
మోతిహరి: త్వరలో ఎన్నికలు జరగనున్న బిహార్‌లో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పర్యటించారు. రూ.7,200 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నాలుగు కొత్త అమృత్ భారత్ రైళ్లు ప్రారంభించారు. పట్నా, దర్భంగాల్లో ఏర్పాటు చేసిన సాఫ్ట్‌వేర్ పార్కులను ప్రధాని ప్రారంభించారు. మోతహరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. బలహీన వర్గాల పేరిట కాంగ్రెస్, ఆర్జేడీలు రాజకీయాలు చేస్తున్నాయంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
యుపీఏ ప్రభుత్వ హయాంలో బిహార్‌కి కేవలం రూ.2 లక్షల కోట్లకు మించి మంజూరు చేయలేదని.. తాను ప్రధాని అయిన తర్వాతే బిహార్ అభివృద్ధి పథంలో నడిచిందన్నారు. యూపీఏ పాలనలో బిహార్‌పై ప్రతీకార రాజకీయాలు తప్ప ఏమీ చేయలేదని ప్రధాని విమర్శలు గుప్పించారు. కాగా, “ఇవాళ బిహార్‌కు శక్తినిచ్చే.. యువతకు అవకాశాలు కల్పించే పథకాలను ప్రారంభించడం గర్వంగా ఉంది” అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
#WATCH | Bihar | PM Narendra Modi says, "... Congress and RJD have been doing politics in the name of backward classes, but they don't even respect people outside their family... We have to save Bihar from their illicit intentions... We were guided by leaders like Chandra Mohan… pic.twitter.com/mfJKy69KFM
— ANI (@ANI) July 18, 2025
.