breaking news
team india
-
నాకూ అలాగే జరిగింది!.. కొత్త ‘చీఫ్ సెలక్టర్’కు వార్నింగ్!
టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలం త్వరలోనే ముగియనుందన్న వార్తల నేపథ్యంలో భారత దిగ్గజ కెప్టెన్ సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కొత్తగా వచ్చే చీఫ్ సెలక్టర్ అన్నింటికీ సిద్ధపడే రంగంలోకి దిగాలని సూచించాడు.ఘనమైన విజయాలుకాగా 2023లో అగార్కర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. అతడి హయాంలో భారత జట్టు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్‌కు చేరడంతో పాటు.. రెండుసార్లు టీ20 ప్రపంచకప్ ట్రోఫీ (2024, 2026)లు గెలిచింది. అదే విధంగా చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ కైవసం చేసుకుంది. ఆసియా కప్ టోర్నీలోనూ చాంపియన్‌గా నిలిచింది.అయితే, ఇప్పటికే రెండేళ్ల పదవీకాలం తర్వాత కూడా అగార్కర్ సేవల్ని కొనసాగించిన బీసీసీఐ.. త్వరలోనే అతడి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి అక్టోబరు 4 తర్వాత తమ నుంచి ప్రకటన వస్తుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.ఎంత గొప్ప పేరున్న వారైనా సరే..ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ మిడ్-డేకు రాసిన కాలమ్‌లో కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న వార్తలు నిజమైతే.. న్యూజిలాండ్ పర్యటన నుంచే టీమిండియాకు కొత్త చీఫ్ సెలక్టర్ వస్తాడు. ఐదు జోన్ల నుంచి సెలక్టర్లను నియమించడం బీసీసీఐ ఆనవాయితీ.కాబట్టి ఈసారి వెస్ట్ జోన్ నుంచే ఎవరో ఒకరు చీఫ్ సెలక్టర్ అవుతారు. జాతీయ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఉండటం నిజంగానే గొప్ప గౌరవం. అయితే, అందుకుతగినట్లునే లక్ష్యాలు కూడా నిర్దేశిస్తుంది యాజమాన్యం. గతంలో ఎంత గొప్ప పేరున్న వారైనా సరే.. ఇక్కడ చిన్న పొరపాటు చేసినా భూతద్దంలో పెట్టి చూస్తారు.నిందలు కూడా అతడే భరించాల్సి వస్తుందివివిధ నిర్ణయాల్లో సెలక్టర్లంతా కలిసి చైర్మన్‌ను బలవంతంగానైనా ఒప్పిస్తారని చాలా మందికి తెలియదు. మీడియా ముందు చీఫ్ సెలక్టర్ వస్తాడు కాబట్టి అందరి దృష్టి అతడి మీదే ఉంటుంది. అందుకే నిందలు కూడా అతడే భరించాల్సి వస్తుంది. తప్పు చేసింది ఇతర సెలక్టర్ అయినా తిట్లు, విమర్శలు మాత్రం చీఫ్ సెలక్టర్‌కే వస్తాయి.ముద్దు ముద్దు మాటలతో లీకులుఇప్పుడు కెప్టెన్ పూర్తిస్థాయిలో సెలక్టర్లతో కూర్చుని జట్టును ఎంపిక చేసుకుంటున్నాడో లేదో తెలియదు. కానీ తొలినాళ్లలో ఓటింగ్ పద్ధతి లేకుండానే కెప్టెన్ కో ఆప్షన్ పద్ధతిలో సెలక్షన్ కమిటీతో ఉండేవాడు. అప్పుడు కొంతమంది సెలక్టర్లు మీడియా మిత్రులతో ‘చిలక పలుకులు పలుకుతూ.. ముద్దు ముద్దు మాటలతో లీకులు ఇచ్చేవాళ్లు.నాకూ ఇలాగే జరిగిందికొంతమంది ఆటగాళ్లను పక్కనపెట్టడానికి కారణం కెప్టెనే అని నిందించేవారు. నా విషయంలో ఇది చాలాసార్లు జరిగింది. ఇదేమీ వాళ్లు సరదా కోసం చేయలేదు. అయితే, దీని వల్ల జట్టు సభ్యులతో కెప్టెన్‌కు స్నేహం దెబ్బతినే పరిస్థితలు వస్తాయి. నేనైతే సెలక్షన్ గురించి ముందుగానే జట్టు సభ్యులతో చర్చించేవాడిని కాబట్టి.. మీడియా కంటే ముందే జట్టులో ఎవరున్నారన్న అంశంపై వాళ్లకు ఒక స్పష్టత వచ్చేది. కొత్త చీఫ్ సెలక్టర్ ఎవరైనా సరే.. క్రికెట్ ఆడే రోజుల్లో ఎంత గొప్ప ఆటగాడైనా సరే.. ఒక్కసారి పదవిలోకి వచ్చాక మీలోని సానుకూలతల కంటే కూడా ప్రతికూల విషయాల గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది. గతంలో మీకున్న పేరుతో ఎవరికీ పనిలేదు’’ అని గావస్కర్ హెచ్చరికలు జారీ చేశాడు. కాగా టీమిండియా చీఫ్ సెలక్టర్ రేసులో మాజీ క్రికెటర్లు పార్థివ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.చదవండి: అదే మా కొంప ముంచింది.. లేదంటే ఫలితంగా వేరుగా ఉండేది! -
బుల్లెట్ ట్రైన్ లో టీమిండియా.. VIRAL VIDEO
-
Asian Games Cricket: సెమీఫైనల్‌కు టీమిండియా
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో భాగంగా భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇవాళ జరగాల్సిన రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ తడి ఔట్ ఫీల్డ్ కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. ఫలితంగా మెరుగైన ర్యాంకింగ్ ఆధారంగా భారత్ సెమీఫైనల్‌కు చేరింది. దీనికి ముందు పాకిస్తాన్-హాంగ్‌కాంగ్ చైనా మధ్య జరగాల్సిన తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. దీంతో పాక్ కూడా సెమీస్‌కు చేరింది. పాపం ఆఫ్ఘనిస్తాన్.. గత ఎడిషన్ ఫైనల్లోనూ ఇంతే..!ఆసియా క్రీడల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు కనీసం పోరాడే అవకాశం కూడా లేకుండా పోతుంది. గత ఎడిషన్ ఫైనల్లోనూ ఆ జట్టు పోరాడే ప్రయత్నాన్ని వరుణుడు అడ్డుకున్నాడు. ఆ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు కావడంతో ఆఫ్ఘనిస్తాన్ రజతంతో సరిపెట్టుకుంది. ఇప్పుడు కనీసం కాంస్యం కూడా లేకుండానే ఏషియన్ గేమ్స్ నుంచి నిష్క్రమించింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ ఈసారి కూడా మరో అడుగు ముందుకేసి సెమీస్‌కు చేరింది.అక్టోబర్ 1న జరిగే రెండో సెమీస్‌లో భారత్ బంగ్లాదేశ్-మలేషియా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో తలపడుతుంది. అదే రోజు జరిగే తొలి సెమీఫైనల్లో పాక్ శ్రీలంక-నేపాల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతను ఎదుర్కొంటుంది. రెండు సెమీఫైనల్స్‌లో గెలిచే జట్లు అక్టోబర్ 3న స్వర్ణ పతకం కోసం జరిగే మ్యాచ్‌లో తలపడతాయి. సెమీస్‌లో ఓడిన జట్లు అదే రోజు కాంస్య పతకం కోసం పోటీపడతాయి. ఇదీ చదవండి: Asian Games Cricket: సెమీస్‌కు పాక్ -
విండీస్‌తో తొలి వన్డే.. విధ్వంసకర బ్యాటర్ అరంగేట్రం
తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా తరఫున కొత్త ఆటగాడు అరంగేట్రం చేశాడు. పంజాబ్‌కు చెందిన 26 ఏళ్ల విధ్వంసకర బ్యాటర్ నమన్ ధిర్ ఈ మ్యాచ్‌తో తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించనున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. నమన్ ధిర్కు తుది జట్టులో చోటు దక్కింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేతుల మీదుగా నమన్ ధిర్ భారత క్యాప్‌ను అందుకున్నాడు.షేర్-ఎ-పంజాబ్ లీగ్‌లో అదరగొట్టి..ఇటీవల జరిగిన షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్‌లో నమన్ ధిర్ సంచలన ప్రదర్శనలు చేశాడు. అమృత్సర్ సూర్మాస్ తరఫున 10 మ్యాచ్‌ల్లో 72.78 సగటు, 217.61 స్ట్రైక్‌రేట్‌తో 655 పరుగులు చేశాడు. సెప్టెంబర్ 8న మొహాలీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 64 బంతుల్లోనే 173 పరుగులు బాదాడు. ఈ అద్భుత ప్రదర్శనతోనే అతడు వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు.లిస్ట్-ఏ రికార్డుభారత్ తరఫున అరంగేట్రం చేసే సమయానికి నమన్ 14 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 351 పరుగులు చేశాడు. అతడి అత్యుత్తమ స్కోరు 97 పరుగులు. బౌలింగ్‌లోనూ ఏడు వికెట్లు పడగొట్టాడు. నమన్‌కు పంజాబ్, ఇండియా-ఏ, ముంబై ఇండియన్స్ తరఫున 20 ఫస్ట్‌క్లాస్, 61 టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం కూడా ఉంది.ఐపీఎల్లో నమన్నమన్ ధిర్ 2024 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్‌తో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 37 మ్యాచ్‌లు ఆడి 710 పరుగులు చేశాడు. 2026 సీజన్లో అతడు 14 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగి 318 పరుగులు సాధించాడు.తొలి వన్డేకు తుది జట్లువెస్టిండీస్ : జాన్ కాంప్‌బెల్, జస్టిన్ గ్రీవ్స్, కీసీ కార్తీ, షాయ్ హోప్(కెప్టెన్), అమీర్ జాంగూ, జ్యువెల్ ఆండ్రూ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డే, గుడాకేష్ మోటీ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నమన్ ధిర్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణఇదీ చదవండి: IND vs WI: మరి కాసేపట్లో మ్యాచ్.. అంతలోనే విండీస్‌కు భారీ షాక్ -
Virat Kohli: ఆ బాధ ఇప్పటికీ వెంటాడుతోంది..!
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి తన కెరీర్లో ఎదురైన చేదు అనుభవాలను తాజాగా జియోస్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమి ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉందని అన్నాడు. ఆ మ్యాచ్‌లో తాను ఔట్ అయిన తీరు తరచూ గుర్తుకొస్తుందని చెప్పాడు. 2016 ఐపీఎల్ ఫైనల్లో ఓటమిని ఆ బాధతో పోల్చాడు.విరాట్ మాటల్లో.. "2025 ఐపీఎల్ టైటిల్ గెలిచే వరకు 2016 సీజన్ ఫైనల్లో ఎదురైన పరాభవం తరచూ గుర్తుకొచ్చేది. 2023 ప్రపంచకప్ ఫైనల్ విషయంలోనూ అదే అనుభూతి ఉంది. ఆ మ్యాచ్‌లో నేను జట్టును మంచి స్థితిలో ఉంచగలనని అనుకున్నా. కానీ నేను ఔట్ అయిన తీరు ఇప్పటికీ చాలా బాధిస్తుంది. చాలా రోజుల పాటు ఆ ఓటమి నుంచి బయటపడలేకపోయా"2016 ఐపీఎల్ ఫైనల్‌తో పోలిక2016 ఐపీఎల్లో ఆర్సీబీ అద్భుత క్రికెట్ ఆడుతూ ఫైనల్‌కు చేరింది. ఆ సీజన్లో విరాట్ ఏకంగా 973 పరుగులు చేసి ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అయితే ఫైనల్లో ఆర్సీబీ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో పరాజయంపాలై తొలి ఐపీఎల్ గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. ఆ ఓటమి విరాట్‌కు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ ఓటమిని విరాట్ 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ పరాభవంతో పోల్చాడు.2023 ప్రపంచకప్‌లోనూ భారత్ వరుస విజయాలతో ఫైనల్‌కు చేరింది. విరాట్ 765 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అయితే టైటిల్ పోరులో భారత్ ఆస్ట్రేలియా చేతిలో అనూహ్యంగా ఓటమిపాలై, మూడో వన్డే ప్రపంచకప్ సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది. ఇదీ చదవండి: వైభవ్ రూపంలో వారికి ప్రమాదం పొంచి ఉంది..! -
విండీస్‌తో తొలి వన్డే.. టీమిండియాకు గుడ్ న్యూస్
వెస్టిండీస్‌తో ఇవాళ జరుగబోయే తొలి వన్డేకు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్ అందింది. ప్రాక్టీస్ సమయంలో గాయపడిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్, మ్యాచ్ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నాడని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. శుక్రవారం ప్రాక్టీస్ సందర్భంగా మహ్మద్ సిరాజ్ వేసిన బంతి వేగంగా పైకి ఎగిసి గిల్ కుడి మోచేతికి బలంగా తాకింది. దీంతో అతడు తొలి వన్డే ఆడటం అనుమానంగా ఉండింది. అయితే కోటక్ తాజా ప్రకటనతో గిల్ తొలి వన్డే ఆడటం ఖరారైపోయింది.కాగా, తిరువనంతపురం వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య తొలి వన్డే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో అందరి చూపు దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వైపు ఉంది. అలాగే రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్ ప్రదర్శనల కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తుది జట్లు (అంచనా)..భారత్: శుభమన్ గిల్ (సి), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ (వికెట్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్వెస్టిండీస్: జాన్ కాంప్‌బెల్, జస్టిన్ గ్రీవ్స్, కీసీ కార్టీ, షాయ్ హోప్ (c & wk), అమీర్ జాంగూ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, గుడాకేష్ మోటీ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్ఇదీ చదవండి: ఇవాళ క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ! గంటన్నర వ్యవధిలో 3 మ్యాచ్‌లు -
Asian Games 2026: బుల్లెట్ ట్రైన్లో టీమిండియా ప్రయాణం
ఆసియా గేమ్స్‌లో పాల్గొనేందుకు టీమిండియా గతవారమే జపాన్‌లో అడుగుపెట్టింది. అయితే జపాన్‌తో చారిత్రక మ్యాచ్ అనంతరం రాజధాని టోక్యోలో గడిపిన టీమిండియా బృందం శనివారం ఆసియా గేమ్స్ జరుగుతున్న నగోయాకు చేరుకుంది. ఈ నేపథ్యంలో టోక్యో నుంచి నగోయాకు టీమిండియా బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన ఎక్స్‌లో పంచుకుంది. స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కారణంగా హెడ్‌కోచ్ గంభీర్ భారత్‌లోనే ఉండిపోవడంతో, శ్రేయస్ అయ్యర్ టీంకు మెంటార్ కమ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. అనంతరం శ్రేయస్ నేతృత్వంలోని జట్టు గ్రూప్ ఫొటోకు ఫోజిచ్చింది. PC: BCCI Twitterభారత్‌కు సీడింగ్, ఐసీసీ ర్యాంకింగ్ ఆధారంగా ఆసియా గేమ్స్‌లో నేరుగా క్వార్టర్‌ఫైనల్ బెర్త్ లభించిన విషయం తెలిసిందే. సోమవారం జరిగే రెండో క్వార్టర్ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. 2023 ఆసియా గేమ్స్‌లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని టీమిండియా స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే.PC: BCCI Twitterకాగా ఈసారి క్రీడలకు మాత్రం డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఫుల్ మెంబర్స్ జట్టుతో బరిలోకి దిగింది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టులో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ తదితర స్టార్లు ఉన్నారు.All set for the #AsianGames 2026 challenge 🇮🇳Drop a 💙 if you are ready to cheer for #TeamIndia 👇@WeAreTeamIndia | @Media_SAI pic.twitter.com/qypPk87QQM— BCCI (@BCCI) September 26, 2026ఇదీ చదవండి: టీమిండియా తరఫున అదే చివరిది: విరాట్ కోహ్లి -
టీమిండియా తరఫున అదే చివరిది: విరాట్ కోహ్లి
టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లి కీలక వ్యాఖ్యలు చేశాడు. తన అంతర్జాతీయ కెరీర్ చివరి దశకు చేరిందనే సంకేతాలు ఇచ్చాడు. భారత్ తరఫున వన్డే వరల్డ్‌కప్-2027 ఈవెంట్ తన అంతర్జాతీయ కెరీర్లో చివరి ఐసీసీ టోర్నమెంట్ అని పేర్కొన్నాడు.ఇప్పటికే టీ20, టెస్టులకు గుడ్బైకాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అనూహ్య రీతిలో గతేడాది టెస్టులకు కూడా ‘కింగ్’ రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌తో పాటు.. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్ చాలెంజర్స్ తరఫున టీ20 క్రికెట్లో కొనసాగుతున్నాడు.టీమిండియా తరఫున అదే చివరిదిఇక ప్రస్తుతం కోహ్లి స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో జియోస్టార్‌తో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా తరఫున నేను ఆడబోయే చివరి వరల్డ్‌కప్ ఇదే (వన్డే ప్రపంచకప్-2027). ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే సిరీస్‌కు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాను.ఇక వరల్డ్‌కప్ ట్రోఫీ గెలవడం అనేదే అంతిమ లక్ష్యం. ఈ ప్రయాణం ఎక్కడిదాకా సాగుతుందో తెలియదు. అన్నింటికీ నేను సిద్ధంగానే ఉన్నాను’’ అని కోహ్లి పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది ఇప్పటికి ఆరు వన్డేలు ఆడిన కోహ్లి 384 పరుగులతో సత్తా చాటాడు. ఇందులో మూడు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి.వరల్డ్‌కప్ ఆడటం లాంఛనమే!ఇక గత 10 వన్డే ఇన్నింగ్స్‌లో కోహ్లి మూడు సెంచరీలు చేయడంతో పాటు ఐదు హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు. దీనిని బట్టి కోహ్లి సూపర్ ఫామ్‌లో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి 37 ఏళ్ల కోహ్లిని వన్డే వరల్డ్‌కప్ జట్టు నుంచి తప్పించే సాహసం టీమిండియా సెలక్టర్లు చేయరనే చెప్పవచ్చు.కాగా 2008లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన కోహ్లి.. 123 టెస్టుల్లో 30 శతకాల సాయంతో 9230 పరుగులు సాధించాడు. 125 టీ20లలో ఓ సెంచరీ బాది 4188 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో ఇప్పటికి 314 మ్యాచ్‌లు ఆడి 14941 పరుగులు సాధించాడు. అంతేకాదు యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధికంగా 54 సెంచరీలు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.చదవండి: సచిన్‌తో అతడికి పోలికేంటి?: సెహ్వాగ్ -
సచిన్‌తో అర్జున్ టెండుల్కర్‌కు పోలికేంటి?: సెహ్వాగ్
తల్లిదండ్రుల కీర్తిప్రఖ్యాతులు వారసులపై ఒక్కోసారి ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా అమ్మ లేదా నాన్న ఏదేని రంగంలో నిష్ణాతులు, దిగ్గజాలుగా పేరొందితే.. వారి పిల్లలు కూడా అదే స్థాయిలో రాణించాలని అభిమానులు కోరుకుంటారు.క్రికెట్, సినీ రంగాల్లో ఇలాంటి అంచనాలు మరింత భారీగా ఉంటాయి. అయితే, ఇవి సదరు వారసులపై ఒత్తిడి పెంచుతాయే తప్ప ఎందుకూ పనికిరావు అంటున్నాడు టీమిండియా విధ్వంసకర ఓపెనింగ్ బ్యాటర్ వీరేందర్ సెహ్వాగ్.సెహ్వాగ్ తనయుడి అరంగేట్రంకాగా సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ఇటీవలే భారత అండర్-19 జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో యూత్ వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో కలిపి 109 పరుగులు సాధించాడు.తండ్రి మాదిరే ఓపెనర్, కుడిచేతి వాటం బ్యాటర్ అయిన ఆర్యవీర్ దూకుడుగా ఆడి ఫోర్ల వర్షం కురిపించాడు. ఈ నేపథ్యంలో తండ్రికి తగ్గ తనయుడు అంటూ అప్పుడే అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఫుట్‌వర్క్ విషయంలో పోలికలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో సెహ్వాగ్.. ఆర్యవీర్, దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ గురించి స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది.మేము చాలా బాగా క్రికెట్ ఆడాముఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘కచ్చితంగా ఇలాంటి పోలికలు ఉంటాయని తెలుసు. మేము చాలా బాగా క్రికెట్ ఆడాము. ఎన్నో రికార్డులు సాధించాము. ఇప్పుడు మా పిల్లలు క్రికెట్లోకి దిగారు. కాబట్టి ఈ పోలికలు సహజమే.అయితే, తండ్రుల ఆట తీరుతో పిల్లల ఆట తీరును పోల్చడం సరికాదు. అలా కాకుండా ఇప్పుడు వారికి పోటీగా ఉన్న, సమకాలీకులతో పోలిస్తే కాస్త బాగుంటుంది. అంతేతప్ప తండ్రులు ఎంతో సాధించారు.. కాబట్టి పిల్లలు కూడా అలాగే ఉండాలి అనే అంచనాలు, పోలికలు సరికాదు.వాడిని నాతో పోల్చడం అన్యాయంఇలాంటి పోలికల వల్ల పిల్లలు నిరాశ చెందుతారు. మీడియా, ప్రజలు అదే పనిగా ఆట గురించి రంధ్రాన్వేషణ చేస్తే వారు కుంగిపోయే పరిస్థితులు కూడా రావొచ్చు. ఆర్యవీర్‌కు ఇప్పుడు కేవలం పద్దెనిమిదేళ్లు.నేను నా జట్టు కోసం ఎంతో చేశాను. అయితే, ఆర్యవీర్ ఇప్పుడే తన ప్రయాణం మొదలుపెట్టాడు. కాబట్టి వాడిని నాతో పోల్చడం అన్యాయమే అవుతుంది. చాలా మంది సచిన్ టెండుల్కర్తో అతడి కుమారుడు అర్జున్ను పోలుస్తారు కూడా!అర్జున్‌కు సచిన్‌తో పోలికేంటి?అది కూడా అస్సలు సరికాదు. అర్జున్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్. తన నైపుణ్యాలకు తగినట్లు ఆడుతున్నాడు. రంజీ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో పాటు ఐదు వికెట్లు కూడా కూల్చాడు. అది అతడి సత్తా. అయినా సరే దిగ్గజ బ్యాటర్ అయిన సచిన్‌తో అర్జున్ను పోలుస్తారు.ఇది తప్పు. అర్జున్ తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకుంటున్నాడు. తండ్రి బాటలో అతడు నడవలేదు. బ్యాటర్‌గా కాకుండా తనకు నచ్చినట్లుగా ఆల్‌రౌండర్‌గా ముందుకు సాగుతున్నాడు. మా పిల్లల్ని స్వేచ్ఛగా ఆడనివ్వండిమా పిల్లల్ని స్వేచ్ఛగా ఆడనివ్వండి. వారు ఏదైనా సాధించే వరకు వేచి చూడండి. అప్పుడు పోలికలు మొదలుపెడితే కాస్త పద్ధతిగా ఉంటుంది’’ అని వీరేందర్ సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.కాగా సెహ్వాగ్ టీమిండియా తరఫున 104 టెస్టుల్లో 8586, 251 వన్డేల్లో 8273, 19 టీ20 మ్యాచ్‌లలో 394 పరుగులు సాధించాడు. ఇక క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో వంద శతకాలు సాధించిన ఏకైక ఆటగాడిగా, అత్యధిక పరుగుల వీరుడిగా చెక్కు చెదరని ప్రపంచ రికార్డు సాధించాడు. సచిన్- సెహ్వాగ్ ఓపెనింగ్ జోడీగానూ అద్బుతంగా రాణించారు.చదవండి: బ్యాటర్ల విధ్వంసం.. భారీ టార్గెట్‌ను ఊదేసి భారత్ సంచలన విజయం -
ఏషియన్ గేమ్స్ క్వార్టర్ ఫైనల్లో టీమిండియా ప్రత్యర్ది ఖరారు
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో భారత్ క్వార్టర్‌ఫైనల్ ప్రత్యర్థి ఖరారైంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు సోమవారం జరిగే రెండో క్వార్టర్ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. భారత్‌కు సీడింగ్, ఐసీసీ ర్యాంకింగ్ ఆధారంగా నేరుగా క్వార్టర్‌ఫైనల్ బెర్త్ లభించిన విషయం తెలిసిందే.ఆఫ్ఘనిస్తాన్ ఎలా క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది..?జపాన్, నేపాల్ మధ్య ఇవాళ జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఆఫ్ఘనిస్తాన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. గ్రూప్-ఏలో ఆఫ్ఘనిస్తాన్, జపాన్, నేపాల్ జట్లు పోటీపడగా.. నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ తొలి రెండు స్థానాల్లో నిలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచిన నేపాల్ సెప్టెంబర్ 29న జరిగే మూడో క్వార్టర్ ఫైనల్లో శ్రీలంకను ఢీకొంటుంది. నేపాల్ తాజాగా జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో తమకంటే మెరుగైన ఆఫ్ఘనిస్తాన్‌కు షాకిచ్చింది.మరో రెండు బెర్త్‌లు ఎవరివి..?గ్రూప్-ఏ నుంచి నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. గ్రూప్-బి బెర్త్‌లు ఖరారు కావాల్సి ఉంది. ఈ గ్రూప్‌లో మలేషియా, హాంగ్‌కాంగ్ చైనా, ఒమన్ జట్లు పోటీపడుతున్నాయి. ఈ గ్రూప్ నుంచి తొలి స్థానంలో నిలిచే జట్టు సెప్టెంబర్ 29న జరిగే నాలుగో క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. రెండో స్థానంలో నిలిచే జట్టు సెప్టెంబర్ 28న జరిగే తొలి క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఢీకొంటుంది. ప్రస్తుతం మలేషియా, హాంగ్‌కాంగ్ తలో 2 పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. ఒమన్ ఖాతా తెరవకుండా చివరి స్థానంలో ఉంది.ఇదిలా ఉంటే, ఈ క్రీడల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఫుల్ మెంబర్స్ జట్టుతో బరిలోకి దిగింది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టులో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ తదితర స్టార్లు ఉన్నారు.ఇదీ చదవండి: తొలి వన్డేకు ముందు టీమిండియాకు భారీ షాక్ -
తొలి వన్డేకు ముందు టీమిండియాకు భారీ షాక్
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి ఏర్పడింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నెట్స్‌లో గాయపడ్డాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం (సెప్టెంబర్ 25) ప్రాక్టీస్ చేస్తుండగా మహ్మద్ సిరాజ్ వేసిన బంతి గిల్ కుడి మోచేతికి బలంగా తగిలింది.దీంతో గిల్ నెట్స్ నుంచి మధ్యలోనే బయటకు వచ్చాడు. 30 నిమిషాలకు పైగా మైదానం వెలుపలే ఉన్న అతడు తిరిగి ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. అతడి కుడి మోచేతికి బ్యాండేజ్ కూడా కట్టినట్లు సమాచారం. గాయం తీవ్రతపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.కాగా, వెస్టిండీస్‌తో తొలి వన్డే తిరువనంతపురం వేదికగా సెప్టెంబర్ 27న జరుగనుంది. ఈ మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉండకపోతే, అది టీమిండియాకు మైనస్ అవుతుంది. నాయకత్వంతో పాటు గిల్ టాపార్డర్‌లో చాలా కీలకం. మ్యాచ్‌కు ఇంకా సమయం ఉన్నందుకు గిల్ కోలుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదీ చదవండి: బ్యాటర్ల విధ్వంసం.. భారత్ సంచలన విజయం; సిరీస్ కైవసం -
చహల్ 'ఆఖరి రాగం'
భారత క్రికెట్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇందుకు చహల్ తాజాగా సోషల్‌మీడియాలో చేసిన ఓ పోస్ట్ కారణం.The Last Dance 🤙 pic.twitter.com/Z27l4tZQQf— Yuzvendra Chahal (@yuzi_chahal) September 23, 2026లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానం నుంచి సెప్టెంబర్ 23న కొన్ని ఫొటోలను షేర్ చేసిన చహల్.. వాటికి 'ది లాస్ట్ డ్యాన్స్' (ఆఖరి రాగం) అనే క్యాప్షన్ జోడించాడు. దీంతో చహల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకబోతున్నాడంటూ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.అయితే, ఈ విషయమై చహల్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అతడి పోస్ట్ వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నది కూడా స్పష్టం కాలేదు.అయితే చహల్ చేసిన 'ది లాస్ట్ డ్యాన్స్' పోస్ట్‌పై మాత్రం అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని అనుమానం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు కౌంటీ క్రికెట్ నుంచి మాత్రమే తప్పుకోబోతున్నాడని అనుకుంటున్నారు. చహల్ ప్రస్తుతం నార్తాంప్టన్‌షైర్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో చహల్ ఈ పోస్ట్ చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కాగా, చహల్ టీమిండియా తరఫున చివరిసారిగా 2023 జనవరి 24న న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్ ఆడాడు. అదే ఏడాది ఆగస్టు 13న వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి చహల్ వివిధ వేదికలపై రాణిస్తున్నా టీమిండియాలో చోటు దక్కడం లేదు. ప్రస్తుతం టీమిండియాలో స్పిన్నర్ల బెర్త్‌ల కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఒక్కో బెర్త్ కోసం పదుల సంఖ్యలో పోటీపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో 35 ఏళ్ల చహల్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రికార్డు బ్రేకింగ్ ప్రదర్శన -
మితిమీరిన క్రికెట్.. జనాలకు బోర్ కొట్టదా..?
క్రికెట్.. ఈ క్రీడ భారతీయులకు ఓ ఎమోషన్. టీమిండియా మ్యాచ్ ఉందంటే చాలు, జనాలు పనులు పక్కనపెట్టి మరీ టీవీలకు అతుక్కుపోతారు. వీలైతే నేరుగా మ్యాచ్ చూసేందుకు స్టేడియాలకు క్యూ కడతారు. భారత్ గెలిస్తే పండుగ చేసుకుంటారు. ఓడితే నిరాశ చెందుతారు. గెలిచినా, ఓడినా గల్లీ నుంచి ఢిల్లీ దాకా డిబేట్లు పెడుతుంటారు. అయితే ప్రస్తుతం ఈ డిబేట్లలో ఓ ఆసక్తికర అంశం చేరింది. అదే.. 'మితిమీరిన క్రికెట్'.ఇటీవలికాలంలో భారత క్రికెట్ జట్లు విపరీతంగా మ్యాచ్‌లు ఆడేస్తున్నాయి. ఆ స్థాయి, ఈ విభాగం అని ప్రతి రోజూ ఏదో ఒక మ్యాచ్ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఒకే రోజు మూడు వేర్వేరు విభాగాలు, స్థాయిలకు సంబంధించి ఏకంగా మూడు మ్యాచ్‌లు జరిగాయి. భారత-ఏ జట్టు, భారత మహిళల-ఏ జట్టు, భారత అండర్-19 జట్టు.. ఇలా మూడు జట్లు ఒకే రోజు, ఒకే ప్రత్యర్దితో (ఆస్ట్రేలియా) మ్యాచ్‌లు ఆడాయి.ఇది చూసి అభిమానులు తెగ తికమకపడ్డారు. ఎక్కడ ఏ జట్టు ఆడుతుందో అర్దం కాక జట్టు పీక్కున్నారు. ఒక్కప్పుడు భారత క్రికెట్ జట్టు మ్యాచ్ ఆడుతుందంటే ఓ క్లారిటీ ఉండేది. కానీ, ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. ఏ ఆటగాడు ఏ జట్టులో ఉంటాడో ఎవరికీ తెలీదు.పురుషుల క్రికెట్ వరకు తీసుకుంటే.. భారత్‌కు ఒక్క జట్టు చాలా తక్కువైపోతుంది. అందుకే టీ20లకు ఒకటి, వన్డేలకు ఒకటి, టెస్ట్‌లకు మరో జట్టు ఉంటుంది. ఇవి కాకుండా భారత-ఏ జట్టు, భారత అండర్ 19, 23 విభాగాల జట్లు.. ఇలా విభాగానికి ఓ జట్టు ఉంది. ఈ జట్లన్నీ ఏడాది పొడవునా ఏదో ఒక మ్యాచ్ ఆడుతూనే ఉంటాయి. ఇవి కావని దేశవాలీ క్రికెట్, ఐపీఎల్, స్థానిక లీగ్‌లతో ఆటగాళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక్కడి వరకు సమస్య ఆటగాళ్ల వరకే ఉంది. మితిమీరిన క్రికెట్ వల్ల ఇప్పుడు, అభిమానులూ ఇబ్బంది పడుతున్నారు. ఆడేందుకు ఆటగాళ్లకు అలసట రాకపోయినా, చూసేందుకు మాత్రం అభిమానులకు బోర్ కొడుతుంది.ఈ పరిస్థితి కేవలం భారత క్రికెట్ వరకు మాత్రమే. ప్రపంచవ్యాప్త క్రికెట్‌ను తీసుకుంటే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏడాది పొడవునా అంతర్జాతీయ మ్యాచ్‌లు, దేశవాలీ మ్యాచ్‌లు, ప్రైవేట్ టీ20 లీగ్‌లతో ఆటగాళ్లకు, అభిమానులకు క్షణం తీరిక లేకుండా పోతుంది. ఈ మితిమీరిన క్రికెట్ ఆడేందుకు ఎలా ఉన్నా, చూసేందుకు మాత్రం ఎబ్బేట్టుగా మారిపోతుంది.ఈ పరిస్థితి వల్ల కొందరు అభిమానులు క్రికెట్ చూడటమే మానేశారు. ప్రస్తుతం క్రికెట్ బోర్ కొట్టే దశ నుంచి విరక్తి వచ్చే దశకు రూపాంతరం చెందుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అతి త్వరలో జనాలు క్రికెట్‌ను పూర్తిగా విస్మరించే ప్రమాదం ఉంది. కాబట్టి అంతర్జాతీయ షెడ్యూల్, ప్రైవేట్ లీగ్‌ల సంఖ్య తగ్గించి, మ్యాచ్‌లను పరిమితం చేస్తే క్రికెట్ బ్రతుకుతుంది. ఇప్పటికే ఆటలో నాణ్యత తగ్గిపోయి చాలామంది క్రికెట్ చూడటం మానేశారు. ఇదే కొనసాగితే మిగతా జనాలు కూడా కాలక్రమేనా ఆటకు దూరమవుతారు.ఇదీ చదవండి: టీమిండియాను ఫాలో అవ్వండి.. పాక్ జట్టుకు సూచన -
టీమిండియాను ఫాలో అవ్వండి.. పాక్ జట్టుకు సూచన
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత బాబర్ ఆజం సేనపై ముప్పేట దాడి జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు ప్రధాన కోచ్ మైక్ హెస్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రస్తుతం భారత్ అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పుతోందని, ఆ స్థాయికి చేరుకోవడమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశాడు.గతంలో పాక్ పరిమిత ఓవర్ల జట్టుకే కోచ్‌గా వ్యవహరించిన హెస్సన్.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో జట్టు పేలవ ప్రదర్శన తర్వాత టెస్టు జట్టు బాధ్యతలు కూడా చేపట్టాడు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో పాకిస్తాన్ జట్టును మెరుగుపర్చే బాధ్యత పీసీబీ అతనికి అప్పగించింది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన హెస్సన్.. భారత జట్టు ప్రదర్శనను ప్రశంసించాడు.టీమిండియానే బెంచ్‌మార్క్..!వైట్‌బాల్ క్రికెట్లో భారత్ ఓ బెంచ్‌మార్క్‌గా నిలిచిందని హెస్సన్ పేర్కొన్నాడు. ఆ స్థాయిని అందుకోవడమే పాకిస్తాన్ ముందున్న సవాలని తెలిపాడు. ఇటీవలికాలంలో భారత్ చేతిలో పాకిస్తాన్ దాదాపు అన్ని సార్లు ఓడిందని, టీమిండియాను ఓడించాలన్నది పాక్ అభిమానుల ఆకాంక్ష అని హెస్సన్ చెప్పాడు.టీ20 జట్టు మెరుగుపడుతుంది..!పాక్ టీ20 జట్టు పూర్తిగా పతనమైందన్న విమర్శలను హెస్సన్ అంగీకరించలేదు. తాను బాధ్యతలు చేపట్టినప్పుడు ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న జట్టు ప్రస్తుతం ఐదో స్థానానికి చేరుకుందని గుర్తు చేశాడు. గత 15 నెలల్లో 30 రేటింగ్ పాయింట్లు మెరుగుపడ్డామని వివరించాడు. టెస్టు జట్టు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటోందని అంగీకరించాడు.వన్డే ప్రపంచకప్‌పై గురి2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు పాక్ జట్టును సిద్ధం చేయడంపై దృష్టి సారించినట్లు హెస్సన్ తెలిపాడు. భారత్‌లో జరిగిన 2023 ప్రపంచకప్‌లో పాక్ జట్టు ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఈసారి మెరుగైన జట్టుతో బరిలోకి దిగడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించాడు.ఇదీ చదవండి: పాక్‌ను ఛీకొట్టి.. చిన్న జట్టులోకి వెళ్లిపోయాడు! -
టీమిండియా క్రికెటర్‌కు తమిళనాడు సీఎం విజయ్ భారీ నజరానా
ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన టీమిండియాలో సభ్యురాలైన భారత మహిళా క్రికెటర్ జి కమలికి తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసఫ్ విజయ్ భారీ నజరానా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.75 లక్షల నగదు పురస్కారం అందించనున్నట్లు వెల్లడించారు. మదురైకి చెందిన కమలిని ప్రతిభను ప్రత్యేకంగా అభినందించిన సీఎం విజయ్.. ప్రతిభావంతులైన క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. కమలిని విజయం రాష్ట్రంలోని యువతకు, మహిళలకు స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత జట్టు సాధించిన చారిత్రాత్మక విజయంపై హర్షం వ్యక్తం చేశారు.వికెట్ కీపర్ బ్యాటర్ అయిన కమలిని ఇప్పటికే భారత క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2024లో మహిళల అండర్-19 ఆసియా కప్, 2025లో అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్లలో ఆమె భాగమైంది.వైస్ జగన్ అభినందనలుమరోవైపు ఆసియా క్రీడల్లో స్వర్ణంతో మెరిసిన భారత మహిళల క్రికెట్ జట్టును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అభినందించారు. జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీ చరణిని ప్రత్యేకంగా ప్రశంసించారు.కాగా, నిన్న జరిగిన ఆసియా క్రీడల మహిళల క్రికెట్ ఫైనల్స్‌లో భారత్ శ్రీలంకను 147 పరుగుల తేడాతో చిత్తు చేసి, వరుసగా రెండో సారి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ సాధించింది.స్మృతి మంధాన (79), రిచా ఘోష్ (49 నాటౌట్) రాణించారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో శ్రీలంక 69 పరుగులకే కుప్పకూలింది. దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా, శ్రీచరణి, శ్రేయాంక, షఫాలీ వర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు.ఇదీ చదవండి: ఫైనల్లో శ్రీలంకను మట్టికరిపించిన భారత్.. స్వర్ణం మనదే! -
Shami : క్రికెట్ కు గుడ్ బై? రాజకీయాల్లోకి షమీ!
-
కోహ్లి, ధోనీ, డివిలియర్స్ వేస్ట్.. సూర్యకుమార్ యాదవ్ సంచలన కామెంట్స్
-
డబుల్ సెంచరీ పక్కా జపాన్ తో మ్యాచ్ కు వైభవ్ ఎంట్రీ ?
