breaking news
cricket news
-
మీడియా క్రికెట్లో దూసుకుపోతున్న సాక్షి టీమ్.. ఫైనల్లో టీవీ9తో అమీతుమీ
జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ టీ20 క్రికెట్ పోటీలు గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌లో సందడిగా సాగుతున్నాయి. ఈ టోర్నీలో సాక్షి టీమ్ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. తొలి రోజు బిగ్ టీవీతో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతో విజయదుందుబి మోగించారు.ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బిగ్ టీవీ టీమ్.. 20 ఓవర్లలో 115 పరుగులు చేయగా సాక్షి టీమ్ కేవలం 12.5 ఓవర్లలో రెండే వికెట్లో కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సాక్షి టీమ్‌కు చెందిన సతీష్ 48 పరుగులు చేయగా.. రమేష్ 47 పరుగులు చేసి సత్తా చాటారు. ఈ విజయంతో సాక్షి సెమీస్‌లోకి అడుగు పెట్టింది.బుధవారం జరిగిన సెమీస్‌లో సాక్షి టీమ్ మరోసారి సత్తా చాటింది. వీ6తో జరిగిన మ్యాచ్‌లో అదిరిపోయే విజయం సాధించి విజయపరంపరను కొనసాగించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన వీ6ను సాక్షి 104 పరుగులకు కట్టడి చేసింది. సాక్షి బౌలర్లలో రామకృష్ణ, అనిల్, రమేష్‌లు అద్భుతంగా బౌలింగ్ చేసి తలో 2 వికెట్లు తీశారు.అనంతరం చేధనకు దిగిన సాక్షి టీమ్ కేవలం 12.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది. రమేష్ 83 పరుగులు చేసి ఒంటిచేత్తో సాక్షిని గెలిపించాడు. బౌలింగ్‌లోనూ 2 వికెట్లతో సత్తా చాటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ గెలుపుతో సాక్షి టీమ్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగే ఫైనల్లో సాక్షి టీమ్ టీవీ9తో అమీతుమీ తేల్చుకుంటుంది. -
జింబాబ్వే జట్టులో మాజీ ప్లేయర్ కొడుకులు
జింబాబ్వే క్రికెట్ జట్టుకు కవలలు ఎంపిక కావడం కొత్తేమీ కాదు. చరిత్ర చూస్తే ఈ జట్టుకు చాలా మంది ట్విన్స్ ప్రాతినిథ్యం వహించారు. ఆండీ ఫ్లవర్-గ్రాంట్ ఫ్లవర్, గై విటల్-ఆండీ విటల్, గావిన్ రెన్నీ-జాన్ రెన్నీ, పాల్ స్ట్రాంగ్-బ్రియాన్ స్ట్రాంగ్ లాంటి జోడీలు జింబాబ్వే క్రికెట్ ఉన్నతికి దోహదపడ్డాయి.తాజాగా మరో కవలల జోడీ జింబాబ్వే జట్టుకు ఎంపికైంది. ఈ జోడీ అండర్-19 ప్రపంచకప్ ఆడే జింబాబ్వే జట్టులో స్థానం సంపాధించింది. ఈ ట్విన్ బ్రదర్స్ గతంలో జింబాబ్వే సీనియర్ జట్టుకు ఆడిన ఆండీ బ్లిగ్నాట్ కొడుకులు కావడం విశేషం. బ్లిగ్నాట్ 1999-2010 మధ్యలో జింబాబ్వే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2003 ప్రపంచకప్‌లోనూ ఆడాడు. ఇతని పుత్రసంతానం మైఖేల్-కియాన్ బ్లిగ్నాట్ జోడీ త్వరలో జరుగబోయే అండర్-19 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యారు. 17 ఏళ్ల మైఖేల్, కియాన్ బ్యాట్‌తో, బంతితో రాణించగల సమర్థులు. వీరిద్దరు తండ్రి అడుగుజాడల్లో నడవడానికి సిద్దంగా ఉన్నారు.వీరి తండ్రి ఆండీ బ్లిగ్నాట్ కూడా ఆల్‌రౌండరే. ఆండీ బంతిని బలంగా బాదేవాడు. అలాగే వేగవంతమైన బౌలర్ కూడా. ఏ స్థాయిలో అయినా ప్రపంచకప్ ఆడిన అతి కొద్ది తండ్రి కొడుకుల జోడీల్లో ఇదీ ఒకటి.కాగా, అండర్ 19 ప్రపంచకప్ 16వ ఎడిషన్‌కు జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం జింబాబ్వే చాలా ముందుగానే జట్టును ప్రకటించింది.ఈ జట్టుకు కెప్టెన్‌గా యువ పేసర్ సింబరాషే ముడ్జెంగెరె నియమితులయ్యాడు. 2024 U19 వరల్డ్‌కప్ ఆడిన బ్యాట్స్‌మన్ నాథనియెల్ హ్లాబంగానా కూడా జట్టులో ఉన్నాడు. ఈ జట్టులో మైఖేల్-కియాన్ బ్లిగ్నాట్ ప్రత్యేక ఆకర్శనగా నిలువనుంది.జింబాబ్వే U19 వరల్డ్‌కప్ 2026 జట్టు సింబరాషే ముడ్జెంగెరె (c), కియన్ బ్లిగ్నాట్, మైఖేల్ బ్లిగ్నాట్, లీరోయ్ చివౌలా, టటెండా చిముగోరో, బ్రెండన్ సెంజెరె, నాథనియెల్ హ్లాబంగానా, టకుడ్జ్వా మకోని, పానాషే మజాయి, వెబ్‌స్టర్ మధిధి, షెల్టన్ మజ్విటోరెరా, కుపక్వాషే మురాడ్జి, బ్రాండన్ న్డివేని, ధ్రువ్ పటేల్, బెన్నీ జూజే -
వరల్డ్‌కప్ స్ట్రీమింగ్ నుంచి తప్పుకున్న హాట్‌స్టార్..!
2026 టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఐసీసీకి ఊహించని షాక్ తగిలింది. మెగా టోర్నీ స్ట్రీమింగ్ నుంచి జియో హాట్‌స్టార్ తప్పుకోనున్నట్లు తెలుస్తుంది. ఆర్దిక సమస్యల కారణంగా హాట్‌స్టార్ ఈ డీల్‌ను వదులుకోనున్నట్లు సమాచారం.జియో హాట్‌స్టార్ భారత్‌లో స్ట్రీమింగ్ హక్కుల కోసం నాలుగేళ్లకు 3 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని ఐసీసీతో కుదుర్చుకుంది. ఇంకా రెండేళ్లు మిగిలుండగానే హాట్‌స్టార్ ఈ డీల్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఐసీసీకి అధికారిక సమాచారం కూడా ఇచ్చినట్లు జాతీయ మీడియా చెబుతుంది. హాట్‌స్టార్ అధికారికంగా తప్పుకుంటే ఈ రెండేళ్లు స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకునేందుకు సోనీ పిక్చర్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.కాగా, జియో హాట్‌స్టార్ స్పోర్ట్స్ కాంట్రాక్టుల కారణంగా గత రెండేళ్లుగా భారీ నష్టాలను చవి చూస్తున్నట్లు తెలుస్తుంది. భారత ప్రభుత్వం రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధించడంతో ప్రకటనదారులు కరువు కావడం ఇందుకు ఓ కారణంగా తెలుస్తుంది. దీని వల్ల $840 మిలియన్ లోటు ఏర్పడిందని అంచనా. దీనికి తోడు డాలర్ రేటు కూడా పెరగడం హాట్‌స్టార్‌పై అదనపు భారం పడేలా చేసిందని సమాచారం.ఒకవేళ హాట్‌స్టార్ వరల్డ్‌కప్ స్ట్రీమింగ్ నుంచి తప్పుకుంటే భారతలో క్రికెట్ అభిమానుల జేబులకు చిల్లులు పడటం ఖాయం. మెగా టోర్నీలో మ్యాచ్‌లు వీక్షించేందుకు డబ్బులు చెల్లించి కొత్త సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాగా, 2026 టీ20 వరల్డ్‌కప్ ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరుగునున్న విషయం తెలిసిందే. -
రోహిత్ శర్మ కీలక నిర్ణయం
టీమిండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) ఆడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన దేశవాలీ జట్టు ముంబై తరఫున నాకౌట్ మ్యాచ్‌ల్లో ఆడేందుకు హిట్‌మ్యాన్ సమ్మతం వ్యక్తం చేశాడట. SMATలో ముంబై నాలుగు వరుస విజయాలతో దూసుకుపోతూ నాకౌట్స్‌కు చేరువైంది.ఇప్పటికే స్టార్ క్రికెటర్లతో పటిష్టంగా ఉన్న ముంబైకి హిట్‌మ్యాన్ తోడైతే వారిని ఆపడం దాదాపుగా అసాధ్యం. ఈ టోర్నీలో ముంబై డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో ఉంది. గత సీజన్లో శ్రేయస్ అయ్యర్ ముంబైకి టైటిల్ అందించాడు.ప్రస్తుత ముంబై జట్టులో భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా అజింక్య రహానే, ఆయుశ్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్ లాంటి టీమిండియా స్టార్లు ఉన్నారు. వీరికి రోహిత్ శర్మ కలిస్తే ఇంకేమైనా ఉందా..?ఈ సీజన్లో ముంబై ఆటగాళ్లంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. కుర్ర ఓపెనర్ మాత్రే వరుసగా రెండో సెంచరీలు బాది జోష్‌లో ఉండగా.. సర్ఫరాజ్ ఖాన్ కూడా తాజాగా ఓ మెరుపు సెంచరీ చేశాడు. ఇటీవలే శార్దూల్ ఠాకూర్ ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు.ఇదిలా ఉంటే, టెస్ట్‌లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ.. 38 ఏళ్ల లేటు వయసులోనూ ఈ ఫార్మాట్లో చెలరేగిపోతున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ, హాఫ్ సెంచరీతో దుమ్మురేపిన హిట్‌మ్యాన్.. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో ఓ హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికాతో మూడో వన్డే డిసెంబర్ 6 విశాఖ వేదికగా జరుగనుంది.సిరీస్ విషయానికొస్తే.. నిన్న జరిగిన రెండో వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసిన ఓటమిపాలైంది. రుతురాజ్, కోహ్లి సెంచరీలు వృధా అయ్యాయి. దక్షిణాఫ్రికా బ్యాటర్లు అసమానమైన పోరాటపటిమ కనబర్చి భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని ఊదేశారు. అంతకుముందు తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. -
రుతు, విరాట్ అద్భుతం.. ఆ రెండే కొంపముంచాయి: కేఎల్ రాహుల్
రాయ్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో నిన్న (డిసెంబర్ 3) జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి అద్భుత సెంచరీలతో చెలరేగి భారీ స్కోర్ అందించినా, టీమిండియా దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. సౌతాఫ్రికా బ్యాటర్లు అసమాన పోరాటపటిమ కనబర్చి 359 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని పెద్దగా కష్టపడకుండానే ఛేదించారు. మార్క్రమ్ బాధ్యతాయుతమైన సెంచరీ, బ్రెవిస్ మెరుపులు, భారత బౌలర్లు, ఫీలర్ల తప్పిదాలు సౌతాఫ్రికా గెలుపుకు కారణమయ్యాయి.గెలుస్తామనుకున్న మ్యాచ్‌లో ఓడటంపై టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) స్పందిస్తూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యాడు. అతడి మాటల్లోనే.."ఇలాంటి ఓటమిని జీర్జించుకోవడం కష్టం. వరుసగా రెండు టాస్‌లు కోల్పోవడం దురదృష్టకరం. ఈ విషయంలో నన్ను నేను నిందించుకుంటా. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం ఎంత కష్టమో, తడి బంతితో బౌలర్లకు ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఉంటాయో మరోసారి బయటపడ్డాయి.అంపైర్లు బంతి మార్చినా, డ్యూ ప్రభావం తగ్గలేదు. మరో 20–25 పరుగులు చేసుంటే బౌలర్లకు కాస్త కుషన్ దొరికేది. వారు శక్తి మేరకు పోరాడినా, ఫీల్డింగ్‌లో కొన్ని తప్పిదాలు జరిగాయి. మొత్తంగా టాస్, డ్యూ కొంపముంచాయి. రుతురాజ్ ఆడిన ఇన్నింగ్స్ అందరినీ ఆకట్టుకుంది. అతడు స్పిన్నర్లను అద్భుతంగా ఎదుర్కొన్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత టెంపో పెంచి జట్టుకు అదనపు పరుగులు అందించాడు. విరాట్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. 53వ సారి తన పని తాను చేసుకుపోయాడు. లోయరార్డర్ బ్యాటర్లు ఇంకొంచెం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసి, రెండు మూడు బౌండరీలు కొట్టుంటే ఆ 20 పరుగులు కూడా వచ్చేవి. నేను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు (ఐదో స్థానం) రావడం సందర్భానుసారంగా తీసుకున్న నిర్ణయం. -
నరైన్@600.. లివింగ్‌స్టోన్ ధన్ ధనాధన్
విండీస్ టీ20 స్పెషలిస్ట్, స్పిన్ మాంత్రికుడు సునీల్ నరైన్ (Sunil Narine) పొట్టి క్రికెట్లో అత్యంత అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో భాగంగా అబుదాబీ నైట్‌రైడర్స్‌కు సారథ్యం వహిస్తున్న అతను.. నిన్న (డిసెంబర్ 3) షార్జా వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ వికెట్ (టామ్ ఏబెల్) తీశాడు. ఇదేం మైలురాయి అనుకుంటున్నారా..? ఆగండి. ఈ వికెట్ నరైన్‌కు టీ20 క్రికెట్లో 600వది. ఈ ఫార్మాట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ముగ్గురు (నరైన్‌తో కలుపుకొని) మాత్రమే ఈ ఘనత సాధించారు. నరైన్‌కు ముందు డ్వేన్ బ్రావో (631), రషీద్ ఖాన్ (681) 600 వికెట్ల క్లబ్లో చేరారు.లివింగ్‌స్టోన్ ఊచకోతషార్జా వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ (Liam Livingstone) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 38 బంతుల్లో 8 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో అజేయమైన 82 పరుగులు చేశాడు. అతనితో పాటు అలెక్స్ హేల్స్ (32), షరాఫు (34), రూథర్‌ఫోర్డ్ (45) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో వారియర్స్ చేతులెత్తేసింది. టిమ్ డేవిడ్ (24 బంతుల్లో 60; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) ఒక్కడే పోరాడినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 194 పరుగులకే పరిమితమై 39 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. సునీల్ నరైన్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు ఓ వికెట్ తీసి 600 వికెట్ల క్లబ్లో చేరాడు. -
భారీ మైలురాయిపై కన్నేసిన రోహిత్ శర్మ
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (డిసెంబర్ 3) రెండో వన్డే జరుగనుంది. రాయ్‌పూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు ముందు భారత వెటరన్ స్టార్ రోహిత్ శర్మను ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో అతను 41 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) 20000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం 13 మంది మాత్రమే ఈ ఘనత సాధించారు. వీరిలో భారత్‌కు చెందిన వారే ముగ్గురున్నారు (సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రాహుల్ ద్రవిడ్). వీరిలో సచిన్ అందరి కంటే ఎక్కువగా 34357 పరుగులు చేసి తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు..సచిన్-34357సంగక్కర-28016కోహ్లి-27808పాంటింగ్-27483జయవర్దనే-25957కల్లిస్-25534ద్రవిడ్-24208లారా-22358రూట్-21774జయసూర్య-21032చంద్రపాల్-20988ఇంజమామ్-20580డివిలియర్స్-20014కాగా, టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో హాఫ్ సెంచరీ, ఓ సూపర్ సెంచరీతో రెచ్చిపోయిన హిట్‌మ్యాన్.. సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లోనూ అదిరిపోయే అర్ద సెంచరీతో అలరించాడు. ప్రస్తుత రోహిత్ ఫామ్‌ను బట్టి చూస్తే.. ఇవాల్టి మ్యాచ్‌లో 20000 పరుగుల మార్కును చేరుకోవడం అంత కష్టమైన పనేమీ కాకపోవచ్చు. -
మరోసారి దడదడలాడించిన అభిషేక్ శర్మ
ఐసీసీ వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన అరివీర భయంకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అంతర్జాతీయ టీ20లకు విరామం రావడంతో దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఆడుతున్న అభిషేక్.. ఇక్కడ కూడా ప్రత్యర్దులను చీల్చిచెండాతున్నాడు.ఈ టోర్నీలో పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. రెండు రోజుల కిందట బెంగాల్‌పై సుడిగాలి శతకం (52 బంతుల్లో 148) బాదాడు. ఇవాళ (డిసెంబర్ 2) బరోడాపై మెరుపు అర్ద శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 18 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. అనంతరం రాజ్ లింబాని బౌలింగ్‌లో ఔటయ్యాడు. అభిషేక్‌తో పాటు అన్మోల్ప్రీత్ సింగ్ (32 బంతుల్లో 69; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. నమన్ ధిర్ (28 బంతుల్లో 39) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బరోడా ఆటగాళ్లు కూడా చెలరేగి ఆడుతున్నారు. 4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేశారు. ఓపెనర్లు శాశ్వత్ రావత్ 30, విష్ణు సోలంకి 14 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, దీనికి ముందు బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 12 బంతుల్లోనే అర్ద సెంచరీ చేశాడు. పొట్టి క్రికెట్లో అది మూడో వేగవంతమైన అర్ద సెంచరీ. -
మరోసారి పేట్రేగిపోయిన వైభవ్ సూర్యవంశీ
యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి పేట్రేగిపోయాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ టోర్నీ తొలి 3 మ్యాచ్‌ల్లో విఫలమైన వైభవ్ ఎట్టకేలకు మహారాష్ట్ర బౌలర్లపై జూలు విదిల్చాడు. 58 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన అతడు.. ఓవరాల్‌గా 61 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 108 పరుగులు చేశాడు. వైభవ్ ధాటికి ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అతని జట్టు బిహార్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.మరో చరిత్రఈ ఇన్నింగ్స్‌తో వైభవ్ మరో విభాగంలో చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా (14 ఏళ్ల 250 రోజులు) రికార్డు నెలకొల్పాడు. వైభవ్‌కు ముందు ఈ రికార్డు మహారాష్ట్ర ఆటగాడు విజయ్ జోల్ పేరిట ఉండేది. జోల్ 18 ఏళ్ల, 118 రోజుల వయసులో ముంబైపై 63 బంతుల్లో 109 పరుగులు చేశాడు.సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో వైభవ్‌కు ఇదే తొలి శతకం. ఓవరాల్‌గా 16 మ్యాచ్‌ల టీ20 కెరీర్లో మూడవది. -
కేకేఆర్ స్టార్ ప్లేయర్ సంచలన నిర్ణయం
కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫ్రాంచైజీ తనను వదిలించుకోవడంతో ఐపీఎల్ మొత్తానికే గుడ్‌బై చెప్పేశాడు. తదుపరి సీజన్ వేలంలోనూ తన పేరు కూడా నమోదు చేసుకోలేదు.కేకేఆర్ వద్దనుకోవడంతో మనస్థాపం చెందినట్లున్న మొయిన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. ఈమేరకు తన ఇన్‌స్టా ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. పీఎస్ఎల్ 2026కి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.మొయిన్ ఐదేళ్ల తర్వాత పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడనున్నాడు. 2020లో చివరిగా అతను ముల్తాన్ సుల్తాన్స్ ఫ్రాంచైజీకి ఆడాడు.కాగా, ఐపీఎల్ 2026కు ముందు కేకేఆర్ మొయిన్‌తో పాటు చాలామంది స్టార్ ఆటగాళ్లను వదిలేసింది. ఆ ఫ్రాంచైజీ విడుదల చేసిన ఆటగాళ్లలో టీ20 దిగ్గజం ఆండ్రీ రసెల్ కూడా ఉన్నాడు.రసెల్‌తో పాటు గత సీజన్ వేలంలో రూ. 23.75 కోట్ల రికార్డు ధర దక్కించుకున్న వెంకటేష్ అయ్యర్‌ను సైతం కేకేఆర్ వదిలేసింది. వీరితో పాటు టీ20 స్పెషలిస్ట్‌లు అయిన డికాక్, స్పెన్సర్ జాన్సన్, నోర్జే, రహ్మానుల్లా గుర్బాజ్‌ను కూడా వేలానికి వదిలేసింది.దిగ్గజాన్నే వదిలేసింది, మొయిన్ ఎంత..?మొయిన్‌ను కేకేఆర్ వదిలేయడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. వయసు పైబడటంతో అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. గత సీజన్లో అతను లభించిన అడపాదడపా అవకాశాలను పెద్దగా సద్వినయోగం చేసుకోలేకపోయాడు. రసెల్ లాంటి దిగ్గజాన్నే సైతం వదులుకున్న కేకేఆర్‌కు మొయిన్‌ను సాగనంపడం పెద్ద సమస్యేమీ కాలేదు. -
IPL 2026: వేలానికి వేళాయే..!
2026 ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి ఇప్పటి నుంచే హడావుడి మొదలైంది. ట్రేడింగ్, రిటెన్షన్ల ప్రక్రియ ముగియగానే ఫ్రాంచైజీలకు వేలం ఫీవర్ పట్టుకుంది. ఈసారి వేలంలో రికార్డు స్థాయిలో 1355 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారని క్రిక్‌బజ్ నివేదిక తెలిపింది. ఏ ఫ్రాంచైజీ ఎవరిని దక్కించుకుంటుంది, ఎంతిచ్చి సొంతం చేసుకుంటుందోనని క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబీలో జరుగనుంది.15 దేశాల ఆటగాళ్లుక్రిక్బజ్ నివేదిక ప్రకారం.. ఈసారి వేలంలో భారత్ సహా 15 దేశాలకు చెందిన ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, యూఎస్ఏతో పాటు మలేషియా లాంటి దేశం నుంచి ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.బరిలో హేమాహేమీలుఈసారి వేలం బరిలో హేమాహేమీలు ఉన్నట్లు తెలుస్తుంది. భారత్ నుంచి పృథ్వీ షా, వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్.. ఆస్ట్రేలియా నుంచి కెమెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్.. ఇంగ్లండ్ నుంచి జానీ బెయిర్‌స్టో, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, టామ్ కర్రన్.. శ్రీలంక నుంచి వనిందు హసరంగ, మతీష పతిరణ.. న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్ర.. బంగ్లాదేశ్ నుంచి ముస్తాఫిజుర్ రహ్మాన్.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి నవీన్-ఉల్-హక్.. సౌతాఫ్రికా నుంచి గెరాల్డ్ కొయెట్జీ, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే తదితరులు పాల్గొంటున్నారు.వెంకటేష్ అయ్యర్ మరోసారి జాక్‌పాట్ కొడతాడా..?గత సీజన్ వేలంలో భారత ఆటగాడు వెంకటేష్ అయ్యర్ రూ. 23.75 కోట్ల రికార్డు ధర దక్కించుకొని జాక్‌పాట్ కొట్టాడు. భారీ అంచనాలతో కేకేఆర్ అతన్ని సొంతం చేసుకుంది. అయితే వెంకటేష్ నుంచి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కేకేఆర్ అతన్ని వదిలించుకుంది. దీంతో ఈసారి అతను వేలం బరిలో నిలిచాడు. గత సీజన్‌లా కాకపోయినా ఈసారి కూడా వెంకటేష్‌కు భారీ మొత్తమే లభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే అతను అత్యధిక బేస్‌ప్రైజ్ అయిన 2 కోట్ల విభాగంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. భారత్ నుంచి వెంకటేష్‌తో పాటు రవి బిష్ణోయ్ మాత్రమే ఈ విభాగంలో పోటీపడుతున్నాడు.2 కోట్ల బేస్‌ప్రైజ్ విభాగంలో ఎవరెవరు..?2 కోట్ల బేస్‌ప్రైజ్ విభాగంలో ఈసారి మొత్తం 45 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్, కెమరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, జేమీ స్మిత్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్ ఉల్ హక్, సీన్ అబాట్, ఆస్టన్ అగర్, కూపర్ కన్నోలీ, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, జోష్ ఇంగ్లిస్, ముస్తాఫిజుర్ రహ్మాన్, గస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, టామ్ కర్రన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, డానియల్ లారెన్స్, లియామ్ లివింగ్‌స్టోన్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మైఖేల్ బ్రేస్‌వెల్, గెరాల్డ్ కొయెట్జీ, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, పతిరణ, తీక్షణ, హసరంగ, షాయ్ హోప్, అల్జరీ జోసఫ్ తదితరులు ఈ విభాగంలో తమ అదృష్టాలను పరీక్షించుకోనున్నారు.భారత్ నుంచి ఎవరెవరు..?ఈసారి వేలంలో భారత్ నుంచి మయాంక్ అగర్వాల్, కేఎస్ భరత్, రాహుల్ చాహర్, రవి బిష్ణోయ్, ఆకాశ్‌దీప్, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ మావి, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా, కుల్దీప్ సేన్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, సందీప్ వారియర్ మరియు ఉమేశ్ యాదవ్ పాల్గొంటున్నారు.మలేషియా నుంచి కూడా..?ఈసారి వేలంలో మలేషియా నుంచి ఒకరు తమ పేరును నమోదు చేసుకున్నారు. భారత మూలాలున్న ఆల్‌రౌండర్ విరన్‌దీప్ సింగ్ రూ. 30 లక్షల బేస్ ప్రైస్ విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.కోటి విభాగంలో షకీబ్బంగ్లాదేశ్ వెటరన్, 9 ఐపీఎల్ సీజన్లు ఆడిన అనుభవమున్న షకీబ్ ఉల్ హసన్ ఈసారి రూ. కోటి బేస్‌ప్రైజ్ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నాడు.77 స్లాట్ల కోసం పోటీ77 స్లాట్లు..ఇందులో 31 విదేశీ స్లాట్ల కోసం 1355 మంది ఆటగాళ్లు పోటీపడునున్నారు. మొత్తం 10 ఫ్రాంచైజీల వద్ద రూ. 237.55 కోట్ల నిధులు ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా రూ. 64.30 కోట్లు, రెండో అత్యధికంగా చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 43.40 కోట్లు ఉన్నాయి. -
9 ఎడిషన్ల తర్వాత వేలం.. ఖరీదైన ఆటగాడు అతడే..!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)లో తొమ్మిది ఎడిషన్ల తర్వాత మళ్లీ ఆటగాళ్ల వేలం జరిగింది. 2012లో తొలి సీజన్ వేలం తర్వాత ఇప్పటివరకు డ్రాఫ్ట్ విధానం అమల్లో ఉండింది. అయితే రాబోయే సీజన్ కోసం ఈసారి ఆటగాళ్ల వేలం నిర్వహించారు. ఈ వేలంలో బంగ్లాదేశ్ జాతీయ జట్టు ఓపెనర్ మొహమ్మద్ నయీమ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. నయీమ్‌ను చిట్టగాంగ్ రాయల్స్ BDT 1 కోటి (USD 88000)కు కొనుగోలు చేసింది. ఈ వేలంలో కోటి టాకాల మార్క్ దాటిన ఏకైక ఆటగాడు నయీమే కావడం విశేషం. నయీమ్ తర్వాత అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా తౌహిద్ హ్రిదోయ్, లిట్టన్ దాస్ నిలిచారు. వీరిద్దరినీ రంగ్‌పూర్ రైడర్స్ ఫ్రాంచైజీనే సొంతం చేసుకుంది. హ్రిదోయ్ USD 73600కు, లిట్టన్ దాస్ USD 56,000కు అమ్ముడుపోయారు.బంగ్లాదేశీ వెటరన్ స్టార్లు మహ్ముదుల్లా, ముష్ఫికుర్ రహీమ్ కోసం తొలుత ఏ ఫ్రాంచైజీ బిడ్ చేయకపోయినా, చివరికి మహ్ముదుల్లాను రైడర్స్, ముష్ఫికుర్‌ను రాజ్షాహి వారియర్స్ వారి బేస్ ప్రైస్ BDT 35 లక్షలకు దక్కించుకున్నాయి.ఈ వేలంలో విదేశీ ప్లేయర్లు వందల సంఖ్యలో పాల్గొన్నా 90 శాతానికి పైగా అమ్ముడుపోకపోవడం మరో విశేషం. ఈ కేటగిరిలో శ్రీలంక ఆల్‌రౌండర్ దసున్ షనకకు అత్యధిక ధర దక్కింది. ఇతన్ని ఢాకా క్యాపిటల్స్ USD 55000కు కొనుగోలు చేసింది.కాగా, ఈ సీజన్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ డిసెంబర్ 26 నుంచి జనవరి 23 వరకు జరగనుంది. ఈ సీజన్లో పాల్గొనే జట్లు.. ఢాకా క్యాపిటల్స్, రంగ్‌పూర్ రైడర్స్, రాజ్షాహి వారియర్స్, నోయాఖాలి ఎక్స్‌ప్రెస్, సిల్హెట్ టైటాన్స్, చిట్టగాంగ్ రాయల్స్. -
సూర్యవంశీ మరోసారి.. మాత్రే వరుస సెంచరీలు
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో నిన్న (నవంబర్ 30) పలు అద్బుత ప్రదర్శనలు నమోదయ్యాయి. యువ ఆటగాళ్లలో ఆయుశ్ మాత్రే వరుసగా సెంచరీతో విజృంభించగా.. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి వారు మెరుపు సెంచరీలతో విరుచుకుపడ్డారు. యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మాత్రం ఈ టోర్నీలో వైఫల్యాల పరంపరను కొనసాగించాడు.అభి'షేక్' సెంచరీబెంగాల్తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ఓవరాల్‌గా 52 బంతుల్లో 148 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 16 సిక్సర్లు ఉన్నాయి. అభిషేక్ ధాటికి పంజాబ్ రికార్డు స్థాయిలో 310 పరుగులు చేయగా.. బెంగాల్ కనీస పోరాటం కూడా చేయలేకపోయింది.విస్ఫోటనం సృష్టించిన పాకెట్ డైనమైట్త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ (జార్ఖండ్) విస్ఫోటనం సృష్టించాడు. కేవలం 50 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయమైన 113 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ త్రిపురపై ఘన విజయం సాధించింది.మాత్రే వరుస సెంచరీలుముంబై ఆటగాడు ఆయుశ్ మాత్రే మూడు రోజుల వ్యవధిలో రెండో సెంచరీ చేశాడు. ఆంధ్రతో నిన్న జరిగిన మ్యాచ్‌లో మాత్రే 59 బంతుల్లో అజేయమైన 104 పరుగులు చేసి తన జట్టుకు సునాయాస విజయాన్నందించాడు.వైభవ్ వరుస వైఫల్యాలుఈ టోర్నీలో యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ పరంపర కొనసాగుతుంది. జమ్మూ అండ్ కశ్మీర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేవలం 7 పరుగులకే ఔటయ్యాడు. సంచలన పేసర్, జమ్మూ అండ్ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీ వైభవ్‌ను ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో బిహార్‌పై జమ్మూ అండ్ కశ్మీర్ ఘన విజయం సాధించింది.ఇవే కాక నిన్న మరిన్ని చెప్పుకోదగ్గ ప్రదర్శనలు నమోదయ్యాయి. సంజూ శాంసన్, రజత్ పాటిదార్, రింకూ సింగ్, కరుణ్ నాయర్, సూర్యకుమార్ యాదవ్ లాంటి నోటెడ్ స్టార్లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. -
IND Vs SA: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా
ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి (0-2తో క్లీన్ స్వీప్) టీమిండియా గట్టిగానే ప్రతీకారం తీర్చుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న (నవంబర్ 30) జరిగిన తొలి వన్డేలో (India vs South Africa) ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు సఫారీలకు చుక్కలు చూపించింది.విరాట్ కోహ్లి (Virat Kohli) 52వ వన్డే శతకంతో చెలరేగిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ (57), కేఎల్ రాహుల్ (60) కూడా అర్ద సెంచరీలతో సత్తా చాటారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆదిలో తబడిన సౌతాఫ్రికా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకొని కాసేపు టీమిండియాను భయపెట్టింది. మిడిలార్డర్ బ్యాటర్లు మాథ్యూ బ్రీట్జ్కే (72), జన్సెన్ (70), కార్బిన్ బాష్ (67) ఊహించని రీతిలో ప్రతిఘటించి టీమిండియా శిబిరంలో గుబులు పుట్టించారు. అంతింగా భారత్‌దే పైచేయి అయినప్పటికీ సఫారీల పోరాటం అందరినీ ఆకట్టుకుంది. 49.2 ఓవర్లలో ఆ జట్టు 332 పరుగులు చేసి లక్ష్యానికి 18 పరుగుల దూరంలో నిలిచిపోయింది.ఈ మ్యాచ్‌లో ఓడినా సౌతాఫ్రికా (South Africa) ఓ విషయంలో చరిత్ర సృష్టించింది. వన్డే లక్ష్య ఛేదనల్లో 15 పరుగులలోపే 3 వికెట్లు కోల్పోయి అంతిమంగా 300 పరుగులు చేసిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. దీనికి ముందు ఈ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉండేది. 2019లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ లక్ష్య ఛేదనలో 6 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి, అంతిమంగా 297 పరుగులు చేసింది. -
టిమ్ డేవిడ్ విలయతాండవం
అబుదాబీ టీ10 లీగ్ (Abu Dhabi T10 League) 2025 ఎడిషన్‌లో యూఏఈ బుల్స్ (UAE Bulls) విజేతగా ఆవిర్భవించింది. నిన్న (నవంబర్ 30) జరిగిన ఫైనల్లో ఆస్పిన్ స్టాల్లియన్స్‌పై 80 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 150 పరుగుల ఊహకందని స్కోర్ చేసింది.బుల్స్‌కు ఆడుతున్న ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు టిమ్ డేవిడ్ (Tim David) కేవలం 30 బంతుల్లో 12 సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో అజేయమైన 98 పరుగులు చేసి విశ్వరూపం ప్రదర్శించాడు. మిగతా ఆటగాళ్లలో రోవ్‌మన్ పావెల్ 20 బంతుల్లో 24 (నాటౌట్), ఫిల్ సాల్ట్ 8 బంతుల్లో 18 పరుగులు చేశారు. జేమ్స్ విన్స్ డకౌటయ్యాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన స్టాల్లియన్స్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఓపెనర్ కమ్ కెప్టెన్ రహ్మానుల్లా గుర్బాజ్ (15 బంతుల్లో 18) సహా అంతా నిదానంగా ఆడారు. ఆండీ ఫ్లెచర్ 2 (రిటైర్డ్ హర్ట్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ డకౌట్, డు ప్లూయ్ 16, కట్టింగ్ 11, కరీమ్ జనత్ 15, సామ్ బిల్లింగ్స్ 3 పరుగులు మాత్రమే చేశారు. సిక్సర్ల సునామీ సృష్టించి యూఏఈని ఒంటిచేత్తో గెలిపించిన టిమ్ డేవిడ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 9 సీజన్ల లీగ్ చరిత్రలో యూఏఈ బుల్స్‌కు ఇదే మొదటి టైటిల్. -
సూర్యకుమార్ కాదు, కెప్టెన్ శార్దూల్ ఠాకూర్
నవంబర్ 26 నుంచి ప్రారంభం కాబోయే దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT 2025-26) కోసం 17 మంది సభ్యుల ముంబై జట్టును ఇవాళ (నవంబర్ 21) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) ఎంపికయ్యాడు. ఇవాళ ఉదయం నుంచి సోషల్‌మీడియాలో ఓ వార్త హల్చల్ చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబై కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ (Surya kumar Yadav) ఎంపికయ్యాడని జోరుగా ప్రచారం జరిగింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారిక ప్రకటనతో ఈ వార్త అబద్దం అని తేలిపోయింది. అయితే సూర్యకుమార్ సాధారణ ఆటగాడిగా జట్టులో చోటు దక్కించుకున్నాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ నేపథ్యంలో అతను కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. SMAT సౌతాఫ్రికా సిరీస్ షెడ్యూల్స్ క్లాష్ అవుతున్నాయి.శార్దూల్ ఇటీవలే ముంబై రంజీ జట్టుకు కూడా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వెటరన్ అజింక్య రహానే నుంచి బాధ్యతలు చేపట్టాడు. వాస్తవానికి SMATలో ముంబై జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించాల్సి ఉండింది. అయితే అతను ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడటంతో అందుబాటులో లేకుండా పోయాడు.ఈ నేపథ్యంలో శార్దూల్‌కు కెప్టెన్సీ హోదా దక్కింది. రానున్న SMAT ఎడిషన్‌లో ముంబై డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. గత ఎడిషన్ ఫైనల్లో శ్రేయస్ నేతృత్వంలోని ముంబై జట్టు మధ్యప్రదేశ్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.రానున్న సీజన్ కోసం ఎంపిక చేసిన ముంబై జట్టులో చాలామంది టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది. కెప్టెన్ శార్దూల్, భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు టీ20 స్టార్ శివమ్ దూబే, వెటరన్ అజింక్య రహానే, యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, అప్‌కమింగ్ స్టార్ ఆయుశ్ మాత్రే ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఫస్ట్ ఛాయిస్ వికెట్‌కీపర్ బ్యాటర్‌గా అండర్-19 స్టార్ అంగ్క్రిష్ రఘువంశీ ఎంపికయ్యాడు.ఈ టోర్నీలో ముంబై ప్రయాణం నవంబర్ 26న రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో జరుగనుంది.SMAT 2025-26 కోసం ముంబై జట్టు: శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), అజింక్య రహానే, ఆయుశ్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, సిద్ధేష్ లాడ్, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, సాయిరాజ్ పాటిల్, ముషీర్ ఖాన్, సూర్యాంశ్ షెడ్గే, అథర్వ అంకోలేకర్, తనుష్ కోటియన్, షమ్స్ ములానీ, తుషార్ దేశ్‌పాండే, ఇర్ఫాన్ ఉమైర్, హార్దిక్ తామోర్ (వికెట్‌కీపర్)చదవండి: వైభవ్ మెరుపులు వృధా.. ఆసియా కప్ సెమీస్‌లో టీమిండియా ఓటమి -
వైభవ్ మెరుపులు వృధా.. ఆసియా కప్ సెమీస్‌లో టీమిండియా ఓటమి
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో (ACC Men's Asia Cup Rising Stars 2025) భాగంగా భారత్-ఏ-బంగ్లాదేశ్-ఏ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 21) జరిగిన తొలి సెమీఫైనల్ నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది. దోహా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ సూపర్ ఓవర్లో విజయం సాధించి, ఫైనల్‌కు దూసుకెళ్లింది. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్లు సమానమైన స్కోర్లు చేయగా మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఖాతా తెరవకుండానే 2 వికెట్లూ కోల్పోగా.. సుయాశ్ శర్మ వైడ్ వేసి బంగ్లాదేశ్‌ను గెలిపించాడు. పాకిస్తాన్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య ఇవాళ రాత్రే జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో బంగ్లాదేశ్-ఏ నవంబర్ 23న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.బంగ్లాదేశ్ భారీ స్కోర్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఓపెనర్ హబిబుర్ రెహ్మాన్ సోహన్ (46 బంతుల్లో 65; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), మెహ్రబ్ (18 బంతుల్లో 48 నాటౌట్; ఫోర్, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్ చేసింది.భారత బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్ (4-0-39-2), హర్ష్ దూబే (4-0-22-1), సుయాశ్ శర్మ (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. రమన్‌దీప్ సింగ్ (2-0-29-1), నమన్ ధిర్ (2-0-33-1) పర్వాలేదనిపించారు.వైభవ్ మెరుపులు వృధాభారీ లక్ష్య ఛేదనలో భారత్‌కు మెరుపు ఆరంభం లభించినప్పటికీ.. ప్రయోజనం లేకుండా పోయింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (15 బంతుల్లో 38; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), ప్రియాంశ్ ఆర్య (23 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు వృధా అయ్యాయి. జితేశ్ శర్మ (33), నేహల్ వధేరా (32 నాటౌట్), ఆఖర్లో రమన్‌దీప్ (17), అశుతోష్ శర్మ (13) సత్తా చాటడంతో అతి కష్టం మీద నిర్ణీత ఓవర్లలో స్కోర్లు సమమయ్యాయి.అయితే సూపర్ ఓవర్లో భారత్ బొక్క బోర్లా పడింది. తొలి రెండు బంతులకు వికెట్లు జితేశ్, అశుతోష్ ఔట్ కావడంతో ఖాతా కూడా తెరవలేకయింది. అనంతరం బంగ్లాదేశ్ సైతం తొలి బంతికే వికెట్ కోల్పోగా.. రెండో బంతిని సుయాశ్ శర్మ వైడ్‌గా వేయడంతో బంగ్లాదేశ్ గెలుపొందింది. చదవండి: భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్ల ప్రకటన -
భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్ల ప్రకటన
త్వరలో భారత్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల (India vs South Africa) కోసం వేర్వేరు సౌతాఫ్రికా జట్లను (South Africa) ఇవాళ (నవంబర్ 21) ప్రకటించారు. వన్డే జట్టు కెప్టెన్‌గా టెంబా బవుమా (Temba Bavuma), టీ20 జట్టు కెప్టెన్‌గా ఎయిడెన్ మార్క్రమ్ (Aiden Markram) ఎంపికయ్యారు. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా పాకిస్తాన్‌పై అరంగేట్రం చేసిన రూబిన్ హెర్మన్ వన్డే జట్టులో కొనసాగాడు. క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్, ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు.మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నవంబర్ 30, డిసెంబర్ 3, 6 తేదీల్లో రాంచీ, రాయ్‌పూర్, విశాఖ వేదికలుగా జరుగనుంది. అనంతరం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ డిసెంబర్ 9, 11, 14, 17, 19 తేదీల్లో కటక్, ముల్లాన్‌పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికగా జరుగనుంది.భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు:టెంబా బవుమా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, రూబిన్ హెర్మన్, కేశవ్ మహారాజ్, మార్కో జన్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, ర్యాన్ రికెల్టన్, ప్రెనెలన్ సుబ్రాయన్.భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు:ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, ట్రిస్టన్ స్టబ్స్.చదవండి: టీమిండియాతో సెమీఫైనల్.. బంగ్లాదేశ్ భారీ స్కోర్ -
టీమిండియాతో సెమీఫైనల్.. బంగ్లాదేశ్ భారీ స్కోర్
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో (ACC Men's Asia Cup Rising Stars 2025) ఇవాళ (నవంబర్ 21) తొలి సెమీ ఫైనల్ జరుగుతుంది. దోహా వేదికగా భారత్-ఏ-బంగ్లాదేశ్-ఏ (India A vs Bangladesh A) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్ హబిబుర్ రెహ్మాన్ సోహన్ (46 బంతుల్లో 65; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆఖర్లో మెహ్రబ్ (18 బంతుల్లో 48 నాటౌట్; ఫోర్, 6 సిక్సర్లు) చెలరేగడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్ చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో జిషన్ ఆలమ్ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జవాద్ అబ్రార్ (13), యాసిర్ అలీ (9 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆ జట్టు కెప్టెన్ అక్బర్ అలీ 9, మహిదుల్ ఇస్లాం 1 పరుగు చేయగా.. అబూ హైదర్ డకౌటయ్యాడు.భారత బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాక్ (4-0-51-0) భారీ పరుగులు సమర్పించుకోగా.. గుర్జప్నీత్ సింగ్ (4-0-39-2), హర్ష్ దూబే (4-0-22-1), సుయాశ్ శర్మ (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. రమన్‌దీప్ సింగ్ (2-0-29-1), నమన్ ధిర్ (2-0-33-1) పర్వాలేదనిపించారు.వైభవ్ మెరుపులు కూడా మొదలయ్యాయి..!అనంతరం భారీ లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (12 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) తన సహజ శైలిలో విధ్వంసాన్ని ప్రారంభించాడు. మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (7 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) కూడా భారీ షాట్లు ఆడుతున్నాడు. ఫలితంగా భారత్ 3.3 ఓవరల్లో వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. -
శ్రేయస్ అయ్యర్‌కు సంబంధించి బిగ్ అప్డేట్
ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడిన భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు (Shreyas Iyer) సంబంధించి బిగ్ అప్డేట్ అందుతుంది. టీమిండియాలోకి శ్రేయస్ రీఎంట్రీ ఇప్పట్లో కష్టమేనని సమాచారం. ఇండియాటుడే నివేదిక ప్రకారం.. శ్రేయస్‌కు తాజాగా అల్రాసోనోగ్రఫీ (USG) స్కాన్ తీశారు. ఇందులో అతడి గాయం పూర్తిగా నయం కాలేదని తేలింది.ప్రస్తుతం అతను సాధారణ పనులు, తేలికపాటి ఎక్సర్సైజ్లు మాత్రమే చేసుకోవచ్చు. హార్డ్ ట్రైనింగ్ మరో నెల పాటు నిషేధం. రెండు నెలల తర్వాత మరో స్కాన్ ఆధారంగా BCCI CoEలో అతడి రీహాబ్ ప్లాన్ అమలు కానుంది. ఈ సమాచారం నిజమైతే శ్రేయస్ మరో మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటాడు.ఈ మధ్యలో అతను సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లకు దూరమవుతాడు. మార్చిలో జరిగే ఐపీఎల్ 2026లోనే శ్రేయస్ పునఃదర్శనం ఉంటుంది. ఈ వార్త తెలిసి శ్రేయస్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. తొలుత శ్రేయస్ వచ్చే ఏడాది న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ సమయానికంతా సిద్దంగా ఉంటాడని అంతా అనుకున్నారు.తాజా అప్డేట్ని బట్టి చూస్తే ఇప్పట్లో శ్రేయస్‌ను టీమిండియా జెర్సీలో చూడటం కష్టమేనని స్పష్టమవుతుంది.కాగా, అక్టోబర్ 25న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సందర్భంగా అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో శ్రేయస్ ప్రమాదకరంగా కిందపడ్డాడు. క్యాచ్ అయితే పట్టగలిగాడు కాని, ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. కిందపడ్డాక నొప్పితో విలవిలలాడిపోయిన శ్రేయస్‌ను హుటాహుటిన సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఐసీయూలో పెట్టి చికిత్సనందించారు. తొలుత గాయం చిన్నదే అని అంతా అనుకున్నారు.అయితే డాక్టర్లు నెమ్మదిగా విషయాన్ని చెప్పారు. శ్రేయస్ స్ప్లీన్‌లో (ప్లీహం) చీలక వచ్చి, అంతర్గత రక్తస్రావమైందని తెలిపారు. ఒకటి, రెండు రోజుల వరకు ఏమీ చెప్పలేమని అన్నారు.అయితే దైవానుగ్రహం, డాక్టర్లు కృషి వల్ల శ్రేయస్ ప్రాణాపాయం నుంచి తప్పించుకుని సాధారణ స్థితికి చేరాడు. ప్రస్తుతం అతను మునుపటిలా యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. క్రికెట్‌కు మాత్రం ఇంకొంతకాలం దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. చదవండి: యాషెస్ సిరీస్‌కు అదిరిపోయే ఆరంభం -
యాషెస్ సిరీస్‌కు అదిరిపోయే ఆరంభం
2025-26 యాషెస్ సిరీస్‌కు (Ashes Series) అదిరిపోయే ఆరంభం లభించింది. పెర్త్ వేదికగా ఇవాళ (నవంబర్ 21) మొదలైన తొలి మ్యాచ్‌లో (Australia vs England) ఏకంగా 19 వికెట్లు పడ్డాయి. యాషెస్ సిరీస్ చరిత్రలో గడిచిన వందేళ్లలో ఇలా ఎప్పుడూ జరగలేదు. 2001 ట్రెంట్‌బ్రిడ్జ్ టెస్ట్‌లో అత్యధికంగా 17 వికెట్లు పడ్డాయి.యాషెస్ టెస్ట్ తొలి రోజు 18 అంతకంటే ఎక్కువ వికెట్లు పడిన ఏకైక ఉదంతం 1909 ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్ట్‌లో చోటు చేసుకుంది. ఆ మ్యాచ్ తొలి రోజు రికార్డు స్థాయిలో 20 వికెట్లు పడ్డాయి. తొలుత ఆస్ట్రేలియా 147, ఆర్వాత ఇంగ్లండ్ 119 పరుగులకు ఆలౌటయ్యాయి.ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఇవాళ మొదలైన యాషెస్ టెస్ట్‌లోనూ పునరావృతమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 172 పరుగులకు ఆలౌట్ కాగా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌పై మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగాడు. ఏకంగా 7 వికెట్లు తీసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను మట్టుబెట్టాడు. అరంగేట్రం పేసర్ బ్రెండన్ డాగ్గెట్ 2, గ్రీన్ ఓ వికెట్ తీశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (52) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఓలీ పోప్ (46), జేమీ స్మిత్ (33), డకెట్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. జాక్ క్రాలే, రూట్, మార్క్ వుడ్ డకౌట్లు కాగా.. స్టోక్స్ 6, అట్కిన్సన్ 1, కార్స్ 6 పరుగులకు ఔటయ్యారు.అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ బౌలర్లు సైతం విరుచుకుపడ్డారు. కెప్టెన్ స్టోక్స్ 5, ఆర్చర్, కార్స్ తలో 2 వికెట్లు తీసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను పతనం అంచుకు తీసుకెళ్లారు. ఇప్పటివరకు ఆసీస్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ క్యారీ (26) టాప్ స్కోరర్ కాగా.. హెడ్ (21), గ్రీన్ (24), స్టీవ్ స్మిత్ (17), స్టార్క్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. అరంగేట్రం బ్యాటర్ వెదరాల్డ్, బోలాండ్ డకౌట్లు కాగా.. లబూషేన్ 9, ఖ్వాజా 2 పరుగులకు ఔటయ్యారు. లియోన్ (3), డగ్గెట్ (0) క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా భూకంపం.. ఉలిక్కిపడ్డ ప్లేయర్లు -
కెప్టెన్‌గా రుతురాజ్
త్వరలో ప్రారంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ (SMAT 2025-26) కోసం 16 మంది సభ్యుల మహారాష్ట్ర జట్టును (Maharashtra) ఇవాళ (నవంబర్ 21) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) ఎంపికయ్యాడు. ఇటీవలే ముంబై నుంచి వలస వచ్చిన పృథ్వీ షాకు (Prithvi Shaw) ఈ జట్టులో చోటు దక్కింది. రుతురాజ్, షా ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.ఈ టోర్నీ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుండగా, అదే రోజు మహారాష్ట్ర తమ తొలి మ్యాచ్‌లో జమ్మూ అండ్ కశ్మీర్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో మహారాష్ట్ర ఎలైట్ గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో హైదరాబాద్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, ఛండీఘడ్, బిహార్, గోవా జట్లు ఉన్నాయి. గ్రూప్ దశలో మహారాష్ట్ర మొత్తం 7 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ కోల్‌కతా వేదికగా జరుగనున్నాయి.SMAT 2025-26 కోసం మహారాష్ట్ర జట్టు..రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), పృథ్వీ షా, అర్శిన్ కులకర్ణి, రాహుల్ త్రిపాఠి, నిఖిల్ నాయక్ (వికెట్‌కీపర్), రామకృష్ణ ఘోష్, విక్కీ ఓస్త్వాల్, తనయ్ సంఘ్వీ, ముకేశ్ చౌదరీ, ప్రశాంత్ సోలంకి, మందర్ బండారీ (వికెట్‌కీపర్), జలజ్ సక్సేనా, రాజవర్దన్ హంగార్గేకర్, యోగేశ్ డోంగరే, రంజిత్ నికమ్చదవండి: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా భూకంపం.. ఉలిక్కిపడ్డ ప్లేయర్లు -
