ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాల్లో అనుకూలత | Today Telugu Horoscope On July 17th, 2025: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాల్లో అనుకూలత

Jul 17 2025 5:17 AM | Updated on Jul 17 2025 8:46 AM

Rasi Phalalu: Daily Horoscope On 17-07-2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.సప్తమి సా.6.16 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: రేవతి రా.3.35 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం: సా.4.18 నుండి 5.48 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.48 వరకు, తదుపరి ప.3.07 నుండి 3.59 వరకు, అమృతఘడియలు: రా.7.11 నుండి 8.41 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.38, సూర్యాస్తమయం: 6.34. 

మేషం: రుణయత్నాలు సానుకూలం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

వృషభం: కొత్త పనులు చేపడతారు. ఆర్థికలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాల్లో అనుకూలత.

మిథునం: శుభవర్తమానాలు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆస్తిలాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.

కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు అంతంతగానే ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

సింహం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. మిత్రుల నుంచి సమస్యలు. ఆరోగ్య సమస్యలు. రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కన్య: నిరుద్యోగులకు కీలక సమాచారం. వాహనయోగం. చర్చల్లో పురోగతి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. కార్యజయం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

వృశ్చికం: ప్రయాణాలలో ఆటంకాలు. దుబారా వ్యయం. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

ధనుస్సు: శ్రమ మరింతగా పెరుగుతుంది. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

మకరం: కొత్త పనులకు శ్రీకారం. సంఘంలో గౌరవం పొందుతారు. జీవితాశయం నెరవేరుతుంది. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు హోదాలు.

కుంభం: మిత్రులు, బంధువులతో అకారణ వైరం. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మీనం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement