breaking news
National
-
మృగాళ్లకు అండగా తృణమూల్
దుర్గాపూర్: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని, వారు నిత్యం భయంభయంగా బతకాల్సి వస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన మృగాళ్లను ఆ పార్టీ కాపాడుతోందని ఆరోపించారు. మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్వాకం వల్ల బెంగాల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న వసూళ్ల దందా చూసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడం లేదని చెప్పారు. ప్రధాని మోదీ శుక్రవారం బెంగాల్లో పర్యటించారు. చమురు, గ్యాస్, విద్యుత్, రైలు, రహదారులకు సంబంధించిన రూ.5,400 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా దుర్గాపూర్‌లో బహిరంగ సభలో మాట్లాడారు. కోల్‌కతా ఆసుపత్రిలో యువ వైద్యురాలిపై ఘోరంగా అత్యాచారం జరిగిందని అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారిని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తోందని ధ్వజమెత్తారు. ఆ అత్యాచార ఘటన పట్ల దేశమంతా కలవరపాటుకు గురైందని, ఇప్పటికీ కోలుకోలేదని అన్నారు. ఆ ఘటన మర్చిపోకముందే మరో కాలేజీలో మహిళపై అత్యాచారం జరిగిందని ఆక్షేపించారు. ఈ కేసులో నిందితుడికి తృణమూల్ కాంగ్రెస్‌తో సంబంధాలు ఉన్నట్లు బయటపడిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గూండా ట్యాక్స్ ‘‘బెంగాల్లో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయి. ప్రజలకు రక్షణ కల్పించడంలో, న్యాయం చేకూర్చడంలో తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. ముర్షీదాబాద్‌లో అల్లర్లు జరిగితే పోలీసులు బాధితులనే వేధించారు. బాధ్యులను వదిలేశారు. రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరుగుతుందన్న ఆశలు అడుగంటాయి. వారి ప్రాణాలకే భద్రత లేకుండాపోయింది. ఇదంతా ప్రభుత్వ నిర్వాకం కాదా? తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డబ్బుల కోసం పారిశ్రామికవేత్తలను పీడిస్తోంది. రాష్ట్రంలో ఆర్థిక ప్రగతికి అడ్డు తగులుతోంది. గూండా ట్యాక్స్‌కు భయపడి పారిశ్రామికవేత్తలు బెంగాల్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పెట్టుబడులు రావడం, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడం తృణమూల్ కాంగ్రెస్‌కు ఎంతమాత్రం ఇష్టం లేదు. బెంగాల్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని మేము సంకల్పించాం. దేశ ప్రగతికి బెంగాల్‌ను చోదక శక్తిగా మారుస్తాం’’ అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈశాన్య భారత అభివృద్ధికి ‘వికసిత్ బిహార్’ మోతిహరీ: ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించాలన్న నిర్ణయం బిహార్ గడ్డపైనే తీసుకున్నానని, అది ఎలా విజయవంతమైందో ప్రపంచం చూసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈశాన్య భారతదేశ సమగ్రాభివృద్ధికి ‘వికసిత్ బిహార్’ అత్యంత కీలకమని స్పష్టంచేశారు. రాష్ట్ర బహుముఖ ప్రగతికి కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ శుక్రవారం బిహార్‌లో పర్యటించారు. తొలుతు తూర్పు చంపారన్ జిల్లాలో రూ.7,200 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మోతిహరీ జిల్లా కేంద్రంలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘బనాయేంగే నయా బిహార్, ఫిర్ ఏక్‌బార్ ఎన్డీయే సర్కార్’ అనే నూతన నినాదం ఇచ్చారు. దీవసూళ్ల దందానిపై జనం పెద్దఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. మళ్లీ ఎన్డీయే ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని, సరికొత్త బిహార్‌ను నిర్మించుకుందామని మోదీ ఇచ్చిన పిలుపును స్వాగతించారు. బిహార్‌లో విపక్ష కాంగ్రెస్–ఆర్జేడీ కూటమిపై ప్రధానమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఆర్జేడీ ప్రభుత్వం పేదల భూములు బలవంతంగా లాక్కుందని, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. పేదలు, అణగారినవర్గాల పేరిట కాంగ్రెస్–ఆర్జేడీ రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. బిహార్ వెనుకబాటుతనానికి ఆ రెండు పారీ్టలే కారణమని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా యువత సంక్షేమం, అభివృద్ధి కోసం ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని మోదీ వెల్లడించారు. ఇందుకోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు ప్రకటించారు. బిహార్ సర్వతోముఖాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, గత 45 రోజుల్లో 24,000 స్వయం సహాయక సంఘాలకు రూ.1,000 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. మోతిహరీని ముంబై తరహాలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మహాత్మా గాంధీ పోరాటానికి బిహార్‌లోని చంపారన్ నూతన దిశను నిర్దేశించిందని మోదీ గుర్తుచేశారు. -
అమెరికా కల చెదురుతోంది..!
ముదురు పాకాన పడుతున్న అమెరికా వీసా సంక్షోభం భారతీయ విద్యార్థుల పాలిట పిడుగుపాటుగా మారుతోంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటినుంచీ విద్యార్థి వీసాలపై నానారకాల ఆంక్షలు విధిస్తుండటంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి అన్న చందంగా తయారవుతోంది. దాంతో పై చదువుల నిమిత్తం అగ్ర రాజ్యానికి వెళ్లే మనవాళ్ల సంఖ్యలో ఈ ఏడాది ఏకంగా 70 నుంచి 80 శాతం తగ్గుదల నమోదైందని హైదరాబాద్‌కు చెందిన పలు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు ఆందోళన వెలిబుచ్చారు. వీసా అపాయింట్మెంట్లను ఉన్నట్టుండి ఫ్రీజ్ చేయడం, వీసా దరఖాస్తుల తిరస్కరణల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటం వంటివి కూడా ఇందుకు కారణంగా నిలుస్తున్నట్టు వారు వివరించారు. ‘‘మామూలుగానైతే ఏటా ఈ సమయానికల్లా విద్యార్థులు వీసా ఇంటర్వ్యూలు పూర్తి చేసుకుని, అమెరికా వెళ్లే ఏర్పాట్లలో తలమునకలుగా ఉంటారు. ఈసారి మాత్రం మేమింకా వీసా స్లాట్లు అందుబాటులోకి వచ్చాయా అని రోజూ ఎంబసీ పోర్టల్‌ను చెక్ చేసుకునే దశలోనే ఉన్నాం! ఇంత దారుణ గత కొన్నేళ్లలో ఎన్నడూ లేదు’’ అంటూ వాపోయారు. ఇది చాలదన్నట్టు ఈసారి వీసా స్లాట్లను అమెరికా ఎంబసీలు దశలవారీగా విడుదల చేస్తున్నాయి. చెప్పా పెట్టకుండా ఉన్నట్టుండి కొత్త నిబంధనలు తెచ్చేస్తున్నాయి. ఇలాంటి ఆకస్మిక నిర్ణయాలు మొత్తం వీసా ప్రక్రియపై విద్యార్థుల్లో టెన్షన్ పెంచేస్తున్నాయి. అంతేకాదు. ఎలాగోలా వీసా స్లాట్లు బుక్కయినా, స్లాట్ దొరికిందంటూ విద్యార్థులకు కన్ఫర్మేషన్ రావడం లేదు. కొత్తగా అప్డేట్ చేసిన స్లాట్ సిస్టంను ఎంబసీలు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తుండటమే ఇందుకు కారణం కావచ్చని కన్సల్టెంట్లు అంటున్నారు. కానీ ఈ పరిణామం విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి లోను చేస్తోంది. ‘‘మరికొద్ది రోజుల్లో గనక వీసా స్లాట్లను విడుదల చేయకపోతే వేలాది మంది భారత విద్యార్థుల అమెరికా చదువుల కల కల్లగా మిగిలిపోనుంది. వాళ్లు తీవ్ర ఆందోళనతో రోజూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు’’ అని ఓ కన్సల్టెంటు ఆవేదన వెలిబుచ్చారు. హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ మాత్రం వీసా స్లాట్ల ప్రక్రియ పునఃప్రారంభమైందని, అపాయింట్మెంట్ల కోసం విద్యార్థులు తరచూ వెబ్సైట్లో చూస్తుండాలని సూచించారు. గతేడాది రికార్డు స్థాయిలో ఏకంగా 3.3 లక్షల మందికి పైగా భారత విద్యార్థులు పై చదువుల నిమిత్తం అమెరికా వెళ్లారు. ఈ విషయంలో చైనాను అధిగమించి భారత్ తొలి స్థానంలో నిలిచింది కూడా! కానీ ట్రంప్ రాకతో పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. 2024 జనవరి నాటికి 11.6 లక్షలకు పైగా భారత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్నట్టు విదేశాంగ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. యూరప్ దేశాలకు వెళ్తున్న మన విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇతర దేశాలే ముద్దు అమెరికా వీసా కోసం అష్టకష్టాలు పడేకంటే ఇతర దేశాలను చూసుకోవడమే మేలని భారత విద్యార్థుల్లో అత్యధికులు భావిస్తున్నారు. ‘‘అమెరికా కలలను నిజం చేసుకునే ప్రయత్నంలో ఇప్పటికే ఏడాది వృథా చేసుకున్నా. ఇంకా దానిమీదే ఆశలు పెట్టుకుని మరో ఏడాది కూడా కోల్పోవడానికి సిద్ధంగా లేను. నాలాంటి ఎంతోమంది విద్యార్థుల అమెరికా కలలకు నా ఉద్దేశంలోనైతే ముగింపు కార్డు పడ్డట్టే’’ అని 23 ఏళ్ల ఓ ఆశావహ విద్యార్థి చెప్పుకొచ్చాడు. ఇప్పుడతను ఆటోమోటివ్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేసేందుకు జర్మనీ వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు.214(బి)తోనే సమస్య! గత మార్చిలోనే వీసా స్లాట్లు బుక్ చేసుకుని ఎట్టకేలకు ఇంటర్వ్యూ దాకా వెళ్తున్న భారత విద్యార్థుల్లో అత్యధికులకు ఎంబసీ నుంచి మొండిచెయ్యే ఎదురవుతోంది! ఈ పరిణామంపై కన్సల్టెంట్లే విస్తుపోతున్నారు. మంచి అకడమిక్, సోషల్ మీడియా రికార్డు తదితరాలుండి, గతేడాది దాకా అనాయాసంగా వీసాలు లభించిన ప్రొఫైళ్లను ఈసారి నిర్ద్వంద్వంగా తిరస్కరించేస్తున్నారు. అమెరికా ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్‌లోని 214(బి) సెక్షనే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. చదువు పూర్తయ్యాక మాతృదేశానికి కచ్చితంగా తిరిగి వెళ్తామన్న నమ్మకాన్ని ఎంబసీ అధికారులకు మనవాళ్లు కల్పించలేకపోతున్నారు. ‘‘ఈ నిబంధనలు కొత్తవేమీ కాదు. ఏళ్లుగా ఉన్నవే. కానీ వాటిని ఈ ఏడాదే తొలిసారి అమలు చేస్తున్నారు’’ అని డాలస్‌లో ఇమిగ్రేషన్ కన్సల్టింగ్ సంస్థ నడుపుతున్న రవి లోతుమల్ల వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్టాక్ మార్కెట్లో యూత్!
ఒకప్పుడు.. ‘స్టాక్ మార్కెట్‌తో మాకేంటి సంబంధం?’ అని సామాన్యుడు అనుకునేవాడు. కానీ, ఇప్పుడు అదే స్టాక్ మార్కెట్లో సామాన్యులు కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా, కోవిడ్, ఆ తరువాత జరిగిన అనేక పరిణామాలు.. ఇలా ఇందుకు కారణాలు అనేకం. ఫలితంగా ఇప్పుడు ఇన్టెస్టర్ల సంఖ్యలో ఏటా కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. దేశ జనాభాలో సుమారు 11.5 కోట్ల మంది జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్లో పెట్టుబడులు పెట్టారు. వీరిలో 30 ఏళ్లలోపు వారు 39 శాతం కాగా.. మహిళలు సుమారు 25 శాతం కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లోనూ మదుపరులు.. ముఖ్యంగా మహిళల సంఖ్య భారీగా పెరిగింది.బిహార్.. దేశంలోనే అత్యల్ప తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం. నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ) వేదికగా బిహార్ ఇన్వెస్టర్ల సంఖ్య అయిదేళ్లలో దేశంలోనే అత్యధికంగా 678 శాతం పెరిగింది. మదుపరుల సంఖ్య 7 లక్షల నుంచి 52 లక్షలకు దూసుకెళ్లింది. బిహార్‌లోనే ఇలా ఉంటే మరి ఇతర రాష్ట్రాల్లో? అవును.. ఇతర రాష్ట్రాల్లోనూ మదుపరులు గణనీయంగా పెరిగారు. ఎన్ఎస్ఈలో మదుపరుల సంఖ్య 2014–15లో 1,79,60,000. ఈ ఏడాది మే నాటికి అది ఏకంగా 11,49,42,000కు చేరింది. అంటే పదేళ్లలో 540 శాతం పెరుగుదల! 5–6 నెలలకే కొత్తగా కోటి మంది ఇన్వెస్టర్లు వచ్చి చేరుతున్నారంటే స్టాక్ మార్కెట్ పట్ల ఆసక్తి ఏ స్థాయిలో పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.సులభమైన షేర్ల లావాదేవీలు!స్మార్ట్ ఫోన్ సామాన్యుడికి చేరువైంది. ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలు సులువయ్యాయి. ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే భయపడే రోజుల నుంచి.. ప్రతిరోజూ వేలూ, లక్షల రూపాయలను రకరకాల మార్గాల్లో పంపే పరిస్థితులు వచ్చాయి. డిజిటల్ అక్షరాస్యత గణనీయంగా పెరిగింది. మరోపక్క.. దేశీయ స్టాక్ మార్కెట్ కూడా రోజురోజుకూ కొత్త శిఖరాలను అధిరోహిస్తూ మదుపరులను ఊరిస్తోంది. తక్కువ సమయంలో, సులభమైన ఆదాయ మార్గంగా స్టాక్ మార్కెట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే ఒకప్పుడు దరఖాస్తు ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండేది.ఏ కంపెనీని ఎంచుకోవాలో సమాచారం తెలిసేది కాదు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు! షేర్ల కదలిక కళ్ల ముందు కనపడుతోంది. సామాన్యులు సైతం అతి తక్కువగా.. అంటే రూ.100 పెట్టుబడితో స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టొచ్చు. పెట్టుబడి పెట్టడమే కాదు.. ఉపసంహరణ సైతం చాలా సులభం అయిపోయింది. ముఖ్యంగా రిటైల్ ట్రేడింగ్‌ను సులభతరం చేసే ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ ఎన్నో వచ్చాయి. కోవిడ్ సమయంలో చాలామందికి ఇంటి దగ్గర ఉంటూ ఆదాయార్జన మార్గంగా స్టాక్ మార్కెట్‌ను ఎంపిక చేసుకున్నారు. ఇలాంటి అనేక అంశాలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారుల సంఖ్య పెరగడానికి కారణమయ్యాయి.పెరిగిన మహిళా శక్తి!..: స్టాక్ మార్కెట్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుండడం విశేషం. మహిళా ఇన్వెస్టర్ల వాటా 2022–23లో 22.5 శాతం కాగా ఈ ఏడాది మే నాటికి 24.4 శాతానికి చేరింది. గోవాలో అత్యధికంగా మహిళా పెట్టుబడిదారులు 32.6 శాతం ఉన్నారు. దేశంలో మొత్తం ఇన్వెస్టర్ల పరంగా మహిళా ఇన్వెస్టర్ల అత్యధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ 28.4 శాతం ఉంటే , గుజరాత్లో 27.8 శాతం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 23.4, తెలంగాణలో 24.9 శాతం మహిళలు ఉన్నారు.ఆ మూడు రాష్ట్రాలు..: ఒక కోటి మంది ఇన్వెస్టర్ల క్లబ్లో చేరిన మూడో రాష్ట్రంగా గుజరాత్ అవతరించింది. 1.86 కోట్లతో మహారాష్ట్ర, 1.31 కోట్లతో ఉత్తరప్రదేశ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే 4.2 కోట్లతో ఉత్తర భారత్ అగ్రస్థానంలో ఉంది. పశ్చిమ భారత్ 3.5 కోట్లు, దక్షిణాది 2.4 కోట్లు, తూర్పు భారత్‌లో 1.4 కోట్ల మంది ఇన్వెస్టర్లు ఉన్నారు. సంఖ్యా పరంగా ఏడాదిలో ఉత్తరాదిలో 24%, తూర్పు భారత్ 23%, దక్షిణాది 22%, పశ్చిమ భారత్‌లో 17% వృద్ధి నమోదైంది. మే నెలలో తోడైన కొత్త ఇన్వెస్టర్ల సంఖ్యలో దేశంలోని టాప్–10 జిల్లాల్లో రంగారెడ్డి (8), హైదరాబాద్ (10) చోటు దక్కించుకున్నాయి.దేశ వ్యాప్తంగా 11.5 కోట్ల మంది మదుపరులకు జూలై 14 నాటికి 22.87 కోట్లకుపైగా ట్రేడింగ్ అకౌంట్లు ఉన్నాయి. వీటిలో ఏపీ నుంచి 1.04 కోట్లకుపైగా ఉంటే, తెలంగాణలో 51.50 లక్షలకుపైగా ఉన్నాయి. -
ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టుల మృతి
చత్తీస్గడ్: భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో భద్రతా బలగాలకు ఎదురుపడ్డ మావోయిస్టులు ఎదురు కాల్పులు జరపడానికి యత్నించారు. అబుజ్మాడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ రోజు(శుక్రవారం, జూలై 18) మధ్యాహ్న సమయం నుంచి భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య తీవ్ర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.. పలుమార్లు జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి పలు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు.మావోయిస్టుల వేరివేతే లక్ష్యంగా భదత్రా బలగాలు పలు ఆపరేషన్లు చేపట్టాయి. మావోయిస్టులు లొంగిపోవడం ఒకటైతే, ఇంకోటి ఏరివేతే అనే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. తమతో చర్చలు జరపాలని మావోయిస్టులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం చర్చలకు అంగీకరించలేదు. వచ్చే మార్చి నాటికి పూర్తిగా మావోయిస్టులనే ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పలు ఆపరేషన్ల పేరుతో మావోయిస్టుల ఉన్న ఏరియాలను జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. -
ఎయిరిండియా విమాన ప్రమాద బాధితుల కోసం రూ.500 కోట్లతో ట్రస్ట్
ముంబై: ఎయిరిండియా విమాన మృతుల కుటుంబాల కోసం టాటా సన్స్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. 260 మంది మృతుల కుటుంబాలకు సాయం చేసేందుకు ట్రస్ట్ AI171 మెమోరియల్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటైంది. రూ.500 కోట్లతో ఈ ట్రస్ట్‌ను టాటా సన్స్ ఏర్పాటు చేసింది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి వైద్య ఖర్చులకు వినియోగించనున్నారు.ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌ను పునర్నిర్మాణానికి ఖర్చు చేయనున్నారు. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫైన 32 క్షణాల వ్యవధిలోనే రన్‌వేను ఆనుకుని ఉన్న వైద్య కళాశాల భవనాలపై కుప్పకూలడం, 241 మంది ప్రయాణికులతో సహా మొత్తం 260 మంది దుర్మరణం పాలవడం తెలిసిందే. ప్రమాదం 32 సెకన్లలోపే జరిగిపోయింది.ఉదయం 11.17: ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగిన ఎయిరిండియా విమానం.. మధ్యాహ్నం 1.38:39: రన్‌వే నంబర్ 23 నుంచి టేకాఫ్ అయ్యింది. మధ్యాహ్నం 1.38:42: టేకాఫై 180 నాట్ల ఐఏఎస్ వేగం అందుకున్న విమానం.. అదే సమయంలో రెండు ఇంధన నియంత్రణ స్విచ్‌లు ‘రన్’ పొజిషన్ నుంచి ‘కటాఫ్’కు మారాయి. 1.38:47: ఇంధన సరఫరా నిలిచిపోవడంతో రెండు ఇంజన్లూ విఫలమయ్యాయి. దాంతో విమానం పూర్తిగా గాల్లోకి లేచేందుకు కావాల్సిన మినిమం ఇడిల్ రేట్‌ను అందుకోలేదు. అందుకు కావాల్సిన హైడ్రాలిక్ పవర్ అందించేందుకు రామ్ ఎయిర్ టర్బైన్ (ఆర్ఏటీ) పంప్ క్రియాశీలమైంది.1.38:52: ఒకటో ఇంజన్ స్విచ్ ఆన్ కాగా.. 1.38:54కి ఏపీయూ ఇన్లెట్ తలుపు తెరుచుకుంది. 1.38:56కి రెండో ఇంజన్ స్విచ్ ఆన్ అయ్యంది. 1.39:05కి పైలట్ ప్రమాద (మే డే) సందేశం పంపించారు. 1.39:11కి తుది డేటా నమోదైంది. ఏటీసీ స్పందించేలోపే జనసమ్మర్ధ ప్రాంతంలో నేలను తాకిన విమానం.. మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై పడి పేలిపోయింది. -
‘తన బిడ్డకు హాని జరిగితేనే అసీం మునీర్‌కు మా బాధ అర్థమవుతుంది’
సాక్షి,న్యూఢిల్లీ: మేం పడుతున్న బాధ ఎలా ఉంటుందో ఆసిమ్ మునీర్‌కు ఇప్పుడు అర్ధం కాదు. తన బిడ్డలకు ఏదైనా హాని జరిగితే అప్పుడు అర్ధమవుతుంది. ఈ మాటలన్నది మరెవరో కాదు. పహల్గాంలో లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్(The Resistance Front)ఉగ్రవాదులు ప్రదర్శించిన అంతులేని ఉన్మాదంలో కోల్పోయిన తొలి ప్రాణం లెఫ్టినెంట్ వినయ్ నార్వాల్ (26)తండ్రి రాజేష్ఈ ఏడాది ఏప్రిల్ 22న ప్రకృతి అందాలతో అలరారే పచ్చిక బయళ్లపై ముష్కరులు సృష్టించిన నరమేధంలో 26మంది టూరిస్టులు మరణించగా.. వారిలో లెఫ్టినెంట్ వినయ్ నార్వాల్ ఒకరు.ఏప్రిల్ 16న వివాహం చేసుకున్న 26 ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్..కేవలం ఆరు రోజుల్లోనే జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ దుర్ఘటన జరిగిన సమయంలో ఆయన భార్య హిమాన్షీ నర్వాల్. భర్త పార్థివ దేహం పక్కన కూర్చుని రోదిస్తున్న దశ్యాలు దేశ ప్రజల్ని కంటతడి పెట్టించాయి.ఈ దారుణ ఘటన దేశ ప్రజల్ని తీవ్రంగా కలిచివేసింది.అయితే,పహల్గాంలో మారణ హోమం సృష్టించిన టీఆర్ఎఫ్పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గాం దాడికి బాధ్యత వహించిన టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.అమెరికా ప్రకటనపై లెఫ్టినెంట్ నర్వాల్ తండ్రి రాజేష్ నర్వాల్ మీడియాతో మాట్లాడారు.ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన తన కుమారుడు వినయ్ నార్వాల్‌ను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతరమయ్యారు. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కుమారుడు,కుమార్తెకు ఏదైనా హాని జరిగితే.. మేం పడుతున్న బాధ అర్థమవుతుంది.నా కొడుకు మరణంతో కుటుంబం మొత్తం మానసికంగా కృంగిపోయింది. నిద్రలేని రాత్రులు, మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి. మానసికంగా అలసిపోయాం. రెండు మూడు గంటలకంటే ఎక్కువ నిద్రపోవడం లేదన్నారు..ఏదో బ్రతుకుతున్నాం అంటే బ్రతుకుతున్నాం’ అంటూ నిట్టూర్చారు. కాగా,పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫ్ఫరాబాద్, కోట్లి,బహావల్పూర్,రావలకోట్,చక్స్వారీ, భింబర్,నీలం వ్యాలీ,జెహ్లం చక్వాలపై దాడులు చేపట్టింది. ఈ దాడులతో పాక్ ఆర్ధికంగా,భారీ సంఖ్యలో ఉగ్రవాదులను కోల్పోయింది. -
ఇన్నాళ్లకు..మా ఊరికి బస్సొచ్చింది!
గడ్చిరోలి: మహారాష్ట్ర నక్సల్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి తొలిసారిగా ప్రభుత్వ బస్సు సర్వీసు ప్రారంభమైందని పోలీసులు తెలిపారు. మార్కనార్ గ్రామం గడ్చిరోలి జిల్లాలోని భమ్రాగడ్ ఉపవిభాగంలో నక్సల్స్ బలమైన కోటగా ఉన్న అబుజమాడ్ పర్వత ప్రాంతంలో ఉంది. గిరిజన జనాభా సాంద్రతకు, నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు ప్రసిద్ధి చెందిన గడ్చిరోలి జిల్లాలో ప్రజలు చాలా కాలంగా పరిసర ప్రాంతాలతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మర్కనార్ నుంచి ఆహేరీకి బస్సు సర్వీసును ప్రారంభించింది. గ్రామంలోకి మొదటిసారిగా అడుగిడిన ప్రభుత్వ బస్సును స్థానికులు హర్షాతిరేకాలతో స్వాగతించారు. జాతీయ జెండాలు ఊపుతూ సంబరాలు చేసుకున్నారు. మర్కనార్, మురుంభూషి, ఫుల్నార్, కోపర్షి, పోయార్కోఠి, గుండుర్వాహి సమీప గ్రామాల్లోని విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు ఈ సర్వీసుతో ప్రయోజనం పొందుతారని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: US Woman 16 ఏళ్ల చిన్నవాడితో ప్రేమ, సప్త సముద్రాలు దాటి పెళ్లి -
బిహార్: రూ.7,200 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ
మోతిహరి: త్వరలో ఎన్నికలు జరగనున్న బిహార్‌లో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పర్యటించారు. రూ.7,200 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నాలుగు కొత్త అమృత్ భారత్ రైళ్లు ప్రారంభించారు. పట్నా, దర్భంగాల్లో ఏర్పాటు చేసిన సాఫ్ట్వేర్ పార్కులను ప్రధాని ప్రారంభించారు. మోతహరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. బలహీన వర్గాల పేరిట కాంగ్రెస్, ఆర్జేడీలు రాజకీయాలు చేస్తున్నాయంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.యుపీఏ ప్రభుత్వ హయాంలో బిహార్‌కి కేవలం రూ.2 లక్షల కోట్లకు మించి మంజూరు చేయలేదని.. తాను ప్రధాని అయిన తర్వాతే బిహార్ అభివృద్ధి పథంలో నడిచిందన్నారు. యూపీఏ పాలనలో బిహార్‌పై ప్రతీకార రాజకీయాలు తప్ప ఏమీ చేయలేదని ప్రధాని విమర్శలు గుప్పించారు. కాగా, “ఇవాళ బిహార్‌కు శక్తినిచ్చే.. యువతకు అవకాశాలు కల్పించే పథకాలను ప్రారంభించడం గర్వంగా ఉంది” అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.#WATCH | Bihar | PM Narendra Modi says, "... Congress and RJD have been doing politics in the name of backward classes, but they don't even respect people outside their family... We have to save Bihar from their illicit intentions... We were guided by leaders like Chandra Mohan… pic.twitter.com/mfJKy69KFM— ANI (@ANI) July 18, 2025 . -
వరకట్న వేధింపులు.. మనీషా చివరి మాటలు శరీరంపై రాసి ప్రాణాలు..
లక్నో: వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివాహం జరిగిన నాటి నుంచి అదనపు కట్నం కోసం అత్తింటి అరళ్లు ఎలా ఉన్నాయో తెలుపుతూ బాధితురాలు ఆమె చేతులు,కాళ్లు,ఉదర భాగాలపై సూసైడ్ నోటు రాసి తనువు చాలిచింది.ఉత్తరప్రదేశ్ బాగ్‌పట్‌లో నివాసం ఉండే మనీషా(28)కు 2023 నవంబర్ కుందర్ కుమార్‌తో వివాహం జరిగింది. పెళ్లైన మరుక్షణం నుంచి భర్త,అత్త,మామ ఇతర కుటుంబసభ్యులు వేధింపులకు గురి చేశారు. చిత్రహింసలు తట్టుకోలేక వివాహం తర్వాత 5 నెలలకే మనీషా తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చింది. అత్తింటివారు థార్ కారు, పెద్ద మొత్తంలో డబ్బు డౌరీగా డిమాండ్ చేశారు. ఇప్పటికే బుల్లెట్ బైక్ ఇచ్చినప్పటికీ ఇంకా పెద్దమొత్తంలో లాంచనాలు కావాలంటూ వేధించారు. అడిగిన మొత్తాన్ని పుట్టింటి నుంచి తీసుకుని రాలేదని మనీషాకు అబార్షన్ చేయించారు. ఆహరం పెట్టకపోవడం, బంధించడం, శారీరకంగా వేధించారు. ఈ క్రమంలో చేతులు, కాళ్లు,ఉదరంపై సూసైడ్ నోట్ రాసింది. ఆ సూసైడ్ నోట్లో ‘నాచావుకు నా భర్త,అత్తింటి వారే కారణం. కుందన్ నా తల్లిదండ్రులను బుద్ధి చెబుతానని, నన్ను చంపుతానని బెదిరించాడు’అందుకే ప్రాణం తీసుకుంటున్నాను అని తెలిపింది. అనంతరం ఇంట్లో పురుగులు మందు తాగి ప్రాణాలు కోల్పోయింది. మనీషా ఆత్మహత్యపై సమాచారం అందుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో ఆమె శరీరంపై ఉన్న సూసైడ్ నోట్‌ను గుర్తించారు. సూసైడ్ నోట్ ఆధారంగా ఆమె డౌరీ కేసుగా పరిగణలోకి తీసుకున్నట్లు ఏఎస్పీ నరేంద్ర ప్రతాప్ సింగ్ వెల్లడించారు. సూసైడ్ నోట్‌తో పాటు ఓ వీడియోను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వీడియోలో మనీషా ఏడుస్తూ.. భర్త, అత్త,మామయ్య,మరిది తనను ఏ విధింగా వేధించారో కళ్లకు కట్టినట్లుగా వివరించింది. ‘మా పెళ్లి 2023లో జరిగింది. పెళ్లి ఖర్చు రూ.20 లక్షలయ్యింది. అడిగినంత కట్నం, బుల్లెట్ బైక్ ఇచ్చారు. అయినప్పటికీ అదనంగా డబ్బులు,కారు కావాలని వేధించారు. సందర్భాను సారం నన్ను కొట్టేవారు. వాల్లు పెట్టిన చిత్ర హింసల కారణంగా నాకు అబార్షన్ కూడా అయ్యింది’ అని కన్నీరు మున్నీరుగా విలపించింది -
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ ‘జాడ’ కనిపెట్టేశారు..!
కరాచీ: గ్లోబల్ టెర్రరిస్టు, భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు మసూద్ అజార్ తమ దేశంలో లేడని బుకాయిస్తు వస్తున్న పాకిస్తాన్ దొంగ బుద్ధి మరోసారి బయటపడింది. పాక్ చెబుతున్నది ఎంతమాత్రం నిజం కాదనే విషయాన్ని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తేటతెల్లం చేశాయి. మసూద్ అజార్ పాక్‌లో ఉన్న విషయాన్ని భారత్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు పసిగట్టేశాయి. పీవోకే(పాక్ ఆక్రమిత కశ్మర్) పరిధిలో గిల్జిట్ బాలిస్తాన్ ప్రాంతంలో మసూద్ సంచరించిన విషయాన్ని తాజాగా వెల్లడించాయి. మసూద్ అజార్ కదలికల్ని అత్యంత దగ్గరగా నిశితంగా పరిశీలిస్తున్న భారత్ ఇంటెలిజెన్స్.. బహవల్పూర్కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో మసూద్ నివాస జాడలు ఉన్నట్లు తెలిపింది. ఇటీవల మసూజ్ అజాయర్ స్కర్దూ, సద్పారా ఏరియాల్లో కనిపించిన విషయాన్ని కూడా ఇంటెలిజెన్స్ స్పష్టం చేసింది. అక్కడ ప్రధానంగా పలు ప్రైవేటు, గవర్నమెంట్ గెస్ట్ హౌస్‌ల్లో మసూద్ కనిపించాడు. కాగా, ఇటీవల ఆల్ అజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిల్వాల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. మసూద్ అజార్ తమ దేశంలో లేడంటూ చెప్పుకొచ్చారు. ఒకవేళ పాకిస్తాన్లో ఉన్నాడని భారత్ సమాచారం ఇస్తే తాము సంతోషంగా అతన్ని అరెస్ట్ చేస్తామని కూడా బుకాయించే యత్నం చేశారు. ఇప్పుడు పాకిస్తాన్‌లోనే అజార్ ఉన్నాడని భారత ఇంటెలిజెన్స్ స్పష్టం చేసిన తరుణంలో బిల్వాల భుట్టో ఏమంటాడో చూడాలిభారత్లో ఉగ్రదాడులకు సూత్రధారిభారత్లో ఇప్పటివరకూ జరుగుతూ వచ్చిన ఉగ్రదాడుల వెనుక మసూద్ అజార్‌ది కీలక పాత్ర. 2016లో పఠాన్‌కోట్‌లో ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడితో పాటు 2019లో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత సైనికుల్ని పొట్టన పెట్టుకున్న ఘటనలో కూడా మసూద్ అజార్ ‘పాత్ర ఉంది. ఆ నేపథ్యంలో భారత్ మోస్గ్ వాంటెడ్ ఉగ్రవాదిగా మసూద్ అజార్ ఉన్నాడు. -
తస్మాత్ జాగ్రత్త.. అలాంటి రీల్స్ చేస్తే జైలుకే!
ఒరేయ్.. ఇది ఇన్స్టాగ్రామా?.. పొరపాటున గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశామా? అనేంత రేంజ్లో అసభ్యకరమైన కంటెంట్ కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్న రోజులివి. పైగా అలాంటి కంటెంట్‌కే ఫాలోవర్స్‌లో మాంచి డిమాండ్ ఉందని రెచ్చిపోతున్న తీరూ చూస్తున్నాం. బూతులతో కొందరు.. హాట్ హాట్ ఫోజులతో మరికొందరు.. సెమీ శృంగారంతో ఇంకొందరు.. చెలరేగిపోతున్నారు. అయితే ఇకపై అలాంటి వేషాలు చెల్లకపోవొచ్చు!. ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ నెలకు రూ.30 వేల దాకా సంపాదిస్తున్న అక్కాచెల్లెలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్లు చేస్తోంది అసభ్యకరమైన కంటెంట్ కాబట్టి. వల్గర్ డైలాగులతో.. అతి జుగుప్సాకరమైన చేష్టలతో కంటెంట్ పోస్టు చేస్తూ వచ్చారు వాళ్లు. రానురాను వాళ్ల చేసే కంటెంట్ శ్రుతి మించిపోవడం.. అది తమ దృష్టికి వెళ్లడంతో సుమోటోగా కేసు నమోదు చేసి ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఈ చర్యలకు ఉపక్రమించారు. ఇక.. అసోంలో ఓ ఘనుడు.. తన మాజీ ప్రేయసిపై కోపంతో ఆమె ముఖంతో ఏఐ జనరేటెడ్ అశ్లీల ఇమేజ్‌లను సృష్టించాడు. అలా ఓ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. ఓ ప్రముఖ అడల్ట్స్టార్ ఈ అకౌంట్‌కు స్పందించడంతో.. రాత్రికి రాత్రే ఈ అకౌంట్ తీవ్ర చర్చనీయాంశమైంది. చివరకు బాధితురాలు(సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే!) సైబర్ పోలీసులను ఆశ్రయించడంతో ఆ సైకోను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఈ అకౌంట్ ద్వారా సదరు నిందితుడు ఏకంగా రూ.10 లక్షల దాకా సంపాదించడాని తెలుస్తోంది. రూల్స్‌కు పాతరేసి..ఒకప్పుడు కంటెంట్ విషయంలో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్స్ కఠిన నిబంధనలే పాటించేది. అయితే రాను రాను ఆ పరిస్థితి దిగజారుతోంది. నిరసనలు, యుద్ధాలు, ప్రమాదాలు.. ఈ తరహా కంటెంట్ విషయంలో మాత్రమే Disclaimerను ఫాలో అవుతోంది. అమ్మాయిల హాట్ ఫోజులకు, సెమీ న్యూడ్ కంటెంట్‌కు, బూతు డైలాగులకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సహా ఇతర యాప్‌లు అడ్డాగా మారిపోయాయి. ఇదే అదనుగా.. ఆదాయం కోసం అడ్డు అదుపు లేకుండా కంటెంట్ క్రియేటర్లు చెలరేగిపోతున్నారు. ఆఖరికి మీమర్లు కూడా తమ కంటెంట్ ప్రమోషన్ కోసం ఈ తరహా కంటెంట్‌ను తమకు తెలియకుండానే ప్రమోట్ చేస్తున్నారు. ఉదాహరణకు.. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ అయ్యే కంటెంట్‌ను ఫిల్టర్ చేస్తే సగటున ఒక రోజులో 72 శాతం ఈ తరహా కంటెంట్ ఉండడం గమనార్హం!!.ఏఐతో దారుణాలుఅర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వాడకం.. నాణేనికి రెండోవైపుగానూ ఉంటోంది. అశ్లీల, అసభ్య కంటెంట్ విషయంలో ఇప్పుడు ఏఐదే ముఖ్యపాత్రగా మారింది. ఇందునా సెలబ్రిటీల కంటెంట్ అగ్రభాగంలో ఉంటోంది. డీప్‌ఫేక్ ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాలాంటి పాపులర్ యాప్‌లోనూ విచ్చలవిడిగా అప్లోడ్ చేస్తున్నారు. అలాంటి కంటెంట్‌కు ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం కాకపోవడం గమనార్హం. అయితే..ఈ మధ్య సెలబ్రిటీలు ఈ తరహా కంటెంట్ విషయంలో సీరియస్‌గానే స్పందిస్తున్నారు. దీంతో అరెస్టులు, కేసుల భయంతో ఎడిటర్లు మరో మలుపు తీసుకుంటున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, రాత్రికి రాత్రే పాపులారిటీ సంపాదించుకున్న యువతను టార్గెట్ చేసుకుంటున్నారు. అరెస్టులతోనే కట్టడి!భారత్‌లో కఠిన చట్టాలు లేకపోవడమే.. బోల్డ్ కంటెంట్ వైరల్ కావడానికి ప్రధాన కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. చట్టసభలకే వదిలేసి.. ఈ తరహా వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి కోర్టులు సైతం ఆసక్తి చూపడం లేదు. కాబట్టి ప్రభుత్వాలే ఉక్కు పాదం మోపాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వాలు(తెలంగాణ సహా) ఈ తరహా కంటెంట్‌పై దృష్టిసారించాయి. తప్పుడు మార్గాల్లో సంపాదించాలని చూస్తే అరదండాలు తప్పవని హెచ్చరిస్తున్నాయి. ఇప్పుడు మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అరెస్టు బాట పట్టాయి. ఈ ఏడాదిలో సోషల్ మీడియాలో వల్గర్ కంటెంట్ పోస్టు చేసినందుకు చాలా అరెస్టులే జరిగినట్లు ఆయా రాష్ట్రాల సైబర్ విభాగాలు చెబుతున్నాయి. దీంతో ఈ తరహా కఠిన చర్యలతోనే అలాంటి రీల్స్‌కు అడ్డుకట్ట పడుతుందని నిపుణులు కూడా ఓ అంచనాకి వస్తున్నారు. -
కాంగ్రెస్‌కు షాక్.. లిక్కర్ స్కాంలో మాజీ సీఎం కుమారుడు అరెస్ట్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్‌కు ఊహించని షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మాజీ సీఎం కుమారుడు చైతన్య బఘేల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో, ఆయన అరెస్ట్ కాంగ్రెస్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణంతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ పాత్ర ఉందని అభియోగాలు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ.. రూ.2,160 కోట్లు మద్యం కుంభకోణం నుండి వచ్చిన ఆదాయాన్ని చైతన్య బాఘేల్ గ్రహీతగా ఉన్నారని ఆరోపించింది. 2019-2023 మధ్య భూపేశ్ బాఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగినట్టు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి గతంలో బఘేల్ నివాసంలో సోదాలు నిర్వహించిన దర్యాప్తు సంస్థ.. శుక్రవారం మరోసారి తనిఖీలు చేపట్టింది. ఈ ఉదయం దుర్గ్ జిల్లాలోని భిలాయ్ ప్రాంతంలో గల బఘేల్ నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు.కేసుకు సంబంధించి కొత్త ఆధారాలు లభించడంతో మాజీ సీఎం నివాసంలో సోదాలు చేపట్టారు. అయితే, ఈ సమయంలో చైతన్య బఘేల్ అధికారులకు సహకరించకపోవడంతో ఆయనను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం నుంచి బఘేల్ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది మోహరించారు. పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకుని ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.VIDEO | Bhilai, Chhattisgarh: Congress workers clash with police personnel and try to stop ED vehicles after Chaitanya Baghel, son of former CM Bhupesh Baghel, was taken into custody by the Enforcement Directorate.The Enforcement Directorate (ED) conducted fresh searches at the… pic.twitter.com/beb7Eq7Pnq— Press Trust of India (@PTI_News) July 18, 2025అయితే, ఈరోజు చైతన్య బఘేట్ పుట్టినరోజు కావడం విశేషం. పుట్టినరోజే ఆయనను ఇలా అరెస్ట్ చేయడం కుటుంబ సభ్యులను, ఆయన మద్దతుదారులను ఆవేదనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో తన కుమారుడి అరెస్ట్ఫై మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ స్పందిస్తూ.. ఈడీ తప్పుడు కేసులకు భయపడేది లేదని వ్యాఖ్యలు చేశారు. తాము ఏ తప్పు చేయలేదని వెల్లడించారు. మరోవైపు.. చైతన్య బఘేల్ అరెస్ట్ సందర్భంగా ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈడీ అధికారులను.. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. #WATCH | Former Chhattisgarh Chief Minister Bhupesh Baghel's son, Chaitnya Baghel (in yellow t-shirt), arrested by Enforcement Directorate, in connection with the ongoing investigation into alleged multi-crore liquor scam in the state, say officials.Visuals from Durg,… pic.twitter.com/bRPTxqfu0b— ANI (@ANI) July 18, 2025 -
భూమికి ఉద్యోగం కేసు.. లాలూకు చుక్కెదురు
న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో(భూమికి ఉద్యోగం) ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్పై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అంతేకాదు.. ఈ కేసులో ట్రయల్ కోర్టు విచారణను నిలిపివేసేలా ఢిల్లీ హైకోర్టుకు ఆదేశాలివ్వాలన్న ఆయన అభ్యర్థననూ శుక్రవారం తోసిపుచ్చింది. దీంతో ఈ కేసులో విచారణ యధాతథంగా కొనసాగనుంది.ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించాని కోరుతూ లాలూ ప్రసాద్ ముందుగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. విచారణపై స్టే విధించడానికి ఎలాంటి కారణలూ లేవని తెలిపింది. ఆపై ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఇవాళ ఆయన పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీం కోర్టు ద్విససభ్య ధర్మాసనం తోసిపుచ్చుతున్నట్లు వెల్లడించింది.యూపీఏ ప్రభుత్వ హయాంలో.. 2004 నుంచి 2009 మధ్య లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో భారతీయ రైల్వే తరఫున మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో వెస్ట్ సెంట్రల్ జోన్లో గ్రూప్-డి ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు సీబీఐ 2022లో అభియోగాలు నమోదు చేసింది. అక్రమంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు లాలూ, అతని కుటుంబ సభ్యులకు భూములు బహుమతిగా ఇచ్చారని సీబీఐ అభియోగాలు మోపింది. ఇదే వ్యవహారంపై మనీలాండరింగ్ వ్యవహారం (PMLA) కింద కేసు నమోదు చేసిన ఈడీ.. లాలూ కుటుంబ సభ్యులకు చెందిన 25 చోట్ల సోదాలు జరిపింది. ఆ సమయంలో.. రూ.6 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసింది.అయితే.. రాజకీయ దురుద్ధేశ్యంతోనే తనపై దాదాపు దశాబ్దన్నర తర్వాత కేసు నమోదు చేశారని లాలూ అంటున్నారు. -
ఆప్‌పై ఈడీ ఉక్కుపాదం.. వెలుగులోకి మరో మూడు భారీ కుంభకోణాలు
ఢిల్లీ: అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో నుంచి పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీని, ఆ పార్టీ నేతల్ని ఇప్పుడే అదే అవినీతి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆప్ నేతలపై మూడు మనీ లాండరింగ్ కేసుల్ని నమోదు చేశారు. అధికారంలో ఉండగా మూడు కుంభకోణాల్లో సదరు నేతలు పాలు పంచుకున్నారని ఈడీ తెలిపింది. ఆప్ నేతలపై ఈడీ నమోదు చేసిన మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఈసీఐఆర్)కు జత చేసిన ఎఫ్ఐఆర్లు కేసు వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో సీసీటీవీ ఫుటేజీల ఏర్పాటు,ఆస్పత్రుల నిర్మాణాలు,అభాగ్యులు ఉండేందు ఆసరా కల్పించే ప్రత్యేక షెల్టర్ హోమ్ పేరుతో సుమారు రూ.6,368 కోట్ల విలువ చేసే కుంబకోణం జరిగింది.ఈ స్కామ్‌లో ఆప్ సీనియర్ నేతలతో పాటు మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సౌరభ్ బరద్వాజ్,సత్యేంద్ర జైన్ వంటి నేతల ప్రమేయం ఉందని ఈడీ అనుమానిస్తుంది. విచారణకు హాజరు కావాలంటూ త్వరలోనే వీరికి ఈడీ సమన్లు జారీ చేయనుంది.ఈడీ లెక్కల ప్రకారం.. 2018-19 అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో ఆరు నెలల్లో 24 ఐసీయూ కూడిన ఆస్పత్రులు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికీ యాభైశాతం పనులు పూర్తయినప్పటికీ ఇందుకోసం సుమారు రూ.800 కోట్లు నిధుల్ని విడుదల చేసింది. అయితే, వీటిల్లో ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న లోక్ నాయక్ ఆస్పత్రితో పాటు ఇతర పలు ఆస్పత్రుల నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.488 కోట్ల నుంచి రూ.1135 కోట్లకు పెరిగింది. వీటి నిర్మాణానికి కేటాయించే నిధుల విషయంలో సరైన అనుమతులు లేవని ఈడీ ఆరోపిస్తోంది.సీసీటీవీ స్కామ్(రూ.571కోట్లు) 2019లోనే కేజ్రీవాల్ ప్రభుత్వం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1.4లక్షల సీసీటీవీ కెమెరాలను అమర్చే ప్రాజెక్ట్‌ను ప్రతీష్టాత్మకంగా చేపట్టింది. ఈ ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్)కు అప్పగించింది. ఈ ప్రాజెక్ట్ విలువ సుమారు రూ.571 కోట్లు. ఒప్పందం ప్రకారం అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడంతో ఆప్ ప్రభుత్వం బీహెచ్ఈఎల్కు రూ.17కోట్లు ఫైన్ వేసింది. కొంతకాలానికి ఎలాంటి వివరణ లేకుండా ఫైన్‌ను రద్దు చేసింది. ఇందుకోసం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ శాఖ కార్యకాలాపాలు నిర్వహించిన సత్యేంద్ర జైన్ రూ.7కోట్లు లంచతీసుకున్నారని ఏసీబీ ఆరోపించింది. సత్యంద్ర జైన్ మీద కేసు కూడా నమోదు చేసింది.ఢిల్లీ అర్బన్ షెల్టర్ బోర్డు 'స్కామ్' (రూ.207 కోట్లు)ఆప్ హయాంలో ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ (DUSIB)లో కూడా అవినీతి జరిగిందని ఈడీ ఆరోపించింది. నకిలీ ఎఫ్‌డీఆర్‌లు (ఫిక్స్డ్ డిపాజిట్ రసీదులు) ఉపయోగించి రూ.207 కోట్లు దుర్వినియోగం చేశారని, పటేల్ నగర్లో రూ. 15 లక్షల రోడ్డు కుంభకోణం జరిగినట్లు ఆధారాలున్నాయని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి లాక్డౌన్ సమయంలో నకిలీ పత్రాలను ఉపయోగించి రూ. 250 కోట్ల విలువైన పనిని చేసినట్లు చూపించినట్లు ఈడీ గుర్తించింది. నకిలీ కార్మికులకు జీతాలు చెల్లించారని, రాజకీయ నాయకులకు కమీషన్లు ఇచ్చారని కూడా ఆరోపించబడింది.ఈ విషయాలపై సీబీఐ,ఏసీబీలు దర్యాప్తు చేస్తున్నాయి. -
బెంగళూరులో హైటెన్షన్.. 40 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
బెంగళూరు: ఓవైపు దేశరాజధానిలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు వస్తున్న వేళ.. ఇటు నగరంలోనూ ఒక్కసారిగా కలకలం రేగింది. బెంగళూరు ఈ ఉదయం ఒకేసారి 40 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.నగరంలోని రాజరాజేశ్వరీనగర్, కెంగేరి తదితర ప్రాంతాల్లోని పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులను ఇళ్లకు పంపించి వేశారు. నగర పోలీసులు బృందాలుగా విడిపోయి ఆయా విద్యాసంస్థల్లో తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్ టీమ్‌లు అక్కడికి చేరుకొని పరిశీలిస్తున్నాయి. ఇటు.. ఢిల్లీలో 20 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అక్కడ కూడా పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఇటీవల దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపు కాల్స్ , ఈమెయిల్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది, ముఖ్యంగా విమానాశ్రయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు లక్ష్యంగా మారాయి.40 Bengaluru schools receive bomb threats via emails, bomb squads and police team are at the spot #Bengaluru #Schools #BombThreats pic.twitter.com/3t9NMeZRpQ— News18 (@CNNnews18) July 18, 2025 -
20 స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు.. టెన్షన్లో పేరెంట్స్
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఢిల్లీలో దాదాపు 20 స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో, అప్రమత్తమైన పోలీసులు, అధికారులు.. తనిఖీలు చేపట్టారు.వివరాల ప్రకారం.. ఢిల్లీలోని పాఠశాళలకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. శుక్రవారం ఉదయమే పశ్చిమ్ విహార్, రోహిణీ సెక్టార్-3లోని పలు పాఠశాలలతో సహా దాదాపు 20 స్కూల్స్ బాంబు బెదిరింపు మొయిల్స్ వచ్చాయి. దీంతో, వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. పలు పాఠశాల్లలో ఉన్న విద్యార్థులను బయటకు పంపించి.. తనిఖీలు చేశారు. ఆయా పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కన్పించలేదని పోలీసులు వెల్లడించారు. ఇక, ఢిల్లీలో నాలుగు రోజుల వ్యవధిలో 30కిపైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ వారం మొదటి మూడు రోజుల్లో ఢిల్లీలోని 11 పాఠశాలలు, ఒక కళాశాలకు ఇలాంటి బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. దీంతో, స్కూల్ యాజమాన్యాలు, విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.బీజేపీ సర్కార్‌పై మాజీ సీఎం ఫైర్.. దేశ రాజధాని వరుస బాంబు బెదిరింపుల విషయమై అధికార బీజేపీపై మాజీ ముఖ్యమంత్రి అతిషి.. ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులకు భద్రత కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అతిషి ట్విట్టర్ వేదికగా.. ఈరోజు 20కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి!. పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న బాధను ఆలోచించండి. ఢిల్లీలోని నాలుగు పాలనా యంత్రాలను బీజేపీ నియంత్రిస్తుంది. ఇంకా మా పిల్లలకు ఎటువంటి భద్రతను అందించలేకపోయింది!. ఇది దిగ్భ్రాంతికరం! అని ఆగ్రహం వ్యక్తం చేశారు. VIDEO | More than 20 schools in Delhi on Friday received bomb threats, triggering panic among the students and their parents. Delhi Police and other quick-response authorities have launched search and evacuation operations, an official said. This is the fourth such day this week… pic.twitter.com/xmnlP3HquW— Press Trust of India (@PTI_News) July 18, 2025 -
గుండెపోటుతో మరో మరణం.. ఆ వదంతులను కొట్టిపారేసిన మంత్రి
రాయచూరు రూరల్: కర్ణాటకలో వరుసగా గండెపోటు మరణాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ యువతి మరణించిన ఘటన కొప్పళలో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి శివగంగా కాలనీలో నివాసముంటున్న మంజుల హూగార్(26) గుండెపోటుకు గురి కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. మంజుల ఇటీవల వరకు బెంగళూరులో పని చేస్తుండేది. అక్కడ పని వదిలిపెట్టి ఇటీవలే కొప్పళకు వచ్చింది. తల్లిదండ్రులు బస్టాండ్‌లో పూల వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. మంజుల మరణంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో గుండెపోటుతో ఎక్కువ మంది చనిపోతున్నారని తప్పుడు సందేశం ప్రచారం అయిందని, అయితే గుండెపోటు వల్లే ఎక్కువ మంది చనిపోతారనడం అబద్ధం అని ఆ రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి డాక్టర్ శరణ ప్రకాష్ పాటిల్ తెలిపారు. హావేరి తాలూకా నిలోగల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈటీటీసీ శిక్షణ సముదాయాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. గుండెపోటు కేసులపై వికాస సౌధలో ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావ్‌తో ఇటీవల సంయుక్త మీడియా సమావేశం నిర్వహించామన్నారు. ఆ మేరకు అన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం అయిందన్నారు. గత 6 నెలల గణాంకాల వివరాలు విశ్లేషించాం. దీని కోసం ఓ సమితిని కూడా ఏర్పాటు చేశామన్నారు. సమితి నివేదిక ప్రకారం మరణాల సంఖ్య ఎక్కువ కాలేదన్న సమాచారం ఉందన్నారు. అయితే ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్లినందువల్ల భయకంపితులయ్యారు. ఈ విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో గుండెపోటు మృతులపై పూర్తి సమాచారం తీసుకున్నాం. అంతేగాక ప్రజల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి గుండెపోటు వస్తుందన్న తప్పుడు విశ్వాసం ఉంది. గుండెపోటుకు సదరు వ్యాక్సిన్‌కు ఎటువంటి సంబంధం లేదన్నారు. -
క్రెడిట్ కాంగ్రెస్ సర్కార్‌కు.. నిందలు కోహ్లీకి..
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాటకు ఆర్సీబీ యాజమాన్యం, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ, కర్ణాటక క్రికెట్ ఆసోసియేషన్ కారణమని పేర్కొంటూ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించడంపై బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు.ఐపీఎల్లో ఆర్సీబీ విజయానికి క్రెడిట్ కొట్టేయాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. దుర్ఘటనలకు మాత్రం ఆర్సీబీ క్రికెటర్ విరాట్ కోహ్లీపై నిందలు వేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. క్రెడిట్ సొంతం చేసుకోవడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరాటపడ్డారని చెప్పారు. ఆర్సీబీ యాజమాన్యంతోపాటు శివకుమార్, కర్ణాటక ప్రభుత్వ అధికారుల పిలుపు మేరకు భారీగా జనం తరలివచ్చారని అరవింద్ బెల్లాద్ గుర్తుచేశారు.చిన్నస్వామి స్టేడియంలో జరిగే విజయోత్సవాలకు హాజరు కావాలంటూ ప్రజలకు పిలుపునిచ్చింది డి.కె.శివకుమార్ కాదా? అని ప్రశ్నించారు. దుర్ఘటనకు ఆర్సీబీ కారణమైతే పోలీసులను ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని నిలదీశారు. 11 మంది మరణానికి కారణమైన తొక్కిసలాటకు కర్ణాటక ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మరొకరిపై నిందలు వేసి తప్పించుకోవాలని చూడడం సరైంది కాదన్నారు. -
జస్టిస్ యశ్వంత్ వర్మ ఎపిసోడ్లో ట్విస్ట్
జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. సుప్రీం కోర్టులో ఆయన ఓ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ కమిటీ సమర్పించిన నివేదికను, తనను అభిశంసించాలంటూ చేసిన ప్రతిపాదనను సవాల్ చేస్తూ జస్టిస్ వర్మ ఈ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది.అలహాబాద్ హైకోర్టు జడ్జి అయిన యశ్వంత్ వర్మ.. గతంలో ఢిల్లీ హైకోర్టులో పని చేశారు. ఆ సమయంలో ఆయన అధికారిక బంగ్లాలో అగ్నిప్రమాదం జరగ్గా.. మంటలు ఆర్పే క్రమంలో కాలిన నోట్ల కట్టలు బయటడ్డాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ముగ్గురు జడ్జిల విచారణ కమిటీ.. ఆయనకు వ్యతిరేకంగా బలంగా సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది.అయితే విచారణ కమిటీ నివేదిక.. తన వ్యక్తిగత, జడ్జి పదవి దృష్ట్యా సక్రమించిన రాజ్యాంగబద్ధమైన హక్కులకు భంగం కలిగించేలా ఉందని పేర్కొంటూ ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కమిటీ విచారణ సవ్యంగా జరగలేదని అందులో పేర్కొన్నారాయన. అంతేకాదు.. తనను అభిశంసించాలని గతంలో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా చేసిన ప్రతిపాదనను తిరస్కరించాలని కోరారాయన.ఇదిలా ఉంటే.. ఈ నెల 21వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్స్‌లోనే ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం గమనార్హం. మరోవైపు.. నోట్ల కట్టల వ్యవహౠరంపై ఢిల్లీ పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లతో అర్థవంతమైన దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణను సైతం స్వీకరించడం తెలిసిందే.అసలేంటి కేసు..మార్చి 2025లో హోలీ పండుగన.. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్న యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఆర్పిన ఫైర్, పోలీసు సిబ్బందికి ఓ గదిలో నోట్ల కట్టలు కాలిపోయిన స్థితిలో కనిపించాయి. ఆ సమయంలో ఆయన తన కుటుంబంతో ఊరెళ్లారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో తీవ్ర దుమారం రేగింది. న్యాయవ్యవస్థలో అవినీతి అంటూ దేశవ్యాప్త చర్చ నడిచింది. అయితే ఆ నోట్ల కట్టలతో తనకు సంబంధం లేదని.. ఇదంతా తనను బద్నాం చేసే ప్రయత్నమని జస్టిస్ శర్మ ఆ ఆరోపణలను ఖండించారు.ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు.. ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదికను అప్పటి సీజేఐ సంజీవ్ ఖన్నాకు సమర్పించగా.. ఆయన దానిని రాష్ట్రపతికి లేఖ రూపంలో పంపించారు. మరోవైపు ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని అలహాబాద్ హైకోర్టుకు(స్వస్థలం కూడా) ట్రాన్స్ఫర్ చేశారు. అయితే అక్కడి బార్ అసోషియేషన్ ఈ బదిలీని తీవ్రంగా వ్యతిరేకించడంతో.. ఆయనకు విధులు అప్పగించకుండా అలాగే ఉంచారు. -
టీఆర్ఎఫ్ ఓ ఉగ్ర సంస్థ
వాషింగ్టన్/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్ర దాడికి పాల్పడిన లష్కరే తొయిబా జేబు సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. టీఆర్ఎఫ్ను విదేశీ, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అని పేర్కొంది. పహల్గాంలో 26 మందిని విచక్షణారహిత కాల్పులతో బలిగొన్న ఉగ్రవాద దాడికి స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. ఇది జమ్మూకశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత పుట్టుకొచ్చిన లష్కరే జేబు సంస్థ. కశ్మీర్లో భద్రతా బలగాలపై, పౌరులపై పలు దాడులకు పాల్పడింది. లౌకిక సంస్థ ముసుగులో మతపరమైన దాడులను కొనసాగించింది. కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ సంస్థకు పాకిస్తాన్ నుంచి నిధులు, మద్దతు అందుతున్నాయి. పహల్గాం మారణకాండను 2008లో ముంబైలో లష్కరే జరిపిన దాడుల తర్వాత భారత్‌పై జరిగిన అత్యంత ప్రాణాంతక ఉగ్ర దాడిగా అమెరికా అభివర్ణించింది. కశ్మీర్ రెసిస్టెన్స్ అని కూడా పిలిచే టీఆర్ఎఫ్ పహల్గాం ఉగ్ర దాడి తన పనేనని తొలుత ప్రకటించింది. తర్వాత ఈ దాడి కారణంగా భారత్, పాక్ నడుమ ఉద్రిక్తతలు పెచ్చరిల్లడంతో ప్రకటనను వెనక్కు తీసుకుంది. స్వాగతించిన భారత్టీఆర్ఎఫ్ను ఉగ్ర సంస్థగా అమెరికా గుర్తించడాన్ని భారత్ స్వాగతించింది. ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికా మధ్య సహకారాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. టీఆర్ఎఫ్ కార్యకలాపాలను, దానికి నిధులను అంతర్జాతీయ స్థాయిలో అడ్డుకునేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని వెల్లడించింది. ఉగ్రవాదాన్ని అస్సలు ఉపేక్షించకూడదన్న నినాదానికి భారత్ కట్టుబడి ఉందని, ఉగ్రవాద సంస్థలు, వారి ముసుగు సంస్థలు జవాబుదారీగా ఉండేలా చేయడానికి అంతర్జాతీయ భాగస్వాములతో కలిపి పని చేయడాన్ని కొనసాగిస్తామని తెలిపింది. ‘టీఆర్ఎఫ్ను విదేశీ, అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా గుర్తించినందుకు అమెరికా విదేశాంగ శాఖను, మంత్రి రూబియోకు మా అభినందనలు. ఉగ్రవాదంపై పోరులో భారత్–అమెరికా సహకారానికి ఇది తాజా నిదర్శనం’’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. గత ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి 26 మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకోవడం తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్, పీఓకేల్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఇది ఇరు దేశాల నడుమ సాయుధ ఘర్షణకు దారితీయడం, పాక్ విజ్ఞప్తి మేరకు చివరికి కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం తెలిసిందే. -
45 ఏళ్ల తర్వాత.. మళ్లీతెరపైకి సరిహద్దు వివాదం!
