breaking news
Hyderabad
-
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ‘బీబీ కా అలవా’ నుంచి ప్రారంభమయ్యే ‘బీబీ కా ఆలమ్’ ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ నెల 26వ తేదీ(శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.ట్రాఫిక్ మళ్లింపు:బీబీ కా అలవా మార్గం: బీబీ కా అలవా వైపునకు వాహనాల రాకపోకలు అనుమతించబడవు. ఈ ట్రాఫిక్‌ను సునార్‌గల్లీ ‘టి’ జంక్షన్ వద్ద దబీర్‌పురా దర్వాజా మరియు గంగా నగర్ నాలా, యాకుత్‌పురా వైపునకు మళ్లిస్తారు.షేక్ ఫైజ్ కమాన్ మార్గం: షేక్ ఫైజ్ కమాన్ వైపునకు వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను జబ్బార్ హోటల్ వద్ద అవసరాన్ని బట్టి దబీర్‌పురా దర్వాజా లేదా చంచల్‌గూడ వైపునకు మళ్లిస్తారు.ఏతేబార్ చౌక్ మార్గం: ఏతేబార్ చౌక్ నుండి బడా బజార్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను ఏతేబార్ చౌక్ వద్ద పరిస్థితిని బట్టి కోట్లా అలీజా లేదా పురాణీ హవేలీ వైపునకు మళ్లిస్తారు.గంగా నగర్ నాలా (యాకుత్‌పురా): ప్రధాన ఊరేగింపు గంగా నగర్ నాలాకు చేరుకున్నప్పుడు, పురాణీ హవేలీ నుండి ఏతేబార్ చౌక్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను పురాణీ హవేలీ వద్ద చత్తా బజార్, దబీర్‌పురా లేదా ఎస్జే రోటరీ (Salarjung Rotary) వైపునకు మళ్లిస్తారు.బీబీ బజార్ చౌరస్తా: ఊరేగింపు గంగా నగర్ నాలాకు చేరుకున్నప్పుడు, మొఘల్‌పురా మరియు వోల్టా హోటల్ నుండి ఏతేబార్ చౌక్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను బీబీ బజార్ చౌరస్తా వద్ద పారిస్ కేఫ్ లేదా తలాబ్ కట్ట వైపునకు మళ్లిస్తారు.గుల్జార్ హౌజ్: ఊరేగింపు ఏతేబార్ చౌక్‌కు చేరుకున్నప్పుడు, మిట్టీ కా షేర్ మరియు మదీనా నుండి ఏతేబార్ చౌక్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను గుల్జార్ హౌజ్ వద్ద మదీనా లేదా మిట్టీ కా షేర్ వైపునకు మళ్లిస్తారు.హాఫెజ్ డంకా మసీదు: ఊరేగింపు కోట్లా అలీజాకు చేరుకున్నప్పుడు, మొఘల్‌పురా వాటర్ ట్యాంక్ నుండి చౌక్ మైదాన్ ఖాన్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను హాఫెజ్ డంకా మసీదు వద్ద పారిస్ కేఫ్ లేదా బీబీ బజార్ వైపునకు మళ్లిస్తారు.చార్మినార్ ప్రాంతం: ఊరేగింపు చార్మినార్‌కు చేరుకున్నప్పుడు, శక్కర్‌కోట్ నుండి గుల్జార్ హౌజ్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. దీనిని మిట్టీ కా షేర్ జంక్షన్ వద్ద ఘన్సీ బజార్ లేదా చేలాపురా వైపునకు మళ్లిస్తారు. అదే సమయంలో ఏతేబార్ చౌక్ వద్ద ఉన్న ట్రాఫిక్‌ను కోట్లా आलीజా లేదా పురాణీ హవేలీ వైపునకు మళ్లిస్తారు.మదీనా చౌరస్తా: ఊరేగింపు చార్మినార్‌కు చేరుకున్నప్పుడు, నయాపూల్ నుండి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను మదీనా చౌరస్తా వద్ద సిటీ కాలేజ్ వైపునకు మళ్లిస్తారు.సాలార్ జంగ్ రోటరీ: ఊరేగింపు మీరాలం మండికి చేరుకున్నప్పుడు.. చాదర్‌ఘాట్ రోటరీ, నూర్ ఖాన్ బజార్, సాలార్ జంగ్ మ్యూజియం, శివాజీ బ్రిడ్జ్ నుండి పురాణీ హవేలీ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను సాలార్ జంగ్ రోటరీ వద్ద నయాపూల్, శివాజీ బ్రిడ్జ్ మరియు నూర్ ఖాన్ బజార్ వైపునకు మళ్లిస్తారు.చాదర్‌ఘాట్ రోటరీ: ఊరేగింపు అలవా సర్తౌక్‌కు చేరుకున్నప్పుడు, చాదర్‌ఘాట్ రోటరీ నుండి కాళీ ఖబర్ వైపు వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను చాదర్‌ఘాట్ రోటరీ వద్ద చాదర్‌ఘాట్ బ్రిడ్జ్ మీదుగా రంగమహల్ లేదా కోటి వైపునకు మళ్లిస్తారు.సాలార్ జంగ్/శివాజీ బ్రిడ్జ్ ప్రవేశ మార్గం: గౌలిగూడ లేదా అఫ్జల్‌గంజ్ నుండి సాలార్ జంగ్/శివాజీ బ్రిడ్జ్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. గౌలిగూడ వైపు ఉన్న సాలార్ జంగ్/శివాజీ బ్రిడ్జ్ ప్రవేశ ద్వారం వద్దనే ఈ ట్రాఫిక్‌ను తిరిగి అఫ్జల్‌గంజ్ మరియు గౌలిగూడ వైపునకు మళ్లిస్తారు.నయాపూల్: ఊరేగింపు అలవా సర్తౌక్‌కు చేరుకున్నప్పుడు, ఎస్జే (Salarjung) రోటరీ వైపు వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను నయాపూల్ వద్ద మదీనా వైపునకు మళ్లిస్తారు.ఆర్టీసీ బస్సుల మళ్లింపు: ఏపీఎస్ఆర్టీసీ మరియు టీజీఎస్ఆర్టీసీ జిల్లా బస్సుల రాకపోకలను 26వ తేదీ ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు రంగమహల్, అఫ్జల్‌గంజ్ వైపునకు మళ్లిస్తారు. ఊరేగింపు ముగింపు స్థానానికి చేరుకునే వరకు ఈ బస్సులను కాళీ ఖబర్, మీరాలం మండి రోడ్డుపైకి అనుమతించరు. -
నాతో సహా ఉద్యోగులంతా మధ్య తరగతి వారే: సీఎం రేవంత్
హైదరాబాద్: తనతో సహా ఉద్యోగులంతా మధ్య తరగతి వర్గానికి చెందిన వారేనని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగులంతా సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఆలోచనని, అందుకే కార్మికులకు కోటి రూపాయల బీమా అందిస్తున్నామన్నారు. ఈరోజు(గురువారం) రవీంద్రభారతిలో ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్. దీనిలో భాగంగా రేవంత్ మాట్లాడుతూ.. ఉద్యోగులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే బీమా రక్షణ పథకాన్ని అమల్లోకి తెస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు బీమా కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటివరకూ సింగరేణిలో 45 మంది కార్మికులకు ప్రమాద బీమా అందించామన్నారు సీఎం రేవంత్. ఉద్యోగులు, కార్మికులకు రక్షణ కల్పించే బాధ్యత తమ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. తనను రేవంతన్న అని పిలిస్తే సంతోషంగా ఉంటుందన్నారు. తాను ఒకప్పుడు జెడ్పీటీసీనని, ఆ తర్వాత ఎంపీనని, ఇప్పుడు సీఎంనని రేవంత్ అన్నారు. పదవులు ఇలా మారుతూ ఉంటాయని, అందుచేత రేవంతన్న అనేది శాశ్వతంగా ఉంటుందన్నారు. -
ఐఎస్ సదన్ ఏటీఎం క్యాష్ దోపిడీ కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఏటీఎం క్యాష్ దోపిడీ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ చోరీ ఘటనను ఛేదించిన పోలీసులు.. ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్ తన కుమారుడితో కలిసి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. రీఫిలింగ్ వ్యాన్ నుంచి డ్రైవర్ శ్రీనివాస్ నగదు ఎత్తుకెళ్లాడు. మంగళవారం మధ్యాహ్నం సంతోష్‌నగర్-రెయిన్ బజార్ మెయిన్‌రోడ్డులో ఎస్బీఐ ఏటీఎంలో నగదు డిపాజిట్ చేయడానికి వచ్చారు.ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలో కస్టోడియన్లు, గన్‌మెన్ నగదు డిపాజిట్ చేయడానికి వెళ్తున్న సమయంలో ఇదే అదునుగా భావించి ముందస్తు ప్లాన్ ప్రకారం వ్యాన్ డ్రైవర్ శ్రీనివాస్ రూ.17 లక్షలు ఉన్న బ్యాగ్‌తో అక్కడికి ముందుగానే సిద్ధంగా ఉంచిన బైక్‌పై పరారయ్యాడు.కస్టోడియన్లు, గన్‌మెన్ వ్యాన్ దగ్గరికి వచ్చేసరికి శ్రీనివాస్ కనిపించకపోవడంతో పాటు, బ్యాగు లేకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేష్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేకంగా ఐదు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. టూ వీలర్‌పై వెళ్ళింది తండ్రి కొడుకులుగా నిర్థారించారు.కన్న కొడుకు సహాయంతో చోరీకి స్కెచ్ వేసిన జగిత్యాలకు చెందిన శ్రీనివాస్.. కొన్ని నెలల క్రితమే క్లియర్డ్ సెక్యూరిటీస్‌లో డ్రైవర్‌గా చేరారు. బైక్‌పై శ్రీనివాస్, అతని కుమారుడు ఉప్పుగూడ వరకు వెళ్లారు. అక్కడ చిన్న కుమారుడిని పిలిపించి అతనికి కొంత నగదును ఇచ్చాడు. అక్కడి నుండి క్యాబ్‌లో శంషాబాద్ ఓఆర్ఆర్ వరకు శ్రీనివాస్, అతని కుమారుడు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. -
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం
సాక్షి,హైదరాబాద్: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం (జూన్25) స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభంచింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అర్పేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. 2023లోనూ ప్రమాదంసికింద్రాబాద్లోని ప్రముఖ వ్యాపార సముదాయమైన స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో 2023 మార్చి 16వ తేదీ గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు యువతీయువకులు (నలుగురు యువతులు, ఇద్దరు యువకులు) ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మార్చి 16, రాత్రి దాదాపు 7:30 నుండి 7:45 గంటల సమయంలో కాంప్లెక్స్ బి-బ్లాక్‌లోని 7వ లేదా 8వ అంతస్తులో మంటలు ప్రారంభమై, వేగంగా కింది అంతస్తులకు వ్యాపించాయి.ఐదో అంతస్తులోని ఎయిర్ కండిషనర్ యూనిట్ లేదా ఏడో అంతస్తులో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే దాదాపు 15 ఫైర్ ఇంజన్లు, బ్రోంటో స్కైలిఫ్ట్ వంటి అత్యాధునిక యంత్రాలతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి అర్ధరాత్రి వరకు శ్రమించి మంటలను అదుపు చేశారు. దాదాపు 12 మందికి పైగా వ్యక్తులను సురక్షితంగా రక్షించారు. మరణించిన వారంతా 22 నుండి 23 సంవత్సరాల లోపు వయసున్న నిరుద్యోగ యువతీయువకులే. వీరంతా బతుకుదెరువు కోసం గ్రామాల నుండి హైదరాబాద్ వచ్చి, ఆ కాంప్లెక్స్‌లోని ఒక ఆఫీసులో పని చేసినట్లు తేలింది. మళ్లీ ఇప్పుడు అదే స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో ప్రమాదం చోటు చేసుకోవడం మరింత భయాందోళనను రేకెత్తిస్తోంది. -
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 9 లోని మార్గదర్శకాలపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఈ స్టే ఆదేశాలు వచ్చే మంగళవారం వరకు అమల్లో ఉంటాయని జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం స్పష్టం చేసింది.కోట్లాది రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దంటూ ఆంక్షలు విధించడంపై న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడమే కాకుండా, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయరాదన్న ప్రభుత్వ నిబంధనలను సవాలు చేస్తూ 89 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.కోట్లాది రూపాయల బకాయిలను పెండింగ్‌లో ఉంచితే కాలేజీలు తమ రోజువారీ నిర్వహణను, సిబ్బంది జీతాలను ఎలా చెల్లిస్తాయి? కాలేజీలు ఎలా నడుస్తాయి?" అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం బకాయిలు చెల్లించదు, అటు కాలేజీలను విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోనివ్వదు. ఇలాంటప్పుడు ప్రస్తుత విద్యాసంవత్సరానికి విద్యార్థులకు అడ్మిషన్లు ఎలా ఇస్తారని కోర్టు నిలదీసింది.గతంలో ప్రభుత్వం తెచ్చిన జీవో 7 పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవో నెం. 9 లో కూడా పాత నిబంధనలనే కొనసాగిస్తూ విద్యార్థుల అలాట్మెంట్ లెటర్లలో ‘ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు’ అని పేర్కొనడాన్ని కోర్టు తప్పుబడుతూ స్టే ఇచ్చింది.ప్రభుత్వం తరఫున స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ బకాయిల చెల్లింపుపై వివరణ ఇచ్చారు. ఈ రీయింబర్స్మెంట్ పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నిధుల్లో కేంద్రం వాటా ఉంటుంది. అయితే, ముందుగా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి నిధులు చెల్లించాలని, ఆ తర్వాతే తమ వాటా విడుదల చేస్తామని కేంద్రం చెబుతోందని వివరించారు. దీనివల్ల మొత్తం బకాయిల భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడిందని, వేల కోట్ల రూపాయల బకాయిలు ఉండటం వల్లే కొంత ఆలస్యం జరుగుతోందని కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి రెండు వారాల సమయం కావాలని కోరారు.ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి జూలై 31 లోపు దరఖాస్తు చేసుకున్న అర్హులైన విద్యార్థులందరికీ ఆగస్టు 15 లోపు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ప్రభుత్వం గనుక అధికారికంగా కోర్టుకు రోడ్‌మ్యాప్ సమర్పించి, ఆగస్టు 15 లోపు బకాయిలన్నీ స్పష్టంగా చెల్లిస్తామని హామీ ఇస్తే.. తాము దాఖలు చేసిన పిటిషన్లను విత్‌డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కాలేజీల యాజమాన్యాల తరఫు సీనియర్ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. -
కేవలం విమానాలే కాదు!
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ యావియేషన్ వద్ద నమోదైన మొత్తం 2,312 మానవ సహిత వాయు వాహనాలలో ఐదింట దాదాపుగా నాలుగో వంతు విమానాలే ఉన్నాయి. మిగతావి హెలికాప్టర్లు, గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లు, అల్ట్రా లైట్ విమానాలు. -
మూసీపై ఆ రెండు వంతెనల వ్యథ..
హైదరాబాదులో మూసీ నదిపై చాలా వంతెనలున్నాయి. అందులో రెండు వంతె నలు నగరానికి రెండు ముఖాలను చూపి స్తాయి. ఒకటి చారిత్రక ప్రాధాన్యం గల చాదర్‌ఘాట్ వంతెన, రెండోది ఆధునిక డిజైన్‌తో కూడిన నాగోల్ వంతెన. మొద టిది నగరం నడిబొడ్డున ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రెండోది నగర శివారులో వరదను దాటించలేకపోతోంది. ఈ రెండు వంతెనల పరిస్థితి తెలిస్తే హైదరాబాద్ వరద సమస్యకు అసలు కారణం బోధపడుతుంది.నిజాం కాలంలో పాతబస్తీకీ, రెసిడెన్సీకీ మధ్య వారధిగా చాదర్ ఘాట్ వంతెన నిర్మించారు. అప్పట్లో ఎడ్లబండ్లు, గుర్రపు బగ్గీల కోసం కట్టిన ఈ వంతెన నేడు లక్షలాది వాహనాల భారాన్ని మోస్తోంది. కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్ వ్యాపార కేంద్రాలకు ఇది జీవనాడి. ఇటీవలి కాలంలో పిల్లర్ల బలోపేతానికి చేపట్టిన పనులవల్ల, పిల్లర్ల మధ్య ఖాళీ కుంచించుకుపోయింది. వర్షాకాలంలో నీటితో పాటు వచ్చే వ్యర్థాలు ఈ ఇరుకు సందుల్లో చిక్కుకుపోతున్నాయి. వంతెన కిందే అవరోధం ఏర్పడి, నీరు వెనక్కి పొంగి కోఠి మార్కెట్‌ను ముంచెత్తుతోంది.క్షేత్రస్థాయి పరిశీలనల ప్రకారం, గత కొన్ని దశాబ్దాలలో చాదర్‌ఘాట్ వద్ద పురాతన కాలం నుండి సహజంగా ఉన్న నది వెడల్పు చాలావరకు తగ్గినట్లు కనిపిస్తుంది. నది గర్భంలో విస్తృతంగా పార్కింగ్, మెకానిక్ షెడ్లు వెలిశాయి. వర్షం రాగానే అవే మొదట మునుగుతున్నాయి. ఆ వాహనాలు, సామగ్రి నీటి ప్రవాహా నికి అడ్డుపడి వరద తీవ్రతను అనేక రెట్లు పెంచుతున్నాయి..చాదర్‌ఘాట్ వంతెన గత కాలపు దూరదృష్టికి నిదర్శనం. నాగోల్ వంతెన ఆధునిక ఇంజినీరింగ్‌కు కొలమానం. కానీ రెండూ వరదల్లో మునుగుతున్నా యంటే తప్పు వంతెనలది కాదు, నది సహజ స్వభా వాన్ని అర్థం చేసుకోని మనది!ఇక నాగోల్ వంతెన ఔటర్ రింగ్ రోడ్లో భాగంగా ఎల్బీ నగర్–ఉప్పల్ ట్రాఫిక్‌ను తగ్గించేందుకు నిర్మించారు. ఆధునిక డిజైన్, వెడల్పాటి రోడ్డు, ఎత్తైన పిల్లర్లు– పైకి అన్నీ బాగానే కనిపి స్తాయి. కానీ సమస్య వంతెనలో లేదు, కట్టిన ప్రదేశ స్వభావంలో ఉంది. నాగోల్ వంతెన మూసీ నది పెద్ద మియాండర్ (వంపు తిరిగే) ప్రాంతంలో ఉంది. వరద సమయంలో నీరు నేరుగా పారదు. మియాండర్ వద్ద నీటి వేగం తగ్గి ఒడ్డును బలంగా కోస్తుంది. ఫలితంగా 2020 అక్టోబర్ వరదల్లో నాగోల్ వంతెన వద్ద నీటిమట్టం వంతెన స్థాయికి చేరి పక్కనే ఉన్న బండ్లగూడ, నాగోల్ కాలనీలు ముంపునకు గురయ్యాయి. నాగోల్ వంతెనకు ఇరువైపులా కాల క్రమేణా నిర్మాణాలు వెలిశాయి. దీనితో వరద మైదానం విస్తీర్ణం తగ్గింది. 2023లో నాగోల్ ప్రాంతంలోని కొన్ని అపార్ట్మెంట్ల సెల్లార్లు మునిగి వాహనాలు పాడయ్యాయి. భారీ వర్షం వస్తే నీళ్లు పోవడానికి తగినంత స్థలం లేకుండా పోయింది.ఏం చెయ్యాలి?హైడ్రాలిక్ అధ్యయనాలు చెబుతున్నదేమిటంటే, భారీ వర్షాల సమయంలో మూసీలోకి చేరే నీటి పరిమాణం అధికంగా ఉంటుంది. కానీ ఆక్రమణల వల్ల చాదర్‌ఘాట్, నాగోల్ వంటి కీలక పాయింట్ల వద్ద నది మోయగలిగే సామర్థ్యం తగ్గిపోయింది. ‘మూసీ రివర్‌ఫ్రంట్ రీజువెనేషన్’ పథకంలో భాగంగా ఇక్కడ రియల్ టైమ్ వాటర్ లెవల్ సెన్సార్ ఏర్పాటు చేసి స్థానిక వ్యాపార సంఘాలతో అనుసంధానిస్తే వరద సమయంలో వ్యాపారులు నష్టపోకుండా కాపాడుకోగలుగుతారు. నాగోల్ వద్ద వంతెనకు ఎగువన, దిగువన నది సహజ ప్రవాహానికి ఆటంకం కలగకుండా వరద మైదానాన్ని శాస్త్రీయంగా పునరుద్ధరించే ప్రణాళికను అమలు చేయాలి.అలాగే నదీ తీరంలో కొత్తగా నిర్మించే భవనాలకు ‘స్టిల్ట్ ఫ్లోర్’ విధానాన్ని తప్పనిసరి చేసి, సెల్లార్ల నిర్మాణాన్ని పరిమితం చేసే దిశగా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. చాదర్‌ఘాట్ నుంచి నాగోల్ వరకు డ్రోన్ సర్వేతో త్రీడీ మ్యాపింగ్ చేపట్టి ఎక్కడ వరద ముప్పుందో, ఎక్కడ నీటి ప్రవాహం నిరోధించ బడుతోందో ముందుగానే గుర్తిస్తే వర్షాకాలంలోపు నివారణ చర్యలు తీసుకోవచ్చు.- డా. రామకృష్ణ మనిమద్దె, వ్యాసకర్త ఎర్త్ సైంటిస్ట్ – నదీ వ్యవస్థల పరిశోధకులు -
'నన్ను జైలుకు పంపించండి..' హోటల్లో రౌడీ షీటర్ బీభత్సం!
హైదరాబాద్, నాంపల్లి: ‘నాకు బయట రక్షణ లేదు. నేను జైల్లోనే సురక్షితంగా ఉంటా.. నన్ను జైలుకు పంపండి’ అంటూ ఓ రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. హోటల్లో బీభత్సం సృష్టించి అరెస్టయ్యాడు. ఆగాపురాకు చెందిన షేక్ అస్లాం.. తనకు ప్రాణహాని ఉందని భయాందోళనకు గురయ్యాడు. ఎలాగైనా జైలుకు వెళ్లాలని భావించి మంగళవారం ఆగాపురాలోని ఓహోటల్‌కు వెళ్లి వంటపాత్రలు, గ్యాస్ సిలిండర్లను బయటకు విసిరేసి బీభత్సం సృష్టించాడు. అద్దాలను ధ్వంసం చేశాడు. నేను జైలుకు వెళ్లేందుకే ఇలా చేస్తున్నా అంటూ అరుస్తూ విధ్వంసానికి పాల్పడ్డాడు. హబీబ్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి అస్లాంను అదుపులోకి అరెస్టు చేశారు. -
ఆన్లైన్ గేమ్స్.. డేంజర్ బెల్స్
సాక్షి, హైదరాబాద్: ‘ఫ్రీ ఫైర్’.. ‘ఫ్రీ ఫైర్ మ్యాక్స్’ వంటి ఆన్లైన్ ఆటల ఉచ్చులో పడి చిన్నారులు చితికిపోతున్నారు. వారితో పాటు కుటుంబీకులూ ఆర్థికంగా, మానసికంగా నష్టపోతున్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వస్తున్న కొన్ని ఫిర్యాదులు పైకి కేవలం ఆర్థిక మోసాలుగా కనిపిస్తున్నప్పటికీ.. వెనుక ఈ వ్యసనం ఉంటోంది. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడమే దీనికి ప్రధాన కారణమని నగర కొత్వాల్ వీసీ సజ్జనర్ పేర్కొన్నారు.హ్యాకింగ్ కాదు ‘సన్’ స్ట్రోక్...తన మొబైల్‌కు వరుసగా నగదు డెబిట్ మెసేజ్‌లు రావడంతో కొందరు బాధితులు ఇటీవల సైబర్ క్రైమ్ ఠాణాకు క్యూ కట్టారు. తమ బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందంటూ ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల దర్యాప్తు నేపథ్యంలో వెలుగులోకి వచి్చన నిజాలు తల్లిదండ్రులను షాక్‌కు గురిచేశాయి. అక్కడ ఎలాంటి హ్యాకింగ్ జరగలేదని, వారి పిల్లలు ఆన్లైన్ గేమింగ్‌లో వర్చువల్ కాయిన్స్, డైమండ్స్ కొనుగోలు చేయడానికి తల్లిదండ్రుల డెబిట్ కార్డు వివరాలు వాడారని తేలింది. ప్రధానంగా తాతయ్యలు, నానమ్మల ఫోన్లలో యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయి ఉండటంతో పిల్లలు సులభంగా రూ. వేల లావాదేవీలు చేసేశారు.గేమ్ పరిచయంతో అక్కడకు పయనమై...‘ఫ్రీ ఫైర్’ గేమ్ ద్వారా కొందరు అపరిచిత వ్యక్తులతో పరిచయం పెంచుకున్న బాలికలు ఆపై సోషల్ మీడియా యాప్స్ ద్వారా వారితో చాటింగ్ కొనసాగించారు. అలా ఆన్లైన్ మాయలో పడిపోయి, కేవలం ఇంటర్నెట్లో మాత్రమే పరిచయమైన ఆ వ్యక్తులను నేరుగా కలవడానికి తమ ఇళ్లను వదిలారు. పక్క రాష్ట్రానికి వెళ్లేందుకు పయనం కాగా... ఫిర్యాదు అందుకున్న పోలీసులు సకాలంలో స్పందించి ఆ బాలికలను సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఇలా రికార్డుల్లోకి ఎక్కకుండా కుటుంబాల మధ్యే ఉండిపోతున్న ‘గేమింగ్ ఉదంతాలు’ ఎన్నో ఉంటున్నాయి.అదో స్టేటస్ సింబల్‌గా మారడంతో...ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 10 నుంచి 17 ఏళ్ల విద్యార్థులు క్లాస్‌రూమ్స్ కంటే ఫ్రీ ఫైర్, మ్యాక్స్ వంటి గేమింగ్ వర్చువల్ ప్రపంచంలోనే ఎక్కువగా ఉంటున్నారు. ఆ ఆటల్లో రేర్ ఐటమ్స్, రకరకాల ఆయుధాలు, ఎలైట్ పాస్‌లు ఉన్నవారినే స్నేహితులు హీరోలుగా చూడటం, అవి లేని వారిని తక్కువ చేసి మాట్లాడటంతో.. ఆ ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు వాటి కోసం డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఒకప్పుడు ఆన్లైన్ క్లాసుల పేరుతో చేతికి వచి్చన ఫోన్లు, నేడు అర్ధరాత్రి వరకు సాగే గేమింగ్ సెషన్లుగా మారిపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా 2022లోనే కేంద్ర ప్రభుత్వం ‘ఫ్రీ ఫైర్’ గేమ్‌ను నిషేధించింది. సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు వీపీఎన్ ద్వారా ఆడుతున్నారు. ‘ఫ్రీ ఫైర్ మ్యాక్స్’ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ల్లో లభిస్తోంది. కళ్లు తెరవండి.. పిల్లల్ని కాపాడుకోండి..పిల్లలు వాడే ఫోన్లలో సేవ్ అయి ఉన్న బ్యాంక్ కార్డులు, యూపీఐ ఆటోఫిల్ వివరాలను తొలగించాలి. ప్రతి లావాదేవీకి పిన్ లేదా బయోమెట్రిక్ లాక్ తప్పనిసరి చేయాలి. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లలో ‘పేరెంటల్ కంట్రోల్స్’, ‘పర్చేజ్ అప్రూవల్స్’ ఆన్ చేసుకోవాలి. బ్యాంక్ అలర్ట్ మెసేజ్‌లను నిరంతరం గమనిస్తూ, అలా చేయమని పెద్దలకు చెప్పాలి. పిల్లలకు పరిమిత బ్యాలెన్స్ ఉండే ప్రీపెయిడ్ కార్డులే ఇవ్వాలి. ఆన్లైన్ ఆటలను కేవలం వినోదం కోసమే. అదీ పరిమితితోనే ఆడాలి. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు, సంరక్షకులు కూడా చిన్నారులను పర్యవేక్షించాలి. – వీసీ సజ్జనర్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ -
సోమాజిగూడలో ప్లాస్టిక్ ఫుట్‌పాత్..
బంజారాహిల్స్: నడకదారులకు పూర్తిగా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ పేవర్ బ్లాక్‌లతో తయారుచేసిన మొదటి ఫుట్‌పాత్ సోమాజిగూడలో అందుబాటులోకి వచి్చంది. ప్లాసిక్ పేవర్ బ్లాక్‌లను ఉపయోగించి ఫుట్‌పాత్‌లను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ అధికారులు ప్రయోగాత్మకంగా చేపట్టారు.సౌరశక్తితో నడిచే ఫుట్‌పాత్‌ల నిర్మాణ పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని సోమాజిగూడ– నెక్లెస్‌రోడ్డు ఎంఎంటీఎస్ స్టేషన్ల మధ్య రెండు కిలోమీటర్ల మేర ప్లాస్టిక్ నడక దారిని అందుబాటులోకి తీసుకువచ్చారు. జూబ్లీహిల్స్ భారతీయ విద్యాభవన్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లోనూ అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ ప్రతిపాదించింది.పారేసిన ప్లాస్టిక్‌తో.. పారేసిన ప్లాస్టిక్ సంచులు (పాలీ బ్యాగ్‌లు), సీసాలు, సీసాల మూతలు, తినుబండారాల ప్లాస్టిక్ ప్యాకెట్లను పేవర్ బ్లాక్‌ల తయారీకి వినియోగించారు. పేవర్ బ్లాక్‌ల్లో 60–70 శాతం వరకు తక్కువ సాంద్రత కలిగిన పాలిథిన్, అధిక సాంద్రత కలిగిన సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. మిగిలిన భాగంలో కొంత మినరల్ మిశ్రమాన్ని వాడినట్లు అధికారులు తెలిపారు.సుదీర్ఘ కాలం మన్నికగా.. ప్లాసిక్ ఫుట్‌పాత్‌లు వాటర్ ప్రూఫింగ్‌తో పాటు సుదీర్ఘకాలం నాణ్యతగా, మన్నికగా ఉంటాయని ఇంజినీర్లు తెలిపారు. ఒకవేళ మరమ్మతులు అవసరమైతే సంబంధిత భాగంలో బ్లాక్‌లను విడిగా తీసి మార్చవచ్చని వారు పేర్కొన్నారు. -
432 ఏళ్లుగా ఆగని అడుగులు..
సాక్షి, హైదరాబాద్: రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి. రాజులు మారారు. రోజులు మారాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ.. 1594 నుంచి ఒక్క ఏడాది కూడా ఆగకుండా భాగ్యనగర గుండెల్లో నడిచే చరిత్ర ఇది. కుతుబ్ షాహీల వారసత్వం, నిజాం పాలనకు ముగింపు పలికినా చెక్కుచెదరని సంప్రదాయం బీబీ కా అలం. వజ్రాలు, వైఢూర్యాలు పొదిగిన అలంతో ఏనుగుపై సాగే ఈ ఊరేగింపు ఈ నెల 26న మరోసారి నగర వీధుల్లో పునరావృతం కానుంది. మొహర్రం సందర్భంగా ఈ ఏడాది కేరళ నుంచి ప్రత్యేకంగా ఏనుగును తీసుకురావడం విశేషం.వజ్ర, వైఢూర్యాల వైభవం.. మహ్మద్ ప్రవక్త కుమార్తె బీబీ ఫాతిమా కాలం చేసిన అనంతరం ఆమె చివరి స్నానంగా వినియోగించిన బల్లను ఆరో కుతుబ్ షాహీ రాజు మహమ్మద్ కులీ తల్లి హయత్ భక్షి బేగం కోరిక మేరకు తీసుకొచ్చి దాంతోనే తయారు చేసిన అలంను ఆమె జ్ఞాపకార్థం నగరంలో 1594లో ప్రతిíÙ్ఠంచారు. నిజాం పాలకులు బహుమతిగా ఇచి్చన వజ్రాలు, వైఢూర్యాలు, అరుదైన రత్నాలు అలం చుట్టూ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.ఏడాది పొడవునా దబీర్‌పురాలోని బీబీ కా అలావాలో పోలీసుల ఆర్మ్డ్ గార్డ్ రక్షణలో భద్రంగా ఉంచి, ఊరేగింపు రోజు మాత్రమే వీటిని బయటకు తీస్తారు. పోలీస్, జీహెచ్ఎంసీ, విద్యుత్, రెవెన్యూ శాఖల సమన్వయంతో 432 ఏళ్లుగా ఊరేగింపు కొనసాగుతోంది. ఈ నెల 26న దబీర్‌పురా నుంచి చార్మినార్, గుల్జార్ హౌజ్ మీదుగా చాదర్‌ఘాట్ వరకు సాగే ఊరేగింపునకు 2వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సంప్రదాయం హైదరాబాద్ మత సామరస్యానికి, గంగా జమునా తెహజీబ్‌కు నిలువెత్తు నిదర్శనం. -
సిటీలో 4.1, స్టేట్‌లో 2.8%
⇒ 2026 మార్చిలో జూబ్లీహిల్స్‌లో జాగింగ్ చేస్తూ ఓ 52 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి తీవ్ర గుండెపోటుకు గురి అయ్యాడు. అక్కడే ఉన్న వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు ఒకరు వెంటనే సీపీఆర్ చేయ డంతో రోగిని ఆస్పత్రికి తరలించేలోగా గుండె కొట్టుకోవడం తిరిగి మొదలైంది.⇒ 2025 డిసెంబర్లో ఎల్బీ నగర్ వద్ద మెట్రో రైల్లో ఓ 28 ఏళ్ల యువతి ఒక్కసారిగా కుప్పకూలింది. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సకాలంలో సీపీఆర్ చేయడంతో ఆమె గుండె తిరిగి పనిచేయడం ప్రారంభించింది.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా సుమారు 80 వేల మంది సడెన్ కార్డియాక్ అరెస్ట్‌తో మరణిస్తుంటే వారిలో 90 శాతం మంది ఆస్పత్రికి చేరేలోపే ప్రాణం వదులుతున్నారు. అంబులెన్సుల సగటు రెస్పాన్స్ టైం 12 నిమిషాలుగా ఉంటోంది. ఇలాంటి సందర్భాల్లో జరిగే ప్రతి నిమిషం ఆలస్యం రోగి బ్రతికే అవకాశాలను 10 శాతం చొప్పున తుడిచేస్తోంది. ఎందుకంటే.. గుండె ఆగిన 4 నిమిషాల్లోగా మెదడుకు ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరణ కాకపోతే అది శాశ్వతంగా దెబ్బతింటుంది. దీన్నే గోల్డెన్ 4 మినిట్స్ అంటారు.అంటే కార్డియాక్ అరెస్ట్‌కు గురైన వారికి చికిత్స ప్రారంభమయ్యేలోగా వారి గుండెను తిరిగి కొట్టుకొనేలా చేసి ప్రాణం నిలిపే బ్రహ్మాస్త్రం లాంటి ప్రక్రియే కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్). కానీ జీహెచ్ఎంసీ పరిధిలో 2024–25లో బహిరంగ ప్రదేశాల్లో 412 మంది కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలితే అక్కడికక్కడే సీపీఆర్ అందడంతో కేవలం 38 మందే బతికారు. అంటే సక్సెస్ రేట్ కేవలం 9.2%గానే నమోదైంది. ఈ లెక్కన బహిరంగ ప్రదేశాల్లో ప్రతి 10 మంది కార్డియాక్ అరెస్ట్ బాధితుల్లో 9 మందిని కోల్పోతున్నాం. బైస్టాండర్స్లో కేవలం 4.1% మందికే సీపీఆర్ చేయడం తెలియగా మిగిలిన 95.9% మందికి దాని గురించి తెలి యకపోవడమే అందుకు ప్రధాన కారణం.విదేశాల్లో అలా.. మన దేశంలో ఇలా..ఆధునిక సీపీఆర్ పద్ధతిని 1960లో అమెరికాకు చెందిన డాక్టర్ విలియం బి. కూవెన్Œహోవెన్, ఆయన బృందం అభివృద్ధి చేసింది. 65 ఏళ్ల తర్వాత చూస్తే నార్వే, డెన్మార్క్, అమెరికా ప్రభుత్వాలు 5వ తరగతి నుంచే స్కూల్ విద్యార్థులకు పాఠ్యాంశంగా సీపీఆర్‌ను చేర్చాయి. దీంతో ఆయా దేశాల్లో బైస్టాండర్ సీపీఆర్ రేట్ 60% దాటింది. ఫలితంగా కార్డియాక్ అరెస్ట్ సర్వైవల్ రేట్ 40%గా ఉంది. మరోవైపు జపాన్ ప్రభుత్వం పౌరులకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేందుకు సీపీఆర్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసింది. అలాగే జపాన్‌లోని ప్రతి రైల్వే స్టేషన్లో ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ మెషీన్‌ను ఆ దేశ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.ఇక యూకే ప్రభుత్వం నేషనల్ రీస్టార్ట్ ఎ హార్ట్ డే పేరుతో ఏటా 2 లక్షల మందికి సీపీఆర్‌పై ఉచిత శిక్షణ అందిస్తోంది. కానీ భారత్‌లో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) 2025 సర్వే ప్రకారం భారత్‌లో సీపీఆర్‌పై శిక్షణ పొందిన వారి సంఖ్య 1.3% నుంచి 9.8% మధ్యే ఉంది. హైదరాబాద్‌లో సీపీఆర్‌పై ప్రాథమిక అవగాహన ఉన్నవారు 4.1% మంది మాత్రమే ఉండగా తెలంగాణవ్యాప్తంగా ఇది కేవలం 2.8% గానే నమోదైంది.30 నిమిషాల్లో నేర్చుకోవచ్చు..సీపీఆర్ చేసేందుకు ఎంబీబీఎస్ డిగ్రీలు అవరసరం లేదని.. 14 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ సీపీఆర్ ప్రక్రియను కేవలం 30 నిమిషాల్లో నేర్చుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు తమ సూచనలు అమలు చేస్తే కేవలం ఐదేళ్లలోనే కార్డియాక్ అరెస్ట్ కేసుల్లో సర్వైవల్ రేట్ 9 శాతం నుంచి 30 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.సీపీఆర్ ఆవశ్యకతపై ప్రభుత్వాలకు వైద్య నిపుణుల సూచనలు ఇవీ..⇒ 8వ తరగతి నుంచే విద్యార్థులకు హెల్త్ ఎడ్యుకేషన్‌లో భాగంగా సీపీఆర్‌ను చేర్చి నార్వే మోడల్ అమలు చేయాలి.⇒ డ్రైవింగ్ లైసె¯న్స్, పాస్‌పోర్ట్ జారీకి ముందు నిర్వహించే పోలీస్ వెరిఫికేషన్‌కు సీపీఆర్ సర్టిఫికెట్‌ను జత చేయడాన్ని తప్పనిసరి చేయాలి.⇒ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాల్లో ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫైబ్రిలేటర్ (ఏఈడీ) మెషీన్లు, సీపీఆర్ చార్టులు పెట్టాలి.⇒ రెసిడెన్షియల్ అసోసియేషన్లు, కాలేజీలు, ఆఫీసుల్లో ప్రతి 6 నెలలకోసారి సీపీఆర్ మాక్‌డ్రిల్ నిర్వహించాలి. -
ఓవర్‌లోడ్‌కు అడ్డే లేదు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్దయెత్తున ఓవర్‌లోడ్‌తో కూడిన ట్రక్కుల్లాంటి వాహనాలు ఇప్పటికీ రోడ్ల మీద యథేచ్ఛగా తిరుగుతూనే ఉన్నాయి. కేవలం రెండు రోజుల తనిఖీల్లో దాదాపు 190 ఓవర్ లోడ్ వాహనాలను అధికారులు జప్తు చేశారంటే, పరిమితికి మించిన లోడ్‌తో ఎన్ని వాహనాలు ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నాయో అవగతమవుతోంది. ఇదెంత ప్రమాదకరమో కూడా అర్థమవుతోంది. గత సోమవారం భూపాలపల్లి జిల్లాలో పరిమితికి మించిన లోడ్‌తో వెళ్లే వాహనాల తనిఖీలో ఉండగా బొగ్గు లోడు లారీ ఢీకొనటంతో జిల్లా రవాణా అధికారి వెంకన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా ఓవర్‌లోడ్ వాహనాలు రాత్రి 11 తర్వాతే ప్రయాణిస్తుండటంతో అర్ధరాత్రి వేళ అధికారులు తనిఖీలు చేయాల్సి వస్తోంది. అసలు ఓవర్‌లోడ్ సమస్యే లేకుంటే ఆ రోజు వెంకన్న తనిఖీ డ్యూటీలో ఉండేవారు కాదు.. ఆయన దుర్మరణం చెంది ఉండేవారు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాయల్టీ చెల్లిస్తే..ఓవర్‌లోడ్‌కు ఓకే!: ఇసుక రీచ్‌ల నుంచి ఇసుక, క్రషర్ల నుంచి కంకర, గ్రానైట్, థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి ఫ్లైయాష్ లను భారీ ట్రక్కుల్లో తరలిస్తుంటారు. ఇక్కడే పరిమితికి మించిన లోడ్ ట్రక్కుల్లోకి చేరుతోంది. ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సాగుతున్న ఇసుక రీచుల వద్ద అక్రమంగా అదనపు లోడ్‌ను లారీల్లోకి ఎక్కించేస్తున్నారు. లోడ్ వివరాలు వెల్లడిస్తూ జారీ అయ్యే వే బిల్లుల్లో మాత్రం నిబంధనలకు లోబడే లోడ్ ఉంటుండటం గమనార్హం.ఈ క్రమంలో భారీ మొత్తం చేతులు మారుతోంది. ఇక మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో క్రషర్లలో లోడింగ్ జరుగుతోంది. కంకర, గ్రానైట్ రాళ్లను పరిమితికి మించి తరలిస్తున్నారు. ఇక సిమెంటు కంపెనీలు సిమెంటును, థర్మల్ పవర్ ప్లాంట్లు ఫ్లైయాష్ ను అలాగే తరలిస్తున్నాయి. ట్రక్కు సామర్థ్యం మేరకు లోడ్ ఉండాల్సి ఉండగా, దాన్ని పట్టించుకోకుండా ఎంత పరిమాణానికి రాయల్టీ చెల్లిస్తే అంత లోడ్‌ను నింపేస్తున్నారు. రవాణా, గనుల శాఖల మధ్య సమన్వయ లోపంతో ఓవర్‌లోడ్ ట్రక్కులకు అడ్డు లేకుండా పోతోందనే విమర్శలు విన్పిస్తున్నాయి. నిపుణులేం చెబుతున్నారు? ‘ప్రతి క్రషర్, క్వారీ, మైనింగ్ ప్రాంతం వద్ద ఉండే డిజిటల్ వే బ్రిడ్జ్‌లను రవాణా శాఖ సర్వర్‌తో అనుసంధానించాలి. వాహన పరిమితి కన్నా ఒక్క కేజీ ఎక్కువ ఉన్నా అక్కడి గేటు దాటకుండా కఠిన లాకింగ్ సిస్టమ్ తీసుకురావాలి. ఓవర్‌లోడ్ ఎక్కించిన సదరు క్రషర్/క్వారీ యాజమాన్యాలపై భారీ జరిమానాలతో పాటు లైసెన్స్ రద్దు చేసేలా గనుల శాఖ నిబంధనలు సవరించాలి. రవాణా, గనులు, పోలీస్ శాఖలతో కలిపి ’ఉమ్మడి హైవే టాస్‌్కఫోర్స్’ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచాలి. క్షేత్రస్థాయిలో తనిఖీలుచేసే అధికారులకు బాడీ కెమెరాలతో పాటు, స్పీడ్ బ్రేకింగ్ బారికేడ్లు, తగిన పోలీస్ రక్షణ కల్పించాలి..’అని నిపుణులు సూచిస్తున్నారు. గతేడాది నవంబర్ 3న చేవెళ్ల సమీపంలోని మిర్జాగూడ వద్ద పరిమితికి మించిన కంకర లోడ్‌తో దూసుకొచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొనటంతో 19 మంది ప్రయాణికులు చనిపోయారు. దూసుకొచ్చిన ట్రక్కు, ఓవర్‌లోడ్ వల్లనే బీభత్సం సృష్టించింది. ఓవర్‌లోడ్ వాహనాలను నియంత్రించనున్నట్టు ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. రవాణాశాఖ–గనుల శాఖ మధ్య సమన్వయం తీసుకొస్తామని పేర్కొంది. ఏడునెలల తర్వాత.. జూన్ 20న రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖ అధికారులు ఆకస్మికంగా వాహనాలను తనిఖీ చేశారు. ఒకేరోజు ఏకంగా 100 ట్రక్కులను ఓవర్‌లోడ్ కారణంతో జప్తు చేశారు. అయితే తనిఖీ జరిగింది కొన్ని ప్రాంతాల్లోనే కాగా అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేస్తే ఇంకా ఎన్ని వందల వాహనాలు పట్టుబడేవోనన్న చర్చ జరుగుతోంది. -
మాకా కంప్యూటరే కావాలి!
సాక్షి, హైదరాబాద్: ఈసారీ ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సీట్లకే అత్యధిక ప్రాధాన్యం కన్పిస్తోంది. సీఎస్ఈ, అనుబంధ ఎమర్జింగ్ బ్రాంచీల్లోనే 70 శాతం సీట్లున్నాయి. కోర్ గ్రూపులపై ప్రభుత్వం విస్తృత ప్రచారం చేసినా సీట్లు మాత్రం పెరగలేదు. ఈ ఏడాది ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఈ నెల 19న మొదలుకాగా, ఇప్పటివరకు 84,992 మంది స్లాట్ బుక్ చేసుకున్నారు. 36,393 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. విద్యార్థులు గురువారం నుంచి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ ప్రక్రియ జూలై 1 వరకూ కొనసాగుతుంది. ఏ కాలేజీలో, ఏ బ్రాంచీలో ఎన్ని సీట్లున్నాయనేది సాంకేతిక విద్యా మండలి కౌన్సెలింగ్‌లో పొందుపర్చింది.కౌన్సెలింగ్‌కు ర్యాంకర్లు అరకొరే..ఎప్‌సెట్‌లో టాప్ ర్యాంకులు వచ్చిన విద్యార్థులు తొలి దశ కౌన్సెలింగ్‌లో ఇప్పటి వరకూ పెద్దగా పాల్గొనలేదు. వాళ్లలో ఎక్కువ మంది జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల వైపు దృష్టి పెట్టారు. కొంతమందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకులు వచ్చాయి. దీంతో ఐఐటీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. 1–100లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు రాష్ట్ర కౌన్సెలింగ్‌కు ఐదుగురు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1–5000లోపు ర్యాంకు విద్యార్థులు 2,793 మంది కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నారు. 80 వేలపైన ర్యాంకున్న వాళ్లు పెద్దఎత్తున ఆప్షన్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.మొత్తం సీట్లు 1,14,007రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11 యూనివర్సిటీల పరిధిలో 44 (వర్సిటీ క్యాంపస్‌లతో సహా) కాలేజీలున్నాయి. వీటి పరిధిలో 6,046 సీట్లున్నాయి. వీటిని కన్వీనర్ కోటా కిందే భర్తీ చేస్తారు. ఇవికాకుండా రెండు ప్రైవేటు వర్సిటీలున్నాయి. వీటిల్లో 1,800 సీట్లున్నాయి. ఇందులో 1,260 సీట్లను కన్వీనర్ కోటా ద్వారా భర్తీ చేస్తారు. ఇక 151 ప్రైవేటు కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. వీటిల్లో 1,06,161 సీట్లున్నాయి.మొత్తంగా 1,14,007 అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 81,620 సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1,14,007 సీట్లు అందుబాటులో ఉంటే... వీటిలో 81,768 సీట్లు సీఎస్ఈ, ఇతర ఎమర్జింగ్ బ్రాంచీల్లో ఉన్నాయి. వీటిల్లో 58,038 సీట్లు కౌన్సెలింగ్ ద్వారా... మిగిలినవి యాజమాన్య కోటా కింద భర్తీ చేస్తారు. కోర్ గ్రూపుల్లో సీట్లు పెరగలేదు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వాటి అనుబంధ బ్రాంచీల్లో 21,896 సీట్లున్నాయి. సివిల్, మెకానికల్ వాటి అనుబంధ బ్రాంచీల్లో 9,310 సీట్లు మాత్రమే ఉన్నాయి. కెమికల్, బయోటెక్ వంటి ఇతర కోర్సుల్లో 1,033 సీట్లున్నాయి. -
తెలంగాణ హక్కులు తాకట్టు పెట్టే కుట్ర
సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తుంగభద్ర నదిపై కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా నీటిపారుదల ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు బుధవారం లేఖ రాశారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రయోజనాలను పక్క రాష్ట్రాల వద్ద తాకట్టు పెట్టే ప్రమాదకరమైన విధానాలను అవలంబిస్తోంది.నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను తమ రాష్ట్రానికి మళ్లించే ప్రయత్నం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు సహకారం అందిస్తోంది. మరోవైపు తుంగభద్రపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల విషయంలో కూడా అదే ద్రోహ బుద్దితో సీఎం వ్యవహరిస్తూ పాలమూరు రైతాంగం భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు కర్ణాటక నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తెస్తున్నామనే సాకుతో తెలంగాణ జల హక్కులను బేరసారాల అంశంగా మార్చారు.తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న కురిడి (2 టీఎంసీలు), చిక్కాలపర్వి (2.5 టీఎంసీలు), చిక్కాలమంచి (5 టీఎంసీలు) బ్రిడ్జ్–కమ్–బరాజ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలిపిందా? 2025 జూలై 18న కొడంగల్ లిఫ్ట్‌కు కర్ణాటక ఎన్వోసీ ఇవ్వడం వెనుక జరిగిన మతలబు ఏంటి? ఏడాది కాలంగా కర్ణాటక అక్రమ నిర్మాణాలపై అభ్యంతరం చెప్పలేదంటే పరోక్షంగా వాటికి మీరు అనుమతించినట్లేనా? తెలంగాణ నీటిని కర్ణాటకకు తాకట్టు పెట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చారు’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆర్డీఎస్ నిర్వీర్వంపై ఆందోళన‘కేటాయించిన నీటి కంటే ఇప్పటికే ఎక్కువగా వినియోగిస్తున్న కర్ణాటక నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు కూడా పూర్తయితే రాజోళిబండ డైవర్షన్ స్కీమ్ పూర్తిగా నిర్వీర్యమవుతుంది. చివరి దశలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే గ్రావిటీ ద్వారా నారాయణ పేట, కొడంగల్‌కు నీళ్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా దాన్ని పక్కనబెట్టారు. కమీషన్ల కొడంగల్ లిఫ్ట్ పేరిట భీమా ప్రాజెక్టు ఆయకట్టు రైతుల శాశ్వత ప్రయోజనాలను దెబ్బతీశారు. 16.94 టీఎంసీల కేటాయింపులో 7 టీఎంసీలను కొడంగల్ లిఫ్టుకు మళ్లించి రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించే భీమా ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు.కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల ప్రభావం కేవలం ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టులకే పరిమితం కాదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులతో పాటు తాగునీటి అవసరాలు, భవిష్యత్తు నీటి ప్రణాళికలు తీవ్రంగా దెబ్బతింటాయి’ అని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేయడంతోపాటు సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్నారు. -
తుంగభద్ర వాటా రాబట్టుకుందాం
సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర నుంచి రాష్ట్రానికి రావాల్సిన నికర జలాల వాటాను సంపూర్ణంగా రాబట్టుకునే విషయంలో కర్ణాటక, ఏపీ రాష్ట్రాలతో సమన్వయ సాధనకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తుంగభద్ర జలాశయం నుంచి నది ప్రవాహ మార్గంలో రాష్ట్రానికి హక్కుగా 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా, కొన్నేళ్లుగా ఐదారు టీఎంసీలకు మించి రావడం లేదని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. రాజోళిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆనకట్ట కింద జోగులాంబ గద్వాల జిల్లాలోని 75 గ్రామాల్లో 83,987 ఎకరాల ఆయకట్టుకు నీరు అందాల్సి ఉంది.తుంగభద్ర బోర్డు నిర్వహణలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల భాగస్వామ్యం ఉన్నందున కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో నీటి వాటాల సమర్థ వినియోగానికి బోర్డును పటిష్టపరచాలని సూచించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి బుధవారం సాయంత్రం జలసౌధలో తుంగభద్ర ఆనకట్ట, ఆర్డీఎస్, అంతర్రాష్ట్ర జల వివాదాలపై సమీక్ష నిర్వహించారు. కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన నూతన క్రస్ట్ గేట్లను గురువారం ప్రారంభించనుండగా, ఈ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, కర్ణాటక, తెలంగాణ, ఏపీ సీఎంలు డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు హాజరు కానున్నారు.ఈ సందర్భంగా వారి దృష్టికి ఆర్డీఎస్ ఆనకట్ట సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో రేవంత్ ఈ సమీక్షను నిర్వహించారు. ఆర్డీఎస్ ఆనకట్ట ప్రమాదకరంగా మారిందని, భద్రత దృష్ట్యా చేపట్టాల్సిన పనులను అత్యవసరంగా గుర్తించాలని సీఎం సూచించారు. ఆర్డీఎస్ కాల్వ ఆధునికీకరణకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.59 కోట్లు కర్ణాటకకు డిపాజిట్ చేసిందని, పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్యాకేజీ 1, 2 పనులు ఇప్పటికీ చేపట్టలేదని, ప్యాకేజీ 3, 4 పనులు మాత్రం పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నిలిచిపోయిన 1, 2 ప్యాకేజీల పనులు వెంటనే చేపట్టాలని గురువారం కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో కర్ణాటక, ఏపీ, తెలంగాణ సీఎంలతో జరిగే సమావేశంలో ప్రస్తావించాలని నిర్ణయించారు.ఆర్డీఎస్ ఆనకట్టలో పూడిక తొలగించాలిఆర్డీఎస్ ఆనకట్టలో తెలంగాణ భూభాగం వైపు పూడిక నిండిపోవడంతో ఆశించిన విధంగా నీటి మళ్లింపు సాధ్యం కావడం లేదని ఇంజనీర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 2004లో నిపుణుల కమిటీ పూడిక తొలిగించాలని సూచించగా, ఆ కమిటీ సిఫారసులు ఇప్పటికీ అమలు కాలేదని చర్చ జరిగింది. వెంటనే పూడిక తీసేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. పూడిక పేరుకున్న భూభాగం కర్ణాటకలో ఉండటంతో ఆ రాష్ట్ర సహకారం కోరాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, 2004లో నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనల అమలుకు కేంద్రానికి వినతి పత్రం అందించాలని సీఎం సూచించారు.అప్పటి నివేదికకు ఇప్పుడున్న వాస్తవ పరిస్థితిని విశ్లేషించుకోవాలని సూచించారు. వెంటనే పూర్తి వివరాలతో నివేదికను తయారు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. తుంగభద్ర ఎత్తిపోతల పథకం ద్వారా సాధ్యమైనంత నీటిని వినియోగించుకునే ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని అధికారులను నిర్దేశించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా నీటి తరలింపులో కీలకమైన మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం పెంచాలని, వీలైనంత వేగంగా పనులను చేపట్టాలని అదేశించారు. సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ పాల్గొన్నారు. -
కాలిబాట జోలికొస్తే కటకటాలే!
సాక్షి, హైదరాబాద్: ‘ఫుట్‌పాత్‌లపై నడవడం పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు’అన్న సుప్రీంకోర్టు తీర్పును మల్కాజ్గిరి కమిషనరేట్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. పాదచారులకు నడిచే దారి లేక రోడ్లపై వేగంగా వెళ్లే వాహనాల మధ్య రోడ్డును దాటే పరిస్థితి ఏర్పడింది. దీంతో పాదచారులు తరచూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి పోలీసులు కాలిబాట జోలికెళితే తాట తీయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు ఫుట్‌పాత్‌లను ఆక్రమించే వారిపై జరిమానాలను విధిస్తుండగా, ఇక నుంచి ఈ–పెట్టీ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. ఉల్లంఘనదారులకు ఒకట్రెండు రోజులు జైలు లేదా సోషల్ సర్వీస్ శిక్షలు వంటివి ఉంటాయి. అడుగడుగునా ఆక్రమణలే.. మల్కాజ్గిరి పోలీసు కమిషనరేట్ పరిధిలో దుకాణదారులు, వీధి వ్యాపారులు, అక్రమ వాహన పార్కింగ్లు, తాత్కాలిక నిర్మాణాలన్నీ ఫుట్‌పాత్‌లపైనే దర్శనమిస్తున్నాయి. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి ఆక్రమణలు తొలగిస్తున్నా.. కొద్ది రోజుల్లోనే కబ్జాలు పునరావృతమవుతున్నాయి. ఈ కమిషనరేట్‌లో ఫుట్‌పాత్‌ల అక్రమణలు అత్యధికంగా మల్కాజ్గిరి, గోపాలపురం, జవహర్‌నగర్, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, కుషాయిగూడ, ఘట్కేసర్ ప్రాంతాల్లో జరుగుతున్నాయి.ఫుట్‌పాత్‌లను వీధి వ్యాపారులే కాదు ప్రభుత్వ శాఖలే ఆక్రమించడం విడ్డూరం. బస్టాప్‌లు, టాయిలెట్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, జీహెచ్ఎంసీ ఇందిరమ్మ క్యాంటీన్లు వంటివి ఆయా ప్రభుత్వ విభాగాలు ఏర్పాటు చేశాయి. దీంతో నడిచే దారిలేక పాదచారులు రోడ్లపై నడుస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఎల్బీనగర్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో ఉదయం, రాత్రి వేళ్లలో ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి బస్సుల్లో వచ్చే కొరియర్లు, పార్సిళ్లను బస్ స్టాప్‌లు, ఫుట్‌పాత్‌లపై పెడుతున్నారు. దీంతో పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఎన్ఎస్ కింద కేసులు.. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు ఫుట్‌పాత్‌లను ఆక్రమించే వారిపై 39 (బీ) సీపీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. అలాగే కాలిబాట మార్గాలకు అవరోధం కలిగించే వాహనదారులపై మోటార్ వెహికిల్ యాక్ట్ 122/177 కింద కేసులు నమోదు చేస్తున్నారు. గరిష్టంగా రూ.1,000 వరకు జరిమానాలు విధిస్తున్నారు. అయితే జరిమానా తక్కువగా ఉండటంతో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు పునరావృతమవుతున్నాయి. దీంతో ఆక్రమణదారులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. ఇటీవల రాంగోపాలపురం స్టేషన్ పరిధిలోని బ్లూ సీ హోటల్ నిర్వాహకులు పదేపదే ఫుట్‌పాత్ ఆక్రమణలకు పాల్పడుతుండటంతో బీఎన్ఎస్ సెక్షన్ 223 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. న్యాయస్థానంలో చార్జిïÙట్ కూడా దాఖలు చేశారు. కాలిబాట ఆక్రమణలు సామాజిక బాధ్యతారాహిత్యం: బి.సుమతి, కమిషనర్, మల్కాజ్గిరి కమిషనరేట్ చాలా కాలనీల వద్ద పెద్దలు, పిల్లలు ఉదయం, సాయంత్రం వేళల్లో నడిచేందుకు, దుకాణాలకు వెళ్లేందుకు ఫుట్‌పాత్‌లపై జాగా ఉండటంలేదు. ఈ ఆక్రమణల్ని తొలగించాలని పెద్ద సంఖ్యలో వినతులు వస్తున్నాయి. ప్రతి వారం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాం. ఫుట్‌పాత్ ఆక్రమణలనేవి సామాజిక బాధ్యతారాహిత్యం. మార్కెట్లు, వాణిజ్య సముదాయాలు ఉన్న ప్రాంతాల్లో కొంతమందికి ఐదారు షాప్‌లు ఫుట్‌పాత్‌ల మీదే ఉంటున్నాయి. ఇలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఠాణా అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. -
ఖాజీ.. కాసులకు రాజీ!
