అమర్‌నాథ్ యాత్రలో ప్రమాదం.. 10 మందికి గాయాలు | Amarnath Yatra Convoy Road Accident Pilgrims Injured | Sakshi
Sakshi News home page

అమర్‌నాథ్ యాత్రలో ప్రమాదం.. 10 మందికి గాయాలు

Jul 13 2025 12:34 PM | Updated on Jul 13 2025 1:03 PM

Amarnath Yatra Convoy Road Accident Pilgrims Injured

కుల్గాం: అమర్‌నాథ్‌ యాత్రలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన  తొమ్మిది మంది యాత్రికులను సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక వైద్య సహాయం అందించి, తదుపరి చికిత్స కోసం అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ)కు తరలించారు.

కుల్గాం జిల్లాలోని ఖుద్వానీ ప్రాంతంలోని టాచ్లూ క్రాసింగ్ సమీపంలో యాత్రా కాన్వాయ్‌లోని మూడు బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో పది మందికి పైగా యాత్రికులు గాయపడ్డారు. గాయపడిన యాత్రికులను అనంతనాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు.  వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్య అధికారులు తెలిపారు. ఈ ఘటన తాత్కాలికంగా అంతరాయం కలిగించినప్పటికీ, యాత్ర కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. స్థానిక అధికారులు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement