breaking news
Politics
-
ఎవరూ రచ్చకెక్కొద్దు!
సాక్షి, న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌లో, ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఏఐసీసీ వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యంగా మంత్రుల స్థాయిలోనే విభేదాలు రచ్చ కెక్కడంపై పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణు గోపాల్ రాష్ట్ర నేతలకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. పార్టీలో అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను బహిరంగ వేదికలు, మీడియా ముందు మాట్లాడటాన్ని కేసీ తప్పుపట్టినట్లు తెలిసింది. డీసీసీ అధ్యక్ష నియా మకాల అంశంపై చర్చించేందుకు శనివారం ఢిల్లీకి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్లు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కేసీ వేణుగోపాల్‌తో చర్చించారు. ఈ సందర్భంగా ఇటీవల పలువురు రాష్ట్ర మంత్రులు, నేతల మధ్య పొడచూపిన విభేదాలపై ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే, వివాదాలను పరిష్కరించే దిశగా తీసుకున్న చర్యలను ఆయనకు రాష్ట్ర నేతలు వివరించారు. సమస్యలపై అంతర్గతంగా చర్చించుకోవా లని, రచ్చకెక్కవద్దని నేతలకు కేసీ ఈ సందర్భంగా సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్లపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్లపై నవంబర్ 3న హైకోర్టులో విచారణ ఉన్నందున ఆ తర్వాత మరోసారి ఈ అంశంపై చర్చించాలని నిర్ణయించినట్లు సమాచారం.పక్షం రోజుల్లో కొత్త డీసీసీలుపార్టీ సంస్థాగత నిర్మాణంలో ప్రధానపాత్ర పోషించే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలను పక్షం రోజుల్లో పూర్తి చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా పరిశీలకుల నుంచి అందిన నివేదికలు, స్థానిక సమీకరణలు, నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ సమర్ధులైన వ్యక్తులను అధ్యక్షులుగా నియమించాలని నిర్ణయించారు. ముందునుంచీ చెబుతున్నట్లుగా పార్టీ పదవుల్లోనూ 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ, మహిళలకు ప్రాధాన్యమిస్తూ అన్ని వర్గాలవారికి న్యాయం చేయాలని భావిస్తోంది. మీనాక్షి నటరాజన్, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాధన్‌లతో కేసీ వేణుగోపాల్ ఇందిరాభవన్‌లో శనివారం సమావేశమై రెండు గంటలపాటు చర్చించారు. రాష్ట్ర పరిశీలకుల నుంచి వచ్చిన పేర్లను ముందుపెట్టుకొని జిల్లాలవారీగా నేతల నుంచి విడివిడిగా అభిప్రాయాలను సేకరించారు. కచ్చితంగా ఒక ఓసీ, ఒక బీసీ..ఈ భేటీలో ప్రధానంగా జిల్లాలవారీగా పరిశీలనకు వచ్చిన ముగ్గురు అభ్యర్థుల పేర్లపై అభిప్రాయాలను సేకరించినట్లు తెలిసింది. ప్రతి ముగ్గురు పేర్లలో ఒక ఓసీ, ఒక బీసీ ఉన్నారని చెబుతున్నారు. జిల్లాల్లో ఉండే కుల సమీకరణలు, అభ్యర్థి బలాబలాలు, పార్టీపై ఉన్న నిబద్ధతను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థిత్వాలపై చర్చించారు. కొన్ని జిల్లాల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల బంధువులు, మిత్రుల పేర్లు రాగా వాటిని పక్కనపెట్టారని, మరికొన్ని జిల్లాల్లో పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్తగా చేరినవారి పేర్లను ప్రత్యేకంగా గుర్తించి జాబితా నుంచి తొలగించారని తెలుస్తోంది. ఇప్పటికే అధ్యక్ష పదవుల్లో ఉన్నవారిని సైతం జాబితాల నుంచి తొలగించి మిగతా పేర్లపైనే ఎక్కువగా చర్చలు జరిగినట్లు తెలిసింది. అభిప్రాయాల సేకరణ ప్రక్రియ పూర్తయిన దృష్ట్యా, ఇందులో 42 శాతం బీసీలు ఉండేలా హైకమాండ్ తన తదుపరి చర్చలు కొనసాగించనుంది. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ఓసీ, ఒక బీసీ అధ్యక్షుడు ఉండేలా అభిప్రాయాలు వచ్చినట్లు తెలిసింది. ఈ లెక్కన కచ్చితంగా 9 మంది రెడ్లు, 13–14 మంది బీసీలకు అవకాశం దక్కుతుందని చెబుతున్నారు.డీసీసీలకు మరింత స్వేచ్ఛపార్టీ దీర్ఘకాలిక సంస్కరణల్లో భాగంగా జిల్లా యూనిట్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. నియోజకవర్గ అభ్యర్థులు మొదలు, పార్టీ, ప్రభుత్వ నియామకాల్లో వారి సూచనల మేరకే పదవుల పంపకాలు, జిల్లా స్థాయి సమస్యలపై పోరాటాలు చేసే స్వేచ్ఛ వారికి ఇచ్చే దిశగా ఈ భేటీలో సమాలోచనలు జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సంస్థాగత ఎన్నికల నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు డీసీసీలే జవాబుదారీగా ఉండాలని, వారి అభిప్రాయం మేరకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పార్టీ విధానాల రూపకల్పన ఉండేలా భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ‘కేసీతో సంస్థాగత వివరాలపై చర్చించాం. అడిగిన వివరాలు అందించాం. సలహాలు, సంప్రదింపులు జరిపాం’అని తెలిపారు. అయితే, ఎప్పటిలోగా డీసీసీలను ప్రకటిస్తారన్నది మాత్రం చెప్పలేదు. 15 రోజుల్లోగా డీసీసీలను ప్రకటించాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
YSRCPలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు.. పార్టీ జాతీయ అధికార ప్రతినిధులుగా మాజీ ఎంపీ మార్గాని భరత్ (రాజమండ్రి), యల్లాప్రగడ కార్తీక్ (మండపేట)లను నియమించారు.కాగా, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా నియమించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌కు ఒక ప్రెసిడెంట్‌ను నియమించారు. జోన్–1కి.. విశాఖ జిల్లాకు చెందిన చెన్నా జానకిరామ్ నియమితులయ్యారు. జోన్–2కి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన విప్పర్తి వేణుగోపాల్ నియమితులయ్యారు. జోన్ –3కి ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నట్ట యోనారాజు నియమితులయ్యారు.జోన్-4కి తిరుపతి జిల్లాకు చెందిన నల్లని బాబు నియమితులయ్యారు. జోన్ –5కి వైఎస్సార్ జిల్లాకు చెందిన పులి సునీల్‌కుమార్ నియమితులయ్యారు. అలాగే కాకినాడ జిల్లాకు చెందిన ఎ.లక్ష్మీశివకుమారిని వైఎస్సార్సీపీ రాష్ట్ర అంగన్వాడీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా(జోన్ –2కు)గా, తిరుపతి జిల్లాకు చెందిన ఎస్.రామచంద్రారెడ్డిని రాష్ట్ర ఐటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–4)గా, తిరుపతి జిల్లాకు చెందిన దువ్వూరు మునిశేఖర్‌రెడ్డిని రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–4)గా నియమించారు.పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లుగా విశాఖ జిల్లాకు చెందిన ద్రోణంరాజు శ్రీవత్సవ(జోన్ –1), కాకినాడ జిల్లాకు చెందిన తోట రాంజీ(జోన్–2), ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎ.రవిచంద్ర(జోన్–3), చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి(జోన్–4), అనంతపురం జిల్లాకు చెందిన వై.ప్రణయ్‌రెడ్డి(జోన్–5) నియమితులయ్యారు. ఎనీ్టఆర్ జిల్లాకు చెందిన వి.ఈశ్వర్‌ప్రసాద్‌ను రాష్ట్ర వాణిజ్య విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–3)గా నియమించారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. -
దగా చేయడమేనా చంద్రబాబు విజనరీ?: జూపూడి
సాక్షి, తాడేపల్లి: సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని, రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు బాటలోనే మంత్రులు పయనిస్తున్నారని, ప్రజల గురించి ఆలోచించడం మానేసి తమ జేబులు నింపుకునే కార్యక్రమంలో వారు బిజీగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒకవైపు శాంతిభద్రతలు నిర్వీర్యమయ్యాయి.. మరో వైపు ప్రజారోగ్యం పడకేసింది, ఇంకోవైపు ప్రకృతి వైఫరీత్యాలతో రైతులు కుదేలవుతున్నారని, అయినా కూడా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా అనిపించడం లేదని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..రాష్ట్రంలో ప్రభుత్వం అనేది కుప్పకూలిపోయింది. మోస్ట్ సీనియర్ అంటూ డబ్బాలు కొట్టుకునే చంద్రబాబు అత్యంత దారుణమైన, దుర్మార్గ పాలన సాగిస్తున్నాడు. సమకాలీన రాజకీయాల్లో ఇంతటి దరిద్రమైన పరిపాలనను ప్రజలెవ్వరూ చూసి ఉండరు. ఈ ప్రభుత్వంలో జనానికి జ్వరాలు వస్తే నేనేం చేయాలని ఒక మంత్రి అంటారు, లా అండర్ ఆర్డర్ లేదంటే.. మరొక మంత్రి నేనేమైనా లాఠీ పట్టుకోవాలా? తుపాకీ పట్టుకోవాలా? అని మండిపడతారు. అన్ని సమస్యలూ మా శాఖలోనే వచ్చేశాయి, మేమే చేయలేకపోతున్నామని మరొక మంత్రి అంటాడు.డబ్బుల్లేవు... మేం మెడికల్ కాలేజీలు ఎలా కట్టాలి? అని మరొక మంత్రి మాట్లాడతాడు. మంత్రులే ఇలా మాట్లాడితే ఇక ప్రజల సమస్యలను కింది స్థాయిలో పట్టించుకునే వారు ఎవరూ? ఎవరికైనా బాధ్యత అనేది ఉందా? మంత్రులు ఇలా మాట్లాడుతున్నారంటే.. ఇవి వారి మాటలుగా మనం చూడాల్సిన అవసరంలేదు. ఆయా సందర్భాల్లో ముఖ్యమంత్రి ఇంటర్నెల్‌గా ఏం మాట్లాడుతున్నాడో… ఆ మాటలే వీరి నోటినుంచి కూడా వస్తున్నాయి. ఇలా వ్యవస్థలను చంద్రబాబు పూర్తిగా గాలికి వదిలేశారు.వ్యవస్థలను సర్వ నాశనం చేశారుఒక వైపు పీహెచ్సీ డాక్టర్ల ఆందోళనతో గ్రామస్థాయిలో వైద్య సేవలు కుటుంపడ్డాయి. మరోవైపు ఆరోగ్య శ్రీ బకాయిలతో, నెట్వర్క్ ఆసుపత్రులు వైద్యసేవలు నిలిపివేయడంతో పేదరోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. లక్షల మంది ప్రాణాలతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ఇంకోవైపు ఆస్పత్రుల్లో దూదికి కూడా దిక్కు లేకుండా పోయింది. మరోవైపు విలేజ్ క్లినిక్స్‌ను నిర్వీర్యం చేశారు. ప్రజలకు అత్యంత అవసరమైన ఒక్క ఆరోగ్య రంగంలోనే ప్రస్తుతం ఇన్నిరకాల సమస్యలు ఉన్నాయి. వీటిని సత్వరం పరిష్కరించాల్సిన మంత్రి ఎదురుదాడి చేస్తున్నాడు. హేళనగా మాట్లాడుతున్నాడు. రాజకీయం చేస్తున్నాడు. కాని ప్రజలకు వైద్య సేవలను అందించడంలో మాత్రం శ్రద్ధచూడంలేదు. మరి ఇలాంటి వాళ్లు మంత్రులుగా ఉండడానికి అర్హులా? మంత్రికి పట్టదు, ముఖ్యమంత్రికి పట్టదు. మరి ఎవరికి పడతాయి ఈ సమస్యలు? దీన్ని పరిపాలన అంటామా? దీన్ని ప్రభుత్వం అంటామా? లేక వల్లకాడు అంటామా? పౌరుల ప్రాణాలు రక్షించలేని ఈ ప్రభుత్వాన్ని ఏమంటారు? అలాంటి పనికిమాలిన ప్రభుత్వంగా మార్చిన ముఖ్యమంత్రిని, ఆయన మంత్రులను ఏమంటారు?రాష్ట్రంలో అరాచకాలకు రెడ్‌బుక్ రాజ్యాంగంతో దన్నురెడ్ బుక్ రాజ్యాంగం పేరు చెప్పి… పొలిటికల్ గవర్నెన్స్ పేరు చెప్పి, వీధికో రౌడీని, అరాచకవాదిని తయారు చేశారు. మొన్న తునిలో ఘటన చూసినా.. మరో చోట చూసినా.. దీనికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్సే. ఇందులో ఎవరో ఒకర్ని పట్టుకుని, లేపేసి, ఖబడ్దార్ అంటూ ప్రచారంచేసుకుని, చేతులు దులుపుకుంటున్నారు. మరి మిగతా వారి సంగతి ఏంటి? లా అండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వహించలేని ఈ ప్రభుత్వాన్ని ఏమంటారు? ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా నడుస్తున్న పేకాట శిబిరాలు, సివిల్ పంచాయతీలపై డిప్యూటీ సీఎం నేరుగా డీజీపీకి కంప్లైంట్ చేశాడు. అంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో దీనికి నిదర్శనం.పైగా ఈ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తమ ప్రాంతంలో పేకాట సర్వసాధారణమే అంటూ సమర్థించుకోవడాన్ని ఏమనుకోవాలి? ఈ రాష్ట్రంలో పేకాట క్లబ్బులు, లిక్కర్ షాపుల అభివృద్ధి తప్ప మరేమీ జరగలేదు. నేరుగా మీ ప్రభుత్వంలో ఉన్న ఒక డిప్యూటీ సీఎం పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి, వాటిని అడ్డుకోలేకపోతున్నారని ఏకంగా డీజీపీకి ఫిర్యాదు చేస్తే.. సీఎంగా చంద్రబాబు తల ఎక్కడపెట్టుకోవాలి? ఇదేనా గవర్నెన్స్ అంటే? మీ అక్రమాలపై మీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారుమరోవైపు తిరువూరులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఏకంగా ఎంపీ కేశినేని చిన్ని అక్రమంగా మైనింగ్ చేస్తున్నాడని, ఇసుక ఎత్తుకు పోతున్నారని, డబ్బులు పంచి కౌన్సిలర్లను కొనుగోలు చేశారని ఏకంగా పెద్ద అవినీతి బాగోతం బయటపెట్టారు. తన అసెంబ్లీ సీటు కోసం కోట్ల రూపాయలు ఇచ్చానంటూ సాక్ష్యాలు చూపించాడు. ఇంత బాగోతం బయటపెట్టినా… ప్రభుత్వం ఏమీ జరగనట్టు ఉంది. మరి అంతటి అవినీతి ప్రభుత్వ కొనసాగాల్సిన అవసరం ఉందా? వీళ్లు పరిపాలించడానికి అర్హులేనా?విదేశాల్లో జల్సాలు... ప్రజా సమస్యలు గాలికి..రాష్ట్ర ముఖ్యమంత్రి విమాన మెక్కి దుబాయ్ పోతారు. మరొక షాడో సీఎం నారా లోకష్ విమానమెక్కి సూటు, బూటు వేసుకుని ఆస్ట్రేలియాలో తిరుగుతాడు. ఇంకొకరు డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఎక్కడున్నాడో తెలియదు. ఆయన సినిమాలు ఆయనవి. సీఎం, డిఫ్యాక్టో సీఎంలు వారంలో రెండు రోజులు కనిపించరు. ఇక డిప్యూటీ సీఎం అయితే వారంలో రెండు రోజులుకూడా విజయవాడలో ఉండేది కష్టమే. ఒకవేళ ఉన్నా.. ఉదయం వచ్చి.. మళ్లీ సాయంత్రానికల్లా జంప్. ఇదేనా ప్రభుత్వాన్ని నడిపేతీరు. ఇదేనా పరిపాలన. అసలు ప్రజలంటే మీకు గౌరవం ఉదా? ప్రజాసమస్యల పట్ల ఏ మాత్రం అయినా బాధ్యత ఉందా?భారీ వర్షాలపై వ్యవసాయశాఖను అప్రమత్తం చేసే పరిస్థితే లేదుభారీ వర్షాల వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్ సీజన్ చివరది దశకు వచ్చిన వరి దెబ్బతింది. పత్తిరైతులు నిండా మునిగారు. ఉల్లిరైతులు ఏడుస్తున్నారు. ఇలా ప్రతి చోటా ఇవే ఇబ్బందులు. రబీ సీజన్‌కు విత్తన సరఫరాపై ఇప్పటివరకూ ఉలుకూ పలుకూ లేదు. మరోవైపు ప్రతివారం అల్పపీడనమో, వాయుగుండమో వస్తోంది, ఇంకోవైపు తుపాను రాబోతోంది. ఇలాంటి అత్యంత ముఖ్యమైన అంశాల్లో ప్రభుత్వం ఏంచేస్తోంది? అసలు వ్యవసాయశాఖ మంత్రి పనిచేస్తున్నారా?లంచాల కోసం మధ్యవర్తిత్వం చేయలేదని, తన కింది అధికారులను బదిలీచేయడం మినహా చేసింది ఏముంది? జనాభాలో 60 శాతం మంది ఆధారపడి ఉన్న ఈ రంగం మీద ప్రభుత్వానికి సీరియస్‌నెస్ లేదంటే, అసలు వ్యవసాయం తన బాధ్యత కాదన్నట్టుగా చంద్రబాబు, ఆయన మంత్రులు బిహేవ్ చేస్తుంటే.. ఇక కిందనున్న అధికారులు ఏం పనిచేస్తారు? ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని గట్టెక్కించడానికి మీరేం చేస్తారు?రైతులను నిలువునా దగా చేయడమేనా చంద్రబాబు విజనరీ?చంద్రబాబు తానేదో పెద్ద విజనరీనంటూ, రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తానని చెప్పుకుంటూ గతంలో మేం అమలు చేసిన అన్ని విధానాలన్నింటినీ ఆపేశారు. ఉచిత పంటల బీమా రద్దుచేశారు. ఆర్బీకేలు నిర్వీర్యం చేశారు. సున్నా వడ్డీ పంటరుణాలు నిలిపేశారు. ఆయన కొత్తగా ఏమీ చేయడం లేదు సరికదా… సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా రైతుల గొంతు కోశారు. వందలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.ఇవన్నీ ప్రభుత్వంచేసిన హత్యలే. ఏరోజైనా ఏ రైతు కుటుంబాన్నానైనా పరామర్శించారా? ఒక్క రూపాయి పరిహారం ఇచ్చారా? అసలు మీది ప్రభుత్వమేనా? ఫీజురియింబర్స్‌మెంట్ లేదు, వసతి దీవెన లేదు. ఫీజులు కట్టుకోలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో పిల్లలు అంటు రోగాలతో చనిపోతున్నారు. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లే పిల్లల సంఖ్య 5 లక్షల తగ్గింది. ఇన్న సమస్యలు పెట్టుకుని, ప్రజలకు అండగా ఉండాల్సిందిపోయి, వారిని ఆదుకోవాల్సింది పోయి.. ఇంత దారుణంగా పరిపాలన చేస్తారా?రాష్ట్రంలో ఎనీటైం మద్యంకర్నూలు బస్సు దగ్ధం ఘటనకు కారణమైన బైక్ ను నడిపిన యువకుడు ప్రమాదానికి ముందు ఆ ప్రాంతంలోని బెల్ట్ షాప్‌లో అర్థరాత్రి మద్యం సేవించి, బైక్ నడపడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అర్థరాత్రి వరకు బెల్ట్‌షాప్‌ల్లో మద్యం విక్రయాలు జరుపుతుండటం వల్ల నేడు ఒక భయంకరమైన ప్రమాదానికి కారణమైందనే ప్రశ్నలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తెలుగుదేశం నాయకులే నకిలీ మద్యాన్ని తయారు చేసి, గ్రామ గ్రామానికి బెల్ట్‌షాప్‌లకు సప్లై చేస్తున్నారు. నకిలీ మద్యం గుప్పిట్లో అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఏపీలో ఏ సమయంలో అయినా మద్యం లభించే పరిస్థితిని కల్పించారు. -
బిహార్ ఎన్నికల్లో హాట్‌టాపిక్!
'ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు' - పాపులర్ సినిమా డైలాగ్. ముందు 60 సీట్లు అన్నాడు, తర్వాత 30కి దిగాడు. చివరకు 15తోనే సరిపెట్టుకున్నాడు. అందుకే ఇప్పుడు బిహార్‌లో ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన పేరు ముకేష్ సహానీ. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) వ్యవస్థాపకుడు. మహాగఠ్‌బంధన్ (మహా కూటమి) ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి. ప్రస్తుతం బిహార్ పాలిటిక్స్‌లో (Bihar Politics) హాట్‌టాపిక్‌గా మారారు. అంతగా ఆయన గురించి మాట్లాడుకోవాల్సి ఏముంది అనుకుంటున్నారా? చాలానే ఉంది!ముకేష్ సహానీ గురించి తెలుసుకోవాలంటే 2020 నాటి బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు జరిగిన పరిణామాలను ప్రస్తావించుకోవాలి. మొదటి దశ ఎన్నికలకు వారం రోజుల ముందు మహాగఠ్‌బంధన్‌కు హ్యాండ్ ఇచ్చి ఎన్డీఏ కూటమిలోకి జంప్ చేశారు. తాను అడిగిన 25 సీట్లు, డిప్యూటీ సీఎం అభ్యర్థిత్వం దక్కకపోవడంతో బీజేపీ-జేడీయూ కూటమితో చేతులు కలిపాడు. ఎన్డీఏ కూటమి ఇచ్చిన 11 స్థానాలతోనే సరిపెట్టుకున్నాడు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా తాను కోరుకున్న డిప్యూటీ సీఎం మాత్రం దక్కలేదు. ఆ ఎన్నికల్లో వీఐపీకి నాలుగు సీట్లు మాత్రమే దక్కాయి.ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్బీజేపీ సిఫారసు మేరకు సహానీని ఎమ్మెల్సీ చేసి పశుసంవర్ధక, మత్స్యకార మంత్రి పదవి కట్టబెట్టారు. అది కూడా ముణ్ణాళ్ల ముచ్చటే అయింది. 16 నెలలకే మంత్రి పదవి నుంచి ఆయనను తప్పించారు. 2022లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా వీఐపీ తరపున 53 మంది అభ్యర్థులను నిలబెట్టినందుకు ఆయనపై ఈ చర్య తీసుకున్నారు. అంతకు వారం ముందే వీఐపీ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సహానీని కాదని బీజేపీలోకి వెళ్లిపోయారు. దీంతో ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన ఒంటరి అయ్యారు. చివరకు మంత్రి పదవి, ఎమ్మెల్సీ పదవి కూడా లాగేసుకున్నారు. ఇది జరిగి మూడున్నరేళ్లు అయింది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి.15 అసెంబ్లీ సీట్లు, 2 ఎమ్మెల్సీప్రస్తుత బిహార్ ఎన్నికల విషయానికి వస్తే ముకేష్ సహానీ.. మహాగఠ్‌బంధన్‌లో భాగస్వామిగా ఉన్నారు. సీట్ల విషయంలో గట్టిగానే పట్టుబట్టారు. ముందు 60 అన్నట్టుగా వార్తలు వచ్చాయి. తర్వాత 30కి తగ్గారని ఊహగానాలు వచ్చాయి. పాతిక సీట్లు, డిప్యూటీ సీఎం అభ్యర్థిత్వం ఇస్తేనే ఉంటానని సహానీ కుండబద్దలు కొట్టారు. చివరి నిమిషం వరకు కాంగ్రెస్, ఆర్జేడీ సీట్ల విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో సహానీని ఆకర్షించేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు మీడియాలో వార్తలు షికారు చేశాయి. చివరకు 15 అసెంబ్లీ సీట్లు, రెండు శాసనమండలి స్థానాలతో పాటు రాజ్యసభ సీటుతో సర్దుకుపోయారు. కానీ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో మాత్రం రాజీపడలేదు.బలమైన ఓటు బ్యాంకుముకేష్ సహానీ విషయంలో అధికార, విపక్ష ఆసక్తి కనబరచడానికి ప్రధాన కారణం కులం. ఉత్తర బిహార్, లోతట్టు ప్రాంతాల్లో 20 ఉపకులాలతో కూడిన బోట్మెన్- ఫిషర్మెన్ కమ్యూనిటీ 'నిషాద్ కి బలమైన ఓటు బ్యాంకు ఉంది. నిషాద్‌లో మల్లా, బింద్, బెల్దార్, కేవత్ వంటి ఉప కులాలు ఉన్నాయి. ముకేష్ సహానీ మల్లా సామాజిక వర్గానికి చెందిన వాడు. ప్రస్తుతం అతడి పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోయినా ప్రధాన పార్టీలు అతడికి ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం ఈ ఓటు బ్యాంక్. పట్నాకు ఉత్తరాన ఉన్న వైశాలి, ముజఫర్‌పూర్, దర్భంగా, మధుబని ప్రాంతాలతో పాటు సీమాంచల్ వైపు తూర్పున కూడా కీలకమైన నిషాద్ కి ఓటు బ్యాంకు ఉంది.2020 బిహార్ శాసనసభ ఎన్నికల్లో చాలా స్థానాల్లో స్వల్ప మెజారిటీలో మహాకూటమి అభ్యర్థులు ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ, మహాకూటమి మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 0.03 శాతం మాత్రమే. ఈ నేపథ్యంలో బలమైన ఓట్లు బ్యాంకు కలిగిన ముకేష్ సహానీ తమతో పాటే ఉండాలని మహాకూటమి బలంగా కోరుకుంది. అందుకే అతడిని డిప్యూటీ సీఎం (Deputy CM) అభ్యర్థిగా ప్రకటించింది. కాగా, తాము అధికారంలోకి మిగతా కులాల నుంచి కూడా ఉప ముఖ్యమంత్రులను నియమిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్ ప్రకటించడం గమనార్హం.చదవండి: బిహార్ సీఎం అభ్యర్థిగా అతడే బెస్ట్!అందుకే ఒప్పుకున్నాతమకు తక్కువ సీట్లు కేటాయించినా, డిప్యూటీ సీఎం అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో మహాకూటమిలో ఉండేందుకు ఒప్పుకున్నారని ముకేష్ సహానీ తెలిపారు. మహాకూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) పేరు ప్రకటించినప్పడే సహానీ పేరు కూడా వెల్లడించారు. సన్ ఆఫ్ మల్లాగా పాపులర్ అయిన 44 ఏళ్ల సహానీ ఈ సారి ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి. బాలీవుడ్లో సెట్ అసిస్టెంట్‌గా పనిచేసిన ముకేష్ రాజకీయ రంగంలో ఎలా రాణిస్తారోనని బిహారీలు ఎదురు చూస్తున్నారు. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతల్లో (నవంబర్ 6, 11) జరుగుతుంది. నవంబర్ 14న ఫలితాలు వస్తాయి. -
క్రెడిట్ చోర్ ఎవరంటే అందరూ చెప్పేది చంద్రబాబు పేరే: తాటిపర్తి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో క్రెడిట్ చోర్ పదం విస్తృతంగా ఉందని.. క్రెడిట్ చోర్ ఎవరంటే అందరూ చెప్పేది చంద్రబాబు పేరేనంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇతరుల క్రెడిట్‌ని తన ఖాతాలో వేసుకోవటం చంద్రబాబుకు అలవాటేనన్నారు. ప్రజల సొమ్ముతో చంద్రబాబు, లోకేష్ విదేశాల్లో విలాసాలు చేస్తున్నారు. 2014-19లో కూడా విదేశాల్లో పర్యటనలు చేశారు. కానీ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదు’’ అని చంద్రశేఖర్ మండిపడ్డారు.‘‘ఎయిర్ బస్, ఆలీబాబా లాంటి సంస్థలు సహా 150 సంస్థలు పెట్టుబడి పెట్టబోతున్నట్టు ఎల్లో మీడియా వార్తలు రాశాయి. మరి ఆ పెట్టుబడులు ఏవీ?. ఒక్క సంస్థ కూడా ఎందుకు రాలేదు?. చంద్రబాబు తన జల్సాల కోసమే విదేశాల్లో విహరిస్తున్నారు. ఏపీలో దోచుకున్నదంతా చంద్రబాబు విదేశాల్లో దాచుకోవటానికే వెళ్తున్నారు. తన ప్రచార పిచ్చికి ఎల్లో మీడియాని వాడుకుంటున్నారు. వైఎస్ జగన్ తీసుకు వచ్చిన డేటా సెంటర్ చంద్రబాబు నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటున్నారు...2020లోనే జగన్ అదానీ డేటా సెంటర్ కు శంకుస్థాపన కూడా చేశారు. ఐటీ పార్కు నిర్మాణం ద్వారా 25 వేల ఉద్యోగాలు ఇచ్చేలా ఒప్పందం కూడా చేశారు. సింగపూర్ నుండి సబ్‌సీ లైన్‌కు అప్పుడే శంకుస్థాపన చేశారు. అంతా అయిన తర్వాత చంద్రబాబు వచ్చి ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు. రూ.87 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్న అదానీ పేరును చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు?. అదానీ పేరు చెబితే జగన్ హయాంలో జరిగిన ఒప్పందాలు, పెట్టబడుల విషయాలు వెలుగులోకి వస్తాయని భయం’’ అంటూ చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసినట్లే.. బాబు సర్కార్‌పై విడదల రజిని ట్వీట్
సాక్షి, తాడేపల్లి: 108, 104ల నిర్వహణ కాంట్రాక్టును టీడీపీ నేతకు కట్టబెట్టటంపై కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడదల రజని మండిపడ్డారు. ఎలాంటి అనుభవం లేని సంస్థకు ప్రజల ప్రాణాలు కాపాడే అంబులెన్స్‌ల బాధ్యత అప్పగిస్తారా? అంటూ ఎక్స్ వేదికగా విడుదల రజిని నిలదీశారు. 108, 104లను కూడా టీడీపీ నేతలు ఆదాయ వనరుగా మార్చుకోవటం దారుణమన్నారు. తమ సంపదను పెంచుకోవటానికి ఆంధ్రుల లైఫ్ లైన్ లాంటి 108, 104లను వాడుకుంటున్నారంటూ విడుదల రజిని దుయ్యబట్టారు.‘‘వైఎస్సార్సీపీ హయాంలో ఆ అంబులెన్సుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాం. కానీ టీడీపీ ప్రభుత్వం వాటిని తమ సంపాదన కోసం వాడుకుంటోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో అనేక కొత్త అంబులెన్సులను తెచ్చాం. సాంకేతికంగా కూడా వాటిని మరింత అభివృద్ధి చేసి 24x7 అందుబాటులో ఉంచాం. ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నో మేళ్లు చేశాం. ఆ అంబులెన్సుల ద్వారా పల్లెలు, పట్టణాల్లోని ప్రజలకు అత్యసవర పరిస్థితుల సమయంలో ప్రాణాలు కాపాడటానికి వీలయింది. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ అంబులెన్సుల కాంట్రాక్టును భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు..ఆ సంస్థ డైరెక్టర్ టీడీపీ నేత డాక్టర్ పవన్ కుమార్ దోనేపూడి. ఆయన గతంలో టీడీపీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడుగా కూడా పని చేశారు. ఆయన సంస్థ టర్నోవర్ కేవలం రూ.5.52 కోట్లు మాత్రమే. అలాంటి ఆర్థిక సామర్థ్యం లేని సంస్థకు 108, 104 నిర్వహణ కాంట్రాక్టును ఎలా కట్టబెడతారు?. ఎంతో అనుభవం ఉన్న GVK, EMRI లాంటి సంస్థలను కాదని టీడీపీ నేత సంస్థకు ఎందుకు కాంట్రాక్టు ఇచ్చారు?. అనుభవం లేని సంస్థకు బాధ్యత అప్పగించటం అంటే ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసినట్లే. ప్రజల ప్రాణాలను గాలిలో పెట్టేలా టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టు కట్టబెట్టటం సరికాదు. ఈ కాంట్రాక్టు ఇవ్వటం ద్వారా తెలుగుదేశం పార్టీ నెలకు రూ. 31 కోట్ల మామూళ్లు తీసుకుంటోంది’’ అంటూ విడుదల రజని ట్వీట్ చేశారు.Andhra's Lifeline is being utilized by the TDP to enrich themselves!The 108 ambulance & 104 medical services were made available to save lives. It is quite unfortunate to learn that, the TDP Government is misusing the facility for generating financial gains for their party.… pic.twitter.com/BLGtQ9Kr48— Rajini Vidadala (@VidadalaRajini) October 25, 2025 -
ఎంపీ కేశినేని చిన్నికి ఝలక్.. కొలికపూడి సంచలన నిర్ణయం
సాక్షి, అమరావతి: అధికార టీడీపీలో పొలిటికల్ వార్ నడుస్తోంది. బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మధ్య వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంపీ కేశినేని బాధితుల సమావేశానికి కొలికపూడి హాజరవుతుండటం వీరి మధ్య పొలిటికల్ హీట్‌ను మరింత పెంచింది.అయితే, టీడీపీ ఎంపీ కేశినేని బాధితులు నవంబర్ రెండో తేదీన హైదరాబాద్‌లో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హాజరవుతుండటం ఆసక్తికరంగా మారింది. కాగా, ఇప్పటికే కేశినేని చిన్నిపై కొలికపూడి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా చిన్ని బాధితులతో సమావేశం కావాలని నిర్ణయించడంతో టీడీపీలో దుమారం రేగుతోంది.కొలికపూడి సంచలన ఆరోపణలు.. ఇదిలా ఉండగా.. అంతకుముందు కేశినేని చిన్నిపై కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ చిన్ని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారు. ఎంపీ కార్యాలయంలో కూర్చుని పార్టీ కమిటీలు వేస్తారు. గతంలో సూరపనేని రాజా తిరువూరులో పార్టీ పదవులను అమ్మేశాడు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేశాడు. చిన్ని 150 కోట్లు జనం డబ్బు ఎగనామం పెట్టారు. బాధితులకు ఇవ్వలేదు. ఇప్పుడు ఎంపీ పీఏ కిషోర్ మొత్తం దందా నడిపిస్తున్నాడు. తిరువూరులో కిషోర్.. ఇసుక, రేషన్ మాఫియా నడిపిస్తున్నాడు. పార్టీ పదవులను సైతం కిషోర్ అమ్ముకుంటున్నాడు. అన్ని విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళదాం. అందరం కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళదాం. తాడోపేడో తేల్చుకుంటా’ అంటూ వ్యాఖ్యలు చేశారు.టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఆ పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారని సోషల్ మీడియా వేదికగా గురువారం పోస్టు పెట్టారు. 2024 ఎన్నికల్లో చిన్ని తనను రూ.5 కోట్లు అడిగారని, తన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా ఈ సొమ్మును ఆయనకు ఇచ్చానని ప్రకటించారు. 2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు, మరుసటి రోజు మరో రూ.20 లక్షలు, ఫిబ్రవరి 14న రూ.20 లక్షలు తదుపరి చిన్ని పీఏ మోహన్‌కు రూ.50 లక్షలు, గొల్లపూడిలో తన మిత్రుల ద్వారా రూ.3.50 కోట్లు ఇచ్చానని వివరించారు. ‘ఈ వివరాలన్నీ రేపు మాట్లాడుకుందాం.. నిజం గెలవాలి. నిజమే గెలవాలి’ అంటూ కొలికపూడి పెట్టిన పోస్టు నియోజకవర్గంలో తీవ్ర సంచలనం రేపింది.అంతేకాకుండా.. ఎంపీ చిన్ని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారు. ఎంపీ కార్యాలయంలో కూర్చుని పార్టీ కమిటీలు వేస్తారు. గతంలో సూరపనేని రాజా తిరువూరులో పార్టీ పదవులను అమ్మేశాడు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేశాడు. చిన్ని 150 కోట్లు జనం డబ్బు ఎగనామం పెట్టారు. బాధితులకు ఇవ్వలేదు. ఇప్పుడు ఎంపీ పీఏ కిషోర్ మొత్తం దందా నడిపిస్తున్నాడు. తిరువూరులో కిషోర్.. ఇసుక, రేషన్ మాఫియా నడిపిస్తున్నాడు. పార్టీ పదవులను సైతం కిషోర్ అమ్ముకుంటున్నాడు. అన్ని విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళదాం. అందరం కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళదాం. తాడోపేడో తేల్చుకుంటా’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో.. ఎంపీ, ఎమ్మెల్యేల నడుమ విభేదాల నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గ టీడీపీ కేడర్ రెండుగా చీలిపోయింది. టీడీపీలో కోవర్టులున్నారు..టీడీపీలో కోవర్టులు ఉన్నారని.. ఆ కోవర్టులు ఎవరో, ఎక్కడున్నారో అందరికీ తెలుసని ఎంపీ చిన్ని వ్యాఖ్యానించారు. ప్రత్యర్థుల జన్మదినాల స్టేటస్లు పెట్టుకుంటూ.. పార్టీకి విధేయుడినంటే కార్యకర్తలు ఒప్పుకుంటారా అంటూ ఎంపీ రెచ్చిపోయారు. నాయకుల కోసం పార్టీ శ్రేణులు దెబ్బలు తినాలి గానీ నేతలు మాత్రం ఇతర పార్టీలతో అంటకాగితే ఎవరైనా ఊరుకుంటారా అంటూ ఎమ్మెల్యే వైఖరిని తప్పుపట్టారు. ‘తిరువూరు నియోజకవర్గంలో విలేకరులకే వార్నింగ్‌లు ఇచ్చారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కనీస విషయాలు తెలియకుండా అన్ని వివాదాలకూ కారణమవుతున్నారు’ అంటూ కొలికపూడిపై ధ్వజమెత్తారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలి ఇప్పటికే పార్టీ దృష్టికి వెళ్లిందని ఎంపీ వ్యాఖ్యానించారు. -
‘చావనైనా చస్తాను.. ఆర్జేడీలో చేరను’: తేజ్ ప్రతాప్
హాజీపూర్: బీహార్ రాజకీయ దిగ్గజం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ విధంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది నెలల క్రితమే పార్టీ నుంచి బహిష్కృతుడైన తేజ్ ప్రతాప్ పలు అంశాలలో వివాస్పదునిగా వార్తల్లో కనిపిస్తున్నారు.జనశక్తి జనతా దళ్ పార్టీని స్థాపించి, మహువా అసెంబ్లీ నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన తేజ్ ప్రతాప్ యాదవ్ తన తమ్ముడు తేజస్విపై కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్విని ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రజల ఆశీర్వాదం అవసరం అని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. ‘ఆర్జేడీ పార్టీలోకి తిరిగి వెళ్లేకంటే చావడమే నయం. నాకు అధికార దాహం లేదు. మానవీయ సూత్రాలు, ఆత్మగౌరవం అత్యున్నతమైనవి’ అని తేజ్ ప్రతాప్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.ప్రజల కోసం పనిచేయడమే తనకు సంబంధించిన పెద్ద విషయం అని, నిజాయితీగా అదే పని చేస్తానని, అప్పుడే ప్రజలు తనను ప్రేమిస్తారు.. నమ్ముతారని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. ఆయన 2015లో ఎన్నికల అరంగేట్రం చేసిన మహువా స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాను రాజకీయాల్లోకి రావడానికి ముందు నుండే ఈ నియోజకవర్గంతో అనుబంధం కలిగి ఉన్నానని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. తన తమ్మునికి నమ్మకస్థుడైన సిట్టింగ్ ఆర్జేడీ శాసనసభ్యుడు ముఖేష్ రౌషన్‌ను తాను పోటీదారుగా భావించడం లేదన్నారు.తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారా? అని మీడియా అడిగినప్పుడు ఆయన మాట్లాడుతూ తాము చాలా కాలంగా మాట్లాడుకోవడం లేదని, కానీ వారి ఆశీర్వాదాలు ఉంటాయని నమ్ముతున్నానని అన్నారు.ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్విని ఎంపిక చేయడం తనకు నచ్చలేదన్నారు. పలు రకాల ప్రకటనలు చేయడం రాజకీయ నాయకుల లక్షణమని, కానీ ప్రజల ఆశీస్సులు పొందిన వ్యక్తి మాత్రమే అధికారాన్ని చేజిక్కించకుంటాడని తేజ్ ప్రతాప్ అన్నారు. -
గన్‌పార్క్ వద్ద క్షమాపణలు చెప్పిన కవిత
సాక్షి, హైదరాబాద్: ఇన్నేళ్ల తన రాజకీయంలో తెలంగాణ ఉద్యమకారుల కోసం గట్టిగా కొట్లాడలేకపోయానని.. అందుకు ఆ కుటుంబాలకు క్షమాపణలు చెబుతున్నానని కవిత అన్నారు. తెలంగాణ జాగృతి తరఫున శనివారం జనం బాట కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అంతకంటే ముందు.. గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు అర్పించాక ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ అమరవీరుల కుటుంబాలను నేను క్షమాపణలు కోరుతున్నా. గతంలో నేను గట్టిగా కొట్లాడలేకపోయా. ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. నా జాగృతి జనం బాటలో అందరినీ కలుస్తా. 33 జిల్లాల్లో ఉన్న అన్ని వర్గాలను కలుస్తా’’ అని అన్నారామె. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరుల అయ్యారు. తెచ్చుకున్న తెలంగాణలో అమరుల ఆశయాలు నెరవేర్చడంలో ఎంత వరకు ముందుకు వెళ్ళామో? ఆలోచించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం కోసం 1,200 అమరులు అయ్యారని అనేక సందర్భాల్లో చెప్పాం. అమరవీరుల కుటుంబాలకు అనుకున్న మేర న్యాయం చేయలేకపోయాం. ఈ మొత్తంలో 580 మంది అమరవీరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యమకారులకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సీట్లు,కొన్ని చోట్ల ఎంపీపీ, జెడ్పిటిసి టిక్కెట్లు వచ్చాయి. కానీ ఉద్యమకారులకు అనుకున్న మేర న్యాయం జరగలేదు. నేను మంత్రిగా లేకపోయినా ఎంపీగా అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలని అడిగాను. ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు కోట్లాడలేక పోయినందుకు నేను బహిరంగ క్షమాపణ చెప్తున్నా అని కవిత వ్యాఖ్యానించారు. -
ఇదండి బాబు మార్కు మోసం!
రాజకీయ పార్టీలకు మాటకు కట్టుబడే లక్షణం.. నిబద్ధత, ఆయా అంశాలపై స్పష్టమైన వైఖరి చాలా ముఖ్యం. లేకపోతే అది అవకాశవాద రాజకీయం అవుతుంది. ప్రజల తిరస్కారానికి కారణమవుతుంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంత తొందరగా గుర్తిస్తే అంత మేలు. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అవసరానికి తగ్గట్టు మాటలు మార్చడంలో సిద్ధహస్తుడన్న పేరు ఇప్పటికే సంపాదించి ఉండటం ఇందుకు కారణం.ఇప్పుడీ ప్రస్తావన మరోసారి ఎందుకొచ్చిందంటే.. టీడీపీతోపాటు జనసేన కూడా ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటన్న చర్చ వచ్చినందుకు! అధికారంలోకి రాగానే ఉద్యోగులకు పీఆర్సీ వస్తామని మధ్యంతర భృతి ప్రకటిస్తామని, బకాయిలు చిటికెలో తీర్చేస్తామని ఊరించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు గద్దెనెక్కిన 16 నెలల తరువాత ఇప్పుడు మాత్రం ఆర్థిక పరిస్థితి బాగా లేదని కథలు చెబుతున్నారు. ఉద్యోగుల బిల్లులు బకాయిలు సుమారు రూ.34వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని ముక్తాయించారు. సహజంగానే దీనిపై ఉద్యోగులు మండి పడుతున్నారు. ఉద్యోగ నేతలు కొందరితో అనుకూల ప్రకటనలు చేయించుకున్నా పరిస్థితి నివురుగప్పిన నిప్పు మాదిరిగానే ఉంది.2019లో జగన్ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉపయోగపడే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలను, ప్రజల ఇళ్ల వద్దే సేవలందించే వలంటీర్ల వ్యవస్థను తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే నెరవేర్చారు. ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు, పవన్ ఇవి వృథా అని ఎన్నడూ చెప్పలేదు. తొలగిస్తామని కూడా అనలేదు. పైగా వలంటీర్లకు జగన్ ఇస్తున్న రూ.5వేలు సరిపోదని, తాము అధికారంలోకి వస్తే రూ.పది వేలు ఇస్తామని ఉగాది నాడు పూజ చేసి మరీ ప్రకటించారు. కానీ ఇప్పుడేమో దానిని ఎత్తివేశారు. అదేమంటే వేస్ట్ అని చెబుతున్నారు. ఇది పక్కా మోసమే కదా?.వైఎస్ జగన్ అమ్మ ఒడి పథకం కింద కుటుంబంలో ఒకరికి రూ.15 వేల ఆర్థిక సాయం ప్రకటిస్తే, చంద్రబాబు తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ప్రతి విద్యార్ధికి డబ్బు ఇస్తామని ఎందుకు ప్రకటించారు? దాని వల్ల రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ నాశనం అవడం లేదా? చంద్రబాబు 2014 టర్మ్‌లో రూ.లక్ష కోట్ల మేర రైతుల, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని చెబితే ఆయనకు విజన్ ఉన్నట్లు! అది సాధ్యం కాదని చెబితే జగన్ చేతకాని వాడన్నట్లు చెప్పేవారు. తీరా ప్రభుత్వంలోకి వచ్చాక ఏం చేశారు?. రైతులకు అరకొరగా రుణమాఫీ చేసి చేతులెత్తేశారే. ఇప్పుడు ఎవరికి విజన్ ఉన్నట్లు? జగన్ నిజాయితీగా చెప్పినట్లు అంగీకరించాలి కదా!. జగన్ రైతులకు రూ.13,500 చొప్పున రైతు భరోసాగా ఇస్తామని తెలిపి దానిని అమలు చేశారు. అది తప్పైతే చంద్రబాబు ఎందుకు ఏకంగా రూ.20 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు?. జగన్ కేంద్రం ఇచ్చిన మొత్తంతో కలిపి ఇస్తే ఆక్షేపించిన చంద్రబాబు దానితో నిమిత్తం లేకుండా ఇస్తానని ప్రకటించి అసలుకే మోసం చేశారే. ఒక ఏడాది ఎగవేసి, రెండో ఏడాది కేవలం రూ.ఐదు వేలు మాత్రమే ఇచ్చారు కదా!.2014 టర్మ్‌లో తెలంగాణ కన్నా ఎక్కువ ఇంటెరిమ్ రిలీఫ్ ఇచ్చి తానేదో గొప్ప పని చేశానని చెప్పుకోవడానికి యత్నించారు. అప్పుడేమో ఆర్థిక వ్యవస్థపై భారం పడినట్లు కాదు. జగన్ టైమ్ లో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 27 శాతం ఐఆర్ ఇచ్చి, తదుపరి 23 శాతం పీఆర్సీ ఇస్తే రివర్స్ పీఆర్సీ ఇస్తారా అని తప్పుడు ప్రచారం చేశారే! చంద్రబాబు చెబుతున్నట్లు ఎస్టాబ్లిష్మెంట్ వ్యయం తగ్గించడానికి జగన్ యత్నిస్తే అది తప్పు చేసినట్లు అవుతుందా?. తాను ఎస్టాబ్లిష్మెంట్ వ్యయం పెంచితేనేమో ఉద్యోగుల కోసమా? ఉద్యోగుల సంక్షేమంపై చిత్తశుద్ది ఉంటే ఎన్నికలలో చెప్పిన విధంగా ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ వేసి, ఐఆర్ ఇవ్వాలి కదా!. డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలి కదా! నాలుగు డీఏ బకాయిలకు ఒకటే ఎందుకు ఇచ్చారు?.పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయితే, ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి రాత్రికి రాత్రే విజయవాడకు వెళ్లిన మాట నిజం కాదా? ఆ తర్వాత సచివాలయ ఉద్యోగులను అదనపు రాయితీలు ఇచ్చి మరీ అక్కడకు తరలించారే. వారానికి ఐదు రోజుల పని చేయండని చెప్పారే. హైదరాబాద్‌లో భవనాలు వదులుకుని వివిధ ప్రభుత్వ కార్యాలయాల కోసం అద్దె భవనాలను విజయవాడ, గుంటూరులలో తీసుకున్నారే. ఇదేమి ప్రభుత్వంపై భారం పడలేదా? 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని, లేకపోతే నిరుద్యోగ భృతి కింద మూడు వేలు ఇస్తామన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ గుర్తుకు రాలేదా!. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు రూ.1500 ఇస్తామని ఆశ పెట్టినప్పుడు రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదని అనుకున్నారా? లేక ఎలాగూ జనాన్ని మాయ చేయడమే కదా అని అనుకున్నారా?. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇవ్వడం గొప్ప విషయంగా ప్రచారం చేస్తుంటారు. దానివల్ల స్త్రీలకు చాలా ఆదా అయిందని ఊదరగొడుతుంటారే! అది మంచి హామీనా?. ఆర్టీసీని ముంచే హామీనా?. చంద్రబాబు ఏమి చేసినా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు ఏం కాదా?. అదే జగన్ చేస్తే నాశనం అయినట్లా? ఇదేం అన్యాయం.ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఎలా వ్యవహరించినా చెల్లిపోతుందన్నది కూటమి పెద్దల విశ్వాసం కావచ్చు. గూగుల్ పేరుతో వస్తున్న అదానీ, రైడెన్ డేటా సెంటర్ ఇచ్చేది కేవలం 200 ఉద్యోగాలే అయినా ఏకంగా రూ.22వేల కోట్ల ప్రజా ధనాన్ని తేలికగా ఇచ్చేస్తున్నారే. దానివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన విమర్శకు మీరెచ్చే జవాబు ఏమిటి?. వేల కోట్ల లాభాలలో ఉన్న టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలకు రూపాయికే ఎకరం భూమి కట్టబెట్టడం, ఉర్సా, లూలూ వంటి కంపెనీలకు ప్రభుత్వ భూములను అతి తక్కువ ధరకు కేటాయించడం ప్రజలకు సంపద సృష్టించినట్లు అవుతుందా?. గూగుల్ తదితర కార్పొరేట్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయా? లేక ఆ కంపెనీలలో ఏపీ ప్రభుత్వం పెట్టుబడి పెడుతోందా అన్న సందేహాన్ని కొందరు నిపుణులు వ్యక్తం చేస్తే పరిస్థితి తెచ్చారే!.జగన్ టైమ్‌లో అప్పులు తేవడాన్ని ఆక్షేపించిన చంద్రబాబు తాను 16 నెలల్లో రికార్డు స్థాయిలో రూ.2.10 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏమి చేశారో ఎందుకు ప్రజలకు చెప్పడం లేదు? డీబీటీ విధానం అంటే నేరుగా ప్రజల ఖాతాలలోకి డబ్బులు వేయడం తప్పని చెబుతున్న చంద్రబాబు తాను అదే పని ఎందుకు చేస్తున్నారో ప్రజలకు వెల్లడించాలి కదా!. అసలు ఎన్నికల సమయంలో డీబీటీ విధానం విదేశాలలో ఉందని, తన కుమారుడు లోకేష్ దీనిపై సలహా ఇచ్చారని, అది గొప్ప సంగతి అని, తాను రూ.రెండు వేల చొప్పున ఇస్తానని ప్రకటించారే. జగన్ ఎక్కడా అవినీతి లేకుండా డీబీటీ అమలు చేస్తే అది తప్పని చెబుతున్నారు.పోనీ ఆ సంక్షేమ స్కీములు అమలు చేయడం సరికాదని చెబుతారా అంటే అలా చేయరు. పైగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ సభలు పెడతారు. ఇంతకీ ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలను మార్చేయాలన్న భావనతో చంద్రబాబు సర్కార్ ఉందా? ఎన్నికల ప్రణాళికలో సీపీఎస్, అవుట్ సోర్స్, కాంట్రాక్ట్ తదితర ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇవ్వడానికి కొత్త గాత్రం అందుకున్నారా?.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘ఇండియా కూటమి అలా నెగ్గాలనుకుంది..’ నడ్డా సంచలన ఆరోపణలు
బీహార్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన ఆరోపణలకు దిగారు. చొరబాటుదారుల ఓట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఇండియా కూటమి భావిస్తోందని.. అయితే ఎన్డీయే ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు సాగనివ్వబోదని అన్నారు. శుక్రవారం వైశాలి జిల్లాలో జరిగిన మేధావుల సమావేశంలో పాల్గొని జేపీ నడ్డా ప్రసంగించారు. ‘‘బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక పునఃసమీక్ష (special intensive revision)కు ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఎందుకంటే.. చొరబాటుదారుల ఓట్ల ఆధారంగానే వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించారు కాబట్టి. కానీ, ఎన్డీయే ప్రభుత్వం అలాంటి ప్రయత్నాన్ని ఎప్పటికీ సాగనివ్వబోదు.. .. ఓటు చోరీ ఆరోపణలపై అఫిడవిట్లు సమర్పించాలని ఎన్నికల కమిషన్ కోరిన తర్వాత ప్రతిపక్షాలు ఆ ఆరోపణలపై మాట్లాడటమే మానేశాయి. అక్కడే అసలు వాస్తవం బయటపడింది. తమ ఆరోపణలకు ఆధారాలు చూపలేకనే వాళ్లు తోకముడిచారు అని నడ్డా ఎద్దేవా చేశారు. ఆర్జేడీది జంగిల్ రాజ్లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీకి గూండా, రౌడీ పార్టీ అనే ముద్ర ఉందని నడ్డా ఆరోపించారు. 2005కి ముందు బీహార్‌లో శాంతి భద్రతలు ఎలా ఉండేవి?. డాక్టర్లు, వ్యాపారులు, న్యాయవాదులు అప్పట్లో కిడ్నాప్, హత్యలకు గురైన సంగతి ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. ఆ సమయంలో అప్పటి సీఎం లాలూ నివాసంలోనే ఫిర్యాదులపై చర్చలు జరిగేవి కదా.. నడ్డా ఆరోపించారు. కానీ.. నితీశ్ కుమార్‌లోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం జంగిల్ రాజ్ నుంచి బీహార్ ప్రజలకు విముక్తి కలిగించిందని నడ్డా అన్నారు. గత 20 ఏళ్లుగా సీఎం నితీష్ కుమార్ సారథ్యంలో బీహార్ గణనీయంగా పురోగతి సాధించిందని, మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి గణనీయమైన నిధులూ బీహార్‌కు సమకూరుతున్నాయని నడ్డా అన్నారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించి ఆ అభివృద్ధిని కొనసాగించాలని ఈ సందర్భంగా మేధావులకు నడ్డా విజ్ఞప్తి చేశారు. -
క్లీన్ స్వీప్ మిస్.. బీజేపీకి ‘క్రాస్ ఓటింగ్’ విక్టరీ!
కేంద్ర పాలిత జమ్ము కశ్మీర్ రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి(Jammu Rajya Sabha Results). అధికార నేషనల్ కాన్ఫరెన్స్ క్లీన్ స్వీప్ మిస్ అయ్యింది. నాలుగు స్థానాల్లో మూడింటిని కైవసం చేసుకుంది. మిగిలిన ఒక్క స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోగా.. క్రాస్ ఓటింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరిగిన తొలి రాజ్యసభ ఎన్నికలు ఇవే. జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో శుక్రవారం(అక్టోబర్ 24వ తేదీన) ఓటింగ్ జరిగింది. 88 మంది ఎమ్మెల్యేలకు గానూ.. 86 మంది నేరుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జైల్లో ఉన్న ఆప్ ఎమ్మెల్యే మెహరాజ్ మాలిక్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. కాంగ్రెస్, పీడీపీ, సీపీఐ(ఎం), ఏఐపీ, ఇతర స్వతంత్ర ఎమ్మెల్యేలు నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు.ఎన్సీ తరఫున చౌదరి మహ్మద్ రంజాన్, సజ్జాద్ కిచ్లూ, జీఎస్ ఒబెరాయ్, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ సత్ పాల్ శర్మ(Sat Paul Sharma) విజేతలుగా నిలిచారని అసెంబ్లీ సెక్రటరీ ఎంకే పండిత తెలిపారు. भाजपा जम्मू कश्मीर अध्यक्ष श्री @iamsatsharmaca ने आज विधानसभा सचिवालय, श्रीनगर में राज्यसभा सांसद के रूप में विजय का प्रमाण पत्र चुनाव अधिकारी से प्राप्त किया। pic.twitter.com/pZul3mcCjF— BJP Jammu & Kashmir (@BJP4JnK) October 24, 2025నాలుగో సీటు కోసం నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఇమ్రాన్ నబీ, సత్ శర్మ పోటీ పడ్డారు. అయితే 32 ఓట్లతో శర్మ విజయం సాధించినట్లు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. జమ్ము అసెంబ్లీలో బీజేపీకి కేవలం 28 సీట్లు మాత్రమే ఉండగా.. 4 అదనపు ఓట్లు వచ్చాయి. అయితే బీజేపీ ఊహించినట్లుగానే.. స్వతంత్రులు వాళ్ల వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, సీఎం ఒమర్ అబ్దుల్లా ఆ నాలుగు ఓట్లు ఎక్కడివి? అంటూ ఓ ట్వీట్ చేశారు. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ(Cross Voting For BJP) ఆ నలుగురు ఎవరు అనేది తేలాల్సి ఉంది. ఇక..All of @JKNC_ votes remained intact across the four elections, as witnessed by our election agent who saw each polling slip. There was no cross voting from any of our MLAs so the questions arise - where did the 4 extra votes of the BJP come from? Who were the MLAs who…— Omar Abdullah (@OmarAbdullah) October 24, 2025డోడా నియోజకవర్గ ఆప్ ఎమ్మెల్యే మెహరాజ్ మాలిక్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేశారు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (PSA) కింద సెప్టెంబర్ 8, 2025న అరెస్ట్ అయ్యారాయన. ఆయన ప్రస్తుతం కథువా జిల్లా జైలులో నిర్బంధంలో ఉన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ రాష్ట్రం కాస్త కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. ఛండీగఢ్, లక్షద్వీప్ లాంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు అసెంబ్లీ ఉండదు. కాబట్టి వాటికి రాజ్యసభ స్థానాలు ఉండవు. అయితే.. 2020లో జమ్ము కశ్మీర్ రీజనల్ అసెంబ్లీ తిరిగి ఏర్పడింది. అందువల్ల ఇతర రాష్ట్రాల మాదిరిగానే రాజ్యసభ ఎన్నికలు మళ్లీ అసెంబ్లీలోనే జరిగాయి. అంతా ఊహించినట్లుగానే అధికార పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. -
రేవంత్‌రెడ్డీ.. దమ్ముంటే అశోక్‌నగర్‌కు రా..!
సాక్షి, హైదరాబాద్: ‘సీఎం రేవంత్‌రెడ్డీ.. నీకు దమ్ముంటే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై చర్చించేందుకు పోలీసు భద్రత లేకుండా అశోక్‌నగర్, చిక్కడపల్లి లైబ్రరీకి రాగలవా?’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్‌రావు సవాల్ విసిరారు. ఎన్నికల ముందు ఉద్యోగాలు, నిరు ద్యోగ భృతి అంటూ నిరుద్యోగులను వేడుకొని, వాడుకొని.. అధికారంలోకి వచ్చాక వదిలేశారని ధ్వజమెత్తారు.శుక్రవారం నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో ‘కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు’ఆవిష్కరణ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే బట్టలూడదీసి కొడతారని హెచ్చరించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలేదు కానీ, రెండు నెలల ముందే మద్యం నోటిఫికేషన్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. జాబ్‌లు నింపాలని అడిగితే.. జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గల్లా పెట్టెలు నింపుకుంటున్నారని మండిపడ్డారు. రెండు లక్షల జాబ్ కేలండర్ ఎక్కడ? జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ లెస్ కేలండర్ విడుదల చేశారని హరీశ్‌రావు ఆరోపించారు. ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా? అని సీఎంను ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ బోగస్ అయిందని, రాజీవ్ యువ వికాసం వికసించకముందే వాడిపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు సురుకు పుట్టాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు నిరుద్యోగులు దండు కట్టాలని పిలుపునిచ్చారు. విద్య, మున్సిపల్, హోంశాఖల మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఫెయిల్ అయ్యారని.. కలెక్షన్ల మంత్రిగా, వసూళ్ల మంత్రిగా మాత్రం పాస్ అయ్యారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 1.64 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని హరీశ్‌రావు తెలిపారు.‘నోటిఫికేషన్లు ఇచ్చింది, పరీక్ష పెట్టింది, ఫిజికల్ టెస్టు పెట్టింది, ఎంపిక చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే... నియామకపత్రాలు ఇచ్చింది మాత్రం రేవంత్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ‘ఇక గుర్తు పెట్టుకో రేవంత్.. ఈరోజు నుంచి నీకు చుక్కలు చూపిస్తాం’అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నాయకులు జనార్ధన్, ఇందిర నాయక్, పురుషోత్తం యాదవ్, నవీన్ పటా్నయక్, మోతీలాల్, తిరుపతి, సింధురెడ్డి, లలిత రెడ్డి, శింబు, శంకర్ నాయక్, బాలకోటి, మహేందర్, కుమార్, రాడపాక రవి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో పలు విభాగాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు. రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌కు ఒక ప్రెసిడెంట్‌ను నియమించారు. జోన్–1కి.. విశాఖ జిల్లాకు చెందిన చెన్నా జానకిరామ్ నియమితులయ్యారు. జోన్–2కి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన విప్పర్తి వేణుగోపాల్ నియమితులయ్యారు. జోన్ –3కి ఎనీ్టఆర్ జిల్లాకు చెందిన నట్ట యోనారాజు నియమితులయ్యారు. జోన్ –4కి తిరుపతి జిల్లాకు చెందిన నల్లని బాబు నియమితులయ్యారు.జోన్ –5కి వైఎస్సార్ జిల్లాకు చెందిన పులి సునీల్‌కుమార్ నియమితులయ్యారు. అలాగే కాకినాడ జిల్లాకు చెందిన ఎ.లక్ష్మీశివకుమారిని వైఎస్సార్సీపీ రాష్ట్ర అంగన్వాడీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా(జోన్ –2కు)గా, తిరుపతి జిల్లాకు చెందిన ఎస్.రామచంద్రారెడ్డిని రాష్ట్ర ఐటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–4)గా, తిరుపతి జిల్లాకు చెందిన దువ్వూరు మునిశేఖర్‌రెడ్డిని రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–4)గా నియమించారు.పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లుగా విశాఖ జిల్లాకు చెందిన ద్రోణంరాజు శ్రీవత్సవ(జోన్ –1), కాకినాడ జిల్లాకు చెందిన తోట రాంజీ(జోన్–2), ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎ.రవిచంద్ర(జోన్–3), చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి(జోన్–4), అనంతపురం జిల్లాకు చెందిన వై.ప్రణయ్‌రెడ్డి(జోన్–5) నియమితులయ్యారు. ఎనీ్టఆర్ జిల్లాకు చెందిన వి.ఈశ్వర్‌ప్రసాద్‌ను రాష్ట్ర వాణిజ్య విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–3)గా నియమించారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. -
‘అదానీ పేరు ఎందుకు చెప్పడం లేదు?’
