
సాక్షి,న్యూఢిల్లీ: ‘పొగతాగుట,మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం’ ఈ తరహా హెచ్చరికలు తినే ఆహార పదార్ధాలకు కేంద్రం వార్నింగ్ లేబుల్స్ తగిలించేలా దిశగా ప్రయత్నాలు చేస్తోందనే ప్రచారం జోరందుకుంది. అయితే, మంగళవారం ఆ ప్రచారాన్ని కేంద్రం ఖండించింది.
ఈ మేరకు పీబీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది. సమోసా,జిలేబీ,లడ్డూతో పాటు ఇతర ఆహార పదార్ధాలకు వార్నింగ్ లేబుల్స్‌ను అందుబాటులోకి తెచ్చేలా కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటి వరకూ ఆ తరహా నిర్ణయాలు తీసుకోలేదని తేల్చింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో ఆహా పదర్ధాలకు వార్నింగ్ లేబుల్స్‌ను జతచేయనుందనే జాతీయ మీడియా కథనాల్ని ట్వీట్‌లో జత చేసింది.
Some media reports claim that the @MoHFW_INDIA has issued a health warning on food products such as samosas, jalebi, and laddoo.#PIBFactCheck
✅This claim is #fake
✅The advisory of the Union Health Ministry does not carry any warning labels on food products sold by vendors,… pic.twitter.com/brZBGeAgzs— PIB Fact Check (@PIBFactCheck) July 15, 2025
పలు మీడియా నివేదికలు ఎయిమ్స్ నాగ్‌పూర్ వంటి కేంద్ర సంస్థల్లో ఆహార పదార్ధాలపై వార్నింగ్ లేబుల్స్ ఏర్పాటు చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించిందని పేర్కొన్నాయి. కానీ పీఐబీ ప్రకారం, ఇది పనిచేసే ప్రాంతాల్లో ఉద్యోగులకు ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాల్ని ఎంపిక చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఇచ్చిన సాధారణ సూచన మాత్రమేనని తెలిపింది. ఈ సూచన ప్రత్యేకంగా భారతీయ స్ట్రీట్ ఫుడ్‌ను లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోలేదు. అందరికీ ఆరోగ్యంపై అవగాహన కలిగించేందుకు రూపొందించినట్లు పీబీఐ హైలెట్ చేసింది.
దేశ జనాభాలో పెరిగిపోతున్న ఒబిసిటి,డయాబెటీస్,గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్త చర్యల భాగంగా ఈ సూచనను తీసుకొచ్చింది. ఈ అడ్వైజరీలో సమోసా, జిలేబీ, లడ్డూ వంటి స్నాక్స్‌పై వార్నింగ్ లేబుల్స్ పెట్టాలని ఎక్కడా చెప్పలేదు. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు వర్క్ ప్లేసుల్లో సూచనలు మాత్రమే స్పష్టం చేసింది.