ఇప్పటి వరకు టూ వీలర్స్ లాంచ్ చేసిన హీరోమోటోకార్ప్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఫోర్ వీలర్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే.. NEX 3ను EICMA 2025 వేదికపై ఆవిష్కరించింది. ఇది చూడటానికి.. పరిమాణం పరంగా నానో కారు మాదిరిగానే అనిపిస్తుంది. కానీ ఇది ఎలక్ట్రిక్ కారు కావడంతో.. కొంత భిన్నంగా, చిన్నదిగా ఉంటుంది.
హీరో మోటోకార్ప్ లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ కేవలం.. ఇద్దరు ప్రయాణించడానికి మాత్రమే అనుమతిస్తుంది. అంటే డ్రైవర్, పిలియన్ మాదిరిగా అన్నమాట. నగర ప్రయాణానికి మాత్రమే కాకుండా.. గ్రామీణ ప్రయాణానికి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ కారుకు సంబంధించిన చాలా వివరాలను కంపెనీ వెల్లడించాల్సి ఉంది.
ఇదీ చదవండి: 42 ఏళ్లు.. ఇండియాలో మూడు కోట్ల సేల్స్!
హీరో మోటోకార్ప్.. EICMA 2025 వేదికపై NEX 3తో పాటు.. VIDA విభాగం రెండు కొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను ఆవిష్కరించారు. అంత కాకుండా.. హీరో బ్రాండ్ యూరోపియన్ మార్కెట్లోకి అధికారిక ప్రవేశాన్ని సూచించే అర్బన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన VIDA VX2 ను కూడా విడుదల చేశారు. అదనంగా.. కంపెనీ VIDA DIRT.E సిరీస్‌ను ఆవిష్కరించింది. వీటిలో 4 నుంచి 10 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం DIRT.E K3 & అధిక పనితీరు గల DIRT.E MX7 రేసింగ్ కాన్సెప్ట్ ఉన్నాయి.


