
ఫిరోజాబాద్: ఒకరు మనతో ఎలా వ్యవహరిస్తారో వారితో అదే మాదిరిగా వ్యవహరించడాన్ని ‘టిట్ ఫర్ టాట్’(దెబ్బకు దెబ్బ) అని అంటారు. దీని అర్థం ఎవరైనా మనకు దొంగ దెబ్బ తీసినప్పుడు వారికి అదే రీతితో సమాధానం ఇవ్వడం అన్నమాట. లౌక్యం కలిగిన వారు ఈ మాట తరచూ చెబుతుంటారు. అయితే దీనిని ఒక ఎలక్ట్రీషియన్ ఆచరించి చూపారు. ఇప్పుడు ఈ ఉదంతం వైరల్‌గా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీనివాస్ అనే ఎలక్ట్రీషియన్ తనకు ట్రాఫిక్ పోలీసుల నుంచి ఎదురైన చేదు అనుభవాకి టిట్ ఫర్ టాట్ రీతిలో సమాధానం ఇచ్చారు. ఒకరోజు శ్రీనివాస్ తన ఉద్యోగ విధుల్లో అత్యవసరంగా బైక్‌పై వెళుతున్న సమయంలో, హెల్మెట్ ధరించనందుకు ట్రాఫిక్ పోలీసులు అతనికి రూ. 500 జరిమానా విధించారు. తన అత్యవసర పని గురించి వారికి చెప్పినప్పకీ, వారు ఏమాత్రం వినకుండా శ్రీనివాస్ చేతిలో జరిమానా రసీదు పెట్టారు.
Fearless man☠️ pic.twitter.com/Y458CvTLHc
— Aditya Tiwari ❤️👻 (@aditiwari9111) July 15, 2025
దానిని ఆన్‌లైన్‌లో చెల్లించిన శ్రీనివాస్ తన ఇబ్బందిని గుర్తించని ట్రాఫిక్ పోలీసులకు తగిన గుణపాఠం చెప్పాలని అనుకున్నారు. తనకు జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ 2016 నుంచి విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని శ్రీనివాస్ కనుగొన్నారు. అది రూ. 6.6 లక్షలకు చేరుకున్న విషయాన్ని శ్రీనివాస్ గుర్తించారు. వెంటనే అతను ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఐదు గంటలపాటు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది చీకటిలో ఉండేలా చేశాడు. పెండింగ్‌లో ఉన్న బకాయిల కారణంగానే ఈ పనిచేశామని, ఇది ప్రతీకారం కాదని శ్రీనివాస్ ట్రాఫిక్ సిబ్బందికి తెలియజేశారు. కాగా శ్రీనివాస్‌కు నెలల తరబడి జీతం రావడంలేదని, అతని జీతం నెలకు రూ. 6,000 మాత్రమేనని, అందుకే అతనికి ట్రాఫిక్ జరిమానా చెల్లించడం భారంగా మారిందని అతని స్నేహితులు చెబుతున్నారు.