breaking news
Andhra Pradesh
-
ఏపీ హైకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట
సాక్షి,విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. వంశీని అరెస్ట్ చేయొద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో వంశీ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. -
చంద్రబాబు ‘కనబడుటలేదు’
సాక్షి,తాడేపల్లి: సీఎం చంద్రబాబు లండన్ వెళ్లినట్లా? లేక ఇండోనేషియా పర్యాటక ప్రాంతం బాలి? వెళ్లారా అని’ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ప్రశ్నించారు. గత నాలుగైదు రోజులుగా అధికారిక కార్యక్రమాల్లో ప్రభుత్వ పెద్దలు కనిపించకపోవడంపై ఆయన మీడియా మాట్లాడారు. ‘సీఎం చంద్రబాబు మిస్ అయ్యారు. మంత్రి లోకేష్ కూడా కనపడటం లేదు. వీరిద్దరూ ఎక్కడకు వెళ్లారో ఆచూకీ తెలియదు.వైకుంఠ ఏకాదశి రోజున శంషాబాద్ నుండి బాలి వెళ్లినట్టు తెలిసింది. టీడీపీ నేతల మాత్రం చంద్రబాబు లండన్ వెళ్లారని అంటున్నారు. నారా లోకేష్ గత నెల 28న కేథ్వే ఫసపిక్ ఎయిర్‌లైన్స్‌లో వెళ్లారని సమాచారం. ప్రతి మూడు నెలలకు ఒకసారి చంద్రబాబు విదేశాలకు వెళ్తున్నారు.ఆయన ఎందుకు పదేపదే విదేశాలకు వెళ్తున్నారో చెప్పాలి. సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ 9 సార్లు విదేశాలకు వెళ్లారు. రూ.2.90 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ముంచారు.వేల కోట్ల విలువైన భూములను బినామీలకు ఇచ్చి కమీషన్లు కొట్టేశారు. ఆ కమీషన్ల సొమ్ముతో విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్నట్టు సమాచారం. కూటమి నేతల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది’ అని ధ్వజమెత్తారు. -
తిరుమల లడ్డూ వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ విషయంలో నేటి నుంచి పబ్లిష్ అయ్యే వార్తా కథనాలు, సోషల్ మీడియా పోస్టులకు తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు.. వైఎస్సార్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా మీడియా సంస్థలకు ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా కథనాలు ప్రచురించారని.. తక్షణమే వాటిని తొలగించాలని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రూ.10 కోట్ల పరిహారానికి దావా వేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్ విచారణ జరిపారు. వాదనల విన్న తర్వాత ఇదివరకే ప్రచురించిన కథనాలపై నిర్ణయం తీసుకుంటామన్న కోర్టు.. కథనాలపై ఇంటెరిం ఇన్‌జంక్షన్ ఇవ్వాలన్న వినతిని కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణ జనవరి 29కి వాయిదా వేసింది. తిరుమల లడ్డూ ప్రసాద వివాదంలో ఓవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా, మరోవైపు ఈనాడు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సహా పలు మీడియా సంస్థలు కల్పిత కథనాలు రాస్తున్నాయని వైవీ సుబ్బారెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన ఢిల్లీ హైకోర్టు.. ‘‘తిరుమల లడ్డూ వ్యవహారం గురించి గానీ, వైవీ సుబ్బారెడ్డి గురించి గానీ ప్రచురించే ప్రతి కథనం కోర్టు విచారణకు లోబడి ఉంటుంది. ఇష్టారాజ్యంగా తప్పుడు రాతలు రాస్తే కోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదు. వాటికి తగిన పరిణామాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి’’ అంటూ గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
ఏపీలో పదే పదే అదే తప్పు!
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కపటత్వంపై మాత్రమే ఆధారపడి పనిచేస్తోందని పదే పదే రుజువు అవుతోంది. స్వయానా మంత్రులే ఫేక్ వీడియోల ప్రదర్శనకు దిగడం ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగమే నడుస్తుందని ప్రభుత్వ పెద్దలు, సీనియర్ అధికారులు సైతం చెబుతూండటం అత్యంత బాధాకరం. చంద్రబాబు కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ వైసీపీ శ్రేణులు ఇప్పటికీ రౌడీయిజం చేయాలని చూస్తున్నాయని, జగన్ పుట్టిన రోజున జంతుబలి చేస్తారా? పోస్టర్లపై రక్తం చల్లి సమాజాన్ని భయ భ్రాంతులకు గురి చేస్తారా విమర్శించారు. ఇది కూడా పక్కదోవ వ్యూహంలో భాగమే.జగన్ జన్మదినోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అతడికి వచ్చిన మద్దతు, జరిగిన సంబరాలను కూటమి పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. దాంతో ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నం చేశారు. అంతే.. కొందరు పోలీసు అధికారులు రెచ్చిపోయి బైకులు ర్యాలీలు తీసినా కేసులు పెట్టారు. కేక్ కట్ చేసినా అరెస్టు చేశారు. జాతరలో మాదిరి పొట్టేళ్లను నరికారంటూ పలువురు కార్యకర్తలపై కేసులు పెట్టడమే కాకుండా, వారిని అమానుషంగా రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. చివరకు పోలీసు శాఖ ఇవన్నీ ఏవో గొప్ప పనులైనట్లు ప్రచారం చేసుకునే దుస్థితికి చేరింది. దీనికి డిజిపి గుప్త సమర్థన మరీ ఘోరంగా ఉంది.తమ వద్ద వాహనాలులేవని, అందుకే నడిపించామని ఆయన చెప్పారు.నిజమే! ఎవరు చట్ట ఉల్లంఘన చేసినా తప్పే. కేసులు పెట్టవచ్చు. అలా కాకుండా కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ వారిపైనే కేసులు పెడతామని, టీడీపీ, జనసేనలకు చెందిన వారు ఎలాంటి తప్పులు చేసినా, తీవ్ర వ్యాఖ్యలు చేసినా పట్టించుకోబోమని పోలీసులు బాహాటంగా చెబుతున్నట్లుగా వ్యవహరిస్తే ఎలా? నీతులు చెప్పే చంద్రబాబు ఏమని ఆదేశాలు ఇవ్వాలి? ఎవరు బహిరంగంగా జంతు బలి చేసినా ఒప్పుకోరాదని, వివక్ష లేకుండా కేసులు పెట్టాలి అని. ఆ పని చేయలేదు. కొంతకాలం క్రితం టీడీపీ కార్యకర్తలు పలుచోట్ల పొటేళ్లలను రోడ్డుపైనే నరికారు.చంద్రబాబు చిత్రపటానికి రక్తాభిషేకం చేశారు.అంతకన్నా దారుణం ఏమిటంటే ఆయన బావమరిది, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కటౌట్ కు పోటేళ్ల తలల దండ వేశారు. ధర్మవరంలో బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్, కొందరు టీడీపీ నేతల సమక్షంలోనే పొటేళ్లను నరికి వేడుక చేస్తుంటే ఇదే పోలీసులు వారికి కాపలాగా ఉన్నారు.అంతే తప్ప వీరెవ్వరిపైన కేసులు పెట్టలేదు. చంద్రబాబు మాటలలోని డొల్లతనం ఈ ఘటనలు తెలియచేయడం లేదా?నిందితులను పెరేడ్ చేయించకూడదని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి డీజీపీకి తెలియదా? లేక నిందితులను శిక్షించే హక్కు నేరుగా ఏమైనా రాజ్యాంగం ఇచ్చిందా? డీజీపీ అలా మాట్లాడితే కింది స్థాయి పోలీసులకు ఏమి సంకేతం ఇస్తున్నట్లు? అన్ని రంగాలలో విఫలమైన నేపథ్యంలో పోలీసులే కూటమి పెద్దలకు దిక్కయ్యారు.అందులో వీర విధేయతతో, రాజును మించిన రాజభక్తితో వ్యవహరించే కొంతమంది పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని అరాచకంగా నడుపుతున్నారు. ఇంత అనుభవం కలిగిన చంద్రబాబుకు ఈ పరిస్థితి అవమానకరం అని వేరే చెప్పనవసరం లేదు.పోలీసు అధికారులు చంద్రబాబు మాటకన్నా ఆయన కుమారుడు ,మంత్రి లోకేశ్ ఆదేశాలకే ఎక్కువ విలువ ఇస్తున్నారన్న భావన ప్రజలలోకి వెళ్లింది. ఇది చంద్రబాబుకు ఏపాటి ప్రతిష్టో ఆయనే ఆలోచించుకోవాలి. మరికొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఎవరో ఒక వ్యక్తి రఫ్ఫా, రఫ్ఫా అంటే తప్పన్నారు.ఒకే! అలాగే అనుకుందాం? మరి లోకేశ్ రడ్బుక్ అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కరెక్టా? దాని ప్రకారం పోలీసులను పని చేయించడం సరైనదేనా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాళ్లు విరగగొడతాం, కీళ్లు విరగగొడతాం, చేతులు అరగదీస్తాం అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడేందుకు ఏ చట్టం అనుమతి ఇస్తోంది? కూటమి అధికారంలోకి వచ్చాక ఎంతమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి? వారు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదే.పైగా బాధితులపైనే తప్పుడు కేసులు పెడుతూ అరెస్టులు చేస్తూ బెదిరిస్తున్నారే! వినుకొండలో రషీద్ అనే యువకుడిని టీడీపీ వారే నడిరోడ్డుపై నరికి చంపితే దానిని ఏమంటారు. కనీసం ప్రభుత్వం ఆ ఘటనను ఖండించిందా? అంతదాక ఎందుకు ! చంద్రబాబు ఇన్ని సుద్దులు చెబుతున్న సమయంలోనే నెల్లూరులో టీడీపీ కార్యకర్తలు కత్తులు పట్టుకుని రోడ్డుపై ప్రదర్శన చేశారే. వారిపై కేసులు పెట్టారా? రోడ్డుపై నడిపించి అవమానించారా? ఈ రెడ్‌బుక్ అండ చూసుకుని పోలీసులు పలు చోట్ల సామాన్య ప్రజలపై కూడా రెచ్చిపోతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పల్నాడులో సీఐ బెదిరింపులు భరించలేక ఓ ఆర్యవైశ్య మహిళ పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్య యత్నం చేసింది. ఇది మహిళలను కూటమి ప్రభుత్వం గౌరవిస్తున్న తీరా!పొదిలిలో ఒక వ్యాపారిపై పోలీసులు దాడి చేసి కొట్టడంపై ఆర్యవైశ్య సంఘం వారు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారే. సీపీఎం నాయకుడు అప్పలరాజు పై పిడి చట్టం పెట్టడంపై టీడీపీకి చెందిన కొందరు మేధావులు కూడా ఖండిస్తున్నారు. మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. గంజాయి వంటివి విచ్చలవిడిగా దొరుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయే! అనంతపురంతో సహా పలు చోట్ల భూ కబ్జాలపై వస్తున్న ఆరోపణల మాటేమిటి? ఇవి కాకుండా అనంతలో గన్ కల్చర్ కూడా పెరుగుతోందని వార్తలు సూచిస్తున్నాయి.తాడిపత్రిలో జేసీ ప్రభాకరరెడ్డి రాజ్యాంగం నడుస్తోందే! ఆయన పోలీసు అధికారులనే అవమానిస్తే నోరు విప్పలేకపోయిన వ్యవస్థ మనది. అమాయకులపై మాత్రం లాఠీ ఝళిపిస్తారా? థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? హోం మంత్రి అనిత వాటికి సమర్థన ఇవ్వడమా? నిందితులను నడిరోడ్డుపై నడిపించడం ఏదో గొప్ప విషయంగా ఆమె చెబుతారా? రేప్, హత్యల వంటి సీరియస్ నేరాలకు పాల్పడిన వారెవరికి ఇలా చేయలేదే? తెనాలిలో పోలీసుల ముగ్గురు దళితుల అరికాళ్లపై బహిరంగంగా కొట్టి అరాచకంగా ప్రవర్తించినా చర్య తీసుకోకపోగా, అది తప్పు కాదన్నట్లు మాట్లాడితే ఏపీ ప్రజలను కాపాడేదెవ్వరు? కదిరి వద్ద ఒక గర్భిణిపై వైసీపీ కార్యకర్త ఒకరు కాళ్లతో దాడి చేశారంటూ స్వయంగా హోం మంత్రే ఒక ఫేక్ వీడియోను ప్రదర్శించారట.ఈ విషయం సోషల్ మీడియాలో ప్రముఖంగా వచ్చింది. దానిని ప్రభుత్వం ఖండించలేకపోయింది. తీరా చూస్తే అతను జనసేన కార్యకర్త అని ఆ పార్టీ నాయకుడు చెప్పినా, అతని సోదరి తెలిపినా హోం మంత్రి మాత్రం అదే అసత్యాన్ని వల్లెవేసే యత్నం చేశారు. ఆ వ్యక్తిని పోలీసులు హింసించి నడిరోడ్డుపై నడిపించారు. ఒక వైపు ఫేక్ వీడియోలు, మరో వైపు ఫేక్ ఆరోపణలు, ఇంకో వైపు కక్షపూరితంగా ఏకపక్షంగా వైసీపీ వారిపై కేసులు,అరెస్టులు..ఇవన్ని ఈ ప్రభుత్వం ఎంత నీచంగా పనిచేస్తుంది తెలియచేస్తుంది తప్పమరొకటి కాదు.ఇలాంటి దుష్టచర్యలను ఉన్మాదం అంటారన్న సంగతి ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి.వైసిపివారిని ఎంత వేధిస్తే వారు అంతగా రాటు తేలుతున్నారన్న విషయం కూడా ప్రజలకు అర్ధం అవుతోంది.కేవలం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ అకృత్యాలకు ఎప్పుడో అప్పుడు చెక్ పడకుండా ఉంటుందా! -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కోనసీమ కలెక్టర్ మహేష్‌కు తప్పిన ప్రమాదం
సాక్షి, కోనసీమ: జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్‌కు ప్రమాదం తప్పింది. సంక్రాంతి పడవ పోటీల నేపథ్యంలో నిర్వహించిన ట్రయల్ రన్లో ఆయన పాల్గొనగా.. ప్రమాదవశాత్తూ కాలువలో పడిపోయారు. అయితే సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఆయన సురక్షితంగా ఒడ్డును చేరారు. ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి పడవ పోటీలు సందర్భంగా నిర్వహించిన ట్రయల్ రన్లో కలెక్టర్ మహేష్ కుమార్ స్వయంగా కయాకింగ్ నడిపారు. అయితే కాస్త దూరం వెళ్లాక అది అదుపు తప్పి ఒక్కసారిగా ఆయన, వెనకాల ఉన్న వ్యక్తి నీళ్లలో పడిపోయారు. లైఫ్ జాకెట్ ఉండడంతో ఇద్దరూ నీట మునగలేదు. వెంటనే గజ ఈతగాళ్లు, ఇతర సిబ్బంది స్పందించి ఆయన్ని బయటకు తీశారు. -
ఏపీలో ప్రభుత్వ పెద్దల మిస్సింగ్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆశ్చర్యకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్, ఇంకొందరు మంత్రులు గత కొన్ని రోజులుగా ప్రజలకు, మీడియాకు అందుబాటులో లేరు. నాలుగు రోజులుగా వీరి పర్యటనలపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడం ప్రజల్లో అనుమానాలు, ఆందోళనలు రేకెత్తిస్తోంది.కూటమి పార్టీల అనుకూల మీడియా వర్గాలు చంద్రబాబు విదేశాలకు వెళ్లారని చెబుతున్నప్పటికీ, ఆయన ఏ దేశంలో ఉన్నారు, ఎందుకు వెళ్లారు అనే విషయంపై అధికారికంగా టీడీపీ నోరు మెదపడం లేదు. ఇదే పరిస్థితి పవన్ కళ్యాణ్‌ది కూడా. ఉప ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారన్నది స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో చర్చలు మరింత వేడెక్కుతున్నాయి. ఇటు పవన్ కల్యాణ్ తన శాఖలకు సంబంధించిన ఏదో మొక్కుబడి ప్రకటన చేశారే తప్ప.. అధికార వర్గాలతో టచ్‌లో లేరని సమాచారం. అయితే అనూహ్యంగా ఆయన కొత్త సినిమా ప్రకటన మాత్రం చేశారు.వారం రోజుల క్రితమే నారా లోకేష్ కూడా గాయబ్ అయ్యారు. ఆయన కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదు. అఫ్కోర్స్.. ఇది మొదటి నుంచి ఉండేదే. అయితే ఇప్పుడు కొత్తగా.. ఇతర మంత్రులు కూడా ముఖ్య నేతల బాటలోనే అజ్ఞాతంగా వెళ్లిపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.ప్రభుత్వ పెద్దలు ఉన్నపళంగా రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో అనేక ససమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సమయంలో, ముఖ్య నేతలు కనిపించకపోవడం ప్రజలకు అసహనాన్ని కలిగిస్తోంది. మరోవైపు, ప్రభుత్వ పెద్దల పర్యటనలపై జారీ చేసిన జీవోలను కూడా రహస్యంగా ఉంచడం, అధికారిక ప్రకటనలు ఇవ్వకపోవడం అనుమానాలను మరింత పెంచుతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా.. ప్రజలకు సోషల్ మీడియాలో, పార్టీ తరఫున ప్రకటనల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు కూటమి పెద్దలు. అయితే ప్రభుత్వపరంగా.. పాలనాపరంగా ఈ ఏడాదికి సంబంధించిన కీలక సమీక్షల నిర్వహణ, నిర్ణయాలు తీసుకోవాల్సిన టైంలో ఉన్నపళంగా వాళ్లు రాష్టం నుంచి గాయబ్ కావడం హాట్ టాపిక్‌గా మారింది.వ్యక్తిగత జీవితాలను సమయం కేటాయించడం తప్పు కాకపోయినా.. దానికంటూ ఓ లిమిట్ ఉంటుందని కొందరు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఉన్నపళంగా ఒక్కసారిగా అంతా ఒక్కసారి మాయం కావడం వెనుక అసలు కారణం ఏమిటి, వారు ఎక్కడ ఉన్నారు అనే ప్రశ్నలకు సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు. -
భక్తులకు అలర్ట్.. శ్రీశైలంలో చిరుత కలకలం
సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైలంలో చిరుతపులి కలకలం సృష్టించింది. అర్ధరాత్రి ఓ ఇంటి ప్రాంగణంలో చిరుత సంచరించింది. పాతాళ గంగ మెట్ల మార్గంలోని ఓ ఇంటి ప్రాంగణంలోకి చిరుతపులి వచ్చింది. సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు రికార్డయ్యాయి. ఈవో శ్రీనివాసరావు, దేవస్థానం సిబ్బంది. అప్రమత్తమయ్యారు. పుణ్య స్నానాలకు వెళ్ళే భక్తులు, స్థానికులు జాగ్రత్తలు పాటించాలని మైకుల ద్వారా అధికారులు అనౌన్స్ చేయిస్తున్నారు.నల్లమలలో 87 పెద్ద పులులునల్లమల అడవుల్లో ప్రస్తుతం 87 పెద్దపులులు ఉన్నట్లు ఎన్ఎస్టీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు. మహానందిలోని అటవీ పర్యావరణ కేంద్రాన్ని గురువారం పునఃప్రారంభించారు. అలాగే శ్రీకామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామివారిని దర్శించుకొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..నల్లమలలో ప్రస్తుతం 87పెద్ద పులులు ఉండగా త్వరలో పులుల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు.మహానందిలోని అటవీ పర్యావరణ కేంద్రాన్ని గతంలో మహానందీశ్వరస్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు, పర్యాటకులు సందర్శించేవారని, అనివార్యకారణాలతో ప్రవేశం నిలిపేసినట్లు తెలిపారు. గురువారంనుంచి అందుబాటులోకి తెస్తున్నామన్నారు. పర్యాటకులు ఉచితంగా పర్యావరణ కేంద్రాన్ని సందర్శించవచ్చునన్నారు. అటవీ జంతువులపై అవగాహన కల్పించేలా చిత్రాలు ఏర్పాటు చేశామన్నారు. -
78 గంటలైనా నా భర్త జాడలేదు
శ్రీకాకుళం క్రైమ్ : నిమ్మాడ.. శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రివర్యులైన కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడుల స్వగ్రామం. ఇదే గ్రామానికి చెందిన కింజరాపు చంద్రకళ అనే వివాహిత తన భర్త కింజరాపు అప్పన్న ఈనెల 29 నుంచి కనపడటంలేదని, ఇద్దరు కానిస్టేబుళ్లు తీసుకెళ్లినట్లు తెలిసిందని, 78 గంటలైనా తన భర్త జాడలేదని, ఆయన ప్రాణానికి హాని ఉందని మీడియా ముందు కన్నీటిపర్యంతమైంది. ఏడాదిన్నరగా నిమ్మాడలోకి అడుగు పెట్టలేకపోతున్నామని, తెలుగుదేశం పార్టీ వాళ్లు రానీయడంలేదని ఆరోపించారు. ఇదే విషయమై జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న ఎస్పీ మహేశ్వరరెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినట్లు ఆమె గురువారం మీడియాకు వివరించారు. 29 నుంచి కనిపించడంలేదు.. గతనెల 29న మా కన్నవారి గ్రామమైన మెళియాపుట్టి మండలం కొసమాలలో కింజరాపు అప్పన్నను ఉ.8–10 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లారు. అప్పుడు నేను వైజాగ్‌లో ఉండటంతో తెలీలేదు. సాయంత్రం వచ్చేస్తున్నానని చెప్పేందుకు నా భర్తకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. కన్నవారింటికి వచ్చాక బైక్, హెల్మెట్ అయితే ఉందిగానీ భర్త లేడు. ఇదే విషయం అక్కడ కొందరిని అడగ్గా ఎవరో ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లారని చెప్పారు. ఆ తర్వాత నా భర్తకు చాలాసార్లు ఫోన్ చేశా. స్విచ్చాఫ్ రావడంతో అదేరోజు సా.6.30కు మెళియాపుట్టి స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశా.ఎఫ్ఐఆర్ రాయమంటే.. ‘డైరీలో రాసి రేపు 9 గంటలకు రండి.. ఈలోగా విచారణ చేసి కనుక్కొని చెబుతాం’ అని అన్నారు. అయితే, మర్నాడు ‘ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారు. రెండేళ్ల కిందట పనిచేసిన మెళియాపుట్టి కానిస్టేబుల్ చందు, మరొకతను తీసుకెళ్లారు’ అని స్థానికులు చెప్పారు. వెంటనే అక్కడి ఎస్ఐకు ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని అనడంతో బుధవారం మళ్లీ స్టేషన్‌కు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను. ఎస్ఐను అడిగితే.. తమ వాళ్లయితే తీసుకెళ్లలేదని, చందు ఎవరో తెలీదని, ఎస్పీ దగ్గరకు వెళ్లమన్నారు. దీంతో బుధవారం రాత్రి ఎస్పీని కలవడానికి శ్రీకాకుళం వచ్చా. ఆయన లేకపోవడంతో మళ్లీ గురువారం వచ్చి ఎస్పీని కలిశాను.టీడీపీ వాళ్లు నిమ్మాడకు రానీయడంలేదు.. ‘ఏడాదిన్నర నుంచి టీడీపీ వాళ్లు మమ్మల్ని నిమ్మాడ గ్రామంలో అడుగుపెట్టనీయడం లేదు. పొలం ఉన్నా.. సాగుచేయకుండా ఉండిపోయింది. అత్తయ్యకు పింఛను, మామయ్య రేషన్‌కార్డు తీసేశారు. మా చుట్టాలంతా బయటకెళ్లి బతుకుతున్నారు. మేం ఒడిశా వెళ్లిపోయాం. నా భర్తను ఎవరేం చేశారోనని భయంగా ఉంది. ప్రాణహాని ఉందని ఆ ఊరికి వెళ్లడంలేదు. ఇదంతా రాజకీయపరంగా ఎవరో చేస్తున్నారు. నా భర్త ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు. ఎవరినీ చంపలేదు, మోసంచేసి డబ్బులు, ఆస్తులు తీసుకోలేదు’ అని చంద్రకళ తెలిపింది. -
కూలీల కడుపుకొట్టిన బాబు సర్కారు!
సాక్షి, అమరావతి: కేంద్రం మంజూరు చేసిన సంఖ్య మేర ఉన్న కుటుంబాలకు ఉపాధి కల్పించకుండా గత ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం భారీగా ఉపాధి కూలీల పొట్టకొట్టింది. నోటిఫై చేసిన రోజువారీ కూలి కూడా ఇవ్వలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, నిర్మాణాత్మక బలహీనతలకు తోడు నిధుల దుర్వినియోగమేనని ఎస్బీఐ ఎకనమిక్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.⇒ 2024–25లో ఉపాధి హామీ కింద రాష్ట్రంలో 64.2 లక్షల కుటుంబాల ఉపాధి కల్పనకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. కానీ, చంద్రబాబు సర్కారు 46.9 లక్షల కుటుంబాలకు మాత్రమే ఉపాధి చూపింది. అంటే, 17.3 లక్షల కూలీల కుటుంబాలకు నష్టం వాటిల్లింది.⇒ దేశంలో చాలా రాష్ట్రాలు గత ఆర్థిక సంవత్సరం ఉపాధి కూలీల రోజువారీ వేతనం నోటిఫై (నిర్దేశిత) చేసిన మేరకు చెల్లించినా, ఏపీ దానిని పాటించలేదు. రోజువారీ కూలి రూ.300 నోటిఫై చేయగా రూ.256 చొప్పున మాత్రమే చెల్లించింది. ఒక్కో కూలీకి రూ.44 మేర చూస్తే 46.9 లక్షల కుటుంబాలకు తక్కువ చెల్లించింది.⇒ ఓపక్క కేంద్రం మంజూరు చేసిన మేర ఉపాధి కల్పించకుండా 17.3 లక్షల కుటుంబాలకు నష్టం చేకూర్చిన బాబు సర్కారు మరోపక్క నోటిఫై చేసిన రోజువారీ వేతనం ఇవ్వకుండా కష్టార్జితాన్ని దోపిడీ చేసిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.⇒ ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో (2025–26) రోజువారీ ఉపాధి హామీ కూలిని రూ.307గా నోటిఫై చేశారు. డిసెంబర్ 29 వరకు డేటాను విశ్లేషిస్తే ఒక్కో కూలీకి రూ.268 మాత్రమే చెల్లించారు. నిర్దేశిత మొత్తానికి ఇది రూ.39 తక్కువ. దీనివల్ల 41 లక్షల కుటుంబాల శ్రమదోపిడీ చేసినట్లైంది. -
నాడు రూ.16.. నేడు రూ.20
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ వినియోగదారులను నిలువునా దోచుకుంటోంది. ఒకవైపు మార్కెట్లో నిత్యావసర సరకుల రేట్లు ఆకాశాన్ని తాకుతుంటే చోద్యం చూస్తూ... మరోవైపు రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే సరకుల రేట్లు మాత్రం అమాంతం పెంచేస్తోంది. జాతీయ ఆహార భద్రత చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ పేద ప్రజలపై భారం మోపుతోంది. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థ గాడితప్పింది. రాగులు, జొన్నలు, గోధుమ పిండి పంపిణీని అటకెక్కించింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే బియ్యం నాణ్యతకు పాతరేసింది. ఇప్పుడు పండగల వేళ ప్రజలను మభ్యపెట్టేందుకు పాత పంపిణీలనే కొత్తగా చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తోంది. వైఎస్సార్ సీపీ హయాంలో తొలిసారిగా ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని పంపిణీ చేయగా... అధికారంలోకి వచ్చాక దానిని చంద్రబాబు కక్షపూరితంగా నిలిపివేసి... ఏడాదిన్నర తర్వాత రేటు పెంచి మళ్లీ పంపిణీ ప్రారంభిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. కిలోకి రూ.4 చొప్పున పెంచేసి... వైఎస్సార్సీపీ హయాంలో పేదలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో రాగులు, జొన్నల పంపిణీతోపాటు ఫోర్టీఫైడ్ గోధుమ పిండిని అందించారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బియ్యానికి బదులుగా ఉచితంగా రాగులు, జొన్నలు ఇచ్చేలా ఒప్పించారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎఫ్‌సీఐ నుంచి గోధుమలు సేకరించి వాటిని మరాడించి, ఫోర్టీఫైడ్ చేసి నాణ్యమైన ప్యాకింగ్‌లో కిలో రూ.16కే లబి్ధదారుల ఇంటి వద్దకే చేర్చారు. కానీ ఏడాదిన్నరగా ఆ గోధుమ పిండి పంపిణీని నిలిపివేసిన చంద్రబాబు ప్రభుత్వం ఈ జనవరి నుంచి కిలో రూ.20కి ఇస్తున్నట్టు ప్రకటించి అభాసుపాలైంది. ఎందుకంటే అప్పట్లో భారత్ బ్రాండ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం స్వయంగా కిలో ప్యాకెట్‌ను రూ.27.50కి వినియోగదారులకు ఇస్తే.. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాత్రం కిలో రూ.16కే అందించి ప్రజల మన్ననలు పొందింది. ఇప్పుడు అదే గోధుమ పిండి ప్యాకెట్‌కు ఏకంగా రూ.4 అదనంగా చంద్రబాబు దండుకోవడం విస్తుగొలుపుతోంది. అరకొర పంపిణీకే హడావిడి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నెలకు 1,839 టన్నుల గోధుమలను అందిస్తోంది. వాటిని మరాడిస్తే 1,690 టన్నుల పిండి వస్తుంది. ఈ పిండినే కిలో ప్యాకెట్లలో నింపి ప్రజలకు పంపిణీ చేయనున్నారు. వాస్తవానికి ఏపీలో 1.48 కోట్ల రైస్ కార్డులున్నాయి. వీళ్లందరికీ కిలో గోధుమ పిండి అందించాలంటే నెలకు 15 వేల టన్నులు అవసరం. అలాంటిది నెలకు కేవలం 1690 టన్నులు మాత్రమే సరఫరా చేస్తుండడం... అది కూడా జిల్లా కేంద్రాల్లో మాత్రమే ఇస్తుండటం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది.బినామీల కోసమే రేటు పెంచేసి..చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి స్కీము సరికొత్త స్కామ్‌ను తలపిస్తోంది. ఇందుకు ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా వదలట్లేదు. ప్రభుత్వం ఎఫ్‌సీఐ నుంచి కిలో గోధుమలు రూ.6.10కి కొనుగోలు చేస్తోంది. వాటిని మరాడించి... ఆ పిండిని కిలో చొప్పున ప్యాకింగ్ చేసి, ఎంఎల్ఎస్ పాయింట్లకు చేర్చి రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు రూ.20కు ఇస్తోంది. వాస్తవానికి నవంబర్ 5న సాక్షాత్తూ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కిలో గోధుమ పిండిని రూ.18కి ఇస్తున్నట్టు మీడియా సమక్షంలో ప్రకటించారు. అయితే, ప్రభుత్వం మాత్రం డిసెంబర్ 24 ఇచ్చిన జీవోలో కిలో గోధుమ పిండి రేటును రూ.20గా పేర్కొంది.ఇంతలోనే అంత వ్యత్యాసం రావడం వెనుక బినామీలు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో కేవలం రూ.16కు అందించిన గోధుమ పిండి ఇప్పుడు ఏకంగా రూ.20కి చేరుకుంది. అప్పుడు.. ఇప్పుడూ రేషన్ దుకాణ డీలర్ కమిషన్ రూపాయిగానే ఉంది. కానీ ప్రజలపై మాత్రం భారం మోపుతోంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీకి మిల్లింగ్, ప్యాకింగ్ కాంట్రాక్టు అప్పగించారు. ఆ ఏజెన్సీ తమ దగ్గర ఎంప్యానల్ అయిన కంపెనీలకు మాత్రమే మిల్లింగ్, ప్యాకింగ్ బాధ్యతలు ఇచ్చింది.ఇందులో విచిత్రం ఏమంటే.. చంద్రబాబు బినామీ, మంత్రి వియ్యంకుడికి చెందిన కాకినాడ జిల్లాలోని ఓ కంపెనీకి గోధుమ పిండి మిల్లింగ్, ప్యాకింగ్ కాంట్రాక్టు దక్కింది. సదరు కంపెనీ సరఫరా విధానంలో గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. వాటిని పక్కన పెట్టిన సర్కార్ నోడల్ ఏజెన్సీ ద్వారా అనుకున్నది చేసింది. ఇక్కడ ఎంప్యానల్ చేసిన మిల్లుల కంటే బహిరంగంగా టెండర్ పిలిస్తే పోటీ పెరిగి మిల్లింగ్, ప్యాకింగ్ ధర తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. -
కొండవీటి వాగు ఎత్తిపోతల్లో రూ.150 కోట్ల అవినీతి వరద
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతికి కొండవీటి వాగు వరద ముప్పు తప్పించేందుకు, ఉండవల్లి వద్ద ఆ వాగు నుంచి 8,400 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీలోకి మళ్లించేలా ప్రభుత్వం చేపట్టిన ఎత్తిపోతల పనుల్లో భారీ అవినీతి చోటుచేసుకుంది. ఈ ఎత్తిపోతల పనులకు రూ.423.64 కోట్ల విలువతో నవంబర్ 14న అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో కాంట్రాక్టు విలువ కంటే రూ.4.75 శాతం అధిక ధర... రూ.443.76 కోట్లకు కోట్ చేసిన మేఘా సంస్థకు పనులను అప్పగించేందుకు సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ), రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపాయి.ఈ మేరకు పనులను మేఘాకు అప్పగిస్తూ గురువారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు పనుల కేటాయింపుతో ఖజానాపై రూ.20.12 కోట్ల భారం పడింది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.79.42 కోట్లను కాంట్రాక్టర్‌కు రీయింబర్స్ చేస్తామని ఏడీసీఎల్ పేర్కొంది. అంటే, కాంట్రాక్టు విలువ రూ.523.18 కోట్లకు చేరుకుంది.5 వేల క్యూసెక్కుల ఎత్తిపోతకు రూ.222.44 కోట్లుకొండవీటి వాగు నుంచి రోజుకు 5 వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీలోకి మళ్లించేందుకు ఉండవల్లి వద్ద 2017–18లో రూ.222.44 కోట్లతో ప్రభుత్వం ఎత్తిపోతలను పూర్తి చేసింది. వీటిని మేఘా సంస్థనే చేపట్టింది. నాటితో పోల్చితే ఎత్తిపోతల పనుల్లో వినియోగించే స్టీల్, సిమెంటు, పంప్‌లు, మోటార్లు, విద్యుత్ ఉపకరణాలు తదితరాల ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. కానీ, ప్రస్తుతం 8,400 క్యూసెక్కులను ఎత్తిపోసే పనులను రూ.523.18 కోట్లకు మేఘా సంస్థకే ప్రభుత్వం కట్టబెట్టింది. కాగా, దీని వ్యయం రూ.360 కోట్ల నుంచి రూ.380 కోట్లకు మించే అవకాశం లేదని, అంచనాల దశలోనే రూ.100 కోట్ల నుంచి రూ.130 కోట్ల మేర భారీగా అక్రమాలు జరిగాయని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు కట్టబెట్టడం వల్ల కాంట్రాక్టర్‌కు ప్రయోజనం చేకూర్చారని.. ఆ మేరకు ఖజానాకు నష్టం కలిగిందంటున్నారు.జ్యుడీషియల్ ప్రివ్యూ–రివర్స్ టెండరింగ్ ఉండి ఉంటే..!జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానంతో టెండర్ల వ్యవస్థకు 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీవం పోసింది. చంద్రబాబు సర్కార్ వచ్చిన వెంటనే వీటిని రద్దు చేసింది. 2014–19 తరహాలోనే టెండర్ల వ్యవస్థను నీరుగార్చింది. మొబిలైజేషన్ అడ్వాన్సు పద్ధతిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేస్తే చంద్రబాబు సర్కార్ పునరుద్ధరించింది. ఒకవేళ జ్యుడీషియల్ ప్రివ్యూ ఇప్పుడు అమల్లో ఉన్నట్లైతే... టెండర్ నోటిఫికేషన్‌కు ముందే ఆ ప్రతిపాదనలోని తప్పులను ఇంజినీరింగ్ నిపుణులు, మేధావులు నుంచి సాధారణ ప్రజల వరకు ఎత్తిచూపే అవకాశం ఉండేది. వాటిని పరిగణనలోకి తీసుకుని అంచనా వ్యయాన్ని సరి చేయాలని ఏడీసీఎల్ అధికారులను జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి ఆదేశించి ఉండేవారు అని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.⇒ రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఉంటే కాంట్రాక్టు విలువ కంటే 5 శాతం తక్కువకే పనులు చేయడానికి కాంట్రాక్టర్ ముందుకొచ్చేవారని, ఖజానాకు కనీసం రూ.20 కోట్లు ఆదా అయ్యేదని నిపుణులు వివరిస్తున్నారు. వీటిని లెక్కలోకి తీసుకుంటే ఎత్తిపోతల పనుల్లో రూ.150 కోట్ల మేర అవినీతి చోటుచేసుకుందని, దాన్ని కాంట్రాక్టర్‌తో కలిసి ముఖ్య నేత నీకింత, నాకింత అంటూ పంచుకు తినేందుకు సిద్ధమయ్యారని ఆరోపిస్తున్నారు. -
ఏపీలో అత్యంత దారుణంగా 108 సేవలు
ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు చంద్రబాబు సర్కారు ఉరి వేస్తోంది! కుయ్ కుయ్ మూగబోతోంది..! నిమిషాల వ్యవధిలో చేరుకోవాల్సిన అంబులెన్సుల జాడ లేక ప్రజల ప్రాణాలు పోతున్నాయ్! 108 సేవల నిర్వహణలో తీవ్ర అలక్ష్యం, ప్రభుత్వ అసమర్థతతో రోడ్డు ప్రమాదాల క్షతగాత్రుల నుంచి అనారోగ్య బాధితులు, నిండు గర్భిణులు దాకా బలైపోతున్నారు! 108 రాకపోవడంతో గర్భిణులు ఆటోలను ఆశ్రయిస్తుండటం.. సకాలంలో వైద్యం అందక ఆటోలోనే పసిగుడ్డు ప్రాణాలు విడవడం.. రోడ్డుపై రయ్ రయ్‌మంటూ పరుగులు తీయాల్సిన ఆపద్బాంధవి నిస్సహాయంగా షెడ్లకే పరిమితం కావడం.. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఓ క్షతగాత్రుడు నడిరోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సర్వత్రా అలజడి రేగుతోంది. ఈ నేపథ్యంలో 108 సేవల తీరును ‘సాక్షి’ బృందం రాష్ట్రవ్యాప్తంగా పరిశీలించగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిరుపయోగంగా మారిన 108వాహనాలు శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన ఓ ద్విచక్రవాహనదారుడి ప్రాణాలను కాపాడేందుకు 108 కోసం కాల్ చేస్తే ఎంతసేపైనా రాలేదు. చివరకు అంబులెన్స్ కోసం ఎదురు చూస్తూ.. విలవిల్లాడుతూ క్షతగాత్రుడు నడిరోడ్డుపైనే ప్రాణాలు విడిచాడు. రణస్థలం జాతీయ రహదారి–16పై బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో 108 సేవల నెట్వర్క్ నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో చెప్పేందుకు నిదర్శనం.‘ఊపిరి’ ఆగుతోంది..! పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన అబ్బూరి శ్రీనివాసరావు ఇటీవల ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా త్రిపురాపురం వద్ద ట్రిప్పర్ ఢీకొని గాయాలపాలయ్యాడు. 108 కోసం ఫోన్ చేయగా 20 నిమిషాలు గడిచినా రాకపోవడంతో ప్రైవేట్ వాహనంలో వైద్యశాలకు తరలించారు. ఇక్కడ రెండు మండలాలకు ఒకే వాహనం ఉంది. పల్నాడు జిల్లాలోనే జలాల్‌పురంలో ఇటీవల మరియమ్మ అనే మహిళకు ఊపిరి అందకపోవటంతో మెరుగైన వైద్యం కోసం సీహెచ్‌సీ నుంచి 108లో గుంటూరు తరలించారు. తిరుగు ప్రయాణంలో బ్యాటరీ చార్జింగ్ లేక వాహనం మొరాయించడంతో రోగి కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ గార్డులు తోయాల్సి వచ్చింది. ఏలూరు జిల్లాలో పాత అంబులెన్స్‌లకు రంగులేసి నడిపిస్తున్నారు. అవి ఎప్పుడు మొరాయిస్తాయో చెప్పలేని దుస్థితి.ఏలూరు జీజీహెచ్‌లో మూలపడి ఉన్న 108 వాహనాలు పయ్యావుల ఇలాకాలో ‘హ్యాండ్సప్’.. అనంతపురం జిల్లాలో 108 సేవలు అస్తవ్యస్థంగా మారాయి. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండలో ఇతర ప్రాంతాలకు చెందిన వాటిని బ్యాకప్‌గా వినియోగిస్తున్నారు. ఉరవకొండ వాహనం పాడవడంతో గుంటూరులో షెడ్డుకు పరిమితమైంది. రాయదుర్గం, డి.హీరేహాళ్, కణేకల్లు బేసిక్ లైఫ్ సపోర్ట్ వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్న అనంతపురం జిల్లాలో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ వాహనాలు అత్యంత కీలకం. కానీ ఇవి మరమ్మతులకు గురవుతున్నాయి. బెడ్డు వద్దకు కాదు.. షెడ్డుకే! వైఎస్సార్ కడప జిల్లా చింతకొమ్మదిన్న మండలంలో ఇటీవల స్పృహ కోల్పోయిన ఓ వ్యక్తిని కాపాడాలని కాల్ సెంటర్‌కు సమాచారం ఇవ్వగా ‘108 వాహనం మరో చోటకు వెళ్లింది. కడపలో వాహనాలు అందుబాటులో లేవు. మరమ్మతులకు గురైన వాహనాలను పాత రిమ్స్‌లో షెడ్డుకు తరలించారు. చెన్నూరు మండలం నుంచి 108 రావడానికి దాదాపు గంట పడుతోంది. వచ్చే వరకు వేచి చూడాలి. లేదంటే ఆటో తీసుకొని కడపలో ఆస్పత్రికి వెళ్లాలి’ అని సిబ్బంది సలహా ఇచ్చారు. రోగిని తరలిస్తుండగా పేలిన టైరు.. నంద్యాల జిల్లాలో కొద్ది రోజుల క్రితం బిల్లా బక్కన్న అనే వృద్ధుడిని 108లో తరలిస్తుండగా బండి ఆత్మకూరు వద్దకు చేరుకోగానే వాహనం టైర్ పేలి రోడ్డు మీద ఆగిపోయింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టైర్లు, బ్యాటరీల సమస్యలతో పలు వాహనాలు షెడ్డుకు పరిమితమయ్యాయి. దయచేసి వేచి ఉండండి...! విజయవాడ సిటీ పరిధిలో కాల్ చేసిన 18 నిమిషాల్లో రావాల్సిన 108 వాహనం దాదాపు అరగంటకుగానీ చేరుకోవడం లేదు. నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు లాంటి దూర ప్రాంతాల నుంచి రిఫర్ కేసులను విజయవాడకు తీసుకొస్తుంటారు. అలాంటి సమయంలో ఫోన్ చేస్తే రావడానికి మరో వాహనం అందుబాటులో ఉండటం లేదు. కృష్ణా జిల్లాలో పూర్తిగా పనికిరాని (కండెమ్) 108 వాహనాన్ని జీజీహెచ్ ఆవరణలో ఉంచారు. ప్రైవేట్ సేవలకు వేలకు వేలు.. చిత్తూరు జిల్లాలో 108 వాహనాలు మొరాయిస్తున్నాయి. అరిగిన టైర్లతో దర్శనమిస్తున్నాయి. కొన్నింటి సైరన్ కూడా పని చేయడంలేదు. ఆపదలో పది మందికి సాయపడాల్సిన 108.. నలుగురు తోస్తేగానీ కదలని దుస్థితి. పల్లెల్లో 108 సేవలు అరుదుగా మారాయి. ప్రసవం కోసం ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. చిత్తూరు నుంచి తమిళనాడులోని వేలూరుకు (30 కి.మీ) ప్రైవేటు అంబులెన్స్‌లో వెళ్లాలంటే కనీసం రూ.5 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుపతి జిల్లాలో తరచూ 18 వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి. రోజూ 8 నుంచి 10 వాహనాలు షెడ్లకే చేరుతున్నాయి.అనుభవం లేని అస్మదీయ సంస్థ వల్లే ఈ దుస్థితి అంతర్జాతీయంగా పేరుగాంచిన, వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న ప్రముఖ సంస్థలను కాదని అస్మదీయ సంస్థకు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా 108, 104 నిర్వహణ కాంట్రాక్టు కట్టబెట్టడమే ఈ దుస్థితికి కారణమని స్పష్టమవుతోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని లాభాపేక్ష లేకుండా సేవా దృక్ఫథంతో ముందుకొస్తున్న, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన సంస్థలను పక్కనపెట్టి.. టీడీపీ డాక్టర్స్ విభాగంలోని పవన్‌కు చెందిన ‘భవ్య’ అనే ఎలాంటి అనుభవం లేని సంస్థకు ఈ కాంట్రాక్టును అప్పగించింది. ప్రజల ప్రాణ, ఆరోగ్య రక్షణ కోసం తీసుకొచ్చిన వీటి నిర్వహణపై ఇంత నిర్లక్ష్యం క్షమార్హం కాదని ప్రజలు మండిపడుతున్నారు. గతేడాది చంద్రబాబు ప్రభుత్వం రాగానే అప్పటి వరకు బాగా పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు పొగపెట్టారు. గడువు ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లే పనులు వదులుకుని వెళ్లిపోయేలా వేధింపులకు దిగారు. దీంతో 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ), 108 నిర్వహణ కాలపరిమితి 2027 వరకూ ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ ఎంవోయూను రద్దు చేసుకున్నారు. అనంతరం భవ్య హెల్త్ సర్వీసెస్‌కు ఈ కాంట్రాక్ట్‌ను కట్టబెట్టడం కోసం పక్కా ప్రణాళికతో నిబంధనలు రూపొందించి టెండర్ పిలిచారు. ఈ సంస్థకు అత్యవసర వైద్య సేవల నిర్వహణలో అనుభవం లేకపోవడంతో ఏకంగా నిబంధనలే మార్చేయడం గమనార్హం. – సాక్షి నెట్వర్క్ -
దోపిడీ ‘అంచనా’!
సాక్షి, అమరావతి : రాజధాని నిర్మాణానికి సమీకరణ (పూలింగ్) కింద భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన నివాస (రెసిడెన్షియల్), వాణిజ్య (కమర్షియల్) ప్లాట్లు ఇచ్చే మాటేమో గానీ... లే అవుట్ పనుల టెండర్లలో కాంట్రాక్టర్లతో కలిసి ముఖ్య నేత భారీఎత్తున దోచుకుంటున్నారని ఇంజినీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు. జోన్–8 (కృష్ణాయపాలెం, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి) లేఅవుట్ అభివృద్ధి పనుల అంచనాలను ప్రతిపాదన దశలోనే భారీగా పెంచేయడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. ఈ లేఅవుట్ అభివృద్ధికి ఎకరానికి సగటున రూ.2 కోట్ల మేర వ్యయం చేస్తున్నారని... దేశ చరిత్రలో ఇది ఎక్కడా లేదని ఎత్తిచూపుతున్నారు. ⇒ రహదారులు, డ్రెయిన్లు, తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్, ఇంటర్నెట్ కేబుల్ వంటి వాటికి యుటిలిటీ డక్ట్లు, మురుగు శుద్ధి కేంద్రాలు, శుద్ధి చేసిన నీటిని పునర్ వినియోగించేందుకు పైప్‌లైన్, రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి పనులకు రూ.1305.39 కోట్ల వ్యయంతో నవంబర్ 14న అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీఎసీఎల్) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.వీటిని 4.03 శాతం అధిక ధర... రూ.1,358 కోట్లకు కోట్ చేసిన మేఘా సంస్థకు అప్పగించడానికి సీఆర్డీఏ, కేబినెట్ ఆమోదం తెలిపాయి. ఆ మేరకు ఏడీసీఎల్‌కు అనుమతి ఇస్తూ గురువారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల ఖజానాపై రూ.52.61 కోట్ల భారం పడనుండగా ఆ మేరకు కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూరనుంది. ఇక జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.277.85 కోట్లను రీయింబర్స్ చేస్తామని ఏడీసీఎల్ పేర్కొంది. తద్వారా కాంట్రాక్టు విలువ రూ.1,635.85 కోట్లకు చేరనుంది.జ్యుడీషియల్ ప్రివ్యూ ఉండి ఉంటే...రాజధాని జోన్–8 లేఅవుట్ అభివృద్ధి పనులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఉంటే కనీసం 5 శాతం తక్కువ ధరకు పనులు చేయడానికి కాంట్రాక్టర్ ముందుకొచ్చేవారని, ఖజానాకు రూ.వంద కోట్లు ఆదా అయ్యేవని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక జ్యుడీషియల్ ప్రివ్యూ విధానం అమల్లో ఉండి ఉంటే... టెండర్ నోటిఫికేషన్ జారీకి ముందే అక్రమాలు వెలుగులోకి వచ్చేవని, తద్వారా అంచనా వ్యయం తగ్గేదని చెబుతున్నారు. ప్రజాధనం భారీగా ఆదా అయ్యేదని స్పష్టం చేస్తున్నారు.మొబిలైజేషన్ అడ్వాన్సులో నీకింత నాకింతకాంట్రాక్టర్కు రూ.1,358 కోట్లకు పనులను అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. ఆ మేరకు ఏడీసీఎల్ ఒప్పందం చేసుకోనుంది. ఆ వెంటనే కాంట్రాక్టు విలువలో పదిశాతం రూ.135.80 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సు కింద ముట్టజెప్పనుంది. ఇందులో 8 శాతం ముఖ్య నేత తొలి విడత కమీషన్ల రూపంలో వసూలు చేసుకుంటారనే ఆరోపణలు వస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రాజధాని నిర్మాణానికి అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులను కాంట్రాక్టర్‌కు దోచిపెట్టి నీకింత నాకింత అంటూ పంచుకుతినడాన్ని ముఖ్య నేత యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని ఇంజినీరింగ్ నిపుణులు, ప్రజాసంఘాలు, మేధావులు ఆరోపిస్తున్నారు. -
ఆర్టీసీలో ‘విధి’ వంచన
తిరుపతి అర్బన్: కొత్త సంవత్సరం నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు డ్యూటీకి డుమ్మా కొట్టారు. అధికారపార్టీనేతల సేవలో తరించారు. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుపతి బస్టాండ్‌లో కొత్త సంవత్సరం వేళ రద్దీ అధికంగా ఉంటుంది. సాధారణ సమయంలోనే తిరుపతికి రోజుకు 1.50లక్షల మందికి పైగానే రాకపోకలు సాగిస్తుంటారు. దీనికితోడు 30వ తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా పోటెత్తిన భక్తులు తిరుగుపయనం నేపథ్యంలో రద్దీ మరింత పెరిగింది. జనవరి 1 సందర్భంగా గురువారం పలువురు కండక్టర్లు, డ్రైవర్లు అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను కలవాలంటూ డ్యూటీలకు డుమ్మా కొట్టారు. దీంతో అధికారులు పలు బస్సులను నిలిపివేశారు. ప్రధానంగా కాణిపాకం మార్గంలో నడుస్తున్న 8 బస్సులను రద్దుచేశారు.ఇంకా పలుమార్గాల్లోని బస్సులను నిలిపివేశారు. ఇప్పటికే బస్సుల కొరతతో ఇబ్బంది పడుతుండడంతో ఉన్న బస్సులూ సిబ్బంది సెలవులతో రద్దు కావడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. బస్టాండ్‌లో గంటల తరబడి నిరీక్షించారు. 10 నుంచి 15శాతం మంది ఉద్యోగులు డ్యూటీకి గైర్హాజరైనట్టు సమాచారం. కొందరు ఉద్యోగ సంఘం నేతలు పదేపదే అధికార పార్టీ నేతల అండదండలతో డ్యూటీలకు డుమ్మాలు కొడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా అధికారులు ప్రశి్నస్తే వెంటనే అధికార పార్టీ నేతల నుంచి ఫోన్లు చేయిస్తున్నారంటూ ఆర్టీసీ అధికారులు బాహాటంగానే చెబుతున్నారు.సిబ్బంది కొరత సమాచారాన్ని తెలుసుకున్న జిల్లా ప్రజా రవాణా అధికారి జగదీష్, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ విశ్వనాధం, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ నిర్మల గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బస్టాండ్‌లోనే ఉండి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడపడానికి పడరానిపాట్లు పడ్డారు. కొంతమందికి ఫోన్లు చేసి డ్యూటీకి రావాలని బతిమాలి మరీ పిలిపించినట్టు తెలిసింది. కొందరు ఉద్యోగులు రాజకీయ నేతలతో అధికారులకు ఫోన్లు చేయించినట్టు సమాచారం. దీంతో ఏం చేయాలో పాలుపోక అధికారులు ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది. ఉదయం నుంచి చాలా బస్సు సర్విసులను నిలిపివేశారని, అడిగినా బస్టాండ్‌లో పట్టించుకునేవారే లేరని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కేవలం కాణిపాకం మార్గంలో నడుస్తున్న 8 బస్సులను మాత్రమే నిలిపివేసినట్టు తిరుపతి డిపో మేనేజర్ సురేంద్రకుమార్ తెలిపారు. ఇదిలాఉంటే సెలవు ఇవ్వకపోయినా విధులు ఎగ్గొట్టిన సిబ్బందిపై విచారణ చేపట్టినట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి జగదీష్ తెలిపారు. -
నూతన సంవత్సర సంబరాల్లో విషాదం
అనంతపురం సెంట్రల్, సఖినేటిపల్లి, పుట్టపర్తి అర్బన్: నూతన సంవత్సర సంబరాలు పలువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. రాష్ట్రంలో పలుచోట్ల అపశ్రుతులు చోటు చేసుకోవడంతో కొందరు ప్రాణాలు విడిచారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సాగర సంగమం వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కాకినాడ నుంచి నిమ్మకాయల శ్రీధర్(35), నందమూరి వెంకట సాయినాథ్ గోపీకృష్ణ, బొండాడ సూర్యకిరణ్ అంతర్వేదికి బుధవారం రాత్రి చేరుకున్నారు. బీచ్‌కు సమీపంలో రూమ్ తీసుకున్నారు.అర్ధరాత్రి దాటాక రూంలో సూర్యకిరణ్ ఉండిపోగా, శ్రీధర్, గోపీకృష్ణ కారులో బయలుదేరి బీచ్ వెంబడి డ్రైవ్ చేస్తూ సాగరసంగమం వైపుకు వెళ్లారు. లైట్‌హౌస్ సమీపానికి వెళ్లే సరికి అక్కడున్న ఒడుపును వారు గుర్తించలేకపోయారు. అదే సమయంలో కారు అదుపు తప్పడంతో సంగమం వద్ద వేగంగా నీళ్లలోకి దూసుకుపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన గోపీకృష్ణ కారులోంచి దూకేయడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. డ్రైవర్ సీటులో ఉన్న శ్రీధర్ కారుతో సహా గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం శ్రీధర్ మృతదేహం లభ్యమైంది. సెల్ఫీ తీసుకుంటూ.. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం చెర్లోపల్లిలో సెల్ఫీ తీసుకుంటూ మిద్దెపై నుంచి కింద పడి యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన కాడాల తరుణ్‌కుమార్ రెడ్డి(17) మిత్రుడితో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బుధవారం రాత్రి 12 గంటల అనంతరం మిద్దెపైకి వెళ్లారు. అక్కడ సెల్ఫీ తీసుకుంటుండగా తరుణ్‌కుమార్ రెడ్డి కింద పడ్డాడు. తీవ్ర గాయాలైన అతన్ని పుట్టపర్తిలోని సత్యసాయి జనరల్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. తరుణ్‌కుమార్ రెడ్డి ఇంటర్ పూర్తి చేశాడు. కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.బీరు సీసాలతో దాడులు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అనంతపురంలో మద్యం మత్తులో యువకులు చెలరేగి బీరు సీసాలతో దాడి చేయడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డులోని ముత్యాలమ్మ గుడి వద్ద నివాసముంటున్న దినేష్, కళ్యాణ్.. అక్కడికి సమీపంలోని ఓ బేకరీలో పనిచేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో వీరిపై గుర్తు తెలియని యువకులు మద్యం మత్తులో బీరు సీసాలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన యువకులను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు సంయుక్తంగా కేసును విచారిస్తున్నారు. -
ఒక్క రోజే 5.13 లక్షల లడ్డూల విక్రయం
తిరుమల: గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేని విధంగా గత నెల 27న అత్యధికంగా 5.13 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేసినట్లు టీటీడీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. టీటీడీ గతేడాదిగా ప్రతిరోజూ 4 లక్షల వరకూ లడ్డూలను తయారు చేస్తోంది.ముఖ్యమైన రోజుల్లో 8 లక్షల నుంచి 10 లక్షల లడ్డూల వరకు (బఫర్) భక్తులకు అందుబాటులో ఉంచుతోంది. అలాగే, 2024తో పోల్చితే 10% అధికంగా లడ్డూలను విక్రయించినట్లు పేర్కొంది. 2024లో 12.15 కోట్ల లడ్డూలను విక్రయించగా 2025లో 13.52 కోట్ల లడ్డూలను టీటీడీ విక్రయించినట్లు తెలిపింది. -
సంపద సృష్టి లేదాయే .. ఉన్నదీ ఆవిరాయే
సాక్షి, అమరావతి: సంపద సృష్టించి.. రెట్టింపు సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటూ ప్రగల్భాలు పలికి అధికారం చేపట్టిన చంద్రబాబు.. కొత్తగా సంపద సృష్టించగా పోగా ఉన్నదాన్ని కూడా ఆవిరి చేసేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన జీఎస్టీ గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలానికి జీఎస్టీ ఆదాయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ.1,785 కోట్లు పడిపోయింది.2024–25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లో రూ.33,371 కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం ఈ ఏడాది 5.34 శాతం తగ్గి రూ.31,586 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం 6.8 శాతం పెరగడం గమనార్హం. ఈ 9 నెలల కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక 13.1 శాతం, తమిళనాడు 8.1 శాతం, కేరళ 8.4 శాతం, తెలంగాణ 5.1 శాతం వృద్ధిని నమోదు చేశాయి.నెలనెలా తగ్గుతున్న ఆదాయంరాష్ట్ర జీఎస్టీ ఆదాయం ప్రతినెలా తగ్గుతూ వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ నెలలో రూ.4,686 కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం క్రమంగా తగ్గుతూ డిసెంబర్ నాటికి రూ.3,137 కోట్లకు పడిపోయింది. గతేడాది డిసెంబర్ నెలలో జీఎస్టీ ఆదాయం భారీగా తగ్గిపోవడం.. ఈ ఏడాది డిసెంబర్ నెలలో 6 శాతం వృద్ధి నమోదు కావడానికి కారణంగా అధికారులు వెల్లడిస్తున్నారు.చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. డిసెంబర్ 2023 డిసెంబర్లో రూ.3,545 కోట్లుగా ఉన్న స్థూల జీఎస్టీ ఆదాయం డిసెంబర్ 2025 నాటికి రూ.3,137 కోట్లకు పడిపోయింది. రెడ్‌బుక్ రాజ్యాంగంపై దృష్టి సారించిన ప్రభుత్వం అభివృద్ధికి తిలోదకాలు ఇవ్వడంతో పాటు సంక్షేమ పథకాలను అటకెక్కించింది. ఫలితంగా ప్రజల ఆదాయం క్షీణించి కొనుగోలు శక్తి పడిపోయింది. జీఎస్టీ రాబడి తగ్గడానికి ఇదే ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. -
చంద్రబాబు ప్రభుత్వంలోనే డెంగీ మరణాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో ఒక్క డెంగీ మరణం కూడా లేదు. చంద్రబాబు పాలనలోనే రాష్ట్రంలో అమాయకులు డెంగీకి బలయ్యారని వైద్య, ఆరోగ్యశాఖ అంగీకరించింది. గత ప్రభుత్వంలో 2021 నుంచి 2023 మధ్య రాష్ట్రంలో ఒక్క డెంగీ మరణం కూడా లేదని గురువారం అధికారికంగా ప్రకటించింది. 2024లో ఇద్దరు, 2025లో ఐదుగురు చొప్పున రెండేళ్లలో ఏడుగురు డెంగీతో మరణించారని తెలిపింది. ‘డెంగీ మరణాల్లో ఏపీకి 4వ స్థానం’ శీర్షికతో సాక్షిలో గురువారం కథనం ప్రచురితమైంది. 2024, 2025ల్లో దేశంలో డెంగీ వ్యాప్తి, నమోదైన మరణాలపై ఇటీవల పార్లమెంట్లో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన చేసింది. అందులో పేర్కొన్న మేరకే రాష్ట్రం నాలుగోస్థానంలో ఉందని సాక్షి పేర్కొంది.దీనికి గురువారం రాష్ట్ర వైద్యశాఖ ఇచ్చిన వివరణలో 2021 నుంచి దేశంలో డెంగీ వ్యాప్తి, మరణాల నివేదికను వెల్లడించింది. దీనిని గమనిస్తే 2021, 2022, 2023 సంవత్సరాల్లో ఒక్క డెంగీ మరణం కూడా నమోదు కాలేదు. ఇదే సందర్భంలో దేశవ్యాప్తంగా 2021లో 346 మంది, 2022లో 303 మంది, 2023లో 485 మంది డెంగీతో మరణించారు.రాష్ట్రంలో డెంగీ బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించడం ద్వారా ప్రజల ప్రాణాలు పోకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది. మరోవైపు దేశంలో 2024లో 297, గతేడాది 95 మరణాలు నమోదయ్యాయి. కాగా.. 2025లో దేశం మొత్తం మరణాలు భారీగా తగ్గాయి. కానీ దేశంలో నమోదైన మరణాల్లో 5 శాతానికి పైగా మన రాష్ట్రంలోనే ఉన్నాయి. దీన్నిబట్టి పరిశీలిస్తే ప్రజారోగ్య పరిరక్షణలో బాబు ప్రభుత్వం ఏ మేరకు విఫలమైందో తెలుస్తోంది. -
రూ.1.23 కోట్ల సైబర్ దోపిడీ
అద్దంకి: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని కోటికి పైగా నగదు పోగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అద్దంకికి చెందిన ఎస్.నాగేశ్వరరావు బ్యాంక్ జనరల్ మేనేజర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ప్రస్తుతం అద్దంకి పట్టణంలో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. నవంబర్‌లో నాగేశ్వరరావుకు అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. ‘మీ ఆధార్ కార్డు ప్రముఖ నేరగాడి వద్ద దొరికింది.మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. డబ్బు ఇవ్వకుంటే భార్యాభర్తలిద్దరినీ ముంబై తీసుకొచ్చి జైల్లో పెడతాం’ అంటూ బెదిరించాడు. భయపడిన నాగేశ్వరరావు డిసెంబర్ 3న రూ.53 లక్షలు సైబర్ నేరగాడి ఖాతాకు జమ చేశారు. ఇలా మొత్తం రూ.1.23 కోట్లు బదిలీ చేశారు. ఇంకా నగదు ఇవ్వాలంటూ ఆ వ్యక్తి పదే పదే ఫోన్ చేస్తుండటంతో అనుమానం వచ్చిన నాగేశ్వరరావు స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ క్రైం పోలీసులు నగదు జమ చేసిన 13 బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి దర్యాప్తు చేపట్టారు. -
పిల్లలకు తాగునీరు ఎప్పుడిస్తారు?
సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లలకు ఎప్పటిలోగా తాగు నీరు అందిస్తారో కూడా స్పష్టంగా చెప్పలేరా? హాస్టళ్లకు ఎన్ని ఆర్వో ప్లాంట్లు అవసరం? దానికి సంబంధించిన లోపాలను ఎలా అధిగమిస్తారనే వివరాలను ప్రభుత్వం సమర్పించడం లేదు. హాస్టళ్ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన కూడా చాలా సాధారణంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ హైకోర్టు వ్యాఖ్యలు సాక్షి, అమరావతి: సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లలకు తాగునీరు ఎప్పటిలోగా అందిస్తారో కూడా స్పష్టంగా చెప్పలేరా? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సుమారు 453 హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు లేవన్న విషయాన్ని ప్రభుత్వం ఖండించడం లేదని ప్రస్తావించింది. హాస్టళ్లకు ఎన్ని ఆర్వో ప్లాంట్లు అవసరం? అందుకు సంబంధించిన లోపాలను ఎలా అధిగమిస్తారు? అనే వివరాలను ప్రభుత్వం సమర్పించడం లేదని ఆక్షేపించింది. హాస్టళ్ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన చాలా సాధారణంగా ఉందని ధర్మాసనం తప్పుబట్టింది.రాష్ట్రవ్యాప్తంగా 3 వేలకు పైగా హాస్టళ్లు ఉన్నందున ప్రతి చోటా తాము స్వయంగా పరిశీలించడం సాధ్యం కాదని, అందువల్ల, తాలూకా/ జిల్లా/ రాష్ట్ర స్థాయిల్లో మౌలిక సదుపాయాలను క్రమం తప్పకుండా పరిశీలించే వ్యవస్థను ఏర్పాటు చేయడం అవసరమని తేల్చి చెప్పింది. రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లలో తాగునీరు, మరుగుదొడ్లు లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు నిర్దిష్ట కాల పరిమితితో సమగ్ర ప్రణాళికను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. స్నానపు గదులు, మరుగుదొడ్లకు తలుపులే లేవు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం హాస్టల్లో 86 మంది విద్యార్థులు కామెర్లకు గురికావడం, విద్యార్థి మరణించడం, 150 మంది విద్యార్థులు ఇతర సమస్యలతో ఆసుపత్రుల్లో చేరిన ఘటనపై సీజే ధర్మాసనం విజయనగరం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిని విచారణకు ఆదేశించింది. ధర్మాసనం ఆదేశాల మేరకు న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఆ హాస్టల్‌ను తనిఖీ చేసి నివేదికను హైకోర్టుకు సమరి్పంచారు. బావి నుంచి నేరుగా ట్యాంక్‌లోకి పంపిన నీటినే విద్యార్థులు తాగుతున్నారని తన నివేదికలో పేర్కొన్నారు.611 మంది విద్యార్థులు ఉంటే కేవలం 58 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయని, ఇందులో 40 దొడ్లను వ్యాధి ప్రబలిన తరువాతే నిరి్మంచారని కార్యదర్శి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 11 మరుగుదొడ్లకు, 2 సాన్నపు గదులకు అసలు తలుపులే లేవని నివేదించారు. ఈ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి స్పందిస్తూ ఆ హాస్టల్లో ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తున్నామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చేపడుతోందన్నారు. ప్రణతి నివేదించిన వివరాలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు ఎక్కడ? రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనను రాష్ట్ర ప్రభుత్వం కేవలం మాటలకు, కాగితాలకే పరిమితం చేయడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు ప్రతి 15 రోజులకు ఒకసారి సంక్షేమ హాస్టళ్లను సందర్శించి రాత్రి అక్కడ బస చేయాలంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46 అమలు కాకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉత్తర్వులు హాస్టళ్ల పనితీరును మెరుగుపరిచేందుకు, విద్య నాణ్యతను పెంపొందించటానికి ఉద్దేశించినవని గుర్తు చేసింది.హాస్టళ్లలో పిల్లలకు శుభ్రమైన తాగునీరు ఎప్పటిలోపు అందిస్తారో కూడా ఈ ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదని ఆక్షేపించింది. 320 కొత్త ఆర్వో వాటర్ ప్లాంట్లు మంజూరయ్యాయని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవానికి అవి ప్రస్తుతం ఉన్న హాస్టళ్ల సంఖ్యకు ఏమాత్రం సరిపోవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 ప్రకారం ప్రతి 15 రోజులకొకసారి పరిస్థితిని పర్యవేక్షించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.కమిటీ పర్యవేక్షణ, నియంత్రణ బాధ్యత మొత్తం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదేనని తేల్చి చెప్పింది. సంక్షేమ శాఖల అధికారులకు ఈ కమిటీలో స్థానం కల్పించాలని సూచించింది. నెలకు ఒకసారి ఈ కమిటీ సమావేశమై హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనను పర్యవేక్షించాలని పేర్కొంది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హాస్టళ్లలో ప్రస్తుతం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించింది. మౌలిక సదుపాయాల కల్పనకు పిల్ సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాకినాడ జిల్లాకు చెందిన కీతినీడి అఖిల్ శ్రీగురు తేజ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సీజే ధర్మాసనం ఇటీవల మరోసారి విచారణ జరిపింది.2025లో హైకోర్టు అడిగినా సీఎస్ ఇంతవరకూ నివేదిక ఇవ్వలేదు హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఆహారం, వ్రస్తాలు, ఆశ్రయం ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను అధిగమించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని 2025 జూలైలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినా ఇంతవరకు తమకు సమరి్పంచలేదని ధర్మాసనం తెలిపింది. హాస్టళ్ల ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు్ల క్షేత్రస్థాయి సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించకపోవడం, ఆ సమస్యలను ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం జరుగుతోందని ధర్మాసనం పేర్కొంది. నెలకొకసారి తనిఖీలు జరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, సమస్యను అధిగమించేందుకు పరిష్కార చర్యలు చేపట్టకుంటే ఎన్ని తనిఖీలు చేసినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. -
కిలకిలా రావాలా..