⇒ చాంద్రాయణగుట్టలో ఓ ఖాజీ మధ్యవర్తితో కలిసి మూడు నెలల్లో 11 దొంగ పెళ్లిళ్లు చేశాడు. అప్పటికే వివాహితుడైన 35 ఏళ్ల వ్యక్తికి, 19 ఏళ్ల యువతికి బలవంతంగా నిఖా చేసి షాదీ ముబారక్‌కు దరఖాస్తు చేయించాడు. ఈ సొమ్మును ఖాజీ, మధ్యవర్తి పంచుకున్నారు. ఆ తర్వాత బాధిత యువతి ఫిర్యాదుతో బాగోతం బయటపడింది. ⇒ బహదూర్‌పురాలో ఓ ఖాజీ ఒకే రోజు అక్కాచెల్లెళ్లకు ఒకే వ్యక్తితో నిఖా చేశాడు. ఇద్దరి పేరున నిధులు మంజూరయ్యాయి.సాక్షి, హైదరాబాద్: ముస్లిం వివాహ వ్యవస్థకు మూల స్తంభాలైన ఖాజీలలో కొందరు.. నేడు ఆ వ్యవస్థకే గొడ్డలిపెట్టుగా మారుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. షాదీ ముబారక్ కింద పేద ముస్లిం యువతులకు ప్రభుత్వం ఇచ్చే రూ.1,00,116 సాయం కొందరికి కాసుల వర్షం కురిపిస్తోంది. ఇష్టమొచి్చనట్టుగా నిఖాలు చేసేస్తుండటం, కొన్ని వివాహాలపై సందేçహాలు తలెత్తడంతో మైనార్టీ సంక్షేమ శాఖ విచారణ జరిపింది. 2024–25లో హైదరాబాద్‌లో ఈ తరహాలో 212 అనుమానాస్పద పెళ్లిళ్లు జరిగినట్లు ప్రాథమికంగా తేలింది. రాష్ట్రంలో వక్ఫ్‌బోర్డు గుర్తింపు పొందిన ఖాజీలు 387 మంది ఉన్నారు.‘తెలంగాణ ముస్లిం ఖాజీల చట్టం–2016’ప్రకారం వివాహానికి వధూవరులకు తగిన వయసు, అంగీకారం, సాక్షులు తప్పనిసరి. కానీ 65 శాతం నిఖాల్లో ఈ నియమాలు పాటించకుండానే కొందరు కార్యక్రమం ముగించేస్తున్నారు. వక్ఫ్ బోర్డు నిఖాకు రూ.2,500 ఫీజు నిర్ణయిస్తే, అక్రమ పెళ్లిళ్లకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి భర్త నుంచి విడిపోవడానికి ముస్లిం మహిళ ‘ఖులా’తీసుకోవాలి.కానీ భార్య సంతకం/సమ్మతి లేకుండా, ఆమెకు తెలియకుండానే ఆమె పేరిట కొందరు ఖాజీలు ఖులా పత్రాలు ఇచ్చేస్తున్నారు. మలక్‌పేట్‌కు చెందిన సల్మాకు తెలియకుండానే భర్త రూ.30 వేలు ఇచ్చి ఖులా చేయించుకున్నాడు. మూడు నెలల తర్వాత నోటీసు వస్తేగానీ ఆమెకు తెలియలేదు. 2024–25లో నగరంలో ఇలాంటి ఫిర్యాదులు 34 వచ్చాయి. నాయబ్ ఖాజీల అక్రమ దందా కొందరు గుర్తింపు పొందిన ఖాజీలు నిబంధనలకు విరుద్ధంగా భారీ సంఖ్యలో నాయబ్ ఖాజీలను(డిప్యూటీ) నియమించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 200కు పైగా అనధికార నాయబ్ ఖాజీలు ఉన్నట్టు సమాచారం. కాగా వీరు కూడా నిఖాలు జరిపించేస్తున్నారు. వాస్తవానికి వీరికి ఎలాంటి అధికారిక అనుమతి లేదు. రికార్డులు ఉండవు. కానీ ఒక్కో నిఖాకు రూ.5 వేలు వసూలు చేస్తూ పెళ్లిళ్లు చేస్తున్నారు. గత రెండేళ్లలో వక్ఫ్‌బోర్డుకు 180కి పైగా ఫిర్యాదులు వచ్చినా చర్యలు నలుగురిపైనే చర్యలు తీసుకున్నారు. సిబ్బంది లేరనే కారణంతో వక్ఫ్‌బోర్డు ఖాజీల విషయంలో ఉదాసీనత ప్రదర్శిస్తోంది. నిఖా, ఖులాను ఆధార్‌తో అనుసంధానించాలి ‘ఖాజీ పదవి న్యాయం కోసం.. కాసుల కోసం కాదు’అని మత గురువులు మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ‘ఖాజీ నియంత్రణ ప్రాధికార సంస్థ’ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి నిఖా, ఖులాను ఆధార్‌తో అనుసంధానించి ఆన్లైన్లో నమోదు చేస్తేనే ఈ దందాకు అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖాజీ వ్యవస్థకు చెడ్డపేరు నిఖా అనేది షరియత్ ప్రకారం పవిత్రమైన బంధం, కాసుల కోసం దానిని అమ్ముకోవడం నిషిద్ధం. కొందరు చేసే తప్పుల వల్ల మొత్తం ఖాజీ వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది. చట్టబద్ధంగా, పారదర్శకంగా నిఖా, ఖులా నిర్వహించడమే మా బాధ్యత. ప్రభుత్వ పథకాల కోసం బూటకపు పెళ్లిళ్లు చేస్తూ, ఫేక్ సర్టీఫికెట్లు ఇచ్చే ఖాజీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. షాదీముబారక్ సొమ్ము కోసం దొంగ పెళ్లిళ్లు చేసిన వారిని, సహకరించిన మధ్యవర్తులను శిక్షించాలి. – ఖాజీ ఇక్రాముల్లా, నాజిరుల్ ఖజాత్ (రాష్ట్ర ఖాజీల ప్రతినిధి) (ఫొటో కామన్‌లో ఖాజీ పేరుతో ఉంది) -
ఓటరు వివరాల సేకరణ నేటి నుంచి షురూ
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026లో భాగంగా గురువారం నుంచి రాష్ట్రంలోని ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం..జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటా తిరిగి ప్రతి ఓటరుకు ఒక జత ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయనున్నారు.ఫారంపై సంబంధిత ఓటరు పేరు, ఎపిక్‌కార్డు సంఖ్య, చిరునామా, ఫొటో, తదితర పాక్షిక వివరాలు ముద్రించి ఉండనున్నాయి. మిగిలిన వివరాలతో రెండు ప్రతులను పూరించాక వాటిపై బీఎల్ఓ సంతకం చేసి ఒక ప్రతిని ఓటరుకే రశీదుగా ఇచ్చి మరో ప్రతిని తనతో పాటు తీసుకెళ్తారు. ఈ విధంగా ఓటర్లు వివరాలు భర్తీ చేసి తమ సంతకం/వేలి ముద్రతో జూలై 24 లోగా బీఎల్ఓలకు తిరిగి అప్పగిస్తేనే జూలై 31న ప్రచురించే ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు రానుంది. మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, ప్రతి ఒక్క ఓటరుకు పంపిణీ చేసేందుకు జత ఎన్యూమరేషన్ ఫారాలను ఇప్పటికే ముద్రించి బీఎల్ఓలకు సరఫరా చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆంగ్లంలో, మిగిలిన జిల్లాల్లో తెలుగులో ప్రచురించిన ఎన్యూమరేషన్ ఫారాన్ని ఓటర్లకు పంపిణీ చేయనున్నారు. ఓటరు స్థానికంగా అందుబాటులో లేకపోతే అతడి ఎన్యూమరేషన్ ఫారాన్ని కుటుంబ పెద్ద భర్తీ చేసి సంతకం పెట్టి బీఎల్ఓకు ఇవ్వవచ్చు. పోలింగ్ కేంద్రాల వారీగా సర్ ముసాయిదా ఓటర్ల జాబితాను జూలై 31న ప్రచురిస్తారు.ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించడంలో విఫలమైన ఓటర్లను గైర్హాజరు/నివాసం మారడం/చనిపోయిన/డూప్లికేట్ ఓటర్లుగా పరిగణించి వారి పేర్లను ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు. ఇలా తొలగించిన ఓటర్ల జాబితాలను సైతం పోలింగ్ కేంద్రాల వారీగా ప్రచురించి స్థానిక గ్రామ పంచాయతీ/వార్డు కార్యాలయంతో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వెబ్సైట్లో ప్రదర్శిస్తారు.ముసాయిదా జాబితాపై అభ్యంతరాల (ఫామ్–7)తో పాటు కొత్తగా ఓటర్లుగా నమోదు (ఫామ్–6), వివరాల దిద్దుబాటు/చిరునామా మార్పు (ఫామ్–8) కోసం జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ముసాయిదా జాబితాలో పేరు రాకపోయినా లేదా అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన/నిండనున్న యువత ఓటర్లుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్యకాలంలో ఈ దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరించడంతో పాటు మ్యాపింగ్ సరిపోలని అనుమానిత ఓటర్లకు ఈఆర్ఓ (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్)లు నోటీసులు జారీ చేసి నిర్దిష్ట తేదీలో విచారణకు పిలుస్తారు. 11 పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాలి రాష్ట్రంలోని 3.38 కోట్ల మంది ఓటర్లలో ఇప్పటివరకు 2.38 కోట్ల మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తికాగా, మ్యాపింగ్ జరిగిన ఓటర్లలో 89.98 లక్షల మంది ఓటర్ల వివరాల్లో తేడాలున్నట్టు గుర్తించారు. వీరందరూ విచారణకు హాజరై ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని సమర్పించి తమ పుట్టిన తేదీ/నివాస ధ్రువీకరణ చేసుకోవాల్సి ఉంటుంది.ఈ జాబితాలో 12వ ధ్రువీకరణ పత్రంగా ఆధార్‌ను ఈసీ చేర్చినా, పుట్టిన తేదీ/నివాస ధ్రువీకరణ కోసం పరిగణనలోకి తీసుకోరు. కేవలం గుర్తింపునకు ధ్రువీకరణగానే ఆధార్‌ను స్వీకరించనున్నారు. ఈసీ నిర్దేశించిన పత్రాల్లో ఏ ఒక్క పత్రం లేని ఓటర్లు వారికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఇతర ధ్రువీకరణ పత్రాలను సైతం సమర్పించవచ్చు. అయితే వాటి స్వీకరణ పూర్తిగా ఈఆర్వోల విచక్షణాధికారాలపై ఆధారపడి ఉంటుంది. అభ్యంతరాలు/దరఖాస్తుల పరిష్కరణ, ఈఆర్వోల విచారణలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ముసాయిదా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేసి అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. బీఎల్ఓకు ఫోన్ కూడా చేయొచ్చుఎన్యూమరేషన్ ఫారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ ( https://voters.eci.gov.in ) ద్వారా కూడా సమర్పించవచ్చు. అయితే ఆధార్ ఆథెంటికేషన్ సదుపాయం కలిగిన ఓటర్లు మాత్రమే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోగలరు. ఇక బీఎల్ఓ ఎన్యూమరేషన్ ఫారాన్ని పంపిణీ చేయకుంటే సీఈఓ వెబ్సైట్ ( https://ceotelangana.nic.in ) నుంచి తమ ప్రాంత బీఎల్ఓ ఫోన్ నంబర్‌ను తీసుకుని నేరుగా ఫోన్ చేయవచ్చు. ఈసీ వెబ్‌సైట్‌లోని ‘బుక్ ఏ కాల్ విత్ బీఎల్ఓ’ సదుపాయాన్ని సైతం వినియోగించుకోవచ్చు. విదేశాల్లోని భారత పౌరులు ఆన్లైన్ ద్వారా ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించవచ్చు. -
ఎప్పుడు చెల్లిస్తారో తేదీ చెప్పండి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజు బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. వందల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉంచితే కాలేజీలు ఎలా నడుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిలు చెల్లించకుండా.. విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవద్దంటే ఈ విద్యా సంవత్సరానికి విద్యార్థులకు అడ్మిషన్ ఎలా ఇస్తారని నిలదీసింది. విచారణకు సమయం లేకపోవడంతో తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది.బకాయిల చెల్లింపు తేదీతో రావాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 29న జారీ చేసిన జీవో 7లోని ఓ క్లాజ్‌ను సవాల్ చేస్తూ పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలని న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులకు ఈ క్లాజ్ విరుద్ధమన్నాయి. దీని ప్రకారం ప్రవేశ సమయంలో ట్యూషన్ ఫీజు సహా ఇతర ఫీజుల కోసం విద్యార్థులను కాలేజీలు ఒత్తిడి చేయడానికి వీల్లేదు. కాలేజీల పిటిషన్‌పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. తాజా జీవోనూ సస్పెండ్ చేయాలి.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎల్.రవిచందర్, శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు స్టే విధించిన జీవో 7ను ఉపసంహరిస్తూ జీవో 8ని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై మార్గదర్శకాలతో జీవో 9ని విడుదల చేసిందని చెప్పారు. ఇందులోనూ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే వేస్తామని చెప్పిందన్నారు.ప్రభుత్వం నుంచి వచ్చిన రీయింబర్స్మెంట్ మొత్తాన్ని విద్యార్థులు తప్పనిసరిగా వారంలోపు కాలేజీలకు చెల్లించాలని, అలా చెల్లించని విద్యార్థుల తల్లిదండ్రులపై రెవెన్యూ రికవరీ చట్టం అమలు చేస్తామని పేర్కొందన్నారు. ఈ జీవో కూడా గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధమని.. సస్పెండ్ చేయాలని కోరారు. ఫీజు బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం వెంటనే చెప్పాలని.. లేనిపక్షంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. కేంద్రం వాటా రావాలి: జీపీ ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రీయింబర్స్మెంట్ పథకంలో కేంద్రం వాటా కూడా ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కేంద్రమే రీయింబర్స్మెంట్ నిధులు చెల్లిస్తోందన్నారు. అయితే.. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని కేంద్రం చెబుతోందని, ఆ తర్వాత తమ వాటా విడుదల చేస్తామంటోదన్నారు. దీంతో ఇప్పుడు మొత్తం బకాయిలను రాష్ట్రం చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. బకాయిలు రూ.వేల కోట్లు ఉన్నందున కొంత ఆలస్యం జరుగుతోందని చెప్పారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు రెండు వారాలు గడువు కావాలన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. అంత సమయం ఇవ్వలేమని, గురువారం(నేడు)లోగా బకాయిల విడుదలపై స్పష్టత ఇవ్వాలంటూ విచారణ వాయిదా వేశారు. -
‘సర్’..వెరీ సీరియస్!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గట్టి ఝలక్ ఇచ్చారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం విషయంలో చాలామంది ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ వైఖరిని మార్చుకోకపోతే వారి స్థానంలో కొత్తవారిని పార్టీ ఇన్చార్జులుగా నియమిస్తామని హెచ్చరించారు. ‘మీరు ఈసారి గెలుస్తారో, ఓడతారో మీ ఇష్టం. కానీ ‘సర్’లో పేదల ఓట్లు పోకుండా చూడాల్సిన బాధ్యత మీదే. పార్టీకి నష్టం కలిగితే చూస్తూ ఊరుకోం. మళ్లీ ఎమ్మెల్యే కావాలనుకున్నా, కొత్తగా ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్నా ఎస్ఐఆర్ను సీరియస్‌గా తీసుకోవాల్సిందే.మీరేం చేస్తున్నారనే దానికి సంబంధించిన అన్ని నివేదికలూ నా దగ్గర ఉన్నాయి. 10 రోజుల సమయమిస్తున్నా. మీ తీరు మార్చుకోండి. లేదంటే మీ స్థానంలో కొత్త వారు వస్తారు..’ అని రేవంత్ స్పష్టం చేశారు. ఎస్ఐఆర్పై పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్చార్జులతో బుధవారం ఉదయం టీపీసీసీ ఆధ్వర్యంలో జూమ్ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో పాటు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలనుద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు మీటింగ్‌ల మీద మీటింగ్‌లు పెడుతున్నారు.. ‘ఎస్ఐఆర్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, పోలింగ్ బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ నేతలు, కార్యకర్తలను అప్రమత్తం చేస్తూ, క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాల్సిన ఎమ్మెల్యేలు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు? పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తే సహించేది లేదు. ఓట్లు తీసేసే వాళ్లు విస్తృతంగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లూ మీటింగ్‌ల మీద మీటింగ్‌లు పెడుతున్నారు.ఓట్లను కాపాడాల్సిన పార్టీగా మనం ఎందుకు సమావేశాలు నిర్వహించడం లేదు? అధికారంలో ఉన్న పార్టీగా అన్ని హంగులూ అందుబాటులో ఉన్నా ఎందుకు వినియోగించుకోవడం లేదు? కేడర్ కూడా లేని కొత్తగూడెంలో బీజేపీ సమావేశాలు పెట్టింది. కనీసం కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉండే సూర్యాపేట జిల్లాలో మనం అవగాహన సమావేశాలు పెట్టుకోలేకపోయాం. ప్రజలకు అవగాహన కల్పించండి ఓట్లు పోయిన తర్వాత పేదలు చాలా ఇబ్బంది పడతారు. కేవలం ఓట్లు మాత్రమే పోవు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోతాయి. వెంటనే డీడీలు కట్టండి. 2002 ఓటరు లిస్టు, ఇప్పటి ఓటరు లిస్టు తెప్పించుకుని సరి చూసుకోండి.అర్హులైన వారి ఓట్లు పోవడానికి వీల్లేకుండా ప్రతి 10 పోలింగ్ బూత్‌లకు ఒక ఇన్చార్జిని నియమించండి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ సమన్వయకర్త ఉండాలి. ఈ నెల రోజులూ ఎస్ఐఆర్ కార్యక్రమం మీదనే పనిచేయాలి. మనకు గ్రామాల్లో సర్పంచ్‌లున్నారు. వారి సహకారంతో ప్రజలకు అవగాహన కల్పించాలి. ఎస్ఐఆర్ గురించి గ్రామాల్లో డప్పు చాటింపులు వేయించాలి..’ అని రేవంత్ సూచించారు. హైదరాబాద్‌లో ఓకే ఎస్ఐఆర్ కార్యక్రమంపై 33 జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు ఎన్ని సమావేశాలు నిర్వహించాయో ప్రతి జిల్లా వారీగా సీఎం చదివి విన్పించారు. ‘హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశాలు బాగా జరిగాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో జరగడం లేదు. అన్ని జిల్లాల్లో పార్టీ కేడర్, నేతలతో సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి యంత్రాంగానికి దిశానిర్దేశం చేయాలి.పోలింగ్ బూత్ వారీగా ఓట్లను సరిచూసుకోవాలి..’ అని చెప్పారు. జిల్లాల వారీగా ఎస్ఐఆర్ కార్యక్రమంపై పార్టీ ఆదేశాలు అమలయ్యేలా ఇన్చార్జి మంత్రులు బాధ్యతలు తీసుకోవాలి. చొరవ తీసుకోకపోతే ఇన్చార్జి మంత్రులను కూడా మారుస్తాం..’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అందరూ చురుగ్గా పాల్గొనాలి: మీనాక్షి గురువారం నుంచి జరిగే ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చురుగ్గా పాల్గొనాలని మీనాక్షి నటరాజన్ కోరారు. గ్రామీణ పేదలు, నిరక్షరాస్యులకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని, గ్రామాల్లో టెంట్లు వేసుకుని ఓట్లను మ్యాపింగ్ చేయాలని సూచించారు. అర్హులైన వారు తమ ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని పిలుపునిచ్చారు. అందుకే టీఎంసీ ఓడిపోయింది: మహేశ్‌గౌడ్ మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బీజేపీ దేశంలో చేస్తున్న రాజకీయాలను చూసిన తర్వాతైనా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జులు ‘సర్’ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశ్చిమబెంగాల్లో కేవలం ఓట్ల చోరీతోనే బీజేపీ గెలిచిందని చెప్పారు. అక్కడ టీఎంసీ అప్రమత్తంగా లేకపోవడంతోనే అధికారం కోల్పోయిందని అన్నారు. -
బోనాల జాతర.. మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలు, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన బోనాల ఉత్సవాలను ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలోని దాశరథి ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బోనాలు కేవలం ఒక మతపరమైన పండుగ మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే సాంస్కృతిక చిహ్నమని అన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హైదరాబాద్‌కు తరలివస్తారని, అమ్మవారి దర్శనం కోసం వివిధ దేవాలయాలను సందర్శిస్తారని చివరి భక్తునికి కూడా అమ్మవారి దర్శనాన్ని కల్పించాలని దేవదాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.బోనాలు, గణేష్ ఉత్సవాలు, రంజాన్, మొహర్రం వంటి భారీ మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన అనుభవం హైదరాబాద్ యంత్రాంగానికి ఉందని, అదే సమన్వయం, ప్రణాళిక, అంకితభావంతో బోనాల ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, లక్షలాది మంది భక్తులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు. ఆలయాలకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నిరంతరం పెంచుతూ వస్తోందని పేర్కొన్నారు. 2021లో 1,028 ఆలయాలకు, 2022 మరియు 2023లో చెరో 1,073 ఆలయాలకు, 2024లో 1,253 ఆలయాలకు, 2025లో రికార్డు స్థాయిలో 3,026 ఆలయాలకు రూ.5.80 కోట్ల ఆర్థిక సహాయం అందించిందన్నారు. అర్హత కలిగిన ఆలయాల గుర్తింపు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, భక్తుల రద్దీ, ఆలయ అవసరాలు, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సహాయం అందించాలని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా యంత్రాంగాలకు, దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు.భక్తుల సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసిన మంత్రి, ప్రధాన ఆలయాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా, ప్రత్యేక విద్యుద్దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, తాగునీటి సౌకర్యం, ప్రసాదాల పంపిణీ, పారిశుద్ధ్య నిర్వహణ, క్యూ లైన్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, వైద్య శిబిరాలు, అత్యవసర స్పందన వ్యవస్థలు, అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు సమగ్రంగా ఉండాలని ఆదేశించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని వినియోగించుకునే భక్తుల సంఖ్య అధికంగా ఉండే అవకాశమున్నందున టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని సూచించారు.గోల్కొండ, బాల్కంపేట, ఉజ్జయిని మహంకాళి, సబ్జీ మండి, అక్కన్న మాదన్న ఆలయాల వద్ద అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు, ట్రాఫిక్, ఇంటెలిజెన్స్, జీహెచ్ఎంసీ, ఇతర పౌర శాఖలు సమగ్ర భద్రతా, ట్రాఫిక్ నియంత్రణ, జనసమ్మర్థ నిర్వహణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. మహిళా భక్తులు, విధుల్లో పాల్గొనే మహిళా సిబ్బంది భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ముందస్తు ప్రణాళికల ద్వారా సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.బోనాల పండుగ విశిష్టత, చరిత్ర, సంప్రదాయాలు, కార్యక్రమాల షెడ్యూల్, ట్రాఫిక్ ఆంక్షలు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సమాచార, పౌర సంబంధాల శాఖను మంత్రి ఆదేశించారు. బోనాల విశిష్టతపై ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం గావించాలని సూచించారు. ఉత్సవాల నిర్వహణ సందర్భంగా అధికారులందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు.గోల్కొండ బోనాల చారిత్రక ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ, ఆషాఢ మాసం సందర్భంగా గోల్కొండ కోటను సందర్శించే భక్తులకు పురావస్తు శాఖ ఉచిత ప్రవేశాన్ని కొనసాగించాలని మంత్రి సూచించారు. తెలంగాణ సంస్కృతి, విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిన బోనాల ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిపూర్వకంగా, వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు, ఆలయ కమిటీలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు నిర్వహించనున్న బోనాల ఉత్సవాల్లో భాగంగా జూలై 16న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి దేవస్థానంలో జాతర తో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆషాఢ మాసంలోని ఐదు గురువారాలు, నాలుగు ఆదివారాల్లో గోల్కొండలో జాతర ఉత్సవాలు నిర్వహించబడతాయి మరియు రాష్ట్ర ప్రభుత్వం జూలై 16న పట్టు వస్త్రం సమర్పించనుంది. జూలై 21న బాల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో కళ్యాణోత్సవం, పట్టు వస్త్రాల సమర్పణ, జూలై 22న రథోత్సవం జరుగుతాయి.ఆగస్టు 2న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ప్రధాన బోనాల ఉత్సవాలు, పట్టు వస్త్రాల సమర్పణ నిర్వహించబడగా, ఆగస్టు 3న రంగం కార్యక్రమం, అంబారీ ఊరేగింపు నిర్వహించబడతాయి. ఆగస్టు 9న ఇతర ప్రధాన ఆలయాల్లో ప్రభుత్వ తరఫున పట్టు వస్త్రాల సమర్పణ జరగనుంది. అదే రోజు సబ్జీ మండి, కార్వాన్ ప్రాంతాల్లో బోనాల ఉత్సవాలు నిర్వహించబడగా, ఆగస్టు 10న హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయంలో ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఉత్సవాల కాలమంతా ఘటోత్సవం, బోనం సమర్పణ, తొట్టెల ఊరేగింపులు, పోతురాజు విన్యాసాలు, శివసత్తుల కార్యక్రమాలు, రంగం, తదితర సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించబడతాయి.అంతకుముందు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వర్చువల్ విధానంలో సమావేశంలో పాల్గొని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం మైనారిటీల సంక్షేమ, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ ఈ చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళికలు, సమర్థవంతమైన అమలు అవసరమని అన్నారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా సమావేశంలో బోనాల విశిష్టత గురించి మాట్లాడారు.సమావేశంలో దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, డీజీపీ సీవీ ఆనంద్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల వ్యవస్థలో బోగస్ ఓట్లపై బీఆర్ఎస్ ఆందోళన
సాక్షి,హైదరాబాద్: ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన ఎన్నికల ప్రక్రియను బోగస్, నకిలీ ఓట్ల బెడద నుంచి పూర్తిగా విముక్తి చేయకుండా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ తన అసలు లక్ష్యాన్ని చేరుకోలేదని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక దేశం - ఒక పౌరుడు - ఒకే ఓటు అనే ఆలోచన మేరకు వారి ఆదేశాలతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి సమగ్ర వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రజాస్వామ్య పునాదులను పరిరక్షించడం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటం, ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడం అనే లక్ష్యంతోనే భారత రాష్ట్ర సమితి ఈ అంశాన్ని అత్యంత బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్తోందని ఆయన తెలిపారు. ఎన్నికల పవిత్రతకు విఘాతం కలిగించే బోగస్, నకిలీ ఓట్ల సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రమాదంలోకి నెట్టినట్లవుతుందని హెచ్చరించారు.డూప్లికేట్ ఓటర్లు, బోగస్ ఓటర్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడమే కాకుండా ప్రజల అసలు తీర్పును వక్రీకరించే ప్రమాదం కలిగిస్తారని డా. శ్రవణ్ పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికే ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం చేపట్టినప్పటికీ, ఒక రాష్ట్రంలో ఓటు హక్కు కొనసాగిస్తూ మరో రాష్ట్రంలో కూడా ఓటరుగా నమోదైన వారిని గుర్తించి తొలగించే స్పష్టమైన విధానం ఇప్పటికీ లేకపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు.హైదరాబాద్ నేడు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజలు నివసిస్తున్న అంతర్జాతీయ స్థాయి నగరంగా ఎదిగిందని ఆయన చెప్పారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో స్థిరపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. వీరిలో చాలామంది తమ స్వరాష్ట్రాల్లో ఓటు హక్కును కొనసాగిస్తూనే తెలంగాణలో కూడా ఓటరుగా నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. ఒకే వ్యక్తికి రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, అటువంటి నమోదులను గుర్తించి తొలగించడంలో ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా జరుగుతున్న ఈ సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం అత్యంత కీలకమని డా. శ్రవణ్ అన్నారు. తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు తమ పాత ఓటు నమోదులను రద్దు చేయకుండా కొనసాగించే అవకాశం ఉందన్నారు. అందువల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు ఉమ్మడిగా పని చేస్తూ రెండు రాష్ట్రాల ఓటరు జాబితాలను పరస్పరం పరిశీలించాలని సూచించారు.ఒక రాష్ట్రంలో నమోదైన ఓటరు మరో రాష్ట్రంలో కూడా ఓటరుగా ఉన్నట్లయితే అలాంటి నమోదులను గుర్తించి వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల ఎన్నికల యంత్రాంగాలు కలిసి పనిచేసి ఓటరు జాబితాలను పరస్పరం సరిపోల్చి, క్షుణ్ణంగా పరిశీలించి, నకిలీ నమోదులను తొలగిస్తేనే ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని అన్నారు.అదేవిధంగా ఈ ప్రక్రియను కేవలం తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. బీహార్, రాజస్థాన్, గుజరాత్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా తెలంగాణలో నివసిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాల మధ్య ఉన్న డూప్లికేట్ ఓట్లను గుర్తించే జాతీయ స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రతిపాదించిన “ఒక దేశం – ఒక పౌరుడు – ఒకే ఓటు” అనే సిద్ధాంతాన్ని డా. శ్రవణ్ ప్రస్తావించారు. ఒక దేశంలో ప్రతి పౌరుడికి ఒకే ఓటు హక్కు ఉండాలనేదే ప్రజాస్వామ్యానికి మూల సూత్రమని పేర్కొన్నారు. ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే ఓటు హక్కు ఉండాలి తప్ప రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు హక్కు కొనసాగకూడదని స్పష్టం చేశారు.ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓటు నమోదులు ఉండటం, తప్పుడు సమాచారంతో ఓటరుగా నమోదు కావడం, బోగస్ ఓటు వేయడం చట్టరీత్యా నేరమని డా. శ్రవణ్ గుర్తు చేశారు. అలాంటి నేరాలకు ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై చాలా మందికి సరైన అవగాహన లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు అమాయక ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.అందువల్ల ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, బోగస్ ఓట్లు కలిగి ఉండటం వల్ల కలిగే చట్టపరమైన పరిణామాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని కోరారు. ఓటు హక్కు పవిత్రతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కేవలం రాష్ట్రాల మధ్య ఉన్న డూప్లికేట్ ఓట్లే కాకుండా, ఒకే రాష్ట్రంలోని వేర్వేరు నియోజకవర్గాల్లో నమోదైన డూప్లికేట్ ఓట్లను కూడా గుర్తించి తొలగించాలని డా. శ్రవణ్ డిమాండ్ చేశారు. ఒకే వ్యక్తి ఒక నియోజకవర్గంలో కాకుండా రెండు లేదా మూడు నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదై ఉండే సందర్భాలు ఉన్నాయని తెలిపారు. అలాంటి నమోదులను గుర్తించి రద్దు చేయడం ఎన్నికల సంఘం బాధ్యత అని పేర్కొన్నారు.ఒకే నియోజకవర్గంలో నమోదైన నకిలీ ఓట్లు, వేర్వేరు నియోజకవర్గాల్లో నమోదైన నకిలీ ఓట్లు, వేర్వేరు రాష్ట్రాల్లో నమోదైన నకిలీ ఓట్లు ,అన్నింటినీ సమగ్రంగా గుర్తించి తొలగించాలని ఎన్నికల అధికారులను కోరినట్లు తెలిపారు. అవసరమైతే ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఢిల్లీలో కలిసి కూడా తమ వాదనను వినిపిస్తామని డా. దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయత, ఓటు పవిత్రత కోసం భారత రాష్ట్ర సమితి నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు కురువ విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్
సాక్షి,హైదరాబాద్: సింగరేణి సంస్థపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఊరట దక్కింది. తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు రూ. 25 వేల వ్యక్తిగత బాండ్, ఇద్దరి పూచీకత్తులను సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. -
‘బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని మరోసారి తేలిపోయింది’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కాములు తప్ప స్కీములు లేవని.. కుసుమ్ పథకంలో వెయ్యి కోట్ల స్కామ్ చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఇందులో కొంతమంది పెద్దల పేర్లు వినపడుతున్నాయి.. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.‘‘పీసీసీ చీఫ్‌కు ఎసరు పెడుతున్నారు. ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. రైతుబంధుకు వీళ్ళు ఇచ్చిన నిధుల కంటే ప్రచారానికి ఎక్కువ ఖర్చు పెట్టారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని మరోసారి తేలిపోయింది. వారం రోజులు తిట్టుకుని ఇప్పుడు డ్యూయెట్లు పాడుతున్నారు. బీఆర్ఎస్ రాదనే కాంగ్రెస్ వాళ్లు.. కేటీఆర్ పర్యటనలకు ఎందుకు భయపడుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం పీఏగా పని చేస్తున్నారా...?. తెలంగాణ హైబ్రిడ్ సీఎం మోదీ జట్టు అని ఖాయమైంది. రైతులకు 30 వేల కోట్లు ప్రభుత్వం బాకీ ఉంది. భట్టి శాఖలో జరుగుతున్న వెయ్యి కోట్ల అవినీతిపై విచారణ జరపాలి..జాతీయ బ్యాంకును బ్లాక్ మెయిల్ చేసి భయపెడుతున్నారు. చంద్రబాబు,మోదీ ఆలోచనలతో పుట్టిన క్రాస్ బ్రీడ్ హైబ్రీడ్ సీఎం రాష్ట్రంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తే కేంద్ర మంత్రి ఇతర కేంద్ర మంత్రులను కలిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో కాదు.. దేశంలో ఎక్కడైనా పార్టీ ఆఫీసు పెట్టుకోవచ్చు. తెలంగాణ వచ్చినందుకు 11 రోజులు అన్నం తినలేదని పవన్ కల్యాణ్ చెప్పారు. వాళ్ళ శరీరం నిర్మాణం అయ్యింది తెలంగాణ తిండితో.. బీజేపీ, రేవంత్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ కలిసి అందుతున్న నాటకాలు. అందరూ కలిసి మ్యాచ్ ఫిక్స్ రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
Banjara Hills: వ్యభిచార గృహంలో స్పై కెమెరా
హైదరాబాద్: ఓ వ్యభిచారగృహంలో నిర్వాహకురాలు స్పై కెమెరా బిగించింది. పోలీసులు దాడుల్లో ఈ విషయం వెలుగు చూసింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 జహీరానగర్‌లోని మైహోమ్ అపార్ట్మెంట్ ప్లాట్ నంబర్ 302లో వ్యభిచారం జరుగుతోందని బంజారాహిల్స్ ఎస్సై నవీన్‌కు విశ్వసనీయ సమాచారం అందింది.సిబ్బందితో కలిసి ఆయన మంగళవారం దాడి చేసి మేనేజర్ శిరీష, మరో యువతిని అదుపులోకి తీసుకున్నారు. బెడ్రూమ్లో స్పై కెమెరా అమర్చి ఉండటాన్ని పోలీసులు గమనించారు. ఫుటేజీ ద్వారా ఏం చేస్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. నిర్వాహకురాలు స్నేహగౌడ్ పరారీలో ఉంది. కేసు దర్యాప్తులో ఉంది. -
ఇంత అలసత్వమా?.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అల్టిమేటం!
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్‌లో అలసత్వం కనిపిస్తోందా? క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదా? ఈ ప్రశ్నలకు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే బలం చేకూరుస్తున్నాయి. ఎస్ఐఆర్ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని స్పష్టం చేసిన ఆయన.. పార్టీ ఆదేశాలను పట్టించుకోని నేతలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన టీపీసీసీ జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ సాధారణ అంశం కాదని, పేద ప్రజల హక్కులతో ముడిపడి ఉన్న కీలక ప్రక్రియ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో కొందరి తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఆయన.. పని చేయని వారి పేర్లు చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దని, అవసరమైతే వారి స్థానంలో కొత్త ఇన్ఛార్జ్లను నియమిస్తామని హెచ్చరించే దాకా వెళ్లారు.కొంతమంది నాయకులు ఎస్ఐఆర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పీసీసీ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమాలపై తన వద్ద పూర్తి నివేదిక ఉందని, ఎవరు పని చేస్తున్నారు.. ఎవరు చేయడం లేదన్న విషయం తనకు తెలుసని చెప్పారు. పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్పై కాంగ్రెస్ తరఫున మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో సర్పంచ్‌లను కూడా భాగస్వామ్యం చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.ఎస్ఐఆర్ ప్రక్రియలో పొరపాట్లు జరిగితే పేదల ఓటు హక్కు దెబ్బతినే ప్రమాదం ఉందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఓటు తొలగిపోతే భవిష్యత్తులో ఆధార్, రేషన్ కార్డులు వంటి సంక్షేమ ప్రయోజనాలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి అన్యాయం జరగకుండా పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.పార్టీ ఆదేశాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసిన సీఎం రేవంత్.. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని క్షమించబోమని హెచ్చరించారు. మరో పది రోజుల సమయం ఇస్తున్నామని, ఈ వ్యవధిలో పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని అన్నారు. లేకపోతే చర్యలు తప్పవని సంకేతాలు ఇచ్చారు. -
ఏసీబీ వలలో గాందీనగర్ ఎస్ఐ
హైదరాబాద్: గాందీనగర్ ఎస్ఐ నర్సింహులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీఖాన్ కథనం ప్రకారం.. సంజీవ్‌సింగ్ ఠాకూర్ అనే వ్యక్తికి సోదరుడితో వ్యాపార లావాదేవీలకు సంబంధించి గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 11న సోదరుడి ఫిర్యాదు మేరకు సంజీవ్‌సింగ్ ఠాకూర్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ఫేవర్ చేయాలంటూ సంజీవ్‌సింగ్ ఠాకూర్ ఎస్.ఐ నర్సింహులుతో రూ.లక్షకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ మేరకు మంగళవారం కవాడిగూడలో ఎస్ఐ మొదటివిడతగా రూ.50 వేలు తీసుకుంటుండగా వలపన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని డీఎస్పీ వివరించారు. నర్సింహులుపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ముందు హాజరుపర్చి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. -
ముక్కు మూసుకుని.. చెప్పులు చేతపట్టుకుని
ఐటీ కారిడార్‌లోని ఇందిరానగర్ కాలనీని మురుగు ముంచెత్తుతోంది. 16 రోజులుగా ఇక్కడ డ్రైనేజీ నీరు ఇళ్ల మధ్య ప్రవహిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. కాలనీలో నివసిస్తున్న ఐటీ ఉద్యోగులు మురుగులో నడుస్తూ ముక్కు మూసుకుని, మాస్క్‌లు వేసుకుని, చెప్పులు చేతపట్టుకుని ఆఫీసులకు వెళ్తున్నారు. గచ్చిబౌలి నుంచి ట్రిపుల్ ఐటీ వైపు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ఇందిరానగర్‌లో ఈ నెల 9న భారీ వర్షానికి డ్రైనేజీ నీటిలో కలిసి వరద ప్రవహిస్తోంది. అంజయ్యనగర్, ఏపీహెచ్‌బీ కాలనీ, జయభేరీ ఎన్క్లేవ్, జేవీ కాలనీల నుంచి నాలాలన్నింటినీ ఇటు వైపు మళ్లించారు. పైపులైన్ చిన్నదిగా ఉండటం, చెత్త పేరుకోవడంతో మురుగు రోడ్డుపైకి వచి్చందని స్థానికులు వాపోతున్నారు. మరో పైపులైన్ వేసేందుకు గత ఆగస్టులో శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు పనులు ప్రారంభించనే లేదు. – గచ్చిబౌలి -
కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజు తెలంగాణకు తిరిగి రానున్నారు. ఆయనను తెలంగాణ కేడర్‌కు పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో సంజయ్ జాజు సీఎస్‌గా నియమితులు కానున్నారని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి, ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న కె. రామకృష్ణారావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. సీఎస్ పదవి కోసం మొన్నటి వరకు 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్‌లు అయిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేశ్ రంజన్ (పురపాలక శాఖ), వికాస్‌రాజ్ (ఆర్అండ్బీ) పోటీపడ్డారు. వారిద్దరి మధ్యనే పోటీ ఉంటుందని భావించారు. అయితే అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వమే తాజాగా సంజయ్ జాజును తెలంగాణ కేడర్‌కు తిరిగి పంపించాలని కేంద్రాన్ని కోరడంతో దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆయన తిరిగి సొంత కేడర్ అయిన తెలంగాణకు వస్తున్నారు. సంజయ్ జాజును కేడర్‌కు పిలిపించుకోవడం ద్వారా ప్రభుత్వం ఒక బలమైన సంకేతాన్ని పంపిందనే చర్చ మొదలైంది. వచ్చే కొన్ని రోజుల్లో తెలంగాణ పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. సంజయ్ జాజు ప్రస్తుతం ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన అంతకుముందు సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ ముఖ్యకార్యదర్శిగా, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా, విశాఖపట్టణం కమిషనర్‌గా, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా, సహాయ పునరావాస శాఖ కమిషనర్‌గా, నీటిపారుదల ఆయకట్టు ప్రాంత అభివృద్ధి శాఖ కమిషనర్‌గా, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన అక్టోబర్‌లో కేంద్ర సర్వీసులకు వెళ్లారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తే ఆయన 2029 ఫిబ్రవరి వరకు ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. సీఎస్‌గా సంజయ్ జాజు రాకను ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు సైతం ధ్రువీకరించాయి. -
ఫుట్‌పాత్‌లపై 'దుకాణాలు'.. నడిరోడ్డుపై 'పాదచారులు'
సాక్షి, హైదరాబాద్: ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపుపై గత విచారణ సందర్భంగా తామిచ్చిన ఆదేశాలను అమలు చేయని అధికారులపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఆక్రమణలు కొనసాగుతుండటంతో ప్రజలు రోడ్లపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. హైకోర్టు సమీపంలోని ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నాయని, ట్రాఫిక్ రద్దీ పెరగడానికి కారణమవుతున్నాయని పేర్కొంది. న్యాయవాదులు, వ్యాజ్యదారులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. టీజీ–బీపాస్ చట్ట ప్రకారం అనధికార నిర్మాణాలపై పౌరులు కూడా అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని కోర్టు గుర్తు చేసింది. పట్టణ ప్రణాళిక నిబంధనలను ఉల్లంఘించిన వారికి కోర్టులు ఉపశమనం ఇవ్వకూడదని, అక్రమ, అనధికార నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు రాజ్యాంగ న్యాయస్థానాలు తమ విచక్షణాధికారాన్ని వినియోగించకూడదని.. సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించింది. ఫుట్‌పాత్‌లపై అక్రమ ఆక్రమణలు ట్రాఫిక్ రద్దీని పెంచడంతోపాటు వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. హైకోర్టు ప్రాంగణం నుంచే ఆక్రమణల తొలగింపు చర్యలు ప్రారంభించి హైదరాబాద్ నగరమంతటా విస్తరించాలని అధికారులను ఆదేశించింది. లేకుంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ.. విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. రెండు వారాల్లో చర్యలు ప్రారంభించాలి.. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఇతర పట్టణ కేంద్రాల్లో రోడ్లు సక్రమంగా ఉండటంలేదని, పాదచారులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించేలా ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన సీనియర్ సిటిజన్ బి.సురేందర్, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. మే 4న జారీ చేసిన ఆదేశాల అమలుపై ఇప్పటివరకు ఎలాంటి పురోగతి నివేదికను అధికారులు సమర్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమణల నుంచి విముక్తం చేసి, శాశ్వత రక్షణ ఏర్పాట్లు చేయాలని, పాదచారులు పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని గతంలో ఆదేశించిన విషయం గుర్తు చేశారు. -
యూరియా ఉన్నా.. రైతుకు సున్నా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా కొరత లేదని ప్రభుత్వం ప్రకటిస్తున్నా, నాలుగు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా నిల్వలున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు యూరియా దొరకడం లేదు. దాదాపు 60 శాతానికి పైగా నిల్వలు మార్క్‌ఫెడ్ గోదాముల్లోనే మూలుగుతున్నా..రైతులకు వీటిని సరఫరా చేసే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (ప్యాక్స్‌లు), సహకార సంఘాలకు యూరి యా రావడం లేదు. దీంతో రైతులు ఎరువుల కోసం దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఒకవైపు కేంద్రం నుంచి రావాల్సిన ఎరువులు పూర్తిస్థాయిలో రాలేదు. మరోవైపు వచి్చన నిల్వలు రైతులకు అందడం లేదు. ముఖ్యంగా ప్యాక్స్‌ల పాలకమండళ్ల తీరుతో యూరియా రైతులకు చేరడం లేదు. పుష్కలంగా ఉన్నా..‘అందని ద్రాక్ష’ రాష్ట్రంలో ఈనెల 22 నాటికి 3.91 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందులో 2.56 లక్షల టన్నుల యూరియా మార్క్‌ఫెడ్ గోదాముల్లోనే ఉంది. రైతులకు నేరుగా అందుబాటులో ఉండే డీలర్ల వద్ద 94 వేల టన్నులు, సహకార సంఘాల వద్ద 25 వేల టన్నులు ఉండగా, ఆయా ఎరువుల కంపెనీల గోడౌన్లలో మరో 16 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉంది. ఈ విధంగా ప్రభుత్వ లెక్కల్లో మాత్రమే యూరియా పుష్కలంగా ఉంది. కానీ అది రైతులకు మాత్రం అందని ద్రాక్షగా మారింది. కేంద్ర ప్రభుత్వం కేటాయించే యూరియా రైల్వే ర్యాక్‌ల ద్వారా రాష్ట్రానికి చేరిన వెంటనే అందులోని 60 శాతం యూరియాను మార్క్‌ఫెడ్ గోదాములకు తరలిస్తారు. మిగతా 40 శాతం వ్యవసాయ శాఖ ద్వారా ప్రైవేటు వ్యాపారులకు పంపించడం జరుగుతుంది. ప్రైవేటు దుకాణాలను చూపిస్తున్న యాప్ ప్రతి ఖరీఫ్ సీజన్లో ప్యాక్స్‌లు, సహకార సంఘాలు ఇండెంట్ పెడితే మార్క్‌ఫెడ్ యూరియా సరఫరా చేస్తుంది. ఇందుకోసం ఆయా సహకార సంఘాలు ఇండెంట్ ఇవ్వాలి. అయితే ప్రస్తుతం ప్యాక్స్‌కు కొత్త పాలక మండళ్ల విషయంలో అయోమయం నెలకొంది, కొత్తగా సంఘాలు ఏర్పాటయ్యేంత వరకు పాత పాలక మండళ్లనే కొనసాగించాలని హైకోర్టు తీర్పు చెప్పినా యూరియా ఇండెంట్లపై పాలకమండళ్లు దృష్టి పెట్టడం లేదు.ప్యాక్స్ సీఈవోలు కూడా యూరియా బాధలు తమకెందుకులే అనే ధోరణిలో ఉన్నారు. ఈ కారణంగానే ప్యాక్స్‌కు యూరియా తగినంత వెళ్లడం లేదు. కేవలం 25 వేల మెట్రిక్ టన్నులు (5.64 లక్షల బస్తాలు) మాత్రమే సహకార సంఘాల వద్ద ఉండగా.. మార్క్‌ఫెడ్ గోదాముల్లో 56.74 లక్షల బస్తాల (2.56లక్షల మెట్రిక్ టన్నులు) నిల్వలు ఉన్నాయి. మార్క్‌ఫెడ్ గోదాముల నుంచి జిల్లాలకు, అక్కడి నుంచి ప్యాక్స్ కేంద్రాలకు సరఫరా జరగకపోవడంతో రైతులు యాప్‌లో యూరియాను బుక్ చేయగానే దగ్గర్లోని ప్రైవేట్ దుకాణాలను చూపెడుతోంది. జూలైలో డిమాండ్ భారీగా పెరిగే చాన్స్ డీలర్లకు కూడా పరిమిత సరఫరా కారణంగా యూరియా కోసం పోటీ నెలకొంది. యాప్ ఓపెన్ చేసినప్పుడు స్టాక్ ఉన్నట్లు చూపించి, కొద్ది నిమిషాల్లోనే నోస్టాక్ అని చూపిస్తున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ఎరువుల వ్యాపారులు సైతం తమకు అవసరమైన మేర స్టాక్ అందడం లేదని చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే నాలుగో వంతు కూడా ఈసారి సాగు కాలేదు.పత్తి పంట కేవలం ఐదున్నర లక్షల ఎకరాల్లోనే సాగు జరగగా, వరి కేవలం 11వేల ఎకరాల్లోనే సాగైంది. కానీ యూరియా కోసం మాత్రం గత సంవత్సరంతో పోటీ పడి మరీ కొనుగోలు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ లెక్కలు చెపుతున్నాయి. పంటల సాగు లేకపోయినా, భవిష్యత్తులో యూరియా దొరుకుతుందో లేదో అనే భయంతో రైతులు ముందుస్తుగానే కొనుగోలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ చెబుతోంది.అయితే వరి ధాన్యం, మొక్కజొన్న, పత్తి సాగు గరిష్ట స్థాయికి చేరే జూలైలో యూరియా అవసరం భారీగా పెరగనుంది. మార్క్‌ఫెడ్ గోదాముల్లో ఉన్న నిల్వలను వెంటనే జిల్లాలకు తరలించి, ప్యాక్స్‌లు, సహకార సంఘాల ద్వారా రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోకపోతే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. -
ఆన్లైన్ స్కిల్‌కు అదనపు బాదుడు!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థులకు నైపుణ్యం పేరుతో ఈ ఏడాది నుంచి అదనపు బాదుడు వేసేందుకు రంగం సిద్ధమైంది. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) ఈ దిశగా ఓ ప్రైవేటు సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఎంవోయూ ప్రకారం దక్షిణాదికి చెందిన సాఫ్ట్ స్కిల్ అనే సంస్థ ఇంజనీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే మెటీరియల్‌ను సరఫరా చేస్తుంది.ఇది అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన సంస్థ అని జేఎన్టీయూహెచ్ చెబుతోంది. అయితే ఎలాంటి క్లాసులు నిర్వహించకుండా కేవలం పీడీఎఫ్ రూపంలోనే ఇది స్టడీ మెటీరియల్‌ను అందిస్తుంది. ఈ మెటీరియల్ చదవడం వల్ల అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు. అయితే ఎంవోయూ కుదుర్చుకున్న సంస్థ మాత్రం ఇలాంటి భరోసా ఏదీ ఇవ్వలేదు. ప్రైవేటు కాలేజీలకు వరం! స్టడీ మెటీరియల్ కోసం ప్రతి విద్యార్థి నుంచి రూ.750 వసూలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ కాలేజీల్లోనే కాదు.. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివే విద్యార్థులూ ఈ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకునే విద్యార్థులకూ ఈ మొత్తం తప్పదని అధికారులు చెబుతున్నారు. అయితే జేఎన్టీయూహెచ్ చేసుకున్న ఈ ఒప్పందం ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు వరంగా మారనుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్టడీ మెటీరియల్ పేరుతో ప్రతి విద్యార్థి నుంచి రూ.3 వేలు వసూలు చేసేందుకు కాలేజీలు సిద్ధమవుతున్నట్టు సమాచారం.కన్వినర్ కోటా అడ్మిషన్లు పూర్తయి, విద్యార్థి కాలేజీలో చేరిన తొలిరోజే ఈ ఫీజును వసూలు చేస్తామని కొన్ని కాలేజీలు చెబుతున్నట్లు తెలిసింది. యాజమాన్య కోటా కింద ఇప్పటికే అనధికారికంగా ప్రవేశాలు ఖరారు చేసుకుంటున్న విద్యార్థుల నుంచి ముందే వసూలు చేస్తున్నాయి. పైగా దీనికి ఎలాంటి రసీదు ఇవ్వడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్‌లో 90 వేల మందికి పైగా చేరుతున్నారు.జేఎన్టీయూహెచ్ నిర్దేశించిన ఫీజు రూ.750 వసూలు చేసినా, 90 వేల మంది విద్యార్థులకు దాదాపు రూ.6.75 కోట్లు ప్రతి ఏటా ఊరూపేరూ లేని సంస్థకు చెల్లించాల్సి ఉంటుందని విద్యారంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఇక ప్రైవేటు కాలేజీలు ముక్కుపిండి వసూలు చేసే ఫీజు రూ.3 వేలు పరిగణనలోకి తీసుకుంటే విద్యార్థులపై భారం మరింత అధికంగా ఉంటుందని అంటున్నారు. వర్సిటీ పాలకమండలిలో చర్చించకుండానే ఆదరాబాదరాగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు ఉన్నతాధికారులూ తప్పుబడుతుండటం గమనార్హం. ముడుపుల ఆరోపణలు వాస్తవానికి సాఫ్ట్ స్కిల్ సంస్థతో ఒప్పందాన్ని జేఎన్టీయూ బాధ్యులు కొందరు వ్యతిరేకించారు. ఈ సంస్థ ఎక్కడా ఎలాంటి ఉద్యోగాలు ఇప్పించలేదని తెలిపారు. అది అందించే మెటీరియల్‌లో కూడా ఏమాత్రం నాణ్యత లేదని వీసీ దృష్టికి తెచి్చనట్టు తెలిసింది. ఇది పేద విద్యార్థులకు భారమని, ఇది సదరు సంస్థకు కోట్లు కట్టబెట్టడమే అవుతుందంటూ ఈ ఫైల్‌పై సంతకం పెట్టేందుకు కొంతమంది అధికారులు నిరాకరించినట్టు సమాచారం.ఈ నేపథ్యంలోనే వారిని ఇటీవల కీలక బాధ్యతల నుంచి తప్పించారనే చర్చ జరుగుతోంది. ఈ సంస్థ యూనివర్సిటీలోని ఓ ప్రొఫెసర్‌తో ఏడాదిగా రాయబేరాలు నడిపినట్టు జేఎన్టీయూ వర్గాలు చెబుతున్నాయి. చివరకు ఒప్పందం ఖరారు కావడం వెనుక ముడుపుల బాగోతం ఉందని కూడా ఆ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారని, పాలకమండలి కూడా సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. స్కిల్‌తో ఉద్యోగాలు వస్తాయి సాఫ్ట్‌స్కిల్ సంస్థ అంతర్జాతీయంగా పేరున్న కంపెనీ. ఇది విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు తీసుకున్న నిర్ణయం. స్కిల్ ఇవ్వడం వల్ల ఉద్యోగాలు వస్తాయి. విద్యార్థి నుంచి రూ.750 మాత్రమే వసూలు చేస్తారు. ప్రైవేటు కాలేజీ విద్యార్థులూ చెల్లించాల్సి ఉంటుంది. – ప్రొఫెసర్ టీకేకే రెడ్డి, వీసీ, జేఎన్టీయూహెచ్ -
ఇక వానలే!
