పదేళ్లు రేవంతే సీఎం
● మంత్రి జూపల్లి కృష్ణారావు
ఖానాపూర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబు నాయుడు, డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి, తెలంగాణలో కె.చంద్రశేఖర్‌రావు రెండు దఫాలుగా సీఎంగా పనిచేశారని, ఈసారి రేవంత్‌రెడ్డి సైతం పదేళ్లు సీఎంగా కొనసాగుతారని మంత్రి జూపల్లి కృష్ణరావు అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ఖానాపూర్ నియోజకవర్గ సర్పంచులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం శనివారం నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై సర్పంచులను సన్మానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో 20 మంది సీఎంలు 65 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించారని గుర్తు చేశారు. కేసీఆర్ గతంలో ఏ ప్రభుత్వం చేయనన్ని అప్పులు చేశాడని పేర్కొన్నారు. రూ.8 లక్షల కోట్లు అప్పు చేసినా గ్రామాల్లో పేదలకు ఇళ్లు కట్టించలేదని విమర్శించారు. ఏడాదికి రూ.75 వేల కోట్లు వడ్డీరూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తు, ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్నామన్నారు. గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు.


