breaking news
Monsoon Parliament session
-
పార్లమెంట్లో మిన్నంటిన నిరసనలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాల ఆందోళనలు, నిరసనలు, నినాదాలు నిత్యకృత్యంగా మారిపోయాయి. శుక్రవారం సైతం పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)పై ప్రభుత్వం వెంటనే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లో నిరసన వ్యక్తంచేశాయి. దాంతో లోక్‌సభ, రాజ్యసభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వెంటనే జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మృతిపట్ల స్పీకర్ ఓంబిర్లా నివాళులర్పించారు. క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం గురించి ప్రస్తావించారు. అనంతరం ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. వెల్‌లోకి దూసుకొచ్చారు. ఎస్ఐఆర్పై చర్చించాలని తేల్చిచెప్పారు. ఈ సమయంలో స్పీకర్ కొంతసేపు ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. విపక్షాల రగడ ఆగకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత విపక్షాల నినాదాలు ఆగలేదు. విపక్షాల ఆందోళన ఆగకపోవడంతో చేసేది లేక సభాపతి లోక్‌సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ‘ఇన్‌కం ట్యాక్స్ బిల్లు–2025’ను ఉపసంహరించుకున్నారు. నూతన బిల్లును ఈ నెల 11 లోక్‌సభలో ప్రవేశపెట్ట బోతున్నారు. ఎస్ఐఆర్పై సభలో నినానాలు మిన్నంటడంతో స్పీకర్ స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెన్నేటి సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చెప్పి వెళ్లిపోయారు. ఓట్లు చోరీ చేసింది కాంగ్రెస్ నేతలే: రవనీత్ సింగ్ బిట్టూ బిహార్‌లో నిర్వహించిన ఎస్ఐఆర్తోపాటు గత లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన ఓట్ల చౌర్యంపై చర్చించాలని రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. సభా కార్యకలపాలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. చర్చ కోసం రూల్ 267 కింద విపక్షాలు ఇచ్చిన 20 నోటీసులను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించారు. దాంతో విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. నినాదాలతో హోరెత్తించారు. దాంతో సభ మధ్యాహ్నం 12 గంటల దాకా వాయిదా పడింది. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితి యథాతథంగా కొనసాగింది. ప్రశ్నోత్తరాలకు సహకరించాలని సభాపతి స్థానంలో ఉన్న ఘన్‌శ్యామ్ తివారీ విజ్ఞప్తి చేయగా, విపక్షాలు పట్టించుకోలేదు. కర్ణాటకలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ డిమాండ్‌చేశారు. ఓట్ల దొంగతనానికి పాల్పడింది కాంగ్రెస్ నేతలేనని కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టూ మండిపడ్డారు. దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఆయనపై విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఘనశ్యామ్ తివారీ ప్రకటించారు. -
పార్లమెంట్లో వాయిదాల పర్వం
న్యూఢిల్లీ: బిహార్‌లో ఎన్నికల సంఘం నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)పై పార్లమెంట్లో ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి. దీనిపై వెంటనే చర్చ ప్రారంభించాలని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని బుధవారం నిలదీశాయి. నిరసన వ్యక్తంచేశాయి. వెల్‌లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దీంతో ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. లోక్‌సభ ఉదయం ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలకు వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. వెనక్కి వెళ్లి సీట్లలో కూర్చోవాలని, సభకు సహకరించాలని స్పీకర్‌స్థానంలో ఉన్న దిలీప్ సైకియా విజ్ఞప్తి చేయగా, విపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. దాంతో ఆయన సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా నినాదాలు, నిరసనలు యథాతథంగా కొనసాగాయి. చేసేది లేక సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు దిలీప్ సైకియా ప్రకటించారు. అంతకుముందు లోక్‌సభలో మర్చంట్ షిప్పింగ్ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఎస్ఐఆర్పై చర్చించే ప్రసక్తే లేదు: రిజిజు ఎస్ఐఆర్పై లోక్‌సభలో చర్చించే ప్రసక్తే లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తేల్చిచెప్పారు. ఆయన బుధవారం సభలో మాట్లాడారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని గుర్తుచేశారు. అందుకే సభలో చర్చించలేమని అన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలను చర్చించేందుకు పార్లమెంట్ నియమ నిబంధనలు ఒప్పుకోవని స్పష్టంచేశారు. అలాగే స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల సంఘం కార్యకలాపాల గురించి సభలో చర్చ చేపట్టడం సాధ్యం కాదని ఉద్ఘాటించారు. రాజ్యసభలోనూ అదే అలజడి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై పార్లమెంట్ ఎగవ సభలోనూ అలజడి కొనసాగింది. ఈ అంశంపై చర్చకు ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. ఎస్ఐఆర్పై వెంటనే చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు రూల్ 267 కింద 35 నోటీసులు ఇవ్వగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించారు. సభలో నినాదాలు, నిరసనలు మిన్నంటాయి. సభను హరివంశ్ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభ పునఃప్రారంభమైన తర్వాత విపక్ష ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు కొనసాగించారు. ఒకవైపు గందరగోళం కొనసాగుతుండగానే, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మణిపూర్‌కు సంబంధించిన డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌ను సభలో ప్రవేశపెట్టారు. తర్వాత ‘క్యారేజీ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు–2025’మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై సభలో స్వల్ప చర్చ జరిగింది. మరోవైపు విపక్షాలు ఆందోళన ఆగలేదు. తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మమతా ఠాకూర్, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్ సింగ్ చైర్మన్ పోడియంపైకి ఎక్కేందుకు ప్రయతి్నంచారు. దాంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి స్థానంలో ఉన్న భువనేశ్వర్ కలితా వెల్లడించారు. -
ఎస్ఐఆర్పై చర్చకు పట్టు స్తంభించిన లోక్‌సభ
న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదంగా మారిన బిహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అంశం మరోసారి పార్లమెంట్‌ను స్తంభింపజేసింది. పార్లమెంట్ ఉభయ సభల సభాకార్యకలాపాలకు బదులు ఎస్ఐఆర్ అంశంపైనే చర్చకు విపక్ష సభ్యులు పట్టుబట్టడంతో లోక్‌సభ అర్ధంతరంగా మంగళవారానికి వాయిదాపడింది. వర్షాకాల సమావేశాలు మొదలయ్యాక లోక్‌సభలో విపక్షసభ్యుల నిరసనల కారణంగా కనీసం ఒక్క బిల్లు కూడా సభామోదానికి నోచుకోలేదని అధ్యక్షస్థానంలో ఉన్న స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నినాదాలు మాని విపక్షసభ్యులు తమ తమ సీట్లలో కూర్చోవాలని విజ్ఞప్తిచేసినా ఎవరూ పట్టించుకోలేదు. సోమవారం ఉదయం లోక్‌సభ మొదలుకాగానే విపక్ష సభ్యులు తమ సీట్లలోంచి లేచి వెల్‌లోకి దూసుకొచ్చారు. ఎస్ఐఆర్పై చర్చించాలని నినాదాలుచేశారు. ప్రభుత్వ వ్యతిరేక, ఎస్ఐఆర్ వ్యతిరేక ప్లకార్డులు చేతబూని ఆందోళన కొనసాగించారు. దీంతో సభను మధ్యా హ్నం రెండు గంటల వరకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలవగానే కాంగ్రెస్ సభ్యులు మళ్లీ ఇదే అంశంపై చర్చకు మొండిపట్టుబట్టారు. దీంతో సభాధ్యక్షస్థానంలో కూర్చున్న జగదాంబికాపాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఈరోజు రెండు కీలక క్రీడా బిల్లులను సభలో చర్చించి, ఆమోదించాల్సి ఉంది. ఇలా నినాదాలు, ఆందోళన చేయడంతో భారతీయ క్రీడాకారులకు అన్యాయం చేసినవాళ్లమవుతాం’’అని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ సైతం ఇదే తరహాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ నినాదాల హోరు మధ్యే ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కస్టమ్స్ సుంకాలకు సంబంధించిన తీర్మానాన్ని చేశారు. ఈ తీర్మానం సభ మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ‘‘వర్షాకాల సమావేశాలు జూలై 21వ తేదీన మొదలైనప్పటి నుంచీ మీరు సభ జరక్కుండా ఆటంకం కల్గిస్తున్నారు. ఇలా వరసగా గత మూడు వారాలుగా అవరోధాలు సృష్టిస్తున్నారు’’అని జగదాంబికాపాల్ వ్యాఖ్యానించి సభను మంగళవారానికి వాయిదావేశారు. ‘‘తమ ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తున్నారన్న ఆశతో మిమ్మల్ని లక్షలాది మంది ఓటర్లు ఎన్నుకుని లోక్‌సభకు పంపించారు. మీరేమో ఇలా నినాదాలు చేస్తూ ముఖ్యమైన బిల్లులు చర్చకు రాకుండా, సభామోదం పొందకుండా అడ్డుకుంటున్నారు. సభా గౌరవాన్ని మీరంతా కించపరుస్తున్నారు’’అని ఓం బిర్లా సైతం వ్యాఖ్యానించడం తెల్సిందే.సోరెన్ మరణంతో రాజ్యసభ వాయిదా రాజ్యసభ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ మరణానికి సంతాప సూచికగా రాజ్యసభలో ఎలాంటి అంశాలను చర్చకు స్వీకరించలేదు. బిల్లులనూ ప్రవేశపెట్టలేదు. రాజ్యసభ సోమవారం ఉదయం ప్రారంభంకాగానే సోరెన్ మరణ వార్త, సంతాప సందేశాన్ని సభ డెప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సభ్యులందరికీ చదివి వినిపించారు. ‘‘గిరిజనుల హక్కుల కోసం అవిశ్రాంతంగా సోరెన్ పోరాడారు’’అని సోరెన్‌ను హరివంశ్ గుర్తుచేసుకున్నారు. ఆయన మృతికి గౌరవ సూచికగా సభలో ఎలాంటి చర్చను డెప్యూటీ చైర్మన్ అనుమతించలేదు. సభను మంగళవారానికి వాయిదావేశారు. 2020 జూన్‌లో సోరెన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. -
పార్లమెంట్లో ఆగని రగడ
న్యూఢిల్లీ: బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)పై పార్లమెంట్లో ప్రతిపక్షాలు పదో రోజు సైతం యథావిధిగా ఆందోళన కొనసాగించాయి. దీనిపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉభయసభల్లో నిరసనలు, నినాదాలతో హోరెత్తించాయి. దీంతో లోక్‌సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి. శాంతించాలని, సభా కార్యకలాపాలకు సహకరించాలని పదేపదే విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోకపోవడంతో ఉభయసభలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. అంతకుముందు రాజ్యసభలో వెల్‌లోకి దూసుకొచ్చిన ప్రతిపక్ష సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. దీనిపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ను పారామిలటరీ దళం అదుపులోకి తీసుకుందని మండిపడ్డారు. మరోవైపు లోక్‌సభలో రిప్రజెంటేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ అసెంబ్లీ కానిస్టిట్యూయెన్స్ ఆఫ్ ద స్టేట్ గోవా బిల్లు–2024, ఇండియన్ పోర్ట్స్ బిల్లు–2025, మర్చంట్ షిప్పింగ్ బిల్లు–2024ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్పీకర్ ఓం బిర్లాకు విపక్షాల లేఖ బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై తక్షణమే లోక్‌సభలో ప్రత్యేక చర్చ నిర్వహించాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్ష సభ్యులు లేఖ రాశారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ సవరణ ప్రక్రియ నిర్వహించడంపై వారు అనుమానాలు వ్యక్తంచేశారు. దేశంలో గతం ఇలాంటి పరిణామం ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం సంకేతాలిస్తోందని గుర్తుచేశారు. ఈ ప్రక్రియ ఉద్దేశం పట్ల సందేహాలున్నాయని వెల్లడించారు. స్పీకర్‌కు రాసిన లేఖపై రాహుల్ గాం«దీ(కాంగ్రెస్), టీఆర్ బాలు(డీఎంకే), సుప్రియా సూలే(ఎన్సీపీ), లాల్జీ వర్మ(సమాజ్‌వాదీ పార్టీ) తదితరులు సంతకాలు చేశారు. హరివంశ్‌కు మల్లికార్జున ఖర్గే లేఖ రాజ్యసభలో వెల్‌లో భద్రతా సిబ్బంది తమను అడ్డుకోవడం పట్ల విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అక్కడ సీఐఎస్ఎఫ్ సిబ్బంది కనిపించడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ మేరకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌కు ఖర్గే శుక్రవారం లేఖ రాశారు. ప్రజాస్వామ్య పద్ధతితో నిరసన తెలిపే హక్కుకు కాలరాసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. భవిష్యత్తులో సీఐఎస్ఎఫ్ సిబ్బంది రాజ్యసభ వెల్‌లోకి రాకుండా నియంత్రించాలని హరివంశ్‌ను కోరారు. పార్లమెంట్ ఉభయసభల లోపల భద్రతపై ప్రభుత్వానికి సంబంధం లేదని, అది సభాపతుల పరిధిలోని అంశమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టంచేశారు. -