విశాఖ: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వాస్తవాలు మాట్లాడతూ ఉంటే తట్టుకోలేక మంత్రుల పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. వైఎస్ జగన్ పత్రికా సమావేశంతో ప్రజలకు వాస్తవాల తెలుస్తున్నాయన్నారు. గూగుల్‌ను స్వాగతిస్తున్నామని తాము చెప్పినప్పటికీ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేసిందన్నారు గుడివాడ అమర్నాథ్. ‘ గూగుల్ - రైడెన్ సంస్థతో ఒప్పందంలో ఉద్యోగాల కోసం ప్రశ్నించాం. గూగుల్- అధాని డేటా సెంటర్ ఏర్పాటులో జరిగిన చర్చల కోసం వైఎస్ జగన్ వివరించారు. డేటా సెంటర్ ఏర్పాటు విషయంలో అధాని పేరు ఎందుకు చెప్పడం లేదు. ఆధాని పేరు చెప్తే జగన్‌కు మంచి పేరు వస్తుందని వారి బాధ..లక్షా 80 వేల ఉద్యోగాలు ఎలా వస్తాయో క్లారిటీ ఇవ్వాలి. ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పాలి. ఎకో సిస్టమ్ ద్వారా ఉద్యోగాల కల్పన అవుతుందని ఎందుకు చెప్పలేకపోతున్నారు. క్రెడిట్ కొట్టేయాలని తండ్రీ కొడుకులు చూస్తున్నారు. ఎల్లో మీడియా రోజూ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకుంటున్నారు. సినిమా టైటిల్ వేరు ఎల్లో మీడియా స్టోరీ ఒక్కటే. చంద్రబాబు మొదలు పెట్టి.. పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఒక్కటి చూపించాలి. ఛాలెంజ్ చేస్తున్నా. భూమి సమీకరణ చెయ్యకుండా చంద్రబాబు దిగిపోయే ముందు భోగాపురం ఎయిర్ పోర్ట్ కు శంకుస్థాపన చేశారు. 2వేల 700 ఎకరాలకు 350 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉంటే మేం మొత్తం భూమి సేకరణ పూర్తి చేసాం.. నాలుగు గ్రామాలను తరలించి, భోగాపురం ఎయిర్ పోర్ట్ స్థలానికి గోడ నిర్మించాం. ఏ చిక్కులూ లేకుండా.. Gmr కు స్థలం అప్పగించాం. రామాయపట్నం పోర్టును మేమే కట్టాం. ఏ పనీ చెయ్యకపోయినా శిలా ఫలకాలు వేసుకోవడంలో బాబు సిద్దహాస్తుడు. 21 సంవత్సరాల ముందే బాబుకి హైదరాబాద్ తో సంబంధం లేదు. బాబు, లోకేష్ యాడ్ ఏజెన్సీని నడుపుతున్నారు. జగన్ చేసిన మంచిని ఎలాగో చెప్పరు కనీసం అధాని పేరు అయినా చెప్పండి’ అని అమర్నాథ్ పేర్కొన్నారు. ఇదీ చదవండి;డేటా సెంటర్ క్రెడిట్ చౌర్యం: వైఎస్ జగన్ -
మహాఘట్బంధన్కు మోదీ కౌంటర్.. బిహార్‌పై కీలక ప్రకటన
సమస్తిపూర్: వచ్చే నెలలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే అన్ని రికార్డులు బద్దలుకొడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం ఆయన బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్‌లో ఎన్డీయే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ.. "ఫిర్ ఏక్ బార్ ఎన్డీఏ సర్కార్... ఫిర్ ఏక్ బార్ సుశాసన్ సర్కార్" అని బిహార్ ప్రజలు అంటున్నారన్నారు.నితీశ్ కుమార్‌ను 'సుశాసన్ బాబు' అనే ప్రజాదరణ పొందిన బిరుదు పేరుతో మోదీ ప్రస్తావించారు. మొదటిసారి నితీశ్ కుమార్‌ను ఎన్డీయే ప్రచార ముఖంగా ప్రస్తావించారు. అయితే, ఎన్నికల తర్వాత ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? అనే విషయం స్పష్టంగా చెప్పలేదు. ఎక్కడా కూడా సీఎం అభ్యర్థి అనే మాట ప్రస్తావించకుండానే.. ఈసారి కూడా సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఎన్డీయే సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ తేజస్వి సవాల్‌పై ప్రధాని మోదీ స్పందించినట్లయింది.కాగా, బీజేపీ.. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడంలో వెనుకడుగు వేస్తోందంటూ మహాఘట్బంధన్ విమర్శించింది. సీఎం నితీశ్ కుమార్ పార్టీ జేడీ(యూ)ని ఖతం చేయడానికి బీజేపీ కుట్రలు సాగిస్తోందంటూ తేజస్వీ యాదవ్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో నితీశ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ ఈసారి ఎందుకు ప్రకటించడం లేదు? దీని వెనుక అసలు కారణం ఏమిటి?’’ అంటూ తేజస్వీ ధ్వజమెత్తారు. -
నకిలీ మద్యం కేసులో ఐవిఆర్ఎస్ కాల్స్‌పై YSRCP ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం కేసులో ఐవిఆర్ఎస్ (interactive Voice Response System) కాల్స్‌పై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆ పార్టీ నేతలు నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు ప్రస్తావిస్తూ ఐవిఆర్ఎస్ కాల్స్ చేయటంపై ఫిర్యాదు చేశారు.డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినవారిలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారు.మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ‘‘నాపై ఐవిఆర్ఎస్ కాల్స్ చేయిస్తున్న వారిపై విచారణ జరపాలి. ఆ కాల్స్ వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారు కఠిన చర్యలు తీసుకోవాలి. నాకు నకిలీ మద్యంతో సంబంధాన్ని అంటగట్టాలని ప్రయత్నిస్తున్నారు. నార్కో అనాలసిస్ టెస్టుకు కూడా నేను సిద్ధమే. ఫేక్ కాల్స్‌తో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. దమ్ముంటే నన్ను ఎదురుగా ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతేగాని ఐవిఆర్ఎస్ కాల్స్ పేతుతో ఫేక్ కాల్స్ చేయటం ఎందుకు?’’ అంటూ ఆయన మండిపడ్డారు.‘‘ఎక్కడి నుండి చేస్తున్నారో కూడా తెలియకుండా ఫేక్ కాల్స్ చేస్తున్నారు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం తమ చేతిలో ఉందని ఏదైనా చేయొచ్చని అనుకుంటున్నారేమో?. దమ్ము, ధైర్యం ఉంటే ఈ కాల్స్ ఎవరు చేశారో, ఎవరు చేయిస్తున్నారో చెప్పాలి. దీనిపై విచారణ జరపాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాం. చట్టాన్ని, టెలికం వ్యవస్థను వాడుకోవటంపై ఫిర్యాదు చేశాం. చంద్రబాబు, లోకేష్ దీని వెనుక ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలి. నా మీద చంద్రబాబు ప్రభుత్వం బురద వేసింది.నా వ్యక్తి గత ప్రతిష్ట దెబ్బతినేలా నకిలీ మద్యం కేసును అంట గడుతున్నారు. దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా. లైడిటెక్టర్ పరీక్షకు సిద్దమని కూడా చెప్పా. నార్కో అనాలసిస్ టెస్టుకైనా నేను సిద్ధం. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటానికే టీడీపీ నేతకు నామీద, నా పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారు. దేశంలోని ఏ సంస్థతో విచారణ జరిపినా నేను సిద్ధమే’’ అని జోగి రమేష్ స్పష్టం చేశారు.IVRS కాల్స్ ఒక ఆటోమేటెడ్ టెలిఫోన్ సిస్టమ్, ఇది కాల్ చేసిన వ్యక్తికి ముందుగా రికార్డ్ చేసిన సందేశాలను వినిపిస్తూ, వారి ఎంపికల ఆధారంగా సమాచారాన్ని అందిస్తూ సంబంధిత విభాగానికి కాల్‌ను ఫార్వర్డ్ చేస్తుంది. ఇప్పుడు దీనిపైనే జోగి రమేష్ ఫిర్యాదు చేశారు. తనకు నకిలీ మద్యం కేసు అంటగట్టాలని చూస్తున్నారని, అందులో భాగంగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఐవిఆర్ఎస్ కాల్స్ కుట్రకు తెరలేపిందని జోగి రమేష్ ఫిర్యాదు చేశారు. -
ఓటుకు రూ.80 వసూలు.. ఓట్ చోరులను గుర్తించిన కర్నాటక సిట్
బెంగళూరు: 2023 కర్నాటక అసెంబ్లీ ఎన్నిక ల్లో అలంద్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా లో అవకతవకలు జరిగినట్లు వస్తున్న ఆరోప లు నిజమేనని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తెలిపింది. ఓటర్ల పేర్లను తొలగించే కుంభకోణంతో కనీసం ఆరుగురికి సంబంధమున్నట్లు గుర్తించింది.ఇక, వీరికి ఓ డేటా సెంటర్‌తో సంబంధాలున్నాయని, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ ద్వారా ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించారని సిట్‌కు సారథ్యం వహించిన సీఐడీ అద నపు డీజీ బీకే సింగ్ చెప్పారు. పేర్లను తొలగించాలంటూ అందిన మొత్తం 6,994 అభ్యర్థన ల్లో ఏవో కొన్ని మినహా చాలామటుకు బోగస్ వేనని గుర్తించామన్నారు. అలంద్‌లో ఓటర్ల తొలగింపునకు కుట్ర జరిగింది వాస్తవమని చెప్పారు. మొత్తం 30 మంది వరకు ప్రశ్నించి, అనుమానితులుగా ఆరుగురిని నిర్ధారించామని, వీరిని త్వరలో అరెస్ట్ చేస్తామని వివరించారు. విచారణలో వెల్లడైన సమాచారం ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో దాడులు జరిపామన్నారు.ఇందులో అప్పట్లో అలంద్‌లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన సుభాష్ గుత్తేదార్, ఆయన ఇద్దరు కుమారుల ఇళ్లు కూడా ఉన్నాయన్నారు. సోదాల సమయంలో సుభాష్ ఇంటికి సమీపంలో కాలిపోయిన ఓటరు జాబితాలు బయటపడినట్లు ఆయన వెల్లడించారు. అయితే, దీపావళి సందర్భంగా తమ సిబ్బంది వృథా వస్తువులను తొలగించే క్రమంలో పనికి రాని ఓటరు జాబితాలను సైతం కాల్చేశారని సుభాష్ గుత్తేదార్ వివరించారు. ఇందులో ఎలాంటి కుట్రకోణం లేదన్నా రు.ఇలా ఉండగా, అలంద్ నియోజకవర్గం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సొంత జిల్లా కలబురిగి పరిధిలోనిదే కావడం గమనార్హం. అలంద్‌లో ఓట్ చోరీ జరిగినట్లు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ ఇటీవల చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై దర్యాప్తు కోసం కర్నా టకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిట్‌ను నియమించింది. కాగా, అలంద్ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి అవకతవకలు జరిగాయని మంత్రి ప్రియాంక్ ఖర్గే గురువారం ఆరోపించారు. వాటిపైనా సమగ్ర దర్యాప్తు జరపాల్సి ఉందన్నారు. ఈ ముఠా ఓటుకు రూ.80 చొప్పున వసూలు చేసిందన్నారు. ఇదంతా బీజేపీ నేతలు పాల్పడిన కుంభకోణమేనన్నారు. బాధ్యులను కటకటా ల్లోకి నెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, అప్పట్లో చీఫ్ ఎలక్టోరల్ అధికారి అడ్డుకోవడం వల్లే ఓట్ల తొలగింపు కుంభకోణానికి బ్రేకులు పడ్డాయని అలంద్‌లో 10వేల ఓట్ల తేడాతో గెలుపొందిన కాంగ్రెస్ సీనియర్ నేత బీఆర్ పాటిల్ తెలిపారు. -
డేటా సెంటర్ క్రెడిట్ చౌర్యం: వైఎస్ జగన్
గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.87 వేల కోట్లు అదానీ సంస్థ పెట్టుబడి పెడుతోంది. గూగుల్‌ను తీసుకొచ్చేందుకు.. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు అదానీ సంస్థ దీన్ని చేపట్టింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్. కట్టిన తర్వాత గూగుల్ దాన్ని క్లయింట్‌గా వాడుకుంటుంది. నేను ముందుగానే చెప్పినట్లు.. సబ్ సీ కేబుల్ రావాలి.. డేటా సెంటర్ కట్టాలి.. అప్పుడు గూగుల్ వస్తుంది. ఈ డేటా సెంటర్‌కు అవసరమైన హార్డ్‌వేర్, ఇతర టెక్నాలజీని గూగుల్ సమకూరుస్తోంది. ఇలాంటి డేటా సెంటర్లను మన దేశానికి చెందిన అదానీ లాంటి గొప్ప కంపెనీ కడుతోందని గొప్పగా, గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి క్రెడిట్ చోరీ చేస్తూ చంద్రబాబు సంకుచిత బుద్ధిని ప్రదర్శించారు. రూ.87 వేల కోట్లు పెట్టుబడి ఎవరు పెడతారండి? గూగుల్‌ను తెస్తున్నారని అదానీకి థ్యాంక్యూ చెప్పాల్సిన చంద్రబాబు కనీసం క్రెడిట్ ఇచ్చారా? – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుకు క్రెడిట్ చోరీ చేయడం కొత్త కాదని.. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి సొంత గొప్పలు చెప్పుకుంటూ సంకుచిత బుద్ధితో వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఏకంగా రూ.87 వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్‌ను నెలకొల్పుతున్న అదానీ పేరును గూగుల్‌తో ఒప్పందం సమయంలో సీఎం చంద్రబాబు కనీసం ప్రస్తావించకపోవడం ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే సీఎం చంద్రబాబు గూగుల్‌తో ఒప్పందం సమయంలో అదానీ పేరెత్తలేదంటూ దుయ్యబట్టారు. డేటా సెంటర్‌ను అదానీ సంస్థే నిర్మిస్తుందని.. ఆ సంస్థకు మూడు చోట్ల భూమిని అప్పగించాలంటూ ఈనెల 4న గూగుల్ ప్రతినిధి అలెగ్జాండర్ స్మిత్ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్‌కు రాసిన లేఖే నిదర్శనమంటూ.. వైఎస్ జగన్ ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. ఉత్తరాంధ్ర దశ, దిశ మార్చాలనే లక్ష్యంతో విశాఖను అంతర్జాతీయ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ 2020 నవంబర్‌లో తమ ప్రభుత్వ హయాంలోనే 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీతో ఒప్పందం చేసుకున్నామని గుర్తు చేశారు. డేటా సెంటర్‌కు డేటా రావాలంటే సింగపూర్ నుంచి 3,900 కి.మీ. పొడవున సబ్‌సీ (సముద్ర గర్భం)లో కేబుళ్లు వేయాలని.. అందుకోసం 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి లేఖ సైతం రాశామని పేర్కొంటూ ఆ లేఖ ప్రతులను విడుదల చేశారు. నోయిడాలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో డేటా సెంటర్ ఏర్పాటుకు 4.64 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్ లీజుకు తీసుకుందంటూ 2022 అక్టోబర్ 11న టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రచురించిందని ఆ క్లిప్పింగ్‌ను చూపారు. ఈ నేపథ్యంలో డేటా సెంటర్లకు సంబంధించి గూగుల్‌తో వ్యాపార అనుబంధం ఉన్న అదానీ సంస్థతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు 2023 మే 3న శంకుస్థాపన చేశామని.. అందుకోసం 190 ఎకరాల భూమిని కూడా కేటాయించామని గుర్తు చేశారు. దాని కొనసాగింపులో భాగంగానే ఇప్పుడు 300 నుంచి వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్‌ను విస్తరిస్తున్నారని స్పష్టం చేశారు. ఇందులో క్రెడిట్ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, సింగపూర్, కేంద్ర ప్రభుత్వానికి, అదానీకి దక్కుతుందని తేల్చి చెప్పారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన యాడ్ ఏజెన్సీ తరహాలో నడుస్తోందని తూర్పారబట్టారు. సీఎం చంద్రబాబు పాలనా సామర్థ్యంలో వీక్.. క్రెడిట్ చోరీలో పీక్.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే.. అదానీ ప్రాజెక్టుకు గూగుల్ విస్తరణ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా అదానీ చేసిన కృషి, కేంద్ర ప్రభుత్వంతో పాటు సింగపూర్ ప్రభుత్వం చేసిన కృషి.. వీరందరి కృషి వల్ల దాని కొనసాగింపులో భాగంగా ఈ రోజు గూగుల్ వచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆరోజు వేసిన విత్తనమే ఈ రోజు డేటా సెంటర్ కొనసాగింపు! గూగుల్ నెలకొల్పే 1,000 మెగావాట్ల కొత్త ప్రాజెక్టు ఇంతకు ముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టుకు విస్తరణ మాత్రమే. గూగుల్, అదానీ ఎంటర్ప్రైజెస్ మధ్య డేటా సెంటర్లకు సంబంధించి వ్యాపార సంబంధాలపై 2022 అక్టోబర్ 11న టైమ్స్ ఆఫ్ ఇండియా (క్లిప్ ప్రదర్శించారు) కథనం కూడా ప్రచురించింది. నోయిడాలోని అదానీ డేటా సెంటర్లో 4.64 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని గూగుల్ లీజుకు తీసుకుందన్నది దాని సారాంశం. ఈ నేపథ్యంలో ఇక్కడ (విశాఖలో) 2023 మే 3న అదానీ డేటా సెంటర్‌కు పునాది వేశాం. సింగపూర్ నుంచి సబ్ సీ కేబుల్‌కు అంకురార్పణ కూడా అప్పుడే జరిగింది. అంతకుముందే.. అదానీకి భూములు కేటాయిస్తూ 2020 నవంబర్‌లో జీవో ఇచ్చాం. ఆ వెంటనే 2021 మార్చి 9న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. సింగపూర్ నుంచి విశాఖపట్నానికి 3,900 కిలో మీటర్ల మేర సబ్ సీ కేబుల్ ఏర్పాటుకు సహాయం అందించాలని లేఖలో కోరాం. ఆ కారిడార్ క్రియేట్ చేస్తే డేటా విశాఖకు చేరుతుంది. డేటా సెంటర్ నిర్మించేది అదానీ సంస్థే.. విశాఖలో కూడా అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే ఈ డేటా సెంటర్‌ను నిర్మిస్తున్నాయి. ఈ మేరకు గూగుల్‌కు చెందిన అలెగ్జాండర్ స్మిత్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. చంద్రబాబు అండ్ కో ఇటీవల ఢిల్లీ వెళ్లి హడావుడి చేయకముందే.. సంతకాలు చేయకముందే.. 2025 అక్టోబర్ 4న అదానీ ఇన్ఫ్రాకు చెందిన మూడు కంపెనీలకు భూమి కేటాయింపులు చేయాలని గూగుల్ సంస్థ ఏపీ ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్‌ను లేఖలో కోరింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రూ.87 వేల కోట్లు అదానీ సంస్థ పెట్టుబడి పెడుతోంది. గూగుల్‌ను తీసుకొచ్చేందుకు.. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు అదానీ సంస్థ దీన్ని చేపట్టింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్. కట్టిన తర్వాత గూగుల్ దాన్ని క్లయింట్‌గా వాడుకుంటుంది. నేను ముందుగానే చెప్పినట్లు.. సబ్ సీ కేబుల్ రావాలి.. డేటా సెంటర్ కట్టాలి.. అప్పుడు గూగుల్ వస్తుంది. ఈ డేటా సెంటర్‌కు అవసరమైన హార్డ్‌వేర్, ఇతర టెక్నాలజీని గూగుల్ సమకూరుస్తోంది. ఇలాంటి డేటా సెంటర్లను మన దేశానికి చెందిన అదానీ లాంటి గొప్ప కంపెనీ కడుతోందని గొప్పగా, గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి క్రెడిట్ చోరీ చేస్తూ చంద్రబాబు సంకుచిత బుద్ధిని ప్రదర్శించారు. రూ.87 వేల కోట్లు పెట్టుబడి ఎవరు పెడతారండి? గూగుల్‌ను తెస్తున్నారని అదానీకి థ్యాంక్యూ చెప్పాల్సిన చంద్రబాబు కనీసం క్రెడిట్ ఇచ్చారా? ఎందుకు భయపడుతున్నారు? ఆ పేర్లు చెప్పడం మొదలు పెడితే.. బ్యాక్‌గ్రౌండ్‌లో వైఎస్సార్సీపీ వస్తుంది కాబట్టి. వైఎస్సార్సీపీ హయాంలో 300 మెగావాట్ల డేటా సెంటర్‌కు బీజం పడినప్పుడే.. గూగుల్, అదానీకి డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి వ్యాపార సంబంధం ఉంది. కేంద్రం, వైఎస్సార్సీపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం, అదానీ.. ఇంతమంది కృషితో గూగుల్ తెచ్చే కార్యక్రమానికి బీజం పడిందని చెప్పటానికి చంద్రబాబు సంశయించారు. క్రెడిట్ ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదు. బాబు ముఖారవిందాన్ని చూసి వచ్చేసినట్లు బిల్డప్.. డేటా సెంటర్లో అతి ముఖ్యమైన విషయం.. సింగపూర్, విశాఖ మధ్య సబ్ సీ కేబుల్ (సముద్ర గర్భంలో కేబుల్ వ్యవస్థ) 3,900 కిలోమీటర్ల మేర నిర్మాణం. అదానీ డేటా సెంటర్ ఏర్పాటులో భాగంగా ఈ కేబుల్ వ్యవస్థను తీసుకుని రావాలని అప్పట్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, కేంద్రం, సింగపూర్ ప్రభుత్వం సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. ఈ రోజు అంతా అయిపోయిన తర్వాత చంద్రబాబు వచ్చి తన సుందర ముఖారవిందాన్ని చూసి గూగుల్ వచ్చేసినట్లు బిల్డప్ ఇస్తున్నారు. మిగిలిన వాళ్లందరి కృషిని సైడ్ లైన్ చేసేశారు. రూ.87 వేల కోట్లు పెడుతున్న అదానీ.. గూగుల్– రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో కనీసం కనిపించలేదు. 190 ఎకరాలు కేటాయింపు.. వైఎస్సార్సీపీ హయాంలోనే 300 మెగావాట్ల డేటా సెంటర్ కోసం 190 ఎకరాలు విశాఖలో కేటాయించాం. మధురవాడలో 130 ఎకరాలు, కాపులుప్పాడలో 60 ఎకరాలు ఇచ్చాం. డేటా సెంటర్ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు సబ్ సీ కేబుల్‌ను సింగపూర్ నుంచి విశాఖపట్నానికి తీసుకురావడానికి అంకురార్పణ చేశాం. ఇవాళ కొత్తగా వస్తున్న 1,000 మెగావాట్ల గూగుల్ ప్రాజెక్టుకు.. నాడు 300 మెగావాట్ల ప్రాజెక్టు ఇవ్వడమే కీలకంగా మారింది. ఏఐ భవిష్యత్తులో ప్రపంచాన్ని డామినేట్ చేసే టెక్నాలజీ. ఏఐ అయినా, క్వాంటం కంప్యూటింగ్ అయినా.. భవిష్యత్తులో గొప్ప మార్పులకు డేటా సెంటర్ నోడల్ పాయింట్‌గా ఉంటుంది. డేటా సెంటర్‌తో ఉద్యోగాలు తక్కువే అయినా.. ఎకో సిస్టమ్ తయారవుతుంది. తద్వారా గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్ వస్తాయి. కాబట్టి వీటికి మా ప్రభుత్వంలోనే నాంది పలికాం. కేవలం 300 మెగావాట్ల డేటా సెంటర్ పెడితే ఉద్యోగాలు తక్కువ వస్తాయి కాబట్టి అంతటితో మేం ఆగలేదు. ఆ రోజు అదానీతో చేసుకున్న ఒప్పందంలో 25 వేల ఉద్యోగాలు కల్పించాలని కోరాం. ఐటీ పార్క్, స్కిల్ సెంటర్, రిక్రియేషన్ సెంటర్ల ద్వారా ఉద్యోగాలు తీసుకొచ్చేలా ఒప్పందంలో పెట్టాం. క్రెడిట్ చోరీల్లో బాబు పీక్..! చంద్రబాబుకు క్రెడిట్ చోరీ చేయడం కొత్తకాదు. హైదరాబాద్ విషయంలోనూ చంద్రబాబుది సేమ్ స్టోరీ. మాదాపూర్‌లో సైబర్ టవర్స్.. ఆరు ఎకరాల స్థలంలో చిన్న ప్రాజెక్టు. దానిపేరు హైటెక్ సిటీ. నిజానికి అక్కడ ఐటీ స్పేస్ కట్టడానికి అప్పటి సీఎం ఎన్.జనార్థన్‌రెడ్డి పునాది వేశారు. చంద్రబాబు దాన్ని ఎప్పుడూ చెప్పరు. ప్రభుత్వ ఆధ్వర్యంలో దాన్ని చేపట్టేందుకు నాడు జనార్దన్‌రెడ్డి శ్రీకారం చుడితే చంద్రబాబు సీఎం అయ్యాక రద్దు చేసి ప్రైవేటుకు ఇచ్చేశారు. దాంతో హైదరాబాద్ మొత్తం నేనే కట్టానని బిల్డప్ ఇస్తున్నారు. ⇒ 2004లో చంద్రబాబు ఓడిపోయారు. ఆ తర్వాత హైదరాబాద్ ఆయన చేతుల్లో లేదు. 2004, 2009లో వైఎస్సార్ గెలిచారు. తర్వాత మరో రెండు సార్లు కేసీఆర్ గెలిచారు. ఏకంగా 20 ఏళ్లపాటు చంద్రబాబుకి, హైదరాబాద్‌కు ఎలాంటి సంబంధం లేదు. అయినా 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అంతా తనదే అంటారు. ఇదీ చంద్రబాబు బిల్డప్. ⇒ అయ్యా చంద్రబాబూ.. ఆరు ఎకరాల్లో 1.40 లక్షల చదరపు అడుగుల్లో చిన్న బిల్డింగ్ కడితే.. హైటెక్ సిటీ అని పేరు పెడితే.. దానితోనే అభివృద్ధి చెందింది అనుకోవడం మూర్ఖత్వం. దాని తర్వాత నువ్వు వెళ్లిపోయావు. 2004లో రాజశేఖరరెడ్డి సీఎం అయ్యారు. ఆ తర్వాత ఓఆర్ఆర్ ఫేజ్–1ను 126 కి.మీ. ప్రాజెక్టును 2006లో ప్రారంభించి 2012లో పూర్తిచేశారు. అది హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చేసింది. పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే 11.6 కి.మీ. ఫ్లైఓవర్.. దేశంలోనే అతి పొడవైనది. దీనిని అక్టోబర్ 2005లో ప్రారంభించి 2009 అక్టోబర్ 19న పూర్తి చేశారు. ⇒ జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మార్చి 2005లో ప్రారంభిస్తే 23 మార్చి 2008లో పూర్తి చేశారు. ఇవన్నీ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించి పూర్తి చేసినవే. ⇒ చంద్రబాబు దిగిపోయే నాటికి 2003–04లో ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ, అనుబంధ ఎక్స్‌పోర్ట్స్ రూ.5,660 కోట్లు మాత్రమే. వైఎస్సార్ సీఎం అయ్యాక 2004–09లో ఐటీ, అనుబంధ రంగాల ఎగుమతులు రూ.32,509 కోట్లకు చేరాయి. ఆయన అవన్నీ పూర్తి చేసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంతోనే ఇదంతా జరిగింది. ⇒ వైఎస్సార్ రెండో సారి గెలిచి సీఎం అయిన కొద్ది నెలలకే చనిపోయినా.. ఆయన గెలిపించి ఇచ్చిన ప్రభుత్వం కొనసాగింపులో భాగంగా 2013–14లో ఐటీ ఎక్స్‌పోర్టులు రూ.57 వేల కోట్లకు చేరాయి. కానీ, చంద్రబాబు హైదరాబాద్‌ను నేనే కట్టేశా... ఐటీ అంటే నేనే అని చెప్పుకుంటున్న పరిస్థితి..! ఈ వ్యత్యాసం చూస్తే అసలు విషయం తెలుస్తుంది. నాన్న తర్వాత కేసీఆర్ రెండు టెర్మ్‌లు పాలించారు. ఆయన కూడా గొప్పగా వైఎస్సార్ ఆపిన దగ్గర నుంచి ప్రారంభించి గొప్పగా పాలించారు. తద్వారా హైదరాబాద్ ఐటీలో టాప్‌లోకి వెళ్లింది. ⇒ చంద్రబాబు హయాంలో రూ.5,660 కోట్లు దగ్గర నుంచి.. ఈరోజు తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.2 లక్షల కోట్లకు చేరాయి. 20 ఏళ్లలో ఇంత జరిగితే.. మొత్తం హైదరాబాద్ నేనే కట్టా అంటే ఎలా? చంద్రబాబుకు ఇది కొత్తకాదు. పబ్లిసిటీ స్టంట్స్ చేస్తారు. వేరేవాళ్లకు ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ వాళ్లకు ఇవ్వకపోవడం చంద్రబాబుకు ఉన్న దుర్మార్గపు నైజం.అభివృద్ధికి విజన్ ఉండాలి.. మా హయాంలో అదానీ డేటా సెంటర్ తద్వారా వచ్చిన గూగుల్, ఇన్ఫోసిస్, ఇనార్బిట్ మాల్, కైలాసగిరి సైన్స్ మ్యూజియం, రిషికొండ వద్ద టీటీడీ దేవాలయం, ఎనీ్టపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్.. ఇవన్నీ కొన్ని ప్రాజెక్టులు. విశాఖపట్నం నుంచి ఎయిర్ పోర్టుతో పాటు మూలపేట పోర్టుకు అనుసంధానిస్తూ రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఈ కారిడార్ ఏర్పాటుకు అప్పటి కేంద్ర మంత్రి గడ్కరీని ఒప్పించి మరీ స్టేట్మెంట్ ఇప్పించాం. అదీ విజన్ అంటే. ఇవన్నీ పూర్తయితే పురోగతి అనేది కనిపిస్తుంది. నంబర్స్ కనిపిస్తాయి. మా హయాంలో దేవుడి దయతో, ప్రజల ఆశీర్వాదాలతో రెండేళ్లు కోవిడ్ ఉన్నా గొప్పగా అభివృద్ధి, సేవలందించాం. గొప్ప సంస్కరణలకు శ్రీకారం.. మా హయాంలో నాడు–నేడు ద్వారా స్కూళ్లు మార్చాం. డిజిటల్ క్లాస్ రూమ్స్, టోఫెల్ క్లాస్‌లు, 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, సీబీఎస్ఈ కాదు ఐబీ సిలబస్ తీసుకువచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. విద్య, వైద్యం, వ్యవసాయంలో అనూహ్య మార్పులు తెచ్చాం. గ్రామాల్లో పౌర సేవలను గడప వద్దకు తీసుకువచ్చాం. గవర్నమెంట్ సేవల్లో పారదర్శకత ఉండదనే భావన లేకుండా చేశాం. ప్రభుత్వ సేవలు లంచాలు లేకుండా పొందగలమనే అభిప్రాయం ప్రజల్లో స్వచ్ఛందంగా నిరూపించగలిగాం. గొప్ప సంస్కరణలు తీసుకువచ్చాం. అందుకే సంతోషంగా, గర్వంగా ఉన్నాం. మూడేళ్లలో ఎవరూ చేయలేని గొప్ప కార్యక్రమాలు చేయగలిగాం. అందుకే ఇప్పటికీ చిరునవ్వుతో మా పార్టీ క్యాడర్ ఏ గడప వద్దకు అయినా వెళ్లగలుగుతున్నారు. మహిళా సాధికారత, సంస్కరణలు మాకు శ్రీరామ రక్ష. అందుకే ప్రజలను మమ్మల్ని ఇప్పటికీ ఆత్మీయంగా ఆదరిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో విశాఖను నిలబెట్టాలని..ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విశాఖ కీలక కేంద్రం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలను తలదన్నే రీతిలో ఏపీ ఉండాలంటే విశాఖను అభివృద్ధి చేయాలని తలపెట్టాం. అందుకే ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడుగులు వేశాం. అందులో భాగంగా 2,700 ఎకరాల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేశాం. భూ సేకరణకు, ఆర్‌అండ్‌ఆర్‌కు రూ.900 కోట్లు ఖర్చు చేశాం. గతంలో చంద్రబాబు ఈ ఎయిర్‌పోర్టుకు కేవలం 377 ఎకరాలు మాత్రమే భూమిని సేకరించారు. వైఎస్సార్ సీపీ హయాంలో వేగంగా చర్యలు చేపట్టి 30 శాతం పనులు పూర్తి చేశాం. మరో ఏడాదికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. అంతే కాదు.. శ్రీకాకుళంలో మూలపేట పోర్టు ద్వారా ఉత్తరాంధ్ర దశ, దిశ మార్చే ప్రయత్నం చేశాం. భూ సేకరణతో పాటు అన్ని అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించి 30 శాతం పనులు పూర్తి చేశాం. విజయనగరంలో మెడికల్ కాలేజీ కడితే 3 బ్యాచ్‌లు క్లాసులు, కోర్సులు కూడా కంప్లీట్ అయ్యాయి. పాడేరు మెడికల్ కాలేజీలో క్లాసులు స్టార్ట్ అయ్యాయి. పార్వతీపురం, నర్సీపట్నం మెడికల్ కాలేజీల పనులు జరుగుతున్నాయి. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు రూ.100 కోట్లు వెచ్చించాం. రూ.600 కోట్లు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేజ్ వాటర్ తీసుకొచ్చి డయాలసిస్ రోగులకు శాశ్వత పరిష్కారం చూపించాం. ⇒ సీతంపేట, పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు దాదాపు పూర్తి చేశాం. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ పూర్తయ్యే దశలో ఉన్నాయి. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పనులు జరుగుతున్నాయి. నక్కపల్లిలో ఇండ్రస్టియల్ హబ్, అన్నవరంలో ఒబెరాయ్ హోటల్ రిసార్ట్ తీసుకొచ్చాం. డెస్టినేషన్‌గా విశాఖపట్నం ఉండాలంటే 5 స్టార్ హోటళ్లు కాదు.. ఏకంగా ఫైవ్ స్టార్ రిసార్టులు ఉండాలని సంకల్పించాం. ⇒ రుషికొండ హై ఎండ్ టూరిజం రిసార్ట్ నిర్మించాం. అదొక మాన్యుమెంట్ బిల్డింగ్. అమరావతిలో చదరపు అడుగకు రూ.10 వేలు పెట్టి.. కట్టిందే కడుతున్నారు. డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. ఎన్నిసార్లు కడతారో అర్థం కాదు. అదే సెక్రటేరియట్ రెండుసార్లు కడతారు.. అదే అసెంబ్లీ రెండు సార్లు కడతారు. డబ్బులు వృథా చేస్తుంటే ఎవరూ ప్రశ్నించరు. ఎందుకంటే.. ఎల్లో మీడియా మొత్తం వాళ్లే. అంతా దోచుకోవడం, పంచుకోవడం తినుకోవడం! బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో సైతం ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ ఉన్న ఫ్లాట్లు నిర్మాణ ఖర్చు చదరపు అడుగుకు రూ.4500 దాటదు. కానీ అమరావతిలో రూ.10 వేలు పెట్టి కడుతున్నారు. ఎవడూ స్కామ్ అనడు. ఎందుకంటే స్కాములో వీళ్లంతా భాగస్వాములే.అదానీ డేటా సెంటర్‌కు కొనసాగింపే గూగుల్‘‘డేటా సెంటర్‌ను మేం ఎక్కడా వ్యతిరేకించడం లేదు. మద్దతు ఇస్తున్నాం. మేం విత్తనం వేశాం కాబట్టే డేటా సెంటర్ ఏర్పాటవుతోంది. అదానీ డేటా సెంటర్‌కు కొనసాగింపే గూగుల్ డేటా సెంటర్. ప్రస్తుతం మనం ఏఐ యుగం, క్వాంటం కంప్యూటింగ్ యుగాల్లోకి పోతున్నాం. వీటన్నింటికీ హబ్ అనేది డేటా సెంటర్. డేటా సెంటర్ ఉంటేనే ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. పవర్ రిక్వైర్మెంట్, వాటర్ గజిలింగ్ (ఎక్కువ విద్యుత్, ఎక్కువ నీటి వినియోగం) లాంటి కొన్ని సమస్యలు వచ్చినా సర్టైన్ కెపాసిటీ బిల్డ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. అప్పటి దాకా ప్రతి ఒక్కరూ దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. డేటా సెంటర్‌తోపాటు ఐటీ స్పేస్ కూడా కట్టాలి.. తద్వారా 25 వేల ఉద్యోగాలు ఇవ్వాలని మేం ఒప్పందంలో పెట్టగలిగాం. నిర్దేశించిన సమయంలోగా ఇవన్నీ కట్టాలి, రావాలి అని ఒప్పందంలో పొందుపరిచాం. ఇది వీళ్లు చేయగలిగితే ఇంకా మెరుగ్గా ఎకో సిస్టమ్ అనేది వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది’ అని వైఎస్ జగన్ ఒక ప్రశ్నకు సమాధానంగా వివరించారు. -
గల్లా పట్టి నిలదీయండి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీషీటర్‌ను పోటీలో నిలబెట్టి ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టింది. కాంగ్రెస్ ప్రచారంలో రౌడీషీటర్లు పాల్గొంటూ కత్తులు, కటార్లతో ఇప్పుడే వీరంగం వేస్తున్నారు. రౌడీలను గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇజ్జత్ (గౌరవం) ఉంటుందా? రౌడీషీటర్‌గా పేరున్న కాంగ్రెస్ అభ్యర్థి పొరపాటున గెలిస్తే నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉంటుంది. రౌడీషీటర్ కుటుంబం నుంచి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించి నియోజకవర్గ గౌరవంతోపాటు హైదరాబాద్‌లో శాంతిభద్రతలను ఓటర్లు కాపాడుకుంటారనే నమ్మకం ఉంది’అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజలతో మమేకమై కాంగ్రెస్ దుష్ట పాలనపై అవగాహన కల్పించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీ సాధించేలా కష్ట పడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎర్రవల్లి నివాసంలో గురువారం కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. సుమారు మూడు గంటలపాటు సాగిన సుదీర్ఘ సమావేశంలో పార్టీ అభ్యర్థి గెలుపు, భారీ మెజారిటీ సాధన కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలు, కార్యాచరణపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ పెద్దలను గల్లా పట్టి నిలదీయాలి ఓట్ల కోసం వచ్చే ప్రభుత్వ పెద్దలను గల్లాపట్టి నిలదీయాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘రాష్ట్రంలో దిగజారిన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి నిలిచిపోవడం గురించి ఇంటింటికీ తిరిగి వివరించండి. హైడ్రా పేరిట బుల్డోజర్లను పేదల గుడిసెల మీదికి పంపి నిలువ నీడ లేకుండా చేస్తున్న ప్రభుత్వ పెద్దలను ఓటు కోసం వస్తే గల్లా పట్టి నిలదీయాలి. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో మానవీయ కోణంలో అమలు చేసిన కేసీఆర్ కిట్ నుంచి కళ్యాణలక్ష్మి వరకు పథకాలు నిలిచిపోవడానికి కారకులైన కాంగ్రెస్ నేతలను ప్రజలు ప్రశ్నించాలి. కరోనాతో పాటు పెద్దనోట్ల రద్దుతో సంభవించిన ఆర్థిక సంక్షోభాన్ని కూడా తట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాం, కానీ, రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిలో ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసహ్యం, ఏహ్య భావం నిండివుంది. ప్రజల చేతిలో పైసలు ఆడక పరేషాన్లో ఉన్నారు. రెండేళ్లు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఖతం చేసింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీయే అని తెలంగాణ సమాజం స్పష్టతతో ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపును ప్రజలు ఎప్పుడో ఖాయం చేశారు. భారీ మెజారిటీ సాధించేలా ప్రజలతో కలిసి పనిచేయడం మీ బాధ్యత’అని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. రాష్ట్రానికైనా, కుటుంబానికైనా పతారా (పరపతి) ఉంటేనే అతార (డిమాండ్) పెరుగుతుందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ గురించి ప్రజలు ఆలోచించడం లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఒక చార్టును తయారు చేసుకుని ప్రజల్లోకి వెళ్లి, తాము అందుబాటులో ఉంటామని భరోసా ఇవ్వాలని ఆదేశించారు. ఎర్రవల్లి నివాసంలో నేతల సందడి ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌తో పాటు ఉప ఎన్నిక కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జి జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. వీరితోపాటు ఉప ఎన్నికలో పార్టీ తరపున డివిజన్, క్లస్టర్ ఇన్చార్జిలుగా ప్రచారం చేస్తున్న పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ నేపథ్యంలో ఎర్రవల్లి నివాసం సందడిగా మారింది. సమావేశానికి వచ్చిన నేతలను కేసీఆర్ పేరు పేరునా పలకరించారు. పార్టీ అభ్యర్థి వెంట ప్రచారంలో ఉండాలని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. -
స్థానికంపై 7న నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణపై వచ్చే నెల 7వ తేదీన తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం.. ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై న్యాయ నిపుణుల సలహాల ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం గురువారం రాష్ట్ర సచివాలయంలో సుదీర్ఘంగా సమావేశమై పలు అంశాలపై చర్చించింది. అనంతరం రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సచివాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై నవంబర్ 3న హైకోర్టులో జరగనున్న విచారణలో వెలువడే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. నవంబర్ 7న మళ్లీ మంత్రివర్గ సమావేశం నిర్వహించి రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ తీర్మానించినట్లు వివరించారు. ఎస్ఎల్బీసీలో టీబీఎంకు స్వస్తి శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టు సొరంగం తవ్వకాల కోసం ఇప్పటి వరకు అనుసరించిన టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) విధానాన్ని పక్కనబెట్టి, అత్యాధునిక డ్రిల్లింగ్ పరిజ్ఞానంతో మిగతా పనులు పూర్తిచేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. దివాళా పరిష్కార ప్రక్రియను ఎదుర్కొంటున్న నిర్మాణ సంస్థ జయప్రకాశ్ అసోసియేట్స్‌తో గతంలో చేసుకున్న ఒప్పందాన్నే కొనసాగిస్తూ ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభం నాటికి లేదా 2028 జూన్‌లోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. జలయజ్ఞంలో భాగంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా ఫ్లోరైడ్ బాధిత నల్లగొండ జిల్లాకు 30 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ప్రారంభించిన ఎస్ఎల్బీసీ సొరంగ నిర్మాణం ప్రాజెక్టును గత బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం చేసిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. 44 కి.మీ.ల సొరంగం తవ్వాల్సి ఉండగా, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 31–32 కి.మీల తవ్వకాలు జరిగాయని, ఆ తర్వాత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కారు 2–2.5 కి.మీ.ల మేర మాత్రమే తవ్వకాలు జరిపిందని విమర్శించారు. ప్రపంచంలోనే అతి పొడువైన 44 కిలోమీటర్ల సొరంగంలో రెండు వైపుల నుంచి ఇప్పటివరకు 35 కిలో మీటర్ల సొరంగం తవ్వకం పూర్తయింది. మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగం తవ్వడానికి అటవీ, పర్యావరణ, వన్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడాలని కేబినెట్ తీర్మానించింది. 1,500 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ యూనిట్లు... రాష్ట్రంలో 1,500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలకు రాష్ట్ర కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ యూనిట్లను ఎక్కడ ఏర్పాటుచేయాలనే అంశంపై విద్యుత్ శాఖ తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. రామగుండంలో 52 ఏళ్ల క్రితం నిర్మించిన 62.5 మెగావాట్ల థర్మల్ బీ–స్టేషన్‌ను తొలగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పుడున్న విద్యుత్తు అవసరాలు, రాబోయే పదేళ్ల విద్యుత్ డిమాండ్ అంచనాలకు అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక తయారు చేయాలని విద్యుత్ శాఖను కేబినెట్ ఆదేశించింది. సౌర, బ్యాటరీ స్టోరేజీ, రివర్స్ పంపింగ్ ద్వారా అందుకు అవసరమైన విద్యుదుత్పత్తికి వ్యూహాలు సిద్ధం చేయాలని కోరింది. ఆ నిబంధన ఎత్తివేత.. ఇద్దరికి మించి సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని ప్రస్తుతం అమ ల్లో ఉన్న నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆ మోదం తెలిపింది. ఇందుకోసం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 21(3)ని తొలగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ ద్వారా చట్టసవరణ కోసం గవర్నర్‌కు ఫైల్ పంపాలని నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. నిర్మాణంలో ఉన్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఎల్బీనగర్, సనత్‌నగర్, అల్వాల్ టిమ్స్ ఆస్పత్రులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు వెల్లడించారు. -
‘మేమేం చేయాలో..నువ్వు చెప్పడం ఏంటి?’
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ ఏం చేయాలో ట్రంప్ చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు.ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. ‘భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపుతోంది’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను శశి థరూర్ ఖండించారు. ట్రంప్ అసత్యమైన, ఆధారాలు లేని వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. భారత్ ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని, అది అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా జరుగుతోందని స్పష్టం చేశారు.భారత్ తన జాతీయ ప్రయోజనాల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటుందని, అమెరికా అధ్యక్షుడు భారత్ తరఫున నిర్ణయాలు ప్రకటించడం అనవసరమని థరూర్ అన్నారు. ఇది భారత స్వతంత్రతను, విదేశాంగ విధానాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన విమర్శించారు.విదేశాంగ వ్యవహారాల్లో అనుభవం కలిగిన నేతగా, శశి థరూర్ మాట్లాడుతూ ..భారత్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే దేశం. ఇతర దేశాల నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. కానీ భారత్ తరఫున నిర్ణయాలు ప్రకటించడం అనైతికం’అని అన్నారు. -
నేను ఆధారాలు లేకుండా ఏనాడు మాట్లాడలేదు: భూమన
సాక్షి, తిరుపతి: తాను ఆధారాలు లేకుండా ఏనాడు మాట్లాడలేదని.. తనపై వ్యక్తిగత దాడికి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ‘‘11.04.25న మీడియా సమావేశంలో గోశాలలో గోవులు అధికంగా మరణిస్తున్నాయని నేను మాట్లాడిన దానికి కట్టుబడి ఉన్నా’’ అని భూమన స్పష్టం చేశారు.‘‘గోవుల పట్ల నిర్లక్ష్యంగా తగదని నేను మాట్లాడాను. పోలీస్ విచారణకు పిలిచారు. నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండ అసభ్య పదజాలంతో కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. నేను వాస్తవాలు చెబితే సమాధానాలు ఇవ్వడం లేదు. వాళ్ల మీడియాలో నాపై విష ప్రచారం చేస్తున్నారు. మీ చేతిలో అధికారం ఉంది. విచారణ చేయించాలి కదా?’’ అంటూ భూమన ప్రశ్నించారు. -
నాన్‌స్టాప్ ఉతుకుడు.. సరిపోయిందా బాబూ?
సాక్షి,తాడేపల్లి: ఎఫీషియన్సీ వీక్..క్రెడిట్ చోరీలో పీక్ అంటూ చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దుమ్మెత్తిపోశారు. గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో ‘గూగుల్ డాటా సెంటర్ గురించి మాట్లాడుకుందాం. గూగుల్ డాటర్ సెంటర్‌కు బీజం వేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.ఏపీలో 2020లో కరోనా టైంలోనే అదానీ డాటా సెంటర్ ఒప్పందానికి బీజం వేశాం. 2023 మే 3న.. ఆ తర్వాత డాటా సెంటర్‌కు శంకుస్థాపన కూడా చేశాం. సింగపూర్ నుంచి సబ్‌సీ కేబుల్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. దీనికి కొనసాగింపుగానే గూగుల్ డాటా సెంటర్ వచ్చింది. వైఎస్సార్సీపీ వేసిన బీజానికి కొనసాగింపే విశాఖ గూగుల్ డాటా సెంటర్ ఇది. వేరే వాళ్లకి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు..అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. గూగుల్ డాటా సెంటర్‌పై వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే? ఈ లింక్ క్లిక్ చేయండి. మద్యం ఇకపై అమ్మేటప్పుడు బాటిళ్లపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అసలు ఆ షాప్‌లు ఎవరి చేతుల్లో ఉన్నాయి. అవి చంద్రబాబు చేతుల్లోనే కదా? అంటే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు కాదా?. మరి అలాంటప్పుడు ఎవరు స్కాన్ చేసేది?.అంటూ మద్యం అమ్మకాలు,కల్తీ మద్యంపై వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు పాలన,వైఎస్సార్ హయాంలో హైదరాబాద్ అభివృద్ధి వంటి అంశాలను మీడియా సమావేశంలో ప్రస్తావించారు. ఈ మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే? ఈ లింక్ క్లిక్ చేయండి.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సినిమా వాళ్లను పిలిచి మరీ అవమానించారంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఈ అంశం మొదలుపెట్టగా.. ఆ వెంటనే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దానిని కొనసాగించారు. అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్లు.. పవన్ కల్యాణ్ మౌనంపై ప్రెస్మీట్లో ఓ రిపోర్టర్ వైఎస్ జగన్‌ను స్పందన కోరారు. అందుకు వైఎస్ జగన్ ఏమన్నారంటే? ఈ లింక్ క్లిక్ చేయండిఉద్యోగులకు జీపీఎస్ లేదు.. ఓపీఎస్ లేదు. ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఉద్యోగులను మోసం చేసి చంద్రబాబు వికృత ఆనందం పొందుతున్నాంటూ దుయ్యబట్టారు. ఇలా ఉద్యోగుల్నే కాదు రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు చేస్తున్న మోసాల్ని వైఎస్ జగన్ కళ్లకు కట్టినట్లు చూపించారు. చంద్రబాబు మోసాలేంటో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండిహైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబుకు అసలు సంబంధమే లేదు. కానీ చంద్రబాబు మాత్రం హైదరాబాద్ అంతా తానే కట్టినట్టు బిల్డప్ ఇస్తారు. వైఎస్సార్ వచ్చాక హైదరాబాద్ రాత మారింది. క్రెడిట్ ఇవ్వకపోవడమన్నది బాబు దుర్మార్గపు నైజం. ‘ఆరు ఎకరాల్లో హైటెక్ సిటీకి పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్ అంటూ హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానంటూ చంద్రబాబు ఇస్తున్న బిల్డప్‌ను బయటపెడుతూ.. హైదరాబాద్ అభివృద్ధి ఎలా జరిగిందో సంవత్సరాలతో సహా వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధి తీరుతెన్నులపై వైఎస్ జగన్ ఏమన్నారో ఈ లింక్ క్లిక్ చేసి చూడండి. -
ఎస్పీ కార్యాలయంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి ఝలక్
సాక్షి,అనంతపురం:తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి అనంతపురం ఎస్పీ జగదీష్ అపాయింట్మెంట్ నిరాకరించారు. ఐపీఎస్ అధికారి తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జగదీష్ ప్రకటించారు. ఈ క్రమంలో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ఎస్పీ కార్యాలయానికి జేసీ ప్రభాకర్‌రెడ్డి వచ్చారు. గంట సేపు వేచి ఉన్నా జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎస్పీ జగదీష్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో చేసేది లేక ఇంటికి తిరిగి వెళ్లారు. -
‘ఎమ్మెల్యే టికెట్ కోసం కేశినేని చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారు’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎమ్మెల్యే టికెట్ కోసం టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన విషయాలు బయటపెట్టారు. కేశినేని చిన్నికి సంబంధించిన ఆధారాలను కొలికపూడి బయటపెట్టారు. రూ.5 కోట్లు తీసుకుని తనకు తిరువూరు టికెట్ ఇచ్చారన్న కొలికపూడి.. సంచలన ఆధారాలను బయటపెట్టారు.2024 ఎన్నికల్లో కేశినేని చిన్ని నన్ను ఐదు కోట్లు అడిగాన్న కొలికపూడి.. తన అకౌంట్ నుంచి ఎవరెవరికి ఎంత ట్రాన్స్ఫర్ చేశారో ఆయన బయటపెట్టారు. ‘‘2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశా. 2024 ఫ్రిబవరి 8న మరో రూ. 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశా. 2024 ఫిబ్రవరి 14న రూ. 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశా. కేశినేని చిన్ని పీఏ మోహన్‌కు రూ. 50 లక్షలు.. గొల్లపూడిలో నా మిత్రుల ద్వారా రూ.3.5 కోట్లు ఇచ్చా.. ఈ వివరాలన్నీ రేపు మాట్లాడుకుందాం’’ అంటూ కొలికపూడి సంచలన పోస్టు పెట్టారు. నిజం గెలవాలి.. నిజమే గెలవాలి అంటూ కొలికపూడి పెట్టిన పోస్టు సంచలనంగా మారింది.మరోవైపు.. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌పై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. ‘‘తిరువూరులో దొంగే దొంగ అని అరుస్తున్నాడు. నాపై విమర్శలు చేసిన వాళ్లు సాక్ష్యాలు ఇవ్వాలి. నేను డబ్బులు సంపాదించుకోవాలంటే తిరువూరు వరకూ రావాల్సిన అవసరం లేదు. తిరువూరు ఎమ్మెల్యే వ్యవహారశైలి ఇప్పటికే పార్టీ దృష్టికి వెళ్లాయి’’ అని చిన్ని వ్యాఖ్యానించారు. -
చిరు-బాలయ్య ఎపిసోడ్‌పై స్పందించిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సినిమా వాళ్లను పిలిచి మరీ అవమానించారంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఈ అంశం మొదలుపెట్టగా.. ఆ వెంటనే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దానిని కొనసాగించారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మీద కాస్త దురుసు వ్యాఖ్య చేశారు. ఇది అటు అభిమానుల మధ్యే కాదు.. ఇటు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది కూడా. అయితే తాజాగా ఈ ఎపిసోడ్‌పై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్లు.. పవన్ కల్యాణ్ మౌనంపై ఓ రిపోర్టర్ వైఎస్ జగన్‌ను స్పందన కోరారు. ‘‘అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి? ఆయన మాట్లాడింది ఏంటి?. పనిపాట లేని సంభాషణ చేశారు. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు. తాగి వచ్చిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుతించారు?. అలా మాట్లాడేందుకు అనుమతించినందుకు స్పీకర్‌కు బుద్ది లేదు. బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో అక్కడే అర్థమవుతోంది. అలా మాట్లాడినందుకు సైకలాజికల్ ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలి’’ అని జగన్ అన్నారు. ఇదిలా ఉంటే..శాసనసభలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడిన అంశంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ తన ప్రస్తావన తీసుకురావడంపై స్పందిస్తూ చిరంజీవి ఆనాడే ఓ ప్రకటన విడుదల చేశారు. సినిమా వాళ్లకు ఎలాంటి అవమానం జరగలేదని, ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను సాదరంగా ఆహ్వనించారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
కమీషన్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో కమీషన్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో అగ్రికల్చర్ పోయి.. గన్ కల్చర్ వచ్చింది. రాష్ట్రంలో కమీషన్ల పాలన నడుస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణభవన్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ రెడ్డి పాలనలో అరాచకం నడుస్తోంది. కాంగ్రెస్ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చారు. కమీషన్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో అధికారులు భయపడుతున్నారు. తెలంగాణలో అగ్రికల్చర్ పోయి.. గన్ కల్చర్ వచ్చింది. రాష్ట్రంలో కమీషన్ల పాలన నడుస్తోంది. అసమర్థ, పనికిమాలిన చెత్త ముఖ్యమంత్రిని నాజీవితంలో చూడలేదు. రేవంత్ రెడ్డిని వదిలించుకుంటే తప్ప.. తెలంగాణకు పట్టిన శని పోదు. ముఖ్యమంత్రి అల్లుడు, మంత్రి కొడుకు పంచాయితీలో ఐఏఎస్ అధికారి రిజ్వీ బలి. 500కోట్ల టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి జూపల్లి మధ్య పంచాయితీ వచ్చింది. మంచిరేవుల భూముల వ్యవహారంలో రేవంత్ తమ్ముడు, మంత్రి కొండా కుటుంబం మధ్య గొడవ. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే.. కిషన్ రెడ్డి, బండి సంజయ్, అమిత్ షా ఎందుకు మాట్లాడటం లేదు?. రేవంత్.. శంకరాహిల్స్లో ఏం చేస్తున్నారో.. సర్వే నంబర్ 83లో ఏం చేయాబోతున్నారో మాకు అన్నీ తెలుసు.ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య పంపకాల విషయంలో గొడవలతో తెలంగాణ పరువు పోయింది. తన మాట వినలేదని.. మంచి అధికారి మీద మంత్రి జూపల్లి కక్ష తీర్చుకుంటున్నాడు. ముమ్మాటకీ రాష్ట్రాన్ని దండుపాళ్యం ముఠానే నడుపుతుంది. దండుపాళ్యం ముఠాకి నాయకుడు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం కాదు.. మాఫియా రాజ్యాం నడుస్తుంది. ముఖ్యమంత్రి కుర్చీలో దావూద్ ఇబ్రహీం తమ్ముడు కూర్చున్నాడు. తన ఇంటి మీదకు ముఖ్యమంత్రే పోలీసులను పంపారని మంత్రి కుమార్తె చెప్పారు. తుపాకీ ఇచ్చింది రేవంత్.. పెట్టింది రోహిణ్ రెడ్డి అని మంత్రి కొండా కుమార్తె చెప్తుంది. మంత్రి కుమార్తె ఆరోపణలపై ఎందుకు విచారణ జరపటం లేదో డీజీపీ శివధర్ రెడ్డి చెప్పాలి.మంత్రి ఉత్తమ్‌కు సంబంధం ఉందని మంత్రి కొండా సురేఖ కూతురు చేసిన ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేయాలి. పింక్ బుక్, రెడ్ బుక్ లేదు.. ఖాకీ బుక్ మాత్రమే ఉందని శివధర్ రెడ్డి అన్నారు. ఖాకీ బుక్ ఎక్కడో డీజీపీ చెప్పాలి. మంచి అధికారిగా శివధర్ రెడ్డికి పేరుంది. రోహిణ్ రెడ్డి, సుమంత్ ను లోపల వేసి తన నిజాయితీని డీజీపీ నిరూపించుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ ఇల్లా.. సెటిల్మెంట్కు అడ్డానా?. కేబినెట్ మీటింగ్‌లోనే మంత్రులు తిట్టుకుంటున్నారు. పొంగులేటి అరాచకాలకు ముఖ్యమంత్రి రేవంత్ ఎందుకు అడ్డుకట్ట వేయటం లేదు?. ముఖ్యమంత్రి, మంత్రుల పంచాయితీ మధ్య అధికారులు నలిగిపోతున్నారు.ప్రభుత్వ పెద్దల అన్యాయాలకు అండగా నిలిచే అధికారులకు శిక్ష తప్పదు. రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తుంది. ముఖ్యమంత్రి వేల కోట్లు సంపాదిస్తుంటే.. వందల కోట్లు అయినా సంపాదించుకోవాలని మంత్రులు చూస్తున్నారు. తెలంగాణ పరువును సీఎం, మంత్రులు నడిబజారులో నిలబెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు సిగ్గుతో తల దించుకునేలా పరిస్థితులు ఉన్నాయి. పారిశ్రామికవేత్తల తలకు తుపాకీలు పెట్టి బెదిరిస్తున్నారు. ఐఏఎస్ రిజ్వీ చాలా సిన్సియర్ అధికారి. ఆయన్ను బలిపశువును చేశారు. పదేళ్లు సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్కు వెళ్ళే పరిస్థితి తెచ్చారు. జూబ్లీహిల్స్‌లో ఎవరు గెలుస్తారో.. నవంబర్14న మాట్లాడుకుందాం అని వ్యాఖ్యానించారు. -
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్.. హైలైట్స్
సాక్షి, గుంటూరు: ఏపీలో నకిలీ మద్యం వ్యవస్థీకృతంగా నడుస్తోందని, చేసిన తప్పును అవతలి వాళ్ల మీదకు నెట్టేయడం చంద్రబాబుకి, ఆయన తనయుడు నారా లోకేష్ అలవాటైన పనేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. నకిలీ మద్యం వ్యవహారంతో పాటు విశాఖ డాటా సెంటర్‌పై కూటమి ప్రభుత్వం.. దాని అనుకూల మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ వాస్తవాల్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించారు. అలాగే ఉద్యోగులను చంద్రబాబు ఎలా మోసం చేస్తోంది తెలియజేస్తూనే కూటమి పాలనలో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు.జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్గ్రామస్థాయిలో పాలనను చంద్రబాబు గాలికొదిలేశారుగ్రామ సచివాలయం, వలంటీర్లాంటి వ్యవస్థలను నిర్వీర్యం చేశారుపొలిటికల్ గవర్నరెన్స్ వల్లే రాష్ట్రం అతలాకుతలం అవుతోంది ఏపీలో ఇప్పటికీ డీఏపీ, యూరియా దొరకని పరిస్థితిబీమా సంగతి పట్టించుకోవడం లేదువర్షాలకు పంట నష్టం జరిగితే కనీసం రైతులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి అంచనా వేయలేదుసబ్సిడీ విత్తనాలు ల్లేవ్ఉల్లి రైతులను గాలికి వదిలేశారుఅరటి, టమాట, పత్తికి డిమాండ్ లేదుక్వింటాల్ పత్తికి ఒకప్పుడు రూ.12 వేలు ఉండేది.. ఇప్పుడు రూ.5 వేలు కూడా లేదుటమాట రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారుపరిస్థితులు ఎలా ఉంటాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు ఉద్యోగులకే కాదు.. ప్రజలకూ చంద్రబాబు ఏమీ చేయలేకపోయారురాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ తిరోగమనంలోనే కనిపిస్తున్నాయిస్కూళ్లలో నాడు-నేడు పనులు ఆగిపోయాయి.. ఇంగ్లీష్ మీడియా చదువులు గాలికి ఎగిరిపోయాయి.. గోరుముద్ద పథకం నిర్వీర్యం అయిపోయిందివిద్యాదీవెన, వసతి దీవెన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదువైద్యరంగం.. ఆరోగ్యశ్రీ నీరుగారిపోయింది. చంద్రబాబు పుణ్యాన పేదవాడికి వైద్యం అందించాల్సిన ఆస్పత్రులు ధర్నాలు చేస్తున్నాయిప్రభుత్వ ఆస్పత్రుల్లో దూదికి కూడా దిక్కలేదుకనీసం రూ.5 కోట్ల టర్న్ ఓవర్ లేని మనిషికి.. 104, 108 సర్వీసులను అప్పజెప్పారుమా హయాంలో మెడికల్ కాలేజీలు తెస్తే.. 10 కాలేజీలను నెమ్మదిగా అయినా పూర్తి చేయాల్సి పోయి ప్రైవేటీకరణకు అప్పజెప్తున్నారుమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా.. రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతోందిదానిని గవర్నర్‌కు సమర్పించి.. రాష్ట్ర ప్రజల రెఫరండంను తెలియజేస్తాంఎన్నికలయ్యాక.. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అన్నారుజీతాలు పెంచాల్సి వస్తుందని పీఆర్సీ గురించి మాట్లాడడం లేదుఐఆర్ గురించి ఒక్క మాట మాట్లాడడం లేదుఉద్యోగులకు జీపీఎస్ లేదు.. ఓపీఎస్ లేదుఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారుఉద్యోగులను మోసం చేసి వికృత ఆనందం పొందుతున్నారుటీడీపీ నేతలు వాళ్లపై దాడులు చేస్తున్నారుఉద్యోగులు త్రిశంకు స్వర్గంలో ఉన్నారుమొత్తంరూ.31 వేల కోట్లు బకాయిలు పెట్టారుప్రతీ నెలా ఒక్కటే తేదీన జీతాలన్నారు.. ఒక్క నెల ఇచ్చారంతేకనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదుకాంట్రాక్టు ఉద్యోగులకు పథకాలు ఇస్తామన్నారుపోలీసులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ పెండింగ్‌లో పెట్టారుఉద్యోగుల విషయంలో మేం ఏనాడూ ఇబ్బందులకు గురి చేయలేదుఅధికారంలోకి వచ్చిన వారంలోనే ఐఆర్ ఇచ్చాంకోవిడ్ సమయంలోనూ వాళ్ల సంక్షేమం గురించే ఆలోచించాంమేం తెచ్చిన జీపీఎస్‌ను కేంద్రం, రాష్ట్రాలు ప్రశంసించాయిఆనాడు చంద్రబాబు ఉంటే.. రాష్ట్రం అతలాకుతలం అయ్యి ఉండేదేమో ఉద్యోగులనూ చంద్రబాబు మోసం చేశారునాలుగు డీఏలు పెండింగ్‌లో పెట్టారుఇప్పటి వరకు ఒక్క డీఏ ఇవ్వలేదుఉద్యోగులు రోడ్డెక్కాక.. డ్రామా చేసి ఒక్కటి ఇస్తామన్నారుఅది కూడా ప్రకటించారు అంతే.. ఇంకా ఇవ్వలేదు(నవంబర్‌లో ఇస్తామని అంటున్నారు)డీఏ బకాయిలు కూడా రిటైర్ అయ్యాక ఇస్తామని ప్రకటించారుదీనికే దీపావళి సంబురాలు అంంటూ ప్రకటనలు చేస్తున్నారుకోవిడ్ కష్టాలు ఉన్నా మేం వెనకడుగు వేయలేదుఐదేళ్లలో 10 డీఏలు ఇవ్వాల్సి ఉంటే.. మేం 11 ఇచ్చాం తనను చూసే గూగుల్ వైజాగ్‌కి వచ్చినట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారుహైదరాబాద్ సైబర్ టవర్స్ విషయంలోనూ చంద్రబాబు ఇలాగే చేశారుదాని పేరే హైటెక్ సిటీహైటెక్ సిటీకి ఆరు ఎకరాల్లో పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్కానీ, చంద్రబాబు ఆ విషయాన్ని ఏనాడూ చెప్పుకోరుఅసలు చంద్రబాబుకి 20 ఏళ్లపాటు హైదరాబాద్‌తో సంబంధమే లేదుఅయినా అభివృద్ధి తనదేనంటూ బిల్డప్ ఇస్తుంటారువాస్తవం ఏంటంటే.. 2003-04 వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచే హైదరాబాద్‌లో నిజమైన అభివృద్ధి మొదలైందిఈ విషయాన్ని గణాంకాలే చెబుతున్నాయిఆ తర్వాత వైఎస్సార్ లేకపోయినా.. ఆ అభివృద్ధి అలా కొనసాగిందికేసీఆర్ రెండుసార్లు సీఎం చేశారు.. అప్పుడూ డెవలప్మెంట్ జరిగిందిక్రెడిట్ ఇవ్వకపోవడం చంద్రబాబుకి ఉన్న దుర్మార్గపు నైజంహైదరాబాద్ అభివృద్ధికి అసలు చంద్రబాబుకే సంబంధం లేదు డాటా సెంటర్ వల్ల ఉద్యోగవకాశాలు తక్కువే, కానీ, భవిష్యత్తులో ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుందిభవిష్యత్తులో పెద్ద మార్పులకు డాటా సెంటర్ కీలకందీనికి వైఎస్సార్సీపీ హయాంలోనూ నాంది అప్పుడే పడిందిఅందుకే తక్కువ ఉద్యోగాలు వస్తాయని తెలిసి కూడా నాడు అదానీతో ఒప్పందం చేసుకున్నాంఅదే సమయంలో.. ఐటీ పార్క్ రీక్రియేషన్, స్కిల్ సెంటర్ పెట్టి 25 వేల ఉద్యోగాలు కావాలని కోరాం ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ డాటా సెంటర్ వైజాగ్‌కి రాబోతోందిముమ్మాటికీ వైఎస్సార్సీపీ వేసిన విత్తనమే ఇదివేరేవాళ్లకి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు.. అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారుఅదానీ గూగుల్ మధ్య వ్యాపార సంబంధాలున్నాయ్అదానీ ప్రాజెక్టు విస్తరణే ఈ గూగుల్ డాటా సెంటర్అదానీ ఇందులో రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారువైజాగ్లో అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే గూగుట్ డాటా సెంటర్‌ని నిర్మిస్తున్నాయిఅదానీ కట్టాక గూగుల్ దీనిని వాడుకుంటుందిఇందుకు సంబంధించి.. ఐటీ సెక్రటరీ భాస్కర్‌కు గూగుల్ ప్రతినిధి లేఖ కూడా రాశారుచంద్రబాబు కనీసం అదానీకి కృతజ్ఞతలు కూడా చెప్పలేదుజగన్ సర్కార్‌కు ఆ క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం లేదువైఎస్సార్సీపీకి ఆ ఘనత దక్కుతుందనే.. బాబు ఆ పని చేయడం లేదు 2020లో.. కరోనా టైంలోనే అదానీ డాటా సెంటర్ ఒప్పందానికి బీజం వేశాం2021 మార్చిలో సింగపూర్ ప్రభుత్వానికి ఈ ఒప్పందానికి సంబంధించి లేఖ రాశాం2023 మే 3న.. ఆ తర్వాత డాటా సెంటర్‌కు వైజాగ్‌లో శంకుస్థాపన కూడా చేశాంఆనాడే.. సింగపూర్ నుంచి సబ్‌సీ కేబుల్ తీసుకొచ్చే అంకురార్పణ జరిగిందిదీనికి కొనసాగింపుగానే గూగుల్ డాటా సెంటర్ వచ్చిందివైఎస్సార్సీపీ ప్రభుత్వం, అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల సమిష్టి కృషి ఇదివైఎస్సార్సీపీ వేసిన బీజానికి కొనసాగింపే వైజాగ్ గూగుట్ డాటా సెంటర్ గూగుల్ డాటా సెంటర్ గురించి మాట్లాడుకుందాం..వారం, పదిరోజులుగా దీని గురించి ఆశ్చర్యం కలిగించే వార్తలు వింటున్నాంరాష్ట్రంలో పాలనను బాబు గాలికి ఎగిరిపోయిందిఏదో యాడ్ ఏజెన్సీ నడిపిస్తున్నట్లుగా కనిపిస్తోందిక్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. రాష్ట్రపరిస్థితి వీక్వేరే వాళ్లకి దక్కాల్సిన క్రెడిట్‌ను చోరీ చేయడంలో బాబు ఎప్పుడూ ముందుంటారు లేని ఎవిడెన్స్ క్రియేట్ చేయడం దారుణంలిక్కర్ స్కాం పేరిట తప్పుడు కేసులోనూ ఇలాగే జరిగిందిఎక్కడో రూ.11 కోట్లు దొరికితే.. అంటగట్టే ప్రయత్నం చేశారుకోర్టుకు వెళ్లడంతో సైలెంట్ అయిపోయారుచంద్రబాబుకు సిగ్గు, లజ్జ ఏమాత్రం ల్లేవ్ అసలు జనార్దన్‌రావు ఎవరు?జనార్దన్‌తో తనకు పరిచయమే లేదని జోగి రమేష్ క్లారిటీ ఇచ్చారుఏదో ఫంక్షన్లో కలిసినందుకే కట్టుకథలు అల్లుతున్నారుతన రెండు ఫోన్లు తనిఖీ చేసుకోమని జోగి రమేష్ సవాల్ చేశారుతప్పు చేయలేదు కాబట్టే సీబీఐ ఎంక్వైరీ కోరుతూ జోగి రమేష్ కోర్టును ఆశ్రయించారుఈలోపే డైవర్షన్ పాలిటిక్స్‌తో.. తప్పుడు ఆధారాలతో అభాండాలు వేస్తున్నారు వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులు నడిపించిందిలాభాపేక్ష మా ప్రభుత్వానికి లేదు.. అందుకే బెల్ట్ షాపులు రద్దు చేశాంషాపుల సంఖ్య తగ్గించాంటైమింగ్ పెట్టి నడిపించాంఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లు లేవుక్యూ ఆర్ కోడ్ తెచ్చిందే మా ప్రభుత్వం.. ఆ టైంలో స్కాన్ చేసి అమ్మేవాళ్లుకాస్తో కూస్తో ప్రజలకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రయత్నాలు చేశాంఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ.. నకిలీ మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలంటూ ఆదేశాలిచ్చారు ఇదసలు హైలైట్ కావాల్సిన అంశంలిక్కర్ షాపుల నుంచి ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌ల దాకా అంతా చంద్రబాబు మనుషులే దొంగకు తాళాలివ్వడం అంటే ఇది కాదా?ఎవరి క్యూఆర్‌కోడ్.. ఎవరి స్కాన్? ఎవరు చేసేది?మద్యం షాపులే మీవి అయినప్పుడు క్యూఆర్ కోడ్ ఎందుకు?క్యూఆర్ కోడ్ అంటూ మరో డైవర్షన్ ఇది ఏలూరులో ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో నకిలీ లిక్కర్ దందా నడుస్తోందిరేపల్లే పేకాట కింగ్.. ఇష్టానుసారంగా నకిలీ మద్యం దందా నడిపిస్తున్నారునకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు మనుషులేతమకు సంబంధించిన లిక్కర్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులేబెల్ట్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులే.. అమ్మకునేది వాళ్ల కింది మనుషులేసీబీఐ విచారణ జరిపితే మూలాలు బయటకు వస్తాయిఅందుకే బాబు సిట్ ముద్దు అంటున్నారు జనార్దన్‌రావు వీడియోలో ఎలా మాట్లాడారు?.. ఫోన్ పోయిందని జనార్దనే చెప్పాడు. మరి ఫోన్ పోతే చాటింగ్ ఎలా బయటకు వచ్చింది?. అసలు లుకౌట్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు?ఈ 20 రోజుల్లో జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?.. పాస్‌పోర్టును ఎందుకు సీజ్ చేయలేదు?.. పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినప్పుడు.. పెద్దిరెడ్డి సోదరుడిపై జయచంద్రారెడ్డిని చంద్రబాబు ఎందుకు పోటీకి నిలబెట్టారు? టీడీపీ టికెట్ ఎలా ఇచ్చారు?తనకు ఆఫ్రికాలో డిస్టరీలు ఉన్నాయని అఫిడవిట్లోనే జయచంద్రారెడ్డి పేర్కొన్నారు.. మరి అప్పుడు ఆఫ్రికా లింకులు చంద్రబాబుకి, ఆయన టిష్యూ పేపర్లకు కనిపించలేదా?పరవాడలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది?నకిలీ మద్యం బయటపడ్డాక ఎన్ని తనిఖీలు నిర్వహించారు? ఎన్ని బాటిళ్లను పట్టుకున్నారు?అన్ని చోట్ల దొరుకుతుందనే తనిఖీలు చేయలేదా?చంద్రబాబుకు ధైర్యం ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. జనార్దన్ రావు లొంగిపోతాడని ఎల్లో మీడియా ముందే ఎలా చెప్పింది?నిందితులకు మా పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధాలు అంటగట్టే ప్రయత్నం చేశారుఆర్గనైజ్డ్గా క్రైమ్చేయడం చంద్రబాబు, లోకేష్‌లకు అలవాటేఆఫ్రికాలో మూలలున్నాయంటూ టీడీపీ సోషల్ మీడియా బిల్డప్పులుమాజీ మంత్రి జోగి రమేష్ పేరు సైతం చెప్పించి.. ఉధృతంగా ప్రచారం చేశారుఏబీఎన్, ఈనాడు, టీవీ5లు.. జనార్దన్ చాటింగ్‌లంటూ హడావిడి చేశారుచేసేది వీళ్లే.. కథా స్క్రీన్‌ప్లే అంతా వాళ్లదే ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యమే!ఒక మొలకల చెరువులోనే 20 వేల లీటర్ల నకిలీ మద్యం బయటపడిందికల్తీ లిక్కర్ మాఫియాలో ఉంది అంతా టీడీపీ వాళ్లేచేసింది.. చేయిస్తోంది చంద్రబాబేటాపిక్ డైవర్ట్ చేయడానికి.. తప్పును వేరే వారికి మీదకు నెడుతున్నారుప్రజలను తప్పు దోవ పట్టించడానికి ఆయన దొంగల ముఠా, ఎల్లో మీడియా సిద్ధంగా ఉండనే ఉంది విజయవాడ సీపీ చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారుఅక్రమ మద్యం కేసులో మా పార్టీ వాళ్లను అనవసరంగా వేధిస్తున్నారుఅన్నమయ్య జిల్లా తంబళపళ్లె, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, అనకాపల్లి జిల్లా పరవాడ, పాలకొల్లు, నెల్లూరులోనూ నకిలీ మద్యం బయటపడిందిపట్టుబడకుంటే వేల లీటర్ల మద్యం తయారయ్యేదే రాష్ట్రంలో నకిలీ మద్యం ఫ్యాక్టరీలే కనిపిస్తున్నాయిప్రైవేట్ మద్యం మాఫియా నడుస్తోందిపోలీసుల భద్రత నడుమ గ్రామాల్లో అమ్మకాలుఆక్షన్లు వేసి మరీ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారుబెల్ట్ షాపులే కాకుండా ఇల్లీగల్ పర్మిట్‌రూమ్‌లు నిర్వహిస్తున్నారుడబ్బుల కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారుప్రభుత్వ ఖజానాకు వేల కోట్లకు గండి కొడుతున్నారువాటాల్లో తేడాలు రావడంతోనే ఇదంతా బయటపడింది ఏపీలో నకిలీ మద్యం దందా వ్యవస్థీకృతమైందిఇలాంటి మాఫియా ప్రపంచంలో ఎక్కడా చూడలేదునకిలీ మద్యం కోసం చిన్నపాటి పరిశ్రమల్నే ఏర్పాటు చేశారునకిలీ మద్యాన్ని తయారు చేస్తోంది వాళ్లే.. బెల్ట్‌షాపులు పెట్టి నడిపిస్తోంది వాళ్లే ఇవాళ నాలుగు అంశాల మీద మాట్లాడుకుందాంనకిలీ మద్యం కేసులో నాణేనికి రెండో వైపు గురించి.. విశాఖలో డేటా సెంటర్ గురించి చంద్రబాబు చేస్తున్న గిమ్మికులు, డ్రామాల గురించి, అసలు వాస్తవాలేంటివి అనేది..ఉద్యోగులకు ఏరకంగా చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు?.. ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తున్నారనేదానిని మీడియా మీద ప్రజల దృష్టికి తీసకెళ్తా.. ప్రస్తుతం ఏపీలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, ఈ ప్రభుత్వంలో రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి కూడా.. -
కొండా ఫ్యామిలీ ఎపిసోడ్.. కాంగ్రెస్, రేవంత్‌కు నష్టమేనా?
