చిర్రకుంటకు చెందిన శ్రీశ్రేష్ట
మందమర్రిరూరల్: మండలంలోని చిర్రకుంట గ్రామానికి చెందిన శెట్టి మాధవి–సత్యనారాయణ కుమార్తె శ్రీశ్రేష్ట కూచిపూడి నృత్యంలో ప్రతిభ కనబరిచి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో శనివారం నిర్వహించిన సామూహిక కూచిపూడి నాట్య పోటీలో శ్రీశ్రేష్ట పాల్గొని రికార్డు సాధించింది. సుమారు 7వేల మంది చిన్నారులు నృత్య ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సభ్యులు చిన్నారికి బహుమతితో పాటు సర్టిఫికెట్ అందించారు. పట్టణంలోని గ్రేస్ లిటిల్ హార్ట్స్ హైస్కూల్‌లో ఏడోతరగతి చదువుతున్న చిన్నారి మూడేళ్లుగా శ్రీసాయి నాట్య కళానిలయంలో కూచిపూడి నృత్యం నేర్చుకుంటుందని తల్లిదండ్రులు తెలిపారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకున్న చిన్నారిని స్కూల్ కరస్పాండెంట్ శ్యాంకుమార్, పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు అభినందించారు.


