రాజకీయ సందడే! | - | Sakshi
Sakshi News home page

రాజకీయ సందడే!

Dec 31 2025 7:34 AM | Updated on Dec 31 2025 7:34 AM

రాజకీ

రాజకీయ సందడే!

● ఎమ్మెల్యే గడ్డం వివేక్‌కు మంత్రి పదవి ● ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు నామినేటెడ్‌ పోస్టు ● స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ జోష్‌ ● మార్చిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలకు అర్హులను ఎంపిక చేశారు. ● జూలైలో కురిసిన వర్షాలకు పంటలు దెబ్బ తిన్నాయి. పత్తి చేన్లు నీటమునిగి రైతులు ఇబ్బందులు పడ్డారు. ఇదే నెలలో హాజీపూర్‌ మండలం వేంపల్లి, పోచంపాడు శివారులో 250ఎకరాల్లో ఇండస్ట్రీయల్‌ పార్కు ప్రారంభించారు.

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కాల చక్రం గిర్రున తిరిగింది. 2025 సంవత్సరం ఎన్నో కీలక పరిణామాలతో చరిత్రలో తనదైన ముద్ర వేస్తూ కాలగర్భంలో కలిసిపోతోంది. మరో ఏడాది 2026ను ముందుకు తీసుకొస్తోంది. గత ఏడాది కాలంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లా పురోగతి కోసం అభివృద్ధి వైపు అడుగులు పడ్డాయి. జిల్లాలో పట్టభద్రుల ఎన్నికలతో మొదలైన రాజకీయ సందడి మొన్నటి సర్పంచ్‌ ఎన్నికలతో ముగిసింది. గత పన్నెండు నెలల్లో కీలక సంఘటనల పర్వం చరిత్రగా మిగిలిపోతోంది.

సంక్షేమ పథకాల అమలు

రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచే రైతు భరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రారంభించింది. గ్రామసభల్లో అర్హుల ఎంపిక కు కసరత్తు మొదలైంది. ఇందుకు ‘హౌజ్‌ హోల్డ్‌ వెరిఫికేషన్‌’ సర్వే నిర్వహించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘కమలం’

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉమ్మడి మెదక్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ పట్టభద్రుల, ఉపాధ్యాయ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదలై.. మార్చిలో ఎన్నిక ముగిసింది. తొలిసారిగా ఈ స్థానాలను బీజేపీ అభ్యర్థులు చిన్నమైల్‌ అంజిరెడ్డి, మల్క కొమురయ్య దక్కించుకున్నారు. దీంతో ఆ పార్టీలో జోష్‌ నింపింది. పార్టీ జిల్లా కొత్త సారథిగా నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ నియామకం అయ్యారు.

ఏప్రిల్‌లో సన్నబియ్యం

ప్రజాపంపిణీలో లబ్ధిదారులకు దొడ్డు బియ్యం స్థానంలో ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ ప్రారంభించింది. ఈ ఏడాది ప్రకటించిన సామాజిక ఆర్థిక రాజకీయ సర్వేలో జిల్లా తలసరి ఆదాయం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వృద్ధిలో ఊరట కలిగింది. ఎల్‌ఆర్‌ఎస్‌(లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం) అనధికారికంగా ఉన్న లేవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రకటన విడుదలైంది.

ఆగస్టులో వందేభారత్‌ హాల్ట్‌

ఈ నెలలో దేవాపూర్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు సోదరుడు సత్యపాల్‌ విజయం సాధించారు. వందేభారత్‌ రైలుకు జిల్లా కేంద్రంలో హాల్ట్‌ కల్పించారు.

అక్టోబర్‌లో మొదలై..

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇస్తే.. హైకోర్టు స్టే విధించడంతో నిలిచిపోయింది. 42శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఆదేశాలతో నామినేషన్ల స్వీకరణ మొదలైన కాసేపటికే బ్రేక్‌ పడింది.

మరోసారి నోటిఫికేషన్‌

నవంబర్‌లో డీసీసీ అధ్యక్షుడిగా పిన్నింటి రఘునాథ్‌ను ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఎన్ని కల సంఘం మరోసారి ‘పంచాయతీ’ నోటిఫికేషన్‌ ఇచ్చి ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టింది.

పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బారులు తీరిన ఓటర్లు(ఫైల్‌)

జూన్‌లో మంత్రి పదవి

జిల్లా ఆవిర్భావం తర్వాత తొలిసారిగా మంత్రి పదవి గడ్డం వివేక్‌ను వరించింది. పదవి కోసం పోటీ పడిన మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వినోద్‌కు ఈ ఏడాది నిరాశే ఎదురైంది.

ముగిసిన పల్లె ‘పంచాయతీ’

స్థానిక సంస్థల ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. 303పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. మెజార్టీ స్థానాలను అధికార కాంగ్రెస్‌ పార్టీ కై వసం చేసుకుంది. ఇక ఏటా శీతాకాలంలో మహారాష్ట్ర నుంచి పులులు వలస వస్తున్నాయి. జన్నారం, హాజీపూర్‌, లక్షెట్టిపేట, చెన్నూరు, భీమారం, జైపూర్‌, వేమనపల్లి, బెల్లంపల్లి, కాసిపేట, తాండూరు, నెన్నెల మండలాల్లో సంచరిస్తున్నాయి. గోదావరి తీరం ముల్కల్లలో దుర్గాదేవి విగ్రహం బయటపడింది.

రాజకీయ సందడే!1
1/4

రాజకీయ సందడే!

రాజకీయ సందడే!2
2/4

రాజకీయ సందడే!

రాజకీయ సందడే!3
3/4

రాజకీయ సందడే!

రాజకీయ సందడే!4
4/4

రాజకీయ సందడే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement