
కార్లు అన్నింటిలోనూ ఖరీదైన, లగ్జరీ కారు రారాజు లాంటిది లంబోర్ఘిని కారు. విశ్వాసంలో కింగ్..కుక్క. ఈ రెండు అనుకోకుండా ఎదురు పడితే.. అస్సలు ఊహకే అందడం లేదు కదా. అందుకే విచిత్రమైన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
విషయం ఏమిటంటే.. ముంబై వీధిలో లంబోర్గిని కారునుకొద్దిసేపు ఆటాడుకుంది ఓ స్ట్రీట్ డాగ్. కొట్టొచ్చినట్టు ఉన్న కారు కలర్ (డార్క్ ఆరెంజ్) చూసి అలా బిహేవ్ చేసిందో ఏమో తెలియదు కానీ ఈ వీడియో ఒకటి ప్రస్తుతం ఎక్స్ లో వైరల్ అవుతోంది.
వీడియోలో విశేషాలు
ఆరెంజ్ కలర్‌లో లంబోర్గిని కారుకు అడ్డంగా నిలబడింది డాగ్. అటూ ఇటూ కొంచెం కూడా కదల్లేదు.. బెదర లేదు. దానితో మనకెందుకునే అనుకున్న డ్రైవర్ పక్కకు పోనిచ్చాడు. ఆహా.. అయినా వదల్లేదు.. వదల బొమ్మాళీ అంటూ కారును ఫాలో అయింది. మళ్లీ డ్రైవర్ తన కారును తిప్పినప్పుడు,ఇక మన శునక రాజు గట్టిగా అరవడం మొదలు పెట్టింది. చివరికి లంబోర్గిని కుక్కను దాటి దూసుకుపోయింది. దాంతో దాన్ని శునకం కొంత దూరం వరకు వెంబడించడం ఈ వీడియోలో చూడవచ్చు.
ఈ వీడియోను "కాలేష్ బీ/వీ సర్ డోగేష్ అండ్ లంబోర్గిని" అనే క్యాప్షన్ తో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు కూడా వచ్చాయి. "రోడ్డుకి నిజమైన బాస్" ‘‘మన బ్రో దెబ్బకు.. లంబోర్గిని పారిపోయింది’’ ఇలా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Kalesh b/w Sir Dogesh and Lamborghini
pic.twitter.com/EbgnzoErvI— Ghar Ke Kalesh (@gharkekalesh) July 15, 2025