-
టీమిండియా ప్రపంచ రికార్డు
భారత మహిళల క్రికెట్ జట్టు మరో ప్రపంచ రికార్డు సమం చేసింది. మహిళల టీ20 అంతర్జాతీయాల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్టుగా ఇంగ్లండ్ సరసన నిలిచింది. ఏషియన్ గేమ్స్ 2026లో భాగంగా శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న స్వర్ణ పతక మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది.ఈ మ్యాచ్‌లో భారత్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల సంఖ్య 233కు చేరింది. ప్రస్తుతం ఇంగ్లండ్ కూడా అన్నే మ్యాచ్‌లతో భారత్ సరసన ఉంది. ఈ జాబితాలో భారత్, ఇంగ్లండ్ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (213), వెస్టిండీస్ (206), పాకిస్తాన్ (205), న్యూజిలాండ్ (204) ఉన్నాయి.2006లో మొదలైన ప్రయాణంమహిళల టీ20ల్లో భారత్ ప్రయాణం 2006లో ప్రారంభమైంది. ఇప్పటివరకు ఆడిన 233 మ్యాచ్‌ల్లో 130 విజయాలు, 95 పరాజయాలు నమోదు చేసింది. ఒక మ్యాచ్ టై కాగా, ఆరు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. స్వర్ణ పతక మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తుంది. 16 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోర్ 157-2గా ఉంది. షఫాలీ వర్మ (48), హర్మన్‌ప్రీత్ (19) ఔట్ కాగా.. స్మృతి మంధన (79), రిచా ఘోష్ (10) క్రీజ్‌లో ఉన్నారు. ఇదీ చదవండి: చరిత్ర సృష్టించి టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
భీకర ఫామ్‌కు బ్రేక్.. నిరాశపరిచిన భారత కెప్టెన్
టీమిండియా స్టార్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ భీకర ఫామ్‌కు బ్రేక్ పడింది. ఆస్ట్రేలియా-ఏతో ఇవాళ మొదలైన తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో (తొలి ఇన్నింగ్స్) అతడు కేవలం 3 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. ఈ సిరీస్‌లో పడిక్కల్ భారత-ఏ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్-ఏ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ అమన్ మోఖడే (6) తర్వాత ఔటయ్యాక బరిలోకి దిగిన పడిక్కల్ 14 బంతులు ఆడి ఒక్క చెప్పుకోదగ్గ షాట్ కూడా ఆడకుండానే నిష్క్రమించాడు. ఇటీవలికాలంలో పడిక్కల్ నుంచి ఇలాంటి ప్రదర్శన చూడలేదు.ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్లో అతడు అర్ద సెంచరీతో (62) రాణించాడు. దానికి ముందు జరిగిన శ్రీలంకతో జరిగిన రెండు టెస్ట్‌ల్లో వరుస సెంచరీలతో (167, 117) చెలరేగాడు. ఆ సిరీస్‌కు ముందు శ్రీలంక ఎలెవెన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ అజేయ సెంచరీతో (142) కదంతొక్కాడు.అంతకుముందు ఐపీఎల్ 2026లోనూ పడిక్కల్ నిలకడైన ప్రదర్శనలతో అకట్టుకున్నాడు. ఆ సీజన్లో 168.73 స్ట్రయిక్‌రేట్‌తో 464 పరుగులు సాధించి, ఆర్సీబీ వరుసగా రెండో ఎడిషన్‌లో టైటిల్ కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.మొత్తంగా ఆసీస్-ఏపై తాజా ప్రదర్శన మినహా పడిక్కల్ ఇటీవలికాలంలో అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు, మూడు అనధికారిక వన్డేల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా పుదుచ్చేరి వేదికగా ఇవాళ తొలి టెస్ట్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న భారత్ 20 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు స్కోర్ చేసింది. అమన్ మోఖడే, పడిక్కల్ ఔట్ కాగా.. సాయి సుదర్శన్ (30), షేక్ రషీద్ (10) క్రీజ్‌లో ఉన్నారు. ఇదీ చదవండి: Asian Games 2026: క్రికెట్లో పాక్‌కు కాంస్య పతకం -
ఆసీస్‌తో తొలి టెస్ట్.. టీమిండియా బ్యాటింగ్
రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు, మూడు అనధికారిక వన్డేల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత టెస్ట్ సిరీస్ జరుగనుంది. తొలి టెస్ట్ పుదుర్చేరి వేదికగా ఇవాల్టి నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.తుది జట్లు.. ఇండియా-ఏ: అమన్ మొఖడే, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్(కెప్టెన్), షేక్ రషీద్, యశ్ రాథోడ్, కుమార్ కుషాగ్రా(వికెట్‌కీపర్), తనుష్ కొటియన్, షమ్స్ ములానీ, అన్షుల్ కాంబోజ్, తుషార్ దేశ్‌పాండే, ప్రఫుల్ హింగేఆస్ట్రేలియా-ఏ: సామ్ కొన్‌స్టాస్, క్యాంప్‌బెల్ కెల్లావే, నాథన్ మెక్‌స్వీనీ, పీటర్ హ్యాండ్స్కాంబ్(కెప్టెన్), జాసన్ సంఘా, జోష్ ఫిలిప్(వికెట్‌కీపర్), లియామ్ స్కాట్, ఫెర్గస్ ఓ నీల్, టాడ్ మర్ఫీ, కోరీ రోకిసియోలీ, బ్రెండన్ డాగెట్ఇదీ చదవండి: Asian Games 2026: క్రికెట్లో పాక్‌కు కాంస్య పతకం -
పసికూనతో ఉత్కంఠ పోరు.. అతికష్టం మీద గెలిచిన టీమిండియా
పసికూనతో ఉత్కంఠ పోరు.. అతికష్టం మీద గెలిచిన టీమిండియాజపాన్తో జరిగిన చారిత్రక టీ20 మ్యాచ్‌లో భారత్ అతికష్టం మీద గెలిచి, పరువు కాపాడుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ చెత్తగా ఆడింది. క్రికెట్లో ఓనమాలు కూడా తెలీని బౌలర్లను ఎదుర్కొనేందుకు భారత స్టార్ బ్యాటర్లు నానాకష్టాలు పడ్డారు. చచ్చీ చెడి నిర్ణీత 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసిన భారత్, లక్ష్యాన్ని కాపాడుకునేందుకు మరింత శ్రమించాల్సి వచ్చింది.జపాన్ బ్యాటర్లు గెలుపు కోసం చివరి బంతి వరకు పోరాడారు. 5 ఓవర్లలో ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసి లక్ష్యానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఫలితంగా భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్లో అక్షర్ పటేల్ వరుసగా వైడ్లు వేసి భారత శిబిరంలో ఉత్కంఠ రేకెత్తించాడు. కాస్త అటుఇటైనా ఫలితం భారత్‌కు ప్రతికూలంగా ఉండేది. రెండో వికెట్ కోల్పోయిన జపాన్1.4వ ఓవర్- 7 పరుగుల వద్ద జపాన్ రెండో వికెట్ కోల్పోయింది. సుందర్ బౌలింగ్‌లో బిష్ణోయ్‌కు క్యాచ్ ఇచ్చి ఇబ్రహీం (4) ఔటయ్యాడు. ఇషాన్ అద్భుతమైన త్రో.. 2 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన జపాన్0.5వ ఓవర్- ఇషాన్ కిషన్ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో రనౌట్ చేయడంతో 33 పరుగుల లక్ష్య ఛేదనలో జపాన్ 2 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. చెత్తగా ఆడిన టీమిండియా.. 5 ఓవర్లలో 32 పరుగులేక్రికెట్లో ఓనమాలు కూడా తెలినీ జపాన్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో టీమిండియా చాలా చెత్తగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 5 ఓవర్లలో కేవలం 32 పరుగులే చేసి ఏకంగా 4 వికెట్లు కోల్పోయింది. భారత ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం గమనార్హం. ఫోర్లు కూడా రెండు మాత్రమే ఉన్నాయి. భారత బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (16) ఒక్కడే రెండంకెల స్కోర్ చేయగా.. అభిషేక్ డకౌట్, సంజూ శాంసన్ 9, ఇషాన్ కిషన్ 3, తిలక్ వర్మ 1 (నాటౌట్) పరుగు చేశారు. జపాన్ బౌలర్లలో చార్లీ 2, ఇబ్రహీం, బెంజమిన్ తలో వికెట్ తీశారు. చెత్తగా ఆడుతున్న టీమిండియా.. 14 పరుగులకే 3 వికెట్లుక్రికెట్లో ఓనమాలు కూడా తెలియని జపాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా చెత్తగా ఆడుతుంది. 2.4 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు (అభిషేక్, సంజూ, ఇషాన్) కోల్పోయింది. నిర్ణీత 5 ఓవర్లలో కనీస స్కోర్ కూడా చయలేకపోతే, టీమిండియాకు ఘోర పరాభవం తప్పకపోవచ్చు. మూడు బంతుల వ్యవధిలో అభిషేక్, సంజూ ఔట్1.2వ ఓవర్- భారత జట్టు మూడు బంతుల వ్యవధిలో ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్ చివరి బంతికి అభిషేక్ డకౌట్ కాగా.. రెండో ఓవర్ రెండో బంతికి సంజూ శాంసన్ (9) కూడా పెవిలియన్ బాట పట్టాడు. 1.2 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 9-2గా ఉంది. టీమిండియాకు షాక్.. తొలి ఓవర్లోనే అభిషేక్ డకౌట్5 ఓవర్ల మ్యాచ్‌లో టీమిండియాకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. భారత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తాను ఎదర్కొన్న తొలి బంతికే డకౌటయ్యాడు. మరో ఎండ్‌లో సంజూ శాంసన్ నిదానంగా ఆడుతున్నాడు. తొలి ఓవర్ తర్వాత భారత్ స్కోర్ 7-1గా ఉంది. తుది జట్లు:భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్జపాన్ (ప్లేయింగ్ XI): లాచ్లాన్ యమమోటో-లేక్, రియో సకురానో-థామస్, కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్(సి), బెంజమిన్ ఇటో-డేవిస్, వాటరు మియాచి, అలెగ్జాండర్ షిరాయ్-పాట్మోర్(w), చార్లీ హర-హింజ్, ఇబ్రహీం తకాహషి, మాక్ తకాహషి, మక్టోమా- షోమా సుగయ-స్లేటర్5 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్మధ్యాహ్నం 12 గంటలు: భారత్-జపాన్ చారిత్రక టీ20 మ్యాచ్ మరి కొదిసేపట్లో ప్రారంభం కానుంది. వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా 3 గంటలు ఆలస్యమైన ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభం కానుంది. బాగా ఆలస్యం కావడంతో ఈ మ్యాచ్‌ను చెరి 5 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇండియా: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, యశ్ రవిసింగ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్జపాన్: కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ (కెప్టెన్), లాచ్లాన్ యమమోటో-లేక్, వటారు మియౌచి, అలెగ్జాండర్ షిరాయ్-పాట్మోర్ (వారం), చార్లీ హింజ్, రియో సకురానో-థామస్, బెంజమిన్ ఇటో-డేవిస్, ఇబ్రహీం తకాహషి, డెక్లాన్ మకో మకో మటోమ్, టాక్లాన్ సుజ్మా,తదుపరి తనిఖీ 11:45 గంటలకుభారత్-జపాన్ మధ్య చారిత్రక టీ20 మ్యాచ్ మరింత ఆలస్యమవుతుంది. ఉదయం 9: 30 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్ వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా ఇప్పటివరకు టాస్ కూడా పడలేదు. పలు మార్లు పిచ్‌ను తనిఖీ చేసిన అంపైర్లు మరో తనిఖీని 11:45 గంటలకు చేపట్టనున్నారు. టాస్ మరింత ఆలస్యం (9:45)వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా టాస్ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. తొలుత 9:45 గంటలకు తనిఖీ చేసి అప్డేట్ ఇస్తామన్న అంపైర్లు.. మైదానం ఇంకా తడిగానే ఉండటంతో మరోసారి తనిఖీ చేయనున్నట్లు చెప్పారు. టాస్ ఆలస్యంఏషియన్ గేమ్స్ 2026 మెన్స్ క్రికెట్ పోటీల ఆరంభానికి ముందు టీమిండియా ఆతిథ్య జపాన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 22) ఏకైక టీ20 మ్యాచ్ ఆడనుంది. సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగనున్న ఈ చారిత్రక మ్యాచ్‌లో వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా టాస్ ఆలస్యమవుతుంది. 9:45 గంటలకు రిఫరీ మైదానాన్ని తనఖీ చేసి అప్డేట్ ఇస్తారు. కాగా, భారత్-జపాన్ మధ్య 75 ఏళ్ల దౌత్య సంబంధాలను పురస్కరించుకుని ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2022 అక్టోబర్‌లో తమ తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన జపాన్.. ఓ ఐసీసీ ఫుల్ మెంబర్ జట్టుతో తలపడటం ఇదే మొదటిసారి. ఇదీ చదవండి: Asian Games 2026: క్రికెట్లో పాక్‌కు కాంస్య పతకం -
జపాన్‌తో చారిత్రక మ్యాచ్.. చిక్కుల్లో భారత క్రికెటర్!
టీమిండియా యువ క్రికెటర్ విప్రజ్ నిగమ్ చిక్కుల్లో పడ్డాడు. ప్రస్తుతం ఆసియా గేమ్స్ ఆడేందుకు విప్రజ్ టీమిండియాతో పాటు జపాన్ చేరుకున్నాడు. జపాన్‌తో టీమిండియా ఆడే చారిత్రక మ్యాచ్‌కు కూడా విప్రజ్ ఎంపికయ్యాడు. ఈ చారిత్రక మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్న తరుణంలో విప్రజ్ నిగమ్‌పై వచ్చిన తాజా ఆరోపణలు అతడిని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. విషయంలోకి వెళితే.. విప్రజ్ ఇంట్లో లేని సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఉన్న అతడి నివాసానికి సోమవారం ఒక యువతి వెళ్లడం కలకలం రేపింది. ఆ సమయంలో విప్రజ్ తల్లి ఇంట్లోనే ఉన్నారు. విప్రజ్ ఇంటి ముందు కూర్చొని తనకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగడం సంచలనం కలిగించింది. అయితే ముందస్తు సమాచారం లేకుండా ఆమె ఇంటికి వచ్చి దాదాపు రెండు నుంచి మూడు గంటలపాటు నిరీక్షించడం చర్చనీయాం శంగా మారింది. కాగా గతంలో విప్రజ్ నిగమ్ ఒక యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలేం జరిగింది?నవంబర్ 8, 2025న విప్రజ్ నిగమ్.. హైదరాబాద్‌కు చెందిన ఒక యువతి తనను వేధిస్తోందని, ఫోన్ చేసి రకరకాలుగా బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోపిస్తూ బారాబంకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విప్రజ్ తనపై కేసు పెట్టిన కొద్ది రోజులకే ఆ యువతి కూడా తిరగబడింది. గౌతమ్‌బుద్ధ నగర్ ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్లో విప్రజ్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ రివర్స్ కేసు దాఖలు చేసింది.ఆ యువతి తన ఫిర్యాదులో.. తాము ఇంటర్నెట్ ద్వారా 2025 మే నెలలో పరిచయం అయ్యామని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి జూలై 29న నోయిడాలోని ఒక హోటల్‌కు తీసుకెళ్లి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. అంతేకాకుండా తనపై భౌతిక దాడి కూడా చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. తాజాగా సదరు యువతి విప్రజ్ ఇంట్లో లేని సమయంలో అతడి ఇంటి ముందు బైఠాయించి న్యాయం చేయాలని నిరసనకు దిగడం సంచలనం కలిగించింది. ప్రస్తుతం ఆసియా గేమ్స్ ఆడేందుకు జపాన్ వెళ్లిన విప్రజ్ నిగమ్‌ను తాజా వివాదం అతడిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఈ పరిణామం అతడి కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: దుమ్మురేపిన యశ్.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం -
మరో చరిత్ర సృష్టించనున్న వైభవ్ సూర్యవంశీ..!
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరో చరిత్ర సృష్టించేందుకు సిద్దంగా ఉన్నాడు. ఏషియన్ గేమ్స్ 2026లో అతడు బరిలోకి దిగితే, ఈ గేమ్స్‌లో పాల్గొనే అన్ని దేశాల సభ్యుల (అథ్లెట్ లేదా క్రికెటర్) కంటే అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పుతాడు.ఏషియన్ గేమ్స్‌లో భారత్ క్రికెట్ జట్టు ఆడబోయే తొలి మ్యాచ్ సమయానికి (సెప్టెంబర్ 29, రెండో క్వార్టర్ ఫైనల్) వైభవ్ వయసు 15 ఏళ్ల 178 రోజులుగా ఉంటుంది. ఇంత కంటే చిన్న వయసు సభ్యుడు ఎవరూ ప్రస్తుత ఆసియా క్రీడల్లో పాల్గొనడం లేదు. మరోవైపు ఈ ఏషియన్ గేమ్స్‌లో అత్యంత పెద్ద వయస్కురాలైన అథ్లెట్ కూడా భారత్ నుంచే బరిలోకి దిగుతుండటం విశేషం. 55 ఏళ్ల 8 నెలల వయసున్న భారత అశ్వ క్రీడాకారిణి శృతి వోరా ఈ ఘనత సాధించారు.కాగా, ఇటీవలికాలంలో వైభవ్ వయసు విషయంలో దాదాపు అన్ని పాత రికార్డులను బద్దలు కొడుతున్నాడు. ఏషియన్ గేమ్స్‌లో కూడా అతడికి తుది జట్టులో చోటు దక్కితే మరో రికార్డు ఖాతాలో వేసుకుంటాడు.అయితే తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. మరి ఏషియన్ గేమ్స్‌లో అయినా అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.ఏషియన్ గేమ్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగుతుంది. ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైనట్లే. వీరిద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వైభవ్ తుది జట్టు బెర్త్‌పై అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రీడల్లో భారత్ గరిష్టంగా మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడగలుగుతుంది. ఏదో ఒక మ్యాచ్‌లో వైభవ్‌కు ఆడే అవకాశం వచ్చినా, ఏషియన్ గేమ్స్ అతి పిన్న వయస్కుడి రికార్డు అతడి ఖాతాలో వచ్చి పడుతుంది. ఇదీ చదవండి: రాజకీయాల్లోకి షమీ..? -
రాజకీయాల్లోకి షమీ..?
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నాడనే సంకేతం అందుతోంది. షమీ తాజాగా రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD) అధినేత జయంత్ చౌధరితో భేటీ కావడం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. షమీ రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడనే ప్రచారం జరుగుతోంది.షమీ ఆదివారం ఢిల్లీలో జయంత్ చౌధరిని కలిశాడు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోను జయంత్ చౌధరి సోషల్ మీడియాలో పంచుకోవడంతో రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలైన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.షమీ అమ్రోహా జిల్లాకు చెందినవాడు కావడంతో.. అమ్రోహా అసెంబ్లీ స్థానం నుంచి రాజకీయ అరంగేట్రం చేయవచ్చన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ అంశంపై RLD నుంచి కానీ, షమీ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.ప్రస్తుతం షమీ టీమిండియాలోకి రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల అతడు ఆడిన ప్రతి దేశవాలీ మ్యాచ్‌లోనూ సత్తా చాటి సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. దీంతో షమీని భారత టెస్ట్ జట్టులోకి తీసుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. త్వరలో జరుగబోయే న్యూజిలాండ్ పర్యటన కోసం భారత సెలెక్టర్లు షమీ పేరును పరిశీలించవచ్చని తెలుస్తోంది. ఇదీ చదవండి: Asian Games 2026: షూటింగ్లో డబుల్ ధమాకా.. మొత్తం 6 పతకాలు -
భారత జట్టు హెడ్ కోచ్‌గా లక్షీపతి బాలాజీ..!
టీమిండియా మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీకి కీలక బాధ్యతలు దక్కాయని తెలుస్తోంది. ఆస్ట్రేలియా-ఏతో జరగనున్న సిరీస్ కోసం ఆయనను ఇండియా-ఏ జట్టు హెడ్ కోచ్‌గా నియమించినట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 11 వరకు పుదుచ్చేరిలో జరిగే ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో రెండు అనధికారిక టెస్టులు, మూడు వన్డేలు ఉన్నాయి. బాలాజీ దేశానికి ప్రాతినిథ్యం వహించే జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి అవుతుంది. 2017 ఐపీఎల్ సీజన్లో అతడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. 2018 నుంచి 2022 వరకు చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా సేవలందించాడు.బాలాజీ భారత్ తరఫున 2002-2012 మధ్యలో 8 టెస్ట్‌లు, 30 వన్డేలు, 5 టీ20 ఆడి 71 వికెట్లు తీశాడు. అతడికి ఐపీఎల్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 73 మ్యాచ్‌ల్లో 76 వికెట్లు పడగొట్టి, రెండు సార్లు ఛాంపియన్ జట్లలో భాగస్వామిగా ఉన్నాడు. 2010లో చెన్నై సూపర్ కింగ్స్ , 2012లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టైటిళ్లు సాధించిన జట్లలో సభ్యుడిగా ఉన్నాడు.ఆసీస్-ఏతో సిరీస్ విషయానికొస్తే.. ఈ సిరీస్‌లో మల్టీ డే మ్యాచ్‌లకు దేవదత్ పడిక్కల్, వన్డేలకు రుతురాజ్ గైక్వాడ్ భారత జట్ల కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. మల్టీ డే మ్యాచ్‌లకు ఎంపిక చేసిన జట్టులో సాయి సుదర్శన్, అన్షుల్ కంబోజ్, తనుష్ కోటియన్, ఎన్ జగదీశన్, విజయ్ కుమార్ వైశాక్ లాంటి గుర్తింపు పొందిన ఆటగాళ్లు ఉన్నారు.వన్డే జట్టులో కెప్టెన్ రుతురాజ్‌తో పాటు పడిక్కల్, ప్రియాంశ్ ఆర్య, సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, హార్దిక్ పాండ్యా లాంటి సార్లు ఉన్నారు. ఇదీ చదవండి: టీమిండియా క్రికెటర్ సంచలన నిర్ణయం.. 18 ఏళ్ల తర్వాత వేరే జట్టుకు? -
షఫాలీ సెంచరీ, బౌలర్ల విజృంభణ.. ఫైనల్స్‌కు టీమిండియా
ఏషియన్ గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో భారత్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఇవాళ జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా బంగ్లాదేశ్‌పై 115 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి, రెండో ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. ఇవాళ ఉదయమే జరిగిన తొలి సెమీఫైనల్లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి శ్రీలంక తొలి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. సెప్టెంబర్ 22న స్వర్ణ పతకం కోసం జరిగే ఫైనల్లో శ్రీలంక టీమిండియాను ఢీకొంటుంది. అదే రోజు కాంస్య పతకం కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్ పోటీపడతాయి. ఫైనల్లో ఓడిన జట్టు రజతంతో సరిపెట్టుకుంటుంది.భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (49 బంతుల్లో 100 నాటౌట్; 3 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.భారత ఇన్నింగ్స్‌లో స్మృతి మంధన (19 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (33 బంతుల్లో 40; 6 ఫోర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. మిగతా ప్లేయర్లలో కమలిని (3), రిచా ఘోష్ (2) నిరాశపరిచారు. బంగ్లా బౌలర్లలో షంజిద అక్తర్, రబేయా ఖాన్, నహిద అక్తర్, మరుఫా అక్తర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ భారత బౌలర్ల ధాటికి పూర్తిగా చేతులెత్తేసింది. పేసర్ నందిన శర్మ (4-0-25-3) అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లా పతనాన్ని శాశించింది. ఆమెకు స్పిన్నర్లు శ్రీచరణి (3-1-7-2), శ్రేయాంక పాటిల్ (3-0-22-1), దీప్తి శర్మ (2.4-0-7-3) సహకరించారు. మరో పేసర్ క్రాంతి గౌడ్ (3-0-20-1) కూడా తన పాత్రకు న్యాయం చేసింది. మొత్తంగా వీరి ధాటికి బంగ్లాదేశ్ 15.4 ఓవర్లలో 81 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో దిల్హర అక్తర్ (27), షర్మిన్ అక్తర్ (10), సుల్తానా ఖాతూన్ (12 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన మంధన -
టీమిండియాకు మరో తలనొప్పి.. ఆసియా గేమ్స్ లో నఖ్వీ ఎంట్రీ...
-
మరో ముగ్గురికి టీమిండియా నుంచి పిలుపు
టీమిండియా జపాన్ పర్యటన కోసం మరో ముగ్గురికి పిలుపు వచ్చింది. జపాన్‌తో జరగనున్న టీ20 మ్యాచ్, అలాగే ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనేందుకు జపాన్ వెళ్లనున్న భారత క్రికెట్ జట్టుకు ముగ్గురు యువ బౌలర్లు నెట్ బౌలర్లుగా ఎంపికయ్యారు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన రసిఖ్ సలామ్ దార్, మహారాష్ట్రకు చెందిన విక్కీ ఓస్త్వాల్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్తిక్ త్యాగిలను జాతీయ సెలెక్టర్లు ఎంపిక చేశారు.ఈ ముగ్గురిని శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టుతో అనధికారిక సభ్యులుగా జత చేశారు. వీరు ప్రాక్టీస్ సెషన్లలో జట్టు సభ్యులకు బౌలింగ్ చేస్తారు. నిన్న (సెప్టెంబర్ 19) రాత్రే వీరు న్యూఢిల్లీ నుంచి టోక్యోకు బయల్దేరారు.సెప్టెంబర్ 21న ప్రాక్టీస్.. 22న జపాన్‌తో మ్యాచ్భారత జట్టు సెప్టెంబర్ 21న సానో ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేయనుంది. అనంతరం సెప్టెంబర్ 22న జపాన్‌తో టీ20 మ్యాచ్ ఆడుతుంది. ఆ మ్యాచ్ తర్వాత కూడా టీమిండియా మరికొన్ని రోజులు సానోలోనే ఉండి సాధన చేయనుంది. ఈ సమయంలో ముగ్గురు నెట్ బౌలర్లు జట్టుకు ఉపయోగపడనున్నారు.ఆ తర్వాత భారత జట్టు నాగోయాకు వెళ్లి ఆసియా గేమ్స్‌లో పాల్గొంటుంది. ఈ మెగా ఈవెంట్లో భారత్ తొలి మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది.నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో అదనపు బౌలర్లుఏషియన్ గేమ్స్ కోసం తొలుత ఎంపిక చేసిన భారత జట్టులో 15 మంది ఉండగా, నితీశ్ కుమార్ రెడ్డిని వెస్టిండీస్‌తో జరిగే స్వదేశీ వన్డే సిరీస్ కోసం టీమిండియాలోకి తీసుకున్నారు. దీంతో ఏషియన్ గేమ్స్ జట్టులో సభ్యుల సంఖ్య 14కు తగ్గింది. ఈ నేపథ్యంలో నెట్ ప్రాక్టీస్ కోసం ముగ్గురు అదనపు బౌలర్లను జట్టుతో కలిపారు.సెప్టెంబర్ 23న రిపోర్టింగ్మరోవైపు, వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టును సెప్టెంబర్ 23న తిరువనంతపురంలో రిపోర్ట్ చేయాలని బీసీసీఐ ఆదేశించింది. ఈ సిరీస్‌లోని తొలి వన్డే సెప్టెంబర్ 27న తిరువనంతపురంలోనే జరగనుండగా, రెండో వన్డే సెప్టెంబర్ 30న గువాహటిలో, మూడో వన్డే అక్టోబర్ 3న న్యూ చండీగఢ్‌లో జరగనున్నాయి. అనంతరం అక్టోబర్ 6 నుంచి లక్నో వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.ఇదీ చదవండి: బీసీసీఐ కీలక నిర్ణయం.. 31 ఏళ్ల తర్వాత స్పెషల్ మ్యాచ్? -
మరోసారి టీమిండియాకు అదే ‘గండం’.. స్పందించిన బీసీసీఐ
భారత మహిళా, పురుష క్రికెట్ జట్లకు మరోసారి ‘నక్వీ గండం’ ఎదురయ్యే అవకాశం ఉంది. ఆసియా కప్ తర్వాత ఆసియా క్రీడలు-2026 టోర్నీలోనూ అతడి చేతుల మీదుగానే ట్రోఫీ అందుకోవాల్సి వస్తే పరిస్థితి ఏమిటనే చర్చ మొదలైంది. కాగా ఆసియా క్రికెట్ మండలి (ACC) అధ్యక్షుడిగా పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి, పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నక్వీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.రెండుసార్లు నిరాకరణఅయితే, భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా టీ20 కప్-2025లో విజేతగా నిలిచిన భారత పురుషుల జట్టు, ఇటీవల 2026లో ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకున్న భారత మహిళల జట్టు నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు నిరాకరించాయి. దీంతో ఇంతవరకు ట్రోఫీలు భారత్‌కు అందకుండా నక్వీ పావులు కదుపుతున్నాడు.హాట్ ఫేవరెట్‌గా భారత జట్లుఈ నేపథ్యంలో ఆసియా క్రీడల్లోనూ ఇదే తరహా పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. జపాన్ వేదికగా ఈ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. క్రికెట్ విభాగంలో టీ20 ఫార్మాట్లో మ్యాచ్‌లు నిర్వహిస్తుండగా.. డిఫెండింగ్ చాంపియన్లు టీమిండియా, భారత మహిళా జట్టు హాట్ ఫేవరెట్‌గా ఉన్నాయి.ఇక్కడా అదే గండం.. నిరాకరిస్తే కష్టమే!ప్రస్తుతం అత్యంత పటిష్టంగా ఉన్న ఇరుజట్లు దాదాపు స్వర్ణం గెలవడం ఖాయమే. ఈ నేపథ్యంలో ఆసియా ఒలింపిక్ మండలి (OCA)లో భాగమైన నక్వీకి గనుక పతకాలు ప్రదానం చేసే అవకాశం వస్తే.. భారత జట్లు తప్పక అతడి చేతుల మీదుగానే మెడల్స్ స్వీకరించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆసియా క్రీడలనే అవమానించినట్లుగా అవుతుంది. తద్వారా పతకాలు నిరాకరించిన జట్లపై క్రమశిక్షణా చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.స్పందించిన బీసీసీఐఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా స్పందించారు. ‘‘ముందుగా మ్యాచ్‌లు గెలవడంపైనే మా దృష్టి ఉంది. భారత జట్లు స్వర్ణ పతకం గెలిచి పోడియం వద్దకు వెళ్లాలి. అప్పుడే మేము దీని గురించి నిర్ణయం తీసుకుంటాము.ప్రస్తుతం మా దృష్టి మొత్తం మ్యాచ్‌లు గెలవడం మీదే ఉంది. బోర్డు, ఆటగాళ్లకు ఇదే మొదటి ప్రాధాన్యం. ఇప్పటి వరకు జరగని దాని గురించి పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు’’ అని సైకియా పేర్కొన్నారు.నిబంధనలు ఇవేకాగా ఆసియా ఒలింపిక్ మండలి నియావళిలోని ఆర్టికల్ 66 ప్రకారం.. ‘విజయాలు, పతకాల ప్రదానోత్సం’లో భాగంగా విజేతలకు OCA అధ్యక్షుడు నేరుగా మెడల్ ప్రదానం చేయవచ్చు. లేదంటే.. మండలిలో భాగమైన ఇతర సభ్యులకు ఆ బాధ్యతను అప్పగించవచ్చు. ఇక్కడ ఎలాంటి రాజకీయ, మతపరమైన, వాణిజ్యపరమైన అంశాలకు తావు ఉండదు.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన భారత బ్యాటర్ అతడే: కమిన్స్ -
భారత్‌తో సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్ షాక్
త్వరలో భారత్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర గాయంతో ఈ సిరీస్‌కు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఆక్లాండ్‌లో సెప్టెంబర్ 16న స్కై సంస్థ నిర్వహించిన ప్రమోషనల్ షూట్లో డైవింగ్ క్యాచ్ అందుకునే ప్రయత్నంలో రచిన్ కుడి భుజం డిస్లోకేషన్కు గురైంది. దీంతో అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతడు ఆడటం అనుమానంగా మారింది. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును వచ్చే వారం ప్రకటించనున్నారు. కాగా, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు ఐదు వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం అక్టోబర్ 22 నుంచి భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది.షెడ్యూల్అక్టోబర్ 22, 2026 తొలి టీ20 క్రైస్ట్‌చర్చ్ మధ్యాహ్నం 12:30 (భారతకాలమానం ప్రకారం)అక్టోబర్ 24, 2026 రెండో టీ20 క్రైస్ట్‌చర్చ్ మధ్యాహ్నం 12:30అక్టోబర్ 27, 2026 మూడో టీ20 వెల్లింగ్టన్ మధ్యాహ్నం 12:30అక్టోబర్ 30, 2026 నాలుగో టీ20 ఆక్లాండ్ మధ్యాహ్నం 12:30నవంబర్ 1, 2026 ఐదో టీ20 హామిల్టన్ మధ్యాహ్నం 12:30నవంబర్ 4, 2026 తొలి వన్డే ఆక్లాండ్ ఉదయం 6:30నవంబర్ 7, 2026 రెండో వన్డే వెల్లింగ్టన్ ఉదయం 6:30నవంబర్ 10, 2026 మూడో వన్డే హామిల్టన్ ఉదయం 6:30నవంబర్ 13, 2026 నాలుగో వన్డే టౌరంగ ఉదయం 6:30నవంబర్ 15, 2026 ఐదో వన్డే టౌరంగ ఉదయం 6:30నవంబర్ 19–23, 2026 తొలి టెస్టు వెల్లింగ్టన్ ఉదయం 3:30నవంబర్ 27–డిసెంబర్ 1, 2026 రెండో టెస్టు క్రైస్ట్‌చర్చ్ ఉదయం 3:30ఇదీ చదవండి: పాక్ ప్లేయర్ హ్యాట్రిక్ -
అభిషేక్ ఫాస్టెస్ట్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా భారీ స్కోర్ (221-7) చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (34 బంతుల్లో 108; 9 ఫోర్లు, 11 సిక్సర్లు) సునామీ శతకంతో విరుచుకుపడగా.. మరో ఓపెనర్ సంజూ శాంసన్ (35 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు అర్ద సెంచరీతో రాణించాడు. వీరిద్దరు ఔటయ్యాక భారత్ స్కోర్ నెమ్మదించింది. తిలక్ వర్మ (2), శివమ్ దూబే (12), ఇషాన్ కిషన్ (10), నితీశ్ కుమార్ రెడ్డి (1), శ్రేయస్ అయ్యర్ (29) వేగంగా పరుగులు సాధించే క్రమంలో ఔటయ్యారు. అక్షర్ పటేల్ (5), రవి బిష్ణోయ్ (0) అజేయంగా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 2, రషీద్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్జాయ్ తలో వికెట్ పడగొట్టగా.. ముగ్గురు భారత బ్యాటర్లు రనౌటయ్యారు. ఫాస్టెస్ట్ సెంచరీఈ మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ ఆడే దేశాల్లో, భారత్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఈ మ్యాచ్‌కు ముందు భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ (35 బంతులు) పేరిట ఉంది.ఓవరాల్‌గా చూస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇది మూడో వేగవంతమైన సెంచరీ. ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ 27 బంతుల్లో, టర్కీకి చెందిన ముహమ్మద్ ఫాహద్ 29 బంతుల్లో సెంచరీలు చేసి, అభిషేక్ కంటే ముందున్నారు. ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. 30 బంతుల్లోనే సెంచరీ -
అభిషేక్ మహోగ్రరూపం.. 36 బంతుల్లోనే భారత్ సెంచరీ
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగగా.. ఆభిషేక్ విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతడు.. ఆతర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు. అభిషేక్‌కు మరో ఓపెనర్ సంజూ శాంసన్ కూడా తోడవ్వడంతో భారత్ కేవలం 3.3 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది.తొలి ఓవర్ నుంచి ఆఫ్ఘన్ బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించిన అభిషేక్.. రెండో, మూడు, ఐదు, ఆరు ఓవర్లలో ఉగ్రరూపం దాల్చాడు. అభిషేక్ ధాటికి భారత్ 6 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును తాకింది. పవర్‌ప్లేలో 100 పరుగుల మార్కును తాకడం భారత్‌కు ఇది తొలిసారి. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 100-0గా ఉంది. అభిషేక్ 22 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 76 పరుగులు, సంజూ శాంసన్ 14 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 24 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.ఇదీ చదవండి: ఆఫ్ఘన్‌తో మూడో టీ20.. టీమిండియాలో ఓ మార్పు -
ఆఫ్ఘన్‌తో మూడో టీ20.. టీమిండియాలో ఓ మార్పు
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న మూడో టీ20లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఆఫ్ఘన్ జట్టు రెండు మార్పులు చేయగా.. భారత్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. ఆఫ్ఘన్ తరఫున గుల్బదిన్ నైబ్, నూర్ అహ్మద్ స్థానాల్లో అబ్దుల్లా అహ్మద్జాయ్, నూర్ ఉల్ రహ్మాన్ బరిలోకి దిగనుండగా.. భారత్ తరఫున అర్షదీప్ స్థానంలో యశ్ ఠాకూర్ బరిలోకి దిగుతున్నాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్ ఇదివరకే సిరీస్ కైవసం చేసుకుంది.తుది జట్లు.. ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): ఇబ్రహీం జద్రాన్ (సి), రహమానుల్లా గుర్బాజ్ (డబ్ల్యు), సెడిఖుల్లా అటల్, అబ్దుల్లా అహ్మద్జాయ్, దర్విష్ రసూలీ, నూర్ ఉల్ రెహమాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబుల్ ఉర్ రహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, అబ్దుల్లా అహ్మద్జాయ్భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రాఇదీ చదవండి: ఆసీస్ వరల్డ్‌కప్ విన్నర్ షాకింగ్ నిర్ణయం -
వైభవ్‌కు చాన్స్ దక్కేనా!
న్యూఢిల్లీ: సమష్టి ప్రదర్శనతో అఫ్గానిస్తాన్‌పై వరుస మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి... సిరీస్ పట్టేసిన టీమిండియా చివరి మ్యాచ్‌లో రిజర్వ్ బలాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టి20ల్లో గెలిచిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే 2–0తో సిరీస్ కైవసం చేసుకుంది. గురువారం ఇరు జట్ల మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో చివరి టి20 మ్యాచ్ జరగనుంది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచి లక్ష్యఛేదనకు మొగ్గుచూపిన టీమిండియా... ఈసారి అవకాశం వస్తే మొదట బ్యాటింగ్ చేస్తూ తమ బలాన్ని సరిచూసుకోవాలని భావిస్తోంది. అలాగే రిజర్వ్ ప్లేయర్లను ఈ మ్యాచ్‌లో పరీక్షించే అవకాశాలున్నాయి. మరోవైపు అఫ్గానిస్తాన్ జట్టు ఎంత పోరాడినా గత రెండు మ్యాచ్‌ల్లో టీమిండియాకు సరైన పోటీనివ్వలేకపోయింది. ముగ్గురు ప్రపంచ స్థాయి స్పిన్నర్లు ఉన్నా... వారి ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. రెండో టి20లో రషీద్ ఖాన్ చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకోవడం ఆ జట్టుకు ఊరటనిచ్చే అంశం. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్‌తో పాటు గుర్బాజ్, సాధిఖుల్లా, నైబ్, డార్విష్, అజ్మతుల్లా, నబీ కలిసి కట్టుగా రాణించాల్సిన అవసరముంది. గత రెండు మ్యాచ్‌ల మాదిరిగానే పిచ్ బ్యాటింగ్‌కు సహకరించనుంది. ఆటకు వర్షం ఆటంకం కలిగించే అవకాశలు పెద్దగా లేవు. భిన్నమైన కూర్పుతో... ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కుతుందా చూడాలి. రెండో మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ... చివరి పోరులో భిన్నమైన కూర్పును ప్రయత్నిస్తామని వెల్లడించాడు. ఏషియన్ గేమ్స్ ప్రారంభానికి ముందు ప్లేయర్లందరికీ తగినంత మ్యాచ్ టైమ్ దక్కాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ సామ్సన్ చెరో మ్యాచ్‌లో హాఫ్‌సెంచరీలు బాదిన నేపథ్యంలో ఎవరి స్థానంలో సూర్యవంశీని తీసుకుంటారనేది ఆసక్తికరం. ఇంగ్లండ్, జింబాబ్వేలో అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన వైభవ్... సొంతగడ్డపై ఇంతవరకు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. ఇటీవలి కాలంలో ఫార్మాట్‌తో సంబంధం లేకుండా నిలకడగా రాణిస్తున్న ఇషాన్‌కు విశ్రాంతినిస్తారా చూడాలి. బౌలర్లకు మరింత వెసులుబాటు కల్పించేందుకు అదనపు బౌలర్‌ను పరీక్షించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అదే జరిగితే బ్యాటింగ్ ఆర్డర్లో ఓ ప్లేయర్ తగ్గనున్నాడు. దీంతో పేస్ ఆల్‌రౌండర్, ఆంధ్ర ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి, స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌పై బ్యాటింగ్ భారం పెరగనుంది. బౌలింగ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతుండగా... అర్ష్ దీప్ సింగ్ అతడికి అండగా నిలుస్తున్నాడు. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలనుకుంటే యశ్ ఠాకూర్‌కు మరోసారి అవకాశం దక్కొచ్చు. గాయం కారణంగా వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్‌కు దూరం కాగా... అతడి స్థానంలో అవకాశం దక్కించుకున్న రవి బిష్ణోయ్ రెండో మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా... ఫీల్డింగ్‌లో మాత్రం టీమిండియా మరింత మెరుగవ్వాల్సిన అవసరముంది. భారత జట్టుతో జపాన్ రాయబారి భేటీ ఈనెల 22న సానో ఇంటర్నేషనల్ స్టేడియంలో జపాన్ జట్టుతో భారత జట్టు తొలిసారి టి20 మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బుధవారం భారత్‌లో జపాన్ రాయబారి ఒనో కెచీ బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్‌తో పాటు భారత క్రికెటర్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్‌కు జపాన్‌లో అదృష్ట చిహ్నానికి ప్రతీకగా భావించే ‘దారుమా’ బొమ్మను ప్రదానం చేశారు. తుది జట్లు (అంచనా) భారత్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సామ్సన్, అభిషేక్, ఇషాన్/వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ, అక్షర్, నితీశ్ రెడ్డి, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, అర్ష్ దీప్, బుమ్రా. అఫ్గానిస్తాన్: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), గుర్బాజ్, సాధిఖుల్లా, నైబ్, డారి్వష్, అజ్మతుల్లా, నబీ, రషీద్ ఖాన్, ముజీబ్/నవీన్, ఫజల్హక్ ఫారూఖి. -
ఆసియా గేమ్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం
జపాన్ వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్‌లో పాల్గొనే టీమిండియా జట్టులో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. ఇప్పటికే గాయం కారణంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తప్పించిన బీసీసీఐ తాజాగా స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డిని కూడా జట్టు నుంచి విడుదల చేసింది. ఇక గాయపడిన వరుణ్ చక్రవర్తి స్థానంలో విప్రజ్ నిగమ్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇదే సమయంలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు మాత్రం నితీశ్‌రెడ్డి అందుబాటులో ఉంటాడని బీసీసీఐ తెలిపింది. అయితే ఆసియా గేమ్స్ నుంచి నితీశ్ కుమార్ రెడ్డిని తప్పించడం వెనుక బీసీసీఐ స్పష్టమైన సమాచారం ఇవ్వనప్పటికీ, రాబోయే ఏడాదిలో టీమిండియా వన్డే ప్రపంచకప్ ఆడనుంది. హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా భావిస్తున్న నితీశ్‌రెడ్డికి వీలైనంత ఎక్కువగా వన్డే మ్యాచ్‌ల్లో అవకాశాలు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే టెస్టుల్లో తానేంటో నిరూపించుకున్న నితీశ్‌రెడ్డి వన్డేల్లోనూ అదే తరహా ప్రదర్శన చేయాలని బీసీసీఐ ఆశిస్తోంది. ఇప్పటివరకు ఆరు వన్డేలు మాత్రమే ఆడిన నితీశ్‌రెడ్డి వంద పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు తీశాడు. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు మాత్రం నితీశ్‌కుమార్ రెడ్డిని ఎంపిక చేయడం జరిగింది.ఆసియా గేమ్స్‌కు టీమిండియా:శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, యశ్ ఠాకూర్, విప్రజ్ నిగమ్. -
విండీస్ సిరీస్‌కు భారత జట్ల ప్రకటన.. రోహిత్, కోహ్లి కొనసాగింపు
ఈ నెలాఖరులో వెస్టిండీస్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం భారత జట్లను ఇవాళ ప్రకటించారు. వన్డే జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్, టీ20 జట్టుకు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ కొనసాగారు. కేఎల్ రాహుల్, తిలక్ వర్మ వన్డే, టీ20 జట్లకు ఉప నాయకులుగా వ్యవహరించనున్నారు. స్టార్ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వన్డే జట్టులో కొనసాగగా.. రిషబ్ పంత్‌కు అవకాశం దక్కలేదు. ఆకిబ్ నబీ, నమన్ ధిర్కు తొలిసారి వన్డే జట్టులో అవకాశం దక్కింది. స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. రెండు జట్లలో అతడికి చోటు దక్కలేదు.వన్డే సిరీస్‌కు భారత జట్టుశుభ్‌మన్ గిల్ (సి), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ధృవ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మహ్మద్ సిరాజ్, ఆకిబ్ నబీ, యశస్వి జైస్వాల్, నమన్ ధిర్టీ20 సిరీస్‌కు భారత జట్టుశ్రేయస్ అయ్యర్ (సి), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), సంజు శాంసన్ (వికెట్‌కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.వన్డే సిరీస్ షెడ్యూల్ తొలి వన్డే: ఆదివారం, సెప్టెంబర్ 27 - మధ్యాహ్నం 2:00 గంటలకు - గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురంరెండో వన్డే: బుధవారం, సెప్టెంబర్ 30 - మధ్యాహ్నం 2:00 గంటలకు - బర్సపారా క్రికెట్ స్టేడియం, గౌహతిమూడో వన్డే: శనివారం, అక్టోబర్ 3 - మధ్యాహ్నం 2:00 గంటలకు - మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ముల్లన్పూర్, న్యూ చండీగఢ్టీ20 సిరీస్ షెడ్యూల్తొలిటీ20: మంగళవారం, అక్టోబర్ 6 - సాయంత్రం 7:00 గంటలకు - భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియం, లక్నోరెండో టీ20: శుక్రవారం, అక్టోబర్ 9 - సాయంత్రం 7:00 గంటలకు - జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్, రాంచీమూడో టీ20: ఆదివారం, అక్టోబర్ 11 - సాయంత్రం 7:00 గంటలకు - హోల్కర్ స్టేడియం, ఇండోర్నాలుగో టీ20: బుధవారం, అక్టోబర్ 14 - సాయంత్రం 7:00 గంటలకు - రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, హైదరాబాద్ఐదో టీ20: శనివారం, అక్టోబర్ 17 - సాయంత్రం 7:00 గంటలకు - ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరుఇదీ చదవండి: రోహిత్ శర్మను అధిగమించిన బట్లర్.. మిగిలింది అతనొక్కడే..! -
వైభవ్ తో పోటీనా... రిపోర్టర్ ప్రశ్నకు సంజూ శాంసన్ దిమ్మతిరిగే కౌంటర్
-
టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్..!
ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20కి ముందు టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయపడిన (సైడ్ స్ట్రెయిన్) విషయం తెలిసిందే. గాయం పెద్దది కావడంతో వరుణ్ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌తో పాటు ఏషియన్ గేమ్స్‌కు కూడా దూరమయ్యాడని తెలుస్తోంది.ఈ క్రమంలో భారత మేనేజ్మెంట్ ఏషియన్ గేమ్స్ కోసం వరుణ్ ప్రత్యామ్నాయంగా ఎవరూ ఊహించని ప్లేయర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. 22 ఏళ్ల రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఆల్‌రౌండర్ విప్రాజ్ నిగమ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.వరుణ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు విప్రాజ్ నిగమ్‌తో పాటు కుల్దీప్ యాదవ్ పేరును కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది. అయితే కుల్దీప్ యాదవ్ ఈ నెలాఖర్లో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఆడనున్న నేపథ్యంలో విప్రాజ్ నిగమ్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ విషయమై అతి త్వరలో అధికారిక సమాచారం రావొచ్చు.ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విప్రాజ్ ఐపీఎల్లో ఇప్పటివరకు 19 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అతడు తన సత్తా చాటాడు. ఐపీఎల్ కెరీర్లో అతడి బ్యాటింగ్ స్ట్రైక్‌రేట్ సుమారు 176గా ఉంది.సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభంజపాన్లోని ఐచి-నగోయాలో సెప్టెంబర్ 19 నుంచి ఆసియా గేమ్స్ ప్రారంభం కానున్నాయి. అయితే పురుషుల క్రికెట్ పోటీలు మాత్రం సెప్టెంబర్ 24 నుంచి మొదలవుతాయి. భారత్ నేరుగా క్వార్టర్‌ఫైనల్ దశలో బరిలోకి దిగనుంది.ఇదీ చదవండి: శతక్కొట్టిన హ్యారీ బ్రూక్.. ప్రపంచ రికార్డు -
అఫ్గానిస్థాన్ పై భారత్ ఘన విజయం..
-
పంత్‌కు పిలుపు దక్కేనా!