ఈనెల 1 నుంచి 23వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 97.4 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 81.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 16 శాతం లోటు ఉన్నట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయిసాక్షి, హైదరాబాద్నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. ఈనెల 8వ తేదీన రాష్ట్ర భూభాగాన్ని తాకిన రుతుపవనాలు క్రమంగా ముందుకు సాగి మంగళవారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. సాధారణంగా రుతుపవనాలు ప్రవేశించిన వారం రోజుల వ్యవధిలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయి. గతేడాది కేవలం 4 రోజుల్లోనే విస్తరించగా... ఈసారి రెండు వారాల సమయం పట్టింది. రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పుడు చురుకుగానే కదిలినప్పటికీ... ఆ తర్వాత నెమ్మదించడంతో జాప్యం నెలకొందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రమంతటా విస్తరించడంతో పాటు చురుకుగా కదులుతుండడంతో వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బిహార్... జార్ఖండ్ వరకు రుతుపవనాల కదలికలతో రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతూ దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో విస్తరించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, ముంబైతో సహా మహారాష్ట్రలోని మరికొన్ని భాగాలు, ఒడిశాలోని మిగిలిన భాగాలు, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బిహార్‌లలోని మరికొన్ని భాగాలకు మరింతగా విస్తరించినట్లు తెలిపింది. రానున్న మూడు రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్‌లోని కొన్ని భాగాలు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని మరి కొన్ని భాగాలకు, ఆ తర్వాతి 3–4 రోజుల్లో జార్ఖండ్, బీహార్లలోని మిగిలిన భాగాలు, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని భాగాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. రెండ్రోజులు ఓ మోస్తరు వర్షాలు రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, ఒకట్రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ వాఖ వివరించింది. ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ, ఇతర ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావం, రుతుపవనాల కదలికలు మందగించడంతో జూన్ నెలలో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది.ఈనెల 1 నుంచి 23వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 97.4 మిల్లీమీటర్ల సాధారణం వర్షం కురవాల్సి ఉండగా... 81.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 16 శాతం లోటు ఉన్నట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 19 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా... 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.నెలాఖరులోగా వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మంగళవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉ్రష్ణోగతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 38డిగ్రీ సెల్సియస్ నమోదు కాగా... కనిష్ట ఉష్ణోగ్రత దుండిగల్‌లో 21.8డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెబుతున్నారు. చాలాచోట్ల సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. మంగళవారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు(సెల్సియస్‌లలో) కేంద్రం గరిష్ఠం కనిష్టం అదిలాబాద్ 34.3 22.2 భద్రాచలం 32.6 24.0 దుండిగల్ 32.2 21.8 హకీంపేట్ 32.3 23.4 హన్మకొండ 36.0 23.5 హైదరాబాద్ 32.6 22.2 ఖమ్మం 35.8 23.0 మహబూబ్‌నగర్ 33.0 24.1 మెదక్ 35.8 22.8 నల్లగొండ 38.0 24.0 నిజామాబాద్ 36.2 24.9 రామగుండం 31.6 23.6 -
‘వీడియో ఫిట్నెస్’లపై రవాణా శాఖ నజర్
సాక్షి, హైదరాబాద్: ఈశాన్య రాష్ట్రాల రిజిస్ట్రేషన్‌తో నిబంధనలకు విరుద్ధంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర పొరుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను నియంత్రించేందుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో నామమాత్రపు పన్నులు ఉండటంతో ట్రావెల్స్ నిర్వాహకులు ఆయా రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో పన్ను చెల్లింపు విషయం ఎలా ఉన్నా, బస్సుల ఫిట్నెస్ విషయంలో ఆయా రాష్ట్రాల రవాణా శాఖలు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ట్రావెల్స్ యాజమాన్యాలతో కుమ్మక్కై కేవలం వీడియో కాల్లో బస్సును పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఫిట్నెస్ లేకున్నా సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ఉన్న అవకాశాన్ని ఎత్తిచూపుతూ, ఫిట్నెస్ లేని బస్సులతో ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉండటంపై ‘సాక్షి’ రెండు రోజుల క్రితం ‘బస్సుల ఫిట్నెస్ ఈ‘శూన్యం’ శీర్షికతో కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన రాష్ట్ర రవాణా శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. వీడియో కాల్స్ ద్వారా ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ఎంత ప్రమాదకరమో వివరిస్తూ సంబంధిత ఈశాన్య రాష్ట్రాల రవాణా శాఖలకు లేఖలు రాయాలని నిర్ణయించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాలని భావిస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో పన్ను తగ్గింపు అంశాన్నీ పరిశీలిస్తోంది.పన్ను తగ్గింపుపై కసరత్తుప్రైవేటు ట్రావెల్స్ బస్సుల నిర్వాహకులు ఈశాన్య రాష్ట్రాల పరిధిలో కాకుండా రాష్ట్రంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి వీలుగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొన్ని పొరుగు రాష్ట్రాలు ఇప్పటికే పన్నులను తగ్గించి బస్సుల రిజిస్ట్రేషన్లు స్థానికంగానే అయ్యేలా చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా పన్ను తగ్గించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో అఖిల భారత పర్యాటక పర్మిట్ ఉన్న ట్రావెల్స్ బస్సులకు త్రైమాసిక పన్ను ప్రతి బెర్తుకు రూ.4 వేలుగా ఉంది. అదే ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లలో ఈ పన్ను ఏడాదికి రూ.500 నుంచి రూ.1,000 లోపు మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుల్లో కూడా తెలంగాణ స్థాయిలోనే పన్ను ఉండేది. కానీ ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పన్నును రూ.4 వేల నుంచి రూ.3 వేలకు తగ్గించింది. తమిళనాడు కూడా తగ్గించే యోచనలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రూ.2,500కు తగ్గించాలని ఇటీవల కేబినెట్ నిర్ణయించింది. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నును తగ్గించే ఆలోచనలో ఉంది. బెర్తుకు రూ.2,500 గానీ, రూ.2 వేలు గానీ చేసే అంశాన్ని పరిశీలించనున్నట్టు తెలిసింది. -
డేటా సెంటర్లకు శుద్ధి చేసిన మురుగునీరు
సాక్షి, హైదరాబాద్: ఐటీ వినియోగం అంతకంతకూ పెరుగుతుండటంతో డేటా సెంటర్లకు డిమాండ్ అదే స్థాయిలో ఉంటోంది. వీటికి పెద్ద ఎత్తున నీరు అవసరం. హైదరాబాద్ సమీపంలో డేటా సెంటర్లు ఒకదాని వెంట ఒకటి ఏర్పాటు అవుతుండడంతో సహజ వనరులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక హబ్‌లకు, ముఖ్యంగా డేటా సెంటర్ల అవసరాలను తీర్చడం కోసం శుద్ధి చేసిన నీటిని పెద్దఎత్తున సరఫరా చేసేలా బృహత్ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఈ వ్యూహాత్మక ప్రాజెక్ట్‌ను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో అమలు చేయాలని భావిస్తోంది. నగరంలోని ప్రధాన డిమాండ్ కేంద్రాలకు మురుగునీటి శుద్ధి ప్లాంట్ల (ఎస్టీపీ) నుంచి శుద్ధి చేసిన మురుగునీటిని దీర్ఘకాలంపాటు సరఫరా చేయడానికి, వాడుకోవడానికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.పదిలంగా నీటి వనరులు..ప్రస్తుతం నగరంలో రోజుకు 1,750 మిలియన్ లీటర్ల కంటే ఎక్కువ శుద్ధి సామర్థ్యంతో మొత్తం 41 ఎస్టీపీలను జలమండలి నిర్వహిస్తోంది. చందన్వెల్లి ప్రాంతంలోని పారిశ్రామిక క్లస్టర్, ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ కోసం రోజుకు 530 మిలియన్ లీటర్ల డిమాండ్ అంచనాతో సరఫరా మౌలిక సదుపాయాల అభివృద్ధికి డీపీఆర్ సిద్ధం చేస్తారు. అలాగే, అత్తాపూర్‌లో ఉన్న ఎస్టీపీ నుంచి చందన్వెల్లి వరకు 41 కి.మీ. దూరంలో పైప్‌లైన్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. దీని ద్వారా 2035 నాటికి ఈ క్లస్టర్లో రోజుకు 239 మిలియన్ లీటర్ల డిమాండ్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. నాగోల్‌లో ఉన్న ఎస్టీపీల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 56.6 కి.మీ. దూరంలో మరొక పంపిణీ మౌలిక సదుపాయాల మార్గం ప్లాన్ చేశారు. 2035 నాటికి రోజుకు 290 మిలియన్ లీటర్ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అంచనా వేస్తున్నారు. ఈ వ్యవస్థ ఇప్పటికే ఉన్న, అలాగే రాబోయే డేటాసెంటర్లకు ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఉన్న పార్కులకు..రెండు పైప్లైన్లు కూడా ఓఆర్ఆర్, ఇతర ముఖ్యమైన రహదారుల వెంబడి వెళ్తుండటం వల్ల రామచంద్రాపురంలోని అసిస్టెడ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, పటాన్చెరు ఇండస్ట్రియల్ పార్క్, ఐడీఏ పటాన్చెరు, బీహెచ్ఈఎల్, సుల్తాన్పూర్ ఇండస్ట్రియల్ పార్క్, గుండ్లపోచంపల్లి అపారెల్ ఎక్స్పోర్ట్ పార్క్, ఎల్ఈఏపీతో సహా ఇతర పారిశ్రామిక క్లస్టర్లు, సంస్థల అవసరాలను తీర్చడానికి వీటిని ఉపయోగించుకోవచ్చు. గాజులరా మారం, ఐడీఏ జీడిమెట్ల, ఎస్‌వీసీఐఈ జీడిమెట్ల, సీసీ జీడిమెట్ల, ఇండస్ట్రియల్ పార్క్ మౌలాలీ, 158 కి.మీ. ఓఆర్ఆర్ హరితహారం నిర్వహణతోపాటు అగ్నిమా పక, వినోద, ల్యాండ్‌స్కేపింగ్ అవసరాలకూ ఈ శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయొచ్చు. -
ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి దిగుబడి వస్తున్న నేపథ్యంలో కేంద్రం నిర్దేశించిన సేకరణ లక్ష్యాలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అదేవిధంగా కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్) సరఫరా గడువును కూడా పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. మంగళవారం ఉదయం ఢిల్లీలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రల్హాద్ జోషితో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడాలంటూ కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు ఒక్క గింజ కూడా నష్టపోకుండా కొనుగోలు చేస్తోందన్నారు.రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ : దేశంలోనే అత్యధికంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 80.09 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించిందని, ఈ కొనుగోలు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఉత్తమ్ తెలిపారు. ఖరీఫ్, రబీ కలిపి 2025–26 మార్కెటింగ్ సీజన్లో తెలంగాణలో 152 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వరి సేకరణ జరిగి చరిత్రాత్మక రికార్డు నమోదైందన్నారు. రబీ 2025–26 సీజన్‌కు సంబంధించి 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ అంచనాలను రాష్ట్రం సమర్పించగా, కేంద్రం కేవలం 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (51.47 లక్షల మెట్రిక్ టన్నుల వరికి సమానం) మాత్రమే లక్ష్యంగా నిర్ణయించిందని చెప్పారు. గత మూడు సీజన్లలో కేంద్రం లక్ష్యాలకు మించి రాష్ట్రం 69.50 లక్షల మెట్రిక్ టన్నుల వరిని అదనంగా కొనుగోలు చేయాల్సి వచ్చిందని, దీనివల్ల రూ.16,446 కోట్ల అదనపు భారం పడిందన్నారు.సీఎంఆర్ గడువు పొడిగించాలినిల్వ స్థలాల కొరత, ఒకేసారి పలు సీజన్ల కొనుగోళ్లు కొనసాగడం, మిల్లింగ్ సామర్థ్యాలపై ఒత్తిడి వంటి కారణాల వల్ల సీఎంఆర్ సరఫరాలో గడువులను పొడిగించాల్సిన అవసరం ఉందని ప్రల్హాద్ జోషికి ఉత్తమ్ వివరించారు. రబీ 2024–25 సీఎంఆర్ సరఫరా గడువును మరో 60 రోజులు, ఖరీఫ్ 2025–26 గడువును 120 రోజులు పొడిగించాలని కోరారు. రబీ 2025–26 సేకరణ లక్ష్యాన్ని 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నుంచి 54.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి పెంచాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. రబీ వరి ఎక్కువగా ఉప్పుడు బియ్యం తయారీకి అనుకూలంగా ఉండటంతో బాయిల్డ్ రైస్ రూపంలో సరఫరా చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఖరీఫ్ 2026–27 సీజన్‌కు సంబంధించి కేంద్రం నిర్ణయించే సేకరణ లక్ష్యాలు.. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే వాస్తవ అంచనాలకు అనుగుణంగా ఉండాలన్నారు. రైతు ప్రయోజనాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికీ రాజీపడదని, వారు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర లభించేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ చెప్పారు. -
మెట్రోపై ‘కలిసి’ వెళ్దాం!
న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: హైదరాబాద్ మెట్రో రైల్వే వ్యవస్థ పురోభివృద్ధిలో సంయుక్తంగా సాగాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మెట్రో నిర్వహణ, అభివృద్ధి కోసం‘జైపూర్ మోడల్’ను కేంద్ర మంత్రులు సీఎం రేవంత్‌రెడ్డి ముందుపెట్టినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ సూచనకు సీఎం రేవంత్‌రెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. ఢిల్లీలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా రేవంత్ మంగళవారం ఉదయం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను ఆయన నివాసంలో కలిశారు. మెట్రో ఫేజ్–1 వాల్యూయేషన్, ఫేజ్–1 స్వాధీనానికి అవసరమైన రుణసేకరణ, రుణ సంస్థ ఎంపిక, ఫేజ్–2 విస్తరణ, నిర్మాణ వ్యయం తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ అధ్యయనం చేయడానికి ఎస్బీఐ క్యాప్స్ (ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్)ను కన్సల్టెంట్‌గా ఎంపిక చేశారు. అధ్యయనంలో సమన్వయానికి కృషి చేసేలా జాయింట్ కమిటీలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారిని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శిని ప్రతినిధులుగా ఉంచాలని నిర్ణయించారు. ఎస్బీఐ క్యాప్స్ సమర్పించే నివేదిక ఆధారంగా మెట్రోపై తదుపరి కార్యాచరణను నిర్ణయించనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనం, విస్తరణపై జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయంటూ రేవంత్‌రెడ్డి ఈ భేటీ అనంతరం ఒక ప్రకటనలో వెల్లడించారు. కిషన్‌రెడ్డి కూడా ఈ చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని పేర్కొన్నారు.ఐఆర్ఎఫ్సీ రుణం లేనట్లే...హైదరాబాద్ మెట్రో ఫేజ్–1లో ఈక్విటీ షేర్ కొనుగోలుకు రూ.1,461.47 కోట్లు, ప్రాజెక్టు అప్పుల రీఫైనాన్సింగ్‌కు రూ.13,538.53 కోట్లు కలిపి మొత్తం రూ.15వేల కోట్ల మేర ఫైనాన్సింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) మధ్య ఇప్పటికే చర్చలు జరిగాయి. ఒప్పందం ప్రకారం ఈనెల 15న మొదటి విడత రుణం విడుదల కావాల్సి ఉన్నప్పటికీ అది కుదరలేదు. దీనిపై రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. చివరకు ఇద్దరూ కలిసి కేంద్ర మంత్రులతో జరిపిన తాజా చర్చల్లో మెట్రో ఫేజ్–1 వాల్యూయేషన్ చేయాలని నిర్ణయించారు. ఎస్బీఐ క్యాప్స్ నివేదిక ప్రకారం రుణ సంస్థను ఎంపిక చేస్తారు. అది ఐఆర్ఎఫ్సీ అవుతుందా, లేదా మరో సంస్థ నుంచి రుణం తీసుకోవాలా అనేది భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కీలక దిశగా అడుగులుదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) నమూనాలో 2017లో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ఫేజ్–1ను గత ఏప్రిల్‌లో తెలంగాణ ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది. అప్పటివరకూ దీన్ని నిర్మించి, నిర్వహించిన ఎల్ అండ్ టీ కోవిడ్ తర్వాత వచ్చిన నష్టాల కారణంగా వైదొలగాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జైపూర్ మోడల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఫేజ్–2 నిర్మాణం, నిర్వహణ చేపడితే కీలక పరిణామమే అవుతుంది.ఏమిటీ జైపూర్ మోడల్?రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో మెట్రో రైల్వే వ్యవస్థ 2015 జూన్ నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది కూడా ఫేజ్–2 విస్తరణ దశలో ఉంది. ప్రారంభంలో జైపూర్ మెట్రో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నప్పటికీ, తర్వాత కేంద్ర మెట్రో రైలు పాలసీ ప్రకారం ఇది కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్య సంస్థగా రూపాంతరం చెందింది. ఇటీవల ఆమోదించిన ఫేజ్–2 విస్తరణ పనులను ‘రాజస్తాన్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్’ అనే సంస్థ ద్వారా 50ః50 సంయుక్త భాగస్వామ్యంతో రెండు ప్రభుత్వాలు కలిసి చేపడుతున్నాయి. -
మీరు డెవలప్మెంట్ సెంటర్లిస్తే.. మేం సీఈవోలనిస్తాం!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరానికి డెవలప్మెంట్ సెంటర్లను అమెరికా ఇస్తే.. తాము గ్లోబల్ సీఈఓ లను ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇది హైదరాబాద్, అమెరికా మధ్య దౌత్య సంబంధం కాదని... ప్రజల మధ్య, కుటుంబాల మధ్య ఏర్పడిన అనుబంధమన్నారు. ఐటీ నుంచి ఏఐ, క్లీన్ ఎనర్జీ వైపు తెలంగాణ–యూఎస్ అడుగులు వేస్తున్నాయన్నారు. హైదరాబాద్ వారసత్వ సంపదను కాపాడటంలో అమెరికా సహ కారం అభినందనీయమన్నారు. అమెరికాకు స్వాతంత్య్రం లభించి 250 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్‌లో నిర్వహించిన ఫ్రీడమ్ 250 వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. 1990లలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో అడుగుపెట్టడం నుంచి.. నేడు సత్య నాదెళ్ల ఆ సంస్థకు సీఈఓగా ఎదగడం వరకు ఉన్న ప్రయాణాన్ని గుర్తుచేశారు. తెలుగువారి నైపుణ్యానికి ఇదొక నిదర్శనమని కొనియాడారు. ‘ఈరోజు మన ఇళ్లలో అమెరికా అనేది మ్యాప్‌లో చూసే ఒక దేశం కాదు. అక్కడ చదువుకుంటున్న మన పిల్లలు, ఉద్యోగాలు చేస్తున్న బంధువులు, స్టార్టప్‌లు పెడుతున్న యువత రూపంలో అమెరికా ప్రతి తెలుగు ఇంట్లో ఒక భాగమైంది. ఇప్పుడు మనం అమెరికాకు వెళ్తున్నాం అని కాదు, తెలుగే నేరుగా అమెరికాకు వెళ్లిపోయింది. అక్కడ వేగంగా విస్తరిస్తున్న భాషగా తెలుగు నిలవడం మనందరికీ గర్వకారణం’ అని భట్టి అన్నారు. ప్రధాన రహదారికి ట్రంప్ పేరు పెట్టాం..తెలంగాణ రైజింగ్ సమ్మిట్–2025లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినట్లుగా.. అమెరికాతో ఉన్న ప్రత్యేక బంధానికి గుర్తుగా ఇక్కడి యూఎస్ కాన్సులేట్ సమీపంలోని ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టా లని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి గుర్తుచేశారు. ఈ సందర్భంగా అమెరికా రాయబారి సెర్జియో గోర్, కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌లతో కలిసి భట్టి విక్రజుమార్క ఆ రహదారి పేరు ఫలకాన్ని ఆవిష్కరించారు. -
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.1.20 కోట్ల జీవిత బీమా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. సహజ మరణం లేదా ప్రమాదవశాత్తు మరణం సంభవించినప్పుడు రూ.1.20 కోట్ల జీవిత బీమా రక్షణ కల్పించే ఎంప్లాయీస్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను ప్రవేశపెడుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రేపే ప్రారంభం!: ఎంప్లాయీస్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లో ఉద్యోగులు, పెన్షనర్లు ఎలాంటి ప్రీమియం, చందా, ఇతర చెల్లింపులేవీ కట్టాల్సిన అవసరం లేదు. ఈ బీమా పథకాన్ని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి ఈనెల 25న రవీంద్రభారతిలో మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ బీమా పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వివిధ బ్యాంకులతో అవగాహన(ఎంఓయూ) కుదుర్చుకోనుంది. రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల పిలుపు: ఎంప్లాయీస్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాలు, యూనియన్లు, సంస్థలు తమ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రతినిధులతో పాటు జంట నగరాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా హాజరు కావాలని తెలంగాణ గెజిటెడ్ ఎంప్లాయీస్ జేఏసీ (టీజీఈజేఏసీ) చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఉద్యోగులు తమ గుర్తింపు కార్డులు (ఐడీ కార్డులు) వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఇది ఊహించని మేలు: ‘ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ మొత్తంలో జీవిత బీమా కల్పించడం ఎవరూ ఊహించనిద’ని ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ సైదులు అన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా కల్పించే ఈ నిర్ణయం ప్రభుత్వ సంక్షేమ దృక్పథానికి నిదర్శనం’అని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల తరఫున జేఏసీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
2027 హజ్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: 2027 హజ్ యాత్ర షెడ్యూల్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని, రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణ సైతం ప్రారంభమైందని తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ అఫ్జల్ బియబానీ ఖుస్రో పాషా మంగళవారం వెల్లడించారు. జూలై 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. తెలంగాణకు 6,684 మంది యాత్రికుల కోటాను కేంద్ర హజ్ కమిటీ కేటాయించిందన్నారు.. 65 ఏళ్లు పైబడిన వారు దరఖాస్తు చేసుకుంటే నేరుగా యాత్రకు ఎంపికవుతారని పేర్కొన్నారు. 15 ఏళ్లు పైబడిన వారే అర్హులని, మిగిలిన వారిని డ్రా పద్ధతిలో ఎంపిక చేస్తామన్నారు. డ్రా జూలై చివరివారం లేదా ఆగస్టు మొదటి వా రంలో ఉంటుందన్నారు.. ఎంపికైన వారు మొదటి విడతగా రూ.1,52,300 చెల్లించాలని సూచించారు. పాస్‌పోర్ట్ వ్యాలిడిటీ 31 డిసెంబర్ 2027 వరకు ఉండాలన్నారు. 2026 వెయిటింగ్ లిస్టులోని 20 శాతం మందికి ఈసారి అవకాశం దక్కుతుందన్నారు. 2026 హజ్ యాత్ర ఈ నెల 22తో ముగిసిందని, 14 రాష్ట్రాల నుంచి 9,660 మంది వెళ్లగా తెలంగాణ నుంచి 6,684 మంది ఉన్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో యాత్రికుల రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరించిందని, రూ.7 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. 19 ప్రభుత్వ శాఖల సమన్వయంతో యాత్ర విజయవంతమైందని, సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
టిమ్స్‌లో 184 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)లో డాక్టర్లు, టెక్నీషియన్లు, పరిపాలనా సిబ్బంది సహా వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. టిమ్స్‌ను నిమ్స్ తరహాలో అభివృద్ధి చే యాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు నియా మక ప్రక్రియ బాధ్యతలను నిమ్స్‌కు అప్పగించారు. భర్తీ చేసే పోస్టులివీ... నిమ్స్ మంగళవారం మొత్తం 184 కాంట్రాక్టు పోస్టుల భర్తీకి మూడు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తం ఖాళీల్లో 31 మెడికల్ ఫ్యాకల్టీ పోస్టులు, 122 టెక్నికల్, అలైడ్ హెల్త్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు, 31 సపోర్ట్, ఇంజినీరింగ్, సెక్యూరిటీ, లీగల్, పీఆర్ తదితర పోస్టులు ఉన్నాయి. మెడికల్ ఫ్యాకల్టీ కేటగిరీలో 5 ప్రొఫెసర్, 2 అసోసియేట్ ప్రొఫెసర్, 24 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, న్యూరోసర్జరీ వంటి సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు. టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో ల్యాబ్, అనస్థీషియా, ఎంఆర్ఐ, సీటీ, ఎక్స్‌రే, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్లతో పాటు మెడికల్ రికార్డు ఆఫీసర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, స్టాటిస్టీషియన్, రిజిస్ట్రార్, అకౌంట్స్, హెల్త్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా లీగల్ ఆఫీసర్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, బయోమెడికల్, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఇంజినీర్లు, ఫైర్ ఆఫీసర్లు, ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూమెడికల్ ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధిత స్పెషాలిటీలో డీఎం, ఎం.సీహెచ్, డీఎన్బీ, డాక్టర్ఎన్బీ అర్హతలతో పాటు నిమ్స్, ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం అనుభవం ఉండాలి. ఇతర పోస్టులకు డిగ్రీ, పీజీ, బీఎస్సీ, డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ తదితర అర్హతలను నిర్దేశించారు. మెడికల్ ఫ్యాకల్టీ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 50 నుంచి 58 ఏళ్లుగా నిర్ణయించగా, ఇతర పోస్టులకు నోటిఫికేషన్లో పేర్కొన్న వయోపరిమితి వర్తిస్తుంది. అభ్యర్థులు జూలై 6 వరకూ దరఖాస్తులను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెడికల్ ఫ్యాకల్టీ పోస్టులకు అభ్యర్థులు జూలై 6 ఉదయం 9 గంటలకు నిమ్స్‌లో జరిగే వాక్–ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ధ్రువపత్రాలతో జూలై 6 సాయంత్రం 4 గంటలలోపు నిమ్స్‌లో సమర్పించాలి. పోస్టుల వారీగా అర్హతలు, వేతనాలు, రిజర్వేషన్ల వివరాలు నిమ్స్ వెబ్సైట్ www.nims.edu.in లో అందుబాటులో ఉన్నాయి. -
వడ్డీ పద్దే పెద్దది
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత రెండు నెలల కాలంలో రాష్ట్ర ఖజానా నుంచి ఎక్కువ భాగం నిధులు అప్పులకు వడ్డీలు చెల్లించడానికే ఖర్చయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. గత ఏప్రిల్, మే..రెండు నెలల కాలంలో మొత్తం రూ.39 వేల కోట్లకు పైగా నిధులు ఖజానాకు సమకూరగా, అందులో 12 శాతం అంటే రూ.4,658 కోట్లు వడ్డీల కింద చెల్లించినట్లు వెల్లడిస్తున్నాయి. ఈ రెండు నెలల్లో మొత్తం నిధుల వ్యయాన్ని పరిశీలిస్తే వచ్చిన రాబడుల్లో 60 శాతం నాలుగు పద్దుల కిందే ఖర్చయ్యాయని, వడ్డీల చెల్లింపులతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, సబ్సిడీల రూపంలో రూ.23 వేల కోట్లకు పైగా ఖర్చయ్యాయని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏ పద్దుకు ఎంతంటే...! ఏప్రిల్, మే మాసాల్లో రెవెన్యూ రాబడుల కింద రూ. 28,441 కోట్లు ఖజానాకు సమకూరాయి. ఇందులో పన్ను ఆదాయం 26,093 కోట్లు కాగా, పన్నేతర ఆదాయం కింద రూ.1,803 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ.544.99 కోట్లు వచ్చాయి. మూలధన రాబడుల రూపంలో మరో రూ.10,603 కోట్లు రాగా, అందులో అప్పుల రూపంలోనే రూ.10,595 కోట్లు వచ్చాయి. రెవెన్యూ, మూలధన రాబడులు కలిపి రూ.39,045.24 కోట్లు వచ్చినట్టు కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక మొత్తం రాబడుల్లో రెవెన్యూ వ్యయం కింద రూ.33,479 కోట్లు, మూలధన వ్యయం రూపంలో రూ. 3,932.36 కోట్లు ఖర్చయ్యాయి. రెవెన్యూ వ్యయం కింద ఖర్చు చేసిన వాటిలో సబ్సిడీలకు రూ.5,809 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్ల కోసం రూ.13 వేల కోట్లు చెల్లించగా, రెవెన్యూ పద్దు కింద దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చయ్యాయి. మొత్తం మీద రెండు నెలల కాలంలో రూ. 37,412.33 కోట్లు ఖర్చు కాగా, మొత్తం వ్యయ గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై అనివార్య ఖర్చుల భారం పెరుగుతోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పన్ను ఆదాయం విషయానికి వస్తే ప్రతి పద్దు కింద గత ఏడాది రెండు నెలల కాలంతో పోలిస్తే పన్నులు పెరగడం గమనార్హం. -
మెట్రో పేరుతో డ్రామాలు
గచ్చిబౌలి/మియాపూర్: సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్ మెట్రో విషయంలో డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఆరోపించారు. కేంద్రాన్ని రేవంత్‌రెడ్డి ఏదో అడిగినట్లు, కిషన్‌రెడ్డి ఏదో తీసుకొస్తున్నట్లుగా ఢిల్లీలో మళ్లీ నాటకాలు మొదలు పెట్టారని ఆయన విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన పార్టీ సభ్యత్వ, ‘సర్’శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మెట్రోకు చెందిన రూ. 30 వేల కోట్ల విలువైన ఆస్తులపై సీఎం రేవంత్ కన్నేశారని.. అందుకే అధికారులను బ్లాక్మెయిల్ చేసి రాష్ట్రం నుంచి తరిమేశారని ఆరోపించారు. 250 ఎకరాలను కుటుంబ సభ్యులకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎల్ అండ్ టీకి ఉన్న రూ. 14 వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తామని చెప్పి మెట్రో రైళ్లను దివాలా తేయించే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. కిషన్‌రెడ్డికి, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే లక్డీకాపూల్ నుంచి పటాన్చెరు వరకు గతంలో తాము ప్రతిపాధించిన మెట్రో రైలు అలైన్‌మెంట్‌కు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. జనసాంద్రత ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేస్తే రేవంత్‌రెడ్డి రద్దు చేశారని కేటీఆర్ మండిపడ్డారు. శేరిలింగంపల్లిని రూ. 9,500 కోట్లతో అభివృద్ధి చేశాం.. శేరిలింగంపల్లిలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ. 9,500 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని కేటీఆర్ చెప్పారు. సినీహీరో రజనీకాంత్ శేరిలింగంపల్లి ప్రాంతాన్ని చూసి హైదరాబాద్‌లో ఉన్నానా లేక అమెరికాలో ఉన్నానా అనే సందేహం కలుగుతోందని అన్నారంటే ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందో అందరూ గుర్తుచేసుకోవాలన్నారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని అంటున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ముందు వారిని లక్షాధికారులను చేయాలని సూచించారు. ఒక్కో మహిళకు రూ. లక్షన్నర ఇస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ విసిరారు. కార్యకర్తలే డ్రైవర్లు.. ‘కారు’కు కార్యకర్తలే డ్రైవర్లని, పదవి ఇచ్చినా ఇవ్వకున్నా ప్రతి ఒక్కరూ కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం అహారి్నశలూ శ్రమిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కార్యకర్తలతో కరచాలనం చేస్తూ, సెల్ఫీలు దిగుతూ కేటీఆర్ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు వివేకానంద, నాయకులు రాగడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొమిరిశెట్టి సాయిబాబ, బొబ్జానవతా రెడ్డి, రోజా రంగారెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మెట్రో మళ్లీ 'మొదటి'కి..
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు మొదటిదశ స్వాదీన ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. రెండు నెలల క్రితమే ఎల్అండ్టీ నుంచి ఈ ప్రాజెక్టును ప్రభుత్వం స్వాదీనం చేసుకుంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) నుంచి రుణాలు బదిలీ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మెట్రో స్వాధీనం, విస్తరణపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సంప్రదింపులు జరిపారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్– ఐ వాల్యూయేషన్‌తోపాటు స్వా«దీనానికి అవసరమైన రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్–2 విస్తరణ, నిర్మాణ వ్యయం తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు ఎస్బీఐ క్యాపిటల్‌ను కన్సల్టెన్సీగా నియమించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఎస్బీఐ క్యాప్స్ అందజేసే నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని పేర్కొనడంతో టేకోవర్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు జరిగిన పరిణామాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఫలితంగా మొదటి దశ టేకోవర్ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఎస్బీఐ క్యాప్స్ సంస్థ మెట్రో మొదటిదశపై అంచనాలను రూపొందిస్తూనే రెండోదశ నిర్మాణ వ్యయాన్ని కూడా అంచనా వేయనుంది. దీంతో రెండో దశ డీపీఆర్‌లో కూడా మార్పులు అనివార్యమయ్యాయి. ఐడీబీఐ నివేదిక సంగతేంటీ... మెట్రో మొదటిదశ ప్రాజెక్టును ప్రభుత్వం ఎల్అండ్టీ నుంచి గత ఏప్రిల్ 29న టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే. గత సెపె్టంబర్లో మెట్రో మొదటి దశ ప్రాజెక్టు నుంచి తప్పుకోనున్నట్లు ఎల్అండ్టీ ప్రకటించినప్పటి నుంచి దశలవారీగా అనేక పరిణామాలు జరిగాయి. మూడు కారిడార్లలోని 69 కి.మీ. మెట్రో మొదటి దశ ప్రాజెక్టుపై అంచనాలను రూపొందించేందుకు అప్పట్లో ఐడీబీఐ సంస్థను నియమించారు. అలాగే సాంకేతిక అంశాలపై అంచనాల బాధ్యతలను ఢిల్లీ మెట్రోరైల్‌కు అప్పగించారు. ఈ రెండు సంస్థలు అందజేసిన నివేదికల ఆధారంగానే ప్రభుత్వం ముందుకెళ్లింది. రూ.1,461.47 కోట్ల ఎల్అండ్టీ ఈక్విటీని చెల్లించడంతోపాటు రూ.13,538.53 కోట్ల అప్పును రీఫైనాన్స్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఐఆర్ఎఫ్సీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెలాఖరునాటికి చెల్లింపులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా కూడా ఐడీబీఐ క్యాపిటల్ సంస్థ వ్యవహరిస్తుందని నిర్ణయించారు. కానీ ఐఆర్ఎఫ్సీ నుంచి రుణాలు అందకపోవడంతో జాప్యం నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరిపారు. ఈ చర్చలు విజయవంతంగా ముగిసినట్లు సీఎం ప్రకటించారు. అయితే, ఐడీబీఐ స్థానంలో ప్రస్తుతం ఎస్బీఐ క్యాపిటల్‌ను కన్సల్టెన్సీగా నియమించడంతో టేకోవర్ ప్రక్రియ ముందుకెళ్తోందా, వెనకడుగు వేస్తోందా తెలియని అయోమయం నెలకొంది. ఇప్పటి వరకు ఇలా... రెండో దశ నిర్మాణానికి అనుమతులను ఇచ్చేందుకు మొదటి దశ ప్రాజెక్టును ఎలా నిర్వహిస్తారంటూ కేంద్రం పలు సందేహాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మొదటి దశ ప్రాజెక్టు నుంచి తప్పుకోనున్నట్లు ఎల్అండ్టీ సంస్థ గత సెపె్టంబర్లో ప్రకటించింది. రెండోదశకు ఆటంకంగా ఉన్న మొదటిదశను ఎల్అండ్టీ నుంచి స్వాధీనం చేసుకొనేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పలు దఫాలుగా జరిపిన చర్చలు, సంప్రదింపులు, ఐఆర్ఎఫ్సీతో కుదుర్చుకున్న ఒప్పందం అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ 29న అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐఆర్ఎఫ్సీ, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్)లిమిటెడ్, హెచ్ఎంఆర్ఎల్ సంస్థలు ఢిల్లీలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. రూ.13,600 కోట్ల రుణ సౌకర్యాన్ని నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు, వర్కింగ్ కాపిటల్ రీఫైనాన్సింగ్ వంటి రుణ అవసరాలకు వినియోగించాలని ఒప్పందం చేసుకున్నారు. మే ఆఖరుకల్లా రుణాల రీఫైనాన్సింగ్ పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పటివరకూ ఈ ప్రక్రియ పట్టాలెక్కలేదు. మరోసారి అంచనాలు ఎందుకు? మెట్రో మొదటి దశ టేకోవర్‌పై మరోసారి అంచనాలను రూపొందించాలని నిర్ణయించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటనేది చర్చనీయాంశంగా మారింది. రూ.30 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును ప్రభుత్వం రూ.15వేల కోట్లకే టేకోర్ చేసినట్లు ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ టేకోవర్ వల్ల మెట్రో ప్రాజెక్టు కోసం కేటాయించిన 269 ఎకరాల భూములు ప్రభుత్వపరం కానున్నాయి. అలాగే వివిధ ప్రాంతాల్లో నిర్మించిన మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లలో సుమారు 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉంది. మెట్రోకు కేటాయించిన ఆస్తులను లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు ఎల్అండ్టీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇప్పటివరకు ఎల్అండ్టీ సంస్థ కేవలం 4 లక్షల చదరపు అడుగులను మాత్రమే లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించింది. రాయదుర్గం వద్ద ఉన్న కొంత భూమిని మాత్రం ఓ ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చింది. ఇటీవల హైదరాబాద్‌లో భూముల విలువ గణనీయంగా పెరిగిన దృష్ట్యా మెట్రో భూములను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం లభించే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే మెట్రో మొదటిదశ అంచనాలపై మరోసారి అధ్యయనం చేయాలని కేంద్రం కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎస్బీఐ క్యాపిటల్ సంస్థను కన్సల్టెన్సీగా నియమించినట్లు తెలుస్తోంది. -
ఫీజుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి
హైదరాబాద్: గత నాలుగు సంవత్సరాలుగా 14 లక్షల మంది పేద విద్యార్థులకు చెల్లించాల్సిన ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లించాలని, గతంలో ఉన్న మాదిరిగానే ఫీజుల రియంబర్స్మెంట్ స్కీములు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్.. ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కోరారు.హైదరాబాద్ లోని మహాత్మ జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కతో జాజుల శ్రీనివాస్ గౌడ్ బేటి అయ్యారు ఈ సందర్భంగా బీసీ డిమాండ్లతో కూడుకున్న వినతి పత్రాన్ని డిప్యూటీ సీఎంకు జాజుల అందజేశారు.ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ తో మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో వేలాదిమంది విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని, ఫీజులు చెల్లించాలని ప్రైవేట్ కళాశాల యజమాన్యాలు వేధిస్తున్నాడంతో అనేక మంది విద్యార్థులు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన తెలిపారు, కాంట్రాక్టర్లకు బిల్లులను ఆపి పేద విద్యార్థుల ఫీజుల బకాయిలు చెల్లించాలని ఆయన కోరారు అలాగే 2008 సంవత్సరంలో ప్రారంభమైన ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ ను ఏ విధంగా అమలు చేశారో ఇప్పుడు కూడా జీవో నెంబర్ 8, 9 లను రద్దుచేసి పాత పద్ధతిలోని ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ అమలు చేయాలని ఆయన కోరారు, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం పదివేల ర్యాంకు నిబంధనలు ఎత్తివేసి పూర్తి ఫీజులను ప్రభుత్వం భరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటాం: భట్టిఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని, ఫీజుల బకాయిల చెల్లింపు పై రెండు మూడు రోజుల్లోనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సానుకూల నిర్ణయం తీసుకుంటామని జాజులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు -
ఏసీబీ వలకు మరో అవినీతి అధికారి
సాక్షి,నిజామాబాద్: ఏసీబీ వలకు మరో అవినీతి అధికారి చిక్కడు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని అవినీతిశాఖ అధికారులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో చేపట్టిన సోదాల్లో నాలుగు ఇళ్లు,ఒక వాణిజ్య భవనం ఉన్నట్లు గుర్తించారు. 8 ఇళ్ల స్థలాలు,10.23 ఎకరాల భూమి,3.31లక్షల నగదు,ఖాతాలో 50 లక్షలు ఉన్నట్లు తేల్చారు.మొత్తం మూడు కోట్లకుపైగా అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. బహిరంగ మార్కెట్లో స్థిరాస్తుల విలువ అధికంగా ఉంటుందని అధికారులు వివరించారు. నిజామాబాద్,సికింద్రాబాద్ మచ్చ బొల్లారం ఇళ్లతోపాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో మొత్తం 11 బృందాలు,11 చోట్ల ఉదయం నుంచి తనిఖీలు చేశాయి. సోదాలు ముగిసినప్పటికీ విచారణ మాత్రం కొనసాగుతుందని అనిశా అధికారులు వెల్లడించారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎల్లుండి(గురువారం) నుంచి ఉచిత బీమా పథకం ప్రారంభించనుంది. సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్నిరవీంద్ర భారతిలో ప్రారంభించనున్నారు.సహజ, ప్రమాద మరణాలకు ఈ బీమా వర్తించనుంది. దీనికి సంబంధించి బ్యాంకులతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సుమారు రూ. 1.20 కోట్ల వరకూ ఉచిత జీవిత బీమా పథకం వర్తింప చేయనున్నారు. -
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల తకరారు!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లను పునర్వవస్థీకరిచడంతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటైంది. రాచకొండ పేరును మల్కాజ్‌గిరిగా మార్చిన డీజీపీ కార్యాలయం.. నాలుగు కమిషనరేట్లకు అధిపతుల్ని నియమించింది. గత ఏడాది డిసెంబర్లో ఈ ప్రక్రియ జరగ్గా ఇప్పటికీ అంతా గందరగోళంగానే ఉంది. ఈ కాలంలో మల్కాజ్‌గిరికి రెండో పోలీసు కమిషనర్ కూడా వచ్చేశారు. ఇటీవల హైదరాబాద్ పోలీసు కమిషనర్ చేపట్టిన సబ్–ఇన్స్పెక్టర్ల బదిలీల నేపథ్యంలో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తాత్కాలికంగా ఎక్కడి వారు అక్కడే అంటూ... పునర్వ్యవస్థీకరణలో భాగంగా మల్కాజ్‌గిరిగా మారిన రాచకొండ నుంచి ఐదు పోలీసుస్టేషన్లు హైదరాబాద్‌లో కలవగా..నగరం నుంచి తొమ్మిది ఠాణాలు అక్కడకు వెళ్లాయి. అప్పట్లో డీజీపీ కార్యాలయం ఎక్కడి సిబ్బంది అక్కడే పని చేసేలా తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆ తొమ్మిది ఠాణాల్లోని ఇన్స్పెక్టర్ల నుంచి హోంగార్డుల వరకు మల్కాజ్గిరిలోనే పని చేస్తున్నారు. ఈ రెండే కాదు.. అన్ని నాలుగు కమిషనరేట్లలోనూ జరిగిన మార్పుచేర్పులతో ఎక్కడి సిబ్బంది అక్కడే తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్నారు. ఈ సిబ్బందితో పాటు సరిహద్దులను పూర్తిస్థాయిలో శాశ్వతంగా నిర్దేశించడానికి ఉద్దేశించిన కమిటీ అధ్యయనం పూర్తి కాకపోవడంతో తుది ఉత్తర్వులు వెలువడలేదు.ఈ రెండింటి మధ్యే అసలు ఇబ్బంది... రాజధానిలోని మిగిలిన కమిషనరేట్ల విషయం అంటుంచితే... హైదరాబాద్–మల్కాజ్గిరి మధ్యే అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రెండు కమిషనరేట్ల మధ్య పోలీసుస్టేషన్ల మార్పిడి జరిగినప్పటికీ సిబ్బంది పంపకం విషయంలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ చార్మినార్ జోన్లోకి, మల్కాజ్గిరి యాదాద్రి జోన్లోకి వస్తాయి. దీంతో ఒక కమిషనరేట్ సిబ్బంది మరో కమిషనరేట్లోకి మారాలంటే ప్రభుత్వ ఉత్తర్వులు ఉండాల్సిందే. ఇవి జారీ అవ్వాలంటే నాలుగు కమిషనరేట్ల అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ అధ్యయనం పూర్తయి..కీలక సిఫార్సులు ప్రభుత్వానికి చేరాలి.వీళ్లు ఎవరికి దరఖాస్తు చేసుకోవాలో.. ఈ పరిణామంతో ఆ తొమ్మిది ఠాణాల్లో పని చేస్తున్న దాదాపు 600 మంది సందిగ్ధంలో పడ్డారు. తమకు పరిపాలన పరమైన ఇబ్బందులు ఉన్నా... బదిలీ అవసరమైనా... ఇతర సమస్యలు వచ్చినా ఎవరికి ఫిర్యాదు చేయాలన్నది అంతుచిక్కట్లేదని వాపోతున్నారు. తాము సాంకేతికంగా హైదరాబాద్ కమిషనరేట్‌కు చెందిన వారమని... తాత్కాలిక ప్రాతిపదికన మల్కాజ్‌గిరిలో పని చేస్తుండటంతో ఈ ఇబ్బంది వస్తోందని చెప్తున్నారు. కమిటీ వీలున్నంత త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందించి తమ సమస్యలు తీర్చాలని కోరుతున్నారు.చదవండి: హెచ్ఎండీఏ భూముల వేలం.. కనీస ధర గజానికి రూ.50 వేలుబదిలీల సమస్య ఏమిటంటే..? హైదరాబాద్ కమిషనరేట్‌లోని వివిధ పోలీసుస్టేషన్లలో సుదీర్ఘకాలంలో పని చేస్తున్న ఎస్ఐల జాబితాను ఇటీవల ఉన్నతాధికారులు రూపొందించారు. శాశ్వత కేటాయింపులు జరగకపోవడంతో మల్కాజ్గిరి కమిషనరేట్‌లో కలిసిన తొమ్మిది ఠాణాల్లో పని చేస్తున్న సిబ్బంది వివరాలూ ఈ జాబితాలోకి వచ్చాయి. దీంతో ఆయా పోలీసుస్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న దాదాపు 20 మంది ఎస్ఐలను వేరే ఠాణాలు, విభాగాలకు బదిలీ చేస్తూ హైదరాబాద్ కమిషనర్ ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ ఠాణాలు సాంకేతికంగా మల్కాజ్గిరి కమిషనర్ ఆధీనంలో ఉండటంతో ఈ తొమ్మిది ఠాణాలకు సంబంధించిన ట్రాన్స్ఫర్స్ ఆగాయి. -
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు బ్రేక్?
సాక్షి,హైదరాబాద్: మెట్రో రైలు విస్తరణ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. మెట్రో రైల్ విస్తరణపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త విధానానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారు. ఈ తాజా ఒప్పందం ప్రకారం.. ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం చేసే బాధ్యతను ఎస్బీఐ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయించాయి. అయితే, ఈ కొత్త పరిణామంతో గతంలో చర్చల్లో ఉన్న ఐఎఫ్ఆర్సీ రుణం (ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్)సీన్ నుంచి పూర్తిగా మాయమవ్వడం గమనార్హం.కేంద్ర ప్రతిపాదనల ప్రకారం మెట్రో ఫేజ్-1కు సంబంధించి మళ్లీ కొత్తగా విలువ నిర్ధారణ (వాల్యుయేషన్) ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ వాల్యుయేషన్ పూర్తయిన తర్వాతే, ప్రాజెక్ట్ స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, తగిన ఆర్థిక సంస్థ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాతే మెట్రో ఫేజ్-2 విస్తరణ, దానికి అయ్యే నిర్మాణ వ్యయం,నిధుల సేకరణ అంశాలపై క్షేత్రస్థాయి అధ్యయనం నిర్వహిస్తారు.ఈ ఎస్బీఐ కన్సల్టెన్సీ అధ్యయన ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్రం నుంచి ఒకరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారిని నియమించనున్నారు. వీరిద్దరూ సమన్వయం చేసుకుంటూ కన్సల్టెన్సీకి అవసరమైన వివరాలను అందిస్తారు. ఈ సంస్థ ఇచ్చే తుది నివేదిక ఆధారంగానే హైదరాబాద్ మెట్రో విస్తరణపై భవిష్యత్తు కార్యచరణను ఖరారు చేయనున్నారు. కేంద్రం తెచ్చిన ఈ కొత్త విధానం వల్ల మెట్రో విస్తరణ ప్రక్రియ మళ్లీ మొదటికి రావడమే కాకుండా, పనుల్లో మరింత ఆలస్యం జరిగేలా కనిపిస్తోంది.ఈ ఎస్బీఐ కన్సల్టెన్సీ తన అధ్యయనాన్ని పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకుంటుందనే గడువుపై ప్రస్తుతం ఎలాంటి స్పష్టత లేదు. దీంతో మెట్రో ఫేజ్-2 విస్తరణ పనులు ఎప్పుడు పట్టాలెక్కుతాయనే దానిపై సందిగ్ధత నెలకొంది. -
ఫోన్ మాట్లాడేందుకు టెర్రస్ పైకి వెళ్లి..
మియాపూర్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఐదో అంతస్తుపైనుంచి పడి మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీకాకుళం జిల్లా చెందిన బుద్ధ వెంకటప్రతాప్ రెడ్డి–ప్రశాంతి దంపతులు అమెరికాలో ఉంటున్నారు. తల్లి ప్రశాంతితో కలిసి కుమార్తె బుద్ధ శ్రీ ప్రాణమ్య (20) ఇటీవల మయూరీ నగర్‌లోని బొమ్మరిల్లు అపార్ట్మెంట్లో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం ప్రాణమ్య ఫోన్ మాట్లాడేందుకు టెర్రస్ పైకి వెళ్లి గోడకు ఆనుకొని ఉండగా అదుపు తప్పి కిందపడింది. వాచ్మెన్ సమాచారం ఇవ్వడంతో తల్లి ప్రశాంతి కూతురిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ప్రాణమ్య డిగ్రీ ఆన్లైన్లో చదువుతోంది. మృతురాలి తల్లి ప్రశాంతికి స్థానికంగా ఓ ఫ్లాట్ ఉందని.. రెండు మూడు రోజుల్లో అక్కడికి వెళ్లాల్సి ఉందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి పేరుతో.. 54 లక్షల హోం లోన్
నిజాంపేట్ : అమాయక దంపతుల ఫ్లాట్‌ను అక్రమంగా రిజి్రస్టేషన్ చేసి, రూ.54 లక్షల బ్యాంకు రుణం పొందిన ప్రధాన నిందితుడు బానొత్ ప్రసాద్‌రావు (37)ను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రసాద్‌రావు లోన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు.నిజాంపేట్ కు చెందిన మనోహర్ దంపతులకు రూ.25 లక్షలు ఇచ్చి వారి ఫ్లాట్ పత్రాలను తాకట్టు పెట్టుకున్నాడు. అనంతరం ఆస్తిని తన సంస్థ పేరిట మార్చి, సాఫ్ట్వేర్ ఉద్యోగి పేరుతో బదిలీ చేసి ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.54 లక్షల హోం లోన్ పొందాడు. జనవరి 2026లో బ్యాంకు రికవరీ సిబ్బంది బాధితుల వద్దకు రావడంతో మోసం బయటపడింది.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, జూన్ 19న ఖమ్మంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. అతని వద్ద నుంచి మొబైల్ స్వా«దీనం చేసుకున్నారు. ఇదే తరహా మరో కేసు దుండిగల్ పోలీస్ స్టేషన్లో కూడా నమోదైందని అధికారులు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచి రిమాండుకు తరలించారు. -
ఓటర్లకు అలర్ట్!
హైదరాబాద్: ‘ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసే ఎన్యూమరేషన్ ఫారాలను జూలై 24లోగా సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (బీఎల్వోలు) సమర్పించాలి. లేకుంటే జూలై 31న విడుదలయ్యే ముసాయిదా ఓటరు జాబితాలో ఓటర్ల పేర్లు ఉండవు’ అని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు.జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (ఎన్నికలు) కె.చంద్రకళతో కలిసి సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికీ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో బీఎల్వోలు ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారని, వాటిని నింపి తిరిగి సమర్పించడం తప్పనిసరి అన్నారు.47 లక్షల మంది ఓటర్లకు ఫారాల పంపిణీ జిల్లాలో 47,36,669 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో పురుషులు 23,99,880 మంది, మహిళలు 23,36,448 మంది, ఇతరులు 341 మంది ఉన్నట్లు వెల్లడించారు. వీరందరికీ వారి వివరాలతో కూడిన ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఫారాలు అందుకున్న ఓటర్లు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా వాటిని నింపి సంబంధిత బీఎల్ఓలకు అందజేయాలని కర్ణన్ సూచించారు. చివరి నిమిషంలో రద్దీ, సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ఫారాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.ఇంటికి వెళ్లిన సమయంలో ఇల్లు తాళం వేసి ఉంటే ఫారాలు అక్కడే ఉంచి బీఎల్వోలు కనీసం మూడు సార్లు వెళ్తారని చెప్పారు. అయినప్పటికీ వారికి ఫారం అందజేయలేకపోయినా, నింపిన ఫారం తిరిగి అందజేయకపోయినా అలాంటి ఓటర్ల పేర్లు కూడా ముసాయిదా జాబితాలో ఉండవని స్పష్టం చేశారు.ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను www.voter.eci.in వెబ్సైట్ లేదా ఈసీఐ యాప్ ద్వారా డౌన్‌న్‌లోడ్ చేసుకుని, అవసరమైన వివరాలు నింపి ఆన్లైన్లో అప్లోడ్ చేసే సౌకర్యాన్ని కూడా ఎన్నికల సంఘం కల్పించిందన్నారు.ఆన్లైన్లో ఫారం సమర్పించిన వారి వివరాలను కూడా బీఎల్వోలు ఇంటి వద్దకు వెళ్లి ధ్రువీకరిస్తారన్నారు. ఎన్యూమరేషన్ ఫారంపై ఓటరు స్వయంగా లేదా కుటుంబ సభ్యులలో ఎవరైనా సంతకం చేసి సమర్పించవచ్చని తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం–6, వివరాల సవరణ కోసం ఫారం–8 కూడా అందుబాటులో ఉంటాయన్నారు.భాగస్వాములు కావాలి.. ఓటరు జాబితా శుద్ధి ప్రక్రియ విజయవంతం కావాలంటే ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారం నింపి సమర్పించాలని, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి సహకరించాలని కర్ణన్ పిలుపునిచ్చారు. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు.. జులై 24 నాటికి పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తవుతుందని, 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తామని కర్ణన్ తెలిపారు. జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ జరుగుతుందని చెప్పారు.ఈ సమయంలో ఓటర్ల చేర్పు, తొలగింపు, వివరాల సవరణకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వోలు) విచారణలు నిర్వహించి, సెప్టెంబర్ 28 నాటికి అన్ని అభ్యంతరాలను పరిష్కరిస్తారు. తుది ఓటరు జాబితా అక్టోబర్ 1, 2026న విడుదల కానుంది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరుగా నమోదై ఉండటం ప్రజాప్రాతినిధ్య చట్టంప్రకారం శిక్షార్హమైన నేరమని కర్ణన్ హెచ్చరించారు.ముసాయిదా జాబితాలో పేరు లేకుంటే..? ఎన్యూమరేషన్ ఫారం సమర్పించని కారణంగా ముసాయిదా జాబితాలో పేరు లేకుంటే, ఆ వివరాలను ఈఆర్వో కార్యాలయాలు, ముఖ్య ప్రదర్శన కేంద్రాలు, ఎన్నికల సంఘం వెబ్సైట్లలో ప్రదర్శిస్తారు. అనంతరం ఈఆర్వోలు నోటీసులు జారీ చేసి అవసరమైన పత్రాలు సమర్పించాలని కోరుతారు. ఈ సందర్భంగా పాస్‌పోర్ట్, జనన ధ్రువీకరణ పత్రం, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు కార్డులు, పెన్షన్ పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రాలు, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలు, భూ లేదా గృహ కేటాయింపు పత్రాలు తదితర గుర్తింపు పత్రాలను సమర్పించవచ్చని అధికారులు తెలిపారు.4,062 పోలింగ్ కేంద్రాలు.. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 4,062 పోలింగ్ కేంద్రాలు, 1,684 పోలింగ్ లొకేషన్లు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణ కోసం 15 మంది ఈఆర్వోలు, 93 మంది ఏఈఆర్వోలు, 408 మంది బీఎల్వో సూపర్వైజర్లు, 4,062 మంది బీఎల్వోలు విధుల్లో ఉన్నారని చెప్పారు.రాజకీయ పార్టీల నుంచి బీఎల్ఏలుజిల్లాలోని 4,062 పోలింగ్ కేంద్రాలకు వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు మొత్తం 10,901 మంది బూత్ లెవల్ ఏజెంట్లను (బీఎల్ఏలు) నియమించాయి. కాంగ్రెస్ పార్టీ 3,601 మంది (88 శాతం), బీజేపీ 2,941 మంది (72.4 శాతం), బీఆర్ఎస్ 1,988 మంది (49.94 శాతం), ఎంఐఎం 2,371 మంది (58.31 శాతం) బీఎల్ఏలను నియమించాయి. బీఎల్ఏలు బల్క్‌గా అప్లికేషన్లు సమర్పించవచ్చు. -
ఎంఎంటీఎస్.. నయాలుక్..!
సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లకు మహర్దశ వచ్చింది. ఇప్పుడు ఆధునిక హంగులతో ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు అందజేస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, బుకింగ్ కేంద్రాలు, హైదరాబాద్ సంస్కృతిని ప్రతింబించేవిధంగా రూపొందించిన స్టేషన్ సమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’లో భాగంగా దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్‌లో 14 స్టేషన్ల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది. బేగంపేట్ స్టేషన్ పూర్తిస్థాయి సదుపాయాలతో గతేడాది అందుబాటులోకి వచ్చింది. హైటెక్‌సిటీ, హఫీజ్‌పేట్ స్టేషన్ల పునరాభివృద్ధి పనులు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో ఈ స్టేషన్లను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. రూ.2076 కోట్లతో.. మొత్తం 14 స్టేషన్లకు రూ.2076.42 కోట్లతో పునరాభివృద్ధి పనులను ప్రారంభించారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి ప్రధాన స్టేషన్లు మినహాయిస్తే మిగతావన్నీ ఎంఎంటీఎస్ స్టేషన్లు. సుమారు రూ.714.73 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్‌స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు ఊపందుకున్నాయి.రూ.29.21 కోట్లతో చేపట్టిన హఫీజ్‌పేట్, రూ.35.61 కోట్లతో చేపట్టిన హైటెక్‌సిటీ స్టేషన్లలో పనులు తుదిదశకు చేరుకొన్నాయి. వీటిని అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో కళాత్మకంగా అభివృద్ధి చేస్తున్నారు. అత్యాధునిక టాయిలెట్లు, తాగునీటి సదుపాయాలు, సీట్లు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లను ప్రయాణికులు మెచ్చేలా అద్భుతంగా ఏర్పాటు చేస్తున్నారు. -
...ట్రంప్ పేరు వద్దు
కవాడిగూడ : హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ రోడ్డుకు అమెరికా అ«ధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టవద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. సోమవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ బాబూ జగ్జీవన్‌రాం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా బీజేపీ ఆర్ఎస్ఎస్ తరహాలో నిర్ణయాలు ఉండటం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ జాతీయ నాయకత్వం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీఎస్‌బోస్,సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి. జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
ప్రియుడి మోజులో పడి కన్నకొడుకునే చంపేసిన తల్లి!
హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రెండేళ్ల కుమారుడిని హత్య చేసిన తల్లి, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం కీసర పోలీస్ స్టేషన్లో ఏసీపీ చక్రపాణి వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన స్వామి భార్య జ్యోతి, కుమారుడితో కలిసి చీర్యాలలోని ఈడెన్ గార్డెన్లో ఉంటున్నారు. జ్యోతికి తుర్కపల్లికి చెందిన నవీన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది.గత నెల 29న నవీన్.. జ్యోతి ఇంటికి వచ్చాడు. తమ వివాహేతర సంబంధానికి కుమారుడు అడ్డుగా ఉన్నాడని జ్యోతి సహకారంతో నవీన్ బాలుడిని నేలపై బలంగా కొట్టగా మృతిచెందాడు. బాలుడు ప్రమాదవశాత్తు మంచంపై నుండి పడిపోవడం వల్ల మృతిచెందాడని నిందితురాలు భర్తను నమ్మించింది. ఆ తరువాత భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖననం బాలుడి మృతదేహాన్ని వెలికితీసి ఫొరెన్సిక్ పరీక్షలు చేశారు. పోస్టుమార్టం నివేదిక, ఇతర సాక్షాల ప్రకారం తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కీసర సీఐ ఆంజనేయులు, ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, హరిప్రసాద్ పాల్గొన్నారు. -
ఛాతీపై కూర్చుని.. చున్నీతో గొంతు బిగించి
హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను దారుణంగా హత్య చేసింది ఓ భార్య. ఆపై ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేసి దొరికిపోయింది. ఎల్బీనగర్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన పోలీసుల వివరాల మేరకు.. మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం తట్టుపల్లికి చెందిన బోడ నర్సింగ్ (33)కు స్వరూపతో 2008లో వివాహమైంది. ఇటీవల నర్సింగ్ ఎల్బీనగర్ ఎనీ్టఆర్ నగర్లో అద్దె ఇల్లు తీసుకుని కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. స్వరూపకు సొంత గ్రామానికి చెందిన మోహన్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఇది నర్సింగ్కు తెలియడంతో తీవ్రంగా గొడవలు జరుగుతున్నాయి. పెద్ద మనుషులు పంచాయితీ కూడా అయింది. 3 రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నర్సింగ్‌ను అంతమొందించాలని స్వరూప పథకం వేసింది. శనివారం కూడా గొడవ జరిగింది. అయితే, తర్వాత భర్తతో ఏకాంతంగా ఉన్న సమయంలో అతడి ఛాతీపై కూర్చొని చున్నీతో గొంతు బిగించి హత్య చేసింది. మృతదేహాన్ని మంచానికి చున్నీతో కట్టి ఆత్మహత్యగా నమ్మించబోయింది. డయల్ 100కు ఫోన్ చేయగా పోలీసులు వచ్చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. ఈలోగా గోనర్సింగ్ మృతిపై అనుమానంతో అతడి అన్న బిచ్యానాయక్ ఎల్బీనగర్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు లోతుగా ఆరా తీయడంతో పాటు.. శవ పరీక్ష నివేదికతో నర్సింగ్ది ఆత్మహత్య కాదని తేలింది. కాగా, స్వరూప భర్తను చంపాక ప్రియుడికి ఫోన్ చేసి పారిపోవాలని చూసింది. పోలీస్‌లు ప్రత్యేక బృందంతో అల్కాపురి వద్ద ఆమెను అరెస్టు చేశారు. విచారణలో నేరాన్ని అంగీకరించింది. సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నర్సింగ్ దంపతుల పెద్ద కూతురు వరంగల్ గురుకులంలో పదో తరగతి పూర్తి చేసింది. చిన్న కూతురు హయత్‌నగర్‌లో 8వ తరగతి చదువుతోంది. -
మీకు అమీర్‌పేటలో నడిచే దుమ్ముందా?
అది జాతీయ రహదారి.. నిత్యం వేల వాహనాలు రాకపోకలు సాగించే మార్గం..! పైగా నగరంలోనే అత్యంత కీలక ప్రాంతం.. రోజూ లక్షల మంది తిరిగే రోడ్డు..! కానీ, అటుగా వెళ్లాలంటేనే ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి..! రహదారి దెబ్బతినడంతో పాటు దుమ్ము రేగుతుండడమే కారణం. దీంతో మొహానికి వస్త్రం అడ్డుపెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. అమీర్‌పేట పాత బిగ్‌బజార్ వద్ద నెలకొందీ దుస్థితి. అక్కడే యూటర్న్ కూడా ఉండడంతో ఇంకా ఇబ్బంది ఉంది. హైదరాబాద్ -
లక్ష పింఛన్ల ‘లెక్క’ తేల్లేదు!
సాక్షి, హైదరాబాద్: చేయూత పథకం కింద బ్యాంకు ఖాతాల్లో పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల ‘లైవ్‌నెస్ అథెంటికేషన్’(ప్రతి ఇంటికీ వెళ్లి పరిశీలన) ప్రక్రియలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ విధానం ద్వారా పింఛన్లు పొందుతున్న 19 లక్షలకు పైగా లబ్ధిదారుల్లో (పోస్ట్ ఆఫీస్‌లు, ఇతర రూపాల్లో మొత్తం కలిపి 41 లక్షల మందికి పైగా పింఛన్లు పొందుతున్నారు) ఇప్పటివరకు దాదాపు 16 లక్షల మంది లైవ్ అథెంటికేషన్ పూర్తి కాగా.. వీరిలో దాదాపు లక్ష వరకు పింఛన్లకు సంబంధించి వివరాలు నిర్ధారణ కాలేదు లేదా అందలేదు. వీరిలో 40 వేలకు పైగా మరణించిన వారు కాగా, ఫొటోలు క్యాప్చర్ కానివి 28 వేలు, ఆధార్‌కార్డు సమస్యలు 12 వేలు, ట్రేస్ కానివి, వలసలు, అథెంటిఫికేషన్‌కు రానివి 14–15 వేల దాకా ‘లైవ్‌నెస్ ఆథెంటికేషన్’లో వెల్లడైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాగా మరో 4 వేల మంది ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నప్పటికీ తెలంగాణలో పింఛన్లు పొందుతున్నట్లు గుర్తించారు. మంచిర్యాల జిల్లాలో బ్యాంక్ ఖాతాల ద్వారా పింఛను పొందుతున్న వారు 23 వేల మంది దాకా ఉండగా..దాదాపు 5 వేల వరకు చనిపోయిన, క్యాప్చర్ కాని, ఆధార్ సమస్యలు, వలసలు తదితర కేసులు ఉన్నట్టు తేలింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 734 పింఛన్లకు గాను దాదాపు 167 మంది, నల్లగొండ జిల్లాలో 1,500కు గాను 300 మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో 20 వేల మందికి గాను 3 వేల మంది, కామారెడ్డి జిల్లాలో 13 వేల మందికి గాను 2 వేల మంది, ములుగు జిల్లాలో 8 వేల మందికి గాను వెయ్యి మంది సరైన నిర్ధారణ లేనప్పటికీ పింఛను ప్రయోజనం పొందుతున్నట్టు వెల్లడైంది. పిల్లలకు లక్షకు పైగా జీతం వస్తున్నా.. ⇒ నెలకు లక్షకు పైగా జీతం పొందుతున్న అధికారులు, ఉద్యోగుల తల్లిదండ్రుల్లో కొందరు చేయూత పింఛన్లు పొందుతున్నట్లు లైవ్ అథెంటికేషన్‌లో తేలింది. ⇒ కార్లు,, ట్రాక్టర్లు, సొంతంగా పెద్ద భవనాలు ఉన్నవారు కూడా ప్రయోజనం పొందుతున్నారు ⇒ దివ్యాంగులకు మాత్రమే ఇవ్వాల్సిన డిజెబిలిటీ పింఛన్లు.. వైకల్యం లేకపోయినా కొందరికి అందుతున్నాయి ⇒ 50 ఏళ్లు దాటని వారికి కూడా వృద్ధాప్య పించన్లు అందుతున్నాయి. వీరికి లబ్ధిని నిలిపివేయండి రెగ్యులర్ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, మినిమమ్ టైమ్ స్కేల్, స్టేట్ స్కేల్ పొందుతున్న వారి సంక్షేమ పథకాల లబ్ధిని వెంటనే నిలిపేయాలని ఈ లైవ్ అథెంటికేషన్‌కు సంబంధించిన నివేదికలో ప్రభుత్వానికి అధికారులు సిఫారసు చేశారు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ సిబ్బంది, దినసరి, గౌరవ వేతనం పొందే వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలిస్తున్నారు. అక్రమ పింఛను కేసులు ఏవంటే.. – మరణించిన వ్యక్తులకు.. – తప్పుడు వివరాలతో పింఛను పొందుతున్నవారు – మార్గదర్శకాలు, నియమ, నిబంధనలకు భిన్నంగా ప్రయోజనం పొందేవారు – కుటుంబంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు లేదా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే.. – వలస వెళ్లిన లబ్ధిదారుడు నెలాఖరు వరకు ‘లైవ్‌నెస్ ఆథెంటికేషన్’పొడిగింపు! చేయూత పథకం కింద బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల ‘లైవ్‌నెస్ ఆథెంటికేషన్’కార్యక్రమాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించినట్టుగా తెలుస్తోంది. ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఇంకా సుమారు 3 లక్షల పింఛన్లకు సంబంధించి లైవ్ అథెంటికేషన్ పూర్తి కావలసి ఉంది. లైవ్ అథెంటికేషన్‌లో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి పరిశీలన నిర్వహిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. పింఛన్లు పొందుతున్నవారు నిజమైన అర్హులో కాదో తెలుసుకోవడంతో పాటు మరణించిన, వివరాలు సరిపోలని కేసులను గుర్తిస్తున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించిన తాజా గడువు ఈ నెల 22వ తేదీతో ముగిసింది. -
పొలం.. కదలని హలం!
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్లో పల్లెల్లో తెల్లవారుజామునే వినిపించే ట్రాక్టర్ల శబ్దాలు ఇప్పుడు అంతగా లేవు. నాగళ్లు భుజాన వేసుకుని వెళ్లే రైతులూ లేరు. నాగలి సాళ్లు పడాల్సిన పొలాల్లో అనేకచోట్ల ఇంకా పిచ్చి మొక్కలే కనిపిస్తున్నాయి. జూన్ మూడో వారం ముగుస్తున్నా చాలాచోట్ల భూములింకా బీడుపడే కనిపిస్తున్నాయి. రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. వాన రాకకోసం నిరీక్షిస్తున్నారు. ముఖ్యంగా తొలకరి జల్లులతో పత్తి విత్తనాలు వేసిన వారు మొలకలు రాక దిగాలుగా దిక్కులు చూస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యం కావడం, అక్కడక్కడా అడపాదడపా కురిసిన చిరు జల్లులు కూడా నిలకడగా లేకపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలు దాదాపు స్తంభించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో 132 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం 7.5 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి 26 లక్షల ఎకరాల్లో పంటలు వేశారంటే..ప్రస్తుతం సాగులో ఎంత జాగు చోటు చేసుకుందో అర్థమవుతుంది. రాష్ట్రంలో ఖరీఫ్ ప్రధాన పంటగా మారిన వరి సాగు ఈసారి దాదాపు నిలిచిపోయినట్లే కనిపిస్తోంది. జూన్ మూడో వారం వరకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 10 వేల ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు లేదా విత్తనాలు వేయగలిగారు. గత ఏడాది ఇదే సమయానికి సుమారు 59 వేల ఎకరాల్లో వరి సాగు ప్రారంభం కావడం గమనార్హం. వరి నాట్లు వాయిదా సాధారణంగా జూన్ రెండో వారం నుంచే నారుమళ్లు సిద్ధమై, అనేక ప్రాంతాల్లో నాట్లు కూడా మొదలవుతాయి. కానీ ఈసారి వర్షాలు లేకపోవడం, చెరువులు, కుంటలు, బోర్లు కూడా ఆశించిన స్థాయిలో నిండకపోవడంతో రైతులు నాట్ల ప్రక్రియను వాయిదా వేస్తున్నారు. ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాభావం తీవ్రంగా ఉండటంతో రైతులు విత్తనాలు కొనుగోలు చేసినా పొలాల్లోకి దిగలేకపోతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా తగినంత వర్షపాతం నమోదయ్యే వరకు రైతులు తొందరపడి విత్తనాలు వేయవద్దని సూచిస్తున్నారు. మొలకెత్తని పత్తి.. రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పత్తి పంట పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఇప్పటివరకు 5.43 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. అయితే వీటిలో సగానికి పైగా విస్తీర్ణంలో విత్తనాలు మొలకెత్తలేదని క్షేత్రస్థాయి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. జూన్ ప్రారంభంలో తొలకరి జల్లులు కురవడంతో రైతులు ఆశగా విత్తనాలు వేశారు. కానీ ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో నేలలో తేమ తగ్గిపోయి గింజలు ఎండిపోయాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, మహబూబ్‌నగర్ తదితర కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 50 శాతం వరకు మాత్రమే మొలకలు వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. గత ఏడాది ఇదే సమయానికి దాదాపు 20 లక్షల ఎకరాల్లో పత్తి సాగు పురోగతిలో ఉండగా, ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. కుప్పకూలిన సోయా సాగు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో ఎక్కువగా సాగయ్యే సోయాబీన్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 6,735 ఎకరాల్లో మాత్రమే సోయాబీన్ విత్తనాలు వేశారు. గత ఏడాది ఇదే సమయానికి 1,15,069 ఎకరాల్లో సోయాబీన్ సాగు జరిగింది. అంటే సుమారు 94 శాతం మేర విస్తీర్ణం తగ్గిపోయింది. సోయాబీన్‌కు విత్తే సమయంలో నేలలో సరిపడా తేమ అవసరం. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో రైతులు విత్తనాలను నిల్వలోనే ఉంచుతున్నారు. మొక్కజొన్న, కంది పంటలకూ బ్రేక్ వర్షాధార పంటలైన మొక్కజొన్న, కంది పంటల సాగు కూడా తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం 11 వేల ఎకరాల్లో మాత్రమే మొక్కజొన్న సాగైంది. గత ఏడాది ఇదే సమయానికి 80,500 ఎకరాల్లో మొక్కజొన్న సాగు నమోదు కావడం గమనార్హం. అలాగే కంది పంట నిరుడు ఇదే సమయానికి లక్షా 2 వేల ఎకరాల్లో సాగవగా..ఈసారి కేవలం 17 వేల ఎకరాల్లో మాత్రమే సాగవడం గమనార్హం. వర్షాభావ పరిస్థితుల్లో ప్రస్తుతం రైతులంతా వానల రాక కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు. -
స్థానికతపై ఒకే ప్రమాణాలు పాటించాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) రాజ్యాంగబద్ధ నియామక సంస్థగా స్థిరమైన ప్రమాణాలు పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. మారుతున్న కారణాలతో అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడం చట్టబద్ధం కాదని.. ఇటువంటి వ్యాజ్యాలతో ప్రజా వనరులు, కోర్టు సమయం, అభ్యర్థుల కెరీర్ అవకాశాలు వృథా అవుతాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకసారి నాలుగు వరుస విద్యా సంవత్సరాలు లేవని, మరోసారి 1 నుంచి 7వ తరగతి వరకు తెలంగాణలో చదవలేదని.. ఇలా భిన్న కారణాలు చూపడం ఆలోచన లేని నిర్ణయమంది. స్థానిక హోదా అంశాన్ని టీజీపీఎస్సీ కొత్త కొత్త కారణాలతో మళ్లీ తెరపైకి తేవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. రిట్ పిటిషనర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) అభ్యర్థి పల్లా నిశాంత్‌కు స్థానిక హోదా కల్పించాలంటూ కీలక తీర్పు ఇచ్చింది. టీజీపీఎస్సీ దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను కొట్టివేస్తూ జస్టిస్ పి.శామ్కోíÙ, జస్టిస్ నర్సింగ్‌రావు నందికొండ ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులు వెలువరించింది. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఏపీలో చదివినందున టీజీపీఎస్సీ తనను ఏఈఈ పోస్టుల ఎంపికకు స్థానికుడిగా పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ నిశాంత్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సింగిల్ జడ్జి పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో దీన్ని కమిషన్ అప్పీల్ చేసింది. 7వ తరగతే ప్రామాణికమనడం చట్టవిరుద్ధం టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రపతి ఉత్తర్వు 2018లోని పేరా 7 ప్రకారం స్థానిక హోదా నిర్ణయానికి ఏడో తరగతి వరకు చదివిన ప్రాంతాన్నే పరిగణనలోకి తీసుకోవాలన్నారు. నిశాంత్ 1 నుంచి 6వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్‌లో చదివినందున తెలంగాణలో స్థానికుడిగా గుర్తించలేమన్నారు. నిశాంత్ తరఫు న్యాయవాది వేదుల చిత్రలేఖ వాదనలు వినిపిస్తూ.. ఏఈఈ పోస్టుకు కనీస విద్యార్హత బీటెక్ అని, స్థానిక హోదా నిర్ణయానికి సంబంధిత అర్హత పరీక్ష బీటెక్ అవుతుందన్నారు. బీటెక్ చదివే వరకు నాలుగు వరుస విద్యా సంవత్సరాలు తెలంగాణలోనే అభ్యసించినందున స్థానిక హోదాకు అర్హుడని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. అభ్యర్థి స్థానిక హోదా విషయంలో టీజీపీఎస్సీ చేసిన వ్యాఖ్యానం సరైనది కాదంది. అన్ని పోస్టులకు 7వ తరగతినే ప్రామాణికంగా పరిగణించడం చట్ట ఉద్దేశానికి విరుద్ధమని పేర్కొంది. సాంకేతిక, వృత్తిపరమైన పోస్టుల విషయంలో సంబంధిత అర్హత పరీక్షను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. టీజీపీఎస్సీ వాదనను అంగీకరిస్తే డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల ఆధారంగా జరిగే నియామకాల్లో నిబంధనల అసలు ఉద్దేశం నిరీ్వర్యమవుతుందని పేర్కొంది. తెలంగాణలో ఉన్నత విద్య పూర్తిచేసిన అభ్యర్థులను కేవలం ప్రారంభ విద్య వేరే రాష్ట్రంలో జరిగిందనే కారణంతో స్థానికేతరులనడం అన్యాయమని తేలి్చచెప్పింది. స్థానిక హోదా నిర్ణయం పరిపాలనా సౌలభ్యం కోసం కాకుండా చట్టబద్ధ ప్రమాణాల ఆధారంగానే ఉండాలని తేలి్చచెప్పింది. ఏ పోస్టుకైనా ఏడో తరగతినే ప్రమాణంగా తీసుకోవాలన్న టీజీపీఎస్సీ వాదన ఆమోదయోగ్యం కాదంది. పారా–7లోని నిబంధనలను విడిగా కాకుండా మొత్తం ఉత్తర్వు ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకోవాలంటూ అప్పీల్‌ను కొట్టివేసింది. -
బాలికకు న్యాయం జరగడం లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్: మైనర్ బాలికలకు రక్షణ దొరకడానికి బీఆర్ఎస్ పోరాడుతోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. బండి భగీరథ్ పోక్సో కేసులో నాలుగు సార్లు బాలిక అత్యాచారానికి గురైందని అన్నారు. మొదటి నుంచి నిందితుడిని రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.‘‘బాధితురాలి మీదనే అక్రమంగా హనీట్రాప్ కేసు పెట్టించారు. కానీ, బీఆర్ఎస్ బాధితులకు న్యాయం జరగాలని పోరాడింది. మే8 న కేసు నమోదైనప్పటి నుంచి జైలుకు పోకుండా స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చూస్తే.. బీఆర్ఎస్ పసిగట్టి ప్రజలు, సోషల్ మీడియా సహాయంతో పోరాడింది. పోరాడిన తర్వాత సెక్షన్ 6 యాడ్ చేశారు. ప్రజలు, మీడియా, బీఆర్ఎస్ పోరాటంతో బండి భగీరథ్ లొంగుబాటు, అరెస్ట్ డ్రామా చేశారు. అనంతరం చర్లపల్లి జైలుకు పంపారు. మేడ్చల్ మల్కాజిగిరి కోర్టులో 3 సార్లు బెయిల్ కు అప్లై చేస్తే.. రిజెక్ట్ చేశారు. కానీ ఈ విషయం బాధితురాలికి చెప్పలేదు. బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలం రికార్డు చేశారు. నిందితుడిని కూడా ఎగ్జామిన్ చేశారు. బాధితురాలి తల్లి ఈ నెల 17, 18 తేదీల్లో నాతో మాట్లాడింది. కేసులో ఏం జరుగుతుందో చెప్పడం లేదని వివరించింది. ఇన్వెస్టిగేషన్ అధికారి బిజీగా ఉంటే, ఎవరో ఒక మహిళా అధికారి వీరికి ఎల్లప్పుడూ వివరాలు చెబుతూ ఉండాలి. బెయిల్ కోసం అప్లై చేస్తే తప్పకుండా బాధితులకు చెప్పాలి. బాధితురాలు స్టేట్మెంట్ వివరాలు అడిగితే అధికారులు ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డి ఎందుకు బాధితురాలితో మాట్లాడలేదు. బండి భగీరథ్ ని కాపాడాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు. పోలీసులు నిందితులు, సహ నిందితులను వెంటనే ఎగ్జామిన్ చేయాలి. నిందితునికి బెయిల్ వచ్చిన విషయం బయటి ప్రపంచానికి ఎందుకు తెలియనివ్వడం లేదు? అంత రహస్యంగా ఎందుకు చేస్తున్నారు? నిందితుని తరపు లాయర్ కోర్టులో ఫైల్ చేసిన పిటిషన్ ప్రకారం.. ఇతను 2023 నుంచి 2026 వరకు మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్నాడు. 2023లో పాశవికంగా తోటి విద్యార్థులపై దాడి చేస్తే.. సస్పెండ్ చేశారు. మూడు సంవత్సరాల కోర్సులో ఇప్పుడు పరీక్షలు రాయకపోతే జీవితం ఆగమవుతదని ఇచ్చారు. ఇప్పటికీ బెయిల్ ఆర్డర్ ఇవ్వలేదు. బయటి ప్రపంచానికి, కనీసం బాధితులకు కూడా ఇవ్వడం లేదు. బాధితులు భయంతో కోర్టుకు, పోలీసులు వద్దకు వెళ్లే పరిస్థితి లేదు. ప్రిసన్ మ్యానువల్ ప్రకారం... అందరూ జైలులో చదువుకొని, పరీక్షలు రాసుకోవచ్చు. భగీరథ్ బెయిల్ కోసం అప్లై చేస్తే... జైలులో రాయవచ్చు కదా? అమ్మాయికి న్యాయం జరగడం లేదు. హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాం’’ అని తెలిపారు. -
మెట్రోపై సానుకూలం
న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: దేశ రాజధాని పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా వీరితోపాటు చర్చలో పాల్గొన్నారు. ఢిల్లీలోని రైల్వేభవన్ వీరి సమావేశానికి వేదికైంది. వీరి మధ్య దాదాపు రెండు గంటలపాటు చర్చలు సాగాయి. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) రుణంతోపాటు మెట్రో ఫేజ్–2 విస్తరణకు త్వరితగతిన అనుమతుల విషయమై వారి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ఫేజ్–1కు కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఇప్పటివరకు రూ.1,204 కోట్లు ఇచ్చిందని ఈ సందర్భంగా అశ్వినీ వైష్ణవ్ చెప్పినట్లు తెలిసింది. ఫేజ్–2 విషయంలో తర్జనభర్జనలు జరుగుతున్న సమయంలోనూ కేంద్రం సూచించిన రెండు ప్రత్యామ్నాయాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. దీనిలో ప్రధానంగా రూ.10వేల కోట్లు తక్కువ ఖర్చయ్యేలా సూచించిన ఆర్ఆర్టీఎస్ ఫార్ములాకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదనే విషయాన్ని కిషన్ రెడ్డి ప్రస్తావించినట్లు తెలిసింది. మెట్రో రెండో దశకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన విషయాన్ని అశ్వినీ వైష్ణవ్ చెప్పినట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కోసం సంయుక్త కమిటీ ఏర్పాటు చేస్తే, తద్వారా సమన్వయ ప్రక్రియ ఆలస్యం లేకుండా మెట్రో విస్తరణ వేగవంతమవుతుందనే విషయాన్ని ఇద్దరు కేంద్ర మంత్రులూ రేవంత్‌రెడ్డితో అన్నట్లు తెలిసింది. మెట్రో ఫేజ్–2 50ః50 నిష్పత్తిలో.. హైదరాబాద్ మెట్రో ఫేజ్–1లో ఈక్విటీ షేర్ కొనుగోలుకు రూ.1,461.47 కోట్లు, ప్రాజెక్టు అప్పుల రీఫైనాన్సింగ్‌కు రూ.13,538.53 కోట్లు కలిపి మొత్తం రూ.15వేల కోట్ల లావాదేవీలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ మేరకు ఐఆర్ఎఫ్సీ రుణం మంజూరు చేయడానికి ఒప్పందం కుదిరింది. అయితే, జూన్ 15న మొదటి విడత రుణం విడుదల కాలేదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అశ్వినీ వైష్ణవ్‌కు చెప్పారు. ఆ రుణం విడుదల చేయడంతోపాటు మెట్రో ఫేజ్–2ను 50ః50 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్‌గా చేపట్టేలా ఆమోదించాలని కోరారు. భేటీ అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చర్చలు సానుకూలంగా సాగినట్లు చెప్పారు. మంగళవారం కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశమైన తర్వాత, మెట్రో ప్రాజెక్టు సమస్యలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఖట్టర్, రేవంత్ భేటీలో కిషన్‌రెడ్డి కూడా పాల్గొననున్నారు. పరస్పర సవాళ్ల మధ్య భేటీ హైదరాబాద్ మెట్రో రైలు వ్యవహారం ముందుకెళ్లకుండా మోకాలడ్డుతున్నారంటూ కిషన్‌రెడ్డిపై కొన్నిరోజులుగా రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి కిషన్‌రెడ్డి స్పందిస్తూ ఎన్నికల హామీల అమలులో తమ వైఫల్యంపై ప్రజల దృష్టి మళ్లించడానికే రేవంత్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి నిధులివ్వొద్దని తాను ఏ మంత్రికి చెప్పానో నిరూపించగలరా? అని సవాలు కూడా విసిరారు. అయితే తాను రెండ్రోజుల ఢిల్లీ పర్యటనకు వస్తున్నానని, అప్పుడు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయించాలని రేవంత్ బహిరంగ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రితో రేవంత్ రెడ్డి, కిషన్‌రెడ్డి సమావేశమవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
వాహనాలు తనిఖీ చేస్తుండగా...
భూపాలపల్లి/సాక్షిప్రతినిధి, వరంగల్/హైదరాబాద్: వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో బొగ్గులారీ ఢీకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణాశాఖాధికారి (డీటీఓ) దుర్మరణం చెందాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. డీటీఓ మద్దోజు వెంకన్న(45) సోమవారం ఉదయం గణపురం మండలంలోని మోరంచపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ట్యాక్స్ చెల్లించని ఒక హార్వెస్టర్‌ను పట్టుకొని చెల్పూరు సమీపంలోని జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి తరలించారు.తాను సైతం కారులో కార్యాలయం వద్దకు చేరుకుని రహదారిపై నిలబడి మళ్లీ వాహన తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాను పట్టుకున్న హార్వెస్టర్ డివైడర్ వైపు నుంచి కార్యాలయం లోపలికి వెళ్తుండగా భూపాలపల్లి నుంచి ఉప్పల్ వెళ్తున్న బొగ్గు లారీ హార్వెస్టర్ ముందు భాగాన్ని ఢీకొట్టి ఎడమవైపున ఉన్న డీటీఓ వెంకన్నపైకి దూసుకెళ్లింది. దీంతో అతను లారీ టైర్ల కింద పడి నడుము భాగం నుజ్జునుజ్జయింది. రవాణాశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని డీటీఓ వెంకన్నను ఆస్పత్రికి తీసుకెళ్ళేందుకు ప్రయతి్నంచినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన మృతిచెందాడు. కాగా, వెంకన్న ఈ నెల 5వ తేదీనే భూపాలపల్లికి బదిలీపై వచ్చారు. సరిగ్గా 17 రోజులకే ఈ సంఘటన జరగడంతో జిల్లా రవాణాశాఖలో విషాదం అలుముకుంది.లారీడ్రైవర్ మహ్మద్ తస్లీమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గణపురం ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. వెంకన్న స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా మరిపెడ గ్రామం. మృతుడికి భార్య స్వప్న, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడున్నారు. వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపిస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ వరంగల్‌లో స్పష్టం చేశారు.కాగా, ఆయన పారి్థవదేహాన్ని హనుమకొండలో ఆశోక కాలనీలోని నివాసానికి తీసుకువచ్చారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ గౌడ్, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారదలు వెంకన్న పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం వెంకన్న మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదం యాదృచి్ఛకంగా జరిగిన రోడ్డు ప్రమాదమా? లేక కుట్రకోణం దాగి ఉందా? అన్నది విచారణలో తేలనుంది. రవాణాశాఖ కేంద్ర కార్యాలయంలో జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌గా పనిచేస్తున్న ఎం.చంద్రశేఖర్ గౌడ్‌ను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను తేల్చటంతోపాటు, సాధారణ ప్రమాదమే అయి ఉంటే, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన అంశాలపై సిఫారసులు కూడా ఆయన ఇవ్వనున్నారు.వీలైనంత త్వరలో నివేదిక అందించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిభూపాలపల్లి డీటీఓ వెంకన్న వాహనాల తనిఖీలు చేస్తుండగా బొగ్గు లారీ ఢీకొని చనిపోవటం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. కాగా డీటీఓ వెంకన్న మృతిపై రవాణాశాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ విచారం వ్యక్తం చేసింది. విధుల్లో ఉన్న సమయంలో లారీ ఢీకొని మృతి చెందాల్సిన పరిస్థితి రావటం దారుణమని, ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్, ప్రధాన కార్యదర్శి సురేశ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన కుటుంబానికి అసోసియేషన్ అండగా నిలుస్తుందని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమని ప్రకటించారు. -
హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం పడింది. మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మణికొండ, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, పాతబస్తీ, చార్మినార్, బహదూర్‌పురా, బీహెచ్ఈఎల్, పటాన్చెరు, మియాపూర్‌లో వాన కురిసింది. హైదరాబాద్‌లో అర్ధరాత్రి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.మరోవైపు, నల్లగొండ జిల్లాలో కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బందులుపడ్డారు. తిరుమలగిరి (సాగర్) మండలం బోయగూడెం గ్రామంలో పిడుగుపాటుకు పశువుల కాపరి పుట్టపాక మల్లయ్య(45) మృతి చెందాడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ వర్షాలు కురిశాయి. నిజామాబాద్, ఆర్మూరు, బోధన్, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. -
హెచ్ఎండీఏ భూముల వేలం.. కనీస ధర గజానికి రూ.50 వేలు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మరోసారి భూముల వేలానికి సన్నద్ధమైంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న విలువైన స్థలాలను ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా విక్రయించనున్నారు. బంజారాహిల్స్‌లోని 102/1, టీఎస్ నంబర్ 1/పిఅండ్ 3/పిలోని 8.24 ఎకరాల భూములను జూలై 2న వేలం వేయనున్నారు. ఈ భూములపై ఈ నెల 24వ తేదీన ప్రీబిడ్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ భూములకు ఈ నెల 12న ప్రీబిడ్‌సమావేశాన్ని ఏర్పాటు చేసి 19న బిడ్డింగ్ నిర్వహించాలని మొదట నిర్ణయించారు. కానీ యమునా నగర్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ, థీమ్ అంబియన్స్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్త సర్వే నిర్వహించి సరిహద్దులను గుర్తించిన తర్వాతే వేలం వేయాలని కోరడంతో బిడ్డింగ్ తేదీలను హెచ్ఎండీఏ సవరించింది. ఈ భూములకు ఎకరానికి రూ.99 కోట్ల చొప్పున ధర నిర్ణయించారు. మోకిలలో 100 ప్లాట్లు.. అలాగే మోకిలలోని మరో 100 ప్లాట్లకు ఈ నెల 29, 30 తేదీల్లో బిడ్డింగ్ నిర్వహించనున్నారు. ఇక్కడ ఒక్కో ప్లాట్ కనిష్టంగా 300 చదరపు గజాల నుంచి గరిష్టంగా 500 చ.గ.ల వరకు ఉన్నాయి. కనీస ధర గజానికి రూ.50 వేలుగా ప్రతిపాదించారు. మేడిపల్లిలో ఉన్న 68 ప్లాట్లకు ఈ నెల 24వ ఈ–బిడ్డింగ్ నిర్వహిస్తారు. కనిష్టంగా 231.66 చ.గ. నుంచి గరిష్టంగా 643.22 చ.గ. విస్తీర్ణంతో ప్లాట్లు ఉన్నాయి. గజానికి రూ.45 వేల చొప్పున నిర్ణయించారు. మోకిల ప్లాట్లకు ఈ నెల 22న ప్రీబిడ్ సమావేశం నిర్వహించనున్నారు.చదవండి: కొత్త రేషన్ కార్డులు హుళక్కే!విక్రయించనున్న హెచ్ఎండీఏ భూములపై ఎలాంటి వివాదాలు లేవని హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. మేడిపల్లిలోని భూములను నిషేధిత జాబితా నుంచి డీ–నోటిఫై చేసిన అనంతరమే హెచ్ఎండీఏ స్వా«దీనంలోకి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మూడుచోట్ల భూముల అమ్మకాల ద్వారా రూ.1000 కోట్లకు పైగా ఆదాయం లభించవచ్చని అధికారుల అంచనా. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న బిడ్డర్లు మేడిపల్లి ప్లాట్ల కోసం ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మోకిలా ప్లాట్లకు 27 వరకు, బంజారాహిల్స్ భూములకు ఈ నెల 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. -
సంధ్య థియేటర్ కేసు.. అల్లు అర్జున్ హాజరు
సంధ్య థియేటర్ ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఇవాళ నాంపల్లి కోర్టు విచారణకు హాజరయ్యారు. షూటింగ్ వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇవాళ కోర్టుకు హాజరుకావాలని 19 మంది నిందితులకు ఇటీవల నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఇవాళ విచారణకు హాజరైన నిందితులంతా న్యాయమూర్తి ఎదుట బాండ్లపై సంతకాలు చేశారు. అనంతరం ఈ కేసు విచారణ జులై 6కి వాయిదా వేశారు. కాగా.. సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్ను ఏ11గా పోలీసులు చేర్చారు. ఏ1 నుంచి ఏ10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 23 మంది నిందితులపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కాగా.. 2024 డిసెంబర్ 4న పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. -
ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావ్?
హైదరాబాద్: భర్త మందలించడంతో భార్య ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన సంఘటన ఆదివారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కీసర మండలం, నాగారానికి చెందిన పెంట శ్రీను తన భార్య రమాదేవి ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుందని మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన భార్య ఈ నెల 19న హెచ్‌బీకాలనీలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. మరుసటి రోజు భర్త శ్రీను హెచ్‌బీకాలనీకి వెళ్లి చూడగా, భార్య అక్కడే ఉంది. అదేరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరకి చెప్పకుండా బయటకు వెళ్లిన రమాదేవి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తెలిసిన చోటల్లా వెతికిన ఫలితం లేకపోవడంతో ఆదివారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో భర్తతో గొడవపడి ప్రేమ వివాహం చేసుకున్న భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దోమలగూడ పీస్ పరిధిలోని దోమల గూడ అడ్వొకేట్స్ కాలనీలో శనివారం అర్ధరాత్రి 12 గంటలకు జరిగింది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కె.మధుసూదనరావు వివరాల ప్రకారం..కాలనీలో నివాసం ఉండే గౌసియా బేగం (32) మణికంఠ రాజు తొమ్మిదేళ్ల క్రితం (2015)లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి విక్రాంత్(9) కుమారుడు ఉన్నాడు. గౌసియా వృత్తిరీత్యా న్యాయవాది. కొంత కాలం క్రితం హందూజా ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. మణికంఠ బజాజ్ ఫైనాన్స్‌లో రికవరీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్య భర్తలు తరచూ గొడవలు పడేవారు. ఆరు నెలల నుంచి గొడవల కారణంగా మణికంఠ రోజూ మద్యం తాగివచ్చి గౌసియాను వేదిస్తూ ఉండేవాడు. ఇదే క్రమంలో శనివారం రాత్రి కూడా గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన గౌసియా ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గౌసియా కుటుంబ సభ్యులు దోమలగూడ పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. డబ్బుల కోసం తన కూతురిని నిత్యం వేదించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని, ఇందుకు కారణమైన ఆమె భర్త మణికంఠపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి ఆమీదా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఐ తెలిపారు. -
పండుపై అంకె.. ఆరోగ్యానికి లంకె..
విదేశీ పళ్లు.. ప్రస్తుతం సూపర్ మార్కెట్ల నుంచి తోపుడు బండ్ల వరకు ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి. అయితే, ప్రతి పండు వెనుక ఉండే ‘కెమికల్ కథ’ మీ ఆరోగ్యాన్ని కాపాడటంలో లేదా దెబ్బ తీయడంలో కీలకపాత్ర పోషిస్తోందన్న విషయం మీకు తెలుసా? హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో విదేశీ పండ్ల వినియోగం 5 ఏళ్లలో బాగా పెరిగింది. వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏ) లెక్కల ప్రకారం 2024–25లో రూ.8,500 కోట్ల విలువైన పండ్లు దిగుమతి అయ్యాయి. అమెరికా యాపిల్స్, న్యూజిలాండ్ కివీ, చిలీ చెర్రీలకు డిమాండ్ ఎక్కువ. – సాక్షి, హైదరాబాద్3, 4తో మొదలైతే ప్రమాదం... 9తో మొదలైతేనే భద్రంపండ్లపై ఉండే ప్రైస్ లుక్–అప్ (పీఎల్‌యూ) కోడ్‌లోనే అసలు రహస్యం ఉంది.4 అంకెలు.. 3 లేదా 4తో మొదలు: రసాయన ఎరువులతో పండించినవి.5 అంకెలు.. 9తో మొదలు: 100 శాతం సేంద్రియం.5 అంకెలు.. 8తో మొదలు: జన్యు మార్పిడి (జీఎమ్‌వో) పండ్లు. భారత్‌లో నిషేధం.కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏమంటోంది అంటే..కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం రసాయన అవశేషాలతో కాలేయం, కిడ్నీలు దెబ్బ తింటాయి. పిల్లల్లో హార్మోన్ల సమస్యలు, పెద్దల్లో క్యాన్సర్ వస్తాయి. అమెరికా యాపిల్‌ను 6 నెలలు నిల్వ ఉంచేందుకు ‘డైఫినైల్ అమైన్’ వాడతారు. ఇది యూరప్‌లో నిషేధం.స్టిక్కర్ కోడ్ చెక్ చేయండికొనేముందు 5 సెకన్లు కేటాయించి స్టిక్కర్ చూడండి. 9తో మొదలయ్యే కోడ్ ఉంటేనే కొనండి. స్టిక్కర్ లేకుంటే ముట్టుకోవద్దు. గర్భిణులు, పిల్లలకు కెమికల్ పండ్లు వద్దని నిమ్స్ వైద్యులు హెచ్చరిస్తున్నారు.నిబంధనలు ఏవి?భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రకారం కాల్షియం కార్బైడ్‌తో మాగబెడితే రూ.10 లక్షల జరిమానా, 6 నెలల జైలు విధించాలి. కానీ దిగుమతి పండ్లపై తనిఖీలు లేవు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది మనమే. -
కొత్త కార్డులు హుళ క్కే!
సాక్షి, సిటీబ్యూరో: సరూర్ నగర్‌లోని పేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసి ఏడాదికిపైగా గడిచింది. ఇప్పటివరకు కనీసం క్షేత్ర స్థాయి విచారణ జరగలేదు. సర్కిల్ ఆఫీస్‌కు వెళ్లి సిబ్బందిని అడిగితే సరైన సమాధానం లేకుండా పోయింది. దీంతో ఉచిత బియ్యంతో పాటు ప్రభుత్వ ఆరు గ్యారంటీల్లో భాగంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వర్తింపు లేకుండా పోయింది. ఇలా ఒక శ్రీనివాస్ సమస్యే కాదు.. మహా హైదరాబాద్‌లో రేషన్ కార్డు మంజూరుకాని లక్షలాది మంది పేదలదీ ఇదే పరిస్థితి.కొత్త రేషన్ (ఆహార భద్రత) కార్డు మంజూరు ప్రక్రియ ఆగినట్టేనా? అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అంటూ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. మహా నగర పరిధిలో కేవలం దరఖాస్తులను స్వీకరిస్తున్నప్పటికీ.. వాటిని పరిశీలించి కార్డుల మంజూరు మాత్రం తాత్కాలికంగా పెండింగ్‌లో వేసినట్లు కనిపిస్తోంది. ఫలితంగా లక్షలాది మంది అర్హులైన పేద ప్రజలు రేషన్ బియ్యంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. ప్రతిరోజూ వందలాది కుటుంబాలు పౌరసరఫరాల శాఖ వెబ్సైట్లో మీ–సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల చేసుకుంటున్నాయి. దరఖాస్తులు మాత్రం లాగిన్లకు పరిమితమవుతున్నాయే తప్ప క్షేత్రస్థాయి పరిశీలనకు మాత్రం మోక్షం లభించడం లేదు. దీంతో పెండెన్సీ పేరుకుపోతోంది.దరఖాస్తుదారుల ప్రదక్షిణ.. మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న పేదలు వాటి హార్డ్ కాపీలను పౌరసరఫరాల విభాగం సర్కిల్ ఆఫీసులో సమరి్పంచి ఆ తర్వాత దరఖాస్తు స్థితి (స్టేటస్) తెలుసుకోవడానికి కాళ్లరిగేలా తిరుగుతున్నారు. సర్కిల్ ఆఫీసుల్లో సిబ్బందిని అడిగితే ‘పై నుంచి ఆదేశాలు రావాలి’.. ‘సర్వర్ సమస్య’ అంటూ దాటవేస్తున్నారు. మరోవైపు పౌరసరఫరా విభాగాల్లో సర్కిల్ ఆఫీసుల్లో తీవ్ర సిబ్బంది కొరత వేధిస్తోంది. ఒకవైపు ఇతర ప్రభుత్వ విధులతో తీరికలేకుండా ఉండటం, మరోవైపు క్షేత్రస్థాయి పరిశీలనకు ప్రత్యేక సిబ్బంది లేకపోవడంతో విచారణ ప్రక్రియ పూర్తిగా స్తంభించినట్లు తెలుస్తోంది. కాగా.. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం కార్డుల సంఖ్య సుమారు 2.41 లక్షల మించలేదు. మరోవైపు 30 శాతంపైగా దరఖాస్తులు పెండింగ్‌లో మగ్గుతున్నాయి. పెరిగిన ప్రాధాన్యం..కేవలం చౌకధరల దుకాణంలో బియ్యం తీసుకోవడానికి మాత్రమే పరిమితం కాకుండా రేషన్ కార్డు బహుళ ప్రయోజనకారిగా పని చేస్తోంది. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు, గృహజ్యోతి (ఉచిత విద్యుత్), సబ్సిడీ సిలిండర్లు వంటి ప్రతి సంక్షేమ పథకానికి ఇది ప్రామాణికంగా మారడంతో కొత్త కార్డులకు ప్రాధాన్యం పెరిగింది. -
అద్భుతం.. అదిత్రి అరంగేట్రం
హైదరాబాద్: అమెరికాలో పుట్టి పెరిగిన అదిత్రి వైష్ణవి చేపూర్ కూచిపూడి అరంగేట్రం నగరంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. బేగంపేటలోని సెస్ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం ప్రముఖులతో పాటు ఆమె రెండు తరాల కుటుంబసభ్యుల మధ్య అరంగేట్రం చేసి తన కలను సాకారం చేసుకుంది. గురువు రేవతి కొమండూరి వద్ద నృత్యం నేర్చుకున్న ఆమె వేదికపై అద్భుతమైన హావభావాలు పలికించి అబ్బురపరిచారు. అన్నమాచార్య కీర్తనతో సాగిన అరంగేట్ర నృత్య ప్రయాణం శివుని స్తుతిస్తూ తాండవేశ్వర..చివరగా థిల్లానాతో ముగిసింది. అదిత్రి వెష్ణవి తల్లిదండ్రులు భానుచందర్, సరితలు అమెరికన్ సిటిజన్స్ కాగా..వారి కూతురు అదిత్రి లా అండ్ సైకాలజీ శాస్త్రంలో విద్యనభ్యసిస్తున్నారు. తన ఏడేళ్ల ప్రాయం నుంచి కూచిపూడి నృత్య శిక్షణ తీసుకుంటూ వచ్చారు. నగరంలో ఉండే తాతయ్యలు, అమ్మమ్మ, నాన్నమ్మలు ముందు తన అరంగేట్రం జరగాలన్న ఆమె కోరికను నెరవేర్చుకున్నారు. మనవరాలి కూచిపూడి అరంగేట్రం తిలకించిన నాన్నమ్మ, తాతయ్య దేవి, జనార్దన్‌రావు, అమ్మమ్మ, తాతయ్య మంజులత, శ్యాంసుందర్‌లు ఆనందం వ్యక్తం చేశారు. -
హైటెక్ – హైరిస్క్
1990ల చివరలో ప్రారంభమైన ఐటీ విప్లవం హైదరాబాద్ రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్ రామ్‌గూడా వంటి ప్రాంతాలు ప్రపంచస్థాయి వ్యాపార కేంద్రాలుగా ఎదిగాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, డెలాయిట్, యాక్సెంచర్ వంటి సంస్థలు వేలాది ఉద్యోగ అవకాశాలను సృష్టించాయి.దేశం నలుమూలల నుంచి యువత ఇక్కడికి వచ్చారు. అధిక వేతనాలు, వేగవంతమైన జీవనశైలి, ఆర్థిక స్వేచ్ఛ నగర సంస్కృతిని కొత్త దిశలో నడిపించాయి. పబ్‌లు, లాంజ్ బార్లు, వీకెండ్ పార్టీలు, ఫామ్‌హౌజ్ ఈవెంట్లు వేగంగా విస్తరించాయి. నైట్ లైఫ్ ఉండటం తప్పు కాదు. ప్రపంచంలోని ప్రతి ఆధునిక నగరంలో అది ఉంటుంది. కానీ వినోదం నియంత్రణ కోల్పోయినప్పుడు, స్వేచ్ఛ బాధ్యతను విస్మరించినప్పుడు, రాత్రి జీవితం చట్టాన్ని సవాలు చేయడం మొదలైనప్పుడు సమస్యలు మొదలవుతాయి.ప్రస్తుతం హైదరాబాదులో వందల సంఖ్యలో పబ్‌లు, నైట్ క్లబ్బులు పని చేస్తున్నాయి. వీటి చుట్టూ కోట్లాది రూపా యల వినోద ఆర్థిక వ్యవస్థ ఏర్పడింది. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ రీల్స్, సెల బ్రిటీ సంస్కృతి యువతలో ఒక భ్రమను సృష్టిస్తున్నాయి. మద్యం సేవించడం, పార్టీలకు హాజరుకావడం వంటివి ఆధునికతకు చిహ్నంగా యువత భావిస్తోంది. ఇదే వాతావరణాన్ని డ్రగ్స్ మాఫియా అవకాశంగా మార్చుకుంటోంది. ఒకప్పుడు గంజాయికి పరిమి తమైన మాదకద్రవ్యాల నెట్వర్క్ ఇప్పుడు ఎమ్డీఎమ్ఏ, ఎల్ఎస్డీ, కోకైన్ వంటి సింథటిక్ డ్రగ్స్ వరకు విస్తరించింది. డార్క్‌వెబ్, క్రిప్టోకరెన్సీల సహా యంతో జరిగే అక్రమ వ్యాపారం యువతను లక్ష్యంగా చేసుకుంటోంది. హైదరాబాద్ ఎందుకు డ్రగ్స్ మాఫియాకు ఆకర్షణీయంగా మారింది? అధిక ఆదాయం కలిగిన యువ జనాభా, అంతర్జాతీయ కనెక్టివిటీ, నైౖట్లైఫ్, ఫామ్ హౌజ్ సంస్కృతి... ఇవన్నీ కారణాలే.అభివృద్ధి అంటే ఐటీ టవర్లు, ఫ్లైఓవర్లు, మెట్రో రైళ్లు, స్కైస్క్రాపర్లు మాత్రమే కాదు. మహిళలు రాత్రి వేళ భయపడకుండా ప్రయాణించగలగడం, యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం, చట్టం పట్ల గౌరవం ఉండటం కూడా అభివృద్ధి సూచికలే. స్వేచ్ఛ–అనాగరికత మధ్య గీత చెదిరి పోకుండా కాపాడుకోవడం సమాజం బాధ్యత. ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే ప్రభుత్వం, పోలీసులు, కుటుంబాలు, విద్యాసంస్థలు, మీడియా సమన్వయంతో పనిచేయాలి. చివరికి ప్రశ్న ఒక్కటే– మన యువతను, నగర భవి ష్యత్తును కాపాడగలమా? సమాధానం కాలం కాదు, మన చర్యలే చెబుతాయి. – డా‘‘ బి. హర్షిణి ‘ సైకియాట్రిస్ట్ -
బిల్డర్‌ను మోసం చేసిన ముగ్గురు మహిళలు
బంజారాహిల్స్: ఒక నకిలీ విల్‌డీల్‌ను సృష్టించి అసలు నిజాన్ని దాచిపెట్టి నకిలీ పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసిన ముగ్గురు మహిళలపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌లోని వంశీరామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ సంస్థతో ఎం.కాంతరాజులు వారసులైన ముగ్గురు మహిళలు 2020లో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. భూమిని డెవలప్మెంట్ కోసం బిల్డర్‌కు ఇచ్చారు. అయితే ముగ్గురు మహిళలు కుట్రపూరితంగా వ్యవహరించారని ‘వంశీరామ్’సంస్థ ప్రతినిధి విశ్వరాజ్ మోహన్ కోర్టును ఆశ్రయించడంతో ఈ మోసం వెలుగుచూసింది. నకిలీ విల్‌డీడ్ సృష్టించి నిజాన్ని దాచి, ఆ నకిలీ పత్రాల ఆధారంగా 2025 జనవరిలో మూడో వ్యక్తి కి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. నిందితులు అక్రమంగా లాభపడ్డారని వంశీరామ్ బిల్డర్స్ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సంతోష్‌కుమారి, సద్గుణ, అనురాధ అనే ముగ్గురు మహిళలపై చీటింగ్, పోర్జరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మంచిని పెంచే ‘సరిగమల ఖాకీ’
పోలీసులంటేనే నిత్యం ఏదో ఒక ఒత్తిడి, బందోబస్తులు, కేసులు, గొడవలు, కొట్లాటలు ఒక్కోసారి వ్యక్తిగత జీవితానికి కూడా సరిగ్గా సమయం ఇవ్వలేని విధులు... కానీ తనకున్న కళతో ఓ అధికారి ఒక వైపు వి«ధులను సక్రమంగా నిర్వహిస్తూనే మరో వైపు సమాజంలో యువతను, పౌరుల్లో స్ఫూర్తి నింపుతూ ముందుకు సాగుతున్నాడు.నగరంలోని రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్లో సీఐగా విధులు నిర్వహిస్తున్న బోడసింగి సురేష్ కుమార్ దేశ భక్తిగీతాలు ఆలపించడంతో పాటు సమాజంలో జరుగుతున్న పలు నిజ జీవిత సంఘటనలపై పాటలు పాడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. 2007 బ్యాచ్‌కు చెందిన సురేష్ గతంలో పని చేసిన జిల్లాలో సైతం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదో ఒక ప్రాంతంలో యువతను, స్థానికంగా ఉండే ప్రజలకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.పాటకు దేన్నైనా మార్చే శక్తి ఉంటుందని, మంచిని పెంచడానికి పది మందిలో స్ఫూర్తిని నింపి మంచి మార్గంలో నడిపించేందుకు పాట ఒక ఆయుధంగా పని చేస్తుందనే విషయాన్ని తాను నమ్ముతానని సురేష్ కుమార్ చెబుతున్నారు. ఇప్పటి వరకు సురేష్ కుమార్ సమాజాన్ని మేల్కొల్పేందుకు రచించిన జై భారత్ జెండా, షీ టీమ్స్ వల్ల అమ్మాయిలకు ఎటువంటి రక్షణ లభిస్తుందో తెలియజేసే పాట, పల్లెను వదిలి పట్నానికి రాలేని ఓ పల్లెటూరి వ్యక్తి బాధ, అడవుల వల్ల కలిగే ప్రయోజనాలు, అడవుల పరిరక్షణకై ఓ పాట, తండ్రి ప్రాముఖ్యత, పిల్లల కోసం తండ్రి చేసే త్యాగాలు, తండ్రి కష్టాన్ని తెలియజేసేలా రచించిన పాట ఇలా ఎన్నో రకాల పాటలను పాడి ఆకట్టుకున్నారు.ఏదైనా విషయాన్ని పాట రూపంలో చెప్తే అందరూ అటెన్షన్లోకి వస్తారని అందులోనూ ఖాకీ యూనిఫాం ధరించి తాను పాట పాడుతుంటూ అంతా కూడా ఆసక్తిగా చూడటంతో పాటు పాట భావాన్ని అర్థం చేసుకొని మంచి మాటలు వినేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. కరోనా సమయంలో కూడా భయపడవద్దని, ఎలా ఉండాలో చెప్పేందుకు ప్రత్యేకంగా ఓ సాంగ్‌ను తయారు చేయించి మరీ పాడారు.పాట రూపంలో చెప్తే అందరూ వింటారు..చదువుకునే రోజుల నుంచే నాకు పాటలంటే ఇష్టం. పోలీస్ ఉద్యోగం వచ్చినా కూడా పాడే అలవాటును మాత్రం వదులుకోలేదు. శాంతి భద్రతల పరిరక్షణతో ఓ వైపు కషి చేస్తూనే మరో వైపు సమాజంలో మంచిని పెంచేందుకు పాటల రూపంలో కషి చేస్తూనే ఉన్నా. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. అక్షర జ్ఞానం లేని వారినే కాదు బాగా చదువుకున్న వాళ్ళను కూడా సైబర్ నేరగాళ్ళు మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యాన్ని తీసుకొని సైబర్ నేరగాళ్ళతో అప్రమత్తంగా ఉండాలంటూ ఓ పాటను తయారు చేయించి పాడబోతున్నాను. మా ఉన్నతాధికకారులు కూడా నా ప్రయత్నాలను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. - బోడసింగి సురేష్ కుమార్, సీఐ రాంగోపాల్‌పేట -
‘గుర్తింపు’ గండం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది ఇంటర్ విద్యార్థుల భవిష్యత్ గాలిలో ఊగిసలాడుతోంది. కాలేజీల్లో చేరినా వాటికి గుర్తింపు ఉందా? లేదా? అన్న డోలాయమానంలో పడిపోయారు. అన్ని జిల్లాల్లో ఈ అయోమయం నెలకొన్నా ఇంటర్మీడియెట్ బోర్డు ఏమాత్రం చలించడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా 3,400 జూనియర్ కాలేజీలున్నాయి. ప్రైవేటు రంగంలో 1400. ప్రభుత్వ రంగంలో ఉన్న 800 కాలేజీలకు బోర్డు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. ప్రైవేటు రంగంలో ఉన్న వాటిల్లో కేవలం 209కి మాత్రమే బోర్డు గుర్తింపు వచ్చింది. వెయ్యికి పైగా కాలేజీలకు అఫ్లియేషన్ ఎందుకు ఆపారో బోర్డు అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ఈ విషయమై ప్రశ్నిస్తే ‘చూస్తాం... ఇస్తాం... చేస్తాం...’ అంటూ దాటవేస్తున్నారు. అనుబంధ గుర్తింపును ఏప్రిల్ నాటికే పూర్తి చేస్తామని గతంలో అధికారులు చెప్పారు. ఇంటర్ షెడ్యూల్ ప్రకారం చూసినా మే నెలాఖరుకే గుర్తింపు ఇవ్వాలి. ప్రైవేటు కాలేజీలను తనిఖీలు చేసి, నివేదికలను బోర్డుకు పంపామని జిల్లా అధికారులు కూడా చెబుతున్నారు. ప్రైవేటువే కాదు కొన్ని మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, సంక్షేమ గురుకులాలకు కూడా బోర్డు అనుమతినివ్వలేదు. వాటిని ధ్రువీకరించేదెవరు?ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా కాలేజీలు అవసరమైన ధ్రువపత్రాలన్నీ సమర్పించాయి. అగ్నిమాపకశాఖ, శానిటేషన్, ట్రాఫిక్, భవన పటిష్టత వంటి పత్రాలను బోర్డుకు ఇచ్చాయి. వీటన్నింటినీ అధికారులు స్వయంగా పరిశీలించాలని ఇంటర్ కార్యదర్శి భావిస్తున్నట్టు తెలిసింది. క్షేత్రస్థాయి అధికారులు కాలేజీలతో కుమ్మక్కై వాటిని ధ్రువీకరించారనేది కార్యదర్శి అనుమానం. వాస్తవానికి బహుళ అంతస్తుల భవనాల్లో నడిచే కాలేజీలకు అగ్నిమాపక శాఖ ఎప్పట్నుంచో అనుమతి ఇవ్వొద్దని చెబుతోంది. పరీక్షలు దగ్గరపడే వరకూ అనుమతులూ ఇవ్వడం లేదు. ఆఖర్లో విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అఫ్లియేషన్ ఇస్తున్నట్టు చెబుతున్నాయి. అఫ్లియేషన్ లేకున్నా అడ్మిషన్లుఅనుబంధ గుర్తింపు లేకున్నా అన్ని కాలేజీలూ పెద్దఎత్తున విద్యార్థులను చేర్చుకున్నాయి. రూ. 80వేల నుంచి రూ. 4 లక్షల వరకూ వార్షిక ఫీజు దండుకున్నాయి. జూన్ 1 నుంచే క్లాసులు మొదలు పెట్టాయి. అయినా అధికారులు గుర్తింపులేని కాలేజీలను అడ్డుకునే సాహసం చేయడం లేదు. గుర్తింపు లేని కాలేజీల్లో ఇప్పటికే ఐదు లక్షల మంది చేరారు. గుర్తింపు ఉంటే తప్ప వీళ్లు వార్షిక పరీక్షలు రాసే అవకాశం ఉండదు. లేదంటే ప్రైవేటుగా పరీక్షలు రాయాలి. ఇంకోవైపు కార్పొరేట్ కాలేజీల మాయాజాలం యథాతథంగా సాగుతోంది. గుర్తింపు ఉన్న బ్రాంచీల్లో విద్యార్థుల ప్రవేశాలు చూపిస్తున్నారు.ఉదాహరణకు హైదరాబాద్ బ్రాంచీలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య నిండినా చేర్చుకుంటున్నారు. వారి ప్రవేశాలను వరంగల్, ఖమ్మం లేదా ఆదిలాబాద్ బ్రాంచీల్లో చూపిస్తున్నారు. అక్కడ ప్రవేశాలు లేకపోవడమే వారికి కలిసి వస్తోంది. పెద్ద కాలేజీలు ఇంత బాహాటంగా వ్యవహరిస్తున్నా పట్టించుకోని అధికారులు తమకు మాత్రం అఫ్లియేషన్లు ఇవ్వకుండా వేధించడం ఏమిటని కొన్ని కాలేజీల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇంటర్ అధికారుల వివరణ కోరేందుకు యత్నించగా వారు స్పందించలేదు. -
అర్జున్‌రెడ్డి హిట్.. రేవంత్‌రెడ్డి ఫట్
శంషాబాద్: ‘‘ఆమధ్య విడుదలైన అర్జున్‌రెడ్డి అనే సినిమా సూపర్ హిట్ అయ్యింది.. కానీ మన రాష్ట్రంలో ఇంటర్వెల్ వరకు వచ్చిన రేవంత్‌రెడ్డి సినిమా మాత్రం ఫట్ అయ్యింది. సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత నష్టపోతాడు. కానీ ఇక్కడ మాత్రం రేవంత్‌రెడ్డి సినిమాతో రాష్ట్రంలో 4 కోట్ల మంది నష్టపోతున్నారు’’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు విమర్శించారు.రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలకు ఆదివారం శంషాబాద్‌లో నిర్వహించిన ‘సర్’ప్రక్రియ అవగాహన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని గప్పాలు చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి... ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలోని 1.67 కోట్ల ఆడబిడ్డల ఖాతాల్లో రూ. లక్షన్నర చొప్పున జమ చేస్తే రాజకీయాలను మానేస్తానని సవాల్ విసిరారు. నిరుద్యోగులకు ఇస్తానన్న రూ. 4 వేలతోపాటు పెన్షన్‌ను రూ. 4 వేలకు పెంచుతానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రాహుల్‌బంధు మాత్రమే : రాష్ట్రంలో ప్రస్తుతం రైతుబంధు లేదని.. రాహుల్ బంధు మా త్రమే ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైతులకు యురియా లేదని.. కనీసం వాటిని దాచుకోవడానికి సంచులు ఇక్కడ ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని సంచులు ముట్టజెప్పి రెన్యూవల్ చేయించు కుంటున్న సీఎం మాత్రమేనని వ్యాఖ్యానించారు. సర్ ప్రక్రియను బూత్ స్థాయి కార్యకర్తలు నిశితంగా పరిశీలించి దొంగ ఓట్లను తీయించి అసలు ఓట్లు ఉండేలా చూడాలన్నారు. అలాగే క్రియాశీల సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మహేశ్వర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి.సబితారెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్‌రెడ్డి, వాణీదేవి తదితరులున్నారు. -
చిన్న రాష్ట్రం.. వేతన కష్టం
సాక్షి, హైదరాబాద్: దేశంలోని చిన్న రాష్ట్రాలు ఏటా పెట్టే మొత్తం ఖర్చులో పావలా వంతు ఉద్యోగుల జీతాలకే సరిపోతోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో నాగాలాండ్, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, త్రిపుర, మిజోరం రాష్ట్రాలు తమ మొత్తం బడ్జెట్లో 25 శాతానికిపైగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే వెచ్చించాయి. అత్యధికంగా నాగాలాండ్ మొత్తం బడ్జెట్లో 37 శాతం వేతనాలకు ఖర్చు చేసినట్లు కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ‘స్టేట్ ఫైనాన్సెస్’పేరుతో కాగ్ ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. 2015–16 నుంచి 2024–25 వరకు పదేళ్లపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ఆదాయ వ్యయాలు, ఆర్థిక పరిస్థితులను ఈ నివేదికలో వెల్లడించింది. ఏ రాష్ట్రంలో ఎలా ఉందంటే.. 2024–25లో వేతనాలకు తెలంగాణ మొత్తం బడ్జెట్లో 14.19 శాతం ఖర్చు చేస్తోంది. ఏపీ (16.96%), కేరళ (22.96%) కూడా వేతనాలకు గణనీయంగానే ఖర్చు చేస్తున్నాయి. కర్ణాటక (6.59 శాతం), మహారాష్ట్ర (8.51%) మాత్రం తక్కువ నిధులు వెచ్చిస్తున్నాయి. ⇒ వేతనాలకే కాక ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల కోసం కూడా చిన్న రాష్ట్రాలే ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి. దేశంలో అత్యధికంగా తన ఏడాది బడ్జెట్లో పింఛన్లకు హిమాచల్ ప్రదేశ్ 19,63 శాతం ఖర్చు చేస్తుండగా.. అత్యల్పంగా ఛత్తీస్‌గఢ్ 5.84 శాతం మాత్రమే ఖర్చు పెడుతోంది. ఇక, దక్షిణాది విషయానికి వస్తే కేరళ టాప్‌లో నిలిచింది. ఈ రాష్ట్రంలో పింఛన్ల కోసం 16.04 శాతం ఖర్చు చేస్తుండగా, తెలంగాణ 7.77 శాతం ఖర్చు చేస్తోంది. ⇒ అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు ఎక్కువగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలో 8వ స్థానంలో నిలిచింది. అత్యధికంగా 19 శాతం నిధులను వడ్డీల కోసం పంజాబ్ ఖర్చు చేస్తుండగా, తెలంగాణ 13 శాతం ఖర్చు పెడుతోంది. అత్యల్పంగా ఒడిశా 2.52 శాతం మాత్రమే చెల్లిస్తోంది. ⇒ ఆహార, విద్యుత్, ఇతర సబ్సిడీల కింద దేశంలోనే ఎక్కువగా ఖర్చు పెడుతున్న రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఈ రాష్ట్రంలో 14 శాతం నిధులు సబ్సిడీల కోసమే ఖర్చు చేస్తుండగా, అందులో సగం మాత్రమే మన రాష్ట్రంలో సబ్సిడీల రూపంలో ఖర్చవుతోంది. దేశంలోనే అత్యల్పంగా మొత్తం బడ్జెట్లో 0.02 శాతం మాత్రమే అరుణాచల్ ప్రదేశ్‌లో సబ్సిడీల కింద ఖర్చవుతోంది. కేరళలో ఇది 1.07 శాతమే కావడం గమనార్హం. -
గ్రేటర్లో ఓట్ల గల్లంతు!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026 కార్యక్రమంలో కీలకమైన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాకముందే భారీ సంఖ్యలో ఓటర్ల పేర్ల గల్లంతు సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో ఓటర్ల జాబితా భారీ ‘శుద్ధికరణ’కు లోనుకానుందని ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల ఓటర్ల మ్యాపింగ్ గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2,38,62,322 మంది (70.54%) ఇప్పటివరకు మ్యాపింగ్ అయ్యారు. ఇంకా 99,64,126 మంది ఓటర్లు (29.46%) మ్యాపింగ్‌కు అందుబాటులోకి రాలేదు. మూడు జిల్లాల్లో.. హైదరాబాద్ జిల్లాలో 25.24 లక్షలు, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో 16.78 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 15.29 లక్షల మంది ఓటర్ల మ్యాపింగ్ పెండింగ్‌లో ఉంది. ఓటర్ల మ్యాపింగ్ జరగాల్సిన వారిలో 57.31 లక్షల (57.5 శాతం) మంది ఈ మూడు జిల్లాల ఓటర్లే కావడం గమనార్హం. రాష్ట్రంలోనే అత్యల్ప మ్యాపింగ్ ఈ జిల్లాల్లోనే జరిగింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 43.67శాతం, హైదరాబాద్ జిల్లాలో 46.69 శాతం, రంగారెడ్డి జిల్లాలో 58.68 శాతమే మ్యాపింగ్ జరిగింది. స్థానిక బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) సైతం మిగిలిన ఓటర్లకు సంబంధించిన ‘ఆచూకీ’తెలియరావడం లేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అద్దె ఇళ్లల్లో నివా సం ఉండటం, తరచూ ఉద్యోగాలు మారడం, ఐటీ ఉద్యోగుల వలసలు, విద్యార్థుల వలసలు, ఒకే వ్యక్తి బహుళ చిరునామాలు కలిగి ఉండటం వంటి కారణాలతో ఈ మూడు జిల్లాల్లో ఓటర్ల ఆచూకీని కనిపెట్టలేకపోతున్నారు. దీంతో జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల సిబ్బంది సహాయాన్ని ఎన్నికల సంఘం కోరింది. మేడ్చల్‌లో మరింత తీవ్రమా? ప్రస్తుత ఓటర్ల జాబితాను 2002 ఓటర్ల జాబితాతో అనుసంధానం చేసి రెండు జాబితాల్లో ఓటర్ల సమాచారాన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో సరిపోల్చి చూస్తున్నారు. రాష్ట్రంలో మ్యాపింగ్ జరిగిన 2.38 కోట్ల ఓటర్లలో 89.88లక్షల (37.67శాతం) మందికి సంబంధించిన వివరాల్లో వ్యత్యాసాలు/లోపాలున్నట్టు గుర్తించారు. వీరిలో 28.55 లక్షల (32శాతం) మంది ఓటర్లు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలవారే. రంగారెడ్డి జిల్లాలో 11.44 లక్షలు, హైదరాబాద్ జిల్లాలో 8.65 లక్షలు, మేడ్చల్ జిల్లాలో 8.45 లక్షల మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలున్నట్టు తేలింది. మేడ్చల్ జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. జిల్లాలో 13 లక్షలు మంది ఓటర్లు మ్యాపింగ్ పూర్తైతే 8.45 లక్షల (65శాతం) మంది వివరాల్లో తేడాలున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక శాతం వ్యత్యాసాలు ఈ జిల్లాలోనే ఉండటం గమనార్హం. గ్రామీణ జిల్లాల ముందంజ గ్రామీణ జిల్లాలు ఓటర్ల మ్యాపింగ్‌లో ముందంజలో ఉండటమే కాకుండా అతి తక్కువగా వ్యత్యాసాలను కలిగి ఉన్నాయి. మహబూబాబాద్‌లో 94.54శాతం, జనగాంలో 93.44 శాతం, మెదక్‌లో 89.98 శాతం, నారాయణపేటలో 85.54 శాతం, రాజన్న సిరిసిల్లలో 84.92శాతం ఓటర్ల మ్యాపింగ్ పూర్తైంది. గ్రామీణ జిల్లాల్లో జనాభా స్థిరంగా ఉండటం, వారిని స్థానిక బీఎల్ఓలు సులభంగా చేరుకోగలగడంతో మ్యాపింగ్ వేగంగా జరిగింది. రాజకీయాలు, ఎన్నికలపై తీవ్ర ప్రభావం రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల ఓటర్లుండగా, 1.13 కోట్ల మంది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలవారే. రాష్ట్రంలో ఇంకా మ్యాపింగ్ మిగిలిన ప్రతి ఇద్దరు ఓటర్లలో ఒకరు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికే చెందినవారే కాగా, వివరాల్లో వ్యత్యాసాలున్న ప్రతి ముగ్గురు ఓటర్లలో ఒకరు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వారే కావడం గమనార్హం.హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఏకంగా 28 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్‌సభ స్థానాలున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభతోపాటు గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలపై ఈ జిల్లాల్లో జరిగే ఓటరు జాబితా మార్పులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా భారీ మార్పుకు లోనైతే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం సైతం మారే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. -
‘రీ–నీట్’ కఠినమే..
సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన నీట్ యూజీ–2026 పునఃపరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం ముగిసింది. గత మే 3న జరిగిన తొలి పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కారణంగా రద్దు కావడంతో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రీఎగ్జామ్ నిర్వహించింది. ఈ క్రమంలో మునుపెన్నడూ లేనివిధంగా త్రీటైర్ సెక్యూరిటీ, బయోమెట్రిక్ వెరిఫికేషన్, జామర్ల నిఘా నడుమ పరీక్ష జరిగింది. తెలంగాణలో మొత్తం 73,059 మంది అభ్యర్థులకు హాల్‌టికెట్లు జారీ చేయగా, 65,087 (89.09 శాతం) మంది హాజరయ్యారు. తొలి నీట్ పరీక్షతో పోలిస్తే రీ–ఎగ్జామ్‌కు హాజరైన విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రాష్ట్రంలో పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష రాసిన విద్యార్థులు, సబ్జెక్ట్ నిపుణులు అందించిన సమాచారం ప్రకారం.. మే 3న జరిగిన పరీక్షతో పోలిస్తే రీఎగ్జామ్ ప్రశ్నపత్రం కాస్త కఠినంగా, ఎక్కువ సమయం తీసుకునేలా (లెంగ్తీగా) ఉందని వెల్లడైంది. కొరవడిన సమతుల్యత: రద్దయిన నీట్ పరీక్షతో పోలిస్తే పునఃపరీక్షలో బయాలజీ విభాగం సులభంగానే ఉందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ప్రశ్నలన్నీ నేరుగా ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే అడిగినట్టు తెలిపారు. కొన్ని అధ్యాయాల నుంచి అసలు ప్రశ్నలే లేవని, అధ్యాయాల పరంగా సమతుల్యత కొరవడిందని సబ్జెక్ట్ నిపుణులు భావిస్తున్నారు. స్టేట్మెంట్, మల్టిపుల్ చాయిస్ జతపరచడం వంటి ప్రశ్నలు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చినట్టు తెలిపారు. గత పరీక్షలతో పోలిస్తే కెమిస్ట్రీ, ఫిజిక్స్ కొంత కఠినంగానే ఉన్నట్టు నిపుణులు వెల్లడించారు. ముఖ్యంగా ఫిజిక్స్ గత రెండు పరీక్షలతో పోలిస్తే చాలా మారిపోయినట్టు పేర్కొన్నారు. గతంలో మోడరన్ ఫిజిక్స్, సెమీకండక్టర్ నుంచి నేరుగా సిద్ధాంతపరమైన ప్రశ్నలు రాగా, ఈసారి సీన్ రివర్స్ అయింది. జేఈఈ మెయిన్ స్థాయి క్లిష్టత ఫిజిక్స్‌లో ఉందని వెల్లడైంది. మెకానిక్స్ నుంచి వచ్చిన ప్రశ్నలు జేఈఈ మెయిన్ స్థాయిని తాకగా, ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ విభాగాల్లో డయాగ్రమ్స్ ఇచ్చి, అందులో రెండు మూడు సూత్రాలు ప్రయోగించాల్సినట్టుగా ప్రశ్నలను క్లిష్టతరం చేశారు. దీంతో ఒక్క ఫిజిక్స్ విభాగానికి గంటన్నర, ఆపైన కేటాయించాల్సి వచ్చిందని విద్యార్థులు చెప్పారు. ఈసారి స్కోర్, మెరిట్ ర్యాంకులను ఫిజిక్స్ శాసిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇక కెమిస్ట్రీలో ప్రశ్నలన్నీ ఎన్సీఈఆర్టీ నుంచి వచ్చాయి. ఫిజికల్ కెమిస్ట్రీలో లెక్కలన్నీ నేరుగా ఫార్ములా ఆధారంగానే ఉన్నాయి. ఇన్‌ఆర్గానిక్‌లో మల్టిపుల్ స్టేట్మెంట్స్, అస్సెర్షన్–రీజన్ ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వడంతో వాటిని చదవడానికి ఎక్కువ సమయం పట్టిందని విద్యార్థులు అన్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ అత్యంత ఇబ్బందిగా అనిపించిందని నిపుణులు అంచనా వేశారు. డైరెక్ట్ ప్రశ్నలు తగ్గించి, రసాయన చర్యల అంతర్గత విధానంపై లోతైన ప్రశ్నలు అడిగారని, దీంతో ఆప్షన్లు చాలా దగ్గరగా ఉండటంతో విద్యార్థులు పొరపాట్లు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇక్కడ నెగిటివ్ మార్కుల ఉచ్చులో విద్యార్థులు పడే వీలుందన్నారు. కటాఫ్ అంచనా ఇలా.. ! 2025తో పోలిస్తే ఈసారి కూడా నీట్ ప్రశ్నపత్రం కఠినంగా ఉండటంతో కటాఫ్‌లు పెద్దగా పెరిగే అవకాశం లేదని నిపుణుల అంచనా. మే నెలలో నిర్వహించిన నీట్ ప్రశ్నపత్రం కొంత సులభంగా ఉండటంతో గతేడాదితో పోలిస్తే కటాఫ్‌లు పెరుగుతాయని భావించారు. పునఃపరీక్షతో ఆ పరిస్థితులు తారుమారయ్యాయి. 2025 తరహాలోనే కటాఫ్‌లు ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కౌన్సెలింగ్ ముగిసే సమయానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో జనరల్ అభ్యర్థులకు 605–610 మార్కుల వద్ద కన్వీనర్ సీట్లు వచ్చాయి. ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 540–550 మార్కులు వచ్చిన వారికి చివరి విడతల్లో సీట్లు దక్కాయి. బీసీలకు ప్రభుత్వ కాలేజీల్లో 575–595 మార్కుల మధ్య చివరి సీట్లు కేటాయించబడ్డాయి. ప్రైవేట్‌లో బీసీ విద్యార్థులకు 490–510 మార్కుల వరకు కూడా సీట్లు లభించాయి. ఎస్సీ విద్యార్థులకు కటాఫ్ ప్రభుత్వ కాలేజీల్లో 495 – 510 మార్కుల మధ్య, ప్రైవేటులో 435–450 మార్కుల శ్రేణిలో ఉంది. ఈ క్రమంలో ఆయా కేటగిరీల్లో గతేడాది కటాఫ్ కంటే 10 నుంచి 20 మార్కులు అదనంగా సాధించిన వారికి ఈసారి కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లు దక్కే అవకాశం ఉంటుందని అంచనా. మొబైల్‌తో పట్టుబడ్డ అభ్యర్థి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని పరీక్ష కేంద్రంలో అక్రమాలకు యత్నించిన అభ్యర్థి పట్టుబడ్డాడు. జండావత్ నరేందర్ అనే అభ్యర్థి తన మొబైల్ ఫోన్‌ను టాయిలెట్‌లోని ఫ్లష్ ట్యాంక్‌లో దాచిపెట్టాడు. పరీక్ష సమయంలో టాయిలెట్‌కు వెళ్లి ఆ మొబైల్‌ను ఉపయోగించే ప్రయత్నం చేయగా ఇని్వజిలేటర్లు గుర్తించి, అతడిని పోలీసులకు అప్పగించారు. కాగా, పరీక్ష నిర్వహణ కోసం హైదరాబాద్‌లోని ఇంటరీ్మడియట్ విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్‌ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సందర్శించారు. ట్రాఫిక్ జామ్‌తో పరీక్షకు దూరం మెదక్ కలెక్టరేట్: మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండల కేంద్రానికి చెందిన వంజరి అనే విద్యార్థిని ఆదివారం స్థానిక డిగ్రీ కళాశాలలో జరిగే నీట్ పరీక్ష రాయడానికి బస్సులో వచ్చింది. అయితే పట్టణంలో ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్ వల్ల ఆమె పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి 10 నిమిషాలు ఆలస్యమైంది. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమనే నిబంధన వల్ల అధికారులు ఆమెను పరీక్షకు అనుమతించలేదు. పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలని తన తల్లితో కలిసి అరగంటపాటు పరీక్ష కేంద్రం వద్దే నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో కన్నీరుమున్నీరైంది. -
కలుషితమై'నది'!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గోదావరి, కృష్ణా నదుల్లో కలుషిత బ్యాక్టీరియా ముఖ్యంగా ఫీకల్ కొలిఫాం బ్యాక్టీరియా పరిమితికి మించి నమోదవుతున్నట్లు వెల్లడైంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) నివేదికల ప్రకారం... మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు కలవడం వల్ల బ్యాక్టీరియా (టోటల్ కోలిఫాం) పరిమితికి మించి నమోదవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ములుగు, నిర్మల్ జిల్లాల పరిధిలోని గోదావరిలో మానవ మలమూత్రాల ద్వారా వచ్చే కోలిఫాం బ్యాక్టీరియా ప్రమాదకర స్థాయిలో ఉంటోంది. అలాగే కాళేశ్వరం (త్రివేణి సంగమం), బేగంపేట, రామగుండం పారిశ్రామిక ప్రాంతాల వద్ద రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు నదిని కలుషితం చేస్తున్నాయి. మరోవైపు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని కృష్ణా నది నీటిలో టోటల్ కోలిఫాం సంఖ్య ప్రతి 100 మిల్లీలీటర్లకు 9,200కుపైనే నమోదవుతోంది. ఇది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రతి 100 ఎంఎల్ నీటిలో 500లోపు పరిమితితో పోలిస్తే ఎన్నో రెట్లు అధికం కావడం గమనార్హం. నీటి నాణ్యతపై ఆందోళన..: కాళేశ్వరం, మంథని, ఏటూరునాగారం తదితర ప్రాంతాల్లో గోదావరి ఎగువ, దిగువ భాగాల నుంచి నీటి నమూనాలను టీపీసీబీ గతంలో సేకరించి నీటి నాణ్యత పరీక్షలను విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం కొన్ని ప్రాంతాల్లో జీవ రసాయన ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ), రసాయన ఆక్సిజన్ డిమాండ్ (సీవోడీ), సస్పెండెడ్ సాలిడ్స్ (ఎస్ఎస్) వంటి సూచీలు పెరిగినట్లు గుర్తించారు. మరోవైపు తాజాగా సీడబ్ల్యూసీ వెల్లడించిన కోలిఫాం కాలుష్య పరిస్థితి చూస్తే సమస్య ఇంకా తీవ్రంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో తెలంగాణలోని గోదావరి పరీవాహక ప్రాంతాల నీటి నాణ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది. కోలిఫాం అంటే ఏమిటి? ఫీకల్ కోలిఫాం అనేది మానవ, జంతు వ్యర్థాల ద్వారా నీటిలోకి చేరే బ్యాక్టీరియా సమూహం. ఇది అధికంగా ఉంటే మురుగునీరు నదిలో కలుస్తోందని అర్థం. తాగునీటికి మాత్రమే కాకుండా స్నానాలకు కూడా ఈ బ్యాక్టీరియాను ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. దీనివల్ల చర్మ వ్యాధులు, కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్లు, వైరల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. మంథని, కాళేశ్వరంలో అధిక కాలుష్య ఛాయలు... గతంలో టీపీసీబీ నిర్వహించిన నీటి నాణ్యత పరీక్షల ఆధారంగా రూపొందించిన నివేదికలో మంథని ప్రాంతంలో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీవోడీ) విలువలు కొన్ని రోజుల్లో 90 ఎంజీ/ఐ వరకు నమోదైనట్లు కనిపిస్తోంది. బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) కూడా 8 ఎంజీ/ఐ వరకు నమోదైంది. ఇవి ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగా ఉండటం గమనార్హం. అలాగే టోటల్ డిజాల్‌్వడ్ సాలిడ్స్ (టీడీఎస్) 300 ఎంజీ/ఐకుపైగా నమోదైన సందర్భాలు ఉన్నాయి. ఇక కాళేశ్వరం ప్రాంతంలో సీవోడీ 95 ఎంజీ/ఐ వరకు, బీవోడీ 4 ఎంజీ/ఐ ( ఝజ/ ) వరకు నమోదైంది. స్నాన ఘాట్ల దిగువ భాగంలో కాలుష్య సూచీలు కొంత పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఇది స్థానిక మురుగునీటి ప్రవాహాలు, మానవ కార్యకలాపాల ప్రభావం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఏటూరునాగారం ప్రాంతంలో బీవోడీ సాధారణంగా తక్కువగానే ఉన్నప్పటికీ సీవోడీ, సస్పెండెడ్ సాలిడ్స్ విలువలు కొన్ని నమూనాల్లో పెరిగినట్లు నమోదయ్యాయి. నీటిలో ఘన వ్యర్థాలు, మట్టి కణాలు అధికంగా చేరుతున్న సంకేతాలుగా దీనిని పరిగణిస్తున్నారు. పుష్కరాల నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దాలంటున్న నిపుణులు వచ్చే ఏడాది జూన్ చివర్లో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో వెంటనే ఆయా ప్రాంతాల్లో నదీ జలాలు, బ్యాక్టీరియా కాలుష్య నియంత్రణకు, ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాళేశ్వరం, ధర్మపురి, మంథని, భద్రాచలం, బాసర తదితర చోట్ల ప్రతి వారం నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించి, నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. –బీవోడీ(బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్)... నీటిలోని సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి సూక్ష్మజీవులకు అవసరమైన ఆక్సిజన్ పరిమాణం –సీవోడీ (కెమికల్ ఆక్సిజన్ డిమాండ్)... నీటిలో ఉన్న మొత్తం కాలుష్య భారాన్ని సూచించే ప్రమాణం –టీడీఎస్... నీటిలో కరిగి ఉన్న లవణాలు, ఖనిజాల పరిమాణం –సస్పెండెడ్ సాలిడ్స్ (ఎస్ఎస్)... నీటిలో తేలియాడే ఘన కణాలు (వాటి విలువలు పెరిగిన కొద్దీ నీటి నాణ్యత తగ్గుతున్నట్లు పరిగణిస్తారు) -
బస్సుల ఫిట్నెస్ ఈ'శూన్యం'
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల్లో రోడ్ల మీద పరుగుపెడుతున్న వందల సంఖ్యలోని ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల నిర్వహణలో జరుగుతున్న ఓ చీకటి వ్యవహారం ఇప్పుడు వణుకుపుట్టిస్తోంది. ఒక్కో బస్సులో కనీసం 50 మంది చొప్పున ప్రయాణికులుంటారు. వారి ప్రాణాలు పూర్తిగా ఆ బస్సు పటుత్వం మీదనే ఆధారమై ఉంటుంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న బస్సు ప్రమాదాలకు కారణమవుతున్న ప్రధాన అంశాల్లో వాటి ఫిట్నెస్ లేమి అన్నది మొదటి మూడు స్థానాల్లో ఉంటుంది. అందుకే బస్సుల ఫిట్నెస్ అన్నది అత్యంత కీలకమైంది. అలాంటి కీలక విషయంలోనే భయంకర నిర్లక్ష్యం చోటు చేసుకుంటోంది. అత్యంత ప్రమాదకరమైన విషయమేంటంటే బస్సుల ఫిట్నెస్ను ప్రత్యక్షంగా చూడకుండా ఏకంగా 2,800 కిలోమీటర్ల దూరం నుంచి వీడియోకాల్‌లో బస్సులను చూసి వాటికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాయి ఈశాన్య రాష్ట్రాల రవాణాశాఖలు. మరోవైపు ఎలాంటి అధికారిక పర్యవేక్షణ లేకుండా ఈ బస్సులు రోడ్లమీద పరుగులు పెడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం గమనార్హం. బస్సును చూడకుండానే..హైదరాబాద్ కేంద్రంగా దాదాపు 1,150 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను తరలిస్తున్నాయి. విచిత్రమేంటంటే, వీటిల్లో కేవలం 128 బస్సులు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో రిజిస్టర్ అయి ఉన్నాయి. దాదాపు 750 బస్సులు హైదరాబాద్‌కు 2,800 కి.మీ.కంటే ఎక్కువ దూరంలో ఉన్న ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌లాంటి రాష్ట్రాల పరిధిలో రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఆయా రాష్ట్రాలు తమ పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో బస్సుల పర్మిట్ ఫీజు, రోడ్డు ట్యాక్స్, త్రైమాసిక పన్నులో భారీ రాయితీలను ప్రకటించాయి. దీంతో వాటి పరిధిలో రిజిస్ట్రేషన్ చేయిస్తే, ఒక్కో బస్సుపై సాలీనా రూ.8 లక్షల వరకు లబ్ధికలుగుతుంది. ఆ డబ్బులు మిగుల్చుకునే కక్కుర్తితో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు తమ బస్సులను ఆయా దూరప్రాంత రాష్ట్రాల పరిధిలో రిజిస్ట్రేషన్ చేయించి, హైదరా బాద్ కేంద్రంగా తెలుగు రాష్ట్రాలు, పొరుగునే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల మధ్య తిప్పుతున్నారు. ఈ బస్సులు దూర ప్రాంత రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ అయి ఉన్నందున, వాటికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు కూడా ఆయా రాష్ట్రాల రవాణాశాఖలే జారీ చేయాలి. ఇక్కడే అసలు మతలబు చోటుచేసుకుంటోంది. బస్సులను తీసుకెళ్లకుండానే...ఎనిమిది సంవత్సరాల వరకు బస్సుకు ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి, ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఫిట్నెస్ చేయించాల్సి ఉంటుంది. బస్సు బ్రేకులు, గేర్లు, స్టీరింగ్, టైర్లు, ఇతర యంత్ర పరికరాలు సహా బస్సును ఆసాంతం పరీక్షించి బాగుంటేనే ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన బస్సులను ఆయా రాష్ట్రాలకు తీసుకెళ్లి అక్కడి రవాణాశాఖ శాఖ అధికారుల ముందుంచితే వారు తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుంది. బస్సు అక్కడికి వెళ్లి రావడానికి దాదాపు వారం రోజుల సమయం అవసరమవుతుంది. భారీ వ్యయం కూడా అవుతుంది. దీంతో బస్సులను అక్కడికి తీసుకెళ్లకుండానే ఆపరేటర్లు ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందుతున్నారు. కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వారిద్వారా బస్సు నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేయించి, వీడియో కాల్ ద్వారా బస్సులను చూసి సర్టిఫికెట్లు జారీ చేసేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వ చర్యలేవీ?ఇలా అడ్డదారిలో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందుతున్నారని రాష్ట్రప్రభుత్వానికి తెలిసి కూడా చర్యలు తీసుకోలేకపోతోంది. బస్సులను తనిఖీ చేయకుండా ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఎలా జారీ చేస్తున్నారని సంబంధిత ఈశాన్య రాష్ట్రాల రవాణాశాఖలను నిలదీయలేకపోతోంది. ఆ బస్సులు పేరుకు ఆయా రాష్ట్రాల్లో రిజిస్టర్ అయినప్పటికీ, వాటిల్లో తిరుగుతోంది మాత్రం తెలుగు రాష్ట్రాలవారేనన్న విషయాన్ని విస్మరిస్తోంది.ఆ నిబంధన ఏమైనట్లు? ఏదీ కేంద్రం నిఘా?పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఈశాన్య రాష్ట్రాల్లో రిజిష్టర్ చేయించి వేరే ప్రాంతాల్లో ఆపరేటర్లు బస్సులు తిప్పుతున్నారన్న విషయాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం గత ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. బస్సు ఏ రాష్ట్రంలో రిజిస్టర్ అయిందో ఆ రాష్ట్రం వెలుపల బస్సు 60 రోజులకు మించి ఉండకూడదన్నదే ఆ నిబంధన. అంటే ప్రతి 60 రోజులకు ఓమారు బస్సు కచ్చితంగా, రిజిస్టర్ అయిన రాష్ట్రంలోకి రావాల్సిందే. హైదరాబాద్ కేంద్రంగా తిరుగుతున్న బస్సులు ప్రతి రెండు నెలలకోమారు అంతదూరం వెళ్లి రావడం దాదాపు అసాధ్యం. దీంతో ఆ నిబంధన దర్జాగా బేఖాతరు అవుతోంది. కానీ, నిబంధన విధించిన కేంద్రం మాత్రం నిఘాను గాలికొదిలేసింది.ఆ రోడ్లమీద ఎలా తిరుగుతాయి?ఈశాన్య రాష్ట్రాలు పూర్తిగా కొండచరియలతో నిండి ఉంటాయి. కొన్ని మినహా అన్నీ ఘాట్ రోడ్లే. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు 10–12 మీటర్ల పొడవుతో ఉంటాయి. ఇంత పొడవైన బస్సులు ఆ ఘాట్‌రోడ్లలో తిరగలేవు. మరి ఈ విషయం తెలిసి కూడా వాటిని ఆయా రాష్ట్రాల పరిధిలో తిరిగే బస్సులుగా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఈశాన్య రాష్ట్రాల అధికారులకే తెలియాలి. -
‘వీబీ జీ రామ్ జీ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీ-జీ రామ్-జీ చట్టం దేశంలోని కోట్లాది గ్రామీణ పేదల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదకరమైన చట్టమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు.ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మొదటి సమావేశం ఇవాళ (ఆదివారం) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉపసంఘం చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, గడ్డం వినోద్‌లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పంచాయతీ రాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్, అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామీణ పేదలకు కల్పించిన హక్కులను క్రమంగా నిర్వీర్యం చేసి, రాష్ట్రాల అధికారాలను హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకువస్తోందని ఆయన ఆరోపించారు. "ఉపాధి హామీ చట్టం కేవలం ఒక పథకం కాదు.. అది గ్రామీణ భారతదేశానికి ఆర్థిక భరోసా కల్పించిన సామాజిక విప్లవం. అలాంటి చట్టాన్ని బలహీనపరచడం అంటే రైతులు, కూలీలు, మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యుల జీవితాలతో ఆటలాడటమే" అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదిత చట్టం ద్వారా రాష్ట్రాల పాత్రను తగ్గించి, అన్ని అధికారాలను ఢిల్లీ చేతుల్లో కేంద్రీకరించాలనే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు. గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన, అమలు, పర్యవేక్షణలో రాష్ట్రాలకు ఉన్న స్వేచ్ఛను హరించడం సహకార సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. -
ఒలింపిక్సే లక్ష్యంగా తెలంగాణలో 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవకాశాలు లేక మరుగున పడిపోతున్న ప్రతిభాపాటవాలను వెలికితీసి, వారికి సరైన శిక్షణనిచ్చి ప్రపంచానికి పరిచయం చేయడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. భవిష్యత్తులో ఒలింపిక్స్ బరిలో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సరికొత్త 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'ని త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నాం" అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.ఉప్పల్ స్టేడియం వేదికగా అత్యంత వైభవంగా ప్రారంభమైన 'టీజీ 20 క్రికెట్ లీగ్' మెగా టోర్నమెంట్‌కు డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తుకు ఈ లీగ్ ఒక బలమైన పునాది కాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు."గతంలో క్రికెట్ అంటే కేవలం నగరాలకే పరిమితమనే భావన ఉండేది. కానీ, ఆ పరిస్థితులను మారుస్తూ మొదటిసారిగా మా ప్రభుత్వం ప్రతి జిల్లా నుంచి క్రీడాకారుల నైపుణ్యాన్ని గుర్తించింది. జిల్లాల వారీగా జట్లను (టీమ్‌లను) ఎంపిక చేసి గ్రామీణ యువతకు ఈ మెగా వేదికను కల్పించాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం క్రీడలను పెద్దపీట వేస్తూ, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉంది" అని భట్టి విక్రమార్క తెలిపారు.గతంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫుట్‌బాల్ స్టార్ 'మెస్సి' ఆడిన ఈ ఉప్పల్ స్టేడియం సాక్షిగా.. హైదరాబాద్ నగరంలో ప్రపంచ స్థాయి వసతులు, అన్ని హంగులతో కూడిన స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతోందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఒలింపిక్స్ స్థాయి శిక్షణ ఇచ్చేలా తెలంగాణలో ఒక బలమైన క్రీడా వ్యవస్థను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.మొత్తం 21 రోజుల పాటు సాగనున్న ఈ 'టీజీ 20 క్రికెట్' హంగామా.. రాష్ట్రంలోని క్రీడాభిమానులకు ఒక పెద్ద పండుగ వాతావరణాన్ని తీసుకురానుంది. ఈ టోర్నీ విజయవంతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. -
భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాదారం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులను భద్రాచలానికి చెందిన దూడల సాయి ప్రకాష్, ఆయన భార్య సంధ్య, మరియు వారి కుమారుడు మోక్ష్గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో సాయి ప్రకాష్ తల్లి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉదయ రాగం.. నాన్న యోగం!
సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు నగర జీవనశైలిలో నాన్న అంటే.. ఉదయం ఇంటినుంచి బయలుదేరి, ట్రాఫిక్‌తో పోరాడి, ఆఫీస్ బాధ్యతలు మోసి, రాత్రి అలసటతో ఇంటికి చేరే వ్యక్తి. పిల్లలతో గడిపే సమయం ‘వీకెండ్ ఆప్షన్’గా మిగిలేది. కానీ.. ఇప్పటి నాన్నలు కొంచెం విభిన్నంగా, వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఉన్న సమయాన్ని అనువుగా వినియోగించుకుంటూ ఆరోగ్యం, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాల వైపు కొత్తదారులు వెతుక్కొంటున్నారు.ఇటీవలి కాలంలో ఉదయపు పార్కులు, అపార్ట్మెంట్ టెర్రస్‌లు, కమ్యూనిటీ హాళ్లలో పిల్లలతో కలిసి యోగా మ్యాట్‌పై కనిపిస్తున్నారు. ఐటీ, ఫార్మా, స్టార్టప్‌ల హబ్‌గా పేరొందిన కార్పొరేట్ నగరంలో పని ఒత్తిడి సహజం. ఈ పరుగుల మధ్య తండ్రితనం కూడా ఒక ‘రెస్పాన్సిబిలిటీ లిస్ట్’గా మారడంతో ఉదయాన్నే యోగాతో పిల్లలకు సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇటు మానసికంగా, అటు శారీరక మేలు కోసం అన్నింటికీ మించి పిల్లలకు సమయం ఇవ్వాలనే కోరిక దీనికి ప్రధాన కారణం. నేడు ఫాదర్స్ డే, యోగా డే రెండూ ఒకే రోజున కలిసి రావడం యాదృచ్ఛికమే అయినప్పటికీ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఇలా నాన్న– పిల్లలు నిత్యం చేస్తున్న యోగా వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారికి ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారు. డాడ్– కిడ్ యోగా రీల్స్.. యోగా.. ఇక్కడ కేవలం ఫిట్నెస్ ట్రెండ్ కాదు.. ఇది ఒక న్యూ ఏజ్ ఫాదర్‌హుడ్ స్టేట్మెంట్. ‘శ్వాసపై దృష్టి పెట్టడం, నిశ్శబ్దాన్ని వినడం, శరీరంతో పాటు మనసును సర్దుకోవడం’ ఈ అలవాట్లు తండ్రులను మరింత సమతుల్యంగా మార్చుతున్నాయి. పిల్లలతో కలిసి సూర్య నమస్కారాలు చేయడం, ప్రాణాయామం నేర్పడం.. ‘క్వాలిటీ టైమ్’ కొత్త నిర్వచనం ఇస్తున్నాయి. ఫలితంగా తండ్రి–పిల్లల మధ్య సంభాషణ పెరుగుతోంది. డిజిటల్ యుగంలో ఈ మార్పు డాడ్–కిడ్ యోగా రీల్స్, ఫ్యామిలీ ఫిట్నెస్ చాలెంజ్లుగా ట్రెండ్ అవుతున్నాయి. పిల్లలు తండ్రిని కేవలం సంపాదించే వ్యక్తిగా కాకుండా, మార్గదర్శిగా చూడటం మొదలుపెడుతున్నారు. నాన్నలు సమయమిచ్చి పిల్లలతో కలిసి యోగా చేయడమే నిజమైన ఫాదర్స్ డే గిఫ్ట్ అని చెబుతున్నారు.కూతురుతో కలిసి యోగా ఆనందకరంఉద్యోగం, బిజీబిజీ నగర జీవన శైలితో అలసిపోయే నాకు యోగాతో ఒక చక్కని పరిష్కారంతో పాటు నాన్నగా కూతురుతో అద్భుత క్షణాలను ఆస్వాదించే అవకాశం లభిస్తోంది. ఇది అలవాటుగా మారకముందు మా దినచర్య వేరేలా ఉండేది. కానీ.. ప్రస్తుతం వినోదం, వి/ê్ఞనం, ఆరోగ్య వికాసం.. ముఖ్యంగా నాన్నగా ఆతీ్మయ సంతృప్తి పొందుతున్నా. మొబైల్స్, టీవీలకు అతుక్కు పోయే బాల్యం ఇలా నాన్నతో, ఆరోగ్యంగా కొనసాగడం సంతోషంగా ఉంది. నా పాప అని్వక కూడా అందరి పిల్లల్లా కాకుండా వినూ త్న ఆలోచనా విధానంతో పెరుగుతోంది. – నవీన్ కుమార్, సరూర్‌నగర్ -
హైదరాబాద్‌లో వర్షం.. మరో రెండు గంటల్లో..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లో మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో, వాతావరణం చల్లబడింది. కాగా, తెలంగాణలో రానున్న రెండు గంటల్లో సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, యాదాద్రి, కరీంనగర్, భూపాలపల్లి, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట సహ పలు జిల్లాలో మోస్తరు నుంచి కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.మరోవైపు.. రానున్న మూడు గంటల్లో ఏపీలోని పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలను జారీ చేసింది ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మచిలీపట్నం, ఏలూరు, నర్సాపూరం, దివిసీమ, గుడివాడ, భీమడోలు పరిసర ప్రాంతాల్లో పిడుగుపాటు హెచ్చరిక.. అలాగే, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌తో పాటుగా పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈదురు గాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. చెట్ల క్రింద, హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని సూచించింది. RAIN ALERT - 4 AM ⚠️🌧️ STEADY MODERATE RAINS to continue in Sangareddy, Vikarabad, Rangareddy, Medak, Kamareddy in next 2hrsISOLATED - SCATTERED RAINS ahead in Medchal, Siddipet, Yadadri - Bhongir, Karimnagar, Bhupalapally, Peddapalli, Nagarkurnool, Mahabubnagar, Narayanpet…— Telangana Weatherman (@balaji25_t) June 20, 2026 -
2030 కంటే ముందే స్వదేశీ బ్రహ్మోస్
సాక్షి, హైదరాబాద్: బ్రహ్మోస్.. ఆపరేషన్ సిందూర్‌లో లక్ష్యాన్ని ఛేదించి శత్రువుకు నిద్రలేని రాత్రులు చూపించిన.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూజ్ మిస్సైల్. భారత్–రష్యా సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి. దీనిని భూమి, సముద్రం, జలాంతర్గామి, యుద్ధ విమానాల నుంచి ప్రయోగించవచ్చు. ఒక్కసారి లక్ష్యాన్ని నిర్దేశించి ప్రయోగిస్తే.. ఇది స్వయంచాలకంగా టార్గెట్‌ను ధ్వంసం చేస్తుంది. శత్రువుల రాడార్లకు చిక్కకుండా చాలా తక్కువ ఎత్తులో దూసుకుపోవడం దీని ప్రత్యేకత. ఇలాంటి క్షిపణుల తయారీలో హైదరాబాద్ సైతం కీలకంగా వ్యవహరిస్తోందని బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్, బ్రహ్మోస్ ఏరోస్పేస్ సీఈవో, ఎండీ జైతీర్థ్ ఆర్. జోషి తెలిపారు. ఎన్‌డీఈ–2026 సదస్సు వివరాలు వెల్లడించేందుకు ఏర్పాటైన సమావేశంలో ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... నూరు శాతం దేశీయంగా.. బ్రహ్మోస్ క్షిపణుల తయారీకి అవసరమైన 85 శాతం విడిభాగాలను దేశీయంగా సమకూర్చుకుంటున్నాం. కొన్ని ఎలక్ట్రానిక్ విడిభాగాల విషయంలో వెనుకబడ్డాం. సెమీకండక్టర్ పరికరాలు దిగుమతి చేసుకుంటున్నాం. నూరు శాతం తయారీ దేశీయంగా సాధ్యమే. 2030 కంటే ముందే ఈ కల సాకారం అవుతుంది. కాన్సెప్ట్ రెడీ అయితే మూడేళ్లలోనే సరికొత్త బ్రహ్మోస్ క్షిపణిని అభివృద్ధి చేయగల సత్తా మనకు ఉంది. ఈ మేరకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) పూర్తిస్థాయి సామర్థ్యం సొంతం చేసుకుంది. ప్రస్తుతం సంస్థ వద్ద 6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.56 వేల కోట్లు) విలువైన ఆర్డర్ బుక్ ఉంది. ఇప్పటికే బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పీన్స్‌కు సరఫరా చేస్తున్నాం. వియత్నాంకు అతి త్వరలోనే అందించనున్నాం. ఈ క్షిపణుల కోసం పశ్చిమ, తూర్పు ప్రాంతంలోని చాలా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. రష్యా సైతం అడుగుతోంది. 10 రోజుల్లో ఒక క్షిపణిని తయారు చేయగలం. 20 శాతం హైదరాబాద్ నుంచే.. బ్రహ్మోస్ ఇండస్ట్రి కన్సార్షియంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని 200కుపైగా చిన్న, మధ్యతరహా కంపెనీలున్నాయి. బ్రహ్మోస్ క్షిపణుల తయారీలో వాడే విడిభాగాలను ఈ కన్సార్షియంలో ఉన్న కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. మిసైళ్ల అసెంబ్లింగ్లోనూ ఇవి పాలుపంచుకుంటున్నాయి. కన్సార్షియంలోని 20 శాతం కంపెనీలు హైదరాబాద్ నుంచే ఉంటాయి. భాగస్వామ్య కంపెనీలకు సాంకేతిక బదిలీ, నిపుణులకు శిక్షణ ఇస్తున్నాం. హైదరాబాద్, నాగ్‌పూర్, పిలానీ, లక్నో వద్ద సంస్థకు తయారీ కేంద్రాలున్నాయి. 4 యూనిట్లలో మూడవ షిఫ్ట్ మొదలుపెట్టబోతున్నాం. బ్రహ్మోస్ ప్రాజెక్టులో డిజైన్, డెవలప్మెంట్, తయారీలో హైదరాబాద్ అత్యంత కీలకపాత్ర పోషిస్తోంది. తెలంగాణలో సర్వే పూర్తి.. కొత్త ప్లాంటుకు 400–500 ఎకరాలు అవసరం. ఏపీ ప్రభుత్వం చూపించిన స్థలం అనువైనది కాదు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర వద్ద సర్వే పూర్తి చేశాం. ప్లాంటు ఎక్కడ ఏర్పాటు చేస్తారనే నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే. ప్లాంటు ఏర్పాటు ముఖ్యం కాదు. అందుకు అవసరమైన ఎకో సిస్టమ్ ప్రధానం. వాస్తవానికి ఈ రంగంలో దేశవ్యాప్తంగా మానవ వనరుల కొరత చాలా ఉంది. ఇండియన్ సొసైటీ ఫర్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ (ఐఎస్‌ఎన్‌టీ) వచ్చే నవంబర్‌లో నాన్ డిస్ట్రక్టివ్ ఇవాల్యుయేషన్ (ఎన్‌డీఈ)–2026, ఏరోఎన్డీటీ–2026 సదస్సులను నిర్వహిస్తోంది. 15–17 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమాలకు హైటెక్స్ వేదిక. దేశ, విదేశాల నుంచి రక్షణ, వైమానిక, ఇంధన, తయారీ రంగాలకు చెందిన 2వేల మంది నిపుణులు పాలుపంచుకోనున్నారు. -
12 పత్రాలే అంతిమం కాదు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్), 2026లో భాగంగా రాష్ట్రంలో నోటీసులు అందుకోనున్న వ్యక్తులు సమర్పించాల్సిన రుజువులకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల జాబితానే పరిమితం కాదు..రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఇతర పత్రాలను సైతం రుజువుగా సమర్పించొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. సర్ కార్యక్రమానికి ముందస్తు సన్నద్ధతలో భాగంగా 2002, 2026 ఓటర్ల జాబితాలను అనుసంధానం (మ్యాపింగ్) చేయగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 89,88,175 మంది ఓటర్ల వివరాల్లో తార్కిక వ్యత్యాసాలు ఉన్నట్టు గుర్తించామన్నారు. ‘సర్’షెడ్యూల్ ప్రకారం వ్యత్యాసాలు కలిగిన ఓటర్లందరికీ జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్య స్థానిక ఎలక్టరోల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వో) నోటీసులు జారీ చేసి నిర్దేశిత తేదీకి విచారణకు పిలుస్తారన్నారు. సర్ కార్యక్రమ ఏర్పాట్లపై శనివారం తన కార్యాలయంలో సుదర్శన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏఏ ధ్రువీకరణ పత్రాలను రుజువుగా స్వీకరిస్తారని విలేకరులు ప్రశ్నించగా, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఈఆర్వోలకు విచక్షణాధికారాలను కల్పించినట్టు వెల్లడించారు. 5 లక్షల డూప్లికేట్ ఓటర్ల తొలగింపు రాష్ట్రంలో 5 లక్షలకు పైగా డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించినట్టు సీఈఓ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఒకే పేరు, ఇతర వివరాలతో వేర్వేరు చోట్లలో ఓటర్లు కలిగి ఉన్నట్టు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఈ ఓటర్లను గుర్తించామన్నారు. గడువు పొడిగింపు ఉండదు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 మధ్య బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికి తిరిగి ప్రతి ఓటరుకు సంబంధించిన పాక్షిక వివరాలతో ముద్రించిన ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఒక వేళ ఇంటికి తాళం వేసి ఉన్నా, మూడు నాలుగు పర్యాయాలు ఆ ఇంటికి వెళ్లి ఫారాలను పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తారన్నారు. ఫారాలను పూరించి వచ్చే నెల 24లోగా సమర్పిస్తే 31న ప్రచురించే ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు లభిస్తుందని స్పష్టం చేశారు. గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. గడువులోగా ఎన్యూమరేషన్ ఫారం సమర్పించని వారి పేరు ముసాయిదా జాబితాలో గల్లంతు అవుతుందని, అలాంటి వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి మళ్లీ ఫారం–6 సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఎన్యూమరేషన్ ఫారంతో ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి అవసరం లేదన్నారు. 2002 ఓటర్ల జాబితా వివరాలు బీఎల్ఓల వద్ద ఉంటాయని, ఆ వివరాలను సైతం ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో ఆంగ్లంలోనే ఎన్యూమరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు భాషలో ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయనున్నామని సీఈఓ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఆంగ్ల భాషలో ముద్రించిన ఫారాలను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. అత్యల్పంగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో 43.67 శాతం ఓటర్ల మ్యాపింగ్ జరగ్గా, ఆ తర్వాత హైదరాబాద్ 46.69 శాతం, రంగారెడ్డి జిల్లాలో 58.68 శాతం మ్యాపింగ్ మాత్రమే జరిగిందన్నారు. మిగిలిన జిల్లాల్లో 80 శాతం వరకు మ్యాపింగ్ పూర్తయిందన్నారు. విలేకరుల సమావేశంలో అదనపు సీఈఓ వాసం వెంకటేశ్వర్లు, జాయింట్ సీఈఓ ఎం.సత్యవతి, అదనపు కార్యదర్శి శంకర్, సహాయ కార్యదర్శి ఏఎస్ చారి, డిప్యూటీ కలెక్టర్ బి.చెన్నయ్య పాల్గొన్నారు. -
ఒత్తిడితో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
మియాపూర్ (హైదరాబాద్): నీట్ రీ ఎగ్జామ్‌కు సిద్ధమవుతున్న విద్యార్థిని చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మియాపూర్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. మియాపూర్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ వివరాలు తెలిపారు. వైఎస్ఆర్కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన షేక్సనా నీట్ ఎగ్జామ్‌కు సిద్ధం అవుతోంది. తండ్రి ఉద్యోగ రీత్యా కువైట్‌లో ఉంటుండగా, పది రోజుల కిందట షేక్ సనా తల్లి అబ్బునిసా సొంతూరికి వెళ్లింది. దీంతో సనా తన ఇద్దరు చెల్లెళ్లు ఇంట్లో ఉంది.శనివారం చదువుకునేందుకు షేక్ సనా తన గదిలోకి వెళ్లి సాయంత్రం అయినా బయటకు రాకపోయేసరికి ఆమె చెల్లెళ్లు గది తలుపులు తెరిచి చూడగా ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని కనిపించింది. స్థానికుల సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది.‘తల్లిదండ్రులను మెప్పించలేకపోతున్నా.. భయం, ఒత్తిడి, ఆత్మవిశ్వాసం కోల్పో యి బాధపడుతున్నాను. చదువులో కుటుంబ అంచనాలను అందుకోలేకపోతున్నా. గత పరీక్షల్లో వైఫల్యం కారణంగా బాధపడుతున్నా. నా బాధను ఎవరితో పంచుకోవాలో తెలియదు’అని సూసైడ్ నోట్లో పేర్కొంది. -
నేడే నీట్ రీఎగ్జామ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో వైద్యవిద్య ప్రవేశాల భవిష్యత్‌ను నిర్ణయించే నీట్–యూజీ 2026 రీ ఎగ్జామ్ ఆదివారం జరగనుంది. గత నెల 3వ తేదీన నిర్వహించిన పరీక్ష.. పేపర్ లీక్, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో రద్దు కావడంతో దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు మరోసారి పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నేడు నీట్ రీఎగ్జామ్ నిర్వహిస్తోంది. తెలంగాణలో సుమారు 73 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పెన్–పేపర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. దేశంలోని 551 నగరాల్లోని 5,440 కేంద్రాలతోపాటు విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ లీక్‌తో రద్దు... ఎన్టీఏపై విమర్శల వెల్లువ గత నెల 3న జరిగిన నీట్‌కు ముందు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. జీవశాస్త్రం, రసాయన శాస్త్రానికి చెందిన అనేక ప్రశ్నలు ముందుగానే సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టినట్టు ఆరోపణలు రావడంతో పరీక్ష సమగ్రత దెబ్బతిన్నదని ఎన్టీఏ నిర్ధారించింది. దీంతో పరీక్షను పూర్తిగా రద్దు చేసి రీఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఎన్టీఏ పరీక్షల నిర్వహణ విధానంపై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ఈసారి ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రభుత్వం పూర్తిస్థాయిలో భద్రతా చర్యలు చేపట్టింది. ప్రశ్నపత్రాల తయారీలో పాల్గొనే నిపుణులను రహస్య ప్రదేశాలకు తరలించి డిజిటల్ కమ్యూనికేషన్‌పై పూర్తిగా ఆంక్షలు విధించారు. ప్రశ్నల బ్యాంకును విస్తరించడం, ప్రశ్నపత్ర రూపకల్పనలో ఎక్కువ మంది నిపుణులను భాగస్వామ్యం చేయడం, గోప్యతా నిబంధనలను కఠినతరం చేయడం వంటి చర్యలు తీసుకున్నారు. పకడ్బందీ ఏర్పాట్లు చేశాం : ఎన్టీఏ నీట్ రీఎగ్జామ్ అత్యంత పారదర్శకంగా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం వెల్లడించింది. 95,000లకు పైగా పరీక్ష గదుల్లో మొత్తం 1,38,560 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. లైవ్ ఫీడ్లను జాతీయ, ఆయా రాష్ట్ర స్థాయిలో వర్చువల్‌గా పర్యవేక్షిస్తారు. ఎల్రక్టానిక్ అక్రమాలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 51,311 జామర్లను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష గదికి ఇద్దరు ఇన్విజిలేటర్లు ఉంటారు. అభ్యర్థుల తనిఖీకి 38,795 మంది సిబ్బందిని, బయోమెట్రిక్ వెరిఫికేషన్‌కు 48,448 మందిని రంగంలోకి దించారు. ఈసారి బయోమెట్రిక్ సిబ్బందిని రెట్టింపు చేయడమే కాకుండా ఫేస్ అథెంటికేషన్ సదుపాయాన్ని కూడా కల్పించారు. సాంకేతిక సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రతి కేంద్రంలో ఒక సెంటర్ సిస్టమ్స్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారు. పరీక్షా కేంద్రాల్లో సుమారు 6,700 మంది అబ్జర్వర్లు విధుల్లో ఉండగా, 100 మందికి పైగా వర్చువల్ అబ్జర్వర్లు కేంద్ర కార్యాలయం నుంచి నిరంతరం లైవ్ సీసీటీవీ ఫుటేజీని పర్యవేక్షిస్తారు. ఈ ఫుటేజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్స్‌తో విశ్లేíÙంచి, ఎక్కడైనా తేడాలు ఉంటే వెంటనే గుర్తిస్తారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరు, విద్యుత్ బ్యాకప్, వైద్య సదుపాయాలు, అత్యవసర పరిస్థితుల నిర్వహణపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్ రీ ఎగ్జామ్‌కు ముందు శనివారం దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్ నిర్వహించారు. రాష్ట్రంలో కూడా ఎంపిక చేసిన అన్ని పరీక్ష కేంద్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో భద్రతా వ్యవస్థలు, ప్రశ్నపత్రాల రవాణా, అభ్యర్థుల ప్రవేశ ప్రక్రియలను పరీక్షించారు. ప్రశ్నపత్రాల భద్రత కోసం జిల్లా యంత్రాంగాలు, పోలీసు బలగాలు, ఎస్కార్ట్ బృందాలు కలిపి రెండు లక్షల మందికి పైగా సిబ్బందిని రంగంలోకి దించారు. పేపర్ లీకేజీలకు సోషల్ మీడియా వేదికలు ఉపయోగించారనే ఆరోపణల నేపథ్యంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. నీట్ రీ ఎగ్జామ్ ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఎన్టీఏ ఖండిస్తూ, విద్యార్థులు వదంతులను నమ్మొద్దని సూచించింది. అనుమానాస్పద సమాచారం, నకిలీ పేపర్లపై ఫిర్యాదులకు ప్రత్యేక పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే నీట్ రీ ఎగ్జామ్ ఎన్టీఏ విశ్వసనీయత, దేశంలోని అత్యంత కీలక ప్రవేశ పరీక్షల పారదర్శకతకు అగ్నిపరీక్షగా మారింది. -
రాజకీయ'దుర్గం'!