గజం మిథ్య, పలాయనం మిథ్య అని నానుడి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఘటనలు ఇలానే ఉంటాయి. మంత్రి కొండా సురేఖ వివాదమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఏదో జరిగిపోతుందన్న భావన ముందు కలుగుతుంది. ఆ తర్వాత పరిస్థితి.. అసలేమీ జరగలేదేమో అనేలా మారుతుంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్ధరాత్రి వేళ కొండా సురేఖ నివాసానికి వెళ్లడం, ఓఎస్డీ సుమంత్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడం ఆ తరువాత మంత్రి స్వయంగా అతడిని కారులో ఎక్కించుకుని రక్షించడం, అదే టైమ్‌లో సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి, మరికొందరు మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం మనందరం చూశాము.ఆ తరువాత మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరయ్యారు సురేఖ. పార్టీ అధిష్టానం ప్రతినిధి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రభృతులు జోక్యం చేసుకుని రేవంత్, కొండా దంపతుల మధ్య రాజీ కుదిర్చి పరిస్థితిని అదుపు చేశారు. కాంగ్రెస్ నేతలంతా గప్ చుప్ అయిపోయారు. అయితే విపక్షం ఊరుకోదు కదా! తెలంగాణలో గన్ కల్చర్ పెరిగిపోయిందని, ముఖ్యమంత్రిపై సురేఖ కూతురు సుస్మిత చేసిన ఆరోపణల మాటేమిటి? అంటూ బీఆర్ఎస్, బీజేపీలు ధ్వజమెత్తాయి. మంత్రి కొండ సురేఖ విషయం ఎందుకంత సీరియస్ అయింది? ఆ తర్వాత ఎలా సద్దుమణిగింది అన్నది ఆసక్తికరమైన అంశమే. ప్రాంతీయ పార్టీల్లో ఎవరైనా సీఎంపై తీవ్ర విమర్శలు చేస్తే ఆ వ్యక్తి పదవి పోయినట్లే. కాంగ్రెస్‌లో అలా ఉండదు. ఢిల్లీలోని హైకమాండ్ పెద్దలను ఏమీ అనకుండా, రాష్ట్ర స్థాయిలో ఎవరు, ఎవరిని విమర్శించుకున్నా పెద్దగా పట్టించుకోరు. కాకపోతే పిలిచి మాట్లాడి రాజీలు చేస్తుంటారు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఇందుకు కారణం కావచ్చు. అయితే సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డిలు అప్రతిష్ట పాలయ్యారు. మంత్రి సురేఖ తొలుత ఆత్మరక్షణలో పడినప్పటికీ, ఆ తర్వాత వ్యూహాత్మకంగా రాజీ కుదుర్చుకోవడం ద్వారా పదవిని నిలబెట్టుకున్నారని భావించాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న సమయం కావడం, బీసీలకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తోందన్న భావన కలిగించే యత్నం చేస్తున్న తరుణంలో ఒక బీసీ మంత్రిని పదవి నుంచి తప్పిస్తే రాంగ్ సంకేతాలు వెళతాయన్న అభిప్రాయం కూడా ఇందులో ఉండవచ్చు.సీనియర్ నేత, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఒక సిమెంట్ కంపెనీ యాజమాన్యం నుంచి డబ్బులు వసూలు చేయడానికి సురేఖ ఓఎస్డీ సుమంత్ తుపాకితో బెదిరించారన్న ఫిర్యాదు వచ్చింది. అతనితోపాటు మరో కాంగ్రెస్ నేత రోహిత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారని చెబుతున్నారు. ఈ సమాచారం ఆధారంగా సీఎం ఆఫీస్ వెంటనే సుమంత్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. తనకు చెప్పకుండా ఎలా చేస్తారన్నది సురేఖ ప్రశ్న. గతంలో పలుమార్లు హెచ్చరించినా మంత్రి పట్టించుకోలేదన్నది రేవంత్ కార్యాలయ వర్గాల వాదన. ఆ తర్వాత పోలీసులు సుమంత్ అరెస్టుకు ప్రయత్నించారు. మంత్రి ఇంటిలోనే రక్షణ పొందుతున్నారని తెలుసుకుని అక్కడకు వెళ్లారు. అది తీవ్ర కలకలం రేపింది. కానీ, సురేఖ పోలీసులకు అవకాశం ఇవ్వకుండా ఓఎస్డీని అక్కడ నుంచి తీసుకువెళ్లిపోయారు. సహ మంత్రుల వద్దకు వెళ్లి ఆమె దీనిపై తన వాదన వినిపించారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషిస్తున్న కొందరిని కలిసినట్లు వార్తలు వచ్చాయి.హోంశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి కావాలనే ఇలా చేశారన్నది సురేఖ వర్గం ఆరోపణగా ఉంది. సురేఖ కుమార్తె ఈ విషయాన్ని నేరుగా ప్రస్తావించి పలు ఆరోపణలు గుప్పించడం రేవంత్‌కు ఇరకాటంగా మారింది. రేవంత్ రెడ్డి, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు వేం నరేంద్ర రెడ్డి, తదితరులపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి సోదరుల పేర్లు చెప్పి మరో ఆరోపణ సంధించారు. తన తల్లి సురేఖను అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆమె అన్నారు. ఏకంగా రెడ్లు తమపై కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. మేడారం వద్ద అభివృద్ది పనుల కాంట్రాక్టులు, దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల వివాదం మొదలైన విషయాలలో ఏర్పడిన అభిప్రాయ బేధాలు ఈ వర్గ పోరుకు కారణం అయ్యాయని చెబుతున్నారు.వరంగల్ కాంగ్రెస్ వర్గ రాజకీయాలలో కూడా ఇదే తరహా గొడవలు నడుస్తుండటం, వారి మద్య రాజీ చేయడానికి పీసీసీ కృషి చేయడం, అవేవి ఒక కొలిక్కి రాకముందే ఈ పరిణామం సంభవించడం కాంగ్రెస్‌కు చికాకు అయింది. తదుపరి మీనాక్షి సమక్షంలో సురేఖ తన వాదన వినిపించి వచ్చారు. కాగా, తమ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్‌పై చేసిన ఆరోపణలను పట్టించుకోవద్దని, ఆవేశంలో అన్న మాటలు అని మంత్రి భర్త, ఎమ్మెల్సీ మురళీ సర్దిచెప్పే యత్నం చేశారు. సురేఖ మంత్రి పదవి వదలుకోవాల్సి వస్తుందేమో అన్న ప్రచారం జరిగింది. కానీ, ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రస్తుతానికి ఆ ఇబ్బంది నుంచి బయటపడ్డారని అనిపిస్తుంది. కొండా దంపతులు స్వయంగా రేవంత్‌ను కలిసి శాలువా కప్పారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని తాము కోరుకున్న విషయాన్ని గుర్తు చేశారట. ఓఎస్డీని దూరం పెట్టండని రేవంత్ సూచించారట. తమ కుమార్తె చేసిన విమర్శలు ఆవేశంలో చేసినవని వీరు విచారం వ్యక్తం చేశారట. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ప్రాసెస్‌లో కీలక భూమిక పోషించినట్లుగా ఉంది. కానీ, ఒకసారి విభేదాలు పొడసూపాక అవి అంత తేలికగా పోవు. కాంగ్రెస్‌లో సద్దుమణిగినప్పటికీ, పలు ప్రశ్నలు అటు రాజకీయ వర్గాలలోను, ఇటు ప్రజలలోను మిగిలే ఉంటాయి!.ఇంతకీ సుమంత్ గన్ తో బెదిరించారా లేదా? దానిపై వచ్చిన ఫిర్యాదును హ్యాండిల్ చేయడంలో రేవంత్ కార్యాలయం విఫలమైందా? అర్దరాత్రి వేళ మంత్రి ఇంటికి పోలీసులను పంపించడం తప్పు అన్న అభిప్రాయం కాంగ్రెస్ ముఖ్యనేతలలో, అధిష్టానంలో కలిగిందా? మంత్రి సురేఖ ఒక కేసులో నిందితుడికి ఆశ్రయం కల్పించడం తప్పా? కాదా? మొదలైన ప్రశ్నలన్ని అలాగే ఉండిపోయాయి. కొండా సురేఖ దంపతుల రాజకీయ ప్రస్థానం అంతా ఎప్పుడూ వివాదాలు, గ్రూపుల గొడవలు, ప్రత్యర్ధి రాజకీయ పార్టీలతో ఘర్షణలతోనే సాగిందని చెప్పాలి. సురేఖ, మురళీలు తొలుత కాంగ్రెస్ లోనే ఉండేవారు. అప్పట్లో టీడీపీలో ఉన్న ఎర్రబెల్లి దయాకరరావుతో తీవ్రంగా ఘర్షణ పడేవారు. కాంగ్రెస్ వర్గ రాజకీయాలలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి మద్దతుగా ఉండేవారు. వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత ముఖ్యమంత్రి రోశయ్యతో సరిపడలేదు. అంతలో వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకోవడంతో ఆమె ఈ పార్టీలోకి వచ్చారు.ఎమ్మెల్యే పదవిని కూడా వదలుకున్నారు. తదుపరి వచ్చిన ఉప ఎన్నికలో పోటీ చేసి స్వల్ప తేడాతో టీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు. కొంతకాలం టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటాలు సాగించేవారు. మళ్లీ పరిణామాలు మారడంతో ఆమె వైఎస్సార్సీపీకి దూరమయ్యారు. రాష్ట్ర విభజన జరగడంతో ఆమె టీఆర్ఎస్కు దగ్గరవడం, వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. అయినా కొండా వర్గం ఆశించినట్లుగా సురేఖ మంత్రి కాలేకపోయారు. తదుపరి టీఆర్ఎస్పైన, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన విమర్శలు చేసి మళ్లీ కాంగ్రెస్ వైపు పయనించారు. కాంగ్రెస్‌కు కూడా జిల్లాలో గట్టిగా నిలబడే నాయకత్వం అవసరమైంది. అది కొండా దంపతులకు కలిసి వచ్చింది. 2023లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలిచారు. తదుపరి రేవంత్ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు.ఈ ప్రస్థానంలో మంత్రి సురేఖ ప్రజలకు కనిపించే ఫేస్ అయితే, వెనుక ఆమె భర్త మురళీ చేసే రాజకీయమే కీలకం అని చెబుతారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కుని మూడు దశాబ్దాలుగా వరంగల్ జిల్లా రాజకీయాలలో తమదైన శైలిలో ఒక ప్రముఖ పాత్రను పోషించడం కొండ దంపతుల విశిష్టత. ఏతావాతా ఈ మొత్తం ఎపిసోడ్లో అటు రేవంత్‌కు, ఇటు సురేఖకు నష్టం జరిగాయని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలలో కొంత పలచన అవడానికి కూడా ఇది దోహద పడిందని అంగీకరించాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బీహార్ ‘గేమ్ ప్లాన్’.. లుకలుకలకు పుల్‌స్టాప్!
బీహార్‌లో గ్రాండ్ అలయన్స్(Mahaghat Bandhan) కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు అంగీకారం తెలిపింది. సీనియర్ నేత అశోక్ గెహ్లాత్ చొరవతో కూటమి పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి.మహాఘట్ బంధన్‌లో సీట్ల పంపకాలపై ఇప్పటికీ ఓ స్పష్టత కొరవడిన సంగతి తెలిసిందే. లెక్క తేలకపోవడంతో ఎవరికివారే అభ్యర్థులను ప్రకటించుకుని నామినేషన్లు దాఖలు చేయించారు. ఈ క్రమంలో పలు స్థానాల్లో మిత్రపక్షాల అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. అయితే దీనిని ‘ఫ్రెండ్లీ పోటీ’గా అభివర్ణించుకున్న ఆర్జేడీ-కాంగ్రెస్‌లు.. మరో పక్క ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాత్, మాజీ ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ ప్నాట్నాలో నిన్నంతా బిజీబిజీగా గడిపారు. భాగస్వామ్య పార్టీల కీలక నేతలతో సమావేశమై సీటు పంపకాలపై నెలకొన్న సందిగ్ధాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. మొత్తంగా 8 స్థానాల్లో పోటీ స్నేహపూర్వకంగా ఉండాలని నిర్ణయించుకున్నారని, మరీ ముఖ్యంగా తేజస్వి యాదవ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి. కాంగ్రెస్ ఎంపీ అఖిలేష్ సింగ్ ఇప్పటికే ఈ విషయాన్ని ధృవీకరించారు. CPI (ML) నేత దీపంకర్ భట్టాచార్య త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అన్నారు. -
తుని ఘటన: నారాయణరావు మృతదేహం లభ్యం
సాక్షి, కాకినాడ: బాలికపై అత్యాచారయత్నం కేసు నిందితుడు, టీడీపీ నేత తాటిక నారాయణరావు(62) మృతదేహాం లభ్యమైంది. బుధవారం అర్ధరాత్రి మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపర్చడానికి తీసుకెళ్తున్న సమయంలో.. తుని కోమటిచెరువులో దూకేశాడు. గురువారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.నారాయణరావును నిన్న సాయంత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన తీవ్ర చర్చనీయాంశమైన తరుణంలో.. అర్ధరాత్రి పూట రహస్యంగా నిందితుడిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచేందుకు తీసుకెళ్లబోయారు. వాష్‌రూమ్‌కు వెళ్తామంటే వాహనం ఆపామని, ఆ సమయంలో నిందితుడు నారాయణరావు చెరువులో దూకేశాడని పోలీసులు చెబుతున్నారు. నారాయణరావు పారిపోవాలని చూశాడా?.. ఆత్మహత్యయత్నం చేశాడా? అనేది స్పష్టత లేకుండా పోయింది.కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం శివారులో జరిగిన దారుణ ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. అధికార టీడీపీ పార్టీకి చెందిన ఓ నేత.. మైనర బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జగన్నాథగిరిలోని ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో బాలిక(13)కు చదువుకుంటోంది. తండ్రి లేకపోవడంతో తల్లే సెలవులప్పుడు వచ్చి చూసి పోతుంటుంది. అయితే ఆమె తన మనవరాలని, ఇంజెక్షన్ వేయిస్తానంటూ సిబ్బందిని నమ్మబలికి తుని హంసవరం శివారున నిర్మానుష్యంగా ఉన్న తోటలోకి నారాయణరావు తీసుకెళ్లాడు. అత్యాచార యత్నం చేయబోతున్న సమయంలో తోట కాపలదారుడు గమనించి నిలదీశాడు. దీంతో.. ‘నేను ఎవరినో తెలుసా? కౌన్సిలర్‌ను. ఎస్సీలం. మాది వీరవరపుపేట’ అంటూ దబాయించాడు.ఈలోపు.. కాపలదారుడు వీడియో తీస్తుండడం గమనించి.. బాలికను గురుకుల పాఠశాలలో దించేసి నారాయణరావు కొండవారపేట పారిపోయాడు. అప్పటికే విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో స్థానికులు నారాయణరావును మంగళవారం రాత్రి పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.నారాయణరావు అరెస్ట్‌ను పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాకు తెలిపారు. బాలికను ఆమె తల్లి అనుమతిలేకుండా పాఠశాల నుంచి తీసుకెళ్లడం, లైంగిక దాడికి యత్నించడం, తరచూ బాలికను బయటకు తీసుకెళ్లడంపై వేర్వేరుగా మూడు కఠినమైన కేసులు నమోదుచేశామని చెప్పారు. పోక్సో కేసులో నిందితుడికి 30 ఏళ్లకు పైగా శిక్ష పడుతుందన్నారు. విచారణకు ప్రత్యేక బృందాలను నియమించడంతో పాటు 15 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈలోపే.. నిందితుడు పోలీసుల చెర నుంచి తప్పించుకుని ఇలా చెరువులో దూకేసి శవమై తేలాడు. -
‘అమ్మా కాళికా.. క్షమించు తల్లీ’
కాళి మాత విగ్రహాన్ని పోలీసులు వాహనంలో తరలించిన ఘటన.. పశ్చిమ బెంగాల్ తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్‌లు పరస్పర ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం శాంతిభద్రతలను అదుపు చేసే క్రమంలోనే అలా చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. సుందర్బన్స్ సమీపంలోని కాక్ద్వీప్ నియోజకవర్గంలో సూర్యనగర్ గ్రామ పంచాయితీ పరిధిలోని ఓ ఆలయంలో మంగళవారం కాళికా దేవి విగ్రహాం ధ్వంసమైన స్థితిలో కనిపించింది. ఈ విషయం దావానంలా పాకడంతో.. పలువురు నేతలు తమ అనుచరులతో అక్కడికి చేరుకుని గ్రామస్తులతో కలిసి ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో.. పోలీసులు తమ వాహనంలో ధ్వంసమైన ఆ విగ్రహాన్ని తరలించి నిమజ్జనం చేశారు. అయితే ఈ ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. కాళి దేవి విగ్రహాన్ని ఖైదీలను తరలించే వ్యాన్‌లో తీసుకెళ్లడాన్ని బీజేపీ అవమానకరమైన చర్యగా అభివర్ణించింది. గ్రామస్తులను భయపెట్టి ఆలయ గేట్లు మూసివేశారని, ప్రజల నిరసనలకు దిగడంతో తిరిగి తెరిచారని ఆరోపించింది. నిందితులను అరెస్ట్ చేయకుండా హిందూ రక్షకులను అడ్డుకున్నారని విమర్శించింది. మమతా బెనర్జీ ప్రభుత్వం బెంగాల్‌ను మరో బంగ్లాదేశ్‌గా మారుస్తోందంటూ బీజేపీ మండిపడుతోంది. ఈ క్రమంలో పలువురు హిందూ రక్షకులతో కలిసి పలు ఆలయాల్లో బీజేపీ శాంతి పూజలు నిర్వహిస్తోంది. అయితే.. নিচের ভিডিওটা দেখে কেউ বাংলাদেশ বলে ভুল করবেন না, এটা পশ্চিমবঙ্গের বর্তমান অবস্থা। আমি বার বার বলেছি পশ্চিমবঙ্গ কে পশ্চিম বাংলাদেশ বানানোর চক্রান্ত চলছে, হিন্দুরা এখনি না জাগলে সমূহ বিপদ অপেক্ষা করছে আগামী দিনেগত রাতে কাকদ্বীপ বিধানসভার সূর্যনগর গ্রাম পঞ্চায়েত এলাকার উত্তর… pic.twitter.com/YB8FwtME3C— Suvendu Adhikari (@SuvenduWB) October 22, 2025ఈ ఘటనపై పోలీసులు వివరణ ఇచ్చారని, కొంతమంది దీనిని రాజకీయంగా వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని అధికార తృణమూల్ కాంగ్రెస్ అంటోంది. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా భావిస్తోందని.. నిందితులను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారని తెలిపింది. విగ్రహం ధ్వంసం కావడం వల్ల దాన్ని ఆలయంలో ఉంచడం అనుచితమని భావించామని, అందుకే నిమజ్జనం చేయాలని నిర్ణయించామని పోలీసులు అంటున్నారు. ‘‘స్థానికులు విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా జాతీయ రహదారిని బ్లాక్ చేశారు. అంబులెన్సులు సహా పలు వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగింది. సున్నితమైన అంశం కావడంతో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా చూడాల్సిన బాధ్యతగా భావించాం. అందుకే మరో దారి లేకనే విగ్రహాన్ని పోలీస్ వాహనంలో తీసుకెళ్లి నిమజ్జనం చేశాం’’ అని వివరణ ఇచ్చారు. అయితే.. తీవ్ర విమర్శలు, అభ్యంతరాల నేపథ్యంలో పోలీస్ శాఖ ధ్వంసమైన విగ్రహ తరలింపు ఘటనపై విచారణకు ఆదేశించింది.ఇదీ చదవండి: బీహార్ పంచాయితీకి కాంగ్రెస్ పెద్ద! -
బీహార్ పాలి‘ట్రిక్స్’.. బీజేపీలోకి ‘అనర్హత’ ఆర్జేడీ నేత
పాట్నా: అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీహార్‌లో నేతల జంప్ జిలానీ వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఆర్జేడీ నేత అనిల్ సహానీ బుధవారం బీజేపీలో చేరారు. విశేషం ఏమిటంటే ఈయనను మూడేళ్ల క్రితం మోసం కేసులో సీబీఐ కోర్టు దోషిగా తేల్చి శిక్ష విధించటంతో అనర్హత వేటు పడి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పోయారు.2012లో ఆయన ఆర్జేడీ రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు ఫోర్జరీ విమాన టికెట్లు సమర్పించారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసులో సీబీఐ కోర్టు విచారణ జరుపుతుండగానే 2020లో ఆర్జేడీ తరఫున కుర్హానీ నియోజవర్గంలో పోటీచేసి బీజేపీ నేత కేదార్ గుప్తను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. మూడేళ్ల క్రితం కోర్టు అనిల్‌ను దోషిగా తేల్చటంతో అసెంబ్లీ సభ్యత్వం కోల్పోయారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో కేదార్ గుప్త గెలిచి, రాష్ట్ర మంత్రి అయ్యారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్ తావ్డేల సమక్షంలో అనిత్ సహానీ బీజేపీలో చేరు. -
కొత్త సీసాలో పాత కుట్ర
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ హయాంలో మద్యం విధానంపై చంద్రబాబు సర్కారు అక్రమ కేసుల కుట్రలకు సంబంధించి విభ్రాంతికర వాస్తవాలు బట్టబయలయ్యాయి. అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో అల్లిన ఈ కుట్ర కేసులో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. తీవ్ర మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్ వాంగ్మూలం ఆధారంగా ఈ అక్రమ కేసు దర్యాప్తును ‘సిట్’ కొనసాగిస్తోందన్న వాస్తవం తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఇదేం దర్యాప్తు..? అలాంటి వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అరెస్టులు చేయడం ఏమిటి?.. ఈ అక్రమ కేసులకు ఏం విలువ ఉంటుంది..? అని న్యాయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పటికే బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డిని బెదిరించి ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలం బాగోతం బహిర్గతమైన విషయం తెలిసిందే. తాజాగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సత్యప్రసాద్ వాంగ్మూలం కథ కూడా కంచికి చేరినట్లేనన్నది తేటతెల్లమవుతోంది. ఈ అక్రమ కేసులో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సిట్ అల్లిన కట్టుకథల కుట్రలు ఒక్కొక్కటిగా బెడిసికొడుతున్నాయి. లేని కుంభకోణాన్ని ఉన్నట్లుగా చిత్రీకరించేందుకే కూటమి సర్కారు ఇంతగా బరి తెగించిందన్నది స్పష్టమవుతోంది. మరోవైపు మద్యం దోపిడీ మాఫియా టీడీపీ కూటమి పెద్దల నిర్వాకమేనన్నది ఆధారాలతో సహా నిరూపితమవుతోంది. చంద్రబాబు సర్కారు భేతాళ కుట్రలు న్యాయస్థానాల సాక్షిగా పటాపంచలు కావడం.. వైఎస్సార్ సీపీపై బురద చల్లాలని యత్నించి భంగపడటం.. నకిలీ మద్యం కేసులో కూటమి సర్కారు అడ్డంగా దొరికిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బెదిరించి.. దారికి తెచ్చుకుని..బేవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవ రెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌ను గతంలోనే టీడీపీ వీరవిధేయ సిట్ అధికారులు బెదిరించి తమకు అనుకూలంగా మలచుకున్నారు. తాము చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌లను సిట్ అధికారులు బెదిరించారు. అందుకు వారిద్దరూ మొదట్లో సమ్మతించ లేదు. అంతేకాదు అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని తమని పోలీసులు బెదిరిస్తున్నారని వాసుదేవరెడ్డి న్యాయస్థానంలో మూడు సార్లు పిటిషన్లు కూడా దాఖలు చేశారు. అయినా సరే సిట్ అధికారులు వారిని వెంటాడి వేధించారు. డెప్యుటేషన్ ముగిసినా సరే వాసుదేవరెడ్డి కేంద్ర సర్వీసులకు తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇవ్వకుండా వేధించారు. అంతేకాదు ఆయన్ని మూడు రోజులపాటు అక్రమంగా నిర్బంధించి బెంబేలెత్తించారు. దీంతో సిట్ అధికారుల కుట్రలకు వాసుదేవరెడ్డి తలొగ్గారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేశారు. ఆ వెంటనే వాసుదేవరెడ్డి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం గమనార్హం. కేవలం వారిద్దరి అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే ఈ కేసులో సిట్ అధికారులు ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలతోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప తదితరులను అక్రమంగా అరెస్టు చేశారు. ఆ కుట్రలన్నీ న్యాయస్థానం విచారణలో ఒక్కొక్కటిగా బెడిసికొట్టాయి. దాంతో వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంపై కూటమి ప్రభుత్వం నమోదు చేసింది అక్రమ కేసేనన్నది స్పష్టమవుతోంది. ముందస్తు బెయిల్ పన్నాగం తాము బెదిరించి లొంగదీసుకున్న వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌లను సిట్ అధికారులు ఇప్పటివరకు అరెస్టు చేయ లేదన్నది తెలిసిందే. ఈ ఏడాది జూలైలో వారిద్దరితో ఈ కేసులో అప్రూవర్లుగా మారేందుకు అనుమతించాలని పిటిషన్ వేయించాలని భావించారు. అందుకోసం వారిద్దరినీ కొందరు సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ న్యాయస్థానానికి తీసుకువచ్చారు. కాగా వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ పిటిషన్లను న్యాయస్థాన వర్గాలు పరిశీలించాయి. అప్రూవర్లుగా మారాలంటే ముందు అరెస్టు కావాలి... న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లాలని వారిద్దరికి స్పష్టం చేశాయి. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉంటూనో... తరువాత ఎప్పుడో బెయిల్‌పై విడుదల అయిన తరువాత మాతమ్రే అప్రూవర్ పిటిషన్‌ను న్యాయస్థానంలో దాఖలు చేయాలన్నది నిబంధన అని స్పష్టం చేశాయి. అంతేగానీ కేసులో నిందితులుగా ఉన్నవారు కనీసం అరెస్టు కాకుండా... జైలుకు వెళ్లకుండా అప్రూవర్లుగా మారేందుకు పిటిషన్ దాఖలు చేయడం కుదరదని చెప్పడతో వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ కంగుతిన్నారు. అప్రూవర్ పిటిషన్ దాఖలు చేసేందుకు వెనకడుగు వేశారు. దాంతో సిట్ అధికారులు కొత్త ఎత్తుగడ వేశారు. వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌లతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయించారు. ఆ ముందస్తు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానంలో వ్యతిరేకించకుండా సహకరిస్తామని సిట్ అధికారులు వారికి చెప్పినట్టు సమచారం. కాగా హడావుడిగా అప్పటికప్పుడు దాఖలు చేసిన ఆ పిటిషన్లకు తగిన పత్రాలు జతపరచకపోవడంతో న్యాయస్థానం ఆ పిటిషన్లను వెనక్కి పంపింది. అబద్ధపు వాంగ్మూలాల కుట్రేఈ తాజా పరిణామాలు ఓ విషయాన్ని మరోసారి స్పష్టం చేశాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పూర్తి పారదర్శకంగా అమలు చేశారని చంద్రబాబు ప్రభుత్వమే పరోక్షంగా అంగీకరించినట్టైంది. రెడ్‌బుక్ కక్ష సాధింపు కోసం తాము నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు కోసం పూరిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలపైనే ఆధారపడ్డామని బయటపెట్టుకుంది. సిట్ నమోదు చేసిన 161, 164 వాంగ్మూలాలన్నీ కట్టుకథలేనన్నది స్పష్టమైంది. మిథున్ రెడ్డిపై కుట్ర విఫలం ఈ అక్రమ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసిన ప్రభుత్వ కుట్రలు చివరికి విఫలమయ్యాయి. డికార్ట్ లాజిస్టిక్ కంపెనీ నుంచి ఆయన కుటుంబ సంస్థకు రూ.5 కోట్లు వచ్చాయనే నెపంతో ఆయన్ను అరెస్టు చేశారు. కాగా తమ నిర్మాణ సంస్థ లో సబ్ కాంట్రాక్టు చేసేందుకు డిపాజిట్‌గా రూ.5 కోట్లు చెల్లించారని... కోవిడ్ పరిస్థితుల్లో ఆ సబ్ కాంట్రాక్టు చేయలేకపోవడంతో తాము ఆ మొత్తాన్ని ఆ కంపెనీకి తిరిగి చెల్లించామని మిథున్‌రెడ్డి తమ బ్యాంకు స్టేట్మెంట్లు, ఇతర ఆధారాలు న్యాయస్థానానికి సమర్పించారు. ఇక ఆయనపై నమోదు చేసిన అభియోగాల్లో సిట్ కనీస ఆధారాలు కూడా చూపలేకపోయిందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మిథున్‌రెడ్డి ఎంపీగా ఉన్నారు. ఇక ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ప్రభుత్వంలో కనీసం ఆ శాఖ మంత్రిగా కూడా లేరు. అలాంటప్పుడు ఇక మద్యం వ్యవహారాలతో వారికి ఏం సంబంధం ఉంటుంది? ‘‘ఈ కేసులో మిథున్‌రెడ్డి మాస్టర్ మైండ్ అని, కీలక పాత్ర పోషించారని, ఇందుకు ప్రాసిక్యూషన్.. సహ నిందితుల నేరాంగీకార వాంగ్మూలంపై ఆధార పడుతోంది. కానీ ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోద యోగ్యత లేదు. సహ నిందితుల వాంగ్మూలాలు, కొందరు సాక్షులు ఇచ్చిన 164, 161 స్టేట్మెంట్లు మినహా ఇతర ఆధారాలను సమర్పించలేదు. ఇవి బెయిల్ నిరాకరించడానికి ఎంత మాత్రం సరిపోవు..’’ అని ఈ కేసులో మిథున్‌రెడ్డికి బెయిల్ మంజూరు సందర్భంగా ఏసీబీ కోర్టు స్పష్టం చేయడం గమనార్హం. న్యాయస్థానం ప్రశ్నలకు సిట్ తెల్లమొహం ఇక ఈ కేసులో సిట్ కుట్రపూరితంగానే నిరాధార ఆరోపణలతో చార్జ్షీట్లు దాఖలు చేసిందన్నది వెల్లడైంది. మొదటి చార్జ్‌షీట్, అనుబంధ చార్జ్షీట్లను పరిశీలించి న్యాయస్థానం లేవనెత్తిన 21 అభ్యంతరాలపై సిట్ సమాధానం చెప్పలేకపోయింది. అందుకే సీఆర్సీపీ సెక్షన్ 167(2) ప్రకారం ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ ఎండీ బాలాజీ గోవిందప్పలకు బెయిల్ మంజూరు చేసింది. మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డిపై సిట్ అక్రమ కేసు నమోదు చేసిందని తేటతెల్లమైంది. సిట్ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. సోదాల ముసుగులో.. ఇక ఈ అక్రమ కేసు దర్యాప్తు ముసుగులో సిట్ బరితెగించి వేధింపులకు పాల్పడింది. ప్రధానంగా సోదాల పేరుతో కుట్రపూరితంగా వ్యవహరించింది. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నర్రెడ్డి సునీల్ రెడ్డి తదితరుల నివాసాల్లో సోదాల పేరుతో హైడ్రామాకు తెరతీసింది. సోదాల పేరుతో తామే అబద్ధపు ఆధారాలు సృష్టించేందుకు సిట్ అధికారులు పన్నాగం పన్నారు. ఒకరి నివాసంలో సోదాలతో ఏదో సమాచారం లభించిందని చెప్పి మరొకరి నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. లేని ఆధారాలు సృష్టించేందుకు పడరాని పాట్లు పడ్డారు. జడ్జిపై లూథ్రా అభ్యంతరకర వ్యాఖ్యలు ఇక ఈ అక్రమ కేసులో అడ్డగోలుగా వాదించేందుకు యత్నించిన ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రాపై ఏసీబీ న్యాయస్థానం మండిపడింది. అక్రమంగా అరెస్టు చేసిన నిందితులకు ఎందుకు బెయిల్ ఇవ్వకూడదన్న కోర్టు ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం చెప్పలేకపోయారు. కౌంటర్ అఫిడవిట్‌లోని అంశాలను చదువుతూ పక్కదారి పట్టించేందుకు యత్నించడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా సిద్ధార్థ్ లూథ్రా ఏకంగా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు విభ్రాంతి కలిగించాయి. ఆ జడ్జిని బదిలీ చేయాలని ప్రభుత్వానికి సూచిస్తానని హైకోర్టులో వ్యాఖ్యానించడం విభ్రాంతి కలిగించింది. న్యాయస్థానాలనే బ్లాక్మెయిల్ చేసేలా మాట్లాడటంపై న్యాయ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరింత బరితెగించి మద్యం దోపిడీ2024లో అధికారంలోకి రాగానే టీడీపీ కూటమి ప్రభుత్వం మరింత బరితెగించి మద్యం దోపిడీకి తెగిస్తోంది. అందుకోసమే ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని తొలగించి 3,336 ప్రైవేటు మద్య దుకాణాలను టీడీపీ సిండికేట్‌కు కట్టబెట్టింది. వాటికి అనుబంధంగా 3,336 పర్మిట్ రూమ్‌లకు అనుమతులు ఇచ్చింది. 540 బార్లను టీడీపీ సిండికేట్‌కే కట్టబెట్టింది. త్వరలో మరో 300 బార్లు కట్టబెట్టేందుకు సిద్ధపడుతోంది. ఇక ఏకంగా 75వేల బెల్ట్ దుకాణాలతో మద్యం ఏరులై పారిస్తోంది. ఎంఆర్పీ కంటే రూ.20 అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతోంది. ఏకంగా ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దందాకు బరితెగించింది. టీడీపీ నేతలే సూత్రధారులు, పాత్రధారులుగా నకిలీ మద్యం తయారీ యూనిట్లను కుటీర పరిశ్రమలుగా ఏర్పాటు చేశారు. మూడోవంతు నకిలీ మద్యం అమ్మకాలతో దోపిడీకి పాల్పడుతున్నారు. ఐదేళ్లలో రూ.45వేల కోట్ల దోపిడీ లక్ష్యంగా నకిలీ మద్యం మాఫియా చెలరేగిపోతోంది. మద్యం కుట్రదారు చంద్రబాబే.. ఇప్పటికీ బెయిల్‌పైనే ఉన్న బాబు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల్లో ఏకంగా రూ.25వేల కోట్లు దోపిడీకి పాల్పడ్డారు. చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతోసహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్‌గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పుటి సీఎం చంద్రబాబు, తదితరులపై ఐపీసీ, సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పైనే ఉన్నారన్నది అసలు నిజం. గత ఏడాది రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతానికి మించిన స్థాయిలో మద్యం దోపిడీకి తెగబడుతున్నారు. మద్యం విధానం ద్వారా తమ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈ కుట్రకు తెరతీసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసి సిట్ ద్వారా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. వీగిన కుట్రలు...రాజ్ కేసిరెడ్డిని ఎంపిక చేసుకోవడంలోనే కుట్ర.... ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామేరెడ్బుక్ కుట్ర కేసుకు కేంద్ర బిందువుగా రాజ్ కేసిరెడ్డిని ఎంపిక చేసుకోవడంలోనే చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రం దాగుంది. ఇక అసలు విషయం ఏమింటే... రాజ్ కేసిరెడ్డి ఎవరో కాదు... ఆయన టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) వ్యాపార భాగస్వామి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కూడా. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అంటే 2021లోనే రాజ్ కేసిరెడ్డి ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)తో భాగస్వామిగా వ్యాపారాలు నిర్వహించారు. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘డే ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు. అక్రమంగా నిధులు తరలించారని సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ హైదరాబాద్‌లోని ఒకే చిరునామాతో (జూబ్లీ హిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ అయ్యాయి. అంతే కాదు ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ (accounts@ws hanviinfraprojects.com)నే ఉపయోగిస్తుండటం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్‌లకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారు. రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి అయిన కేశినేని చిన్ని మంత్రి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడే కాదు బినామీ అన్నది బహిరంగ రహస్యమే. అందుకే పట్టుబట్టి మరీ ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించారు. రాజ్ కేసిరెడ్డి చెప్పని విషయాలను చెప్పినట్టుగా సిట్ వాంగ్మూలం నమోదు చేసింది. ఆ వాంగ్మూలంపై ఆయన సంతకం చేయలేదని సిట్ అధికారులే ఆ రిమాండ్ నివేదికలో వెల్లడించారు కూడా. లేకపోతే రాజ్ కేసిరెడ్డి తాను ఆ వాంగ్మూలం ఇవ్వలేదని న్యాయస్థానానికి చెబితే తాము ఇబ్బందిపడాల్సి వస్తుందనే భయంతోనే సిట్ ఆ విషయాన్ని నివేదికలో పేర్కొంది.మానసిక రోగి సత్య ప్రసాద్..!కాగా ఈ అక్రమ కేసులో వెల్లడైన ఓ కొత్త విషయం ఆసక్తికరంగా మారింది. సత్య ప్రసాద్ దీర్ఘకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అనంతపురానికి చెందిన మానసిక వైద్య నిపుణులు డా.ఎండ్లూరి ప్రభాకర్, పి.విజయ పద్మ ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు వెల్లడైంది. సత్య ప్రసాద్ మానసిక అనారోగ్య సమస్యలకు వారిద్దరూ ప్రిస్రైబ్ చేసిన ప్రిస్క్రిప్షన్ కాపీలు బయటపడ్డాయి. అంటే ఎంతో కాలంగా ఆయన మానసిక ఆరోగ్యం సరిగా లేదన్నది స్పష్టమైంది. మానసికంగా ఆరోగ్యంగా లేని సత్య ప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప తదితరులను సత్య ప్రసాద్‌తో చెప్పించిన అబద్ధపు వాంగ్మూలం ఆధారంగానే అక్రమంగా అరెస్టు చేశారు. ఆయన తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నారనే వాస్తవాన్ని గోప్యంగా ఉంచేందుకు సిట్ అధికారులు యత్నిస్తున్నారు. కానీ సత్య ప్రసాద్ మానసిక ఆరోగ్యం సరిగా లేదని తాజాగా బయటపడటం సిట్ బండారాన్ని బట్టబయలు చేసింది. బెడిసికొట్టిన రూ.11కోట్ల జప్తు కుట్ర ఇక లేని ఆధారాలు సృష్టించేందుకే సిట్ అధికారులు రాజ్ కేసిరెడ్డి ఫాం హౌస్‌లో రూ.11కోట్లు స్వా«దీనం చేసుకున్నట్టు డ్రామాకు తెరతీశారు. కాగా ఆ నగదు తనది కాదని...దీనిపై విచారించాలని రాజ్ కేసిరెడ్డి కోర్టును ఆశ్రయించడంతో సిట్ కుట్ర బెడిసికొట్టింది. దాంతో సిట్ అధికారులు ఆ రూ.11 కోట్ల నగదును అర్ధరాత్రి బ్యాంకులో జమ చేసి కప్పిపుచ్చేందుకు యత్నించారు. ఇక ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని రాజ్ కేసిరెడ్డి తండ్రిని బలవంతంగా తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించింది. మరో నిందితుడి తండ్రి, రిటైర్డ్ కానిస్టేబుల్‌ను అక్రమంగా నిర్బంధించి మరీ వేధించడంతో ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో వెంకటేష్ నాయుడు పాత వీడియోను తెరపైకి తీసుకొచ్చి అది మద్యం డబ్బులేనంటూ ప్రచారం చేశారు.గన్మెన్పైనే థర్డ్ డిగ్రీ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పని చేసిన గిరి, మదన్ రెడ్డిలను అక్రమంగా నిర్బంధించి అబద్ధపు వాంగ్మూలం కోసం తీవ్రస్థాయిలో వేధించారు. బెంబేలెత్తిన గిరి సిట్ అధికారులు చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. దాంతో ఆయనకు వెంటనే జీతం పెంచి మరీ ప్రమోషన్ కల్పించి పోస్టింగ్ ఇచ్చారు. అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేందుకు సమ్మతించని మదన్ రెడ్డిపై సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం విభ్రాంతి కలిగించింది. సిట్ అధికారులు తనపై భౌతికంగా దాడి చేశారని ఆయన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు కూడా. ఇక అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవి ఇవ్వడంతోపాటు రూ.2కోట్లు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు సిట్ అధికారుల ద్వారా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్నేహితుడు వెంకటేశనాయుడు దంపతులను ప్రలోభ పెట్టారు. అందుకు వారు తిరస్కరించడంతోనే ఈ కేసులో వెంకటేశ్‌నాయుడును అరెస్టు చేశారు. ఆయన పాత్రను నిరూపించే ఆధారాల్లేవు‘‘కేవలం కేసు తీవ్రత, పరిమాణం మాత్రమే కాక నిందితుడి పాత్ర, దర్యాప్తు అధికారులు సేకరించిన ఆధారాలను బట్టే బెయిల్ మంజూరుపై నిర్ణయం ఉంటుంది. ప్రస్తుత కేసులో పిటిషనర్ పాత్రను నిర్ధారించేందుకు సరైన, బలమైన ఆధారాలేవీ లేవు..’’ ‘‘ఈ కేసులో మిథున్‌రెడ్డి మాస్టర్ మైండ్ అని, కీలక పాత్ర పోషించారని, ఇందుకు ప్రాసిక్యూషన్.. సహ నిందితుల నేరాంగీకార వాంగ్మూలంపై ఆధార పడుతోంది. కానీ ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోద యోగ్యత లేదు. సహ నిందితుల వాంగ్మూలాలు, కొందరు సాక్షులు ఇచ్చిన 164, 161 స్టేట్మెంట్లు మినహా ఇతర ఆధారాలను సమర్పించలేదు. ఇవి బెయిల్ నిరాకరించడానికి ఎంత మాత్రం సరిపోవు..’’ ‘‘నేరపూరిత కుట్ర విషయంలో దర్యాప్తు అధికారులు ప్రాథమిక ఆధారాలను చూపలేకపోయారు. నిందితులు డబ్బు, ముడుపులను దారి మళ్లించడానికి ఒప్పందం చేసుకున్నారనేందుకు ఆధారాలేవీ చూపలేదు. కోర్టు ముందుంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు. అందువల్ల బెయిల్‌ను తిరస్కరించలేం..’’ – మిథున్‌రెడ్డికి బెయిల్ మంజూరు సమయంలో ఏసీబీ కోర్టుడీఫాల్ట్ బెయిల్ రాకుండా ఉండేందుకు అసంపూర్ణ చార్జిషీట్ దాఖలు రాజ్యాంగ విరుద్ధం‘‘ఇటీవల సుప్రీంకోర్టు రీతూ చాబ్రియా కేసులో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దర్యాప్తు పూర్తి చేయకుండానే దాఖలు చేసిన అసంపూర్ణ చార్జిషీట్... సీఆర్పీసీ సెక్షన్ 167(2) ప్రకారం నిందితుడికి లభించే డిఫాల్ట్ బెయిల్ హక్కును దూరం చేయలేదని తేల్చి చెప్పింది. డిఫాల్ట్ బెయిల్ చట్టబద్ధ హక్కు మాత్రమే కాక రాజ్యాంగంలోని అధికరణం 21 ప్రకారం ప్రాథమిక హక్కు కూడా అని సుప్రీం పేర్కొంది...’’ ‘‘ప్రతి నిందితుడికి వేర్వేరుగా చార్జిషీట్లు దాఖలు చేసి డిఫాల్ట్ బెయిల్ హక్కును అడ్డుకోవాలనుకునే తీరు చట్ట, రాజ్యాంగ విరుద్ధం అని తెలిపింది. ఇలాంటి చర్యలు నిందితుడి ప్రాథమిక హక్కు అయిన స్వేచ్ఛను హరిస్తాయని చెప్పింది. అసంపూర్ణ లేదా పలు భాగాలుగా చార్జిషీట్ దాఖలు చేయడం ద్వారా రాజ్యాంగం ప్రసాదించిన ఈ హక్కును కాలరాయలేరని సుప్రీం చెప్పింది’’ ‘‘ప్రస్తుత కేసులో ప్రాథమిక చార్జిషీట్, అనుబంధ చార్జిషీట్ విషయానికి వస్తే 48 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రాథమిక చార్జిషీట్‌ను 16 మందిపై మాత్రమే దాఖలు చేశారు. మరో ముగ్గురిపై అనుబంధ చార్జిషీట్ వేశారు. ఇంకా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికలు రాలేదు. ఆ నివేదికల్లో ఏమున్నదో తెలియకుండా, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ లేదా 19 ప్రకారం అనుమతులు, ఆమోదం పొందకుండా ప్రభుత్వ ఉద్యోగులపై కేసును ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదు...’’ ‘‘చట్ట ప్రకారం నేరాలను కోర్టు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందే గానీ నిందితులను కాదు. సీఆర్పీసీ సెక్షన్ 309(2) ప్రకారం నేరాన్ని పరిగణలోకి తీసుకోకుండా నిందితుల రిమాండ్ పొడిగించడం సాధ్యం కాదు. కేసు ఇంకా ప్రి కాగ్నిజెన్స్ దశలోనే ఉంది. ఈ పరిస్థితుల్లో సెక్షన్ 167(2) ప్రకారం 90 రోజులు దాటిన తరువాత నిందితుల కస్టడీ పొడిగించడానికి అనుమతి లేదు. అందువల్ల నిందితులకు సీఆర్పీసీ సెక్షన్ 167(2) కింద బెయిల్ మంజూరు చేయడం తప్ప మరో మార్గం లేదు..’’ – ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు తీర్పు -
‘మా నాన్న తర్వాతి సీఎం ఆయనే’.. బాంబు పేల్చిన సిద్ధరామయ్య కుమారుడు
సాక్షి,బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కుమారుడు ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య బాంబు పేల్చారు. మా నాన్న కెరీర్ ముగిసింది. ఇక కర్ణాటక కాంగ్రెస్‌ను ముందుండి నడిపించే శక్తిసామర్ధ్యాలు, ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఆ రాష్ట్ర ప్రజా పనుల వ్యవహారాల శాఖ మంత్రి (పీడబ్ల్యూడీ) సతీష్ జార్కిహోళికే ఉన్నాయని వ్యాఖ్యానించారు.బెళగావి జిల్లాలోని రాయ్‌బాగ్ తాలూకా కప్పలగుడ్డి గ్రామంలో మహాకవి కనకదాసు విగ్రహ ఆవిష్కరణలో యతీంద్ర సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా యతీంద్ర తన తండ్రి, సీఎం సిద్ధరామయ్య రాజకీయ భవిష్యత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.‘నా తండ్రి తన రాజకీయ జీవితంలో చివరి దశలో ఉన్నారు. ఈ దశలో, ఆయనకు బలమైన భావజాలం, ప్రగతిశీల మనస్తత్వం కలిగిన నాయకుడు అవసరం. అలాంటి నాయకుడికి సిద్ధరామయ్య మార్గదర్శకుడిగా ఉంటారు. ఆ నాయకుడే మంత్రి సతీష్ జార్కిహోళి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నిలబెట్టి, పార్టీని సమర్థవంతంగా నడిపించగల వ్యక్తి. అటువంటి సైద్ధాంతిక విశ్వాసం ఉన్న నాయకుడిని గుర్తించడం చాలా అరుదు’ అని నేను గట్టిగా నమ్ముతున్నాను. సతీష్ సీఎంగా బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో వర్గపోరు బయటకొచ్చిన వేళ..సిద్ధారామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలతో కర్ణాటక కాంగ్రెస్‌లో వర్గపోరు బహిర్గతమైంది. పీడబ్యూటీ మంత్రిగా పని చేస్తున్న సతీష్ జార్కిహోళిని తదుపరి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అంటూ యతీంద్ర సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలతో డీకే శివకుమార్‌తో ఉన్న విభేదాల్ని బహిర్గతం చేసింది. కర్ణాటకలో సిద్ధారామయ్య వారసుడిగా డీకే శివకుమార్ పేరే ప్రధానంగా వినిపిస్తున్న తరుణంలో యతీంద్ర చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో హీట్ పుట్టించాయి. యతీంద్ర తన మనసులోని మాటను ఒక ప్రజావేదికపై బయటపెట్టడంతో డీకేతో ఉన్న విభేదాలు ఉన్నాయనే దానికి మరింత బలం చేకూర్చింది. గతంలో సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ఎన్నుకునే క్రమంలో డీకే శివకుమార్‌తో ఒప్పందం కూడా జరిగింది. తలో రెండున్నర ఏళ్లు చేయడానికి ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం సిద్ధరామయ్య రెండున్నరేళ్ల కాలం పూర్తి కావడానికి సమయం దగ్గర పడుతున్న సమయంలో తదుపరి డీకేకే రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలి. ఈ విషయంపై ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వద్ద పంచాయతీ కూడా జరిగింది. మరి అటువంటిది ఇప్పుడు డీకేను కాదని, మంత్రి సతీష్‌ను తెరపైకి తీసుకురావడంతో కర్ణాటక కాంగ్రెస్‌లో లుకలుకలు బయటకొచ్చాయి. VIDEO | Mysuru: “My father, (Siddaramaiah), is in the final stages of his political career. Satish Jarkiholi must take the Congress forward,” says Karnataka CM Siddaramaiah’s son, Yathindra Siddaramaiah.(Source: Third Party)#Karnataka (Full video available on PTI Videos -… pic.twitter.com/pCkXLEjqz7— Press Trust of India (@PTI_News) October 22, 2025 -
పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఝలక్!
సాక్షి,అమరావతి: కూటమి ప్రభుత్వంలో భీమవరం డీఎస్పీ పేకాట పంచాయితీ చిచ్చురేపుతోంది. ఇటీవల భీమవరం డీఎస్పీ పేకాట ప్రోత్సహిస్తున్నారంటూ జనసేన నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. జనసేన ఫిర్యాదుతో నిన్న డీఎస్పీ జయసూర్యపై పవన్ విచారణకు ఆదేశించారు.ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఝలక్ ఇచ్చారు. భీమవరం డీఎస్పీ జయసూర్యను రఘురామ సమర్ధించారు. దీంతో పవన్ ఆరోపణలకు భిన్నంగా డిప్యూటీ స్పీకర్ స్పందిస్తూ వ్యాఖ్యలు చేయడంతో కూటమిలో పేకాట పంచాయితీ చిచ్చురేపుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. డీఎస్పీ ఆర్జీ జయసూర్య అసాంఘిక కార్యకలాపాలకు గతకొన్ని రోజులుగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య అసాంఘిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ఫిర్యాదు అందిందనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతుండటంతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా విషయం చర్చనీయాంశంగా మారింది. భీమవరం డీఎస్పీగా జయసూర్య సుమారు ఏడాది క్రితం బాధ్యతలు చేపట్టారు. సంక్రాంతి కోడిపందేల నిర్వహణ, పెద్ద ఎత్తున పేకాట వంటి జూదాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, దీనికి పరోక్షంగా డీఎస్పీ సహకారం ఉందంటూ ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ప్రధానంగా భీమవరం పట్టణంలోని క్లబ్బుల్లో విచ్చలవిడిగా జూదాలు నిర్వహిస్తున్నారని, అందుకు గాను పోలీసులకు పెద్ద మొత్తంలో ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే కార్యాలయానికి ముడుపులు ఇవ్వాలంటూ పోలీసులే ముడుపులు వసూలు చేస్తున్నారంటూ ప్రచారం సాగింది. దీంతో మండిపడ్డ ఎమ్మెల్యే.. క్లబ్బుల్లో జూదాల నిర్వహణను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే.. పక్కనున్న ఉండి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కోడిపందేలు, పేకాట వంటి జూదాలు నేటికీ జోరుగా సాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, దీనికి పక్క నియోజకవర్గ కూటమి పెద్దలతో డీఎస్పీ అంటకాగడమే కారణమని బహిరంగంగా చెబుతున్నారు. దీంతో సుమారు ఆరు నెలల క్రితం డీఎస్పీ జయసూర్యను బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. అయితే బదిలీని పక్క నియోజకవర్గ నాయకుడి అండదండలతో బదిలీని నిలుపుదల చేయించుకుని ఆయనకు అనుకూలంగా పనిచేస్తూ జూదాల నిర్వాహకుల జోలికి పోకుండా.. వారినుంచి పెద్ద మొత్తంలో ముడుపులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా సివిల్ తగాదాల్లో డీఎస్పీ ప్రమేయం ఉంటోందని, భీమవరంలో డీఎస్పీ జయసూర్య ప్రత్యేక దందా నిర్వహిస్తున్నారంటూ జనసేన నాయకులు పవన్‌కల్యాణ్‌కు ఫిర్యాదు చేయడంతో నేరుగా పవన్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. డీఎస్పీ జయసూర్యపై నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. -
‘అబద్ధానికి అధికారం ఇస్తే.. అది కూటమి ప్రభుత్వం’
తాడేపల్లి : అబద్ధానికి అధికారం ఇస్తే అది కూటమి ప్రభుత్వమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ విమర్శించారు. బోగస్ మాటలతో జనాన్ని మోసం చేస్తున్నారని, ముఖ్యమంత్రే అబద్ధాలు చెప్పడం ఏపీలోనే చూస్తున్నామని ధ్వజమెత్తారు. ఈరోజు(బుధవారం, అక్టోబర్ 22వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘ఆయన చెప్పేవి నిజమా? అబద్దమా? అని జనం కూడా చర్చించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. టీడీపీ నేతలు నకిలీ మద్యం తయారు చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. కానీ మాపార్టీ పైకి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. వైరస్ కంటే ప్రమాదకరంగా టీడీపీ మారింది. తుని, రాజమండ్రిలో మైనర్ బాలికలపై జరిగిన సంఘటనలు దారుణం’ అని కూటమి పాలనపై మండిపడ్డారు.ఇదీ చదవండి:మెడికల్ కాలేజీలను ఎవరికి దోచి పెట్టాలో రెడీ చేశారు.. -
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ‘నేనే మాగంటి గోపినాథ్ వారసుడిని’..
