ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ (Team India) బోణీ కొట్టింది. హోబర్ట్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో (India vs Australia) 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడిన సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించాడు. ఈ గెలుపుతో భారత్ సిరీస్‌లో సమంగా (1-1) నిలిచింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (74), స్టోయినిస్ (64) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. ఆఖర్లో మాథ్యూ షార్ట్ (26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ (Arshdeep Singh) 3 వికెట్లు తీయగా.. వరున్ చక్రవర్తి 2, శివమ్ దూబే ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
సుందర్‌కు జితేశ్ శర్మ (13 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) సహకరించాడు. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ 25, శుభ్‌మన్ గిల్ 15, సూర్యకుమార్ యాదవ్ 24, తిలక్ వర్మ 29, అక్షర్ పటేల్ 17 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ 3 వికెట్లు పడగొట్టగా.. బార్ట్‌లెట్, స్టోయినిస్ తలో వికెట్ తీశారు. నాలుగో టీ20 గోల్డ్ కోస్ట్ వేదికగా నవంబర్ 6న జరుగుతుంది.
చదవండి: రంజీ క్రికెటర్ దుర్మరణం