సూళ్లూరుపేట : కిలకిలా రావాల సవ్వడికి వేళైంది. ప్రకృతి ప్రేమికుల హృదయాలను పులకింపజేసే ఫ్లెమింగో ఫెస్టివల్‌కు పులికాట్ సిద్ధమైంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి సైబీరియా, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చే శీతాకాల అతిథులు ఇప్పటికే కనువిందు చేస్తున్నాయి. ఆంధ్రా – తమిళనాడు సరిహద్దుల్లో సుమారు 620 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన పులికాట్ సరస్సును ఆహార కేంద్రంగా, నేలపట్టు చెరువును సంతానోత్పత్తి కేంద్రంగా ఉపయోగించుకుంటూ తమ జీవనశైలిని ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నాయి.ఈ జీవ వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు 2001లో ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ ఈ ఏడాది జనవరి 10, 11న నిర్వహించనున్నారు. గతంలో సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ మండలాలు కేంద్రాలుగా ఈ వేడుక నిర్వహించేవారు. ఈ ఏడాది అదనంగా ఇరక ఐల్యాండ్, శ్రీసిటీ, ఉబ్బలమడుగు జలపాతంతో కలిపి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ పండగను రెండు రోజులకు కుదించేయడంతో ప్రకృతి ప్రేమికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.శీతాకాలంలో విదేశీ విహంగాల సందడి పులికాట్ సరస్సు జలకళ సంతరించుకోగానే సుమారు 150 నుంచి 160 రకాల పక్షులు ఇక్కడకు వచ్చి సందడి చేస్తుంటాయి. ముఖ్యంగా పులికాట్ సరస్సులో లక్షలాది పక్షులు ఆహారవేటలో చేసే విన్యాసాలు పర్యాటకులకు కనులవిందు చేస్తుంటాయి. ఫ్లెమింగోలు (సముద్ర రామ చిలుక), పెలికాన్ (గూడబాతులు), పెయింటెడ్‌స్టార్క్స్ (ఎర్రకాళ్లకొంగలు) ఓపెన్‌బిల్ స్టార్క్స్ (నల్లకాళ్లకొంగ) సీగల్ (సముద్రపు పావురాళ్లు), నారాయణపక్షి, నల్లబాతులు, తెల్లబాతులు, పరజలు, తెడ్డుముక్కు కొంగ, నీటికాకులు, చింతవక్క, నత్తగుల్లకొంగ, చుక్కమూతి బాతులు, సూదిమొన బాతులు, నీటికాకులు, స్వాతికొంగలు లాంటి అనేక విదేశీ, స్వదేశీ పక్షులు ఇక్కడ దర్శనమిస్తుంటాయి.అందుకే పక్షుల భూతల స్వర్గమని ఈ ప్రాంతం పేరుపొందింది. ముఖ్యంగా సైబీరియా, నైజీరియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, రష్యా, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్థాన్ లాంటి దేశాల నుంచి పక్షులు వస్తున్నాయని గుర్తించారు. ఈ క్రమంలో 2001లో నెల్లూరు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ చొరవతో ఆరంభమైన వేడుకను 2013లో టూరిజం క్యాలెండర్లో చేర్చారు. 2016లో రాష్ట్ర స్థాయి పండగగా గుర్తించి పర్యాటక శాఖ నుంచి నిధులు కేటాయిస్తున్నారు.రెండు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు ప్రపంచంలోనే రెండో అతి పెద్ద సరస్సుగా, జీవ వైవిధ్య సరస్సుగా గుర్తింపు పొందిన పులికాట్ విదేశీ వలస పక్షులకు ఆతిథ్యమిచ్చి ఆహారం అందిస్తోంది. పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో సుమారు పది వేల కుటుంబాలకు జీవనోపాధి కలి్పస్తోంది. ఇక్కడ ఈ ఏడాది రెండు రోజుల పాటు ఎగ్జిబిషన్ స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, పులికాట్ సరస్సు పరిరక్షణపై పర్యావరణవేత్తలతో సెమినార్లు నిర్వహించనున్నారు.తడ, భీములవారిపాళెం పడవల రేవు వద్ద బోట్ షికార్ ఏర్పాటు చేస్తున్నారు. సూళ్లూరుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఉద్యాన శాఖ, షార్ ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్ స్టాల్స్ ఆకర్షణగా నిలవనున్నాయి. మరోవైపు శ్రీసిటీ సెజ్‌లో కంపెనీలు, ఇరకం ఐల్యాండ్‌లో బోట్ షికార్, ఉబ్బల మడుగులో జలపాతం సందర్శనకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘పోలవరం–నల్లమలసాగర్’ డీపీఆర్ టెండర్‌కు ఆమోదం
సాక్షి, అమరావతి : పోలవరం–బనకచర్ల అనుసంధానం (లింక్) ప్రాజెక్టును చేపట్టడానికి అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ టెండర్లను ప్రభుత్వం ఆమోదించింది. రూ.7.67 కోట్లకు ఐఐసీ టెక్నాలజీస్‌కు అప్పగించింది. పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టును నల్లమలసాగర్ వరకే పరిమితం చేస్తూ.. ఆ లింక్ ప్రాజెక్టు చేపట్టడానికి డీపీఆర్ తయారీతోపాటు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అన్ని రకాల అనుమతులు తెచ్చేందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించే పనులకు నవంబరు 27న జలవనరుల శాఖ టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది.ఈపీసీ (ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్) పద్ధతిలో ఏడాదిలోగా ఈ పనులు పూర్తిచేయాలని నిర్దేశించింది. ఈ టెండర్లో రూ.7,67,56,539లకు కోట్‌చేసి ఐఐసీ టెక్నాలజీస్ ఎల్–1గా నిలిచింది. దీంతో ఆ సంస్థకే పనులు అప్పగించడానికి అనుమతివ్వాలని గుంటూరు జిల్లా ఎస్ఈ పంపిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. డీపీఆర్ తయారీలో భాగంగా లైడార్ సర్వే చేయాలని నిర్దేశించింది. ఈ లింక్ ప్రాజెక్టును మూడు భాగాలుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.పోలవరం నుంచి కృష్ణా నదిలోకి గోదావరి జలాల మళ్లింపు.. రెండో దశలో కృష్ణా నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు మళ్లింపు.. మూడో దశలో బొల్లాపల్లి నుంచి నల్లమలసాగర్‌కు తరలించేలా పనులు చేపట్టాలని నిర్ణయించింది. లైడార్ సర్వేలో ఈ మూడు భాగాల్లో అలైన్‌మెంట్‌ను ఖరారు చేసి.. గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లను ఏర్పాటుచేయాలని.. పనులు చేపట్టడానికి అవసరమైన అన్ని రకాల పరీక్షలు చేయాలని టెండర్లలో షరతు విధించింది. అక్టోబరు 7న పిలిచిన టెండర్లు రద్దు..ఇక సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారీ, అవసరమైన పరిశోధనలు, కేంద్రం నుంచి చట్టపరమైన అనుమతులు పొందడానికి సహకారం అందించే పనులకు జలవనరుల శాఖ అక్టోబరు 7న టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పనులకు కాంట్రాక్టు విలువను రూ.9.20 కోట్లుగా నిర్ణయించింది. టెండర్లో బిడ్ల దాఖలు గడువు గత అక్టోబరు 22తో ముగిసింది. కానీ, ఎవరూ బిడ్లు దాఖలు చేయకపోవడంతో ఆ టెండర్‌ను రద్దుచేసింది.ఆ లింక్ ప్రాజెక్టును పోలవరం–నల్లమలసాగర్‌కే పరిమితం చేసి డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచింది. ఇకపోతే.. పోలవరం నుంచి బనకచర్లకు 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించే ప్రాజెక్టుకు అనుమతి కోసం సీడబ్ల్యూసీకి గత ఏడాది మే 22న పీఎఫ్ఆర్ (ప్రీ ఫీజిబులిటీ రిపోర్టు)ను రాష్ట్ర జలవనరుల శాఖ సమర్పించింది. దీనిపై సీడబ్ల్యూసీ బేసిన్ పరిధిలోని అన్ని రాష్ట్రాలు.. గోదావరి, కృష్ణా బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అభిప్రాయాలను కోరింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేయడానికి పర్యావరణ ప్రభావ అంచనా (ఈఏఐ)పై అధ్యయనం చేయడానికి నియమ, నిబంధనల (టీఓఆర్–టెరŠమ్స్ ఆఫ్ రిఫరెన్స్) రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ) జూన్ 30న తోసిపుచ్చింది.గోదావరి నదిలో వరద జలాల లభ్యత.. అంతర్రాష్ట్ర అనుమతి తీసుకున్న తర్వాతే టీఓఆర్ కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంచేసింది. ఇదిలా ఉంటే.. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు పనుల నిమిత్తం పర్యావరణ, వైల్డ్‌లైఫ్ (వన్యప్రాణులు), అటవీ అనుమతుల కోసం అవసరమైన నివేదికల తయారీ పనులను గతేడాది జనవరి 26న రూ.1.77 కోట్లకు ఎస్వీ ఎన్విరో ల్యాబ్స్ అండ్ కన్సల్టెంట్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. -
అదుపు తప్పి నోళ్లకు క్యాన్సర్ !
సాక్షి, అమరావతి: క్యాన్సర్ మహమ్మారి ఏటా దేశంలో లక్షలాది మందిని కబళిస్తోంది. రోజురోజుకూ జబ్బు విజృంభణ పెరుగుతూనే ఉంది. పలు క్యాన్సర్ల వ్యాప్తికి ప్రజల జీవనశైలే ప్రధాన కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతి ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధుల్లో నోటి క్యాన్సర్ ఒకటి. దేశంలో 62 శాతం నోటి క్యాన్సర్ కేసులకు ప్రధాన కారణం మద్యపానం, ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగమే అని తెలుస్తోంది. ఈ అంశాన్ని ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) క్యాన్సర్ ఎపిడమాలజీ విభాగం శాస్త్రవేత్తలు ఇటీవల ఈ విషయం వెల్లడించారు. 2010–2021 మధ్య 1,803 మంది నోటి క్యాన్సర్ బాధితులు, 1,903 మంది ఆరోగ్యవంతులపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. అధ్యయనంలోని అంశాలు ఇటీవల బీఎంజీ గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు. ఆ కాంబినేషన్ యమా డేంజర్ మద్యపానం, ధూమపానం, గుట్కా, ఖైనీ, ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగంతో ప్రతి 10 మంది భారతీయుల్లో ఆరుగురు నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు వెల్లడైంది. మితమైన చెడు అలవాట్లు ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపవనే భావనను ఈ అధ్యయనం పూర్తిగా కొట్టిపడేసింది. ఆరోగ్యకరమైన స్థాయిలో మద్యపానం అపోహేనని తోసిపుచ్చారు. వ్యసనాలు అత్యంత మితంగా ఉన్నా.. క్యాన్సర్ ముప్పు మాత్రం అధికంగానే ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. రోజుకు 11.4 ఎంఎల్ మద్యం సేవించినా నోటి క్యాన్సర్ బారినపడే అవకాశం 50 శాతం పెరుగుతుందని స్పష్టం చేశారు.రోజూ బీర్ తాగేవారికి నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేల్చారు. మద్యం సేవించని వారితో పోలిస్తే, సేవించే వారిలో జబ్బు బారిన పడే ముప్పు 68 శాతం ఎక్కువేనని గుర్తించారు. మద్యపానంతోపాటు, పొగాకు ఉత్పత్తులను వినియోగించే వారిలో మహమ్మారి ముప్పు అత్యధికంగా ఉంటుందని తేల్చారు. ఆల్కహాల్‌లోని ఇథనాల్ నోటి లోపలి పొరను పల్చబరుస్తుందని, పొగాకు వినియోగించే వారిలో క్యాన్సర్ కారకాలు సులభంగా కణాల్లోకి చొచ్చుకుని పోతాయని వివరించారు. మద్యం, పొగాకు కాంబినేషన్ ఆరోగ్యాన్ని త్వరగా క్షీణింపజేయడంతోపాటు, క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందన్నారు. దేశంలో సుమారు 11.3 శాతం నోటి క్యాన్సర్ కేసులకు ఆల్కహాల్ ప్రధాన కారణమని అధ్యయనం తేలి్చంది.కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం దేశంలో ఏటా నమోదవుతున్న క్యాన్సర్ కేసులు (అంచనా) సంవత్సరం కేసులు 2022 14.61 లక్షలు 2023 14.96 లక్షలు 2024 15.33 లక్షలు 2025 15.62 లక్షలు -
జేఈఈ మెయిన్స్‌కు భారీగా దరఖాస్తులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా జాతీయ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్–2026 జనవరి ఒక్క సెషన్‌కు మాత్రమే 14.50 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఇది గత ఏడాది జనవరి సెషన్ కంటే లక్షకుపైగా ఎక్కువ. ఏటా జనవరి, ఏప్రిల్ సెషన్లలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈసారి రెండు సెషన్లు కలిపి 17లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇది జాతీయ సంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు పెరుగుతున్న డిమాండ్‌ను సూచిస్తోందని చెబుతున్నారు. గత మూడేళ్లతో పోలిస్తే ఈసారి జనవరి మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తులు భారీగా పెరిగాయి. 2025 తొలి సెషన్‌కు 13.80 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. ఇది 2024 కంటే అధికం. అదేవిధంగా 95 నుంచి 96 శాతం మంది పరీక్షలకు హాజరవుతున్నారు. అంటే, ఈసారి రెండు సెషన్లలోనూ భారీగా పోటీ ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. జనవరిలో 21 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్టీఏ షెడ్యూల్ ఇచ్చింది. ఈ వారంలో విద్యార్థి సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను విడుదల చేయనుంది. మూడో వారంలో అడ్మిట్ కార్డులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది. -
‘కిక్కు’రేగ్గొట్టింది
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు మందుబాబుల తుక్కురేగ్గొట్టింది. జేబులకు భారీగా చిల్లుపెట్టింది. ‘ఫుల్లుగా తాగండి...తాగి ఊగండి..’ అన్నదే తమ అధికారిక విధానమని మరోసారి స్పష్టం చేసింది. ఎందుకంటే ఎంతగా తాగితే టీడీపీ మద్యం సిండికేట్ ఖజానా అంతగా కాసులతో గలగల లాడుతుంది. అందుకే కొత్త సంవత్సరం వేడుకలను అవకాశంగా మలుచుకుని మద్యం ఏరులై పారించింది. అర్ధరాత్రి ఒంటిగంట వరకు అనుమతులిచ్చి మరీ మందుబాబుల జేబులు గుల్ల చేసింది. చివరి నాలుగు రోజుల్లోనే భారీగా రూ.585.70 కోట్ల విలువైన మద్యాన్ని తాగించేసింది. 2024లో చివరి నాలుగు రోజులతోపోలిస్తే 2025లో చివరి నాలుగు రోజుల్లోనే ఐఎంఎల్ లిక్కర్ అమ్మకాలు ఏకంగా 11 శాతం, బీరు అమ్మకాలు 34.4 శాతం పెరగడం విభ్రాంతి కలిగిస్తోంది. సిండికేట్‌కు ఫుల్ జోష్.. కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో మద్యం విక్రయాల్లో పాత రికార్డులను తిరగరాయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు తేల్చి చెప్పింది. అందుకే మద్యం విక్రయ వేళలను ఉదయం 6గంటల నుంచి అర్దరాత్రి 1గంట వరకు అధికారికంగా పొడిగించింది. తెల్లవారే వరకు మద్యం విక్రయించినా పట్టించుకోవద్దని ఎక్సైజ్, పోలీసు అధికారులను అనధికారికంగా ఆదేశించింది. ఫలితంగా 2024తో పోలిస్తే 2025 చివరి నాలుగు రోజుల్లో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇవిగో గణాంకాలు.. ⇒ 2024 డిసెంబర్ 28 నుంచి 31 వరకు 5,18,844 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 2,42, 351 బీరు కేసులను విక్రయించారు. వాటి విలువ రూ.445.22 కోట్లు. ⇒ 2025 డిసెంబర్ 28 నుంచి 31 వరకు 7,32,658 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 3,91,082 బీరు కేసులను విక్రయించారు. వాటి విలువ రూ.585.70 కోట్లు. ⇒ అంటే 2024లో చివరి నాలుగు రోజుల కంటే 2025లో చివరి నాలుగు రోజుల్లో ఐఎంఎల్ లిక్కర్ అమ్మకాలు 11.5శాతం, బీరు విక్రయాలు 34.4 శాతం పెరిగాయి. తద్వారా రూ.140.48 కోట్ల అధిక రాబడి వచి్చంది. ⇒ ఇక 2024 డిసెంబర్‌తో పోలిస్తే 2025 డిసెంబర్లో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. 2024 డిసెంబర్లో మొత్తం 33,88,275 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 11,25,050 బీరు కేసులు విక్రయించారు. వాటి విలువ రూ.2,568.18 కోట్లు. ⇒ కాగా 2025 డిసెంబర్లో మొత్తం 37,79,446 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 15,11,633 బీరు కేసులు విక్రయించారు. వాటి విలువ రూ.2,767.08కోట్లు. ఈ గణాంకాలన్నీ ఎక్సైజ్‌శాఖ అధికారికంగా వెల్లడించినవి. ఎమ్మార్పీ కంటే అధిక బాదుడు అదనం కాగా టీడీపీ మద్యం సిండికేట్ ఎమ్మార్పీ కంటే అదనంగా మందుబాబుల నుంచి దండుకుంది ప్రతి క్వార్టర్ మద్యం సీసాపై ఎమ్మార్పీ కంటే రూ.50, బీరు సీసాపై ఎమ్మార్పీ కంటే రూ.30 అదనంగా వసూలు చేసింది. తద్వారా అనధికారికంగా మరో రూ.100 కోట్లకుపైగా కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. టాప్‌లో విశాఖ డిసెంబర్లో మొత్తం 178.6 కోట్ల మద్యం అమ్మకాల్లో విశాఖపట్నం జిల్లా రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిచింది. రూ.169.4కోట్ల మద్యం అమ్మకాలతో తిరుపతి జిల్లా రెండోస్థానంలో, రూ.155.4కోట్ల మద్యం అమ్మకాలతో ఎనీ్టఆర్ జిల్లా మూడో స్థానంలో ఉన్నాయి. రూ.30.7 కోట్ల మద్యం అమ్మకాలతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది. ⇒ 34.4 శాతం నాలుగురోజుల్లోనే పెరిగిన బీర్ల అమ్మకాలు⇒ 11 శాతంనాలుగు రోజుల్లోనే పెరిగిన లిక్కర్ విక్రయాలు⇒ రూ.178.6 కోట్లు డిసెంబర్లో ఒక్క విశాఖ జిల్లాలో మొత్తం మద్యం అమ్మకాల విలువ⇒ రూ. 169.4 కోట్లు డిసెంబర్లో మద్యం అమ్మకాల్లో రెండో స్థానంలో నిలిచిన తిరుపతి జిల్లా -
చంద్రబాబు పాలనలో మళ్లీ తగ్గిన ఆదాయం
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఆదాయం మళ్లీ తగ్గింది. డిసెంబర్లో ఏపీ జీఎస్టీ ఆదాయం తగ్గిపోయింది. గతేడాది కంటే 5.37 శాతం తగ్గిపోయింది జీఎస్టీ ఆదాయం. ఫలితంగా చంద్రబాబు పాలనలో అత్యధిక కాలం .జీఎస్టీ తగ్గిపోయినట్లైంది. చంద్రబాబు పాలనలో అప్పుల్లో భారీ వృద్ధి ఉండగా, ఆదాయంలో మాత్రం పతనం కనబడుతోంది. దాంతో ఆర్థికశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు.. ఉన్న సంపదను కూడా నాశనం చేసే విధంగా అడుగులు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీఎస్టీ ఆదాయం మళ్లీ పడిపోవడంతో ఆంధ్రప్రదేశ్ తిరోగమనంలో పయనిస్తోంది. కూటమి సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి జీఎస్టీ ఆదాయంలో క్షీణతలే నమోదవుతున్నాయి. వరుసగా జీఎస్టీ ఆదాయం గణనీయంగా తగ్గిపోవడంతో బాబు పాలనలో అంతా నేలచూపులే కనిపిస్తున్నాయి. ఒకవైపు అప్పులు.. మరొకవైపు జీఎస్టీ ఆదాయం తగ్గిపోవడంతో ఏపీ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా మారింది. -
ఏపీలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు
సాక్షి,విజయవాడ: ఏపీలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రభుత్వం మద్యం విక్రయ సమయాన్ని పెంచిన నేపథ్యంలో.. నెలాఖరులో మూడు రోజుల్లోనే (డిసెంబర్ 29, 30, 31) రూ.543 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు సమాచారం. గత ఏడాది డిసెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 8 శాతం పెరిగాయి. మొత్తం డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాల విలువ రూ.2,767 కోట్లుగా నమోదైంది. ఈ పెరుగుదలతో రాష్ట్రంలో మద్యం వినియోగం మరింతగా పెరుగుతోందని స్పష్టమవుతోంది.అధికారికంగా అనుమతించిన దుకాణాలతో పాటు, బెల్టు షాపులు కూడా విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు షాపుల ద్వారా మద్యం సులభంగా అందుబాటులోకి రావడం వల్ల వినియోగం పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితి మద్యం నియంత్రణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం మద్యం విక్రయ సమయాన్ని పొడిగించింది. అయితే, ఈ నిర్ణయం ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం వినియోగం పెరగడం వల్ల కుటుంబాల ఆర్థిక స్థితి దెబ్బతింటుందని, సామాజిక సమస్యలు మరింతగా ఉత్పన్నమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు
తిరుమల: తిరుమలల వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. రేపటి నుండి సర్వదర్శనంలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. దర్శన టికెట్టు లేని భక్తులకు క్యూలైన్లోకి అనుమతిస్తోంది టీటీడీ. ఉదయం వరకూ కంపార్ట్మెంట్లలో ఉంచి వేకువజాము దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రెండు రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 1,37,309 గా ఉందని టీటీడీ తెలిపింది. రెండు రోజుల హుండీ ఆదాయం 7.04 కోట్లుగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలో స్వర్ణరథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉదయం 9 నుంచి 10.30 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని పురమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. బధవారం(డిసెంబర్ 31 వతేదీ) వైకుంఠ ద్వాదశి కావడంతో ఉదయం శ్రీవారి పుష్కరిణిలో అర్చకులు సంప్రదాయబద్ధంగా చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్కరిణి పరిసరాలు భక్తులతో నిండిపోయాయి.వైకుంఠ ఏకాదశి సందర్భంగా పరిమిత సంఖ్యలోనే వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పించామని టీటీడీ అధికారులు తెలిపారు. మొత్తం పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయని, ఇప్పటికే వైకుంఠ ద్వార దర్శన టికెట్లు కలిగిన భక్తులకు మాత్రమే రేపటి వరకు దర్శనం ఉంటుందని వెల్లడించారు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనంలో భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. -
‘కొద్ది రోజులుగా చంద్రబాబు ఎందుకు కనబడుట లేదు?’
తాడేపల్లి : సీఎం చంద్రబాబు ఎక్కడకు వెళ్లారో ప్రజలకు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే,వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. ఆయన కొద్ది రోజులుగా ఎందుకు కనుబడుటం లేదని, ఎక్కడకు వెళ్లారో ప్రజలకు చెప్పాలన్నారు. ఈరోజు(గురువారం, జనవరి 1వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. చంద్రబాబు పర్యటనపై ప్రజలకు పలు అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయాలన్నారు. ‘సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్తే ఆ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు ప్రకటించటం లేదు?, చివరికి జీఏడీ(సాధారణ పరిపాలన శాఖ )కి కూడా చంద్రబాబు పర్యటన గురించి తెలియకపోవడం ఏంటి?, సొంత ఎల్లోమీడియాకి కూడా చంద్రబాబు ఎక్కడకు వెళ్లారో తెలియదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా కనపడటం లేదు. చివరకు మంత్రులు కూడా రాష్ట్రంలో లేరు. చంద్రబాబుది అధికార పర్యటనో వ్యక్తిగత పర్యటనో ఎందుకు చెప్పటం లేదు?, కొన్ని పత్రికల్లో రకరకాల వార్తలు రాస్తున్నాయి. వైద్యం కోసం వెళ్లారనీ, ఇతర పనుల మీద వెళ్లారనీ రాశాయి. ఎవరికీ చంద్రబాబు పర్యటనపై క్లారిటీ లేదు. సింగపూర్ అనీ, బాలి అనీ, జపాన్ అనీ, లండన్ వెళ్లాడనీ పత్రికలు రాస్తున్నాయి. అసలు చంద్రబాబు ఎక్కడకు వెళ్లారు?, చంద్రబాబు, లోకేష్ మధ్య సీఎం కుర్చీ కోసం పోరు జరుగుతోంది. లోకేష్ వలనే చంద్రబాబుకు కుర్చీ గండం ఉంది. లోకేష్ లండన్‌లో ఉన్నాడని తెలిసి చంద్రబాబు తన విమానాన్ని మరో దేశానికి మళ్లించారు. గతంలో జగన్ తన కుమార్తె కోసం లండన్ వెళ్తే టీడీపీ నేతలు రచ్చరచ్చ చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు పర్యటన గురించి ఎందుకు బయట పెట్టటం లేదు?. మూడు హెలికాప్టర్లు, మూడు విమానాల్లో ముగ్గురు నేతలు తిరుగుతూ విలాసాలు చేస్తున్నారు. విమానాలు, హెలికాఫ్టర్లకు అయ్యే ఖర్చు ఎంత?, సొంత ఖర్చుతో ప్రయాణాలు చేస్తే మాకు సంబంధం లేదు. రాష్ట్ర ఖజానాను ఎందుకు ఖాలీ చేస్తున్నారు?, ఆ పర్యటనల వలన ఏపీకి కలుగుతున్న ప్రయోజనం ఏంటి?, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ విమానాల ఖర్చులను బయట పెట్టాలి. ఇచ్చిన హామీలు అమలు చేయడానికి మాత్రం డబ్బుల్లేవని ఎలా అంటారు?, సూపర్ సిక్స్ పేరుతో మోసం చేశారు. ఈ ప్రభుత్వం చేస్తున్నది 420 పనులే. కొత్త సంవత్సరం కానుకగా రోడ్ సెస్ పేరుతో పన్ను విధించారు. కరెంటు ఛార్జీలు మరో రూ.4 వేల కోట్లు పెంచుతున్నారు. ఈ బిల్లులు, పన్నులు చెల్లించలేక జనం అల్లాడిపోతున్నారు’ అని మండిపడ్డారు. -
ఈనాడు ఇప్పుడు వారి చెప్పుచేతల్లో!
ఈనాడు మీడియాను తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచే నడుపుతున్నారట. నిజం కాదని ఎంతగానో అనుకున్నా. కానీ ఈ మధ్య కాలంలో ఆ పత్రికలో వస్తున్న వార్తలు చూస్తుంటే ఈ ప్రచారాన్ని నమ్మక తప్పడం లేదు. ఏదో.. ఎవరి ప్రయోజనం ఏమిటో తెలియదని కొందరు సరిపెట్టుకుంటున్నారు కానీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రి లోకేశ్‌లను ఈ మీడియా సంస్థ కాపుకాస్తున్న విధానం రోజురోజుకూ మితిమీరిపోతోంది. పైగా ఇందుకోసం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌పై చండాలపు సంపాదకీయం ఒకటి రాసిపెట్టడం ఏహ్యభావాన్ని మరింత పెంచుతోంది.అది సంపాదకీయం చదివిన తర్వాత కచ్చితంగా ఇది టీడీపీ ఆఫీస్ నుంచి రాసి ఉండవచ్చని అనిపించింది. చాలామంది ఇదే విషయం చర్చించుకుంటున్నారు కూడా. టీడీపీ ఆఫీసులోని ఒక టీమ్ ఈనాడులో ఏ రోజు ఏ వార్త రావాలో నిర్దేశిస్తున్నారని, టీడీపీ రచయిత ఎవరో రాసిన వ్యాసాన్ని ఈనాడు యథాతథంగా సంపాదకీయంగా ప్రచురించి ఉండవచ్చని అనిపిస్తోంది. నిజంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచే ఈనాడుకు ఆదేశాలు వెళుతున్నాయా? ఏమో తెలియదు కానీ.. చంద్రబాబు, లోకేశ్‌లకు అత్యంత విధేయులుగా ఉన్నామని రుజువు చేసుకోవడానికి ఆ పత్రిక ఇలాంటి దిక్కుమాలిన రాతలు రాస్తోందేమో.ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జగన్ విధానం సుస్పష్టం. వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలని, అందుకు విరుద్ధంగా చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందుకోసం ఆయన కోటి సంతకాల ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆ సందర్భంగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మొత్తం ఒక స్కామ్ అని, అందులో భాగస్వాములైన వారందరూ జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇది తప్పట. అలా మాట్లాడకూడదట. పీపీపీ విధానాన్ని వ్యతిరేకించకూడదట. అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుందట. అంతటితో ఆగలేదీ పచ్చపత్రిక. జగన్ క్రూరుడని, ఆయనవి విష రాజకీయాలని 11 సీట్లకే పరిమితమైన తరువాత బెదిరింపు భాష మానుకోలేదని నానా మాటలు తన సంపాదకీయం ద్వారా అనేసింది. నిధుల కొరత వల్ల ప్రభుత్వం పీపీపీ విధానాన్ని ఎంచుకుని ఉండవచ్చునని బాబు అండ్ కోకు వత్తాసుపలికింది.ఒక్క ముక్కలో చెప్పాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాన్ని ఎడిటోరియల్గా అచ్చేసింది ఈనాడు పత్రిక. బాబు వాక్యం వేదమైనట్లు, ఎవరూ వ్యతిరేకించకూడదన్న బానిస మనస్తత్వం ఇందులో కొట్టొచ్చినట్లు కనిపిస్తూంటుంది. వైఎస్సార్సీపీ వాదన అక్షరం రాయకుండా ఆసాంతం జగన్‌పై విషం చిమ్మారంటేనే ఇదంతా టీడీపీ రాతే అయి ఉంటుంది. జగన్ విధానంతో ఏకీభవించవచ్చు.. లేక వ్యతిరేకించవచ్చు. కానీ, రెండు వైపుల వాదనలు వివరించి జగన్ వాదన ఏ రకంగా తప్పో రుజువు చేసి ఉంటే హుందాగా ఉండేది. ఏకపక్షంగా పచ్చి అబద్దాలను ప్రచురించడం ఏ రకమైన జర్నలిజం?. ఇక్కడ మరో మాట చెప్పాలి. జగన్‌కు అసలు బలమే లేదని కదా వీరి అభిప్రాయం. అలాంటప్పుడు ఆయనను పట్టించుకుని ఇంత నిర్లజ్జగా ఎడిటోరియల్ రాయవలసిన అవసరం ఏమిటి?.జగన్ హెచ్చరికలకే ప్రైవేటు సంస్థలు రాకుండా పోయాయన్నది నిజమే అనుకుంటే జనాభిప్రాయానికి వారు భయపడుతున్నట్లు అంగీకరించినట్లేనా? అంతేకాదు.. ఈ లెక్కన ఈనాడు మీడియా కూడా మళ్లీ అధికారంలోకి వచ్చేది జగనే అని నిర్ధారిస్తున్నట్లే కదా!. చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గతంలో అసలు మెడికల్ కాలేజీలు జగన్ ఎక్కడ నిర్మించారని ప్రశ్నించి నాలుక కరుచుకున్నారు. జగన్, వైఎస్సార్సీపీ నేతలు ఆ కాలేజీల వద్దకు వెళ్లి వాటిని ప్రజలందరికీ చూపించారు. అయినా కూడా మెడికల్ కాలేజీలు ఎందుకు నిర్మించలేదని గుడ్డిగా ప్రశ్నించింది ఈనాడు!. నిధుల కొరతవల్ల ప్రభుత్వం పీపీపీ విధానంలోకి వెళ్లి ఉండవచ్చనని సన్నాయి నొక్కులు నొక్కుతున్న ఈ పచ్చ పత్రిక అమరావతి పేరుతో వేలకు వేల కోట్లు అప్పులు తేవడాన్ని ఏనాడైనా ప్రశ్నించిందా?.జగన్ అధికారంలో ఉండగా.. ప్రతి విషయాన్ని వక్రీకరించిన ఇదే పత్రిక ప్రజలను మోసం చేయడానికి టీడీపీ, జనసేనలతో కుమ్మక్కై అప్పులపైన, అమ్మాయిల మిస్సింగ్‌లపై, భూముల రీసర్వే వంటి అంశాలపై ఎంత తప్పుడు ప్రచారం చేసిందీ ప్రజలకు తెలియకుండా ఉంటుందా? బాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్‌లది క్రూరత్వం, కపటత్వం కావా?. తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కిన కూటమి వాటిని విస్మరించడం, ఎగ్గొట్టడం ఏనాడూ ఈ పచ్చ పత్రికలకు కనపడలేదు. ఎన్నికలకు ముందు సెల్ఫ్ పైనాన్స్ సీట్లకు జగన్ అనుమతిస్తే వ్యతిరేకించిన బాబు, లోకేశ్‌లు ఆ తరువాత ప్లేటు ఫిరాయించినా, వైద్య కళాశాలల ఆస్తులు అప్పనంగా ప్రైవేటువారి పరం చేస్తున్నా పట్టలేదు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం.. ప్రభుత్వ రంగంలో కాలేజీలు మంజూరు చేసింది. పీపీపీ విధానంలోనే చేయాలని ఆదేశించలేదే? అయినా పార్లమెంటరీ కమిటీ సిఫారసు అని మరొకటని ఎందుకు ఈనాడు మీడియా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తోంది? అందులో వారి స్వార్ధం ఏమిటి? జగన్ టైమ్‌లో అనేక అంశాల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూటమి పాలనలో ఎందుకు వెనుకబడిపోయిందన్న విషయం రాసి ఉంటే ఈనాడును అభినందించి ఉండవచ్చు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు అనేక తప్పుడు కథనాలు వండి, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కృషి చేసిన ఈనాడు ఇప్పుడు అదే పని చేస్తోంది. ఏడాదిన్నరగా రెడ్‌బుక్ పేరుతో జరుగుతున్న అరాచకాలపై నోరు మెదిపితే ఒట్టు ఈ పత్రిక. కదిరి వద్ద ఎవరో ఒక వ్యక్తి తన వదినతో గొడవపడి తోస్తే, దానికి.. జగన్ పుట్టిన రోజును జతచేసి అతను వైఎస్సార్సీపీ వాడని ఆరోపించి, పోలీసులు కొట్టి రోడ్డుపై తీసుకువెళితే ఈనాడు, ఎల్లోమీడియా మొదటి పేజీలో వార్తలు ఇచ్చాయి.చిన్నపాటి కుటుంబ గొడవను మొదటి పేజీలో వేశారంటే అది టీడీపీ టీమ్ ఆదేశాల మేరకే జరిగి ఉండవచ్చన్న భావన కలుగుతుంది. తీరా అతను జనసేనకు చెందిన వ్యక్తి అని తేలితే ఎల్లో మీడియా కిక్కురుమనలేక పోయింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు కత్తులు తిప్పుతూ రోడ్డుమీద వీరంగం వేస్తే ఎందుకు కేసులు పెట్టలేదు? ఎవరు తప్పు చేసినా తప్పే అని రాయవలసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి అలా చేయకపోగా, వైఎస్సార్సీపీపై విషం చిమ్ముతూ జనానికి కంపరం పుట్టిస్తున్నాయి. అమరావతిలో ఒక రైతు మంత్రి నారాయణ సమక్షంలో తన ప్లాట్ గురించి ఆవేదన వ్యక్తం చేసిన కొద్దిసేపులోనే గుండెపోటుకు గురై ప్రాణం కోల్పోతే ఆ వాస్తవాన్ని రాయకుండా కప్పిపుచ్చినప్పుడే ఈనాడు, తదితర ఎల్లో మీడియా నైతికంగా పాతాళానికి చేరినట్లు అయ్యింది.ఈ సందర్భంలో ఏపీలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ పరిస్థితులు ఏర్పడే ముప్పు ఉందని ఈ మీడియా చెబుతోంది. ఇది వాస్తవమే అనిపిస్తుంది. కాకపోతే అది జగన్ వల్ల కాదు. మంత్రి లోకేశ్ రెడ్‌బుక్ అరాచకాలు, ఎన్నికల ప్రణాళిక అమలు చేయకుండా చంద్రబాబు సర్కారు నిత్యం అసత్యాలు ప్రచారం చేస్తుండడం వల్ల అని గమనించాలి. ఈ పరిణామాలన్నిటిపై రాష్ట్ర ప్రజలలో అసంతృప్తి ఏర్పడింది. అది తిరుగుబాటుగా మారకుండా ఉండడానికి ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఈనాడు గ్రూప్‌కు చెందిన మార్గదర్శికి సంబంధించి కేసులు ఎత్తివేయడం, జప్తు అయిన రూ.వెయ్యి కోట్లు విడుదల చేయడం తదితర ఆర్థిక ప్రయోజనాలు పొందిన తర్వాత తెలుగుదేశం పార్టీకి లొంగి పనిచేయకుండా ఎలా ఉంటుంది?.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నంద్యాలలో దారుణం..
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలను హత్య చేసి చివరకు తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, మద్యం మత్తులను పిల్లలను తండ్రి హత్య చేసినట్టు తెలుస్తోంది.వివరాల మేరకు.. ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నెలో విషాదం నెలకొంది. తండ్రి సురేంద్ర.. మద్యం మత్తులో తన ముగ్గురు పిల్లలను దారుణం హత్య చేశాడు. అనంతరం, సురేంద్ర ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన పిల్లలను కావ్య(7), రాజేశ్వరి(4), సూర్యగగన్(2)గా గుర్తించారు. అయితే, ఎనిమిది నెలల క్రితమే సురేంద్ర భార్య చనిపోయారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
న్యూ ఇయర్ వేడుకలు.. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీపై హత్యాయత్నం
సాక్షి, అనంతపురం: నూతన సంవత్సర వేడుకల వేళ ఏపీలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. అనంతపురంలో ఉద్రికత్త నెలకొంది. వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేసి దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ జెడ్సీటీసీపై హత్యయత్నం చేయడంతో తీవ్ర గాయలయ్యాయి. దీంతో, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగారు.వివరాల ప్రకారం.. శింగనమల నియోజకవర్గం యల్లనూరులో పచ్చ బ్యాచ్ రెచ్చిపోయారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న వైఎస్సార్సీపీ నేతలపై దాడి చేశారు. యల్లనూరు వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం చేశారు. టీడీపీ నేతలు కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో టీడీపీ నేతల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నేతల ధర్నాకు దిగారు.అనంతరం, ధర్నా చేస్తున్న వారిపై కూడా టీడీపీ నేతలు మరోసారి దాడి చేశారు. దీంతో, జెడ్పీటీసీ ప్రతాప్ రెడ్డి సహా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ నేతల దాడుల నిరసనగా గాయాలతోనే యల్లనూరు పీఎస్ వద్ద ప్రతాప్ రెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు బైఠాయించారు. కూటమి ప్రభుత్వం, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చిచ్చు రాజేసిన న్యూఇయర్ కేక్ కటింగ్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో అర్ధరాత్రి కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పల్లె, పట్నం అంతా 2026కు ఘనంగా స్వాగతం పలికారు. అయితే పోలీసుల వైఖరితో న్యూఇయర్ సెలబ్రేషన్స్ వేడుకల్లో అక్కడక్కడ చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇటు జగ్గయ్యపేట పరిధిలో కేక్ కట్టింగ్ యువకుల మధ్య చిచ్చును రాజేసింది. జగ్గయ్యపేట పట్టణంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అర్ధరాత్రి దాటాక.. తొర్రగుంటపాలెం రోడ్డుపై కొందరు యువకులు కేక్ కటింగ్‌కు ప్రయత్నించారు. అదే సమయంలో.. అటువైపుగా కారులో నలుగురు యువకులు వచ్చారు. నడిరోడ్డుపై సెలబ్రేషన్స్ ఏంటని?.. పక్క నిర్వహించుకోవాలని.. తమకు దారి ఇవ్వాలంటూ వాళ్లను కోరారు. అయితే.. కేక్ కట్టింగ్ అయ్యాకే కారు ముందుకు వెళ్తుందంటూ తేల్చి చెప్పడంతో మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో యువకులు ఒకరినొకరు తోసేసుకుని పిడిగుద్దులు గుప్పించుకున్నారు. ఈ దాడిలో కారులో వచ్చిన యువకులకు గాయాలు కావడంతో.. స్థానికులు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాడి సమయంలో యువకులు మద్యం మత్తులో ఉన్నారా?. ఫిర్యాదు నమోదు అయ్యిందా?.. అనే విషయాలు తెలియాలంటే ఈ ఘటనపై పోలీసులు స్పందించాల్సిందే. -
కలుషిత ఆహారంతో 34 మంది విద్యార్థులకు అస్వస్థత
సుండుపల్లె: అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని సుండుపల్లె మండలం రాయవరం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం కలుషితమై 34 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న అనంతరం వీరంతా కడుపునొప్పి, వాంతులతో ఇబ్బందులుపడ్డారు. వెంటనే ఉపాధ్యాయులు వారిని రాయవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్థానిక వైఎస్సార్సీపీ నాయకుల ద్వారా సమాచారం అందుకున్న రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి.. రాజంపేట సబ్ కలెక్టర్ భావన, డీఎంహెచ్‌వో, స్థానిక వైద్యులతో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ శేఖర్‌రెడ్డి తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ భావన పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. పీహెచ్సీ వైద్యులతో మాట్లాడి విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలు, వారి పరిస్థితి తెలుసుకున్నారు. ఆహార తనిఖీ అధికారి పాఠశాలలో విద్యార్థులకు వడ్డించిన ఆహారాన్ని పరీక్షించారు. -
ఏయూ దూర విద్యలో బీఈడీ కోర్సుకు మంగళం?
సాక్షి, అమరావతి: ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) అసమర్థ పాలనలో కునారిల్లుతోంది. చంద్రబాబు ప్రభుత్వ స్వార్థ, కుటుంబ రాజకీయ ప్రయోజనాల కోసం ఉనికి, ప్రగతిని కోల్పోతోంది. దూరవిద్య బీఈడీ కోర్సులకు శాశ్వతంగా స్వస్తి పలికేందుకు సర్కారు పథక రచన చేస్తోంది. ఉపాధ్యాయులకు తీరని అన్యాయం కరోనా సమయంలో బీఈడీ స్టడీ మెటీరియల్‌కు యూజీసీ–డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో (డెబ్) అనుమతి, ఇతర పరిశీలన కోసం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) ఏయూలో దూరవిద్య బీఈడీ అనుమతులను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. దీనిపై అప్పటి వర్సిటీ అధికారులు డెబ్‌కు లేఖరాశారు. అటువంటి సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్‌కు తన అనుమతి అవసరం లేదని డెబ్ తేల్చిచెప్పింది. ఇదే విషయాన్ని అప్పటి అధికారులు ఎన్సీటీఈ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 2023 డిసెంబర్లో వర్సిటీ అధికారులు సమర్పించిన వివరాలతో ఎన్సీటీఈ సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో పునఃగుర్తింపు కోసం వర్సిటీ అధికారులు ఎన్‌సీటీఈకి దరఖాస్తు పెట్టారు. ఇంతలో ఎన్నికల కోడ్, ఆ తర్వాత కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అనుమతుల ప్రక్రియను గాలికొదిలేసింది. ‘థర్డ్ మెథడాలజీ’పై అనిశ్చితి ఉపాధ్యాయులు తమ రంగంలో సబ్జెక్టు పెంచుకునేందుకు, ప్రమోషన్ల కోసం థర్డ్ మెథడాలజీని అభ్యసిస్తున్నారు. దీనిని దూరవిద్యలోనే పూర్తి చేసే వెసులుబాటు ఉంటుంది. అలాంటిది కొన్నేళ్లుగా ఏయూలో థర్డ్ మెథడాలజీకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడలేదు. బీఈడీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు థర్డ్ మెథడాలజీకి నోటిఫికేషన్ ఇవ్వొచ్చనే ఆలోచనతో నిలిపివేశారు. తీరా బీఈడీ కోర్సు పరిస్థితి అగమ్యగోచరం కావడంతో.. థర్డ్ మెథడాలజీ విషయంలోనూ అనిశ్చితి ఏర్పడింది. వాళ్లకు ఇచ్చిన అనుమతి.. ఇక్కడెందుకు రావట్లేదు? ⇒ తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీ ఈ ఏడాది సెపె్టంబర్లో ఎన్సీటీఈ నుంచి 500 బీఈడీ సీట్లతో కోర్సుకు అనుమతి తెచ్చుకుంది. ⇒ మైసూర్‌లోని కర్ణాటక స్టేట్ ఓపెన్ వర్సిటీ సైతం ఎన్సీటీఈ నుంచి బీఈడీ కోర్సుల నిర్వహణకు అనుమతి పొందింది. ⇒ ఇక వైస్ చాన్సలర్ సహా ఇప్పటివరకు ఏయూ నుంచి ఒక్క అధికారి కూడా ఎన్సీటీఈని సంప్రదించి బీఈడీ కోర్సు పునః గుర్తింపు కోసం అడిగిన పాపాన పోలేదు. ⇒ కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. రెండేళ్లలో రూ.3.50 కోట్లు నష్టం ఏయూలో 500 బీఈడీ సీట్ల భర్తీకి ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో దాదాపు 5–6వేల మంది ఇన్ సర్వీసు ఉపాధ్యాయులు పోటీపడతారు. రెండేళ్ల కోర్సుకు రూ.35 వేల చొప్పున ఫీజు నిర్ణయించింది. అంటే ఏడాదికి రూ.1.75 కోట్లు ఆదాయం దూరవిద్య సంస్థ ద్వారా ఏయూకు వచ్చేది. రెండేళ్లలో వర్సిటీకి రూ.3.50కోట్లకుపైగా నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. బాబు బంధుప్రీతే కారణం చంద్రబాబు బంధుప్రీతి ఏయూను నిర్వీర్యం చేస్తోంది. విశాఖలోని తమ కుటుంబానికి చెందిన వ్యక్తుల కార్పొరేట్ విద్యా సంస్థకు మేలు చేసేందుకు ఏకంగా శతాబ్దాలు చరిత్ర కలిగిన ఏయూను దెబ్బతీసేందుకు వెనుకాడట్లేదు. ముందుగా దూరవిద్య నుంచి డ్యామేజ్ మొదలెట్టారు. అందులో భాగంగానే బీఈడీ కోర్సుల అనుమతి పునరుద్ధరణను కావాలనే పట్టించుకోవట్లేదని వర్సిటీ వర్గాలే విమర్శిస్తున్నాయి. త్వరలో అస్మదీయ కార్పొరేట్ విద్యా సంస్థ దూరవిద్యలోకి బీఈడీ కోర్సు వచ్చి చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. -
'గ్రీటింగ్'.. 'చీటింగ్'
శ్రీకాకుళం క్రైమ్ : ఏడాది మారుతోంది. డిసెంబర్ 31 మొదలుకుని జనవరి 1 వరకు లెక్కలేనన్ని మెసేజీలు సెల్‌ను తాకుతాయి. న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరిట ఎస్ఎంఎస్లు, వాట్సాప్‌ల ద్వారా సందేశాలు వస్తా యి. వీటితోనే ప్రమాదం పొంచి ఉంది తెలియని సైట్లపై ఏమరపాటుగా క్లిక్ చేసినా మన అకౌంట్లలో నగదు క్షణాల్లో మాయమవుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చీటింగ్ ఇలా..న్యూ ఇయర్ సందర్భంగా మొబైల్లో వచ్చే రకరకాల చిత్రాలు, సందేశాల పేర్లతో సహా తయారుచేసుకుని మెజేస్ పంపుతారు. మీకు నచ్చేవిధంగా మీ పేరుతో గ్రీటింగ్స్, సందేశాలను పంపుకోవచ్చని, ఫలానా లింక్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలని అంటారు. మన మొబైల్లో టెలిగ్రామ్, వాట్సాప్‌లను ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్) ఫైల్స్ రూపంలో మె సేజ్లను పంపిస్తారు. పొరపాటున ఆ లింక్‌ను క్లిక్ చేస్తే అంతే సంగతులు. మన ఫోన్లో సమాచారమంతా వారికి పోతుంది. కాంటాక్ట్ నంబర్లు, ఫొటో లు, వీడియోలు, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలే కాక డాక్యుమెంట్ ఫైళ్లు సైతం వీరికి చేరిపోతాయి. వెరిఫై చేసుకోవాలి.. రకరకాల గిఫ్ట్ ఓచర్లు, గ్రీటింగ్స్, ట్రావెల్, గాడ్జెట్స్, ఫ్యాషన్లపై ఇచ్చే డిస్కౌంట్లను ఒకటికి రెండుసార్లు నమ్మదగినవా కాదా అన్నది వెరిఫై చేసుకోవాలి. వాటి రివ్యూస్ చూస్తూ వెరిఫైడ్, అథెంటిక్ వెబ్సైట్లోకి వెళ్లి ఆఫర్లను తెలుసుకునేందుకు ప్రయతి్నంచాలి. కొత్త బృందాలు ఏర్పాటుశ్రీకాకుళం జిల్లాలో 2025లో వైట్ కాలర్ నేరాలు 171 నమోదయ్యాయి. సైబర్ నేరాల్లో బాధితులకు అందించే రికవరీ సొమ్ము రాబట్టుకునేలా ఇక కృషి చేస్తాం. ఆన్లైన్ నేరాలను ఛేదించేందుకు ఇప్పటికే కొత్త బృందాలను ఏర్పాటు చేశాం. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, సైబర్ క్రైమ్ సెల్‌తో సమన్వయం చేసుకుని 1930హెల్ప్‌లైన్ ఆన్లైన్ పోర్టల్ నిర్వహిస్తాం. విద్యాసంస్థల్లో, గ్రామాల్లో అవగాహన కల్పిస్తాం. – శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి జాగ్రత్తలు తప్పనిసరి.. » అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయరాదు. » ఫోన్లోని సెట్టింగ్‌లో ఇన్స్టాల్ ఫ్రం అన్నోన్ సోర్సెస్ అనే ఆప్షన్‌ను డిసేబుల్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకు తెలియకుండా యాప్స్ ఇన్స్టాల్ కావు. » మొబైల్ సెట్టింగ్‌లో ఫోన్ నంబర్లను యాక్సిస్ చేసే అనుమతి ఇవ్వరాదు. » తెలియని ఏపీకే ఫైల్స్, మాల్వేర్స్ ఇన్స్టాల్ అయితే ఫోన్‌ను రీసెట్ చేయాలి. » ఈ–మెయిల్స్, టెక్ట్స్æ, ఇతర సోషల్ మీడియా యాప్‌ల ద్వారా నకిలీ లింక్స్‌ను గుర్తించాలి. వాటిని క్లిక్ చేయకుండా జాగ్రత్త పడాలి. » గివ్ అవేస్ పోటీల ద్వారా వినియోగదారులను ట్రాప్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని దోచేస్తారు. మన వివరాలను సేకరించి డార్క్‌వెబ్‌కు అమ్మేస్తారు. » మన మొబైల్, ల్యాప్‌టాప్ (కంప్యూటర్)లలో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీ వైరస్ ప్రోగ్రామ్, అధికారిక యాప్‌లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. -
విశాఖపై నెత్తుటి మరకలు
విశాఖ నగరానికి నెత్తుటి మరకలు అంటుకుంటున్నాయి. వరుస హత్యలు, నెత్తురోడుతున్న రహదారులతో నగరం ఉలిక్కిపడుతోంది. పోలీస్ శాఖ చేపట్టిన చర్యలతో మొత్తంగా నేరాల రేటు తగ్గిందని గణాంకాలు చెబుతున్నప్పటికీ.. మనిషి ప్రాణాలు తీసే కిరాతక నేరాలు పెరగడం భయాందోళనలకు గురిచేస్తోంది. ముఖ్యంగా 2024తో పోలిస్తే 2025లో హత్యల సంఖ్య గణనీయంగా పెరగడం, రహదారులపై మరణ మృదంగం ఆగకపోవడం నగర ప్రజలను కలవరపెడుతోంది. గత ఏడాది 24గా ఉన్న హత్యలు ఈ ఏడాది 35కు చేరడం, రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 349 మంది బలవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నగరంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని పోలీసులు భరోసా ఇస్తున్నా.. పెరుగుతున్న ఈ ఘోరాలు చూస్తుంటే ‘విశాఖ సేఫేనా?’అనే ప్రశ్న ప్రజల మదిలో మెదులుతోంది. - అల్లిపురం విశాఖను సురక్షిత నివాస ప్రదేశంగా మార్చడానికి పోలీస్ శాఖ చేపట్టిన సమర్థవంతమైన చర్యలతో నగరంలో నేరాలు 12.71 శాతం మేర తగ్గుముఖం పట్టాయని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. మంగళవారం పోలీస్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో 2025లో పోలీసులు సాధించిన ప్రగతి, ఛేదించిన కేసుల వివరాలను సీపీ వెల్లడించారు. 2024లో 5,921 కేసులు నమోదు కాగా.. 2025లో 5,168 కేసులు నమోదయ్యాయని వివరించారు. 2026లో మరింత సమర్థవంతమైన పోలీసింగ్‌తో, అత్యాధునిక సాంకేతికతను జోడించి ‘ప్రశాంత విశాఖే’లక్ష్యంగా ముందుకు వెళతామని సీపీ స్పష్టం చేశారు. తొలిసారిగా ‘బడ్స్’యాక్ట్ అమలు అనధికార డిపాజిట్ పథకాల నిషేధ(బడ్స్) చట్టం–2019ను రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా విశాఖలో అమలు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ చట్టం కింద 26 కేసులు నమోదు చేశామన్నారు. ఈ ఏడాది మొత్తం 653 ఆర్థిక నేరాలు నమోదైనట్లు వెల్లడించారు. తగ్గిన దొంగతనాలు 2024లో 1,149 చోరీ కేసులు నమోదు కాగా, 2025లో 1,126 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జరిగిన దొంగతనాల్లో మొత్తం రూ.7.82 కోట్ల సొత్తు చోరీకి గురవగా, అందులో రూ.4.90 కోట్ల విలువైన ఆస్తులను పోలీసులు రికవరీ చేశారు. 2025లో ఇంటి దొంగతనాలు, సెల్‌ఫోన్ దొంగతనాల నేరాల్లో 6 కేజీల బంగారం(విలువ రూ.5.25 కోట్లు), 16.1 కేజీల వెండి, రూ.67లక్షల నగదు, 186 మోటార్ సైకిళ్లు, 9 ఆటోలు, 2 లారీలు, 1 బస్సు, 5 కార్లు, 15 ల్యాప్‌టాప్‌లు, 139 మొబైల్ ఫోన్లు, రూ.6.33 కోట్ల విలువైన 4,222 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. మొత్తం రూ.10.56 కోట్ల విలువైన ఆస్తిని 757 మంది బాధితులకు అందజేశారు. మహిళల భద్రత ప్రాధాన్యంవిజిబుల్ పోలీసింగ్, నేర ప్రభావిత ప్రదేశాల జియో మ్యాపింగ్, మహిళా పోలీసుల పర్యవేక్షణ, కుటుంబ తగాదాలకు సంబంధించి కౌన్సెలింగ్ వంటి చర్యలతో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయని సీపీ తెలిపారు. 2024లో 1,216 కేసులు నమోదు కాగా, 2025లో 951 కేసులు (21.79 శాతం తగ్గుదల) నమోదయ్యాయి. పిల్లలపై నేరాలు కూడా 42.74 శాతం వరకు తగ్గినట్లు సీపీ వెల్లడించారు. 2024లో 131 కేసులు రాగా, 2025లో 75 నమోదయ్యాయి. డ్రోన్లతో నిఘా నేత్రం నగర భద్రత, మత్తు పదార్థాల నియంత్రణ కోసం 22 స్టేషన్ల పరిధిలో 15 డ్రోన్ల ద్వారా 2,833 చోట్ల రెక్కీ నిర్వహించారు. పండగలు, ర్యాలీలు, వీఐపీ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణలో డ్రోన్లను వినియోగించి 453 కేసులు నమోదు చేశారు. సైబర్ నేరాల్లో భారీ రికవరీ సైబర్ కేసులు తగ్గాయని కమిషనర్ తెలిపారు. 2024లో 374 సైబర్ నేరాలు నమోదు కాగా, 2025లో 286 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది 205 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.14.64 కోట్లు రికవరీ చేశారు(గతేడాది ఇది రూ.3.89 కోట్లు మాత్రమే). లోన్ యాప్‌ల ద్వారా మోసపోయిన 126 మంది బాధితులకు రూ.56 లక్షలు తిరిగి ఇప్పించారు. ముఖ్యమైన కేసుల్లో ట్రయల్స్ వేగంగా జరిపి, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా పోలీసులు చర్యలు చేపట్టారు. 2025లో 4,706 కేసులను కోర్టులు పరిష్కరించాయి. ఒక పోక్సో కేసులో 146 రోజుల్లోను, మరో కేసులో 234 రోజుల్లో తీర్పు వెలువడటం గమనార్హం. ప్రజల సహకారంతో సురక్షిత విశాఖ విశాఖకు టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలు వస్తుండటం, భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం కానుండటంతో ప్రముఖుల తాకిడి పెరిగిందని సీపీ తెలిపారు. ప్రైవేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ప్రజల సహకారంతో విశాఖను సురక్షిత నివాస ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామని చెప్పారు. సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. కలవరపెడుతున్న హత్యలు నగరంలో 2024లో 24 మంది హత్యకు గురవగా, ఈ ఏడాది 35 హత్యలు జరిగాయి. మద్యం మత్తు, అక్రమ సంబంధాలు, క్షణికావేశమే హత్యలకు ప్రధాన కారణాలు. ద్వేషపూరిత నరహత్యలు 12, వరకట్న హత్యలు 3, మహిళల హత్యలు 7 జరిగాయి. మిగిలిన హత్యలకు ఆర్థిక వివాదాలు, ప్రేమ వ్యవహారాలు, చిన్నపాటి తగాదాలు కారణమయ్యాయి. ట్రాఫిక్ కఠినం.. అయినా ఆగని మరణాలు రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చినా, మరణాల సంఖ్య స్వల్పంగా పెరిగింది. 2024లో 1,132 ప్రమాదాలు జరగ్గా, 2025లో 1,086 ప్రమాదాలు సంభవించాయి. అయితే మృతుల సంఖ్య 347 (2024) నుంచి 349కి (2025) చేరింది. స్పీడ్ లేజర్ గన్ వినియోగం, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహణ, బైక్ రేసర్లపై కేసులు వంటి చర్యలతో ప్రమాదాలు అదుపులోకి వచ్చాయి. వచ్చే ఏప్రిల్ నాటికి ప్రైవేట్ సంస్థల సహకారంతో ట్రాఫిక్ ఉల్లంఘనులకు ఆటోమేటిక్‌గా ఫైన్లు వేసే ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. -
వచ్చే ఏడాదికి ‘వెలిగొండ’ పూర్తి
సాక్షి, అమరావతి : వెలిగొండ ప్రాజెక్టును 2026 సీజన్ మొదలయ్యే నాటికి పూర్తిచేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో బుధవారం సాగునీటి ప్రాజెక్టులపై ఆ శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తిలతో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి మొదటి వారంలో సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించి రూ.456 కోట్లతో చేపట్టనున్న ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులను ప్రారంభిస్తారన్నారు. 2027 గోదావరి పుష్కరాలు నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే దిశగా పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ ప్రాజెక్టును 2027లో జాతికి అంకితం చేస్తామన్నారు. అలాగే, పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తిచేసి 2026లో అనకాపల్లి వరకు గోదావరి జలాలు తరలిస్తామన్నారు. 2019–24 మధ్య పోలవరానికి కేంద్రం రీయింబర్స్ చేసిన రూ.3,000 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం మళ్లించిందని మంత్రి నిమ్మల ఆరోపించారు.నిధుల మళ్లింపు అంటే అడ్వాన్సును మళ్లించడం నిమ్మలా!?విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని వంద శాతం వ్యయంతో నిర్మించి, ఏపీకి అప్పగించాల్సిన బాధ్యత కేంద్రానిదే. కానీ, కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలంటూ 2014, జూన్ నుంచి 2016 సెప్టెంబరు వరకూ కేంద్రాన్ని నాటి సీఎం చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధమవడంతో 2016, సెప్టెంబరు 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి కేంద్రం అప్పగించింది. 2010–11 నాటి పరిమాణాల ప్రకారం 2013–14 ధరలతో నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని కేంద్రం పెట్టిన షరతుకు కూడా చంద్రబాబు అంగీకరించారు. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి తొలుత ఖర్చుచేస్తే.. ఆ తర్వాత రీయింబర్స్ చేస్తామని కేంద్రం విధించిన షరతుకు సైతం చంద్రబాబు తలొగ్గారు. అంటే.. కేంద్రం రీయింబర్స్ చేసే నిధులు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేసినవే. రాష్ట్ర ఖజానాలోని నిధులను ప్రభుత్వం ప్రాధాన్యత పనులకు ఖర్చుచేస్తుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదే చేసింది. నిధులను మళ్లించలేదు. రాష్ట్రం ఖర్చు చేసిన నిధులనే కేంద్రం తిరిగి ఇచ్చింది. కానీ, మంత్రి నిమ్మల మాత్రం తనకు అలవాటైన రీతిలో అలవోకగా అబద్ధాలు వల్లె వేశారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేయడానికి అడ్వాన్సుగా నిధులిచ్చి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలని 2019 నుంచి నాటి సీఎం వైఎస్ జగన్ కోరుతూ వచ్చారు. 2023, జూన్ 5న ఆ ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించింది. ఆ ప్రకారమే 2024–25లో రెండు విడతలుగా రాష్ట్రానికి రూ.5,052.71 కోట్లు విడుదల చేసింది. వాటిని ఎస్ఎన్ఏ (సింగిల్ నోడల్ ఏజెన్సీ) ఖాతాలో జమచేసి.. పోలవరం ప్రాజెక్టు పనులకే వ్యయంచేయాలని కేంద్రం షరతు పెట్టింది. కానీ, ఆ నిధులను చంద్రబాబు సర్కారు ఇతర అవసరాలకు మళ్లించింది. అడ్వాన్సుగా ఇచ్చిన నిధులను ఎలా మళ్లిస్తారంటూ పీపీఏ అధికారులు, కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి, సాక్షాత్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ పదేపదే ఆగ్రహం వ్యక్తంచేయడంతో పలు విడతలుగా ఇప్పటివరకూ రూ.4,352.71 కోట్లను ఎస్ఎన్ఏ ఖాతాలో ప్రభుత్వం జమచేసి ఖర్చుపెట్టింది. ఇప్పటికీ అడ్వాన్సుగా ఇచ్చిన నిధుల్లో రూ.700 కోట్లను ఇతర అవసరాలకు మళ్లించేసింది. నిధులను సద్వినియోగం చేసుకోకుండా ఇతర అవసరాలకు మళ్లించడంవల్లే 2025–26 బడ్జెట్లో పోలవరానికి రూ.5,936 కోట్లను కేంద్రం కేటాయించినా.. ఇప్పటికీ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదన్నది వాస్తవం కాదా మంత్రివర్యా!? -
డెంగీ మరణాల్లో ఏపీకి 4వ స్థానం
సాక్షి, అమరావతి : ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు ఉందన్నట్లుగా ఉంది రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం పనితీరు. దోమలపై డ్రోన్లతో యుద్ధం అంటూ మాటలు కోటలు దాటించిన కూటమి సర్కారు.. ఆచరణలో మాత్రం అభాసుపాలవుతోంది. కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు కట్టబెట్టడంపైనే ధ్యాస పెట్టిన ప్రభుత్వం.. ప్రజారోగ్య రక్షణపై మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. ఫలితంగా.. డెంగీ, మలేరియా తదితర సీజనల్ వ్యాధుల నియంత్రణలో దారుణంగా విఫలమవుతోంది. వ్యాధుల బారినపడి బాధితులు మరణిస్తుంటే విషయం బయటకు పొక్కకుండా చూసుకునే పనిలో పడింది తప్ప వాటి నియంత్రణ చర్యలపై ఏమాత్రం దృష్టిసారించడంలేదు. దీంతో.. డెంగీ మరణాల్లో దేశంలోనే ఏపీ నాలుగో స్థానం దక్కించుకుంది. ఈ బండారాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ బట్టబయలు చేసింది. ఈ వివరాల ప్రకారం.. 2025 జనవరి నుంచి నవంబరు మధ్య ఏపీలో 2,386 కేసులు నమోదు కాగా.. ఐదు మరణాలు సంభవించినట్లు వెల్లడించింది. 49 మరణాలతో కేరళ తొలి స్థానంలో, మహారాష్ట్ర (13), తమిళనాడు (12) రెండు, మూడుస్థానాల్లో ఉన్నాయి. 2025 జనవరి నుంచి నవంబరు మధ్య దేశవ్యాప్తంగా 1.13 లక్షల పాజిటివ్ కేసులు, 94 మరణాలు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.రూ.25 వేలు ఖర్చయింది..రెండు నెలల కిందట వైరల్ జ్వరం రావడంతో నగరంలోని ప్రైవేట్ ల్యాబ్‌లో పరీక్ష చేయించగా డెంగీ అని తేలింది. దీంతో.. వైద్యం కోసం ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రికి వెళ్తే ఉచిత వైద్యం కుదరదన్నారు. గత్యంతరంలేక బిల్లు చెల్లిస్తానని చెప్పి అడ్మిట్ అయ్యాను. చివరికి రూ.25 వేల ఖర్చయింది. డబ్బు కోసం బంధువుల దగ్గరఅప్పుచేయాల్సి వచ్చింది. – అప్పారావు, విజయవాడరెండేళ్లుగా మరణాలు..అయితే, రాష్ట్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. 2023లో రాష్ట్రంలో డెంగీ మరణాలు నమోదు కాలేదు. మలేరియా, జపనీస్ ఎన్సెఫాలిటిస్ (జేఈ) వైరస్ మరణాలు కూడా 2023లో ఒక్కటంటే ఒక్కటీ నమోదుకాలేదు. కానీ, 2025 జనవరి నుంచి సెప్టెంబరు వరకు.. ఈ వ్యాధులతో పలువురు చనిపోయారు.» అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముగ్గురు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు మలేరియా బారినపడి మరణించారు. »గతేడాది శ్రీకాకుళం, అల్లూరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. » ఇక డెంగీతో ఈ ఏడాది నవంబరు నాటికి ఐదుగురు మరణించారు. మృతులు కర్నూలు, అన్నమయ్య, బాపట్ల, ఇతర జిల్లాల వారు. » గతేడాది కూడా ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో ఇద్దరు డెంగీ బారినపడి మృత్యువాతపడ్డారు. » 2024లో జేఈ వైరస్ బారినపడిన ఇద్దరు మరణించారు. » ఇదే ఏడాది కలరా బారినపడి ఏడుగురు మరణించారు.చికిత్సల కోసం అప్పులు..వ్యాధుల వ్యాప్తి నియంత్రణలోనే కాక, బాధితులకు ఉచిత సేవల కల్పనలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కిడ్నీ, గుండె సంబంధిత, క్యాన్సర్ వంటి పెద్ద జబ్బులతో పాటు సీజనల్ వ్యాధుల బారిన పడిన వారికి కూడా ఆరోగ్యశ్రీ పథకం అమలుచేసింది. కొన్నేళ్లుగా రాష్ట్రంలో వైరల్ జ్వరాల బారినపడిన వారిలో ప్లేట్లెట్స్ తగ్గుదల సమస్య తలెత్తుతోంది. ఈ క్రమంలో.. ఎలిసా నిర్ధారణ పరీక్షతో సంబంధంలేకుండా వైరల్ జ్వరంతో బాధపడుతూ ర్యాపిడ్ కిట్‌లో పాజిటివ్ ఉండి, ప్లేట్లెట్ తగ్గుదల సమస్య ఉన్నవారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా డెంగీ చికిత్స అందించే విధానాన్ని వైఎస్ జగన్ హయాంలో అమలుచేశారు. అయితే, చంద్రబాబు గద్దెనెక్కాక ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుండడంతో డెంగీ, మలేరియా తదితర వ్యాధులతో పాటు, గుండె, కిడ్నీ బాధితులకు సైతం ఉచిత వైద్యసేవలు అందడంలేదు. డెంగీ, వైరల్ జ్వరాల చికిత్సలకు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తే రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకూ ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో.. ఆరోగ్యశ్రీ వర్తించక వైద్యం కోసం అప్పులుచేయాల్సి వస్తోందని పేద, మధ్యతరగతి కుటుంబాల వారు గగ్గోలు పెడుతున్నారు. -
ప్రభుత్వం దారుణంగా విఫలం
సంక్షేమ హాస్టళ్లలో 45 మంది పిల్లలు చనిపోవడం చిన్న విషయమేమీ కాదు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల సంరక్షణ ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. జ్వరం, కడుపు నొప్పి, కంటి, బ్లడ్ ఇన్ఫెక్షన్ తదితర కారణాలతో పిల్లలు మృతి చెందారని చెబుతున్నారంటే... ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంలో, తగిన వైద్య సాయం అందించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైనట్లే!– రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యలు సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ, ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థినీ విద్యార్థుల వరుస మరణాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే అని తేల్చిచెప్పింది. విద్యార్థులు జ్వరం, కడుపు నొప్పి, కంటి, బ్లడ్ ఇన్ఫెక్షన్ తదితర కారణాలతో చనిపోవడం అంటే ముందుజాగ్రత్త చర్యలు, తగిన వైద్యం అందించడంలో దారుణంగా విఫలమైనట్లేనని ఆక్షేపించింది. సంక్షేమ హాస్టళ్లలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందజేసే విషయంలో నిర్దిష్ట విధానం ఉందా...? అని ప్రశ్నించింది. ఉంటే దానిని తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హాస్టళ్లలో నెలలో ఎన్నిసార్లు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్న దానిపై కార్యాచరణ రూపొందించాలని, ఇప్పటివరకు సంభవించిన మరణాలపై పూర్తి వివరాలను సమర్పించాలని సూచించింది. విద్యార్థులు ఏఏ కారణాలతో చనిపోయారో చెబుతూ, అందుకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని స్పష్టం చేసింది. మరణించిన వారి కుటుంబాలకు ఇప్పటివరకు ఏమైనా పరిహారం చెల్లించి ఉంటే ఆ వివరాలను కూడా అందించాలంది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశంపై ఇప్పటికే దాఖలైన ఓ పిల్లో కూడా ఈ వివరాలు అన్నింటినీ పొందుపరచాలని ప్రభుత్వానికి నిర్దేశించింది. కారణాలు తెలుసుకుంటాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, 45 మంది విద్యార్థులు చనిపోయారని పిటిషనర్ చెబుతున్నారని... అందుకు కారణాలు ఏమిటి? హాస్టళ్లలోని పరిస్థితుల నేపథ్యమా? లేక ఇతర అంశాలు ఉన్నాయా? అన్న విషయాలను నిర్ధారించుకోవాల్సి ఉందని చెప్పారు. పిల్లలు మరణించినప్పుడు అందుకుగల కారణాలపై నివేదికలు ఉంటాయని, వాటిని కూడా కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు. ప్రతి 15 రోజులకు హాస్టళ్లకు వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని గ్రామాల్లోని ఏఎన్ఎంలకు ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు వీలుగా ధర్మాసనం విచారణను 21కి వాయిదా వేసింది. ఇటీవల హాస్టళ్లలో మరణాలు పెరిగాయి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సంక్షేమ హాస్టళ్లలో పిల్లల బాగోగులు చూసేందుకు హెల్త్ వలంటీర్లను నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఉత్తరాంధ్ర కమిటీ ఆఫ్ గిరిజన సంక్షేమ సంఘం ప్రతినిధి పలక రంజిత్‌కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... సంక్షేమ హాస్టళ్లలో మృతి చెందిన పిల్లల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఇటీవల హాస్టళ్లలో మరణాలు పెరిగాయన్నారు. హెల్త్ వలంటీర్లను నియమించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. -
సాగర గర్భంలో 'స్వదేశీ' సింహం
సాక్షి, విశాఖపట్నం : దేశ రక్షణ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, హిందూ మహాసముద్ర జలాల్లో ఆధిపత్యం చెలాయించే దిశగా భారత నౌకాదళం సరికొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఇప్పటికే వరుస క్షిపణి ప్రయోగాలతో దూసుకెళ్తోన్న నౌకాదళం తాజాగా మరో అడుగు ముందుకేసింది. శత్రు దేశాల గుండెల్లో గుబులు రేపేలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నాలుగో ‘బాహుబలి’ బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి (ఎస్ – 4 స్టార్) సిద్ధమవుతోంది. విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో నిర్మితమవుతున్న 7 వేల టన్నుల బరువున్న ఈ జంబో సబ్‌మెరైన్ రెండు రోజుల క్రితం సీ ట్రయల్స్ కోసం సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. 40 ఏళ్ల క్రితం ప్రారంభమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్స్ (ఏటీవీ) ప్రాజెక్టులో ఈ సబ్‌మెరైన్ ఒక కీలక మైలురాయిగా మారనుంది. 2027 జనవరిలో నౌకాదళ అమ్ముల పొదిలోకి.. » అరిహంత్ క్లాస్ బాలిస్టిక్ మిసైల్ సబ్‌మెరైన్ శ్రేణిలో ఇదే చివరిది. అందుకే గత మూడు జలాంతర్గాముల కంటే భిన్నంగా భారీగా తయారు చేస్తున్నారు. » భారత నౌకాదళంలో ప్రస్తుతం షిప్ సబ్మెర్సిబుల్ బాలిస్టిక్ న్యూక్లియర్(ఎస్ఎస్బీఎన్)లు నాలుగున్నాయి. ఇందులో ఇప్పటికే రెండు సబ్మెరైన్లు నౌకాదళంలో సేవలందిస్తున్నాయి. » మూడో సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ అరిథామన్ సీ ట్రయల్స్ పూర్తి చేసుకుంది. 2026 చివర్లో సేవలందించేందుకు సిద్ధమవుతోంది. » ఈ సబ్మెరైన్ల నిర్మాణం కోసం 1984లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెస్సెల్ (ఏటీవీ) ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. » గతంలో నిర్మించిన 3 సబ్మెరైన్లలో 60 నుంచి 75 శాతం స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించగా, ఈ ఎస్–4 స్టార్ జలాంతర్గామిని 80 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. » తొలివిడత సీ ట్రయల్స్ పరీక్షలు విజయవంతంగా జరుగుతున్నాయని... మరో మూడు విడతల్లో పూర్తి చేసిన తర్వాత 2027 జనవరిలో విధుల్లో చేరనుందని నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. అరిహంత్ క్లాస్‌లో అదరగొట్టే సబ్‌మెరైన్ » మొదటి ఎస్ఎస్బీఎన్ అయిన అరిహంత్ క్లాస్ సబ్‌మెరైన్ నిర్మాణం 1998లో మొదలైంది. » అదే సంవత్సరం పోఖ్రాన్లో అణ్వాయుధాలను భారత్ పరీక్షించింది. » అరిహంత్ 2016 నుంచి సేవల్లో చురుగ్గా ఉంది. » రెండో సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ అరిఘాత్‌ను 2024 ఆగస్టు 29న జాతికి అంకితం చేశారు. » అరిథామన్ 2026లో నౌకాదళంలో చేరనుంది. » వీటన్నింటికంటే భిన్నంగా శత్రు దేశాలకు భయం పుట్టించేలా భారీగా ఎస్–4 స్టార్ సబ్‌మెరైన్ తయారు చేశారు. » మొదటి మూడు సబ్మెరైన్లు 110 మీటర్ల పొడవు, 6 వేల టన్నుల బరువుతో తయారు చేశారు. ఇవి 16 కే, 15 ఎస్ఎల్బీఎంలని లేదా కే–4 బాలిస్టిక్ మిసైల్స్‌ని నాలుగింటిని మాత్రమే తీసుకెళ్లగలవు. కొత్తగా తయారు చేసిన ఎస్–4 స్టార్ సబ్‌మెరైన్ మాత్రం 120 మీటర్ల పొడవు, 7 వేల టన్నుల బరువుతో నిర్మితమైంది. ఇది ఏకంగా 8 కే–4 బాలిస్టిక్ మిసైల్స్‌ని తీసుకెళ్లే సామర్థ్యంతో డిజైన్ని విస్తరించారు.ఎస్ – 5 క్లాస్‌కు తొలి మెట్టుగా » అరిహంత్ క్లాస్ తర్వాత భారీ సబ్మెరైన్లు నిర్మించేందుకు భారత నౌకాదళం ప్రణాళికలు రూపొందించింది. » ఎస్–5 ప్రాజెక్టుగా 5 జలాంతర్గాములు తయారు చేయనున్నారు. » దీనికి ఎస్ – 4 స్టార్ సబ్‌మెరైన్ నిర్మాణం తొలి మెట్టుగా భావిస్తున్నారు. » ఎందుకంటే రాబోయే జలాంతర్గాముల్ని రెట్టింపు బరువుతో అంటే ఏకంగా 13,500 టన్నుల భారీ సామర్థ్యంతో నిర్మించాలని భావిస్తున్నారు. » 2030 నాటికి ఎస్ – 5 ప్రాజెక్టులో తొలి సబ్‌మెరైన్ సేవలు అందించనుందని నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి. » మొత్తానికి విశాఖ తీరం వేదికగా జరుగుతున్న ఈ పరిణామాలు, హిందూ మహాసముద్రంలో చైనా వంటి దేశాల కదలికలకు చెక్ పెట్టే దిశగా భారత్ వేస్తున్న బలమైన అడుగులుగా రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
బాపట్లలో టీడీపీ కార్యాలయానికి రెండెకరాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోట్లాది రూపాయల విలువైన భూములను తమ పార్టీ కార్యాలయాల కోసం ఇష్టారాజ్యంగా కేటాయించుకుంటున్న సీఎం చంద్రబాబు.. తాజాగా బాపట్లలో రెండెకరాల భూమిని కేటాయించుకున్నారు. పశ్చిమ బాపట్ల గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 1341–ఎ లోని రెండెకరాలను 33 ఏళ్ల పాటు లీజుకు టీడీపీ ఆఫీసుకు కేటాయిస్తూ బుధవారం ప్రభుత్వం జీఓ జారీచేసింది. బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడి పేరుతో ఆ భూమిని కేటాయించి ఏడాదికి వెయ్యి రూపాయలు లీజు ధరగా నిర్ణయించారు. రెండు నెలల క్రితం తిరుపతి, మచిలీపట్నం నగరాల్లో కూడా అత్యంత విలువైన స్థలాలను ఆ పార్టీ కార్యాలయాల కోసం కేటాయించుకున్నారు. ⇒ కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో రూ.50 కోట్లకు పైగా విలువైన 1.60 ఎకరాలను సంవత్సరానికి రూ.1,000 చొప్పున 33 ఏళ్లకు లీజుకిచ్చారు. ఆ భూమిని గతంలో రవాణా శాఖకు ఇచ్చినా ఆ కేటాయింపును రద్దుచేసి మరీ టీడీపీ జిల్లా కార్యాలయానికి అప్పగించారు. ⇒ తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామంలో రూ.100 కోట్ల విలువైన రెండెకరాల ప్రభుత్వ భూమిని కూడా రూ.వెయ్యికి 33 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేశారు. ⇒ అలాగే, కడప నగరంలో రూ.50 కోట్ల విలువైన రెండెకరాల ఆర్ అండ్ బీ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి కేటాయించుకున్నారు. ఈ భూమికి సంబంధించి వివాదం కొనసాగుతున్నా, కోర్టు పరిధిలో ఉన్నా లెక్కచేయకుండా దాన్ని తన పార్టీ జిల్లా అధ్యక్షుడి పేరు మీద ఇచ్చేశారు. విశాఖలో రాష్ట్ర సేవా సమితికి 18.57 ఎకరాలు ఇదిలా ఉంటే.. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గుడిలోవ గ్రామంలో రాష్ట్ర సేవా సమితికి 18.57 ఎకరాల భూమిని కేటాయిస్తూ మరో ఉత్తర్వు ఇచ్చారు. ఈ భూమిని ఎకరాకు రూ.80 లక్షల చొప్పున మొత్తం రూ.14.85 కోట్లు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే, అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో వేదాంత లిమిటెడ్ కంపెనీ ఆన్‌షోర్ డ్రిల్లింగ్ పనుల కోసం గతంలో ఇచ్చిన 9.88 ఎకరాల భూమి లీజును మరో మూడేళ్లు పొడిగిస్తూ ఇంకో ఉత్తర్వు ఇచ్చారు. ఇక నూజివీడులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ఏర్పాటుకు 9.96 ఎకరాల భూమిని 33 ఏళ్ల పాటు ఉచితంగా కేటాయించారు. ఆ భూమిని హార్టీకల్చర్, సెరికల్చర్ విభాగానికి బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులిచ్చారు. పేదలకు ఇవ్వకుండా పార్టీకి కేటాయింపులు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు పట్టణాల్లో అయితే రెండు సెంట్లు, గ్రామాల్లో మూడుసెంట్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పటివరకూ ఆ హామీ గురించి పట్టించుకోలేదు. పైగా పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వకుండా తన పార్టీ ఆఫీసులకు మాత్రం వందల కోట్ల విలువైన స్థలాలను కేటాయించుకుంటున్నారు. అంతేకాక.. గతంలో లీజుకు తీసుకున్న భూములపై ఇంకా అధికారాలు పెంచుకునేలా పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూముల కేటాయింపు లీజు కాలాన్ని 33 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు పొడిగించారు. -
ఊపిరి తీసిన సెల్‌ఫోన్
వినుకొండ: సెల్ ఫోన్ ధ్యాస ఓ విద్యార్థి ఊపిరి తీసింది. ఫోన్ చూసుకుంటూ వుండిపోవడంతో దిగాల్సిన స్టాప్ దాటిపోవడంతో కంగారులో కదులుతున్న బస్సు నుంచి దూకిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లి సమీపంలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన కన్న వారికి పుత్ర శోకం మిగిల్చింది.వివరాలు... ప్రకాశం జిల్లా పుల్లల చెరువుమండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డి(16) గుంటూరు జిల్లా వినుకొండ దరి విష్ణుకుండినగర్‌లో బంధువుల ఇంటి వద్ద ఉండి స్థానిక బాలాజీ ఐటీఐ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. రోజూలాగానే కళాశాలకు వెళ్లేందుకు బుధవారం బస్సు ఎక్కిన లక్ష్మీరెడ్డి సెల్ఫోన్లో లీనమయ్యాడు. దిగాల్సిన బస్టాప్ వచ్చిన విషయాన్ని గమనించలేకపోయాడు. స్టాప్ దాటి బస్సు వెళ్తుండగా తేరుకుని డ్రైవర్‌ను బస్సు ఆపాలని కోరాడు. డ్రైవర్ బస్సు ఆపే ప్రయత్నం చేస్తుండగానే లక్ష్మీరెడ్డి బస్సులో నుంచి కిందకు దూకేశాడు. దీంతో నియంత్రణ కోల్పోయి రోడ్డుపై పడిపోవడంతో నడుము, వెన్నెముక భాగానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని లక్ష్మీరెడ్డిని ఆస్పత్రికి తరలించారు. కొంతసేపటికి విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రయాణ సమయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, పెద్దలు సూచిస్తున్నారు. -
అధర్మాస్పత్రిలో అరణ్యరోదన
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో రోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, ఇక్కడి సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆమదాలవలస మండలం కొర్లకోటకు చెందిన హేమలత అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి సిబ్బంది తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన కుమార్తె హైందవితో కలిసి బుధవారం ఉదయం రిమ్స్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆమె మాట్లాడుతూ తన కుమార్తెను రెండు రోజుల క్రితం రిమ్స్‌కు తీసుకురాగా వైద్యులు మంగళవారం ఉదయం శస్త్రచికిత్స(కొండనాలుక వ్యాధి) పూర్తయ్యాక ఐసీయూలో ఉంచారని తెలిపారు. అక్కడకు వెళ్లినప్పటి నుంచి ఆపరేషన్ థియేటర్ సిబ్బంది తరచూ వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. వార్డుకు తరలించిన వారు సైతం డబ్బులు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవని, మరుగుదొడ్లలో నీరు రావడం లేదని చెబితే తనపై కేకలు వేశారని వాపోయారు. కొందరు సిబ్బంది, వైద్యులు వచ్చి బయటకు వెళ్లి చికిత్స చేయించుకోమన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త పోలీస్ శాఖలో పని చేస్తున్నారని చెప్పినా డబ్బులు అడుగుతున్నారని, తమ పరిస్థితే ఇలా ఉంటే ఇక పేదల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అధికారులు ఆలోచించాలని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రిమ్స్‌లో సిబ్బంది పనితీరు అసలు బాగలేదని, ప్రతిదానికీ లంచాలు ఇవ్వాల్సి వస్తోందని ఆరోపించారు. సుమారు అరగంటకు పైగా ఆమె ఆస్పత్రి వద్ద బైఠాయించగా.. సూపరింటెండెంట్ ప్రసన్నకుమార్ ఆమెకు నచ్చజెప్పి వార్డుకు తీసుకువెళ్లారు. సిబ్బందిని పిలిపించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై గురువారం విచారణ జరిపిస్తామని హేమలతకు హామీ ఇవ్వడంతో ఆమె ఆందోళన విరమించి తిరిగి తన కుమార్తెను ఐసీయూలోకి తీసుకెళ్లారు. నివేదిక అందాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ ‘సాక్షి’కి తెలిపారు. -
ఆప్కాఫ్.. నువ్వా.. నేనా..
