
ముంబై: మరాఠీవారిని అవమానిస్తూ వాట్సాప్ స్టేటస్ పోస్ట్ చేశారనే ఆరోపణలతో ముంబైలోని విక్రోలిలోగల ఒక మార్వాడీ దుకాణదారుడిపై దాడి చేసి, చెవులు పట్టుకుని క్షమాపణ చెప్పాలంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎస్‌ఎన్) కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
రాజ్ థాక్రే నేతృత్వంలోని పార్టీ కార్యకర్తలు మరాఠీ భాష మాట్లాడనివారిపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో విరివిగా జరుగుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు మరాఠీ దుకాణదారుణ్ణి చుట్టుముట్టి, అతను చేసిన వాట్సాప్ పోస్ట్ గురించి అడగటాన్ని గమనించవచ్చు. తరువాత వారంతా అతనిపై దాడి చేసి, బహిరంగ క్షమాపణ చెప్పాలని బలవంతం చేయడాన్ని చూడవచ్చు.
तुम्ही इथे येऊन अशी भाषा वापराल तर तुम्हाला त्याच भाषेत उत्तर मिळणार. तुला कोलला ! pic.twitter.com/xSGFk201Ts
— MNS Videos (@mnsvideos) July 16, 2025
మరాఠీ భాష, సంస్కృతిని అగౌరవపరచవద్దని ఎంఎస్‌ఎస్ కార్యకర్తలు ఇతరులను హెచ్చరించడం వీడియోలో కనిపిస్తుంది. మరాఠీ ప్రజలను అవమానించేవారి దుకాణాలలో వస్తువులను కొనుగోలు చేయవద్దని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. థానేలో ఫుడ్ స్టాల్ యజమానిపై ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు దాడి చేసిన కొద్ది రోజులకు ఈ ఘటన జరిగింది. గతంలో మరాఠీ మాట్లాడేందుకు నిరాకరించినందుకు ఒక ఆటోరిక్షా డ్రైవర్‌పై కూడా దాడి జరిగింది.