సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మురుగుడు హనుమంతరావు, కల్పలతారెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి, గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాల్లో జరగాల్సిన అభివృద్ధిని జగన్ ఐదేళ్లలోనే చేసి చూపించారని.. ఒక ప్రణాళికా బద్దంగా రూపొందిన విధానాలతోనే అది సాధ్యమైందన్నారు. ‘‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్ష తెలిసిన నేత జగన్. ప్రజల అభివృద్ధి కోసం పని చేసిన నేత. ప్రతి కుటుంబం తనదిగా భావించి వారి మేలు ఆశించారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే జగన్ పోరాటాలు చేస్తున్నారు’’ అని సజ్జల అన్నారు.

‘‘2014లో అధికారంలోకి రాలేకపోయాం. నంద్యాల ఉప ఎన్నికలలో చంద్రబాబు చేయాల్సిన కుట్రలన్నీ చేశారు. అన్నీ ఛేదించుకుని 2019లో అధికారంలోకి వచ్చాం. మేనిఫెస్టోని ఖురాన్, బైబిల్, భగవద్గీత గా భావించిన నాయకుడు జగన్. ఐదేళ్ల తర్వాత మేనిస్టోని మళ్ళీ ప్రజల ముందుకు తీసుకెళ్లారు. ఇచ్చిన హామీలన్నీ అమలు వేశామో లేదో చెప్పమనిప్రజల్నే అడిగారు. మళ్ళీ అధికారంలోకి కచ్చితంగా వస్తాం. భారీ సీట్లతో గెలుస్తాం. ప్రజల్లో ఉండే నాయకుడు కాబట్టే జగన్‌కు ఆదరణ ఉంది’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.