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గంలో భూముల వేలం వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మధ్య వివాదం అంశాన్ని ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రత్యర్థి పార్టీలు వినియోగించుకుంటున్నాయన్న భావనలో ప్రభుత్వం ఉంది. ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టిపై ప్రధానమంత్రి మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాకు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసే అవకాశం ఉంది. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను తాకట్టు పెట్టడాన్ని అడ్డుకున్న మాదిరిగానే రాయదుర్గంలోని భూముల బహిరంగ వేలాన్ని వివాదాస్పదం చేయడం వెనుక రాజకీయ కోణం ఉందని రాష్ట్ర ప్రభుత్వం బలంగా భావిస్తోంది. ఎస్బీఐతో కటీఫ్! 2010లో భూ విక్రయంలో విధించిన నిబంధనలను పాటించకపోవడంతో భూ విక్రయాన్ని రద్దు చేస్తున్నట్లు ఎస్బీఐకి స్పష్టంచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఆ సేల్ డీడ్‌ను రద్దు చేస్తూ ఉత్తర్తులు జారీచేయకపోవడంతో ఎస్బీఐ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. ఆ భూ విక్రయాన్ని రద్దు చేయడంతోపాటు ఎస్బీఐకి ప్రత్యామ్నాయంగా నాలెడ్జి సిటీలో రూ.500 కోట్ల విలువైన రెండున్నర ఎకరాల భూమిని ప్రభుత్వం ఇవ్వడానికి ప్రతిపాదించినా సరే... ఎస్బీఐ ముందుకు రాకుండా వేలానికి ఒక రోజు ముందు అంటే మే 27న ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించింది. ఆ తిరస్కరణ లేఖ వేలం ముగిసిన మరుసటి రోజు టీజీఐఐసీకి అందినట్లు సమాచారం. వేలం నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు కానీ, ప్రీబిడ్ సమావేశమప్పుడు గానీ స్పందించని ఎస్బీఐ ఆ మరుసటి రోజు హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతోనే కోర్టుకు వెళ్లిందన్న అభిప్రాయంతో సర్కారు ఉంది. దీని వెనుక రాజకీయ ప్రోద్బలం (కుట్ర) ఉందనే అనుమానాన్ని ప్రభుత్వ ముఖ్యులు వ్యక్తంచేస్తున్నారు. ఈనేపథ్యంలో ఎస్బీఐతో కఠినంగానే వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఎస్బీఐతో ఉన్న లావాదేవీలను ఉపసంహరించుకునే అవకాశాలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిశీలిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఎస్బీఐతో జరిపే ఆర్థిక లావాదేవీలు, డిపాజిట్ల వివరాల సేకరణలో ఆర్థిక శాఖ నిమగ్నమైంది. కనీసం రూ.5వేల కోట్లకు పైగా ప్రభుత్వ డిపాజిట్లు ఎస్బీఐలో ఉన్నట్లు ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా డిపాజిట్లను ఉపసహరించుకునే కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించగా, టీజీఐఐసీ దాదాపు 25 కోట్ల ఎఫ్డీలను ఉపసంహరించుకున్నట్లు సమాచారం. అప్పట్లోనే ఎకరా రూ. 25 కోట్లపైనే... రాయదుర్గం రెవెన్యూ పరిధిలో 2006–07 నాటికే ఎకరం భూమి మార్కెట్ ధర రూ.25 నుంచి రూ.30 కోట్ల వరకు ఉందని ప్రభుత్వం చెబుతోంది. 2010 నాటికి రాయదుర్గం పరిధిలో ఎకరం రూ.40 కోట్లు పలికింది. 2010లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సర్వే నం. 83/1లో 5 ఎకరాల భూమిని కార్యాలయ నిర్మాణం, ఇతర కార్యకలాపాల కోసం ఎస్‌బీహెచ్‌కు రూ.13.30 కోట్లకు కేటాయించింది. బహిరంగ మార్కెట్ ప్రకారం చూస్తే దీని విలువ రూ.200 కోట్లు. ఎస్బీహెచ్ నిర్మించే కార్యాలయాలు.. ఇతర వాణిజ్య కార్యకలాపాలతో ఆ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందని నాటి ప్రభుత్వం భావించింది. అయినా ఏడాది తరువాత కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో 2012 సెపె్టంబర్లో ఎస్‌బీహెచ్‌కు ఏపీఐఐసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే 2016 మార్చి 30న, జూన్ 27న మరింత సమయం కావాలంటూ ఎస్బీహెచ్ ప్రభుత్వాన్ని కోరుతూ లేఖలు రాసింది. రద్దు చేయాలంటూ టీఎస్ఐఐసీ లేఖ ఎస్బీహెచ్.. ఎస్బీఐలో విలీనమయ్యాక టీఎస్ఐఐసీ 2019 మే 27న ఆ భూ కేటాయింపును రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. తమకు చివరి అవకాశం ఇవ్వాలంటూ ఎస్బీఐ 2020 జూలై 2న ప్రభుత్వానికి మరో లేఖ రాసింది. 15 రోజుల్లోగా ప్రాజెక్టుకు సంబంధించి కాలపరిమితి సమర్పించాలని ఎస్బీఐకి తుది షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు ఎస్బీఐ ఇచ్చిన సమాధానం 2020 సెప్టెంబర్ 1న ప్రభుత్వానికి అందింది. నిర్దిష్ట కాలపరిమితిలోగా నిర్దేశించిన ప్రయోజనానికి ఆ భూమిని వినియోగించుకోని పక్షంలో దానిని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 2021 జనవరిలో కేటాయింపు రద్దు ప్రభుత్వానికి ఉన్న అధికారం మేరకు 2021, జనవరి 22న ఎస్బీఐకి చేసిన భూ కేటాయింపును రద్దు చేసినట్లు అధికారవర్గాలు వివరించాయి. రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేఖ రాయడంతోపాటు ఎస్బీఐ జూన్1న హైకోర్టులో రిట్పిటిషన్ను దాఖలు చేసింది, రద్దు చేసిన భూమికి ప్రత్యామ్నాయంగా ఉస్మాన్‌నగర్, గండిపేటలో భూమి ఇవ్వాలని టీజీఐఐసీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈలోగా కాలపరిమితి పొడిగించే అంశాన్ని పునఃపరిశీలించాలని న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది. దీనికి ప్రత్యామ్నాయంగా కోర్టు కేసు ఉపసంహరించుకుని ఉస్మాన్‌నగర్‌లో భూకేటాయింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఎస్బీఐకి సూచించింది. అయినా స్పందించకపోవడంతో 2024 ఆగస్టు 21న కేటాయింపుతోపాటు సేల్ డీడ్ రద్దు చేయాలని ప్రభుత్వానికి టీజీఐఐసీ లేఖ రాసింది. రద్దు పునరుద్దరణను తిరస్కరించామని, ప్రత్యామ్నాయ స్థలాల కోసం ముందుకు రావాలని 2024 ఆగస్టు 21న ఎస్బీఐని మరోసారి కోరింది. అప్పుడు కోర్టుకు వెళ్లగా.. 4 వారాల్లో ఎస్బీఐ ప్రతిపాదనను పరిశీలించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రతిపాదనలతో ముందుకు రావాలని 2026 మే 4న రావాలని టీజీఐఐసీ కోరింది. ఆ సమావేశంలో నాలెడ్జి సిటీలో 2.5 ఎకరాల భూమి ఇవ్వడానికి టీజీఐఐసీ ప్రతిపాదించింది. ప్రత్యామ్నాయ భూమి తీసుకోవడానికి ఎస్బీఐ సుముఖత వ్యక్తం చేసింది. దీనితో మే 6న వేలం నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించి హెడ్‌ఆఫీసుతో మాట్లాడినట్లు ఎస్బీఐ అధికారులు తెలిపారు. మే 18న ప్రీబిడ్ సమావేశం నిర్వహించారు. ఆ మరుసటి రోజునే ఎస్బీఐ హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. కానీ విచారణకు రాలేదు. మే 20న ఎస్బీఐ ప్రతిపాదనను ప్రభుత్వం మరోసారి తిరస్కరించింది. ఎస్బీఐ చైర్మన్ కారణం? మొదట్లో ఎస్బీఐ సుముఖత వ్యక్తం చేసి ఆ తరువాత ప్రభుత్వంపై బురద చల్లేవిధంగా కోర్టును ఆశ్రయించడంపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది., ఇందులో రాజకీయ హస్తం ఉందని భావిస్తోంది, తెలుగు వ్యక్తి ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి మహబూబ్‌నగర్ జిల్లా పెద్త పోతులపాడు గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో స్థానిక రాజకీయాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది, 16 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి చేయని ఎస్బీఐ ఇప్పుడు అదే స్థలం కావాలంటూ కోరడం వెనుక రాజకీయాలే కారణమని భావిస్తోంది, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే 2.50 ఎకరాల్లో ఎస్బీఐ నిర్మాణాలు చేపట్టవచ్చని ఆ భూములు కేటాయించినా సకాలంలో పనులు చేపట్టకపోతే వాటిని కూడా రద్దు చేసే అధికారం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
గులాబీ గూటిలో 'కొత్త లెక్కలు'!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండున్నరేళ్ల క్రితం అధికార పీఠానికి దూరమైన బీఆర్ఎస్ తిరిగి పూర్వవైభవం సాధించాలని భావిస్తోంది. ఇందుకు సర్వశక్తులూ ఒడ్డేందుకు సన్నద్ధమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి చేస్తున్న బీఆర్ఎస్ మరోవైపు సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంపైనా దృష్టి పెట్టింది. వచ్చే ఏడాది పార్టీ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావు బస్సు యాత్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాదయాత్ర ఉంటుందని బీఆర్ఎస్ సంకేతాలు ఇస్తోంది. అదే సమయంలో నాయకత్వలేమి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన నాయకుల కోసం అన్వేష్కిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి హైదరాబాద్‌లోని పాతబస్తీ సహా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది. చురుగ్గా యువనేతలు...2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు ఇతర పార్విల్లోకి వలసపోయారు. కొందరు మాజీ ఎమ్మెల్యేలు అటు పార్టీ అధినాయకత్వం, ఇటు కేడర్‌తో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కొందరు మాజీ ఎమ్మెల్యేల వివాదాస్పద వైఖరితో పార్వికి చెడ్డపేరు వచ్చిందనే ఆరోపణలున్నాయి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పలుచోట్ల అభ్యర్థులను మార్చకపోవడం వల్లే ఓటమి పాలయ్యామనే అభిప్రాయాన్ని కేటీఆర్ పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో కొత్త తరానికి అవకాశమివ్వాలనే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలిసింది. అదీగాక, గతంలో విద్యార్థి, యువజన విభాగాలతోపాటు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నేతలే ప్రస్తుతం పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులుగా అవకాశం దక్కుతుందనే ఆశావహ దృక్పథం వీరిలో కనిపిస్తోంది. మరోవైపు పునర్విభజనతో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందనే వార్తల నేపథ్యంలో ఆశావహులు సందడి చేస్తున్నారు. పార్విలో అనేక మంది సీనియర్ నేతలు వచ్చే ఎన్నికల్లో తమ వారసులతో అరంగేట్రం చేయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మహిళా, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయా కేటగిరీలకు చెందిన వారు కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా తిరిగి బీఆర్ఎస్వైపు చూస్తున్నట్లు సమాచారం. నిష్క్రమణలు.. చేరికలు.. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోణప్ప ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ పొసగక తిరిగి బీఆర్ఎస్ గూటికి తిరిగి చేరుకుని క్రియాశీలమయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక్కడ బీఎస్పీ నుంచి పోటీచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరి నాగర్‌కర్నూలు ఎంపీగా పోటీ చేసి, ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ అచ్చంపేట (ఎస్సీ) నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశముంది. నిర్మల్‌లో ఓటమి అనంతరం మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినా క్రియాశీలంగా పనిచేయడం లేదు. ఆయన తిరిగి బీఆర్ఎస్లో చేరే అవకాశాలున్నాయి. ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్ఎస్ స్థానికంగా బలమైన నాయకుడి కోసం అన్వేష్కిస్తోంది. ⇒ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం వెతుక్కోవాలి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తన కుమారుడిపై కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆర్మూరులో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితయ్యారు. ⇒ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కాంగ్రెస్‌లో చేరడంతో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. రామగుండంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భారీ ఓట్ల తేడాతో ఓడిపోవడాన్ని పార్విలో ఆయన ప్రత్యర్థులు ఎత్తి చూపుతున్నారు. ⇒ ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నా వారి వయసు, ఆరోగ్య కారణాలతో కొత్త ముఖాలు తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేశ్ బీజేపీ నుంచి తిరిగి బీఆర్ఎస్లో చేరారు. స్టేషన్ ఘనపూర్‌లో పార్టీని వీడిన కడియం శ్రీహరి స్థానంలో మాజీ మంత్రి రాజయ్య తిరిగి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మాజీ ఎంపీ డాక్టర్ వినోద్ కుమార్ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ⇒ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరడంతో పార్టీ కేడర్‌ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమన్వయం చేస్తున్నారు. ⇒ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం (ఎస్టీ) ఎమ్మెల్యే వెంకట్రావు కాంగ్రెస్‌లోకి ఫిరాయించడంతో ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ సాగుతోంది. కొత్తగూడెంలోనూ మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్థానంలో వెతుకులాట సాగుతోంది. ⇒ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరడంతో సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి పార్టీ కేడర్‌ను సమన్వయం చేస్తున్నారు. శేరిలింగంపల్లిలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి కాంగ్రెస్‌కు చేరువ కావడంతో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ తాండూరు తన కార్యకలాపాలు ముమ్మరం చేశారు. ⇒ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో గతంలో ఎంఐఎంతో దోస్తీ మూలంగా ఏడు చోట్ల స్నేహపూర్వక పోటీకి బీఆర్ఎస్ పరిమితమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాతబస్తీలోనూ బలమైన అభ్యర్థులను పోటీ పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దానం నాగేందర్ బీఆర్ఎస్లో చేరడంతో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మన్నె క్రిశాంక్ పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెడుతున్నారు. -
రూ.1.5 కోట్ల నగదు, 2 కిలోల బంగారం
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడిన తెలంగాణ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ మల్టీ జోన్–2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావు ఆస్తులపై ఏసీబీ ఆరా కొనసాగుతోంది. కేసు దర్యాప్తులో భాగంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం కీలక సోదాలు నిర్వహించారు. ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొందిన అనంతరం అధికారులు కెనరా బ్యాంక్ శాలిబండ శాఖలోని నరహరిరావు భార్య పేరుతో ఉన్న రెండు బ్యాంక్ లాకర్లను తెరిచారు. ఈ సోదాల్లో రూ.1.50 కోట్ల నగదు లభ్యమైంది. అదేవిధంగా ఒక్కోటి 100 గ్రాముల బరువున్న 12 బంగారు బిస్కెట్లు సహా సుమారు 2 కిలోల బరువున్న బంగారం, వజ్రాల ఆభరణాలు కూడా గుర్తించినట్లు ఏసీబీ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, మంగళవారం నరహరిరావు ఇంట్లో ఏసీబీ సోదాల్లో రూ.1.54 కోట్ల నగదు, 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి ఆభరణాలు లభించాయి. బ్యాంక్ బ్యాలెన్స్ రూ.2.29 కోట్లు, రూ.5.04 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్టు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఐదు స్థలాలు, మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, పుప్పాల్‌గూడలో 2,500 చదరపు అడుగుల ఫ్లాట్, నార్సింగిలో 1,860 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు ఫ్లాట్లు, రాజేందర్‌నగర్ సమీపంలో 1,377 చదరపు అడుగుల ఫ్లాట్, గచ్చిబౌ లి టీఎన్జీఓ కాలనీలో జీప్లస్–3 భవంతి, ఛత్రినాకలో జీప్లస్ 2 భవనం ఉన్నట్టు గుర్తించారు. ఈ ఆస్తుల విలువ రూ.13,05,67,100గా ఉన్నట్టు ఏసీబీ అధికారికంగా ప్రకటించింది. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ప్రస్తుతం నరహరిరావు జ్యుడీíÙయల్ కస్టడీలో ఉన్నారని ఏసీబీ అధికారులు వెల్లడించారు. -
వివాహితలకు కష్టాలే 'సర్'..
సాక్షి, హైదరాబాద్: గతంలో భర్త పేరు.. ఇప్పుడు తండ్రి పేరును బంధువుగా ఓటర్ల జాబితాలో పేరు కలిగి ఉన్న మహిళలకు ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026 కార్యక్రమంలో తలనొప్పులు తప్పేటట్టు లేదు. చివరిసారిగా రాష్ట్రంలో సర్ కార్యక్రమాన్ని 2002లో నిర్వహించగా, నాటి జాబితాతో ప్రస్తుత ఓటర్ల జాబితాను అనుసంధానం (మ్యాపింగ్) చేసి వ్యత్యాసాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా గుర్తిస్తోంది. 2002 ఓటర్ల జాబితాలో భర్త పేరును బంధువుగా కలిగి ఉండి ... ప్రస్తుత ఓటర్ల జాబితాలో తండ్రి పేరును బంధువుగా ఓటు కలిగి ఉంటే మ్యాపింగ్ ప్రక్రియలో తార్కిక వ్యత్యాసంగా గుర్తించి వారికి సైతం నోటీసులు జారీ చేయనున్నారు.2002 నాటి జాబితాలో తండ్రి పేరును బంధువుగా కలిగి ఉండి..ఆ తర్వాత పెళ్లి కావడంతో ప్రస్తుత జాబితాలో భర్త పేరు కలిగి ఉంటే ఇబ్బంది ఉండదు. కానీ, దీనికి భిన్నంగా భర్త పేరును తీసేసి తండ్రి పేరును బంధువుగా ప్రస్తుత జాబితాలో పేరును నమోదు చేసుకునే ఉంటే మాత్రం అలాంటి మహిళలు విచారణ హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుండగా, ఇప్పటి వరకు 2,38,62,322 మంది (70.54శాతం) మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. ఇప్పటి వరకు మ్యాపింగ్ జరిగిన ఓటర్లలో 89,88,175 (37.67) శాతం ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలున్నట్టు గుర్తించారు. వీరందరికీ ఎలక్టోరల్ రిజి్రస్టేషన్ అధికారులు (ఈఆర్ఓ) నోటీసులు జారీ చేసి నిర్దేశిత తేదీకి విచారణకు పిలుస్తారు. ఈ 11 రకాల తార్కిక వ్యత్యాసాలు ఇలా ఉన్నాయి. » 2002 ఓటర్ల జాబితాలోని తల్లిదండ్రుల పేర్లతో అనుసంధానమైన తోబుట్టువుల మధ్య వయస్సులో తేడా 9 నెలల కంటే తక్కువ ఉండడం. » తల్లిదండ్రులు, పిల్లల మధ్య వయస్సులో తేడా 15 ఏళ్ల కంటే తక్కువగా ఉండడం. » తల్లిదండ్రులు, పిల్లల మధ్య వయస్సులో తేడా 50 ఏళ్లకు మించి ఉండడం. » 2002 ఓటర్ల జాబితాలోని నానమ్మ/తాతయ్య పేర్లతో మ్యాపింగ్ జరిగితే వారి మధ్య వయసులో 40 ఏళ్ల కంటే తక్కువ తేడా ఉండడం. » 2002 ఓటర్ల జాబితా, ప్రస్తుత ఓటర్ల జాబితాల్లో వేర్వేరు తల్లిదండ్రుల పేర్లు కలిగి ఉండడం. » 2002 జాబితా, ప్రస్తుత జాబితాల్లో వేర్వేరు బంధుత్వం పేర్లు కలిగి ఉండడం. ఒక జాబితాలో తండ్రి ఉంటే మరో జాబితాలో తల్లి పేరు కలిగి ఉండడం. » 2002 జాబితాలో భర్త పేరు, ప్రస్తుత జాబితాలో తండ్రి పేరును బంధువుగా ఓటు కలిగి ఉండడం. » 2002 జాబితా, ప్రస్తుత జాబితాల్లో వేర్వేరు తండ్రి పేరు కలిగి ఉండడం. » 2002 జాబితా, ప్రస్తుత ఓటర్ల జాబితాల్లోని ఓటరు వయస్సుల్లో తేడాలుండడం. »ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయకపోవడం » కేవలం ఆధార్ మాత్రమే కలిగి ఉండడం. -
మూగ జీవుల ‘మనసు’ తెలుసుకునేలా..
సాక్షి, హైదరాబాద్: మానసిక ఒత్తిడి మనుషులకే కాదు, మూగజీవులకూ ఉంటుంది. మరి వాటి మానసిక ఒత్తిడిని గ్రహించేదెలా? హైదరాబాద్, సీసీఎంబీ(సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ)లోని అంతరించిపోతున్న జాతుల పరిక్షణ ప్రయోగశాల (లాకోన్స్) శాస్త్రవేత్తలు జంతువుల మనసును చదవడానికి ‘బయో–స్కోర్’విధానాన్ని అభివృద్ధి చేశారు. మలపరీక్ష చాలు! సాధారణంగా జంతువుల అనారోగ్యాన్ని గుర్తించడానికి రక్తపరీక్ష చేస్తారు. రక్తం సేకరించే క్రమంలో అవి మరింత ఒత్తిడికి గురవుతాయి. బయో–స్కోరింగ్ విధానంలో జంతువుల మలాన్ని పరీక్ష చేస్తారు. దీనిని ‘ఫీకల్ గ్లూకోకార్టికాయిడ్ మెటాబోలైట్’(ఎఫ్‌జీఎం) విశ్లేషణ అంటారు. ఈ పరీక్ష ద్వారా జంతువుల్లోని హార్మోన్ల హెచ్చుతగ్గులను పరిశీలించి, అవి కొన్ని రోజులు, వారాలుగా అనుభవిస్తున్న ఒత్తిడిని కచి్చతంగా నిర్ధారిస్తారు. బోనులోని సింహానికీ తప్పని ఒత్తిడి జంతుప్రదర్శనశాలల్లోని బోనుల్లో ఉండే పులులు, సింహాల వంటి వన్యప్రాణులు పైకి ఎంత గంభీరంగా, ఆరోగ్యంగా కనిపిస్తున్నప్పటికీ మానసికంగా తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తుంటాయి. జూ నిర్వహకులు జంతువుల శారీరక లక్షణాలు, ప్రవర్తన ఆధారంగా ఇచ్చే ‘కేర్ ఇన్ క్యాప్టివిటీ’స్కోర్‌కార్డులు కచ్చితమైన ఆరోగ్యస్థితిని అంచనా వేయలేవని గుర్తించిన శాస్త్రవ్తేలు ఈ బయో–స్కోర్ విధానాన్ని అభివృద్ధి చేశారు. భవిష్యత్తు సమస్యలకు అద్దం జూలలో జంతువు చురుగ్గా తిరుగుతోందా, బక్కచిక్కిందా, ఆహారం సరిగ్గా తింటోందా వంటి పైకి కనిపించే విషయాల ఆధారంగా రిపోర్టు ఇస్తారు. బయో స్కోర్ డేటా ద్వారా జంతువుల ప్రస్తుత ఆరోగ్య స్థితితోపాటు భవిష్యత్తు ఆరోగ్యాన్ని కూడా గ్రహించవచ్చు. తీవ్రమైన ఒత్తిడి వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతినడం వంటి పరిణామాలను గ్రహించి, తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. -
భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్య వారసత్వం యోగా: గవర్నర్
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్య వారసత్వం యోగా అని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో శనివారం నిర్వహించిన యోగా దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ కృషి ఫలితంగా ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించడంతో దేశాల సరిహద్దులు, భాష, సంస్కృతులను దాటి మానవాళిని ఏకం చేసే శక్తిగా యోగా నిలిచిందన్నారు. వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు మార్గం చూపిన భారతదేశపు సనాతన జ్ఞాన సంప్రదాయం యోగా అని అన్నారు.ఆధునిక జీవితంలోని సవాళ్లు, ఒత్తిళ్లు, అసమతుల్యతల మధ్య యోగా ఆత్మ విశ్వాసం, క్రమశిక్షణ, సానుకూల శక్తిని ప్రసాదిస్తుందన్నారు. కాగా, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ యోగా మతానికి పరిమితం కాదని, అలా చూడటం మూర్ఖత్వమే అవుతుందని.. యోగా ప్రపంచానికి మనం ఇచ్చిన వరమని అన్నారు. భారత్ ప్రపంచానికి విశ్వగురువుగా నిలవడానికి మన సంస్కృతి, సంప్రదాయాలే కారణమని చెప్పారు.కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో గత 7 సంవత్సరాలుగా అద్భుతంగా యోగా దినోత్సవాన్ని 24 కౌంట్‌డౌన్ పేరుతో నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు పెద్దఎత్తున పాల్గొనడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, పాయల్ శంకర్, కొమురయ్య, అంజిరెడ్డి, సినీనటులు నవీన్ పొలిశెట్టి, డింపుల్ హయతి, పాయల్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
'సాక్షి' కథనాలను సుమోటోగా తీసుకున్న TGHRC
హైదరాబాద్: మానవ హక్కుల పరిరక్షణ, ప్రజా భద్రత, బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి ‘‘సాక్షి’’ తెలుగు దినపత్రికలో జూన్ 20న ప్రచురితమైన 2 వార్తలను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు (జ్యుడీషియల్) శివడి ప్రవీణ సుమోటోగా విచారణకు స్వీకరించారు.మొదటి కేసు (HRC నెం.2468/2026)లో “తీవ్రంగా గాయపరచి.. నోట కరుచుకుని” అనే శీర్షికతో ప్రచురితమైన వార్తను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. వరంగల్ నగరంలోని లేబర్ కాలనీ సమీపంలోని శాలినీనగర్‌లో వీధికుక్క దాడి చేయడంతో రెండేళ్ల చిన్నారి పాయల్ తీవ్రంగా గాయపడింది. అలాగే, ఐదేళ్ల బాలుడు సహా మరికొందరు కూడా గాయపడినట్లు వార్తలో పేర్కొన్నారు. ఈ ఘటన ప్రజా భద్రతకు, ముఖ్యంగా చిన్నారుల జీవన హక్కు, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన తీవ్రమైన ఆందోళనలను కలిగిస్తోందని భావించిన కమిషన్.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, బాధితుల ఆరోగ్య పరిస్థితి, వారికి అందించిన సాయం, వీధికుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టనున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.“నలుగురిని కన్నా.. నడి రోడ్డుపైనే అమ్మ” రెండో కేసు (హెచ్ఆర్సీ నెం.2469/2026)లో “నలుగురిని కన్నా.. నడి రోడ్డుపైనే అమ్మ” అనే శీర్షికతో ప్రచురితమైన వార్తను కమిషన్ స్వీకరించింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని శివాజీచౌక్ (గోల్‌బంగ్లా జంక్షన్) వద్ద ఓ గుర్తుతెలియని వృద్ధురాలు దయనీయ స్థితిలో రోడ్డుపైనే జీవిస్తున్నట్లు వార్తలో వెల్లడైంది. శారీరక ఇబ్బందులతో బాధపడుతూ, దారిన పోయేవారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జీవిస్తున్న ఆ వృద్ధురాలి పరిస్థితి, వృద్ధుల గౌరవప్రదమైన జీవనం, సంక్షేమం, సంరక్షణ, పునరావాసానికి సంబంధించిన తీవ్రమైన అంశాలను లేవనెత్తుతోందని కమిషన్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆమెను గుర్తించడం, రక్షించడం, వైద్య చికిత్స, పునరావాసం కల్పించడం, కుటుంబ సభ్యులను గుర్తించే ప్రయత్నాలు చేయడం, ఆమె భద్రత, సంక్షేమం కోసం తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌ను కమిషన్ ఆదేశించింది. ఈ రెండు కేసుల్లోనూ సంబంధిత అధికారుల నివేదికల కోసం విచారణను జులై 20కి వాయిదా వేసింది. -
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్ మణికొండ, నానక్ రామ్‌గూడ, కొండాపూర్‌లో కుండపోత వర్షం పడింది. గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్‌సిటీలో వర్షం కురిసింది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. -
నిర్మాణ వ్యర్థాల విచ్చలవిడి డంపింగ్‌పై చర్యలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఎక్కడపడితే అక్కడ నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను (సీఅండ్‌డీ వేస్ట్) పారబోసే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. పర్యావరణ పరిరక్షణ, నాలాల పూడిక నివారణ, నగరాల్లో వరద ముప్పును అరికట్టడమే లక్ష్యంగా అత్యంత కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని తాజాగా సంచలన జీఓ జారీ చేసింది. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీతో పాటు హెచ్ఎండీఏ, హెచ్ఎంఆర్ఎల్, హైడ్రా, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ, ఆర్అండ్బీ, టీజీఐఐసీ, టీజీఎస్పీడీసీఎల్ ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి.కొత్త నిబంధనలు ఇలా.. ఇష్టానుసారంగా నిర్మాణ వ్యర్థాలు పారబోస్తే వాహనాలు సీజ్‌తో పాటు భారీ జరిమానాలు విధిస్తారు. రోడ్ల పక్కన, ఖాళీ స్థలాలు, చెరువులు, నాలాలలో వేస్తే భారీ జరిమానాలతో పాటు, ఆ వ్యర్థాల తొలగింపు ఖర్చును సదరు వ్యక్తి లేదా సంస్థ నుంచే రికవరీ చేస్తారు. అక్రమ రవాణా వాహనాలను స్పాట్లోనే సీజ్ చేస్తారు. నిబంధనలు అతిక్రమించే బిల్డర్లు, కాంట్రాక్టర్ల పర్మిషన్లు రద్దు చేయడమే కాక, వారిని శాశ్వతంగా బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విధులకు అడ్డుతగిలితే కఠిన క్రిమినల్ చర్యలు ఉంటాయి. u ఇకపై భవన నిర్మాణ, లేఅవుట్ లేదా కూల్చివేత అనుమతులు పొందాలంటే బిల్డర్లు కేవలం దరఖాస్తు చేస్తే సరిపోదు. దాంతో పాటు వ్యర్థాలను అక్రమంగా పారబోయబోమని అండర్ టేకింగ్ ఇవ్వాలి. u వేస్ట్ మేనేజ్మెంట్ , యుటిలైజేషన్ ప్లాన్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. u పర్యావరణ హితాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ పరిధిలో జరిగే అన్ని సివిల్, రోడ్డు మౌలిక వసతుల పనుల్లో కనీసం 10 శాతం నిర్మాణ సామగ్రిని రీసైకిల్ చేసిన వ్యర్థాలతో తయారు చేసిన వాటినే ఉపయోగించాలి. u రోడ్డు కటింగ్ పనులు, డ్రైనేజీలు, మెట్రో లేదా మౌలిక వసతుల కాంట్రాక్టర్లు పనులు ముగించే లోపు సైట్‌ను పూర్తిగా క్లీన్ చేయాలి. u ఈ ఉత్తర్వులు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లో ఉన్నాయని, ఈ సరికొత్త నిబంధనల అమలులో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ హెచ్చరించారు. ఏ చిన్న పొరపాటు జరిగినా సంబంధిత నోడల్ అధికారులు, కమిషనర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని జీవోలో స్పష్టం చేశారు. ఇక్కడే వ్యర్థాలను అప్పగించాలి.. శంషాబాద్ ప్లాంట్ (టోల్‌ఫ్రీ: 18002030033) తూము కుంట ప్లాంట్ (18002030033) జీడిమెట్ల ప్లాంట్ (18001201159) ఫతుల్లాగూడ ప్లాంట్ (18001201159) -
బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరైంది. మల్కాజ్గిరి కోర్టు భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేసింది. కాగా, రెండు వారాలకుపైగా రిమాండ్‌లో ఉన్న బండి భగీరథ్‌కు బెయిల్ రావడంతో బయటకు రానున్నాడు. అయితే బెయిల్‌కు సంబంధించిన షరతులను తప్పనిసరిగా పాటించాలని న్యాయస్థానం స్పష్టం చేసినట్లు సమాచారం.మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండి భగీరథ్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణల ఆధారంగా పోలీసులు POCSO చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భగీరథ్‌ను పోలీసులు కోర్టు ముందు హాజరుపరచగా, న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు.ఈ నేపథ్యంలో భగీరథ్ తరపు న్యాయవాదులు మల్కాజ్గిరి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై శనివారం కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. భగీరథ్ తరపు న్యాయవాదులు తమ వాదనలను వినిపిస్తూ బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న గౌరవ న్యాయస్థానం.. కొన్ని నిబంధనలతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్ రావడంతో భగీరథ్ జైలు నుంచి విడుదల కానున్నారు. -
24 గంటల కరెంట్ లేక..!
ఈ రైతు పేరు పులిమామిడి శ్రీనివాస్. సిద్దిపేట జిల్లా, లింగాపురం గ్రామం. ఈయనకు పదెకరాల భూమి ఉంది. పొద్దంతా బోరు వేస్తే నీళ్లు కింద మడులకు అందడం లేదని, రాత్రిపూట త్రీఫేజ్ కరెంట్ ఇస్తే బోర్లు, బావులు మంచిగా నడిచి పొలమంతా పారుతుందని పేర్కొంటున్నాడు. వ్యవసాయానికి 12 గంటల త్రీఫేజ్ కరెంట్ సరిపోవట్లేదని 24 గంటలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాడు.ముస్తాబాద్ (సిరిసిల్ల): నిన్నమొన్నటి వరకు పండించిన ధాన్యాన్ని అమ్మేందుకు తిప్పలు పడ్డ రైతాంగం.. ఇప్పుడు నారుమళ్లు, వరిసాగుకు విద్యుత్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం పంటల సాగుకు సమాయత్తం అవుతున్న రైతులకు త్రీఫేజ్ కరెంట్ సరఫరా తగినంత లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధాన్యం అమ్మకాల సమయంలో త్రీఫేజ్ కరెంట్ సరఫరాను అధికారులు కుదించారు. అప్పుడు పెద్దగా అవసరం లేని కరెంట్ కోసం రైతులు ఏం ఆలోచించలేదు. ఇప్పుడు ఏరువాక సిద్ధం చేస్తున్న రైతాంగానికి కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. రాత్రి కరెంట్ నిలిపేసిన అధికారులు నెల రోజులుగా రాత్రిపూట త్రీఫేజ్ కరెంట్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ధాన్యం విక్రయాల సమయంతోపాటు రైతులెవరూ ఇతర పంటలు కూడా వేయకపోవడంతో కరెంట్ సరఫరాపై ఆలోచించలేదు. ప్రస్తుతం మృగశిర కార్తె ముగిసి ఆరుద్రలోకి వస్తున్న తరుణంలో త్రీఫేజ్ కరెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం వ్యవసాయం కోసం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు త్రీఫేజ్ కరెంట్‌ను సరఫరా చేస్తున్నారు. రైతులు నారుమడులు సిద్ధం చేసుకోగా, వరి నాట్లకు అవసరమైన పొలాన్ని సిద్ధం చేసేందుకు కరెంట్ సరిపోవడం లేదని పేర్కొంటున్నారు. పైగా ఇంకా ఎండలు మండుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం వేళ పొలాల్లో పనిచేసే పరిస్థితులు లేవని, రాత్రి వేళ కరెంట్ సరఫరా ఉంటే పొలం మొత్తం నీరు పారించి ఇతర పనులు చేసుకుంటామనే అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. హామీ అమలు చేయాలి ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు కేవలం 10 గంటలు మాత్రమే త్రీఫేజ్ కరెంట్ రావడంతో జిల్లాలో వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయం చేయలేక, కరెంట్ రాక అవస్థలు పడుతున్నారు. నాణ్యమైన కరెంట్ ఇచ్చి, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. |– కొండ శ్రీనివాస్, ముస్తాబాద్నీళ్లున్నా కరెంట్ ఉంటలేదు భూగర్భ జలాలు మంచిగానే ఉన్నాయి. చెరువుల్లో కూడా నీళ్లున్నాయి. కానీ కరెంట్ ఉంటలేదు. పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు మాత్రమే త్రీఫేజ్ ఇస్తున్నారు. గతంలో కరెంట్ ఇచ్చినట్లు ఈసారి కూడా ఇవ్వాలి. రైతులకు అండగా నిలవాలి. – తాళ్ల చంద్రారెడ్డి, రైతు, ముస్తాబాద్త్వరలోనే త్రీఫేజ్ సరఫరా ప్రస్తుతానికి 12 గంటల త్రీఫేజ్ కరెంట్ సరఫరా అవుతోంది. రైతులు పూర్తిస్థాయిలో పంటలు వేసుకునేలోగా 24 గంటల కరెంట్ సరఫరా అవుతుంది. ఇప్పటికైతే ఇంకా మాకేమీ ఆదేశాలు రాలేదు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వ్యవసాయానికి అవసరమైన కరెంట్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – విష్ణుతేజ, ఏఈ, ముస్తాబాద్రాజన్న సిరిసిల్ల జిల్లా వరిసాగు : లక్షా 40వేల ఎకరాలు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు: 80,289 రైతులు : సుమారు లక్ష మంది ఈ రైతు పేరు ఎద్దండి నర్సింహారెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం. ఇతడికి నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. వానాకాలం వరి సాగుకు సిద్ధమవుతున్నాడు. తనకున్న రెండు బోరుబావులతో వరి సాగుచేసే నర్సింహారెడ్డికి విద్యుత్ బాధలు వచ్చి పడ్డాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే త్రీఫేజ్ కరెంట్ సరఫరా ఉండడంతో వ్యవసాయం ఎలా చేసేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కేవలం 12 గంటల కరెంట్ ఎలా సరిపోతుందో అధికారులు చెప్పాలని కోరుతున్నాడు. నెలరోజులుగా ఇదే పరిస్థితి ఉందని, పొలం మొత్తం నీరు పారిద్దామంటే కరెంట్ సరిపోవడం లేదని పేర్కొంటున్నాడు. 24 గంటలు త్రీఫేజ్ కరెంట్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఇలా.. ఇతనొక్కడే కాదు.. చాలా మంది రైతులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. -
‘కనెక్షన్’లో కలెక్షన్!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నెలకు వందకుపైగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. ఏటా 3 వేల వరకూ దెబ్బతింటున్నాయి. ప్రతిరోజూ కనీసం 60 ప్రాంతాల్లో విద్యుత్ లోఓల్టేజీ లేదా విద్యుత్ అంతరాయాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిని విద్యుత్ అధికారులు ప్రకృతి వైపరీత్యాలపై నెట్టేస్తున్నారు. సాంకేతిక లోపాలంటూ తప్పించుకుంటున్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.ట్రాన్స్ఫార్మర్ స్థాయికి మించి విద్యుత్ లోడ్ ఇవ్వడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. విద్యుత్ పంపిణీ సంస్థలు జరిపిన అధ్యయనంలో ఇది వెల్లడైంది. ఈ వ్యవహారం వెనుక విద్యుత్ సిబ్బంది ముడుపుల వ్యవహారం ఉంటోంది. ఈ అవినీతిలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని ఉన్నతాధికారుల వరకూ భాగం ఉంటోంది. లోడ్ ఉన్నా కనెక్షన్ వినియోగదారులు కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసేప్పుడు విద్యుత్ అధికారులు హైడ్రామా ఆడుతున్నారు. వాస్తవానికి లోడ్ ఎంత ఉందో ముందే లెక్కగట్టాలి. ట్రాన్స్ఫార్మర్ స్థాయి కన్నా ఎక్కువ లోడ్ ఉంటే కొత్తదాన్ని బిగించాలి. దీనికి వినియోగదారుల నుంచి అధికారికంగా ఫీజు వసూలు చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ ఖర్చు, బిగింపు, రవాణా ఇతరత్రా లెక్కలు వేసి, వినియోగదారులను ముందుగా విద్యుత్ సిబ్బంది భయపెడుతున్నారు.దీంతో వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తోంది. లోడ్ తక్కువున్న...దూరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్కు కనెక్షన్ ఇస్తామని, రికార్డుల్లో చూపిస్తారు. కానీ లోడ్ ఎక్కువగా ఉన్న దగ్గర్లోని ట్రాన్స్‌ఫార్మర్‌కే కనెక్షన్ ఇస్తున్నారు. బహుళ అంతస్తుల భవనాల కనెక్షన్ల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతోంది. దీనికి ఒక్కో వినియోగదారుడి నుంచి పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు.కార్పొరేట్ ఆఫీసుల విషయంలో విద్యుత్ అధికారుల పంట పండినట్టే. మల్టీ నేషన్ కంపెనీలు ఖర్చులను పెద్దగా పట్టించుకోవు. కాబట్టి రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారు. దీంతో లోడ్ ఎక్కువగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కే కనెక్షన్లు ఎక్కువవుతున్నాయి. ఫలితంగా తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, పేలిపోవడం లేదా చెడిపోవడం జరుగుతోందని డిస్కమ్‌ల అంతర్గత అధ్యయనంలో వెల్లడైంది. చేతులెత్తేస్తున్న ఉన్నతాధికారులు హైదరాబాద్ నగరంలో ఓ ఏఈ తన పరిధిలో పది చోట్ల లోడ్ ఎక్కువగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కే నిబంధనలకు విరుద్ధంగా కనెక్షన్లు ఇచ్చాడు. ఈ విషయమై అధికారులు నిలదీస్తే, మర్నాడే ఓ రాజకీయ నేత నుంచి ఫోన్ వచి్చంది. ఖమ్మంలో ఇలాంటి ఉదంతమే వెలుగు చూసింది. లోడ్ ఎక్కువై 12 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. దీనికి ఏఈని సస్పెండ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ జిల్లా అధికారులకు రాజకీయ నేతల నుంచి ఫోన్ వస్తే ఆగిపోయారు.ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. సిబ్బంది కూడా విచిత్రమైన సమాధానం చెబుతున్నారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ బిగించే వరకూ వినియోగదారులు ఓపిక పట్టడం లేదని చెబుతున్నారు. ఎవరో ఒక నాయకుడితో ఫోన్లు చేయిస్తున్నారని, అందుకే ఉన్నచోట కనెక్షన్లు ఇస్తున్నామని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము మాత్రం ఏం చేయగలమని ఉన్నతాధికారులు చేతులు ఎత్తేస్తున్నారు. -
ఎస్సీ గురుకుల సొసైటీలో 550 ఖాళీలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో పెద్ద ఎత్తున ఉద్యోగ ఖాళీలున్నాయి. ఇప్ప టికే మంజూరైన పోస్టుల్లో ఉన్న ఖాళీలపై జోనల్ అధి కారులు పరిశీలన పూర్తి చేసిన సొసైటీ కార్యదర్శికి తాజాగా నివేదిక సమర్పించారు. ప్రస్తు తం ఎస్సీ గురుకుల సొసైటీలో బోధన కేటగిరీలో 550 ఖాళీలు న్నాయి. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడం, ఈనెల 15వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో తరగ తులు ప్రారంభించడంతో బోధనా సిబ్బంది ఖాళీలను అధి గమించేందుకు సొసైటీ కార్యదర్శి కార్యాలయం క్షేత్రస్థాయి అధికారులకు పలు సూచనలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఖాళీలను పరిశీలించిన జోనల్ అధికారులు కేట గిరీల వారీగా గుర్తించి నివేదిక సమర్పించారు. ఈ ఖాళీలన్నీ శాశ్వ త ప్రాతిపది కన ప్రభుత్వం మంజూరు చేసి న పోస్టులే. ప్రాధాన్యత క్రమంలో ఈ ఖాళీ లను పార్ట్ టైమ్ టీచర్లతో భర్తీ చేయాలని సొసైటీ కార్యాలయం నిర్ణయించింది.జిల్లా కలెక్టర్ల అనుమతితో...ఉద్యోగ ఖాళీలను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేసేలా జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. జిల్లా పరిధిలోని ఖాళీల వివరాలను వెంటనే కలెక్టర్లకు అందించాలని గురుకుల సొసైటీ కార్యదర్శి సంబంధిత జోనల్ అధికారులను ఆదేశిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. జిల్లా కలెక్టర్ అనుమతితో పార్ట్‌టైమ్ ఉద్యోగులను నియమించుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ సొసైటీ పరిధిలో దాదాపు వెయ్యికి పైగా పార్ట్‌టైమ్ ఉద్యో గులున్నట్లు సమాచారం.తాజాగా నియ మించుకునే వారికి కూడా ఇదే తరహా వేత నాలు ఇవ్వాలని సొసైటీ అధికారులు ప్రాథ మికంగా నిర్ణయించారు. అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు చేరింది. ఇప్పటికే 2 విడతల్లో ప్రవేశా లను చేప ట్టిన అధికారులు ఈనెల 21వ తేదీలోగా ఆయా విద్యా ర్థులను నిర్దేశించిన పాఠశా లల్లో రిపోర్టు చేయాలన్నారు. మరోవైపు బోధన తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పార్ట్ టైమ్ టీచర్లను నియమించుకోవా లని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
గాంధీసరోవర్‌కు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్‌కు లైన్ క్లియరైంది. మూసీ సుందరీకరణలో భాగంగా బాపూఘాట్ ప్రాంతంలో గాంధీ సరోవర్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు ఇప్పటివరకు అడ్డంకిగా ఉన్న కేంద్ర రక్షణ శాఖకు చెందిన భూముల అప్పగింతకు తాజాగా కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ పరిధిలోని బాపూఘాట్ పరిసరాల్లో రక్షణ శాఖకు చెందిన 83.814 ఎకరాల భూమిని మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్)కు బదిలీ చేసింది.ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ (డిఫెన్స్ ల్యాండ్స్ విభాగం) ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అవుతున్న ఈ భూముల మొత్తం విలువ రూ.533.42 కోట్లు అని రక్షణ శాఖ నిర్ధారించింది. దీనికి బదులుగా రక్షణ భూముల నిబంధనల ప్రకారం సమాన విలువైన మౌలిక వసతులను సైన్యానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొంది. కేంద్రం నిర్ణయంతో సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మూసీ నదిని సరికొత్త పర్యావరణ, సాంస్కృతిక కేంద్రంగా మార్చేందుకు, బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ఈ ల్యాండ్ క్లియరెన్స్ ఎంతో కీలకమని తన ‘ఎక్స్’ఖాతాలో పేర్కొన్నారు. ఈ సహకారానికిగాను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు, భారత సైన్యానికి సీఎం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.బదిలీ చేసిన భూములివీ..గండిపేట మండలంలోని బండ్లగూడలో సర్వే నంబర్లు 86, 87, 88లోని 25.15 ఎకరాలు, హైదర్‌గూడలోని సర్వే నంబరు 126లోని 5.23 ఎకరాలు, అలాగే బండ్లగూడలోని 91, 92, 96 సర్వే నంబర్లు, హైదర్‌గూడలోని 123, 124, 125ల్లోని మొత్తం 39.72 ఎకరాలు, అలాగే బండ్లగూడలోని సర్వే నంబరు 94లోని 5.5 ఎకరాలు, గోల్కొండలోని ఖిలా మొహమ్మద్ నగర్‌లోని సర్వే నంబర్లు 3/ఎల్/15 (రెవెన్యూ సర్వే నంబర్లు 250, 251, 252లోని 8.09 ఎకరాలను ఎంఆర్డీసీఎల్కు బదిలీ చేసింది. తొలి దశలో ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు (11.8 కి.మీ), హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు (9.2 కి.మీ) మూసీని అభివృద్ధి చేయనున్నారు. ఈ మూసీ కారిడార్ పొడవునా అవసరమైన అదనపు ప్రైవేట్ భూముల సేకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసింది.త్రివేణి సంగమంగా గాంధీ సరోవర్..మొత్తం 238 ఎకరాల్లో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌ను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. మూసీ, ఈసా నదులతో పాటు మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటిని ఈ ప్రాంతానికి తరలించి బాపూఘాట్ త్రివేణి సంగమ ప్రాంతంలో 150 అడుగుల ఎత్తయిన మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మహనీయుడి విగ్రహం ఇదే కానుంది. ప్రస్తుతం మన దేశంలో అత్యంత ఎత్తయిన గాంధీ విగ్రహం పాట్నాలోని గాంధీ మైదానంలో ఉంది. దీని ఎత్తు 72 అడుగులు (22 మీటర్లు). కాంస్య విగ్రహం.ఈ ప్రాజె క్టులో భాగంగా గాంధీ సరోవర్‌ను హ్యాపెనింగ్ ప్లేస్‌గా నైట్ ఎకానమీగా అభివృద్ధి చేయడంతో పాటు అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. గాంధీ తత్వ శాస్త్రాన్ని బోధించే మ్యూజియం, గాంధీ జీవిత చరిత్రను వివరించే ఆడిటోరియాలు, ఫొటో ఎగ్జిబిషన్లు, ధ్యాన మందిరం, చేనేత శిక్షణ కేంద్రం, భారీ వీక్షణ గోపురాన్ని నిర్మించనున్నారు. ఈ సంగమంలో బోటింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. వ్యాపార, ఆర్ధిక కార్యకలాపాల కోసం హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాలు కూడా ఉంటాయి. నదీ పరివాహక ప్రాంతంలో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, షాపింగ్ మాల్స్, యాంపీ థియేటర్లు, వినోద కేంద్రాలు, ఉద్యానాలు, ఇతరత్రా యుటిలిటీలను అభివృద్ధి చేస్తారు. -
అన్నిటికీ ఒకటే క్యూర్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగర ప్రజలు ఇకపై వివిధ ప్రభు త్వ విభాగాలకు చెందిన వివిధ సేవల చెల్లింపులను ఒకే యాప్ (క్యూర్–1) ద్వారా చేయొచ్చు. ఈ మేరకు ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాప్ ద్వారా క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల్లో ‘కామన్ యూనిఫైడ్ బిల్లింగ్ అండ్ కలెక్షన్ సిస్టం’ అమలుకు మార్గ దర్శకాలు జారీ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ వ్యవస్థ ద్వారా ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, ట్రాఫిక్ చలాన్లు తదితర ప్రభుత్వ బకాయిలన్నింటినీ ఒకే డిజిటల్ ప్లాట్‌ఫాంలో చెల్లించే అవకాశం కల్పించనున్నారు.ప్రస్తుతం నగర ప్రజలు వివిధ శాఖలకు సంబంధించిన బిల్లులు, పన్నులు చెల్లించేందుకు వేర్వేరు పోర్టళ్లను వినియోగించాల్సి వస్తోంది. ఈ పరిస్థితి వల్ల ప్రజలకు ఇబ్బందులు, శాఖలకు వసూళ్ల సమన్వయంలో సమస్యలు, ఆదాయ లీకేజీలు చోటుచేసుకుంటున్నాయని గుర్తించిన ప్రభుత్వం.. ఈ యాప్ ద్వారా సమగ్ర చెల్లింపు వ్యవస్థను అందుబాటులోకి తేనుంది. దీంతో చెల్లింపుల పారదర్శకత, జవాబుదారీతనం, వసూళ్ల సామర్థ్యం పెరగడంతో పాటు విభిన్న చెల్లింపు వ్యవస్థల అవసరం తొలగిపోనుంది. ఏ సేవలు అందుబాటులోకి?మొదటి దశలో జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలకు సంబంధించిన ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్సులు, సెల్ఫ్ అసెస్మెంట్, సూపర్ స్ట్రక్చర్ ఫీజులు, ఖాళీ భూముల పన్ను (వీఎల్టీ) చెల్లింపులను అనుసంధానించనున్నారు. అలాగే టీజీ ఎస్పీడీసీఎల్ విద్యుత్ బిల్లులు, జలమండలికి సంబంధించిన వాటర్, సివరేజి చార్జీలు, హైదరాబాద్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులు కూడా ఈ వేదికలోకి రానున్నాయి. భవిష్యత్తులో ప్రభుత్వం సూచించే ఇతర సేవలను కూడా ఇందులో చేర్చనున్నారు. యాప్ నిర్వహణ బాధ్యతలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కు అప్పగించనున్నారు. రోజువారీ సెటిల్మెంట్యాప్ ద్వారా జరిగే అన్ని చెల్లింపులు మీ సేవ పేమెంట్ గేట్‌వే ద్వారా ప్రాసెస్ అవుతాయి. వసూలైన మొత్తా లు తాత్కాలికంగా కేంద్ర ఖాతాలో నిల్వ చేసి, టీ+0 లేదా టీ+1 విధానంలో సంబంధిత శాఖలకు బదిలీ చేస్తారు. పేమెంట్ వైఫల్యాలు, రీకన్సిలియేషన్ సమస్యలు, ఇతర సేవా వివాదాల పరిష్కారం కోసం కేంద్రీకృత గ్రీవెన్స్ రెడ్రెస్సల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.పౌరులు క్యూర్ –1 యాప్,మై క్యూర్ యాప్, ఆయా శాఖల పోర్టళ్ల ద్వారా ఫిర్యాదులు నమో దు చేసుకునే అవకాశం ఉంటుంది. అన్ని శాఖలు 90 రోజుల్లోపు క్యూర్–1 యాప్‌తో చెల్లింపు వ్యవస్థలోకి మారా ల్సి ఉంటుంది. కాగా.. ఒకే డిజిటల్ ఎకో సిస్టమ్ లక్ష్యంతో రాష్ట్ర ప్రభు త్వం తీసుకొచ్చిన క్యూర్ –1 యాప్ నగర పాలనలో డిజిటల్ సంస్కరణలకు కొత్త మైలురాయిగా నిలవనుందని అధికారులు భావిస్తు న్నారు. 3 కార్పొరేషన్ల పరిధిలోని పౌరులకు సౌకర్యవంతమైన, పారదర్శకమైన సేవలు అందుతాయని పేర్కొంటున్నారు. -
తెలంగాణకు మూడు బుల్లెట్ రైళ్లు
కందుకూరు: దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో భాగంగా తెలంగాణకు మూడు బుల్లెట్ రైళ్లు(హైస్పీడ్ రైల్ కారిడార్లు) రానున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి కేంద్రం నిర్ణయించిందన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు, బేగంపేట, తిమ్మాపూర్ గ్రామాల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి సీఆర్ఎఫ్ నిధులు రూ.87 కోట్లతో లింకు రహదారులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.ఈ సందర్భంగా లేమూరులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ హైస్పీడ్ కారిడార్ల కోసం మొదట రూ.5 లక్షల కోట్లు అంచనా వేయగా, భూముల ధరలు పెరగడంతో ఆ ఖర్చు రూ.10 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని, దీనికి సంబంధించి సర్వే పనులు కొనసాగుతున్నాయన్నారు. ఆర్ఆర్ఆర్ కోసం ఉత్తరం వైపు భూసేకరణ పనులు కొనసాగుతున్నాయని, ఆ ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందన్నారు. శ్రీశైలం హైవే విస్తరణ పనులకు డీపీఆర్ సిద్ధమవుతోందని, ఏడాది లోపు పనులు ప్రారంభమవుతాయని స్పష్టంచేశారు.రంగారెడ్డి జిల్లా తెలంగాణకు గుండెకాయ లాంటిదని, జిల్లాలోని గ్రామాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, ఈ ప్రాంత అభివృద్ధికి రహదారుల అనుసంధానం అత్యంత కీలకమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దేశాన్ని ఏలే పాలకులు కావాలి
సాక్షి, హైదరాబాద్: ‘గురుకుల విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులు డాక్టర్లు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, గ్రూప్ అధికారులుగానే కాకుండా దేశాన్ని ఏలే పాలకులుగా ఎదగాలి. ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి 100 మంది అంబేడ్కర్లు తయారు కావాలి. మీరంతా (విద్యార్థులు) తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలిం. దేశాన్ని నడిపించే శక్తిగా ఎదగాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో విద్య, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి.. రాష్ట్రవ్యాప్తంగా 27.50 లక్షల మంది విద్యార్థులకు కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.అలాగే గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి అన్న–అక్క మెంటార్షిప్ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. అలాగే సుమారు రూ.150 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడామౌలిక సదుపాయాల అభివృద్ధికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అంతకుముందు సీఎం రేవంత్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్ స్కూళ్ల కంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటే అద్భుత ఉదాహరణ అన్నారు.విధ్వంసం నుంచి వికాసం వైపు..‘అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని ప్రజాప్రభుత్వం సంపూర్ణంగా విశ్వశిస్తోంది. గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ బడుల మూసివేతతో విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించాలని నిర్ణయించింది. అందుకే బడ్జెట్లో విద్య కోసం 8.5 శాతం నిధులు కేటాయించాం. విద్యాభివృద్ధికి రూ. 26,600 కోట్లు కేటాయించాం. దీన్ని ఖర్చుగా కాకుండా ంభవిష్యత్ తరాలకు పెట్టుబడిగా భావిస్తున్నాం. మేం అధికారంలోకి రాగానే డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచాం.’ అని సీఎం రేవంత్ వివరించారు.విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసమే.. ‘విద్యా శాఖకు మంత్రి లేడంటూ కొందరు మాట్లాడుతున్నారు. పదేళ్లు వాళ్లు చేసిన విధ్వంసంతో వందేళ్ల నష్టం జరిగింది. అందుకే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి పేదలకు విద్య అందించాలని విద్యా శాఖను నా దగ్గరే పెట్టుకున్నా. ప్రీ ప్రైమరీ విధానం తీసుకొచ్చి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరిస్తున్నాం. కుల వ్యవస్థను రూపుమాపాలనే లక్ష్యంతో సమీకృత గురుకులాలను తీసుకొస్తున్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మంజూరు చేశాం. వచ్చే విద్యా సంవత్సరంలో 119 పాఠశాలలను ప్రారంభిస్తాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌తో దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలుపుతాం. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. బంగారు పతకాలు సాధించే బాధ్యతను రాష్ట్ర విద్యార్థులపై పెడుతున్నాం’ అని సీఎం రేవంత్ చెప్పారు.బ్లూకాలర్ ఉద్యోగాల కల్పనపై దృష్టిపెట్టాం‘ఏఐ తుపానుతో కోట్లాది మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అందుకే బ్లూ కాలర్ ఉద్యోగాల కల్పన వైపు దృష్టి సారించాం. యువతకు నైపుణ్యాన్ని అందిస్తున్నాం. ఆంగ్లంతోపాటు జర్మన్, జపానీస్ భాషలను నేర్పిస్తున్నాం. ఐటీఐలను ఏటీసీలుగా మార్చాం. స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. విద్యార్థుల్లో నైపుణ్యాలకు పదునుపెట్టి గొప్ప వాళ్లుగా తీర్చిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. రేపటి భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది. మన తలరాతను మార్చేది చదువొక్కటే. మీరంతా శ్రద్దతో చదవండి. మీకేం కావాలో ఇచ్చే బాధ్యత మీ అన్నగా నేను తీసుకుంటా’ అని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.డ్రగ్స్‌రహిత తెలంగాణ నిర్మాణమే లక్ష్యం: గవర్నర్తెలంగాణను మాదకద్రవ్యాల రహితంగా మార్చడమే తన లక్ష్యమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా చెప్పారు. గతంలో హిమాచల్ గవర్నర్‌గా పనిచేసిన తాను ఆ రాష్ట్రాన్ని డ్రగ్స్‌రహితంగా తయారు చేసినట్లు గుర్తుచేశారు. డ్రగ్స్ నిర్మూలనపై ఇంటి నుంచే విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు విద్యార్థులతో మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. కేంద్ర ప్రభుత్వం కూడా నషా ముక్త్ భారత్ కోసం కృషి చేస్తోందన్నారు. మంచిపని చేసే ప్రభుత్వానికి మద్దతు ఉంటుందని.. రేవంత్ ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తానన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగితే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆత్మగౌరవానికి ప్రతీక: డిప్యూటీ సీఎం భట్టిరాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఆత్మగౌరవానికి యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ ప్రతీక అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రజాప్రభుత్వం తీర్చిదిద్దుతోందని చెప్పారు. యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్‌లో బూట్లు, యూనిఫారాలు, పుస్తకాలు, బెడ్‌షీట్స్ వంటి వస్తువులను అత్యంత నాణ్యతతో సేకరించినట్లు వివరించారు. 27 లక్షల మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ ఒక తండ్రిలా బాధ్యత తీసుకొని ఈ కిట్లను అందిస్తున్నారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం భారీ సంస్కరణలు చేపడుతుంటే ప్రతిపక్ష నాయకులు అర్థంలేని విమర్శలు చేస్తున్నారని.. అభివృద్ధి చెందుతున్న తెలంగాణ, ప్రపంచంతో పోటీ పడుతున్న విద్యార్థులను చూసి ఓర్వడం లేదని విమర్శించారు.వాట్సాప్ ద్వారా 18 లక్షల మంది విద్యా సమాచారంరాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మందికిపైగా విద్యార్థుల పాఠశాల విద్యా సమాచారాన్ని నేరుగా తల్లిదండ్రుల వాట్సాప్‌కు పంపే సేవలను గవర్నర్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రారంభించారు. రాష్ట్ర పక్షి పాలపిట్టను డిజిటల్ మస్కట్‌గా పరిచయం చేశారు. పాలపిట్ట యానిమేషన్ వీడియోల ద్వారా ముఖ్యమైన సమాచారం, అవగాహన సందేశాలు, వీడియోలు వాట్సాప్‌లో పంపిస్తారు. విద్యా పురోగతి, పరీక్షల సమాచారం, విద్యా సామగ్రి పంపిణీ, స్కాలర్షిప్స్, పాఠశాల కార్యక్రమాలు, ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాల వంటి అంశాలపై సకాలంలో సమాచారం అందుబాటులోకి రానుంది. విద్యారంగంలో సాంకేతికత వినియోగాన్ని విస్తరించి విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం, తల్లిదండ్రులతో ప్రభుత్వ అనుసంధానాన్ని బలోపేతం చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం రేవంత్ తెలిపారు. -
ఆస్తులు విడుదల చేయాల్సిందే ఈడీ జప్తు సరికాదు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డిపై అక్రమంగా ఆరోపించిన కేసుల్లో వాన్‌పిక్ (వాడరేవు–నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్) వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వాన్‌పిక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఆస్తులను విడుదల చేస్తూ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్ధించింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన తొమ్మిది పిటిషన్లు కొట్టివేసింది.ఈ మేరకు జస్టిస్ పి. శామ్ కోషి, జస్టిస్ సుద్దాల చలపతిరావు ధర్మాసనం.. అన్ని వర్గాల నుంచి సుదీర్ఘ వాదనలు విని గతేడాది డిసెంబర్ 23న తీర్పు రిజర్వు చేసింది. శుక్రవారం తీర్పు వెలువరించింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులు, అందులోని నిర్ధారణలు, పత్రాలను సమగ్రంగా పరిశీలించిన ధర్మాసనం.. ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకొనేలా ఎటువంటి కొత్త ఆధారాలు లేదా చట్టపరమైన కారణాలను ఈడీ చూపించలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.ట్రిబ్యునల్ ఇచ్చిన కారణాలు సమంజసంగా ఉన్నాయని సమర్ధించింది. వాటిని తప్పుబట్టేందు కు తగిన ఆధారాలు రికార్డులో లేవని స్పష్టం చేసింది. దీంతో ఈడీ దాఖలు చేసిన 9 అప్పీళ్లను కొట్టివేస్తూ.. ట్రిబ్యునల్ ఉత్తర్వులను యథాతథంగా వెంటనే అమలు చేయాలని తేల్చిచెప్పింది. అప్పిలేట్ ట్రిబ్యునల్ మొత్తం 12 కేసుల్లో ఉత్తర్వులు జారీ చేయగా గతంలో హైకోర్టు మూడు కేసుల్లో ఊరటనిచ్చింది. దీంతో వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌తోపాటు సంబంధిత కంపెనీలకు ఇది కీలక న్యాయపరమైన విజయంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఏమిటి వాన్‌పిక్ కేసు? వాడరేవు, నిజాంపట్నం ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి ఓడరేవులు, పారిశ్రామిక కారిడార్, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, షిప్‌యార్డ్, విమానాశ్రయం వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వాన్‌పిక్ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రస్ అల్ ఖైమా ప్రభుత్వం మధ్య ప్రభుత్వ–ప్రభుత్వ (జీటుజీ) విధానంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది.ఈ ప్రాజెక్టులో ప్రయోజనాలు పొందిన నిమ్మగడ్డ ప్రసాద్, ప్రతిఫలంగా జగన్‌కు చెందిన కంపెనీల్లో రూ. 863.33 కోట్ల పెట్టుబడులు పెట్టారన్న నాటి అధికార, ప్రతిపక్ష కుట్రలో భాగంగా సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. అక్రమంగా మనీలాండరింగ్ కేసులు నమోదు చేసి, పలు ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ జప్తు ఉత్తర్వులను అడ్జుడికేటింగ్ అథారిటీ సమర్థించడంతో జగన్మోహన్రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ సహా కంపెనీలు అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. ట్రిబ్యునల్ఏం చెప్పింది? విచారణ అనంతరం ట్రిబ్యునల్కీలక వ్యాఖ్యలు చేసింది. వాన్‌పిక్ ప్రాజెక్టు అధికారికంగా అమల్లోకి రావడానికి ముందే సంబంధిత పెట్టుబడులు జరిగాయని.. కాబట్టి వాటిని ప్రాజెక్టుకు ప్రతిఫలంగా ఇచ్చినట్లు లేదా క్విడ్ ప్రో కోగా పేర్కొనలేమంది. అక్రమ పెట్టుబడులను నిర్ధారించేందుకు ఎలాంటి ఆధారాలు కూడా లేవని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ఈడీ జప్తు చేసిన ఆస్తులను వెంటనే విడుదల చేయాలని ఆదేశిస్తూ.. 2019 జూలైలో ఉత్తర్వులు జారీ చేసింది. అనేక మంది ఉద్యోగులు పనిచేస్తున్న మీడియా సంస్థ జగతి పబ్లికేషన్స్ ఆస్తుల బదిలీని నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఉన్నందున, ఆ సంస్థకు సంబంధించిన రూ. 273.39 కోట్ల విలువైన ప్లాంట్, యంత్రాల జప్తును కొనసాగించాల్సిన అవసరం లేదని పేర్కొంది.మొత్తం 60 మంది పెట్టుబడిదారులు (నిమ్మగడ్డ ప్రసాద్, ఆయన గ్రూప్ కంపెనీలతో సహా) ఒక్కో షేరుకు రూ. 360 చొప్పున షేర్లను కొనుగోలు చేశారన్న వాస్తవాన్ని ఈడీ తరఫు న్యాయవాది కూడా కాదనలేదు. 60 మందిలో 45 మంది పెట్టుబడిదారులపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. పెట్టుబడి పెట్టిన వారిలో కొందరిని మాత్రమే ప్రత్యేకంగా ఎంచుకొని వారి వ్యవహారాలను క్విడ్ ప్రో కోగా ఆరోపించడం వెనుక ‘ఎంపిక చేసుకునే విధానం’అవలంభిస్తోందని సందేహం కలుగుతోందని ట్రిబ్యునల్ అనుమానం వ్యక్తం చేస్తూ జప్తు ఉత్తర్వులను రద్దు చేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో దర్యాప్తు సంస్థల జోక్యం సరికాదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ అనుమతితోనే పెట్టుబడులు.. ట్రిబ్యునల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 2019 అక్టోబర్‌లో ఈడీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. వాన్‌పిక్ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వ విధానాలను దురి్వనియోగం చేసి భారీ ప్రయోజనాలు పొందారని.. ప్రాజెక్టు కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఈడీ వాదించింది. ప్రతివాదుల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వ–ప్రభుత్వ ఒప్పందం ఆధారంగా చేపట్టారన్నారు. రస్–అల్–ఖైమా ప్రభుత్వం అధికారిక భాగస్వామిగా వ్యవహరించిందన్నారు. ప్రాజెక్టు కోసం జరిగిన పెట్టుబడులు, భూముల కొనుగోళ్లు, కంపెనీల ఏర్పాటు అన్నీ ప్రభుత్వ అనుమతులతోనే జరిగాయని కోర్టుకు తెలిపారు. ప్రతివాదులకు ఊరట.. హైకోర్టు కొట్టివేసిన అప్పీళ్లలో జీ2 కార్పొరేట్ సర్విసెస్, సుగుణి కన్స్ట్రక్షన్స్ ఎల్ఎల్పీ, జగతి పబ్లికేషన్స్, గిల్‌క్రిస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ఫా అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్, కార్మెల్ ఏసియా హోల్డింగ్స్, వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, ఆల్ఫా విలాస్ ప్రైవేట్ లిమిటెడ్, నిమ్మగడ్డ ప్రసాద్ తదితర ప్రతివాదులకు ఊరట లభించింది. (వాన్‌పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ అదర్స్, వాన్‌పిక్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, వాన్‌పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు రెండేళ్ల కిత్రం జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల్లో ఊరట లభించిన విషయం తెలిసిందే) ట్రిబ్యునల్ నాటి ఉత్తర్వుల్లోని మరికొన్ని అంశాలు.. వాన్‌పిక్ ప్రాజెక్టు రస్–అల్–ఖైమా (యూఏఈ) ప్రభుత్వంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ–ప్రభుత్వ ఒప్పందం కింద ప్రారంభించిందన్న వాదనలకు రికార్డుల్లో ఆధారాలు ఉన్నాయంది. పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రభుత్వం నేరుగా చర్చలు జరిపి ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని గుర్తుచేసింది. వాన్‌పిక్ ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాల్లో సీబీఐ, ఈడీలు విధాన నిర్ణయాలను కూడా నేరపూరిత చర్యలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాయని వ్యాఖ్యానించింది.ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక, పారిశ్రామిక విధాన నిర్ణయాలను దర్యాప్తు సంస్థలు తమ అభిప్రాయాలతో భర్తీ చేయలేవని పేర్కొంది. ప్రభుత్వానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా, అవగాహన ఒప్పందంలోని ప్రతి అంశం తుది ఒప్పందంలో యథాతథంగా ఉండాల్సిన అవసరం లేదని, భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పరిస్థితులకు అనుగుణంగా మార్పులు సహజమని అభిప్రాయపడింది. అడ్జుడికేటింగ్ అథారిటీ పలు కీలక పత్రాలు, వాదనలను సరిగా పరిశీలించలేదంది. వాన్‌పిక్ కేసుల్లో ఈడీ అటాచ్ చేసిన ఆస్తులివే... మొత్తం ఆస్తుల విలువ: 863.33 కోట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రూప్: రూ.538.31 కోట్లు నిమ్మగడ్డ ప్రసాద్ గ్రూప్: రూ. 325.02 కోట్లు వైఎస్ జగన్‌కు చెందిన కంపెనీల్లో.. వైఎస్ జగన్మోహన్రెడ్డి: రూ. 68.31 కోట్లు (సండూర్ పవర్స్: 54.94 కోట్లు, స్థిరాస్తులు: 13.35 కోట్లు) జగతి పబ్లికేషన్స్: రూ. 450.00 కోట్లు కార్మెల్ ఆసియా హోల్డింగ్స్: రూ. 20.00 కోట్లు నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన కంపెనీల్లో... నిమ్మగడ్డ ప్రసాద్: రూ. 37.83 కోట్లు ఆల్ఫా అవెన్యూస్: రూ. 97.82 కోట్లు ఆల్ఫా విల్లాస్: రూ. 35.90 కోట్లు గిల్‌క్రిస్ట్ ఇన్వెస్ట్మెంట్స్: రూ. 45.85 కోట్లు జి2 కార్పొరేట్ సర్విసెస్: రూ. 49.98 కోట్లు సుగుణి కన్స్ట్రక్షన్స్: రూ. 7.00 కోట్లు వాన్‌పిక్ పోర్ట్స్: రూ. 23.23 కోట్లు వాన్‌పిక్ ప్రాజెక్ట్స్: రూ. 27.72 కోట్లు (ఇందులో వాన్‌పిక్ పోర్ట్స్, వాన్‌పిక్ ప్రాజెక్టుపై ఉత్తర్వులు గతంలోనే వెలువడ్డాయి) -
