‘వీబీ జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం’
దండేపల్లి: ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న వీబీ జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పెద్దయెత్తున పోరాటం చేస్తుందని రాష్ట్ర గిరిజన సహకార కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి తెలిపారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఆర్‌జీపీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అనంతరం డీఆర్‌డీవో పీడీ కిషన్‌కు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు అక్కల వెంకటేశ్వర్లు, కంది సతీష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నవీన్, సర్పంచ్‌లు పాల్గొన్నారు.