స్తబ్దుగా ఉన్న తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సరిహద్దు గ్రామాలు తమవేనని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయా పంచాయతీల్లోని కొన్ని గ్రామాల ప్రజలు ఈ ప్రకటనను వ్యతిరేకిస్తుండగా, మరికొందరు మాత్రం సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆరు గ్రామాల ప్రజలు తెలంగాణలోనే కొనసాగుతామంటూ గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి కలెక్టరేట్లో వినతిపత్రం సైతం సమర్పించారు. ముంబైలో ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జివితితోపాటు పలు సరిహద్దు గ్రామాలకు చెందిన 11 మంది నాయకులు ప్రజాప్రతినిధులను కలిశారు. సరిహద్దు గ్రామాల విషయంలో స్పష్టతనివ్వాలని కోరడంతోనే విలీన విషయం మళ్లీ తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.అసలు వివాదం ఇదీ.. 1955–56లో ఫజల్ అలీ కమిషన్ ద్వారా రాష్ట్రాల సరిహద్దులను నిర్ధారించారు. ఈ క్రమంలో భాషా ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్న వివాదాస్పద 14 గ్రామాలు మహారాష్ట్రలోకి వెళ్లాయి. 1978లో మరోసారి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సరిహద్దులు నిర్ణయించగా, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఆర్టికల్–3 ద్వారా ఆయా గ్రామాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదీనంలో ఉంటాయని ఒప్పందం కుదుర్చుకున్నాయి. ముకదంగూడ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త రాందాస్ నర్వడే తెలిపిన వివరాల ప్రకారం.. 1980 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగబోమని, మహారాష్ట్రలో విలీనం చేయాలని ఉద్యమం ప్రారంభమైంది. దీంతో 1983లో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 1978లో చేసిన హద్దుల ప్రకారం గ్రామాలు ఏపీకి చెందినవేనని స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందుతాయని 1990 జూలై 7న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అక్కడ మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. మరాఠీ మాట్లాడే వారు ఎక్కువగా ఉన్నారని, భాషా ప్రాతిపదికన విభజించాలని న్యాయవాది, రాజురా ఎమ్మెల్యే వామన్‌రావు చటప్ ప్రజలతో కలిసి ఆందోళన చేశారు. అసెంబ్లీలోనూ సమస్యను లేవనెత్తారు. వివాదాస్పద గ్రామాలు భాషాపరంగా తమకు చెందుతాయని ‘మహా’సర్కార్ 1993 ఆగస్టు 5న 1990 నాటి పాత ఉత్తర్వులను రద్దు చేసింది. దీనిపై 1996 ఏప్రిల్ 3న అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం హైకోర్టులో రిట్ పిటిషన్‌ను వేసింది. అక్కడి ప్రభుత్వం అదే ఏడాది ఏప్రిల్ 30న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ 10338/96 దాఖలు చేసింది. కేసు వెనక్కి తీసుకోవాలని సుప్రీంకోర్టు 1997 ఫిబ్రవరి 12న ఏపీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిట్ పిటిషన్‌ను ఆగస్టు 21న బేషరతుగా వెనక్కి తీసుకుంది. అయితే ఆ ఉత్తర్వులపై స్థానిక ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదు. దీంతో ఇరు రాష్ట్రాలూ తమ పాలనను కొనసాగిస్తున్నాయి. ఇరు ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఎన్నికల్లోనూ ప్రజలు ఓటు వేస్తున్నారు. 1965 నుంచి ఆయా గ్రామాలు మహారాష్ట్రలోని నోకేవాడ, పుడ్యాన్‌మోదా గ్రామ పంచాయతీలో ఉండగా, 1990లో మళ్లీ పరంధోళి, అంతాపూర్ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి గ్రామాలను విడదీసింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ కూడా పరంధోళి, అంతాపూర్ గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది.ఇరు రాష్ట్రాల పాలన ప్రస్తుతం 14 గ్రామాలు ఇరు రాష్ట్రాల పాలనలో కొనసాగుతున్నాయి. ప్రజలకు రెండేసి రేషన్ కార్డులు, ఓటరు కార్డులు ఉన్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల ఆధ్వర్యంలో పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. గతంలో పరంధోళి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా నిర్మించలేదు. పట్టాల కోసం 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా సమస్యకు పరిష్కారం లభించలేదు. గ్రామాలను అనుసంధానిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పించింది. ఇరవై శాతం గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం అటవీ హక్కు పత్రాలు అందించింది. డెబ్భైయ్ శాతం ఉన్న ఎస్సీలు, 10 శాతం ఉన్న బీసీలకు హక్కులు కల్పించకపోవడంతో.. వారిలో చాలామంది మహారాష్ట్రలో కలుస్తామని చెబుతున్నారు.రెండు రాష్ట్రాల రేషన్ కార్డులు చూపిస్తున్న మహిళలుపట్టాలిస్తేనే.. నలభయ్యేళ్లుగా సాగు చేస్తున్నా నేటికీ భూములకు పట్టాలు లేవు. ఇరు ప్రభుత్వాలు కూడా స్పందించకపోవడంతో సంక్షేమ పథకాలు అందడం లేదు. ప్రజలు పేదరికంలో బతుకుతున్నారు. ఏ ప్రభుత్వం సాగు భూములకు పట్టాలిస్తే ఆ రాష్ట్రంలో కొనసాగుతాం. :::కాంబ్డె లక్ష్మణ్, మాజీ సర్పంచ్, పరంధోళి‘మహా’సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం మహారాష్ట్ర సర్కారు 14 గ్రామాలు తమవే అని ప్రకటించిన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. మరాఠీ మాట్లాడే మేమంతా భాషా ప్రాతిపదికన మహారాష్ట్రలోనే ఉంటా మని 1980 నుంచి పోరాటం చేస్తున్నాం. గ్రామాలు మహారాష్ట్రకు చెందినవని 1997లోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. :::రాందాస్ రన్వీర్, సామాజిక కార్యకర్త, ముకదంగూడతెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాం తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. అటవీ భూములకు హక్కు పత్రాలు ఇచి్చంది. త్వరలో ఇందిరమ్మ ఇళ్లు కూడా అందనున్నాయి. తాగునీరు, సాగునీరు తదితర సౌకర్యాలు కలి్పస్తోంది. మా గ్రామాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాం. :::హడ్సె బాజీరావు, ఇంద్రానగర్ :::కెరమెరి (ఆసిఫాబాద్), సాక్షి ప్రతినిధి -
డిగ్రీ అర్హతతో 5,000 జాబ్స్, అప్లై చేసుకోండిలా..
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రొబేషనరీ ఆఫీసర్స్/మేనేజ్మెంట్ ట్రైనీస్(పీవో /ఎంటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.ఐబీపీఎస్‌లో 5,208 పీవో/ఎంటీ పోస్టులు.. మొత్తం పోస్టుల సంఖ్య: 5,208.» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 21.07.2025 నాటికి గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. » వయసు: 01.07.2025 నాటికి 20 నుంచి 30 ఏళ్లు ఉండాలి. (02.07.1995 నుంచి 01.07.2005 మధ్య జన్మించినవారు అర్హులు). ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు, ఈఎస్ఎం అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.» వేతనం: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920(బేసిక్ పే)+ఇతర అలవెన్సులుతో పాటు చెల్లిస్తారు.» ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా.» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది:21.07.2025» ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్ట్ 2025.» మెయిన్స్ పరీక్ష: అక్టోబర్ 2025.» ఇంటర్వ్యూ:డిసెంబర్ 2025 జనవరి 2026» వెబ్సైట్: https://www.ibps.in ఎస్ఎస్సీలో 1,340 జూనియర్ ఇంజనీర్ పోస్టులుస్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) 2025 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–బి(నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్) జూనియర్ ఇంజనీర్(సివిల్,మెకానికల్, ఎల క్ట్రికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.» మొత్తం పోస్టుల సంఖ్య: 1,340.» అర్హత: సంబంధిత విభాగంలో(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్) డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని పోస్టులకు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి. వయసు:01.01.2026 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి. సీపీడబ్ల్యూడీకి చెందిన కొన్ని పోస్టులకు 32 ఏళ్ల లోపు ఉండాలి. » పే స్కేల్: రూ.35,400 నుంచి రూ.1,12,400» ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు.» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది:21.07.2025» దరఖాస్తు ఫీజుకు చివరితేది: 22.07.2025.» దరఖాస్తు సవరణ తేదీలు: 01.08.2025 నుంచి 02.08.2025 వరకు» పేపర్–1 కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు: 27.10.2025 నుంచి 31.10.2025 వరకు» పేపర్–2 పరీక్ష: జనవరి నుంచి ఫిబ్రవరి 2026 మధ్యలో » వెబ్సైట్: https://ssc.gov.in -
వాద్రాపై ఈడీ చార్జిషీట్
న్యూఢిల్లీ: వ్యాపారవేత్త, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అభియోగ పత్రాన్ని కోర్టులో సమరి్పంచింది. 2008లో గుర్గావ్లోని సెక్టార్ 83లో షికోహ్‌పూర్‌లో 3.53 ఎకరాల భూమి కొనుగోలు వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందంటూ చార్జ్‌షీటులో ఈడీ పేర్కొంది. ఆ భూమిని స్కై లైట్ హాస్పిటాలిటీ అనే కంపెనీ ఓంకారేశ్వర్ ప్రాపరీ్టస్ సంస్థ నుంచి కొనుగోలు చేసింది. చెల్లింపు చెక్కులను మరో కంపెనీకి స్కై లైట్ రియాలిటీ జారీ చేసింది. ఈ రెండు సంస్థలకు వాద్రా యజమానిగా ఉన్నాయి. ఇక సేల్ డీడ్సమయంలో ఈ కంపెనీ వద్ద కేవలం రూ.1 లక్ష నగదు ఉంటే రూ.7.5 కోట్ల పెట్టి భూమిని కొనుగోలు చేయగల్గిందని ఈడీ చార్జ్‌షీటులో ప్రస్తావించింది.మరుసటి రోజే ఆ భూమిని స్కైలైట్ హాస్పిటాలిటీ పేరిట మార్చేశారు. 24 గంటల్లోపే భూమి టైటిల్‌ను వాద్రా కంపెనీకి మార్చారు. ఈ ప్రక్రియకు సాధారణంగా కనీసం మూడు నెలలు పడుతుంది. ఒక నెల తర్వాత హరియాణాలో హుడా ప్రభుత్వం స్కైలైట్ హాస్పిటాలిటీకి దాదాపు 2.71 ఎరాల భూమిలో గృహనిర్మాణ ప్రాజెక్టు అభివృద్ధికి అనుమతులు వచ్చాయి. ఫలితంగా భూమి విలువ ఒక్కసారిగా అమాంతం పెరిగింది. 2008లో రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ ఆ ప్లాట్‌ను రూ.58 కోట్లకు కొనుగోలు చేసింది. అంటే ఆ భూమి విలువ ఒకేసారి 700 శాతం పెరిగింది. డీఎల్ఎఫ్ రెండు మూడు దఫాలుగా వాద్రాకు నగుదు చెల్లింపులు జరిపింది. 2012లో ఈ భూమి వ్యవహారాన్ని బయటకు తెచ్చిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అశోక్ ఖేమ్కాను అప్పటి ముఖ్యమంత్రి హుడా ఆదేశాల మేరకు వెంటనే బదిలీ చేయడానికి ప్రయత్నించి తరువాత రద్దు చేశారు. భూమి వ్యవహారంపై సమగ్రస్థాయిలో విచారణ జరిపిన ఖేమా ఆ భూమి మ్యూటేషన్‌ను రద్దు చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఈ సమస్యను పరిశీలించడానికి ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌లతో ప్యానెల్ ఏర్పాటైంది. 2013లో హుడా ప్రభుత్వం వాద్రాకు, డీఎల్ఎఫ్కు క్లీన్ చిట్ ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ వ్యవహారంపై విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. భూ ఒప్పందాల్లో హుడా, వాద్రాలు అక్రమాలకు పాల్పడినట్లు 2018లో ఆరోపణలు వచ్చాయి. అందులో ఈ 3.5 ఎకరాల భూమి కూడా ఉంది. తప్పుడు డిక్లరేషన్ ఆధారంగా భూమిని కొనుగోలు చేశారని ఆరోపిస్తూ గుర్గావ్ పోలీసులు 2018 సెపె్టంబర్ 2న ఎఫ్ఐఆర్ నేమోదు చేసి ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. -
సైన్యానికి 7 వేల ఏకే–203 రైఫిల్స్
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం సాయుధంగా బలపడుతోంది. దశాబ్దాల కాలం నాటి రైఫిళ్ల వాడకాన్ని దశలవారీగా నిలిపేయనుంది. తాజాగా శిక్షణ పూర్తిచేసుకోబోతున్న సైనికుల బ్యాచ్‌కు మరో రెండు, మూడు వారాల్లో 7,000 దాకా కలాష్నికోవ్ ఏకే–203 రకం రైఫిళ్లను అందజేయనున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని అమేథి నగరంలో ఇండో–రష్యన్ భాగస్వామ్యంతో ఈ రైఫిళ్లను తయారుచేస్తున్న విషయం విదితమే. గత 18 నెలల్లో 48,000 రైఫిళ్లను తయారుచేసి సరఫరాచేశారు. 2023 జనవరిలో ఏకే203 రైఫిళ్ల ఉత్పత్తి అధికారికంగా ప్రారంభమైంది. 2026 కల్లా 1,00,000 యూనిట్లను డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి ఇండో–రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ గడువు ముగియనుంది. తర్వాత పూర్తిగా స్వదేశీ రైఫిల్‌గా ఇది అవతరించనుంది. ప్రస్తుతం రైఫిళ్లను 50 శాతం స్వదేశీ భాగాలతో ఉత్పత్తి చేస్తున్నారు. అమేథీలో ప్రతి నెలా 12,000 రైఫిళ్లు తయారవుతున్నాయి. ప్రతి వంద సెకన్లకు ఒక రైఫిల్ తయారవుతోంది. ఒక సంవత్సరంలో 1.5 లక్షల రైఫిళ్లను ఉత్పత్తి చేస్తారు. పూర్తి ఆర్డర్ అంటే.. 6 లక్షల రైఫిళ్ల తయారీ 2030నాటికి పూర్తి కానుంది. గడువు కంటే దాదాపు 22 నెలలు ముందుగానే అన్ని రైళ్ల తయారీ, సరఫరా పూర్తి చేయనున్నట్టు అంచనా. ఇక ఈ రైఫిల్స్‌కు ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి చేయాలంటూ విజ్ఞప్తులు వచ్చాయి. భారత త్రివిధ బలగాల అవసరాలు తీరాక అనంతరం విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఏకే–203 ప్రత్యేకతలుపాత కలాష్నికోవ్ సిరీస్‌కు ఆధునిక రూపం అయిన ఏకే–203 ఖచ్చితత్వంలో పనిచేస్తుంది. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలతోపాటు అధిక ఎత్తుల్లో రణక్షేత్రాల్లో సులువుగా ఉపయోగించేందుకు అనువుగా దీనిని రూపొందించారు. నిమిషానికి 700 తూటాలను దీని నుంచి ప్రయోగించవచ్చు. గరిష్టంగా 800 మీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఇది ఖచ్చితత్వంతో చేధించగలదు. -
నేడు బెంగాల్, బిహార్‌లో ప్రధాని పర్యటన
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో నేడు ప్రధాని మోదీ పర్యటించి రూ.5,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్ పట్టణంలో బీజేపీ చేపట్టిన భారీ ర్యాలీలోనూ ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్–మే కాలంలో పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికలున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈనెల 21వ తేదీన కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో అమరవీరుల దినోత్సవ ర్యాలీ జరగనున్న నేపథ్యంలో అంతకుముందే మోదీ రాష్ట్రంలో పర్యటిస్తుండటం గమనార్హం. ‘‘బిహార్ నుంచి ప్రధాని మోదీ శుక్రవారం దుర్గాపూర్‌కు చేరుకుంటారు. తొలుత వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ప్రాజెక్టుల కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. తర్వాత పార్టీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు’’అని బెంగాల్ బీజేపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. పశ్చిమబెంగాల్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా సమీర్ భట్రాచార్యను బీజేపీ అధిష్టానం నియమించాక రాష్ట్రానికి మోదీ రావడం ఇదే తొలిసారి. త్వరలో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో టీఎంసీ అధికారికంగా నిర్వహించే చివరి అమరవీరుల దినోత్సవం ఇదేకావడంతో ఈ కార్యక్రమంలోనే టీఎంసీ తన ఎన్నికల అజెండాను ప్రకటించే వీలుందని తెలుస్తోంది. ఓటర్లను ఆకర్షించేందుకు కొత్త పథకాలనూ మమతా బెనర్జీ ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో అంతకుముందే ఈ తరహా హామీలను శుక్రవారం జరగబోయే బహిరంగ సభలో మోదీ ప్రకటిస్తారని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. రూ.1,950 కోట్లతో బీపీసీఎల్ ప్రాజెక్ట్ రూ.1,950 కోట్లతో చేపట్టనున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్)వారి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. దుర్గాపూర్–హల్దియా గ్యాస్ పైప్‌లైన్‌లోని 132 కిలోమీటర్ల దుర్గాపూర్–కోల్‌కతా సెక్షన్‌ను మోదీ శుక్రవారం జాతికి అంకితంచేయనున్నారు. పీఎం ఉర్జా గంగా ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.1,190 కోట్లతో దీనిని పూర్తిచేశారు. పూర్బ బర్ధమాన్, హూగ్లీ, నదియా జిల్లాల్లో లక్షలాది కుటుంబాలకు సహజవాయువు సరఫరాను సుసాధ్యంచేయడంతోపాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధికి ఈ ప్రాజెక్ట్ బాటలు వేస్తోంది.బిహార్‌లోనూ మోదీ పర్యటనశుక్రవారం బిహార్‌లోనూ మోదీ పర్యటించనున్నారు. రూ.7,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిచనున్నా రు. ఈస్ట్ చంపారన్ జిల్లాలోని మోతిహరీ పట్టణంలోని గాంధీ మైదాన్‌లో భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. ఈ సభకు 5,00,000 మంది హాజరవుతారని అంచనా. అందుకు తగ్గట్లు భారీ ఏర్పాట్లుచేస్తున్నట్లు జిల్లా మేజి్రస్టేట్ సౌరభ్ జోర్వాల్ చెప్పారు. రూ.4,079 కోట్లతో పూర్తిచేసిన దర్భాంగా– నార్కాటియాగంజ్ 256 కిలోమీటర్ల రైల్వేలైన్ డబ్లింగ్‌ను మోదీ జాతికి అంకితంచేయనున్నారు. -
సుప్రీంకోర్టు ఉత్తర్వు రివర్స్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణ యం తీసుకుంది. ఏడాది క్రితం తాము స్వయంగా ఇచ్చిన ఉత్తర్వునే మార్చేసింది. 13 ఏళ్ల బాలుడి మానసిక పరిస్థితిని, అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అతడిని తల్లికే అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ బాలుడిని తండ్రి కస్టడీకి అప్పగిస్తూ 2024 ఆగస్టులో ఇచ్చిన ఉత్తర్వును న్యాయస్థానం మార్చింది. కేరళకు చెందిన యువతి, యువకుడికి 2011లో వివాహం జరిగింది. వారికి 2012లో కుమారుడు జన్మించాడు. తర్వాత కాపురంలో విభేదాలు తలెత్తడంలో వేర్వేరుగా జీవిస్తున్నారు. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుమారుడు తల్లి వద్దే ఉండేలా, తండ్రి నెలకు రెండు రోజులు చూసేలా ఒప్పందం కుదిరింది. 2015లో వారికి విడాకులు మంజూరయ్యాయి. యువతి మళ్లీ పెళ్లిచేసుకుంది. ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. మొ దటి భర్త నాలుగేళ్లుగా ఆమె మొదటి కుమారుడిని చూడడానికి రాలేదు. తాను మలే షియా వెళ్లిపోతున్నానని, మొదటి బిడ్డను కూడా తీసుకెళ్తానని, ఇందుకు అంగీకరిస్తూ సంతకం చేయాలని మొదటి భర్తను 2019 లో కోరింది. అందుకు అతడు నిరాకరించా డు. ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన బిడ్డను తనకే అప్పగించాలని కోరాడు. కానీ, బిడ్డను తల్లికే అప్పగిస్తూ 2022లో ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ మొదటి భర్త కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. హైకోర్టు అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బిడ్డను తండ్రి కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తల్లి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గత ఏడాది విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేరళ హైకోర్టు తీర్పును సమరి్థంచింది. కుమారుడు తండ్రి వద్దే ఉండొచ్చని ఉత్తర్వు జారీ చేసింది. దాంతో ఈ ఉత్వర్వును పునఃసమీక్షించాలని కోరుతూ తల్లి మరోసారి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వును రివర్స్ చేస్తున్నట్లు తేల్చిచెప్పింది. కుమారుడు తల్లి కస్టడీలోనే ఉండొచ్చని తేల్చిచెప్పింది. ఈ సమయంలో అతడికి తల్లి అవసరం చాలా ఉందని అభిప్రాయపడింది. చిన్న వయసులో బిడ్డకు తల్లే అసలైన సంరక్షురాలు అని న్యాయస్థానం పేర్కొంది. -
గురుబ్రహ్మ అమ్మ అవుతున్న వేళ...
రాములవారి తలంబ్రాలూ, పట్టువస్త్రాలను తలపై పెట్టుకుంటారు... అది భక్తి. రాయలవారు తనకు తోడుగా కవులను ఏనుగు మీదకు ఎక్కించుకుంటారు. అది గౌరవం. శ్రవణకుమారుడు తన తల్లిదండ్రులను కావడిలో మోస్తాడు... అవి ప్రేమాభిమానాలు. అలాంటి భక్తి, గౌరవం, ప్రేమ ప్రపత్తులను తమ ఉ పాధ్యాయినుల పట్ల చూ పారు కొందరు విద్యార్థులు. హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుని... లోకమంతటా వైరలైన ఈ సంఘటన వివరాలివి...ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండ పోత వానలు కురుస్తుండటం... దాంతో చండప్రచండంగా నదులు ప్రవహిస్తుండటం... ఫలితంగా ఎంతోమంది కొట్టుకు పోతున్న సంఘటనల వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. కొద్దికాలంలోనే అలాంటి వరస సంఘటనలు అక్కడ చాలానే చోటు చేసుకున్నాయి. అచ్చం అలాగే ఆరోజున కూడా హిమాచల్ ప్రదేశ్‌లోని మాండీ జిల్లా థునాగ్ ప్రాంతమంతా కారుమబ్బులు ఆవరించి నలువైపుల్నుంచీ కమ్ముకొస్తూ పట్టపగటిని చిమ్మచీకటి చేసేశాయి. ఈ వాతావరణ నేపథ్యంలోనే... థునాగ్‌లోని ‘కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ’కి చెందిన ఇద్దరు లెక్చరర్లకు నెలలు నిండాయి. ఏ సమయంలోనైనా వారికి నొప్పులు మొదలయ్యే అవకాశముంది. హిమాచల్ ప్రదేశ్‌లో అందునా పర్వత్ర పాంతమైన మాండీ పరిసరాల్లో ఇలా కురిసే అకస్మాత్ వర్షాలూ, హఠాత్తుగా వచ్చే మెరుపు వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) చాలా మామూలు. ఒక పక్క నిండు గర్భిణులైన తమ లెక్చరర్లు... మరోపక్క కమ్ముకొస్తున్న వర్షపు ధాటి...ఇంకో పక్క పొంచి ఉన్న వరద ముప్పు! ఏం చేయాలో తోచని అక్కడి విద్యార్థులు... మోసుకెళ్లేందుకు వీలుగా ముందుగా పల్లకి లాంటి ఓ మంచె కట్టారు. అలా కట్టిన ఆ పల్లకిలో లెక్చరర్‌ను కూర్చోబెట్టి ఆ మంచెను మోశారా విద్యార్థులు.అసలే పర్వత ప్రాంతం! అంతా ఎగుళ్లూ దిగుళ్లు. మరోపక్క స్టూడెంట్లకు... ‘వానెప్పుడు ముంచుకొస్తుందో... ప్రసవపు నొప్పులెప్పుడోస్తాయోనని గుండెనిండా దిగులు. నిట్టనిలువుగా ఉండే పర్వత మార్గాలు కూలి కొండదారులు మూసుకు పోతే వాటినెలా దిగాలో తెలియని దిగాలు!! అలాంటి నేపథ్యంలో దాదాపు పదకొండు కిలోమీటర్ల ΄÷డవున అత్యంత కఠినమైన దారుల్లో ముందుకు సాగారు. గోడల్లా నిలువుగా ఉన్న సానువులను దిగారు. అలా కఠిన మార్గాల్ని ఓడిస్తూ ఎట్టకేలకు పర్వత పాదాల వద్దనున్న హాస్పిటల్‌కు చేరారూ... తమ లెక్చరర్లనూ చేర్చారు. ఇటీవల జరిగిన ఈ సంఘటన తాలూకు క్లిప్స్ వైరల్ కావడంతో ఆ స్టూడెంట్ల పట్ల అభినందనలూ, ప్రశంసలు వెల్లువెత్తాయి... అచ్చం అక్కడి క్లౌడ్ బరస్ట్ టైమ్‌లో ఫ్లాష్ఫ్లడ్స్లాగే!!‘ఆ స్టూడెంట్స్ తెగువకూ, ధైర్యానికీ మా సలాం’ అంటూ ఒకరు ప్రశంసిస్తే... ‘గురుపూర్ణిమకు గురుదక్షిణ ఆ గురువులకు చక్కగా దొరికిందం’’టూ మరొకరు కితాబిచ్చారు. ‘‘ఇది కదా ఇండియా ప్రజల సంస్కారమం’’టూ అందరూ ఆ విద్యార్థులకు జేజేలు పలికారు. -
చోరీ చేసినా వీసా రద్దు: అమెరికా
న్యూఢిల్లీ: అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు అక్కడి నిబంధనలు కచ్చితంగా పాటించాలని భారత్‌లో అమెరికా రాయబార కార్యాలయం స్పష్టంచేసింది. ఒకవేళ ఇతరులపై దాడులకు పాల్పడినా, చోరీ చేసినా వీసా రద్దయ్యే ప్రమా దం ఉంటుందని పేర్కొంది. చట్టపరమైన చర్యలను ఎదుర్కోవడంతోపాటు భవిష్యత్తులో అమెరికా వీసా పొందడానికి కూడా అర్హత కోల్పోతారని తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది. మళ్లీ అమెరికాలో అడుగుపెట్టే అవకాశం ఉండదని తేల్చిచెప్పింది. అమెరికాలో భారతీయ మహిళ ఒకరు దుకాణంలో చోరీ చేస్తూ పోలీసులకు దొరికిపోయిన నేపథ్యంలో అమెరికన్ ఎంబసీ ఈ హెచ్చరికలు జారీ చేసింది. -
ముందస్తు నిర్ణయం దారుణం
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో పైలెట్ల తప్పిదం కారణంగానే ఎయిర్ఇండియా విమానం కుప్పకూలిందంటూ అంతర్జాతీయ మీడియాలో తప్పుడు కథనాలు వెల్లువెత్తుతున్నాయని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. నిరాధార సమాచారంతో ప్రమాదఘటనపై ముందస్తు నిర్ణయానికి రావొద్దని విదేశీ మీడియాకు ఆయన హితవు పలికారు. ‘‘ అసంబద్ధ కథనాలు అల్లడం మానేయండి. ఈ కేసు సమగ్ర దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ప్రమాదానికి మూల కారణాలు, సిఫార్సులతో తుది నివేదిక రూ పొందిస్తాం. ఆలోపే అసమగ్ర సమాచారంతో ఎవ్వరూ ముందస్తు అంచనాకు, తుది నిర్ణయానికి రావొద్దు. తప్పుడు డేటాతో భారత విమానయాన రంగం భద్రతపై ప్ర యాణికుల్లో ఆందోళనను అనవసరంగా పెంచకండి’’ అని యుగంధర్ హితవు పలికారు. వివాదమైన అమెరికా ‘క్రాష్’ నివేదికఎయిరిండియా విమాన ప్రమాదంలో అమెరి కా క్రాష్ నివేదిక వివాదమైంది. కెప్టెన్ ఇంజిన్లకు ఇంధన ప్రవాహాన్ని తగ్గించాడని కాక్‌పిట్ రికార్డింగ్‌లను ఉదహరిస్తూ యూఎస్ ఇచ్చిన నివేదికను భారత పైలట్ల సమాఖ్య తోసిపుచ్చింది. అమెరికా అధికారుల అంచనా ను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ముందే నివేదిక వెల్లడించడంపై అనుమానం వ్యక్తం చేసింది. ప్రమాదం జరిగిన ఎయిరిండియా విమానానికి ఆరోజు 56 ఏళ్ల సుమీత్ సభర్వాల్ కెప్టెన్ హోదాలో నాయకత్వం వహించారు. ఆయనకు మొత్తం 15,638 గంటలపాటు విమానాలు నడిపిన అనుభవం ఉంది. 32 ఏళ్ల మరో పైలట్ క్లైవ్ కుందర్ ఆరోజు ఫస్ట్ ఆఫీసర్ హోదాలో కో–పైలట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈయనకు మొత్తం 3,403 గంటలపాటు విమానాలు నడిపిన అనుభవం ఉంది. విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్ల తర్వాత ఇంధన స్విచ్‌లు ‘కటాఫ్’ పొజిషన్లోకి మారడం చూసి కుందర్.. సుమీత్‌ను మీరెందుకు సిŠవ్చ్లను రణ నుంచి కటాఫ్‌లోకి మార్చారు? అని ప్రశ్నించారని వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. అమెరికా ఉన్నతాధికారుల ద్వారా ఈ సమా చారాన్ని సేకరించామని వార్తాసంస్థ పేర్కొంది. స్విచ్‌లు కటాఫ్‌లోకి మారడంతో కుందర్ భయపడిపోయారని, కుందర్ ప్రశ్నించాక కూడా పైలట్ సుమీత్ ఎలాంటి భయం, ఆందోళనలేకుండా ప్రశాంతంగా కనిపించారని వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. -
నటి రన్యా రావుకు ఏడాది జైలు
బనశంకరి: విదేశాల నుంచి భారత్‌కు బంగారాన్ని అక్రమంగా తరలించిన కేసులో నిందితురాలు, కన్నడ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష పడింది. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ నిరోధక చట్టం కింద ఆమెకు కోర్టు ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది. ఆమెతోపాటు సహచరుడు తరుణ్ కొండూరు రాజు, బంగారం వ్యాపారి సాహిల్ జైన్‌లకూ శిక్ష పడింది. ఇటీవలే నటి రన్యారావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ ఏడాదిలో రన్యా రావు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే హక్కును కోర్టు నిరాకరించింది. రన్యారావు ఏడాదిపాటు జైలు నుంచి విడుదల కాకుండా ఉండేందుకు సీఓఎఫ్ఈపీఓఎస్ఏ చట్టం జారీ చేశారు. నటి రన్యారావు ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన రూ.12.56 కోట్ల విలువైన 14.2 కేజీల బరువైన బంగారాన్ని దుబాయ్ నుంచి స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. దీంతో రన్యా రావును డీఆర్ఐ అరెస్ట్‌చేసి విచారించింది. నటితోపాటు ఆమె సహచరుడు తరుణ్ కొండూరు రాజు, వజ్రాభరణాల వ్యాపారి సాహిల్ జైన్ ఈ స్మగ్లింగ్ రాకెట్లో భాగమైనట్లు ఆరోపణలు వచ్చాయి. రన్యా రావు 2023 నుంచి 2025 వరకు దుబాయ్‌కు ఏకంగా 56 సార్లు ప్రయాణించినట్లు డీఆర్ఐ దర్యాప్తులో స్పష్టమైంది. దుబాయ్ పర్యటనలో భాగంగా భారత్ నుంచి తరుణ్‌తో కలిసి 20 సార్లు ప్రయాణించింది. ఇది గుర్తించిన అధికారులు విచారించగా నటి పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో రూ. 2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు రూ.2.67 కోట్ల విలువైన కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకున్నారు. రన్యా రావు నుంచి మొత్తంగా రూ. 17.29 కోట్ల నగదు, బంగారాన్ని అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. రన్యా రావు గత 12 నెలలకాలంలో 27 సార్లు విదేశాలకు వెళ్లిందని, కస్టమ్స్ సుంకం మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. -
జాతీయ ప్రయోజనాలే ముఖ్యం
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే, వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తే 100 శాతం టారిఫ్‌లు విధిస్తామంటూ ‘నాటో’ సెక్రెటరీ జనరల్ మార్క్ రుట్టే చేసిన హెచ్చరికలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తిప్పికొట్టారు. జాతీయ ప్రయోజనాలు, మార్క్ అవసరాల ఆధారంగానే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. తమకు దేశ ప్రయోజనాలు, అవసరాలే ముఖ్యమని తేల్చిచెప్పారు. రష్యా చమురు విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించొద్దని నాటోకు సూచించారు. రణధీర్ జైశ్వాల్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మార్క్ రుట్టే హెచ్చరికలను నిశితంగా గమనిస్తున్నా మని చెప్పారు. భారత ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు ప్రజా ప్రయోజన కోణంలోనే ఉంటాయన్నారు. సుస్థిరమైన ఇంధన భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మార్కెట్లో తక్కువ ధరకు చమురు లభించినప్పుడు కొనడం సాధారణమేనని వివరించారు. రష్యా నుంచి యూరప్ దేశాలు చమురు కొనుగోలు చేస్తున్నారని రణధీర్ జైశ్వాల్ పరోక్షంగా ప్రస్తావించారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపాలని, ఉక్రెయిన్‌పై యుద్ధం విరమించేలా రష్యాపై ఒత్తిడి పెంచాలని ఇండియా, చైనా, బ్రెజిల్‌కు మార్క్ రుట్టే సూచించిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి ఈ మూడు దేశాలే అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్నాయి. -
సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపండి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో సెమీకండక్లర్ ప్రాజెక్టులకు త్వరితగతిన ఆమోదం తెలపాలని కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, ప్రపంచ స్థాయి పరిశోధన, అభివద్ధి కేంద్రాలు తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. అందువల్ల ప్రతిపాదిత అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ (ఏఎస్ఐపీ) ప్రాజెక్టు, మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే ఫ్యాబ్ ప్రాజెక్టు క్రిస్టల్ మ్యాట్రిక్స్‌కు ఆమోదం తెలపాలని కోరారు.రెండురోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఢిల్లీ వచ్చిన సీఎం..గురువారం రైల్ భవన్లో అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో హైటెక్ ఎల్రక్టానిక్స్ పార్క్ ఏర్పాటుకు ఈఎంసీ 2.0 పథకం కింద తెలంగాణ ఇచ్చిన వినతిని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రీజినల్ రింగు రోడ్డు సమీపంలో నూతన ఎల్రక్టానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరారు. రీజినల్ రింగు రైలుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఎం వినతులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ డ్రైపోర్టు–బందరు లైన్ మంజూరు చేయండి రాష్ట్రంలో రైల్వే అనుసంధానత పెంపు కోసం నూతన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని అశ్వినీ వైష్ణవ్‌ను ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డుకు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించామని..ఇందుకు రైల్వే బోర్డు ఇప్పటికే ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. రూ.8 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. ‘రీజినల్ రింగ్ రైలుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానత పెరగడంతో పాటు హైదరాబాద్ నగరంలోని ప్రధాన స్టేషన్లలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది..’అని చెప్పారు. హైదరాబాద్ డ్రైపోర్టు నుంచి బందరు ఓడ రేవుకు అనుసంధానంగా రైలుమార్గం మంజూరు చేయాలని కోరా రు. ఔషధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఉ త్పత్తుల ఎగుమతులకు ఈ మార్గం దోహదపడుతుందన్నారు. కొత్త రైలు మార్గాలు మంజూరు చేయండి ఖాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు అంశాన్ని సీఎం రేవంత్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ఆపరేషన్లను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఖాజీపేట రైల్వే డివిజన్ అవసరమని తెలిపారు. ప్రయాణికులకు భద్రత, వేగవంతమైన సేవల కోసం దీనిని ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా తెలంగాణలో వివిధ ప్రాంతాల అనుసంధానత, పారిశ్రామిక, వ్యవసాయక ఎగుమతులు, దిగుమతుల కోసం.. వెనుకబడిన ప్రాంతాల అభివద్ధికి నూతన రైలు మార్గాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.వికారాబాద్–కృష్ణా (122 కి.మీ.–అంచనా వ్యయం రూ.2,677 కోట్లు) కల్వకుర్తి–మాచర్ల (100 కి.మీ.–అంచనా వ్యయం రూ.2 వేల కోట్లు), డోర్నకల్–గద్వాల (296 కి.మీ.–అంచనా వ్యయం రూ.6,512 కోట్లు), డోర్నకల్–మిర్యాలగూడ (97 కి.మీ.–అంచనా వ్యయం 2,184 కోట్లు) మార్గాలను వంద శాతం రైల్వే శాఖ వ్యయంతో మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపీలు పోరిక బలరాం నాయక్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, సురేశ్ షెట్కార్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్, ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. -
ఏఐతో.. ముప్పు పొంచి ఉంది!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రస్తుతం ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న సాంకేతికత. ఏఐతో కొత్త అవకాశాలు రావడమే కాదు.. ప్రస్తుతం తాము పనిచేస్తున్న ఉద్యోగాలకు ముప్పు రానుందని అత్యధిక మంది నిపుణులు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో నైపుణ్యాలను పెంచుకోవాలన్న కృతనిశ్చయం వారిలో కనిపిస్తోంది. మెషీన్ లెర్నింగ్, ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఎక్కువ శాతం మంది భావిస్తున్నారని ‘గ్రేట్ లెర్నింగ్’ సర్వేలో తేలింది.సాంకేతికతతో తమ ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని భావించే వారిలో 21 నుండి 28 సంవత్సరాల వయసు గల యువత (జనరేషన్ –జెడ్) అత్యధికంగా ఉండటం విశేషం. ముఖ్యంగా ఏఐ వల్ల తమ ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని 74% మంది జెన్ –జెడ్ తరం భావిస్తున్నారు. ప్రస్తుతం తాము పనిచేస్తున్న ఉద్యోగానికి ఢోకా లేదని 64 శాతం మంది ధీమాగా ఉన్నారు.45–60 సంవత్సరాల వయసు గల జనరేషన్ –ఎక్స్‌లో 56% మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా 69% మంది నిపుణులు తమ ఉద్యోగాలకు ఏఐ వల్ల ప్రమాదం ఉందని నమ్ముతున్నారు. ‘అప్‌స్కిల్లింగ్ ట్రెండ్స్ రిపోర్ట్ 2025–26’ పేరుతో ఎడ్టెక్ కంపెనీ ‘గ్రేట్ లెర్నింగ్’ దేశవ్యాప్తంగా విభిన్న రంగాలకు చెందిన 1,000 మందికిపైగా నిపుణులతో చేసిన సర్వేలో ఇలాంటి ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.నైపుణ్యం పెంచుకుంటాం..ఈ సంవత్సరం నైపుణ్యాలను పెంచుకోవాలని 81% మంది భావిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ సంఖ్య దేశంలోనే అత్యధికంగా 90 శాతం ఉంది. తమ కెరీర్లపై ఏఐ ప్రభావం సానుకూలంగా ఉంటుందని 78% మంది చెబుతున్నారు. ఈ ఏడాది 73% మంది నిపుణులు తమ ఉద్యోగాలను నిలుపుకోవడంపై నమ్మకంగా ఉన్నారు. 82% మంది చురుగ్గా కొత్త ఉద్యోగ అవకాశాలను అన్వేషిస్తున్నారు. ఇక 29–44 ఏళ్ల వయసున్న (మిలీనియల్స్) ఉద్యోగుల్లో 90 శాతం మంది నైపుణ్య విలువను గుర్తించారు. జెన్ –జెడ్ విషయంలో ఇది 79 శాతం. కానీ ఆఫీసు పని గంటల కారణంగా నూతన సాంకేతిక నైపుణ్యాలను సంపాదించడం అడ్డంకిగా మారిందని 37% మంది అంటున్నారు. కుటుంబ బాధ్యతలు, ఇంటి పని కారణంగా కొత్త కోర్సులు నేర్చుకోలేకపోతున్నామని 25 శాతం మహిళలు చెబుతుంటే.. ఇలా చెప్పిన పురుషులు 20 శాతం కావడం విశేషం.6 వారాల నుంచి ఆరు నెలలు..కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి జెన్ –ఏఐని ఉపయోగిస్తున్నట్లు 80% మంది నిపుణులు వెల్లడించారు. మెషీన్ లెర్నింగ్, ఏఐ విభాగాల్లో నైపుణ్యం పెంచుకుంటామని 44 శాతం మంది తెలిపారు. తమ పనిలో జెన్ –ఏఐని ‘ఎల్లప్పుడూ’ లేదా ’తరచుగా’ ఉపయోగిస్తామని 60% మంది చెబుతున్నారు. ఇక ఐటీ, ఐటీఈఎస్, బీపీఎం, టెలికం రంగాల్లో పనిచేస్తున్నవారిలో 91 శాతం మంది నైపుణ్యం మెరుగుపర్చుకోవడం ముఖ్యం అని తెలిపారు. 64% మంది నిపుణులు 6 వారాల నుంచి 6 నెలల నిడివిగల ప్రోగ్రామ్స్‌తో నైపుణ్యాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నారు.జెన్ –జీ ప్రధానంగా స్వల్పకాలిక ప్రోగ్రామ్స్‌ను ఇష్టపడుతున్నారు. 50% మంది 6 వారాల కంటే తక్కువ లేదా 6 వారాల నుండి 3 నెలల మధ్య ఉన్న ప్రోగ్రామ్‌లను ఇష్టపడుతున్నారు. దేశీయ యూనివర్సిటీలు అందించే సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామని 43 శాతం చెప్పగా.. అంతర్జాతీయ వర్సిటీల సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామని 36 శాతం తెలిపారు. తల్లి/తండ్రిగా బాధ్యతలు నెరవేరుస్తున్న ఉద్యోగుల్లో 90% మంది నిపుణులు నైపుణ్యం పెంపుదల ముఖ్యమైనదని భావిస్తున్నారు. ఇతర (పెళ్లికాని లేదా పిల్లలు లేనివారు) నిపుణుల్లో ఈ సంఖ్య 76 శాతమే. -
ఇది కదా హ్యూమన్ స్పిరిట్ .. ఓ వైపు పెళ్లి.. మరో వైపు అంత్యక్రియలు
కౌలాలంపూర్: నేటి సమాజంలో మంటగలుస్తున్న మానవత్వానికి మచ్చుతునక ఈ ఉదంతం. జూలై 5న మలేషియాలోని నెగెరి సెంబిలాన్ రాష్ట్రంలోని టంపిన్ పట్టణంలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వైపు భారతీయ కుటుంబం వివాహ వేడుకను నిర్వహిస్తుండగా, అదే వీధిలో చైనా కుటుంబం 94 ఏళ్ల మహిళకు అంత్యక్రియలు నిర్వహించింది.చైనా కుటుంబానికి చెందిన వాంగ్ అనే రాజకీయ నాయకుడు తన తల్లి మరణాన్ని ‘జాయ్‌ఫుల్ ఫ్యూనరల్’గా పేర్కొన్నారు. అంటే, వృద్ధాప్యంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మరణించడం చైనా సంస్కృతిలో శుభంగా భావిస్తారు. అయితే, తన తల్లి మరణంతో వాంగ్ భారతీయ కుటుంబాన్ని సంప్రదించారు. ‘రాత్రి ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు ఉండవు. మీరు మీ వేడుకను కొనసాగించవచ్చు అని వారికి భరోసా ఇచ్చారు. దీంతో భారతీయ కుటుంబం పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించింది. సంగీతాన్ని తగ్గించి, అతిథులను అంత్యక్రియల ప్రదేశానికి దూరంగా వాహనాలు పార్క్ చేయమని సూచించింది.ప్రస్తుతం ఈ ఘటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇది నిజమైన మలేషియన్ స్పిరిట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. సాంస్కృతిక భిన్నత్వం ఉన్నా.. పరస్పర గౌరవం, సానుభూతి ఎలా మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్తాయో ఇది ఒక అద్భుత ఉదాహరణగా నిలిచిందని కామెంట్లు చేస్తున్నారు. -
‘నిమిషకు న్యాయపరమైన సాయం అందిస్తున్నాం’
న్యూఢిల్లీ: యెమెన్‌లో చివరి నిమిషంలో మరణశిక్ష వాయిదా పడ్డ కేరళ నర్సు నిమిష కేసు అంశానికి సంబంధించి భారత విదేశాంగ శాఖ స్పందించింది. నిమిష కేసులో అవసరమైన న్యాయ సహాయాన్ని అందిస్తున్నామని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం ప్రయత్నాలే వల్లే నిమిష మరణశిక్ష వాయిదా పడిందని విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. నిమిష తరఫున లాయర్‌ను కూడా నియమించినట్లు ఆయన తెలిపారు. సదరు లాయర్ ఆ ఫ్యామిలీతో రెగ్యులర్‌గా ఫాలో చేస్తూ అందుబాటులో అవసరమైన సలహాలు ఇస్తున్నారన్నారు. అలాగే యెమెన్ అధికారులతో కూడా లాయర్ టచ్‌లో ఉంటూ కేసుకు సంబంధించిన విషయాల్ని చూసుకంటున్నారని రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.కాగా, యెమెన్‌లో కేరళ నర్సు నిమిషా ప్రియాకు భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఆమె మరణ శిక్షను వాయిదా వేస్తున్నట్లు యెమెన్ ప్రభుత్వం ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం.. యెమెన్ సనా జైలులో బుధవారం(జూలై 16వ తేదీ) మధ్యాహ్నాం నిమిషకు శిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో మరణశిక్ష వాయిదా పడింది.2008లో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిందామె. 2011లో భారత్‌కు వచ్చి వివాహం చేసుకుంది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత ఆమె మళ్లీ యెమెన వెళ్లింది. అక్కడి చట్టాల ప్రకారం.. తలాబ్ అబ్దో మహ్దీ అనే వ్యక్తితో కలిసి క్లినిక్ తెరిచింది. అయితే తలాబ్ తనను వేధించాడంటూ ఆమె 2016లో పోలీసులను ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో తలాబ్ వద్ద చిక్కుకున్న తన పాస్‌పోర్టును దొంగలించేందుకు అతనికి మత్తుమందిచ్చింది. ఓవర్‌డోస్ కావడంతో అతను మరణించాడు. శవాన్ని ఓ వాటర్ ట్యాంకర్లో పడేసి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. -
ధర్మస్థళలో ఏం జరిగింది?
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థళ. ఇప్పటి వరకు ఇది మంజునాథుడి ఆలయం నుంచి ఆధ్యాత్మిక ప్రాంతంగానే సుపరిచితం. ఈ నెల 3న ఓ న్యాయవాదితో కలిసి అక్కడి పోలీసుస్టేషన్‌కు వచ్చిన వ్యక్తి చేసిన ఫిర్యాదు అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ధర్మశాల దేవాలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసిన తాను దాదాపు 20 ఏళ్ల పాటు అనేక మృతదేహాలను పాతిపెట్టానని బాంబు పేల్చాడు. హతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని, కొందరిపై అత్యాచారం జరిగినట్లు, మరికొందరిపై యాసిడ్ దాడులకు సంబంధించిన గుర్తులు ఉన్నాయని అంతా ఉలిక్కిపడేలా చేశాడు. ప్రస్తుతం మానవహక్కుల, మహిళ సంఘాలు నిజాలు నిగ్గు తేల్చడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.ధర్మస్థళ కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడి మంజునాథ స్వామి ఆలయం ఏళ్లుగా లక్షలాది మంది భక్తుల్ని ఆకర్షిస్తోంది. ఈ ఆలయాన్ని నడిపే ట్రస్ట్ కర్ణాటకలోని అత్యంత శక్తిమంతమైన హెగ్డే కుటుంబం నేతృత్వంలో పని చేస్తుంటుంది. అత్యంత సంప్రదాయకమైన ఈ కుటుంబం కేవలం దక్షిణ కన్నడ జిల్లాలోనే కాకుండా ఆ రాష్ట్రంలోనే సామాజిక, రాజకీయంగా శక్తిమంతమైంది. అలాంటి ధర్మస్థళ దేవాలయం సూపర్వైజర్లు, నిర్వాహకులపై మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పుడు కేసు నమోదైంది. ఇందులోని నిజానిజాలు గుర్తించే పనిలో ధర్మస్థళ పోలీసులు ఉండగా... సుజాత భట్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసు విభాగం మొత్తం అప్రమత్తమైంది. ఫిర్యాదుదారుడిగా ఉన్న మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ‘తాను దళితుడినని, 1995 నుంచి 2014 డిసెంబర్ దేవస్థానంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశానని’ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అనేక కీలకాంశాలు పొందుపరిచాడు. అంతా ఉలిక్కిపడేలా చేసిన ఆ వివరాలివి....‘‘ఉద్యోగంలో చేరిన తొలినాళ్లల్లో ధర్మస్థళ ఆలయానికి సమీపంలో ఉన్న నేత్రావతి నది వద్ద విధులు నిర్వర్తించా. ఆ పరిసరాలను శుభ్రం చేసే డ్యూటీ నుంచి సూపర్వైజర్ల ఆదేశాల మేరకు హఠాత్తుగా హేయమైన, దారుణ నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను మాయం చేసే పని చేయాల్సి వచ్చింది. పురుషులతో పాటు మహిళలు, బాలికలు, చిన్నారుల మృతదేహాలను తీసుకువెళ్లి సమీపంలో ఉన్న అడవిలోని వివిధ ప్రాంతాల్లో పాతిపెట్టేలా సూపర్వైజర్లు ఆదేశించారు. మొదట్లో ఇవన్నీ నేత్రావతి నదితో పాటు ధర్మస్థళ ప్రాంతానికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలకు సంబంధించినవి భావించా. అయితే కొన్నాళ్లకు ఆ మృతదేహాలను ఉన్న గాయాలు, ఇతర గుర్తులను చూసి అనుమానించాం. దీంతో ఆ మృతదేహాలు ఏమిటి? అంటూ ఆ బాధ్యతలు అప్పగించిన సూపర్వైజర్లను ప్రశ్నించా. పోలీసులకు చెప్పకుండా ఇలా మృతదేహాలను మాయం చేయకూడదని, అసలు విషయం చెప్పకపోతే ఆ పని చేయనని స్పష్టం చేశా. ఆగ్రహానికి గురైన వాళ్లు నన్ను తీవ్రంగా కొట్టారు. తాము చెప్పినట్లు చేయకపోతే చంపేస్తానంటూ బెదిరించారు. ‘ముక్కలుగా నరికేస్తాం’, ’మీ మృతదేహాన్ని మిగిలిన వాటిలాగే పాతిపెడతాం’, ’మీ కుటుంబాన్ని కూడా ఉండనీయం’ అంటూ వాళ్లు భయపెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పని కొనసాగించా.కొన్నిసార్లు ఆయా మృతదేహాలపై అత్యాచారం, తీవ్రమైన హింసకు సంబంధించి ఆనవాళ్లు కనిపించాయి. మహిళల మృతదేహాల్లో అనేకం వస్త్రాలు లేకుండా లో దుస్తులు లేకుండా ఉండేవి. వారి శరీరాలపై లైంగికదాడులకు సంబంధించి గుర్తులు, గాయాలు కనిపించేవి. కొన్ని మృతదేహాలకు ఏకంగా గొంతులు కోసి, తీవ్రరక్తస్రావమై ఉండేవి. 1994 నుంచి దాదాపు 20 ఏళ్ల పాటు ఎన్నో మృతదేహాలను తీసుకువెళ్లి ధర్మస్థళ చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతాల్లో పూడ్చిపెట్టా. వాటిలో 2010లో పూడ్చిన బాలిక మృతదేహం స్కూల్ యూనిఫాంతో ఉంది. ఆ రోజు సూపర్వైజర్లు నన్ను నేత్రావది నది సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్‌కు అర కిలోమీటరు దూరంలో ఉన్న ప్రదేశానికి పంపారు. అక్కడే నాకు ఆ బాలిక మృతదేహం కనిపించింది. అప్పట్లో ఆమె వయస్సు 12 నుంచి 15 ఏళ్ల మధ్య ఉండచ్చు. ఆమె శరీరంగా లైంగిక దాడికి సంబంధించిన గుర్తులు స్పష్టంగా కనిపించాయి.యాసిడ్ దాడిలో ముఖం, చేతులు కాలిపోయి ఉన్న మహిళలవి, గొంతు పిసికి చంపిన పురుషుల మృతదేహాలు కూడా తీసుకువెళ్లి పాతిపెట్టి వచ్చా. నా సమక్షంలోనూ కొందరిని చంపిన సూపర్వైజర్లు ఆ శవాలను మారుమూల అటవీ ప్రాంతాల్లో పాతిపెట్టించారు. 1998లో వారికి ఎదురు తిరగడంతో తీవ్రంగా కొట్టారు. నా ప్రాణంతో పాటు నా కుటుంబ ప్రాణాల కోసం 2014 వరకు ఈ పని చేశా. ఆ ఏడాది డిసెంబర్లో సూపర్వైజర్ల సంబంధీకుడు నా కుటుంబానికి చెందిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో నా ఉద్యోగంతో పాటు ధర్మస్థళ వదిలి కుటుంబంతో సహా పారిపోయా. ఇతర రాష్ట్రంలో తలదాచుకున్నా... నాకు, నా కుటుంబానికి హాని తప్పదనే భయం నిత్యం వెంటాడుతూనే ఉంది. అప్పట్లో జరిగిన దారుణాలను బయటకు చెప్పాలని ఇటీవల తిరిగి వచ్చా’’ అని పేర్కొన్నాడు.ధర్మస్థళకు వచ్చిన వెంటనే తాను అప్పట్లో ఓ శవాన్ని పాతిపెట్టిన ప్రాంతానికి వెళ్లానని పోలీసుల దృష్టికి తెచ్చాడు. అక్కడ తవ్వి కొన్నేళ్ల క్రితం పాతిపెట్టిన మృతదేహాన్ని తవ్వి తీశానంటూ కొన్ని ఫొటోలను తన ఫిర్యాదుతో జత చేసి ధర్మస్థళ పోలీసులకు అందించాడు. తనకు, తన కుటుంబానికి రక్షణ ఇవ్వాలని కోరాడు. పోలీసులు తనతో వస్తే తాను మృతదేహాలను పాతిపెట్టిన అటవీ ప్రాంతానికి తీసుకువెళ్తాననీ పేర్కొన్నాడు. ఆ మృతదేహాలను బయటకు తీసి సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తిచేయాలని ఆశిస్తున్నానని, అలా చేస్తేనే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, తనలో ఉన అపరాధ భావం పోతుందని సదరు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు చెప్పాడు. అప్పట్లో మృతదేహాలను మాయం చేయాలని ఆదేశించిన వారిలో సూపర్వైజర్లతో పాటు ఆలయ పాలకమండలి సభ్యులూ ఉన్నట్లు వివరించాడు. ప్రాణభయంతోనే వారి పేర్లు చెప్పలేదని, పలుకుబడి ఉన్న వారి నుంచి తనకు రక్షణ కావాలని కోరాడు. పోలీసుల ఆ భరోసా ఇస్తే అన్ని పేర్లు చెప్తానని అన్నాడు. ఈ ఫిర్యాదును కోర్టుకు నివేదించిన ధర్మస్థళ పోలీసులు న్యాయమూర్తి అనుమతితో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.- శ్రీరంగం కామేష్త్వరలో మరిన్ని వివరాలు.. -
రష్యన్ మహిళను వెతికి పట్టుకోండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: భర్తతో విడాకుల కేసు పెండింగ్‌లో ఉన్న సమయంలో ‘కస్టడీ డీల్’లో ఉన్న ఐదేళ్ల పిల్లాడితో కనిపించకుండా పోయిన రష్యాకు చెందిన మహిళను వెంటనే వెతికి పట్టుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖను ఆదేశించింది సుప్రీంకోర్టు. కొన్నేళ్ల క్రితం రష్యాకు చెందిన మహిళ విక్టోరియా బసూను భారత్‌కు చెందిన సైకత్ బసూ వివాహం చేసుకోగా, ప్రస్తుతం వారి మధ్య విడాకుల కేసు ఢిల్లీ సాకేత్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ సమయంలో విక్టోరియా బసూ కనిపించకుండా పరారైయినట్లు భర్త సైకత్ బసూ ఫిర్యాదు చేశాడు. తన భార్య పిల్లాడిని తీసుకుని పరారైనట్లు సైకత్.. సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిలో భాగంగా విచారణ చేపట్టిన ధర్మాసనం సదరు మహిళను వెంటనే పట్టుకోవాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో రష్యన్ మహిళ వెంట పెట్టుకుని తీసుకుని పోయిన ఆమె కుమారుడ్ని వెంటనే ట్రేస్ అవుట్ చేయాలని ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించింది. ఇందులో ఎటువంటి జాప్యం లేకుండా త్వరతగతిన పిల్లాడి ఆచూకీని ఛేదించాలని స్పష్టం చేసింది. ఆపై పిల్లాడిని తండ్రి సైకేత్కు అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం.. పిల్లాడితో పాటు కనిపించకుండా పోయిన విక్టోరియా బసూ పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని ఆదేశించింది. ఎయిర్పోర్ట్, నావీ పోర్ట్ల్లో అధికారులు ఆ మహిళపై ఓ కన్నేసి ఉంచాలని ఆదేశాల్లో పేర్కొంది ధర్మాసనం. అదే సమయంలో ఆమెపై లుకౌట్ నోటీసులు జారీ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. విక్టోరియా బసూ ఎక్కడ ఉందో తెలియదంటూ ఆమె తరఫు న్యాయవాది తెలిపిన క్రమంలో.. సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ‘ ‘ఆమె ఎక్కడ ఉందో మీకు తెలుసు. మీరు మాతో ఆటలు ఆడాలనుకుంటున్నారా?, మీ దగ్గరికి మళ్లీ వస్తాం.. మీరు కాస్త ఆగండి’ అని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఆమెకు రష్యా ఎంబాసీ అధికారి సాయం చేశారు..తన భార్య పారిపోవడానికి భారత్‌లో ఉన్న రష్యన్ ఎంబసీ ప్రతినిధి సాయం చేశారని సైకేత్ కోర్టుకు తెలిపారు. విడాకుల కేసు ప్రోసిడింగ్స్‌లో ఉండగా ఢిల్లీలోని రష్యన్ ఎంబసీ నుంచి ఆమె పారిపోయిందని భర్త తెలిపారు. ఎంబసీ వెనుక గేటు నుంచి ఆమె వెళ్లిపోయిందని, రష్యన్ ఎంబసీ అధికారి ఆమెకు సాయం చేశారని భర్త ఆరోపిస్తున్నాడు. లగేజీ పట్టుకుని మరీ వెళ్లిన ఆమెను సదరు అధికారి పంపించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. రష్యన్ ఎంబాసీ అధికారి ఆమెకు సాయం చేయడం తాను చూశానన్నాడు. అ అధికారి ఇళ్లు సోదా చేయడానికి అనుమతి కోరండిరష్యన్ రాయబార కార్యాలయ అధికారితో సంబంధం ఉందని బాధిత భర్త చేసిన ఆరోపణను కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది; ఆమె గుర్తించబడకుండా భవనంలోకి ప్రవేశించడానికి సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ఎవరు అనేది అస్పష్టంగా ంది. ఢిల్లీలోని ఈ అధికారి ఇంటిని సోదా చేయడానికి అనుమతి కోరాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించింది సుప్రీంకోర్టు.విడాకుల కేసు పెండింగ్‌లో ఉన్న కారణంగా ఆ పిల్లాడు మూడు రోజులు తల్లి దగ్గర ఉండాలనేది కస్టడీ డీల్. దీనిలో భాగంగా మే 22వ తేదీన పిల్లాడిని తీసుకుంది. అదే తాను పిల్లాడిని చివరిసారి చూడటమని కోర్టుకు తెలిపాడు భర్త సైకేత్. భార్య విక్టోరియా బసూ.. జూలై 7 నుంచి పిల్లాడితో సహా కనిపించకుండా పోయిందని సైకేత్ బసూ కోర్టుకు తెలిపారు. -
హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు అసంతృప్తి.. దర్శన్‌కు లీగల్ షాక్
సాక్షి,న్యూఢిల్లీ: అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్ తూగుదీపకు కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై గురువారం (జులై 17) సుప్రీంకోర్టు ఆగ్రహ వ్యక్తం చేసింది. రేణుకా స్వామి హత్యకేసులో కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు గతేడాది బెయిల్ మంజూరు చేసింది. అయితే, దర్శన్‌కు బెయిల్ ఇచ్చే సమయంలో హైకోర్టు తగిన ఆధారాలు, కేసు తీవ్రత, బాధితుడి (రేణుకాస్వామి) హక్కులను సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని భావించింది.గతేడాది ఏప్రిల్ నెలలో తన స్నేహితురాలు పవిత్ర గౌడకు సంబంధించిన అసభ్యకర ఫొటోలు పంపించాడన్న ఆరోపణల్లో రేణుకాస్వామిని దర్శన్, ఆయన స్నేహితురాలు పవిత్రగౌడలు దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో దర్శన్, పవిత్రగౌడ సహా 15మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టిన కోర్టు నిందితులకు జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో దర్శన్, పవిత్రగౌడతో పాటు పలువురు నిందితులు కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. అనంతరం, గతేడాది డిసెంబర్లో వీరికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.దర్శన్‌కు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై సుప్రీం కోర్టు జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టించింది. ఈ సందర్భంగా..దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇచ్చిన తీరును తప్పుబట్టింది.రేణుకాస్వామి హత్య కేసు విచారణ సందర్భంగా, దర్శన్ తరపున వాదనలు వినిపిస్తున్న ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్‌తో సుప్రీం కోర్టు ధర్మాసనం ఇలా అన్నది.‘రేణుకాస్వామి కేసులో దర్శన్‌కు బెయిల్ ఇచ్చిన కర్ణాటక హైకోర్టు తీర్పు.. న్యాయబద్ధంగా తీసుకోలేదనే అభిప్రాయం కలుగుతోంది. తగిన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా, విచక్షణను సరిగ్గా అమలు చేయలేకపోయింది అనిపిస్తోంది. మిస్టర్ సిబల్..మీ అభిప్రాయం ఏమిటి?’అని అడిగింది.అందుకు కపిల్ సిబల్ అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టు నిర్ణయాన్ని పక్కన పెట్టి సాక్షుల ఇచ్చిన స్టేట్మెంట్లపై దృష్టి పెట్టాలని కోరారు. కపిల్ సిబల్ విజ్ఞప్తిపై సుప్రీం ధర్మాసనం.. విచారణ తదుపరి మంగళవారానికి వాయిదా వేస్తున్నాం. హైకోర్టు తీర్పులో మేము ఎందుకు జోక్యం చేసుకోకూడదో వచ్చే విచారణలో మీరు వాదించండి. మీ వాదనల్ని మేం వినాలని అనుకుంటున్నామని తెలిపింది. Supreme Court hears Karnataka’s plea against bail granted to Kannada actor Darshan Thoogudeepa (Sri Darshan C). They are accused in the murder of a fan, Renukaswamy, allegedly triggered by derogatory messages the victim sent to actress Pavithra Gowda - Darshan’s alleged… pic.twitter.com/7Dw8eIL9vf— Bar and Bench (@barandbench) July 17, 2025 -
ముఖ్యమంత్రి ఇలాకాలో.. ఐసీయూలో కాల్పుల కలకలం
పాట్నా: బీహార్‌లో క్రైమ్ సినిమా సీన్‌ను తలపించేలా ఘటన చోటు చేసుకుంది. ఐదుగురు నిందితులు తాపీగా ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూలో చొరపడ్డారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితుడ్ని కాల్చి చంపారు. గురువారం పాట్నాలోని రాజాబజార్ పారస్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. బక్సర్ జిల్లాకు చెందిన పలు హత్యకేసుల్లో జైలు శిక్షను అనుభవిస్తున్న చందన్ మిశ్రా.. ప్రస్తుతం పేరోల్ మీద బయటకు వచ్చాడు. అనారోగ్యం కారణంగా పారస్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆస్పత్రిలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలో ఐసీయూలోకి చొరబడి కాల్పులు జరిపిన దృశ్యాల ఆధారంగా చందన్ మిశ్రాను ప్రతీకారం తీర్చుకునేందుకే చందన్ షేరు గ్యాంగ్ ప్రాణాలు తీసినట్లు పాట్నా ఎస్ఎస్పీ కార్తికేయ శర్మ భావిస్తున్నారు.మరోవైపు, పట్టపగలే నిందితులు ఆస్పత్రి ఐసీయూలోకి ప్రవేశించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చందన్ మిశ్రా హత్య వెనుక ఆస్పత్రి వర్గాల ప్రమేయో కూడా ఉండొచన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇందులో భాగంగా హాస్పిటల్ సెక్యూరిటీ గార్డులు, యాజమాన్యాన్ని సైతం దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్ని ఆచూకీ గుర్తించేందుకు పాట్నా పోలీసులు.. బక్సర్ పోలీసుల సహకారంతో షూటర్ల ఫోటోలు సేకరించి వారి గాలింపు చర్యలు చేపట్టారు.𝐓𝐇𝐄 A̶M̶R̶I̶T̶ 𝐑𝐀𝐕𝐀𝐍 𝐊𝐀𝐀𝐋The Most Sensational CCTV Video So Far 😱This CCTV Footage is from Paras Hospital in #Patna, where a young man named Chandan Mishra, with a Criminal Background, was murdered yesterday.These Shooters are Captured in the CCTV video; See… pic.twitter.com/wGHAvROQrm— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) July 17, 2025సీఎం నితీష్ కుమార్ నివాసానికి ఐదు కిలోమీటర్లు దూరంలో ఈ ఘటన చోటు చేసుకోవడంపై రాజకీయ దుమారం చెలరేగింది. పరాస్ ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు ఆర్జేడీ, కాంగ్రెస్‌లు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ బీహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ప్రభుత్వ అడంతో నేరస్తులే ఆస్పత్రి ఐసీయూలోకి చొరబడి రోగిని కాల్చి చంపారు.బీహార్‌లో ఎక్కడైనా ఎవరైనా సురక్షితంగా ఉన్నారా? 2005 కి ముందు ఇది జరిగిందా? అని నితిష్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాగా, ఈ ఏడాది నవంబర్‌లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా సీఎం నితిష్ కుమార్ ఓటర్లకు వరాల జల్లు కురిపిస్తున్నారు. అయితే, బీహార్‌లో వరుస హత్యలతో శాంతి భద్రతలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. -
మిరాకిల్.. వెంటిలేటర్ తీయగానే, షేర్ సింగ్ బతికొచ్చాడు!