క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా భూకంపం.. ఉలిక్కిపడ్డ ప్లేయర్లు
ఢాకా (Dhaka) వేదికగా బంగ్లాదేశ్ (Bangladesh)-ఐర్లాండ్ (Bangladesh vs Ireland) మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు (నవంబర్ 21) ఆటలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా భూకంపం (Earth Quake) సంభవించడంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లంతా ఉలిక్కిపడ్డారు. మ్యాచ్ ఉన్నపళంగా ఆగిపోయింది. ఆటగాళ్లు, అంపైర్లు బౌండరీ లైన్ వైపు పరుగులు పెట్టారు. కొందరేమో మైదానంలోనే కింద పడుకుండిపోయారు.ప్రేక్షకులు ఏం జరుగుతుందో అర్దం కాక స్టేడియం బయటికి లగెత్తారు. దీంతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. మూడు, నాలుగు నిమిషాల భూకంపం ధాటి తగ్గడంతో సాధారణ పరిస్థితి నెలకొంది. మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. ఈ షాకింగ్ ఘటన ఐర్లాండ్ ఇన్నింగ్స్ 56వ ఓవర్ రెండో బంతి బౌల్ చేస్తుండగా చోటు చేసుకుంది.కాగా, ఇవాళ ఉదయం 10:08 గంటల సమయంలో బంగ్లాదేశ్‌లోని ఢాకా నగరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (US Geological Survey) తెలిపింది. భూప్రకంపనల కారణంగా ఢాకాలోని పలు భవనాలు కూలిపోయాయి. ఇందులో ఆరుగురు మృతి చెందినట్టు సమాచారం.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పట్టు సాధించింది. మూడో రోజు మూడో సెషన్ సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 70 పరుగులు చేసి, 281 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 476 పరుగుల భారీ స్కోర్ చేసిన బంగ్లాదేశ్.. ఆతర్వాత ఐర్లాండ్‌ను 265 పరుగులకే పరిమితం చేసి 211 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది. రెండు మ్యాచ్‌ల ఆ సిరీస్‌లో తొలి టెస్ట్ గెలిచిన బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో ఉంది. చదవండి: టీమిండియా కెప్టెన్‌గా రిషబ్ పంత్.. బీసీసీఐ అధికారిక ప్రకటన -
కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ పేరు ప్రకటన
త్వరలో ప్రారంభం కానున్న దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT 2025-26) కోసం 15 మంది సభ్యుల జార్ఖండ్ జట్టును ఇవాళ (నవంబర్ 20) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఎంపికయ్యాడు. ఈ జట్టులో కుమార్ కుషాగ్రా, రాబిన్ మింజ్, అనుకూల్ రాయ్ లాంటి ఐపీఎల్ సంచలనాలకు చోటు దక్కింది. ఉత్కర్ష్ సింగ్, విరాట్ సింగ్ లాంటి స్థిరమైన బ్యాటర్లు.. సుశాంత్ మిశ్రా, వికాస్ సింగ్ లాంటి నాణ్యమైన బౌలర్లు కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరందిరినీ కలగలుపుకొని ఇషాన్ జార్ఖండ్ జట్టును ముందుండి నడిపించనున్నాడు.27 ఏళ్ల ఇషాన్ విధ్వంసకర బ్యాటింగ్‌కు మారు పేరు. చూడటానికి చిన్నగా ఉన్నా భారీ షాట్లు ఆడగల సమర్దుడు. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఇషాన్, టీమిండియాలోనూ తనదైన ముద్ర వేశాడు. ఇషాన్‌కు ఇదివరకే జార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం ఉంది.టీ20 ఫార్మాట్లో ఇషాన్‌కు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు 206 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్.. 134.20 స్ట్రైక్ రేట్‌తో 5270 పరుగులు చేశాడు.ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన అనుభవమున్న ఇషాన్.. తాజాగా సౌతాఫ్రికా-ఏతో జరిగిన వన్డే సిరీస్‌లో ఇండియా-ఏ తరఫున మెరిశాడు. ఈ సిరీస్‌లో ఇషాన్ ఓ అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు.నవంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ ఎలైట్ గ్రూప్-డిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఢిల్లీ, కర్ణాటక, ఉత్తరాఖండ్, రాజస్థాన్, తమిళనాడు, సౌరాష్ట్ర, త్రిపుర జట్లు ఉన్నాయి. జార్ఖండ్ నవంబర్ 26న జరిగే తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీతో తలపడనుంది. ఈసారి ఇషాన్ నేతృత్వంలోని జార్ఖండ్ జట్టు అండర్ డాగ్‌గా బరిలోకి దిగనుంది. స్టార్లతో నిండిన పటిష్టమైన జట్లకు షాకిచ్చే అవకాశం ఉంది.కుమార్ కుషాగ్రా, రాబిన్ మింజ్ లాంటి హార్డ్ హిట్టర్లు చెలరేగవచ్చు. అనుకూల్ రాయ్ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటే ఆస్కారం ఉంది. ఇషాన్‌ను వ్యక్తిగతంగా ఆపడం కూడా చాలా కష్టమవచ్చు. ఇషాన్ ఒక్క సారి టచ్‌లోకి వచ్చాడంటే ఎంతటి బౌలర్లనైనా లెక్క చేయడు.SMAT 2025-26 కోసం జార్ఖండ్ జట్టు.. ఇషాన్ కిషన్ (C/WK), ఉత్కర్ష్ సింగ్, విరాట్ సింగ్, కుమార్ కుషాగ్రా (WK/VC), రాబిన్ మింజ్, అనుకూల్ రాయ్, పంకజ్ కుమార్, బాలకృష్ణ, మొహమ్మద్ కౌనైన్ ఖురేషీ, శుభ్ శర్మ, అమిత్ కుమార్, మనీషి, సుశాంత్ మిశ్రా, వికాస్ సింగ్, సౌరభ్ శేఖర్, రాజన్దీప్ సింగ్. చదవండి: IPL 2026 Auction: ఫ్రాంచైజీల బలహీనతలు, లోటుపాట్లు -
IPL 2026 Auction: ఫ్రాంచైజీల బలహీనతలు, లోటుపాట్లు
ఐపీఎల్ 2026 మినీ వేలానికి (IPL 2026 Auction) నెల రోజులు సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఫ్రాంచైజీలన్నీ వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి. ఆటగాళ్ల రిలీజ్, రిటెన్షన్, ట్రేడింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత అన్ని ఫ్రాంచైజీల్లో 77 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ స్లాట్ల భర్తీతో ఫ్రాంచైజీలు తమ బలహీనతలను, లోటుపాట్లను పూడ్చుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఫ్రాంచైజీల వద్ద మిగిలి ఉన్న పర్స్ విలువ కీలకమవనుంది. కేకేఆర్ అత్యధిక పర్స్ నిలువతో వేలానికి వెళ్లనుండగా, ముంబై ఇండియన్స్ అత్యల్ప పర్సు విలువతో వేలం బరిలో నిలువనుంది. ఫ్రాంచైజీల వారీగా బలహీనతలు, లోటుపాట్లు..చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పర్స్: ₹43.4 కోట్లు స్లాట్లు: 9 (విదేశీ 4) బలహీనతలు: - జడేజా RRకి వెళ్లడం, ధోనిలో ఫినిషింగ్ సామర్థ్యం తగ్గడంతో లోయర్ మిడిలార్డర్ బలహీనంగా కనిపిస్తుంది. - పతిరణ విడుదలతో పేస్ విభాగం కూడా బలహీనంగా మారింది. - అశ్విన్ రిటైర్మెంట్, జడేజా ఆర్ఆర్కు వెళ్లడంతో స్పిన్ విభాగంలో ఖాళీలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) పర్స్: ₹21.8 కోట్లు స్లాట్లు: 8 (విదేశీ 4) బలహీనతలు: - అనుభవజ్ఞుడైన టాపార్డర్ బ్యాటర్ లేడు. - డుప్లెసిస్, జేక్ ఫ్రేసర్ విడుదల. - పోరెల్, విప్రాజ్, అశోతోష్, రిజ్వి లాంటి యువ ఆటగాళ్లు ఉన్నా, వారిపై మాత్రమే ఆధారపడలేని పరిస్థితి. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పర్స్: 64.3 కోట్లు స్లాట్లు: 13 (విదేశీ 6) బలహీనతలు: - ఓపెనింగ్ జంట లేకపోవడం (గుర్బజ్, డికాక్ విడుదల). - కెప్టెన్సీ కోసం సరైన ఆటగాడు అవసరం. - పేస్ విభాగంలో సంక్షోభం (నోర్జే, రస్సెల్ లేకపోవడం). రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పర్స్: ₹16.4 కోట్లు స్లాట్లు: 8 (విదేశీ 2) బలహీనతలు: - హాజిల్‌వుడ్, భువనేశ్వర్‌కు బ్యాకప్ సీమర్ లేడు. - గాయాలతో సతమతమవుతున్న హాజిల్‌వుడ్ అందుబాటులో ఉండటంపై స్పష్టత ఉండదు. - భువనేశ్వర్ వయసు పెరుగుతుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పర్స్: ₹25.5 కోట్లు స్లాట్లు: 10 (విదేశీ 2) బలహీనతలు: - లోయర్ మిడిలార్డర్ బలహీనంగా ఉంది. సరైన ఫినిషర్ లేడు. - స్పిన్ విభాగంలో అనుభవజ్ఞులు లేరు (చాహర్, జంపా విడుదల). లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పర్స్: ₹22.95 కోట్లు స్లాట్లు: 7 (విదేశీ 4) బలహీనతలు: - లోయర్ మిడిలార్డర్లో నమ్మదగిన బ్యాటర్ లేడు. - బౌలింగ్ విభాగం బలహీనం (బిష్ణోయి, ఆకాష్ దీప్ విడుదల). గుజరాత్ టైటాన్స్ (GT) పర్స్: ₹12.9 కోట్లు స్లాట్లు: 6 (విదేశీ 5) బలహీనతలు: - మిడిలార్డర్ బలహీనం. - రూథర్‌ఫోర్డ్ విడుదల, తెవాటియా, సుందర్ పెద్దగా ప్రభావం చూపకపోవడం. పంజాబ్ కింగ్స్ (PBKS) పర్స్: ₹11.5 కోట్లు స్లాట్లు: 4 (విదేశీ 2) బలహీనతలు: - మ్యాక్స్‌వెల్, ఇంగ్లిస్ స్థానాల్లో ఆ స్థాయి విధ్వంసకర ఆటగాళ్లు అవసరం. - వీరు లేకపోవడంతో మిడిలార్డర్ బలహీనం. రాజస్థాన్ రాయల్స్ (RR) పర్స్: ₹16.05 కోట్లు స్లాట్లు: 9 (విదేశీ 1) బలహీనతలు: - స్పిన్ విభాగం బలహీనం (తీక్షణ, హసరంగ విడుదల). - ఒక్క విదేశీ స్లాట్ మాత్రమే మిగిలి ఉండటం. ముంబై ఇండియన్స్ (MI) పర్స్: ₹2.75 కోట్లు స్లాట్లు: 5 (విదేశీ 1) బలహీనతలు: - అన్ని విభాగాలు బలంగా ఉన్నప్పటికీ, మిడిలార్డర్లో విధ్వంసకర బ్యాటర్ అవసరం. - ఒక్క విదేశీ స్లాటే ఉండటం. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ విధ్వంసకర శతకం -
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ విధ్వంసకర శతకం
మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో (WBBL 2025) మెల్బోర్న్ స్టార్స్ ఓపెనర్, మహిళల ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అయిన మెగ్ లాన్నింగ్ (Meg Lanning) చెలరేగిపోయింది. సిడ్నీ సిక్సర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడింది. 74 బంతుల్లో 22 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసింది. WBBL HUNDRED FOR THE GOAT, MEG LANNING....!!!! 🐐 pic.twitter.com/0mc50pUij9— Johns. (@CricCrazyJohns) November 20, 2025ఆమెకు తోడు మరో ఓపెనర్ మెక్కెన్నా (34 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా బ్యాట్ ఝులిపించింది. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది.స్టార్స్ ఇన్నింగ్స్‌లో లాన్నింగ్, మెక్కెన్నా మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ అన్నాబెల్ సదర్‌ల్యాండ్ 12, మారిజన్ కాప్ 6 పరుగులు చేసి ఔట్ కాగా.. డానియెలా గిబ్సన్ 7, యామీ జోన్స్ 0 పరుగులతో అజేయంగా నిలిచారు. సిక్సర్స్ బౌలర్లలో లారెన్ చీటిల్, ఆష్లే గార్డ్నర్, మ్యాడీ విలియర్స్‌కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో స్టార్స్ చేసిన 219 పరుగుల స్కోర్ మహిళల బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో మూడో అత్యధికం. ఈ లీగ్‌లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు సిడ్నీ సిక్సర్స్ (242) పేరిట ఉంది. ఆతర్వాతి స్థానంలో బ్రిస్బేన్ హీట్ (229) ఉంది.ఈ మ్యాచ్‌లో లాన్నింగ్ చేసిన స్కోర్ (135) కూడా లీగ్ చరిత్రలో మూడో అత్యధికం. మొదటి రెండు స్థానాల్లో లిజెల్ లీ (150 నాటౌట్), గ్రేస్ హ్యారిస్ (136 నాటౌట్) ఉన్నారు. ఈ సెంచరీతో లాన్నింగ్ WBBLలో అత్యధి ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన ప్లేయర్ల జాబితాలో ఎల్లిస్ పెర్రీని (34) వెనక్కు నెట్టి రెండో స్థానానికి (35) ఎగబాకింది. టాప్ ప్లేస్‌లో బెత్ మూనీ (48) ఉంది. ఈ సెంచరీ లాన్నింగ్‌కు మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో రెండవది. చదవండి: నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో చరిత్ర సృష్టించిన భారత క్రికెటర్ -
చరిత్ర సృష్టించిన భారత క్రికెటర్
భారత దేశవాలీ స్టార్ క్రికెటర్ ప్రియాంక్ పంచల్ (Priyank Panchal) నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో చరిత్ర సృష్టించాడు. ఈ లీగ్ అరంగేట్రంలో అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. కొద్ది రోజుల కిందటే కర్నాలీ యాక్స్ ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకున్న ప్రియాంక్.. చిట్వాన్ రైనోస్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేశాడు. నేపాల్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఓ ఆటగాడు అరంగేట్రంలో చేసిన అత్యధిక స్కోర్ ఇదే.ప్రియాంక్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యాక్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. యాక్స్ ఇన్నింగ్స్‌లో ప్రియాంక్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేకపోయారు. విదేశీ ప్లేయర్లు మ్యాక్స్ ఓడౌడ్ (30 బంతుల్లో 20 పరుగులు), మార్క్ వాట్ (21 బంతుల్లో 16) పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. ఆఖర్లో పవన్ సర్రాఫ్ (16 బంతుల్లో 27 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో యాక్స్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. రైనోస్ బౌలర్లలో సోహైల్ తన్వీర్ (4-0-26-1), రవి బొపారా (3-0-18-1) పొదుపుగా బౌలింగ్ చేశారు.అనంతరం 167 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రైనోస్‌కు దీపక్ బొహారా (36 బంతుల్లో 42) శుభారంభాన్ని అందించాడు. కెప్టెన్ కుసాల్ మల్లా (15 బంతుల్లో 20), సైఫ్ జైబ్ (16 బంతుల్లో 38) సహకారంతో రవి బొపారా (36 బంతుల్లో 52) రైనోస్‌ను గెలుపు వాకిటి వరకు చేర్చాడు. చివరి ఓవర్లో 2 పరుగులు చేయాల్సిన తరుణంలో అర్జున్ సౌద్ సిక్సర్ బాది రైనోస్‌ను గెలిపించాడు. యాక్స్ బౌలర్లలో సోంపాల్ కామీ (4-0-33-2) మెరుగైన ప్రదర్శన చేశాడు.కాగా, ప్రియాంక్ పంచల్ ఇటీవలే భారత దేశవాలీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి పరాయి దేశ లీగ్‌లు ఆడేందుకు అర్హత సాధించాడు. భారత ఆటగాళ్లు విదేశీ లీగ్‌ల్లో ఆడాలంటే భారత క్రికెట్‌తో పూర్తిగా సంబంధాలు తెంచుకోవాలి. ప్రియాంక్‌కు ముందు టీమిండియా గబ్బర్‌గా పిలువబడే శిఖర్ ధవన్ నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. ఈ లీగ్ గతేడాదే పురుడు పోసుకుంది.దేశవాలీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు కలిగిన ప్రియాంక్.. టీమిండియాకు మాత్రం ఆడలేకపోయాడు. గుజరాత్‌కు చెందిన 35 ప్రియాంక్ 127 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 45.18 సగటున, 23 సెంచరీలతో 8856 పరుగులు సాధించాడు. చదవండి: IRE vs BAN: రహీమ్, లిట్టన్ దాస్ సెంచరీలు.. బంగ్లాదేశ్ భారీ స్కోర్ -
రికార్డులు కొల్లగొట్టిన హోప్
వెస్టిండీస్ సంచలన బ్యాటర్ షాయ్ హోప్ (Shai Hope) వన్డే క్రికెట్లో రికార్డుల మీద రికార్డును నమోదు చేస్తున్నాడు. న్యూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్ 19) జరిగిన వన్డేలో సుడిగాలి శతకం బాదిన అతడు.. వేర్వేరు విభాగాల్లో పలు రికార్డులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో మహోగ్రరూపం దాల్చిన హోప్ కేవలం 69 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో హోప్ ఖాతాలో ఈ కింది రికార్డులు చేరాయి.ఈ ఏడాది విండీస్ తరఫున మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు.ఈ సెంచరీ హోప్‌కు వన్డేల్లో 19వది. తద్వారా క్రిస్ గేల్ (25) తర్వాత అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ బ్రియాన్ లారా (19) రికార్డు సమం.19 శతకాలను హోప్ కేవలం 142 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు. తద్వారా బాబర్ ఆజమ్ (102), హాషిమ్ ఆమ్లా (104), విరాట్ కోహ్లి (124), డేవిడ్ వార్నర్ (139) తర్వాత అత్యంత వేగంగా ఈ శతకాల మైలురాయిని తాకిన ఆటగాడిగా రికార్డు.ఈ 19 శతకాలను హోప్ 12 వేర్వేరు దేశాలపై సాధించాడు. భారత్, బంగ్లాదేశ్‌పై అత్యధికంగా తలో 3 సెంచరీలు చేశాడు. న్యూజిలాండ్‌పై హోప్‌కు ఇదే తొలి వన్డే సెంచరీ.ఈ సెంచరీతో హోప్ ఈ దశాబ్దంలో (2015-2025) అత్యధిక సెంచరీలు చేసిన తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. తద్వారా బాబర్ ఆజమ్ (9), డికాక్ (8), కోహ్లి (8), గుర్బాజ్ (8), గిల్‌ను (8) మరింత వెనక్కు నెట్టాడు. ఈ ఇన్నింగ్స్‌తో హోప్ వన్డేల్లో 6000 పరుగుల మైలురాయిని తాకాడు. ఈ మార్కును తాకేందుకు అతనికి 142 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. తద్వారా గ్రేట్ వివ్ రిచర్డ్స్ (141) తర్వాత అత్యంత వేగంగా 6000 పరుగుల మార్కును తాకిన విండీస్ ఆటగాడిగా రికార్డు.హోప్ ఒక్క ఇన్నింగ్స్‌తో ఇన్ని రికార్డులు సాధించినా ఈ మ్యాచ్‌లో విండీస్ పరాజయంపాలవడం విచారకరం. ఈ పరాజయంతో విండీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే కోల్పోయింది. నేపియర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. చదవండి: వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల -
వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
2026 పురుషుల అండర్ 19 ప్రపంచకప్ (వన్డే) షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (నవంబర్ 19) విడదల చేసింది. 16 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలోని తొలి మ్యాచ్‌లో గత ఎడిషన్ రన్నరప్ భారత్, యూఎస్ తలపడనున్నాయి. అదే రోజు జింబాబ్వే, స్కాట్లాండ్, టాంజానియా, వెస్టిండీస్ మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి.జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ వచ్చే ఏడాది (2026) జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 మధ్యలో జరుగనుంది. మూడు వారాల పాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఫిబ్రవరి 6న హరారేలో జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది.డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా వారి తొలి మ్యాచ్‌ను జనవరి 16న ఐర్లాండ్‌తో ఆడుతుంది. ఈ టోర్నీలోని మ్యాచ్‌లు రెండు ఆతిథ్య దేశాల్లోని ఐదు మైదానాల్లో జరుగుతాయి. ఈ టోర్నీలో పాల్గొనే 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. అనంతరం సూపర్-6, సెమీఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయి. ఈ టోర్నీకి సంబంధించిన వార్మప్ మ్యాచ్‌లు జనవరి 9-14 మధ్యలో జరుగుతాయి.గ్రూప్‌లు..గ్రూప్-ఏ- భారత్, బంగ్లాదేశ్, యూఎస్ఏ, న్యూజిలాండ్గ్రూప్-బి- జింబాబ్వే, పాకిస్తాన్, ఇంగ్లండ్, స్కాట్లాండ్గ్రూప్-సి- ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్, శ్రీలంకగ్రూప్-డి- వెస్టిండీస్, టాంజానియా, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా View this post on Instagram A post shared by Zimbabwe Cricket (@zimbabwe.cricket)చదవండి: టీమిండియాకు భంగపాటు -
షాయ్ హోప్ మహోగ్రరూపం
న్యూజిలాండ్ పర్యటనలో వెస్టిండీస్ వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది. తొలుత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-3 తేడాతో చేజార్చుకున్న కరీబియన్ జట్టు.. తాజాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2 తేడాతో కోల్పోయింది.నేపియర్ వేదికగా ఇవాళ (నవంబర్ 19) జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. వర్షం కారణంగా 34 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో విండీస్ కెప్టెన్ వీరంగం చేశాడు. కివీస్ బౌలర్లను ఊచకోత కోస్తూ, విధ్వంసకర శతకం బాదాడు. కేవలం 69 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.విండీస్ ఇన్నింగ్స్‌లో హోప్ 109 పరుగుల తర్వాత రెండో అత్యధిక స్కోర్ కేవలం 22 పరుగులు మాత్రమే. అకీమ్ అగస్ట్, జస్టిన్ గ్రీవ్స్, రొమారియో షెపర్డ్ తలో 22 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లలో మాథ్యూ ఫోర్డ్ (21), రూథర్‌ఫోర్డ్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో నాథన్ స్మిత్ 4, జేమీసన్ 3, టిక్నర్, సాంట్నర్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు డెవాన్ కాన్వే (90), రచిన్ రవీంద్ర (56) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఆఖర్లో టామ్ లాథమ్ (39 నాటౌట్), మిచెల్ సాంట్నర్ (34 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో న్యూజిలాండ్ మరో 3 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. నామమాత్రపు చివరి వన్డే హ్యామిల్టన్ వేదికగా నవంబర్ 22న జరుగనుంది. అనంతరం డిసెంబర్ 2 నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ మొదలవుతుంది.19వ సెంచరీఈ ఇన్నింగ్స్‌తో హోప్ ఈ ఏడాది విండీస్ తరఫున మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ సెంచరీ హోప్‌కు వన్డేల్లో 19వది. క్రిస్ గేల్ (25) తర్వాత వన్డేల్లో విండీస్ తరఫున అత్యధిక సెంచరీలు చేసింది హోపే. 19 శతకాలను హోప్ కేవలం 142 ఇన్నింగ్స్‌ల్లో సాధించడం మరో విశేషం. ఈ సెంచరీలకు హోప్ 12 దేశాలపై చేశాడు. -
వన్డే క్రికెట్‌కు సరికొత్త 'కింగ్'
వన్డే క్రికెట్‌కు సరికొత్త కింగ్ వచ్చాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌కు చెందిన 34 ఏళ్ల డారిల్ మిచెల్ (Daryl Mitchell) నంబర్ వన్ బ్యాటర్‌గా అవతరించాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ సెంచరీ (119) చేసిన మిచెల్.. రెండు స్థానాలు ఎగబాకి తొలిసారి టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. 1979 తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకున్న తొలి న్యూజిలాండ్ ఆటగాడు మిచెలే.మిచెల్ అగ్రపీఠాన్ని అధిరోహించే క్రమంలో టీమిండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) టాప్ ర్యాంక్‌ను కోల్పోయాడు. ఆసీస్ పర్యటనలో సంచలన ప్రదర్శనల (73, 121 నాటౌట్) తర్వాత తొలిసారి నంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా అవతరించిన రోహిత్ కేవలం మూడు వారాలు మాత్రమే టాప్ ప్లేస్‌లో కొనసాగాడు. ప్రస్తుతం రోహిత్ ఓ స్థానం కోల్పోయి రెండో స్థానానికి పడిపోయాడు. మిచెల్‌కు (782) రోహిత్‌కు (781) మధ్య వ్యత్యాసం కేవలం ఒక్క రేటింగ్ పాయింట్ మాత్రమే.త్వరలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ జరుగనుండగా హిట్‌మ్యాన్ తిరిగి నంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది. మరోవైపు మిచెల్ గాయం కారణంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండు, మూడు వన్డేలకు దూరమయ్యాడు. ఈ లెక్కన చూస్తే సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో రోహిత్ ఓ మోస్తరు ప్రదర్శనలు చేసినా తిరిగి నంబర్ వన్ స్థానానికి చేరుకోవడం లాంఛనమే.ఇదిలా ఉంటే, తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్లు శుభ్‌మన్ గిల్ (4), విరాట్ కోహ్లి (5) నిలబెట్టుకున్నారు. టాప్-10లో ఉన్న మరో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఓ స్థానం మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి ఎగబాకాడు. టాప్-10లో ఉన్న మిగతా ఆటగాళ్లలో బాబర్ ఆజమ్, హ్యారీ టెక్టార్ తలో స్థానం మెరుగుపర్చుకొని 6, 7 స్థానాలకు ఎగబాకగా.. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక 3 స్థానాలు కోల్పోయి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు.మిగతా భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (16), అక్షర్ పటేల్ (89), హార్దిక్ పాండ్యా (92) టాప్-100లో ఉన్నారు. క్వింటన్ డికాక్ 3, మొహమ్మద్ రిజ్వాన్ 5, ఫకర్ జమాన్ 5, డెవాన్ కాన్వే 4, , షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ 8, మైఖేల్ బ్రేస్‌వెల్ 4 స్థానాలు మెరుగుపర్చుకున్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. రషీద్ ఖాన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా, జోఫ్రా ఆర్చర్, కేశవ్ మహారాజ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. భారత్ నుంచి కుల్దీప్ యాదవ్ (6) ఒక్కడే టాప్-10లో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ 11 స్థానాలు మెరుగుపర్చుకొని తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, సిరాజ్ వరుసగా 14, 15 స్థానాల్లో నిలిచారు. షమీ 19వ స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: ఆల్‌టైమ్ టీ20 జట్టు.. రోహిత్, కోహ్లికి దక్కని చోటు!.. ఓపెనర్లుగా వారే.. -
హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిన ఆస్ట్రేలియా ఫుట్‌బాలర్
మహిళల బిగ్‌బాష్ లీగ్-2025లో సంచలనం నమోదైంది. 16 ఏళ్ల సిడ్నీ సిక్సర్స్ ఆల్‌రౌండర్ కావిమ్ బ్రే (Caoimhe Bray) హ్యాట్రిక్ నమోదు చేసింది. తద్వారా WBBLలో హ్యాట్రిక్ సాధించిన అతి పిన్నవయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. కావిమ్కు ముందు WBBLలో ఆరుగురు (నికోల్ బోల్టన్, గెమ్మ ట్రిస్కారి, అమీ సాటర్త్‌వైట్, డేన్ వాన్ నీకెర్క్, మారిజాన్ కాప్, డార్సీ బ్రౌన్) హ్యాట్రిక్ సాధించారు. సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో కావిమ్ ఈ ఘనత సాధించింది. కావిమ్ హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లతో చెలరేగడంతో థండర్‌పై సిక్సర్స్ 24 పరుగుల తేడాతో గెలుపొందింది.అత్యంత అరుదైన ప్లేయర్‌గా కావిమ్ఇక్కడి వరకు అంతా బాగుంది. క్రికెట్లో చాలామంది బౌలర్లు హ్యాట్రిక్ సాధిస్తుంటారు. అయితే కావిమ్కు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ఈ అమ్మాయి క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్‌లో కూడా ప్రావీణ్యం ఉంది. ఆస్ట్రేలియా అండర్-17 ఫుట్‌బాల్ జట్టులో ఆమె గోల్‌కీపర్‌గా రాణిస్తుంది. తద్వారా క్రికెట్‌తో పాటు మరో క్రీడలో సత్తా చాటుతున్న అరుదైన ప్లేయర్ల జాబితాలో చేరింది.కావిమ్ గాయం కారణంగా ఫుట్‌బాల్‌కు స్వల్ప విరామం ప్రకటించి, క్రికెట్‌వైపు మళ్లింది. ఈ క్రమంలో ఆమెకు సిడ్నీ సిక్సర్స్ నుంచి ఆహ్వానం అందింది. ఈ ఫ్రాంచైజీతో కావిమ్ మూడేళ్ల ఒప్పందంలో ఉంది. గత సీజన్లో బీబీఎల్ ఎంట్రీ ఇచ్చిని కావిమ్.. ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు ఆడి, హ్యాట్రిక్ సహా 27 వికెట్లు తీసింది. బ్యాటింగ్‌లో 137 పరుగులు చేసింది. ఈ ఎడిషన్ బీబీఎల్‌లో సిడ్నీ సిక్సర్స్ ప్రస్థానం ముగిసిన వెంటనే కావిమ్ మళ్లీ ఫుట్‌బాల్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. ఆసీస్ మహిళ-ఏ లీగ్ టోర్నీలో న్యూకాసిల్ జట్టుకు గోల్‌కీపర్‌గా వ్యవహరించాల్సి ఉంది.ప్రస్తుత ఆసీస్ జట్టులోని ఎల్లిస్ పెర్రీ కూడా ద్వంద క్రీడల్లో సత్తా చాటిన విషయం తెలిసిందే. పెర్రీ 17 ఏళ్లకే ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి, క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్‌లోనూ దేశానికి ప్రాతినిథ్యం వహించింది. 2011 FIFA Women’s World Cupలో పెర్రీ ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగింది. ICC & FIFA వరల్డ్ కప్‌లలో పాల్గొన్న ఏకైక ఆస్ట్రేలియన్ మహిళగా పెర్రీ చరిత్ర సృష్టించింది. పెర్రీని ఆదర్శంగా తీసుకున్న కావిమ్ కూడా క్రికెట్, ఫుట్‌బాల్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని ఉవ్విళ్లూరుతుంది. చదవండి: పాకిస్తాన్ ట్రై సిరీస్.. శ్రీలంక జట్టులో సరికొత్త స్పిన్ ఆయుధం -
భారత్-బంగ్లాదేశ్ సిరీస్ రద్దు..!
భారత్, బంగ్లాదేశ్ (India vs Bangladesh) మహిళా క్రికెట్ జట్ల మధ్య వచ్చే నెలలో (డిసెంబర్) జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ (మూడు వన్డేలు, మూడు టీ20లు) రద్దైనట్లు తెలుస్తుంది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ సిరీస్‌కు అనుమతి లభించలేదని బీసీసీఐ వర్గాల సమాచారం. ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్‌లో (FTP) భాగమైన ఈ సిరీస్‌కు సంబంధించి ఖచ్చితమైన తేదీలు, వేదికలు ఖరారు కావాల్సి ఉండింది. ఈ లోపే రద్దు నిర్ణయం వెలువడిందంటూ ఓ ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ సిరీస్ జరగాల్సిన సమయంలో (డిసెంబర్ మూడో వారం) బీసీసీఐ ప్రత్యామ్నాయ హోమ్ సిరీస్‌కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. జనవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) దృష్ట్యా ఈ సిరీస్ చిన్నదిగా ఉండే అవకాశం ఉందని సమాచారం. డబ్ల్యూపీఎల్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా, కొద్ది రోజుల కిందట పురుషుల క్రికెట్లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగాల్సిన సిరీస్ వాయిదా పడింది. ఆగస్టులో భారత పురుషుల జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉండింది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ఆ సిరీస్‌ను వచ్చే ఏడాది సెప్టెంబర్‌కు మార్చారు.ఇదిలా ఉంటే, తాజాగా ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో చివరి జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించిన టీమిండియా.. సెమీస్‌లో ఆసీస్‌ను, ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి విశ్వవిజేతగా అవతరించింది. భారత మహిళల జట్టుకు ఇదే తొలి ప్రపంచకప్. చదవండి: బాబర్ ఆజమ్‌కు భారీ షాక్ -
బాబర్ ఆజమ్‌కు భారీ షాక్
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌కు (Babar Azam) భారీ షాక్ తగిలింది. నవంబర్ 16న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో మితిమీరి ప్రవర్తించినందుకు ఐసీసీ అతడికి జరిమానా విధించింది. ఆ మ్యాచ్‌లో బాబర్ ఔటయ్యాక వికెట్లను బ్యాట్‌తో తన్నాడు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఇలాంటి చర్య లెవెల్-1 ఉల్లంఘన కిందికి వస్తుంది. దీని ఫలితం బాబర్ డిసిప్లినరీ రికార్డుకు ఓ డీ మెరిట్ పాయింట్ యాడ్ చేయబడింది. అలాగే ఆ మ్యాచ్‌కు సంబంధించిన ఫీజ్‌లో 10 శాతం కోత విధించబడింది. గడిచిన 24 నెలల కాలంలో బాబర్ చేసిన మొదటి తప్పిదం ఇదే కావడంతో ఐసీసీ నామమాత్రపు చర్యలతో వదిలిపెట్టింది. ఐసీసీ చర్యలను బాబర్ కూడా అంగీకరించాడు. దీంతో విచారణ నుంచి మినహాయింపు పొందాడు.ఆ మ్యాచ్‌కు ముందే బాబర్ తన సుదీర్ఘ సెంచరీ కలను నెరవేర్చుకున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 119 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో 807 రోజులు, 83 మ్యాచ్‌ల తర్వాత బాబర్ సాధించిన తొలి సెంచరీ ఇదే. ఈ మత్తులో ఉండగానే ఐసీసీ బాబర్‌కు షాకిచ్చింది. కాగా, స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాకిస్తాన్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో పాక్ 6 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 45.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. సదీరా సమరవిక్రమ (65 బంతుల్లో 48; 2 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... కెప్టెన్ కుశాల్ మెండిస్ (34), పవన్ రత్నాయకే (32), కామిల్ మిశారా (29), పతుమ్ నిసాంక (24) పర్వాలేదనిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ వసీమ్ (3/47) లంకను దెబ్బ తీయగా...హారిస్ రవూఫ్, ఫైసల్ అక్రమ్ చెరో 2 వికెట్లు తీశారు.అనంతరం పాకిస్తాన్ 44.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మొహమ్మద్ రిజ్వాన్ (92 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు), ఫఖర్ జమాన్ (45 బంతుల్లో 55; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించి పాక్‌ను గెలిపించారు. హుస్సేన్ తలత్ (42 నాటౌట్), బాబర్ ఆజమ్ (34) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు.ఈ సిరీస్ తర్వాత పాక్ సొంతగడ్డపైనే శ్రీలంక, జింబాబ్వేతో కలిపి ముక్కోణపు టీ20 సిరీస్ ఆడనుంది. ఈ టోర్నీ ఇవాల్టి నుంచి (నవంబర్ 18) ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్, జింబాబ్వే తలపడనున్నాయి. చదవండి: వైభవ్ తుపాన్ ఎలా ఆపేది? -
పసికూనపై శ్రీలంక ప్రతాపం
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీలో భాగంగా ఇవాళ (నవంబర్ 17) జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక-ఏ, హాంగ్‌కాంగ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హాంగ్‌కాంగ్.. ట్రవీన్ మాథ్యూ (4-0-21-3), కెప్టెన్ దునిత్ వెల్లాలగే (3-0-24-2), విజయ్‌కాంత్ వియాస్కాంత్ (4-0-11-2), మిలన్ రత్నాయకే (3-0-19-1), గురక సంకేత్ (1-0-11-1), రమేశ్ మెండిస్ (4-0-18-0) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 117 పరుగులకే పరిమితమైంది.హాంగ్‌కాంగ్ ఇన్నింగ్స్‌లో శివ్ మథుర్ (26) టాప్ స్కోరర్‌గా నిలువగా.. అన్షుమన్ రథ్ (21), కెప్టెన్ యాసిమ్ ముర్తుజా (20), ఎహసాన్ ఖాన్ (17 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని శ్రీలంక ఆడుతూపాడుతూ ఛేదించింది. మిడిలార్డర్ బ్యాటర్ నువనిదు ఫెర్నాండో (47 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి శ్రీలంకను గెలిపించాడు. ఓపెనర్ నిషాన్ మధుష్క (35) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌తో రాణించాడు. మిగతా బ్యాటర్లలో విషెన్ హలంబగే 4, లసిత్ క్రూస్పుల్లే 13, సహాన్ అరఛ్చిగే 14 పరుగులు (నాటౌట్) చేశారు. హాంగ్‌కాంగ్ బౌలర్లలో ముర్తుజా, నస్రుల్లా, అన్షుమన్ తలో వికెట్ తీశారు. ఈ టోర్నీలో ఇవాళ రాత్రి 8 గంటలకు ఆఫ్ఘనిస్తాన్-ఏ, బంగ్లాదేశ్-ఏ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.చదవండి: ఐపీఎల్-2026 వేలానికి ముందు పిచ్చెక్కించిన బౌలర్ -
చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్
టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) సరికొత్త చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో (50 ఓవర్ల ఫార్మాట్, అంతర్జాతీయ వన్డేలు సహా) అత్యధిక సగటు కలిగిన భారత ఆటగాడిగా అవతరించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికా-ఏ నిన్న (నవంబర్ 16) జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అజేయ అర్ద సెంచరీ (83 బంతుల్లో 68 నాటౌట్) సాధించిన తర్వాత రుతురాజ్ లిస్ట్-ఏ సగటు 57.80కి చేరింది. తద్వారా చతేశ్వర్ పుజారాను (57.01) అధిగమించి లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక సగటు కలిగిన భారత ఆటగాడిగా అవతరించాడు.ఓవరాల్‌గా.. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక సగటు కలిగిన ఆటగాళ్ల జాబితాలో రుతురాజ్ కంటే ముందు కేవలం ఒకే ఒక ఆటగాడు ఉన్నాడు. ఆస్ట్రేలియా వైట్ బాల్ దిగ్గజం మైఖేల్ బెవాన్ (57.86) మాత్రమే రుతురాజ్ కంటే ముందున్నాడు.లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక సగటు కలిగిన టాప్-5 బ్యాటర్లు..మైఖేల్ బెవాన్-57.86 (427 ఇన్నింగ్స్‌లు)రుతురాజ్ గైక్వాడ్-57.80 (85 ఇన్నింగ్స్‌లు)సామ్ హెయిన్-57.76 (64 ఇన్నింగ్స్‌లు)చతేశ్వర్ పుజారా-57.01 (130 ఇన్నింగ్స్‌లు)విరాట్ కోహ్లి-56.66 (339 ఇన్నింగ్స్‌లు)ఇప్పటివరకు కెరీర్లో 85 లిస్ట్-ఏ ఇన్నింగ్స్‌లు ఆడిన రుతురాజ్ 17 శతకాలు, 18 అర్ద శతకాల సాయంతో 4509 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో అతని అత్యధిక స్కోర్ 220 నాటౌట్‌గా ఉంది.భీకర ఫామ్ప్రస్తుతం సౌతాఫ్రికా-ఏతో జరుగుతున్న మూడు అనధికారిక వన్డే సిరీస్‌లో రుతురాజ్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. రెండో వన్డేలో అజేయ అర్ద శతకంతో భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించిన అతను.. అంతకుముందు తొలి వన్డేలో అద్భుత శతకం (129 బంతుల్లో 117) బాదాడు. రెండో వన్డేలో గెలుపుతో భారత్, మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో వన్డే నవంబర్ 19న రాజ్‌కోట్‌లో జరుగనుంది. చదవండి: పాక్ ప్లేయర్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైభవ్ సూర్యవంశీ -
పాక్ ప్లేయర్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైభవ్ సూర్యవంశీ
నిన్న (నవంబర్ 16) జరిగిన ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీలో భారత్ పాకిస్తాన్ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా.. పాక్ బౌలర్లు షాహిద్ అజిజ్ (3-0-24-3), సాద్ మసూద్ (4-0-31-2), మాజ్ సదాఖత్ (3-1-12-2), ఉబైద్ షా (4-0-24-1), అమ్మద్ దనియాల్ (3-0-21-1), సూఫియాన్ ముఖీమ్ (2-0-24-1) ధాటికి 19 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది.భారత ఇన్నింగ్స్‌కు చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) (28 బంతుల్లో 45; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అదిరిపోయే ఆరంభాన్ని అందించినా, ఆతర్వాత వచ్చిన ఆటగాళ్లు దాన్ని కొనసాగించలేకపోయారు. వన్‌డౌన్ బ్యాటర్ నమన్ ధిర్ (35) ఓ మోస్తరు పోరాటం చేయగా.. మిగతా ఆటగాళ్లలో ప్రియాంశ్ ఆర్య (10), రమన్‌దీప్ సింగ్ (11), హర్ష్ దూబే (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ జితేశ్ శర్మ (5), నేహల్ వధేరా (8), యశ్ ఠాకూర్ (2), గుర్జప్నీత్ సింగ్ (1 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. అశుతోష్ శర్మ, సుయాశ్ శర్మ డకౌటయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని పాక్ 13.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ మాజ్ సదాఖత్ (79 నాటౌట్) మెరుపు అర్ధ శతకంతో పాక్‌ను గెలిపించాడు. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్, సుయాశ్ శర్మకు తలో వికెట్ దక్కింది. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను రేపు (నవంబర్ 18) ఒమన్‌తో ఆడుతుంది. అంతకుముందు భారత్ తొలి మ్యాచ్‌లో యూఏఈపై 148 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ పూనకాలెత్తిపోయాడు. కేవలం 42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 144 పరుగులు చేశాడు.మాటలోనూ చిచ్చరపిడుగే..!14 ఏళ్ల కుర్ర వైభవ్ ఆటలోనే కాదు మాటలోనూ చిచ్చరపిడుగే అని నిన్న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నిరూపించాడు. ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్ ఉబైద్ షా వైభవ్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా.. తనదైన శైలిలో జవాబిచ్చాడు. భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఉబైద్ షా వైభవ్వైపు సీరియస్‌గా చూడగా.. వెళ్లి పని చూడు అన్న అర్దం వచ్చేలా కౌంటరిచ్చాడు. అంతటితో ఆగకుండా మరుసటి బంతిని బౌండరీకి తరలించి పాక్ బౌలర్‌కు తన దమ్మును చూపాడు. చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన బవుమా.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే -
నేపాల్ ప్రీమియర్ లీగ్ ఆడనున్న మరో భారత స్టార్ క్రికెటర్
నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో (NPL) మరో భారత స్టార్ క్రికెటర్ అడుగు పెట్టబోతున్నాడు. తొలుత ఈ లీగ్‌లో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్ (Shikhar Dhawan) ఆడాడు. తాజాగా దేశవాలీ స్టార్ ప్రియాంక్ పంచల్ (Priyank Panchal) ఎన్పీఎల్ ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న 2025 ఎడిషన్ కోసం పంచల్ కర్నాలి యాక్స్ ఫ్రాంచైజీతో చేతులు కలిపాడు. పంచల్ చేరికతో ఎన్పీఎల్లో విదేశీ క్రికెటర్ల సంఖ్య 5కు (శిఖర్ ధవన్, జేమ్స్ వాట్, జేమ్స్ ఓడౌడ్ (నెదర్లాండ్స్), విలియం బాసిస్టో (ఆస్ట్రేలియా)) చేరింది.గుజరాత్‌కు చెందిన 35 పంచల్‌కు దేశవాలీ సూపర్ స్టార్‌గా పేరుంది. 127 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 45.18 సగటు, 23 సెంచరీలతో 8856 పరుగులు సాధించాడు. అయినా అతనికి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం రాలేదు. భారత సెలెక్టర్ల నుంచి పిలుపు కోసం కళ్లకు ఒత్తులు పెట్టుకొని ఎదురుచూసి, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా జరిగిన హాంగ్‌కాంగ్ సిక్సస్ టోర్నీలో పంచల్ భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. రంజీ ట్రోఫీలో పంచల్‌కు 2016-17 సీజన్ డ్రీమ్ సీజన్. ఆ సీజన్లో అతను ట్రిపుల్ సెంచరీ సాయంతో 1310 పరుగులు చేశాడు.కాగా, ప్రస్తుతం పంచల్ ఒప్పందం చేసుకున్న కర్నాలి యాక్స్ ఫ్రాంచైజీకే శిఖర్ ధవన్ గత నేపాల్ ప్రీమియర్ లీగ్ సీజన్లో ఆడాడు. యాక్స్ తరఫున మార్కీ ప్లేయర్‌గా ఎంట్రీ ఇచ్చిన ధవన్ గత సీజన్లో ఓ మెరుపు అర్ద శతకం బాది ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌కు ధవన్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. చదవండి: రోహిత్ శర్మకు సంబంధించి బిగ్ న్యూస్ -
రోహిత్ శర్మకు సంబంధించి బిగ్ న్యూస్
టీమిండియా వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మకు (Rohit Sharma) సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో వైరలవుతోంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు సన్నాహకంగా రోహిత్ దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు (ముంబై తరఫున) సిద్దంగా ఉన్నాడని ప్రచారం జరుగుతుంది.ఈ టోర్నీలో పాల్గొనే విషయాన్ని రోహిత్ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు తెలియజేశాడని, వారు కూడా సంతృప్తి వ్యక్తం చేశారని వార్తలు వస్తున్నాయి. విజయ్ హజారే ట్రోఫీతో పాటు కుదిరితే దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ రోహిత్ పాల్గొంటాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ విషయంపై తాజాగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సెలెక్టర్ సంజయ్ పాటిల్ స్పందించాడు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేశాడు. విజయ్ హజారే టోర్నీలో కానీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కానీ ఆడాలనుకున్న విషయాన్ని రోహిత్ తమ దృష్టికి తేలేదని స్పష్టం చేశాడు.ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్ ముంబై తరఫున ఆడితే అది గొప్ప విషయని అన్నాడు. యువ ఆటగాళ్లకు ప్రేరణగా ఉంటుందని తెలిపాడు. ఆటగాళ్లు ఎంతటి వారైనా, జాతీయ జట్టు అవకాశాలు రావాలంటే దేశవాలీ క్రికెట్లో తప్పక ఆడాలని రూల్ పెట్టిన బీసీసీఐ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్, కోచ్ గౌతమ్ గంభీర్‌కు ధన్యవాదాలు తెలిపాడు.కాగా, ఇటీవలికాలంలో టీమిండియా వెటరన్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భవిష్యత్‌పై చర్చలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఈ ఇద్దరు.. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడాలని అనుకుంటున్నారు. ఇది జరగాలంటే రో-కో ఫిట్నెస్తో పాటు ఫామ్‌ను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ రో-కోకు దేశవాలీ టోర్నీల్లో ఆడాలని సూచించినట్లు తెలుస్తుంది.ఆస్ట్రేలియా టూర్లో రోహిత్ మెరుపులుభవిష్యత్తుపై గందరగోళం నెలకొన్న తరుణంలో రోహిత్ ఆస్ట్రేలియా టూర్లో సత్తా చాటాడు. 3 వన్డేల్లో సెంచరీ, హాఫ్ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌లో రోహిత్ మునుపెన్నడూ కనబడని రీతిలో ఫిట్‌గా కనిపించాడు. ఇదే సిరీస్‌లో విరాట్ కోహ్లి తొలుత (తొలి 2 వన్డేల్లో డకౌట్) నిరాశపరిచినా.. ఆతర్వాత పర్వాలేదనిపించాడు (మూడో వన్డేలో హాఫ్ సెంచరీ). చదవండి: Viral Video: ఎంతుంటే ఏంటన్నయ్యా.. గెలిచానా లేదా..? -
నిప్పులు చెరిగిన డఫీ.. న్యూజిలాండ్‌దే టీ20 సిరీస్
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను న్యూజిలాండ్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. డునెడిన్ వేదికగా ఇవాళ (నవంబర్ 13) జరిగిన చివరి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ విండీస్‌ను 140 పరుగులకే ఆలౌట్ (18.4 ఓవర్లలో) చేసింది. జేకబ్ డఫీ (Jacob Duffy) 4 వికెట్లు తీసి విండీస్‌ను దెబ్బకొట్టాడు. మరో పేసర్ జిమ్మీ నీషమ్ 2, జేమీసన్, బ్రేస్‌వెల్, సోధి, సాంట్నర్ తలో వికెట్ తీశారు. విండీస్ ఇన్నింగ్స్‌లో రోస్టన్ ఛేజ్ (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖర్లో రొమారియో షెపర్డ్ (36) బ్యాట్ ఝులిపించకపోయుంటే విండీస్ ఈ మాత్రం స్కోర్ కూడా చేయలేకపోయేది. వీరితో పాటు జేసన్ హోల్డర్ (20), రోవ్‌మన్ పావెల్ (11), షాయ్ హోప్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు టిమ్ రాబిన్సన్ (45), డెవాన్ కాన్వే (47 నాటౌట్) రాణించడంతో 15.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కివీస్ గెలుపులో రచిన్ రవీంద్ర (2), చాప్మన్ (21 నాటౌట్) కూడా తలో చేయి వేశారు. షెపర్డ్, స్ప్రింగర్‌కు తలో వికెట్ దక్కింది.ఈ సిరీస్‌లో విండీస్ తొలి మ్యాచ్‌లో గెలువగా.. న్యూజిలాండ్ 2, 3, 5 టీ20లు గెలిచింది. వర్షం కారణంగా నాలుగో టీ20 రద్దైంది. నవంబర్ 16 నుంచి ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం డిసెంబర్ 2 నుంచి మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కూడా జరుగుతుంది. చదవండి: ఐపీఎల్లో జరిగిన ట్రేడ్ డీల్స్ ఇవే..! -
ఐపీఎల్ చరిత్రలో అతి భారీ ట్రేడ్ డీల్స్ ఇవే..!
