
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో 8 కొత్త బిల్లులు ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియోహెరిటేజ్ సైట్స్, జియో రెలిక్స్(సంరక్షణ, నిర్వహణ) బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్(అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్(సవరణ) బిల్లు, మణి పూర్ వస్తువులు, సేవల పన్ను(సవరణ) బిల్లు వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే ఇన్‌కం ట్యా క్స్–2025ను కూడా ప్రవేశపెట్టే అవకాశం కనిపి స్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 21వ తేదీ దాకా మొత్తం 21 రోజులపాటు జరుగు తాయి. రాఖీ పౌర్ణమి, స్వాతంత్య్ర దినో త్సవం సందర్భంగా రెండు రోజులు సెలువులు ప్రకటించారు.