‘‘బాజా భజంత్రీలతో కళకళలాడాల్సిన ఇల్లు..వల్లకాటిలా మారిపోయింది. కాళ్ల పారాణి ఆరకముందే...తాళి కట్టిన చేతులతోనే.’’ ఇలాంటి వార్తలను చదివి, వినీ వినీ విసిగిపోయిన వారికి నిజంగా ఇది మిరాకిల్. బంధువులంతా బరువెక్కిన గుండెలతో, అశ్రునయనాలతో అంత్యక్రియలకు సిద్ధమవుతున్న వేళ చనిపోయిన మనిషి తిరిగి బతికి వచ్చాడు. హర్యానాలో అద్భుతం జరిగింది. దీంతో ఆ కుటుంబం తొలుత ఆశ్చర్యపోయింది. ఆ తరువాత వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అంత్యక్రియల కోసం చేసిన ఏర్పాట్లన్నీ అంతులేని ఆనందంతో ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. హర్యానాలోని యమునానగర్ జిల్లాలోని కోట్ మజ్రిలో ఈ అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది. షేర్ సింగ్ అనే 75 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో పెద్ద ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. చికిత్స అనంతరం షేర్ సింగ్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో కుటుంబ సహ్యులు అంత్యక్రియలకోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దహన సంస్కారాలకు కలప శ్మశానవాటికకు చేరుకుంది. దూరం నుండి వచ్చిన అతిథులు, ఇతరుల కోసం ఆహారం కూడా సిద్ధం చేశారు. అంత్యక్రియలకు సన్నాహాలు పూర్తయ్యాక, స్నానం చేయించే ముందు అతని వెంటిలేటర్ ట్యూబ్‌ను తొలగించారు. ఆ మరుక్షణంలో అతను కళ్ళు తెరిచి దగ్గు ప్రారంభించాడు. షేర్‌సింగ్‌ను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. విచిత్రంగా వెంటిలేటర్ పైపు తొలగించగానే, షేర్ సింగ్ ఆకస్మికంగా ఊపిరి పీల్చుకోవడం ఆనందాన్ని కలిగించిందని స్థానిక మాజీ సర్పంచ్ రంజిత్ సింగ్ తెలిపారు అందరూ ఆనందంగా భోజనాలు ముగించి అదృష్టవంతుడు షేర్ సింగ్ అంటూ మనుసులోనే ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతోషంగా తమ తమ ఇళ్లకు చేరారు.ఇదీ చదవండి: చదివింది తక్కువే, రూ.500తో ముంబైకి, కట్ చేస్తే కోటీశ్వరుడుగా -
మరాఠీని వ్యతిరేకించిన మార్వాడీపై దాడి
ముంబై: మరాఠీవారిని అవమానిస్తూ వాట్సాప్ స్టేటస్ పోస్ట్ చేశారనే ఆరోపణలతో ముంబైలోని విక్రోలిలోగల ఒక మార్వాడీ దుకాణదారుడిపై దాడి చేసి, చెవులు పట్టుకుని క్షమాపణ చెప్పాలంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎస్ఎన్) కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.రాజ్ థాక్రే నేతృత్వంలోని పార్టీ కార్యకర్తలు మరాఠీ భాష మాట్లాడనివారిపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో విరివిగా జరుగుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు మరాఠీ దుకాణదారుణ్ణి చుట్టుముట్టి, అతను చేసిన వాట్సాప్ పోస్ట్ గురించి అడగటాన్ని గమనించవచ్చు. తరువాత వారంతా అతనిపై దాడి చేసి, బహిరంగ క్షమాపణ చెప్పాలని బలవంతం చేయడాన్ని చూడవచ్చు. तुम्ही इथे येऊन अशी भाषा वापराल तर तुम्हाला त्याच भाषेत उत्तर मिळणार. तुला कोलला ! pic.twitter.com/xSGFk201Ts— MNS Videos (@mnsvideos) July 16, 2025మరాఠీ భాష, సంస్కృతిని అగౌరవపరచవద్దని ఎంఎస్ఎస్ కార్యకర్తలు ఇతరులను హెచ్చరించడం వీడియోలో కనిపిస్తుంది. మరాఠీ ప్రజలను అవమానించేవారి దుకాణాలలో వస్తువులను కొనుగోలు చేయవద్దని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. థానేలో ఫుడ్ స్టాల్ యజమానిపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన కొద్ది రోజులకు ఈ ఘటన జరిగింది. గతంలో మరాఠీ మాట్లాడేందుకు నిరాకరించినందుకు ఒక ఆటోరిక్షా డ్రైవర్‌పై కూడా దాడి జరిగింది. -
అమర్నాథ్ యాత్ర నిలిపివేత.. కారణమిదే..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రా మార్గంలో భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో పహల్గామ్, బాల్టాల్ మార్గాలలో కొనసాగుతున్న అమర్నాథ్ యాత్రను గురువారం(జూలై 17)న ఒకరోజు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కుండపోత వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున, ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. శుక్రవారం (జూలై 18)న యాత్ర తిరిగి ప్రారంభమయ్యే ముందు భద్రతా తనిఖీలు నిర్వహించనున్నారని తెలిపారు. Tragedy Strikes Amarnath Yatra: Pilgrim Killed, Route Halted!A devastating landslide on the Baltal route in Ganderbal claimed the life of a woman pilgrim and injured three others, prompting the suspension of the Amarnath Yatra on July 17, 2025. Heavy rainfall triggered a… pic.twitter.com/uERtEB9cbm— UnreadWhy (@TheUnreadWhy) July 17, 2025కశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధురి మీడియాతో మాట్లాడుతూ గత రెండు రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా, ట్రాక్‌లపై మరమ్మతు, నిర్వహణ పనులు చేపట్టాల్సిన అవసరం ఏర్పండిందన్నారు. అందుకే గురువారం నాడు ఈ రెండు బేస్ క్యాంపుల మీదుగా పవిత్ర గుహ వైపు వెళ్లేదారిలో ఎటువంటి రాకపోకలను అనుమతించకూడదని నిర్ణయించామన్నారు. పగటిపూట వాతావరణ పరిస్థితులను అనుసరించి శుక్రవారం యాత్ర తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. Indian Army Rescues Pilgrims Amid Heavy Rain on Amarnath Yatra Route #AmarnathYatra #IndianArmy #ArmyRescue #Kashmir #YatraSafety #BreakingNews #Amarnath2025 #PilgrimSupport #DisasterResponse #JaiHind pic.twitter.com/oQyqxeMCHz— Geopolitics | News | Trends (@rareinfinitive) July 17, 2025గందర్బాల్ జిల్లాలోని యాత్ర బాల్తాల్ మార్గంలో కొండచరియలు విరిగిపడి ఒక మహిళ మృతిచెందిన నేపధ్యంలో అప్రమత్తమైన అధికారులు యాత్రను ఒకరోజు నిలిపివేసి మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. అమర్నాథ్ యాత్రా మార్గంలోని బాల్తాల్ ప్రాంతంలో అధిక వర్షపాతం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షాకాలంలో పర్వత ప్రాంతాలలో ఇటువంటి ప్రమాదాలు పొంచి ఉంటాయని అధికారులు తెలిపారు. జూలై 3న యాత్ర ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 2.47 లక్షలకు పైగా యాత్రికులు అమర్నాథ్ పవిత్ర గుహను సందర్శించుకున్నారు. -
భార్యపై కానిస్టేబుల్ అత్యాచారం సహకరించిన భర్త..!
కర్ణాటక: మహిళపై అత్యాచారం కేసులో పోలీసు కానిస్టేబుల్‌ను దక్షిణకన్నడ జిల్లా మంగళూరు కంకనాడి పోలీసులు అరెస్ట్ చేశారు. కావూరు పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న చంద్రనాయక్ నిందితుడు. మంగళూరు నగర పోలీసు కమిషనర్ సుదీర్ కుమార్ రెడ్డి వివరాలను వెల్లడించారు. బాధిత మహిళను ఆమె భర్త నగ్న వీడియోలను తీసి తాను చెప్పినట్లు చేయాలని బెదిరించసాగాడు. భర్త వేధింపులను తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో చంద్రనాయక్‌ను ఆమెతో మాట్లాడాడు. భర్త ఫోన్లోని వీడియోలను అతడు తొలగించడంతో సమస్య సద్దుమణిగింది. అప్పటినుంచి బాధితురాలికి మాయమాటలు చెప్పిన చంద్రనాయక్ లైంగికంగా వాడుకున్నాడు. ఇందుకు భర్త కూడా సహకరించాడు. ఇద్దరి వేధింపులు మితిమీరడంతో తట్టుకోలేక బాధితురాలు పోలీసు కమిషనర్ సుధీర్‌కుమార్ రెడ్డిని కలిసి తన గోడును వెల్లబోసుకుంది. ఆయన ఆదేశాలతో చంద్రనాయక్‌ను, ఘరానా భర్తని అరెస్టు చేశారు. -
అనుమతి లేకుండానే విజయోత్సవాలు
బెంగళూరు: ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విజయం తర్వాత బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు ఆర్సీబీ యాజమాన్యం, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ నెట్వర్క్స్ లిమిటెడ్‌తోపాటు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్(కేఎస్‌సీఏ) కారణమని కర్ణాటక ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు ఒక నివేదికను హైకోర్టుకు సమర్పించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముందస్తుగా అనుమతి తీసుకోకుండానే విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు కర్ణాటక సర్కార్ స్పష్టంచేసింది. ఈ ర్యాలీ నిర్వహించాలని ఆర్సీబీ యాజమాన్యం, డీఎన్ఏ సంస్థ, కేఎస్‌సీఏ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు తప్పు పట్టింది. పోలీసులకు ముందుగా సమా చారం ఇవ్వలేదని, చట్టప్రకారం తీసుకోవాల్సి అనుమతులేవీ తీసుకోలేదని వెల్లడించింది. జూన్ 4న జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, మరో 30 మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ గెలిస్తే బెంగళూరులో విజయో త్సవాలు నిర్వహిస్తామంటూ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు కేవలం సమాచారం మాత్రమే ఇచ్చారని, అధికారికంగా అనుమతి తీసుకోలేదని ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఆ సమాచారంలో పూర్తి వివరాలు లేకపోవడంతో విజయోత్సవాలకు పోలీసులు అంగీకరించలేదని తెలిపింది. కేవలం సమాచారం ఇవ్వడాన్ని అనుమతి కోసం చేసుకున్న దరఖాస్తుగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. అయినప్పటికీ జూన్ 4న ఆర్సీబీ టీమ్ యాజమన్యం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, విధాన సౌధ నుంచి చిన్న స్వామి స్టేడియం ద్వారా విక్టరీ పరేడ్ నిర్వహించబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటనలు జారీ చేసిందని వెల్లడించింది. సోషల్ మీడియాలో మొదటి పోస్టు ఉదయం 7.01 గంటలకు, చివరి పోస్టు మధ్యాహ్నం 3.14 గంటలకు పెట్టినట్లు తెలిపింది. ఆన్లైన్లో ఉచిత పాసులు అందుబాటులో ఉన్నాయని యాజమాన్యం చెప్పగా, అప్పటికే జనం స్టేడియం వద్దకు చేరుకున్నారని వివ రించింది. మొత్తానికి ఆర్సీబీ యాజమాన్యం, డీఎన్ఏ నెట్వర్క్స్ లిమిటెడ్, కేఎస్‌సీఏ నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు ప్రభు త్వం స్పష్టంచేసింది. ఈ దుర్ఘటనకు వారే పూర్తి బాధ్యత వహించాలని పేర్కొంది. CAT says IPL Team #RCB is prima facie responsible for Bengaluru Stampede which claimed 11 lives.Police is not magician, can't be expected manage huge crowds if not given sufficient time to make arrangements, the Tribunal observed.@RCBTweets @KarnatakaCops #BengaluruStampede pic.twitter.com/2QdmvohATs— Live Law (@LiveLawIndia) July 1, 2025ఆర్సీబీ సేవకులుగా పోలీసులు బెంగళూరు తొక్కిసలాట ఘటనలో ఐపీఎస్ అధికారి వికాస్ కుమార్‌తోపాటు మరికొందరు పోలీసులను సస్పెండ్ చేయడాన్ని కర్ణాటక ప్రభుత్వం సమర్థించుకుంది. పోలీసులు ఆర్సీబీ టీమ్‌కు సేవకులుగా వ్యవహరించారని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ఆక్షేపించింది. ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయకుండానే ఆర్సీబీ విజయోత్సవాల కోసం ఏర్పాటు చేశారని ఆరోపించింది. అనుమతి ఉందో లేదో కూడా తెలుసుకోకుండా ఆర్సీబీ సేవలో తరించారని విమర్శించింది. 🚨 Karnataka Govt blames RCB for Bengaluru Stampede🚨Govt to High Court—No permission was taken for RCB’s victory paradePublic was invited without police consultationOver 3 lakh people gathered near Chinnaswamy Stadium11 people died, 50+ injured in the chaos… pic.twitter.com/KQTFFJxoWx— VIPIN_UPDATE🚨 (@Vipin_Update) July 17, 2025 -
ఇది అద్భుత క్షణం.. భార్య, కుమారుడిని హత్తుకుని శుభాంశు ఎమోషనల్
ఢిల్లీ: భారత అంతరిక్ష చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుతమైన అధ్యాయానికి ఘనమైన ముగింపు లభించింది. మన వ్యోమగామి, వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా 18 రోజుల అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించుకుని అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి క్షేమంగా తిరిగొచ్చారు. ఇక, తాజాగా శుభాంశు శుక్లా ఎట్టకేలకు తన కుటుంబాన్ని కలుసుకున్నారు. హూస్టన్‌లోని పునరావాస కేంద్రంలో భార్య కమ్నా, కుమారుడు కైశ్‌ను కలిసి ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.హూస్టన్‌లోని పునరావాస కేంద్రంలో శుభాంశు శుక్లా.. తన కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా ఎమోషనల్‌గా భార్య, కుమారుడిని హత్తుకున్నారు. రెండు నెలల తర్వాత వారిని కలవడంతో శుభాంశ్ ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించి ఫొటోలను శుభాంశు.. సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని.. పోస్టులో చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో పోస్టులో శుభాంశు.. ‘అంతరిక్షయానం అద్భుతం. చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడం సైతం అంతే అద్భుతం. ఈ ప్రయాణం కోసం రెండు నెలలు క్వారంటైన్లో గడిపాను. ఈ సమయంలో దూరం నుంచి నా కుటుంబాన్ని చూడాల్సి వచ్చింది. భూమికి తిరిగివచ్చి ఫ్యామిలినీ హత్తుకున్నప్పుడు ఇంటికి వచ్చినట్లే అనిపిస్తోంది. కొన్నిసార్లు మనం బిజీగా ఉంటాం. మన జీవితాల్లోని వ్యక్తులు ఎంత ముఖ్యమైన వారో మర్చిపోతుంటాము. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన వారిని కలిశాను. అంతరిక్ష ప్రయాణాలు మాయాజాలంగా అనిపిస్తాయి. అయితే మనుషుల వల్లే అవి అలా మారాయి’ అని ఎమోషనల్ అయ్యారు.Gp Capt Shubhanshu Shukla reunites with his family after returning from space ❤️🇮🇳 pic.twitter.com/yfENxJr7ed— ISRO Spaceflight (@ISROSpaceflight) July 16, 2025మరోవైపు, శుభాంశు సతీమణి కమ్నా స్పందిస్తూ.. ‘శుభాంశు సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. ఈ అద్భుత ప్రయాణం తర్వాత తను తిరిగి మమ్మల్ని కలవడమే మాకు అతిపెద్ద సెలబ్రేషన్. ఇకపై తను మునుపటి జీవితాన్ని కొనసాగించడంపైనే దృష్టి నిలుపుతాం. అంతరిక్షంలో ఉన్న సమయంలో తను ఇంటి ఆహారాన్ని మిస్ కావాల్సి వచ్చింది. ఇంటికి వచ్చాక తనకు ఇష్టమైన ఆహారాన్ని వండేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకుంటున్నా అని’ ఆనందంతో పోస్టు పెట్టారు. Our hero has returned! 👨🚀Group Captain #ShubhanshuShukla's successful completion of the historic Axiom Mission 4 is a giant leap for India's space dreams and a powerful step toward Gaganyaan. The nation is filled with pride. 🚀🇮🇳 pic.twitter.com/rSEhnhjZ1v— Piyush Goyal (@PiyushGoyal) July 15, 2025 -
Odisha Bandh: విద్యార్థిని ఆత్మాహుతికి నిరసనల వెల్లువ
భువనేశ్వర్: ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసినా చర్య తీసుకోలేదని ఆరోపిస్తూ, ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విద్యార్థినికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎనిమిది ప్రతిపక్ష పార్టీల మద్దతుతో కాంగ్రెస్ ఒడిశాలో ఈరోజు(గురువారం) బంద్ నిర్వహిస్తోంది. ఈ నేపధ్యంలో రాజధాని భువనేశ్వర్‌లోని దుకాణాలు మూతపడ్డాయి. రోడ్లపై వాహనాలు రాకపోకలు కూడా కనిపించలేదు.రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపునకు మద్దతుగా పలువురు ప్రతిపక్ష నేతలు.. ఈ ఘటనలో మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ, పార్టీ జెండాలు, ప్లకార్డులను పట్టుకుని రోడ్లపై నిరసన తెలిపారు. బంద్ నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసు బృందాలను మోహరించడంతో పాటు గట్టి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఓపీసీసీ) అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ బంద్ రాజకీయాల కోసం కాదని, ఇక్కడి కుమార్తెలకు అండగా నిలిచేందుకేనని అన్నారు. ఇటువంటి నిరసన లేకపోతే ప్రతీ పాఠశాల, కళాశాలలో ఇటువంటి దుస్థితి ఏర్పడుతుందన్నారు. విద్యార్థిని ఫిర్యాదుపై చర్య తీసుకోవడంలో విఫలమైనందుకు రాష్ట్ర విద్యా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై న్యాయ విచారణకు సీపీఐ(ఎం) నేత సురేష్ పాణిగ్రాహి పిలుపునిచ్చారు. 🚨 🚨 #BreakingNews Odisha Bandh Today, Roads Empty In Protest Over Student's Self-Immolation https://t.co/txmxD08kwBThe 20-year-old student of Fakir Mohan Autonomous College in Balasore attempted self-immolation last week after allegedly facing prolonged sexual harassment b…— Instant News ™ (@InstaBharat) July 17, 2025బాలసోర్‌లోని ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాలకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని తాను కళాశాల విభాగాధిపతి నుంచి దీర్ఘకాలంగా లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడింది. తరువాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. కాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మృతురాలి తండ్రితో మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఈ ఘటన సమాజానికి అయిన గాయంగా రాహుల్ అభివర్ణించారు. -
విమానం నుంచి ‘ప్యాన్ ప్యాన్ ప్యాన్’.. ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ముంబైలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో విమానాన్ని ముంబైలో అత్యవసర ల్యాండ్ చేసిన పైలట్.. ‘ప్యాన్ ప్యాన్ ప్యాన్’ అంటూ సంకేతమిచ్చారు. ప్రాణాపాయం ఏమీ లేదు కానీ.. అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్ కావాల్సి ఉందంటూ సంకేత భాషలో పైలట్ సందేశం పంపించారు.నిన్న(బుధవారం) ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి గోవా బయలేరిన ఇండిగో ఎయిర్‌బస్ ఏ320 నియో విమానంలో సమస్య తలెత్తింది. గాలిలో ఉండగా.. ఒక ఇంజిన్ పనిచేయకపోవడంతో పైలట్ ‘ప్యాన్.. ప్యాన్.. ప్యాన్’ సంకేత భాషలో సమాచారం ఇచ్చారు. దీంతో ఉదయం 9.53 గంటల ప్రాంతంలో విమానాన్ని అత్యవసరంగా ముంబైలో ల్యాండ్ చేశారు. విమానంలో 191 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.ఈ ఘటనపై ఇండిగో సంస్థ స్పందిస్తూ.. సాంకేతికలోపం తలెత్తడంతో విమానాన్ని ముంబైకి దారి మళ్లించినట్ల పేర్కొంది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది.కాగా, గత నెల ఇండిగో విమానం నుంచి ‘మేడే కాల్’తో ఒక్కసారిగా కలకలం రేగింది. గువహటి నుంచి చెన్నైకి వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పెను ప్రమాదమే తప్పడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇటీవల అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం నుంచి ‘మేడే కాల్’ వచ్చిన సంగతి తెలిసిందే. ఎవరైనా పైలట్ నుంచి ఏటీసీకి మేడే కాల్ వచ్చిందంటే ఆ విమానం కూలిపోయే ప్రమాదంలో ఉందని అర్థం. వెంటనే ఏటీసీ అధికారులు అత్యవసరం కాని సేవలన్నింటినీ నిలిపేసి ఆ విమానాన్ని కాపాడేందుకు ప్రయత్నం మొదలు పెడతారు.సహాయం కోసం మేడే కాల్ ఇచ్చిన పైలట్ తన విమానం ఏ ప్రాంతంలో ఉంది? ఎంత ఎత్తులో ఉంది? ఎలాంటి ప్రమాదంలో ఉంది? విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనే విషయాలు కూడా అందించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి సహాయ చర్యలు ఎలా చేపట్టాలన్నది ఏటీసీ అధికారులు నిర్ణయిస్తారు. ఈ మేడే సిగ్నల్‌ను సాధారణంగా 121.5 మెగాహెడ్జ్, 243 మెగాహెడ్జ్‌లో పంపుతుంటారు. ఈ ఫ్రీక్వెన్సీలను ఏటీసీ అధికారులు అనుక్షణం పరిశీలిస్తుంటారు. -
తొమ్మిదేళ్ల చిన్నారికి గుండెపోటు?
జైపూర్: దేశంలో ఇటీవలి కాలంలో యువతలో గుండెపోటు కేసులు అధికంగా నమోదవుతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో ముక్కుపచ్చలారని తొమ్మిదేళ్ల చిన్నారి గుండెపోటుతో ప్రాణాలొదిలింది. ఈ ఉదంతం గుండెపోటు మరణాలపై మరోమారు ఆందోళనను రేకెత్తించింది.ప్రాచీ కుమావత్.. వయసు తొమ్మిదేళ్లు.. సికార్‌లోని దంతా పట్టణంలో 4వ తరగతి చదువుతోంది. ఎంతో ఆరోగ్యంగా కనిపించే ఈ చిన్నారి పాఠశాల విరామ సమయంలో భోజనానికి కూర్చుంది. టిఫిన్ డబ్బా తెరుస్తూ స్పృహ కోల్పోయింది. వెంటనే అక్కడున్న ఉపాధ్యాయులు బాధితురాలిని సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఆ చిన్నారిని బతికించేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేశారు. వైద్యుల పరీక్షలో ఆ చిన్నారికి పల్స్ అందలేదు.. రక్తపోటు పడిపోయింది. ఊపిరి ఆగిపోయింది. ఇవన్నీ గుండెపోటు లక్షణాలని వైద్యులు గుర్తించారు.జలుబు కారణంగా ప్రాచీ రెండు మూడు రోజులుగా పాఠశాలకు హాజరు కాలేదని ఆదర్శ్ విద్యా మందిర్ స్కూల్ ప్రిన్సిపాల్ నంద్ కిషోర్ తివారీ మీడియాకు తెలిపారు. తిరిగి ఆ చిన్నారి పాఠశాలకు వచ్చినప్పుడు ఆరోగ్యంగానే ఉందని, ఉదయం ప్రార్థనలు, అసెంబ్లీలో కూడా పాల్గొన్నదని, భోజన సమయంలో స్పృహ కోల్పోయిందని తెలిపారు. వెంటనే సీపీఆర్ ఇచ్చినా ప్రయోజనం లేకపోయిందని, తరువాత దంతాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువెళ్లామని నందకిశోర్ వివరించారు.కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇన్‌ఛార్జి డాక్టర్ డాక్టర్ ఆర్కె జాంగిద్ మీడియాతో మాట్లాడుతూ బాధిత చిన్నారిని బతికించేందుకు దాదాపు గంటన్నర పాటు ప్రయత్నించామని తెలిపారు. తరువాత మెరుగైన వైద్యం కోసం సికార్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు. అయితే పోస్ట్‌మార్టం నిర్వహించకుండా ఆ చిన్నారి గుండెపోటుతో మృతిచెందిందని ఖచ్చితంగా నిర్ధారించలేమని, ఆ చిన్నారికి పుట్టుకతోనే గుండె జబ్బు ఉండే అవకాశం ఉందని, దానిని తల్లిదండ్రులు గుర్తించకపోయి ఉండవచ్చని డాక్టర్ జాంగిద్ అన్నారు. -
ఎన్నికల ‘పవర్ ప్లే’.. ఉచితం అంటూ బీహారీలకు నితీశ్ బంపరాఫర్!
పాట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షం.. ప్రజలకు వరాలను ప్రకటిస్తున్నాయి. బీహార్‌లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ భారీ ప్లాన్‌తో హామీలు ఇస్తున్నారు. తాజాగా ప్రజలకు బంపరాఫర్ ఇచ్చారు. బీహార్‌లో 125 యూనిట్ల లోపు కరెంటు బిల్లులు వస్తే డబ్బులు చెల్లించాల్సి అవసరం లేదని ఆఫర్ ప్రకటించారు. వచ్చే నెల నుంచే ఇది అమలులోకి వస్తుందని నితిశ్ చెప్పుకొచ్చారు.సీఎం నితీశ్ కుమార్ తాజాగా ట్విట్టర్ వేదికగా మరో పథకాన్ని ప్రకటించారు. ట్విట్టర్లో నితిశ్..‘బీహార్ ప్రజల అవసరాల కోసం మేం మరో పథకాన్ని తీసుకువస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరెంట్ చార్జీలు అందుబాటు ధరల్లోనే ఇస్తున్నాం. దీనిపై ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నాం. గృహ వినియోగదారులు 125 యూనిట్ల వరకు కరెంట్ వాడుకుంటే.. వారు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.అంటే, జూలై బిల్లులను కూడా కట్టనక్కర్లేదు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1.67 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. రానున్న మూడేళ్లలో గృహ వినియోగదారులందరి మద్దతుతో ప్రతి ఇంటిపై సోలార్ పవర్ ప్లాంట్లను అమర్చాలని నిర్ణయించాం. బీహార్‌లో 10వేల మెగావాట్ల సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాంకుటీర్ జ్యోతి పథకం కింద.. అత్యంత పేద కుటుంబాలకు సోలార్ ప్లాంట్ల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. మిగతా వారికి అందుబాటు ధరల్లోనే వీటిని అందజేస్తాం’ అని వెల్లడించారు. దీంతో, ఈ పథకంపై బీహార్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఈ పథకం ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఇదిలా ఉండగా.. బీహార్ మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారం కోసం అన్ని పార్టీ ప్రజలకు కీలక హామీలు ఇస్తున్నాయి. ఇక, తాము మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని నీతీశ్ ఇటీవల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. हमलोग शुरू से ही सस्ती दरों पर सभी को बिजली उपलब्ध करा रहे हैं। अब हमने तय कर दिया है कि 1 अगस्त, 2025 से यानी जुलाई माह के बिल से ही राज्य के सभी घरेलू उपभोक्ताओं को 125 यूनिट तक बिजली का कोई पैसा नहीं देना पड़ेगा। इससे राज्य के कुल 1 करोड़ 67 लाख परिवारों को लाभ होगा। हमने यह…— Nitish Kumar (@NitishKumar) July 17, 2025 -
సర్పంతో ఆటలాడితే అంతే
భోపాల్: నాగ పామును మెడకు చుట్టుకొని, బైక్ నడుపుతూ సాహసం చేయబోయిన ఓ వ్యక్తి అదే పాము కాటు వేయడంతో మృతిచెందాడు. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బాధితుడిని దీపక్ మహావర్గా గుర్తించారు. పాముతో బైక్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీపక్ స్థానిక జేపీ కాలేజీలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నాడు. పాములను పట్టడంలో నేర్పరిగా పేరుంది. వేలాది పాములను రక్షించి, సురక్షిత ప్రాంతాల్లో వదిలేశాడు. ఇటీవల నాగు పామును పట్టుకున్నాడు. దాన్ని అందరికీ చూపించాలని భావించాడు. అందుకే మెడకు చుట్టుకొని బైక్ నడిపాడు. కానీ, పాము అతడిని కాటు వేసింది. దీపక్‌ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆలస్యంగా తీసుకురావడంతో రక్షించలేకపోయామని డాక్టర్లు చెప్పారు. దీపక్ భార్య గతంలోనే మృతిచెందారు. అతడికి రౌనక్, చిరాగ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రుల మరణంతో వారు అనాథలుగా మారిపోయారు. -
Air India crash probe: ‘ఇంధన స్విచ్‌లలో ఇబ్బందే లేదు’
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో గత నెలలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన దరిమిలా, ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు ముమ్మర విచారణ జరుపుతున్నాయి. ఇదే కోవలో ఎయిర్ ఇండియా కూడా వ్యవస్థీకృత లోపాలపై పరిశీలన జరుపుతోంది. తాజాగా ఎయిర్ ఇండియా తమ బోయింగ్ 787-8 విమానాలలోని ఇంధన నియంత్రణ స్విచ్ (ఎఫ్‌సీఎస్) లాకింగ్ మెకానిజానికి సంబంధించిన ముందు జాగ్రత్త తనిఖీలను నిర్వహించింది.ఈ నేపధ్యంలో ఇంధన నియత్రణ స్విచ్‌లతో ఎటువంటి సమస్యలు లేవని టాటా యాజమాన్యంలోని ఎయిర్‌లైన్ అధికారులు స్పష్టం చేశారు. పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)బోయింగ్ విమాన నమూనాల ఎప్సీఎస్ను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసిన దరిమిలా ఎయిర్ ఇండియా ఈ తనిఖీలను నిర్వహించింది. బోయింగ్ నిర్వహణ షెడ్యూల్ ప్రకారం అన్ని బోయింగ్ 787-8 విమానాలలో పరిశీలనలు చేశారు.తమ ఇంజనీరింగ్ బృందం ఎస్సీఎస్ లాకింగ్ మెకానిజంపై ముందు జాగ్రత్త తనిఖీలను పూర్తి చేసింది. వాటిలో ఎటువంటి సమస్యలు లేవని అధికారులు తెలిపారు. లాకింగ్ ఫీచర్‌తో సహా ఇంధన నియంత్రణ స్విచ్ డిజైన్ అన్ని బోయింగ్ విమాన నమూనాలలో ఒకే తరహాలోనే ఉంటుందని, అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8లో కూడా ఇదే తరహా స్విచ్ ఉందని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. -
కదులుతున్న కారులో మహిళపై గ్యాంగ్‌రేప్
జైపూర్: రాజస్తాన్‌లోని అల్వార్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఏడుగురు దుండగులు ఓ మహిళను అపహరించి, సామూ హిక అత్యాచారానికి పాల్పడ్డారు. కారులో ప్రయాణిస్తూ ఒకరి తర్వాత ఒకరు రేప్ చేశారు. 11 రోజులపాటు బాధితురాలిని నిర్బంధించారు. చివరకు రోడ్డు పక్కన వది లేసి వెళ్లిపోయారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. బాధితురాలి భర్త ఫిర్యాదు ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 24న రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళను ముగ్గురు వ్యక్తులు అపహరించారు. బొలేరో వాహనంలో బలవంతంగా ఎక్కించి తీసుకెళ్లారు. వాహనంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన మహిళపై దాడికి దిగారు. నోట్లో గుడ్డలు కుక్కారు. గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మరో నలుగురు ఉన్నారు. 11 రోజులు అక్కడే నిర్బంధించారు. ఏడుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలిని నగ్నంగా మార్చి అభ్యంతకరంగా వీడియోలు చిత్రీకరించారు. పోలీసులకు చెబితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని హెచ్చరించారు. రూ.3 లక్షల ఇస్తామని, నోరు మూసుకోవాలని చెప్పారు. అపస్మారక స్థితికి చేరిన బాధితురాలిని రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు. స్థానికుల సాయంతో ఆమె తన ఇంటికి చేరుకున్నారు. -
వర్షాకాల సమావేశాల్లో 8 కొత్త బిల్లులు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో 8 కొత్త బిల్లులు ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియోహెరిటేజ్ సైట్స్, జియో రెలిక్స్(సంరక్షణ, నిర్వహణ) బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్(అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్(సవరణ) బిల్లు, మణి పూర్ వస్తువులు, సేవల పన్ను(సవరణ) బిల్లు వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే ఇన్‌కం ట్యా క్స్–2025ను కూడా ప్రవేశపెట్టే అవకాశం కనిపి స్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 21వ తేదీ దాకా మొత్తం 21 రోజులపాటు జరుగు తాయి. రాఖీ పౌర్ణమి, స్వాతంత్య్ర దినో త్సవం సందర్భంగా రెండు రోజులు సెలువులు ప్రకటించారు. -
కబుర్లు చెప్తా.. కమ్మటి భోజనం పెడతా
లక్నో: అంతరిక్షరంగంలో భారత కీర్తిపతాకను అంతర్జాతీయ అంతరిక్షకేంద్రంలో ఎగరేసి పుడమికి తిరిగొచ్చిన వ్యోమగామి శుభాంశు శుక్లా రాక కోసం లక్నోలో ఆయన కుటుంబం ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా శుక్లా సతీమణి కామ్నా మీడియాతో మాట్లాడారు. ‘‘అద్వితీయమైన ఆయన అంతరిక్ష యాత్ర ముగింపు తర్వాత కుటుంబంతో ఎప్పుడు గడుపుతారా అని మేమంతా ఎదురు చూస్తున్నాం. ఆయన లక్నోకు రాగానే ఇంటి భోజనం రుచి చూపిస్తా. తినలేకపోయిన ఆయనకు ఎంతో ఇష్టమై న వంటకాలను కొసరి కొసరి వడ్డిస్తా’’ మా ఆరేళ్ల అబ్బాయి కియాశ్ సహా కుటుంబం మొత్తం సర దాగా గడుపుతాం’’ అని ఆయన భార్య కామ్నా చెప్పారు. ‘‘ఈయన వెళ్లిన వెంటనే నాకు ఫోన్ చేశా రు. సంభ్రమాశ్చర్యాలకు గురయ్యా. ఆయన గొంతు వినగానే ప్రాణం లేచొచ్చింది. అక్కడ ఆయన చేసిన శాస్త్రసాంకేతిక ప్రయోగాలపైనే మేమిద్దరం మాట్లాడుకున్నాం. భూమికి దూరంగా అంతెత్తులో గడపడం అసాధారణంగా ఉందని నాతో అనేవారు. అక్కడ ఉన్న ఈ 18 రోజుల్లో ఆయనతో జరిపిన ఈ ఫోన్‌కాల్ సంభాషణలు నా జీవితంలో మర్చిపోలే ను. ఆయన స్వదేశాను గమనం మా కుటుంబానికే కాదు యావత్ దేశానికి గర్వకారణం కావడం నాకెంతో నచ్చింది అని ఆమె అన్నారు. -
ఆకాశ్ ప్రైమ్ పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: భారత స్వదేశీ తయారీ గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టంచేసేలా ఆకాశ్ ప్రైమ్ క్షిపణి పరీక్ష విజయవంతమైందని భారత రక్షణ శాఖ వర్గాలు బుధవారం ప్రకటించాయి. సముద్రమట్టానికి 15,000 అడుగుల ఎత్తులో లద్దాఖ్‌లో భూతలం నుంచి గగనతల లక్ష్యాలను చేధించే ఆకాశ్ ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించామని రక్షణ వర్గాలు తెలిపాయి. క్షిపణిని అభివృద్ధి చేసిన రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) సహకారంతో లద్దాఖ్ సెక్టార్లో ఈ ప్రయోగపరీక్షలు పూర్తయ్యాయి. గగనంలో వేగంగా భిన్న దిశల్లో కదిలే రెండు లక్ష్యాలను ఆకాశ్ ప్రైమ్ మిస్సైల్ అత్యంత ఖచ్చితత్వంతో చేధించింది. అననుకూల వాతావరణంలోనూ పూర్తి సమర్థతతో పనిచేసి క్షిపణి తన సత్తా చాటింది. భారత సైన్యంలోని మూడో, నాలుగో ఆకాశ్ రెజిమెంట్‌లో ఈ కొత్త ఆకాశ్ ప్రైమ్ క్షిపణులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్తాన్ నుంచి దూసుకొచ్చిన డ్రోన్లు, క్షిపణులను ఆ ఆకాశ్ ప్రైమ్ క్షిపణి విజయవంతంగా అడ్డుకుని ఇప్పటికే తన సమర్థతను నిరూపించుకుంది. ఆనాడు పాకిస్తాన్‌కు చైనా తయారీ యుద్ధవిమానాలు, ఇజ్రాయెల్ సరఫరా చేసిన డ్రోన్ల నుంచి పొంచి ఉన్న ముప్పును ఆకాశ్ ప్రైమ్ క్షిపణులు తప్పించాయని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. -
వచ్చే నెలలో మోదీ చైనా పర్యటన!
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ వచ్చే నెలలో చైనాలో పర్యటించబోతున్నారు. ఆగస్టు 31, సెపె్టంబర్ 1వ తేదీల్లో చైనాలోని తియాంజిన్ నగరంలో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారని సమాచారం. 2020 జూన్‌లో జరిగిన భారత్, చైనా జవాన్ల భీకర ఘర్షణ తర్వాత మోదీ చైనాకు వెళ్తుండడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఆయన చివరిసారిగా 2019లో చైనాలో పర్యటించారు. గల్వాన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి. సంబంధాలు పునరుద్ధరించుకోవాలని ఇరుదేశాలు భావిస్తున్నాయి. ఈ విషయంలో మోదీ చైనా పర్యటన కీలకమైన ముందడుగు అవుతుందని దౌత్య నిపుణులు అంచనా వేస్తున్నారు. మోదీ చైనా పర్యటన సందర్భంగా చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. చైనాలో ఎస్సీఓ సదస్సు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా సభ్యదేశాల అధినేలతో మోదీ భేటీ అవుతారు. చైనా పర్యటన కంటే ముందు ప్రధానమంత్రి జపాన్‌లో పర్యటిస్తారని సమాచారం. మోదీ ప్రధానమంత్రి హోదాలో ఇప్పటిదాకా ఐదు సార్లు చైనాలో పర్యటించారు. దేశ విదేశాల్లో షీ జిన్‌పింగ్‌తో 18 సార్లు సమావేశమయ్యారు. మరోవైపు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ మంగళవారం చైనా అధినేత జిన్‌పింగ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. భారత్–చైనా సంబంధాలపై వారు చర్చించారు. -
శుభ సప్తకం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లోకి అడుగు పెట్టిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా ఘనత సాధించారు. యాగ్జియం –4 మిషన్‌లో భాగంగా శుభాంశు చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతంగా ముగియటంతో ఇక ఇప్పుడు – ఐఎస్ఎస్లో ఉన్న ఈ 18 రోజుల్లోనూ ఆయన జరిపిన 7 ప్రధాన ప్రయోగాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి మొదలైంది. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తున్న భవిష్యత్ మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’కు ఇవి ఎంతో ఉపయుక్తమైనవి కావటం వలన కూడా ఈ ప్రయోగాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిలో వివిధ జీవ, భౌతిక వ్యవస్థలను అధ్యయనం చేయటానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు వంటి ప్రసిద్ధ భారతీయ పరిశోధన సంస్థలు రూపొందించిన ఆ ప్రయోగాలు ఏమిటో చూద్దాం. 1 టార్డిగ్రేడ్ ఏంటివి?: టార్డిగ్రేడ్లు అంటే నీటి ఎలుగు బంట్లు. ఎనిమిది కాళ్లుండే సూక్ష్మజీవులు. ఇవి అధిక ఉష్ణోగ్రతలు, రేడియేషన్ వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితులలో కూడా ఎక్కువ కాలం జీవించగలవు. ఏంటి ఉపయోగం?: టార్డిగ్రేడ్లు అంతరిక్షంలో ఎలా మనుగడ సాగిస్తాయో అర్థం చేసుకోవడం వల్ల అంతరిక్ష కార్యకలాపాల్లో వ్యోమగాముల రక్షణకు కొత్త వ్యూహాలను అభివృద్ధి చేయవచ్చు. శుభాంశు అంతరిక్షంలో భారత జాతి టార్డిగ్రేడ్లపై అధ్యయనం చేసి, అవి ఎలా మనుగడ సాగిస్తాయో, పునరుత్పత్తి చేస్తాయో, సూక్ష్మ గురుత్వాకర్షణకు (మైక్రోగ్రావిటీ) ఎలా స్పందిస్తాయో, రోజులు గడుస్తున్నకొద్దీ వాటిలో వచ్చే మార్పులు (ఏజింగ్ ప్యాటర్న్స్) పరిశీలించారు. ఈ అధ్యయనం వల్ల రక్షణ వ్యూహాలే కాకుండా.. అంతరిక్షంలో ఆహారాన్ని, జీవ నమూనాలను ఎలా నిల్వ చేయవచ్చో తెలుస్తుంది.2 మయోజెనిసిస్ఏంటిది?: మయోజెనిసిస్ అంటే కండరాల్లోని కణాల అభివృద్ధి/పెరుగుదల. దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రల సమయంలో వ్యోమగాముల కండరాల బరువు తగ్గుతుంటుంది. తద్వారా కండరాలు బలహీనమవుతాయి.ఏంటి ఉపయోగం?: కండరాల్లో కణాలను సూక్ష్మ గురుత్వాకర్షణలో అధ్యయనం చేసి అవి ఎలా ప్రవర్తిస్తాయో, వాటిలో వచ్చే మార్పులేమిటో శుభాంశు నిశితంగా పరిశీలించారు. సూక్ష్మ గురుత్వాకర్షణలో కండరాల్లో కణాలు ఎలా ప్రవర్తిస్తాయో అర్థం చేసుకోవడం వల్ల వాటి బరువు తగ్గకుండా నివారణోపాయాలను కనిపెట్టటానికి, ఆరోగ్య పరిరక్షణకు ఈ అధ్యయనం తోడ్పడుతుంది.3 విత్తనాల పెరుగుదలఏంటిది?: అంతరిక్షంలోకి శుభాంశు పెసర, మెంతి విత్తనాలు తీసుకెళ్లి ట్రేలలో వాటిని ఉంచారు. ఏంటి ఉపయోగం?: సూక్ష్మ గురు త్వాకర్షణ ప్రభావం మొలకలపైనా, విత్తనాల పెరుగుదలపైనా ఎలా ఉంటుందో అధ్యయనం చేశారు. అంతరిక్షంలో మొక్కలను పెంచడం వల్ల దీర్ఘకాలిక మిషన్లలో వ్యోమగాము లకు స్థిరమైన ఆహార వనరు లభిస్తుంది.4 సైనోబ్యాక్టీరియాఏంటివి?: సైనోబ్యాక్టీరియా అనేవి ఆక్సిజన్‌ను, పోష కాలను ఉత్పత్తి చేయగల సూక్ష్మజీ వులు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం భూమిపై మొట్టమొదట ప్రాణ వాయువును ఉత్పత్తి చేసిన జీవులు ఇవి.ఏంటి ఉపయోగం?: సూక్ష్మ గురుత్వాకర్షణలో సైనో బ్యాక్టీరియా ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవడం ద్వారా అంతరిక్ష కార్యకలాపాల కోసం ‘బయో రీజెనరేటివ్ లైఫ్ సపోర్ట్ వ్యవస్థ’లను అభివృద్ధి చేయవచ్చు. ఉన్న వనరులను రీ సైకిల్ చేసి ఆక్సిజన్, నీరు, ఆహారం వంటి వనరులను తయారు / ఉత్పత్తి చేయటం ద్వారా అంతరిక్షంలో మానవ మనుగడకు సహాయం చేసే కృత్రిమ వ్యవస్థలే ఈ బయో రీజెనరేటివ్ వ్యవస్థలు. ఇవి పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి.5 మైక్రో అల్గేఏంటివి?: మంచినీరు, సముద్ర పర్యావరణ వ్యవస్థలలో కీలక పాత్ర పోషించే సూక్ష్మ, ఏకకణ జల జీవులనే సూక్ష్మ శైవలాలు (మైక్రో ఆల్గే) అంటారు. ఇవి పోషకాలను అందించగల ఆహారంగా స్వీకరించతగిన సూక్ష్మజీవులు. అలాగే బొగ్గు వంటి శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయమైన బయో ఇంధనంగానూ ఉపయోగపడతాయి.ఏంటి ఉపయోగం?: సూక్ష్మ గురుత్వాకర్షణలో సూక్ష్మ శైవలాలు ఎలా పెరుగుతాయో అర్థం చేసుకోవడం, వ్యోమగాములకు స్థిరమైన ఆహార వ్యవస్థలను అభివృద్ధి చేయటం ఈ అధ్యయన లక్ష్యం. అలాగే అంతరిక్షంలో ఇంధన సమస్యల పరిష్కారానికి కూడా ఇది దారి చూపుతుందని భావిస్తున్నారు.6 పంట విత్తనాలుఏంటిది?: ఈ ప్రయోగం ఆహార పంటల విత్తనాలపై సూక్ష్మగురుత్వాకర్షణ ప్రభావాన్ని పరిశీలించింది. ఏంటి ఉపయోగం?: శుభాంశు సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో పంట విత్తనాల పెరుగుదల, దిగుబడులపై అధ్యయనం చేశారు. దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రలలో వ్యోమగాములకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించే విధానాలను తెలుసుకోవటానికి ఈ అధ్యయన ఫలితాలు ఉపకరిస్తాయి. 7 వాయేజర్ డిస్ప్లేలుఏంటివి?: కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు. ఈ ప్రయోగంతో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అంతరిక్షంలో ఎలా పనిచేస్తాయి, వాటి వాడకం వల్ల వ్యోమగాములపై ఎలాంటి ప్రభావం ఉంటుందో శుభాంశు విశ్లేషించారు. ఏంటి ఉపయోగం?: సూక్ష్మ గురుత్వాకర్షణలో కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వ్యోమగాముల కళ్లు, మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతాయి, ఎన్ని గంటల పాటు వాటిని వినియోగించవచ్చు, అంతరిక్ష అవసరాల కోసం ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కావాలి.. వంటి విషయాలు తెలుసుకునేందుకు ఈ ప్రయోగం తోడ్పడుతుంది. -
రైతన్నల సంక్షేమానికి ధన్–ధాన్య కృషి యోజన
న్యూఢిల్లీ: దేశంలో రైతన్నల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన’కు ఆమోద ముద్రవేసింది. రూ.24,000 కోట్లతో రాబోయే ఆరేళ్లపాటు దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. పంటల ఉత్పత్తిని పెంచడమే పథకం లక్ష్యం. దీంతో 1.7 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన’ను ఈ ఏడాది అక్టోబర్‌లో రబీ సీజన్ నుంచే అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మూడు సూచికల ఆధారంగా ఎంపిక ధన్–ధాన్య కృషి యోజన అమలుకు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. శిక్షణ, అవగాహన కార్యక్రమాలు ఆగస్టులు ప్రారంభమవుతాయని చెప్పారు. 100 జిల్లాల్లో పంటల సాగు, ఉత్పత్తిపాటు గ్రామ స్థాయిలో పంటల నిల్వ సామర్థ్యాన్ని పెంచడం పథకం ఉద్దేశమని వివరించారు. పొలాలకు నీటి సరఫరాను మెరుగుపర్చడం, రైతులకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు ఇవ్వడం ఇందులో భాగమని అన్నారు. పంటల ఉత్పాదకత తక్కువగా ఉండటం, అన్ని రుతువుల్లోనూ పంటలు సాగు పెద్దగా లేకపోవడం, రుణ లభ్యత అత్యంత తక్కువగా ఉండటం అనే మూడు కీలక సూచికల ఆధారంగా 100 జిల్లాలను గుర్తిస్తామని స్పష్టంచేశారు. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక జిల్లాను ఎంపిక చేస్తామన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పెంచడానికి చర్యలు ప్రస్తుతం అమల్లో ఉన్న 11 శాఖలకు సంబంధించిన 36 కేంద్ర పథకాలు, రాష్ట్ర పథకాల సమ్మేళనంతోపాటు ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో ‘ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన’ను అమలు చేయనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెప్పారు. కేబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు తెలియజేశారు. ఇంధన పరివర్తన ప్రయాణంలో కీలకమైన మైలురాయికి చేరుకున్నట్లు చెప్పారు. శిలాజేతర ఇంధన వనరుల నుంచే 50 శాతం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని, నిర్దేశిత గడువు కంటే ఐదేళ్ల ముందే ఈ ఘనత సాధించామని అన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని మరింత పెంచడానికి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రభుత్వ రంగంలోని ఎన్టీపీసీ పెట్టుబడుల పరిమితిని రూ.20,000 కోట్లకు పెంచినట్లు చెప్పారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో రూ.7,000 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్(ఎన్ఎల్సీఐఎల్)కు అనుమతి ఇచి్చనట్లు వివరించారు. శుభాంశు శుక్లాకు అభినందనలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) వెళ్లి, క్షేమంగా తిరిగివచి్చన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఒక తీర్మానం ఆమోదించారు. భారత అంతరిక్ష కార్యక్రమాల్లో ఇదొక నూతన అధ్యాయమని ప్రశంసించారు. శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర సఫలం కావడం మన దేశానికి గర్వకారణమని తీర్మానంలో పేర్కొన్నారు. -
ఆ ముచ్చటే లేదు!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల అంశమే ప్రస్తావనకు రాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘బనకచర్ల ప్రాజెక్టును కడతామని ఏపీ వాళ్లు ప్రస్తావిస్తే కదా.. మేము ఆపమంటూ అభ్యంతరం తెలిపేది..’ అని సీఎం అన్నారు. అయినా బనకచర్లపై ఇప్పటికే తెలంగాణ అభ్యంతరాలు తెలియజేసిందని, ఆ ప్రాజెక్టుపై పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా అభ్యంతరాలు తెలిపాయని చెప్పారు.ఇది కేవలం అనధికార (ఇన్ఫార్మల్) భేటీ మాత్రమే అన్న రేవంత్‌రెడ్డి.. ఇద్దరు సీఎంలతో ఈ భేటీని నిర్వహించేలా చేయడం, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాల పరిష్కారానికి కమిటీ వేసేలా చేయడం.. తెలంగాణ సాధించిన విజయంగా అభివర్ణించారు. ముఖ్యమంత్రుల సమావేశం పూర్తిగా ఇన్‌ఫార్మల్‌గానే సాగిందని, కేంద్రం ఎటువంటి ఎజెండా పెట్టుకోకుండా, కేవలం ఒక వేదికను ఏర్పాటు చేసి మధ్యవర్తిలా మాత్రమే వ్యవహరించిందని తెలిపారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు, నీటిపారుదల శాఖల మంత్రులు, అధికారుల సమావేశం అనంతరం..రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదు ‘జరిగింది అపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదు. కేవలం ముఖ్యమంత్రుల స్థాయిలో జరిగిన ఒక అనధికార సమావేశం. కృష్ణా, గోదావరి నదీ జలాల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేస్తున్న కమిటీ అన్ని అంశాలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంది. పార్లమెంటులో చేసిన రాష్ట్ర పునరి్వభజన చట్టంలోని అంశాల అమలు నిబద్ధతకే దిక్కు లేదు. ఏ విషయంలోనైనా నమ్మకంతో ముందుకు పోవాలి తప్ప, అనుమానించుకుంటూ పోతే ఏ సమస్యలూ పరిష్కారం కావు..’ అని ముఖ్యమంత్రి (విలేకరుల ప్రశ్నకు జవాబు) అన్నారు. యుద్ధ ప్రాతిపదికన టెలీమెట్రీ ‘కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాలకూ అనుమానాలున్నాయి. అందుకే టెలీమెట్రీ పరికరాలు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఎవరెన్ని నీళ్లు వాడుతున్నారోనన్న రాష్ట్రాల సందేహాలకు ఇది శాశ్వత పరిష్కారం చూపిస్తుంది. కాబట్టి అవసరమైతే తెలంగాణ నిధులతోనే యుద్ధ ప్రాతిపదికన అన్ని పాయింట్లలో టెలీమెట్రీ ఏర్పాటు చేస్తాం. గోదావరి బోర్డు హైదరాబాద్‌లో, కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. శ్రీశైలం డ్యాం మరమ్మతులు తక్షణమే చేపట్టేందుకు ఏపీ అంగీకరించింది. ఈ నాలుగు అంశాలపైనే ఈసారి చర్చ సాగింది. టెలీమెట్రీ ఏర్పాటుతో పాటు శ్రీశైలం డ్యాం మరమ్మతులకు ఏపీని ఒప్పించడం కూడా రాష్ట్రం సాధించిన విజయమే. ఈ విషయంలో ఎలాంటి ఊహాగానాలకు తావు లేదు. కమిటీ ఏర్పాటు అయిన 30 రోజుల్లోగా సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం..’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్ రాష్ట్ర హక్కులు ఏపీకి ధారాదత్తం చేశారు ‘గత సీఎం కేసీఆర్ తెలంగాణ హక్కులను ఏపీకి ధారాదత్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా అమలు చేయలేకపోయారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏం సాధించారు? కనీసం బోర్డుల కార్యాలయాలు ఎక్కడ ఉండాలో కూడా నిర్ణయించలేకపోయారు. కానీ మేము సమస్యలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. మా హయాంలో పలు అంశాలు చర్చల స్థాయికి రావడం, నాలుగు అంశాలపై స్పష్టమైన నిర్ణయాలు రావడం తెలంగాణ సాధించిన విజయం. కానీ కొందరు అధికారం కోల్పోయిన బాధతో ఈ చర్చలు సఫలమవ్వకూడదని చూస్తున్నారు..’ అని సీఎం విమర్శించారు. ఈ సమావేశంలో కేంద్రం కేవలం మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరించిందని, జలశక్తి మంత్రి ఈ విషయంలో ఎవరి పక్షాన నిలబడకుండా ఒక న్యాయమూర్తిలా వ్యవహరించారని కితాబు ఇచ్చారు. సమావేశం ఫలప్రదం: ఏపీ మంత్రి నిమ్మల కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ఫలప్రదమైనట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు చెప్పారు. భేటీ స్నేహపూరిత, సుహృద్భావ వాతావరణంలో జరిగిందని అన్నారు. కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో పనిచేస్తుందని తెలిపారు. -
ఉద్దవ్ ఠాక్రేకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బంపరాఫర్!
ముంబై: ‘రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు’ అనేది నానుడి. ఇది భవిష్యత్ మహా రాజకీయాల్లో నిరూపితం కానుంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. ప్రతిపక్షనేత ఉద్ధవ ఠాక్రేకు బంపరాఫ్ ఇచ్చారు. మళ్లీ తమతో కలిసిపోవచ్చంటూ ఆహ్వానించారు. దీంతో పాత మిత్రులు మళ్లీ ఒక్కటి కానున్నారా? అన్న ప్రచారం జోరందుకుంది. బుధవారం మహారాష్ట్ర శాసన మండలిలో జరిగిన అంబదాస్ డాన్వే (ఉద్ధవ్ ఠాక్రే శివసేన విభాగానికి చెందిన ప్రతిపక్ష నేత) వీడ్కోలు సభలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఉద్ధవ్ జీ 2029 వరకు మాది అధికార పక్షమే. కానీ మీరు మా వైపు రావాలనుకుంటే ఆలోచించుకోండి. అది మీపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఫడ్నవీస్ చేసిన ఈ వ్యాఖ్యలు సభలోని సభ్యుల మొహాల్లో నవ్వులు పూయించేలా చేశాయి. కానీ రాజకీయంగా దీని వెనుక ఉన్న వేరే ఉద్దేశ్యం ఉందన్న చర్చలు మొదలయ్యాయి. ఫడ్నవ్ ఆహ్వానంపై ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. ఫడ్నవీస్ ఆహ్వానం సరదాగా చెప్పిన మాట. అంతే’ అని అన్నారుకాగా, గత ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ,ఏకనాథ్ షిండే నేతృత్వంలో శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలు పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. ఉద్ధవ్ ఠాక్రే గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, 2022లో విభజన తర్వాత ఆయన శివసేన (UBT) నేతగా కొనసాగుతున్నారు.ఈ క్రమంలో సీఎం ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీసింది. ఫడ్నవీస్ చేసిన ఈ రాజకీయ పరమైన కామెంట్లు భవిష్యత్తులో పాత మిత్రులు మళ్లీ కలవవచ్చన్న సంకేతాలు పంపినట్లైంది. పాత మిత్రుల మధ్య మళ్లీ పొత్తు పొడిస్తే మహా రాజకీయాలు మలుపులు తిరగనున్నాయి. అయితే… ఇదంతా ఊహలు మాత్రమే. నిజంగా పొత్తు ఉంటుందా? ఉండదా? అనేది భవిష్యత్తులో తేలాల్సి ఉంది. देवेंद्र फडणवीस ने कहा - उद्धव जी, 2029 तक कोई स्कोप नहीं है! #MaharashtraCM #DevendraFadnavis #mansoonsession2025 #AssemblySession #UddhavThackeray #SSUBT pic.twitter.com/62dLFKNXiQ— Aaj Ke Devendra Kal Ke Narendra (@AajKDKalN) July 16, 2025 -
‘నువ్వు చిన్న పిల్లవి కాదు.. నన్ను అర్థం చేసుకో’.. బీఈడీ విద్యార్థినితో లెక్చరర్
భువనేశ్వర్: లెక్చరర్ వేధింపుల కారణంగా ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న ఒడిశా రాష్ట్రం బాలాసోర్ విద్యార్థిని మృతి ఘటనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థిని వేధించిన ఇంటిగ్రేటెడ్ బీఈడీ విభాగ అధిపతి, లెక్చరర్ సమీర్ రంజన్ సాహూపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థిని ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్న ఫకీర్ మోహన్ కాలేజీ అంతర్గత ఫిర్యాదు కమిటీ (ఐసీసీ) సభ్యులు లెక్చరర్ సమీర్ రంజన్ సాహూను విధుల నుంచి తొలగించాలని యాజమాన్యానికి సిఫార్స్ చేసింది. కాలేజీ విద్యార్థుల నుంచి లెక్చరర్ సాహుపై వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఐసీసీ సమన్వయ కర్త జయశ్రీ మిశ్రా వెల్లడించారు. అయినప్పటికీ, యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్యానల్ సభ్యులు సైతం ఇప్పటికే విద్యార్థినుల పట్ల వ్యవహరిస్తున్న తీరు, క్లాసులు చెప్పే విధానం మార్చుకోవాలని లెక్చరర్ సాహూకు సూచించింది. ఈ సందర్భంగా విద్యార్థినుల పట్ల లెక్చరర్ సాహూ ఒడిగట్టిన ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అంతర్గత ఫిర్యాదు కమిటీ (ఐసీసీ) సభ్యురాలు మినాటీ సేథీ లెక్చరర్‌పై ఆరోపణలు చేశారు. క్లాసు జరిగే సమయంలో విద్యార్థినులు ఏ చిన్న తప్పు చేసినా తరగతి గది బయట నిలబెట్టేవారు. అలా లైగింక వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బాధిత విద్యార్థినిని కూడా అలాగే క్లాసు బయట నిలబెట్టారు. ఇదే విషయంపై లెక్చరర్ తీరును ప్రశ్నిస్తూ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుతో జూన్ 30న కాలేజీలో జరిగిన సెమిస్టర్ పరీక్షలను విద్యార్థినిని రాయనీవ్వలేదు. దీంతో ఆమె బాగా కృంగిపోయింది. ఎప్పుడైతే లెక్చరర్‌పై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసిందో.. ఆ మరుసటి రోజు నుంచి విద్యార్థిని మానసికంగా, లైంగిక వేధింపులు గురైంది.దుర్ఘటనకు ముందు లెక్చరర్ సాహూకు.. మృతి చెందిన విద్యార్థిని మధ్య సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో సాహూ తనకు ఫేవర్ చేయమని నన్ను అడిగారు. అందుకు నేను .. మీకు ఏ విధమైన ఫేవర్ కావాలని అడిగాను. అలా నేను అడిగినప్పుడు నాకు ఎలాంటి ఫేవర్ కావాలో అర్ధం చేసుకోలేనంత చిన్నపిల్లవి కావు నువ్వు’ అని నన్ను అన్నారంటూ ప్యానల్‌కు ఫిర్యాదు చేసింది’అని సేథి అన్నారు.ఐసీసీ సభ్యులపై విద్యార్థిని తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. నా కుమార్తె మరణానికి ఐసీసీ సభ్యులే బాధ్యులు. నా కుమార్తె మరణంపై పక్షపాతంగా నివేదిక తయారు చేశారని అన్నారు. జులై 12న ఒడిశాలోని బాలాసోర్ ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాలకు చెందిన 20 ఏళ్ల బీఈడీ విద్యార్థిని ఆత్మహత్య ఆ రాష్ట్రాన్ని కలచివేసింది. కాలేజీలో ఇంటిగ్రేటెడ్ బీఈడీ విభాగ అధిపతి, లెక్చరర్ సమీర్ రంజన్ సాహూ తనని మానసికంగా,లైంగికంగా వేధిస్తున్నారంటూ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తనని తాను నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యాయత్నంతో 95 శాతం కాలిన గాయాలైన విద్యార్థిని తోటి విద్యార్థులు ఎయిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ జూలై 14 రాత్రి మరణించారు. కాగా, విద్యార్థిని ఫిర్యాదు చేసిన సమీర్ కుమార్ సాహూపై కళాశాల అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) అతనికి క్లీన్ చిట్ ఇవ్వడంపై దుమారం చెలరేగింది. -
జలశక్తి సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయాలు.. సీఎం రేవంత్ ఏమన్నారంటే
సాక్షి,న్యూఢిల్లీ: జలశక్తి సమావేశంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గోదావరి,కృష్ణా జలాలపై వివాదాలపై పరిష్కరించేలా కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఆధ్వర్యంలో జలవివాదాల పరిష్కార కమిటీని కేంద్రం నియమిస్తుంది. ఈ నెల 21లోగా కమిటీ ఏర్పాటు కానుంది. హైదరాబాద్‌లోని గోదావరి నది బోర్డు,అమరావతిలోనే కృష్ణానది బోర్డు ఉండేలా నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు రిజర్వయార్ల ప్లో నీటి లెక్కలను గుర్తించేలా టెలిమెట్రీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు వచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సమావేశంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఇది కేవలం ఇన్ ఫార్మల్ మీటింగ్ మాత్రమే. నాలుగు అంశాలపై పరిష్కారం దొరికింది. కేసీఆర్ ఇన్నాళ్లు వీటికి పరిష్కారం కనుక్కోలేదు. ఈ సమావేశంలో మేము విజయం సాధించాం. అన్ని ప్రాజెక్టులలో టెలిమెట్రి యంత్రాలు పెట్టేందుకు ఏపీ అంగీకరించడం మా విజయం. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకుంటాం..పోరాటం చేయాల్సిన అవసరం లేదు. కృష్ణా, గోదావరిపై ప్రాజెక్టుల అపరిష్కృతంగా ఉన్న అన్ని అంశాలపై ఇంజనీర్ల కమిటీ ముందడుగు చూపిస్తుంది. వారం రోజుల్లో కమిటీ ఏర్పాటు అవుతుందని తెలిపారు. -
Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడిలో కీలక పరిణామం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలో నరమేధంలోనూ ఉగ్రవాదులు ప్రదర్శించిన అంతులేని ఉన్మాదానికి 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో పురోగతి లభించింది. కేంద్రం భద్రతా సంస్థల దర్యాప్తులో లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్(The Resistance Front)ఉగ్రవాదులు కెమెరాలు అమర్చిన హెల్మెట్లు ధరించి 26మంది అమాయాకుల ప్రాణాల్ని బలి తీసుకున్నారు. ప్రాణాలు తీసే సమయంలో దాడిని వీడియో రికార్డు చేసుకున్నారు.అనంతరం, హింసాత్మక చర్యపై సంతోషం వ్యక్తం చేస్తూ.. టూరిస్టుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులకు రక్షణగా ఉన్న ముగ్గురు ఉగ్రవాదులు తుపాకుల్ని తెచ్చి వారికి ఇచ్చారు. ఆ తుపాకుల్ని గాల్లోకి ఎక్కుపెట్టి కాల్పులు జరిపి రాక్షసానందం పొందినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు ఎన్ఐఏకి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రకృతి అందాలతో అలరారే పచ్చిక బయళ్లపై ముష్కరులు సృష్టించిన నరమేధంలో మరణించిన 26మంది టూరిస్టులు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, కేరళ, గుజరాత్, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన టూరిస్టులు ఉన్నారు. వీరితో పాటు నేపాల్‌కు చెందిన ఓ పర్యాటకుడు, పహల్గాంకు చెందిన స్థానికుడు ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు.పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల వివరాలు సుశీల్ నాథ్యాల్ – ఇండోర్సయ్యద్ ఆదిల్ హుస్సైన్ షా – హపత్నార్, తహసిల్ పహల్గాంహేమంత్ సుహాస్ జోషి – ముంబైవినయ్ నార్వాల్ – హర్యానాఅతుల్ శ్రీకాంత్ మోని –మహారాష్ట్రనీరజ్ ఉదావాని – ఉత్తరాఖండ్బిటన్ అధికారి – కోల్కతాసుదీప్ నియుపానే – నేపాల్శుభం ద్వివేది – ఉత్తరప్రదేశ్ప్రశాంత్ కుమార్ సత్పతి – ఒడిశామనీష్ రంజన్ – బీహార్ఎన్. రామచంద్ర – కేరళసంజయ్ లక్ష్మణ్ లల్లీ – ముంబైదినేష్ అగర్వాల్ – చండీగఢ్సమీర్ గుహార్ – కోల్కతాదిలీప్ దసాలీ – ముంబైజే. సచంద్ర మోలీ – విశాఖపట్నంమధుసూదన్ సోమిశెట్టి – బెంగళూరుసంతోష్ జాఘ్డా – మహారాష్ట్రమంజు నాథ్ రావు – కర్ణాటకకస్తుబ గంటోవత్య – మహారాష్ట్రభరత్ భూషణ్ – బెంగళూరుసుమిత్ పరమార్ – గుజరాత్యతేష్ పరమార్ – గుజరాత్టగెహాల్యిగ్ – అరుణాచలప్రదేశ్శైలేష్భాయ్ హెచ్. హిమత్‌భాయ్ కళాథియా – గుజరాత్ఆపరేషన్ సిందూర్‌తో చావు దెబ్బ కొట్టిన భారత్పహల్గాం ఉగ్రదాడి ఘటనతో భారత్, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల వేళ పాక్‌ను భారత్ దెబ్బకొట్టింది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యల్లో భాగంగా మే7న (మంగళవారం) అర్ధరాత్రి 1:44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం (Indian Army) మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. ప్రపంచ దేశాల ముందు పాక్‌ను భారత్‌ను దోషిగా నిలబెట్టింది. -
నిమిషా ప్రియను క్షమించలేం
సనా: తన సోదరుడు తలాల్ అబ్దో మెహదీని దారుణంగా హత్య చేసిన కేరళ నర్స్ నిమిషా ప్రియను క్షమించలేమని అబ్దెల్ ఫతాహ్ మెహదీ తేల్చిచెప్పారు. ఆమె నుంచి క్షమాపణ గానీ, నష్టపరిహారం(బ్లడ్ మనీ) గానీ తాము కోరుకోవడం లేదని స్పష్టంచేశారు. తమ కుటుంబానికి న్యాయం జరగాలని అన్నారు. యెమెన్‌లో నిమిష తల్లి ప్రేమకుమారియెమెన్లో మాజీ వ్యాపార భాగస్వామి అయిన తలాల్ అబ్దో మెహదీని 2017లో విషపు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసినందుకు నిమిషా ప్రియకు స్థానిక కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆమెకు బుధ వారం శిక్ష అమలు చేయాల్సి ఉండగా, చివరి నిమి షంలో వాయిదా పడింది. బాధితుడి సోదరుడు అబ్దెల్ ఫతాహ్ మెహదీ బీబీసీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఖిసాస్’ తప్ప ఇంకేమీ కోరుకోవడం లేదని చెప్పారు. షరియా చట్టం ప్రకారం తమకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు. తన సోదరుడిని చంపినందుకు నిమిషా ప్రియను ఉరి తీయాల్సిందేనని, అంతకుమించి ఇంకేదీ అక్కర్లే దని వెల్లడించారు. -
Pahalgam Probe: పారిపోతూ ఉగ్రవాదులు కాల్పులు
న్యూఢిల్లీ: గత ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ)ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ నేపధ్యంలో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఘటనా స్థలంలో ఒక వ్యక్తిని ఉగ్రవాదులు ‘కల్మా’ పఠించాలని అడిగి, అతను అలా చేయగానే వదిలివేసినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది.దాడి అనంతం ఉగ్రవాదులు పారిపోతూ, గాలిలో కాల్పులు జరిపారని, భాధితులకు ఎవరూకూడా సాయం అందించకుండా ఉండేందుకే ఇలా చేసివుంటారని ఎన్ఐఏ వర్గాలు భావిస్తున్నాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన పర్వైజ్ అహ్మద్, బషీర్ అహ్మద్‌ల విచారణలో.. ఉగ్రవాదులు అక్కడి నుంచి తప్పించుకుంటున్నప్పుడు గాలిలో కాల్పులు జరిపారని వెల్లడయ్యింది.కాల్పులు జరిగిన ప్రదేశం నుండి ఎన్ఐఏ ఖాళీ బుల్లెట్లను స్వాధీనం చేసుకుంది. ఉగ్రవాదులు ఈ ఘటనకు ముందు అక్కడున్నవారి మతాన్ని తెలుసుకునేందుకు కల్మా చదవమన్నారని ప్రాణాలతో బయటపడిన వారు ఎన్ఐఏ అధికారులకు తెలిపారు. ఎన్ఐఏ ఇప్పటివరకూ లభ్యమైన ఆధారాల మేరకు ముగ్గురు ఉగ్రవాదులలో ఒకరిని పాకిస్తాన్‌కు చెందిన హషీమ్ ముసాగా గుర్తించింది. మిగిలిన ఇద్దరినీ గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే వీరు పహల్గామ్ దాడి కోసం భారత్‌లోనికి చొరబడినట్లు అనుమానిస్తున్నారు. -
United States: టార్గెట్ స్టోర్‌లో చోరీ.. పట్టుబడిన భారత మహిళ
వాషింగ్టన్: అమెరికాలోని టార్గెట్ స్టోర్‌లో రూ. లక్షకుపైగా విలువైన వస్తువులను దొంగిలిస్తూ భారతీయ మహిళ పట్టుబడింది. బాడీక్యామ్ వీడియోలో ఆమె చోరీకి పాల్పడిన ఘటన రికార్డయ్యింది. యునైటెడ్ స్టేట్స్ను సందర్శించేదుకు వచ్చిన ఆమెను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు.ఇల్లినాయిస్ ప్రాంతంలోని ఈ స్టోర్‌లో ఏడు గంటలపాటు గడిపిన ఈమె అనుమానాస్పద ప్రవర్తనను అక్కడి సిబ్బంది గమనించి, పోలీసు అధికారులకు సమాచారమిచ్చారు. ఈ రిటైల్ చైన్ నుండి ఆమె లక్షరూపాయలకు పైగా విలువైన వస్తువులను చోరీ చేసిందని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు స్టోర్‌లోని బాడీక్యామ్ ఫుటేజ్‌ను సేకరించారు. సదరు మహిళ ఏడు గంటలుగా స్టోర్‌లో తిరగడాన్ని గమనించామని, ఆమె అక్కడి వస్తువులను తీసుకుంటూ, ఫోన్‌ను చూసుకుంటూ చివరికి డబ్బు చెల్లించకుండా వెళ్లడానికి ప్రయత్నించిందని స్టోర్ సిబ్బంది పోలీసులకు తెలిపారు. వారి ఫిర్యాదు అనంతరం పోలీసులు ఆమెకు సంకెళ్లు వేసి, స్టేషన్‌కు తరలించారు. ఆమెపై నేరారోపణలు మోపినప్పటికీ, ఇంకా అరెస్టు చేయలేదని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై టార్గెట్ స్టోర్ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. -
UIDAI: కోట్లలో మరణాలు.. యాక్టివ్‌లోనే ఆధార్ కార్డులు.. ఏం జరుగుతోంది?
