
న్యూఢిల్లీ: ఇద్దరు ప్రయాణికుల అలజడి కారణంగా మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరాల్సిన స్పైస్‌జెట్ విమానం (SG 9282) దాదాపు ఏడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఢిల్లీ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తించింది.
స్పైస్‌జెట్ విమానంలో విమానం టేకాఫ్ కోసం ట్యాక్సీ చేస్తున్నప్పుడు కాక్‌పిట్‌లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ఇద్దరు ప్రయాణికులు ప్రయత్నించిన దరిమిలా గంగదరగోళం ఏర్పడింది. విమాన ప్రయాణానికి ఆటకం కలిగించిన ఆ ఇద్దరినీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)కి అప్పగించామని స్పైస్‌జెట్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘2025, జూలై 14న, ఢిల్లీ నుండి ముంబైకి వెళుతున్న స్పైస్‌జెట్ విమానం(SG 9282)లో అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఇద్దరు ప్రయాణికులను దింపేశాం. వారు బలవంతంగా కాక్‌పిట్‌లోకి చేరుకునేందుకు ప్రయత్నించారు. సిబ్బంది విధులకు ఆటకం కలిగించారని’ దానిలో పేర్కొంది.
స్పైస్‌జెట్ తెలిపిన వివరాల ప్రకారం క్యాబిన్ సిబ్బంది, తోటి ప్రయాణికులు, కెప్టెన్ పదే పదే అభ్యర్థించినప్పటికీ, ఆ ఇద్దరు ప్రయాణికులు ఇబ్బందులకు గురిచేశారు. జూలై 13న మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరాల్సిన ఈ విమానం, తొమ్మిది గంటలకు పైగా ఆలస్యంతో రాత్రి 9:05 గంటలకు బయలుదేరిందని ప్రయాణికులు తెలిపారు. రన్‌వే వైపు టాక్సీ వేసిన తర్వాత విమానం అకస్మాత్తుగా ఆగిపోయింది. ఫలితంగా ప్రయాణికుల్లో ఆందోళన ఏర్పడింది.