వాజ్‌పేయి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి
మంచిర్యాలటౌన్: అటల్ బిహరీ వాజ్‌పేయి జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. వాజ్‌పేయి 101వ జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 8వ అటల్ బిహరీ వాజ్‌పేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్‌ను గురువారం ప్రారంభించారు. అనంతరం వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వాజ్‌పేయి జీవిత చరిత్ర అందరికీ స్ఫూర్తిదాయకమని, దేశ రాజకీయ చరిత్రలో అన్ని రాజకీయ పార్టీల నేతలకు విలువలు నేర్పిన గొప్ప నాయకుడుగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పురుషోత్తం జాజు, ఎనగందుల కృష్ణమూర్తి, దుర్గం అశోక్, జోగుల శ్రీదేవి, బి య్యాల సతీశ్‌రావు, రంగ శ్రీశైలం, సత్రం రమే శ్, ఆకుల అశోక్‌వర్ధన్, వైద్య శ్రీధర్, మెరెడి కొండ శ్రీనివాస్, బుద్దారపు రాజమౌళి, నాగుల రాజన్న, ముల్కల్ల తిరుపతిరెడ్డి, రెడ్డిమల్ల అశో క్, కిషోర్, బోయిని దేవేందర్ పాల్గొన్నారు.