సవరణపై సభా సమరం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం బిహార్‌లో చేపట్టిన వివాదాస్పద ఓటర్ల జాబితా సమగ్ర సవరణ క్రతువును తక్షణం నిలిపివేయాలన్న విపక్షాల డిమాండ్లతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లిపోయాయి. గురువారం ఉదయం రాజ్యసభలో సభాకార్యకలాపాలు మొదలవగానే విపక్షసభ్యులు తమ డిమాండ్లను నినాదాల రూపంలో వినిపించారు. ఆపరేషన్ సిందూర్‌పై 16 గంటల చర్యకు ప్రధాని మోదీ ఎందుకు రాజ్యసభలో సమాధానం ఇవ్వలేదని విపక్ష సభ్యులు ప్రశ్నిస్తూ సభాకార్యకలాపాలను అడ్డుకున్నారు. బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ఈసీ వెంటనే ఆపేయాలనీ విపక్ష సభ్యులు డిమాండ్‌చేశారు. దీంతో సభను సభాధ్యక్షుడు మధ్యా హ్నం 2 గంటలవరకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలైనా మళ్లీ ఇదే విపక్షాల డిమాండ్ల పర్వం కొనసాగింది. వెంటనే ప్రధాని మోదీ సభకు వచ్చి ఆపరేషన్ సిందూర్‌పై సమాధానం ఇవ్వాలని విపక్ష సభ్యులు నినాదాలుచేశారు. ఈ సందర్భంగా రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడేందుకు సభాధ్యక్షుడు సస్మిత్ పాత్రా అనుమతించారు. ‘‘ 2008లో ముంబై ఉగ్రదాడులపై నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో వివరణ ఇవ్వనప్పుడు నాట హోం మంత్రి వివరణ ఇచ్చారు. అంతేగానీ హోం మంత్రి అమిత్ షా లాగా ‘‘ నేనొక్కడినే మీ అందరినీ అదమాయించగలను. హ్యాండిల్ చేస్తాను’’ అని అందర్నీ తూలనాడలేదు. ఇప్పటికైనా ప్రధాని మోదీ సభకు వచ్చి మాట్లాడాలి’’ అని ఖర్గే డిమాండ్‌చేశారు. ఈయన మాటలకు విపక్షసభ్యులు గొంతు కలిపారు. దీంతో చేసేదిలేక సభను సాయంత్రం నాలుగున్నర గంటలదాకా వాయిదావేశారు. 4.30 గంటలకు సభ మొదలయ్యాక ట్రంప్ చేసిన ‘డెడ్ ఎకానమీ’ వ్యాఖ్యలకు వాణిజ్యమంత్రి గోయల్ ఘాటుగా స్పందిస్తూ ప్రకటనచేశారు. అయినాసరే విపక్షసభ్యులు తమ నినాదాలను ఆపకపోవడంతో చివరకు సభను శుక్రవారానికి వాయిదావేశారు. లోక్‌సభలోనూ అదే తీరు..లోక్‌సభలోనూ ఇవే దృశ్యాలు కనిపించాయి. లోక్‌సభ ఉదయం మొదలుకాగానే జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా నైసార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తలకు సభ అభినందించింది. తర్వాత వెంటనే బిహార్ అంశంపై విపక్ష సభ్యులు నినాదాలు మొదలెట్టారు. ‘‘ ఇలా నినాదాలు చేయడానికి మనల్ని ఓటర్లు ఓట్లేసి గెలిపించుకున్నారా? దయచేసి మీమీ సీట్లలో కూర్చోండి’’ అని లోక్‌సభ స్పీకర్ బిర్లా మందలించారు. అయినా విపక్షసభ్యులు వినిపించుకోలేదు. తొలుత రెండు గంటల దాకా సభ వాయిదాపడింది. తర్వాత ఇదే పునరావృతంకావడంతో అప్పుడు సభాధ్యక్ష స్థానంలో కూర్చన్న అవదేశ్ ప్రసాద్ సభను నాలుగు గంటలకువాయిదావేశారు. నాలుగు గంటలకు సభ మొదలవగానే మంత్రి పియూశ్ గోయల్ మాట్లాడారు. ఆ తర్వాత నినాదాలు కొనసాగడంతో స్పీకర్ బిర్లా సభను శుక్రవారానికి వాయిదావేశారు. -
దేశ ప్రయోజనాలను పరిరక్షిస్తాం
న్యూఢిల్లీ: అరడజను సార్లు అమెరికా, భారత ప్రతినిధులు భేటీ అయినా చర్చలు ఓ కొలిక్కిరాకపోవడంతో విసుగుచెందిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా, ఇష్టారీతిక విధించిన 25 శాతం దిగుమతి సుంకంపై భారతసర్కార్ పార్లమెంట్ సాక్షిగా స్పందించింది. భారతదేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని లోక్‌సభ, రాజ్యసభలో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. నేటి నుంచి 25 శాతం టారిఫ్‌లతోపాటు పెనాల్టీలను భారత్‌పై మోపుతానని ట్రంప్ బుధవారం ప్రకటించిన నేపథ్యంలో గురువారం లోక్‌సభ, రాజ్యసభల్లో గోయల్ కీలక ప్రకటక చేశారు. ‘‘ హఠాత్తుగా ఏకపక్షంగా ట్రంప్ మనపై అదనపు టారిఫ్‌లను మోపారు. దీని దుష్ప్రభావాలపై విస్తృతస్తాయి అధ్యయనం చేస్తున్నాం. ఇందులోభాగంగా టారిఫ్‌ల భారం పడే రైతులు, ఎగుమతిదారులు, కార్మికులు, వ్యాపారులు, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు, పలు పరిశ్రమల సమాఖ్యలు, సంఘాలతో మంతనాలు జరుపుతున్నాం. పెను ప్రభావం తాలూకు పరిణామాలపై విశ్లేషణ చేపడుతున్నాం. దేశ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్నాం. పౌర ప్రయోజనాల పరిరక్షణకు పాటుపడతాం’’ అని గోయల్ అన్నారు. ‘‘ కేవలం దశాబ్దకాలంలోనే దుర్భల ఆర్థిక వ్యవస్థ నుంచి సుదృఢ ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ తయారైంది. 11వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థ ర్యాంక్ నుంచి టాప్–5 ర్యాంక్‌లోకి భారత్ ఎగబాకింది. మన కర్షకులు, కార్మికులు, సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల కృషి, మా ప్రభుత్వ పట్టుదల ఈ ప్రగతికి కారణం. భవిష్యత్తులో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయం. ప్రపంచ తయారీరంగ హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దేందుకు గత దశాబ్దకాలంగా కృషిచేస్తున్నాం. మేక్ ఇన్ ఇండియా పథకం ద్వారా భారతీయ ఉత్పత్తుల గణనీయ పెరుగుదలకు పాటుపడ్డాం. నైపుణ్య మానవ వనరులు, యువత కారణంగానే భారతీయ పరిశ్రమల్లో పోటీతత్వం, నవకల్పనలు ఎక్కువయ్యాయి. గత 11 సంవత్సరాలుగా మన ఎగుమతులు పెరుగుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, ఆస్ట్రేలియాలతో భారత్ లాభదాయకమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. రైతులు, భారత సాగు రంగం బాగు కోసం, ఆహార భద్రత కోసం ప్రభుత్వం పాటుపడుతోంది. ఇకమీదటా అదే పనిచేస్తాం. అమెరికా టారిఫ్‌ల అంశంలో భారత ప్రయోజనాలకు పణంగా పెట్టే ప్రసక్తే లేదు’’ అని గోయల్ వ్యాఖ్యానించారు.డెయిరీ విషయంలో మరింత అప్రమత్తంగా..డెయిరీ రంగానికి సంబంధించి ప్రభుత్వం ఇంతవరకూ ఏ దేశంతోనూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదర్చుకోలేదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 కోట్ల జనాభా దేశ సాగురంగంపై ఆధారపడిన నేపథ్యంలో ఆహారభద్రత సంక్షోభంలో పడకుండా ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులోభాగంగానే ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా సాగురంగంపై ప్రతికూల ప్రభావం పడకుండా ప్రభుత్వం ఓ కంట కనిపెడుతోంది. 2021–25 వాణిజ్యగణాంకాల ప్రకారం భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. భారత్ నుంచి మొత్తం ఎగుమతుల్లో దాదాపు 18 శాతం ఎగుమతులు అమెరికాకే వెళ్తున్నాయి. -
కాంగ్రెస్ ధారాదత్తం చేసింది
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై రాజ్యసభలో 16 గంటల చర్చకు ప్రభుత్వం తరఫున సమాధానంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ పాపం కాంగ్రెస్‌దే అని ధ్వజమెత్తారు. ‘‘ దేశ భద్రత అనేది కాంగ్రెస్ ప్రాధాన్యతాంశాల్లో అస్సలు లేదు. ఓటు బ్యాంక్, బుజ్జగింపు రాజకీయాలు మాత్రమే కాంగ్రెస్ అజెండా. వీటిపై మాత్రమే కాంగ్రెస్ దృష్టిపెట్టి జాతీయభద్రత వంటి మిగతా కీలకాంశాలను గాలికొదిలేసింది. దీంతో ఉగ్రవాదం విపరీతంగా విస్తరించింది. దీనికి ఏకైక కారణం కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు, పేలవమైన రాజకీయ విధానాలు. కాంగ్రెస్ ఘోర తప్పిదాల కారణంగానే కశ్మీర్లో కొంతభాగం మన చేజారింది. అలా కాంగ్రెస్సే పాకిస్తాన్‌కు పీఓకేను అప్పగించింది. వాళ్లు ఇచి్చన పీఓకేను మేం తిరిగి తీసుకొస్తాం. ఘటన జరిగాక సమీక్ష జరపడం కాంగ్రెస్ విధానం. అసలు అలాంటివి సంభవించకుండా ముందే అప్రమత్తంగా ఉండటం మా నైజం’’ అని అమిత్ షా అన్నారు. ‘‘పహల్గాం పాశవిక హత్యాకాండలో అమాయకులు చనిపోయారు. వాళ్ల తలకు గురిపెట్టి మరీ ఉగ్రవాదులు తూటాలు పేల్చారు. అదే తీరులో ఆపరేషన్ మహాదేవ్లో పహల్గాం ఉగ్రవాదుల తలల్లోకి మేం కూడా తూటాలు దించాం. పహల్గాం బాధిత కుటుంబాలు కోరుకున్నది మేం నెరవేర్చాం. ఆపరేషన్ మహదేవ్లో అంతమైన ముగ్గురు ఉగ్రవాదులకు లష్కరే తోయిబాతో సంబంధాలున్నట్లు ఆర్మీ దర్యాప్తులో స్పష్టమైంది. మహిళలు, చిన్నారుల ఎదుట నీ మతమేంటి? అని అడిగిమరీ అమాయకుల ప్రాణాలు తీసిన పహల్గాం వంటి హేయమైన ఘటన గతంలో ఎన్నడూ జరగలేదు’’ అని అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా వచ్చి మాట్లాడాలని విపక్షసభ్యులు పట్టుబట్టారు. ఆయన బదులు నేను మాట్లాడుతున్నానని అమిత్ షా సర్దిచెప్పే ప్రయత్నంచేసినా విపక్షసభ్యులు వినిపించుకోకుండా నిరససగా వాకౌట్ చేశారు. తర్వాత అమిత్ షా తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
ఆ ముగ్గురూ పహల్గాం ముష్కరులే
న్యూఢిల్లీ: వేలాది మంది విచారణ. అనుమా నితులపై నిరంతర నిఘా. ఆశ్రయమిచ్చిన వారి నిర్బంధం. గత ఏప్రిల్ 22న పహల్గాంలో పాశవిక దాడికి పాల్పడి 26 మంది అమాయక పర్యాట కులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల కోసం ‘ఆపరేషన్ మహదేవ్’లో భాగంగా భద్రతా దళాలు నెలల తరబడి వేటాడిన తీరిది. శాటిలైట్ ఫోన్ సిగ్నల్స్ సాయంతో ఆనుపానులు చిక్కడంతో ఎట్టకేలకు వారి పాపం పండింది. సోమవారం జమ్మూ కశ్మీర్లో భద్రతా దళాల చేతుల్లో హతమ య్యారు. ఆ ముగ్గురూ పహల్గాం దాడిలో పాల్గొన్న ముష్కరు లేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. వారిని గుర్తించేందుకే నెలల సమయం పట్టిందని వెల్ల డించారు. సాంకేతికత, మానవ నిఘా సాయంతో ఉగ్రవాదులను కదలి కలను కనిపెట్ట గలిగినట్టు వివరించారు. ఆపరేషన్ సిందూర్‌పై మంగళవా రం లోక్‌సభలో ప్రత్యేక చర్చలో ఆ యన ప్రసంగించారు. ఆ పాశవిక దాడితో గాయ పడ్డ దేశ ప్రజల హృద యాలకు సాంత్వన చేకూ ర్చిన ఆపరేషన్ మహదేవ్ తాలూకు వివరాలను సభకు వెల్లడించారు. హతులైన ముగ్గురిని సులే మాన్ అలియాస్ ఫైజల్, అఫ్గాన్, జిబ్రాన్‌గా గుర్తించారు. వారంతా ఏ గ్రేడ్ ఉగ్రవాదులేనని తెలిపారు. సైన్యం తాలూకు 4 పారా మిలిటరీ బలగాలు, సీఆర్పీఎఫ్ జవాన్లు, జమ్మూ కశ్మీర్ పోలీసులు కలసి కట్టుగా ఆపరేషన్‌లో పాలుపంచుకున్నట్టు వివరించారు. పహల్గాం దాడికి పాల్పడ్డ ముష్కరులను ఏరివేసి జాతికి ఊరట కల్పించామని చెప్పారు. ‘‘ఇంత మంచి వార్త విని అధికార పక్షంతో పాటు విపక్షాలు ఆనందిస్తాయని ఆశించా. కానీ వారి ముఖాలన్నీ కళతప్పి కనిపిస్తున్నాయి’’ అంటూ ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ తప్పిదమే ‘పాక్’!ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమవుతూ వస్తోందని అమిత్ షా ఎద్దేవా చేశారు. దేశ సమస్యలన్నింటికీ కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమంటూ తూర్పారబట్టారు. పాక్ ఆక్రమిత భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అవకాశాలన్నింటినీ కాంగ్రెస్ ఎప్పటికప్పుడు కాలదన్నుతూ వచ్చిందని ఆరోపణలు గుప్పించారు. అలాంటి పార్టీకి మోదీ ప్రభుత్వం పాక్‌పై పూర్తిస్థాయిలో నిర్ణాయక చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించే నైతిక అర్హత కూడా లేదన్నారు. పహల్గాం దాడిలో పాక్‌కు క్లీన్చిట్ ఇచ్చేందుకు ఎక్కడ లేని ఉత్సాహమూ చూపిన చరిత్ర ఆ పార్టీది అంటూ మండిపడ్డారు. పహల్గాం దాడికి పాల్పడింది స్థానిక ఉగ్రవాదులే కావచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోం మంత్రి పి.చిదంబరం ఇటీవల కూడా వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. పీఓకేను స్వాధీనం చేసుకునే అవకాశం చేతికందిన వేళ సైనిక చర్యను కేంద్రం నిలిపేసిందా అంటూ కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగొయ్ సభలో ప్రశ్నించడంపై అమిత్ షా మండిపడ్డారు. ‘‘వాళ్లు ఏం నిరూపించాలని అనుకుంటున్నారు? ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? ఇదంతా పాక్‌ను కాపాడేందుకు స్పష్టమైన కుట్రే’’ అంటూ తూర్పారబట్టారు. స్వాతంత్య్రం వచ్చిన వేళ దేశ విభజనను కాంగ్రెస్ వ్యతిరేకించి ఉంటే జమ్మూ కశ్మీర్లో అసలు ఉగ్ర భూతం జడలు విప్పేదే కాదన్నారు. ఉగ్రవాదానికి పాక్ తల్లివేరుగా మారిందంటూ దుయ్యబట్టారు. ఆ దేశం ఏర్పాటును కాంగ్రెస్ తాలూకు తప్పిదంగా అభివర్ణించారు. పాక్‌కు బుద్ధి చెప్పేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే జారవిడిచిందని ఆరోపించారు. ‘‘1948లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను మన సైన్యం పూర్తిగా విముక్తం చేసే సమయంలో నాటి కాంగ్రెస్ ప్రధాని నెహ్రూ ఏకపక్షంగా కాల్పుల విమరణ ప్రకటించారు. 1962 యుద్ధం వేళ అస్సాంను చైనా దఖలు పరుస్తున్నట్టు బాహాటంగా ప్రకటన చేశారు. పైగా ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ హోదా అవకాశాన్నీ కాలదన్నారు. 1971లో 90,000 మంది పాక్ సైనికులు భారత్‌కు లొంగిపోయారు. ఆ సంఖ్య నాటి పాక్ సైన్యంలో ఏకంగా 42 శాతం. అంతేగాక 15 వేల చదరపు కి.మీ. పాక్ భూభాగం కూడా మన అదుపులోకి వచ్చింది. అయినా పీఓకేను వెనక్కు తీసుకునేందుకు నాటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. సరికదా, ఆ యుద్ధంలో స్వాధీనం చేసుకున్న పాక్ భూభాగాన్ని కూడా పువ్వుల్లో పెట్టి వెనక్కిచ్చారు. ఇలాంటి చరిత్ర ఉన్నవాళ్లు, పహల్గాం దాడికి పాల్పడ్డవారిని ఎందుకు పారిపోనిచ్చారని నన్ను అడుగుతున్నారు. వారిని తుదముట్టించడం ద్వారా ఈ ప్రశ్నకు నా తరఫున భద్రతా దళాలే బదులిచ్చాయి. 1986లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాక్‌కు పారిపోయింది కూడా కాంగ్రెస్ ప్రధాని రాజీవ్ హయాంలోనే. 1993లో ఉగ్రవాదులు సయీద్ సలాహుద్దీన్, టైగర్ మెమన్, అనీస్ ఇబ్రహీం కస్కర్, 2007లో రియాజ్ భత్కల్, 2010లో ఇక్బాల్ భత్కల్ దేశం వీడి పారిపోయినప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెసే. వీళ్లందరినీ ఎందుకు పారిపోనిచ్చారో విపక్ష నేత రాహుల్‌గాంధీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నా’’ అని అన్నారు. -
