దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్‌రూరల్: ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అఽ దికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించి న ప్రజావాణికి తాండూర్ మండలం రేచిని గ్రామానికి చెందిన సత్యనారాయణ తనకు భూమి మంజూరు చేయాలని, కడెం మండల కేంద్రానికి చెంది న ప్రభాకర్ రుణ సదుపాయం కల్పించాలని, వి విధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు పింఛన్, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు.