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ఎంపికలో బిగ్‌ట్విస్ట్ చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ వారసుడిని తానేనంటూ తారక్ ప్రద్యుమ్న తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు.ఆ లేఖలో ‘తన తల్లి మాలినీ దేవిని హిందూ వివాహ చట్ట ప్రకారం.. మాగంటి గోపీనాథ్ పెళ్లి చేసుకున్నారు. గోపీనాథ్ భార్య అంటూ సునీత తప్పుడు సమాచారం ఇస్తున్నారు. సునీత అఫిడవిట్‌ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఇప్పటికే మాగంటి సునీత నామినేషన్‌కు ఈసీ ఆమోదం తెలిపింది. మరోవైపు షేక్‌పేట్ ఆర్వో కార్యాలయానికి మాగంటి సునీత వచ్చారు. నామినేషన్లో తాను పేర్కొన్న అంశాలన్నీ సరైనవేనంటూ ఎన్నికల అధికారులకు డిక్లరేషన్ ఫారమ్ అందజేశారు. -
మెడికల్ కాలేజీలను ఎవరికి దోచి పెట్టాలో రెడీ చేశారు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈనెల 28న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ నేతలు పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, అరుణ్ కుమార్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ హయాంలో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయి. అబద్ధాలు చెప్పి దబాయించడం చంద్రబాబు అలవాటే. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకిస్తున్నారు. వైఎస్ జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు. కోవిడ్ తర్వాత ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయి. కూటమి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపే వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ దుర్మార్గ చర్య. దీనిపై ప్రజల్లో కూడా వ్యతిరేకత బాగా పెరిగింది. ప్రభుత్వం వెనక్కు తగ్గే వరకు పోరాటం చేస్తాం. ఇది రాజకీయాల కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే. ఈనెల 28న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో నిరసన ర్యాలీలు చేస్తాం. ప్రజాస్వామ్య వాదులంతా హాజరు కావాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ ఉదృతంగా జరుగుతోంది. ప్రజల అభిప్రాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం. స్వచ్ఛందంగా ప్రజా సంఘాలు, మేధావులు ఈ పోరాటంలో పాల్గొంటున్నారు.అందులో భాగంగానే ఈనెల 28న అసెంబ్లీ నియోజకవర్గాలలో ర్యాలీలు చేయబోతున్నాం. తర్వాత నవంబర్ 12న జిల్లా కేంద్రాలలో కూడా ర్యాలీలు చేస్తాం. కోటి సంతకాలు పూర్తి చేసుకుని వాటిని నవంబర్ 23న జిల్లాలకు తరలిస్తాం. అనంతరం కేంద్ర కార్యాలయానికి వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణను ఆపాలి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు వైద్యం, వైద్య విద్యను అందించాలన్నది వైఎస్ జగన్ ఉద్దేశం. అందుకే 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారు. మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతాయి. ఒక్కరోజులో ఏ కాలేజీ పూర్తి కాదు. ఎయిమ్స్ లాంటి సంస్థ పూర్తవటానికే తొమ్మిదేళ్లు పట్టింది.పులివెందుల కాలేజీ పూర్తయినా చంద్రబాబు సీట్లు రాకుండా అడ్డుకున్నారు. పాడేరు కాలేజీకి 50 సీట్లు చాలని మిగతావి రాకుండా అడ్డుకున్నారు. సంవత్సరానికి వెయ్యి కోట్లు చొప్పున నాలుగైదేళ్లు ఖర్చు చేస్తే కాలేజీలన్నీ అందుబాటులోకి వస్తాయి. పీపీపీ అంటే ప్రయివేటీకరణ కాదని చంద్రబాబు కొత్త భాష్యం చెప్తున్నారు. లాభాల కోసమే ప్రైవేటు వ్యక్తులు మెడికల్ కాలేజీలతో వ్యాపారం చేస్తారు. ఇప్పటికే ఎవరెవరికి ఏ కాలేజీని దోచి పెట్టాలో నిర్ణయం తీసుకున్నారు. ఇక పేద, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఇలాంటి విధ్వంసాన్ని ఏపీలో ఎప్పుడూ చూడలేదు. కానీ, తన మీడియా పవర్‌తో ఎదుటి వారిపై విమర్శలు చేస్తున్నారు’ అని అన్నారు. -
Bihar Election: ‘లాలూ’కు చెక్ పెట్టిన రీతు.. స్వతంత్రంగా రంగంలోకి..
పట్నా:బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న విచిత్ర పరిణామాలు మీడియా కంట పడుతున్నాయి. తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రీతూ జైస్వాల్.. ఆర్జేడీని వీడి బీహార్‌లోని పరిహార్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.రాష్ట్రీయ జనతాదళ్‌పై తిరుగుబాటు ప్రకటించిన జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ నేతలు తనకు టికెట్ నిరాకరించారని, ఇది ఆర్జేడీ నాయకత్వం తనకు తలపెట్టిన ద్రోహంగా ఆమె అభివర్ణించారు. తనను మరో నియోజకవర్గం నుంచి పోటీచేయాలని పార్టీ కోరిందని, అది తన మనస్సాక్షికి వ్యతిరేకమని, అందుకే తాను స్వతంత్రంగా నామినేషన్ వేయాలనుకున్నానని రీతూ జైస్వాల్ తెలిపారు.1977, మార్చి ఒకటిన హాజీపూర్‌లో జన్మించిన జైస్వాల్, ప్రభుత్వ మాజీ ఉద్యోగి అరుణ్ కుమార్ భార్య. కుమార్ తన గ్రామానికి సేవ చేసేందుకు, విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించేందుకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)తీసుకున్నారు. అతని భార్య జైస్వాల్ బీహార్ రాజకీయాల్లో ప్రముఖ నాయకురాలిగా పేరు సంపాదించారు. విద్య, మౌలిక సదుపాయాలు ఇతర సమస్యల పరిష్కారానికి ఆమె ప్రభుత్వంతో పోరాడుతుంటారు. రీతూ జైస్వాల్ రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేశారు.2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఆమె పరిహార్ స్థానం నుండి పోటీ చేశారు. అయితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గాయత్రి దేవి చేతిలో కేవలం 1,569 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో షియోహార్ నియోజకవర్గం నుండి పోటీ చేసి, ఓటమి చవిచూశారు. నాడు ఆమె జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ)నేత లవ్లీ ఆనంద్ చేతిలో 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల్లో ఆమెకు ఓటమి ఎదురైనప్పటికీ, క్షేత్రస్థాయిలో భారీ మద్దతు లభించింది.2020 బీహార్ ఎన్నికల్లో రెండు వేల కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ, ఇప్పుడు పార్టీ తనకు టికెట్ నిరాకరించిందని రీతూ జైస్వాల్ ఆరోపించారు. నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో ఆమె ఎంతో భావోద్వేగానికి గురై, తాను రాజకీయ కుట్రకు బలయ్యానని పేర్కొన్నారు. జైస్వాల్‌ను బెల్సాండ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని పార్టీ కోరింది. అయితే ఆమె పరిహార్ నుండి పోటీ చేస్తానని పట్టుబట్టారు. -
చంద్రబాబు అంటేనే కాపీ కొట్టడం: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు అప్పులు చేసి అభూత కల్పనపై ఖర్చు పెడుతున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వైఎస్ జగన్ చేసిన పనులను చూసి కాపీ కొట్టడమే చంద్రబాబుకు తెలిసిన విద్య అని ఎద్దేవా చేశారు. అలాగే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగింది అంటూ వ్యాఖ్యలు చేశారు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేవీనగర్‌లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, కార్పొరేటర్ జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. చంద్రబాబు అప్పులు చేసి అభూత కల్పనపై ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగింది. చంద్రబాబు ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశాడు . వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీకి గ్రీన్ చానల్ అని పెట్టి ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించారు. ఆరోగ్య శ్రీ ఉద్యోగులు రోడ్డుపై నిరసనలకు దిగుతున్నారుప్రతి సందర్భంలో వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కూటమి నేతలు విర్రవీగుతున్నారు. వైఎస్ జగన్ దీపావళి పండగ చేస్తే.. దానిపై బురద జల్లుతున్నారు. వైఎస్ జగన్ చేసిన పనులన్నీ చంద్రబాబు కాపీ కొట్టడమే పని. వైఎస్ జగన్ దీపావళి చేస్తే.. చంద్రబాబు విజయవాడలో దీపావళి చేస్తాడు. వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తే.. చంద్రబాబు విజయవాడలో వినాయక చవితి వేడుకలు ఏర్పాటు చేశాడు. వైఎస్ జగన్ చేసే ప్రతీ పనిని చంద్రబాబు కాపీ కొడుతున్నాడు. ప్రజల విషయంలో అన్యాయం జరిగితే వైఎస్సార్సీపీ ఉద్యమాలు చేపడుతుంది. 28వ తేదీన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ర్యాలీ చేపడతాం’ అని చెప్పుకొచ్చారు. -
త్వరలో రాజయ్యపేటకు వైఎస్ జగన్
సాక్షి, అనకాపల్లి: ప్రభుత్వం ఉంది ప్రజల ప్రాణాలను కాపాడడానికే గానీ తీయడానికి కాదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. బల్క్ డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేపట్టిన దీక్ష 39వ రోజుకి చేరుకుంది. బుధవారం వైఎస్సార్సీపీ బృందం వాళ్లను పరామర్శించి సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడిన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మత్స్యకారులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వైఎస్ జగన్‌కు వివరించారు. ఆయన ఆదేశాలతోనే మేం ఇక్కడికి వచ్చాం. ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను కాపాడాలి అంతేగానీ తీయకూడదు. కూటమి ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. ఎన్నికలకు ముందు బల్క్ డ్రగ్ పార్క్‌తో క్యాన్సర్, పిల్లలకు వైకల్యం వస్తుందని మంత్రి అనిత చెప్పారు. ఇప్పుడేమో ఇలా చేస్తున్నారు. అనితకు ఇది న్యాయమా?. చేతకాకపోతే రాజకీయాల నుంచి తప్పుకోండి.... పరిశ్రమలకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదు. కానీ, బల్క్ డ్రగ్ పార్క్ వల్ల జీవితాలు నాశనం అవుతాయని ప్రజలే అంటున్నారు. అలాంటప్పుడు స్థానికుల అభీష్టానికి వ్యతిరేకంగా ఎలా ఏర్పాటు చేస్తారు?. వైఎస్సార్సీపీ హయాంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?. అప్పుడు.. ఇప్పుడు.. మేం ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటాం. బల్క్ డ్రగ్ పార్క్‌ను ఏర్పాటు కానియ్యం’’ అని అన్నారు. త్వరలో జగన్ రాక.. ‘‘మా జీవితాలు నాశనం అవుతున్నాయి. ప్రాణాలు పోయినా ఫర్వాలేదు. కానీ, బల్క్ డ్రగ్ పార్క్‌ను కట్టనివ్వం’’ అంటూ పలువురు బొత్స వద్ద వాపోయారు.ఈ సందర్భంగా మత్స్యకారులున ఉద్దేశిస్తూ బొత్స మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మీ కోరికను నెరవేరుస్తారు. ఈ పోరాటంలో కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసులను.. జగన్ అధికారంలోకి వచ్చాక తొలగిస్తారు. మీతో పాటు మేము పోరాటం చేస్తాం. మీకు అండగా మేముంటాం. తప్పు చేసిన కూటమికి శిక్ష తప్పదు. మీరు చెప్పిన ప్రతి మాటను వైఎస్ జగన్ దృష్టికి వెళ్తాం. త్వరలో రాజయ్యపేటకు జగన్ వస్తారు’’ అని బొత్స తెలిపారు. పోలీసుల ఓవరాక్షన్‌పై..రాజయ్యపేట దీక్షాశిబిరానికి వైఎస్సార్సీపీ నేతలు వెళ్లనీయకుండా పోలీసులు ఆంక్షలను విధించారు. అయితే వాటిని దాటుకుని నేతలు అక్కడికి చేరుకున్నారు. దీనిపై బొత్స మాట్లాడుతూ.. ‘‘రాజయ్యపేట పర్యటనపై అనేక ఆంక్షలు పెట్టారు. కనీస మానవత్వం లేకుండా కూటమి వ్యవహరిస్తోంది. గ్రామస్తులను ఆధార్ కార్డులు చూపించమని అడుగుతున్నారు. ఏమైనా సంఘ విద్రోహశక్తులా?’’ అని బొత్స నిలదీశారు. -
‘దానం సపోర్ట్ చేస్తే తప్పేంటి?.. కొండా ఫ్యామిలీ వివాదం ముగిసింది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ బహిరంగంగానే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కొండా సురేఖ, కొండా సుస్మిత వివాదం ముగిసిపోయిందని క్లారిటీ ఇచ్చారు.టీపీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మా స్టార్ క్యాంపెయినర్ లిస్టులో దానం నాగేందర్ పేరు ఉంటే తప్పేంటి?. ముసుగులో గుద్దులాటలు అవసరం లేదు.. దానం నాగేందర్ సపోర్ట్ డైరెక్ట్ చేస్తున్నాడు. మా పార్టీకి మద్దతు ఇస్తే తప్పేంటి?. ఫిరాయింపుల అంశాన్ని స్పీకర్ చూసుకుంటారు. జీవన్ రెడ్డి చాలా రోజుల నుంచి అసంతృప్తితో ఉన్నారు. జీవన్ రెడ్డిని త్వరలోనే సెట్ చేస్తాం.కొండా సుస్మిత వ్యాఖ్యలపై కొండా దంపతులు విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మళ్ళీ ఇలాంటివి జరగవని కొండా దంపతులు ముఖ్యమంత్రితో చెప్పారు. కొండా సురేఖ వివాదం ముగిసింది. రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను ఢిల్లీ వెళ్తాం. డీసీసీల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
Bihar Election: మహిళలకు శాశ్వత ఉద్యోగం: తేజస్వీ భారీ హమీ
పట్నా: బిహార్‌లో వచ్చేనెల(నవంబర్)లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో నేతల ప్రచార పర్వం కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ రాష్ట్రంలోని మహిళలకు భారీ హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ‘జీవికా దీదీ’లకు ఉద్యోగం పర్మినెంట్ చేయడంతోపాటు, నెలకు రూ.30 వేల జీతం అందిస్తామన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న ‘జీవికా దీదీ’ పథకంలోని లోపాలను చక్కదిద్ది, మహిళలకు అండగా ఉంటామని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. ఆర్జేడీ నేత నేత తేజస్వీ యాదవ్ తన ఎన్నికల ప్రచారంలో ‘జీవికా దీదీ’లపై హామీల వర్షం కురిపించారు. బిహార్‌లో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ‘జీవికా దీదీ’లకు రూ. 30 వేల జీతంతోపాటు వారు తీసుకున్న రుణాలపై వడ్డీని మాఫీ చేస్తామని, బీమా కవరేజీని అందిస్తామని హామీనిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వ చేపట్టిన ‘జీవికా దీదీ’ పథకం తీరుతెన్నులపై తేజస్వీ పలు విమర్శలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ‘జీవికా దీదీ’లకు అన్యాయం జరుగుతున్నదనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ పథకంలోని మహిళలను పర్మినెంట్ చేయాలని, వారికి ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించాలని తాము నిర్ణయించామని తేజస్వీ పేర్కొన్నారు. వారి జీతం కూడా నెలకు రూ. 30 వేలకు పెంచుతామని, ఇది సాధారణ ప్రకటన కాదని అన్నారు. జీవికా దీదీల దీర్ఘకాల డిమాండ్ సాకారం చేయనున్నామని తేజస్వి యాదవ్ పట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. జీవికా దీదీల ప్రస్తుత రుణాలపై వడ్డీని మాఫీ చేస్తామని, రాబోయే రెండేళ్లకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. దీనికితోడు ప్రతి జీవికా దీదీకి నెలకు రూ. రెండువేల అదనపు భత్యం, రూ. ఐదు లక్షల బీమా కవరేజ్ అందిస్తామన్నారు. కాగా ‘జీవికా దీదీ’ పథకం ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కీలకాంశంగా మారింది. -
కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్ కీలక భేటీ
సాక్షి, ఎర్రవల్లి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో(KCR) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో(Jubilee Hills By poll) ప్రచారం, ఎన్నికల వ్యూహంపై చర్చిస్తున్నట్టు సమాచారం. తాజా భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.మాజీ మంత్రులు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) బుధవారం ఉదయం ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు చేరుకున్నారు. అనంతరం, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం రోడ్ షోలు, ప్రచార వ్యూహంపై నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం. అలాగే, తాజా రాజకీయ అంశాలపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఇక, రేపు(గురువారం) కేసీఆర్.. జూబ్లీహిల్స్ ఇన్‌చార్జ్‌లతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ప్రచార వ్యూహాలపై వారికి కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. -
బీహార్‌కు పైసలిస్తారు.. విద్యార్థులకు లేవా?.. మంత్రులకు బండి హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై(Congress Govt) కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని అడిగితే విజిలెన్స్ దాడులంటూ బ్లాక్మెయిల్ చేస్తారా అని మండిపడ్డారు. బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల, యాజమాన్యాల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోంది అని విమర్శలు చేశారు.హైదరాబాద్‌లోని నల్లకుంట పరిధిలోని ఉన్న శంకర్‌మఠ్‌కు బుధవారం ఉదయం బండి సంజయ్ వెళ్లారు. శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం, బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..‘ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకుంటామా?. కమీషన్లు రావనే సాకుతోనే సర్కార్ పెద్దలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదా?. అసెంబ్లీ (Telangana Assembly) సాక్షిగా ఇచ్చిన హామీని కూడా కాలరాస్తారా?. పదేపదే ఇచ్చిన మాటను తప్పే వాళ్లను ఏమనాలి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.బీహార్ ఎన్నికల(Bihar Elections) కోసం తెలంగాణ నుంచే పైసలు పంపుతున్నారు కదా. మరి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేని దిన స్థితిలో ప్రభుత్వం ఉందా?. తక్షణమే బకాయిలు రూ.10 వేల కోట్లు చెల్లించాలి. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయి. విద్యార్థులు, యాజమాన్యాలతో కలిసి నిరసనలకు దిగుతాం. ఖబడ్దార్ మంత్రులను రోడ్లపై తిరగనీయబోమని హెచ్చరిస్తున్నాం. ఇదే సమయంలో కళాశాలల యజమాన్యాలు కూడా ప్రభుత్వానికి భయపడి సమ్మె విరమిస్తే అంతే సంగతులని అన్నారు. అలా చేస్తే.. భవిష్యత్తులో వారికి ఎవరూ అండగా నిలబడే పరిస్థితి ఉండదన్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ బకాయిలపైనా ప్రైవేటు ఆసుపత్రులు రోడ్డెక్కడం తథ్యమని అన్నారు. మంత్రులు ప్రతి పనికి కమీషన్లు వసూలు చేస్తున్నారని.. వచ్చిన సొమ్మును కాంగ్రెస్ హైకమాండ్‌కు కప్పం కడుతున్నారు అంటూ విమర్శలు చేశారు. -
ఏపీలో నకిలీ మద్యం.. ప్రమాదకరం కాదంట!
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం కుంభకోణాన్ని కప్పిపుచ్చేందుకు ఎల్లోమీడియా వింత పోకడలకు పోతోంది. ల్యాబ్ నివేదికలపై చిత్ర విచిత్రమైన కథనాలు ప్రచురిస్తోంది. మద్యపానం ఆరోగ్యానికి, సమాజానికి హానికరమని ప్రచారం చేయాల్సిన బాధ్యతాయుతమైన మీడియా సంస్థ, కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు గత ఎన్నికల సమయంలోనే నాణ్యమైన మద్యమిస్తామని జనాన్ని మభ్యపెట్టిన విషయం ఒకసారి గుర్తుచేసుకోవాలిక్కడ. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా తాము గెలిస్తే రూ.99లకే మద్యం సరఫరా చేస్తామని నిస్సిగ్గు ప్రచారం కూడా చేసుకుందీ కూటమి. అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడిచిన మద్యం దుకాణాలను కాస్తా ప్రైవేటకు అప్పగించేసింది. ఈ బాధ్యతారహితమైన నిర్ణయమే నకిలీ మద్యం దందాకు, కుంభకోణానికి దారితీసిందన్నది అంచనా. గత ప్రభుత్వం మాదిరిగా క్యూఆర్ కోడ్ ఆధారంగా విక్రయాలు జరపకపోవడం, విచ్చలవిడిగా పర్మిట్ రూములను అనుమతించడం, బెల్ట్‌షాపుల అణచివేతకు చర్యలు తీసుకోకపోవడం వంటి ఇతర కారణాలు కూడా మార్కెట్లో అసలుకు, నకిలీకి మధ్య తేడా తెలియని స్థితికి నెట్టింది. ఇదే ఛాన్సుగా భావించిన కొందరు టీడీపీ నేతలు ఫ్యాక్టరీ పెట్టిమరీ నకిలీ మద్యాన్ని తయారు చేసి పంపిణీ చేయడం మొదలుపెట్టారు. సరుకు నిల్వలకు ప్రత్యేక ఏర్పాట్లు, హైదరాబాద్ నుంచి సరఫరా వంటి అనేకాకనేక అక్రమాలకు పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకల చెరువు వద్ద నకిలీ ప్లాంట్, ఇటు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఒక డంప్ బయటపడ్డాయి. తరువాతి కాలంలో ఎక్సైజ్ పోలీసులు కొందరిని పట్టుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నకిలీ మద్యంతో చాలామంది అనారోగ్యానికి గురై ఉండవచ్చునని, మృత్యువాత పడి ఉండవచ్చునని అనుమానాలు ఉన్నాయి. నకిలీ మద్యం కుంభకోణాన్ని కాస్తా వైసీపీవైపు తిప్పేందుకు అధికార టీడీపీ విఫలయత్నం చేసింది. సొంతపార్టీ నేతలే పలువురు కీలక సూత్ర, పాత్రధారులుగా స్పష్టం కావడంతో రోజుకో కొత్త కథతో విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. ములకలచెరువుతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో లభించిన నకిలీ మద్యం శాంపిళ్లను పరీక్షల కోసం పంపగా.. వచ్చిన ఫలితాలను మసిపూసి మారేడు కాయ చేసేందుకు ఎల్లోమీడియా రంగంలోకి దిగింది. స్ట్రెంత్ ప్రమాణాలు పాటించకుండా నకిలీ మద్యం తయారు చేశారని, ప్రమాదకరం కాకపోయినా మంచిది కాదని లాబ్ అధికారులు నివేదించారని తెలుగుదేశం మీడియా సన్నాయి నొక్కులు నొక్కింది. ఒక సమాచారం.. ప్రకారం.. నీళ్లు, స్పిరిట్, రంగు ,రుచి రసాయనాలతో నకిలీ మద్యం తయారైందని గుంటూరు లాబ్ నివేదిక ఇచ్చిందట. వారికి అందిన 45 శాంపిల్స్ నకిలీ మద్యమేనని తేల్చిందట. అండర్ ఫ్రూఫ్, ఓర్ ఫ్రూఫ్లలో భారీ వత్యాసం ఉందని కనుగొన్నారు. లాబ్ రిపోర్టు తీవ్రత తగ్గించి చూపడానికి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోందని వార్తా కథనాలు సూచిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. బార్లు, బెల్టు షాపులు, పర్మిట్ రూమ్ ల ముసుగులో నకిలీ మద్యం దందా సాగుతోందని ఆయన అన్నారు. ఈ 16 నెలల్లో వైన్ షాపుల ద్వారా జరిగిన డిజిటల్ చెల్లింపులు, రూ.99 రూపాయల ధర కలిగిన లిక్కర్ సేల్స్ వివరాలు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం ఆదాయంపై విపరీతంగా ఆధారపడ్డ రాష్ట్ర ప్రభుత్వం నకిలీమద్యం పేరెత్తితే కేసులు బనాయించేందుకు సిద్ధమవుతోంది. దుగ్గిరాల మండలంలో పెరిగిపోతున్న బెల్ట్ షాపుల గురించి లేఖద్వారా తెలియజేసినందుకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి లోకేశ్ చిర్రుబుర్రులాడారట. ఆ కోపంతో ఆయన తన భర్త దాసరి వీరయ్యపై అక్రమంగా హత్యకేసు బనాయించారని స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు అరుణ వాపోతున్నారు. పేర్ని నాని మరో సంచలన విషయం చెప్పారు. బార్ల యజమానులకు ప్రభుత్వం నిర్దిశించిన ఫీజ్ కట్టాలంటే విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు తదితర నగరాలలో రోజుకు మూడు లక్షల రూపాయల మద్యం అమ్మాల్సి ఉంటుందట. ఇందుకోసం ప్రభుత్వం నుంచి నెలకు రూ.80 లక్షల విలువైన సరుకు కొనాలట. ఈ బార్లవారు నెలకు ఎంత సరుకు కొంటున్నారో వివరాలు బయటపెట్టగలరా అని పేర్ని నాని సవాల్ చేశారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించాలంటే ఆ వివరాలు వెల్లడించాలి. బార్లలో అమ్మే మద్యంలో పదిశాతం కూడా ప్రభుత్వం వద్ద కొన్నది కాదని ఆయన ఆరోపించారు. ఇది నిజమే అయితే సంచలనమే అని చెప్పాలి. 500 బార్ల నుంచి నెలనెలా రూ.5 కోట్లు అడ్వాన్స్ గా వసూళ్లు జరుగుతున్నాయని, ఇది నకిలీ మద్యం కన్నా భారీ కుంభకోణం అని ఆయన అంటున్నారు. గతంలో ఎల్లో మీడియా.. నేరుగా డిస్టిలరీల నుంచి వచ్చిన మద్యాన్ని ప్రభుత్వ షాపుల ద్వారా విక్రయిస్తేనే నాసిరకం మద్యం అని, పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారని ప్రచారం చేసింది. చంద్రబాబు అయితే ఏకంగా 30 వేల మంది చనిపోయారని ఆరోపించారు. ఇప్పటికీ అలాగే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏకంగా నకిలీ మద్యాన్ని తయారు చేసి అమ్మితే దానిపై ఫేక్ ప్రచారం జరుగుతోందని ఎదురుదాడి చేస్తున్నారు. పోలీసులను ప్రయోగించి కేసులు పెడుతున్నారు. వాస్తవాలు రాస్తున్న సాక్షి మీడియాపై పోలీసులతో వెంటాడుతున్నారు. సాక్షిని, సోషల్ మీడియాను అణచివేస్తే నకిలీ మద్యం సమస్యను కప్పిపుచ్చవచ్చని భ్రమ పడుతున్నారు. దానికి ఎల్లో మీడియా నకిలీ మద్యం ప్రమాదకరం కాదంటూ వంతపాడుతూ సమాజానికి ద్రోహం చేస్తోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘సంక్షేమం ఎక్కడ?..’ జనసేన ఎమ్మెల్యే అసంతృప్తి
సాక్షి, పార్వతీపురం మన్యం: సూపర్ సిక్స్ అంటూ బోలెడన్ని ఎన్నికల హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam).. వాటిని ఎగ్గొట్టే ప్రయత్నంలో డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీస్తోంది. అయితే జనాలు మాత్రం ఆ కుట్రలను పసిగడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో.. జనసేన ఎమ్మెల్యే ఒకరు అసంతృప్తితో ఉండడం తీవ్ర చర్చనీయాంశమైంది.అన్నదాత సుఖీభవ పథకం(annadata sukhibhava)పై టీడీపీ మాజీ నేత, పాలకొండ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు. గత వైఎస్సార్సీపీ హయాంలో రైతు భరోసా అందిన రైతులకు.. ఇప్పుడు అన్నదాత సుఖీభవ జమ కావడం లేదని అంటున్నారు. ఈ క్రమంలో.. వండవ గ్రామంలో 600 మంది రైతులకు నగదు జమ కాకపోవడాన్ని ప్రమఖంగా ప్రస్తావించారు. ‘‘అన్నదాత సుఖీభవపై అధికారులకు ఫిర్యాదు చేశాం. పరిష్కరిస్తారేమో చూడాలి. న్యాయం జరగకపోతే సీఎం దృష్టికి, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్తా. వాళ్లకు న్యాయం జరిగే దాకా పోరాడతా’’ అని నిమ్మక అన్నారు. ఏడాదిన్నర దాటినా కూటమి పాలనలో సంక్షేమం ఊసే లేకుండా పోయింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పథకాల అమలు అలసత్వం, వాటిలో కొన్నింటిని ఎగవేయడంపై వైఎస్సార్సీపీ ప్రజా పోరాటాలు చేస్తోంది. అదే సమయంలో కూటమి నేతలే ఇలా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఇదీ చదవండి: బాబూ.. ఇంటింటా దీపాల వెలుగు ఎక్కడ? -
బీహార్‌లో బిగ్ ట్విస్ట్.. బీజేపీ బెదిరింపుల వల్లే తప్పుకున్నాం: పీకే సంచలన వ్యాఖ్యలు
పట్నా: బీహార్ ఎన్నికల్లో(bihar Assembly Election) బీజేపీ ఒత్తిళ్ల కారణంగానే తాము ముగ్గురు అభ్యర్థులను పోటీ నుంచి విరమింపజేయాల్సి వచ్చిందని జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(prashant Kishor) ఆరోపించారు. మంగళవారం ఆయన పట్నాలో మీడియాతో మాట్లాడారు. దానాపూర్, బ్రహాంపూర్, గోపాల్‌గంజ్ సీట్ల నుంచి ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. ఓటమి భయంతోనే ఎన్డీయే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరింపులకు గురి చేస్తోందన్నారు.ఈ సందర్బంగా ప్రశాంత్ కిషోర్.. ‘ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ఇలాంటి పరిణామాలు దేశంలో ఇంతకుముందెన్నడూ జరగలేదు. ఎన్నికల సంఘం అభ్యర్థులకు తగు భద్రత కల్పించాలి’ అని ఆయన కోరారు. ఆదివారం వరకు పార్టీ తరఫున చురుగ్గా పనిచేసిన బ్రహాంపూర్‌లో తమ అభ్యర్థి సత్యప్రకాశ్ తివారీ సోమవారం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ(BJP Party) ఎన్నికల ఇన్చార్జి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం తివారీ ఇంటికి వెళ్లి తీవ్రంగా బెదిరించారన్నారు.బీజేపీ నేతలు బెదిరింపుల వల్లే పోటీ నుంచి వైదొలగుతున్నట్లు గోపాల్‌గంజ్‌లోని తమ అభ్యర్థి శేఖర్ సిన్హా, దాన్‌పూర్‌లో అభ్యర్థి అఖిలేశ్ షా తనకు చెప్పారని ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని, ప్రజల్లో సడలుతున్న విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పాలన్నారు. అభ్యర్థులనే కాపాడలేని ఈసీ, ఓటర్లకు ఎలా రక్షణ కల్పిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించింది. ఎవరూ పట్టించుకోవడం లేదని భావించిన ప్రశాంత్ కిశోర్ బీజేపీ నేతలపై ఆరోపణల ద్వారా ప్రచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడింది. -
ఇంటింటా దీపాల వెలుగు ఎక్కడ?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘‘మీరూ.. మీ కూటమి ఇంటింటా వెలిగిస్తామన్న దీపాల్లో ఒక్కటైనా ఈ 18 నెలల కాలంలో వెలిగిందా..? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా?’’ అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. వైఎస్సార్సీపీ పాలనలో 2019–24 మధ్య ఇంటింటికీ అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులని చంద్రబాబును దుయ్యబడుతూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. ఇవన్నీ వెలగని దీపాలే కదా... 1. నిరుద్యోగులందరికీ నెలకు రూ.3 వేల చొప్పున భృతి.. 2. ప్రతి అక్కచెల్లెమ్మకూ నెలకు రూ.1,500 చొప్పున ఏటా రూ.18,000.. 3. 50 ఏళ్లకే పెన్షన్.. నెల నెలా రూ.4 వేలు... 4. పీఎం కిసాన్ కాకుండా, ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20,000 ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట.. 5. ఎంతమంది పిల్లలున్నా, ఆ పిల్లలందరికీ ప్రతి ఒక్కరికీ ఏటా రూ.15,000 6. ప్రతి ఇంటికీ ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. ఈ రెండేళ్లలో ఆరు సిలిండర్లు 7. అక్క చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా, ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం..ం 8. ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు.. ⇒ ఇవన్నీ.. వెలగని దీపాలో ంలేక చేశామంటే చేశాం అన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలా.. లేక మీరు రాకముందు వరకూ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా? ⇒ వీటితోపాటు స్కూళ్లు, ఆస్పత్రులు, విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత.. ఇవన్నీ కూడా వెలగని దీపాలే కదా! ⇒ మా పాలనలో 2019–24 మధ్యం ఇంటింటికీ అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు! -
బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు రెడీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా పార్టీకి చెందిన 40 మంది ముఖ్య నేతలు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార సారథులుగా వ్యవహరిస్తారు. బీఆర్ఎస్ తరఫున ప్రతిపాదించిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ గుప్తా ఇచ్చిన ప్రతిపాదనల మేరకు ప్రచార వాహనాల పాస్‌లు మంజూరు చేసింది. ఈసీ అనుమతి పొందిన స్టార్ క్యాంపెయినర్లు వచ్చే నెల 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం నిర్వహించేలా అనుమతి ఇచ్చింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఇంకా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, వి.ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వి.శ్రీనివాస్‌గౌడ్, ఎస్.నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి ఉన్నారు. అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, అనిల్‌జాదవ్, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, ముఠా గోపాల్, చింతా ప్రభాకర్ కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంబీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తాతా మధు, ఎల్.రమణ, తక్కెళ్లపల్లి రవీందర్ రావు ప్రచారంలో పాల్గొంటారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్దన్‌రెడ్డి, షకీల్ అమీర్ మొహమ్మద్, నేతలు రావుల శ్రీధర్‌రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, అబ్దుల్లా సోహైల్ కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థిని మజ్లిస్ నిర్ణయించింది
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ని ఎంఐఎం నేతలు నిర్ణయించారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి ని ప్రకటించిన వెంటనే మజ్లిస్ నేతలు కలసి, తరువాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారని ఆరోపించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పక్కలో చేరడం మజ్లిస్‌కు అలవాటేనన్నారు. కిషన్‌రెడ్డి మంగళవారం బీజేపీ అభ్యర్థి లంకెల దీపక్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా యూసఫ్‌గూడలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. ‘బీఆర్ఎస్ పనైపోయింది. ఆ పార్టీకి ఓటు వేస్తే మూసీలో వేసినట్లే. హైదరాబాద్‌ను లండన్, న్యూయార్క్, వాషింగ్టన్, సింగపూర్‌గా మారుస్తా అన్న వ్యక్తి ఫాంహౌస్‌లో పడుకున్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, రాజీనామా చేసిన తరువాత ఫాంహౌస్ నుంచి బయటకు రాని వారికి ఓటు వేస్తామా’అని అన్నారు. జూబ్లీహిల్స్ అంటే అక్కడ అన్నీ అద్దాల మేడలని ప్రజలకు ఒక దురభిప్రాయం ఉందని, ఇక్కడ వీధుల్లో చూస్తే మురుగు నీరు, చెత్త, వెలగని వీధి లైట్లు, పార్కుల కబ్జాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. గుడి భూములు ఎంఐఎంకు: బండి సంజయ్ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి ఆలయానికి చెందిన 11 ఎకరాలను ఎంఐఎం పార్టీ వారికి రాసివ్వడానికి ముందస్తు అగ్రిమెంట్ జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సల్కం చెరువులో ఎంఐఎం కాలేజీ కడితే వారితో కాంగ్రెస్ నేతలు భాగస్వామ్యం పెట్టుకున్నారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో సైకిల్‌కి కూడా గతి లేని నాయకులు ఇప్పుడు కేజీల కొద్దీ బంగారు ఆభరణాలు వేసుకుని, పెద్దపెద్ద కార్లలో తిరుగుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై మేం మాట్లాడం, మూసీపై మీరు మాట్లాడకండి అంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం నడుస్తోందని ఆరోపించారు. ఎంఐఎంలో ఇద్దరు జోకర్లు ఉన్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి చెరో రూ.200 కోట్లు తెచ్చుకుని, పతంగి పార్టీని యూసఫ్‌గూడ చౌరస్తాలో వేలం వేస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయడానికి కాంగ్రెస్‌కు అభ్యర్థి దొరకలేదని, అందుకే మజ్లిస్ నుంచి ఒక వ్యక్తిని అద్దెకు తెచ్చుకున్నారని బీజేపీ రాష్త్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని, దానికి జూబ్లీహిల్స్ నుంచే నాంది పలకాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు పాల్గొన్నారు. -
చివరిరోజు 189 నామినేషన్లు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం నామినేషన్లు వెల్లువెత్తాయి. భారీ సంఖ్యలో నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులతో బంజారాహిల్స్ రోడ్డు నంబర్–2లోని షేక్‌పేట మండల కార్యాలయంలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారి కార్యాలయం కిటకిటలాడింది. ఉదయం 8 గంటల నుంచే అభ్యర్థులు క్యూ కట్టారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవగా అభ్యర్థులు భారీగా ఉండటంతో అధికారులు వారికి టోకెన్లు జారీ చేశారు. ఇలా మొత్తం 189 నామినేషన్లకు అధికారులు టోకెన్లు అందించారు. ఈ టోకెన్ల ప్రకారం అభ్యర్థులను లోపలకు పిలిచారు. ఒక్కో అభ్యర్థి నామినేషన్ సమర్పించేందుకు 15 నిమిషాలు పట్టగా రాత్రి 12 గంటల వరకు 160 నామినేషన్ల పత్రాలను మాత్రమే రిటర్నింగ్ అధికారి తీసుకోగలిగారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన అధికారులతోపాటు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ హేమంత్ కేశవ పాటిల్, రిటర్నింగ్ అధికారి సాయిరాం తదితరులు అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఈసీని బు«§ధవారం వరకు గడువు కోరారు. దీంతో ఈసీ అనుమతి మేరకు టోకెన్లు ఎంత మందికి జారీ చేస్తే వారందరి నుంచి నామినేషన్ పత్రాలు తీసుకోవాలని.. బుధవారం ఈ ప్రక్రియ కొనసాగించవచ్చని ఈసీ నుంచి ఆదేశాలు జారీ కావడంతో ఆర్వో కేంద్రం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉప ఎన్నికకు మొత్తంగా 316 నామినేషన్లు దాఖలయ్యాయి. ట్రిపుల్ ఆర్ బాధితులు... ప్రతిపాదిత రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్) వల్ల భూములు కోల్పోతున్న నిర్వాసితుల్లో 11 మంది రైతులు సైతం మంగళవారం నామినేషన్లు వేశారు. ఆర్ఆర్ఆర్ వల్ల రోడ్డున పడుతున్నామని మొరపెట్టుకున్నా ప్రభుత్వం వినిపించుకోనందున తమ బాధలు చెప్పుకోవడానికే నామినేషన్లు వేసినట్లు బాధిత రైతులు పేర్కొన్నారు. అలాగే 10 మంది ఫార్మాసిటీ భూ నిర్వాసిత రైతులు సైతం నామినేషన్లు దాఖలు చేశారు. వారితోపాటు సుమారు 200 మంది భూ నిర్వాసితులు నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకొని తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేసి టీజీఐఐసీ పేరిట మార్చిన పట్టా భూములను తిరిగి రైతుల పేరిట నమోదు చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకే నామినేషన్లు వేశామని అభ్యర్థులు తెలిపారు. మరోవైపు రిటైరైనా ప్రభుత్వం నుంచి ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదంటూ పలువురు రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ 50 మంది మాల మహానాడు నేతలు సైతం నామినేషన్లు వేశారు. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారి సంఖ్య భారీగా నమోదైంది. -
రేవంత్ సర్కారుకు బుద్ధి చెప్పండి
శేరిలింగంపల్లి/బండ్లగూడ: (హైదరాబాద్): రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కారుకు బుద్ధి రావాలంటే జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గెలిపించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు కోరారు. మంగళవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి లింగంపల్లి బస్తీ దవాఖానాను పరిశీలించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం హైదర్షాకోట్లో హైడ్రా కూల్చివేతల బాధితుల దీపావళి పండుగలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు..బస్తీల ప్రజలకు ఇబ్బంది కలగవద్దని, గడప దగ్గరలోనే వైద్య సేవలు అందించేలా రాష్ట్రవ్యాప్తంగా 450 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు. అందులో 350 బస్తీ దవాఖానాలను ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఏర్పాటు చేస్తే, ఇప్పుడు వాటిని నిర్వీర్యంగా మార్చారు. కనీసం బీపీ మీటర్లు కూడా పనిచేయడం లేదు. గతంలో బస్తీ దవాఖానాలలో 134 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తూ 110 రకాల మందులు అందించే వాళ్ళం. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వీటికి సుస్తీ పట్టింది. ప్రస్తుతం 60 నుంచి 70 రకాల మందులే ఇస్తున్నారు. 40 రకాల మందులు సరఫరా చేయడం లేదు. వైద్య పరీక్షలు కూడా అన్నీ జరగడం లేదు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటి. సీఎం సొంత నియోజకవర్గంలోనే 108 సర్వీస్ సకాలంలో రాక, వైద్యం సకాలంలో అందక మనిషి ప్రాణం పోయింది..’అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కేసీఆర్ కిట్లు ఇవ్వడం లేదు ‘ఆస్పత్రులలో కేసీఆర్ కిట్లు ఇవ్వకపోవడం వల్ల 20 శాతం ప్రసవాల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు తరలి వెళుతున్నారు. రూ.1,400 కోట్ల మేర ఆరోగ్యశ్రీ బకాయిలు ఉండగా.. వాటిని చెల్లించకపోతే సేవలు నిలిపివేస్తామని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయంటే పరిస్థితి ఏ విధంగా మారిందో అర్థమవుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఎన్నటికీ బీజేపీతో కలవదు. మాది లౌకిక పార్టీ. కానీ కాంగ్రెస్, బీజేపీలు కలిసి పని చేస్తున్నాయనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. నగరంలో పేదల ఇళ్లు కూల్చడం ఆగాలన్నా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. రేవంత్‌రెడ్డి నయా నరకాసురుడు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వం వారికి కునుకు లేకుండా చేస్తోంది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు ఓటేస్తే బస్తీ దవాఖానాల్లో మందులు లేకున్నా, డాక్టర్లు లేకున్నా, వైద్య పరీక్షలు లేకున్నా నాకే ఓటేశారని రేవంత్‌రెడ్డి అనుకుంటాడు. అందుకే ప్రజలంతా బీఆర్ఎస్కే ఓటెయ్యాలి. హైదర్షాకోట్ అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు తమకు అండగా ఉండాలని కోరారు. మీ కష్టాల్లో అండగా ఉన్నది బీఆర్ఎస్ పారీ్టయే..’అని హరీశ్‌రావు చెప్పారు. పలువురు పార్టీ నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
‘చంద్రబాబు.. అన్నీ ప్రైవేటుకు అప్పగించి ఇంకేం పాలన చేస్తావ్’
విజయవాడ: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలన్నీ ప్రైవేటీకరణ వైపు నడుస్తున్నాయని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అన్నింటినీ ప్రైవేటుకు కట్టబెట్టాలనే ఆలోచనలోనే చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు. అన్నింటినీ ప్రైవేటుకు అప్పగించేటప్పుడు ఇక చేసే పాలన ఏముంటుందని ప్రశ్నించారు రామకృష్ణ.మోదీని ప్రసన్నం చేసుకోవడానికి అవసరం లేకపోయినా ఏపీకి ఆహ్వానిస్తున్నారన్నారు.‘వందల కోట్లు ఖర్చు చేసి పెద్ద పెద్ద ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. కర్నూలులో జీఎస్టీ విజయోత్సవం నిర్వహించడం హాస్యాస్పదం. జీఎస్టీ తగ్గింపు వల్ల సామాన్యులకు ఎలాంటి లాభం లేదు. రాష్ట్రానికి కూడా పెద్దగా ఒరిగిందేమీ లేదు. గత నెలలో ఏపీకి జీఎస్టీ వల్ల వచ్చింది 3500 కోట్లు మాత్రమే. ఏపీ కంటే జీఎస్టీ వల్ల ఎక్కువ ఆదాయం వచ్చిన రాష్ట్రాలేవీ ఇలా సంబరాలు నిర్వహించలేదు. మోదీని ప్రసన్నం చేసుకోవడానికే చంద్రబాబు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఢిల్లీలో ఈనెల 24,25 తేదీల్లో జాతీయ సిపిఐ సమావేశాలు. దేశవ్యాప్తంగా చేపట్టే కార్యక్రమాల పై చర్చిస్తాం. 25వ తేదీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. నవంబర్ 2,3 తేదీల్లో సిపిఐ స్టేట్ కౌన్సిల్ సమావేశాలు ఉంటాయి. ఏపీలో భవిష్యత్ కార్యక్రమాలు , పోరాటాలకు రూపకల్పన చేయబోతున్నాం. మాతో కలిసి వచ్చే అందరినీ కలుపుకుని పోరాడుతాం’ అని రామకృష్ణ స్పష్టం చేశారు.ఇది ఉద్యోగులను దగా చేస్తున్న ప్రభుత్వం -
‘ఇది ఉద్యోగులను దగా చేస్తున్న ప్రభుత్వం’
నెల్లూరు: ఒకపక్క ఉద్యోగుల పొట్టగొడుతూ వారి సంపదను స్వాహా చేస్తున్న కూటమి ప్రభుత్వం వారిని ఉద్దరించినట్టుగా ప్రచారం చేసుకుంటోందని, మొన్న దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన ఒక పెండింగ్ డీఏ కూడా మోసమేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దీపావళికి ముందు చంద్రబాబు ఉద్యోగులతో మాట్లాడి ప్రెస్‌మీట్ పెడితే ఏదో ఉద్ధరిస్తాడనుకుంటే నాలుగు పెండింగ్ డీఏల్లో ఒకే ఒక్కటి రిలీజ్ చేస్తామని చెప్పాడని అన్నారు. ఆ అరియర్స్ని కూడా రిటైర్మంట్ సమయంలో ఇస్తామని చెప్పి ఉద్యోగుల కడుపు మీద కొట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ కమిషన్, ఐఆర్, రూ. 34 వేల కోట్ల పెండింగ్ బకాయిల గురించి ప్రస్తావించకుండానే చంద్రబాబు ప్రెస్‌మీట్ ముగించడం చూస్తే ఉద్యోగుల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అర్థమైందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...ఇచ్చిన ఒక్క డీఏ కూడా మోసమేఉద్యోగులను ఉద్ధరించేసినట్టుగా రెండు రోజులుగా కూటమి ప్రభుత్వం విపరీతంగా ప్రచారం చేసుకుంటోంది. ఉద్యోగులకు డీఏ ధమాకా, దీపావళి బొనాంజా అంటూ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటోంది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఎన్నికల్లకు ఇచ్చిన హామీలు పక్కడపెడితే వారికి హక్కుగా దక్కాల్సినవే ఇవ్వకుండా ఒక డీఏ రిలీజ్ చేసి వారికి బిక్షం వేస్తున్నట్టు మట్లాడుతున్నారు. రెండు రోజుల క్రితం దీపావళికి ముందు నేరుగా సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవడంతో ఈసారి ఉద్యోగుల హామీలన్నీ నెరవేరుస్తారని అనుకున్నారు. నాలుగు డీఏలు ఇవ్వడంతోపాటు పీఆర్సీ కమిషన్ వేస్తారు, పెండింగ్ అరియర్స్ రిలీజ్ చేస్తారని, 30 శాతం ఐఆర్ ఇస్తారని ఉద్యోగులంతా భావించారు. కానీ తీరా చూస్తే సీఎం చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి ఒకే ఒక్క డీఏ ఇచ్చేయడం చూసి ఉద్యోగులంతా నివ్వెరపోయారు. పీఆర్సీ కమిషన్ పైగానీ, ఐఆర్ పైగానీ, పెండింగ్ అరియర్స్ విషయంలో కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా చాలించాడు. ఇచ్చిన డీఏలోనూ ఉద్యోగులకు జరిగిన మోసమే కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ అయిదేళ్ళ పాలనలో 11 డీఏలువైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలలో ఆర్నెళ్లకు ఒక డీఏ చొప్పున 10 డీఏలు ఇవ్వడంతో పాటు గత చంద్రబాబు ప్రభుత్వం పెండింగ్ పెట్టిన డీఏ ను కూడా రిలీజ్ చేసి మొత్తం 11 డీఏలు ఇచ్చారు. మాజీ సీఎం వైఎస్ జగన్ నాలుగు డీఏలు పెండింగ్ పెడితే అందులో ఒక డీఏ ఇస్తున్నట్టు చంద్రబాబు డీఏల విషయంలో పచ్చి అబద్ధాలు చెప్పాడు. 2024 లో జనవరి, జూన్ తోపాటు 2025 జనవరి జూన్ నెలల డీఏలు ఇవ్వాల్సి ఉందని చంద్రబాబే చెబుతున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వాల్సిన డీఏలను కూడా జగన్ ఖాతాలో వేసి తప్పించుకోవాలని చూడటం హేయం. వైఎస్సార్సీపీ హయాంలో ఒక డీఏ పెండింగ్ లో ఉండటానికి కూడా కారణం కేంద్ర ప్రభుత్వ జాప్యమే. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం డీఏ రిలీజ్ చేసిన తర్వాత రాష్ట్రాలు ప్రకటించడం అనేది ఆనవాయితీ. ఆ ప్రకారం కేంద్రం జనవరి 2024లో రిలీజ్ చేయాల్సిన డీఏను మార్చి 6న ప్రకటించడంతో ఆ వెంటనే మార్చి 11న ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రకటించలేకపోయాం. 2024 జనవరి డీఏను ఇప్పుడు ప్రకటించారు. దానికి సంబంధించి డీఏ అరియర్స్ ని కూడా రిటైర్ అయ్యేటప్పుడు ఇస్తామనడం దారుణం. చంద్రబాబు తప్ప దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా చెప్పడం చూడలేదు. పైగా ఈ అమౌంట్‌ను పీఎఫ్ అకౌంట్ లో కూడా జమ చేస్తామని చెప్పకపోవడం దుర్మార్గం. ఇప్పుడు ఎంత బకాయి ఉందో ఆ మొత్తమే వడ్డీ కూడా లేకుండా 30 ఏళ్ల తర్వాత ఇస్తామని చెప్పడం ఉద్యోగులను దారుణంగా వంచించడమే. చంద్రబాబు తీసుకొస్తున్న ఇలాంటి కొత్త సంస్కృతితో ఉద్యోగుల జీవితాలు ఏమైపోతాయో ఆలోచించాలి. రిటైర్ అయిన ఉద్యోగుల డీఏల గురించి ఏమీ ప్రస్తావించడం లేదు.పీఆర్సీ కమిషన్ ఊసే లేదుపీఆర్సీ కమిషన్ కాల పరిమితి ముగిసి ఇప్పటికే రెండేళ్ళ మూడు నెలలు గడిచిపోయింది. అయినా కొత్త పీఆర్సీ వేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పీఆర్సీ కోసం వేసిన కమిషన్‌ను కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడగానే, కమిషనర్ చైర్మన్‌తో రాజీనామా చేయించారు. తరువాత ఈరోజుకీ పీఆర్సీ కమిషన్ వేయడానికి కూడా చంద్రబాబుకి మనసు రావడం లేదు. ఈరోజు పీఆర్సీ కమిషన్ వేసినా దాని నివేదిక వచ్చి అమలు చేయడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది. ఉద్యోగుల సంఘాల మీటింగ్‌లో పీఆర్సీ కమిషన్ వేస్తామని చెప్పకుండా తప్పించుకోవడం దుర్మార్గం కాదా? పీఆర్సీ వేయనప్పుడు ఐఆర్ ఇవ్వడం ఆనవాయితీ. కానీ రెండేళ్ళ మూడు నెలల కాలంలో ఐఆర్ కూడా ఇవ్వని దారుణ పరిస్థితిని చంద్రబాబు నేతృత్వంలో ఉద్యోగులు ఎదుర్కుంటున్నారు. కోవిడ్ వంటి పరిస్థితులున్నా సాకులు చెప్పి తప్పించుకోకుండా ఆరోజున వైఎస్ జగన్ 23 శాతం పీఆర్సీ ఇచ్చి ఉద్యోగుల పక్షాన నిలిచారు. 27 శాతం ఇస్తామని చెప్పి 23 శాతమే ఇచ్చారని, ఇది రివర్స్ పీఆర్సీ అని ఆరోజున, ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు సహా కూటమి నాయకులు ప్రచారం చేసుకున్నారు. నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని హేళన చేసి మాట్లాడిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా పీఆర్సీ ఎందుకు ఇవ్వలేదు. కనీసం కమిటీ కూడా వేయకపోగా వైఎస్ జగన్ హయాంలో వేసిన కమిటీతో కుట్రపూరితంగా రాజీనామా చేయించారు.రూ.34 వేల కోట్లకు ఉద్యోగుల బకాయిలుస్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.22 వేల కోట్లు ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలున్నాయని చంద్రబాబు గెలిచిన వెంటనే అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశాడు. ఆ రూ.22 వేల కోట్లు దఫదఫాలుగా చెల్లిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఉద్యోగుల ఓట్లతో గెలిచిన చంద్రబాబు, తీరా గెలిచాక వాటి ఊసే ఎత్తడం లేదు. చంద్రబాబు ఇచ్చిన శ్వేతపత్రంలో రూ.22 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పాడు. మొన్నటి ప్రెస్మీట్లో రూ.34 వేల కోట్ల అరియర్స్ ఉన్నాయని చెబుతున్నాడు. బకాయిలు చెల్లిస్తానని చెప్పి, ఏకంగా రూ. 12 వేల కోట్లు పెంచేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఇది మోసం కాదా? రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఏవైనా ఉంటే వెంటనే చెల్లిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం 2027-28 లో 12 వాయిదాల్లో ఇస్తానని చెప్పడం వారిని వేధించడమే. పింఛన్ పై ఆధారపడి జీవించే వృద్ధులను కూడా వేధించడం న్యాయమా అని చంద్రబాబు ఆలోచించుకోవాలి. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా కర్నాటక, తమిళనాడుతో పోల్చి చూపించి ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలి, ఉద్యోగుల జీతాలు తగ్గించుకోవాలని చంద్రబాబు హేళనగా మాట్లాడుతున్నాడు. సీఎం, డిప్యూటీ సీఏం, మంత్రులు చేస్తున్న దుబారాను తగ్గిస్తే, ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుంది. వాలంటీర్లకు జీతాలు పెంచుతానని చెప్పి, వారిని రోడ్డు పాలు చేశారు. సచివాలయ ఉద్యోగుల విషయంలోనూ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మీకు అనవసరంగా జీతాలిస్తున్నామని సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి అనడం సరికాదు. పోలీసులకు 4 సరెండర్ లీవ్‌లకు గానూ ఒక్కదానికే అనుమతి ఇస్తూ, రెండు నెలల తరువాత రూ.105 కోట్లు విడుదల చేస్తాను అని చెప్పడం దారుణం. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకునేందుకు సీఎంగా వైయస్ జగన్ దానిని ప్రభుత్వపరం చేస్తే, దానిపైనా సీఎం చంద్రబాబు వక్రబాష్యం చెబుతున్నాడు. ఆర్టీసిని కాపాడాలనే ఉద్దేశమే ఆయనకు లేదు’ అని ధ్వజమెత్తారు.ఇదీ చదవండి:‘చంద్రబాబు.. దీనినే క్రెడిట్ చోరీ అంటారు’ -
మీడియాపై హోంమంత్రి అనిత తీవ్ర అసహనం.. ఎందుకంటే?
సాక్షి,అమరావతి: మీడియాపై హోంమంత్రి తీవ్ర అనిత అసహనం వ్యక్తం చేశారు.పవన్ వద్ద భీమవరం డీఎస్పీ పేకాట పంచాయితీపై మీడియా ప్రశ్నించింది. సమాధానం చెప్పలేక మీడియాపై హోంమంత్రి ఎదురుదాడికి దిగారు. పవన్ సలహాలు ఇవ్వడంలో తప్పులేదు. మాకు మాకు లేని ఈగోలు మీకెందుకు?.ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు. మా మధ్య అండర్ స్టాండింగ్ ఉంది. ఎలాంటి ఈగోలు లేకుండా పనిచేస్తున్నాం’ అంటూ మీడియాపై ఫైరయ్యారు. అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు పేకాట పంచాయితీ చేరింది. భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై పవన్‌కు జనసేన నేతల ఫిర్యాదు చేశారు. సివిల్ వివాదాలలో జయసూర్య జోక్యం చేసుకుంటున్నారని, భీమవరం పరిధిలో పేకాట శిబిరాలు ప్రోత్సహిస్తున్నారని డీఎస్పీపై పవన్‌కు చేసిన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అయితే ఫిర్యాదులపై పవన్ స్పందించారు. కూటమి నేతల నుంచి తమకు ఫిర్యాదులు వచ్చాయన్న ఆయన ..డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి, డీజీపీకి తెలపాలని అధికారులకు ఆదేశాలు చేశారు. డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని ఎస్పీకి ..పవన్ ఆదేశించారు. ఈ ఆదేశాలు,పవన్ జోక్యం వంటి అంశాలపై మీడియా హోంమంత్రి అనితను ప్రశ్నించింది. పేకాట పంచాయితీలో మాకు లేని ఈగోలు మీకెందుకు అంటూ అసహనం వ్యక్తం చేశారు.👉ఇదీ చదవండి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు ‘పేకాట పంచాయితీ’ -
అమిత్ షా కామెంట్స్.. నితీశ్‌కు టెన్షన్!
బిహార్ శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. మొదటి దశ పోలింగ్‌కు సరిగ్గా 15 రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రధాన కూటములు ఎన్డీఏ, మహాఘఠ్బందన్ గెలుపు వ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. ఒకవేళ ఎన్డీఏ గెలిస్తే ముఖ్యమంత్రి పీఠం ఎవరు అధిష్టిస్తారనే అనుమానం తాజాగా మొదలయింది. బిహార్‌కు అత్యధిక కాలం సీఎంగా సేవలు అందించిన 74 ఏళ్ల నితీశ్ కుమార్‌కు మరో చాన్స్ ఉంటుందా, లేదా అనే చర్చ నడుస్తోంది. నితీశ్ మద్దతుదారులు మాత్రం ఆయనే మళ్లీ సీఎం అంటూ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.తాజా ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిస్తే, ఎవరు సీఎం అవుతారనే దానిపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలతో నితీశ్ భవితవ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక టీవీ షోలో అమిత్ షా మాట్లాడుతూ.. "నితీష్ మా ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహిస్తారు. ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు ముందుగా తమ తమ పార్టీ నాయకులను ఎన్నుకుంటారు. తర్వాత వారు కలిసి కూర్చుని తదుపరి ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించాలో నిర్ణయిస్తారు" అని అన్నారు.నితీశ్‌కు బీజేపీ ధోకాఅమిత్ షా వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. నితీశ్ కుమార్‌కు బీజేపీ ధోకా ఇవ్వడం ఖాయమన్నట్టుగా ప్రచారం మొదలు పెట్టాయి. నితీశ్ మరోసారి సీఎం కాలేరని అమిత్ షా స్పష్టంగా చెప్పారని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. కాంగ్రెస్ మాటలను నమ్మవద్దని ఎక్స్‌లో బీజేపీ వీడియో షేర్ చేసింది. అమిత్ షా మాటలను కాంగ్రెస్ పార్టీ వక్రీకరించిందని, స్వప్రయోజనాల కోసం బిహార్ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని కమలనాథులు కౌంటర్ ఇచ్చారు.షాకు చిరాగ్ మద్దతు!అమిత్ షాకు మద్దతుగా బీజేపీ కీలక మిత్రుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. "ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిని ఎన్నుకునే సాధారణ ప్రక్రియ గురించి అమిత్ షా ప్రస్తావించారు. ఐదు పార్టీలతో కూడిన మా కూటమిలో గెలిచిన ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియను గౌరవించాలి" అని అన్నారు. కాగా, సీట్ల పంపిణీ వ్యవహారంలో చిరాగ్ గట్టిగా పట్టుబట్టి లోక్ జన్ శక్తి పార్టీకి 29 సీట్లు సాధించుకున్న సంగతి తెలిసిందే.ముందే ప్రకటించాలిహిందుస్తానీ అవామ్ మోర్చా (HAM) వ్యవస్థాపక అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మాత్రం భిన్నంగా మాట్లాడారు. కూటమిలో క్లారిటీ, యునిటీ కోసం ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నికలకు ముందే ప్రకటించాలన్నారు. ఎన్డీఏ ముఖ్యమంత్రి నితీశ్ కుమారే అంటూ రాష్ట్రీయ లోక్‌మంచ్ (RLM) జాతీయ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా ప్రకటించారు. నితీశ్ నాయకత్వంలో ఎన్నికల్లో గెలుస్తామని, మళ్లీ అధికారంలోకి వస్తామని మీడియాతో అన్నారు.పీకే జోస్యం ఫలిస్తుందా?నితీశ్ కుమార్‌కు ఈసారి అధికార యోగం లేదని జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) చెబుతూ వస్తున్నారు. జేడీయూకి పరాభవం తప్పదని, 25 సీట్లు కూడా రావని ఆయన అంటున్నారు. శారీరకంగా అలసిపోయి, మానసికంగా బలహీనపడిన నితీశ్ కుమార్ రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించలేరని పేర్కొన్నారు. జేడీయూ సంప్రదాయ ఓట్లకు జన్ సురాజ్ పార్టీ గండి కొడుతుందని ప్రశాంత్ కిశోర్ అంచనా వేస్తున్నారు.చదవండి: 3 కోట్ల లగ్జరీ కారు.. 35 లక్షల బంగారంనల్లేరు మీద నడక కాదుబిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్డీఏ ఫేస్‌గా నితీశ్ కుమార్ ప్రస్తుతం ఉన్నప్పటికీ తర్వాత పరిస్థితుల గురించి అమిత్ షా సూచనప్రాయంగా వెల్లడించడంతో చర్చ మొదలైంది. ఒకవేళ ఎన్డీఏ కూటమి మెజారిటీ స్థానాలు సాధించి, జేడీయూకు తక్కువ సీట్లు వస్తే నితీశ్‌కు సీఎం పదవి కట్టబెడతారా, లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవంబర్ 14న వెలువడే ఎన్నికల ఫలితాలపై నితీశ్ భవితవ్యం ఆధారపడి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
ప్రజల సొమ్ము కరకట్టపాలు.. చంద్రబాబు సోకులపై విమర్శల వర్షం!
సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు సోకుల కోసం కూటమి ప్రభుత్వం ప్రజల సొమ్మును ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేస్తుందనే విమర్శలు వెత్తుతున్నాయి. తాజాగా, చంద్రబాబు కరకట్ట ప్యాలెస్ కోసం మరో రూ.1.07కోట్లు మంజూరు చేసింది.ఇటీవల చంద్రబాబు కాన్వాయ్‌లో కొత్త వాహనాల కొనుగోలు కోసం భారీ మొత్తంలో నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇలా జీవో జారీ చేసిందో లేదో చంద్రబాబు నివాసంగా ఉపయోగిస్తున్న కరకట్ట ప్యాలస్ మరమ్మతులు, సౌకర్యాల కోసం రూ. కోటి 21 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది కొత్తది కాదు. గత రెండు నెలల్లోనే కరకట్ట ప్యాలస్‌కు సంబంధించి రూ.95 లక్షలు, రూ.36 లక్షలు వేర్వేరుగా నిధులు విడుదల చేసింది. అది సరిపోదన్నట్లుగా మొన్నటికి మొన్న మరో రూ.50 లక్షలు విడుదల చేసింది. ఈ నిధుల్లోరూ.20 లక్షలు: మరుగుదొడ్లు, శానిటేషన్, నీటి సరఫరా మరమ్మతులకురూ.16.50 లక్షలు: వంటశాల సదుపాయాల కోసంరూ.19.50 లక్షలు: నివాసం చుట్టూ చెదల నివారణకు వినియోగించనుంది.ఇంతకు ముందు కరకట్ట ప్యాలస్ సౌకర్యాల కోసం రూ.కోటి 44 లక్షలు ఖర్చు చేసిన ప్రభుత్వం.. గత వారం రూ. కోటి 21 లక్షలు విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా, ఢిల్లీలో చంద్రబాబు నివాసానికి సౌకర్యాల కోసం రూ.95 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.కొత్తగా ప్రజల సొమ్ము కరకట్టపాలు అన్న చందంగా.. మరోసారి కరకట్ట సోకుల కోసం రూ.1.07కోట్లు మంజూరు చేయడం గమనార్హం.2014–19 మధ్య సీఎంగా ఇలా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి తన విలాసాల కోసం భారీ మొత్తంలో ఖర్చు పెడుతుండడం విశేషం. గతంలో 2014–19 మధ్య సీఎంగా ఉండగా ఆయన విలాసాలు, హంగు, ఆర్భాటం, సొంత ఇళ్లు, క్యాంప్ ఆఫీసులకు పెట్టిన ఖర్చు వంద కోట్లకు పైనే. ఆ ఐదేళ్లలో హైదరాబాద్‌లో రెండేసి బంగ్లాలు, రెండేసి క్యాంపు ఆఫీస్‌లు, విజయవాడలో రెండేసి క్యాంపు ఆఫీస్‌ల పేరుతో మరమ్మతులకు, సెక్యూరిటీ, సీసీ కెమేరాలు, పోలీస్ బరాక్‌లకు కోట్ల రూపాయల ప్రజా ధనం ఖర్చు చేశారు. ఇప్పుడు మరోసారి తన మార్క్ దుబారాతో పరిపాలన చేస్తున్నారు. -
‘చంద్రబాబు.. దీనినే క్రెడిట్ చోరీ అంటారు’
కాకినాడ: 2019 నుంచి 2024 కాలంలో దేశంలో ఎక్కడా జరగని విప్లవాత్మక సంస్కరణలను మాజీ సీఎం వైఎస్ జగన్ చేస్తే.. దాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు విమర్శించారు. దీనినే క్రెడిట్ చోరీ అంటారు.. చంద్రబాబు అని కురసాల ఎద్దేవా చేశారు. ‘గత మరచిపోయిన చంద్రబాబు.. అన్నీ తానే చేశాను అంటున్నారు.వైఎస్ జగన్ చేసిన మంచిని కూటమీ ప్రభుత్వం చోరి చేస్తుంది. చంద్రబాబుకు తోడు ఆయన కొడుకు లోకేష్ నలభై ఆబద్దలు చెబుతున్నాడు. నోరు తెరుస్తే నిజం చెప్పకుండా తండ్రి కొడుకులు పచ్చి ఆబద్దలు ఆడుతున్నారు. గ్రీన్ ఎనర్జీ,డేటా సెంటర్,పోర్టు లను తామే కొబ్బరి కొట్టి ప్రారంభించినట్లు చెబుతున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు కనీసం గత చంద్రబాబు పాలనలో భూసేకరణ చేయ్యలేదు. *సెజ్ భూములను తిరిగి ఇవ్వడం కూడా తనదే క్రెడిట్ గా చెప్పుకున్నారు. *దీనికి వంత పాడుతున్న ఎల్లో మీడియా.. సెజ్ భూములను తిరిగి ఇస్తున్నట్లుగా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యవసాయ మంత్రిగా ఉన్న నన్ను సెజ్ భూములు తిరిగి ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కమీటికి ఛైర్మన్‌గా నియమించారు.ఆనాడు జీవో నెం : 158 ద్వారా 2180 ఎకరాల సెజ్ భూములను వెనక్కి ఇచ్చేశారు. సెజ్ భూములు తిరిగి ఇవ్వడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ మోమో ఇచ్చింది. గతంలో వైఎస్ జగన్ ఇచ్చిన జీవోను అమలు చేయ్యమని ఆ మోమో లో ఉంది. గత టిడిపి పాలనలో సెజ్ పోరాట కమీటి నాయకులను గృహనిర్భం చేశారు. ఉద్యమకారులపై పోలీసులతో దమణకాండ చేసి... అక్రమ కేసులు పెట్టించారు. జైళ్ళల్లో నిర్బందించి రైతులను, ఉద్యమకారులను వేధించారు. 2014కు ముందు సెజ్ భూముల్లో ఏరువాక చేసి భూములని తిరిగి ఇచ్చేస్తానని హమీ ఇచ్చారు చంద్రబాబు. సెజ్ కోసమే భూసేకరణ ముఖ్యం.. గ్రామలు ఎలా పోయిన పర్వాలేదని ఆనాడు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ లో వదిలేయగా లేనిది..మా భూములు ఇవ్వాలని 16 రాష్ట్రాలకు సంబంధించిన సెజ్ భూముల కేసులు సుప్రీం కోర్టులో నడుస్తున్నాయి. 158 జీవో ద్వారా స్ధానికులకు 78% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పాం...దానిని అమలు చేయ్యండి. సెజ్ రైతులపై చంద్రబాబు సర్కార్ బనాయించిన అక్రమ కేసులను జగన్ ఎత్తివేశారు.వాటిలో ఇంకా ఉన్న కొన్ని కేసుల ఇప్పుడు ఎత్తివేయ్యండి. దీవీస్ తీసుకున్న ఎస్సైన్డ్ భూములు ఎకరాకు రూ.10 లక్షలు రైతులకు ఇప్పించారు. జిఎంఆర్ రూ. 300 కోట్లు, కేవీ రావ్ 600 కోట్లు రుణాలు తెచ్చారు. శ్మసానాలు,చెరువులను కూడా సేకరించారు. వాటిపై చంద్రబాబు ఎందుకు విచారణ జరపరు. క్రెడిట్ చోరి తప్పా...మరో ఆలోచన చంద్రబాబుకు లేదు. సెజ్ లో జరిగిన తప్పులపై చర్యలు తీసుకోండి. కూటమి ప్రభుత్వం లో పబ్లిసిటీ పీక్...పనిలో వీక్. కార్పోరేట్ కంపెనీలు అంటే...జీ హుజీర్ అంటూ చంద్రబాబు సాగిలపడిపోతాడు’ అని ధ్వజమెత్తారు కురసాల కన్నబాబు.విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు -
Hyd: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ గడువు
హైదరాబాద్: నగర పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ గడువు ముగిసింది. ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన అభ్యర్థులను లోనికి అనుమతించారు అధికారులు. ఈరోజు(మంగళవారం, అక్టోబర్ 21వ తేదీ) నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఆర్వో కార్యాలయం కాంపౌండ్క భారీగా క్యూకట్టారు స్వతంత్ర్య అభ్యర్థులు. సుమారు వందకు పైగా స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ వేసినట్ల తెలుస్తోంది. గేట్ లోపల ఉన్న అభ్యర్థుల నామినేషన్లన మాత్రమే ఆర్వో అధికారి స్వీకరించనున్నారు. గడిచిన 9 రోజుల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని(Deepak Reddy) సైతం ఈరోజే నామినేషన్ దాఖలు చేశారు. కాగా, ఊహించిన విధంగా దీపక్ రెడ్డి వైపే.. బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. గత బుధవారం ఉదయం దీపక్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది. ఇక, దీపక్ రెడ్డి.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దీపక్‌రెడ్డికి 25వేల ఓట్లు వచ్చాయి.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పక్కా ప్రణాళికలు చేస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలోనూ పార్టీలు ఆచితూచి అడుగులు వేశాయి. ఇక, ఈ ఎన్నికలో అధికార కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత గోపీనాథ్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో త్రిముఖ పోరు ఉండనుంది.ఇదీ చదవండిపార్టీలో నా న్థానం ఏమిటి..? -
3 కోట్ల లగ్జరీ కారు.. 35 లక్షల బంగారం..
బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. టిక్కెట్లు దక్కించుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన భోజ్‌పురి సూపర్‌స్టార్ ఖేసరి లాల్ యాదవ్ తాజాగా నామినేషన్ వేశారు. సరన్ జిల్లాలోని చాప్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అభ్యర్థిగా పోటీకి దిగారు.నామినేషన్ వేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ''నా హృదయం ఎప్పుడూ ఆర్జేడీతోనే ఉంద''ని అన్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు ఆయన తన భార్య చందాతో కలిసి ఆర్జేడీలో చేరారు. ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) సాదరంగా ఖేసరి లాల్ యాదవ్, ఆయన భార్యను పార్టీలోకి ఆహ్వానించారు. వారికి స్వయంగా పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు.కాగా, తన ఆస్తుల విలువ ₹24.81 కోట్లు అని ఖేసరి లాల్ యాదవ్ (Khesari Lal Yadav) ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ₹16.89 కోట్ల విలువైన చరాస్తులు, ₹7.91 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. భార్య చందా యాదవ్ కు ₹90.02 లక్షల విలువైన చరాస్తులు, ₹6.49 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని ప్రకటించారు. తన అసలు పేరు శత్రుఘ్న యాదవ్‌గా అఫిడవిట్లో పేర్కొన్నారు. తన వద్ద ₹5 లక్షల నగదు.. తన సతీమణి వద్ద ₹2 లక్షల నగదుతో పాటు ₹35 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలిపారు.ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. 2023–24లో ఖేసరి లాల్ యాదవ్ వార్షిక ఆదాయం ₹73.5 లక్షలుగా ఉంది. 2022–23లో ₹95.02 లక్షలు, 2020–21లో ₹1.01 కోట్లుగా ఉంది. ఖేసరి లాల్ యాదవ్ ఆస్తుల్లో 2023లో కొనుగోలు చేసిన ₹3 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ లగ్జరీ కారు కూడా ఉంది.పాలు అమ్మి.. స్టార్‌గా ఎదిగిసామాన్య కుటుంబంలో పుట్టిన ఖేసరి లాల్ యాదవ్ తన ప్రతిభతో సెలబ్రిటీగా ఎదిగారు. ఆయన తండ్రి మంగరు యాదవ్ ఒకప్పుడు ఉదయం వీధి వ్యాపారిగా, రాత్రిళ్లు సెక్యూరిటీ గార్డుగా పనిచేశారు. తన బాల్యంలో తమ గ్రామంలో పశువులను మేపుతూ పాలు అమ్మేవాడినని ఖేకరీ పలు సందర్బాల్లో చెప్పారు. నటుడిగా, గాయకుడిగా ఎదిగిన ఆయన వందకు పైగా భోజ్‌పురి చిత్రాలలో నటించారు. 5 వేలకు పైగా పాటలు పాడారు. తొలిసారిగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి శాసనసభకు ప్రాతినిథ్యం వహించాలని భావిస్తున్నారు.చదవండి: బిహార్ ఎన్నికల్లో 'వెరైటీ' ఫ్రెండ్లీ ఫైట్!యువతలో ఫాలోయింగ్భోజ్పురిలో ఖేసరి లాల్ యాదవ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యువత, వలస కార్మికులు ఆయనను బాగా ఇష్టపడతారు. రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన సరన్ జిల్లాలో ఖేసరి లాల్ యాదవ్ ప్రభావం ఉంటుందని ఆర్జేడీ అంచనా వేస్తుంది. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయి. మొదటి విడత పోలింగ్ నవంబర్ 6న, రెండో దశ పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి. -
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు ‘పేకాట పంచాయితీ’
సాక్షి,విజయవాడ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు పేకాట పంచాయితీ చేరింది. భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై పవన్‌కు జనసేన నేతల ఫిర్యాదు చేశారు. సివిల్ వివాదాలలో జయసూర్య జోక్యం చేసుకుంటున్నారని, భీమవరం పరిధిలో పేకాట శిబిరాలు ప్రోత్సహిస్తున్నారని డీఎస్పీపై పవన్‌కు చేసిన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అయితే ఫిర్యాదులపై పవన్ స్పందించారు. కూటమి నేతల నుంచి తమకు ఫిర్యాదులు వచ్చాయన్న ఆయన ..డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి, డీజీపీకి తెలపాలని అధికారులకు ఆదేశాలు చేశారు. డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని ఎస్పీకి ..పవన్ ఆదేశించారు. -
విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు
సాక్షి,విశాఖ: ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో చాలా సవాళ్లు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ పెద్ద సమస్య. గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పలేం. డేటా సెంటర్ ఏర్పాటులో అదానీ కూడా భాగస్వామిగా ఉందని’ వ్యాఖ్యానించారు.అంతకుముందు విశాఖలో గూగల్ సంస్థలో ఉద్యోగాల విషయమై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కీలక కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. గూగుల్ సంస్థలో లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయనే మాట అవాస్తవం అంటూ నిజాలను బయటపెట్టారు. వాస్తవాలను కుండబద్దలు కొట్టారు. 👉ఇదీ చదవండి: చారాణా కోడికి బారాణా మసాలామూడు రోజుల క్రితం విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. ‘ నిజం చెప్పడానికి నాకు మొహమాటం లేదు. డేటా సెంటర్ అంటే కాల్ సెంటర్ కాదు. డేటా సెంటర్ వలన ఎక్కువ ఉద్యోగాలు రావు. గూగుల్ సంస్థలో లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయనే మాట అవాస్తవం. రెండు, మూడు వేలలో మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. గూగుల్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయానేది సమస్య కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, గూగల్ సంస్థలో ఉద్యోగాలపై చంద్రబాబు, నారా లోకేష్ వ్యాఖ్యలు అబద్దమని తేలిపోయింది. -
‘రేయ్ ఏఎస్పీ.. నీ అంతు చూస్తా’.. పోలీసులపై రెచ్చిపోయిన జేసీ
అనంతపురం జిల్లా: తాడిపత్రి టీడీపీ నేత, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ నోరు పారేసుకున్నారు. ‘‘తుపాకులు నీ వద్దే కాదు.. నా వద్ద కూడా ఉన్నాయి. రేయ్ ఏఎస్పీ.. నీ అంతు చూస్తా.. నీకు బుద్ధి, జ్ఞానం లేవు. ఏఎస్పీ రంజిత్ ఓ పనికిమాలిన వాడు.. వేస్ట్ ఫేలో.. గొడవలు జరిగితే ఇంట్లో దాక్కుంటాడు’’ అంటూ పోలీసుల అమరవీరుల సంస్మరణ సభలో జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు.కాగా, అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి రెండు రోజుల క్రితం కూడా వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. పట్టపగలు అందరూ చూస్తుండగా.. వైఎస్సార్సీపీ నాయకుడిపై తన అనుచరులతో దాడి చేయించి తీవ్రంగా గాయపరిచారు. వైఎస్సార్సీపీ నాయకుడు యర్రగుంటపల్లి నాగేశ్వరరెడ్డి ఆదివారం తాడిపత్రిలోని ఆనంద్ భవన్ హోటల్ వద్ద టీ తాగుతుండగా.. వాహనంలో అటుగా వెళ్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి చూశారు.ఆ వెంటనే ‘వీణ్ని ఎందుకురా ఇంత వరకు వదిలేశారు’ అంటూ అనుచరులను రెచ్చగొట్టారు. దీంతో రవీంద్రారెడ్డి, యాసిన్, బద్రీ, విష్ణు, శేఖర్‌తో పాటు సుమారు పది మంది జేసీ అనుచరులు ఇనుప రాడ్లతో నాగేశ్వరరెడ్డిపైకి దూసుకెళ్లారు. వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన నాగేశ్వరరెడ్డిని.. రోడ్డుపై వెంబడిస్తూ దాడి చేశారు. సమీపంలో వైఎస్సార్సీపీ నాయకురాలు పేరం స్వర్ణలత ఇల్లు కనిపించడంతో.. నాగేశ్వరరెడ్డి అందులోకి పరుగెత్తుకెళ్లి తలదాచుకున్నాడు. జేసీ అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోగానే.. పేరం అమరనాథ్‌రెడ్డి స్థానికులతో కలిసి బాధితుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. -
చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపులు.. భూమనకు నోటీసులు
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ నేతలపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డికి ఎస్వీ వర్శిటీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎస్వీ గోశాలలో గోవుల మరణాలపై అసత్య ప్రచారం చేశారంటూ టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విచారణ హాజరుకావాలంటూ భూమనకు నోటీసులు జారీ చేశారు. -
‘‘కేసీఆర్‌పై కోపంతో..’’ కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్, హరీష్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ లేని కాంగ్రెస్ ప్రభుత్వం.. విజయోత్సవాలు చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మంగళవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇబ్రహీంనగర్ బస్తీ దవాఖానాను సందర్శించి.. అక్కడి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఫిరాయింపుల వ్యవహారంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డిపైనా ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అసలు నీతి ఉందా?. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్స్ లిస్ట్‌లో దానం నాగేందర్ పేరు చేర్చటం సిగ్గు చేటు. దానం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని ఎవరు చెప్పారు?. పార్టీ మారలేదని స్పీకర్ దగ్గర అబద్దాలు చెప్తున్నారు. పార్టీ మారినోళ్ళకు సిగ్గు లేదు. ఏ పార్టీలో ఉన్నామో చెప్పే దమ్ము లేదు. ఆ దమ్మే ఉంటే స్వయంగా చెప్పొచ్చు కదా అని కేటీఆర్ నిలదీశారు.AICC అంటే.. ఆల్ ఇండియా కరపర్షన్ కమిటీ. విజయోత్సవాలు ఎందుకు చేయోలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. ప్రజారోగ్యం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెక్కలేదు. రాజకీయాలు కాదు.. ముఖ్యమంత్రి ప్రజల ప్రాణాలను పట్టించుకోవాలి. మున్సిపల్ మంత్రి లేక.. పట్టించుకునే వారు లేక హైదరాబాద్ అనాధగా మారింది. హైదరాబాద్ సిటీ చెత్త చెదారంతో నిండిపోయింది. పట్టణంలో ఉండే పేదల కోసమే కేసీఆర్ 450 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో బస్తీ దవాఖానలకు సుస్తీ చేసింది. కనీస మందులు కూడా అందుబాటులో లేవు. ఇది ప్రభుత్వానికి గుర్తు చేయటం కోసమే ఆకస్మిక తనిఖీలను చేపట్టాం. బస్తీ దావాఖాన సిబ్బందికి తక్షణమే జీతాలు ఇవ్వాలి. ఆశా వర్కర్లు, అంగన్ వాడీ సిబ్బందికి జీతాలు పెంచాలి. కేసీఆర్ ముందు చూపుతో.. కరోనా సమయంలో కూడా ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడలేదు. వైద్య పరీక్షలు ఉచితంగా చేసే టీ డయాగ్నస్టిక్స్ ను అందుబాటులోకి తీసుకురావాలి నిర్మాణ పనులు పూర్తి చేయకుంటే.. టిమ్స్ ఆసుపత్రుల ముందు వెయ్యి మంది దర్నా చేస్తాం అని కేటీఆర్ హెచ్చరించారు.అటు శేరిలింగంపల్లి బస్తీ దవాఖానాను పరిశీలించిన తర్వాత హరీష్‌రావు మాట్లాడారు. ‘‘పేదల ఆరోగ్యంపై రేవంత్‌కు శ్రద్ధ లేదు. బస్తీ దవాఖానాల్లో బీపీ మిషన్లు పని చేయడం లేదు. కేసీఆర్‌పై కోపంతో కేసీఆర్ కిట్ పథకం తీసేశారు. జనం మద్యం తాగాలి.. ఖజానా నిండాలి అన్నదే సీఎం ఆలోచనగా కనిపిస్తోంది అని హరీష్ విమర్శించారు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. భ్రాంతి కాకూడదు!
హైదరాబాద్‌లో భూమి ధరలు రికార్డులు బద్ధలు కొడుతున్నాయి. ఎకరా భూమి ఏకంగా రూ.177 కోట్లు పలికిందంటే ఆశ్చర్యమేస్తోంది. రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఆశించిన స్థాయిలో లేవన్న వార్తలొస్తున్న వేళ ఒక కంపెనీ ఇంత మొత్తం పెట్టిందంటటే నమ్మశక్యం కాదు. వేలం పాటలో కొన్నమాటైతే వాస్తవం. అయితే కొనుగోలు ధర పూర్తిగా చెల్లించినప్పుడే ఈ విలువ ధృవీకరణ అవుతోంది.తెలంగాణలో రియల్ ఎస్టేట్ కుదేలైందన్నది దుష్ప్రచారమేనని వాస్తవం లేదని, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో రూ.2800 కోట్ల విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగితే, అది రూ.4804 కోట్లు అని రియల్ ఎస్టేట్ రంగం వృద్ధికి ఇదే ఆధారమని కూడా ఆయన వ్యాఖ్యానించారు అయితే జనాభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ కాస్త బాగున్న రోజుల్లో బుక్ అయిన ఇళ్లు, అపార్టుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతుండవచ్చని, ప్రస్తుతం బుకింగ్ ఎంత మేరకన్నది కూడా చూడాలంటున్నారు వారు. వాస్తవానికి రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణతోపాటు దేశాద్యంతం కూడా మందగతిలోనే ఉందని వారు చెబుతున్నారు.కొన్ని రోజుల క్రితం తెలంగాణ పారిశ్రామిక వసతుల కల్పన సంస్థ రాయదుర్గ్‌లోని 7.67 ఎకరాల భూమిని వేలానికి పెడితే ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ ఎకరానికి రూ.177 కోట్ల చొప్పున మొత్తం రూ.1350 కోట్లకు దక్కించుకుంది. పెస్టీజ్ రియాల్టీ ఇంకో 11 ఎకరాలను ఎకరాకు రూ.141.5 కోట్ల చొప్పున సొంతం చేసుకుంది. ఈ వేలం ద్వారా మొత్తం రూ.2913 కోట్ల ఆదాయం దక్కిందన్నమాట. రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీల రూపంలో ఇంకో రూ.225 కోట్లు కూడా రానున్నాయి. అయితే గతానుభవాలను దృష్టిలో ఉంచుకుంటే.. వేలం పాడిన ఈ సంస్థలు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేంతవరకూ కొనసాగుతాయా అన్న అనుమానం వస్తుంది. 2023లో కోకాపేటలో ఎకరాకు రూ.100.75 కోట్లు పలికిన విషయం తెలిసిందే. అప్పటితో పోలిస్తే ధర సుమారు 76 శాతం పెరిగిందన్నమాట. హైదరాబాద్ సాధిస్తున్న సుస్థిరాభివృద్ధి, గ్లోబల్ బిజినెస్ హబ్‌గా మారడం, మౌలిక వసతులు తదితరాలు ఇందుకు కారణమని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ విధానాలపై పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనమని టీజీఐఐసీ ఎండీ శశాంక అభిప్రాయపడ్డారు. ఇవన్నీ వాస్తవమైతే ఫర్వాలేదు కానీ.. బలవంతంగా మార్కెట్‌ను పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తే మాత్రం బెడిసికొడుతుందని రియల్ ఎస్టేట్ రంగం అనుభవజ్ఞులు చెబుతున్నారు.ఎకరా భూమికి రూ.177 కోట్లు, రూ.141.5 కోట్లు పెట్టి కొన్న కంపెనీలు నిర్మాణాలు పూర్తయిన తరువాత ఎంత కాదన్నా అన్ని ఖర్చులు కలుపుకుని చదరపు అడుగు రూ.30 - 40 వేల కు అమ్ముకోవాల్సి వస్తుందని కొందరు బిల్డర్ల అంచనా. అయితే ఆ ప్రాంతంలో ఎఫ్ఎస్ఏ ఎక్కువ కాబట్టి ఏభై, అరవై అంతస్థుల నిర్మాణానికి కూడా అనుమతులు లభిస్తాయని... ఆ రకంగా చదరపు అడుగుకు రూ.10 - 20 వేలకు అమ్ముకున్నా గిట్టుబాటు అవుతుందని మరికొందరి అంచనా. మరీ ఎక్కువ ధర పెడితే కంపెనీలు కూడా కొనుగోలుకు ఆలోచిస్తాయని చెబుతున్నారు. పెట్టిన పెట్టుబడిపై ఒక శాతం కూడా గిట్టుబాటు కాదనుకుంటే ఎందరు కొనుగోలు చేస్తారు అని ఒక ప్రముఖ బిల్డర్ ప్రశ్నించారు.కోకాపేటలో పక్కనే 50 - 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండటంతో దాని ధర రూ.వంద కోట్లయితే తనదీ అంతే పలుకుతుందన్న అంచనాతో గతంలో ఒక కంపెనీ వేలంలో పాల్గొందని సమాచారం. అయితే ఆ అంచనాలు తారుమారు కావడంతో ఆ కంపెనీ తన డిపాజిట్‌ను వదులుకుంది మినహా ఎకరాకు రూ.వంద కోట్లు చెల్లించలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుత వేలం పాటలలో పాల్గొన్న కంపెనీలలో ఒక రాజకీయ నేత భాగస్వామిగా ఉన్నారు. ఇటీవలే రియల్ ఎస్టేట్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడియన ఆయన కంపెనీనే ఇంత భారీ మొత్తానికి వేలం పాటలో పాల్గొనడం వెనుక మతలబు ఏమిటన్నది ప్రశ్న. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా మాంద్యం ఏర్పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లేవు. అమెరికా ప్రభుత్వ విధానాలు, ప్రత్యేకించి ట్రంప్ సుంకాలు భారత్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఏఐ కారణంగా ఐటీ రంగం అనిశ్చితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు గతంలో మాదిరిగా రుణాలపై అపార్టుమెంట్లు కొనుగోలు చేయడం లేదని అంటున్నారు. పైగా ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవనాలు, అపార్ట్మెంట్లు కొనుగోలుదారులు, అద్దెదారుల కోసం వేచి చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నంతలో హైదరాబాద్ కాస్తో, కూస్తో బెటర్‌గా ఉండవచ్చేమో కాని, ఈ స్థాయిలో ధరపెట్టి కొనుగోలు చేసేంతగా ఉండకపోవచ్చని ఒక నిపుణుడు అభిప్రాయపడ్డారు. ఇంకో సంగతి గుర్తు చేసుకోవాలి. హెచ్ఎండీయే ఇటీవలే హైదరాబాద్ శివార్లలో 103 ప్లాట్లను వేలం వేస్తే, మూడు మాత్రమే అమ్ముడుపోయాయి. వేలం ద్వారా రూ.500 కోట్లు వస్తాయని ఆశిస్తే, రూ.38 కోట్లే వచ్చాయి. కొద్ది నెలల వ్యవధిలోనే ఎకరం రూ.177 కోట్లకు కొనేంత మార్పు వస్తుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన చివరి రోజుల్లో రియల్ ఎస్టేట్ పడిపోవడం ఆరంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ మరింతగా దిగజారిందన్న అపప్రథ ఉంది. దీనిని కప్పిపుచ్చడానికి రేవంత్ ప్రభుత్వం ఏదో మాయాజాలం చేసి ఉండాలని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రెండు ప్రముఖ సంస్థలపై ఒత్తిడి తెచ్చి, ఇతరత్రా మేలు చేస్తామని ఆఫర్ ఇచ్చి ఈ స్థాయిలో ధర పలికేలా చేశారన్నది కొందరి అనుమానం. ఈ రెండు కంపెనీలు గడువులోపు డబ్బును చెల్లిస్తే రేవంత్ ప్రభుత్వ విశ్వసనీయత, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ అమాంతంగా పెరిగిపోతుంది. దీని ప్రభావం ఫ్యూచర్ సిటీపై కూడా పడుతుంది. అక్కడ కూడా లావాదేవీలు పుంజుకుంటాయి. రీజినల్ రింగ్ రోడ్ల నిర్మాణం, హైదరాబాద్ - విజయవాడ రోడ్లు విస్తరణ, కొత్తగా అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే వంటివి కూడా కార్యాచరణకు వచ్చినప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగా పుంజుకునే అవకాశం ఉంది. ఇంతకాలం నేచురల్ గా గ్రోత్ ఉండడం వల్ల భూముల ధరలు పెరిగాయి. అయితే ఇవీ మరీ పెరిగిపోతే మధ్య తరగతికి అందుబాటులో లేకపోతే కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉంటుంది.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బిహార్ ఎన్నికల్లో ‘వెరైటీ’ ఫ్రెండ్లీ ఫైట్!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీల మధ్య లుకలుకలు కొనసాగుతున్నాయి. సీట్ల పంపకంపై స్పష్టమైన ప్రకటనేదీ చేయకుండానే రాష్ట్రీయ జనతాదళ్(RJD), కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు.. తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించేశాయి. దీంతో మహాఘట్ బంధన్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. పైగా కీలకమైన 11 స్థానాల్లో మిత్రపక్షాల అభ్యర్థులు తలపడబోతుండడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.ఈ పోటీని ఫ్రెండ్లీ ఫైట్‌గా అభివర్ణించుకున్నప్పటికీ.. బీజేపీ, జేడీయూ, ఇతర ఎన్డీయే మిత్రపక్షాలు మాత్రం విపక్ష కూటమిని ఎద్దేవా చేస్తున్నాయి. ఈలోపు.. ఊహించని పరిణామం ఒకటి అక్కడి రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే.. తన పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ ప్రచారం చేయాల్సి రావడం!.గౌర బౌరమ్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థి అఫ్జల్ అలీ ఖాన్ పోటీ చేస్తున్నారు. అయితే తేజస్వి యాదవ్ అఫ్జల్ తరఫున కాకుండా వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(VIP Candidate) సంతోష్ సాహ్నికి మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు.గౌర బౌరమ్ నియోజకవర్గంలో పోటీకి ఆర్జేడీ తరఫున అఫ్జల్ అలీ ఖాన్‌ను తొలుత అధిష్టానం ఎంచుకుంది. ఆ పార్టీ అధినేత లాలూ తన నివాసానికి పిలిచి మరీ అఫ్జల్‌కు పార్టీ గుర్తు (లాంతరు)తో క్లియరెన్స్ ఇస్తూ సీల్డ్ కవర్ అందజేశారు. ఆ సంతోషంలో.. ఆలస్యం చేయకుండా ప్రచారంలోకి దిగిపోయారు. ఆ వెంటనే నామినేషన్ దాఖలు చేశారు.ఈలోపు.. లాలూ తనయుడు తేజస్వి యాదవ్ ఎంట్రీతో సీన్ మారింది. సీట్ల పంపకంలో భాగంగా.. గౌర బౌరమ్ను వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీకి అప్పగించినట్లు లాలూకు వివరించారు. ఆపై నామినేషన్ వెనక్కి తీసుకోవాలని అఫ్జల్‌ను కోరారు. కానీ అందుకు ఆయన నిరాకరించాడు. ఈలోపు నామినేషన్ల గడువు ముగిసిపోయింది. దీంతో ఎన్నికల అధికారులను ఆర్జేడీ ఆశ్రయించింది. అయితే రిటర్నింగ్ ఆఫీసర్లు నామినేషన్లో అభ్యంతరాలు లేవని చెబుతూ.. పోటీ నుంచి తొలగించలేమని చేతులెత్తేశారు. దీంతో ఈ ఎన్నికల్లో ఈవీఎం మీద ఆర్జేడీ లాంతర్ గుర్తుతో అఫ్జల్ అలీ అధికారికంగా పోటీ చేయబోతున్నారు. అలా మహాఘట్ బంధన్‌లో సీట్ల పంపకాల గ్యాప్ వల్ల తన పార్టీ గుర్తుతో పోటీ చేస్తున్న అభ్యర్థికి వ్యతిరేకంగా తేజస్వి ప్రచారం చేసే అరుదైన పరిస్థితి ఏర్పడింది(Gaura Bauram RJD Fight).2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గౌర బౌరమ్ స్థానం వీఐపీ పార్టీకి చెందిన స్వర్ణ సింగ్‌కు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో నెగ్గిన ఆమె తర్వాత బీజేపీలో చేరారు. అంతకు ముందు.. 2015, 2010 ఎన్నికల్లో జేడీయూ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. కొసమెరుపు.. పైన చెప్పుకున్న సందర్భం మొదటిసారేం కాదు. కిందటి ఏడాది లోక్‌సభ ఎన్నికల్లోనూ రాజస్థాన్ బన్స్వారా నియోజకవర్గంలో ఇదే తరహ పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ తరఫున అరవింద్ దామోత్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆపై మనసు మార్చుకున్న హైకమాండ్ భారత్ ఆదివాసీ పార్టీ అభ్యర్థి రాజ్‌కుమార్ రౌత్‌కు సీటు కేటాయిస్తూ.. తన అభ్యర్థిని సింబల్ రిటర్న్ చేయమని కోరింది. అయితే పార్టీకి మస్కా కొట్టి నామినేషన్ ఉపసంహరణ గడువు దాకా దామోత్ అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో.. కాంగ్రెస్‌కు తన అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే ఆ ఎన్నికల్లో రౌత్ విజయం సాధించినప్పటికీ.. దామోత్కు 60 వేల ఓట్లు పోలయ్యాయి. -
‘మరీ ఇంత వెన్నుపోటు రాజకీయమా?’ ఇండియా కూటమిపై జేఎంఎం సంచలన ఆరోపణలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమి (బీహార్ మహా ఘట్బంధన్) భాగస్వామి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)నేతలు కాంగ్రెస్, ఆర్జేడీలపై సంచలన ఆరోపణలు చేశారు. పొత్తులపై పునరాలోచన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు కూడా. ఏమైందంటే..బీహార్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించక ముందే కాంగ్రెస్, ఆర్జేడీ, జేఎంఎంలు మహా ఘట్బంధన్ పేరుతో ఒక్కతాటిపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో సీట్ల పంపకం ఎంతకీ తెగలేదు. కాంగ్రెస్ పార్టీ తనకు 70కుపైగా సీట్లు కావాలని డిమాండ్ చేయడం, అన్ని సీట్లు ఇవ్వడం సాధ్యం కాదని ఆర్జేడీ భీష్మించుకున్నాయి. తరువాతి కాలంలో ఇరుపక్షాలు కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శించడంతో తగిన సమయంలోనే ఇరు పార్టీల మధ్య సీట్ల పంపిణీ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. ఇదిలా ఉంటే.. జార్ఖండ్ ముక్తి మోర్చా పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. తాము 12 సీట్లు కావాలని కోరామని, అయితే ఘట్ బంధన్ భాగస్వాములు సీట్ల పంపకంలో తమను అసలు లెక్కలోకే తీసుకోలేదని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ సుప్రియో భట్టాచార్య ఆరోపించారు. మూడు రోజుల క్రితమే ఈ పార్టీ తాము అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని ప్రకటించిన సంగతి ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. సీట్ల పంపకంపై ఘట్ బంధన్ నుంచి స్పందన లేకపోవడంతోనే తామీ నిర్ణయానికి వచ్చినట్లు (జేఎంఎం) ప్రకటించింది. కాంగ్రెస్, ఆర్జేడీలపై ఒత్తిడి తెచ్చేందుకే చేసిన ఈ ప్రకటన ఫలితమేమీ ఇవ్వలేదు. నామినేషన్ల దాఖలుకు ఆఖరి గడువైన ఆదివారం కూడా సీట్ల పంపిణీ పంచాయతీ తేలలేదు. జేఎంఎం అభ్యర్థులనూ ప్రకటించలేదు. దీంతో ఆ పార్టీ ఈసారి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్టు అయ్యింది. ఈ నేపథ్యంలో జేఎంఎం కీలక నేత, జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సైతం కాంగ్రెస్, ఆర్జేడీలపై విమర్శలు గుప్పించారు. సీట్ల పంపకంలో తమ పార్టీని పక్కన పెట్టారని.. వెన్నుపోటు రాజకీయం చేశారని ఆయన ఆరోపించారు. అభ్యర్థులను నిలబెట్టమని చెప్పకుండా, చివరి నిమిషం వరకు స్పష్టత ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. అంతేకాదు.. ఆర్జేడీ-కాంగ్రెస్‌లు ‘కూటమి ఒప్పందాన్ని’ సైతం గౌరవించలేదని అన్నారు.తొలిసారి..ఇదిలా ఉంటే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు జేఎంఎం దూరం కావడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. బీహార్-జార్ఖండ్ సరిహద్దు రాష్ట్రాల నియోజకవర్గాలైన జమై, చకాయి, ధమదాహా, మనిహారి, పిర్పైంటి, కటోరియా.. తదితర ప్రాంతాలలో ఆ పార్టీ క్రమం తప్పుకుండా పోటీ చేస్తుంటుంది. 2020 ఎన్నికల్లోనూ సొంతంగా పోటీ చేసినా ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. బీహార్ ఎన్నికల నుంచి జేఎంఎం తప్పుకోవడంపై బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘బీహార్ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసిపోయింది. కానీ JMM ఒక్క అభ్యర్థిని కూడా బరిలో నిలపలేకపోయింది. భారీ ప్రకటనలు చేసే ఆ పార్టీ.. ఈసారి ఏం చేసింది?. జార్ఖండ్ పరువు ప్రతిష్టలను దిగజారుస్తూ సిగ్గులేకుండా వ్యవహరించారని BJP ప్రతినిధి ప్రతుల్ షాహ్దేవ్ మండిపడ్డారు.ముదురుతున్న విబేధాలు..బీహార్ అసెంబ్లీ ఎన్నికల (2025) నేపథ్యంలో రాష్ట్రీయ జనతా దళ్ (RJD), కాంగ్రెస్ మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు INDIA కూటమిలో భాగస్వాములు అయినప్పటికీ.. సీటు పంపకాలపై ఏకాభిప్రాయానికి రావడం లేదు. ఈ గందరగోళం మధ్య.. ఆర్జేడీ 143 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించుకుంది. అలాగే.. కాంగ్రెస్ 61 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగతా సీట్లలో వామపక్షాలకు, అలాగే.. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీకి 15 సీట్లు పోనున్నట్లు తెలుస్తోంది. సీట్ల పంపకాలపై అధికారిక ప్రకటన.. స్పష్టత లేకపోవడంతో కాంగ్రెస్-ఆర్జేడీలు ఐదు నియోజకవర్గాల్లో ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయి. అలాగే.. కాంగ్రెస్ మరికొన్ని స్థానాలలో వామపక్షాల కూటమితోనూ పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.బీహార్ ఎన్నికలు నవంబర్ 6, 11వ తేదీల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న ఉంటుంది. నామినేషన్ల గడువు ముగియడంతో.. ప్రచార కార్యక్రమాలు ఇవాళ్టి (అక్టోబర్ 21) నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ముజఫ్ఫర్‌పూర్ నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. బీజేపీ నేతలు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు.ఇదీ చదవండి: హోరాహోరీ పోరు! ఎలా ఉందంటే.. -
సీఎం రేవంత్‌రెడ్డితో కొండా సురేఖ దంపతుల భేటీ
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ పాల్గొన్నారు. ఇటీవల సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు కలకలంగా రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు తన తల్లిదండ్రులపై కుట్ర చేస్తున్నారంటూ సుస్మిత ఘాటైన విమర్శలు చేశారు.కొండా సురేఖ, మురళికి ఏం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఆమె హెచ్చరించారు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీలో.. అటు అధికారవర్గాల్లో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి. -
మాచర్లలో బరితెగించిన టీడీపీ గూండాలు.. జర్నలిస్ట్‌పై దాడి
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ గూండాలు బరితెగించారు. జర్నలిస్టుపై టీడీపీ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. జర్నలిస్టుపై టీడీపీ గూండాలు కర్రలతో దాడి చేశారు. కారంపూడి మండలంలో అక్రమాలపై వార్తలు రాసినందుకు జర్నలిస్ట్‌పై దాడి చేశారు. టీడీపీ గూండాల దాడిలో జర్నలిస్టు లక్ష్మణరావుకు తీవ్రగాయాలయ్యాయి.జర్నలిస్ట్ లక్ష్మణరావు తలకు బలమైన గాయం కావడంతో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మణరావుపై తప్పుడు కేసు బనాయించడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. లక్ష్మణరావు మాట్లాడుతూ.. తెలుగుదేశం నాయకుడు చప్పిడి రాము తనపై కర్రతో దాడి చేశారన్నారు. తాను ఫిర్యాదు చేయడానికి కారంపూడి పోలీస్ స్టేషన్‌కి వెళ్తే.. చప్పిడి శ్రీనుతో పాటు మరో కత్తితో పోలీస్ స్టేషన్‌కి వచ్చి తనపై దాడి చేయడానికి ప్రయత్నించారని లక్ష్మణరావు తెలిపారు. పోలీస్ ఉన్నతాధికారులు కారంపూడి పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తే టీడీపీ నేతల దౌర్జన్యం తెలుస్తుందన్నారు. టీడీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని.. కాపాలంటూ లక్ష్మణరావు వేడుకున్నారు. -
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. ఆర్జేడీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమవారం (అక్టోబర్20)రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) 143 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అనూహ్యంగా పొత్తు పెట్టుకునేందుకు చర్చలు జరుపుతున్న ఇండియా కూటమి అభ్యర్థులపై పోటీగా ఆర్జేడీ ఐదుగురు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఇక ఆర్జేడీ విడుదల చేసిన జాబితాలో 24 మంది మహిళలు,18 మంది ముస్లిం అభ్యర్థులు ఉన్నారు.ఆర్జేడీ 143 మంది అభ్యర్థులను ప్రకటించడంతో మహాగఠ్‌బంధన్ (విపక్షాల మహా కూటమి)లో సీట్ల పంపకాల ఫార్ములా ఆర్జేడీ (143), కాంగ్రెస్ (55), సీపీఐఎంఎల్(20), సీపీఐ(6),సీపీఎం(4),వీఐపీ (15) సీట్లు ఉన్నాయి. ఓ వైపు కాంగ్రెస్ ఇప్పటికే 60 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. RJD releases its list of candidates for the Bihar Assembly Election 2025, fielding candidates in 143 seats. RJD leader Tejashwi Yadav will contest from the Raghopur assembly seat in Vaishali district. pic.twitter.com/wSsMEj8gdm— ANI (@ANI) October 20, 2025 -
పార్టీలో నా స్థానం ఏంటి?.. మంత్రి ముందు జీవన్‌రెడ్డి ఆవేదన
సాక్షి, జగిత్యాల జిల్లా: తనను హలాల్ చేసి రోజుకింత ఎందుకు చంపేస్తున్నారంటూ మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకేసారి చంపండంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముందు జీవన్‌రెడ్డి వాపోయారు. బీఆర్‌పూర్ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీపై జీవన్‌రెడ్డి అసంతృప్తి చేశారు. కమిటీలు, కాంట్రాక్టులు బీఆర్ఎస్ నుంచి వచ్చినవారికే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తమ స్థానమేంటని ప్రశ్నించారు.తాము వలసదారులం కాదంటూ తాజాగా పార్టీలోకి చేరి పదవులనుభవిస్తున్న వారిపై చురకలు అంటించారు. మంత్రి శ్రీధర్‌బాబు, అడ్లూరి అడుకోకపోతే ఆ రోజే కథ వేరుండేదంటూ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కౌలుదారులం కాదు.. పట్టాదారులమంటూ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జీవన్‌రెడ్డి ఆవేదనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. -
చంద్రబాబు పాలనలో వెలుగులు లేని దీపావళిపై వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబూ.. మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో వెలుగులు లేని దీపావళిపై సోమవారం (అక్టోబర్ 20) వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో .. చంద్రబాబు మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా?1.నిరుద్యోగులందరికీ నెలకు రూ.3వేల చొప్పున భృతి2.ప్రతి అక్కా చెల్లెమ్మకూ నెల నెలా రూ.1500, సంవత్సరానికి రూ.18,0003.50 ఏళ్లకే పెన్షన్, నెల నెలా రూ.4వేలు.4.ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20,000, పీఎం కిసాన్ కాకుండా ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట5.ఎంతమంది పిల్లలు ఉన్నా, ఆ పిల్లలందరికీ, ప్రతి ఒక్కరికీ ఏటా రూ.15,0006.ప్రతి ఇంటికీ ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఈ రెండేళ్లలో 6 సిలిండర్లు7.అక్క చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా, ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం…8.ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలుఇవన్నీ వెలగని దీపాలో…లేక చేశాం అంటే చేశాం అన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలా..? లేక మీరు రాకముందు వరకూ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా?. వీటితోపాటు స్కూళ్లు, ఆస్పత్రులు, విద్యా, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత ఇవన్నీకూడా వెలగని దీపాలే కదా.మా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 2019-24 మధ్య… ఇంటింటికీ అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు, ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు’ అంటూ ధ్వజమెత్తారు. .@ncbn గారూ… మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా? 1.నిరుద్యోగులందరికీ నెలకు రూ.3వేల చొప్పున భృతి2.ప్రతి అక్కా చెల్లెమ్మకూ నెల నెలా రూ.1500, సంవత్సరానికి రూ.18,0003.50 ఏళ్లకే పెన్షన్,…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 20, 2025 -
రేపే దీపక్ రెడ్డి నామినేషన్.. ముగ్గురు బీజేపీ ముఖ్యమంత్రుల రాక!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికపై ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలు విజయం కోసం ప్రణాళికలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు.. ఉప ఎన్నిక నేపథ్యంలో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు అవుతున్నాయి.ఇక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి రేపు(మంగళవారం) తన నామినేషన్ వేయనున్నారు. ఈ క్రమంలో యూసఫ్‌గూడ హైలం కాలనీ నుంచి షేక్‌పేట్ తహశీల్దార్ ఆఫీస్ వరకు నామినేషన్ ర్యాలీ చేపట్టనున్నట్టు సమాచారం. ఆయన నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముగ్గులు సీఎంలు ముఖ్యఅతిథిలుగా రానున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే గోవా సీఎం ప్రమోద్ సావంత్ అధికారికంగా కన్ఫరేషన్ ఇచ్చారు. అసోం, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల కన్ఫరేషన్ కోసం తెలంగాణ బీజేపీ నేతలు ఎదురుచూస్తున్నారు. కాగా, నామినేషన్ ర్యాలీలో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొననున్నారు. పెద్ద ఎత్తున జనసమీకరణతో భారీ ర్యాలీకి తెలంగాణ బీజేపీ ప్లాన్ చేసింది. -
ఉదయ్‌నిధి దీపావళి శుభాకాంక్షలు.. భగ్గుమన్న బీజేపీ
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయ్‌నిధి స్టాలిన్ దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పడం.. రాజకీయంగా దుమారాన్ని రేపింది. నమ్మకం ఉన్నవారికే.. అంటూ చేసిన కామెంట్‌పై బీజేపీ భగ్గుమంది. ఇది హిందువులపై వివక్షేనంటూ తీవ్రస్థాయిలో ఆ పార్టీ నేతలు విరుచుకుపడతున్నారు.తాజాగా ఉదయ్‌నిధి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘వేదికపైకి వచ్చినప్పుడు కొందరు నాకు పుష్పగుచ్ఛాలు, పుస్తకాలు ఇచ్చారు. అయితే దీపావళి శుభాకాంక్షలు చెప్పడం కోసం కొందరు సంకోచించారు. ‘చెబితే వీడు ఎక్కడ కోపపడతాడేమో?’ అని అనుకుని ఉండొచ్చు. అందుకే నమ్మకం ఉన్నవారికి మాత్రమే శుభాకాంక్షలు చెబుతున్నా’’ అని ఆయన అన్నారు.ఈ వ్యాఖ్యలపై(Udhayanidhi Stalin Diwali wish) బీజేపీ నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. ‘‘వాళ్లు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా హిందువులే. అందుకే మేం అందరికీ శుభాకాంక్షలు చెబుతాం" అంటూ ఉదయ్‌నిధి కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఇతర మతాల విషయంలో ఇలా ఎందుకు చేయబోరని.. ఆయన వ్యాఖ్యలు హిందువులపై వివక్ష చూపుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన నమ్మకం ‘‘ఉన్నవారికి దీపావళి శుభాకాంక్షలు" అనే వ్యాఖ్యపై బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా తీవ్రంగా స్పందిస్తున్నారు. తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి ANS ప్రసాద్ స్పందిస్తూ.. హిందూ పండుగలపై డీఎంకే ప్రభుత్వం కనీస గౌరవం ప్రదర్శించబోదని మండిపడ్డారు. ‘‘అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పౌరుడిని సమానంగా గౌరవించాల్సిన బాధ్యత ఉంది. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. అయినప్పటికీ ఎందుకనో డీఎంకే ప్రభుత్వం హిందూ మతంపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తోంది. ఆ పార్టీ హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది’’ అని ప్రసాద్ విమర్శించారు. ఇదిలా ఉంటే.. డీఎంకే నేత ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయ్‌నిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మం అనేది సామాజిక అసమానతలకు మూలం అంటూనే.. సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించకూడదు, నిర్మూలించాలి. ఇది డెంగీ, మలేరియా లాంటి వ్యాధిలా ఉంది అంటూ విమర్శించారు. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడగా.. దేశవ్యాప్తంగా కేసులు కూడా నమోదు కావడంతో కోర్టుల్లో విచారణ జరుగుతోంది.ఇదీ చదవండి: తమిళనాడు ఎలక్షన్స్.. వార్నీ.. అప్పుడే తొలి జాబితా రిలీజ్ -
సీఎం వద్దే హోంశాఖ.. పోలీసులకే రక్షణ లేదు: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే హోంశాఖ ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వంలోని పెద్దలు గుండాల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులకే రక్షణ లేకుండా పోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దీపావళి సందర్బంగా హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, హరీష్ రావు మాట్లాడుతూ.. ఒక రౌడీషీటర్.. పోలీసును హత్య చేసిన ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో బహిర్గతం చేసింది. పోలీసులకే రక్షణ లేకపోవడమేంటి?. ముఖ్యమంత్రి దగ్గర హోమ్ శాఖ ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవు. కానిస్టేబుల్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రభుత్వంలోని పెద్దలు గుండాల లాగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులకే రక్షణ లేకుండా పోయింది.పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడేది వాస్తవం కాదా?. మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులే అంత ఓపెన్‌గా మాట్లాడుతుంటే.. ఇంకా తప్పు జరగలేదని ఎవరు భావించాల్సి ఉంటుంది?. ఈ అంశంపై సిట్ విచారణ చేపట్టాలి. పెట్టుబడిదారులను బెదిరించి.. గన్ కల్చర్ చేపట్టి వాటాలు పంచుకుంటున్నారు. మేము అగ్రికల్చర్‌ను తీసుకొస్తే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గన్ కల్చర్‌ను తీసుకొచ్చింది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
అంతన్నారు ఇంతన్నారు.. తీరా చూస్తే!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన విధానాలను, సంక్షేమ పథకాలపై మనసూ మార్చుకున్నారా? ‘‘యువత పాతికేళ్ల భవిత కోరుతున్నారు’’ అని ఆయన ఇటీవల చేసిన ఒక ట్వీట్ ఇందుకు కారణమవుతోంది. రాజకీయ వర్గాలలో ఆసక్తి రేకెత్తిస్తోంది. టీడీపీ, జనసేనలు సంయుక్తంగా 2024 ఎన్నికల కోసం ఇచ్చిన హామీలు, విడుదల చేసిన ప్రణాళిక, సూపర్ సిక్స్ హామీలకు ఈ వ్యాఖ్య భిన్నంగా ఉండటం గమనార్హం. 2018లో అక్టోబరు 12న పవన్ ఉత్తరాంధ్రలో పర్యటించారు. కొందరు యువకులతో భేటీ అయి పలు అంశాలపై చర్చలు జరిపారు. తాజాగా ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుని పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ ఫోటోను ట్వీట్ ద్వారా షేర్ చేశారు. ప్రతిగా పవన్ ఆ ట్వీట్‌ను ట్యాగ్ చేసి.. ‘‘ఏపీలో యువత సంక్షేమ పథకాలు, ఉచితాలు అడగడం లేదని, పాతికేళ్ల భవిష్యత్తును అడుగుతున్నారు’’ అని కామెంట్ చేశారు. అందుకే తరచూ కలుస్తూ వారి (యువత) కలలు సాకారం చేసేందుకు కృషి చేస్తున్నానని కూడా ఆ ట్వీట్లో చెప్పుకున్నారు. సహజంగానే ఈ ట్వీట్లో ఉన్న చిత్తశుద్ధి ఎంత? అన్న ప్రశ్న వస్తుంది. ఈ మధ్య కొన్ని సినిమా ఫంక్షన్లలో ఆయన ఇదే యువతను ఉద్దేశించి భిన్నమైన కామెంట్లు చేయడం ఇక్కడ ప్రస్తావనార్హం. తన సినిమాలపై వ్యతిరేక కామెంట్లు చేసిన వారిపై దాడులు చేయమని యువతకు పిలుపునిచ్చారాయన. అంతేనా.. మోటార్‌సైకిళ్ల సైలెన్సర్లు తీసేసి తిరగాలని.. ఇంకా పలు రకాలుగా రెచ్చగొట్టారు. ఇవన్నీ పాతికేళ్ల భవిష్యత్తుకు మంచి చేసేవేనా? రాజకీయాల్లో ఉన్న వారికి నిబద్ధత అన్నది చాలా ముఖ్యం. ఇలా రోజుకో రీతిలో మాట్లాడం ఎంత మాత్రం సరికాదు. ఎప్పటికప్పుడు తప్పొప్పులను దిద్దుకుంటూ యువతకు ఆదర్శంగా నిలవడం అవసరం. ఈ దిశగా పవన్ ఏమీ చేయడం లేదన్నది సుస్పష్టం. టీడీపీ ప్రతిపాదించిన సూపర్ సిక్స్ హామీలతోపాటు అప్పట్లో ఈయన గారు జనసేన తరఫున ‘షణ్ముఖ వ్యూహం’ పేరుతో కొన్ని వాగ్ధానాలు చేసిన విషయం రాష్ట్ర యువత మరచిపోయి ఉండదు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం, స్టార్టప్‌లకూ ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా పది లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వాలని ఆయన షణ్ముఖ వ్యూహంలోనే ‘సౌభాగ్య పథం’ పేరుతో ప్రతిపాదించారు. ఒక్కో నియోజకవర్గానికి 500 మందికి ఇలా రూ.పది లక్షల చొప్పున ఇస్తామని కూడా చెప్పుకున్నారు. అధికారంలోకి వచ్చి 17 నెలలవుతున్నా దీని అయిపుఅజా లేదు. తాజాగా పవన్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుంటే.. ఈ పథకం ఉచితాల ఖాతాలోకి వస్తుందా? లేక నిర్మాణాత్మకమైందేనా? ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌లు ఇద్దరూ బోలెడన్ని హామీలిచ్చారు. అప్పటి సీఎం జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలకు మించి ఇస్తామని నమ్మబలికారు కూడా. కానీ అధికారం వచ్చిన తరువాత మాత్రం ఏది ఎలా ఎగ్గొట్టాలా? లబ్ధిదారులకు కత్తెరేయాలా? అన్న ఆలోచనలోనే ఉండిపోయారు ఒకటి, అర పథకాలను అరకొరగా అమలు చేసి మ మ అనిపించారు. ఈ ప్రణాళికలో భాగంగానే ఇప్పుడు పవన్ ఉచితాలు వద్దని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారా? అయినా కావచ్చు! 2018లోనే ఉచితాలు వద్దని పవన్ భావించి ఉంటే.. 2024 ఎన్నికల్లో అన్ని హామీలు ఎందుకిచ్చారు? పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకూ నెలకు రూ.1500 ఇస్తామన్నది ఆ ఆలవికాని హామీల్లో ఒకటి. ఒకవేల టీడీపీ ఈ హామీని ఇచ్చిందనుకుంటే.. ఉచితాలను వ్యతిరేకించే ఆలోచన ఉన్న పవన్ ఎందుకు వద్దనలేదు? నిరుద్యోగ భృతి కింద యువతకు నెలకు రూ.3000 ఇస్తామన్నది కూడా ఉచితం కాదనుకున్నారా పవన్? అమ్మ ఒడి పథకం కింద వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, జగన్ ఆంధ్రప్రదేశ్‌లోని పేద కుటుంబాల్లోని ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున ఇచ్చారు. అది చాలదని కుటుంబంలోని ప్రతి పిల్లాడికి రూ.18 వేలు చొప్పున ఇస్తామని ఎందుకు హామీ ఇచ్చారు? ఇవే కాదు.. బీసీలకు యాభై ఏళ్లకే నెలకు రూ.నాలుగు వేల ఫించన్, ఒక్కో రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున ఇస్తామని, ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ, వలంటీర్ల గౌరవ వేతనం పెంపు, కాపుల సంక్షేమం కోసం ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల వ్యయం, అన్న క్యాంటీన్లు, డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పేదల ఆకలి తీరుస్తాం, మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు ఆంక్షల్లేకుండా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కూడా చెప్పారు కదా? పవన్ వీటన్నింటినీ ఉచితాలు కాదని అప్పట్లో హామీ ఇచ్చారా? ఇక ఉచిత ఇసుక మాట సరేసరి.అక్రిడిటేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టుకు ఉచిత నివాస స్థలం, ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం... ఇలా అనేక హామీలిచ్చారే... వీటి అమలుకు రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అసాధ్యమని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పినా... సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తామని ప్రకటించారు కదా? ఇప్పుడు ఏమైంది? వృద్ధాప్య ఫించన్ల మొత్తం రూ.వెయ్యి పెంచడం, ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడం మినహా ఏడాదిన్నరగా అమలు చేసింది ఎన్ని హామీలు? పరిస్థితులు ఇలా ఉంటే.. పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా యువత ఉచితాలు అడగడం లేదని అనడంలో ఆంతర్యమేమిటి? హామీల ఎగవేతకు దారి వెతుకుతున్నారన్న అనుమానం బలమవుతుంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మహారాష్ట్రలో కోటి బోగస్ ఓట్లు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో కనీసం కోటి బోగస్ ఓట్లున్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈ ఓట్లను ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేస్తూ నవంబర్ ఒకటో తేదీన ముంబైలో ఉమ్మడిగా ర్యాలీ చేపడతామని ప్రకటించాయి.ఆదివారం మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్)నేత బాల నంద్గావోంకర్, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, కాంగ్రెస్ నేత సచిన్ సావంత్, ఎన్సీపీ(ఎస్పీ)నేత జయంత్ పాటిల్‌లు మీడియాకు ఈ విషయం తెలిపారు. త్వరలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను నకిలీ ఓటర్లను తొలగించాకే నిర్వహించాలని వారు ఈసీని కోరారు. అంతకుముందు, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ..స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే 96 లక్షల ఫేక్ ఓటర్లను జాబితాల్లో చేర్చారని ఆరోపించారు. ఒక్క ముంబైలోనే సుమారు 10 లక్షల నకిలీ ఓట్లున్నాయన్నారు. నకిలీ ఓట్లతో ఎన్నికలు జరపడం ఓటర్లను అవమానించడమేనన్నారు. -
తాడిపత్రిలో హైటెన్షన్.. జేసీ గూండాగిరి
తాడిపత్రి టౌన్: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో టీడీపీ నేత, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి వీరంగం సృష్టించారు. పట్టపగలు అందరూ చూస్తుండగా.. వైఎస్సార్సీపీ నాయకుడిపై తన అనుచరులతో దాడి చేయించి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడు తెలిపిన వివరాలు.. వైఎస్సార్సీపీ నాయకుడు యర్రగుంటపల్లి నాగేశ్వరరెడ్డి ఆదివారం తాడిపత్రిలోని ఆనంద్ భవన్ హోటల్ వద్ద టీ తాగుతుండగా.. వాహనంలో అటుగా వెళ్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి చూశారు. ఆ వెంటనే ‘వీణ్ని ఎందుకురా ఇంత వరకు వదిలేశారు’ అంటూ అనుచరులను రెచ్చగొట్టారు. దీంతో రవీంద్రారెడ్డి, యాసిన్, బద్రీ, విష్ణు, శేఖర్‌తో పాటు సుమారు పది మంది జేసీ అనుచరులు ఇనుప రాడ్లతో నాగేశ్వరరెడ్డిపైకి దూసుకెళ్లారు. వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయతి్నంచిన నాగేశ్వరరెడ్డిని.. రోడ్డుపై వెంబడిస్తూ దాడి చేశారు. సమీపంలో వైఎస్సార్సీపీ నాయకురాలు పేరం స్వర్ణలత ఇల్లు కనిపించడంతో.. నాగేశ్వరరెడ్డి అందులోకి పరుగెత్తుకెళ్లి తలదాచుకున్నాడు. జేసీ అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోగానే.. పేరం అమరనాథ్‌రెడ్డి స్థానికులతో కలిసి బాధితుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆస్పత్రి వద్దకు చేరుకుని దాడి వివరాలను ఆరా తీశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకుంటారన్న నమ్మకం తనకు లేదంటూ.. కేసు పెట్టడానికి బాధితుడు నిరాకరించారు. కాగా, నాగేశ్వరరెడ్డిని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫోన్లో పరామర్శించారు. -
సీఎంకు రైతుల తిప్పలు కనిపించవా?