ఐపీఎల్ 2026కి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్, ట్రేడ్ డీల్‌కు రేపే (నవంబర్ 15) చివరి తేదీ. ఈ నేపథ్యంలో పలానా ఫ్రాంచైజీ పలానా ఆటగాడిని ట్రేడ్ చేసుకుంటుంది, పలానా ఫ్రాంచైజీ పలానా ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటుందనే ప్రచారం జోరుగా సాగుతుంది.ట్రేడ్ డీల్స్‌కు సంబంధించి చాలా అంశాలు ప్రచారంలో ఉన్నా, ఓ విషయం మాత్రం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. సుదీర్ఘ చర్చల అనంతరం రాజస్థాన్ రాయల్స్-సీఎస్కే ఓ డీల్ కుదుర్చుకున్నాయని సమాచారం. రాయల్స్ సంజూ శాంసన్‌ను సీఎస్కేకు ఇచ్చి, బదులుగా రవీంద్ర జడేజా, సామ్ కర్రన్‌ను ట్రేడింగ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ట్రేడ్ డీల్ ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో గతంలో జరిగిన ట్రేడ్ డీల్స్, అందులో భాగంగా జరిగిన భారీ క్యాష్ డీల్స్‌పై ఓ లుక్కేద్దాం. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు చాలా ట్రేడ్ డీల్స్ జరిగాయి. ట్రేడ్ డీల్ అంటే ఫ్రాంచైజీలు ఆటగాళ్లను మార్చుకోవడం ఓ పద్దతి. రెండోది వేలం బయట ఆటగాళ్లను కొనుగోలు చేయడం (క్యాష్ డీల్).ఈ ట్రేడింగ్ విండో తొలిసారి 2009 ఎడిషన్ ప్రవేశ పెట్టబడింది. ఆ ఎడిషన్‌లో ఆర్సీబీ నుంచి జహీర్ ఖాన్ ముంబై ఇండియన్స్‌కు మారాడు. ముంబై ఇండియన్స్ నుంచి రాబిన్ ఉతప్ప ఆర్సీబీకి ట్రేడ్ అయ్యాడు.అలాగే ఢిల్లీ డేర్ డెవిల్స్ నుంచి ఆశిష్ నెహ్రా ముంబై ఇండియన్స్‌కు మారగా.. ముంబై ఇండియన్స్ నుంచి శిఖర్ ధవన్ ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ట్రేడ్ అయ్యాడు.2012లో దినేశ్ కార్తీక్ క్యాష్ డీల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు మారాడు.2013లో రాస్ టేలర్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి పూణే వారియర్స్‌కు.. 2015లో పార్థివ్ పటేల్ ఆర్సీబీ నుంచి ముంబై ఇండియన్స్‌కు.. మన్విందర్ బిస్లా కేకేఆర్ నుంచి ఆర్సీబీకి క్యాష్ డీల్ ద్వారా బదిలి అయ్యారు. 2016లో కేదార్ జాదవ్‌ను ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి స్వాప్ చేసుకుంది.2019లో మన్దీప్ సింగ్, మార్కస్ స్టోయినిస్ విషయంలో ఆర్సీబీ-పంజాబ్ కింగ్స్ మధ్య స్వాపింగ్ జరిగింది.2019లో శిఖర్ ధవన్‌ను డీసీ ఎస్ఆర్హెచ్ నుంచి ట్రేడ్ చేసుకుంది. శిఖర్‌కు బదులుగా ఎస్ఆర్హెచ్ డీసీ నుంచి విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, నదీమ్‌ను పొందింది. 2019- అశ్విన్ (పంజాబ్ నుంచి ఢిల్లీకి, క్యాష్ డీల్, రూ. 7.6 కోట్లు)2019- రహానే (రాజస్థాన్ నుంచి ఢిల్లీకి,స్వాపింగ్, రహానేకు బదులుగా మయాంక్ మార్కండే, రాహుల్ తెవాటియా రాయల్స్‌కు ట్రేడ్ అయ్యారు)2019- ట్రెంట్ బౌల్ట్ (ఢిల్లీ నుంచి ముంబై ఇండియన్స్, క్యాష్ డీల్, రూ. 3.2 కోట్లు)2020- రాబిన్ ఉతప్ప (రాజస్థాన్ నుంచి సీఎస్కే, క్యాష్ డీల్)2020- డేవియల్ సామ్స్, హర్షల్ పటేల్ (డీసీ నుంచి ఆర్సీబీ, స్వాపింగ్)2022- శార్దూల్ ఠాకూర్ (డీసీ నుంచి కేకేఆర్, క్యాష్ డీల్, రూ. 10.75 కోట్లు)2023- ఆవేశ్ ఖాన్-దేవ్‌దత్ పడిక్కల్ (లక్నో నుంచి రాజస్థాన్, స్వాపింగ్)2024- హార్దిక్ పాండ్యా- గుజరాత్ నుంచి ముంబై ఇండియన్స్ (క్యాష్ డీల్, రూ. 15 కోట్లు)2024- కెమరాన్ గ్రీన్- ముంబై ఇండియన్స్ నుంచి ఆర్సీబీ (క్యాష్ డీల్, రూ. 17.5 కోట్లు)- ఐపీఎల్ చరిత్రలో ఇదే అతి భారీ క్యాష్ డీల్చదవండి: IPL 2026: రేపే 'డెడ్‌లైన్' -
హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
త్వరలో సౌతాఫ్రికాతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు (India vs South Africa) ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ సిరీస్‌లకు సన్నాహకంగా నవంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్నాడు.ఈ టోర్నీలో హార్దిక్ తన హోం టీమ్ బరోడా తరఫున బరిలోకి దిగుతాడు.హర్దిక్ చివరిగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో కాంపిటేటివ్ క్రికెట్ ఆడాడు. ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన అతను.. ఆతర్వాత పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్‌తో పాటు ఆస్ట్రేలియాలో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరమయ్యాడు. హార్దిక్ ఇటీవలే గాయం (ఎడమ క్వాడ్రిసెప్స్) నుంచి పూర్తిగా కోలుకొని, బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.ఫిట్నెస్ టెస్ట్‌లన్నీ క్లియర్ చేసి అధికారిక అనుమతి కోసం ఎదురుచూస్తున్నాడు. నవంబర్ 26న బెంగాల్‌తో జరిగే మ్యాచ్‌తో రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు. ముస్తాక్ అలీ టోర్నీలో హార్దిక్ రెండు మ్యాచ్‌లకు (28న జరిగే మ్యాచ్‌కు కూడా) మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.ఆ తర్వాత అతను భారత జట్టుతో కలవాల్సి ఉంటుంది. నవంబర్ 30 నుంచి సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌కు హార్దిక్ తప్పక ఎంపికయ్యే అవకాశం ఉంది. రాంచీ వేదికగా తొలి వన్డే జరుగనుంది. డిసెంబర్ 3న రాయ్‌పూర్, డిసెంబర్ 6న విశాఖపట్నంలో మిగిలిన రెండు వన్డేలు జరగనున్నాయి.ఆ తర్వాత సౌతాఫ్రికాతోనే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కటక్ వేదికగా డిసెంబర్ 9న ప్రారంభవుతుంది. ఈ సిరీస్‌లో కూడా హార్దిక్ బెర్త్ దాదాపుగా ఖరారైనట్టే. హార్దిక్ జట్టులో చేరితే భారత మిడిలార్డర్ మరింత బలోపేతమవుతుంది. హార్దిక్ గైర్హాజరీలో భారత్ ఆసియా కప్ ఫైనల్లో గెలిచి ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే.ఆతర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన టీమిండియా.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.చదవండి: రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే? -
బాబర్ ఆజమ్‌ను వెనక్కు నెట్టిన విరాట్ కోహ్లి
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో (ICC ODI Rankings) టీమిండియా బ్యాటర్ల హవా కొనసాగింది. తాజా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (Virat Kohli) పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్‌ను (Babar Azam) వెనక్కు నెట్టి టాప్-5లోకి చేరాడు.గత వారం ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉండిన విరాట్ ఓ స్థానం మెరుగుపర్చుకొని ఐదో స్థానానికి ఎగబాకాడు. సౌతాఫ్రికా సిరీస్‌లో ఘెరంగా విఫలమైన బాబర్ రెండు స్థానాలు కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు. టాప్-10 మరో టీమిండియా స్టార్ ఆటగాడు కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆసీస్ సిరీస్‌లో ఓ హాఫ్ సెంచరీతో రాణించిన శ్రేయస్ అయ్యర్ తొమ్మిదో స్థానాన్ని కాపాడుకున్నాడు.తాజాగా ర్యాంకింగ్స్‌లో ఇద్దరు పాక్ ఆటగాళ్లు భారీగా లబ్ది పొందారు. సౌతాఫ్రికా సిరీస్‌లో రాణించినందుకు యువ ఆల్‌రౌండర్ సైమ్ అయూబ్ ఏకంగా 18 స్థానాలు మెరుగుపర్చుకొని 36వ స్థానానికి ఎగబాకాడు. అదే సౌతాఫ్రికా సిరీస్‌లో పర్వాలేదనిపించి, నిన్న శ్రీలంకతో జరిగిన వన్డేలో శతక్కొట్టిన పాక్ టీ20 కెప్టెన్ సల్మాన్ అఘా 14 స్థానాలు మెరుగుపర్చుకొని 16వ స్థానానికి చేరాడు.పాక్‌తో సిరీస్‌లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన సౌతాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 15వ స్థానానికి చేరాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 2 స్థానాలు మెరుగుపర్చుకొని మూడో ప్లేస్‌కు చేరాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత్ నుంచి టాప్-10లో కుల్దీప్ యాదవ్ (6) ఒక్కడే ఉన్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్ టాప్ ప్లేస్‌ను కాపాడుకోగా.. భారత ఆటగాడు అక్షర్ పటేల్ ఎనిమిదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.చదవండి: IPL 2026: ఆర్సీబీ అభిమానులకు చేదు వార్త -
IPL 2026: ఆర్సీబీ అభిమానులకు చేదు వార్త
2025, జూన్ 3.. ఆర్సీబీ అభిమానుల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, ఆ రోజు ఆర్సీబీ (RCB) తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే ఆర్సీబీ ఆటగాళ్లకు, ముఖ్యంగా అభిమానులకు ఆ ఆనందం ఎంతో సేపు మిగల్లేదు. మరుసటి రోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెందరో గాయపడ్డారు. అభిమానుల ఉత్సాహం, అధికారుల నిర్లక్ష్యం కలిసినప్పుడు ఎంతటి విషాదం చోటు చేసుకుంటుందో ఈ ఘటన రుజువు చేసింది.సురక్షితం కాదుఈ ఘోర విషాదంపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రిటైర్డ్ జడ్జి జాన్ మైఖేల్ డికున్హా నేతృత్వంలో ఓ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ చిన్నస్వామి స్టేడియం మ్యాచ్‌ల నిర్వహణకు సురక్షితం కాదని తేల్చింది. ఈ స్టేడియం భారీ జనసమూహాలు గుమి కూడటానికి అనర్హంగా ప్రకటించింది. కమిషన్ నిర్ణయం వల్ల ఆర్సీబీ 2026 ఐపీఎల్ సీజన్లో తమ హోం మ్యాచ్‌లను చిన్నస్వామి స్టేడియంలో ఆడే అవకాశం కోల్పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సమాచారం తెలిసింది. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఆర్సీబీ తమ తాత్కాలిక హోం గ్రౌండ్‌గా పూణేలోని గహున్జే స్టేడియాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.ఓ ప్రముఖ దినపత్రిక కథనం ప్రకారం.. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ పుణేలోని గహున్జే స్టేడియాన్ని ఆర్సీబీకి తాత్కాలిక హోం గ్రౌండ్‌గా ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ అంశంపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. కొన్ని సాంకేతిక అంశాలు పరిష్కారమైతే, ఆర్సీబీకి పుణే వేదికగా మారే అవకాశం ఉంది.ఆర్సీబీ అభిమానులకు చేదు వార్తఈ వార్త ఆర్సీబీ అభిమానులకు తీరని శోకాన్ని కలిగిస్తుంది. 17 ఏళ్ల తర్వాత తొలి టైటిల్ సాధిస్తే.. ఆ సంతోషాన్ని హోం గ్రౌండ్లో ఆస్వాదించలేమా అని వారు వాపోతున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో తాము హోం గ్రౌండ్లో మ్యాచ్‌లు ఆడలేమని తెలిసి తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అన్నీ కుదిరి హోం గ్రౌండ్ పూణేకి మారితే ఆర్సీబీకి సొంత అభిమానులు దూరమయ్యే ప్రమాదం ఉంది. కొత్త వాతావరణంలో ఆర్సీబీ ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో ఇమడటానికి చాలా సమయం పడుతుంది. ఈ విషయంపై బీసీసీఐ నుంచి కాని ఐపీఎల్ నుంచి కాని ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చదవండి: IND vs SA: భారత తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు.. క్లారిటీ ఇచ్చిన కోచ్ -
శతక్కొట్టిన హసన్ జాయ్.. భారీ స్కోర్ దిశగా బంగ్లాదేశ్
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రెండో రోజు మూడో సెషన్ సమయానికి వికెట్ నష్టానికి 246 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్ముదుల్ హసన్ జాయ్ (Mahmudul Hasan joy) సెంచరీతో (125 నాటౌట్) కదంతొక్కి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. మరో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (80) సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. హసన్ జాయ్‌కు జతగా మొమినుల్ హాక్ (38) క్రీజ్‌లో ఉన్నాడు. షద్మాన్ వికెట్ మాథ్యూ హంఫ్రేస్కు దక్కింది.అంతకుముందు ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. వెటరన్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (60), కేడ్ కార్మిచల్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. కర్టిస్ క్యాంఫర్ (44), లోర్కాన్ టకర్ (41), జోర్డన్ నీల్ (30), బ్యారీ మెక్‌కార్తీ (31) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్ 3, హసన్ మహమూద్, తైజుల్ ఇస్లాం, హసన్ మురద్ తలో 2, నహిద్ రాణా ఓ వికెట్ తీసి ఐర్లాండ్‌ను దెబ్బ కొట్టారు. బంగ్లాదేశ్ ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు దాటి 40 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.రెండు టెస్ట్‌లు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న తొలి టెస్ట్ సిల్హెట్ వేదికగా నవంబర్ 11న మొదలు కాగా.. రెండో టెస్ట్ ఢాకా వేదికగా నవంబర్ 19 నుంచి జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనంతరం నవంబర్ 27, 29, డిసెంబర్ 2 తేదీల్లో మూడు టీ20లు జరుగుతాయి. తొలి రెండు మ్యాచ్‌లకు చట్టోగ్రామ్, మూడో టీ20కి ఢాకా ఆతిథ్యమివ్వనున్నాయి. చదవండి: IND vs SA: భారత తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు.. క్లారిటీ ఇచ్చిన కోచ్ -
మయాంక్ అగర్వాల్ సూపర్ సెంచరీ
రంజీ ట్రోఫీ 2025-26లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఎడిషన్‌లో ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు చేసిన అతను.. ఇవాళ (నవంబర్ 11) మహారాష్ట్రపై అద్భుతమైన శతకాన్ని (103) బాదాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇది వచ్చింది. ఇదే మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ (80) మయాంక్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.తాజా సెంచరీ మయాంక్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 20వది. ఈ ఇన్నింగ్స్‌తో అతను 8500 ఫస్ట్ క్లాస్ పరుగుల మార్కును (118 మ్యాచ్‌ల్లో 8533 పరుగులు) కూడా దాటాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 313 పరుగులకే ఆలౌటైంది.మయాంక్, స్మరణ్ రవిచంద్రన్ (54), శ్రేయస్ గోపాల్ (71) అర్ద సెంచరీలతో రాణించారు. అభినవ్ మనోహర్ (47), అనీశ్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మహారాష్ట్ర బౌలర్లలో జలజ్ సక్సేనా 4, ముకేశ్ చౌదరీ 3, విక్కీ ఓత్సాల్ 2, రామకృష్ణ ఘోష్ ఓ వికెట్ తీశారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర కర్ణాటక స్కోర్‌కు ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది. పృథ్వీ షా (71), జలజ్ సక్సేనా (72) రాణించడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులు చేసింది. కర్ణాటక బౌలర్లలో శ్రేయస్ గోపాల్ 4, మొహిసిన్ ఖాన్ 3, విధ్వత్ కావేరప్ప 2 వికెట్లు తీశారు.13 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక మ్యాచ్ ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. మయాంక్ సెంచరీతో సత్తా చాటగా.. అభినవ్ మనోహర్ (96) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మహారాష్ట్ర బౌలర్లలో ముకేశ్ చౌదరీ 3, విక్కీ ఓస్వాల్ 2, జలజ్, రజనీష్, సిద్దేశ్ వీర్ తలో వికెట్ తీశారు. చదవండి: రాణించిన బంగ్లా బౌలర్లు -
రాణించిన బంగ్లా బౌలర్లు
రెండు టెస్ట్‌లు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం ఐర్లాండ్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (నవంబర్ 11) తొలి టెస్ట్ మొదలైంది. సిల్హెట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. వెటరన్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (60), కేడ్ కార్మిచేల్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. కర్టిస్ క్యాంఫర్ (44), లోర్కన్ టకర్ (41), జోర్డన్ నీల్ (30) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు.బ్యారీ మెక్‌కార్తీ 21 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. తొలి రోజు ఆటలో చివరి బంతికి జోర్డన్ నీల్ ఔటయ్యాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ డకౌట్ కాగా.. హ్యారీ టెక్టర్ 1, ఆండీ మెక్‌బ్రైన్ 5 పరుగులు చేసి ఔటయ్యారు.బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్ 3 వికెట్లతో సత్తా చాటగా.. హసన్ మురద్ 2, హసన్ మహమూద్, నహిద్ రాణా, తైజుల్ ఇస్లాం తలో వికెట్ తీశారు. కాగా, ఈ పర్యటనలో రెండో టెస్ట్ నవంబర్ 19 నుంచి ఢాకాలో జరుగుతుంది. అనంతరం నవంబర్ 27, 29, డిసెంబర్ 2 తేదీల్లో మూడు టీ20లు జరుగుతాయి. చదవండి: శ్రేయస్ గాయం.. షాకింగ్ విషయాలు -
శ్రేయస్ గాయం.. షాకింగ్ విషయాలు
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. శ్రేయస్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా నెల రోజులైనా పడుతుందని డాక్టర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 30 నుంచి సౌతాఫ్రికాతో జరుగబోయే వన్డే సిరీస్‌లో శ్రేయస్ ఆడటం కష్టమేనని తెలుస్తుంది. బీసీసీఐ శ్రేయస్ విషయంలో ఎలాంటి తొందరపాటుకు పోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పూర్తిగా కోలుకొని, ప్రాక్టీస్ మొదలుపెట్టాకే అతనికి కబురు పెట్టే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా సిరీస్‌లో శ్రేయస్‌కు ప్రత్యామ్నాయం కోసం సెలెక్టర్లు వేట మొదలుపెట్టారు. గత కొంతకాలంగా శ్రేయస్ నాలుగో స్థానంలో అంచనాలకు మించి రాణిస్తూ, స్థిరపడ్డాడు. ఈ సిరీస్‌కు శ్రేయస్ దూరమైతే టీమిండియా భారీ ఎదురుదెబ్బ తగిలినట్లవతుంది. ఇటీవలికాలంలో ఛేదనల్లో శ్రేయస్ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడుతూ టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడకముందు కూడా రాణించాడు. మొత్తంగా శ్రేయస్ గాయం భారత వన్డే జట్టు కూర్పును గందరగోళంలో పడేసింది.ఇదిలా ఉంటే, శ్రేయస్ గాయానికి సంబంధించి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గాయపడిన వెంటనే శ్రేయస్ ఆక్సిజన్ లెవెల్స్ ప్రమాదకర స్థాయికి పడిపోయినట్లు నివేదికలు తెలిపాయి. స్ప్లీన్‌లో (ప్లీహం) చీలక వచ్చి, అంతర్గత రక్తస్రావం కావడంతో శ్రేయస్ అక్సిజన్ లెవెల్స్ 50కి పడిపోయినట్లు పేర్కొన్నాయి. ఆ సమయంలో శ్రేయస్ పది నిమిషాల పాటు నిలబడలేకపోయాడని, అతడి శరీరం పూర్తిగా బ్లాక్ అవుటయ్యిందని తెలిపాయి. ఈ విషయం వింటుంటే శ్రేయస్ చావుకు దగ్గరగా వెళ్లొచ్చాడని స్పష్టమవుతుంది.అక్టోబర్ 25న ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే సందర్భంగా అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో శ్రేయస్ ప్రమాదకరంగా కిందపడ్డాడు. క్యాచ్ అయితే పట్టుకోగలిగాడు కాని, ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. నొప్పితో విలవిలలాడిపోయిన శ్రేయస్‌ను హుటాహుటిన సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఐసీయూలో పెట్టి చికిత్సనందించారు. తొలుత గాయం చిన్నదే అని అంతా అనుకున్నారు.అయితే డాక్టర్లు నెమ్మదిగా విషయాన్ని చెప్పారు. శ్రేయస్ స్ప్లీన్‌లో (ప్లీహం) చీలక వచ్చి, అంతర్గత రక్తస్రావమైందని తెలిపారు. ఒకటి, రెండు రోజుల వరకు ఏమీ చెప్పలేమని అన్నారు. ఈ విషయం తెలిశాక యావత్ క్రికెట్ సమాజం ఆందోళనకు గురైంది. శ్రేయస్‌కు ఏమీ కాకూడదని దేవుళ్లను మొక్కింది. దేవుడి దయ, డాక్టర్ల పనితనం వల్ల శ్రేయస్ మృత్యు కొరల్లో నుంచి బయటపడ్డాడు. కొన్ని రోజుల చికిత్స అనంతరం కోలుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. చదవండి: చరిత్ర సృష్టించిన జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ టీమ్ -
చరిత్ర సృష్టించిన జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ టీమ్
జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ జట్టు (Jammu & Kashmir Cricket Team) చరిత్ర సృష్టించింది. రంజీ ట్రోఫీలో (Ranji Trophy 2025-26) తొలిసారి ఢిల్లీని ఓడించింది (7 వికెట్ల తేడాతో). టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 43 సార్లు తలపడగా జమ్మూ తొలిసారి విజయం సాధించింది. ఏడు సార్లు ఛాంపియన్ అయిన ఢిల్లీని జమ్మూ వారి సొంత మైదానంలో (అరుణ్ జైట్లీ స్టేడియం) ఓడించింది. 🚨 A HISTORIC DAY IN JAMMU & KASHMIR CRICKET 🚨- Jammu & Kashmir has defeated Delhi for the first time in Ranji Trophy history. 🔥🤯 pic.twitter.com/VxNFBOj7QW— Johns. (@CricCrazyJohns) November 11, 2025ఈ గెలుపుతో రంజీ ట్రోఫీలో జమ్మూ కశ్మీర్‌పై ఢిల్లీ ఆధిపత్యానికి తెర పడింది. యువకులు, అనుభవజ్ఞులతో కూడిన ప్రస్తుత జమ్మూ జట్టు ఆ ప్రాంత క్రికెట్ అభిమానుల దశాబ్దాల కలను నెరవేర్చింది. ఢిల్లీ లాంటి అగ్రశ్రేణి జట్టును, వారి సొంత మైదానంలో ఓడించడమంటే ఆషామాషీ విషయం కాదు. ఈ గెలుపుతో ప్రస్తుత జమ్మూ జట్టు వారి ప్రాంత యువ క్రికెటర్లకు స్పూర్తిదాయకంగా నిలిచింది. 179 పరుగుల లక్ష్య ఛేదనలో కమ్రాన్ ఇక్బాల్ చారిత్రక శతకం (133 నాటౌట్) సాధించి జమ్మూ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన జమ్మూ.. ఢిల్లీ బ్యాటింగ్ లైనప్‌ను 211 పరుగులకే కుప్పకూల్చింది. సంచలన పేసర్ ఆకిబ్ నబీ 5 వికెట్ల ప్రదర్శనతో ఢిల్లీ పతనాన్ని శాసించాడు. వన్ష్‌రాజ్ శర్మ, ఆబిద్ ముస్తాక్ తలో 2 వికెట్లు తీసి ఢిల్లీ పతనంలో తమవంతు పాత్ర పోషించారు.అనంతరం బరిలోకి దిగిన జమ్మూ.. కెప్టెన్ పరాస్ డోగ్రా (106) సెంచరీతో కదంతొక్కడంతో 310 పరుగులు చేసింది. అబ్దుల్ సమద్ (85), కన్హయ్య (47) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో సిమర్జీత్ 6 వికెట్లు తీశాడు.99 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ.. ఈసారి కూడా తడబడింది. ఓ దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించినా చివరికి 277 పరుగులకే పరిమితమై, జమ్మూ ముందు 179 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని జమ్మూ ఆడుతూపాడుతూ ఛేదించింది. ఓపెనర్ కమ్రాన్ అజేయ శతకంతో జమ్మూను గెలుపు తీరాలకు చేర్చాడు. ఈ గెలుపు జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది.చదవండి: శ్రేయస్ అయ్యర్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం! -
ప్రపంచకప్ విజేతకు చారిత్రక గౌరవం
2025 మహిళల వన్డే ప్రపంచకప్ విజేత, ఛాంపియన్ జట్టు టీమిండియాలో కీలక సభ్యురాలైన రిచా ఘోష్‌కు (Richa Ghosh) చారిత్రక గౌరవం దక్కింది. రిచా పేరిట ఆమె సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో క్రికెట్ స్టేడియం నిర్మితం కానుంది. ఈ విషయాన్ని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించారు.ఇవాళ (నవంబర్ 10) జరిగిన రిచా సన్మాన కార్యక్రమం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రిచా జన్మస్థలమైన సిలిగురి పట్టణానికి క్రికెట్ మైదానాన్ని కేటాయిస్తూ.. దానికి రిచా ఘోష్ పేరుతో నామకరణం చేయనున్నట్లు ప్రకటించారు. రిచా సన్మాన కార్యక్రమంలో బెంగాల్ క్రికెట్ దిగ్గజాలు సౌరవ్ గంగూలీ, ఝులన్ గోస్వామి పాల్గొన్నారు. రిచా పశ్చిమ బెంగాల్ నుంచి సీనియర్ ప్రపంచకప్ గెలిచిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఫలితంగా ఆమెకు బెంగాల్ ప్రభుత్వం నుంచి భారీ నజరానాలు అందాయి. ఫైనల్లో సౌతాఫ్రికాపై చేసిన ప్రతి పరుగుకు (34 పరుగులు) రూ. లక్ష చొప్పున రూ. 34 లక్షల చెక్కును రిచాకు అందించారు.అంతకుముందు రోజే ప్రభుత్వం రిచాకు బంగ భూషణ్ బిరుదుతో పాటు రాష్ట్ర పోలీసు శాఖలో డీఎస్పీ ఉద్యోగాన్ని కేటాయించింది. పశ్చిమ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కూడా రిచాకు భారీ తాయిలాలు ప్రకటించింది. గోల్డెన్ బ్యాట్, గోల్డెన్ బాల్‌తో పాటు విలువైన బంగారు గొలుసును బహుకరించింది.కాగా, రిచా ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై అమూల్యమైన ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 24 బంతుల్లో 34 పరుగులు చేసి భారత్ 298 పరుగుల భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించింది. అంతకుముందు ఏడు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లోనూ రిచా మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఛేదనలో కీలక సమయంలో 16 బంతుల్లో 26 పరుగులు చేసి భారత విజయంలో తనవంతు పాత్ర పోషించింది.లీగ్ దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ రిచా చెలరేగింది. 77 బంతుల్లోనే 94 పరుగులు చేసింది. ప్రపంచకప్ మొత్తంలో రిచా మెరుపు ఇలాగే కొనసాగాయి. 8 ఇన్నింగ్స్‌ల్లో 133.52 స్ట్రయిక్‌రేట్‌తో 235 పరుగులు చేసింది. కాగా, నవంబర్ 2న జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. వికెట్ కీపర్-బ్యాటర్ అయిన రిచా ప్రపంచకప్‌లో మొత్తం 12 సిక్సర్లు బాది, టోర్నీ టాప్ టాప్ హిట్టర్‌గా నిలిచింది. -
పాకిస్తాన్ ట్రై సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్
నవంబర్ 17 నుంచి పాకిస్తాన్లో జరిగే ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి జింబాబ్వే స్టార్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ వైదొలిగాడు. వెన్ను గాయం కారణంగా ముజరబానీ ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ముజరబానీ స్థానాన్ని న్యూమన్ న్యామ్హురితో భర్తీ చేస్తున్నట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ టోర్నీలో జింబాబ్వే, ఆతిథ్య పాక్‌తో పాటు శ్రీలంక జట్టు పాల్గొంటుంది.ఈ టోర్నీలో జింబాబ్వే జట్టుకు సికందర్ రజా నాయకత్వం వహిస్తున్నాడు. టోర్నీలో ఓపెనర్‌లో పాకిస్తాన్, జింబాబ్వే తలపడతాయి. రావల్పిండి వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. నవంబర్ 19న జరిగే రెండో మ్యాచ్‌లో శ్రీలంక, జింబాబ్వే పోటీపడతాయి. ఈ మ్యాచ్‌కు కూడా రావాల్పిండేనే ఆతిథ్యమివ్వనుంది.అనంతరం నవంబర్ 22వ తేదీ పాకిస్తాన్-శ్రీలంక, 23న జింబాబ్వే-పాకిస్తాన్, 27న పాకిస్తాన్-శ్రీలంక పోటీపడతాయి. 29న లాహోర్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.పాకిస్తాన్ ట్రై సిరీస్ కోసం జింబాబ్వే జట్టు: సికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, గ్రేమ్ క్రీమర్, బ్రాడ్లీ ఎవాన్స్, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, వెల్లింగ్టన్ మసకద్జా, తడివానాషే మారుమణి, టోనీ మున్యోంగా, తషింగా ముసెకివా, డియాన్ మేయర్స్, రిచర్డ్ నగరవ, న్యూమన్ న్యామ్హురి, బ్రెండన్ టేలర్చదవండి: వర్షార్పణం.. ఆధిక్యంలో న్యూజిలాండ్ -
వర్షార్పణం.. ఆధిక్యంలో న్యూజిలాండ్
న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 10) జరగాల్సిన నాలుగో టీ20 వర్షార్పణమైంది. నెల్సన్‌లోని సాక్స్ట్న్ వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉండింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. 6.3 ఓవర్ల తర్వాత మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది.వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఆ సమయానికి విండీస్ స్కోర్ వికెట్ నష్టానికి 38 పరుగులుగా ఉంది. అలిక్ అథనాజ్ (21) ఔట్ కాగా.. ఆమిర్ జాంగూ (12), కెప్టెన్ షాయ్ హోప్ (3) క్రీజ్‌లో ఉన్నారు. అథనాజ్ వికెట్ నీషమ్‌కు దక్కింది.ఆధిక్యంలో న్యూజిలాండ్ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. మొదటి మ్యాచ్‌లో విండీస్ గెలువగా.. న్యూజిలాండ్ వరుసగా రెండు, మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఐదో టీ20 డునెడిన్ వేదికగా నవంబర్ 13న జరుగనుంది.కాగా, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. టీ20 సిరీస్ తర్వాత వన్డే సిరీస్, ఆతర్వాత టెస్ట్ సిరీస్ జరుగుతాయి. నవంబర్ 16, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు జరుగనుండగా.. డిసెంబర్ 2, 10, 18 తేదీల్లో టెస్ట్ మ్యాచ్‌లు మొదలవుతాయి. చదవండి: ఐదేసిన ములానీ.. మావి ఆల్‌రౌండ్ షో -
ఐదేసిన ములానీ.. మావి ఆల్‌రౌండ్ షో
రంజీ ట్రోఫీలో ఇవాళ (నవంబర్ 10) ఏడు మ్యాచ్‌ల్లో ఫలితాలు వచ్చాయి. సౌరభ్ కుమార్ 4 వికెట్ల ఘనత.. అభిషేక్ రెడ్డి (70), కరణ్ షిండే (51) అర్ద శతకాలతో రాణించడంతో తమిళనాడుపై ఆంధ్రప్రదేశ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మయాంక్ వర్మ సెంచరీ (121 నాటౌట్), ఆదిత్య సర్వటే 6, రవికిరణ్ 3 వికెట్లతో రాణించడంతో పుదుచ్చేరిపై ఛత్తీస్‌ఘడ్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.ముషీర్ ఖాన్ (112), సిద్దేశ్ లాడ్ (127) శతకాలు.. షమ్స్ ములానీ 7 వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో హిమాచల్ ప్రదేశ్‌పై ముంబై ఇన్నింగ్స్ 120 పరుగుల తేడాతో గెలుపొందింది.శివమ్ మావి (101 నాటౌట్, 5 వికెట్లు) ఆల్‌రౌండ్ షోతో చెలరేగడంతో నాగాలాండ్‌ను ఉత్తర్‌ప్రదేశ్ ఇన్నింగ్స్ 265 పరుగుల తేడాతో చిత్తు చేసింది.జగదీశ్ సుచిత్ (11 వికెట్లు, హాఫ్ సెంచరీ) ఆల్‌రౌండ్ షోతో ఇరగదీయడంతో ఉత్తరాఖండ్‌పై హర్యానా ఇన్నింగ్స్ 28 పరుగుల తేడాతో గెలుపొందింది.సిద్దార్థ్ దేశాయ్ 10 వికెట్లు, విశాల్ జైస్వాల్ 8 వికెట్లు తీయడంతో సర్వీసెస్‌పై గుజరాత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఉదయ్ సహరన్ అజేయ సెంచరీతో (117) చెలరేగడంతో ఛండీఘడ్‌పై పంజాబ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఇవాల్టి బ్యాటింగ్ హైలైట్స్ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్‌లో విదర్భ ఆటగాడు ధ్రువ్ షోరే రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేశాడు. మరో విదర్భ ఆటగాడు అమన్ మోఖడే కూడా సెంచరీతో సత్తా చాటాడు.కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఆటగాడు చిరాగ్ జానీ (152) భారీ సెంచరీతో కదంతొక్కాడు.జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బరోడా ఆటగాడు శాశ్వత్ రావత్ సెంచరీతో సత్తా చాటాడు.బౌలింగ్ హైలైట్స్కర్ణాటక బౌలర్లు శ్రేయాస్ గోపాల్ (4), మోహ్సిన్ ఖాన్ (3) రాణించి మహారాష్ట్రను 300 పరుగులకే కట్టడి.మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గోవా బౌలర్ వాసుకి కౌశిక్ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్ బౌలర్ వంశ్‌రాజ్ శర్మ 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. చదవండి: నిప్పులు చెరిగిన స్టార్క్ -
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్‌కు బెదిరింపులు
ఐపీఎల్లో (IPL) ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తరఫున మెరిసిన యువ ఆల్‌రౌండర్ విప్రాజ్ నిగమ్ (Vipraj Nigam) బెదిరింపులకు గురయ్యాడు. నవంబర్ 9న అతడికి ఓ అంతర్జాతీయ ఫోన్ నంబర్ నుంచి అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఓ మహిళ అతన్ని బ్లాక్మెయిల్ చేస్తూ, ఓ వీడియోను లీక్ చేస్తానని బెదిరించింది.తొలుత విప్రాజ్ దీన్ని ఫేక్ కాల్‌గా భావించి, నంబర్‌ను బ్లాక్ చేశాడు. అయినా సదరు మహిళ వేరే నంబర్ల నుంచి ఫోన్ చేసి విప్రాజ్‌ను పదేపదే ఇబ్బంది పెట్టింది. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన విప్రాజ్ వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన పరువుకు భంగం కలిగించడం, మానసికంగా వేధించడం ద్వారా తన క్రికెట్ కెరీర్‌ను నాశనం చేయాలనే కుట్ర జరుగుతోందని అతను ఆరోపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి సదరు కాల్ వివరాలు, ఫోన్ నంబర్ల మూలాలను పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై విప్రాజ్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న తమ కుమారుడిని బద్నాం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు.21 ఏళ్ల విప్రాజ్ గత సీజన్లోనే (2025) ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. కుడి చేతి వాటం లెగ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన విప్రాజ్ అరంగేట్రం సీజన్లోనే అదరగొట్టాడు. 14 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి, 142 పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగి పలు మ్యాచ్‌లో మెరుపులు మెరిపించాడు.గతేడాదే విప్రాజ్ ఉత్తరప్రదేశ్ తరఫున దేశవాలీ అరంగేట్రం చేశాడు. 3 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 5 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 15 టీ20లు ఆడి మొత్తంగా 32 వికెట్లు తీశాడు. చదవండి: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్‌కు తీవ్ర అస్వస్థత -
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్‌కు తీవ్ర అస్వస్థత
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ (Former Bangladesh Captain), ప్రస్తుత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ అయిన ఫారూఖీ అహ్మద్ (Faruque Ahmed) తీవ్ర అస్వస్థత గురయ్యారు. ఫారూఖీకి నిన్న (నవంబర్ 9) మధ్యాహ్నం తీవ్రమైన గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు కార్డియాక్ అరెస్ట్‌గా నిర్దారించారు. యాంజియోగ్రామ్ చేయగా, గుండె ధమనాల్లో బ్లాకేజ్ గుర్తించారు. చికిత్సలో భాగంగా స్టెంట్ వేసి పూడికను తొలగించారు. క్రిటికల్ కేర్ యూనిట్లో (CCU) ఉంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.ఫారూఖీ 1984-1999 మధ్యలో బంగ్లాదేశ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. కొంతకాలం ఆ జట్టుకు కెప్టెన్‌గానూ సేవలందించాడు. రిటైర్మెంట్ తర్వాత రెండుసార్లు జాతీయ సెలెక్టర్‌గా వ్యవహరించిన అతను.. 2024 అగస్ట్లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తాత్కాలిక అధ్యక్షుడిగానూ పని చేశారు. ఈ పదవిలో 9 నెలల పాటు కొనసాగాడు. ఆతర్వాత అమినుల్ ఇస్లాం పూర్తి స్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. 59 ఏళ్ల ఫారూఖీ ఇటీవలే బీసీబీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.ఫారూఖీ సుదీర్ఘకాలం జాతీయ జట్టులో ఉన్నా కేవలం 7 వన్డేలు మాత్రమే ఆడాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ సాయంతో 105 పరుగులు చేశాడు. ఫారూఖీ కుడి చేతి వాటం బ్యాటింగ్‌తో పాటు పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్ బౌలర్‌గానూ వ్యవహరించేవాడు.చదవండి: 'అతడొక గన్ ప్లేయర్.. కచ్చితంగా రిటైన్ చేసుకోవాలి' -
టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించి బిగ్ అప్డేట్
వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరిగే పురుషుల టీ20 వరల్డ్‌కప్‌కు (Men's T20 World Cup 2026) సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్ వేదికలు ఖరారయ్యాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం, కోల్‌కతాలోని ఈడెన్ గార్డన్స్‌లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఫైనల్ వేదిక విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు.20 దేశాలు పాల్గొనే ఈ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. భారత్‌లోని ఐదు నగరాలు (ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా), శ్రీలంకలోని మూడు మైదానాల్లో (కొలొంబోలో 2, క్యాండీలో ఓ మైదానం) ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.పాక్ మ్యాచ్‌లన్నీ అక్కడే..!ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లన్నీ కొలంబోలో జరుగుతాయి. ఒకవేళ పాక్ సెమీస్‌కు, ఫైనల్‌కు చేరితే ఆ మ్యాచ్‌లు కూడా కొలొంబోలోనే జరుగుతాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాక్ జట్లను తమ దేశంలో అడుగుపెట్టనివ్వకూడదని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.పాక్‌తో ఏ క్రీడలో అయినా ద్వైపాక్షిక సిరీస్‌లను సైతం రద్దు చేసుకుంది. ఇతర దేశాలు పాల్గొనే మెగా టోర్నీల్లో మాత్రం తటస్థ వేదికలపై పాక్‌తో ఆడుతుంది.2026 ప్రపంచకప్ ఆడే దేశాలు ఇవే..!టీ20 ప్రపంచకప్‌కు మొత్తం 20 దేశాలు అర్హత సాధించాయి. ఆతిథ్య హోదాలో భారత్, శ్రీలంక.. గత ప్రపంచకప్‌లో (2024) సూపర్-8 దశకు చేరిన 7 జట్లు (ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, యూఎస్ఏ) ఈ మెగా టోర్నీకి నేరుగా అర్హత సాధించాయి. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా పాకిస్తాన్, న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్లు ప్రపంచకప్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. అమెరికా రీజియనల్ క్వాలిఫయర్ ద్వారా కెనడా అర్హత సాధించింది.యూరప్ క్వాలిఫయర్స్ ద్వారా నెదర్లాండ్స్, ఇటలీ అర్హత సాధించాయి. అఫ్రికా క్వాలిఫయర్ ద్వారా నమీబియా, జింబాబ్వే క్వాలిఫై అయ్యాయి. చివరిగా ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయర్ ద్వారా ఒమన్, నేపాల్, యూఏఈ జట్లు ప్రపంచకప్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి.మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే..?ఈ టోర్నీలో తలో ఐదు జట్లు నాలుగు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి. గ్రూప్ దశ అనంతరం సూపర్-8 పోటీలు జరుగుతాయి. ప్రతి గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. ఈ దశలో తలో నాలుగు జట్లు రెండు గ్రూప్‌లు విభజించబడి పోటీపడతాయి. సూపర్-8లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్ విజేతలు ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ టోర్నీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. ఈ టోర్నీ షెడ్యూల్, గ్రూప్ తదితర వివరాలు మరికొద్ది రోజుల్లో వెలువడతాయి. చదవండి: శతక్కొట్టిన మావీ.. కుషాగ్రా డబుల్ సెంచరీ -
సూపర్ ఫామ్‌లో పృథ్వీ షా
రంజీ ట్రోఫీ 2025-26లో మహారాష్ట్ర ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw) సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. కొద్ది రోజుల కిందట చండీఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు డబుల్ సెంచరీ (141 బంతుల్లో) చేసిన షా.. ప్రస్తుతం కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో షా 92 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 71 పరుగులు చేశాడు.ఇవాళ షా 26వ జన్మదినం. తన పుట్టిన రోజున షా అర్ద సెంచరీ బాది తనకు తనే గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. ఈ రంజీ ట్రోఫీకి ముందే ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన షా.. సెంచరీల మోత మోగిస్తూ, పరుగుల వరద పారిస్తున్నాడు. చండీఘడ్‌పై డబుల్ సెంచరీకి ముందు కేరళపై అర్ద సెంచరీ (75) చేశాడు.అంతకుముందు ముంబైతో జరిగిన రంజీ వార్మప్ మ్యాచ్‌లో 181 పరుగులు చేశాడు. దానికి ముందు బుచ్చిబాబు టోర్నీలో చత్తీస్‌ఘడ్‌పై 111 పరుగులు చేశాడు. షా ప్రస్తుత ఫామ్ చూస్తే మరోసారి టీమిండియా తలుపులు తట్టేలా ఉన్నాడు. అయితే ఇది అంత ఈజీ ఏమీ కాదు. టెస్ట్‌ల్లో టీమిండియా ఓపెనర్ స్థానానికి చాలా పోటీ ఉంది. యువ ఓపెనర్లంతా రాణిస్తున్నారు. షా సహచరుడు రుతురాజ్ గైక్వాడ్ సైతం పరుగుల వరద పారిస్తున్నా అతనికే చోటు దక్కడం లేదు. టీమిండియాలో యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా స్థిర పడిపోయారు.మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మహారాష్ట్ర 113 పరుగులు వెనుకపడి ఉంది. కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులు చేయగా.. మహారాష్ట్ర 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.కర్ణాటక తరఫున కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (80), స్మరన్ రవిచంద్రన్ (54), శ్రేయస్ గోపాల్ (71) అర్ద సెంచరీలతో రాణించగా.. మహారాష్ట్ర తరఫున పృథ్వీ షా ఒక్కడే అర్ద సెంచరీతో మెరిశాడు. శ్రేయస్ గోపాల్ (23-3-46-3) బంతితోనూ రాణించి మహారాష్ట్రను దెబ్బ కొట్టాడు.చదవండి: భారీ లక్ష్యాన్ని ఊదేసిన సౌతాఫ్రికా -
సంచలనం.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన సౌతాఫ్రికా
భారత్-ఏ, సౌతాఫ్రికా-ఏ (India A vs South Africa A) జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-1లో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 417 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. జోర్డన్ హెర్మన్ (91), లెసెగో సెనోక్వానే (77), జుబేర్ హంజా (77), టెంబా బవుమా (59), వికెట్ కీపర్ కాన్నర్ (52 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి సౌతాఫ్రికాను గెలిపించారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 255 పరుగులకు ఆలౌటైంది. ధృవ్ జురెల్ (132 నాటౌట్) అజేయ సెంచరీతో గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అనంతరం సౌతాఫ్రికా కూడా తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. టీమిండియా పేసర్ల ధాటికి 221 పరుగులకే ఆలౌటైంది.34 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 7 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. జురెల్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అజేయ సెంచరీతో (127 నాటౌట్) చెలరేగాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (65), హర్ష్ దూబే (84) అర్ద సెంచరీలతో రాణించారు.భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ఐదుగురు అర్ద సెంచరీలు చేసి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్లు పోరాడినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. కాగా, ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్ నవంబర్ 13 నుంచి మొదలవుతుంది.చదవండి: వరుసగా 8 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ -
వేర్వేరు క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లు వీరే..!
ఏ క్రీడలో అయినా దేశానికి ప్రాతినిథ్యం వహించడం క్రీడాకారులందరి కల. ఇందు కోసం సర్వశక్తులు ఒడ్డి, ఎంతో శ్రమించి, చాలా త్యాగాలు, పోరాటాలు చేస్తారు. ఒక్క క్రీడలో దేశానికి ప్రాతినిథ్యం వహించాలంటేనే ఇన్ని కష్టాలు ఎదర్కోవాల్సి వస్తే.. కొందరు ఒకటికి మించిన క్రీడల్లో జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించి శభాష్ అనిపించుకున్నారు. ఇలాంటి మల్టీ టాలెంటెడ్ క్రీడాకారులపై ఓ లుక్కేద్దాం.ఈ టాపిక్ డిస్కషన్‌కు రాగానే ముందుగా ఇద్దరు మహిళా క్రికెటర్లు గుర్తుకు వస్తారు. వారిలో మొదటి పేరు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ సూజీ బేట్స్ కాగా.. రెండో పేరు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లిస్ పెర్రీ. ఈ ఇద్దరు వారి దేశాల తరఫున క్రికెట్‌తో పాటు మరో క్రీడలో పాల్గొన్నారు.సూజీ బేట్స్సూజీ న్యూజిలాండ్ తరఫున క్రికెట్‌తో పాటు బాస్కెట్‌బాల్ ఆడింది. ప్రస్తుతం న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో కీలక సభ్యురాలిగా కొనసాగుతున్న ఆమె.. 2008 Beijing Olympicsలో దేశానికి ప్రాతినిథ్యం వహించింది. బాస్కెట్‌బాల్‌లో ఆమె పలు అంతర్జాతీయ టోర్నీల్లోనూ పాల్గొంది. ప్రస్తుతం సూజీ బాస్కెట్‌బాల్‌ను వదిలి క్రికెట్‌పై దృష్టి సారించింది.ఎల్లిస్ పెర్రీ17 ఏళ్లకే ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన పెర్రీ.. క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్‌లోనూ దేశానికి ప్రాతినిథ్యం వహించింది. ఆమె 2011 FIFA Women’s World Cupలో ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగింది. ICC & FIFA వరల్డ్ కప్‌లలో పాల్గొన్న ఏకైక ఆస్ట్రేలియన్ మహిళగా పెర్రీ చరిత్ర సృష్టించింది.పురుషుల క్రికెట్ విషయానికొస్తే.. ఇక్కడ కూడా చాలా మంది మల్టీ టాలెండెడ్ ఉన్నారు.యుజ్వేంద్ర చహల్ఐపీఎల్లో మెరిసి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్న చహల్.. చెస్ క్రీడలోనూ భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. World Chess Federationలో చహల్ పేరు నమోదై ఉంది. భారత్ తరఫున క్రికెట్ & చెస్ ఆడిన ఏకైక ఆటగాడు చహల్.ఏబీ డివిలియర్స్మిస్టర్ 360 డిగ్రీస్‌గా పేరుగాంచిన ఏబీ డివిలియర్స్ సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ కావడంతో పాటు ఆ దేశం తరఫున జూనియర్ లెవెల్లో టెన్నిస్ కూడా ఆడాడు. అలాగే స్విమ్మింగ్, రగ్బీ, గోల్ఫ్, బాడ్మింటన్, అథ్లెటిక్స్ వంటి అనేక క్రీడల్లోనూ ఏబీకి ప్రావీణ్యం ఉంది. మల్టీ టాలెంటెడ్ పదానికి ఏబీ నిజమైన అర్హుడని చాలామంది అంటుంటారు.జాంటీ రోడ్స్క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఫీల్డర్‌గా పేరొందిన జాంటీ రోడ్స్.. సౌతాఫ్రికా తరఫున క్రికెట్‌తో పాటు హాకీ ఆడే అవకాశం కూడా వచ్చింది. 1992, 1996 ఒలింపిక్స్ సౌతాఫ్రికా హాకీ జట్టుకు రోడ్స్ ఎంపికయ్యాడు. అయితే వేర్వేరు కారణాల వల్ల అతను హాకీలో దేశానికి ప్రాతినిథ్యం వహించలేకపోయాడు.ఆండ్రూ ఫ్లింటాఫ్ఈ ఆల్‌రౌండ్ దిగ్గజం ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడటంతో పాటు బాక్సింగ్ క్రీడలోనూ సత్తా చాటాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక ఫ్లింటాఫ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారాడు. ఈ క్రీడలోనూ అతను అత్యున్నతాలను చూశాడు.ఇయాన్ బోథమ్క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లలో ముఖ్యుడైన ఇయాన్ బోథమ్.. ఇంగ్లండ్ తరఫున క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్ కూడా ఆడాడు. క్రికెట్ ఆడే సమయంలోనే బోథమ్ పలు క్లబ్ లెవెల్ ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొన్నాడు.సర్ వివియన్ రిచర్డ్బ్యాటింగ్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్ వెస్టిండీస్ తరఫున క్రికెట్ ఆడటంతో పాటు ఓ కరీబియన్ దీవి తరఫున ఫుట్‌బాల్ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. క్రికెట్లో అత్యున్నత స్థానానికి చేరకముందే 1974 FIFA వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో Antigua & Barbuda దేశానికి ప్రాతినిథ్యం వహించాడు.చదవండి: ఆర్సీబీకి సంబంధించి మరో బిగ్ న్యూస్ -
సౌతాఫ్రికాతో రెండో టెస్ట్.. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-1లో ఇవాళ (నవంబర్ 6) భారత్-ఏ, దక్షిణాఫ్రికా-ఏ (India A vs South Africa A) జట్ల మధ్య రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్కస్ ఆకెర్మన్ టాస్ గెలిచి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో చాలామంది టీమిండియా స్టార్లు బరిలోకి దిగుతున్నారు.కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ ఓపెనింగ్‌కు దిగగా.. సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, దృవ్ జురెల్, రిషబ్ పంత్, హర్ష్ దూబే, ఆకాశ్‌దీప్, కల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ ఆతర్వాత స్థానాల్లో రానున్నారు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఆ జట్టులో చోటు దక్కిన ఆటగాళ్లకు ప్రాక్టీస్ నిమిత్తం ఈ అవకాశం ఇచ్చారు. మరోవైపు దక్షిణాఫ్రికా-ఏ తరఫున ఆ జట్టు టెస్ట్ కెప్టెన్ టెంబా బవుమా సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగాడు. సౌతాఫ్రికా టెస్ట్ జట్టులోకి ప్రెనేలన్ సుబ్రాయన్ కూడా ఈ మ్యాచ్ ఆడుతున్నాడు.రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్-ఏ తొలి మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో రిషబ్ పంత్ (90) ఛేదనలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను గెలిపించాడు. ఇవాళ మొదలైన మ్యాచ్‌లో కూడా పంత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంగ్లండ్‌లో గాయపడిన తర్వాత పంత్ ఆడుతున్న తొలి సిరీస్ ఇదే.ఆదిలోనే షాక్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ మొరేకీ బౌలింగ్‌లో డకౌటయ్యాడు. కేఎల్ రాహుల్‌కు జతగా సాయి సుదర్శన్ క్రీజ్‌లోకి వచ్చాడు.ఇండియా A (ప్లేయింగ్ XI): KL రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, దృవ్ జురెల్, రిషబ్ పంత్(w/c), హర్ష్ దూబే, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణదక్షిణాఫ్రికా A (ప్లేయింగ్ XI): జోర్డాన్ హెర్మాన్, లెసెగో సెనోక్వానే, టెంబా బావుమా, జుబేర్ హంజా, మార్క్వెస్ అకెర్మాన్ (సి), కానర్ ఎస్టర్హుయిజెన్ (w), టియాన్ వాన్ వురెన్, కైల్ సిమండ్స్, ప్రేనెలన్ సుబ్రాయెన్, షెపో మోరేకి, ఒకుహ్లే సెలెచదవండి: చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్ -
చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్
వెస్టిండీస్‌తో నిన్న (నవంబర్ 5) జరిగిన టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) చారిత్రక ఇన్నింగ్స్ ఆడాడు. 165 పరుగుల లక్ష్య ఛేదనలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి.. వీరోచిత పోరాటాన్ని (28 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 55 పరుగులు) ప్రదర్శించాడు. సాంట్నర్ చెలరేగినా న్యూజిలాండ్ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. తద్వారా స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకపడిపోయింది.ఈ ఇన్నింగ్స్‌తో సాంట్నర్ పలు రికార్డులు నెలకొల్పాడు. ఐసీసీ ఫుల్ మెంబర్ టీమ్‌లలో ఎనిమిది అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్లలో హాఫ్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ విభాగంలో అత్యధిక స్కోర్ సాంట్నర్ సహచరుడు టిమ్ సౌథీ (39), ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు (39) రషీద్ ఖాన్ పేరిట సంయుక్తంగా ఉండేది.ఈ మ్యాచ్‌లో 107/9 స్కోర్ వద్ద జేకబ్ డఫీతో (1 నాటౌట్) సాంట్నర్ పదో వికెట్‌కు అజేయమైన 50 పరుగులు జోడించాడు. తద్వారా ఐసీసీ ఫుల్ మెంబర్ టీమ్‌లలో పదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం జోడించిన రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు జోష్ లిటిల్-బ్యారీ మెక్‌కార్తీ (44*) పేరిట ఉండేది.కాగా, నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. షాయ్ హోప్ (53) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్‌ను సాంట్నర్ (55 నాటౌట్) గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్, రోస్టన్ ఛేజ్ తలో 3 వికెట్లు తీసి కివీస్‌ను దెబ్బకొట్టారు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 ఆక్లాండ్ వేదికగా నవంబర్ 6న జరుగనుంది. చదవండి: నరాలు తెగే ఉత్కంఠ: సాంట్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్ వృథా -
త్వరలో మరో క్రికెట్ లీగ్
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 వేదికల్లో 600 జట్లతో తెలుగు ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) క్రికెట్ టోర్నీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ లీగ్‌కు సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. టీపీఎల్ నిర్వాహకులైన జూపర్ ఎల్ఈడీ సంస్థ ప్రతినిధులు మంగళవారం మంత్రిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి లీగ్ విశేషాలను వివరించారు. యువతను మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా క్రమశిక్షణ గల క్రీడాకారులుగా, బాధ్యయుత పౌరుడిగా తయారు చేసే శక్తి క్రీడలకు ఉందని శ్రీహరి అన్నారు. క్రికెట్‌తో పాటు ఏదో ఒక క్రీడలో యువత రాణించాలని, తద్వారా ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ కూడా అలవడుతుందని చెప్పారు. ‘సే నో టూ’ డ్రగ్స్ ప్రచారాన్ని యువతలోకి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న ఈ టీపీఎల్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం లీగ్ నిర్వాహక సంస్థ జూపర్ ఎల్ఈడీ డైరెక్టర్ ఒ.రమేశ్ మాట్లాడుతూ తమ సీఎస్ఆర్ నిధులతో ఈ పోటీలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ లీగ్‌ను కేవలం వినోదం కోసం నిర్వహించకుండా సమాజంలో ఆరోగ్య భద్రత, ఫిట్నెస్, క్రీడలపై అవగాహన పెంచేందుకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 80 లక్షలు అని ఆయన చెప్పారు. చదవండి: ప్రపంచ క్రికెట్‌ను శాశించేందుకు మరో వసంతంలోకి అడుగుపెట్టిన కోహ్లి -
ప్రపంచ క్రికెట్‌ను శాసించేందుకు మరో వసంతంలోకి..