సిందూర్ ఆపాలని ఏ దేశాధినేతా చెప్పలేదు
న్యూఢిల్లీ: నిఘా వైఫల్యం కారణంగా పహల్గాంలో అత్యంత పాశవిక దాడి జరిగిందని, ఆపరేషన్ సిందూర్‌తో భారత్ సాధించిన కీలక విజయాలేంటో చెప్పాలంటూ విపక్షాల డిమాండ్ల మధ్య లోక్‌సభలో ప్రధాని మోదీ సూటిగా సమాధానమిచ్చారు. ఆపరేషన్ సిందూర్‌పై 16 గంటల ప్రత్యేక చర్చకు సమాధానంగా ప్రధాని మోదీ వివరణ ఇస్తూనే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు, విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. భారత్, పాక్ పరస్పర సైనిక చర్యలు పరిసమాప్తం కావడానికి తానే ముఖ్యకారణమని ఇప్పటికే పాతికసార్లు ఢంకా భజాయించిన ట్రంప్ మాటల్లో రవ్వంతైనా నిజంలేదని స్పష్టంచేశారు. ఉగ్రవాదాన్ని కాళ్లకింద నలిపేసేటప్పుడు ప్రపంచంలో ఏ దేశం వారించినా ఊరుకునేది లేదని వ్యాఖ్యానించారు. సిందూర్ తక్షణం ఆపేయాలని ప్రపంచంలో ఏ దేశ నేతా తమకు చెప్పలేదని మోదీ స్పష్టం చేశారు. 102 నిమిషాల ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..విజయోత్సవంలో ప్రసంగిస్తున్నా..‘‘ఉగ్రవాదానికి కుంభస్థలం వంటి పాక్‌లోని ఉగ్రస్థావరాలను మనం నేలమట్టంచేసినందుకు ఈరోజు పార్లమెంట్లో విజయోత్సవం జరుపుకుంటున్నట్లు అనిపిస్తోంది. భారత వాణిని ప్రపంచానికి వినిపించేందుకు, భారత్ అంటే ఎంటో అందరికీ మరోసారి చాటిచెప్పేందుకే మాట్లాడుతున్నా. సిందూర్ వేళ నాపై నమ్మకం ఉంచిన ప్రజలందరికీ రుణపడిపోయా. ఉగ్రవాదానికి తల్లివేరు వంటి పాక్‌కు ఆపరేషన్ సిందూర్‌తో అసాధారణరీతిలో గుణపాఠం చెప్పాం. ఆ భీకర దాడుల నుంచి పాక్ ఇంకా కోలుకోలేదు. దాడులు మళ్లీ జరగొచ్చని వాళ్లు ఇప్పటికీ భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆపరేష్ సిందూర్ అమలుకోసం మేం సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. పహల్గాం దుశ్చర్యకు దీటుగా బదులిస్తూ పాక్ నడిబొడ్డున క్షిపణుల వర్షం కురిపించాం. కేవలం 22 నిమిషాల్లో భిన్న ప్రాంతాల్లోని కీలక ఉగ్రస్థావరాలను నేలమట్టంచేశాం. అణు బెదిరింపులు మన దగ్గర పనిచేయవని పాక్‌ను గట్టిగానే హెచ్చరించాం. మన దాడుల ధాటికి పాక్ వైమానిక స్థావరాలు సర్వనా శనమై ఇప్పటికీ అలాగే ఐసీయూలో ఉన్నాయి’’.ఆత్మనిర్భరతను ప్రపంచం కళ్లారా చూసింది‘‘ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ వంటి స్వదేశీ క్షిపణులుసహా సొంత డ్రోన్ల వినియోగంతో భారత్ సాధించిన స్వావలంభన, ఆత్మనిర్భరతను ప్రపంచం కళ్లారా చూసింది. అమాయకులను ఉగ్రదా డులతో బలితీసుకుంటే ఎలాంటి స్పందనా ఉండదని ఇన్నాళ్లూ ఉగ్రదాడుల సూత్రధారులు భావించారు. ఇకపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే భారత్ దండయాత్ర చేయగలదని ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులక బాగా తెలిసొచ్చింది. ఆపరేషన్ సిందూర్ నుంచి సింధు దాకా భారత్ భిన్నకోణాల్లో ప్రతీకార చర్యలు చేపట్టింది. భవిష్య త్తులో తోకజాడిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పాక్‌కు బోధపడింది. ఉగ్రపోషకులు, పాక్ పాలకులు ఒక్కరే అనే భావనతోనే భారత్ ముందుకెళ్తోంది. ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఆపరేషన్ సిందూర్ మొదలెడితే ప్రపంచంలో మూడు దేశాలు తప్ప ఏ దేశమూ భారత్‌కు అడ్డుచెప్పలేదు. పాక్‌కు ఆ మూడుదేశాలే మద్దతు పలికాయి. ఇలా ప్రపంచదేశాలన్నీ భార త్‌కు అండగా నిలిస్తే కాంగ్రెస్ మాత్రం మన సైనికుల వీరత్వానికి సలామ్ చేయలేదు. పాకిస్థా న్ను కాంగ్రెస్ వెనకేసుకురావడం దౌర్భా గ్యం. గతంలో సర్జికల్ దాడులు చేసినప్పుడూ కాంగ్రెస్ ఇదే పాట పాడింది’’.నిమిషాల్లో నాశనం చేశాం‘‘పాక్ నడిబొడ్డున, ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రస్థా వరాలపై మన బలగాలు మేలో మెరుపుదాడులు చేశాయి. నిమిషాల్లోనే మీ స్థావరాలను సమాధులుగా మార్చగలమని పాక్‌కు నిరూపించాం. తొలుత ఉగ్రస్థావరాలను మన బలగాలు ధ్వసంచేశాయి. ఉగ్రవాదులకు సాయంగా పాక్ బలగాలు ప్రతిదాడులకు సిద్ధపడడంతోనే వాళ్ల వైమానిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించి కోలుకోలేని దెబ్బతీశాం. దీంతో పాక్ కాళ్లబేరానికి వచ్చింది. పాక్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) నుంచి ఫోన్ వచ్చింది. ఇంతకుమించి దాడులు చేస్తే ఇప్పట్లో కోలుకోలేమని ప్రాధేయపడ్డారు. అందుకే సిందూర్‌కు ముగింపు పలికాం. ఆపరేషన్‌ను ఆపడానికి ఇదే ఏకైక కారణం. అంతేగానీ ప్రపంచంలో మరే దేశాధినేత కారణంగానో సిందూర్ ఆగలేదు. ఆపాలని ఎవరూ మాకు చెప్పలేదు. మే 9వ తేదీ రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పదేపదే నాకు ఫోన్ చేశారు. అప్పటికే త్రివిధ దళాధిపతులతో భేటీలో బిజీగా ఉన్నాను. భేటీ తర్వాత నేనే ఫోన్‌కాల్ చేసి మాట్లాడా. పాక్ దాడి చేయబోతోందని ఉప్పందించారు. ఎలాంటి దాడినైనా అడ్డుకోగలమని ఆయనకు స్పష్టంచేశా. దాడికి ప్రతిదాడి దారుణంగా ఉంటుందని చెప్పా. బుల్లెట్లకు బాంబులతో సమాధానం చెప్తామన్నా. ఎన్నో విషయల్లో భారత్ స్వావలంభన సాధిస్తోంది. కాంగ్రెస్ మాత్రం చాలా అంశాలను ఎత్తిచూపేందుకు పాక్ పేరును మధ్యలోకి లాక్కొస్తోంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పరోక్షంగా పాక్ అజెండాను ప్రకటించే అధికారిక ప్రతినిధులుగా తయార య్యా రు. గతంలో మేం సర్జికల్ దాడులుచేస్తే కాంగ్రెస్ వాళ్లు ఆధారాలు కావాలన్నారు. ఆనాడు పైలట్ అభి నందన్ పాక్ బలగాలకు దొరికిపోతే ఎలా విడిపించుకొస్తారో చూస్తామని మాట్లాడారు. తీరా మేం తీసుకొచ్చాక ఇదే కాంగ్రెస్ నేతలు నోరుమూశారు. ఉగ్రవాదులకు జరిగిన భారీ నష్టాన్ని చూసి అక్కడ పాక్ మాత్రమే కాదు ఇక్కడ భారత్‌లోనూ కొందరు ఏడుస్తున్నారు’’ అని మోదీ ఎద్దేవా చేశారు.విశ్వశాంతికి ఇది అవసరం‘‘విశ్వశాంతి సాధనలో ఆయుధ సంపత్తితో తులతూగడం కూడా ముఖ్యమే. అందుకే రక్షణరంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి ద్వారాలు తెరిచాం. ఇప్పడు వందకు పైగా అంకురసంస్థలు రక్షణరంగంలో కృషిచేస్తున్నాయి. కొన్ని సంస్తలను మహిళలు ముందుండి నడిపిస్తున్నారు. ఇలాంటి జాతీయ భద్రతా ముందుచూపు కాంగ్రెస్‌కు గతంలోలేదు. ఇకమీదట కూడా రాదు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను ఇప్పటికీ భారత్ ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయిందన్న ప్రశ్నకంటే ముందు అసలు అదెలా మన చేయిజారిందనే ప్రశ్న వేసుకోవాలి. విశాల కశ్మీరం చేజారడానికి కారకులెవరు? నెహ్రూ హయాం నుంచి మొదలుపెడితే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన ఘోర పరిపాలనా తప్పిదాల కారణంగానే భారత్ ఇప్పటికీ ఉగ్రదాడులు, ఇతర గాయాలతో బాధపడుతోంది’’ అని అన్నారు.వేయి క్షిపణులు ప్రయోగిస్తే అన్నింటినీ గాల్లోనే కూల్చేశాం‘‘భారత గగనతల రక్షణ వ్యవస్థల సత్తాను చూసి ప్రపంచదేశాలు నివ్వెరపోయాయి. సిందూర్‌కు ప్రతిగా పాక్ 1,000కిపైగా క్షిపణులను ప్రయోగిస్తే మన గగనతల రక్షణవ్యవస్థలు వాటన్నింటినీ గాల్లోనే పేల్చేశాయి. అదంపూర్ వైమానికస్థావరం నాశనమైందని పాక్ కారుకూతలు కూస్తే తెల్లారే అక్కడికెళ్లి అది నిక్షేపంగా ఉందని ప్రపంచానికి చాటిచెప్పా. భారత సైనిక సత్తాను దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ నమ్మకపోవడం దారుణం. మన రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి, హోం మంత్రులు చెప్పిన మాటలకూ కాంగ్రెస్ విలువ ఇవ్వట్లేదు. పాక్ రిమోట్ కంట్రోల్‌తో కాంగ్రెస్ పనిచేస్తుందేమో. కొందరు కాంగ్రెస్ యువనేత (రాహుల్)లు ఆపరేషన్ సిందూర్‌ను తమాషాగా కొట్టిపారేశారు. మన సైనికుల అద్భుత విజయాన్ని చూసి కాంగ్రెస్ నేతలు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. లోక్‌సభలో ప్రత్యేక చర్చ మొదలైన నాడే ఆపరేషన్ మహదేవ్లో పహల్గాం ముష్కరులు ఎలా చనిపోయారని ప్రశ్నిస్తున్నారు. జాడ కనిపెట్టి ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి వారాలు, తేదీలు చూడాలా?’’ అని మోదీ ఆగ్రహంవ్యక్తం చేశారు.సిందూ నదీజలాల ఒప్పందం నెహ్రూ పాపమే‘‘మన నదీజలాలపై ప్రపంచబ్యాంక్ అజమాÆ ‡ుుషీ చేసేలా నెహ్రూ ప్రభుత్వం ఘోర తప్పుడు నిర్ణయం తీసుకుంది. భారతనేలపై పారే సిందూ నదీజలాల్లో 80 శాతం వాటా పాక్‌కు ఆయనే ధారాదత్తంచేశారు. ఇంతటి జనాభా ఉన్నప్పటికీ మనకు 20 శాతం మాత్రమే హక్కులు దఖలుపడ్డాయి. మన భారతీయ రైతుల నీటికష్టాలు నెహ్రూకు పట్టలేదు. నీళ్లివ్వడంతోపాటు నెహ్రూ పాక్‌కు నిధులు కూడా ఇచ్చారు. సిందూ నదీజలాలపై డ్యామ్‌లు కట్టుకునేందుకు నెహ్రూ ప్రభుత్వం పాక్‌కు ఆర్థికసాయం చేసింది. సిందూ నదీజలాల ఒప్పందంలో నెహ్రూ చేసిన భారీ తప్పిదాలను తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలూ సరిచేయలేదు. మేం వచ్చాకే ఆ తప్పులను సవరించాం. ఉగ్రదాడులతో భారతీయుల రక్తం పారేలా చేస్తున్నారు. అందుకే సిందూ నదీజలాల ఒప్పందం నుంచి వైదొలిగాం. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించబోవని స్పష్టంచేశాం. ఆపరేషన్ సిందూర్ ముగిసిపోలేదు. పాక్ మళ్లీ కుయుక్తులతో పేట్రేగిపోతే సిందూర్ మళ్లీ మొదలవుతుంది’’ అని మోదీ స్పష్టం చేశారు. -
పహల్గాం దాడి, సిందూర్‌పై నేడు పార్లమెంటులో చర్చ
న్యూఢిల్లీ: వారం రోజులపాటు అంతరాయాల మధ్య నడిచిన పార్లమెంటు వర్షకాల సమావేశాల్లో నేటి నుంచి ఉత్కంఠభరితమైన చర్చ జరగనుంది. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్‌పై తలపడేందుకు ఉభయ సభల్లోని అధికార, ప్రతిపక్ష కూటములు సిద్ధమయ్యాయి. జాతీయ భద్రత, విదేశాంగ విధానం వంటి కీలక అంశాలు కావడంతో మాట్లాడేందుకు ఇరు పక్షాల అగ్ర నేతలు సిద్ధమవుతున్నారు. అధికార పక్షం నుంచి హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి తమ వైఖరిని స్పష్టం చేయనున్నారు. మంత్రులు అనురాగ్ ఠాకూర్, సుధాంషు త్రివేది, నిషికాంత్ దూబేలతోపాటు.. ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రపంచ దేశాలకు తమ వాదనను వినిపించిన ఎన్డీయే సభ్యులు సైతం మాట్లాడతారు. ఇక ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అఖిలేశ్ యాదవ్‌తో పాటు, ఇతర కీలక నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించే అవకాశం ఉంది. భారత్–పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తానే తగ్గించానని, కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం తానే వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదేపదే వ్యాఖ్యానించారు. దీనిని విదేశాంగశాఖ తోసిపుచ్చినా.. ట్రంప్ అవే వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం వైఖరిని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. ఇక, ప్రధాని మోదీ మౌనం వహించడంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం విమర్శలు గుప్పించారు. మరోవైపు... కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాత్రం ఉగ్రవాద దాడి తర్వాత ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యను పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో పార్టీతో ఆయన సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే విదేశాలకు వెళ్లిన బృందాల్లో ఒక బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు జరిగే చర్చలో ప్రతిపక్షం నుంచి ఆయన మాట్లాడతారా? లేదా? అనే సంశయం నెలకొంది. విప్ జారీ చేసిన కాంగ్రెస్ ఆపరేషన్ సిందూర్‌పై సోమవారం నుంచి పార్లమెంట్లో చర్చ జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ లోక్‌సభ ఎంపీలకు విప్ జారీ చేసింది. వరుసగా మూడు రోజులపాటు తప్పనిసరిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలని ఆదేశించింది. ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్ దిగువ సభలో వాడీవేడిగా చర్చ జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఈ అంశంపై పార్లమెంట్లో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఎస్.జైశంకర్ మాట్లాడుతారని తెలుస్తోంది. ప్రధాని మోదీ సైతం సభలో సమాధానం చెబుతారని సమాచారం. -
వీసాల ఆలస్యాన్ని పట్టించుకోండి