చిన్నకోడూరు (సిద్దిపేట): సీఎం రేవంత్‌రెడ్డికి ప్రతిపక్షాలను తిట్టడంపై ఉన్న సోయి రైతుల మీద లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఆయన ఆదివారం సిద్దిపేట జిల్లా మండల పరిధిలోని మాచాపూర్‌లో మొక్కజొన్న రైతులతో మాట్లాడారు. రాష్ట్రంలో 6 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరి గిందని, మక్కలు మార్కె ట్లో పెట్టుకుని రైతులు పడిగాపులు కాస్తున్నారన్నారు. ఇప్పటికే 30 శాతం వరకు రైతులు దళారులకు విక్రయించారన్నారు. ప్రభుత్వం వెంటనే మొక్క జొన్న, పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సాగు ఎట్లుందమ్మా: వ్యవసాయం ఎట్లుందమ్మా.. ఇబ్బందులు వస్తున్నా యా అంటూ హరీశ్‌రావు రైతులను ఆప్యాయంగా పలకరించారు. ఏమున్న ది సారూ అన్నింటికీ ఇబ్బంది అవుతోందంటూ రైతులు బదులిచ్చారు. చిన్నకోడూరు మండల పరిధిలోని గంగాపూర్‌లో పొలాల వద్ద సద్ది తింటున్న రైతులతో హరీశ్‌రావు ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ‘యూరియా కోసం రోజుల తర బడి పడిగాపులు కాసినా ఒక్క బస్తా దొరక లేదు. వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి రుణమాఫీ చేయలేదు. సన్న బియ్యంతో అన్నం ముద్ద అవుతోంది. మూడు పంటలు పండిస్తున్నామంటే మీరు తెచ్చిన కాళేశ్వరం నీళ్లే ఆసరా’ అని రైతులు చెప్పారు. రేవంత్ పాలన రైతులను నట్టేట ముంచిందని, రైతుల ఉసురు తప్పక తగులుతుందని హరీశ్ పేర్కొన్నారు. -
కమీషన్ల కోసం మంత్రుల కొట్లాట
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టులు, బిల్లులు మొదలుకొని అన్ని పనుల్లో కమీషన్ల కోసమే మంత్రులు కొట్లాడు కుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సమాధానం చెప్పాల్సిన మంత్రులు, ముఖ్యమంత్రి దాట వేత «ధోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. ఎయిర్ పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ వే రద్దు చేసి హైదరాబాద్ అభివృద్ధిపై రేవంత్ సర్కారు నీళ్లు చల్లిందన్నారు. ఫ్యూచర్ సిటీలో ఉన్న తన సొంత భూముల కోసం సీఎం రేవంత్ ప్రజల సొమ్మును అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్, జూబ్లీహిల్స్ నేత అంజిబాబుతోపాటు వివిధ పార్టీల నాయకులు ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.కసరత్తు చేయకుండానే బీసీ రిజర్వేషన్లు‘ఎలాంటి కసరత్తు చేయకుండానే రిజర్వేషన్ల పెంపు పేరిట కాంగ్రెస్ బీసీలను మోసం చేసింది. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే గల్లీలో దొంగ పోరాటాలు చేయకుండా ఢిల్లీలో తమ అధిష్టానాలపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లు పార్లమెంట్లో ఆమోదించేలా చూడాలి. ఢిల్లీలో జరిగే ప్రయత్నాలకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పనితీరుకు పరీక్ష. ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసిన కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్‌లో ఓటర్లు బుద్ధి చెప్పాలి’అని కేటీఆర్ పిలుపునిచ్చారు.ప్రజలు బాధ పడుతున్నారు.. సబిత: ప్రతీ సందర్భంలో ప్రజలు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారని, దేవుడి పాలన కోల్పోయామని జూబ్లీహిల్స్ ప్రజలు బాధ పడుతున్నారని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో మైనారిటీ ఓటర్లు బీఆర్ఎస్కు మద్దతు పలుకుతున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్ పోర్టు మెట్రో పనులు ప్రారంభించడంతోపాటు 111 జీవో నుంచి విముక్తి కలిగిస్తామని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ప్రకటించారు.పారా అథ్లెట్ అర్చనకు కేటీఆర్ అండరాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటకు చెందిన పారా అథ్లెట్ మిట్టపల్లి అర్చనకు కేటీఆర్ అండగా నిలిచారు. కుట్టుపని ద్వారా జీవనోపాధిపొందుతున్న అర్చనకు పారా త్రోబాల్ క్రీడలో ఈ ఏడాది డిసెంబర్ 8 నుంచి 10 వరకు శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ సౌత్ ఏషియన్ చాంపియన్ షిప్లో దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం లభించింది. అర్చన ఆదివారం కేటీఆర్‌ను కలవగా, అవసరమైన క్రీడా పరికరాలు, శిక్షణ సామగ్రిని అందజేశారు. -
బీఆర్ఎస్ తరపున నామినేషన్ వేసిన విష్ణు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ తరపున ఆ పార్టీ నేత, పీజేఆర్ తనయుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనే స్వయంగా రిటర్నింగ్ అధికారికి రెండుసెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ విష్ణుతో నామినేషన్ వేయించింది. ఇప్పటికే బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.అయితే, సునీత నామినేషన్‌ను ఎన్నికల అధికారులు ఆమోదం తెలిపిన తర్వాత విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 21న కూడా మాగంటి సునీత మరోసారి భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ల స్క్రూటినీలో ఏదైనా తేడా వస్తే విష్ణు బరిలో ఉంటారని తెలుస్తోంది. -
‘ఎప్పుడు ఎన్నికలొచ్చినా వచ్చేది మన ప్రభుత్వమే’
కృష్ణాజిల్లా: దళితులతో చంద్రబాబుకు ఆనాడే సంబంధాలు తెగిపోయాయని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్టర అధ్యక్షుల టీజేఆర్ సుధాకర్‌బాబు స్పష్టం చేశారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు అని, ఆనాడే ఆయనతో దళితులకు సంబంధాలు తెగిపోయాయన్నారు. ఈరోజ( ఆదివారం, అక్టోబర్ 19వ తేదీ) మచిలీపట్నంలో కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనిలో భాగంగా మాట్లాడిన టీజీఆర్ సుధాకర్ బాబు.. ‘ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలి. వచ్చేది మన ప్రభుత్వమే ... ఎవరికీ భయపడొద్దు. 2027లో ఎన్నికలొచ్చినా... 2029లో ఎన్నికలొచ్చినా వచ్చేది మనమే. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్రెడ్డి. టిడిపి నేతలు రౌడీయిజంతో వచ్చినా ...రాజకీయంతో వచ్చినా.. జగన్ కోసం గుండె చూపించి నిలబడదాం. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబుతో దళితులకు ఆనాడే సంబంధాలు తెగిపోయాయి. దళిత కుటుంబంలో పుట్టిన నన్ను యువజన కాంగ్రెస్ నాయకుడిగా చేసిన వ్యక్తి వైఎస్సార్. దళితులను రాజకీయంగా చైతన్య పరిచిన కుటుంబం వైఎస్సార్ కుటుంబం. దళితులకు జగన్ ఐదు మంత్రిపదవులిచ్చారు. చంద్రబాబు మాదిగలకు ఒకటి, మాలలకు ఒకటి మాత్రమే ఇచ్చారు. టిడిపిలో ఉండి చంద్రబాబుకోసం తబలా వాయించే దళిత నాయకులకు సిగ్గుందా. దళితుల కుటుంబాల్లో చంద్రబాబు పండుగ లేకుండా చేశారు. కల్తీ మద్యం తయారు చేసి..అమ్మేది టిడిపి వాళ్లు. ఆ మద్యం తాగి చనిపోయేది మా దళితులుకల్తీ మద్యం తాగి చనిపోయిన ప్రతీ ఒక్కరికీ కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. -
‘ఒక్క డీఏ ప్రకటించి పండగ చేసుకోమంటున్నారు’
కాకినాడ: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులను డీఏ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. ఉద్యోగులకు డీఏ పేరుతో ప్రచారం సాగిందని, అయితే చివరకు ఒక్క డీఏని ప్రకటించి పండుగ చేసుకోమంటున్నారని కురసాల మండిపడ్డారు. ‘ఉద్యోగులను కూడా చంద్రబాబు మోసం చేశారు. ఒక్క డిఎ ప్రకటించారు. దీంతో పండుగ చేసుకోమంటున్నారు.లెక్కప్రకారం నాలుగు డీఏలు ఇవ్వాలి,. ఒక్కసారి క్షేత్ర స్ధాయిలోకి వచ్చి ఉద్యోగులతో మాట్లాడితే తెలుస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో మోసం చేసి ముంచేశాడు. ఫీజు రియింబర్మెంట్ చెల్లించకుండా విద్యార్ధులను మోసం చేశాడు. వైఎస్ జగన్ తీసుకువచ్చిన నాడు-నేడును చంద్రబాబు నీరుగార్చేశారు. వారం రోజులుగా ఆరోగ్య శ్రీ సేవలను బంద్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. పీహెచ్సీ వైద్యులు సమ్మె చేస్తున్నా...వారితో చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావాడం లేదు. చంద్రబాబు మారేడేమో అని ఉద్యోగులు అనుకున్నారు. ఉద్యోగుల డిఎ విషయంలో పెద్ద హైడ్రామా చేసే ప్రభుత్వం ఏదీ ఉండదేమో.. 16 నెలల్లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు మేలు చేసే ఒక్క నిర్ణయం తీసుకోలేదు. మసిబూసి మారేడు కాయ చేసి రాష్ట్రంలో ఏదో గొప్పగా జరిగిపోతుందని ప్రచారం చేసుకుంటున్నారు. ఓపిఎస్ నే అమలు చేస్తానని చంద్రబాబు గతంలో చెప్పారు. ఇప్పుడు ఈ విషయం సుప్రీంకోర్టు లో ఉందంటున్నారు. ఇప్పటి వరకు ఉద్యోగులకు ఏలాంటి అలవెన్సులు,బకాయిలు చెల్లించారు.పెన్షనర్ల కోసం ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు.. ఆ కార్పోరేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారు. ఉద్యోగ.ఉపాధ్య వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయని... ఉద్యోగ సంఘాలను పిలిచి ఒక్క డిఎతో మమ అనిపించారు కూటమీ పాలనలో ఉద్యోగం ఉన్నవాడు..ఉద్యోగం లేని వాడు సంతోషంగా లేడు. 2.70 లక్షల వాలంటీర్లను పది వేలు ఇస్తానని మోసం చేశారు.ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం వల్ల ఖర్చు పెరిగిపోయిందని చంద్రబాబు మాట్లాడుతున్నారు. బేవరేజెస్లో 18 వేల ఉద్యోగులను తొలగించారు. ఫైబర్ నెట్ లో 2 వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఎండియూ వాహనాల వ్యవస్థను రద్దు చేసి ఆనందం పొందుతున్నారు. ఆబ్కాస్ను రద్దు చేసే కార్యక్రమం చేస్తున్నారు.. చివరకు సచివాల ఉద్యోగులను కూడా మోసం చేశారు. చంద్రబాబు గతంలో బకాయిలు పెట్టిన రెండు డిఎలను వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెల్లించారు. ఆఖ వర్కర్లు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచారు. వైఎస్ జగన్ వ్యవస్ధలను విస్తృత పరిచారు. ఉద్యోగులకు బకాయిలను మనస్పూర్తిగా చెల్లించేందుకు వైఎస్ జగన్ ప్రయత్నించారు.’ అని కురసాల తెలిపారు.ఇదీ చదవండి:‘లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధం.. ఎక్కడికి రమ్మన్నా వస్తా -
‘లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధం.. ఎక్కడికి రమ్మన్నా వస్తా’
హైదరాబాద్: నకిలీ మద్యం, నకిలీ సారాలో చంద్రబాబు సర్కార్ మునిగిపోయిందని విమర్శించారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్. ఫేక్ ప్రభుత్వం,. ఫేక్ బాబు, ఫేక్ లోకేష్.. కట్టు కథలు, పచ్చి అబద్ధాలు ఇవే టీడీపీ ప్రభుత్వం చేస్తుందని ధ్వజమెత్తారు. ఈరోజు(ఆదివారం, అక్టోబర్ 19వ తేదీ) హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్మీట్లో మాట్లాడిన జోగి రమేష్.. చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘బాబు చేసిన కల్తీని వైఎస్సార్సీపీపై రుద్దే యత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం చేసే ఐవిఆర్ఎస్ కాల్స్ ను నకిలీ మద్యం కోసం టీడీపీ వాడుతుంది. నకిలీ మద్యం ఎక్కడ తయారయింది... ఎక్కడకు సరఫరా అయిందో ఎందుకు ఎంక్వరీ చేయడం లేదు.డైవర్షన్ కోసం చంద్రబాబు ప్రభుత్వం మాపై విమర్శలు చేస్తుంది. అద్దెపల్లి జనార్థన్‌కు రెడ్ కార్పెట్ వేసింది టీడీపీ ప్రభుత్వమే. అద్దెపల్లి జనార్థన్, టీడీపీ కుమ్మక్కయ్యాయి. ఏ విచారణకైనా సిద్ధమని చెప్పినా ప్రభుత్వం నంచి స్పందనలేదు. జైలుకు పంపించి రాక్షసానందం పొందడం బాబుకు అలవాటు. దమ్ముంటే నాకు లై డిటెక్టర్ టెస్ట్ చేయండి. ప్రభుత్వం ఎక్కడికి రమ్మన్నా.. వస్తా. ఏపీలో మంచినీటి ుకుళాయిల కన్నా.. బెల్ట్ షాపులే ఎక్కువ. నారా వారి సారా పాలనను డోర్ డెలివరీ చేస్తున్నారు’ అని మండిపడ్డారు. -
కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ మొదటి దెబ్బ అక్కడే కొట్టబోతుంది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ మొదటి దెబ్బ జూబ్లీహిల్స్‌లో కొట్టబోతుందన్న కేటీఆర్.. రెండో దెబ్బ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్‌లో కొడతాం. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దౌర్భాగస్థితిలో ఉన్నాడు. దమ్ముంటే ఉప ఎన్నికకు రావాలి’’ అంటూ సవాల్ విసిరారు. ‘‘రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది. కేసీఆర్ సీఎం కాబోతున్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు తథ్యం’’ అంటూ కేటీఆర్ జోస్యం చెప్పారు. -
ఆ కుట్రలను తిప్పి కొట్టాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మూడు తరాలుగా గాంధీ కుటుంబం దేశం కోసం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశ సమగ్రతను కాపాడేందుకు ఆనాడు రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తిని కొనసాగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు.రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును సల్మాన్ ఖుర్షీద్‌కు అందించిన నిర్వాహకులను అభినందిస్తున్నా. దేశంలో గాంధీ అనే పదం భారతదేశానికి పర్యాయ పదం. గాంధీ కుటుంబం దేశానికి స్పూర్తినిచ్చింది. దేశ సమగ్రతను కాపాడేందుకు ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ప్రాణాలు అర్పించారు. ఇందిర వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారు. దేశం కోసం మూడు తరాలు ప్రాణాలర్పించిన చరిత్ర గాంధీ కుటుంబానిది’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.‘‘గాంధీ కుటుంబంతో సల్మాన్ ఖుర్షీద్ అనుబంధం ఈనాటిది కాదు. మూడు తరాలుగా వారి కుటుంబం గాంధీ కుటుంబంతో కలిసి పనిచేస్తోంది. సల్మాన్ ఖుర్షీద్‌కు రాజీవ్ సద్భావన అవార్డ్ అందించడం మనందరికీ గర్వకారణం. 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించి దేశ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ. 21 ఏళ్లకే శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తూ రాజ్యాంగ సవరణ తీసుకు రావాల్సిన అవసరం ఉంది. రాజీవ్ స్ఫూర్తితో రాహుల్ గాంధీ దేశ సమగ్రత కోసం భారత్ జోడో యాత్ర చేశారు...రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్‌గా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో రహస్య ఒప్పందంతో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో 21 శాతం బీఆర్ఎస్ ఓట్లు ఎవరికి చేరాయి?. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అదే చేయాలని కుట్రలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఓట్లు చీల్చాలని కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రలను తెలంగాణ సమాజం తిప్పి కొట్టాలి’’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
Bihar Elections: 25 మంది అభ్యర్థులను ప్రకటించిన ఏఐఎంఐఎం
పట్నా: బీహార్‌లో నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం తొలిదశ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ముస్లిం నేత అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే 25 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ఆదివారం విడుదల చేసింది. బీహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న లెక్కింపు ఉంటుంది. ఏఐఎంఐఎం పార్టీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో.. ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. బీహార్‌లో అత్యంత అణగారిన ప్రజల గొంతుకగా పార్టీ నిలుస్తుందని దానిలో పేర్కొంది. పార్టీ జాతీయ నాయకత్వం అభ్యర్థులను ఎంపికచేసింది. అమౌర్ నుండి అఖ్తరుల్ ఇమాన్(పార్టీ సీనియర్ నేత), గోపాల్‌గంజ్ నుండి అనస్ సలాం, కిషన్‌గంజ్ నుండి న్యాయవాది షమ్స్ ఆగాజ్, నర్కటియా నుండి షమీముల్ హక్, బహదూర్‌గంజ్ నుండి తౌసీఫ్ ఆలం, నవాడా నసీమా ఖాటూన్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. बिहार विधानसभा चुनाव के AIMIM प्रत्याशियों के नाम कुछ इस तरह हैं। इंशाअल्लाह उम्मीद है कि हम बिहार के सबसे मज़लूम लोगों की आवाज़ बनेंगे। यह सूची AIMIM बिहार यूनिट ने तैयार की है और इस सिलसिले में पार्टी की क़ौमी कियादत से भी मशविरा किया गया है।We are happy to announce the list… pic.twitter.com/9ec1t4KpR2— AIMIM (@aimim_national) October 19, 2025243 స్థానాలు కలిగిన బీహార్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ భారీ స్థాయిలో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. బీజేపీ,జేడీయూలతో కూడిన అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) ఇందుకు ముమ్మర కసరత్తు చేసింది. అక్టోబర్ 24 నుండి ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ అంతటా 12 ర్యాలీలు నిర్వహించనున్నారు. అలాగే ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు కీలక నియోజకవర్గాలలో ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు.ఎన్డీఏలో సమన్వయం కనిపిస్తుండగా, ‘మహాఘట్ బంధన్’ (గ్రాండ్ అలయన్స్)లో సీట్ల పంపకాల వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. కాంగ్రెస్, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ), వామపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ, సంకీర్ణ వ్యూహం ఇంకా అస్పష్టంగానే ఉంది. తాజాగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఆరు నియోజకవర్గాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అక్టోబర్ 18న తన రెండవ జాబితాను విడుదల చేసింది. దానిలో శాశ్వత్ పాండే (నర్కటియాగంజ్), జితేందర్ యాదవ్(పూర్నియా), మహమ్మద్ కమ్రుల్ హోడా(కిషన్‌గంజ్), మహమ్మద్ ఇర్ఫాన్ ఆలం (కస్బా), మోహన్ శ్రీవాస్తవ (గయా టౌన్) తదితరులు ఉన్నారు. -
Bihar Elections: గేదెనెక్కి ఒకరు.. సంకెళ్లతో మరొకరు.. తెగ నవ్విస్తున్న అభ్యర్థులు
పట్నా: బీహార్‌కు ఎన్నికల పండుగొచ్చింది. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో చిత్రవిచిత్రాలు మీడియా కంటపడుతున్నాయి. నామినేషన్లకు వస్తున్న అభ్యర్థులు అందరినీ అకట్టకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు గేదెపై ఊరేగుతూ నామినేషన్ వేసేందుకు వస్తుండగా, మరికొందరు చేతులకు సంకెళ్లు వేసుకుని, మద్దతుదారులను వెంటేసుకుని వస్తున్నారు. गोपालगंज के बरौली में हथकड़ी में बंद धर्मेंद्र कुमार 'क्रांतिकारी' पुलिस की सुरक्षा में नामांकन करने पहुंचे. हथकड़ी हाथ में थी, आंखों में आंसू थे, और जुबान पर गाना था. लोगों की भीड़ जमा हो गई, कोई वीडियो बना रहा था, कोई लाइव चला रहा था.नेताजी बोले, “मैं साजिश का शिकार हूं, जनता… pic.twitter.com/kW5ZXwomWF— NDTV India (@ndtvindia) October 19, 2025లాలూ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు చెందిన జనశక్తి జనతాదళ్ పార్టీ అభ్యర్థి ధర్మేంద్ర కుమార్ శుక్రవారం బరౌలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చారు. ఈ సందర్బంగా అతని చేతులకు సంకెళ్లు ఉన్నాయి. ఈయన కలెక్టరేట్ వద్దకు చేరుకోగానే విలేకరులు, జనం ఆయన చుట్టూ గుమిగూడారు. ఈ సందర్బంగా ధర్మేంద్ర కుమార్ మాట్లాడుతూ ‘నేను కుట్రకు బలైపోయాను. అయితే ఇప్పుడు ప్రజల నుండి న్యాయం కోరుకుంటాను’ అని అన్నారు. ఇతనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. तेज प्रताप यादव के प्रत्याशी अरुण यादव भैंस पर चढ़कर नामांकन करने पहुंचे#BiharElection2025 pic.twitter.com/X86XD0BRjo— NDTV India (@ndtvindia) October 18, 2025ఇదేవిధంగా అర్వాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీకి దిగిన అరుణ్ యాదవ్ తన నామినేషన్ దాఖలు చేసేందుకు గేదెపై స్వారీ చేస్తూ జిల్లా కలెక్టరేట్‌కు వచ్చారు. ఇది అక్కడున్నవారిని అమితంగా ఆకట్టుకుంది. లాలూ యాదవ్ ఫొటోను పట్టుకుని.. ‘రాజకీయాల్లో తన ఏకైక రోల్ మోడల్ లాలూ అని, అతని ఆశీర్వాదంతో నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చాను" అని అరుణ్ యాదవ్ మీడియాకు తెలిపారు. తేజ్ ప్రతాప్ యాదవ్ పార్టీకి చెందిన అభ్యర్థులు విచిత్ర తీరుతెన్నులతో నామినేషన్లు దాఖలు చేసేందుకు కలెక్టరేట్లకు తరలిరావడం విశేషంగా మారింది. -
ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: బెజవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ చిన్ని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. ఎంపీ కార్యాలయంలో కూర్చుని పార్టీ కమిటీలు వేస్తారు. గతంలో సూరపనేని రాజా తిరువూరులో పార్టీ పదవులను అమ్మేశాడు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేశాడు. ఇప్పుడు ఎంపీ పీఏ కిషోర్ మొత్తం దందా నడిపిస్తున్నాడు’’ అంటూ కొలికపూడి మండిపడ్డారు.తిరువూరులో కిషోర్ ఇసుక, రేషన్ మాఫియా నడిపిస్తున్నాడు. పార్టీ పదవులను సైతం కిషోర్ అమ్ముకుంటున్నాడు. అన్ని విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళదాం. ఈ నెల 24న అందరం కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళదాం. తాడోపేడో తేల్చుకుంటా’’ అంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగులకు బాబు దగా -
బీహార్ ఎన్నికలు.. ఎన్డీయే కూటమికి బిగ్ షాక్
పట్నా: బీహార్ అసెంబ్లీ(Bihar Assembly Election) ఎన్నికల నేపథ్యంలో అధికార ఎన్డీయే(NDA Alliance) కూటమికి ఊహించని షాక్ తగిలింది. మధుర అసెంబ్లీ స్థానం నుంచి కూటమి తరఫున ఎల్జేపీ అభ్యర్థిగా నిలిచిన సీమా సింగ్(Seema Singh) నామినేషన్ రద్దైంది. దీంతో, మధుర అసెంబ్లీ స్థానంలో ఎన్డీయే అభ్యర్థి పోటీలో లేకుండా ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పోటీ ఆర్జేడీ, జన్ సురాజ్ పార్టీల మధ్య ఉండనుంది.వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చాప్రా జిల్లాలోని మధుర అసెంబ్లీ స్థానం నుంచి ఎన్డీఏ కూటమి తరఫున ఎల్జేపీ అభ్యర్థిగా సీమా సింగ్ నామినేషన్ వేశారు. మొదటి విడత నామినేషన్ వేయడానికి అక్టోబర్ 17 చివరి తేదీ కావడంతో ఆమె.. శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను అధికారులు శనివారం పరిశీలించగా సీమా సింగ్ నామినేషన్లో లోపం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమె నామినేషన్ రద్దు చేసినట్లు డిప్యూటీ ప్రొవిన్షియల్ ఎలక్షన్ ఆఫీసర్ (డీపీఆర్వో) ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే, ఈ నియోజకవర్గంలో నామినేషన్లో లోపం కారణంగా సీమా సింగ్‌తో పాటు మొత్తం నాలుగు నామినేషన్లు తిరస్కరణకు గురైనట్టు ఎన్నికల అధికారి తెలిపారు.సినిమా నుంచి పాలిటిక్స్‌లోకి.. సీమా సింగ్ పలు భోజ్‌పురి సినిమాల్లో నటించారు. తన మార్క్ నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, సినిమా రంగం నుంచి ఆమె రాజకీయాల్లోకి వచ్చి అందరనీ ఆశ్చర్యపర్చారు. కాగా, చిరాగ్ పాశ్వాన్ తనకు మధుర స్థానాన్ని కేటాయించిన తర్వాత ఆమె చాలా నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి రాజకీయంగా యాక్టివ్‌గా ప్రచారం చేసుకుకున్నారు. మరోవైపు.. ఆమె తన అఫిడవిట్లో తొమ్మిదో తరగతి చదివినట్లు పేర్కొన్నారు. దీంతో, ఆమెపై ప్రజల్లో మరింత ఫోకస్ పెరిగింది. ఇదిలా ఉండగా.. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సీమా సింగ్‌పై కేసు నమోదైంది. ప్రభుత్వ అనుమతి లేకుండా షేక్‌పురాలో ఆమె హోలీ నిర్వహించిన కారణంగా పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదిలా ఉండగా.. బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈసారి అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి, జన్ సురాజ్ పార్టీ మధ్య త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉంది. బీహార్ అసెంబ్లీకి గడువు నవంబర్ 22తో ముగియనుంది. -
Bihar Elections: బీజేపీపై ఆగ్రహం.. స్వతంత్రంగా పోటీ.. క్షణంలో మారిన సీన్
పట్నా: బీహార్‌లో నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో తొలి దశ పోలింగ్నకు సంబంధించి, అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంతలో ఒక ఉదంతం మీడియా దృష్టిని ఆకర్షించింది. భాగల్పూర్ బీజేపీ టికెట్ లభించకపోవడంతో కలత చెందిన మాజీ కేంద్ర మంత్రి అశ్విని చౌబే కుమారుడు అర్జిత్ శశ్వత్ చౌబే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇంతలో వచ్చిన ఒక ఫోన్ కాల్‌తో క్షణంలో అతని నిర్ణయం మారిపోయింది.నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థి అర్జిత్ శశ్వత్ చౌబే జిల్లా కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకోగానే, అతని మద్దతుదారులు అతనికి పూలమాలలు వేసి, మరింత ఉత్సాహపరిచారు. ఇంతలో శశ్వత్ చౌబే ఫోన్ రింగ్ అయ్యింది. అదే సమయంలో అతనితో మాట్లాడేందుకు విలేకరులు వేచివున్నారు. శశ్వత్ చౌబే తనకు వచ్చిన కాల్ తీసుకుని, నామినేషన్ పత్రాలను దాఖలు చేయకుండా వెనుదిరిగారు. తరువాత తాను ఊహించని విధంగా యూ టర్న్ తీసుకోవడానికి గల కారణాన్ని మీడియాకు వివరించారు.తన తండ్రి అశ్విని చౌబే సూచనల మేరకు బీజేపీలోనే ఉంటానని శశ్వత్ చౌబే స్పష్టం చేశారు. తన తండ్రి మాటను మన్నిస్తూ, ఆయనకు గౌరవాన్నిస్తూ, ఎన్నికల్లో పోటీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించగానే, బీజేపీ అగ్ర నాయకత్వం నుండి ఒత్తిడిని ఎదురయ్యిందని శశ్వత్ చౌబే పేర్కొన్నారు.‘ఈరోజు, నా తల్లిదండ్రులు నాతో మాట్లాడారు. ఇది బీజేపీ అగ్ర నాయకత్వం నుండి వచ్చిన సూచన. నేను వారికి అవిధేయునిగా ఉండలేను. నేను నా పార్టీకి, దేశానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేను.వారిని వ్యతిరేకించలేను’ అని శశ్వత్ చౌబే మీడియాకు తెలిపారు. -
ఆ రెండు పార్టీలు తలచుకుంటే ఆపేదెవరు?
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల పెంపు పేరిట కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు ఆడుతు న్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మద్దతు ఇస్తే బీసీ రిజర్వేషన్ల పెంపుదలను ఎవరు ఆపగలరు? అని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం హరీశ్‌రావు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్లమెంటులో బీజేపీకి 240, కాంగ్రెస్‌కు 99 మంది ఎంపీల బలం ఉన్నా బీసీలను మభ్య పెడుతూ ఢిల్లీలో కొట్లాడకుండా గల్లీలో డ్రామాలు చేస్తున్నాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్పుడు కులగణన చేయని కాంగ్రెస్, నాలుగేళ్లుగా జనగణనను వాయిదా వేస్తూ వచ్చిన బీజేపీ.. బీసీలపై కపట ప్రేమ చూపుతున్నాయని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.బీసీలకు మంత్రిత్వ శాఖను కోరిందే కేసీఆర్: కేంద్రంలో బీసీ లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని 2005లోనే కేసీఆర్ కోరా రని, బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ అసెంబ్లీలో రెండు సార్లు తీ ర్మానం చేయడంతో పాటు ప్రధానిని కూడా స్వయంగా కలిశారని హరీశ్‌రావు గుర్తు చేశారు. జనాభా సంఖ్యకు అనుగుణంగా రిజర్వే షన్లు కావాలని కోరుతున్న రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రైవే టు బిల్లు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని నిలదీశారు. -
గులాబీ సైన్యమంతా ఇక్కడే!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ ప్రచారపర్వంలో సర్వశక్తులూ ఒడ్డుతోంది. నియోజకవర్గం పరిధిలోని ప్రతీ ఓటరును కలవడం లక్ష్యంగా ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఓ వైపు నామినేషన్ల పర్వం కొనసాగుతుండగా మరోవైపు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు సుమారు 60 మంది క్షేత్రస్థాయి ప్రచారంలో పాల్గొంటున్నారు. స్థానిక కేడర్‌తో సమన్వయంజూబ్లీహిల్స్ నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరు డివిజన్లలో సంపూర్ణంగా, మరో మూడు డివిజన్లలో పాక్షికంగా విస్తరించి ఉంది. యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, షేక్‌పేట, బోరబండ డివిజన్లు పూర్తిగా, శ్రీనగర్ కాలనీ, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ డివిజన్లు పాక్షికంగా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. డివిజన్ వారీగా ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు ఇన్చార్జీ బాధ్యతలు అప్పగించారు. వీరు స్థానిక నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. బయటి నియోజకవర్గాల నుంచి వచ్చిన 60 మంది ముఖ్యనేతలకు మూడు లేదా నాలుగు పోలింగ్ బూత్‌ల పరిధిలో ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఒక్కో ముఖ్యనేత తమతోపాటు వచ్చిన అనుచరులతో కలిసి తమకు కేటాయించిన బూత్‌లలో ప్రచారం చేస్తున్నారు. అలాగే, బయటి నుంచి సుమారు వేయి మంది జెడ్పీటీసీ, ఎంపీపీ స్థాయి నేతలు ప్రచారానికి తరలివచ్చినట్లు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బూత్‌ల వారీగా ముఖాముఖి సమావేశం నిర్వహించి ఇన్‌చార్జీలకు ప్రచార వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. భారీగా నకిలీ ఓటర్లు నమోదయ్యారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఓటరు జాబితాను వడపోస్తూ అసలైన ఓటర్లను చేరుకోవాలని భావిస్తోంది.సాదాసీదాగా నామినేషన్నగరంలో నెలకొన్న ట్రాఫిక్ కష్టాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థి నామినేషన్ కార్యక్రమాన్ని సాదాసీదాగా సాగేలా బీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే మూడు సెట్లు నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి ఈ నెల 19న మరో సెట్ దాఖలు చేయనున్నారు. 19న భారీ ర్యాలీ నిర్వహించాలని భావించినా పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రద్దు చేసుకున్నట్లు తెలిసింది. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత కేటీఆర్, హరీశ్‌రావు రోడ్ షోలు, హాల్ మీటింగ్స్‌లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉంది: వైఎస్సార్సీపీ
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం 16 నెలలు తర్వాత ఉద్యోగులతో హడావుడిగా చర్చలు జరిపి ఒకే ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడంపై వైఎస్సార్సీపీ మండిపడింది. ఇది కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందంటూ విమర్శించింది. ఈరోజు( శనివారం, అక్టోబర్ 18వతేదీ) పెన్షనర్ల సంఘ నాయకులతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ముఖ్యమంత్రి సమావేశాలు జరిపి ఒక్క విడత డి ఏ మాత్రమే అనౌన్స్ చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ ఎంప్లాయిస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యంగా మధ్యంతర భృతిని ఇవ్వకపోవడం, 4 విడతలు డిఏ పెండింగ్ ఉంటే ఒకటి విడత మాత్రమే మంజూరు చేయడం, ఉద్యోగులకు ఇవ్వవలసిన బకాయిలు మాట ఎత్తక పోవడాన్ని ఉద్యోగవర్గం జీర్ణించుకోలేక పోతోంది దీపావళి పండుగకు ఇవి తప్పక ఇస్తారని ఎదురు చూశారు కానీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ కి దీపావళి కానుక ఒక్క డీ ఏతో తుష్ మనిపించారు’ అని విమర్శించారు.కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు మళ్లీ మొండిచేయి చూపెట్టారు. ఉద్యోగులకు ఐఆర్‌పై ఎటువంటి ప్రకటన చేయని చంద్రబాబు.. పీఆర్సీపైనా కూడా నోరు మెదపలేదు. వీటిని పక్కన పెట్టిన చంద్రబాబు.. కేవలం సింగిల్ డీఏతో సరిపెట్టేశారు. నాలుగు డీఏల్లో ఒక డీఏను మాత్రమే ప్రకటించారు. ఇక, ఐఆర్, పీఆర్సీపై ప్రకటన వస్తుందని ఉద్యోగులుకు కేవలం ఒక డీఏనే ప్రకటించడంతో మరోసారి చంద్రబాబు చిత్తశుద్ధి బయటపడింది. చంద్రబాబు ప్రకటనతో ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. గత రెండు రోజులుగా ఉద్యోగ సంఘాలతో చర్చల పేరుతో మంత్రులు హైడ్రామా నడిపినప్పటికీ, చివరికి ఒక డీఏనే ప్రకటించారు చంద్రబాబు. మరొకవైపు పెండింగ్ బకాయిల అంశానికి సంబందించి కూడా ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. -
‘దండుపాళ్యం’ పాలన ఎవరిదో అందరికీ తెలుసు
హైదరాబాద్: ‘దండుపాళ్యం’ పాలన అంటే ఎవరిదో అందరికీ, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అందుకే గట్టిగా కర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు. అధికారం లేదన్న అసహనం, నిరాశలో ‘కేబినేట్’పై ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలను ఆయన శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. మంత్రుల మధ్య కుమ్ములాటలు, కేబినేట్ సమావేశంలో వర్గాలుగా విడిపోయి గొడవలు పడ్డారంటూ కట్టుకథల్ని సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారంతా సినిమాల్లో ‘రచయితలు’ గా ప్రయత్నించాలని, మంచి భవిష్యత్తు ఉంటుందని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినేట్ సమష్ఠిగా రాష్ట్రాభివృద్ధి కోసం పని చేస్తుందని స్పష్టం చేశారు. భావితరాల భవిష్యత్తు కోసం చిత్తశుద్ధితో అహర్నిశలు శ్రమిస్తున్న మా మంత్రులకు ప్రత్యేకంగా వ్యక్తిగత అజెండా అంటూ ఏదీ లేదన్నారు. మాకు అవకాశమిచ్చిన తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలే మా అందరి అజెండా అని తేల్చి చెప్పారు. మేం వేసే ప్రతి అడుగు రాష్ట్రాభివృద్ధి కోసమేనని, ఈ విషయంలో ఎలాంటి అపోహాలకు తావు లేదని స్పష్టం చేశారు. ‘విలువ ఆధారిత వృద్ధే’ లక్ష్యంగా మా ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తుందన్నారు. మేం పాలనను గాలికొదిలేస్తే గత 20 నెలల్లో రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేవా అని ప్రశ్నించారు. మంత్రులంతా వ్యక్తిగత పంచాయతీలు పెట్టుకుంటే "ఎలీ లిల్లీ" లాంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు తెలంగాణకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. మాది మాటల ప్రభుత్వం కాదని... చేతల్లో చేసి చూపించే ప్రజా ప్రభుత్వమని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మీ అంతర్గత కుమ్ములాటలను కప్పిపుచ్చుకోవడానికి మాపై బురద చల్లడం ఇకనైనా మానుకోవాలని సూచించారు. మీ అహంకారపూరిత వ్యవహారశైలి, పాలనా వైఫల్యాల చరిత్రను దాచుకునేందుకు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. విజ్ఞులైన తెలంగాణ ప్రజలు మీ కుతంత్రాలను నమ్మరని గుర్తు చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని లేదంటే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.6 నెలల్లోనే రూ.12,864 కోట్ల ఎఫ్‌డీఐలు..‘పారిశ్రామికాభివృద్ధి విషయంలోనూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్ డీఐ) ఆకర్షణలో తెలంగాణ ముందంజలో ఉంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లోనే రాష్ట్రానికి రూ.12,864 కోట్ల ఎఫ్ డీఐలు వచ్చాయి. 2023–24లో ఇదే కాలంతో పోలిస్తే 33 శాతం ఎక్కువ కావడం గమనార్హం. దేశంలోనే టాప్ – 3 అర్బన్ ఎఫ్ డీఐ కేంద్రాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది’ అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ‘2023-24లో పరిశ్రమల జీఎస్ వీఏ రూ.2.46 లక్షల కోట్లు. అది 2024-25లో 12.6 శాతం పెరిగి రూ.2.77 లక్షల కోట్లకు చేరుకుంది. వృద్ధి రేటు 8.68 శాతం. గతేడాదితో పోలిస్తే 2.1 శాతం అధికంగా నమోదయ్యింది. అదే జాతీయ సగటు వృద్ధి రేటు 6.2 శాతం మాత్రమే’ అని పేర్కొన్నారు. ఇకనైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ప్రతిపక్షాలకు సూచించారు. -
కానీ.. ఆ విద్యను రైతులకు మాత్రం నేర్పలేదు: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో యువత కీలక పాత్ర పోషించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత పాలకులు యువత ఆకాంక్షలను రాజకీయాల కోసం వాడుకున్నారంటూ విమర్శలు గుప్పించారు. వారి కుటుంబం కోసమే గత పాలకులు ఆలోచించారు. గత పాలకులు నిజాం నవాబులతో పోటీపడి సంపద పెంచుకున్నారంటూ ఆరోపించారు.‘‘గత పదేళ్లలో నిరుద్యోగుల సమస్యను పరిష్కరించలేదు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలింది. ఎకరానికి రూ.కోటి సంపాదించే విద్య ఉందని గత పాలకులు చెప్పారు. కానీ ఆ విద్యను రైతులకు మాత్రం నేర్పలేదు. గత పాలకులు వారి కుటుంబసభ్యులకే పదవులు ఇచ్చుకున్నారు. కానీ గ్రూప్-2 నియామకాలు చేపట్టాలని ఆలోచించలేదు’’ అంటూ రేవంత్ దుయ్యబట్టారు.‘‘విద్యార్థి, నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన వాళ్లు ఒక్కక్షణం కూడా నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదు. అమరుల ఆశయ సాధనపై వాళ్లు ఆలోచన చేసి ఉంటే మీకు ఎనిమిదేళ్ల క్రితమే ఉద్యోగాలు వచ్చేవి. వాళ్ల కుటుంబంలో పదవులు భర్తీ చేసుకున్నారు తప్ప గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదు. పదిహేనేళ్లుగా గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ జరగలేదు అంటే… ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా?. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేం గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేశాం. గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి ఇవాళ నియామక పత్రాలను అందిస్తున్నాం...మిమ్మల్ని తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములను చేసే బాధ్యత టీజీపీఎస్సీ తీసుకుంది. మీరు, మేము వేరు కాదు.. మీరే మేము.. మేమే మీరు. చీకటి రోజులు పోవాలి.. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని గ్రూప్-1 విషయంలో సమస్యలన్నింటినీ ఎదుర్కొని నియామక పత్రాలు అందజేశాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. గత పాలకులు ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కేసులు వేసి అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వ్యవస్థతో మాపై బురద జల్లే ప్రయత్నం చేశారు. అలాంటి ఏ వ్యవస్థ మాకు లేదు.. మా వ్యవస్థనే మీరు.. ఆ వ్యవస్థలో మీరే మా కుటుంబ సభ్యులు. ఇప్పటి వరకు మీరు సామాన్యులు.. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్..మీ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా పనిచేయాలి. దేశంలోనే తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలి. రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దు. నిస్సహాయులకు సహాయం చేయండి.. పేదలకు అండగా నిలవండి. గత పాలకుల పాపాల పుట్ట పలుకుతోంది. వాళ్ల దోపిడీ గురించి మేం చెప్పడం కాదు..వాళ్ల కుటుంబ సభ్యులే చెబుతున్నారు. హాస్టల్స్ లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే వాళ్లు పైశాచిక ఆనందం పొందుతున్నారు. సెంటిమెంట్‌తో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. అలాంటి వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా, ఫుడ్ పాయిజన్‌తో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చూడాలి’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
ఐవీఆర్ఎస్ కాల్స్‌తో వైఎస్సార్సీపీపై విష ప్రచారం: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ పెద్దల ప్రోత్సహాంతో నకిలీ మద్యం దందాలో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోవడంతో, ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఐవీఆర్ఎస్ కాల్స్‌తో వైఎస్సార్సీపీపై తప్పుడు ప్రచారానికి చంద్రబాబు తెగబడ్డారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వివేకా హత్యతో లింక్ చేస్తూ, నకిలీ మద్యం దందాపై ప్రజలకు ఐవీఆర్ఎస్ కాల్స్ చేయిస్తున్న చంద్రబాబుకు నిజంగా దీనిపై వాస్తవాలు వెల్లడి కావాలంటే సీబీఐ విచారణ కోరడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఈ దందాలో కిలారు రాజేష్, నారా లోకేష్‌ల దోపడీ వ్యవహారం బయటపడుతుందని చంద్రబాబు కంగారు పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..చంద్రబాబు నేతృత్వం లోని ప్రభుత్వం నకిలీ మద్యం రాకెట్‌ను ప్రోత్సహిస్తూ మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్‌షాప్‌ల ద్వారా పెద్ద ఎత్తున అమ్ముతోంది. ఈ విషయం కాస్తా బయటపడిపోవడం, ఈ నకిలీ మద్యం దందా వెనుక ఉన్న టీడీపీ నేతల పేర్లు వెలుగులోకి రావడంతో ప్రజలు తెలుగుదేశం పార్టీని అసహ్యించుకుంటున్నారు. దీని నుంచి బయటపడటానికి సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌ను తెరమీదికి తీసుకువచ్చి, వైఎస్సార్సీపీకి ఆ బురద అందించేందుకు సిద్ధమయ్యాడు.అందులో భాగంగానే నిందితుడు జనార్థన్‌తో మాజీ మంత్రి జోగి రమేష్‌పై తప్పుడు ఆరోపణలు చేయించాడు. ఈ విషయాలను ప్రజలు నమ్మడం లేదని తెలిసి, పదేపదే ఈ నిందను వైఎస్సార్సీపీపై మోపుతూ పెద్ద ఎత్తన ప్రచారం చేయించేందుకు తెగబడ్డాడు. దీనిలో భాగంగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజలకు ఫోన్లు చేయించి, ముందుగా రికార్డు చేసిన మెసేజ్‌ను వారి మెదళ్ళలో జొప్పించేందుకు దిగజారుడు రాజకీయం చేస్తున్నాడు.ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్టగత ఎన్నికలకు ముందు కూడా ఇలాగే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా 'మీ భూమిని వైయస్ జగన్ లాగేసుకుంటున్నారు, మీ భూములకు రక్షణ లేదంటూ' ఒక ఫేక్ న్యూస్‌ను విస్తృతంగా ప్రచారం చేసి లభ్దిపొందారు. తిరిగి ఇప్పుడు టీడీపీ కార్యాలయం నుంచి ప్రజలకు మళ్ళీ అటువంటి ఐవీఆర్ఎస్ కాల్స్ చేయిస్తున్నాడు. నకిలీ మద్యం దందాలో కీలక నిందితుడు జనార్థన్‌రావు వాయిస్‌తో ఉన్న ఐవీఆర్ఎస్ కాల్స్‌లో జోగి రమేష్‌పై చేసిన ఆరోపణలను వినిపిస్తూ, నకిలీ మద్యం అంతా కూడా వైయస్ఆర్సీపీ వారే చేశారనే ఫేక్ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. (టీడీపీ నేతలు చేయిస్తున్న ఐవీఆర్ఎస్ కాల్స్ ఆడియోను ప్రదర్శించారు) తెలుగుదేశంకు ఈ నకిలీ మద్యం దందాతో సంబంధం లేకపోతే ఎందుకు పనిగట్టుకుని పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా జనార్థన్ వాయిస్‌తో జోగి రమేష్ పేరు చెప్పిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి.నాణ్యమైన లిక్కర్ అంటూ నకిలీ లిక్కర్ ఇస్తున్నాడుప్రజాస్వామ్యంలో ఇటువంటి నికృష్టపు రాజకీయాలు ఒక్క చంద్రబాబు తప్ప మరెవ్వరూ చేయలేదు. చంద్రబాబు పేరు చెబితే నేడు ప్రజలకు నకిలీ మద్యం దందానే గుర్తుకు వస్తోంది. మందుబాబులకు నాణ్యమైన మద్యంను ఇస్తానంటూ ఎన్నికలకు ముందు హామీలు గుప్పించాడు. ప్రబుత్వ ఆధీనంలోని మద్యంను ప్రైవేటువారి చేతికి ఇస్తే ఇలాంటి దారుణాలే జరుగుతాయని అందరికీ తెలుసు. గత తెలుగుదేశం ప్రభుత్వంలోనూ నకిలీ మద్యం తాగి అనేక మంది చనిపోయారు. నేడు అధికారంలోకి రాగానే చంద్రబాబు తన నకిలీ మద్యం దందాను ప్రారంభించాడు. నాణ్యమైన మద్యం, తక్కువ రేటుకు ఇస్తానంటూ హామీలు ఇస్తే మద్యం తాగే అలవాటు ఉన్న వారు చంద్రబాబు మాటలపై ఎంతో ఆశలు పెంచుకున్నారు.కానీ నేడు నాణ్యమైన మద్యం సంగతి పక్కకుపెట్టి, నకిలీ మద్యం తయారీని కుటీర పరిశ్రమ స్థాయికి తీసుకువచ్చాడు. ఈ విషయం ప్రజల ముందు బయటపడిపోవడంతో, దాని నుంచి బయట పడేందుకు తన హయాంలోనే జరిగిన వివేకా హత్యకేసు, సీబీఐ విచారణలో ఉన్న ఆ కేసుపైన కూడా తప్పుడు వక్రీకరణలు చేస్తూ ఐవీఆర్ఎస్ కాల్స్ చేయిస్తున్నాడు. ఇటువంటి ఐవీఆర్ఎస్ కాల్స్ చేసే బదులు నకిలీ మద్యం దందాపై సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు కోరాలని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలి. వివేకా హత్యకేసు ఇప్పటికే సీబీఐ పరిధిలో ఉంది. నకిలీ మద్యంను, వివేకా హత్య కేసును ఎలా ముడిపెడతారు? ప్రజలను పక్కదోవ పట్టించేందుకే ఇటువంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. నకిలీ మద్యం ఏ షాప్‌ల్లో ఉందో ప్రజలను ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అడగాలి. చంద్రబాబు నకిలీ మద్యం తాగి చనిపోయిన ప్రతి ప్రాణం ఉసురు ఆయనకు తగిలితీరుతుంది.చంద్రబాబూ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండిఐవీఆర్ఎస్ కాల్స్‌లో తప్పుడు ప్రచారాలు మాని… మీకు ధైర్యం, నిజాయితీ ఉంటే మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నారా లోకేష్‌తో అయినా చెప్పించండి. నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు బయటపడ్డ తర్వాత మీరెన్ని షాపుల్లో తనిఖీలు చేశారు? ఎన్ని నకిలీ లిక్కర్ బాటిళ్లు పట్టుకున్నారు? ఏయే షాపుల్లో గుర్తించారు? నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీల నుంచి సరఫరా చైన్ ఏంటి? ఎవరెవరు వాటిని కొన్నారు? ఏయే లిక్కర్ షాపులు అమ్మాయి? ఎక్కడెక్కడ బెల్టుషాపులకు సప్లై అయ్యాయి? ఇది బయటకు రావడం లేదంటే.. ఇదంతా మీరు నడిపించిన మాఫియా కదా? అద్దేపల్లి జనార్దన్‌ను మీరు రప్పించారా? తనే వచ్చాడా? తాను వస్తున్నట్టుగా మీకు తెలిస్తే.. ముంబై వెళ్లి ఎందుకు అరెస్టు చేయలేదు? అంతకుముందు రెడ్‌కార్నర్ నోటీసు ఎందుకు జారీచేయలేదు? పరస్పర సహకార ఒప్పందం వెనుక మతలబు ఏమిటో చెప్పాలి.అద్దేపల్లి జనార్థన్ ఫోన్ ఎక్కడ ఉంది?అద్దేపల్లి జనార్దన్ తన ఫోను ముంబైలో పోయిందని చెప్పారు. ఆ ఫోన్లో జోగిరమేష్‌తో చాట్ చేసినట్టుగా మరోవైపు లీక్ చేయించారు. పోయిన ఫోన్ నుంచి చాటింగ్ స్క్రీన్ షాట్ ఎలా బయటకు తీశారు? ఇదెలా సాధ్యమైంది? జనార్దన్‌ను ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేశారు. జనార్దన్ లాయర్ల సమక్షంలో అదుపులోకి తీసుకున్నారు. మరి మీ కస్డడీలో ఉన్నప్పుడు జనార్దన్ ఎలా వీడియో తీసుకున్నాడు? ఆ వీడియోను ఎలా బయటకు పంపగలిగాడు? అదీ అతనికి ఫోన్లేకుండా? ఈ మాయా మర్మం ఏంటి మహానుభావా? నకిలీ మద్యం కేసులో తంబళ్లపల్లె నుంచి పోటీచేసిన మీ పార్టీ నాయకుడు జయచందరారెడ్డి తనకు లిక్కర్ వ్యాపారాలు ఉన్నాయని, ఆఫ్రికాలో ఉన్నాయని నేరుగా అఫిడవిట్లో పెట్టారు.మీకు ఇవన్నీ తెలిసే గత ఎన్నికల్లో టిక్కెట్టు ఇచ్చిన మాట వాస్తవం కాదా? దీనికోసం సీనియర్, మాజీ ఎమ్మెల్యే అయిన శంకర్‌యాదవ్‌ను నట్టేటా ముంచిన మాట వాస్తవం కాదా? ఈ టిక్కెట్లు ఇవ్వడానికి నడిచిన క్యాష్… సూట్‌కేస్… రాజేష్.. లోకేష్.. వ్యవహారం మీద మీకు విచారణ చేసే దమ్ము ఉందా? నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ అక్టోబరు 3న బయటపడితే ఇవ్వాళ్టికి 16 రోజులు అయ్యింది. ఇప్పటికీ జయంద్రారెడ్డికి రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వలేదు. రెడ్‌కార్నర్ నోటీసు జారీచేయలేదు. పాస్ పోర్టు రద్దు చేయాలంటూ మీ జేబులో సిట్ దరఖాస్తు కూడా చేయలేదు. కారణం ఏంటో…? స్తుతి మెత్తని, సానుకూలత పద్ధతులు ఎందుకు? మీకు మీకు ఉన్న ఒప్పందాలు ఏంటి?కిలారు రాజేష్, లోకేష్‌ల గుట్టు బయటపడుతుందని భయంజయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్‌రెడ్డి, పీఏ రాజేష్లనుకూడా ఎందుకు పట్టుకోలేకపోయారు? నన్ను ఇబ్బందిపెడితే కిలారు రాజేష్, లోకేష్‌ల గట్టువిప్పుతానని జయంద్రారెడ్డి మీకు గట్టి హెచ్చరిక పంపినట్టుగా తెలుస్తోంది. ఈ స్టోరీపై కాస్త స్పందిస్తారా? కనీసం లోకేష్ అయినా మాట్లాడతాడా? మీ నకిలీ మద్యం అమ్మకానికి అడ్డురాకుండా మీరు అద్భుతమంటూ ప్రచారం చేసిన రూ.99ల లిక్కర్ సప్లైని తగ్గించేశారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అద్భుతమైన ఈ రూ.99ల సరుకు ఎంత అమ్మారు? నెలల వారీగా… వివరాలు బయటపెట్టగలరా? మీరు డాష్‌బోర్డు సీఎం కదా? కనీసం ఆ ముఖేష్‌కుమార్ మీనా కైనా చెప్పండి. పాపం మిమ్మల్ని కవర్ చేయలేక, ఆయన్ని ఆయన కాపాడుకోలేక తెగ ఇబ్బందిపడుతున్నాడు. దీంతో పాటు గతంలో ఉన్న బ్రాండ్లు, వాటి రేట్లు, ఇప్పుడున్న బ్రాండ్లు వాటి రేట్లు, మీరు కొత్త పాలసీ తెచ్చిన తర్వాత నెలవారీగా వాటి విక్రయాలు, అలాగే ఆయా డిస్టలరీలకు ఇచ్చిన ఆర్డులు, వాటి నుంచి సప్లై, చెల్లించిన మొత్తాలు.. ఇవి బయటపెడితే బాగుంటుంది. మీరు బయటపెట్టకపోయినా ఎలాగూ.. మేం వచ్చాక బయటపెడతాం. అందులో సందేహం లేదు. చంద్రబాబూ.. రూల్ ప్రకారం బార్లకు సెపరేట్‌గా, లిక్కర్ షాపులకు సెపరేట్‌గా మందును సప్లై చేయాలి. కాని, బార్లు ఏవీకూడా ఆర్డర్లు పెట్టుండా… నేరుగా లిక్కర్ షాపుల నుంచి తెచ్చి అమ్మేస్తున్నారు. ఇందులో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, కిలారు రాజేష్‌కి, తద్వారా లోకేష్‌కి వాటాలు అందుతున్న విషయం వాస్తవం కాదా? -
మచిలీపట్నం ప్రజలతో కొల్లు రవీంద్ర ఆటలాడుతున్నాడు: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నం ప్రజలతో కొల్లు రవీంద్ర ఆటలాడుతున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన మచిలీపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కొల్లు రవీంద్ర స్వార్థం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. చిరు వ్యాపారులను రోడ్డున పడేశారంటూ ధ్వజమెత్తారు.‘‘కొల్లు రవీంద్ర కాంప్లెక్స్ కోసం అన్యాయంగా స్థానికులకు నోటీసులు ఇస్తున్నారు. కొల్లు రవీంద్ర బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు. రోడ్డు విస్తరణ పేరుతో హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చేశారు. కొల్లు రవీంద్ర కట్టే నిర్మాణాలకు మున్సిపల్ ప్లాన్ లేదు. మున్సిపల్ ప్లాన్ లేకుండా నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు ఏమయ్యారు?. సామాన్యులు ఇల్లు కట్టుకుంటే మాత్రం అధికారులు ఆపేస్తున్నారు. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే టీడీపీ నేతలు 50 వేలు వసూలు చేస్తున్నారు’’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.‘‘13వ తేదీన మున్సిపల్ అధికారులతో ఒక నోటీస్ ఇప్పించారు. జూలైలోనే మున్సిపల్ అధికారులతో కొల్లు రవీంద్ర ఓ ప్లాన్‌ను రెడీ చేసేసుకున్నారు. బెల్లపుకొట్ల సందును నేను మొదటి సారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే విస్తరణ చేశా. 2014లో మంత్రిగా ఉన్నప్పుడు రోడ్డు విస్తరణ చేయాలనే ఆలోచన రాలేదు. రోడ్డు విస్తరణపై పేపర్లో వచ్చే వరకూ ఎవరికీ తెలియదు. హడావిడిగా పేపర్ ప్రకటనపై మచిలీపట్నం ప్రజల్లో ఆందోళన మొదలైంది. 10 కోట్లతో మిల్లు, 20 కోట్లతో కమర్షియల్ కాంప్లెక్స్, 5 కోట్లతో గెస్ట్‌హౌస్ కడుతున్నాడు..కొల్లు రవీంద్ర చేపట్టే ఒక్క నిర్మాణానికీ ప్లాన్లు లేవు. చిన్నచిన్న వారి పై ప్రతాపం చూపించే మున్సిపల్ కమిషనర్‌కు కొల్లు రవీంద్ర నిర్మాణాలు కనిపించలేదా?. ప్లాన్లు లేకుండా నిర్మాణాలు జరుగుతుంటే మచిలీపట్నం పట్టణ అభివృద్ధి సంస్థ(ముడా) కళ్లు మూసుకుందా?. కొల్లు రవీంద్ర అండ చూసుకుని మున్సిపల్ కమిషనర్ రెచ్చిపోతున్నాడు. సామాన్యులు ఇల్లు కట్టుకుంటుంటే మున్సిపల్ సిబ్బంది వాలిపోతున్నారు. స్థానిక టీడీపీ ఇంఛార్జ్‌లకు కమిషన్ ఇస్తేనే అనుమతులిస్తున్నారు. నువ్వు మీ ఇంఛార్జిలకు ఎంత కమిషన్ ఇచ్చావ్ కొల్లు రవీంద్ర?..బడ్డీ కొట్లు కూలగొట్టించి నీఇంఛార్జ్లకు కమిషన్లు ఇప్పించి మళ్లీ అక్కడే షాపులు పెట్టించావ్. కొల్లు రవీంద్ర కడుతున్న కమర్షియల్ కాంప్లెక్స్‌కు కనీసం ప్లాన్ లేదు. తన కాంప్లెక్స్ ప్లాన్ కోసం రోడ్డును విస్తరణ చేయిస్తున్నాడు. చంద్రబాబు, లోకేష్ ఆశ్చర్యపోయే స్థాయిలో కొల్లు రవీంద్ర ఆస్తులు పోగేశాడు. ఎంతమంది కన్నీళ్లతో నువ్వు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటావ్. నీ స్వార్థం కోసం వ్యాపారుల ఉసురు పోసుకోకు. నేను ఊరు బాగు కోసం గతంలో రోడ్డు విస్తరణ చేయించా. ఈ రోజు ఎవరి బాగు కోసం మీరు ఈ రోడ్డు విస్తరణ చేయిస్తున్నావు. మచిలీపట్నం పట్టణ అభివృద్ధి సంస్థ (ముడా) ఛైర్మన్ పదవి ఇప్పిస్తానని రూ.5 కోట్లు తీసుకున్నావు. లోకేష్ దగ్గర పెండింగ్ ఉందని మరో కోటి 70 లక్షలు తీసుకున్నది నిజం కాదా?..ఉచ్ఛనీచాలు ఆలోచించకుండా పాపాలు చేయడం దేనికి కొల్లు రవీంద్ర. నువ్వు, చంద్రబాబు కలిసి 650 ఎకరాల ముడా భూమి తవ్వింది నిజం కాదా?. నేను చెప్పింది నిజమో కాదో ముడా పదవికి రాజీనామా చేసిన బీజేపి నేతను అడగండి చెబుతాడు. బెజవాడలోనో.. హైదరాబాద్‌లోనో కట్టుకోవచ్చు కదా. మచిలీపట్నంలోనే నీ మల్టీ కాంప్లెక్స్ ఎందుకు కట్టడం?. తన కమర్షియల్ కాంప్లెక్స్ కోసం స్వార్థంతో రోడ్డు విస్తరణ చేస్తున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టి కమర్షియల్ కాంప్లెక్స్ కడతానంటే చూస్తూ ఊరుకునేది లేదు. బలవంతంగా కొల్లు రవీంద్ర షాపింగ్ కాంప్లెక్స్ కట్టలేడు. కొల్లు రవీంద్ర చేస్తున్న పాపం.. దగాపై ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. చంద్రబాబుకి పిటిషన్లు పెడతాం. హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తాం..పోలీసులను ఉపయోగించి బలవంతంగా ఆర్యవైశ్యుల ఆస్తులు లాక్కోవాలని చూస్తే ఊరుకోం. కృత్తివెన్నులో 35 ఎకరాల ఆర్య వైశ్యుల ఆస్తులను కొట్టేశావ్. బెంగుళూరులో ఉన్న వారిపై అక్రమంగా కేసులు పెట్టావ్. జగన్ మళ్లీ అధికారంలోకి రాగానే కచ్చితంగా నీ అక్రమ కేసుల సంగతి తేలుస్తాం. బీచ్‌లో ఫెస్టివల్ తప్ప బందరుకు నువ్వు చేసిందేంటి?. మచిలీపట్నంలో రోడ్డు విస్తరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. కొల్లు రవీంద్రను ఎదుర్కోలేకే... సామాన్యులు నన్ను ఆశ్రయించారు. నన్ను సాయం కోరిన వారికి కచ్చితంగా నేను అండగా ఉంటా’’ పేర్ని నాని పేర్కొన్నారు. -
గూగుల్‌తో లక్ష ఉద్యోగాలు అనేది అబద్ధం: బీజేపీ ఎమ్మెల్యే విష్ణు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో గూగల్ సంస్థలో ఉద్యోగాల విషయమై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కీలక కామెంట్స్ చేశారు. గూగుల్ సంస్థలో లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయనే మాట అవాస్తవం అంటూ నిజాలను బయటపెట్టారు. వాస్తవాలను కుండబద్దలు కొట్టారు. దీంతో, చంద్రబాబు, నారా లోకేష్ వ్యాఖ్యలు అబద్దమని తేలిపోయింది.బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నిజం చెప్పడానికి నాకు మొహమాటం లేదు. డేటా సెంటర్ అంటే కాల్ సెంటర్ కాదు. డేటా సెంటర్ వలన ఎక్కువ ఉద్యోగాలు రావు. గూగుల్ సంస్థలో లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయనే మాట అవాస్తవం. రెండు, మూడు వేలలో మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. గూగుల్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయానేది సమస్య కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళల పట్ల బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ క్రమంలో విష్ణుకుమార్..‘ఉచిత బస్సు ప్రయాణంలో మహిళల డామినేషన్ ఎక్కువైంది. టికెట్ ఉన్న మగవాళ్లను కూడా బస్ నుంచి దించేస్తున్నారు. ఆర్టీసీ యూనియన్ నాయకులే ఈ మాట చెప్పారు. మగవాళ్లు ఇబ్బంది పడుతున్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పుకొచ్చారు. దీంతో, కూటమి ప్రభుత్వం ఉన్న లొసుగులు మరోసారి బహిర్గతమయ్యాయి. -
‘నకిలీ మద్యం.. నాలుగు లక్షల కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్’
సాక్షి, అనంతపురం: టీడీపీ కూటమి నేతల కనుసన్నల్లో లిక్కర్ మాఫియా నడుస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకులు సాకే శైలజానాథ్. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక నకిలీ మద్యం విజృంభిస్తోందని అన్నారు. ప్రజల ఆరోగ్యం నాశనం అవుతుంటే.. మీరు జేబులు నింపుకుంటున్నారా? అని ప్రశ్నించారు. నాలుగు లక్షల కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి శైలజానాథ్ అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ పాలనలో బెల్టు షాపులు లేవు. ప్రభుత్వమే నిబంధనల ప్రకారం మద్యం విక్రయాలు జరిపించింది. చంద్రబాబు ఓ అసమర్థ ముఖ్యమంత్రి. బాబు ముఖ్యమంత్రి అయ్యాక నకిలీ మద్యం విజృంభిస్తోంది. కల్తీ మద్యం తయారు చేస్తూ పట్టుబడ్డ వారంతా టీడీపీ నేతలే. నాలుగు లక్షల కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు. ప్రజల ఆరోగ్యం నాశనం అవుతుంటే.. మీరు జేబులు నింపుకుంటున్నారా?. చంద్రబాబు అబద్దాల ముఖ్యమంత్రి. నకిలీ లిక్కర్ కుటీర పరిశ్రమను చంద్రబాబు రాష్ట్రమంతా నడిపిస్తున్నారు. కల్తీ మద్యం వెనుక టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు ఉన్నారు.ఏపీలో మద్యం మాఫియా రాజ్యమేలుతోంది. చంద్రబాబు చాలా దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు. చాలా కాలం నుంచి లిక్కర్ దందాకు చంద్రబాబు ప్లాన్ చేశారు. చంద్రబాబు మనుషుల చేతుల్లోనే లిక్కర్ షాపులున్నాయి. లక్షలాది బెల్టు షాపులు టీడీపీ వారివే. చంద్రబాబు డర్డీ పాలిటిక్స్ చేస్తున్నారు. అన్ని లిక్కర్ షాపుల్లో నకిలీ లిక్కర్ అమ్ముతున్నారు. ప్రజల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కలేదు. కల్తీ మద్యం అరికట్టాలన్న చిత్తశుద్ధి ఉంటే కేసును సీబీఐకి అప్పగించాలి. నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్‌ను ఇరికించే కుట్రలు జరుగుతున్నాయి. జోగి రమేష్ ఛాలెంజ్‌ను చంద్రబాబు, లోకేష్ ఎందుకు స్వీకరించలేదు?.రాష్ట్రంలో అన్యాయం, అరాచక పాలన సాగుతోంది. లోకేష్ మీ నాన్నలా రాజకీయాలు చేయకు.. మంచి రాజకీయాలు నేర్చుకో. చంద్రబాబు సిట్ అంటేనే రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు. చంద్రబాబు వేసే సిట్.. ఆయన సిట్ అంటే సిట్, ఆయన స్టాండ్ అంటే స్టాండ్ . చంద్రబాబు ఓట్ చోరీ ద్వారా అధికారంలోకి వచ్చారు. విద్యాశాఖ మంత్రి గా నారా లోకేష్ పూర్తిగా విఫలమయ్యారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ శాఖలు సరిగా పనిచేయలేదని సాక్షాత్తూ మంత్రి సత్యకుమార్ అంటున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు ఇస్తే పేదల పరిస్థితి ఏంటి?. వైఎస్సార్సీపీ, ప్రజలు అడిగే ప్రశ్నలకు కూటమి నేతల దగ్గరా సమాధానాలు లేవు’ అని అన్నారు. -
అతకని అతిశయోక్తులతో ప్రధాని ప్రసంగం...