ఢిల్లీ: మన దేశంలో ఆధార్ కార్డుల విషయమై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలో కోట్ల మంది చనిపోయినప్పటికీ వారి ఆధార్ కార్డులు యాక్టివ్గానే ఉన్నాయని ఉడాయ్ తెలిపింది. వాటిలో కేవలం 10 శాతం కార్డులను మాత్రమే డీయాక్టివేట్ చేస్తున్నట్టు వెల్లడించింది. దీని వల్ల ఆధార్ నంబర్లు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆధార్ కార్డుల విషయమై.. జాతీయ మీడియా ‘ఇండియా టుడే’ దాఖలు చేసిన సమాచార హక్కు (RTI) దరఖాస్తు నేపథ్యంలో ఉడాయ్ సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో కీలక విషయాలను బయటపెట్టింది. ఈ సందర్భంగా ఉడాయ్.. దేశంలో గత 14 సంవత్సరాల్లో సుమారు 11.7 కోటి మంది మరణించినప్పటికీ కేవలం 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే డీయాక్టివేట్ చేసిందని తెలిపింది. ఇది దేశ మరణాల రేటుతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది.అయితే, సిటిజన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) డేటా ప్రకారం.. 2007 నుంచి 2019 వరకు సంవత్సరానికి సగటున 83.5 లక్షల మరణాలు చోటుచేసుకుంటున్నాయి. అయినప్పటికీ 10 శాతం కార్డులను మాత్రమే డీయాక్టివేట్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యులు ఇచ్చే సమాచారం ఆధారంగా జరుగుతుందని ఉడాయ్ వెల్లడించింది.🚨 RTI Shocker on Aadhaar Deactivation🔹 11.7 crore deaths in India in last 14 years🔹 But UIDAI deactivated only 1.15 crore Aadhaar numbers🔹 Raises serious concerns on data accuracy🔹 Big risk of misuse & fraud🔹 Aadhaar update system under scanner #Aadhaar #Uidai pic.twitter.com/LQ8uEmnujL— Sood Saab (@SoodSaab11) July 16, 2025ఇదే సమయంలో గత ఐదు సంవత్సరాల్లో సంవత్సరం వారీగా ఎన్ని ఆధార్ నంబర్లు మరణాల ఆధారంగా డీయాక్టివేట్ చేయబడ్డాయని ఆర్టీఐ ద్వారా అడిగినప్పుడు.. అటువంటి సమాచారం తమ వద్ద లేదు అని యూఐడీఏఐ సమాధానమిచ్చింది. డిసెంబర్ 31, 2024 నాటికి మరణాల ఆధారంగా మొత్తం 1.15 కోట్ల ఆధార్ నంబర్లు డీయాక్టివేట్ చేయబడ్డాయని మాత్రమే యూఐడీఏఐ తెలిపింది. ఈ అసమానత ఆధార్ వ్యవస్థలో మరణాల రిజిస్ట్రేషన్, డీయాక్టివేషన్ ప్రక్రియలో లోపాలను ఎత్తిచూపుతున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, ఆధార్ నంబర్లు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు మెయిల్స్.. పోలీసులు అలర్ట్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పలు పాఠశాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. బుధవారం ఉదయం రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో పోలీసులు, పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు.వివరాల ప్రకారం.. ఢిల్లీలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ద్వారకాలోని సెయింట్ థామస్, వసంత్ వ్యాలీ స్కూల్లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన పోలీసులు.. సెయింట్ థామస్, వసంత్ వ్యాలీ స్కూల్ వద్దకు చేరుకున్నారు. ఈ రెండు పాఠశాలలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని బాంబు, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. దీంతో పాఠశాల యాజమాన్యాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.#BREAKING: Delhi | 5 Schools get threat emails Five schools have received threat calls and emails since this morning St Thomas in Dwarka, Vasant Valley in Vasant Kunj, Mother International in Hauz Khas and Richmond Global School in Paschim Vihar.@DelhiPolice @CPDelhi… pic.twitter.com/deWfff27jN— The New Indian (@TheNewIndian_in) July 16, 2025ఇదిలా ఉండగా.. సోమవారం ఉదయం కూడా ఢిల్లీలో మూడు స్కూళ్లకు బాంబు బెదిరింపులు మెయిల్స్ వచ్చాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు స్కూళ్లు, భారత నావికాదళం నడుపుతున్న ఒక పాఠశాలకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇది విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల అధికారులలో భయాందోళనలను రేకెత్తించింది. అయితే పూర్తి భద్రతా తనిఖీల తర్వాత అధికారులు ఈ బాంబు బెదిరింపులు నకిలీవిగా తేల్చారు పోలీసులు.VIDEO | Delhi: St. Thomas School in Dwarka received bomb threat via mail.A parent says, “My son is in 9th standard. I saw the news about bomb threat. Then, I came to take my child home."#bombthreat(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/nAj73TUJj1— Press Trust of India (@PTI_News) July 16, 2025 -
బస్సులో ప్రసవం.. బయటకు విసిరి పారేసిన తల్లి
నెలలు నిండిన ఓ యువతి బస్సెక్కింది. సరిగ్గా ప్రయాణంలో ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. చప్పుడు కాకుండా ప్రసవించిన ఆమె.. ఆ బిడ్డను గుడ్డలో చుట్టి రోడ్డు మీదకు విసిరి పారేసింది. దీంతో ఆ పసిగుడ్డు అక్కడికక్కడే మరణించింది.మహారాష్ట్ర పర్బానీలో దారుణం జరిగింది. బస్సుల్లోనే బిడ్డను ప్రసవించిన ఓ యువతి.. ఆపై దారుణానికి ఒడిగట్టింది. కళ్లు తెరవని ఆ పసికందును రోడ్డు మీదకు విసిరి ప్రాణం తీసింది. ఈ వ్యవహారంలో 19 ఏళ్ల ఆ యువతితో పాటు భర్తగా చెప్పుకున్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.పర్బానీ నుంచి పుణే వెళ్తున్న స్లీపర్ బస్సులో ఓ జంట ఎక్కింది. మంగళవారం ఉదయం 6.30గం. ప్రాంతంలో బస్సు సేలు రోడ్డుకు చేరుకోగానే.. బస్సులోంచి ఓ చిన్నమూట బయటకు పడింది. కిటికీలోంచి అది చూసిన డ్రైవర్.. అనుమానం వచ్చి బస్సును ఆపి ప్యాసింజర్ల దగ్గరకు వచ్చి ఆరా తీశాడు. అయితే..తన భార్యకు బస్సు జర్నీ పడలేదని.. వాంతి చేసుకుందని.. దానిని గడ్డలో చుట్టి పడేశామని సదరు వ్యక్తి చెప్పాడు. అయితే బస్సు ఎక్కే సమయంలో ఆమె గర్భంతో ఉన్న విషయం గమనించిన ఓ ప్రయాణికురాలికి ఈ వ్యవహారం అనుమానంగా తోచింది. తోటి ప్రయాణికులను అప్రమత్తం చేసింది. వాళ్లు విసిరేసిన గుడ్డ మూటను విప్పి చూడగా.. అందులో ఓ పసికందు కనిపించింది. దీంతో.. ప్రయాణికులంతా ఆ జంటను నిలదీశారు. తమ పేర్లు రితికా ధిరే, అల్తాఫ్ షేక్‌గా చెప్పుకున్న ఆ జంట.. ఏడాదిన్నరగా పుణేలో కాపురముంటున్నామని చెప్పారు. అయితే బిడ్డను పెంచి పోషించే స్తోమత తమకు లేదని.. అందుకే ఇలా చేశామని ఆ ఇద్దరు చెప్పారు. ఆపై ఎమర్జెన్సీ నెంబర్ 112 ద్వారా పోలీసులను ఈ సమాచారం అందించారు.పార్తీ స్టేషన్ పోలీసులు వచ్చి విచారణ జరపగా.. ఆ జంట భార్యభర్తలే అని నిరూపించేందుకు తగిన ఆధారాలు చూపించలేకపోయింది. దీంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. డెలివరీ అయిన యువతిని ఆస్పత్రికి.. సదరు వ్యక్తిని జైలుకి తరలించారు. డిశ్చార్జి తర్వాత ఆ జంటను కలిపి విచారణ జరిపే యోచనలో పోలీసులు ఉన్నారు. మరణించిన ఆ మగశిశువుకు పోలీసులే అంత్యక్రియలు జరిపించారు. -
‘టిట్ ఫర్ టాట్’: చలానా వేసిన పోలీసులు.. వాహనదారుడి అదిరిపోయే కౌంటర్!
ఫిరోజాబాద్: ఒకరు మనతో ఎలా వ్యవహరిస్తారో వారితో అదే మాదిరిగా వ్యవహరించడాన్ని ‘టిట్ ఫర్ టాట్’(దెబ్బకు దెబ్బ) అని అంటారు. దీని అర్థం ఎవరైనా మనకు దొంగ దెబ్బ తీసినప్పుడు వారికి అదే రీతితో సమాధానం ఇవ్వడం అన్నమాట. లౌక్యం కలిగిన వారు ఈ మాట తరచూ చెబుతుంటారు. అయితే దీనిని ఒక ఎలక్ట్రీషియన్ ఆచరించి చూపారు. ఇప్పుడు ఈ ఉదంతం వైరల్‌గా మారింది.ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీనివాస్ అనే ఎలక్ట్రీషియన్ తనకు ట్రాఫిక్ పోలీసుల నుంచి ఎదురైన చేదు అనుభవాకి టిట్ ఫర్ టాట్ రీతిలో సమాధానం ఇచ్చారు. ఒకరోజు శ్రీనివాస్ తన ఉద్యోగ విధుల్లో అత్యవసరంగా బైక్‌పై వెళుతున్న సమయంలో, హెల్మెట్ ధరించనందుకు ట్రాఫిక్ పోలీసులు అతనికి రూ. 500 జరిమానా విధించారు. తన అత్యవసర పని గురించి వారికి చెప్పినప్పకీ, వారు ఏమాత్రం వినకుండా శ్రీనివాస్ చేతిలో జరిమానా రసీదు పెట్టారు. Fearless man☠️ pic.twitter.com/Y458CvTLHc— Aditya Tiwari ❤️👻 (@aditiwari9111) July 15, 2025దానిని ఆన్లైన్లో చెల్లించిన శ్రీనివాస్ తన ఇబ్బందిని గుర్తించని ట్రాఫిక్ పోలీసులకు తగిన గుణపాఠం చెప్పాలని అనుకున్నారు. తనకు జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ 2016 నుంచి విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని శ్రీనివాస్ కనుగొన్నారు. అది రూ. 6.6 లక్షలకు చేరుకున్న విషయాన్ని శ్రీనివాస్ గుర్తించారు. వెంటనే అతను ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఐదు గంటలపాటు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది చీకటిలో ఉండేలా చేశాడు. పెండింగ్‌లో ఉన్న బకాయిల కారణంగానే ఈ పనిచేశామని, ఇది ప్రతీకారం కాదని శ్రీనివాస్ ట్రాఫిక్ సిబ్బందికి తెలియజేశారు. కాగా శ్రీనివాస్‌కు నెలల తరబడి జీతం రావడంలేదని, అతని జీతం నెలకు రూ. 6,000 మాత్రమేనని, అందుకే అతనికి ట్రాఫిక్ జరిమానా చెల్లించడం భారంగా మారిందని అతని స్నేహితులు చెబుతున్నారు. -
అలసిపోయిన ప్రాణం: పాడె మోసిన గ్రామస్తులు
భువనేశ్వర్: ఒడిశారాష్ట్రం అంతటా విషాదం అలముకుంది. అధ్యాపకుని వేధింపులు తాళలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విద్యార్థిని సౌమ్య శ్రీ (Soumyashree) ఆస్పత్రిలో చావుతో పోరాటం చేసి సోమవారం అర్ధరాత్రి తనువు చాలించింది. బాలాసోర్ ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీలో చోటు చేసుకున్న విషాద సంఘటన ఇది. భోరుమన్న తల్లిదండ్రుల రోదనతో పలాసియా గ్రామం మారు మోగింది. ఊరంతా ఏకమై భుజాలు మార్చుకుంటూ గ్రామం ముద్దు బిడ్డ సౌమ్యశ్రీకి బరువైన గుండెతో తుది వీడ్కోలు పలికారు. బాధ్యులకు రాజీ లేని శిక్ష: గవర్నరు బాలాసోర్ ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థిని అకాల మరణం బాధాకరమని, ఆమె మరణం విషాదం మాత్రమే కాదని, నేటి విద్యాబోధన ప్రాంగణాల్లో యువతులను కాపాడుకోవాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తు చేస్తుందని రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరి బాబు కంభంపాటి ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం తన కఠినమైన మార్గాన్ని అనుసరిస్తుందని, బాధ్యులు రాజీలేని శిక్షను ఎదుర్కొంటారని ఆయన ఉద్ఘాటించారు. దోషులకు శిక్ష తప్పదు: ముఖ్యమంత్రి ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాల విద్యార్థిని విషాదకరమైన ఆత్మాహుతి సంఘటనను ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తీవ్రంగా పరిగణించి దోషుల్ని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. చట్టం ప్రకారం ఆదర్శప్రాయమైన శిక్ష పడేలా చూడాలని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. వ్యవస్థాపరమైన వైఫల్యం: నవీన్ పట్నాయక్ ‘చాలా విచారకరమైన సంఘటన. అందరూ షాక్ అయ్యారు. రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థిని విషాద మరణం ఉదాసీన వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమ’ని విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పటా్నయక్ విచారం వ్యక్తం చేశారు. విద్యార్థిని మరణానికి దారితీసిన సంఘటనల క్రమం సంస్థాగత ద్రోహం తప్ప మరేమీ కాదు అని ఆందోళన చెందారు. న్యాయం కోసం దివంగత విద్యార్థిని చేసిన విజ్ఞప్తిని విస్మరించిన కళాశాల అధికారులు, అధికారంలో ఉన్నవారు ఉభయ వర్గాల్ని జవాబుదారీగా పరిగణించి చర్యలు చేపట్టాలని రాష్ట్ర గవర్నర్‌ను కోరారు. పర్లాకిమిడిలో.. పర్లాకిమిడి: బాలేశ్వర్‌లో ఫకీర్ మోహన్ స్వయం ప్రతిపత్తి కళాశాలలో సౌమ్య శ్రీ మృతిపై పర్లాకిమిడి ప్యాలెస్ రోడ్డులో పలువురు మహిళలు నిరసన తెలిపారు. కళాశాలలో ఆమెను వేధించిన హెచ్ఓడీని అరెస్టు చేయాలని, ఆమెకు న్యాయం జరిగేలా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి చూడాలని సామాజిక సేవకురాలు జాస్మిన్ షేక్ డిమాండ్ చేశారు. సాయంత్రం ప్యాలెస్ నుంచి కొవ్వొత్తులతో పలువురు మహిళలు శాంతియుత ర్యాలీ జరిపారు. రాయగడ: బాలేశ్వర్‌లోని ఫకీర్ మోహన్ సేనాపతి కళాశాల విద్యార్థిని సౌమ్యశ్రీ ఆత్మాహుతికి నిరసనగా ప్రతిపక్షపారీ్టలైన బీజేడీ, కాంగ్రెస్‌లు మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. స్థానిక కపిలాస్ కూడలిలో బీజేడీ శ్రేణులు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ దిష్టి బొమ్మలను తగుల బెట్టాయి. బీజేపీ అధికారంలొకి వచ్చిన ఏడాదిలోనే మహిళలకు రక్షణ కరువైందని, ఎక్కడ చూసినా అత్యాచారాలు పెరిగిపోయాయని దుమ్మెత్తిపోశారు. కల్యాణసింగుపూర్ లొ మంగళవారం నాడు కాంగ్రేస్ నాయకులు ఆందోళన చేపట్టారు. భగ్గుమన్న బీజేడీ శ్రేణులుజయపురం: బాలాసోర్ జిల్లాలో ఫకీర్ మోహన యూనివర్సిటీలో సౌమ్యశ్రీ మృతిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఆమె మృతిపై జయపురం బీజేడి శ్రేణులు భగ్గు మన్నాయి. మంగళవారం జయపురం బీజేడీ శ్రేణులు 26 వ జాతీయ రహదారిని స్తంభింపజేసి ఆందోళనలు చేపట్టారు. ప్లకార్డులు చేత పట్టి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనలో విక్రమ విశ్వ విద్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు. నేడు, రేపు బంద్ భువనేశ్వర్: ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థిని సౌమ్యశ్రీ ఆత్మాహుతిపై నిరసనలతో రాష్ట్రంలో పరిస్థితి అట్టుడికి పోతుంది. ప్రధానంగా విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం విద్యార్థిని ప్రాణాలు బలిగొందని నిందిస్తున్నాయి. విషాదకర సంఘటనని రాజకీయం చేయొద్దని అధికార పక్షం భారతీయ జనతా పార్టీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్, రాష్ట్ర కాంగ్రెస్ వరుసగా రెండు రోజులు బంద్‌కు పిలుపునిచ్చాయి. తొలుత బిజూ జనతా దళ్ బుధవారం బాలాసోర్ బంద్ నిర్వహిస్తుందని ప్రకటించింది. విద్యార్థిని మృతిపై ప్రభుత్వ వైఫల్యం కారణంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బిజూ జనతా దళ్ బాలసోర్‌లో ఆరు గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బంద్ జరుగుతుందని ప్రకటించింది. ఈ వ్యవధిలో ముఖ్యమైన సేవలు కొనసాగుతాయి. బంద్ సమయంలో దుకాణాలు, మార్కెటు సముదాయాలు, మోటారు వాహనాల రవాణా, బస్సులు, రైళ్లు రాకపోకలు, పాఠశాలలు మరియు కళాశాలలు మూసివేయాలని అభ్యర్థించారు. రేపు రాష్ట్ర బంద్ రాష్ట్ర కాంగ్రెస్ ఈ నెల 17 గురువారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. వామపక్షాలు, 8 ఇతర రాజకీయ పార్టీలతో ఉమ్మడిగా ఒడిశా బంద్ నిర్వహిస్తున్నట్లు ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ విలేకర్లకు వివరించారు. బాలాసోర్ సంఘటనకు నిరసనగా ఒడిశా బంద్‌కు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌తో భారత కమ్యునిస్టు పార్టీ (సీపీఐ), సీపీఐ(ఎం సహా 8 ఇతర రాజకీయ పార్టీలు మంగళ వారం సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఒడిశా బంద్ ప్రకటన చేశాయి. ఎయిమ్స్ ఆవరణలో ఆందోళన,ఉద్రిక్తతసౌమ్యశ్రీ మరణం తర్వాత శవ పరీక్షలు రాత్రికి రాత్రి ముగించి అడ్డగోలుగా తరలిస్తున్నారని దుమారం రేగింది. సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత ఆస్పత్రుల్లో శవ పరీక్షలు నిర్వహించడం జరగదు. సౌమ్యశ్రీ విషయంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఎదురు కావడంతో యువజన, విద్యార్థి కాంగ్రెస్ వర్గాలు ఆకస్మిక ఆందోళనకు దిగాయి. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆవరణలో ఆచార విరుద్ధ చర్యల్ని ఖండించారు. ఈ సందర్భంగా పోలీసులతో ఘర్షణకు దిగడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. -
మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ మృతి కేసు.. ఎన్ఆర్ఐ అరెస్ట్
ఛండీగఢ్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భారత దిగ్గజ మారథాన్ అథ్లెట్ ఫౌజా సింగ్ కేసులో ఎన్ఆర్ఐ అమృత్‌పాల్ సింగ్ ధిల్లాన్(30)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో ప్రమాదం జరిగిన సమయంలో వాహనం నడిపిన అమృత్‌పాల్ సింగ్‌ను కర్తార్‌పుర్‌లో మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే అతడు కెనడా నుంచి భారత్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అతడు నడిపిన ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరికాసేపట్లో అతన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అనంతరం రిమాండ్‌కు తరలించనున్నారు.ఇదిలా ఉండగా.. పంజాబ్‌లోని జలంధర్ సమీపంలోని బియాస్ పిండ్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 114 ఏళ్ల ఫౌజా సింగ్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా, గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో ఫౌజాసింగ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.ప్రపంచంలోనే కురువృద్ధ అథ్లెట్‌గా పేరుగాంచిన ఈ పంజాబ్ పుత్తర్ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. వందేళ్ల వయసును ఏమాత్రం లెక్కచేయకుండా యువకులకు సవాలు విసురుతూ ప్రపంచ వ్యాప్తంగా వివిధ మారథాన్లలో బరిలోకి దిగి సత్తాచాటారు. ఫౌజా సింగ్ మృతి పట్ల పలు ప్రపంచ దేశాలు తమ దిగ్భ్రాంతి ప్రకటించాయి. 1911 ఏప్రిల్ 1న జన్మించిన ఫౌజాసింగ్ 89 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్ కెరీర్ మొదలుపెట్టారు. 1993లో ఇంగ్లండ్‌కు వెళ్లిన ఈ దిగ్గజ అథ్లెట్.. ‘టర్బన్ టోర్నడో’ అంటూ అందరి మనన్నలు పొందారు. 2011లో జరిగిన టొరంటో మారథాన్‌లో 100 ఏళ్ల వయసులో 8 గంటల 11 నిమిషాల్లో రేసు పూర్తి చేసి కొత్త రికార్డు నెలకొల్పాడు. ఐదేళ్ల పసిప్రాయం వరకు నడవని ఆయన.. తన 14 ఏళ్ల అథ్లెటిక్స్ కెరీర్లో తొమ్మిది మారథాన్ రేసుల్లో పోటీపడటం విశేషం.The world's oldest marathon runner, Fauja Singh, has died at the age of 114. He was involved in a hit-and-run near Jalandhar, India.Singh began running at 89 and ran nine full marathons - and was one of the 2012 London Olympic torchbearers. pic.twitter.com/kvevQ84FaD— Channel 4 News (@Channel4News) July 15, 2025తన కుటుంబసభ్యుల మరణాల నుంచి తేరుకునేందుకు పరుగును ఎంచుకున్న ఫౌజాసింగ్ను 2015లో బ్రిటిష్ ఎంపైర్ మెడల్ వరించింది. 2012లో జరిగిన హాంకాంగ్ మారథాన్.. ఆయన చివరి అంతర్జాతీయ రేసుగా నిలిచింది. పంజాబ్‌లో డ్రగ్స్ నియంత్రణకు అక్కడి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ఈ దిగ్గజ అథ్లెట్ కీలకంగా వ్యవహరించారు. కనీసం నడిచే వీలు లేని వయసులో కుర్రాళ్లకు స్ఫూర్తిగా నిలిచిన ఫౌజాసింగ్ అకాల మృతి అందరినీ కలిచివేసింది. -
రాహుల్.. ప్రధాని అవుతారని మీకు తెలుసా?: బాంబే హైకోర్టు
ముంబై: హిందూత్వ నాయకుడు వీర్ సావర్కర్ గురించి చదివి అవగాహన పెంచుకోవాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను బాంబే హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. సావర్కర్ గురించి రాహుల్‌గాంధీ చేసిన బాధ్యతారహిత ప్రకటనలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని పిటిషనర్, అభినవ్ భారత్ కాంగ్రెస్ అనే సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పంకజ్ కుముద్‌చంద్ర ఫడ్నిస్ ఆరోపించారు. ఆయన ప్రధానమంత్రి అయితే, అప్పుడు విధ్వంసం సృష్టిస్తారని పిటిషన్లో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ‘మీ పిటిషన్లో అధ్యయనం చేయమని ఆదేశించాలంటూ మీరు కోరారు. కోర్టు చదవమని అతన్ని ఎలా బలవంతం చేస్తుంది?’ అని ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, న్యాయమూర్తి సందీప్ మార్నేలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. అంతేకాదు.. ఆయన ప్రధాని అవుతారని మాకు తెలియదు.. మీకు తెలుసా? అని ప్రశ్నించింది. రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేసుకునే చట్టపరమైన మార్గం పిటిషనర్‌కు ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో వీర్ సావర్కర్ మవనడు పుణే కోర్టును ఆశ్రయించారని, విచారణ జరుగుతోందని ధర్మాసనం వెల్లడించింది. -
రష్యాతో వ్యాపారం చేస్తే ఊరుకోం
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై ఆక్రమణ జెండా ఎగరేసిన రష్యాను నిలువరించేందుకు దాని ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు నాటో కూటమి పరోక్ష చర్యలకు దిగింది. రష్యా నుంచి చమురు కొనుగోలుసహా పలురకాల వాణిజ్య కార్యకలాపాల కొనసాగిస్తున్న భారత్, చైనా, బ్రెజిల్‌లపై నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హెచ్చరికలు చేశారు. రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను ఎదుర్కోవలసి ఉంటుందని రుట్టే బ్రెజిల్, చైనా, భారత్‌లను హెచ్చరించారు. బుధవారం అమెరికా సెనేటర్లతో వాషింగ్టన్లో సమావేశమైన అనంతరం మీడియాతో రుట్టే మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను శాంతి చర్చలకు ఒప్పించేలా పుతిన్‌పై భారత్, చైనా, బ్రెజిల్‌లు ఒత్తిడితేవాలని రుట్టే వ్యాఖ్యానించారు. ‘భారత ప్రధాన మంత్రి, చైనా అధ్యక్షుడు, బ్రెజిల్ అధ్యక్షుడు... మీరు ఎవరైనా కావొచ్చుగానీ రష్యాతో మీరు ముడిచమురు, సహజ వాయువు కొనుగోలుసహా వాణిజ్య వ్యాపారాలను వెంటనే ఆపేయండి. మీరో విషయం గుర్తుంచుకోవాలి. రష్యాలోని ఆ పెద్దమనిషి(పుతిన్) గనక ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి ముందుకు రాకపోతే నేను టారిఫ్‌ల కొరడాతో రంగంలోకి దిగుతా. భారత్, బ్రెజిల్, చైనాలపై 100 శాతం టారిఫ్‌లు విధిస్తా. ఆర్థిక ఆంక్షలు సైతం విధిస్తా. నా ఈ హెచ్చరికలను మీరు చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిందే. లేదంటే దీని విపరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాటిని మీరు ఎదుర్కోక తప్పదు. కొత్తగా ఈ 100 శాతం టారిఫ్‌ల బాధ తప్పాలంటే మీరు వెంటనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి బాగా పెంచాలి. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు పుతిన్‌ను ఒప్పించాలి. పుతిన్ ఆ శాంతి చర్చలకు కట్టుబడి ఉండాలి. పుతిన్‌కు వెంటనే ఫోన్ చేసి, శాంతి చర్చలపై మరింత సీరియస్‌గా ఆలోచించాలని సూచనలు చేయండి. మీరు చర్చలపై ముందడుగువేయకుంటే నాటో మాపై 100 శాతం టారిఫ్‌లు విధిస్తుందట అని పుతిన్‌కు చెప్పండి. శాంతి ఒప్పందంగనక సాధ్యంకాకపోతే మీ మూడు దేశాలపై టారిఫ్‌లు విధించడం ఖాయం. ఈ గుదిబండను మీరు మోయకతప్పదు’’’ అని రుట్టే హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు సైనిక మద్దతు మరింత పెంచుతామని, రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై టారిఫ్‌లను విపరీతంగా పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజు రుట్టే ఇలా భారత్‌ను హెచ్చరిస్తూ వ్యాఖ్యలుచేయడం గమనార్హం. రష్యా, దాని భాగస్వాములపై 100 శాతం సుంకాలు విధిస్తాం: అమెరికా రష్యా ఎగుమతులపై 100 శాతం సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. 50 రోజుల్లోపు ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే రష్యా నుంచి ముడిచమురును కొనుగోలుచేసే దేశాలపై మరోదఫా ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ‘50 రోజుల్లోపు శాంతి ఒప్పందం కుదరాల్సిందే. అది జరక్కపోతే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. టారిఫ్‌ల మోత మోగిస్తా. ఇతర ఆర్థిక ఆంక్షలు మోపుతా’’ అని ట్రంప్ ప్రకటించారు. అమెరికా కాంగ్రెస్ ఆమోదం అవసరం లేకుండానే మరోదఫా టారిఫ్‌లను అమలు చేయవచ్చన్నారు. అత్యధిక కొనుగోలుదారుల్లో భారత్ తాజా అంతర్జాతీయ వాణిజ్య నివేదికల ప్రకారం రష్యా నుంచి ముడి చమురును అధికంగా దిగుమతి చేసుకుంటున్న, కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్, చైనా, తుర్కియే తొలి వరసలో ఉన్నాయి. ట్రంప్ నిజంగానే ఆర్థిక ఆంక్షలు విధిస్తే భారత్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్న ఈ తరుణంలో ట్రంప్ కొత్తగా టారిఫ్‌ల కొరడా ఝులిపిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలకు అంతరాయం కలిగే వీలుంది. ట్రంప్ బెదిరింపులపై రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ దీటుగా స్పందించారు. ‘ ట్రంప్‌తో చర్చలు జరపడానికి రష్యా సిద్ధంగా ఉంది. కానీ రష్యానే బెదిరించాలని చూడటం తగదు. అలి్టమేటం జారీ చేయడం అస్సలు ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి చర్యలు సానుకూల ఫలితాలను ఇవ్వవని గుర్తుంచుకుంటే మంచిది’ అని సెర్గీ వ్యాఖ్యానించారు. -
ఐదు నెలలు.. 7000 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కేవలం 5 నెలల వ్యవధిలో అక్షరాలా రూ.7వేల కోట్లను దేశ ప్రజల నుంచి కొట్టేశారు. దీనిని బట్టి చూస్తే మే– జూలై మధ్యలో సైబర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తం రూ.10వేల కోట్ల వరకు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటీపీ ఫ్రాడ్ మొదలు డిజిటల్ స్కాం వరకు ఒక్కో వ్యక్తిని ఒక్కో రకంగా మోసం చేస్తున్న నేరగాళ్లు లక్షల రూపాయిలు కొల్లగొడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నేరాలు చేసే వారంతా ఆగ్నేయాసియా దేశాల వాళ్లు కాగా చేయించేది మాత్రం చైనీయులేనని నిఘా విభాగం స్పష్టం చేసింది.ఐ4సీ ఏం చెబుతోందంటే.. దేశ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని వివిధ దేశాలకు చెందిన సైబర్ నేరాలకు వివిధ దేశాలకు చెందిన వారు పాల్పడుతున్నారని హోంశాఖ గుర్తించింది. వివిధ మార్గాల్లో డబ్బు కొట్టేస్తున్న వాళ్లంతా మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయ్‌లాండ్‌లకు చెందిన వారేనని ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) డేటా తేలి్చంది. వీరి వెనుక ఉన్నది మాత్రం చైనీయులేననేది ఐ4సీ స్పష్టం చేస్తోంది. నెలకు రూ. వెయ్యి కోట్ల వసూళ్లే లక్ష్యంగా వీరు అమాయకులను ఉచ్చులోకి దించుతున్నట్లు తెలిపింది.డబ్బంతా వెళ్లేది అటే.. సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోరి్టంగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్(సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) డేటా ప్రకారం దేశంలో జనం నుంచి కొట్టేసిన డబ్బంతా ఆగ్నేయాసియా దేశాలకు వెళుతున్నట్లు వెల్లడైంది. జనవరిలో రూ.1,192 కోట్లు, ఫిబ్రవరిలో రూ.951 కోట్లు, మార్చిలో రూ.1,000 కోట్లు, ఏప్రిల్‌లో రూ.731 కోట్లు, మేలో రూ.999 కోట్లు కొట్టేసినట్లు సమాచారం. ఓటీపీ ఫ్రాడ్స్, డిజిటల్ స్కాం, పోలీసులమని చెప్పి కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడటం, క్రిప్టో కరెన్సీ, లాటరీ స్కాం, క్రెడిట్ కార్డు పాయింట్స్ క్లెయిం, ఈ నెంబర్‌పై ఆఫర్ ఉంది కారు గిఫ్ట్‌గా వస్తుందని చెప్పడం, పెళ్లి చేసుకోవడానికి యూఎస్ నుంచి వస్తున్నట్లు నమ్మబలకడం, లింకులు పంపి డబ్బు కొట్టేయడం తదితర మార్గాల్లో జనం నుంచి లాగేస్తున్నారు.మన వాళ్లే ఏజెంట్లు సైబర్ నేరాల పేరుతో అమాయకుల నుంచి డబ్బు కొట్టేసేందుకు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మనవాళ్లను ఏజెంట్లుగా నియమించుకోవడం గమనార్హం. ఇటీవల ఈ విషయాలు వివిధ రాష్ట్రాల పోలీసుల దర్యాప్తులు తేలాయి. మహారాష్ట్ర, తమిళనాడు, జమ్ముకశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో వందల కొద్దీ ఏజెంట్లు సైబర్ నేరగాళ్ల సహకరిస్తున్నారు. చైనా నుంచి కీలక వ్యక్తుల సూచనలు.. మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయ్‌లాండ్‌లకు దేశాల నేరగాళ్ల ఆదేశాలతో మనవాళ్లు నేరాల్లో ప్రత్యక్షంగా భాగస్వాములుగా మారుతున్నట్లు గుర్తించారు. ఇటువంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని, వీరి ఉచ్చులో పడొద్దని కేంద్రం పదేపదే హెచ్చరిస్తున్నా కేటుగాళ్లఉచ్చులో జనం పడుతుండటం గమనార్హం. -
గ్రేట్ ఫ్లాటెనింగ్...ఇప్పుడు ట్రెండింగ్
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతం కంపెనీలు, ఆయా సంస్థల్లోని వ్యవస్థలు వేగంగా మారిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులుచేర్పులతో ఆర్థిక ఒత్తిళ్లు, సాంకేతికతలో పెరుగుతున్న వినియోగం, విధుల నిర్వహణలో సమర్థత సాధనకు కృషి అనే ఈ మూడు ప్రధాన అంశాల ప్రభావంతో సంస్థల నిర్మాణ విధానంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు, సంస్థల్లో మధ్యస్థ మేనేజర్ల (మిడిల్ మేనేజ్మెంట్) పాత్ర కొత్తగా నిర్వచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే టెక్నాలజీ రోజురోజుకూ వేగంగా మారుతోంది. ఆ మార్పు ఉత్పత్తుల స్థాయిలోనే కాకుండా, సంస్థల అంతర్గత నిర్మాణంలోనూ జరుగుతోంది. ఇప్పుడు చోటుచేసుకుంటున్న పరిణామాల్లో ‘గ్రేట్ ఫ్లాటెనింగ్‘అన్న పదం సిలికాన్ వ్యాలీలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో మారుతున్న ట్రెండ్‌కు సంకేతంగా నిలుస్తోంది. ఇందులో భాగంగా మధ్యస్థ మేనేజ్మెంట్ స్థాయిని తగ్గిస్తూ, నిర్ణయాలు తీసుకునే మార్గాన్ని వేగవంతం చేయాలనే లక్ష్యంతో టెక్ దిగ్గజాలు ముందుకు సాగుతున్నాయి. టెక్ కంపెనీలు సైతం తాము స్టార్టప్‌ల సెటప్ మాదిరిగా పనిచేయాలనే మానసిక స్థితిలో చిన్న బృందాలుగా, తక్కువ సంఖ్యలో మేనేజర్లతో ఎక్కువ ఉత్పాదకతను సాధించే లక్ష్యంతో ముందుకెళుతున్నాయి. చాట్బాట్లు, డేటా ఎనలిటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ వంటి వినియోగంతో మానవ వనరుల నిపుణుల అవసరం తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదే బాటలో దిగ్గజ కంపెనీలు మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, గూగుల్, ఇంటెల్ వంటి కంపెనీలు సైతం సంస్థాగత వ్యవస్థలను పునర్వ్యవస్థీకరిస్తూ మార్పులు తీసుకొస్తున్నాయి. కొన్ని ప్రముఖ కంపెనీలు, సంస్థలు ఇప్పటికే ఈ మార్పులకు అనుగుణంగా మధ్యస్థ మేనేజర్ల పాత్రను కొత్తగా రూపుదిద్దేలా చర్యలు చేపట్టాయి. కృత్రిమ మేధ, ఆటోమేషన్ వంటి వాటిని ప్రవేశపెట్టి, మధ్యస్థ స్థాయి మేనేజ్మెంట్ పాత్రను తగ్గించేశాయి. దీని వల్ల నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఏర్పడడంతో పాటు మేనేజర్లను వ్యూహాత్మక విధానాల్లోకి మళ్లించేందుకు ప్రయతి్నస్తున్నాయి. అనుకూల అంశాలుసమర్థత, వేగవంతమైన నిర్ణయాలు: బ్యూరోక్రసీని తగ్గించి, చిన్న బృందాలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా చేయాలన్నదే లక్ష్యం. దీంతో ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి. మార్కెట్‌కు అనుగుణంగా వేగంగా స్పందించొచ్చువ్యయాల తగ్గింపు : ఉద్యోగుల జీతాలు, ముఖ్యంగా మేనేజ్మెంట్ స్థాయిలో అధికంగా ఉండటంతో వాటిని తగ్గించడం ద్వారా కంపెనీలకు ప్రయోజనాలు చేకూరుతాయి. తాజా ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఇది కీలకంగా మారింది.ఇన్నోవేషన్‌కు మద్దతు: మధ్యస్థ మేనేజ్మెంట్ లేకపోతే, నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని నేరుగా పనిచేసే ఉద్యోగులకు ఇవ్వొచ్చు.దీనివల్ల సృజనాత్మకత పెరిగే అవకాశముందిప్రతికూల అంశాలు మిగిలిన మేనేజర్లపై పనిభారం : తగ్గిన మేనేజ్మెంట్ వ్యవస్థకు ప్రత్యా మ్నాయం లేకపోవడం వల్ల మిగిలిన వారిపై అధిక పనిఒత్తిడి పెరుగుతోంది. ఇది ‘బర్నౌట్’కు దారితీయొచ్చునాయకత్వలోపం : తొలగించిన మేనేజ్మెంట్ల స్థాయిల కారణంగా లీడర్ షిప్ గ్యాప్ ఏర్పడి, టీమ్‌ల పనితీరు దెబ్బతినే అవకాశముందిసీనియర్ స్థాయిలో మైక్రో మేనేజ్మెంట్ : మధ్యస్థ స్థాయి లేకపోతే, టాప్ లెవల్ లీడర్íÙప్ చిన్న విషయాల దాకా జోక్యం చేసుకోవడం వల్ల ఇది వ్యతిరేక ఫలితాన్నే కలిగించొచ్చు.ప్రమోషన్ అవకాశాల తగ్గుదల : మంచి ప్రతిభ కనబరిచే వారికి మధ్యస్థ మేనేజర్ స్థాయికి చేరే అవకాశాలు తగ్గి.. కెరీర్ ఎదుగుదలకు బ్రేకులు పడే ప్రమాదం. సవాళ్లు ఎదురవుతున్నా.. అనేక కొత్త అవకాశాలు అందుబాటులోకి కంపెనీలు, సంస్థలు నిర్వహణ వ్యయాన్ని తగ్గిస్తూ, కార్యకలాపాల్లో సమర్థత పెంపుదల కోసం మార్గాలు వెతుకుతున్నాయి. ఇప్పుడు ఎక్కువ కంపెనీలు ఫ్లాట్ (అంటే తక్కువ మేనేజ్మెంట్ లేయర్లతో కూడిన) సంస్థలుగా మారుతున్నాయి. దీనివల్ల వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది. ఈ మార్పుల నేపథ్యంలో మధ్యస్థ మేనేజర్లు అధికంగా ›ప్రభావితం అవుతున్నారు. వారికి సవాళ్లు ఎదురవుతున్నా, అనేక అవకాశాలు కూడా అందుబాటులో వస్తున్నాయి. – వెంకారెడ్డి, చీఫ్ పీపుల్ ఆఫీసర్, క్వాలీ జీల్ ఐఎన్‌సీ -
నెలకు రూ.1,000 కోట్లకుపైనే
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్–పెట్టుబడులు, డిజిటల్ అరెస్ట్, టాస్క్, పెట్టుబడి.. ఎంచుకున్న విధానం ఏదైనా విదేశీ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో భారతీయులు చిక్కుతున్నారు. తద్వారా ప్రతి నెల సగటున రూ.1,000 కోట్లకుపైగా దోపిడీకి గురవుతున్నారు. భారతీయులను లక్ష్యంగా చేసుకుని అత్యధికంగా ఆగ్నేయాసియా కేంద్రంగా ఈ సైబర్ మోసాలు జరుగుతున్నాయని కేంద్ర హోం శాఖ (ఎంహెచ్ఏ) గుర్తించింది. భారతీయులతో సహా అక్రమ రవాణాకు గురైన వ్యక్తులతో ఈ కేంద్రాల్లో బలవంతంగా మోసాలు చేయిస్తున్నారు.ఈ ఏడాది జనవరి నుండి మే వరకు ఆన్ లైన్ స్కామ్‌ల వల్ల భారతీయులు కోల్పోయిన మొత్తం సుమారు రూ.7,000 కోట్లు. ఇందులో సగానికి పైగా మోసాలకు మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయిలాండ్ నుండి పనిచేస్తున్న నెట్వర్క్లే కారణమని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఎంహెచ్ఏ అనుబంధ విభాగమైన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) రూపొందించిన డేటా ప్రకారం.. అధిక భద్రత కలిగిన ప్రదేశాల నుండి సైబర్ నేరగాళ్లు ఈ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ నెట్‌వర్క్‌లను చైనీస్ ఆపరేటర్లు నియంత్రిస్తున్నారు.బాధితులే ఉద్యోగులు..విదేశాల్లో ఉద్యోగాల ఆశతో మానవ అక్రమ రవాణాకు గురై.. ఆయా దేశాల కేంద్రాల్లో వీరితో బలవంతంగా పనిచేయిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కరీంనగర్ జిల్లాతోపాటు పలువురు యువకులు ఉపాధి కోసం థాయ్‌లాండ్ వెళ్లి అక్కడి సైబర్ కేఫ్‌లలో బందీలుగా చిక్కుకున్నారు. దీనిపై వార్తల నేపథ్యంలో స్పందించిన కేంద్రం అక్కడి 539 భారతీయ బందీలను విడిపించి, మార్చి 11న సురక్షితంగా భారత్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఇలా చాలామందిని నిఘా సంస్థలు రక్షించాయి. వీరి సాయంతో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కంబోడియాలో కనీసం 45, లావోస్‌లో ఐదు, మయన్మార్‌లో ఒక కేంద్రాన్ని గుర్తించాయి. బాధితుల్లో భారతీయులతో పాటు, ఆఫ్రికా, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా, దక్షిణాసియా, మధ్య ఆసియా, పశ్చిమాసియా దేశాలు, యూరప్/ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా నుండి వచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఆగ్నేయాసియా నుండి పనిచేస్తున్న సైబర్ నేరగాళ్లు ప్రధానంగా మూడు రకాల మోసాలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. వీటిలో స్టాక్ ట్రేడింగ్/పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్ట్, టాస్క్ ఆధారిత, పెట్టుబడి ఆధారిత మోసాలు ఉన్నాయి.ఘోస్ట్ సిమ్ కార్డులతో..ప్రభుత్వ అంచనాల ప్రకారం ప్రస్తుత సంవత్సరం మార్చికి ముందు ఆరు నెలల్లో భారతీయులు కనీసం రూ.500 కోట్ల మేర మోసపోయారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. బ్యాంకింగ్, ఇమిగ్రేషన్, టెలికం రంగాలలో ఉన్న లొసుగులను ప్యానెల్ గుర్తించింది. నకిలీ, దొంగిలించిన గుర్తింపులతో సిమ్‌లను జారీ చేశారనే ఆరోపణలపై వివిధ రాష్ట్రాల్లోని పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నకిలీ, ఇతరుల గుర్తింపుతో జారీ అయిన ఈ ఘోస్ట్ సిమ్‌లను పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు సైబర్ నేరస్తులకు విక్రయిస్తున్నారు. మోసపూరితంగా సిమ్ జారీ కావడంతో నేరస్తులను గుర్తించడం కష్టమవుతోంది.బాధితులే ఉద్యోగులు..సైబర్ నేరాల కోసం వ్యక్తులను నియమించుకుంటున్న అనేక మంది ఏజెంట్లను భారత ప్రభుత్వం గుర్తించింది. వీరిలో మహారాష్ట్ర నుంచి 59 అత్యధికంగా మంది ఉన్నారు. తమిళనాడు 51, జమ్మూ కాశ్మీర్ 46, ఉత్తర ప్రదేశ్ 41, ఢిల్లీ నుంచి 38 మంది ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏజెంట్లు లావోస్, మయన్మార్, కంబోడియాలకు ఎక్కువ మందిని నియమించుకుంటున్నారు. 5,000 మందికిపైగా భారతీయులు కంబోడియాలో చిక్కుకున్నట్టు సమాచారం. నేరగాళ్లు వీరిని నిర్బంధించి, బలవంతంగా సైబర్ మోసాలు చేయిస్తున్నారు. దేశాలను దాటి..సైబర్ నేరస్తుల చెర నుంచి రక్షించిన బందీలు, తిరిగి వచ్చిన వ్యక్తుల వాంగ్మూలాలను ప్రభుత్వం నమోదు చేసింది. భారత్ నుంచి కంబోడియాకు బాధితులను తరలిస్తున్న తీరు నిఘా సంస్థల విచారణలో బయటపడింది. తొలుత దుబాయ్.. అక్కడి నుండి చైనా, కంబోడియాకు; తమిళనాడు నుండి కంబోడియా; మహారాష్ట్ర నుండి థాయిలాండ్, కంబోడియా; జైపూర్ నుండి థాయిలాండ్, కంబోడియా; జైపూర్ నుండి వియత్నాం.. అక్కడి నుండి బ్యాంకాక్, కంబోడియాకు; ఢిల్లీ నుండి బ్యాంకాక్, కంబోడియా, లక్నో నుండి బ్యాంకాక్, కంబోడియా; కేరళ నుండి వియత్నాం, కంబోడియా; కేరళ నుండి సింగపూర్, కంబోడియాకు తరలిస్తున్నారు. ఇక కోల్‌కతా నుండి వియత్నాం, కంబోడియాకు రోడ్డు మార్గం ద్వారా చేరవేస్తున్నట్లు తేలింది. ఆధునిక మోసాలు..: తప్పుదోవ పట్టించి రహస్య సమాచారాన్ని తెలుసుకోవడం, నకిలీ యాప్‌లు, ఫిషింగ్ హెచ్చరికలు, వంచన వంటి వివిధ పద్ధతులను సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్నారు. కేవైసీ అప్డేట్ పేరుతో ఒత్తిడికి గురిచేయడం, లాభదాయక రాబడి పేరుతో వల వేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ కారణంగా 2025లోనే రూ.210 కోట్లకుపైగా నష్టాలు నమోదయ్యాయి. సైబర్ నేరస్తులు గ్రామీణులతోపాటు నగరవాసులనూ లక్ష్యంగా చేసుకుని మరింత ఆధునిక మోసాలకు తెరలేపుతున్నారు.కాల్ 1930..: సైబర్ నేరం మీ దృష్టికి వచ్చినా.. ఎవరైనా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అనుమానం వచ్చినా వెంటనే 1930కి కాల్ చేయండి. cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయండితక్షణ నివారణ చర్యలు తీసుకోకపోతే మొత్తం నష్టాలు వచ్చే ఏడాది కాలంలో రూ.1.2 లక్షల కోట్లకు మించి ఉండవచ్చని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ హెచ్చరించింది. -
ఓటీటీ.. ఏమిటీ ట్రాప్!
అభిమాన తారలు నటించిన సినిమా ఎప్పుడు రిలీజవుతుందా.. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే వీక్షకులు కోట్లలో ఉంటారు. ఓటీటీలోకి వస్తోందని, ఫలానా తేదీన స్ట్రీమింగ్ అవుతుందని తెలియగానే ఆరోజు కోసం ఎదురు చూసేవారెందెరో. ఆ సినిమా కోసమైనా ఓటీటీ యాప్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకునేవారూ ఉన్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు. ఓటీటీ సబ్స్క్రిప్షన్ ను రద్దు చేయాలంటే? సైన్ అప్ చేసినంత సులభం కాదని ఇటీవలి సర్వే వెల్లడించింది. అంతేకాదు వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా యూజర్ ఇంటర్ఫేస్ ఉంటోందట.సినిమాలూ, వెబ్ సిరీస్‌ల వంటివి చూపే ఓవర్ ద టాప్ (ఓటీటీ) యాప్‌లలో సబ్స్క్రిప్షన్ ను (చందా) రద్దు చేయడం ఆషామాషీ వ్యవహారం కాదని కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్ లోకల్‌సర్కిల్స్ సర్వేలో తేలింది. దేశంలోని డిజిటల్ వినియోగదారులలో డిజిటల్ సేవల సబ్స్క్రిప్షన్స్ ను రద్దు చేయడంలో సగం మంది తరచూ ఇబ్బంది పడుతున్నారట. చాలా సందర్భాల్లో రద్దు చేసే ఆప్షన్ అందుబాటులో ఉండడం లేదని సర్వేలో పాలుపంచుకున్నవారు తెలిపారు. యాప్ లేదా వెబ్సైట్లో ఆ ఆప్షన్ ఎక్కడో ఉండటం వల్ల దాన్ని కనుక్కోలేకపోయామని వినియోగదారులు చెబుతున్నారు.దేశవ్యాప్తంగా 353 జిల్లాల్లోని 95,000కుపైగా మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా లోకల్‌సర్కిల్స్ ఈ నివేదిక రూపొందించింది. చందా రద్దు ప్రక్రియ కష్టతరం చేయడానికి ప్లాట్‌ఫారాలు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను ఈ నివేదిక బహిర్గతం చేసింది. ‘డార్క్ ప్యాటర్న్స్’ అని పిలిచే ఈ ఉపాయాలు ఇప్పుడు వినియోగదారులు, నియంత్రణ సంస్థల నుండి విమర్శలను ఎదుర్కొంటున్నాయని ఈ నివేదిక తెలిపింది. దేశంలో ప్రస్తుతం 69 ఓటీటీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి.ఆసక్తి లేకపోయినా..ఈ నివేదిక ద్వారా గుర్తించిన అత్యంత సాధారణ డార్క్ ప్యాటర్న్లలో సబ్స్క్రిప్షన్ ట్రాప్ ఒకటి. ఓటీటీలో సైన్ అప్ చేసే సమయంలోనే కంపెనీలు తమ ఉపాయాలను ప్రదర్శిస్తున్నాయి. ఫ్రీ ట్రయల్స్ ఆఫర్ చేసినా.. కాల పరిమితి ముగియగానే సులభంగా నిష్క్రమించే అవకాశం లేకుండా పోతోంది. అన్ సబ్స్క్రయిబ్ చేసే ఆప్షన్ గుర్తించడం కష్టంగా ఉంటోంది. దీంతో వినియోగదారులు వారు అనుకున్న దానికంటే ఎక్కువ కాలం సభ్యత్వాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి తలెత్తింది. బ్యాంకు ఖాతా నుంచి ఆటో డెబిట్ ఆప్షన్ ఉండడంతో కాల పరిమితి కాగానే ఖాతాలోంచి డబ్బులు కట్ అయిపోయి, సబ్స్క్రిప్షన్ రీచార్జ్ అయినట్టుగా చాలా మంది తెలిపారు. కొన్ని సందర్భాల్లో అదనపు యాప్‌లను ఇన్ స్టాల్ చేయడం, లేదా అవసరమైన దానికంటే ఎక్కువ వ్యక్తిగత సమాచారాన్ని కూడా పంచుకోవాల్సి వస్తోంది. ఓటీటీ సేవలకు అవసరం లేని చర్యలను వినియోగదారులు పూర్తి చేయాల్సి ఉంటోంది. ముఖ్యం కాకపోయినా సబ్స్క్రిప్షన్ సమయంలో ఈ దశలను కంపెనీలు తప్పనిసరి అని చెప్పి పూర్తి చేయిస్తున్నాయి.లోపించిన పారదర్శకత..సబ్స్క్రిప్షన్ సమయంలో కంపెనీలు ఒక ధరను ముందుగా ప్రదర్శిస్తున్నాయి. చెక్ అవుట్ ప్రక్రియ సమయంలో తప్పనిసరి రుసుములు, ఛార్జీలను జోడిస్తున్నాయి. ఈ తరహా మోసానికి గురైనట్టు చందాదారులు చెబుతున్నారు. ఓటీటీ సేవలకు సబ్‌స్క్రైబ్ చేసుకునేటప్పుడు అదనపు ఛార్జీల గురించి ముందస్తుగా సమాచారం ఇవ్వలేదని 53% మంది వినియోగదారులు వెల్లడించారు. చెల్లింపు చివరి దశలో మాత్రమే ఈ అదనపు ఖర్చులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. కంపెనీల్లో పారదర్శకత లోపించిందనడానికి ఇది నిదర్శనమని నివేదిక వివరించింది. దృష్టి మరల్చడానికి.. వినియోగదారుల దృష్టి మరల్చడానికి లేదా తప్పుదారి పట్టించడానికి ఉద్దేశించిన గమ్మతై ్తన నేవిగేషన్, రంగు రంగుల సంకేతాలతో కూడిన ఇంటర్‌ఫేస్‌లను కంపెనీలు ఉపయోగిస్తున్నాయి. ఆఫర్స్‌ను తిరస్కరించడం, ట్రయల్స్‌ను నిలిపివేయడం, చందా రద్దు (క్యాన్సిలేషన్) మార్గాన్ని కనుగొనడం కష్టతరం అయ్యే పరిస్థితులను ఎదుర్కొన్నామని 86% మంది వినియోగదారులు చెప్పారు. ‘కంపెనీలు ఒక ఆఫర్ లేదా సేవను ప్రమోట్ చేస్తున్నాయి. సైన్ అప్ చేసిన తర్వాత అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ప్రకటనలు లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు అన్నీ చూడండని ఊదరగొట్టి ఆ హామీని నిలబెట్టుకోవడం లేదు. అదనంగా చెల్లించకపోతే ప్రకటనలను కొనసాగిస్తున్నాయి’ అని సర్వేలో పాల్గొన్నవారు తెలిపారు.రద్దు చేసినా చార్జీలు..సబ్స్క్రిప్షన్ ను రద్దు చేసిన తర్వాత కూడా కంపెనీలు ఛార్జ్ చేస్తున్నాయని వినియోగదారులు అంటున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 24% మంది ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ఎలాంటి అలర్ట్, వివరణ లేకుండానే ఈ ప్రక్రియ జరుగుతోందని వారు అంటున్నారు. సబ్స్క్రిప్షన్ గడువు అయిపోయిందని, ఇక డబ్బు చెల్లించనక్కర్లేదని భావించినప్పటికీ బ్యాంకు ఖాతా నుండి డబ్బు డెబిట్ అవుతోందని వారు చెబుతున్నారు.కంపెనీల ఈ డిజైన్ వ్యూహాలు స్వల్పకాలంలో ప్లాట్‌ఫామ్‌లకు ప్రయోజనం చేకూర్చినప్పటికీ వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోతాయని లోకల్‌సర్కిల్స్ స్పష్టం చేసింది. సౌలభ్యం తగ్గిందని, ప్రకటనలు ఎక్కువయ్యాయని, గందరగోళమైన బిల్లింగ్ ఉంటోందన్నది కస్టమర్ల వాదన. సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించేటప్పుడు కంపెనీల నుంచి సహాయం, స్పష్టత పొందలేకపోయామని వినియోగదారులు తెలిపారు.అయినా మారలేదు..ఈ సమస్యలను పరిష్కరించడానికి 2023లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ 13 రకాల డార్క్ ప్యాటర్న్స్ నివారణ, నియంత్రణ కోసం మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు డిజిటల్ పారదర్శకతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అవి ఈ–కామర్స్ సేవలకు మాత్రమే వర్తిస్తాయని వాదిస్తున్నాయి. అయితే కంపెనీల మోసపూరిత విధానాలపై కన్నెర్ర చేసిన సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ 2023 నవంబర్‌లో ఓ హెచ్చరిక జారీ చేసింది. తప్పుదోవ పట్టించే ఇంటర్‌ఫేస్‌లను తొలగించడానికి కంపెనీలకు మూడు నెలల సమయం ఇచ్చింది. ఆ తరవాత కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదని లోకల్‌సర్కిల్స్ సర్వేలో వెల్లడైంది. భారత్‌లో వినియోగదారుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో స్పష్టమైన నియమాలు, బలమైన అమలు వ్యవస్థ ఉండాలని ఈ నివేదిక అభిప్రాయపడింది. -
విమానం ఇంజన్ల షట్‌డౌన్ ఘటనలు.. ఐదేళ్లలో 65
హైదరాబాద్: అహ్మదాబాద్ ఘటన అనంతరం విమాన ప్రమాదాలకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ఐదేళ్ల కాలంలో విమానాల ఇంజన్లు షట్‌డౌన్ అయిన ఘటనలు 65 నమోదవగా, ప్రమాదంలో ఉన్నామంటూ పైలట్లు కేవలం 17 నెలల వ్యవధిలోనే 11సార్లు కాల్ చేసినట్లు వెల్లడైంది. ఇందులో అహ్మదాబాద్ ఘటన, ఇండిగో విమానాన్ని దారి మళ్లించిన ఘటనలను మినహాయించారు.సమాచార హక్కు చట్టం కింద టైమ్స్ ఆఫ్ ఇండియా పంపిన దరఖాస్తుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అందజేసిన సమాధానంలో ఈ వివరాలుండటం గమనార్హం. అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం దుర్ఘటనకు ఇంజన్ ఫ్యూయల్ షట్‌డౌన్ కారణం కావచ్చునంటూ ప్రాథమిక నివేదిక అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో బయటకు వచ్చిన ఈ వివరాలు విమాన ప్రయాణికులకు భయం పుట్టించేలా ఉన్నాయి. మెరుగ్గా లేని భారత్ రికార్డు దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విమానయాన సంస్థల్లో ఇంజిన్ లోపాల ఘటనలు నెలకు కనీసం ఒకటి చొప్పున నమోదవుతున్నాయి. ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ ఘటన ఇందుకు తాజా ఉదాహరణగా డీజీసీఏ పేర్కొంది. గడిచిన ఐదేళ్లు 2020–2025 మధ్య కాలంలో సంభవించిన ఇంజన్ షట్‌డౌన్ ఘటనల్లో టేకాఫ్‌తోపాటు ఆకాశంలో ఉన్న సమయంలోనూ జరిగినవి ఉన్నాయంది. అయితే, చాలా సందర్భాల్లో పైలట్లు పనిచేసే ఒక్క ఇంజన్‌తోనే విమానాలను దగ్గర్లోని ఎయిర్‌పోర్టుల్లో సురక్షితంగా ల్యాండ్ చేశారని తెలిపింది.టర్బయిన్ పనిచేయకపోవడం నుంచి ఇతర ఎల్రక్టానిక్ ఉపకరణాల్లో లోపాల వరకు అన్ని సాంకేతిక అంశాలను కలిపి నిపుణులు ఇంజన్ షట్డౌన్గా పేర్కొంటున్నారని డీజీసీఏ వివరించింది. 2024 జనవరి 1–2025 మే 31 మధ్య కాలంలో ప్రమాదంలో ఉన్నామంటూ పైలట్లు కాల్ చేసిన ఘటనలు 11 నమోదయ్యాయని, ఇందులో సాంకేతికలోపాలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు సాయం కోరడం వంటివి ఉన్నాయని డీజీసీఏ పేర్కొంది.ఈ 11 విమానాల్లో నాలుగు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యాయంది. ప్ర మాదంలో ఉన్నామంటూ పంపే సంకేతాలు (మేడే కాల్స్) సర్వసాధారణంగా జరుగుతుండేవేనని నిపుణులు అంటున్నారు. అయి తే, ఇందులో భారత్‌కు ఏమంత సంతృప్తికరమైన రికార్డులేదని పెదవి విరుస్తున్నారు. ఈ విషయంలో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన జాబితాలో భారత్ 48వ స్థానంలో నిలిచింది. -
వాటికి సొంతింట్లో తిండి పెట్టొచ్చుగా?