న్యూఢిల్లీ: ఒకవైపు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత టి20 జట్టు అఫ్గానిస్తాన్‌తో టి20 సిరీస్ ఆడుతుండగా... మరోవైపు ఈ నెలాఖరున ప్రారంభమయ్యే వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ బుధవారం జట్టును ఎంపిక చేయనుంది. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌తో టి20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు ఆ తర్వాత నేరుగా... జపాన్ వేదికగా జరుగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లనుంది. కాగా... ఈ నెల 27 నుంచి వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా 27న తిరువనంతపురం వేదికగా తొలి వన్డే, 30న గువాహటిలో రెండో వన్డే, అక్టోబర్ 3న చండీగఢ్‌లో మూడో వన్డే జరగనున్నాయి. అనంతరం ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ జరగనుంది. ఆసియా క్రీడల్లో పాల్గొన్న జట్టే విండీస్‌తో టి20 సిరీస్‌లో పాల్గొననుంది. అయితే వన్డే సిరీస్ కోసం మాత్రం సెలెక్టర్లు ఈ రోజు జట్టును ఎంపిక చేయనున్నారు. ‘రో–కో’ రీ ఎంట్రీ... టెస్టు, టి20లకు వీడ్కోలు పలికి కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రానుండగా... గాయం నుంచి కోలుకున్న పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపిక తథ్యమే. నితీశ్ కుమార్ రెడ్డి ఆసియా క్రీడల్లో పాల్గొంటుండగా... అదనపు పేస్ ఆల్‌రౌండర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. వెంకటేశ్ అయ్యర్, సూర్యాంశ్ షెడ్గే ప్రస్తుతం గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. కేఎల్ రాహుల్ రూపంలో రెగ్యులర్ వన్డే వికెట్ కీపర్ అందుబాటులో ఉండగా... అదనపు కీపర్‌గా రిషబ్ పంత్‌కు చోటు దక్కుతుందా చూడాలి. చాన్నాళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్లో పంత్‌ను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈసారి కూడా అతడిని ఎంపిక చేయకపోతే... రిజర్వ్ కీపర్‌గా ధ్రువ్ జురేల్‌కు అవకాశం దక్కొచ్చు. అదే జరిగితే పంత్ ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాకు సారథ్యం వహించాల్సి ఉంటుంది. షమీకి చివరి చాన్స్ వచ్చేనా! రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లితో టాపార్డర్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకపోగా... టి20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేకపోవడంతో నాలుగో స్థానంలో ఖాళీని రుతురాజ్ గైక్వాడ్, రజత్ పాటిదార్లలో ఒకరితో నింపే అవకాశాలున్నాయి. యశస్వి జైస్వాల్‌ను రిజర్వ్ ఓపెనర్‌గా ఎంపిక చేయనుండగా... సీనియర్ స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను కొనసాగిస్తారా లేక మానవ్ సుతార్‌కు అవకాశం ఇస్తారా అనేది కీలకం. విప్రాజ్ నిగమ్, జీషన్ అన్సారీ రూపంలో ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి.అయితే వన్డే ప్రపంచకప్ టోరీ్నకి మరో ఏడాది సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో సెలెక్టర్లు ప్రయోగాల జోలికి వెళ్లకుండా... పాత జట్టుకే మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో భారీ మద్దతు కూడగట్టుకున్న మొహమ్మద్ షమీకి ఈసారైనా జాతీయ జట్టులో అవకాశం దక్కుతుందా చూడాలి.దేశవాళీల్లో ఫార్మాట్‌తో సంబంధం లేకుండా మెరుగైన బౌలింగ్‌తో సత్తాచాటుతున్న షమీని జాతీయ జట్టుకు ఎంపిక చేయాలనే డిమాండ్ భారీగా వినిపిస్తున్న నేపథ్యంలో సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరం. బుమ్రా ఆసియా క్రీడల బరిలో ఉన్న నేపథ్యంలో సిరాజ్‌కు వన్డే పిలుపు వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. -
IND VS AFG 2nd T20: సత్తా చాటిన టీమిండియా బౌలర్లు
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. నితీశ్ కుమార్ రెడ్డి (3-0-24-3), అర్షదీప్ సింగ్ (4-0-35-2), జస్ప్రీత్ బుమ్రా (4-1-25-1), అక్షర్ పటేల్ (4-0-28-1), రవి బిష్ణోయ్ (4-0-32-1) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమైంది. ఆఖర్లో రషీద్ ఖాన్ (28) బ్యాట్ ఝులిపించడంతో ఆఫ్ఘన్ జట్టు ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతా ప్లేయర్లలో ఇబ్రహీం జద్రాన్ 37, రహ్మానుల్లా గుర్బాజ్ 0, సెదిఖుల్లా అటల్ 12, గుల్బదిన్ నైబ్ 10, దర్విష్ రసూలీ 26, అజ్మతుల్లా ఒమర్జాయ్ 11, మొహమ్మద్ నబీ (15), నూర్ అహ్మద్ (7 నాటౌట్), ముజీబ్ ఉర్ రెహ్మాన్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు -
చరిత్ర సృష్టించిన బుమ్రా
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో (పూర్తి సభ్య దేశాల బౌలర్లలో) అత్యధిక మెయిడిన్ ఓవర్లు (13) వేసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న రెండో టీ20లో ఇన్నింగ్స్ తొలి ఓవరే మెయిడిన్ వేసి ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్‌కు ముందు బుమ్రా, జింబాబ్వే పేసర్ రిచర్డ్ నగరవ చెరో 12 మెయిడిన్ ఓవర్లతో సమంగా ఉండేవారు. తాజాగా బుమ్రా సోలోగా ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 10 మెయిడిన్ ఓవర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తుంది. 17.4 ఓవర్లు ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 132-6గా ఉంది. ఇబ్రహీం జద్రాన్ 37, రహ్మానుల్లా గుర్బాజ్ 0, సెదిఖుల్లా అటల్ 12, గుల్బదిన్ నైబ్ 10, దర్విష్ రసూలీ 26, అజ్మతుల్లా ఒమర్జాయ్ 11 పరుగులు చేసి ఔట్ కాగా.. మొహమ్మద్ నబీ (15), రషీద్ ఖాన్ (17) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి తలో 2 వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచిన భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.ఇదీ చదవండి: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు -
కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్న టీమిండియా ప్లేయర్
టీమిండియా పేసర్ ముకేశ్ కుమార్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నాడు. 2026 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు నాటింగ్‌హామ్‌షైర్ జట్టుతో ఒప్పందం చేసుకున్నాడు. ఇవాళ ససెక్స్‌తో జరిగే మ్యాచ్‌తో నాటింగ్‌హామ్‌షైర్ తరఫున అరంగేట్రం చేయనున్నాడు. అనంతరం సెప్టెంబర్ 24న యార్క్‌షైర్‌తో జరిగే మ్యాచ్‌లోనూ ఆడనున్నాడు.డివిజన్-1 టైటిల్ రేసులో నాటింగ్‌హామ్‌షైర్ ప్రస్తుతం కీలక దశలో ఉంది. రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండటంతో ముకేశ్ రాక ఆ జట్టు బౌలింగ్ విభాగానికి అదనపు బలాన్ని ఇవ్వనుంది. ఇంగ్లండ్ పరిస్థితుల్లో ముకేశ్ స్వింగ్, సీమ్ బౌలింగ్ నాటింగ్హమ్కు ఉపయోగపడే అవకాశం ఉంది.నాటింగ్‌హామ్‌షైర్‌తో జతకట్టక ముందు ముకేశ్ దులీప్ ట్రోఫీ 2026లో ఈస్ట్ జోన్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. టోర్నీలో 12 వికెట్లు పడగొట్టి సంయుక్తంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు.మొత్తంగా ముకేశ్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మంచి రికార్డు ఉంది. 60 మ్యాచ్‌ల్లో 233 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున మూడు టెస్టులు కూడా ఆడిన ముకేశ్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో విస్తృత అనుభవం ఉంది. ముకేశ్ టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడు. అయితే ప్రస్తుతం జట్టులో తీవ్ర పోటీ ఉండటంతో అవకాశాలు దొరకడం లేదు. నాటింగ్హ్షైర్ తరఫున సత్తా చాటి తిరిగి జట్టులోకి రావాలని ముకేశ్ భావిస్తున్నాడు.చదవండి: బాబర్ ఆజం సంచలన నిర్ణయం! -
భారత్ అఫ్గాన్ రెండో T20.. టీమ్ లో సంచలన మార్పులు
-
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ నుంచి టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్
ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20కి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడని సమాచారం. వరుణ్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఏషియన్ గేమ్స్‌లోనూ ఆడటం అనుమానమేనని తెలుస్తోంది.వరుణ్ సైడ్ స్ట్రెయిన్‌తో బాధపడుతున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. నిన్న జరిగిన తొలి టీ20లో వరుణ్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అతడు నాలుగు ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు.న్యూఢిల్లీలో రేపు జరుగబోయే రెండో టీ20లో వరుణ్ లేకపోతే టీమిండియా ఇబ్బంది పడవచ్చు. ఇటీవలికాలంలో వరుణ్ టీ20 ఫార్మాట్లో భారత్ విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నాడు. రెండో టీ20కి వరుణ్ దూరమైతే అతడి స్థానంలో రవి బిష్ణోయ్ తుది జట్టులోకి రావచ్చు.కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్నాయి. తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లింది.ఈ మ్యాచ్‌లో తొలుత బౌలర్లు రెచ్చిపోగా.. ఆతర్వాత బ్యాటర్లు తమ పని కానిచ్చారు. బౌలింగ్‌లో వరుణ్‌తో పాటు అర్షదీప్ (4-0-19-3), బుమ్రా (4-0-26-1), అక్షర్ పటేల్ (4-0-27-1) సత్తా చాటగా.. బ్యాటింగ్‌లో అభిషేక్ (32 బంతుల్లో 82; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (33 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపించారు.ఇదీ చదవండి: టీమిండియాకు ఊహించని షాక్ -
టీమిండియాకు ఊహించని షాక్
మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్లో శ్రీలంకపై ఘన విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. వికెట్ తీసిన అనంతరం దూకుడుగా సంబురాలు చేసుకున్నందుకు స్టార్ పేసర్ క్రాంతి గౌడ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం శ్రీలంకతో జరిగిన ఫైనల్లో క్రాంతి గౌడ్ తొలి ఓవర్లోనే ఇమేషా దులానిని క్లీన్ బౌల్డ్ చేసింది. వికెట్ తీసిన ఆనందంలో ఆమె దూకుడుగా సంబరాలు చేసుకుంది. ఈ సందర్భంగా క్రాంతి ప్రదర్శించిన హావభావాలపై ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్య ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని లెవల్-1 నిబంధనను ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపింది.వికెట్ తీసిన తర్వాత అతడిని లేదా ఆమెను అవమానించేలా, లేదా దూకుడుగా స్పందించేలా ప్రేరేపించే భాష, చర్యలు లేదా హావభావాలు చేయడాన్ని నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. దీంతో ఐసీసీ క్రాంతి గౌడ్‌పై చర్యలు తీసుకుంది. 24 నెలల వ్యవధిలో ఆమెకు ఇది తొలి తప్పిదం కావడంతో జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌తో సరిపెట్టారు.తనపై వచ్చిన అభియోగాన్ని క్రాంతి అంగీకరించడంతో ప్రత్యేకంగా ఫార్మల్ హియరింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదని ఐసీసీ వెల్లడించింది. కాగా, నిన్న జరిగిన ఫైనల్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. ఇదీ చదవండి: పాకిస్తాన్‌కు మరో భారీ షాక్ -
వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్లో పెను సంచలనంగా మారిన టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ.. డబ్బు సంపాదనలోనూ సంచలనాలు సృష్టిస్తున్నాడు. నివేదికల ప్రకారం వైభవ్ ఒక్క రోజు బ్రాండ్ ఎండార్స్మెంట్ షూట్‌కు సుమారు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని AMP Sports & Entertainment వ్యవస్థాపకుడు, CEO ఇంద్రనీల్ దాస్ స్వయంగా చెప్పాడు.రాబోయే రెండు మూడేళ్లలో వైభవ్ బ్రాండ్ విలువ మరింత పెరిగి, ప్రస్తుతం తీసుకుంటున్న ఫీజుకు రెట్టింపు అవుతుందని ఆయన అంచనా వేశాడు.సచిన్‌తో పోలికబ్రాండ్ విలువలో వైభవ్‌ను మార్కెట్ నిపుణులు దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తున్నారు. Houlihan Lokey IPL Valuation Study 2026 ప్రకారం, వైభవ్‌కు ఉన్న ఆకర్షణ సచిన్ స్థాయికి దగ్గరగా ఉంది. భయమెరుగని బ్యాటింగ్ శైలి వైభవ్ క్రేజ్‌ను మరింత పెంచుతుంది. కొందరు క్రికెటేతర అభిమానులు కేవలం వైభవ్ బ్యాటింగ్ చూసేందుకే స్టేడియాలకు తరలి వస్తున్నారు.13 ఏళ్లకే కోటీశ్వరుడువైభవ్ 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో అడుగుపెట్టి అతి పిన్న వయస్కుడైన కోటీశ్వరుడిగా నిలిచాడు. ఐపీఎల్ 2025కు ముందు రాజస్థాన్ రాయల్స్ అతడిని జట్టులోకి తీసుకుంది. తొలి సీజన్లో ఏడు మ్యాచ్‌లు ఆడిన వైభవ్, 206 స్ట్రైక్‌రేట్‌తో 252 పరుగులు చేశాడు. ఇందులో ఓ సునామీ శతకం కూడా ఉంది.రెండో సీజన్లో మరింత విధ్వంసంతన రెండో ఐపీఎల్ సీజన్లో (2026) వైభవ్ మరింత రెచ్చిపోయాడు. ఏకంగా 776 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గానిలిచాడు. అతడి స్ట్రైక్‌రేట్ ఏకంగా 237.31గా ఉంది.టీమిండియాలోనూ చోటుఐపీఎల్లో అద్బుత ప్రదర్శనల తర్వాత బీసీసీఐ కూడా వైభవ్‌పై నమ్మకం ఉంచింది. యూకే పర్యటనకు అతడిని ఎంపిక చేసింది. ఇప్పటివరకు 6 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన వైభవ్, ఐపీఎల్ తరహా ప్రదర్శనలు చేయనప్పటికీ.. ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించాడు. ఇదీ చదవండి: మావాడు ఇప్పటికే వైభవ్ పనిపట్టాడు.. ఇంకేం భయం?: జపాన్ కెప్టెన్ -
గంభీర్ సంచలన నిర్ణయం.. అభిషేక్ ఔట్ టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే
-
మనమే చాంపియన్స్
దుబాయ్: ఫార్మాట్ ఏదైనా ఆసియా పరిధిలో తమకు ఎదురులేదని భారత మహిళల క్రికెట్ జట్టు నిరూపించింది. ఆసియాకప్ టి20 టోర్నీలో భారత జట్టు ఎనిమిదోసారి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 72 పరుగుల ఆధిక్యంతో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక జట్టును ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిరీ్ణత 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు సాధించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (39 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్మృతి మంధాన (39 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 129 పరుగులు జోడించారు. రిచా ఘోష్ (14; 1 ఫోర్), హర్మన్‌ప్రీత్ (17; 1 ఫోర్, 1 సిక్స్), కమలిని (5 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కూడా రాణించారు. అనంతరరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టును భారత స్పిన్నర్లు దెబ్బ కొట్టారు. ఏదశలోనూ లక్ష్యం దిశగా సాగని శ్రీలంక సరిగ్గా 20 ఓవర్లు ఆడి 111 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి 20 పరుగులిచ్చి 4 వికెట్లు, దీప్తి శర్మ 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. వన్డే, టి20 ఫార్మాట్లు కలిపి ఆసియాకప్ ఇప్పటి వరకు 10 సార్లు జరిగింది. 10 సార్లు భారత జట్టు ఫైనల్‌కు చేరింది. వన్డే ఫార్మాట్లో భారత జట్టు 2004, 2005, 2006, 2008లలో విజేతగా నిలిచింది. టి20 ఫార్మాట్లో 2012, 2016, 2022, 2026లలో టైటిల్ గెలిచింది. 2018లో, 2024లలో టీమిండియా రన్నరప్‌గా నిలిచింది.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి మంధాన (రనౌట్) 59; షఫాలీ వర్మ (సి) చమరి (బి) ప్రబోద 68; హర్మన్‌ప్రీత్ కౌర్ (సి) కవింది (సబ్) (బి) మిథాలీ అయోధ్య 14; రిచా ఘోష్ (సి) దిల్హారి (బి) చమరి 17; దీప్తి శర్మ (రనౌట్) 5; భారతి ఫుల్మాలి (నాటౌట్) 5; కమలిని (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–129, 2–132, 3–160, 4–166, 5–167. బౌలింగ్: మిథాలీ అయోధ్య 4–0–33–1, కవిషా దిల్హారి 3–0–29–0, సుగందిక కుమారి 4–0–31–0, చమరి అటపట్టు 4–0–34–1, చముడి ప్రబోద 4–0–40–1, నీలాక్షిక సిల్వా 1–0–15–0. శ్రీలంక ఇన్నింగ్స్: ఇమేశా దులాని (బి) క్రాంతి గౌడ్ 4; చమరి అటపట్టు (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) దీప్తి శర్మ 36; విశ్మీ గుణరత్నే (బి) దీప్తి శర్మ 20; హర్షిత సమరవిక్రమ (సి అండ్ బి) శ్రీచరణి 9; నీలాక్షిక సిల్వా (సి) కమలిని (బి) శ్రీచరణి 22; కవిషా దిల్హారి (సి) నందని శర్మ (బి) శ్రీచరణి 7; హాసిని పెరీరా (సి) శ్రీచరణి (బి) షఫాలీ వర్మ 1; కౌషిని నుత్యాంగణ (బి) దీప్తి శర్మ 9; సుగందిక కుమారి (సి) నందని శర్మ (బి) శ్రీచరణి 1; మిథాలీ అయోధ్య (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) ప్రేమ రావత్ 0; చముడి ప్రబోద (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 111. వికెట్ల పతనం: 1–4, 2–62, 3–63, 4–86, 5–100, 6–101, 7–103, 8–104, 9–107, 10–111. బౌలింగ్: క్రాంతి గౌడ్ 2–0–8–1, నందని శర్మ 3–0–17–0, షఫాలీ వర్మ 4–0–23–1, శ్రీచరణి 4–1–20–4, దీప్తి శర్మ 4–0–19–3, ప్రేమ రావత్ 3–0–22–1. ట్రోఫీ స్వీకరించేందుకు నిరాకరణ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్‌గా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మోహసిన్ నఖ్వీ నుంచి ఆసియా కప్ ట్రోఫీని స్వీకరించేందుకు భారత క్రికెట్ జట్టు నిరాకరించింది. శ్రీలంక జట్టు క్రికెటర్లు మెడల్స్‌ను స్వీకరించిన తర్వాత బహుమతి ప్రదానోత్సవం ముగిసింది. -
గంభీర్ సంచలన నిర్ణయం.. అభిషేక్ ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే
-
టీమిండియా షెడ్యూల్లో మార్పులు
2026 ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు మ్యాచ్‌ల సమయాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పురుషుల నాకౌట్ మ్యాచ్‌ల్లో కొన్ని మ్యాచ్‌లను అరగంట ముందుకు మార్చారు. రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం, మధ్యాహ్నం జరగాల్సిన మ్యాచ్‌లు ఇకపై స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతాయి. గతంలో ఈ మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండింది. మహిళల క్రికెట్ మ్యాచ్‌ల సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.సెప్టెంబర్ 28న తొలి మ్యాచ్ఐచి-నగోయా (జపాన్) వేదికగా జరిగే ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల జట్టుకు నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ లభించింది. సెప్టెంబర్ 28న జరిగే రెండో క్వార్టర్ ఫైనల్లో భారత్ బరిలోకి దిగనుంది.ఈ మ్యాచ్ జపాన్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్ కంటే జపాన్ 3 గంటల 30 నిమిషాలు ముందుండటంతో.. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 10 గంటలకు మొదలవుతుంది.అలాగే అక్టోబర్ 1న జరిగే రెండో సెమీఫైనల్, అక్టోబర్ 3న జరిగే గోల్డ్ మెడల్ మ్యాచ్ కూడా మధ్యాహ్నం 1.30 గంటలకే ప్రారంభం కానున్నాయి. భారత్ సెమీఫైనల్‌కు చేరితే ఆ మ్యాచ్ కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది.జపాన్‌లో ముందుగానే చీకటి పడటమే కారణంమ్యాచ్ల సమయాలను మార్చడానికి ప్రధాన కారణం జపాన్‌లో త్వరగా చీకటి పడటమేనని సమాచారం. మ్యాచ్‌లు జరిగే వేదికలో ఫ్లడ్‌లైట్లు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.పురుషుల మ్యాచ్‌లు సాధారణంగా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉండటంతో.. చీకటి పడేలోపు మ్యాచ్‌లను పూర్తి చేసేందుకు ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం.ముందుగా మరో మ్యాచ్ఏషియన్ గేమ్స్‌లో తమ తొలి అధికారిక పోటీకి ముందు భారత్ ఆతిథ్య జట్టు జపాన్‌తో ఓ టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 22న సానో ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది.ఇదీ చదవండి: ఇషాన్ గాయంపై అప్డేట్ ఇచ్చిన శ్రేయస్ -
#80s Trend: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ సర్ప్రైజ్!
భారత్‌ను ప్రస్తుతం ‘80s’ ట్రెండ్ షేక్ చేస్తోంది. ఇన్స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ చూసుకున్నా ‘80s’ ట్రెండ్ పిచ్చ వైరల్‌గా మారిపోయింది. సెలెబ్రిటీల నుంచి సామాన్యుల దాకా తమకు నచ్చిన ఫొటోను చాట్ జీపీటీకి ఇచ్చి ప్రాంప్ట్ సహాయంతో ‘80s’ ట్రెండ్ ఫొటోలను సృష్టించి స్టేటస్‌లుగా పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇదే ‘80s’ ట్రెండ్ టీమిండియా క్రికెట్‌కు కూడా పాకింది. తాజాగా బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతాలో టీమిండియా క్రికెటర్ల 80s ట్రెండ్ ఫొటోలను పంచుకుంది. అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో రేపటి నుంచి తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న టీమిండియా క్రికెటర్లకు వారి ‘80s’ ఫొటోలను చూపించింది. దీనిపై ఒక్కో క్రికెటర్ ఒక్కోలా రియాక్ట్ అవ్వడం కనిపించింది. Photo Credit: BCCI Twitterముఖ్యంగా అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, అభిషేక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, అర్షదీప్ సింగ్‌లు తమ ‘80s’ ఫొటోలు చూసుకొని తెగ మురిసిపోయారు. అభిషేక్ శర్మ అయితే అచ్చం హాలీవుడ్ హీరోని తలపించే విధంగా ఉన్నాడంటూ ఇషాన్ కిషన్ ఆటపట్టించడం విశేషం. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. బుమ్రా, సంజూ శాంసన్ ఇలా అందరు క్రికెటర్లు తమ ఫొటోలను గుర్తుపట్టగా.. రవి బిష్ణోయి, యష్ ఠాకూర్లు మాత్రం తమ ఫొటోలను పోల్చుకోలేకపోయారు. Photo Credit: BCCI Twitterమొదట శివమ్ దూబే తన ఫొటో బదులు యశ్ ఠాకూర్‌ను చూపించాడు. అయితే వెంటనే తన ఫొటోను చూపిస్తూ.. ఇందాకా చూపించింది యశ్ ఠాకూర్‌ది అని పేర్కొన్నాడు. ఇక బుమ్రా మాత్రం తన ఫొటోను చూసుకోవడానికి ఇష్టపడలేదు. 2 నిమిషాల 40 సెకన్ల నిడివి ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి.Photo Credit: BCCI Twitterఇక రేపు (ఆదివారం) భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. జట్టు కూర్పు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినప్పటికీ, ఓపెనింగ్ విషయంలోనే మేనేజ్మెంట్ ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఓపెనింగ్‌లో వైభవ్ లేదా శాంసన్‌లలో ఎవరిని ఆడిస్తారనేది చూడాలి. విశ్వసనీయ సమాచారం మేరకు వైభవ్‌ను బెంచ్‌కు పరిమితం చేసి శాంసన్‌కు అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది.Vintage vibes. Priceless reactions. 😂🎥 #TeamIndia takes on the 1980s trend 😉 - By @RajalArora #AFGvIND pic.twitter.com/nSaClHHdyn— BCCI (@BCCI) September 12, 2026ఇదీ చదవండి: ఆసియా గేమ్స్‌కు కొత్త రంగు జెర్సీలో టీమిండియా! -
ఆసియా గేమ్స్‌కు కొత్త రంగు జెర్సీలో టీమిండియా!
సెప్టెంబర్ 19 నుంచి అధికారికంగా మొదలుకానున్న ఆసియా క్రీడలకు టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. సంప్రదాయ నీలం రంగు (Blue) జెర్సీకి బదులు నారింజ రంగు (Orange) జెర్సీ ధరించి టీమిండియా మ్యాచ్‌లు ఆడనున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కానప్పటికీ, ఆసియా క్రీడలకు మాత్రం టీమిండియా జెర్సీలో మార్పు ఖాయమన్న విషయం స్పష్టమవుతోంది. అయితే ఇటీవలే భారత హాకీ జట్టు మాత్రం కాషాయ రంగు జెర్సీ నుంచి బ్లూ జెర్సీలోకి మారిన సంగతి తెలిసిందే. రాబోయే ఆసియా క్రీడలకు కూడా మన హాకీ జట్టు ఆటగాళ్లు నీలం రంగు జెర్సీలతోనే బరిలోకి దిగనున్నట్లు ఇప్పటికే హాకీ ఇండియా స్పష్టం చేసింది. ఇప్పటికే వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్‌లు కాషాయ రంగు జెర్సీ ధరించిన ఫొటోలు (ఏఐ) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో నిజమెంత అనేది పక్కనబెడితే.. అభిమానులు మాత్రం నారింజ రంగు వద్దని, అచ్చొచ్చిన నీలం రంగు జెర్సీతోనే ఆసియా గేమ్స్‌లో పాల్గొనాలని కామెంట్లు చేశారు. కొందరు మాత్రం నారింజ, నీలం రంగులు కలిసిన జెర్సీని ధరిస్తే బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు.ఇక జపాన్‌లోని నగోయా వేదికగా సెప్టెంబర్ 10 నుంచే ఆసియా గేమ్స్ ప్రారంభమైనప్పటికీ అధికారికంగా మాత్రం సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్నాయి. మొత్తం 43 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇక పురుషుల క్రికెట్ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 మధ్య, మహిళల క్రికెట్ సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు జరగనున్నాయి. టాప్-10లో ఉండడంతో భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 28న ఆడనుంది. ఇక మహిళల క్రికెట్లో మాత్రం నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరగనుండగా, సెప్టెంబర్ 18న జరగనున్న క్వార్టర్ ఫైనల్లో జపాన్‌తో భారత్ తలపడనుంది.🚨 NEW JERSEY FOR TEAM INDIA IN ASIAN GAMES 2026 !🧡🇮🇳- According to reports, Team India are set to move away from their iconic blue jersey and feature a new orange kit at the upcoming Asian Games. [News Arena] pic.twitter.com/3NpG2VXkDT— lndian Sports Network (@IS_Netwrk29) September 12, 2026చదవండి: యూఏఈ క్రికెటర్‌పై నేపాల్ ఆటగాళ్ల దౌర్జన్యం! -
వైస్ కెప్టెన్ పదవి వచ్చినా హ్యాపీగా లేను.. తిలక్ వర్మ షాకింగ్ కామెంట్స్
-
క్రికెటర్ శ్రీశాంత్ ఇంట తీవ్ర విషాదం
భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి శాంతకుమారన్ నాయర్ (89) శుక్రవారం రాత్రి కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. శాంతకుమారన్ గత కొద్ది రోజులుగా హృదయ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలోనే ఉన్నారు. శాంతకుమారన్ ఎల్ఐసీలో జోనల్ మేనేజర్‌గా పని చేసి రిటైరయ్యారు. శాంతకుమారన్-సావిత్రి దేవి దంపతులకు నలుగురు సంతానం. వీరిలో చివరి సంతానం శ్రీశాంత్. శాంతకుమారన్ మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశాంత్ కుటుంబానికి పలువురు క్రికెటర్లు, అభిమానులు సానుభూతిని తెలియజేస్తున్నారు. శ్రీశాంత్ 2005-2011 మధ్యలో టీమిండియాకు ఆడాడు. దేశవాలీ క్రికెట్లో కేరళతో పాటు ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీల తరఫున సత్తా చాటాడు. శ్రీశాంత్ రెండు ప్రపంచకప్ విజయాల్లో భాగమయ్యాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్! -
సంజు దెబ్బకు వైభవ్ అవుట్, టీ 20 ప్లేయింగ్ 11 భారీ మార్పులు
-
భారత్-ఆఫ్ఘనిస్తాన్ తొలి టీ20 వాయిదా..?
భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అనుకోని సమస్య ఎదురైంది. సిరీస్‌లోని తొలి మ్యాచ్ వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. సెప్టెంబర్ 13న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను, భద్రతా కారణాల దృష్ట్యా ఒక రోజు వెనక్కి జరిపే అంశాన్ని నిర్వాహకులు పరిశీలిస్తున్నారు.తొలి టీ20 షెడ్యూలైన సెప్టెంబర్ 13నే ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు (BRICS Summit) జరుగనుంది. ఈ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో భద్రతా బలగాల మోహరింపు, వీఐపీ రాకపోకలు, ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కాబట్టి ఆటగాళ్ల భద్రతా ఏర్పాట్లలో సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే మ్యాచ్‌ను ఒక రోజు వాయిదా వేసి సెప్టెంబర్ 14న నిర్వహించాలని నిర్వహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. సంబంధిత అధికారుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇదిలా ఉంటే, తొలి టీ20తో పాటు భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ మొత్తం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరుగనుంది. తొలి టీ20 మినహా మిగతా మ్యాచ్‌ల నిర్వహణకు ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ఒకవేళ తొలి మ్యాచ్‌ను వాయిదా వేయాల్సి వస్తే.. మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మూడు టీ20లు సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో జరగాల్సి ఉన్నాయి. చదవండి: ఫిన్ అలెన్‌కు జాక్‌పాట్.. అత్యంత ఖరీదైన ఆటగాడు -
హాట్ కేకుల్లా...
ఆక్లాండ్: టీమిండియాతో వచ్చే నెలలో జరుగనున్న సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు టికెట్ల అమ్మకం ప్రారంభించింది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు ఐదు టి20లు, ఐదు వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. న్యూజిలాండ్‌తో భారత్ పూర్తి స్థాయి సిరీస్‌లు ఆడనుండటం ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి. దీంతో ఈ మ్యాచ్‌లు వీక్షించేందుకు అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. టికెట్ల విక్రయం ప్రారంభించిన రెండు రోజుల్లోనే 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. భారత్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 22న క్రైస్ట్‌చర్చ్‌లో తొలి టి20 జరగనుంది. ఆ తర్వాత 24న అక్కడే రెండో మ్యాచ్... 27న వెల్లింగ్టన్లో మూడో మ్యాచ్... 30న ఆక్లాండ్‌లో నాలుగో మ్యాచ్ జరుగుతాయి. నవంబర్ 1న హామిల్టన్ వేదికగా జరగనున్న చివరి మ్యచ్‌తో పొట్టి సిరీస్ ముగియనుంది. ‘క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగే రెండో టి20 మ్యాచ్ టికెట్లు దాదాపు అయిపోయాయి. మిగిలిన మ్యాచ్‌ల టికెట్లు కూడా వేగంగా అమ్ముడవుతున్నాయి. ఈడెన్ పార్క్‌లో అధిక డిమాండ్ ఉంది. 2019లో టీమిండియా న్యూజిలాండ్‌లో పర్యటించిన అనంతరం ఇంత పెద్ద మొత్తంలో టికెట్ల కోసం పోటీ కనిపించలేదు. దీంతో మైదానంలోని పై అంతస్తును కూడా అభిమానుల కోసం అందుబాటులోకి తేనున్నాం’ అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. టి20 సిరీస్ అనంతరం నవంబర్ 4న ఆక్లాండ్‌లో తొలి వన్డే... 7న వెల్లింగ్టన్లో రెండో వన్డే... 10న హామిల్టన్‌లో మూడో వన్డే నిర్వహించనున్నారు. నవంబర్ 13, 15న జరగనున్న చివరి రెండు వన్డే మ్యాచ్‌లు మౌంట్ మాంగనీలో జరుగుతాయి. అనంతరం నవంబర్ 19 నుంచి వెల్లింగ్టన్లో తొలి టెస్టు ప్రారంభమవుతుంది. క్రైస్ట్‌చర్చ్‌లో నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుతో ఈ పర్యటన ముగియనుంది. -
ఆసీస్ సిరీస్‌కు భారత జట్టులోకి సర్ప్రైజ్ ఎంట్రీ
త్వరలో ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగనున్న రెండు ఫార్మాట్ల సిరీస్‌కు భారత జట్లను ఇవాళ ప్రకటించారు. మల్టీ డే మ్యాచ్‌లకు దేవదత్ పడిక్కల్, వన్డే జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్లుగా ఎంపిక కాగా.. మల్టీ డే ఫార్మాట్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఓ ఆసక్తికర ఎంపిక జరిగింది.దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న విదర్భ ఆల్‌రౌండర్ నచికేత్ భూటేకు ఊహించని అవకాశం దక్కింది. నచికేత్ తొలిసారి భారత ఎ జట్టుకు ఎంపికయ్యాడు. గత రంజీ సీజన్లో 29 వికెట్లతో అదరగొట్టిన ఈ 26 ఏళ్ల ఆటగాడి కెరీర్‌పై ఓ లుక్కేద్దాం.రైట్ఆర్మ్ మీడియం పేసర్, రైట్‌హ్యాండ్ బ్యాటర్ అయిన నచికేత్.. కొత్త బంతితో అద్బుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేయడంలో దిట్ట. అలాగే లోయర్ ఆర్డర్లో కీలక బ్యాటర్ కూడా. 2018-19లో విదర్భ అండర్-19 జట్టు వినూ మన్కడ్ ట్రోఫీ సాధించడంలో నచికేత్ కీలకపాత్ర పోషించాడు. అనంతరం అండర్-23 స్థాయిలోనూ తన ప్రతిభ చాటాడు.2019-20 సీకే నాయుడు ట్రోఫీలోనూ నచికేత్ కీలక ప్రదర్శనలు చేశాడు. ఆ సీజన్లో అతడు 8 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు తీసి తన జట్టు టైటిల్ గెలవడంలో ప్రధానపాత్ర పోషించాడు.2021లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా సీనియర్ దేశవాళీ క్రికెట్లోకి అడుగుపెట్టిన నచికేత్.. ఆ తర్వాత లిస్ట్ ఎ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో కూడా అరంగేట్రం చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన నచికేత్ 50 వికెట్లు సాధించాడు. గత రంజీ సీజన్లో 29 వికెట్లు తీసిన నచికేత్ విదర్భ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. బ్యాటింగ్‌లోనూ నచికేత్ ఈ సీజన్లో (2 అర్ద సెంచరీల సాయంతో 196 పరుగులు) రాణించాడు. ఈ ప్రదర్శనలను పరిగణలోకి తీసుకొనే సెలెక్షన్ కమిటీ అతన్ని ఆసీస్ ఎతో సిరీస్‌కు ఎంపిక చేసింది.కాగా, ఆసీస్ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్లలో మరో ఆశ్చర్యకర ఎంపిక కూడా జరిగింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను వన్డే జట్టుకు ఎంపిక చేశారు. హార్దిక్ గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు భారత పర్యటనకు వస్తోంది. సెప్టెంబరు 22- అక్టోబరు 11 వరకు జరిగే ఈ రెండు సిరీస్‌లకు పుదుచ్చేరి వేదిక.ఆస్ట్రేలియా ‘ఎ’తో అనధికారిక టెస్టులకు భారత-‘ఎ’ జట్టుఅమన్ మోఖడే, ఆయుశ్ పాండే, దేవదత్ పడిక్కల్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), యశ్ రాథోడ్, షేక్ రషీద్, కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), షామ్స్ ములాని, తనుష్ కొటియాన్, తుషార్ దేశ్‌పాండే, అన్షుల్ కాంబోజ్, ప్రఫుల్ హింగే, నారాయణన్ జగదీశన్ (వికెట్ కీపర్), నచికేత్ భూటే, వి వైశాక్* (ఫిట్నెస్ ఆధారంగా).ఆసీస్ ‘ఎ’తో అనధికారిక వన్డేలకు భారత-‘ఎ’ జట్టుప్రియాన్ష్ ఆర్య, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), నిశాంత్ సింధు, విప్రాజ్ నిగమ్, అర్షిన్ కులకర్ణి, అర్షద్ ఖాన్, నమన్ ధిర్, హార్దిక్ పాండ్యా (ఫిట్నెస్ ఆధారంగా), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), గుర్జప్రీత్ సింగ్, యశ్ ఠాకూర్.చదవండి: IND vs AUS: భారత జట్టు ప్రకటన.. హార్దిక్ పాండ్యాకు చోటు -
ఏకంగా రూ. 130 కోట్లు!.. ఎవరు ఎంత చెల్లిస్తారంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వచ్చే రెండేళ్ల పాటు స్వదేశంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లకు సంబంధించి మూడు సంస్థలను అసోసియేట్ స్పాన్సర్లుగా ఎంచుకుంది.క్యాంపా కోలా, ఎస్బీఐ లైఫ్‌తో పాటు చాట్ జీపీటీతో బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెలలో ప్రారంభమయ్యే వెస్టిండీస్‌తో సిరీస్ మొదలు 2028 మార్చి కొనసాగే ఈ కాంట్రాక్ట్‌లో భారత్ 35 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది.ఈ స్పాన్సర్షిప్ విలువ సుమారు రూ.130 కోట్లుగా ఉందని ప్రకటించిన బీసీసీఐ... గతంతో పోలిస్తే ఇది దాదాపు 44 శాతం ఎక్కువ అని ప్రకటించింది. విడివిడిగా బోర్డు వివరాలు వెల్లడించలేదు. అయితే మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఒక్కో మ్యాచ్‌కు క్యాంపా కోలా రూ.1.31 కోట్లను చెల్లించనుండగా... ఎస్బీఐ లైఫ్, చాట్ జీపీటీ మ్యాచ్‌కు రూ.1.20 కోట్లు చొప్పున చెల్లిస్తాయి.ఇదీ చదవండిమెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) తమ టీ20 లీగ్ టోర్నీ ‘బిగ్‌బాష్‘ను 15 సీజన్ల పాటు నిర్వహించింది. ఇప్పటి వరకు టోరీ్నకి సొంతదారుగా సీఏనే వ్యవహరించింది. జట్లతో పాటు టోర్నీల నిర్వహణ, ఆటగాళ్ల ఎంపికవంటి అంశాలన్నీ స్వయంగా బోర్డు పర్యవేక్షణలోనే జరిగాయి. అయితే ఇప్పుడు లీగ్‌లో ప్రైవేట్ సంస్థలను భాగస్వాములను చేయాలని సీఏ నిర్ణయించింది. లీగ్‌లో ప్రైవేట్ పెట్టుబడుల అనుమతికి అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. ఈ క్రమంలో ముందుగా మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టులో 100 శాతం వాటా అమ్మకానికి పచ్చ జెండా ఊపింది. ఆటగాళ్ల చెల్లింపులు, టీమ్ విలువ, క్రికెటర్స్ అసోసియేషన్‌తో సంప్రదింపులు వంటి అంశాలపై ఇంకా పూర్తి స్పష్టత రాకపోయినా సీఏ ముందుకు వెళ్లడం ఆసీస్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇవన్నీ తేలిన తర్వాతే బిగ్ బాష్‌కు సంబంధించిన ఎంఓయూలపై ఒప్పందం కుదరవచ్చని తెలుస్తోంది. -
అద్భుత ఫామ్‌ను కొనసాగించిన పడిక్కల్
టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో (టెస్టు సిరీస్‌లో) వరుసగా రెండు సెంచరీలు సాధించిన అతడు.. ప్రస్తుతం జరుగుతన్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో కీలకమైన అర్ద సెంచరీతో సత్తా చాటాడు.ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సౌత్ జోన్ తరఫున బరిలోకి దిగిన పడిక్కల్, తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు చాలా ముఖ్యమైన పరుగులు సాధించాడు. కేవలం 65 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతడు.. మొత్తం 104 బంతులు ఎదుర్కొని 4 ఫోర్ల సాయంతో 60 పరుగులు చేసి ఔటయ్యాడు.పడక్కిల్ అర్ద సెంచరీతో రాణించినప్పటికీ.. సౌత్ జోన్ కష్టాలు కొనసాగుతున్నాయి. మూడో రోజు టీ విరామం సమయానికి ఆ జట్టు కేవలం 176 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. రికీ భుయ్ (1), నారాయణ్ జగదీశన్ (32), పడిక్కల్ (62), షేక్ రషీద్ (27), స్మరణ్ రవిచంద్రన్ (23) ఔట్ కాగా.. కెప్టెన్ తిలక్ వర్మ (18), శ్రేయస్ గోపాల్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఈస్ట్ జోన్ బౌలర్లలో షమీ, ముకేశ్ కుమార్ తలో 2 వికెట్లు తీయగా.. శిఖర్ మోహన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన స్కోర్‌కు సౌత్ జోన్ ఇంకా 532 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇషాన్ కిషన్ ఏకంగా 270 పరుగులతో చెలరేగాడు. కుమార్ కుషాగ్రా (101) సెంచరీతో సత్తా చాటాడు. అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (44), అనుకూల్ రాయ్ (45), కౌనైన్ ఖురేషి (40) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. త్రిపురణ విజయ్ 4 వికెట్లతో రాణించాడు. చదవండి: వారెవ్వా వైభవ్ సూర్యవంశీ!.. ఇషాన్‌ను ఒప్పించి మరీ! -
రెచ్చిపోయిన కేకేఆర్ బ్యాటర్; 9 ఫోర్లు, 5 సిక్సర్లతో విధ్వంసం
షేర్-ఇ-పంజాబ్ టీ20 లీగ్‌లో మొహలీ కింగ్స్ వరుస విజయాలతో దుమ్మురేపుతుంది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ రమన్‌దీప్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. తాజాగా సోమవారం లుధియానా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రమన్‌దీప్ విధ్వంసంతో మొహలీ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లుధియానా లయన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అర్జున్ రాజ్‌పుత్ (46 బంతుల్లో 78), అభిజిత్ గార్గ్ (48 బంతుల్లో 78) రాణించడంతో లుధియానా భారీ స్కోరు చేసింది. మొహాలీ కింగ్స్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 3 వికెట్లు తీయగా, రమన్‌దీప్ సింగ్ 2, ఆయుశ్ గోయల్ ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన మొహాలీ కింగ్స్ సరిగ్గా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసి గెలుపొందింది. రమన్‌దీప్ (35 బంతుల్లో 85; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా, అన్మోల్ప్రీత్ సింగ్ (50) అర్థసెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 41 బంతుల్లోనే 86 పరుగులు జోడించడంతో మొహాలీ విజయం దిశగా పరిగెత్తింది. బౌలింగ్‌లో రెండు వికెట్లు, బ్యాటింగ్‌లో 85 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్‌తో మెరిసిన రమన్‌దీప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఆరు మ్యాచ్‌ల్లో మొహలీ కింగ్స్‌కు ఇది నాలుగో విజయం కాగా, పట్టికలో తొలి స్థానంలో కొనసాగుతోంది. 5 మ్యాచ్‌ల్లో మూడు ఓటములతో లుధియానా ఐదో స్థానంలో కొనసాగుతోంది.ఇక రమణ్‌దీప్ విషయానికి వస్తే.. టీమిండియా తరపున కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 2024లో సౌతాఫ్రికా టూర్లో ఆడిన రమణ్‌దీప్‌కు తర్వాత భారత జట్టులో చోటు దక్కలేదు. ఇండియా-ఎ టీమ్‌లో మాత్రం అతడు కీలక సభ్యునిగా ఉన్నాడు. ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో మరింత మెరుగ్గా రాణించి సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలని ఈ పంజాబ్ ఆల్‌రౌండర్ భావిస్తున్నాడు.85(34) with the bat.🌟2/31 (4) with the ball.🤛Ramandeep Singh owned the game from start to finish. A true all-round Masterclass. 💜🔥 pic.twitter.com/s0HyFEbJcS— Rokte Amar KKR (@Rokte_Amarr_KKR) September 7, 2026Read: కసితీరా బాదిన అభిషేక్.. గిల్‌పై ప్రతీకారం! -
సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..
