పోలీస్‌శాఖలో బదిలీల జాతర
మంచిర్యాలక్రైం: పోలీస్‌శాఖలో బదిలీల జాతర మొదలైంది. రానున్న మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ మంగళవారం కాళేశ్వరం మల్టీజోన్–1 డీఐజీ చంద్రశేఖర్‌రెడ్డి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా బదిలీ ఉత్తర్వులను సంబంధిత బదిలీ అధికారులకు అందజేశారు.
ఎం.ప్రశాంత్ సీసీఎస్ కు.ఆసిఫాబాద్ సీసీఎస్ నస్పూర్
యూ ఉపేందర్‌రావు సీసీసీ నస్పూర్ టాస్క్‌ఫోర్స్ రామగుండం
డీ కిరణ్‌కుమార్ తాండూర్ హాజీపూర్
ఎన్.స్వరూప్‌రాజ్ హాజీపూర్ పీసీఆర్ రామగుండం
ఎల్.భూమేశ్ గోదావరిఖని 1టౌన్ రామకృష్ణాపూర్
జీ రాజశేఖర్ రామకృష్ణాపూర్ సీసీఆర్‌బీ రామగుండం
ఎన్.సుగుణాకర్ వీఆర్ రామగుండం వీఆర్ కు.ఆసిఫాబాద్
(అండర్ సస్పెన్షన్) (లైన్ షిఫ్టెడ్)