న్యూఢిల్లీ: వీధిశునకాలను ఎక్కడపడితే అక్కడ పెంచిపోషిస్తున్న కారణంగా కుక్కలున్న రోడ్లపై చిన్నారులు, వృద్దులు, మహిళలు ఒంటరిగా వెళ్లలేని పరిస్థితి దాపురించిందని సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తంచేసింది. వీధి శునకాల కోసం ప్రత్యేకంగా ఆహారకేంద్రాలు తెరవాలంటూ పిటిషన్ దాఖలుచేసిన ఒక వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయన తరఫున హాజరైన న్యాయవాదిపై పలు ప్రశ్నలు సంధించింది. ‘‘వీధిశునకాల బాగోగులు పట్టించుకునే ఇలాంటి దయార్థ్ర హృదయుల కోసం కాలనీలోని ప్రతి రోడ్డును, ప్రతి సందును భోజనాల కోసం కేటాయించాలా?. ఆయన ఉండే కాలనీలోని వీధి శునకాలన్నింటికీ ఆయన సొంతింట్లోనే ఆహారం పెట్టొచ్చుగా?. ఎవ్వరూ ఆయనకు అడ్డుచెప్పరు’’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జంతువుల జనన నియంత్రణ నిబంధనలు, 2023లో 20వ రూల్ ప్రకారమే తమ ఏరియాలోని వీధిశునకాలకు క్లయింట్ ఆహారం పెడుతుంటే ఆయా కాలనీవాసులు, అపార్ట్మెంట్ యజమానులు అడ్డుచెబుతున్నారని, వేధిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. జనం పెద్దగా తిరగని ప్రాంతాల్లో ఫీడింగ్ పాయింట్లు ఏర్పాటుచేసేలా పురపాలికలను ఆదేశించాలని న్యాయవాది కోరారు. దీనిపై సుప్రీంకోర్టు మండిపడింది.‘‘మేమొక మంచి సలహా ఇస్తాం. పిటిషనర్ ఇంట్లోనే ఒక షెల్టర్‌ను తెరవండి. అక్కడే ప్రతి ఒక్క వీధిశునకానికి ఆహార ఏర్పాట్లు చేసుకోండి’’అని కోర్టు సూచించింది. గ్రేటర్ నోయిడాలో ఇలాంటి పాయింట్లు ఉన్నా నోయిడా సిటీలో లేవని న్యాయవాది వాదించడంతో కోర్టు మళ్లీ స్పందించింది. ‘‘మీరొక సైకిల్ తొక్కుతూ ఉదయం పూట అలా వెళ్లిరండి. వీధి శునకాలున్న రోడ్డులో ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది’’అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘నేను రోజూ ఉదయం వాకింగ్‌కు వెళ్తా. ఎన్నో కుక్కలను చూస్తా’’అని అనడంతో కోర్టు కల్పించుకుని ‘‘ఉదయపు నడకకు వెళ్లే వాళ్లకు వీధిశునకాల బెడద ఎక్కువ. అందులోనూ సైకిల్, ద్విచక్రవాహనాలు నడిపే వాళ్లకు కుక్కల బెడద మరింత ఎక్కువ. అవి వెంట బడి కిందపడి గాయపడేలాచేస్తాయి. వాటి కారణంగా కిందపడి ప్రాణాలమీదకు తెచ్చుకున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు’’అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇదే అంశంలో పెండింగ్‌లో ఉన్న ఇతర కేసులతో కలిపి ఈ పిటిషన్‌ను తర్వాత విచారిస్తామని కోర్టు తెలిపింది. -
5 నెలలు.. రూ.7వేల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కేవలం 5 నెలల వ్యవధిలో అక్షరాలా రూ.7వేల కోట్లను దేశ ప్రజల నుంచి కొట్టేశారు. దీనిని బట్టి చూస్తే మే– జూలై మధ్యలో సైబర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తం రూ.10వేల కోట్ల వరకు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటీపీ ఫ్రాడ్ మొదలు డిజిటల్ స్కాం వరకు ఒక్కో వ్యక్తిని ఒక్కో రకంగా మోసం చేస్తున్న నేరగాళ్లు లక్షల రూపాయిలు కొల్లగొడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నేరాలు చేసే వారంతా ఆగ్నేయాసియా దేశాల వాళ్లు కాగా చేయించేది మాత్రం చైనీయులేనని నిఘా విభాగం స్పష్టం చేసింది. ఐ4సీ ఏం చెబుతోందంటే.. దేశ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని వివిధ దేశాలకు చెందిన సైబర్ నేరాలకు వివిధ దేశాలకు చెందిన వారు పాల్పడుతున్నారని హోంశాఖ గుర్తించింది. వివిధ మార్గాల్లో డబ్బు కొట్టేస్తున్న వాళ్లంతా మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయ్‌లాండ్‌లకు చెందిన వారేనని ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) డేటా తేల్చింది. వీరి వెనుక ఉన్నది మాత్రం చైనీయులేననేది ఐ4సీ స్పష్టం చేస్తోంది. నెలకు రూ. వెయ్యి కోట్ల వసూళ్లే లక్ష్యంగా వీరు అమాయకులను ఉచ్చులోకి దించుతున్నట్లు తెలిపింది. డబ్బంతా వెళ్లేది అటే.. సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్(సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) డేటా ప్రకారం దేశంలో జనం నుంచి కొట్టేసిన డబ్బంతా ఆగ్నేయాసియా దేశాలకు వెళుతున్నట్లు వెల్లడైంది. జనవరిలో రూ.1,192 కోట్లు, ఫిబ్రవరిలో రూ.951 కోట్లు, మార్చిలో రూ.1,000 కోట్లు, ఏప్రిల్‌లో రూ.731 కోట్లు, మేలో రూ.999 కోట్లు కొట్టేసినట్లు సమాచారం. ఓటీపీ ఫ్రాడ్స్, డిజిటల్ స్కాం, పోలీసులమని చెప్పి కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడటం, క్రిప్టో కరెన్సీ, లాటరీ స్కాం, క్రెడిట్ కార్డు పాయింట్స్ క్లెయిం, ఈ నెంబర్‌పై ఆఫర్ ఉంది కారు గిఫ్ట్‌గా వస్తుందని చెప్పడం, పెళ్లి చేసుకోవడానికి యూఎస్ నుంచి వస్తున్నట్లు నమ్మబలకడం, లింకులు పంపి డబ్బు కొట్టేయడం తదితర మార్గాల్లో జనం నుంచి లాగేస్తున్నారు. మన వాళ్లే ఏజెంట్లు సైబర్ నేరాల పేరుతో అమాయకుల నుంచి డబ్బు కొట్టేసేందుకు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మనవాళ్లను ఏజెంట్లుగా నియమించుకోవడం గమనార్హం. ఇటీవల ఈ విషయాలు వివిధ రాష్ట్రాల పోలీసుల దర్యాప్తులు తేలాయి. మహారాష్ట్ర, తమిళనాడు, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో వందల కొద్దీ ఏజెంట్లు సైబర్ నేరగాళ్ల సహకరిస్తున్నారు. చైనా నుంచి కీలక వ్యక్తుల సూచనలు..మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయ్‌లాండ్‌లకు దేశాల నేరగాళ్ల ఆదేశాలతో మనవాళ్లు నేరాల్లో ప్రత్యక్షంగా భాగస్వాములుగా మారుతున్నట్లు గుర్తించారు. ఇటువంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని, వీరి ఉచ్చులో పడొద్దని కేంద్రం పదేపదే హెచ్చరిస్తున్నా కేటుగాళ్లఉచ్చులో జనం పడుతుండటం గమనార్హం. -
శుభ ఆగమనం
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుతమైన అధ్యాయానికి ఘనమైన ముగింపు లభించింది. మన వ్యోమగామి, వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా 18 రోజుల అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించుకుని అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి క్షేమంగా తిరిగొచ్చారు. ఆయనతో పాటు యాగ్జియం–4 మిషన్ బృందంలోని మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని స్పేస్ ఎక్స్ డ్రాగన్ ‘గ్రేస్’వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4:45 గంటలకు ఐఎస్ఎస్ నుంచి విడివడి నింగి నుంచి నేలకేసి సుదీర్ఘయానం ప్రారంభించడం తెలిసిందే.22.5 గంటల ప్రయాణం అనంతరం షెడ్యూల్ ప్రకారం అది మంగళవారం తెల్లవారుజామున 2.31 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:02కు) అమెరికాలో దక్షిణ కాలిఫోరి్నయాలోని శాన్‌డీగో తీర సమీపంలో పసిఫిక్ సముద్ర జలాల్లో విజయవంతంగా దిగింది. తర్వాత కాసేపటికే ముందుగా అమెరికాకు చెందిన మిషన్ కెప్టెన్ పెగ్గీ వాట్సన్ డ్రాగన్ క్యాప్సూల్ నుంచి బయటికొచ్చారు. మిషన్ పైలట్‌గా వ్యవహరించిన 39 ఏళ్ల శుభాంశు, ఆ తర్వాత కొద్ది నిమిషాలకే నిండైన చిరునవ్వుల నడుమ బయటికి వచ్చి దేశవాసులను ఉద్దేశించి చేతులూపుతూ అభివాదం చేశారు. అప్పటిదాకా దేశవ్యాప్తంగా టీవీ తెరలకు అతుక్కుపోయి ఉత్కంఠభరితంగా వీక్షించిన ప్రజలంతా పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు.భారత్‌మాతా కీ జై అంటూ ఆనందోత్సాహాలతో నినదించారు. శుభాంశు స్వస్థలమైన యూపీ రాజధాని లఖ్నవూలోనైతే సంబరాలు అంబరాన్నంటాయి. ఎవరిని చూసినా మిఠాయిలు పంచుకుంటూ, బాణసంచా కాలుస్తూ కన్పించారు. తనయుడు క్షేమంగా భూమికి తిరిగొచ్చిన క్షణాలను వీక్షించే క్రమంలో ఆయన తల్లిదండ్రులు ఆనందబాష్పాలు రాల్చారు. అమెరికాలోని ఫ్లోరిడాలో శుభాంశు భార్య కామ్నాది కూడా అదే పరిస్థితి! రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు మొదలుకుని రాజకీయ తదితర రంగాల ప్రముఖలంతా శుభాంశును అభినందించారు.‘‘చరిత్రాత్మక అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించుకుని భూమికి తిరిగొచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను దేశవాసులందరితో కలిసి అత్యంత సాదరంగా స్వాగతిస్తున్నా’’అంటూ మోదీ హర్షం వెలిబుచ్చారు. వైద్యపరీక్షలు తదితరాల అనంతరం శుభాంశు బృందాన్ని వారం రోజుల పాటు క్వారెంటైన్‌కు తరలించారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మానవసహిత అంతరిక్ష యాత్ర (గగన్‌యాన్)కు శుభాంశు ఐఎస్ఎస్ యానం భారీ ఊపునిచ్చింది. నాసా, ఇస్రో సంయుక్తంగా రూపొందించిన యాగ్జియం–4 మిషన్‌లో భాగంగా శుభాంశు, వాట్సన్‌తో పాటు స్లావోజ్ ఉజ్నాన్స్కీ విస్నియెవ్స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) జూన్ 25న బయల్దేరి 26న ఐఎస్ఎస్ చేరడం తెలిసిందే. అక్కడ 18 రోజుల పాటు వారు వివిధ రకాలైన 60 ప్రయోగాలు నిర్వహించి తిరిగొచ్చారు. లఖ్‌నవూలో శుభాంశు తల్లిదండ్రులు, బంధుమిత్రుల ఆనందోత్సాహాలు విశేషాలు...⇒ శుభాంశు అంతరిక్ష, ఐఎస్ఎస్ యాత్రపై ఇస్రో రూ.550 కోట్లు వెచ్చించింది. ఈ యాత్రలో ఆయన సాధించిన అనుభవం 2027 కల్లా సాకారం చేసుకోవాలని తలపెట్టిన గగన్‌యాన్ ప్రాజెక్టుకు ఎంతగానో ఉపకరించనుంది.⇒ విస్నియెవ్స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) కూడా తమ దేశాల నుంచి ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి వ్యోమగాములుగా నిలిచారు.⇒ తనయుడు క్షేమంగా తిరిగి రావా లని ప్రార్థిస్తూ డ్రాగన్ క్యాప్సూల్ భూమిని చేరేదాకా ఆయన తల్లి ఆశాదేవి సుందరకాండ పారాయణం చేస్తూ గడిపారు.డ్రాగన్ వేగాన్ని తగ్గిస్తున్న ప్యారాచూట్లుఇలా తిరిగొచ్చారు...⇒ శుభాంశు బృందాన్ని తీసుకుని భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4:45 గంటలకు ఐఎస్ఎస్ నుంచి బయల్దేరిన డ్రాగన్ వ్యోమనౌక 22.5 గంటల పాటు ప్రయాణించి మంగళవారం భూమిని చేరింది. మధ్యాహ్నం 2:07 గంటలు: క్యాప్సూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించే ముందు కక్ష్య నుంచి విడివడే ప్రక్రియ మొదలై 18 నిమిషాల పాటు కొనసాగింది. 2:27: సోలార్ ప్యానెళ్లు, రేడియేటర్లతో కూడిన ముందు భాగాన్ని క్యాప్సూల్ విజయవంతంగా వదిలించుకుంది. 2:33: తిరిగి క్యాప్సూల్ ముందు భాగాన్ని మూసివేసే ప్రక్రియ విజయవంతంగా జరిగింది. 2:43: గంటకు ఏకంగా 28 వేల కి.మీ. వేగంతో భూ వాతావరణంలో ప్రవేశించింది. ఆ రాపిడి ఫలితంగా ఏకంగా 1,600 నుంచి 1,900 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పుట్టుకొచ్చింది. అంతటి వేడినీ డ్రాగన్ క్యాప్సూల్ తాలూకు హీట్ షీల్డ్ విజయవంతంగా తట్టుకుంది. 2:44: విపరీతమైన వేగం కారణంగా స్పేస్ ఎక్స్ గ్రౌండ్ స్టేషన్‌తో క్యాప్సూల్‌కు 11 నిమిషాల పాటు సంబంధాలు తెగిపోయాయి. అదే సమయంలో దాని వేగాన్ని తగ్గించే ప్రక్రియ మొదలైంది. 2:54: మళ్లీ సిగ్నల్స్ కలిశాయి. 2:59: భూమికి 5 కి.మీ. ఎత్తులో రెండు ప్యారాచూట్లు తెరుచుకుని వేగాన్ని చాలావరకు తగ్గించాయి. 3:00: 2 కి.మీ. ఎత్తులో ఉండగా మరో నాలుగు ప్యారాచూట్లు విచ్చుకోవడంతో క్యాప్సూల్ వేగం గంటకు 118 మైళ్లకు దిగివచ్చింది.‘‘యాగ్జియం–4 మిషన్‌కు సారథ్యం వహించి సురక్షితంగా తిరిగొచ్చిన శుభాంశుకు, ఈ చరిత్రాత్మక మిషన్‌లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు’’ – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము‘‘ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి భారతీయునిగా శుభాంశు సాధించిన ఘనత కోట్లాది మంది భారత యువత తమ కలలను నిజం చేసుకునేందుకు తిరుగులేని స్ఫూర్తిగా నిలిచింది. గగన్‌యాన్ ప్రాజెక్టు దిశగా ఈ యాత్ర ఓ తిరుగులేని మైలురాయి’’ – ప్రధాని మోదీశుభాంశు యాత్ర హైలైట్స్⇒ రాకేశ్ శర్మ అనంతరం 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతరిక్షంలో వెళ్లిన తొలి భారతీయునిగా శుభాంశు రికార్డు సృష్టించారు. ఐఎస్ఎస్లోకి అడుగు పెట్టిన తొలి భారతీయుడు కూడా ఆయనే. ఆయన అంతరిక్ష యాత్ర సాగిన తీరు... ⇒ 2024లో యాగ్జియం–4 వాణిజ్య మిషన్‌ను ఇస్రో, నాసా సంయుక్తంగా ప్రకటించాయి.⇒ 2025 మొదట్లోనే ప్రయోగం జరగాల్సింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పదేపదే వాయిదా పడుతూ వచ్చింది. ⇒ జూన్ 25న స్పేస్ ఎక్స్ ఫాల్కన్–9 రాకెట్ ద్వారా యాగ్జియం–4 మిషన్ అంతరిక్షానికి బయల్దేరింది. ⇒ 28 గంటల సుదీర్ఘ ప్రయాణం అనంతరం 26న విజయవంతంగా ఐఎస్ఎస్ను చేరింది. ⇒ అక్కడ శుభాంశు బృందం 18 రోజుల పాటు గడిపింది. ఆయన పలు కీలక ప్రయోగాలు చేయడంతో పాటు ప్రధాని మోదీ, విద్యార్థులు, తన తల్లిదండ్రులతో సంభాషించారు. ⇒ జూలై 13న శుభాంశు బృందం తిరుగు ప్రయాణ సన్నాహాలు మొదలయ్యా యి. ఐఎస్ఎస్లోని సహచరులు వారికి సాదరంగా వీడ్కోలు పలికారు. ⇒ జూలై 14 సాయంత్రం డ్రాగన్ వ్యోమనౌకలో శుభాంశు బృందం తిరుగు పయనమైంది. ⇒ జూలై 15 మధ్యాహ్నం 3:01 గంటలకు కాలిఫోర్నియా తీర సమీపంలో సురక్షితంగా దిగింది. -
సమోసా, జిలేబీలపై వార్నింగ్ లేబుల్స్‌లో.. కేంద్రం ట్విస్ట్
సాక్షి,న్యూఢిల్లీ: ‘పొగతాగుట,మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం’ ఈ తరహా హెచ్చరికలు తినే ఆహార పదార్ధాలకు కేంద్రం వార్నింగ్ లేబుల్స్ తగిలించేలా దిశగా ప్రయత్నాలు చేస్తోందనే ప్రచారం జోరందుకుంది. అయితే, మంగళవారం ఆ ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఈ మేరకు పీబీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది. సమోసా,జిలేబీ,లడ్డూతో పాటు ఇతర ఆహార పదార్ధాలకు వార్నింగ్ లేబుల్స్‌ను అందుబాటులోకి తెచ్చేలా కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటి వరకూ ఆ తరహా నిర్ణయాలు తీసుకోలేదని తేల్చింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో ఆహా పదర్ధాలకు వార్నింగ్ లేబుల్స్‌ను జతచేయనుందనే జాతీయ మీడియా కథనాల్ని ట్వీట్లో జత చేసింది. Some media reports claim that the @MoHFW_INDIA has issued a health warning on food products such as samosas, jalebi, and laddoo.#PIBFactCheck✅This claim is #fake ✅The advisory of the Union Health Ministry does not carry any warning labels on food products sold by vendors,… pic.twitter.com/brZBGeAgzs— PIB Fact Check (@PIBFactCheck) July 15, 2025పలు మీడియా నివేదికలు ఎయిమ్స్ నాగ్‌పూర్ వంటి కేంద్ర సంస్థల్లో ఆహార పదార్ధాలపై వార్నింగ్ లేబుల్స్ ఏర్పాటు చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించిందని పేర్కొన్నాయి. కానీ పీఐబీ ప్రకారం, ఇది పనిచేసే ప్రాంతాల్లో ఉద్యోగులకు ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాల్ని ఎంపిక చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఇచ్చిన సాధారణ సూచన మాత్రమేనని తెలిపింది. ఈ సూచన ప్రత్యేకంగా భారతీయ స్ట్రీట్ ఫుడ్‌ను లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోలేదు. అందరికీ ఆరోగ్యంపై అవగాహన కలిగించేందుకు రూపొందించినట్లు పీబీఐ హైలెట్ చేసింది.దేశ జనాభాలో పెరిగిపోతున్న ఒబిసిటి,డయాబెటీస్,గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్త చర్యల భాగంగా ఈ సూచనను తీసుకొచ్చింది. ఈ అడ్వైజరీలో సమోసా, జిలేబీ, లడ్డూ వంటి స్నాక్స్‌పై వార్నింగ్ లేబుల్స్ పెట్టాలని ఎక్కడా చెప్పలేదు. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు వర్క్ ప్లేసుల్లో సూచనలు మాత్రమే స్పష్టం చేసింది. -
బెంగళూరులో దారుణం.. విద్యార్థినిపై లెక్చరర్లు అత్యాచారం
బెంగళరూరు: నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్థినిపై లెక్చరర్లు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన వెలుగుచూసింది. క్లాస్‌లో పాఠాలకు సంబంధించి ఓ విద్యార్థినికి టెక్ట్స్ మెసేజ్ చేసిన లెక్చరర్.. ఆపై సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఫ్రెండ్ రూమ్‌కు పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై మరొక లెక్చరర్, అతని ఫ్రెండ్ కలిసి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తాజాగా వెలుగు చూడటంతో బెంగళూరులో తీవ్ర కలకలం రేపుతోంది. కర్ణాటకలోని ఓ విద్యార్థినిని ఫిజిక్స్ బోధించే లెక్చరర్ నరేంద్ర పరిచయం చేసుకున్నాడు. చదువులో సాయంతో పరిచయాన్ని సాన్నిహిత్యంగా మార్చుకున్నాడు. ఇలా అనూప్ అనే స్నేహితుడి రూమ్‌కి తీసుకెళ్లాడు. అక్కడ అనూప్ కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డ వీడియోను చూపించి మరొక లెక్చరర్ సందీప్ విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని ఆ విద్యార్థినిని నిత్యం వేధింపులకు గురి చేస్తుండటంతో తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. వీరు కర్ణాటక మహిళా కమిషన్‌ను ఆశ్రయించడంతో విషయం బయటకొచ్చింది. దీంతో మారతహళ్లి పోలీస్ స్టేషన్లో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇద్దరు లెక్చరర్లు సహా స్నేహితుడు అనూప్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరపరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు.ఇదిలావుంచితే, ఒడిశాలో కూడా ఇదే తరహా దారుణం ఇటీవల చోటు చేసుకుంది. తనను లైంగికంగా వేధిస్తున్న లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని ఓ విద్యార్థిని కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసి ప్రాణాలు తీసుకుంది. ప్రిన్సిపాల్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బాలాసోర్ బీఈడీ సెకండియర్ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. ఒంటికి నిప్పంటించుకుని 90 శాతం కాలిన గాయాల పాలైన ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేసినప్పటికీ ప్రాణాలు కోల్పోయింది. ముందే చెబుతున్నా.. న్యాయం జరగకపోతే.. -
బెంగళూరు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం ఇదే..
మీరేప్పుడైనా బెంగళూరు వెళ్లారా? అబ్బో చాలాసార్లు వెళ్లాం.. చాలా చూశాం అంటారా? ఎన్నిసార్లు చూసినా మారనిది ఏంటని అక్కడికి వెళ్లొచ్చిన వారిని లేదా అక్కడే ఉంటున్న వారిని అడిగితే వచ్చే సమాధానం ఒకటే. అదే ట్రాఫిక్ సమస్య. దీని కారణంగా రోజులో ఎక్కువ సమయం రోడ్లపైనే గడపాల్సి వస్తుందని బెంగళూరు నగర వాసులు తరచుగా వాపోతుంటారు. ట్రాఫిక్ సమస్య కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను సోషల్ మీడియా వేదికగా ఏకరువు పెడుతుంటారు. ఒక్క బెంగళూరే కాదు దేశంలోని ప్రధాన మహా నగరాలన్ని ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్నాయి.సింగపూర్ మోడల్‌తో చెక్ఇండియా ఐటీ రాజధానిగా వెలుగొందున్న బెంగళూరు (Bengaluru) మహా నగరాన్ని చాలా కాలంగా ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. అయితే దీనికో పరిష్కారం ఉందంటున్నారు సాఫ్ట్వేర్ కంపెనీ 'జోహో కార్పొరేషన్' సీఈఓ శ్రీధర్ వెంబు. బెంగళూరులో ప్రతిపాదిత భారీ టన్నెల్ రోడ్డు ప్రాజెక్టు గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎక్స్‌లో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. సింగపూర్ అమలు చేస్తున్న ప్రజా రవాణా నమూనాతో భారత నగరాల్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించవచ్చని ఆయన అంటున్నారు. ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధించి, పబ్లిస్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని సూచిస్తున్నారు."ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో సింగపూర్ ఒకటి. అత్యంత నివాసయోగ్యమైన నగరంగానూ పేరొందిన సింగపూర్.. ప్రజా రవాణాపై ఎక్కువగా ఆధారపడుతోంది. ప్రైవేటు వాహనాలపై నియంత్రణను పక్కాగా అమలు చేస్తోంది. కొత్తగా కారు కొనుగోలు చేసే వారు కచ్చితంగా సర్టిఫికెట్ ఆఫ్ ఎన్టైటిల్మెంట్ (COE) కలిగివుండాలి. ఈ సర్టిఫికెట్ ధర లక్ష సింగపూర్ డాలర్ల కంటే ఎక్కువ. ఇది కారు ధర కంటే అధికం. భారతీయ నగరాలు సింగపూర్ కంటే చాలా ఎక్కువ జనసాంద్రత కలిగి ఉన్నాయి. మన నగరాలను నివాసయోగ్యంగా మార్చడానికి విస్తృతమైన ప్రజా రవాణాను నిర్మించాలి. అది సాధ్యమే" అని ఎక్స్‌లో శ్రీధర్ వెంబు ((Sridhar Vembu) పోస్ట్ చేశారు. అయితే బెంగళూరులో ప్రతిపాదిత భారీ టన్నెల్ రోడ్డు ప్రాజెక్టు గురించి ఆయన నేరుగా ప్రస్తావించలేదు. కానీ బెంగళూరు లాంటి అత్యధిక జనసంద్రత కలిగిన నగరాల్లో బలమైన, సమ్మిళిత ప్రజా రవాణా అవసరాన్ని నొక్కి చెప్పారు.స్పందించిన ఎంపీ తేజస్వి సూర్య శ్రీధర్ అభిప్రాయంతో బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య (Tejasvi Surya) ఏకీభవించారు. రూ. 18,500 కోట్ల వ్యయంతో బెంగళూరులో ప్రతిపాదిత టన్నల్ రోడ్డు నిర్మాణాన్ని ఆయన వ్యతిరేకించారు. ఈ భారీ ప్రాజెక్ట్ వల్ల సామాన్యులకు ఒరిగేదేం లేదని, ప్రైవేట్ కార్లు కలిగి ఉన్న టాప్ 10% నివాసితులకు మాత్రమే ప్రయోజనం ఉంటుందని విమర్శించారు. దీనికి బదులుగా బెంగళూరు మెట్రోపాలిటిన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ), మెట్రో రైళ్ల విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీ సూర్య సూచించారు. 'బెంగళూరులో 2031 నాటికి 16,580 BMTC బస్సులు అవసరం. కానీ మన దగ్గర కేవలం 6,800 మాత్రమే ఉన్నాయి. 2031 నాటికి 317 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైళ్లు నడవాలి. ప్రస్తుతం 78 కి.మీ. వరకే మెట్రో సేవలు పరిమితమయ్యాయ'ని తెలిపారు. 20కి పైగా నిలిచిపోయిన ఫ్లైఓవర్లతో పాటు నగరంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు.చదవండి: కోటి ఖర్చు పెడతా... ట్రాఫిక్ సమస్యను తీర్చేద్దాం!నెటిజన్ల రియాక్షన్ప్రభుత్వ రవాణా వ్యవస్థను మెరుగుపరిస్తే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని శ్రీధర్ వెంబు వెలిబుచ్చిన అభిప్రాయంపై ఎక్స్‌లో నెటిజనులు స్పందించారు. ప్రజా రవాణా వ్యవస్థను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే.. ప్రజలు సహజంగానే ప్రైవేట్ వాహనాలకు దూరంగా ఉంటారని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. మౌలిక సదుపాయాలంటే విశాలమైన రోడ్లు, ఫ్లైఓవర్ల మాత్రమే కాదని.. సంపన్నుల నుంచి సామాన్యూల వరకు ప్రయాణించేలా ప్రపంచ స్థాయి ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తేవాలని మరొకరు సూచించారు. నివాస ప్రాంతాల నుంచి వాణిజ్య సముదాయాలకు ప్రజా రవాణాను అనుసంధానిస్తూ నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మరో నెటిజన్ అన్నారు. బెంగళూరు వంటి మహా నగరాల్లో కొత్తగా మౌలిక సదుపాయాలను కల్పించడం సులభమా, లేదా ఉన్న మౌలిక సదుపాయాలను మెరుగైనదిగా అప్‌గ్రేడ్ (Upgrade) చేయడం సులభమా? అన్నది.. చూడాలని మరొకరు సూచించారు. I want to add that Singapore, one of the most advanced economies in the world and one of the most livable cities, relies extensively on public transport. Singapore also limits the number of private cars through the mechanism of open market trading of Certificate of Entitlement… https://t.co/ob7WjOiybJ— Sridhar Vembu (@svembu) July 15, 2025 -
రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు
ఢిల్లీ: భారత్ జోడోయాత్రలో నమోదైన కేసులో భాగంగా ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది. భారత్ జోడోయాత్రలో ఇండియన్ ఆర్మీని కించపరిచే విధంగా రాహుల్ వ్యాఖ్యలు చేశారనే పరువు నష్టం కేసులో ఆయనక లక్నో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిలోభాగంగా రూ. 20 వేల పూచీకత్తు, రెండు బాండ్లు సమర్పించారు రాహుల్ గాంధీ న్యాయవాదులు. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది కోర్టు.2022, డిసెంబర్ 16వ తేదీన భారత్ జోడో యాత్రలో భాగంగా భారత్ ఆర్మీ సైనికుల్ని రాహుల్ కించ పరిచారంటూ పరువు నష్టం కేసు దాఖలైంది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మాజీ డైరెక్టర్ ఉదయ్ శంక్ శ్రీవాస్తవ తరఫను వివేక్ తివారీ అనే న్యాయవాది రాహల్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఇండియన్ ఆర్మీని రాహల్ కించపరిచారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో భారత సైనికులను చైనా ఆర్మీ కొడుతున్నా భారత్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాహుల్ జోడోయాత్రలో ప్రశ్నించారు. ఎల్వోసీ వెంబడి చైనా చర్యలకు భారత్ ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని నిలదీశారు. ఈ వ్యాఖ్యలపైనే రాహుల్‌పై కేసు నమోదైంది. భారత్ ఆర్మీని కించపరిచారంటూ పరువు నష్టం కేసు దాఖలైంది. అదే సమయంలో దేశంలోని పలు చోట్ల రాహుల్ గాంధీపై ప్రత్యర్థి పార్టీలు రాజకీయ పిటిషన్లు దాఖలు చేశాయి. మరొకవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీకి ఈ జనవరిలో ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు స్టే విధించింది. 2019లో లోక్‌సభ ఎన్నికల సమయంలో జార్ఖండ్‌లోని చైబాసా పట్టణంలో బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన హంతకుడు అని మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకుడు నవీన్ ఝా 2019లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నిమిష కేసు: భారతీయల పాలిట లైఫ్‌లైన్.. బ్లడ్‌మనీ!
కేరళ నర్సు నిమిషా ప్రియను రక్షించేందుకు చివరి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇండియా గ్రాండ్ ముఫ్తీ.. కేరళ ముస్లిం మతపెద్ద కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్ చొరవతో మరణశిక్ష అయితే వాయిదా పడింది. క్షమాభిక్ష కోసం యెమెన్‌లో ఇంకా రాయబారం నడుస్తోంది. బాధిత కుటుంబం గనుక బ్లడ్‌మనీకి అంగీకరించి క్షమాభిక్ష ప్రసాదిస్తేనే నిమిష మరణశిక్ష తప్పుతుంది. ఈ క్రమంలో బ్లడ్‌మనీ(క్షమాధనం) తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2008లో తన కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిన నిమిష.. కొన్నాళ్లకు సొంతంగా క్లినిక్ ఓపెన్ చేసింది. అయితే 2017లో తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహ్దీతో ఆమెకు పొరపచ్చాలు వచ్చాయి. తన పాస్‌పోర్టును దగ్గర ఉంచుకుని తనను వేధిస్తున్నాడంటూ నిమిష ఆరోపణలకు దిగింది. ఈ క్రమంలో మత్తుమందు ఇవ్వడంతో తలాల్ మరణించాడు. ఈ కేసులో నిమిషా ప్రియాకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం.. యెమెన్‌లోని సనా సెంట్రల్ జైలులో బుధవారం మధ్యాహ్నాం 12 గంటల ప్రాంతంలో నిమిషా ప్రియకు శిక్ష అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈలోపు చర్చలకు తొలిసారి తలాల్ కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో శిక్ష వాయిదా పడింది. మరి బ్లడ్‌మనీకి ఆ కుటుంబం అంగీకరిస్తుందా?.. అసలు బ్లడ్ మనీతో మరణశిక్ష నుంచి ఇంతకు ముందు ఎవరైనా బయటపడ్డారా?. వర్కవుట్ కాని సందర్భాలు ఏమైనా ఉన్నాయా?క్షమాధనం అంటే.. హత్య లేదంటే తీవ్రమైన నేరాల్లో ఇచ్చే పరిహారం. హత్యకు గురైన కుటుంబానికి నేరస్తుడు లేదంటే అతని కుటుంబానికి దక్కే సొమ్ము ఇది. ఇది ఎంత ఉండాలి?. ఎంత స్వీకరించాలి? అనేది ఈ రెండవైపులా కుదిరే ఒప్పందాన్ని బట్టి ఉంటుంది. బాధిత కుటుంబం గనుక అంగీకరించకుంటే శిక్ష అమలు అవుతుంది. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం. ఇందులో ప్రభుత్వాల జోక్యం ఉండదు. నిమిష కేసులో ఇదే విషయాన్ని కేంద్రం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది.నిమిష కేసులో తలాల్ అబ్దో మహ్దీ కుటుంబానికి $1 మిలియన్ రక్తపరిహారం(మన కరెన్సీలో 8 కోట్లకు పైనే) ప్రతిపాదించింది నిమిష తల్లి ప్రేమ కుమారి. అయితే బ్లడ్‌మనీ తమ గౌరవానికి భంగం కలిగించే అంశమంటూ గతంలో వాళ్లు తిరస్కరించారు. యెమెన్ అనేది హౌతీ నియంత్రణలో ఉన్న దేశం. ఈ కారణంగానే భారత ప్రభుత్వ జోక్యం కష్టంగా మారింది. క్షమాభిక్ష కోసం మత పెద్దలు, Save Nimisha Priya Action Council ప్రయత్నాలు మమ్మరంగా కొనసాగుతున్నాయి. రూ.8.6 కోట్లు తీసుకునేందుకు యెమెన్‌లోని బాధిత కుటుంబాన్ని ఒప్పిస్తే నిమిష ప్రియకు ఊరట దక్కనుంది.వీరంతా ‘బ్లడ్ మనీ’తో బయటపడినవారే..!నేరం రుజువైన తర్వాత కూడా దోషిని బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష తప్పుతుంది. ఆ కుటుంబం బ్లడ్‌మనీకి అంగీకరిస్తే అది సాధ్యమవుతుంది. షరియా చట్టాల ప్రకారం.. ప్రస్తుతం ఈ విధానం యెమెన్, సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్థాన్ వంటి ఇస్లామిక్ దేశాల్లో అమల్లో ఉంది. 👉2008లో.. సహోద్యోగిని చంపిన కేసులో జస్బీర్ సింగ్ సౌదీ అరేబియా జైలు నుంచి రూ.30 లక్షల బ్లడ్‌మనీ చెల్లించడంతో శిక్ష నుంచి తప్పించుకున్నారు. 2005లోశ్రీలంక పౌరుడ్ని చంపిన కేసులో సులేమాన్‌తో పాటు మరో ఎనిమిది మందికి సౌదీ అరేబియాలోనే మరణశిక్ష పడింది. అయితే రూ. 40 లక్షల బ్లన్మనీతో వీళ్లంతా క్షేమంగా బయటపడ్డారు👉2012లో.. షార్జాలో పాకిస్తానీని మూకహత్య చేసిన కేసులో 17 మంది భారతీయులకు మరణశిక్ష పడింది. బ్లడ్‌మనీ కింద రూ.16 కోట్లు సేకరించి బాధిత కుటుంబానికి ఇచ్చారు. ఇందులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ సాయం కూడా ఉంది. 👉2013లో.. కర్ణాటకకు చెందిన ట్రక్కు డ్రైవర్ సలీమ్ భాషాకు 2006లో సౌదీ అరేబియాలో మరణశిక్ష పడింది. రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణానికి కారణమైనందుకు గానూ ఈ శిక్ష విధించారు. అయితే ఈ కేసులో అప్పటి సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా ముందుకొచ్చి సాయం చేశారు. స్వయంగా ఆయనే దాదాపు రూ.1.5 కోట్ల బ్లడ్‌మనీ బాధిత కుటుంబాలకు చెల్లించడంతో సలీమ్ శిక్ష నుంచి బయటపడ్డాడు.👉2014లో.. సౌదీలో కారుతో ఓ చిన్నారిని ఢీ కొట్టిన కేసులో రవీంద్ర ప్రసాద్ అనే వ్యక్తికి మరణశిక్ష పడింది. అయితే భారత దౌత్య కార్యాలయం సహకారంతో బ్లడ్‌మనీ చెల్లించి ఆయన శిక్ష నుంచి తప్పించుకున్నారు.👉2014లో బ్లడ్‌మనీ ఆధారంగానే ముగ్గురు భారతీయులను విడుదల చేసింది సౌదీ. మృతుడి కుటుంబానికి రూ.1.12 కోట్లు చెల్లించడంతో శిక్ష నుంచి తప్పించుకున్నారు.👉బంగ్లాదేశీ కార్మికుడి హత్య కేసులో కేరళకు చెందిన ఏఎస్ శంకరనారాయణకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మరణశిక్ష పడింది. ఈ కేసులో ‘బ్లడ్ మనీ’ కింద 2 లక్షల దిర్హామ్‌లు (భారత కరెన్సీలో ప్రస్తుతం దాదాపు రూ.47లక్షలు) చెల్లిస్తే క్షమిస్తామని బాధిత కుటుంబం తెలిపింది. దాతల సాయంతో ఆ మొత్తాన్ని చెల్లించడంతో ఎనిమిదేళ్ల తర్వాత 2017లో శంకరనారాయణ యూఏఈ జైలు నుంచి విడుదలయ్యాడు.👉2017లోనే.. ఓ పాక్ పౌరుడ్ని హత్య చేసిన కేసులో 10 మంది పంజాబ్ పౌరులకు సౌదీ అరేబియాలో మరణశిక్ష పడింది. అయితే బాధిత కుటుంబానికి ₹24 లక్షల (200,000 దిర్హామ్స్) బ్లడ్‌మనీ చెల్లించడంతో క్షమాభిక్ష లభించింది. ఆపై వారు భారత్‌కు తిరిగొచ్చారు. భారత రాయబార కార్యాలయం, పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధులు, సామాజిక సంస్థలు కలిసి బ్లడ్‌మనీ సేకరణ చేపట్టారు.👉2017లో తెలంగాణకు చెందిన లింబాద్రి కూడా సౌదీ అరేబియాలో బ్లడ్ మనీతోనే మరణశిక్షను తప్పించుకున్నాడు. ఆ కేసులో సౌదీకి చెందిన ఓ దాత.. లింబాద్రి తరఫున రూ.1.8 కోట్లు బాధిత కుటుంబానికి పరిహారంగా ఇచ్చారు. దీంతో ఆయన శిక్ష నుంచి బయటపడి స్వదేశానికి తిరిగొచ్చారు.👉2024లో.. అబ్దుల్ రహీమ్ కేసు విస్తృతంగా చర్చనీయాంశమైంది. కేరళ కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ సౌదీ అరేబియాకు హౌజ్ డ్రైవర్‌గా వెళ్లారు. అక్కడ తన యజమాని ఇంట దివ్యాంగుడైన అనాస్ అల్ షహ్రీ బాధ్యతలు కూడా చూసుకునేవాడు. ఈ క్రమంలో.. ఓ రోజు ప్రమాదవశాత్తూ మరణించాడు. 2018లో సౌదీ కోర్టు హత్య ఆరోపణలపై రహీమ్‌కు మరణశిక్ష విధించింది. 2022లో అక్కడి సుప్రీం కోర్టు కూడా శిక్షను సమర్థించింది. ఈ క్రమంలో బ్లడ్‌మనీ తెర మీదకు వచ్చింది. బాధిత కుటుంబం ₹34 కోట్లు (15 మిలియన్ సౌదీ రియాల్స్) బ్లడ్‌మనీ తీసుకుంటే క్షమించేందుకు సిద్ధమని తెలిపింది. ఆరు నెలల్లో మొత్తం చెల్లించేలా 2023 అక్టోబర్ 16న ఒప్పందం కుదిరింది. SAVEABDULRAHIM' యాప్ ద్వారా క్రౌడ్‌ఫండింగ్ ద్వారా మొత్తం సేకరించారు. అలా.. 2024 జూలై 2న రియాద్ క్రిమినల్ కోర్టు ఆదేశాలతో శిక్ష రద్దు అయ్యింది. బ్లడ్‌మనీ చెక్కును బాధిత కుటుంబానికి అప్పగించారు. అయితే.. ఈ ఏడాదిలోనే రహీమ్ విడుదల కావాల్సి ఉంది. ఈ ఘటన.. మానవత్వం, భారతీయుల ఐక్యత, న్యాయం కోసం పోరాటం చూపిన ఉదాహరణగా నిలిచింది.👉2019లో.. అర్జునన్ అతిముత్తు, తమిళనాడులోని తంజావూరు జిల్లా, అతివెట్టి గ్రామంకు చెందిన వ్యక్తి. ఆయన 2013లో కువైట్‌లో తన రూమ్మేట్ అబ్దుల్ వాజిద్ (మలప్పురం, కేరళ)ను హత్య చేసిన కేసులో మరణశిక్షకు గురయ్యారు. 2016లో శిక్ష ఖరారు అయ్యింది. అయితే బ్లడ్‌మనీ ఒప్పందం కింద.. బాధిత కుటుంబం ₹30 లక్షలు తీసుకుని క్షమాభిక్ష ఇచ్చేందుకు అంగీకరించింది. ఆపై కువైట్ ప్రభుత్వం మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. అప్పటి కోటక్కల్ MLA అబిద్ హుస్సేన్, యూత్ లీగ్ నేతలు కలిసి క్రౌడ్‌ఫండింగ్ ద్వారా మొత్తం సేకరించారు.కాగా.. ఈ బ్లడ్ మనీతో భారతీయులకు కూడా పరిహారం దక్కిన సందర్భం ఉంది. 2019 దుబాయ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో భారత్‌కు చెందిన మహ్మద్ మీర్జా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్.. బ్లడ్ మనీ కింద మీర్జా కుటుంబానికి 5 మిలియన్ల దిర్హామ్‌లు (భారత కరెన్సీలో అప్పటికి దాదాపు రూ.11కోట్లు) చెల్లించాడు.బ్లడ్‌మనీ తప్పించలేకపోయింది!సౌదీ పౌరుడ్ని హత్య చేసిన కేఏసులో ధరమ్‌పాల్ సింగ్(2020)ను రక్షించేందుకు భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బ్లడ్‌మనీని బాధిత కుటంబం తిరస్కరించడంతో మరణశిక్ష అమలు చేశారు.తన యాజమానిని హత్య చేసిన కేసులో కే మాధవన్‌కు సౌదీలో మరణశిక్ష పడింది. అయితే కుటంబం బ్లడ్‌మనీని సేకరించడంలో విఫలమైంది. దీంతో 2004లో మరణశిక్ష అమలు చేశారు.సహోద్యోగిని హత్య చేసిన కేసులో.. షంసుద్దీన్కి మరణశిక్ష పడింది. అయితే బ్లడ్‌మనీని బాధిత కుటుంబం తిరస్కరించడంతో ఉరిశిక్ష అమలైంది.పెండింగ్‌లో..ఓ దాడి కేసులో యూఏఈలో యూనస్ అనే భారతీయడికి మరణశిక్షపడింది. ఫ్యామిలీ బ్లడ్‌మనీ సేకరించడంలో ఇబ్బంది పడుతోంది. అయితే శిక్ష ఇంకా అమలు కాలేదు.నిమిష ప్రియ కేసులో.. గతేడాది నిమిష తల్లి ప్రేమకుమారి యెమెన్ వెళ్లారు. తనకున్న పరిచయాల ఆధారంగా బ్లడ్‌మనీ ఇచ్చి, తన కుమార్తెను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రియ కుటుంబం ఒక మిలియన్ డాలర్ల (రూ.8.6 కోట్లు)ను బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ, ఇందుకు అవతలి వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడు చర్చల వేళ.. శిక్ష తప్పుతుందో..? లేదో అనే ఉత్కంఠ నెలకొంది. -
Shubhanshu Shukla: భూమిపైకి శుభాంశు శుక్లా
వాషింగ్టన్: అంతరిక్షంలో భారత కీర్తిపతాకను సమున్నతంగా ఎగరేసిన మన ముద్దుబిడ్డ శుభాంశు శుక్లా నింగి నుంచి సగర్వంగా నేలకు తిరిగొచ్చాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టిన తొలి భారతీయునిగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్న శుభాంశు.. మరో ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి సురక్షితంగా భూపైకి చేరుకున్నారుయాక్సియం-4 మిషన్ లో భాగంగా... అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములు భూమిపైకి చేరుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 2.50 నిమిషాలకు కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర జలాల్లో ల్యాండింగ్ అయ్యారు. డ్రాగన్ స్పేస్ క్యాప్స్‌లో భూమి మీదకు చేరుకున్నారు. వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించేందుకు స్పేస్ ఎక్స్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఎస్ఎస్ నుంచి ఘనంగా వీడ్కోలు ఐఎస్ఎస్లోని ఏడుగురు సహచర వ్యోమగాములు శుభాంశు బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆ సందర్భంగా పరస్పర కౌగిలింతలు, కరచాలనాలు ముగిసిన అనంతరం వాతావరణం ఉద్వేగపూరితంగా మారింది. 18 రోజుల పాటు కలిసి గడిపిన క్షణాలను అందరూ ఆనందంగా నెమరేసుకున్నారు. ముఖ్యంగా శుభాంశు రుచి చూపిన క్యారెట్, పెసరపప్పు హల్వాను ఎన్నటికీ మర్చిపోలేమని సహచరులు చెప్పుకొచ్చారు. జూన్ 25న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ప్రారంభంశుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర జూన్ 25, 2025న ప్రారంభమైంది. అమెరికాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా శుక్లా బృందం అంతరిక్షంలోకి వెళ్లింది. 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి ప్రవేశించారు. అక్కడ పైలట్ శుక్లా నేతృత్వంలోని గ్రూప్ మొత్తం 60 రకాల శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించింది. ఇందులో శుక్లా ఒక్కరే స్వయంగా 7 ప్రయోగాలు నిర్వహించారు. ఫ్లోటింగ్ వాటర్ బబుల్ ఐఎస్ఎస్లో 60కి పైగా ప్రయోగాలు శుభాంశు బృందం ఐఎస్ఎస్లో 18 రోజులు గడిపింది. ఆ క్రమంలో 60 కీలక ప్రయోగాలు చేపట్టింది. అంతరిక్షంలో జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై శుక్లా అధ్యయనం చేశారు. మానవ జీర్ణవ్యవస్థ ఖగోళంలో ఎలా పని చేస్తుందనే అంశంపై భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక వీడియోను ఆయన రూపొందించారు. దాంతోపాటు నలుగురు వ్యోమగాముల బృందం తమ మానసిక స్థితిగతులపైనా ప్రయోగాలు చేసి చూసింది. ఆ క్రమంలో ఫ్లోటింగ్ వాటర్ బబుల్ తయారు చేసి అందులో గడిపింది. అది అద్భుతమైన అనుభవమని శుభాంశు గుర్తు చేసుకున్నారు. ‘‘ఐఎస్ఎస్లో ప్రతి క్షణాన్నీ పూర్తిగా ఆస్వాదించా. ముఖ్యంగా కిటికీ పక్కన కూచుని కిందకు చూడటాన్ని. బహుశా నా జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన అనుభూతి అది’’ అని చెప్పారు. అంతరిక్షంలో వ్యవసాయం దిశగా కూడా వ్యోమగాములు పలు కీలక పరీక్షలు జరిపారు.76 లక్షల మైళ్లు..288 భూ ప్రదక్షిణలు శుభాంశు బృందం ఐఎస్ఎస్లో గడిపిన 18 రోజుల్లో భూమి చుట్టూ ఏకంగా 76 లక్షల మైళ్లకు పైగా ప్రయాణించింది. ఆ క్రమంలో 288 సార్లు భూప్రదక్షిణలు చేసింది. నవభారత శకమిది శుభాంశు భావోద్వేగం భూమికి తిరుగు ప్రయాణమయ్యే ముందు శుభాంశు ఐఎస్ఎస్లో వీడ్కోలు ప్రసంగం చేశారు. 41 ఏళ్ల ముందు రాకేశ్ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలో కాలు పెట్టిన క్షణాలను, అక్కడినుంచి భారత్ కనిపించిన తీరును వర్ణించిన వైనాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘మా తిరుగు ప్రయాణం సందర్భంగా ఈ రోజు ఆకాశం నుంచి భారత్ ఎలా కనిపిస్తుందో చూడాలని మా బృందమంతా ఉత్సాహపడుతోంది. నేటి భారత్ ఘనమైన ఆకాంక్షల భారత్. నిర్భయ భారత్. సగర్వంగా తలెత్తుకుని సాగుతున్న భారత్. అందుకే నేడు కూడా నా దేశం మిగతా ప్రపంచమంతటి కంటే మిన్నగా (సారే జహా సే అచ్ఛా) కనిపిస్తోందని చెప్పగలను’’ అంటూ నాడు రాకేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలను శుభాంశు పునరుద్ఘాటించారు. అక్కడి సహచరులపై శుభాంశు ఈ సందర్భంగా ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘ఈ యాత్ర ఇంత అద్భుతంగా సాగుతుందని జూన్ 25న ఫాల్కన్–9 రాకెట్ ద్వారా అంతరిక్షానికి పయనమయ్యే క్షణాల్లో నేనస్సలు ఊహించలేదు! ఇదంతా ఇదుగో, ఇక్కడ నా వెనక నుంచున్న ఈ అద్భుతమైన వ్యక్తుల వల్లే సాధ్యమైంది. ఈ యాత్రను మా నలుగురికీ అత్యంత ప్రత్యేకమైనదిగా మార్చింది వీళ్లే. అంకితభావంతో కూడిన ఇలాంటి అద్భుతమైన వృత్తి నిపుణులతో కలిసి పని చేయడం నిజంగా మరచి పోలేని అనుభూతి’’ అంటూ హర్షం వెలిబుచ్చారు. -
“నేను నిన్ను విడిచి ఉండలేను.. నేను నీ దగ్గరకు వస్తున్నాను’
ధర్మపురి సమీపంలో తన భర్త మరణ బాధను తట్టుకోలేక ఓ మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ధర్మపురి జిల్లాలోని కడ్తూర్ సమీపంలోని తలనాథం గ్రామానికి చెందిన తీతు కుమారుడు దీపమలై (26) ఇంజనీర్. పుట్టిరెట్టిపట్టికి చెందిన గీత (21) ల్యాబ్ టెక్నీషియన్. వీరిద్దరూ వేర్వేరు వర్గాలకు చెందినవారు. వారు పాఠశాల రోజుల నుంచి స్నేహితులు, చివరికి ప్రేమలో పడ్డారు. వారి ప్రేమ వ్యవహారం వారి ఇద్దరి తల్లిదండ్రుల దృష్టికి వచ్చింది. వ్యతిరేకత కారణంగా, వారు ఒక సంవత్సరం క్రితం వారి ఇళ్ల నుంచి బయటకు వెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం తర్వాత కొన్ని నెలలుగా దీపమలై అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందినప్పటికీ అతని ఆరోగ్యం మెరుగుపడలేదు. తాను చనిపోతానని భావించి, తన ప్రేమ భార్య నుంచి విడిపోయి, ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి జీవించమని చెప్పాడు. దీని కారణంగా గీత రెండు నెలల క్రితం తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఇంతలో ఆరోగ్యం క్షీణించిన దీపమలై గత 29వ తేదీన మరణించాడు. తన భర్త మరణం తర్వాత గీత మానసిక వేదనకు గురైంది. ఈ పరిస్థితిలో గీత ఇన్ స్ట్రాగామ్‌లో “నేను నిన్ను విడిచి ఉండలేను. నేను నీ దగ్గరకు వస్తున్నాను’ అంటూ ఓ పోస్ట్ చేసి, ఇంట్లోని ఎలుకల మందు తాగి మరణించింది. కడత్తూర్ పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.దీని తరువాత, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు దీపమలై మృతదేహాన్ని ఖననం చేసిన ప్రదేశానికి సమీపంలోనే అతని గీత మృతదేహాన్ని కూడా ఖననం చేశారు. -
నవవధువు చికెన్ తినలేదనే మనస్తాపంతో..
తమిళనాడు: వెల్లకోవిల్ సమీపంలో భార్య చికెన్ తినడానికి నిరాకరించిందని నవవరుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. వివరాలు.. తంజావూరు జిల్లాలోని కుంభకోణం తాలూకాలోని సక్కోట్టై ప్రాంతానికి చెందిన మణికంఠన్ (29 ). ఇతను ఫర్నిచర్ దుకాణంలో పనిచేసేటప్పుడు, అతనితో కలిసి పనిచేసే సుబలక్ష్మి (25)తో ప్రేమలో పడ్డాడు. నెల రోజుల క్రితం తల్లిదండ్రులను ధిక్కరించి, వారిద్దరూ చెన్నైలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. రెండు కుటుంబాలు ఈ వివాహాన్ని వ్యతిరేకించడంతో, వారు తిరుప్పూర్ జిల్లా వెల్ల కోవిల్ పుత్తూరులోని సుబలక్ష్మి సోదరి మేనక ఇంట్లో నివసించారు. ఈ స్థితిలో, మేనక, ఆమె భర్త ఆలయ ప్రత్యేక కార్యక్రమానికి తిరుచ్చికి వెళ్లారు. ఆదివారం ఇంట్లో ఉన్న మణికంఠన్ దుకాణం నుంచి చికెన్ కొని తన భార్యను తినమని అడిగాడు. తన సోదరి గుడికి వెళ్లినందున ఇంట్లో చికెన్ తినడానికి ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. దీనితో ఆగ్రహించిన మణికంఠన్ తన ఇంటి బయట ఉన్న ఇనుప కడ్డీకి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు అతన్ని రక్షించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు మణికంఠన్ మృతి చెందినట్లు ప్రకటించాడు. -
భర్తను కడతేర్చి.. ఇంటి ఆవరణలో గొయ్యి తవ్వి..
గౌహతి: దేశంలో ఇటీవలి కాలంలో భర్తలను అంతమొందిస్తున్న భార్యలకు సంబంధించిన ఉదంతాలు విరివిగా వినిపిస్తున్నాయి. తాజాగా అసోంలోని గౌహతిలో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. దంపతుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ చివరకు భర్త హత్యకు దారితీసింది.గౌహతి పోలీసులు భర్తను హత్యచేసిన భార్యను అదుపులోకి తీసుకున్న దరిమిలా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. నిందితురాలు రహిమా ఖాతున్(38), ఆమె భర్త సబియాల్ రెహమాన్ (40)తో తరచూ గొడవ పడేదని పోలీసులు తెలిపారు. సబియాల్ రెహమాన్ స్క్రాప్ డీలర్‌గా పనిచేస్తున్నాడు. జూన్ 26న అతను తన పని ముగించుకుని, పాండు ప్రాంతంలో ఉన్న తన ఇంటికి తిరిగి వచ్చాడు.పోలీసులు ప్రాథమిక దర్యాప్తులోని వివరాల ప్రకారం.. ఆ సమయంలో తన భర్త మద్యం మత్తులో ఉన్నాడని, ఆ సమయంలో తలెత్తిన ఇంటి గొడవ దాడులకు దిగేవరకూ కొనసాగిందని రహీమా చెప్పింది. ఈ నేపధ్యంలోనే భర్త హతమయ్యాడని పేర్కొంది. కాగా భర్త మృతదేహాన్ని ఆమె ఇంటి ఆవరణలో ఐదు అడుగుల లోతున గొయ్యి తవ్వి, దానిలో పూడ్చిపెట్టిందని సమాచారం. ఆ జంటకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా రెహమాన్ కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో పొరుగింటివారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసుల విచారణలో నిందితురాలు తొలుత తన భర్త పని కోసం కేరళకు వెళ్లాడని తెలిపింది. తరువాత మాటమార్చి, అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నాడని తెలిపింది. రెహమాన్ సోదరుడు జూలై 12న జలుక్బరి పోలీస్ స్టేషన్లో ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. మర్నాడు పోలీసులు రహిమా ఖాతున్ను విచారించగా తమ దంపతుల గొడవల్లో భర్త మరణించాడని చెప్పింది. ఆ తర్వాత తాను భర్త మృతదేహాన్ని ఇంటి ఆవరణలో పాతిపెట్టానని పోలీసులకు చెప్పింది.ఫోరెన్సిక్ నిపుణులు, మేజిస్ట్రేట్‌తో కూడిన పోలీసు బృందం వారి ఇంటి ఆవరణలోని గొయ్యిలో నుంచి కుళ్లిపోయిన మృతదేహ అవశేషాలను వెలికి తీసింది. రహీమా ఒక్కర్తే ఈ హత్య చేసి ఉండకపోవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఒక మహిళ స్వయంగా ఇంత పెద్ద గొయ్యిని తవ్వే అవకాశం లేదని, ఇతరుల ప్రమేయం ఉండవచ్చని, ఈ దిశగా దర్యాప్తు జరుగుతున్నదని పోలీసులు తెలిపారు. -
చిత్రం చెప్పేకథ : రైతే కాడెద్దు, బెంబేలెత్తించిన పైపు నీరు
బెంబేలెత్తించిన పైపు నీరు: స్థానిక జయదేవ భవన్ పరిసరాల్లో నీటి పైపు చిట్లడంతో భయానక పరిస్థితి చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం ఈ పరిస్థితి నెలకొంది. నగర వ్యాప్తంగా తాగు నీరు సరఫరా చేసే ప్రధాన అనుసంధాన పైపు కావడంతో నీటి ఒత్తిడి అత్యధికంగా ఉంటుంది. ఈ పైపు చిల్లుబడి సుమారు 50 అడుగుల ఎత్తుకు నీరు చిమ్మడంతో చేరువలో 30 అడుగుల ఎత్తున 30 కేవీ విద్యుత్ సరఫరా అనుసంధాన వ్యవస్థని అధిగమించి నీరు నింగికి ఎగసింది. – భువనేశ్వర్ చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్లుకాడెద్దులు లేకున్నా.. ఉన్న పొలం పోయింది. కాడెద్దులు దూరమయ్యాయి. అప్పులు బతుకు మీదకు వచ్చాయి. కానీ ఆయనకు తెలిసింది ఒక్కటే. వ్యవసాయం. భూమి ఉన్నా లేకపోయినా, కాడెద్దుల సాయం ఉన్నా లేకున్నా.. ఆయన చేయగలిగింది ఒక్కటే వ్యవసాయం. జయపూర్ పట్టణ సమీపంలో బంకబిజ గ్రామ వద్ద రోడ్డు పక్కన పొలంలో ఎద్దుల సాయం లేకుండా దుక్కి దున్నుతున్న ఇతని పేరు రామ పరిజ. సాగు తప్ప ఇంకేమీ తెలియని ఈ మనిషి సొంత పొలం పోయాక కొంత పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. ట్రాక్టర్ అద్దె కట్టలేక ఇలా దున్నే బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. – కొరాపుట్ ఇదీ చదవండి: Tipeshwar అటు పులి, ఇటు చిరుత...చూడాలంటే అదృష్టం ఉండాలి! -
వారి ఆదేశాలతోనే ఉగ్రదాడి.. ‘పహల్గామ్’పై సంచలన నివేదిక
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి పాకిస్తాన్‌కు చెందిన రాజకీయ నేతలు, సైనిక అధికారుల ఆదేశాల మేరకే జరిగిందని, ఇది పాక్ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ)చేసిన కుట్ర అని భద్రతా వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ ఉగ్రదాడి అనంతరం మే 7న పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత్ ‘ఆపరేషన్ సింధూర్’పేరుతో ప్రతీకార దాడులు చేపట్టింది.పహల్గామ్ దాడికి విదేశీ ఉగ్రవాదులను మాత్రమే మోహరించాలని, పూర్తి గోప్యతను పాటించాలని, కశ్మీరీ ఉగ్రవాదులను తీసుకోవద్దని ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ .. లష్కర్ కమాండర్ సాజిద్ జట్‌కు నిర్దిష్ట ఆదేశాలు ఇచ్చిందని భద్రతా వర్గాలు తెలిపాయి. కొంతకాలంగా జమ్ముకశ్మీర్ ఉంటున్న విదేశీ ఉగ్రవాదుల ప్రమేయంతో ఈ దాడులకు పాల్పడాలని కూడా వారు సూచించారని సమాచారం. స్థానిక ఉగ్రవాదులు ఈ ఘటనలో పాల్గొనలేదని ఒక సీనియర్ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు.నిషేధిత లష్కరే తోయిబా సంస్థకు ప్రాక్సీ గ్రూప్ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ పహల్గామ్ దాడికి బాధ్యత వహించింది. దాడి చేసిన ఇద్దరూ పాకిస్తాన్ జాతీయులుగా భద్రతా దళాలు గుర్తించాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలతో ఇద్దరు స్థానికులను అరెస్ట్ చేశారు. మే 7న ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్ ఈ ఉగ్ర దాడికి ప్రతిస్పందించింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై బాంబు దాడులు చేసి, వందమంది ఉగ్రవాదులను అంతమొందించింది. -
ముందే చెబుతున్నా, న్యాయం జరగకపోతే..!