-
‘ఆమె ఒప్పుకొంటే సరే.. లేదంటే విడాకులే’
టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌కు మిశ్రమ ఫలితాలు అందుకుంటున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఈ మాజీ క్రికెటర్‌కు మంచి మార్కులే పడుతున్నా.. టెస్టుల్లో మాత్రం ఇప్పటికే ఎన్నో ఘోర పరాభవాలు చవిచూశాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో భారత్ 1-0తో సిరీస్ గెలిచినా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2027 చేరాలంటే.. న్యూజిలాండ్ రూపంలో కఠిన సవాలు ఎదుర్కోవాల్సి ఉంది.రేసులో ఆ పేరు కూడాకివీస్ పర్యటనలో గనుక టీమిండియా అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోతే గంభీర్‌పై విమర్శలు తప్పవు. ఇక గంభీర్ గనుక మరోసారి విఫలమైతే అతడి స్థానంలో హెడ్‌కోచ్ రేసులో వీవీఎస్ లక్ష్మణ్ ముందు వరుసలో ఉన్నాడు. గతంలో ఆశిష్ నెహ్రా పేరు సైతం ప్రముఖంగా వినిపించింది.ఈ పరిణామాల నేపథ్యంలో ఆశిష్ నెహ్రా తాజాగా ఈ విషయంపై స్పందించాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న నెహ్రాకు టీమిండియా హెడ్‌కోచ్ కావాలనే ఆశయం ఉందా అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ..అంతపెద్ద మాటలు వద్దు‘‘నేనసలు ఆశయం అనే పదాన్ని ఉపయోగించాలనుకోవడం లేదు. నేనెప్పుడూ ముందుగా ఇలాంటి ప్రణాళికలు రచించుకోను. ఏదేమైనా టీమిండియా హెడ్‌కోచ్ అవడం గొప్ప గౌరవం. కానీ ఇప్పుడు నేనేమీ ప్లాన్ చేసుకోలేదు. భవిష్యత్తులో పదవి వరిస్తే మాత్రం కాదనకపోవచ్చు.ప్రస్తుతం నాకున్న పనితో సంతోషంగా ఉన్నాను. గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా నేను విజయవంతమయ్యానని చాలా మంది అంటూ ఉంటారు. అయితే, కేవలం కోచ్ వల్ల ఏమీ కాదు. జట్టు ప్రదర్శన బాగుంటేనే విజయాలు వరిస్తాయి. ముఖ్యంగా కెప్టెన్, కోచ్ మధ్య సమన్వయం ఉంటే అంతా సజావుగా సాగిపోతుంది.ఆమె ఒప్పుకోవాలి.. లేదంటే విడాకులేటీమిండియా హెడ్‌కోచ్ కావాలనే కోరిక ప్రస్తుతానికి లేదు. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే ముందుగా హై కమిషన్.. అంటే నా భార్య (రుష్మా నెహ్రా)ను సంప్రదిస్తా. ఆమెకు చెప్పకుండా ఏమైనా చేశానంటే విడాకులు ఇచ్చేస్తుంది. ఎందుకంటే టీమిండియా షెడ్యూల్ బిజీగా ఉంటుంది.ఏడాదిలో ఎనిమిది నుంచి తొమ్మిది నెలల పాటు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి’’ అని భారత మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు. కాగా 2022లో ఐపీఎల్లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ ఆశిష్ నెహ్రా మార్గదర్శనంలో.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో అరంగేట్రంలోనే చాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత 2023లో హార్దిక్ సారథ్యంలో.. 2026 సీజన్లో శుబ్‌మన్ గిల్ నాయకత్వంలో ఫైనల్‌కు చేరింది. చదవండి: నష్రా సంధుకు ఆరు వికెట్లు.. సెమీ ఫైనల్లో పాకిస్తాన్ -
పాక్‌లో భారత జట్ల పర్యటనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
పాకిస్తాన్లో వచ్చే ఏడాది జరగనున్న సౌత్ ఏషియన్ ఫెడరేషన్ (SAF) గేమ్స్‌కు భారత్ తమ బృందాన్ని పంపేందుకు సమ్మతి తెలిపినట్లు ఆ దేశ మీడియా చెప్పుకుంటుంది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్లో జరిగే క్రీడా పోటీలకు భారత బృందం నిజంగానే వెళ్తుందా అని భారతీయులు చర్చించుకుంటున్నారు.SAF గేమ్స్‌లో పాల్గొనేందుకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పాకిస్తాన్ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ ఖాలిద్ మెహమూద్ వెల్లడించినట్లు 'ది న్యూస్ పాకిస్తాన్' అనే వార్తా సంస్థ పేర్కొంది.ది న్యూస్ పాకిస్తాన్ కథనం ప్రకారం.. దక్షిణాసియా ఒలింపిక్ అసోసియేషన్‌కు సంబంధించిన ఉన్నతస్థాయి సమావేశంలో భారత్‌కు ప్రాతినిధ్యం ఉందని మెహమూద్ తెలిపారు. భారత్ నుంచి ఎంత మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటారు.. ఏయే క్రీడాంశాల్లో బరిలోకి దిగుతారు.. అనే వివరాలు వచ్చే ఏడాది జనవరిలో వెల్లడించే అవకాశం ఉందని ఆయన అన్నారు.SAF గేమ్స్‌లో క్రికెట్, హాకీ సహా 28 క్రీడాంశాలు ఉంటాయి. భారత హాకీ జట్టు చివరిగా 2006లో పాక్‌లో పర్యటించగా.. భారత క్రికెట్ జట్టు చివరిగా 2008లో పాక్‌లో పర్యటించింది. చదవండి: టీమిండియా ప్లేయర్‌పై పాక్ అభిమానుల అభ్యంతరకర వ్యాఖ్యలు -
టీమిండియా ప్లేయర్‌పై పాక్ అభిమానుల అభ్యంతరకర వ్యాఖ్యలు
మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా శనివారం జరిగిన భారత్-పాకిస్తాన్ గ్రూప్ స్టేజీ మ్యాచ్ మరో వివాదానికి దారితీసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ పేసర్ క్రాంతి గౌడ్‌పై పాక్ అభిమానులు లింగ వివక్షతో కూడిన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.The people are a reflection of the country 🤡 pic.twitter.com/4WzNwWfy96— Out Of Context Cricket (@GemsOfCricket) September 6, 2026టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న క్రాంతి గౌడ్‌ను ఉద్దేశించి కొందరు ప్రేక్షకులు (పాకిస్తాన్‌కు చెందిన వారుగా అనుమానం) ఆమె లింగం, రూపురేఖలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు వినిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, ఇలాంటి చెత్త ప్రవర్తన పాకిస్తాన్ అభిమానులకు మాత్రమే సాధ్యమని అంటున్నారు. మహిళా క్రీడాకారిణులపై ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా ఆమోదయోగ్యం కాదని కొందరు మండిపడుతున్నారు.ఇదిలా ఉంటే, ఆసియా కప్ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు భారత స్పిన్నర్ల ధాటికి 18.1 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ 8.4 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. చదవండి: షఫాలీ పట్ల దురుసు ప్రవర్తన.. మూల్యం చెల్లించుకున్న పాక్ కెప్టెన్ -
ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్
-
అక్కడ శ్రేయస్ అయ్యర్.. ఇక్కడ శుబ్‌మన్ గిల్!
దాదాపు ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత భారత పురుషుల క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఒకేరోజు ‘టీమిండియా’ రెండు మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమైంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీ20 జట్టు.. శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలో వన్డే జట్టు ప్రత్యర్థులతో అమీతుమీ తేల్చుకోనున్నాయి.ఒకేరోజు టీమిండియా రెండు మ్యాచ్లుఇంతకీ ఆరోజు ఎప్పుడంటారా?.. అక్టోబరు 3. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు వెస్టిండీస్ జట్టు భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీమిండియా- విండీస్ మధ్య సెప్టెంబరు 27, 30.. అక్టోబరు 3న వన్డే సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.న్యూ చండీగఢ్ వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య అక్టోబరు 3న మూడో వన్డే జరుగనుంది. మరోవైపు.. జపాన్ వేదికగా ఆసియా క్రీడలు-2026 టోర్నీ అక్టోబరు 3న ముగియనుంది. అదే రోజు పురుషుల క్రికెట్లో కాంస్య పతక పోరుతో పాటు ఫైనల్ జరుగనుంది.ఇక గత ఎడిషన్‌లో స్వర్ణం సాధించిన టీమిండియా.. ఈసారి నేరుగా ఆసియా క్రీడల క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 2023లో రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో ద్వితీయ శ్రేణి జట్టు చైనాలో పసిడి పతకం గెలవగా.. ఈసారి పూర్తిస్థాయిలో రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత టీ20 జట్టు జపాన్‌కు వెళ్లనుంది.గతంలోనూ ఇదే తరహాలోస్థాయిని బట్టి చూస్తే టీమిండియా ఈసారి కూడా ఫైనల్ ఆడటం లాంఛనమేనని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు భారత్‌లో గిల్ కెప్టెన్సీలో వన్డే జట్టు.. అటు జపాన్‌లో టీ20 జట్టు అక్టోబరు 3న మ్యాచ్‌లు ఆడనున్నాయి. కాగా 1998, సెప్టెంబరు 12న కూడా ఇలాంటి ఘటనే జరిగింది.నాడు కౌలలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సచిన్ టెండుల్కర్, అనిల్ కుంబ్లే, అజయ్ జడేజా, వీవీఎస్ లక్ష్మణ్‌లతో కూడిన భారత జట్టు.. కెనడాను 112 పరుగుల తేడాతో ఓడించింది. అదే రోజు.. మహ్మద్ అజారుద్దీన్ సారథ్యంలో టొరంటో వేదికగా సహారా ఫ్రెండ్షిప్ కప్‌లో భాగంగా టీమిండియా పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడింది. ఇందులో సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, నవజోత్ సింగ్ సిద్ధు, జవగళ్ శ్రీనాథ్, అజిత్ అగార్కర్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. నాటి ఈ మ్యాచ్‌లో భారత్ పాక్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.చదవండి: ఇషాన్ కిషన్‌కు గాయం! -
250 రిటైర్డ్ హర్ట్.. చరిత్రలో మూడో బ్యాటర్‌గా ఇషాన్ కిషన్
సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. అతడికి కుమార్ కుషాగ్రా (101), శికర్ మోహన్ (85), అభిమన్యు ఈశ్వరన్ (72), వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ (44), అనుకూల్ రాయ్ (45) కూడా తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఈస్ట్ జోన్ అతి భారీ స్కోర్ దిశగా సాగుతోంది.రెండో రోజు టీ విరామ సమయానికి ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 626 పరుగులు చేసింది. మొహమ్మద్ ఖురేషి (6 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. టీ విరామానికి ముందు అనుకూల్ రాయ్ ఔటయ్యాడు. సౌత్ జోన్ బౌలర్లలో త్రిపురణ విజయ్, చామ మిలింద్ తలో 2 వికెట్లు తీయగా.. షేక్ రషీద్‌కు ఓ వికెట్ దక్కింది. అభిమన్యు ఈశ్వరన్ రనౌటయ్యాడు.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో కదంతొక్కిన ఇషాన్ కిషన్ పలు అరుదైన ఘనతలు సాధించాడు. రామన్ లాంబా (320), అన్షుమన్ గైక్వాడ్ (216), చటేశ్వర్ పుజారా (256), యశస్వి జైస్వాల్ (209) తర్వాత దులీప్ ట్రోఫీ ఫైనల్లో డబుల్ సెంచరీ చేసిన ఐదో బ్యాటర్‌గా, 65 ఏళ్ల దులీప్ ట్రోఫీ చరిత్రలో 250 పరుగుల మార్కును తాకిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు.డబుల్ సెంచరీకి ముందే ఇషాన్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 4000 పరుగులు కూడా పూర్తి చేశాడు. 2014లో ఈ ఫార్మాట్లోకి అరంగేట్రం చేసిన ఇషాన్.. ఇప్పటివరకు 10 సెంచరీలు, 19 అర్ద సెంచరీలు చేశాడు.కాగా, ప్రస్తుత మ్యాచ్‌లో ఇషాన్ 250 పరుగుల తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. 85 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బంతి పొత్తి కడుపులో బలంగా తాకడం వల్ల ఇషాన్ అసౌకర్యానికి గురయ్యాడు. అప్పుడే అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెళ్తాడని అంతా అనుకున్నారు. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజ్‌లో నిలబడిన ఇషాన్ సెంచరీ పూర్తి చేయడమే కాకుండా డబుల్ సెంచరీ, 250 మార్కును కూడా తాకాడు.చదవండి: ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. 26 ఫోర్లు, 2 సిక్స్‌లతో -
మానవ్ సుతార్ జోరు.. కౌంటీలో ఇరగదీస్తున్న భారత ఆటగాళ్లు
టీమిండియా రైజింగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ కౌంటీ చాంపియన్‌షిప్‌లోనూ అదరగొడుతున్నాడు. వార్విక్షైర్ తరఫున ఆడుతున్న మానవ్ సుతార్ తన స్పిన్ మ్యాజిక్‌తో హాంప్‌షైర్‌తో మ్యాచ్‌లో ఏడు వికెట్ల హాల్ (తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు) నమోదు చేయడం విశేషం. మానవ్ సుతార్ విజృంభణ కారణంగా వార్విక్షైర్ ఇన్నింగ్స్ 129 పరుగుల తేడాతో హాంప్‌షైర్‌పై ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్ 398 పరుగులకు ఆలౌటైంది. అనంతరం హాంప్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 115, రెండో ఇన్నింగ్స్‌లో 154 పరుగులకు కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు వేసిన మానవ్ సుతార్ 42 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 23.3 ఓవర్లు వేసి 52 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కౌంటీ ఆడడానికి ముందు శ్రీలంక పర్యటనలోనూ మానవ్ సుతార్ దుమ్మురేపాడు. రెండు టెస్టులు కలిపి 11 వికెట్లు పడగొట్టిన సుతార్ ఖాతాలో ఒక ఐదు వికెట్ల హాల్ ఉండడం విశేషం. రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత పలుచబడిన స్పిన్ విభాగంలో మానవ్ సుతార్ తన మ్యాజిక్‌తో భారత జట్టులో కొత్త ఆశలు రేపుతున్నాడు.ఇరగదీసిన చాహల్, అకిబ్ నబీఇక కౌంటీల్లో మానవ్ సుతార్‌తో పాటు మిగతా భారత బౌలర్లు కూడా తమ ప్రదర్శనతో అదరగొట్టారు. జమ్మూ కశ్మీర్ సంచలనం అకిబ్ నబీ కూడా అదిరిపోయే అరంగేట్రం చేశాడు. తొలిసారి కౌంటీల్లో ఆడుతున్న ఈ బారాముల్లా ఎక్స్‌ప్రెస్ సర్రే తరఫున రెండు కీలక వికెట్లు తీసి యార్క్‌షైర్‌పై విజయం సాధించడంలో ప్రధానపాత్ర పోషించాడు. మరో టీమిండియా సీనియర్ యజ్వేంద్ర చాహల్కూడా నార్తంప్టన్‌షైర్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు తీసిన చాహల్ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల హాల్ నమోదు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లోనూ చాహల్ అదరగొట్టాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఈ సీజన్లో చాహల్ 14 వికెట్లు తీశాడు.Manav Suthar vs Hampshire: 3/42 in the 1st inns4/52 in the 2nd innsOutstanding bowling touch in last few months for Indian spinner... 🔥pic.twitter.com/uTrBKhD1OS— CricketGully (@thecricketgully) September 5, 2026చదవండి: వైరలవుతున్న అల్కరాజ్ బనియన్ .. ఇదేం కర్మరా దేవుడా! -
రోహిత్ కొత్త అవతారం.. ‘రిటైర్మెంట్ తర్వాత చేసే పని ఇదేనా’
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త అవతారం ఎత్తాడు. సెప్టెంబర్ 19 నుంచి సోనీ ఎంటర్టైన్మెంట్, సోనీ లివ్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్న కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మ హోస్ట్‌గా వ్యవహరించనున్న షో పేరు "ఫ్యామిలీ ఫుల్హౌస్ విత్ రోహిత్ శర్మ". ఈ షోలో మల్టీ జనరేషన్ టీమ్స్ పాల్గొననున్నాయి. ఇప్పటిదాకా మైదానంలో బ్యాట్ పట్టి అభిమానులను అలరించిన హిట్‌మ్యాన్ ఇకపై గ్రీన్ మ్యాట్‌పై షోకు విచ్చేసే కుటుంబాలు చెప్పే కథలను కెమెరా, లైటింగ్ మధ్య విననున్నాడు. స్వతహాగా మంచి మాటకారి అయిన రోహిత్‌ను షోకు హోస్ట్‌గా ఎంపిక చేయడంతోనే సోనీ ఎంటర్టైన్మెంట్ సగం విజయం సాధించేసింది. ఇక రోహిత్ తన కామెడీ టైమింగ్‌తో షోను ఎంత మేర నడిపిస్తాడనేది చూడాలి. ఇప్పటికే ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమో కట్స్, అందులో రోహిత్ చేస్తున్న అల్లరి అభిమానులను పూర్తిగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఆటకు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత చేయబోయే పని కూడా ఇదేనని అభిమానులు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.ఇప్పటికే టెస్టులకు, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 వన్డే వరల్డ్‌కప్ రోహిత్ శర్మకు చివరి టోర్నీ అయ్యే అవకాశం లేకపోలేదు. కాగా రోహిత్ రిటైర్మెంట్పై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా రోహిత్ జట్టులో ఉంటాడని, అతడి గురించి అనవసర ఊహాగానాలు చేయడం ఆపేయాలని హితవు పలికాడు. ఇక రోహిత్ శర్మ టీమిండియా తరఫున తన చివరి వన్డే మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో ఆడాడు. లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేలో రోహిత్ సెంచరీతో మెరిశాడు. ఓవరాల్‌గా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మూడు వన్డేలు కలిపి 175 పరుగులు చేశాడు.Garden Se Reporting Live, Jersey No. 45 😉Family Full House With Rohit Sharma!Shuru ho raha hai 19th September se, sirf #SonyEntertainmentTelevision aur Sony LIV par.#RohitSharma#FamilyFullHouse#ComingSoon #SonyTV@ImRo45 pic.twitter.com/DGWRp6Epzv— sonytv (@SonyTV) September 5, 2026చదవండి: భారత్‌తో మ్యాచ్.. విజయం మాదే! పాక్ ప్లేయర్ సంచలన కామెంట్స్ -
వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా
-
'లోకల్ ఫైట్'లోకి శుభ్‌మన్ గిల్
టీమిండియా స్టార్ బ్యాటర్, భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ లోకల్ ఫైట్‌లోకి దిగనున్నాడు. తన సొంత రాష్ట్రం పంజాబ్‌లో జరిగే షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు. ఈ టోర్నీలో గిల్ ఫజిల్కా ఫాల్కన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. సెప్టెంబర్ 5న బటిండా రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగే అవకాశం ఉంది. దీని కోసం గిల్ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కారణంగా గిల్ షేర్-ఎ-పంజాబ్ టోర్నీలో తొలి మూడు మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. అతని గైర్హాజరీలో సన్వీర్ సింగ్ జట్టుకు నాయకత్వం వహించాడు. అతడి సారథ్యంలో ఫాల్కన్స్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఆరు జట్ల పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.షేర్-ఎ-పంజాబ్ టోర్నీలో గిల్‌తో పాటు టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ, పేసర్ అర్ష్‌దీప్ సింగ్, పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్, ముంబై ఇండియన్స్ ఆటగాడు నమన్ ధిర్ తదితర స్టార్లు కూడా ఆడుతున్నారు.టీ20 జట్టులోకి పునరాగమనమే లక్ష్యంభారత టీ20 జట్టులో పునరాగమనమే లక్ష్యంగా గిల్ షేర్-ఎ-పంజాబ్ టోర్నీలో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది చివరి వరకు గిల్ భారత టీ20 జట్టులో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్‌గా ఆడాడు. 2025 ఆసియా కప్ గెలిచిన భారత జట్టులోనూ అతడు సభ్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ల్లోనూ జట్టులో కొనసాగాడు.అయితే టీ20ల్లో ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోవడంతో సెలెక్టర్లు అతడిని జట్టు నుంచి తప్పించారు. అతని స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం ఇచ్చారు.డిసెంబర్ 2025లో తన 36వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన తర్వాత గిల్ ఇప్పటివరకు టీ20 జట్టులోకి తిరిగి రాలేదు. షేర్-ఎ-పంజాబ్ లీగ్‌లో మంచి ప్రదర్శన చేసి టీమిండియాలోకి పునరాగమనం చేయాలని అతడు పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తోంది. చదవండి: నేడు పాకిస్తాన్‌తో భారత్ ఢీ -
కౌంటీల్లో తొలి వికెట్ సాధించిన కశ్మీర్ సంచలనం
కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆడుతున్న జమ్మూ కశ్మీర్ సంచలనం అకిబ్ నబీ మెయిడెన్ వికెట్ సాధించాడు. సీజన్లో సర్రే తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అకిబ్ నబీ భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఔట్ చేయడం ద్వారా కౌంటీల్లో తొలి వికెట్ పొందాడు. యార్క్‌షైర్‌తో మ్యాచ్ సందర్భంగా నబీ వేసిన బంతిని ఆడే క్రమంలో కుల్దీప్ స్లిప్‌లో ఆడి కార్డన్కు దొరికిపోయాడు. దీంతో అప్పటివరకు ఉన్న పార్టనర్షిప్ బ్రేక్ అవ్వడంతో పాటు 53 బంతుల తర్వాత వికెట్ లభించినట్లయింది. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయంది.ఇక జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లాకు చెందిన అకిబ్ నబీ గత నెలలో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. కానీ సిరీస్‌లో మ్యాచ్ ఆడే అవకాశం అతడికి రాలేదు. దీంతో సిరీస్ ముగిసిన వెంటనే కౌంటీల్లో ఆడేందుకు ఇంగ్లండ్ చేరుకున్నాడు. కెరీర్లో తొలిసారి కౌంటీ ఆడుతున్న అకిబ్ నబీ తన బౌలింగ్ మెరుపులను ఇంగ్లీష్ గడ్డపై ప్రత్యర్థులకు రుచి చూపించే పనిలో పడ్డాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఉండడంతో కౌంటీల్లో సత్తా చాటి మరోసారి జట్టుకు ఎంపికవ్వాలని అకిబ్ నబీ భావిస్తున్నాడు. ఇక మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీసిన నబీ రెండో ఇన్నింగ్స్‌లో జేమ్స్ వార్టన్‌ను ఔట్ చేసి రెండో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మ్యాచ్‌లో సర్రే జట్టు విజయం దిశగా నడుస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సర్రే జట్టు వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది.దేశవాళీలో సంచలన ప్రదర్శనఇక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో జమ్మూ కశ్మీర్ తరఫున అకిబ్ నబీ వరుసగా రెండేళ్లు సంచల ప్రదర్శన నమోదు చేశాడు. 2025-26 రంజీ సీజన్లో అకిబ్ నబీ 60 వికెట్లు పడగొట్టి జమ్మూ కశ్మీర్ టైటిల్ అందుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే అకిబ్ నబీ 43 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 162 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతోనే అకిబ్ నబీ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు రూ. 8.4 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాడు. కౌంటీ ముగిసిన తర్వాత అకిబ్ నబీ స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరగనున్న రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాడు. అంతేకాదు న్యూజిలాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు బీసీసీఐ మదిలో ఉన్న ఐదుగురు ఫాస్ట్ బౌలర్లలో అకిబ్ నబీ పేరు కూడా ఉండడం విశేషం.Auqib Nabi gets his first Surrey wicket as Kuldeep Yadav is caught at second slip by Ollie Pope. ✅Yorkshire 170/8 at the Kia Oval.🤎 | #CountyChampionship pic.twitter.com/VXVuEeI4mA— Surrey Cricket (@surreycricket) September 3, 2026Read: చివరి గ్రాండ్‌స్లామ్ ఆడిన ఫ్రెంచ్ ఐకాన్.. భార్య ఎవరో తెలిస్తే షాక్! -
వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ ప్రత్యేక నిఘా!
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించనుంది. పిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అరేంగట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ కెరీర్ తొందరగా ముగియకూడదనే ఉద్దేశంతో ప్రత్యేక ప్రణాళికలు చేపట్టనుంది. వైభవ్‌ను చూస్తుంటే భవిష్యత్తు సచిన్‌లా కనిపిస్తున్న తరుణంలోనే అతడి కెరీర్ ఒక్క సిరీస్, ఏడాది లేదా రెండేళ్లకే పరిమితం కాకూడదని, అతడి కెరీర్ సుదీర్ఘంగా సాగాలని బీసీసీఐ భావిస్తోంది. వైభవ్‌తో పాటు ప్రతిభ చూపుతున్న యువ ఆటగాళ్లకు సరైన మార్గదర్శకత్వం, సహకారం అందించాలని ముంబైలో గురువారం నిర్వహించిన బీసీసీఐ కీలక సమావేశంలో నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఆటగాడిని ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. సచిన్ టెండూల్కర్‌లా వైభవ్ సూర్యవంశీ దేశానికి సుదీర్ఘకాలం సేవలందించే ఆటగాడిగా ఎదగాలని బీసీసీఐ కోరుకుంటోందని చెప్పారు. అతడి కెరీర్‌ను ప్రతి దశలోనూ నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్, టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సీవోఈ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.ఇటీవలే వైభవ్ 15 ఏళ్ల 157 రోజుల వయసులో దులీప్ ట్రోఫీ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అర్ధశతకం చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 57 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. భారత్ ఆ సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ద్వారా భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అతడు 776 పరుగులు చేశాడు. 237.30 స్ట్రైక్‌రేట్‌తో ఆడాడు. ఒక సెంచరీ, ఐదు అర్ధశతకాలు బాదాడు. 72 సిక్సర్లతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.చదవండి: హాంకాంగ్‌పై విజయం.. స్మృతి మంధాన కన్నీటిపర్యంతం! -
మరోసారి చెలరేగిన భువీ.. టీమిండియా సెలెక్టర్లకు సవాల్
టీమిండియాకు దూరమైన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి తన సత్తా చాటాడు. యూపీ టీ20 లీగ్ 2026లో లక్నో ఫాల్కన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. నిన్న మీరట్ మావెరిక్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో అబ్బురపడే ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్ 19.4 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. జీషన్ అన్సారీ (4-0-14-3) అద్భుతంగా బౌలింగ్ చేసి ఫాల్కన్స్‌ను కట్టడి చేశాడు. అతడకి కార్తీక్ త్యాగి (4-0-38-2), విశాల్ చౌదరి (4-0-23-1) సహకరించారు. ఫాల్కన్స్ ఇన్నింగ్స్‌లో హిమాన్షు సింగ్ (61) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.అనంతరం 146 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భువనేశ్వర్ కుమార్ మ్యాజిక్ చేశాడు. అతడికి అభినందన్ సింగ్ (4-0-28-2), కృష్ణ్ కుమార్ సరోజ్ (4-0-20-1), విప్రాజ్ నిగమ్ (4-0-15-1) కూడా తోడవడంతో రింకూ సింగ్ నేతృత్వంలోని మీరట్ మావెరిక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 98 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఫాల్కన్స్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. మావెరిక్స్ తరఫున రింకూ సింగ్ (34), జీషన్ అన్సారీ (30 నాటౌట్) పోరాటం చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.కాగా, యూపీ టీ20 లీగ్ ప్రస్తుత సీజన్లో భువీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. పలు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేసి, తన జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 5.88 ఎకానమీతో 13 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఐపీఎల్ 2026లోనూ భువీ అద్భుత ప్రదర్శన చేశాడు. ఆర్సీబీ తరఫున 16 ఇన్నింగ్స్‌ల్లో 28 వికెట్లు పడగొట్టి, జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు 2025 సీజన్లోనూ 17 వికెట్లతో సత్తా చాటి ఆర్సీబీకి తొలి టైటిల్ గెలిపించాడు. మొత్తంగా ఆర్సీబీ తరఫున గత రెండు సీజన్లలో ఏకంగా 45 వికెట్లు సాధించాడు.ఈ అద్భుత ప్రదర్శనల తర్వాత భువీ తిరిగి టీమిండియా వైపు చూస్తున్నాడు. 2022 నవంబర్‌లో చివరిసారి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన అతడు.. దాదాపు నాలుగేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో వరుసగా మెరుగైన ప్రదర్శనలు చేస్తూ పునరాగమనానికి తలుపులు తడుతున్నాడు. తాజా యూపీ టీ20 ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని మరోసారి ఆకర్షించాడు.చదవండి: సిరాజ్‌తో పాటు ఆ ఇద్దరు టీమిండియా స్టార్లకు పిలుపు! -
స్మృతి రికార్డుల హోరు
దుబాయ్: అత్యధిక పరుగులు, సెంచరీలు, సిక్స్‌లు... ఇలా ఒకే మ్యాచ్‌లో స్మృతి మంధాన సరికొత్త రికార్డులతో చెలరేగడంతో ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు మరో ఘన విజయాన్ని సాధించి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. స్మృతి మెరుపు బ్యాటింగ్‌తో పాటు మన బౌలర్ల ముందు పసికూన హాంకాంగ్ ఏమాత్రం నిలవలేకపోయింది. గురువారం జరిగిన గ్రూప్ ‘ఎ’ పోరులో భారత్ 137 పరుగుల తేడాతో హాంకాంగ్‌ను చిత్తు చేసింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. స్మృతి మంధాన (64 బంతుల్లో 124; 14 ఫోర్లు, 7 సిక్స్‌లు) కెరీర్లో రెండో సెంచరీతో చెలరేగింది. ఆమె 98 పరుగులు బౌండరీల ద్వారానే రాగా... మరో ఓపెనర్ షఫాలీ వర్మ (17 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడింది.అనంతరం హాంకాంగ్ 16.2 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ నటాషా మైల్స్ (15)దే అత్యధిక స్కోరు కాగా...దీప్తి శర్మకు 3 వికెట్లు దక్కాయి. రేపు జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది. నేడు జరిగే గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో యూఏఈ జట్టుతో ఇండోనేసియా ఆడుతుంది. మెరుపు బ్యాటింగ్... ఓపెనర్లు స్మృతి, షఫాలీ చక్కటి షాట్లతో పరుగులు రాబట్టడంతో తొలి ఐదు ఓవర్లలో 38 పరుగులు వచ్చాయి. ఆ తర్వాతి ఓవర్లో షఫాలీ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదడంతో మొత్తం 22 పరుగులు లభించాయి. షఫాలీ వెనుదిరిగినా, మరోవైపు స్మృతి జోరు కొనసాగింది. 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఆమె ఆ తర్వాత మరింత చెలరేగిపోయింది. తర్వాతి 17 బంతుల్లోనే ఆమె శతకాన్ని అందుకోవడం విశేషం. ఈ క్రమంలో ఇఖ్రా ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన ఆమె...బీబీ ఓవర్లో 2 సిక్స్‌లు బాదింది. 95 పరుగుల వద్ద డీప్ మిడ్‌వికెట్ ఫీల్డర్ సులువైన క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన స్మృతి... తన తర్వాతి బంతికి ఫోర్ కొట్టి సెంచరీ మార్క్‌ను చేరుకుంది. రుచిత వేసిన తర్వాతి ఓవర్లో ఆమె మరో 3 సిక్స్‌లతో చెలరేగింది. చివరి ఓవర్ మూడో బంతికి రనౌట్‌తో స్మృతి ఇన్నింగ్స్ ముగియగా... ఇతర బ్యాటర్లు ప్రభావం చూపలేదు. అనంతరం ఛేదనలో హాంకాంగ్ పూర్తిగా కుప్పకూలింది. ఒక్క బ్యాటర్ కూడా కనీసం ప్రతిఘటించలేకపోయారు. 10,880అంతర్జాతీయ మహిళల క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి స్మృతి చేసిన పరుగులు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మిథాలీ రాజ్‌ను (10,868) స్మృతి అధిగమించింది.95 అంతర్జాతీయ టి20ల్లో స్మృతి సిక్సర్ల సంఖ్య. భారత్ తరఫున అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్ (89) రికార్డును స్మృతి సవరించింది.18 అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి స్మృతి చేసిన సెంచరీలు. అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్‌గా ఆ్రస్టేలియాకు చెందిన మెగ్ లానింగ్ (17), దక్షిణాఫ్రికా ప్లేయర్ లారా వోల్వార్ట్ (17) పేరిట ఉన్న రికార్డును స్మృతి బద్దలు కొట్టింది.174 అంతర్జాతీయ టి20ల్లో దీప్తి శర్మ వికెట్లు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా తిపాచా పుతవాంగ్ (థాయ్‌లాండ్; 173) రికార్డును దీప్తి అధిగమించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి (రనౌట్) 124; షఫాలీ (సి) లామ్ప్లా (బి) రుచిత 28; ప్రతీక (సి) బీబీ (బి) జాయ్‌లీన్ 10; రిచా (సి) అండ్ (బి) లామ్ప్లా 11; హర్మన్‌ప్రీత్ (సి) జాయ్‌లీన్ (బి) లామ్ప్లా 10; భారతి ఫుల్మాలి (నాటౌట్) 10; దీప్తి శర్మ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–74, 2–111, 3–151, 4–185, 5–190. బౌలింగ్: ఇఖ్రా సహర్ 4–0–28–0, కేరీ చాన్ 3–0–28–0, మరీనా లామ్ప్లా 4–0–46–2, మర్యమ్ బీబీ 2–0–29–0, అలీసాన్ 3–0–19–0, రుచిత 2–0–30–1, జాయ్‌లీన్ 2–0–12–1. హాంకాంగ్ ఇన్నింగ్స్: నటాషా (సి) రిచా (బి) ప్రేమ 15, మారికో (బి) నందని 0; యాస్మీన్ (సి) భారతి (బి) దీప్తి 11; కేరీ చాన్ (సి) షఫాలీ (బి) ప్రేమ 1; మరీనా (సి) ప్రతీక (బి) శ్రీచరణి 14; మర్యమ్ (సి) షఫాలీ (బి) నందని 7; షాన్జీన్ (స్టంప్డ్) రిచా (బి) శ్రీచరణి 2; అలీసాన్ (బి) దీప్తి 1; ఇఖ్రా (సి) రిచా (బి) దీప్తి 0; జాయ్‌లీన్ (రనౌట్) 1; రుచిత (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (16.2 ఓవర్లలో ఆలౌట్) 56. వికెట్ల పతనం: 1–2, 2–29, 3–31, 4–36, 5–52, 6–54, 7–55, 8–55, 9–56, 10–56. బౌలింగ్: క్రాంతి 3–1–5–0, నందని 3–0–6–2, షఫాలీ 1–0–4–0, శ్రీచరణి 3.2–0–16–2, దీప్తి 3–0–9–3, ప్రేమ 3–0–12–2.చదవండి: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ప్రపంచ రికార్డులు -
టీమిండియా హెడ్‌కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
ఆసియా క్రీడలు-2026 టోర్నీలో పాల్గొనబోయే భారత పురుషుల క్రికెట్ జట్టుకు.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రికెట్ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ మార్గదర్శనం చేయనున్నాడు. జపాన్‌లో టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో గౌతం గంభీర్‌కు బదులు లక్ష్మణ్ హెడ్‌కోచ్‌గా వ్యవహరించనున్నాడు. కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.గత ఎడిషన్‌లోనూ..కాగా చైనా వేదికగా ఆసియా క్రీడల గత ఎడిషన్‌లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి భారత జట్టు పాల్గొంది. అప్పుడు కూడా లక్ష్మణ్ మార్గదర్శనం చేయగా.. భారత్ స్వర్ణ పతకం సాధించింది. అయితే, ఈసారి మాత్రం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ప్రధాన టీ20 జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జపాన్‌కు పంపేందుకు సిద్ధమైంది.PC: BCCI/Xఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఆసియా క్రీడల్లో వీవీఎస్ లక్ష్మణ్ భారత టీ20 జట్టుకు మార్గదర్శనం చేయనుండగా.. గంభీర్ స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌తో బిజీగా ఉండనున్నాడు.అసిస్టెంట్ కోచ్‌లు వీరేఇక కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆసియా క్రీడల్లో టీమిండియాకు లక్ష్మణ్ హెడ్‌కోచ్‌గా వ్యవహరించనుండగా.. సునిల్ జోషి, హృషికేశ్ కనితక్కర్, శుభదీప్ ఘోష్ అతడికి అసిస్టెంట్లుగా పనిచేయనున్నారు. కాగా జపాన్‌లోని ఐచి- నగోయా వేదికగా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 మధ్య ఆసియా క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల టీ20 క్రికెట్ జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివం దూబే, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ.చదవండి: IND vs AFG: అతడిని ఎందుకు తప్పించారో సెలక్టర్లకే తెలియాలి -
లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్
-
సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే
-
ప్రభ్‌సిమ్రన్ ఊచకోత.. నమన్ ధిర్ సుడిగాలి శతకం వృధా
షేర్-ఏ-పంజాబ్ టీ20 లీగ్‌లో టీమిండియా ఆటగాడు, పంజాబ్ కింగ్స్ విధ్వంసకర ఓపెనర్, జలంధర్ వారియర్స్ కెప్టెన్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అమృత్సర్ సూర్మాస్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయమైన 125 పరుగులు చేశాడు. ఫలితంగా అతడి జట్టు 265 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 16.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.భారీ లక్ష్య ఛేదనలో ప్రభ్‌సిమ్రన్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఎదుర్కొన్న ప్రతి బంతిని కసి తీరా బాదాడు. అతడి ఊచకోత ధాటికి అమృత్సర్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ప్రభ్‌సిమ్రన్‌కు అన్మోల్ మల్హోత్రా (23 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), హర్జస్ సింగ్ టాండన్ (21 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), విశ్వనాథ్ సింగ్ (12 బంతుల్లో 31; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా సహకరించారు.అంతకుముందు అమృత్సర్ తరఫున నమన్ ధిర్ కూడా సుడిగాలి శతకం బాదాడు. ధిర్ 56 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 117 పరుగులు చేశాడు. అతడికి కెప్టెన్, టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (36 బంతుల్లో 82; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) కూడా జతకలవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన అమృత్సర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. కాగా, దీనికి ముందు మ్యాచ్‌లో కూడా అభిషేక్ శర్మ, నమన్ ధిర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ వారి జట్టు ఓటమిపాలైంది. చదవండి: అభిషేక్ శర్మ తుపాన్ ఇన్నింగ్స్.. కేవలం 26 బంతుల్లోనే -
కన్నీళ్లు పెట్టుకున్న వైభవ్ బ్యాడ్ టైం అంటే ఇదేరా బుద్దోడా
-
భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు సంబంధించి కీలక అప్డేట్స్
త్వరలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సంబంధించి కీలక అప్డేట్స్ అందాయి. ఈ సిరీస్‌కు భారత జట్టును సెప్టెంబర్ 3న ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఆ రోజు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం ఖరారైనట్లు సమాచారం. అదే రోజే జట్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే.ఏషియన్ గేమ్స్ జట్టునే కొనసాగిస్తారా..?నివేదికల ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు ఏషియన్ గేమ్స్ 2026 కోసం ఎంపిక చేసిన జట్టునే కొనసాగిస్తారని తెలుస్తుంది. అయితే కొందరు కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై స్పష్టత రావాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ నివేదికల కోసం సెలెక్టర్లు ఎదురుచూస్తున్నారు. వీరు ముగ్గురు ఇటీవల గాయాల బారిన పడి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నారు.వీరితో పాటు వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా కూడా సీఓఈలోనే ఉన్నారు. వీరిలో వరుణ్ చక్రవర్తి పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. దీంతో అతను ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు భారత జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.ఒకవేళ బుమ్రా, హర్షిత్ రాణా పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోతే వారి స్థానాల్లో ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్‌లను తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు (అంచనా)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీచదవండి: Asia Cup 2026: రికార్డు విజయంతో శ్రీలంక బోణీ -
వైభవ్ సూర్యవంశీ సంచలన నిర్ణయం
టీమిండియా యువ సంచలనం, బ్యాటింగ్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన అధికారిక X (ట్విట్టర్) ఖాతా ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని పేద, ప్రతిభావంతులైన విద్యార్థుల చదువుకు వినియోగిస్తానని ప్రకటించాడు. అలాంటి విద్యార్థులు లేదా వారి గురించి తెలిసిన వారు తనను సంప్రదించాలని కోరాడు.I want to use my X payout to support a needy student’s education📚If you or someone you know is a genuinely deserving student who is struggling financially with school/college expenses, please come forward or tag them here.I’d be happy to help in whatever way I can. Let’s… https://t.co/dVuZgwJhSy— Vaibhav Sooryavanshi (@Vaibhavsooryava) August 29, 2026నాకు సాధ్యమైన విధంగా సహాయం చేయడానికి సంతోషిస్తాను. తాను చేయబోయే సహాయానికి ఒక అర్థవంతమైన ప్రయోజనం కల్పిద్దామని పిలుపునిచ్చాడు. ఈ మేరకు ఇవాళ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ విషయాన్ని వైభవ్ నిన్ననే (ఆగస్ట్ 28) ఎక్స్ ద్వారా వెల్లడించాడు. 'గొప్ప విషయాలు రాబోతున్నాయి. చూస్తూ ఉండండి' అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు.వైభవ్ గొప్ప మనసుకు సమస్త ప్రజానీకం ఫిదా అవుతుంది. 15 ఏళ్ల వయసులో వైభవ్ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడని జనాలు కొనియాడుతున్నారు. వైభవ్ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ప్రతి ఒక్కరు అతడికి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కాగా, వైభవ్ స్వతహాగా ఇంకా స్కూలింగ్ కూడా పూర్తి చేయలేదు. ప్రస్తుతం అతడు 10వ తరగతి విద్యార్ది. క్రికెట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు అతడు ఈ ఏడాది బోర్డు పరీక్షలను వాయిదా వేసుకున్నాడు. వైభవ్ ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో పాల్గొంటున్నాడు. ఈ టోర్నీలో ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. తాజాగా నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బ్యాట్‌తో రాణించలేకపోయినా, బంతితో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అతడు 4 బంతుల వ్యవధిలో 2 వికెట్లు తీసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 210 పరుగుల తేడాతో గెలుపొందిన ఈస్ట్ జోన్ జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆగస్ట్ 30న మొదలయ్యే తొలి సెమీస్‌లో ఆ జట్టు సెంట్రల్ జోన్‌తో తలపడనుంది. చదవండి: టీ20 క్రికెట్లో సంచలనం.. సౌతాఫ్రికాకు షాకిచ్చిన నమీబియా -
కెప్టెన్ గా సూర్య రీఎంట్రీ.. ఫెర్ వెల్ కోసం BCCI మాస్టర్ ప్లాన్?
-
సూర్యకు BCCI గుడ్ న్యూస్.. టీమిండియాలోకి రీఎంట్రీ..?
-
మాస్టర్ ప్లాన్ అదిరింది.. ధోనిని మించిపోయిన పంత్!
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో మాత్రమే ఉంది. సోనల్ దినూష (7), కెషారా నువంత (3) క్రీజులో ఉన్నారు. సోనల్ దినూష మాత్రమే బ్యాటర్ కావడం, మిగతావాళ్లంతా టెయిలెండర్లు కావడంతో చివరి రోజు టీమిండియా బౌలర్లకు మిగతా నాలుగు వికెట్లు తీయడం కష్టమేమీ కాదు. అయితే లంక రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బ్యాటర్ పసిందు సూరియబండార ఆయువు పట్టుగా నిలిచాడు. 21 పరుగుల వద్ద లభించిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న పసిందు ఆ తర్వాత 90 పరుగులు చేసి ఔటయ్యాడు. లంక నాలుగో రోజు ఆటను పూర్తి చేయగలిగిందంటే అదంతా పసిందు చలవే. జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన పసిందును ఔట్ చేసేందుకు టీమిండియా మాస్టర్‌ప్లాన్ వేసింది.ఆ మాస్టర్‌ప్లాన్‌లో పంత్, మానవ్ సుతార్లు కీలకపాత్ర పోషించారు. ఇన్నింగ్స్ 61వ ఓవర్ మానవ్ సుతార్ వేశాడు. ఆఫ్ స్టంప్ అవతల వేసిన స్లో బంతిని పసిందు ఆడే ప్రయత్నంలో క్రీజులైన్ దాటి బయటికి వచ్చాడు. ఇది గమనించిన పంత్ కేవలం 0.3 సెకన్ల వ్యవధిలో బెయిల్స్‌ను ఎగురగొట్టాడు. రిప్లేలో పంత్ చేసిన డిస్మిసల్ చూస్తే వారెవ్వా అనకుండా ఉండలేం. ఈ ఒక్క స్టంపౌట్ విషయంలో మాత్రం భారత మాజీ కీపర్ ఎంఎస్ ధోనిని కూడా మించిపోయాడనంలో సందేహం లేదు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలా మానవ్ సుతార్ తెలివైన బంతితో పసిందును బోల్తా కొట్టించినప్పటికీ, ఇక్కడ పంత్‌ను కూడా మెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతకముందు బంతికే పసిందు ఎల్బీడబ్ల్యూ నుంచి తప్పించుకున్నాడు. ఈ సమయంలో పంత్.. ‘బ్యాటర్ అలసిపోయాడు.. రెడీగా ఉండండి’ అన్న మాటలు మైక్ స్టంప్‌లో రికార్డయ్యాయి.Rishabh Pant stumped Sri Lanka’s Sooriyabandara in just 0.3 seconds 🥶🔥What a quick stumping 🔥 pic.twitter.com/lztPjNcEMf— Harshit (@I_am_Harshit_17) August 26, 2026Read: దుమ్మెత్తిపోసుకున్న జడ్డూ, సిరాజ్.. ఏం జరిగిదంటే? -
భువీ విజృంభణ
యూపీ టీ20 లీగ్ 2026లో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ విజృంభిస్తున్నాడు. ఈ టోర్నీలో లక్నో ఫాల్కన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. నిన్న డిఫెండింగ్ ఛాంపియన్స్ కాశీ రుద్రాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఫలితంగా అతడి జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపు లక్నో ఫాల్కన్స్‌కు వరుసగా మూడవది. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనకు గానూ భువీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది.ఈ మ్యాచ్‌లో లక్నో ఫాల్కన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. భువీ కొత్త బంతితో చెలరేగిపోయాడు. పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు పడగొట్టి కాశీ రుద్రాస్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. భువీతో పాటు అభినందన్ సింగ్ (3-16) కూడా సత్తా చాటడంతో రుద్రాస్ 19.1 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. రుద్రాస్ తరఫున శుభమ్ చౌబే (32 బంతుల్లో 46 పరుగులు) ఒంటరి పోరాటం చేశాడు.అనంతరం 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. హిమాన్షు సింగ్ (64) మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో 16 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.కాగా, యూపీ టీ20 లీగ్‌లో భువనేశ్వర్ కుమార్ తన అసమాన ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుత సీజన్లో అదిరిపోయే స్పెల్స్‌తో సత్తా చాటుతున్న అతడు.. టోర్నీ చరిత్రలోనే (నాలుగు సీజన్లు) 400 డాట్ బాల్స్ వేసిన తొలి బౌలర్‌గా అవతరించాడు. ఈ టోర్నీ 2024 ఎడిషన్‌లో భువీ వేసిన స్పెల్ (4-1-4-0) టీ20ల చరిత్రలోనే అత్యుత్తమమైన స్పెల్స్‌లో ఒకటిగా చలామణి అవుతుంది.ప్రస్తుతం భువీకి భారత జట్టులో చోటు లేనప్పటికీ.. ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇటీవల ఆర్సీబీ వరుసగా రెండు సీజన్లలో టైటిల్ సాధించడంలో భువీది కీలకపాత్ర. -
టెస్ట్ జట్టులో చోటుపై ఇషాన్ కిషన్ కీలక వ్యాఖ్యలు
భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ టెస్ట్ క్రికెట్‌పై తనకున్న ఆసక్తిని మరోసారి స్పష్టం చేశాడు. దులీప్ ట్రోఫీ 2026లో ఈస్ట్ జోన్‌కు నాయకత్వం వహిస్తున్న అతడు.. నార్త్ ఈస్ట్ జోన్‌పై ఇన్నింగ్స్ 210 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సాధించిన అనంతరం ఇలా అన్నాడు."నేను భారత టెస్ట్ జట్టులో భాగం కావాలని 100 శాతం కోరుకుంటున్నాను. టెస్ట్ క్రికెట్ ఆడిన ప్రతి ఒక్కరూ ఈ ఫార్మాట్‌ను ఇష్టపడతారు. ప్రజలు నమ్మకపోవచ్చు కానీ, నాకు నిజంగా రెడ్ బాల్ క్రికెట్ అంటే చాలా ఇష్టం"పరిమిత ఓవర్ల క్రికెట్లో దూకుడైన బ్యాటింగ్‌కు పేరున్న ఇషాన్.. టెస్ట్ క్రికెట్లోనూ తనకు తగిన సామర్థ్యం ఉందని ఈ వ్యాఖ్యల ద్వారా చెప్పకనే చెప్పాడు.2023లో చివరి టెస్ట్ఇషాన్ కిషన్ 2023 వెస్టిండీస్ పర్యటనలో భారత్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు టెస్టులూ ఆడిన అతను మూడు ఇన్నింగ్స్‌ల్లో 78 పరుగులు మాత్రమే చేశాడు.పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన సిరీస్ డిసైడర్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇషాన్ కేవలం 34 బంతుల్లోనే 52 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే అదే అతడి చివరి టెస్ట్ ఇన్నింగ్స్‌గా మిగిలిపోయింది.ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలో భారత సెలెక్టర్లు వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్‌కు ప్రాధాన్యం ఇచ్చారు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మంచి రికార్డువైట్ బాల్ క్రికెట్లో ఇషాన్‌కు మంచి పేరున్నప్పటికీ, రెడ్ బాల్ క్రికెట్లోనూ అతడి గణాంకాలు బలంగానే ఉన్నాయి.ఇప్పటివరకు 65 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు.. 106 ఇన్నింగ్స్‌ల్లో 3897 పరుగులు చేశాడు. అతడి బ్యాటింగ్ సగటు 39.36గా ఉంది. ఇందులో 9 సెంచరీలు, 19 అర్ధసెంచరీలు ఉన్నాయి.అంత ఈజీ కాదుఇషాన్కు వ్యక్తిగతంగా రెడ్ బాల్ క్రికెట్‌పై మక్కువ ఉన్నప్పటికీ.. టెస్ట్ జట్టులోకి తిరిగి రావడం అంత ఈజీ కాదు. ప్రస్తుతం భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ స్థానానికి బలమైన పోటీ ఉంది. రిషభ్ పంత్‌తో పాటు ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్ వంటి బలమైన ఆప్షన్లు మేనేజ్మెంట్ ముందున్నాయి.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అసాధారణ రీతిలో పరుగులు చేసినా ఇషాన్‌కు టెస్ట్ జట్టులో చోటు దక్కడం అనుమానమే. ఎందుకంటే పంత్, జురెల్, రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నారు. వీరిని కాదని ఇషాన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు చాలా తక్కువ. చదవండి: ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన ఇషాన్, వైభవ్ జట్టు -
శాసించేది మనమే!
