ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన ఇండియా ఉమెన్స్ టీమ్.. ప్రస్తుతం సంబరాల్లో మునిగిపోయింది. ఈ తరుణంలో టాటా మోటార్స్ వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. జట్టులోని సభ్యులకు ఒక్కొక్కరికి.. ఒక్కో సియెర్రా కారును గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
టాటా మోటార్స్.. తన సియెర్రా కారును నవంబర్ 25న దేశీయ విఫణిలో లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ కారు టెస్టింగ్ సమయంలో చాలాసార్లు కనిపించింది. ఇది 5 డోర్స్ మోడల్. కాబట్టి కుటుంబ ప్రయాణాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారు పనోరమిక్ సన్‌రూఫ్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, సొగసైన డోర్ హ్యాండిల్స్ పొందుతుంది.

టాటా సియెర్రా.. మూడు స్క్రీన్ లేఅవుట్‌తో కూడిన డ్యాష్‌బోర్డ్ పొందుతుంది. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం సెంట్రల్ టచ్‌స్క్రీన్, ముందు ప్రయాణీకుడి కోసం అదనపు స్క్రీన్ వంటివి ఉన్నాయి. సరికొత్త స్టీరింగ్ వీల్ కూడా పొందుతుంది. ఈ కారు పసుపు, ఎరుపు రంగుల్లో అమ్మకానికి రానున్నట్లు సమాచారం. ఈ కారు ధరను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. కానీ దీని ప్రారంభ ధర రూ. 15 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉంటుందని అంచనా.
ఇదీ చదవండి: హీరో ఎలక్ట్రిక్ కారు: నానో కంటే చిన్నగా!
టాటా సియెర్రా యొక్క పవర్‌ట్రెయిన్ గురించి.. కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది పెట్రోల్ & డీజిల్ ఇంజిన్ ఎంపికలతో లభించనుంది. అయితే ప్రస్తుతం హారియర్ & సఫారీ మోడళ్లలోని 2.0-లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలే.. సియెర్రాలో కూడా ఉంటాయని సమాచారం. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో మాన్యువల్ & ఆటోమేటిక్ ఉండనున్నాయి.