హృదయవిదారకమైన ఒడిషా బాలాసోర్ బీఈడీ సెకండియర్ స్టూడెంట్ సూసైడ్ కేసులో షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. హెచ్‌వోడీ లైంగిక వేధింపుల పర్వాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ఈ క్రమంలో ఆమె ఫిర్యాదు చేసిన కాపీ.. అందులో పేర్కొన్న విషయాలు బయటకు వచ్చాయి. బాలాసోర్ బీఈడీ విద్యార్థిని బలవన్మరణం కేసులో విస్తుపోయే విషయం వెలుగు చూసింది. నిప్పంటించుకునే పది రోజుల ముందు.. 22 ఏళ్ల బాధిత విద్యార్థిని సీఐసీసీ(college's internal complaints committee)కి ఫిర్యాదు చేసింది. అందులో సీనియర్ ఫ్యాకల్టీ నుంచి తనకు ఎదురైన ఇబ్బందులను ప్రస్తావిస్తూనే.. చర్యలు తీసుకోకుంటే గనుక ప్రాణం తీసుకుంటానని హెచ్చరించింది కూడా. జులై 1వ తేదీన ఆమె రాసిన లేఖలో ఇలా.. గత కొన్ని నెలలగా బీఈడీ డిపార్ట్మెంట్ హెచవోడీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ సమీర్ కుమార్ సాహూ నన్ను వేధిస్తున్నారు. తక్కువ మార్కుల వేస్తానని, నన్ను ఫెయిల్ చేస్తానని.. నా గురించి నా కుటుంబంతో లేనిపోనివి చెబుతానని బెదిరిస్తూ వస్తున్నారు. అన్నింటికి మించి తన కోరికెలు తీర్చమంటూ వేధిస్తున్నారు. మనశ్శాంతి కరువై మానసికంగా ఇబ్బంది పడుతున్నా. నా ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే.. నేను బలవన్మరణానికి పాల్పడతాను. నా చావుకు హెచ్‌వోడీ, కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుంది అని లేఖ రాసిందామె. జూన్ 30వ తేదీన ఫకీర్ మోహన్ కాలేజీ ప్రిన్సిపల్ దీలీప్ ఘోష్ దృష్టికి ఆమె విషయాన్ని తీసుకెళ్లింది. ఆ మరుసటిరోజు ఆమె రాతపూర్వకంగా ఫిర్యాదును సమర్పించింది. అంతటితో ఆగకుండా.. పది రోజులపాటు ఆ ఫిర్యాదు కాపీని సోషల్ మీడియాలో పోస్టు చేసి చర్యలు తీసుకోవాలంటూ సీఎం, విద్యాశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యేను ట్యాగ్చేసి మరీ కోరింది. అయినా ఫలితం లేకపోయింది. జులై 12వ తేదీన.. ఆమె కాలేజీలోని ప్రిన్సిపల్ గది ఆవరణలో నిప్పటించుకుంది. 95 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలో ఆమెను రక్షించడానికి వెళ్లిన మరో విద్యార్థిని కూడా 70 శాతం గాయాలపాలై చికిత్స పొందుతోంది. ప్రధాన బాధితురాలిని బాలాసోర్ జిల్లా ఆస్పత్రిలో.. ఆపై భువనేశ్వర్‌లో ఎయిమ్స్‌కు ఆమెను తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి బాధితురాలు కన్నుమూసింది. ఈ కేసుకు సంబంధించిన బీఈడీ హెచ్‌వోడీ సమీర్ కుమార్ సాహూ, కాలేజీ ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్‌లను కాలేజీ యాజమానయం తొలగించగా.. ఆపై పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఉదయం బాలాసోర్‌లోని బాధితురాలి స్వగ్రామం పలాసియాకు మృతదేహాన్ని తరలించారు. ఊరు ఊరంతా ఆమె మృతదేహం చూసి కన్నీరు పెట్టుకుంది. ఆమె మృతదేహాంతో కాసేపు రోడ్డుపై ఆందోళనకు దిగింది.ఈ ఘటనపై సీఎం మోహన్ చరణ్ మజ్హీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారాయన. మరోవైపు.. స్వరాష్ట్రం ఒడిశా పర్యటనలో ఉన్నరాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సోమవారం సాయంత్రం AIIMSకి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. ఆపై కాసేపటికే ఆమె కన్నుమూయడం గమనార్హం.ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో రాజకీయ విమర్శలు వినవస్తున్నాయి. ఆమెది ఆత్మహత్య కాదు.. బీజేపీ వ్యవస్థ చేసిన హత్య అని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. బాధితురాలిని రక్షించడంలో ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్న రాహుల్.. బాధిత విద్యార్థిని ధైర్యంగా తన గొంతుక వినిపించినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: నేనేం చావడానికి ఇక్కడికి రాలేదు! -
Auto Fares: మినిమం రూ. 36.. మరి వెయింటింగ్?
బెంగళూరు: కర్నాటకలోని బెంగళూరులో నాలుగేళ్ల తరువాత ఆటో రిక్షా ఛార్జీలను అధికారికంగా సవరించారు. దీని ప్రకారం ప్రయాణికులు 2025, ఆగస్టు ఒకటి నుంచి, మొదటి రెండు కిలోమీటర్లకు రూ.36 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత బేస్ ఛార్జీ రూ.30 నుంచి పెరిగింది. ప్రతి అదనపు కిలోమీటరుకు ఛార్జీ రూ.18గా సవరించారు. గతంలో కి.మీ.కు రూ.15గా ఉంది. జిల్లా రవాణా అథారిటీ అధ్యక్షుడు, బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ ఈ సవరణను తెలియజేశారు.దీనికి సంబంధించిన ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, మొదటి 5 నిమిషాల వెయిటింగ్ సమయం ఉచితం. అయితే ఆ తర్వాత ప్రతి 15 నిమిషాల వెయిటింగ్‌కు రూ.10 వసూలు చేయనున్నారు. ప్రయాణీకులు 20 కిలోల వరకు బరువున్న లగేజీని ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా తీసుకెళ్లవచ్చు. ఉచిత పరిమితిని దాటిన ప్రతి 20 కిలోలకు రూ.10 అదనపు ఛార్జీ వర్తిస్తుంది. సవరించిన ఛార్జీలు రాత్రి ప్రయాణానికి కూడా వర్తిస్తాయి. కాగా ఆటో డ్రైవర్లు తమ వాహనాలలో కొత్త ఛార్జీల చార్ట్‌ను ప్రదర్శించాలని అధికారులు ఆదేశించారు.ఛార్జీల సవరణపై వివిధ రవాణా సంఘాల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ఆటో ఛార్జీల పెంపును తాము స్వాగతిస్తున్నామని కర్ణాటక రాష్ట్ర ప్రైవేట్ రవాణా సంఘాల సమాఖ్య అధ్యక్షుడు నటరాజ్ శర్మ అన్నారు. అయితే, అదనపు కిలోమీటరుకు ఛార్జీని రూ. 18కి బదులుగా రూ. 20గా చేయాలని ఆయన సూచించారు. డ్రైవర్లు అగ్రిగేటర్ యాప్‌లకు బదులుగా, మీటర్‌పై ఆటోలను నడపాలని శర్మ కోరారు. కాగా కొన్ని ఆటో యూనియన్లు బేస్ ఫేర్ రూ. 20 ఉంటుందని ఆశించామని పేర్కొన్నాయి. -
కోటి ఖర్చు పెడతా... ట్రాఫిక్ సమస్యను తీర్చేద్దాం!
మహానగరాల్లో ట్రాఫిక్ సమస్యల గురించి నిత్యం వింటూనే ఉన్నాం.. చినుకుపడితే చాలు.. కిలోమీటర్ల జామ్‌లు.. గతుకుల రోడ్లు, కార్పొరేషన్ల తవ్వకాలు.. పూర్తికాని నిర్మాణాలు..ట్రాఫిక్ చిక్కులకు బోలెడు కారణాలు ఉండవచ్చు కానీ.. పరిష్కార మార్గాలు మాత్రం గగన కుసుమాలే! వీటన్నింటితో ప్రశాంత్ పిట్టి ఎంత విసిగిపోయాడో కానీ.. ఈ సమస్యకు ఫుల్స్టాప్ పెట్టాల్సిందేనని తీర్మానించాడు! కోటి రూపాయలు ఖర్చు పెడతా కలిసి రండని ఏఐ/ఎంఎల్ ఇంజినీర్లకు పిలుపునిచ్చాడు!కర్ణాటక రాజధాని బెంగళూరును ఒకప్పుడు ఉద్యాన నగరి అని పిలుచుకునేవారు కానీ ఇప్పుడది వాహనాల పద్మవ్యూహం! అభిమన్యుడు సైతం ఛేదించలేని దుర్భర నరకం! ‘ఈజ్ మై ట్రిప్’ కంపెనీ వ్యవస్థాపకుడిగా ఎందరి ప్రయాణాలనో సులభతరం చేసిన ప్రశాంత్ పిట్టికి కూడా బెంగళూరు ట్రాఫిక్ రోజూ సవాళ్లు విసురుతూనే ఉంది. మొన్నటికి మొన్న శనివారం అర్ధరాత్రి.. 11.5 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు 145 నిమిషాల టైమ్ పట్టిందట.ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ఉద్దేశించిన ఔటర్ రింగ్ రోడ్డులోనే ఒక చోట సుమారు వంద నిమిషాలు ఇరుక్కుపోయానని, అక్కడ కనీసం ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ లేదా సిగ్నల్ కానీ లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందని వాపోయాడు ప్రశాంత్! ఈ జామ్‌లతో విసిగిపోయిన ప్రశాంత్... తన ఎక్స్ అకౌంట్లో ఒక ప్రకటన చేశాడు. ‘‘కోటి రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్ధం. గూగుల్ మ్యాప్స్, కృత్రిమ మేధల సాయంతో బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తున్న ప్రాంతాలను గుర్తిద్దాం’’ అని కోరాడు.గూగుల్ మ్యాప్స్‌కు శాటిలైట్ ఇమేజరీ తోడు...ఈ ఏడాది ఏప్రిల్‌లో గూగుల్ మ్యాప్స్ ‘‘రోడ్ మేనేజ్మెంట్ ఇన్సైట్’’ పేరుతో కొన్ని వివరాలు ఇవ్వడం మొదలుపెట్టిన విషయాన్ని ప్రస్తావించాడు ప్రశాంత్. ఏ రోడ్డులో ట్రాఫిక్ ఉన్నదో గుర్తించి ఇంకోమార్గంలో వెళ్లమని సూచిస్తుందన్నమాట ఈ రోడ్ మేనేజ్మెంట్ ఇన్సైట్. దీనికి ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా అందే సమాచారాన్ని జోడించి బెంగళూరు నగరం మొత్తమ్మీద ట్రాఫిక్‌ను అడ్డుకునే ఇరుకు ప్రాంతాలను గుర్తిద్దామని ప్రశాంత్ పిలుపునిచ్చాడు. ఒక నెలరోజులపాటు గమనిస్తే ఎప్పుడు ఎక్కడ ఎంత మేరకు ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందో తెలిసిపోతుందని, ఆ తరువాత ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ట్రాఫిక్ పోలీసులు క్రమబద్ధీకరించగలరని వివరించాడు.I am committing INR 1 Cr to find Bangalore Choke-Points via Google Maps & AL.11 km → 2.15 hours in Bangalore Traffic on Saturday late night!I was stuck at one choke-point at ORR, where I spent 100 mins struggling to understand why there is no traffic-light or cop here!But… pic.twitter.com/b8Nf5vnUKf— Prashant Pitti (@ppitti) July 14, 2025ఈ పని తన ఒక్కడి వల్లే కాదన్న ఆయన ఒకరిద్దరు ఏఐ/ఎంఎల్ ఇంజినీర్లు కలిసిరావాలని కోరాడు. గూగుల్ మ్యాప్స్, జీపీయూ, ఏపీఐ కాల్స్, ఉపగ్రహ ఛాయాచిత్రాల కోసం కావాల్సిన మొత్తాలతో కలిపి ఈ ప్రాజెక్టు కోసం కోటి రూపాయల వరకూ తాను ఖర్చు పెడతానని కూడా ప్రకటించాడు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు, కార్పొరేషన్లు ఇప్పటికే సేకరిస్తున్న సమాచారాన్ని అందించడంతోపాటు... తామిచ్చే సలహా, సూచనలను పాటించేందుకు ఒక టీమ్‌ను ఏర్పాటు చేస్తే చాలు పని మొదలుపెడతానని చెప్పారు.బెంగళూరు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చేపట్టిన ఈ ప్రాజెక్టు గురించి కార్పొరేషన్, ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులకు తెలిసేంతవకూ తన ట్వీట్‌ను ట్యాగ్ చేయాలని పిలుపునిచ్చాడు. అలాగే ఈ పనిలో సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్న ఇంజినీర్లు తన ట్వీట్‌కు ‘ఇన్’ అని కామెంట్ చేయాలని, ట్రాఫిక్ కారణంగా సమయం వృథా అవుతోందని భావిస్తున్న వాహనదారులందరూ ట్వీట్‌పై కామెంట్ చేయడంతోపాటు నలుగురికి షేర్ చేయాలని కోరారు. ఆల్ ద బెస్ట్ ప్రశాంత్ పిట్టి! -
‘అప్పడం లాంటి రోటీ, కంపు పన్నీర్’.. ఎంపీ భార్య ఫిర్యాదుకు ఐఆర్సీటీసీ షాకింగ్ ఆన్సర్
న్యూఢిల్లీ: రైళ్లలో ఐఆర్సీటీసీ అందించే ఆహారంపై అప్పుడప్పుడు పలు విమర్శలు వినిపిస్తుంటాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ సంజయ్ సింగ్ భార్య అనితా సింగ్ తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో తమకు వడ్డించిన ఆహారం బాగోలేదంటూ విమర్శించారు. ఈ నేపధ్యంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)పై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అనితా సింగ్.. రైలు ఆహారం విషయంలో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ.. రోటీ అప్పడంలా ఉందని, పన్నీర్ పాచిపోయిందని, పప్పు.. నీళ్లగా ఉందని పేర్కొన్నారు. తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను ఐఆర్సీటీసీ ప్రీమియం రైలుగా చెబుతున్నప్పటికీ, క్యాటరింగ్ ప్రమాణాలు అందుకు అనువుగా లేవని అనితా సింగ్ వ్యాఖ్యానించారు. ఆమె తన పోస్ట్‌కు రైల్వే మంత్రిత్వ శాఖను, మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేశారు.ఆమె వ్యాఖ్యలకు వెంటనే స్సందించిన ఐఆర్సీటీసీ ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఆహారం వడ్డించే ముందు సిబ్బంది దానిని తనిఖీ చేస్తారని, ఆ రోజు అదే కోచ్‌లోని ఇతర ప్రయాణీకుల నుండి ఎటువంటి ఫిర్యాదు రాలేదని పేర్కొంది. అయితే అనితా సింగ్ అభిప్రాయాన్ని విలువైనదిగా పరిగణిస్తున్నామని తెలిపింది. కాగా ఆమె సోషల్ మీడియా పోస్టుకు యూజర్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ సమస్యను అంగీకరించే బదులు, ఐఆర్సీటీసీ తనను తాను సమర్థించుకుంటోందని కొందరు వ్యాఖ్యానించారు. తేజస్, శతాబ్ది లాంటి ప్రీమియం రైళ్లలో కూడా ఆహారం బాగుండటం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
‘చనిపోయేందుకు రాలేదు’: అనుమానాలకు తెరదించిన రష్యన్ మహిళ
బెంగళూరు: కర్ణాటకలోని గోకర్ణ గుహలో పిల్లలతో పాటు ఉంటున్న రష్యన్ మహిళ ఉదంతం సంచలనంగా మారింది. ఈ వార్త వెల్లడి కాగానే ఆమె ఎందుకు అక్కడ ఉంటోంది? పిల్లలను అలా ఎందుకు సాకుతోంది? చనిపోయేందుకే పిల్లలతో పాటు ఇక్కడికి వచ్చిందా? అనే సందేహాలు పలువురిలో కలుగుతున్నాయి. వాటికి ఆమె స్వయంగా సమాధానం చెప్పింది.గోకర్ణ గుహలో తలదాచుకుటున్న రష్యన్ మహిళ నీనా కుటినా.. తాను, తన పిల్లలు ఉంటున్న గోకర్ణ గుహ గ్రామానికి చాలా దగ్గరగా ఉందని, అది ప్రమాదకరం కాదని మీడియాకు తెలిపింది. రామతీర్థ కొండలలోని ఈ గుహలో తన ఇద్దరు కుమార్తెలతో పాటు ఉండటాన్ని ఆమె సమర్థించుకుంది. తమ కుటుంబం ప్రకృతిని ప్రేమిస్తుందని, తాము కొన్నేళ్లుగా 20 దేశాల అడవులలో నివసించామని చెప్పుకొచ్చింది. గుహలో తనకు, తన పిల్లలకు ఎటువంటి హానిలేదని నీనా కుటినా తెలిపింది. ప్రకృతిలో ఉండటం తమకు గొప్ప అనుభూతినిస్తుందని, ఇక్కడికి మేము చనిపోయేందుకు రాలేదని, తన పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఆమె మీడియాకు తెలిపింది. #WATCH | Bengaluru | Russian national Nina Kutina, who was found living with her two daughters in a remote cave near Gokarna in Karnataka, says, "We have a lot of experience staying in nature and we were not dying. I did not bring my children to die in the jungle...We used to… pic.twitter.com/iY0Bi8I6xb— ANI (@ANI) July 14, 2025నినా కుటినా తన పిల్లలతో గుహలో ఉండటాన్ని చూసి పలువురు ఆశ్యర్యపోయారు. అయితే ఆ గుహ జనావాసాలకు దూరంగా అడవిలో లేదని, గ్రామానికి చాలా దగ్గరలోనే ఉందని ఆమె తెలిపింది. తాము ఇక్కడి జలపాతంలో ఆనందంగా ఈత కొట్టామని పేర్కొంది. తాను 2016లో బిజినెస్ వీసాపై భారతదేశానికి వచ్చానని, ఆ వీసా గడువు 2017తో ముగిసిపోయిందని, ఇప్పుడు తమ దగ్గర చెల్లుబాటు అయ్యే వీసా లేదని ఆమె వివరించింది. 2017 తర్వాత తాము నాలుగు దేశాలలో తిరిగామని, ఇప్పుడు భారత్ వచ్చామని ఆమె తెలిపింది. ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన తర్వాత సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో అధికారులకు ఆమెతో పాటు పిల్లలు గోకర్ణ గుహలో కనిపించారు. రామతీర్థ కొండలోని గుహ వెలుపల చీర, ఇతర దుస్తులను వేలాడదీసి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. తరువాత నినా కుటినాను, ఆమె ఇద్దరు పిల్లలను గమనించారని ఉత్తర కన్నడ పోలీసు సూపరింటెండెంట్ ఎం నారాయణ తెలిపారు. -
కాక్‌పిట్‌లోకి ఇద్దరు ప్రయాణికుల చొరబాటు.. ‘స్పైస్‌జెట్’లో గందరగోళం
న్యూఢిల్లీ: ఇద్దరు ప్రయాణికుల అలజడి కారణంగా మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరాల్సిన స్పైస్‌జెట్ విమానం (SG 9282) దాదాపు ఏడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఢిల్లీ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తించింది.స్పైస్‌జెట్ విమానంలో విమానం టేకాఫ్ కోసం ట్యాక్సీ చేస్తున్నప్పుడు కాక్‌పిట్‌లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ఇద్దరు ప్రయాణికులు ప్రయత్నించిన దరిమిలా గంగదరగోళం ఏర్పడింది. విమాన ప్రయాణానికి ఆటకం కలిగించిన ఆ ఇద్దరినీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)కి అప్పగించామని స్పైస్‌జెట్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘2025, జూలై 14న, ఢిల్లీ నుండి ముంబైకి వెళుతున్న స్పైస్‌జెట్ విమానం(SG 9282)లో అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఇద్దరు ప్రయాణికులను దింపేశాం. వారు బలవంతంగా కాక్‌పిట్‌లోకి చేరుకునేందుకు ప్రయత్నించారు. సిబ్బంది విధులకు ఆటకం కలిగించారని’ దానిలో పేర్కొంది.స్పైస్‌జెట్ తెలిపిన వివరాల ప్రకారం క్యాబిన్ సిబ్బంది, తోటి ప్రయాణికులు, కెప్టెన్ పదే పదే అభ్యర్థించినప్పటికీ, ఆ ఇద్దరు ప్రయాణికులు ఇబ్బందులకు గురిచేశారు. జూలై 13న మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరాల్సిన ఈ విమానం, తొమ్మిది గంటలకు పైగా ఆలస్యంతో రాత్రి 9:05 గంటలకు బయలుదేరిందని ప్రయాణికులు తెలిపారు. రన్‌వే వైపు టాక్సీ వేసిన తర్వాత విమానం అకస్మాత్తుగా ఆగిపోయింది. ఫలితంగా ప్రయాణికుల్లో ఆందోళన ఏర్పడింది. -
Odisha: ప్రాణాలొదిలిన వేధింపుల బాధితురాలు.. స్పందించిన సీఎం
భువనేశ్వర్: లైంగిక వేధింపుల ఉదంతానికి మరో విద్యార్థిని అశువులుబాసింది. ఒడిశాలోని ఒక కళాశాలలో లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్‌పై ఫిర్యాదు చేసినప్పటికీ, చర్యలు తీసుకోకపోవడంతో కలత చెందిన ఒక విద్యార్థిని ఒంటికి నిప్పటించుకుంది. మూడు రోజులుగా ప్రాణాలతో పోరాడుతూ సోమవారం రాత్రి మృతిచెందింది.ఐసీయూలోని బర్న్స్ వార్డులో చికిత్సనందిస్తూ, మూత్రపిండ మార్పిడి చికిత్సతో సహా అన్ని సాధ్యమైన వైద్య సహాయం అందించినప్పటికీ, బాధితురాలిని బతికించలేకపోయామని, ఆమె సోమవారం రాత్రి 11:46 గంటలకు మరణించిందని ఎయిమ్స్ భువనేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపింది. బాధితురాలు జూలై 1న కళాశాల ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆమె కళాశాల అధికారులకు రాసిన లేఖలో ఆ ప్రొఫెసర్ నెలల తరబడి తనపై సాగించిన వేధింపులు, బెదిరింపులను వివరించింది. అయినా ప్రొఫెసర్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది. ఈ నేపధ్యంలో తీవ్ర నిరాశలో ఉన్న బాధితురాలు జూలై 12న బాలసోర్‌లోని ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాల ప్రాంగణంలో నిప్పంటించుకుంది. 90 శాతం మేరకు కాలిపోయిన బాధితురాలిని వెంటనే ఎయిమ్స్ భువనేశ్వర్‌కు తరలించారు. సోమవారం రాత్రి ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. ଫକୀର ମୋହନ ସ୍ୱୟଂଶାସିତ ମହାବିଦ୍ୟାଳୟର ପୀଡ଼ିତା ଛାତ୍ରୀଙ୍କ ଦେହାନ୍ତ ଖବର ଶୁଣି ମୁଁ ଅତ୍ୟନ୍ତ ମର୍ମାହତ। ସରକାରଙ୍କ ସମସ୍ତ ଦାୟିତ୍ୱ ନିର୍ବାହ ତଥା ବିଶେଷଜ୍ଞ ଡାକ୍ତରୀ ଦଳଙ୍କ ଅକ୍ଲାନ୍ତ ପରିଶ୍ରମ ସତ୍ତ୍ୱେ ପୀଡ଼ିତାଙ୍କ ଜୀବନ ରକ୍ଷା ହୋଇପାରିଲା ନାହିଁ । ତାଙ୍କର ଅମର ଆତ୍ମାର ସଦଗତି କାମନା କରିବା ସହ ପରିବାରବର୍ଗଙ୍କୁ ଏହି ଅପୂରଣୀୟ…— Mohan Charan Majhi (@MohanMOdisha) July 14, 2025ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి విద్యార్థిని మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ, దోషులకు కఠినమైన శిక్ష పడుతుందని ఆమె కుటుంబానికి హామీ ఇచ్చారు.‘ఎఫ్ఎం అటానమస్ కళాశాలకు చెందిన విద్యార్థిని మృతి వార్త విని చాలా బాధపడ్డాను. నిపుణులైన వైద్య బృందం అవిశ్రాంత ప్రయత్నాలు చేసినప్పటికీ, బాధితురాలి ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ జగన్నాథుడిని వేడుకుంటున్నాను. ఈ కేసులో దోషులందరూ చట్ట ప్రకారం కఠినమైన శిక్షను ఎదుర్కొంటారని బాధిత విద్యార్థిని కుటుంబానికి హామీ ఇస్తున్నాను. ఇందుకోసం వ్యక్తిగతంగా అధికారులకు తగిన సూచనలు జారీ చేశాను’ అని ఆయన తన ఆన్లైన్ పోస్ట్‌లో తెలిపారు. -
రష్యాకు 10 లక్షల మంది భారత కార్మికులు
మాస్కో: ఉక్రెయిన్‌తో మూడేళ్లుగా సాగుతున్న యుద్ధం కారణంగా రష్యాలో మానవ వనరుల కొరత ఏర్పడింది. దేశంలో కార్మికుల కొరతను భర్తీ చేసేందుకు భారత్ వైపు దృష్టి సారించింది. ఈ ఏడాది చివరికల్లా 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన భారత కార్మికులను రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.ఇందుకు సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా యాకటెరిన్బర్గ్లో కొత్తగా కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని ప్రారంభిస్తోందని ఉరల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చీఫ్ అండ్రీ బెసెడిన్ ప్రకటించారు. రష్యాలోని ఉరల్ పర్వతాలకు సమీపంలోని యాకటెరిన్ బర్గ్ ప్రాంతం భారీ పరిశ్రమలకు కేంద్రస్థానం.అక్కడ సైనిక పరిశ్రమలూ భారీగానే ఉన్నాయి. రష్యా ప్రభుత్వ అంచనాల ప్రకారం 2030 నాటికి దేశంలో కారి్మక శక్తి కొరత 31 లక్షలకు పెరగనుంది. అందుకే, ఉత్తర కొరియా, శ్రీలంకల నుంచీ కారి్మకులను రప్పించాలని ప్రణాళికలు వేసింది. -
కబరస్తాన్ గేటు దూకి.. అమరులకు నివాళులర్పించి..!
శ్రీనగర్: శ్రీనగర్‌లోని నక్ష్ బంద్ సాహిబ్ కబరస్తాన్ వద్ద సోమవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 1931 జూలై 13న డోగ్రా ఆర్మీ జరిపిన కాల్పుల్లో చనిపోయిన 22 మంది సమాధులు ఇందులోనే ఉన్నాయి. ముఖ్యనేతలెవరూ ఇక్కడికి నివాళులరి్పంచడానికి రాకూడదని యంత్రాంగం సీఎం ఒమర్ సహా పలువురు నేతలను ఆదివారం గృహ నిర్బంధంలో ఉంచింది. అయితే, సోమవారం సీఎం ఒమర్ సహా పలువురు నేతలు అక్కడికి చేరుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఆటోలో, విద్యామంత్రి సకినా ఇట్టూ స్కూటీపై వచ్చారు. కబరస్తాన్‌కు దారి తీసే రెండు వైపులా దారుల్నీ అధికారులు మూసివేశారు. ఖన్‌య్రాŠ ప్రాంతానికి చేరుకున్న సీఎం ఒమర్ తన వాహనం దిగి అరకిలో మీటర్ దూరంలో ఉన్న కబరస్తాన్‌కు కాలినడకన చేరుకున్నారు. కబరస్తాన్‌కు తాళంవేసి ఉంచడంతో ఇనుప గేటు పైకెక్కి లోపలికి చేరుకున్నారు. కొందరు నేతలు కూడా ఆయన్ను అనుసరించారు. కొద్దిసేపటికి అధికారులు గేట్లు తెరిచారు. దీంతో, ఫరూక్ అబ్దుల్లా తదితరులు కూడా వచ్చి అమరుల కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఒమర్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ లెఫ్టినెంట్ మనోజ్ సిన్హా చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. ఆదివారం గృహ నిర్బంధంలో ఉంచిన అధికారులు సోమవారం తనను ఎందుకు ఆపారంటూ మండిపడ్డారు. వాళ్లు మమ్మల్ని బానిసలని అనుకుంటున్నారు. కానీ, మేం ప్రజలు మాత్రమే సేవకులం. యూనిఫాంలో ఉన్న పోలీసులు చట్టం మర్చిపోతున్నారు. పరుగెత్తుతున్న మమ్మల్ని వెంటాడారు. మా చేతిలోని జెండాను చింపేయాలని చూశారు’అని ఆరోపించారు. -
దర్యాప్తు నివేదికతో మరిన్ని అనుమానాలు
న్యూఢిల్లీ: గత నెలలో అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు అనంతరం మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఎయిరిండియా సీఈవో కాంప్‌బెల్ విల్సన్ పేర్కొన్నారు. పైలట్ల సామర్థ్యాన్ని కొట్టిపారేయలేమన్న ఆయన.. విమానంలో మెకానికల్, మెయింటెనెన్స్‌కు సంబంధించిన లోపాలేవీ ఈ నివేదిక పేర్కొనలేదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఘటనపై ఇప్పుడే నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుందని అభిప్రాయపడ్డారు. ‘ప్రాథమిక నివేదిక విడుదలతోపాటు ఘటనకు దారి తీసిన పరిస్థితులు, కారణాలపై అదనంగా మరిన్ని వివరాలు వెల్లడవుతున్నాయి. ఇది మరింత స్పష్టతను, మరిన్ని ప్రశ్నలను లేవనెత్తడం ఏమాత్రం ఆశ్చర్యం కలిగించడం లేదు’అంటూ ఆయన తమ సిబ్బందికి పంపిన అంతర్గత మెమోలో పేర్కొన్నారు. ఇంధన నాణ్యతలోగానీ, టేకాఫ్ ప్రక్రియలోగానీ తేడాల్లేవన్నారు. అదేవిధంగా, ఇద్దరు పైలట్లకు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష కూడా జరిగిందన్నారు. ‘ప్రాథమిక నివేదికలో ప్రమాదానికి ఎలాంటి కారణం గుర్తించలేదు. ఎటువంటి సిఫారసులు చేయలేదు. పైపెచ్చు ఈ విచారణ ఇంకా కొనసాగుతోంది. అందుకే ఊహాగానాలకు తెరలేపవద్దు’అని కోరారు. తుది నివేదిక వెలువడే వరకు మరిన్ని సెనేషనల్ వార్తలు, వదంతులు వస్తాయనడంలో సందేహం లేదని వ్యాఖ్యానించారు. ఎయిరిండియా బోయింగ్ విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాసిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ)శనివారం ప్రాథమిక నివేదిక విడుదల చేయడం తెల్సిందే. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే విమానం రెండు ఇంజన్ల ఫ్యూయల్ సప్లయ్ స్విచ్‌లు నిలిచినట్లు పైలట్ల మధ్య సంభాషణల ద్వారా వెల్లడైందని తెలిపింది. ఫ్యూయల్ స్విచ్‌లను తనిఖీ చేయించండి: డీజీసీఏ ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడమే అహ్మదాబాద్ ఘటనకు దారి తీసినట్లు తేలడంతో దేశీయ విమానయాన సంస్థలకు డీజీసీఏ కీలక ఆదేశాలిచి్చంది. ఆయా సంస్థలు తమ బోయింగ్ 787, 737 రకం విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థలను తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. కాగా ఎయిరిండియా ప్రమాద నివేదికలోని కీలక విషయాలను ప్రభుత్వం వెల్లడించకమునుపే వాల్‌స్ట్రీట్ జర్నల్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఎలా తెలిసిపోయాయని శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంకా చతుర్వేది ప్రశ్నించారు. -
ఈదుకుంటూ స్కూల్‌కు
ఖుంటి: ఆ గ్రామాన్ని కలిపే రహదారిపై వంతెన వర్షాలకు దెబ్బతింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కర్ర నిచ్చెనను ప్రమాదకరమంటూ అధికారులు తీసేశారు. అయినా ఆ బాలిక అధైర్యపడలేదు. చదువుకోవాలనే తపన ముందు అడ్డంకులన్నీ ఓడిపోయాయి. స్కూలు బ్యాగును నెత్తిపై పెట్టుకుని ఈదుకుంటూ నదిని దాటి తడిచి నీళ్లు కారుతున్న దుస్తులతోనే స్కూలుకు వెళుతోంది. ఆ గ్రామంలోని మిగతా పిల్లలందరిదీ ఇదే పరిస్థితి. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. రాంచీ–ఖుంటి–సిండెగా రహదారిలో పెలోల్ గ్రామాన్ని కలుపుతూ బనాయ్ నదిపై ప్రభుత్వం 2007లో రూ.1.30 కోట్లతో వంతెన నిర్మించింది. చుట్టుపక్కల 12 గ్రామాల ప్రజలకు ఆ వంతెనే ఆధారం. జూన్ 19వ తేదీన సంభవించిన వరద తీవ్రతకు వంతెన పిల్లర్ ఒకటి దెబ్బతింది. దీంతో, వెదురుకర్రలతో తాత్కాలికంగా వంతెనను ఏర్పాటు చేసుకుని గ్రామస్తులంతా పెలోల్ చేరుకుంటున్నారు. కానీ, ప్రమాదకరంగా ఉందంటూ అధికారులు ఆ నిచ్చెనను తొలగించారు. కానీ, పెలోల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న అంగర్బరీ గ్రామానికి చెందిన సునీత హొరొ(పేరు మార్చారు) మాత్రం ఏమాత్రం భయపడలేదు. నెత్తిపై స్కూల్ బ్యాగు పెట్టుకుని నదిలో ఈదుతూ ఆవలి ఒడ్డుకు చేరుకుంటోంది. తడిచిన దుస్తులకు బదులుగా బ్యాగులో అదనంగా సిద్ధంగా ఉంచుకున్న డ్రెస్‌ను వేసుకుని స్కూలుకు వెళ్లేంది. ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడూ ఇదే పరిస్థితి. దీంతో, వారంలో ఒకటీ రెండు సార్లు మాత్రమే స్కూలుకు వెళ్తున్నామని తెలిపింది. సునీత వచ్చే ఏడాది బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంది. ‘స్కూలుకెళ్లాంటే నదిలో కొంత భాగాన్ని ఈదటమే తప్ప మరో మార్గంలేదు. ఈదేటప్పుడు స్కూలు బ్యాగు నెత్తిపై పెట్టుకుంటా. కానీ, నా డ్రెస్ పూర్తిగా తడిచిపోతుంది. అందుకే, వచ్చేటప్పుడే ఎక్స్ ట్రా తెచ్చుకుంటా’అని ఆమె తెలిపింది. బోర్డు పరీక్షలకు ప్రిపరేరయ్యే తన స్నేహితులదీ ఇదే పరిస్థితని వివరించింది. సాధారణంగా ఐదంటే ఐదే నిమిషాలు పట్టే ప్రయాణానికి ఇప్పుడు 12 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని, 40 నిమిషాల సమయం తీసుకుంటోందని విద్యార్థులు అంటున్నారు. రాంచీ నుంచి సిండెగా మీదుగా ఒడిశా వెళ్లే భారీ వాహనాలు, బస్సులు సైతం వంతెన దెబ్బతినడంతో ప్రత్యామ్నాయం మార్గంలో వెళ్తున్నాయి. వంతెన వద్ద డైవర్షన్ రోడ్డు నిర్మించే పనిలో ఉన్నామని ఖుంటి సబ్ డివిజనల్ అధికారి దీపేశ్ కుమారి తెలిపారు. అయితే, ఆగకుండా కురుస్తున్న వానలతో పనులకు అవరోధం కలుగుతోందని చెప్పారు. జార్ఖండ్ సీఎంహేమంత్ సోరెన్వంతెన దెబ్బతినడంపై దర్యాప్తునకు ఆదేశించారు. -
రహస్య రికార్డింగులు సాక్ష్యాలే
న్యూఢిల్లీ: జీవిత భాగస్వాములతో సంభాషణను రహస్యంగా రికార్డు చేయడం విడాకులతో పాటు అన్నిరకాల వైవాహిక వివాదాల్లోనూ సాక్ష్యాలుగా చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ధర్మాసనం సోమవారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. సదరు సంభాషణలకు సాక్ష్యాల చట్టంలోని 122వ సెక్షన్ కింద రక్షణ ఉంటుందని, కనుక వాటిని న్యాయ వివాదాల్లో ఉపయోగించడాన్ని అనుమతించలేమని పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. వాటిని సాక్ష్యాలుగా అనుమతిస్తే వైవాహిక బంధాన్ని, కుటుంబంలో సామరస్యాన్ని దెబ్బతీస్తాయని, భాగస్వామిపై గూఢచర్యానికి దారి తీస్తాయని హైకోర్టు వెలువరించిన అభిప్రాయాలతో ధర్మాసనం విభేదించింది. ‘‘ఇలాంటివి చెల్లుబాటయ్యే వాదనలు కావన్నది మా అభిప్రాయం. భార్యాభర్తలు పరస్పరం తరచూ ఇలా సంభాషణను గుట్టుగా రికార్డు చేయడం వంటి పనులకు పాల్పడుతున్నారంటేనే ఆ బంధం బీటలు వారిందని, వారి మధ్య విశ్వాసం సన్నగిల్లిందని అర్థం. కనుక అలాంటి పరిస్థితుల్లో గోప్యంగా రికార్డు చేసిన భాగస్వామి తాలూకు సంభాషణను సాక్ష్యంగా అంగీకరించడం అసమంజమేమీ కాదు. ఎందుకంటే అది వైవాహిక సమస్యల తాలూకు ఫలితమే తప్ప వాటికి కారణం కాదు’’ అని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. ‘‘122వ సెక్షన్ పేర్కొంటున్న గోప్యత హక్కు భార్యాభర్తల సంభాషణలకు కూడా వర్తిస్తుందన్నది నిజమే. కానీ అది సంపూర్ణమైనది కాదు. ఈ అంశాన్ని ఆ సెక్షన్‌కు ఇచ్చిన మినహాయింపులతో కలిపి చూడాల్సి ఉంటుంది’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘‘ఇలాంటి విషయాల్లో గోప్యత హక్కు కంటే కూడా సక్రమ విచారణ హక్కుదే పై చేయి అవుతుంది. వైవాహిక బంధం విచి్ఛన్నమయ్యే స్థితికి చేరినప్పుడు భాగస్వాములకు తమ వాదనను రుజువు చేసే సాక్ష్యాలు సమరి్పంచే హక్కును గోప్యత తదితరాలను ప్రాతిపదికగా చూపి కాలరాయలేం’’ అని స్పష్టం చేసింది. 2017 నాటి ఓ విడాకుల కేసులో భార్యకు తెలియకుండా భర్త జరిపిన ఆమె సంభాషణల రికార్డులను సాక్ష్యంగా అనుమతిస్తూ పంజాబ్‌లోని భటిండా ఫ్యామిలీ కోర్టు ఇచి్చన తీర్పును పునరుద్ధరించింది. -
ఢిల్లీ వెళ్తున్నారు.. ఏమి తెస్తున్నారు..?
సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు ప్రహసనంగా మారుతున్నాయి. 2014–19లో మాదిరిగానే ఇప్పుడు కూడా ఆయన తరచూ ఢిల్లీ రావడం.. హడావుడి చేయడం మినహా సాధించిందేమి కనిపించడంలేదు. ‘అయినా పోయి రావలె హస్తినకు’.. అన్నట్లుగా 21వ సారి ఆయన మళ్లీ మంగళవారం ఢిల్లీకి వస్తున్నారు. గడచిన ఏడాది కాలంగా ఏం సాధించారంటే చెప్పుకోవడానికి గొప్పగా ఏమి కనిపించడంలేదు. ప్రతిసారీ రావడం.. కేంద్ర మంత్రులను కలవడం.. రాష్ట్ర అభివృద్ధే తన అజెండా అని చెప్పడం పరిపాటిగా మారింది. ప్రధాని సహా, కేంద్ర మంత్రులను కలిస్తే వారితో చర్చించిన అంశాలను ఎంపిక చుకున్నాడు మీడియాకు మాత్రమే వివరిస్తున్నారు. తాజాగా.. మంగళవారం మళ్లీ చంద్రబాబు ఢిల్లీకి వస్తుండగా, ఈసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తదితరులను కలవనున్నారు. వస్తున్నారు.. వెళ్తున్నారు.. ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న చంద్రబాబు ఈ ఏడాది కాలంలో ఇప్పటివరకు 21సార్లు ఢిల్లీకి వచ్చి ఐదుసార్లు ప్రధాని మోదీని, ఆరుసార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, ఐదుసార్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. వీరిని కలిసి రాష్ట్ర అభివృద్ధిపై చర్చించానని, ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధానిని తాను నిరి్మంచబోతున్నట్లు ఎంపిక చేసుకున్న మీడియాకు చంద్రబాబు ఊదరగొడుతున్నారు. అయితే అప్పులు తప్ప ఆయన సాధించింది ఏమీ కనపడటంలేదు. ఇప్పటివరకు అమరావతి పేరుతో రూ.31వేల కోట్లు తీసుకున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రూ.15వేల కోట్లు పొందారు. ఇవి కాక.. బడ్జెటేతర అప్పులు ఇప్పటివరకు రూ.19,410 కోట్లు. ఇక ప్రతి మంగళవారం అప్పులు సరేసరి. విశాఖ స్టీల్‌ప్లాంట్, పోలవరంపై గప్‌చుప్.. మరోవైపు.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యొద్దని ఇప్పటికీ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఎన్డీఏలో కీలకంగా ఉన్న చంద్రబాబు దీనిని ప్రైవేటీకరణ చేయడంలేదనే హామీని మాత్రం కేంద్రం నుంచి ఇప్పించలేకపోతున్నారు. అలాగే, పోలవరం ఎత్తు తగ్గించినట్లు లోక్‌సభ సాక్షిగా బట్టబయలైనా ఆయన నోరు మెదపడంలేదు. ఎత్తు తగ్గలేదని బుకాయించే పనిలో మాత్రం ఎన్డీఏ నేతలు నిమగ్నమయ్యారు. ఈ అంశంపై మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ ఎంపీలపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.బనకచర్లపై బిగ్‌షాక్.. ఇదిలా ఉంటే.. కేంద్రంలో చక్రం తిప్పుతున్నానని చెప్పుకునే చంద్రబాబుకు ఎన్డీఏ బిగ్‌షాక్ ఇచ్చింది. సముద్రంలో వృధాగా పోయే గోదావరి జలాలను వాడుకునేందుకు ‘పోలవరం–బనకచర్ల’ ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం కూడా సానుకూలంగా ఉందని, త్వరలో డీపీఆర్ సమర్పించనుందని ఇటీవల ఢిల్లీ వచి్చన సమయంలో మీడియాకు చెప్పారు. అయితే, కొద్దిరోజులకే ఈ ప్రతిపాదనలను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ) వెనక్కు పంపింది. పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేయడానికి.. పర్యావరణ ప్రభావ అంచనాపై అధ్యయనం చేయడానికి నియమ, నిబంధనల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను తోసిపుచ్చింది. గోదావరిలో వరద జలాల లభ్యతపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)తో సమగ్రంగా అధ్యయనం చేయించి లెక్క తేల్చాలని సిఫార్సు చేసింది. దీంతో.. బనకచర్లపై ఊదరగొట్టిన చంద్రబాబుకు ఇదొక బిగ్‌షాక్ అనే చెప్పాలి. ఇక మిర్చి రైతులకు మద్దతు ధర విషయంలోగానీ.. తోతాపురి మామిడి రైతులను ఆదుకునే విషయంలోగానీ కేంద్రం నుంచి ఆయనేమీ సాధించలేకపోయారు. -
జిలేబీ, సమోసాలపై ఆరోగ్య హెచ్చరికలు!
న్యూఢిల్లీ: సిగరెట్ ప్యాకెట్‌పై ‘ఆరోగ్యానికి హానికరం’ అంటూ విధిగా కనిపించే హెచ్చరిక ఇకపై అన్నిరకాల చిరుతిళ్లపైనా దర్శనమివ్వనుంది. జిలేబీ, సమోసా, పకోడీ, వడా పావ్ మొదలుకుని చాయ్ బిస్కట్ దాకా దాదాపుగా అన్నిరకాల చిరుతిళ్ల ప్యాకెట్లపైనా వాటిలోని నూనెలు, చక్కెర, కొవ్వు తదితరాల శాతాన్ని ప్రముఖంగా ముద్రించనున్నారు. జీవనశైలికి సంబంధించిన పలు రకాల వ్యాధులకు హెచ్చు మోతాదులో నూనెలు, చక్కెర తదితరాలే కారణంగా మారుతున్న నేపథ్యంలో అనారోగ్యకర ఆహారపు అలవాట్లపై ప్రజల్లో అవగాహనను పెంచడమే ఈ చర్య ఉద్దేశమని కేంద్రం వెల్లడించింది. దేశంలోనే తొలిసారిగా దీన్ని నాగపూర్ ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టనున్నారు. ఇందులో భాగంగా క్యాంపస్‌లోని కేఫ్టేరియాలు, ఫుడ్ కౌంటర్లు తదితర పక్కనే అందురూ తేలిగ్గా చదవడానికి వీలయ్యేలా పెద్ద అక్షరాలతో కూడిన భారీ పోస్టర్లు, హెచ్చరిక బోర్డులు పెడతారు. వాటిని తరచూ తింటే తలెత్తే ఆరోగ్య సమస్యలను వివరంగా ఏకరువు పెడతారు. అనంతరం దీన్ని కొద్ది నెలల్లో దేశమంతటికీ విస్తరిస్తారు. నిషేధం కాదన్న కేంద్ర ప్రభుత్వం చిరుతిళ్లలో ఇమిడి ఉండే ఆరోగ్యసమస్యల గురించి అధికారిక లెటర్హెడ్లు, కవర్లు, నోట్ప్యాడ్లు, ఇతర ప్రచురణల్లో ఆరోగ్య సందేశాలను విధిగా ప్రచురించాల్సిందిగా అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఆ శాఖ కార్యదర్శి పుణ్యసలిల శ్రీవాత్సవ జూన్ 21న ఈ మేరకు వాటికి లేఖలు రాశారు. సమోసా, వడా పావ్ తదిత సంప్రదాయ చిరుతిళ్లతో పాటు పిజ్జాలు, బర్గర్లు, డోనట్లను వంటి విదేశీ స్నాక్స్‌ను ఈ జాబితాలో చేర్చాలని సబార్డినేట్ లెజిస్లేషన్‌పై పార్లమెంటరీ కమిటీ చైర్మన్, శివసేన ఎంపీ మిలింద్ దేవ్రా సూచించారు. అయితే ఈ చర్య సమోసా, జిలేబీ, పకోడీ వంటి పాపులర్ చిరుతిళ్లపై నిషేధం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ‘‘కేవలం వాటని తినడం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడం, తద్వారా జీవన శైలి వ్యాధుల ముప్పును కనీస స్థాయికి తగ్గించడమే మా లక్ష్యం’’ అని వివరించింది. పెను సమస్యగా... భారత్‌లో ఆరోగ్య సంక్షోభం నానాటికీ పెరుగుతూ వస్తున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, హృద్రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణాల్లో అతిగా వేయించిన, చక్కెర తదితరాల శాతం ఎక్కువగా ఉండే స్నాక్స్ వాడకం ఒకటని గుర్తించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2025 కల్లా భారత్‌లో ఏకంగా 44 కోట్ల మంది స్థూలకాయులుగా మారడం ఖాయమని ప్రఖ్యాత లాన్సెట్ జర్నల్ ఇటీవల ప్రచురించిన అంతర్జాతీయ అధ్యయనం హెచ్చరించింది. ‘‘దేశవ్యాప్తంగా పిల్లలతో పాటు పెద్దల్లో కూడా స్థూలకాయ సమస్య నానాటికీ పెరిగిపోతోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఐదుగురిలో ఒకరి కంటే ఎక్కువగా అధిక బరువుతో బాధ పడుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) ఎత్తిచూపింది.హెచ్చరికలు వేటిపై? సమోసా, జిలేబీ, పకోడీ, వడా పావ్, కచోరీ, పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, గులా బ్ జామూన్, చాక్లెట్ పేస్ట్రీ లు, అన్నిరకాల శీతల పానీయాలు తదితరాలు -
నీ రాక కోసం.. శుభాంశు ఆగమనం నేడే
వాషింగ్టన్: అంతరిక్షంలో భారత కీర్తిపతాకను సమున్నతంగా ఎగరేసిన మన ముద్దుబిడ్డ శుభాంశు శుక్లా నింగి నుంచి సగర్వంగా నేలకు తిరిగొస్తున్నాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టిన తొలి భారతీయునిగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్న శుభాంశు.. మరో ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి అక్కడ రెండున్నర వారాలకు పైగా గడిపిన విషయం తెలిసిందే. స్పేస్ఎక్స్ డ్రాగన్ ‘గ్రేస్’ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4.45 గంటలకు శుభాంశు బృందాన్ని తీసుకుని భూమికి తిరుగు ప్రయాణమైంది. 22 గంటల 15 నిమిషాలకు పైగా ప్రయాణించిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం 3.01 గంటలకు అమెరికాలోని కాలిఫోరి్నయా తీర సమీపంలో పసిఫిక్ మహాసముద్ర జలాల్లో దిగనుంది. ఆ వెంటనే వారికి వైద్యపరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కు తరలిస్తారు. అంతరిక్షంలోని సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల నుంచి నుంచి భూ వాతావరణానికి అలవాటు పడేదాకా శుభాంశు బృందాన్ని వారం రోజుల పాటు ఏకాంతంలో ఉంచుతారు. వైద్య పరీక్షలు తదితరాలు నిర్వహించిన అనంతరం వారు బయటి ప్రపంచంలోకి అడుగు పెడతారు. ఈ నేపథ్యంలో శుభాంశు రాక కోసం దేశమంతా నిలువెల్లా కనులు చేసుకుని ఆనందోత్సాహాలతో ఉత్కంఠగా వేచిచూస్తోంది. తిరిగొచ్చేది ఇలా... నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టిన యాగ్జియం–4 మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి, వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశుతో పాటు పెగ్గీ వాట్సన్ (అమెరికా), స్లావోజ్ ఉజ్నాన్స్కీ విస్నియెవ్స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) జూన్ 25న ఐఎస్ఎస్కు బయల్దేరడం తెలిసిందే. దాదాపు 28 గంటల ప్రయాణం అనంతరం వారు 26న విజయవంతంగా ఐఎస్ఎస్లోకి ప్రవేశించారు. అక్కడ 18 రోజులు (443 గంటలు) గడిపారు. ఆ క్రమంలో 60 కీలక ప్రయోగాలు చేశారు. → సోమవారం సాయంత్రం షెడ్యూల్ కంటే 10 నిమిషాలు ఆలస్యంగా సాయంత్రం 4.45 గంటలకు శుభాంశు బృందం తిరుగు ప్రయాణం మొదలైంది. → అంతకు రెండు గంటల ముందు వారు ఐఎస్ఎస్ నుంచి ఒకరి తర్వాత ఒకరుగా డ్రాగన్ వ్యోమనౌకలోకి ప్రవేశించారు. నలుగురూ స్పేస్ సూట్లు ధరించాక వ్యోమనౌకను ఐఎస్ఎస్తో అనుసంధానించే హాచ్ను మధ్యాహ్నం 2.37కు విజయవంతంగా మూసేశారు. → తర్వాత ప్రయాణానికి తుది సన్నాహాలు దాదాపు రెండు గంటల పాటు సాగాయి. అంతరిక్షం నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించే క్షణాల్లో విపరీతమైన రాపిడికి పుట్టుకొచ్చే 1,600 డిగ్రీ సెల్సియస్ వేడిని తట్టుకునేందుకు స్పేస్‌క్రాఫ్ట్‌కు బిగించిన హీట్ షీల్డ్‌ను సరిచూడటం వంటివి పూర్తయ్యాక డ్రాగన్ ముందు భాగాన్ని ఐఎస్ఎస్ నుంచి విడదీశారు. → అనంతరం సాయంత్రం 4.45కు వ్యోమనౌక భూమికి పయనమైంది. → భూమికి దాదాపు 350 కి.మీ. ఎత్తులో ఉండగా సర్వీస్ మాడ్యూల్ నుంచి డ్రాగన్ విడిపోయింది. → భూమి చుట్టూ పలుమార్లు చక్కర్లు కొడుతూ ప్రయాణ దిశ తదితరాలను సరిచేసుకున్న అనంతరం నిర్ధారిత ప్రాంతంలో అది భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది. → క్రమంలో ముందుగా దాని ముందు భాగాన్ని మూసేస్తారు. హీట్‌షీల్డ్ కిందకు ఉండేలా క్యాప్సూల్‌ను సరిచేస్తారు. → విపరీతమైన వేగంతో దూసుకొచ్చే డ్రాగన్‌ను నెమ్మదింపజేసేందుకు భూమికి సుమారు 5.7 కి.మీ. ఎత్తున రెండు రెండు ప్యారాచూట్లు తెరుచుకుంటాయి. అనంతరం 1.8 కి.మీ. ఎత్తున మరో నాలుగు ప్యారాచూట్లు విచ్చుకుంటాయి. → క్యాప్సూల్ వాతావరణంలోకి పునఃప్రవేశించే క్రమంలో పుట్టుకొచ్చే అత్యంత ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా ప్యారాచూట్లను అత్యంత దృఢంగా ఉండే నైలాన్, కెవ్లర్‌లతో తయారు చేస్తారు. → మధ్యాహ్నం 3.01 గంటలకు క్యాప్సూల్ పసిఫిక్ జలాల్లో దిగుతుంది. → అప్పటికే అక్కడ సిద్ధంగా ఉండే స్పెషల్ రికవరీ షిప్ వెంటనే డ్రాగన్ క్యాప్సూల్‌ను చేరుకుంటుంది. → దాన్ని షిప్‌లోకి చేర్చిన అనంతరం శుభాంశుతో పాటు మిగతా ముగ్గురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అందులోంచి బయటికి వస్తారు. → అనంతరం షిప్ మీదే వారందరికీ తొలి దఫా పలురకాల వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. → అనంతరం వారిని హెలికాప్టర్లో ముందుగా తీరానికి, అనంతరం నాసా కార్యాలయంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తారు.ఐఎస్ఎస్ నుంచి ఘనంగా వీడ్కోలు ఐఎస్ఎస్లోని ఏడుగురు సహచర వ్యోమగాములు శుభాంశు బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆ సందర్భంగా పరస్పర కౌగిలింతలు, కరచాలనాలు ముగిసిన అనంతరం వాతావరణం ఉద్వేగపూరితంగా మారింది. 18 రోజుల పాటు కలిసి గడిపిన క్షణాలను అందరూ ఆనందంగా నెమరేసుకున్నారు. ముఖ్యంగా శుభాంశు రుచి చూపిన క్యారెట్, పెసరపప్పు హల్వాను ఎన్నటికీ మర్చిపోలేమని సహచరులు చెప్పుకొచ్చారు. ఫ్లోటింగ్ వాటర్ బబుల్ ఐఎస్ఎస్లో 60కి పైగా ప్రయోగాలు శుభాంశు బృందం ఐఎస్ఎస్లో 18 రోజులు గడిపింది. ఆ క్రమంలో 60 కీలక ప్రయోగాలు చేపట్టింది. అంతరిక్షంలో జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై శుక్లా అధ్యయనం చేశారు. మానవ జీర్ణవ్యవస్థ ఖగోళంలో ఎలా పని చేస్తుందనే అంశంపై భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక వీడియోను ఆయన రూపొందించారు. దాంతోపాటు నలుగురు వ్యోమగాముల బృందం తమ మానసిక స్థితిగతులపైనా ప్రయోగాలు చేసి చూసింది. ఆ క్రమంలో ఫ్లోటింగ్ వాటర్ బబుల్ తయారు చేసి అందులో గడిపింది. అది అద్భుతమైన అనుభవమని శుభాంశు గుర్తు చేసుకున్నారు. ‘‘ఐఎస్ఎస్లో ప్రతి క్షణాన్నీ పూర్తిగా ఆస్వాదించా. ముఖ్యంగా కిటికీ పక్కన కూచుని కిందకు చూడటాన్ని. బహుశా నా జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన అనుభూతి అది’’ అని చెప్పారు. అంతరిక్షంలో వ్యవసాయం దిశగా కూడా వ్యోమగాములు పలు కీలక పరీక్షలు జరిపారు.76 లక్షల మైళ్లు..288 భూ ప్రదక్షిణలు శుభాంశు బృందం ఐఎస్ఎస్లో గడిపిన 18 రోజుల్లో భూమి చుట్టూ ఏకంగా 76 లక్షల మైళ్లకు పైగా ప్రయాణించింది. ఆ క్రమంలో 288 సార్లు భూప్రదక్షిణలు చేసింది. నవభారత శకమిది శుభాంశు భావోద్వేగం భూమికి తిరుగు ప్రయాణమయ్యే ముందు శుభాంశు ఐఎస్ఎస్లో వీడ్కోలు ప్రసంగం చేశారు. 41 ఏళ్ల ముందు రాకేశ్ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలో కాలు పెట్టిన క్షణాలను, అక్కడినుంచి భారత్ కని్పంచిన తీరును వరి్ణంచిన వైనాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘మా తిరుగు ప్రయాణం సందర్భంగా ఈ రోజు ఆకాశం నుంచి భారత్ ఎలా కని్పస్తుందో చూడాలని మా బృందమంతా ఉత్సాహపడుతోంది. నేటి భారత్ ఘనమైన ఆకాంక్షల భారత్. నిర్భయ భారత్. సగర్వంగా తలెత్తుకుని సాగుతున్న భారత్. అందుకే నేడు కూడా నా దేశం మిగతా ప్రపంచమంతటి కంటే మిన్నగా (సారే జహా సే అచ్ఛా) కనిపిస్తోందని చెప్పగలను’’ అంటూ నాడు రాకేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలను శుభాంశు పునరుద్ఘాటించారు. అక్కడి సహచరులపై శుభాంశు ఈ సందర్భంగా ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘ఈ యాత్ర ఇంత అద్భుతంగా సాగుతుందని జూన్ 25న ఫాల్కన్–9 రాకెట్ ద్వారా అంతరిక్షానికి పయనమయ్యే క్షణాల్లో నేనస్సలు ఊహించలేదు! ఇదంతా ఇదుగో, ఇక్కడ నా వెనక నుంచున్న ఈ అద్భుతమైన వ్యక్తుల వల్లే సాధ్యమైంది. ఈ యాత్రను మా నలుగురికీ అత్యంత ప్రత్యేకమైనదిగా మార్చింది వీళ్లే. అంకితభావంతో కూడిన ఇలాంటి అద్భుతమైన వృత్తి నిపుణులతో కలిసి పని చేయడం నిజంగా మరచి పోలేని అనుభూతి’’ అంటూ హర్షం వెలిబుచ్చారు. కలుద్దాం! అతి త్వరలో భూమిపై కలుద్దాం – ఐఎస్ఎస్ నుంచిబయల్దేరే ముందు శుభాంశు శుభాంశూ... సుస్వాగతం ‘‘యాగ్జియం–4 స్పేస్ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగొస్తున్న శుభాంశుకు హార్దిక స్వాగతం. ఆయన రాక కోసం దేశమంతా ఎనలేని ఆనందోత్సాహాలతో, అత్యంత ఉత్సుకతతో ఎదురుచూస్తోంది. – కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్రసింగ్ -
యుద్ధానికి ఆయన వైఫల్యమే కారణం: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్
న్యూఢిల్లీ: పెహల్గాంలో ఉగ్రదాడి, ఆపై చోటు చేసుకున్న పరిస్థితులకు తాను కారణం కాదని, అది జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వైఫల్యమేనని ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు పెహల్గామ్ ఉగ్రదాడికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కారణమన్నారు.కాగా, జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం ఉదయం గోడ దూకి మహారాజా హరిసింగ్‌కు చెందిన డోగ్రా బలగాలు కాల్చిచంపిన వీరుల స్మారకంగా ఉన్న శ్మశానం గోడ దూకి లోపలికి వెళ్లి అక్కడ అమరవీరుల స్థూపాలకు నివాళులు అర్పించారు,. డోగ్రా బలగాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 1931, జూలై 13వ తేదీన పలువురు అమరులయ్యారు. ఈ క్రమంలోనే వారికి కశ్మీర్‌లోని శ్మశాన వాటికలో స్మారక చిహ్నాలు ఏర్పాటు చేశారు. దీన్ని ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. ఆదివారం(జూలై 13) సీఎం అబ్దుల్లాను ఇంటి నుంచి కదలకుండా ఒక బంకర్ ఏర్పాటు చేశారు. అయితే అది సోమవారం తీసేశారు. నేడు(జూలై 14) ఒమర్ అబ్దుల్లా ఒంటరిగా కారులో వెళ్లి ఆ అమరులకు నివాళులు అర్పించే యత్నం చేశారు. అక్కడ అబ్దుల్లాను పోలీసులు అడ్డుకునే యత్నం చేయడంతో గోడ దూకి వెళ్లి నివాళులర్పించి వచ్చారు. దీనిపై అబ్దుల్లా మాట్లాడుతూ.. రాష్ట్రంలో లెఫ్టినెంట్ గవర్నర్ పాలన నడుస్తోందంటూ మండిపడ్డారు. కేంద్ర నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చెప్పినట్లే ఇక్కడ నడుస్తోందన్నారు. అనాలోచిత నిర్ణయాలతో ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్లో పెహల్గాం ఉగ్రదాదాడికి, తర్వాత ఆపరేషన్ సింధూర్ వరకూ భారత్ వెళ్లడానికి ఎల్జీ మనోజ్ సిన్హా వైఫల్యమే కారణమన్నారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదాను తిరిగి పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. -
లోక్‌సభలో కొత్త అటెండెన్స్ వ్యవస్థ
సాక్షి,న్యూఢ్లిలీ: పార్లమెంట్లో ఎంపీలకు డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు లోక్‌సభ వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై పార్లమెంట్లో ఇక ఎంపీలకు డిజిటల్ అటెండెన్స్ వేయనున్నారు. తమకు కేటాయించిన సీట్లలో నుంచి ఎలక్ట్రానిక్ అటెండెన్స్ నమోదు కానున్నాయి. జూలై 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో డిజిటల్ అటెండెన్స్ అమలు కానున్నట్లు లోక్‌సభ తెలిపింది.గతంలో హాజరు నమోదు కోసం ఎంపీలు సంతకాల్లో రిజిస్టర్ చేసే వారు. ఇకపై రాతపూర్వకంగా సంతకం చేసే బదులు డిజిటల్ అటెండెన్స్ పడనుంది. అలాగే 12 భాషల్లో పార్లమెంట్ ఎజెండాను డిజిటల్ సంసద్ పోర్టల్‌లో అందుబాటులోకి రానుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టూల్స్ సహాయంతో స్పీచ్ టు టెక్స్ట్ రికార్డు కానుంది.లోక్‌సభ డిబేట్లను ఇకనుంచి రియల్ టైంలో ఏఐ టూల్స్ అనువదించనున్నట్లు లోక్‌సభ అధికారిక వర్గాల వెల్లడించాయి. -
కర్ణాటకలో మరో నాయకత్వ మార్పు?