దేశ రాజధాని ఢిల్లీ.. అమరావతి వేగంగా అభివృద్ధి చెందుతున్నాయిట. దేశ ప్రగతిలో కీలకంగా మారాయట. ఈ వ్యాఖ్యలు ఎవరో ఆషామాషీ వ్యక్తులు చేసింది కాదు. ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నవి. మరీ ఇంత అతిశయోక్తా? ఢిల్లీ ఇప్పటికే అభివృద్ది చెందిన ప్రాంతమన్నది అందరికీ తెలుసు. కానీ అమరావతి? అమరావతి అభివృద్ది చెందుతుందని, దానికి తమ సహకారం ఉంటుందని చెబితే ఫర్వాలేదు. అలా కాకుండా భారతదేశాన్ని నడిపించగలిగే శక్తి ఆంధ్రప్రదేశ్‌కు ఉందంటే ప్రజలు నమ్మగలుగుతారా? ఇదే నిజమైతే ముంబై, బెంగుళూరు, చెన్నై హైదరాబాద్, పూణేల మాటేమిటి? అవి కదా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నవి. కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ ముఖచిత్రం మారుతోందని, ఈ 16 నెలల ఎన్డీయే పాలనలో వేగవంతమైన అభివృద్ది జరుగుతోందని ప్రధాని అన్నారు. అదేంటో కాస్తా వివరించి ఉంటే బాగుండేది. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లేస్తూ పోలీసు రాజ్యాన్ని నడపడం, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటకు అప్పనంగా అప్పగించేయడమేనా ముఖచిత్ర మార్పు అంటే? లేక... ఏడాదిన్నర కాలంలో రూ.2.10 లక్షల కోట్లు అప్పులు చేయడమా? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని విస్మరించి దేశానికి నష్టం చేశాయని ప్రధాని వ్యాఖ్యానించారు. అయితే ఏపీలో సుదీర్ఘకాలం అధికారం వెలగబెట్టింది తన భాగస్వామి చంద్రబాబే అన్నది మరచిపోయారు. మొన్నటికి మొన్న ఎన్డీయేను వీడిన చంద్రబాబును మోడీ, అమిత్ షాలు అనని మాటలేదు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చేసుకున్నారని విమర్శించడం మాత్రమే కాదు.. తనకన్నా సీనియర్ అని చంద్రబాబును వెటకారమాడిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. లోకేశ్ వారసత్వ రాజకీయాలకు ప్రతినిధిగానూ తెగనాడిన ప్రధాని ఇప్పుడు అదే నోటితో ఆయన్నో యువనేతగా అభివర్ణిస్తున్నారు. మనోడైతే వారసత్వ రాజకీయాలు చేసినా ఓకే అన్నమాట. జీఎస్టీ రేట్లలో తగ్గింపులను ఉత్సవాలుగా జరిపే ప్రయత్నం చేస్తున్న మోడీ, చంద్రబాబులు ఏడేళ్లుగా ప్రజల నుంచి అప్పనంగా దోచుకున్న విషయంపై మాట్లాడరు. వాస్తవానికి పెట్రోలు, డీజిళ్లను కూడా జీఎస్టీ పరిధిలోకి తెస్తేనే మధ్యతరగతి వారికి నాలుగు రూకలు మిగులుతాయి. సూపర్ గిఫ్ట్ అవుతుంది. విశాఖలో రానున్న అదానీ, గూగుల్ల డేటా సెంటర్‌ను ప్రస్తావించిన మోడీ దీని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోన్న రూ.22 వేల కోట్ల రాయితీల్లో కొంత కేంద్రమూ భరిస్తుందని చెప్పి ఉంటే ప్రజలపై అప్పుల భారం కొంతైనా తగ్గిఉండేది. ఏపీ అభివృద్ధికి రాయలసీమ కీలకమన్న ప్రధాని ఆ ప్రాంతంలో వలసల నిరోధానికైనా, టమోటా, ఉల్లి, మిర్చి వంటి పంటలకు తగిన ధరలు కల్పించేందుకైనా ఏమైనా పథకాలు ప్రకటించి ఉంటే అసలు మేలు చేసిన వాళ్లు అయ్యేవారు. అదేదీ చేయకుండా ఒట్టి మాటలు మాట్లాడితే ఎవరికి ప్రయోజనం? విభజన హామీల్లో ఒకటైన ప్రత్యేక హోదా ఊసైనా ఎత్తలేదు ప్రధాని తన ప్రసంగంలో. మొత్తం ప్రసంగంలో మోడీ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయకపోవడం ఒక ప్రత్యేకతని చెప్పాలి. బహుశా ఇది టీడీపీ, జనసేనలకు నిరాశ కలిగించి ఉండవచ్చు. ఈ మధ్యకాలంలో ఐదారు సార్లు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ప్రధాని రాష్ట్రనికి ఇచ్చిందేమీ లేదని, పర్యటనల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు వృథా చేస్తోందని అవుతోందన్న విమర్శలున్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రధానిని ఆకాశానికి ఎత్తేస్తే.. మోడీ కూడా బాబు, పవన్‌లను కీర్తించి వెళ్లారు. ఎందరో ప్రధానులతో పనిచేసిన తనకు మోడీ లాంటి నేత అస్సలు కనపడనే లేదని, విలక్షణ నాయకుడని, జాతికి ఎనలేని సేవలందిస్తున్నారని చంద్రబాబు కీర్తిస్తే.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత పాటే మళ్లీ పాడారు. కూటమి ఏపీలో 15 ఏళ్లపాటు కలిసి ఉంటుందని భరోసా ఇచ్చారు. మోడీ దార్శనికతతో, చంద్రబాబు స్పూర్తితో సమష్టిగా ముందుకు వెళతామని ఆయన అన్నారు. డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రానికి సూపర్ సిక్స్ పథకాలు, సూపర్ జీఎస్టీ తగ్గింపులనే డబుల్ బెనిఫిట్లు వచ్చాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అప్పు చేయకుండా వారం గడవని పరిస్థితుల్లో, ఎన్నికల హామీలు నెరవేర్చలేక సతమతమవుతున్న చంద్రబాబు ఈ మాటలనడం ఆత్మవంచనే అవుతుంది. జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రభుత్వానికి రూ.ఎనిమిది వేల కోట్ల ఆదాయం తగ్గుతుందన్న భయమున్నా అది సూపర్ అని ప్రచారం చేయక తప్పడం లేదు. జీఎస్టీ తగ్గింపువల్ల ప్రజలకు నేరుగా కలిగే ప్రయోజనం ఎంతన్నదానిపై కూడా ప్రయోజనం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులన్నీ తన ప్రతిభే అని అన్నిచోట్ల చెప్పుకునే చంద్రబాబు ఈసారి మాత్రం అన్నీ మోడీ చలవేనని చెప్పుకున్నారు. గతంలో ప్రధాని మోడీ వచ్చిన ప్రతి సందర్భంలోనూ రాష్ట్రానికి అవసరమైన కొన్ని డిమాండ్లను సీఎం హోదాలో జగన్ ప్రస్తావించే వారు. వినతిపత్రం లాంటివి ఇచ్చేవారు. చంద్రబాబు ఈ పని మాత్రం చేయలేకపోయారు. కారణమేమిటో మరి?తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న లోకేశ్ తనకు ఇచ్చిన శాఖలను సమర్థం నిర్వహిస్తున్నారని పవన్ పొగడడం గమనించాల్సిన అంశమే. లోకేశ్ నాయకత్వానికి పరోక్షంగా ఆమోదం చెప్పినట్లు అనుకోవాలి. లోకేశ్ కూడా తన శక్తి వంచన లేకుండా సినిమా డైలాగుల మాదిరి మోడీని మురిపించే యత్నం చేశారు. ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు..అనేది నమో స్టైల్ అని ఆయన అన్నారు. మోడీ లోకేశ్‌కు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన అనుచరులు సంబరపడుతున్నారు. రాజకీయ వారసత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అన్న ప్రచారం జరుగుతోంది. కర్నూలు సభ ప్రచారానికి బాగానే ఉపయోగపడవచ్చు కానీ ప్రజలకు ఎంత ప్రయోజనం సిద్దిస్తుందన్నదే డౌటు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కవిత కొడుకు పొలిటికల్ ఎంట్రీ!?
సాక్షి, హైదరాబాద్: 42 శాతం రిజర్వేషన్ల సాధన డిమాండ్‌తో బీసీ సంఘాలు ఇవాళ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నిరసనల్లో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత శనివారం ఉదయం ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో.. ఆమె కుమారుడు ఆదిత్య సైతం పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తల్లితో పాటే నిరసనల్లో పాల్గొన్న ఆదిత్య.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని ఫ్లకార్డు చేతబూని నినాదాలు చేస్తూ కనిపించాడు.‘‘కేవలం మా అమ్మ మాత్రమే పోరాటం చేస్తే సరిపోదు.. ప్రతి ఇంటి నుండి అందరూ బయటకు వచ్చి రిజర్వేషన్ల కోసం పోరాడాలి. బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు ఎంతో అవసరం’’ అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. బీఆర్ఎస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ కవితను ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో నొచ్చుకున్న ఆమె ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. విదేశాల్లో చదువుకున్న ఆదిత్య ఇటీవలే ఇండియాకు రాగా.. అనూహ్యంగా ఇవాళ్టి బంద్, ధర్నాల్లో పాల్గొనడం గమనార్హం. దీంతో 20 ఏళ్లకే కవిత కొడుకు పొలిటికల్ ఎంట్రీకి రెడీనా? అనే చర్చ నెట్టింట జోరుగా నడుస్తోంది. -
‘బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా’
సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కారణంగా బంద్ కొనసాగుతోంది. బంద్‌లో అన్ని రాజకీయ పార్టీ నేతలు పాల్గొంటున్నారు. మరోవైపు.. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోంది ఆరోపించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైకోర్టు ఇచ్చిన స్టేతో బీసీలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి బట్టబయలైంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.తెలంగాణభవన్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది. కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాలతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండాపోయింది. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మభ్యపెట్టారని చూశారు. కామారెడ్డి డిక్లరేషన్ బూటకం. కానీ, బీసీలు వాస్తవాలను తెలుసుకున్నారు. రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేయడం దారుణం. చెల్లని జీవోలను, ఆర్డినెన్స్‌ను విడుదల చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోంది. సమస్యలు పరిష్కరించే నాధుడే కరువయ్యాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నాయి’ అని కామెంట్స్ చేశారు. మాజీమంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ..‘బీసీ బంద్‌లో కాంగ్రెస్, బీజేపీ పాల్గొంటున్నాయి. మొక్కుబడిగా బీసీ బంద్‌లో కాంగ్రెస్, బీజేపీ భాగస్వామ్యం కావద్దు. బీసీలకు రాజ్యాంగ సవరణ ద్వారానే 42 శాతం రిజర్వేషన్లు వస్తాయి. బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. బీసీలకు ఒక్క శాతం కూడా రిజర్వేషన్ తగ్గవద్దు అంటూ కామెంట్స్ చేశారు. -
మంత్రులు వర్గాలుగా విడిపోయి తన్నుకుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం.. దండుపాళ్యం ముఠా కంటే అధ్వానంగా తయారైందని..కేబినెట్ మీటింగ్‌లో మంత్రులు అరడజను వర్గాలుగా విడిపోయి తన్నుకుంటున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కమీ షన్లు, కాంట్రాక్టులు, వసూళ్లు, వాటాలు, కబ్జాలు, పోస్టింగుల కోసం పోటీలు పడుతూ పాలన గాలికి వదిలి వ్యక్తిగత పంచాయితీలు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ముఖ్య మంత్రి, మంత్రులు పరస్పరం తిట్లతో గడుపుతున్నారని, అతుకుల బొంత ప్రభుత్వ మనుగడపై అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల్లోనే అనుమానాలు ఉన్నాయని చెప్పారు.దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే భావనతో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నప్పుడే అందినకాడికి దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. మాజీమంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మాణిక్‌రావు, పార్టీ నేతలు చిరుమర్తి లింగయ్య, పల్లె రవికుమార్‌తో కలిసి శుక్రవారం తెలంగాణభవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. దీపావళి పండుగ నేపథ్యంలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశం ద్వారా తీపి కబురు చెప్తారని ఆశించిన అన్ని వర్గాల ప్రజలు నిరాశకు గురయ్యారన్నారు.రేవంత్ ‘గన్ కల్చర్’ తెచ్చారు‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యాపార వేత్తలకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికి పెట్టుబడులతోపాటు ఉద్యోగ, ఉపాధి కల్పనకు కృషి చేశాం. కానీ రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోకి గన్ కల్చర్ తెచ్చి వ్యాపారవేత్తలను తుపాకులతో బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి సన్నిహితులు తుపాకులు పెడుతున్నారని, సీఎం జపాన్ నుంచి ఫైళ్లు ఆపించారని ఓ మంత్రి కుమార్తె స్పష్టంగా చెప్తోంది.కాంట్రాక్టుల కోసం.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినిమా హీరోలు, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. ఇక్కడ జరుగు తున్న అరాచకాలపై కేంద్ర ప్రభుత్వ సంస్థలతో లేదా స్వతంత్ర జ్యుడీషియల్ కమిషన్‌తో విచారణ జరిపించాలి. సీఎం తుపాకీ పంపారు అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో డీజీపీ స్పందించాలి’అని హరీశ్‌రావు అన్నారు. దేని కోసం విజయోత్సవాలు..?‘ప్రభుత్వ సంస్థలను అప్పుల కుప్ప చేసి ఎఫ్ఆర్బీఎం పరిమితిని మించి అప్పులు తెచ్చారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చి కమీషన్లు దండుకునేందుకు హ్యామ్ మోడల్ పేరిట రూ.10,547 కోట్లతో రోడ్లకు టెండర్లు పిలిచారు. బ్యాంకుల్లో అప్పులు పుట్టకపోవడంతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి పేద, మధ్య తరగతి ప్రజలను రేవంత్ ప్రభుత్వం దొంగ దెబ్బతీసింది. 23 నెలల పాలనలో అన్ని పథకాలు, హామీలను అమలు చేయకుండా డిసెంబర్ 1 నుంచి 9 వరకు విజయోత్సవాలు జరపాలని నిర్ణయించడం సిగ్గుచేటు. రాష్ట్రంలో పెరిగిన అరాచకాలపై విచారణ ఏజెన్సీలకు ఫిర్యాదు చేస్తాం’అని హరీశ్‌రావు చెప్పారు. -
‘లోకేశ్‌ని ఎదిరించినందుకు హత్య కేసులో ఇరికించారు’
తాడేపల్లి: వైఎస్సార్సీపీలో యాక్టివ్‌గా ఉంటూ, పార్టీ నిర్వహిస్తున్న నకిలీ లిక్కర్ వ్యతిరేక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుంటే తట్టుకోలేక వైఎస్సార్సీపీ దుగ్గిరాల జెడ్పీటీసీ మేకతోటి అరుణ భర్త దాసరి వీరయ్యపై పోలీసులు అక్రమంగా హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో జరిగిన ఒక హత్య కేసుతో సంబంధం లేకపోయినా కూడా దాసరి వీరయ్యను ఆ కేసులో నిందితుడిగా చేర్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాలతో వీరయ్యకు ఏమాత్రం సంబంధం లేకపోయినా తప్పుడు వాంగ్మూలం తీసుకుని దొంగ సాక్ష్యాలతో ఒక కట్టు కథ అల్లారని చెప్పారు. మంత్రి నారా లోకేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో వ్యతిరేక గళం వినిపించకూడదన్న నియంత ఆలోచనలతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మనోహర్‌రెడ్డి చెప్పారు. నకిలీ మద్యం తయారీకి వ్యతిరేకంగా గళమెత్తినందుకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆయన భార్యతోపాటు మరో 13 మంది వైయస్సార్సీపీ నాయకులపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇదే నకిలీ మద్యం గురించి వార్తలు రాసినందుకు సాక్షిమీడియాపై 17 అక్రమ కేసులు నమోదు చేశారని, ములకలచెరువు నకిలీ మద్యం తయారీ రాకెట్ గుట్టు ఎలా తెలిసిందో సోర్స్ చెప్పాలని వేధించడం రాజ్యాంగం ఇచ్చిన మీడియా స్వేచ్చను కాలరాయడమేనని స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే ...కుట్రపూరితంగా దాసరి వీరయ్యపై కేసు బనాయించారుచట్టాన్ని, శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం కూటమి నాయకుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తోంది. కూటమి నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ పోలీసులు రోజురోజుకీ దిగజారి వ్యవహరిస్తున్నారు. ఇటీవల బాపట్ల జిల్లా అమల్తూరు మండలం యడవూరు గ్రామానికి చెందిన నాగ గణేశ్, కొలకలూరు గ్రామానికి చెందిన కీర్తి వీరాంజనాదేవి అనే యువతి వారి కుటుంబసభ్యులకు ఇష్టం లేకపోయినా కోటిలింగాల గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి పోలీసుల రక్షణ కోరారు. ఇరువురు తల్లిదండ్రులను పోలీసులు పిలిపించగా అమ్మాయి తల్లిదండ్రులు నచ్చలేదని వెళ్లిపోయారు. దీంతో నవ దంపతులు కొత్త కాపురం పెట్టుకుని జీవిస్తుండగా, ఇటీవల కీర్తి వీరాంజనాదేవి అన్న కాపు కాసి ఆమె భర్త నాగ గణేశ్‌ను మరికొందరితో కలిసి తండ్రి ముందరే నరికి చంపేశాడు. దీనిపై ప్రత్యక్ష సాక్షి, మృతుడు నాగ గణేశ్ తండ్రి స్టేట్మెంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అంతటితో ఆగకుండా ఈ కేసుకి ఏమాత్రం సంబంధం లేని వైఎస్సార్సీపీ నాయకుడు, దుగ్గిరాల జెడ్పీటీసీ మేకతోటి అరుణ భర్త అయిన దాసరి వీరయ్యని నిందితుడిగా చేర్చారు. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి లోకేశ్‌ని ఎదిరించి నిలబడిన కారణంగా ఆయనపై పోలీసులు ఈ విధంగా అక్రమ కేసు బనాయించారు. ఎవరో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మొన్న అర్థరాత్రి అరెస్ట్ చేసి నిన్న రాత్రి కోర్టులో హాజరు పరిచారు. ఈ వాంగ్మూలం కాపీలో పేర్లు, చిరునామా దగ్గర నుంచి చంపిన ఘటన వరకు వారే ప్రశ్నలు వేసినట్టు, వారే సమాధానాలు రాసుకున్నారు. నాగ గణేశ్‌ని చంపడం వెనుక మాస్టర్ మైండ్ దాసరి వీరయ్య అన్నట్టుగా ఆయన అండదండలతోనే హత్య చేసినట్టుగా ఒక కథనం అల్లారు. దాన్ని ధ్రువీకరిస్తూ ఇద్దరు మధ్య వ్యక్తులతో సాక్షి సంతకాలు చేయించుకున్నారు. మధ్యవర్తుల సమక్షంలో సంతకం చేయడానికి దాసరి వీరయ్య సంతకం చేయడానికి నిరాకరించినట్టు మళ్లీ మధ్యవర్తులతో సంతకాలు చేయించుకున్నారు. చేయని నేరాన్ని అంగీకరించాలంటూ దాసరి వీరయ్యను పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. తనపై అన్యాయంగా అక్రమ కేసు బనాయించి వేధిస్తున్నారని, ఎలాంటి సంబంధం లేకపోయినా 302 కేసులో ఇరికించారని దాసరి వీరయ్య స్వయంగా మెజిస్ట్రేట్‌కి వివరించారు. ప్రేమ పెళ్లి వ్యవహారంలో జరిగిన పరువు హత్య ఘటనలో ఆ ఊరితో సంబంధమే లేని దాసరి వీరయ్యను పోలీసులు అక్రమంగా ఇరికించారు. ప్రమోషన్ల ఆశ చూపించి కొంతమంది పోలీసులను రాజకీయ ప్రతీకార దాడులకు కూటమి నాయకులు వాడుకుంటున్నారు.ధర్నా చేసినందుకు 13 మందిపై హత్యాయత్నం కేసునకిలీ మద్యం వ్యవహారంలో రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ పిలుపునివ్వడంతో పలాస నియోజకవర్గంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నేతృత్వంలో పార్టీ నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో కొంచెం పెనుగులాట జరిగింది. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరగ్గా మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఒకరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. నిరసనలో పాల్గొన్నందుకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆయన భార్యతోపాటు మరో 13 మందిపై పోలీసులను చంపడానికి ప్రయత్నం చేశారంటూ 307 కింద అక్రమంగా హత్యాయత్నం కేసు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. ఎక్కడ చూసినా అక్రమ కేసులే. విచారణ పేరుతో పదే పదే పిలిపించడం వంద ప్రశ్నలు రాసుకొచ్చి వాటికి సమాధానాలు చెప్పాలని వేధించడం పోలీసులు అలవాటుగా మార్చుకున్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సాక్షి మీడియాపై 17 అక్రమ కేసులునకిలీ లిక్కర్ గుట్టురట్టు చేయడమే నేరమన్నట్టు సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. విచారణ పేరుతో సాక్షి ఎడిటర్‌ను పిలిపించి గంటలకొద్దీ కూర్చోబెట్టి ఇబ్బంది పెడుతున్నారు. నకిలీ లిక్కర్ దందా వెలికితీసిన వ్వవహారంలో వార్తలు రాయడినికి దొరికిన సోర్స్ వివరాలు చెప్పాలని వేధిస్తున్నారు. సోర్స్ చెప్పే అవసరం లేని పత్రికా స్వేచ్ఛ ఉందని తెలిసీ, ఇది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని తెలిసీ పోలీసులు సాక్షి కార్యాలయాన్ని చుట్టుముట్టి వార్త ఎవరు రాశారు? ఎవరు ఎడిట్ చేశారు? వార్తకు సోర్స్ ఏంటి చెప్పాలంటూ వంద ప్రశ్నలు రాసుకొచ్చారు. వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయనే భయంతో సాక్షి ప్రసారాలు రాకుండా కేబుల్ ఆపరేటర్లను బెదిరిస్తున్నారు. ఏకంగా సాక్షిపై 17 కేసులు నమోదు చేశారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు. కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్రంలో శ్మశాన వాతావరణం సృష్టిస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు, జర్నలిస్టులు, వైఎస్సార్సీపీ నాయకుల మీద హత్యాయత్నం, హత్య కేసులు బనాయిస్తున్నారు. కోర్టు పదే పదే మొట్టికాయలేస్తున్నా లెక్కచేయకుండా కూటమి నాయకులకు ఊడిగం చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న ఇలాంటి పోలీసులంతా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. వారిని న్యాయస్థానాల్లో దోషులుగా నిలబెట్టడం ఖాయం. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేసే వారికి ఖచ్చితంగా బుద్ధి చెబుతాం’ అని హెచ్చరించారు,ఇదీ చదవండి: లేఖ రాశానని.. నా భర్తను అరెస్ట్ చేశారు: మేకతోటి అరుణ -
మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వాహనంపై టీడీపీ గూండాల దాడి
సాక్షి,కర్నూల్: కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వాహనంపై టీడీపీ గూండాలు దాడి చేశాయి. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు వెళ్తుండగా టీడీపీ గూండాలు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. టీడీపీ గూండాల దాడిలో వైఎస్సార్సీపీ ఎంపీపీ వాహనం ధ్వంసమైంది. వైఎస్సార్సీపీ నేతలు గ్రామంలోకి అడుగు పెట్టకూడదు అంటూ హుకుం జారీ చేశారు. గ్రామంలో రెచ్చిపోతూ స్థానికుల్ని టీడీపీ గూండాలు భయబ్రాంతులకు గురి చేశారు. -
హరీష్‌కు మంత్రి సీతక్క కౌంటర్
హైదరాబాద్: క్యాబినెట్లో రాద్దాంతం జరిగిందంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటరిచ్చారు. క్యాబినెట్లో రాద్దాంతం జరిగిందని హరీష్ నిరూపించగలరా? అంటూ సవాల్ విసిరారు. ‘ నిన్న క్యాబినెట్లో ఎలాంటి రాద్దాంతం జరగలేదు. క్యాబినెట్ ఎజెండా, ప్రజల సమస్యలు తప్పా ఇంకేమీ చర్చ జరగలేదు. జరగని విషయాలను జరిగిందని మాట్లాడి హరీష్ రావు దిగజారిపోయారు. హరీష్ రావు నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు. నిన్న వ్యక్తిగతంగా సీఎంతో మాట్లాడినపుడు కూడా ఇతర మంత్రుల మీద చర్చ చేయలేదు. రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం హరీష్ రావు. దండుపాళ్యం, దండుకున్న పాళ్యం బీఆర్ఎస్ పార్టీనే’ అని విమర్శించారు మంత్రి సీతక్క.ఇదీ కూడా చదవండి:‘రాష్ట్ర క్యాబినెట్ దండుపాళ్యం ముఠా మాదిరి తయారైంది’ -
దివ్యాంగులపై మానవత్వం లేదా బాబూ?: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కమిటీ, అన్ని జిల్లాల అధ్యక్షుల ఆత్మీయ సమావేశం జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి, దివ్యాంగుల విభాగం నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆయన ఏమన్నారంటే..దివ్యాంగులకు సంబంధించిన ప్రతి సమస్యపై వైఎస్ జగన్ క్షుణ్ణంగా తెలుసుకుంటూనే ఉన్నారు. వైఎస్ జగన్ హయాంలో నిస్సహాయులుగా ఉన్న వర్గాలకు, దివ్యాంగులకు సమాన హక్కులు కల్పించడం, అంతిమంగా దివ్యాంగులకు ఎలా లబ్ధిచేయాలని తపించారు. సాంకేతిక కారణాలతో దివ్యాంగులను ఇబ్బంది పెట్టకుండా, నిబంధనలు సరళీకృతం చేయాలని, అవసరమైన సవరణలు చేశారు. క్యాలెండర్ పెట్టుకుని జగనన్న పాలనలో ఏ నెలలో ఏం వస్తుందని సంక్షేమ లబ్ధిదారులకు హక్కుగా లభించేలా చేశారు...పాలన అంటే ఒక సార్ధకత దానిని నాడు వైఎస్సార్.. ఆ తర్వాత వైఎస్ జగన్ హయాంలో చూశారు. అసమానతలు తొలగించి రాజ్యాంగ స్పూర్తిని అమలు చేసింది వైఎస్ జగన్ పాలనలోనే. మానవత్వంతో పాలన సాగించడం అనేది చూశాం. వైఎస్సార్సీపీ అనేది ప్రజల్లో నుంచి వచ్చిన పార్టీ కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళుతుంది. వైఎస్ జగన్ పాలనకు పూర్తి వ్యతిరేకంగా చంద్రబాబు పాలన సాగుతుంది. ఏ రకంగా వడపోసి సంక్షేమ పథకాల లబ్ధిదారులను తగ్గించాలనేది చంద్రబాబు లక్ష్యం. చంద్రబాబు సంక్షేమం అంతా తన కోసం, అయిన వారికే తప్ప నిజమైన లబ్ధిదారులకు కాదు. ఎల్లో మీడియా, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు చంద్రబాబు చేతిలో ఉన్నాయి.ఊత కర్రల సాయంతో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. దివ్యాంగుల విషయంలో చంద్రబాబు రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సామాజిక భద్రత అనేది లేకపోతే పేద వర్గాలు ఏమవ్వాలి. దివ్యాంగులకు పింఛన్లు అవసరమా అనే చర్చ లేవనెత్తారు చంద్రబాబు. దానికి ఎల్లో మీడియా బాకా ఊదుతోంది. రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను వేధిస్తున్నారు. వికలాంగుల విషయంలో జగన్ ఏనాడు పార్టీలు చూడలేదు. వారికి ఎలా చేయూత ఇవ్వాలి, వారు ఆత్మగౌరవంతో ఎలా బతకాలి అని ఆలోచించారు. వైఎస్ జగన్ పాలన ఈ ఐదేళ్ళు కొనసాగి ఉంటే ఒక కొత్త జనరేషన్ తయారయ్యేది. ఒక మంచి వ్యవస్థలను జగన్ రూపొందిస్తే.. చంద్రబాబు దానిని కుప్పకూల్చారు.వైఎస్ జగన్ పాలనలో నాడు-నేడు పేరుతో స్కూల్స్ అభివృద్ధి జరిగితే ఇప్పుడు ఏం జరుగుతుంది. కురుపాం, తురకపాలెం ఘటనలే ఇందుకు నిదర్శనం. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదా.? ప్రభుత్వం దృష్టికి ఇవి రాలేదా..? ఇవి వైఫల్యాలు కావా..? పాలన అనేది ఒక యజ్ఞంలా వైఎస్ జగన్ భావించారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాల డెలివరీ పెడితే చంద్రబాబు లిక్కర్ షాప్‌లు, బెల్ట్ షాపులు పెట్టి లిక్కర్ డెలివరీ చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను కూడా రెడ్ బుక్ పేరుతో నాశనం చేశారు. మళ్ళీ అధికారం రాదని తెలిసి చంద్రబాబు ఆయన కుమారుడు బరితెగించి వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఒక బలీయమైన శక్తిగా రూపొందింది. అందుకు ఉదాహరణే జగన్ పర్యటనలకు వస్తున్న లక్షలాది మంది జనమే. కోటి సంతకాల సేకరణలో మీ విభాగం కూడా సమన్వయంతో పనిచేయాలి. మీ పరిధిలో ఉన్నంత మేరకు వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషిచేయండి.కూటమి సర్కార్ దివ్యాంగులను మోసగించింది: మేరుగ నాగార్జునదేశ చరిత్ర లోనే దివ్యాంగులకు భరోసా, ఆత్మస్ధైర్యం కల్పించింది జగనన్న పాలనలోనే. ఏపీలో కూటమి ప్రభుత్వం దివ్వాంగులను మోసగించింది. వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను ఆసుపత్రుల చుట్టు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు. పెన్షన్ల రీవెరిఫికేషన్ పేరుతో వారికి నరకయాతన చూపుతున్నారు. చంద్రబాబు ఇదేనా మానవత్వం. చంద్రబాబు దివ్యాంగుల పట్ల నువ్వు చేస్తున్నది మోసం, దగా కాదా అని ప్రశ్నిస్తున్నాం.దివ్యాంగులకు ఇచ్చిన హామీ ఏంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి?: పులిపాటి దుర్గారెడ్డిచంద్రబాబు దివ్యాంగులను నిలువునా మోసం చేశారు. దివ్యాంగుల పెన్షన్లలో కోతలు, ఆంక్షలతో వేధిస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు నువ్వు దివ్యాంగులకు ఇచ్చిన హామీ ఏంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి. లక్షల మంది దివ్యాంగలకు నోటీసులు ఇచ్చి మా దివ్యాంగులను దొంగలుగా చిత్రీకరిస్తున్నావు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశావ్. జగన్ హయాంలో తలెత్తుకు తిరిగిన మేమంతా ఇప్పుడు ఆత్మాభిమానం దెబ్బతిని బతుకీడుస్తున్నాం. అనేకమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం మీకు సమంజసమా అని నిలదీస్తున్నాం. -
‘రాష్ట్ర క్యాబినెట్ దండుపాళ్యం ముఠా మాదిరి తయారైంది’
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. మంత్రులు వారి పంచాయితీలు చెప్పుకోవడానికే క్యాబినేట్ మీటింగ్‌లు పెడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం (అక్టోబర్ 17) తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. హరీష్ మాట్లాడుతూ.. ‘మంత్రులు గ్రూపులుగా విడిపోయారు. దంళుపాళ్యం ముఠాకంటే అధ్వాన్నంగా మారింది. మంత్రుల పంచాయితీ చెప్పుకోవడానికే క్యాబినెట్ మీటింగ్. కేసీఆర్ ఢిల్లీలో తిరిగి లోకల్ రిజర్వేషన్ల వాటా, నీళ్ల వాటాను సాధించారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి కమీషన్లు.కాంట్రాక్టుల వాటాల కోసం కొట్లాడుతున్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్నారు. రేవంత్‌రెడ్డి పాలనతో అతితక్కువ ఇండస్ట్రీలు వచ్చాయి. టీఎస్ ఐపాస్ ఏర్పడిన తర్వాత పరిశ్రమల రాక సంఖ్య పెరిగింది.మా హయాంలో పారిశ్రామిక వేత్తలకు ప్రాధాన్యాత ఇచ్చాం. మీరు వ్యాపార వేత్తలకు తుపాకులు గురి పెడుతున్నారు. గన్ కల్చర్ తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మంత్రిగా టీమిండియా క్రికెటర్ భార్య ప్రమాణ స్వీకారం
టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా సోలంకి జడేజా (Rivaba Solanki Jadeja) రాజకీయ జీవితంలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. గుజరాత్ రాష్ట్ర మంత్రిగా ఆమె శుక్రవారం (అక్టోబరు 17) ప్రమాణ స్వీకారం చేశారు. కాగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మంత్రులంతా గురువారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టగా.. రివాబా జడేజా తాజాగా మంత్రి అయ్యారు.జడేజాతో ప్రేమ, పెళ్లిరివాబా సింగ్ సోలంకి 1990, నవంబరు 2న జన్మించారు. తండ్రి హర్దేవ్ సింగ్ సోలంకి బిజినెస్‌మ్యాన్ కాగా.. తల్లి ప్రఫుల్లాబా సోలంకి భారత రైల్వేస్‌లో ఉద్యోగిని. రాజ్‌కోట్‌లో ఉన్నత విద్యనభ్యసించిన రివాబా.. మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు.రవీంద్ర జడేజా సోదరి నైనాబాకు రివాబా ఫ్రెండ్. ఓ పార్టీలో నైనా.. తన సోదరుడు రవీంద్ర జడేజాకు రివాబాను పరిచయం చేశారు. అలా జడ్డు- రివాబాల మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఇరుకుటుంబాల సమ్మతితో 2016లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఆ మరుసటి ఏడాదే అంటే.. 2017లో రివాబా- జడ్డూ దంపతులకు కూతురు నిధ్యానా జన్మించింది.సామాజిక సేవపెళ్లికి ముందు నుంచే రివాబా తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకున్నారు. రాజ్‌పుత్‌లకు చెందిన కర్ణి సేన మహిళా విభాగానికి ఆమె అధ్యక్షురాలిగా పనిచేశారు. ఈ క్రమంలో 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు రివాబా బీజేపీలో చేరారు.ఈ క్రమంలో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రివాబా ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాతృశక్తి అనే చారిటబుల్ ట్రస్టు ద్వారా మహిళా సాధికారికత, సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలా జడ్డూ భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న రివాబా.. చిన్న వయసులోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.టీమిండియా అత్యుత్తమ ఆల్రౌండర్సౌరాష్ట్ర స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 2009లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 87 టెస్టులు, 204 వన్డేలు, 74 టీ20 మ్యాచ్‌లు ఆడిన జడ్డూ.. ఆయా ఫార్మాట్లలో 3990, 2806, 515 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఖాతాలో 338 టెస్టు వికెట్లు, 231 వన్డే వికెట్లు, 54 టీ20 వికెట్లు ఉన్నాయి. ఇక భార్య రివాబాతో కలిసి జడ్డూ సైతం గతంలోనే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.చదవండి: అఫ్గాన్ చేతిలో వైట్ వాష్.. బంగ్లాదేశ్ క్రికెటర్ల వాహనాలపై దాడి! -
గుజరాత్లో నూతన మంత్రివర్గం కొలువు దీరింది
గాంధీనగర్: గుజరాత్లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగతా మంత్రులంతా రాజీనామా చేయడంతో శుక్రవారం నూతన క్యాబినెట్ ఏర్పాటు అయింది.ఈ సందర్భంగా 25 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా కూడా ఉన్నారు. ఈ పునర్వ్యవస్థీకరణలో గుజరాత్ హోంమంత్రి నేత హర్ష్ రమేష్‌భాయ్ సంఘవీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని లక్షకు పైగా ఓట్లతో ఓడించి ఘన విజయం సాధించారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ కొనసాగుతున్నారు.కమలం అధిష్టానం క్యాబినెట్లో సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యం ఇచ్చింది. 7 మంది పాటిదార్లు, 8 మంది ఓబీసీలు, 3 మంది ఎస్సీలు, 4 మంది ఎస్టీలు, 3 మంది మహిళా నేతలు ఉన్నారు. కొత్త క్యాబినెట్లో ఎక్కువ మంది కొత్తవారికే అవకాశం లభించింది. గత క్యాబినెట్లో ఉన్న మంత్రుల్లో కేవలం ఆరుగురు మాత్రమే తిరిగి పదవులు చేపట్టారు. #WATCH | BJP MLA Rivaba Jadeja takes oath as Gujarat Cabinet minister in Gandhinagar pic.twitter.com/mJzv53J2C0— ANI (@ANI) October 17, 2025 -
లేఖ రాశానని.. నా భర్తను అరెస్ట్ చేశారు: మేకతోటి అరుణ
సాక్షి, తాడేపల్లి: మంగళగిరి నియోజకవర్గంలో బెల్ట్‌షాప్‌లపై మంత్రి నారా లోకేష్‌ను ప్రశ్నిస్తూ ఒక జెడ్పీటీసీగా లేఖ రాయడాన్ని జీర్ణించుకోలేక తన భర్త వీరయ్యపై పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులో అర్ధరాత్రి దౌర్జన్యంగా లాక్కెళ్ళారని దుగ్గిరాల జెడ్పీటీసీ మేకతోటి అరుణ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరి వైఎస్సార్సీపీ ఇంచార్జి దొంతిరెడ్డి వేమారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. దళితులమైన తమపై మంత్రి నారా లోకేష్ కక్షపూరితంగానే అక్రమ కేసులు బనాయించి, తన నియోజకవర్గంలో ప్రశ్నించే గొంతు ఉండకూడదనే నిరంకుశత్వంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజల పక్షాన నిలబడతామని, నారా లోకేష్ ఎన్ని అక్రమ కేసులు పెట్టించినా భయపడేదే లేదని మేకతోటి అరుణ స్పష్టం చేశారు. తాను చేస్తున్న తప్పులకు నారా లోకేష్ భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. ఈనెల పదో తేదీన దుగ్గిరాల మండల సర్వసభ్య సమావేశంలో బెల్ట్‌షాప్‌లపై బాధ్యత కలిగిన ఒక జెడ్పీటీసీ సభ్యురాలుగా అధికారులను ప్రశ్నించాను. మా మండలంలో ప్రతి వీధిలోనూ బెల్ట్‌షాప్‌లను ఏర్పాటు చేసి, మద్యాన్ని విచ్చలవిడిగా నడిపిస్తున్నారు. దీనిపై ఎక్కడికి వెళ్ళినా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకురావాలని కోరుతున్నారు. ఇదే అంశాన్ని సర్వసభ్య సమావేశంలో నేను ప్రస్తావించాను.ఈ సమావేశానికి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ హాజరు కాలేదు. అందువల్ల ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెడుతూ లేఖ రాశాను. (ఈ సందర్బంగా ఆ లేఖ ప్రతిని వీడియాకు ప్రదర్శించారు) ఈ లేఖను ఎండీఓకు అందచేయడం ద్వారా దానిని మంత్రివర్యులకు పంపాలని కోరాను. మండలంలో కూల్ డ్రింక్ షాప్‌లు, కంటైనర్లలో బెల్ట్‌షాప్ లను నిర్వహిస్తూ, ప్రజలకు మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయిస్తూ, వారిని ఆరోగ్యపరంగా, ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని ఫోటోలతో సహా ఆ లేఖకు జత చేసి ఎండీఓకు అందచేశాను.ఆ రోజు నేను మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏం మాట్లాడానో దానికి సంబంధించిన వీడియోను కూడా ఈ సందర్బంగా ప్రదర్శిస్తున్నాను. (ఎంపీపీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు). ఈ సమావేశంలో కేవలం మద్యం, బెల్ట్‌షాప్‌ల గురించి, అధిక ధరలకు జరుగుతున్న మద్యం విక్రయాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మాత్రమే మాట్లాడానే తప్ప ఎవరినీ విమర్శించలేదు. అయినా కూడా దీనిని తట్టుకోలేని స్థితిలో మంత్రి నారా లోకేష్ ఉన్నారు. ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంది. దీనిని బయటపెట్టినందుకు నా భర్త దాసరి వీరయ్యను ఎక్కడో జరిగిన హత్యకేసులో నిందితుడిగా కేసులు బనాయించి, అర్థరాత్రి దౌర్జన్యంగా అదుపులోకి తీసుకున్నారు.నారా లోకేష్ అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారుకూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో దళితులపై తప్పుడు కేసులు, అరాచకాలు, దాష్టీకాలు పెరిగిపోయాయి. ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ఏడాది జూన్ 4న తుమ్మపూడిలో జరిగిన హత్యకేసులో కూడా నా భర్త వీరయ్యను ఇరికించారు. మంత్రి నారా లోకేష్ కావాలనే మాపైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా దానికి నా భర్తనే లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఐజీ నా భర్తపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. నారా లోకేష్ దళితులమైన మాపైన ఎన్ని కేసులు పెట్టినా, వేధించినా భయపడేదే లేదు.వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజల పక్షాన గళం విప్పకుండా మమ్మల్ని అడ్డుకోలేరు. గత ప్రభుత్వంలో అవినీతి కేసులో చంద్రబాబును అరెస్ట్ చేస్తే, అది అక్రమ కేసు అంటూ ఇదే నారా లోకేష్ మాట్లాడారు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటీ? వైఎస్సార్సీపీలో ఉన్న దళిత నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించడం లేదా? కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో బుద్ది చెబుతారని అరుణ స్పష్టం చేశారు.వీరయ్య పట్ల దౌర్జన్యంగా వ్యవహరించిన పోలీసులు: దొంతిరెడ్డి వేమారెడ్డివీరయ్యను కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురి చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? పోలీస్ రాజ్యంలో జీవిస్తున్నామా? అనే సందేహం కలుగుతోంది. తప్పుడ చేస్తే చట్టప్రకారం అరెస్ట్ చేయవచ్చు. కానీ పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తుంటే, వైఎస్సార్సీపీలో ఆయన నాయకుడిగా కొనసాగుతున్నందున కక్షసాధింపుతో కావాలనే ఒక భయోత్పాతాన్ని సృష్టించేలా ఆయనను అరెస్ట్ చేశారు.అర్ధరాత్రి తన కుటుంబంతో నిద్రిస్తున్న సమయంలో, ఆయనను పెద్ద సంఖ్యలో వచ్చిన పోలీసులు హంగామాతో బలవంతంగా ఈడ్చుకుంటూ తమతో తీసుకువెళ్ళిన ఘటన అభ్యంతరకరం. ఆయన సంతానంలో దివ్యాంగురాలైన కుమార్తె కూడా ఉంది. జరుగుతున్న ఈ తతంగంతో ఆమె భీతావాహం అయ్యింది. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందా? లోకేష్ రాసుకున్న రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు అవుతోందా? అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, వైయస్ఆర్సీపీ నేతలను భయపెట్టాలనుకోవడం వారి అవివేకమని వేమారెడ్డి హెచ్చరించారు. -
ఎల్లో మీడియాకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి సవాల్
సాక్షి, కర్నూలు జిల్లా: ఎల్లో మీడియాకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి సవాల్ విసిరారు. ప్రధాని మోదీ పర్యటనలో వైఎస్సార్సీపీ నేతలు కలవలేదని అసత్య ప్రచారం చేసిన ఎల్లో మీడియాకు ఆయన కౌంటర్ ఇచ్చారు. మేం ఫేక్ ఎమ్మెల్యేలం కాదు.. ఎల్లో మీడియా ఫేక్ అంటూ విరూపాక్షి మండిపడ్డారు. మేం వినతి పత్రం ఇవ్వలేదని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. నిరూపించకపోతే ఈటీవీ, ఏబీఎన్ మూసేస్తారా? అంటూ విరూపాక్షి ఛాలెంజ్ విసిరారు.వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వమే చేపట్టాలని.. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తుంటే దాన్ని పచ్చ మీడియా తప్పుదోవ పట్టిస్తుందంటూ విరూపాక్షి దుయ్యబట్టారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధాని మోదీకి వినతి పత్రం ఇస్తే జీర్ణించుకోలేక పోయారంటూ ఎల్లో మీడియాపై ఆయన మండిపడ్డారు.కాగా, మెడికల్ కళాశాలలను ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గురువారం(అక్టోబర్ 16, గురువారం) కర్నూలుకు వచ్చిన మోదీని ఓర్వకల్లు విమానాశ్రయంలో జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి కలిసి పలు అంశాలపై వినతి పత్రాన్ని అందించారు.అనంతరం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డితో కలిసి వినతిపత్రంలో పేర్కొన్న అంశాలను మీడియాకు వివరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వ సహకారంతో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారన్నారు. 2023–24 విద్యా సంవత్సరం నుంచి 5 మెడికల్ కళాశాలలు కూడా ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు.ఈ కళాశాలల నిర్వహణను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పీపీపీ తరహాలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు అప్పగించడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. జిల్లాలో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు అధిక నిధులు విడుదల చేసేలా నీతి ఆయోగ్‌కు సూచనలు ఇవ్వాలని కోరామన్నారు. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని నంద్యాల వరకు నిరి్మంచనున్న 167కే జాతీయ రహదారి మధ్యలో కొల్హాపూర్ సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణా నదిపై వైర్ కమ్ రోడ్ వంతెనగా మార్చాలని కోరామన్నారు. 2019లో ఇచ్చిన హామీ మేరకు వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని కోరామన్నారు. -
నన్ను కలవొద్దని ఈ కుటుంబాన్ని బెదిరించారు: రాహుల్ గాంధీ
ఉత్తర ప్రదేశ్ రాయ్‌బరేలీలో గాంధీ జయంతి నాడు దొంగ అనే అనుమానంతో హరీఓం వాల్మీకి అనే దళితుడ్ని కొందరు కొట్టి చంపారు. ఈ ఘటన అక్కడ తీవ్ర దుమారం రేపింది. శుక్రవారం ఫతేపూర్‌లో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యూపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనను కలవొద్దని ఈ ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని బెదిరించిందని.. అది కుదరకపోవడంతో ఫేక్ ప్రచారానికి దిగిందని మండిపడ్డారాయన. దేశంలో దళితులపై దాడులు, హత్యలు, అఘాయిత్యాలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ కుటుంబం ఎలాంటి నేరం చేయలేదు. ఇది ఒక బాధిత కుటుంబం. కానీ వీళ్లేదో నేరస్తులన్నట్లు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. నన్ను కలవొద్దని వీళ్లను పోలీసులు బెదిరించారు. వీళ్లను కనీసం ఇంట్లో నుంచి బయటకు రానివ్వడం లేదు. హరీఓం కుమార్తెకు శస్త్రచికిత్స అవసరం. వీళ్ల ఆంక్షలతో ఆమెకు కనీస వైద్యసేవలు అందడం లేదు. చర్యలు తీసుకోవాల్సింది నేరస్తుల మీద. వీళ్ల మీద కాదు. నేరస్తుల రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది అని యోగి సర్కార్‌పై మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో రాజకీయ దుమారం రేగింది. మాకు మీ పరామర్శ అక్కర్లేదు.. ప్రభుత్వం తగినంత సాయం చేసింది అనే పోస్టర్లు అక్కడ వెలిశాయి. అయితే.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పోస్టర్లను చించేయగా.. బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇంకోవైపు.. హరీఓం సోదరుడు, ఆ కుటుంబం పేరిట కొన్ని వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యింది. मृतक हरिओम वाल्मीकि के भाई ने Rahul Gandhi को Expose कर दिया।शर्मा आनी चाहिए कांग्रेस को।pic.twitter.com/UnKZrN1Tlf— Unfileterd Rencho (@UnfileterdR) October 17, 2025రాష్ట్ర మంత్రులు మా ఇంటికి వచ్చి పరామర్శించారు. మా సోదరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చారు. నేరస్తులు జైల్లో ఉన్నారు. ప్రభుత్వ చర్యలతో మేం సంతృప్తిగానే ఉన్నాం. రాహుల్ గాంధీ సహా నేతలెవరూ మా ఇంటి వైపు రావొద్దు అంటూ ఆయన చెప్పడం అందులో ఉంది. పైగా బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయానే వాటిని పోస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ వీడియోలపై మీడియా నుంచి రాహుల్ గాంధీకి ప్రశ్న ఎదురైంది.ఇంతకు మించి దిగజారదు అనుకున్న ప్రతీసారి బీజేపీ ఇలానే చేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. అది బలవంతంగా తీయించిన వీడియో అని, ఆ వీడియోను మోదీ అనుకూల మీడియా(Godi Media), బీజేపీ విపరీతంగా ప్రచారం చేస్తున్నాయని అన్నారాయన. అయితే కాసేపటికే రాహుల్‌ను కలవడం సంతోషంగా ఉందంటూ మరో వీడియో ఆ కుటుంబం పేరిట బయటకు రావడం గమనార్హం.Whenever you think that BJP can’t stoop lower than this, they set a new parameter. Hariom Valamiki family told Rahul Gandhi Ji that they were threatened by the BJP govt to not meet him and they were forced to say this on camera. That video was made viral by Godi media and BJP. pic.twitter.com/q42JsYrBxc— Shantanu (@shaandelhite) October 17, 2025అక్టోబర్ 2వ తేదీన జమునాపూర్ వద్ద హరీఓం వాల్మీని దొంగగా అనుమానించి కొందరు కొట్టి చంపారు. ఈ ఘటన యూపీ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. విమర్శల నేపథ్యంలో కేసు విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయించింది యోగి ప్రభుత్వం. అక్టోబర్ 11వ తేదీన బాధిత కుటుంబాన్ని యోగి పరామర్శించారు. ఆ కుటుంబం కార్చిన ప్రతీ కన్నీటి బొట్టుకు ప్రభుత్వం సమాధానం చెబుతుందని ఆ సమయంలో భరోసా ఇచ్చారాయన. అంతేకాదు.. హరీఓం సోదరికి కాంట్రాక్ట్ బేస్ మీద స్టాఫ్ నర్స్‌గా ఉద్యోగం ఇప్పించారు. राहुल गांधी जी आज हमसे मिलने आए। वे हमारे लिए मसीहा हैं, हम चाहते हैं कि वे हमें न्याय दिलाएं। - हरिओम वाल्मिकी जी का परिवारअब बिलकुल चुप रह तू ।pic.twitter.com/wr7DkBZW5Y— Surbhi (@SurrbhiM) October 17, 2025ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిని అక్టోబర్ 10న ఎన్కౌంటర్లో పట్టుబడ్డాడు. ఇప్పటిదాకా 14 మందిని పోలీసులు ఇప్పటిదాకా అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి విమర్శల నేపథ్యంలో.. ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. జాతి కోణంలో ఈ ఘటనను చూడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా.. సోషల్ మీడియాలో చర్చ మాత్రం ఆగడం లేదు. -
చంద్రబాబుకు పేర్ని నాని సవాల్..
సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం కేసులో జనం నవ్వుతారనే సిగ్గు ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు లేదంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే పోలీసులు జనార్థన్‌తో వీడియో చేయించారని ఆరోపించారు. ఇదే సమయంలో చంద్రబాబుకు సవాల్ విసిరారు. బార్లలో జరుగుతున్న అవినీతిని బయట పెట్టే దమ్ముందా? అని ప్రశ్నించారు. బార్లలో విక్రయించే మద్యం ఎక్కడిదో లెక్క తేల్చేందుకు ఎల్లో మీడియా సైతం సిద్దమా అని సవాల్ చేశారు. ఇక, బార్లలో నెలకు రూ.5 కోట్లు భారీ అవినీతి జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నకిలీ మద్యాన్ని కవర్ చేయడం తెలియక ఎల్లో మీడియా చచ్చిపోతుంది. ఈనాడులో నకిలీ మద్యం మీద వార్తలే లేవు!. నకిలీ మద్యంపై ఆంధ్రజ్యోతి వార్తలు జుగుప్సాకరంగా ఉన్నాయి. జనం నవ్వుతారనే సిగ్గు ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు లేదు. జనార్థన్, సురేంద్ర నాయుడు, జయచంద్రారెడ్డికి రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వలేదు. నకలీ మద్యం కేసులో ఏ1 జనార్థన్ పెళ్లికి వచ్చినట్టు గన్నవరంలో దిగాడు. జనార్థన్‌తో కూటమి ప్రభుత్వ పెద్దలు మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలాడారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో పోలీసులు జనార్థన్‌తో వీడియో చేయించారు.అన్ని వైన్ షాపులకు పర్మిట్ రూమ్‌లు.. కూటమి ప్రభుత్వం వచ్చాక క్యూఆర్ కోడ్ ఎందుకు రద్దు చేశారు. నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముకోవడానికే క్యూఆర్ కోడ్ ఎత్తేశారు. మళ్లీ ఏడాదిన్నర తర్వాత క్యూఆర్ కోడ్ ఎందుకు తెచ్చారు?. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందానా.. క్యూఆర్ కోడ్ రాగం ఎత్తుకున్నారు. నకిలీ మద్యం వ్యవహారం చేయిదాటి పోతుందనే క్యూ ఆర్ కోడ్ తెచ్చారు. క్యూ ఆర్ కోడ్‌పై కూటమి నేతలు డ్రామాలు మానుకోవాలి. రాష్ట్రంలో పర్మిట్ రూమ్లేని షాపులు ఉన్నాయా?. పట్టణాల్లో పర్మిట్ రూమ్‌కు రూ.7.5లక్షలు, గ్రామాల్లో 5 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు. అన్ని వైన్ షాపులకు పర్మిట్ రూమ్‌లు పెట్టారు. ఏపీలో 3736 మద్యం దుకాణాలు ఉంటే 3736 పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. నకిలీ మద్యంతో ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోంది. రాష్ట్రంలో లక్షా 50వేలకు పైగా బెల్టు షాపులు ఉన్నాయి. బెల్టు షాపులు ఏర్పాటు చేసింది నకిలీ మద్యం విచ్చలవిడిగా అమ్ముకోవడానికే కదా.నగదుకే మందు ఎందుకు?..రూ.99 మందును రెండు నెలలకే అటక ఎందుకెక్కించారు?. రూ.99కే మందు దొరికితే నకిలీ మద్యం అమ్ముకోవడం కుదరదు కాబట్టే ఆపేశారు. కూటమి ప్రభుత్వంలో పది శాతం కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు. వైన్ షాపుల్లో 25 శాతం డిజిటల్ పేమెంట్స్ అంటే చంద్రబాబు ఎలా నమ్ముతున్నారు?. నగదుకే మందు ఎందుకు అమ్ముతున్నారో ప్రజలకు తెలియదా?. జనార్థన్ ఫ్యాక్టరీలో మందు నకిలీయే కానీ.. ప్రమాదం కాదట!. నకిలీ మద్యం అయినా తాగేయమని అధికారులు, ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు’ అంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు సవాల్చంద్రబాబు.. బార్లలో జరుగుతున్న అవినీతిని బయట పెట్టే దమ్ముందా?. నెలకు రూ.5 కోట్లు దండుకుని బార్లలో పెద్ద ఎత్తున స్కాం చేస్తున్నారు. ప్రభుత్వ డిపోల నుండి కాకుండా బయటి నుండి పెద్ద ఎత్తున సరుకు తెచ్చి విక్రయిస్తున్నారు. ఆ మద్యం విక్రయాల కోసం నెలకు రూ.5 కోట్లు లంచాల కింద వసూలు చేస్తున్నారు. ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?. చంద్రబాబుకు దమ్ముంటే బార్లలో తనిఖీలు చేసేందుకు రాగలరా?. బార్లలో విక్రయించే మద్యం ఎక్కడిదో లెక్క తేల్చేందుకు ఎల్లోమీడియా, రాజకీయ పార్టీల సమక్షంలో మేము సిద్దం. మా హయాంలో ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు?. నకిలీ మద్యంపై ఎందుకు మాట్లాడటం లేదు?. మద్యం సీసాల మీద క్యూఆర్ కోడ్ పెట్టామని ప్రెస్ మీట్ పెట్టేంత ఖాళీగా చంద్రబాబు ఉన్నారు. రోజుకు రూ.3 లక్షల బిజినెస్ చేయకపోతే బార్లకు నష్టం వస్తుంది. విజయవాడ, తిరుపతి, కర్నూలు, గుంటూరు లాంటి నగరాల్లో నెలకి రూ.80 లక్షల సరుకు ప్రభుత్వం దగ్గర కొనాలి. ఈ మేరకు ఆ షాపులు కొనుగోలు చేస్తున్నాయా?. ప్రభుత్వానికి చాలెంజ్ చేస్తున్నా.. ఆ వివరాలు బయట పెట్టగలరా?.కరకట్టకే డబ్బంతా..డబ్బంతా కరకట్ట బంగ్లాలోకి వెళ్తోందా? విమానాల్లో హైదరాబాద్ వెళ్తుందో చెప్పాలి. నకిలీ మద్యం తాగినా జనం చనిపోరని ఎల్లోమీడియా రాసింది. అంటే నకిలీ మద్యం తాగొచ్చని ప్రభుత్వమే స్టాంప్ వేసినట్టు కాదా?. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా?. రేపోమాపో జయచంద్రారెడ్డిపై సస్పెన్షన్ ఎత్తేస్తారు. జనార్థన్కి బెయిల్ ఇప్పించి బయటకు తెస్తారు. నకిలీ మద్యం తయారు చేసిన జయచంద్రారెడ్డి, జనార్ధన్, సురేంద్ర నాయుడు ఫోన్లను అధికారులు ఎందుకు సీజ్ చేయలేదు?. ఏ సంబంధం లేని జోగి రమేష్ ఫోన్లను ఎందుకు సీజ్ చేశారు?. అన్ని వర్గాల ప్రజలను పథకాల పేరుతో చంద్రబాబు నిలువునా మోసం చేశారు. పిఠాపురం వర్మ నుండి తాగుబోతుల వరకు ఇలా అందరినీ మోసం చేశారు. మద్యం షాపుల ఓనర్లను కూడా చంద్రబాబు మోసం చేశారు. ఈ విషయం వచ్చే సెప్టెంబరు నాటికి తెలుస్తుంది. -
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ చర్చించి చెప్పాలని హైకోర్టు పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు కాగా.. స్థానిక సంస్థల ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నెల 9 న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేయగా.. నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేయడానికి సవాలు చేస్తూ సురేందర్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. నిన్న సుప్రీం కోర్టు కూడా ఎన్నికలకు వెళ్లమని చెప్పింది కదా అంటూ వ్యాఖ్యానించింది. ఎన్నికలు పెట్టుకోవచ్చని ఓరల్‌గా మాత్రమే చెప్పిందని.. ఆర్డర్లో ఎక్కడా చెప్పలేదని ఎలక్షన్ కమిషన్ తరఫు న్యాయవాది అన్నారు.నిన్ననే(అక్టోబర్ 16, గురువారం) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని కోర్టుకు తెలిపారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టే దాన్ని సస్పెండ్ చేశాం. ఫ్రెష్ గా రిజర్వేషన్ లను గూర్చి ప్రభుత్వంతో చర్చించాకే రీ నోటిఫికేషన్ ఉంటుంది. రెండు వారాల సమయం కావాలంటూ కోర్టును స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో తదుపరి విచారణ రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. -
చారాణా కోడికి బారాణా మసాలా
ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయుడికి మించిన బ్రాండే లేదంటారు ఆయన కుమారుడు, టీడీపీ నేతలు. బాగానే ఉంది కానీ.. ఈ బ్రాండ్ విలువ కాస్తా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరింత పేదలను చేస్తేనే వస్తుంది తంటా. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్ వివరాలు తెలిస్తే ఎవరైనా ఇదే మాట అంటారు. కేవలం రెండు వందల మందికి ఉద్యోగాలిచ్చే ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎకాఎకిన రూ.22 వేల కోట్ల రాయితీలు కల్పిస్తోంది మరి. చారాణా కోడికి బారా అణా మసాలా అన్నమాట!ఇంతటి భారీ రాయితీల వల్ల ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి చితికిపోతుందని కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే ఇప్పటికే విస్పష్టంగా చెప్పేశారు కూడా. కానీ యథావిధిగా ఏపీ మంత్రివర్యులు లోకేశ్ ఆ మాటలను ఖండించేశారు. కడుపుమంట అన్నట్టుగానూ మాట్లాడారు. ఇలా కాకుండా భారీ రాయితీలతో ఆర్థిక నష్టం ఉండదన్న విషయాన్ని వివరించి ఉంటే బాగుండేదేమో. ఐటీ ఉద్యోగాల కోసం రాష్ట్ర యువత బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు భారీ ఎత్తున వెళుతున్న నేపథ్యంలో ఆచితూచి మాట్లాడటం మంచిదన్నది పలువురి అభిప్రాయం.గూగుల్ డేటా సెంటర్ విషయానికి వస్తే.. కొన్ని రోజుల క్రితం ఎల్లో మీడియా దీనిపై పతాక శీర్షికల్లో కథనాలు ప్రచురించింది. రైడెన్ ఇన్ఫోటెక్ రూ.87 వేల కోట్ల పెట్టుబడులతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదించిందని, దీంతో రాష్ట్ర సాఫ్ట్వేర్ రంగం గతి మారిపోతుందన్నది దీని సారాంశం. దీంతోపాటే మరుసటి రోజు ఈనాడులో ఇంకో కథనం కూడా ప్రచురితమైంది. డేటా సెంటర్ ఏర్పాటకు గాన ప్రభుత్వం ఇస్తున్న రాయితీల మొత్తం రూ.22 వేల కోట్లు అని! కేబినెట్ ఆమోదం రోజున వెల్లడైన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టుతో వచ్చే ఉద్యోగాల సంఖ్య 200 మాత్రమే.పెట్టుబడి మొత్తం ఒక్కో కోటికి ఒక ఉద్యోగాన్ని ఇవ్వవచ్చునన్నది సాధారణ అంచనా. ఈ లెక్కన డేటా సెంటర్‌తో 87 వేల ఉద్యోగాల సృష్టి జరగాలి. పరోక్షంగా ఉపాధి పొందేవారు దీనికి అదనం. కానీ ఇవేవీ జరుగుతున్నట్లు లేదు. అటు సీఎం చంద్రబాబు, ఇటు రైడెన్ సంస్థ ప్రతినిధులు కానీ ఉద్యోగాల సంఖ్య విషయంలో పెదవి విప్పలేదు. ప్రభుత్వ జీవోలోనూ స్పష్టత లేదు. ఈ విషయాన్ని కవర్ చేసుకునేందుకా అన్నట్టు ఎల్లోమీడియా తరువాతి రోజుల్లో ఈ ప్రాజెక్టు ద్వారా రెండు లక్షల మంది వరకూ ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తాయని కాకిలెక్కలు కొన్ని ప్రచురించింది. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఉద్యోగుల సంఖ్య 1.87 లక్షలైతే.. కొత్తగా ఏర్పాటయ్యే ఒక డేటా సెంటర్లోనే అంతమొత్తంలో ఉద్యోగాలు ఎలా వస్తాయన్నది ప్రశ్న!ఎల్లో మీడియా బొంకులు అక్కడితో ఆగాయా? ఊహూ లేదు. డేటా సెంటర్ పెట్టుబడులన్నీ గూగుల్ పెడుతున్నట్టుగా రాశారు. వాస్తవానికి గూగుల్ అనుబంధం సంస్థ రైడెన్, అదానీ గ్రూపులు కలిసి ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఎయిర్టెల్ కూడా భాగస్వామి అని తెలుస్తోంది. అయితే జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అదానీ ఏర్పాటు చేయతలపెట్టిన డేటా సెంటర్ కోసం 150 ఎకరాల భూమి కేటాయించారు. సీఎంగా ఆయన శంకుస్థాపన కూడా చేశారు.డేటా సెంటర్‌తోపాటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని, 25 వేల ఉద్యోగాలు కల్పించాలన్న షరతులతో అదానీకి స్థలం కేటాయించడం గమనార్హం. ఈ ఏర్పాట్లు కొనసాగుతున్న సమయంలోనే అదాని కంపెనీకి రైడెన్, ఎయిర్‌టెల్‌లు తోడయ్యాయి. నెదర్లాండ్స్, డెన్మార్క్, ఐర్లాండ్ వంటి దేశాలు డేటా సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనను తిరస్కరించిన తరువాతే రైడెన్ అదానీ కంపెనీతో జత కట్టడం గమనార్హం. ఈ డేటా సెంటర్లకు కావాల్సిన భారీ విద్యుత్తు, నీటి అవసరాలను తీర్చలేకపోవడం, డేటా సెంటర్లతో వచ్చే కాలుష్య సమస్యపై ప్రజలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.ఎక్కడైనా పరిశ్రమ వస్తే ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగం ఉండాలి. ప్రభుత్వానికి ఆదాయం సమకూరాలి. కాని చంద్రబాబు ఇచ్చిన రాయితీలను పరిగణనలోకి తీసుకుంటే మరో పది నుంచి ఇరవై ఏళ్ల వరకు ప్రభుత్వానికి అదనపు ఖర్చే మినహా పైసా ఆదాయం ఉండదని స్పష్టమవుతోంది. లక్షల కోట్ల టర్నోవర్, వేల కోట్ల పెట్టుబడులు పెట్టగలిగిన స్థోమత ఉన్న కంపెనీలకు మళ్లీ అంతే స్థాయిలో రాయితీలు ఇవ్వాల్సిన అవసరముందా? అన్నది ప్రశ్న. అసలు రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెట్టగలిగే సామర్ధ్యం ఉన్న కంపెనీ ఇన్ని రాయితీలు ఎలా కోరుతోందో అర్థం కాదు. తాము పెట్టదలచిన మొత్తంలో 25 శాతం ముందుగానే గిట్టుబాటు చేసుకుంటున్నారన్న భావన రాదా? కంపెనీలను ఆకర్శించేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వడంలో తప్పులేదు కానీ.. ఒకపక్క వైద్య కళాశాలల నిర్మాణానికి డబ్బుల్లేవని చెబుతున్న ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలకూ నిధుల్లేవంటున్న ప్రభుత్వం ఇలా కంపెనీలకు వేల వేల కోట్ల రాయితీలు ఇవ్వడం ఎంత వరకూ సమంజసం? కొన్ని కంపెనీలకు భారీ రాయితీలు.. ఇంకొన్నింటికి కారుచౌకగా భూములు ఇస్తున్న చంద్రబాబు ప్రభుత్వం... భారతీ సిమెంట్స్ మైనింగ్ లీజులను కక్షపూరితంగా రద్దు చేసే ప్రయత్నం చేస్తూండటం విమర్శలకు గురవుతోంది. అడక్కపోయినా టీసీఎస్ కంపెనీకి ఎకరాకు రూపాయి చొప్పున 22 ఎకరాల భూమి కేటాయించింది. కాగ్నిజెంట్, ఉర్సా కంపెనీలకూ ఇదే లెక్కన భూమి ఇస్తున్నామని అంటున్నారు.తాజాగా రైడెన్ కంపెనీకి 25 శాతం రాయితీతో 480 ఎకరాలు ఇస్తారట. స్టాంపు డ్యూటి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పూర్తిగా మినహాయిస్తారు. కంపెనీ వారు ప్లాంట్, మెషినరీ కొనుగోలు ఖర్చులో పది శాతం రాయితీ అంటే రూ.2129 కోట్లు ప్రభుత్వం భరిస్తుందట. డేటా సెంటర్ నిర్మాణానికి చెల్లించే జీఎస్టీ మొత్తం కంపెనీకి తిరిగి చెల్లిస్తారు.దీని విలువ రూ.2245 కోట్లు. లీజులపై చెల్లించే జీఎస్టీ పదేళ్లపాటు చెల్లించే మరో రూ.1745 కోట్లు కూడా ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. ఏపీ ప్రజలపై కొన్నివేల కోట్ల రూపాయల అదనపు ఛార్జీల భారం మోపిన చంద్రబాబు ప్రభుత్వం రైడెన్ కంపెనీకి మాత్రం యూనిట్‌కు రూపాయి రాయితీ ఇస్తోంఇ. తద్వారా కంపెనీకి పదేళ్లలో కలిగే లాభం రూ.4800 కోట్లు! సుంకాల్లో మినహాయింపులు మరో రూ.1200 కోట్లు. పంపిణీ ఛార్జీలు, క్రాస్ సబ్సిడీ ఛార్జీలు కలిపి మరో రూ.8500 కోట్లు ఉంటాయని లెక్క గడుతున్నారు.ఈ అంశాలపై ఎవరైనా సందేహాలు వ్యక్తం చేశారనుకోండి.. ఈనాడు వంటి సంస్థలు ఠకీమని అదంతా విష ప్రచారమన్న పాట అందుకుంటున్నాయి. విశాఖను కార్యనిర్వాహక రాజధాని అని గతంలో జగన్ అన్నప్పుడు ఇదే ఎల్లోమీడియా విశాఖకు వ్యతిరేకంగా బోలెడు కథనాలు వండి వార్చాయి. సముద్రం మట్టం పెరుగుతోందని, విశాఖకు ఏదో అవుతుందంటూ, ప్రజలను భయపెట్టేశారు. రిషి కొండపై నాలుగు ఆధునిక భవనాలు గత ప్రభుత్వం నిర్మిస్తే, పర్యావరణం నాశనం అయిపోయిందని, కొండకు గుండు కొట్టారంటూ తప్పుడు వార్తలు రాశారు. విష ప్రచారం అంటే అది! రిషికొండ భవనాలతోపాటు మరో తొమ్మిది ఎకరాల భూమిని ఇప్పుడు ప్రైవేటు వారికి ఇస్తుంటే మాత్రం వీరికి నోరు పెగలడం లేదు.డేటా సెంటర్ వల్ల ఉష్ణాగ్రత పెరుగుతుందని ఒప్పుకుంటూనే అది పెద్ద ఇబ్బంది కాదని సమర్థించుకున్నారు. ఇలా ఉంది వారి జర్నలిజం . మరో వైపు చక్కగా నడుస్తూ స్థానికులకు ఉపాధి కల్పిస్తున్న భారతి సిమెంట్, ఏసీసీ, రామకో సిమెంట్ కంపెనీలకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన సున్నపురాయి లీజులను రద్దు చేస్తారట. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబానికి సంబంధం ఉన్న భారతి సిమెంట్ కంపెనీకి నష్టం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేస్తోందన్నది వాస్తవం. ఇది కదా నడుస్తున్న పరిశ్రమలకు తరిమివేసే ప్రయత్నం అంటే అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.గూగుల్ డేటా సెంటర్ ఏపీ ప్రజలకు, ముఖ్యంగా విశాఖ ప్రాంతానికి ప్రయోజనం కలిగేలా ఏర్పాటైతే స్వాగతించాల్సిందే. కాకపోతే దాని వల్ల వచ్చే సమస్యలను అధ్యయనం చేయడం అవసరం.అప్పులపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్న ఏపీలో అతి తక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే సంస్థకు 22 వేల కోట్ల రాయితీలు ఇవ్వడంలోని హేతుబద్దతపై ప్రభుత్వం వివరణ ఇవ్వకపోతే ప్రజలలో అనుమానాలు బలపడతాయని గమనించాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అదే జరిగితే బెంగాల్లో రాష్ట్రపతి పాలనే.. సువేందు అధికారి హెచ్చరిక
జల్పాయ్గురి: పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి 2026లో జరగనున్న ఎన్నికలతో ప్రభుత్వం మారనుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి జోస్యం చెప్పారు. సకాలంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయని హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.జల్పాయ్గురి జిల్లా నగ్రాకటలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియ పూర్తికాని పక్షంలో ఎన్నికలు జరగవన్నారు. ‘వచ్చే ఏడాది మే 4వ తేదీకల్లా ఎస్ఐఆర్ పూర్తి చేయాల్సి ఉంది. లేకుంటే ఆ తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలవుతుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ఎన్నికల ముందు సెమీఫైనల్స్ వంటిది. ఎన్నికల్లో టీఎంసీకి ఓటమి తప్పదు’ అని సువేందు వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో ‘2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీలు పొందిన ఓట్లలో తేడా 42 లక్షలు మాత్రమే. అప్పట్లో అక్రమంగా చేర్చిన 2.4 కోట్ల మంది ఓటర్ల పేర్లను ఎస్ఐఆర్లో తొలగిస్తారు. అక్రమ వలసదారులు, ఇతరత్రా అనర్హుల పేర్లు సైతం ఉండవు. భవానీపూర్‌లో సీఎం మమతా బెనర్జీకి తన చేతిలో ఓటమి తప్పదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
గూగుల్‌తో ఆ మాట చెప్పిస్తే సన్మానం చేస్తాం: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్‌లో గూగుల్ డాటా సెంటర్ రాకతో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయంటూ కూటమి ప్రభుత్వం, దాని అనుకూల మీడియా.. సోషల్ మీడియాల్లో విస్తృతంగా ప్రచారం చేసుకుంటోంది. వాస్తవానికి విరుద్ధంగా ఉన్న ఈ ప్రచారంపై క్లారిటీ ఇవ్వకపోగా.. గత వైఎస్సార్సీపీ పాలనపై, ఆ పార్టీ నేతలపై ఐటీ మంత్రి నారా లోకేష్ నిందలు వేస్తున్నారు. అయితే వాటికి మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ (Gudivada Amarnath on Google Data Center Jobs)ఇచ్చారు. శుక్రవారం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గూగుల్‌తో లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు కదా. ఆ మాట గూగుల్‌తోనే చెప్పించండి. కనీసం ఆ సంస్థతో ఓ అధికారికి ప్రెస్‌నోట్ అయిన రిలీజ్ చేయించండి. అది నిజమని తెలిస్తే మేమే సన్మానం చేస్తాం.... గూగుల్ డేటా సెంటర్ ఒప్పందం, ఉద్యోగాల కల్పన కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లోకేష్ మీడియా ముఖంగా ప్రజల అనుమానాలకు సమాధానం చెపుతారు అని భావించాను. కానీ ఆ డేటా సెంటర్‌ను మా పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. దీనిని స్వాగతిస్తున్నట్లు తొలిరోజే వైఎస్సార్సీపీ చెప్పింది. అయితే.. గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తాయని, ఎంత రెవెన్యూ రాష్ట్రానికి వస్తుందని మాత్రం అడిగాం. అందులో తప్పేముంది?.... 1 గిగా వాట్ డేటా సెంటర్ ద్వారా గూగుల్ ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తుంది?. గూగుల్ డేటా సెంటర్ వలన 200 మందికి ఉద్యోగాలు వస్తాయని ఈనాడు పేపర్ లో వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ డేటా సెంటర్ లో ఉన్న ఉద్యోగులు 1.88 మంది ఉద్యోగులు ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో 1.88 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని టీడీపీ నేతలు చెపుతున్నారు. ఆ రెండింటికీ చాలా తేడా ఉంది కదా. అయినా ఉద్యోగాల గురించి లోకేష్, టీడీపీ నేతలు కాదు చెప్పాల్సింది. ఆ మాట ఆ సంస్థ చెప్పాలి. అసలు గూగుల్‌తో సమాధానం చెప్పించడానికి ఐటీ మంత్రికి వచ్చిన ఇబ్బంది ఏంటి?. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. నన్ను గుడ్డు అన్నా.. నేను లోకేష్‌ను పప్పు అన్నా.. రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు.ముందు ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలి. మాయ మాటలతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేయొద్దు. కష్టపడి పోరాటం చేసి జగన్ ఆశీస్సులతో ఈ స్థాయికి వచ్చాను. ఎవరో డబ్బులు కడితే చదువుకోలేదు(లోకేష్‌ను ఉద్దేశించి..). విశాఖ నగరానికి ఏడాదికి ఐదు టీఎంసీల నీళ్లు అవసరం. గూగుల్ డేటా సెంటర్‌కు ఏడాదికి మూడు టీఎంసీల నీళ్లు అవసరం, ఎలా సర్దుబాటు చేస్తారు?. డేటా సెంటర్ వలన ఒకటి నుంచి రెండు సెంటిగేడ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది అని మేధావులు చెబుతున్నారు. దాని మీద ఏమైనా స్టడీ చేశారా?. ఒక రోజు మొత్తానికి విశాఖ నగరంకు ఎంత కరెంట్ అవసరమో, గూగుల్ డేటా సెంటర్ కు ఒక గంటకు అంత కరెంట్ అవసరం అవుతుంది. రామాయపట్నం, బందరు మూలపేట, భోగాపురం ఎయిర్ పోర్టు, NTPC గ్రీన్ ఎనర్జీ దగ్గర నేను నిలబడి మా హయంలో వచ్చింది అని చెప్పగలను. నువ్వు మంత్రిగా ఎన్ని పరిశ్రమలు తెచ్చావు నేను మంత్రి ఎన్ని పరిశ్రమలు తెచ్చావు కూర్చొని రాసుకుందాం రా?.. నారా లోకేష్ ఈ రాష్ట్రానికి మంత్రిగా ఏం తెచ్చారు.. ఏ ప్రయోజనం చేకూర్చారు. నువ్వు మంత్రిగా ఏమి చేశావో చెప్పగలవా.. అమరావతి రోడ్లు తప్ప. నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే లోకేష్ భరించలేరు. వర్ధంతి జయంతికి తేడా తెలియని వ్యక్తి కూడా మాట్లాడుతున్నారా?. ఆయనలా నేను ఎవరి దగ్గర స్క్రిప్ట్ తీసుకొని చదవను. ట్రోలింగ్‌కు జాతి పితా లోకేష్ అని ఎద్దేశా చేశారు. వ్యక్తిగత విమర్శలు ఇకనైనా మానుకోవాలి’’ అని గుడివాడ అమర్నాథ్ లోకేష్‌కు హితవు పలికారు. ఇదీ చదవండి: కల్తీ మద్యం కేసు.. కమీషన్ మాట్లాడుకుందామా? -
నితీశ్ మళ్లీ సీఎం.. డౌట్ కామెంట్స్ చేసిన అమిత్ షా!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. అధికార ఎన్డీయే కూటమిలో లుకలుకలు నడుస్తున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. అలాగే.. బీహార్ సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపైనా ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఓ స్పష్టత ఇచ్చారు.బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు(Amit Shah On Bihar CM Candidate). బీహార్ ఎన్డీయే కూటమిలో పార్టీల మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని.. మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు పనికి మాలినవని తోసిపుచ్చారు. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలోనే బీహార్ ఎన్నికలకు వెళ్తున్న విషయాన్ని షా ప్రస్తావించారు. అయితే.. బీహార్ ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు.. అంత తొందర ఎందుకంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నితీశ్ కుమార్ మళ్లీ సీఎం అవుతారా? కారా?(Will Nitish Kumar CM Again) అనేది నేను ఒక్కడినే నిర్ణయించే అంశం కాదు. ప్రస్తుతానికి ఆయన సారథ్యంలోనే మేం ఎన్నికలకు వెళ్తున్నాం. ఎన్నికలయ్యాక.. మిత్రపక్షాలన్నీ కూర్చుని అప్పుడు సీఎం ఎవరు అనేది నిర్ణయిస్తాయి అని షా స్పష్టత ఇచ్చారు. గత ఎన్నికల్లో(2020) జేడీయూ కంటే బీజేపీ అత్యధిక స్థానాలు నెగ్గింది. ఆ టైంలో నితీశ్ కుమార్ ప్రధాని మోదీని కలిసి బీజేపీ నుంచే ముఖ్యమంత్రి ఉండడం సబబని అన్నారు. కానీ, మా మిత్రపక్షానికి మేం ఎప్పుడూ గౌరవం ఇస్తాం. సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని ఆయన్ని సీఎం చేశాం అని షా అన్నారు.నితీశ్ తరచూ పార్టీలు మారుతున్న సందర్భాన్ని ప్రస్తావించగా.. షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1974లో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణన్ సారథ్యంలో జరిగిన ఆందోళనతో నితీశ్ రాజకీయ ప్రయాణం ప్రారంభమైందని, అది అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమంగా మారిన సందర్భాన్ని గుర్తు చేశారు. పైగా నితీశ్ రెండున్నరేళ్లు మాత్రమే కాంగ్రెస్‌తో అనుబంధం కొనసాగించారని.. ఎక్కువ కాలం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నారని గుర్తు చేశారు. ఇక..నితీశ్ ఆరోగ్యం, పబ్లిక్‌లో ఆయన ప్రవర్తనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపైనా అమిత్ షా స్పందించారు. వయసు కారణంగా చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. కానీ, ముఖాముఖిగా, ఫోన్ ద్వారానూ నితీశ్ సుదీర్ఘంగా, అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారని షా అన్నారు. అంతేకాదు.. సీఎంగా ఆయన సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని అన్నారు.ఇక.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Assembly Elections 2025) ఎన్డీయే కూటమి మునుపెన్నడూ చూడని ఘన విజయం సాధిస్తుందని.. నవంబర్ 14న వెల్లడయ్యే ఫలితాలతో గత రికార్డులను బద్దలు కొడతామని షా ధీమా వ్యక్తం చేశారు.74 ఏళ్ల వయసున్న నితీశ్‌కుమార్ ఇప్పటికే 9 సార్లు(2000 సంవత్సరంలో తొలిసారి) బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ మధ్య ఆయన బీహార్ రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని, గవర్నర్‌గానో, రాజ్యసభకో వెళ్తారని ఊహాగానాలు వినిపించాయి. అంతెందుకు మొన్నీమధ్యే ఉప రాష్ట్రపతి పదవి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది కూడా. అయితే నితీశ్ 10వ సారి బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని జేడీయూ అంటోంది.ఇదీ చదవండి: కరూర్ ఘటన తర్వాత.. విజయ్ క్రేజ్ మరింత పెరిగిందా? -
తమిళ రాజకీయం.. టీవీకే విజయ్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు(టీవీకే), సినీ నటుడు విజయ్‌కు(TVK Vijay) ప్రజల నుంచి మద్దతు పెరిగినట్టు ఓ సర్వేలో వెలుగు చూసింది. ఆయనకు తాజాగా 23 శాతం మంది ప్రజలు మద్దతు పలుకుతున్నట్టు తేలింది. విజయ్ రాజకీయ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, కరూర్‌లో(Karur Stampade) ప్రచార సందర్భంగా చోటు చేసుకున్న ఘటన ఆ పార్టీ(Tamil nadu) వర్గాలను కాస్త డీలా పడేలా చేసింది. విజయ్ సైతం తీవ్ర మనోవేదనలో పడ్డారు.తాజాగా ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఇచ్చిన సీబీఐ విచారణ ఉత్తర్వుల నేపథ్యంలో మళ్లీ పార్టీ పరంగా కార్యక్రమాల విస్తృతంపై విజయ్ కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన పార్టీ జిల్లాల కార్యదర్శులతో సంప్రదింపులలో ఉన్నారు. ఎక్కువ శాతం జిల్లాల కార్యదర్శులు పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్‌కు వ్యతిరేకంగా గళాన్ని విప్పుతున్నట్టు సమాచారం వెలువడింది. ఈ సమావేశాలు, సంప్రదింపులు తదుపరి పార్టీ పరంగా విజయ్ కొన్ని మార్పు, చేర్పుల ప్రక్రియతో ప్రక్షాళన చేయబోతున్నట్టు చర్చ ఊపందుకుంది.ఈ పరిస్థితులలో విజయ్‌కు మరింత ఉత్సాహం తెప్పించే రీతిలో తాజాగా ఓ సర్వే వెలుగు చూసింది. ఇటీవల ముంబైకు చెందిన ఓ సంస్థ సర్వే జరపగా 2026 ఎన్నికలలో విజయ్ పార్టీకి 95 నుంచి 105 సీట్లు వస్తాయన్న సమాచారాలు వెలువడ్డాయి. తాజాగా జరిపిన సర్వేలో కరూర్ ఘటనతో విజయ్‌కు ప్రజాదరణ మరింతగా పెరిగినట్టు పేర్కొనడం గమనార్హం. ప్రజలలో ఆయనపై ఆదరణ అన్నది తగ్గలేదని, అదే సమయంలో తాజాగా 23 శాతం మద్దతు ఆయనకు పెరిగినట్టుగా పేర్కొంటూ వెలువడ్డ సర్వే ఫలితాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. -
కాంగ్రెస్, జేడీయూ అభ్యర్థుల ప్రకటన.. కూటమిలో ట్విస్ట్!