కొలంబో: ఆహ్వానం లేని అతిథిగా వరుణుడు వస్తూ పోతున్నా... భారత బౌలర్లు సహనం కోల్పోకుండా సత్తా చాటారు. కీలకదశలో శ్రీలంక బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించి రెండో టెస్టును శాసించే స్థితిలో టీమిండియాను నిలిపారు. వర్షం, వెలుతురు లేమి కారణంగా వరుసగా మూడో రోజు కూడా పూర్తి ఓవర్లు సాధ్యపడలేదు. ఓవర్‌నైట్ స్కోరు 8/2తో మంగళవారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన శ్రీలంక జట్టు వర్షం కారణంగా ఆటను నిలిపి వేసే సమయానికి 83.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు సాధించింది. పసిందు సూరియబండారా (80; 9 ఫోర్లు), తొలి టెస్టు సెంచరీ హీరో సోనాల్ దినుషా (85 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో శ్రీలంక జట్టును ఆదుకున్నారు. ఫాలోఆన్ తప్పించుకోవాలంటే శ్రీలంక మరో 39 పరుగులు సాధించాలి. దినుషాతో కలిసి లాహిరు (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. నాలుగో రోజు ఆరంభంలోనే శ్రీలంకను ఆలౌట్ చేస్తే భారత్ ఈ మ్యాచ్‌పై పూర్తి పట్టుబిగించవచ్చు. ఆ తర్వాత భారత్ చకచకా పరుగులు సాధించి లంకకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉంటుంది.ధాటిగా ఆడి...మూడో రోజు తొలి సెషన్ ఆరంభంలోనే శ్రీలంకకు దెబ్బ పడింది. ఇన్నింగ్స్ పదో ఓవర్లో ఓపెనర్ మిషారాను ప్రసిధ్ అవుట్ చేశాడు. 35/3తో ఎదురీదుతున్న లంకను పసిందు సూరియబండారా, కామిందు మెండిస్ (58 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆదుకున్నారు. వీరిద్దరు ధాటిగా ఆడుతూ నిలకడగా పరుగులు సాధించారు. నాలుగో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. క్రీజులో నిలదొక్కుకుంటున్న కామిందును ప్రసిధ్ అవుట్ చేసి మళ్లీ లంకను కష్టాల్లోకి నెట్టాడు. గాయపడ్డ రిషబ్ పంత్ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చన సర్ఫరాజ్ ఖాన్, బౌలర్ సిరాజ్‌లతో శ్రీలంక బ్యాటర్లు వాగ్వాదం చేశారు. లంచ్ సెషన్లో 122 పరుగులు చేసిన శ్రీలంక రెండో సెషన్లో తడబడింది. కెప్టెన్ ధనంజయ డిసిల్వా (8) విఫలంకాగా ... సెంచరీపై కన్నేసిన పసిందును జడేజా బౌల్డ్ చేశాడు. డిక్వెలాను సిరాజ్ ఖాతా తెరవనివ్వలేదు. దాంతో 122/3తో కోలుకున్నట్లు కనిపించిన శ్రీలంక 173/7తో మళ్లీ కష్టాల్లో పడింది. శ్రీలంక ఇన్నింగ్స్ ముగియడానికి ఎక్కువ సమయం పట్టదేమోనని అనుకున్నా... నువాంతా (74 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్), దినుషా మొండిపట్టుదలతో ఆడారు. ఒకవైపు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ మరోవైపు పరుగులు సాధించారు. ఈ క్రమంలో దినుషా 82 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టీ విరామానికి లంక స్కోరు 216/7. చివరి సెషన్లో నువాంతాను సుతార్ అవుట్ చేసినా... లాహిరు కుమారతో కలిసి దినుషా తొమ్మిదో వికెట్‌కు 35 పరుగులు జత చేసి శ్రీలంక స్కోరును 250 పరుగులు దాటించాడు.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 503/9 డిక్లేర్డ్; శ్రీలంక తొలి ఇన్నింగ్స్: ఉడారా (సి) జైస్వాల్ (బి) ప్రసిధ్ కృష్ణ 1; కమిల్ (సి) జురేల్ (బి) ప్రసిధ్ కృష్ణ 19; ప్రభాత్ జయసూరియ (ఎల్బీడబ్ల్యూ) (బి) సుతార్ 2; పసిందు సూరియబండారా (బి) జడేజా 80; కామిందు మెండిస్ (సి) జడేజా (బి) ప్రసిధ్ కృష్ణ 32; ధనంజయ డిసిల్వా (సి) కేఎల్ రాహుల్ (బి) మానవ్ సుతార్ 8; సోనాల్ దినుషా (బ్యాటింగ్) 85; డిక్వెల్లా (సి) జురేల్ (బి) సిరాజ్ 0; కేషారా నువాంతా (సి) సారాంశ్ జైన్ (బి) మానవ్ సుతార్ 18; లాహిరు కుమార (బ్యాటింగ్) 8; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (83.4 ఓవర్లలో 8 వికెట్లకు) 265. వికెట్ల పతనం: 1–1, 2–8, 3–35, 4–122, 5–137, 6–171, 7–173, 8–230. బౌలింగ్: సిరాజ్ 11–0– 33–1, ప్రసిధ్ కృష్ణ 14–1–47–3, మానవ్ సుతార్ 21–1–83–3, సారాంశ్ జైన్ 18–5– 51–0, రవీంద్ర జడేజా 19.4–4–45–1. -
బౌలర్‌గానూ ఇరగదీసిన వైభవ్ సూర్యవంశీ
బ్యాటింగ్ సంచలనం, టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ బంతితోనూ ఇరగదీశాడు. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్వార్టర్ఫైనల్లో కేవలం నాలుగు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టి తన ఫస్ట్‌క్లాస్ వికెట్ల ఖాతా తెరిచాడు. ఈ టోర్నీలో వైభవ్ ఈస్ట్ జోన్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.నాలుగు బంతుల్లో రెండు వికెట్లునార్త్ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 26వ ఓవర్ వద్ద ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్.. షాబాజ్ అహ్మద్ స్థానంలో వైభవ్ సూర్యవంశీకి బంతిని అందించాడు. తొలి ఓవర్లో రెండు పరుగులు మాత్రమే ఇచ్చిన వైభవ్.. ఆ తర్వాత ఓవర్లో అద్భుతం చేశాడు.28వ ఓవర్లో కిషన్ లింగ్డోహ్ను ఔట్ చేసి తన తొలి ఫస్ట్‌క్లాస్ వికెట్ సాధించాడు. వైభవ్ బంతిని అటాక్ చేయడానికి లింగ్డోహ్ ముందుకొచ్చాడు. అయితే బంతికి భారీ లీడింగ్ ఎడ్జ్ రావడంతో కవర్ ప్రాంతం వైపు వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న డెనిష్ దాస్ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు.ఆ తర్వాత మరో మూడు బంతులకే వైభవ్ మరో వికెట్ తీశాడు. ఇమ్లివాటి లెమ్తుర్ బ్యాట్ అంచును తాకిన బంతిని ఇషాన్ కిషన్ అద్భుతమైన రిఫ్లెక్స్‌తో క్యాచ్ పట్టాడు. దీంతో ఒకే ఓవర్లో వైభవ్‌కు రెండు వికెట్లు దక్కాయి.VAIBHAV SOORYAVANSHI, THE BOWLER 🔥- Sooryavanshi picks 2 wickets in 4 balls in Duleep Trophy Quarter-Final. pic.twitter.com/G5pfCmFXYF— Johns. (@CricCrazyJohns) August 25, 2026బంతితోనూ వైభవ్‌కు మంచి భవిష్యత్తు..?వైభవ్ సూర్యవంశీ ప్రధానంగా బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. భారీ షాట్లు ఆడగల సామర్థ్యంతో అతను ఇప్పటికే భారత క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు పొందాడు.అయితే వైభవ్ స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ కూడా. అతని బౌలింగ్‌లో హిప్ రొటేషన్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. దులీప్ ట్రోఫీలో లభించిన అవకాశాన్ని అతను చక్కగా ఉపయోగించుకుని నాలుగు బంతుల్లోనే రెండు వికెట్లు పడగొట్టాడు.దీంతో భవిష్యత్తులో అవసరమైనప్పుడు బంతితోనూ జట్టుకు ఉపయోగపడే పార్ట్‌టైమ్ ఆల్‌రౌండర్‌గా ఎదిగే అవకాశం వైభవ్‌కు ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సచిన్‌తో మరో పోలికచిన్న వయసులోనే ప్రొఫెషనల్ క్రికెట్లోకి వచ్చి సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్‌ను ఇప్పటికే పలువురు సచిన్ టెండూల్కర్‌తో పోల్చుతున్నారు. సచిన్ కూడా చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి బ్యాట్‌తో పాటు అప్పుడప్పుడు బంతితోనూ భారత్‌కు కీలక వికెట్లు అందించాడు. ఇప్పుడు వైభవ్ కూడా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో తన ప్రతిభను చూపించడం ఆసక్తికరంగా మారింది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ గెలుపు దిశగా సాగుతోంది. ఫాలో ఆన్ ఆడుతున్న ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 102 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి భారీ ఇన్నింగ్స్ ఓటమి దిశగా పరుగులు పెడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 111 పరుగులకే కుప్పకూలింది. దీనికి ముందు ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగుల భారీ స్కోర్ చేసింది. చదవండి: సిరాజ్ రెచ్చగొట్టాడు.. ప్రసిద్ద్ పని కానిచ్చేశాడు..! -
IND VS SL: టీమిండియాకు బ్యాడ్ న్యూస్
టీమిండియాకు చేదు వార్త. కొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆటకు వర్షం ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే రెండో రోజు మ్యాచ్‌కు పలుమార్లు వర్షం, మేఘావృత వాతావరణం అంతరాయం కలిగించింది.మంగళవారం ఉదయం కొలంబోలో ఆకాశం మేఘావృతంగా ఉండటంతో పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ఉష్ణోగ్రత సుమారు 31 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనుండగా, ఉదయం వర్షం పడే అవకాశం 82 శాతంగా ఉంది. మధ్యాహ్నం కూడా వర్ష సూచనలు కొనసాగనున్నాయి. ఆ సమయంలో వర్షం పడే అవకాశం 56 శాతంగా అంచనా వేశారు.సాయంత్రం పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. వర్షం పడే అవకాశం 86 శాతంగా ఉండటంతో పాటు మేఘావృతం 98 శాతం, తేమ 79 శాతం వరకు ఉండొచ్చని అంచనాలు చెబుతున్నాయి.జురెల్ శతకంతో భారత్ భారీ స్కోరుమ్యాచ్ విషయానికొస్తే భారత్ పూర్తి ఆధిపత్యంలో ఉంది. రెండో రోజు ధ్రువ్ జురెల్ అద్భుత శతకంతో భారత్ 503/9 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. జురెల్ 171 బంతుల్లో 9 ఫోర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.రిషభ్ పంత్ 63 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, జురెల్‌తో కలిసి ఏడో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి 8/2తో రెండో రోజు ఆటను ముగించింది.ప్రస్తుతం శ్రీలంక 495 పరుగుల భారీ లోటుతో ఉంది. భారత్ ఇప్పటికే మ్యాచ్‌పై పట్టు సాధించిన నేపథ్యంలో మూడో రోజు వర్షం ఎంత మేరకు ఆటను ప్రభావితం చేస్తుందన్నది కీలకంగా మారింది.పడిక్కల్ శతకంవన్డౌన్ బ్యాటర్ పడిక్కల్ వరుసగా రెండో టెస్ట్‌లోనూ సెంచరీ చేశాడు. తొలి టెస్ట్‌లో భారీ శతకం చేసిన అతడు.. రెండో మ్యాచ్ తొలి రోజే సెంచరీ (117) పూర్తి చేశాడు. జురెల్, పడిక్కల్ సెంచరీలతో కదంతొక్కగా.. పంత్‌తో పాటు కెప్టెన్ గిల్ (50) కూడా అర్ద సెంచరీతో రాణించాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (45), రవీంద్ర జడేజా (43) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు.ఆధిక్యంలో భారత్‌కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న భారత్ తొలి టెస్ట్‌లో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. -
పడిక్కల్ పరుగుల ప్రవాహం
వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ వరుసగా రెండో సెంచరీతో విజృంభించడంతో... శ్రీలంకతో రెండో టెస్టులో భారత జట్టు మెరుగైన స్కోరు దిశగా సాగుతోంది. పడిక్కల్ ప్రతాపానికి శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ సహకారం తోడవడంతో తొలిరోజు టీమిండియా ఆధిపత్యం కనబర్చగా... సంప్రదాయానికి విరుద్ధంగా పేస్ పిచ్‌ను సిద్ధం చేసిన శ్రీలంక తొలి రోజు ఐదు వికెట్లు పడగొట్టింది. మ్యాచ్ కొనసాగుతున్నకొద్దీ వికెట్ స్పిన్‌కు సహకరించనున్న నేపథ్యంలో టీమిండియా ఎంత స్కోరు చూస్తుందో చూడాలి! కొలంబో: శ్రీలంక పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన టీమిండియా రెండో మ్యాచ్‌లోనూ అదే దూకుడు కనబరిచింది. ఆదివారం ప్రారంభమైన రెండో టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు... తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (193 బంతుల్లో 117; 12 ఫోర్లు) మరో సెంచరీతో కదంతొక్కాడు. గిల్ (108 బంతుల్లో 50; 6 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (45; 9 ఫోర్లు), రవీంద్ర జడేజా (43; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కేఎల్ రాహుల్ (18) విఫలం కాగా... వికెట్ కీపర్ రిషబ్ పంత్ (3) గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. గత మ్యాచ్‌తో పోలిస్తే భిన్నమైన పిచ్‌ను సిద్ధం చేసిన శ్రీలంక... దాన్ని కాస్త సద్వినియోగం చేసుకోగలిగింది. గాయం నుంచి కోలుకున్న పంత్ బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండగా... జురేల్ (7 బ్యాటింగ్), సారాంశ్ జైన్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. వరుసగా రెండో శతకం... రెండేళ్ల విరామం తర్వాత భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకొని... గత టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్న పడిక్కల్ ఈ మ్యాచ్‌లోనూ దుమ్మురేపాడు. గాలేలో ఎక్కడ ఆపాడో... కొలంబోలో అక్కడి నుంచే ప్రారంభించాడు. శ్రీలంక ఫీల్డర్ల తప్పిదాలతో రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అతడు ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఆచితూచి ఆడుతూ ముందుకు సాగాడు. అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్ తరహాలో వీలుచిక్కినప్పుడు బౌండరీలు బాదుతూ స్ట్రయిక్ రొటేషన్‌పై ప్రధానంగా దృష్టి పెట్టాడు.ఒక దశలో గిల్ వేగంగా పరుగులు చేస్తుంటే మరో ఎండ్‌లో సంయమనం పాటించిన పడిక్కల్ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. రాహుల్ ఎక్కువసేపు నిలవలేపోగా ... జైస్వాల్ మరోసారి మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. ఈ దశలో గిల్‌తో కలిసి పడిక్కల్ మూడో వికెట్‌కు 120 పరుగులు జోడించాడు.హాఫ్‌సెంచరీ పూర్తయ్యాక గిల్ అవుట్ కాగా... లహిరు బౌలింగ్‌లో పంత్ రిటైర్డ్ హర్ట్‌గా క్రీజు వీడాడు. పిచ్ బౌన్స్‌కు సహకరిస్తుండటంతో శ్రీలంక పేసర్లు షార్ట్ పిచ్ బంతులతో ఇబ్బంది పెట్టినా పడిక్కల్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. జడేజా సహకారంతో 168 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న పడిక్కల్ కాసేపటికి అవుటయ్యాడు. తొలి రోజు చివరి ఓవర్లో జడేజా కూడా అవుటవ్వడంతో లంక సంతృప్తికరంగా రోజును ముగించింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) ఫెర్నాండో 45; రాహుల్ (సి) డిక్వెలా (బి) లహిరు కుమారా 18; పడిక్కల్ (బి) కేషారా నువాంతా 117; గిల్ (సి) డిక్వెలా (బి) ఫెర్నాండో 50; పంత్ (రిటైర్డ్ హర్ట్) 3; జడేజా (బి) ఫెర్నాండో 43; జురేల్ (బ్యాటింగ్) 7; సారాంశ్ (బ్యాటింగ్) 4; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (85 ఓవర్లలో 5 వికెట్లకు) 300. వికెట్ల పతనం: 1–37, 2–66, 3–186, 4–281, 5–296. బౌలింగ్: ఫెర్నాండో 16–5–46–3; లహిరు 13–4–38–1; జయసూర్య 27–4–90–0; కేషారా 22–0–93–1; దినుషా సోనాల్ 1–0–2–0; ధనంజయ 2–0–8–0; కమిల్ 4–0–16–0. -
రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎల్ స్టార్
ఐపీఎల్ స్టార్, భారత లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ 38 ఏళ్ల వయసులో అంతర్జాతీయ, భారత దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. యూపీ టీ20 లీగ్ 2026లో ఆగస్టు 25న జరిగే మ్యాచ్ తనకు చివరిదని ప్రకటించాడు.2007-08 దేశవాళీ సీజన్లో ఫస్ట్‌క్లాస్, లిస్ట్-ఏ, టీ20 అరంగేట్రం చేసిన కర్ణ్.. తొలుత ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే సెంచరీ సాధించాడు. 2012-13 సీజన్లో మూడు రంజీ మ్యాచ్‌ల్లో 19.04 సగటుతో 21 వికెట్లు తీసి బీసీసీఐ బెస్ట్ అండర్-25 క్రికెటర్ అవార్డు అందుకున్నాడు.2014 ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని రూ.3.75 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో అన్క్యాప్డ్ భారత ఆటగాడికి దక్కిన అత్యధిక వేలం ధర ఇదే.అదే ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో భారత్ తరఫున టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో అతడి ఏకైక వికెట్‌గా జో రూట్‌ను ఔట్ చేశాడు. అనంతరం శ్రీలంకతోసిరీస్లో వన్డే అరంగేట్రం చేశాడు. రోహిత్ శర్మ 264 పరుగులు చేసిన చారిత్రాత్మక వన్డేలో కర్ణ్ శర్మ కూడా ఆడాడు.2014 చివర్లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో టెస్టు అరంగేట్రం చేసి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రెండేసి వికెట్లు తీశాడు. అయితే అదే అతడి చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా మారింది. 2015లో జింబాబ్వే పర్యటనకు ఎంపికైనా గాయం కారణంగా వెళ్లలేకపోయాడు. ఆ తర్వాత భారత్ తరఫున మళ్లీ ఆడే అవకాశం రాలేదు.ఐపీఎల్లో అరుదైన ఘనతకర్ణ్ శర్మ ఐపీఎల్ కెరీర్లో అత్యంత ప్రత్యేకమైన రికార్డు సాధించాడు. మూడు వరుస సీజన్లలో మూడు వేర్వేరు జట్లతో ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన తొలి ఆటగాడిగా నిలిచాడు.* 2016: సన్‌రైజర్స్ హైదరాబాద్* 2017: ముంబై ఇండియన్స్* 2018: చెన్నై సూపర్ కింగ్స్అంతేకాదు, ఐపీఎల్లో అతను ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి భారత దిగ్గజాలతో కలిసి ఆడాడు. 2025లో ముంబై ఇండియన్స్ తరఫున అతడి చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు.కర్ణ్ శర్మ కెరీర్ గణాంకాలు* టెస్టులు: 1 మ్యాచ్* వన్డేలు: 2 మ్యాచ్‌లు* టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు: 1* ఫస్ట్‌క్లాస్: 97 మ్యాచ్‌లు, 270 వికెట్లు* ఫస్ట్‌క్లాస్ బ్యాటింగ్: 2,866 పరుగులు, 2 సెంచరీలు, 17 అర్ధసెంచరీలు* లిస్ట్-ఏ: 123 మ్యాచ్‌లు, 153 వికెట్లు* టీ20లు: 191 మ్యాచ్‌లు, 168 వికెట్లు* ఐపీఎల్: 90 మ్యాచ్‌లు, 83 వికెట్లుఅంతర్జాతీయ స్థాయిలో కేవలం నాలుగు మ్యాచ్‌లకే పరిమితమైనప్పటికీ, దాదాపు రెండు దశాబ్దాల దేశవాళీ కెరీర్, మూడు ఐపీఎల్ టైటిళ్లు, 270 ఫస్ట్‌క్లాస్ వికెట్లు కర్ణ్ శర్మను భారత దేశవాళీ క్రికెట్లో గుర్తుండిపోయే లెగ్‌స్పిన్నర్‌గా నిలబెట్టాయి.రిటైర్మెంట్ తర్వాత కోచింగ్‌తో పాటు క్రికెట్‌కు సంబంధించిన ఇతర బాధ్యతల్లో కొనసాగుతానని కర్ణ్ శర్మ వెల్లడించాడు. -
WTC : కీలక మలుపు.. బంగ్లా ఓటమితో భారత్‌కు లక్కీ చాన్స్!
ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో భారీ విజయం సాధించిన బంగ్లాదేశ్ రెండో టెస్టులో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. ఆసీస్ బౌలర్ల ధాటికి ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకున్న బంగ్లాదేశ్ డబ్ల్యూటీసీ పట్టికలో స్థానం మారనప్పటికీ, పాయింట్లు భారీగా కోల్పోయింది. మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం రెండో టెస్టులో విజయంతో 80 పాయింట్లు సాధించి డబ్ల్యూటీసీ పట్టికలో తన తొలి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఇక రెండో స్థానంలో సౌతాఫ్రికా (75 పాయింట్లు) ఉండగా, 72.22 పాయింట్లతో న్యూజిలాండ్ మూడో స్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ ఓటమి తర్వాత భారత్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు అవకాశాలు ఎంత ఉన్నాయి? ఏ లెక్కన భారత్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుందనేది మరోసారి తెలుసుకుందాం.పాయింట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ఆసీస్తో టెస్టు సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్ 66.6 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతూ వస్తోంది. అయితే రెండో టెస్టులో ఓటమి తర్వాత బంగ్లాదేశ్ 11.1 పాయింట్లు కోల్పోయి 55.5 పాయింట్లకు పరిమితమైంది. అదే సమయంలో తొలి టెస్టులో భారీ విజయం సాధించిన టీమిండియా ఐదో స్థానంలో కొనసాగుతుండగా, భారత్ ఖాతాలో 53.3 పాయింట్లు ఉన్నాయి.ఒకవేళ లంకతో రెండో టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ పట్టికలో బంగ్లాను అధిగమించి నాలుగో స్థానానికి చేరుకుంటుంది. లంకతో టెస్టు సిరీస్ తర్వాత 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్లో మరో ఏడు టెస్టులు ఆడాల్సి ఉంది. ఇప్పటికే పది టెస్టులాడిన భారత్ నాలుగింట ఓడిపోయింది. లంకతో సిరీస్ అనంతరం న్యూజిలాండ్ పర్యటనలో భారత్ రెండు టెస్టులు ఆడనుంది. ఎనిమిదిలో ఏడు గెలిస్తేనే..ఆ తర్వాత ఐపీఎల్ 2027 ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ రెండు కఠినమైన సిరీస్‌లు కావడం భారత్‌కు ఇబ్బంది కలిగించే అంశం. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలంటే భారత్ తమకు మిగిలిన 8 టెస్టుల్లో కనీసం ఏడింటిలో గెలవాల్సి ఉంటుంది. అప్పుడే డబ్ల్యూటీసీ పట్టికలో 68.52 పర్సంటైల్‌తో ఉంటుంది. ఒకవేళ ఆరు విజయాలు, రెండు ఓటములు ఎదురైతే అప్పుడు 62.96 పాయింట్లకు పరిమితమవుతుంది. భారత్‌కు రెండే దారులు..ఈ రెండు దారులు తప్ప టీమిండియా ఫైనల్ చేరేందుకు మరో అవకాశం లేదు. అయితే రాబోయే 8 టెస్టుల్లో ఒక పెనాల్టీ పాయింట్ వచ్చినా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్తంతయినట్లే. కాబట్టి గిల్ సేన ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలనుకుంటే మాత్రం ప్రతీ మ్యాచ్‌లో విజయం సాధించాల్సిన అవసరముంది.Read: జైస్వాల్, లంక బౌలర్ మధ్య వాగ్వాదం; కొట్టుకోవడమే తరువాయి! -
చరిత్ర సృష్టించిన గిల్.. దశాబ్దంలో తొలి ఆటగాడు
భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో కీలక మైలురాయిని తాకాడు. టెస్ట్ క్రికెట్లో 3,000 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 28వ భారత బ్యాటర్‌గా నిలిచాడు. కొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో గిల్ ఈ ఘనత సాధించాడు.26 ఏళ్ల గిల్ తన 43వ మ్యాచ్ 77వ ఇన్నింగ్స్‌లో 3000 పరుగుల మార్కును తాకాడు. ఈ ఫార్మాట్లో గిల్ 43.53 సగటున, 8 సెంచరీలు, 11 అర్ద సెంచరీలు చేశాడు. అతడి అత్యుత్తమ స్కోర్ 269గా ఉంది.కపిల్ కంటే వారం ముందు..టెస్ట్‌ల్లో 3000 పరుగుల మైలురాయిని గిల్ 26 ఏళ్ల 349 రోజుల వయసులో అందుకున్నాడు. తద్వారా భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో ఈ మైలురాయిని తాకిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (23 ఏళ్ల 228 రోజుల) అగ్రస్థానంలో ఉండగా.. వీరేంద్ర సెహ్వాగ్ (26 ఏళ్ల 157 రోజులు), దిలీప్ వెంగ్‌సర్కార్ (26 ఏళ్ల 263 రోజులు) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. గిల్.. భారత దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ (26 ఏళ్ల 356 రోజులు) కంటే వారం రోజుల ముందు ఈ మైలురాయిని తాకాడు.2020లో టెస్ట్ అరంగేట్రం చేసిన గిల్.. నాటి నుంచే నిలకడైన ప్రదర్శనలతో భారత టెస్ట్ జట్టులో కీలక బ్యాటర్‌గా ఎదిగాడు. ముఖ్యంగా 2025లో ఇంగ్లండ్ పర్యటనలో అతడి బ్యాటింగ్ అత్యంత ప్రభావవంతంగా నిలిచింది. ఆ సిరీస్‌లో గిల్ ఏకంగా 754 పరుగులు సాధించాడు. గిల్ వన్డేల్లోనూ ఇదివరకే 3000 పరుగులు పూర్తి చేశాడు.దశాబ్దంలో తొలి ఆటగాడుఈ మ్యాచ్‌లో గిల్ మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ దశాబ్దంలో టెస్టులు, వన్డేలు రెండింటిలో కనీసం 3,000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. గిల్ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 3,000 వన్డే పరుగులు పూర్తి చేశాడు. కేవలం 62 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకుని, వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 3,000 పరుగులు సాధించిన ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ తొలి రోజు లంచ్ విరామం సమయానికి 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(45), కేఎల్ రాహుల్ (18) ఔట్ కాగా.. పడిక్కల్ (13), గిల్ (11) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్‌లో గెలిచిన విషయం తెలిసిందే. -
వైభవ్‌కు టెస్టుల్లోనూ అవకాశం ఇవ్వాలి..!
భారత బ్యాటింగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టెస్టు క్రికెట్లోనూ అవకాశాలు ఇవ్వాలని భారత మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. 15 ఏళ్ల వైభవ్‌ను రెడ్‌బాల్ క్రికెట్లోనూ తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.ఐర్లాండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ద్రవిడ్.. వైభవ్ ప్రస్తుతం ఐపీఎల్, అంతర్జాతీయ టీ20ల ద్వారా వైట్‌బాల్ అనుభవం సంపాదిస్తున్నాడని, అదే సమయంలో దేశవాళీ క్రికెట్లో రెడ్‌బాల్ మ్యాచ్‌లు కూడా ఆడేలా చూడాలని అన్నారు.దులీప్ ట్రోఫీ కీలకం2026 దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్‌కు వైభవ్ ప్రాతినిధ్యం వహించనున్న నేపథ్యంలో, ఈ టోర్నీ అతడి రెడ్‌బాల్ సామర్థ్యాలను పరీక్షించడానికి కీలకంగా మారనుందిని.. భవిష్యత్తులో టెస్టు క్రికెట్‌కు ఎంపిక కావాలంటే ఇలాంటి అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకోవాలని ద్రవిడ్ అభిప్రాయపడ్డారు.అయితే వైభవ్‌పై అంచనాలు పెట్టుకునే విషయంలో తొందరపడకూడదని ఆయన స్పష్టం చేశారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతడు పెద్ద స్థాయిలో విజయాలు సాధించాడని, ఇక ముందు ఆటలో హెచ్చుతగ్గులు సహజమేనని, అందుకే అతడికి తగినంత సమయం ఇవ్వాలని సూచించారు.రెడ్‌బాల్‌లో ఇంకా మెరుగవ్వాలి..!వైట్‌బాల్ క్రికెట్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన వైభవ్.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం అంతగా ప్రభావం చూపలేదు. ఇప్పటివరకు ఎనిమిది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు 17.25 సగటుతో 207 పరుగులు మాత్రమే చేశాడు.అందుకే దులీప్ ట్రోఫీ అతడికి ముఖ్యమైన పరీక్ష కానుంది. ఇందులో రాణిస్తే ఆస్ట్రేలియా-ఏతో జరిగే అనధికారిక టెస్టులకు కూడా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.సెహ్వాగ్‌లా X-ఫ్యాక్టర్ అవుతాడా..?వైభవ్ సాంకేతికంగా ఇంకా సంపూర్ణ బ్యాటర్‌గా ఎదగాల్సి ఉన్నప్పటికీ, అతడి దూకుడు టెస్టు జట్టుకు ప్రత్యేకమైన X-ఫ్యాక్టర్‌గా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి.గతంలో భారత టెస్టు జట్టులో వీరేంద్ర సెహ్వాగ్ ఓపెనర్‌గా దూకుడైన పాత్ర పోషించాడు. వేగంగా పరుగులు చేస్తూ ప్రత్యర్థి బౌలింగ్ దాడిపై ఒత్తిడి పెంచేవాడు. అదే తరహాలో వైభవ్ కూడా భవిష్యత్తులో టెస్టుల్లో దూకుడైన ఓపెనర్‌గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే ప్రస్తుతానికి అతడికి టెస్టు జట్టులో స్థానం కంటే రెడ్‌బాల్ క్రికెట్లో ఎక్కువ అనుభవం, ఓర్పు, సాంకేతిక పరిణతి సాధించడం అవసరం. ద్రవిడ్ చెప్పినట్లుగా, వైభవ్ విషయంలో తొందరపడకుండా సమయం ఇవ్వడం కీలకం. -
ఇంగ్లండ్ చేతిలో చావుదెబ్బ; భారత్‌కు కలిసొచ్చిన పాక్ ఓటమి!
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ పరాజయం చవిచూసిన పాకిస్తాన్ జట్టు ఒక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పాకిస్తాన్ సున్నా పరుగు వద్దే తొలి వికెట్‌ను కోల్పోవడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్‌లో ఓలి రాబిన్సన్ బౌలింగ్‌లో అజన్ అవైస్ డకౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో ఆర్చర్ బౌలింగ్‌లో ఇమామ్-ఉల్-హక్ సున్నా పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ క్రమంలో 149 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సున్నా పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోవడం పాక్‌కు ఇది ఏడోసారి. ఈ నేపథ్యంలో అత్యధిక సార్లు సున్నా పరుగుల వద్ద వికెట్ కోల్పోయిన చెత్త జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. పాక్ తర్వాత ఇంగ్లండ్ (5 సార్లు), ఆస్ట్రేలియా (4 సార్లు), భారత్ (రెండు సార్లు), న్యూజిలాండ్ ఒకసారి ఈ ఫీట్‌ను నమోదు చేశాయి.ఇక ఇంగ్లండ్ చేతిలో పాక్ ఓటమి వల్ల డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పెద్దగా మార్పు లేకపోయినప్పటికీ, భారత్‌కు మాత్రం కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఇంగ్లాండ్ చేతిలో ఓటమితో డబ్ల్యూటీసీ సైకిల్లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌కు ఇది ఐదో ఓటమి. కేవలం 19.05 శాతం పాయింట్లతో పాక్ 9వ స్థానానికి దిగజారింది. దీంతో వెస్టిండీస్ (20.83 శాతం పాయింట్లు) 8వ స్థానంలో నిలవగా, పాక్‌పై విజయంతో ఇంగ్లాండ్ 29.76 శాతం పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఇరు జట్లు ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించాయి. మరోవైపు ఆస్ట్రేలియా 77.78 శాతం పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, సౌతాఫ్రికా (75 శాతం), న్యూజిలాండ్ (72.22 శాతం) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 53.33 శాతం పాయింట్లతో 5వ స్థానంలో, బంగ్లాదేశ్ 66.67 శాతం పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నాయి. శ్రీలంకపై జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్ రెండో మ్యాచ్‌లోనూ గెలిచి, అటు ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఓడిపోతే, భారత్ 57.57 శాతం పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకోవడంతో ఫైనల్ రేసుకు మరింత దగ్గరయినట్లవుతుంది.ఇక హెడ్డింగే వేదికగా జరిగిన టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో పాక్‌ను మట్టికరిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 171 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 409 పరుగులకు ఆలౌట్ కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో 238 పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 135 పరుగులకే కుప్పకూలింది.జోఫ్రా ఆర్చర్, ఒల్లీ రాబిన్సన్, జోష్ టంగ్, గుస్ అట్కిన్సన్ల ధాటికి పాకిస్థాన్ బ్యాటర్లు నిలవలేకపోయారు. రాబిన్సన్, టంగ్‌లు చెరో 8 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. తద్వారా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఆగస్టు 27నుంచి లార్డ్స్ వేదికగా జరగనుంది.Read: స్టార్క్ దెబ్బకు బంగ్లాదేశ్ విలవిల.. 149 ఏళ్లలో ఇదే తొలిసారి -
ముమ్మర సాధన.. ప్రాక్టీస్‌కు వాళ్లిద్దరు డుమ్మా!
కొలంబో: శ్రీలంక పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన భారత క్రికెట్ జట్టు... రెండో మ్యాచ్ కోసం సాధన ప్రారంభించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరాలంటే ప్రతీ మ్యాచ్‌లో విజయం కీలకం కాగా... భారత ప్లేయర్లు లోపాలను సరిదిద్దుకునే పనిలో పడ్డారు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గాలేలో జరిగిన తొలి టెస్టులో సంపూర్ణ ఆధిపత్యంతో గెలుపొందిన టీమిండియా... ఆదివారం నుంచి లంకతో రెండో టెస్టు ఆడనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్, బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే పర్యవేక్షణలో జట్టు సభ్యులు ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ లెఫ్టార్మ్ స్పిన్నర్లలను ఎదుర్కోవడంపై ప్రధాన దృష్టి పెట్టాడు. తొలి టెస్టులో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 16, 8 పరుగులతో నిరాశ పరిచాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఎడంచేతివాటం స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లోనే అతడు అవుటయ్యాడు. దీంతో లోపాలను అధిగమించేందుకు నెట్స్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్లను ఎదుర్కోవడంపై గిల్ ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. ఇప్పటి వరకు ఆడిన 42 టెస్టుల్లో గిల్ 11 సార్లు లెఫ్టార్మ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో అవుటయ్యాడు.శుక్రవారం సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ నెట్స్‌లో మానవ్ సుతార్, రవీంద్ర జడేజాతో పాటు పలువురు స్థానిక లెఫ్టార్మ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో గిల్ సాధన చేశాడు. గిల్ ప్రాక్టీస్‌ను సాయిరాజ్ బహుతులే ప్రత్యేకంగా పర్యవేక్షించాడు. ‘గిల్ నిరంతరం పరుగులు రాబట్టడాన్ని ఇష్టపడతాడు. గత మ్యాచ్‌లో అది సాధ్యపడలేదు. దీంతో వెంటనే ఆ లోపాన్ని అధిగమించేందుకు సిద్ధమయ్యాడు. పరిస్థితులకు తగ్గట్లు ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు’ అని బహుతులే వెల్లడించాడు. ఇక కుడిచేతివాటం ఆఫ్ స్పిన్నర్లపై గిల్‌కు మంచి రికార్డు ఉంది. కేఎల్ రాహుల్, కుల్దీప్ గైర్హాజరు తొలి టెస్టులో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ శుక్రవారం ప్రాక్టీస్‌కు దూరంగా ఉండిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కండరాలు పట్టేసి ఇబ్బంది పడిన రాహుల్... రెండో టెస్టులో భారీ ఇన్నింగ్స్ ఆడాలని భావిస్తున్నాడు. లంకతో మొదటి టెస్టులో అతడు వరుసగా 82, 35 పరుగులు చేశాడు. గతంలోనే శ్రీలంకలో పర్యటించిన భారత జట్టులో సభ్యుడైన రాహుల్... తన అనుభవాన్నంతా రంగరించి స్పిన్ ఉచ్చును చేధించడంతోనే భారత్ తొలి మ్యాచ్‌లో సులువుగా గెలుపొందింది. అతడితో పాటు తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ప్రాక్టీస్ చేయలేదు. ఆటగాళ్లు కసరత్తులు చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న కుల్దీప్... అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయకుండానే మైదానాన్ని వీడాడు. సారాంశ్ జైన్ కొన్ని ఓవర్లు బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. అతడి బౌలింగ్‌లో పంత్, గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ‘రాహుల్, కుల్దీప్ విశ్రాంతి తీసుకుంటున్నారు’ అని బహుతులే పేర్కొన్నాడు. -
భారీ నష్టాల్లో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు!
క్రికెట్లో బ్లాక్‌క్యాప్స్‌గా పిలుచుకునే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆర్థిక కష్టాల్లో పడింది. గతేడాది ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలను చవిచూసినట్లు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో 7.3 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 69 కోట్లు) ప్రాథమిక లోటు ఉన్నట్లు తెలిపింది. జూలై 31, 2026తో ముగిసిన గతేడాది ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో అంచనా వేసిన రూ. 1.8 మిలియన్ల నష్టం కంటే ఇది చాలా ఎక్కువ. స్పాన్సర్‌షిప్‌లు తగ్గడం, అకౌంటింగ్ సర్దుబాట్లు , ఖర్చులు పెరగడం ఇందుకు ప్రధాన కారణమని కివీస్ బోర్డు తెలిపింది. ముఖ్యంగా డ్రీమ్ 11 స్పాన్సర్‌షిప్‌ను కోల్పోవడం వల్ల ఆదాయం తగ్గిపోవడంతో పాటు ఖర్చులు పెరిగినట్లు స్పష్టం చేసింది.అయితే ఈ ఏడాది చివర్లో స్వదేశంలో టీమిండియా పర్యటన వల్ల సుమారు 10 మిలియన్ డాలర్లు వస్తాయని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆశాభావం వ్యక్తం చేస్తోంది. సూపర్ స్మాష్ పోటీ స్థానంలో 2027-28 సీజన్ కోసం ప్రతిపాదిత టీ20 ఫ్రాంచైజీ లీగ్‌కు సంబంధించి ప్రణాళికలు రచిస్తోంది. ఈ వేసవిలో జరిగే సూపర్ స్మాష్ పోటీల్లో మొత్తం 64 మ్యాచ్‌ల్లో ఫైనల్ సహా 24 మ్యాచ్‌లను డబుల్ హెడర్‌గా ప్రసారం చేస్తామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కార్యనిర్వహణాధికారి జియోఫ్ అల్లట్ స్పష్టం చేశాడు. ఇక డిసెంబర్-జనవరి నెలలో జరిగే సూపర్ స్మాష్ పోటీలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ వచ్చే నెలలో విడుదల కానుంది. ఇక ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్, వెస్టిండీస్‌పై వన్డే సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్ స్వదేశంలో భారత్‌తో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో టీమిండియా ఐదు టీ20లు,ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.Read: భారీగా యూఎస్ ఓపెన్ ప్రైజ్‌మనీ.. సింగిల్స్ విజేతకు 52 కోట్లు -
లంకతో రెండో టెస్టు.. స్టార్ ప్లేయర్‌పై వేటు..?