సాక్షి, అమరావతి: సీనియర్ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర మధ్య ఆధిపత్యపోరు తారస్థాయికి చేరింది. ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య (ఆప్కాఫ్) చైర్మన్ పదవి విషయంలో ఇద్దరూ నువ్వా.. నేనా.. అ న్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మత్స్యశాఖలో కనీస అనుభవంలేని డోలా శంకర్‌ను ఆ శాఖ కమిషనర్‌గా నియమించడంతో మొదలైన వీరి పోరు ఆప్కాఫ్ పదవిపై కత్తులు దూసుకునే స్థాయికి చేరింది.ఆది నుంచి కొల్లు రవీంద్రదే పెత్తనం మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడైనా.. తొలినుంచి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఈ శాఖపై పెత్తనం చలాయిస్తున్నారు. వేటనిషేధ భృతి దగ్గర నుంచి కేంద్ర పథకాలకు అర్హుల ఎంపిక, నిధుల వ్యయం వరకు అన్నింటా కొల్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. తమ నియోజకవర్గానికి చెందిన డోలా శంకర్‌ను కమిషనర్‌గా నియమించుకోవడమేగాక.. వివిధ హోదాల్లో తన మనుషులకు మత్స్యశాఖలో రూ.లక్షల వేతనంతో కొలువులు కట్టబెట్టి వసూళ్లపర్వం సాగించారన్న ఆరోపణలున్నాయి. కలెక్టర్ల సమావేశంలో డోలా పనితీరుపై సీఎం చంద్రబాబు కూడా మండిపడ్డారు. దీంతో సీనియర్ ఐఏఎస్ అధికారికి కమిషనర్ బాధ్యతలు అప్పగించాలని మంత్రి అచ్చెన్నాయుడు ప్రయతి్నంచగా.. రవీంద్ర మంత్రి లోకేశ్ ద్వారా చక్రం తిప్పారు. దాదాపు పదేళ్ల కిందట రిటైరైన రామశంకర్కు పునర్నియామకం ద్వారా కమిషనర్ బాధ్యతలు అప్పగించారు. కొల్లు జోక్యంపై అచ్చెన్నాయుడు పలుమార్లు చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా మంత్రి కొల్లు తన అనుచరుడైన కొల్లు పెద్దిరాజుకు దక్కేలా చేయగలిగారు. కార్పొరేషన్ పరిధిలో ఓడబలిజ, జాలారి, నెయ్యల, పట్టపు, గుండ్ల వంటి ఉపకులాలకు చెందిన వారిని కాదని కార్పొరేషన్‌తో సంబంధం లేని అగ్నికులక్షత్రియ వర్గానికి చెందిన నరసాపురం వాసి పెద్దిరాజుకు ఈ పదవి ఇవ్వడంపై అచ్చెన్నాయుడు విభేదించినా ఎవరూ పట్టించుకోలేదు. సీఎం చెప్పినా.. కోర్టుకెక్కిన కొల్లు వర్గీయులు నామినేటెడ్ పదవుల పందేరంలో భాగంగా మంత్రి లోకేశ్ అండదండలతో రవీంద్ర తన అనుచరుడైన కడప జిల్లా మత్స్యకార సంఘాల సమాఖ్య చైర్మన్ రాంప్రసాద్‌ను ఆప్కాఫ్ చైర్మన్‌గా అధిష్టానం ద్వారా ప్రకటింప చేయించుకున్నారు. తన శాఖలో మంత్రి కొల్లు జోక్యం ఏమిటో తేల్చాలంటూ మంత్రి అచ్చెన్న ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చంద్రబాబు.. రాంప్రసాద్‌ను పక్కనపెట్టి నంద్యాల ఎంపీ శబరి అనుచరుడైన కర్నూలు జిల్లా మత్స్యకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడు నవీన్‌కుమార్‌ను ఆప్కాఫ్ చైర్మన్‌గా ఎంపిక చేశారు. సీఎంవో ఆదేశాల మేరకు నియమితులైన నవీన్‌కుమార్ ఆప్కాఫ్ చైర్మన్‌గా బాధ్యతలు కూడా స్వీకరించారు. దీంతో రాంప్రసాద్‌ను బలపరుస్తున్న మంత్రి రవీంద్ర వర్గీయులైన జిల్లా సమాఖ్యల వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పదవికి ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. తనశాఖ మంత్రి అచ్చెన్నాయుడైనా.. తొలినుంచి మంత్రి కొల్లుకు వత్తాసు పలుకుతున్న మత్స్యశాఖ కమిషనర్ రామ్‌శంకర్‌నాయక్ ఎన్నికల నిర్వహణకు సన్నద్దమయ్యారు. జనవరి 8వ తేదీన ఆప్కాఫ్ జనరల్ బాడీ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. దీంతో ‘నా అనుమతి లేకుండా.. నాకు తెలియకుండా.. నా శాఖ పరిధిలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో చూస్తా..’ అంటూ అచ్చెన్నాయుడు నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో గెలవాలని రాష్ట్రంలోని 13 జిల్లా సమాఖ్య చైర్మన్లను తమ వైపు తిప్పుకునేందుకు రాంప్రసాద్, నవీన్‌కుమార్ ప్రయత్నిస్తున్నారు. ఓటుకు రూ.5 లక్షల వరకు బేరసారాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు నిర్వహించాలని, నిలిపేయాలని మంత్రులు ఎవరికివారు ప్రయత్నిస్తున్నారు. రూ.కోట్లు కొల్లగొట్టేందుకే ఆప్కాఫ్పై పెత్తనం ఏపీ సహకార సంఘాల చట్టం–1964 ద్వారా 1987లో ఏర్పాటైన ఆప్కాఫ్.. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఉన్న 2,136 మత్స్య సహకార సొసైటీలు, వాటి పరిధిలో ఉన్న మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తుంది. వేటకు వెళ్లే బోట్లకు సబ్సిడీ డీజిల్ ఆయిల్ సరఫరా చేసే అవుట్‌లెట్స్, వాటి మార్కెటింగ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఆప్కాఫ్కు మత్స్యశాఖ అదనపు డైరెక్టర్ ఎండీగా వ్యవహరిస్తుండగా, బైలా ప్రకారం చైర్మన్, వైస్ చైర్మన్లను జిల్లా సమాఖ్యల ద్వారా ఎన్నకుంటారు. ప్రాథమిక మత్స్య సహకార సొసైటీలను ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎఫ్పీవో)లుగా అభివృద్ధి చేసేందుకు రెండేళ్ల కిందట ఆప్కాఫ్కు జాతీయ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) రూ.1,274 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే రూ.637 కోట్లు విడుదల కూడా చేసింది. వీటిని ఎంపిక చేసిన 182 ప్రాథమిక మత్స్య సహకార సొసైటీలను ఎఫ్ఎఫ్పీవోలుగా అభివృద్ధి చేసేందుకు ఖర్చు చేయాల్సి ఉంది.ఇప్పటికే ఈ ప్రాజెక్టు పేరు చెప్పి 50 మందికి పైగా తమ అనుచరులను నియమించుకున్నారు. వీరికి పైసా పనిలేకున్నా రూ.లక్షల జీతాలిస్తున్నారు. ఈ నిధులపై కన్నేసినందునే మంత్రులు ఈ శాఖపై పెత్తనం కోసం ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. -
22ఏ భూములపై మళ్లీ రీ వెరిఫికేషన్
సాక్షి, అమరావతి: నిషేధిత జాబితా (22ఏ)లో ఉన్న భూములపై రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి కసరత్తు జరుగుతోంది. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో భాగంగా యంత్రాంగం నాలుగు నెలలుగా రెండు సార్లు రీ వెరిఫికేషన్ చేసింది. అయినా, ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. వివాదాలు లేని భూములపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా ఆ పని చేయలేకపోతోంది. దీంతో మళ్లీ వెరిఫికేషన్ జరిపిస్తున్నారు. చంద్రబాబు సర్కారు వచ్చాక 22ఏ నుంచి తమ భూములను తొలగించాలని గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా 6,846 దరఖాస్తులు వస్తే కేవలం 829 మాత్రమే రెవెన్యూ యంత్రాంగం క్లియర్ చేసింది. 305 దరఖాస్తులకు అనుమతివ్వగా 524 తిరస్కరించింది. 6,017 పెండింగ్‌లో ఉంచారు. వీటిపై నిర్ణయం తీసుకోవడానికి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు వెనుకాడుతున్నారు. వివాదాల భయంతో ప్రభుత్వ స్థాయిలోనే పరిష్కరించాలనే రీతిలో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)కు పంపుతున్నారు. అయితే, సీసీఎల్ఏ, ప్రభుత్వ స్థాయిలోనూ స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో దరఖాస్తులు జిల్లాల నుంచి సీసీఎల్ఏ, అక్కడినుంచి జిల్లాల చుట్టూ తిరుగుతున్నాయి. వాస్తవానికి రైతులు, భూముల యజమానులు పెట్టుకున్న దరఖాస్తులు లక్షల సంఖ్యలో ఉన్నాయి. కాగా, బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను తొలుత పరిగణనలోకి తీసుకుంది. వాటిలో 90 శాతం పరిష్కరించలేకపోయింది. మండలాల వారీగా 22ఏ జాబితాలో అన్ని భూములపైనా వెరిఫికేషన్ జరిపింది. వీఆర్వో, డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్ తనిఖీ చేసిన తర్వాత ఆర్డీవో, జేసీ, కలెక్టర్ స్థాయిలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. తహసీల్దార్... 22ఏ నుంచి తొలగించాలని సిఫారసు చేసిన భూములనూ పెండింగ్‌లో ఉంచారు. ఎమ్మెల్యేలు, టీడీపీ నేతల జోక్యం ఉండడంతో చిక్కుల్లో పడతామని జిల్లా అధికారులు, రెవెన్యూ ఉన్నతాధికారులు జంకుతున్నారు. 22ఏలోని భూములపై కన్నేసిన టీడీపీ ప్రజాప్రతినిధులు సంబంధిత యజమానులతో బేరాలు మాట్లాడుకుని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో సక్రమంగా ఉన్నాసరే పరిష్కారానికి అధికారులు భయపడుతున్నారు. ఎలాగోలా సమస్యకు తెరపడాలని భూ యజమానులు భావిస్తుండగా, దానిని సొమ్ము చేసుకోవడానికి టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. దీంతో గందరగోళం నెలకొంది. -
మద్యం అమ్మకాలపై ‘న్యూ ఇయర్ సెస్’.. ‘పచ్చ’ సిండికేట్‌కి కిక్కే కిక్కు
సాక్షి, అమరావతి: మద్యం అమ్మకాలపై ‘న్యూ ఇయర్ సెస్’ వసూళ్లకు సర్కారు అనధికారిక అనుమతులు ఇచ్చేసింది. ఈ కానుకతో కొత్త సంవత్సరంతో ‘కిక్కే.. కిక్కు’ అంటోంది టీడీపీ మద్యం సిండికేట్. రాష్ట్రంలో మద్యం విక్రయాల వ్యవస్థను గుప్పెట పట్టిన టీడీపీ సిండికేట్ నూతన సంవత్సర వేడుకలను అవకాశంగా చేసుకుని మరింత దోపిడీకి తెగబడింది. అదనపు విక్రయ సమయాలకు ప్రభుత్వం అధికారికంగా పచ్చజెండా ఊపగా.. అనధికారిక వసూళ్లకు కూడా సై అంది. తద్వారా రెండ్రోజుల్లోనే రూ.500 కోట్ల మద్యం అమ్మకాలు, అనధికారికంగా మరో రూ.100 కోట్లు కొల్లగొట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కరకట్ట బంగ్లా కనుసన్నల్లో రాష్ట్రంలో సాగుతున్న మద్యం దోపిడీ విధానంలో కొత్త అంకానికి తెరలేచింది. ఇకపై ఏ పండుగ వచ్చినా ఇదే విధానమని స్పష్టమైన సంకేతాలిచ్చింది. క్వార్టర్ బాటిల్‌పై రూ.50 బాదుడు కొత్త ఏడాది వేడుకలను టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి మరో అవకాశంగా చంద్రబాబు ప్రభుత్వం మార్చేసింది. అందుకోసమే బుధ, గురువారాల్లో ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు, అర్ధరాత్రి ఒంటిగంట వరకు బార్లలో మద్యం విక్రయాలకు అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఎందుకంటే రాష్ట్రంలోని 3,336 మద్యం దుకాణాలు, 540 బార్లు టీడీపీ సిండికేటే ఏకపక్షంగా దక్కించుకుంది. దాదాపు 75 వేల బెల్ట్ దుకాణాలను అనధికారికంగా ఏర్పాటు చేసి ఊరూ వాడా మద్యం ఏరులై పారిస్తోంది. అంటే మొత్తం మద్యం వ్యవస్థ అంతా టీడీపీ సిండికేట్ గుప్పెట్లోనే ఉంది. ఇప్పటికే బాటిల్‌పై ఎంఆర్పీ ధర కంటే రూ.10 చొప్పున అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇక కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా బుధ, గురువారాల్లో మద్యం ధరలను అనధికారికంగా అమాంతం పెంచేశారు. ‘న్యూ ఇయర్ సెస్’ అంటూ అనధికారికంగా క్వార్టర్ బాటిల్‌పై రూ.50 అదనంగా వసూలు చేయాలని సిండికేట్ నిర్ణయించింది. అంటే ఫుల్ బాటిల్‌పై రూ.200 ధర పెంచేసినట్టే. ఇక బీర్ బాటిల్‌పై కూడా రూ.50 అనధికారికంగా పెంచేశారు. ఆ ప్రకారమే బుధవారం ఉదయం నుంచే మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి వరకు ఈ న్యూ ఇయర్ హంగామా దోపిడీ కొనసాగనుంది. రెండ్రోజుల్లో రూ.500 కోట్ల అమ్మకాలే లక్ష్యంబుధ, గురువారాల్లో మద్యం విక్రయాలు ఎంతగా పెరిగితే.. అంతగా దోపిడీ చేయవచ్చని టీడీపీ సిండికేట్ గుర్తించింది. అందుకే మద్యం విక్రయాల సమయాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఇక సాధారణ రోజుల్లో ఎంఆర్పీ ధరల ప్రకారం రాష్ట్రంలో రోజుకు దాదాపు రూ.90 కోట్ల మేర మద్యం విక్రయాలు సాగుతున్నాయి. 2025 జనవరి 1న రూ.147 కోట్ల మద్యం, 2025 సంక్రాంతి రోజున రూ.225 కోట్ల మద్యం విక్రయించారు. ఇప్పుడు ఆ రికార్డులను తిరగ రాయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. డిసెంబర్ 31న అంటే బుధవారం ఒక్క రోజే రూ.300 కోట్ల మార్కు దాటించాలని స్పష్టం చేసింది. జనవరి 1న విక్రయాలు కలిపి రూ.500 కోట్ల మద్యం విక్రయించాలని ఎక్సైజ్ అధికారులకు అనధికారికంగా టార్గెట్ ఇచ్చింది. వారం రోజులుగా ఎక్సైజ్ శాఖ మొత్తం అదే పనిలో నిమగ్నమైంది. ఎంత వీలైతే అంతగా తాగించేందుకు ఏమేం చేయాలో అన్నీ చేస్తోంది. రాష్ట్రంలోని బీచ్లలోని కూల్‌డ్రింక్స్ షాపులు, పల్లెలు, పట్టణాల్లోని కిళ్లీ కొట్లు, కిరాణా కొట్లను కూడా బెల్ట్ దుకాణాలుగా చేసేసుకోవాలని సిండికేట్‌కు పచ్చ జెండా ఊపింది. సూర్యలంక బీచ్‌లో కూల్‌డ్రింక్ దుకాణాల్లో బహిరంగంగానే మద్యం విక్రయిస్తుండటం గమనార్హం. రాష్ట్రం అంతా అదే పరిస్థితి నెలకొంది. కాగా న్యూ ఇయర్ స్పెషల్‌గా క్వార్టర్ బాటిల్‌పై రూ.50, బీరు బాటిల్‌పై రూ.50 అదనపు దోపిడీ ద్వారా మరో రూ.100 కోట్లు కొల్లగొడతారని అంచనా. తద్వారా మద్యం విక్రయాల అసలు విలువ రూ.600 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు.కరకట్ట బంగ్లా కనుసన్నల్లోనే..రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్ అంతా కరకట్ట బంగ్లా కనుసన్నల్లోనే సాగుతోందన్నది బహిరంగ రహస్యం. అందుకోసమే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఆ స్థానంలో ఏర్పాటు చేసిన రాష్ట్రంలోని మొత్తం 3,336 మద్యం దుకాణాలు, 540 బార్ల లైసెన్సులను టీడీపీ సిండికేట్‌కు ఏకపక్షంగా కేటాయించింది. రాష్ట్రంలో విక్రయిస్తున్న ప్రతి మద్యం బాటిల్‌పై రూ.5 చొప్పున కరకట్ట బంగ్లాకు చేరుతోంది. అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.35వేల కోట్ల మద్యం విక్రయాలను ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు లక్ష్యం నిర్దేశించింది. ఇందుకు కొత్త సంవత్సరం, సంక్రాంతి, ఇతర పండుగల సీజన్‌ను వాడుకోవాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. -
రహస్య పర్యటనలో ఆంతర్యమేంటి?
సాక్షి, అమరావతి: పారదర్శకతకు పాతరేసి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ రహస్యంగా విదేశీ పర్యటనలు చేయడం దుమారం రేపుతోంది. జీవోలను సైతం గోప్యంగా ఉంచి విదేశాల్లో రహస్యంగా పర్యటిస్తుండటంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తన పర్యటనకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలియకుండా గోప్యంగా ఉంచడం ఏమిటనే ప్రశ్నకు అటు టీడీపీ నుంచి గానీ, ఇటు ప్రభుత్వం నుంచి గానీ సరైన సమాధానం రావడం లేదు. గత నెల 30న ఆయన హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తన సతీమణితో కలిసి విదేశాలకు వెళ్లారు. సాధారణంగా సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు ఎక్కడికి వెళ్లినా అధికారికంగా ఉత్తర్వులు ఇస్తారు. ఐఏఎస్, ఐపీఎస్ ఇతర అఖిల భారత సర్వీసు సహా వివిధ స్థాయి అధికారులు అధికారిక విధుల్లో భాగంగా ఒక్కరోజు ఢిల్లీ, ఇతర ప్రాంతాలకు వెళ్లినా అందుకు సంబంధించిన వివరాలతో జీవోలు వెలువడతాయి. సీఎం వ్యక్తిగత పర్యటనలకు వెళ్లినా అందుకు సంబంధించిన జీవోలు జారీ చేస్తారు. సీఎం పర్యటన ఉంటే భద్రతా ఏర్పాట్లు చాలా ఉంటాయి కాబట్టి అందుకోసమైనా వివరాలు వెల్లడిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం జీవోను బయట పెట్టకుండా విదేశీ పర్యటనకు వెళ్లారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు హోరెత్తుతున్నాయి. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచడం ఏమిటని రాజకీయ, మేధావి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. సీఎం హోదాలో చంద్రబాబు ఏమీ చెప్పకుండా విదేశాలకు వెళ్లడాన్ని టీడీపీ నేతలు సమర్థించుకుంటూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ ఐదు రోజుల క్రితమే రహస్యంగా విదేశాలకు వెళ్లారు. ఆయన ఎక్కడికి వెళ్లారనే వివరాలు కూడా బయట పెట్టలేదు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నా గుడ్డిగా సమర్థించుకోవడం తప్ప, తాము ప్రజలకు జవాబుదారీ అనే విషయాన్ని మరచిపోయి టీడీపీ శ్రేణులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయి. -
బాబు కేసుల వివరాలన్నీ ఇవ్వండి
సాక్షి, అమరావతి: నారా చంద్రబాబునాయుడు, పొంగూరు నారాయణ, కొల్లు రవీంద్ర తదితరులు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా ఉన్న 2014–19 మధ్య కాలంలో జరిగిన ఏపీ ఫైబర్‌నెట్, మద్యం విధానం, ఉచిత ఇసుక కుంభకోణాలపై సీఐడీ నమోదుచేసిన కేసుల్లో అన్ని డాక్యుమెంట్లను తనకిచ్చేలా విజయవాడ ఏసీబీ కోర్టును ఆదేశించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు సువర్ణరాజు దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్లపై హైకోర్టు స్పందించింది. సువర్ణరాజు దాఖలు చేసిన మూడు రివిజన్ పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వం–నిందితుల మధ్య అపవిత్ర బంధంఏపీ ఫైబర్‌నెట్, మద్యం విధానం, ఉచిత ఇసుక కుంభకోణాలపై సీఐడీ పెట్టిన కేసుల్లో అన్ని డాక్యుమెంట్లను తనకిచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరిస్తూ ఈనెల 5న జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేసి, అన్ని డాక్యుమెంట్లను తనకిచ్చేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ సువర్ణరాజు హైకోర్టులో ఇటీవల క్రిమినల్ రివిజన్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ లక్ష్మణరావు బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం, నిందితుల మధ్య అపవిత్ర బంధం కొనసాగుతోందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలపై గతంలో నమోదైన క్రిమినల్ కేసులను అన్యాయంగా, దారుణంగా మూసేస్తున్నారని.. ఇప్పటికే ఇలా ఐదారు కేసులను మూసివేశారని ఆయన వివరించారు. అలా మూసేసిన కేసుల తాలూకు కాపీలను కూడా బయటకు రానివ్వడంలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు నిందితులుగా ఉన్న కేసులకు తాలూకు డాక్యుమెంట్లను కోరినా కూడా ఏసీబీ కోర్టు ఇవ్వడంలేదని తెలిపారు. వాటిని తమకు ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించిందన్నారు. థర్డ్ పార్టీగా అన్ని డాక్యుమెంట్లు పొందే హక్కు పిటిషనర్‌కు ఉందన్నారు. వాస్తవానికి ఆ డాక్యుమెంట్లన్నీ కూడా పబ్లిక్ డాక్యుమెంట్లేనని తెలిపారు. న్యాయం కోసమే పోరాటం చేస్తున్నాంసీఐడీ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాణిని సోమయాజీ జోక్యం చేసుకుంటూ.. థర్డ్ పార్టీకి కేసు డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. థర్డ్‌పార్టీ అయినా డాక్యుమెంట్లు పొందవచ్చని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టంగా చెప్పిందని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఆ కాపీలను ఏ ప్రయోజనం కోసం కోరుతున్నారని న్యాయమూర్తి ప్రశి్నంచారు. కేసుల మూసివేతపై హైకోర్టులో రివిజన్ పిటిషన్లు దాఖలు చేసేందుకు కోరుతున్నామని సుధాకర్‌రెడ్డి బదులిచ్చారు. కేసుల మూసివేతపై థర్డ్ పార్టీనే పిటిషన్లు దాఖలు చేయాల్సిన అవసరంలేదని, హైకోర్టు సైతం సుమోటోగా స్పందించవచ్చని ఆయన చెప్పారు. న్యాయం కోసమే తాము పోరాటం చేస్తున్నామన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ మూడు క్రిమినల్ రివిజన్ పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఐడీని ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. -
వైఎస్సార్సీపీ నేత జగ్గిరెడ్డి అక్రమ అరెస్ట్
రావులపాలెం: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగ్గిరెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు. పోలీసుల సహకారంతో కూటమినేతలు రెచ్చిపోయారు. రావులపాలెంలో అనుమతులు లేకుండా విగ్రహాన్ని అడ్డుగోలుగా ఏర్పాటు చేశారు కూటమి నేతలు. అనుమతులు లేని ప్రాంతంలో విగ్రహం పెట్టడంపై జగ్గిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే ప్రదేశంలో ఏ విధమైన విగ్రహం పెట్టకూడదని గతంలో తీర్మానం చేశారు. పంచాయతీ తీర్మానాన్ని పట్టించుకోకుండా విగ్రహాన్ని పెట్టడమే కాకుండా జగ్గిరెడ్డిని అరెస్ట్ చేశారు. జగ్గిరెడ్డిని రావులపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
కురిచేడులో అధికార పార్టీ నేత అరాచకం
ప్రకాశం: జిల్లాలోని కురిచేడలో అధికార పార్టీ నేత అరాచకానికి పాల్సడ్డాడు. ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పితీసుకెళ్లాడు అధికార పార్టీకి చెందిన క్యక్తి. అయితే ఈ ఘటనపై పోలీసుల ఫోక్స యాక్ట్ కేసు నమోదు చేయకుండా అధికార పార్టీకి చెందిన వ్యక్తిని కాపాడే యత్నం చేశారు. అదే సమయంలో రాజీ పడాలని బాధితురాలి తల్లిదండ్రులపై ఒత్తిడి చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షకు తీసుకెళ్లకుండా కురిచేడు ఎస్సై కాలయాపన చేస్తున్నాడు. బాధితులకు న్యాయం చేయకపోతే ఆందోళన చేస్తామని రజక రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పొటికలపూడి జయరాం డిమాండ్ చేశారు. -
కొత్త ఏడాదిలో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి
సాక్షి, తాడేపల్లి: తెలుగు ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 సంవత్సరంలో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారాయన.అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం.. ప్రతీ ఒక్కరి జీవితాలలో ఆరోగ్యం, ఆనందం, సంతృప్తి నింపే సంవత్సరం కావాలి. మీరు, మీ కుటుంబ సభ్యులు వెలుగుతో, నవ్వులతో నిండిన ఏడాది గడపాలని కోరుకుంటున్నా’’ అంటూ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన. Happy New Year to all! May 2026 be a year of good health and deep fulfillment. Wishing you and your loved ones a year filled with light and laughter!#HappyNewYear2026— YS Jagan Mohan Reddy (@ysjagan) January 1, 2026అంతకు ముందు న్యూఇయర్ సందేశాన్ని విడుదల చేసిన ఆయన.. 2026లో ప్రతి ఇంటా సుఖ శాంతలు వెల్లివిరియాలని, ఈ ఏడాది ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందం నింపాలన్నారు. అందరు ఆరోగ్యంగా ఉండాలని.. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికీ దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆకాక్షించారు. -
తిరుపతి జిల్లా: అల్లుడిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన మామ
సాక్షి, తిరుపతి జిల్లా: వెంకటగిరిలో దారుణం జరిగింది. భార్య కోసం అత్తింటికి వెళ్లిన అల్లుడిపై మామ పెట్రోల్ పోసి తగలబెట్టాడు. పాపన హరిప్రసాద్ (32), లక్ష్మీ మౌనిక భార్యభర్తల మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. భర్త హరిప్రసాద్‌పై భార్య లక్ష్మీ మౌనిక అలిగి పుట్టింటికి వెళ్లింది.భార్య, పిల్లల కోసం హరిప్రసాద్.. ఇవాళ అత్తింటికి వెళ్లగా.. అల్లుడిపై మామ దాడి చేశాడు. స్థానికుల సమాచారంతో బాధితుడ్ని కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 70 శాతం శరీరం కాలిపోగా.. మెరుగైన చికిత్సకోసం తిరుపతి రుయాకు తరలించారు. -
రక్షించాల్సిన పాలకులు.. భక్షిస్తున్నారు: వరుదు కల్యాణి
సాక్షి, తాడేపల్లి: ఈ ఏడాది (2025)లో కూటమి ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని.. మహిళలు, చిన్నారుల పాలిట చీకటి సంవత్సరంగా మారిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రక్షించాల్సిన పాలకులే భక్షిస్తున్నారంటూ మండిపడ్డారు. విచ్చలవిడిగా మద్యం షాపులు, బెల్టు షాపులు నెలకొల్పి మహిళల జీవితాలతో ఆడుకున్నారని ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థ పనితీరు అట్టడుగుకు పడిపోయింది.‘‘కేంద్ర హోంశాఖ హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం మారలేదు. డీజీపీ స్థాయి వ్యక్తి మాటలు వింటుంటే పోలీసు వ్యవస్థ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖ జిల్లాలో 213 శాతం గంజాయి, డ్రగ్స్ కేసులు పెరిగాయి. నెల్లూరులో గంజాయికి వ్యతిరేకంగా పని చేస్తున్న కమ్యూనిస్టు నాయకుడు పెంచలయ్యను హత్య చేశారు. 1,450 మందిపై లైంగిక దాడులు జరిగాయి. 5 వేల మందిపై వేధింపులు జరిగాయి. ఏపీలో మహిళలకు రక్షణ లేదు’’ అంటూ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మహిళలకు ఇచ్చిన ఏ హామీనీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. మూడు పార్టీలు కలిసి మూడు చెరువుల నీళ్లు తాగించారు. కూటమి పాలనలో మహిళలు, చిన్నారులు తీవ్రంగా అన్యాయానికి గురయ్యారు. ఏ వర్గానికీ ప్రభుత్వం మేలు చేయలేదు. దోపిడీలో బంగ్లాదేశ్‌కు బాబుగా, శ్రీలంకకు చెల్లిగా మార్చారు. ఆవకాయ ఫెస్టివల్‌కి డబ్బులు ఉంటాయిగానీ, ఆడబిడ్డ పథకం అమలు చేయడానికి డబ్బుల్లేవా?’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నించారు.‘‘మహిళలంటే సామాన్య మహిళలే కాదు, దేవతలను కూడా అవమానం చేశారు. దుర్గమ్మ ఆలయానికి కరెంటు కట్ చేసి అవమానం చేశారు. అనిత, సంధ్య, సవిత.. ఈ ముగ్గురికే న్యాయం జరిగింది. పేరుకే మంత్రులు, కానీ జగన్‌ని దూషించటానికే పని చేస్తున్నారు. హోంమంత్రి అనిత రౌడీలకు పెరోల్ ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. సంధ్యారాణి పీఏ ఒక మహిళను వేధిస్తే తిరిగి బాధితురాలి మీదనే కేసు పెట్టించారు. మంత్రి సవిత కుట్టు మిషన్ల స్కాం చేసి సంపద సృష్టించుకునే పనిలో ఉన్నారు. తప్పులు చేసిన వారిని వదిలేసి, బాధితులపైనే కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వం లోనే చూస్తున్నాం..సింహాచలం ప్రసాదంలో నత్త వచ్చిందని చెబితే వారిపైనే కేసులు పెట్టటం అన్యాయం. జల్సా సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్లో జనసేన, టీడీపీ కార్యకర్తలు అవాంఛనీయ శక్తులుగా వ్యవహరించారు. జగన్, అల్లు అర్జున్‌లను కించపరిచే మాస్కులు వేసుకుని వ్యవహరించారు’’ అంటూ వరుదు కల్యాణి దుయ్యబట్టారు. -
‘ఆ యాప్‌ని జనం వాడకపోతే వారు మాత్రం ఏం చేస్తారు?’
తాడేపల్లి : మన మిత్ర యాప్ పేరుతో సచివాలయ సిబ్బందిని వేధించడం సరికాదని వైఎస్సార్సీపీ ఉద్యోగ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. ఆ యాప్‌ని జనం వాడకపోతే సిబ్బంది మాత్రం ఏం చేస్తారని ప్రశ్నించారు. ఈరోజు(బుధవారం, డిసెంబర్ 31) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రదాన కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘ కొత్త యాప్‌లు వాడాలంటే జనం భయపడుతున్నారు. తెలిసి, తెలియక ఏదైనా నొక్కితే అకౌంట్లో డబ్బులు పోతున్నాయి. అందుకే చాలామంది యాప్‌లు వాడటం తగ్గించారు. అటువంటప్పుడు మన మిత్ర యాప్‌ని వాడటం లేదని సచివాలయ సిబ్బందిని ఎందుకు టార్గెట చేస్తున్నారు?, అసలు మన మిత్ర యాప్ వలన ఏం ప్రయోజనం ఉంది?, 20 శాతం మంది కూడా ఆ యాప్‌ని వాడటం లేదు. ఈ కారణంతో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని వేధించటం కరెక్టు కాదు. వాలంటీర్ల వ్యవస్థ ను రద్దు చేసి వారి పనిని కూడా సచివాలయ సిబ్బందితో చేయిస్తున్నారుఉద్యోగుల సొమ్ము రూ.34 వేల కోట్లు వాడుకుని ఇంతవరకు ఇవ్వలేదు. డీఏ, పీఆర్సీ ఊసే లేదు. సంపద సృష్టిస్తామని చెప్పి ఉద్యోగుల సొమ్ము కాజేస్తారా?’ అని ప్రశ్నించారు. -
‘ఆలయాలపై కూడా రెడ్‌బుక్ రాజ్యాంగమా?’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో దేవుడికి కూడా వేధింపులు తప్పటం లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేవుడు, ఆలయాల మీద కూడా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సింహాచలం ఆలయ ప్రసాదంలో నత్త వచ్చిందని చెబితే నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా?. ఇంతకంటే నీచమైన పని ఇంకోటి ఉంటుందా? అంటూ నాగార్జున యాదవ్ నిలదీశారు.‘‘ఇలాంటి నీచ రాజకీయాలను దేవుడు కూడా క్షమించడు. ఆలయాల పవిత్రతను దెబ్బ తీయవద్దు. సింహాచలం అప్పన్న ఆలయ ప్రసాదంలో నత్త రావటం ఆందోళనకు గురి చేసింది. ఇదే ఆలయంలో గోడ కూలి భక్తులు మరణించారు. ఇప్పుడు ప్రసాదంలో నత్త వచ్చింది. దీనిపై ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యమైన సమాధానం చెప్పి, బెదిరించారు. ఆ దంపతులు ఒక వీడియో పోస్టు చేస్తే వారిని టార్గెట్ చేశారు. ఆ జంటపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం దిగజారుడుతనానికి ఇదే నిదర్శనం..ప్రసాదంలో నత్త రావటానికి కారణాలపై విచారణ జరపకుండా భక్తులపై కేసులు పెడతారా?. చివరికి దేవుడి మీద కూడా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. దీనిని దేవుడు కూడా క్షమించరు. నీచ రాజకీయాలకు దేవుడ్ని వాడుకోవద్దు. చంద్రబాబుకు దైవ భక్తి ఉంటే భక్తులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి. కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని నాగార్జున యాదవ్ డిమాండ్ చేశారు. -
మోసం చేశారు.. వేధిస్తున్నారు!
నంద్యాల: తమను మోసం చేశారని, అంతేకాకుండా డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నారని ఎస్పీ సునీల్ షెరాన్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. నంద్యాలలోని ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. తన భర్త బాలుగ్రం అనే వ్యక్తి వేరే అమ్మాయిలతో తిరుగుతూ మోసం చేస్తున్నాడని, ఈఎంఐ చెల్లించాని వేధిస్తున్నాడని ఏఎన్ఎంగా పనిచేస్తున్న ఒక మహిళ ఫిర్యాదు చేశారు. తాను నంద్యాలలోని ఒక ప్రైవేటు జూనియర్ కళాశాలలో పనిచేయగా జీతం ఇవ్వకుండా మోసం చేశారని మల్లికార్జునయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన స్థలాన్ని ఆక్రమించుకుని బెదిరిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని బండిఆత్మకూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు వినతి పత్రం అందజేశారు. మొత్తం 75 ఫిర్యాదులు రాగా వాటికి చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. -
తణుకులో పోలీసుల ఓవరాక్షన్..
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: తణుకులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్ విగ్రహం వద్ద 144 సెక్షన్ విధించారు. జనవరి 5న వైఎస్సార్ విగ్రహావిష్కరణ చేస్తామని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రకటించగా.. వైఎస్సార్ విగ్రహం చుట్టూ రెవెన్యూ అధికారులు ఇనుక కంచె వేశారు.ఎట్టిపరిస్థితుల్లోనూ వైఎస్సార్ విగ్రహాన్ని ప్రారంభిస్తామన్న కారుమూరి తేల్చి చెప్పారు. ఇప్పటికే మాజీ మంత్రి కారుమూరి సహా 13 మందిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. విగ్రహం వద్ద పోలీసులు పహారా కొనసాగుతుంది.కాగా, ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే తణుకు ప్రాంతం రాష్ట్రంలోనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరిగిన సంఘటనలతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా తణుకు వై.జంక్షన్‌లోని వైఎస్సార్ విగ్రహం వద్ద చంద్రబాబు ఫ్లెక్సీ కట్టి టీడీపీ సానుభూతిపరులు చేసిన నిర్వాకం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.వైఎస్సార్ విగ్రహానికి చంద్రబాబు ఫ్లెక్సీ కట్టడంపై ప్రజలు దుమ్మెత్తి పోశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగడం, తమ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం, ఆపై రెండు ఫ్లెక్సీలు పోలీసులు తొలగింపచేయడం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. -
కోడలికి మేడలు లేవని చెబుతాం!
కర్నూలు జిల్లా: తరాలు మారినా, కంప్యూటర్ యుగం నడుస్తున్నా ఆ గ్రామంలో ఇప్పటికీ ఓ ఆచారం కొనసాగుతోంది. ఎంతటి వారైనా, ఉన్నతాధికారులైనా తమ గ్రామంలో ఉండాలంటే ఈ ఆచారాన్ని కచ్చితంగా పాటించాల్సిందే. గ్రామస్తుల ఆరాధ్య దైవమైన ఉచ్చీరప్ప తాత ఆలయం కంటే ఒక్క ఇంచు కూడా ఎత్తుగా ఇళ్లను కట్టరాదన్నది ఇక్కడ ఏళ్ల తరబడి కొనసాగుతున్న సంప్రదాయం. తమ పెద్దలు ఆచరించి చూపిన నియమాన్ని తాము ఎప్పటికీ పాటిస్తామని ఆ గ్రామస్తులు ముక్త కంఠంతో చెబుతున్నారు. ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామంలో 6,500 మంది ఓటర్లు, దాదాపు 2,900 వరకు గృహాలు ఉన్నాయి. గ్రామంలో మోతుబరి రైతైనా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించిన వారైనా, ఆర్థికంగా ఉన్న వారైనా ఇంటిపై మేడలు కట్టరు. గ్రామస్తుల ఆరాధ్య దైవం ఉచీ్చరప్ప తాత ఇక్కడ ఎన్నో మహిమలు చూపి భక్తుల విశ్వాసం పొందారు. తన ఆలయం కంటే ఎత్తుగా ఎవరూ మిద్దెలు నిర్మించుకోరాదని గ్రామస్తులను ఆజ్ఞాపించారు. తద్వారా గ్రామానికి ప్రతిష్ట ఉంటుందని చూచించారు. నాటి ఆయన ఆజ్ఞను గ్రామస్తులు నేటికీ పాటిస్తున్నారు. దీంతో ఆ ఊరి కోడలిగా వచ్చే యువతికి, ఆమె బంధువులకు వివాహం కుదుర్చుకునే సమయంలోనే తమకు మేడలు లేవని చెప్పడం సంప్రదాయంగా వస్తోంది. కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగినా మరోచోట ఖాళీ స్థలం తీసుకొని ఇంటిని నిర్మించుకుంటారు గానీ మిద్దెపై మరో అంతస్తు కట్టే సాహసం చేయరు. పెద్దహోతూరు గ్రామంలో కొలువుదీరిన ఉచ్చీరప్పతాత, సమీపంలోని మరకట్టు గ్రామంలో కొలువుదీరిన సలువప్ప తాత ఆజ్ఞల మేరకు నేటికీ ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నారు. అలాగే జని్మంచిన శిశువులకు ఉచీ్చ రప్ప, ఉచీ్చరమ్మ, సలువప్ప తాత పేర్లు పెట్టడం అనవాయితీగా వస్తోంది. -
రాయచోటిలో నిరసనలు.. టీడీపీ నేతలకు టెన్షన్!
సాక్షి, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేయడంపై రాయచోటిలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హేతుబద్ధత లేకుండా జిల్లా కేంద్రాన్ని తరలించడాన్ని వెనక్కు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు, ప్రజలకు డిమాండ్ చేస్తున్నారు. రాయచోటిని మదనపల్లిలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మండిపడుతున్నారు.ఇక, జిల్లాను మూడు ముక్కలు చేయడంపై వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్బంగా రాయచోటి జిల్లా కేంద్రాన్ని తరలించడానికి వీల్లేదంటూ నినాదాలు చేశారు. స్థానిక ప్రజలు అభిప్రాయాలు తీసుకోకుండా ఎలా మారుస్తారు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాను చీల్చవద్దంటూ నినాదాలు చేశారు. మరోవైపు.. రాయచోటిలో జిల్లా కేంద్రం కోసం ఎన్ని పోరాటాలకైనా సిద్ధమంటూ శ్రీకాంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం మారకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఇదిలా ఉండగా.. జిల్లాను నిలబెట్టలేకపోతే మీసం తీసుకుంటా అంటూ.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి గతంలో తొడగొట్టి మరీ చెప్పిన మాటలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాయచోటిలో ఆయన తీరుపై అసంతృప్తి.. క్రమక్రమంగా ఆగ్రహ జ్వాలలుగా మారుతోంది. తాజాగా రాయచోటిని మదనపల్లిలో కలపడంపై కేబినెట్లో సంతకం చేసిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. బయటకు వచ్చి కంటతడి పెట్టారు. అయితే ఆయనది డ్రామా అంటూ రాయచోటి ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘నాడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకుని రాయచోటికి జిల్లాను తెచ్చారు. దానిని నిలబెడతానని.. లేకుంటే మీసం తీసేస్తానంటూ రాంప్రసాద్‌రెడ్డి శపథం చేశారు. ఈ క్రమంలో.. ఇప్పుడు మీసం తీసేస్తారంటూ అంటూ రాజకీయ ప్రత్యర్థులు సెటైరలు సంధిస్తున్నారు. శ్రీకాంత్‌రెడ్డి పదవీ త్యాగంతో జిల్లాను తీసుకొస్తే..రాంప్రసాద్‌రెడ్డి మంత్రి పదవి కోసం జిల్లాను ముక్కలు చేశాడంటున్న రాయచోటి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ద్రాక్షారామంలో శివాలయంపై దాడి.. నిందితుడు టీడీపీ కార్యకర్త?
సాక్షి, ద్రాక్షారామం: ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ఉత్తర గోపురం సప్తగోదావరి ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి లింగాన్ని సోమవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. అనంతరం, మంగళవారం ఉదయం స్థానికులు చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై భక్తులు మండిపడుతున్నారు.ఈ ఘటనపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ..‘ద్రాక్షారామాం ఆలయంలోని శివలింగం ధ్వంసం కావడం దారుణం. ఎటువంటి సంప్రోక్షణ చెప్పకుండా హడావిడిగా మరో లింగాన్ని ఎందుకు ప్రతిష్టించారు. ధ్వంసమైన శివలింగానికి వేల ఏళ్ళ చరిత్ర ఉంది. హడావుడిగా కార్యక్రమం ఎందుకు చేశారు?. వ్యవస్థలను కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేస్తోంది. మాట్లాడితే సనాతన ధర్మం అంటున్నారు. ఇదేనా సనాతన ధర్మం అంటే?. ఆలయ నిర్వహణ అధికారి ఆలయానికి రెగ్యులర్‌గా ఎందుకు రావటం లేదు అని ప్రశ్నించారు.మరోవైపు.. దేవాలయ శాఖ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ మాట్లాడుతూ..‘ద్రాక్షారామంలో శివాలయంపై దాడి దుర్మార్గం. దక్షిణ కాశీగా పేరుగాంచిన ద్రాక్షారామంలో విధ్వంసం జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించలేదు?. ఎలాంటి సంప్రోక్షణ జరగకుండానే విగ్రహాన్ని పునః ప్రతిష్టించటం అపచారం కాదా?. టీడీపీ కూటమి పాలనలో సనాతన ధర్మం ప్రమాదంలో పడింది. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడికెళ్లారు?. ఆలయాలపై జరుగుతున్న దాడులపై పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు. రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడికి ఐదు లక్షల రూపాయల సాయం ఎందుకు ఇచ్చారు?. చంద్రబాబు సర్కారుకు రాజకీయ లబ్ధి మినహా హిందువుల మనోభావాలు అక్కర్లేదా? అని ప్రశ్నించారు.ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కాకినాడ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హుటాహుటిన వచ్చి ధ్వంసమైన శివలింగాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని రామచంద్రపురం మండలం తోటపేట గ్రామానికి చెందిన నీలం శ్రీనివాస్‌గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, నిందితుడి సోదరుడు అధికార టీడీపీ కార్యకర్త అని తెలిసింది. నిందితుడు కూడా టీడీపీ కార్యకర్త అని సమాచారం. -
మద్దూరు ఆలయంలో వెండి ఆభరణాల మాయం
నంద్యాల జిల్లా: చాగలమర్రి మండలం మద్దూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. స్వామివారికి భక్తులు, దాతలు సమర్పించిన విలువైన వెండి ఆభరణాలు అపహరణకు గురికాగా, వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. ఈ ఘటన ఆలయ పరిపాలనపై తీవ్ర విమర్శలకు దారితీసింది.సోమవారం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి ఆభరణాలను పరిశీలించిన సమయంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రతి ఏడాది ఆనవాయితీగా వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారికి వెండి ఆభరణాలతో ప్రత్యేక అలంకరణ నిర్వహిస్తుంటారు. అనంతరం వాటిని ఆలయంలోని బీరువాలో భద్రపరుస్తూ వస్తున్నారు. అయితే ఈసారి అలంకరణకు సిద్ధం చేస్తున్న సమయంలో అసలైన వెండి ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాలు ఉండటాన్ని ఆలయ అర్చకుడు మామిడి కిషోర్ శర్మ గుర్తించారు. విషయం వెంటనే ఆలయ అధికారులకు తెలియజేయగా, ప్రస్తుత ఈవో జయచంద్ర రెడ్డి ఆలయానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో జయచంద్ర రెడ్డి మాట్లాడుతూ, గత ఈవో తనకు సరైన చార్జ్ అప్పగించలేదని తెలిపారు. వెండితో తయారుచేసిన కిరీటం, హస్తాలు, శంఖం, చక్రం, పాదాల తొడుగులతో పాటు మరికొన్ని విలువైన ఆభరణాలు మాయమైనట్లు వెల్లడించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.ఈ వ్యవహారంలో విశ్రాంత ఈవోతో పాటు ఆలయ అర్చకుడు కిషోర్ శర్మ హస్తం ఉండవచ్చన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా జరిగిన ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
రాజధాని రైతుల మెడపై కత్తి
సాక్షి ప్రతినిధి, గుంటూరు, తాడికొండ: ప్రభుత్వ తొందరపాటు చర్య ఒక నిండు ప్రాణం తీసింది. మంత్రులు, ఎమ్మెల్యేల హడావుడి సీఆర్డీఏ అధికారుల ఒత్తిడి కారణంగా తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన రైతు రామారావు గుండె పగిలి మృతి చెందిన విషయం తెలిసిందే. రెండు లక్షల జనాభా కూడా లేని ప్రాంతంలో ఈ హడావుడి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతుల ఇళ్ళు తొలగించి రోడ్డు వేయాలంటూ స్వయంగా మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ ఒత్తిడికి చేయడంపై ఆందోళనకు గురవుతున్నారు. గ్రామం చుట్టూ ఉన్న నాలుగు రోడ్లు పూర్తిచేసి రహదారుల పక్కన ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తే బావుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా ప్లాట్లు ఎక్కడ ఇస్తారో, ఏఏ వసతులు కల్పిస్తారో చెప్పకుండా పరిహారం గురించి చెప్పమని ఒత్తిడికి గురిచేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద రోడ్డు అవసరమా రాజధాని అమరావతి పరిధిలో మందడం పెద్ద గ్రామం. ప్రస్తుత మాస్టర్ ప్లాన్‌లో ఈ గ్రామం చుట్టూ నాలుగు రోడ్లు వెళుతున్నాయి. ఉత్తరం వైపున ఈ–3 సీడ్ యాక్సెస్ రోడ్డు ఉంది. మధ్యలో ఈ–4 రోడ్డు ఉంది. తూర్పున ఎన్–7 రోడ్డు ఉంది. ఈ రెండు రోడ్లు గ్రామానికి ఆనుకునే ఉంటాయి. దక్షిణాన ఈ–5 రోడ్డు వెళ్తుంది. పడమటివైపు మందడం మల్కాపురం గ్రామానికి అనుకొని ఎన్–9 రోడ్డు వెళుతుంది. ప్రస్తుతం ఈ రోడ్డు ద్వారానే వెలగపూడి సెక్రటేరియట్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ చూస్తే మందడం గ్రామానికి చుట్టూ సరిహద్దు గోడలాగా ఈ రోడ్లన్నీ కనిపిస్తుంటా యి. అయితే ఇప్పుడు చర్చ జరిగిన రోడ్డు ఈ–8 రహదారి. ఇది సీబీడీ అంటే సీడ్ బిజినెస్ డిస్టిక్కు అనుసంధానంగా నిర్మిస్తున్న మేజర్ ఆరీ్టరియల్ రోడ్డు. అంటే 200 అడుగులు వెడల్పుతో ఉంటుంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ రోడ్డు నిర్మించాల్సిందే. కానీ ఇంత పెద్ద రోడ్డు ఇప్పటికిప్పుడు గ్రామం మధ్యలో నుంచి నిర్మించడం అవసరమా అనేది రైతుల ప్రశ్న.25 లక్షల జనాభా కోసం డిజైన్ చేసిన రోడ్డు అది... సుమారు పాతిక లక్షల జనాభాకు అనుగుణంగా ఈ రోడ్లను డిజైన్ చేశారు. ప్రస్తుతం రాజధానిలో రెండు లక్షలు జనాభా కూడా లేదు. మరి అలాంటప్పుడు భారీగా ఇళ్లను తొలగించి నిర్మించాల్సిన అవసరం ఏమిటో అర్థం కావడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులు ఇళ్లు కూడా ఇచ్చేయాలా అనే ఒత్తిడికి గురవుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుండా రైతులపై ఒత్తిడి తేవడం వల్లే రైతు రామారావు మృతి చెందాడని రాజధాని ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బాబుగారు... చిల్లర రాజకీయాలపై మీరే మాట్లాడాలి!
ఏపీ ముఖ్యమంత్రికో చిత్రమైన గుణం ఉంది. ఆయన ఎవరినైనా దూషించవచ్చు కానీ.. ఎవరైనా ఆయన్ను పల్లెత్తు మాట అన్నాసరే.. ‘‘చూశారా ఎంత మాటన్నారో?.. ప్రజల కోసం అన్నీ భరిస్తా’’ అనేస్తారు. ఇదీ ఇకరకమైన ప్లేటు ఫిరాయింపే. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహావిష్కరణ సభలో ఇటీవల ఆయన మాట్లాడుతూ ‘‘వాజ్ పేయి వంటి ఉన్నత వ్యక్తులతో రాజకీయం చేసిన తాను ఇప్పుడు చిల్లర వ్యక్తులతో రాజకీయాలు చేయాల్సి వస్తోంది’’ అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘కొందరు నాయకులు స్ఫూర్తినిస్తారు. మరికొందరు దేశం కోసం బతుకుతారు. ఇంకొందరు స్వార్థం కోసమే బతుకుతారు’’ అని కూడా వ్యాఖ్యానించినట్లు తెలుగుదేశం మీడియా తన కథనంలో తెలిపింది. విపక్షమైనంత మాత్రాన వారిని చిల్లర వ్యక్తులతో పోల్చడం ఏపాటి సభ్యత? గురువింద గింజ సామెత ఆయనకు గుర్తురాలేదా? ఎవరేమైనా అనని దులుపుకుని పోవడమే ఆయన నైజమా?వాస్తవానికి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి పరిస్థితులకు ఎంతో తేడా ఉంది. ఒకపక్క చంద్రబాబు పాలన వ్యవస్థల్లో జగన్ తీసుకొచ్చిన సంస్కరణలనే అనుసరిస్తూ ఇంకోపక్క ఇష్టారీతిని భూముల పందేరం పెడుతున్నారు. ఎన్నికల సందర్భంగా తానిచ్చిన హామీల్లో 95 శాతం వరకూ నెరవేర్చిన జగన్‌కు.. ఇచ్చిన హామీల్లో దాదాపు ఏవీ నెరవేర్చని టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వానికి పోలికెక్కడ? ఈ రెండు అంశాలు చాలవా? ఎవరిది చిల్లర రాజకీయమో అర్థం చేసుకునేందుకు? గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ వంటి విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రంలో పాలనను ప్రజల చెంతకు చేర్చిన ఘనత జగన్‌ది. గతిలేక... తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని కొనసాగించాల్సిన స్థితి చంద్రబాబుది. అందుకే కదా జగన్ పథకాల పేర్లు మార్చి క్రెడిట్ చోరీకి పాల్పడింది? ఇది చిల్లరతనం కాదా? అని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది కదా! వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, గౌరవ వేతనం కూడా రూ.పదివేలకు పెంచుతామన్న ఎన్నికల హామీని అధికారంలోకి వచ్చిన తరువాత తుంగలో తొక్కడం చిల్లరతనం కాదా? అని ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలోని సుదీర్ఘ సముద్రతీర ప్రాంతాన్ని ఆర్థిక చోదక శక్తిగా మార్చేందుకు జగన్ చేపట్టిన నౌకాశ్రయాలను చూపి చంద్రబాబు ఇప్పుడు పెట్టుబడులు అడుగుతున్నారని గుర్తు చేస్తున్నారు. అన్ని మౌలిక వసతులతో చరిత్రలో ఎన్నడూ లేనట్టు ఏకంగా 17 వైద్య కళాశాలలను తీసుకొస్తే అందులో జగన్ స్వార్థం కనిపిస్తుందా? పేద విద్యార్ధుల విద్య, పేద ప్రజలకు మంచి వైద్యం అప్పగించాలన్నదే ఆయన లక్ష్యం కనిపిస్తుందా?? ఎంతో సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు ఒక్క ప్రభుత్వమెడికల్ కాలేజీని తన హయాంలో తేలేదు? పైగా జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ఎకరా వంద రూపాయల లీజుకు కట్టబెట్టి ప్రైవేటు వారికి సంపదగా మారుస్తున్నారే? దీనిని బట్టి అర్థం కాదా? ఎవరు స్వార్థపరులన్నది? జగన్ తెచ్చిన కాలేజీలలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను వ్యతిరేకించిన చంద్రబాబు, లోకేశ్‌లు ఇప్పుడు ఏకంగా కాలేజీలనే ప్రైవేటికరిస్తూ జనం దృష్టిలో విలన్లుగా మారారన్న సంగతి అర్థం చేసుకోలేకపోతున్నారు. జగన్ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల అప్పులు చేసిందని చంద్రబాబు, రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ, వలంటీర్లు కిడ్పాప్ చేశారంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు చిల్లరవి కావా? అధికారంలోకి వచ్చాకైనా వీటిలో ఒక్కదానికైనా ఆధారం చూపించారా?ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబును ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయజాలం. కాని ఆయనే అనవసర కామెట్లు చేస్తున్నారనిపిస్తుంది.ఇక రాజకీయ కోణం చూద్దాం. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో వేసిన గుంతులు, కట్టిన పొత్తులు ఏ సిద్ధాంతపరమైన రాజకీయాలకు ప్రతీకలు? మామ ఎన్టీఆర్‌పై కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేస్తానని తొడగొట్టి సవాల్ చేసిన చంద్రబాబు 1983 ఎన్నికలలో ఓటమి తర్వాత బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీలోకి ఫిరాయించేశారే! మరి జగన్ ఏమి చేశారు. తాను విబేధించిన కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలో అఖండ విజయం సాధించారు. దీనిని ప్రతిష్టాత్మక వ్యవహారం అంటారు కాని జెండాలు మార్చే చిల్లర రాజకీయం అనరు కదా! 1995లో ఎన్టీ రామారావును దించడానికి తనకు మద్దతు ఇచ్చే మీడియా ద్వారా ఎంతగా అప్రతిష్టపాలు చేసింది చరిత్రలో ఉంది కదా! అది ఏమైనా ఘనమైన విషయమా? ఎన్టీ రామారావే చంద్రబాబు బుద్ధి, నైజం గురించి ఎంత ఘోరంగా దూషించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతుంటాయే!. అది ఏపాటి గౌరవమో చంద్రబాబు చెప్పగలరా? ఆ ఎపిసోడ్లో వాజ్‌పేయి వంటివారు ఎన్టీఆర్కే మద్దతు ఇచ్చింది వాస్తవం కాదా? ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి కొత్తగా పెట్టిన పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది కదా! 1996లో వామపక్షాలతో కలిసి పోటీచేసి బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించే వారా? కాదా?ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్‌ను గోదాట్లో ముంచి బీజేపీకి మద్దతు ఇచ్చారా?లేదా? 2001-02 మధ్య గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీపై ఎలాంటి విమర్శలు చేశారో గుర్తు ఉండకపోవచ్చు. ఆ తర్వాత కాలంలో ఆయన ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి 2014లో పొత్తు పెట్టుకుంది నిజమా? కాదా? 2004 ఎన్నికలలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఓటమికి గురైన తర్వాత జీవితంలో బీజేపీతో కలవనని ప్రకటించారా? లేదా? ఇప్పుడేమో వాజ్ పేయి, నరేంద్ర మోడీ తనకు స్ఫూర్తి అని ప్రకటించుకుంటున్నారు. ఆయన ఎలాగైనా రూపాంతరం చెందగలరన్నమాట. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో ఉద్యమం చేస్తున్న టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని 2009 ఎన్నికలలో పోటీ చేయడానికి రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చారా?లేదా? తీరా కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చాక ఎన్ని మాటలు మార్చారు? తెలంగాణలో తన వల్లే రాష్ట్రం వచ్చిందని, ఏపీకి వెళ్లి రాష్ట్రాన్ని సోనియాగాంధీ నాశనం చేశారని ఎంతగా నిందించారు? దీనిని ఏ రాజకీయం అంటారు? 2018లొ కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ప్రధాని మోడీని ఎన్ని మాటలు అన్నారో తెలియదా? దేశ ప్రధానినే టెర్రరిస్టు అన్న చరిత్ర చంద్రబాబుదే కావచ్చు. ఆ రోజుల్లో టీడీపీ మీడియాలో వచ్చిన కొన్ని హెడ్డింగ్‌లు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మోసాల మోడీ, బీజేపీకి సహకరించే వాళ్లు దేశద్రోహులు, మోడీని దింపేస్తాం, మోడీ హటావో..మోడీతో రాజీ లేదు..రెచ్చిపోతా..,ఇలాంటి స్టేట్ మెంట్లు ఇచ్చిన చంద్రబాబు 2024 ఎన్నికలకు ముందు మోడీ, అమిత్ షాలతో కలవడానికి ఎన్ని పాట్లుపడింది ఇటీవలి చరిత్రే కదా? మధ్యలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఎన్నికలలో పోటీచేశారే. ఆ తర్వాత వారిని గాలికి వదలివేశారే! వీటిని రాజకీయ వ్యూహాలు అంటారా? లేక అవకాశవాద రాజకీయాలు అంటారా? లేక చిల్లర రాజకీయాలు అంటారా అన్నదానిపై ఎప్పుడైనా టీడీపీ వివరణ ఇచ్చిందా? మరి జగన్ ఎప్పుడైనా ఇలాంటి అవకాశవాద, లేదా చిల్లర రాజకీయాలకు పాల్పడ్డారా? నిజానికి బీజేపీ కోరిన విధంగా జగన్ ఎన్డీయేలో చేరి ఉంటే టీడీపీ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. విధానాల మీద అభిప్రాయం చెప్పవచ్చు కాని రాజకీయ ప్రత్యర్ధుల వ్యక్తిత్వాన్ని కింపచరిచే విధంగా మాట్లాడి రాజకీయ లబ్ది పొందాలని అనుకుంటే ఎదురుదెబ్బ తప్పదు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సింహాచల పుణ్యక్షేత్రంలో అపచారం.. అధికారుల ఓవరాక్షన్!
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని సింహాచల దేవస్థానం పులిహోర ప్రసాదంలో నత్త కనిపించిన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రసాదంలో నత్త కనిపించిన విషయాన్ని భక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో, ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో, దేవస్థానం అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంపై భక్తులు మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం.. దేవస్థానం అధికారులపై చర్యలు తీసుకోకుండా భక్తులపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. ప్రసాదంపై నత్త వచ్చిందని చెప్పిన భక్తులపైనే తిరిగి పోలీసులు కేసు నమోదు చేశారు. గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో దేవస్థానం అధికారులు ఫిర్యాదు చేయడంతో భక్తులపై పోలీసులు కేసు పెట్టారు. భక్తులపై BNS 298, 353 (1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, ప్రసాదం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోకుండగా.. విచారణ చేపట్టకుండా.. భక్తులపై కేసు పెట్టడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పన్న పులిహోర ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని.. దాని విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండడం దారుణమని మండిపడ్డారు.🚨 #SaveSimhachalamFromTDPసింహాచలం ఆలయంలోని ప్రసాదంలో నత్తహిందూ దేవాలయాల్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం. దాంతో ఆలయాల్లో వరుసగా అపచారాలు, భక్తులు పవిత్రంగా భావించే ప్రసాదాల్లో కీటకాల అవశేషాలుఇదేనా @ncbn ఆలయాల ప్రక్షాళన అంటే?#SaveDevoteesFromTDP#APisNotinSafeHands… pic.twitter.com/1Hm7YhOK7O— YSR Congress Party (@YSRCParty) December 30, 2025ఇక, దేవాలయాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పదేపదే దారుణాలు చోటుచేసుకుంటున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. సింహాచలం దేవస్థానం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ఏప్రిల్ 30న జరిగిన చందనోత్సవంలో నాసిరకంగా నిర్మించిన గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందారని.. జూలైలో భారీ షెడ్ కూలిపోయిందని.. ఇప్పుడు ప్రసాదంలో నత్త కనిపించిందని.. వీటన్నింటికీ చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య తీరే కారణమని మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు..
