సాఫ్ట్‌బాల్ పోటీల విజేత మహబూబ్‌నగర్
మందమర్రిరూరల్: మంచిర్యాల జిల్లా మందమర్రిలోని మోడల్ స్కూల్ మైదానంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో మహబూబ్‌నగర్ విజేతగా నిలిచింది. నిజామాబాద్, మహబూబ్‌నగర్ జట్లు ఫైనల్‌కు చేరుకోగా 3–2 స్కోర్ తేడాతో మహబూబ్‌నగర్ గెలుపొందగా నిజామాబాద్ జట్టు రెండో స్థానం దక్కించుకుంది. వరంగల్, ఆదిలాబాద్ జట్లు తలపడగా వరంగల్ టీం 9–8స్కోర్ తేడాతో వరంగల్ జట్టు గెలిచి మూడో స్థానంలో నిలిచింది. గెలిచిన జట్లకు ఒలింపిక్ జిల్లా కార్యదర్శి రఘునాథ్‌రెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి బాబురావు, డీఐఈవో అంజయ్య బహుమతులు, మెడల్స్ ప్రదానం చేశారు. అనంతరం రాష్ట్రస్థాయి జట్టును ఎంపిక చేశారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సారా తస్నీమ్, కోచ్‌లు, పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.