న్యూఢిల్లీ: బీహార్ (Bihar Assembly Election) అసెంబ్లీ ఎన్నికలకు గాను కాంగ్రెస్ (Congress Party) శుక్రవారం 48 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ రామ్ కుటుంబా స్థానం నుంచి... కాంగ్రెస్ శాసనసభా పక్షం నేత షకీల్ అహ్మద్ ఖాన్‌కు కద్వా నుంచి బరిలోకి దిగనున్నారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ చీఫ్ ప్రకాశ్ గరీబ్ దాస్‌కు బెచ్వాడా సీటు కేటాయించారు.బగాహాలో జయేశ్ మంగళ్ సింగ్, నౌతన్లో అమిత్ గిరి, చన్‌పటియాలో అభిషేక్ రంజన్, బెట్టియాలో వాసి అహ్మద్, రక్జౌల్లో శ్యామ్ బిహారీ ప్రసాద్ పోటీ చేయనున్నారు. గోవింద్గన్ స్థానం నుంచి శశి భూషణ్ రాయ్ అలియాస్ గప్పు రాయ్, రిగా నుంచి అమిత్ కుమార్ సింగ్ పోటీకి దిగనున్నారు. కాగా, ఆర్జేడీ సహా మహా ఘఠ్బంధన్ పక్షాల మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి రాకమునుపే కాంగ్రెస్ ఈ జాబితాను ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం ఈ కూటమి పక్షాల మధ్య సీట్ల పంపిణీ చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ నామినేషన్ల దాఖలుకు ఈ నెల 17వ తేదీ ఆఖరు. రెండో దశ పోలింగ్‌కు నామినేషన్లకు ఈ నెల 20వ తేదీతో గడువు ముగియనుంది.101 స్థానాలకూ అభ్యర్థుల్ని ప్రకటించిన జేడీయూమరోవైపు.. బీహార్‌లో అధికార ఎన్డీఏ (NDA) కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీ జనతాదళ్(యునైటెడ్) తాము పోటీచేయబోయే మొత్తం 101 స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే 57 మందితో తొలిజాబితా విడుదలచేయగా గురువారం మిగతా 44 మంది అభ్యర్థులతో చివరి జాబితాను వెల్లడించింది. చాలా మంది అభ్యర్థులు వెనువెంటనే తమ నామినేషన్లు దాఖలుచేస్తూ బిజీగా కనిపించారు. మొత్తం 101లో ఓబీసీలకు 37, ఈబీసీలకు 22, అగ్రవర్ణాలకు 22 చోట్ల అవకాశం కల్పించింది. జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తన రాష్ట్ర కేబినెట్ మంత్రుల్లో చాలా మందికి మళ్లీ టికెట్ ఇచ్చారు. విజయ్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, జామా ఖాన్, షీలా మండల్, లేశీ సింగ్, సుమిత్ సింగ్, విభా దేవి, చేతన్ ఆనంద్, శ్వేతా గుప్తా ఈసారి బరిలో దిగనున్నారు. -
పెద్దల వద్దకు ‘కొండా’ పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కేంద్రంగా చోటు చేసుకున్న పరిణా మాలు కలకలం రేపాయి. కొంతకాలంగా నెల కొన్న వివాదం గురువారం రాత్రి వరకు కొన సాగింది. పరిస్థితి మరీ దిగజారి రచ్చకెక్కకుండా పార్టీ పెద్దలు అతికష్టం మీద నియంత్రించగలి గారు. తనను లక్ష్యగా చేసుకొని పార్టీలో, మంత్రివర్గంలో కుట్రలు జరుగుతున్నాయని భావిస్తున్న మంత్రి సురేఖ గురు వారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశ మై తన వాదన వినిపించారు.అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌తో కూడా చర్చించారు. తనకు మాట మాత్రంగా కూడా చెప్పకుండా తన దగ్గర పనిచేస్తున్న ఓఎస్డీని ప్రభుత్వం తొలగించడాన్ని అవమానకరంగా భావించినట్లు ఆమె వారికి తెలిపినట్లు సమాచారం. పార్టీలో తనపై జరుగుతున్న దాడి గురించి మీనాక్షికి వివరించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె మంత్రివర్గ సమావేశానికి కూడా హాజరు కాలేదు. పార్టీ పెద్దల నిర్ణయమే శిరోధార్యం: కొండా మీనాక్షి నటరాజన్‌తో సమావేశం అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. ‘తాజా పరిణామాలపై పార్టీ ఇన్చార్జి, పీసీసీ అధ్యక్షుడు మహేష్మార్ గౌడ్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపినం. ఈ విషయంలో పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇచ్చారు. సమస్యను పార్టీ పెద్దలు సెటిల్ చేస్తా మని చెప్పారు. ఇక ఈ విషయం వారే చూసుకుంటారని భరోసా ఉంది’అని పేర్కొన్నారు. నివురుగప్పిన నిప్పులా పరిస్థితి..వరంగల్‌లో మంత్రి పొంగులేటి దేవాదాయ శాఖకు సంబంధించిన కాంట్రాక్టు వ్యవహారాల్లో తలదూరుస్తున్నారనే ఆరోపణలతో మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. మేడారం జాతర అభివృద్ధి పనుల విషయంలో దేవాదాయ శాఖ మంత్రి సురేఖ లేకుండానే సమావేశం జరగడం, ఆ తరువాత సురేఖ ఓఎస్డీ సుమంత్‌ను తొలగించడంతో వివాదం ముదిరింది. మేడారం అభివృద్ధి పనులను దేవా దాయ శాఖ నుంచి రోడ్లు, భవనాల శాఖకు బదలాయించడంతో మంత్రి సురేఖ ప్రమేయం లేకుండానే పనులు జరుగుతున్నాయి. పోలీసులతో వాగ్వాదానికి దిగిన మంత్రి కుమార్తె సుష్మిత.. సీఎం పలువురు మంత్రులపై నేరుగా విమర్శలు చేశారు. బీసీ నాయకురాలైన తన తల్లి పట్ల ఓ వర్గం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం సృష్టించాయి. -
రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారు
రాజమహేంద్రవరం రూరల్: ఒకవైపు నకిలీ మద్యం, మరోవైపు లిక్కర్ సిండికేట్‌తో అధికార పార్టీ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తోందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ మండిపడ్డారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ... రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ పరిధిలోని 39 మద్యం షాపుల సిండికేట్‌కు సంబంధించిన ఆడియో సాక్షిగా అధికార పార్టీ నేతల అక్రమాలను భరత్ బయటపెట్టారు.రేట్ల పెంపు, బెల్టు షాపుల ఏర్పాటుతో పాటు ఎక్సైజ్ అధికారుల మామూళ్ల గురించి నిస్సిగ్గుగా చర్చిస్తున్న టీడీపీ రాజమహేంద్రవరం నగర పట్టణ అధ్యక్షుడు మజ్జి రాంబాబుతో పాటు ఆయన వెనకున్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేను కూడా పార్టీ నుంచి బహిష్కరించాలని భరత్‌రామ్ డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. అక్రమాలకు వేదికగా రాజమహేంద్రవరం టీడీపీ ప్రభుత్వంలో రాజమహేంద్రవరం అక్రమాలకు వేదికగా మారింది. రాజమండ్రి సిటీ ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లో రాజమహేంద్రవరం నగరం, మరో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి నియోజకవర్గం రాజమండ్రి రూరల్‌లోని 39 మద్యం దుకాణాల సిండికేట్ మీటింగ్ పెట్టారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రధాన అనుచరుడైన టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఫోన్ సంభాషణ ద్వారా అధికార పార్టీ నేతల సిగ్గులేని తనం బయటపడింది.రూ.100 బాండ్ పేపరు మీద సంతకాలు చేద్దామంటూ నిస్సిగ్గుగా ప్రతిపాదించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలి. ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 37ఏ, 39/1, 2 సెక్షన్ల ప్రకారం వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలి. మజ్జి రాంబాబు వెనుక ఉన్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేను కూడా అరెస్టు చేయాలి. ఆయన్ని చంద్రబాబు బర్తరఫ్ చేయాలి. దీంతో పాటు ప్రభుత్వ అధికారులకు లంచాలిద్దామంటూ నేరుగా చెబుతున్నారు. దీనిపై బీఎన్ఎస్ 274, 276 సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే అండతోనే సిండికేట్ మంతనాలు ఎక్సైజ్ అధికారులు ఎవరి మీద కేసు పెట్టాలో కూడా డ్రా తీసి వీళ్లే నిర్ణయిస్తామని చెబుతున్నారు. కేసు పెట్టిన షాపు కట్టాల్సిన ఫైన్ సిండికేట్ మొత్తం భరించేలా ఒప్పందం చేసుకుంటున్నారు. రెండుసార్లు కేసులు వస్తే.. ఆ షాపు క్లోజ్ అవుతుంది కాబట్టి వంతుల వారీగా ఏ షాపు మీద కేసు పెట్టాలో కూడా సిండికేటే నిర్ణయిస్తుంది. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అండ లేకుండా ఇలా అధికారులను సైతం ప్రభావితం చేయడం సాధ్యమా? లేని లిక్కర్ కేసులో మా పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డిని, ఇతర నేతలను అరెస్టు చేశారు. ఇవాళ మీ పార్టీ నేతలు బహిరంగంగా దొరికిపోయారు.రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీలో చంద్రబాబుకు సైతం భాగస్వామ్యం ఉంది. కూటమి నేతలు ఇంత విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నా కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఇంత పెద్ద ఎత్తున స్కామ్‌కు పాల్పడుతున్న వీళ్లందరినీ అండమాన్ లేదా తీహార్ జైలుకు పంపించాలి. కూటమి నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఆ బురదను ప్రతిపక్షంపై చల్లుతున్నారు. మద్యం షాపుల్లో అమ్మే మందు అసలా, నకిలీయా తేల్చాల్సింది ప్రభుత్వం. ఒకవైపు నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తూ.. కొనే ముందు ఫోనులో స్కాన్ చేసి అది అసలా.. నకిలీయా టెస్ట్ చేయమంటున్నారు. రూ.100కు చీప్ లిక్కర్ కొనే వారి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుందా?వైఎస్ జగన్ హయాంలోనే డేటా సెంటర్విశాఖలో ఏర్పాటు చేస్తున్నది గూగుల్ అదానీ ఎయిర్ టెల్ డేటా సెంటర్. దీనితో పాటు ఐటీ పార్కు, స్కిల్ యూనివర్సిటీ తీసుకురావాలని వైఎస్ జగన్ విశాఖలో 130 ఎకరాల స్థలం ఇచ్చి ఎంఓయూ చేసుకున్నారు. 2021లో రూ.23 వేల కోట్ల పెట్టుబడులతో 25 వేల ఉద్యోగాలతో విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఎక్స్‌పోలో అదానీ డేటా సెంటర్‌తో ఎంఓయూ చేసుకుని, 2023 మే నెలలో శంకుస్థాపన కూడా చేశారు. వైఎస్ జగన్ హయాంలో చేసిన అభివృద్ధినే చంద్రబాబు ఇప్పుడు చెప్పుకుంటున్నారు. -
మంత్రి నారాయణ వ్యాఖ్యలపై స్పందించిన వర్మ
సాక్షి, కాకినాడ: మంత్రి నారాయణ వ్యాఖ్యలపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. టీడీపీకి నేనెప్పుడూ ఫైర్ బ్రాండేనన్న వర్మ.. మంత్రి నారాయణ వ్యాఖ్యలను పట్టించుకోనక్కర్లేదన్నారు. ఎవడో కర్మ, గడ్డి పరక అంటే నాకేంటి? అంటూ వ్యాఖ్యానించారు. తానేంటో పిఠాపురం ప్రజలకు తెలుసునన్నారు.కాగా, టెలి కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడిన ఆడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాను ప్రస్తుతం కాకినాడ ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నానని పేర్కొంటూ అక్కడ జనసేన, టీడీపీ మధ్య విభేదాలున్నాయన్నారు. పిఠాపురంలో వర్మ అసహనంగా ఉన్నారన్నారు. తనను నియోజకవర్గంలో జీరో చేశారని బాధపడుతుంటారన్నారు. జనసేన సమావేశాలకు వెళ్లమని, ఇష్టం లేకపోతే వెళ్లకండని ఇప్పటికే తాము చెప్పామన్నారు. తన నియోజకవర్గంలో పద్ధతిగా నడుచుకోకపోతే సహించేదిలేదన్నారు.నీ నియోజకవర్గంలో పార్టీ నేతలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావని, పార్టీ కేంద్ర కార్యాలయం తనను పిలిచి అడిగిందన్నారు. ప్రతి పది, ఇరవై రోజులకు చిన్న ఇష్యూలు వస్తే పవన్‌కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌తో కలిసి మాట్లాడుకుంటున్నామన్నారు. కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురంలో ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య విభేదాలున్నాయని, వీటిపై చర్చించి సరిచేసుకుంటున్నామని పేర్కొన్నారు.మనోహర్ తనకు ఫోన్ చేసి తాము ఎన్డీఏలో ఉన్నామా, లేమా.. అంటూ అడిగారన్నారు. మీ నియోజకవర్గంలో నాయకులతో మాట్లాడించేది మీరేనా అని అడిగారన్నారు. తన డిపార్ట్మెంట్ను డీగ్రేడ్ చేస్తూ అధికారులను ఉద్దేశించి మాట్లాడటంపై అసహనం వ్యక్తం చేశారన్నారు. మీ శాఖలపై మాట్లాడమంటారా? అంటూ తనను అడిగారన్నారు. ఇప్పటి వరకు నుడాను పట్టించుకోలేదని, పట్టించుకుంటే తనకన్నా మొండోడు ఎవరూ ఉండరన్నారు. తనకూ తిట్టడం వచ్చు.. కేకలేయడం వచ్చని, ఇక నుంచి పార్టీ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. టెలి కాన్ఫరెన్స్‌లో నేతలతో మంత్రి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
‘బీసీ రిజర్వేషన్లలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు’
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లలో వెనకడుగు వేసే ప్రకస్తే లేదని టీపీసీసీ చీఫ్ మహేహ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గాంధీ భవన్లో బీసీ సంఘాల నేతలతో సమావేశం అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ కుల సర్వేకు ఆద్యులు రాహుల్ గాంధీ. స్వాతంత్ర్యం అనంతరం శాస్త్రీయ బద్దంగా కుల సర్వే నిర్వహించి అఫిషియల్ డాక్యుమెంట్ ఇచ్చాం. కామారెడ్డి డిక్లరేషన్‌కే కట్టుబడి ఉన్నాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. తెలంగాణ బీసీ జేఏసీ బంద్‌కు మద్దతు ఇస్తున్నాం. బంద్ విజయవంతం కావాలి. బీసీ బంద్‌తో కనువిప్పు కలగాలి. అసెంబ్లీలో మద్దతు ఇచ్చి బయటకు వచ్చి మోకాలడ్డు పడుతున్నారు. రాహుల్ గాంధీ ఎవరి వాటా వారికి నినాదం.. ఉద్యమంగా మారింది. రాహుల్ గాంధీ నినాదం గొప్ప వరంబీసీ రిజర్వేషన్ల విషయంలో న్యాయ పరంగా పోరాడుదాం. రాజకీయాలు ఎన్నికల వరకే. రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది. రిజర్వేషన్ల 9 వ షెడ్యూల్ చేర్చే విషయంలో ప్రధాని మోదీని అడిగేందుకు బీజేపీ నేతలు ఎందుకు జంకుతున్నారు. బీజేపీ బిఆర్ఎస్లో పాయికారి ఒప్పందంతో బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతాం. సిఎం రేవంత్,నాకు ఉన్న సఖ్యత దేశంలో ఎక్కడా లేదు. రాహుల్ గాంధీ ఆశయ సాధన కోసం సీఎం రేవంత్ ఎనలేని కృషి చేస్తున్నారు’ అని స్పష్టం చేశారు.ఇదీ చదవండి:బీసీ రిజర్వేషన్లు.. తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్! -
అందుకే పవన్ కల్యాణ్ నోరు మెదపడం లేదు: పోతిన మహేష్
సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని.. వారి కనుసన్నల్లోనే పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోందని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నకిలీ మద్యంలో పవన్ కళ్యాణ్‌కీ భాగస్వామ్యం ఉందని.. అందుకే ఆయన దీనిపై నోరు మెదపటం లేదన్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా పవన్‌కు కనపడటం లేదా? అంటూ పోతిన మహేష్ నిలదీశారు.‘‘కొత్తగా తెచ్చిన క్యూ ఆర్ కోడ్ కంటితుడుపు చర్య మాత్రమే. రాష్ట్రంలో వైన్ షాపులన్నీ టీడీపీ నేతలవే. వారందరికీ నకిలీ మద్యంలో ప్రమేయం ఉంది. అలాంటప్పుడు క్యూ ఆర్ కోడ్ వలన ఏం ప్రయోజనం ఉంటుంది?. అసలు క్యూ ఆర్ కోడ్ పెట్టటం అంటే రాష్ట్రంలో నకిలీ మద్యం విక్రయిస్తున్నట్టు చంద్రబాబు అంగీకరించినట్టే.. అందుకే ఇప్పుడు వైన్ షాపుల్లో క్యూ ఆర్ కోడ్ అమలు చేస్తున్నారు. నకిలీ మద్యంతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ప్రాణాలను తీస్తోంది, వేల కోట్ల రూపాయలు దోపిడీకి టీడీపీ పెద్దలు ప్లాన్ చేశారు. నకిలీ మద్యాన్ని నియంత్రిస్తామని ప్రభుత్వ పెద్దలు ఎందుకు చెప్పటం లేదు?’’ అంటూ పోతిన మహేష్ ప్రశ్నించారు.‘‘ప్రజలను మభ్య పెట్టటానికే క్యూ ఆర్ కోడ్ ప్రకటన చేశారు. స్మార్ట్ ఫోన్లు పేద ప్రజలందరి దగ్గర ఎలా ఉంటాయి?. వారు నకిలీ మద్యాన్ని ఎలా గుర్తిస్తారు?. బెల్టు షాపులు, పర్మిట్ రూములు పెట్టి గత 16 నెలలుగా దోపిడీ చేశారు. ఈ పర్మిట్ రూములలో పెగ్గుతో పాటు, ఫుడ్, బెడ్‌కి కూడా అవకాశం కల్పించారు. నకిలీ మద్యాన్ని ప్రోత్సాహించటానికే పర్మిట్ రూములకు అవకాశం ఇచ్చారా?. లూజుగా మద్యం విక్రయిస్తే అది నకిలీదో మంచిదే ఎలా తెలుస్తుంది?. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం షాపులన్నీ ప్రభుత్వ ఆదీనంలో నడిచాయి. ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉంది. డిస్టలరీస్ నుండి షాపుల వరకు అన్ని పాయింట్లలోనూ చెకింగ్ జరిగేది. అందువలన ఎక్కడా నకిలీ మద్యానికి ఆస్కారం లేదు..ఇప్పుడు టీడీపీ పెద్దల ఆధ్వర్యంలో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ములకలచెరువు, అనకాపల్లి, ఏలూరులో భారీగా నకిలీ డంపులు బయట పడ్డాయి. ఇంత జరిగినా వైన్ షాపులలో ఎందుకు తనిఖీలు చేయట్లేదు?. రాష్ట్ర ప్రజలందరికీ ఏపీలో నకిలీ మద్యం విక్రయిస్తున్నారని అర్థం అయింది. పవన్ కళ్యాణ్ ఈ నకిలీ మద్యంపై ఎందుకు మాట్లాడటం లేదు?. అనేక మంది చనిపోతున్నా ఎందుకు పట్టించుకోవటం లేదు?. పవన్‌కు కూడా నకిలీ మద్యంలో భాగస్వామ్యం ఉంది. అందుకే ఆయన మాట్లాడటం లేదు’’ అంటూ పోతిన మహేష్ దుయ్యబట్టారు. -
గుజరాత్లో కీలక పరిణామం.. మంత్రులంతా రాజీనామా
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగిలిన మంత్రులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12:39 గంటలకు నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. "ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గాన్ని శుక్రవారం మధ్యాహ్నం విస్తరించనున్నారు" అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మంత్రివర్గంలో దాదాపు 10 మంది కొత్త వారికి అవకాశం లభించవచ్చని బీజేపీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు తెలిపారు. అంతేకాకుండా, ప్రస్తుత ఉన్న మంత్రుల్లో దాదాపు సగం మందిని మార్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గుజరాత్ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా మొత్తం 17 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది క్యాబినెట్ ర్యాంకు మంత్రులు కాగా, మిగిలిన వారు సహాయ మంత్రులుగా కొనసాగుతున్నారు. -
Bihar Election: స్ఫూర్తినిస్తున్న ‘జన్ సురాజ్’ అభ్యర్థి నీరజ్
పట్నా: అతను ఢిల్లీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశారు. అంచలంచలుగా ఎదుగుతూ రూ. 400 కోట్ల టర్నోవర్ గల కంపెనీని నడిపేస్థాయికి చేరుకున్నారు. అతనే బీహార్ పారిశ్రామికవేత్త నీరజ్ సింగ్. అతని జీవన ప్రయాణం సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తుంది.38 ఏళ్ల నీరజ్ సింగ్ రాబోయే బీహార్ ఎన్నికల్లో షియోహార్ స్థానం నుంచి జన్ సురాజ్ పార్టీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు.బీహార్‌లోని షియోహార్ జిల్లాలోని మధురాపూర్ గ్రామంలో జన్మించిన నీరజ్ సింగ్ పదవ తరగతి పూర్తిచేశాక కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఉద్యోగాల వేటలో పడ్డారు. ఎటువంటి ఉద్యోగం దొరక్క, గ్రామంలో పెట్రోల్, డీజిల్ విక్రయించడం మొదలుపెట్టాడు. తరువాత ఢిల్లీకి వెళ్లి, సెక్యూరిటీ గార్డు ఉద్యోగంలో చేరారు. అనంతరం పూణేకు చేరుకుని, ఒక ప్రైవేట్ సంస్థలో ఆఫీస్ అటెండెంట్‌గా చేరారు. 2010లో ధాన్యం వ్యాపారాన్ని ప్రారంభించారు. అది కలసివచ్చింది. దీంతో ఇటుకలు, బిల్డింగ్ బ్లాక్స్, టైల్స్, ఇతర సిరామిక్ వస్తువులను విక్రయించే ఉషా ఇండస్ట్రీస్‌ను స్థాపించారు. తదనంతర కాలంలో సింగ్ తన వ్యాపారాన్ని రోడ్డు నిర్మాణ రంగానికి కూడా విస్తరించారు. ఇటీవలే సొంత పెట్రోల్ పంపును ప్రారంభించారు. నీరజ్ సింగ్ స్థాపించిన కంపెనీ ప్రస్తుతం రూ. 400 కోట్ల టర్నోవర్‌తో, రెండువేల మంది సిబ్బందికి ఉపాధిని అందిస్తోంది. ఒకప్పుడు సైకిల్ కూడా లేని నీరజ్ సింగ్ దగ్గర నేడు అర డజనుకు పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. సింగ్ తన ఇద్దరు సోదరులు, భార్య, ఇద్దరు కుమారులు, తల్లిదండ్రులతోపాటు ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నారు. పేద మహిళలకు వివాహాలు చేయడం, సీనియర్ సిటిజన్ల కోసం ఉచిత ఆరోగ్య శిబిరాలు, వృద్ధుల కోసం తీర్థయాత్రలను నిర్వహించడం లాంటి సేవాకార్యక్రమాలను నీరజ్ సింగ్ నిర్వహిస్తున్నారు. -
‘సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగిస్తామన్నారు.. ఏమైంది?’
విశాఖ: టీడీపీ అంటే తెలుగు దురహంకార పార్టీ అని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మహిళలను అవమానించడమే టీడీపీ నేతల అలవాటుగా పెట్టుకున్నారని ఆమె విమర్శించారు. జీడీ నెల్లూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త కృపాలక్ష్మీ కోసం ఎమ్మెల్యే థామస్ నీచంగా మాట్లాడరని, మహిళలను అవమానించినా చంద్రబాబు ఏమి అనరు అనే ధైర్యంతో రెచ్చిపోతున్నారని వరుదు కళ్యాణి మండిపడ్డారు. ‘ టిడిపి నేతల వాళ్ళ ఇంట్లో వాళ్ళని అంటే ఎలా ఉంటుంది. దళిత మహిళ అని కూడా చూడకుండా వ్యక్తిత్వ హననం చేశారు. ఈ ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే కృపాలక్ష్మికి ఎమ్మెల్యే థామస్ క్షమాపణ చెప్పాలి. కృపాలక్ష్మి నిజాలు మాట్లాడితే ఆమెపై దాడి చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో టిడిపి నేతలు కాలకేయుల్లా ప్రవర్తిస్తున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జనసేన మహిళ నేత వీడియోలు తీయించాడు..డబ్బులు ఎరచూపి వీడియోలు తీయించారని కోట వినూత ఆరోపించారు. తప్పుడు పనులు చేసిన వారిపై పోలీసులను ఉపయోగించడం లేదు. సుగాలి ప్రీతి తల్లిని నిర్బంధించడానికి మాత్రం పోలీసులను వాడుతున్నారు. సుగాలి ప్రీతి తల్లిని అడ్డం పెట్టుకొని పవన్ ఓట్లు దండుకున్నారు.సుగాలి ప్రీతి కేసును సిబిఐకు ఇస్తామని ఎన్నికలకు ముందు పవన్ మాట్లాడారు. సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయాల్సిన బాధ్యత బాబు పవన్ కళ్యాణకు లేదా?, సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు ఎప్పుడూ తారు సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు ఎప్పుడూ తారుమారయ్యాయి..?, ఎన్నికల్లో ఓట్ల కోసం సుగాలి ప్రీతి కేసును వాడుకున్నారు. జడ్పీ చైర్పన్ ఉప్పాల హారికపై టిడిపి గుండాలు దాడి చేశారు. కేసు పెడితే కనీసం పోలీసులు పట్టించుకోలేదు. రాష్ట్రంలో మహిళలపై ఎన్ని దాడులు జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మహిళల పట్ల తప్పులు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..?’ అని ప్రశ్నించారు వరుదు కళ్యాణి. -
సాక్షి మీడియాపై కొనసాగుతున్న చంద్రబాబు సర్కార్ కుట్రలు
సాక్షి, హైదరాబాద్: సాక్షి మీడియాపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. నకిలీ మద్యంపై వార్తలు రాసినందుకు చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డికి ఏపీ పోలీసులు వరుసగా నోటీసులు ఇచ్చారు. గత నాలుగు రోజుల్లో మూడుసార్లు నోటీసులు ఇచ్చిన ఏపీ పోలీసులు.. ఒకే కేసులో వరుసగా నోటీసులు ఇచ్చి బెదిరించేందుకు యత్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వరుసగా మూడు రోజుల నుంచి పోలీసులు వస్తున్నారు. సమాధానం ఇచ్చినా.. పదేపదే నోటీసులు ఇస్తున్నారు.కాగా, హైదరాబాద్‌లోని సాక్షి పత్రిక ప్రధాన కార్యాలయంలో ఏపీ పోలీసులు బుధవారం(అక్టోబర్ 15) కూడా దాదాపు 10 గంటల పాటు హల్చల్ చేయడం... ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిని విచారణ పేరుతో వేధించారు. ఇక ఎస్సీఎస్ఆర్ నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్చార్జిని కూడా వారం రోజులుగా వేధిస్తుండటం సర్కారు కుట్రలను బహిర్గతం చేస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, దోపిడీని బట్టబయలు చేస్తున్న ‘సాక్షి’ మీడియా గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు సాగిస్తోంది. నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించినందుకు.. ఎడిటర్‌కు నోటీసుల పేరుతో విజయవాడలోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో కూడా ఆదివారం(అక్టోబర్ 12) తెల్లవారుజామున పోలీసుల దాష్టీకానికి దిగిన సంగతి తెలిసిందే.టీడీపీ సిండికేట్ నకిలీ మద్యం దోపిడీని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కారు పోలీసు జులుంతో బరి తెగిస్తోంది! రాజ్యాంగ హక్కులను కాలరాసేందుకు తెగబడుతోంది. నకిలీ మద్యం దారుణాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై కక్ష సాధింపు చర్యలకు తెగిస్తోంది. మద్యం ప్రియుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ మద్యం మాఫియాపై పోరాడుతున్న ‘సాక్షి’పై అధికార మదంతో విరుచుకుపడుతోంది. నకిలీ మద్యం రాకెట్ దారుణాలను వెలుగులోకి తేకుండా కట్టడి చేయాలనే పన్నాగంతో బరితెగిస్తోంది. ఆర్టికల్ 19 (1) కింద రాజ్యాంగం ప్రసాదించిన పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కులను పాశవికంగా కాలరాస్తూ కుతంత్రాలకు తెగబడుతోంది. -
కొండా సురేఖ ఎపిసోడ్.. పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ అంశంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎక్కడో కమ్యూనికేషన్ లోపంగా కనిపిస్తుందన్నారు. సాయంత్రం లోగా ఈ విషయంపై క్లారిటీ వస్తుందని మహేష్ గౌడ్ అన్నారు.కాగా, సుప్రీం కోర్టు తీర్పుపై మహేష్ గౌడ్ స్పందిస్తూ.. హైకోర్టులో కేసుకి సమయం ఉందని.. వేచి చూస్తామన్నారు. హైకోర్టులోనే తేల్చుకుంటామన్నారు. బీసీ రేజర్వేషన్ అంశం మీద కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తో ఉందని.. వెనక్కి తగ్గేది లేదంటూ ఆయన స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు పోవాలనే తపన ఉందని.. హై కోర్టులో పోరాడతామని మహేష్ గౌడ్ చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ నేతల ఆస్తుల వివరాలు బయట పెట్టాలి: బీజేపీ చీఫ్మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌పై బీజేపీ చీఫ్ రామచందర్‌రావు మాట్లాడుతూ.. సిమెంట్ ఫ్యాక్టరీని బెదిరించడంలో పెద్దవారి హస్తముందని కొండ సురేఖ కుటుంబ సభ్యులు చెబుతున్నారని.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో బయట పెట్టాలన్నారు. ‘‘కాంగ్రెస్ అంటేనే కరప్షన్. కాంగ్రెస్ నేతల ఆస్తుల వివరాలు బయట పెట్టాలి. బలవంతంగా కాంగ్రెస్ వసూలు చేస్తుంది. సీఎంపై ఆరోపణలు చేసింది కేబినెట్ మినిస్టర్ కుటుంబ సభ్యులే...దోచుకున్న సొమ్మును పంచుకోలేక దంచుకొని తన్నుకుంటున్నారు. కొండ సురేఖ కుమార్తె మాట్లాడిన విషయంపై విచారణ జరపాలి. దోచుకునే లీడర్లు ఎక్కువ రోజులు ఉండొద్దు. కాంగ్రెస్ నాయకులు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేయొద్దు’’ అంటూ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. -
కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు
తన తల్లిదండ్రులకు ఏమైనా హానీ జరిగితే సీఎం రేవంత్‌రెడ్డిదే బాధ్యత అంటున్నారు తెలంగాణ దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కుమార్తె సుస్మిత. మాజీ ఓఎస్డీ సుమంత్‌ను అడ్డం పెట్టుకుని తమను వేధిస్తున్నారని ఆరోపించారు. సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చిన పోలీసులను ఆమె అడ్డుకున్నారు.బుధవారం రాత్రి ఆమె తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ''బీసీ లీడర్లను, మమ్మల్ని తొక్కడానికి ట్రై చేస్తున్నారు. ఎక్స్‌టార్సన్ కేసు అంటున్నారు. ఆర్మ్స్ యాక్ట్ కింద మా నాన్నను తీసుకొద్దామని ట్రై చేస్తున్నారని నా డౌట్. ఆ డౌట్లో మాత్రం మానాన్నకు కానీ, మా అమ్మకు కానీ ఎటువంటి హాని జరిగినా పూర్తి బాధ్యత రేవంత్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రోహిన్ రెడ్డిలదే. వీళ్లందరు మాత్రం బాధ్యత వహించాలి. నేను ముందే చెబుతున్నా.ఇది కాంగ్రెసా, తెలుగుదేశమా తెలుస్తలేదండీ. రెడ్ల రాజ్యం నడుస్తోంది. బీసీ నినాదమేమో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎత్తుకుంటే.. ఇక్కడ బీసీ మంత్రి ఇంటికి టాస్క్‌ఫోర్స్ సీఐ వస్తడా? అసలు ఎక్కడైనా ఉందా? ఎంత సిగ్గుమాలిన చర్య? ఒక ముఖ్యమంత్రి సిగ్గుపడాలి దానికి. ఒక బీసీ లేడీ లీడర్ ఇంటికి రాత్రి తొమ్మిదింటికి ఒక టాస్క్‌ఫోర్స్ సీఐ వచ్చిండంటే ముఖ్యమంత్రి సిగ్గుపడాలి. అయామ్ టెల్లింగ్ ఆన్ మీడియా'' అంటూ సుస్మిత ఫైర్ అయ్యారు. కాగా, నిన్నరాత్రి తాను చేసిన వ్యాఖ్యలను కట్టుబడి ఉన్నానని గురువారం మీడియా ప్రతినిధులకు స్పష్టం చేశారు కొండా సుస్మిత. చదవండి: కొండా సురేఖ వివాదం.. అసలేం జరిగింది? -
Bihar Elections: తేజస్వి ఆస్తులెంత? బెరెట్టా పిస్టల్ వివాదమేంటి?
పట్నా: దేశంలో ఎక్కడ చూసినా బీహార్ ఎన్నికలకు సంబంధించిన ముచ్చట్లే వినిపిస్తున్నాయి. నవంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం మొదలయ్యింది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని రఘోపూర్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన అధికారిక అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఇప్పుడిది ఎంతో ఆసక్తికరంగా మారింది.ఆర్జేడీ కోట నుండి వరుసగా మూడవసారి విజయం సాధించాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో దిగిన తేజస్వి యాదవ్.. బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏపై పలు విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో బెరెట్టా పిస్టల్‌తో పాటు రూ. 8.98 కోట్ల విలువైన కుటుంబ ఆస్తులను వెల్లడించారు. అలాగే తనపై 18 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కూడా తెలిపారు. ఆ వివరాలు..తేజస్వి యాదవ్ ఆస్తులు- రూ 1.88 కోట్లు (స్థిరచరాస్తులు) భార్య రాజ్శ్రీ యాదవ్ ఆస్తులు- రూ 59.69 లక్షలు(స్థిరచరాస్తులు)ఇద్దరు పిల్లల ఆస్తులు- రూ. 40 లక్షలు(స్థిరచరాస్తులు)మొత్తం కుటుంబపు చరాస్తులు- రూ. 6.12 కోట్లుబంగారం, వెండి- రూ. 85.9 లక్షలు- (980 గ్రాముల బంగారం, 3.5 కిలోల వెండి)ఆయుధాలు- రూ.1.05 లక్షలు ఇటాలియన్ బెరెట్టా ఎన్పీబీ 380 బోర్ పిస్టల్, 50 రౌండ్లుఎలక్ట్రానిక్స్- రూ. 85 లక్షలు డెస్క్‌టాప్, ల్యాప్టాప్మొత్తంగా ప్రకటించిన కుటుంబ ఆస్తులు రూ. 8.98 కోట్లుఈ అఫిడవిట్లో తేజస్వి యాదవ్ పేరు మీద ఏ వ్యక్తిగత వాహనం లేదా రియల్ ఎస్టేట్ వివరాలు లేవు. ఇది తేజస్వి సామాన్యుడనే ఇమేజ్ను బలోపేతం చేస్తుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే జాబితాలోని ఎలక్ట్రానిక్స్ , ఆయుధం విలువ అతని సామాన్య జీవనశైలికి విరుద్ధంగా ఉన్నాయనే వాదన విపిస్తోంది. కాగా అఫిడవిట్లో ఇటాలియన్ బెరెట్టా ఎన్పీబీ 380 బోర్ పిస్టల్, 50 బుల్లెట్లను చేర్చడం, దాని విలువ రూ. 1.05 లక్షలుగా పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. 1984 నుండి దేశంలో పౌర ఆయుధాల దిగుమతిని నిషేధించారు. ఆయుధ చట్టం- 1959 ప్రకారం అధికారం కలిగిన భారతీయ డీలర్ నుండే ఆయుధాన్ని కొనుగోలు చేయాలి. అయితే తేజస్వి బెరెట్టా పిస్టల్ కలిగివుండటంపై పలు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇది అక్రమంగా వచ్చిన ఆయుధమనే వాదన వినిపిస్తోంది.తేజస్వి యాదవ్ తన అఫిడవిట్లో తనపై 18 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో నాలుగు అప్పీల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కేసులు రాజకీయ ర్యాలీలు, నిరసనలు, వివాదాస్పద ప్రకటనల కారణంగా నమోదయ్యాయి. తాజగా అక్టోబర్ 13న ఢిల్లీ కోర్టు.. ఆయనతో పాటు ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, తల్లి రబ్రీ దేవిలపై ఐఆర్సీటీసీ హోటళ్ల అవినీతి కుంభకోణం, ల్యాండ్-ఫర్-జాబ్స్ స్కామ్‌లో అధికారికంగా అభియోగాలు మోపాలని ఆదేశించింది. ఇది ఎన్నికలకు ముందు తేజస్వికి ఎదురుదెబ్బగా మారింది.రాఘోపూర్ నియోజకవర్గం ఆర్జేడీకి ఎంతో కీలకమైనది. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి ఇద్దరూ ప్రాతినిధ్యం వహించిన ప్రాంతమిది. తేజస్వి 2015, 2020లలో ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. ఇక్కడి ఓటర్లలో యాదవులు 25 శాతం, ముస్లింలు 20 శాతం, ఈబీసీలు 30 శాతం ఉన్నారు. ఇది ఆర్జేడీ విజయానికి కీలకమైన జనాభాగా పరిగణిస్తుంటారు. హాజీపూర్ కలెక్టరేట్లో తేజస్వి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశాక తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన ‘ఎక్స్’ ఖాతాలో ‘ఈ నామినేషన్ తేజస్వి ఒక్కడికే కాదు.. బీహార్ అంతటా మార్పు కోసం’ అని పేర్కొన్నారు. -
నకిలీ మద్యం కేసులో ఉన్నది లోకేష్, ఎంపీ: దేవినేని అవినాష్
సాక్షి, ఎన్టీఆర్: ఏపీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకులు దేవినేని అవినాష్. తప్పుడు కేసులతో బీసీ నాయకుడు జోగి రమేష్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అంటూ ఆరోపించారు. నకిలీ మద్యంలో ఉన్నదంతా టీడీపీ పార్టీ నేతలే అని చెప్పుకొచ్చారు. నకిలీ మద్యం వ్యవహారంలో లోకేష్, మైలవరం ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.జోగి రమేష్ ను కలిసిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్(Devineni Avinash) గురువారం ఉదయం జోగి రమేష్‌ను(Jogi Ramesh) కలిశారు. ఈ క్రమంలో ఆయనపై టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. అనంతరం, దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో 15 నెలలుగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులతో జోగి రమేష్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వ నీచ రాజకీయాలను జోగి రమేష్ ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. జోగి రమేష్‌కు వైఎస్సార్సీపీ పూర్తి అండగా ఉంటుంది. నకిలీ మద్యం వ్యవహారంలో సీబీఐ ఎంక్వైరీ వేయాలని జోగి రమేష్ ధైర్యంగా అడిగారు. తనపై వస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. నకిలీ మద్యంలో ఉన్నదంతా టీడీపీ నేతలే. నకిలీ మద్యం వ్యవహారంలో లోకేష్(Nara Lokesh), మైలవరం ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ ఉన్నారు. జయచంద్రారెడ్డి, జనార్ధన్ రావు నెలనెలా మామూళ్లు చినబాబు, వసంత కృష్ణప్రసాద్, ఎంపీ చిన్నికి పంపించారు. టీడీపీ నేతలు దొరికిపోవడంతో వైఎస్సార్సీపీపై నీచ రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ పెట్టిన తప్పుడు కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటాం.పోలీసులు కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ సెక్షన్లను వైఎస్సార్సీపీ(YSRCP) నేతలపై పెడుతున్నారు. టీడీపీ తప్పుడు ప్రచారాలపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీస్ కమిషనర్ కలవలేదు. అదే టీడీపీ నుంచి చోటా మోటా నేతలు వెళితే సీపీ వారిని కలిశాడు. పోలీస్ కమిషనర్ ప్రజల కోసం పనిచేస్తున్నారా? టీడీపీ నేతల కోసం పనిచేస్తున్నారా?. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పదవుల కోసం బుద్ధా వెంకన్న ఆరాటపడుతున్నాడు. వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు చేస్తే పదవులు వస్తాయని బుద్ధా వెంకన్న అనుకుంటున్నాడు అని ెసెటైరికల్ కామెంట్స్ చేశారు. -
‘నా మాటలకు కట్టుబడి ఉన్నా.. ఫోన్ వచ్చింది ఇప్పుడేం మాట్లాడలేను’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ(konda Surekha) ఎపిసోడ్ తీవ్ర కలకలం సృష్టించింది. ఇక, తాజాగా మరోసారి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటానని సుస్మిత చెప్పుకొచ్చారు. దీంతో, అధికార కాంగ్రెస్ పార్టీలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.కొండా సుస్మిత(konda Sushmita) తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాత్రి నేను మాట్లాడిన మాటలకు నేను కట్టుబడి ఉన్నాను. అధిష్టానం మాతో మాట్లాడింది. మీడియాలో ఎలాంటి అంశాలపై మాట్లాడవద్దని అదేశాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని విషయాలపై మాట్లాడలేను. ఏం జరిగిందో అందరికీ తెలుసు’ అని కామెంట్స్ చేశారు.మరోవైపు.. మంత్రి కొండా సురేఖకు సైతం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి పిలుపు వెళ్లింది. ఎమ్మెల్యే క్వార్టర్స్‌కి రావాలని సురేఖకు తెలిపారు. మరికాసేపట్లో ఎమ్మెల్యే క్వాటర్స్‌కి మంత్రి కొండా సురేఖ వెళ్ళనున్నారు. కేబినెట్ భేటీకి కూడా కొండా సురేఖ హాజరకానున్నారు. ఇదిలా ఉండగా.. మినిస్టర్ క్వార్టర్స్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటికి ఆమె మాజీ osd సుమంత్ భార్య డాక్టర్ మనిషా చేరుకున్నట్టు తెలుస్తోంది.ఇది కూడా చదవండి: కొండా సురేఖకు బిగ్ షాక్.. -
ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి ఝలక్.. టీడీపీ శ్రేణుల కొత్త రాజకీయం!
సాక్షి, వైఎస్సార్: కడపలో టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు తిరుగుబావుట ఎగురవేశారు. మాధవీ రెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఆయన భర్త శ్రీనివాసులు రెడ్డి వ్యవహారంపై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీనియర్లు లేరు.. తొక్కా లేదన్న శ్రీనివాసులు రెడ్డి వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ముస్లిం మైనార్టీ నేతలు, కార్యకర్తలు తిరుగుబాటు ఎగురవేశారు. పార్టీకి మొదటి నుంచీ సేవలందించిన వారిని పక్కన పెట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడపలోని పలువురు మైనార్టీ టీడీపీ నేతలు పెద దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాధవీ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలంటూ ప్రార్ధనలు చేశారు. క్రమంలో తిరుగుబాటు వర్గాన్ని కమలాపురం నేత పుత్తా నరసింహారెడ్డి దగ్గరకు తీసుకున్నారు. పార్టీని కాపాడాలంటూ పుత్తా వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు.అధికారం వచ్చి ఏడాదిన్నర అయినా పార్టీ సీనియర్లను పట్టించుకోలేదని ఆరోపించారు. దీనికి తోడు అంతా తమ కుటుంబ పెత్తనమేనంటూ బహిరంగ వ్యాఖ్యలు చేయడంపై నిరసన తెలిపారు. ఇంత వరకూ ఒక్క మైనార్టీ నేతకు కూడా నామినేటెడ్ పదవులు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి కడపకు రాక ముందు నుంచీ పార్టీ తరఫున కష్టాలకోర్చి ముందుకు తీసుకెళ్లామని సీనియర్ నాయకులు అన్నారు.మరోవైపు.. కడపలో టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డి తీరుతో రోజుకో వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీ శ్రేణులు మాధవీ రెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి వ్యవహారంపై పచ్చ పార్టీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీలో రోజుకో వర్గం తిరుగుబావుటా ఎగురవేయడంతో ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో, టీడీపీలో మరో వర్గం ఏర్పడినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
కొండా సురేఖ వివాదం.. అసలేం జరిగింది?
మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపింది. తన మాజీ ఓఎస్డీ వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల మంత్రి సురేఖ కోపంగా ఉన్నట్టు కనబడుతోంది. మరోవైపు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించిన సురేఖ ఓఎస్డీపై చట్టపరమైన చర్యలకు సర్కారు యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చిన పోలీసులను సురేఖ కుమార్తె సుస్మిత (konda sushmitha) అడ్డుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. తమను టార్గెట్ చేశారని, రాష్ట్రంలో రెడ్ల రాజ్యం నడుస్తోందంటూ సుస్మిత మీడియా ముందు ఫైర్ అయ్యారు.మరోవైపు ఈ వ్యవహారం గురించి తనకేమీ తెలియదని మంత్రి సురేఖ భర్త కొండా మురళి హన్మకొండలో చెప్పారు. తమ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిసి వివాదం పరిష్కారానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. అదే సమయంలో తన కూతురును ఆయన వెనకేసుకొచ్చారు. కాగా, ఈ వివాదంపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కూడా సురేఖ వ్యవహరించిన తీరు పట్ల సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. దేవాదాయ శాఖను ఆమె నుంచి తీసేసుకోవాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం.అసలేం జరిగింది? తన నియోజకవర్గం హుజూర్‌నగర్‌లోని డెక్కన్ సిమెంట్స్‌లోని పనిచేస్తున్న ఓ వ్యక్తిని డబ్బుల కోసం కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ బెదిరించినట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో అతడిని విధుల నుంచి ప్రభుత్వం తప్పించింది. సుమంత్‌ను అదుపులోకి తీసుకుని విచారించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతడు సురేఖ ఇంట్లో ఉన్నాడన్న సమాచారంతో బుధవారం రాత్రి అక్కడికి వెళ్లారు. జూబ్లీహిల్స్ గాయత్రిహిల్స్‌లోని తమ ఇంటికి మఫ్టీలో వచ్చిన పోలీసులను సురేఖ కూతురు సుస్మిత అడ్డుకున్నారు. మంత్రి ఇంటికి పోలీసులు ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. ఈలోపు ఇంట్లో ఉన్న సురేఖ, సుమంత్ బయటికి వచ్చి కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మా ప్రమేయం లేదుఈ నేపథ్యంలో మేడారం జాతర పనులను రోడ్లు భవనాలకు అప్పగిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు కొండా సురేఖ (Konda Surekha) వివాదంపై స్పందించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నిరాకరించారు. డెక్కన్ సిమెంట్ వివాదంలో తన ప్రమేయం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదే వ్యవహారంలో తనపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి తోసిపుచ్చారు. డెక్కన్ సిమెంట్ వివాదంలో తన ప్రమేయం లేదని అన్నారు.తెలంగాణ కేబినెట్ భేటీసీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు, రైతు భరోసా, మైనింగ్ కొత్త పాలసీ, ట్రో ఫేజ్-2 టెండర్లపై మంత్రి మండలిలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కొండా సురేఖ వివాదం నేపథ్యంలో కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, సురేఖకి మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసి క్యాబినెట్ మీటింగ్‌కు హాజరు కావాలని కోరినట్టు తెలుస్తోంది. చదవండి: నన్ను తిట్టినవాళ్లే నాకోసం వస్తున్నారుపొంగులేటిపై ఫిర్యాదు!అంతకుముందు మేడారం పనుల టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి. తన శాఖకు సంబంధించిన రూ. 71 కోట్ల విలువైన పనులను తనవాళ్లకు ఇప్పించుకునేందుకు పొంగులేటి ప్రయత్నిస్తున్నారని సురేఖ ఆరోపించినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి పొంగులేటితో ప్రభుత్వ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. మహేష్ గౌడ్ క్లారిటీమంత్రి కొండా సురేఖ వివాదంపై పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ స్పందించారు. ఈ వ్యవహారాన్ని తాను మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎక్కడో కమ్యూనికేషన్ లోపం కనిపిస్తుందని, తొందరలో క్లారిటీ వస్తుందని మీడియా ప్రతినిధులతో చెప్పారు. -
ప్రైవేటీకరణ ఆపించండి.. ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, కర్నూలు: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం ఆపించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. తాజాగా జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన్ని ఎయిర్‌పోర్టు వద్ద పలువురు నేతలు కలిశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలిపివేయాలని ఈ సందర్భంగా ప్రధానిని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. అలాగే.. వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం పరిశీలించాలని, నంద్యాల-కల్వకుర్తి బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ప్రధాని మోదీని కలిసిన వాళ్ళలో ఎమ్మెల్యే విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్, జెడ్పీ చైర్మన్.. తదితరులు ఉన్నారు.