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలో స్వర్ణరథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉదయం 9 నుంచి 10.30 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని పురమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. నేడు బధవారం వైకుంఠ ద్వాదశి కావడంతో ఉదయం శ్రీవారి పుష్కరిణిలో అర్చకులు సంప్రదాయబద్ధంగా చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్కరిణి పరిసరాలు భక్తులతో నిండిపోయాయి.వైకుంఠ ఏకాదశి సందర్భంగా పరిమిత సంఖ్యలోనే వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పించామని టీటీడీ అధికారులు తెలిపారు. మొత్తం పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయని, ఇప్పటికే వైకుంఠ ద్వార దర్శన టికెట్లు కలిగిన భక్తులకు మాత్రమే రేపటి వరకు దర్శనం ఉంటుందని వెల్లడించారు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనంలో భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.అలిపిరి మెట్ల మార్గం ద్వారా లక్కీడిప్‌లో టికెట్ పొందిన భక్తులు మెట్టు మెట్టుకు పూజలు చేస్తూ భక్తిశ్రద్ధలతో తిరుమలకు చేరుకుంటున్నారు. తిరుపతితో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనానికి భక్తులు కిటకిటలాడుతున్నారు.వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులు: 67,053నిన్న తలనీలాలు సమర్పించిన భక్తులు: 16,301వైకుంఠ ఏకాదశి హుండీ ఆదాయం: ₹2.25 కోట్లు -
పేరు పోలవరం.. ఊరు రంపచోడవరం
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 26 జిల్లాలు ఉండగా కూటమి ప్రభుత్వ మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటు నిర్ణయంతో 28కి చేరింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా చేసిన మార్పులు నేటి(బుధవారం) నుంచి అమల్లోకి రానున్నాయి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను అస్తవ్యస్తంగా పునర్వ్యవస్థీకరించింది చంద్రబాబు ప్రభుత్వం. వివాదాస్పద రీతిలో.. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకి మార్చారు. కొత్తగా అడ్డరోడ్డు జంక్షన్, అద్దంకి, పీలేరు, మడకశిర, బనగానపల్లె రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ ప్రాంతాన్ని గత ప్రభుత్వం అన్నమయ్య పేరుతో జిల్లాగా ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు దాన్ని రద్దు చేసి చీలికలు పీలికలు చేశారు. ఆ పార్లమెంటు నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి మూడు జిల్లాల్లో కలపడంతో అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట అన్నమయ్య జిల్లాలో ఉన్న తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంతో కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. తుది నోటిఫికేషన్ నాటికి ఆ జిల్లాలో మిగిలిన రాయచోటిని మదనపల్లె జిల్లాలోనూ, రాజంపేటను వైఎస్సార్ కడప, రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోనూ కలిపి దానికి రూపురేఖలు లేకుండా చేశారు. తాళ్లపాక కడపలోకి!రాజంపేట ప్రాంతాన్ని అన్నమయ్య జిల్లా నుంచి వేరు చేసి అన్నమయ్య పేరును మదనపల్లె జిల్లాకు పెట్టారు. నిజానికి ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన మదనపల్లె జిల్లాకు అన్నమయ్య పేరు పెట్టినా దాంతో ఆయనకు సంబంధం లేదు. అన్నమయ్య స్వస్థలం రాజంపేట ప్రాంతంలోని తాళ్లపాక. ఆ నియోజకవర్గాన్ని వైఎస్సార్ కడప జిల్లాలో కలిపారు. కానీ ఆయన పేరును పక్కన ఏర్పాటు చేసిన కొత్త జిల్లాకు పెట్టారు. పోలవరం లేకుండానే.. ఎన్నికల సమయంలో రాయచోటిలో నిర్వహించిన సభలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాయచోటిని జిల్లా కేంద్రంగానే కొనసాగిస్తామని, దాన్ని మార్చబోమని అక్కడి ప్రజలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీకి తిలోదకాలిచ్చి, ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకి మార్చేశారు. అన్నమయ్య పుట్టిన ప్రాంతంతో సంబంధం లేని ప్రాంతానికి ఆయన పేరు పెట్టినట్లే.. పోలవరంతో సంబంధం లేని ప్రాంతంతో ఒక జిల్లా ఏర్పాటు చేసి పోలవరం పేరు పెట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లాను రెండు ముక్కలు చేసి కేవలం రంపచోడవరం నియోజకవర్గంతో పోలవరం జిల్లాను ఏర్పాటు చేశారు. అల్లూరి జిల్లాలో ఉన్నదే మూడు నియోజకవర్గాలు కాగా దాన్ని విడగొట్టి కొత్త జిల్లా ఏర్పాటు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఒరిజినల్ పోలవరం ఏలూరు జిల్లాలో ఉండగా, రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాకు పోలవరం పేరు పెట్టారు. ఈ నిర్ణయంతో పోలవరం పేరుపై గందరగోళం నెలకొనడంతోపాటు రంపచోడవరం పేరుకి ప్రాధాన్యత తగ్గిపోనుంది. ఒకే ప్రాంతాన్ని రంపచోడవరం, పోలవరంగా పిలవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.శాస్త్రీయత లేకుండా..బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపి బాపట్ల ప్రాధాన్యాన్ని తగ్గించారు. మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసినా అది స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదనే వాదన వినిపిస్తోంది. 2023లో శాస్త్రీయ పద్ధతిలో పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేయగా ఇప్పుడు వాటిని అస్తవ్యస్తంగా మార్చి శాస్త్రీయత లేకుండా చేశారు. చంద్రబాబు తనకు రాజకీయంగా పట్టు లేని ప్రాంతాలను దెబ్బతీసేలా పునర్విభజన చేపట్టినట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో తమ ప్రాంతాలుగా చెప్పుకునే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అనంతపురం తదితర జిల్లాలను మాత్రం కదల్చకపోవడం ద్వారా పునర్విభజనలో కచ్చితంగా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. జిల్లాల సరిహద్దులు, రెవెన్యూ డివిజన్ల మార్పులు, మండలాల మార్పులు సైతం టీడీపీ ప్రయోజనాలకు అనుగుణంగానే జరిగినట్లు తేటతెల్లమైంది. -
రాయుడు హత్యకేసులో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జలకు సమన్లు?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్చార్జి వినుత కోట డ్రైవర్ శ్రీనివాసులు (రాయుడు) హత్యకేసులో చెన్నై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సమన్లు జారీచేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన ఇన్చార్జ్ వినుత డ్రైవర్ మృతదేహం ఈ ఏడాది జూలై 10న చెన్నై కూవం నదిలో లభ్యమైన విషయం తెలిసిందే. ఈ కేసులో వినుత, చంద్రబాబు దంపతుల్ని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో వారిద్దరు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. తరువాత కొద్దిరోజులకు రాయుడు సెల్ఫీ వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ వీడియోలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి పేరును పదేపదే ప్రస్తావించటంతో రాజకీయంగా టీడీపీకి షాక్ తగిలింది. జనసేన నేత వినుత ఆరోపణలు, రాయుడు సెల్ఫీ వీడియో ఆధారంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్రెడ్డిని విచారించేందుకు చెన్నై పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుజిత్కుమార్రెడ్డికి సమన్లు జారీచేసి సెల్‌ఫోన్ డేటాతో పాటు, అతడి బ్యాంకు లావాదేవీలను పోలీసులు సేకరించినట్లు తెలిసింది. మరోవైపు జనసేన పార్టీ కార్యకర్త పేట చంద్రశేఖర్‌కి సమన్లు జారీచేసి సోమవారం శ్రీకాళహస్తిలో విచారించారు. అతడి నుంచి ఫోన్ డేటా, బ్యాంకు లావాదేవీలను తీసుకున్నట్లు సమాచారం. మృతుడు రాయుడు బ్యాంక్ లావాదేవీల వివరాలను సేకరించి, అతడి నాయనమ్మను మరోసారి విచారించినట్లు తెలిసింది. మృతుడు రాయుడు శ్రీనివాస క్లినిక్‌లో చికిత్స పొందిన ఆధారాలను కూడా నమోదు చేశారు. రాయుడు చనిపోవడానికి ముందు బంగారు దుకాణంలో చైన్ కొనుగోలు చేసినట్లు లభించిన ఆధారాల మేరకు ఆ షాపు యజమానితో మాట్లాడిన పోలీసులు ఆ బిల్లులను సేకరించారు. రాయుడు బంధువులు, స్నేహితులను విచారించి వారి బ్యాంకు వివరాలను కూడా పరిశీలించినట్లు సమాచారం. వినుత తండ్రి భాస్కర్‌తోపాటు వారు ఉంటున్న ఇంటి యజమానిని, వినుత ఇంట్లో పనిమనిíÙని కూడా పోలీసులు విచారించి స్టేట్మెంట్లు తీసుకున్నారు.తన రాజకీయ ప్రాబల్యం తగ్గించే కుట్రలో భాగంగానే రాయుడు హత్య జరిగిందని, ఈ హత్యకు దారితీసిన పరిస్థితులపై లోతుగా విచారణ చేపట్టాలని కోరుతూ అందుకు కొన్ని ఆధారాలను నిందితురాలు వినుత పోలీసులకివ్వడంతో ఆదిశగా విచారణ చేపట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఒకటి, రెండురోజుల్లో బొజ్జల సు«దీర్‌రెడ్డికి సమన్లు ఇచ్చి స్టేట్మెంట్ నమోదు చేయనున్నట్లు సమాచారం. దీంతో రాయుడు హత్యకు గురికాలేదని, ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారమూ సాగుతోంది. -
పిల్ తేలే వరకు ‘స్కిల్’కేసును మూసేయొద్దు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరుతూ హైకోర్టులో తాను దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఈ కేసును మూసివేసేందుకు సీఐడీ దాఖలు చేసే క్లోజర్ రిపోర్ట్ విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువరించవద్దని పాత్రికేయుడు కొట్టి బాలగంగాధర్ తిలక్ విజయవాడ ఏసీబీ కోర్టును అభ్యర్థిచారు. ఆ మేరకు ఆయన ఏసీబీ కోర్టులో ఓ మెమో దాఖలు చేశారు. ‘స్కిల్ కుంభకోణం దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరుతూ హైకోర్టులో నేనే పిల్ దాఖలు చేశాను.దర్యాప్తు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని, ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లకూడదన్న ఉద్దేశంతోనే నేను ఆ పిల్ దాఖలు చేశా. ఇదిలా ఉంటే, స్కిల్ కుంభకోణంపై నమోదు చేసిన కేసును మూసివేసేందుకు సీఐడీ చర్యలు చేపడతున్నట్లు నాకు తెలిసింది. హైకోర్టులో నేను దాఖలు చేసిన పిల్ పెండింగ్‌లో ఉన్నప్పటికీ, సీఐడీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా కేసు మూసివేత దిశగా చర్యలు చేపడుతోంది. హైకోర్టులో పిల్ తేలకుండా కేసును ముగిస్తే, పిల్ దాఖలు చేసిన అసలు ఉద్దేశమే దెబ్బతింటుంది. అలాగే విచారణ ప్రక్రియకు విఘాతం కలిగించినట్లు కూడా అవుతుంది.అలా చేయడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా కూడా. అంతేకాక అలా కేసును మూసేయడం న్యాయ విరుద్ధం కూడా. స్కిల్ కుంభకోణంపై సీఐడీ కేసును కొట్టేయాలని కోరుతూ ఆ కేసులో 37వ నిందితునిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు 2023లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. హైకోర్టులో నేను దాఖలు చేసిన పిల్ పరిష్కారం అయ్యే వరకు స్కిల్ కుంభకోణం కేసును మూసివేసే దిశగా సీఐడీ దాఖలు చేసే క్లోజర్ రిపోర్ట్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, ఆ మొత్తం ప్రక్రియను నిలిపేయండి.’ అని తిలక్ తన మెమోలో ఏసీబీ కోర్టును అభ్యర్థిచారు. -
వెంటిలేటర్‌పై... సంజీవని!
ఇప్పుడు ఉచిత వైద్యం కాదు.. రూ.లక్షన్నర వరకు బాదుడు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం కోసం ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్తే రోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి కాలు విరిగిన బాధితులు కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేశారు. ఈ దోపిడీకి గురైనవారు సింహాద్రిపురం వారు. ఇలాంటి కేసులు ఒకటి రెండు వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. – పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మడబ్బు కడితేనే గుండె ఆపరేషన్ చేస్తారటడాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలానికి చెందిన స్వామి(65) ఆర్నెల్ల కిందట అనారోగ్యం పాలవడంతో కుటుంబ సభ్యులు కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గుండె రక్త నాళాలు పూడుకుపోయాయని.. బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. కొద్ది రోజులు మందులు వాడాక సర్జరీ చేస్తామని సూచించారు. అక్టోబర్‌లో ఆరోగ్యశ్రీ కార్డుతో స్వామి, కుటుంబ సభ్యులు మళ్లీ అదే ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. ఆరోగ్యశ్రీ కార్డు కింద అడ్మిట్ చేసుకోవాలని కోరారు. ‘ప్రభుత్వం బిల్లులివ్వడం లేదు. డబ్బు కడితేనే వైద్యం చేస్తాం. బైపాస్ సర్జరీకి రూ.మూడు లక్షలకు పైగా ఖర్చవుతుంది. అంత భరించే స్తోమత లేకుంటే వెళ్లిపోండి’ అని తేల్చిచెప్పారు. ఉసూరుమంటూ వెనుదిరిగిన స్వామి.. గతంలో వైద్యులు రాసిచ్చిన మందులు వేసుకుంటూ నెట్టుకొస్తున్నారు.ఆరోగ్యశ్రీ కార్డు చేతిలో ఉంటే వైద్యం చెంతనున్నట్లే.. ఎంత పెద్ద జబ్చొచ్చినా చింత లేనట్లే. పేదలకు అదో సంజీవనే. భారీ కార్పొరేట్ ఆస్పత్రికైనా ధైర్యంగా వెళ్లి చికిత్స పొందే వెసులుబాటు... ఆ తర్వాత కోలుకునేవరకు ఆర్థిక ఆసరా.. -ఇది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని భరోసా పేద, మధ్య తరగతికి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు రోజురోజుకు దూరం. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఛీత్కారం. అడ్మిట్ చేసుకున్నా శస్త్రచికిత్సలకు సకాలంలో అనుమతి రావడం గగనం. ఫలితంగా అప్పోసప్పో చేసి ఆస్పత్రిలో డబ్బు కట్టి ఆపరేషన్ చేసుకోవాల్సిన దుస్థితి..! -ఇదీ ప్రస్తుతం చంద్రబాబు సర్కార్‌లో దుస్థితిమూడు ఆస్పత్రులు తిరిగినా...గుంటూరుకు చెందిన రమేశ్ ప్రైవేట్ ఉద్యోగి. కొన్నేళ్లుగా పైల్స్‌తో సతమతం అవుతున్నాడు. సమస్య తీవ్రం కావడంతో వైద్యులు సర్జరీ సూచించారు. దీంతో ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్స కోసం గుంటూరులోని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రిని ఆశ్రయించాడు. ప్రభుత్వం నిధులివ్వడం లేదని, ఉచిత చికిత్సలు చేయడం లేదని, రూ.45 వేలు చెల్లిస్తే సర్జరీ చేస్తామని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. అంత స్థోమత లేని రమేశ్ మరో రెండు, మూడు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లాడు. అక్కడా ఉచిత సర్జరీ చేయలేమని చెప్పడంతో రమేశ్ ఇంటికి వెనుదిరిగాడు. తీవ్రమైన పైల్స్ సమస్యతో బాధపడుతున్నాడు.సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, కడప/నెట్వర్క్: ఏ క్షణంలో చంద్రబాబు సర్కారు కొలువుదీరిందో ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలకు జబ్బు చేసింది. ‘ఎన్టీయార్ వైద్య సేవ’ అంటూ పేరు మార్పులో ఉన్న శద్ధ్ర... పథకం అమలులో కొరవడింది. పేద, మధ్య తరగతికి కార్పొరేట్‌వైద్యం ఉచితంగా అందించే మహోన్నత లక్ష్యంతో దివంగత మహా నేత వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనిని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అత్యంత సమర్థంగా అమలు చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్. కానీ, చంద్రబాబు ప్రభుత్వానికి ఈ పథకంపై ఏమాత్రం చిత్తశుద్ధి లేకపోవడంతో వైద్యసేవలు వెంటిలేటర్‌పైకి చేరాయి. ఫలితంగా రాష్ట్రంలో అనారోగ్యం బారిన పడిన పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది.⇒ 1.40 కోట్లకు పైగా కుటుంబాలకు సంజీవని అయిన ఆరోగ్యశ్రీని చంద్రబాబు నీరుగార్చారు. గద్దెనెక్కిన వెంటనే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రభుత్వ నిధులను దోచిపెట్టే బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం కోసం ఆరోగ్యశ్రీని కనుమరుగు చేసే పన్నాగానికి శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా నెట్వర్క్ ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకుండా, పథకం అమలును గాలికి వదిలేశారు. ప్రభుత్వం తీరుతో ఆస్పత్రులు చేతులెత్తేశాయి. ఆరోగ్యశ్రీ కార్డుతో ఉచిత వైద్యం కోసం వచ్చినవారిని నిర్దాక్షిణీయంగా తిప్పి పంపుతున్నాయి.బకాయిల కోసం పోరుబాట పట్టినా...రాష్ట్రవ్యాప్తంగా 600పైగా ప్రైవేటు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ అనుమతులున్నాయి. వాటికి రూ.3 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. వీటిని సాధించేందుకు అక్టోబర్‌లో వైద్యులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేసి పెద్దఎత్తున ఉద్యమించారు. ఉద్యోగ భద్రత కోరుతూ ఆస్పత్రుల సిబ్బంది ఆందోళన బాట పట్టారు. ఆ సమయంలో బ్యాంక్‌ల నుంచి అప్పు తెచ్చి బకాయిలన్నీ ఒకేసారి చెల్లిస్తామని (వన్‌టైమ్ సెటిల్మెంట్) చేస్తామని బాబు సర్కారు హామీ ఇచ్చింది. కానీ, ఉద్యమం విరమించాక మెలిక పెట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి బకాయిలు వచ్చే పరిస్థితి లేదని ప్రైవేట్ ఆస్పత్రులు నిర్ణయానికి వచ్చాయి.రూ.లక్షల్లో గుంజేస్తున్న వైనంబిల్లుల విషయంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి ప్రైవేట్ ఆస్పత్రులకు అవకాశంగా మారింది. ఆరోగ్యశ్రీ కార్డు ఉందని చెబుతున్నా పట్టించుకోకుండా డబ్బు కడితేనే వైద్యం అని రోగులకు తేల్చి చెప్పేస్తున్నాయి. ఓపీ ఫీజు, రక్త పరీక్షలు, ఈసీజీ, ఎకో, ఎక్స్‌రే, సీటీ స్కాన్ వంటి వివిధ డయాగ్నస్టిక్స్, మందులు రాసి అందినంత గుంజేస్తున్నాయి. డెలివరీ, కంటి శుక్లాలు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మొదలు మెదడు, కిడ్నీ, గుండె, క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద జబ్బుల బాధితుల వరకు ఏ ఒక్కరినీ వదలడం లేదు. కొన్ని ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స అందిస్తామని తొలుత నమ్మబలికి... రోగిని అడ్మిట్ చేసుకుని, ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లాక మరో సమస్య బయటపడిందని, దానికి ఆరోగ్యశ్రీ వర్తించదంటూ దోచేస్తున్నాయి.ఈ ప్రభుత్వంలో పేదలను దోచుకుంటున్నారుకాలు ఫ్రాక్చర్ అయిందని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లినవారి వద్ద ఏకంగా రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల దాక వసూలు చేస్తున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు వర్మ సంచలన విషయం బయటపెట్టారు. చంద్రబాబు ప్రభుత్వంలో పేదలు దోపిడీకి గురవుతున్న తీరుకు వర్మ వ్యాఖ్యలే పెద్ద నిదర్శనం. వాస్తవానికి ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఓపీ దగ్గర నుంచి వైద్య పరీక్షలు, ఇన్‌పేషెంట్ కింద సర్జరీలు, ఇతర సేవలన్నింటినీ అందించాలి. అంతేకాక డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లే రోజున మందులను కూడా పూర్తి ఉచితంగా రోగికి ఇవ్వాలి. వైఎస్సార్సీపీ హయాంలో రోగి కోలుకునేదాక నెలకు రూ.5 వేల వరకు ఆరోగ్య ఆసరా కూడా అందించేవారు. ఈ ఆసరా సాయాన్ని బాబు ప్రభుత్వం అటకెక్కించింది.ఉన్నతాధికారి విన్నవించినా దిక్కు లేదుబకాయిల విషయంలో బాబు ప్రభుత్వం హామీలివ్వడం, అమలు చేయకుండా మొండిచేయి చూపిస్తుండడంతో విసిగిపోయిన ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల యజమానులు ఆరోగ్యశ్రీనే కాదు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ (ఈహెచ్ఎస్) కింద ఉచిత వైద్య సేవలు అందించబోమని తేల్చి చెప్పేస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర సచివాలయం ఉద్యోగి భార్య కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు. తాడేపల్లిలోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించి... ఈహెచ్ఎస్ కింద చికిత్స చేయాలని కోరారు. ఉచిత వైద్యం చేస్తే ప్రభుత్వం డబ్బులు ఇవ్వదని, ముందు డబ్బు చెల్లించి, తర్వాత మెడికల్ రీయింబర్స్మెంట్ పెట్టుకోమని ఉద్యోగికి ఆస్పత్రికి యాజమాన్యం సూచించింది. చేతిలో అంత డబ్బు లేకపోవడంతో సదరు ఉద్యోగి సమస్యను సచివాలయం ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన నేరుగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఉన్నతాధికారులకు సమస్య వివరించారు. స్పెషల్ కేస్ కింద పరిగణించి, ఉచిత వైద్యం చేయాలని ఆరోగ్య శ్రీ సీఈవోను కోరినా ఆస్పత్రి యాజమాన్యం ఒప్పుకోలేదని సమాచారం. దీంతో ఆ ప్రభుత్వ ఉద్యోగి భార్య వైద్యానికి రూ.లక్షల్లో సొంతంగా ఖర్చు పెట్టుకున్నారు.రూ.60 వేలు అప్పు చేసి చికిత్సనెల కిందట అకస్మాత్తుగా కడుపునొప్పి రావడంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి వెళ్లా. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని విజయవాడలోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి పంపారు. ఆరోగ్యశ్రీలో చికిత్స చేస్తామని చెప్పి చేర్చుకున్నా మూడు రోజులైనా సర్జరీ చేయలేదు. అదేమంటే... ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి అనుమతి రాలేదని చెప్పారు. రోజురోజుకు నొప్పి ఎక్కువ కావడంతో రూ.60 వేలు అప్పు చేసి సర్జరీ చేయించుకున్నా. పేదింటికి చెందిన నాకు అప్పు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం సకాలంలో అనుమతిచ్చి ఉంటే అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. –లాజరస్, తాళ్లపాలెం, మచిలీపట్నం.జగన్ హయాంలో పూర్తి భరోసా..ఆరోగ్యశ్రీ పథకాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే.. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించి రాష్ట్రంలో పేదలందరికీ చేరువ చేశారు. రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందేలా విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. వైద్య ప్రక్రియలను ఏకంగా 3,257కు పెంచారు. రూ.వెయ్యికి పైగా ఖర్చయ్యే చికిత్సలన్నింటినీ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. శస్త్ర చికిత్సలు చేయించుకున్న పేదలకు పూట గడవడం కోసం ఇదివరకెన్నడూ లేని విధంగా ‘ఆరోగ్య ఆసరా’ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద వైద్యులు సూచించిన మేరకు రోగి కోలుకునే వరకు రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేలు చొప్పున సాయం అందించేందుకు శ్రీకారం చుట్టారు. 108, 104 వ్యవస్థలను గాడిన పెట్టారు. ప్రతి పీహెచ్సీలో కనీసం ఇద్దరు వైద్యుల చొప్పున నియమించి గ్రామాల్లో ‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. నడవలేని రోగులకు ఇంటి వద్దకే వెళ్లి చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. కరోనా సమయంలో తీసుకున్న చర్యలు యావత్ దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. ఇంటింటి సర్వేలు, క్వారంటైన్ సెంటర్లు, వైద్యుల నియామకాల కోసం వాకిన్ ఇంటర్వ్యూలు, టెలి మెడిసిన్ తదితర సేవల పట్ల నాడు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వైద్య రంగాన్ని ఇంత సర్వోన్నతంగా మార్చేసిన స్థితి నుంచి.. చంద్రబాబు ప్రభుత్వం రాకతో ఇప్పుడు మళ్లీ మొదటికొచ్చినట్లయింది. గుండె ఆపరేషన్‌కు రూ.3.5 లక్షలు ఖర్చు చేశానాకు అక్టోబరులో గుండెపోటు వచ్చింది. ఒంగోలు కిమ్స్‌కు వెళ్తే వైద్యులు ఆపరేషన్ తప్పనిసరి అన్నారు. ప్రభుత్వం నుంచి బకాయిలు చెల్లింపులు లేవని, ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయలేమని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టంగా చెప్పింది. సొంతంగా రూ.3.5 లక్షలు ఖర్చు పెట్టుకుని ఆపరేషన్ చేయించుకున్నా. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎంతోమంది పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు చేయించుకున్నారు. మందులు, ఆస్పత్రి ఖర్చులతో పాటు, కోలుకునేవరకు రోజుకు రూ.225 చొప్పున చెల్లించింది. ఇప్పుడు ఆ వెసులుబాటు లేదు.– కుక్కల వెంకటేశ్వర్లురెడ్డి, రాజుబంగారుపాలెం, చినగంజాం మండలం, బాపట్ల జిల్లాపేదవారికి దక్కని భరోసానేను చిన్నాచితక పనులతో జీవనం సాగిస్తున్నా. గుండె నొప్పితో బాధపడుతూ నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ పూర్తిస్థాయి వైద్యం అందే అవకాశం లేకపోవడంతో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రికి పంపారు. పరీక్షలన్నింటికీ డబ్బు చెల్లించాలని చెప్పారు. చేతిలో డబ్బు లేదు. అనారోగ్యంతో ఉన్నా చేసేదిలేక వెనుదిరిగా. గతంలో ఆరోగ్యశ్రీ కార్డు మాలాంటి పేదలకు భరోసా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. – వెంకటరెడ్డి, బొమ్మలసత్రం. నంద్యాలవైద్యం అందక మంచంపైనే..మాది నిరుపేద కుటుంబం. కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నా. ముగ్గురు ఆడ పిల్లలను పెంచి పెళ్లి చేశాను. కొడుకు లారీ డ్రైవర్. అతడి సంపాదనే మాకు జీవనాధారం. నాకు మూడేళ్ల కిందట పక్షవాతం రాగా ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రిలో చికిత్స పొందా. కుటుంబ డాక్టర్ కార్యక్రమంలో 15 రోజులకోసారి గ్రామానికి వచ్చిన వైద్యులు పరీక్షలు చేసేవారు. ఇప్పుడు ఏడాదిన్నరగా ఊరికి వైద్యులు రావడం లేదు. మందులు కొనలేకపోయాను. మళ్లీ ఆరోగ్యం క్షీణించింది. ఆరోగ్యశ్రీలో చికిత్స కుదరదంటున్నారు. డబ్బు చెల్లించి వైద్యం చేయించుకోలేక మంచానికే పరిమితమయ్యా. – మేరమ్మ, గండేపల్లి, ఎన్టీఆర్ జిల్లా.డబ్బులు పడలేదని పంపించేశారునా భర్త పేరు శరవణరెడ్డి. వెనుకభాగంలో ఎముక అరిగిందని ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాం. 20 రోజులు ఉన్నాం. ఆరోగ్యశ్రీ డబ్బులు పడలేదని చెప్పి.. ఆపరేషన్‌కు రూ.50 వేలు కట్టాలన్నారు. మా దగ్గర అంత డబ్బు లేదని చెప్పాం. దీంతో మందులు రాసి డిశ్చార్జి చేశారు. ఈ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కార్డుతో భరోసా దక్కడం లేదు. – దీపా, జంభూగోళంపల్లె, చిత్తూరు జిల్లా.ఆపరేషన్‌కు ముందే రూ. 8 వేలు ఖర్చునాకు కాలు విరగడంతో ప్రొద్దుటూరు నెట్వర్క్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పి... ఎక్స్‌రే రాశారు. కట్టు కట్టారు. రూ.8 వేలు తీసుకున్నారు. మందులు కూడా డబ్బు పెట్టి కొన్నాం. ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఇవ్వాలి కదా అని అడిగితే.. మీ ఫైల్ అప్రూవల్ కాలేదు. అన్నింటికీ డబ్బులు చెల్లించాల్సిందేనని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో అదనపు ఖర్చులు ఉండేవి కావు. నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లగానే ఆపరేషన్ చేసేవారు. కానీ, ఇప్పుడు దోపిడీ జరుగుతోంది. అడిగినా పట్టించుకునే నాథుడు లేడు. – రామరాజు, తొండూరు మండలం, వైఎస్సార్ కడప జిల్లాఅదనంగా చెల్లించాల్సి వచ్చింది...మా నాన్నకు తుంటి ఎముక విరిగింది. నెల్లూరులోని కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్తే ఖరీదైన మందులంటూ రూ.20 వేలు అదనంగా వసూలు చేశారు. రశీదు కూడా ఇవ్వలేదు. మా అత్తకు కూడా కాలు విరిగి ఆస్పత్రికి వెళ్లాం. తొడ ఎముక చీలిపోయిందని అత్యవసరంగా ఆపరేషన్ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ అనుమతులు వచ్చేసరికి ఆలస్యం అవుతుందని భయపెట్టారు. ఆరోగ్యశ్రీలో గిట్టుబాటు కావడం లేదంటూ కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు అదనంగా డబ్బు వసూలు చేస్తున్నాయి. – బీబీజాన్, నెల్లూరు -
క్లిక్.. ఆర్డర్
ఫంక్షన్‌కి వెళ్లాలి.. శారీకి మ్యాచింగ్ ఇమిటేషన్ జ్యువెలరీ లేదు.. ఏం పర్లేదు.. వెంటనే ఆర్డర్ పెట్టేయ్! కొత్త హ్యాండ్ బ్యాగ్ కొనాలి.. ఆన్లైన్లో చూసేద్దాం.. జిమ్‌కు వెళ్లే సమయం లేదు.. ఇంట్లోనే ఫిట్నెస్ పెంచుకోవాలి.. ఇంకేం.. వెంటనే డంబెల్స్, బార్బెల్స్, వెయిట్ ప్లేట్స్ బుక్ చేసేద్దాం.. ఇది, అది అనే తేడా లేదు.. ఏదైనా సరే.. క్లిక్ కొట్టి ఆర్డర్ పెట్టేయడమే! పది నిమిషాల్లోనే వస్తువు ఇంటి ముందు వాలిపోతుంది. ప్రస్తుతం వైజాగ్‌లో ఎక్కడ చూసినా.. క్లిక్ ఆర్డర్.. ఇదే ట్రెండ్ నడుస్తోంది. వంద రూపాయల పర్స్ నుంచి.. లక్ష రూపాయల గోల్డ్ కాయిన్ వరకూ.. ఏం కావాలన్నా.. ఆన్లైన్ షాపింగ్ ఉంది కదా.. అనేదే అందరి ధీమా..!సాక్షి, విశాఖపట్నం: ఒకప్పుడు చాక్లెట్ కావాలంటే వీధి చివర ఉన్న షాప్‌కి వెళ్లేవాళ్లం. పెరుగు కావాలంటే డెయిరీకి, స్వీట్ల కోసం మిఠాయి దుకాణానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు క్విక్ కామర్స్ పుణ్యమా అని, ఆర్డర్ పెట్టిన పది నిమిషాల్లోనే మనకు కావల్సిన వస్తువు ఇంటికి వచ్చేస్తోంది. అందుకే ఆన్లైన్ ఆర్డర్లకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. విశాఖ నగరంలోనూ క్విక్ డెలివరీ యాప్స్‌కు ఆదరణ భారీగా పెరిగిందని ప్రముఖ డెలివరీ సంస్థ ఇన్‌స్టామార్ట్ సర్వేలో వెల్లడైంది. 2025లో వైజాగ్ వాసులు ఫాస్టెస్ట్ డెలివరీ యాప్స్‌లో ఎక్కువగా ఏం ఆర్డర్ చేశారో తెలుసా.? బ్యాగ్స్, వ్యాలెట్స్..! రూ.5.84 లక్షల షాపింగ్.. ఐఫోన్లలో టాప్ క్విక్ కామర్స్‌లో అత్యంత ఖరీదైన ఫోన్లు కూడా ఆర్డర్ చేస్తుండటం విశేషం. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో ప్రీమియం కొనుగోళ్లలో దేశంలోనే వైజాగ్ నగరం అగ్రస్థానంలో నిలిచింది. 2025లో నగరానికి చెందిన ఒక వినియోగదారుడు రూ.లక్ష విలువైన 24 క్యారట్ల బంగారు నాణేన్ని కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఓ వ్యక్తి ఇన్‌స్టామార్ట్‌లో ఏకంగా రూ.5.84 లక్షల విలువైన షాపింగ్ చేశారు.2025లో ఒకే వ్యక్తి చేసిన అత్యధిక షాపింగ్ ఇదే కావడం విశేషం. మరికొంతమంది రూ.3.50 లక్షల మార్కును దాటారు. వైజాగ్ ప్రజలు ఆన్లైన్లో చేసే ప్రతి 10 ఆర్డర్లలో 7 వరకు పెరుగు ప్యాకెట్లే ఉంటున్నాయి. తర్వాత స్థానంలో ఐస్‌క్రీమ్‌లు, స్వీట్లు ఉన్నాయి. ఏడాది కాలంలో వీటి ఆర్డర్లలో 112 శాతం వృద్ధి కనిపించిందని సర్వేలో వెల్లడించింది. సెకనుకు 4 పాల ప్యాకెట్లు దేశవ్యాప్తంగా చూస్తే.. సగటున సెకనుకు 4 పాల ప్యాకెట్లను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుండటం గమనార్హం. ఈ గణాంకాలను బట్టి క్విక్ కామర్స్ యాప్స్ నగర జీవనాన్ని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. స్థానిక ఉత్పత్తుల నుంచి ప్రీమియం వస్తువుల వరకూ విస్తృత శ్రేణిలో అందించేందుకు ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్ పోటీపడుతున్నాయి. విశాఖ వాసులు ఇల్లు కదలకుండానే తమకు నచ్చిన వస్తువును కొనుగోలు చేస్తూ.. ‘స్మార్ట్’గా మార్ట్‌ని ఇంటికి రప్పించుకుంటున్నారు.నిమిషాల్లో డెలివరీ ఉరుకుల పరుగుల జీవన విధానంలో అంతా ఇప్పుడు వేలికొనల పైనే నడుస్తోంది. నచ్చింది తినాలన్నా, కొనాలన్నా ఒక్క క్లిక్‌తో ఇంటికే తెప్పించుకుంటున్నారు. ఆర్డర్ పెడితే 10 నుంచి 15 రోజుల సమయం వేచి చూసే రోజులు పోయాయి. ఇప్పుడంతా ఇన్స్టంట్ జమానా. 15 నిమిషాల్లో డెలివరీ చేస్తామని ఒకరు, 10 నిమిషాల్లోనే తెస్తామని మరొకరు.. పోటీ పడి మరీ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. పైగా షాపుల్లో దొరకని ఆఫర్లతో వస్తువులు ఇంటికి చేరుస్తుండటంతో, శ్రమ తగ్గిందని నగరవాసులు క్విక్ కామర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు.ఏం ఆర్డర్ చేస్తున్నారంటే?ఇన్‌స్టామార్ట్ క్విక్ కామర్స్ యాప్.. 2025లో విశాఖ నగరవాసులు కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించి పలు ఆసక్తికర మైన గణాంకాలను వెల్లడించింది.» ఈ ఏడాది వైజాగ్ వాసులు కిరాణా సరుకుల కంటే కిరాణేతర సామగ్రిపైనే ఎక్కువగా దృష్టి సారించారు.» నగలు, హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ వంటి వస్తువుల కొనుగోళ్లు వృద్ధి శాతం 249» గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హ్యాండ్ బ్యాగులు, వాలెట్ల కొనుగోళ్లు పెరిగిన శాతం 434» ఎల్రక్టానిక్స్ ఉపకరణాలు శాతం 161» పిల్లల ఆటవస్తువుల కొనుగోళ్లు పెరిగిన శాతం 166» క్రీడలు, ఫిట్నెస్ పరికరాల ఆర్డర్లు నమోదయిన శాతం 374» స్నాక్స్, చక్కెర, వాటర్ బాటిల్స్, పాల ఉత్పత్తులు, గృహోపకరణాల కొనుగోళ్లు వృద్ధి చెందిన శాతం 100 -
బాబు సర్కారు అప్పులు రూ.2.93 లక్షల కోట్లు!
సాక్షి, అమరావతి: బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఎడాపెడా అప్పు...! భారీగా రుణాలు తీసుకుంటూ ప్రజలపై పెనుభారం..! సంపద సృష్టించడం దేవుడెరుగు... ఉన్న ఆస్తులు ప్రైవేటుపరం...! ఇదీ చంద్రబాబు ప్రభుత్వ పనితీరు..! ఏడాదిన్నరలో ఏకంగా రూ.2.93 లక్షల కోట్లు అప్పులు చేసి ఆయన రికార్డుల మీద రికార్డు సృష్టిస్తున్నారు. రాష్ట్ర సర్కారు మంగళవారం బడ్జెట్ లోపల 7.54 శాతం వడ్డీతో రూ.4 వేల కోట్ల రుణం తీసుకుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఈ మొత్తాన్ని ఆర్బీఐ సమకూర్చింది. దీంతో బడ్జెట్ లోపలే బాబు సర్కారు రూ.1,65,637 కోట్లు అప్పు చేసినట్లయింది. ఇక బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు, రాజధాని పేరుతో మరో రూ.1,27,632 కోట్లు అప్పు చేశారు. ఇందులో కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో రూ.80,245 కోట్లు రుణం తీసుకున్నారు. మరోపక్క రాజధాని పేరుచెప్పి ప్రపంచ బ్యాంక్, జర్మనీ సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కో, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (ఎన్ఏబీఎఫ్ఐడీ), ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీఎఫ్సీఎల్), నాబార్డు నుంచి ఏకంగా రూ.47,387 కోట్లు అప్పు చేసింది.సంపద లేదు అప్పే..!చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర సంపద పెంచడంలో, కొత్త సంపద సృష్టించంలో విఫలమైంది. భారీగా అప్పులు చేస్తూ ప్రజలపై కొత్తగా అప్పుల భారాన్ని మోపుతున్నారు. బడ్జెట్ లోపల, బయట ఇష్టానుసారం అప్పులు చేస్తున్నప్పటికీ సూపర్ సిక్స్‌లో కీలకమైన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకాలను అమలు చేయకుండా ఎగనామం పెట్టారు. చేసిన అప్పులతో ఆస్తులు సృష్టించకపోగా... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన 17 మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేట్‌పరం చేస్తోంది. వాస్తవానికి అప్పులను ఆస్తుల కల్పనపై వెచ్చించాలి. ఇదే విషయాన్ని ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు పదేపదే నొక్కిచెప్పారు. కానీ, అధికారంలోకి వచ్చాక మాత్రం దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ రంగంలో ఆస్తులను కల్పించగా చంద్రబాబు సర్కారు ప్రైవేట్‌పరం చేస్తోంది. మరోవైపు చేసిన అప్పులను మెడికల్ కాలేజీల్లో మిగిలిన నిర్మాణాలకు వ్యయం చేయడం లేదు.కళ్లు మూసుకుపోయిన ఎల్లోమీడియా...కేవలం ఏడాదిన్నర పాలనలోనే చంద్రబాబు సర్కారు రూ.2.93 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినా ఎల్లో మీడియాకు కనిపించడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో లేని అప్పులను కూడా ఉన్నట్లు తప్పుడు సమాచారం వ్యాప్తి చేసింది పచ్చ మీడియా. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారంటూ దుష్ప్రచారం చేసింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగానే వైఎస్సార్సీపీ సర్కారు అప్పులు చేసినా రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది. ఇప్పుడు చంద్రబాబు రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియాకు కనిపించకపోతుండడం గమనార్హం. -
ఆ ఘటన ఎలా జరిగింది!
యలమంచిలి రూరల్: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన ఘటనపై రైల్వే శాఖ అధికారులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఝార్ఖండ్‌లోని టాటానగర్ నుంచి కేరళలోని ఎర్నాకుళం వెళ్తున్న రైలు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత యలమంచిలి రైల్వేస్టేషన్‌కు చేరుకునేసరికి అగ్నిప్రమాదానికి గురైన విషయం విదితమే. ఘటనపై యలమంచిలి రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ ఆకుల సురేష్‌కుమార్ ఫిర్యాదు మేరకు తుని రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారి కాకినాడ ప్రభుత్వ రైల్వే పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు ఘటనకు గల కారణాలపై వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. ప్రమాదం సంభవించిన బోగీల్లో బీడీ కాల్చిన వ్యక్తితో పాటు కోచ్‌ల్లో బెడ్ రోల్స్ అందించే వారినీ అదుపులోకి తీసుకుని విచారించారు. అగ్ని ప్రమాదానికి గురైన రెండు బోగీలను సోమవారం అర్ధరాత్రి విజయవాడకు తరలించారు. అగ్నికీలలు వ్యాపించి దగ్ధమైన బోగీలను రైల్వే ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ బృందాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించాయి. ఘటనపై బుధ, గురువారాల్లో దక్షిణ మధ్య రైల్వే సర్కిల్ సేఫ్టీ కమిషనర్ మాధవి విజయవాడలో విచారణ జరపనున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలిసిన వారు సికింద్రాబాద్ సరోజినీదేవి రోడ్డులో రైల్ నిలయం ఎదురుగా ఉన్న రైల్వే సేఫ్టీ కమిషనర్ అడ్రస్‌కు రాతపూర్వకంగా పంపించవచ్చని దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో ఎ.శ్రీధర్ ప్రకటనలో పేర్కొన్నారు. -
నేటి నుంచి జిల్లాల పునర్వ్యవస్థీకరణ అమలు
సాక్షి, అమరావతి : రాజకీయ ప్రయోజనాల కోసం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను అస్తవ్యస్తంగా పునర్వ్యవస్థీకరించిన చంద్రబాబు ప్రభుత్వం.. వాటికి సంబంధించిన తుది నోటిఫికేషన్లు మంగళవారం ఇచ్చింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా చేసిన మార్పులు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ 16 వేర్వేరు జీవోలు జారీ చేశారు. ఇప్పటివరకు 26 జిల్లాలు ఉండగా మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటుతో వాటి సంఖ్య 28కి చేరింది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకి మార్చారు. కొత్తగా అడ్డరోడ్డు జంక్షన్, అద్దంకి, పీలేరు, మడకశిర, బనగానపల్లె రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ ప్రాంతాన్ని గత ప్రభుత్వం అన్నమయ్య పేరుతో జిల్లాగా ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు దాన్ని రద్దు చేసి చీలికలు పీలికలు చేశారు. ఆ పార్లమెంటు నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి మూడు జిల్లాల్లో కలపడంతో అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట అన్నమయ్య జిల్లాలో ఉన్న తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంతో కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. తుది నోటిఫికేషన్ నాటికి ఆ జిల్లాలో మిగిలిన రాయచోటిని మదనపల్లె జిల్లాలోనూ, రాజంపేటను వైఎస్సార్ కడప, రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోనూ కలిపి దానికి రూపురేఖలు లేకుండా చేశారు. పేరు అన్నమయ్యది.. జిల్లా మదనపల్లెదిరాజంపేట ప్రాంతాన్ని అన్నమయ్య జిల్లా నుంచి వేరు చేసి అన్నమయ్య పేరును మదనపల్లె జిల్లాకు పెట్టారు. నిజానికి ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన మదనపల్లె జిల్లాకు అన్నమయ్య పేరు పెట్టినా దాంతో ఆయనకు సంబంధం లేదు. అన్నమయ్య స్వస్థలం రాజంపేట ప్రాంతంలోని తాళ్లపాక. ఆ నియోజకవర్గాన్ని వైఎస్సార్ కడప జిల్లాలో కలిపారు. కానీ ఆయన పేరును పక్కన ఏర్పాటు చేసిన కొత్త జిల్లాకు పెట్టారు. ఎన్నికల సమయంలో రాయచోటిలో నిర్వహించిన సభలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాయచోటిని జిల్లా కేంద్రంగానే కొనసాగిస్తామని, దాన్ని మార్చబోమని అక్కడి ప్రజలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీకి తిలోదకాలిచ్చి, ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకి మార్చేశారు. పేరు పోలవరం.. ఊరు రంపచోడవరంఅన్నమయ్య పుట్టిన ప్రాంతంతో సంబంధం లేని ప్రాంతానికి ఆయన పేరు పెట్టినట్లే.. పోలవరంతో సంబంధం లేని ప్రాంతంతో ఒక జిల్లా ఏర్పాటు చేసి పోలవరం పేరు పెట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లాను రెండు ముక్కలు చేసి కేవలం రంపచోడవరం నియోజకవర్గంతో పోలవరం జిల్లాను ఏర్పాటు చేశారు. అల్లూరి జిల్లాలో ఉన్నదే మూడు నియోజకవర్గాలు కాగా దాన్ని విడగొట్టి కొత్త జిల్లా ఏర్పాటు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఒరిజినల్ పోలవరం ఏలూరు జిల్లాలో ఉండగా, రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాకు పోలవరం పేరు పెట్టారు. ఈ నిర్ణయంతో పోలవరం పేరుపై గందరగోళం నెలకొనడంతోపాటు రంపచోడవరం పేరుకి ప్రాధాన్యత తగ్గిపోనుంది. ఒకే ప్రాంతాన్ని రంపచోడవరం, పోలవరంగా పిలవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.తగ్గిన బాపట్ల ప్రాధాన్యంబాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపి బాపట్ల ప్రాధాన్యాన్ని తగ్గించారు. మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసినా అది స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదనే వాదన వినిపిస్తోంది. 2023లో శాస్త్రీయ పద్ధతిలో పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేయగా ఇప్పుడు వాటిని అస్తవ్యస్తంగా మార్చి శాస్త్రీయత లేకుండా చేశారు. చంద్రబాబు తనకు రాజకీయంగా పట్టు లేని ప్రాంతాలను దెబ్బతీసేలా పునర్విభజన చేపట్టినట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో తమ ప్రాంతాలుగా చెప్పుకునే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అనంతపురం తదితర జిల్లాలను మాత్రం కదల్చకపోవడం ద్వారా పునర్విభజనలో కచ్చితంగా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. జిల్లాల సరిహద్దులు, రెవెన్యూ డివిజన్ల మార్పులు, మండలాల మార్పులు సైతం టీడీపీ ప్రయోజనాలకు అనుగుణంగానే జరిగినట్లు తేటతెల్లమైంది. -
సచివాలయాల ఉద్యోగులపై సర్కారు కక్ష
సాక్షి, అమరావతి: అత్తమీద కోపం దుత్తమీద చూపిన చందంగా.. ప్రజల మీద అసహనాన్ని సచివాలయ ఉద్యోగులపై ప్రదర్శిస్తోంది చంద్రబాబు సర్కారు. ‘మన మిత్ర’ పేరిట ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ సేవల గురించి రాష్ట్రంలోని 68 శాతం మందికి అవగాహన లేదని తేలడంతో.. అందుకు సచివాలయ ఉద్యోగులను బాధ్యుల్ని చేస్తోంది. ఈ ఏడాది జనవరి 30న ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ విధానం అమల్లో ఉన్నట్టు రాష్ట్రంలో మూడింట రెండొంతుల మందికి పైగా కనీసం తెలియలేదని ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 27,280 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నుంచి వివరణ కోరాలని సచివాలయాల శాఖ డైరెక్టర్ కార్యాలయం ద్వారా ఆదేశాలు జారీ చేసింది.20 శాతం మందికే అవగాహన‘ప్రభుత్వం నిర్వహిస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ గురించి తెలుసా’ అంటూ ఐవీఆర్ఎస్ విధానంలో ప్రభుత్వం 20 లక్షల మందికి ఫోన్లు చేసి సమాచారం సేకరించింది. ఏకంగా 67.99 శాతం మంది ఆ కార్యక్రమం గురించి తమకు తెలియదని చెప్పారు. ఈ విధానం ఉన్నట్టు తెలుసని కేవలం 20.54 శాతం మంది మాత్రమే చెప్పారు. ఈ గణాంకాలను ఇటీవల ప్రభుత్వమే వెల్లడించింది. డిసెంబర్ 17, 18 తేదీల్లో జరిగిన కలెక్టర్ల సందర్భంగా సర్వే వివరాలు బహిర్గతం కావడం, పత్రికల్లో కథనాలు ప్రచురితమవడంతో ఈ కార్యక్రమంపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఇంటింటికీ పంపించి ప్రచారం చేయించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీంతో సచివాలయ ఉద్యోగులు ఇకనుంచి ప్రతి శుక్రవారం ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంచుతూ ప్రచారం చేయాలని సచివాలయాల శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కాగా.. డిసెంబర్ 26వ తేదీ మొదటి శుక్రవారం 27,280 సచివాలయాల ఉద్యోగులు ప్రచార కార్యక్రమంలో పాల్గొనలేదని సచివాలయాల శాఖ తేల్చింది. ఈ నేపథ్యంలో ఆ శాఖ డైరెక్టర్ అన్ని జిల్లాల గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించి 27,280 మంది ఉద్యోగుల నుంచి వివరణ కోరాలని ఆదేశించారు. తెలియకపోవడానికి కారణాలివీ2019–24 మధ్య గ్రామ, వార్డు వలంటీర్ల ఆధ్వర్యంలో సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజల గడపవద్దే అందేవి. ఆ కాలంలో దాదాపు 10 కోట్లకు పైగా సేవలు ప్రజలు ఇంటినుంచే పొందారు. కూటమి పార్టీలు అధికారంలోకి రాగానే.. సీఎం చంద్రబాబు వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడేశారు. వలంటీర్ల సేవల స్థానంలో మనమిత్ర యాప్ పేరుతో వాట్సాప్ గవర్నెర్స్ సేవల్ని ప్రవేశపెట్టారు. ఈ సేవలు వినియోగించుకోవాలంటే ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్లు ఉండాలి. నిరుపేదలు, సామాన్యుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేవు. కొందరి వద్ద ఉన్నా వారు ఇంటర్నెట్ సేవల్ని పొందడం లేదు. ఒకవేళ ఇంటర్నెట్ డేటా వినియోగిస్తున్నా మనమిత్ర యాప్ ఉపయోగించడం, సేవలు పొందేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను తమ ఫోను ద్వారా ఆ యాప్‌లో అప్లోడ్ చేసే పరిజ్ఞానం కూడా చాలామందికి తెలియదు. మరోవైపు తోడు స్మార్ట్ ఫోన్లలో యాప్‌లు వినియోగిస్తే మోసాలకు గురవుతామన్న భయాందోళనలు చాలామందిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేదలకు, సామాన్యులకు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి రాలేదు. వాస్తవాలు ఇలా ఉంటే.. ఈ లోపాలను గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ వైఫల్యాలను ఉద్యోగులపై చూపాలన్న పాలకుల నిర్ణయాన్ని సచివాలయాల ఉద్యోగ సంఘాల నేతలు తప్పు పడుతున్నారు.డొల్లతనం బట్టబయలుమన మిత్ర యాప్ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా 20 లక్షల మంది అభిప్రాయాలు తీసుకుంటే కేవలం సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో మాత్రమే 33 నుంచి 35 శాతం మంది అవగాహన ఉందని చెప్పడంతో అధికారులు షాక్ అయ్యారు. యాప్ వాడటం రాదని 37.42 శాతం మంది వెల్లడించగా.. 32.13 శాతం మంది యాప్ వాడితే ఎక్కడ డబ్బులు పోతాయన్న భయంతో వినియోగించడం లేదని చెప్పారు. 30.45 శాతం మంది తమకు స్మార్ట్‌ఫోన్ లేదని స్పష్టం చేశారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. తొలుత 161 సేవలు ప్రవేశపెట్టామని.. వీటిని ఇప్పుడు 700 వరకు పెంచామని ప్రతి వేదికపై సీఎం చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారంలో డొల్లతనాన్ని ఈ నివేదిక బయటపెట్టింది. ఇది కాస్తా అట్టర్ ఫ్లాప్ కావడంతో సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. యాప్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏకంగా 21 శాఖలకు చెందిన 1.20 లక్షల మంది ఉద్యోగులతో ప్రచారం చేపట్టారు. అయినా ప్రయోజనం కనిపించే అవకాశం లేదని తేలిపోవడంతో.. దీనంతటికీ వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బందే కారణమని చూపించేందుకు ప్రభుత్వం సిద్ధమవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పోలవరం.. హత‘నిధి’
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును 2026, మార్చి నాటికి పూర్తి చేయడానికి వీలుగా కేంద్రం విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకుని ప్రాజెక్టు పనులను పరుగులెత్తించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టు కోసం అడ్వాన్సు రూపంలో రెండు విడతలుగా రూ.5,052.71 కోట్లను కేంద్ర జల్ శక్తి శాఖ విడుదల చేసింది. ఆ నిధులను కేంద్ర జల్ శక్తి శాఖ నిర్దేశించిన మేరకు ఎస్ఎన్ఏ(సింగిల్ నోడల్ ఏజెన్సీ) ఖాతాలో జమ చేసి.. పోలవరం ప్రాజెక్టు పనుల కోసమే వ్యయం చేయాలి. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇతర అవసరాలకు మళ్లించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జల్ శక్తి శాఖ ఎత్తిచూపినప్పుడు మాత్రమే ఎస్ఎన్ఏ ఖాతాలో జమ చేస్తోంది. దీంతో.. గత ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన రూ.5,052.71 కోట్లలో ఇప్పటిదాకా రూ.4,352.71 కోట్లను మాత్రమే వ్యయం చేసింది. మిగతా రూ.700 కోట్లను ఇప్పటికీ ఎస్ఎన్ఏ ఖాతాలో బాబు ప్రభుత్వం జమ చేయలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26 బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన రూ.5,936 కోట్లు ఇంకా విడుదల చేయలేదు. దీంతో ఆ నిధుల్లో రూ.3,034 కోట్లు మాత్రమే విడుదల చేయాలంటూ కేంద్ర జల్ శక్తి శాఖకు పీపీఏ ప్రతిపాదనలు పంపింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం మూడు నెలల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఆ మేరకు నిధులు సరిపోతాయని పేర్కొంది. 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి వీలుగా మిగతా నిధులను 2026–27 ఆర్థిక సంవత్సరంలో కేటాయించాలని సూచించింది.నాడు రిజర్వాయర్.. నేడు బ్యారేజ్పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు. గరిష్ట నీటి నిల్వ 194.6 టీఎంసీలు. 2004–05లో అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ఆమోదించిన ప్రకారం 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసి.. కుడి, ఎడమ కాలువ కింద 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా.. కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించి 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే లక్ష్యంతో చేపట్టింది. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేను పూర్తి చేసింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, అప్రోచ్ చానల్, స్పిల్ చానల్, ఫైలట్ ఛానల్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాం, గ్యాప్–1లో డయాఫ్రం వాల్, జలవిద్యుత్ కేంద్రంలో అత్యంత కీలకమైన పనులను పూర్తి చేసింది. చంద్రబాబు సర్కారు చారిత్రక తప్పిదం చంద్రబాబు సర్కారు 2014–19 మధ్య గోదావరి ప్రవాహాన్ని మళ్లించేసేలా స్పిల్ వే, స్పిల్ చానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండానే.. గ్యాప్–2లో డయాఫ్రం వాల్ వేయడం ద్వారా చారిత్రక తప్పిదం చేసింది. దీంతో వరదల ఉద్ధృతికి గ్యాప్–2లో డయాఫ్రం వాల్ గోదావరి వరదల ఉద్ధృతికి దెబ్బతింది. ఇక గ్యాప్–2లో ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం వరద ఉద్ధృతికి కోతకు గురై ధ్వంసమైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం గ్యాప్–2లో కోతకు గురైన ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చింది. డయాఫ్రం వాల్‌కు మరమ్మతు చేయాలా? కొత్తది నిర్మించాలా? అన్నది కేంద్రం అప్పట్లో తేల్చలేదు. చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే.. 2022–23 నాటికే వైఎస్ జగన్ ప్రభుత్వం పోలవరాన్ని పూర్తి చేసేదని ఆ ప్రాజెక్టు పనులను ఆది నుంచీ నిశితంగా పర్యవేక్షించిన అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇక పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేస్తే దానికి టీడీపీ మంత్రులు అంగీకరించడం.. రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పకపోవడం అందరినీ విస్మయపరిచింది. దీని వల్ల డ్యాంలో నీటి నిల్వ సామర్థ్యం 115.44 టీఎంసీలకు తగ్గిపోతుంది. దీని వల్ల గోదావరికి వరద వచ్చే రోజుల్లో పోలవరం కుడి, ఎడమ కాలువల కింద 1.98 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లందించవచ్చునని అధికారులు చెబుతున్నారు. పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేసిన ఘనత చంద్రబాబు సర్కారుకే దక్కిందని సాగునీటిరంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 19 నెలల్లో ఒక్క ఇల్లూ పూర్తి చేయని బాబు సర్కారుపోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.12,157.53 కోట్లను మంజూరు చేయడానికి 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని నిర్దేశించింది. భారీ వరదలు వంటి విపత్తులు ఉత్పన్నమైతే ప్రాజెక్టును పూర్తి చేసే గడువును మరో ఏడాది అంటే 2027 మార్చి నాటికి పొడిగిస్తామని పేర్కొంది. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి వీలుగా 2024–25లో రెండు విడతల్లో రూ.5,052.71 కోట్లను అడ్వాన్సుగా విడుదల చేసింది. విదేశీ నిపుణుల కమిటీతో ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులను పర్యవేక్షించి.. సత్వరమే ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టు పనులను పరుగులెత్తించడంలో విఫలమైంది. ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్ పనులు నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇప్పటికీ సాగడం లేదు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు పూర్తయింది. కానీ.. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం కోసం పునరావాస కాలనీల్లో ఒక్క ఇంటినీ పూర్తి చేసిన దాఖలాలు లేవు. కేంద్రం అడ్వాన్సుగా ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకుని ఉంటే.. నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులు ఈ పాటికే కొలిక్కివచ్చేవని అధికారవర్గాలే చెబుతుండటం గమనార్హం. -
వైకుంఠవాసా... శ్రీవేంకటేశా
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలో స్వర్ణరథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉదయం 9 నుంచి 10.30 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని పురమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. అలాగే, శ్రీవారి ఆలయంలో ఏర్పాటు చేసిన పుష్పాలంకరణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు పర్యవేక్షణలో ఓ దాత ఏర్పాటు చేసిన శ్రీరంగనాథ స్వామి ఆలయ సెట్టింగు భక్తులను ఆకట్టుకుంది. కాగా, వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకుని బుధవారం సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం వైభవంగా జరుగనుంది. రామతీర్థంలో వైభవంగా గిరి ప్రదక్షిణనెల్లిమర్ల రూరల్: ఆంధ్రా రెండో భద్రాద్రిగా పేరొందిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థంలో గిరి ప్రదక్షిణ మంగళవారం వైభవంగా జరిగింది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు వేలాదిగా తరలివచ్చి శ్రీరామ నామస్మరణతో బోడికొండ (నీలాచల పర్వతం) చుట్టూ 8 కిలోమీటర్ల మేర నడిచి స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామున స్వామివారికి బాల¿ోగం, సుప్రభాత సేవ అనంతరం ఉత్తరద్వారం నుంచి శ్రీ సీతా సమేత లక్ష్మణ స్వామివారి దర్శనాన్ని కల్పించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. కోదండరామ స్వామివారి మెట్లను పసుపు, కుంకుమలతో అలంకరించి మెట్లోత్సవాన్ని జరిపించారు. ప్రత్యేక పూజల అనంతరం గిరి ప్రదక్షిణ చేపట్టి 1,500 అడుగులు ఎత్తులో బోదికొండపై కొలువైన శ్రీ కోదండరామ స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీల సేవలో తరించిన టీటీడీ» సామాన్య భక్తులను పక్కనపెట్టి.. » 6 గంటలకుపైగా వీఐపీలకే అవకాశం » వైకుంఠ ద్వార దర్శనానికి భారీగా విచ్చేసిన సినీ నటులుసాక్షి టాస్క్ ఫోర్స్: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వీఐపీల సేవలో తరించారు. మొదటి నుంచి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని చెబుతూ వచి్చన టీటీడీ అధికారులు.. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా చేశారు. 6 గంటల పాటు వీఐపీల సేవలో తరించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. టీటీడీ చరిత్రలో తొలిసారిగా వైకుంఠ ద్వార దర్శనం కోసం మొదటి మూడురోజులు కేవలం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న భక్తులకు మాత్రమే లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి అవకాశం కల్పించడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుమలలో సోమవారం అర్ధరాత్రి దాటాక మంగళవారం వేకువజామున ప్రారంభ సమయం 12.05 గంటలకు ఉత్తర ద్వారా దర్శనం ప్రారంభం కాగా.. 1.15 గంటలకు వీఐపీలను అనుమతించారు. సాధారణంగా అయితే వీఐపీలకు తెల్లవారుజామున 4.30 గంటల వరకు మాత్రమే సమయం కేటాయిస్తారు. కానీ మంగళవారం నాటికి ఏకంగా 6,800 మంది వీఐపీలకు టికెట్లు కేటాయించడంతో ఉదయం 7.30 గంటలు వరకు వారే దర్శనాలు చేసుకున్నారు. టీటీడీ చర్యలతో విసుగు చెందిన అనేకమంది భక్తులు, స్థానిక తిరుపతి వాసులు టీటీడీ అనుబంధ ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకున్నారు. ఈసారి వైకుంఠ దర్శనానికి మాజీ ఎమ్మెల్యేలను తిరస్కరించడంతో టీటీడీ తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎలాంటి ప్రోటోకాల్ లేని అనేకమంది సినీనటులు మంగళవారం వేకువజామున వైకుంఠ ద్వారదర్శనం చేసుకోవడం గమనార్హం. మరోవైపు తిరుమలలో కూటమి నేతల హవా కనిపించింది. ఎమ్మెల్యేలు కాని వారికి సైతం వైకుంఠ ద్వారదర్శనం లభించింది. సింహగిరీశా..శరణు శరణుముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహగిరిపై కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి శ్రీదేవి, భూదేవి సమేతుడై ఆలయ ఉత్తర రాజగోపురంలో వైకుంఠవాసుడిగా శేషతల్పంపై వేంజేసి భక్తులకు దర్శనమిచ్చారు. పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి రాత్రి ఒంటి గంట నుంచి వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ఉత్తర రాజగోపురంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు. – సింహాచలంచిన వెంకన్న నమోస్తుతే! ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం చిన వెంకన్న ఆలయంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం భక్తులకు నేత్రపర్వమైంది. తెల్లవారుజామున 4.15 గంటలకు అర్చకులు ఆలయ ఉత్తర ద్వారాలను తెరచి, వెండి గరుడ వాహనంపై కొలువైన స్వామి, అమ్మవార్లకు పూజలు చేసి హారతులిచ్చారు. అనంతరం భక్తులకు శ్రీవారి ఉత్తర ద్వార దర్శనంతో పాటు, స్వామివారి నిజరూప దర్శన భాగ్యాన్ని కల్పించారు. – ద్వారకాతిరుమల కైలాసవాసా.. పాప వినాశ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీశైలంలో శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివార్లకు మంగళవారం ప్రత్యేక ఉత్సవం నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ముఖమండపంలో ఉత్తర ముఖంగా ఆశీనులను చేసి విశేష పూజాదికాలు జరిపించారు. అనంతరం విశేషపూజాదికాలు, రావణవాహన సేవ చేపట్టారు. ఉత్సవమూర్తులను ఉత్తరద్వారమైన శివాజీగోపురం నుంచి వెలుపలకి తీసుకువచ్చి గ్రామోత్సవం జరిపించారు. ఆ తర్వాత ఉత్సవమూర్తులను తిరిగి ఆలయ ముఖమండపం ఉత్తరం వైపున (బలిపీఠం సమీపంలో) ఆశీనులను చేయించారు. గ్రామోత్సవం ప్రారంభమైన తరువాత భక్తులను దర్శనానికి, ఆర్జితసేవలకు అనుమతించారు. – శ్రీశైలం టెంపుల్ శ్రీవారి సేవలో ప్రముఖులువైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాత్సవ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు ఏపీ, తెలంగాణ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు. – తిరుమల -
‘కరెంట్ కట్’ పైనా డైవర్షనే
సాక్షి, అమరావతి: ప్రసిద్ధిగాంచిన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని తొలిసారిగా చీకట్లు అలముకున్నాయి. ఈ నెల 27న దాదాపు మూడున్నర గంటలపాటు దుర్గ గుడికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జరిగింది చిన్న పొరపాటు కాదు. చేసింది ప్రైవేటు సంస్థలో.. వ్యక్తులో కాదు. విజయవాడ ప్రధాన కేంద్రంగా సీఆర్డీఏతో పాటు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు విద్యుత్ సరఫరా చేసే ఏపీ సీపీడీసీఎల్. అదీగాక సాక్షాత్తూ కనకదుర్గ ఆలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడమంటే అదేదో కిందిస్థాయి సిబ్బంది తీసుకునే నిర్ణయం కాదు. ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి. కానీ.. మాకేం తెలియదంటూ ఎవరికివారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడంతో పాటు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం పరువు పోయింది. నిర్లక్ష్యంపై 4 రోజులకు కళ్లు తెరిచిన సీఎం చంద్రబాబు విద్యుత్ శాఖ మంత్రిని వివరణ కోరడంతో పాటు ఈ విషయాన్ని ‘డైవర్షన్’ చేయాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన మంత్రి గొట్టిపాటి మంగళవారం దుర్గగుడి ఈవో, విద్యుత్ అధికారులతో మంత్రి సమావేశమైన అనంతరం మీడియా ముందుకు వచ్చారు. అధికారులపై నెపం దుర్గగుడిలో విద్యుత్ అంతరాయం అంశాన్ని కొందరు రాజకీయం చేయడం దురదృష్టకరమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. కనకదుర్గమ్మ గుడిలో సుమారు 15 నిమిషాల పాటు (వాస్తవంగా 3 గంటలు) విద్యుత్ అంతరాయం కలగడానికి గల కారణాలపై దేవదాయ, విద్యుత్ శాఖాధికారులతో సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. అధికారుల మధ్య సమన్వయం లోపం వల్లే విద్యుత్ సరఫరా నిలిచి పోయిందన్నారు. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. జనవరి 6, 7 తేదీల్లో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మరోసారి దుర్గ గుడి ఈవో, ముఖ్య అధికారులతో కలిసి సమావేశం కానున్నట్టు ప్రకటించారు.పెద్దలకు తెలిసే.. దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంలో తమ తప్పేమీ లేదంటున్న ప్రభుత్వం అధికారుల మీద నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తోంది. అమ్మవారి ఆలయానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబర్‌లో దసరా ఉత్సవాలు అనంతరం దేవస్థానానికి చెందిన పది సర్వీసులకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అప్పుడే సీఎంగానీ, మంత్రిగానీ దృష్టి సారించి ఉంటే ఇప్పుడు మరోసారి ఆ పరిస్థితి వచ్చేది కాదు. కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి వెళ్లిన ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డికి సైతం ఆలయ అధికారులు సమస్యను విన్నవించి పరిష్కరించాలని కోరారు. ఆయన ఏమాత్రం పట్టించుకున్నా ఇప్పుడిలా విద్యుత్ సరఫరా ఆగేది కాదు. అదీగాక దుర్గగుడికి విద్యుత్ సరఫరా ఆపడమంటే అది కచ్చితంగా డిస్కం సీఎండీకి, ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా, వారి అనుమతి లేకుండా జరిగే అవకాశం లేదు. అప్పుడు నిర్లక్ష్యంగా ఉండి.. తీరా అభాసుపాలవ్వడంతో అధికారుల సమన్వయ లోపం వల్లే పొరపాటు జరిగిందంటూ తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాంకేతిక వివరాలేవి? దేవస్థానం పరిధిలో ఉన్న సౌర విద్యుత్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేస్తున్నారు. దీనికి కచ్చితంగా నెట్ మీటరింగ్ విధానాన్ని అనుసరించాల్సి ఉంది. అది సక్రమంగా జరిగితే ఆ కేంద్రం నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌కు బదులుగా డిస్కం నుంచి విద్యుత్‌ను వినియోగించుకున్నప్పటికీ ఎలాంటి విద్యుత్ బిల్లు చెల్లించే అవసరం రాకపోవచ్చు. కానీ.. ఏవో సాంకేతిక కారణాలను సాకుగా చూపించి రూ.3.08 కోట్ల బకాయిలు చెల్లించాలని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదేమీ గుట్టుగా ఉండే విషయం కాదు. ప్రతీదీ అధికారికంగా ఆన్లైన్లో నమోదై ఉండాల్సిందే. కానీ.. ఇంతవరకూ బకాయిలకు సంబంధించిగానీ, నెట్ మీటరింగ్‌కు సంబంధించిగానీ అధికారిక పత్రాలను, వివరాలను విద్యుత్ శాఖ బయటపెట్టలేదు. మరోవైపు మూడున్నర గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతే కేవలం 15 నిమిషాలేనంటూ విద్యుత్ శాఖ మంత్రి అసత్యాలు వల్లె వేస్తున్నారు. -
సింహాచల అప్పన్న ఆలయంలో అపచారం.. పులిహోర ప్రసాదంలో నత్త
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో సోమవారం మహాపచారం చోటుచేసుకుంది. పరమ పవిత్రంగా భావించే పులిహోర ప్రసాదంలో నత్త కనిపించడంతో భక్తులు షాక్‌కు గురయ్యారు. దీనిపై దేవస్థానం సిబ్బంది సరిగ్గా స్పందించకపోవడంతో.. ఇద్దరు భక్తులు తమ ఆవేదనను తెలియజేస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు. ‘దర్శనం అనంతరం మేము పులిహోర ప్రసాదం ప్యాకెట్ తీసుకున్నాం. పులిహోర తింటున్నప్పుడు అందులో నత్త వచ్చింది. కౌంటర్ వద్దకు వెళ్లి ప్రశ్నిస్తే.. వారు సరిగ్గా సమాధానమివ్వకుండా ఆ ప్యాకెట్‌ని తీసేసుకున్నారు. ఇంకో ప్యాకెట్ ఇచ్చేసి వెళ్లిపొమ్మన్నారు’ అంటూ ఇద్దరు భక్తులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వంపై భక్తులు, నెటిజన్లు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పన్న పులిహోర ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని.. దాని విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండడం దారుణమని మండిపడ్డారు. దేవాలయాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పదేపదే దారుణాలు చోటుచేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాచలం దేవస్థానం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ఏప్రిల్ 30న జరిగిన చందనోత్సవంలో నాసిరకంగా నిరి్మంచిన గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందారని.. జూలైలో భారీ షెడ్ కూలిపోయిందని.. ఇప్పుడు ప్రసాదంలో నత్త కనిపించిందని.. వీటన్నింటికీ చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య తీరే కారణమని మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, నత్త విషయాన్ని భక్తులు తమ దృష్టికి తేలేదని ప్రసాదాల విభాగం ఏఈవో రమణమూర్తి చెప్పారు. వారు సోషల్ మీడియాలో పోస్టు చేసుకున్నారని, ప్రసాదాల విక్రయశాల సిబ్బంది ద్వారా తనకు విషయం తెలిసిందన్నారు. ఈ ఘటనపై దేవస్థానం ఇన్చార్జ్ ఈవో సుజాతను దేవదాయ శాఖ కమిషనర్ వివరణ కోరినట్లు తెలిసింది. -
డ్రైవర్ రాయుడు హత్య కేసు వేగవంతం.. ఎమ్మెల్యే బొజ్జలను విచారించే అవకాశం!