న్యూఢిల్లీ: అమెరికా విద్యార్థి వీసాల జారీలో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని ఆ దేశ ఉన్నతాధికార వర్గాల దృష్టికి కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లింది. కొంతకాలంగా విద్యార్థి వీసా దరఖాస్తుల స్క్రీనింగ్ తదితరాలను అమెరికా కఠినతరం చేయడం తెలిసిందే. దాంతో వీసా అపాయింట్మెంట్లు పొందడమే విద్యార్థులకు చాలా కష్టంగా మారిపోయింది. ఫలితంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ అమెరికా విదేశాంగ శాఖ వర్గాలతో, ఢిల్లీలోని ఆ దేశ దౌత్య కార్యాలయంతో దీనిపై లోతుగా చర్చించింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌సింగ్ ఈ మేరకు వెల్లడించారు. భారత విద్యార్థుల ఆందోళనలను ఎప్పటికప్పుడు అమెరికా దృష్టికి తీసుకెళ్తున్నట్టు ఆయన వివరించారు. శుక్రవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖిత సమాధానమిచ్చారు. అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించేవారు తదితరులను దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు అన్నిరకాల చర్యలూ తీకుంటున్నట్టు జూన్ 18న విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసిందని మంత్రి గుర్తు చేశారు. అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి వీసాల జారీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి 14 మంది భారతీయ అమెరికన్ చట్టసభ సభ్యుల బృందం కూడా కృషి చేస్తోంది. దెబోరా రాస్ వీరికి నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారత విద్యార్థుల వాటా ఏటా 900 కోట్ల డాలర్ల మేరకు ఉంటుందని ఆమె అన్నారు. అంతేగాక పరిశోధనలు, ఇన్నొవేషన్లలో వారిది కీలక పాత్ర గుర్తు చేశారు. కొత్త వీసాల జారీని ఆపేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా కాన్సులేట్లన్నింటినీ ట్రంప్ సర్కారు గత మేలో ఆదేశించడం తెలిసిందే. రెండు నెలల విరామం తర్వాత ఎట్టకేలకు విద్యార్థి వీసాల ప్రాసెసింగ్ గత నెల మొదలైంది. కొత్త నిర్దేశకాల ప్రకారం వీసా దరఖాస్తుదారుల ఆన్లైన్ కార్యకలాపాలు, సోషల్ మీడియా ఖాతాల తనిఖీ (వెట్టింగ్)ను అమెరికా పెద్ద ఎత్తున చేపట్టింది. ఇందుకు వీలుగా సోషల్ ఖాతాల వివరాలను పబ్లిగ్గా అందుబాటులో ఉంచాల్సిందిగా ఆశావహులందరికీ సూచించింది.అక్రమ వలసలపై... అమెరికాలోకి అక్రమ వలసలు, మనుషుల అక్రమ రవాణా కట్టడిలో ఆ దేశ ప్రభుత్వంతో నిరంతరం టచ్‌లో ఉన్నట్టు మరో ప్రశ్నకు సమాధానంగా కీర్తివర్ధన్ సింగ్ రాజ్యసభకు వివరించారు. వాటికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ–మైగ్రేట్ పోర్టల్, సోషల్ మీడియా హ్యాండిళ్లు తదితరాల ద్వారా ఈ విషయంలో విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు అడ్వైజరీలు జారీ చేస్తున్నట్టు చెప్పారు. -
ఐదోరోజూ అదే తీరు
న్యూఢిల్లీ: పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల్లో గందరగోళానికి ఇంకా తెరపడలేదు. విపక్ష సభ్యు లు ఆందోళనలు, నిరసనలు, నినాదాల కారణంగా వరుసగా ఐదో రోజు శుక్రవారం సైతం ఉభయ సభలు స్తంభించాయి. పలుమార్లు వాయిదా పడ్డాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం ప్రారంభించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై విపక్షాలు మండిపడ్డాయి. దీనిపై పార్లమెంట్లో వెంటనే చర్చించాలని, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశాయి. నినాదాలతో హోరెత్తించాయి. ప్రతిపక్షాల ఆగ్రహావేశాల వల్ల పరిస్థితి చెయ్యి దాటిపోతుండడంతో లోక్‌సభ, రాజ్యసభను సోమవారానికి వాయిదా వేస్తుతన్నట్లు సభాపతులు ప్రకటించారు. చెప్పుకోదగ్గ కార్యకలాపాలేవీ జరగకుండానే వర్షాకాల సమావేశాల్లో తొలివారం ముగిసిపోవడం గమనార్హం. లోక్‌సభలో నినాదాల హోరు లోక్‌సభ శుక్రవారం ఉదయం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు ప్రారంభించారు. స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. దీనిపై చర్చకు విపక్ష సభ్యులు అడ్డుతగిలారు. చేసేది లేక స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ఓటర్ల జాబితా సవరణపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, విపక్షాలు సహకరించాలని స్పీకర్ స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ కోరారు. అయినా విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. ఇప్పడే చర్చ ప్రారంభించాలని తేల్చిచెప్పారు. వారిపై జగదాంబికా పాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సి సభలో ఈ అలజడి ఏమిటని ప్రశ్నించారు. దీనివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని అన్నారు. సభ వాయిదా పడేలా చేయడం గొప్ప విషయం కాదని హితవు పలికారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగకపోతే దేశమే నష్టపోతుందని చెప్పారు. చర్చించాల్సిన బిల్లులు చాలా ఉన్నాయని, సహకరించాలని ప్రతిపక్షాలను కోరారు. గోవాలో ఎస్టీలకు అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు ఉద్దేశించిన కీలకమైన బిల్లుపై చర్చిద్దామని న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ చెప్పారు. అయినా విపక్షాల తీరులో మార్పు రాలేదు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు జగదాంబికా పాల్ ప్రకటించారు. ‘కార్గిల్ విజయ్ దివస్’ నేపథ్యంలో కార్గిల్ అమర వీరులకు లోక్‌సభలో నివాళులర్పించారు. ఎంపీలంతా కొంతసేపు మౌనం పాటించారు. ‘ఓటు చోరీ బంద్ కరో’ పార్లమెంట్ ఎగువ సభలోనూ విపక్షాల ఆందోళన యథాతథంగా కొనసాగింది. వివిధ అంశాలపై రూల్ 267 కింద చర్చను కోరుతూ విపక్షాలు ఇచ్చిన 28 నోటీసులను తిరస్కరిస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చెప్పారు. బిహార్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అంశాన్ని ప్రతిపక్ష ఎంపీలు లేవనెత్తారు. దీనిపై సభలో తక్షణమే చర్చించాలని పట్టుబట్టారు. ఉదయం రాజ్యసభ మొదలైన వెంటనే నినాదాలు మిన్నంటడడంతో రఘువంశ్ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్‌పై బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సమాధానం ఇస్తుండగా ప్రతిపక్ష ఎంపీలు బిగ్గరగా కేకలు వేశారు. బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణను ఆపాలని డిమాండ్ చేశారు. ‘ఓటు చోరీ బంద్ కరో’ అంటూ నినదించారు. కొందరు ఎంపీలు వెల్‌లోకి ప్రవేశించారు. వెనక్కి వెళ్లిపోవాలని, సభకు సహకరించాలని సభాపతి స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ ఘన్‌శ్యామ్ తివారీ పదేపదే విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదు. దాంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఘన్‌శ్యామ్ తివారీ ప్రకటించారు. కమల్ హాసన్ ప్రమాణం ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌పీ) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు డీఎంకే నాయకులు రాజాత్తి, ఎస్.ఆర్.శివలింగం, పి.విల్సన్ సైతం ఎగువ సభ సభ్యులుగా ప్రమాణం చేశారు. విపక్షాల నిరసన బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పా ర్లమెంట్ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. మకరద్వారం మెట్లపై వినూ త్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ అని రాసి ఉ న్న పత్రాలను చించివేసి, చెత్తకుండీలో విసి రేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఎస్ఐఆర్పై పార్లమెంట్లో చర్చించాలని తేల్చిచెప్పారు. సభకు సహకరించడానికి విపక్షాల అంగీకారం నిరసనలు, నినాదాలు పక్కనపెట్టి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇకపై సజావుగా సాగేందుకు సహకరిస్తామని ప్రతిపక్ష నేతలు చెప్పారు. వర్షాకాల సమావేశాల్లో నిత్యం గందరగోళ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం అన్ని పార్టీల సీనియర్ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సభా కార్యకలాపాలకు సహకరించాలని కోరగా, ప్రతిపక్ష నాయకులు అందుకు అంగీకరించినట్లు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. సోమవారం నుంచి నిర్మాణాత్మక చర్చలు సాగిద్దామని స్పీకర్ సూచించారు. ప్రజలకు మేలు కలిగేలా సభలో అర్థవంతమైన చర్చలు జరగాలన్నదే తన ఉద్దేశమని ఆయన వివరించారు. ఆపరేషన్ సిందూర్‌పై సోమవారం పార్లమెంట్లో చర్చ ప్రారంభం కానుంది. -
కేంద్రం ప్రతిపక్షం గొంతు నొక్కేస్తోంది: రాహుల్
న్యూఢిల్లీ: ప్రతిపక్ష నాయకుడినైన తనను లోక్‌సభలో మాట్లాడనివ్వకుండా చేస్తూ బీజేపీ ప్రతిపక్షం గొంతును నొక్కేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా తనకు ప్రశ్నలు అడిగే హక్కు ఉందని ఆయన ఉద్ఘాటించారు. ప్రతిపక్షాలను అడ్డుకుంటూ, రక్షణ మంత్రి, ఇతర ట్రెజరీ బెంచ్ సభ్యులను మాత్రమే మాట్లాడటానికి అనుమతిస్తూ బీజేపీ కొత్త విధానం అనుసరిస్తోందని గాంధీ ఆరోపించారు. ప్రతిపక్షాలను కూడా అనుమతిస్తేనే అర్థమవంతమైన చర్చ జరుగుతుందని, మంత్రులు మాట్లాడినప్పుడు ప్రతిపక్షం వింటున్నప్పుడు, ప్రతిపక్షం మాట్లాడినప్పుడు ప్రభుత్వం వినాలని గుర్తు చేశారు. వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. పార్లమెంటులో మాట్లాడేందుకు సభ్యులను అనుమతించాలన్నారు. ప్రభుత్వం నిజంగా చర్చ కోరుకుంటే.. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేందుకు ఒక్క నిమిషం కూడా ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. -
కూటమి భేటీలకు మేమిక దూరం
సాక్షి, న్యూఢిల్లీ: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి భారీ షాక్ తగిలింది. ఈ నెల 21 నుంచి మొదలయ్యే వర్షాకాల సమావేశాల్లో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇండియా పక్షాలు ఏర్పాటు చేసిన ఆన్లైన్ భేటీకి, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే శనివారం ఏర్పాటు చేసిన భేటీకి దూరంగా ఉండనున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ‘‘ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చామని మా పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ కూటమి కేవలం గత లోక్‌సభ ఎన్నికల దాకానేనని కూడా ఆయన అప్పుడే చెప్పారు. కనుక ఇండియా కూటమిలో ఆప్ ఇంకెంత మాత్రమూ భాగం కాదు. టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలు మాకు మద్దతిస్తున్నందున పార్లమెంటులో వారితో అంశాలవారీగా సమన్వయాన్ని కొనసాగిస్తాం’ అని ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ తెలిపారు. బిహార్, యూపీ, పూర్వాంచల్‌లో బుల్డోజర్ రాజ్యం, ఢిల్లీలో పేదల ఇళ్ల కూల్చివేతలపై కేంద్రాన్ని ఆప్ నిలదీస్తుందన్నారు.కూటమి బలహీనంగత లోక్‌సభ ఎన్నికల అనంతరం హరియాణా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుంటుందని భావించినా సీట్ల పంపకాల్లో విభేదాలతో అది జరగలేదు. ఆ తర్వాత పంజాబ్, గుజరాత్ ఉప ఎన్నికల్లో కూడా ఆప్ ఒంటరిగానే పోటీ చేసింది. గుజరాత్లో విశావదర్ ఉప ఎన్నికల్లో ఆప్ విజ యం తర్వాత కేజ్రీ వాల్ మాట్లాడుతూ, ఇండియా కూటమి కేవలం గతేడాది లోక్‌సభ ఎన్నికలకు ఉద్దేశించినది మాత్రమే నన్నారు. ‘‘ప్రస్తుతం కాంగ్రెస్‌తో పొత్తు లేదు. బిహార్ సహా అన్ని ఎన్నికల్లోనూ ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుంది’’ అని ప్రకటించారు. దానిపై పార్టీ తాజాగా మరింత స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో విపక్షాల స్వరం నానాటికీ మరింత బలహీనపడుతోందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఆప్‌కు ప్రస్తుతం లోక్‌సభలో 3, రాజ్యసభలో 8 మంది ఎంపీలున్నారు. ఇండియా కూటమి నుంచి ఆ పార్టీ బయటకు రావడం విపక్ష ఐక్యతకు పెద్ద దెబ్బే కానుంది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, పాక్‌తో కాల్పుల విరమణలో అమెరికా జోక్యం, మనపై ఆ దేశ సుంకాలు, బిహార్‌లో ఈసీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి పలు అంశాలపై వర్షాకాల సమావేశాల్లో కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలాంటి సమయంలో కీలక బిల్లులపై ఓటింగ్ జరిగే పక్షంలో ఆప్ లేకపోవడం ఇండియా కూటమికి సంఖ్యాపరంగా ఇబ్బందిగా మారనుంది. -
వర్షాకాల సమావేశాల్లో 8 కొత్త బిల్లులు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో 8 కొత్త బిల్లులు ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియోహెరిటేజ్ సైట్స్, జియో రెలిక్స్(సంరక్షణ, నిర్వహణ) బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్(అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్(సవరణ) బిల్లు, మణి పూర్ వస్తువులు, సేవల పన్ను(సవరణ) బిల్లు వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే ఇన్‌కం ట్యా క్స్–2025ను కూడా ప్రవేశపెట్టే అవకాశం కనిపి స్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 21వ తేదీ దాకా మొత్తం 21 రోజులపాటు జరుగు తాయి. రాఖీ పౌర్ణమి, స్వాతంత్య్ర దినో త్సవం సందర్భంగా రెండు రోజులు సెలువులు ప్రకటించారు. -
