
మాస్కో: ఉక్రెయిన్‌తో మూడేళ్లుగా సాగుతున్న యుద్ధం కారణంగా రష్యాలో మానవ వనరుల కొరత ఏర్పడింది. దేశంలో కార్మికుల కొరతను భర్తీ చేసేందుకు భారత్ వైపు దృష్టి సారించింది. ఈ ఏడాది చివరికల్లా 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన భారత కార్మికులను రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
ఇందుకు సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా యాకటెరిన్‌బర్గ్‌లో కొత్తగా కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని ప్రారంభిస్తోందని ఉరల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చీఫ్ అండ్రీ బెసెడిన్ ప్రకటించారు. రష్యాలోని ఉరల్ పర్వతాలకు సమీపంలోని యాకటెరిన్ బర్గ్ ప్రాంతం భారీ పరిశ్రమలకు కేంద్రస్థానం.
అక్కడ సైనిక పరిశ్రమలూ భారీగానే ఉన్నాయి. రష్యా ప్రభుత్వ అంచనాల ప్రకారం 2030 నాటికి దేశంలో కారి్మక శక్తి కొరత 31 లక్షలకు పెరగనుంది. అందుకే, ఉత్తర కొరియా, శ్రీలంకల నుంచీ కారి్మకులను రప్పించాలని ప్రణాళికలు వేసింది.