కర్ణాటకలో ఇప్పుడు ముఖ్యమంత్రి మార్పు గురించే అక్కడి రాజకీయ వర్గాల్లో ఎక్కవగా చర్చ నడుస్తోంది. సీఎం సిద్ధరామయ్యను తప్పించి డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెడతారని ప్రచారం జోరుగా సాగుతోంది. నాయకత్వ మార్పును కాంగ్రెస్ అధిష్టానం తోసిపుచ్చింది. ముఖ్యమంత్రి మార్పు అంశంపై బహిరంగంగా మాట్లాడొద్దని కన్నడ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఏదోరకంగా దీనిపై చర్చ నడుస్తూనే ఉంది. ఇదే సమయంలో చాప కింద నీరులా ప్రతిపక్ష బీజేపీలోనూ ముసలం మొదలైంది. అయితే దీనిపై మీడియా అంతగా ఫోకస్ చేయలేదు.కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర (BY Vijayendra) సీటు కిందకు నీళ్లు వచ్చే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఆయన నాయకత్వంపై సీనియర్లు గుర్రుగా ఉన్నట్టు తేలడంతో బీజేపీ నాయకత్వం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదని విజయేంద్రపై కేంద్ర నాయకత్వానికి పలువురు ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. సీనియర్ నేతలతో సఖ్యతగా ఉండడం లేదన్న వాదనలు విన్పిస్తున్నాయి. విజయేంద్రతో పాటు ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక పనితీరుపైనా రాష్ట్ర నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్యాడర్‌ను నిర్లక్ష్యం చేయడం వల్లే పార్టీలో సమస్యలు తలెత్తాయని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.రంగం దిగిన 'అప్పా'కొడుకు పదవికి గండం ఏర్పడే పరిస్థితులు నెలకొనడంతో విజయేంద్ర తండ్రి, మాజీ సీఎం యడియూరప్ప (Yediyurappa) స్వయంగా రంగం దిగారు. తన కుమారుడిపై స్థానిక నేతలు, క్యాడర్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించేందుకు ఆయన పయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ బెంగళూరులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వస్తున్నారు. నాయకులు, కార్యకర్తల సమస్యలను సావధానంగా వింటున్నారు. అసంతృప్తులను బుజగించి గ్యాప్ తగ్గించేందును తన అనుభవాన్ని వాడుతున్నారు. పార్టీ కార్యకర్తలు తమ సమస్యలను నేరుగా నాయకత్వం ముందు ప్రసావించడానికి వీలుగా ఒక వేదికను కల్పించేందుకు యడియూరప్ప తిరిగి వచ్చారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. "ఇది విజయేంద్ర తన సొంత నియోజకవర్గం శికారిపురపై దృష్టి పెట్టడానికి కూడా అవకాశం ఇస్తుంది" అని ఒక సీనియర్ కార్యకర్త అన్నారు.2023 నవంబర్‌లో విజయేంద్ర కర్ణాటక బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత యడియూరప్ప క్రియాశీలక రాజకీయాలకు దూరం జరిగారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కొడును గండం నుంచి తప్పించడానికి ఆయన తిరిగి రావాల్సి వచ్చింది. బెంగళూరులోని జగన్నాథ్ భవన్లో ప్రతిరోజు నాయకులు, కార్యకర్తలకు పెద్దాయన అందుబాటులో ఉంటున్నారు. రాజకీయంగా ఆయన ఇంకా చురుగ్గానే ఉన్నారని, గణనీయమైన ప్రభావాన్ని చూపగలరని సన్నిహితులు పేర్కొంటున్నారు.విజయేంద్రకు వ్యతిరేకంగా పావులుపార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ఎమ్మెల్యేలు బిపి హరీష్, మాజీ ఎమ్మెల్యే కుమార్ బంగారప్ప, మాజీ కేంద్ర మంత్రి జీఎం సిద్దేశ్వర నేతృత్వంలోని వర్గాలు.. విజయేంద్రకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. లింబవల్లి, రమేష్ జార్కిహోళి, ప్రతాప్ సింహా, హరీష్ తదిరత నాయకులు కూడా విజయేంద్ర నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. పార్టీలో అసమ్మతిని గుర్తించిన అధినాయకత్వం.. పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని (Pralhad Joshi) కర్ణాటకకు పంపించింది. అసమ్మతి నేతలతో ఆయన జరిపిన సమావేశాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదని అంతర్గత వర్గాల సమాచారం. ఇంత జరుగుతున్నా విజయేంద్రకే పార్టీ మద్దతుగా నిలిచింది. అసమ్మతి గళం వినిపించిన ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్‌ను సస్పెండ్ చేసి.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను సహించబోమని సందేశం పంపింది.నాయకత్వ మార్పు తప్పదా?కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల కర్ణాటక పర్యటన తర్వాత పార్టీ అంతర్గత పునర్వ్యవస్థీకరణలపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి. విజయేంద్ర శిబిరం నమ్మకంగా ఉన్నప్పటికీ, నాయకత్వ మార్పు తప్పదని ఊహాగానాలు మొదలయ్యాయి. విజయేంద్ర ఢిల్లీ పర్యటన కూడా ఈ ప్రచారానికి ఊతం ఇచ్చింది. అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక (R Ashoka) కూడా హస్తినలో ఉండడంతో ప్రచారం జోరందుకుంది. అయితే ప్రతిపక్ష నేతను మార్చే అవకాశం ఉందంటూ కొత్త ప్రచారం మొదలైంది.చదవండి: స్టాలిన్ చాణక్యం.. ఏకమైన మారన్ బ్రదర్స్! ఏమైనా జరగొచ్చు..పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారని మేము అనుకోవడం లేదు. కానీ ప్రతిపక్ష నాయకుడిని మార్చే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నాయకుడొకరు వెల్లడించారు. ఏమైనా జరగొచ్చు అంటూ మరో సీనియర్ నేత వ్యాఖ్యానించారు. "ఎవరూ హైకమాండ్ మనసును చదవలేరు. కానీ ఒకటి మాత్రం స్పష్టం. పార్టీని ఏకం చేసి మమల్ని ఎన్నికల మోడ్‌లోకి నడిపించగల వ్యక్తిని అధినాయకత్వం ఎంపిక చేస్తుంద"ని అన్నారు. మరి కొడుకును కాపాడటానికి కోసం రంగంలోకి దిగిన యడియూరప్ప తాను అనుకున్నది సాధిస్తారా, లేదా అనేది వేచి చూడాలి. -
మూడు దశాబ్దాల తర్వాత ఉగ్రమూకల అరెస్టుపై బీజేపీ హర్షం
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి మూడు దశాబ్దాలుగా చిక్కకుండా తిరుగుతున్న ముగ్గురు టెర్రరిస్టులను ఏటీఎస్( యాంటీ టెర్రరిజం స్వ్కాడ్) అదుపులోకి తీసుకోవడంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై హర్షం వ్యక్తం చేశారు. సదీఖ్ అలీ అలియాస్ టైలర్ రాజా, మహ్మద్ అలీ మన్సూర్, అబుబాకర్ సిద్ధిఖిలను ఏటీస్ బృందం అదుపులోకి తీసుకోవడాన్ని ప్రత్యేకంగా అభినందించారాయన. ఇది తమిళనాడు ఏటీఎస్ పోలీసుల ఘనత అంటూ ఆయన కొనియాడారు. రాష్ట్రంలో జరిగిన ఉగ్ర కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించిన ఈ ముగ్గుర్ని మూడు దశాబ్దాల తర్వాత పట్టుకోవడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ మేరకు అన్నామలై ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. After three decades, the Tamil Nadu Anti-Terrorism Squad has successfully arrested three long-absconding terrorists, Sadiq Ali (also known as Tailor Raja), Mohammed Ali Mansoor, and Abubacker Siddique, linked to a series of targeted terror attacks across Tamil Nadu.These… pic.twitter.com/ODNkJ5HqwW— K.Annamalai (@annamalai_k) July 14, 20251998లో కోయాంబత్తూర్‌లో జరిగిన ఉగ్రదాడిలో 59 మంది ప్రాణాలు కోల్పోగా, మరొకవైపు 1993లో చెన్నై ఆర్ఎస్ఎస్ ఆఫీస్‌లో జరిగిన బాంబు దాడి జరిగింది. ఇక 1995లో నాగూర్‌లో హిందూ మున్నాని నాయకుడు ముతుకృష్ణన్ భార్యను పొట్టనపెట్టుకున్నారు ఈ ఉగ్రవాదులు. రామాయణం పుస్తకంలో బాంబు దాచి ముతుకృష్ణన్ భార్యను హత్య చేశారు. ఇలా పలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ వీరిపై ఏటీఎస్ నిఘా వేసి ఉంచింది. తప్పుడు ఐడెంటీ కార్డులతో ఖాళీగా ఉండే ప్రదేశాలను ఎన్నుకుని తప్పించుకుని తిరుగుతూ ఉన్న వీరిని ఎట్టకేలకు ఏటీఎస్ బృందం పట్టుకుంది. -
భర్త కనుపాప అలసి.. న్యాయం కోసం ఎదురు చూపులు..
భార్య నుంచి భర్త భరణాన్ని కోరవచ్చా? చట్టాలు అందుకు సమ్మతిస్తాయా?. పిల్లల్ని మాత్రమే చదివించాలని.. భార్యలను చదివించవద్దని సోషల్ మీడియాలో ఆ మధ్య ప్రచారం ఎందుకు నడిచింది?. భరణానికి.. ఈ ప్రచారానికి అసలు సంబంధం ఏంటి?.. జ్యోతి-అలోక్ కేసు సంచలన తీర్పునకు వేదిక కాబోతోందా?. ఇదంతా తెలియాలంటే ఈ సంచలన కేసు వివరాల్లోకి వెళ్లాల్సిందే.. జ్యోతి మౌర్య ఉత్తర ప్రదేశ్‌లో పీసీఎస్ అధికారిణి. ఆమె భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగే(శానిటేషన్ డిపార్ట్మెంట్లో 4వ కేడర్ ఉద్యోగి). అయితే గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తన భార్య నుంచి భరణం కోరుతూ ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. తన భార్య జ్యోతి సంపాదన తన కంటే చాలా ఎక్కువని, పైగా తనకున్న అనారోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని భరణం ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశాడతను.గతంలో ప్రయాగ్‌రాజ్ ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. విచారణకు స్వీకరించిన కోర్టు.. జ్యోతి మౌర్యకు నోటీసులు పంపింది. ఈ కేసులో తదుపరి విచారణ ఆగష్టు 8వ తేదీన జరగనుంది. అయితే ఈ కేసు ఇప్పటికిప్పుడే వార్తల్లోకి ఎక్కింది కాదు. బాగా చదివించిన భార్య తనను మోసం చేసి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందుంటూ చాన్నాళ్ల కిందట వైరల్ అయిన కథనం తాలుకాదే..!పారిశుద్ధ్య కార్మికుడైన అలోక్ మౌర్యకు 2010లో జ్యోతి అనే యువతితో వారణాసి చిరైగావ్ గ్రామంలో జరిగింది. అప్పటికి ఆమె వయసు 20 ఏళ్లు. డిగ్రీ చేసి ఇంటి వద్దే ఖాళీగా ఉంటోంది. దీంతో.. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలని అలోక్ ఆమెను ప్రొత్సహించాడు. అలా ఆమె కష్టపడి 2015లో పీసీఎస్(Provincial Civil Services) పరీక్షలు రాసి 16వ ర్యాంకుతో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ జాబ్ దక్కించుకుంది. అప్పటి నుంచి జౌన్పూర్, కౌశంబి, ప్రతాప్‌ఘడ్, ప్రయాగ్‌రాజ్‌లలో ఆమె విధులు నిర్వహించింది. ఆ జంటకు 2015లో కవల పిల్లలు పుట్టారు.2020లో వీళ్ల కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన హోం గార్డ్ కమాండెంట్ మనీష్ దుబేతో జ్యోతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో అలోక్-జ్యోతి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో లక్నోలోని ఓ హోటల్లో ఈ ఇద్దరినీ రెడ్‌హ్యాండెండ్‌గా అలోక్ పట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన తర్వాత భర్తకు దూరంగా ఉంటూ వచ్చింది జ్యోతి. ఈ క్రమంలో.. 2023లో తనను హత్య చేసేందుకు తన భార్య జ్యోతి కుట్ర పన్నుతుందంటూ అలోక్ పోలీసులను ఆశ్రయించాడు. అదే సమయంలో జ్యోతి కూడా తనను కట్నం కోసం భర్త, అతని కుటుంబం వేధిస్తోందంటూ కేసు పెట్టారు. ఈలోపు జ్యోతి అవినీతి బాగోతమంటూ వాట్సాప్ చాటింగ్, డైరీకి సంబంధించిన పేజీలు ఆన్లైన్లో చక్కర్లు కొట్టాయి. అప్పుడే తనకు న్యాయం కావాలంటూ అలోక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియో నెట్లో బాగా వైరల్ అయ్యింది.ఇదిలా ఉండగా.. ఈ కేసు నేపథ్యంలో ‘‘బేటీ పడావో.. బీవీ నహీ(పిల్లలను చదివించండి.. భార్యలను కాదు)’’ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టులతో చర్చ నడిచింది. ఏకంగా కొందరు ఈ లైన్ మీద బాణీలు కట్టి యూట్యూబ్‌లలో వదిలారు. సరిగ్గా అదే సమయంలో ఓ కులాన్ని కించపరిచేలా జ్యోతి చేసిన ప్రసంగం నెట్టింట మంట పుట్టించింది. జ్యోతి క్షమాపణలు చెప్పాలంటూ భీమ్ ఆర్మీ నిరసలకు దిగింది. భర్త భరణానికి అర్హుడేనా?హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 24 ప్రకారం.. పోషించుకోలేని పరిస్థితుల్లో భార్యభర్తల్లో ఎవరికైనా సరే భరణం పొందే అర్హత ఉంది. ఈ లెక్కన ఈ భరణం పిటిషన్.. రాబోయే రోజుల్లో చర్చనీయాంశమయ్యే అవకాశం లేకపోలేదు.ప్రొఫెషనల్‌గానూ..వ్యక్తిగత జీవితంతోనే కాదు.. వృత్తిపరంగానూ జ్యోతి మీద విమర్శలు ఉన్నాయి. ఇంతకు ముందు బరేలీ సెమీఖేదా షుగర్ మిల్కు ఆమె జనరల్ మేనేజర్‌గా పని చేశారు. ఆమె హయాంలో వివిధ కార్యకలాపాల జాప్యంతో చెరుకు రైతులు నిరసనలకు దిగారు. ఇటు రైతులే కాదు, అటు తోటి అధికారులు ఆమె వ్యవహార శైలిపై ఫిర్యాదులు చేశారు. దీంతో.. 2023లో ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది. లక్నో హెడ్ క్వార్టర్స్‌కు ఆమెను బదిలీ చేసినప్పటికీ.. ఇప్పటిదాకా ఎలాంటి బాధ్యతలను అప్పజెప్పకపోవడం గమనార్హం. -
ముఖ్యమంత్రిని నెట్టిపడేసిన పోలీసులు
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. జమ్మూకశ్మీర్‌లో జూలై 13న అమరవీరుల దినోత్సవం. అయితే అమరవీరలుకు నివాళులు అర్పించేందుకు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఎప్పటిలాగా ఇవాళ అక్కడ స్థానికులు అమర వీరుల స్థూపంగా భావించే మజార్-ఎ-షుహదా వద్ద నివాళులర్పించేందుకు ప్రయత్నించారు. గోడదూకేందుకు ప్రయత్నించగా.. గవర్నర్ ఆదేశాలతో అప్పటికే మొహరించిన పోలీసులు ఆయన్ను పక్కకు లాగారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, పోలీసుల తీరుపై సీఎం ఓమర్ అబ్ధుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ఏ చట్టవిరుద్ధమైన పని చేయలేదు. వీళ్లు (పోలీసులు) మమ్మల్ని ఆపాలని ఏ చట్టం చెబుతోందని ప్రశ్నించారు. ఇది స్వేచ్ఛా దేశమని చెబుతారు. కానీ వాళ్లు మమ్మల్ని బానిసలుగా భావిస్తున్నారు. మేము ప్రజలకు మాత్రమే బానిసలం. ఎవరికి బానిసలం కాదు’అని అన్నారు.కాశ్మీర్ అమరవీరుల దినోత్సవం. బ్రిటీష్ ఇండియాలోని జమ్మూ కశ్మీర్ డోగ్రా దళాల చేతుల్లో 1931, జూలై 13 న 21 మంది ప్రాణాలు కోల్పోయారు. వారికి నివాళులర్పిస్తూ ప్రతి ఏడాది జులై 13న అధికారికంగా అమరవీరుల దినోత్సవం జరుగుతుంది. పబ్లిక్ హాలుడే. ప్రభుత్వం,ప్రతిపక్ష పార్టీలు.. అమర వీరుల స్థూపం వద్ద అధికారికంగా నివాళులర్పించేవి. సీఎం నేతృత్వంలో అధికారిక నివాళి కార్యక్రమం జరిగేది. జమ్మూ కాశ్మీర్ పోలీసు దళాలు సైతం ఇందులో పాల్గొనేవి. కానీ ఆగస్టు 5, 2019న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఆ మరుసటి ఏడాది నుంచి అంటే జూలై 2020లో ఈ సెలవు దినంతో పాటు అధికారిక నివాళులు రద్దయ్యాయి.ఈ క్రమంలో ఇవాళ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశాల మేరకు అమరవీరులకు నివాళులర్పించేందుకు ఎలాంటి అనుమతి లేదు. అయినప్పటికీ సీఎం ఓమర్ అబ్దుల్లా నివాళులర్పించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. This is the physical grappling I was subjected to but I am made of sterner stuff & was not to be stopped. I was doing nothing unlawful or illegal. In fact these “protectors of the law” need to explain under what law they were trying to stop us from offering Fatiha pic.twitter.com/8Fj1BKNixQ— Omar Abdullah (@OmarAbdullah) July 14, 2025పోలీసులు బంకర్లు ఏర్పాటు చేశారు. ఇతర పార్టీల నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. -
నా మార్ఫింగ్ ఫొటోల్ని సృష్టించింది మా పార్టీవాళ్లే!
మమతా బెనర్జీ అధినాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ తీవ్ర కలకలం రేగింది. స్టూడెంట్ వింగ్ లీడర్ రాజన్యా హల్దార్(Rajanya Haldar) సంచలన ఆరోపణలకు దిగిన సంగతి తెలిసిందే. తన మార్ఫింగ్ ఫొటోల వ్యవహారం వెనుక టీంఎసీవాళ్లే ఉన్నారని రాజన్య ఆరోపించగా.. టీఎంసీ ఆ ఆరోపణలకు స్పందించింది.టీఎంసీ స్టూడెంట్ వింగ్ లీడర్(TMCP) అయిన రాజన్య హల్దార్.. గతంలో జాదవ్‌పూర్ వర్సిటీకి ప్రెసిడెంట్‌గా పని చేశారు. కిందటి ఏడాది ఓ షార్ట్ ఫిల్మ్ కారణంగా తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. దీంతో టీఎంసీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తాజాగా కోల్‌కతా లా కాలేజీ అత్యాచార ఉదంతంపైనా ఆమె ఓ టీవీ షోలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఘటనను ఖండించిన ఆమె.. విద్యార్థి నాయకుల్లోని దురుద్దేశాలను, నేరస్వభావాన్ని ఈ కేసు బయటపెట్టిందంటూ ప్రధాన నిందితుడు, టీఎంసీ స్టూడెంట్ మాజీ లీడర్ మోనోజిత్ మిశ్రాను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారామె. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన రోజు నుంచే ఆమె పేరిట అశ్లీల చిత్రాలు నెట్టింట చక్కర్లు కొట్టడం మొదలైంది. దీంతో కోల్‌కతా సైబర్ పోలీసులను ఆశ్రయించారామె. తన డీప్‌ఫేక్ న్యూడ్ ఫొటోలను వైరల్ చేస్తోంది టీఎంసీ వాళ్లేనని ఆరోపిస్తున్నారామె. ‘‘ఉద్దేశపూర్వకంగానే పార్టీలో ఉన్న జూనియర్ లీడర్లు కొందరు ఏఐ సాయంతో నా డీప్‌ఫేక్ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. పార్టీ అధిష్టానం గనుక తన వివరణ తీసుకుని దర్యాప్తు జరిపిస్తుందని మాటిస్తే.. వాళ్ల పేర్లను వెల్లడించేందుకు తాను సిద్ధమని ప్రకటించింది. అదే సమయంలో ఫేస్‌బుక్‌లోనూ ఆమె ఓ పోస్ట్ చేశారు. ‘‘ఇది నా ప్రతిష్టను దెబ్బ తీయడానికే విద్యార్థి విభాగంలో కొందరు చేసిన పని. నా పాపాలను కప్పిపుచ్చుకునేందుకు నేను ఈ నాటకాలు ఆడుతున్నానని ప్రచారం చేస్తున్నారు. ఏది సత్యమో నిర్ణయించాల్సింది ఇక చట్టమే’’ అని అన్నారామె.కోల్‌కతాలోని వివిధ లొకేషన్ల నుంచి ఆ ఫొటోలు షేర్ అయ్యాయి. ఈ ఫేక్ ఫొటోలతో తనను బద్నాం చేయడం మాత్రమే కాదు.. టీఎంసీ విద్యార్థి విభాగంలోని యువతుల్లో కొందరిని పదవుల ఆశ చూపించి లొంగదీసుకునే ప్రయత్నం కూడా అని ఆరోపించారామె. అయితే ఈ వ్యవహారంపై టీఎంసీ స్పందించింది. ఈ విషయాన్ని రాజన్య తమకు దృష్టికి తేలేదని.. ఒకవేళ తగిన ఆధారాలతో సంప్రదిస్తే విచారించి కచ్చితంగా చర్యలు తీసుకుంటామని సీనియర్ నేత, మంత్రి ఫిర్హద్ హకీమ్ చెబుతున్నారు.రాజన్య హల్దార్ టీఎంసీ విద్యార్థి విభాగం సహచరుడు, ఫిల్మ్ మేకర్ అయిన ప్రాంతీక్ చక్రవర్తిని కిందటి ఏడాది వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ ఇద్దరూ పొలిటికల్ థీమ్‌తో కూడిన షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్జీకర్ దారుణ ఘటన ఉదంతాన్ని పోలిన షార్ట్ ఫిలింలో ఆమె నటించారు. ఇది దుమారం రేపడంతో ఆమెను పార్టీ సస్పెండ్ చేసింది. ఇదిలా ఉంటే.. రాజన్య భర్త ప్రాంతీక్ పార్టీలోకి తీసుకొచ్చిన కొందరిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అంతెందుకు లా స్టూడెంట్ అత్యాచార ఉదంతంలో అరెస్ట్ అయిన మోనోజిత్ మిశ్రాకు ప్రాంతీక్కు అత్యంత సన్నిహితుడు ఈ ఎపిసోడ్లో మరో కోసమెరుపు.ఇదీ చదవండి: యమునా నదిలో శవమై తేలిన ఢిల్లీ వర్సిటీ స్టూడెంట్ -
గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు
సాక్షి,న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గవర్నర్లను నియమించారు. హర్యానా గవర్నర్‌గా ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్,గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్ గజపతి రాజు (Pusapati Ashok Gajapathi Raju) ,లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గుప్తా నియమిస్తూ సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారుఅశోక్ గజపతి రాజు రాజకీయ నేపథ్యంపూసపాటి అశోక్ గజపతి రాజు టీడీపీ సీనియర్ నేతగా, కేంద్ర మాజీ మంత్రిగా రాజకీయాల్లో రాణించారు. తాజాగా ఆయన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గోవా గవర్నర్‌గా నియమించారు. అశోక్ గజపతిరాజు ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో ఎంపీగా గెలిచి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్సైజ్, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఫైనాన్స్ వంటి కీలక శాఖలను నిర్వహించారు.రాజవంశీయ నేపథ్యంఅశోక్ గజపతి రాజు తండ్రి పూసపాటి విజయరామ గజపతి రాజు. విజయనగరం సంస్థానపు చివరి మహారాజు. అశోక్ గతపతి రాజు రాజకీయాలతో పాటు సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా సేవలందించారు. ఇవాళ గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజును నియమిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ అధికారికంగా ప్రకటించింది. -
నిమిష కేసు: చేతులెత్తేసిన కేంద్రం! అంతా మంచి జరగాలంటూ..
కేరళ నర్సు నిమిషా ప్రియా కేసులో కేంద్రం చేతులెత్తేసింది. యెమెన్‌లో ఈ నెల 16వ తేదీన ఆమె మరణ శిక్ష అమలు కానుంది. అయితే కేంద్రం తక్షణ జోక్యం చేసుకుని.. నిమిష శిక్షను తప్పించేలా అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం అత్యవసర విచారణ జరిపింది. ఈ కేసులో ఎలా ఆర్డర్ పాస్ చేయాలి, ఎవరు ఫాలో అవుతారని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆరా తీసింది. అయితే తాము (కేంద్రం) చేయగలిగినదంతా చేశామని, యెమెన్‌తో భారత్‌కు సత్సంబంధాలు అంతగా లేవని, అయినా కూడా అక్కడి ప్రాసిక్యూటర్‌కు మరణశిక్షను వాయిదా వేయాలని రాశామని, బ్లడ్‌మనీ చివరి అవకాశమని, ఆ చర్చలంతా ప్రైవేట్ వ్యవహారమని, అందులో ప్రభుత్వ జోక్యం ఉండబోదని, అంతా మంచి జరగాలని ప్రార్థిస్తున్నామని అటార్నీ జనరల్ వెంకటరమణి ధర్మాసనానికి స్పష్టం చేశారు. దీంతో జస్టిస్ సందీప్ మెహతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ప్రాణాలు పోతే గనుక చాలా బాధాకరమని అన్నారాయన. అయితే అనధికారిక మార్గాలు ఏమైనా ఉన్నాయో పరిశీలన చేసి వెంటనే సంప్రదించాలని ఆయన ఏజీకి సూచిస్తూ.. ఈ పిటిషన్లో విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. యెమెన్‌లో ఓ వ్యక్తిని చంపిన కేసులో నిమిషా ప్రియాకు 2017లో మరణశిక్ష పడింది. యెమెన్‌లో తాను తీవ్ర చిత్రహింసలకు గురయ్యానని, తన వ్యాపార భాగస్వామి(బాధితుడి) తన పాస్‌పోర్టును తిరిగి పొందేందుకు అతనికి మత్తు మందు ఇచ్చానని నిమిష చెబుతోంది. అయితే మత్తుమందు డోస్ ఎక్కువ కావడంతో అతను మరణించాడని తేలింది. ఈ కేసులో చివరగా మిగిలిన ఆశ బ్లడ్‌మనీ ఒక్కటే. షరీయత్ చట్టం ప్రకారం ‘బ్లడ్ మనీ’ చెల్లిస్తే క్షమాపణ దక్కే అవకాశం ఉంది. అయితే.. బాధితుడి కుటుంబానికి $1 మిలియన్ (రూ. 8.3 కోట్లు) చెల్లించేందుకు నిమిష కుటుంబం అంగీకరించింది. కానీ అవతలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరణశిక్ష అమలుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిన తరుణంలో నిమిషాకు అంతర్జాతీయ మద్దతు కోసం ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. -
చర్లపల్లి, హైదరాబాద్, విశాఖ... ఈ రోజుల్లో రైళ్లు రద్దు
న్యూఢిల్లీ: దేశంలోని పలు రైల్వే డివిజన్లలో ట్రాక్ నిర్వహణ, సాంకేతిక నవీకరణ పనులు కొనసాగుతున్నందున జార్ఖండ్ గుండా వెళ్లే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయనున్నట్లు భారతీయ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. చక్రధర్పూర్ డివిజన్లో జరుగుతున్న పనులు రైలు సేవలకు అంతరాయం కలిగిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ప్రయాణాలకు సిద్ధమవుతున్నవారు రద్దవుతున్న రైళ్ల వివరాలను, తేదీలను తెలుసుకోవడం ద్వారా అందుకు అనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోగలుగుతారు. ఈ రైళ్ల రద్దు ప్రభావం చర్లపల్లి, హైదరాబాద్, విశాఖపట్టణంలో కనిపించనుంది.చర్లపల్లి, హైదరాబాద్, విశాఖలలో రద్దయ్యే రైళ్లివే.. రైలు నం. 17007 చర్లపల్లి - దర్భంగా ఎక్స్‌ప్రెస్ (వయా రాంచీ ) 2025, ఆగస్టు 26, సెప్టెంబర్ 9 తేదీలలో రాకపోకలు సాగించదు.రైలు నం. 17008 దర్భంగా - చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ (వయా రాంచీ) 2025 ఆగస్టు 29, సెప్టెంబర్ 12 తేదీలలో రద్దు కానుంది.రైలు నం. 18523 విశాఖపట్నం - బనారస్ ఎక్స్‌ప్రెస్ (వయా రాంచీ) 2025, ఆగస్టు 27, 31, సెప్టెంబరు 7, 10 తేదీలలో రాకపోకలు సాగించదు.రైలు నం. 18524 బనారస్ - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (వయా రాంచీ) 2025, ఆగస్టు 28, సెప్టెంబర్ 1,8, 11 తేదీలలో రద్దు చేయనున్నారు.రైలు నం. 17005 హైదరాబాద్ - రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ (వయా రాంచీ) 2025, ఆగస్టు 28న రద్దు కానుంది.రైలు నం. 17006 రక్సౌల్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ (వయా రాంచీ) 2025, ఆగస్టు 31న నడవదు.రైలు నం. 07051 చర్లపల్లి - రక్సౌల్ స్పెషల్ (వయా రాంచీ) 2025, ఆగస్టు 30న నడవదు.రైలు నం. 07052 రక్సౌల్ - చర్లపల్లి స్పెషల్ (వయా రాంచీ) 2025, సెప్టెంబర్ 2న నడవదు.రైలు నం. 07005 చర్లపల్లి - రక్సౌల్ స్పెషల్ (వయా రాంచీ) 2025, సెప్టెంబర్ 1న రద్దు కానుంది.రైలు నం. 07006 రక్సౌల్ - చర్లపల్లి స్పెషల్ (వయా రాంచీ) 2025, సెప్టెంబర్ 4న రద్దు చేయనున్నారు. -
ఉత్తరాదికి శ్రావణ శోభ.. ఆకట్టుకుంటున్న వీడియోలు
న్యూఢిల్లీ: నేడు దేశంలోని ఉత్తరాదిన తొలి శ్రావణ సోమవారం. ఎంతో పవిత్రమైనదిగా భావించే ఈరోజున వివిధ దేవాలయాల ముందు వేలాది మంది భక్తులు క్యూ కట్టారు. ఉత్తరాదిన శ్రావణ మాసం జూలై 11న ప్రారంభమై, ఆగస్టు 9న ముగుస్తుంది. ఇది హిందూ చంద్రమాన క్యాలెండర్లో ఐదవ నెల. శివునికి ఎంతో ప్రతీకరమైన మాసంగా శ్రావణమాసం గుర్తింపు పొందింది. #WATCH | Varanasi, Uttar Pradesh | The district administration showers flower petals on the devotees standing in queue to offer prayers at the Kashi Vishwanath temple. The flower shower was completed in the presence of Police Commissioner Mohit Agarwal, DM Satyendra Kumar,… pic.twitter.com/TeTLtcXrQL— ANI (@ANI) July 14, 2025శ్రావణ సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో భద్రతను మరింతగా పెంచారు. యాత్రికుల రద్దీని తట్టుకునేందుకు నిర్వాహకులు నెల రోజులు ముందు నుండే సన్నాహాలు చేస్తున్నారని వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ తెలిపారు.#WATCH | Bhasma Aarti being performed at Ujjain's Mahakaleshwar Jyotirlinga Temple on the first Monday of the holy month of 'saavan'. pic.twitter.com/2exWEHzPuA— ANI (@ANI) July 13, 2025కన్వరియాల కోసం, ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్ నుండి వచ్చే భక్తుల కోసం ఒక ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఆలయ ప్రాంగణం సీసీటీవీ నిఘాలో ఉంది. సమీప ప్రాంతాలను పర్యవేక్షించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. భక్తులను క్రమబద్ధీకరించేందుకు బారికేడ్లను ఏర్పాటు చేశారు.#WATCH | Jaipur, Rajasthan | Devotees throng the Jharkhand Mahadev temple on the first Monday of the Holy Month of Shraavan pic.twitter.com/CNFoPa4779— ANI (@ANI) July 14, 202512 జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వనాథుని ఆలయంలో భక్తులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో ఉదయం వేళ భస్మ హారతి నిర్వహించారు. ముందుగా మహాకాళునికి నీటితో స్నానం చేయించారు. తరువాత పాలు, పెరుగు, నెయ్యి, తేనె పండ్లతో ‘పంచామృత అభిషేకం’ చేశారు. అనంతరం స్వామివారికి విభూతి సమర్పించారు. ఆ సమయంలో శంఖునాదాలు, గంటల శబ్దాలతో ఆలయం ప్రతిధ్వనించింది.#WATCH | Ayodhya, Uttar Pradesh | A huge crowd of devotees visit Nageshwar Nath Temple to offer prayers on the first Monday of 'saavan' month. pic.twitter.com/pI2sGr1w3F— ANI (@ANI) July 14, 2025యూపీలోని పరశురామేశ్వర్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఘజియాబాద్‌లోని దూధేశ్వర్ మహాదేవ్ ఆలయం, ఢిల్లీలోని గౌరీ శంకర్ ఆలయం, శ్యామ్ నాథ్ ఆలయం, లక్నోలోని మంకమేశ్వర్ ఆలయం, అయోధ్యలోని క్షీరేశ్వర్ నాథ్ ఆలయం, దేవఘర్‌లోని బైద్యనాథ్ ఆలయం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గౌహతిలోని సుక్రేశ్వర్ ఆలయం, ముంబైలోని బాబుల్నాథ్ ఆలయం భారీ జనసమూహంతో నిండిపోయాయి. మీరట్‌లోని కాళీ పల్తాన్ ఆలయం, సనాతన ధర్మ ఆలయం, దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం, గ్వాలియర్‌లోని అచలేశ్వర్ ఆలయం భక్తులతో కళకళలాడుతున్నాయి. #WATCH | Mumbai, Maharashtra | Devotees throng Babulnath Temple to offer prayers on the first Monday of 'saavan' month. pic.twitter.com/ZoMOG7plmw— ANI (@ANI) July 14, 2025 -
ద్వైపాక్షిక సంబంధాల్లో మెరుగుదల: చైనాలో జైశంకర్
బీజింగ్: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తాజాగా చైనా రాజధాని బీజింగ్‌లో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌ను కలుసుకున్నారు. తన పర్యటన నేపధ్యంలో ఇరు దేశాల మధ్య సానుకూల చర్చలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో)అధ్యక్ష పదవికి భారతదేశం మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.జైశంకర్ తన ‘ఎక్స్’ పోస్టులో తాను బీజింగ్ కు చేరుకున్నాక ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. చైనా ఎస్సీఓ అధ్యక్ష పదవికి భారతదేశం మద్దతు ఇస్తున్నట్లు తెలియజేశానని పేర్కొన్నారు. ఇరు ద్వైపాక్షిక సంబంధాలలో మెరుగుదల గమనించానని, తన పర్యటనలో జరిగే చర్చలు సానుకూల పథాన్ని కొనసాగిస్తాయని నమ్ముతున్నానని అన్నారు. Pleased to meet Vice President Han Zheng soon after my arrival in Beijing today. Conveyed India’s support for China’s SCO Presidency. Noted the improvement in our bilateral ties. And expressed confidence that discussions during my visit will maintain that positive trajectory. pic.twitter.com/F8hXRHVyOE— Dr. S. Jaishankar (@DrSJaishankar) July 14, 2025గతంలో కజాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ- చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ మధ్య జరిగిన సమావేశం అనంతరం రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని జైశంకర్ పేర్కొన్నారు. భారత్- చైనా దౌత్య సంబంధాలు 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాయన్నారు. కైలాశ్ మానసరోవర్ యాత్ర పునఃప్రారంభాన్ని చాలామంది ప్రశంసిస్తున్నారని అన్నారు. ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న భారత్, చైనాల మధ్య అభిప్రాయాలు, దృక్పథాల బహిరంగ మార్పిడి చాలా ముఖ్యమని అంటూనే, తన. పర్యటన అలాంటి చర్చలకు దారితీస్తుందని భావిస్తున్నానని అన్నారు. -
ప్రేమించుకున్న అన్నాచెల్లెళ్లు.. గ్రామానికే అరిష్టమని..!
ఒడిశా: ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో ప్రేమికులను నాగలికి కట్టి ఊరేగించిన ఘటన సంచలనం రేకెత్తించింది. జిల్లాలోని నారాయణ పట్న సమితి, బొరికి గ్రామ పంచాయతీ పెద్ద ఇటికి గ్రామంలో ఒకే వంశానికి చెందిన ఇద్దరు గిరిజనులు ప్రేమించుకున్నారు. ఈ విషయం రథయాత్ర సమయంలో వెలుగులోకి రావడంతో పెద్దలు కఠిన శిక్ష విధిస్తారనే భయంతో వీరు ఆంధ్రాకు పారిపోయారు. కానీ, వారి ఆచూకీని ఇరు కుటుంబాల వారు పసిగట్టి గ్రామ పెద్దలకు నివేదించారు.ఒకే వంశానికి చెందిన వీరిద్దరూ అన్నాచెల్లెళ్లు అవుతారు. వీరిద్దరూ ప్రేమించుకోవడం గ్రామానికే అరిష్టమని, పంటలు పండవని, పాపశుద్ధి జరగాలని పేర్కొంటూ వీరిని ఆదివారం ఊరికి రప్పించారు. అయితే ప్రేమికులు తాము ఎలాంటి శిక్షనైనా భరిస్తాం గానీ విడిపోయి ఉండలేమని తేల్చి చెప్పారు. దీంతో వారిని గ్రామం నడిబొడ్డున నాగలికి కట్టి ఊరేగించి శుద్ధిజలం చల్లారు. శిక్ష అమలు తర్వాత ఇద్దరూ కలిసి ఉండొచ్చని పెద్దలు నచ్చజెప్పి తీసుకురావడం గమనార్హం. -
‘ఆపరేషన్ కాలానేమి’తో దొంగ బాబాల్లో వణుకు.. 82 మంది ఆటకట్టు
డెహ్రాడూన్: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నకిలీ బాబాల మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటూ, ఈ నకిలీ బాబాలు తమ ఇష్టానుసారం చెలరేగిపోతున్నారు. అయితే ఇటువంటి వారి ఆటకట్టించేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది. తాజాగా ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో నిర్వహించిన ‘ఆపరేషన్ కాలానేమి’లో మొత్తం 82 మంది నకిలీ బాబాలను పోలీసులు అరెస్ట్ చేశారు.ఉత్తరాదిలో చార్ ధామ్ యాత్ర, కన్వర్ యాత్ర కొనసాగుతున్న దృష్ట్యా నకిలీ బాబాలు పుట్టుకువస్తున్నారు. దీనిని గుర్తించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం ‘ఆపరేషన్ కాలానేమి’ని చేపట్టి, దొంగబాబాల ఆగడాలను కట్టడి చేస్తోంది. ప్రజలను మోసం చేసేందుకు సాధువులు, స్వామీజీల వేషం ధరించినవారిని గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. డెహ్రాడూన్‌లో జరిగిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 82 మంది నకిలీ బాబాలను అరెస్టు చేసినట్లు వివరించారు.మతం ముసుగులో ప్రజలను దోపిడీ చేసేందుకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సూచనల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించినట్లు డెహ్రాడూన్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్ఎస్పీ) అజయ్ సింగ్ తెలిపారు. అరెస్టు చేసిన దొంగ బాబాలపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని పలు విభాగాల కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అజయ్ సింగ్ పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో బంగ్లాదేశ్ జాతీయుడు షా ఆలం అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతన్ని డెహ్రాడూన్ జిల్లాలోని సహస్పూర్లో అరెస్టు చేశారు. -
డార్క్ క్వీన్ సాన్ రేచల్ కన్నుమూత
ప్రముఖ మోడల్ సాన్ రేచల్ (San Rechal) బలవన్మరణానికి పాల్పడింది. పుదుచ్చేరిలో తన నివాసంలో ఆమె నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి ప్రయత్నించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందతూ శనివారం కన్నుమూసింది. పుదుచ్చేరిలో పుట్టిపెరిగిన సాన్ రేచల్.. మోడలింగ్ రంగంలో మిస్ డార్క్ క్వీన్‌గా, మిస్ బెస్ట్ ఆటిట్యూడ్‌గా, మిస్ ఆఫ్రికా గోల్డెన్ ఇండియా లాంటి టైటిల్స్ గెలుచుకున్నారు. మోడలింగ్ మాత్రమే కాదు.. ఆమె మెడిసిన్ విద్యనూ అభ్యసించారు. ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి కారణంగా డిప్రెషన్లోకి వెళ్లిన ఆమె.. అధిక డోస్‌లో నిద్ర మాత్రలు తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. గమనించిన కుటుంబ సభ్యుల ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆమె.. రెండు కిడ్నీలు చెడిపోవడంతో జూలై 12వ తేదీన కన్నుమూసినట్లు సమాచారం.రేచల్ తల్లి ఆమె చిన్నతనంలోనే కేన్సర్‌తో కన్నుమూసింది. అప్పటి నుంచి తండ్రి, సోదరుడి ప్రోత్సాహంతో ఆమె పెరిగారు. రంగు గురించి తోటి స్నేహితులు, బంధువులు ఆమెను ఎగతాళి చేసేవారు. అయినా ఆమె కుంగిపోలేదు. ‘‘రంగులో ఏముందిలే.. కరుపు(నలుపు) కూడా అందమే’’ అనే ఆమె మాటలు మోడలింగ్ రంగంలో ఎంతో మందికి ప్రేరణగా నిలిచాయి. అయితే.. View this post on Instagram A post shared by San rechal Gandhi / Pageant Coach (@san_rechal_official)సూసైడ్ నోట్లో.. తన మరణానికి భర్త(ఇటీవలె వివాహం జరిగింది), కుటుంబ సభ్యులు కారణం కాదని ఆమె ఒక లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆమె మృతిపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అవమానాలను, ట్రోలింగ్‌ను తట్టుకుని మోడలింగ్ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకున్న రేచల్.. పాతికేళ్లకే ఇలా తనువు చాలించడం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదు.. అలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
Kerala: మళ్లీ ‘నిఫా’ కలకలం.. అంతటా అప్రమత్తం
పాలక్కాడ్: కేరళలో నిఫా వైరస్ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. తాజాగా మరో ‘నిఫా’ అనుమానిత మరణం నమోదైంది. ఈ నేపధ్యంలో ఈ వైరస్ ప్రభావం కలిగినవిగా భావిస్తున్న ఆరు జిల్లాల్లోని వైద్యాధికారులు మరింత అప్రమత్తయయ్యారు. నిఫా రెండవ మరణం విషయంలో పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)తుది నిర్ధారణ చేయనుంది.జూలై 12న పాలక్కాడ్ జిల్లాకు చెందిన 57 ఏళ్ల వ్యక్తి నిపా వైరస్ కారణంగా మరణించాడనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఈ వైరస్‌తో కేరళలో మరణించినవారి సంఖ్య రెండుకు చేరింది. బాధితుడు ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. మంజేరి మెడికల్ కాలేజీలో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా, నిపా పాజిటివ్‌గా తేలిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో వెంటనే అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం కాంటాక్ట్ ట్రేసింగ్, ఫీల్డ్ సర్వైలెన్స్‌ను ముమ్మరం చేసింది.మృతునితో సంబంధం కలిగిన 46 మంది జాబితాను సిద్ధం చేశారు. మృతుడు గతంలో తిరిగిన ప్రాంతాలను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్,మొబైల్ టవర్ డేటా సాయం తీసుకున్నారు. ప్రాంతీయ వైద్య బృందాలను అప్రమత్తం చేశామని, పరిస్థితులను పర్యవేక్షించేందుకు అందుబాటులో ఉన్న అన్ని డేటాలను సేకరిస్తున్నామని వీణా జార్జ్ తెలిపారు. కాగా పాలక్కాడ్, మలప్పురం జిల్లాల ప్రజలు అనవసరమైన సందర్శనలకు దూరంగా ఉండాలని అధికారులు కోరారు. ఆస్పత్రులలోని వైద్య సిబ్బంది, రోగులు, సందర్శకులు మాస్క్‌లు ధరించాలని సూచించారు. పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, వయనాడ్, త్రిస్సూర్ తదితర ఆరు జిల్లాల్లోని ఆసుపత్రులకు నిపా అప్రమత్తతపై అధికారుల నుంచి హెచ్చరికలు అందాయి. -
కాలేజీకి వెళ్లే కూతుళ్లు ఉన్నా, జల్సాలకు మరిగిన భార్య..!
యశవంతపుర: భర్త అనే గౌరవంలేదు. పార్టీ, పబ్ అంటూ తిరగటం, తన విలాసవంతమైన జీవనం కోసం ఆరాటం, అందుకే హత్యాయత్నం చేశానని కన్నడ బుల్లితెర నటి మంజుళ శ్రుతి (38) భర్త అమరేశ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఇటీవల బెంగళూరు హనుమంతనగర పోలీసుస్టేషన్ పరిధిలోని మునేశ్వర బ్లాక్‌లో ఇంట్లో ఆమెను కత్తితో పొడిచి హత్యాయత్నం చేయడం తెలిసిందే. తీవ్ర గాయాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఫిర్యాదు మేరకు భర్త అమరేశ్‌ను అరెస్టు చేశారు. ఇందుకు భార్య ధోరణే కారణమని చెప్పాడు. ఆమెకు ఏమాత్రం మానవత్వం లేదు, పిల్లలను ఇంటిలో పెట్టి పబ్, పార్టీలంటూ తిరుగుతుంది. అర్ధరాత్రి ఇంటికొచ్చేది. ఒక్కోసారి ఇళ్లు వదిలితే 15 రోజులైనా కనబడదు. కుంభమేళా అంటూ 15 రోజులు అడ్రస్ లేదు. అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కాలేజీకీ వెళ్లే ఇద్దరు కూతుళ్లు ఉండగా, నేను రూ.25 లక్షలతో ఒక అపార్ట్మెంట్ ఫ్లాటును కొనాలనుకున్నా. కానీ ఆ డబ్బు తీసుకుని పారిపోవాలని ప్లాన్ వేసుకొంది. విపరీతంగా వేధిస్తూ ఉండడంతో కత్తితో దాడి చేశాను అని విచారణలో తెలిపాడు. కాగా బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
భర్త వద్దని.. ప్రియుని చెంతకు
కర్ణాటక: ప్రియుని కోసం, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను కాదని వచ్చిందో యువతి. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం వద్ద ఉన్న రంపచోడవరం ప్రాంతానికి చెందిన తిరుపతమ్మ లవ్ కహాని ఇది. రాజధాని బెంగళూరులో కాంట్రాక్టర్‌గా పని చేస్తున్న తిరుపతమ్మ తండ్రి వద్ద కొప్పళ జిల్లా కుష్టిగి తాలూకా సంగనాళకు చెందిన వెంకటేష్ గార పని చేసేవాడు. ఆ సమయంలో తిరుపతమ్మతో పరిచయమై మూడేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం జరిగింది. ఈ విషయంలో తిరుపతమ్మకు నచ్చచెప్పి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. వెంకటేష్‌ను బెదిరించడంతో పని మానేసి సంగనాళకు చేరుకున్నాడు. కానీ తిరుపతమ్మ భర్తను వదిలేసి సంగానాళులో ప్రియుని వద్దకు చేరుకుంది. ఇద్దరూ కలిసి కొప్పళ పట్టణానికి వచ్చి ఎస్పీని కలిసి రక్షణ కోరారు. మరోవైపు తిరుపతమ్మ తల్లిదండ్రులు నాలుగు కార్లలో కుమార్తెను వెతుకుతూ కొప్పళకు వచ్చారు. ఆమె పెళ్లి జరిగి 15 రోజులు కాకమునుపే ప్రేమించిన వాని కోసం వచ్చేసిందని చెబుతున్నారు. తాను ప్రియునితోనే ఉంటానని తిరుపతమ్మ భీష్మించుకుని. -
Yemen: భారతీయ నర్సుకు ఉరి.. అన్ని ప్రయత్నాలూ విఫలం?
న్యూఢిల్లీ: యెమెన్‌లో మరణశిక్ష విధించిన భారతీయ నర్సు నిమిషా ప్రియ కేసులో ఉపశమనం కోసం చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయినట్లు కనిపిస్తున్నాయి. కేరళకు చెందిన వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ఆమెను కాపాడటానికి దౌత్య ప్రయత్నాలు చేయాలంటూ కేంద్రానికి మెరపెట్టుకున్నాయి.2017లో నిమిషా ప్రియ తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీ నుంచి తన ధృవీకరణ పత్రాలను తిరిగి పొందేందుకు అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చిందని, ఫలితంగా అతను మృతి చెందాడనే ఆరోపణలున్నాయి. ఈ నేపధ్యంలో ఆమెపై మోపిన అభియోగాలు తీవ్రంగా ఉన్నాయి. అయితే ఆమెకు ఉపశమనం కల్పించేందుకు చేసిన చట్టపరమైన ప్రయత్నాలన్నీ విఫలమైనట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో జూలై 16న యెమెన్‌లో ఆమెకు ఉరిశిక్ష అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.నిమిషా ప్రియ తన వ్యాపార భాగస్వామి మెహదీని హత్య చేసి, మరొక నర్సు సహాయంతో అతని శరీరాన్ని ముక్కలు చేసి, ఆ భాగాలను భూగర్భ ట్యాంక్‌లో పడవేసిందని యెమెన్ కోర్టు నిర్ధారించింది. ఈ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆమెను అరెస్టు చేశారు. సనాలోని ట్రయల్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. దీనిని ఆమె యెమెన్‌లోని అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేసింది. అయితే ఆమె అభ్యర్థన తిరస్కరణకు గురైంది. దీంతో ఆమె అధ్యక్షునికి క్షమాభిక్ష కోసం విజ్ఞప్తి చేసింది. అయితే ఆయన అందుకు నిరాకరించారని సమాచారం.ఈ కేసులో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, సాధ్యమైనంత మేరకు సహాయాన్ని అందిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ)తెలిపింది. యమన్లో ఉరిశిక్ష పడిన భారత నర్సును కాపాడేందుకు అన్ని దౌత్య మార్గాలను ఉపయోగించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జూలై 14న విచారించనుంది. న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించే అవకాశం ఉంది. -
‘యమున’లో విగతజీవిగా త్రిపుర యువతి.. కుటుంబ కలహాలే..?
