నిషేధిత మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: నిషేధిత చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వన్‌టౌన్ సీఐ సునిల్ కుమార్ అన్నారు. పట్టణంలోని వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలో చైనా మాంజా విక్రయాలపై తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూ.17,800 విలువ గల 27 చరఖాల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపా రు. అశోక్ రోడ్‌లోని శ్రీలక్ష్మి షాప్‌లో రూ.15,800 విలువ గల 18 చైనా మాంజా చరఖాలు, బుర్రెవార్ వంశీకృష్ణ నుంచి రూ.1200 విలువ గల 8 చరఖాలు, గుండవేని శ్రీకాంత్ నుంచి రూ.800 విలువ చేసే ఒక చైనా మాంజా చరాఖా స్వాధీనం చేసుకొని వారిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
చైనా మాంజా పట్టివేత
ఆసిఫాబాద్/కాగజ్‌నగర్‌టౌన్: జిల్లా కేంద్రంలోని బజార్ ఏరియాలో పోలీసులు దాడి చేసి అడె పోశెట్టి అనే వ్యక్తి వద్ద రూ.4వేల విలువైన 10 రీల్స్ చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బుద్దే రవీందర్, ఎస్సై రాజు కందూరు, కానిస్టేబుళ్లు సంజీవ్, దేవేంద్ర పాల్గొన్నారు. అలాగే కాగజ్‌నగర్ పట్టణంలోని గాంధీ చౌరస్తాలోని ఓ దుకాణంలో నిషేధించిన చైనా మాంజాను అక్రమంగా విక్రయిస్తుండగా అబ్దుల్ వాజీద్ ఖాన్‌ను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 44 రీల్స్ చైనా మాంజాను స్వాధీనం చేసుకోగా, వీటి విలువ రూ.26,400 ఉంటుందని తెలిపారు. ఈ దాడిలో ఎస్సై రాజు, కానిస్టేబుళ్లు విజయ్, రమేశ్, శేఖర్ పాల్గొన్నారు. పోలీసు సిబ్బందిని ఎస్పీ నితిక పంత్ అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ చైనా మాంజాతో తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. పిల్లలకు ప్రాణాపాయం కలిగే ప్రమాదం ఉందని, అక్రమంగా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిషేధిత మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు