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించబోయే నీట్ (NEET) రీ-ఎగ్జామ్‌కు హాజరయ్యే అభ్యర్థులకు టీజీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్‌ను చూపించి, తమ ఇళ్ల నుండి పరీక్షా కేంద్రాల వరకు, తిరిగి ఇంటికి చేరుకోవడానికి ఉచితంగా రాకపోకలు సాగించవచ్చని ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక ఉచిత ప్రయాణ సదుపాయం సంస్థకు చెందిన ఏసీ సర్వీసులు మినహాయించి అన్ని బస్సులలో అందుబాటులో ఉంటుందని ఆయన వివరించారు.ఈ పరీక్షకు దాదాపు 73 వేల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల మార్గాలలో తగినన్ని బస్సులను నడిపేందుకు ముందస్తుగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 21వ తేదీ మొదటి సర్వీసు నుంచి అర్ధరాత్రి వరకు ఈ సదుపాయాన్ని అభ్యర్థులు వినియోగించుకోవచ్చని, ఏదైనా ఆటంకాలు ఎదురైనట్లయితే, టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040-2345 0033, 6815 3333లలో సంప్రదించవచ్చంటూ ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షకు సకాలంలో చేరుకోవడానికి అభ్యర్ధులు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. -
తెలంగాణ: వాట్సాప్‌లో పాఠశాల విద్యా సేవలు
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. విద్యాశాఖ ద్వారా అన్ని పాఠశాలల సమాచారం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు, విద్యార్థులకు అందించనున్నారు. మీసేవ సహకారంతో వాట్సాప్ ద్వారా ఇకపై స్కూల్ అప్డేట్స్ నేరుగా వారి ఫోన్ కు చేరనున్నాయి. ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు.ఈ వినూత్న కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాల విద్యకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం, సేవలు, ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను నేరుగా వాట్సాప్ ద్వారా పొందనున్నారు. విద్యా పురోగతి, పరీక్షల సమాచారం, విద్యా సామగ్రి పంపిణీ, స్కాలర్షిప్లు, పాఠశాల కార్యక్రమాలు, ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాల వంటి అంశాలపై సకాలంలో సమాచారం అందుబాటులోకి రానుంది.ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వ సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖకు చెందిన ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD)-మీసేవ విభాగం, పాఠశాల విద్యా శాఖతో కలిసి అభివృద్ధి చేసింది.విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టులు, హాల్ టికెట్ల డౌన్లోడ్, మార్కుల మెమోలు, పరీక్షా ఫలితాలు, ఎస్ఎస్సీ మెమోలు, బోనఫైడ్ సర్టిఫికెట్లు, ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్లు, ఎస్ఎస్సీ మెమో సవరణల దరఖాస్తులు.. సేవలు పొందవచ్చుత్వరలో అందుబాటులోకి రానున్న సేవలుయూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ వివరాలు, విద్యార్థుల హాజరు సమాచారం, ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులు, మధ్యాహ్న భోజన పథకం వివరాలు, ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాలు, క్రీడలు, సహపాఠ్య కార్యక్రమాల సమాచారం, రెసిడెన్షియల్ పాఠశాలల సంక్షేమ కార్యక్రమాల వివరాలు, విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణ -
ఆంగ్ల భాషపై విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ సందేశం
సాక్షి,హైదరాబాద్: విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందిస్తూనే వారి మాతృభాషలు, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉపాధ్యాయులకు సూచించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన “రెండు వారాల ఆంగ్ల భాషా ప్రావీణ్యత కార్యక్రమం”లో పాల్గొన్న ఉపాధ్యాయులతో గవర్నర్ శుక్రవారం లోక్ భవన్లో ముచ్చటించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసిన ఉపాధ్యాయులకు గవర్నర్ ధృవపత్రాలను అందజేసి అభినందించారు.హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (EFLU) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంక్షేమ నివాస విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఆంగ్ల భాషా బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా నిర్వహించబడింది. గిరిజన సంక్షేమ విద్యాసంస్థల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి మద్దతుగా గవర్నర్ విచక్షణ నిధుల నుంచి రూ.12.80 లక్షలు లోక్ భవన్ మంజూరు చేసింది. కార్యక్రమంలో 50 మంది ఉపాధ్యాయులు, ఐదుగురు ఈఎఫ్ఎల్యూ అధ్యాపకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, మారుమూల గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల భావప్రసార, బోధనా సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఈఎఫ్ఎల్యూ మరియు గిరిజన సంక్షేమ శాఖ చేస్తున్న కృషిని అభినందించారు. ఉపాధ్యాయులలో ఆంగ్ల భాషా ప్రావీణ్యం పెరగడం ద్వారా గిరిజన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సంభాషణ నైపుణ్యాలు మెరుగుపడి, ఉన్నత విద్యా, ఉపాధి అవకాశాలు మరింత విస్తృతమవుతాయని ఆయన పేర్కొన్నారు.విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని గవర్నర్ అన్నారు. ఇటువంటి సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు విద్యాపరమైన అంతరాలను తగ్గించడమే కాకుండా, గిరిజన ప్రాంతాల విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. గిరిజన సంక్షేమ విద్యాసంస్థల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి మద్దతుగా లోక్ భవన్ నిధుల మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.“శిక్షణ పొందిన 56 మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఆదర్శంగా నిలవాలి. నాణ్యమైన విద్య ద్వారా గిరిజన విద్యార్థుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి మనమందరం కలిసి పనిచేయాలి. గిరిజన సంక్షేమానికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి లోక్ భవన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని గవర్నర్ పేర్కొన్నారు. మాతృభాషలను, గిరిజన సమాజాల సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూనే, పోటీ ప్రపంచంలో రాణించగల సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించేలా బోధన సాగాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసిన ఉపాధ్యాయులను గవర్నర్ అభినందించి, శిక్షణ ద్వారా పొందిన జ్ఞానం, నైపుణ్యాలను విద్యార్థుల ప్రయోజనం కోసం సమర్థవంతంగా వినియోగించాలని కోరారు.కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, ఈఎఫ్ఎల్యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నాగరాజు, గవర్నర్ సంయుక్త కార్యదర్శి కె. శశికిరణా చారి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజా రామ్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో తరచూ ఇక్కడే యాక్సిడెంట్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు బ్లాక్‌స్పాట్స్‌పై దృష్టి సారించారు. తరచూ ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి, కారణాలను అధ్యయనం చేయడంతో పాటు నివారణ చర్యలకు కసరత్తు చేస్తున్నారు. నగరంలోని ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలో 2023–25 మధ్య నిర్వహించిన అధ్యయనం ఆధారంగా 49 ప్రాంతాల్లో బ్లాక్‌స్పాట్స్ ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో మూడేళ్లలో 398 ప్రమాదాలు జరగ్గా.. 279 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆయా చోట్ల ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ సంబంధిత విభాగాలకు లేఖలు రాశారు. జాతీయ రహదారులపైనే అత్యధికం.. నగర ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలో కేవలం కొన్నింటిలో మాత్రమే బ్లాక్‌స్పాట్స్ లేవని తేలింది. అత్యధిక ఠాణాల పరిధిలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకునే బ్లాక్స్పాట్లు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. మొత్తం 49 బ్లాక్‌స్పాట్స్‌లో 26 జాతీయ రహదారుల పైనే ఉన్నాయని ట్రాఫిక్ విభాగం అధికారులు గుర్తించారు. ఎన్‌హెచ్ నం.44పై 11, ఎన్‌హెచ్ నం.65పై 13 ఉండగా.. ఎన్‌హెచ్ నం.765, 163లపై ఒకొక్కటి చొప్పున ఉన్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు సహా ఇతర రహదారులపై మిగిలినవి ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అనేకం ‘చావు’రస్తాలే... నిత్యం ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లో అత్యధికం చౌరస్తాలు, జంక్షన్లే. రద్దీ వేళలు, సిగ్నళ్లు యాక్టివ్‌గా ఉండే సమయంలో కంటే మిగిలిన సమయాల్లోనే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ 49 బ్లాక్‌స్పాట్స్‌లో 40 శాతం చౌరస్తాల్లో ఉన్నవే. ఆయా ప్రాంతాలు సైతం హైదరాబాద్–సైబరాబాద్–మల్కాజిగిరి సరిహద్దుల్లో కొన్ని ఉండటం గమనార్హం. వీటిలో చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో మరణించిన/క్షతగాత్రులైన వారిలో పాదచారులు, ద్విచక్ర వాహనచోదకులే ఎక్కువగా ఉన్నారు. ప్రమాదాలకు కారణాలివే ⇒ పరిమితికి మించిన వేగం, మద్యం తాగి వాహనాలు నడపటం ⇒ మలుపులున్న చోట్ల డివైడర్లు, మీడియమ్స్ లేకపోవడం ⇒ అత్యంత సమస్యాత్మకంగా (బ్లైండ్) ఉన్న మలుపులు ⇒ కీలక సూచనలు చేసే సైనేజ్ బోర్డులు లేకపోవడం ⇒ ఇరుకైన రోడ్లు, ఆపై అక్కడే ఉంటున్న ఆక్రమణలు ⇒ రోడ్ ఇంజినీరింగ్‌ను పట్టించుకోకుండా రహదారి నిర్మాణం ⇒ రహదారులపై హఠాత్తుగా చేపడుతున్న మరమ్మతులు ⇒ క్యారేజ్ వేలో తొలగించకుండా వదిలేసిన చెట్లు, కరెంటు స్తంభాలు ⇒ అవసరమైన స్థాయిలో విద్యుత్ దీపాలు లేకపోవడం ⇒ వాహనచోదకులు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం ⇒ నో–ఎంట్రీల్లోకి వాహనాలతో దూసుకుపోవడం ⇒ రోడ్ మార్కింగ్ పక్కగా లేకపోవడం, శాస్త్రీయత కొరవడటంచదవండి: బుడ్డోడి సరదా.. లగ్జరీ కారు గోవిందా! గ్రే స్పాట్లే కీలకం బ్లాక్ స్పాట్స్‌తో పాటు గ్రే స్పాట్స్ గుర్తింపునకు ప్రాధాన్యం ఇవ్వాలి. తరచూ ప్రమాద ప్రాంతాలు బ్లాక్ స్పాట్స్ కిందికి వస్తే.. ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉన్నవి గ్రే స్పాట్స్. గ్రే స్పాట్లను గుర్తించి ముందే చర్యలు తీసుకుంటే ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడవచ్చు. – ఎం.ప్రకాష్ కుమార్, రవాణా రంగ నిపుణుడు -
‘తలరాతను మార్చేది చదువొక్కటే.. మీకేం కావాలో నాకు చెప్పండి’
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర,దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ శుక్రవారం (జూన్ 19) హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి సీఎం విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘‘అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది యువత ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని మేం సంపూర్ణంగా విశ్వసించాం. విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించాలని నిర్ణయించాం. అందుకే బడ్జెట్లో విద్య కోసం 8.5 శాతం నిధులు కేటాయించాం.విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.ఇది ఖర్చుగా కాదు…భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా మేం భావిస్తాం. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదు.పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచలేదు. మేం అధికారంలోకి రాగానే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచాం.ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి విద్యా వ్యవస్థను విధ్వంసం చేశారువిద్యా శాఖకు మంత్రి లేడంటూ కొందరు మాట్లాడుతున్నారు. పదేళ్లు వాళ్లు చేసిన విధ్వంసంతో వందేళ్ల నష్టం జరిగింది. అందుకే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి పేదలకు విద్య అందించాలని విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకున్నా. ప్రీ ప్రైమరీ విధానం తీసుకొచ్చి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరిస్తున్నాం.ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుందని ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరుఆరుట్ల పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాం.యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించి దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలపబోతున్నాం. రాబోయే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఏఐ తుఫాన్‌తో కోట్లాదిమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అందుకే బ్లూ కాలర్ జాబ్స్ వైపు దృష్టి సారించాం.యువతకు నైపుణ్య శిక్షణ అందించే కార్యక్రమాన్ని చేపట్టాం. ఇంగ్లీష్ తో పాటు జర్మనీ, జపాన్ భాషను నేర్పిస్తున్నాం .ఐటీఐలను ఏటీసీలుగా మార్చాం… స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం.. మీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి పదును పెట్టి గొప్ప వాళ్లుగా తీర్చిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందిసోషల్ వెల్ఫేర్‌లో చదువుకున్న విద్యార్థులు డాక్టర్లుగా, ఐఏఎస్ లుగా, ఐపీఎస్ లుగా, రాజకీయ నాయకులుగా ఎదగాలి. మీరంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి.దేశాన్ని నడిపించే శక్తిగా ఎదగాలి.రేపటి భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది..మీ తలరాతను మార్చేది చదువొక్కటే. మీరు చదవండి… మీకు ఏం కావాలో ఇచ్చే బాధ్యత మీ రేవంతన్న తీసుకుంటాడు. 27.50 లక్షల మంది విద్యార్థులకు ఇవాళ యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ అందిస్తున్నాం . తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్‌గా, స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం’అని స్పష్టం చేశారు. -
బుడ్డోడి సరదా.. లగ్జరీ కారు గోవిందా!
హైదరాబాద్: కేవలం నాలుగు సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే లగ్జరీ కారు అది. దానిని ఐదవ తరగతి చదువుతున్న 11 సంవత్సరాల బాలుడు ఓఆర్ఆర్ పై నడుపుతూ దూసుకెళ్లాడు. విచిత్రమేమంటే తండ్రి బాలుడి పక్కనే కూర్చున్నాడు. ఈ దృశ్యాన్ని అటుగా వెళుతున్న మరో వాహనదారుడు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ క్లిప్ ను రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సీహెచ్ రాజు చూసి సీసీ కెమెరాల ఆధారంగా కారు యజమానిని గుర్తించారు.కారు టోలీచౌకి ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త అబ్దుల్ హాదీది అని నిర్ధారించారు. అతను ఎంజీ సైబర్ స్టార్ లగ్జరీ కారును ఇటీవల కొనుగోలు చేశాడు. ఈనెల 11న తన 11 ఏళ్ల కుమారుడితో కారులో వచ్చాడు. కారు కుమారుడికి చేతికిచ్చి ఔటర్‌పై శంషాబాద్ వైపు వెళ్ళాడు. చివరకు వాహనాన్ని జప్తు చేశారని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీహెచ్ రాజు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: అయ్యో శ్వేతా.. ఆదుకునేవారే లేరా?#Rajendranagar #Police have Booked a #Tolichowki-based businessman, after a video of his 11-year-old son driving #Minor #Driving an #MG #Cyberster convertible luxury electric sports car on the Outer Ring Road went viral on social media. 1/2 pic.twitter.com/l0MQmwYYB5— shinenewshyd (@shinenewshyd) June 19, 2026 -
అయ్యో శ్వేతా.. ఆదుకునేవారే లేరా?
హైదరాబాద్: విధి ఆడిన వింత నాటకంలో ఆమె ఒంటరిగా మిగిలిపోయింది.. భర్త, కూతురితో ఆనందంగా సాగిపోవాల్సిన ఆమె ఇపుడు అనాథ అయింది.. కన్న కూతురు, కట్టుకున్న భర్త ప్రాణాలు ఆమె కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయారు.. ఈనెల 13న తెల్లవారుజామున జరిగిన విద్యుత్ ప్రమాదంలో అందరి ముందూ తండ్రి, కూతురు విగతజీవులగా మారిపోయారు.అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానాజీగూడ టెలికాం కాలనీలో జరిగి విద్యుత్ తీగ కారుపై పడటంతో సందీప్(45), అతని కూతురు రుత్విక(16) ప్రాణాలు కోల్పోవడం ఇంకా స్థానికుల కళ్లముందే మెదులుతోంది.మీ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది.. కాదు.. మీ నిర్లక్ష్యం వల్లే అని విద్యుత్ శాఖ అధికారులు, మల్కాజిగిరి మున్సిపల్ అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ ప్రమాదం జరిగి ఇప్పటికి ఆరు రోజులవుతోంది. ప్రమాదానికి కారణం ఏ శాఖ అయినా.. ప్రభుత్వ శాఖలే కదా.. మరి బాధితురాలు శ్వేత గురించి ప్రభుత్వం అస్సలు పట్టించుకోకపోతే ఎలా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రభుత్వ అధికారులైనా వచ్చి బాధితురాలికి భరోసా ఇచ్చి పరిహారం గురించి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. ఆ కుటుంబ పరిస్థితి కూడా అంతంత మాత్రమేనని చెబుతున్నారు. ప్రమాద సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయాలని స్థానికులు పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేసినప్పటికీ స్పందన లేదని ఆరోపిస్తున్నారు. సుమారు 45 నిమిషాల పాటు సహాయం కోసం ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో స్పందించి కరెంట్ సరఫరా నిలిపివేసి ఉంటే.. అత్యవసర టీమ్ వెంటనే చేరుకుంటే ఇద్దరి ప్రాణాలు దక్కేవని చెబుతున్నారు. ఇపుడు అధికారులు సమాధానం చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం శ్వేతకు ఆర్థిక సహాయం అందజేసి ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని కాలనీవాసులు కోరుతున్నారు.ఇలాంటి సమయంలో బాధితురాలికి మానసికంగా, ఆర్థికంగా అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యతని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా శ్వేత అత్త లలిత క్యాన్సర్ బారిన పడింది, మామ చక్రపాణికి ఇటీవల బైపాస్ సర్జరీ జరిగింది. తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కుటుంబ పరిస్థితిని ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకొని అండగా నిలవాలని కోరుతున్నారు. -
బొల్లా బ్రహ్మనాయుడికు బెయిల్ మంజూరు
సాక్షి,హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో కోర్టు విధించిన 3 రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో సైబరాబాద్ ఈవోడబ్ల్యూ (EOW) అధికారులు ఆయనను న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. అయితే, ప్రతి 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని, అలాగే రూ. 20 వేల చొప్పున రెండు పూచీకత్తులు (ష్యూరిటీలు) సమర్పించాలని న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
ఈ పన్నీరు తింటే కన్నీరే..
అబిడ్స్: పన్నీరు అంటే స్వచ్ఛమైన పాలతో తయారు చేస్తారని అధిక శాతం ప్రజలకు తెలుసు. కానీ జంట నగరాల్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, పన్నీరు విక్రయ కేంద్రాల్లో కల్తీ జరుగుతోంది. పాలు లేని కల్తీ పన్నీర్ తింటున్న చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. ఈ క్రమంలోనే హెచ్– ఫాస్ట్ అధికారులు నగరంలోని 45 కల్తీ పన్నీరు తయారీ, విక్రయ కేంద్రాలపై దాడులు చేశారు. కల్తీ పన్నీరు, మలై పన్నీరు, చీజ్‌లను స్వాధీనం చేసుకున్నారు.గురువారం ఉస్మాన్‌గంజ్‌లోని హెచ్ ఫాస్ట్ కార్యాలయంలో టాస్‌్కఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొంత మంది వ్యాపారులు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ తదితర రాష్ట్రాల నుంచి చీజ్డ్ అనలాగ్‌ను తీసుకొచ్చి పన్నీరుగా తయారు చేసి వివిధ బ్రాండ్ల పేరుతో విక్రయాలు చేస్తున్నారు. అదే ఉత్పత్తిని లోప్యాట్ పన్నీర్, మీడియం ప్యాట్ పన్నీర్, ప్రెష్ పన్నీర్ వంటి తప్పుదారి పట్టించే పేర్లతో విక్రయిస్తున్నారని డీసీపీ వివరించారు. పన్నీరు ప్యాకెట్లపై బ్యాచ్ నంబర్, గడువు తేదీ లేకుండా అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు.కొంత మంది వ్యాపారులు అక్రమంగా లాభార్జన కోసం అక్రమాలకు పాల్పడున్నారని ఆయన చెప్పారు. పన్నీరు తయారీ కేంద్రాలపై అధికారులు దాడులు చేయగా.. అధిక నీరు, పాలేతర కొవ్వులు, కృత్రిమ పాలు, ఆహారానికి అనర్హమైన పదార్థాలు కలపడం లాంటి కల్తీ చర్యలను గుర్తించామన్నారు. పన్నీరు ప్యాకెట్లపై లేబ్లింగ్ లేకపోవడంతో పాటు కేంద్రాల్లో చెల్లని లైసెన్సులు ఉండడం, అపరిశుభ్రమైన నిల్వ విధానాలను కూడా గుర్తించామన్నారు. కల్తీ, మిస్ బ్రాండెడ్ 825 కిలోల నకిలీ ఉత్పత్తులను స్వా«దీనపరచ్చుకున్నట్లు డీసీపీ తెలిపారు. ప్రజలు పన్నీరు కొనుగోలు చేసేటప్పుడు ప్యాకెట్‌పై లేబుల్, గడువు తేదీల వివరాలను తప్పనిసరిగా చూసి కొనుగోలు చేయాలని సూచించారు. -
తెలంగాణ అటవీశాఖకు బహుమతిగా రోబోటిక్ ఏనుగు
తెలంగాణ ప్రజల భద్రతకు, జంతు సంక్షేమానికి ప్రాధ్యానత ఇస్తూ..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు ఊరేగింపులకు, సినిమా షూటింగ్‌లకు సజీవ ఏనుగులను వినియోగించేవారు. అయితే జంతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ..పెటా(పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) బహుమతిగా ఇచ్చిన రొబొటిక్ ఏనుగును స్వాగతించారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. ఈ మేరకు గురువారం గుర్రంగుడ ఎకో పార్కులో జరిగిన వనమహోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖల చేతుల మీదుగా ప్రారంభమైన రొబోటిక్ ఏనుగు ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ రోబోటిక్ ఏనుగును నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో ఏర్పాటు చేయనున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. సుమారు రూ. 10 లక్షలు విలువ చేసే ఈ రోబోటిక్ ఏనుగును పెటా తెలంగాణ రాష్ట్ర అటవీశాఖకు బహుమతిగా ఇచ్చింది. కాగా, పెటా మత, సాంస్కృతిక కార్యక్రమాలలో సజీవ ఏనుగుల వాడకానికి ప్రత్యామ్నాయంగా ఇటీవల కేరళలోని ప్రముఖ దేవాలయాలకు 10కి పైగా రోబోటిక్ ఏనుగులను విరాళంగా ఇచ్చిందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.(చదవండి: నా సరస్వతిరేఖ మా నాన్న!) -
హైదరాబాద్‌లో కల్తీ కలకలం : 110 కిలోల ఫ్రైడ్ చికెన్ సీజ్
హైదరాబాద్ : ఆహార కల్తీ మరియు అసురక్షిత ఆహార పద్ధతులపై నిరంతర నిఘాలో భాగంగా, హెచ్-ఫాస్ట్ (హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్) బృందం, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (FSO)తో కలిసి చార్మినార్‌లోని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న ఒక ఫాస్ట్ ఫుడ్ గోదాముపై ఆకస్మిక దాడి నిర్వహించింది. ఈమేరకు కల్తీ చికెన్, కృత్రిమ, రంగులు, నూనెలకు స్వాధీనం చేసుకుంది. ఈ అక్రమ కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఇద్దరు బాధ్యులను అదుపులోకి తీసుకున్నామని ఐపిఎస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్.వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.నమ్మకమైన సమాచారం మేరకు, ఈ బృందం చార్మినార్‌లోని పంచ్ మొహల్లా, న్యూ లాడ్ బజార్లో ఉన్న ‘మెసర్స్ అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’ ప్రాంగణాన్ని తనిఖీ చేసింది. ఈ తనిఖీలో, ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించే విధంగా అత్యంత అపరిశుభ్రమైన మరియు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆహార పదార్థాలను తయారు చేయడం మరియు నిల్వ చేయడం జరుగుతున్నట్లు గుర్తించారు.• నిర్బంధ FSSAI లైసెన్స్ లేకుండా నిర్వహించడం.• నిషేధించబడిన/కృత్రిమ ఆహార రంగులను (MSK లయన్ గ్రీన్ మరియు రాస్ప్బెర్రీ రెడ్) ఉపయోగించడం.• పాడైపోయిన మరియు ప్రమాదకరమైన వంట నూనెను పదే పదే ఉపయోగించడం.• నీటి విశ్లేషణ ధృవీకరణ (Water Analysis Certification) మరియు నాణ్యత నియంత్రణ చర్యలు లేకపోవడం.• విపరీతమైన అపరిశుభ్ర వాతావరణం మరియు కీటకాల నియంత్రణ (Pest Control) లేకపోవడం.స్వాధీనం చేసుకున్న ఆహార పదార్తాల వివరాలు:• సుమారు 110 కిలోల తయారు చేసిన ఫ్రైడ్ చికెన్• 6 టిన్నుల వంట నూనె (ఒక్కొక్కటి 15 లీటర్లు)• కృత్రిమ రసాయన ఆహార రంగులు కల్తీ , అపరిశుభ్రమైన ఆహారం- ఆరోగ్య సమస్యలు • ఫుడ్ పాయిజనింగ్, వాంతులు మరియు విరేచనాలు.• జీర్ణశయాంతర ఇన్ఫెక్షన్లు (Gastrointestinal infections).• పదే పదే వాడిన నూనెను ఉపయోగించడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు.• కృత్రిమ ఆహార రంగుల వల్ల అలర్జీలు మరియు టాక్సిసిటీ (విషపూరితం) కావడం.• కాలేయం (Liver) మరియు మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపే తీవ్రమైన వ్యాధుల ముప్పు పెరగడం.చట్టపరమైన చర్యలు:నిందితులు ఈ అసురక్షిత పద్ధతులను దాచిపెట్టి, వినియోగదారులకు కల్తీ ఆహారాన్ని సరఫరా చేయడం ద్వారా ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేసారు మరియు చట్టవిరుద్ధంగా లాభపడ్డారు. దీనిపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 (FSS Act, 2006) మరియు ఇతర సంబంధిత చట్టాల నిబంధనల ప్రకారం హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నిందితులను మరియు స్వాధీనం చేసుకున్న సామగ్రిని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)కు అప్పగించారు. ఆహార కల్తీపై హైదరాబాద్ సిటీ పోలీస్ ఈ కింది జాగ్రత్తలను సూచించింది. • లైసెన్స్ పొందిన సంస్థల నుండి మాత్రమే ఆహారాన్ని కొనుగోలు చేయండి/తీసుకోండి.• కొనుగోలు చేయడానికి ముందు FSSAI లైసెన్స్‌ను తనిఖీ చేసుకోండి.• కృత్రిమ రంగులు కలిపిన లేదా అనుమానాస్పద ఆహార పదార్థాలను నివారించండి.• అసురక్షిత ఆహార పద్ధతులపై అధికారులకు ఫిర్యాదు చేయండి.ఫిర్యాదుల కొరకు టోల్-ఫ్రీ నంబర్: 8712661212 ను సంప్రదించండి. -
దాన్యం కొనుగోళ్ల నుంచి ప్రభుత్వం తప్పుకుంటోంది
సాక్షి, హైదరాబాద్: పంట బోనస్‌కు కోతలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల బాధ్యత నుంచి కూడా తప్పుకోవాలని చూస్తోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. డిజిటల్ కేబినెట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. ఇకపై కేంద్రం నిర్దేశించిన కోటాకు లోబడి మాత్రమే ధాన్యం కొనుగోళ్లు చేస్తామని చెప్పడం అంటే రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్ల నుంచి చేతులెత్తేసినట్టేనని పేర్కొన్నారు.రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనకపోతే వారు ఏం చేయాలన్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని హరీశ్‌రావు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పంట బోనస్ విషయంలో కూడా ప్రభుత్వం రైతులపై కొత్త షరతులు విధిస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు. కేవలం ఏడు రకాల సన్న ధాన్యాలకు మాత్రమే బోనస్ వర్తింపజేయడం ద్వారా సాగుపై ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లకు పరిమితులు విధించడం రైతులను మార్కెట్ దయాదాక్షిణ్యాలపై వదిలేయడమేనన్నారు.కేసీఆర్ రైతన్నను రాజుగా నిలబెట్టారని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం రైతును ఆర్థికంగా దెబ్బతీసే విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో నీటి నిర్వహణ విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్‌రావు విమర్శించారు. ప్రాజెక్టుల్లో నీటి కొరత ఉందని చెబుతూనే ఆంధ్రప్రదేశ్‌కు 10 టీఎంసీల నీటిని ఎందుకు వదిలారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుభరోసా చెల్లింపుల విషయంలో బహిరంగ సభలు నిర్వహించడం హాస్యాస్పదమని, గతంలో పెండింగ్‌లో ఉన్న మూడు విడతలతోపాటు ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతుభరోసా నిధులు కలిపి మొత్తం రూ.16,545 కోట్లను ఈ నెల 30న మధిర వేదికగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. -
ప్రతి గింజా కాదు.. 'కోటా మేరకే'!
సాక్షి, హైదరాబాద్: ఇకపై కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే కోటా మేరకే రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయనుంది. ఏటా కేంద్రం ఖరారు చేసే కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో నిర్దేశిత కోటా మేరకే కొనుగోళ్లు జరపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గురువారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన అనధికార మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్కతో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా.. రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయం విలేకరులు ప్రస్తావించగా.. పంట ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉండదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు బదులిచ్చారు. మిర్చి, పత్తి, ఇతర పంటల ఎగుమతి కేంద్రం వల్లే సాధ్యమని స్పష్టం చేశారు. ఇందుకోసమే గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్‌సీఐ, సీసీఐ, నాఫెడ్ సంస్థలను నెలకొల్పిందని గుర్తు చేశారు. పంటల కొనుగోలు బాధ్యతల నుంచి తప్పుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తుండడంతో ఒత్తిడి పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పండించే అన్ని రకాల పంటలను ఎంఎస్పీతో పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి.. ఎల్‌నినో ప్రభావం తీవ్రమవుతోందని, ప్రధానంగా తెలంగాణ, ఏపీపైనే అధిక ప్రభావం ఉండబోతోందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని తుమ్మల చెప్పారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని, కాబట్టి మొదటి వర్షం పడగానే తొందరపాటుతో విత్తనాలు నాటవద్దని రైతులకు సూచించారు. కనీసం 7 సెం.మీ.ల వర్షం కురిస్తేనే విత్తనాలు మొలకెత్తేందుకు సరిపడ తేమ లభిస్తుందని చెప్పారు. మండల వ్యవసాయ అధికారులు చేసే సూచనలను రైతులు పాటించాలని కోరారు. 83% రైతులు ఈ 7 రకాలే పండిస్తున్నారు.. సన్న ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న బోనస్‌ను ఈ ఏడాది ఏడు రకాల సన్నాలకు మాత్రమే ఇవ్వాలని మంత్రుల సమావేశం నిర్ణయించింది. బీపీటీ–5204, ఆర్ఎన్ఆర్–15048,హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం–1638, డబ్ల్యూజీఎల్–44, కేఎన్ఎం–7715.. ఈ ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్ వర్తిస్తుంది. రాష్ట్రంలో సన్నాలు పండించే 83 శాతం రైతులు ఈ రకాలనే పండిస్తున్నారని తుమ్మల చెప్పారు. మార్కెట్ డిమాండ్, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వీటిని పండిస్తే ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినా రైతులు మార్కెట్లో విక్రయించుకోవచ్చని అన్నారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు గతంలో ఎన్నడూ లేని విధంగా యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఇప్పటికే దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రం మన రాష్ట్రం నుంచి తక్కువ ధాన్యాన్ని సేకరించటంపై కేబినెట్ ఆందోళన వ్యక్తం చేసిందని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిరలో ఈ నెల 30న భారీ స్థాయిలో రైతు సమ్మేళనం సభ ఏర్పాటు చేసి ఆ వేదిక నుంచి వానాకాలం పంటల సాగుకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. యూరియా కోసం త్వరలో మరోసారి ఢిల్లీకి.. వానాకాలం సీజన్‌కు రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాల్సిందిగా కేంద్రానికి మళ్లీ విజ్ఞప్తి చేయాలని నిర్ణయించినట్టు ఉత్తమ్ తెలిపారు. ఇందుకోసం త్వరలో ఇతర మంత్రులతో కలిసి ఢిల్లీ వెళతామని తుమ్మల చెప్పారు. గత ఏప్రిల్, మే నెలల్లో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయించి, లక్ష మెట్రిక్ టన్నులు కూడా విడుదల చేయలేదని విమర్శించారు. రామగుండం ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవుతున్న ఎరువులను మధ్యప్రదేశ్, బిహార్‌కు తరలిస్తున్నారని, ఇకపై అధ్యధిక కోటాను రాష్ట్రానికే కేటాయించాలని డిమాండ్ చేశారు. మెట్రో–2కు సహకరించాలి.. ‘మెట్రో రైలు రెండో దశ విస్తరణకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రివర్గం విజ్ఞప్తి చేస్తోంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) నుంచి ఒప్పందం ప్రకారం రావాల్సిన రుణాన్ని వెంటనే మంజూరు చేయించాలని కోరుతున్నాం. రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలందరూ మెట్రో విస్తరణకు సహకరించాలి..’ అని ఉత్తమ్ కోరారు. ఈ నెల 21న రాష్ట్రంలోని 2,008 పరీక్ష కేంద్రాల్లో జరగనున్న నీట్ పరీక్షకు 2.95 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారని, ఈ విద్యార్థులందరికీ (హాల్ టికెట్లు చూపాలి) ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. వీబీజీ రామ్ జీ వద్దు..పాత నరేగా కావాలి పాత ఉపాధి హామీ చట్టం యథాతథంగా కొనసాగించాలని కేంద్రానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) పేరు మార్చిన కేంద్రం.. కొత్తగా తెచ్చిన వీబీజీ రామ్ జీ పథకాన్ని రాష్ట్రంలో జూలై 1 నుంచి అమల్లోకి తీసుకువచ్చేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలంటూ ఒత్తిడి చేస్తోందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా (60:40 నిష్పత్తి) నిధులతో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేయనుందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై పడే ఒత్తిడిపై అధ్యయనం కోసం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో తనతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామితో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. ఇక డిజిటల్ కేబినెట్ భేటీలు.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను పేపర్ లెస్‌గా నిర్వహించే పద్ధతికి గురువారం నాటి సమావేశంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో డిజిటల్ కేబినెట్ భేటీలే నిర్వహిస్తారు. ఇందుకోసం గురువారం ఐటీ విభాగం తరఫున మంత్రి శ్రీధర్‌బాబు.. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులందరికీ స్పెషల్ ట్యాబ్‌లు అందజేశారు. ఇకపై ఈ– బుక్ ద్వారానే కేబినెట్ సమావేశం ఎజెండా, నోట్స్ అన్నీ మంత్రులకు అందుబాటులో ఉంచుతారు. -
టమాటాలో పులుపు తగ్గింది!
సాక్షి, హైదరాబాద్: పళ్లెంలో ముద్ద నోట్లోకి వెళ్లేవరకు అంతా బాగానే ఉంది. నమిలాకే తెలుస్తోంది.. రుచి లేదు, వాసన లేదు, పైగా కడుపులో మంట. హైదరాబాద్ మా ర్కెట్లకు ప్రతిరోజూ 2,800 టన్నుల కూరగాయలు దిగుమతవుతున్నా, పోషకాలు మాత్రం ఉండట్లేదు. తొందరపాటు సాగు కోసం మోతాదుకు మించి విష రసాయనాలు వాడటమే దీనికి ప్రధాన కారణమవుతోంది. తిండి తిన్నా బలమేదీ? పంట త్వరగా చేతికందడానికి విచ్చలవిడిగా రసాయన ఎరువులు,కాలుష్య కారకాలు ఎక్కువగా ఉండే మందులు పిచికారీ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) తన అధ్యయనంలో తేల్చింది. మడిలో వేర్వేరు కూరగాయల తోటలను సాగుచేస్తుండటం కూడా ఒకింత ప్రమాదకరమని చెప్పింది. ఒక పంటకు పిచికారీ చేసే రసాయనం ఇంకో పంట ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని గుర్తించింది. నగరానికి వచ్చే టమాటాలో పులుపు (లైకోపీన్) 35 శాతం, క్యాప్సికంలో విటమిన్–సీ 28 శాతం తగ్గినట్లు తేల్చింది. ఆహార భద్రత, ప్రమాణాలు (ఎఫ్ఎస్ఎస్ఏఐ)–2025 సర్వేలో హైదరాబాద్ మార్కెట్ నమూనాల్లో 31 శాతం కూరగాయల్లో గరిష్ట అవశేష పరిమితికి మించి పురుగుమందు అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. కృత్రిమంగా మగ్గబెట్టిన టమాటాలో లైకోపీన్ 38 శాతం, క్యాప్సికంలో విటమిన్–సీ 30 శాతం తగ్గినట్లు ఐకార్ అధ్యయనంలో తేలింది. ఫలితంగా తిండి తిన్నా బలం రావడం లేదు. ఏ మందు ఎంత మోతాదులో... టమాటా త్వరగా పక్వానికి రావడానికి ఎథిఫాన్ ద్రావణం పిచి కారీ చేస్తున్నారు. సొరకాయ, బీరకాయ లావుగా, పొడవుగా పెరగడానికి నిషేధిత ఆక్సిటోసిన్ సూదులు గుచ్చు తున్నారు. ఇది తిన్న పిల్లల్లో హార్మోన్ సమస్యలు, అకాల యుక్తవయస్సు వస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పురుగుల నివారణకు వాడే క్లోర్‌పైరిఫాస్, మాలాథియాన్ మందులు నరాలను దెబ్బ తీస్తున్నాయి. శంషాబాద్‌లో గత మార్చిలో బీరకాయ నమూనాలో ఆక్సిటోసిన్ పరిమితికి ఏడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అది తిన్న ఇద్దరు చిన్నారులు వాంతులతో ఆసుపత్రి పాలయ్యారు. మేడ్చల్‌లో కాలీఫ్లవర్‌పై నిషేధిత ప్రొఫెనోఫాస్ వాడకం బయటపడింది. నిమ్స్ వైద్యుల లెక్కల ప్రకారం కలుషిత ఆహారం వల్ల గ్యా్రస్టిక్, కాలేయ జబ్బులు గత ఏడాది 22 శాతం పెరిగాయి. -
గాజు చాంబర్లున్న ట్రావెల్స్ బస్సుల సీజ్ షురూ
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా ఏసీ స్లీపర్ బస్సుల్లో గాజు చాంబర్లు ఏర్పాటు చేస్తున్న బస్సులపై రవాణాశాఖ చర్యలు ప్రారంభించింది. ఇంతకాలం సాధారణ కర్టెన్లతోనే సరిపెట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నిర్వాహకులు, బెర్తులకు కొత్తగా గాజు చాంబర్లు ఏర్పాటు చేసే కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని గురువారం ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ‘‘గాజు చాంబర్లలో ప్రయాణికులు బందీ’’ శీర్షికతో ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో రవాణాశాఖ ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టారు. నగరంలోని మియాపూర్‌లో రంగారెడ్డి జిల్లా డీటీఓ శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహించి ప్రియా ట్రావెల్స్‌కు చెందిన ఏసీ స్లీపర్ బస్సును సీజ్ చేశారు. అందులో గాజు చాంబర్లు ఏర్పాటు చేసిన తీరును పరిశీలించారు. ఈ తనిఖీలు కొనసాగుతాయని, ఇలా నిబంధనలకు విరుద్ధంగా గాజు చాంబర్లు ఏర్పాటు చేసిన బస్సులను సీజ్ చేసి వాటిని తొలగింపజేసి, బస్సు ఆపరేటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్టు రవాణాశాఖ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జరిపిన సాధారణ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 928 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశామని తెలిపింది. అంతకుముందు జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్ నగరంలోని పలు ప్రైవేట్ బస్సు ఆపరేటర్లతో భేటీ అయి, నిబంధనలు విధిగా పాటించాల్సిందేనని స్పష్టంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు తిప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని, బస్సులు సీజ్ చేసి భారీ పెనాల్టీలు విధిస్తామని హెచ్చరించారు. ప్రయాణికుల భద్రతపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, వాటికి విరుద్ధంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. సాక్షి వెలుగులోకి తెచ్చిన గాజు చాంబర్ల అంశాన్ని ప్రస్తావించి... వాటి ఏర్పాటు అంటే ప్రయాణికుల ప్రాణాలతో చెలాగాటమాడినట్టేనని, ఆ కొత్త విధానాన్ని విస్తరించకుండా చూడాలన్నారు. -
ఖరీఫ్‌కు ముందే కష్టాలు!
యాసంగి సన్న ధాన్యానికి రావాల్సిన బోనస్‌లో రూ.700 కోట్లు ఇప్పటికీ రాలేదు.. ఇంతలో ప్రభుత్వం గుర్తించిన 7 రకాల వరి వంగడాలకే ఈసారి బోనస్ పరిమితమంటూ ప్రకటించింది. మరి.. ఆ రూ.700 కోట్లు ఇక రానట్టేనా? యాసంగి రైతు భరోసా రూ.9 వేల కోట్లు అని చెప్పినా.. అది రూ. 5,653 కోట్లకే పరిమిత మైంది.. ఈ నెల 30న ఈ ఖరీఫ్ రైతు భరోసా నిధులు జమచేస్తామంటూ కేబినెట్ భేటీ అనంతరం సర్కారు ప్రకటించింది.యాసంగి రైతు భరోసాకు మంగళం పాడినట్టేనా? అన్నదాతల అవస్థలు..రైతన్నకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే పెరిగిన ఎరువుల ధరలు, ట్రాక్టర్ అద్దెల భారం, కూలీల కొరత, ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ హెచ్చరికలు అన్నదాతను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. వీటికి తాజా కష్టాలు తోడయ్యాయి. అటు రైతు బీమాలో భాగంగా ఎల్ఐసీకి ప్రీమియం చెల్లింపులో ఆలస్యం జరగడంతో అన్నదాతల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఏడు రకాల వరికే బోనస్గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యం సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. ప్రజలకు సన్నబియ్యం పంపిణీ, రైతులకు అదనపు ఆదాయం అనే లక్ష్యాలతో క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ను ప్రకటించింది. ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో లక్షలాది మంది రైతులు దొడ్డు బియ్యం స్థానంలో సన్నాల సాగుకు మొగ్గు చూపారు. యాసంగి సీజన్లో ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో సన్నాలకు వాతావరణం అనుకూలించకపోయినా వ్యయ ప్రయాసల కోర్చి రైతులు పెద్ద ఎత్తున సాగు చేశారు. అయితే గత యాసంగిలో కొనుగోలు చేసిన దాదాపు 14 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యానికి సంబంధించిన బోనస్ సుమారు రూ.700 కోట్లు ఇప్పటికీ రైతుల ఖాతాల్లో జమ కాలేదు. వానాకాలం సీజన్ రావడంతో ఇక యాసంగి బోనస్‌ను వదులుకున్నట్టే. 2024–25 యాసంగిలో కూడా దాదాపు 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని విక్రయించిన రైతులకు చెల్లించాల్సిన బోనస్ రూ.1,159 కోట్లను ఇవ్వలేదు. కాగా, ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇకపై ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల వరి వంగడాలకు మాత్రమే బోనస్ వర్తిస్తుందని సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అంచనా ప్రకారం 38.19 లక్షల ఎకరాల్లో ఈ ఏడు రకాల సన్నాలను సాగు చేయనున్నారు. దీనికి అవసరమైన విత్తనాల పరిమాణం 9.55 లక్షల క్వింటాళ్లుగా పేర్కొన్న ప్రభుత్వం.. 15.64 లక్షల క్వింటాళ్లు అందుబాటులో ఉన్నట్టు చెబుతోంది. అయితే అందులో దాదాపు 13 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ప్రైవేట్ వ్యాపారుల వద్దనే ఉండడం గమనార్హం. ఇందులో ఇప్పటికే 2 లక్షల క్వింటాళ్లను రైతులకు విక్రయించినట్టు వ్యవసాయశాఖ తాజా నివేదికలో వెల్లడించింది. తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వద్ద కేవలం నాలుగు రకాల విత్తనాలు 38 వేల క్వింటాళ్లు మాత్రమే ఉండగా, జాతీయ విత్తన సంస్థ (ఎన్ఎస్సీ) వద్ద కేవలం 4,838 క్వింటాళ్లు మాత్రమే ఉన్నాయి. రైతులు సన్నాల కోసం ప్రైవేటు వ్యాపారుల వద్దకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. రైతుబీమా ఆలస్యం... రైతు బీమా డబ్బు అందక వేలాది కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి.2025–26 సంవత్సరానికి గాను రైతుబీమా ప్రీమియం కింద ఎల్ఐసీకి రూ.1,359 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ.436 కోట్లు ఆలస్యంగా చెల్లించినట్టు తెలిసింది. ప్రభుత్వం ప్రీమియం ఆలస్యంగా చెల్లించిన కారణంగా ఈ ఏడాది చనిపోయిన 7,606 రైతులకు సంబంధించిన రైతు బీమాను ఎల్ఐసీ ఇంకా విడుదల చేయలేదు. మరణించిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందలేదు. 2 ఎకరాలకే పరిమితమైన రైతుభరోసా సాగు యోగ్యమైన భూములన్నింటికీ రైతుభరోసా కింద ప్రతి సీజన్‌కు ఎకరానికి రూ.6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం.. గత యాసంగిలో రాష్ట్రంలోని 71.05 లక్షల రైతుల ఖాతాల్లో రెండు ఎకరాలకు మాత్రమే రూ.5,653 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. మార్చి 19న తొలి విడతగా రూ.3,446.94 కోట్లు, రెండో విడతగా రూ.2,206.06 కోట్లను జమచేసింది. రూ.9 వేల కోట్లు రైతుభరోసా కింద చెల్లించనున్నట్టు ప్రకటించినా, రూ.5,653 కోట్లకే పరిమితం చేశారు. ఈ నెల 30న మధిరలో వచ్చే ఖరీఫ్ కోసం రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో యాసంగి రైతుభరోసా కథ ముగిసిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.– సాక్షి, హైదరాబాద్ -
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందుకోసం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించామని, వాటితో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన అమలు చేస్తున్నామన్నారు. గురువారం సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ పనుల పురోగతిపై ఆ శాఖ మంత్రి అజహ రుద్దీన్తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ మైనార్టీ సంస్థల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉర్దూ అకాడమీ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉర్దూ సంస్కృతిని ప్రతిబింబించేలా భారీ స్థాయిలో ‘ముషాయిరా’ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రధాన కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆధునిక సదుపాయాలతో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని, ఇప్పటికే 20 పాఠశాలలు పూర్తై ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని, మరో 17 పాఠశాలలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. మైనార్టీ యువత స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ పథకం ద్వారా పెద్దఎత్తున ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. అలాగే క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూ.50 కోట్లను కేటాయించి, యువతకు ఉపాధి, స్వయం ఉపాధి రంగాల్లో ప్రోత్సాహకాలు అందించనున్నట్లు వెల్లడించారు. మొహరం వేడుకల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి హాజరుకా వాలని మంత్రి అజహ రుద్దీన్ కోరగా భట్టి సాను కూలంగా స్పందించారు.మహిళా శక్తి క్యాంటీన్‌ను పరిశీలించిన భట్టిదక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఉద్యోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్‌ను గురువారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సందర్శించారు. అక్కడ ఉద్యోగులకు కల్పించిన వివిధ రకాల మౌలిక సదుపాయాలను పరిశీలించారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక స్వావలంబన, ఉద్యోగులకు నాణ్యమైన భోజనం అందజేయడమే లక్ష్యంగా ఈ క్యాంటీన్లను ప్రభు త్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధప్రసాద్, టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ పాటిల్, డైరెక్టర్లు చక్రపాణి, శివాజీ, నరసింహ ఉన్నారు. -
ఫస్ట్.. లీనియర్ ఆల్జీబ్రా
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా 12.53 లక్షల మంది ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. వీరిలో 3.9 లక్షల మంది కంప్యూటర్ కోర్సుల్లో చేరేవారే. తెలంగాణలో 1.16 లక్షల సీట్లలో 70 శాతం కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలోనే చేరుతున్నారు. డేటా సైన్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ కోర్సులపై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. అయితే, కోర్ గ్రూపు విద్యార్థులు వీటిని ఓ పేపర్‌గా ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిలబస్‌పై అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కసరత్తు చేసి మారుతున్న కాలానికి అనుకూలంగా వీటిని తీర్చిదిద్దాలని దేశంలోని అన్ని యూనివర్సిటీలకు సూచించింది. లీనియర్ ఆల్జీబ్రాపై ఫోకస్కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో మొదటి ఏడాది నుంచి లీనియర్ ఆల్జీబ్రాకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఏఐసీటీఈ సూచిస్తోంది. ప్రస్తుతం ఏఐ, ఎంఎల్, డేటాసైన్స్, గ్రాఫిక్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక రంగాలన్నింటికీ లీనియర్ ఆల్జీబ్రానే పునాది వంటిది. ఏఐఎంఎల్‌లో వాడే టేబుల్స్, ఇమేజ్‌లు, వీడియోలు అంకెల రూపంలో ఉంటాయి. కంప్యూటర్ డేటాను మ్యాట్రిక్స్, వెక్టర్ల రూపంలో నిల్వచేసి ప్రాసెస్ చేసేదే ఈ లీనియర్ ఆల్జీబ్రా. జీపీఎస్, డ్రోన్లు, రోబోటిక్స్, గ్రాఫిక్స్, ఏఐలో డేటా ప్రాతినిధ్యానికిది కీలకం. ఇందులో మరో కీలకమైన ఈజెన్ వ్యాల్యూస్, ఈజెన్ వెక్టర్స్ సరిగ్గా ప్రాక్టీస్ చేస్తేనే ఫేస్ రికగ్నైజేషన్, గూగుల్ సెర్చ్ అల్గారిథమ్, ఇమేజ్ కంప్రషన్, ఏఐ మోడల్స్‌పై పట్టు దొరుకుతుంది. అయితే, అకడమిక్ అధ్యాపకులు దీన్ని థియరీగానే అందిస్తారు. దీనివల్ల ఏఐపై సరైన పట్టు రావడం లేదు. క్యాంపస్ సెలెక్షన్స్‌లో విద్యార్థులు వెనుకబడి ఉండటానికి లీనియర్ ఆల్జీబ్రాపై పట్టు లేకపోవడమేనని తేలింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ నిపుణుల చేత పార్ట్‌టైం బోధన చేయిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఏఐసీటీఈ సూచించింది.కోర్ గ్రూపులపైనా విజువల్సివిల్, మెకానికల్, ఈఈఈ వంటి కోర్ గ్రూపుల వారూ ఇప్పుడు ఏఐ పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంది. భవన నిర్మాణం, యంత్ర పరికరాల తయారీ మొత్తం ఏఐపైనే నడుస్తోంది. ఈ కారణంగా కోర్ గ్రూపులను ఆప్డేట్ చేయాలని ఏఐసీటీఈ సూచించింది. కోర్ గ్రూపుల్లో ఏఐ, డేటా మైనింగ్, డేటా విజువలైజేషన్ వంటి సబ్జెక్టులను ప్రవేశ పెడుతున్నారు. మూడో ఏడాది విద్యార్థులకు డీప్ లెర్నింగ్‌పై చాప్టర్లు ఉంటాయి. బిగ్ డేటా అనాలసిస్ చేసేలా అవసరమైన రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ విధానం అవసరమని ఏఐసీటీఈ చెబుతోంది.జనరేటివ్ ఏఐ, లాంగ్ లెర్నింగ్ మాడ్యూల్స్ వంటివి నాల్గో సంవత్సరంలో కీలకం చేశారు. అయితే, ప్రతీ కాలేజీలోనూ పైథాన్ ప్రోగ్రామింగ్ ల్యాబ్, మెషీన్ లెర్నింగ్ లేబొరేటరీ డేటా అనలిటిక్స్ ల్యాబ్, కంప్యూటర్ విజన్ ల్యాబ్, ఏఐ ప్రాజెక్టు ల్యాబ్ ఉండాలని చెబుతోంది. ఇలాంటి మౌలిక వసతులపై ప్రతీ వర్సిటీ దృష్టి పెట్టాలని, ఇవన్నీ ఉన్నప్పుడే అనుబంధ గుర్తింపు ఇవ్వడం మంచిదని అంటోంది. -
గృహమస్తు
సాక్షి, హైదరాబాద్: కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలోని అల్పాదాయ, మధ్య తరగతి వర్గాల సొంతింటి కలను సాకారం చేసేందుకు గృహ నిర్మాణ శాఖ అడుగులు వేస్తోంది. ఇప్పటికే అఫర్డబుల్ అర్బన్ హౌసింగ్ ప్రోగ్రాం కింద లక్ష గృహాల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధితో పాటు నగర ఆర్థిక ప్రాంతాన్ని (క్యూర్) యూనిట్‌గా తీసుకుని దిగువ ఆదాయ వర్గాలకు (ఎల్ఐజీ) 70 వేల ఫ్లాట్లు, మధ్య ఆదాయ వర్గాలకు (ఎంఐజీ) 30 వేల ఫ్లాట్లను నిర్మించనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా 12 వేల ఇళ్లు: భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా మొదటి విడత కింద పైలట్ ప్రాజెక్టుగా సుమారు 12,000 ఫ్లాట్ల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. హౌసింగ్ బోర్డు సొంత నిధులతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన భాగస్వామ్యంతో కేపీహెచ్‌బీ, బాలానగర్, లింగంపల్లి వంటి ప్రధాన ప్రాంతాల్లో ఎల్ఐజీ, ఎంఐజీ ఇళ్లను నిర్మించనున్నారు. జూన్ నెలాఖరు, లేదా జూలై మొదటి వారంలో డిమాండ్ సర్వే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. క్యూర్ పరిధిలో ఇప్పటి వరకు నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, పటాన్ చెరు, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, ఎల్బీనగర్, మలక్‌పేట, మల్కాజిగిరి, మేడ్చల్ తదితర 15 అసెంబ్లీ నియోజక వర్గాల్లోని కొన్ని ప్రాంతాల్లో గృహాల నిర్మాణాలకు అనువైన భూములను గుర్తించారు. మరో తొమ్మిది నియోజకవర్గాల్లో స్థలాలను ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ మంత్రితో పాటు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు పలు ప్రాంతాలను సందర్శించారు. గుర్తించిన భూముల్లో ఎక్కెడెక్కడ ఎన్ని టవర్లు, ఎన్ని ఫ్లాట్లు నిర్మించవచ్చన్న దానిపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు.. జీవనోపాధి ప్రాంతాలకు చేరువగా.. గత ప్రభుత్వాల హయాంలో నగరానికి 30 నుంచి 40 కి.మీ దూరంలో ఇళ్లు నిర్మించడంతో రవాణా, ఉపాధి, వైద్యం కరువై లబి్ధదారులు ఇబ్బంది పడ్డారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నగర నడిబొడ్డున, ఐటీ, పారిశ్రామిక కారిడార్లకు సమీపంలోనే ఈ ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నారు. ప్రతి ఫ్లాట్‌ను కనీసం 400 చ.అడుగుల ప్లింత్ ఏరియాతో అన్ని ఆధునిక మౌలిక వసతులతో నిర్మించనున్నారు. -
హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బేగంపేట, గచ్చిబౌలి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, నాగోల్, బోయిన్పల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో వర్షం పడింది.రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. -
తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌కు బ్రేకులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన వెబ్‌సైట్‌తో పాటు అనుబంధ ఆన్లైన్ సేవలు ఈ నెల 26 నుంచి 28 వరకు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. షెడ్యూల్ చేసిన సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ విరామం అవసరమని ఆయన పేర్కొన్నారు.సుమారు ఐదేళ్ల తర్వాత చేపడుతున్న ఈ సర్వర్ నిర్వహణ పనుల ద్వారా సర్వర్ వ్యవస్థలు మరింత సజావుగా పనిచేయడం, భద్రతా ప్రమాణాలు బలోపేతం కావడం, సేవల నాణ్యత మెరుగుపడడం లక్ష్యమని ఐజీ వివరించారు.ప్రజలకు అసౌకర్యం తగ్గించేలా షెడ్యూల్జూన్ 26న మొహరమ్, జూన్ 28న ఆదివారం ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో, మధ్యలో ఉన్న జూన్ 27న ఒక్కరోజు మాత్రమే ప్రభుత్వ పని దినంలో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం కలుగుతుందని గురువారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. దీంతో సాధారణ ప్రజలకు కలిగే అసౌకర్యం అత్యల్పంగా ఉండేలా ఈ షెడ్యూల్ రూపొందించామని తెలిపారు.సేవలు పునఃప్రారంభంప్రజలు తమ రిజిస్ట్రేషన్ సంబంధిత పనులను ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని, జూన్ 29వ తేదీ నుంచి అన్ని సేవలు యథావిధిగా పునఃప్రారంభమవుతాయని ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. శాఖ నిర్వహణ పనులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. -
హైదరాబాద్‌కు ఆ పరిస్థితి రావద్దనే ఇలా చేస్తున్నాం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశీర్వదిస్తేనే తాను సీఎం అయ్యానని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎంగా ఎల్బీనగర్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. తనకు తన సొంతూరు కొండారెడ్డిపల్లెలాగే ఎల్బీనగర్ అని చెప్పారు. ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే నాకు ప్రత్యేక అభిమానం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎకో పార్క్ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు.హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘కాలుష్య కోరల్లో ఢిల్లీ చిక్కుకుంది. హైదరాబాద్‌కు ఆ పరిస్థితి రావద్దనే మొక్కల పెంపకం చేపట్టాం. మూసీ పునరుజ్జీవం చేస్తామంటే అడ్డుపడుతున్నారు. భూకబ్జాలతో ప్రజలకు సమస్యలు రావద్దనే హైడ్రాను తీసుకొచ్చాం. పేదల జోలికి హైడ్రా వెళ్లదు, కబ్జాదారుల భరతం పడుతుంది. 2018 శాసనసభ ఎన్నికల్లో రాజకీయ కుట్ర వల్ల కొడంగల్‌లో ఓడిపోయినప్పుడు చాలా మంది ఇక ఏమీకాడని నవ్వుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అండగా నిలబడి మల్కాజ్ గిరి ఎంపీగా నాకు అవకాశం ఇచ్చారు. ఆ నాడు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 30 వేల మెజార్టీ ఇచ్చి ప్రశ్నించే గొంతును నిలబెట్టారు. పార్లమెంటులో పార్టీ, ప్రజల తరుపున గట్టిగా నిలబడి కొట్లాడినప్పుడు సోనియా, రాహుల్ గాంధీ నన్ను గుర్తించి పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు.ఈ ప్రాంతంలో రూ.2.400 కోట్లతో 240 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్ ను నిర్మిస్తున్నాం’’ అని తెలిపారు. -
రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే
హైదరాబాద్: రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు మూడు వారాలపాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మూడు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల వేలంలో ఎకరం ధర రూ.237 కోట్లు పలికింది. వేలం వేసిన భూమిలో 5 ఎకరాలు తమవేనని ఎస్బీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టలు స్టే విధించింది. కాగా, రాయదుర్గం భూముల వివాదంపై ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ల్యాండ్ ఆక్షన్ చేసే సమయంలో SBIకి సమాచారం ఇచ్చామని తెలిపారు. మరో చోట ల్యాండ్ కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఆ ప్రపోజల్ కు SBI కూడా ఒప్పుకుందని అన్నారు. 7 రోజులు కౌంటర్ ధాఖలు చేయడానికి సమయం కావాలని అన్నారు. ఎకరానికి రూ.237 కోట్లు చొప్పున చెల్లించిన గౌరవ్ వెంచర్స్ అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోతుందని హైకోర్టు ప్రశ్నించింది. -
తెలంగాణ సచివాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం సచివాలయాన్ని బీసీ సంఘాలు ముట్టడించాయి. నాలుగు దఫాలుగా సచివాలయం ముట్టడికి బీసీ నేతలు ప్రయత్నించారు. ముట్టడిని అడ్డుకున్న పోలీసులు. బీసీ సంఘాల నేతలను అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన బీసీ నేతలను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. బీసీ నేతలు కుల్కచర్ల శ్రీనివాస్, విక్రమ్ గౌడ్, కనకల శ్యామ్ మీడియాతో మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేయాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు. గత నాలుగు ఏళ్లుగా ఫీజుల బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం బీసీ విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తుందని.. తక్షణమే ఫీజుల బకాయిలు విడుదల చేయకపోతే సీఎం, మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామని బీసీ నేతలు హెచ్చరించారు. -
Gachibowli: నేను పోలీసును.. పైసా ఇవ్వను..!