శ్రీలంకతో రెండో టెస్టుకు భారత జట్టు సిద్ధమవుతున్న వేళ తుది జట్టులో కీలక మార్పు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు 23 నుంచి కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో ప్రారంభం కానున్న రెండో టెస్టులో మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ సరాన్ష్ జైన్‌కు అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.33 ఏళ్ల సరాన్ష్కు ఇటీవలే భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ రెండో టెస్టుకు అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో సరాన్ష్ను జట్టులోకి తీసుకున్నారు.సరాన్ష్ కుడిచేతి ఆఫ్స్పిన్నర్తో పాటు ఎడమచేతి వాటం బ్యాటర్. 2014లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అతడు, దశాబ్దానికి పైగా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించాడు. ఫస్ట్‌క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 181 వికెట్లు, 2223 పరుగులు సాధించాడు.సరాన్ష్ తుది జట్టులోకి వస్తే ఎడమచేతి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై వేటుకు అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. గాలేలో జరిగిన తొలి టెస్టులో కుల్దీప్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. 25 ఓవర్లు వేసి 103 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే సాధించాడు.మరోవైపు తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. భారత స్పిన్నర్ మానవ్ సుతార్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి ప్రధాన కారణంగా నిలిచాడు.ఈ నేపథ్యంలో కొలంబోలో పరిస్థితులకు అనుగుణంగా స్పిన్ విభాగాన్ని మార్చాలని భారత జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సరాన్ష్ జైన్‌కు తుది జట్టులో చోటు దక్కితే, దాదాపు 12 ఏళ్ల దేశవాళీ ప్రస్థానం తర్వాత అతడి భారత టెస్టు అరంగేట్రం సాకారం అవుతుంది. -
ఫినిషర్ రింకూ సింగ్ ఈజ్ బ్యాక్
టీమిండియా ఫినిషర్‌గా పేరొందిన రింకూ సింగ్ ఛేజింగ్‌లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. యూపీ టీ20 లీగ్ 2026లో మీరట్ మావెరిక్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. లక్నో ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.🚀Rocket Rinku for a reason. 🔥pic.twitter.com/Ktl4vMBkk8 https://t.co/ChVvyki6Ym— Rokte Amar KKR (@Rokte_Amarr_KKR) August 19, 2026183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జట్టు కష్టాల్లో (10 ఓవర్లలో 75-4) ఉన్నప్పుడు ఆరో స్థానంలో బరిలోకి దిగిన రింకూ.. కేవలం 24 బంతుల్లో 6 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో అజేయమైన 55 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు.రింకూ విధ్వంసంతో మావెరిక్స్ స్కోర్ 154/6కు చేరుకుంది. ఈ దశలో వర్షం కారణంగా మ్యాచ్‌ను కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో మావెరిక్స్‌ను 5 పరుగుల తేడాతో విజేతగా ప్రకటించారు.2023 జ్ఞాపకాలురింకూ సింగ్ తాజా ఇన్నింగ్స్ చూసిన అభిమానులకు 2023 ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌పై అడిన సంచలన ఇన్నింగ్స్ గుర్తుకొచ్చింది. ఆ మ్యాచ్ చివరి ఓవర్లో యశ్ దయాల్ బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాది 29 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రింకూ, అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు.ఫినిషర్‌గా రింకూ ఎందుకు ప్రత్యేకం..?2023 ఐపీఎల్ తర్వాత రింకూ సింగ్‌కు నమ్మకమైన ఫినిషర్ అనే గుర్తింపు వచ్చింది. 2026 ఐపీఎల్‌లోనూ అతను 59.00 సగటుతో రాణించాడు. అయితే బ్యాటింగ్ స్థానాల్లో మార్పులు రావడంతో 2023 స్థాయి స్థిరత్వాన్ని మాత్రం కొనసాగించలేకపోయాడు.అయినా ఒత్తిడిలో ఛేజింగ్‌ను ముగించే సామర్థ్యంలో రింకూకు ప్రత్యేక గుర్తింపు ఉంది. టీ20ల్లో ఛేజింగ్ చేసిన 54 మ్యాచ్‌ల్లో 34 విజయాల్లో అతను భాగమయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 94 టీ20 మ్యాచ్‌ల్లో అతని సగటు 33.04, స్ట్రైక్‌రేట్ 139.44. ఈ క్రమంలో ఎనిమిది అర్ధసెంచరీలు సాధించాడు. -
కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు
గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయానికి యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (167, 44 పరుగులు), సంచలన స్పిన్నర్ మానవ్ సుతార్ (10 వికెట్లు) ప్రదర్శనలు కీలకంగా నిలిచాయి. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ కూడా బ్యాట్‌తో తమ వంతు సహకారం అందించారు.అహంకారాన్ని చోటు లేదుమ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ చేసిన వ్యాఖ్యలు భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లోని వాతావరణాన్ని మరోసారి చర్చలోకి తెచ్చాయి. సీనియారిటీ, అనుభవం పేరుతో అహంకారానికి చోటు లేదని, ప్రతి ఆటగాడు మరొకరి నుంచి నేర్చుకోవాల్సిందేనని రాహుల్ స్పష్టం చేశాడు."ఎవరినుంచైనా నేర్చుకోవడానికి సిగ్గు ఉండకూడదు"సీనియర్ ఆటగాడిగా ప్రతి క్రికెటర్ తన సహచరుడికి సహాయం చేయాల్సిన బాధ్యత ఉందని రాహుల్ చెప్పాడు. 20 టెస్టులు ఆడిన ఆటగాడైనా, 60-70 టెస్టులు ఆడిన సీనియర్ అయినా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడంలో ఎలాంటి సంకోచం ఉండకూడదని పేర్కొన్నాడు."ఎవరినుంచైనా నేర్చుకోవడంలో సిగ్గు లేదా అహంకారం ఉండకూడదు. డ్రెస్సింగ్ రూమ్ ఎప్పుడూ అందరికీ తెరిచే ఉంటుంది. ఆటగాళ్లు ఒకరి నుంచి మరొకరు నేర్చుకుంటూనే ఉంటారు"రాహుల్ చెప్పిన ఈ మాటలు భారత జట్టులో సీనియర్-జూనియర్ అనే గోడలు లేకుండా జ్ఞానాన్ని పంచుకునే సంస్కృతి ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.జైస్వాల్ నుంచి కూడా నేర్చుకుంటాను..తన కంటే తక్కువ అనుభవం ఉన్న ఆటగాళ్ల నుంచి కూడా తాను నేర్చుకుంటున్నానని రాహుల్ ప్రత్యేకంగా చెప్పాడు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్‌తో బ్యాటింగ్‌లోని కొన్ని అంశాలపై చర్చిస్తానని వెల్లడించాడు.స్వీప్, రివర్స్ స్వీప్ వంటి షాట్ల విషయంలో జైస్వాల్ ఆలోచనా విధానం తనకంటే భిన్నంగా ఉంటుందని, అందుకే అతనితో మాట్లాడి అతని అభిప్రాయాలను తెలుసుకుంటానని తెలిపాడు.సుతార్‌పై ప్రశంసలు10 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన మానవ్ సుతార్‌ను కూడా రాహుల్ ప్రశంసించాడు.సుతార్ ఒకే ప్రాంతంలో నిలకడగా బౌలింగ్ చేస్తూ, స్వల్ప మార్పులతో బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పాడు. బంతి ఎక్కువగా టర్న్ కాకపోయినా, అదే ప్రాంతంలో పదేపదే బౌలింగ్ చేయడం ద్వారా బ్యాటర్‌పై ఒత్తిడి పెంచుతున్నాడని వివరించాడు."బౌలర్ నుంచి ఎక్కువ మార్పు కనిపించకపోతే ఏదో ఒకటి చేయాలనే ఆలోచన బ్యాటర్లో మొదలవుతుంది. ఆ మానసిక స్థితిలోకి బ్యాటర్‌ను తీసుకెళ్లగలిగితే పోరులో బౌలర్‌దే పైచేయి" అని విశ్లేషించాడు.రాహుల్ వ్యాఖ్యలు కేవలం డ్రెస్సింగ్ రూమ్‌లోని వాతావరణంపై చేసిన సాధారణ వ్యాఖ్యలు కావు. భారత క్రికెట్లో అనుభవం కంటే నేర్చుకునే మనస్తత్వం, వ్యక్తిగత ప్రతిష్ఠ కంటే జట్టు ప్రయోజనం ముఖ్యమనే సందేశాన్ని ఇస్తున్నాయి.ప్రత్యేకంగా జైస్వాల్ వంటి యువ ఆటగాళ్ల నుంచి సీనియర్లు కూడా నేర్చుకుంటున్నారని రాహుల్ స్వయంగా చెప్పడం, భారత జట్టు కొత్త తరం వైపు మారుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో పరస్పర గౌరవానికి ఎంత ప్రాధాన్యం ఉందో చూపిస్తోంది. భారత జట్టు భవిష్యత్తుకు ఈ సంస్కృతి మరింత కీలకం కావచ్చు. -
భారత్-ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్‌కు FIFA వరల్డ్ కప్ టెక్నాలజీ
భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగనున్న మూడు మ్యాచ్ టీ20 సిరీస్ క్రికెట్ ప్రసారంలో కొత్త అనుభూతిని అందించనుంది. 2026 FIFA వరల్డ్ కప్‌లో ఉపయోగించిన అధునాతన ప్రసార సాంకేతికతలను ఈ సిరీస్‌లో తొలిసారిగా పూర్తి స్థాయిలో ఉపయోగించనున్నారు.ఆఫ్ఘనిస్తాన్ ఈ సిరీస్‌కు అధికారికంగా ఆతిథ్య జట్టు అయినప్పటికీ, మ్యాచ్‌లు భారత్‌లోని ఢిల్లీలో జరగనున్నాయి. ఈ సిరీస్‌ను FIFA వరల్డ్ కప్ హోస్ట్-బ్రాడ్కాస్ట్ ప్రమాణాలతో రూపొందించనున్నట్లు ప్రసార హక్కులు కలిగిన ITW Universe వెల్లడించింది.FIFA వరల్డ్ కప్ మ్యాచ్‌లను, అలాగే పలు UEFA ఛాంపియన్స్ లీగ్ ఫైనల్స్‌ను డైరెక్ట్ చేసిన జేమీ ఓక్‌ఫోర్డ్ ఈ సిరీస్ ప్రసారానికి దర్శకత్వం వహించనున్నారు. ఆయన 2002 నుంచి ప్రతి FIFA వరల్డ్ కప్‌ను కవర్ చేశారు.ప్రసారంలో AI-స్టెబిలైజ్డ్ POV కెమెరాలు, వాల్యూమెట్రిక్ ఫ్రీ-వ్యూపాయింట్ టెక్నాలజీ, అధునాతన Spidercam, Ultra-Motion కెమెరాలు, సినీ-స్టైల్ విజువల్స్ వంటి సాంకేతికతలు ఉపయోగించనున్నారు.ఇవే కాకుండా Quidich Innovation Labsకు చెందిన Spatio సిస్టమ్ ద్వారా స్టెబిలైజ్డ్ డ్రోన్ ఫీడ్‌పై బ్రాడ్కాస్ట్-గ్రేడ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్రాఫిక్స్‌ను చూపించనున్నారు. మరో ప్రత్యేక Ultra-Slow-Motion కెమెరా సెకనుకు 600 ఫ్రేమ్‌ల వేగంతో బంతి, ఎడ్జ్‌లు, షాట్లు వంటి కీలక క్షణాలను రికార్డ్ చేయనుంది.ప్రస్తుతం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మూడు టీ20లు సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య ఢిల్లీలో జరగాల్సి ఉంది. అయితే గణేశ్ చతుర్థి కారణంగా షెడ్యూల్లో స్వల్ప మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.మొత్తంగా, ఈ సిరీస్ క్రికెట్ మ్యాచ్‌ను టీవీలో చూసే అనుభూతిని FIFA వరల్డ్ కప్ స్థాయి విజువల్ ప్రొడక్షన్‌కు తీసుకెళ్లే తొలి ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌గా నిలవనుంది. -
రికార్డుల మోత మోగించిన సుతార్
శ్రీలంకపై తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంలో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో (6/55) ఒకే ఓవర్లో 3 వికెట్లు తీయడంతో పాటు మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు (10/131) పడగొట్టిన అతడు, పలు రికార్డులు బద్దలు కొట్టాడు.సుతార్ బద్దలు కొట్టిన రికార్డులు* 6/55: శ్రీలంక గడ్డపై శ్రీలంకపై భారత బౌలర్ సాధించిన అత్యుత్తమ టెస్టు ఇన్నింగ్స్ గణాంకాల్లో రెండో స్థానం. రవిచంద్రన్ అశ్విన్ 6/46తో ముందున్నాడు.* 10/131: శ్రీలంకలో ఒక టెస్టు మ్యాచ్‌లో భారత బౌలర్ సాధించిన అత్యుత్తమ మ్యాచ్ గణాంకాలు.* శ్రీలంకపై టెస్టుల్లో భారత బౌలర్ సాధించిన అత్యుత్తమ మ్యాచ్ గణాంకాల్లో నాలుగో స్థానం.* సుతార్ తన కెరీర్లో 2 టెస్ట్‌లు పూర్తయ్యేసరికి 17 వికెట్లు తీసుకున్నాడు. ఈ జాబితాలో నరేంద్ర హిర్వాణి 24 వికెట్లతో, అక్షర్ పటేల్ 18 వికెట్లతో మాత్రమే సుతార్ కంటే ముందున్నారు.* శ్రీలంకపై టెస్టుల్లో ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు.రెండు టెస్టుల్లోనే 17 వికెట్లు24 ఏళ్ల సుతార్ టెస్టు కెరీర్‌కు ఇది అద్భుతమైన ఆరంభం. ఈ ఏడాది ఆఫ్ఘనిస్తాన్పై అరంగేట్రం చేసిన అతను తొలి టెస్టులోనే ఆరు వికెట్ల ప్రదర్శన చేశాడు.ఇప్పుడు శ్రీలంకపై 10 వికెట్లతో తన సత్తా చాటాడు. దీంతో కేవలం రెండు టెస్టుల్లో 17 వికెట్లు సాధించాడు. అతని బౌలింగ్ సగటు 11.35గా ఉంది. ఇప్పటివరకు రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు, ఒక 10 వికెట్ల మ్యాచ్ ప్రదర్శన నమోదు చేశాడు.ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం పడిక్కల్కుసుతార్ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దేవదత్ పడిక్కల్‌కు దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో పడిక్కల్ 167 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన 44 పరుగులు సాధించాడు. సాయి సుదర్శన్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన పడిక్కల్ తనకు లభించిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.తాజా విజయంతో భారత్ రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్టు ఆగస్టు 23న కొలంబోలో ప్రారంభం కానుంది. -
టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవం
శ్రీలంకపై తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో తమ పరిస్థితిని మెరుగుపరుచుకుంది. తొలి టెస్టుకు ముందు భారత్ PCT 48.15%గా ఉండగా, శ్రీలంకపై విజయం తర్వాత అది 53.55%కి పెరిగింది. PCT శాతం పెరిగినప్పటికీ భారత్ ఐదో స్థానంలోనే కొనసాగుతోంది. నాలుగో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌తో భారత్‌కు ఇంకా గణనీయమైన తేడా ఉంది.ఈ సైకిల్లో భారత్ ఫైనల్ రేసులో నిలవాలంటే మిగిలిన 8 మ్యాచ్‌ల్లో భారీగా విజయాలు సాధించాల్సి ఉంటుంది. భారత్ తదుపరి శ్రీలంకతో మరో టెస్టు, న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు, ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం 6 టెస్టులు గెలిస్తే భారత్‌కు ఫైనల్ చేరే అవకాశాలు బలపడతాయి. అది మాత్రమే సరిపోదు. పై స్థానాల్లో ఉన్న జట్లు కూడా పాయింట్లు కోల్పోవాలి. అప్పుడే భారత్ ఫైనల్‌కు చేరుకుంటుంది.ప్రస్తుతం ఆస్ట్రేలియా 77.78 శాతం PCTతో పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికా (75), న్యూజిలాండ్ (72.22), బంగ్లాదేశ్ (66.67) భారత్ కంటే ముందు (వరుసగా రెండు నుంచి నాలుగు) స్థానాల్లో ఉన్నాయి.శ్రీలంక పరిస్థితి మరింత క్లిష్టంభారత్ చేతిలో ఓటమితో శ్రీలంక WTC ఫైనల్ అవకాశాలు మరింత దెబ్బతిన్నాయి. శ్రీలంకకు ఇంకా 7 టెస్టులు మిగిలి ఉన్నాయి. భారత్‌తో మరో టెస్టుతో పాటు న్యూజిలాండ్, పాకిస్తాన్లలో విదేశీ సిరీస్‌లు, దక్షిణాఫ్రికాతో స్వదేశీ సిరీస్ ఆడాల్సి ఉంది.ప్రస్తుతం ఆ జట్టు 33.33 శాతం PCTతో భారత్ తర్వాత ఆరో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ (24.36), పాక్ (22.22), వెస్టిండీస్ (20.83) చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి. కాగా, శ్రీలంకపై తొలి టెస్ట్ గెలుపుతో భారత్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగస్ట్ 23న కొలొంబోలో ప్రారంభం కానుంది. -
వివాదంలో రింకూ సింగ్
టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ తన స్వరాష్ట్రం యూపీలో జరిగే టీ20 లీగ్‌లో రచ్చ చేశాడు. ఈ టోర్నీలో మీరట్ మావెరిక్స్ కెప్టెన్‌గా వ్యవహరించే రింకూ.. గోరఖ్‌పూర్ లయన్స్ మ్యాచ్‌కు ముందు గ్రౌండ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగి వివాదంలో చిక్కుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా సోషల్ మీడియాలో వైరలవుతోంది.The ground staff member told Rinku and his teammate that the area was reserved for the opposition’s practice bowling, but neither of them listened. Rinku still ran towards the pitch and started bowling while the poor guy kept chasing them. Rinku and his teammate just kept… pic.twitter.com/3MyKIHS0za— ElysiumCricket (@CricketElysium) August 19, 2026అసలేం జరిగిందంటే..?మ్యాచ్‌కు ముందు మావెరిక్స్ ఆటగాళ్లు మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సమయంలో రింకూ సింగ్, అతని సహచర ఆటగాడు ప్రత్యర్థి జట్టు కోసం కేటాయించిన ప్రాక్టీస్ ప్రాంతంలోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో కనిపించింది.ప్రత్యర్థి జట్టు బౌలింగ్ ప్రాక్టీస్ కోసం ఆ ప్రాంతాన్ని కేటాయించడంతో అక్కడికి వెళ్లవద్దని గ్రౌండ్ సిబ్బంది రింకూను, అతని సహచరుడిని కోరాడు. అయితే రింకూ అతని సూచనలను పట్టించుకోకుండా ఆ ప్రాంతంలోకి వెళ్లి బౌలింగ్ చేసినట్లు వీడియోలో కనిపించింది.గ్రౌండ్ సిబ్బంది వారిని అక్కడి నుంచి వెళ్లాలని పదేపదే కోరుతున్న సమయంలో రింకూ, అతని సహచరుడు నవ్వుతూ కనిపించడం వివాదానికి కారణమైంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో రింకూపై విమర్శలు వస్తున్నాయి. అమాయకంగా కనిపిస్తాడు కానీ, ముదురే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రింకూకు శిక్ష పడుతుందా..?అయితే ఈ ఘటనను క్రికెట్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించడం అంత సులభం కాదు. వీడియోలో కనిపిస్తున్నది ప్రత్యర్థి జట్టు కేటాయించిన ప్రాక్టీస్ పిచ్ మాత్రమే. అది మ్యాచ్‌కు ఉపయోగించే అసలు పిచ్ కాకపోవడంతో, అక్కడ బౌలింగ్ చేసినందుకు నేరుగా శిక్ష విధించే నిబంధన ఉన్నట్లు స్పష్టత లేదు.మ్యాచ్‌కు ఉపయోగించే ప్రధాన పిచ్‌ను దెబ్బతీయడం లేదా దాని పరిస్థితిని ప్రభావితం చేసే చర్యలు మాత్రం తీవ్రంగా పరిగణించబడతాయి. కానీ ఈ ఘటనలో రింకూ అసలు మ్యాచ్ పిచ్‌ను ఉపయోగించినట్లు ఆధారాలు లేవు.క్రీడాస్ఫూర్తికి విరుద్ధంప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రింకూ సింగ్‌పై నిషేధం లేదా భారీ శిక్ష పడే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. అయితే గ్రౌండ్ సిబ్బంది సూచనలను పట్టించుకోకుండా ప్రత్యర్థి జట్టు ప్రాక్టీస్ ప్రాంతంలోకి వెళ్లడం మాత్రం క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. -
జురెల్ క్యాచ్‌పై వివాదం
భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు టీమిండియా ఆటగాడు ధ్రువ్ జురెల్ పట్టిన ఓ క్యాచ్ వివాదానికి దారితీసింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో లహిరు ఉదారాను ఔట్ చేసేందుకు అతడు తీసుకున్న లో క్యాచ్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.శ్రీలంక ఇన్నింగ్స్‌లో 22వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. భారత స్పిన్నర్ మానవ్ సుతార్ వేసిన బంతిని ఉదారా డిఫెన్స్ చేయబోయాడు. అయితే బంతి బ్యాట్ అంచుకు తగిలి గల్లీ దిశగా వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న జురెల్ అద్భుతంగా కిందకు డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు.Jurel takes a stunner - Suthar gets Lahiru Udara.Jurel takes it centimeters off the turf.Third umpire Raveendra Wimalasiri says he is satisfied that the fingers are under the ball.#SLvIND #TeamIndia #Galle #SriLanka #WTC27 #LahiruUdara #DhruvJurel #ManavSuthar pic.twitter.com/v8fjQf6P3h— lightningspeed (@lightningspeedk) August 18, 2026అయితే బంతి నేరుగా జురెల్ చేతిలో పడిందా..? లేక ముందుగా నేలను తాకిందా..? అనే అనుమానం తలెత్తింది. ఫీల్డ్ అంపైర్ క్యాచ్‌ను సమీక్ష కోసం థర్డ్ అంపైర్‌కు పంపాడు.రిప్లేలలో కూడా పరిస్థితి చాలా క్లిష్టంగా కనిపించింది. బంతి జురెల్ చేతుల్లోకి వెళ్లే సమయంలో నేలను తాకినట్లు కొందరికి అనిపించగా, మరికొందరు బంతి నేలను తాకకుండానే జురెల్ క్యాచ్ పూర్తి చేశాడని వాదించారు.చివరికి థర్డ్ అంపైర్ భారత్‌కు అనుకూలంగా నిర్ణయం ఇచ్చాడు. దీంతో లహిరు ఉదారా ఔట్‌గా వెనుదిరిగాడు.అంపైర్ నిర్ణయం వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కొంతమంది అభిమానులు జురెల్ క్యాచ్‌ను అద్భుతమైనదిగా అభివర్ణించగా, మరికొందరు బంతి నేలను తాకిందని పేర్కొంటూ థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని ప్రశ్నించారు.లంక టార్గెట్ 372తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసిన భారత్.. శ్రీలంకను 284 పరుగులకుఆలౌట్ చేసి 174 పరుగుల ఆధిక్యం సాధించింది.రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 193 పరుగులకు ఆలౌటైంది. దీంతో శ్రీలంక ముందు 372 పరుగుల విజయలక్ష్యం నిలిచింది.విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలవాలంటే చివరి రోజు 288 పరుగులు చేయాలి. ఇది అంతా సులువుగా జరిగే పని కాదు. భారత్ మాత్రం మరో 6 వికెట్లు తీస్తే విజయం సొంతం చేసుకుంటుంది. అయితే చివరి రోజు భారత గెలుపుకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో సోనల్ దినుష (25), కెప్టెన్ ధనంజయ డిసిల్వ (31) క్రీజ్‌లో ఉన్నారు. -
కోహ్లి సక్సెస్ వెనుక గంభీర్.. ఎవరికీ తెలియని 18 ఏళ్ళ సీక్రెట్
-
వీవీఎస్ లక్ష్మణ్ కు గుడ్ న్యూస్..! బీసీసీఐ కీలక నిర్ణయం
-
Virat Kohli: 18 ఏళ్ల ప్రయాణంలో 18 అద్భుత క్షణాలు
ఆగస్టు 18, 2008.. శ్రీలంకతో మ్యాచ్‌లో ఒక 19 ఏళ్ల కుర్రాడు 18వ నెంబర్ జెర్సీ మైదానంలో బరిలోకి దిగాడు. నునుగు మీసాలతో ఉన్న ఆ కుర్రాడు మ్యాచ్‌లో 22 బంతులాడి 12 పరుగులే చేసి ఔటయ్యాడు. అయితే ఆ కుర్రాడే భారత క్రికెట్‌ను ఏలబోతున్నాడన్న విషయం అతడితో సహా అక్కడున్న వారికి ఎవరికీ తెలియదు. కట్‌చేస్తే 18 ఏళ్లు తిరిగేసరికి అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లు (టెస్టు, వన్డే, టీ20లు) కలిపి 28,359 పరుగులు చేసి ఆల్‌టైమ్ అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో 85 సెంచరీలు, 125 హాఫ్ సెంచరీలున్నాయి. వన్డే క్రికెట్లో సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టిన ఆ వ్యక్తి ఎవరో కాదు.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి. 18 ఏళ్ల ప్రయాణంలో కోహ్లి ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. (18 Years Of Virat Kohli In International Cricket)విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం మొదలై ఇవాళ్టితో (ఆగస్టు 18) 18 సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కోహ్లి లక్కీ నంబర్ 18 అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతడు వేసుకునే జెర్సీ నెంబర్ 18.. ఐపీఎల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలి టైటిల్ సాధించింది 18వ ఎడిషన్‌లోనే కావడం విశేషం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే కోహ్లికి 18వ సంఖ్య అంటే బాగా ఇష్టం. ఈ నేపథ్యంలో కోహ్లి 18 ఏళ్ల ప్రయాణంలో 18 అద్భుత క్షణాలను ఒకసారి గుర్తుకుతెచ్చుకుందాం. (Virat Kohli Greatness)1) తండ్రి మరణం2006 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో, 18 ఏళ్ల వయసులో విరాట్ కోహ్లి అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నాడు. డిసెంబర్ 19న 40 పరుగులతో ఆడుతున్న సమయంలో తన తండ్రి మరణవార్త తెలిసినప్పటికీ కోహ్లి ఆ వార్తను దిగమింగి 90 పరుగులతో ఢిల్లీ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు.2) అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్మలేషియాలోని కౌలాలంపూర్‌లోని వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో కోహ్లి తొలిసారి తనలోని వ్యూహాత్మకను ప్రదర్శించాడు. వర్షం కారణంగా 25 ఓవర్లలో 116 పరుగుల సవరించిన లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేదించాల్సి ఉంది. అయితే ఆ మ్యాచ్‌లో భారత బౌలర్లలో ప్రతీ ఒక్కరు పది కంటే ఎక్కువ పరుగులే సమర్పించుకున్నారు. కానీ ఇక్కడే కోహ్లి తన తెలివిని ఉపయోగించి అజితేష్ అర్గల్‌ను సరైన సమయంలో వాడుకున్నాడు. ఆఖరి ఓవర్లో ఏడు పరుగులు మాత్రమే ఇచ్చిన అజితేష్ రెండు వికెట్లు తీయడంతో పాటు ఇండియాకు టైటిల్ అందించాడు.3) 2011 వన్డే ప్రపంచకప్2011 వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. లంకతో జరిగిన ఆనాటి ఫైనల్లో కోహ్లి 35 పరుగులే చేసినప్పటికీ, గంభీర్‌తో కలిసి ఒత్తిడిలో అతడు ఆడిన ఇన్నింగ్స్ విలువైనది. కోహ్లి ఇన్నింగ్స్‌లో పెద్ద సంచలనం లేకపోయినా, తర్వాతి కాలంలో అతడు అద్భుతమైన క్రికెటర్‌గా మారడానికి ఇదే అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.4) 2012లో హోబార్ట్ వీరోచిత ఇన్నింగ్స్2012 ఫిబ్రవరి 28న, హోబర్ట్‌లో, విరాట్ కోహ్లీ శ్రీలంకపై 86 బంతుల్లో 133* పరుగులతో తన కెరీర్లోనే ఒక చిరస్మరణీయమైన వన్డే ఇన్నింగ్స్ ఆడాడు. కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో నిలవాలంటే, శ్రీలంక చేసిన 320/4 పరుగులను భారత్ కేవలం 40 ఓవర్లలోనే ఛేదించాల్సి వచ్చింది. అయితే భారత్ 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేధించడం విశేషం. ఇక లసిత్ మలింగ వేసిన ఒక ఓవర్లో కోహ్లి 24 పరుగులు రాబట్టడం విశేషం.5) 2012 ఆసియా కప్2012 ఆసియా కప్ సందర్భంగా మీర్పూర్లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లి 183 పరుగులు చేశాడు. కోహ్లి ఇన్నింగ్స్‌తో 330 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ఆరు వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది. కోహ్లి వన్డే కెరీర్లో ఇప్పటికీ ఇదే అత్యధిక స్కోరు.6) 2012 ఫిట్నెస్ విప్లవం2012 ఐపీఎల్లో పేలవ ప్రదర్శన తర్వాత, విరాట్ కోహ్లీ తాను తన శరీరాకృతిని ఎంతగా కోల్పోయాడో గ్రహించాడు. అంతర్జాతీయ క్రికెట్లో మారుతున్న ప్రమాణాలను గ్రహించిన కోహ్లీ, స్వీట్లు, జంక్ ఫుడ్, అర్ధరాత్రి పూట తినే స్నాక్స్‌ను మానేసి, ఆహార పరిమాణాన్ని కఠినంగా నియంత్రించుకుంటూ, ప్రతిరోజూ తీవ్రమైన వ్యాయామాలు చేయడం ప్రారంభించాడు.7) 2014 పీడకల2014 ఇంగ్లాండ్ టెస్ట్ పర్యటన విరాట్ కోహ్లీ మానసిక స్థైర్యానికి, ఏకాగ్రతకు పెద్ద దెబ్బగా మారింది. ఇంగ్లీష్ పేసర్ జేమ్స్ అండర్సన్, కోహ్లీకి ఆఫ్-స్టంప్ బయట బౌలింగ్ చేసే బలహీనతను నిరంతరం ఉపయోగించుకున్నాడు. అతను నాలుగు సార్లు ఔటయ్యాడు, 10 ఇన్నింగ్స్‌లలో కేవలం 134 పరుగులకే పరిమితమయ్యాడు.8) సాంకేతిక విప్లవంవిరాట్ కోహ్లీ తన స్టాన్స్‌ను వెడల్పుగా ఉంచి, బంతి వేగాన్ని తగ్గించడానికి ఫార్వర్డ్ ప్రెస్ మూవ్‌మెంట్‌ను ఉపయోగించడం ద్వారా తన సాంకేతిక సామర్థ్యాలను పునఃసమీక్షించుకున్నాడు. BGT తరఫున ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు, అడిలైడ్‌లో తన టెస్ట్ కెప్టెన్సీ అరంగేట్రంలో కోహ్లీ 115, 141 పరుగులు చేశాడు.9) 2022 టీ20 ప్రపంచ కప్పాకిస్థాన్పై కోహ్లీ చేసిన అజేయమైన 82* పరుగులు ఒక అద్భుతం కంటే తక్కువ కాదు. కేవలం 3.1% గెలుపు శాతంతో ఆ దేశానికి 8 బంతుల్లో 28 పరుగులు అవసరం కాగా, కోహ్లీ దానిని సాధ్యం చేశాడు.10) 2016 ఐపీఎల్ సీజన్దేశీయ టీ20 లీగ్‌లో విరాట్ కోహ్లీ మరియు ఒక బ్యాటర్‌గా అతని అత్యుత్తమ ప్రదర్శన అది. అద్భుతమైన నిలకడతో, అతను 16 ఇన్నింగ్స్‌లలో నాలుగు సెంచరీలతో పాటు ఏడు అర్ధ సెంచరీలు సాధించాడు. ఆ సీజన్లో అతను 973 పరుగులు చేశాడు, ఇది ఆ టోర్నమెంట్ యొక్క ఒక ఎడిషన్‌లో ఇప్పటివరకు ఒక బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు.11) 2018లో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి2014 పర్యటన తర్వాత నాలుగేళ్లకు తిరిగి వచ్చిన కోహ్లీ, 59 సగటుతో 594 పరుగులు సాధించాడు. అతను తన టెక్నిక్, సహనం, ఆత్మాభిమానంతో విమర్శకుల నోళ్లు మూయించడమే కాకుండా, తన బ్యాటింగ్ విధానాన్ని పునరుద్ధరించుకోవడం ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు.12) ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయంవిరాట్ సారథ్యంలో భారత్ ఆస్ట్రేలియా గడ్డపై మొట్టమొదటి టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించింది. ఇది ఆసియా రెడ్-బాల్ క్రికెట్లో ఒక మైలురాయి వంటిది. అతను 4 మ్యాచ్‌లలో 282 పరుగులు చేసి ఆదర్శంగా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్ల నుండి పుజారా తీవ్రమైన దెబ్బలు తిన్న వివాదాస్పద సిడ్నీ టెస్ట్ కూడా ఇందులో ఉంది.13) 60 ఓవర్లపై స్పందనకోహ్లీ తన దూకుడును శక్తిగా మలచి, ఇతరులను బలోపేతం చేయడానికి తన తీవ్రతను ఉపయోగించాడు. 2021లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఓవల్ టెస్టులో, తన సహచరులకు అతను చేసిన ప్రసిద్ధ '60 ఓవర్ల నరకం' ప్రసంగం, భారత్‌ను ఉత్తేజపరిచి నాటకీయ విజయాన్ని సాధించేలా చేసింది. అది కెప్టెన్‌గా కోహ్లీ యొక్క తీవ్రమైన, రాజీపడని ప్రతిబింబాన్ని చాటింది.14) 2022 ఆసియా కప్‌లో 71వ సెంచరీ2019లో ఏడు సెంచరీలు చేసిన తర్వాత, కోహ్లీ 2020, 2021లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఆ తర్వాత రెండేళ్లకు, 2022 ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్పై సెంచరీతో పునరాగమనం చేశాడు. అది అతని తొలి టీ20ఐ సెంచరీ కూడా.15) 2023 వన్డే ప్రపంచకప్స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అతను 765 పరుగులు చేసి, ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగుల కోసం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టడంతో పాటు, ఈ ఫార్మాట్లో అత్యధికమైన తన 50వ వన్డే సెంచరీని నమోదు చేశాడు.16) 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్2024 టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ అంతటా 1, 4, 0, 24, 37, 0, 9 పరుగులు చేసిన తర్వాత, కోహ్లీ అత్యంత కీలకమైన సమయంలో రాణించాడు. ఫైనల్లో అతను 59 బంతుల్లో 76 పరుగులు చేసి, 12 ఏళ్ల తర్వాత భారత్ ఐసీసీ ట్రోఫీని గెలవడంలో సహాయపడ్డాడు.17) ఆర్సీబీకి తొలి టైటిల్ ఐపీఎల్లో 18 సీజన్ల తర్వాత ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ అందుకుంది. 18 ఏళ్లుగా ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కోహ్లి తొలి ఐపీఎల్ టైటిల్ అందుకున్న క్షణంలో భావోద్వేగానికి గురయ్యాడు.18) టెస్టు రిటైర్మెంట్పై కోహ్లీ స్పందనతన రెండో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడానికి ముందు, టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక మీడియాలో చక్కర్లు కొట్టిన అన్ని ఊహాగానాలకు కోహ్లీ సమాధానమిచ్చాడు. ‘నేను క్రికెట్ ఆడాలనుకుంటున్నాను, కొనసాగించాలనుకుంటున్నాను. భారత్ తరఫున ప్రపంచ కప్ ఆడటం అద్భుతం. కానీ దాని విలువ స్పష్టంగా ఉండాలి” అని చెప్పుకొచ్చాడు. -
చావుతో పోరాడి దేశానికి కప్ తెచ్చిన యోధుడు.. యువరాజ్ సింగ్ లైఫ్ స్టోరీ
-
ఆసీస్ ఓటమితో మారిన టీమిండియా WTC ఫైనల్ లెక్కలు
-
పంత్ సిక్సర్ల రికార్డు
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మరో అరుదైన రికార్డు సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదడంతో టెస్ట్ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో లెజండరీ ఆల్‌రౌండర్ జాక్ కలిస్‌ను (97 సిక్సర్లు) అధిగమించాడు.ఈ జాబితాలో బెన్ స్టోక్స్ (138), బ్రెండన్ మెక్కల్లమ్ (107), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (100), టిమ్ సౌథీ (98), క్రిస్ గేల్ (98) పంత్ (98) కంటే ముందున్నారు.2024లో విమర్శలు.. 2025లో అద్భుతమైన పునరాగమనంటెస్ట్ క్రికెట్లో పంత్ దూకుడైన బ్యాటింగ్‌కు ఎప్పటినుంచో ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే 2024లో అతని ఆ దూకుడే ప్రతికూలంగా మారింది. ఆ ఏడాది 17 ఇన్నింగ్స్‌ల్లో 576 పరుగులు చేసిన పంత్ సగటు 36.00గా ఉంది.అయితే 2025లో పంత్ అద్భుతంగా పుంజుకున్నాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 629 పరుగులు, 48.38 సగటుతో రాణించాడు. 2026లోనూ అతను 81, 39 పరుగుల ఇన్నింగ్స్‌లతో ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం పంత్ 51 టెస్టుల్లో 3,596 పరుగులు, 43.32 సగటు, 73.91 స్ట్రైక్‌రేట్‌తో కొనసాగుతున్నాడు.అంతేకాదు.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా గడ్డలపై టెస్ట్ సెంచరీలు సాధించిన అరుదైన వికెట్ కీపర్లలో పంత్ ఒకడిగా చలామణి అవుతున్నాడు.జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం ఉందా..?పంత్ ఎంతటి మ్యాచ్ విన్నర్ అయినప్పటికీ, టెస్టుల్లో అతని దూకుడు బ్యాటింగ్‌పై అప్పుడప్పుడు విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీమిండియాలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో వరుసగా విఫలమైతే ఏ ఆటగాడికైనా జట్టులో స్థానం ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉంది.పంత్ ఇప్పటికే భారత టెస్ట్ వైస్ కెప్టెన్సీని కోల్పోయాడు. ఒకవేళ భవిష్యత్తులో అతను టెస్ట్ జట్టులో చోటు కోల్పోతే, అతని స్థానాన్ని భర్తీ చేయడానికి ధృవ్ జురెల్ ప్రధాన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు.అయితే ప్రస్తుతానికి పంత్ తన బ్యాటింగ్‌తోనే సమాధానం ఇస్తున్నాడు. టెస్ట్ క్రికెట్లో 100 సిక్సర్ల మైలురాయికి అతను కేవలం రెండు సిక్సర్ల దూరంలో ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా రెండో రోజు ఆటలో దాదాపు రెండు సెషన్ల ఆట జరగలేదు. మూడో సెషన్లో ఆట ప్రారంభమైంది. ఓవర్‌నైట్ బ్యాటర్లు దేవదత్ పడిక్కల్ (167), రిషభ్ పంత్ (39)తో పాటు కేఎల్ రాహుల్ (82) ఔటయ్యారు. ధృవ్ జురెల్ (22), రవీంద్ర జడేజా (9) క్రీజ్‌లో ఉన్నారు. జట్టు స్కోర్ 372-5గా ఉంది. తొలి రోజు ఆటలో భారత్ యశస్వి జైస్వాల్ (32), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వికెట్లు కోల్పోయింది. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య, కేశర నువంత తలో 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో కోసం భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. -
విరాట్ కోహ్లిపై రవీంద్ర జడేజా సంచలన వ్యాఖ్యలు..!
భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్ ప్రారంభంలో టీమ్ మేనేజ్మెంట్ తన బ్యాటింగ్ సామర్థ్యంపై నమ్మకం ఉంచలేదని పరోక్షంగా చెప్పిన జడేజా.. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని వెల్లడించాడు. జడేజా నేరుగా ఏ కెప్టెన్ పేరును ప్రస్తావించకపోయినా, ఆయన వ్యాఖ్యలు విరాట్ కోహ్లి భారత టెస్ట్ కెప్టెన్‌గా ఉన్న కాలాన్ని గుర్తుచేస్తున్నాయి.జడేజా 2012లో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో ఇంగ్లండ్‌పై టెస్ట్ అరంగేట్రం చేశాడు. దేశవాళీ క్రికెట్లో మాత్రం అతను ఎక్కువగా నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. కానీ భారత జట్టులోకి వచ్చిన తర్వాత అతని బ్యాటింగ్ స్థానం క్రమంగా దిగజారింది.8, 9 స్థానాల్లో బ్యాటింగ్ చేయాల్సి వచ్చేది..!సంజయ్ మంజ్రేకర్‌తో మాట్లాడుతూ జడేజా తన బ్యాటింగ్ సామర్థ్యంపై తనకు మొదటి నుంచే నమ్మకం ఉండేదని చెప్పాడు. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ వంటి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తన బ్యాటింగ్ సగటు 60కుపైగా ఉండేదని గుర్తుచేశాడు.అయితే భారత జట్టులోకి వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఎనిమిదో, తొమ్మిదో స్థానంలో కూడా బ్యాటింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పాడు. అదే సమయంలో ఒక ఫాస్ట్ బౌలర్ తన తర్వాత బ్యాటింగ్ చేయడానికి సిద్ధమవుతున్న దృశ్యం తనలో అనుమానాలు కలిగించేదని పేర్కొన్నాడు.ఆ పరిస్థితుల్లో టీమ్‌కు నా బ్యాటింగ్‌పై నమ్మకం లేదా అనే భావన ఏర్పడేదని, దాంతో ఆత్మవిశ్వాసం దెబ్బతిందని తెలిపాడు.కోహ్లి కెప్టెన్సీ కాలం ఎందుకు ప్రస్తావనకు వచ్చింది..?ఈ విషయమై జడేజా నేరుగా విరాట్‌ను విమర్శించనప్పటికీ.. అతని కెరీర్లో ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో ఎక్కువసార్లు బ్యాటింగ్ చేసిన కాలంలో కోహ్లినే భారత టెస్ట్ కెప్టెన్‌గా ఉన్నాడు.టెస్ట్ క్రికెట్లో జడేజా 32 సార్లు ఎనిమిదో స్థానంలో, 12 సార్లు తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 2014 న్యూజిలాండ్ సిరీస్‌లో కూడా అతను తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఆ సమయంలో రవిచంద్రన్ అశ్విన్‌ను ఏడో స్థానానికి ప్రమోట్ చేయగా, వృద్ధిమాన్ సాహా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు.నంబర్ 6లో అవకాశం రావడంతో మారిన పరిస్థితిజడేజా తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని దేశవాళీ క్రికెట్లో చాలాకాలం క్రితమే నిరూపించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అతను 220 ఇన్నింగ్స్‌లలో 8,337 పరుగులు చేశాడు.అయితే భారత టెస్టు జట్టులో నాలుగో స్థానంలో అతనికి కేవలం ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే అవకాశం వచ్చింది. ఆ ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేశాడు. ఆరో స్థానంలో 29 ఇన్నింగ్స్‌లలో 1,074 పరుగులు, ఏడో స్థానంలో 32 ఇన్నింగ్స్‌లలో 1,578 పరుగులు సాధించాడు.కాలక్రమంలో జడేజా బ్యాటింగ్‌లో గణనీయమైన పురోగతి సాధించాడు. ఒత్తిడిని ఎదుర్కొంటూ టెస్టు మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడగల సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. -
భారత్, పాక్ రికార్డులు బద్దలు కొట్టిన బంగ్లాదేశ్
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. డార్విన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించి.. ఆ దేశంలో తమ తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో బంగ్లాదేశ్ మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. ఆస్ట్రేలియాలో అత్యంత వేగంగా టెస్ట్ విజయం సాధించిన ఆసియా జట్టుగా నిలిచింది. ఈ విషయంలో ఇప్పటివరకు పాకిస్తాన్ పేరిట ఉన్న రికార్డును బంగ్లాదేశ్ అధిగమించింది.మూడు టెస్టుల్లోనే తొలి విజయంబంగ్లాదేశ్ ఆస్ట్రేలియాలో తమ మూడో టెస్టులోనే తొలి విజయాన్ని అందుకుంది. దీంతో పాకిస్తాన్, భారత్ కంటే వేగంగా ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ గెలిచిన ఆసియా జట్టుగా నిలిచింది.బంగ్లాదేశ్- డార్విన్, 2026 (3వ టెస్ట్)పాకిస్తాన్ - సిడ్నీ, 1977 (7వ టెస్ట్)భారత్ - మెల్బోర్న్, 1978 (12వ టెస్ట్)శ్రీలంక - ఇంకా విజయం లేదు (15 టెస్టులు)ఆఫ్ఘనిస్తాన్ - ఇంకా ఆడలేదు (ఇంకా టెస్ట్ మ్యాచ్ ఆడలేదు)భారత్ తొలిసారిగా 1947లో ఆస్ట్రేలియాలో టెస్ట్ ఆడింది. తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. ఆ తర్వాత కూడా ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు విజయాలు దక్కలేదు. చివరకు 1978లో మెల్బోర్న్లో ఆస్ట్రేలియాపై తొలి టెస్ట్ విజయాన్ని సాధించింది.పాకిస్తాన్ మాత్రం 1964లో ఆస్ట్రేలియాలో తమ తొలి టెస్ట్ ఆడగా, 1977లో సిడ్నీలో ఏడో ప్రయత్నంలోనే తొలి విజయాన్ని అందుకుంది.2003లో ఘోర ఓటములు.. ఇప్పుడు చారిత్రక విజయంబంగ్లాదేశ్కు ఆస్ట్రేలియా పర్యటన కొత్తేమీ కాదు. 2003లో ఆ జట్టు తొలిసారి ఆస్ట్రేలియాలో టెస్టులు ఆడింది. అయితే ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది.అయితే 23 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బంగ్లాదేశ్ గణనీయంగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా పేస్ బౌలింగ్‌లో హసన్ మహ్మూద్ నేతృత్వంలోని బంగ్లా బౌలింగ్ విభాగం ఆస్ట్రేలియా స్టార్ పేసర్లైన జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్‌ల కంటే మెరుగైన ప్రభావాన్ని చూపింది.మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్ వంటి అనుభవజ్ఞులతో పాటు నజ్ముల్ హొస్సేన్ శాంటో, తంజిద్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్, ఎబాడత్, హసన్ మహ్మూద్ వంటి ఆటగాళ్లు బంగ్లాదేశ్‌ను టెస్టుల్లో మరింత పోటీ జట్టుగా మార్చారు.సిరీస్ గెలిచే సువర్ణావకాశండార్విన్ టెస్టు విజయంతో బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలవడం బంగ్లాదేశ్‌కు ఇప్పటివరకు సాధ్యం కాలేదు.మెక్‌కేలో జరగనున్న రెండో టెస్టులో ఓటమిని తప్పించుకున్నా, బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాలో తొలి టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఒకవేళ రెండో టెస్టులోనూ విజయం సాధిస్తే 2-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తుంది. -
గాలె టెస్టులో దుమ్ము దులిపిన దేవ్ దత్..
