రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
లక్ష్మణచాంద: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్‌పల్లి గ్రామ సమీపంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన జంబుగ రాధ(45)తన భర్త చిన్నపోసులు, అల్లుడు లింబాద్రితో కలిసి ఉదయం 8:15 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై గోదావరి స్నానానికి బయల్దేరారు. సోన్ మండలం కూచన్‌పల్లి గ్రామా శివారులో రోడ్డుపై కుక్కలు అడ్డు రావాడంతో వాటిని తప్పిచే క్రమంలో బైక్ అదుపు తప్పడంతో రాధ కిందపడింది. ఆమె తల వెనుక భాగంలో గాయాలు కావడంతో అక్కడిక్కడే మరణించింది. రాధ భర్త చిన్న పోసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాపు చేస్తున్నట్లు సోన్ ఎస్సై గోపి తెలిపారు.
కారు ఢీకొని సెక్యూరిటీగార్డు..
బెల్లంపల్లి: రోడ్డు ప్రమాదానికి గురై ఓ యువకుడు దుర్మరణం చెందాడు. బెల్లంపల్లి టూటౌన్ ఏఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి ప్రభుత్వ ఏరియాస్పత్రిలో కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కొండు సాయికుమార్ (23) బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. కాల్‌టెక్స్ శివారు రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎగిరి కారు బానెట్‌పై పడిన సాయికుమార్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


