
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి మూడు దశాబ్దాలుగా చిక్కకుండా తిరుగుతున్న ముగ్గురు టెర్రరిస్టులను ఏటీఎస్( యాంటీ టెర్రరిజం స్వ్కాడ్) అదుపులోకి తీసుకోవడంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై హర్షం వ్యక్తం చేశారు. సదీఖ్ అలీ అలియాస్ టైలర్ రాజా, మహ్మద్ అలీ మన్సూర్, అబుబాకర్ సిద్ధిఖిలను ఏటీస్ బృందం అదుపులోకి తీసుకోవడాన్ని ప్రత్యేకంగా అభినందించారాయన.
ఇది తమిళనాడు ఏటీఎస్ పోలీసుల ఘనత అంటూ ఆయన కొనియాడారు. రాష్ట్రంలో జరిగిన ఉగ్ర కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించిన ఈ ముగ్గుర్ని మూడు దశాబ్దాల తర్వాత పట్టుకోవడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ మేరకు అన్నామలై ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు.
After three decades, the Tamil Nadu Anti-Terrorism Squad has successfully arrested three long-absconding terrorists, Sadiq Ali (also known as Tailor Raja), Mohammed Ali Mansoor, and Abubacker Siddique, linked to a series of targeted terror attacks across Tamil Nadu.
These… pic.twitter.com/ODNkJ5HqwW— K.Annamalai (@annamalai_k) July 14, 2025
1998లో కోయాంబత్తూర్‌లో జరిగిన ఉగ్రదాడిలో 59 మంది ప్రాణాలు కోల్పోగా, మరొకవైపు 1993లో చెన్నై ఆర్‌ఎస్‌ఎస్ ఆఫీస్‌లో జరిగిన బాంబు దాడి జరిగింది. ఇక 1995లో నాగూర్‌లో హిందూ మున్నాని నాయకుడు ముతుకృష్ణన్ భార్యను పొట్టనపెట్టుకున్నారు ఈ ఉగ్రవాదులు. రామాయణం పుస్తకంలో బాంబు దాచి ముతుకృష్ణన్ భార్యను హత్య చేశారు. ఇలా పలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ వీరిపై ఏటీఎస్ నిఘా వేసి ఉంచింది. తప్పుడు ఐడెంటీ కార్డులతో ఖాళీగా ఉండే ప్రదేశాలను ఎన్నుకుని తప్పించుకుని తిరుగుతూ ఉన్న వీరిని ఎట్టకేలకు ఏటీఎస్ బృందం పట్టుకుంది.