
న్యూఢిల్లీ: అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు అక్కడి నిబంధనలు కచ్చితంగా పాటించాలని భారత్‌లో అమెరికా రాయబార కార్యాలయం స్పష్టంచేసింది. ఒకవేళ ఇతరులపై దాడులకు పాల్పడినా, చోరీ చేసినా వీసా రద్దయ్యే ప్రమా దం ఉంటుందని పేర్కొంది. చట్టపరమైన చర్యలను ఎదుర్కోవడంతోపాటు భవిష్యత్తులో అమెరికా వీసా పొందడానికి కూడా అర్హత కోల్పోతారని తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది. మళ్లీ అమెరికాలో అడుగుపెట్టే అవకాశం ఉండదని తేల్చిచెప్పింది. అమెరికాలో భారతీయ మహిళ ఒకరు దుకాణంలో చోరీ చేస్తూ పోలీసులకు దొరికిపోయిన నేపథ్యంలో అమెరికన్ ఎంబసీ ఈ హెచ్చరికలు జారీ చేసింది.