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి!
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి ఆగస్టు 9వ తేదీ దాకా జరుగుతాయని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశాల్లో తొలిరోజే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారని తెలిపాయి. బడ్జెట్‌కు ముందు వివిధ శాఖలతో జరిపే సంప్రదింపులను ఆర్థిక శాఖ ఈనెల 17 నుంచి ప్రారంభించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గడిచిన పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన ఆర్థిక విజయాలను, ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఎదిగిన క్రమాన్ని ఆమె ఆనాడు వివరించారు. కాగా 18వ లోక్‌సభ తొలి సమావేశాలు జూన్ 24 నుంచి జూలై 3 దాకా జరగనున్నాయి. 24, 25 తేదీల్లో నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం, జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఉంటాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు దీన్ని ధృవీకరించారు. -
సగం సమయం కూడా పని చెయ్యలేదు
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ సమయంలో సగం కూడా పని చెయ్యలేదు. అయినప్పటికీ రికార్టు స్థాయిలో 23 బిల్లులు పాసయ్యాయి. మణిపూర్‌లో జాతుల ఘర్షణ ఈ సారి ఉభయసభల్ని కుదిపేసింది. లోక్‌సభ కార్యకలాపాలు 43% జరిగితే, రాజ్యసభ 55% సమయం కార్యకలాపాలు కొనసాగించింది. పాలసీ రీసెర్చ్ స్టడీస్ (పీఆర్ఎస్) అందించిన డేటా ప్రకారం లోక్‌సభ 17 రోజులు సమావేశమైంది. అవిశ్వాస తీర్మానంపై 20 గంటల సేపు చర్చ జరిగింది. ఈ చర్చలో 60 మంది సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంటు ఆమోదించిన బిల్లుల్లో ఢిల్లీలో పాలనాధికార బిల్లు, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ బిల్లు, అటవీ సంరక్షణ సవరణ బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు ప్రధానమైనవి. ఈసారి సభలో ప్రవేశ పెట్టిన బిల్లుల్లో 56% కేవలం ఎనిమిది రోజుల్లో పార్లమెంటు ఆమోదాన్ని పొందాయి. మరో 17% బిల్లుల్ని కమిటీల పరిశీలనకు పంపారు. -
Manipur violence: మోదీ నోరు విప్పాలి
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు తమ డిమాండ్‌పై మెట్టు దిగడం లేదు. ఫలితంగా లోక్‌సభ, రాజ్యసభలో ఆందోళనలు, నినాదాలు, నిరసనలు, వాయిదాలు నిత్యకృత్యంగా మారాయి. మణిపూర్ అంశంపై పార్లమెంట్లో చర్చించాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు తొమ్మిదో రోజు బుధవారం సైతం ఉభయ సభలను స్తంభింపజేశారు. సభా కార్యకలాపాలకు పదేపదే అంతరాయం కలుగుతుండడంతోపాటు విపక్ష, అధికారపక్ష సభ్యుల తీరుతో కలత చెందిన స్పీకర్ ఓం బిర్లా బుధవారం లోక్‌సభకు రాలేదు. సభా గౌరవాన్ని కాపాడాలని స్పీకర్ ఆరాటపడుతున్నారని, సభ్యుల నుంచి సహకారం లభించక కలతతో సభకు హాజరు కాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. సమాధానం చెబుతా: అమిత్ షా లోక్‌సభ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. స్పీకర్ ఓం బిర్లా రాకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు, ప్యానెల్ స్పీకర్ మిథున్‌రెడ్డి సభాపతి స్థానంలో కూర్చొని ప్రశ్నోత్తరాలు చేపట్టారు. వెంటనే విపక్ష ఎంపీలు మణిపూర్ అంశాన్ని లేవనెత్తారు. నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. సభలో గందరగోళం నెలకొనడంతో ప్యానల్ స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు ప్రారంభించారు. మణిపూర్ అంశంపై చర్చ ప్రారంభిద్దామని, తాము సమాధానం చెబుతానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రతిపాదించగా, విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధానమంత్రి రావాల్సిందేనని పట్టుబట్టారు. ఈసారి సభాపతి స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ కిరీట్ సోలంకీ సభకు సహకరించాలంటూ పదేపదే కోరినా వారు వినిపించుకోలేదు. దాంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు కిరీట్ సోలంకీ ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి, ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సులే స్పీకర్‌తో సమావేశమైనట్లు తెలిసింది. మోదీని ఆదేశించలేను: ధన్‌ఖఢ్ మణిపూర్ హింసపై రూల్ 267 కింద సభలో చర్చ చేపట్టాలంటూ రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. వాటిని తిరస్కరిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ చెప్పడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు ప్రారంభించారు. మణిపూర్‌లో కనీవినీ ఎరుగని హింస జరుగుతోందని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ౖవిపక్ష నేత, కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గేకు మాట్లాడే అవకాశం చెప్పారు. ఈ దీనిపై మోదీ ఎందుకు నోరువిప్పడం లేదని నిలదీశారు. ప్రధాని రావాలనుకుంటే రావొచ్చని, రావాలంటూ ఆదేశించలేనని తేలి్చచెప్పారు. మణిపూర్ వ్యవహారంపై రూల్ 176 కింద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అయినా ప్రతిపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. సభనుంచి వాకౌట్ చేశారు. ఖర్గే, శరద్ పవార్‌తో ధన్‌ఖడ్ భేటీ ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ బుధవారం ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో పార్లమెంట్‌లోని తన చాంబర్లో సమావేశమయ్యారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్లో జరుగుతున్న విపక్షాల రగడపై చర్చించారు. సభా సజావుగా సాగేలా సహకారం అందించాలని కోరారు. ‘మణిపూర్’పై ప్రకటన చేసేలా మోదీని ఆదేశించండి 31 మంది ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు బుధవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. మణిపూర్ హింసపై పార్లమెంట్లో ప్రకటన చేసేలా ప్రధాని మోదీని ఆదేశింంచాలని కోరుతూ వినతి పత్రం సమరి్పంచారు. హింసకు స్వస్తి పలికి, సోదరభావాన్ని పెంచుకోవాలని ప్రధానే స్వయంగా ప్రజలకు పిలుపునివ్వాలని డిమాండ్ చేశారు. హరియాణా ఘర్షణలను కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. మణిపూర్‌పై చర్చ విపక్షాలకు ఇష్టం లేదని, అందుకే సభ జరగకుండా రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి ప్రహ్లాద్ జోషీ ఆరోపించారు. -
Parliament Monsoon Session 2023: అవిశ్వాసానికి అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు దాదాపు ఏడాది ఉండగానే అధికార బీజేపీ, కాంగ్రెస్ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమి తదితర విపక్ష పార్టీల బాహాబాహీకి అనూహ్యంగా రంగం సిద్ధమైంది. అనూహ్యంగా లోక్‌సభే ఇందుకు వేదికగా మారనుంది! మణిపూర్ హింసాకాండ తదితరాలపై కేంద్రాన్ని ఇరుకున పెట్టే వ్యూహంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైన నాటినుంచీ విపక్షాలు ఉభయ సభలనూ స్తంభింపజేస్తుండటం తెలిసిందే. అందులో భాగంగా మరో అడుగు ముందుకేసి మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని అవి తాజాగా నిర్ణయించాయి. ఆ సవాలు స్వీకరించి విపక్షాల ఎత్తును చిత్తు చేసేలా మోదీ సర్కారు పై ఎత్తు వేయడం, అందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పరిగణనలోకి తీసుకోవడం... ఇలా బుధవారం హస్తినలో అనూహ్య రాజకీయ పరిణామాలు ఒకదాని వెంట ఒకటి చకచకా చోటుచేసుకున్నాయి...! అన్ని పార్టీలతో సంప్రదించాక అవిశ్వాస తీర్మానంపై చర్చకు తేదీ, సమయం తదితరాలు వెల్లడిస్తానని స్పీకర్ ప్రకటించారు. అదే రగడ...: మణిపూర్ హింసాకాండ తదితరాలపై లోక్‌సభలో బుధవారం కూడా రగడ జరిగింది. దాంతో సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభం కాగానే, కేంద్ర మంత్రివర్గంపై విశ్వాసం లేదని పేర్కొంటూ గౌరవ్ గొగోయ్ (కాంగ్రెస్) ఇచి్చన నోటీసును స్పీకర్ అనుమతించారు. దానికి ఎందరు మద్దతిస్తున్నారని ప్రశ్నించగా కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీ, ఫరూక్ అబ్దుల్లా (ఎన్సీ), టీఆర్ బాలు (డీఎంకే), సుప్రియా సులే (ఎన్సీపీ) తదితర విపక్ష ‘ఇండియా’ కూటమి సభ్యులతో పాటు ప్రతిపక్ష సభ్యులంతా లేచి నిలబడ్డారు. దాంతో తీర్మానాన్ని అనుమతిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అంతకుముందు బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎంపీలు శ్రీనివాసరెడ్డి, రాములు, దయాకర్ లోక్ సభ సెక్రటరీ జనరల్‌కు అవిశ్వాస నోటీసులిచ్చారు. బీఆర్ఎస్ ఎంపీలు బీబీ పాటిల్, రంజిత్‌రెడ్డితో పాటు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా దానిపై సంతకాలు చేశారు. ‘ఇండియా’ కూటమిలో బీఆర్ఎస్ భాగస్వామి కాని విషయం తెలిసిందే. ఇప్పడేమవుతుంది? అవిశ్వాస తీర్మానంపై ఏ రోజు, ఎప్పుడు చర్చ మొదలు పెట్టాలో స్పీకర్ సారథ్యంలో జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయమవుతుంది. ► చర్చలో పాల్గొనేందుకు ఏయే పార్టీకి ఎంత సమయం ఇవ్వాలో స్పీకర్ నిర్ణయిస్తారు. ► చర్చ తర్వాత తీర్మానంపై ప్రధాని సమాధానమిస్తారు. తర్వాత ఓటింగ్ జరుగుతుంది. లోక్‌సభలో బలాబలాలివీ... లోక్‌సభ మొత్తం బలం 543. ప్రస్తుతం 5 ఖాళీలున్నాయి. బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీఏ పక్షానికి 330 మందికి పైగా, విపక్ష ‘ఇండియా’ కూటమికి 140కి పైగా ఎంపీల బలముంది. ఈ రెండు కూటముల్లోనూ లేని ఎంపీలు 60 మందికి పైగా ఉన్నారు. మోదీ జోస్యమే నిజమైంది! విపక్షాలు అవిశ్వాస తీర్మానం ఇవ్వడంతో ప్రధాని మోదీ నాడు చెప్పిన జోస్యమే నిజమైందంటూ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2019 జూలై 20న మోదీ ప్రభుత్వంపై విపక్షాలు తొలిసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం తెలిసిందే. దానికి అనుకూలంగా 126 మంది ఓటేయగా 325 మంది ఎన్డీఏ సభ్యులు వ్యతిరేకించారు. దాంతో భారీ మెజార్టీతో మోదీ సర్కారు గట్టెక్కింది. ఆ సందర్భంగా అవిశ్వాస తీర్మానంపై చర్చకు మోదీ బదులిస్తూ విపక్షాలను ఎద్దేవా చేశారు. ‘2023లోనూ నా ప్రభుత్వంపై అవిశ్వాస పరీక్ష పెట్టేంతగా వాళ్లు సన్నద్ధం కావాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ చెణుకులు విసిరారు. అచ్చం ఆయన అన్నట్టుగానే ఇప్పుడు జరుగుతోందంటూ బుధవారం రోజంతా సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొట్టాయి. -
Manipur violence: ఆరని మంటలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో మణిపూర్ హింసాకాండ మంటలు కొనసాగుతున్నాయి. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తక్షణమే సమాధానం ఇవ్వాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, ఆందోళనలు, నిరసనలతో ఉభయ సభలు స్తంభిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వరుసగా మూడో రోజూ సోమవారం సైతం ఇదే అంశంపై విపక్షాలు ఉభయ సభలను అడ్డుకున్నాయి. దీంతో పలుమార్లు సభలను వాయిదా వేయాల్సి వచి్చంది. ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ సస్పెన్షన్ వ్యవహారం రాజ్యసభను మరింత వేడెక్కించింది. డిమాండ్‌పై వెనక్కి తగ్గని విపక్షాలు మణిపూర్ ఘటనలపై చర్చించాలని కోరుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు లోక్‌సభలో సోమవారం వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సభలో సమాధానం ఇవ్వాలని ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరీ డిమాండ్ చేశారు. ఆయనకు మద్దతుగా విపక్ష ఎంపీలు తమ స్థానాల్లోంచి లేచి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్ ఓంబిర్లా స్పందిస్తూ.. దీనిపై సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే కేంద్రం తరఫున ఎవరూ సమాధానమివ్వాలో మీరు ఆదేశించలేరని అన్నారు. ఇదే సమయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నా«థ్ సింగ్ మాట్లాడుతూ.. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోగా మరింత తీవ్రస్వరంతో నినాదాలు చేశారు. ‘ఇండియా ఫర్ మణిపూర్’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. లోక్‌సభలో బీజేపీ ఎంపీలు కూడా ఎదురుదాడికి దిగారు. పశి్చమ బెంగాల్, రాజస్తాన్‌లో మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష ఎంపీల నినాదాల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. నినాదాల హోరు ఆగకపోవడంతో కొద్దిసేపటికే సభను మధ్యాహ్నం 12 గంటల దాకా, ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల దాకా.. అనంతరం మంగళవారానికి వాయిదా వేశారు. నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు–2023, నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కమిషన్ బిల్లు–2023, కానిస్టిట్యూషన్(ఎస్సీలు) ఆర్డర్(సవరణ) బిల్లు–2023ని కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. సంజయ్ సింగ్ సస్పెన్షన్ మణిపూర్ హింసపై రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్), కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా విపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల వరకూ సభ వాయిదా పడింది. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా ఆందోళన కొనసాగించారు. సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్న ‘ఆప్’ ఎంపీ సంజయ్ సింగ్ తీరుపై చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను సభ నుంచి సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. దీంతో సంజయ్ సింగ్‌ను సస్పెండ్ చేయాలనే తీర్మానాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టారు. దీనిని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో వర్షాకాల సమావేశాల్లో సభ జరిగే మిగిలిన దినాలకు సంజయ్ సింగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ‘ఆప్’ ఎంపీని సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. దీంతో సభను చైర్మన్ వాయిదా వేశారు. ఆ తర్వాత అన్ని పారీ్టల సభాపక్ష నేతలతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సభ సక్రమంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్లో సజావుగా చర్చ జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని హోంమంత్రి అమిత్ అన్నారు. ఆయన సోమవారం లోక్‌సభలో మాట్లాడారు. మణిపూర్ అంశంలో నిజాలు బయటకు రావాల్సిందేనని, వాస్తవాలు దేశ ప్రజలకు తెలియాలని పేర్కొన్నారు. పార్లమెంట్ వెలుపల నిరసన మణిపూర్‌లో మహిళలపై అకృత్యాలపై ప్రధాని నరేంద్ర మోదీ సమగ్ర ప్రకటన చేయాలని ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ పార్లమెంట్ ఆవరణలో సోమవారం ఆందోళన చేపట్టింది. ‘మణిపూర్ కోసం భారత్’, ‘భారత్ డిమాండ్ మణిపూర్’ అని రాసి ఉన్న ప్లకార్డులు, బ్యానర్లు చేతపట్టుకుని ప్రతిపక్ష ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేశారు. -
ఇండియా కూటమి తొలి భేటీ
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి నేతల మొట్టమొదటి సమావేశం గురువారం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చాంబర్లో వారంతా భేటీ అయి వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మంగళవారం బెంగళూరులో సమావేశమైన ప్రతిపక్ష నేతలు తమ కూటమికి ఇండియా అనే పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. మణిపూర్ అంశంపై ఉభయసభల్లో చర్చించాలని, అనంతరం ప్రధాని మోదీ ఒక ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ..మణిపూర్ సీఎం బిరేన్ సింగ్‌ను వెంటనే తొలగించి, అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలన్నారు. ఆ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు 80 రోజులుగా కొనసాగుతున్నా ప్రధాని మోదీ అక్కడికి వెళ్లలేదు, అక్కడి పరిస్థితిపై స్పందించలేదని చెప్పారు. ‘మహిళా రెజ్లర్లపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ పార్లమెంట్ నాలుగో నంబర్ గేట్ దగ్గర కనిపించగా, అక్కడికి కొన్ని అడుగుల దూరంలో ప్రధాని మోదీ మహిళల భద్రతపై లెక్చరిచ్చారు. ద్వంద్వ ప్రమాణాలు బీజేపీ డీఎన్ఏలోనే ఉన్నాయి’అని లోక్‌సభలో కాంగ్రెస్ విప్ మాణిక్కం ఠాగూర్ అన్నారు. -
Parliament Monsoon Session 2023: తొలి రోజే గరంగరం
సాక్షి, న్యూఢిల్లీ: వర్షాకాల సమావేశాల్లో తొలిరోజే పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. మణిపూర్‌లో హింసాకాండ, ఇద్దరు గిరిజన మహిళలకు జరిగిన అవమానం సహా ఇతర అంశాలపై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు ఆందోళనకు దిగడంతో ఉభయ సభలు అట్టుడికాయి. ఇతర సభా కార్యక్రమాలన్నీ రద్దుచేసి, మొదటి అంశంగా మణిపూర్ హింసపైనే చర్చించాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ప్రధాని జవాబు చెప్పాలని డిమాండ్ పార్లమెంట్ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమైన వెంటనే.. ఇటీవల మరణించిన సభ్యులకు నివాళులరి్పంచిన కొద్ది నిమిషాలకే రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు, లోక్‌సభ 2 గంటలకు వాయిదా పడ్డాయి. అంతకంటే ముందు మణిపూర్ అంశంపై 267 నిబంధన కింద చర్చకు పట్టుబట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించారు. ఈ మేరకు కాంగ్రెస్ తరపున మాణిక్యం ఠాగూర్, ఆప్ నేత సంజయ్ సింగ్, బీఆర్ఎస్ తరపున నామా నాగేశ్వరరావు, ఎంఐఎం నుంచి ఒవైసీ, సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం వాయిదా తీర్మానిచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభ పునఃప్రారంభమైన తర్వాత కాంగ్రెస్, టీఎంసీ సహా ఇతర విపక్షాల సభ్యులు మణిపూర్ హింసపై చర్చించాలని కోరారు. చైర్మన్ అంగీకరించకపోవడంతో నిరసనకు దిగారు. అత్యంత సున్నితమైన ఈ అంశాన్ని ప్రాధాన్యతగా చర్చకు చేపట్టాలని, దీనిపై మోదీ సమాధానం చెప్పాలని ప్రతిపక్ష నేత మల్లికార్జునఖర్గే డిమాండ్ చేశారు. టీఎంసీ నేత డెరిక్ ఓబ్రియన్ సైతం ఆయనకు మద్దతు పలికారు. ఛైర్మన్ తిరస్కరించడంతో సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా పడింది. సభ తిరిగి ఆరంభమైన తర్వాత కూడా ఖర్గే మరోసారి తమ నోటీసులపై చర్చించాలని కోరారు. ఆయన మైక్‌ను కట్ చేయడంతో కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో సభాపతి జగదీప్ ధన్‌ఖడ్ సభను శుక్రవారానికి వాయిదావేశారు. ఇక లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు పునఃప్రారంభమైన తర్వాత మణిపూర్ హింసపై విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగించడంతో సభను స్పీకర్ శుక్రవారం ఉదయానికి వాయిదా వేశారు. చర్చకు సిద్ధమే: పీయూష్ గోయల్ విపక్షాల ఆందోళనపై రాజ్యసభలో సభాపక్ష నేత పీయూష్ గోయల్ స్పందించారు. ‘‘పార్లమెంట్ సక్రమంగా కొనసాగకూడదన్నదే ప్రతిపక్షాల ఉద్దేశంగా కనిపిస్తోంది. మణిపూర్ సంఘటనలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టంచేసినా.. నిబంధనల ప్రకారం చర్చ జరగనివ్వకుండా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి’’ అని ఆక్షేపించారు. సోనియా ఆరోగ్య పరిస్థితిపై మోదీ ఆరా పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు లోక్‌సభలో ప్రధాని మోదీ విపక్ష నేతలను పలకరించారు. వారి యోగక్షేమాలను విచారించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీతో కొద్దిసేపు మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మణిపూర్ హింసాకాండపై లోక్‌సభలో చర్చించాలని ప్రధాని మోదీని సోనియా కోరారని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి చెప్పారు. -
Parliament Monsoon Session: నేటి నుంచే సభా సమరం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సాక్షిగా అధికార, విపక్షాల మధ్య వాడీవేడి చర్చలు, సంవాదాలకు రంగం సిద్ధమయ్యింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం ఆరంభం కానున్నాయి. ఇరుపక్షాలు అస్త్రశ్రస్తాలను సిద్ధం చేసుకుంటున్నాయి. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు అధికార, ప్రతిపక్ష నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. మణిపూర్‌లో జాతుల మధ్య రగులుతున్న హింస, ఉమ్మడి పౌరస్మృతి బిల్లు, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కేంద్ర దర్యాప్తు సంస్థల దురి్వనియోగం వంటి అంశాలపై సభలో గట్టిగా నిలదీసి, కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష కూటమి సిద్ధమవుతోంది. తిప్పికొట్టేందుకు అధికార పక్షం ప్రతివ్యూహాలు పన్నుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 23 రోజుల పాటు జరిగే ఈ సెషన్లో మొత్తం 17 రోజుల పాటు పార్లమెంట్ భేటీ కానుంది. పార్లమెంటరీ వర్గాల సమాచారం ప్రకారం.. వర్షాకాల సమావేశాలు పాత పార్లమెంట్ భవనంలో ప్రారంభమై, సమావేశాల మధ్యలో నూతన భవనానికి మారుతాయి. ఈసారి మొత్తం 21 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇందులో ప్రధానమైంది ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) బిల్లు. యూసీసీ, ఢిల్లీ ఆర్డినెన్స్‌పై రగడ తప్పదా? మణిపూర్‌లో హింసాకాండపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సహా ఇతర ప్రతిపక్షాలు గట్టి పట్టుదలతో ఉన్నాయి. యూసీసీ బిల్లుపై కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఎంసీ సహా ఇతర విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే అన్ని స్థాయిల్లో అడ్డుకునేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నాయి. ఢిల్లీ విషయంలో కేంద్ర ఆర్డినెన్స్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన బీఆర్ఎస్, టీఎంసీ, సీపీఐ, సీపీఎం తదితర పారీ్టల మద్దతు కూడగట్టారు. జోషి ఆధ్వర్యంలో అఖిలపక్షం భేటీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రస్తావించే అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. జోషి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కీలకపార్టీల నేతలు పాల్గొన్నారు. 32 అంశాలు పార్లమెంట్లో ప్రస్తావనకు రానున్నట్లు జోషి చెప్పారు. కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగాలని కేంద్ర ప్రభుత్వం నిజంగా కోరుకుంటే, సభలో ప్రతిపక్షాలు లెవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ అధిర రంజన్ చౌదరి అన్నారు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని వ్యాఖ్యానించారు. మా డిమాండ్‌కు వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ మద్దతు: బీజేడీ వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని బిజూ జనతాదళ్(బీజేడీ) ఎంపీ శశి్మత్ పాత్రా కోరారు. అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై తమ డిమాండ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, వామపక్షాలు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. -
స్థిరీకరణకు అవకాశం
ముంబై: స్టాక్ సూచీలు జీవిత గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతున్న తరుణంలో.., ఈ వారం కొంత స్థిరీకరణకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లను వచ్చే సంకేతాలను అందిపుచ్చుకోవచ్చు. దేశీయంగా కీలక కంపెనీల జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల దృష్టి వాటిపై మళ్లనుంది. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త షేర్లు నేడు(సోమవారం) ఎక్చ్సేంజీల్లో లిస్ట్ కానున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం(జూన్ 20న) ప్రారంభం కానున్నాయి. రుతు పవనాల పురోగతి వార్తలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్ మారకంలో రూపాయి, క్రూడాయిల్ కదలికలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే ఇతర అంశాలుగా ఉన్నాయి. ‘‘గరిష్ట స్థాయిల్లో స్వల్పకాలిక కన్సాలిడేషన్‌కు ఆస్కారం ఉంది. జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌పై దృష్టి సారించడం శ్రేయస్కరం. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వహిస్తూ కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్లు చేయోచ్చు. సాంకేతికంగా నిఫ్టీకి 19650 వద్ద నిరోధం ఉంది. ఈ స్థాయిని చేధిస్తే 19770 వద్ద మరో కీలక నిరోధం ఎదురుకానుంది. లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే దిగువ స్థాయిలో 19300 వద్ద తక్షణ మద్దతును కలిగి ఉంది’’ అని మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అరవిందర్ సింగ్ నందా తెలిపారు. కంపెనీల తొలి క్వార్టర్ ఫలితాలపై ఆశాశహ అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు, టోకు ధరలు దిగిరావడం, మార్కెట్లో అస్థిరత తగ్గడం తదితర సానుకూలాంశాలతో వరుసగా మూడోవారమూ సూచీలు లాభాలను ఆర్జించగలిగాయి. ఐటీ, మెటల్, రియల్టీ, ఫార్మా షేర్లు రాణించడంతో గత వారం మొత్తంగా సెన్సెక్స్ 781 పాయింట్లు, నిఫ్టీ 233 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. అలాగే వారాంతాన సెన్సెక్స్ 66,160 వద్ద, నిఫ్టీ 19,595 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరుపై దృష్టి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తొలి త్రైమాసిక ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. అలాగే విలీన ప్రక్రియ పూర్తైన తర్వాత అర్హులైన హెచ్డీఎఫ్సీ వాటాదారులకు 311 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లను జారీ చేసింది. తద్వారా హెచ్డీఎఫ్సీ షేర్హోల్డర్లు ఇప్పటికే వారు కలిగి ఉన్న షేర్లకు ప్రతి 25 షేర్లకు బదులుగా 42 హెచ్డీఎఫ్సీ షేర్లు అందనున్నాయి. కొత్త షేర్లు నేడు(సోమవారం) ఎక్చ్సేంజీల్లో లిస్ట్ కానున్నాయి. తాజాగా లిస్ట్ అవుతున్న షేర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఈక్విటీ షేర్లతో సమానంగా ఉంటాయని వెల్లడైంది. క్యూ1 ఆర్థిక ఫలితాలపై కన్ను కీలక కంపెనీలు తమ జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఈ వారంలో ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు ఆస్కారం ఉంది. ఇండెక్సుల్లోని హెచ్డీఎఫ్ఎసీ బ్యాంక్, ఎల్టీఐమైండ్టీ కంపెనీల క్యూ1 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ బుధవారం.., ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలివర్ గురువారం.., హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఆ్రల్టాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీలు శుక్రవారం తమ జూన్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి. అలాగే ఐసీఐసీఐ లాంబార్డ్, ఐసీసీఐ ప్రుడెన్షియల్, ఎల్అండ్టీ టెక్నాలజీ, టాటా కమ్యూనికేషన్స్, యూనిటెడ్ స్పిరిట్, కెన్‌ఫిన్ హోమ్స్, ఎంఫసిస్, టాటా ఎలాక్సీ, క్రిసిల్ కంపెనీలూ ఫలితాలను విడుదల చేసే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. ప్రపంచ పరిణామాలు చైనా కేంద్ర బ్యాంకు సోమవారం కీలక వడ్డీరేట్లపై నిర్ణయాన్ని వెల్లడించనుంది. అలాగే ఆ దేశ రెండో క్వార్టర్ జీడీపీ డేటా వెల్లడి కానుంది. అమెరికా జూన్ రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మంగవారం విడుదల అవుతాయి. బ్రిటన్, యూరోపియన్ యూనియన్ సీపీఐ ద్రవ్యోల్బణ డేటా బుధవారం, మరుసటి రోజు గురువారం కరెంట్ ఖాతా గణాంకాలు.., జపాన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వెల్లడి కానున్నాయి. జపాన్ ద్రవ్యోల్బణ గణాంకాలు శుక్రవారం విడుదల అవుతుంది. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను వెల్లడించే స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. కొనసాగిన ఎఫ్ఐఐల కొనుగోళ్లు దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం జూలై ప్రథమార్థంలో కొనసాగింది. ఈ నెల తొలి భాగంలో రూ.30,600 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. దేశీయ కార్పొరేట్ ఆదాయాలు, స్థూల ఆర్థిక డేటా మెరుగ్గా నమోదవడం ఇందుకు కారణమయ్యాయి. కాగా మే, జూన్ నెలల్లో వరుసగా రూ.43,838 కోట్లు, రూ.47,148 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ‘‘అంతర్జాతీయంగా డాలర్ క్షీణతతో ఎఫ్ఐఐల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. బెంచ్‌మార్క్ సూచీలు ప్రస్తుతం జీవితకాల గరిష్టం వద్ద ట్రేడ్ అవుతున్నాయి. చైనాతో పోలిస్తే భారత ఈక్విటీల వ్యాల్యూయేషన్లు అధికంగా ఉన్నాయి. కావున చైనాలో అమ్మకం, భారత్‌లో కొనుగోలు విధానం విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువకాలం కొనసాగించకపోవచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయకుమార్ తెలిపారు. -
19న అఖిలపక్ష సమావేశం
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు అఖిలపక్ష భేటీ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. వర్షాకాల సమావేశాల కోసం అధికార, విపక్షాలు తమ వ్యూహాలు, అ్రస్తాలతో సన్నద్ధమవుతున్నాయి. -
20 నుంచి పార్లమెంట్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో సభా వ్యవహారాలు, వివిధ అంశాలపై ఫలప్రదమైన చర్చలకు సహకరించాలని అన్ని పారీ్టలను కోరుతున్నా’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. 23 రోజుల పాటు జరిగే ఈ సెషన్లో మొత్తం 17 రోజులపాటు పార్లమెంట్ సమావేశం కానుంది. సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో ప్రారంభమై, సమావేశాల మధ్యలో కొత్త భవనానికి మారుతాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి ఐక్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రతిపక్ష పార్టీలు ప్రయతి్నస్తున్న వేళ ఈ సమావేశాలు వాడీవేడిగా సాగుతాయని భావిస్తున్నారు. ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి( యూసీసీ)బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ అంశాన్ని ప్రధాని మోదీ ఇటీవల ప్రముఖంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పును పక్కనబెడుతూ ఢిల్లీలో పరిపాలనాధికారాలపై పట్టుబిగించేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అదేవిధంగా, ఇప్పటికే కేబినెట్ ఆమోదం పొందిన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ నూతన భవనాన్ని మే 28న ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. -
Parliament Monsoon Session: తొలి రోజే రగడ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ధరల పెరుగుదల నుంచి అగ్నిపథ్ వరకు కీలక అంశాలపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభలను వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో తొలిరోజు ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. లోక్‌సభకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ తదితరులు హాజరయ్యారు. సభ ఉదయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. రాష్ట్రపతి ఎన్నికలో ఎంపీలు ఓటు వేయడానికి గాను సభను మధ్యాహ్నం 2 గంటల వరకు స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. ఎన్నికలంటే ఒక పండగ లాంటిదేనని అన్నారు. ఈ పండగలో పాలుపంచుకోవాలని ఎంపీలకు సూచించారు. లోక్‌సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత వామపక్ష సభ్యులు వెల్‌లోకి ప్రవేశించారు. ద్రవ్యోల్బణంపై నిరసన వ్యక్తం చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ సభ్యుడు అధిర్‌రంజన్ చౌదరి మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కుటుంబ న్యాయస్థానాల(సవరణ) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన ఆగకపోవడంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభలోనూ ఉదయం కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు ప్రారంభించారు. సభను అడ్డుకోవడమే లక్ష్యంగా కొందరు సభ్యులు వచ్చినట్లు కనిపిస్తోందని చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు అసహనం వ్యక్తం చేశారు. ఎంపీలంతా రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయడానికి వెళ్లాలని సూచిస్తూ సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుగుతున్న వేళ ఈ సమావేశాలను చిరస్మరణీయ సమావేశాలుగా మార్చుకోవాలని సూచించారు. చక్కటి పనితీరు ప్రదర్శించాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. గత ఐదేళ్ల మాదిరిగా కాకుండా ఈసారి వైవిధ్యంగా వ్యవహరించాలన్నారు. జపాన్ దివంగత ప్రధాని షింజో అబె, యూఏఈ మాజీ అధ్యక్షుడు, అబూదాబీ నాయకుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, కెన్యా మూడో అధ్యక్షుడు మావై కిబాకీకి, ఇటీవల మరణించిన ఎనిమిది మంది మాజీ ఎంపీలకు ఉభయ సభలు నివాళులర్పించాయి. కొత్త సభ్యుల ప్రమాణం ఎగువ సభకు ఇటీవల ఎన్నికైన సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మాజీ మంత్రులు పి.చిదంబరం, కపిల్ సిబల్, ప్రఫుల్ పటేల్, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, శివసేన నేత సంజయ్ రౌత్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్ సూర్జేవాలా, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి, కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా, వైఎస్సార్సీపీ నేతలు వి.విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, నామినేటెడ్ సభ్యుడు, సినీ కథా రచయిత వి.విజయేంద్ర ప్రసాద్ లోక్‌సభలో శత్రుఘ్న సిన్హా తదితరులు ప్రమాణం చేశారు. ఓపెన్ మైండ్‌తో చర్చిద్దాం ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు లోతైన, వివరణాత్మక చర్చలతో వ్రర్షాకాల సమావేశాలను ఫలవంతం చేయాలని ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అంతా కలిసి ఓపెన్ మైండ్‌తో చర్చిద్దామని సూచించారు. సునిశిత విమర్శ, చక్కటి విశ్లేషణల ద్వారా ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల రూపకల్పనలో భాగస్వాములు కావాలని విన్నవించారు. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మీడియాతో మాట్లాడారు. ‘‘సభలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలి. అందరి కృషితోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అందరి సహకారంతోనే సభ సజావుగా నడుస్తుంది. ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటుంది. సభ గౌరవాన్ని పెంపొందించేలా మన విధులను నిర్వర్తించాలి. పంద్రాగస్టు సమీపిస్తున్న వేళ... దేశ స్వాతంత్య్రం కోసం జీవితాలను దేశానికి అంకితం చేసి, జైళ్లలో గడిపినవారి త్యాగాలను మనం గుర్తుంచుకోవాలి. వారి ఆశలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని మర్చిపోవద్దు’ అని ప్రధాని పేర్కొన్నారు. పార్లమెంట్‌ను పవిత్ర స్థలంగా భావించాలన్నారు. దేశానికి కొత్త శక్తినివ్వాలి ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేళ, మరో పాతికేళ్ల తర్వాత దేశ ప్రయాణం ఎలా ఉండాలనే దానిపై ప్రణాళికలు రూపొందించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. మరింత వేగంగా ముందుకు సాగే తీర్మానాలతో జాతికి దిశానిర్దేశం చేయాలన్నారు. ఎంపీలంతా దేశానికి కొత్త శక్తిని సమకూర్చడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాలు కీలకమన్నారు. -
వివాద్ సే విశ్వాస్‌తో రూ. 53,684 కోట్లు
పన్ను వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన వివాద్ సే విశ్వాస్ స్కీము ద్వారా ఇప్పటిదాకా రూ. 53,684 కోట్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు. ఈ పథకం కింద దాదాపు రూ. 99,765 కోట్ల పన్ను వివాదాలకు సంబంధించి 1.32 లక్షల డిక్లరేషన్లు దాఖలైనట్లు ఆయన వివరించారు. స్కీము కింద డిక్లరేషన్ ఇవ్వడానికి 2021 మార్చి 31తో గడువు ముగిసింది. అయితే, చెల్లింపులు జరిపేందుకు ఆఖరు తేదీని ఆగస్టు 31దాకా పొడిగించారు. అదనంగా వడ్డీతో అక్టోబర్ 31 దాకా కూడా చెల్లించవచ్చు. రూ. 1.67 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు .. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో (ఏప్రిల్–జూన్) మధ్య కాలంలో నికరంగా రూ. 1.67 లక్షల కోట్ల మేర వస్తు, సేవల పన్నులు (జీఎస్టీ) వసూలైనట్లు లోక్‌సభకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో నిర్దేశించుకున్న రూ. 6.30 లక్షల కోట్లలో ఇది 26.6 శాతమని ఆయన పేర్కొన్నారు. 2020–21లో రూ. 5.48 లక్షల కోట్లు, 2019–20లో రూ. 5.98 లక్షల కోట్లు జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. డీఐసీజీసీ సవరణ బిల్లుకు ఆమోదం రూ. 5 లక్షల దాకా డిపాజిట్లకు బీమా భద్రత కల్పిం చేలా డిపాజిట్ బీమా, రుణ హామీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. రాజ్యసభలో గతవారమే ఇది ఆమోదం పొందింది. బ్యాంకులపై ఆర్బీఐ మారటోరియం విధించిన 90 రోజుల్లోగా ఖాతాదారులు రూ. 5 లక్షల దాకా డిపాజిట్లను తిరిగి పొందేందుకు ఇది ఉపయోగపడనుంది. 7 సంస్థలకు ఇంధన రిటైలింగ్ లైసెన్సు .. కొత్త విధానం కింద 7 సంస్థలకు ఆటోమొబైల్ ఇంధన రిటైలింగ్ లైసెన్సులు జారీ చేసినట్లు పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలీ తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్‌కు చెందిన బీపీతో కలిసి ఆ కంపెనీ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్, ఐఎంసీ, ఆన్సైట్ ఎనర్జీ, అస్సామ్ గ్యాస్ కంపెనీ, ఎంకే ఆగ్రోటెక్, ఆర్‌బీఎంఎల్ సొల్యూషన్స్ ఇండియా, మానస్ ఆగ్రో ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ సంస్థల్లో ఉన్నాయి. ఆర్ఐఎల్కు గతంలోనే ఇంధన రిటైలింగ్ లైసెన్సు ఉండగా దాన్ని అనుబంధ సంస్థ రిలయన్స్ బీపీ మొబిలిటీకి బదలాయించి కొత్తగా మరో లైసెన్సు తీసుకుంది. బీపీతో కలిసి ఆర్‌బీఎంఎల్ సొల్యూషన్స్ పేరిట ఇంకో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి, దానికి కూడా లైసెన్సు తీసుకుంది. 13 రాష్ట్రాల్లో విద్యుత్ వాహన విధానాలు విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు నిర్దుష్ట విధానాన్ని ఆమోదించిన లేదా నోటిఫై చేసిన 13 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి కృష్ణన్ పాల్ గుర్జర్ రాజ్యసభలో ఈ విషయం తెలిపారు. ఆటోమోటివ్ రిసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) ప్రకారం విద్యుత్ వాహనాల ఖరీదులో బ్యాటరీ ధర వాటా సుమారు 30–40 శాతంగా ఉంటుందని ఆయన వివరించారు. -
పార్లమెంట్లో వీడని ప్రతిష్టంభన
-
పార్లమెంట్ సమావేశాల కుదింపు?
