
కానుకలు, విరాళాల రూపంలో సమర్పించిన భక్తులు
పండరీపూర్ ఆలయ చరిత్రలో ఇదే మొదటిసారని కమిటీ సభ్యుల వెల్లడి
సోలాపూర్, మహారాష్ట్ర: ఈ ఏడాది ఆషాఢ ఏకాదశి జాతర సందర్భంగా మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని విష్ణువు అవతారమైన విఠోబా లేదా శ్రీ విఠల రుక్మిణి ఆలయానికి (Shri Vitthal Rukmini Mandire) కానుకలు, విరాళాల రూపంలో భారీ ఆదాయం సమకూరింది. ఆలయ చరిత్రలోనే మొదటిసారిగా రికార్డుస్థాయిలో రూ. 10.84 కోట్ల ఆదాయం లభించిందని ఆలయ కమిటీ సహాయ అధ్యక్షుడు గహినీనాథ్ ఔసేకర్ మహారాజ్ తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రెండున్నర కోట్ల రూపాయలు అదనంగా లభించినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఆషాఢ ఏకాదశి జాతరకు అత్యధికంగా 15 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. ఇది కూడా ఒక రికార్డే. లడ్డూ ప్రసాదం, భక్త నివాసాలు, హుండీ ఆదాయం కానుకల రూపేణా వచ్చిన మొత్తం 10.84 కోట్ల ఆదాయాన్ని భక్తులకు వివిధ సౌకర్యాలు కల్పించేందుకు ఉపయోగిస్తామని మేనేజర్ మనోజ్ శృత్రి తెలిపారు.
ఇదీ చదవండి: ఇన్నాళ్లకు..మా ఊరికి బస్సొచ్చింది!