క్రికెట్ దిగ్గజం, రికార్డుల రారాజు, ఛేజింగ్ మాస్టర్, ఫిట్నెస్ ఫ్రీక్ అయిన విరాట్ కోహ్లి (Virat Kohli) ప్రపంచ క్రికెట్‌ను శాసించేందుకు మరో వసంతంలోకి అడుగుపెట్టాడు. ఇవాళ (నవంబర్ 5, 2025) కింగ్ కోహ్లి 37వ జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ క్రీడా సమాజం అతడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది.ఇటీవలే టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 ప్రపంచకప్ ఆడాలన్నది అతడి కొరిక. అంతవరకు విరాట్ మునుపటి మెరుపులు మెరిస్తూ, మరెన్నో రికార్డులను బద్దలు కొడుతూ అప్రతిహతంగా కెరీర్‌ను కొనసాగించాలని ఆశిద్దాం.కోహ్లి ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆడాడు. ఇందులో తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌటైనా, మూడో మ్యాచ్‌లో తిరిగి పుంజుకున్నాడు. రోహిత్ శర్మతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను విజయాన్నందించాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో రోహిత్ సెంచరీ (121 నాటౌట్) చేయగా.. కోహ్లి (74 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు.విరాట్ త్వరలో మరోసారి దర్శనమివ్వబోతున్నాడు. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే సిరీస్‌లో కోహ్లి ఆడే అవకాశం ఉంది. 2027 ప్రపంచకప్ వరకు కోహ్లి ఫిట్నెస్ను, ఫామ్‌ను కాపాడుకుంటూ టీమిండియాను గెలిపిస్తూ ఉండాలని భారత క్రికెట్ అభిమానులంతా కోరుకుంటున్నారు. అతడి జన్మదినం సందర్భంగా ప్రతి భారత క్రికెట్ అభిమాని అకాంక్ష ఇదే.ఢిల్లీ వీధుల్లో క్రికెట్ ఆడటం మొదలుపెట్టి, క్రీడలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన కోహ్లి.. ఫామ్‌ను కాపాడుకోగలిగితే సునాయాసంగా మరో రెండు, మూడేళ్లు దేశానికి సేవలందించగలడు. ఫిట్నెస్ విషయంలో అతడికి ఎలాంటి సమస్యలు లేవు. ఉండవు. సాధారణంగా 35 ఏళ్ల వయసొచ్చే సరికే క్రికెటర్లు ఫిట్నెస్ను కోల్పోయి సమస్యలు ఎదుర్కొంటుంటారు.అయితే కోహ్లి మాత్రం అలా కాదు. 25 ఏళ్ల కుర్రాళ్లు కూడా పోటీ పడలేని విధంగా ఫిట్నెస్ను మెయిన్‌టెయిన్ చేస్తున్నాడు. తాజాగా ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో కోహ్లిని చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది.కెరీర్‌ను నిదానంగా ప్రారంభించిన కోహ్లి.. అందరిలాగే మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఓ దశలో ఫామ్ కోల్పోయి చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పటివరకు పొగిడిన నోళ్లే అతన్ని దూషించాయి. బ్యాడ్ టైమ్‌ను అధిగమించిన కోహ్లి తిరిగి నిలబడ్డాడు. దూషించిన నోళ్లకు బ్యాట్‌తో సమాధానం చెప్పాడు.ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గానూ కోహ్లి కెరీర్ విజయవంతంగా సాగింది. టెస్ట్‌ల్లో భారత అత్యుత్తమ కెప్టెన్ కోహ్లినే అని చెప్పవచ్చు. అతడి హయాంలో భారత్ అత్యున్నత శిఖరాలు అధిరోహించింది. కోహ్లి జట్టు ఆటతీరునే మార్చేశాడు. ఆటగాళ్లకు దూకుడు నేర్పాడు. ఫిట్నెస్ మెరుగుపర్చుకునే విషయంలో అందరికీ దిక్సూచిగా నిలిచాడు. కోహ్లి జమానాలో భారత్ చిరస్మరణీయ విజయాలు సాధించింది. చాలాకాలం పాటు ప్రపంచ నంబర్ వన్ జట్టుగా కొనసాగింది.కోహ్లి ఆటగాడిగా, కెప్టెన్‌గా ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. ఇప్పటికే భారత క్రికెట్‌కు చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశాడు. అయినా కోహ్లిలో కసి తీరడం లేదు. భారత జట్టుకు ఇంకా ఏదో చేయాలనే తపన ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ గెలిచి కెరీర్‌కు ముగింపు పలకాలన్నది కోహ్లి కోరిక. ఈ కోరిక నెరవేరాలని, కోహ్లి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిద్దాం. కోహ్లి సాధించిన ఘనతలు..అండర్-19 వరల్డ్‌కప్ (2008)వన్డే వరల్డ్‌కప్ (2011)టీ20 వరల్డ్‌కప్ (2024)ఛాంపియన్స్ ట్రోఫీ (2013, 2025)ఐపీఎల్ (2025)ఆసియా కప్-3టెస్ట్ మేస్-5ఐసీసీ అవార్డ్స్-10చదవండి: డ్రగ్స్‌కు బానిస.. స్టార్ క్రికెటర్‌పై శాశ్వత నిషేధం -
స్టార్ క్రికెటర్‌పై శాశ్వత నిషేధం
జింబాబ్వే క్రికెట్‌కు 20 ఏళ్ల పాటు సేవలందించిన మాజీ కెప్టెన్ సీన్ విలియమ్స్ (Sean Williams) ఇకపై జాతీయ జట్టుకు ఎంపిక కాడు. డ్రగ్స్ అలవాటు కారణంగా జింబాబ్వే క్రికెట్ బోర్డు అతనిపై శాశ్వత నిషేధం విధించింది. ఇకపై అతని సెంట్రల్ క్రాంటాక్ట్ పొడిగించేది లేదని స్పష్టం చేసింది.సీన్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి ఆకస్మికంగా తప్పుకున్నాడు. కారణం ఏంటని బోర్డు ఆరా తీయగా షాకింగ్ విషయం వెలుగు చూసింది. అప్పటికే హెవీగా డ్రగ్స్‌కు అలవాటు పడిన సీన్.. డోపింగ్ టెస్ట్‌లో పట్టుబడతాడన్న భయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. సీన్ తాను డ్రగ్స్ అలవాటు పడిన విషయాన్ని బోర్డు పెద్దల వద్ద అంగీకరించినట్లు తెలుస్తుంది. అలవాటు నుంచి బయటపడేందుకు డీఎడిక్షన్ సెంటర్లో కూడా జాయిన్ అయ్యాడని సమాచారం. బోర్డుతో సీన్ కాంట్రాక్ట్ ఈ ఏడాది చివర్లో ముగుస్తుంది. 39 ఏళ్ల సీన్ జింబాబ్వేకు ఎన్నో అపురూప విజయాలు అందించాడు. కెరీర్లో 18 టెస్ట్‌లు, 162 వన్డేలు, 8 టీ20లు ఆడి 13 సెంచరీలు, 50 సెంచరీల సాయంతో 8000 పైచిలుకు పరుగులు చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ కూడా అయిన సీన్.. మూడు ఫార్మాట్లలో 156 వికెట్లు తీశాడు.కాగా, సీన్ డుమ్మా కొట్టిన టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీ జింబాబ్వేకు అత్యంత కీలకంగా ఉండింది. ఆ టోర్నీలో జింబాబ్వే సికందర్ రజా పుణ్యమా అని నెగ్గి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. సీన్ లాంటి సీనియర్ ఆటగాడు ఆ టోర్నీకి అందుబాటులో లేకపోవడం జింబాబ్వే విజయావకాశాలను ప్రభావితం చేసేదే. ఒకవేళ ఆ టోర్నీలో జింబాబ్వే ఓటమిపాలై, ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయుంటే జింబాబ్వే అభిమానులు సైతం సీన్‌ను క్షమించేవారు కాదు.జింబాబ్వే క్రికెట్‌కు మాదకద్రవ్యాల ముప్పు జింబాబ్వే క్రికెట్లో మాదకద్రవ్యాల కలకలం ఇది మొదటిసారి కాదు. 2022లో మరో మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ కోకైన్ వాడకం వల్ల మ్యాచ్ ఫిక్సర్ల చేతిలో బ్లాక్‌మెయిల్‌కు గురయ్యాడు. ఆ ఉదంతంలో ఫిక్సర్ల నుంచి డబ్బు తీసుకున్న టేలర్‌పై 3.5 ఏళ్ల నిషేధం విధించబడింది. టేలర్ ఇటీవల శిక్షను పూర్తి చేసుకొని రీఎంట్రీ ఇచ్చాడు. టేలర్ విషయంలో కాస్త ఉదాసీనంగా వ్యవహరించిన జింబాబ్వే క్రికెట్ బోర్డు సీన్ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించింది. చదవండి: యాషెస్ తొలి టెస్ట్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన -
పాకిస్తాన్, సౌతాఫ్రికా తొలి వన్డేలో హైడ్రామా
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్, సౌతాఫ్రికా (Pakistan vs South Africa) జట్ల మధ్య నిన్న (నవంబర్ 4) జరిగిన తొలి వన్డేలో హైడ్రామా చోటు చేసుకుంది. పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) హ్యాట్రిక్ సాధించినట్టే సాధించి మిస్ అయ్యాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 44వ ఓవర్ తొలి రెండు బంతులకు అబ్రార్.. బ్రీట్జ్కే, ఫోర్టుయిన్ను ఔట్ చేశాడు. మూడో బంతికి లుంగి ఎంగిడి ఎల్బీడబ్ల్యూ అయినట్లు తొలుత ఫీల్డ్ అంపైర్ ప్రకటించాడు.దీంతో అబ్రార్, అతని సహచరులు సహా మైదానంలో ఉన్న పాక్ అభిమానులంతా తెగ సంబరపడిపోయారు. అయితే ఎంగిడి అంపైర్ నిర్ణయంపై రివ్యూకి వెళ్లడంతో కథ తారుమారైంది. రివ్యూలో స్పష్టంగా ఇన్సైడ్ ఎడ్జ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. చేతిలోకి వచ్చిన హ్యాట్రిక్ మిస్ కావడంతో అబ్రార్ తీవ్ర నిరాశకు గురయ్యాడు.ఈ మ్యాచ్‌లో పాక్ సౌతాఫ్రికాను ఓడించి సిరీస్‌లో బోణీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.1 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. పాక్ 8 వికెట్లు కోల్పోయి, మరో 2 బంతులు మిగిలుండగా అతి కష్టం మీద లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ గెలుపులో సల్మాన్ అఘా (62), మొహమ్మద్ రిజ్వాన్ (55), ఫకర్ జమాన్ (45), సైమ్ అయూబ్ (39, 2 వికెట్లు) కీలక పాత్రలు పోషించారు. సౌతాఫ్రికా బౌలర్లు పాక్‌ను భయపెట్టారు. ఎంగిడి, ఫెరియెరా, కార్బిన్ బాష్ తలో 2, లిండే, ఫోర్టుయిన్ చెరో వికెట్ పడగొట్టారు.అంతకుముందు నసీం షా (9.1-1-40-3), అబ్రార్ అహ్మద్ (9-1-53-3), సైమ్ అయూబ్ (8-0-39-2), షాహీన్ అఫ్రిది (10-0-55-1), మొహమ్మద్ నవాజ్ (10-0-45-1) ధాటికి సౌతాఫ్రికా ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. ఓపెనర్లు ప్రిటోరియస్ (57), డికాక్ (63) అర్ద సెంచరీలతో రాణించారు. కెప్టెన్ బ్రీట్జ్కే (42), కార్బిన్ బాష్ (41) పర్వాలేదనిపించారు. ఈ సిరీస్‌లోని రెండో వన్డే కూడా ఫైసలాబాద్ వేదికగానే నవంబర్ 6న జరుగుతుంది. చదవండి: ఆసియాకప్‌లో ఓవరాక్షన్.. పాక్ ఆటగాడిపై 2 మ్యాచ్‌ల బ్యాన్! సూర్యకు కూడా -
ఆసీస్ దిగ్గజానికి కీలక పదవి
ఐపీఎల్ 2026కి ముందు ఆస్ట్రేలియా దిగ్గజం టామ్ మూడీకి (Tom Moody) కీలక పదవి దక్కింది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ఫ్రాంచైజీ మూడీని గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించింది. ఈ పదవి చేపట్టాక మూడీ ఎల్ఎస్జీతో పాటు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్, హండ్రెడ్ లీగ్‌లో మాంచెస్టర్ ఆధారిత ఫ్రాంచైజీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తాడు.గతంలో ఈ పదవిలో టీమిండియా దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్ ఉండేవాడు. జహీర్ తప్పుకున్న తర్వాత మూడీని ఈ పదవి వరించింది. మూడో రానున్న ఐపీఎల్ సీజన్లో రిషబ్ పంత్ (కెప్టెన్), జస్టిన్ లాంగర్ (హెడ్ కోచ్), కేన్ విలియమ్సన్ (స్ట్రాటజిక్ అడ్వైజర్), భరత్ అరుణ్ (బౌలింగ్ కోచ్), లాన్స్ క్లూసెనర్‌తో (అసిస్టెంట్ కోచ్) కలిసి పని చేస్తాడు. మూడీకి కోచింగ్‌తో పాటు ఫ్రాంచైజీ మేనేజ్మెంట్లో అపార అనుభవం ఉంది. ఈ అనుభవాన్ని క్యాష్ చేసుకునేందుకే ఎల్ఎస్జీ మూడీని తమ ఫ్రాంచైజీల గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించింది. మూడీ పర్యవేక్షణలో (కోచ్‌గా) సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి, ఏకైక టైటిల్ (2016) సాధించింది.మూడీ ప్రొఫైల్..2000 సంవత్సరం ప్రారంభంలో ఆటకు వీడ్కోలు పలికిన మూడీ.. 2005-07 మధ్యలో శ్రీలంక జాతీయ జట్టుకు కోచ్‌గా పని చేశాడు. అతని జమానాలో శ్రీలంక 2007 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరింది.అదే ఏడాది మూడీ వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించాడు.అంతర్జాతీయ స్థాయిలో కోచ్‌గా రాణించిన మూడీ.. 2008-10 మధ్యలో ఐపీఎల్లో Kings XI Punjab (ఇప్పుడు Punjab Kings) జట్టుకు కోచ్‌గా సేవలందించాడు.2013లో Sunrisers Hyderabad ఫ్రాంచైజీలో హెడ్ కోచ్‌గా చేరి, 2016లో ఆ జట్టుకు తొలి ఐపీఎల్ టైటిల్ అందించాడు. 2019 వరకు అదే బాధ్యతలు నిర్వహించిన మూడీ.. 2020 డిసెంబర్లో అదే ఫ్రాంచైజీకి Director of Cricketగా తిరిగి వచ్చాడు.చదవండి: జైస్వాల్ సూపర్ సెంచరీ -
జైస్వాల్ సూపర్ సెంచరీ
రాజస్థాన్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో (Ranji Trophy 2025-26) ముంబై ఆటగాడు, టీమిండియా ప్లేయర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. తొలి ఇన్నింగ్స్‌లో సైతం అర్ద సెంచరీతో (67) రాణించిన ఈ ముంబైకర్.. రెండో ఇన్నింగ్స్‌లో మూడంకెల మార్కును తాకాడు. 120 బంతుల్లో 11 బౌండరీల సాయంతో ఈ మార్కును చేరుకున్నాడు.జైస్వాల్‌కు రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఇది ఐదో సెంచరీ (21 ఇన్నింగ్స్‌ల్లో). ఓవరాల్‌గా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 17వది (టెస్ట్‌ల్లో 7 సెంచరీలు, భారత్-ఏ తరఫున 1, ముంబై తరఫున రంజీల్లో 5, రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున 2, వెస్ట్ జోన్ తరఫున 2).2019లో రంజీ అరంగేట్రం చేసిన జైస్వాల్ ఈ సెంచరీతో 1000 పరుగుల మార్కును కూడా తాకాడు. 10 మ్యాచ్‌ల్లో 57కు పైగా సగటుతో ఈ పరుగులు చేశాడు. తాజా సెంచరీని జైస్వాల్ తన ఐపీఎల్ హోం గ్రౌండ్ అయిన సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో (జైపూర్) చేయడం విశేషం.చెలరేగిన రాజస్థాన్ బౌలర్లుతొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగులకే ఆలౌటైంది. ముంబై ఇన్నింగ్స్ మొత్తంలో యశస్వి జైస్వాల్ (67) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ముషీర్ ఖాన్ 49, షమ్స్ ములానీ 32, హిమాన్షు సింగ్ 25, తుషార్ దేశ్‌పాండే 25 (నాటౌట్) పరుగులతో పర్వాలేదనిపించారు. రాజస్థాన్ బౌలర్లలో కుక్నా అజయ్ సింగ్ 4, అశోక్ శర్మ 3, అంకిత్ చౌదరి, ఆకాశ్ మహారాజ్ సింగ్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు.దీపక్ హుడా ద్విశతకంఅనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో దీపక్ హూడా ద్విశతకంతో (248), కార్తిక్ శర్మ (139) శతకంతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (617/6) చేసింది. సచిన్ యాదవ్ (92) తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. ముంబై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, షమ్స్ ములానీ తలో 2 వికెట్లు తీశారు. యశస్వి జైస్వాల్ బంతితోనూ రాణించి డబుల్ సెంచరీ వీరుడు దీపక్ హుడాను ఔట్ చేశాడు.363 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై నాలుగో రోజు తొలి సెషన్ సమయానికి (52 ఓవర్లలో) 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ (63), అజింక్య రహానే (18) ఔట్ కాగా.. జైస్వాల్ 105, సిద్దేశ్ లాడ్ 0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి ముంబై రాజస్థాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే ఇంకా 170 పరుగులు వెనుకపడి ఉంది.చదవండి: భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్య -
రంజీ క్రికెటర్ దుర్మరణం
త్రిపుర రంజీ జట్టు మాజీ కెప్టెన్ రాజేష్ బానిక్ (Rajesh Banik) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పశ్చిమ త్రిపుర ప్రాంతంలోని ఆనంద్ నగర్లో ఈ ప్రమాదం జరిగింది. 40 ఏళ్ల బానిక్ తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి జీవనం సాగించే వాడు. నిత్యం కళ్లెదుటే ఉండే బానిక్ ఇక లేడని తెలిసి తల్లిదండ్రులు, సోదరుడు కన్నీరుమున్నీరవుతున్నారు. బానిక్ మరణవార్త భారత క్రికెట్ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. త్రిపుర క్రికెట్ అసోసియేషన్ బానిక్కు నివాళులర్పించింది.కుడి చేతి వాటం బ్యాటర్, అకేషనల్ లెగ్ స్పిన్నర్ అయిన బానిక్ 2001-02 సీజన్లో త్రిపుర తరఫున రంజీ అరంగేట్రం చేశాడు. అనతికాలంలోనే నమ్మదగ్గ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. బానిక్ 42 మ్యాచ్‌ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో 1469 పరుగులు చేశాడు. అలాగే 24 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 378 పరుగులు, 18 టీ20ల్లో 203 పరుగులు చేశాడు. క్రికెటర్‌గా బానిక్ కెరీర్ 17 ఏళ్ల పాటు సాగింది.అనంతరం అతడు త్రిపుర అండర్-16 జట్టుకు స్టేట్ సెలెక్టర్‌గా సేవలందించాడు. అండర్-15 రోజుల్లో బానిక్ టీమిండియా మాజీ ఆటగాళ్లు ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడుతో డ్రస్సింగ్ రూమ్‌ను షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం అగర్తలలో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో త్రిపుర జట్టు ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్బ్యాండ్స్ ధరించి బానిక్ను నివాళులర్పించారు. చదవండి: IND vs AUS: టీ20 క్రికెట్లో అతి భారీ సిక్సర్.. వరల్డ్ రికార్డు బ్రేక్ -
ఆసీస్‌పై టీమిండియా గెలుపు
హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడిన వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగా.. భారత్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో టిమ్ డేవిడ్ (74), స్టోయినిస్ (64) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. భారత్ తరఫున వాషింగ్టన్ సుందర్ చెలరేగాడు. సుందర్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేసి అజేయంగా నిలువగా.. జితేశ్ శర్మ (13 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) సుందర్‌కు సహకరించాడు. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ 25, శుభ్‌మన్ గిల్ 15, సూర్యకుమార్ యాదవ్ 24, తిలక్ వర్మ 29, అక్షర్ పటేల్ 17 పరుగులు చేశారు.భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, వరున్ చక్రవర్తి 2, శివమ్ దూబే ఓ వికెట్ పడగొట్టగా... ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ 3, బార్ట్లెట్, స్టోయినిస్ తలో వికెట్ తీశారు. నాలుగో టీ20 గోల్డ్ కోస్ట్ వేదికగా నవంబర్ 6న జరుగుతుంది.ఐదో వికెట్ కోల్పోయిన భారత్14.2వ ఓవర్- 145 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. బార్ట్లెట్ బౌలింగ్‌లో తిలక్ వర్మ (29) ఔటయ్యాడు.15 ఓవర్ద తర్వాత భారత్ స్కోర్ 152/5గా ఉంది. సుందర్ (30), జితేశ్ శర్మ (5) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్11.1 ఓవర్- 111 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఇల్లిస్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ (17) ఔటయ్యాడు. 11.4 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 117/4గా ఉంది. వాషింగ్టన్ సుందర్ (6), తిలక్ వర్మ (24) క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన భారత్7.3వ ఓవర్- 76 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. స్టోయినిస్ బౌలింగ్‌లో ఇల్లిస్‌కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (24) ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 82/3గా ఉంది. అక్షర్ పటేల్ (3), తిలక్ వర్మ (12) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన భారత్5.3వ ఓవర్- 61 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. నాథన్ ఇల్లిస్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (15) ఔటయ్యాడు.6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 64/2గా ఉంది. తిలక్ వర్మ (2), సూర్యకుమార్ యాదవ్ (19) క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా రెండో వికెట్ డౌన్..శుభ్‌మన్ గిల్ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 15 పరుగులు మాత్రమే చేసిన శుభ్‌మన్ గిల్.. నాథన్ ఎల్లీస్ బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 63/2గా ఉంది. తిలక్ వర్మ (2), సూర్యకుమార్ యాదవ్ (19) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్3.3 ఓవర్- 187 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ధాటిగా ఆడుతున్న అభిషేక్ శర్మ 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 25 పరుగులు చేసి నాథన్ ఇల్లిస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 41/1గా ఉంది. శుభ్‌మన్ గిల్ (7), సూర్యకుమార్ యాదవ్ (7) క్రీజ్‌లో ఉన్నారు. దూకుడుగా ఆడుతున్న అభిషేక్187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(24), శుభ్‌మన్ గిల్(5) ఉన్నారు.భారత్ ముందు భారీ టార్గెట్హోబర్ట్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్(38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74), మార్కస్ స్టోయినిష్(39 బంతుల్లో 8 ఫోర్లు,2 సిక్స్‌లతో 64) విధ్వసంకర హాఫ్ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు, శివమ్ దూబే ఒక్క వికెట్ సాధించారు.ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్12.6వ ఓవర్- 118 పరుగుల వద్ద ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న టిమ్ డేవిడ్ (74) శివమ్ దూబే బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 143/5గా ఉంది.వరుణ్ మ్యాజిక్.. వరుస బంతుల్లో వికెట్లువరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో వరుస బంతుల్లో మిచెల్ మార్ష్ (11), మిచెల్ ఓవెన్‌ను (0) ఔట్ చేశాడు. 9 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 75/4గా ఉంది. స్టోయినిస్ (1), టిమ్ డేవిడ్ (55) క్రీజ్‌లో ఉన్నారు. ఓ పక్క వికెట్లు పడుతున్నా డేవిడ్ మెరుపు హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ 23 బంతుల్లోనే ఈ మార్కును తాకాడు. రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్.. 5 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..?టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. అర్షదీప్ సింగ్ తొలి ఓవర్లో, మూడో ఓవర్లో వికెట్లు తీశాడు. తొలుత ట్రవిస్ హెడ్ (6), ఆతర్వాత జోస్ ఇంగ్లిస్‌ను (1) పెవిలియన్‌కు పంపాడు. 5 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 35/2గా ఉంది. టిమ్ డేవిడ్ (20), మిచ్ మార్ష్ (7) క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్హోబర్ట్ వేదికగా ఇవాళ (నవంబర్ 2) భారత్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. జితేశ్ శర్మ, అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ఓ మార్పుతో బరిలోకి దిగింది. హాజిల్‌వుడ్ స్థానంలో సీన్ అబాట్ తుది జట్టులోకి వచ్చాడు.ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్భారత్: శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రాచదవండి: IND vs SA: వారెవ్వా అన్షుల్!.. ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్ -
అదే జరిగితే టీమిండియా కొంప కొల్లేరే..!
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 30) భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగే ఈ నాకౌట్ సమరం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాను వరుణుడు పరీక్షించబోతున్నాడు.ఈ మ్యాచ్‌కు వాతావరణం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. AccuWeather నివేదిక ప్రకారం, DY పాటిల్ స్టేడియం పరిసరాల్లో ఇవాళ ఉదయం ఆకాశం 93 శాతం మేఘావృతంగా ఉంటుంది. 25 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది.మ్యాచ్ సమయానికి పరిస్థితులు మెరుగవుతాయన్న అంచనా ఉన్నా, నవీ ముంబైలో వాతావరణ పరిస్థితులను నమ్మడానికి వీల్లేదు. ఈనెల 28న ఇక్కడ జరగాల్సిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌ను కూడా వర్షం ముంచేస్తుందేమోనని భారత క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.మ్యాచ్ పూర్తిగా రద్దైతే..?ఒకవేళ నేటి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైనా రిజర్వ్ డే (అక్టోబర్ 31) ఉంది. ఇవాళ కొంత మ్యాచ్ జరిగి ఆగిపోయినా, ఇదే స్థితి నుంచి రిజ్వర్ డేలో కొనసాగుతుంది. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ సాధ్యపడకపోతే మాత్రం టీమిండియా కొంప కొల్లేరవుతుంది. గ్రూప్ దశలో భారత్ కంటే ఎక్కువ పాయింట్లు ఉండటం చేత ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంటుంది. గ్రూప్ దశలో ఆసీస్ 7 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని జట్టుగా 13 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. భారత్ 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 7 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.ఇదిలా ఉంటే, నిన్న (అక్టోబర్ 29) జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (169) రికార్డు శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం లక్ష్య ఛేదనలో మారిజన్ కాప్ (7-3-20-5) చెలరేగడంతో ఇంగ్లండ్ 42.3 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటై 125 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది.చదవండి: పెను విషాదం.. ఆస్ట్రేలియా యువ క్రికెటర్ మృతి -
పెను విషాదం.. ఆస్ట్రేలియా యువ క్రికెటర్ మృతి
క్రికెట్ మైదానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బంతి తగిలి 17 ఏళ్ల ఆస్ట్రేలియా (Australia) యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్ (Ben Austin) మృత్యువాత పడ్డాడు. ప్రీ మ్యాచ్ ప్రాక్టీస్ సందర్భంగా ఈ విషాదం చోటు చేసుకుంది.మెల్బోర్న్లోని ఫెర్న్ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించే బెన్.. అక్టోబర్ 29న ఓ టీ20 మ్యాచ్ ఆడాల్సి ఉంది. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బౌలర్ సంధించిన ఓ బంతి బెన్ ఛాతీపై బలంగా తాకింది. దీంతో బెన్ స్పృహ తప్పి పడిపోయాడు.హుటాహుటిన సమీపంలోని అసుపత్రికి తరలించగా.. రెండు రోజుల చికిత్స అనంతరం బెన్ నిన్న తుదిశ్వాస విడిచాడు. అప్పటివరకు తమతో ప్రాక్టీస్ చేసిన బెన్ ఇక లేడని తెలిసి సహచరులు కన్నీరుమున్నీరయ్యారు. బెన్ తల్లిదండ్రులు గుండె పగిలేలా రోధించారు. బెన్ మరణవార్త యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా బెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. పాపులర్, లవబుల్, గ్రేట్ యంగ్ పర్సన్‌ను కోల్పోయామని ఫెర్న్ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్ శోకం వ్యక్తం చేసింది.బెన్ ఉదంతం ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిల్ హ్యూస్‌ను (Phil Hughes) గుర్తు చేసింది. హ్యూస్ కూడా 2014లో బెన్ తరహాలోనే మృత్యువాత పడ్డాడు. ఓ దేశవాలీ మ్యాచ్ ఆడుతుండగా ఓ రాకాసి బౌన్సర్ హ్యూస్ తల వెనుక భాగంలో బలంగా తాకింది. అక్కడిక్కడే కుప్పకూలిపోయిన హ్యూస్ రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచాడు. ఈ విషాదం ప్రతిష్టాత్మక సిడ్నీ మైదానంలో జరిగింది. చదవండి: పంత్ రీఎంట్రీ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో (ICC ODI Rankings) టీమిండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. ఆసీస్‌తో జరిగిన రెండు, మూడు వన్డేల్లో (73, 121 నాటౌట్) చెలరేగడంతో 36 రేటింగ్ పాయింట్లు మెరుగుపర్చుకొని, తొలిసారి వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠాన్ని అధిరోహించాడు.ఈ ఘనతను రోహిత్ 38 ఏళ్ల 182 రోజల వయసులో సాధించాడు. తద్వారా అత్యంత లేటు వయసులో నంబర్ వన్ బ్యాటర్‌గా అవతరించిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉండిన రోహిత్.. రెండు స్థానాలు మెరుగుపర్చుకొని టాప్ ప్లేస్‌కు చేరాడు.ఈ క్రమంలో అగ్రపీఠంపై తిష్ట వేసిన సహచరుడు, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను కిందికి దించాడు. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్ తర్వాత నంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా అవతరించిన భారత బ్యాటర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు.ఆసీస్‌తో తాజాగా జరిగిన 3 మ్యాచ్‌లో సిరీస్‌లో (10, 9, 24) విఫలమైన గిల్ రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. ఇదే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌటైన మరో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఓ స్థానం కోల్పోయి ఆరో స్థానానికి పడిపోయాడు. ఇదే సిరీస్‌లోని రెండో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించిన శ్రేయస్ అయ్యర్ ఓ స్థానం మెరుగుపర్చుకొని 10 నుంచి తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ 3 స్థానాలు ఎగబాకి నాలుగో ప్లేస్‌కు చేరుకున్నాడు. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరాడు. టాప్-10లో ఏకైక టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ ఓ స్థానం కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరగా.. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ టాప్ ప్లేస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. చదవండి: రాణించిన రచిన్, మిచెల్.. న్యూజిలాండ్‌దే వన్డే సిరీస్ -
రెచ్చిపోయిన న్యూజిలాండ్ బౌలర్లు
న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 29) జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. బ్లెయిర్ టిక్నర్ (8-1-34-4), నాథన్ స్మిత్ (5-0-27-2) చెలరేగడంతో 36 ఓవర్లలో 175 పరుగులకే ఆలౌటైంది. జేకబ్ డఫీ, జకరీ ఫౌల్క్స్, మిచెల్ సాంట్నర్, బ్రేస్‌వెల్ కూడా తలో వికెట్ తీసి ఇంగ్లండ్‌ను మట్టుబెట్టడంలో పాలుపంచుకున్నారు.జేమీ ఓవర్టన్ (42), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖర్లో ఓవర్టన్ ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదాడు. వీరితో పాటు జేమీ స్మిత్ (13), జో రూట్ (25), జేకబ్ బేతెల్ (18), సామ్ కర్రన్ (17) రెండంకెల స్కోర్లు చేశారు. బట్లర్ (9) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు.కాగా, మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు రద్దైన టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ 1-0 తేడాతో కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. చదవండి: కాంట్రాక్టర్ నుంచి శ్రేయస్ దాకా.. మైదానంలో తీవ్రంగా గాయపడిన క్రికెటర్లు వీరే..! -
పాక్‌ను చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికా
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (Babar Azam) వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. ఫార్మాట్లకతీతంగా అతను వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో బాబర్ సెంచరీ చేసి రెండేళ్లైపోయింది. ఈ మధ్యలో 75 ఇన్నింగ్స్‌లు ఆడినా ఓ మూడంకెల స్కోర్ లేదు.టెస్ట్‌ల్లో, వన్డేల్లో వరుస వైఫల్యాలు ఎదుర్కొన్న బాబర్.. తాజాగా టీ20 ఫార్మాట్లోనూ చెత్త ప్రదర్శనను కొనసాగించాడు. దాదాపుగా ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చి రెండు బంతుల్లో డకౌటయ్యాడు. ఈ ప్రదర్శన తర్వాత బాబర్‌పై ట్రోలింగ్ తారాస్థాయికి చేరింది.సొంత అభిమానులు కూడా అతన్ని భరించడం లేదు. వీడు మనకొద్దు రా బాబూ అంటూ తలలు బాదుకుంటున్నారు.మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్ల మధ్య నిన్న (అక్టోబర్ 28) తొలి టీ20 (Pakistan vs South Africa) జరిగింది. రావల్పిండి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బాబర్ సహా పాక్ ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా ఆ జట్టు సౌతాఫ్రికా చేతిలో 55 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (60) అర్ద సెంచరీతో రాణించగా.. టోనీ డి జోర్జి (33), జార్జ్ లిండే (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ నవాజ్ (40-26-3), సైమ్ అయూబ్ (4-0-31-2) రాణించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఓ మోస్తరు ఆరంభం లభించినా ఆ తర్వాత పేకమేడలా కూలింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ 24, సైమ్ అయూబ్ 37 పరుగులకు ఔటయ్యారు. అంతా అయిపోయాక మొహమ్మద్ నవాజ్ (36) కాసేపు బ్యాట్ ఝులిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బాష్ (4-0-14-4), జార్జ్ లిండే (3-0-31-3), లిజాడ్ విలియమ్స్ (3.1-0-21-2) అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ పతనాన్ని శాశించారు. ఈ మ్యాచ్‌లో 9 మంది రెగ్యులర్ ప్లేయర్లు లేకపోయినా సౌతాఫ్రికా పాక్‌ను చిత్తుగా ఓడించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 అక్టోబర్ 31న లాహోర్‌లో జరుగుతుంది. చదవండి: మహ్మద్ రిజ్వాన్ సంచలన నిర్ణయం.. -
భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం
1930ల్లో భారత క్రికెట్ అంతర్జాతీయ స్థాయిలో అడుగుపెడుతున్న వేళ, దేశీయ క్రికెట్‌కు బలం చేకూర్చే దిశగా 1934లో "క్రికెట్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియా" పేరిట ఓ దేశీయ టోర్నీ ప్రారంభమైంది. ఈ టోర్నీ 1935-36లో (రెండో ఎడిషన్) రూపాంతరం చెంది రంజీ ట్రోఫీగా (Ranji Trophy) మారింది. తొలి రెండు ఎడిషన్లలో బాంబే (Bombay) ఛాంపియన్‌గా అవతరించింది.ఈ టోర్నీ మూడో ఎడిషన్ (1936-37) ఓ చారిత్రక ఘట్టానికి వేదికైంది. ఓ విదేశీ ఆటగాడు భారత దేశ అత్యుత్తమ క్రికెట్ టోర్నీ అయిన రంజీ ట్రోఫీని కైసవం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన అల్బర్ట్ ఫ్రెడ్రిక్ వెన్ల్సే (Albert Frederick Wensley) నావానగర్ (Nawanagar) అనే జట్టుకు నేతృత్వం వహించి ఛాంపియన్‌గా నిలబెట్టాడు.తద్వారా ఫ్రెడ్రిక్ రంజీ ట్రోఫీ గెలిచిన తొలి విదేశీ కెప్టెన్‌గా చరిత్రలో నిలిచాడు. ఆల్‌రౌండర్ అయిన ఫ్రెడ్రిక్ కోచ్‌గా వచ్చి, ఆటగాడిగా మారి నావానగర్కు తొలి టైటిల్ అందించాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇది మరిచిపోలేని అధ్యాయం.బాంబేలోని జింంఖానా మైదానంలో బెంగాల్‌తో జరిగిన ఫైనల్లో నావానగర్ అద్భుత ప్రదర్శన చేసి ఛాంపియన్‌గా అవతరించింది. 1937, ఫిబ్రవరి 6-10 మధ్యలో జరిగిన ఆ మ్యాచ్‌లో నావానగర్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ (424) చేసింది. వినూ మన్కడ్ (185) సెంచరీతో కదంతొక్కాడు. సోరబ్జీ కోలా (66) అర్ద సెంచరీతో రాణించాడు.అనంతరం బరిలోకి దిగిన బెంగాల్.. ఫ్రెడ్రిక్ వెన్ల్సే (4/93) ధాటికి 315 పరుగులకు ఆలౌటైంది. బెంగాల్ ఇన్నింగ్స్‌లో పాల్ వాన్ డర్ గచ్ట్ (79) అర్ద సెంచరీతో రాణించాడు.109 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నావానగర్ 383 పరుగులకు ఆలౌటై, బెంగాల్ ముందు 493 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో ఫ్రెడ్రిక్ వెన్ల్సే (4/46) మరోసారి చెలరేగడంతో బెంగాల్ 236 పరుగులకే ఆలౌటై, 256 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.ఫ్రెడ్రిక్ వెన్ల్సే అద్భుతమైన బౌలింగ్‌తో నావానగర్ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఓ విదేశీ ఆటగాడు కోచ్‌గా వచ్చి, కెప్టెన్‌గా మారి, ఛాంపియన్‌గా నిలిచిన ఈ ప్రయాణం భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయింది. ఈ ఘట్టం రంజీ ట్రోఫీకి అంతర్జాతీయ గౌరవాన్ని తెచ్చింది. ఫ్రెడ్రిక్ వెన్ల్సే తర్వాత టామ్ లాంగ్ఫీల్డ్, హెర్బర్ట్ బారిట్ అనే ఇంగ్లీష్ ఆటగాళ్లు బెంగాల్ (1938-39), వెస్ట్రన్ ఇండియా (1943-44) జట్లను రంజీ ఛాంపియన్లుగా నిలబెట్టారు. చదవండి: యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం -
జైస్వాల్ కీలక నిర్ణయం
భారత టెస్ట్ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియా తరఫున ఎలాంటి కమిట్మెంట్స్ లేకపోవడంతో దేశవాలీ క్రికెట్ ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. త్వరలో జరుగనున్న రంజీ ట్రోఫీ 2025/26 (Ranji Trophy) మూడో రౌండ్ మ్యాచ్ ఆడేందుకు సన్నద్దత వ్యక్తం చేస్తూ.. తన హోం టీమ్ మేనేజ్మెంట్కు లేఖ రాశాడు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా వెల్లడించాడు.జైస్వాల్ కొద్ది కాలం క్రితం తన హోం టీమ్ ముంబైని కాదని గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. అయితే తదనంత పరిణామాల్లో యూటర్న్ తీసుకున్నాడు. తాజాగా రాజస్తాన్‌తో జరిగబోయే మూడో రౌండ్ మ్యాచ్‌కు ముంబై తరఫున ఆడేందుకు అందుబాటులో ఉన్నట్లు ప్రకటించాడు.ఈ మ్యాచ్ నవంబర్ 1 నుంచి జైపూర్‌లో జరుగుతుంది. ఎలైట్ గ్రూప్ D భాగంగా ఈ మ్యాచ్ జరుగనుంది. ముంబై మేనేజ్మెంట్ తమను కాదని వెళ్లిపోవాలని చూసిన జైస్వాల్‌కు అవకాశం ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ అవకాశం ఇస్తే అతను ముంబై జట్టులో కీలకమవుతాడు.జైస్వాల్ తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు. అయితే అక్టోబర్ 29 నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌కు అతను ఎంపిక కాలేదు. దీంతో దేశీయ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు.టీమిండియా తరఫున కమిట్మెంట్స్ లేని సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లు దేశీయ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కండిషన్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకే జైస్వాల్ కూడా రంజీ ఆడాలని నిర్ణయించుకున్నాడు. మూడో రౌండ్‌కు ముంబై జట్టును త్వరలో ప్రకటిస్తారు.జైస్వాల్ గత సీజన్లో జమ్మూ అండ్ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున చివరిసారి ఆడాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కూడా పాల్గొన్నాడు. జైస్వాల్ తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ను ఈ ఏడాది ఆగస్ట్‌లో ఆడాడు. దులీప్ ట్రోఫీ 2025లో వెస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగాడు.రంజీ ట్రోఫీలో ఆడటం జైస్వాల్‌కు వ్యక్తిగతంగా కలిసొస్తుంది. నవంబర్ 14 నుంచి దక్షిణాఫ్రికాతో జరుగబోయే హోం సిరీస్‌కు ముందు మంచి ప్రాక్టీస్ అవుతుంది. ఆ సిరీస్‌లో భారత్ రెండు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జైస్వాల్‌కు టెస్ట్ జట్టులో చోటు పక్కా కాగా.. వన్డే, టీ20ల్లో అవకాశం లభిస్తుందో లేదో చూడాలి. సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్‌లు నవంబర్ 14 (కోల్‌కతా), నవంబర్ 22 (గౌహతి) తేదీల్లో జరుగనున్నాయి.చదవండి: వెస్టిండీస్ బోణీ -
పక్కటెముకల్లో రక్తస్రావం.. ఐసీయూలో శ్రేయస్ అయ్యర్
భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ వార్త. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో గాయపడ్డ టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా మారింది. ఆ మ్యాచ్‌లో అలెక్స్ క్యారీ క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్ ఎడమ వైపు రిబ్ కేజ్‌పై పడిపోయాడు. మొదట్లో స్వల్ప నొప్పిగా కనిపించినా, డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన తర్వాత పరిస్థితి విషమంగా మారింది. వెంటనే మెడికల్ టీమ్ ఆయనను ఆసుపత్రికి తరలించింది.సిడ్నీలోని ఆసుపత్రిలో స్కానింగ్ చేసిన వైద్యులు, శ్రేయస్‌కు అంతర్గత రక్తస్రావం (internal bleeding) ఉందని గుర్తించారు. వెంటనే ఐసీయూకు తరలించి, రెండు రోజులుగా పర్యవేక్షణలో ఉంచారు. రక్తస్రావం ఆగే వేగం, ఇన్ఫెక్షన్ ప్రమాదం ఆధారంగా శ్రేయస్‌ను మరో రెండు నుంచి ఏడు రోజులు ఐసీయూలో ఉంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. శ్రేయస్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా స్పందించారు. శ్రేయస్‌కు స్ప్లీన్‌లో లాసరేషన్ గాయం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం శ్రేయస్ అరోగ్యం నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటున్నాడని తెలిపారు. బీసీసీఐ మెడికల్ టీమ్.. సిడ్నీ, భారత్‌లో ఉన్న వైద్యులను సమన్వయం చేసుకుంటూ శ్రేయస్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత డాక్టర్ శ్రేయస్‌తో పాటే ఉండి రోజువారీగా అతని ఆరోగ్యాన్ని పరిశీలిస్తారని తెలిపారు.30 ఏళ్ల శ్రేయస్, ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కు విరామం తీసుకుని వన్డేలపై ఫోకస్ పెంచనున్నట్లు ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో (11) నిరాశపరిచిన శ్రేయస్.. రెండో వన్డేలో పుంజుకొని 61 పరుగులు చేశాడు. శ్రేయస్ మరో 83 పరుగులు చేస్తే.. వన్డేల్లో 3000 పరుగుల మైలురాయిని తాకుతాడు.తాజాగా గాయం కారణంగా శ్రేయస్ త్వరలో (నవంబర్ 30) స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో ఆడటం అనుమానంగా మారింది. శ్రేయస్ త్వరగా కోలుకోవాలని భారత క్రికెట్ అభిమానులు దేవుళ్లను ప్రార్దిస్తున్నారు. ఇటీవలికాలంలో శ్రేయస్ టీమిండియాకు ప్రధానాస్త్రంగా ఉన్నాడు. వన్డేల్లో నాలుగో స్థానంలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ తురుపుముక్కగా మారాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌కు శ్రేయస్ దూరమైతే టీమిండియా విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.చదవండి: భారత్‌తో తొలి టీ20.. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు -
IND vs AUS T20 Series: తొలి పంజా మనదే..!
టెస్ట్, వన్డే ఫార్మాట్లలో గుత్తాధిపత్యం చలాయించే ఆస్ట్రేలియా జట్టుకు పొట్టి క్రికెట్ బలహీనత ఉంది. ముఖ్యంగా టీమిండియా ఎదురైనప్పుడు ఆ బలహీనత మరింత ఎక్కువవుతుంది. 2007 నుంచి భారత్‌తో ఆడిన 32 మ్యాచ్‌ల్లో (India vs Australia) ఆసీస్ కేవలం 11 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయాలు సాధించింది.ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అయితే ఆసీస్ ట్రాక్ రికార్డు మరింత చెత్తగా ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 11 సిరీస్‌లు జరగ్గా, ఆసీస్ రెండింట మాత్రమే గెలుపొందింది. త్వరలో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్ నేపథ్యంలో భారత్-ఆసీస్ మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం.తొలి పంజా మనదేభారత్, ఆసీస్ జట్ల మధ్య తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ 2007 అక్టోబర్ 20న జరిగింది. వన్ మ్యాచ్ సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఆసీస్‌పై తొలి పంజా విసిరింది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటింది. బౌలింగ్‌లో ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్.. బ్యాటింగ్‌లో గౌతమ్ గంభీర్ (63), యువరాజ్ సింగ్ (31 నాటౌట్) రాణించారు.అనంతరం 2008 ఫిబ్రవరి 1న మెల్బోర్న్లో జరిగిన వన్ మ్యాచ్ సిరీస్‌లో (డే అండ్ నైట్) ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 74 పరుగులకే ఆలౌట్ కాగా.. ఆసీస్ మరో 52 బంతులు మిడిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.గంభీర్ మరోసారి..!2012 ఫిబ్రవరిలో ఇరు జట్ల మధ్య తొలి మల్టీ మ్యాచ్ సిరీస్ జరిగింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో గంభీర్ (56 నాటౌట్) టీమిండియాను గెలిపించాడు. యువీ విధ్వంసం2013 అక్టోబర్‌లో జరిగిన మరో వన్ మ్యాచ్ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఆరోన్ ఫించ్ (89) చెలరేగడంతో 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం యువరాజ్ సింగ్ (77 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించాడు.చెలరేగిన కోహ్లి.. వైట్వాష్మళ్లీ మూడేళ్ల తర్వాత (2016, జనవరి) భారత్, ఆసీస్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 3-0తో వైట్‌వాష్ చేసింది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లి చెలరేగిపోయాడు. మూడు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు (90 నాటౌట్, 59 నాటౌట్, 59) బాది టీమిండియా గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. రోహిత్ శర్మ కూడా రెండు అర్ద సెంచరీలతో రాణించాడు.రాణించిన శిఖర్అనంతరం 2017 అక్టోబర్‌లో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్ (భారత్), 2018 నవంబర్‌లో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌లు (ఆస్ట్రేలియా) 1-1తో డ్రా అయ్యాయి. ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్‌లో శిఖర్ ధవన్, విరాట్ కోహ్లి సత్తా చాటారు. ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా (4-0-36-4) అదరగొట్టాడు.తొలి పరాభవం2019లో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్‌లో పర్యటించింది. ఈ సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి సత్తా చాటారు.హ్యాట్రిక్ విక్టరీస్ఆతర్వాత భారత్ వరుసగా 2020 (ఆస్ట్రేలియాలో), 2022 (భారత్‌లో), 2023 (భారత్‌లో) సిరీస్‌ల్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. 2020 సిరీస్‌లో రాహుల్, ధవన్, కోహ్లి, నటరాజన్, చహల్ సత్తా చాటడంతో భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 2022 సిరీస్‌లో అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ చెలరేగడంతో 2-1 తేడాతో గెలుపొందింది.యువ ఆటగాళ్ల హవా.. రుతురాజ్ విధ్వంసకర శతకం2023లో జరిగిన సిరీస్‌లో ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, రింకూ సింగ్ లాంటి యువ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఫలితంగా భారత్ 4-1 తేడాతో ఆసీస్‌ను ఖంగుతినిపించింది. ఈ సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసకర శతకం బాదాడు.చదవండి: రోహిత్, కోహ్లి మళ్లీ రంగంలోకి దిగేది అప్పుడే..! -
టీమిండియాకు బిగ్ షాక్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా అక్టోబర్ 30న ఆస్ట్రేలియాతో జరుగబోయే సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. నిన్న (అక్టోబర్ 26) బంగ్లాదేశ్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్ సందర్భంగా ఇన్ ఫామ్ ఓపెనర్ ప్రతిక రావల్ (Pratika Rawal) తీవ్రంగా గాయపడింది. దీంతో సెమీస్ మ్యాచ్‌కు ఆమె అందుబాటులో ఉంటుందా లేదా అన్నది అనుమానంగా మారింది.ప్రస్తుతానికి ప్రతిక గాయంపై ఎలాంటి అప్డేట్ లేనప్పటికీ.. అభిమానుల్లో మాత్రం ఆందోళన నెలకొలింది. ప్రతిక న్యూజిలాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో స్మృతి మంధనతో సహా విధ్వంసకర శతకం బాదిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రపంచకప్‌లో ప్రతిక మంధనతో కలిసి భారత్‌కు శుభారంభాలు అందిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తుంది.అలాంటి ప్రతిక ఆసీస్‌తో జరుగబోయే డూ ఆర్ డై సెమీఫైనల్ మ్యాచ్‌కు దూరమైతే, టీమిండియా విజయావకాశాలు తప్పక ప్రభావితమవుతాయి.మ్యాచ్ రద్దునవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో నిన్న జరిగిన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 119 పరుగుల స్వల్ప స్కోర్‌కు పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్ 21వ ఓవర్ రెండో బంతికి మిడ్‌వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ప్రతిక తీవ్రంగా గాయపడింది.విలవిలాడిపోయిన ప్రతికమైదానం చిత్తడిగా ఉండటంతో రన్నింగ్ చేసే సమయంలో ప్రతిక కుడి కాలి మడమ మడతపడింది. తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆమెను సిబ్బంది డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. ఆతర్వాత ఆమె తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు. ఆమె స్థానంలో అమన్‌జోత్ కౌర్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.ఛేదనలో అమన్‌జోత్, మంధన 8.4 ఓవర్లలో 57 పరుగులు జోడించాక వర్షం మళ్లీ మొదలుకావడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.రికార్డుల ప్రతికప్రతిక న్యూజిలాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో పలు రికార్డులు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో చేసిన సెంచరీ ఆమెకు ప్రపంచకప్ టోర్నీలో మొదటిది. ఈ మ్యాచ్‌లో ఆమె మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్లలో ఒకరిగా నిలిచింది. అలాగే మంధన తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు చేసిన భారత మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది.ప్రతిక దూరమైతే..?ప్రతిక ఆస్ట్రేలియాతో జరుగబోయే సెమీఫైనల్ మ్యాచ్‌కు దూరమైతే టీమిండియా తీవ్రమైన కష్టాలు ఎదుర్కోనుంది. ప్రతిక స్థానాన్ని భర్తీ చేసే ఓపెనర్ ఎవరూ జట్టులో లేరు. ఐసీసీ అంగీకారంతో రిజర్వ్‌లలో లేని ప్లేయర్‌ను పిలిపించుకోవాల్సి వస్తుంది. ప్రతిక పూర్తిగా టోర్నీ నుంచి తప్పుకుంటేనే ఇది సాధ్యపడుతుంది.టీమిండియాకు మరో సమస్యప్రతిక గాయానికి ముందే టీమిండియా మరో సమస్య ఉండింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా వికెట్‌కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ గాయపడింది. దీంతో బంగ్లాదేశ్ మ్యాచ్‌కు ఆమెకు విశ్రాంతినిచ్చారు. సెమీస్ మ్యాచ్‌కు రిచా అందుబాటులో ఉంటుందా లేదా అన్నదానిపై కూడా ప్రస్తుతానికి సమాచారం లేదు. గాయాల నేపథ్యంలో టీమిండియా సెమీస్‌లో పటిష్టమైన ఆసీస్‌ను ఏమేరకు నిలువరించగలదో చూడాలి.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్‌కు అర్హత సాధించాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఫైనల్ మ్యాచ్ (నవీ ముంబై) నవంబర్ 2న జరుగుతుంది. చదవండి: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ -
ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్
ఊహించిన విధంగానే జరిగింది. యాషెస్ సిరీస్ (Ashes Series 2025-26) తొలి టెస్ట్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) దూరమయ్యాడు. వెన్నెముకలో స్ట్రెస్ ఇంజ్యూరీ కారణంగా కమిన్స్ జూలై నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. కమిన్స్ గైర్హాజరీలో తొలి టెస్ట్‌కు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ (Steve Smith) ఎంపికయ్యాడు. ఈ విషయాలను క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 21న పెర్త్‌లో తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది. కమిన్స్ స్థానాన్ని స్కాట్ బోలాండ్ భర్తీ చేసే అవకాశం ఉంది. బోలాండ్.. జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్‌తో కలిసి తొలి టెస్ట్‌లో బౌలింగ్ బాధ్యతలు చేపట్టవచ్చు.ప్రస్తుతం కమిన్స్ రన్నింగ్ చేయగలుగుతున్నా, బౌలింగ్ చేయడం లేదు. పూర్తి రికవరీకి కనీసం నాలుగు వారాల సమయపడుతుందని అతనే స్వయంగా చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే డిసెంబర్ 4న బ్రిస్బేన్‌లో ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌కు కమిన్స్ అందుబాటులోకి రావొచ్చని తెలుస్తుంది.స్టీవ్ స్మిత్ విషయానికొస్తే.. 2018లో సాండ్‌పేపర్ వివాదం తర్వాత కెప్టెన్సీ కోల్పోయిన స్మిత్, కమిన్స్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతూ ఇప్పటివరకు ఆరు టెస్టుల్లో తాత్కాలిక నాయకత్వం వహించాడు. ఆసక్తికరంగా, కెప్టెన్‌గా ఉన్నప్పుడు స్మిత్ బ్యాటింగ్ యావరేజ్ 68.98గా ఉండగా, సాధారణంగా అది 49.9 మాత్రమే.కాగా, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల యాషెస్ 2025-26 సిరీస్ నవంబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది. తొలి టెస్ట్ నవంబర్ 21న పెర్త్‌లో, రెండో టెస్ట్ డిసెంబర్ 4న బ్రిస్బేన్‌లో, మూడో టెస్ట్ డిసెంబర్ 17న అడిలైడ్‌లో, నాలుగో టెస్ట్ డిసెంబర్ 26న మెల్బోర్న్లో, ఐదో టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 4న సిడ్నీలో ప్రారంభం కానున్నాయి.స్వదేశంలో జరిగే ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో తొలి టెస్ట్‌కు కమిన్స్ దూరం కావడం వారికి ఎదురుదెబ్బే. మరోవైపు ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ కూడా గట్టిగానే కసరత్తు చేస్తుంది. నెల ముందుగానే జట్టును ప్రకటించి సన్నద్దతను వ్యక్తం చేసింది.యాషెస్ సిరీస్ 2025-26కి ఇంగ్లండ్ జట్టు..బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేకబ్ బేతెల్, బెన్ డకెట్, జాక్ క్రాలే, జో రూట్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జేమీ స్మిత్, ఓలీ పోప్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, మాథ్యూ పాట్స్చదవండి: అదరగొట్టిన తెలుగు టైటాన్స్ -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన బంగ్లాదేశ్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (అక్టోబర్ 26) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో (India vs Bangladesh) టీమిండియా (Team India) బౌలర్లు చెలరేగిపోయారు. వర్షం కారణంగా 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. బంగ్లాదేశ్‌ను 119 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది.బంగ్లా ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన షర్మిన్ అక్తర్ టాప్ స్కోరర్‌గా నిలువగా.. శోభన మోస్తరి (26), రుబ్యా హైదర్ (13), రితూ మోనీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో సుమయ్యా అక్తర్ 2, కెప్టెన్ నిగార్ సుల్తానా 9, షోర్నా అక్తర్ 2, నహీద అక్తర్ 3, రబేయా ఖాన్ 3, నిషిత అక్తర్ 4 (నాటౌట్), మరుఫా అక్తర్ 2 (నాటౌట్) పరుగులు చేశారు.భారత బౌలర్లలో రాధా యాదవ్ 3 వికెట్లు తీయగా.. శ్రీచరణి 2, రేణుకా సింగ్, దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్ తలో వికెట్ తీశారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో సెమీస్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఫైనల్ మ్యాచ్ (నవీ ముంబై) నవంబర్ 2న జరుగుతుంది. చదవండి: రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యద్భుతం -
తేలిపోయిన బంగ్లా బ్యాటర్లు.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..?