శ్రీకాళహస్తి(తిరుపతి జిల్లా): శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కోటా వినుత (Vinutha Kota) డ్రైవర్ శ్రీనివాసులు (రాయుడు) హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డికి నోటీసులిచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే బొజ్జల అనుచరుడు సుజిత్‌ను పోలీసులు విచారించగా, బొజ్జలను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోట వినూత హత్యకు టీడీపీ ఎమ్మెల్య బొజ్జల సుధీర్‌రెడ్డి స్కెచ్ వేసినట్లు కోట వినుత డ్రైవర్ రాయుడు హత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ద్వారా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బొజ్జలను విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ వీడియోలో ఏం చెప్పాడంటే..ఆ వీడియోలో బొజ్జల సుధీర్‌రెడ్డి.. కోట వినూత దంపతులను హత్య చేసేందుకు రెండు సార్లు ఏ విధంగా కుట్ర చేశారు. ఆ కుట్రలు బెడిసి కొట్టడంతో తనకు భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి కోట వినూత ఏకాంత వీడియోలు తీయాలని పురమాయించడం, కోట వినుత దంపతులు ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నారు. ఏం చేస్తున్నారన్న సమాచారం తనకు ఇవ్వాలని బొజ్జల సుధీర్‌రెడ్డి తనని బెదిరించి, భయపెట్టినట్లు హత్య కావడానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో బయటపెట్టాడు రాయుడు. జులై 10వ తేదీన కూవం నది కాలువులో తేలిన డ్రైవర్ రాయుడు శవంజులై 10వ తేదీ చెన్నై కూవం నది కాలువ నుంచి గుర్తు తెలియని శవాన్ని అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నివేదికలో హత్య అని గుర్తించారు. మృతుడి చేతిపై కోట వినుత, జనసేన సింబల్ పచ్చబొట్లు ఉండడంతో.. లోతుగా దర్యాప్తు చేశారు. ఆ మృతదేహం డ్రైవర్ రాయుడిదని నిర్ధారించారు. ఆ దిశగా పోలీసులు చేపట్టిన విచారణలో అప్పటి శ్రీకాళహస్తి(తిరుపతి) జనసేన ఇన్చార్జ్ వినుత దంపతులు జులై 8వ తేదీన అతన్ని హత్య చేసి కూవం కాలువలో పడేసినట్లు తేల్చారు. అనంతరం కోట వినుత దంపతులతో పాటు మరో ముగ్గురు వారి అనుచరుల్ని అరెస్ట్ చేశారు.జనసేన తరఫున చాలా యాక్టీవ్‌గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వినుత దంపతులు హత్య కేసులో అరెస్ట్ కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఆమె పేరు బయటకు రావడంతో ఆగమేఘాల మీద ఆమెను పదవి నుంచి తొలగించి.. పార్టీ నుంచి బహిష్కరించింది జనసేన. అయితే.. అరెస్ట్ తర్వాత మీడియా ముందు.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది త్వరలోనే బయటికి వస్తుందని కోట వినుత అనడం, ఆ తర్వాత కాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి పేరు బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో అలజడి రేపింది. -
మరో భారీ అప్పు తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం
విజయవాడ: చంద్రబాబు నాయడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వంం మరో భారీ అప్పు తెచ్చింది. తాజాగా సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల అప్పు చేసింది చంద్రబాబు సర్కారు. మంగళవారం నాడు ఏపీ ప్రభుత్వం మరో భారీ అప్పును తెచ్చింది. రిజర్వ్ బ్యాంక్ వేలం ద్వారా అప్పు సమీకరించింది. గడిచిన 18 నెలల్లో రూ. 2.77 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది ఏపీ ప్రభుత్వం. ఫలితంగా అప్పుల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది చంద్రబాబు సర్కారు.చంద్రబాబు ప్రభుత్వం ఈనెల ఆరంభంలో బడ్జెట్ లోపల రూ.3,000 కోట్ల అప్పు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రూ.3,000 కోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి సమకూర్చిందిఇలా బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఎడాపెడా అప్పులు చేస్తున్న చంద్రబాబు సర్కారు.. సూపర్ సిక్స్‌లోని ప్రధాన హామీలు సైతం అమలు చేయకుండా ఎగనామం పెట్టింది. అలాగే ఇప్పటివరకు చేసిన అప్పులతో ప్రజలకు ఆస్తులు కల్పించకపోగా.. గత వైఎస్సార్సీపీ సర్కారు అభివృద్ధి చేసిన ఆస్తులను సైతం ప్రైవేటుపరం చేస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం 17 కొత్త మెడికల్ కాలేజీలతో ఆస్తుల కల్పన చేయగా.. ఇప్పుడు వాటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేట్ పరం చేస్తోంది.కేవలం ఏడాదిన్నర పాలనలోనే చంద్రబాబు సర్కారురూ. 2.77 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినా ఎల్లో మీడియాకు కనిపించట్లేదా అని ఆర్థిక విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కానీ గత వైఎస్సార్సీపీ పాలనలో లేని అప్పులు కూడా ఉన్నట్లుగా ఎల్లో మీడియా ఇష్టారీతిన దుష్ప్రచారం చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ బాబు అండ్ కో గగ్గోలు పెట్టిందని పేర్కొంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియాకు నోరు మెదపకపోవడం గమనార్హమని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
వివాదాస్పదంగా చంద్రబాబు విదేశీ పర్యటన!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి విదేశీ పర్యటన వివాదాస్పదంగా మారింది. అటు ప్రభుత్వ, ఇటు అధికార వర్గాలనే విస్మయానికి గురి చేస్తూ ఈ ఉదయం ఆయన లండన్ వెళ్లినట్లు సమాచారం. అయితే.. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసమే ఆయన వెళ్లి ఉంటారని అటు టీడీపీ వర్గాలు జోరుగా కూడా చర్చించుకోవడం కొసమెరుపు. ఉండవల్లి నుంచి హైదరాబాద్‌కు.. అక్కడి నుంచి అటే లండన్‌కు అత్యంత రహస్యంగా సాగింది ఆయన పర్యటన. అయితే.. పదేపదే విదేశీ పర్యటల వెనుక మతలబు ఏంటనే చర్చ జోరందుకుంది ఇప్పుడు. ఈ ఏడాదిలో ఇప్పటికే చంద్రబాబు ఆరుసార్లు విదేశాలకు వెళ్లారు. సీఎం హోదాలో పెట్టుబడుల సాధన పేరు చెప్పి.. కుటుంబ సభ్యులతో వ్యక్తిగతంగా పర్యటించిన సందర్భాలే ఉన్నాయి. అయితే.. సీఎం హోదాలో ఉండి కూడా అంత రహస్యంగా పర్యటనలు చేయడం ఎందుకు? అనే చర్చ మొదలైంది ఇప్పుడు. అటు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా తరచూ రహస్య పర్యటనలు చేస్తుండడం.. కనీస సమాచారం లేకపోవడం తెలుగు దేశం పార్టీలోనూ తీవ్రచర్చనీయాంశంగా మారుతోంది. ప్రస్తుతం లోకేష్ విదేశీ పర్యటనలోనే ఉన్నాడు. అందుకే నిన్నటి ఏపీ కేబినెట్ భేటీకి కూడా హాజరు కాలేదు. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా కూటమి నేతలు చంద్రబాబు, పవన్, నారా లోకేష్‌లు మాత్రం విలాసాల విషయంలో ‘తగ్గేదే లే’ అంటున్నారు. ఒకవైపు అడ్డగోలుగా అప్పులు చేస్తూనే.. ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ల ఖర్చుతో రాష్ట్ర ఖాజనాకు చిల్లు పెడుతుండడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. -
"గుంటూరును నాశనం చేశారు"
సాక్షి గుంటూరు: కేంద్రమంత్రి పెమ్మసాని గుంటూరు సిటీని సర్వనాశనం చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అనుమతి లేకుండానే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కూల్చివేశారని, అద్భుతమైన కోర్ సెంటర్‌ను సేదు బంధు కింద తొక్కేశారని ఆరోపించారు. కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా భూసేకరణ చేశారని ఫ్లైఓవర్ కూల్చివేసిన తర్వాత అనుమతులడిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్ కూల్చివేతతో రాకపోకలకు ప్రజలు ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గంటూరు సిటికీ జరుగుతున్న అన్యాయాలపై తాను గళం విప్పితే మహిళల చేత తనను తిట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పెమ్మసాని చాలా అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు తానే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
‘శ్రీకాంత్‌రెడ్డి జిల్లాను తెస్తే.. నువ్వు ముక్కలు చేస్తావా?’
సాక్షి, అన్నమయ్య జిల్లా: జిల్లాను నిలబెట్టలేకపోతే మీసం తీసుకుంటా అంటూ.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి గతంలో తొడగొట్టి మరీ చెప్పిన మాటలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాయచోటిలో ఆయన తీరుపై అసంతృప్తి.. క్రమక్రమంగా ఆగ్రహ జ్వాలలుగా మారుతోంది. తాజాగా రాయచోటిని మదనపల్లిలో కలపడంపై కేబినెట్లో సంతకం చేసిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. బయటకు వచ్చి కంటతడి పెట్టారు. అయితే ఆయనది డ్రామా అంటూ రాయచోటి ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘నాడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకుని రాయచోటికి జిల్లాను తెచ్చారు. దానిని నిలబెడతానని.. లేకుంటే మీసం తీసేస్తానంటూ రాంప్రసాద్‌రెడ్డి శపథం చేశారు. ఈ క్రమంలో.. ఇప్పుడు మీసం తీసేస్తారంటూ అంటూ రాజకీయ ప్రత్యర్థులు సెటైరలు సంధిస్తున్నారు. శ్రీకాంత్‌రెడ్డి పదవీ త్యాగంతో జిల్లాను తీసుకొస్తే..రాంప్రసాద్‌రెడ్డి మంత్రి పదవి కోసం జిల్లాను ముక్కలు చేశాడంటున్న రాయచోటి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. జిల్లా కేంద్రంలో రాయచోటిని తొలగించి మదనపల్లికి మార్చడంపై ఇటు ముస్లిం మత పెద్దల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. శుక్రవారం జిల్లా కేంద్రం మార్పునకు నిరసగా ర్యాలీ చేపట్టాలని నిర్ణయించాయి. ప్రభుత్వ పెద్దలు పునరాలోచన చేయాలని.. అన్నమయ్య జిల్లాలోనే యధావిధిగా కొనసాగించాలని మత పెద్ద సర్కాజి షర్ఫుద్దీన్ హుస్సేని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగించలేని పక్షంలో రాయచోటిని కడప జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారాయన. ‘‘జిల్లా కేంద్రం లేనప్పుడు పన్నుల భారం కూడ తోలగించి రాయచోటిను వైఎస్ఆర్ జిల్లాలో విలీనం చేయండి అని కోరుతున్నారాయన. -
కేసుల మాఫీపై నయా రోల్‌మోడల్!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకో అక్రమ ట్రెండ్‌కు తెరతీశారు. తమపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునే విషయంలో ఇతర అవినీతి నేతలందరికీ రోల్ మోడల్ అవుతున్నారు. ఎందుకంటే.. 2014-19 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన స్కామ్‌లపై పెట్టిన కేసులను తానే ఎత్తేసుకుంటున్నారు మరి! రాష్ట్ర నేర విచారణ సంస్థ సీఐడీ అన్ని కోణాల్లో విచారించిన తరువాత పెట్టిన కేసులివి. ప్రభుత్వ ఉన్నతాధికారుల మేరకు నమోదైనవి. చంద్రబాబు వీటిల్లో కొన్నింటిపై ముందస్తు బెయిల్ సంపాదించుకుంటే ఒక కేసులో మాత్రం జైలుకెళ్లారు. కానీ.. 2024లో అధికారంలోకి వచ్చిందే తడవు చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఫైబర్ నెట్, మద్యం స్కామ్ కేసులను ఎత్తేయించుకున్నారు. తాజాగా స్కిల్ స్కామ్ కేసునూ లేకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. యువకుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉద్దేశించిన పథకంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారన్నది ఈ స్కిల్‌స్కామ్. అంతర్జాతీయ సంస్థ సీమెన్స్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తాయని ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వం పది శాతం అంటే రూ.300 కోట్లు పెడితే.. సీమెన్స్ రూ.3000 కోట్లు పెడుతుందని ఊరించారు. పైగా సీమెన్స్ కంపెనీ పైసా చెల్లించకుండానే ప్రభుత్వం రూ.330 కోట్లు కట్టేసింది. పుణేలోని జీఎస్టీ అధికారులు ఈ తేడాను గుర్తించారు. సీమెన్స్ అసలు, జీఎస్టీ రెండూ కట్టలేదని సమాచారమిచ్చినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈలోపు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడంతో అసలు విషయం బట్టబయలైంది. అసలు సీమెన్స్ కంపెనీ ఈ ఒప్పందంలో భాగమే కాదన్న బోగస్ వ్యవహారంపై కేసు నమోదు చేసింది. కొందరిని అరెస్టు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు లావాదేవీలతో తమకు సంబంధం లేదని సీమెన్స్ స్పష్టం చేసింది. సీమెన్స్ మాజీ అధికారి ఒకరు మొత్తం కథ నడిపినట్లు విచారణలో తేలింది. రాష్ట్ర ప్రభుత్వం తనకు తెలియకుండా ఇందులో చిక్కుకుందా? లేక కుట్రపూరితంగానే జరిగిందా అన్న అంశం పరిశీలనకు వచ్చింది. ఆ సందర్భంలోనే ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా రూ.330 కోట్లు డిజిటెక్ అనే కంపెనీకి విడుదల చేసిందని వెల్లడైంది. సీఎం కోరినట్లుగా నిధులు విడుదల చేస్తున్నామని అధికారులు ఫైళ్లలోనే రాశారు. కేబినెట్‌తో సంబంధం లేకుండా ఈ భారీ మొత్తం దుర్వినియోగమైందని సీఐడీ గుర్తించింది. ఈ స్కామ్‌లో భాగస్వాములన్న అభియోగంపై అధికారులు కొందరిని అరెస్టు చేసింది. సీఎం హోదాలో చంద్రబాబు పాత్ర సాంతం నిర్ధారణ అయ్యాక ఆయనను కూడా అరెస్టు చేసింది. దీంతో రిమాండ్ రిపోర్టు ఆధారంగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబును జైలుకు పంపారు. ఈ కేసులో పలు షెల్ కంపెనీలకు ఈ స్కామ్ డబ్బు వెళ్లిందని, అక్కడి నుంచి సుమారు రూ.70 కోట్లు టీడీపీ బ్యాంక్ ఖాతాలోకి చేరాయని సీఐడీ అధికారులు కనిపెట్టారు. సీఐడీ ఇంత పక్కాగా దర్యాప్తు చేసినా టీడీపీ, జనసేనలు ఇదో అక్రమ కేసు అనే ప్రచారం చేశాయి. ఎల్లో మీడియా కూడా చంద్రబాబును అరెస్టు చేస్తారా? అంటూ చిందులు తొక్కింది. చివరికి న్యాయమూర్తిపై కూడా అభ్యంతకరమైన కథనాలు ప్రచురించింది. చివరకు చంద్రబాబు కేసుతో నిమిత్తం లేకుండా..ఆనారోగ్య కారణాలు చూపి హైకోర్టులో బెయిల్ పొందాల్సి వచ్చింది. హైకోర్టు కూడా కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేయడం.. విడుదలైన మరుక్షణమే చంద్రబాబు వాటిని బేఖాతరు చేయడం జరిగిపోయాయి. అది వేరే సంగతి.ఈ నేపథ్యంలో 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత తన కేసులను ఎలా తొలగించుకునే బాధ్యతను ఒక లీగల్ ప్రముఖుడికి అప్పగించారని గతంలో వార్తలు వచ్చాయి. అంతకంటే ముందు చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంలో ఈ స్కామ్‌లపై విచారణ జరిపిన అధికారులపై, వైసీపీ నేతలపై రకరకాల కేసులు సృష్టించారు. పలువురిని అరెస్టు చేసి, ప్రజల దృష్టి మళ్లించారు. ఇంకో వైపు తన కేసుల మాఫీకి చర్యలు తీసుకున్నారు. అంతేకానీ... తాను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి సిద్దపడలేదు. వెనుకటి రోజుల్లో తాను టెక్నికల్‌గా, లీగల్‌గా దొరకనని సభలలో అంటుండే వారు. కాని గత ప్రభుత్వం సాక్ష్యాలతో సహా కేసులు పెట్టడంతో వాటి నుంచి బయట పడడానికి చంద్రబాబు కోర్టు విచారణ బదులు కొత్తమార్గం కనిపెట్టారు. మద్యం, ఫైబర్‌నెట్ స్కామ్‌లలో తనపై ఫిర్యాదు చేసిన అధికారులను భయపెట్టి ఉపసంహరణ పిటిషన్లు వేయించారు. ఇది బెయిల్ కండిషన్లు ఉల్లంఘించడమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. స్కిల్ స్కామ్‌లో ‘మిస్టేక్ ఆఫ్ ప్యాక్ట్స్’ అని ఇంకో వ్యూహం ప్రయోగించారు. అప్పటి స్కిల్ కార్పొరేషన్ ఎండీకి ఒక నోటీసు పంపి, ఈ కేసు ఉపసంహరణలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియ చేయాలని కోరారట. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ టైమ్‌లో ఎవరు అభ్యంతరం చెబుతారు? నిజానికి అప్పటి కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్ రెడ్డి స్కామ్‌పై ఫిర్యాదు చేశారట. కాని ఆయన అభిప్రాయం తీసుకోవడం లేదట. ఇలా అధికారంలో ఉన్నవారు తమపై వచ్చిన అవినీతి కేసులను తొలగించుకునే రీతిని న్యాయ వ్యవస్థ అంగీకరిస్తుందా అన్నది చర్చనీయాంశం. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఒక తీర్పు ప్రకారం కింది కోర్టులు ఇలాంటి వాటిపై నిర్ణయాలు చేయరాదు. హైకోర్టులో జరగాలి. చిత్రమేమిటంటే ఇంతవరకు చంద్రబాబుకు చెందిన రెండు కేసుల ఉపసంహరణకు సంబంధించిన ఆదేశాల సర్టిఫైడ్ కాపీలు న్యాయ స్థానం కూడా ఇవ్వడం లేదట. ఎందుకు కోర్టు ఇలా గోప్యత పాటిస్తుంది అనేదానిపై సోషల్ మీడియాలో పలు విశ్లేషణలు వచ్చాయి. ఇప్పటికే స్కిల్ కేసును ఈడీ అధికారులు విచారించారు. కాని కేంద్రంలో, రాష్ట్రంలో మారిన రాజకీయాలు, రెండు చోట్ల కూటమి ప్రభుత్వాలే ఉన్న రీత్యా వారికి వ్యతిరేకంగా కేసును ముందుకు సాగనివ్వదని భావిస్తున్నారు. ఈడీతో నిమిత్తం లేకుండా సీఐడీ ఈ కేసును ఎలా నీరుకార్చుతుందన్న ప్రశ్న వస్తుంది. సీఐడీ అప్పట్లో ఎలా కేసు పెట్టి అరెస్టు చేసింది? ఇప్పుడు అదే సీఐడీలో అధికారులు మారిపోతే కేసే ఉండకుండా పోతుందా? చట్టప్రకారం ఇది చెల్లుబాటు అవుతుందా అన్న చర్చలు సాగుతున్నాయి. వచ్చే ఎన్నికలతో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అప్పుడు ఈ కేసులన్నీ మళ్లీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుందా? అనే మీమాంస కూడా ఉంది. దీనికి న్యాయ నిపుణులు అవుననే చెబుతున్నారు. ఇలా అధికారంలో ఉన్న వారు కేసు తీసివేసుకునే పద్ధతి ఉంటే భవిష్యత్తులో ఏ రాజకీయ నేత అయినా అధికారం సాధించుకుంటే అన్నీ మాఫ్ అవుతాయన్న భావన కలగదా?. గతంలో బీహారు ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను గడ్డి స్కామ్‌లో సీబీఐ అరెస్టు చేసి జైలులో పెట్టింది. ఆయన పదవికి రాజీనామా చేయగా, సతీమణి రబ్రీదేవి సీఎం అయ్యారు. కేసు విచారణ తర్వాత ఆయనకు శిక్ష పడింది. అలాగే హర్యానా ముఖ్యమంత్రిగా ఓం ప్రకాష్ చౌతాల కూడా టీచర్ల నియామక వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై శిక్షకు గురై జైలు జీవితం గడపాల్సి వచ్చింది. మరికొందరు నేతలు కూడా విచారణను ఎదుర్కున్నారు. వారికి కూడా ఇలాంటి కేసు ఉపసంహరణ మార్గాలకు సంబందించిన ఐడియాలు వచ్చి ఉంటే జైలుకు వెళ్లవలసిన అవసరం ఉండేది కాదేమో!. బహుశా ఇలాంటి వాటినన్నటిని పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు లీగల్ టీమ్ వ్యూహాత్మకంగా అసలు కేసులు విచారణకే రాకుండా చేయడం ద్వారా వీటి నుంచి బయటపడవచ్చని భావించినట్లు ఉంది. అందుకు తగ్గట్లు ఆయా కేసులలో గతంలో ఫిర్యాదు చేసిన అధికారులతోనే కేసును విరమింప చేయిస్తున్నారు. లేదంటే ఇలా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పేరుతో కొత్త వ్యూహం అమలు చేయాలని అనుకుని ఉండవచ్చు. ఇప్పటికే రెండు కేసుల నుంచి బయటపడ్డ చంద్రబాబు స్కిల్ స్కామ్ కు కూడా అదే ప్లాన్ చేసినట్లు అనుకోవాలి. ఏది ఏమైనా చంద్రబాబు టీమ్ వేసిన ఈ ప్లాన్ దేశంలోని ఇతర నేతలకు ఒక మార్గం చూపినట్లవుతుందా, న్యాయ వ్యవస్థ ఇలాంటి పెడపోకడలకు చెక్ పెడుతుందా? పెట్టదా?అనేవి ఆసక్తికరమైన అంశాలుగా ఉన్నాయి. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ప్రజలకు వైఎస్ జగన్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: వైకుంఠ ఏకాదశి పవిత్ర పర్వదినాన్ని తెలుగు ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఆ వైకుంఠ వాసుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ.. తెలుగు ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అంటూ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా వైఎస్ జగన్ శుభాకాంక్షల సందేశాన్ని పంచుకున్నారు.ఆ వైకుంఠ వాసుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) December 30, 2025శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం. ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల పుణ్యాలు లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.క్లిక్ చేయండి👉: ముక్కోటి ఏకాదశి..తిరుమలలో ప్రముఖుల సందడి చిత్రాలు -
ఎమ్మెల్యే విరూపాక్షికి వైఎస్ జగన్ పరామర్శ
ఆలూరు రూరల్: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రెండు మోకాళ్లకు శస్త్రచికిత్స చేయించుకుని చికిత్స పొందుతున్న కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఫోన్లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా సంపూర్ణ ఆర్యోగంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. -
అల్లోపతి.. ఆయుర్వేదం.. చేయవద్దు మిక్సోపతి
సాక్షి, అమరావతి: ఆయుర్వేద వైద్యులు శస్త్ర చికిత్సలు (సర్జరీలు) చేయడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని అల్లోపతి వైద్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయం ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఇప్పటికే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సైతం ప్రకటించింది. ఆయుర్వేద పీజీ వైద్యులు 58 రకాల శస్త్ర చికిత్సలు స్వతంత్రంగా చేసే వెసులుబాటు కల్పిస్తున్నట్టు ఈ నెల 23న రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు.వాటిలో 39 శల్యతంత్ర(సాధారణ శస్త్ర చికిత్సలు), 19 శలాక్య తంత్ర(ఈఎన్టీ, నేత్ర, దంత వంటి ఇతర) శస్త్రచికిత్సలు ఉన్నాయి. పురాతన వైద్య విధాన ప్రక్రియలను ఆధునిక చికిత్సలతో అనుసంధానం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై రాష్ట్రంలోనే కాకుండా, జాతీయ స్థాయిలో అల్లోపతి వైద్యులు మండిపడుతున్నారు. స్వచ్ఛమైన రూపంలోనే ప్రోత్సహించాలిఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ పి.భన్సాలీ ఇప్పటికే ప్రకటించారు. తమకు ఆయుర్వేద, హోమియోపతి వైద్య ప్రక్రియలపై గౌరవం ఉందన్నారు. ఆయుర్వేదం దాని అసలైన, స్వచ్ఛమైన రూపంలోనే ప్రోత్సహించాలని, ఆధునిక వైద్యంతో ఎందుకు కలుపుతున్నారని ప్రశ్నించారు. సరైన శిక్షణ లేని వారు సర్జరీలు చేస్తే రోగుల ప్రాణాల మీదకు వస్తుందని ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేస్తోంది.అల్లోపతి, ఆయుర్వేద, వివిధ వైద్య విధానాలను కలిపి మిక్సోపతి చేస్తే వైద్య ప్రమాణాలు దెబ్బతింటాయని తెలిపింది. ఆయుర్వేద వైద్యులు శస్త్ర చికిత్సలు చేసేందుకు సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ 2020లోనే మార్గదర్శకాలు ఇచ్చింది. అప్పట్లోనే దీన్ని అల్లోపతి వైద్యులు దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు సైతం చేశారు. సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. వచ్చే నెల ఎనిమిదో తేదీన విచారణకు రానుందని ఐఎంఏ చెబుతోంది. అనుసంధానం చేయవద్దుఅల్లోపతి, ఆయుర్వేదం హోమియోపతి వైద్య విధానాలను ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో తప్పులేదు. అలా కాకుండా ఒకదానితో మరొకటి అనుసంధానం చేసి మిక్సోపతి చేయవద్దు. ఇలా చేస్తే వైద్యం నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మోడ్రన్ మెడిసిన్ వైద్యులకు అనాటమీ, పథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీలో నైపుణ్యం ఉంటుంది. వీటిపై ప్రాచీన వైద్య విద్య అభ్యసించిన వారికి అవగాహన తక్కువ ఉంటుంది. ఆధునిక వైద్యంతో ఆయుర్వేదాన్ని అనుసంధానం చేయడం సరికాదు. – డాక్టర్ ఎస్.బాలరాజు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు -
నేరం రుజువు కాకముందే ఖాకీల శిక్ష
సాక్షి, అమరావతి: ఇప్పటికే బరితెగించి వ్యవహరిస్తున్న ఏపీ పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం నిర్భీతిగా బేఖాతరు చేసే స్థాయికి చేరారు. రెడ్‌బుక్ రాజ్యాంగ అరాచకాలకు వత్తాసు పలకడమే ఏకైక కర్తవ్యంగా రాజ్యాంగ ధర్మాన్ని నిస్సిగ్గుగా పోలీసు శాఖ విస్మరిస్తోంది. నిందితుల అరెస్టు, న్యాయస్థానంలో హాజరుపరిచే ప్రక్రియపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై స్వయంగా డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం విస్మయపరుస్తోంది. ఆయా అంశాలకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలు ఏమిటీ?.. ఏపీ పోలీసుల బరితెగింపు ఏ స్థాయికి చేరిందన్న అంశాలు పరిశీలిస్తే...నిందితులను పరేడ్ చేయించకూడదుడీజీపీలకు సుప్రీంకోర్టు ఆదేశం ఏదైనా కేసుల్లో నిందితులను అరెస్టు విషయంలో పోలీసులు కచ్చితంగా నిబంధనలకు లోబడి వ్యవహరించాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. నిందితులను అరెస్టు చేయడం, న్యాయస్థానంలో హాజరుపరిచే ప్రక్రియలో అనుసరించాల్సిన విధి విధానాలను నిర్దేశించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ ప్రకారం.. ⇒ ఒక కేసులో నిందితులుగా ఉన్నంత మాత్రాన వారు నేరస్తులుగా భావించలేం. నేరం నిరూపితం కానంతవరకు నేరస్తులు కారు.⇒ ఇక నిందితుల సామాజిక గౌరవానికి పోలీసులు భంగం కలిగించ కూడదు. వారి గౌరవాన్ని పోలీసులు కచ్చితంగా పరిరక్షించాలి. అరెస్టు చేసిన నిందితులను బహిరంగంగా నడిపిస్తూ పరేడ్ చేయించకూడదు. వారిని ప్రజలకు కనిపించేలా ప్రదర్శించకూడదు. ⇒ నిందితులను సోదా చేసే ప్రక్రియ గౌరవప్రదంగా ఉండాలి. వారి వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించకూడదు. ⇒ అరెస్టు సమయంలో పోలీసులు బల ప్రయోగం చేయడం సరికాదు. ⇒ నిందితులు తప్పించుకునేందుకు యత్నిస్తే, గాయాలు కాకుండా వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించాలి. అంతేగానీ అరెస్టు కోసమని చెప్పి గాయపరచ కూడదు.సుప్రీం కోర్టు చెప్పినా లెక్క చేయం: ఏపీ పోలీసుల నిర్భీతి నిందితుల గౌరవానికి భంగం కలిగించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను తాము లెక్కచేయబోమంటూ బాబు సర్కార్ హయాంలో ఏపీ పోలీసులు బరితెగిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో కక్ష పూరితంగా అరెస్టు చేసిన పలువురు నిందితులను రోడ్డుపై నడిపించి పరేడ్ చేయించడం పోలీసుల దాషీ్టకానికి నిదర్శనం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను సంప్రదాయ జాతర తరహాలో నిర్వహించిన అభిమానులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. నరికిన పొట్టేళ్ల తలలను దండగా చేసి టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫ్లెక్సీకి వేసి వేడుకలు చేసిన టీడీపీ అభిమానులను పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు.కానీ సాధారణ జాతర శైలిలో మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించిన వైఎస్సార్సీపీ అభిమానులపై మాత్రం కక్ష గట్టారు. శ్రీసత్యసాయి, అనంతపురం, ఉభయ గోదావరి తదితర జిల్లాల్లో ఏకంగా 13 కేసులు నమోదు చేశారు. ఆ కేసుల్లో నిందితులుగా ఉన్న యువకులను అరెస్టు చేశారు. అంతేకాదు...వారిని తీవ్రంగా కొట్టారు. అనంతరం వారిని నడిరోడ్డుపై నడిపిస్తూ పరేడ్ నిర్వహించారు. తద్వారా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు నిర్భీతిగా ఉల్లంఘించారు. నిందితుల సామాజిక గౌరవానికి భంగం కలిగించారు. వారి వ్యక్తిగత గోప్యత హక్కును కాలరాశారు. మొత్తం మీద సుప్రీంకోర్టు ఆదేశాలంటే తమకు ఏమాత్రం లెక్క లేదని తేల్చి చెప్పారు. వాహనాలు లేవు.. అందుకే నడిపించాం: డీజీపీ గుప్తా బాధ్యతా రహిత స్పందన నిందితుల గౌరవానికి భంగం కలిగించ కూడని.. వారిని రోడ్డుపై నడిపిస్తూ పరేడ్ నిర్వహించకూడదని సుప్రీంకోర్టు డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. కానీ ‘సుప్రీంకోర్టు చెబితే మాత్రం మేమేందుకు చేస్తాం’ అన్నట్టుగా సాక్షాత్తూ ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా స్పందించడం విభ్రాంతి కలిగిస్తోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా నిందితులను రోడ్డుపై పరేడ్ చేయించడంపై మీడియా ప్రతినిధులు ఆయనను సోమవారం ప్రశ్నించారు. దీనిపై డీజీపీ పూర్తి బాధ్యతారహితంగా స్పందించారు. ‘నిందితులను న్యాయస్థానంలో హాజరు పరిచేందుకు పోలీసుల వద్ద వాహనాలు లేవు. అందుకే నడిపించి తీసుకువెళ్లాం’ అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.తద్వారా సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర పోలీసు శాఖకు ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర పోలీసు శాఖ చీఫ్ స్వయంగా సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. ఇక ఇతర పోలీసు అధికారుల ఎలా వ్యవహరిస్తారన్న అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో సామాన్యుల గురించి ఎందుకు పట్టించుకుంటారని, పౌర హక్కుల మాటేమిటని మేధావులు, ప్రజాస్వామ్య హితైషులు ప్రశి్నస్తున్నారు. డీజీపీ గుప్తా ఒక దుస్సంప్రదాయానికి తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అంతటా దాడులూ... దౌర్జన్యాలే..
సాక్షి, అమరావతి: చంద్రబాబు రెడ్‌బుక్ పాలనలో రాష్ట్రం దాడులు, దౌర్జన్యాలతో అట్టుడుకుతోంది. ప్రధానంగా భౌతికదాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 2025 సంవత్సరంలో శాంతిభద్రతల పరిస్థితిని వివరిస్తూ పోలీసు శాఖ వార్షిక నివేదికను సోమవారం డీజీపీ హరీశ్‌కుమార్‌గుప్తా మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, పరిస్థితి అంతా బాగుందని చెప్పేందుకు గణాంకాలతో కనికట్టు చేసేందుకు ఆ నివేదికలో యత్నించారు. కానీ ఎంతగా దాచాలన్నా పోలీసు శాఖ వైఫల్యం మాత్రం బట్టబయలైంది. 2024తో పోలిస్తే 2025లో రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలతోపాటు ఆర్థిక నేరాలు పెరిగాయని ఆ నివేదికే స్పష్టం చేసింది.పూర్తిగా అదుపుతప్పిన శాంతిభద్రతలుటీడీపీ రెడ్‌బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో భయోత్పాతం సృష్టిస్తోంది. అధికార టీడీపీ కూటమి నాయకుల అరాచకాలకు పోలీసులు వత్తాసు పలుకుతుండటంతో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులు, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు, సామాజిక ఉద్యమకారులే లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు చాలావరకు కేసులు నమోదు చేయడం లేదు. అయినా సరే 2025లో దాడులు, దౌర్జన్యాల కేసుల సంఖ్య పెరగడం గమనార్హం.బాధితుల ఫిర్యాదులు అన్నింటిపైనా విచారణ చేసి కేసులు నమోదు చేసి ఉంటే రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితి మరింతగా వెల్లడయ్యేది. రాష్ట్రవ్యాప్తంగా 2024లో దాడులు, దౌర్జన్యాల కేసులు 137 నమోదు కాగా... 2025లో ఆ సంఖ్య 146కు పెరిగింది. భౌతిక దాడుల కేసులు 6.6శాతం పెరిగినట్టు పోలీసు శాఖ నివేదిక వెల్లడించింది. ఇక రాజకీయ ప్రత్యర్థులు, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న వారిని అంతం చేయడమే లక్ష్యంగా అధికార పార్టీ నేతలు చెలరేగిపోతున్నారు. 2024లో 1,403 హత్యాయత్నం కేసులు నమోదు కాగా... 2025లో హత్యాయత్నం కేసులు 1,566కు పెరగడం గమనార్హం. హత్యాయత్నం కేసులు 11.6 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది. భారీగా పెరిగిన ఆర్థిక నేరాలుచంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఆర్థిక నేరాలు అమాంతంగా పెరిగాయి. అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలకు కొమ్ముకాయడమే పనిగా పెట్టుకున్న పోలీసు పెద్దలు.. రాష్ట్రంలో ఆర్థిక నేరాల అదుపుపై ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదు. 2024లో 7,667 ఆర్థిక నేరాల కేసులు నమోదు కాగా... 2025లో ఆ కేసుల సంఖ్య 8,034కు పెరిగింది. రాష్ట్రంలో ఆర్థిక నేరాలు 4.78 శాతం పెరిగాయని పోలీసు శాఖ నివేదిక వెల్లడించింది. ఇక పగటిపూట దొంగతనాలు కూడా పెరిగాయి. 2024లో 824 కేసులు నమోదు కాగా, 2025లో ఆ కేసుల సంఖ్య 836కు చేరింది.లక్షల్లో భక్తులు వస్తే భద్రత కల్పించడం కష్టం⇒ మహిళల భద్రతపై జనరలైజ్ చేసి మాట్లాడటం సరికాదు⇒ పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలకు డీజీపీ కౌంటర్‘తిరుపతికి లక్షల్లో భక్తులు వస్తే భద్రత కల్పించడం సాధ్యమయ్యేపనా... వైఫల్యానికి చాలా కారణాలు ఉంటాయి’ అని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల–తిరుపతిలలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో తొక్కిసలాటపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... లక్షల్లో భక్తులు వస్తుంటే భద్రత కల్పించడం, తగిన ఏర్పాట్లు చేయడం పూర్తిగా సాధ్యం కాదని డీజీపీ బదులిచ్చారు. అందుకు చాలా కారణాలు ఉంటాయని, పోలీసుల వైఫల్యంగానే చూడకూడదన్నారు. ఇక భద్రత కోసం మహిళలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను డీజీపీ గుప్తా వ్యంగ్యంగా తిప్పికొట్టారు.‘మహిళా భద్రతలో పోలీసు వైఫల్యం గురించి జనరలైజ్ చేసి చెప్పడం సరి కాదు. నిర్దిష్టంగా చెప్పాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. నేరాలను కట్టడి చేస్తున్నామని చెప్పారు. 2024లో రాష్ట్రంలో 1,10,193 కేసులు నమోదు కాగా, 2025లో 1,03,397 కేసులకు తగ్గాయని తెలిపారు. నేరాలు 6 శాతం తగ్గాయన్నారు. నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2025లో 153 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. త్వరలో ఐపీఎస్ అధికారుల జాతీయ సదస్సు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఐజీలు శ్రీకాంత్, రవికృష్ణ, పాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
2026 ప్రారంభంలోనే పీఎస్ఎల్వీ సీ62 ప్రయోగం!
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ62 ప్రయోగాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ ప్రయోగాన్ని 2026 జనవరి 5న గాని లేదా 10న నిర్వహించేందుకు సిద్ధం చేస్తోంది. ఈ నెల 26న ఈవోఎస్–ఎన్1 (అన్వేష్) ఉపగ్రహం షార్ కేంద్రానికి చేరుకుంది. క్లీన్ రూమ్‌లో శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహించి రాకెట్‌కు అనుసంధానం చేయనున్నారు.షార్‌లోని మొదటి ప్రయోగ వేదికకు సంబంధించి పీఎస్ఎల్వీ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ బిల్డింగ్ (ఫిఫ్)లో నాలుగు దశల పీఎస్ఎల్వీ సీ62 రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసి తుది విడత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాకెట్ అనుసంధానం తరువాత ఫిఫ్ నుంచి ఎంఎస్టీకి తరలించి అక్కడ ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ ప్రయోగంలో ఈవోఎస్–ఎన్1 (అన్వేష్) అనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపబోతున్నారు.రాకెట్ ఆఖరి దశ అయిన పీఎస్–4 దశతో స్పెయిన్‌కి చెందిన స్పానిష్ స్టార్టప్ ఆర్బిటల్ ఫారాడైమ్తో ప్రయోగాత్మకంగా ఓ పరీక్షను నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. 25 కిలోల బరువైన కెస్ట్రెల్ ఇనీషియల్ డిమాన్్రస్టేటర్ (కేఐడీ) అనే క్యాప్సూల్స్‌ను పీఎస్–4 ద్వారా తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించడం కోసం దక్షిణ ఫసిఫిక్ మహా సముద్రంలో ఒక స్పాష్ డౌన్ జోన్‌ను గుర్తించారు. దీంతో పాటు ఇందులో 18 పేలోడ్స్‌ను కూడా పంపిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. -
ప్రయోగాలు తగ్గించిన ఇస్రో
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. ఈ ఏడాది కేవలం ఐదు ప్రయోగాలకే పరిమితమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి రెండు జీఎస్ఎల్వీ రాకెట్లు, రెండు ఎల్వీఎం–3 రాకెట్లు, ఒక్క పీఎస్ఎల్వీ రాకెట్‌ను మాత్రమే ప్రయోగించారు. గతంలో ఏడాదికి నాలుగుకుపైనే పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలు ఉండేవి. జీఎస్ఎల్వీ, ఎల్వీఎం–3 రాకెట్ ప్రయోగాలు ఏడాదికి ఒకటో రెండో ఉండేవి. ఈ ఏడాది ఒకే ఒక్క పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగించినప్పటికీ విఫలమైంది. పీఎస్ఎల్వీ ప్రయోగాలను తగ్గించి జీఎస్ఎల్వీ, ఎల్వీఎం–3 రాకెట్ల ప్రయోగాలు పెంచుతున్నారు. ఈ ప్రయోగాలకు సంబంధించిన క్రయోజనిక్ దశను వివిధ రూపాల్లో తయారు చేసి విజయాలు నమోదు చేస్తున్నారు. జనవరి నుంచే ప్రయోగాలు ఈ ఏడాది ప్రారంభంలోనే అంటే జనవరి 29న జీఎస్ఎల్వీ ఎఫ్ 15 రాకెట్ ద్వారా నావిగేషన్ శాటిలైట్ (ఎన్వీఎస్–02)ను ప్రయోగించారు. మే 18న పీఎస్ఎల్వీ సీ 61 ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–09)ను ప్రయోగించగా విఫలమైంది. జూలై 30న జీఎస్ఎల్వీ ఎఫ్ 16 ద్వారా ఇస్రో–నాసా సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహాన్ని, నవంబర్ 2న ఎల్వీఎం3 – ఎం5 రాకెట్ ద్వారా కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎంఎస్–03) ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారు. డిసెంబర్ 24న ఎల్వీఎం – 3 – ఎం6 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన 6,400 కిలోల అత్యంత బరువైన బ్లూబర్డ్ బ్లాక్–2 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించి ప్రపంచంలో భారత కీర్తిపతాకాన్ని ఎగురవేశారు.ఇస్రో చరిత్రలో ఈ ఏడాది సువర్ణాక్షరాలతో లిఖించదగిన ప్రయోగాలు చేసింది. ఇస్రో బాహుబలిగా పేరుగాంచిన ఎల్వీఎం–3 రాకెట్‌ను ఎప్పుడో రెండు మూడేళ్లకు ఒకటి, రెండుసార్లు ప్రయోగించేవారు. అలాంటిది ఈ ఏడాది 52 రోజుల వ్యవధిలో రెండు ప్రయోగాలు చేసి విజయాలను సొంతం చేసుకోవడం ఒక మైలురాయిగా నిలిచింది. ఇస్రో చరిత్రలో ఇప్పటిదాకా రెండువేల కిలోల నుంచి మూడువేల కిలోల బరువైన ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించారు. ఈ ఏడాది ప్రపంచంలో అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాకు చెందిన 6,400 కిలోల అత్యంత బరువైన ఉపగ్రహాన్ని వాణిజ్యపరంగా ప్రయోగించి చరిత్ర సృష్టించారు. లాంచింగ్ సౌకర్యాలు పెరిగినా.. ఆ స్థాయి ప్రయోగాలు లేవుశ్రీహరికోటలో లాంచింగ్ సౌకర్యాలు విపరీతంగా పెరిగినప్పటికీ ఆ స్థాయిలో రాకెట్ ప్రయోగాలు నిర్వహించడంలో ఇస్రో వెనుకంజలోనే ఉంది. 2022, 2023 సంవత్సరాల్లో ఎనిమిదేసి ప్రయోగాలు చేసిన ఇస్రో 2024, 2025ల్లో అయిదేసి ప్రయోగాలకే పరిమితమైంది. 2020, 2021ల్లో కరోనా మహమ్మారి కారణంగా రెండేసి ప్రయోగాలతో సరిపెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్టాయి. మొదటి ప్రయోగవేదిక మీద ఒకేసారి రెండు రాకెట్లను అనుసంధానం చేసే సౌకర్యాలున్నాయి. రెండో ప్రయోగవేదికకు సంబంధించి రెండు వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లతోపాటు ఎస్‌ఎస్‌ఏబీ భవనం కూడా ఉంది. అంటే ఇక్కడ కూడా ఒకేసారి అయిదు రాకెట్లు అనుసంధానం చేసే వీలుంది. ఇక్కడ ఘన ఇంధన మోటార్ల తయారీ సామర్థ్యాన్ని కూడా పెంచారు.ఇన్ని వసతులు మెరుగుపడినా ఆ స్థాయిలో రాకెట్లను ప్రయోగించడంలేదు. ఈ నెల 24న చేసిన ఎల్వీఎం3 – ఎం6 ప్రయోగంతో షార్ నుంచి 104 ప్రయోగాలు పూర్తయ్యాయి. ఇందులో నాలుగు.. ఉపగ్రహాలు లేకుండా ప్రయోగాత్మకంగా నిర్వహించారు. ఈ నెల 24న చేసింది.. ఉపగ్రహాలతో కూడిన వందో ప్రయోగం. వచ్చే మార్చి నాటికి తమిళనాడు తూత్తుకుడి సమీపంలోని కులశేఖరపట్నంలో నిర్మీస్తున్న రాకెట్ ప్రయోగకేంద్రం అందుబాటులోకి రానుంది. పీఎస్ఎల్వీ, ఎస్ఎస్ల్వీ రాకెట్ ప్రయోగాలను అక్కడి నుంచే నిర్వహించే అవకాశాలున్నాయి. భారీ ప్రయోగాల కోసం శ్రీహరికోట షార్ కేంద్రాన్ని బలీయమైన శక్తిగా తయారు చేస్తున్నారు. ఇక భవిష్యత్‌లో ప్రతిష్టాత్మకమైన గగన్‌యాన్ అన్‌మ్యాన్ మిషన్, గగన్‌యాన్ మ్యాన్ మిషన్, చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించే ప్రయోగాలతోపాటు సుమారు 10 వేలకిలోల బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని సముపార్జించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. -
బాబు.. బాదుడే బాదుడు
విద్యుత్ చార్జీల వీర బాదుడు...భూముల క్రయవిక్రయాలపై రిజిస్ట్రేషన్ చార్జీల అదనపు మోత... తాగునీటిపై ఎప్పుడంటే అప్పుడు యూజర్ చార్జీల భారం! ఇవన్నీ చాలదన్నట్లు వాహనాల కొనుగోలుపై భారీగా సెస్ విధింపుతో సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలపై మళ్లీ పన్ను బాదుడుకు సిద్ధమయ్యారు. వివిధ పేర్లతో అన్ని వర్గాల వారిపై పన్నుల మోత మోగిస్తున్న ఆయన ఈసారి వాహనదారులను లక్ష్యంగా చేసుకున్నారు. ఏడాదిన్నర కిందట అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజలపై ఎడాపెడా పన్నుల బాదుడే లక్ష్యంగా సాగుతోంది బాబు ప్రభుత్వ పాలన. అదనపు పన్నుల మోతతో వీలున్న ప్రతి రంగంలోనూ జనం జేబులకు చిల్లులు పెడుతూ వస్తున్నప్పటికీ చంద్రబాబు శాంతించలేదు. తాజాగా మంత్రివర్గ సమావేశం వేదికగా మరో రుసుముల కొరడా ఝళిపించారు. తన మార్కు బాదుడుకు ఇదే నిదర్శనం అని చాటారు. సాక్షి, అమరావతి: అంతుపొంతు లేకుండా సాగుతున్న చంద్రబాబు సర్కారు పన్నుల మోత రాష్ట్ర ప్రజలపై పెనుభారంగా మారుతోంది. ఈ క్రమంలో ఆర్థికంగా కుంగదీసే మరో బాదుడుకు సిద్ధమైంది. వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఊరటను రాష్ట్ర ప్రజలకు లేకుండా చేస్తోంది. ‘‘రహదారి భద్రత సెస్’’ పేరిట ఏటా ఏకంగా రూ.270 కోట్లు బాదేయనుంది. యథాప్రకారం ఇందులో సరికొత్త దోపిడీకి తెరవెనుక పావులు కదుపుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో విక్రయించే వాహనాలపై 10 శాతం రహదారి భద్రత సెస్ వేయాలని బాబు సర్కారు నిర్ణయించింది. వాహనాల లైఫ్ ట్యాక్స్‌లో ఈ సెస్ విధించాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించింది. అందుకోసం ఆర్డినెన్స్ జారీ చేస్తామని ప్రకటించింది. దాదాపు పదేళ్లుగా వాహనాల లైఫ్ ట్యాక్స్‌లో 28 శాతం జీఎస్టీ విధించేవారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను సరళం చేసింది. వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. దీంతో కాస్త ఊరట లభించిందని రాష్ట ప్రజలు భావించారు. కానీ, ఈలోపే వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్‌తో చంద్రబాబు పన్నుల కొరడా ఝళిపించారు.⇒ ప్రభుత్వం చెప్పిన అధికారిక లెక్కలు ప్రజలపై పడనున్న భారీ ఆర్థిక భారాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏటా 73 వేల వాహనాలను విక్రయిస్తారు. వాటిపై లైఫ్ ట్యాక్స్‌లో 10 శాతం సెస్ వేస్తే నెలకు రూ.22.50 కోట్లు కానుంది. ఆ ప్రకారం వాహన కొనుగోలుదారులపై ఏటా రూ.270 కోట్లు పన్ను మోత మోగనుంది. స్కూటర్ల నుంచి లారీల వరకు మున్ముందు వాహన విక్రయాలు పెరిగితే అందుకు తగినట్లే పన్ను భారం పెరుగుతుంది.రహదారి భద్రత ముసుగే... దోపిడీయే అసలు కథచంద్రబాబు ప్రభుత్వం వేసిన రహదారి భద్రత సెస్ అనేది దోపిడీ ఓ ముసుగు మాత్రమేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎలాగంటే... సెస్ బాదుడు ద్వారా వచ్చిన నిధులను ఎలా వెచ్చిస్తామన్నది మంత్రులు వెల్లడించలేదు. అంటే, సెస్ ద్వారా వచ్చిన మొత్తాన్ని దారిమళ్లిస్తారని పేర్కొంటున్నారు. రహదారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను అందుకోసం ఖర్చు చేయని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హోం, వైద్యఆరోగ్య, ఆర్అండ్బీ శాఖల సంయుక్త కమిటీల ద్వారా నిధులను వెచ్చించాల్సి ఉండగా, ఆ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాటించడమే లేదు. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం సెస్ పేరిట ఏటా వసూలు చేసే రూ.270 కోట్లను సద్వినియోగం చేస్తుందనే నమ్మకం ఏమాత్రం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు అస్మదీయులకు అడ్డదారిలో కాంట్రాక్టు పనుల పేరిట దోచిపెడతారని ఆరోపిస్తున్నారు.రిజిస్ట్రేషన్ల చార్జీలు 50 శాతం పెంపుచంద్రబాబు ప్రభుత్వం గత సంవత్సరం రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచింది. ప్రజలపై సుమారు రూ.వెయ్యి కోట్ల భారంపడింది. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువలను 50 నుంచి 60 శాతం పెంచారు. అర్బన్ ప్రాంతాల్లో దీని ప్రభావం తీవ్రంగా కనిపించింది. భూముల విలువతో పాటు నిర్మాణాల విలువను అమాంతం పెంచి రిజిస్ట్రేషన్ చార్జీలు దండుకుంటున్నారు. పూరిళ్లు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లు, గోడలు లేని ఇళ్లను కూడా వదలకుండా విలువను పెంచారు. ఫలితంగా అపార్టుమెంట్లలో ఫ్లాట్లు, ఇళ్లు కొన్నవారిపై భారంపడింది. భూముల విలువ పెంపును తక్కువగా చూపేందుకు ప్రస్తుతం భూముల క్లాసిఫికేషన్లను మార్చేశారు. దీంతో ఏరియాను బట్టి కాక స్థలాన్ని బట్టి రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగిపోయాయి. గతంలో చార్జీలు రూ.2 లక్షలు ఉండగా, రూ.50 వేల వరకు పెరిగాయి.బాబు వస్తూనే బాదుడు మొదలు‘‘అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచేది లేదు. అవసరమైతే తగ్గిస్తాం. వినియోగదారులే విద్యుత్ అమ్ముకునేలా చేస్తాం’’ అంటూ ప్రగల్భాలు పలికారు చంద్రబాబు. ఇంతలా నమ్మబలికిన ఆయన అధికారం చేతికి రాగానే అసలు స్వభావం బయటపెట్టుకున్నారు. బాబు వస్తూనే రూ.15,485.36 కోట్ల భారీ భారాన్ని ప్రజలపై వేసి చార్జీల బాదుడుకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది చివరి నుంచే రూ.6,072.86 కోట్లను వసూలు చేస్తుండగా, ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో రూ.9,412.50 కోట్ల భారాన్ని జోడించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది వసూలు చేసిన రూ.2,787.18 కోట్లలో రూ.1,863.64 కోట్లకు ఏపీఈఆర్సీ అనుమతి లభించింది. అంటే, బాబు ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ఏకంగా రూ.17,349 కోట్ల భారం ప్రజలపై మోపినట్లైంది. దీంతో ప్రజలకు కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. రూ.వేలల్లో వస్తున్న బిల్లులపై ప్రజలు మండిపడుతున్నా, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా బాబు ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదు, సరికదా ఇంకా చార్జీల భారం వేస్తూనే ఉంది. దీంతో వాడిన విద్యుత్‌కు సమానంగా అదనపు చార్జీలు పడుతున్నాయి. ఇంతలేసి బిల్లులు కట్టలేం బాబూ అంటూ జనం గగ్గోలు పెడుతూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు.తాగునీటిపై యూజర్ చార్జీలు అనుకున్నప్పుడు అమలు!గ్రామాల్లో ప్రజలు తాగేందుకు రక్షిత పథకాల ద్వారా సరఫరా చేసే నీటిపైనా యూజర్ చార్జీలు వసూలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లోని సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు, బోర్ల నిర్వహణ, మరమ్మతులకు ఏడాదికి రూ.1680.29 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి, అందులో రూ.1,036.97 కోట్లను ప్రజల నుంచి యూజర్ చార్జీలుగా పిండుకోవాలని చూస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికకు రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం తెలిపి, ‘ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ’ పాలసీ రూపొందించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీనిప్రకారం రెండు కంటే ఎక్కువ గ్రామాలకు ఒకే రక్షిత మంచినీటి పథకం ద్వారా నీటి సరఫరా జరిగేచోట ఒక్కో వ్యక్తిపై నెలకు రూ.26.66 చొప్పున ఏడాదికి రూ.320 భారం మోపనున్నారు. గ్రామ పరిధిలో అంతర్గతంగా చిన్న రక్షిత తాగునీటి పథకం ఉన్నచోట ఒక్కొక్కరి నుంచి నెలకు రూ.20 వంతున ఏడాదికి రూ.240 యూజర్ చార్జీ వసూలు చేయాలని నిర్ణయించారు. కాగా, ‘‘ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ’’ పాలసీకి యూజర్ చార్జీల వసూలు ఎప్పటినుంచి అన్నది ప్రత్యేకంగా పేర్కొనలేదు. కానీ, నోటిఫికేషన్ ప్రభుత్వ జీవో రూపంలో జారీ అయినందున ఎప్పుడనుకుంటే అప్పటినుంచి యూజర్ చార్జీల వసూలు ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
బాబు సర్కారు దోపిడి ‘పర్వం’
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసి ఉత్సవాలు, ఈవెంట్ల పేరుతో దోపిడీ పర్వానికి తెరలేపింది. అధికారం చేపట్టినప్పటి నుంచి భారీగా ప్రజాధనాన్ని ఖర్చుచేస్తూ తన అనుయాయ సంస్థలకు భారీగా దోచిపెడుతోంది. ఇప్పటికే శక్తి విజయోత్సవ్, వరల్డ్ టూరిజం డే పేరిట భారీ అవినీతికి పాల్పడిన సర్కారు తాజాగా అమరావతిృఆవకాయ అంటూ మరో లూటీ ఈవెంట్‌కు సిద్ధమవు తోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యాటక రంగం పూర్తిగా కుంటుపడింది. ఆధ్యాత్మిక కేంద్రాలు, ఎకో, తీర ప్రాంతాలు వంటి పర్యాటక ప్రదేశాల్లో మౌలిక వసతుల లేమి వెంటాడుతోంది. వీటిని అభివృద్ధి చేయకుండా ఏడాదిన్నర కాలంగా చంద్రబాబు సర్కారు యథేచ్ఛగా భూ పందేరాలు, ఉత్సవాల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేయడంతోనే పబ్బం గడిపేసింది. తమ బినామీ సంస్థలు, అనుయాయులకు ప్రాజెక్టులు, ప్రోగ్రామ్స్‌ను వంతులు వేసి మరీ కేటాయించి అప్పనంగా దోచిపెడుతోంది. తాజాగా ‘అమరావతి–ఆవకాయ’ అంటూ హడావుడి చేస్తోంది.ఈ వేడుకల నిర్వహణ కోసం నిధులు ఖర్చు చేయడంలో చూపిస్తున్న శ్రద్ధ.. పర్యాటక ఆస్తులను అభివృద్ధి చేయడంలో చూపించట్లేదు. ఇప్పటివరకు దేశ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడం కోసమంటూ భారీ స్థాయిలో పర్యాటక రోడ్‌షోలు, పండుగలు, ఫెయిర్స్ నిర్వహణకు ఏకంగా రూ.150 కోట్లు ఖర్చు చేస్తుండడం విస్తుగొలుపుతోంది. వాస్తవానికి ప్రభుత్వం కేవలం ప్రచారాల కోసం పెట్టిన ఈ బడ్జెట్.. ఒక వార్షిక ఏడాదిలో ఏపీటీడీసీ నికర రాబడులతో సమానంగా ఉండటం గమనార్హం. అప్పుడు శక్తి విజయోత్సవ్.. ఇప్పుడు ఆవకాయ్! చంద్రబాబు సర్కారు జనవరిలో విజయవాడలో ‘అమరావతి–ఆవకాయ్’ పేరుతో ఉత్సవం నిర్వహించనున్నట్టు ప్రకటించింది. మూడు రోజుల ప్రోగ్రామ్‌కి ఏకంగా రూ.5 కోట్లు బడ్జెట్ కేటాయించింది. తెలుగు సాహిత్యం, సినిమా వైభవాన్ని చాటేందుకు ఉత్తరాదికి చెందిన ‘టీమ్ వర్క్ ఆర్ట్స్’కు బాధ్యతలిచ్చింది. అయితే, టెండర్లు లేకుండా ఎంప్యానల్ చేసిన సంస్థల్లో ఒక సంస్థకు కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది.గతంలోనూ ఇదే రీతిలో 2024 దసరా పండుగ సమయంలో శక్తి విజయోత్సవ్ పేరుతో తూతూ మంత్రంగా చేపట్టి ఏకంగా రూ.7 కోట్లు తమ అనుయాయులకు దోచిపెట్టింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగం చేయడంతో ఈ ప్రోగ్రామ్‌కు బడ్జెట్ అంచనాలకు మించి బిల్లులు చెల్లించింది. తొలుత శక్తి విజయోత్సవానికి రూ.2 కోట్లకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయగా.. ఆ తర్వాత మరో రూ.5 కోట్లు అదనంగా కేటాయిస్తూ మొత్తం రూ.7 కోట్లకు ఉత్తర్వులు ఇచ్చింది. అంతా ప్లాన్ ప్రకారమే.. గతంలో శక్తి విజయోత్సవ్ను హైదరాబాద్‌కు చెందిన ఓ ఈవెంట్ కంపెనీకి డమ్మీ టెండర్ల ద్వారా కాంట్రాక్టు అప్పగించింది. సదరు కంపెనీ 2014–19 మధ్య కాలంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి ఇలాంటి ఈవెంట్లు ఎన్నో చేసింది. సదరు కంపెనీ ఇటీవల ఎన్నికల్లో అధికార పార్టీకి ఫండింగ్ చేయడంతో.. అందుకు లబ్ధి చేకూర్చేందుకు పర్యాటక శాఖలో శక్తి విజయోత్సవ్ షోల నిర్వహణ అప్పగించింది. వాస్తవానికి మొదటి రోజు సాయంత్రం ఆరు గంటలకు కార్యక్రమం ప్రారంభం అయితే సీఎం సతీమణి భువనేశ్వరి నారీ శక్తిపై ప్రసంగించారు. ప్రభుత్వంలోని కొంత మంది మంత్రులు హాజరయ్యారు. రాత్రి 10 గంటల్లోపే కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత రెండు రోజులు సాయంత్రం పూటే తూతూ మంత్రంగా చిన్నారుల కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో ఎంత విచ్చలవిడిగా ఖర్చు చేసినా రూ.కోటి, రూ.కోటిన్నర కూడా బడ్జెట్ దాటని కార్యక్రమానికి కళ్లు చెదిరేలా రూ.7 కోట్లు విడుదల చేయడం నిధుల దుర్వినియోగానికి అద్దం పట్టింది. పైగా ప్రైవేటు స్థలం వినియోగించుకున్నందుకు యజమానికి ఒక్కపైసా కూడా చెల్లించకుండా వేధించింది. అసలు ఈ కార్యక్రమానికి సంబంధించి పాస్‌లు పూర్తిగా దుర్వినియోగం అవ్వగా, కనీసం డ్యూటీలో ఉన్న పర్యాటక శాఖ ఉద్యోగులకూ పాస్‌లు అందని పరిస్థితి. ఇందులో ఏపీ టూరిజం అథారిటీలో కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తూ ఎనిమిదేళ్లుగా ఒకే చోట పాతుకు పోయిన ఓ అధికారి కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం.ఆయనకు సంబంధం లేని ఈవెంట్ విభాగాన్ని రాజకీయ నాయకుల ఒత్తిడితో చేజిక్కించుకుని కథను నడిపించారని సమాచారం. ఫైల్ నిర్వహించడం దగ్గర నుంచి బిల్లుల అప్లోడ్ వరకు అన్నీ తానై వ్యవహరించారని, ఇందుకు ప్రతిగా బిల్లుల్లో ఒకశాతం కమీషన్ తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదేమాదిరిగా సెప్టెంబర్‌లో నిర్వహించిన వరల్డ్ టూరిజం డే కార్యక్రమంలోనూ భారీగా నిధులు దుర్వినియోగం చేశారు. ఇప్పుడు అమరావతి–ఆవకాయ్లో కూడా ఇదే తంతు నడుస్తోందని వినికిడి. మౌలిక వసతులు మృగ్యం.. గత ప్రభుత్వ హయాంలో పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు హరిత హోటళ్ల అప్గ్రేడేషన్ను చేపట్టింది. 12 హోటళ్లలో సుమారు రూ.78 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఇంకా కొన్ని చోట్ల చిన్న మొత్తంలో పనులు పెండింగ్‌లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని గాలికొదిలేసింది. ఫలితంగా హోటళ్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది.రూ.కోట్లు ఖర్చు చేసి రూపురేఖలు మార్చిన ఆ హోటళ్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఏకంగా ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను సైతం కూటమి సర్కారు ఆహ్వానించింది. ఈ క్రమంలో సగానికిపైగా హోటళ్ల ఆదాయం క్షీణించింది. పైగా అక్కడ పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు ప్రైవేటు హోటళ్లకు వెళ్లి జేబులు గుళ్ల చేసుకుంటున్న పరిస్థితి. ఇలాంటి దుస్థితిలో పర్యాటకుల ఆకర్షణ కోసం పండుగలు నిర్వహిస్తామంటూ సర్కారు రూ.కోట్లు వృథా చేయడం గమనార్హం. -
ఆయువిచ్చిన అమ్మ వెంటే...
