
రాజస్తాన్‌లో దారుణం
జైపూర్: రాజస్తాన్‌లోని అల్వార్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఏడుగురు దుండగులు ఓ మహిళను అపహరించి, సామూ హిక అత్యాచారానికి పాల్పడ్డారు. కారులో ప్రయాణిస్తూ ఒకరి తర్వాత ఒకరు రేప్ చేశారు. 11 రోజులపాటు బాధితురాలిని నిర్బంధించారు. చివరకు రోడ్డు పక్కన వది లేసి వెళ్లిపోయారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. బాధితురాలి భర్త ఫిర్యాదు ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 24న రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళను ముగ్గురు వ్యక్తులు అపహరించారు.
బొలేరో వాహనంలో బలవంతంగా ఎక్కించి తీసుకెళ్లారు. వాహనంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన మహిళపై దాడికి దిగారు. నోట్లో గుడ్డలు కుక్కారు. గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మరో నలుగురు ఉన్నారు. 11 రోజులు అక్కడే నిర్బంధించారు. ఏడుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలిని నగ్నంగా మార్చి అభ్యంతకరంగా వీడియోలు చిత్రీకరించారు. పోలీసులకు చెబితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని హెచ్చరించారు. రూ.3 లక్షల ఇస్తామని, నోరు మూసుకోవాలని చెప్పారు. అపస్మారక స్థితికి చేరిన బాధితురాలిని రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు. స్థానికుల సాయంతో ఆమె తన ఇంటికి చేరుకున్నారు.