
అరటి తొక్కలను పడేయకండి.. పండే కాదు..తొక్కల కూడా ఉపయోగమే అంటూ పలు బ్యూటీ చిట్కాలు గురించి విని ఉంటాం. అందులోనూ చాలామంది అరటి పండు తొక్కలను ముఖంపై, దంతాలపై తెగ రుద్దేస్తుంటారు. క్లీనింగ్ పర్పస్‌గా ఉపయోగపడుతుందని, ముఖం, దంతాలు నిగనిగలాడే తెల్లటి మెరుపుని సంతరించుకుంటాయిని చాలామంది నమ్ముతుంటారు. అయితే ఇందులో వాస్తవమెంతుందో ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ సవివరంగా చెప్పడమే గాక నిపుణులు కూడా ఆమె మాటకే మద్దతిస్తూ పలు సూచనలు కూడా ఇచ్చారు.
అమెరికాకు చెందిన బ్యూటీ అండ్ వెల్నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ అమ్ము బ్యూటీ వ్యవస్థాపకురాలు జరీఫా అహ్మద్ అరిజే ఇన్‌స్టాలో ఆరోగ్యకరమైన తెల్లటి దంతాల కోసం అరటి తొక్కలను చాలామంది వినియోగిస్తుంటారని చెప్పుకొచ్చింది. 50 మిలియన్ల మందకి పైగా ప్రజలను బోటాక్స్ బదులుగా అరటితొక్కను ముఖంపై రుద్దడం వంటివి చేస్తుంటారని అన్నారామె. వీటికి దంతాలను కూడా తెల్లగా మార్చే శక్తి ఉన్నందున అదుకోసం కూడా ఉపయోగిస్తారని చెప్పారు.
ఇదేమి మ్యాజిక్ కాదని, ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటివి ఎలాంటి కెమికల్ రియాక్షన్ ఇవ్వకుండా దంతాలను సున్నితంగా పాలిష్ చేసి, మంచి స్ట్రాంగ్‌గా మారుస్తాయని చెప్పుకొచ్చింది. దీన్ని ఎక్కువగా కరేబియన్, ఆఫ్రికన్, దక్షిణాసియన్లు నోటి ఆరోగ్యం కోసం ఉపయోగిస్తుంటారని తెలిపింది.
రాత్రిపూట ఇదేమి దంతాలను శుభ్రపరచదు గానీ, స్ట్రాంగ్ ఉండేలా చేస్తుంది. ఈ అరటిపండులో సహజసిద్ధంగా ఇంత మంచి లక్షణం ఉండటం కారణం చేతనే చాలామంది బోటాక్స్‌ల జోలికిపోవడం లేదని చెబుతోంది.
ఇది నిజమేనా..?
దంతాలు అందంగా మారాలంటే దంత వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు నిపుణులు. ఇలా అరటి తొక్కలు దంతాలను తెల్లగా మారుస్తాయిని చెప్పడానికి ఎక్కడ శాస్త్రీయమైన ఆధారాలు లేవని అన్నారు. సదరు ఇన్‌ఫ్లుయెన్సర్ వాదనను సమర్థించేలా శాస్త్రీయ పరిశోధనలు కూడా ఏమి జరగలేవని తేల్చి చెప్పార. ఇలా అరటి తొక్కను రుద్దడంతోనే దంతాలు స్ట్రాంగ్ అవుతాయని చెప్పుందుకు కూడా సరైన శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతున్నారు నిపుణులు.
అరటి తొక్కల్లో పొటాషియం, మెగ్నిషియం, మాంగనీస్ వంటివి ఉన్నప్పటికీ అవేమి ఇలా రుద్దగానే దంతంలోకి చొచ్చుకునిపోవని అన్నారు. అయితే ఈ పద్ధతిలో దంతాలపై ఉండే మరకలను తొలగే అవకాశం ఉందేమో గానీ, ఆ తర్వాత క్రమం తప్పకుండా బ్రెష్ చేయకపోతే మాత్రం సమస్య తప్పదని అన్నారు. ఎందుకంటే దీనిలో సహజ చక్కెరలు ఉంటాయి. అందువల్ల ఇలా రుద్దిన తర్వాత తప్పనిసరిగా బ్రష్‌చేయాల్సిందేనని అన్నారు. ఒకవేళ అలా వదిలేస్తే..దంతక్షయానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
అంతేగాదు అవి ఉపరితల మరకలను తొలిగించవచ్చేమో కానీ దంతాలపై ఉండే లోతైన మరకలను మాత్రం పూర్తిగా తొలగించేలేదని చెప్పుకొచ్చారు. చివరికి ఇది తెల్లబడటం అటుంచి ఆ తొక్కలో ఉండే వర్ణద్రవ్యం దంతాలపై ఉండే ఎనామిల్‌ని పసుపు రంగులోకి మార్చే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.
ఇదేమి హైడ్రోజన్ పెరాక్స్‌డ్ మాదిరి మంచి బ్లీచింగ్ చికిత్సను అందించి దంతాలను తెల్లగా మార్చలేదన్నారు. వైద్యపరంగా ఆమోదించిన ఉత్పత్తులు, వైద్య నిపుణుల సలహాలతో దంతాలను తళతళలాడే మెరుపులో ఉండేలా చేసుకోవాలని అన్నారు నిపుణులు.
(చదవండి: ఆ మూగజీవి ప్రతిస్పందనకు..ఎవ్వరైన ఇట్టే కరిగిపోవాల్సిందే..! వీడియో వైరల్)