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 16) ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ (Australia vs Bangladesh) జరుగుతుంది. వైజాగ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. పటిష్టమైన ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఆసీస్ బౌలర్ల అనుభవం ముందు బంగ్లా బ్యాటర్లు తేలిపోయారు. మిడిలార్డర్ బ్యాటర్ శోభన మోస్తరి (66 నాటౌట్), ఓపెనర్ రుబ్యా హైదర్ (44) మాత్రం కాస్త ప్రతిఘటించారు. మిగతా 9 మందిలో షర్మిన్ అక్తర్ (19), కెప్టెన్ నిగార్ సుల్తానా (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఫర్జానా హాక్ (8), షోర్నా అక్తర్ (7), రితూ మోనీ (2), ఫహీమా ఖాతూన్ (4), రబేయా ఖాన్ (6), నిషిత అక్తర్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు.ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. తన కోటా 10 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఇందులో 4 మెయిడిన్లు ఉండటం విశేషం. మిగతా బౌలర్లలో ఆష్లే గార్డ్నర్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, జార్జియా వేర్హమ్ కూడా తలో 2 వికెట్లు తీశారు. మెగాన్ షట్‌కు ఓ వికెట్ దక్కింది.ప్రస్తుత ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో ఒక్క ఓటమి కూడా లేకుండా పాయింట్లు పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, భారత్ ఒకటి, మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ వరుసగా ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి.చదవండి: సూపర్ సెంచరీతో కదంతొక్కిన ఆర్సీబీ కెప్టెన్ -
రేపటి నుంచి దేశీయ క్రికెట్ మహా సంగ్రామం ప్రారంభం
రేపటి నుంచి (అక్టోబర్ 15) దేశీయ క్రికెట్ మహా సంగ్రామం రంజీ ట్రోఫీ 2025-26 (Ranji Trophy) ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి ఇది 91వ ఎడిషన్. ఇందులో మొత్తం 38 జట్లు పోటీపడనున్నాయి. 28 రాష్ట్రాలకు చెందిన జట్లు (కొన్ని రాష్ట్రాలకు సంబంధించి రెండుకు మించి జట్లు ఉన్నాయి), 4 కేంద్ర పాలిత ప్రాంతాల జట్లు, అలాగే సర్వీసెస్, రైల్వేస్ జట్లు పాల్గొంటున్నాయి.గత సీజన్లో విదర్భ విజేతగా, కేరళ రన్నరప్‌గా నిలిచాయి. తొలి మ్యాచ్‌లో ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడనున్నాయి. రేపు మొత్తం 16 మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఈ టోర్నీ కోసం దాదాపుగా అన్ని జట్లు తమ ఆటగాళ్లను ప్రకటించాయి. ఈసారి టోర్నీకి చాలామంది టీమిండియా స్టార్లు అందుబాటులో ఉన్నారు.రంజీ ట్రోఫీ 2025-26లో ఆడనున్న కీలక ఆటగాళ్లు..ముంబై- శార్దూల్ ఠాకూర్, అజింక్య రహానే, ఆయుశ్ మాత్రే, శివమ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్కేరళ- సంజూ శాంసన్కర్ణాటక- మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్జార్ఖండ్- ఇషాన్ కిషన్హైదరాబాద్- తిలక్ వర్మబీహార్- వైభవ్ సూర్యవంశీబెంగాల్- మహ్మద్ షమీఉత్తరప్రదేశ్- రింకూ సింగ్అస్సాం- రియాన్ పరాగ్కాగా, రంజీ ట్రోఫీలో అత్యధిక టైటిళ్లు ముంబై గెలుచుకుంది. ఆ జట్టు ఇప్పటివరకు 42 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ముంబై తర్వాత కర్ణాటక/మైసూర్ అత్యధికంగా 8 టైటిళ్లు సాధించింది. ఆతర్వాతి స్థానాల్లో ఢిల్లీ (7), మధ్యప్రదేశ్/హోల్కర్ (5), బరోడా (5), సౌరాష్ట్ర (2), విదర్భ (2), బెంగాల్ (2), తమిళనాడు/మద్రాస్ (2), రాజస్తాన్ (2) జట్లు ఉన్నాయి.చదవండి: కింగ్ కోహ్లి వచ్చేశాడు..! -
పాక్ క్రికెట్ దిగ్గజం కన్నుమూత
పాకిస్తాన్ క్రికెట్‌కు మూలపురుషులుగా నిలిచిన మహ్మద్ బ్రదర్స్‌లో ఒకరైన వజీర్ మహ్మద్ (95) ఇవాళ (అక్టోబర్ 13) యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బర్మింగ్‌హామ్‌లో తుదిశ్వాస విడిచారు. వయో భారం కారణంగా వజీర్ కన్నుమూశారు. 1952లో భారత్, పాక్ మధ్య జరిగిన తొలి టెస్ట్ సిరీస్‌లో పాల్గొన్న వజీర్, అప్పటి నుంచి 1959 వరకు 20 టెస్టులు ఆడి 801 పరుగులు చేశారు.వజీర్ తన కెరీర్లో తొలి టెస్ట్ మ్యాచ్‌ను భారత్‌తోనే ఆడారు. ఆ మ్యాచ్‌లో అతను కేవలం 12 పరుగులు మాత్రమే చేసి, రెండు ఇన్నింగ్స్‌ల్లో వినూ మన్కడ్ బౌలింగ్‌లో ఔటయ్యారు. వజీర్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి రికార్డు ఉంది. 105 మ్యాచ్‌ల్లో 11 సెంచరీలు, 26 అర్ధ సెంచరీల సాయంతో 4930 పరుగులు చేశారు.వజీర్ పాక్‌కు ప్రాతినిథ్యం వహించిన నలుగురు మహ్మద్ బ్రదర్స్‌లో ఒకరు. వజీర్ సోదరుడు హనీఫ్ మహ్మద్ క్రికెట్ ప్రపంచానికి సుపరిచితుడు. హనీఫ్ 2016 ఆగస్టు 11న 81 ఏళ్ల వయసులో కన్నుమూశారు.వజీర్ మరణించే సమయానికి నీల్ హార్వీ, ట్రెవర్ మెక్‌మహన్ తర్వాత మూడవ అతిపెద్ద వయస్సు గల టెస్ట్ క్రికెటర్‌గా ఉన్నారు. -
అయ్యయ్యో! పుండు మీద కారం జల్లినట్లుగా..
ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించగా.. బీసీసీఐ(BCCI) వెంటనే రూ.21 కోట్లు బోనస్‌గా ప్రకటించి ఆటగాళ్లను ఘనంగా సత్కరించింది. ఇది మన క్రీడాకారుల శ్రమకు గౌరవం, ప్రోత్సాహం, దేశం తరఫున పోరాడినందుకు ఇచ్చే గుర్తింపు అని భారత క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. సాధారణంగా రన్నరప్‌గా నిలిచిన జట్ల ఆటగాళ్లకూ ఆ దేశాలు ఎంతో కొంత ప్రొత్సాహాకం అందిస్తుంటాయి. మరి రన్నరప్‌గా నిలిచిన పాక్ ఆటగాళ్ల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?..ఆసియా కప్‌లో రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్ జట్టుకు ఆసియా క్రికెట్ కంట్రోల్ బోర్డు(75,000 డాలర్ల) తరఫున రూ.66.5 లక్షల ప్రైజ్‌మనీ లభించింది. అంతేగానీ పాక్ క్రికెట్ బోర్డు నుంచి ఇప్పటిదాకా ఎలాంటి నజరానా ప్రకటించలేదు. దీంతో ఏదైనా నజరానా ప్రకటిస్తారేమోనని ఆటగాళ్లు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో.. అలాంటి ఆశలేం వద్దంటూ ఓ వీడియో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అది 2009 టీ20 వరల్డ్ కప్ విజేతగా పాక్ నిలిచిన సమయం. ఆ సమయంలో పాక్ ఆటగాళ్లకు నజరానాను ప్రకటించింది అప్పటి యూసఫ్ రజా గిలానీ ప్రభుత్వం. అయితే ప్రధాని స్వయంగా జారీ చేసిన ఆ 25 లక్షల చెక్కు బౌన్స్ అయ్యిందట. దీంతో అప్పటి పీసీబీ చైర్మన్‌ను ఆటగాళ్లు ఆశ్రయిస్తే.. అది ప్రభుత్వం ఇస్తామన్న నజరానా అని, దాంతో మాకేం సంబంధం అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారట. చివరికి ICC ఇచ్చిన ప్రైజ్ మనీ తప్ప ఆటగాళ్లకు ఇంకేమీ అందలేదు... ప్రభుత్వం ఇచ్చే చెక్కు కూడా బౌన్స్ అవుతుందా? అని పాక్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్(Syeed Ajmal Comments Viral) చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. రెండేళ్ల కిందట నదీర్ అలీ అనే యూట్యూబర్ పాడ్‌కాస్ట్‌లో అజ్మల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు.. పాక్ జట్టులో వ్యక్తిగత విజయాలకూ తగిన గుర్తింపు ఉండదని అన్నాడాయన. 2012, 2013లో ICC టీమ్ ఆఫ్ ది ఇయర్లో తనకి చోటు దక్కినా.. పీబీసీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రొత్సాహాకం అందలేని గుర్తు చేసుకుని వాపోయాడు. దీనితో పాక్ ఆటగాళ్ల దుస్థితి ఇలా ఉందంటూ.. సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది.అదే సమయంలో.. మరోవైపు ఏసీసీ అద్యక్షుడైన పీబీసీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi) ఆటగాళ్ల నజరానా గురించి ఆలోచించే స్థితిలో ఏమాత్రం లేడు. ఆయన పరిస్థితి కూడా ‘చంద్రుడి కోసం ఎదురుచూసే చకోర పక్షి’ పరిస్థితిని తలపిస్తోంది. 2025 ఆసియా కప్ విజేతగా నిలిచిన టీమిండియా జట్టు.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో ఆయన ట్రోఫీ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆయన ట్రోఫీతో పారిపోయాడంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలాయి. ఈ తరుణంలో.. తాజాగా ఏసీసీ మీటింగ్‌లో ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగతంగానైనా వచ్చి ట్రోఫీ తీసుకెళ్లాలని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే అది జరిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే బీసీసీఐ ఇప్పటికే నఖ్వీ ట్రోఫీ తస్కరించిన వ్యవహారంపై అసంతృప్తితో ఉంది. ఈ క్రమంలో ఐసీసీకి ఫిర్యాదు చేయాలనుకుంటోంది కూడా. మరోవైపు.. మా టీమ్ మేట్స్, మా సపోర్ట్ స్టాఫ్.. వీళ్లే నా నిజమైన ట్రోఫీలు” అంటూ సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. ఏరకంగా చూసుకున్నా ట్రోఫీ కోసం నఖ్వీ ఎదురు చూస్తూ ఉండిపోవాల్సిందేనంటూ సెటైర్లు పేలుతున్నాయి. ఇదీ చదవండి: ఆ పాక్ ప్లేయర్‌కు థ్యాంక్స్.. అతని వల్లే గెలిచాం! -
ప్రపంచ క్రికెట్లో పెను సంచలనం.. మాజీ ఛాంపియన్‌ను మట్టికరిపించిన పసికూన
ప్రపంచ క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. పసికూన నేపాల్ (Nepal) రెండు సార్లు టీ20 ఛాంపియన్లైన వెస్టిండీస్‌పై (West Indies) ద్వైపాక్షిక సిరీస్ (West Indies vs Nepal) గెలిచింది. ఓ ఐసీసీ ఫుల్ మెంబర్ జట్టుపై నేపాల్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. షార్జా వేదికగా నిన్న (సెప్టెంబర్ 29) రెండో టీ20లో నేపాల్ 90 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అంతకుముందు తొలి టీ20లోనూ నేపాల్ వెస్టిండీస్‌కు షాకిచ్చింది. ఆ మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో విండీస్‌ను మట్టికరిపించింది.రెండో టీ20 విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. ఓపెనర్ ఆసిఫ్ షేక్ (68 నాటౌట్), సందీప్ జోరా (63) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో అకీల్ హొసేన్, కైల్ మేయర్స్ తలో 2, జెడియా బ్లేడ్స్ ఓ వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరుకు మించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. ఆదిలోనే మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. మొహమ్మద్ ఆదిల్ ఆలం (4-0-24-3), కుషాల్ భుర్టెల్ (2.1-1-16-3), దీపేంద్ర సింగ్ ఎయిరీ (3-0-4-1), లలిత్ రాజబంశీ (3-0-13-1) చెలరేగడంతో 17.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌటైంది. తద్వారా 90 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. పరుగుల పరంగా ఓ ఐసీసీ అసోసియేట్ జట్టుకు (నేపాల్) ఫుల్ మెంబర్ జట్టుపై (వెస్టిండీస్) ఇదే అత్యంత భారీ విజయం. వెస్టిండీస్ చేసిన 83 పరుగుల స్కోర్, ఓ అసోసియేట్ జట్టుపై ఓ ఫుల్ మెంబర్ జట్టుకు రెండో అత్యల్పం. ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో టీ20 ఇవాళ (సెప్టెంబర్ 30) జరుగనుంది. చదవండి: ఐదు రోజుల్లో మరోసారి భారత్, పాకిస్తాన్ క్రికెట్ సమరం -
స్మీడ్ ఊచకోత.. టీ20 బ్లాస్ట్ 2025 విజేతగా సోమర్సెట్.. రికార్డు ఛేదన
టీ20 బ్లాస్ట్ 2025 విజేతగా సోమర్సెట్ ఆవిర్భవించింది. నిన్న (సెప్టెంబర్ 13) జరిగిన ఫైనల్లో హ్యాంప్‌షైర్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన హ్యాంప్‌షైర్.. టాబీ ఆల్బర్ట్, కెప్టెన్ జేమ్స్ విన్స్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.టీ20 బ్లాస్ట్ ఫైనల్స్ చరిత్రలో ఇది రెండో భారీ స్కోర్. అయినా ఈ స్కోర్‌ను హ్యాంప్‌షైర్ కాపాడుకోలేకపోయింది. విల్ స్మీడ్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి సోమర్సెట్ను గెలిపించాడు. కెప్టెన్ లెవిస్ గ్రెగరి మరో ఓవర్ మిగిలుండగానే సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. సోమర్సెట్కు ఇది మూడో టీ20 బ్లాస్ట్ టైటిల్.పూర్తి వివరాల్లోకి వెళితే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హ్యాంప్‌షైర్.. టాబీ ఆల్బర్ట్ (48 బంతుల్లో 85; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), జేమ్స్ విన్స్ (34 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో బెన్నీ హోవెల్ (19 బంతుల్లో 26 నాటౌట్; 2 సిక్సర్లు) వేగంగా పరుగులు రాబట్టాడు. క్రిస్ లిన్ 12, జేమ్స్ ఫుల్లర్ 1, బెన్ మేయర్స్ 9, అలీ ఒర్ 3 పరుగులు చేశారు. సోమర్సెట్ బౌలర్లలో జేక్ బాల్ 2, గ్రెగరి, ఓవర్టన్, గోల్డ్స్వర్తీ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సోమర్సెట్.. విల్ స్మీడ్ (58 బంతుల్లో 94; 14 ఫోర్లు, 14 ఫోర్లు, సిక్స్) విధ్వంసం సృష్టించడంతో 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది (4 వికెట్లు కోల్పోయి). సీన్ డిక్సన్ (22 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్రెగరి (5 బంతుల్లో 18 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) సోమర్సెట్ను విజయతీరాలకు చేర్చారు. మిగతా బ్యాటర్లలో టామ్ కొహ్లెర్ కాడ్మోర్ 23, టామ్ ఏబెల్ 0, జేమ్స్ రూ 20 పరుగులు చేశారు. హ్యాంప్‌షైర్ బౌలరల్లో స్కాట్ కర్రీ 2, సొన్నీ బేకర్, జేమ్స్ ఫుల్లర్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో స్మీడ్ చేసిన పరుగులు (94) టోర్నీ ఫైనల్స్ ఛేదనల చరిత్రలో అత్యధికం. ఈ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌కు గానూ స్మీడ్‌కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్దు దక్కింది. -
షాకింగ్ ఘటన.. క్రికెటర్లకు తుపాకీ బెదిరింపులు
తాజాగా జరిగిన ఓ ఘటన క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో (CPL) పాల్గొంటున్న ఇద్దరు స్టార్ ఆటగాళ్లు (సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియట్స్), ఓ సీపీఎల్ అధికారి తుపాకీ బెదిరింపులకు గురయ్యారు. ఈ ఘటన సెప్టెంబర్ 9వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది. పైన పేర్కొన్న వారు ఓ ప్రైవేట్ ఈవెంట్ నుండి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల కథనం ప్రకారం.. ఆటగాళ్లను బెదిరించింది దొంగలై ఉండవవచ్చు. నగలు మరియు ఇతర విలువైన వస్తువుల కోసం ఇలా చేసి ఉంటారు. ఘటనా స్థలంలో ఓ తుపాకీ లభించింది. అది దొంగలదిగా భావిస్తున్నాం. ఈ ఘటనలో బాధితులు ఎవరూ గాయపడలేదు. విచారణ వేగవంతగా జరుగుతుంది.తాజా ఉదంతంతో సీపీఎల్ నిర్వహకులు అలర్ట్ అయ్యారు. ఆటగాళ్లు సహా సీపీఎల్‌లో భాగమైన వారందరికీ భద్రత పెంచారు. ఆటగాళ్ల సంక్షేమం తమకు చాలా ముఖ్యమని ప్రకటించారు. బాధితుల గోప్యతను గౌరవిస్తూ వారి పేర్లను వెల్లడించడం లేదని తెలిపారు.కాగా, తుపాకీ బెదింపుల ఘటన తర్వాత పేట్రియట్స్ ఇవాళ (సెప్టెంబర్ 11) జరుగబోయే మ్యాచ్‌కు ప్రిపేర్ అవుతుంది. ఆ జట్టు బార్బడోస్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. ఈ సీజన్లో పేట్రియాట్స్ ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది.పేట్రియాట్స్ సెప్టెంబర్ 7న జరిగిన తమ చివరి మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్‌పై 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌లో పాక్ ఆటగాడు రిజ్వాన్ (62 బంతుల్లో 85) ఒంటరిపోరాటం చేసి పేట్రియాట్స్ను గెలిపించాడు. రిజ్వాన్ ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన పాక్ జట్టుకు ఎంపిక కాలేదు. వన్డే జట్టు కెప్టెన్ అయినా పాక్ సెలెక్టర్లు ఫామ్‌ను సాకుగా చూపుతూ రిజ్వాన్‌ను పక్కన పెట్టారు. -
చరిత్ర సృష్టించిన జింబాబ్వే ప్లేయర్.. అసాధారణ రికార్డు సొంతం
పొట్టి క్రికెట్లో పట్టుమని 10 పరుగులు చేసినా అందులో ఓ సిక్సర్ తప్పక ఉంటుంది. అలాంటిది హాఫ్ సెంచరీనో లేక ఆపై స్కోరో చేస్తే కనీసం రెండు, మూడు సిక్సర్లైనా ఉంటాయి. పొట్టి ఫార్మాట్లో జరిగే ఏ మ్యాచ్‌లో అయినా ఈ తంతు సహజంగా జరుగుతుంటుంది.అయితే తాజాగా జరిగిన ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఓ స్పెషలిస్ట్ బ్యాటర్ ఏకంగా 81 పరుగులు చేసినా ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. నిన్న (సెప్టెంబర్ 3) శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ 57 బంతులు ఎదుర్కొని ఒక్క సిక్సర్ కూడా లేకుండా 12 ఫోర్ల సాయంతో 81 పరుగులు చేశాడు.ఈ క్రమంలో బెన్నెట్ ఓ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఫుల్ మెంబర్ సభ్య దేశాలు ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లో సిక్సర్ లేకుండా అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పేరిట సంయుక్తంగా ఉండేది.బాబర్, ఫాఫ్ ఇద్దరూ గతంలో సిక్సర్ లేకుండా 79 పరుగులు చేశారు. ఈ రికార్డు జాబితాలో రికీ పాంటింగ్ లాంటి డాషింగ్ బ్యాటర్ కూడా ఉండటం విశేషం. అన్ని ఐసీసీ సభ్య దేశాలన్నిటీ పరిగణలోకి తీసుకుంటే ఈ రికార్డు మాల్వాయ్కు చెందిన సామి సోహైల్ పేరిట ఉంది. 2022లో అతను లెసోధోపై సిక్సర్ లేకుండా 94 పరుగులు చేశాడు.ఒంటరి పోరాటంశ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బెన్నెట్ ఒంటరిపోరాటం చేశాడు. జట్టులో మిగతా ఏ బ్యాటర్ ఓ మోస్తరు స్కోరైనా చేయలేకపోగా.. బెన్నెట్ ఒక్కడే దాదాపు సెంచరీ (87) చేసినంత పని చేశాడు. బెన్నెట్ రికార్డు ఇన్నింగ్స్ కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే ఓ మోస్తరుకు మించిన స్కోర్ (175/7) చేసింది.అనంతరం బౌలర్లు మ్యాచ్ మొత్తం కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా ఒక్క ఓవర్ జింబాబ్వే కొంపముంచింది. మపోసా వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో కమిందు మెండిస్ 26 పరుగులు పిండుకుని శ్రీలంకను గెలిపించాడు. అంతకుముందు ఓపెనర్లు పథుమ్ నిస్సంక (55), కుసాల్ మెండిస్ (38) ఆడిన ఇన్నింగ్స్‌లు కూడా లంక గెలుపుకు దోహదపడ్డాయి.ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో పర్యాటక శ్రీలంక 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 సెప్టెంబర్ 6న జరుగనుంది. దీనికి ముందు జరిగిన రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను శ్రీలంక క్లీన్ స్వీప్ చేసింది. -
చరిత్ర సృష్టించిన లిట్టన్ దాస్
బంగ్లాదేశ్ టీ20 జట్టు కెప్టెన్ లిట్టన్ దాస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ తరఫున టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా అవతరించాడు. నిన్న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ద సెంచరీ (46 బంతుల్లో 73; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసిన దాస్ ఈ ఘనత సాధించాడు.దాస్‌కు ముందు ఈ రికార్డు షకీబ్ అల్ హసన్ పేరిట ఉండేది. షకీబ్ బంగ్లాదేశ్ తరఫున 129 మ్యాచ్‌ల్లో 13 హాఫ్ సెంచరీలు చేయగా.. దాస్ కేవలం 110 మ్యాచ్‌ల్లోనే షకీబ్ పేరిట ఉండిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.దాస్, షకీబ్ తర్వాత టీ20ల్లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక అర్ద సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా తమీమ్ ఇక్బాల్ (8), మహ్మదుల్లా (8), తంజిద్ హసన్ (6) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్న నెదర్లాండ్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఈ సిరీస్ గెలుపుతో బంగ్లాదేశ్ హ్యాట్రిక్ సాధించింది. నెదర్లాండ్స్‌ను ఖంగుతినిపించకముందు బంగ్లాదేశ్ శ్రీలంక, పాకిస్తాన్‌ను కూడా మట్టికరిపించింది. హ్యాట్రిక్ సిరీస్ విజయాలతో బంగ్లాదేశ్ ఆసియా కప్‌లో అడుగుపెట్టబోతుంది.చివరి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 18.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఈ దశలో ప్రారంభమైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఆట ఆగిపోయే సమయానికి జాకిర్ అలీ (20), నురుల్ హసన్ (22) క్రీజ్‌లో ఉన్నారు. లిట్టన్ దాస్ బంగ్లాదేశ్‌కు మెరుపు ఆరంభాన్ని అందించాడు. బంగ్లా ప్లేయర్లలో సైఫ్ హస్సన్ 12, తౌహిద్ హృదోయ్ 9, షమీమ్ హొస్సేన్ 21 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో కైల్ క్లెయిన్ 3 వికెట్లు పడగొట్టగా.. టిమ్ ప్రింగిల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
రెండు ప్రపంచకప్‌లు ఆడిన అంతర్జాతీయ క్రికెటర్‌పై చోరీ కేసు
ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న ఓ వార్త క్రికెట్ సమాజాన్నంతా షాక్‌కు గురి చేస్తుంది. రెండు టీ20 ప్రపంచకప్‌లు, 97 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవమున్న పపువా న్యూగినియా క్రికెటర్ కిప్లింగ్ డోరిగా (Kipling Doriga) చోరీ కేసులో బుక్కాయ్యాడు.ఆగస్టు 25వ తేదీ ఉదయం జెర్సీ ద్వీప రాజధాని సెయింట్ హెలియర్స్ (St Heliers) ప్రాంతంలో ఓ చోరీ జరిగింది. ఈ ఘటనలో డోరిగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు తెలుస్తుంది. డోరిగాను స్థానిక పోలీసులు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా నేరాన్ని ఒప్పుకున్నాడని సమాచారం.రిలీఫ్ మేజిస్ట్రేట్ రెబెక్కా మోర్లే-కిర్క్ ఈ కేసును తీవ్రమైందిగా పరిగణించి రాయల్ కోర్టుకు బదిలీ చేశారు. తదుపరి విచారణను నవంబర్ 28కి వాయిదా వేశారు. ఈ కేసులో డోరిగాకు బెయిల్ నిరాకరించబడింది. తదుపరి వాయిదా వరకు డోరిగా పోలీసుల కస్టడీలో కొనసాగనున్నాడు.ఈ పరిణామం పపువా న్యూగినియా క్రికెట్ బోర్డును అప్రతిష్ఠపాలు చేసింది. అంతర్జాతీయ వేదికపై ఆ జట్టు తల దించుకునేలా చేసింది. ఓ అంతర్జాతీయ క్రికెటర్ చోరీ కేసులో ఇరుక్కోవడం ఐసీసీ కూడా చెడ్డ పేరు తీసుకొచ్చింది. ఈ ఘటన అంతర్జాతీయ క్రీడా సమాజంలో క్రికెట్ ప్రతిష్టను దెబ్బతీసింది. పపువా న్యూగినియా ఐసీసీ అసోసియేట్ సభ్య దేశంగా ఉంది.వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అయిన 29 ఏళ్ల డోరిగా 2021, 2024 టీ20 ప్రపంచకప్‌లలో పపువా న్యూగినియాకు ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ స్థాయిలో 97 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న డోరిగా, ప్రస్తుతం CWC ఛాలెంజ్ లీగ్ రెండో రౌండ్లో పపువా న్యూగినియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. -
అప్పుడు ధోనీ, ఇప్పుడు రోహిత్ పొగరు ప్రో మ్యాక్స్ భయ్యా
-
ఊచకోత.. సిక్సర్ల సునామీ.. చరిత్రలో అత్యధిక స్కోర్
పురుషుల హండ్రెడ్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదైంది. నిన్న (ఆగస్ట్ 16) వెల్ష్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇన్విన్సిబుల్స్ నిర్ణీత 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 226 పరుగుల రికార్డు స్కోర్ చేసింది.ఇన్విన్సిబుల్స్ చారిత్రక స్కోర్ సాధించడానికి జోర్డన్ కాక్స్ ప్రధాన కారకుడు. కాక్స్ 29 బంతుల్లో 10 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో అజేయమైన 86 పరుగులు సాధించాడు. అజీత్ డేల్ వేసిన ఓ ఓవర్లో వరుసగా 4 సిక్సర్లు బాదాడు. ఇన్విన్సిబుల్స్ ఇన్నింగ్స్‌లో విల్ జాక్స్ (38), ముయేయే (33), సామ్ కర్రన్ (34), డొనోవన్ ఫెరియెరా (18) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఫలితంగా ఇన్విన్సిబుల్స్ లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. గతంలోనూ ఈ రికార్డు ఇన్విన్సిబుల్స్ (208) పేరిటే ఉండేది. తాజాగా ఇన్విన్సిబుల్స్ తమ రికార్డును తామే బద్దలు కొట్టుకుంది. రికార్డు స్కోర్ చేసిన అనంతరం ఇన్విన్సిబుల్స్ లక్ష్యాన్ని సునాయాసంగా కాపాడుకుంది. టామ్ కర్రన్ (18-8-15-4), బెహ్రెన్‌డార్ఫ్ (15-7-20-3) చెలరేగి బౌలింగ్ చేసి వెల్ష్ ఫైర్‌ను 93 బంతుల్లో 143 పరుగులకే ఆలౌట్ చేశారు. జానీ బెయిర్‌స్టో (28 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. లూక్ వెల్స్ (29), టామ్ కొహ్లెర్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
మరో విధ్వంసకర శతకం.. బీభత్సం సృష్టించిన టీమిండియా యువ కెరటం
రెడ్ బాల్ క్రికెట్‌కు మాత్రమే పనికొస్తాడనుకున్న భారత అండర్-19 జట్టు మాజీ కెప్టెన్ యశ్ ధుల్.. టీ20 ఫార్మాట్లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025లో సెంట్రల్ ఢిల్లీకి ఆడుతున్న ధుల్.. వరుస సెంచరీలతో అదరగొడుతున్నాడు.కొద్ది రోజుల కిందట నార్త్రన్ ఢిల్లీ స్ట్రయికర్స్పై మెరుపు సెంచరీతో (56 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో అజేయమైన 101 పరుగులు) విరుచుకుపడిన చేసిన ధుల్.. తాజాగా అదే జట్టుపై మరోసారి విధ్వంసకర శతకంతో (51 బంతుల్లో 105; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) బీభత్సం సృష్టించాడు.ధుల్ సెంచరీలతో పేట్రేగిపోయిన రెండు సందర్భాల్లో సెంట్రల్ ఢిల్లీ ఘన విజయాలు సాధించింది. తాజాగా నార్త్రన్ ఢిల్లీ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ ఢిల్లీ 16 ఓవర్లలో (వర్షం కారణంగా కుదించారు) 7 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. ధుల్‌తో పాటు యుగల్ సైనీ (28 బంతుల్లో 63; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తా చాటాడు. నార్త్రన్ ఢిల్లీ బౌలర్లలో కెప్టెన్ హర్షిత్ రాణా, అర్జున్ రప్రియ తలో 3 వికెట్లు తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో నార్త్రన్ ఢిల్లీ అద్భుతంగా పోరాడినప్పటికీ విజయం సాధించలేకపోయింది. 16 ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి లక్ష్యానికి 16 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఓపెనర్లు సర్తక్ రంజన్ (52), అర్నవ్ బుగ్గా (43) మెరుపు ఇన్నింగ్స్‌లతో గెలుపుకు గట్టి పునాది వేసినప్పటికీ.. ఆతర్వాత వచ్చిన వారు దాన్ని కొనసాగించలేకపోయారు. మధ్యలో వైభవ్ కంద్పాల్ (34) మినహా అంతా విఫలమయ్యారు. సెంట్రల్ ఢిల్లీ బౌలర్లు తలో చేయి వేసి నార్త్రన్ ఢిల్లీ గెలుపుకు అడ్డుకున్నారు.ఆ ముద్రను చెరిపేసిన ధుల్రెడ్ బాల్ బ్యాటర్‌గా ముద్రపడిన ధుల్.. వరుస టీ20 సెంచరీలతో ఆ ఇమేజ్ను చెరిపేశాడు. తాజా ప్రదర్శనలతో ఆల్ ఫార్మాట్ బ్యాటర్ అనిపించుకున్నాడు. ధుల్‌కు అండర్-19 క్రికెట్ ఆడే రోజుల నుంచి నిదానంగా ఆడతాడన్న చెడ్డ పేరుంది. టెక్నిక్ పరంగా బలంగా ఉన్నప్పటికీ.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో, ముఖ్యంగా టీ20ల్లో అవేవీ లెక్కలోని రావు.అందుకే ధుల్ తన శైలిని మార్చుకొని బ్యాట్‌ను ఝులిపించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే డీపీఎల్‌లో రెండు విధ్వంసకర శతకాలతో విరుచుకుపడ్డాడు. ధుల్‌కు ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గానూ మంచి ట్రాక్ రికార్డు ఉంది. అతని సారథ్యంలో భారత్.. అండర్-19 జట్టు 2021 ఆసియా కప్, 2022 వరల్డ్‌కప్ గెలిచింది.ధుల్ రంజీ అరంగేట్రంలో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి సీనియర్ లెవెల్లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత 2022లో అతనికి ఐపీఎల్ అవకాశం దక్కింది. ఆ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అరంగేట్రం చేసిన ధుల్.. 3 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 16 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఆ సీజన్లో పేలవ ప్రదర్శన తర్వాత ధుల్‌ను ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. తాజాగా ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ ధుల్‌ను మరోసారి దక్కించుకునే ప్రయత్నం చేయవచ్చు. -
న్యూజిలాండ్‌ను కాదని స్కాట్లాండ్కు వలస వెళ్లిన టీ20 క్రికెటర్
న్యూజిలాండ్ క్రికెటర్ టామ్ బ్రూస్ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న స్కాట్లాండ్కు వలస వెళ్లాడు. న్యూజిలాండ్ తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో జరుగనున్న వరల్డ్‌కప్ లీగ్-2 మ్యాచ్‌ల కోసం బ్రూక్ స్కాట్లాండ్ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. బ్రూస్ తండ్రి స్వస్థలం స్కాట్లాండే కావడంతో అతనికి ఈ అవకాశం దక్కింది. బ్రూస్ న్యూజిలాండ్‌కు ఆడకముందు 2016లో స్కాట్లాండ్ డెవలెప్మెంట్ జట్టుకు ఆడాడు.2017లో బ్రూస్ న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. బ్రూస్ న్యూజిలాండ్ తరఫున రెండో మ్యాచ్‌లోనే మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ సాధించి పర్వాలేదనిపించాడు. ఆతర్వాత అతను అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాడు. తదుపరి 15 ఇన్నింగ్స్‌ల్లో మరో ఫిఫ్టి మాత్రమే చేయగలిగాడు. దీంతో జట్టులో స్థానం గల్లంతైంది.2020లో స్వదేశంలో భారత్‌తో జరిగిన సిరీస్‌లో అతను చివరిసారిగా న్యూజిలాండ్‌కు ఆడాడు. ఆ సిరీస్‌లో వరుస డకౌట్ల కారణంగా అతనిపై వేటు పడింది. ఆ సిరీస్‌ను న్యూజిలాండ్ 0-5 తేడాతో భారత్‌కు కోల్పోయింది.భారత్‌తో సిరీస్ తర్వాత బ్రూస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా జట్టులోకి రాలేకపోయాడు. దీంతో కెరీర్‌ను కొనసాగించేందుకు తన తండ్రి స్వస్థలమైన స్కాట్లాండ్కు వలస వెళ్లాడు. అక్కడ దేశవాలీ మ్యాచ్‌ల్లో సత్తా చాటి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. 2017-2020 మధ్యలో బ్రూస్ న్యూజిలాండ్ తరఫున 17 మ్యాచ్‌లు ఆడి 2 హాఫ్ సెంచరీల సాయంతో 122.44 స్ట్రయిక్‌రేట్‌తో 279 పరుగులు చేశాడు.స్కాట్లాండ్ వన్డే జట్టుకు ఎంపికైన అనంతరం బ్రూస్ ఇలా అన్నాడు. "మా కుటుంబానికి స్కాటిష్ చరిత్ర ఉంది. స్కాట్లాండ్కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. ప్రపంచ వేదికపై స్కాట్లాండ్ విజయానికి నా వంతు కృషి చేస్తాను". ఈ మార్పుతో బ్రూస్ రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.కాగా, వరల్డ్‌కప్ లీగ్-2లో భాగంగా స్కాట్లాండ్ కెనడా, నమీబియా దేశాలతో ఆగస్ట్ 29-సెప్టెంబర్ 6 మధ్యలో నాలుగు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. -
స్నేహితుడిపై దాడి.. బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్‌పై కేసు
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తస్కిన్ అహ్మద్ చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. నివేదికల ప్రకారం అతనిపై కేసు నమోదైంది. ఈనెల 26న తస్కిన్.. అతని స్నేహితుడు సిఫాతుర్ రెహ్మాన్ సౌరవ్‌పై దాడి చేశాడు. మీర్పూర్ మోడల్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయమై స్థానిక జర్నలిస్ట్‌లు తస్కిన్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ విషయమై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు (బీసీబీ) చెందిన కీలక అధికారి స్పందిస్తూ ఇలా అన్నాడు. ఈ వార్తను సమాచార మాధ్యమాల్లో చూశాను. ఒకవేళ ఇది నిజమే అయితే విచారకరం. తస్కిన్ లాంటి స్టార్ ప్లేయర్లు ఇలాంటి విషయాల్లో తలదూర్చకూడదు. ఈ విషయంపై విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి కామెంట్ చేయదలచుకోలేదని అన్నాడు.మరో వాదనతస్కిన్కు సంబంధించి ఇదే విషయంలో మరో ప్రచారం కూడా జరుగుతుంది. తస్కిన్ బీసీబీ డైరెక్టర్‌తో మాట్లాడి తాను నిర్దోషినని చెప్పాడట. కావాలనే కొందరు తనను ఈ కేసులో ఇరికించారని సంజాయిషీ ఇచ్చాడట. గొడవ జరిగిన మాట వాస్తవమే అని.. అయితే అందులో తన ప్రమేయమేమీ లేదని వివరణ ఇచ్చాడట.తస్కిన్ బీసీబీ డైరెక్టర్‌తో ఇలా చెప్పాడట..ఆ రోజు తన మిత్ర బృందంలోని రెండు గ్రూప్‌ల మధ్య గొడవ జరిగింది. అందులో ఓ వర్గం తనను మీర్పూర్ పోలీసులకు ఫోన్ చేయమని చెప్పింది. వారి కోరిక మేరకు నేను పోలీసులకు ఫోన్ చేశాను. ఇందుకు ఆగ్రహించిన మరో వర్గం తనపై కేసు నమోదు చేసింది.ఈ ఘటన తస్కిన్ పాకిస్తాన్‌తో మూడో టీ20 ఆడిన అనంతరం జరిగింది. మీర్పూర్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో తస్కిన్ 3 వికెట్లు తీశాడు. 30 ఏళ్ల రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ అయిన తస్కిన్ బంగ్లాదేశ్ తరఫున 17 టెస్ట్‌లు, 81 వన్డేలు, 76 టీ20లు ఆడి 254 వికెట్లు తీశాడు. తస్కిన్ పేరిట టెస్ట్‌ల్లో ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది. -
టీమిండియా స్టార్లతో ? కోహ్లి తన్నులాట విరాట్ కు ఏమైంది
-
ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్.. స్టార్ క్రికెటర్లు వీరే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్ మిస్సయిన పలువురు విదేశీ స్టార్ క్రికెటర్లకు మరో అవకాశం దక్కింది. మన దాయాది దేశం పాకిస్తాన్ వారిని అక్కున చేర్చుకుంది. ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని పలువురు విదేశీ క్రికెటర్లకు పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) అవకాశం కల్పించింది. ఇందులో స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ కూడా ఉండడం విశేషం. వార్నర్ అయితే ఒక జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కరాచీ కింగ్స్ జట్టుకు అతడు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇదే టీమ్‌లో విలియమ్సన్ కూడా ఉన్నాడు. వీరిద్దరూ ఫస్ట్‌టైం పీఎస్ఎల్లో ఆడుతున్నారు. అఫ్గానిస్తాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ, న్యూజిలాండ్ ప్లేయర్లు ఆడమ్ మిల్నే, టిమ్ సీఫెర్ట్ కూడా కరాచీ కింగ్స్ (Karachi Kings) జట్టులో ఉన్నారు. ఈ మూడు దేశాలతో పాటు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్, వెస్టిండీస్‌కు చెందిన క్రికెటర్లు కూడా పీఎస్ఎల్లో ఆడనున్నారు.కోలిన్ మున్రో (న్యూజిలాండ్), రాస్సీ వాన్ డెర్ డుసెన్ (దక్షిణాఫ్రికా), రిలే మెరెడిత్, బెంజమిన్ డ్వార్షుయిస్ (ఆస్ట్రేలియా), జాసన్ హోల్డర్ (వెస్టిండీస్).. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత సంవత్సరం రన్నరప్ ముల్తాన్ సుల్తాన్స్ జట్టులో షాయ్ హోప్, గుడాకేష్ మోటీ, జాన్సన్ చార్లెస్(వెస్టిండీస్), మైఖేల్ బ్రేస్‌వెల్ (న్యూజిలాండ్), డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్ (ఇంగ్లండ్) ఉన్నారు.న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్, శ్రీలంక క్రికెటర్ కుశాల్ పెరెరా, నమీబియా మాజీ క్రికెటర్ డేవిడ్ వైస్.. లాహోర్ ఖలందర్స్ టీమ్‌లో ఉన్నారు.వెస్టిండీస్ సీమర్ అల్జారి జోసెఫ్, దక్షిణాఫ్రికాకు చెందిన జార్జ్ లిండే, ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ ఓవెన్.. పెషావర్ జల్మి జట్టుకు ఆడుతున్నారు. కుశాల్ మెండిస్(శ్రీలంక), మార్క్ చాప్మన్, కైల్ జామీసన్, ఫిన్ అలెన్(న్యూజిలాండ్), రిలీ రోసౌ(దక్షిణాఫ్రికా).. క్వెట్టా గ్లాడియేటర్స్ టీమ్ తరపున బరిలోకి దిగనున్నారు.కాగా, పీఎస్ఎల్ (PSL 2025) పదో సీజన్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమవుతోంది. ఈసారి ఐపీఎల్‌కు సమాంతరంగా పాకిస్తాన్ క్యాష్ రిచ్ లీగ్ జరుగుతుండడంతో పీఎస్ఎల్కు ఆదరణ అంతంతమాత్రమేన్న వార్తలు వెలువడుతున్నాయి. వరల్డ్ క్రికెట్లోని స్టార్లు అందరూ ఐపీఎల్‌లోనే ఉండడం, మ్యాచ్‌లు కూడా ఉత్కంఠభరితంగా సాగుతుండడంతో పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఇండియా క్యాష్ రిచ్ లీగ్వైపే మొగ్గు చూపిస్తున్నారు. నేటి నుంచి మే 18 వరకు జరిగే పీఎస్ఎల్ 10వ ఎడిషన్‌లో 6 జట్లు పోటీపడతాయి. నాలుగు వేదికల్లో 34 మ్యాచ్‌లు జరుగుతాయి.ఇస్లామాబాద్ యునైటెడ్షాదాబ్ ఖాన్ (కెప్టెన్), ఆండ్రీస్ గౌస్ (వికెట్ కీపర్), ఆజం ఖాన్ (వికెట్ కీపర్), నసీమ్ షా, రిలే మెరెడిత్, హునైన్ షా, బెంజమిన్ ద్వార్షుయిస్, కోలిన్ మున్రో, రుమ్మన్ రయీస్, సల్మాన్ ఇర్షాద్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, మాథ్యూ షార్ట్, ఇమాద్ వసీం, సల్మాన్ అగ్లీహమ్, సల్మాన్ అగ్లీహమ్, హోల్డర్ నవాజ్, సాద్ మసూద్, సాహిబ్జాదా ఫర్హాన్, ముహమ్మద్ షాజాద్.ముల్తాన్ సుల్తాన్స్మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్& వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాయ్ హోప్ (వికెట్ కీపర్), జాన్సన్ చార్లెస్ (వికెట్ కీపర్), ఉసామా మీర్, మైఖేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, ఇఫ్తికార్ అహ్మద్, క్రిస్ జోర్డాన్, తయ్యబ్ తాహిర్, అమీర్ అజ్మత్, కమ్రాన్ గులామ్, మహ్మద్ జొహ్ల్ హస్నైన్, అకిఫ్స్ జొస్నాన్, లిటిల్, యాసిర్ ఖాన్, షాహిద్ అజీజ్, ఉబైద్ షా, ముహమ్మద్ అమీర్ బార్కీ.కరాచీ కింగ్స్ డేవిడ్ వార్నర్ (కెప్టెన్), టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), అబ్బాస్ అఫ్రిది, ఆడమ్ మిల్నే, హసన్ అలీ, జేమ్స్ విన్స్, ఖుష్దిల్ షా, ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, షాన్ మసూద్, మీర్ హమ్జా, కేన్ విలియమ్సన్, అమర్ జమాల్, అరాఫత్ బి మహ్మద్, ఓ జహీమా బి మహ్మద్, యు. అలీ, రియాజుల్లా, మీర్జా మామూన్, ఇంతియాజ్ మహ్మద్ నబీ.లాహోర్ ఖలందర్స్ షాహీన్ అఫ్రిది (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), మహ్మద్ అఖ్లాక్ (వికెట్ కీపర్), కుసల్ పెరీరా (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, డారిల్ మిచెల్, హరీస్ రవూఫ్, సికందర్ రజా, అబ్దుల్లా షఫీక్, సల్మాన్ అలీ మీర్జా, రిషద్ హుస్సేన్, ముహమ్మద్ నయీమ్, మహ్మద్ అజాబ్, డేవిడ్ ఖాన్, జమర్, డేవిడ్ ఖాన్, జహర్, మోమిన్ క్యూమ్, కుర్రాన్, ఆసిఫ్ ఆఫ్రిది, ఆసిఫ్ అలీ.పెషావర్ జల్మిబాబర్ ఆజం (కెప్టెన్), టామ్ కోహ్లర్-కాడ్మోర్ (వికెట్ కీపర్), మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), జార్జ్ లిండే, అహ్మద్ డానియాల్, అల్జారీ జోసెఫ్, నహిద్ రానా, సైమ్ అయూబ్, మహ్మద్ అలీ, హుస్సేన్ తలత్, అబ్దుల్ సమద్, ఆరిఫ్ యాకూబ్, మెహ్రాన్ ముంతాజ్, నజీమ్ అలీక్స్ బ్రయంట్, మాజ్ సదాకత్, మిచెల్ ఓవెన్, ల్యూక్ వుడ్.చదవండి: పాక్ జట్టులో నో ఛాన్స్.. కట్ చేస్తే! అక్కడెమో ఏకంగా వైస్ కెప్టెన్క్వెట్టా గ్లాడియేటర్స్సౌద్ షకీల్ (కెప్టెన్), కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), హసీబుల్లా ఖాన్ (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, ఫహీమ్ అష్రఫ్, ఖవాజా నఫే, అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ అమీర్, రిలీ రోసౌ, అకేల్ హోసేన్, మహ్మద్ వసీం జూనియర్, ఉస్మాన్ తారిజ్, ఉస్మాన్ తారిజ్ జీషన్, సీన్ అబాట్, కైల్ జామీసన్, హసన్ నవాజ్, షోయబ్ మాలిక్, అలీ మజిద్. -
మ్యాచ్ జరుగుతుండగా గుండెపోటు.. ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డ స్టార్ క్రికెటర్
బంగ్లాదేశ్ దిగ్గజ బ్యాటర్, ఆ దేశ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (36) నిన్న ఉదయం తీవ్రమైన గుండెపోటుకు గురయ్యాడు. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ ఆడుతుండగా ఈ ఘటన జరిగింది. ఫీల్డింగ్ చేస్తుండగా తమీమ్‌కు రెండు సార్లు ఛాతీ నొప్పి వచ్చినట్లు తెలుస్తుంది. విషయం తెలిసి అందుబాటులో ఉన్న వారు తమీమ్‌ను ఆసుపత్రికి తరలించారు. స్పృహ కోల్పోయిన తమీమ్‌కు ఆసుపత్రిలో డాక్టర్లు గంట సేపు సీపీఆర్ చేశారు. డాక్టర్లు తమీమ్ గుండె ధమనాల్లో పూడికలు ఉన్నట్లు గుర్తించారు. నిన్ననే తమీమ్ గుండెకు స్టంట్లు వేశారు. తమీమ్ ఆసుపత్రికి చేరిన సమయంలో పరిస్థితి విషమంగా ఉండిందని డాక్టర్లు తెలిపారు. ఆసుపత్రికి రావడం లేట్ అయ్యుంటే తమీమ్ ప్రాణాలు కోల్పోయేవాడని అన్నారు.ప్రస్తుతం తమీమ్ ప్రాణాపాయస్థితి నుంచి బయటపడి కోలుకునే క్రమంలో ఉన్నాడని తెలుస్తుంది. తమీమ్ ఇవాళ ఉదయమే స్పృహలోకి వచ్చాడని సమాచారం. తమీమ్ తన కుటుంబ సభ్యులతో మాట్లాడాడని బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.తమీమ్ గుండెపోటుకు గురయ్యాడని తెలిసి క్రికెట్ ప్రపంచం స్పందించింది. తమీమ్ కుటుంబ సభ్యుల్లో మనో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసింది. తమీమ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. నిన్ననే పుట్టిన రోజు జరుపుకున్న బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ తమీమ్ త్వరగా కోలుకోవాలని దేవుడిని వేడుకున్నాడు. తమీమ్ ఆరోగ్యం గురించి ప్రార్థనలు చేయాలని అభిమానులకు పిలుపునిచ్చాడు.తమీమ్ పరిస్థితి తెలిసి టీమిండియా మాజీ ఆటగాడు, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ కూడా స్పందించాడు. ఇంతకంటే కఠినమైన పరిస్థితులను మైదానంలో ఎదుర్కొన్నావు. విజయవంతమయ్యావు. ఇప్పుడూ అంతే, త్వరగా కోలుకుని విజయవంతంగా తిరిగొస్తావంటూ ట్వీట్ చేశాడు.కాగా, తమీమ్ బంగ్లాదేశ్ తరఫున 16 ఏళ్ల కెరీర్లో 391 మ్యాచ్‌లు ఆడి 15000 పైచిలుకు పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చలామణి అవుతున్నాడు. తమీమ్ బంగ్లాదేశ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు కలిగి ఉన్నాడు. తమీమ్ తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తం 25 సెంచరీలు బాదాడు. తమీమ్ 2020-2023 మధ్యలో బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. -
స్టార్ క్రికెటర్‌కు గుండెపోటు.. పరిస్థితి విషమం
బంగ్లాదేశ్ దిగ్గజ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్‌కు (36) ఇవాళ (మార్చి 23) ఉదయం గుండెపోటు వచ్చింది. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ ఆడుతుండగా తమీమ్ తీవ్రమైన ఛాతీ నొప్పికి గురయ్యాడు. దీంతో అతన్ని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తమీమ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతనికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. తమీమ్ గుండె ధమనాల్లో పూడికలు ఉన్నట్లు తెలుస్తుంది. తమీమ్ ఇవాళ ఉదయమే రెండు సార్లు ఛాతీ నొప్పికి గురైనట్లు సమాచారం. తమీమ్ పరిస్థితి తెలిసి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ కార్యకలాపాలన్నిటినీ వాయిదా వేసుకుంది. బోర్డు డైరెక్టర్లు తమీమ్‌ను చూసేందుకు ఆసుపత్రికి క్యూ కట్టారు.తమీమ్ బంగ్లాదేశ్ క్రికెట్లో అత్యంత సఫలమైన ఆటగాడు. తమీమ్ 2023లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం అతను లోకల్ క్రికెట్ ఆడుతూ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు. తమీమ్ పేరిట బంగ్లాదేశ్ క్రికెట్‌కు సంబంధించి ఎన్నో రికార్డులు ఉన్నాయి. తమీమ్ తన అంతర్జాతీయ కెరీర్లో (మూడు ఫార్మాట్లలో) 15000 పైచిలుకు పరుగులు సాధించాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో ఇన్ని పరుగులు ఎవరూ చేయలేదు. తమీమ్ బంగ్లాదేశ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు కలిగి ఉన్నాడు. తమీమ్ తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తం 25 సెంచరీలు బాదాడు. తమీమ్ 2020-2023 వరకు బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. -
44 బంతుల్లో శతక్కొట్టిన పాక్ ఓపెనర్.. 9 వికెట్ల తేడాతో చిత్తైన న్యూజిలాండ్
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో పాకిస్తాన్ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ యువ ఓపెనర్ హసన్ నవాజ్ 44 బంతుల్లోనే శతక్కొట్టి పాక్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. టీ20ల్లో పాక్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. గతంలో ఈ రికార్డు బాబర్ ఆజమ్ పేరిట ఉండేది. బాబర్ 2021లో సౌతాఫ్రికాపై 49 బంతుల్లో శతక్కొట్టాడు.నవాజ్ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో న్యూజిలాండ్ నిర్ధేశించిన 205 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ 16 ఓవర్లలోనే ఊదేసింది. ఈ గెలుపుతో పాక్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు టీ20ల్లో ఘన విజయాలు సాధించిన న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావించింది. అయితే కివీస్ అశలపై హసన్ నవాజ్ నీళ్లు చల్లాడు. నవాజ్ తన కెరీర్లో మూడో మ్యాచ్‌లోనే ఫాస్టెస్ట్ సెంచరీ సాధించడం విశేషం. ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నవాజ్ తొలి రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు.పాక్ క్రికెట్ జట్టు విషయానికొస్తే.. ఈ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ తెలీదు. వరుసగా పరాజయాలతో ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న ఆ జట్టు.. ఒక్కసారిగా సంచలన ప్రదర్శనతో భారీ లక్ష్యాన్ని ఛేదించి ఊహించని విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలవడాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఇటీవలికాలంలో ఆ జట్టు ప్రదర్శన అంత దారుణంగా ఉంది మరి. నవాజ్ తన సుడిగాలి శతకంతో పాక్ క్రికెట్లో ఒక్కసారిగా హీరో అయిపోయాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19.5 ఓవర్లలో 204 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. మార్క్ చాప్మన్ 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో చాప్మన్ తర్వాత ఎవరూ ఆ స్థాయిలో రాణించలేదు. ఆఖర్లో కెప్టెన్ బ్రేస్‌వెల్ (18 బంతుల్లో 31) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. టిమ్ సీఫర్ట్ (19), డారిల్ మిచెల్ (17), ఐష్ సోధి (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఫిన్ అలెన్ 0, నీషమ్ 3, మిచెల్ హే 9, జేమీసన్ 0, డఫీ 2 పరుగులకు ఔటయ్యారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, అబ్బాస్ అఫ్రిది తలో 2, షాదాబ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్ ఆది నుంచి దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు మహ్మద్ హరీస్ (20 బంతుల్లో 41), హసన్ నవాజ్ (45 బంతుల్లో 105 నాటౌట్; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు వేగంతో పరుగులు సాధించారు. హరీస్ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన సల్మాన్ అఘా (31 బంతుల్లో 51 నాటౌట్) కూడా దూకుడుగా ఆడాడు. ఫలితంగా పాక్ మరో 4 ఓవర్లు మిగిలుండగానే వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. పాక్ కోల్పోయిన ఏకైక వికెట్ డఫీకి దక్కింది. ఈ సిరీస్‌లో నాలుగో టీ20 మార్చి 23న మౌంట్ మాంగనూయ్ వేదికగా జరుగనుంది. -
రాజవంశీకుడైన మాజీ క్రికెటర్ మృతి
రాజస్థాన్ రంజీ జట్టు మాజీ కెప్టెన్, మేవార్ పూర్వ రాజకుటుంబ సభ్యుడు, రాజ్‌పుత్ రాజు మహారాణా ప్రతాప్ వారసుడు, హెచ్ఆర్హెచ్ (HRH) గ్రూప్ ఆఫ్ హోటల్స్ చైర్మన్ అయిన అరవింద్ సింగ్ మేవార్ (81) ఇవాళ (మార్చి 16) తెల్లవారుజామున ఉదయపూర్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. మేవార్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, ఉదయపూర్‌లోని సిటీ ప్యాలెస్‌లో చికిత్స పొందారు. అరవింద్ సింగ్ మేవార్ మహారాణా భగవత్ సింగ్ మేవార్ మరియు సుశీలా కుమారి మేవార్ దంపతుల చిన్న కుమారుడు. అరవింద్‌కు భార్య విజయ్‌రాజ్ కుమారి, కుమారుడు లక్ష్యరాజ్ సింగ్ మేవార్, కుమార్తెలు భార్గవి కుమారి మేవార్, పద్మజ కుమారి పర్మార్ ఉన్నారు. అరవింద్ సింగ్ మేవార్ మృతికి గౌరవ సూచకంగా ఉదయపూర్‌లోని సిటీ ప్యాలెల్ను ఆది, సోమవారాల్లో మూసివేయబడుతుంది.మేవార్ అజ్మీర్‌లోని ప్రతిష్టాత్మక మాయో కళాశాలలో విద్యనభ్యసించారు. UK, USAలలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు చేశారు. తదనంతరం వివిధ అంతర్జాతీయ హోటళ్లలో శిక్షణ పొందాడు. ఆసక్తిగల క్రికెటర్ అయిన మేవార్ 1945-46లో రాజస్థాన్ రంజీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించారు. మేవార్ రెండు దశాబ్దాల పాటు క్రికెటర్‌గా కెరీర్‌ను కొనసాగించాడు. మేవార్ ప్రొఫెషనల్ పోలో ఆటగాడు కూడా. UKలో అతను కేంబ్రిడ్జ్ మరియు న్యూమార్కెట్ పోలో క్లబ్లో 'ది ఉదయపూర్ కప్'ను స్థాపించాడు. 1991లో మేవార్ పోలో జట్టు 61వ కావల్రీ ఆటగాళ్లను ఓడించి ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ కప్‌ను కైవసం చేసుకుంది.ఆసక్తిగల పైలట్ కూడా అయిన మేవార్.. మైక్రోలైట్ విమానంలో భారతదేశం అంతటా సోలో విమానాలు నడిపారు. మేవార్ ఉదయపూర్‌లోని మహారాణా ఆఫ్ మేవార్ ఛారిటబుల్ ఫౌండేషన్‌కు ఛైర్మన్ మరియు మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు. -
పాక్ ప్లేయర్లకు జరిమానా
గత కొంతకాలంగా పాకిస్తాన్ క్రికెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ మధ్య కాలంలో ఏం చేసినా ఆ జట్టుకు కలిసి రావట్లేదు. తాజాగా స్వదేశంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ ఘోర పరాభవం ఎదుర్కొంది. సొంతగడ్డపై జరిగిన టోర్నీలో ఆ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా, గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన పాక్‌కు ఇది పెద్ద అవమానం. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు స్వదేశంలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లోనూ పాక్‌కు పరాభవం ఎదురైంది. న్యూజిలాండ్, సౌతాఫ్రికా పాల్గొన్న ఈ టోర్నీలోనూ పాక్ ఓటమిపాలైంది. ఇన్ని ఘెర అవమానాల తర్వాత పాక్ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌కు బయల్దేరనుంది. ఈ పర్యటనలో పాక్ న్యూజిలాండ్‌తో 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. మార్చి 16న తొలి టీ20 జరుగనుంది. ఆతర్వాత మార్చి 18, 21, 23, 26 తేదీల్లో మిగతా మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం మార్చి 29న వన్డే సిరీస్ మొదలవుతుంది. ఈ సిరీస్‌లో మ్యాచ్‌లు మార్చి 29, ఏప్రిల్ 2, ఏప్రిల్ 5 తేదీల్లో జరుగనున్నాయి.పాక్ ఆటగాళ్లకు జరిమానాఇదిలా ఉంటే, ఆటగాళ్ల ప్రదర్శనను పెంపొందించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కఠినమైన క్రమశిక్షణా చర్యలు అమలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించిన పలువురు పాక్ ఆటగాళ్లపై పీసీబీ కొరడా ఝులిపించినట్లు సమాచారం. గతేడాది చివర్లో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ మొదలుకుని తాజాగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ వరకు రూల్స్ అతిక్రమించిన పాక్ ఆటగాళ్లకు జరిమానా విధించారని తెలుస్తుంది. జరిమానాల రూపంలో పాక్ క్రికెట్ బోర్డు దాదాపు 3.3 మిలియన్ రూపాయలు వసూలు చేసిందని సమాచారం. జరిమానా పడిన ఆటగాళ్లలో సల్మాన్ అఘా, సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, అమీర్ జమాల్, సుఫీయాన్ ముఖీమ్, ఉస్మాన్ ఖాన్, అబ్బాస్ అఫ్రిది ఉన్నట్లు సమాచారం.ఓ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా క్యాప్‌పై 804 అంకెను ముద్రించుకున్నందుకు అమీర్ జమాల్‌కు 1.4 మిలియన్ రూపాయలు..గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో హోటల్ రూమ్‌కు లేట్‌గా వచ్చినందుకు సల్మాన్ అఘా, సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్‌కు 5 లక్షల రూపాయలు..సౌతాఫ్రికా పర్యటనలో హోటల్‌కు లేట్‌గా వచ్చినందుకు సుఫీయాన్ ముఖీమ్, ఉస్మాన్ ఖాన్, అబ్బాస్ అఫ్రిదికి 200 డాలర్ల జరిమానాను విధించినట్లు పలు క్రికెట్ వెబ్సైట్లు వెల్లడించాయి.న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ కోసం పాక్ జట్టు: ఒమెయిర్ యూసఫ్, అబ్దుల్ సమద్, హసన్ నవాజ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అఘా (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, జహన్దాద్ ఖాన్, మొహమ్మద్ హరీస్, ఉస్మాన్ ఖాన్, షాహీన్ అఫ్రిది, అబ్బాస్ అఫ్రిది, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్, సూఫియాన్ ముఖీమ్, మొహమ్మద్ అలీన్యూజిలాండ్తో వన్డే సిరీస్ కోసం పాక్ జట్టు: అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హాక్, ఖుష్దిల్ షా, బాబర్ ఆజమ్, తయ్యబ్ తాహిర్, ఇర్ఫాన్ ఖాన్, సల్మాన్ అఘా, ఫహీమ్ అష్రాఫ్, మహ్మద్ రిజ్వాన్, అబ్రార్ అహ్మద్, అకీఫ్ జావిద్, మొహమ్మద్ ఆలీ, మహ్మద్ వసీం జూనియర్, నసీం షా, సూఫియాన్ ముఖీమ్పాకిస్తాన్తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు: మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్ (4,5 మ్యాచ్‌లకు), మిచ్ హే, మాట్ హెన్రీ (4,5 మ్యాచ్‌లకు), కైల్ జామిసన్ (1, 2, 3 మ్యాచ్‌లకు), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, విల్ ఓ'రూర్కే (1, 2, 3 మ్యాచ్‌లకు), టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధిన్యూజిలాండ్ పర్యటనలో పాక్ షెడ్యూల్..మార్చి 16- తొలి టీ20 (క్రైస్ట్‌చర్చ్)మార్చి 18- రెండో టీ20 (డునెడిన్)మార్చి 21- మూడో టీ20 (ఆక్లాండ్)మార్చి 23- నాలుగో టీ20 (మౌంట్ మౌంగనూయ్)మార్చి 26- ఐదో టీ20 (వెల్లింగ్టన్)మార్చి 29- తొలి వన్డే (నేపియర్)ఏప్రిల్ 2- రెండో వన్డే (హ్యామిల్టన్)ఏప్రిల్ 5- మూడో వన్డే (మౌంట్ మౌంగనూయ్) -
లెజెండ్స్ లీగ్‌కు మెరుపు ఆరంభం.. శతకాల మోత మోగించిన ప్లేయర్లు
ఏషియన్ లెజెండ్స్ లీగ్ తొలి ఎడిషన్ (2025) నిన్న (మార్చి 10) ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు (ఏషియన్ లయన్స్, శ్రీలంక లయన్స్, ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్, ఇండియన్ రాయల్స్, బంగ్లాదేశ్ టైగర్స్) పాల్గొంటున్నాయి. ఏషియా ప్రాంతానికి చెందిన మాజీ స్టార్ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఇండియన్ రాయల్స్ తరఫున టీమిండియా స్టార్లు శిఖర్ ధవన్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు, మనోజ్ తివారి, మునాఫ్ పటేల్ తదితర స్టార్లు ఆడుతున్నారు. నిన్న జరిగిన టోర్నీ ఓపెనర్‌లో ఏషియన్ స్టార్స్, ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్ తలపడ్డారు. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఏషియన్ స్టార్స్.. ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. షోయబ్ ఖాన్ (63 బంతుల్లో 104 నాటౌట్) మెరుపు శతకంతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అస్గర్ అఫ్ఘాన్ (65) అర్ద సెంచరీతో రాణించాడు.అనంతరం బరిలోకి దిగిన ఏషియన్ స్టార్స్ కెప్టెన్ మెహ్రాన్ ఖాన్ (52 బంతుల్లో 109 నాటౌట్) సునామీ శతకంతో విరుచుకుపడటంతో 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మరో ఎండ్‌లో మెహ్రాన్ ఖాన్‌కు పెద్దగా సపోర్ట్ లేనప్పటికీ.. ఒంటిచేత్తో ఏషియన్ స్టార్స్‌ను గెలిపించాడు. ఏషియన్స్ స్టార్స్ ఇన్నింగ్స్‌లో అంకిత్ నర్వాల్ (39), రాఘవ్ ధావన్ (34 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. నిన్ననే జరగాల్సిన మరో మ్యాచ్ రద్దైంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టైగర్స్, ఇండియన్ రాయల్స్‌తో తలపడాల్సి ఉండింది.ఏషియన్ లెజెండ్స్ లీగ్‌లో ఇండియన్ రాయల్స్ జట్టు..అంబటి రాయుడు, మనోజ్ తివారి, సుబ్రమణ్యం బద్రీనాథ్, ఫయాజ్ ఫజల్, శిఖర్ ధవన్, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, నమన్ ఓఝా, శ్రీవట్స్ గోస్వామి, అనురీత్ సింగ్, మునాఫ్, కరణ్వీర్ సింగ్, బరిందర్ శ్రాన్, షాదాబ్ జకాతి, మన్‌ప్రీత్ గోని, సుదీప్ త్యాగి -
ఇతర దేశాలకు ఆడుతున్న టాప్-10 భారత సంతతి క్రికెటర్లు
భారత సంతతికి చెందిన చాలామంది క్రికెటర్లు ఇతర దేశాలకు ఆడి పేరు ప్రఖ్యాతలు గడించారు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్‌కు ఆడుతున్న భారత సంతతి ఆటగాడు) ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన నేపథ్యంలో భారత సంతతి క్రికెటర్ల ప్రస్తావన వచ్చింది. ఇతర దేశాలకు ఆడిన, ఆడుతున్న భారత సంతతి టాప్-10 క్రికెటర్లపై ఓ లుక్కేద్దాం.1. రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్)2. కేశవ్ మహారాజ్ (సౌతాఫ్రికా)3. ఐష్ సోధి (న్యూజిలాండ్)4. నునీల్ నరైన్ (వెస్టిండీస్)5. రవి బొపారా (ఇంగ్లండ్)6. శివ్‌నరైన్ చంద్రపాల్ (వెస్టిండీస్)7. మాంటి పనేసన్ (ఇంగ్లండ్)8. తేజ నిడమనూరు (నెదర్లాండ్స్)9. మోనాంక్ పటేల్ (యూఎస్ఏ)10. మిలింద్ కుమార్ (యూఎస్ఏ)రచిన్ రవీంద్ర- నవంబర్ 18, 1999న రచిన్ న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్లో బెంగళూరుకు చెందిన దంపతులకు జన్మించాడు. ఐదు సంవత్సరాల వయసులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించిన రచిన్.. తండ్రి రవి కృష్ణమూర్తిచే (మాజీ బెంగళూరు క్లబ్ ఆటగాడు) ప్రభావితం చేయబడ్డాడు. కృష్ణమూర్తి రచిన్ పేరును భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ పేర్లు కలిసొచ్చేలా పెట్టాడు. రచిన్ 2021లో న్యూజిలాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన రచిన్.. అనతికాలంలో స్టార్‌గా ఎదిగాడు.కేశవ్ మహారాజ్- ఫిబ్రవరి 7, 1990న దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జన్మించిన కేశవ్ మహారాజ్ భారతీయ కుటుంబం నుండి వచ్చాడు. కేశవ్ మహారాజ్ పూర్వీకులు ఉత్తరాది ప్రాంతానికి చెందిన వారని తెలుస్తుంది. కేశవ్ 2016లో దక్షిణాఫ్రికా తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. అతికొద్ది కాలంలోనే టాప్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లలో ఒకరిగా మారాడు. దక్షిణాఫ్రికా సాధించిన అనేక టెస్ట్ విజయాలలో మహారాజ్ కీలక పాత్ర పోషించాడు. 2021లో వెస్టిండీస్‌పై మహారాజ్ సాధించిన హ్యాట్రిక్ మరపురానిది.ఐష్ సోధి- ఇందర్బీర్ సింగ్ 'ఇష్' సోధి అక్టోబర్ 31, 1992న పంజాబ్‌లోని లూథియానాలో జన్మించాడు. సోధి తన ప్రారంభ దినాలను న్యూజిలాండ్‌లో గడిపాడు. సోధి 2013లో న్యూజిలాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సోధికి మంచి ప్రదర్శనకారుడిగా పేరుంది. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో సోధి చెలరేగిపోతాడు.సునీల్ నరైన్- 1988, మే 26న ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన సునీల్ నరైన్ మిస్టరీ స్పిన్ బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. 2011లో విండీస్ తరపున అరంగేట్రం చేసిన నరైన్.. 2012 టీ20 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. నరైన్ విశ్వవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రైవేట్ లీగ్‌ల్లో ఆడతాడు.రవి బొపారా- మే 4, 1985న లండన్‌లో భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన రవి బొపారా.. అన్ని ఫార్మాట్లలోనూ ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2007లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన బొపారా.. తన స్టైలిష్ బ్యాటింగ్‌తో పాటు మీడియం పేస్ బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. వన్డే, టెస్ట్‌ల్లో బొపారాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది.శివ్‌నరైన్ చంద్రపాల్- వెస్టిండీస్ క్రికెట్లో అత్యంత నమ్మకమైన బ్యాటర్లలో ఒకరైన శివ్‌నరైన్ చంద్రపాల్ ఆగస్టు 16, 1974న గయానాలోని ఒక భారతీయ కుటుంబంలో జన్మించాడు. 1994లో విండీస్ తరఫున అరంగేట్రం చేసిన చంద్రపాల్.. తన విలక్షణమైన బ్యాటింగ్ భంగిమతో ప్రసిద్ది చెందాడు. చంద్రపాల్ తన కెరీర్లో 20000కు పైగా పరుగులు సాధించాడు. ఘనమైన విండీస్ క్రికెట్ చరిత్రలో చంద్రపాల్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మాంటీ పనేసర్- మద్సుదేన్ సింగ్ 'మాంటీ' పనేసర్ 1982 ఏప్రిల్ 25న ఇంగ్లండ్‌లోని లూటన్‌లో పంజాబీ దంపతులకు జన్మించాడు. మాంటీ 2006లో ఇంగ్లండ్ తరఫున టెస్ట అరంగేట్రం చేశాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన మాంటీ ఇంగ్లండ్ తరఫున టెస్ట్‌ల్లో విశేషంగా రాణించాడు. మాంటీ.. ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ గెలుపుల్లో కీలకపాత్ర పోషించాడు.తేజ నిడమనూరు- ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించిన తేజ నిడమనూరు నెదర్లాండ్స్‌కు ఆడుతున్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో తేజ మంచి ప్రదర్శనకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తేజ నెదర్లాండ్స్ గెలిచిన చాలా మ్యాచ్‌ల్లో కీలకపాత్ర పోషించాడు. నెదర్లాండ్స్‌కు రాకముందు తేజ క్రికెట్ అవకాశాల కోసం న్యూజిలాండ్‌లో గడిపాడు. ఆల్‌రౌండర్ అయిన తేజ ఐసీసీ టోర్నీల్లో విశేషంగా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.మోనాంక్ పటేల్- గుజరాత్లో మే 1, 1993న జన్మించిన మోనాంక్ పటేల్ అమెరికాకు వలస వచ్చి అమెరికన్ క్రికెట్లో మంచి పేరు గడించాడు. పటేల్.. యూఎస్ఏ జట్టుకు టాపార్డర్ బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా సేవలందస్తాడు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్, అంతకుముందు జరిగిన మేజర్ లీగ్ క్రికెట్లో మోనాంక్ అద్భుత ప్రదర్శనలు చేశాడు.మిలింద్ కుమార్- ఫిబ్రవరి 15, 1991న ఢిల్లీలో జన్మించిన మిలింద్ కుమార్ భారత దేశవాళీ క్రికెట్లో చాలా పరుగులు చేశాడు. తదనంతరం అతను అమెరికాకు మకాం మార్చి అమెరికా జాతీయ జట్టు తరపున ఆడటం ప్రారంభించాడు. మిలింద్ అనతి కాలంలోనే యూఎస్ఏ జట్టులో కీలక ఆటగాడిగా స్థిరపడ్డాడు. -
CT 2025 Final: నాలుగు క్యాచ్‌లు జారవిడిచిన టీమిండియా ఫీల్డర్లు.. మూల్యం తప్పదా..?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో ఇవాళ (మార్చి 9) భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తుండటంతో న్యూజిలాండ్ 196 పరుగులకు (44 ఓవర్లలో) సగం వికెట్లు కోల్పోయింది. డారిల్ మిచెల్ (51), మైఖేల్ బ్రేస్‌వెల్ (21) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా ఓ వికెట్ దక్కించుకున్నాడు. వరుణ్, కుల్దీప్ న్యూజిలాండ్ ఆటగాళ్లు భాగస్వామ్యాలు నెలకొల్పుతున్న సమయంలో వికెట్లు తీసి భారత్‌ను తిరిగి ఆటలోకి తెచ్చారు. భారత్‌కు తొలి ఫలితం వరుణ్ చక్రవర్తి అందించాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ చివరి బంతికి వరుణ్ విల్ యంగ్‌ను (15) ఎల్బీడబ్ల్యూ చేశాడు. అనంతరం కుల్దీప్ తన మొదటి బంతికే ఇన్ ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను (37) క్లీన్ బౌల్డ్ చేశాడు. కొద్ది సేపటికే కుల్దీప్ మరో అద్భుత బంతితో స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌ను (11) క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు. మిచెల్, లాథమ్ క్రీజ్‌లో కుదురుకుంటుండగా.. జడేజా లాథమ్‌ను (14) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మిచెల్‌తో కలిసి 50 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి ప్రమాదకరంగా కనిపిస్తున్న ఫిలిప్స్‌ను (34) వరుణ్ చక్రవర్తి మరో అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు.ఇంతవరకు బాగానే ఉన్నా, ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్ల ప్రదర్శన చాలా దారుణంగా ఉండింది. 40 ఓవర్లలోపే భారత ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు డ్రాప్ చేశారు. తొలుత రచిన్ రవీంద్ర అందించిన రెండు క్యాచ్‌లను శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీ నేలపాలు చేశారు. అయితే అదృష్టవశాత్తు రచిన్ ఔట్ కావడంతో భారత ఆటగాళ్లు ఊపిరిపీల్చుకున్నారు. తర్వాత భారత ఫీల్డర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మరో రెండు క్యాచ్‌లు జారవిడిచారు. డారిల్ మిచెల్ క్యాచ్‌ను రోహిత్.. ఫిలిప్స్ క్యాచ్‌ను గిల్ వదిలేశారు. ప్రమాదకరంగా కనిపిస్తున్న ఫిలిప్స్ ఔటయ్యాడు కానీ మరో డేంజర్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఇంకా క్రీజ్‌లోనే ఉన్నాడు. మిచెల్ డ్రాప్ క్యాచ్‌కు టీమిండియా మూల్యం చెల్లించకుంటుందేమో వేచి చూడాలి. -
పాపం క్లాసెన్.. ఎక్కడికి వెళ్లినా చేదు అనుభవమే..!
అంతర్జాతీయ క్రికెట్లో సౌతాఫ్రికా ఎంత దురదృష్టమైన జట్టో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఐసీసీ టోర్నీలో ఈ జట్టు దురదృష్టం పతాకస్థాయిలో ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ (1991) ఇచ్చిన నాటి నుంచి సౌతాఫ్రికా ఒకే ఒక ఐసీసీ టైటిల్ (1998 ఛాంపియన్స్ ట్రోఫీ) గెలిచింది. టన్నుల కొద్ది టాలెంట్ ఉన్నా ఈ జట్టుకు అదృష్టం కలిసి రాదు. ఐసీసీ టోర్నీల్లో మొదటి దశలో రెచ్చిపోయే సౌతాఫ్రికన్లు నాకౌట్ మ్యాచ్‌లు వచ్చే సరికి తేలిపోతారు. నాకౌట్ మ్యాచ్‌ల్లో.. ముఖ్యంగా సెమీఫైనల్స్‌లో సౌతాఫ్రికాను ఏదో ఒక రూపంలో దురదృష్టం వెంటాడుతుంది. తాజాగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనలే ఇందుకు నిదర్శనం.కాగా, సౌతాఫ్రికా దురదృష్టాన్ని ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ కొనసాగిస్తున్నాడు. క్లాసెన్ ఎక్కడ నాకౌట్ మ్యాచ్‌లు ఆడినా అతని జట్టు ఓటమిపాలవుతుంది. క్లాసెన్ నాకౌట్ ఫోబియా ఒక్క సౌతాఫ్రికాకే పరిమితం కాలేదు. ప్రైవేట్ లీగ్‌ల్లోనూ క్లాసెన్‌ను నాకౌట్ బూచి వెంటాడుతుంది. ప్రైవేట్ లీగ్‌ల్లో క్లాసెన్ ఆడిన మూడు నాకౌట్ మ్యాచ్‌ల్లో అతను ప్రాతినిథ్యం వహించిన జట్లు ఓడాయి. 2023 మేజర్ లీగ్ క్రికెట్ ఫైనల్లో క్లాసెన్ ప్రాతినిత్యం వహించిన సియాటిల్ ఓర్కాస్ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ చేతుల్లో ఓడింది.2024 సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫైనల్లో క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన డర్బన్ సూపర్ జెయింట్స్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ చేతుల్లో ఓటమిపాలైంది. 2024 ఐపీఎల్ ఫైనల్లో క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కేకేఆర్ చేతుల్లో పరాజయంపాలైంది.తొలి నాకౌట్ నుంచే..క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన తొలి ఐసీసీ నాకౌట్లోనే సౌతాఫ్రికా ఓటమిపాలైంది. 2023 వన్డే సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియా చేతిలో చిత్తైంది. క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన రెండో ఐసీసీ నాకౌట్లో సౌతాఫ్రికా గుండెబద్దలైంది. 2024 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో ఆ జట్టు భారత్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. తాజాగా క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన మూడో ఐసీసీ నాకౌట్లో కూడా సౌతాఫ్రికాకు చేదు అనుభవమే మిగిలింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్ చిత్తుగా ఓడించింది. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఇన్ని పరాభవాలు ఎదురుకావడంతో క్లాసెన్‌పై క్రికెట్ అభిమానులు జాలి చూపిస్తున్నారు. పాపం క్లాసెన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో సౌతాఫ్రికా గ్రూప్ దశలో అదిరిపోయే ప్రదర్శనలు చేసింది. ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్‌పై ఘన విజయాలు సాధించింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అయినప్పటికీ సౌతాఫ్రికా గ్రూప్ టాపర్‌గా సెమీస్‌కు చేరింది. సెమీస్‌లోనూ మంచి ప్రదర్శనే చేసినప్పటికీ న్యూజిలాండ్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ సూపర్ సెంచరీలు చేసి సౌతాఫ్రికా చేతి నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. సెమీస్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్ ఫైనల్లో భారత్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. -
వీరేంద్ర సెహ్వాగ్ సోదరుడు అరెస్ట్
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోదరుడు వినోద్ సెహ్వాగ్ అరెస్ట్ అయ్యాడు. చెక్ బౌన్స్ కేసులో చండీఘడ్ పోలీసులు వినోద్ సెహ్వాగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అనేక మార్లు విచారణకు హాజరుకాకపోవడంతో 2023లో స్థానిక కోర్టు వినోద్ సెహ్వాగ్‌తో పాటు మరో ఇద్దరిని దోషులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే వినోద్ అరెస్ట్ జరిగింది. అరెస్ట్ అనంతరం వినోద్ తరఫు న్యాయవాది సెషన్స్ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను పోలీసులు వ్యతిరేకించారు. దీంతో దీనిపై విచారణ మార్చి 10కి వాయిదా పడింది. అప్పటివరకు వినోద్ సెహ్వాగ్ పోలీసుల కస్టడీలోనే ఉండనున్నాడు.అసలేం జరిగిందంటే.. క్సాల్టా ఫుడ్ అండ్ బేవరేజెస్ కంపెనీలో వినోద్ సెహ్వాగ్‌తో పాటు విష్ణు మిట్టల్, సుధీర్ మల్హోత్రా డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ కంపెనీ 2018లో శ్రీ నైనా ప్లాస్టిక్స్ నుండి రూ. 7 కోట్ల విలువైన వస్తువులు కొనుగోలు చేసింది. చెల్లింపుగా, కంపెనీ రూ. కోటి చొప్పున ఏడు వేర్వేరు చెక్కులను జారీ చేసింది.అయితే అకౌంట్లో సరిపడా నిధులు లేని కారణంగా అన్ని చెక్కులు బౌన్స్ అయ్యాయి. పలు ఫాలోఅప్‌ల అనంతరం శ్రీ నైనా ప్లాస్టిక్స్ అధినేత కృష్ణణ్ మోహన్ ఖన్నా కోర్టును ఆశ్రయించారు. స్థానిక కోర్టు క్సాల్టా ఫుడ్ అండ్ బేవరేజెస్ డైరెక్టర్లైన వినోద్ సెహ్వాగ్, విష్ణు మిట్టల్, సుధీర్ మల్హోత్రాను నిందితులుగా ప్రకటించింది. ఈ తీర్పుపై వినోద్ సెహ్వాగ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.ఇదిలా ఉంటే, వీరేంద్ర సెహ్వాగ్‌కు సంబంధించి ఇటీవలికాలంలో వచ్చిన రెండో వార్త ఇది. వీరూ అతని భార్యతో విడాకులు తీసుకోనున్నాడని కొద్ది రోజుల కిందట సోషల్‌మీడియా కోడై కూసింది. ఇన్‌స్టాలో వీరూ, అతని సతీమణి ఇద్దరు అన్‌ఫాలో చేయడంతో ఈ ప్రచారం మొదలైంది. వీరూ గత కొద్ది రోజులుగా తన భార్యను విడిచి పెట్టి, తన ఇద్దరు పిల్లలతో పాటు వేరుగా ఉంటున్నట్లు తెలుస్తుంది. తరుచూ పుణ్యక్షేత్రాలు తిరిగే వీరూ ఈ మధ్యకాలంలో ఒంటరిగా ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు.46 ఏళ్ల వీరేంద్ర సెహ్వాగ్ 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అప్పటినుంచి కామెంటేటర్‌గా, విశ్లేషకుడిగా క్రికెట్‌తో సంబంధం కలిగి ఉంటున్నాడు. సెహ్వాగ్‌కు ఇద్దరు కొడుకులు. ఈ ఇద్దరూ క్రికెటర్లే కావడం విశేషం. సెహ్వాగ్ పెద్ద కొడుకు ఇటీవలికాలంలో జూనియర్ క్రికెట్లో సత్తా చాటి వార్తల్లో నిలిచాడు. సెహ్వాగ్‌కు టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌గా పేరుండేది. సెహ్వాగ్ భారత్ తరఫున టెస్ట్‌ల్లో తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. సెహ్వాగ్ తన కెరీర్లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేశాడు. కేవలం బ్రాడ్‌మన్, గేల్, లారా మాత్రమే ఈ ఘనత సాధించారు. -
ఐపీఎల్లో కొత్త రూల్స్
ఐపీఎల్-2025 (IPL 2025) ప్రారంభానికి ముందు బీసీసీఐ (BCCI) కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు సంబంధించి నిబంధనలను కఠినతరం చేసింది. ఆటగాళ్లు జట్టు బస్సులో ప్రయాణించడం తప్పనిసరి చేసింది. గతంలో మాదిరి ఇష్టం వచ్చినన్ని సార్లు ప్రాక్టీస్ సెషన్స్‌ను నిర్వహించుకునే వెసులుబాటును నిషేధించింది. ప్రాక్టీస్ సెషన్లకు సంబంధించి పరిమితులు విధించింది.కొత్త రూల్స్ ప్రకారం ఒక్కో జట్టు ఏడు ప్రాక్టీస్ సెషన్స్ మాత్రమే నిర్వహించుకోవాలని తెలిపింది. మ్యాచ్‌లకు ముందు అలాగే మ్యాచ్‌లు జరిగే సమయంలో PMOA ప్రాంతాల్లో (ఆటగాళ్లు మరియు మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా) ఆటగాళ్ల కుటుంబ సభ్యులు ఉండటాన్ని నిషేధించింది. ప్రాక్టీస్ రోజులలో డ్రెస్సింగ్ రూమ్‌లోకి మరియు మైదానంలోకి కేవలం గుర్తింపు పొందిన సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుంది.ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు ఆతిథ్య ప్రాంతం నుండి జట్టు ప్రాక్టీస్‌ను వీక్షించే వెసులుబాటును కల్పించింది. మ్యాచ్ రోజులలో ఆటగాళ్లకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించలేమని తెలిపింది. ఆటగాళ్ళు కనీసం రెండు ఓవర్ల పాటు ఆరెంజ్ మరియు పర్పుల్ క్యాప్‌లను ధరించాలని పేర్కొంది. ప్రెజెంటేషన్ సెర్మనీలో ఆటగాళ్ళు స్లీవ్‌లెస్ జెర్సీలు ధరించడాన్ని నిషేధించింది.ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా అమల్లోకి రానున్న మార్పులు..1. ప్రాక్టీస్ ఏరియాలో 2 నెట్లు మరియు రేంజ్ హిట్టింగ్ చేయడానికి ప్రధాన స్క్వేర్‌లో ఓ సైడ్ వికెట్ లభిస్తాయి. ముంబై లాంటి వేదికల్లో రెండు జట్లు ఒకే సమయంలో ప్రాక్టీస్ చేస్తుంటే, ఒక్కో జట్టుకు రెండు వికెట్లు లభిస్తాయి.2. ఓపెన్ నెట్లు అనుమతించబడవు.3. రెండు జట్లలో ఓ జట్టు ప్రాక్టీస్‌ను ముందుగానే ముగిస్తే, రెండో జట్టు ప్రాక్టీస్ కోసం ఆ వికెట్లను ఉపయోగించకూడదు.4. మ్యాచ్ రోజులలో ఎటువంటి ప్రాక్టీస్‌కు అనుమతించబడదు.5. ప్రధాన స్క్వేర్‌లో మ్యాచ్ రోజున ఫిట్నెస్ పరీక్ష జరగదు.6. ప్రాక్టీస్ రోజులలో డ్రెస్సింగ్ రూమ్ మరియు మైదానంలోకి గుర్తింపు పొందిన సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారు.7. ఆటగాళ్ళు ప్రాక్టీస్ కోసం వచ్చే సమయంలో జట్టు బస్సును మాత్రమే ఉపయోగించాలి.8. ఆటగాళ్ళు మరియు సహాయక సిబ్బంది LED బోర్డుల ముందు కూర్చోకూడదు.9. మ్యాచ్ సమయంలో ఆటగాళ్ళు కనీసం రెండు ఓవర్ల పాటు ఆరెంజ్ మరియు పర్పుల్ క్యాప్ ధరించాలి.10. ప్రెజెంటేషన్ సెర్మనీలో స్లీవ్‌లెస్ జెర్సీలు అనుమతించబడవు.11. గత సీజన్ల తరహాలోనే మ్యాచ్ రోజులలో జట్టు వైద్యుడుతో సహా 12 మంది గుర్తింపు పొందిన సహాయక సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారు. -
ఈ ఏడాది మరో మూడు భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌లు
భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌లు ఈ ఏడాది మరిన్ని జరిగే అవకాశం ఉంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్‌ను షెడ్యూల్ చేసింది. ఈసారి ఈ కాంటినెంటల్ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. ఇందులో మొత్తం 19 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో భారత్, పాక్ మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. సెప్టెంబర్ రెండు, నాలుగు వారాల మధ్యలో ఈ టోర్నీ జరుగుతుంది.ఈ టోర్నీ మొదట భారత్‌కు కేటాయించబడింది. అయితే, భారత్-పాక్‌ల మధ్య సత్సంబంధాలు లేని కారణంగా ఈ టోర్నీని తటస్థ వేదికపై నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. ప్రస్తుతానికి వేదిక ఖరారు కానప్పటికీ.. యూఏఈ లేదా శ్రీలంకలో టోర్నీ నిర్వహించే అవకాశం ఉంది. ఈ టోర్నీ 2025 ఎడిషన్‌లో భారత్, పాక్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, ఒమన్, హాంకాంగ్ పాల్గొంటాయి. ఉపఖండం నుండి నేపాల్ ఒక్కటే ఈ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది.గత ఎడిషన్లోలాగా, ఈ ఏడాది ఆసియా కప్‌లో కూడా ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించబడతాయి. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉండటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు సూపర్ ఫోర్ దశకు చేరుకుంటాయి. ఈ దశలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్‌కు చేరతాయి. భారత్, పాకిస్తాన్ గ్రూప్ దశలో ఓసారి.. సూపర్ ఫోర్ రౌండ్లో మరోసారి.. ఫైనల్లో మూడోసారి తలపడే అవకాశం ఉంది.కాగా, 2031లో ముగిసే ప్రస్తుత సైకిల్లో నాలుగు ఆసియా కప్‌లు జరుగనున్నాయి. 2025 ఎడిషన్ (19 మ్యాచ్‌లు) తర్వాత, 2027 ఎడిషన్ బంగ్లాదేశ్‌లో (13 మ్యాచ్‌లు) వన్డే ఫార్మాట్లో జరుగుతుంది. ఆతర్వాత పీసీబీ ఆతిథ్యం ఇచ్చే టోర్నీ టీ20 ఫార్మాట్లో (19 మ్యాచ్‌లు) జరుగుతుంది. చివరిగా, 2031 ఎడిషన్ వన్డే ఫార్మాట్లో (13 మ్యాచ్‌లు) శ్రీలంకలో జరుగుతుంది. -
కొడుకుతో కలిసి బరిలోకి దిగిన రాహుల్ ద్రవిడ్.. తండ్రి విఫలం.. కొడుకు హాఫ్ సెంచరీ
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ 12 ఏళ్ల తర్వాత క్లబ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. చిన్న కొడుకు అన్వయ్‌తో కలిసి నసుర్ మెమొరియల్ షీల్డ్ టోర్నీలో పాల్గొన్నాడు. ఈ టోర్నీలో ద్రవిడ్ విజయా క్రికెట్ క్లబ్‌కు (మాలుర్) ప్రాతినిథ్యం వహించాడు. యంగ్ లయన్స్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన ద్రవిడ్ 8 బంతుల్లో బౌండరీ సాయంతో 10 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్ విఫలమైనా కొడుకు అన్వయ్ ద్రవిడ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన అన్వయ్.. 58 బంతుల్లో 8 బౌండరీల సాయంతో 60 పరుగులు చేశాడు. రాహుల్-అన్వయ్ కొద్ది సేపు కలిసి బ్యాటింగ్ చేశారు. వీరిద్దరు 17 బంతుల్లో 15 పరుగులు జోడించారు. క్రికెట్ చరిత్రలో తండ్రి కొడుకులు కలిసి ఆడటం చాలా అరుదుగా జరిగింది.కలిసి క్రికెట్ ఆడిన కొంతమంది తండ్రి కొడుకులు..డబ్ల్యూజీ గ్రేస్-గ్రేస్ జూనియర్లాలా అమర్నాథ్-సురిందర్ అమర్నాథ్డెన్నిస్ లిల్లీ-ఆడమ్ లిల్లీడెనిస్ స్ట్రీక్- హీథ్ స్ట్రీక్శివ్నరైన్ చంద్రపాల్-తేజ్ నరైన్ చంద్రపాల్ఇయాన్ బోథమ్-లియామ్ బోథమ్ఇలా చేయడం ద్రవిడ్‌కు కొత్తేమీ కాదు..!రిటైర్మెంట్ తర్వాత క్లబ్ క్రికెట్ ఆడటం ద్రవిడ్‌కు ఇది కొత్తేమీ కాదు. గతంలో పలుమార్లు తన చిన్ననాటి క్లబ్ అయిన బెంగళూరు యునైటెడ్ క్రికెట్ క్లబ్‌కు ఆడాడు. ఈ జట్టుకు ఆడుతూ ద్రవిడ్ ఓ సెంచరీ కూడా చేశాడు.ద్రవిడ్ పెద్ద కొడుకు కూడా క్రికెటరే..!ద్రవిడ్ చిన్న పెద్ద కొడుకు సమిత్ ద్రవిడ్ కూడా క్రికెటరే. గతేడాది ఆగస్ట్‌లో సమిత్ భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. గతేడాది మహారాజా టీ20 టోర్నీలోనే సమిత్ పాల్గొన్నాడు.ఇటీవలే బెంగళూరుకు వచ్చిన ద్రవిడ్రాహుల్ ద్రవిడ్ ఇటీవలే తన హో సిటీ బెంగళూరుకు వచ్చాడు. బెంగళూరుకు రాక ముందు ద్రవిడ్ గౌహతిలో జరిగిన రాజస్థాన్ రాయల్స్ ప్రీ సీజన్ క్యాంప్‌లో పాల్గొన్నాడు. ద్రవిడ్ రాయల్స్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సమిత్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో స్వప్నిల్ అనే ఆటగాడు సుడిగాలి శతంకంతో విజృంభించడంతో విజయ క్రికెట్ క్లబ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. స్వప్నిల్ 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేశాడు. యంగ్ లయన్స్ బౌలర్లలో ఆధిత్య నాలుగు వికెట్లు పడగొట్టాడు. -
కేరళ కల సాకారం.. కష్టానికి తోడైన అదృష్టం.. తొలిసారి రంజీ ఫైనల్లోకి ప్రవేశం
‘ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది’ అనే నానుడి కేరళ జట్టుకు సరిగ్గా సరిపోతుంది. 68 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ... 352 మ్యాచ్‌ల పోరాటం అనంతరం కేరళ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీలో ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్లో అద్వితీయ ప్రదర్శన కనబరుస్తున్న కేరళ జట్టు... తీవ్ర ఉత్కంఠ మధ్య మాజీ చాంపియన్ గుజరాత్‌తో జరిగిన సెమీఫైనల్లో పైచేయి సాధించి తొలిసారి తుదిపోరుకు చేరింది. క్వార్టర్ ఫైనల్లో ఒక్క పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో జమ్మూకశ్మీర్‌ను వెనక్కి నెట్టిన కేరళ... ఇప్పుడు సెమీఫైనల్లో గుజరాత్‌పై రెండు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముందంజ వేసింది. ఒక్క పరుగే కదా అని తేలికగా తీసుకుంటే ... ఎలాంటి ఫలితాలు వస్తాయో ప్రత్యర్థికి రుచి చూపింది. ఆరు దశాబ్దాల పోరాటం అనంతరం దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీ ఫైనల్‌కు చేరిన కేరళ జట్టు ప్రస్థానంపై ప్రత్యేక కథనం.. సుదీర్ఘ కాలంగా రంజీ ట్రోఫీ ఆడుతున్న కేరళ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయింది. ముంబై, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, బెంగాల్ మాదిరిగా తమ జట్టులో స్టార్ ప్లేయర్లు లేకపోయినా... నిలకడ కనబరుస్తున్నప్పటికీ ఆ జట్టు తుదిపోరుకు మాత్రం అర్హత సాధించలేదు. తాజా సీజన్లో అసాధారణ పోరాటాలు, అనూహ్య ఫలితాలతో ఎట్టకేలకు కేరళ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ చేరి చరిత్ర సృష్టించింది. జమ్మూ కశ్మీర్‌తో హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో 1 పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సెమీఫైనల్లో అడుగుపెట్టిన కేరళ జట్టు... సెమీస్‌లో మాజీ చాంపియన్ గుజరాత్‌పై 2 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో తమ చిరకాల కల నెరవేర్చుకుంది.నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్ చివరి రోజు కేరళ జట్టు అద్భుతమే చేసింది. చేతిలో 3 వికెట్లు ఉన్న గుజరాత్ జట్టు తుదిపోరుకు అర్హత సాధించాలంటే మరో 29 పరుగులు చేయాల్సిన దశలో తొలి ఇన్నింగ్స్ కొనసాగించగా... కేరళ జట్టు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టిపడేసింది. అప్పటికే క్రీజులో పాతుకుపోయి మొండిగా పోరాడుతున్న గుజరాత్ బ్యాటర్లు జైమీత్ పటేల్, సిద్ధార్థ్ దేశాయ్‌లను కేరళ బౌలర్ ఆదిత్య వెనక్కి పంపాడు. ఇంకేముంది మరో వికెట్ తీస్తే చాలు కేరళ తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ చేరడం ఖాయమే అనుకుంటే... ఆఖరి వికెట్‌కు అర్జాన్ నాగ్వస్వల్లా, ప్రియజీత్ సింగ్ జడేజా మొండిగా పోరాడారు.పది ఓవర్లకు పైగా క్రీజులో నిలిచిన ఈ జంటను చూస్తే ఇక మ్యాచ్ కేరళ చేజారినట్లే అనుకుంటున్న తరుణంలో అర్జాన్ కొట్టిన షాట్ కేరళకు కలిసొచ్చింది. ఆదిత్య వేసిన బంతిని అర్జాన్ బలంగా బాదే ప్రయత్నం చేశాడు. బంతి షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సల్మాన్ నిజార్ హెల్మెట్‌కు తాకి గాల్లోకి లేచి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న కెప్టెన్ సచిన్ బేబీ చేతిలో పడింది. అంతే కేరళ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. స్టార్లు లేకుండానే... స్టార్ ఆటగాడు సంజూ సామ్సన్ భారత జట్టులో ఉండగా... అనుభవజ్ఞులైన విష్ణు వినోద్, బాబా అపరాజిత్ వంటి వాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. అయినా ఈ సీజన్లో కేరళ జట్టు స్ఫూర్తివంతమైన ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా మిడిలార్డర్లో కెప్టెన్ సచిన్ బేబీతో పాటు సీనియర్ ప్లేయర్ జలజ్ సక్సేనా... యువ ఆటగాళ్లు మొహమ్మద్ అజహరుద్దీన్, సల్మాన్ నిజార్ అసమాన పోరాటం కనబర్చారు.జమ్మూ కశ్మీర్‌తో క్వార్టర్స్ పోరులో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసేందుకు సల్మాన్, అజహరుద్దీన్ కనబర్చిన తెగువను ఎంత పొగిడినా తక్కువే. 40 ఓవర్లకు పైగా జమ్మూ బౌలర్లను కాచుకున్న ఈ జంట వికెట్ ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించి తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఒక్క పరుగు ఆధిక్యంతో సెమీఫైనల్‌కు చేరింది.తాజాగా గుజరాత్‌తో సెమీస్‌లోనూ తొలి ఇన్నింగ్స్‌లో కేరళ బ్యాటర్లు అసాధరణ ప్రదర్శన కనబర్చారు. సచిన్ బేబీ 195 బంతుల్లో 69 పరుగులు, జలజ్ సక్సేనా 83 బంతుల్లో 30 పరుగులు, అజహరుద్దీన్ 341 బంతుల్లో 177 పరుగులు, సల్మాన్ నిజార్ 202 బంతుల్లో 52 పరుగులు చేసి గుజరాత్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ముందు నుంచే చక్కటి గేమ్ ప్లాన్‌తో మైదానంలో అడుగుపెట్టిన కేరళకు చివర్లో అదృష్టం కూడా తోడవడంతో చక్కటి విజయంతో తొలిసారి రంజీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ టోర్నీ చరిత్రలో కేరళ జట్టు ఇప్పటి వరకు అత్యుత్తమంగా 2018–19 సీజన్లో సెమీఫైనల్‌కు చేరింది.నిరీక్షణకు తెరదించుతూ.. తొమ్మిది దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న రంజీ ట్రోఫీలో కేరళ జట్టు 1957లో అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి ఒక్కటంటే ఒక్కసారి కూడా ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఫుట్‌బాల్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే కేరళ వాసులు... క్రికెట్‌ను పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ గత రెండు దశాబ్దాల్లో కేరళ క్రికెట్లో అనూహ్య మార్పు వచ్చింది. 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన శ్రీశాంత్ స్ఫూర్తితో మరెందరో ఆటగాళ్లు క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నారు.అందుకు తగ్గట్లే గత కొన్నేళ్లుగా కేరళలో క్రీడా మౌలిక వసతులు మరింత మెరుగు పడటంతో ప్రతిభావంతులు వెలుగులోకి రావడం మొదలైంది. అయితే ఇది ఒక్క రోజులో సాధ్యమైంది కాదు. దీని వెనక ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉంది. అందుకే శుక్రవారం సెమీస్‌లో కేరళ జట్టు విజయానికి చేరువవుతున్న సమయంలో ప్రసార మాధ్యమాల్లో వీక్షకుల సంఖ్య ఒక్కసారిగా లక్షల్లో పెరిగింది. ప్రతిష్టాత్మక టోర్నీలో కేరళ టీమ్ ఫైనల్‌కు చేరగానే సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు... తామే గెలిచినంతగా లీనమైపోయి జట్టును అభినందనల్లో ముంచెత్తారు. మౌలిక వసతుల్లో భేష్.. సాధారణంగా అధిక వర్షపాతం నమోదయ్యే కేరళలో ఒకప్పుడు నిరంతరం అవుట్డోర్ ప్రాక్టీస్ చేయడం కూడా కష్టతరంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఆ రాష్ట్ర వ్యాప్తంగా 17 ఫస్ట్‌క్లాస్ మైదానాలు అందుబాటులోకి వచ్చాయంటే కేరళ క్రికెట్లో ఎంత పురోగతి సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ కృషి వల్లే కేవలం పెద్ద నగరాల నుంచే కాకుండా... ద్వితీయ శ్రేణి పట్టణాలకు చెందిన ప్రతిభావంతులైన ఆటగాళ్లు కూడా రంజీ జట్టులో చోటు దక్కించుకోగలుగుతున్నారు.‘ముంబై, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ వంటి ఇతర జట్లతో పోల్చుకుంటే... కేరళ జట్టు ఎంపిక విభిన్నంగా ఉండేది. పరిమితమైన వనరులు మాత్రమే ఉండటంతో అందుబాటులో ఉన్నవాళ్లనే ఎంపిక చేసేవాళ్లం. ముందు ఆ పరిస్థితి మారాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో అకాడమీలను స్థాపించాం. కేవలం ప్లేయర్లకే కాకుండా కోచ్‌లకు కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. మౌలిక వసతులపై ప్రధానంగా దృష్టి పెట్టాం. ఒకప్పుడు వర్షం వస్తే ప్రాక్టీస్ ఆగిపోయేది. ఇప్పుడు ఇండోర్‌లోనూ నెట్స్ ఏర్పాటు చేశాం.2005లో రాష్ట్రంలో ఒక్క మైదానంలో కూడా లేదు. ఇప్పుడు మొత్తం 17 ఫస్ట్‌క్లాస్ గ్రౌండ్లు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో మరే రాష్ట్రంలో లేనంతమంది బీసీసీఐ లెవల్1 కోచ్‌లు కేరళలో ఉన్నారు’ అని బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు మాథ్యూ తెలిపారు.కేరళ క్రికెట్ సంఘం కృషి వల్లే స్వేచ్ఛగా ఆడగలుగుతున్నామని... సెమీఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కించుకున్న అజహరుద్దీన్ వెల్లడించాడు. పరస్పర సహకారం, సమష్టితత్వంతో ముందుకు సాగడం వల్లే మెరుగైన ఫలితాలు వస్తున్నాయని అన్నాడు. ఈనెల 26 నుంచి నాగ్‌పూర్‌లో జరిగే తుది పోరులోనూ కేరళ విజయం సాధిస్తే 10 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ చాంపియన్‌గా నిలిచిన దక్షిణాది జట్టుగా నిలుస్తుంది... ఆల్ ద బెస్ట్ కేరళ..! -
జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకున్న ఐర్లాండ్
తొలి వన్డేలో జింబాబ్వే చేతిలో ఎదురైన పరాభవానికి ఐర్లాండ్ ప్రతీకారం తీర్చుకుంది. ఇవాళ (ఫిబ్రవరి 16) జరిగిన రెండో వన్డేలో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 49 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. వెస్లీ మెదెవెరె (61), సికందర్ రజా (58) అర్ద సెంచరీలతో రాణించి జింబాబ్వేకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వెల్లింగ్టన్ మసకద్జ (35), బ్రియాన్ బెన్నెట్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. బెన్ కర్రన్ (18), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (4), జోనాథన్ క్యాంప్‌బెల్ (2), టి మరుమణి (0), ముజరబానీ (0), ట్రెవర్ గ్వాండు (2) నిరాశపరిచారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ నాలుగు, కర్టిస్ క్యాంఫర్ మూడు వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాశించారు. హ్యూమ్, జాషువ లిటిల్, ఆండీ మెక్‌బ్రైన్ తలో వికెట్ పడగొట్టారు.246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్.. 48.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (89), వన్‌డౌన్ బ్యాటర్ కర్టిస్ క్యాంఫర్ (63) అర్ద సెంచరీలతో రాణించి ఐర్లాండ్ విజయానికి గట్టి పునాదాలు వేశారు. లోర్కాన్ టక్కర్ (36 నాటౌట్), జార్జ్ డాక్రెల్ (20 నాటౌట్) ఐర్లాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ బల్బిర్నీ (11), హ్యారీ టెక్టార్ (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో గ్వాండు 2, నగరవ, ముజరబానీ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో ఐర్లాండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో జింబాబ్వే ఆధిక్యాన్ని 1-1కి తగ్గించింది. ఈ సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో వన్డే ఫిబ్రవరి 18న జరుగనుంది. -
ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌ను ఢీకొట్టనున్న ఆర్సీబీ
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL) షెడ్యూల్ ఇవాళ (ఫిబ్రవరి 16) విడుదలైంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ మార్చి 22న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR).. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (RCB) తలపడనుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్‌లో (Eden Gardens) జరుగుతుంది.ఇదే ఈడెన్ గార్డెన్స్‌లో క్వాలిఫయర్-2 (మే 23) మరియు ఫైనల్ మ్యాచ్‌లు (మే 25) జరుగనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో క్వాలిఫయర్-1 (మే 20) మరియు ఎలిమినేటర్ (మే 21) మ్యాచ్‌లు జరుగుతాయి. గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్.. మార్చి 23న జరిగే తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌ను ఎస్ఆర్హెచ్ తమ సొంత మైదానమైన ఉప్పల్ స్టేడియంలో ఆడుతుంది. అదే రోజు చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరుగుతుంది. మొత్తం 65 రోజుల పాటు జరిగే ఐపీఎల్-2025 సీజన్లో 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా 13 వేదికల్లో మెగా లీగ్ నిర్వహించబడుతుంది. -
జింబాబ్వేకు షాకిచ్చిన ఐర్లాండ్
జింబాబ్వేతో (Zimbabwe) జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఐర్లాండ్ (Ireland) జట్టు సంచలన విజయం సాధించింది. బులవాయో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్.. ఆతిథ్య జట్టును 63 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకు ఆలౌటైంది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఆండీ మెక్‌బ్రైన్ (90 నాటౌట్), మార్క్ అదైర్ (78) అర్ద సెంచరీలు సాధించి ఐర్లాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 127 పరుగులు జోడించారు. మెక్‌బ్రైన్, అదైర్తో పాటు ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో పాల్ స్టిర్లింగ్ (10), లోర్కాన్ టక్కర్ (33) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. రిచర్డ్ నగరవ 2, ట్రెవర్ గ్వాండు ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులు చేసింది. అరంగేట్రం ఆటగాడు నిక్ వెల్చ్ (90) 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. 10వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన ముజరబానీ 47 పరుగులు చేసి జింబాబ్వే తరఫున సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అతనికి 11వ నంబర్ ఆటగాడు ట్రెవర్ గ్వాండు (18 నాటౌట్) సహకరించాడు. వీరిద్దరూ ఆఖరి వికెట్‌కు 67 పరుగులు జోడించారు. వీరిద్దరి భాగస్వామ్యం మూలానా జింబాబ్వేకు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెక్‌కార్తీ 4, ఆండీ మెక్‌బ్రైన్ 3, మార్క్ అదైర్ 2, మాథ్యూ హంఫ్రేస్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం బరిలోకి దిగిన ఐర్లాండ్.. ఆండీ బల్బిర్నీ (66), లొర్కాన్ టక్కర్ (58) అర్ద సెంచరీలతో రాణించడంతో రెండో ఇన్నింగ్స్‌లో 298 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో కర్టిస్ క్యాంఫర్ (39), మూర్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ 4, ట్రెవర్ గ్వాండు, మధెవెరె తలో 2, ముజరబానీ, జోనాథన్ క్యాంప్‌బెల్ చెరో వికెట్ పడగొట్టారు.292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా కుప్పకూలింది. మాథ్యూ హంఫ్రేస్ ఆరు వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాశించాడు. హంఫ్రేస్ 6, మెక్‌కార్తీ 2, మార్క్ అదైర్, ఆండీ మెక్‌బ్రైన్ తలో వికెట్ పడగొట్టడంతో జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 228 పరుగులకు చాపచుట్టేసింది. వెస్లీ మెదెవెరె (84) జింబాబ్వేను ఓటమి బారి నుంచి గట్టెక్కించేందుకు విఫలయత్నం చేశాడు. మెదెవెరె, జోనాథన్ క్యాంప్‌బెల్ (33) జింబాబ్వే ఓటమిని కాసేపు అడ్డుకున్నారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో మెదెవెరె, జోనాథన్ క్యాంప్‌బెల్‌తో పాటు బ్రియాన్ బెన్నెట్ (45) రాణించాడు.కాగా, ఐర్లాండ్ జట్టు ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఫిబ్రవరి 14, 16, 18 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఫిబ్రవరి 22, 23, 25 తేదీల్లో మూడు టీ20లు జరుగుతాయి. -
అరంగేట్రంలోనే శతక్కొట్టిన సౌతాఫ్రికా ఓపెనర్.. వరల్డ్ రికార్డు
సౌతాఫ్రికా ఓపెనర్ (South Africa Opener) మాథ్యూ బ్రీట్జ్కీ (Matthew Breetzke) వన్డే అరంగేట్రంలోనే (ODI Debut) సెంచరీతో మెరిశాడు. పాకిస్తాన్ ట్రై సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 10) జరుగుతున్న మ్యాచ్‌లో బ్రీట్జ్కీ ఈ ఫీట్‌ను సాధించాడు. అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన 19వ ఆటగాడిగా, నాలుగో సౌతాఫ్రికన్ ప్లేయర్‌గా బ్రీట్జ్కీ రికార్డుబుక్కుల్లోకెక్కాడు. బ్రీట్జ్కీకి ముందు డెన్నిస్ అమిస్ (ఇంగ్లండ్), డెస్మండ్ హేన్స్ (విండీస్), ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే), సలీం ఇలాహి (పాకిస్తాన్), మార్టిన్ గప్తిల్ (న్యూజిలాండ్), కొలిన్ ఇంగ్రామ్ (సౌతాఫ్రికా), రాబర్ట్ నికోల్ (న్యూజిలాండ్), ఫిల్ హ్యూస్ (ఆస్ట్రేలియా), మైఖేల్ లంబ్ (ఇంగ్లండ్), మార్క్ చాప్మన్ (న్యూజిలాండ్), కేఎల్ రాహుల్ (ఇండియా), టెంబా బవుమా (సౌతాఫ్రికా), ఇమామ్ ఉల్ హార్ (పాకిస్తాన్), రీజా హెండ్రిక్స్ (సౌతాఫ్రికా), ఆబిద్ అలీ (పాకిస్తాన్), రహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్), మైఖేల్ ఇంగ్లిష్ (స్కాట్లాండ్), అమీర్ జాంగూ (వెస్టిండీస్) వన్డే అరంగేట్రంలోనే సెంచరీలు చేశారు.వన్డే అరంగేట్రంలనే సెంచరీలు చేసిన సౌతాఫ్రికా ఆటగాళ్లు..కొలిన్ ఇంగ్రామ్ 2010లో జింబాబ్వేపైటెంబా బవుమా 2016లో ఐర్లాండ్పైరీజా హెండ్రిక్స్ 2018లో శ్రీలంకపైమాథ్యూ బ్రీట్జ్కీ 2025లో న్యూజిలాండ్పైతటస్థ వేదికపై వన్డే అరంగ్రేటంలో సెంచరీ చేసిన ఆటగాళ్లు..ఆండీ ఫ్లవర్ 1992లో శ్రీలంకపైఇమామ్ ఉల్ హాక్ 2017లో శ్రీలంకపైఆబిద్ అలీ 2018లో ఆస్ట్రేలియాపైరహ్మానుల్లా గుర్బాజ్ 2021లో ఐర్లాండ్పైమాథ్యూ బ్రీట్జ్కీ 2025లో న్యూజిలాండ్పైబ్రీట్జ్కీ ప్రపంచ రికార్డున్యూజిలాండ్తో మ్యాచ్‌లో 148 బంతులు ఎదుర్కొన్న బ్రీట్జ్కీ 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 150 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ప్రదర్శనతో బ్రీట్జ్కీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే అరంగేట్రంలో 150 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. గతంలో వన్డే అరంగేట్రంలో 150 పరుగులు ఎవ్వరూ స్కోర్ చేయలేదు. ఈ మ్యాచ్‌కు ముందు వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోర్ రికార్డు విండీస్ దిగ్గజం డెస్మండ్ హేన్స్ పేరిట ఉండింది. హేన్స్ తన వన్డే డెబ్యూలో 148 పరుగులు స్కోర్ చేశాడు. తాజా ప్రదర్శనతో వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోర్ రికార్డు కూడా బ్రీట్జ్కీ ఖాతాలోకి చేరింది.న్యూజిలాండ్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. మాథ్యూ బ్రీట్జ్కీ (150) అరంగేట్రంలోనే సెంచరీతో కదంతొక్కగా.. వియాన్ ముల్దర్ (64) అర్ద సెంచరీతో రాణించాడు. జేసన్ స్మిత్ (41) పర్వాలేదనిపించాడు. టెంబా బవుమా 20, కైల్ వెర్రిన్ 1, సెనూరన్ ముత్తుసామి 2 పరుగులు చేసి ఔటయ్యారు.న్యూజిలాండ్ బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ, మ్యాట్ హెన్రీ తలో రెండు వికెట్లు.. మైఖేల్ బ్రేస్‌వెల్ ఓ వికెట్ పడగొట్టారు. -
న్యూజిలాండ్ టీ20 టోర్నీ విజేతగా సెంట్రల్ డిస్ట్రిక్ట్స్
న్యూజిలాండ్ టీ20 టోర్నీ సూపర్ స్మాష్ (Super Smash) విజేతగా సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ (Central Districts) (సెంట్రల్ స్టాగ్స్) అవతరించింది. ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన ఫైనల్లో ఆ జట్టు కాంటర్బరీ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ సూపర్ స్మాష్ టైటిల్ గెలవడం 2019 తర్వాత ఇదే మొదటిసారి. ఇనాగురల్ ఎడిషన్‌లో (2006) టైటిల్ గెలిచిన కాంటర్బరీ కింగ్స్ వరుసగా ఐదోసారి, మొత్తంగా ఏడో సారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన కాంటర్బరీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 46 పరుగులు చేసిన డారిల్ మిచెల్ (Daryl Mitchell) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెక్కోంచీ (27), చాడ్ బోవ్స్ (16), షిప్లే (10), మ్యాట్ హెన్రీ (12) రెండంకెల స్కోర్లు చేయగా.. మిచెల్ హే (5), మాథ్యూ బాయిల్ (2), జకరీ ఫౌల్క్స్ (7) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ బౌలర్లలో టాబీ ఫిండ్లే 3 వికెట్లు పడగొట్టగా.. రాండెల్ 2, అంగస్ షా, టిక్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు.136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సెంట్రల్ డిస్ట్రిక్ట్స్.. డేన్ క్లీవర్ (43), విల్ యంగ్ (35) రాణించడంతో మరో 16 బంతులు మిగిలుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ ఇన్నింగ్స్‌లో జాక్ బాయిల్ 5, కెప్టెన్ టామ్ బ్రూస్ 14 పరుగులు చేసి ఔట్ కాగా.. విలియమ్ క్లార్క్ (17), కర్టిస్ హీపీ (9) సెంట్రల్ డిస్ట్రిక్ట్స్‌ను విజయతీరాలకు చేర్చారు. కాంటర్బరీ కింగ్స్ బౌలర్లలో కైల్ జేమీసన్ 2, విలియమ్ ఓరూర్కీ, హెన్రీ షిప్లే తలో వికెట్ పడగొట్టారు.కాగా, న్యూజిలాండ్‌లో జరిగే సూపర్ స్మాష్ టీ20 టోర్నీ 2005-06లో తొలిసారి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ టోర్నీ పలు పేర్లతో చలామణి అవుతూ వస్తుంది. తొలుత న్యూజిలాండ్ టీ20 కాంపిటీషన్ అని, ఆతర్వాత స్టేట్ టీ20 అని, 2009-2012 వరకు హెచ్ఆర్వీ కప్ అని, 2013-14 ఎడిషన్‌లో హెచ్ఆర్వీ టీ20 అని, 2018-19 సీజన్ నుంచి సూపర్ స్మాష్ అని నిర్వహించబడుతుంది. ఈ టోర్నీ పురుషులతో పాటు మహిళల విభాగంలోనూ జరుగుతుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ప్రస్తుత సీజన్లో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్‌కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా నిలిచింది. ఈ టోర్నీలో న్యూజిలాండ్ జాతీయ జట్టుకు ఆడే చాలామంది ఆటగాళ్లు పాల్గొంటారు. -