హిందూపురం టౌన్/ పెనుకొండ : తీవ్ర రక్తస్రావంతో మృతిచెందిన తల్లి మృతదేహాన్ని తరలిస్తుండగా... ఆ వాహనానికి ప్రమాదం జరగడంతో అందులో ఉన్న నవజాత శిశువు ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచింది. హృదయాలను కలిచివేసే ఈ దుర్ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో జరిగింది. హిందూపురం ఆస్పత్రి నుంచి వైద్యులు అనంతపురం రిఫర్ చేయడం వల్లే తల్లీబిడ్డ ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం బసవనపల్లికి చెందిన నజ్మాకు బత్తలపల్లికి చెందిన కలీంతో రెండేళ్ల క్రితం వివాహమైంది.నజ్మాకు పురిటి నొప్పులు రావడంతో రెండో కాన్పు కోసం ఆదివారం హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. సాధారణ కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం జరిగిన కొద్ది సేపటికే నజ్మాకు తీవ్ర రక్తస్రావం కావడంతోపాటు బీపీ పెరగడంతో వైద్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ నజ్మా మృతి చెందింది. సోమవారం ఉదయం ప్రభుత్వ అంబులెన్స్‌లో నజ్మా మృతదేహంతోపాటు నవజాత శిశువును తీసుకుని కుటుంబ సభ్యులు బసవనపల్లికి బయలుదేరారు.మార్గంమధ్యలో పెనుకొండ వద్ద 44వ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వీరి వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవజాత శిశువు అక్కడికక్కడే చనిపోయింది. వాహనంలోని ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రిలోనే మెరుగైన చికిత్స అందించి ఉంటే తల్లీబిడ్డ ప్రాణాలు నిలిచేవని... అనంతపురం రిఫర్ చేయడం వల్లే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
బాబు పాలనలో ఏ పంటకూ కనీస మద్దతు ధర దక్కట్లేదు
సాక్షి,అమరావతి: అన్నదాతలను ఆదుకోవడంతోపాటు, కనీస మద్దతు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, (వ్యవసాయం, రైతు సంక్షేమం), ఏపీ అగ్రికల్చర్ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు తాడేపల్లిలో సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సాగును పూరి్తగా విస్మరించిన కూటమి పాలనలో 2025 రైతుల పాలిట చీకటి సంవత్సరమని అభివర్ణించారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టడంతోపాటు రైతులు పండించిన కంది పంటకు గిట్టుబాటు ధర లేక కంది రైతులు విలవిలలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ‘2025 – 26లో రాష్ట్రంలో దాదాపు 7.96 లక్షల ఎకరాలలో కంది సాగు జరిగింది. కంది కనీస మద్దతు ధర క్వింటా రూ.8 వేలు. కానీ ఆ ధర దక్కడం లేదు. రైతులు క్వింటా రూ.6,500 నుంచి రూ.6,600 వరకు అయినకాడికి తెగనమ్ముకుని నష్టపోతున్నారు. అయినా రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదు. పొరుగున కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం స్వయంగా కంది కొనుగోలు కేంద్రాలు తెరిచి, క్వింటా కంది రూ.8 వేలకు కొంటున్నట్లు చెబుతున్నారు. కానీ రాష్ట్రంలో ఇప్పటికీ కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. గత ఏడాది కంది పంట ఉత్పత్తి 1.71 లక్షల టన్నులు కాగా, ఈ ఏడాది అంచనా 1.17 లక్షల టన్నులు. అలాగే గత ఏడాది హెక్టారు సగటు దిగుబడి 473 కిలోలు కాగా, ఈ ఏడాది అది కూడా 401 కిలోలకు తగ్గింది.’ అని నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కజొన్నదీ అదే దుస్థితి ‘మొక్కజొన్న కనీస మద్దతు ధర క్వింటా రూ.2,400 కాగా, రైతులు క్వింటా మొక్కజొన్న రూ.1,500 నుంచి రూ.1,900 వరకు అమ్ముకోవాల్సిన దుస్థితి. ఈ పంటను రాష్ట్రంలో ఈ సీజన్లో 4.6 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, అదీ సగటు దిగుబడి తగ్గింది. తెలంగాణలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరిచినా, మన ప్రభుత్వానికి మాత్రం ఆ ఊసే లేకుండా పోయింది. మొక్కజొన్న గత ఏడాది హెక్టారు సగటు దిగుబడి 4,710 కిలోలు కాగా, ఈ ఏడాది 4,254 కిలోలు మాత్రమే అని అంచనా వేస్తున్నారు’ రైతు కంట కన్నీరు మంచిది కాదు.. అది అరిష్టం ‘రాష్ట్రంలో ఏ పంటకూ కనీస మద్దతు ధర దక్కడం లేదు. ప్రకృతివైపరీత్యాలకు దిగుబడి తగ్గి, ధరలు పడిపోవడంతో దిక్కుతోచక విలపిస్తున్నారు. అయినా చంద్రబాబు సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదు. ‘రైతు కన్నీరు మంచిది కాదు. రాష్ట్రానికి అరిష్టం’ అని ఏపీ అగ్రికల్చర్ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి హెచ్చరించారు. -
ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నికీలలు
సాక్షి, అనకాపల్లి/సామర్లకోట: ఎర్నాకుళం వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. జార్ఖండ్‌లోని టాటానగర్ నుంచి కేరళలోని ఎర్నాకుళం వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్–18189)లో అనకాపల్లి జిల్లా యలమంచిలి వద్ద భారీగా మంటలు చెలరేగాయి. అగ్నికీలలు ఎగిసిపడడంతో బీ–1, ఎం–2 ఏసీ బోగీలు దగ్ధమయ్యాయి. పొగ విపరీతంగా కమ్ముకోవడంతో బీ–1 బోగీలో ప్రయాణిస్తున్న విజయవాడ వాసి చంద్రశేఖర్ సుందర్ (70) అనే వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయి.. అగ్నికీలల్లో సజీవ దహనమయ్యాడు.ఈ ఘటనతో యలమంచిలి రైల్వేస్టేషన్లో రెండు గంటలపాటు భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అనకాపల్లి, యలమంచిలి, నక్కపల్లి నుంచి అగి్నమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈలోపు లోకో పైలట్లు కాలిపోతున్న రెండు బోగీలను వేరుచేసి మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా అడ్డుకున్నారు. పరుగులు తీసిన ప్రయాణికులు మంటలు చెలరేగిన రెండు ఏసీ బోగీల్లోని ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ రైలు దిగి యలమంచిలి రైల్వే స్టేషన్లోకి పరుగులు తీశారు. లగేజీలను కూడా వదిలేసి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ మంటల్లో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సజీవ దహనమైన ఒక్కరు మినహా అంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురైన రెండు బోగీలతోపాటు ఎం–2 బోగీని కూడా తప్పించి ఉదయం 7 గంటలకు రైలు బయల్దేరింది. ఆ బోగీల నుంచి దింపేసిన సుమారు 125 మంది ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్‌కు తరలించారు. అక్కడ మూడు కొత్త బోగీలు అటాచ్ చేసి ప్రయాణికులను అదే రైలులో వారి గమ్యస్థానాలకు పంపించారు. రైలు కదలికలో తేడా రావడంతో.. ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో నర్సింగిబిల్లి–యలమంచిలి స్టేషన్ల మధ్య బ్రేకుల్లో తలెత్తిన లోపాల కారణంగా.. ఏసీ బోగీలో అర్ధరాత్రి సమయంలో పొగ రావడం మొదలైంది. ఆ తరువాత కొద్దిసేపట్లోనే యలమంచిలి స్టేషన్‌కు రైలు చేరుకుంది. వాస్తవానికి ఇక్కడ ఆ ట్రైన్‌కు హాల్టు లేదు. ఈ రైల్వేస్టేషన్లో లోకో పైలట్ల విశ్రాంతి గది ఉండటంతో ఒక పైలట్‌ను దించేందుకు రైలును ఆపినట్టు రైల్వే సిబ్బంది చెప్పారు. ముందుగా రైలు వేగాన్ని తగ్గించి.. స్టేషన్‌కు రాగానే బ్రేక్ వేశారు. ఆ సమయంలో బ్రేకుల్లో లోపాలున్నట్టు అర్థమైంది. బ్రేక్‌లు పట్టేయడం, రైలు కదలికలో తేడాను పైలట్లు గమనించారు.దిగి చెక్ చేయాలని భావిస్తున్న సమయంలోనే.. ప్రయాణికులు చైన్ లాగిన సంకేతాలు వచ్చాయి. దీంతో లోకో పైలట్లు వేగంగా చైన్ లాగిన బోగీలవైపు పరుగులు తీశారు. బోగీల్లో మంటలు మొదలవడంతో ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ.. ప్లాట్‌ఫామ్ పైకి దిగి పరుగులు తీశారు. యలమంచిలి రైల్వే స్టేషన్లో రైలును నిలపడంతో ప్రయాణికులు తొందరగా సులువుగా ప్లాట్‌ఫామ్‌పైకి దిగగలిగారు. ఫైర్ ఇంజిన్లు త్వరితగతిన చేరుకోగలిగాయి. అక్కడ రైల్వే పోలీసు సిబ్బంది కూడా ఉండటం వల్ల వేగవంతంగా సహాయక చర్యలు చేపట్టగలిగారు. లేదంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని అధికారులు చెప్పారు.మృతుడి బ్యాగ్‌లో నగదు, బంగారం గుర్తింపు ప్రమాదంలో మృతి చెందిన చంద్రశేఖర్ సుందర్ బ్యాగులో నగదు, బంగారం ఉన్నట్టు రైల్వే పోలీసులు గుర్తించారు. చంద్రశేఖర్ కుటుంబ సభ్యుల సమక్షంలో బ్యాగును తెరిచి చూడగా.. అందులో రూ.6.50 లక్షల నగదు, బంగారం ఉంది. చాలావరకు నోట్ల కట్టలు కాలిపోయి ఉన్నాయి. మృతుడు విజయవాడలో హోల్‌సేల్ వస్త్ర వ్యాపారం చేస్తుంటారు. విజయనగరంలో ఒక వస్త్ర దుకాణం నుంచి డబ్బు వసూలు చేసుకుని విజయవాడ వెళ్తుండగా ప్రమాదంలో మృతి చెందారు. మృతుడి బ్యాగ్‌లో దొరికిన రూ.6.50 లక్షల నగదు, బంగారు ఆభరణాలను అతడి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు రైల్వే ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. బ్రేకులు పట్టేయడమే కారణమా? ప్రమాదానికి కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేయిస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. బ్రేకుల ఫెయిల్యూరే కారణమా లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా.. ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని తెలిపారు. ప్రమాద స్థలాన్ని సోమవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాత్సవ, విజయవాడ డీఆర్ఎం మోహిత్ సోనాకియా, రైల్వే డీఐజీ బి.సత్య ఏసుబాబు, రైల్వే సేఫ్టీ అధికారులు పరిశీలించారు.డీఆర్ఎం మోహిత్ మాట్లాడుతూ.. బ్రేకులు పట్టేయడం వల్లే మంటలు చెలరేగాయని.. బోగీల్లో ఉన్న దుప్పట్లు అంటుకుని మంటలు శరవేగంగా వ్యాపించాయని భావిస్తున్నట్టు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతుడి కుటుంబానికి రైల్వే శాఖ రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషనర్ శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. సౌత్ సెంట్రల్ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవిని విచారణాధికారిగా నియమించారు.వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వేస్టేషన్ సమీపంలో ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి రెండు బోగీలు పూర్తిగా దగ్ధమై ఒక ప్రయాణికుడు మృతిచెందడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మృతుడి కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. సీట్ల కింద నుంచి మంటలొచ్చాయిఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ బీ–1 బోగీలో ఆదివారం రాత్రి 10.30 గంటలకు అనకాపల్లిలో ఎక్కాను. రైలు యలమంచిలి చేరుకుంటున్న సమయంలో పైబెర్తులోని ప్రయాణికుడు టాయిలెట్‌కు వెళ్లూ బోగీలోని సీట్ల కింద నుంచి మంటలు వస్తున్న విషయాన్ని గమనించి నాకు చెప్పాడు. ఆయన, నేను కేకలు వేస్తూ బోగీలోని ప్రయాణికులను నిద్రలేపి చైన్ లాగాం. అప్పటికే రైలు యలమంచిలి స్టేషన్‌కు వచ్చి ఆగింది.వెంటనే ప్రయాణికులు రైలులోంచి ప్రాణభయంతో దిగేశారు. అదే సమయంలో సమీపంలోని ఎం–2 బోగీకి కూడా మంటలు వ్యాపించాయి. యలమంచిలి రైల్వేస్టేషన్ ఆవరణ అంతా పొగతో నిండిపోయిది. ప్రమాదం జరిగిన బోగీల్లోని ప్రయాణికులను సామర్లకోట తీసుకు వచ్చారు. చాలామంది తమ లగేజీలను అక్కడే వదిలేసి ఇక్కడకు వచ్చారు. –నాగేంద్ర, ప్రత్యక్ష సాక్షి -
కేబినెట్ భేటీలో హైడ్రామా
సాక్షి, అమరావతి: జిల్లాల పునర్విభజనలో రాయచోటి ప్రాంతాన్ని చావుదెబ్బ కొట్టిన తర్వాత కూడా అక్కడి ప్రజలను మాయచేసేందుకు సీఎం చంద్రబాబు తనదైన శైలిలో డ్రామాకు తెరలేపారు. ఇందుకు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశాన్ని వేదికగా చేసుకున్నారు. రాయచోటి ఎమ్మెల్యేగా మంత్రివర్గంలో ఉన్న మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కన్నీరు పెట్టుకున్నట్లు, చంద్రబాబు ఆయన్ను ఓదార్చినట్లు అనుకూల మీడియాకు లీకులిచ్చి ప్రచారం చేసుకున్నారు. నిజానికి.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకి తరలిస్తున్నా రాంప్రసాద్‌రెడ్డి కళ్లప్పగించి చూడడం తప్ప ఏమీచేయలేకపోయారు.పునర్విభజన ప్రక్రియ ప్రారంభమైనప్పుడు రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని తరలిస్తే తన పదవులకు రాజీనామా చేస్తానని బీరాలు పలికిన ఆయన ఇప్పుడు కేబినెట్ భేటీలో అందుకు సమ్మతి తెలుపుతూ సంతకం పెట్టారు. తన సొంత ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతున్నా మాట్లాడకుండా చంద్రబాబు చెప్పిందల్లా చేసి ఇప్పుడు సానుభూతి కోసం కన్నీరు పెట్టుకున్నట్లు డ్రామాలాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాంప్రసాద్‌రెడ్డి రాయచోటి కోసం పోరాడారని.. అయినా జిల్లా కేంద్రాన్ని అక్కడి నుంచి తరలించాల్సి వచ్చిందని చంద్రబాబు చిలక పలుకులు పలికినట్లు లీకులు వచ్చాయి.ఆ ప్రాంతం గొంతు పిసికి తీరిగ్గా సంతాపం వ్యక్తంచేసినట్లుగా చంద్రబాబు తీరు ఉందని స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు. తాజా నిర్ణయంతో మంత్రి స్థానికంగా తిరగలేని పరిస్థితి ఉంటుందని గ్రహించిన చంద్రబాబు ఈ డ్రామా ఆడించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే ఆయన మంత్రివర్గ సమావేశం నుంచి కళ్లు తుడుచుకుంటూ వచ్చి కారెక్కి వెళ్లిపోయారు. ఇక భావోద్వేగంతో ఆయన మాట్లాడలేకపోతున్నారని ఆయన సిబ్బంది సెలవిచ్చారు.మంత్రి రాజీనామా శపథం ఏమైంది?నిజంగా రాయచోటి ప్రాంతానికి మేలు చేయాలని ఉంటే మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తాను శపథం చేసినట్లు ఈ పాటికే రాజీనామా చేయాలి. కానీ, ఆ పని చేయకపోగా చంద్రబాబు ఎదుట తన ప్రాంతం గోడును కూడా వినిపించకుండా ఆయన చెప్పినచోట సంతకం పెట్టారు. తన నియోజకవర్గానికి అన్యాయం జరిగేలా చేసిన ప్రతిపాదనకు తానే సంతకం పెట్టి ఆమోదముద్ర వేసిన ఘనకీర్తి రాంప్రసాద్రెడ్డికే దక్కుతుందని విమర్శకులు మండిపడుతున్నారు. మంత్రిగా ఉండి తన నియోజకవర్గంలో ఉన్న జిల్లా కేంద్రాన్ని ఆయన కాపాడుకోలేకపోవడం అసమర్థతేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు కూడా ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీకి విరుద్ధంగా రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకి మార్చేసి ప్రజాభిప్రాయం అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. జనాగ్రహం నుంచి గట్టెక్కేందుకే ఓదార్పు నాటకం..ఇక జనాగ్రహం నుంచి తప్పించుకునేందుకు మంత్రి మండిపల్లిని ఓదార్చినట్లు.. జిల్లా కేంద్రాన్ని మార్చడంపట్ల తాను కూడా బాధపడినట్లు చంద్రబాబు లీకులిచ్చి నాటకాన్ని మరింత రంజింపచేశారు. అంత బాధపడేటప్పుడు జిల్లా కేంద్రాన్ని ఎందుకు మార్చారు? ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేనప్పుడు ఎందుకు హామీ ఇచ్చారు? దురాలోచన లేకపోతే ప్రాథమిక నోటిఫికేషన్లో ఒకలా తర్వాత మరోలా ఎందుకు ప్రతిపాదన మార్చాల్సి వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానాలు కరువయ్యాయి. ఇదంతా కేవలం ప్రజాగ్రహం నుంచి తప్పించుకునే జిమ్మిక్కులేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల పేరును చంద్రబాబు సర్కారు మార్చేయనుంది. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం పేర్లకు బదులు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డులుగా నామకరణం చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. అలాగే, రెండు కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు పలు మండలాలను అటూ ఇటూ మార్చనున్నారు.బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చనున్నారు. మోటారు వాహనాల లైఫ్‌టాక్స్‌పై 10 శాతం చొప్పున రోడ్ సేఫ్టీ సెస్ విధించాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు మోటార్ వాహనాల పన్నుల చట్టం–1963లో పలు వసరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు.. రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు.. జిల్లాల పునర్విభజనలో భాగంగా రెండు కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రంపచోడవరం నియోజకర్గంతో పోలవరం జిల్లా.. నాలుగు నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు. ⇒ రాయచోటికి బదులుగా మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లాను మార్పుచేస్తున్నారు. రాయచోటి మదనపల్లిలో భాగంగా ఉంటుంది. తొమ్మిది జిల్లాల్లో ఎటువంటి మార్పులు చేయలేదని.. 17 జిల్లాల్లో 25 మార్పులు చేసినట్లు మంత్రి అనగాని తెలిపారు. పలు మండలాలను అటు ఇటూ మార్పులు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ మార్పులు చేర్పులతో ఈనెల 31న గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుందని, వచ్చేనెల 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయన్నారు. ⇒ సామర్లకోటను పెద్దాపురం మండలంలోకి.. మండపేట మండలాన్ని రాజమండ్రిలో కలపనున్నారు. పెనుగొండ మండలం పేరు వాసవి పెనుగొండగా.. రైల్వేకోడూరు తిరుపతి జిల్లాకు.. రాజంపేట కడపలోకి.. సిద్దవటం ఒంటిమిట్ట కడపలోకి మారుస్తున్నారు. మడకసిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకానుంది. బాపట్ల నుంచి అద్దంకి నియోజకవర్గం తిరిగి ప్రకాశం జిల్లాకు మార్పు. గూడూరు నియోజకవర్గంలోని మూడు మండలాలను నెల్లూరు జిల్లాకు.. మరో రెండు మండలాలను తిరుపతి జిల్లాకు మార్పు. ఆదోని మండలాన్ని ఆదోని–1 మండలం, ఆదోని–2 మండలంగా మార్పు. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనలున్నాయి. ⇒ మోటారు వాహనాల లైఫ్‌టాక్స్‌పై 10 శాతం చొప్పున రోడ్ సేఫ్టీ సెస్ విధింపు. ఈ సెస్ మొత్తాన్ని రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు బదిలీచేసి రోడ్ల మెరుగుదల, రోడ్డు భద్రతా చర్యలను చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ రోడ్ సేఫ్టీ సెస్ ద్వారా ఏటా రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించడంతో వాహన కొనుగోలుదారులకు కొంత ఆదా అవుతోంది. ఈ చిన్న సెస్ విధించడంవల్ల వాహన యజమానులపై ఆరి్థక భారం పెద్దగా ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ⇒ దుగ్గరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు, షిప్ బిల్డింగ్ క్లస్టర్ స్థాపనకు గ్రీన్‌సిగ్నల్. ⇒ నెల్లూరు జిల్లా దామవరం గ్రామంలో 418.14 ఎకరాల భూమిని దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు అనుమతి. అలాగే, జిల్లా కలెక్టర్ ప్రతిపాదించిన దాని ప్రకారం శాశ్వత లీజ్ హోల్డర్లకు ఎకరాకు రూ.13 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు అంగీకారం. ⇒ బాపట్ల మండలంలోని వెస్ట్ బాపట్ల గ్రామంలో ఉన్న రెండెకరాల ప్రభుత్వ భూమిని బాపట్ల టీడీపీ జిల్లా అధ్యక్షుడికి లీజ్ పద్ధతిలో కేటాయించి, టీడీపీ జిల్లా కార్యాలయ భవనం నిర్మాణానికి అనుమతి. ఎకరాకు సంవత్సరానికి రూ.1,000 చొప్పున లీజ్ రుసుము చెల్లిస్తూ, 33 ఏళ్లపాటు లీజుకు ఆమోదం. ⇒ ఎన్ఎస్సీఎఫ్డీసీ (జాతీయ షెడ్యూలు కులాల ఆరి్థక అభివృద్ధి సంస్థ) ద్వారా ఎస్సీలు తీసుకున్న రుణాలపై వడ్డీ రూ.41 కోట్లు మాఫీ. ⇒ అమరావతిలో యోగా నేచురోపతి ఇనిస్టిట్యూషన్‌కు భూమి కేటాయింపు. అలాగే, విశాఖలో ఆసుపత్రి ఏర్పాటుకు కూడా.. ⇒ తొలుత ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు నిర్ణయం. అలాగే, విద్యుత్ రంగంలో మరిన్ని అప్పులకు అనుమతి. ⇒ సీఆర్డీఏలో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలుకు నాబార్డు నుండి రూ.7,387.70 కోట్ల రుణం పొందేందుకు సీఆర్డీఏ కమిషనర్‌కు అనుమతి. ⇒ సీఆర్డీఏలో ఉండవల్లి వద్ద ఫ్లడ్ పంపింగ్ స్టేషన్–2 కమిషనింగ్ (కెపాసిటీ 8,400 క్యూసెక్) 15 ఏళ్ల ఆపరేషన్–మెయింటెనెన్స్‌తో లంప్సమ్ కాంట్రాక్టు ప్రాతిపదికన ఎల్–1 బిడ్ ఆమోదించేందుకు అనుమతి. ⇒ మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో రూ.1,673.51 కోట్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రతిపాదనకు ఆమోదం. ⇒ డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో 9.88 ఎకరాల లీజును మూడేళ్ల కాలానికి పునరుద్ధరించాలన్న రెవెన్యూ శాఖ ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్. ఈ భూమిని వేదాంత లిమిటెడ్‌కు ఆన్‌షోర్ డ్రిల్లింగ్ కార్యకలాపాల కోసం కేటాయించనున్నారు. ⇒ సీఆర్డీఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపునకు సంబంధించిన మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సులకు ఓకే. ⇒ హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు–ఫేజ్– ఐ–స్టేజ్– ఐలోని పంపింగ్ స్టేషన్లకు ఆమోదించిన డిజైన్లు/డ్రాయింగ్ల ప్రకారం ఇండక్షన్ మోటార్లలో పెరిగిన మెగావాట్ కెపాసిటీ కోసం అదనపు ఖర్చు రూ.76,80,000ల మొత్తానికి పరిపాలనా అంగీకారం. ⇒ రాజముద్రతో త్వరలోనే 21.87 లక్షల మంది రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ. పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీలు..ఇక వైద్య కళాశాలల నిర్మాణానికి పీపీపీ విధానంలోనే ముందుకెళ్తామని, వెనక్కు వెళ్లేదిలేదని మంత్రి సత్యకుమార్ స్పష్టంచేశారు. ఆదోని వైద్య కళాశాలకు రాజ్‌కుమార్ ప్రేమ్‌చంద్ షా బిడ్ దాఖలు చేశారని, మరికొన్ని సమరి్పంచడానికి గడువు కోరారని, అయితే.. గడువు పొడిగించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఒక్క బిడ్ వచి్చనాసరే ముందుకెళ్తామని మంత్రి తేల్చిచెప్పారు. -
‘ఏపీలో రాజకీయ వేధింపులు పరాకాష్టకు చేరాయి’
తాడేపల్లి : ఏపీలొ రాజకీయ వేధింపులు పరాకాష్టకు చేరాయని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈరోజు(సోమవారం, డిసెంబర్ 29వ తేదీ) పార్టీ లీగల్ సెల్ నేతలతో ఆయన జూమ్ కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై చర్చించారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘ఏపీలో రాజకీయ వేధింపులు పరాకాష్టకు చేరాయి. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడాన్ని తట్టుకోలేక పార్టీ క్యాడర్‌పై అక్రమ కేసులు పెడుతున్నారు. నిరంకుశ పాలన, నియంత పాలనకు ఇంతకు మించిన నిదర్శనం ఉంటుందా?, చంద్రబాబు, లోకేష్‌లు బరితెగించి వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి వంతపాడుతున్న పోలీసుల చర్యలను ధీటుగా ఎదుర్కుందాం.చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్న పోలీసులపై ప్రైవేట్ కేసులు వేద్దాం. క్యాడర్‌కు అండగా నిలుద్దాం. రెడ్ బుక్ రాజ్యాంగంపై గట్టిగా పోరాడుతున్న పార్టీ లీగల్ సెల్‌కు అభినందనలు. చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీకి పొట్టేళ్ళ తలలతో హారం వేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?, ఈ మధ్య ఒకరిపై రాజద్రోహం కేసు పెట్టారు. ఇంతకంటే దారుణం ఉంటుందా?, కమ్యూనిస్ట్ నాయకుడు హక్కుల కోసం పోరాడితే పీడీ యాక్ట్ పెట్టారు. జగన్ మరింత పట్టుదలతో పార్టీని నడిపిస్తున్నారు. ప్రతి ప్రజాసమస్యపై ముందుండి పోరాటం చేస్తున్నాం, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. కూటమి ప్రభుత్వ దమనకాండను ధీటుగా ఎదుర్కొందాం. వైఎస్సార్సీపీ సైన్యం పోరాట పటిమతో దూసుకెళుతుంది’ అని స్పష్టం చేశారు. -
మెడికల్ కాలేజీల పీపీపీలో బట్టబయలైన ప్రభుత్వ బండారం!
విజయవాడ: మెడికల్ కాలేజీల పీపీపీలో ప్రభుత్వ బండారం మరోసారి బట్టబయలైంది. సింగిల్ బిడ్‌కే మెడికల్ కాలేజీ అప్పగించాలనే నిర్ణయంతో ప్రభుత్వం బండారం బయటపడింది. ఆదోని మెడికల్ కాలేజి రాజేంద్ర కుమార్ ప్రేమ్ చంద్ షా కి అప్పగించాలని తీసుకున్న నిర్ణయంతో అసలు ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళుతుందనేది వెల్లడైంది. సింగిల్ బిడ్ అయినా అగ్రిమెంట్ చేసుకుంటామని మంత్రి సత్య కుమార్ ప్రకటించారు. అయితే సింగిల్ బిడ్కి ఇవ్వడం నిబంధనలకు విరుద్దవం కాదా అని మీడియా ప్రశ్నించగా, అన్ని పట్టించుకుంటే ఎలా ? అని తిరిగి ప్రశ్నించారు. సింగిల్ బిడ్‌కే అప్పగిస్తామని మంత్రి ప్రకటించారు. దీనిపై వైఎస్సారసీపీ మండిపడుతుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేదలు తీవ్రంగా నష్టపోతారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. ‘ఆదోని కాలేజ్ కోసం కిమ్స్ ఆస్పత్రికి చెందిన ఒక డాక్టర్‌తో టెండర్ వేయించారని,. ఒకే ఒక్క టెండర్ పెడితే దాన్ని కూడా ఆమోదించడం చూస్తే ప్రభుత్వం ఎటు పోతుంది?, ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తి చేతిలో ఎలా పెడతారు?, కోటి సంతకాలతో ప్రజల ఆకాంక్షలు తెలిసినా ప్రభుత్వం బరితెగించింది. రాష్ట్రంలో విద్య వ్యాపారం చేశారు. జగన్ తెచ్చిన సంస్కరణలను నాశనం చేశారు. ఇక వైద్య విద్యలాంటిది పేదలకు అసలు అందే అవకాశం లేకుండా చేశారు. చంద్రబాబు చర్యలకు ప్రజామోదం లేదు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అంగీకరించరు’ అని హెచ్చరించారు. -
‘క్యాబినెట్లో వ్యతిరేకించకుండా ఇలా కన్నీరు కారిస్తే ఉపయోగం ఏంటి?’
రాయచోటి: రాయచోటి జిల్లా కేంద్రాన్ని కొనసాగించకుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధమన్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి. చంద్రబాబు సహజ ధోరణి వెన్నుపోటు పొడవడమేని, అది మరోసారి రుజువైందన్నారు. రాయచోటి జిల్లా కేంద్రాన్ని రద్దు అంశం కూటమి కక్షలో భాగమేనన్నారు. క్యాబినెట్లో వ్యతిరేకించకుండా కన్నీరు కారిస్తే ఉపయోగం ఏంటి? అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీరుపై మండిపడ్డారు శ్రీకాంత్‌రెడ్డి. జిల్లా కేంద్రం కోసం,జిల్లా కోసం పోరాటాలు కొనసాగిస్తామని, రేపు(మంగళవారం) రాయచోటిలో భారీ ర్యాలీ ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తామన్నారు శ్రీకాంత్‌రెడ్డి. కాగా, రాయచోటి ప్రజలను సీఎం చంద్రబాబు మరోసారి మోసం చేశారు సీఎం చంద్రబాబు. గత ఎన్నికల సమయంలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చబోమని ప్రజలకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని మార్చి వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు మోసంపై రాయచోటి ప్రజలు మండిపడుతున్నారు.రాయచోటి జిల్లా కేంద్రం రద్దు అంశానికి సంబంధించి ఏపీ కేబినెట్లో హై డ్రామా సాగింది. రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి నోరు విప్పలేదు. వ్యతిరేకించారా..? లేదా..? అంటూ రాంప్రసాద్ రెడ్డిని మీడియా ప్రశ్నించగా.. ఆయన ముఖం చాటేసి వెళ్లిపోయారు. అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. వైకుంఠ ఏకాదశి వేళ అన్నమయ్యకు ఘోర అవమానమే జరిగింది.రాయచోటి జిల్లా కేంద్రం ఎత్తి వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజంపేటని కడప జిల్లాలో కలిపి.. మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లంటూ లీకులు ఇస్తూ.. డ్రామాను రక్తి కట్టించారు. -
‘ఇప్పటివరకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం’
విజయవాడ: నగరంలోని భవానీపురం పున్నమి ఘాట్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆవకాయ అమరావతి ఫెస్టివల్ ఎగ్జిబిషన్‌ను ఉన్నపళంగా కూల్చివేయడానికి టౌన్ ప్లానింగ్ అధికారులు సిద్ధమైన తరుణంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ కూల్చివేత కార్యక్రమానికి నిర్వాహకులు అడ్డుకున్న నేపథ్యంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. జనవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ పున్నమి ఘాట్‌లో ఆవకాయ అమరావతి పెస్టివల్ నిర్వహించడానికి అంతా సిద్ధం చేసుకున్నారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు. అయితే దాన్ని తీసువేయాలని చెప్పి.. ఇవాళ కూల్చివేత కార్యక్రమం చేపట్టడంతో ఎగ్జిబిషన్ నిర్వహాకులు ఆందోళనకు దిగారు. నోటీసుల్లో వారం రోజులు గడువు అని ఉండగా, ఉన్నపళంగా కూల్చివేయడంపై మండిపడుతున్నారు. ఎగ్జిబిషన్‌ను ఇప్పటికిప్పుడు తొలగించాలంటే కోట్ల రూపాయిలు నష్టం వస్తుందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటీసుల్లో వారం రోజులు గడువు ఇచ్చారని, ఇవాళ కూల్చివేతలకు దిగారని మండిపడుతున్నారు. ఇప్పటివరకూ ఐదు కోట్ల రూపాయిలు ఖర్చుపెట్టామని, ఉన్నపళంగా తీసేసేమంటే రోడ్డున పడే పరిస్ధితి వస్తుందని అంటున్నారు. -
‘చంద్రబాబు చర్యలకు ప్రజామోదం లేదు’
తాడేపల్లి : ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేపడుతున్న చర్యలకు ప్రజామోదం లేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత మేరుగ నాగార్జున విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్రంలో ఉద్యమం జరిగిందని, ప్రైవేటీకరణ వలన పేదలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈరోజు(సోమవారం, డిసెంబర్ 29వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్రంలో ఉద్యమం జరిగింది. అయినా చంద్రబాబు తన ఆలోచనా విధానాన్ని మార్చుకోలేదు. ప్రైవేటీకరణ వలన పేదలు తీవ్రంగా నష్టపోతారు. మెడికల్ కాలేజీల కోసం ఏ కాంట్రాక్టర్ కూడా రాలేదు. కాలేజీలను స్వాధీనం చేసుకుంటే ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదని అర్ధం చేసుకున్నారు. కానీ ఆదోని కాలేజ్ కోసం కిమ్స్ ఆస్పతరికి చెందిన ఒక డాక్టర్‌తో టెండర్ వేయించారు. ఒకే ఒక్క టెండర్ పెడితే దాన్ని కూడా ఆమోదించడం చూస్తే ప్రభుత్వం ఎటు పోతుంది?, ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తి చేతిలో ఎలా పెడతారు?, కోటి సంతకాలతో ప్రజల ఆకాంక్షలు తెలిసినా ప్రభుత్వం బరితెగించింది. రాష్ట్రంలో విద్య వ్యాపారం చేశారు. జగన్ తెచ్చిన సంస్కరణలను నాశనం చేశారు. ఇక వైద్య విద్యలాంటిది పేదలకు అసలు అందే అవకాశం లేకుండా చేశారు. చంద్రబాబు చర్యలకు ప్రజామోదం లేదు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అంగీకరించరు’ అని స్పష్టం చేశారు. -
బాబు మరో మోసం.. రాయచోటి ప్రజలకు వెన్నుపోటు
సాక్షి, అమరావతి: రాయచోటి ప్రజలను సీఎం చంద్రబాబు మరోసారి మోసం చేశారు. గత ఎన్నికల సమయంలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చబోమని ప్రజలకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని మార్చి వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు మోసంపై రాయచోటి ప్రజలు మండిపడుతున్నారు.కాగా, ఏపీ కేబినెట్లో హై డ్రామా సాగింది. రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి నోరు విప్పలేదు. వ్యతిరేకించారా..? లేదా..? అంటూ రాంప్రసాద్ రెడ్డిని మీడియా ప్రశ్నించగా.. ఆయన ముఖం చాటేసి వెళ్లిపోయారు. అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. వైకుంఠ ఏకాదశి వేళ అన్నమయ్యకు ఘోర అవమానమే జరిగింది.రాయచోటి జిల్లా కేంద్రం ఎత్తి వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజంపేటని కడప జిల్లాలో కలిపి.. మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లంటూ లీకులు ఇస్తూ.. డ్రామాను రక్తి కట్టించారు. -
చిట్టి చిలకమ్మా.. ఎక్కడికెళ్లింది..
ప్రజల సొమ్ము మంచినీళ్లలా ఖర్చు చేయడంలో చంద్రబాబు.. లోకేష్.. పవన్ కళ్యాణ్ ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాల్లోనే పయనం.. వాటికి లక్షలు.. కోట్లలో అద్దెలు చెల్లిస్తూ షికార్లు చేస్తున్నారు. బయటకు చెప్పేది మాత్రం పెట్టుబడుల సాధన.. పారిశ్రామిక వేత్తలతో చర్చలు. రాష్ట్రానికి పరిశ్రమలు. వ్యాపారాలు తీసుకురావడం.. కానీ లోపల ఏమి జరుగుతున్నదో ఎవరికీ తెలియదు. కానీ ఈ ఏడాదిన్నరలోనే పదుల సంఖ్యలో ఢిల్లీ.. హైద్రాబాదు వంటి చోట్లకు షికార్లకు వెళ్లారు. అంతేకాకుండా తండ్రి చంద్రబాబుతో కలిసి సింగపూర్.. అమెరికా.. ఇలా ఎన్నిసార్లు ఎక్కడికి ఎందుకు వెళ్తున్నారో తెలియదు.. అట్నుంచి వచ్చి రాష్ట్రానికి ఏం లాభం చేసారో చెప్పలేరు.. కానీ అయన ఎక్కినా విమానాలు మాత్రం రయ్యి రయ్యిన ఆకాశంలో ఎగురుతూనే ఉంటాయి. నవంబర్‌లో తండ్రితో కలిసి సింగపూర్ వెళ్లొచ్చారు.. ఆ తరువాత కొద్దీ రోజులకే డిసెంబర్ మొదటి వారంలో డల్లాస్ వెళ్లిన లోకేష్ అక్కడ తెలుగువారితో భేటీ అయ్యారు.దీనికోసం ఐటీడీపీ .. ఎల్లోమీడియా ఇచ్చిన ఎలివేషన్లు అంతా ఇంతా కాదు.. లోకేష్ విదేశాలకు వెళ్లడం.. అక్కడి ఐటి ప్రముఖులతో ఫోటోలు దిగడం.. అంతే.. ఇక ఆ కంపెనీ ఆంధ్రా వచ్చేసినట్లు చెప్పడం.. ఆ మధ్య గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ను కలిసిన ఫోటోలు మీడియాకు విడుదల చేయడం లేటు.. వెంటనే ఇక గూగుల్ తో ఏపీకి చుట్టరికం కలిపేయడం. రాష్ట్రంలోని యువతకు ఐటీ జాబులు వచ్చినట్లు ప్రచారం చేయడం రొటీన్ అయింది.తాజాగా నేడు ఏపీ కేబినెట్ భేటీ జరుగుతున్న తరుణంలో లోకేష్ మళ్ళీ ఇక్కడ లేకుండా లండన్ పర్యటనకు వెళ్తున్నారు. అసలు ఈ పర్యటన గురించి ప్రభుత్వంలో ఎక్కడా ప్రకటన కానీ సమాచారం కానీ లేదు.ఈ నేపథ్యంలో ఆయన లండన్ ఎందుకు వెళ్తున్నారు.. అది వ్యక్తిగతమా ? ప్రభుత్వ పరంగా వెళ్తున్నారా అన్నది ఎక్కడ లీక్ చేయడం లేదు. డిసెంబర్ 29న కేబినెట్ భేటీ ఉన్నప్పటికీ అయన ఇక్కడ లేకుండా లండన్ పర్యటనకు ఎందుకు వెళ్ళారన్నది సందేహాస్పదంగా అనిపిస్తోంది. ఆయన రహస్యంగా ఎవరినైనా కలుస్తున్నారా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. -
ఏపీ కేబినెట్లో హైడ్రామా
సాక్షి, విజయవాడ: ఏపీ కేబినెట్లో హై డ్రామా సాగింది. రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి నోరు విప్పలేదు. వ్యతిరేకించారా..? లేదా..? అంటూ రాంప్రసాద్ రెడ్డిని మీడియా ప్రశ్నించగా.. ఆయన ముఖం చాటేసి వెళ్లిపోయారు. అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. వైకుంఠ ఏకాదశి వేళ అన్నమయ్యకు ఘోర అవమానం జరిగింది.అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాయచోటి జిల్లా కేంద్రం ఎత్తి వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజంపేటని కడప జిల్లాలో కలిపి.. మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లంటూ లీకులు ఇస్తున్నారు. -
కృష్ణా జలాలు వైఎస్సార్ పుణ్యమే: వైఎస్ అవినాష్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటూ నిలదీశారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఐదు లక్షల మంది పెన్షన్లు కట్ చేశారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయి?. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో ప్రజలు నష్టపోతారు.’’ అని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.పేదలందరికీ రేషన్ బియ్యం అందాలన్నదే తమ ఆలోచన.. 8 వేల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందజేయాలన్న అవినాష్‌రెడ్డి.. రూ.480 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ పథకం ప్రారంభించింది మేమే. వాటర్ గ్రిడ్ స్కీముకు వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. పాపాఘ్ని నది నుంచి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. దొంగతనాలు, మట్కా, జూదం విచ్చలవిడిగా జరుగుతున్నాయని ధ్వజమెత్తారు.‘‘వైఎస్సార్సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడంలో చంద్రబాబు సర్కార్ ఘనత సాధించింది. ప్రతి మహిళకు రూ.18 వేలు డబ్బులు ఇస్తామన్నారు. నిరుద్యోగ అభివృద్ధి రూ.3వేలు ఇస్తామన్నారు. రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు.. ఎక్కడ ఇస్తున్నారు? 66 లక్షల పెన్షన్లు వచ్చేవి.. మీ ప్రభుత్వం వచ్చాక ఐదు లక్షల పెన్షన్లను తీసేశారు’’ అంటూ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. ఈ ప్రాంతానికి కృష్ణ జలాలు వస్తున్నాయంటే వైఎస్సార్ పుణ్యమే. వైఎస్సార్, వైఎస్ జగన్ చేసిన మంచి ఈ ప్రాంత ప్రజలు, రైతులకు తెలుసు. బోగస్ మాటలు పక్కన పెట్టి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని ఆయన హితవు పలికారు. -
ఎంతకాలమీ ప్రజావ్యతిరేక నిర్ణయాలు బాబూ!
మొండివాడు రాజుకంటే బలవంతుడని సామెత. రాజు అంటే పరిపాలకుడు మొండివాడుగా ఉండొద్దు అన్న అర్థమూ ఉంది దీంట్లో. పట్టు విడుపుల్లేని రాజకీయం, ప్రజాస్వామ్యంలో విజ్ఞత, విచక్షణల అవసరమని గతానుభావాలు చెబుతున్నాయి. ఏ ప్రభుత్వానికైనా ప్రజాక్షేమమే పరమావధి కావాలి మినహా వ్యక్తిగత పట్టింపులు కాదు. ఈ విషయాలను విస్మరిస్తే ప్రజల నుంచి ఛీత్కారం తప్పదు. అచ్చం... ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో జరుగుతున్నది ఇదే. ఎవరు కాదన్నా.. వద్దంటున్నా ప్రైవేటీకరణకు మంకుపట్టు పట్టుకున్న చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడుతోంది. ఈ అహేతుక నిర్ణయం ప్రజా వ్యతిరేకంగా కనిపిస్తోంది. ప్రజల అభిమతానికి భిన్నంగా నడుచుకుంటే రాజకీయ పార్టీలకు ఇక్కట్లు తప్పవన్న సంగతి ఇప్పటికే పలుమార్లు నిరూపితమైంది. తెలుగువారంతా కలిసి ఉండాలనుకున్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీనటుడు ఎన్టీఆర్ అందుకు తగ్గట్టుగా ‘‘తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది. ప్రాంతాలు వేరైనా మనమంతా ఒక్కటే’’ అన్న సందేశాత్మక పాటలను తన సినిమాల్లో పెట్టుకున్నారు. అల్లుడు చంద్రబాబు కూడా ఎన్టీఆర్ నుంచి పార్టీని అక్రమంగా లాగేసుకున్న తరువాత చాలాకాలం అదే విధానాన్ని కొనసాగించారు. 2004 ఎన్నికల ఓటమి తరువాత జరిగిన మహానాడులోనూ టీడీపీ ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. కానీ 2009 వచ్చేసరికి ప్రత్యేకవాదంపై ఉద్యమం చేస్తున్న టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం కోసం చంద్రబాబు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించారు. టీడీపీకి చెందిన కోస్తా, రాయలసీమ నేతలు వ్యతిరేకించినా తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖలు ఇచ్చారు. అది ఆంధ్రుల సెంటిమెంట్ కు వ్యతిరేకంగా మారింది. దాంతో 2009లోనూ ఓటమిపాలైంది. 1999లో విపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని పాదయాత్ర లో ప్రకటించారు. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవల్సిందేనని ఎద్దేవ చేశారు. 2004 ఎన్నికలలో టీడీపీ అధికారం కోల్పోవడానికి ఇది ఒక కారణమైంది. వైఎస్ అధికారంలోకి వచ్చాక ఉచిత విద్యుత్ ను అమలు చేసి చూపారు. దాంతో చంద్రబాబు కూడా తన వైఖరి మార్చుకుని గత టర్మ్‌లో అధికారంలోకి వచ్చినప్పుడు ఉచిత విద్యుత్ ను కొనసాగించారు. విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇచ్చే హామీలు, తదుపరి మాటలు మార్చడం గురించి ఇక్కడ చర్చ కాదు. నేదురుమల్లి జనార్ధన రెడ్డి ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ సరస్వతిని అమ్ముతారా అంటూ తీవ్ర విమర్శలు చేసింది. అంతేకాదు. అతకు ముందు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.ప్రస్తుతం అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వపరంగా గత ముఖ్యమంత్రి జగన్ కష్టపడి సాధించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటువారికి కట్టబెట్టడానికి ఎక్కడలేని కృషి చేస్తోంది. దీనిపై వైసీపీ అధినేత జగన్ కోటి సంతకాల ఉద్యమం చేపట్టారు. దానికి ప్రజలు స్వచ్చందంగా మద్దతు పలికి ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటువారికి అప్పగించరాదని సంతకాలు చేశారు. జగన్ వారి పక్షాన గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. చంద్రబాబు చేస్తున్నందంతా ఒక స్కామ్ అని, ఇందులో ప్రైవేటు సంస్థలు భాగస్వాములైతే భవిష్యత్తులో తమ ప్రభుత్వం వచ్చాక కేసులు ఎదుర్కోవలసి ఉంటుందని, తిరిగి కాలేజీలను స్వాధీనం చేసుకుంటామని జగన్ విస్పష్టంగా తెలిపారు. బహుశా ప్రజా వ్యతిరేకత, జగన్ హెచ్చరికలను గమనంలోకి తీసుకున్నాయో, ఏమో కాని, ప్రైవేటు సంస్థలు కాలేజీలకు టెండర్లు వేయలేదు. నాలుగు కాలేజీలకు గాను ఆదోని కాలేజీకే ఒక ప్రైవేటు వైద్య సంస్థ కిమ్స్ మాత్రం బిడ్ వేసిందని ప్రభుత్వం చెప్పింది. అయితే తాము బిడ్ వేయలేదని కిమ్స్ ప్రకటించడంతో ప్రభుత్వం పరువు పోయింది. కిమ్స్‌లో పనిచేసే ఒక డాక్టర్ ఈ టెండర్ వేశారని, కమ్యునికేషన్ గ్యాప్ వల్ల తప్పు జరిగిందని, ఇది చిన్న విషయమని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు. ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా పని చేస్తోందో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం ఉండకపోవచ్చు. అయినా చంద్రబాబు మళ్లీ సమీక్ష చేసి మొండిగా ముందుకువెళ్లాలని నిర్ణయించారు. పైగా ఆయా ప్రైవేటు సంస్థలకు ఆర్థిక, ఇతర రాయితీలు కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. ఇక్కడే ఆశ్చర్యంగా ఉంటుంది. జగన్ ప్రభుత్వం ఆ కాలేజీలకోసం వందల కోట్ల రూపాయల విలువైన భూములను కేటాయించింది. కొన్ని కాలేజీలకు భవన నిర్మాణాలు దాదాపు పూర్తి అయ్యాయి. పులివెందుల మెడికల్ కాలేజీకి అవసరమైన పరికరాలు కూడా సమకూర్చారు. ఇలాంటి వాటన్నిటిని ప్రైవేటు వారికి అప్పగించడం ఏమి హేతుబద్దత? ఈ ఆస్తులను కట్టబెట్టడమే కాకుండా, రెండేళ్లపాటు సిబ్బందికి జీతాలూ ఇస్తారట. అయినా ప్రైవేటు సంస్థలు ముందుకు రాలేదు. దీంతో ఆయా ప్రైవేటు సంస్థలకు వయబిలిటి గ్యాప్ ఫండ్ కూడా ఇస్తామని చంద్రబాబు తాజాగా ప్రకటించారు. జగన్ కోటి సంతకాల ఉద్యమం సందర్భంగా చేసిన హెచ్చరిక పని చేసిందన్నది ప్రజాభిప్రాయంగా ఉంది. ప్రభుత్వ వర్గాలు కూడా అలాగే భావిస్తున్నాయి. అదే టైమ్‌లో ఈ కాలేజీలు తీసుకున్నా, ఎంత ప్రభుత్వం ఆస్తులు ఇచ్చిన నష్టం రావచ్చునని ప్రైవేటు సంస్థలు అనుమానించాయా? లేక చంద్రబాబు బలహీనతను క్యాష్ చేసుకొన్ని మరిన్ని రాయితీలు పొందాలని అనుకుని ఉండవచ్చు. మొత్తం ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు ఎల్లో మీడియా ద్వారా కేంద్రం పీపీపీ విధానాన్ని అమలు చేయాలని తెలిపిందని, ఇందుకు కేంద్రం నుంచి నిధులు వస్తాయని కొత్త ప్రచారం ఆరంభించారు. ఇందులో నిజం ఎంతవరకు ఉందన్నది అనుమానమే. కేంద్ర మంత్రి నడ్డా నిజంగానే అలా లేఖ రాసి ఉంటే దానిని బహిర్గతం చేసి ఉండేవారు కదా! ప్రజాధనం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం చంద్రబాబుకు కొత్తకాదు. 1995-2004 మధ్యకాలంలో 54 ప్రబుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించారు. ఆ ప్రైవేటు సంస్థలకు మంచి విలువైన భూములు కట్టబెట్టగా, అవి ఆ తర్వాత కాలంలో వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకున్నాయని చెబుతారు. గత టర్మ్‌లో విజయవాడకు, కడప వంటి విమానాశ్రయాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి విమానాలు నడపడం ఆర్థికంగా లాభతరం కాదని చెప్పిన విమానయాన సంస్థలకు ఖాళీగా ఉండే సీట్ల టిక్కెట్ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని ప్రజాధనాన్ని వెచ్చించారు. దీనినే వయబిలిటి గ్యాప్ ఫండ్ అంటారు. ఇదే సూత్రాన్ని మెడికల్ కాలేజీలకు వర్తిస్తారట. అత్యవసర సమయాలలో ఇలా చేస్తే ఫర్వా లేదు కాని, లేని డిమాండ్ క్రియేట్ చేయడం కోసం ప్రభుత్వం ఇలా వృథా వ్యయం చేయవచ్చా? ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ టర్మ్‌లో అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమరావతి రాజధాని పేరుతో ఇప్పటికి సుమారు రూ.47 వేల కోట్ల రుణం తీసుకు వస్తున్నారు. కాని వైద్య కాలేజీలకు ఐదువేల కోట్ల డబ్బు లేదని చెబుతున్నారు. అమరావతి ఆవకాయ పేరుతో ఐదు కోట్ల రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. వెయ్యి రూపాయలు అదనంగా ఫించన్ పెంచి దానిని ఇవ్వడానికి లక్షల రూపాయలు వృధా వ్యయం చేస్తున్నారు. విశాఖలో వందల కోట్ల రూపాయల విలువైన భూమిని 99 పైసలకే ఇచ్చేస్తున్నారు. కాని మెడికల్ కాలేజీలను నడపలేమని చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం విద్య,వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యత ఇచ్చింది. స్కూళ్లతోపాటు ప్రభుత్వ ఆస్పత్రులను బాగు చేసింది. గుంటూరు, విజయవాడ తదితర ముఖ్యమైన ఆస్పత్రులు కార్పొరేట్ తరహాలోనే పనిచేసే స్థితి వచ్చింది. అయినా చంద్రబాబు మాత్రం కార్పొరేట్ ఆస్పత్రులే గొప్ప అన్నట్లు మాట్లాడుతూ తన ప్రభుత్వం చేతకానిదన్న సంకేతం ఇస్తున్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అంటూ కొత్త రాగం ఆలపించారు. పేదలకు నాణ్యమైన వైద్యం కోసం ప్రైవేటు వారికి కాలేజీలు ఇస్తారట.ఇప్పటికే కార్పొరేట్ ఆస్పత్రులు ఏ స్థాయిలో ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాయో అందరికి తెలుసు. పోనీ ప్రైవేటు కాలేజీలు సొంతంగా భూమి సమకూర్చుని, నిర్మాణాలు చేసుకుని, సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ఆస్పత్రులు పెట్టుకుంటే అదో పద్దతి అనుకోవచ్చు.ప్రభుత్వమే అన్ని సమకూర్చి,అప్పనంగా కాలేజీలను ప్రైవేటువారికి ఇవ్వడం ద్వారా పేదలకు ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుందో అర్ధం కాదు.కేంద్రం జగన్ టైమ్ లో ప్రభుత్వరంగంలో పనిచేసేలానే ఈ 17 కాలేజీలను మంజూరు చేసిందన్న సంగతిని దాచేయాలని యత్నిస్తున్నారు.కేంద్రం కూడా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేట్లయితే మంగళగిరిలో ఎయిమ్స్ ను ప్రభుత్వపరంగా ఎలా నిర్మించిందన్నదానికి జవాబు దొరకదు. ప్రజల ఆస్తులుగా ఉన్న ఈ కాలేజీలను చంద్రబాబు తనకు కావల్సినవారికి సంపదగా మార్చుతున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు.ప్రజల సెంటిమెంట్ కు వ్యతిరేకంగా చంద్రబాబు తీసుకున్న ఈ మొండి నిర్ణయం కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తులో ఒక చేదు ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వ్యభిచారం కేసులో మహిళ అరెస్ట్
గుణదల(విజయవాడ తూర్పు): పలువురు యువతుల సహకారంతో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళను మాచవరం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మాచవరం శాంతినగర్‌కు చెందిన వేముల రమణమ్మ తాను ఉంటున్న అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోంది. నివాసాల మధ్య అసభ్యకరంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై గతంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిఘా ఏర్పాటు చేసిన మాచవరం పోలీసులు దాడులు నిర్వహించగా ముగ్గురు యువతులతో పాటు బి.రాజు అనే విటుడు ఉన్నట్లు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలు రమణమ్మను అరెస్ట్ చేశారు. -
ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో విజయవాడకు చెందిన ప్రయాణికుడు మృతి చెందడంపైనా విచారం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగడం దిగ్భ్రాంతి కలిగించింది. ఘటనలో ఓ ప్రయాణికుడు మృతి చెందడం బాధాకరం. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ప్రమాదంలో ఎవరైనా గాయపడి ఉంటే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం, రైల్వే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అని ఒక ప్రకటనలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. టాటానగర్(జార్ఖండ్)-ఎర్నాకుళం(కేరళ) మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ ఆదివారం అర్ధరాత్రి అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. రైలులోని ఓ బోగీలో మంటలు చెలరేగి.. మరో బోగికి అంటుకున్నాయి. ఈ ఘటనలో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ప్రయాణికుల్లో విజయవాడకు చెందిన చంద్రశేఖర్(70) అనే వృద్ధుడు సజీవ దహనం అయ్యారు. లోకో పైలట్ సమయస్ఫూర్తితో మిగతా ప్రయాణికులంతా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది. -
Tirumala: శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 13 కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 85,823 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,660 మంది భక్తులు తలనీలాలు అరి్పంచారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.80 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇదిలా ఉంటే తిరుమలలో చలి తీవ్రత పెరిగిపోయింది. భక్తులు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూములు దొరకని భక్తులు వెయిటింగ్ హాళ్ల వద్ద, టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద చలికి వణుకుతూ కనిపిస్తున్నారు.రేపు ముక్కోటి ఏకాదశి వేడుకలుడిసెంబరు 30వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టిటిడి స్థానిక ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేట్టారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించనున్నారు. తిరుపతి స్థానిక ఆలయాల్లో పుష్పాలంకరణలకు 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 1 లక్ష కట్ ఫ్లవర్స్ ఉపయోగించనున్నారు. శ్రీ గోవిందరాజవారి ఆలయంలో…తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఇందులో భాగంగా వేకువజామున 12.05 నుండి 1.35 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వేకువజామున 1.35 నుండి రాత్రి 8.45 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో…తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 2 నుండి 3 గంటల వరకు తిరుప్పావై, ధనుర్మాస కైంకర్యాలు జరుగనున్నాయి. ఉదయం 3 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు అమ్మవారికి ఆస్థానం నిర్వహిస్తారు.శ్రీనివాసమంగాపురంలో …డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 గంటల నుండి 1.30 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వేకువజామున 1.35 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 6 నుండి 7 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.అదేవిధంగా డిసెంబరు 31న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4 నుండి 5.30 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు.అప్పలాయగుంటలో ….అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువ జామున 12.05 నుండి 1.30 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 1.35 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరగనుంది. అనంతరం రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు.డిసెంబరు 31న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించనున్నారు.నారాయణవనంలో …నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేకువజామున 12.05 నుండి 1.30 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 1.35 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీవారి గ్రామోత్సవం, ఆస్థానం నిర్వహించనున్నారు.డిసెంబరు 31న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 6 నుండి 7 గంటల గంటల వరకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఉదయం 8:15 నుండి 9 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం జరుగునుంది. అదేవిధంగా తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం, చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయం, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, పిఠాపురంలోని శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయం, బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, అమరావతిలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
అనకాపల్లి: ‘ఎర్నాకుళం’ మృతుడికి పరిహారం ప్రకటించిన రైల్వే
సాక్షి, అనకాపల్లి: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాద ఘటనలో ఒకరు మరణించారని.. మిగతా ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని అధికారులు ధృవీకరించారు. అలాగే మంటలు పూర్తిగా అదుపులోకి రావడంతో సహాయక చర్యలు పూర్తైనట్లు ప్రకటించారు. టెక్నికల్ క్లియరెన్స్ అనంతరం.. ప్రమాదానికి గురైన రెండు బోగీలతో పాటు మరొక బోగీని(ఎం2 కూడా) మినహాయించడంతో సోమవారం ఉదయం 7గంటలు ఆలస్యంగా రైలు ఎర్నాకుళం బయల్దేరింది.టాటానగర్(జార్ఖండ్) నుంచి ఎర్నాకుళం(కేరళ) వెళ్తున్న ఎక్స్‌ప్రెస్(18189) రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని ఎలమంచిలి సమీపంలోని పాయింట్ వద్ద లోకో పైలట్లు గుర్తించి స్టేషన్లో రైలును నిలుపుదల చేశారు. ప్రయాణికులంతా బయటకు దిగి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈలోపు లోకో పైలట్ కాలిపోతున్న బోగీలను రైలు నుంచి వేరు చేశారు. సమాచారం అందుకున్న అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లికి చెందిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల్లో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా.. మిగతా వారంతా సురక్షితంగా బయటపడ్డారు. తొలుత బీ1 కోచ్‌లోనే మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. అర్ధరాత్రి 3.30గంటలు దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన రెండు బోగీలను తొలగించి, ఆయా బోగీల్లోని ప్రయాణికులను మిగతా బోగీల్లో సర్దుబాటు చేసి రైలును పంపించడానికి ప్రయత్నాలు చేయబోయారు. కానీ.. దుప్పట్ల వల్లే..ప్రమాద స్థలానికి చేరుకున్న దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ డీఆర్ఎం మోహిత్ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘‘ప్రమాదం జరిగిన ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి దాటాక 1.30గం. ప్రాంతంలో ప్రమాదం జరిగింది. బీ1 కోచ్‌లో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నాం. ఆ బోగీలో దుప్పట్లు ఉండడం వల్ల మంటలు శరవేగంగా వ్యాపించాయి. రెండు బోగీలు(బీ1, ఎం2) పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో బీ1లో 76 మంది, ఎం2లో 82 మంది ఉన్నారు. ప్రమాదంలో ఒకరు మరణించారు. బీ1 బోగీలో మృతదేహాన్ని గుర్తించాం. ప్రయాణికులను ప్రత్యేక బస్సుల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. బ్రేకులు పట్టేయడం వల్లే మంటలు చెలరేగాయని లోకో పైలట్లు చెబుతున్నారు. కానీ, అధికారిక దృవీకరణ జరగాల్సి ఉంది. ఘటనపై విచారణ జరుగుతోంది’’ అని అన్నారు. ఇదిలా ఉంటే.. మృతుడ్ని విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్(70)గా అధికారులు నిర్ధారించారు. ఆయన కుటుంబానికి రైల్వేశాఖ రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. ప్రయాణికుల అవస్థలుఈ ఘటన తర్వాత.. చలిలో సుమారు 2వేల మంది ప్రయాణికులు స్టేషన్లో పడిగాపులు పడ్డారు. అనకాపల్లి, తుని, విశాఖ స్టేషన్లో పలు రైళ్లు నిలిచిపోయాయి. విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పూరి-తిరుపతి, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, జన్మభూమి ఎక్స్‌ప్రెస్, బెంగళూర్ హంసఫర్ రైళ్లు వీటిల్లో ఉన్నాయి. ప్రయాణికులు ఈ విషయం గమనించాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.ఎఫ్ఎస్ఎల్ ఆధారాలే కీలకంప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ ఉదయం ఘటన స్థలానికి రైల్వే సేఫ్టీ కమిటీ చేరుకుంది. ప్రమాద తీవత్రను సీనియర్ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో రెండు ఫోరెన్సిక్ బృందాలు ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నాయి. ఫైర్ సిబ్బంది మూడు గంటలపాటు శ్రమించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారని ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. దర్యాప్తులో ఎఫ్ఎస్ఎల్ ఆధారాలే కీలకమని పోలీసులు చెబుతున్నారాయన. ‘‘ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు జరిపి సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకున్నాం. ప్రత్యేక బస్సుల్లో రైల్వే స్టేషన్‌కు తరలించాం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ఎర్నాకులం చేరేలా చూస్తాం’’ అని తెలిపారు.కలెక్టర్ కామెంట్స్.. రైలు ప్రమాద ఘటనపై కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ.. ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది. యలమంచిలి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చే సరికి ప్రెషర్ తేడాలను లోకో పైలెట్ గుర్తించారు. అప్పటికే పొగలు వ్యాపించడంతో ప్రయాణీకులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులకు జిల్లా యంత్రాంగం తరపున ప్రయాణీకులకు ఆహారం, మంచినీటి సౌకర్యం కల్పించాం. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా ప్రమాద కారణాలు తెలుస్తాయి అన్నారు. -
Anakapalli: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. బోగీలు దగ్ధం
సాక్షి,అనకాపల్లి: ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు మృతి చెందినట్లు సమాచారం. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.సోమవారం టాటా నగర్ నుండి ఎర్నాకుళం వెళ్తున్న ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన లోకోపైలట్ వెంటనే రైలును ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో నిలిపివేశారు. అగ్నిప్రమాదంపై రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.రైలు నిలిపివేయగానే భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. అయితే రైల్వే అధికారులు, సిబ్బంది చాకచక్యంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఒక బోగీలోని ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనలో మొదటగా బీ1 బోగీలో మంటలు చెలరేగగా.. అనంతరం ఎం1,బీ2 కోచ్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రైల్వే సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మంటలు ఇతర కోచ్‌లకు వ్యాపించకుండా వాటిని వేరు చేసి, ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. -
'ఎగ్'బాకింది
విజయవాడ సత్యనారాయణపురంలో రోజూ మాదిరిగా రమేష్ తన స్నేహితులతో అల్పాహారం కోసం ఓ టిఫిన్ దుకాణానికి వెళ్లాడు. మూడు డబుల్ ఎగ్ దోశలు ఆర్డర్ చేసి తిన్నారు. ఎప్పటిలాగే దోశ రూ.40 చొప్పున మూడు దోశలకు రూ.120 ఫోన్ పే చేశాడు. ఆ సౌండ్ విన్న యజమాని మరో రూ.30 చేయండి బాబూ.. గుడ్లు ధర బాగా పెరిగిందని చెప్పాడు. దీంతో రమేష్ అదనంగా డబ్బులు చెల్లించి ఏంటి గుడ్డు రూ.8 అయిపోయిందా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విశాఖ నగరంలోని ఎండాడలో సత్యవతి అనే మహిళ ఇంటికి సమీపంలోని కిరాణాదుకాణానికి వెళ్లి అరడజను గుడ్లు అడిగింది. దుకాణదారుడు గుడ్డు రూ.8.50 అని చెప్పడంతో ఆమె అవాక్కయింది. ఎప్పుడూ ఇంత రేటు చూడలేదని నాలుగు గుడ్లుతో సరిపెట్టుకుంది. దుకాణదారుడు అమ్మా కొద్ది రోజుల్లో గుడ్డు ధర రూ.10 కి చేరవచ్చని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారని అనడంతో ఆమె ఆశ్చర్యపోయింది. ఇలా వీరే కాదు రాష్ట్రంలోని ఏ ఎగ్, చికెన్ మార్కెట్‌కి వెళ్లినా ప్రస్తుతం పెరిగిన గుడ్లధర గురించే చర్చ నడుస్తోంది. చికెన్ ధరలు కూడా అందనంత దూరంలో ఉన్నాయని ప్రజలు అసంతప్తిని వ్యక్తం చేస్తున్నారు. – ఏపీ సెంట్రల్ డెస్క్నాన్ వెజ్ ప్రియులు జిహ్వచాపల్యాన్ని తీర్చుకోలేకపోతున్నారు.పెరిగిన గుడ్లు, చికెన్ ధరలతో అటు వైపు చూడడానికి సాహసించడంలేదు. ఒకవైపు పెరిగిన కూరగాయల ధరలతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే మరోవైపు గుడ్డు ధర ఆల్‌టైం రికార్డుస్థాయికి చేరింది. హోల్‌సేల్‌లోనే రూ.7 పలుకుతోంది. ఇక కిరాణాషాపులు, చిన్న చిన్న దుకాణాల్లో రూ.8 నుంచి రూ.8.50 వరకూ విక్రయిస్తున్నారు. ఈ ప్రభావంతో గుడ్డు, చికెన్‌తో తయారయ్యే ఆహారపదార్థాల ధరలు పెంచేశారు. దీంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ధరలు పెరగడంతో ఏం తినాలి.. ఎలా బతకాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడ్డుధర ఇంత ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు సైతం చెప్పడం విశేషం. తక్కువ ట్రేలే తెస్తున్నాం గుడ్లు ధర భారీగా పెరగడంతో చిరువ్యాపారులు సైతం స్టాక్ తగ్గించుకుంటున్నారు. గతంలో హోల్‌సేల్ దుకాణం నుంచి 10 ట్రేల గుడ్లు తెచ్చే వారు ప్రస్తుతం పెరిగిన ధరలకు భయపడి స్టాక్ తగ్గించేస్తున్నామని చెబుతున్నారు. ఒక్క సారిగా ధర తగ్గిపోతే నష్టపోవాల్సి వస్తుందనే భయంతో తక్కువగా తెస్తున్నామని.. హోల్‌సేల్ వ్యాపారులు మాత్రం ఇప్పట్లో ధర తగ్గదు... పెరుగుతుందని చెబుతున్నా... వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని రిస్క్ చేయలేక పోతున్నామంటున్నారు. ఎగ్ వంటకాల ధరలకు రెక్కలు 15 రోజుల్లోనే గుడ్డు ధర రూ.6 నుంచి రూ.8కి చేరడంతో వంటకాల ధరలు కూడా వ్యాపారులు పెంచేశారు.సాధారణ టిఫిన్‌షాపులోనే సింగిల్ ఎగ్ దోశపై రూ.5, డబుల్ ఎగ్ దోశపై రూ.10 వరకూ పెంచేశారు. ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో మరింత పెంచారు. ఎగుమతులు పెరగడమే కారణమా! రాష్ట్రంలో భారీగా కోడి గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే ఇందులో 60 శాతం వరకూ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. ఈ ప్రభావం ధరల పెరుగుదలకు కారణమని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో గుడ్లు ఉత్పత్తి చేసే కోళ్లు 5 కోట్లు ఉన్నాయి. వాటి ద్వారా రోజుకు 4.70 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో 60 శాతం వరకూ పశ్చిమ బెంగాల్, ఒడిశా, అసోం,ఢిల్లీ వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. సాధారణంగా ఈ రాష్ట్రాల్లో చేపలు ఎక్కువగా వినియోగిస్తారు. నవంబర్ నుంచి జనవరి వరకూ ఆ రాష్ట్రాల్లో చేపల ఉత్పత్తి తగ్గడంతో గుడ్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. దిగిరాని చికెన్ చికెన్‌ధరలు దిగిరావడం లేదు. కార్తీకంలో కూడా కిలో రూ.200కు పైగానే కొనసాగింది. అలా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో స్కిన్ లెస్ చికెన్ కర్నూలు, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో రూ.260 పలుకుతోంది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, గుంటూరు, విజయవాడ జిల్లాల్లో కిలో రూ.280 నుంచి రూ.300 పలకడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. కోడి కూర వైపు చూడడానికి సాహసించడం లేదు.చికెన్, గుడ్లు తినలేకపోతున్నాం నేను జూపాడుబంగ్లా గ్రీన్‌అంబాసిడర్‌గా పనిచేస్తున్నా. నాకు నెలకు రూ.6 వేల వేతనం ఇస్తారు. పెరిగిన నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలతో సతమతం అవుతున్నాను. కనీసం నెలకోమారైనా చికెన్, గుడ్లు తిందామనుకొంటే చికెన్ కిలో రూ.260, గుడ్లు డజన్(12) రూ.100 చెబుతున్నారు. నాకొచ్చే అరకొర వేతనంతో చికెన్, గుడ్లు కొనుక్కొని తినలేని పరిస్థితి నెలకొంది. – రమణమ్మ, జూపాడుబంగ్లా, నంద్యాల జిల్లా గుడ్డు రేటు ఇంతా! సీజన్‌తో సంబంధం లేకుండా ఈ ఏడాది గుడ్లు, చికెన్ ధర పెరుగుతోంది. గుడ్డు ధర రూ.8.50 అంటే సామాన్యులు ఎలా కొనుక్కొని తినగలరు. చికెన్‌ధర కూడా అందనంత దూరంలో ఉంది. – ఎం.మణి, మంగమారిపేట, విశాఖపట్నంఇంత రేటు ఎప్పుడూ చూడలేదు నాకు తెలిసి గుడ్డు ఎప్పుడూ ఇంత రేటు చూడలేదు. గుడ్డు రూ.8.50 పెట్టి కొనాలంటే కష్టం. ధర ఒక్కసారిగా పెరగడంతో ఎగ్ దోశ రేటు పెంచారు. సింగిల్ ఎగ్ దోశపై రూ.5. డబుల్ ఎగ్ అయితే రూ.10 పెరిగింది.–గౌరినాయుడు,సత్యనారాయణపురం, విజయవాడగుడ్లు కూడా కొనలేకపోతున్నాం మధ్యతరగతి వాళ్లకు వారానికి ఒక్క రోజైనా చికెన్ తినాలని ఉంటుంది. అయితే ఇప్పుడు చికెన్ కాదు కదా.. కోడిగుడ్లను కూడా కొనే పరిస్థితి లేదు. కేజీ చికెన్ ధర రూ.280పైనే ఉంది. కోడిగుడ్లతో సరిపెడదామా అంటే డజన్ వంద రూపాయలు అంటున్నారు. చికెన్, కోడిగుడ్ల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. - భాస్కర్, హిందూపురం, శ్రీసత్యసాయి జిల్లా -
వెయిటింగ్ లిస్ట్‌కు రైల్వే చెక్!
