గిన్నీస్ ప్రపంచ రికార్డు నృత్య ప్రదర్శనలో మనోళ్లు
బెల్లంపల్లి: హైదరాబాద్ గచ్చిబౌళి స్టేడియంలో శనివారం నిర్వహించిన కూచిపూడి కళావైభ వం గిన్నీస్ ప్రపంచ రికార్డు నృత్య ప్రదర్శనలో బెల్లంపల్లికి చెందిన కూచిపూడి గురువు ఎడ్ల వనిత శిష్యులు పాల్గొన్నారు. వనిత ప్రస్తుతం హైదరాబాద్‌లో కూచిపూడి నృత్య శిక్షణ ఇస్తున్నారు. ఆమె వద్ద శిష్యరికం చేసిన 60 మంది బాలికలు కూచిపూడి నృత్యం చేసి కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. వీరిలో కన్నెపల్లి మండలం జన్కాపూర్ గ్రామానికి చెందిన సహ స్ర, శ్రీమహనీ ఉన్నారు. ఈ గిన్నీస్ ప్రపంచ రికార్డు కార్యక్రమంలో 7,209 మంది కూచిపూ డి నృత్య కళాకారులు పాల్గొన్నారు.