-
టీమిండియాను భారీ దెబ్బేసిన బంగ్లాదేశ్
ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించడంతో బంగ్లాదేశ్ ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్లైంది. ఈ గెలుపుతో ఆ జట్టు డబ్ల్యూటీసీ రేటింగ్ పాయింట్లను పెంచుకోవడమే కాకుండా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను భారీగా దెబ్బేసింది. ఆసీస్‌పై బంగ్లా గెలుపుతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.ఈ విజయంతో బంగ్లాదేశ్ పాయింట్ల శాతం (PCT) 58.33 నుంచి 66.67కి పెరిగింది. దీంతో ఆ జట్టు నాలుగో స్థానానికి ఎగబాకింది. మరోవైపు ఆస్ట్రేలియా PCT 87.50 నుంచి 77.78కి పడిపోయింది. అయినప్పటికీ ఆసీస్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా 75%, న్యూజిలాండ్ 72.22%తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఐదో స్థానంలో భారత్aఆసీస్‌పై బంగ్లాదేశ్ విజయం భారత్‌కు పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం టీమిండియా 48.15% PCTతో ఐదో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌తో భారత్‌కు ఇప్పుడు గణనీయమైన అంతరం ఏర్పడింది.భారత్ WTC ఫైనల్‌కు చేరాలంటే ఇకపై మిగిలిన టెస్టుల్లో వీలైనన్ని ఎక్కువ విజయాలు సాధించాల్సి ఉంటుంది. అదే సమయంలో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఫలితాలు కూడా భారత అవకాశాలపై ప్రభావం చూపనున్నాయి.ఆస్ట్రేలియాకు బిగ్ షాక్రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి, ఆ దేశ గడ్డపై తమ తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 198 పరుగులకే ఆలౌట్ చేసిన బంగ్లాదేశ్, అనంతరం 426 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 284 పరుగులకు ఆలౌట్ కావడంతో బంగ్లాదేశ్ ముందు కేవలం 57 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ లక్ష్యాన్ని బంగ్లా జట్టు సునాయాసంగా ఛేదించి చారిత్రక విజయం సొంతం చేసుకుంది.ఫైనల్ ఆశలుచారిత్రక విజయం తర్వాత బంగ్లాదేశ్ WTC ఫైనల్ రేసులో బలమైన పోటీదారుగా మారింది. ఆ జట్టుకు ఈ సైకిల్లో ఇంకా ఆస్ట్రేలియాతో మరో టెస్టుతో పాటు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లతో కీలక మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌ల్లో వీలైనన్ని గెలిస్తే బంగ్లాదేశ్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఆసీస్‌తో రెండో టెస్ట్ మెక్కే వేదికగా ఆగస్ట్ 22 నుంచి ప్రారంభమవుతుంది. -
చీఫ్ సెలక్టర్ లేదా హెడ్‌కోచ్ అవుతా: టీమిండియా దిగ్గజం
భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో భాగమయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నాడు. తనకు ఏ పదవి ఇచ్చినా వంద శాతం న్యాయం చేస్తానంటూ మనలోని మాటను వెల్లడించాడు.గంభీర్, అగార్కర్‌పై విమర్శలుకాగా టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్, చీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌పై గత కొంతకాలంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరి నేతృత్వంలో వైట్‌బాల్ క్రికెట్లో ఐసీసీ టోర్నీలో భారత జట్టు మంచి ఫలితాలు నమోదు చేస్తున్నప్పటికీ.. టెస్టుల్లో మాత్రం ఇటీవల ఘోర పరాభవాలు చవిచూసింది.వరుస పరాభవాలుఎన్నడూలేని విధంగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్ కావడం.. పాతికేళ్ల తర్వాత సొంతగడ్డపై సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్ కావడం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఇక స్వదేశంలో న్యూజిలాండ్‌కు తొలిసారి వన్డే సిరీస్ కోల్పోవడం.. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో 2-0తో క్లీన్‌స్వీప్ కావడం.. ఇంగ్లండ్ చేతిలో టీ20 సిరీస్‌లో 4-0తో వైట్‌వాష్ కావడం, వన్డే సిరీస్‌ను కోల్పోవడం తాజా ఉదాహరణలు.చీఫ్ సెలక్టర్, హెడ్‌కోచ్ అయ్యేందుకు సిద్ధంఈ నేపథ్యంలో శ్రీలంకతో తాజాగా రెండు టెస్టుల సిరీస్ తర్వాత వీరి భవితవ్యంపై స్పష్టత రానుందనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో హర్భజన్ సింగ్ బీసీసీఐలో ఏ పదవి ఇచ్చినా చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం గమనార్హం.‘‘బీసీసీఐ అధ్యక్షుడు, చీఫ్ సెలక్టర్ లేదంటే హెడ్‌కోచ్... ఈ మూడింటిలో ఏ బాధ్యత ఇచ్చినా నెరవేర్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. భారత క్రికెట్‌కు ఏ స్థాయిలోనైనా సేవ చేయడం నాకు ఎల్లప్పుడూ సంతోషమే. భవిష్యత్తులో ఈ మూడింటిలో ప్రతీ పాత్ర పోషించాలని నేను కోరుకోవడం లేదు.గంభీర్‌కు మద్దతుఅయితే, నా తలరాతలో ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. ఒకవేళ నాకే గనుక నిజంగా అవకాశం వస్తే.. అత్యుత్తమంగా రాణించేందుకు శాయశక్తులా కృషి చేస్తా’’ అని భజ్జీ PTI ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అదే విధంగా ప్రతీ దానికి గంభీర్‌ను విమర్శించడం తగదని.. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే అతడు ప్రతీ నిర్ణయం తీసుకుంటాడని అండగా నిలిచాడు.చదవండి: వీవీఎస్ లక్ష్మణ్‌కు బీసీసీఐ అత్యున్నత పదవి! -
వీవీఎస్ లక్ష్మణ్‌కు బీసీసీఐ అత్యున్నత పదవి?
టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ త్వరలోనే బీసీసీఐ అత్యున్నత పదవిని అలంకరించనున్నట్లు సమాచారం. గంభీర్ స్థానంలో టీమిండియా హెడ్‌కోచ్‌గా రానున్నాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో లక్ష్మణ్‌కు బీసీసీఐ (హెడ్‌కోచ్ పదవికి మించి) డైరక్టర్ ఆఫ్ క్రికెట్ పదవిని కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది.కొత్తగా రూపొందించనున్న డైరక్టర్ ఆఫ్ క్రికెట్ పదవికి లక్ష్మణ్ అయితేనే మంచి ఫలితం ఉంటుందని బీసీసీఐ భావించింది. అంతేకాదు లక్ష్మణ్ ఆ పదవిలో తన బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వహిస్తాడని బీసీసీఐ విశ్వాసం వ్యక్తం చేసింది. అయితే లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)కు సీఈవోగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.ప్రస్తుతం లక్ష్మణ్ సీవోఈ హెడ్‌గా ఆటగాళ్ల పునరావాసం, శిక్షణ వంటి బాధ్యతలు చూస్తున్నాడు. 'డైరెక్టర్ ఆఫ్ క్రికెట్'గా నియమితులైతే, ఆయన పరిధి మరింత విస్తృతం కానుంది. సీనియర్ పురుషుల, మహిళల జట్ల వ్యూహరచన, జాతీయ సెలక్షన్ కమిటీతో సమన్వయం, జూనియర్ స్థాయి నుంచి సీనియర్ స్థాయి వరకు ఆటగాళ్ల ప్రగతిని పర్యవేక్షించడం వంటి కీలక అధికారాలు ఆయన చేతికి రానున్నాయి.ఇదే సమయంలో, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం కూడా సెప్టెంబర్‌తో ముగియనుంది. ఆయన పదవీకాలాన్ని 2027 జూన్ వరకు పొడిగించాలా? లేక కొత్త వారిని నియమించాలా? అనే అంశంపై కూడా బీసీసీఐ చర్చిస్తోంది. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కొత్త కోచింగ్ బృందంతో సమన్వయం కోసం లక్ష్మణ్ లాంటి అనుభవజ్ఞుడి సేవలు అవసరమని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.గతంలో రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవిని చేపట్టాలని బీసీసీఐ కోరినప్పటికీ, లక్ష్మణ్ సున్నితంగా తిరస్కరించాడు. బెంగళూరులోని నూతన సీవోఈ ప్రాజెక్టుపై దృష్టి సారించేందుకే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు గాడిన పడటంతో, ఆయన అనుభవాన్ని విస్తృత స్థాయిలో ఉపయోగించుకునేందుకు బీసీసీఐ సిద్ధమైంది. Read: ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లా ఓపెనర్ -
టీమిండియాపై సంచలన అస్త్రాలను ప్రయోగించనున్న శ్రీలంక
భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు శ్రీలంక సిద్ధమవుతోంది. ఆగస్టు 15న గాలే వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుండగా.. శ్రీలంక ఇంకా తుది జట్టును ప్రకటించలేదు. ఆటగాళ్ల గాయాలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుతో తలపడేందుకు శ్రీలంక ఆటగాళ్లు ఇప్పటికే గాలేలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ సమయంలో ఆతిథ్య జట్టు ఇద్దరు ఆసక్తికరమైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.రోహిత్ శర్మను బోల్తా కొట్టించిన బౌలర్ మళ్లీ వస్తున్నాడా..?భారత్‌తో టెస్ట్ సిరీస్ కోసం లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్షాన్ మధుశంకను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశముంది. రేవ్స్పోర్ట్జ్ నివేదిక ప్రకారం.. మధుశంకకు రీకాల్ దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.మధుశంకకు భారత్‌పై ప్రత్యేకమైన జ్ఞాపకం ఉంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక తరఫున అద్భుతంగా రాణించిన అతడు.. రోహిత్ శర్మను మ్యాచ్ రెండో బంతికే ఔట్ చేశాడు.ఆ మ్యాచ్‌లో రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని భావించిన సమయంలో మధుశంక అతడిని పెవిలియన్‌కు పంపించాడు. ఇప్పుడు మరోసారి భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టేందుకు అతడు సిద్ధమవుతున్నాడు. మధుశంక ఇప్పటివరకు శ్రీలంక తరఫున ఒక టెస్ట్, 28 వన్డేలు, 20 టీ20లు ఆడాడు.గిల్, పంత్‌ను పడగొట్టిన కొత్త అస్త్రంమధుశంకతో పాటు ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్ కేశర నువంతకు తొలిసారి శ్రీలంక టెస్ట్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.ఇటీవల భారత్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో నువంత తన సత్తా చూపించాడు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు రిషభ్ పంత్ వికెట్లను పడగొట్టాడు.అంతేకాదు.. భారత్-ఏ, శ్రీలంక-ఏ మధ్య జరిగిన రెండో అనధికారిక టెస్టులో నువంత ఏకంగా ఐదు వికెట్లు తీసుకున్నాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడిన నువంత 64 వికెట్లు పడగొట్టాడు. అతని స్ట్రైక్‌రేట్ 39గా ఉంది. దీంతో భారత బ్యాటర్లకు అతడు మరో సవాలుగా మారే అవకాశం ఉంది.ఇద్దరు కీలక బ్యాటర్లు దూరంమరోవైపు శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పథుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం లేదు.దీంతో బ్యాటింగ్ విభాగంలో శ్రీలంకకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లాను తిరిగి టెస్ట్ జట్టులోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిక్వెల్లా చివరిసారిగా 2023 మార్చిలో శ్రీలంక తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడాడు.అదే సమయంలో అన్క్యాప్డ్ వికెట్ కీపర్ అంజలా బండారాను కూడా జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. డిక్వెల్లా, బండారా ఇద్దరూ ప్రస్తుతం గాలేలో శ్రీలంక జట్టుతో కలిసి ఉన్నట్లు సమాచారం.WTC ఫైనల్‌కు వెళ్లాలంటే భారత్‌ను ఓడించాల్సిందే..!ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 పాయింట్ల పట్టికలో శ్రీలంక ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది. రెండు సిరీస్‌ల తర్వాత 41.67 శాతం పాయింట్లతో భారత్‌కు వెనుకనే ఉంది. శ్రీలంక ఇంకా ఎనిమిది టెస్టులు ఆడాల్సి ఉంది. WTC ఫైనల్‌కు చేరాలంటే భారత్‌పై సిరీస్ విజయం వారికి అత్యంత కీలకం. -
కొత్త బాధ్యతల్లో రహానే
భారత క్రికెట్‌పై తనదైన ముద్ర వేసిన మాజీ కెప్టెన్ అజింక్య రహానే ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్‌కు సిద్ధమయ్యాడు. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు ఇటీవలే ముగింపు పలికిన అతడు.. ఇక నుంచి కామెంటేటర్‌గా తన అనుభవాన్ని అభిమానులతో పంచుకోనున్నాడు.భారత్-శ్రీలంక మధ్య జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌తో రహానే తొలిసారి టెస్ట్ కామెంటరీలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఆగస్టు 15 నుంచి 27 వరకు జరగనున్న ఈ సిరీస్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేయనున్నారు.టెస్ట్ క్రికెట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న రహానే.. ఇక మ్యాచ్‌ను బయట నుంచి విశ్లేషించనున్నాడు. బ్యాటర్ ఆలోచనా విధానం, బౌలర్ల వ్యూహాలు, ఫీల్డ్ సెట్టింగ్స్, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా తీసుకునే నిర్ణయాలపై తన అభిప్రాయాలను పంచుకోనున్నాడు.‘కొత్త కోణంలో మ్యాచ్‌ను చూడబోతున్నా’తన కొత్త బాధ్యతపై రహానే ఆసక్తి వ్యక్తం చేశాడు. టెస్ట్ క్రికెట్ అత్యున్నత ఫార్మాట్ అని, ఎన్నో సంవత్సరాలు భారత్ తరఫున ఈ ఫార్మాట్లో ఆడిన తర్వాత ఇప్పుడు మరో కోణంలో ఆటను చూడటం ప్రత్యేక అనుభూతి అనిపేర్కొన్నాడు.85 టెస్టులు.. 5 వేలకుపైగా పరుగులురహానే భారత జట్టు తరఫున 85 టెస్టులు ఆడాడు. 5,077 పరుగులు సాధించిన అతని టెస్ట్ కెరీర్లో 12 సెంచరీలు, 26 అర్ధసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్లో కీలక సమయాల్లో జట్టును ఆదుకున్న బ్యాటర్‌గా రహానేకు ప్రత్యేక గుర్తింపు ఉంది.ముఖ్యంగా విదేశీ పిచ్‌లపై అతని బ్యాటింగ్, క్లిష్ట పరిస్థితుల్లో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే తీరు అభిమానులను ఆకట్టుకుంది. రహానే కెప్టెన్‌గా కూడా టీమిండియాకు అద్భుత విజయాలు అందించాడు . -
కళ్లు చెదిరే ఎండార్స్మెంట్లు.. వైభవ్ సంపాదన ఎంతంటే?
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి సంచలనం సృష్టించాడు. మ్యాచ్‌ల పరంగా ఆట ఎలా ఉన్నా ఎండార్స్మెంట్ల విషయంలో మాత్రం వైభవ్ సూర్యవంశీ దూసుకెళ్తున్నాడు. దీంతో 15 ఏళ్ల వయసుకే కళ్లు చెదిరే మొత్తాన్ని అందుకుంటున్న వైభవ్ సంపాదనలోనూ స్టార్ హోదా పొందాడు. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడుతున్న సమయంలోనే వైభవ్ సూర్యవంశీ తన బ్రాండ్ ఎండార్స్మెంట్ ఫీజులు పెంచినట్లు సమాచారం. అయినప్పటికీ అతడి కోసం ఎండార్స్మెంట్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. వైభవ్ వాణిజ్య విలువకు సంబంధించి ఒక్కోటి కోటి రూపాయల మార్కును దాటినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం అతడి నికర ఆస్తి విలువ రూ. 7 కోట్ల నుంచి 10 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. దీనికి తోడు ఐపీఎల్ జీతం, మ్యాచ్ ఫీజులు, దేశవాళీ క్రికెట్ రూపంలో వస్తున్న డబులు అదనమని చెప్పొచ్చు.వైభవ్ ఆమోదించిన బ్రాండ్లు..👉ఎస్ఎస్ బ్యాట్స్: సచిన్ టెండూల్కర్ తన ఐకానిక్ MRF బ్యాట్ స్పాన్సర్‌షిప్‌తో ప్రసిద్ధి చెందగా, సూర్యవంశీ ఇంకా ఏ కార్పొరేట్ దిగ్గజంతోనూ భారీ ఒప్పందం కుదుర్చుకోలేదు. అయితే, అతను ప్రస్తుతం సరీన్ స్పోర్ట్స్ (SS)తో సంవత్సరానికి సుమారు రూ. 50 లక్షల విలువైన పరికరాల ఒప్పందాన్ని కలిగి ఉన్నాడు. SS మార్కెట్లో ప్రత్యేకమైన "వైభవ్ సూర్యవంశీ ఎడిషన్" బ్యాట్లను కూడా విడుదల చేసింది.👉కాంప్లాన్: 2026 ప్రారంభంలో వైభవ్ కాంప్లాన్ వారి "థోడా ప్లాన్, థోడా కాంప్లాన్" ప్రకటన ప్రచారానికి అంబాసిడర్‌గా మారాడు. సరైన పోషణ , అంకితభావంపై దృష్టి సారించే ఈ ప్రకటన, ఒక యువ అథ్లెట్‌గా సూర్యవంశీ నిజ జీవిత దినచర్యను ప్రతిబింబిస్తుండడం విశేషం.👉గూగుల్ పే: ప్రస్తుతం వైభవ్ గూగుల్ పే ప్రచారకర్తగా ఉన్నాడు. ఈ ప్రకటనలో, అతడు తన తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాకు అనుసంధానించబడిన UPIని ఉపయోగిస్తూ, టీనేజర్ల కోసం సురక్షితమైన డబ్బు నిర్వహణను హైలైట్ చేస్తూ ప్రచారం చేస్తున్నాడు.👉రెడ్‌బుల్: ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ తరఫున ధ్రువ్ జురెల్‌తో కలిసి వైభవ్ రెడ్‌బుల్ చాలెంజ్‌లో పాల్గొని అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.👉జార్ఖండ్ ఆరోగ్యశాఖ: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువతను చురుకుగా, ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేలా ప్రేరేపించడానికి వైభవ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తామని జార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి 2026 మేలో ఒక ప్రకటన విడుదల చేశారు.👉ఇక ఇంగ్లండ్ పర్యటన ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ గత నెలలో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో రెండు మెరుపు అర్ధశతకాలతో 151 పరుగులు చేశాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఈస్ట్‌జోన్‌కు ప్రాతినిధ్యం వహించనున్న వైభవ్ వైస్‌కెప్టెన్‌గా జట్టును నడిపించనున్నాడు.Read: ‘అతడి జోలికి వెళ్లొద్దు’.. ఫిఫాకు ట్రంప్ వార్నింగ్! -
నన్ను నిందిస్తే ఊరుకోను BCCIకి లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్
-
చరిత్ర సృష్టించనున్న టీమిండియా
భారత క్రికెట్ చరిత్రలో మరో అరుదైన అధ్యాయం ఆవిష్కృతం కానుంది. 2026 ఆగస్టు 15న, దేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ టీమిండియా చారిత్రక 600వ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. శ్రీలంకతో గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌తో భారత టెస్ట్ క్రికెట్లో సరికొత్త మైలురాయిని చేరుకోనుంది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత్ ఈ చారిత్రక టెస్ట్ బరిలో దిగనుంది.ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తర్వాత భారత్600 టెస్టులు ఆడిన జట్ల జాబితాలో ఇప్పటివరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు భారత్ ఈ ప్రత్యేక జాబితాలో చేరనుంది. అలాగే 600 టెస్టుల మైలురాయిని తాకిన తొలి ఆసియా దేశంగానూ భారత్ చరిత్ర సృష్టించనుంది.టెస్ట్ క్రికెట్లో భారత ప్రస్థానం 1932లో ప్రారంభమైంది. అప్పటి నుంచి 94 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో భారత క్రికెట్ ఎన్నో మలుపులు, మరపురాని విజయాలు, దిగ్గజ ఆటగాళ్లను చూసింది.1932లో మొదలైన ప్రయాణంభారత్ తొలి టెస్ట్ మ్యాచ్‌ను 1932 జూన్ 25న ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో ఆడింది. సీకే నాయుడు నాయకత్వంలో ప్రారంభమైన ఆ ప్రయాణం ఇప్పుడు 600వ మ్యాచ్‌కు చేరుకుంది.భారత్ టెస్ట్ ప్రస్థానంలోని ముఖ్యమైన మైలురాళ్లు ఇవే:1వ టెస్ట్: 1932, ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో కెప్టెన్: సీకే నాయుడు100వ టెస్ట్: 1967, ఆస్ట్రేలియాతో కెప్టెన్: మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ200వ టెస్ట్: 1982, పాకిస్థాన్‌తో కెప్టెన్: సునీల్ గవాస్కర్500వ టెస్ట్: 2016, న్యూజిలాండ్‌తో కెప్టెన్: విరాట్ కోహ్లీ600వ టెస్ట్: 2026, శ్రీలంకతో కెప్టెన్: శుభ్‌మన్ గిల్స్వాతంత్ర్య దినోత్సవం రోజున చారిత్రక ఘట్టంఆగస్టు 15.. భారతీయులకు ఎంతో ప్రత్యేకమైన రోజు. అదే రోజున టీమిండియా తన 600వ టెస్ట్ మ్యాచ్ ఆడటం ఈ ఘట్టానికి మరింత ప్రత్యేకతను తీసుకొస్తోంది.1932లో సీకే నాయుడు నాయకత్వంలో మొదలైన భారత టెస్ట్ ప్రయాణం.. పటౌడీ, గవాస్కర్, కపిల్ దేవ్, అజారుద్దీన్, సచిన్, గంగూలీ, ద్రవిడ్, ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజ తరాలను దాటి ఇప్పుడు గిల్ తరం వరకు వచ్చింది.ఇదిలా ఉంటే, టీమిండియా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ ఆగస్ట్ 15న ప్రారంభం కానుండగా.. రెండో టెస్ట్ కొలొంబో వేదికగా ఆగస్ట్ 23న మొదలవుతుంది. -
‘షమీ అదొక్కటి చెయ్యు.. నీ రీఎంట్రీ తథ్యం’
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ భవిష్యత్తు ఏంటనేది బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ముందే చెప్పేశాడు. రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ కోసం తాము యువ ఆటగాళ్లను ఎక్కువగా ప్రోత్సహించనున్నామని, షమీ లాంటి సీనియర్ ఆటగాళ్లు గతంలో టీమిండియాకు విలువైన సేవలు అందించినప్పటికీ ఇప్పుడు అతడి సేవలు జట్టుకు అవసరం లేదని భావిస్తున్నట్లు అగార్కర్ పరోక్షంగా పేర్కొన్నాడు. దీంతో షమీ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లే అనే వార్తలు వస్తున్నాయి. దీంతో అతడి రిటైర్మెంట్కు సమయం ఆసన్నమైందనే వార్తలు వినిపిస్తన్నాయి. అయితే బుమ్రా లాంటి టాప్ బౌలర్ తరచూ గాయాల బారిన పడుతుండడం ఇప్పుడు టీమిండియాను ఆందోళనలోకి నెట్టేస్తుంది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్.. షమీ రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఎంపిక కావడం లేదన్న నిరాశను పక్కనబెట్టి జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు శాయాశక్తులా ప్రయత్నిస్తూనే ఉండాలని, షమీకి తానిచ్చే సలహా అదొక్కటేనని జహీర్ పేర్కొన్నాడు.‘‘ముందుకు ఎలా వెళ్లాలో నిర్ణయించుకోవాల్సింది షమీనే. మ్యాచ్‌లు ఆడుతూ బాగా రాణిస్తే జాతీయ జట్టుకు అందుబాటులో ఉన్నట్టే. ప్రస్తుతం జట్టు ఆలోచన మరోలా ఉండొచ్చు. కానీ ఆటగాడిగా మన ఆలోచన, మనం జట్టుకు ఎలా ఉపయోగపడగలమన్నది ముఖ్యం. షమీ ఇప్పుడు చేస్తున్నదే కొనసాగించాలి. మ్యాచ్‌లు ఆడటం, రాణించడమే చాలా ముఖ్యం’’ అని జహీర్ చెప్పాడు.ఇక జస్ప్రీత్ బుమ్రా వరుస సిరీస్‌లకు ఫిట్‌గా ఉండకపోవడం, సుందర్, సాయి సుదర్శన్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య వంటి ఆటగాళ్లు ఫిట్నెస్ కాపాడుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో జహీర్ టీమిండియా ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడడంపై స్పందించాడు."గాయాలు ఆటలో సహజం. అవి ప్రతి వ్యక్తి ప్రయాణంలో అంతర్భాగం. ఆటగాళ్ల పని భారం తగ్గించడం అవసరమే అయినా.. పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి. ముఖ్యంగా పేసర్ గాయపడినప్పుడు లేదా కష్టమైన దశను ఎదుర్కొంటు న్నప్పుడు మన నియంత్రణలో ఉన్న అంశాలపై దృష్టి పెట్టాలి. గాయానికి అసలు కారణం ఏంటో తెలుసుకునే వరకు ముందుకు సాగడం కష్టం" అని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.Read: బాడీ షేమింగ్‌పై ట్రోల్స్.. కట్‌చేస్తే టీమిండియాలోకి రీఎంట్రీ! -
బాడీ షేమింగ్ ట్రోల్స్.. కట్‌చేస్తే టీమిండియాలోకి రీఎంట్రీ!
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో 28 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్‌కు జట్టులో అవకాశం కల్పించింది. అయితే రెండేళ్ల తర్వాత తిరిగి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్ ఖాన్ తన ఎంపికపై తొలిసారి స్పందించాడు. తన బాడీషేమింగ్‌పై వచ్చిన ట్రోల్స్‌ను చాలెంజ్‌గా తీసుకున్న సర్ఫరాజ్ ఖాన్ సీరియస్ వర్కౌట్స్ చేసి బరువు తగ్గిన కొత్త ఫొటోలను పంచుకున్నాడు. తొలి ఫోటోలో తనను జట్టులోకి ఎంపిక చేసినందుకు కృతజ్ఞతగా షేక్ హ్యాండ్ ఇస్తున్న ఎమోజీతో పాటు లవ్ ఇండియా సింబల్‌ను ట్యాగ్ చేశాడు. ఇక రెండో ఫొటోలో తన తండ్రి నౌషద్ ఖాన్‌తో కలిసి ఉన్న క్లిప్‌ను పంచుకున్నాడు. స్వతహాగా క్రికెట్ కోచ్ అయిన నౌషద్ ఖాన్ భారత్ తరఫున తన కుమారుడి అంతర్జాతీయ అరంగేట్రం కోసం చాలానే కష్టపడ్డాడు. 2024లో తన కుమారుడు తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన సందర్భంలో నౌషద్ ఖాన్ హర్షం వ్యక్తం చేసిన ఫొటోలు అప్పట్లో వైరలయ్యాయి. తండ్రి పర్యవేక్షణలో..అంతేకాదు ఫామ్‌లేమి, ఫిట్నెస్ సమస్యలతో జట్టులో చోటు కోల్పోయి ఇబ్బంది పడుతున్న కొడుకుకు అండగా నిలిచి, అతడు బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ క్రమంలో గాయపడ్డ సాయి సుదర్శన్ స్థానంలో జట్టుకు ఎంపిక కావడంతో సర్ఫరాజ్ సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి. కాగా తండ్రితో కలిసి దిగిన ఫొటోకు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. 13 గంటల్లోనే 169 లక్షల వ్యూస్ రావడం విశేషం.2024లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు అనూహ్యంగా చోటు దక్కించుకున్న సర్ఫరాజ్ ఖాన్ ఆ సిరీస్‌లో 371 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలున్నాయి. సూపర్ ఫామ్‌తో న్యూజీలాండ్‌తో సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు. అయితే తొలి మ్యాచ్‌లో 150 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న సర్ఫరాజ్ ఆ తర్వాత వరుసగా 11, 9, 0, 1.. విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోయాడు.జురెల్, పడిక్కల్‌తో పోటీఇదే సమయంలో ధ్రువ్ జురెల్ ఎంట్రీ ఇవ్వడం, ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ రాణించడంతో సర్ఫరాజ్ ఖాన్ క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. అయితే తాజాగా సాయి సుదర్శన్ గాయంతో లంకతో సిరీస్‌కు దూరమవ్వడంతో అతడి స్థానంలో సర్ఫరాజ్ జట్టులోకి వచ్చాడు. ధ్రువ్ జురెల్ ఇప్పటికే జట్టులో ఉండడంతో లంకతో తొలి టెస్టుకు సర్ఫరాజ్‌కు అవకాశం రావడం కష్టమే.2024లో టీమిండియాలో చోటు కోల్పోయిన సర్ఫరాజ్ తొలుత ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. కఠిన శిక్షణతో బరువు తగ్గిన సర్ఫరాజ్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఆ తర్వాత 2025-26 రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో ఒక డబుల్ సెంచరీ సాయంతో 429 పరుగులు సాధించాడు. ఈ ప్రదర్శనతోనే సర్ఫరాజ్.. ఆరో స్థానం కోసం ధ్రువ్ జురెల్, దేవదత్ పడిక్కల్‌తో పోటీ పడుతున్నాడు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా పడిక్కల్ తొలి టెస్టులో ఆడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక లంకతో తొలి టెస్టు గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది.Sarfaraz Khan in India kit with his Father. Deserved comeback 🤝. pic.twitter.com/asooA1XJxY— CricketGully (@thecricketgully) August 10, 2026SARFARAZ KHAN ON THE WAY TO SRI LANKA 🔥 [Sahil Malhotra] - All the best, Sarfaraz Khan. pic.twitter.com/dBp2cQ2RC7— Johns. (@CricCrazyJohns) August 9, 2026 Sarfaraz Khan’s special words for his son after being picked once again for the Indian Test team.🇮🇳❤️ pic.twitter.com/VogFjGFOZ4— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 10, 2026Read: భయపెడుతున్న గాయాలు.. గిల్ ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్! -
శ్రీలంకతో తొలి టెస్ట్.. భారత తుది జట్టు ఇదే..!
భారత్-శ్రీలంక మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ గాలే వేదికగా జరుగనుండగా.. రెండో టెస్ట్ ఆగస్ట్ 23 నుంచి కొలొంబోలో జరుగనుంది.దీనికి ముందు శ్రీలంక ఎలెవెన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మాంచి జోరు ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌తో భారత్‌కు మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించింది. సాయి సుదర్శన్ గైర్హాజరీలో దేవదత్ పడిక్కల్ రూపంలో వన్ డౌన్లో మంచి ఆప్షన్ లభించింది. రెగ్యులర్ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్. కేఎల్ రాహుల్ ఆకట్టుకున్నారు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా బ్యాట్‌తో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో పేసర్లు పెద్దగా ప్రభావం చూపకపోయినా, స్పిన్నర్లు పర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్ ప్రదర్శనలను పరిగణలోకి తీసుకొని తొలి టెస్ట్‌లో టీమిండియా ఎలా ఉండబోతుందో ఓ అంచనా వేద్దాం.ఓపెనర్లు: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్తొలి టెస్ట్‌లో వీరిద్దరూ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఖాయం. ఇద్దరూ వార్మప్ మ్యాచ్‌లో పరుగులు సాధించడం సానుకూల అంశం. జైస్వాల్ దూకుడుగా ఆడితే.. రాహుల్ పరిస్థితులకు తగ్గట్టుగా ఇన్నింగ్స్‌ను నిర్మించగలడు. శ్రీలంక బౌలర్లను ఎదుర్కోవడంలో ఈ జోడీ కీలకంగా మారనుంది.నంబర్ 3లో దేవదత్ పడిక్కల్సాయి సుదర్శన్ అందుబాటులో లేకపోవడంతో నంబర్ 3 స్థానంలో దేవదత్ పడిక్కల్‌కు అవకాశం దక్కడం ఖాయమైపోయింది. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పడిక్కల్ అద్భుతమైన సెంచరీ సాధించి తన స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాడు.నాలుగో స్థానంలో గిల్నంబర్ 4లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆడనున్నాడు. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో గాయం కారణంగా బ్యాటింగ్‌కు రాని గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగి మంచి టచ్‌లో కనిపించాడు.నంబర్ 5లో రిషభ్ పంత్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతడు విఫలమైనప్పటికీ.. టెస్టుల్లో భారత్‌కు ఉన్న అత్యుత్తమ వికెట్ కీపర్-బ్యాటర్లలో పంత్ ఒకడు. అందువల్ల అతడికి తుది జట్టులో చోటు దక్కడం దాదాపు ఖాయమే.నంబర్ 6లో ధ్రువ్ జురెల్‌కు అవకాశం లభించవచ్చు. వార్మప్ మ్యాచ్‌లో అతడూ పెద్దగా రాణించలేదు. అయినప్పటికీ టెస్టుల్లో బ్యాటింగ్ లైనప్‌ను మరింత లోతుగా ఉంచాలన్న భారత వ్యూహంలో భాగంగా జురెల్‌ను ఆడించే అవకాశం ఉంది.ఆల్రౌండర్లుగా జడేజా, సుతార్ఆల్రౌండర్ స్థానాల్లో రవీంద్ర జడేజాతో పాటు మానవ్ సుతార్‌కు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జడేజా టెస్టు క్రికెట్లో భారత్‌కు అత్యంత కీలకమైన ఆటగాళ్లలో ఒకడు. బ్యాటింగ్‌లో 38కు పైగా సగటుతో అతడు మిడిలార్డర్‌కు అదనపు బలం అందించగలడు.మరోవైపు సుతార్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సుమారు 26 సగటు కలిగి ఉన్నాడు. నంబర్ 8 వరకు బ్యాటింగ్‌ను తీసుకెళ్లడంతో పాటు స్పిన్ బౌలింగ్‌లోనూ అతడు ఉపయోగపడనున్నాడు.స్పిన్ బాధ్యతలు కుల్దీప్వేగాలే పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో భారత్ ముగ్గురు ప్రధాన స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. జడేజా, సుతార్‌తో పాటు కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్‌గా వ్యవహరించనున్నాడు. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. గాలేలో టర్నింగ్ పిచ్ లభిస్తే శ్రీలంక బ్యాటర్లకు అతడు పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉంది. శ్రీలంకలో ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్టు ఆడిన కుల్దీప్.. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు.పేసర్లుగా సిరాజ్, గర్నూర్ బ్రార్తొలి టెస్ట్‌లో భారత్ ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగాలని భావిస్తే.. సిరాజ్‌తో పాటు గర్నూర్ బ్రార్‌కు అవకాశం లభించవచ్చు. బ్రార్ వార్మప్ మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు.శ్రీలంకతో తొలి టెస్ట్‌కు టీమిండియా (అంచనా)కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్ -
సిరాజ్ హ్యాట్రిక్ సిక్సర్స్.. టీమిండియా గెలుపు
శ్రీలంక క్రికెట్ ఎలెవెన్‌తో జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 207 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన యశస్వి జైస్వాల్ (61 రిటైర్ట్ హర్ట్) మెరుపు అర్ద సెంచరీ చేసి భారత గెలుపుకు గట్టి పునాది వేశాడు. గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక ఇన్నింగ్స్ (44) ఆడాడు. ఆఖర్లో సిరాజ్ (32 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) హ్యాట్రిక్ సిక్సర్స్‌తో విరుచుకుపడి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. టార్గెట్ 207లంక ఎలెవెన్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, టీమిండియా ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిషాన్ మధుష్క (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. అంజల బండార (35), నిపున్ ధనంజయ (46) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ చెరో వికెట్ దక్కించుకున్నారు.పడిక్కల్ అజేయ శతకంభారత్ తొలి ఇన్నింగ్స్‌ను 357 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తా చాటాడు. రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్ (40), మానవ్ సుతార్ (41), గుర్నూర్ బ్రార్ (36 నాటౌట్), సరాన్ష్ జైన్ (22 రిటైర్డ్ హర్ట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో అసంక మనోజ్, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, కేశర నువంత చెరో వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. నిషాన్ మధుష్క (66), రవిందు రషాంత (71), సోనల్ దినుష (52) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలో 2 వికెట్లు తీయగా.. బ్రార్ చెరో వికెట్ దక్కించుకున్నారు.కాగా, ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ మ్యాచ్ గాలే వేదికగా ఆగస్ట్ 15 నుంచి మొదలుకానుంది. రెండో టెస్ట్ కొలంబో వేదికగా ఆగస్ట్ 23న ప్రారంభం కానుంది. -
టీమిండియా టార్గెట్ 207
శ్రీలంక క్రికెట్ ఎలెవెన్‌తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో భారత్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. లంక ఎలెవెన్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, టీమిండియా ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఆట ఇవాళ (మూడో రోజు) చివరి రోజు కావడంతో ఫలితం తేలే అవకాశం లేదు. ఆటలో మరో సెషన్ మాత్రమే మిగిలి ఉంది.లంక ఎలెవెన్ రెండో ఇన్నింగ్స్‌లో నిషాన్ మధుష్క (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. అంజల బండార (35), నిపున్ ధనంజయ (46) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ చెరో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 357 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తా చాటాడు. రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్ (40), మానవ్ సుతార్ (41), గుర్నూర్ బ్రార్ (36 నాటౌట్), సరాన్ష్ జైన్ (22 రిటైర్డ్ హర్ట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో అసంక మనోజ్, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, కేశర నువంత చెరో వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. నిషాన్ మధుష్క (66), రవిందు రషాంత (71), సోనల్ దినుష (52) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలో 2 వికెట్లు తీయగా.. బ్రార్ చెరో వికెట్ దక్కించుకున్నారు.కాగా, ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ మ్యాచ్ గాలే వేదికగా ఆగస్ట్ 15 నుంచి మొదలుకానుంది. రెండో టెస్ట్ కొలంబో వేదికగా ఆగస్ట్ 23న ప్రారంభం కానుంది. -
కీలక టోర్నీ నుంచి టీమిండియా స్టార్ ఔట్
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ కీలకమైన హండ్రెడ్ లీగ్ నుంచి మధ్యలోనే వైదొలిగింది. హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఆమె భారత్‌కు తిరిగి రానుంది. త్వరలో జరుగబోయే ఆసియా కప్‌కు కూడా ఆమె అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.హండ్రెడ్ లీగ్‌లో జెమీ సదర్న్ బ్రేవ్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆమె కోసం ఫ్రాంచైజీ ఏకంగా 60,000 పౌండ్లు చెల్లించింది. అయితే గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు ఆమె దూరం కానుంది.చార్లీ నాట్‌కు అవకాశంజెమీమా స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ చార్లీ నాట్‌ను సదర్న్ బ్రేవ్ ఎంపిక చేసింది. ఈ సీజన్లో జెమీమా 6 మ్యాచ్‌ల్లో 143 పరుగులు చేసింది. ఆమె సగటు 35.75గా ఉంది. ఒక్క అర్ధశతకం కూడా నమోదు చేయకపోయినా వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 25కు పైగా పరుగులు సాధించింది.మరోవైపు చార్లీ నాట్ ఇటీవల ముగిసిన టీ20 బ్లాస్ట్‌లో అద్భుతంగా రాణించింది. 13 ఇన్నింగ్స్‌ల్లో 40.40 సగటున, 404 పరుగులు చేసి ఆకట్టుకుంది.సదర్న్ బ్రేవ్‌కు ఈ సీజన్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఆరు మ్యాచ్‌ల్లో 20 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.ఆసియా కప్ కూడా దూరమయ్యే ప్రమాదంగాయం కారణంగా హండ్రెడ్ లీగ్‌కు దూరమైన జెమీమా, ఆగస్టు 28 నుంచి జరుగబోయే ఆసియా కప్‌కు కూడా దూరమయ్యే ప్రమాదముందని తెలుస్తోంది. ఈ టోర్నీ కోసం ప్రకటించిన భారత జట్టులో జెమీమాకు ఇప్పటికే చోటు దక్కింది.ఆసియా కప్ 2026 కోసం భారత జట్టు..హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జీ. కమలిని (వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాధా యాదవ్, ప్రేమా రావత్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్, ఎన్. శ్రీ చరణి, నందిని శర్మ.రిజర్వ్ ఆటగాళ్లు: ప్రతికా రావల్, ఉమా చెత్రీ, వైష్ణవి శర్మ, సయాలి సత్ఘరే, మిన్ను మణి.జెమీమా ఆడకపోతే ఎవరికి అవకాశం..?జెమీమా ఆసియా కప్‌కు దూరమైతే ఆమె స్థానాన్ని భర్తీ చేసే అవకాశాల్లో ప్రతికా రావల్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత జట్టులో ప్రధాన బ్యాటర్లలో జెమీమా స్థానాన్ని భర్తీ చేయగల రిజర్వ్ ఆటగాళ్లలో ప్రతికా కీలకంగా కనిపిస్తోంది.అయితే ప్రతికా ఇప్పటివరకు భారత తరఫున టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. ఆసియా కప్‌లో అవకాశం వస్తే ఆమెకు అదే తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్ కావొచ్చు. -
టీమిండియాకు మరో భారీ షాక్
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే సిరీస్‌కు దూరం కాగా.. తాజాగా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా గాయం కారణంగా తప్పుకున్నాడు.తొలుత లంక సిరీస్‌కు బుమ్రాతో పాటు సాయి సుదర్శన్‌ను కూడా ఎంపిక చేశారు. వీరిద్దరూ గాయాల నుంచి పూర్తిగా కోలుకుంటారనుకుంటే, అది జరగలేదు. బుమ్రా ఎడమ మోకాలిలో గాయం.. సాయి సుదర్శన్ కాలి బొటనవేలికి గాయం నుంచి కోలుకునేందుకు గత కొంతకాలంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్‌లో ఉన్నారు.అయితే గాయాలు ఎంతకీ మానకపోవడంతో తొలుత బుమ్రా, తాజాగా సాయి సుదర్శన్ లంక సిరీస్ నుంచి తప్పుకున్నారు. రోజుల వ్యవధిలో ఇద్దరు రెగ్యులర్ ఆటగాళ్లు వైదొలగడం టీమిండియాకు భారీ ఎదురుదెబ్బే అనుకోవాలి. ఇప్పుడు వీరిద్దరికి ప్రత్యామ్నాయాలుగా ఎవరికి ఎంపిక చేస్తారో చూడాలి. తొలి టెస్ట్ (ఆగస్ట్ 15, గాలే) ప్రారంభానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది.లంకలో పరిస్థితులకు అలవాటు పడేందుకు టీమిండియా ప్రస్తుతం ఆ దేశ క్రికెట్ ఎలెవెన్ జట్టుతో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక ఎలెవెన్ జట్టు 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు పెద్దగా ఆకట్టకోలేకపోయారు. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ తలో 2 వికెట్లు తీయగా.. గుర్నూర్ బ్రార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. సీనియర్ పేసర్లు సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. స్పిన్నర్ సరాన్ష్ జైన్ 11 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ దక్కలేదు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ సెంచరీతో (103 రిటైర్డ్ హర్ట్) సత్తా చాటగా.. కేఎల్ రాహుల్ (40) రాణించాడు. యశస్వి జైస్వాల్ డకౌటై నిరాశపర్చగా.. పంత్ (2), జురెల్ (1) కూడా విఫలమయ్యారు. ప్రస్తుతం రెండో రోజు ఆట (టీ విరామం) కొనసాగుతోంది. -
రెండో పెళ్లికి హార్దిక్ గ్రీన్ సిగ్నల్.. ఎప్పుడంటే?