సాక్షి, విశాఖపట్నం: రైలు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల నుంచి బయలుదేరే రైళ్ల రాకపోకల్ని రెట్టింపు చెయ్యాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం తొలివిడతగా.. 48 నగరాల్ని ఎంపిక చేసింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ చోటు దక్కించుకున్నాయి. ఎంపిక చేసిన నగరాల్లోని రైల్వే స్టేషన్ల సామర్థ్యాన్ని 2030 నాటికి గణనీయంగా పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం వీలైనంత త్వరగా.. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ ఆయా జోన్ల అధికారులకు బోర్డు చైర్మన్, సీఈవో సతీష్ కుమార్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రోజూ దేశవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్, మెయిల్, సబర్బన్ (లోకల్), ప్యాసింజర్ రైళ్లు అన్నీ కలిపి 13,500 వరకు నడుస్తున్నాయి. 2024–25 ఆరి్థక సంవత్సరంలో సుమారు 715 కోట్ల మంది రైళ్లలో రాకపోకలు సాగించారు. ఆ సంఖ్యను 1,000 కోట్లకు పెంచేలా సర్వీసులను రెట్టింపు చేయాలన్నది ప్రణాళిక. 2030 నాటికి దేశంలో ‘వెయిటింగ్ లిస్ట్’ అనే మాటే దాదాపు వినపడకూడదనే లక్ష్యంగా సైతం రైల్వే శాఖ చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఏం చేయనున్నారంటే..!» ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్లను రీ–డెవలప్మెంట్లో భాగంగా.. రైళ్ల సంఖ్యని క్రమంగా పెంచుతారు.ఉదాహరణకు ప్రస్తుతం ప్రతిరోజూ విశాఖపట్నం రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లు 180 నుంచి 200 వరకూ ఉండగా.. ఇందులో వైజాగ్ స్టేషన్ నుంచి బయలుదేరే రైళ్లు 55 వరకూ ఉన్నాయి. 2030 నాటికి ఈ సంఖ్య 100 నుంచి 110 వరకూ పెంచే అవకాశాలున్నాయి. » ఇప్పటికే ఉన్న టెర్మినల్స్‌లో అదనపు ప్లాట్‌ఫామ్‌లు, పిట్ లైన్లు, స్టాబ్లింగ్ లైన్లను ఏర్పాటు చేస్తారు. » నగరాల శివార్లలో ఉన్న రైల్వే స్టేషన్లను శాటిలైట్ టెర్మినల్స్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఇలా చేస్తే ప్రధాన స్టేషన్లలో రద్దీ తగ్గే అవకాశాలుంటాయి. »కేవలం కొత్త ప్లాట్‌ఫామ్‌లు కట్టడమే కాకుండా, రైళ్లు వేగంగా, సురక్షితంగా నడవడానికి ‘సెక్షనల్ కెపాసిటీ’ పెంచాలని బోర్డు సూచించింది. ఇందులో భాగంగా సిగ్నలింగ్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయడం, మల్టీ–ట్రాకింగ్ (అదనపు లైన్లు వేయడం) వంటి పనులు చేపడతారు. » దీంతో పాటు శివార్లలో కొత్త టెర్మినల్స్, మెగా కోచింగ్ కాంప్లెక్స్ అభివృద్ధి చేస్తారు. రైళ్ల సంఖ్య పెరగాలంటే వాటి నిర్వహణ ముఖ్యం. అందుకే నగరాల చుట్టూ ఈ మెగా కోచింగ్ కాంప్లెక్స్‌లు, పిట్ లైన్లను ఏర్పాటు చేస్తారు. -
బంగ్లా చెరలో ‘అల’వికాని వేదన
బంగ్లాదేశ్ పరిణామాలు అక్కడి భారతీయులనే కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని మత్స్యకారుల కుటుంబాలనూ కల్లోలపరుస్తున్నాయి. పొరపాటున తీరం దాటి బంగ్లా దళాల చేతుల్లో చిక్కుకున్న విజయనగరానికి చెందిన 9 మంది మత్స్యకారులు 75 రోజులకుపైగా అక్కడి జైలులో మగ్గిపోతున్నారు. వారి కుటుంబాలు ఇక్కడ తల్లడిల్లిపోతున్నాయి. ఒకవైపు ఇల్లుగడవడం కష్టమైపోతోంది.. ప్రభుత్వమేమో లేఖలు, మాటలతోనే సరిపెడుతోంది తప్పితే విడిపించేందుకు చర్యలు తీసుకోవడం లేదు. బంగ్లాలో పరిస్థితులు దిగజారిపోతుండటంతో తమవారు జైలులో ఎలా ఉన్నారో.. చెర వీడుతారా.. లేదా... అని ఆ కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. – ఏపీ సెంట్రల్ డెస్క్సముద్రంలో వేటకు వెళ్లి దారి తప్పి బంగ్లాదేశ్ కోస్ట్‌గార్డుకు చిక్కిన 9 మంది మత్స్యకారులు 75 రోజులకుపైగా జైలులో మగ్గిపోతున్నారు. వారిని స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో చొరవ చూపకపోవడంతో వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. అసలేం జరిగిందంటే.. విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామానికి చెందిన మత్స్యకారులు నక్కా రమణ, వాసుపల్లి సీతయ్య, భోగాపురం మండలం కొండ్రాజుపాలెం గ్రామానికి చెందిన మరుపల్లి చిన్నప్పన్న, మరుపల్లి రమేష్, సూరాడ అప్పలకొండ, మరుపల్లి ప్రవీణ్, సురపతి రాము, చిన్నప్పన్న, మైలపల్లి అప్పన్న జీవనం కోసం వైజాగ్‌కు వలస వచ్చారు. అక్కడే చేపల వేట కొనసాగించే వారు. అక్టోబర్ 13న విశాఖ చేపల రేవు నుంచి (బోటు నంబరు : ఎంఎం 75) సముద్రంలోకి వేటకు వెళ్లారు. దురదృష్టవశాత్తు అక్టోబర్ 14న అర్ధరాత్రి 2 గంటల సమయంలో దారి తప్పి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ పరిధిలోకి ప్రవేశించడంతో అక్కడి నేవీ అధికారులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.కడుపులో బిడ్డ.. జైలులో భర్తప్రసవ సమయంలో భర్త తన పక్కనే ఉండాలని భార్య కోరుకుంటుంది. భర్త కూడా తన బిడ్డ ఈ లోకంలోకి రాగానే ఎత్తుకుని మురిసిపోవాలనుకుంటాడు. దురదృష్టవశాత్తూ సూరాడ అనిత, అప్పలకొండ దంపతులకు ఆ అవకాశం లేకుండా పోయింది. బంగ్లాదేశ్ జైలులో బందీగా ఉన్న సూరాడ అప్పల కొండ భార్య అనిత ప్రస్తుతం 9వ నెల గర్భిణి. వచ్చే నెలలో ప్రసవించే అవకాశం ఉందని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో తన భర్త ఆచూకీ కోసం అనిత ఆందోళన చెందుతోంది. పురిటి నొప్పులకు తోడు మనోవేదనతో ఆమె సతమతమవుతోంది. తన భర్త రాకకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.బాధితులను విడిపించేందుకు వైఎస్సార్సీపీ యత్నాలు బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన 9 మంది మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్సార్ సీపీ అండగా నిలిచింది. ఆర్థిక సహాయం అందించడంతోపాటు విడుదల కోసం కూడా ప్రయత్నాలు చేస్తోంది. మత్స్యకారుల విడుదల కోసం వైఎస్సార్ సీపీ నాయకుడు, ఈస్ట్‌కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాసుపల్లి జానకీరామ్ బంగ్లాదేశ్ వెళ్లారు. జైలులో ఉన్న మత్స్యకారులకు ఆహారం, నిత్యావసర సరుకుల కోసం కొంత మొత్తాన్ని డిపాజిట్ చేశారు. వారి విడుదలకు బంగ్లాదేశ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి కోసం ఢాఖాలోని సుప్రీంకోర్టు అడ్వకేట్ మహమ్మద్ రెహ్మాన్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే భారత విదేశాంగ శాఖ అధికారులతోనూ సమావేశమై కేసు వివరాల డాక్యుమెంట్స్‌ను అందజేశారు.నాడు వైఎస్ జగన్ చొరవతో 22 మందికి పాక్ చెర నుంచి స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మత్స్యకారులు గుజరాత్‌లోని ఓ చేపల వ్యాపారి వద్ద పని చేస్తూ 2018 నవంబర్ 31న అరేబియా సముద్రంలో వేటకు వెళ్లారు. గుజరాత్ తీరం నుంచి పాకిస్తాన్ జలాల వైపు వెళ్లి అక్కడి భద్రత దళాలకు ఈ 22 మంది చిక్కారు. అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు మత్స్యకారులను విడిపించేందుకు కనీస చర్యలు చేపట్టలేదు. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చి న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో రాష్ట్ర మంత్రులు, అధికారులు కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరిపారు. ఫలితంగా విదేశాంగ శాఖ అధికారులు పాక్ అధికారులతో మాట్లాడి.. 22 మంది మత్స్యకారులను 2020 జనవరి 6న సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మొత్తంగా కోటీ పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా అందించారు.బంగ్లాలో పరిస్థితులు దిగజారడంతో ఆందోళనబంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటుతో నెలకొన్న అస్థిరత నేటికీ కొనసాగుతోంది. సైన్యం ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఉన్నప్పటికీ భారత్‌తో దౌత్యపరమైన సంబంధాలు క్షీణించాయి. మరోవైపు తాజాగా భారత వ్యతిరేకి, ఇంక్విలాబ్ మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. తాజాగా ఓ హిందూ యువకుడు దీపూ చంద్రదాస్‌ను నిరసనకారులు క్రూరంగా కొట్టి చంపేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో అరాచక శక్తుల ఆగడాలు మితిమీరిపోయి సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. దౌత్యపరంగానూ భారత్ – బంగ్లాదేశ్ మధ్య దూరం పెరిగిన ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అక్కడి జైలులో మగ్గిపోతున్న ఆంధ్రా మత్స్యకారుల విడుదలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాలో పరిస్థితులు పూర్తిగా క్షీణించక ముందే.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని బందీలను విడిపించేందుకు చర్యలు చేపట్టాలని బాధితుల కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.సర్కారు చర్యలు శూన్యం బంగ్లాదేశ్ జైలులో బందీలుగా ఉన్న మత్స్యకారులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వంతో కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందే తప్ప ఆ దిశగా దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం ప్రకటనలకే పరిమితమయ్యారు తప్పితే గంగపుత్రులను విడుదల చేయించేందుకు చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. మత్స్యకారులంతా విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గం పరిధి పూసపాటిరేగ, భోగాపురం మండలాలకు చెందిన వారే. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన ఎమ్మెల్యే పట్టించుకున్న పాపాన పోవడం లేదు. బాధిత కుటుంబాలకు భరోసానివ్వాలి దురదృష్టవశాత్తూ దారి తప్పి బంగ్లాదేశ్ కోస్టుగార్డుకు చిక్కిన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి భరోసానివ్వాలి. జైలులో మగ్గిపోతున్న తమ వారు ఎప్పుడొస్తారో తెలియక ఇక్కడ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇంటికి పెద్ద దిక్కైన వారు పరాయి దేశంలో బందీలుగా ఉండడంతో ఆర్థిక ఇబ్బందులతో పూట గడవడం కష్టంగా మారింది. వారికి ఆర్థిక భరోసానివ్వడంతోపాటు బందీలను వీలైనంత త్వరగా విడిపించాలి. – సూరాడ చిన్నారావు, కొండ్రాజుపాలెం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంకా జైల్లో..బంగ్లాదేశ్ జైలులో 75 రోజులకు పైగా మగ్గిపోతున్న మత్స్యకారులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే జైలు అధికారులతోపాటు బంగ్లా సుంప్రీంకోర్టు న్యాయవాదితో కేసు విషయమై మాట్లాడాను. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే 9 మంది నేటికీ జైలులో వున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ద్వారా బంగ్లా విదేశాంగ శాఖతో చిత్తశుద్ధితో సంప్రదింపులు జరిపి మత్స్యకారులను విడిపించి స్వస్థలాలకు తీసుకురావాలి. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి. – వాసుపల్లి జానకీరామ్, ప్రెసిడెంట్, ఈస్ట్‌కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ -
సర్కారుకు ‘ఆవకాయ’..ఏపీటీడీసీ ఉద్యోగులకు వెలక్కాయ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. ఉద్యోగుల బకాయిలు చెల్లించడంలో ఒకవైపు తీవ్ర తాత్సారం చేస్తూ.. మరోవైపు వేడుకల పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తోంది. గత ప్రభుత్వంలో నియమించిన పీఆర్సీ కమిషన్ చైర్మన్‌తో బలవంతంగా రాజీనామా చేయించడమే కాకుండా ఇప్పటివరకు కొత్త చైర్మన్‌ను నియమించకుండా, పీఆర్సీ అమలును అడ్డుకుని, కనీసం ఐఆర్‌ను ప్రకటించకుండా నిలువునా ముంచేస్తోంది. ఇక్కడ ప్రభుత్వోద్యోగుల వెతలు ఒక ఎత్తయితే.. కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగుల కష్టాలు మరో ఎత్తు. ఇటీవల పర్యాటక శాఖలో ‘ఆవకాయ–అమరావతి’ పేరుతో ఒక సినిమా, సాహిత్య ఈవెంట్‌కు ఏకంగా రూ.5 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. అదే పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)లో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ ఉద్యోగులకు గత ఐఆర్ ఎరియర్స్ విడుదల చేయడానికి మాత్రం డబ్బుల్లేవని చేతులెత్తేస్తోంది. వాస్తవానికి.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీటీడీసీ ఆధ్వరంలో నడిచే హరిత హోటళ్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఒడిగట్టింది. ఇలా ఒక్కొక్కటిగా ఏపీటీడీసీ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే సంస్థకు చెందిన శాశ్వత ఉద్యోగులను బదిలీల పేరుతో ప్రధాన కార్యాలయం నుంచి బయటకు పంపించి తమ మాట వినే అధికారులకు డెప్యూటేషన్లపై పగ్గాలు అప్పగించింది. ఫలితంగా ఏడాదిన్నర కాలంలో ఏపీటీడీసీ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవల్సి వచ్చింది. రూ.1.20 కోట్లు కూడా లేవా?ఏపీటీడీసీలో పనిచేస్తున్న 55 మంది ఇన్ సర్వీస్ ఉద్యోగులకు రూ.1.20 కోట్లు, 35 మంది రిటైర్డ్ ఉద్యోగులకు రూ.70 లక్షల వరకు ఐఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది మేలో ఏపీటీడీసీ ఎండీ నిధుల విడుదలకు ఆర్డర్ ఇచ్చారు. అయితే, ఇన్‌సర్వీస్ ఉద్యోగులకు మూడు దఫాల్లో ఇస్తామని మెలికపెట్టారు. ఇందులో ఇప్పటివరకు కేవలం ఒక దఫా మాత్రమే చెల్లించారు. మిగిలిన రెండు దఫాలు గురించి అడిగిన ఉద్యోగులకు సంస్థలో డబ్బుల్లేవనే మాట తప్ప మరో సమాధానం రావట్లేదు. విచిత్రం ఏమిటంటే.. రిటైరైన ఉద్యోగులకు మాత్రం సింగిల్ సెటిల్మెంట్లో మొత్తం చెల్లించేశారు. దీని వెనుక ఏపీటీడీసీలో డెప్యూటేషన్‌పై పనిచేస్తున్న అధికారులు భారీఎత్తున ముడుపులు దండుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇన్ సర్వీస్ ఉద్యోగులను ప్రధాన కార్యాలయంలోకి రానిస్తే తమ ఆటలు సాగవనే వారికి దక్కాల్సిన చెల్లింపులను అడ్డుకుంటున్నట్లు బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదేమి న్యాయం మేడం..ఏపీటీడీసీలో డెప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఓ కీలక అధికారిణికి ఏడాదిన్నరగా పొడిగింపు ఆర్డర్ లేదు. కానీ, ఆమె ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రతినెలా జీతం తీసుకుంటూనే ఉన్నారు. ఏపీటీడీసీకి చెందిన శాశ్వత ఉద్యోగులకు ఆర్థిక బకాయిలు విడుదల చేయడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సదరు అధికారి ఒక్కరే కాదు.. కీలక విభాగాలు అన్నింటిలోనూ డెప్యూటేషన్ ఉద్యోగులే చక్రం తిప్పుతున్నారు. ఇక ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్క కొత్తబోటు కొనలేదు.. హోటళ్ల ఆదాయాన్నీ పెంచలేదు.. పైగా ఉత్సవాల పేరుతో ఏపీటీడీసీ ఆదాయాన్ని అప్పనంగా వాడేస్తున్న పరిస్థితి. కానీ, అక్కడి ఉద్యోగులకు బకాయిలు చెల్లించకుండా డబ్బుల్లేవంటూ ఇబ్బందులకు గురిచేస్తోంది. వాస్తవానికి.. అక్టోబరు నుంచి జనవరి వరకు ఏపీటీడీసీకి పీక్ సీజన్. ఈ సమయంలో పర్యాటకుల ద్వారా సంస్థకు అధిక రాబడి వస్తుంది. కానీ, డెప్యూటేషన్ అధికారులు మాత్రం ఖజానాలో చిల్లిగవ్వ లేదని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.వైఎస్సార్సీపీ హయాంలో 27 శాతం ఐఆర్..2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఏడాది జూలైలో ఉద్యోగులకు పీఆర్సీ కంటే ముందు 27 శాతం ఐఆర్ అమలుచేసింది. అయితే, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు దీనిని వర్తింపజేసే క్రమంలో కరోనా విజృంభించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత 2021 నవంబరులో ఏపీటీడీసీ బోర్డు ప్రభుత్వం ఇచ్చిన ఐఆర్ జీఓతో సొంత నిధులు వాడుకుని ఉద్యోగులకు వర్తింపజేసేలా ఆమో దం తెలిపింది. దీనిపై 2021 డిసెంబరులోనే ప్రభుత్వం జీఓ జారీచేసింది. ఇంతలో 2022 జనవరి నుంచి ప్రభుత్వం పీఆర్సీ అమలులోకి తీసుకురావడం.. ఆ వెంటనే దానిని ఏపీటీడీసీ బోర్డు సైతం ఆమోదించి అమలుచేసింది. అయితే, ఆ తర్వాత ఏపీటీడీసీ రెవెన్యూ వృద్ధి చెందగా 2024లో బకాయిలు తీర్చే క్రమంలో ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచి ఏపీటీడీసీ ఉద్యోగులు పోరాడుతూనే ఉన్నా ప్రభుత్వం కనికరించట్లేదు. -
చావడానికే వచ్చాం.. ఎవరూ కాపాడొద్దు
గడివేముల: ఇద్దరు బిడ్డలు.. ఉన్నంతలో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు ఆ దంపతులు. కానీ విధి చిన్నచూపు చూసింది. ఇద్దరు బిడ్డలను అనారోగ్యం వెంటాడింది. దీంతో ఆ తల్లి మనసు తల్లడిల్లింది. చిన్నారులు ఇద్దరినీ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అని చెప్పి.. మధ్యలోనే దిగి ఇద్దరు బిడ్డలను కాలువలో తోసి తానూ దూకేసిన∙విషాద ఘటన నంద్యాల జిల్లా గడివేముల మండలంలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలు.. గడివేముల మండల పరిధిలోని ఒండుట్ల గ్రామానికి చెందిన బుగానిపల్లె ఎల్లా లక్ష్మి (23)ని అదే గ్రామానికి చెందిన రమణయ్య నాలుగేళ్ల్ల కిందట వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు వైష్ణవి (2), సంగీత (మూడునెలలు) ఉన్నారు. పిల్లలకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో గ్రామంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు వెళ్లగా రక్తకణాలు తగ్గిపోయాయని, గడివేములకు వెళ్లాలని సూచించాడు. దీంతో లక్ష్మి తన బిడ్డలను తీసుకుని గడివేముల బయలుదేరింది. మార్గమధ్యలోని మంచాలకట్ట గ్రామ సమీపంలో ఎస్సార్బీసీ ప్రధాన కాలువ వద్ద ఇద్దరు చిన్నారులతో దిగడంతో అటుగా వెళ్తున్న స్థానిక రైతులు ‘ఏమ్మా..ఇక్కడ కూర్చున్నావ్’ అని అడిగారు. ఆ వెంటనే లక్ష్మీ ఇద్దరు కుమార్తెలను కాలువలో పడేసి తానూ దూకింది. రక్షించేందుకు స్థానికులు యత్నించగా.. ‘నేను చావడానికే వచ్చాను.. మమ్మల్ని ఎవరూ కాపాడవద్దు’ అని కేకలు వేసింది. స్థానిక ఎస్ఐ నాగార్జునరెడ్డి కేసు నమోదు చేసి, సిబ్బందితో కలిసి ఎస్సార్బీసీ కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టారు. -
ప్రాణాలు తీసిన సరదా
కూనవరం: అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం నర్సింపేటలో ఆదివారం జరిగిన ఒక చిన్న పొరపాటు, ఒకేసారి తండ్రీకొడుకులను బలితీసుకుని ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మండలంలోని నర్సింగపేట గ్రామానికి చెందిన సింహాద్రి పాపారావు (40), కుమారుడు జశ్వంత్(14)తో కలిసి సరదాగా పెంచుకుంటున్న కోడిపుంజులను ఈత కొట్టించేందుకు పొలం వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నీటికుంటలో కోళ్లను ఈత కొట్టిస్తుండగా ప్రమాదవశాత్తు కుమారుడు జశ్వంత్ కాలుజారి కుంటలో పడిపోయాడు. కళ్లముందే కొడుకు మునిగిపోతుంటే చూడలేకపోయిన తండ్రి, ఈత రాకపోయినా ప్రాణాలకు తెగించి నీటిలోకి దూకాడు. దురదృష్టవశాత్తు ఇద్దరూ ఆ నీటిలోనే ఊపిరి వదిలారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకేసారి విగతజీవులుగా మారారు. ఇంటర్ చదువుతున్న కూతురు, భర్తను కోల్పోయిన భార్య.. మాకు దిక్కెవరు?.. అంటూ బోరున విలపిస్తున్న తీరు అక్కడున్న వారిని కన్నీటి పర్యంతం చేసింది. పోలీసులు మృతదేహాలను కోతులగుట్ట సీహెచ్‌సీకి తరలించారు. బహిర్భూమికి వెళ్లి ప్రమాదానికి గురైనట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలావుండగా జశ్వంత్ మర్రిగూడెం హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. -
నేటి అర్ధరాత్రి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించేందుకు టీటీడీ రంగం సిద్ధం చేసింది. జనవరి 8వ తేదీ రాత్రి 12గంటల వరకు 10 రోజులపాటు భక్తులకు వైకుంఠద్వార దర్శనం అందుబాటులో ఉంటుంది. సామాన్య భక్తులకు అధిక సమయాన్ని కేటాయిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. టోకెన్లు పొందిన భక్తులకు మూడు ప్రవేశ మార్గాల నుంచి అనుమతిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన మంగళవారం ఉదయం శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణ రథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. బుధవారం ద్వాదశి పర్వదినాన వేకువజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ద్వాదశి నాడు స్వామివారి పుష్కరిణిలో స్నానాలు ఆచరించే అవకాశం కల్పిస్తారు. మొదటి మూడు రోజులు టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. వీరికి అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 11 గంటల వరకు కృష్ణతేజ ప్రవేశమార్గం నుంచి, ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏటీజీహెచ్ అతిథిగృహం నుంచి అనుమతిస్తారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు శిలాతోరణం ప్రవేశమార్గం నుంచి భక్తులను అనుమతిస్తాడు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు టోకెన్లు లేకుండా వచ్చే భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఎస్ఈడీ, శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన భక్తులకు దర్శనం కల్పిస్తారు. చివరి మూడు రోజుల్లో స్థానికులకు రోజుకు 5 వేల మందికి చొప్పున ఇప్పటికే ఈ–డిప్ ద్వారా టోకెన్లు జారీ చేశారు. ఇప్పటికే సప్తగిరులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ పది రోజులు 50 టన్నుల సంప్రదాయ పుష్పాలు, పది టన్నుల ఫలాలు, నాలుగు లక్షల కట్ ఫ్లవర్స్‌తో శ్రీవారి ఆలయంతోపాటు, అనుబంధ ఆలయాలను అలంకరించనున్నారు. ఇల వైకుంఠాన్ని తలపించేలా విద్యుద్దీప కాంతులతో శ్రీవారి ఆలయం, తిరుమల అలరారుతున్నాయి. ఆలయం వెలుపల శ్రీ రంగనాథస్వామి ఆలయ నమూనాను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులోనే అష్టలక్ష్ములను, శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సెట్టింగులను ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు శ్రీవారి ఆలయం ఎదుట అష్టలక్ష్ములను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ముక్కోటి ఏకాదశి రోజున ఆలయాల వద్ద పటిష్ట బందోబస్తు సాక్షి, అమరావతి: ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠద్వార దర్శనం కల్పించే అన్ని ఆలయాల వద్ద ఈ నెల 30న పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. రద్దీని అంచనా వేసి ఆ సమాచారాన్ని పోలీసులకు అందించాలని దేవదాయశాఖ ఈవోలను ఆదేశించింది. -
పునర్వి‘భజన’లో రాజకీయ కుతంత్రం
సాక్షి, అమరావతి: స్వార్థ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు జిల్లాల పునర్విభజన చేస్తున్నారు. ప్రజల, పాలనా సౌలభ్యాలకు తిలోదకాలిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఒక శాస్త్రీయ ప్రాతిపదికన ఏర్పాటైన జిల్లాలను టీడీపీ ప్రయోజనాలే పరమావధిగా అస్తవ్యస్తంగా మారుస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక జిల్లా రద్దుకు సిద్ధమయ్యారు. 2023లో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన రాజంపేట పార్లమెంటు ప్రాంతాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు. ఆ జిల్లాకు అదే ప్రాంతానికి చెందిన ప్రఖ్యాత వాగ్గేయకారుడు అన్నమయ్య గౌరవార్థం పేరు పెట్టారు. రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లా ఏర్పాటైంది. దీనికి అందరి ఆమోదం లభించింది. ఇప్పుడు దాన్ని చంద్రబాబు ప్రభుత్వం కకావికలం చేస్తోంది. అప్పట్లో చిత్తూరు జిల్లా ప్రాధాన్యాన్ని కొనసాగించేందుకు రాజంపేట పరిధిలో ఉన్న పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆ జిల్లాలో కలిపారు. చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా మదనపల్లె జిల్లాను ఏర్పాటు చేసే పేరుతో అన్నమయ్య జిల్లా రూపురేఖలను మార్చివేసేలా ప్రతిపాదించారు. ఆ జిల్లాలో ఉన్న తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న మదనపల్లె జిల్లాలో కలిపారు. చిత్తూరు జిల్లాలో ఉన్న పుంగనూరు అసెంబ్లీ స్థానాన్ని మదనపల్లె జిల్లాలో విలీనం చేశారు. తుది నోటిఫికేషన్ విడుదల చేసే సమయానికి మిగిలిన రైల్వేకోడూరు, రాయచోటి, రాజంపేట నియోజకవర్గాలను తిరుపతి, కడప, మదనపల్లె జిల్లాల్లో కలపి అన్నమయ్య జిల్లాను పూర్తిగా రద్దు చేయాలని ప్రతిపాదించారు. అదే గనుక జరిగితే అన్నమయ్య జిల్లా కనుమరుగైనట్లే. తొలిసారి జిల్లా రద్దుకు అడుగులు రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకూ గతంలో ఏర్పాటైన జిల్లాలను ఏ ప్రభుత్వం రద్దు చేయలేదు. 11 జిల్లాలతో మొదలైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం 23 జిల్లాలకు విస్తరించింది. 2014లో తెలంగాణ విడిపోయిన తర్వాత 13 జిల్లాలతో అవశేష ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. చంద్రబాబు ఆ జిల్లాలను పునర్వ్యస్థీకరించకుండా వదిలేశారు. 2023లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. గతంలో ఉన్న 13 జిల్లాలను అలాగే ఉంచి కొత్తగా మరో 13 జిల్లాలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు కొత్తగా మరో 3 జిల్లాలు ఏర్పాటు చేస్తామని ముందు చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం చివరికి ఒక విధానం, హేతుబద్ధత లేకుండా రాజకీయ కారణాలతో అన్నమయ్య జిల్లాను లేకుండా చేయాలనే అభిప్రాయానికి వచ్చింది. రాజంపేట ఛిన్నాభిన్నమే లక్ష్యం రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీకి పట్టు లేకుండాపోవడంతో ఆ నియోజకవర్గాన్ని ఛిన్నాభిన్నం చేసేందుకు సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. 2004 నుంచి టీడీపీ అక్కడ గెలవలేదు. రాష్ట్ర విభజన తర్వాత 2014, 2019, 2024 ఎన్నికల్లో అక్కడ వైఎస్సార్సీపీ గెలిచింది. రాజకీయంగా ఆ నియోజకవర్గంలో టీడీపీకి ఇక పట్టు చిక్కే పరిస్థితులు లేకపోవడంతో జిల్లాల పునర్విభజన ముసుగులో అందులోని అసెంబ్లీ స్థానాలను చెల్లాచెదురు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మదనపల్లె జిల్లా ఏర్పాటు చేయడానికి పెద్దగా అభ్యంతరాలు లేకపోయినా ఆ పేరుతో ఉన్న జిల్లాను రద్దు చేయడం సరికాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పునర్విభజనలో చిత్తూరు జిల్లాలో ఉన్న పుంగనూరు నియోజకవర్గాన్ని మదనపల్లె జిల్లాలో కలపాలని నిర్ణయించారు. దీంతో చిత్తూరు జిల్లా కేవలం ఆరు నియోజకవర్గాలకే పరిమితం కానుంది. 32 మండలాలతో ఉన్న ఆ జిల్లా 26 మండలాలకే పరిమితమై ప్రాధాన్యం కోల్పోనుంది. తగ్గిపోతున్న బాపట్ల జిల్లా ప్రాముఖ్యంఅలాగే కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తుండగా దాని కోసం బాపట్ల జిల్లా ప్రాధాన్యాన్ని తగ్గిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తున్నారు. బాపట్ల జిల్లా నుంచి అద్దంకి, నెల్లూరు జిల్లా నుంచి కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతున్నారు. దీంతో 25 మండలాలతో ఉన్న బాపట్ల జిల్లా ఇప్పుడు 20 మండలాలకే పరిమితం కానుంది.పోలవరం లేకుండానే పోలవరం జిల్లాఅల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన ప్రాంతాన్ని విచిత్రంగా పునర్వ్యస్థీకరించింది. పోలవరం లేకుండా పోలవరం జిల్లాను ఏర్పాటు చేసి ప్రస్తుతం చేపట్టిన జిల్లాల పునర్విభజనకు అసలు ప్రాతిపదికే లేదని నిరూపిస్తున్నారు. కేవలం రంపచోడవరం నియోజకవర్గంతో ఒక జిల్లాను ఏర్పాటు చేయడమేకాకుండా దానికి పక్కనున్న ఏలూరు జిల్లాలో ఉన్న పోలవరం పేరును దానికి పెట్టడం గమనార్హం. అరకు పార్లమెంటు స్థానం పరిధి ఎక్కువ కావడం, నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉండడంతో ఈ జిల్లాను పునర్వ్యస్థీకరించడం 2022లోనే సవాలుగా మారింది. అయినా అప్పట్లో దాని విస్తృత పరిధి దృష్ట్యా రెండు జిల్లాలుగా విభజించారు. పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం కేంద్రంగా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేశారు. తద్వారా రెండు గిరిజన జిల్లాలను వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే రంపచోడవరం నియోజకవర్గం పాడేరుకు దూరంగా ఉందనే సాకుతో కేవలం ఆ ఒక్క నియోజకవర్గంతోనే ఇప్పుడు కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. పైగా దానికి ఏలూరు జిల్లాలో ఉన్న పోలవరం పేరు పెట్టడం ఇంకా విచిత్రంగా ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం ఒక నియోజకవర్గం కోసం జిల్లా ఏర్పాటు చేయడాన్ని బట్టి తాము చేసిన పునర్వ్యస్థీకరణకు తీరూతెన్నూ లేదని చంద్రబాబు ప్రభుత్వం నిరూపించుకుంది. ఒంగోలు, రాజంపేట, అరకు పార్లమెంటు స్థానాల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకు చంద్రబాబు ఈ పునర్విభజనను ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.2014లో వదిలేసి ఇప్పుడు తూట్లు పొడుస్తున్న చంద్రబాబుఅమరావతి కోసం చంద్రబాబు 2014–19లో జిల్లాలను పునర్వ్యస్థీకరించకుండా వదిలేయడంతో అనేక సమస్యలు ఏర్పడ్డాయి. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక శాస్త్రీయ దృక్పథంతో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని జిల్లాలను పునర్వ్యస్థీకరించారు. ప్రతి జిల్లాకు కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు, అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకూడదనే ప్రాథమిక సూత్రాల ఆధారంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి జిల్లాలో జనాభా సగటున 15 లక్షల నుంచి 20 లక్షలు ఉండేలా చూశారు. తద్వారా అన్ని జిల్లాలకు సమాన ప్రాధాన్యం ఉండేలా స్వరూపాలను నిర్దేశించారు. ఇందుకోసం 13 జిల్లాలను 26 జిల్లాలుగా, 51 రెవెన్యూ డివిజన్లను 76 డివిజన్లుగా పునర్వ్యస్థీకరించారు. చివరికి చంద్రబాబు సుదీర్ఘకాలం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం రెవెన్యూ డివిజన్ కూడా వైఎస్ జగన్ హయాంలోనే ఏర్పాటైంది. అంత శాస్త్రీయంగా జరిగిన పునర్విభజనను చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం నీరుగార్చడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.అన్నమయ్య జిల్లాపై నేడు నిర్ణయంఅన్నమయ్య జిల్లా రద్దు అంశాన్ని సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో తేల్చుదామని సీఎం చంద్రబాబు అధికారులతో చెప్పినట్టు తెలిసింది. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశమైనా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న అన్నమయ్య జిల్లాను పూర్తిగా రద్దు చేయడానికి దాదాపు నిర్ణయించినట్లు సమాచారం. కొత్తగా ఏర్పాటు చేసే మదనపల్లె జిల్లానే అన్నమయ్య జిల్లాగా కొనసాగిస్తున్నట్లు చెప్పాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం. రాయచోటి నియోజకవర్గాన్ని మదనపల్లె జిల్లాలో కలిపి జిల్లా కేంద్రంగా మదనపల్లెను చేయాలని దాదాపు ఖరారు చేశారు. అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి తాజాగా పలు మార్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం. వీటన్నింటిపై సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదముద్రవేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ నెల 31న జిల్లాల పునర్విభజనకు సంబంధించిన మార్పులపై తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. -
‘దళితుల భూముల్లో ప్రైవేట్’ దందా!
సాక్షి, అమరావతి: అవన్నీ దాదాపుగా దళితుల భూములే..! పారిశ్రామిక అవసరాల కోసం సేకరిస్తున్నామనడంతో స్థానికంగా అందరికీ ఉపాధి లభిస్తుందనే నమ్మకంతో ఎంతో మంది రైతులు భూములిచ్చారు. ఇక ఎస్సీ ఎస్టీలైతే.. ఏపీఐఐసీ తీసుకునే దాంట్లో చట్ట ప్రకారం 22.5 శాతం భూమిని దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేటాయించాల్సి ఉన్నందున తమ దక్షత చాటుకునేందుకు ఇదో మంచి అవకాశమని భావించారు. నమ్మి అసైన్డ్ భూములను అప్పగించారు. కానీ చంద్రబాబు సర్కారు ఏం చేస్తోంది..? విలువైన ఆ భూములను అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తోంది. దళిత యువ పారిశ్రామికవేత్తల ఆశలను నీరుగారుస్తోంది. పారిశ్రామిక పార్కుల ముసుగు తొడిగి.. దళితుల నుంచి తీసుకున్న భూముల్లో రియల్ ఎస్టేట్ దందాకు తెర తీసింది. చంద్రబాబు సర్కారు బరి తెగించి సాగిస్తున్న మరో భూదందా ఇదిగో ఇలా ఉంది...! ఏపీఐఐసీ భూములు ప్రైవేట్‌కు ధారాదత్తం... ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ పేరిట ఇప్పటికే విశాఖలో రూ.వేల కోట్ల విలువైన భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా అప్పగించేసిన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్కుల ముసుగులో రాష్ట్రవ్యాప్తంగా ఏపీఐఐసీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఏపీ పాలసీ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రైవేట్ ఇండ్రస్టియల్ పార్క్స్ విత్ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2024–29 పాలసీ పేరిట ప్రైవేట్ వ్యక్తులకు భూములను అప్పగించేందుకు ఏపీఐఐసీ బిడ్లను ఆహ్వానించింది. పీపీపీ విధానంలో 22 ప్రైవేట్ పార్కుల కోసం అస్మదీయులకు ఈ భూములను అప్పగించనున్నారు. పారిశ్రామిక పార్కులకు సంబంధించి ఎటువంటి అనుభవం లేని వ్యక్తులను సైతం సొంతంగా బిడ్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించడంపై అధికార వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. వ్యక్తులతో పాటు ప్రాపర్టీషి ప్ సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ సంస్థలు ఈ బిడ్‌లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ‘రియల్’ లబ్ధి కోసమే..! నివాస సముదాయాలు, రెసిడెన్షియల్ లే అవుట్లు, టౌన్షి ప్ లేఅవుట్లు వేసిన సంస్థలను కూడా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు బిడ్లలో పాల్గొనేందుకు అనుమతించటాన్ని బట్టి ప్రభుత్వ పెద్దలు తమకు కావాల్సిన వ్యక్తులు, రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములను కారుచౌకగా కట్టబెట్టడమే అసలు ఉద్దేశమని స్పష్టం చేస్తున్నారు. పారిశ్రామిక పార్కుల్లో కన్వెన్షన్ సెంటర్లు, విద్యా సముదాయాలు, ఆస్పత్రులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఎంటర్టైన్మెంట్ సెంటర్ల నిర్మాణానికి అనుమతిస్తున్నారంటే దీని వెనుక ఉన్న ‘రియల్’ ఉద్దేశాలు అర్థం చేసుకోవచ్చని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. బిడ్లు ఆహ్వానించడానికి 2026 జనవరి 19 చివరి తేదీగా నిర్ణయించారు.తీరు మారిన ఏపీఐఐసీఏపీ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ)కు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. ఎటువంటి కన్సల్టెన్సీల ప్రమేయం లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు ఫార్మా, బయో టెక్నాలజీ పార్కులను ఈ సంస్థ నిర్మించింది. పారిశ్రామిక అవసరాల కోసం ఏపీఐఐసీ భూమి సేకరిస్తోందంటే.. తమ బిడ్డలతోపాటు ఇరుగు పొరుగు వారికి ఉపాధి లభిస్తుందన్న ఉద్దేశంతో ఎంతో మంది రైతులు భూములు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇక ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో అత్యధికం దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములే ఉన్నాయి. ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తే వాటి ద్వారా తమకు ఉపాధి లభించడంతో పాటు చట్టప్రకారం 22.5% భూమిని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కేటాయించాల్సి ఉన్నందున తాము కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగవచ్చనే ఆశతో తమ భూములను అప్పగించారు. కానీ చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టాక ఏపీఐఐసీ తీరు పూర్తిగా మారిపోయింది. 547 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్న ఆ సంస్థ.. ఇప్పుడు కొత్తగా పారిశ్రామిక పార్కులను నిరి్మంచలేమంటూ చేతులెత్తేసింది. పేదల నుంచి సేకరించిన రూ.వేల కోట్ల విలువైన భూములను ప్రైవేటు, రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించడానికి ఉత్సాహం చూపుతోంది. ఒకపక్క ఏపీఐఐసీ పారిశ్రామికపార్కుల పేరిట రూ.8,500 కోట్ల రుణాలను సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం ఆ డబ్బులను తీసుకోవడంతోపాటు.. పారిశ్రామిక పార్కుల పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు విలువైన భూములు కట్టబెడుతుండటం పట్ల అధికార వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. పీపీపీ విధానంలో చేపట్టే ఈ పారిశ్రామికపార్కుల్లో రూల్ ఆఫ్ లా కింద ఎస్సీ ఎస్టీలకు 22.5% రిజర్వేషన్లు అమలు చేయరని, తద్వారా బడుగు వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తల ఆశలను చంద్రబాబు సర్కారు తుంచేసిందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.టెండర్లు పిలిచిన ఎంఎస్ఎంఈ పార్కులు ఆర్.కృష్ణపురం, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా గుండ్లమడుగు, వైఎస్సార్ కడప జిల్లా టి.చౌడూరు, వైఎస్సార్ కడప జిల్లా పల్లుగుర్రంపల్లి, వైఎస్సార్ కడప జిల్లా చేదెళ్ల, పుంగనూరు, చిత్తూరు జిల్లా చిన్నపండూరు, తిరుపతి జిల్లా కుక్కరాజుపల్లె, అన్నమయ్య జిల్లా నిజాంపట్నం, బాపట్ల జిల్లా వై.కోట, అన్నమయ్య జిల్లా మంగాడు, చిత్తూరు జిల్లా అనంతపురం గోవాడ, బాపట్ల జిల్లా నాయునిపల్లి, బాపట్ల జిల్లా గంగపాలెం, ప్రకాశం జిల్లా ముత్యాలంపాడు, విజయవాడ పరవాడ, అనకాపల్లి జిల్లా నిడదవోలు, తూ.గో. జిల్లా హంసవరం, కాకినాడ జిల్లా చెరుకుమిల్లి, తూ.గోజిల్లా గోపాలపట్నం, ముడసరలోవ విశాఖ జిల్లా టెక్కలి, శ్రీకాకుళం జిల్లా -
రెడ్‌బుక్ అరాచకం.. పోలీసు పైశాచికం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘పచ్చ ఖాకీ’లు పేట్రేగిపోతున్నారు. రెడ్‌బుక్ అరాచకానికి వత్తాసు పలికితే చాలు ప్రజల హక్కులను కాలరాసినా పర్వాలేదన్నట్లుగా బరితెగిస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తే సరి.. వారి భద్రతను గాలికొదిలేసినా అడిగేవారు ఉండరన్న ధీమాతో చెలరేగిపోతున్నారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై పోలీసు గూండాగిరి ప్రదర్శించి బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు మోపుతున్నారు. సీపీఎం నేత అప్పలరాజుపై పీడీ యాక్ట్ ప్రయోగించడం రాష్ట్రప్రభుత్వ దన్నుతో ఖాకీల బరితెగింపునకు పరాకాష్ట అని విమర్శకులంటున్నారు. తాజాగా.. వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో రప్పారప్పా అన్నందుకే వారిని పోలీసులు అరెస్టు చేసి నడిరోడ్డులో నడిపిస్తూ.. కొట్టుకుంటూ తీసుకెళ్లారు.ఇలా చేయడం దేనికి సంకేతం? పోలీసులు అలా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం న్యాయమేనా? వ్యవస్థలు దిగజారుతున్నాయనడానికి ఇదే సంకేతం. ఇలాంటి చర్యలతో న్యాయం బతుకుతుందా? అని మేధావులు, ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు. జంతు బలి ఇవ్వడాన్ని సాకుగా చేసుకుని హింసా ప్రవృత్తిని ప్రేరేపిస్తున్నారంటూ సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలతో పోలీసులు మరింత అత్యుత్సాహం ప్రదర్శించారు. హింసించి నడిబజార్లో నడిపిస్తారా!? రప్పా రప్పా అన్నారని, ఫ్లెక్సీలకు రక్త తర్పణం చేశారని వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. వారేదో దేశద్రోహులన్నట్లుగా నడిబజారులో కొట్టుకుంటూ నడిపించడం చూసి అంతా విస్తుపోయారు. ఈ ఉదంతాన్ని ఎల్లో మీడియా ప్రముఖంగా ప్రచురించడం చూసి ఆశ్చర్యపోయారు. నిజానికి.. ఫ్లెక్సీల వద్ద జంతు బలులు, రక్త తర్పణాల జాఢ్యాన్ని మొదలు పెట్టింది టీడీపీయే. గతంలో చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీల వద్ద టీడీపీ నేతలు ఒకటీ రెండు కాదు పదుల సంఖ్యలో పొట్టేళ్ల తలలు నరికి రక్త తర్పణం చేశారు. ఆ తలలను గుచ్చి దండలా ఫ్లెక్సీలకు వేలాడదీశారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా 2023లో పొట్టేలు తల నరికి ఫ్లెక్సీకి రక్తాభిõÙకం చేయలేదా? ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున చాలాచోట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిందేమిటి? ఇలాగే పొట్టేళ్ల తలలు నరికి, ఫ్లెక్సీలకు రక్త తర్పణం చేయలేదా? వాటిని ఏమంటారు? ప్రభుత్వ దోపిడీని ప్రశ్నిస్తే పీడీ యాక్ట్.. యథేచ్ఛగా సాగిస్తున్న దోపిడీని ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తుండటంతో సీఎం చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. ఏడాదిన్నరలోనే తమ పాలనపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోందని హడలిపోతున్నారు. అయినా, దోపిడీ విధానాలను ఆయన విడిచిపెట్టడంలేదు. అవినీతిని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలు, ఉద్యమకారులపై పోలీసులను ప్రయోగిస్తున్నారు. ఇలా ఏడాదిన్నరలోనే వేలాది అక్రమ కేసులు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఉమ్మడి విశాఖ జిల్లా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, రైతు సంఘం కార్యదర్శి ఎం. అప్పలరాజును లక్ష్యంగా చేసుకుంది. బల్క్‌డ్రగ్ పరిశ్రమ పేరిట రైతుల భూములను కొల్లగొట్టాలన్న టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్రను ప్రశ్నించడమే ఆయన చేసిన నేరం. బల్క్‌డ్రగ్ పార్క్ ముసుగులో భూదోపిడీ, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, గాజువాకలో సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో భూదోపిడీపై అప్పలరాజు నిలదీస్తుండడంతో చంద్రబాబు బెంబేలెత్తారు. ‘ఆయన సంగతి తేల్చండి’ అన్న ప్రభుత్వ పెద్దల హుకుంకు పోలీసులు యస్ బాస్ అన్నారు. అంతే.. ఏకంగా 2013 నుంచి పెండింగులోని కేసులను తిరగదోడి మరీ అప్పలరాజుపై ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపింది. జై జగన్ అన్నా అక్రమ కేసులు, వేధింపులు..ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకు పచ్చ ఖాకీల క్రౌర్యం కట్టలు తెంచుకుంటోంది. అక్రమంగా నిర్బంధించి నిబంధనలకు విరుద్ధంగా థర్డ్ డిగ్రీతో వేధిస్తోంది. నిజానికి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక వైఎస్సార్సీపీ శ్రేణులందరూ నీరుగారిపోతారని ప్రభుత్వ పెద్దలు భావించారు. కానీ, అందుకు విరుద్ధంగా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై వారు పోరుబాట పట్టారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా కదం తొక్కుతుండడం ప్రభుత్వ పెద్దలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వైఎస్సార్సీపీ శ్రేణులు, సోషల్ మీడియా కార్యకర్తలపై వెయ్యికిగా పైగా అక్రమ కేసులు పెట్టినా సరే అది వారిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. అక్రమ కేసులు పెడుతున్న కొద్దీ వారు రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఈనెల 21న వైఎస్సార్సీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాయి. ఆ వేడుకలు గ్రామీణ ప్రాంతాల్లో జాతరలను తలపించాయి. ఇదే ఉత్సాహం కొనసాగితే టీడీపీ కూటమి ప్రభుత్వం పుట్టి మునగడం ఖాయమని వారికి అర్ధమైంది. అంతే.. వైఎస్సార్సీపీ శ్రేణులపై సరికొత్త కుతంత్రానికి తెగించారు. జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదుచేశారు. స్వయంగా సీఎం చంద్రబాబు ఆ వేడుకలపై అక్కసు వెళ్లగక్కి వారిని ఏం చేయాలన్న దానిపై పోలీసులకు స్పష్టమైన సంకేతాలిచ్చారన్న ఆరోపణలున్నాయి. శ్రీ సత్యసాయి, అనంతపురం, ఉభయ గోదావరి.. ఇలా పలు జిల్లాల్లో పోలీసులు ఏకంగా 13 అక్రమ కేసులు నమోదుచేయడం ప్రభుత్వ అసహనానికి నిదర్శనం. వారికి అలా.. వీరిని ఇలా.. చంద్రబాబు ప్రభుత్వంలో ఇప్పటివరకు 265 మంది బాలికలు, యువతులు అత్యాచారానికి గురయ్యారు. 15 మంది యువతులను అత్యాచారంచేసి హత్య చేయడం అరాచకానికి పరాకాష్ట. టీడీపీ కార్యకర్తలు, జనసేన సానుభూతిపరులే నిందితులు. కర్నూలు జిల్లాలో బాలికను అత్యాచారం చేసి హత్యచేసిన ఉదంతం జరిగి ఏడాది దాటినా పోలీసులు ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించలేకపోయారు. బెడిసికొట్టిన ప్రభుత్వ కుట్ర.. తాజాగా.. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్త అజయ్ దేవ కొద్దిరోజుల క్రితం ఓ గర్భిణిని కాలితో తన్ని దాడికి పాల్పడ్డాడు. ఆ ఉదంతాన్నీ వైఎస్సార్సీపీ మీదకు నెట్టేందుకు పోలీసులు ఆపసోపాలు పడ్డారు. అజయ్ వైఎస్సార్సీపీ కార్యకర్త అంటూ ఎల్లో మీడియా కూడా దు్రష్పచారం చేసింది. కానీ, అజయ్ జనసేన కార్యకర్త అని.. అతనికి ఆ పార్టీ సభ్యత్వం కూడా ఉందని కుటుంబ సభ్యులే చెప్పడం, అందుకు తగిన ఆధారాలు కూడా బైటపడడంతో ప్రభుత్వ పెద్దలు, పోలీసుల కుట్ర బెడిసికొట్టింది.ఏపీ పోలీసుకు లాస్ట్ ర్యాంకు..ఇక రాష్ట్రంలో శాంతిభద్రతలను పూర్తిగా దిగజారిపోతున్నా పోలీసు శాఖ ఏమాత్రం పట్టించుకోవడంలేదు. కేంద్ర హోంశాఖ ఇటీవల విడుదల చేసిన ర్యాంకుల్లో ఏపీ పోలీసు దేశంలోనే అట్టడుగు స్థానానికి పడిపోయింది. ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నేర న్యాయ చట్టాలు బీఎన్ఎస్, బీఎన్ఎన్ఎస్ చట్టాల అమలులో ఏపీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని కేంద్ర హోంశాఖ కుండబద్దలు కొట్టింది. ఆ చట్టాలను పటిష్టంగా అమలుచేస్తే రెడ్‌బుక్ వేధింపులకు ఆస్కారం ఉండదు. అందుకే ఆ చట్టాలను పోలీసులు ఉల్లంఘిస్తున్నారు. ఫలితంగా.. శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది. ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్ర హోంశాఖే వెల్లడించింది.అమిత్ షా అసహనంఏపీ పోలీసు శాఖ అసమర్థతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కుండబద్దలు కొట్టారు. ఆపదలో ఉన్నవారు ఫిర్యాదుచేస్తే 25.50 నిమిషాల వరకు పోలీసులు స్పందించడంలేదని ఆయన స్వయంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. చండీఘడ్ పోలీసులు కేవలం ఐదు నిమిషాల్లోనే స్పందిస్తుంటే.. ఏపీ పోలీసులు మాత్రం 25.50 నిమిషాల వరకు మొద్దునిద్ర పోతున్నారని ఆయన అసహనం వ్యక్తంచేశారు. నిజానికి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాల్లో అయితే ఐదు నిమిషాల్లోనూ, పల్లె ప్రాంతాల్లో ఎనిమిది నిమిషాల్లోనే పోలీసులు బాధితుల వద్దకు చేరుకుని రక్షణ కల్పించేవారు. అందుకోసం పటిష్ట వ్యవస్థను ఏర్పాటుచేసింది. అయితే, ఏడాదిన్నరలోనే చంద్రబాబు ప్రభుత్వం ఏపీ పోలీసు శాఖను నిర్వీర్యం చేసింది. -
ముస్లిం మత పెద్ద ముఫ్తీ అబ్దుల్ వహాబ్ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: ముస్లిం మత పెద్ద ముఫ్తీ అబ్దుల్ వహాబ్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అ ట్వీట్లో ‘60 ఏళ్లకు పైగా ఇస్లాం ధర్మ ప్రచారానికి, విద్యకు అంకితమైన నెల్లూరుకు చెందిన ముఫ్తీ అబ్దుల్ వహాబ్ గారి మరణం ముస్లిం సమాజానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. 60 ఏళ్లకు పైగా ఇస్లాం ధర్మ ప్రచారానికి, విద్యకు అంకితమైన నెల్లూరుకు చెందిన ముఫ్తీ అబ్దుల్ వహాబ్ గారి మరణం ముస్లిం సమాజానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/LMV96K43Bl— YS Jagan Mohan Reddy (@ysjagan) December 28, 2025 -
ఏపీ హైకోర్టు సిబ్బందిని చావగొట్టిన సీఐకి బాబు సర్కార్ పోస్టింగ్
సాక్షి, విజయవాడ: హైకోర్టు చెప్పినా లెక్క చెయ్యని చంద్రబాబు ప్రభుత్వం.. హైకోర్టు సిబ్బందిని చావగొట్టిన సీఐకి పోస్టింగ్ ఇచ్చింది. మార్టూరు సీఐగా యార్లగడ్డ శ్రీనివాసరావుకు పోస్టింగ్ ఇచ్చింది. టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుని సీఐ యార్లగడ్డ శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు.గతంలో మంగళగిరి రూరల్ సీఐగా పనిచేసిన యార్లగడ్డ శ్రీనివాసరావు.. హైకోర్టు డ్రైవర్‌పై దాడి చేశాడు. అదే కేసులో గతంలో సీఐని ప్రభుత్వం వీఆర్‌కు పంపింది. సీఐపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. హైకోర్టు ఆదేశంతో సీఐపై కేసు నమోదైంది. అదే సీఐకి చంద్రబాబు ప్రభుత్వం సైలెంట్‌గా మళ్లీ పోస్టింగ్ ఇచ్చింది. సీఐకి పోస్టింగ్ ఇవ్వడంపై పోలీసు, హైకోర్టు వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. -
ఓర్వలేకే మా కార్యకర్తలపై అక్రమ కేసులు: తానేటి వనిత
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు కూటమి ప్రభుత్వం గుండెల్లో గుబులు రేపిందని.. అది చూసి ఓర్వలేక మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు దిగారని మాజీ మంత్రి తానేటి వనిత అన్నారు. ఆదివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ప్లెక్సీల మీద సినిమా డైలాగులు రాసినా కేసులు పెట్టారు. నల్లజర్లలో ఒక కార్యకర్తను నడిరోడ్డు మీద నడిపించారు. ఇలాంటి చర్యల ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వతలచుకున్నారు?’’ అంటూ వనిత ప్రశ్నించారు.‘‘రక్త తర్పణం చేసిన వారిని రాష్ట్ర బహిష్కరణ చేయాలని హోంమంత్రి అనిత అంటున్నారు. మరి బాలకృష్ణ సినిమా రిలీజ్ రోజు 20 పొట్టేళ్ల తలలు నరికి దండలు కడితే ఏం చేశారు?. ఆ రోజు జీవహింస, రాక్షస సంస్కృతి హోంమంత్రి అనితకు కనపడలేదా?. అసలు ఇలాంటి సంస్కృతిని తెచ్చిందే టీడీపీ. ఆ రోజే ఈ సంస్కృతిని ఎందుకు కట్టడి చేయలేదు?. మా వాళ్లపై పోలీసులతో ట్రీట్మెంట్ ఇప్పిస్తానని హోంమంత్రి ఎలా అంటారు?. థర్డ్ డిగ్రీ ప్రయోగించే అర్హత మీకు ఎవరిచ్చారు?. చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారం ఎవరు ఇచ్చారు?..నల్లజర్ల సెంటర్లో వైఎస్సార్సీపీ కార్యకర్తని నడిపిస్తారని టీటీపీ కార్యకర్తలు ముందుగానే పోస్టు చేశారు. చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీలకు టీడీపీ కార్యకర్తలు పొట్టేళ్ల రక్తంతో తర్పణం చేస్తుంటే హోంమంత్రికి కనపడలేదా?. జగన్‌ని దూషిస్తేనే మంత్రి పదవి ఉంటుందని హోంమంత్రి భావిస్తున్నారు. ఏపీలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు హోంమంత్రికి కనపడటం లేదు. రాజధాని రైతుల్లో కూడా తీవ్రమైన మార్పు వచ్చింది. తమను మోసం చేయటంపై రైతులు ప్రశ్నిస్తున్నారు..దాన్ని డైవర్షన్ చేసేందుకు జీవహింస అంటూ రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తల విధ్వంసంపై ఎందుకు కేసులు పెట్టడం లేదు?. కూటమి ప్రభుత్వం చేసే ప్రతి అక్రమ చర్యకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. జగన్‌పై నిత్యం విషం చిమ్మటమే పనిగా కూటమి నేతలు పెట్టుకున్నారు. వాస్తవాలేంటో ప్రజలకు తెలుసు. ఇలాంటి విష ప్రచారాలు ఆపి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం ఎంత వేధించినా కార్యకర్తలంతా ధైర్యంగా నిలబడాలి. డిజిటల్ బుక్ లో అవన్నీ నమోదు చేయండి. అధికారం లోకి వచ్చాక తగిన విధంగా చర్యలు తీసుకుందాం’’ అని తానేటి వనిత చెప్పారు. -
కమిటీల నియామకాలు నిర్మాణాత్మకంగా జరగాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కమిటీల నిర్మాణంపై నాయకులంతా సీరియస్‌గా దృష్టి పెట్టాలని.. ఇది ఒక స్పెషల్ డ్రైవ్‌లా ముందుకు తీసుకెళ్లాలని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఆదివారం(డిసెంబర్ 28) ఆయన వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ‘‘అందరూ ఫోకస్‌తో పనిచేయాలి. పార్టీ కార్యక్రమాలతో పాటు కమిటీల నిర్మాణం అనేది కూడా అత్యంత ప్రాధాన్యమైనదని వైఎస్ జగన్ ప్రత్యేకంగా చెప్పారు. కమిటీలలో నియామకాలు నిర్మాణాత్మకంగా జరగాలి, మొక్కుబడిగా ఉండకూడదని వైఎస్ జగన్ చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారంకల్లా కమిటీలన్నీ నియామకాలు పూర్తి అవ్వాలి. విలేజ్, వార్డు కమిటీలు త్వరగా పూర్తిచేయాలి, డేటా అంతా ఎలాంటి తప్పులు లేకుండా సరిగా ఉండాలి’’ అని ఆయన పేర్కొన్నారు.‘‘డేటా ప్రొఫైలింగ్ సరిగా ఉంటే మనకు భవిష్యత్‌లో అనేక ఉపయోగాలు ఉంటాయి. పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం జరుగుతుంది. దాదాపు 15 లక్షల మంది వైఎస్సార్సీపీ సైన్యానికి కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం నేరుగా అందేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ సోల్జర్స్‌ను రెడీ చేసే కార్యక్రమంలో భాగమే. ఇప్పటికే ప్రతి నియోజకవర్గం నుంచి డిజిటల్ మేనేజర్లు కూడా అందుబాటులో ఉన్నారు. కమిటీల నియామకంపై నాయకులకు అవసరమైన ఓరియెంటేషన్ కూడా ఇప్పటికే ఇస్తున్నాం...ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సైంటిఫిక్‌గా కమిటీల నియామకాలు పూర్తి అయ్యాయి. కడప పార్లమెంట్, వేమూరు, పుంగనూరు, మడకశిర ఇలా కొన్ని నియోజకవర్గాల్లో పైలెట్ ప్రాజెక్ట్ గా మైక్రో లెవల్ లో కూడా అన్ని కమిటీలు పూర్తయ్యాయి. కమిటీల నియామకంపై పార్టీ సీనియర్ నాయకులు కొందరితో టాస్క్ ఫోర్స్ టీమ్‌ను కూడా ఏర్పాటు చేశాం, వారంతా కూడా అవసరమైన సమావేశాలు నిర్వహించుకుని ఇది ఒక డ్రైవ్ లాగా చేయాలని నిర్ధేశించాం. కమిటీల నియామకాలు అన్నీ పక్కాగా జరిగితే ఏ ఎన్నికలు జరిగినా గెలుపు సులభతరమవుతుంది. పార్టీ అనుబంధ విభాగాల కమిటీలు పక్కగా ఉంటే పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా విజయవంతం చేయవచ్చు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)
-
పిడుగురాళ్ల పీఎస్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి, పల్నాడు జిల్లా: పిడుగురాళ్ల పీఎస్‌లో ఓ మహిళ చెయ్యి కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిడుగురాళ్ల టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ వెంకట్రావుతో పాటు తెలుగుదేశం నాయకులు సివిల్ సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ బాధితురాలు జ్యోతి ఆరోపిస్తున్నారు. సీఐతో పాటు టీడీపీ నాయకులు తన భర్తను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి బలవంతంగా రూ. 10 కోట్లు విలువచేసే ఆస్తులను రాయించుకున్నారని ఆమె తెలిపింది.ఆ ఆస్తులు సరిపోవని మరికొన్ని ఆస్తులు రాయించుకోవడానికి మమ్మల్ని వేధిస్తున్నారంటూ బాధితురాలు జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. పిడుగురాళ్ల టౌన్ సీఐ వెంకట్రావు 20 రోజుల క్రితం రాత్రి వేళ నన్ను, నా కుమార్తెని అర్ధరాత్రి 12 గంటల వరకు స్టేషన్లో నిర్భందించారు. సీఐ ఒక మహిళ అని చూడకుండా నన్ను చెప్పలేని భాషతో దూషించారు.నిన్న రాత్రి 9:00 సమయంలో మా ఇంటి నుంచి బలవంతంగా పోలీసులు నన్ను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. మరోసారి సీఐ వెంకటరావు చెప్పలేని భాషతో దుర్భాషలాడారు. నాకు భయం వేసి చెయ్యి కోసుకునే ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాను. సీఐ వెంకట్రావు మా కుటుంబాన్ని వేధిస్తున్నారు. మాకు ప్రాణహాని ఉంది.. దయచేసి మాకు న్యాయం చేయండి’’ అంటూ బాధితురాలు జ్యోతి వేడుకుంటోంది. -
కూటమి పాలనలో నిలువెత్తు నిర్లక్ష్యంలో ఆలయాలు: మల్లాది విష్టు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ఆలయాలు, దేవుళ్లను రాజకీయాల కోసం వాడుకుంటున్న కూటమి ప్రభుత్వ తీరుపై ప్రజలు చీదరించుకంటున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీలో అనేక అపచారాలు జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని మండిపడ్డారు.తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నా, రీల్స్ చేస్తున్నా, మద్యం, మాంసాహారం యథేచ్ఛగా కొండమీదకు తీసుకొస్తున్నా టీటీడీ బోర్డు ఏం చేస్తుందో అర్ధం కాని పరిస్థితి నెలకొందని, కూటమి పాలనలో టీటీడీ వ్యవస్థ పూర్తిగా నీరుగారి పోయిందని అన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలోని ఆలయాల నిర్వహణలో నిలువెత్తు నిర్లక్ష్యం చోటు చేసుకుందని.. భక్తులు దైవ దర్శనానికి వెళ్తే ప్రాణాలతో తిరిగొస్తామన్న నమ్మకం లేకుండా పోయిందని గుర్తు చేశారు.చంద్రబాబు హయాంలో ప్రతిసారి హిందుత్వం మీద దాడి జరగడం పరిపాటిగా మారిందని.. తిరుపతి, అన్నవరం,కాశీబుగ్గ క్షేత్రమేదైనా కూటమి పాలనలో వరుస అపచారాలు చోటుచేసుకుంటున్నా.. భక్తుల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మల్లాది విష్టు ఆక్షేపించారు. మరోవైపు రాష్ట్రంలో యధేచ్చగా గోవధ జరుగుతున్నా.. విశాఖ కేంద్రంగా భారీగా గోమాంసం నిల్వలు పట్టుబట్టినా కూటమి నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మల్లాది విష్ణు నిలదీశారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:తిరుమలలో వరుస అపచారాలు..తిరుమలలో అధికారులు, విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయింది. టీటీడీ పాలక మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ సభ్యుడు ఏకంగా మహాద్వారం గుండా వెళ్లాలని అక్కడున్న సిబ్బందితో గొడవపడి నానా రాద్ధాంతం చేశారు. మరోవైపు టీటీడీకి చెందిన గోశాల నిర్వహణ దారుణంగా మారింది. అక్కడ తొలిసారిగా దాదాపు 190 గోవులు మరణించడం అత్యంత బాధాకరం.అదే విషయాన్ని వైయస్సార్సీపీ నాయకులు ఎత్తి చూపితే.. వారి మీద తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేశారు. కానీ అదే టీటీడీ పాలకమండలి సమావేశంలో గోశాల నిర్వహణ కష్టంగా ఉందని చర్చించడం ద్వారా మేం చెప్పిన అంశం నిజమేనని రుజువైంది. మునుపెన్నడూ లేని విధంగా చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం టీటిడీని రాజకీయ విమర్శలకు వేదికగా దుర్వినియోగం చేస్తోంది.ఈ ఏడాది ఏప్రిల్ 12న వసంతోత్సవంలో భాగంగా అర్చక స్వాములు స్వామివారికి నైవేద్యం తీసుకెళ్తున్న సమయంలో స్వామివారి గేటు తాళాలు మూసివేయడంతో స్వామివారి నైవేద్య సమర్పణ 15 నిమిషాలు ఆలస్యమైంది. ఇది ఘోరమైన అపచారం. పాలకమండలి పాలనా, నిర్వహణ వైఫల్యానికి, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. అసలు తిరుమలలో వ్యవస్థ పని చేస్తుందా? లేదా? అన్న సందేహం కలిగేలా వ్యవహరిస్తూ కొంతమంది చెప్పులు వేసుకుంటూ వైకుంఠం క్యూ కాంప్లెక్ లోకి వెళ్తున్న ఘోర తప్పిదాలు జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వం హిందూధర్మ పరిరక్షణకు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం.దేవాలయాల్లో వరుస అపచారాలు..కూటమి ప్రభుత్వం తరహాలో వైయస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఏరోజూ ఇలా జరగలేదు. కానీ 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం నిత్యం దేవుళ్లని, హిందూ ధర్మాన్ని అడ్డుపెట్టుకుని దేవుడితో రాజకీయాలు చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నాయి. సాక్షాత్తూ సుప్రీంకోర్టు స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ వేదిక చేయెద్దని రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేసినా.. చంద్రబాబు ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు. టీటీడీకి సంబంధించిన వ్యవహారాలను సక్రమంగా నిర్వహించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం.. లడ్డూ తయారీ నెయ్యిలో లేని కల్తీ జరిగిందని సిట్ దర్యాప్తు వేసి.. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దాన్ని వాడుకుంటోంది.అదే విధంగా కాశీనాయన క్షేత్రంలో గోశాల, అన్నదాన సత్రం, భక్తుల విశ్రాంతి భవనాలను టైగర్ రిజర్వ్ జోన్ లో ఉందని.. అత్యంత అమానుషంగా బుల్డోజర్లతో కూలగొట్టారు. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారు. వైయస్.జగన్ హయాంలో అయితే ఇదే కాశీనాయన క్షేత్రానికి సంబంధించి అటవీ భూముల నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర అటవీ శాఖ మంత్రికి లేఖ రాశారు. కూటమి ప్రభుత్వానికి, వైయస్.జగన్ ప్రభుత్వానికి ఇదే తేడా.వైయస్. జగన్ హయాంలోనే పరకామణి కోసం అత్యాధునిక వసతులతో కొత్త భవనాన్ని నిర్మించారు. కాబట్టే పరకామణి చోరీ వ్యవహారం బయటపడింది. అయితే ఈ కేసులో మాజీ ఏవీఎస్ సతీష్ వేధింపులకు ఎవరు కారణం?, ప్రభుత్వ వేధింపులు కాదా? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దేవాలయాల నిర్వహణ అత్యంత అధ్వాధ్నాంగా తయారైంది. కేవలం టీటీడీ, కాశీనాయన క్షేత్రాల్లోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అలయాల్లోనూ ఇవే అపచారాలు జరుగుతూనే ఉన్నాయి. 01–05–2025న సింహాచలం దేవస్దానంలో గోడకూలి 7 మంది సజీవసమాధి అయితే దానికి ఎవరు బాధ్యత వహించారు? ఎవరి మీద చర్య తీసుకున్నారు? పర్వదినాన దర్శనానికి వచ్చిన భక్తులు ప్రభుత్వ చేతగానితనం, నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పేతే ఎవరు జవాబూదారీతనంరాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల్లో అసాంఘిక కార్యకలాపాలకు విపరీతంగా పెరిగిపోతున్నా.. పట్టించుకునే నాధుడు లేకుండా పోతుంది. కోడిగుడ్లు తినడం, మద్యపానం, పేకాట వంటివి అష్టాదశ శక్తిపీఠ శ్రీశైలంలో విపరీతంగా పెరిగిపోయాయి. పైగా కూటమి ఎమ్మెల్యే తప్పతాగి, స్వయంగా అటవీశాఖ సిబ్బంది మీద దాడులకు దిగడమేనా సనాతన ధర్మం. ఈ ఏడాది మే 18న శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం అద్దేపల్లిపేటలో కోదండరామాలయంలో ఘోర అపచారానికి పాల్పడ్డారు. కల్కి, బలరాముడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడి విగ్రహాలను ధ్వంసం చేసి పక్కన పడేశారు. నిందితులను ఇంతవరకు పట్టుకోలేదు, దాని మీద ఎలాంచి చర్యలు లేవు. ఈ ఏడాది నవంబరు 11న కాశీబుగ్గలో కార్తీక ఏకాదశి నాడు భక్తులు భారీగా వస్తారని తెలిసినా.. కనీస పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయలేదు. వేలాదిమంది భక్తులు దర్శనానికి రావడంతో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు. గుడికి వెళ్తే తిరిగిప్రాణాలతో వస్తామో? రామో? అన్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. అలాగనే పక్కనే ఉన్న శ్రీకూర్మంలో సరైన నిర్వహణ లేకపోవడం వల్ల... నక్షిత్ర తాబేళ్లు చనిపోతే కనీసం పోస్టుమార్టమ్ కూడా నిర్వహించకుండా ఈవో కార్యాలయం వెనుక వాటిని తగలబెట్టారు. ఇవన్నీ మీ పరిపాలనకు మచ్చుతునకలు.రామతీర్థంలో శ్రీరాముడి తల నరికిన వ్యక్తికి ప్రభుత్వ నిధుల నుంచి రూ.5 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఇచ్చారా? లేదా? ఈ రకమైన కార్యక్రమాలు చేస్తుంది. 2024–25 లో హిందూ ధర్మాన్ని కూటమి ప్రభుత్వం ఎంతటి దుస్థితికి దిగజార్చిందనడానికి ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే. తిరుపతిలో తొక్కిసలాటలో గతేడాది 6గురు చనిపోయారు. దానికి కారణమైన అధికారులను మరలా అదే స్ధానంలో నియమించారు. రెండు రోజుల క్రితం 24, 25 తేదీల్లో మరలా తొక్కిసలాట జరిగింది. మీకు అనుకూలంగా పని చేసే అధికారులు తప్పు చేసినా వారి మీద చర్యలు ఉండవన్నది స్పష్టమవుతోంది.సదావర్తి భూములను వేద పండితుల పోషణ కోసం ఇచ్చారు. అని అన్యాక్రాంతం కాకుండా వైయస్సార్సీపీ ప్రభుత్వం కాపాడింది. ఇవాళ కూటమి ప్రభుత్వంలో భక్తుల కానుకులు వేసిన హుండీలకు కూడా భద్రత లేదు. అహోబిలంలో రూ.20 లక్షలు భక్తులు వేసిన కానుకలని స్థానిక ఎమ్మెల్యే మనుషులు కైంకర్యం చేస్తే.. కనీసం కేసు కూడా పెట్టలేదు. దేవాలయాల్లో పెరిగిన రాజకీయ జోక్యానికి ఇదే నిదర్శనం. ఆలయాల్లో చొరబడి రాజకీయజోక్యంతో నాశనం చేస్తున్నారు.వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామిని చిన్నతిరుపతిగా పేరు గాంచింది. 19–11–2025న హుండీ లెక్కింపుల్లో వాసంశెట్టి శ్రీనివాసరావు... మంత్రి వాసంశెట్టి సుభాష్ సిఫారసుతో వచ్చి.. డబ్బులు దొంగతనం చేస్తే కేసు పైలు చేశారు. దీని మీద కూటమి నేతలు నోరు మెదపరు. ఇవన్నీ ఈ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అరాచకాలు.ఇవీ కూటమి ప్రభుత్వ ఘనతలు:కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలయాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు లేవు. వారి భద్రతకు చర్యలు తీసుకోకుండా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేవాదాయధర్మాదాయ శాఖ అధికారులు భక్తుల ప్రాణాలను గాల్లో వదిలేసింది. రాష్ట్రంలో వివిధ ఆలయాల నిర్వహణ కోసం, వేదపండితులు పోషణ కోసం దేవాలయాలకు భూములిస్తారు. అయితే ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఒక జీవో ప్రకారం ఆలయాల భూములను తమకు తూచినట్లు, టెండర్లు లేకుండానే తమకు నచ్చిన వారికి కట్టబెట్టే విధంగా జీవో జారీ చేసింది. ఇది ఏ మేరకు ధర్మం? వైఎస్ జగన్ హయాంలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూశారు. కానీ ఈ ప్రభుత్వం వాటిని దోచిపెట్టే పని చేస్తోంది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవస్థానం అయిన.. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో.. 70 వేల మంది భక్తులున్న ఆలయంలో 3 నుంచి 4 గంటల పాటు కరెంటు సరఫరా నిలిపివేసారంటే ఈ ప్రభుత్వ అసమర్థత ఏంటో అర్ధం అవుతుంది. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? దేవాదాయ, ధర్మాదాయ మరియు విద్యుత్ శాఖలకు మధ్య ఉన్న సమన్వయలోపానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వ అసమర్థ పాలనకు తార్కాణం. అనంతపురం సింగనమలలో పుట్ పాత్ మీద సిరి రమణ అనే ఒక అర్చకుడు ఆందోళనకు దిగాడు. 150 ఏళ్లుగా వంశపారపర్యంగా ఆలయ అర్చకత్వం చేస్తుంటే.. వారిని గుడి నుంచి గెంటేస్తే.. పోలీసులకు ఫిర్యాదు చేసినా, కలెక్టర్ కు అర్జీ ఇచ్చినా పట్టించుకోకపోవడం అత్యంత అమానుషం.ద్వారకా తిరుమలలో సైతం ప్రభుత్వ అసమర్థ నిర్వహణ వల్లే గోవులు చనిపోతే.. దాని మీద ఇంతవరకు చర్యలు లేవు. కూటమి పాలన వచ్చిన తర్వాత విశాఖపట్నం వేదికగా పెద్ద మొత్తంలో గోమాంసం విదేశాలకు ఎగుమతి అవుతుంది. హిందూ సమాజానికి జరుగుతున్న అతిపెద్ద ద్రోహం ఇది. బాపట్ల ఎమ్మెల్యే సన్నిహితుడు గోడౌన్ లో పట్టుబడినా చర్యలు శూన్యం. తూతూ మంత్రంగా ఇద్దరిని అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారు. కర్నూలులో లే అవుట్ కి అడ్డంగా ఉందని అలయ గోడ కూల్చి వేసిన ఘటన చోటు చేసుకుంది.ఇంకా టీడీపీ ఎమ్యెల్యే ఒకరు బహిరంగంగా భగవద్గీతను అవమానించారు. ఎన్టీఆర్ జిల్లా నారికంపాడులో ఆలయానికి చెందిన 28 ఎకరాలను 22–ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించమని హైకోర్టు ఆదేశిస్తే, మొత్తం 1036 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం జిల్లా రిజిస్టార్కు లేఖ రాసింది. అంటే కోర్టు ఆదేశాన్ని చూపి, మొత్తం భూమిపై కన్నేసి.. అలా ఆలయ ఆస్తుల రిజిస్టర్లో ఇనాం, ఎస్టేట్ భూములని చూపి, దాన్ని స్వాహా చేయడానికి కుట్ర చేశారు. ఆ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు రూ.1000 కోట్లు.వైఎస్ జగన్ హయాంలో దేవాదాయశాఖలో సంస్కరణలు:వైఎస్ జగన్ హయాంలో ఆలయాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. తిరుమలలో శ్రీవాణి పథకం ద్వారా భక్తులు దర్శనాలు చేసుకుంటే.. దానిపైనా విమర్శలు చేసి ఆనేక ఆరోపణలు చేశారు. ఆ పథకాన్ని ఎన్నికల ముందు రద్దు చేస్తామని ప్రకటించి.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్నే కొనసాగిస్తున్నారు. అంటే వీరు చేసినవన్నీ అబద్దపు ఆరోపణలనే తేలింది. మరోవైపు చంద్రబాబు హయాంలో గతంలో విజయవాడలో కూలగొట్టిన ఆలయాలన్నింటినీ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో తిరిగి నిర్మించారు. అసలైన హిందూ పరిరక్షకులు ఎవరన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. -
‘ఆవకాయ అమరావతి’ కార్యక్రమానికి షాక్
సాక్షి, విజయవాడ: ఆవకాయ అమరావతి కార్యక్రమానికి షాక్ తగిలింది. పున్నమి ఘాట్‌లో జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఆవకాయ అమరావతి కార్యక్రమం నిర్వహించడానికి సిద్ధమవ్వగా.. పున్నమి ఘాట్‌లోని ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ అడ్డం తిరిగారు. తమను సంప్రదించకుండా తమ ప్రైవేట్ భూముల్లో ఏ విధంగా కార్యక్రమం పెడతారంటూ యజమానులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎగ్జిబిషన్‌కు నోటీసులు ఇవ్వకుండా పడగొట్టడంపై మండిపడ్డారు.భవానీపురం పున్నమి ఘాట్ భూమి యజమానుల సంఘం నేతలు మాట్లాడుతూ.. పున్నమి ఘాట్‌లోని మా భూముల్లో ఎవరెవరో చొరబడుతున్నారు. పున్నమిఘాట్లో 20 ఎకరాల వరకు ప్రైవేటు పట్టా ల్యాండ్ ఉంది. మా భూమిని కాపాడుకోవడానికి గోడలు కట్టుకుంటున్నా కానీ కూల్చివేస్తున్నారు. మా భూములకు రక్షణ అవసరం. పుష్కరాలు సమయం నుంచి భూమిలిచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరిస్తున్నాం. మా భూములను ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చాం. అయినా మా సహనాన్ని పరీక్షిస్తున్నారు..మా హద్దులు వేసుకొని మా భూములను కాపాడుకుంటాం. ప్రభుత్వం కూడా సహకరించాలని కోరుతున్నాం. ఎగ్జిబిషన్‌కు అన్ని అనుమతులు ఉన్నాయి. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పడగొట్టేస్తారా?. ఏమైనా అంటే కలెక్టర్ ఆదేశాలంటున్నారు. ప్రైవేట్ స్థలాల్లో కూల్చివేతలకు ముందస్తు నోటీసులు ఇవ్వరా?. ఎవరికో మేలు చేసేలా రౌడీల్లా వ్యవహరిస్తే సహించం.కలెక్టర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. మా స్థలాలను వాడుకుంటున్నారు మాకు పరిష్కారం చూపించడం లేదు. 20 ఏళ్లుగా వాడుకుంటూ మాకు రూపాయి బిళ్ల ఇవ్వడం లేదు. ప్రైవేట్ ల్యాండ్స్ కార్యక్రమాలు పెడితే ఎలా?. ప్రభుత్వ కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తున్నాం కదా అని మా భూముల నుంచి మమ్మల్నే పంపేస్తారా?. ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం.. మాకు సహకరించకుంటే మేం సహకరించం. న్యాయపరంగా ఎదుర్కొంటాం.. మా భూముల పరిరక్షణకోసం అందరం ఏకమయ్యాం’’ అని ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ పేర్కొన్నారు. -
చలికి వణికి.. ప్రాణం విడిచి
మదనపల్లె రూరల్ : ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ వృద్ధురాలు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆస్పత్రి ఆవరణలో ఆరుబయట పడుకుని చలికి తాళలేక మృత్యువాత పడిన ఘటన శనివారం జరిగింది. తంబళ్లపల్లె మండలం బలకవారిపల్లెకు చెందిన వెంకటప్ప భార్య మల్లమ్మ(75)కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో చికిత్స కోసం శుక్రవారం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి వచ్చింది. లోనికి వెళ్లి వైద్యం చేయించుకునేందుకు శరీరం సహకరించకపోవడంతో ఓపీ బ్లాక్ సమీపంలో ఆరుబయట పడుకుంది. గమనించిన కొందరు వృద్ధురాలిని అత్యవసర విభాగంలోకి తీసుకెళ్లి చికిత్స చేయించారు. చేతికి క్యాన్లా అమర్చి సూదిమందు వేశారు. చికిత్స అనంతరం ఆమె ఇంటికి వెళ్లకుండా ఆస్పత్రిలోనే ఉండిపోయింది. రాత్రిపూట ఆస్పత్రిలో అడ్మిట్ రోగులను తప్ప మిగిలిన వారిని బయటకు పంపేయడంతో వృద్ధురాలు ఓపీ బ్లాక్ బయట స్లాబ్ కింద పడుకుంది. అయితే, రాత్రిపూట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయి చలిగాలులు, మంచు అధికం కావడంతో అనారోగ్యంతో బాధపడుతున్న మల్లమ్మ, తట్టుకోలేక వణుకుతూ ప్రాణాలు విడిచింది. చికిత్స కోసం వచ్చిన వృద్ధురాలు ఓపీ బ్లాక్ ఎదుట ఆరుబయట అందరికీ కనిపించే విధంగా పడుకుంటే, రాత్రిపూట విధుల్లో ఉన్న ఆస్పత్రి సిబ్బంది గమనించకపోవడం దారుణం. శనివారం ఉదయం వృద్ధురాలిని గమనించిన ఆస్పత్రి సిబ్బంది హుటాహుటిన అత్యవసర విభాగంలోకి తీసుకువెళ్లి డాక్టర్లతో పరీక్షలు చేయించగా, చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పట్టణంలోని బీకే.పల్లెలో నివాసం ఉంటున్న కుమార్తె మల్లీశ్వరి అంత్యక్రియల కోసం తల్లి మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తీసుకెళ్లింది. సెక్యూరిటీ, ఆస్పత్రి సిబ్బంది రాత్రిపూట ఓ వృద్ధురాలు ఆరుబయట పడుకున్నా గమనించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో వైద్యసేవలు అంతంతమాత్రంగానే ఉన్న తరుణంలో వచ్చిన ఒకటి అరా కేసులను నిర్లక్ష్యంగా వదిలేయడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా సూపరింటెండెంట్, ఆర్ఎంఓ పట్టించుకోవడం లేదంటూ ప్రజలు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. -
బాబూ.. సీఎం పోస్టు పీపీపీకి ఇచ్చేయండి: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: పేదల పట్ల చంద్రబాబు విధానం మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు, లోకేష్ ఏ మాత్రం సిగ్గు, ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. వైద్యరంగాన్ని వ్యాపారస్తుల చేతితో పెడితే వ్యాపారమే చేస్తారు అని మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రజల మనిషి.. చంద్రబాబు కార్పొరేట్ వ్యక్తుల మనిషి అని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. పీపీపీ వల్ల ప్రజలకు లాభమేంటో చంద్రబాబు చెప్పాలి. పీపీపీ, పీ-4 విధానాలతో బాగుపడిన వారు ఎవరైనా ఉన్నారా?. నాలుగో పీ అంటే పబ్లిక్ ప్రాపర్టీ ప్రైవేటు పరం. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించకుండానే ఎలా ప్రైవేటీకరిస్తారు?. వైద్యంపై ఇప్పుడు చెబుతున్న మాటలు ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు. చంద్రబాబు, లోకేష్ ఏ మాత్రం సిగ్గు, ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు.ఆసుపత్రుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి మందికిపైగా సంతకాలు చేశారు. మీ టీడీపీ, జనసేన నేతలు కూడా సంతకాలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చి దిద్దుతామని చెప్పి ఇదా మీరు చేసేది?. వైద్యరంగాన్ని వ్యాపారస్తుల చేతితో పెడితే వ్యాపారమే చేస్తారు. పేదల పట్ల చంద్రబాబు విధానం మారడం లేదు. ఆరోగ్యాన్ని, చదువును జగన్ బాధ్యతగా తీసుకున్నారు. వైద్య రంగాన్ని ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు వెంపర్లాడుతున్నారు. ఆసుపత్రుల ప్రైవేటీకరణతో ఎవరికి దోచిపెడతారు?. బాబూ.. నీ వాళ్లకు దోచిపెట్టాలి అనుకుంటే పీపీపీ కింద కొత్త కాలేజీలు పెట్టు. 17 మెడికల్ కాలేజీలు ఆరు కోట్ల ఏపీ ప్రజల ఆస్తి. 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి వైఎస్ జగన్ నిర్మాణం చేపట్టారు. 17 కాలేజీల్లో నాలుగు కాలేజీలను వైఎస్ జగన్ పూర్తి చేశారు.ఆరోగ్యశ్రీని చంద్రబాబు నాశనం చేశారు. ప్రజల హక్కుగా పొందాల్సిన వైద్యాన్ని దిగజార్చుతున్నారు. అన్నీ ప్రైవేటీకరిస్తే సీఎం పదవి ఎందుకు?. వైఎస్ జగన్ ప్రజల మనిషి.. చంద్రబాబు కార్పొరేట్ వ్యక్తుల మనిషి. ప్రశ్నిస్తానని ఓట్లు అడుక్కున్న పవన్ కల్యాణ్.. ఇంకా జగన్నే ప్రశ్నిస్తున్నారు. మెడికల్ కాలేజీలను తీసుకుని ఆ పాపం మోయకూడదు అనుకునే ఎవరూ తీసుకోవడం లేదు. మెడికల్ కాలేజీలకు టెండర్లు పిలిస్తే ఒక్కరు కూడా తీసుకుంటామని ముందుకు రావడం లేదు. ఆదోని మెడికల్ కాలేజీని కిమ్స్ తీసుకుంటుందని తప్పుడు ప్రచారం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రకటనను కిమ్స్ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలపై సిట్ వేస్తారు. అమరావతిలో వచ్చిన ప్రతీ టెండర్లో చంద్రబాబుకు నాలుగు శాతం కమీషన్ ఇస్తున్నారు. ప్రజల సొమ్మును హల్వా తింటున్నట్టు బాబు అండ్ కో తినేస్తున్నారు. అమరావతిలో చంద్రబాబు మాస్ దోపిడీ చేస్తున్నారు. అమరావతి అవినీతి సొమ్ముతో కడుపు నిండటం లేదా బాబూ?. దేశంలో ఎక్కడైనా 99 పైసలకు భూములు ఇస్తున్నారా?.. లేక తీసుకుంటున్నారా?. చంద్రబాబు తానా అనగానే ఎల్లో మీడియా తానా తందానా అంటుంది. తన ఆవేదన చెబుతూ అమరావతి రైతు రామారావు చనిపోయారు. అమరావతి రైతుని ఈడ్చుకు వెళ్లమని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అనలేదా?. రాజధానికి భూములు ఇచ్చిన రైతులంటే ఎందుకు అంత చిన్నచూపు?. కూటమి పార్టీల కార్యకర్తల అరాచకాలు రాష్ట్రంలో పెరిగి పోయాయి. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికార మందంతో విర్ర వీగుతున్నారు. రాజధాని రైతులపై పోలీసులను ఉసి గొల్పుతున్నారు. డబ్బు పిచ్చితో రాష్ట్రాన్ని చంద్రబాబు నాశనం చేస్తున్నారు. అమరావతి రైతులను రోడ్డు పాల్జేయవద్దు. కనకదుర్గమ్మ గుడికి బిల్ కట్టలేదని కరెంటు కట్ చేస్తారా?. బాలకృష్ణ అల్లుడి విద్యాసంస్థకు వందల కోట్ల బిల్ పెండింగ్ ఉన్నా కరెంటు ఎందుకు కట్ చేయలేదు?. కనకదుర్గమ్మ గుడికి కరెంటు బిల్ మాఫీ చేస్తే వచ్చే నష్టం ఏంటి?. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మెప్పు కోసం రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. పవన్ ఆటలో అరటిపండు లాంటి వాడు. అలాంటి వ్యక్తి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. -
రైల్వే చార్జీల పెంపుతో ప్రయాణికులకు షాక్!
