లాభాల సాగు
బెల్లంపల్లి: మనస్సుంటే ఎన్నో మార్గాలుంటాయి. దీన్ని ఓ రైతు అక్షరాల నిజం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సీజన్‌కు అనుగుణంగా కూరగాయలు పండిస్తూ లాభాలు గడిస్తున్నాడు. వివరా లు.. బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన గోపే రామ్మూర్తి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఇతనికి గ్రామ శివారులో పదెకరా ల వ్యవసాయ భూమి ఉంది. ఐదెకరాల్లో వరి, నా లుగెకరాల్లో పత్తి సాగు చేస్తూనే మరో ఎకరంలో బో రు ఆధారంగా పదెకరాల కూరగాయలు పండిస్తున్నాడు. టమాట, వంకాయ, బెండకాయ, కాకర, ఉల్లి, తోటకూర, పాలకూర, కొత్తిమీర, మెంతి, అలసంద తదితర రకాల కూరగాయలు పదేళ్లుగా సాగు చేస్తున్నాడు. నాలుగు గుంటలకో రకం చొప్పున పది రకాల కూరగాయలు సాగు చేస్తున్న రామ్మూర్తి ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా నష్టపోయింది లేదు. సాగులో రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులనూ వినియోగిస్తున్నాడు. సాగులో భర్తతో సమానంగా కష్టపడుతోంది రామ్మూర్తి భార్య మంగ. సాగునే నమ్ముకున్న ఈ రైతు దంపతులు కూతురు షాలిని, కొ డుకు సాయితేజను ఉన్నతంగా చదివిస్తున్నారు. షా లిని ఎంటెక్ చదువుతుండగా సాయితేజ డిగ్రీ చదువుతున్నాడు.
అంగళ్లలో అమ్మకాలు
రామ్మూర్తి దంపతులు పండించిన కూరగా యలను హోల్‌సేల్‌గా అమ్మకుండా నేరుగా సమీప అంగళ్లలో విక్రయిస్తుంటారు. వారంలో ఐదురోజులపాటు చట్టుపక్కల గ్రామాల్లో నిర్వహించే సంతల్లో వీరు పండించిన కూరగాయలు విక్రయిస్తుంటారు. ఒక్కో సంతకు ఒక్కోరోజున కూరగా యలు తీసుకువెళ్లి విక్రయాలు చేస్తుండగా.. మిగతా రెండ్రోజులు మందమర్రి మార్కెట్‌కు తీసుకెళ్లి అ మ్ముకుంటారు. దీంతో గిట్టుబాటు ధర లభించి వీరి సాగు లాభాల బాటలో పయనిస్తోంది.
నెలకు రూ.30వేల ఆదాయం
ఒకటి, రెండురకాల కూరగాయలు పండిస్తే రో జువారీగా ఆదాయం ఉండదు. రోజువారీగా అ మ్మకాలూ ఉండవు. అదే పది రకాల కూరగా యలు సాగు చేస్తే ఏరోజుకారోజు ఆదాయం వ స్తుంది. ప్రస్తుతం రామ్మూర్తి ఈ విధానాన్నే అనుసరిస్తుండటంతో రోజుకు రూ.వెయ్యికి తగ్గకుండా నె లకు రూ.30వేల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఇందులో ఖర్చులు రూ.10 వేలు పోనూ రూ.20వేల దాకా మిగులుతున్నట్లు రామ్మూర్తి తెలిపాడు. చిత్తశుద్ధితో కూరగాయలు సాగు చేసి కష్టపడాలే గాని ఏ కోశాన నష్టాలనేవి ఉండవని ధీమా వ్యక్తంజేస్తున్నాడు. ఏ రకం పంటకు ఏ సీజన్‌లో డిమాండ్ ఉంటుందో గుర్తెరిగి సాగు చేస్తే అసలు నష్టాలే ఉండవని రామ్మూర్తి దంపతులు చెబుతున్నారు.
తోటలో వంకాయలు సేకరిస్తున్న రామ్మూర్తి
లాభాల సాగు
లాభాల సాగు
లాభాల సాగు