శతక్కొట్టిన స్టీవ్ స్మిత్.. 35వ టెస్ట్ సెంచరీ.. ఉస్మాన్ ఖ్వాజా కూడా..!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్ స్మిత్ 179 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో కెరీర్లో 35వ టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) స్మిత్‌కు ఇది 47వ సెంచరీ. శ్రీలంక గడ్డపై మూడవది (టెస్ట్‌ల్లో).Steve Smith with yet another 100 It's his 35th test 100✨ pic.twitter.com/4ppbWFEehc— Schrödinger (@srhnation) January 29, 2025టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్ ఏడవ స్థానానికి ఎగబాకాడు. సచిన్ టెండూల్కర్ (51), జాక్ కల్లిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార సంగక్కర (38), జో రూట్ (36), రాహుల్ ద్రవిడ్ (36) మాత్రమే టెస్ట్‌ల్లో స్మిత్ కంటే ఎక్కువ సెంచరీలు చేశారు.తాజా సెంచరీతో స్మిత్ ఫాబ్ ఫోర్లో (టెస్ట్ సెంచరీల పరంగా) రెండో స్థానానికి ఎగబాకాడు. 36 సెంచరీలతో రూట్ అగ్రస్థానంలో ఉండగా.. 33 సెంచరీలతో కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో, 30 సెంచరీలతో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఈ సెంచరీతో స్మిత్ ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో నాలుగో అత్యధిక సెంచరీలు (మూడు ఫార్మాట్లలో) చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ (81) అగ్రస్థానంలో నిలువగా.. రూట్ (52) రెండో స్థానంలో, రోహిత్ శర్మ (48) మూడో స్థానంలో, స్మిత్ (47) నాలుగులో, కేన్ విలియమ్సన్ (46) ఐదో స్థానంలో ఉన్నారు.వివిధ దేశాల్లో స్మిత్ చేసిన సెంచరీలుఆస్ట్రేలియాలో 18ఇంగ్లండ్‌లో 8భారత్‌లో 3శ్రీలంకలో 3న్యూజిలాండ్‌లో 1సౌతాఫ్రికాలో 1వెస్టిండీస్‌లో 135వ సెంచరీకి ముందు స్మిత్ ఇదే మ్యాచ్‌లో 10000 పరుగుల మైలురాయిని కూడా దాటాడు. ఈ ఇన్నింగ్స్ తొలి బంతికే స్మిత్ ఈ ఘనత సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో ఆస్ట్రేలియన్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. స్టీవ్‌కు ముందు రికీ పాంటింగ్ (13378), అలెన్ బోర్డర్ (11174), స్టీవ్ వా (10927) ఈ ఘనత సాధించారు.205వ ఇన్నింగ్స్‌లో 10000 పరుగులు పూర్తి చేసుకున్న స్మిత్.. బ్రియాన్ లారా (195), సచిన్ టెండూల్కర్ (195), కుమార సంగక్కర (195), రికీ పాంటింగ్ (196) తర్వాత అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) ఈ ఫీట్‌ను సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.టెస్ట్ క్రికెట్లో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లలో జో రూట్ (12972) తర్వాత స్టీవ్ స్మిత్ మాత్రమే 10000 పరుగుల క్లబ్లో చేరాడు. స్టీవ్ సమకాలీకులు కేన్ విలియమ్సన్ (9276), విరాట్ కోహ్లి (9230) ఇంకా 9000 పరుగుల క్లబ్‌లోనే ఉన్నారు.తన టెస్ట్ కెరీర్లో 114 మ్యాచ్‌లు ఆడిన స్మిత్ 56కు పైగా సగటుతో 10100* పరుగులు చేశాడు. ఇందులో 4 డబుల్ సెంచరీలు, 35 సెంచరీలు, 41 అర్ద సెంచరీలు ఉన్నాయి.ఇదే మ్యాచ్‌లో మరో ఆసీస్ బ్యాటర్ ఉస్మాన్ ఖ్వాజా (Usman Khawaja) కూడా సెంచరీ చేశాడు. ఖ్వాజా 135 బంతుల్లో 8 బౌండరీలు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేసుకుని 147 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవలికాలంలో పెద్దగా ఫామ్‌లో లేని ఖ్వాజాకు ఏడాదిన్నర తర్వాత ఇదే తొలి సెంచరీ. టెస్ట్‌ల్లో ఖ్వాజాకు ఇది 16వ శతకం. ఇటీవల భారత్‌తో ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఖ్వాజా దారుణంగా నిరాశపరిచాడు (కేవలం 20.44 సగటున పరుగులు చేశాడు).16TH TEST CENTURY FOR USMAN KHAWAJA - A TERRIFIC KNOCK. 💯pic.twitter.com/H2jliMrAVy— Mufaddal Vohra (@mufaddal_vohra) January 29, 2025ఖ్వాజా, స్మిత్ సెంచరీతో కదంతొక్కడంతో లంకతో తొలి టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 81.1 ఓవర్ల అనంతరం రెండు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. మ్యాచ్ ముగియడానికి కొద్ది సేపటి ముందు వర్షం మొదలుకావడంతో అంపైర్లు తొలి రోజు ఆటను ముగించారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ట్రవిస్ హెడ్ (40 బంతుల్లో 57; 10 ఫోర్లు, సిక్స్) చెలరేగి మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. వన్‌డౌన్ బ్యాటర్ లబూషేన్ 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రభాత జయసూర్య, జెఫ్రీ వాండర్సేలకు తలో వికెట్ దక్కింది. -
2024 ఐసీసీ అవార్డుల విజేతలు వీరే..!
2024 ఐసీసీ అవార్డుల ప్రకటన ప్రక్రియ జనవరి 24న మొదలై, ఇవాల్టితో (జనవరి 28) ముగిసింది. మూడు ఫార్మాట్లలో పురుషులు, మహిళల విభాగాల్లో వ్యక్తిగత అవార్డులతో పాటు టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను రివీల్ చేశారు. గతేడాదికి సంబంధించి మొత్తం 12 వ్యక్తిగత అవార్డులు, 5 ఐదు టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు ప్రకటించబడ్డాయి.వ్యక్తిగత విభాగాల్లో ఐసీసీ అవార్డులు (2024)..ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ)-జస్ప్రీత్ బుమ్రా (నామినీలు-హ్యారీ బ్రూక్, ట్రవిస్ హెడ్, జో రూట్)ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (రేచల్ హెహోయ్ ఫ్లింట్ ట్రోఫీ)-మేలీ కెర్ (నామినీలు-చమారీ ఆటపట్టు, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, లారా వోల్వార్డ్ట్)ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-జస్ప్రీత్ బుమ్రా (నామినీలు-హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జో రూట్)ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-స్మృతి మంధన (నామినీలు-చమారీ ఆటపట్టు, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, లారా వోల్వార్డ్ట్)ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- అజ్మతుల్లా ఒమర్జాయ్ (నామినీలు- వనిందు హసరంగ, కుసాల్ మెండిస్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్)ఐసీసీ ఎమర్జింగ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అన్నెరీ డెర్క్సెన్ (నామినీలు-సస్కియా హోర్లీ, శ్రేయాంక పాటిల్, ఫ్రేయా సర్జెంట్)ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-కమిందు మెండిస్ (నామినీలు-సైమ్ అయూబ్, గస్ అట్కిన్సన్, షమార్ జోసఫ్)ఐసీసీ వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-ఈషా ఓఝాఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-గెర్హార్డ్ ఎరాస్మస్ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్-రిచర్డ్ ఇల్లింగ్వర్త్ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అర్షదీప్ సింగ్ (నామినీలు-బాబర్ ఆజమ్, ట్రవిస్ హెడ్, సికందర్ రజా)ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-మేలీ కెర్ (నామినీలు- చమారీ ఆటపట్టు, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, లారా వోల్వార్డ్ట్)ఫార్మాట్ల వారీగా టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు..ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: రోహిత్ శర్మ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్, బాబర్ ఆజం, నికోలస్ పూరన్ (వికెట్‌కీపర్), సికందర్ రజా, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, వనిందు హసరంగా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), స్మృతి మంధాన, చమరి అతపత్తు, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, మెలీ కెర్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), మరిజాన్ కప్ప్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, దీప్తి శర్మ, సదియా ఇక్బాల్.ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జామీ స్మిత్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా.ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: సైమ్ అయూబ్, రహ్మానుల్లా గుర్బాజ్, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్‌కీపర్), చరిత్ అసలంక (కెప్టెన్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, వనిందు హసరంగ, షాహీన్ షా అఫ్రిది, హరిస్ రౌఫ్, అల్లా ఘజన్ఫర్.ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: స్మృతి మంధాన, లారా వోల్వార్డ్ (కెప్టెన్), చమర్తి అథపత్తు, హేలీ మాథ్యూస్, మారిజాన్ కాప్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్. -
టామ్ బాంటన్ విధ్వంసకర శతకం.. ముంబై ఇండియన్స్ ఘన విజయం
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ ఆటగాడు టామ్ బాంటన్ చెలరేగిపోతున్నాడు. డెజర్ట్ వైపర్స్‌తో నిన్న (జనవరి 27) జరిగిన మ్యాచ్‌లో బాంటన్ విధ్వంసకర శతకం బాదాడు. ఫలితంగా ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ 154 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 228 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 చరిత్రలో ఇది రెండో అత్యధిక టీమ్ స్కోర్. ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన టామ్ బాంటన్ 55 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేశాడు. ఓపెనర్ ఆండ్రీ ఫ్లెచర్ 50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బాంటన్, ఫ్లెచర్ రెండో వికెట్‌కు 198 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. యూఏఈ గడ్డపై టీ20ల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం.229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డెజర్ట్ వైపర్స్.. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్ల ధాటికి 12.3 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలింది. ముహమ్మద్ రోహిద్ ఖాన్, అల్జరీ జోసఫ్ తలో మూడు.. ఫజల్ హక్ ఫారూఖీ, డాన్ మౌస్లీ చెరో రెండు వికెట్లు పడగొట్టి వైపర్స్ ఇన్నింగ్స్‌ను నేలమట్టం చేశారు. వీరి దెబ్బకు వైపర్స్ ఇన్నింగ్స్‌లో ఒక్క ఆటగాడు కూడా కనీసం 15 పరుగులు చేయలేకపోయాడు. కెప్టెన్ సామ్ కర్రన్ (11), వికెట్‌కీపర్ ఆజమ్ ఖాన్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ వైపర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన వైపర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.రెండో శతకంఈ సీజన్లో టామ్ బాంటన్కి ఇది రెండో శతకం. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 చరిత్రలో ఒకే సీజన్లో రెండు సెంచరీలు ఎవరూ చేయలేదు. తాజా శతకంతో బాంటన్ ఈ సీజన్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. బాంటన్ ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 156.36 స్ట్రయిక్‌రేట్‌తో 369 పరుగులు చేశాడు. ఈ సీజన్లో బాంటన్‌తో పాటు దుబాయ్ క్యాపిటల్స్ ఆటగాడు షాయ్ హోప్ ఒక్కడే సెంచరీ చేశాడు. -
మిచెల్ ఓవెన్ సునామీ శతకం.. బిగ్‌బాష్ లీగ్ విజేత హోబర్ట్ హరికేన్స్
బిగ్‌బాష్ లీగ్ 2024-25 ఎడిషన్‌లో హోబర్ట్ హరికేన్స్ విజేతగా నిలిచింది. ఇవాళ (జనవరి 27) జరిగిన ఫైనల్లో హరికేన్స్ సిడ్నీ థండర్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ధండర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఓపెనర్లు జేసన్ సంఘా (42 బంతుల్లో 67; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (32 బంతుల్లో 48; 5 ఫోర్లు, సిక్స్) థండర్‌కు మెరుపు ఆరంభాన్ని అందించారు. అయితే థండర్ మధ్యలో తడబడింది. మాథ్యూ గిల్కెస్ డకౌట్ కాగా.. సామ్ బిల్లింగ్స్ (14 బంతుల్లో 20; ఫోర్, సిక్స్), ఒలివర్ డేవిస్ (19 బంతుల్లో 26; ఫోర్, సిక్స్), క్రిస్ గ్రీన్ (9 బంతుల్లో 16; 2 ఫోర్లు) పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. హరికేన్స్ బౌలర్లలో రిలే మెరిడిత్, కెప్టెన్ నాథన్ ఇల్లిస్ తలో మూడు వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి థండర్‌ను భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు.అనంతరం లక్ష్య ఛేదనలో హరికేన్స్ ఓపెనర్ మిచెల్ ఓవెన్ విలయతాండవం చేశాడు. ఓవెన్ దెబ్బకు థండర్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఓవెన్ విశ్వరూపం దాల్చి 16 బంతుల్లో హాఫ్ సెంచరీని, 39 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. ఓవెన్ సునామీ ఇన్నింగ్స్ దెబ్బకు హరికేన్స్ పవర్ ప్లేలో (తొలి 6 ఓవర్లలో) 98 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొన్న ఓవెన్ 6 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓవెన్ ఔటయ్యే సమయానికే హరికేన్స్ విజయం ఖరారయ్యింది. ఆఖర్లో మాథ్యూ వేడ్ (17 బంతుల్లో 32 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్), బెన్ మెక్‌డెర్మాట్ (12 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు) మ్యాచ్‌ను లాంఛనంగా పూర్తి చేశారు. హరికేన్స్ 14.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హరికేన్స్ ఇన్నింగ్స్‌లో కాలెబ్ జువెల్ (13), నిఖిల్ చౌదరీ (1) మాత్రమే తక్కువ స్కోర్లకు ఔటయ్యారు.థండర్ బౌలర్లలో తన్వీర్ సంఘా 2, టామ్ ఆండ్రూస్ ఓ వికెట్ పడగొట్టారు. 2011-12 ❌2012-13 ❌2013-14 ❌2014-15 ❌2015-16 ❌2016-17 ❌2017-18 ❌2018-19 ❌2019-20 ❌2020-21 ❌2021-22 ❌2022-23 ❌2023-24 ❌2024-25 🏆The wait is over for @HurricanesBBL.pic.twitter.com/bPufT8V9Ko— CricTracker (@Cricketracker) January 27, 2025హరికేన్స్ 14 ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపు తర్వాత సొంత ప్రేక్షకుల మధ్య టైటిల్ గెలిచింది. మిచెల్ ఓవెన్ సునామీ శతకంతో మ్యాచ్‌ను వన్ సైడెడ్‌గా చేశాడు. ఓవెన్‌కు ఈ సీజన్లో ఇది రెండో సెంచరీ. ఈ సెంచరీతో ఓవెన్ బీబీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును (39 బంతుల్లో) కూడా సమం చేశాడు. -
పాకిస్తాన్ ప్లేయర్ల సంచలన నిర్ణయం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొంటున్న పాకిస్తాన్ ప్లేయర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దర్బార్ రాజ్‌షాహీ అనే ఫ్రాంచైజీ మ్యాచ్ ఫీజ్ బకాయిలు చెల్లించని కారణంగా బీపీఎల్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్నారు. ఇదే కారణంగా పలువురు విదేశీ ప్లేయర్లు కూడా బీపీఎల్‌కు దూరంగా ఉన్నారు. విదేశీ ఆటగాళ్లు ర్యాన్ బర్ల్, మెక్కాలీ కమిన్స్, లహీరు కుమార, మార్క్ డోయల్‌తో పాటు పాకిస్తాన్ ఆటగాళ్లు మొహమ్మద్ హరీస్, అఫ్తాబ్ ఆలమ్ దర్బార్ రాజ్‌షాహీ ఆడిన గత మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేశారు. విదేశీ ఆటగాళ్లు హ్యాండ్ ఇవ్వడంతో రాజ్‌షాహీ గత మ్యాచ్‌లో లోకల్ ప్లేయర్లను బరిలోకి దించింది. రాజ్షాహీకి చెందిన విదేశీ ఆటగాళ్లు మ్యాచ్ ఫీజ్ బకాయిలను డిమాండ్ చేస్తూ తమ ధిక్కార స్వరాన్ని వినిపించడం ఇది తొలిసారి కాదు. ఈ సీజన్ ఆరంభంలో రాజ్‌షాహీ విదేశీ ఆటగాళ్లు ట్రయినింగ్ సెషన్స్‌ను బాయ్‌కాట్ చేశారు. తమ ఫ్రాంచైజీపై చర్యలు తీసుకుని, తమకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలని బీపీఎల్ గవర్నింగ్ బాడీని డిమాండ్ చేశారు. రాజ్‌షాహీ దర్బార్ ఫ్రాంచైజీ అవళంభిస్తున్న విధానాలు అంతర్జాతీయ క్రికెట్ వేదికపై బంగ్లాదేశ్ పరువును మసకబారేలా చేస్తున్నాయి.ఇదిలా ఉంటే, విదేశీ స్టార్లు లేనప్పటికీ గత మ్యాచ్‌లో రాజ్‌షాహీ రంగ్‌పూర్ రైడర్స్‌పై విజయం సాధించింది. లో స్కోరింగ్ థ్రిల్లర్‌గా నడిచిన ఈ మ్యాచ్‌లో రాజ్‌షాహీ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజ్‌షాహీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. రాజ్‌షాహీ ఇన్నింగ్స్‌లో సంజముల్ ఇస్లాం (28 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రంగ్‌పూర్ రైడర్స్ బౌలర్లలో ఖుష్దిల్ 3 వికెట్లు పడగొట్టగా.. రకీబుల్ హసన్, సైఫుద్దీన్ తలో రెండు, అకీఫ్ జావెద్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రంగ్‌పూర్ రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. మొహమ్మద్ సైఫుద్దీన్ (52 నాటౌట్), రకీబుల్ హసన్ (20) రైడర్స్‌ను గెలిపించేందుకు చివరి వరకు ప్రయత్నించారు. రాజ్‌షాహీ బౌలర్లు మృత్యుంజయ్ చౌధురీ (4-1-18-4), మొహర్ షేక్ (4-1-15-2), కెప్టెన్ తస్కిన్ అహ్మద్ (4-0-2-25) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి రైడర్స్‌ను దెబ్బకొట్టారు. ఈ గెలుపు అనంతరం రాజ్‌షాహీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ సీజన్లో రాజ్‌షాహీ 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి, ప్లే ఆఫ్స్‌పై కన్నేసింది. -
PAK Vs WI: చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. 21వ శతాబ్దంలో పాక్ గడ్డపై తొలి విజయం
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ 120 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. ఈ విజయం విండీస్ క్రికెట్ చరిత్రలో చారిత్రక విజయం. 21వ శతాబ్దంలో పాక్ గడ్డపై ఆ జట్టుకు ఇది తొలి టెస్ట్ విజయం. విండీస్ చివరిసారి 1990లో పాకిస్తాన్ గడ్డపై టెస్ట్ విజయం సాధించింది. మళ్లీ 35 ఏళ్ల తర్వాత విండీస్ పాక్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించింది.మ్యాచ్ విషయానికొస్తే.. 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ 133 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. స్పిన్నర్లు గోమెల్ వార్రికన్ (5/27), కెవిన్ సింక్లెయిర్ (3/61), గుడకేశ్ మోటీ (2/35) పాకిస్తాన్ పతనాన్ని శాశించారు. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ చేసిన 31 పరుగులే అత్యధికం కాగా.. మొహమ్మద్ రిజ్వాన్ (25), కమ్రాన్ గులామ్ (19), సౌద్ షకీల్ (13), సల్మాన్ అఘా (15) రెండంకెల స్కోర్లు చేశారు. మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 76 పరుగులుగా ఉండింది. మూడో రోజు ఆట తొలి సెషన్లోనే పాక్ మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. విండీస్ స్పిన్నర్లు పాక్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు.అంతకుముందు విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. బ్రాత్‌వైట్ (52) అర్ద సెంచరీతో రాణించాడు. అమీర్ జాంగూ (30) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. చివరి వరుస బ్యాటర్లు టెవిన్ ఇమ్లాచ్ (35), కెవిన్ సింక్లెయిర్ (28), గుడకేశ్ మోటీ (18), గోమెల్ వార్రికన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. కషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.తొలి రోజు ఆటలోనే ఇరు జట్లు తమతమ తొలి ఇన్నింగ్స్‌లను ముగించాయి. బౌలర్లు.. ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగడంతో మొదటి రోజు 20 వికెట్లు నేలకూలాయి. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 163 పరుగులకే ఆలౌట్ కాగా.. పాకిస్తాన్ 154 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో పాక్ స్పిన్నర్ నౌమన్ అలీ హ్యాట్రిక్ (తొలి ఇన్నింగ్స్‌లో) సహా 10 వికెట్లు తీయగా.. విండీస్ స్పిన్నర్ వార్రికన్ 9 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ మొత్తంలో పేసర్లకు నాలుగు వికెట్లు మాత్రమే దక్కాయి. మిగతా 36 వికెట్లను ఇరు జట్ల స్పిన్నర్లు షేర్ చేసుకున్నారు. రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో కలిపి 19 వికెట్లు పడగొట్టిన విండీస స్పిన్నర్ జోమెల్ వార్రికన్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. రెండో టెస్ట్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసినందుకు గానూ వార్రికన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. కాగా, రెండు మ్యాచ్ ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో గెలుపొందింది. -
పాకిస్తాన్ విజయ లక్ష్యం 254
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 244 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 9 పరుగుల లీడ్ కలుపుకుని విండీస్ పాకిస్తాన్ ముందు 255 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. విండీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బ్రాత్‌వైట్ (52) అర్ద సెంచరీతో రాణించాడు. అమీర్ జాంగూ (30) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. చివరి వరుస బ్యాటర్లు టెవిన్ ఇమ్లాచ్ (35), కెవిన్ సింక్లెయిర్ (28), గుడకేశ్ మోటీ (18), గోమెల్ వార్రికన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. కషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 154 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ ఇన్నింగ్స్‌ను నేలమట్టం చేశారు. గోమెల్ వార్రకన్ 4, గుడకేశ్ మోటీ 3, కీమర్ రోచ్ 2 వికెట్లు పడగొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌద్ షకీల్ 32 పరుగులు చేశాడు. షాన్ మసూద్ 15, ముహమ్మద్ హురైరా 9, బాబర్ ఆజమ్ 1, కమ్రాన్ గులామ్ 16, సల్మాన్ అఘా 9, నౌమన్ అలీ 0, సాజిద్ ఖాన్ 16 (నాటౌట్), అబ్రార్ అహ్మద్ 2, కషిఫ్ అలీ డకౌటయ్యారు.విండీస్ పరువు కాపాడిన చివరి ముగ్గురు బ్యాటర్లుఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 163 పరుగులకు ఆలౌటైంది. 54 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన విండీస్‌ను చివరి ముగ్గురు బ్యాటర్లు ఆదుకున్నారు. గడకేశ్ మోటీ 55, కీమర్ రోచ్ 25, గోమెల్ వార్రికన్ 36 (నాటౌట్) పరుగులు చేశారు. నౌమన్ అలీ (6/41) విండీస్‌ను ఆరేశాడు. సాజిద్ ఖాన్ 2, అబ్రార్ అహ్మద్, కషిఫ్ అలీ తలో వికెట్ తీశారు.కష్టాల్లో పాక్255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ షాన్ మసూద్ (2), ముహమ్మద్ హురైరా (2), కమ్రాన్ గులామ్ (19) నిరాశపరిచారు. బాబర్ ఆజమ్ (26), సౌద్ షకీల్ (3) క్రీజ్‌లో ఉన్నారు. 17 ఓవర్ల అనంతరం పాక్ స్కోర్ 59/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలవాలంటే మరో 195 పరుగులు చేయాలి. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీ, కెవిన్ సింక్లెయిర్, జోమెల్ వార్రికన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్ తొలి టెస్ట్‌లో 127 పరుగుల తేడాతో నెగ్గింది. -
2024 ఐసీసీ వన్డే జట్టు ప్రకటన.. టీమిండియా నుంచి ఒక్కరు కూడా లేరు..!
టీమిండియాకు అవమానం జరిగింది. 2024 ఐసీసీ పురుషుల వన్డే జట్టులో ఒక్క భారత ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. టీమిండియా గతేడాది వన్డే ఫార్మాట్లో అతి తక్కువ మ్యాచ్‌లు ఆడటమే ఇందుకు కారణం.2024లో టీమిండియా కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడింది. ఇందులో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది.2024 మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్‌ను ఐసీసీ ఇవాళ (జనవరి 24) ప్రకటించింది. ఈ జట్టులో నలుగురు శ్రీలంక ప్లేయర్లు.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి చెరి ముగ్గురు.. వెస్టిండీస్‌కు చెందిన ఓ ఆటగాడు చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు సారధిగా లంక కెప్టెన్ చరిత్ అసలంక ఎంపికయ్యాడు. గతేడాది ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గానూ రాణించినందుకు ఐసీసీ అసలంకను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.అసలంక గతేడాది 16 వన్డేల్లో 50.2 సగటున 605 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 4 అర్ద సెంచరీలు ఉన్నాయి. శ్రీలంక గతేడాది 18 వన్డేలు ఆడి 12 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఏ జట్టూ గతేడాది ఇన్ని వన్డేలు ఆడలేదు.దాయాది పాక్ గతేడాది 9 వన్డేలు ఆడి ఏడింట విజయాలు సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ గతేడాది 14 వన్డేల్లో 8 మ్యాచ్‌ల్లో నెగ్గింది.ఐసీసీ వన్డే జట్టులో ఏకైక నాన్ ఏషియన్ వెస్టిండీస్ ఆటగాడు షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్. 2023లో వన్డే అరంగేట్రం చేసిన రూథర్‌ఫోర్డ్ గతేడాది 9 మ్యాచ్‌లు ఆడి 106.2 సగటున 425 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన కారణంగా రూథర్‌ఫోర్డ్‌కు ఐసీసీ జట్టులో చోటు దక్కింది.ఐసీసీ జట్టులో భారత్‌తో పాటు SENA దేశాలైన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌కు కూడా ప్రాతినిథ్యం లభించలేదు. రెండోసారి ఇలా..!ఐసీసీ వన్డే జట్లను ప్రకటించడం మొదలుపెట్టినప్పటి నుంచి (2004) భారత్‌కు ప్రాతినిథ్యం లభించకపోవడం ఇది రెండో సారి మాత్రమే. 2021లో కూడా ఐసీసీ మెన్స్ వన్డే టీమ్‌లో భారత ఆటగాళ్లకు చోటు లభించలేదు. 2023లో జట్టు నిండా భారతీయులే..!2023 ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్లో ఏకంగా ఆరుగురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. టీమిండియా నుంచి రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ ఐసీసీ జట్టుకు ఎంపికయ్యారు.ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: చరిత్ అసలంక (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, పథుమ్ నిస్సంక, కుసాల్ మెండిస్ (వికెట్‌కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, వనిందు హసరంగ, షాహీన్ షా అఫ్రిది, హరీస్ రౌఫ్, అల్లా ఘజన్ఫర్ -
ఆస్ట్రేలియాకు కొత్త కోచ్
ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ కోచ్‌గా ఆర్సీబీ బౌలింగ్ కోచ్ ఆడమ్ గ్రిఫిత్ నియమితుడయ్యాడు. 46 ఏళ్ల గ్రిఫిత్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌గా ఆస్ట్రేలియా దేశవాలీ క్రికెట్ (టస్మానియా తరఫున) ఆడాడు. గ్రిఫిత్ 2019 నుంచి 2024 వరకు ఆర్సీబీ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. గ్రిఫిత్ ప్రస్తుతం ఆస్ట్రేలియా దేశవాలీ జట్టు అయిన విక్టోరియాకు అసిస్టెంట్ కోచ్‌గా సేవలందిస్తున్నాడు. గ్రిఫిత్.. ఆస్ట్రేలియా జాతీయ జట్టుతో పాటు ఆస్ట్రేలియా-ఏ జట్టుకు కూడా బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.గ్రిఫిత్ బ్రిస్బేన్‌లో ఉన్న క్రికెట్ ఆస్ట్రేలియా నేషనల్ క్రికెట్ సెంటర్‌ను ఆపరేట్ చేస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. గ్రిఫిత్ పేస్ బౌలర్ల అభివృద్ధి మరియు కొత్త పేస్ బౌలర్లను తయారు చేయడంలో భాగమవుతాడని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. గ్రిఫిత్ నియామకాన్ని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ స్వాగతించాడు. గ్రిఫిత్ అనుభవం ఆసీస్ పేసర్లను మరింత పదునెక్కించేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు.గ్రిఫిత్ తన కోచింగ్ కెరీర్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా, పెర్త్ స్కార్చర్ జట్లకు సీనియర్ అసిస్టెంట్ కోచ్‌గా.. టస్మానియా కోచింగ్ డైరెక్టర్‌గా.. బీబీఎల్ జట్లైన టస్మానియా టైగర్స్, హోబర్ట్ హరికేన్స్ జట్లకు హెడ్ కోచ్‌గా పని చేశాడు.ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా జట్టు త్వరలో రెండు టెస్ట్‌లు, రెండు మ్యాచ్ వన్డే సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించనుంది. ఈ సిరీస్‌లో టెస్ట్ జట్టుకు స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా ఈ పర్యటనకు దూరంగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ గాలే వేదికగా జనవరి 29న ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ ఇదే వేదికగా ఫిబ్రవరి 6 నుంచి మొదలవుతుంది. అనంతరం ఫిబ్రవరి 12, 14 తేదీల్లో రెండు వన్డేలు జరుగనున్నాయి.ఆస్ట్రేలియా ఇటీవలే స్వదేశంలో భారత్‌తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. శ్రీలంక పర్యటన అనంతరం ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటుంది. మెగా టోర్నీలో ఆసీస్ ఫిబ్రవరి 22న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. కరాచీలో జరిగే ఆ మ్యాచ్‌లో ఆసీస్ ఇంగ్లండ్‌ను ఢీకొంటుంది. అనంతరం ఫిబ్రవరి 25న సౌతాఫ్రికాతో (రావల్పిండి), ఫిబ్రవరి 28న ఆఫ్ఘనిస్తాన్‌తో (లాహోర్) తలపడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ గ్రూప్-బిలో ఉంది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. మెగా టోర్నీలో భారత్ ఫిబ్రవరి 20న దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న పాకిస్తాన్‌ను, మార్చి 2న న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. -
T20 World Cup 2025: టీమిండియా బౌలర్ హ్యాట్రిక్.. 17 బంతుల్లోనే ముగిసిన ఆట
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2025లో భారత్ రెండో విజయం సాధించింది. మలేసియాతో ఇవాళ (జనవరి 21) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మలేసియాను భారత బౌలర్లు 31 పరుగులకే (14.3 ఓవర్లలో) కుప్పకూల్చారు. భారత స్పిన్నర్ వైష్ణవి శర్మ హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లతో (4-1-5-5) చెలరేగింది. మరో స్పిన్నర్ ఆయుషి శుక్లా (3.3-1-8-3) మూడు వికెట్లు తీసింది. వీజే జోషిత్ (2-1-5-1) ఓ వికెట్ పడగొట్టింది. HISTORY IN U-19 WORLD CUP 📢Vaishnavi Sharma becomes the first Indian bowler to take the Hat-trick in Women's U-19 WC history. pic.twitter.com/s9ziyvZjpm— Johns. (@CricCrazyJohns) January 21, 2025మలేసియా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. ఎక్స్‌ట్రాల రూపంలో లభించిన 11 పరుగులే ఆ జట్టు తరఫున అత్యధికం. నలుగురు బ్యాటర్లు డకౌట్ కాగా.. ఇద్దరు 5 పరుగులు, ఇద్దరు 3 పరుగులు, ఒకరు 2, ఇద్దరు ఒక్క పరుగు చేశారు.అనంతరం అతి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ కేవలం 17 బంతుల్లోనే ఆట ముగించేసింది. ఓపెనర్లు గొంగడి త్రిష, జి కమలిని కళ్లు మూసి తెరిచే లోగా ఖేల్ ఖతం చేశారు. త్రిష పూనకాలు వచ్చినట్లు ఊగిపోయి 12 బంతుల్లో 5 బౌండరీల సాయంతో 27 పరుగులు చేసింది. కమలిని 5 బంతుల్లో బౌండరీ సాయంతో నాలుగు పరుగులు చేసింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో తిరుగులేని రన్‌రేట్‌తో (+9.148) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. గ్రూప్-ఏలో భారత్ సహా శ్రీలంక (2 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో రెండో స్థానం), వెస్టిండీస్ (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలతో మూడో స్థానం), మలేసియా (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలతో నాలుగో స్థానం) జట్లు ఉన్నాయి.కాగా, భారత్ తమ తొలి గ్రూప్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై తిరుగులేని విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ భారత బౌలర్లు చెలరేగి వెస్టిండీస్‌ను 44 పరుగులకే కుప్పకూల్చారు. అనంతరం టీమిండియా వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ప్రత్యర్థి నిర్ధేశించిన 45 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4.2 ఓవర్లలనే ఛేదించింది. గొంగడి త్రిష 4 పరుగులకే ఔటైనా.. కమలిని (16 నాటౌట్), సనికా ఛల్కే (18 నాటౌట్) భారత్‌ను గెలుపు తీరాలు దాటించారు. అంతకుముందు భారత బౌలర్లు పరుణిక సిసోడియా (2.2-0-7-3), ఆయూషి శుక్లా (4-1-6-2), వీజే జోషిత్ (2-0-5-2) విజృంభించడంతో వెస్టిండీస్ 44 పరుగులకే ఆలౌటైంది. -
కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు.. టీమిండియా నయా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్
కోల్‌కతా: భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 184 వికెట్లు తీయడంతో పాటు 1,712 పరుగులు కూడా సాధించాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరగబోయే టి20 సిరీస్ కోసం అతను తొలిసారి వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సుదీర్ఘ కాలం పాటు తనదైన బౌలింగ్, బ్యాటింగ్ శైలిని పోలిన రవీంద్ర జడేజా నీడలోనే ఉండిపోయిన అతను... ఇటీవలే కొన్ని అత్యుత్తమ ప్రదర్శనలతో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. దాదాపు 11 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఎంతో సాధించానని, ఇప్పుడు కొత్తగా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అక్షర్ పటేల్ వ్యాఖ్యానించాడు. ‘భారత జట్టుకు సంబంధించి మూడు ఫార్మాట్లలో సంధి దశ నడుస్తోందనేది వాస్తవం. అయితే దీనిపై సెలక్టర్లే నిర్ణయం తీసుకుంటారు. నాకు సంబంధించి నేను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. అప్పగించిన పనిని సమర్థంగా చేయడమే నాకు తెలుసు. అలా చేస్తే చాలు జట్టులో స్థానం గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. ఫార్మాట్ ఏదైనా అవకాశం లభించిన ప్రతీసారి ఆటను మెరుగుపర్చుకుంటూ ఉత్తమ ప్రదర్శన ఇస్తాను. జట్టులో నా స్థానం గురించి ఎప్పుడూ ఆందోళన చెందను’ అని అతను అన్నాడు. తాజాగా వైస్ కెప్టెన్సీతో కొంత బాధ్యత పెరిగిందనేది మాత్రం వాస్తవమని అక్షర్ అభిప్రాయపడ్డాడు. ‘టీమ్ నాయకత్వ బృందంలో నాకు కూడా అవకాశం దక్కడం సంతోషం. దీని వల్ల బాధ్యత మరింత పెరుగుతుంది. మన టి20 జట్టు స్థిరంగా ఉంది కాబట్టి కొత్తగా అనూహ్య నిర్ణయాలేమీ ఉండవు. అయితే మైదానంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది’ అని అతను చెప్పాడు. భారత జట్టులో ఓపెనర్లకు మాత్రమే వారి స్థానాల విషయంలో స్పష్టత ఉంటుందని, మూడు నుంచి ఏడో స్థానం వరకు బ్యాటర్లు ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలని అతను అభిప్రాయ పడ్డాడు. ‘ఏడాది కాలంగా ఇది కొనసాగుతోంది. 3–7 బ్యాటర్లు మ్యాచ్‌లో ఆ సమయంలో ఉన్న పరిస్థితిని బట్టి ఎక్కడైనా ఆడాల్సి ఉంటుంది. దీని గురించి ఆటగాళ్లందరికీ ఇప్పటికే చెప్పేశాం’ అని పటేల్ వెల్లడించాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం జట్టులో తాను ఎంపిక కాకపోవడంపై ఎలాంటి నిరాశ కలగలేదని... 15 మందిని ఎంపిక చేస్తారని, తనకు చోటు దక్కకపోవడం పెద్ద విషయం కాదని అక్షర్ స్పష్టం చేశాడు. ఆ సిరీస్‌లో భారత జట్టు ప్రదర్శన గురించి ఇప్పుడు చర్చ అనవసరమని, ఇప్పుడు కొత్తగా మళ్లీ మొదలు పెడుతున్నామని ఈ గుజరాత్ ఆల్‌రౌండర్ వ్యాఖ్యానించాడు. -
చాంపియన్స్ ట్రోఫీ పూర్తి జట్లు.. కెప్టెన్లు, వైస్ కెప్టెన్లు వీరే
క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy 2025) వన్డే సమరానికి సమయం దగ్గర పడుతోంది. మినీ వన్డే వరల్డ్‌కప్‌గా భావించే చాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. వన్డే ప్రపంచకప్-2023లో సత్తా చాటి ఏడు టీమ్‌లు అర్హత సాధించగా, ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్‌కు నేరుగా ఎంట్రీ లభించింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్థాన్, దుబాయ్ వేదికగా ఈ మెగాటోర్ని జరగనుంది. ఎనిమిదేళ్ల తర్వాత ఈ టోర్నమెంట్ జరుగుతుండడంతో క్రికెట్ అభిమానులు (Cricket Fans) ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 2017లో చివరిగా చాంపియన్స్ ట్రోఫీ జరిగిన సంగతి తెలిసిందే.రౌండ్-రాబిన్ ఫార్మాట్లో చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. 8 జట్లను రెండు గ్రూపులుగా (ఏ, బీ) విభజించారు. ప్రతి జట్టు తమ గ్రూపులోని ప్రతి ఇతర జట్టుతో తలపడుతుంది. ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి. సెమీ ఫైనల్లో విజేతలుగా నిలిచిన రెండు టీమ్‌లు ఫైనల్లో ఢీకొంటాయి. నాకౌట్ చేరేందుకు ప్రతిజట్టు గట్టిగానే ప్రయత్నించే అవకాశం ఉన్నందున ఈసారి మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు రెట్టింపు వినోదాన్ని పంచనున్నాయి. గ్రూప్ ఏలో ఇండియా, (India) న్యూజిలాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ టీమ్‌లున్నాయి. గ్రూప్ బీలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ ఉన్నాయి.ఫిబ్రవరి 19న కరాచిలో జరిగే తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు పోటీపడతాయి. ఫిబ్రవరి 20 నుంచి టీమిండియా (Team India) మ్యాచ్‌లు ఉంటాయి. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికైన దుబాయ్‌లోనే జరుగుతాయి. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఫిబ్రవరి 23న టీమిండియా తలపడుతుంది. మార్చి 2న న్యూజిలాండ్‌తో మన మ్యాచ్ ఉంటుంది. మార్చి 4న దుబాయ్‌లో మొదటి సెమీఫైనల్, మార్చి 5న లాహోర్‌లో రెండో సెమీఫైనల్ జరగనున్నాయి. టైటిల్ విజేతను తేల్చే ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరుగుతుంది. కాగా, పాకిస్థాన్ తప్ప మిగతా దేశాలు తమ జట్లను ఇప్పటికే ప్రకటించాయి.Group Aఇండియాకెప్టెన్: రోహిత్ శర్మవైస్ కెప్టెన్: శుభమన్ గిల్స్టార్ ప్లేయర్లు: విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాభారత పూర్తి జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (విసి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిన్యూజిలాండ్కెప్టెన్: మిచెల్ సాంట్నర్కీలక ఆటగాళ్లు: కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీన్యూజిలాండ్ పూర్తి జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, విలియమ్సన్, విల్ యంగ్.పాకిస్తాన్కెప్టెన్: బాబర్ ఆజంవైస్ కెప్టెన్: మహ్మద్ రిజ్వాన్ కీలక ఆటగాళ్లు: షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్పాకిస్థాన్ జట్టు (అంచనా): బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులామ్, నోమన్ అలీ, సాజిద్ ఖాన్, నసీమ్ షా, ఇహ్సానుల్లా, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రవూఫ్, అఘా సల్మాన్, ఉస్మాన్ ఖాదిర్, తయ్యాబ్ తాదిర్, హసన్ అలీబంగ్లాదేశ్కెప్టెన్: నజ్ముల్ హొస్సేన్కీలక ఆటగాళ్లు: ముష్ఫికర్ రహీమ్, తస్కిన్ అహ్మద్, మహ్మదుల్లాబంగ్లాదేశ్ పూర్తి జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, తంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహమూద్ ఉల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, పర్వేజ్ హోస్సై ఎమోన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, నహిద్ రానాGroup Bఇంగ్లండ్కెప్టెన్: జోస్ బట్లర్వైస్-కెప్టెన్: హ్యారీ బ్రూక్కీలక ఆటగాళ్లు: జో రూట్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ఇంగ్లండ్ పూర్తి జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్ఆస్ట్రేలియాకెప్టెన్: పాట్ కమిన్స్కీలక ఆటగాళ్లు: స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్ఆస్ట్రేలియా పూర్తి జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, ఆరోన్ హార్డీ, మిషెల్ హార్డీ, హాజిల్‌వుడ్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపాదక్షిణాఫ్రికాకెప్టెన్: టెంబా బావుమాకీలక ఆటగాళ్లు: కగిసో రబడ, హెన్రిచ్ క్లాసెన్, రాస్సీ వాన్ డెర్ డుసెన్దక్షిణాఫ్రికా పూర్తి జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), ర్యాన్ రికిల్టన్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డి జోర్జి, వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబడ, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జేఅఫ్గానిస్థాన్కెప్టెన్: హష్మతుల్లా షాహిదీవైస్ కెప్టెన్: రహమత్ షాకీలక ఆటగాళ్లు: రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ఫజల్ హక్ ఫరూఖీఅఫ్గానిస్థాన్ పూర్తి జట్టు: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మత్ షా (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెడిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీబ్, మహ్మద్ నబీబ్, రహమ్మద్ నబీబ్, గజన్ఫర్, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫరూఖీ, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్.రిజర్వ్ ఆటగాళ్లు: దర్విష్ రసూలీ, నంగ్యాల్ ఖరోటీ, బిలాల్ సామివేదికలుకరాచీ నేషనల్ స్టేడియంలాహోర్: గడాఫీ స్టేడియంరావల్పిండి క్రికెట్ స్టేడియందుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంమ్యాచ్లన్నీ మధ్యాహ్నం 2.30కు ప్రారంభమవుతాయి. -
పాక్ గడ్డపై పొట్టి మ్యాచ్
పాకిస్తాన్, వెస్టిండీస్ జట్ల మధ్య ముల్తాన్ వేదికగా నిన్న (జనవరి 19) ముగిసిన టెస్ట్ మ్యాచ్ రికార్డుపుటల్లోకెక్కింది. ఈ మ్యాచ్ పాకిస్తాన్ గడ్డపై అత్యంత పొట్టి మ్యాచ్‌గా (బంతుల పరంగా) రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్ కేవలం 1064 బంతుల్లోనే ముగిసింది. పాకిస్తాన్ గడ్డపై అతి త్వరగా (బంతుల పరంగా) ముగిసిన టెస్ట్ మ్యాచ్ ఇదే. ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్లో బంతుల పరంగా అతి త్వరగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌గా భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచ్ 2023-24లో సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ కేవలం 642 బంతుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బంతుల పరంగా అతి వేగంగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌ల జాబితాలో తాజాగా ముగిసిన పాకిస్తాన్, వెస్టిండీస్ మ్యాచ్ 10వ స్థానంలో నిలిచింది.పాకిస్తాన్ గడ్డపై బంతుల పరంగా అతి పొట్టి టెస్ట్ మ్యాచ్‌లు..2025- పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్, ముల్తాన్ (1064 బంతుల్లో ముగిసింది)1990- పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్, ఫైసలాబాద్ (1080 బంతుల్లో)1986- పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్, లాహోర్ (1136)2001- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, ముల్తాన్ (1183)2024- పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్, రావల్పిండి (1233)బంతుల పరంగా అతి వేగంగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లు..624- భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (2023,24, కేప్‌టౌన్)656- సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా (1931-32, మెల్బోర్న్)672- వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ (1934-35, బ్రిడ్జ్‌టౌన్)788- ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా (1888, మాంచెస్టర్)842- భారత్ వర్సెస్ ఇంగ్లండ్ (2020-21, అహ్మదాబాద్)872- న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా (1945-46, వెల్లింగ్టన్)893- పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (2002-03, షార్జా)920- శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా (2022, గాలే)1011- జింబాబ్వే వర్సెస్ న్యూజిలాండ్ (2005, హరారే)1064- పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ (2025, ముల్తాన్)ఔ1069- బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ (2023-24, మీర్పూర్)1423- ఐర్లాండ్ వర్సెస్ జింబాబ్వే (2024, బెల్ఫాస్ట్)కాగా, ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో పాక్ స్పిన్ త్రయం సాజిద్ ఖాన్ (9 వికెట్లు), నౌమన్ అలీ (6 వికెట్లు), అబ్రార్ అహ్మద్ (5 వికెట్లు) 20 వికెట్లు పడగొట్టింది. వెస్టిండీస్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 137, 123 పరుగులకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకు ఆలౌటైన పాక్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 157 పరుగులే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో విండీస్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్ 10 వికెట్లు తీశాడు. -
శతక్కొట్టిన టామ్ బాంటన్.. ముంబై ఇండియన్స్ తరఫున తొలి సెంచరీ
ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2025 ఎడిషన్‌లో రెండో సెంచరీ నమోదైంది. షార్జా వైపర్స్‌తో నిన్న (జనవరి 19) జరిగిన మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ ఆటగాడు టామ్ బాంటన్ శతక్కొట్టాడు. ఐఎల్టీ20 (ILT20) చరిత్రలో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ తరఫున ఇదే తొలి సెంచరీ. బాంటన్‌కు ముందు ఐఎల్టీ20లో కేవలం ముగ్గురు మాత్రమే సెంచరీలు చేశారు. లీగ్ చరిత్రలో తొలి సెంచరీని టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (షార్జా వారియర్స్) చేయగా.. రెండో సెంచరీని అలెక్స్ హేల్స్ (డెజర్ట్ వైపర్స్) చేశాడు. లీగ్‌లో మూడో సెంచరీ ఇదే సీజన్లో నమోదైంది. సీజన్ నాలుగో మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌పై షాయ్ హోప్ (దుబాయ్ క్యాపిటల్స్) శతక్కొట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. షార్జా వారియర్స్‌పై ఎంఐ ఎమిరేట్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన షార్జా వారియర్స్, ఓపెనర్ జాన్సన్ ఛార్లెస్ (42 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), వన్‌డౌన్ బ్యాటర్ అవిష్క ఫెర్నాండో (17 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. వీరిద్దరూ మినహా వారియర్స్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. లూక్ వెల్స్ (18), కరీమ్ జనత్ (18), ఎథన్ డిసౌజా (11) రెండంకెల స్కోర్లు చేశారు. జేసన్ రాయ్ (1), రోహన్ ముస్తఫా (6), కీమో పాల్ (4), కెప్టెన్ సౌథీ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్ రెండు, రొమారియో షెపర్డ్, వకార్ సలామ్కిల్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన ఎంఐ ఎమిరేట్స్ 17.4 ఓవర్లలో ఆడుతూపాడుతూ వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఎమిరేట్స్ ఆదిలోనే ముహమ్మద్ వసీం (12) వికెట్ కోల్పోయినా, టామ్ బాంటన్ (55 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్సర్లు), ఇంపాక్ట్ ప్లేయర్ కుసాల్ పెరీరా (42 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు అజేయమైన 157 పరుగులు జోడించారు. ఐఎల్టీ20లో ముంబై ఇండియన్స్ తరఫున ఇదే అత్యధిక భాగస్వామ్యం. లీగ్ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. ఐఎల్టీ20లో డెసర్ట్ వైపర్స్ ఆటగాళ్లు కొలిన్ మున్రో, అలెక్స్ హేల్స్ నెలకొల్పిన 164 పరుగుల భాగస్వామ్యం ఏ వికెట్‌కైనా అత్యధికం. 2023 సీజన్లో మున్రో, హేల్స్ ఈ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ గెలుపుతో ఎమిరేట్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. -
చరిత్ర సృష్టించిన ముంబై యువ సంచలనం.. యశస్వి జైస్వాల్ వరల్డ్ రికార్డు బద్దలు
ముంబై యువ సంచలనం ఆయుశ్ మాత్రే సరికొత్త రికార్డు నెలకొల్పాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో భాగంగా నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మాత్రే (181) భారీ సెంచరీతో మెరిశాడు. 17 ఏళ్ల 168 రోజుల వయసులో మాత్రే ఈ భారీ సెంచరీ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో (50 ఓవర్ల ఫార్మాట్) ఇంత చిన్న వయసులో 150 ప్లస్ స్కోర్ ఎవరూ చేయలేదు. ఇదో వరల్డ్ రికార్డు. గతంలో ఈ రికార్డు టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉండేది. యశస్వి కూడా ముంబై తరఫున ఆడుతూ 17 ఏళ్ల 291 రోజుల వయసులో 150 ప్లస్ స్కోర్ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత చిన్న వయసులో 150 ప్లస్ చేసిన ఆటగాళ్లుఆయుశ్ మాత్రే 17 ఏళ్ల 168 రోజులుయశస్వి జైస్వాల్ 17 ఏళ్ల 291 రోజులురాబిన్ ఉతప్ప 19 ఏళ్ల 63 రోజులుటామ్ ప్రెస్ట్ 19 ఏళ్ల 136 రోజులుమాత్రే ఇన్నింగ్స్ విషయానికొస్తే.. నాగాలాండ్‌తో మ్యాచ్‌లో మాత్రే 117 బంతుల్లో 15 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 181 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఇది ఐదో అత్యధిక స్కోర్. ఈ మ్యాచ్‌లో మాత్రే.. అంగ్‌క్రిశ్ రఘువంశీతో (56) కలిసి తొలి వికెట్‌కు 156 పరుగులు జోడించాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ సునామీ ఇన్నింగ్స్ (28 బంతుల్లో 73 నాటౌట్; 2 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడటంతో ముంబై భారీ స్కోర్ చేసింది. శార్దూల్ సిక్సర్ల సునామీ ధాటికి ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 403 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో బిస్త 2, సిద్దేశ్ లాడ్ 39, సుయాంశ్ షేడ్గే 5, ప్రసాద్ పవార్ 38, అంకోలేకర్ 0, హిమాన్షు సింగ్ (5) పరుగులు చేశారు. నాగాలాండ్ బౌలర్లలో దిప్ బోరా మూడు వికెట్లు పడగొట్టగా.. నగాహో చిషి 2, ఇమ్లివాటి లెమ్టూర్, జే సుచిత్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నాగాలాండ్ 14 ఓవర్లు పూర్తయ్యే సరికి 42 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయింది. బ్యాట్‌తో మెరిసిన శార్దూల్ ఠాకూర్ (4-1-12-2) బంతితోనూ సత్తా చాటాడు. రాయ్స్టన్ డయాస్ రెండు, సుయాన్ష్ షేడ్గే ఓ వికెట్ దక్కించుకున్నారు. నాగాలాండ్ ఇన్నింగ్స్‌లో డేగా నిశ్చల్ (5), హేమ్ చెత్రి (2), యుగంధర్ సింగ్ (0), కెప్టెన్ రాంగ్సెన్ జొనాథన్ (0), చేతన్ బిస్త్ (0) ఔట్ కాగా.. రుపేరో (22), జే సుచిత్ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో నాగాలాండ్ గెలవాలంటే 36 ఓవర్లలో 362 పరుగులు చేయాలి. చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి.ఈ మ్యాచ్‌లో ముంబై ఆటగాళ్లు, టీమిండియా స్టార్ ప్లేయర్లు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే ఆడటం లేదు. ప్రత్యర్ధి చిన్న జట్టు కావడంతో ముంబై మేనేజ్మెంట్ పై ముగ్గురికి విశ్రాంతినిచ్చింది. శ్రేయస్ అయ్యర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. -
2025లో టీమిండియా షెడ్యూల్ ఇదే..!