అన్నమయ్య జిల్లా: ఉమ్మడి కడప జిల్లామీదుగా వెళ్లే ప్రధాన రైలుమార్గాల్లో నడిచే రైళ్లలో ప్రయాణం భారం కానుంది. కొత్త చార్జీలను రైల్వే ప్రకటించిన సంగతి తెలిసిందే. పెరుగుతున్న ఖర్చులను బ్యాలెన్స్ చేస్తూనే, ఎక్కువ మంది ప్రయాణికులకు రైల్వే సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు రైల్వేవర్గాల సమాచారం. జిల్లాలో మూడు రైలుమార్గాలు ఉన్నాయి. ముంబై–చెన్నై ప్రధాన రైలుమార్గం ఉండగా, ఎర్రగుంట్ల–నంద్యాల, ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైలుమార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల్లో అప్ అండ్ డౌన్ కలిసి 30కి పైగా రైళ్లు నడుస్తున్నాయి. 25 స్టేషన్లు ఉన్నాయి. ప్రధాన రైల్వే కేంద్రాలుగా కడప, నందలూరు, ఎర్రగుంట్ల కొనసాగుతున్నాయి. ఆర్డినరీ క్లాస్‌కు ఒక పైసా.. ఆర్డినరీ క్లాస్‌కు కిలోమీటర్‌కు ఒక పైసా పెంచారు. పైసా లేదు.. 99 పైసలు లేదు కాబట్టి రూపాయే పడుతుందని ప్రయాణికులు అంటున్నారు. కాగా లోకల్, స్వల్ప దూరప్రయాణాల టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఆర్డినరీ క్లాస్‌లో 215 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ప్రయాణించేవారికి ఎలాంటి చార్జీలు పెంచలేదు. అంతకంటే ఎక్కువదూరం వెళితే, ఆర్డినరీ క్లాస్ రైలు టికెట్ ధర కిలోమీటర్‌కు 1పైసా చొప్పున పెంచారు. మెయిల్/ఎక్స్‌ప్రెస్, ఏసీ, నాన్–ఏసీ రైళ్లలో కిలోమీటర్‌కు 2 పైసలు చొప్పున చార్జీలు పెంచింది. ఇక నాన్ ఏసీ ట్రైన్లో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వారు అదనంగా రూ.10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. రైలు ప్రయాణపు టికెట్ల విషయంలో రైల్వేశాఖ కొత్త చార్జీలను పెంచిన తరుణంలో ప్రయాణీకుల్లో ఆందోళన మొదలైంది. ఈ చార్జీలు డిసెంబరు 26 నుంచి అమలులోకి వచ్చాయి. జనరల్ బోగీలేవి.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దే శ వ్యాప్తంగా అన్ని రైళ్ల ఫారి్మసిన్లో జనరల్ కోచ్‌లు తగ్గించేశారనే అపవాదు పేదవర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు వాటి జాడ కనుక్కొనేందుకు ప్లాట్‌ఫాంపై ఊరుకులు, పరుగులు తీయాల్సి వస్తోంది. ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఒకొక్కసారి జనరల్ బోగీలోకి ఎక్కలేక స్లీపర్‌కోచ్‌లు ఎక్కి కొంతమంది టీసీల దురుసుతనంతో నెట్టివేతకు గురైన సంఘటనలు కొకొల్లలు. ఏసీ, స్లీపర్ కోచ్‌లే అధికం.. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ, స్లీపర్ కోచ్‌లే అధికంగా కనిపిస్తున్నాయి. ఈ ఏసీలో త్రీటైర్.. వివిధ శ్రేణుల కోచ్‌లు ఉంటాయి. ఫార్మసీన్‌లో ఒకటి లేదా రెండు ఉంటాయి. అవి కూడా కోచ్ పొజిషన్ బట్టి స్లీపర్, ఏసీ కోచ్ పెంచాల్సిన పరిస్థితి ఉంటుంది. లేడీస్‌కోచ్ ఉంటుంది. అటువంటప్పుడు సాధారణ ప్రయాణికులు రైలెక్కలాంటే వెనుకంజవేసే పరిస్ధితులున్నాయి. -
‘బాబుకు నో విజన్.. కేవలం రాజకీయ అవకాశవాదమే’
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజన్ లేదు.. కేవలం రాజకీయ అవకాశవాదమే ఉంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్. చంద్రబాబు పాలనలో దాడులు, దౌర్జన్యాలు తప్పా ఏమీ లేవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి శైలజానాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తప్పించుకున్నవాడు ధన్యుడు అన్నట్లు చంద్రబాబు హామీల అమలు నుంచి తప్పించుకుంటున్నారు. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగడాన్ని టీడీపీ కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్ జగన్ అభిమానులు మాంసం తినటమూ తప్పేనా?. పొట్టేళ్లు, కోళ్లు ఎలా తినాలో ప్రభుత్వం చెప్పాలా?. జంతు బలి చట్టాలను టీడీపీ కూటమి నేతలు తెలుసుకోవాలి. చంద్రబాబు పాలనలో దాడులు, దౌర్జన్యాలు తప్పా ఏమీ లేవు. వైఎస్ జగన్‌కు రోజు రోజుకూ ప్రజాదరణ పెరుగుతోంది. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఒకటి, రెండు చోట్ల ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీల వద్ద పొట్టేళ్లు కొడితే, అది పెద్ద నేరం అన్నట్లు.. రాష్ట్రంలో గతంలో ఎక్కడా అలా జంతు బలి జరగనట్లు మీరు (సీఎం చంద్రబాబు), మీ హోం మంత్రి మాట్లాడుతున్నారు. దాని వల్ల సమాజం నాశనమై పోతున్నట్లు నిందిస్తున్నారు. యువతను ప్రభావితం చేస్తున్నట్లు పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు. అలా చేసి హింసను ప్రేరేపిస్తున్నారు కాబట్టి, రాష్ట్ర బహిష్కరణ చేస్తామని అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. మరి జాతరలు, గ్రామోత్సవాల్లో కూడా జంతు బలులు సహజం. వాటిని కూడా తప్పు పడుతున్నారా? మొక్కుల కోసం జంతు బలి ఇచ్చిన వారిపైనా చర్యల తీసుకుంటారా? లేదా రాష్ట్రంలో జంతు బలులనే నిషేధిస్తారా?. వైఎస్ జగన్ ఫ్లెక్సీల వద్ద పొట్టేళ్ల బలిని అంతగా తప్పు పడుతున్న మీకు.. హిందూపురంలో మీ బావమరిది నందమూరి బాలకృష్ణ గెలుపు తర్వాత పదుల సంఖ్యలో పొట్టేళ్లు నరికి, వాటి తలకాయలతో ఆయన ఫ్లెక్సీకి దండ వేశారు. అది కనిపించడం లేదా బాబు?. ఇంకా 2023లో మీ (చంద్రబాబు) పుట్టినరోజు సందర్భంగా మీ పార్టీ కార్యకర్తలు పొట్టేళ్లు నరికి, రక్తంతో మీ ఫ్లెక్సీకి రక్త తర్పణం చేశారు. అంతెందుకు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున, అనేకచోట్ల మీ ఫ్లెక్సీలు పెట్టి, బహిరంగంగా పొట్టేళ్లు నరికి, ఆ రక్తాన్ని మీ ఫ్లెక్సీలకు తర్పణం చేశారు. అవన్నీ నిజం కాదా? మరి వాటికేం సమాధానం చెబుతారు?. కదిరి దగ్గర జనసేన కార్యకర్త ఇంట్లో చిన్న గలాటా జరిగితే, దాన్ని కూడా వైఎస్సార్సీపీకి అంటగట్టి బురదచల్లే ప్రయత్నం చేశారు. చివరకు ఆ యువకుడి సోదరి, పూర్తి వివరాలు స్వయంగా చెప్పింది.మెడికల్ కాలేజీలు, శాంతిభద్రతల వైఫల్యం కప్పిపుచ్చేందుకే..రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే.. శాంతిభద్రతలు ఛిద్రమవుతుంటే.. గంజాయి బ్యాచ్‌లు పెరుగుతూ పదులు, వందల కేజీల్లో గంజాయి దొరుకుంటే.. మీ నేతలు తప్పుడు పత్రాలతో దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుంటుంటే.. సగటు మనుషులు బిక్కుబిక్కుమంటూ పోలీసు స్టేషన్లకు వెళ్తుంటే.. ఎమ్మెల్యేలు చెప్పాలని వారు తిప్పి పంపిస్తుంటే ఇవన్నీ మీకు కనిపించడం లేదా? కేంద్ర హోంమంత్రి అమిత్ షా శాంతిభద్రతలపై మీకు లేఖ రాయలేదా? శాంతిభద్రతలే కాదు, ఏమీ లేదు ఇక్కడ.రాష్ట్రంలో పారిశ్రామికీకరణ లేదు. ఉద్యోగాలు లేవు. పెట్టుబడులు లేవు. ఆలయాలకు రక్షణ లేదు. అన్ని చోట్లా మీ పార్టీ దుర్మార్గమైన ఆలోచనలతో ప్రజల జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నారు. ఇవన్నీ కప్పి పుచ్చేందుకు ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇంకా, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిర్ణయిస్తే, మీరు చేస్తున్న అవినీతి, అక్రమ వ్యవహారం అర్థమై, ఎవరూ బిడ్ వేయలేదు. అందుకే ఒక్కటంటే ఒక్కటీ సరైన బిడ్ రాలేదు. జగన్మోహన్రెడ్డిపై నమ్మకంతోనే మెడికల్ కాలేజీల బిడ్లు వేయడానికి ఎవరూ రాలేదు. వీటన్నింటి నుంచి డైవర్షన్ కోసం, ఇప్పుడు ఫ్లెక్సీలు, రక్త తర్పణాలు అంటూ అనవసర రచ్చ చేస్తున్నారు.పోలీసులూ అది గుర్తు చేసుకోండి.. పోలీసు అధికారులకు కూడా చెబుతున్నాం. మీరు ఈ ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవడం తగదు. టీడీపీ ప్రభుత్వంపై ప్రమాణం చేసి మీరు ఉద్యోగాల్లోకి రాలేదు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉద్యోగాల్లోకి వచ్చారు. అనంతపురంలో రోడ్డు వేస్తుంటే టీడీపీ దిమ్మె కూలగొట్టారు. ఇక్కడ కాంట్రాక్టర్ మీ వాడు. అధికారులు మీ చెప్పుచేతల్లో ఉన్న వాళ్లు. జేసీబీ డ్రైవర్ కూడా మీవాడే. కానీ జనం మీద బలం చూపిస్తామంటే కుదరదు. పోలీసు శాఖ ఉన్నది న్యాయాన్ని రక్షించడం కోసం. ప్రజలకు రక్షణ కల్పించడం కోసం. అంతేకానీ, అధికార పార్టీ వారు చెప్పిందే చేయడం కోసం కాదు అని స్పష్టం చేశారు. -
రతన్ టాటా జయంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. రతన్ టాటాకు నివాళి అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘టాటా సంస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన 'భారతదేశ రత్నం' రతన్ టాటా. ఆయన దాతృత్వం, వారసత్వం మనందరికీ స్ఫూర్తి దాయకం’ అని పోస్టు చేశారు. Paying tributes to ‘Jewel of India' Shri Ratan Tata Ji on his birthday, whose entrepreneurship took Indian industry to a global level. His simplicity, philanthropy, and legacy continue to guide us. pic.twitter.com/BAskFec7iO— YS Jagan Mohan Reddy (@ysjagan) December 28, 2025 -
‘జనం చెప్పులతో కొట్టేలా ఉన్నారు’
పల్నాడు జిల్లా: సత్తెనపల్లిలోని తన వార్డులో తట్ట మట్టి వేయలేదని, ఒక చిన్న అభివృద్ధి పని కూడా చేయలేదని, వార్డులో ప్రజల వద్దకు వెళితే చెప్పుతో కొట్టేలా ఉన్నారని 16వ వార్డు టీడీపీ కౌన్సిలర్ కంభంపాటి అబ్రహాం ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ చల్లంచర్ల లక్ష్మీ తులసి అధ్యక్షతన శనివారం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరిగింది. 16వ వార్డు కౌన్సిలర్ కంభంపాటి అబ్రహాం మాట్లాడుతూ 16వ వార్డులో రెండు గోనలు ఏర్పాటు చేయాలని సంవత్సరం నుంచి అడుగుతున్నానని.. అదిగో, ఇదిగో అంటున్నారు తప్ప ఇంతవరకు కార్యరూపం దాల్చలేదన్నారు. వార్డులోకి వెళితే ఓ మహిళ సమస్యలపై నిలదీసి తనను చెప్పుతో కొడతానన్నదని, అది చెప్పుకోవాలంటేనే సిగ్గుచేటుగా ఉందన్నారు. తన వార్డులో ఆదివారం సాయంత్రం లోగా రెండు గోనలు ఏర్పాటు చేయకుంటే విలేకరులను పిలిచి ఎమ్మెల్యే కన్నా హయాంలో తమ వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదనేది బహిరంగంగా ప్రకటిస్తానని అల్టిమేటం జారీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పేరు చెబితే ప్రజలు చెప్పులు, చీపురులు తీసుకొని కొట్టేలా ఉన్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఆ సమయంలో 19వ వార్డు వైఎస్సార్ సీపీ తరఫున గెలిచి టీడీపీలోకి వెళ్లిన కౌన్సిలర్ అవ్వారు శ్రీనివాసరావు జోక్యం చేసుకొని రూ. 7 కోట్లతో ఎమ్మెల్యే కన్నా హయాంలో అభివృద్ధి పనులు జరిగాయంటూ చెప్పబోతుండగా... కంభంపాటి అబ్రహాం అడ్డుపడి ఆపవయ్యా.. అటు ఇటు మాట్లాడేవాళ్లు ఉండబట్టే పరిస్థితి ఇలా తయారైందన్నారు. మనకు రావాల్సిన గౌరవ వేతనాలే సరిగ్గా ఇవ్వడం లేదని, ఆరు నెలలుగా గౌరవవేతనాలు రావడంలేదని తనదైన శైలిలో ఆవేదన వ్యక్తపరుస్తూ మండి పడ్డారు. అంతేకాకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలని కౌన్సిలర్ అవ్వారు శ్రీనివాసరావుకు హితబోధ చేశాడు. కో–ఆప్షన్ మెంబర్ కొణతం స్వాతి, 24వ వార్డు కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్, 31వ వార్డు కౌన్సిలర్ తురకా మేరీగ్రేస్, 20వ వార్డు కౌన్సిలర్ కూకుట్ల లక్ష్మి తదితరులు తమతమ వార్డుల్లోని సమస్యలను ప్రస్తావించారు. అజెండాలోని అన్ని అంశాలను ఆమోదించారు. సమావేశంలో మున్సిపల్ డీఈ మధుసూధన్‌రావు, కౌన్సిలర్లు, కోప్షన్ మెంబర్లు, సెక్షన్ హెడ్లు, ఉన్నారు. -
10 నిమిషాల్లో 200 మంది పోలీసులను దించుతా..!
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్‌స్టేషన్ ముందు గంటపాటు హైడ్రామా నడిచింది. తన కొడుకుతోపాటు మరో ముగ్గురిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టారని శనివారం రాత్రి ఓ మహిళ రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలు నాగమణి తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం ఉదయం తాడేపల్లి ఎస్ఐ సాయి తమ ఇంటికి వచ్చి తన కుమారుడిని గంజాయి విక్రయిన్నాడనే ఆరోపణలతో స్టేషన్‌కు తీసుకెళ్తున్నామని చెప్పారన్నారు. ఆధార్ కార్డు, ఇతర ప్రూఫ్‌లు ఇస్తే పంపించేస్తామని నమ్మబలికారని తెలిపారు. అవన్నీ తీసుకున్నాక స్టేషన్లో కాకుండా పక్కన వేరే గదిలో పెట్టి చిత్ర హింసలకు గురిచేశారన్నారు. తమ కుమారుడు తేజ ముంతతోపాటు గాందీనగర్‌లో నివసించే దినేష్ ప్రేమ్‌చంద్, యర్రబాలెంలో నివాసం ఉండే పవన్‌లను కూడా ఇదే తరమాలో తీసుకొచ్చారని ఆరోపించారు. దీనిపై నిలదీస్తే అసభ్య పదజాలంతో తనను దూషించారని వాపోయారు. ఇంతలో ఒక నాయకుడు అటుగా రావడంతో సీఐ అరాచకాలను నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన కాళ్లు పట్టుకుని ఆమె బతిమిలాడారు. ఓ నాయకుడు ఆ మహిళను సీఐ వద్దకు తీసుకెళ్లగా అందరి సమక్షంలోనే ‘‘200 మంది పోలీసులను 10 నిమిషాల్లో దించుతాను. మర్యాదగా చెప్పింది చెయ్యి. కపట్రాల తిప్పలో నీలాంటి వాళ్లను ఎంతోమందిని చూశాను. ఎవరు ఏం చేస్తారో చూస్తాను’’ అంటూ పెద్దపెద్దగా మాట్లాడారు. విధులకు ఆటంకం కలిగించినట్లు ఆమెపై కేసు పెట్టండని సిబ్బందిని ఆదేశించారు. మరో మహిళ కూడా సీఐ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదంతా చూసి ఎస్ఐలు అవాక్కయ్యారు. సోమవారం అదుపులోకి తీసుకున్న వారిపై శనివారం ప్రకాషః్ నగర్ శ్మశానవాటిక వద్ద పట్టుకున్నట్లు కేసు నమోదు చేయడం ఏంటని, ఇది తమ తలకు చుట్టుకునేలా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సక్రమంగా ఉన్నతాధికారులు విచారణ చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. -
కొనసాగుతున్న కక్ష సాధింపు
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: అల్లు అర్జున్ కథా నాయకుడిగా నటించిన పుష్ప–2 సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడానికి ఆ హాలు నిర్వాహకులే కారణమని హైదరాబాద్ పోలీసులు తేల్చినా, అల్లు అర్జున్ను కేసులో ఏ11గా కొనసాగించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గత ఏడాది డిసెంబర్ 4న చోటుచేసుకున్న ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన పట్ల అల్లు అర్జున్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రేవతి మృతికి సంతాపం తెలిపారు. రేవతి భర్తకు ఆరి్థక సహాయం చేసి.. శ్రీతేజ చికిత్సకు అవసరమైన నిధులను సమకూర్చారు. ప్రజల్లో క్రేజ్ ఉన్న సినీ నటుడు సంధ్య థియేటర్‌కు వస్తున్న నేపథ్యంలో భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులది. వారు ముందుగానే తగిన భద్రత కలి్పంచి ఉంటే తొక్కిసలాటకు తావుండేదే కాదు. ఈ ఘటనలో అల్లు అర్జున్ బాధ్యతగా చేయాల్సిందంతా చేసినప్పటికీ, ఆయనపై చార్జ్‌షీట్ దాఖలు చేయడం సబబు కాదని, ఇది కక్ష పూరితమని సినీ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసిన చిక్కడపల్లి పోలీసులు రెండు రోజుల క్రితం నాంపల్లి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారిస్తూ మేనేజ్‌మెంట్‌తోపాటు మేనేజర్‌పైనా అభియోగాలు మోపారు. అల్లు అర్జున్, ఆయన బృందం, సంధ్య థియేటర్ యాజమాన్యంపై బీఎన్ఎస్ 105, 118 (1) రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల జాబితాలో మొత్తం 23 మంది ఉండగా.. అల్లు అర్జున్ 11వ నిందితుడిగా ఉన్నారు. ఆయనతోపాటు ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా 8 మంది బౌన్సర్లపైనా చార్జిషిట్ దాఖలైంది. ఈ కేసులో అల్లు అర్జున్ను పోలీసులు గత ఏడాది డిసెంబర్ 13న అరెస్టు చేశారు. కింది కోర్టు రిమాండ్ విధించగా, అదే రోజు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే విడుదలకు సంబంధించిన లాంఛనాలు పూర్తి కాకపోవడంతో ఆయన ఆ రోజు రాత్రి రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైల్లో ఉండాల్సి వచి్చంది. అక్కడొక న్యాయం.. ఇక్కడొక న్యాయం.. అల్లు అర్జున్ను ఏ–11గా చేర్చుతూ పోలీసులు చార్జిషిట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో తొక్కిసలాట ఘటనలకు బాధ్యుడైన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టాలని మేధావులు, సామాజిక వేత్తలు, ప్రజాస్వామ్యవాదులు ప్రశి్నస్తున్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ బాధ్యతగా చేయాల్సిందంతా చేసినప్పటికీ, ఆయనపై చార్జ్‌షీట్ దాఖలు చేయడం ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తోందని ప్రజా సంఘాల నేతలు చెబుతున్నారు. ‘ఆంధప్రదేశ్‌లో 2015 జూలై 14న రాజమండ్రిలో గోదావరి పుష్కరాలను నాటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆ సమయంలో తన ప్రచార కండూతితో ఒకేసారి భక్తులను ఘాట్‌లోకి వదలడంతో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు. 2022 డిసెంబర్ 28న టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు కందుకూరులో ఇరుకు సందుల్లో నిర్వహించిన రోడ్ షోలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించారు. 2023 జనవరి 1న గుంటూరులో చంద్రబాబు పాల్గొన్న సంక్రాంతి కానుక పంపిణీ సభలోనూ తొక్కిసలాట జరిగి ముగ్గురు మరణించారు. ఇలా పలు ఘటనల్లో తొక్కిసలాటతో పదుల సంఖ్యలో జనం చనిపోవడానికి చంద్రబాబే బాధ్యుడని స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి బాబుపై ఎన్ని కేసులు నమోదు చేయాలి? ఎన్ని చార్జిషిట్లు నమోదు చేయాలి?’ అని మేధావులు ప్రశ్నింస్తున్నారు. తెలంగాణలోని రేవంతరెడ్డి సర్కార్ తన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం అల్లు అర్జున్‌పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసు నమోదు చేసిందని స్పష్టం చేస్తున్నారు. రెండు పక్క పక్క రాష్ట్రాల్లో జరిగిన ఘటనల్లో ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం అంటూ విస్తుపోతున్నారు. -
రఘురామను రఫ్ఫాడిస్తున్న ఐపీఎస్
శకునం చెప్పే బల్లి కుడితిలో పడిపోవడం అంటే ఇదే మరి.. రాష్ట్ర.. జాతీయ రాజకీయాల గురించి.. చిత్రవిచిత్రమైన హావ భావాలతో మిమిక్రీ చేస్తూ ఎదుటివాళ్లను అవహేళన చేయడమే తన ఘనతగా చెప్పుకుంటూ వస్తున్నా ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఒక పోలీస్ అధికారి నోటికి చిక్కారు.గతంలో తనను ఇబ్బంది పెట్టారంటూ అప్పటి సీఐడీ చీఫ్.. డీజీపీ పీవీ సునీల్ కుమార్‌ను టార్గెట్ చేసిన రఘురామకృష్ణం రాజు సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారం కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆనాడు తన విషయంలో అప్రజాస్వామికంగా వ్యవహరించిన పీవీ సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేయాలంటూ రఘురామ పోస్టులు చేయడమే కాకుండా ప్రకటనలు కూడా చేస్తున్నారు. దీనిపై సునీల్ దీటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా సునీల్ కుమార్ రఫ్ఫాడిస్తున్నారు.రఘురామ పాత చరిత్రను తవ్వుతూ సోషల్ మీడియాలో పోస్టుల పరంపర కొనసాగించారు. ఇదే తరుణంలో రఘురామ గతంలో బ్యాంకులను మోసం చేసిన కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సునీల్ కుమార్ చేతిలో అస్త్రాలుగా మారాయి.. దీనిపై అయన ఏమని పోస్ట్ చేసారంటే..‘‘కె.రఘురామకృష్ణరాజు ఓ ‘420’.. మూడు బ్యాంక్‌ల నుంచి రూ.945 కోట్లు లూటీ చేశారు.. దీనిపై ఆయనపై సీబీఐ ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), నేరపూరిత కుట్రతోపాటు 120బీ (కుట్ర) కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. సుప్రీం కోర్టు ఆర్ఆర్ఆర్ని, ఆయన కుటుంబసభ్యులను అరెస్ట్ చేయడానికి మొన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి రాజధాని గా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో డిప్యుటీ స్పీకర్ హోదా లో రఘురామకృష్ణంరాజు అరెస్ట్ అయితే ఆది ఆయనకి కాదు రాష్ట్రం మొత్తానికి తలవంపులు. అమరావతి బ్రాండ్ దెబ్బ తింటుంది. పెట్టుబడి పెట్టేవాళ్ళు వెనక్కి పోతారు. ఇలాంటి గజదొంగను, చీటర్‌ని ఇంత పెద్ద పదవిలో ఎలా ఉంచారు అనే ప్రశ్న రాదా?..ఈ కేసు దర్యాప్తు ముగిసి, కోర్టులో విచారణ పూర్తి అయ్యి రఘురామకృష్ణ రాజు గారికి ఉప ముఖ్యమంత్రి పదవి సహా ఏ పదవి అయినా ఇవ్వండి. అభ్యంతరం లేదు. ఉప సభాపతి హోదాలో రఘురామకృష్ణ రాజు గారు అరెస్ట్ అయితే అది రాష్ట్రానికే అవమానం. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా ఆయన అరెస్ట్ అయితే ఆయన వరకే అది పరిమితం అవుతుంది. మీడియా వారికి కూడా విజ్ఞప్తి చేస్తుననా.. మీరు ప్రజల పక్షాన ఉండాలి. ఒక వ్యక్తి వైపు కాదు.. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట పౌరుడిగా నా బాధ్యత. 420 రఘురామ కృష్ణ రాజు గారి మీద ఇంకా అనేక అభియోగాలు ఉన్నాయి. ఆ రిపోర్టులు కూడా నా దగ్గర ఉన్నాయి. వాటిల్లో కూడా కొత్త కేసులు నమోదు అవుతాయి. అందుకోసం నేను సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్లు వేస్తాను. ఈ కేసులో 420 రఘురామకృష్ణ రాజు బయటపడటం జరగదు..అన్ని సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. పైగా దర్యాప్తు చేస్తున్నది సీబీఐ. ఒక 420 కోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర ఇమేజ్ను ఫణంగా పెట్టవద్దు. నేను చెప్పిన విషయాలు అసత్యం అయితే నా మీద చర్య తీసుకోండి. నేను సిద్ధం. నిజం కాబట్టి తక్షణం 420 రఘురామకృష్ణ రాజు గారిని అన్ని పదవుల నుండి తొలగించాలి. అమరావతి బ్రాండ్ ఇమేజ్ కోసం అమరావతి రైతులు 420 రఘురామకృష్ణ రాజు ని అన్ని పదవుల నుండి తొలగించేలా ఉద్యమం చేయాలి. జై అమరావతి.. జై స్వర్ణాంధ్రప్రదేశ్… జై భీమ్' అంటూ సునీల్ ఎదురుదాడి కొనసాగించారు.తనను సస్పెండ్ చేయడం న్యాయమైతే కోట్లకు బ్యాంకులను ముంచిన రాజును కూడా సస్పెండ్ చేయాలనీ.. ఇదే చేస్తే ఒక శాసన సభ డీప్యూటీ స్పీకర్ సస్పెన్షన్ అనేది రాష్ట్ర పరువుకు సంబంధించిన అంశం అని.. ఆయనను సస్పెండ్ చేస్తే దేశవ్యాప్తంగా రాష్ట్ర పరువు పోతుందని అవహేళన చేసారు. ఇదిలా ఉండగా సునీల్‌కు అంబేద్కర్ యువజన సంఘాలు.. దళిత సంఘాలు సైతం మద్దతు పలుకుతుండగా అటు రఘురామ మాత్రం కూటమి ప్రభుత్వంలో ఒంటరి అయ్యారు. ఆయనకు మద్దతుగా తెలుగుదేశం వాళ్ళు కానీ.. జనసేనావాళ్లు కానీ.. కనీసం బీజేపీ వాళ్ల కానీ ఒక్క ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో కూడా ఒక పోస్టు పెట్టలేదు. దీంతో సునీల్ కుమార్ నేరుగా రఘురామను టార్గెట్ చేసి ఆయన్ను, అయన కుటుంబాన్ని బ్యాంకుల దొంగగా సంభోదిస్తూ పరువు తీస్తున్నారు. దీనికి ఎదురు సమాధానం ఇవ్వలేక రఘురామ సైలెంట్ అయ్యారు.-సిమ్మాదిరప్పన్న -
సర్వం కల్తీమయం
ప్రస్తుత ఉరుకులు.. పరుగుల జీవనంలో అధిక శాతం మంది బయట లభించే ఆహారంపైనే ఆధారపడాల్సి వస్తోంది. నగరాల్లో ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న రెస్టారెంట్లు సైతం ప్రజలను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. అయితే ఏదో ఒకట్రెండు మినహా మిగిలిన అన్ని చోట్ల లభిస్తున్న ఫుడ్ క్వాలిటీపై ప్రశ్నలు తలెత్తు తున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో వంటల తయారీ.. ప్రమాదకర రసాయనాల వినియోగం ప్రజల ఆరో గ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా, తూతూమంత్రపు తనిఖీలకే అధికారులు పరిమితమవుతున్నారు.సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కొన్నేళ్ల క్రితం వరకు బయట ఆహారాన్ని ఎక్కువ మంది పెద్దగా తీసుకునేవారు కారు. సంపాదనలో తక్కువ ఖర్చు చేసి ఎక్కువ మొత్తాన్ని దాచుకునేవారు. ఇది ఆర్థికంగా, ఆరోగ్యపరంగానూ మంచి లక్షణంగా ఉండేది. అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ పార్టీ కల్చర్ వచ్చింది. పుట్టిన రోజు, వివాహ మహోత్సవం.. ఇలా సందర్భమేదైనా పారీ్టలివ్వడం పరిపాటిగా మారింది. ఇంటి భోజనం కంటే రెస్టారెంట్లకు వెళ్లేందుకు ఎక్కువ మంది ప్రాధాన్యమిస్తున్నారు. ఖరీదైన ఆహారాన్ని తింటున్నామనే భ్రమలో ఉంటున్నారే గానీ, ఇవి ఆరోగ్యకరమాననే అంశాన్ని తెలుసుకోలేకపోతున్నారు. నిల్వ ఉంచిన.. ప్రమాదకర రసాయనాలు కలిపిన ఫుడ్‌ను తింటున్నారు. వీటితో అప్పటికప్పుడు ఎలాంటి నష్టం లేకపోయినా, దీర్ఘకాలంలో ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. కేన్సర్ రోగుల్లో 53 శాతం మంది కల్తీ ఆహారంతోనే సమస్య తెచ్చుకున్నారని పలు సర్వేలు వెల్లడించడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. నిబంధనలు బేఖాతర్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చిన్నా, పెద్ద రెస్టారెంట్లు, ధాబాలు, చాట్, నూడిల్స్ షాపులు దాదాపు ఐదు వేలకుపైగా ఉంటాయి. ఒక్క నెల్లూరు నగరంలోనే వీటి సంఖ్య దాదాపు మూడు వేలు ఉంటుందని అంచనా. వీటి ద్వారా ఏటా రూ.కోట్లల్లో వ్యాపారం జరుగుతోంది. వాస్తవానికి ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి లైసెన్స్‌లను పొంది, నిబంధనల మేరకు ఫుడ్‌ను తయారు చేయాల్సి ఉంది. ఈ రూల్ 2006 నుంచి అమల్లో ఉంది. ఆ శాఖ పరిధిలో జిల్లా స్థాయి అధికారితో పాటు ఓ గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, మరో ఇద్దరు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లున్నారు. వీరు నెలకు 12 శాంపిళ్లను సేకరించాల్సి ఉంది. ఆపై వీటిని ప్రయోగశాలకు పంపి, పరిశీలన తర్వాత తేడా ఉంటే కేసులు నమోదు చేయాలి. కల్తీని బట్టి క్రిమినల్ లేదా సివిల్ కేసులు నమోదు చేసి జరిమానాలు విధించాలి. అయితే ఇంత పెద్ద జిల్లాలో కేవలం 12 శాంపిళ్లనే సేకరిస్తే, మిగిలిన వాటి పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు చెలరేగిపోతున్నారు. ఫలితంగా విచ్చలవిడిగా కల్తీ చేస్తున్నారు. అనుమతుల్లేకుండానే.. జిల్లాలో అనుమతి తీసుకొని వ్యాపారం చేసే సంస్థలు 25 శాతం కూడా ఉండవని తెలుస్తోంది. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్ల మినహా మిగిలిన చోట్ల పరిశుభ్రతను ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. నాసిరక ఆహార పదార్థాల వినియోగం.. రోజుల తరబడి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడం.. ఆపై వీటిని వేడి చేసి అంటగడుతున్నారు. పట్టణాల్లో మురుగు కాలువలు, చెత్త కుప్పల పక్కన ఫాస్ట్ఫుడ్స్ సెంటర్లు దర్శనమి స్తున్నా, ప్రశ్నించే వారే కరువవుతున్నారు. జరుగుతోందిలా..» మున్సిపల్ కుళాయిలు, బోరు నీటిని పాలల్లో కలుపుతున్నారు. చిక్కదనం కోసం నాసిరక పౌడర్లు, యూరియా, పిండి, నూనెను కలిపి విక్రయిస్తున్నారు. » టీ పొడిలో ఇనుప పొడి, రంపపు పొట్టును మిశ్రమంగా చేస్తున్నారు. దీని వల్ల ఊపిరితిత్తులు పాడైపోయే ప్రమాదం ఉంది. » పశువుల ఎముకలను సేకరించి వాటిని బట్టీల్లో అధిక ఉష్ణోగ్రతపై మరిగించి ద్రావణాన్ని తీస్తున్నారు. ఆపై సాధారణ నూనెల్లో కలిపి విక్రయిస్తున్నారు. వీటితో జీర్ణకోశ వ్యాధులొచ్చే అవకాశం ఉంది. » చికెన్, మటన్ బిర్యానీలు, తందూరి చికెన్‌లో ఆకట్టుకునేందుకు గాను హానికరమైన రంగులను వాడుతున్నారు. ప్రమాదాల్లో చనిపోయిన గొర్రెలు, పొట్టేళ్లు, మేకలతో పాటు అనారోగ్యానికి గురైన వాటిని వధించి వినియోగదారులకు విక్రయిస్తున్నారు. » నిషేధిత క్యాట్ ఫిష్‌లను సైతం చేపల విక్రయదారులు అమ్ముతున్నా, అడిగే నాథుడే లేరు. వీటిని చికెన్, మటన్ వ్యర్థాలతో చెరువుల్లో పెంచి పోషిస్తున్నారు. » మిరపకాయల్లో ఎరుపు రంగు రావడానికి సూడాన్ రంగులను వినియోగిస్తున్నారు. పసుపులో మెటానిల్ ఎల్లో అనే పదార్థాన్ని కలుపుతారు. వీటిని వంటలో వినియోగిస్తే కేన్సర్ సంబంధిత వ్యాధులొచ్చే ప్రమాదం ఉంది. » నూనెను మళ్లీ.. మళ్లీ కాస్తున్నారు. వీటి ద్వారా కేన్సర్, అల్సర్లొచ్చే ప్రమాదమున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదు. » చిన్న హోటళ్లు, కర్రీ పాయింట్లలో వేడి కూరలు, పప్పు, సాంబారు తదితర ఆహార పదార్థాలను పల్చటి పాలిథిన్ కవర్లలో వేసిస్తున్నారు. వేడికి కరిగి వీటిని తినే వారు అనారోగ్యానికి గురవుతున్నారు. » అల్లం, వెల్లుల్లి పేస్టులను సైతం అక్రమార్కులు కల్తీ చేస్తున్నారు. నిత్యం తనిఖీలు చేస్తున్నాంహోటళ్లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు, రెస్టారెంట్లు తదితరాల్లో తనిఖీలను నిత్యం చేస్తూనే ఉన్నాం. పలు హోటళ్లలో వంటల తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాల్లో నాణ్యత లేకపోగా.. చాలా వరకు కాలం చెల్లినవి, పాడైపోయినవి ఉంటున్నాయి. ఆహార పదార్థాలు ఆకర్షణీయంగా ఉండేందుకు రంగులు కలుపుతున్నారనే అంశాన్ని గుర్తించాం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 307 శాంపిళ్లను సేకరించి.. ఆరు కేసులపై కోర్టుకు నివేదించాం. జేసీ వద్ద 22 కేసులపై విచారణ జరిపి రూ.మూడు లక్షలు జరిమానాను విధించాం. కల్తీ ఆహారాన్ని విక్రయిస్తే చర్యలు తప్పవు. – వెంకటేశ్వరరావు, జిల్లా సహాయ ఆహార నియంత్రణాధికారి -
భారతీయులను వెనక్కి పంపేస్తున్నాయ్..
సాక్షి, అమరావతి: సరైన పత్రాలు లేకుండా విదేశాలకు వెళ్లిన అనేక మంది భారతీయులను పలు దేశాలు తిరిగి వెనక్కి పంపుతున్నాయి. 2025లో ప్రపంచవ్యాప్తంగా 24,600 మంది భారతీయులు ఇలా వెనక్కి వచ్చారు. భారతీయులను వెనక్కి పంపిన దేశాల్లో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉంది. ఒక్క సౌదీ అరేబియానే 11,000 మంది భారతీయులను సరైన పత్రాలు లేకపోవడం, వీసా గడువు తీరినా ఆ దేశంలో ఉండడం, కార్మిక చట్టాలు ఉల్లంఘించడం వంటి కారణాలతో వెనక్కి పంపేసింది. ఆ తర్వాతి స్థానంలో అమెరికా ఉంది. ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులను బయటకు పంపుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది అమెరికా నుంచి 3,800 మంది ఇలా వెనక్కి వచ్చేయగా అందులో ఒక్క వాషింగ్టన్ నుంచే 3,414 మంది, హోస్టన్ నుంచి 234 మంది ఉన్నట్లు కేంద్ర విదేశాంగమంత్రి తాజాగా రాజ్యసభకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారే అత్యధికం.. విదేశాలకు భవన నిర్మాణ పనులు చేయడానికి వెళ్తున్నవారిలో అత్యధికమంది ఏజెంట్ల చేతిలో మోసపోయినవారే. మయన్మార్ నుంచి 1,591, మలేíÙయా నుంచి 1,485, యూఏఈ నుంచి 1,469, బహ్రెయిన్ నుంచి 769 మంది వెనక్కి వచ్చారు. సరైన పత్రాలు లేకుండా ఆయా దేశాల్లోకి అడుగు పెట్టారంటూ వెనక్కి పంపించేశాయి. కేవలం ఉపాధి కోసం వెళ్లిన వారే కాకుండా విద్యార్థులు కూడా మోసపోయిన వారి జాబితాలో ఉన్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన వారిలో అత్యధికంగా 170 మందిని బ్రిటన్ వెనక్కి పంపింది. ఆ తర్వాత ఆ్రస్టేలియా 114 మందిని, రష్యా 82, అమెరికా 45 మంది విద్యార్థులను వెనక్కి పంపాయి. -
మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరమా?
డాబా గార్డెన్స్: ‘‘ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పేరిట అమ్మడం ప్రజలకు నష్టం చేకూరుస్తుంది. ప్రభుత్వాన్ని నడిపేవాడు అమ్ముడుపోయాడు. కళ్లముందే విశాఖ స్టీల్‌ప్లాంట్ వ్యాపారం (ప్రైవేటీకరణ) జరుగుతోంది. అమ్మేవాడు ఒకడు. కొనేవాడు ఒకడు’’ అని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో గతంలో 1,007 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రైవేట్‌కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ప్రజలంతా ఏకమై పోరాడి అడ్డుకున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఎవరిని బలపరచాలో వారు నేర్చుకోవాలని సూచించారు. విశాఖపట్నంలో సీఐటీయూ అఖిల భారత మహాసభల్లో భాగంగా శ్రామిక ఉత్సవ్ ప్రారంభానికి హాజరైన ఆయన శనివారం ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిదానంగా ప్రైవేట్‌పరం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లుగా విమానయాన రంగం పెద్దోళ్ల చేతుల్లో ఉందని, ప్రభుత్వాలు అమ్ముడుపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు ప్రజలు, కార్మికుల ఓపికను పరీక్షిస్తున్నారని అన్నారు. ప్రశ్నిoచే గొంతు నొక్కుతున్నారని, ఇలాంటి పరిస్థితులపై నిరంతరం పోరాటం చేయడమే మార్గమని సూచించారు. ప్రశ్నిoచేవారు ఉండకూడదని పాలకులు కోరుకుంటారని, ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడుతున్నారని అన్నారు. వందేళ్ల ఉత్సవాలు చేసుకుంటున్న ఆర్ఎస్ఎస్ నుంచి దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నవారు ఒక్కరూ లేరని, వారు చడ్డీల నుంచి ప్యాంట్లకు వచ్చారు తప్ప సాధించిందేమీ లేదని ప్రకాష్ రాజ్ ఎద్దేవా చేశారు. భారత దేశం సరోవరమైతే అందులో బ్రహ్మ రాక్షసుడు ఆర్ఎస్ఎస్ అని అన్నారు. శివాజీ వ్యాఖ్యలు అహంకార పూరితం సినీ నటుడు శివాజీ మహిళలపై మాటలు అహంకారంతో కూడినవని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్‌రాజ్ అన్నారు. విశాఖ విచ్చేసిన ఆయన ఓ హోటల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. వేదికలపై అభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు ఒళ్లు, భాష జాగ్రత్తగా పెట్టుకోవాలన్నారు. శివాజీ చెత్తగా మాట్లాడారు.. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఆడవాళ్లకు మగవాళ్ల నుంచే తరతరాలుగా అన్యాయం జరుగుతుందని.. మహిళలను కుసంస్కారంతో చూసేవాళ్లకు ఆడవాళ్ల అవయవాలు మాత్రమే కనిపిస్తాయన్నారు. నటి అనసూయపై గతంలో శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రకాష్‌రాజ్ తీవ్రంగా స్పందించారు. శివాజీ మాటలను తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని.. తన మద్దతు ఎప్పుడూ అనసూయకే ఉంటుందన్నారు. శివాజీ మాటలు చూస్తుంటే.. ఒక మహిళలో ఆయనకు కేవలం అవయవాలు మాత్రమే కనిపిస్తున్నట్లు ఉన్నాయని ఘాటుగా విమర్శించారు. -
న్యాయానికి గంతలు కట్టొచ్చేమో.. న్యాయమూర్తులకు కాదు
సాక్షి, అమరావతి: నివాస భవన నిర్మాణానికి అనుమతులు తీసుకుని.. తరువాత వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నా, అది నివాస భవనమేనంటూ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన పురపాలక కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేసు ఇది. న్యాయానికి గంతలు కట్టొచ్చేమో గానీ, న్యాయమూర్తులకు కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినందుకు గాను పశి్చమ గోదావరి జిల్లా, భీమవరం అప్పటి మునిసిపల్ కమిషనర్‌కు రూ.2.50 లక్షలను ఖర్చుల కింద విధించింది. ఈ ఖర్చులను సొంత జేబు నుంచి చెల్లించాలని ఆదేశించింది. అంతేకాక నివాస భవనం కోసం అనుమతి తీసుకుని వాణిజ్య భవనం నిర్మించిన ఆ భవన యజమానులు– మణి మంజరి, నరసింహారావుకి సైతం రూ.2.50 లక్షలు ఖర్చులు విధించింది. సింగిల్ జడ్జి విధించిన రూ.50 వేల ఖర్చులను ఈ మేరకు భారీగా పెంచింది. ఈ మొత్తాన్ని రెండు వారాల్లో హైకోర్టు రిజిస్ట్రార్ (జుడీషియల్) వద్ద జమ చేయాలని ఆదేశించింది. అనంతరం ఈ మొత్తాన్ని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మూగ, అంధుల సంక్షేమం కోసం వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఇటీవల ఒక అప్పీల్‌పై తీర్పును వెలువరించింది. కాగా, వాణిజ్య భవనం నిర్మించిన ప్రాంతం ఇప్పటికే వాణిజ్య ప్రాంతంగా అధికారికంగా మారడం, తమ భవనానికి యజమానులు వాణిజ్య అనుమతులు పొందడం వంటి కారణాల నేపథ్యంలో భవన అనుమతులను రద్దు చేయడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చిచెప్పింది. -
బలవంతపు భూసేకరణపై కన్నెర్ర
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘బలవంతపు భూసేకరణకు అంగీకరించం. రనే వే వద్దు.. భూసేకరణ వద్దు’ అంటూ ప్రకాశం జిల్లా మూలగుంటపాడు, కనుమళ్ల, కలికవాయ, సింగరాయకొండ ప్రజలు ఉద్యమబాట పట్టారు. జాతీయ రహదారిపై అత్యవసర సమయాల్లో విమానాలు దిగేలా ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికవాయ నుంచి కందుకూరు మధ్య సుమారు నాలుగు కిలోమీటర్ల మేర రన్‌వే ఏర్పాటు చేశారు. తాజాగా రన్‌వే విస్తరణకు భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కనీసం గ్రామసభలు కూడా నిర్వహించకుండా భూసేకరణ కోసం చర్యలు చేపట్టింది. బలవంతపు భూసేకరణపై నాలుగు గ్రామాల ప్రజలు కన్నెర్ర చేశారు. తమ అనుమతి లేకుండా భూముల్ని సేకరిస్తే అంగీకరించేది లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భవిష్యత్ కార్యాచరణకు ఉద్యమ కమిటీ తీర్మానం ఈ అంశంపై మూలగుంటపాడు, కనుమళ్ల, కలికవాయ, సింగరాయకొండ గ్రామాల ప్రజలు సింగరాయకొండలోని కాకతీయ కళ్యాణ మండపంలో శనివారం సమావేశమై ఉద్యమ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. తమ గ్రామాల్లోని భూముల్ని ఇచ్చేందుకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రకాశం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు జయంత్ బాబు మాట్లాడుతూ.. అభివృద్ధి పేరిట ప్రజలను తొక్కుకుంటూ వెళ్తామంటే ఉపేక్షించేది లేదన్నారు. జాతీయ రహదారిపై సుమారు 4 కిలోమీటర్ల దూరం రన్‌వే నిర్మించిన అధికారులు మధ్యలో అండర్‌పాస్ కానీ, సర్వీసు రోడ్డు కానీ నిర్మించలేదని ధ్వజమెత్తారు. అధికారుల చర్యలతో అప్పటి నుంచి ఇబ్బందులు పడుతూనే ఉన్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని, రన్‌వే నిర్మాణం అడ్డుకోవటానికి అండగా ఉంటామన్నారు. రైతు సంఘం నాయకుడు హనుమారెడ్డి మాట్లాడుతూ.. కరేడులో ఇండోసోల్ ప్రాజెక్టుకు వైఎస్సార్సీపీ హయాంలో 4 వేల ఎకరాల భూసేకరణ జరపాలని నిర్ణయించగా.. టీడీపీ నాయకులు ఆ ప్రాజెక్టు జగన్ బినామీ కంపెనీ అని ఆరోపించారని గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు 8 వేల ఎకరాల భూసేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారని, దీనిని బట్టి ఇది ఎవరి బినామీ కంపెనీ అని ప్రశ్నించారు. ఇది కేవలం అదానీ కంపెనీ అని, దానికి మద్దతుగా ప్రధాని మోదీ ఉన్నాడని ఆరోపించారు. సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నెబోయిన శ్రీనివాసులు మాట్లాడుతూ.. జనావాసాలు గల ప్రాంతంలో రన్‌వే నిర్మాణం ఆమోదయోగ్యం కాదని, వేరే ప్రాంతంలో నిర్మించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. గ్రామసభ జరగకుండా, గ్రామస్తుల సలహా తీసుకోకుండా భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయడం దారుణమన్నారు. గతంలో జాతీయ రహదారి నిర్మాణానికి భూసేకరణ జరిపారని, భూములిచ్చిన రైతులకు పూర్తిగా నగదు చెల్లించలేదని ఆరోపించారు. తిరిగి భూసేకరణ చేస్తామంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రన్‌వేకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో నరాల సుధాకర్, దొడ్డ కరుణాకరరెడ్డి, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిగురుపాటి శేషగిరి, సీఎంఎం నాయకుడు రాము, రైతు సంఘాల నాయకులు, నాలుగు గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు. -
ఎరువు.. ధరల దరువు
సాక్షి, అమరావతి: ఎరువుల ధరలు మోతమోగిస్తున్నాయి. అదునుకు యూరియా అందక అగచాట్లు పడుతున్న అన్నదాతలకు మిశ్రమ (కాంప్లెక్స్) ఎరువుల ధరల పెరుగుదల గోరుచుట్టుపై రోకలి పోటులా పరిణవిుంచింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులకు యూరియా, డీఏపీ ఎరువులు దొరకడం లేదు. వాటిని బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేస్తున్న అన్నదాతలకు తాజాగా కాంప్లెక్స్ ఎరువుల ధరలు సైతం పెరగడం భారంగా మారింది. గతేడాదితో పోలిస్తే కాంప్లెక్స్ ఎరువుల ధరలు బస్తాకు రూ.100 నుంచి రూ.500 వరకు పెరిగాయి. చైనా ఆంక్షల ఫలితంగా సూక్ష్మసేద్యంలో విరివిగా వినియోగించే వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ (ప్రత్యేక ఎరువుల) ధరలు 25నుంచి 50 శాతం మేర పెరిగాయి. 2023–24లో 50 కిలోల బస్తా రూ.1,250–1,450 మధ్య ఉన్న మిశ్రమ ఎరువుల ధరలు ప్రస్తుతం రూ.1,450 నుంచి రూ.1,950కు పెరిగాయి. రబీ సీజన్లో రూ.250 కోట్ల భారంసాధారణంగా రబీ సీజన్లో యూరియా, డీఏపీతో పాటు కాంప్లెక్స్ ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. యూరియా మినహా ఎన్పీకే ఎరువులపై పోషకాధారిత సబ్సిడీ పథకం కింద ఆరేళ్లకోసారి రాయితీ వాటాను కేంద్రం నిర్ణయిస్తుంది. కంపెనీలు ధరలు పెంచినప్పుడు ఆ మేరకు రాయితీ పెంచితే ఆ భారం రైతులపై పడదు. కానీ.. కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాయితీలు పెంచకపోవడంతో కంపెనీలు పెంచే భారం పూర్తిగా రైతులపై పడుతోంది. మరోవైపు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడిపదార్థాలపై 18 శాతంగా ఉన్న జీఎస్టీని ఇటీవలే 5 శాతానికి తగ్గించింది. ఆ మేరకు ఉత్పత్తి వ్యయం తగ్గింది. కానీ.. జీఎస్టీ ఫలాలను జేబుల్లో వేసుకుంటున్న కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల తయారీకి ఉపయోగించే ముడిసరకుల ధరలు పెరిగాయన్న సాకుతో ఏటా వీటి ధరలను పెంచేస్తుండటం రైతులకు పెనుభారంగా మారుతోంది. గతేడాది కాంప్లెక్స్ ఎరువులు 50 కేజీల బస్తాకు రూ.100–150 మేర పెరిగాయి. తాజాగా కంపెనీలు ఆ ధరలను మరోసారి పెంచేశాయి. ఫలితంగా ప్రస్తుత రబీ సీజన్లోనే ఎరువుల ధరల పెంపు భారం దాదాపు రూ.250 కోట్లకు పైగా రైతులపై పడుతుందని చెబుతున్నారు.ప్రత్యేక ఎరువులూ భారమేసూక్ష్మ సేద్యంలో ఉపయోగించే సూక్ష్మ (డ్రిప్) ఎరువులకు గడ్డుకాలం దాపురించింది. సూక్ష్మ సేద్యానికి ప్రధానంగా మోనో అమ్మోనియం ఫాస్పేట్ (ఎంఏపీ), మోనో పొటాషియం ఫాస్పేట్ (ఎంకేపీ), కాల్షియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, మైక్రో న్యూట్రియెంట్స్ వంటివి వినియోగిస్తారు. వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్గా పేర్కొనే వీటిని ప్రత్యేక ఎరువులని పిలుస్తారు. దేశీయంగా వీటి వినియోగం 2.5 లక్షల టన్నులు. వీటిలో 60–65 శాతం రబీలోనే వినియోగిస్తుంటారు. వీటిలో 80 శాతానికి పైగా చైనా నుంచే దిగుమతి అవుతాయి. ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంతో కంపెనీలు వీటి ధరలను 25 నుంచి 50 శాతం వరకు పెంచాయి. ప్రధానంగా కిలోకు ఎంఏపీ, ఎంకేపీ ఎరువుల ధరలు రూ.60–80, ఫె–ఈడీడీహెచ్ఏ (ఐరన్ చెలేట్) వంటి సూక్ష్మ ఎరువుల ధరలు రూ.220 నుంచి రూ.280కి, జెడ్ఎన్–ఏడీటీఏ అనే జింక్ ఎరువుల ధరలు రూ.130–170 మేర పెరిగాయి. ఏటా పెరుగుతున్న ఎరువుల భారం మోయలేక రైతులు గగ్గోలు పెడుతున్నారు.రైతుల ఆందోళనదాచేపల్లి: యూరియా కోసం గంటల తరబడి పడిగాపులుపడ్డ రైతులకు అవి దక్కకపోవటంతో శనివారం ఆందోళనకు దిగారు. పల్నాడు జిల్లా నడికుడి వ్యవసాయ మార్కెట్ యార్డు వద్దకు యూరియా కోసం రైతులు భారీగా తరలిరావడంతో సిబ్బంది కూపన్లు పంపిణీ చేశారు. ఒక్కో రైతుకు రెండు బస్తాల యూరియాతో పాటు రూ.266 విలువచేసే నానో యూరియా డబ్బా కూడా తీసుకోవాలని సిబ్బంది మెలిక పెట్టారు. నానో యూరియా డబ్బా తీసుకునేందుకు రైతులు అంగీకరించలేదు. దీంతో సిబ్బంది రైతులకు చెప్పాపెట్టకుండా తాళాలు వేసి వెళ్లిపోయారు. రైతులు మండల వ్యవసాయ శాఖాధికారి కంచర్ల వెంకటేష్‌కి జరిగిన విషయాన్ని వివరించారు. ఆయన సిబ్బందితో మాట్లాడి యూరియా బస్తాలు రైతులకు ఇవ్వాలని సూచించినా సిబ్బంది యార్డుకు రాకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. చివరకు.. ఏఓ సమక్షంలో యూరియా బస్తాలను రైతులకు పంపిణీ చేశారు. -
నెల్లూరు జిల్లాలోకి గూడూరు
సాక్షి, అమరావతి: ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. జిల్లాల పునర్విభజనపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గతంలో చేసిన ప్రతిపాదనలకు కొన్ని మార్పులు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్‌పై వచ్చిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. గత నెల 27న కొత్తగా మూడు జిల్లాలు, ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సహా వివిధ మార్పులపై ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయగా... వాటిపై రాష్ట్రవ్యాప్తంగా 927 అభ్యంతరాలు వచ్చాయని అధికారులు సీఎంకు వివరించారు. కాగా, సమావేశంలో రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయడంపై చర్చ జరిగింది. ప్రజల సూచనలకు అనుగుణంగా దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. విస్తీర్ణంలో పెద్దదైన ఆదోని మండలాన్ని రెండుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ బదులు అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. మునగపాకను అనకాపల్లి డివిజన్లో, అచ్యుతాపురంను అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్లో చేర్చాలని నిర్ణయించారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటుకానున్న పోలవరం జిల్లాను ప్రతిపాదించిన విధంగా మనుగడలోకి తీసుకురానున్నారు.మరికొన్ని మార్పులు ఇలా..శ్రీకాకుళం జిల్లాలోని నందిగం మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కలి డివిజన్‌కు, అనకాపల్లి జిల్లాలోని చీడికాడ మండలాన్ని నర్సీపట్నం డివిజన్ నుంచి అనకాపల్లి డివిజన్‌కు, కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్‌కు, అద్దంకి డివిజన్లోని అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, జె. పంగులూరు, కొరిశపాడు మండలాలను ప్రకాశం జిల్లాలోకి మార్పు.» కనిగిరి రెవెన్యూ డివిజన్లోని మర్రిపూడి, పొన్నలూరు మండలాలను కందుకూరు రెవెన్యూ డివిజన్‌లోకి చేర్చి ప్రకాశం జిల్లాలో విలీనం చేయాలి.» కందుకూరు డివిజన్లోని ఐదు మండలాలను ప్రకాశం జిల్లాకు మార్చాలి. కందుకూరు డివిజన్లోని మిగిలిన వరికుంటపాడు, కొండాపురం మండలాలను కావలి డివిజన్లో చేర్చాలి.» చిత్తూరు జిల్లా పలమనేరు డివిజన్లోని బంగారుపాళ్యం మండలాన్ని చిత్తూరుకు, చౌడేపల్లి, పుంగనూరును మదనపల్లి రెవెన్యూ డివిజన్‌కు మార్చాలి. సదుం, సోమలను మదనపల్లి జిల్లాలోని పీలేరు రెవెన్యూ డివిజన్లో చేర్చాలి.» శ్రీ సత్యసాయి జిల్లాలో కొత్తగా మడకశిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి. కదిరి డివిజన్లోని ఆమదగురు మండలం పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లో విలీనం. పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లోని గోరంట్ల పెనుకొండ డివిజన్లో చేర్పు. ఈ మార్పుచేర్పులతో ఈ నెల 31న తుది నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. -
దేవుడా.. ఇదేం విడ్డూరం!
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు టీటీడీ పిడుగులాంటి వార్తను విడుదల చేసింది. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో దివ్య దర్శనం, టైం స్లాట్ టోకెన్ల పంపిణీని ముందుగానే నిలిపి వేసింది. టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావొచ్చని ప్రకటించింది. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ తీసుకున్న నిర్ణయంపై భక్తులు మండిపడుతున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని డిసెంబర్ 30వ తేదీ నుంచి పది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. టీటీడీ తాజా నిర్ణయంతో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం అందని ద్రాక్షలా మారింది. ఆన్లైన్ ద్వారా మాత్రమే వైకుంఠ ద్వార దర్శన టికెట్లు ఇవ్వడం ద్వారా గ్రామీణ, చదువుకోని భక్తులకు స్వామి వారి దర్శనాన్ని దూరం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా లక్కుంటేనే వైకుంఠ ద్వార దర్శనం అంటూ ఆన్ లైన్ లక్కీ డిప్ విధానం అమలు చేయటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువులకు అత్యంత పవిత్రమైన ధనుర్మాసంలో భక్తులు ఆలయాలకు వెళ్లటం ఆనవాయితీ. ముఖ్యంగా కలియుగ వైకుంఠంలో కొలువైన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశ నలు మూలల నుంచి భక్తులు వస్తుంటారు. అలా వచ్చే వారిలో టోకెన్లు కలిగిన వారు, లేని వారూ ఉంటారు. ఆన్లైన్లో దర్శన టికెట్లు పొందలేని భక్తులు తిరుపతిలో టైం స్లాట్ టోకెన్లు తీసుకుని స్వామి వారి దర్శనానికి వెళుతుంటారు.ఆ 3 రోజులూ తిరుమలకు రావొద్దుడిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, డిసెంబర్ 31న ద్వాదశి, జనవరి 1వ తేదీల్లో సామాన్య భక్తులు వెళ్లే సర్వ దర్శనం టోకెన్ల పంపిణీ నిలిపి వేసినట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఆ మూడు రోజుల్లో కేవలం ఆన్లైన్లో లక్కీ డిప్ ద్వారా టికెట్లు పొందిన వారిని మాత్రమే సర్వ దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. లక్కీ డిప్ టికెట్ లేని భక్తులు ఈ మూడు రోజులు తిరుమల దర్శనానికి రావద్దని ప్రచారం చేస్తోంది. జనవరి 2 నుంచి 8 వరకు ఆఫ్‌లైన్‌లో సర్వ దర్శనం కోసం అనుమతిస్తామని ఓ ప్రకటనలో వెల్లడించింది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు, నడక మార్గంలో వచ్చే భక్తులను ఉద్దేశించి సోషల్ మీడియా, దినపత్రికల్లో టీటీడీ ప్రకటనలు సైతం ఇచ్చింది. అదే విధంగా గోవింద మాల ధరించిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండవని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. మాల ధరించిన భక్తులు కూడా సర్వ దర్శనం ఆన్ లైన్ టికెట్లు ఉంటేనే అనుమతి ఇస్తామని చెబుతున్నారు. ఈ విషయం ఏపీ, తెలంగాణా, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని భక్తులకు కూడా తెలిసేలా విస్తృత ప్రచారం చేస్తున్నామని టీటీడీ ఈఓ తెలిపారు.నిర్వహణ చేతకాకేనా?గత వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో టోకెన్ల కోసం తొక్కిసలాట కారణంగా ఆరుగురు భక్తులు ప్రాణాలు కొల్పోగా, దాదాపు 40 మందికి పైగా భక్తులు గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో టీటీడీ తమ చేతికి మట్టి అంటకుండా అన్ని టికెట్లను ఆన్లైన్లో ఉంచి చేతులు దులుపుకుందని, నిర్వహణ చేతకాకే ఇలాంటి నిర్ణయం తీసుకుందని భక్తులు విమర్శిస్తున్నారు. టీటీడీ తాజా నిర్ణయం కారణంగా తొలి మూడు రోజులు సామాన్య భక్తులు వైకుంఠ ద్వార దర్శనాలకు దూరం అయ్యారు. లక్కీ డిప్ పేరుతో టీటీడీ పాలక మండలి భక్తుల మనోభావాలతో ఆడుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనాల్లో భాగంగా మొదటి మూడు రోజుల తర్వాత మిగిలిన ఏడు రోజుల్లో శ్రీవారి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తామని చెబుతున్నారు.స్థానికుల పైనా వివక్ష!చంద్రబాబు పాలనలో డిప్ సిస్టమ్ ఏర్పాటు చేసి తమను శ్రీవారి దర్శనానికి దూరం చేశారని స్థానికులు, స్థానికేతరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో సుమారు 8 లక్షల మంది జనాభా ఉంటే.. కేవలం 15 వేల టికెట్లు ఇచ్చి చేతులు దులుపుకోవటం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ ఆంక్షలు విధించి టికెట్లు ఇవ్వక పోవటంపై భక్తులు మండిపడుతున్నారు. వైకుంఠ ద్వారా దర్శనాల నేపథ్యంలో ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ దర్శనాలను టీటీడీ రద్దు చేసినట్లు ప్రకటించింది. అయితే టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఎవరికి వారు కుటుంబాలతో సహా వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైకుంఠ ఏకాదశి సమయంలో తిరుపతిలో భారీ ఏర్పాట్లు చేసి, నేరుగా భక్తులకు టోకెన్లు పంపిణీ చేశారు. క్యూలైన్లో వచ్చిన వారు వచ్చినట్లు టోకెన్లు తీసుకుని వెళ్లేవారు. స్థానికులతో పాటు అలా ఎంతో మందికి శ్రీవారి దర్శన అవకాశం కలిగింది. -
మృత్యువులోనూ వీడని స్నేహం
భీమడోలు: ఆ యువకులు ముగ్గురూ మంచి స్నేహితులు.. ముగ్గురూ కలిసి శుభకార్యాలకు ఫ్లవర్ డెకరేషన్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పనిలో భాగంగా ముగ్గురూ కలిసే వెళ్తారు. శనివారం తెల్లవారుజామున డెకరేషన్ పుష్పాల కోసం వెళ్లి బైక్‌పై తిరిగి వస్తున్న వారిని ఏలూరు జిల్లా భీమడోలు వద్ద జాతీయ రహదారిపై ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఏలూరు నుంచి పొలసానిపల్లి వైపుగా ముగ్గురు యువకులు కలిసి వెళ్తుండగా వీరి బైక్ భీమడోలు వద్ద ప్రమాదానికి గురై ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. వీరిలో ద్వారకాతిరుమల మండలం తిమ్మపురానికి చెందిన మాండ్రోజు చరణ్‌కుమార్ (26), ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన సయ్యద్ రఫీ (22), కొయ్యగర శ్రీరాములు అలియాస్ బన్నీ (21) ఉన్నారు. ఘటనాస్థలంలో నెత్తుటి మడుగులో ఉన్న బిడ్డలను చూసి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్ఐ ఎస్కే మదీనా బాషా ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.దట్టమైన పొగమంచే కారణమా ?ద్వారకాతిరుమలలో ఆదివారం జరిగే ఓ ఫంక్షన్‌కు డెకరేషన్ కోసం పువ్వుల కొనుగోలుకు చరణ్‌కుమార్ తన తమ్ముడి కొత్త బైక్‌పై రఫీ, బన్నీతో కలిసి శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్లాడు. ఏలూరులో ఫ్లవర్స్ ఆర్డర్ ఇచ్చి తిరిగి వస్తున్న వీరు భీమడోలు ఫ్లైఓవర్ సమీపంలో చనిపోయారు. దట్టమైన పొగమంచు కురుస్తుండడం కూడా ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భీమడోలు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