-
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియాకు తొలి సవాలుకే వాతావరణం అడ్డంకిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుండగా, రేపటి నుంచి (ఆగస్టు 7) కొలంబోలో శ్రీలంక ‘ఏ’తో భారత్ మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.తొలి రోజు ఏకంగా 97 శాతం వర్షావకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ఆకాశం 99 శాతం మేఘావృతమై ఉంటుందని అంచనా. ఉష్ణోగ్రత సుమారు 30 డిగ్రీలుగా ఉండనుంది.రెండో రోజు పరిస్థితి మరింత ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. ఆగస్టు 8న వర్షం పడే అవకాశం 99 శాతంగా ఉండటంతో పాటు 89 శాతం మేఘావృత వాతావరణం ఉండొచ్చని అంచనాలు చెబుతున్నాయి.మూడో రోజు కూడా వర్షం ముప్పు తప్పేలా లేదు. ఆగస్టు 9న వర్షం పడే అవకాశం 91 శాతంగా, మేఘావృతం 95 శాతంగా ఉండొచ్చని అంచనా.టీమిండియా ప్రాక్టీస్‌కు కీలక మ్యాచ్శ్రీలంకలో టెస్టు సిరీస్‌కు ముందు భారత ఆటగాళ్లకు ఈ వార్మప్ మ్యాచ్ చాలా కీలకం. ముఖ్యంగా శ్రీలంకలోని నెమ్మదైన, స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై బ్యాటర్లు, బౌలర్లు తమను తాము సిద్ధం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం.కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మినహా ప్రస్తుత భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు శ్రీలంక గడ్డపై టెస్టు అనుభవం తక్కువ. సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ వంటి ఆటగాళ్లకు స్థానిక పరిస్థితులపై కొంత అనుభవం ఉన్నప్పటికీ, పూర్తి స్థాయి టెస్టు సిరీస్ అనుభవం లేదు.వార్మప్ రద్దయితే ఇబ్బందే!మూడు రోజులూ వర్షం ముప్పు అధికంగా ఉండటంతో వార్మప్ మ్యాచ్ పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ పూర్తిగా రద్దయితే శ్రీలంక పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత ఆటగాళ్లకు మరో అవకాశం ఉండదు.గతంలోనూ వర్షం కారణంగా ప్రాక్టీస్ మ్యాచ్‌లు రద్దై, విదేశీ పర్యటనల్లో టీమిండియా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కొలంబోలోనూ అదే పరిస్థితి ఎదురైతే, ఆగస్టు 15న గాలేలో ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ముందు భారత్‌కు ఇది ఎదురుదెబ్బగా మారొచ్చు. -
‘ఒక్కసారి తలుపు మూతపడితే.. ఎవరినీ రానివ్వడు’
మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెప్టెన్‌గా టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత అతడిది. ధోని సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013లను భారత్ కైవసం చేసుకుంది.ఇక ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు ధోని. కాగా ధోనికి మిస్టర్ కూల్ అన్న ‘బిరుదు’ ఉన్న ఉన్న సంగతి తెలిసిందే. మైదానంలో ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహనం కోల్పోకుండా వ్యూహాలు అమలు చేయడంలో దిట్ట.అదే విధంగా ఆటగాళ్లకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మార్గనిర్దేశనం చేస్తాడనే పేరు అతడికి ఉంది. టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన అజింక్య రహానే సైతం ఇదే మాట అంటున్నాడు. ఓవర్‌ల్యాప్ క్రికెట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఒకేసారి 10- 15 మంది ఆటగాళ్లు‘‘ధోని కామ్‌గా, కూల్‌గా ఉంటాడు. అందరిలాగే తానూ ఒకడినంటూ చాలా సాధారణంగా ఉంటాడు. ధోని గది ఎల్లప్పుడూ ఆటగాళ్లతో నిండి ఉంటుంది. ఒకేసారి 10- 15 మంది ఆటగాళ్లు అతడి రూమ్‌లోకి వచ్చి ఆట గురించి మాట్లాడుతూ ఉంటారు.ఒక్కోసారి జట్టు మొత్తం అక్కడే ఉంటుంది. అయితే, అంతా అయిపోయి ఒక్కసారి ధోని గది తలుపు మూతపడిందంటే మాత్రం.. మళ్లీ ఎవరికీ లోపలికి అనుమతి ఉండదు’’ అని రహానే చెప్పుకొచ్చాడు. రహానే గుడ్బైకాగా రహానే ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్లో సారథిగా ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిన ఘనత అతడికి ఉంది.టీమిండియా తరఫున 2011లో అరంగేట్రం చేసిన రహానే.. 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 12 శతకాల సాయంతో 5077 పరుగులు సాధించాడు. వన్డేల్లో 2962, టీ20లలో 375 పరుగులు చేసిన రహానే.. ఐపీఎల్లో మొత్తంగా 5367 పరుగులు సాధించాడు. ధోని కెప్టెన్సీలో 2023లో చెన్నై టైటిల్ గెలవడంలో రహానే (326 రన్స్) తన వంతు పాత్ర పోషించాడు.చదవండి: ODI WC: ‘భారత జట్టులో ఆ ఇద్దరికి చోటు దక్కదు’ -
వాళ్ళకి దూరంగా ఉండు లేదంటే.. బుర్డోడికి ఉతప్ప వార్నింగ్
-
ODI WC: ‘భారత జట్టులో ఆ ఇద్దరికి చోటు దక్కదు’
వన్డే ప్రపంచకప్-2027 టోర్నీలో ఆడబోయే భారత ఓపెనింగ్ జోడీ ఎవరన్న అంశంపై చర్చ కొనసాగుతోంది. చాలా ఏళ్లుగా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ- శుబ్‌మన్ గిల్ వన్డే ఓపెనర్లుగా కొనసాగుతున్నారు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసిన తర్వాత గిల్.. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌లో మాత్రం వన్‌డౌన్‌లో వచ్చాడు.గిల్‌కు బదులుగిల్కు బదులు యశస్వి జైస్వాల్ అఫ్గాన్‌తో మ్యాచ్‌లో రోహిత్‌తో పాటు ఓపెనింగ్ చేశాడు. రెగ్యులర్ వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరం కావడం వల్ల జైసూకు జట్టులో చోటు దక్కగా.. గిల్ అతడిని ఓపెనర్‌గా ప్రమోట్ చేసి.. తాను వన్‌డౌన్‌లో వచ్చాడు.మరోవైపు.. లార్డ్స్‌లో ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేనే రోహిత్ కెరీర్లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అనే ప్రచారం జరిగింది. అయితే, బీసీసీఐతో పాటు రోహిత్ ఈ వదంతుల్ని కొట్టిపారేశాడు. లార్డ్స్‌లో సెంచరీతో కదం తొక్కి తన విలువేంటో చాటుకున్నాడు హిట్‌మ్యాన్. అయినప్పటికీ వన్డే వరల్డ్‌కప్‌లో ఆడించే విషయంలో యాజమాన్యం ఇప్పటికైతే స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది.ఈ పరిణామాల నేపథ్యంలో యశస్వి జైస్వాల్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్ పేరు తెరమీదకు వచ్చింది. వీరిద్దరిలో ఒకరు బ్యాకప్ ఓపెనర్‌గా వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాత్రం భిన్నంగా స్పందించాడు. ఆ ఇద్దరికి చోటు దక్కదు‘‘నిజానికి రుతురాజ్ గైక్వాడ్ రెండు పనులు చేయగలడు. ఓపెనర్‌గా, మిడిలార్డర్లోనూ రాణించగలడు. అతడు పక్కా ఓపెనింగ్ బ్యాటర్. కానీ టీమిండియాకు అవసరమైనపుడు మిడిలార్డర్లోనూ ఆడాడు.ఆ స్థానంలో ఫిఫ్టీ, సెంచరీ బాదాడు. మరోవైపు.. యశస్వి జైస్వాల్ ఇందుకు విరుద్ధం. అతడు కేవలం బ్యాకప్ ఓపెనర్‌గా మాత్రమే ఉండగలడు. ఏదేమైనా ప్రపంచకప్ జట్టులో వీరిద్దరికి స్థానం దక్కదని నేను నమ్ముతున్నాను’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.ఇక ప్రపంచకప్ జట్టులో ఇద్దరు సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్లతో పాటు.. ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లకు చోటు ఇవ్వాలని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఉంటారు.ఇక ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ లేదంటే రిషభ్ పంత్ స్థానం దక్కించుకుంటారు. టాపార్డర్ ఎలాగో మారదు. కాబట్టి రుతురాజ్ గైక్వాడ్ లేదంటే యశస్వి జైస్వాల్‌కు జట్టులో చోటు దక్కే అవకాశాలు తక్కువ’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అయితే, మిడిలార్డర్లో మాత్రం రుతుకు బ్యాకప్ బ్యాటర్‌గా చోటు దక్కే అవకాశం లేకపోలేదని పేర్కొన్నాడు.చదవండి: భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో మార్పు! -
టీమిండియాలో నో చాన్స్.. కౌంటీ బరిలో సీనియర్ క్రికెటర్!
భారత జట్టులో అవకాశాలు రాకపోవడంతో వెటరన్ క్రికెటర్ జైదేవ్ ఉనాద్కట్ కౌంటీ క్రికెట్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ససెక్స్ తరఫున కౌంటీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు జైదేవ్ ఉనాద్కట్ ఈ వారం చివర్లో ఇంగ్లండ్‌కు బయల్దేరి వెళ్లనున్నాడు. ప్రస్తుతం హండ్రెడ్ టోర్నీతో పాటు వన్డే కప్ జరుగుతుండడంతో కౌంటీ క్రికెట్‌కు చిన్న బ్రేక్ వచ్చింది. కౌంటీ క్రికెట్ ప్రారంభమవ్వగానే ఉనాద్కట్ జట్టుతో జాయిన్ అవనున్నాడు. ఓలీ రాబిన్సన్ నేతృత్వంలోని ససెక్స్ జట్టు ఈ సీజన్లో మంచి ప్రదర్శనే చేసింది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, రెండు ఓటములు, రెండు డ్రాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆగస్టు 20న తిరిగి ప్రారంభం కానున్న కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఉనాద్కట్ ససెక్స్ తరఫున వార్విక్షైర్తో బర్మింగ్హమ్ వేదికగా మ్యాచ్‌లో ఆడనున్నాడు. కాగా ఉనాద్కట్ 2023 నుంచే కౌంటీల్లో ససెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాడు. మొత్తం ఇప్పటివరకు ససెక్స్ తరఫున 13 మ్యాచ్‌లాడిన ఉనాద్కట్ 57 వికెట్లు పడగొట్టాడు. ఇక టీమిండియా తరఫున ఉనాద్కట్ నాలుగు టెస్టులు, ఎనిమిది వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఉనాద్కట్ చివరగా ఆగస్టు 2023లో వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్ ఆడాడు. అదే ఏడాది పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తోనే చివరి టెస్టు ఆడాడు. ఇక ఉనాద్కట్ చివరి టీ20 మ్యాచ్ ఆడి 8 సంవత్సరాలు దాటింది. ఇక జైదేవ్ ఉనాద్కట్‌తో పాటు ప్రస్తుతం చాహల్ నాటింగ్హమ్షైర్కు, సర్రీ తరఫున రాహుల్ చాహర్ ఆడుతున్నారు. ఇక యార్క్‌షైర్ తరఫున కుల్దీప్ యాదవ్ వన్డే కప్ ఆడుతుండగా, స్నిన్నర్ మానవ్ సుతార్ వార్విక్షైర్ తరఫున రెండు కౌంటీ మ్యాచ్‌లు ఆడాడు.చదవండి: ‘వైభవ్ వాటికి దూరంగా ఉండు.. లేదంటే మరో పృథ్వీ షానే!’ -
‘వైభవ్ వాటికి దూరంగా ఉండు.. లేదంటే మరో పృథ్వీ షానే!’
టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో వైట్‌బాల్ ఫార్మాట్లో తనదైన ముద్ర వేయగల సామర్థ్యం వైభవ్ కలిగి ఉన్నాడని ఊతప్ప అభిప్రాయపడ్డాడు. గతంలో పృథ్వీ షా తక్కువ వయసులోనే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత వేరే విషయాలపై దృష్టి పెట్టడంతో కెరీర్ దారి తప్పిందని, వైభవ్ అలా దారి తప్పకూడదని పరోక్షంగా హెచ్చరించాడు.ఒక మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఊతప్ప మాట్లాడాడు. ‘వైట్‌బాల్ క్రికెట్లో దిగ్గజం సచిన్ టెండూల్కర్ కంటే వైభవ్ ఎక్కువ ప్రభావం చూపగలడు. ఎందుకంటే సచిన్ లాగే చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. సచిన్ ఎంతటి పేరు ప్రతిష్టలు సాధించాడన్నది అందరికీ తెలిసింది. మరి వైభవ్ దానిని ఎలా నిలబెట్టుకుంటాడనేది ఆసక్తిగా మారింది. అంధఃపాతాళానికి పృథ్వీ షా..‘భారత క్రికెట్లో చిన్న వయసులో ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో పైకి వచ్చినవాళ్లను అరుదుగా చూశాం. ఉదాహరణకు వినోద్ కాంబ్లీ, పృథ్వీ షాలను తమ కెరీర్‌ను 17-18 ఏళ్ల వయసులోనే ప్రారంభించారు. ఈ ఇద్దరు భారత క్రికెట్లో ఎంతో ముద్ర వేస్తారని అంతా భావించారు. కాంబ్లీ సంగతి పక్కనబెడితే, పృథ్వీ షా కెరీర్ ట్రాక్ తప్పడానికి ప్రధాన కారణం అతడి వయస్సే. చిన్న వయసులోనే స్టార్డమ్ చూసిన పృథ్వీ షాకు కెరీర్ కంటే మిగతా విషయాలపై ఫోకస్ పెరిగింది. గర్ల్‌ఫ్రెండ్స్ మోజుతో పాటు ఎండార్స్మెంట్ రూపంలో యాడ్ చేయడంతో సంపాదనపై ఆసక్తి పెరిగింది. దీంతో ఎంతో భవిష్యత్తు ఉన్న పృథ్వీ షా కెరీర్ అంధఃపాతాళానికి పడిపోయింది. కాబట్టి వైభవ్ సూర్యవంశీకి అతడి వయస్సే పెద్ద సవాల్ కానుంది. ప్రస్తుతం 15 ఏళ్ల వయసున్న వైభవ్ రానున్న ఐదేళ్ల పాటు ఎలాంటి మచ్చ లేకుండా ఆటపై దృష్టి పెడతాడా అన్నది చూడాలి. వీలైనంత వరకు వయసు రీత్యా గర్ల్‌ఫ్రెండ్స్‌పై మోజు, ఎడాపెడా ఎండార్స్మెంట్లకు సంతకాలు చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి. సరైన దారిలోనే..ఇప్పటికైతే వైభవ్ తనకు ఎలాంటి ఎండార్స్మెంట్ ఆఫర్ వచ్చినా ఆలోచించి అడుగు వేస్తున్నాడు. అంతేకాదు కేవలం ఆటపైనే దృష్టి పెట్టడం నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే వైట్‌బాల్‌లో సచిన్‌ను మించిన అద్భుతం అవుతాడు. అలా కాదని వ్యవహరిస్తే మాత్రం మరో పృథ్వీషాగా మిగిలిపోవడం ఖాయం. ఇప్పటికిప్పుడు సచిన్‌తో పోల్చడం సరైన చర్య కాకపోయినప్పటికీ, వైభవ్‌లో దాగున్న అపారమైన సామర్థ్యం అతడిని ప్రత్యేకంగా నిలుపుతుంది’ అని చెప్పుకొచ్చాడు.Read: సామ్ బిల్లింగ్స్ సిక్సర్ల వర్షం.. దూసుకెళ్తున్న ట్రెంట్ రాకెట్స్ -
యశ్ ధుల్ విధ్వంసకర శతకం
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ అదరగొట్టింది. పూరానీ ఢిల్లీ 6పై ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ విజయానికి యువ బ్యాటర్ యశ్ ధుల్ సంచలన సెంచరీ ప్రధాన కారణంగా నిలిచింది.141 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ధుల్ 47 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో అజేయ సెంచరీ బాదాడు. ధుల్ ఒంటిచేత్తో సెంట్రల్ ఢిల్లీని విజయతీరాలకు చేర్చాడు. అతడికి మరో ఎండ్‌లో యుగల్ సైనీ (27 నాటౌట్) నామమాత్రపు అండగా ఉన్నాడు. సైనీతో కలిసి ధుల్ అజేయమైన 81 పరుగులు జోడించి మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు. అంతకుముందు ధుల్ సహ ఓపెనర్ సిద్దార్థ్ జూన్ (8)తో తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించాడు. ధుల్ ధాటికి సెంట్రల్ ఢిల్లీ 13.2 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత పురానీ ఢిల్లీ 7 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఓపెనర్ సమర్థ్ సేథ్ (32) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. ఆఖర్లో అశ్విని చిల్లర్ (38), రోహన్ రాఠీ (46) బ్యాట్ ఝులిపించారు. సెంట్రల్ ఢిల్లీ బౌలర్లలో మోనీ గ్రేవాల్ 3, ఖురానా 2, బరోకా ఓ వికెట్ తీశారు.ధుల్ 2022 అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి టైటిల్ గెలిపించాడు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అతడు 110 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ టోర్నీలో ధుల్ 4 మ్యాచ్‌ల్లో 229 పరుగులు చేశాడు. సగటు 76.33.అదే ఏడాది అండర్-19 ఆసియా కప్ గెలిచిన భారత్ జట్టులోనూ ధుల్ కీలక సభ్యుడు. అండర్-19 ప్రదర్శనల తర్వాత ధుల్‌ను భారత క్రికెట్లో భవిష్యత్ టాపార్డర్ బ్యాటర్‌గా పరిగణించారు. అయితే దురదృష్టవశాత్తు అతడు పెద్దగా రాణించలేకపోయాడు. తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో చేసిన సెంచరీ అతడి కెరీర్‌ను మలుపు తప్పుతుందేమో చూడాలి. -
క్రికెట్ వదిలి ఆఫీస్ కి ఇషాన్ కిషన్ శాలరీ ఎన్ని లక్షలో తెలుసా ?
-
ఆకిబ్ నబీ జీవితంలో ఆసక్తికర విశేషాలు
అది జమ్మూకశ్మీర్‌లోని బరాముల్లా పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న షీరీ అనే గ్రామం. అక్కడ క్రికెట్ ఆడేందుకు పెద్దగా సౌకర్యాలు లేవు. నిత్యం రాజకీయ ఉద్రిక్తతలు ఉండే ఆ ప్రాంతంలో ఒక బాలుడు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాలని కలలు కన్నాడు. కలలు కనడమే కాకుండా పట్టుదల, కృషితో వాటిని సాకారం చేసుకున్నాడు.అతడి పేరే ఆకిబ్ నబీ. త్వరలో శ్రీలంకతో జరుగబోయే టెస్ట్ సిరీస్‌కు బుమ్రా ప్రత్యామ్నాయంగా ఎంపికైన ఆటగాడు. నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్ల పాలిట సింహస్వప్నమైన అతడిని క్రికెట్ సర్కిల్స్‌లో బారాముల్లా ఎక్స్‌ప్రెస్ అని పిలుస్తారు. లంకతో తొలి టెస్ట్‌తో టీమిండియా అరంగేట్రం చేసే అవకాశం ఉన్న నబీ జీవిత విశేషాలు ఈ కథనంలో చూద్దాం.29 ఏళ్ల నబీ చిన్నతనంలో ఫుట్‌బాల్‌పై ఆసక్తి చూపినప్పటికీ.. ఆ తర్వాత పేస్ బౌలింగ్‌పై మక్కువ పెంచుకున్నాడు. అదే ఆసక్తి అతడిని దేశవాళీ క్రికెట్లో తిరుగులేని పేసర్‌గా మార్చి, టీమిండియాలోకి తీసుకొచ్చింది. తద్వారా భారత టెస్ట్ జట్టుకు ఎంపికైన తొలి జమ్మూకశ్మీర్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించేలానూ చేసింది.డాక్టర్ కావాలని తండ్రి ఆశ..నబీకి క్రికెట్ కెరీర్ ఎంచుకోవడం అంత సులభంగా జరగలేదు. 12వ తరగతి చదువుతున్న సమయంలో అతడు బయోసైన్స్ విద్యార్థి. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడైన అతడి తండ్రి గులాం నబీ దార్ తన కొడుకు డాక్టర్ కావాలని కోరుకున్నారు.కానీ అదే సమయంలో నబీకు బీసీసీఐ నిర్వహించిన పేస్ బౌలింగ్ క్యాంప్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ క్యాంప్‌కు ఆస్ట్రేలియా దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ కోచ్‌గా వ్యవహరించాడు.కొడుకు చదువును పక్కన పెట్టి క్రికెట్ కోసం వెళ్లడం తండ్రికి అస్సలు నచ్చలేదు. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం ప్రమాదకరమైన నిర్ణయమని ఆయన భావించారు.అయితే ఈ విషయంలో నబీ తొలి కెప్టెన్ జుబైర్ దార్ జోక్యం చేసుకున్నారు. మెక్‌గ్రాత్ వంటి దిగ్గజం దగ్గర నేర్చుకునే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని చెప్పి నబీను క్యాంప్‌కు పంపించేందుకు తండ్రిని ఒప్పించారు. అది నబీ క్రికెట్ జీవితాన్ని మార్చిన కీలక మలుపుల్లో ఒకటి.స్పైక్స్ కూడా తెలియని స్థాయి నుంచి ‘బరాముల్లా ఎక్స్‌ప్రెస్’గా..నబీ ప్రతిభను తొలిసారి గుర్తించింది కూడా జుబైర్ దారే. 14 ఏళ్ల వయసులో ప్రత్యర్థి జట్టు తరఫున ఆడుతున్న నబీను ఆయన చూశారు. ఓటమి ఎదురైనా బ్యాట్, బంతితో నబీ చూపిన తెగువ జుబైర్‌ను ఆకట్టుకుంది. నబీ ప్రతిభకు ముగ్ధుడైన జుబైర్.. బరాముల్లా క్లబ్లో చేరాలని ఆహ్వానించారు.అయితే అప్పట్లో నబీకు క్రికెట్లోని కనీస విషయాలు కూడా తెలీవు. శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ స్టేడియంలో తొలిసారి టర్ఫ్ వికెట్‌పై బౌలింగ్ చేసేందుకు దిగినప్పుడు అతడి కాళ్లు పాపింగ్ క్రీజ్ వద్ద జారిపోయాయి. పరుగెత్తుకుంటూ వచ్చి బంతి వేయాల్సిన బౌలర్.. పిచ్‌పై జారి పడిపోయాడు.అందుకు కారణం ఏంటంటే.. అతడు సాధారణ షూస్ వేసుకుని బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఫాస్ట్ బౌలింగ్‌కు స్పైక్స్ అవసరమని కూడా అతడికి తెలీదు.క్రికెట్ వ్యవస్థ గురించి అంతగా అవగాహన లేని నబీ మరోసారి తన అమాయకత్వంతో చిక్కుల్లో పడ్డాడు. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ రెండు వర్గాలుగా విడిపోయిన సమయంలో రెండు వర్గాలు నిర్వహించిన క్యాంపులకు ఒకే రోజు వెళ్లాడు. ఉదయం ఒక క్యాంప్‌లో బౌలింగ్ చేసిన అతడు.. అక్కడి అధికారి చెప్పడంతో మధ్యాహ్నం మరో వర్గం నిర్వహించిన క్యాంప్‌కు కూడా వెళ్లి బౌలింగ్ చేశాడు. దీని వల్ల అతడు కొద్ది రోజుల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. అతడికి అక్కడి రాజకీయాలు తెలియదు. అతడికి తెలిసింది ఒక్కటే.. బంతిని వేగంగా, సరిగ్గా వేయడం.ఇర్ఫాన్ పఠాన్ మార్గదర్శకత్వంలో..నబీలో ఉన్న సహజమైన ప్రతిభకు సరైన మెరుగులు దిద్దింది మాజీ భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. ఇర్ఫాన్ పఠాన్ మార్గదర్శకత్వంలో నబీ బౌలింగ్‌లో అసలు మార్పు వచ్చింది. కేవలం వేగంతో బంతులు విసిరే పేసర్ నుంచి.. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల తెలివైన బౌలర్‌గా నబీ మారాడు. లైన్, లెంగ్త్‌పై పట్టు సాధించాడు.2018 సెప్టెంబర్‌లో విజయ్ హజారే ట్రోఫీతో లిస్ట్-ఏ అరంగేట్రం చేసిన నబీ.. 2020 జనవరిలో జార్ఖండ్‌పై ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఒడిశాపై ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. ఆ ప్రదర్శన జమ్మూకశ్మీర్‌ను క్వార్టర్ ఫైనల్స్‌కు చేర్చడంలో కీలకమైంది.44 వికెట్ల నుంచి డబుల్ హ్యాట్రిక్ వరకు..2024-25 రంజీ ట్రోఫీ నబీ కెరీర్లో కీలక మలుపు. ఆ సీజన్లో 44 వికెట్లతో దేశంలోనే అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా నిలిచాడు. అతడి బౌలింగ్ సగటు కేవలం 13.93. అయితే అసలు సంచలనం 2025 ఆగస్టులో వచ్చింది.దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ తరఫున ఈస్ట్ జోన్‌పై ఆడుతున్నప్పుడు నబీ వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. అంటే డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. అప్పటికే ‘బరాముల్లా ఎక్స్‌ప్రెస్’ అనే పేరు దేశవ్యాప్తంగా మార్మోగడం మొదలైంది.ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ 15 వికెట్లు తీసిన నబీ.. వైట్‌బాల్ క్రికెట్లోనూ తనకు తిరుగులేదని నిరూపించాడు.ఐపీఎల్లో జాక్పాట్దీంతో ఐపీఎల్ వేలంలో అతడి కోసం ఫ్రాంచైజీల మధ్య పోటీ నెలకొంది. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ రూ.8.40 కోట్లకు నబీను సొంతం చేసుకుంది. ఒకప్పుడు కొడుకు విమాన టికెట్ కోసం రూ.10,000 సమకూర్చేందుకు ఇబ్బంది పడిన నబీ తండ్రి, ఐపీఎల్ జాక్‌పాట్ చూసి మురిసిపోయాడు.జమ్మూకశ్మీర్‌కు తొలి రంజీ టైటిల్.. నబీదే కీలక పాత్ర2025-26 రంజీ ట్రోఫీ సీజన్ నబీ కెరీర్లోనే అత్యంత గొప్ప అధ్యాయం.జమ్మూకశ్మీర్ తొలిసారి రంజీ ట్రోఫీ గెలవడంలో అతడి పేస్ బౌలింగే కీలకం. ఆ సీజన్లో అతడు కేవలం 17 ఇన్నింగ్స్‌ల్లో 60 వికెట్లు తీశాడు. 12.65 సగటున ఏకంగా ఎనిమిది సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచాడు.ఇండియా-ఏ నుంచి టీమిండియా వరకు..దేశవాళీ క్రికెట్లో వరుసగా అద్భుత ప్రదర్శనలు చేయడంతో భారత జట్టు తలుపులు తెరుచుకున్నాయి.2026 మధ్యలో శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఇండియా-ఏ జట్టులో నబీ చోటు దక్కించుకున్నాడు. రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీశాడు.అంతేకాదు.. భారత సీనియర్ జట్టుకు నెట్ బౌలర్‌గా కూడా వ్యవహరించాడు. జాతీయ సెలెక్టర్ల ముందు తన సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం అతడికి అక్కడే లభించింది. అయితే టీమిండియా టెస్ట్ జట్టులో చోటు దక్కుతుందని మాత్రం అతడు ఊహించి ఉండకపోవచ్చు.బుమ్రా గాయంతో తెరుచుకున్న తలుపుఆగస్టు 2026లో శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ముందు జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం కారణంగా దూరమయ్యాడు. హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి కూడా అందుబాటులో లేకపోవడంతో భారత జట్టుకు మరో పేసర్ అవసరమైంది. అప్పుడు సెలెక్టర్ల దృష్టి నబీపై పడింది.రెండు రంజీ సీజన్లలో ఏకంగా 104 వికెట్లు. 2025-26 సీజన్లో 60 వికెట్లు. రెడ్‌బాల్‌లో రెండు వైపులా బంతిని స్వింగ్ చేయగల సామర్థ్యం. అద్భుతమైన ఫామ్. ఈ గణాంకాలన్నీ నబీకు అనుకూలంగా నిలిచాయి. దీంతో అతడికి భారత టెస్ట్ జట్టులో చోటు దక్కింది. -
మరోసారి వార్తల్లోకెక్కిన అర్షదీప్ సింగ్
టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ క్రికెటేతర విషయానికి సంబంధించి మరోసారి వార్తల్లో నిలిచాడు. అతడు పంజాబీ నటి, మోడల్ సమ్రీన్ కౌర్‌తో రిలేషన్లో ఉన్నాడని ఇటీవల సోషల్‌మీడియా కోడై కూసింది. ఆ ప్రచారం నిజమేనని తాజాగా జరిగిన ఓ ఉదంతంతో స్పష్టమైంది.సమ్రీన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేయగా అర్షదీప్ స్పందించాడు. ఎలుగుబంటి, రెడ్ హార్ట్ ఎమోజీలతో కామెంట్ చేశాడు. దీనికి సమ్రీన్ కూడా రెడ్ హార్ట్, లాక్ ఎమోజీలతో రిప్లై ఇచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం బహిర్గతమైంది.అర్ష్‌దీప్ కొద్ది రోజుల కిందట సమ్రీన్‌తో కలిసి ఉన్న రెండు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి 'My Person' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్ తర్వాతే అర్షదీప్-సమ్రీన్ రిలేషన్లో ఉన్నారని ప్రచారం మొదలైంది.ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగానూ వీరిద్దరు కలిసి తిరిగినప్పటికీ.. అప్పట్లో ఇంత ప్రచారం జరగలేదు. అర్షదీప్-సమ్రీన్ రిలేషన్‌కు నెటిజన్లు ఫిక్స్ అయిపోయినప్పటికీ.. వారి నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అర్షదీప్ క్రికెట్‌తో, సమ్రీన్ సోషల్‌మీడియాలో బిజీగా ఉన్నారు.అర్షదీప్ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే వన్డేల్లో మాత్రం అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఒకే ఒక వన్డే ఆడి 0/72 గణాంకాలు నమోదు చేశాడు.ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ 2026 కోసం అర్ష్‌దీప్ సింగ్ నార్త్ జోన్ జట్టుకు ఎంపికయ్యాడు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన కన్హయ్య వాధ్వాన్ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఢిల్లీ ఆటగాడు ఆయుష్ బదోనీ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. -
ఇక ఈ అధ్యాయం ముగిసిపోయింది
టీమిండియాతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ భావోద్వేగానికి లోనయ్యాడు. భారత జట్టు సాధించిన తిరుగులేని విజయాల్లో తానూ భాగమైనందుకు సంతోషంగా ఉందన్నాడు. అయితే, ఈ అధ్యాయం ముగిసిపోయిందని.. ఏదేమైనా గత ఐదేళ్లు తన జీవితంలో మధుర జ్ఞాపకంగా మిగిలిపోతాయని పేర్కొన్నాడు.కాగా 2021, నవంబరులో టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన టి.దిలీప్ (T. Dilip).. తన హయాంలో మంచి మార్పులు తీసుకువచ్చాడు. మైదానంలో అత్యుత్తమంగా రాణించిన ఫీల్డర్లకు గుర్తింపుగా డ్రెసింగ్‌రూమ్‌లో ఫీల్డింగ్ మెడల్ ప్రదానం చేయడం మొదలుపెట్టాడు ఈ హైదరాబాదీ.అయితే, బీసీసీఐ మాత్రం అతడి కాంట్రాక్టును పొడిగించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ నేపథ్యంలో దిలీప్ స్థానంలో కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా శుభదీప్ ఘోష్‌ను నియమించింది. ఈ నేపథ్యంలో దిలీప్ తాజాగా టీమిండియాతో తన అనుబంధం గురించి గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టాడు.అదే లక్ష్యంతో పనిచేశాను‘‘ఈ ఐదేళ్ల ప్రయాణం గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు. సహాయక సిబ్బందిలో చేరే ముందే.. జట్టు కోసం నా సర్వస్వం ఇవ్వాలని భావించాను. మొదటి రోజు నుంచి అదే లక్ష్యంతో పనిచేశాను.ఫీల్డింగ్ కోచ్‌గా జట్టుతో ప్రయాణం చేయడం పట్ల నేను కృతజ్ఞుడినై ఉంటాను. ఫీల్డింగ్ మెడల్ అనేది మా మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ మెడల్ ప్రదానం ద్వారా డ్రెసింగ్‌రూమ్‌లో ఒక ఆహ్లాదకర వాతావరణం సృష్టించాము.చిరస్మరణీయ విజయాలుఈ జ్ఞాపకాలు నా మదిలో నిలిచిపోతాయి. రెండు టీ20 ప్రపంచకప్ (2024,2026), ఒక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (2025), రెండు ఆసియా కప్ (2023, 2025) ట్రోఫీలు గెలిచిన జట్టులో నేనూ భాగమే.ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్‌కప్ (2023) ఫైనల్ చేరిన జట్టులోనూ నేను ఉన్నాను. ఈ ప్రయాణంలో నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన బీసీసీఐకి సదా కృతజ్ఞుడినై ఉంటాను.మీరు కెప్టెన్లుగా ఉన్న సమయంలోనాపై నమ్మకం ఉంచినందుకు రాహుల్ ద్రవిడ్, గౌతం గంభీర్‌కు నా ధన్యవాదాలు. మీ ఇద్దరితో కలిసి పని చేయడం గొప్ప అనుభవం. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్.. మీరు కెప్టెన్లుగా ఉన్న సమయంలో భారత క్రికెట్‌కు నా వంతు సేవ చేయడాన్ని గొప్పగా భావిస్తున్నాను.ఈ ప్రయాణంలో నాతో ఉన్న ప్రతీ ఆటగాడు, కోచ్, సహాయక సిబ్బందిలోని ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడిక ఈ అధ్యాయం ముగిసిపోయింది. ఈ ఐదేళ్లు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు. అయితే, నా ప్రయాణం మాత్రం కొనసాగుతుంది’’ అని టి. దిలీప్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.చదవండి: బుమ్రా అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ -
యువరాజ్ సింగ్ విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు!
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వ్యక్తిగత గోప్యత, హక్కులకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్ విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. యువరాజ్ సింగ్ వ్యక్తిగత హక్కులకు, గోప్యతకు భంగం కలిగించవద్దని స్పష్టంచేసింది. యువరాజ్ అనుమతి లేకుండా అతడి పేరు, ఫొటోలు, గొంతును వాణిజ్య లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని థర్డ్ పార్టీలను నియంత్రిస్తూ జస్టిస్ జ్యోతి సింగ్ తీర్పునిచ్చారు.తన వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా అనుమతి లేకుండా తన పేరును ఉపయోగించి వస్తువులను అనధికారికంగా విక్రయించడమే కాకుండా, పలు సోషల్ మీడియా ఖాతాలు తనను కల్పిత, అవాస్తవ దృశ్యాలలో చూపిస్తున్నట్లుగా ఏఐ రూపొందించిన చిత్రాలు, వీడియోలను ప్రచురిస్తున్నారని, ఇవి తన ప్రతిష్టకు, సద్భావనకు నష్టం కలిగిస్తున్నాయని యువరాజ్ సింగ్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో ఇతర క్రీడాకారులపై దాడి చేస్తున్నట్లు, మతపరమైన భావాలను దెబ్బతీసేలా, అసభ్యకరమైన భాషతో కూడిన డీప్‌ఫేక్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారని యువరాజ్ సింగ్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై జస్టిస్ జ్యోతిసింగ్ స్పందిస్తూ.. ‘17 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో దేశానికి యువరాజ్ ప్రాతినిధ్యం వహించాడు. దేశం తరఫున ఆడుతూ ఎన్నో ఘనతలు సొంతం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రికెటర్లలో యువరాజ్ ఒకడు. అతడి వ్యక్తిత్వ, గోప్యతా హక్కులకు భంగం కలిగిస్తున్నవారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది. యువరాజ్ ఆమోదం లేకుండా రూపొందించిన అభ్యంతరకర పోస్టులు, వీడియోలు తక్షణమే తొలగించాలి’ అని తెలిపాడు.చదవండి: 'పతకాలు చూసి మురిసిపోవద్దు.. ముందుంది ముసళ్ల పండగ!’ -
‘అతడిని ఎంపిక చేయబోం.. రిటైరవ్వడమే మంచిది’
భారత జట్టు సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ టీమిండియాలో తిరిగి చోటు దక్కించుకోవడం కష్టమే అనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. తాజాగా భువనేశ్వర్ కుమార్‌తో పాటు మహమ్మద్ షమీ భవిష్యత్తుపై అజిత్ అగార్కర్ కీలక ప్రకటన చేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది. 2027 వన్డే ప్రపంచకప్ కోసం 15 మంది ఫాస్ట్ బౌలర్లను సిద్ధం చేస్తున్నట్లు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. అయితే ఇందులో అందరూ యంగ్ బౌలర్లే ఉంటారని అగార్కర్ పేర్కొన్నాడు. 30 సంవత్సరాలు దాటిన బౌలర్లను తాము పరిగణలోకి తీసుకోవడం లేదని బాంబు పేల్చాడు.'షమీ టీమిండియా అత్యుత్తమ మ్యాచ్ విన్నర్లలో ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో షమీ ఛాంపియన్. కానీ భవిష్యత్తు కోసం మేము యువ పేస్ బౌలింగ్ దళానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. భారత క్రికెట్‌కు అతని సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. మేము అతడిని గౌరవిస్తున్నాము.’ అని చెప్పుకొచ్చాడు. అగార్కర్ వ్యాఖ్యల ను బట్టి చూస్తే మాత్రం షమీ రిటైర్మెంట్కు సమయం ఆసన్నమైందంటూ పరోక్షంగా హింట్ ఇచ్చినట్లు అనిపిస్తోంది.ఒకప్పుడు భారత బౌలింగ్ దళానికి ప్రధాన బలంగా నిలిచిన షమీ.. ఇప్పుడు సెలెక్టర్ల దీర్ఘకాలిక ప్రణాళికల్లో చోటు దక్కించు కోలేకపోతున్నట్లు తెలుస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్ చేరడంలో షమీ కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా నిలిచి తన ప్రతిభను చాటుకున్నాడు. అనంతరం 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో చివరిసారిగా భారత జట్టు తరఫున వన్డే ఆడగా, అదే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో చివరిసారి కనిపించాడు. షమీతో పాటు భువనేశ్వర్ కుమార్ కూడా 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని ఎదురుచూస్తున్నారు. దీనికి తగినట్లుగానే గత రెండేళ్లుగా వీళ్లిద్దరి గణాంకాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. దేశవాళీ, రంజీలు అదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్స్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. అయినప్పటికీ బీసీసీఐ మాత్రం ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లను పట్టించుకోవడం లేదు. అవకాశాలు ఇవ్వడం లేదు. ముఖ్యంగా హెడ్‌కోచ్‌గా గంభీర్, సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ వచ్చిన తర్వాత వీళ్ల అడ్రస్ గల్లంతయ్యింది.🚨 Ajit Agarkar breaks silence on Mohammed Shami .🚨🔹We've picked our group of 15 fast bowlers for the future and want to give young players more opportunities ahead of the World Test Championship and the 2027 ODI World Cup.Shami has been one of India's finest match-winners… pic.twitter.com/p0mEPybruS— Indian cricket (@Cricketpaglu45) August 1, 2026చదవండి: హార్దిక్ మాజీ భార్యపై తీవ్ర విమర్శలు! -
ఆసియా కప్ 2026కు భారత జట్టు ప్రకటన
మహిళల ఆసియా కప్ 2026 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. కెప్టెన్సీపై ఇటీవల చర్చ జరిగినప్పటికీ హర్మన్‌ప్రీత్ కౌర్‌నే కెప్టెన్‌గా కొనసాగించింది. స్మృతి మంధానను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. జట్టులో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ వంటి కీలక ప్లేయర్లకు చోటు దక్కింది.శ్రేయాంక పాటిల్‌కు చోటు లేదుటీ20 ప్రపంచకప్ జట్టులో ఉన్న శ్రేయాంక పాటిల్‌కు ఆసియా కప్ జట్టులో చోటు దక్కలేదు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఆమె కుడి చీలమండకు గాయమయ్యింది. శ్రేయాంక స్థానంలో టీ20 ప్రపంచకప్ జట్టులోకి వచ్చిన ప్రేమా రావత్ ఆసియా కప్ జట్టులోనూ కొనసాగింది. ఇదే జట్టులో జరిగిన ప్రధాన మార్పు.భారత మహిళల ఆసియా కప్ 2026 జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి. కమిలిని, అరుంధతి రెడ్డి, ప్రేమా రావత్, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, నందిని శర్మ, క్రాంతి గౌడ్.కాగా, ఆసియా కప్ 2026 సెప్టెంబర్ 17న మొదలై 22వ తేదీ వరకు జరుగనుంది. ఈ టోర్నీ ఫిక్చర్స్ ఇంకా ఖరారు కాలేదు. -
గుండుతో దర్శనం.. హార్దిక్ పాండ్యా కొత్త లుక్ వైరల్
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొత్త లుక్‌తో దర్శనమిచ్చాడు. తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి తిరుమల స్వామి వారిని దర్శించుకున్న పాండ్యా క్లీన్ హెడ్షేవ్ (గుండు)తో కనిపించాడు. దీంతో పాండ్యా కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తిరుమల పర్యటనలో హార్దిక్ పాండ్యా శ్రీవారికి తలనీలాలు సమర్పించాడు. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన మొక్కుబడి తీర్చుకునే భాగంగానే తలనీలాలు సమర్పించారా.? లేక మరేదైనా వ్యక్తిగత కారణం ఉందా? అనేది తెలియాలి. ఇక ఐపీఎల్ 2026 సీజన్ చివర్లో గాయానికి గురైన పాండ్యా స్వదేశంలో అప్గానిస్తాన్‌తో సిరీస్‌తో పాటు ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లకు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)లో పాండ్యా రీహాబిలిటేషన్‌లో గడుపుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ కోసం పాండ్యాను జాగ్రత్తగా కాపాడుకోవడంపై బీసీసీఐ ప్రత్యేక ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగానే పరిమితంగానే పాండ్యా సేవలు ఉపయోగించుకోవాలని చూస్తోంది. మరోవైపు పాండ్యా కూడా 2027 వన్డే ప్రపంచకప్ వరకు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించే పనిలో పడ్డాడు.ఇక ఐపీఎల్ 2026 సీజన్లోనూ ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. 2024 సీజన్‌కు ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించినప్పటికీ.. అతని నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. పాండ్యా కెప్టెన్‌గా వచ్చిన తర్వాత కూడా ముంబై గత మూడు సీజన్లలో నిరాశాజనక ఫలితాలే అందుకుంది. దీంతో పాండ్యాను ముంబై ఇండియన్స్ వదులుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌కు పాండ్యా వేరే జట్టులో దర్శనమిచ్చే అవకాశముంది. ఇప్పటికే హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ స్టార్ ఆల్‌రౌండర్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ట్రేడ్ లేదా ఒప్పందం ఖరారు కాలేదు. మొత్తంగా 2027 సీజన్లో హార్దిక్ ఏ జట్టు జెర్సీలో కనిపిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.Indian cricketer Hardik Pandya visited the Sri Venkateswara Swamy Temple in Tirumala today with Mahika Sharma.Hardik offered his hair as part of a religious vow and was seen in a new bald look. The two also took part in the early morning Suprabhatha Seva. 🙏 pic.twitter.com/mdkQlecKLv— Amit Kumar Sindhi (@AMIT_GUJJU) August 2, 2026 Hardik Pandya with Mahieka at the Tirumala Temple. pic.twitter.com/3FjJ33ltw8— Mufaddal Vohra (@mufaddal_vohra) August 2, 2026Read: అభిషేక్ శర్మ ఊచకోత.. 91 బంతుల్లో 233 పరుగులు -
అభిషేక్ శర్మ ఊచకోత.. 91 బంతుల్లో 233 పరుగులు
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానికంగా జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అమృత్సర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ తరన్ తారన్ మెన్స్ సీనియర్ జట్టుపై 91 బంతుల్లో 233 పరుగులతో చెలరేగాడు. ఈ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 25 సిక్సర్లు ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.ఇదిలా ఉంటే, అభిషేక్ ఇటీవలికాలంలో టీమిండియా తరఫున వరుసగా విఫలమయ్యాడు. గత ఏడు టీ20 మ్యాచ్‌ల్లో అతడు ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. చివరిగా ఇంగ్లండ్ పర్యటనలో తొలి మ్యాచ్‌లో అర్ద సెంచరీ చేశాడు. దానికి ముందు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయలేదు. అతడు చివరి సారిగా మూడంకెల స్కోర్ చేసింది ఐపీఎల్ 2026లో. డీసీతో జరిగిన మ్యాచ్‌లో అతడు 68 బంతుల్లో అజేయమైన 135 పరుగులు చేశాడు.తాజాగా జింబాబ్వేతో ముగిసిన 3 మ్యాచ్‌ల సిరీస్‌లో అభిషేక్ ఫామ్ ఘోరంగా పడిపోయింది. ఆ మూడు మ్యాచ్‌ల్లో అతడు వరుసగా 1, 8, 2 స్కోర్లు చేశాడు. ఈ సిరీస్‌లో అభిషేక్ కనీసం రెండంకెల స్కోర్‌ను కూడా చేయలేకపోయాడు. ప్రస్తుతం భారత జట్టు ఖాళీగా ఉండటంతో స్థానిక వన్డే మ్యాచ్ ఆడిన అభిషేక్ ఎట్టకేలకు ఫామ్ దొరకబుచ్చుకున్నాడు.త్వరలో టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుండగా, ఆ పర్యటన నిమిత్తం ఎంపిక చేసిన టెస్ట్ జట్టులో అభిషేక్‌కు చోటు దక్కలేదు. అభిషేక్‌కు గతకొంతకాలంగా టీ20ల్లో మాత్రమే అవకాశం వస్తుంది. తాజా ప్రదర్శనతో అతడు వన్డే జట్టులో స్థానంపై కూడా కన్నేయవచ్చు. టీమిండియా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నిమిత్తం ఆగస్ట్ 4న శ్రీలంక పర్యటనకు బయల్దేరనుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ మ్యాచ్ గాలే వేదికగా ఆగస్ట్ 15న ప్రారంభం కానుంది. దీనికి ముందు భారత జట్టు ఓ వార్మప్ మ్యాచ్ ఆడనుంది.