మెల్బోర్న్ టెస్ట్‌లో ఓటమితో 2024 సంవత్సరాన్ని ముగించిన టీమిండియా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదో టెస్ట్‌తో కొత్త ఏడాదిని (2025) ప్రారంభిస్తుంది. సిడ్నీ టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7 వరకు సాగనుంది. అనంతరం భారత్ జనవరి 22 నుంచి ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. ఐదు టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ భారత్‌లో పర్యటిస్తుంది.ఇంగ్లండ్ టూర్ ఆఫ్ ఇండియా షెడ్యూల్జనవరి 22- తొలి టీ20 (కోల్‌కతా)జనవరి 25- రెండో టీ20 (చెన్నై)జనవరి 28- మూడో టీ20 (రాజ్‌కోట్)జనవరి 31- నాలుగో టీ20 (పూణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20 (ముంబై)ఫిబ్రవరి 6- తొలి వన్డే (నాగ్‌పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే (కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే (అహ్మదాబాద్)ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ అనంతరం భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ (వన్డేలు) ఆడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా షెడ్యూల్ ఇలా ఉండబోతుంది.ఫిబ్రవరి 20- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (దుబాయ్)గ్రూప్ దశలో ఫలితాల ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీలో తదుపరి మ్యాచ్‌లు (సెమీస్, ఫైనల్) ఉంటాయి.మార్చి 14 నుంచి మే 25 వరకు ఐపీఎల్ 2025 జరుగుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్ వచ్చే ఏడాది జూన్ 20న మొదలవుతుంది. ఈ సిరీస్ షెడ్యూల్ ఇలా ఉండనుంది.జూన్ 20-24: తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6: రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14: మూడో టెస్ట్ (లండన్, లార్డ్స్)జులై 23-27: నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4: ఐదో టెస్ట్ (లండన్, కెన్నింగ్స్టన్ ఓవల్)షెడ్యూల్ ప్రకారం టీమిండియా వచ్చే ఏడాది బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికాలతో కూడా సిరీస్‌లు ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు.2025లో టీమిండియా ఆడే వన్డేలుఇంగ్లండ్తో 3ఛాంపియన్స్ ట్రోఫీలో 5బంగ్లాదేశ్‌తో 3 (బంగ్లాదేశ్‌తో)ఆస్ట్రేలియాతో 3 (ఆస్ట్రేలియాలో)సౌతాఫ్రికాతో 3 (భారత్‌లో)వచ్చే ఏడాది టీమిండియా ఆడే టెస్ట్లుఆస్ట్రేలియాతో ఒకటి (బీజీటీ)క్వాలిఫై అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ఇంగ్లండ్తో 5 (ఇంగ్లండ్‌లో)వెస్టిండీస్‌తో 2 (భారత్‌లో)సౌతాఫ్రికాతో 2 (భారత్‌లో) -
నిప్పులు చెరిగిన డఫీ.. లంకను చిత్తు చేసిన కివీస్.. సిరీస్ కైవసం
మౌంట్ మాంగనూయ్ వేదికగా శ్రీలంకతో (Sri Lanka) జరిగిన రెండో టీ20లో ఆతిథ్య న్యూజిలాండ్ (New Zealand) 45 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచ్ సిరీస్‌ను కివీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.ఇవాళ (డిసెంబర్ 30) జరిగిన రెండో టీ20లో శ్రీలంక టాస్ గెలిచి న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టిమ్ రాబిన్సన్ (41), మార్క్ చాప్మన్ (42), మిచెల్ హే (41 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో రచిన్ రవీంద్ర 1, గ్లెన్ ఫిలిప్స్ 23, డారిల్ మిచెల్ 18 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో మిచెల్ హే (Mitchell Hay) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. లంక బౌలర్లలో వనిందు హసరంగ రెండు వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషార, మతీశ పతిరణ తలో వికెట్ దక్కించుకున్నారు.187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 19.1 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. జేకబ్ డఫీ (Jacob Duffy) (4-0-15-4) నాలుగు వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించాడు. మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్ తలో రెండు.. మైఖేల్ బ్రేస్‌వెల్, జకరీ ఫోల్క్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. లంక ఇన్నింగ్స్‌లో కుసాల్ పెరీరా (48) టాప్ స్కోరర్‌గా నిలువగా.. పథుమ్ నిస్సంక (37), చరిత్ అసలంక (20), కుసాల్ మెండిస్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. కమిందు మెండిస్ (7), అవిష్క ఫెర్నాండో (5), వనిందు హసరంగ (1), మహీశ్ తీక్షణ (0), బినుర ఫెర్నాండో (3), మతీశ పతిరణ (0) విఫలమయ్యారు. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 నెల్సన్ వేదికగా వచ్చే ఏడాది జనవరి 2న జరుగనుంది.తొలి మ్యాచ్‌లోనూ ఇబ్బంది పెట్టిన డఫీన్యూజిలాండ్ పేసర్ జేకబ్ డఫీ తలో టీ20లోనూ లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఆ మ్యాచ్‌లో డఫీ 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. తద్వారా ఛేదనలో శ్రీలంక ఇబ్బంది పడి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో డఫీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది.తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (62), మైఖేల్ బ్రేస్‌వెల్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో తీక్షణ, హసరంగ, బినుర తలో రెండు వికెట్లు తీయగా.. పతిరణ ఓ వికెట్ దక్కించుకున్నాడు.173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. ఓపెనర్లు నిస్సంక (90), కుసాల్ మెండిస్ (46) రాణించడంతో ఓ దశలో గెలుపు దిశగా సాగింది. అయితే డఫీ సహా కివీస్ పేసర్లు మ్యాట్ హెన్రీ (2/28), జకరీ ఫోల్క్స్ (2/41) ఒక్కసారిగా విజృంభించడంతో శ్రీలంక ఓటమిపాలైంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. లంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు మినహా ఎవ్వరూ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేకపోయారు. -
IND VS AUS 4th Test: నాలుగో రోజు ముగిసిన ఆట.. టీమిండియా ముందు భారీ లక్ష్యం
నాలుగో రోజు ముగిసిన ఆట.. టీమిండియా ముందు భారీ లక్ష్యంమెల్బోర్న్ టెస్ట్‌లో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ 333 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాథన్ లయోన్ (41), స్కాట్ బోలాండ్ (10) చివరి వికెట్‌కు 50కు పైగా పరుగులు (100కు పైగా బంతులు ఎదుర్కొని) జోడించి టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 3, జడేజా ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 82, రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24, విరాట్ కోహ్లి 36, ఆకాశ్‌దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17, నితీశ్ రెడ్డి 114, వాషింగ్టన్ సుందర్ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయోన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.దీనికి ముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖ్వాజా (57), లబూషేన్ (72), కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్‌దీప్ 2, సుందర్ ఓ వికెట్ పడగొట్టారు.ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆసీస్.. స్టార్క్ రనౌట్ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్148 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. సెంచరీ దిశగా సాగుతున్న లబూషేన్‌ను (70) సిరాజ్ సూపర్ డెలివరీతో ఎల్బీడబ్ల్యూ చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 253 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. గాడిలో పడుతున్న ఆస్ట్రేలియాలంచ్ తర్వాత వడివడిగా వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా టీ విరామానికి ముందు కాస్త కుదుటపడింది. 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఆ ఆతర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది. టీ విరామం సమయానికి ఆసీస్ స్కోర్ 135/6గా ఉంది. లబూషేన్ (65).. కమిన్స్‌తో (21) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆసీస్ 240 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్91 పరుగుల వద్ద ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. బుమ్రా అద్భుతమైన బంతితో అలెక్స్ క్యారీని (2) క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం ఆసీస్ 196 పరుగుల లీడ్‌లో ఉంది. బుమ్రా ఆన్ ఫైర్.. 85 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆసీస్బుమ్రా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. తొలుత డేంజర్ మ్యాన్ ట్రవిస్ హెడ్‌ను (1) పెవిలియన్‌కు పంపిన బుమ్రా అదే ఓవర్ చివరి బంతికి మిచెల్ మార్ష్‌ను (0) ఔట్ చేశాడు. మొత్తంగా ఆసీస్ 10 బంతుల వ్యవధిలో మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది. జోరు మీదున్న బుమ్రా, సిరాజ్.. కష్టాల్లో ఆసీస్భారత పేసర్లు బుమ్రా, సిరాజ్ జోరు మీదున్నారు. వీరి ధాటికి ఆసీస్ ఆరు బంతుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. స్టీవ్ స్మిత్‌ను (13) సిరాజ్.. డేంజర్ మ్యాన్ ట్రవిస్ హెడ్‌ను (1) బుమ్రా పెవిలియన్‌కు పంపారు. ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 85/4గా ఉంది. లబూషేన్ (39), మిచెల్ మార్ష్ క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ 190 పరుగుల ఆధిక్యంలో ఉంది.లంచ్ బ్రేక్.. 158 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియారోజు లంచ్ విరామం సమయానికి ఆసీస్ స్కోర్ 53/2గా ఉంది. 105 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకుని ప్రస్తుతం ఆసీస్ 158 పరుగుల ఆధిక్యంలో ఉంది. లబూషేన్ (20), స్టీవ్ స్మిత్ (2) క్రీజ్‌లో ఉన్నారు.43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాను 369 పరుగులకు ఆలౌట్ చేసిన ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కొన్‌స్టాస్‌ను బుమ్రా.. ఖ్వాజాను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశారు. లబూషేన్ (16), స్టీవ్ స్మిత్ క్రీజ్‌లో ఉన్నారు.భారత్ 369 ఆలౌట్358/9 స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 11 పరుగులు జోడించి 369 పరుగులకు ఆలౌటైంది. సెంచరీ హీరో నితీశ్ కుమార్ రెడ్డి (114) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 82, రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24, విరాట్ కోహ్లి 36, ఆకాశ్‌దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17, వాషింగ్టన్ సుందర్ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయోన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖ్వాజా (57), లబూషేన్ (72), కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్‌దీప్ 2, సుందర్ ఓ వికెట్ పడగొట్టారు. -
IND Vs AUS 4th Test: మూడో రోజు ముగిసిన ఆట.. ఇంకా 116 పరుగులు వెనుకపడి ఉన్న భారత్
IND VS AUS 4th Test Day 3 Live Updates And Highlights:మూడో రోజు ముగిసిన ఆట.. ఇంకా 116 పరుగులు వెనుకపడి ఉన్న భారత్వెలుతురు లేమి కారణంగా మూడో రోజు ఆట ముందుగానే ముగిసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 116 పరుగులు వెనుకపడి ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 358/9గా ఉంది. నితీశ్ కుమార్ రెడ్డి (105), సిరాజ్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ గడ్డపై సత్తా చాటిన తెలుగోడు.. నితీశ్ సూపర్ సెంచరీఆసీస్ గడ్డపై తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి సత్తా చాటాడు. మెల్బోర్న్ టెస్ట్‌లో నితీశ్ సూపర్ సెంచరీ చేశాడు. జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినప్పుడు బరిలోకి దిగిన నితీశ్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. బోలాండ్ బౌలింగ్‌లో బౌండరీ బాది నితీశ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 11వ నంబర్ ఆటగాడు సిరాజ్ సహకారంతో నితీశ్ సెంచరీ పూర్తి చేశాడు.తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్.. బుమ్రా డకౌట్ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా.. సుందర్ ఔట్348 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. నాథన్ లయోన్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి సుందర్ పెవిలియన్ బాట పట్టాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సుందర్.. సెంచరీకి చేరువగా నితీశ్లయోన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సుందర్ 146 బంతుల్లో సింగిల్ బౌండరీతో హాఫ్ సెంచరీ మార్కు తాకాడు. మరో ఎండ్‌లో నితీశ్‌కుమార్ సెంచరీకి చేరువయ్యాడు. ప్రస్తుతం నితీశ్ స్కోర్ 94 నాటౌట్‌గా ఉంది. భారత్ స్కోర్ 345/7. నితీశ్, సుందర్ ఇద్దరూ క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 129 పరుగులు వెనుకపడి ఉంది. తిరిగి ప్రారంభమైన ఆట10:30- వెలుతురు లేమి కారణంగా కాసేపు నిలిచిపోయిన ఆట తిరిగి ప్రారంభమైంది. వెలుతరు లేమి కారణంగా నిలిచిపోయిన ఆట.. సెంచరీకి చేరువగా నితీశ్వెలుతురు లేమి కారణంగా ఆట నిలిచిపోయింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి టీమిండియా స్కోర్ 326/7గా ఉంది. భారత్‌ను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించిన నితీశ్ కుమార్ (85) సెంచరీకి చేరువగా ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్ (40) నితీశ్‌కు అండగా క్రీజ్‌లో ఉన్నాడు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 100కు పైగా పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం నితీశ్‌కుమార్ రెడ్డి చేసుకున్న పుష్ప తరహా సెలబ్రేషన్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి.లంచ్ విరామం.. ఎదురీదుతున్న టీమిండియా మూడో రోజు లంచ్ విరామం సమయానికి టీమిండియా ఎదురీదుతుంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 230 పరుగులు వెనుకపడి ఉంది. నితీశ్‌కుమార్ రెడ్డి (40), సుందర్ (5) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ స్కోర్ 244/7గా ఉంది.ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా221 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. లయోన్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా (17) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.ఆరో వికెట్ కోల్పోయిన భారత్191 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. బాగా సెట్ అయ్యాడనుకున్న తరుణంలో రిషబ్ పంత్ (28) బోలాండ్ బౌలింగ్‌లో లయోన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.మూడో రోజు మొదలైన ఆట310 పరుగులు వెనుకపడి టీమిండియా మూడో రోజు ఆట ప్రారంభించింది. రవీంద్ర జడేజా (4), రిషబ్ పంత్ (5) క్రీజ్‌లో ఉన్నారు.రెండో రోజు ముగిసిన ఆటబాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రెండో రోజు ఆట కాసేపట్లో ముగుస్తుందనగా 6 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 164/5గా ఉంది. రవీంద్ర జడేజా (4), రిషబ్ పంత్ (5) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 310 పరుగులు వెనుకపడి ఉంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 82, విరాట్ కోహ్లి 36, కేఎల్ రాహుల్ 24, రోహిత్ శర్మ 3, నైట్ వాచ్‌మన్ ఆకాశ్‌దీప్ 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 474 పరుగుల వద్ద ముగిసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్‌స్టాస్ (60), ఖ్వాజా (57), లబూషేన్ (72), పాట్ కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. ట్రవిస్ హెడ్ (0), మిచెల్ మార్ష్ (4) విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా.. జడేజా 3, ఆకాశ్‌దీప్ 2, సుందర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. శుబ్‌మన్ గిల్ స్ధానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చాడు.మరోవైపు ఆసీస్ తమ జట్టులో రెండు మార్పులు చేసింది. మెక్‌స్వీనీ స్ధానంలో యువ సంచలనం సామ్ కొంటాస్ తుది జట్టులోకి రాగా.. గాయం కారణంగా దూరమైన హాజిల్‌వుడ్ స్ధానంలో స్కాట్ బోలాండ్ ఎంట్రీ ఇచ్చాడు.తుది జట్లుఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, సామ్ కొంటాస్, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ -
విధ్వంసం సృస్టించిన సురేశ్ రైనా
బిగ్ క్రికెట్ లీగ్-2024 ఎడిషన్‌లో ఇవాళ (డిసెంబర్ 22) ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. సథరన్ స్పార్టన్స్‌తో జరుగుతున్న అంతిమ పోరులో ముంబై మెరైన్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సథరన్ స్పార్టన్స్‌కు టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా సారథ్యం వహిస్తుండగా.. ముంబై మెరైన్స్కు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.ఫిల్ మస్టర్డ్ ఊచకోత.. సురేశ్ రైనా విధ్వంసంతొలుత బ్యాటింగ్ చేసిన సథరన్ స్పార్టన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ఫిల్ మస్టర్డ్ (39 బంతుల్లో 78; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోయగా.. సురేశ్ రైనా (26 బంతుల్లో 51; 9 ఫోర్లు, సిక్సర్) విధ్వంసం సృష్టించాడు. స్పార్టన్స్ ఇన్నింగ్స్‌లో సోలొమన్ మైర్ 7, అభిమన్యు మిధున్ 25, ఫయాజ్ ఫజల్ 30, అమాన్ ఖాన్ 10 పరుగులు చేశారు. మెరైన్స్ బౌలర్లలో మన్‌ప్రీత్ గోని, మనన్ శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
ఇంగ్లండ్ జట్టుకు అతి భారీ షాక్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025, దానికి ముందు టీమిండియాతో జరిగే కీలకమైన వైట్‌బాల్ సిరీస్‌లకు ముందు ఇంగ్లండ్ జట్టుకు అతి భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్థార్ ఆటగాడు, టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా పై రెండు ఈవెంట్లకు దూరమయ్యాడు. 33 ఏళ్ల స్టోక్స్ ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరికి గురయ్యాడు. భారత్‌తో జరిగే టెస్ట్ సిరీస్, యాషెస్ సిరీస్ 2025-26 దృష్ట్యా స్టోక్స్‌కు విశ్రాంతి కల్పించారని తెలుస్తుంది.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ-2025, దానికి ముందు టీమిండియాతో జరిగే వైట్‌బాల్ సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టును ఇవాళ (డిసెంబర్ 22) ప్రకటించారు. వన్డే, టీ20 జట్లకు కెప్టెన్‌గా జోస్ బట్లర్ ఎంపికయ్యాడు. టెస్ట్ జట్టు కీలక సభ్యుడు జో రూట్, 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత తొలి సారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ వన్డే, టీ20 జట్లలో చోటు దక్కించుకున్నాడు. వికెట్కీపర్లు జేమీ స్మిత్, ఫిల్ సాల్ట్.. రైజింగ్ స్టార్ జేకబ్ బేతెల్ కూడా రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు.భారత్‌తో సిరీస్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ వ్యవహరిస్తాడు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్ల హెడ్ కోచ్‌గా మెక్‌కల్లమ్‌కు ఇవే తొలి అసైన్మెంట్స్ అవుతాయి. ఇప్పటివరకు మెక్కల్లమ్ కేవలం టెస్ట్ జట్టుకు మాత్రమే హెడ్ కోచ్‌గా ఉన్నాడు.భారత్‌తో జరిగే వన్డే సిరీస్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీల కోసం ఇంగ్లండ్ జట్టు..జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సకీబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్భారత్తో జరిగే టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు..జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్భారత్లో ఇంగ్లండ్ పర్యటన షెడ్యూల్ వివరాలు..జనవరి 22- తొలి టీ20 (కోల్‌కతా)జనవరి 25- రెండో టీ20 (చెన్నై)జనవరి 28- మూడో టీ20 (రాజ్‌కోట్)జనవరి 31- నాలుగో టీ20 (పూణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20 (ముంబై)ఫిబ్రవరి 6- తొలి వన్డే (నాగ్‌పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే (కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే (అహ్మదాబాద్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు పోటీపడనున్నాయి. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్తాన్ వేదికగా జరుగనుంది. టోర్నీకి సంబంధించిన మ్యాచ్ తేదీలను, వేదికలను ప్రకటించాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరుగనున్నాయి. -
విండీస్‌ను వారి సొంతగడ్డపై చిత్తు చేసిన బంగ్లాదేశ్
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను బంగ్లాదేశ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. భారతకాలమానం ప్రకారం ఇవాళ (డిసెంబర్ 18) ఉదయం జరిగిన రెండో టీ20లో బంగ్లాదేశ్ 27 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో షమీమ్ హొస్సేన్ (17 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షమీమ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయుంటే బంగ్లాదేశ్ ఈ మాత్రం స్కోరైనా చేయలేకపోయేది. మెహిది హసన్ మిరాజ్ (26), జాకిర్ అలీ (21), మెహిది హసన్ (11), సౌమ్య సర్కార్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో మోటీ 2, అకీల్ హొసేన్, రోస్టన్ ఛేజ్, అల్జరీ జోసఫ్, ఓబెద్ మెక్కాయ్ తలో వికెట్ పడగొట్టారు.130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. బంగ్లా బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 18.3 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. తస్కిన్ అహ్మద్ 3, మెహిది హసన్, తంజిమ్ హసన్ సకీబ్, రిషద్ హొసేన్ తలో 2, హసన్ మహమూద్ ఓ వికెట్ తీసి విండీస్‌ను దెబ్బకొట్టారు. బంగ్లా బౌలర్లు స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుని ఔరా అనిపించారు. విండీస్ ఇన్నింగ్స్‌లో రోస్టన్ ఛేజ్ (32), అకీల్ హొసేన్ (31), జాన్సన్ ఛార్లెస్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లాదేశ్‌కు వెస్టిండీస్‌పై ఆరేళ్ల తర్వాత తొలి సిరీస్ విజయం ఇది. బంగ్లాదేశ్ చివరిసారి 2018లో వెస్టిండీస్‌పై టీ20 సిరీస్ విక్టరీ సాధించింది. బంగ్లాదేశ్.. వెస్టిండీస్‌ను వారి సొంతగడ్డపై చిత్తు చేయడం విశేషం. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 డిసెంబర్ 19న జరుగనుంది. -
ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రవిచంద్రన్ అశ్విన్
-
ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే తొలి వన్డే రద్దు
ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్ 17) జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం మొదలైంది. అయితే మధ్యలో వరుణుడు కాసేపు శాంతించడంతో 28 ఓవర్ల మ్యాచ్‌గా కుదించారు. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జింబాబ్వేను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.సామ్ కర్రన్ సోదరుడు అరంగేట్రంఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ పెద్ద సోదరుడు బెన్ కర్రన్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. బెన్ తన తండ్రి దేశమైన జింబాబ్వే తరఫున తన తొలి వన్డే ఆడాడు. ఈ మ్యాచ్‌లో బెన్ 22 బంతులు ఎదుర్కొని ఓ బౌండరీ సాయంతో 15 పరుగులు చేశాడు. అనంతరం బెన్ అజ్మతుల్లా బౌలింగ్‌లో ఇక్రమ్ అలీఖిల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.నిప్పులు చెరిగిన ఒమర్జాయ్తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. ఆఫ్ఘనిస్తాన్ పేసర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ నిప్పులు చెరగడంతో విలవిలలాడిపోయింది. ఒమర్జాయ్ ధాటికి జింబాబ్వే 41 పరుగులకు సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఒమర్జాయ్ 4.2 ఓవర్లలో 18 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. మిస్టరీ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. జింబాబ్వే స్కోర్ 44/5 వద్ద నుండగా (9.2 ఓవర్లు) వర్షం మళ్లీ మొదలైంది. ఈ దశలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో బెన్ కర్రన్ 15, మరుమణి 6, బ్రియాన్ బెన్నెట్ 0, డియాన్ మైర్స్ 12, సీన్ విలియమ్స్ 0 పరుగులకు ఔట్ కాగా.. కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (1),సికందర్ రజా (1) క్రీజ్‌లో ఉన్నారు. -
శిఖర్ ధవన్ సుడిగాలి శతకం
బిగ్ క్రికెట్ లీగ్‌లో టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ చెలరేగి ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో నార్తర్న్ ఛార్జర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ధవన్.. యూపీ బ్రిడ్జ్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సుడిగాలి శతకంతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో 49 బంతుల్లోనే శతక్కొట్టిన ధవన్.. ఓవరాల్‌గా 63 బంతులు ఎదుర్కొని 14 బౌండరీలు, 5 సిక్సర్ల సాయంతో 119 పరుగులు చేశాడు. SHIKHAR DHAWAN CENTURY. 🙇♂️🔥pic.twitter.com/CntrgLAf4L— Mufaddal Vohra (@mufaddal_vohra) December 17, 2024ధవన్‌కు జతగా మరో ఎండ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ సమీవుల్లా షెన్వారీ కూడా విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. షెన్వారీ 46 బంతుల్లో 11 సిక్స్‌లు, 7 ఫోర్ల సాయంతో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. ధవన్-షెన్వారీ జోడీ తొలి వికెట్‌కు 207 పరుగులు జోడించింది. ధనవ్, షెన్వారీ సుడిగాలి శతకాలతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన నార్తర్న్ ఛార్జర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరు చేసింది.పరుగుల వరద పారిస్తున్న ధవన్బిగ్ క్రికెట్ లీగ్‌లో శిఖర్ ధవన్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ లీగ్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన ధవన్ 170కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో 301 పరుగులు చేశాడు. ఈ లీగ్‌లో ధవన్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనా కూడా ధవన్‌లో జోరు ఏమాత్రం తగ్గలేదు. రిటైర్మెంట్ అనంతరం ధవన్ ప్రతి చోటా లీగ్‌లు ఆడుతున్నాడు. ఇటీవలే అతను నేపాల్ క్రికెట్ లీగ్‌లోనూ పాల్గొన్నాడు. ధవన్ అక్కడ కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి అభిమానులను అలరించాడు. -
WI Vs BAN: వెస్టిండీస్‌పై చారిత్రక విజయం సాధించిన బంగ్లాదేశ్
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. కింగ్స్టౌన్ వేదికగా ఇవాళ (డిసెంబర్ 16) జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. విండీస్ గడ్డపై టీ20ల్లో బంగ్లాదేశ్‌కు ఇది తొలి విజయం. తద్వారా ఈ మ్యాచ్‌కు చారిత్రక గుర్తింపు దక్కింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. సౌమ్య సర్కార్ (43), జాకెర్ అలీ (27), మెహిది హసన్ (26 నాటౌట్), షమీమ్ హొసేన్ (27) రెండంకెల స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో అకీల్ హొసేన్, ఓబెద్ మెక్కాయ్ తలో రెండు వికెట్లు తీయగా.. రోస్టన్ ఛేజ్, రొమారియో షెపర్డ్ చెరో వికెట్ పడగొట్టారు.148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ 19.5 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. మెహిది హసన్ 4 వికెట్లు తీసి విండీస్‌ను దెబ్బకొట్టాడు. హసన్ మహహూద్, తస్కిన్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. తంజిమ్ హసన్, రిషద్ హొసేన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. రోవ్‌మన్ పావెల్ (60) విండీస్‌ను గెలిపించేందుకు చివరి వరకు ప్రయత్నం చేశాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో రోవ్‌మన్ పావెల్‌తో పాటు రొమారియో షెపర్డ్ (22), జాన్సన్ ఛార్లెస్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లాదేశ్ వికెట్‌కీపర్ లిట్టన్ దాస్ ఐదుగురు విండీస్ బ్యాటర్లను ఔట్ చేయడంలో భాగమయ్యాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 డిసెంబర్ 17న జరుగనుంది.కాగా, టీ20 సిరీస్‌కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆతిథ్య వెస్టిండీస్ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. -
ముగిసిన మినీ వేలం.. అత్యంత ఖరీదైన ప్లేయర్ ఎవరంటే..?
మహిళల ఐపీఎల్ (WPL) 2025 సీజన్ మినీ వేలంలో బెంగళూరు నగరంలో ఇవాళ (డిసెంబర్ 15) జరిగింది. ఈ వేలంలో దేశ విదేశాలకు చెందిన 120 మంది ప్లేయర్లు పాల్గొనగా.. ఖాళీగా ఉన్న 19 స్థానాలు భర్తీ అయ్యాయి. వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా షేక్ సిమ్రన్ నిలిచింది. సిమ్రన్ను గుజరాత్ జెయింట్స్ రూ.1.9 కోట్లకు సొంతం చేసుకుంది. సిమ్రన్ తర్వాత అత్యధిక ధర విండీస్ ఆల్‌రౌండర్ డియాండ్రా డొట్టిన్‌కు దక్కింది. డొట్టిన్‌ను గుజరాత్ జెయింట్స్ రూ.1.7 కోట్లకు దక్కించుకుంది. ఈ వేలంలో మరో ఇద్దరు భారతీయ అన్క్యాప్డ్ ప్లేయర్లకు కోటి పైన ధర లభించింది. జి కమలినిని ముంబై ఇండియన్స్ రూ.1.6 కోట్లకు.. ప్రేమా రావత్‌ను ఆర్సీబీ రూ.1.2 కోట్లకు సొంతం చేసుకున్నాయి.డబ్ల్యూపీఎల్ 2025 వేలంలో అత్యధిక ధర పలికిన టాప్-5 ప్లేయర్లుషేక్ సిమ్రన్-1.9 కోట్లు (గుజరాత్ జెయింట్స్)డియాండ్రా డొట్టిన్-1.7 కోట్లు (గుజరాత్ జెయింట్స్)జి కమలిని-1.6 కోట్లు (ముంబై ఇండియన్స్)ప్రేమా రావత్-1.2 కోట్లు (ఆర్సీబీ)నల్లపురెడ్డి చరణి-55 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)డబ్ల్యూపీఎల్ 2025 వేలంలో ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్న ప్లేయర్లు వీళ్లే..!ముంబై ఇండియన్స్:జి కమిలిని-1.6 కోట్లునడినే డి క్లెర్క్-30 లక్షలుఅక్షిత మహేశ్వరి-20 లక్షలుసంస్కృతి గుప్తా-10 లక్షలుఆర్సీబీ:ప్రేమా రావత్-1.2 కోట్లుజోషిత-10 లక్షలురాఘ్వి బిస్త్-10 లక్షలుజాగ్రవి పవార్-10 లక్షలుఢిల్లీ క్యాపిటల్స్:నల్లపురెడ్డి చరణి-55 లక్షలునందిని కశ్యప్-10 లక్షలుసారా బ్రైస్-10 లక్షలునికీ ప్రసాద్-10 లక్షలుయూపీ వారియర్జ్:అలానా కింగ్-30 లక్షలుఆరుషి గోయెల్-10 లక్షలుక్రాంతి గౌడ్-10 లక్షలుగుజరాత్ జెయింట్స్:షేక్ సిమ్రన్-1.9 కోట్లుడియాండ్రా డొట్టిన్-1.7 కోట్లుడేనియెల్ గిబ్సన్-30 లక్షలుప్రకాషిక నాయక్-10 లక్షలు -
ఘనంగా ప్రారంభమైన బిగ్‌బాష్ లీగ్.. తొలి మ్యాచ్‌లో స్టోయినిస్ జట్టు ఓటమి
ఈ ఏడాది బిగ్‌బాష్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో మార్కస్ స్టోయినిస్ నేతృత్వంలోని మెల్బోర్న్ స్టార్స్.. పెర్త్ స్కార్చర్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. స్టోయినిస్ (37), టామ్ కర్రన్ (37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మెల్బోర్న్ స్టార్స్ ఇన్నింగ్స్‌లో జో క్లార్క్ 0, థామస్ రోజర్స్ 14, సామ్ హార్పర్ 1, కార్ట్‌రైట్ 18, వెబ్‌స్టర్ 19, హెచ్ మెక్కెంజీ 4, ఆడమ్ మిల్నే 2, బ్రాడీ కౌచ్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. స్కార్చర్స్ బౌలర్లలో జై రిచర్డ్సన్ 3, లాన్స్ మోరిస్ 2, బెహ్రెన్‌డార్ఫ్, ఆస్టన్ అగర్, కూపర్ కన్నోలీ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం బరిలోకి దిగిన స్కార్చర్స్ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కూపర్ కన్నోలీ (64) మెరుపు ఇన్నింగ్స్ ఆడి స్టార్చర్స్ విజయానికి బీజం వేశాడు. ఆస్టన్ టర్నర్ (37 నాటౌట్), నిక్ హాబ్సన్ (27 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్‌లతో స్కార్చర్స్‌ను విజయతీరాలకు చేర్చారు. స్కార్చర్స్ ఇన్నింగ్స్‌లో ఫిన్ అలెన్ (6), కీటన్ జెన్నింగ్స్ (4), మాథ్యూ హర్స్ట్ (4) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. మెల్బోర్న్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, పీటర్ సిడిల్, టామ్ కర్రన్, బ్రాడీ కౌచ్ తలో వికెట్ పడగొట్టారు. రేపు జరుగబోయే మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్ తలపడతాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతుంది. -
మినీ వేలం.. విండీస్ అల్రౌండర్కు భారీ మొత్తం
మహిళల ఐపీఎల్ (WPL) మినీ వేలం బెంగళూరు వేదికగా ఇవాళ (డిసెంబర్ 15) జరుగుతుంది. ఈ వేలంలో విండీస్ ఆల్‌రౌండర్, లేడీ యూనివర్సల్ బాస్‌గా పిలువబడే డియాండ్రా డొట్టిన్‌ను గుజరాత్ జెయింట్స్ రూ. 1.7 కోట్ల భారీ మొత్తనికి సొంతం చేసుకుంది. ఇవాళ జరుగుతున్న మినీ వేలంలో మొదటిగా సోల్డ్ ఔటైన ప్లేయర్ డొట్టినే. డొట్టిన్‌ను 2023 డబ్ల్యూపీఎల్ ఇనాగురల్ ఎడిషన్‌లో కూడా గజరాత్ జెయింట్సే సొంతం చేసుకుంది. ఆ సీజన్లో జెయింట్స్ డొట్టిన్‌ను రూ. 60 లక్షలకు దక్కింంచుకుంది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ లీగ్ ప్రారంభానికి ముందే జెయింట్స్ డొట్టిన్‌ను వదిలేసింది. డొట్టిన్ తొలుత 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కలు పలికింది. అయితే ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌కు ముందు డొట్టిన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఈ యేడు పొట్టి ప్రపంచకప్‌లో డొట్టిన్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 120 పరుగులు చేయడంతో పాటు ఐదు వికెట్లు తీసింది.కాగా, ఈసారి మెగా వేలంలో గుజరాత్ జెయింట్సే అత్యధిక పర్స్ వాల్యూతో బరిలోకి దిగింది. జెయింట్స్ వద్ద రూ.4.4 కోట్ల పర్స్ బ్యాలెన్స్ ఉంది. ఈ మొత్తంతో జెయింట్స్ కేవలం నాలుగు స్లాట్లు మాత్రమే భర్తీ చేసుకునే అవకాశం ఉంది. డొట్టిన్ కోసం జెయింట్స్‌తో పాటు యూపీ వారియర్జ్ తీవ్రంగా పోటీపడింది. అయితే అంతిమంగా డొట్టిన్‌ను జెయింట్సే దక్కించుకుంది. డొట్టిన్‌కు విధ్వంసకర బ్యాటర్‌గానే కాకుండా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్‌గానూ పేరుంది. అందుకే డొట్టిన్‌కు వేలంలో భారీ మొత్తం దక్కింది.ఇదిలా ఉంటే, డబ్ల్యూపీఎల్ మినీ వేలంలో తమిళనాడు అమ్మాయి జి కమలినిని ముంబై ఇండియన్స్ రూ.1.6 కోట్లకు సొంతం చేసుకుంది. నల్లపురెడ్డి చరణిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 55 లక్షలకు సొంతం చేసుకుంది. నందిని కశ్యప్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.10 లక్షలకు సొంతం చేసుకుంది. సిమ్రన్ షేక్‌కు గుజరాత్ జెయింట్స్ రూ.1.9 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుంది. సౌతాఫ్రికాకు చెందిన నదినే డి క్లెర్క్‌ను ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది. -
జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకున్న ఆఫ్ఘనిస్తాన్
తొలి టీ20లో జింబాబ్వే చేతిలో ఎదురైన పరాభవానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. హరారే వేదికగా ఇవాళ (డిసెంబర్ 13) జరిగిన రెండో టీ20లో ఆఫ్ఘనిస్తాన్.. జింబాబ్వేపై 50 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ జట్లు 1-1తో సమానంగా నిలిచాయి.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. దర్విష్ రసూలీ (58) అర్ద సెంచరీతో రాణించగా.. అజ్మతుల్లా (28), గుల్బదిన్ (26 నాటౌట్), సెదికుల్లా అటల్ (18), గుర్బాజ్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ 4 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. జింబాబ్వే బౌలర్లలో ట్రెవర్ గ్వాండు, ర్యాన్ బర్ల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.154 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. ఆఫ్ఘన్ బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించడంతో 17.4 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. నవీన్ ఉల్ హక్, రషీద్ ఖాన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ 2, ఒమర్జాయ్, ఫరీద్ మలిక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సికందర్ రజా (35) టాప్ స్కోరర్‌గా నిలువగా.. బ్రియాన్ బెన్నెట్ (27), తషింగ ముసేకివా (13) రెండంకెల స్కోర్లు చేశారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టీ20 డిసెంబర్ 14న జరుగనుంది. -
పాకిస్తాన్ క్రికెట్లో ఆసక్తికర పరిణామం
పాకిస్తాన్ క్రికెట్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆ జట్టు రెడ్ బాల్ (టెస్ట్) కోచ్ జేసన్ గిల్లెస్పీ జట్టుతో పాటు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లేది లేదని తేల్చి చెప్పాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో చోటు చేసుకుంటున్న పరిణామాలే గిల్లెస్పీ నిర్ణయానికి కారణమని తెలుస్తుంది.పీసీబీ ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలతో గిల్లెస్పీ కలత చెందాడని సమాచారం. గిల్లెస్పీ ఇవాళ (డిసెంబర్ 12) పాక్ టెస్ట్ జట్టుతో కలిసి దుబాయ్ మీదుగా దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి ఉంది. అయితే పాక్ జట్టు ప్రయాణించిన విమానంలో గిల్లెస్పీ జాడ కనబడలేదు. దీంతో ఆయన తన రాజీనామాను పీసీబీకి పంపినట్లు ప్రచారం జరుగతుంది. ఈ అంశంపై పీసీబీ వైపు నుంచి ఎలాంటి సమాచారం లేదు.గిల్లెస్పీ ఈ ఏడాది ప్రారంభంలో పాక్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. గిల్లెస్పీ-పీసీబీ మధ్య రెండేళ్లకు ఒప్పందం కుదిరింది. గిల్లెస్పీ ఆథ్వర్యంలో పాక్ స్వదేశంలో బంగ్లాదేశ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. అయితే బంగ్లా సిరీస్ తర్వాత పాక్ స్వదేశంలోనే ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించింది. ఇంగ్లండ్ సిరీస్ సందర్భంగా పీసీబీ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల పట్ల గిల్లెస్పీ అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తుంది.పాక్ వైట్ బాల్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్ నిష్క్రమించిన కొద్ది రోజుల్లోనే గిల్లెస్పీ వ్యవహారం చోటు చేసుకుంది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో గిల్లెస్పీతో పాటు కిర్‌స్టన్ పాక్ హెడ్ కోచ్‌లుగా నియమించబడ్డారు. పాక్ జట్టుకు ఇద్దరు విదేశీ కోచ్‌లు ఆరు నెలలు కూడా నిలదొక్కుకోలేకవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గిల్లెస్పీ గైర్హాజరీలో పాక్ రెడ్ బాల్ టీమ్ తాత్కాలిక బాధ్యతలను కూడా ఆకిబ్ జావిదే మొయవచ్చు. జావిద్ ఛాంపియన్స్ ట్రోఫీ వరకు పాక్ తాత్కాలిక వైట్ బాల్ కోచ్‌గా నియమించబడ్డ విషయం తెలిసిందే.ప్రస్తుతం పాక్ పరిమిత ఓవర్ల జట్లు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్నాయి. టీ20, వన్డే సిరీస్‌ల అనంతరం పాక్ సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. రెండు టెస్టులు సెంచూరియన్ (డిసెంబర్ 26 నుంచి), కేప్ టౌన్ (జనవరి 3 నుంచి) వేదికలుగా జరుగనున్నాయి. -
ఉత్కంఠ పోరులో ఆఫ్ఘనిస్తాన్పై జింబాబ్వే విజయం
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగింది. చివరి బంతికి ఒక్క పరుగు చేయల్సి ఉండగా.. తషింగ సింగిల్ తీసి జింబాబ్వేను గెలిపించాడు. చివరి ఓవర్లో జింబాబ్వే 11 పరుగులు రాబట్టి గెలుపు తీరాలకు చేరింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. 58 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌ను కరీమ్ జనత్ (54 నాటౌట్), మహ్మద్ నబీ (44) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 79 పరుగులు జోడించి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ 3 వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ, ట్రెవర్ గ్వాండు, మసకద్జ తలో వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఆదిలో సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి జింబాబ్వేపై ఒత్తిడి పెంచారు. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (49) జింబాబ్వేను గెలుపు వాకిటి వరకు తీసుకొచ్చి ఔటయ్యాడు. ఇక్కడే ఆఫ్ఘన్లు జింబాబ్వేపై ఒత్తిడి పెంచారు. 11 పరుగుల వ్యవధిలో జింబాబ్వే రెండు వికెట్లు కోల్పోయి గెలుపు కోసం చివరి బంతి వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు తషింగ (16 నాటౌట్), మసకద్జ (6 నాటౌట్) సాయంతో జింబాబ్వేను విజయతీరాలకు చేర్చాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ (4-1-33-3), రషీద్ ఖాన్ (4-0-26-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు. మహ్మద్ నబీకి ఓ వికెట్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 డిసెంబర్ 13న జరుగనుంది. -
అభిషేక్ శర్మ విధ్వంసం
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు, టీమిండియా టీ20 ప్లేయర్ అభిషేక్ శర్మ ఓ లోకల్ టీ20 టోర్నమెంట్లో (టైమ్స్ షీల్డ్ టోర్నీ) చెలరేగిపోయాడు. తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో అభిషేక్ 22 బంతుల్లో 60 పరుగులు చేశాడు. అభిషేక్ భారీ షాట్లు అడుతున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలొ అభిషేక్ ఆడిన షాట్లు చూస్తుంటే ఐపీఎల్ 2025 సీజన్ కోసం గట్టిగానే కసరత్తు చేస్తున్నాడనిపిస్తుంది.ABHISHEK SHARMA SHOW IN TIMES SHIELD TOURNAMENT...!!! 🙇- While playing in the red ball, Abhishek smashed 60 runs from just 22 balls, preparing hard for the 2025 season. pic.twitter.com/smqEHcOxNl— Johns. (@CricCrazyJohns) December 10, 2024అభిషేక్ ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ పర్వాలేదనిపించాడు. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన అభిషేక్.. చివరి రెండు మ్యాచ్‌ల్లో తన ప్రతాపం చూపించాడు. మూడో టీ20లో 25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసిన అభిషేక్.. నాలుగో మ్యాచ్‌లో 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌ను సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది.అభిషేక్ ఐపీఎల్ ప్రదర్శన విషయానికొస్తే.. గత సీజన్లో అభిషేక్ చెలరేగిపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌కు చేరడంలో అభిషేక్ కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్.. 204.22 స్ట్రయిక్ రేట్‌తో 484 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అభిషేక్ గత మూడు ఐపీఎల్ సీజన్లుగా రాణిస్తూ వస్తున్నాడు. అందుకే సన్‌రైజర్స్ అతన్ని వేలానికి వదిలి పెట్టకుండా అట్టిపెట్టుకుంది. ఐపీఎల్ కెరీర్లో మొత్తం 63 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్.. 155.24 స్ట్రయిక్‌రేట్‌తో 1377 పరుగులు చేశాడు.