న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే ముందుగా ముగిసే అవకాశాలు కనిపిస్తు న్నాయి. కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఆలోచన చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం ఈనెల 14వ తేదీ నుంచి అక్టోబర్ 1 వరకు ఉభయసభల సమావేశాలు జరగాలి. అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వ ప్రతినిధులతో లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో సమావేశాల కుదింపునకే మెజారిటీ సభ్యులు మొగ్గుచూపారు. ఈమేరకు 23వ తేదీ వరకే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సమావేశాలు జరుగుతుండగానే కేంద్ర మంత్రులు గడ్కరీ, ప్రహ్లాద్ పటేల్‌లకు కరోనా సోకింది. ఇంకొందరికీ సోకడంతో సమావేశా లకు రావద్దని వారికి సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో సమావేశాలను నిర్వహించడం మంచిదికాదని ప్రతిపక్షాలు కూడా సూచించ డంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఇప్పటికే ఉభయసభలను షిఫ్టుల వారీగా నడుపుతూ మునుపెన్నడూ లేనివిధంగా పలు జాగ్రత్త చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ► లాక్డౌన్ సమయంలో శ్రామిక్ రైళ్లలో ప్రయాణిస్తున్న వారిలో 97 మంది మరణిం చారని కేంద్రం రాజ్యసభ లో తెలిపింది. ► రూ. 2,000 నోట్ల ముద్రణను ఆపే ఆలోచనలేమీ లేవని కేంద్రం లోక్‌సభకు తెలిపింది. అయితే 2019తో పోలిస్తే 2020లో తక్కువ నోట్లు సర్కులేçషన్లో ఉన్నట్లు చెప్పింది. ► భవిష్యత్ మిలిటరీ అప్లికేషన్లపై పరిశోధనకు డీఆర్డీఓ 8 అధునాతన సెంటర్లను ప్రారంభించినట్లు ప్రభుత్వం తెలిపింది. -
రేపు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
సాక్షి, కాకినాడ : లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ట్వీటర్లో పేర్కొన్నారు. పార్లమెంట్లో జరిగిన పరిణామాలపై రేపు ఉదయం ప్రెస్మీట్లో స్పందిస్తానని వైఎస్ జగన్ చెప్పారు. కాకినాడ జేఎన్టీయూకు ఎదురుగా ఉన్న పాదయాత్ర శిబిరంలో ప్రెస్‌మీట్ ఉంటుందని వైఎస్సార్సీపీ మీడియా సెల్ తెలిపింది. Keenly following the happenings at the Loksabha #NoConfidenceMotion. I will react on this episode at tomorrow’s 8:30am press conference. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 20, 2018 -
‘ఎంపీ ప్రశ్నలు.. టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్ సభలో బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాసంపై టీడీపీని హరిబాబు ఉక్కిరిబిక్కిరి చేశారు. తన ప్రశ్నలతో టీడీపీ ఎంపీలను నిలదీశారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు విభజన చట్టంలో చేర్చలేదని ఎంపీ ప్రశ్నించారు. అంతేకాక ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి లేదని కంబంపాటి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతల దగ్గరకెళ్లి టీడీపీ నాయకులు చర్చలు జరపడంపై ఆయన మండిపడ్డారు. మీ చర్యలతో ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తోందని తనదైన శైలిలో బీజేపీ ఎంపీ నిప్పులు చెరిగారు. ‘కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. ఎన్టీఆర్ జీవితమంతా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడారు. మీరు నిస్సిగ్గుగా కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. కాంగ్రెస్ నేతలతో టీడీపీ నేతలు ఫ్లోర్ కోఆర్డినేషన్ చేశారు. రాష్ట్రం విడిపోతే ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ నమ్మింది. రాష్ట్ర విభజన చేయాలని టీడీపీనే లేఖ ఇచ్చింది. హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు. ప్రత్యేక ప్యాకేజీకి ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. నాబార్డు, హడ్కో ద్వారా సాయం చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. ఏపీ నుంచి వినతులను అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించారు. మీకు హోదా అనే పేరు ముఖ్యమా లేక ఆర్థిక సాయం ముఖ్యమా? పోలవరం ప్రాజెక్ట్‌కు ఇప్పటి వరకు రూ. 6,374 కోట్లు ఇచ్చాం. పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రమే పూర్తి చేస్తుంది. కడప స్టీల్ ప్లాంట్‌నుపై కమిటీ వ్యతిరేక రిపోర్టు ఇచ్చింది. అయినా స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది’. అని ఎంపీ కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. -
హరిబాబు ప్రశ్నలు.. టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి
-
ప్రజల నమ్మకాన్ని టీడీపీ నాయకులు కోల్పోయారు
-
‘రాజ్‌నాథ్ వ్యాఖ్యలు.. బయటపడిన టీడీపీ డ్రామా’
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ సాక్షిగా టీడీపీ-బీజేపీల బంధం మరోసారి బట్టబయలైంది. ఇన్ని రోజులు విడిపోయినట్లు సంకేతాలు ఇచ్చి.. లోపల మాత్రం బలమైన బంధాలు అలానే ఉన్నాయనే విషయం అర్థమౌతుంది. పార్లమెంట్ సమావేశంలో శుక్రవారం కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ వైదొలిగినప్పటికీ.. చంద్రబాబు మాకు మిత్రుడేనని వెల్లడించారు. లోక్‌సభలో రాజ్‌నాథ్ చేసిన వ్యాఖ్యలతో తెలుగుదేశం డ్రామా బయటపడింది. దీనిపై హోదా కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అంతేకాక రాజ్‌నాథ్ స్టేట్మెంట్పై టీడీపీ ఎంపీలు కనీసం నిరసన కూడా తెలపలేదని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఆ సమయంలో టీడీపీ నాయకులు రాజ్‌నాథ్ చేసిన స్టేట్మెంట్ను వింటూ కుర్చున్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో టీడీపీ-బీజేపీ బంధంపై మేం చెప్పిందే నిజమైందని వైఎస్సార్సీపీ నేత అన్నారు. బీజేపీతో బంధం కొనసాగుతోంది కాబట్టే సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లలేదు. అవిశ్వాసంపై లోపాయికారిగా ముందే మాట్లాడుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. నిధులపై రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతుండగా టీడీపీ ఎంపీలు స్పందించలేదు. దీన్ని బట్టి చూస్తే ఎన్డీఏతో తెగదెంపులు.. టీడీపీ ఆడిన డ్రామా అని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. -
‘టీడీపీ తూట్లు పొడిచి.. వ్యర్ధమైన ప్రసంగాలు’
సాక్షి, హైదరాబాద్ : ఎన్డీఏ ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై చర్చ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. అవిశ్వాసంపై టీడీపీ వాదన బలహీనంగా కనిపించిందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని సరైన రీతిలో ప్రస్తావించిలేకపోయారని పవన్ అన్నారు. ‘పార్టీకోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ రాజీ పడిందన్నారు. ప్రజల నమ్మకాన్ని టీడీపీ నాయకులు కోల్పోయారు. ఏపీ ప్రజల మనసును గెలిచే సువర్ణావకాశాన్ని తెలుగుదేశం పార్టీ చేజార్చుకుంది. గతంలో ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ప్రత్యేక హోదాను టీడీపీనే గతంలో వ్యతిరేకించింది. ఏపీ ప్రజలు టీడీపీ నాయకులకు ఎలా కనిపిస్తున్నారు. వ్యక్తిగత లాభాల కోసం ‘స్పెషల్ క్యాటగిరి స్టేటస్’కి మూడున్నర సంవత్సరాలుగా తూట్లు పొడిచి ఈ రోజు వ్యర్ధమైన ప్రసంగాలు చేసి ప్రయోజనం ఏమిటి? దశాబ్దాల అనుభవం ఉన్న నాయకులకు కేంద్రం వంచన తెలియాటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటే మేము నమ్మాలా ? ఇంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండి, ఇప్పుడే పుట్టిన పాలుగారే పసిపిల్లల లాగా.. కేంద్రం చేత మోసగింపపడ్డాం.. అంటే ప్రజలు నమ్ముతారు.. అని టీడీపీ నాయకులు ఎలా అనుకుంటారు? ’ అని పవన్ కల్యాణ్ తన ట్వీటర్ అకౌంట్లో పేర్కొన్నారు. -
కేంద్రమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు
సాక్షి, న్యూఢిల్లీ : వర్షాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ ఉభయ సభలు రెండో రోజు గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. నేడు రాజ్యసభలో ఆర్టీఐ అనుబంధ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు లోక్‌సభలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. చెన్నై విమానాశ్రయం విస్తరణ పనులపై అన్నాడీఎంకే సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి జయంత్ సిన్హా సమాధానం చెబుతున్న సమయంలో విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన గళాన్ని వినిపించాయి. స్పీకర్ వారించిన కూడా వారు వినిపించుకోలేదు. సిన్హా మాట్లాడుతున్న సమయంలో విపక్ష నాయకులు ఆయనకు వ్యతిరేకంగా, హేళన చేసేలా వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్‌లో ఓ మాంస వ్యాపారిని కొట్టి చంపిన కేసులో జైలు నుంచి విడుదలైన నిందితులకు ఆయన పూలమాలలు వేసి, స్వీట్లు పంచి సన్మానం చేసిన సంగతి తెలిసిందే. హత్యకేసులో నిందితులకు సన్మానం చేసిన సిన్హా.. ఈ విషయమై సభకు సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్ష సభ్యులు ఆయన నిలదీశారు. సిన్హాకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. -
ఫలితాలు, పార్లమెంట్ సమావేశాలు కీలకం
♦ ట్రేడింగ్ ప్రారంభంలో రిలయన్స్ ఫలితాల ప్రభావం ♦ వర్షపాత విస్తరణ కూడా కీలకమే ♦ ఈ వారం మార్కెట్‌పై నిపుణులు.. న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వారంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్, విప్రో వంటి బ్లూ చిప్ కంపెనీల తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెలువడనున్నాయి. ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరిగే తీరు, ఈ వారం వెలువడే బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు వర్షపాత విస్తరణ తదితర అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, ముడి చమురు ధరల గమనం, తదితర అంశాలు కూడా స్టాక్ మార్కెట్‌పై తగిన ప్రభావం చూపుతాయని క్యాపిటల్‌వయా రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు. అందరి కళ్లూ జీఎస్టీ బిల్లుపైనే అందరి కళ్లూ వస్తు, సేవల పన్ను(గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్-జీఎస్టీ)బిల్లుపైనే ఉన్నాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందుతుందనే అంచనాలే అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. సోమవారం నాటి ట్రేడింగ్ ప్రారంభంలో స్టాక్ సూచీలు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాలకు స్పందనగా ట్రేడవుతాయని ఆయన అంచనా వేస్తున్నారు. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత రిలయన్స్ క్యూ1 ఫలితాలు వెలువడ్డాయి. కంపెనీ నికర లాభం అంచనాలను మించి 18% వృద్ధి సాధించింది. కీలక బ్లూ చిప్ కంపెనీల ఫలితాలు... ఇక ఈ వారం ఫలితాల విషయానికొస్తే, ఈ నెల 18న (సోమవారం) హిందుస్తాన్ యునిలివర్, 19న (మంగళవారం) అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, 21న(గురువారం) హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కెయిర్న్ ఇండియా, శుక్రవారం(22న) యాక్సిస్ బ్యాంక్ వంటి బ్లూచిప్ కంపెనీల ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఇన్వెస్టర్లు పరిశీలిస్తారని సింఘానియా పేర్కొన్నారు. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే, గురువారం (ఈ నెల 21) యూరోపియన్ కేంద్ర బ్యాంక్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనున్నది. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 710 పాయింట్లు లాభపడి 27,837 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 218 పాయింట్లు లాభపడి 8,541 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ సూచీలు చెరో 2.6 శాతం చొప్పున లాభపడ్డాయి.