కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఐఎన్టీయూసీ నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్‌ను హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. సింగరేణి కార్మికులకు దీర్ఘకాలికంగా ఉన్న అనేక సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో భాగంగా వీటన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత యూనియన్, ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. అలవెన్స్‌లపై ఆదాయ పన్నును కంపెనీనే చెల్లించాలని, మారుపేర్ల సమస్యను తక్షణమే ప రి ష్కరించాలని కోరారు. ప్రతీనెల మెడికల్ బోర్డు ని ర్వహించి 95శాతం కేసులను అన్‌ఫిట్ చేయాలని వి జ్ఞప్తి చేశారు. ఆగస్టులో జరిగిన మెడికల్ బోర్డులో జ రిగిన లోపాలను సరిచేయాలని, అర్హులకు న్యా యం చేయాలని కోరారు. రీజియన్ల వారీగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశా రు. కొత్త గనులను ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాలు కల్పించాలని, ఇతర ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అన్ని డివిజన్ల ఉపాధ్యక్షులు ఈ భేటీలో పాల్గొన్నారు. యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షుడు శంకర్‌రావు, నాయకుడు కలవేన శ్యామ్ పాల్గొన్నారు.