న్యూఢిల్లీ: ఆరు రోజుల క్రితం ఢిల్లీలో అదృశ్యమైన త్రిపురకు చెందిన యువతి స్నేహా దేబ్నాథ్(19) ఆత్మహత్య చేసుకున్నదని, ఆమె మృతదేహం యుమునా నదిలో కనిపించిందని పోలీసులు తెలిపారు. ఈమె ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకుంటోంది. స్నేహా దేబ్నాథ్ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు నిర్ధారించారని పోలీసులు పేర్కొన్నారు.స్నేహా దేబ్నాథ్ అదృశ్యమైన దరిమిలా త్రిపురలోని ఆమె కుటుంబ సభ్యులు ఆమె కోసం తీవ్రంగా గాలించారు. జూలై 7న ఆమె ఉత్తర ఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జికి క్యాబ్‌లో వెళ్లింది. స్నేహ తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు సూచించే నోట్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. చదువు విషయంలో ఆమె కలకతచెందడం లేదని, ఆమె ఆందోళనకు కారణం కుటుంబ కలహాలై ఉండవచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి. సిగ్నేచర్ బ్రిడ్జికి 10 కి.మీ దిగువన ఉన్న గీతా కాలనీలోని ఫ్లైఓవర్ సమీపంలోని యమునా నదిలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.స్నేహా దేబ్‌నాథ్‌ను ఈ స్థలంలో దింపినట్లు క్యాబ్ డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. కాగా ఈ వంతెనపై నిలబడి ఉన్న ఒక అమ్మాయిని చూశామని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), పోలీసు విభాగాల సహాయంతో ఆమె కోసం గాలింపు చర్యలు సాగాయి. వారు ఉత్తర ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ నుండి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా వరకుగల అన్ని ప్రాంతాలను అణువణువునా జల్లెడ పట్టారు. జూలై 7 తెల్లవారుజామున స్నేహా తన సన్నిహితులకు ఈమెయిల్స్ పంపిందని పోలీసులు తెలిపారు. గత కొన్ని నెలలుగా ఆమె మానసికంగా బాధపడుతున్నట్లు స్నేహితులు పోలీసులకు తెలిపారు. -
కల్తీ ఎరువులపై కఠిన చర్యలు: కేంద్రం∙
సాక్షి, న్యూఢిల్లీ: నకిలీ, నాసిరకం ఎరువుల విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రులను కోరారు. ఆదివారం ఆయన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకని, రైతుల ఆదాయంలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, వారికి సరైన సమయంలో సరసమైన ధరలకు ప్రామాణికతతో నాణ్యమైన ఎరువులను అందించడం చాలా అవసరమని నొక్కి చెప్పారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ఎరువుల లభ్యతను నిర్ధారించాలని తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు విక్రయించడం, సబ్సిడీ ఎరువుల మళ్లింపు వంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. సంప్రదాయ ఎరువులతో పాటు నానో–ఎరువులు, బయో–స్టిమ్యులెంట్ ఉత్పత్తులను బలవంతంగా అంటగట్టడాన్ని వెంటనే అరికట్టాలన్నారు. దోషులుగా తేలితే లైసెన్స్‌ల రద్దు వంటి కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు, తగు శిక్షలు పడేలా చూడాలని సూచించారు. ఎరువుల్లో కల్తీపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. -
ఢిల్లీలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఢిల్లీతోపాటు శివారు ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండియా గేట్, కర్తవ్యపథ్ ప్రాంతాల్లో భీకర వర్షం పడడంతో పర్యాటకులు ఇబ్బందులకు గురయ్యారు. ఢిల్లీలో మరికొన్ని రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించడంతో అరెంజ్ అలర్ట్‌ను అధికారులు రెడ్ అలర్ట్‌గా మార్చారు. ఢిల్లీతోపాటు తూర్పు హరియాణ, పశి్చమ ఉత్తరప్రదేశ్‌లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. -
నేటి నుంచి ఒడిశాలో రాష్ట్రపతి పర్యటన
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేటి నుంచి ఒడిశాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆమె సోమవారం భువనేశ్వర్‌కు చేరుకుంటారని రాష్ట్రపతి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. సోమవా రం భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయి మ్స్) ఐదవ స్నాతకోత్సవానికి హాజరవుతారు. రెండో రోజైన జూలై 15న రావెన్షా విశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అలాగే రావెన్షా బాలికల ఉన్నత పాఠశాల మూడు భవనాల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేస్తారు. ఆదికాబి సరళ దాస్ జయంతి వేడుకలకు హాజరవుతారు. -
భావప్రకటనా స్వేచ్ఛ ఉందని ఉగ్రవాదాన్ని కీర్తించరాదు
శ్రీనగర్: దేశ రాజ్యాంగం ప్రజలందరికీ భావ ప్రకటనా స్వేచ్ఛను ఇచి్చందని, అది ఉగ్రవాదాన్ని కీర్తించడం కోసం కాదని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తేల్చిచెప్పారు. ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా పట్టణంలో 40 ఉగ్రవాద బాధిత కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ.. ఉగ్రవాద బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు, న్యాయం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రతి బాధిత కుటుంబానికి పునరావాసం కల్పించే వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఉద్ఘాటించారు. రాజకీయ అవకాశాల కోసం ఎవరైనా ఉగ్రవాదాన్ని కీర్తిస్తే.. అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. జమ్మూకశ్మీర్ ఇప్పటికే చాలా ఎంతో రక్తపాతాన్ని చూసిందని, ఇప్పుడా బాధలకు, కన్నీళ్లకు ఫుల్స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని మనోజ్ సిన్హా పేర్కొన్నారు. -
పార్లమెంట్ సమావేశాల్లో వ్యూహంపై చర్చ
న్యూఢిల్లీ: రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ నెల 15వ తేదీన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. చైర్పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన ఆమె 10 జన్‌పథ్ నివాసంలో భేటీ జగనుంది. ఇందులో రాజ్యసభ, లోక్‌సభల్లో ప్రతిపక్ష నేతలుగా ఉన్న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతోపాటు ఉభయ సభల ఉప నేతలు, పార్టీ చీఫ్ విప్‌లు, విప్‌లు పాల్గొంటారు. కొందరు సీనియర్ నేతలు కూడా పాలుపంచుకుంటారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఆగస్ట్ 21 వరకు పార్లమెంట్ సెషన్ కొనసాగనుంది.ఆపరేషన్ సిందూర్తోపాటు బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ తదితర అంశాలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడే అవకాశాలు కని్పస్తున్నాయి. బిహార్ ఓటరు జాబితా సవరణను సవాల్ చేస్తూ కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. ఈసీ చర్య రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అదేవిధంగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో మోదీ ప్రభుత్వం అనేక తప్పిదాలకు పాల్పడి, దేశానికి నష్ట కలిగించిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది.అంతేకాదు, భారత్–పాక్ మధ్య అణు యుద్ధం ప్రమాదం తన జోక్యంతోనే తొలగిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే ప్రకటనలు చేయడంపైనా ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. పై అంశాలపై ప్రభుత్వం నుంచి సమాధానాలకు కాంగ్రెస్ పార్లమెంట్లో పట్టుబట్టే ఛాన్సుంది. ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రమూకల దాడి, అమెరికా టారిప్‌లు వంటి వాటిపైనా ఇండియా కూటమి చర్చకు ప్రభుత్వాన్ని నిలదీస్తాయని భావిస్తున్నారు. కాంగ్రెస్ వ్యూహం ఖరారైతే ఇతర ప్రతిపక్షాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణను రూపొందించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. -
ఢిల్లీ నుంచి ఢిల్లీకి: ద ఇండియన్ పనోరమ టూర్
‘ద ఇండియన్ పనోరమ’ టూర్. ఇది ఏడు రోజుల యాత్ర. ఐఆర్సీటీసీ నిర్వహిస్తున్న ఈ టూర్ ఢిల్లీ నుంచి మొదలై ఢిల్లీకి చేరడంతో పూర్తవుతుంది. ఈ టూర్లో జైపూర్, రణతంబోర్, ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా, ఓర్చా, ఖజురహో, వారణాసి ప్రదేశాలు కవర్ అవుతాయి.పనోరమ టూర్లో ఏమేమి ఉన్నాయి?యూపీ... ఎంపీ... రాజస్థాన్ రాష్ట్రాలు.ఆరు రోజుల్లో మూడు రాష్ట్రాల పర్యటన.జయ్‌పూర్‌లో సన్డయల్ను చూస్తాం.అమేర్ కోటలో మాన్సింగ్ మందిరం.రామ్‌బాగ్ రాజమందిరంలో భోజనం.పులి పుట్టిల్లు రణతంబోర్ సఫారీ.విజయం పేరుకే పరిమితమైన ఫతేపూర్.ఏడు వింతల్లో స్థానం పొందిన తాజ్‌మహల్.ఢిల్లీకి మోడలైన ఓర్చా ఐలాండ్ఫోర్ట్.బ్రిటిష్ ఇంజనీర్లను దిగ్భ్రమకు గురిచేసిన...ఆలయాల పుట్ట... ఖజురహో నగరం.సారనాథ్ స్థూపం... సిల్క్ వీవింగ్ సెంటర్.వారణాసిలో గంగాహారతి... పడవ విహారం.వారం రోజులు ఏడు క్షణాలను తలపిస్తాయి.1రోజుఢిల్లీ నుంచి జైపూర్‌కు ప్రయాణం. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్లో ఉదయం ఏడున్నరకు పర్యాటకులకు స్వాగతం. రైలెక్కిన తర్వాత తొమ్మిది గంటలకు మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ నుంచి జయ్‌పూర్‌కు బయలుదేరుతుంది. పన్నెండు గంటలకు టూర్ మేనేజర్ పర్యాటకులకు ఈ టూర్ గురించిన వివరాలు తెలియచేస్తారు. ఒంటి గంటకు రైల్లోనే లంచ్. మూడున్నరకు రైలు జయ్‌పూర్‌కు చేరుతుంది. అమేర్ ఫోర్ట్ సందర్శనం. తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు వచ్చి రైలెక్కాలి. రాత్రి భోజనం రైల్లోనే. రాత్రి బస రైల్లోనే. రైలు జయ్‌పూర్ స్టేషన్లోనే ఉంటుంది.అమేర్ కోటజయ్పూర్కి పదకొండు కిలోమీటర్ల దూరాన ఉన్న నగరం అమేర్. ఇందులోని కోట అమేర్ కోటగా వ్యవహారంలోకి వచ్చింది. రాజపుత్రుల నిర్మాణకౌశలానికి నిదర్శనం ఈ కోట. దీని నిర్మాణం నాటికే మనదేశంలో మొఘల్ పాలన మొదలైంది. అమేర్ కోటలోని కొన్ని ప్యాలెస్‌లలో మొఘల్ ఆర్కిటెక్చర్ సమ్మేళనం కూడా కనిపిస్తుంది. ఈ కోటను కట్టించిన మాన్‌సింగ్‌కి పన్నెండు మంది రాణులు. ఒక్కో రాణికి ఒక్కొక్క గది ఉంటుంది. ప్రతి గది నుంచి పై అంతస్థులోని మాన్సింగ్ గదికి మెట్లు ఉన్నాయి. శీలాదేవి ఆలయద్వారం, గణేశ్పోల్ ముఖద్వార నిర్మాణం అద్భుతంగా ఉంటాయి. ప్యాలెస్ లోపల గోడలకు పాలరాతిలో చేసిన ఇన్లే వర్క్‌ను చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది.2రోజుజయ్పూర్ పర్యటన. ఉదయం ఎనిమిది గంటలకు రైల్లోనే బ్రేక్‌ఫాస్ట్. తొమ్మిదింటికి రైలు దిగి సిటీ ప్యాలెస్, గ్యాలరీల వీక్షణానికి వెళ్లాలి. ఒంటిగంటకు తిరిగి రైలెక్కిన తర్వాత భోజనం. ఆ తర్వాత విశ్రాంతి. రైల్లో ఏర్పాటు చేసిన యాక్టివిటీలతో సేదదీరవచ్చు. సాయంత్రం ఆరు గంటలకు రామ్‌బాగ్ ప్యాలెస్‌కు వెళ్లాలి. డిన్నర్ ప్యాలెస్‌లోనే. తొమ్మిదిన్నరకు తిరిగి రైలెక్కాలి. రాత్రి పదకొండు గంటలకు రైలు జయ్పూర్నుంచి సవాయ్ మాధోపూర్ (రణతంబోర్)కు బయలుదేరుతుంది.గులాబీ నగరం!ఈ నగరం పేరు జయ్‌పూర్, రెండవ సవాయ్ జయ్సింగ్ నిర్మించాడు. బ్రిటిష్ రాజకుటుంబీకులు భారత్ సందర్శనార్థం వచ్చిన సందర్భంగా జయ్‌పూర్‌లోని భవనాలకు గులాబీరంగులు వేశారు. అప్పటి నుంచి పింక్‌సిటీ అనే పేరు వాడుకలోకి వచ్చింది. యునెస్కో సాధారణంగా ఒక కట్టడాన్ని లేదా ప్రదేశాన్ని మాత్రమే హెరిటేజ్ సైట్ల జాబితాలోకి తీసుకుంటుంది. ఒక నగరం మొత్తాన్ని హెరిటేజ్‌సైట్‌గా గుర్తించడం అరుదు. ఆ గౌరవం జయ్‌పూర్‌కి దక్కింది. సైక్లింగ్ ప్రేమికులు జయ్‌పూర్‌లో రెండు రోజులు బస చేసి, సైకిల్ అద్దెకు తీసుకుని పర్యాటక ప్రదేశాలను చుట్టివస్తారు. అంత సమయం లేని వాళ్లు వాహనంలో సిటీ టూర్ చేస్తారు. సిటీప్యాలెస్, హవామహల్, జల్‌మహల్ వంటి రాజపుత్రుల మార్కు నిర్మాణాలతో పాటు మనదేశ విజ్ఞానానికి ప్రతీక అయిన జంతర్‌మంతర్‌ని తప్పకుండా చూడాలి. దీనిని 1734లో నిర్మించారు. అతిపెద్ద సన్డయల్ ఇక్కడే ఉంది.రామ్‌బాగ్ తొలి ప్యాలెస్హోటల్రామ్బాగ్ ప్యాలెస్ జయ్‌పూర్‌కి మణిహారం వంటిది. యాభై ఎకరాల్లో విస్తరించిన ఈ ప్యాలెస్ ప్రధాన నగరానికి ఎనిమిది కిలోమీటర్ల దూరాన ఉంది. ఇందులో జయ్‌పూర్ రాజు సవాయ్ రెండవ మాన్సింగ్, మహారాణి గాయత్రీ దేవి నివసించారు. రాజకుటుంబీకుల వివాహ వేడుకలు, పోలో ఆటలు ఇక్కడే జరిగేవి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సంస్థానాలను విలీనం చేసిన క్రమంలో ఈ ప్యాలెస్‌ను హోటల్‌గా మార్చారు. కొంతకాలం రాజకుటుంబమే నిర్వహించింది. తర్వాత తాజ్ గ్రూప్ నిర్వహిస్తోంది. ప్యాలెస్‌లో రాజభోజనం చేసే అవకాశం ఈ టూర్ కల్పిస్తోంది.3రోజురణతంబోర్ నుంచి ఫతేపూర్ సిక్రీ. ఉదయం ఆరున్నరకు రైలు దిగి రణతంబోర్ నేషనల్ పార్కుకు వెళ్లాలి. తొమ్మిది ముప్పావుకు వెనక్కి వచ్చి రైలెక్కాలి. అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. పదింపావుకి రైలు ప్రయాణం ఫతేపూర్ సిక్రీ వైపు సాగుతుంది. మధ్యాహ్న భోజనం తర్వాత రెండూ ముప్పావుకు రైలు ఫతేపూర్ సిక్రీకి చేరుతుంది. మూడు నుంచి ఫతేపూర్ సిక్రీ నగర పర్యటన మొదలు. సాయంత్రం ఆరు గంటలకు తిరిగి రైలెక్కాలి. రైలు ఆగ్రా వైపు సాగుతుంది. ఏడున్నరకు భోజనం. ఎనిమిది గంటలకు రైలు ఆగ్రా స్టేషన్‌కు చేరుతుంది.రణతంబోర్ పులి పుట్టిల్లురణతంబోర్ విస్తారమైన అడవి. కొంతభాగం పులుల సంరక్షణ కేంద్రం. రాయల్ బెంగాల్ టైగర్లు సంచరించే నేల ఇది. ఈ అడవిలో ఏడువందల అడుగుల ఎత్తు కొండ మీద ఓ కోట. ఇది జయ్‌పూర్ రాజవంశానికి చెందిన కోట. రాజపుత్రుల శత్రుదుర్భేద్య కోటలంత పెద్దది కాదు, కానీ నిర్మాణపరంగా పెద్దదే. యునెస్కో ఈ కోటను హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ కేటగిరీలో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. ఈ అడవిలో చంబల్ నది ప్రవహిస్తుంది.విజయవంతం కాని ఫతేపూర్ ఫతేపూర్ అంటే... సిటీ ఆఫ్ విక్టరీ. అంటే విజయనగరం అని అర్థం. విఫలమైన అక్బర్ ప్రయత్నాల్లో ఇదొకటి. ఎవరూ సొంతం చేసుకోని అక్బర్ బ్రెయిన్ చైల్డ్ ‘దీన్ ఈ ఇలాహి’ మతం కూడా ఇక్కడే పుట్టింది. ఇక్కడ పుట్టిన జహంగీర్ కూడా మొఘల్ పాలకుల్లో అత్యంత తక్కువ సమయం పాలించిన పాలకుడు, ఎటువంటి చారిత్రక గొప్పదనం లేని పాలకుడుగా మిగిలిపోయాడు. పాతికేళ్ల కిందట ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్రదేశంలో తవ్వకాలు చేపట్టింది. సిక్రీ అనే ఈ గ్రామంలో అక్బర్ నగరాన్ని నిర్మించకముందు శుంగ జాతి ప్రజలు నివసించేవారని, కన్యాకుబ్జ బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేదని వెల్లడైంది. అక్బర్‌కు ఇష్టమైన భార్య మరియమ్ ఉజ్ జమానీకి మగపిల్లవాడు పుట్టిన ఈ ప్రదేశంలోనే రాజధానిని నిర్మించాలని అక్బర్ ముచ్చటపడ్డాడు. సుమారు 150 అడుగుల ఎత్తులో ఉన్న కొండ మీద అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు. యునెస్కో ఈ నగరాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది.4రోజుఆగ్రా పర్యటన. ఆరున్నరకు తాజ్ మహల్ సందర్శన. తొమ్మిది గంటలకు తాజ్ ఖేమాలో బ్రేక్‌ఫాస్ట్. పదకొండు గంటలకు తిరిగి రైలెక్కాలి. రైలు ప్రయాణం ఓర్చా వైపు సాగుతుంది. మధ్యాహ్న భోజనం తర్వాత విశ్రాంతి, రైల్లో ఏర్పాటు చేసిన యాక్టివిటీలతో సేదదీరడం. రాత్రి భోజనం ఏడున్నరకు.వాహ్ వండర్ఫుల్ తాజ్!తాజ్‌మహల్ మనదేశానికి గర్వకారణం. ఇది యునెస్కో గుర్తించిన హెరిటేజ్ సైట్ మాత్రమే కాదు. ప్రపంచ వింత కూడా. ఏడు వింతల జాబితా కోసం 2007లో ఓటింగ్ జరిగినప్పుడు మొదట తాజ్ చాలా వెనుకబడింది. వెనుకబడిందనే విషయం మీద ప్రభావవతమైన కథనాలను వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా చానెళ్లు ప్రసారం చేయడంతో దేశమంతా చైతన్యవంతమైంది. ఉత్సాహవంతులు చురుగ్గా ఓటింగ్‌లో పాల్గొని తాజ్ మహల్‌కు ఓటు వేసి గెలిపించారు. తాజ్‌మహల్ మాత్రం ‘నన్ను ప్రేమించండి లేదా సమాధికి ఇంత గొప్ప నిర్మాణం అవసరమా అని ద్వేషించండి... నన్ను మాత్రం గుర్తించి తీరాల్సిందే’ అన్నట్లు ఠీవిగా ఉంటుంది. గోడలకు ఉన్న రంగురంగు ఇన్లే వర్క్ వస్త్రం మీద దారంతో అందంగా కుట్టిన పూలను తలపిస్తుంది. గోడలకు పాలరాతిలో చెక్కిన పూలను చూస్తే మైనాన్ని కరిగించి మూసలో పోసి గోడకు అతికించారా అనిపిస్తుంది. మెత్తని రాతిలో ఉలి చేసిన చాతుర్యానికి, శిల్పకారుడి నైపుణ్యానికి సలామ్ అనాల్సిందే. ఈ టూర్లో ఆగ్రాలోని రెడ్ఫోర్ట్ను కూడా చూడాలి. అక్బర్ తొలి రాజధాని ఆగ్రా. ఈ ఎర్ర కోట నుంచే పాలన సాగించాడు.5రోజుఓర్చాకు రావడం, ఖజురహోకి ప్రయాణం. ఉదయం ఆరున్నరకు రైలు ఓర్చా స్టేషన్‌కు చేరుతుంది. ఓర్చా కోట సందర్శనం, గ్రామాల పర్యటన తర్వాత తిరిగి రైలెక్కాలి. తొమ్మిదీ ముప్పావుకు బ్రేక్‌ఫాస్ట్. మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ ఖజురహోకు సాగుతుంది. ఒంటిగంటకు లంచ్. మూడింటికి రైలు ఖజురహోకి చేరుతుంది. రైలు దిగి అక్కడి ప్రసిద్ధ దేవాలయాల దర్శనం. ఆరున్నరకు వెనక్కి వచ్చి మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. విశ్రాంతి, యాక్టివిటీస్‌తో సేదదీరడం. ఏడున్నరకు రాత్రి భోజనం. రాత్రి పదిగంటలకు రైలు వారణాసికి బయలుదేరుతుంది.ఐలాండ్ ఫోర్ట్ఓర్చా కోట మరీ పురాతనమైనదేమీ కాదు. పదహారవ శతాబ్దపు నిర్మాణం. బుందేల్ రాజపుత్రుల కోట ఇది. రుద్రప్రతాప్ సింగ్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత వచ్చిన పాలకులు ఒక్కో ప్యాలెస్‌ను నిర్మిస్తూ విస్తరించారు. మొఘల్ పాలకుడు జహంగీర్ ఈ రాజ్యానికి అతిథిగా విచ్చేసిన సందర్భంగా ఆయన బస కోసం అప్పటి బుందేల్‌ఖండ్ రాజు వీర్ సింగ్ దేవ్ ఏకంగా ఒక మందిరాన్నే కట్టించారు. అదే జహంగీర్ ప్యాలెస్. ఢిల్లీ నగరాన్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ ల్యూటియెన్స్ కూడా ఓర్చా కోట, ప్యాలెస్‌ల డిజైన్లతో ప్రభావితమయ్యాడు. ఈ కోట నిర్మాణంలో గొప్పతనం ఏమిటంటే... కోటలోని మూలనున్న చిన్న గదుల్లోకి కూడా సూర్యరశ్మి ధారాళంగా ప్రసరించడానికి చిన్న చిన్న గూళ్లున్నాయి. ఈ కోటలో మరో ప్రత్యేకత ఏమిటంటే... ఇది ఐలాండ్ ఫోర్ట్. బేత్వా, జామ్ని నదుల సంగమస్థలిలో ఏర్పడిన దీవి మీద నిర్మించారు. అందుకే ఈ కోట నుంచి ప్రధాన నేలమీదకు వంతెన కూడా ఉంటుంది. సాధారణంగా శత్రువుల దాడుల నుంచి రక్షణ కోట చుట్టూ కందకం తవ్వుతారు. ఇక్కడ నీటి మధ్యలో కోట ఉంటుంది.ఆలయ నగరం ఖజురహోఖజురహో జైన, హిందూ దేవాలయాలకు ప్రసిద్ధి. ఎక్కువ ఆలయాలు తొమ్మిది, పది, పదకొండు శతాబ్దాలనాటివి. పన్నెండవ శతాబ్దం నాటికి ఆ సంఖ్య 85కి చేరింది. బుందేల్‌ఖండ్‌ను పాలించిన చందేల రాజవంశస్థులు నిర్మించిన ఆలయాలివన్నీ. ఇవన్నీ నగర వాస్తు శైలి నిర్మాణాలు. యునెస్కో ఈ ప్రదేశాన్ని హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. వైష్ణవం, శైవ ఆలయాలు, జైన ఆలయాలు నిర్మాణపరంగా చాలా ప్రత్యేకమైనవి. బ్రిటిష్ ఇంజనీర్లు ఈ నిర్మాణాలను స్వయంగా పరిశీలించి కథనాలను రాశారు. ఈ ప్రదేశం 1986లో యునెస్కో జాబితాలో చేరింది.6రోజువారణాసి విహారం. ఉదయం ఎనిమిది గంటలకు రైల్లోనే బ్రేక్‌ఫాస్ట్. మధ్యాహ్న భోజనం హోటల్ తాజ్ గాంజెస్లో. లంచ్ తర్వాత సారనాథ్ స్థూపం, సిల్క్ వీవింగ్ సెంటర్ సందర్శనం. నాలుగన్నరకు గంగానదిలో పడవ విహారం, గంగాహారతి దర్శనం. ఎనిమిది గంటలకు తిరిగి మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ చేరిన తర్వాత ఎనిమిదన్నరకు డిన్నర్. తొమ్మిదిన్నరకు ఢిల్లీకి ప్రయాణం.సారనాథ్బుద్ధుడి జీవితంలో సారనాథ్ ప్రముఖమైన ప్రదేశం. సిద్ధార్థుడు ధ్యానం చేసి బుద్ధుడైన తర్వాత తొలిసారిగా ప్రవచనం బోధించిన ప్రదేశం. బౌద్ధానికి సంబంధించిన పుస్తకాలు, వ్యాసాల్లో బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చుని ఐదుగురు శిష్యులకు బోధిస్తున్న చిత్రం ఉంటుంది. అది సారనాథ్‌లోని తొలి ప్రబోధానికి ప్రతీకాత్మక చిత్రం. సారనాథ్‌లోని బౌద్ధ స్థూపం, ప్రపంచదేశాల్లోని బుద్ధుని శిల్పాలతో ఓ గార్డెన్ ఉన్నాయిక్కడ. వారణాసి చేనేత కేంద్రం ఉందిక్కడ. మగ్గం ఉంటుంది. నేత ప్రక్రియలను వివరిస్తారు. ఇది సొసైటీ ఆధీనంలో నడుస్తుంది. అందుకే ఈ వీవింగ్ సెంటర్లో అమ్మే చేనేత చీరలను కచ్చితమైనవిగా భావిస్తారు. ఇక వారణాసిలో గంగాహారతిని చూడడం నయనానందకరం. ఈ టూర్లో కాశీ విశ్వనాథుడి దర్శనం లేదు. ఆసక్తి ఉన్న వాళ్లు మధ్యలో వీలు చేసుకుని విశ్వనాథుని దర్శనానికి వెళ్లవచ్చు.7రోజుతొమ్మిదింటికి రైల్లోనే బ్రేక్‌ఫాస్ట్. పన్నెండున్నరకు రైలు ఢిల్లీకి చేరుతుంది. స్టేషన్లో ఐఆర్సీటీసీ ఉద్యోగుల వీడ్కోలుతో పర్యటన పూర్తవుతుంది.ప్యాకేజ్ ధరలివి: → డీలక్స్ క్యాబిన్ లో ఒక్కొక్కరికి దాదాపుగా ఏడు లక్షల రూపాయలు. సూట్లో ఒక్కొక్కరికి పదమూడు లక్షల రూపాయలు. ప్రెసిడెన్షియల్ సూట్లో 22లక్షలకు పైగా అవుతుంది. వీటికి ఐదు శాతం జీఎస్టీ అదనం.→ ఈ ప్రదేశాల్లో పర్యటనకు అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య సమయం అనువుగా ఉంటుంది. కాబట్టి బుకింగ్ ఇంకా మొదలవలేదు. 90 రోజుల ముందు సైట్ ఓపెన్ అవుతుంది.→ ప్రయాణం మొత్తం 2,300 కిమీల ప్రయాణం. -
రైల్లో సీసీటీవీలు
న్యూఢిల్లీ: రైళ్లలో త్వరలో సీసీటీవీ కెమెరాలు దర్శనమివ్వనున్నాయి. భారతీయ రైల్వేస్ పరిధిలో ఉన్న మొత్తం 74 వేల ప్యాసింజర్ బోగీలు, 15 వేల సరుకు రవాణా లోకోస్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయనున్నట్లు రైల్వేశాఖ ఆదివారం ప్రకటించింది. ఉత్తర రైల్వే విభాగంలో కొన్ని ప్రయాణికుల బోగీలు, లోకోల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల వల్ల సత్ఫలితాలు వచ్చాయని, త్వరలో అన్ని బోగీల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. బోగీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఆ శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టు శనివారం రైల్వే శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పైలట్ ప్రాజెక్టులో వచ్చిన ఫలితాలను సమీక్షించి, అన్ని బోగీల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో రైల్వేశాఖ తెలిపింది.ప్రయాణికులకు భద్రతబోగీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల ప్రయాణికుల భద్రత మరింత పెరుగుతుందని రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. ‘సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల ప్రయాణికుల భద్రత మరింత పెరుగుతుంది. బోగీల్లో దోపిడీలకు పాల్పడే దొంగలు, వ్యవస్థీకృత ముఠాల ఆగడాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ప్రయాణికుల ప్రైవసీకి ఇబ్బంది కలగ కుండా సీసీ కెమెరాలను బోగీల ద్వారాల వద్దనే ఏర్పాటు చేస్తాం’అని తెలిపారు. ఒక్కో బోగీలో 4 కెమెరాలుప్రయాణికుల రైళ్లలో ఒక్కో బోగీలో నాలుగు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. బోగీకి ఉండే రెండు ద్వారాల్లో ఒక్కో ద్వారం వద్ద రెండు చొప్పున డోమ్ టైప్ అత్యాధునిక కెమెరాలు అమర్చుతారు. లోకోమోటివ్‌లలో 6 సీసీ కెమెరాలు ఉంటాయి. ముందు, వెనుక భాగాల్లో ఒక్కోటి, కార్కు రెండు వైపులు రెండు డోమ్ టైప్ కెమెరాలు ఉంటాయి. వీటికి అదనంగా రెండు డెస్క్ మౌంటెడ్ మైక్రోఫోన్ కెమెరాలు కూడా ఏర్పాటుచేస్తారు. ఈ సీసీ కెమెరాలన్నీ ఎస్టీక్యూసీ సర్టిఫికేషన్‌తో అత్యాధునిక ఫీచర్లతో ఉంటాయని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.కెమెరాల నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడొద్దని రైల్వే మంత్రి సూచించినట్లు చెప్పారు. రైలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నా, వెలుతురు సరిగా లేకపోయినా సీసీ కెమెరా ఫుటేజీ అత్యంత స్పష్టంగా ఉండేలా నాణ్యమైన కెమెరాల అమర్చాలని కోరినట్లు వెల్లడించారు. ఇండియా ఏఐ మిషన్ సహకారంతో సీసీ కెమెరాల డేటా సేకరణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించుకోవాలని అశ్వినీ వైష్ణవ్ సూచించినట్లు పేర్కొన్నారు. -
సారే జహాసె అచ్ఛా ఇండియా
న్యూఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) సోమవారం వీడ్కోలు పలుకబోతున్నారు. ఐఎస్ఎస్కు చేరుకున్న మొట్టమొదటి ఇండియన్ అస్ట్రోనాట్‌గా చరిత్ర సృష్టించిన శుక్లా 18 రోజుల తన అంతరిక్ష యాత్ర ముగించుకొని సహచర వ్యోమగాములతో కలిసి భూమిపైకి తిరిగిరాబోతున్నారు. యాక్సియోమ్ మిషన్–4(ఏఎక్స్–4) ముగింపు దశకు చేరుకోవడంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆదివారం ప్రత్యేక వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శుభాంశు శుక్లా చివరి సందేశం ఇచ్చారు. ‘‘భారతదేశం ఈరోజు అంతరిక్షం నుంచి నిర్భయంగా, పూర్తి విశ్వాసంతో సగర్వంగా కనిపిస్తోంది. సారే జహాసె ఆచ్ఛా ఇండియా. ఇదొక అద్భుతమైన, నమ్మశక్యంకాని ప్రయాణం. ఐఎస్ఎస్లో అంతరిక్ష ప్రయోగాల్లో ఈరోజు నా వ్యక్తిగత అధ్యాయం ముగిసింది. కానీ, భారతీయ అంతరిక్ష సంస్థ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. మనమంతా కలిసి పని చేస్తే అనుకున్నది సాధించగలం. భవిష్యత్తులో మరెన్నో ఘన విజయాల కోసం మనం ఐక్యంగా కృషి చేయాలి. పరస్పరం సహకరించుకోవాలి. ఈ ప్రయోగం సఫలం కావడానికి, నేను ఇక్కడికి చేరుకోవడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఐఎస్ఎస్లో నిష్ణాతులైన సహచర వ్యోమగాములతో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభవం. వారు నా అంతరిక్ష యాత్రను అందమైన అనుభూతిగా మార్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మన భూమిని వీక్షించడం ఎన్నో గొప్ప జ్ఞాపకాలను మిగిల్చింది. భూమిని చూసిన ప్రతిసారీ మాయజాలాన్ని చూస్తున్నట్టే ఉంది. నాకు అన్ని విధాలా మద్దతుగా నిలిచిన ఇస్రో, నాసా సైంటిస్టులకు కృతజ్ఞతలు. ఇలాంటి అంతరిక్ష యాత్రలు కేవలం శాస్త్రీయ పరిశోధనలకే కాకుండా మన దేశాలకు, మానవాళి ప్రగతికి తోడ్పడతాయి’’ అని శుభాంశు శుక్లా ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. సహచర వ్యోమగాములు ఆయనను ఆలింగనం చేసుకున్నారు. శుభాంశు శుక్లాతోపాటు అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలాండ్‌కు చెందిన సావోజ్ ఉజ్నాన్స్కీ–విస్నీవ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కపు సైతం మాట్లాడారు. తమ అనుభవాలు పంచుకున్నారు. → ఏఎక్స్–4 మిషన్‌లో భాగంగా గత నెల 26న అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నలుగురు వ్యోమగాములు శుభాంశు శుక్లా, పెగ్గీ విట్సన్, సావోజ్ ఉజ్నాన్స్కీ–విస్నీవ్స్కీ, టిబోర్ కపు బయలుదేరిన సంగతి తెలిసిందే. → ఐఎస్ఎస్ నుంచి వీరు ఇప్పటిదాకా భూగోళాన్ని 250 సార్లు చుట్టేశారు. భూమి చుట్టూ 96,56,064 కిలోమీటర్లు ప్రయాణించారు. → అంతరిక్ష కేంద్రంలో 60 రకాల శాస్త్రీయ ప్రయోగాల్లో పాలుపంచుకున్నారు. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి కీలకమైన సమాచారం అందించారు. → స్పేస్ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఐఎస్ఎస్ నుంచి శుభాంశు శుక్లా, పెగ్గీ విట్సన్, సావోజ్ ఉజ్నాన్స్కీ–విస్నీవ్స్కీ, టిబోర్ కపు భూమిపైకి తిరిగిరాబోతున్నారు. వారి రిటర్న్ షెడ్యూల్‌ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అధికారికంగా ధ్రువీకరించింది. → భారత అంతరిక్ష ప్రయోగాల్లో శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా, ఐఎస్ఎస్కు చేరుకున్న మొదటి భారతీయుడిగా ఆయన రికార్డుకెక్కారు. ఆయన ప్రయా ణం కొత్త తరం భారతీయ శాస్త్రవేత్తలకు, అంతరిక్ష ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.ఘనస్వాగతానికి ఏర్పాట్లు→ అంతరిక్ష యాత్ర పూర్తికావడంతో నలుగురు వ్యోమగాములు భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2.25 గంటలకు ఐఎస్ఎస్ నుంచి స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌకలోకి చేరుకుంటారు. ప్రి–ఫ్లైట్ తనిఖీలు నిర్వహిస్తారు. → అమెరికాలోని కాలిఫోరి్నయా సమీపంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు పసిఫిక్ సముద్ర తీరంలో నలుగురు వ్యో మగాములు భూమిపై దిగే అవకాశం ఉంది. → అమెరికాలో ఏడు రోజుల క్వారంటైన్ తర్వాత స్వదేశానికి చేరుకొనే శుభాంశు శుక్లాకు ఘన స్వాగతం పలకడానికి ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో స్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
మినిమం బాదుడుకు బైబై!!
మినిమం బ్యాలెన్స్ నిబంధన.. బ్యాంకు ఖాతా నుంచి ఆఖరు రూపాయి కూడా ఊడ్చేసినా ఖర్చులు తీరని సామాన్యులకు, వేతన జీవులకు కంగారెత్తిస్తుంది. చెప్పిన దానికన్నా ఖాతాలో ఏ కాస్త తక్కువైనా సరే బ్యాంకులు పెనాల్టీ చార్జీల కింద బాదేస్తుంటాయి. అప్పటికి కట్టలేకపోతే, ఆ తర్వాత ఖాతాలోకి డబ్బు క్రెడిట్ కావడమే తరువాయి.. లాగేస్తాయి. ప్రైవేట్ బ్యాంకులు సరే.. ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా దీన్ని అడ్డం పెట్టుకుని వందల వేల కోట్ల రూపాయలు రాబట్టాయి. దీనిమీద చాలాకాలంగా విమర్శలు వస్తున్నా, పెద్దగా పట్టించుకోలేదు. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పుడు మనసు, రూటు మార్చుకుంటున్నాయి. ఎస్బీఐ కోవలో మరో 5 బ్యాంకులు ఈ ‘మినిమం’ నిబంధనను ఎత్తివేసి, మ్యాగ్జిమం ఊరటనిచ్చాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్ బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ ఈ జాబితాలో ఉన్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ఒక్కో ఖాతాదారువారీగా చూస్తే పెనాల్టీలు నామమాత్రంగా వందల రూపాయల స్థాయిలోనే కనిపిస్తాయి. కానీ, కోట్ల మంది పరంగా చూస్తే వేల కోట్ల రూపాయలు బ్యాంకులు వసూలు చేశాయి. ఆర్థిక శాఖ గతేడాది ఇచ్చిన గణాంకాల ప్రకారం మూడేళ్ల వ్యవధిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇలా వసూలు చేసింది ఏకంగా రూ.5,614 కోట్లు. 2024 ఆర్థిక సంవత్సరంలో 11 పీఎస్‌యూ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ.2,331 కోట్లు మినిమం బ్యాలెన్స్ పెనాల్టీల కింద వసూలు చేశాయి. 2023లో వసూలు చేసిన రూ.1,855 కోట్లతో పోలిస్తే ఇది 25.6 శాతం అధికం! చాలా మటుకు గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని అల్పాదాయ కస్టమర్లు ఏటా రూ.360–720 వరకు, పట్టణ ప్రాంతాల్లోని వారు ఏటా కనీసం రూ. వెయ్యి అయినా చెల్లించుకోవాల్సి వస్తోందని అంచనా. ఇంతకీ ఎందుకీ చార్జీలు?2000కు ముందు ఈ నిబంధనను పెద్దగా పట్టించుకోకపోయినా, ఆ తర్వాత పెద్ద ప్రైవేట్ బ్యాంకులు వచ్చినప్పట్నుంచి ఇవి సర్వసాధారణమైపోయాయి. అప్పట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ చార్జీలను రద్దు చేసినప్పటికీ 2017లో మళ్లీ ప్రవేశపెట్టింది. దీంతో కోట్లాది ఖాతాదారుల మీద ప్రభావం పడి చర్చకు దారి తీసింది. దీంతో కాస్త తగ్గించి, ఆ తర్వాత 2020లో కోవిడ్ సమయంలో పూర్తిగా తొలగించింది. వాస్తవానికి కస్టమర్ల ఖాతాల (సేవింగ్స్ అయినా, కరెంట్ అయినా) నిర్వహణ కోసం బ్యాంకులకు కాస్తంత ఖర్చవుతుంది. అంటే ఏటీఎం విత్‌డ్రాయల్స్, కార్డుల నిర్వహణ, పాస్‌బుక్ ప్రింటింగ్, బ్రాంచ్ సర్వీసులు, ఆన్ లైన్/మొబైల్ బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలు మొదలైనవి కల్పించడానికి ఖర్చులవుతాయి. కస్టమర్లు కనీసం కొంతైనా బ్యాలెన్స్ ఉంచితే ఆ ఖర్చులను కవర్ చేసుకోవచ్చనేది బ్యాంకుల ఆలోచన. అదొక్కటే కాదు..» ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంటే బ్యాంకులు ఎక్కువ వడ్డీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా తక్కువ ఖర్చుకే డిపాజిట్లను సమీకరించుకున్నట్లు అవుతుంది. అలా చౌకగా వచ్చిన మొత్తాన్ని అధిక వడ్డీ రేటుపై రుణాలివ్వొచ్చు లేదా పెట్టుబడులకు వాడుకోవచ్చు.» పెనాల్టీలనేవి బ్యాంకులకు ఇతరత్రా ఆదాయ వనరులాగా కూడా ఉపయోగపడతాయి. » బ్యాలెన్స్ లేని ఖాతాల వల్ల తమకు ఉపయోగం లేకపోయినా తప్పనిసరిగా కేవైసీ, ఆడిట్లాంటివన్నీ చేయాలి. కాబట్టి ఆ భారాన్ని తగ్గించుకునేందుకు పెనాల్టీలు విధిస్తే కస్టమర్లు ఖాతాను యాక్టివ్‌గా ఉంచుకోవడమో లేదా మూసివేయడమో చేస్తారు కాబట్టి భారం కాస్త తగ్గుతుంది. » హై–వేల్యూ కస్టమర్లు, లో–వేల్యూ కస్టమర్లను గుర్తించేందుకు, ఖాతాదారులను బట్టి ప్రీమియం సర్వీసుల్లాంటివి ఆఫర్ చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి.ఎందుకు తొలగిస్తున్నాయంటే?కరువు.. ఆపై అధిక మాసంలాగా అసలే చేతిలో డబ్బు లేకపోగా.. పెనాల్టీల భారం కూడా తోడు కావడమనేది సామాన్య ఖాతాదారులకు తలనొప్పి వ్యవహారంగా మారింది. దీన్ని భరించే బదులు ఖాతానే వాడటం మానేస్తే పోతుందని వదిలేస్తున్నారు కూడా. దీన్ని పరిష్కరించుకోవడంతో పాటు, అందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తేవడంపై ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతుండటంతో దానికి తగ్గట్లుగా ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే తీసుకున్న ఈ నిర్ణయంతో.. సాధారణంగా కనీస బ్యాలెన్స్‌లను పాటించడం కష్టంగా ఉండే విద్యార్థులు, రైతులు, మహిళలు, గ్రామీణ – పట్టణ ప్రాంతాల్లోని పేదలు మొదలైన వర్గాలకు ప్రయోజనం చేకూరుతుంది.వ్యాపార వ్యూహాలు..: ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడంలో బ్యాంకుల వ్యాపా ర వ్యూహాలు కూడా ఉన్నాయి. పెనాల్టీల రూపంలో కోట్లు వసూలు చేస్తున్నప్పటికీ బ్యాంకుల కోణంలో చూస్తే వాటికి వచ్చే వడ్డీ ఆదాయంతో పోలిస్తే ఇలా వచ్చే ఆదాయం చాలా తక్కువే. దీనికి తోడు చెడ్డ పేరు ఒకటి. దీంతో ఆ కాస్త మొత్తాన్ని వదులుకున్నా, కస్టమర్ల నమ్మకాన్ని పొందవచ్చనేది ఒక ఆలోచన. మినిమం బ్యాలెన్స్ పెనాల్టీ భారం లేదు కాబట్టి ఖాతాదారులు ఎంతో కొంతైనా వేస్తూ, తీస్తూ ఉండటం వల్ల ఖాతాలు యాక్టివ్‌గా ఉంటాయి. అలాగే పాతబడిన ఖాతాలపై పెనాల్టీలు వేయొద్దన్న నియంత్రణ సంస్థ ఆదేశాలను కూడా పాటించినట్లవుతుంది. జీరో–బ్యాలెన్స్, డిజిటల్ ఖాతాల్లాంటివి అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్న కొత్త తరం సంస్థలతో పోటీపడేందుకు వీలవుతుంది.ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.633.4 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.386.51 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.369.16 కోట్లు ఇలా పెనాల్టీల కింద వసూలు చేశాయి. -
నెటిజన భారత్!
ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా ఓ స్మార్ట్‌ఫోన్ . అవసరానికే కాదు వినోదానికీ ఈ ఉపకరణమే. మెసేజింగ్, కాలింగ్ యాప్స్, సామాజిక మాధ్యమాలు జీవితంలో భాగం అయిపోయాయి. ఇంకేముంది.. డేటా, అన్ లిమిటెడ్ ప్యాక్స్‌తో జనం సింపుల్‌గా మొబైల్‌తో ‘రీచార్జ్’ అవుతున్నారు. దేశంలో సగటున ఒక్కో నెల మొబైల్ కస్టమర్లు 21.53 జీబీ డేటాను ఆస్వాదిస్తున్నారు. మూడేళ్లలో సగటున నెలకు డేటా వినియోగం 44.59% పెరిగిందంటే నెట్లో ఏ స్థాయిలో విహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.దేశంలో వైర్లెస్ డేటా చందాదారుల సంఖ్య 2025 మార్చి నాటికి 93.9 కోట్లు. అంతకుముందు ఏడాదిలో ఇది 91.3 కోట్లు. మొత్తం బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల్లో వైర్లెస్ వాటా ఏకంగా 95 శాతానికిపైగా ఉంది. ఇక వైర్లెస్ డేటా వినియోగం 1,94,774 పెటాబైట్స్ నుంచి ఏడాదిలో 17.46 శాతం అధికమై 2,28,779 పెటాబైట్స్‌కు ఎగసింది. అంటే 2,28,77,90,00,000 జీబీ అన్నమాట. టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) ఇటీవల విడుదల చేసిన 2024–25 గణాంకాల్లో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల్లో ఎల్టీఈ (4జీ) వాటా 64.2 కోట్లు కాగా, 5జీ చందాదారుల సంఖ్య 24.4 కోట్లకు చేరింది. 100 మంది జనాభాలో ఇంటర్నెట్ వాడుతున్న వారు 68.63 శాతం ఉన్నారు. ఇంటర్నెట్ మార్కెట్లో ప్రైవేట్ కంపెనీల వాటా ఏకంగా 96 శాతం ఉంది. మిగిలినది ప్రభుత్వ టెలికం సంస్థలది. వైర్లెస్ డేటా వినియోగం ద్వారా ఒక్కో కస్టమర్ నుంచి టెలికం కంపెనీలకు ప్రతి నెలా సగటున 2023–24లో రూ.211.36 సమకూరితే.. 2024–25లో అది రూ.231.64కి పెరిగింది. 2021–22లో ఇది రూ.147.94 మాత్రమే. -
హైకోర్టు చివాట్లు పెట్టినా.. ఆ ఐఏఎస్ తీరు మారలేదు..
భోపాల్: పరీక్షా కేంద్రంలో ఓ విద్యార్థినిపై కలెక్టర్ పలు మార్లు దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజా ఘటనతో మరోసారి సదరు వివాదాస్పద ఐఏఎస్ అధికారి తీరు చర్చాంశనీయంగా మారింది.విద్యార్థిపై కలెక్టర్ చేయి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఏప్రిల్ 1న మధ్యప్రదేశ్ రాష్ట్రం భింద్ జిల్లాలోని మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు హేమంత్ కటారే మామ నారాయణ్ దంగ్రౌలియాకు చెందిన దీన్ దయాళ్ దంగ్రౌలియా మహవిద్యాలయ కాలేజీలో మాథ్స్ పరీక్షా కేంద్రంలో జరిగింది. పరీక్షా కేంద్రంలో విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. పరీక్ష రాసే సమయంలో ఓ విద్యార్థి బాత్రూంకు వెళ్లి తిరిగి తన స్థానంలో కూర్చొనేందుకు ప్రయత్నించాడు. అప్పుడే పరీక్ష కేంద్రంలోకి జిల్లా కలెక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ విద్యార్థులు పరీక్ష ఎలా రాస్తున్నారని పరిశీలించే ప్రయత్నం చేశారు.బాత్రూంకు వెళ్లి వచ్చిన విద్యార్థిపై పలు ప్రశ్నలు సంధించాడు. విద్యార్థి సైతం కలెక్టర్‌కు రిప్లయి ఇచ్చాడు. అప్పుడే విద్యార్థి సమాధానంతో కలెక్టర్ కోపోద్రికులయ్యారు. విద్యార్థిపై పలుమార్లు దాడి చేశారు. అనంతరం విద్యార్థి సిబ్బంది గదిలోకి పిలిపించుకున్నారు. మరో మారు విద్యార్ధిపై చేయి చేసుకున్నారు. ఆ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.కలెక్టర్ చేతిలో దెబ్బలు తిన్న విద్యార్ధిపేరు రోహిత్ రాథోడ్. బీఎస్ఈ రెండో సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షా కేంద్రంలో రోహిత్ రాథోర్ తన ప్రశ్నాపత్రాన్ని బయటకు తీసుకెళ్లి వాటికి సమాధానాలు తెలుసుకున్నారనే ఆరోపణలు వినిపించాయి.దీనిపై కలెక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ స్పందించారు. విద్యార్ధిపై చేయిచేసుకోవడాన్ని తనని తాను సమర్ధించుకున్నారు. ‘ఈ పరీక్షా కేంద్రంలో ఆర్గనైజ్డ్ మాస్ చీటింగ్ జరుగుతుందనే సమాచారం అందింది. మాస్ చీటింగ్ గుట్టురట్టు చేసేందుకే ఎగ్జామ్ సెంటర్‌ను విజిట్ చేశాను. ఆ సమయంలో ఓ విద్యార్థి తన ప్రశ్నాపత్రాన్ని టాయిలెట్లోకి తీసుకెళ్లాడు. ప్రశ్నలకు జవాబులు తెలుసుకొని పరీక్ష జరుగుతున్న తన బెంచ్ మీద కూర్చొనే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో బెంచ్ మీద క్వశ్చన్ పేపర్ లేదు. ఇదే విషయాన్ని విద్యార్ధిని ప్రశ్నించానని చెప్పుకొచ్చారు. కాలేజీలో చీటింగ్‌లు జరుగుతున్నాయనే సమాచారం వచ్చింది. భవిష్యత్తులో కాలేజీల్లో ఇలా జరగకుండా యూనివర్సీటీకి లేఖ రాస్తానని అన్నారు.విద్యార్థి రోహిత్ రాథోర్ మాట్లాడుతూ.. నేను టాయిలెట్‌కు వెళ్లి వచ్చేసరికి నా ప్రశ్నపత్రం కనిపించలేదు. నేను మోసం చేయలేదని వాపోయాడు. కాగా, విద్యార్ధిపై దాడి విషయంలో ఐఏఎస్ అధికారి సంజీవ్ శ్రీవాస్తవపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు సైతం ఆయన ప్రవర్తనపై వ్యాఖ్యలు చేసింది. మరో అధికారిణి మాలా శర్మ ఆయనపై మానసిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఇప్పుడు విద్యార్థిపై ఐఏఎస్ అధికారి సంజీవ్ శ్రీవాస్తవ చేయిచేసుకోవడం వివాదానికి దారి తీసింది. ఇదే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. Sanjeev Srivastava, IAS, DM of Bhind, got a tip-off about cheating during the BSc 2nd year maths exam at a college.DM sahab barged in like Singham, picked a student, and started slapping him without any proof of cheating.If you are angry at this, remeber that DM sahab could… pic.twitter.com/n5J1yZv5gy— THE SKIN DOCTOR (@theskindoctor13) July 13, 2025 -
కోట శ్రీనివాసరావు మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం
న్యూఢిల్లీ: టాలీవుడ్ ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావు మరణం బాధాకరమని, ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞగా ఆయన గుర్తిండిపోతారని మోదీ కొనియాడారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘కోట శ్రీనివాసరావు గారి మరణం బాధాకరం. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారు. తరతరాలుగా ప్రేక్షకులను తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు మరియు పేదలు మరియు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారు. ఆయన కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు నా సంతాపం. ఓం శాంతి.’ అని ‘ఎక్స్’ ఖాతా ద్వారా సంతాపం తెలిపారు.శ్రీ కోట శ్రీనివాసరావు గారి మరణం బాధాకరం. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారు. తరతరాలుగా ప్రేక్షకులను తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు మరియు పేదలు మరియు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారు. ఆయన…— Narendra Modi (@narendramodi) July 13, 2025 ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నటుడుప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మరణం బాధాకరం. తన అద్భుతమైన నటనా ప్రతిభతో కోట ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన సినిమాకు చేసిన సేవలకు గాను ఆయనకు 2015లో పద్మశ్రీ అవార్డు లభించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిన్నా’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు.Deeply saddened by the demise of illustrious film personality Shri Kota Srinivasa Rao Garu. Admired for his phenomenal acting talent, Shri Kota Srinivasa Rao Garu made his place in people's hearts and won honors for his devotion to uplifting the poor. He was also conferred the…— Amit Shah (@AmitShah) July 13, 2025 ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి -
ప్రియుడితో భార్య జంప్.. పాల స్నానంతో భర్త సంబరాలు
భార్య నుంచి విడాకులు పొందానన్న ఆనందంతో ఓ భర్త సంబరాలు చేసుకున్నాడు.. అక్కడితో ఆగలేదు.. ఇక తాను స్వేచ్ఛాజీవినంటూ 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు. విడాకులను నాలుగు బకెట్ల పాల స్నానంతో వేడుక చేసుకున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అస్సాంలోని నల్బాడీ జిల్లాలోని ముకల్మువా ప్రాంతానికి చెందిన మాణిక్ అలీకి భార్యతో విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ భార్యభర్తలకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఇంటికి చేరుకున్న భర్త.. పాలతో స్నానం చేసి సంతోషంతో ఎగిరి గంతేశాడు.తన భార్యకు ఓ ప్రియుడు ఉన్నాడంటూ చెప్పుకొచ్చిన మాణిక్ అలీ.. తనతో పెళ్లై ఓ బిడ్డ జన్మించినా కానీ.. ఆమె తీరు మారలేదని.. తన ప్రియుడితో వివాహేతర బంధం కొనసాగించిందని తెలిపాడు.. తనను, తన బిడ్డను వదిలేసి ఆమె ప్రియుడితో వెళ్లిపోయిందని.. ఇలా.. ఒక్కసారి కాదు రెండు సార్లు అలాగే వెళ్లిపోయిందన్నాడు.మొదటిసారి తప్పు చేసినప్పుడు తన బిడ్డ కోసం ఆమెను క్షమించానని చెప్పాడు. మా కుటుంబం శాంతి కోసం తాను మౌనంగా ఉన్నానని.. మళ్లీ అదే తప్పు చేయడంతో భరించలేక విడాకులు తీసుకున్నానని మాణిక్ అలీ తెలిపారు. విడాకులు తీసుకున్నాక.. కొత్త జన్మ ఎత్తినట్లుగా ఉందని.. ఈ రోజు నుండి తాను విముక్తి పొందానని.. కొత్త జీవితం ప్రారంభానికి గుర్తుగా పాలతో స్నానం చేశానంటూ మాణిక్ అలీ చెప్పాడు. -
మరాఠీ మాట్లాడని ఆటో డ్రైవర్‌పై దాడి
ముంబై: మహారాష్ట్రలో బాషా వివాదాలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తాజాగా విరార్ ప్రాంతంలో ఇటువంటి ఘటనే జరిగింది. శివసేనలోని ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన కార్యకర్తలు మరాఠీలో మాట్లాడేందుకు నిరాకరించిన ఆటో డ్రైవర్‌పై దాడి చేశారు. ఆ డ్రైవర్ గతంలో ఒక వీడియోలో తాను హిందీ, భోజ్‌పురిలో మాట్లాడటం కొనసాగిస్తానని ప్రకటించాడు. ఇది కొన్నివర్గాలకు ఆగ్రహాన్ని తెప్పించింది.శనివారం సాయంత్రం విరార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన కార్యకర్తలు ఆ డ్రైవర్‌ను వెతికి పట్టుకుని, అతనిపై దాడి చేశారు. తరువాత మరాఠీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శివసేన (యూబీటీ) విరార్ నగర చీఫ్ ఉదయ్ జాదవ్ ఈ చర్యను సమర్థించారు. ‘ఎవరైనా మరాఠీ భాషను, మహారాష్ట్రను, మరాఠీ ప్రజలను అవమానించే ప్రయత్నం చేస్తే, వారికి శివసేన తనదైన శైలిలో సమాధానం ఇస్తుందని జాదవ్ హెచ్చరించారు. #Auto driver assaulted in #Virar for not speaking #Marathi, #UddhavThackeray Sena workers force public apology | Video#ShivsenaUBT #Shivsena #MarathiNews https://t.co/PLsFHzDsN0— IndiaTV English (@indiatv) July 13, 2025కాగా పలువురు ఈ దాడిని ఖండించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైనదికాదన్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులు ఎటువంటి అధికారిక ఫిర్యాదును నమోదు చేయలేదు. మహారాష్ట్రలో భాషా రాజకీయాలపై తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) ఇటువంటి వివాదాల్లో చిక్కుకున్న దరిమిలా.. ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే వర్గం కూడా ఇలాంటి దూకుడు చర్యలకు పాల్పడుతోందనే మాట వినిపిస్తోంది. -
అమర్నాథ్ యాత్రలో ప్రమాదం.. 10 మందికి గాయాలు
కుల్గాం: అమర్నాథ్ యాత్రలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన తొమ్మిది మంది యాత్రికులను సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక వైద్య సహాయం అందించి, తదుపరి చికిత్స కోసం అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ)కు తరలించారు.కుల్గాం జిల్లాలోని ఖుద్వానీ ప్రాంతంలోని టాచ్లూ క్రాసింగ్ సమీపంలో యాత్రా కాన్వాయ్‌లోని మూడు బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో పది మందికి పైగా యాత్రికులు గాయపడ్డారు. గాయపడిన యాత్రికులను అనంతనాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్య అధికారులు తెలిపారు. ఈ ఘటన తాత్కాలికంగా అంతరాయం కలిగించినప్పటికీ, యాత్ర కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. స్థానిక అధికారులు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. -
Bihar: ఓటరు జాబితాలో అత్యధిక విదేశీయులు.. ఈసీఐ అధికారులు షాక్
పట్నా: బీహార్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల కమిషన్ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ఓటర్ల జాబితాను సవరిస్తున్న అధికారులకు పలు కంగుతినే అంశాలు కనిపించాయి. సెప్టెంబర్ 30న ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో అక్రమ వలసదారుల పేర్లు కనిపించవని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు.బీహార్‌లో ఓటర్ల జాబితాపై ఇంటెన్సివ్ సమీక్ష కోసం ఇంటింటికీ వెళ్లి నిర్వహించిన సర్వేలో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్‌కు చెందినవారు పెద్ద సంఖ్యలో ఓటర్లుగా ఉన్నట్లు తేలిందని భారత ఎన్నికల సంఘం(ఈసీఐ)అధికారులు తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా మేజిస్ట్రేట్లు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వివిధ పంచాయతీలలో ఇంటింటికీ వెళ్లి బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓ)చేస్తున్న పనిని ధృవీకరిస్తున్నారు. బూత్-స్థాయి అధికారుల ఇంటింటి సందర్శనల సమయంలో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్లకు చెందిన ఓటర్లను కనుగొన్నారని ఈసీఐ అధికారులు తెలిపారు.ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. దేశంలో స్థిరపడిన బంగ్లాదేశ్, మయన్మార్లకు చెందిన వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రస్తుత తరుణంలో వీరు ఓటర్లుగా మారడంపై చర్చ మొదలయ్యింది. కాగా అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరగనున్నాయి. -
ఆర్పీఎఫ్ తొలి మహిళా సారధిగా సోనాలి మిశ్రా
న్యూఢిల్లీ: మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు. భారత సైన్యంలోనూ ప్రవేశించి, తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడు సీనియర్ ఐపీఎస్ అధికారిణి సోనాలి మిశ్రా.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. జూలై 31న పదవీ విరమణ చేయనున్న మనోజ్ యాదవ్ స్థానంలో ఆమె ఈ పదవిని చేపడుతున్నారు.సోనాలి మిశ్రాను ఈ పదవిలో నియమించేందుకు క్యాబినెట్ నియామకాల కమిటీ అధికారికంగా ఆమోదం తెలిపింది. సిబ్బంది మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం 2026, అక్టోబర్ 31 వరకూ అంటే పదవీ విరమణ చేసే వరకు సోనాలి మిశ్రా ఈ పదవిలో కొనసాగనున్నారు. రైల్వే ఆస్తులను కాపాడటం, ప్రయాణికుల భద్రత తదితర విధులతో పాటు, వాటి బాధ్యతలను అధికారులకు అప్పగించే విషయంలో ఆర్పీఎఫ్కు సోనాలీ మిశ్రా తొలి మహిళా అధికారిగా విధులు నిర్వహించనున్నారు.సోనాలి మిశ్రా మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన 1993 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారిణి. ఆమె ప్రస్తుతం మధ్యప్రదేశ్ పోలీసు విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ (సెలక్షన్)గా పనిచేస్తున్నారు. కాగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)1957లో పార్లమెంటు చట్టం ప్రకారం ఏర్పాటయ్యింది. దీనికి 1985, సెప్టెంబర్ 20న యూనియన్ సాయుధ దళం హోదా ఇచ్చారు. 2021 జూలైలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఏర్పాటుకు నాయకత్వం వహించిన మొదటి మహిళా కమాండర్‌గా సోనాలి మిశ్రా పేరొందారు. -
రాధిక చేసిన మిస్టేక్ అదే.. హిమాన్షిక సంచలన వ్యాఖ్యలు
గురుగ్రామ్: టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య కేసుకు సంబంధించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కూతుర్ని ఆంక్షల నడుమ బంధించడానికి యత్నించే క్రమంలోనే ఈ హత్య జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రాధిక ప్రాణ స్నేహితురాలు స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తల్లిదండ్రులు.. రాధికను నియంత్రించారని పేర్కొంది. రాధికను తనకు నచ్చిన విధంగా జీవించనివ్వలేదని తెలిపారు.రాధిక ప్రాణ స్నేహితురాలు హిమాన్షిక సింగ్ తాజాగా మాట్లాడుతూ.. రాధిక నాకు 2012 నుంచి తెలుసు. రాధిక ఎంతో సున్నితమైన మనసు కలిగి ఉంది. రాధిక కుటుంబ సభ్యులు.. ఆమెను నియంత్రించే వారు. ఆమె నాతో వీడియో కాల్లో ఉన్నప్పుడు, ఆమె ఎవరితో మాట్లాడుతుందో తల్లిదండ్రులకు చూపించాల్సి వచ్చింది. టెన్నిస్ అకాడమీ తన ఇంటి నుంచి కేవలం 15 నిమిషాల దూరంలో ఉన్నప్పటికీ, ఆమె ఎప్పుడు తిరిగి రావాలన్న దానిపై డెడ్‌లైన్ ఉండేది. రాధికది సంప్రదాయ కుటుంబమని, దాదాపు ప్రతి దానితోనూ సమస్యలు ఉండేవని తెలిపింది. ప్రతి విషయంలోనూ నియంత్రణ విధిస్తూ రాధిక జీవితాన్ని ఆమె తండ్రి దుర్భరం చేశాడు.బయటకు వెళ్లాక పలానా సమయంలో తిరిగి ఇంటికి రావాలని ఆంక్షలు విధించేవారు. రాధిక కదలికలను ఇంట్లోవారు నియంత్రించారు. అతను తన నియంత్రణ, ప్రవర్తన, నిరంతర విమర్శలతో కుమార్తె జీవితాన్ని సంవత్సరాలుగా దుర్భరంగా మార్చాడు. షార్ట్స్ ధరించినందుకు, అబ్బాయిలతో మాట్లాడినందుకు, తన సొంత నిబంధనల ప్రకారం జీవించినందుకు వారు ఆమెను అవమానించారు. క్రమంగా వీడియోలు చిత్రీకరించడం వంటి ఆమె అభిరుచులన్నీ కనుమరుగయ్యాయి. ఆమె ఇంట్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. కుటుంబంపై సామాజిక ఒత్తిడి ఉంది. ప్రజలు ఏమనుకుంటారో అని తల్లిదండ్రులు ఎల్లప్పుడూ ఆందోళన చెందేవారు. ఇంట్లోని ఆంక్షలతో ఆమె ఊపిరాడనట్టు ఉండేది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ రాధిక హత్యకు కారణమని తెలిపారు. రాధిక.. తన పేరెంట్స్‌కు నచ్చని కొని పనుల కారణంగానే హత్యకు గురైందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. రాధికా యాదవ్ టెన్నిస్ కోచ్‌లలో ఒకరైన అజయ్ యాదవ్ కూడా ఆమె హత్యపై స్పందించారు. ఈ సందర్భంగా యాదవ్ మాట్లాడుతూ..‘ఇంట్లోని కొన్ని పరిమితులు, ఆంక్షలతో రాధిక సతమతమైనట్లు వెల్లడించారు. తనకు వాట్సాప్ చాట్ టెక్ట్స్ మెసేజ్‌లు, వాయిస్ చాట్లలో ఆమె చెప్పిన కొన్ని విషయాలను జాతీయ మీడియాకు చూపించారు. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. -
గంటలో 14 కేజీలు లాగించేశారు!
ప్రభుత్వ అధికారుల అవినీతి కథలు కొత్తేమీ కాదు కానీ.. మధ్యప్రదేశ్‌లోని ఈ తాజా ఘటన మాత్రం కొంచెం విచిత్రమైందే. గంట సమయంలో కొందరు అధికారులు ఎకాఎకిన 14 కిలోల డ్రైఫ్రూట్స్ లాగించేశారట. దీనికి సంబంధించి రూ.85 వేల బిల్లు పెడితే.. పై అధికారులకు డౌటొచ్చింది. విచారణ జరగడంతో పాపం చిక్కిపోయారు! వివరాలు...మధ్యప్రదేశ్‌లోని శాధోల్ జిల్లాలో ఉండే చిన్న గ్రామం భడ్‌వాహీ. వాన నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ‘జల్ గంగ సంవర్ధన్’ పేరుతో ఒక కార్యక్రమం చేపట్టింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్, ఎస్డీఎం, పంచాయతీ కార్యదర్శి తదితరులు హాజరయ్యారు. అంతా కలిపి 24 మంది మాత్రమే. కానీ బిల్లు మాత్రం రూ..85 వేలు అయినట్లు పెట్టారు.వీళ్లంతా కలిసి ప్రజాధనం దోచేస్తున్నారు అనుకున్నారో ఏమో.. గుర్తు తెలియని వ్యక్తులు ఈ బిల్లును కాస్తా సోషల్ మీడియాలో పడేశారు. ఇంకేముంది.. ఒక్కపట్టున వైరల్ అయిపోయింది అది. గంట టైమ్‌లో ఈ 24 మంది అధికారులు కూర్చుని 14 కిలోల బాదాం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష తిన్నారట. ఇది చాలదన్నట్టు 30 కిలోల స్నాక్స్, కాఫీ/టీల కోసం ఆరు లీటర్ల పాలు.. ఐదు కిలోల చక్కెర వాడామని బిల్లులో పెట్టారు.వీటికి రకరకాల పండ్లు అదనం! విచిత్రమైన విషయం ఇంకోటి ఉంది. సమావేశానికి హాజరైన గ్రామస్తులకు కిచిడీ మాత్రమే వడ్డించి వీరు మాత్రం పంచభక్ష్య పరమాన్నాల టైపులో డ్రైఫ్రూట్స్‌తో ‘బ్రేవ్’ మని తేన్చడం!గంట సమావేశంలో రూ.85 వేల బిల్లు ఏమిటా? అన్న అనుమానం పై అధికారులకు రావడంతో విషయం బయటకొచ్చింది. విచారణ మొదలైంది. ‘‘అబ్బే.. మేం అసలు డ్రైఫ్రూట్స్ ముట్టుకోలేదు’’ అని కొందరు అధికారులు సన్నాయి నొక్కులు నొక్కడం కొసమెరుపు!-గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
పెద్దల సభకు ఉజ్వల్ నికమ్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నలుగురు ప్రతిభావంతులను రాజ్యసభకు నామినేట్ చేశారు. 26/11 ముంబయి ఉగ్రవాద దాడి కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసి, పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్ష పడేలా కీలక పాత్ర పోషించిన సీనియర్ లాయర్ ఉజ్వల్ నికమ్, చరిత్రకారిణి డాక్టర్ మీనాక్షి జైన్, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లా, కేరళ బీజేపీ నేత సి.సదానందన్ మాస్టర్లు పెద్దల సభకు నామినేట్ అయ్యారు. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 80(1)(ఎ) క్లాజ్ (3) కింద తనకు లభించిన అధికారం మేరకు ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు ఈ నలుగురిని నామినేట్ చేశారు. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎగువ సభకు 12 మందిని పంపించే అధికా రం రాష్ట్రపతికి ఉంది. ప్రధానంగా కళలు, సాహిత్యం, విజ్ఞానం, సామాజిక సేవ వంటి రంగాల్లో విశిష్టమైన సేవలందించిన వ్యక్తులకు రాష్ట్రపతి రాజ్యసభకు పంపిస్తుంటారు. న్యాయ పటిమకు మారుపేరు ఉజ్వల్ ఉజ్వల్ దేవ్‌రావు నికమ్‌కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో కోర్టులో ప్రభుత్వం పక్షాన వాదించారు. దాదాపు 100 మందికి శిక్షలు పడేలా కృషిచేశారు. ఆ తర్వాత 26/11 దాడి కేసులో ఉగ్రవాది కసబ్‌కు ఉరిశిక్ష పడేలా కీలక పాత్ర పోషించారు. ఎన్ని బెదిరింపులు వచి్చనా, ఎన్ని ఒత్తిళ్లున్నా పక్కాగా సాక్ష్యాధా రాలు సేకరించి, కోర్టులో వాదించడం ఉజ్వల్ నికమ్ ప్రత్యేకత. ఇప్పటివరకు వివిధ కేసుల్లో 628 మందికి యావజ్జీవ కారాగార శిక్ష, 37 మందికి ఉరిశిక్ష పడేలా కోర్టులో వాదించారు. 2016లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్ సెంట్రల్ స్థానం నుంచి బీజేపీ అభ్యరి్థగా ఉజ్వల్ పోటీ చేశారు. దౌత్య నిపుణుడు హర్షవర్ధన్ శ్రింగ్లా హర్షవర్ధన్ శ్రింగ్లా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి. 1984 బ్యాచ్‌కు చెందిన ఆయన 38 ఏళ్లకు పైగా దౌత్య సేవలు అందించారు. అమెరికా, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్‌లో భారత రాయ బారిగా, హైకమిషనర్‌గా పని చేశారు. అమెరికా, చైనా వంటి దేశాలతో ఇండియా సంబంధాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2020 నుంచి 2022 వరకు భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా సేవలందించారు. 2023లో జీ20 కూటమికి భారత్ నా యకత్వం వహించిన సమయంలో జీ20 స మావేశాల ముఖ్య సమన్వయకర్తగా ఉన్నారు.చరిత్రలో కొత్త వెలుగులు మీనాక్షి జైన్ డాక్టర్ మీనాక్షి జైన్ విద్యావేత్తగా పేరుగాంచారు. చరిత్ర, సామాజిక శా్రస్తాల్లో లోతైన పరిశోధనలు చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలోని గార్గీ కాలేజీలో హిస్టరీ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. భారతీయ నాగరికత, సంస్కృతిపై పలు పుస్తకాలను రచించారు. విద్య, సాహిత్యం, చరిత్ర, రాజనీతిశాస్త్రంలో మీనాక్షి జైన్ సేవలు ప్రశంలందుకున్నాయి. పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. సాహసి సదానందన్ మాస్టర్ కేరళలోని పాలక్కడ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత సి.సదానందన్ మాస్టర్ రాజకీయ హింసకు భయపడని వ్యక్తిగా ప్రఖ్యాతి చెందారు. పార్టీ మారేందుకు నిరాకరించినందుకు 1994 జనవరి 25న వామపక్ష కార్యకర్తలు ఆయనపై దాడి చేసి, రెండు కాళ్లను నరికేశారు. అయినా సదానంద్ మాస్టర్ ధైర్యం కోల్పోకుండా సమాజ సేవలో నిమగ్నమయ్యారు. విద్యా, సామాజిక రంగాల్లో తన వంతు సేవలందించారు. సుదీర్ఘకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 2016, 2021లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున కన్నూర్ నుంచి పోటీ చేశారు. మోదీ మరాఠీలో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ తనతో మరాఠీ భాషలో మాట్లాడారని ఉజ్వల్ నికమ్ ఆదివారం తెలిపారు. తనను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయబోతున్నట్లు ఆయన ముందే చెప్పారని అన్నారు. ‘‘శనివారం ప్రధాని మోదీ నాతో ఫోన్లో మాట్లాడారు. హిందీలో మాట్లాడాలా? లేక మరాఠీలో మాట్లాడాలా? అని అడి గారు. దాంతో ఇద్దరం కాసేపు హాయిగా నవ్వుకున్నాం. చివరకు మోదీ మరాఠీలోనే నాతో సరదాగా సంభాషించారు. రాజ్యసభకు పంపించబోతున్నట్లు చెప్పగా, అందుకు వెంటనే అంగీకారం తెలియజేశా’’ అని ఉజ్వల్నికమ్ వెల్లడించారు. అసాధారణ కృషి చేశారు: మోదీ రాజ్యసభకు నామినేట్ అయిన నలుగురు ప్రముఖులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వారి నైపుణ్యం పార్లమెంట్ కార్య కలాపా లను సుసంపన్నం చేయాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ‘‘నలుగురు ప్రముఖులు చేసిన కృషి అసాధారణం. న్యాయరంగం, రాజ్యాంగం పట్ల ఉజ్వల్ నికమ్ నిబద్ధత ప్రశంసనీయమైనది. ఆయనను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయడం ఒక గౌరవ సూచిక. హర్షవర్దన్ శ్రింగ్లా ప్రతిభావంతుడైన దౌత్యవేత్త. వ్యూహాత్మక ఆలోచనలతో భారత్‌ను అంతర్జాతీయంగా నూతన శిఖరాలకు తీసుకెళ్లారు. సదానందన్ మాస్టర్ జీవితం ధైర్యసాహసాలకు ఒక ప్రతీక. విద్య, సమాజ సేవా రంగాల్లో ఆయన విశేషమైన కృషి సాగించారు. డాక్టర్ మీనాక్షి జైన్ ఒక గొప్ప చరిత్రకారిణి, విద్యావేత్త, పరిశోధనల్లో మేటి. ప్రతిభావంతురాలైన మీనాక్షి జైన్ రాజ్యసభకు వస్తుండడం చాలా సంతోషకరం’’ అని పేర్కొన్నారు. The President of India has nominated Ujjwal Deorao Nikam, a renowned public prosecutor known for handling high-profile criminal cases; C. Sadanandan Maste, a veteran social worker and educationist from Kerala; Harsh Vardhan Shringla, former Foreign Secretary of India; and… pic.twitter.com/eN6ga5CsPw— ANI (@ANI) July 13, 2025రాజ్యసభకు నామినేట్ అయిన కొత్త అభ్యర్థులు వీరే..1. ఉజ్వల్ దేవరావు నికమ్: 26/11 ముంబై ఉగ్ర దాడులతో సహా అనేక ఉన్నత స్థాయి క్రిమినల్ కేసులను విచారించిన ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్.2. సి. సదానందన్ మాస్తే: దశాబ్దాలుగా అట్టడుగు వర్గాలకు సేవలు అందిస్తున్న కేరళకు చెందిన సామాజిక కార్యకర్త, విద్యావేత్త.3. హర్షవర్ధన్ శ్రింగ్లా: భారత మాజీ విదేశాంగ కార్యదర్శి, కీలక ప్రపంచస్థాయి పదవులలో పనిచేసిన అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త.4. డాక్టర్ మీనాక్షి జైన్: ప్రముఖ విద్యావేత్త, భారతీయ చారిత్రక విజ్ఞానానికి విశేష కృషి చేశారు.న్యాయవాది, బీజేపీ నేత ఉజ్వల్ నికమ్ 1993 ముంబై వరుస పేలుళ్లు, 26/11 ఉగ్రదాడి తదితర కేసులలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(ఏ) కింద ఈ నామినేషన్లు దాఖలయ్యాయి. సాహిత్యం, సైన్స్, కళలు, సామాజిక సేవ తదితర రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారిని రాజ్యసభకు నామినేట్ చేయడానికి రాష్ట్రపతికి ప్రత్యేక అధికారం ఉంది. -
నేను మీ జోలికి రాను.. నా బిడ్డను ఏమీ చేయవద్దు..!
మైసూరు: పెళ్లయి కోటి ఆశలతో మెట్టినింటికి వెళ్లింది, కానీ రెండు నెలలకే అత్తింట్లో యువ వైద్యురాలు నరకాన్ని చూసింది. ఆమెకు వేధింపులకు గురి చేసి బలవంతంగా గర్భస్రావం చేయించిన భర్త, అత్తమామలతో పాటు ఐదుగురిపై మైసూరులోని సరస్వతీపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. రూ.80 లక్షలతో పెళ్లి వేడుక వివరాలు.. మండ్య జిల్లా కేఆర్ పేటె ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి వైద్యురాలు నవ్య, ఆమె తండ్రి మహాదేవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నవ్య భర్త అభిõÙక్, మామ గోవిందరాజు, అత్త లత, జ్ఞానశేఖర్, వైద్యురాలు లత అనేవారిపై కేసు నమోదైంది. నవ్యకు మైసూరులోని బిళికెరె నివాసి, బంగారు వ్యాపారి గోవిందరాజు కుమారుడు అభిõÙక్తో వివాహమైంది. మహాదేవ సుమారు రూ.80 లక్షలు ఖర్చు చేసి కుమార్తెకు ఘనంగా వివాహం చేశారు. నీకు పిల్లలెందుకు అని శుక్రవారం రాత్రి నవ్య మీడియాతో మాట్లాడుతూ వివాహమైన రెండు నెలల్లోనే నన్ను చిత్రవధ చేసిన భర్త, అతని కుటుంబ సభ్యుల నిజస్వరూపం ఏంటో చూశాను. డబ్బు కోసం తీవ్రంగా వేధించారు. తిరుపతికి వెళ్లాలి, సుదూర ప్రయాణం చేయాలంటూ అబద్ధం చెప్పి డబ్బులు తేవాలనేవారు. రూ.5 లక్షల వరకట్నం కూడా తేలేదు, నీకు పిల్లలెందుకు అని అబార్షన్ చేయించారు అని విలపించింది. మంగళసూత్రం, కాళ్ల ఉంగరాలు అన్నింటినీ తీసుకుని తనను నడివీధిలో వదిలేశారన్నారు. పెళ్లికి ముందు వైద్యురాలిగా ఉద్యోగానికి వెళ్లేదాన్నని, పెళ్లైన నాటి నుంచి ఉద్యోగాన్ని మాన్పించారు. ఒక వారం రోజులే తనను బాగా చూసుకున్నారని, తర్వాత రోజుకొక రకంగా హింసించారని రోదించింది. వదిలేయండి అని వేడుకున్నా.. బలవంతపు అబార్షన్‌కు ఓ ఆస్పత్రి వైద్యులు జ్ఞానశేఖర్, లత సహకరించారని ఆరోపించారు. మీరు వేరే పెళ్లి చేసుకోండి, నేను మీ జోలికి రాను, విడాకులు ఇస్తాను, కడుపులోని నా బిడ్డకు ఏమీ చేయవద్దని భర్తను వేడుకున్నా వినలేదు. నా ప్రైవేట్ వీడియో అడ్డు పెట్టుకుని బలవంతం చేశారు, నాకు న్యాయం కావాలని, తన భర్త కుటుంబాన్ని శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేశారు. -
Delhi: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి కారు పోనిచ్చిన డ్రైవర్ అరెస్ట్
న్యూఢిల్లీ: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఐదుగురిపై నుంచి కారును పోనిచ్చిన డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నైరుతి ఢిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతంలోని శివ క్యాంప్ సమీపంలో చోటుచేసుకుంది. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరు జంటలతో పాటు ఎనిమిదేళ్ల బాలిక.. మొత్తం ఐదుగురు పైకి డ్రైవర్ ఉత్సవ్ శేఖర్ (40) కారును ఎక్కించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన సమయంలో శేఖర్ మద్యం మత్తులో ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు.కారు డ్రైవర్ ఉత్సవ్ శేఖర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికే.. స్థానికులు ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. బాధితులను లాధి (40), ఆమె ఎనిమిదేళ్ల కుమార్తె బిమ్లా, భర్త సబామి అలియాస్ చిర్మా (45), రామ్ చందర్ (45), అతని భార్య నారాయణి (35)గా గుర్తించారు. వీరందరూ రాజస్థాన్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. నిందితునిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించామని, సంఘటనల ఖచ్చితమైన క్రమాన్ని నిర్ధారించేందుకు తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.