హైదరాబాద్ : నగర కమిషనరేట్‌లో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్ ఫుడ్ కోర్టుకు వెళ్లి గన్‌తో బెదిరించి హల్చల్ సృష్టించాడు. బాధితుడి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు విచారణ చేపట్టారు. నగర కమిషనరేట్‌లోని యాంటీ స్నాచింగ్ టీమ్‌లో పని చేసే ఏఆర్ కానిస్టేబుల్ వివేక్ బుధవారం తెల్లవారు జామున 3 గంటలకు డీఎల్ఎఫ్ సమీపంలోని మొమోస్ డిలైట్ ఫుడ్ కోర్ట్‌కు వెళ్లాడు. మొమోస్ తిన్న తర్వాత రూ.175 ఇవ్వమని అడగగా రేట్ ఎక్కువగా ఉందని కానిస్టేబుల్ గొడవకు దిగాడు. ‘నేను పోలీసును, డబ్బులు ఇవ్వను’ అంటూ గన్ చూపించినట్లు ఫుడ్ కోర్ట్ నిర్వాహకుడు మనీష్ 100కు కాల్ చేశాడు. వెంటనే గచ్చిబౌలి పెట్రోల్ మొబైల్ సిబ్బంది కానిస్టేబుల్ వివేక్‌ను పీఎస్‌కు తరలించారు. మొమోస్ తినక ముందే ధర విషయంలో వివాదం జరిగిందని, ఐడీ కార్డు లేకపోవడంతో గన్ చూపించాడని గచ్చిబౌలి పోలీసులు చెబుతుండటం గమనార్హం. -
నగరానికొచ్చిన ‘కోజికోడ్ శ్రీదేవి’
హైదరబాద్: మొహర్రం సంతాప దినాల్లో భాగంగా ఈ నెల 26న పాతబస్తీ వీధుల్లో అంబారీతో 10వ మొహర్రం సామూహిక ఊరేగింపు కొనసాగుతుంది. డబీర్‌పురా బీబీకా అలావాకు చెందిన బీబీకా ఆలంతో షియా ముస్లింలు ఊరేగింపులో పాల్గొంటారు. ఇందులో భాగంగా కేరళలోని కోజికోడ్ నుంచి శ్రీదేవి అనే ఆడ ఏనుగు బుధవారం రాత్రి పాతబస్తీకి చేరుకుంది. ప్రధాన ఊరేగింపునకు ముందస్తుగా డబీర్‌పురా నుంచి చార్మినార్ మీదుగా చాదర్‌ఘాట్ వరకు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. -
ఫిన్లాండ్లో విద్యార్థి మణిదీప్ రెడ్డి మిస్సింగ్
ఉన్నత విద్య కోసం ఫిన్లాండ్కు వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి అదృశ్యమవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ హైదరాబాద్‌కు చెందిన మణిదీప్ అనే యువకుడు దాదాపు నెలరోజులకు పైగా కనిపించకుండా పోయాడు. అతని నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించినా సరైన సమాధానం లభించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్‌కు చెందిన మణిదీప్ రెడ్డి గుజ్జా ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్కు వెళ్లాడు. లాహ్టి (Lahti) నగరంలో ఉన్న ఎల్‌యూటీ యూనివర్సిటిలో విద్యను అభ్యసిస్తున్నాడు. అయితే మే నెల 5వ తేదీ నుంచి కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకపోయినట్లు తెలుస్తోంది. ఫోన్, సోషల్ మీడియా సహా ఏ మార్గంలోనూ అతనితో సంప్రదింపులు జరగకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.మణిదీప్ అదృశ్యమైన విషయం గురించి కాలేజీ యాజమాన్యాన్ని, సిబ్బందిని పలుమార్లు సంప్రదించినప్పటికీ స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి గల్లంతైన విషయంపై కాలేజీ నుంచి కూడా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని వారు చెబుతున్నారు.ఇప్పటికే పలు మార్గాల్లో అతడి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్న కుటుంబ సభ్యులు, భారత విదేశాంగ శాఖతో పాటు ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకుని తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీనే హైదరాబాద్‌కు చెందిన ఓ లాయర్ మణిదీప్ మిస్సింగ్ మీద ఓ ట్వీట్ చేయడం గమనార్హం.. 🚨 MISSING IN FINLAND 🇫🇮Manideep Reddy Gujja has been missing in Finland.Family and friends are urgently seeking any information regarding his whereabouts.📍 Last Contacted: May 5, 2026🎓 University: LUT University📍 City: Lahti, FinlandContact +91 78932 87099— Nipun Tulsyan (@NipunTulsyan) June 12, 2026 -
మృగశిరలోనూ మంటలు
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రమంతా తొలకరి వర్షాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో..మళ్లీ ఎండ మండిపోతోంది. ఉత్తరాది నుంచి వస్తున్న వడగాలుల తీవ్రతతో 246 మండలాల్లో వాతావరణ శాఖ హీట్‌వేవ్ అలర్ట్ జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెంలో 43.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ముప్పై జిల్లాల్లో నలభై డిగ్రీలకు మించి పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.వచ్చే రెండు రోజులు కూడా వడగాలుల తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే మృగశిర కార్తెలో కురిసే వర్షాలతో ఆరుతడి పంటలతో బిజీ కావాల్సిన రైతులు ఇంకా 18 జిల్లాల్లో తొలకరి వర్షాల కోసమే ఎదురుచూస్తున్నారు. కేవలం నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఈ సీజన్లో సాధారణం కంటే అధిక వర్షం కురవగా..ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం నమోదు అయింది. మిగిలిన అన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం లోటు కనిపిస్తోంది. హనుమకొండ, సిద్దిపేట, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో చుక్క వర్షం కూడా కురవలేదు. -
కావాల్సిన సీట్లపై కర్ఛీఫ్ వేశారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులు ఇద్దరు తమ రాజకీయ వారసుల కోసం ఇప్పటినుంచే నియోజకవర్గాలను సెట్ చేస్తున్నారా? అసెంబ్లీ ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందే పరిస్థితులకు అనుగుణంగా పావులు కదుపుతూ, కాంగ్రెస్ మార్కు రాజకీయం చేస్తూ కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం వ్యూహాలు పన్నుతున్నారా? వీరి వ్యూహాల్లో ఒక చోట రాజ్యసభ సభ్యుడు, మరోచోట లోక్‌సభ సభ్యుడు పాలుపంచుకుంటున్నారా? వీరి సహకారం వెనుక మరో తంత్రం ఉందా? అంటే.. పాలకుర్తి, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితులను బట్టి చూస్తే అవుననే సమాధానమే లభిస్తోంది. తన అల్లుడు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘు రామిరెడ్డి కుమారుడు అర్జున్‌రెడ్డి కోసం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాలకుర్తిపై, తన కుమార్తె త్రిష కోసం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంపై గురి పెట్టారని స్థానిక కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సులభంగా టికెట్ తెచ్చుకోగలమని, ఒకవేళ జరగకపోతే రేసులో గట్టిగా ఉండాలనే ఆలోచనతో ఇద్దరు మంత్రులు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లోని వివాదాల వ్యవహారం టీపీసీసీ క్రమశిక్షణా సంఘం ముందుకు రావడం గమనార్హం. పాలకుర్తిలో కదులుతున్న పావులుపాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి అసమ్మతి సెగలు భారీగా తగులుతున్నాయి. ఆమె అత్త, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డికి వ్యతిరేకంగా పలువురు కాంగ్రెస్ నేతలు గళమెత్తుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఝాన్సీరెడ్డిని కాదని ఇతర అభ్యర్థులకు వారు బహిరంగంగానే మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి యశస్వినిరెడ్డితో కలిసి ఝాన్సీరెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే యశస్వినిరెడ్డి ఫిర్యాదు చేసిన ఇద్దరు నేతలు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన సమయంలో ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి కూడా వారితో కలిసి రావడం పార్టీలో చర్చనీయాంశమవుతోంది. పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి మద్దతుగా ఎంపీ రాగా, ఇందుకు మంత్రి పొంగులేటి సహకారం ఉందని, పాలకుర్తి నుంచి ఈసారి తన కుమారుడిని పోటీ చేయించే ఆలోచనలో రఘురామిరెడ్డి ఉన్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే అసమ్మతి నేతలకు ఆపన్న హస్తం అందిస్తున్నారనేది బహిరంగ రహస్యమేనని పార్టీ శ్రేణులంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఫిర్యాదుపై నిర్ణయం తీసుకునేందుకు కూడా టీపీసీసీ వెనుకాడుతోందనే చర్చ జరుగుతుండడం గమనార్హం. కాగా మరోవైపు ఈ అసమ్మతి నేతలకు సీఎం సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి మద్దతు కూడా ఉందని, తన కుమారుడు కృష్ణభార్గవ్ రెడ్డి వేం కోసం పాలకుర్తిపై కన్నేసిన నరేందర్‌రెడ్డి ఇప్పటినుంచే జాగ్రత్త పడుతున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది.జహీరాబాద్‌లో దామోదర వ్యూహంఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంపై దృష్టి పెటారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి తన కుమార్తె త్రిషకు ఆయన టికెట్ అడిగే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే జహీరాబాద్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌కు పొగ పెడుతున్నారని స్థానిక కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయనకు స్థానిక ఎంపీ సురేశ్ షెట్కార్ కూడా సహకరిస్తున్నారని తెలస్తుండగా, మరోవైపు ఆయన కూడా ఆ స్థానం తనకు కావాలని అడిగే ఆలోచనలో ఉన్నారని, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈసారైనా ఎమ్మెల్యే కావాలనే వ్యూహంతో షెట్కార్ ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి సహకారంతోనే మాజీ మంత్రి చంద్రశేఖర్‌పై ఫిర్యాదు చేసేందుకు స్థానిక కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ వరకు వచ్చారని చెబుతున్నారు. -
ప్రజల దృష్టి మళ్లించేందుకే సీఎం కొత్త డ్రామాలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు విమర్శించారు. గత రెండున్నరేళ్లలో ప్రధాని మోదీని పలుమార్లు కలిసిన సీఎం... కేంద్రమంత్రులను కలవడానికి అడ్డంకులు కల్పిస్తున్నారనడం హాస్యాస్పదమన్నారు. సీఎం మాటలు చెప్పడంలోనే కాకుండా...ఇప్పుడు అబద్ధాల ప్రచారంలోనూ ప్రావీణ్యం సంపాదించారని ఎద్దేవా చేశారు. అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజమని నమ్మించేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని దాచేందుకే రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.బుధవారం బీజేపీ కార్యాలయంలో రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరుతూ కిషన్ రెడ్డికి సీఎం లేఖ రాయడం అత్యంత హాస్యాస్పదమన్నారు. ఇప్పటివరకు సీఎం ఢిల్లీకి 71సార్లు వెళ్లారని, కనీసం 15సార్లు కేంద్రమంత్రులను కలిశారని గుర్తుచేశారు. ఆ సందర్భాల్లో ఎప్పుడైనా కిషన్‌రెడ్డికి చెప్పి కలిశారా? ఇప్పుడు అపాయింట్మెంట్ ఇప్పించడం లేదంటూ కిషన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం బూటకమేనని మండిపడ్డారు. కేవలం ప్రజలను తప్పుదారి పట్టించేందుకే రేవంత్ రెడ్డి ఈ లేఖ రాశారని దుయ్యబట్టారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై, బీజేపీపై నిరాధార ఆరోపణలు చేయడం వెంటనే మానుకోవాలన్నారు. మెట్రో విస్తరణ ఆలస్యానికి కేంద్రం, కిషన్ రెడ్డి కారణం కాదని, కేవలం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ప్రధానకారణమని పేర్కొన్నారు. కాగా, సీనియర్ సినీ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి, నిర్మాత బండి శ్రీనివాస్ బీజేపీలో చేరడం పట్ల రాంచందర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. -
గాజు చాంబర్లలో ప్రయాణికులు బందీ
గత అక్టోబర్ 24న హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొని అగ్నిప్రమాదానికి గురైన ఘటనలో 19 నిండుప్రాణాలు బలయ్యాయి. సకాలంలో ప్రయాణికులు బస్సులో నుంచి తప్పించుకోలేక చనిపోయారు. 2013 అక్టోబర్ 30న మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఏసీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురై 45 మంది దహనమైన ఘటన తర్వాత కూడా నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు కర్నూలు జిల్లా ప్రమాద ఘటన తేల్చింది. కానీ, ఇప్పటికీ తీరు మారలేదని స్పష్టమవుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకుల ఇష్టారాజ్యం, బస్సుల్లో లోపాలను పసిగట్టి చర్యలు తీసుకోవాల్సిన రవాణాశాఖ అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వెరసి ఇప్పుడు ప్రైవసీ, ప్రీమియం సర్వీసు పేరుతో ప్రయాణికులను మరింత ప్రమాదంలోకి నెట్టేసే గ్లాస్ చాంబర్ ఫెసిలిటీ తెరమీదకు వచ్చింది.సాక్షి, హైదరాబాద్ : అర్ధరాత్రి వరకు సెల్‌ఫోన్‌తో గడపడం సర్వసాధారణమైంది. ఇక ప్రయాణాల్లో ఇది మరింత ఎక్కువ. బస్సుల్లో సెల్‌ఫోన్ వాడకం పక్క సీటు ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంటుంది. దీనికి పరిష్కారం అన్నట్టుగా ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సుల్లో స్లైడింగ్ డోర్ ఉండే గ్లాస్ చాంబర్స్ అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికులు లోపల పడుకుని చాంబర్ డోర్ మూసేసుకుంటే వీరితో పక్కవారికి, పక్క బెర్త్ వారితో వీరికి ఎలాంటి ‘ఆటంకం’ఉండదు. ప్రమాదం జరిగితే తప్పించుకోవటం ఎలా... ఏసీ బస్సులు అగ్నిప్రమాదానికి గురైతే బస్సుల్లో విపరీతంగా పొగ నిండి ఊపిరాడక చాలా మంది స్పృహ తప్పి సజీవ దహనమవుతున్నారు. ఇప్పుడు బెర్తును గ్లాస్ చాంబర్‌గా మార్చటంతో ప్రమాదం జరిగినప్పుడు నిద్రలో ఉండే ప్రయాణికులు బెర్తులోంచి వేగంగా బయటకు రావటానికి ఈ గ్లాస్ డోర్లు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తాయి. దీంతో ప్రమాద తీవ్రత మరింత పెరుగుతుంది. ఈ గ్లాస్ చాంబర్ల ఏర్పాటు అటు ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ 119కు, ఇటు మోటారుæ వాహనాల నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఇటీవల ప్రమాదాలకు గురైన కొన్ని బస్సుల్లో ఈ తరహా గ్లాస్ చాంబర్లు ఉండటాన్ని గుర్తించిన పలు రాష్ట్రాలు వాటి తొలగింపునకు ఆదేశాలు జారీ చేశాయి. లేకుంటే ఫిట్నెస్ సరి్టఫికెట్ రద్దు చేస్తామని కూడా హెచ్చరించాయి. కానీ, తెలంగాణ రవాణా శాఖ నిద్రమత్తు వీడలేదు.ఎన్ని సిఫారసులు వచ్చినా... డోంట్ కేర్» పాలెం దుర్ఘటన తర్వాత నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులతో విచారణ కమిటీని వేసింది. ఆ కమిటీ దర్యాప్తు చేయటంతోపాటు వోల్వోకంపెనీ ప్రతినిధులను కూడా పిలిపించి బస్సు తయారీలో మార్పులనుసూచించింది. ఆ మేరకు బస్సు తయారీ డిజైన్‌లో సంస్థ కొన్ని మార్పులు చేసినా, రవాణాశాఖ అధికారులు మాత్రంగుణపాఠం నేర్చుకోలేదు. » గ్లాస్ చాంబర్ క్లోజ్డ్ గాఉండటం వల్ల చిన్న నిప్పురవ్వ వచ్చినా పొగ నేరుగా చాంబర్లోకి చేరి ప్రయాణికుడు క్షణాల్లో స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. » నిద్రలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగితే, ప్రయాణికులు వెంటనే స్లైడింగ్ డోర్‌ను తెరవటంలో గందరగోళానికి గురవుతారు. » దట్టమైన పొగ, చీకటి అలుముకొంటే, స్లైడింగ్ డోర్ లాకింగ్ వ్యవస్థ ఎక్కడుందో కనిపించదు, అవి జామ్ అయ్యే పరిస్థితి రావచ్చు. » గ్లాస్ చాంబర్ల కోసం వాడే రబ్బర్ బెల్టులు, ప్లాస్టిక్ స్లైడర్లు అగ్ని ప్రమాదం జరిగితే విషపూరిత పొగను విడుదల చేస్తాయి. » కిటికీ అద్దం పగలగొట్టేందుకు ప్రతి బెర్త్ వద్ద హ్యామర్ (సుత్తి) ఉండాలి. ప్రమాద సమయంలో ఒకవైపు కిటికీ అద్దం పూర్తిగా క్లోజ్ చేసి, మరోవైపు గ్లాస్ డోర్ పెట్టడం వల్ల హ్యామర్‌తో పగలగొట్టే సమయం కూడా ప్రయాణికుడికి దొరకదు. »ఒక స్లీపర్ బస్సుకు కనీసం 4 ఎమర్జెన్సీ ఎగ్జిట్లు (1 డోర్, 2 రూఫ్ హాచెస్, విండోస్) ఉండాలి. ఈ గ్లాస్ చాంబర్ల నిర్మాణం వల్ల ప్రయాణికుడు ఆ ఎగ్జిట్ మార్గాల వరకు కూడా రాలేడు. » ప్రస్తుతం అన్ని ఏసీ బస్సుల్లో పొగను గుర్తించే వ్యవస్థ, అల్లారాలు, ఆటోమేటిక్ ఫైర్ సప్రెషన్ సిస్టమ్స్ తప్పనిసరి. అయితే చాంబర్లు క్లోజ్ చేయడం వల్ల ఇవి కూడా సకాలంలో స్పందించకపోవచ్చు. -
ఆ సన్నాలే కావాలి!
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వేళ..రాష్ట్రంలో సన్న రకాల వరి విత్తనాలకు అనూహ్య డిమాండ్ ఏర్పడింది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, మిల్లర్లు, ఎగుమతిదారుల సూచనల మేరకు ఎంపిక చేసిన ఏడు ప్రధాన సన్న రకాల వంగడాల సాగునే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలని నిర్ణయించింది. తెలంగాణ సోనా, జై శ్రీరామ్, సాంబమసూరి, హెచ్ఎంటీ సోనా, కూనారం సన్నాలు, సిద్ధి, కేఎన్ఎం–7715 రకాల సన్నరకం విత్తనాలను ఈ ఖరీఫ్‌లో సాగు చేయాలని ప్రభుత్వం రైతులకు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు ఇస్తున్న క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ను కూడా ఈ ఏడు రకాల వరి వంగడాలకే పరిమితం చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఇప్పటి వరకు 36 రకాల సన్నాల్లో ఏ వంగడాన్ని పండించినా, ఈ బోనస్ అందేది. అయితే సర్కార్ తాజా నిర్ణయంతో ఒక్కసారిగా ఈ ఏడు వంగడాలకు డిమాండ్ పెరిగింది. దీంతో ఈ వంగడాల కోసం ప్రభుత్వ విక్రయ కేంద్రాలు, తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎస్డీసీ) డిపోలు, ప్రైవేట్ విత్తన దుకాణాల వద్ద రైతుల తాకిడి పెరిగింది. నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. ఆ ఏడింటికే ప్రాధాన్యం ఎందుకంటే.. వరి సాగులో తెలంగాణ దేశంలో అగ్రస్థానాల్లో ఉన్నా, రాష్ట్రంలో పండే బియ్యానికి మార్కెట్లో స్థిరమైన గుర్తింపు లేకపోవడం చాలా కాలంగా సమస్యగా ఉంది. రైతులు వివిధ రకాల వంగడాలను సాగు చేయడం వల్ల కొనుగోలు, నిల్వ, మిల్లింగ్, ఎగుమతుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ, మిల్లర్లు, ఎగుమతిదారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో జరిగిన సమావేశాల్లో మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న సన్న రకాల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ జాబితాలో తెలంగాణ సోనా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాజేంద్రనగర్‌లోని భారత వరి పరిశోధన సంస్థ (ఐఐఆర్ఆర్) అభివృద్ధి చేసిన ఈ రకం దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటంతో మధుమేహ బాధితులు, ఆరోగ్య స్పృహ కలిగిన వినియోగదారుల్లో తెలంగాణ సోనాకు మంచి డిమాండ్ ఉంది. సాంబా మసూరి ఇప్పటికీ దేశీయ మార్కెట్లో అత్యధిక ఆదరణ పొందుతున్న సన్నబియ్యం రకాల్లో ఒకటిగా కొనసాగుతోంది. రైతుల పరుగులు.. వ్యాపారుల లాభాపేక్ష ప్రభుత్వం ఖరీఫ్‌కు అవసరమైన విత్తనాల కన్నా ఎక్కువగానే నిల్వలను సిద్ధం చేసింది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఈ సీజన్‌కు సుమారు 19.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా, 38 లక్షల క్వింటాళ్లకుపైగా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. అయితే రైతులు తెలంగాణ సోనా, సాంబా మసూరి, హెచ్ఎంటీ సోనాతో పాటు ఏడు రకాల విత్తనాలనే ఎక్కువగా కోరుతుండటంతో కొన్ని కేంద్రాల్లో నిల్వలు వేగంగా ఖాళీ అవుతున్నాయి. దీంతో రైతులు ఒక కేంద్రం నుంచి మరో కేంద్రానికి వెళ్లి విత్తనాల కోసం వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో కొందరు వ్యాపారులు లాభాపేక్షతో నాసిరకం విత్తనాలను రైతులకు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చాలా చోట్ల తెలంగాణ సోనా, సాంబా మసూరి, హెచ్ఎంటీ సోనా , జై శ్రీరాం విత్తనాలకు కొరత ఏర్పడింది. కొందరు వ్యాపారులు డిమాండ్ ఉన్న విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ, ఎక్కువ ధరకు విక్రయించే పనిలో ఉన్నారు. -
తరగతి గదుల్లో తెలంగాణ భవిష్యత్తు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేదల బతుకులు మారవు. అవి కేవలం బతకడానికి మాత్రమే పనికొస్తాయి. భవిష్యత్ తరాల తలరాతలు మారాలంటే ముందు వారు చదువుకోవాలి. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, అధికారులుగా రాణించినప్పుడే బతుకులో మార్పు కన్పిస్తుంది. పుట్టి, పెరిగిన ప్రాంతానికి గుర్తింపు లభిస్తుంది. రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు రంగుల అద్దాల మేడలు, రంగుల గోడల్లో లేదు. తరగతి గదుల్లోనే ఉంది. విద్యార్థులు తమ తల్లిదండ్రులు ఆత్మగౌరవంతో బతికేలా విద్యలో రాణించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువును చిన్నతనంగా భావించొద్దు. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నప్పటికీ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నా. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ప్రస్తుత ప్రధాని మోదీ కూడా ప్రభుత్వ స్కూళ్లల్లోనే చదువుకుని రాణించిన వాళ్లే..’అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్)ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం బడి పిల్లలకు అల్పాహారం పంపిణీ పథకాన్నీ ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. అటు నుంచి నేరుగా కిచెన్‌కు వెళ్లి పూరీని వొత్తారు. లైబ్రరీ, ప్రయోగశాల, మ్యూజిక్, డ్యాన్స్ తరగతి గదులను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. క్రీడామైదానానికి చేరుకుని పిల్లలతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. విద్యార్థులు, టీచర్లతో కరచాలనం చేశారు. గ్రూప్ ఫొటోలు దిగారు. అనంతరం బహిరంగసభలో ప్రసంగించారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేలా.. ‘విద్యాశాఖ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం. పదేళ్ల పాలనలో విధ్వంసమైన విద్యావ్యవస్థను వికాసం వైపు నడిపించేందుకే టీపీఎస్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఆరుట్ల టీపీఎస్‌లో ఇప్పటికే 1,814 మంది అడ్మిషన్లు పొందారు. ఒక ప్రభుత్వ పాఠశాలకు నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇదే విధంగా తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక టీపీఎస్ నుంచి ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరిస్తున్నాం. ఆరుట్ల గ్రామం తెలంగాణకు ఆదర్శంగా నిలుస్తుందని విశ్వసిస్తున్నా. ఇక్కడ ప్రారంభించిన టీపీఎస్‌ను ఇతర ప్రభుత్వ పాఠశాలలకు అంకితం చేస్తున్నాం. ఈ స్ఫూర్తి ఆరుట్ల గ్రామానికే కాదు..తెలంగాణలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులది. డిసెంబర్ 9న స్కిల్స్ వర్సిటీ ప్రారంభం ఒకప్పుడు ప్రభుత్వ బడుల్లో మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు ఉండేవి కాదు. ప్రస్తుతం విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంతో పాటు 9 రకాల వస్తువులతో కూడిన కిట్లు అందించే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. రూ.685 కోట్లతో టెండర్ పిలిస్తే..రూ.3 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. జూలై ఆఖరి వరకు విద్యార్థులందరికీ పుస్తకాలు, యూనిఫాంలు, ఇతర వస్తువులు అందజేస్తాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా కుల,మతాలకు అతీతంగా 500 మంది విద్యార్థులను ఒకేచోట చేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. డిసెంబర్ 9న యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీని ప్రారంభించనున్నాం..’అని సీఎం తెలిపారు. మెస్సీని తెస్తే విమర్శించారు.. ‘2034 ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధనే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీని ఏర్పాటు చేశాం. అకాడమీల్లో ఆడే వాళ్ల కంటే..ఆరుట్ల స్కూలు పిల్లలు బాగా ఆడుతున్నారు. ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ, విద్యార్థులను కలిపి ఫుట్‌బాల్ ఆడించాం. క్రీడలను ప్రోత్సహించేందుకు మెస్సీని తీసుకొస్తే రాజకీయ విమర్శలు చేశారు. కడుపులో కుళ్లు పెట్టుకుని రాజకీయం చేయాలని భావించే వారికి భవిష్యత్తు ఉండదు. ప్రతిపక్ష హోదా కూడా దక్కదు..’అని రేవంత్ ధ్వజమెత్తారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం 19న ప్రతిజ్ఞ ‘తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ సమస్యగా మారాయి. సరదాగా మొదలైన అలవాటు ఆ తర్వాత వాటికి బానిసలుగా మార్చుతుంది. డ్రగ్స్, గంజాయి రహిత సమాజం కోసం ఈ నెల 19న ఎల్బీనగర్లో వేలాది మంది విద్యార్థులతో ప్రమాణం చేయించబోతున్నాం. విద్యార్థులు తమ తోటి విద్యార్థులు ఎవరైనా గంజాయి, డ్రగ్స్‌కు అలవాటైతే ఆ విషయం వెంటనే ఉపాధ్యాయుల ద్వారా పోలీసులకు చేరవేయాలి. పోలీసులకు మీరే సమాచార వారధులుగా నిలవాలి..’అని సీఎం కోరారు. పేదల భూములకు విముక్తి కల్పించండి ఇబ్రహీంపట్నం: రామోజీ ఫిలింసిటీ ఆక్రమణలో ఉన్న పేదల భూములకు విముక్తి కల్పించాలని కోరుతూ సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, ఇతర నాయకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. నాగన్‌పల్లి సర్వే నంబర్ 189లోని పన్నెండెకరాల నాలుగు గుంటల భూమి, 203 సర్వే నంబర్లో ఎనిమిదెకరాల భూమిలో 2007లోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని సీఎంకు తెలిపారు. పేదలకిచ్చిన ఇంటి స్థలాలను రామోజీ ఫిలింసిటీ యాజమాన్యం ఆక్రమించిందని వివరించారు. ఈ భూమికి విముక్తి కల్పించి పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. -
ఖనిజాల ‘పర్వత’o
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల పరిధిలోని పర్వతాపూర్ దేశంలోని అత్యంత కీలక ఖనిజ కేంద్రాల్లో ఒకటిగా అవతరించబోతోంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) నిర్వహించిన అధ్యయనాల్లో పర్వతాపూర్ బ్లాక్‌లో భారీ స్థాయిలో వెనేడియం, టైటానియం, అల్యూమినస్ లేటరైట్ ఖనిజ నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. సుమారు 335.50 హెక్టార్ల విస్తీర్ణంలో 15.25 మిలియన్ టన్నుల వెనేడియం నిక్షేపాలు, 87 మిలియన్ టన్నుల అల్యూమినస్ లేటరైట్ నిల్వలు ఉన్నట్టు జీఎస్ఐ అంచనా వేసింది. కొత్తగా కనుగొన్న ఈ ఖనిజ బ్లాక్‌ను కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఈ నెల 11న ‘క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్ బ్లాక్స్’కేటగిరీలో ‘ఈ వేలం’వేసింది. ఎన్ఎల్సీ ఇండియా ఈ బ్లాక్‌ను దక్కించుకుంది. ఇక్కడ లభ్యమవుతున్న వెనేడియం, టైటానియం ఖనిజాలు దేశ పారిశ్రామిక, రక్షణ, శక్తి రంగాలకు అత్యంత ప్రాధాన్యమైనవిగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఖనిజాల కోసం భారత్ విదేశీ దిగుమతులపై గణనీయంగా ఆధారపడుతోంది. పర్వతాపూర్ గనుల అభివృద్ధితో దేశీయ అవసరాలకు స్థానిక వనరులు అందుబాటులోకి వస్తాయి. వెనేడియం, టైటానియం కీలకం ప్రపంచంలో అరుదుగా లభించే ఖనిజాల్లో ఒకటైన వెనేడియంను అధిక దృఢత్వం కలిగిన ప్రత్యేక ఉక్కు తయారీ, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, దీర్ఘకాలిక శక్తి నిల్వ చేసే బ్యాటరీలు, అణు, రక్షణ రంగ పరికరాల తయారీలో ఉపయోగిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక శక్తి నిల్వ వ్యవస్థలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వెనేడియం ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. మరోవైపు ఏరోస్పేస్ రంగానికి టైటానియం వెన్నెముకగా నిలుస్తోంది. » తక్కువ బరువు, అధిక బలం, తుప్పు నిరోధక లక్షణాల కారణంగా టైటానియంను విమానాల తయారీ, అంతరిక్ష నౌకలు, క్షిపణి వ్యవస్థలు, నౌకాదళ పరికరాలు, అధునాతన వైద్య పరికరాల్లో విస్తృతంగా వినియోగిస్తారు. భారత రక్షణ, అంతరిక్ష రంగాలకు కీలకమైన ముడి సరుకు ఇది. » 87 మిలియన్ టన్నుల అల్యూమినస్ లేటరైట్ భవిష్యత్‌లో అల్యూమినా, అల్యూమినియం పరిశ్రమలకు ఉపయోగపడే అవకాశముంది. తెలంగాణకు కొత్త పారిశ్రామిక దిశ పర్వతాపూర్ ఇప్పటివరకు వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఖనిజ సంపద వెలుగులోకి రావడంతో తెలంగాణలో క్రిటికల్ మినరల్స్ రంగానికి కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. గనుల అభివృద్ధి, ఖనిజ ప్రాసెసింగ్ యూనిట్లు, అనుబంధ పరిశ్రమలు ఏర్పడితే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు రాష్ట్రానికి గణనీయమైన ఆదాయం సమకూరుతుంది. ఎన్ఎల్సీ ఇండియా ఈ బ్లాక్‌ను దక్కించుకోవడం ద్వారా లిగ్నైట్, విద్యుత్ రంగాలకే పరిమితమైన సంస్థ ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ రంగంలోనూ అడుగుపెట్టినట్టయ్యింది. దేశభద్రత, రక్షణ సామర్థ్యం, అధునాతన తయారీ రంగాలకు అవసరమైన కీలక ఖనిజాల నిలయంగా పర్వతాపూర్ త్వరలో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశముందని నిపుణులు అంటున్నారు. -
ఆ 5 ఎకరాలు మావే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో ఇటీవల ప్రభుత్వం ఎకరా రూ.237 కోట్లకు వేలం ద్వారా విక్రయించిన భూమి తమదేనంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హైకోర్టును ఆశ్రయించింది. తమకు కేటాయించిన 5 ఎకరాల భూమిని తెలంగాణ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఈ–వేలం ద్వారా విక్రయించడాన్ని సవాల్ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పణ్మక్తా హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో సర్వే నంబర్ 83/1లోని ప్లాట్ నంబర్–1ఏ (5 ఎకరాలు)ను ప్రభుత్వం 2010లో జారీ చేసిన జీవో 501 ప్రకారం పూర్తిస్థాయి విక్రయ పద్ధతిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్)కు కేటాయించిందని పేర్కొంది. దీని కోసం రూ.13.33 కోట్లను చెల్లించామంది. అనంతరం ఎస్బీహెచ్.. ఎస్బీఐలో విలీనమైందని గుర్తు చేసింది. ఈ–వేలం నోటిఫికేషన్‌ను ఇప్పటికే మరో రిట్ పిటిషన్లో సవాల్ చేసినప్పటికీ, ఆ కేసు విచారణలో ఉండగానే మే 28న వేలం నిర్వహించి గౌరా వెంచర్స్‌ను విజయవంతమైన బిడ్డర్‌గా ప్రకటించారని తెలిపింది. భూమి విక్రయ ధరను ప్రభుత్వం ఇప్పటికే స్వీకరించిన నేపథ్యంలో తిరిగి అదే భూమిని వేలం వేయడానికి చట్టబద్ధమైన అధికారం లేదని కోరింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ప్రస్తుతం ముంబై తరువాత దేశంలో రెండో కార్పొరేట్ ఆఫీసును ఎస్బీఐ హైదరాబాద్‌లో రెండు టవర్లలో నిర్మాణం చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో వేలంలో జరిగిన విక్రయాన్ని రద్దు చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేశారు. -
ఎన్యూమరేషన్లో 'సర్'దర్ద్!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్) – 2026 కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 నుంచి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయాల్సి ఉండగా, వాటి ప్రచురణ విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుండగా, ప్రతి ఓటరుకు సంబంధించిన పాక్షిక సమా చారంతో ఒక జత ఎన్యూమరేషన్ ఫారాల ప్రచురణను ఈ నెల 15 నుంచే ప్రారంభించాల్సి ఉంది. హైదరాబాద్‌లో దక్కనీ ఉర్దూ తోపాటు హిందీ, గుజరాతీ, రాజస్తానీ, మరాఠీ, బెంగాళీ, కన్నడ, తమిళం వంటి భాషలు మాట్లాడే ఓటర్లు లక్షల సంఖ్యలో ఉన్నా రు. రాష్ట్రంలోని ఓటర్లందరికీ పంపిణీ చేసే ఎన్యూమరేషన్ ఫారా లను ఏకరూపంగా కేవలం తెలుగులోనే ముద్రించాలని ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించడంతో తెలుగు రాని ఓటర్లు ఇక్కట్లకు గురికానున్నట్టు రాజకీయ పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతోపాటు ఇతర పార్టీల నేతలు ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ)ని కలిసి జంట నగరాల ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను తెలుగుతోపాటు ఆంగ్ల భాషలో సైతం ప్రచురించాలని కోరారు. దీనిపై ఈసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్టు సీఈఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి. వారం గడిచినా, ఈసీ నుంచి స్పందన రాలేదు. దీంతో బుధవారం సైతం వివిధ పార్టీల ప్రతినిధులు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు కలిసి ఆంగ్లంలోనూ ఫారాలను ప్రచురించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్లందరికీ స్థానిక ఓటర్ల వివరాలతో ప్రచురణకు అవసరమైన డేటాను పంపించగా, తెలుగులో మాత్రమే ప్రస్తుతం ఎన్యూమరేషన్ ఫారాలను ప్రచురిస్తున్నామని అధికా రులు తెలిపారు. ఈసీ నుంచి అనుమతి వస్తే అవసరమైన చోట పంపిణీ చేసేందుకు ఆంగ్లంలో సైతం ముద్రిస్తామని ఓ అధికారి తెలిపారు.సరైన సమాచారం భర్తీ కీలకంఎన్యూమరేషన్ ఫారంలో ఓటరు పేరు, ఎపిక్ నంబర్, సీరి యల్ నంబర్, పార్ట్ నంబర్, అసెంబ్లీ/పార్లమెంట్ నియోజక వర్గ పేరుతోపాటు పాత ఫొటోను ముద్రి స్తారు. మిగిలిన వివరాలను ఓటరు పూరించాలి. సర్–2002 ఓటర్ల జాబితా ప్రకారం..ఓటరుతోపాటు అతడి బంధువు పేరు, ఎపిక్ నంబ ర్, బంధుత్వం, జిల్లా, రాష్ట్రం, అసెంబ్లీ నియోజకవర్గం నంబ ర్, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ వంటి వివరాలతోపాటు ఓటరు పుట్టిన తేదీ, ఆధార్ నంబర్ (ఐచ్ఛికం), మొబైల్ నంబర్, తండ్రి/సంరక్షకుడి పేరు, ఎపిక్ నంబర్, తల్లి పేరు, తల్లి ఎపిక్ నంబర్, జీవిత భాగ స్వామి పేరు, ఎపిక్ నంబర్ వంటి వివరాలను ఓటరు భర్తీ చేయా ల్సి ఉంటుంది. బీఎల్ఓలు వివరించినా ఎన్యూమరేషన్ ఫారంలోని భాష అర్థం కాక తప్పుడు సమాచారాన్ని భర్తీ చేస్తే, ఓటర్ల మ్యాపింగ్ సాఫ్ట్వేర్ తేడాలను గుర్తించి అనుమానిత ఓటర్ల జా బితాలో చేర్చే ప్రమాదం ఉంటుంది. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. అయితే, ఎన్యూమరేషన్ ఫారా న్ని తప్పుడు సమాచారంతో భర్తీ చేసిన వారిని గుర్తించి జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్య స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు నోటీ సులు జారీ చేసి వివరణ కోరనున్నారు. విచారణకు హాజరై ఈసీ నిర్దేశించిన 13 రకాల ధ్రువీకరణ పత్రాలను రుజువుగా సమర్పించాల్సి ఉంటుంది. ఈప్ర క్రియ లో ఎక్క డ తేడా వచ్చినా అక్టోబర్ 1న ప్రచురించే సర్– 2026 తుది ఓటర్ల జాబితాలో పేరు గల్లంతయ్యే ప్రమాదముంది. -
రూ.100 కోట్లతో రీసెర్చ్ పార్క్
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) క్యాంపస్‌లో రూ.100 కోట్లతో రీసెర్చ్‌పార్క్ ఏర్పాటు కానుంది. ఈమేరకు యాక్సిస్ బ్యాంక్, బిట్స్ పిలానీ మధ్య ఒప్పందం జరిగింది. యాక్సిస్ బ్యాంక్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద గ్రాంట్ రూపంలో ఈ నిధులను సమకూర్చనుంది. 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ ఇన్నోవేషన్ పార్క్‌లో ఆరోగ్యం, మందులు, వైద్య పరికరాల రంగంలో కొత్త ఆవిష్కరణలకు పరిశోధనలు జరుగుతాయి. ప్రజలకు తక్కువ ధరకే మంచి వైద్యం అందించడం లక్ష్యంగా సరికొత్త పరిశోధనలకు ఈ కేంద్రం నిలయంగా ఉండనుంది. ఈ పార్క్‌లో పెద్ద ల్యాబ్‌లు, స్టార్టప్ కంపెనీల కోసం ప్రత్యేక స్థలాలు ఉంటాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, విద్యార్థులకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ సందర్భంగా బిట్స్ పిలానీ చాన్స్‌లర్ కుమార మంగళం బిర్లా మాట్లాడుతూ.. బలమైన ఆవిష్కరణ వ్యవస్థలను నిర్మించడానికి ఈ భాగస్వామ్యం దోహదపడుతుందన్నారు. యాక్సిస్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ అమితాబ్ చౌదరి మాట్లాడుతూ.. సమ్మిళిత, సుస్థిర పురోగతిలో భాగస్వాములం కావడం ఆనందంగా ఉందన్నారు. -
ఉస్మానియా వైద్య కాలేజీలో ర్యాగింగ్
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): రాష్ట్రంలో పేరొందిన కోఠి ఉస్మానియా వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతం పడగవిప్పింది. ఈ కళాశాల హాస్టల్లో ఉంటున్న సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులను తమ సొంత పనులకు వినియోగించుకుంటూ వేధింపులకు పాల్పడుతున్నారు. అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని డెంటల్ కళాశాలలో అభ్యసించే 2025 బ్యాచ్‌కు చెందిన 14 మంది విద్యార్థులను బీడీఎస్ ఫైనల్ ఇయర్ వైద్య విద్యార్థులు మూడు నాలుగు నెలల నుంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీనిపై జూనియర్ విద్యార్థులు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేయగా, ఆయన నామమాత్రంగా సీనియర్లను మందలించారు. సీనియర్ చెప్పిన పనులు చేయకపోవ డంతో వారు దాడులకు పాల్పడుతున్నారంటూ బాధితులు సుల్తాన్‌బజార్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2020 బ్యాచ్‌కు చెందిన 12 మంది బీడీఎస్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఖైరతా బాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పర్యవేక్షణలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.అడ్మిషన్ దశలోనే అవగాహన కల్పించాలి: డీసీపీర్యాగింగ్ చట్టాలపై విద్యార్థులకు అడ్మిషన్ దశలోనే విద్యాసంస్థల అధికారులు అవగాహన కల్పించాలని డీసీపీ శిల్పవల్లి సూచించారు. ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మంది విద్యార్థులను ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారని ఆమె తెలిపారు. ర్యాగింగ్ చట్టాల ప్రకారం... ఆరు నెలల శిక్ష పడుతుందని, అదే ర్యాగింగ్ వల్ల బాధితులు ఆత్మహత్యకు పాల్పడితే జీవితకాలం శిక్ష పడుతుందన్నారు. అంతేకాకుండా ఇతర విద్యాసంస్థల్లో అడ్మిషన్లు దొరకకుండా చర్యలు ఉంటాయని తెలిపారు. విద్యాసంస్థలు యాంటీ ర్యాగింగ్ కమిటీలు, స్క్వాడ్‌ను ఏర్పాటు చేసి విద్యార్థులపై నిఘా ఉంచాలని సూచించారు.ఆర్కిటెక్చర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులు!ఓక్సన్ వర్సిటీలో ఈవెంట్ సందర్భంగా ఘటనఆలస్యంగా వెలుగుచూసిన వైనం నాంపల్లి: ఆర్కిటెక్చర్ విద్యార్థినిపై ఓ కాంట్రాక్టు అధ్యాపకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట సమీపంలోని కంకోల్లో ఉన్న ఓక్సన్ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంది. ఈ నెల 11–14వ తేదీల మధ్యన ఓక్సన్ వర్సిటీలో 68వ వార్షిక నాసా కన్వెన్షన్ జరిగింది. జాతీయ స్థాయిలో జరిగిన కన్వెన్షన్‌కు దేశవ్యాప్తంగా వివిధ కళాశాలలు, వర్సిటీల్లో చదివే ఆర్కిటెక్చర్ విద్యార్థులు, డిజైనర్లు పాల్గొన్నారు. ఈ సెమినార్‌కు మాసబ్‌ట్యాంక్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలకు చెందిన 50 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరితో పాటుగా కళాశాలకు చెందిన కొందరు అధ్యాపకులు కూడా వెళ్లారు. కాగా, మాసబ్‌ట్యాంక్ నుంచి సెమినార్‌కు వెళ్లిన ఆర్కిటెక్చర్ అధ్యాపకుల్లో (ఫ్యాకల్టీ) ఒకరైన ఆదిత్య మూర్తి తమ కళాశాలలో ఆర్కిటెక్చర్ కోర్సును అభ్యసించే మొదటి సంవత్సరం విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.సదరు విద్యార్థిని సెమినార్ ముగియగానే విషయం తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో సోమవారం వారు ప్రిన్సిపాల్ వినోద్ గణేష్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా కళాశాల యాజమాన్యం దాచిపెట్టింది. కాగా, ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించామని, నిజనిర్ధారణ కోసం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడానికి యూనివర్సిటీకి లేఖ రాశామని వినోద్ గణేశ్ తెలియజేశారు. -
పదివేలలోపు ర్యాంకుంటే.. టాప్ కాలేజీల్లో సీటు!
సాక్షి, హైదరాబాద్: వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 19 నుంచి మొదలవుతుంది. ఇదే రోజు నుంచి విద్యార్థులు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జూన్ 25 నుంచి జూలై 1 వరకూ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మాక్ సీట్ల కేటాయింపు జూలై 4న ఉంటుంది. వెబ్ ఆప్షన్లు మార్చుకోవడానికి జూలై 5 నుంచి 7 వరకూ గడువు ఇచ్చారు. జూలై 10న తొలి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది.సాంకేతిక విద్య మండలి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసింది. దాదాపు 159 కాలేజీలు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉంటాయి. ఇందులో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లు యాజమాన్య కోటా కింద కేటాయిస్తారు. ఇప్పటికే అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీల నుంచి సీట్ల వివరాలు కౌన్సెలింగ్ వెబ్సైట్లో క్రోడీకరించారు.ఆప్షన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త» నచ్చిన బ్రాంచీ, కాలేజీలపై విద్యార్థులు ముందుగా ఒక అవగాహనకు రావాలి. ఎప్‌సెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా కొంత కసరత్తు చేయాలి. వచ్చిన ర్యాంకుకు ఏయే కాలేజీల్లో, ఏ బ్రాంచీలో సీటు వస్తుందో అంచనాకు రావాలి. గత ఏడాది కటాఫ్‌లను విద్యార్థులు ప్రామాణికంగా తీసుకుంటే కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. సీటు లభ్యత ఉన్న కాలేజీల జాబితాల్లో నచ్చిన కాలేజీలను మొదటి ఆప్షన్‌గా ఎంచుకోవాలి. ఇదేవిధంగా బ్రాంచీ విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. బ్రాంచీ ముఖ్యం అనుకుంటే కాలేజీ ప్రాధాన్యతపై కొంత చూసీచూడనట్టు ఉండొచ్చు. కాలేజీనే ముఖ్యం అనుకుంటే బ్రాంచీ ఏదైనా ప్రాధాన్యం ఇవ్వొచ్చు. దీనిపై అంచనా లేకుండా ఆప్షన్లు ఇస్తే నష్టం జరిగే వీలుంది. ఉదాహరణకు 50 వేలపైన ర్యాంకు వచ్చిందనుకుందాం. ఈ ర్యాంకుతో టాప్ కాలేజీల్లోనే సీటు కావాలని, ఆప్షన్ ఇస్తే కటాఫ్ ప్రకారం రాకపోవచ్చు. విద్యార్థి ర్యాంకుకు తగ్గ కాలేజీలు, బ్రాంచీలకు తొలి కౌన్సెలింగ్‌లో 70 వేల ర్యాంకు వరకు ఆప్షన్లు ఇవ్వొచ్చు.టాప్ కాలేజీల్లో 10 వేల లోపే» ఈసారి విద్యార్థుల చూపు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మీదే కన్పిస్తోంది. గత ఏడాది 68 శాతం విద్యార్థులు సీఎస్ఈ, అనుబంధ ఎమర్జింగ్ కోర్సుల్లో చేరారు. ఈసారి ఈసీఈ, సీఎస్ఈ కోర్ గ్రూపుల్లో విద్యార్థుల చేరికలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రధాన కాలేజీల్లో గరిష్టంగా 10 వేల ర్యాంకు వరకూ సీటు వచ్చే వీలుందని అంచనాలు చెబుతున్నాయి. ఉస్మానియా, జేఎన్టీయూహెచ్ వంటి క్యాంపస్‌లలో సీఎస్ఈతోపాటు అన్ని గ్రూపులకు పోటీ తీవ్రంగానే ఉంది. సీఎస్ఈలో 2 వేల లోపు, ఈసీఈలో 5 వేల లోపు మాత్రమే సీటు వచ్చే అవకాశం కన్పిస్తోంది. జేఎన్టీయూహెచ్ పరిధిలోని ఇతర జిల్లాల్లో ఉన్న కొత్త కాలేజీల్లో పోటీ పెద్దగా కన్పించడం లేదు. 90 వేల ర్యాంకు వరకూ సీటు వచ్చే చాన్స్ ఉందని తెలుస్తోంది. విద్యార్థులు ఎక్కువగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లోనే చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగా యూనివర్సిటీ కాలేజీల్లోనూ డిమాండ్ ఉండటం లేదు. -
తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 1.62 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో 70,804 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి కలగనుంది. జనవరి 1 నుంచి డీఏ పెంపు అమలు కానుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. -
హైడ్రా, ఈగల్ తరహాలో ‘ఫుడ్ సేఫ్టీ స్పెషల్ వింగ్’
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్సేఫ్టీపై స్పెషల్ వింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీనియర్ ఐఏఎస్ నేతృత్వంలో ఫుడ్‌సేఫ్టీ వింగ్‌ను ఏర్పాటు చేస్తారు. డీపీఆర్ రెడీ చేయాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైడ్రా, ఈగల్ తరహాలో ఫుడ్ సేఫ్టీ స్పెషల్ వింగ్ ఉండనుంది. ఆహార కల్తీ, తనిఖీలు, సేఫ్టీపై చర్యలు తీసుకోనుంది ఈ వింగ్. త్వరలోనే విధివిధానాలతో పూర్తి వివరాలు క్యాబినెట్ ముందుకు రానున్నాయి.కాగా, ఫుడ్ సేఫ్టీపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్ సైడ్ ఆహారం తయారీ, నిల్వ, రవాణా, విక్రయం, వినియోగం సమయంలో పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను పాటించడం లేదు. దీనివల్ల ఆహారం కలుషితం, బ్యాక్టీరియా, వైరస్లు, రసాయనాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీనిని నివారించడంలో ఫుడ్ సేఫ్టీ స్పెషల్ వింగ్ కీలక పాత్ర పోషిస్తుంది.పరిశుభ్రమైన ఆహారం ప్రతి వ్యక్తి ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఆహార పదార్థాలను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం, గడువు ముగిసిన ఉత్పత్తులను ఉపయోగించకపోవడం వంటి జాగ్రత్తలు ఫుడ్ సేఫ్టీలో భాగం. నాణ్యమైన ఆహారాన్ని అందించే బాధ్యతను వ్యాపార సంస్థలు మరుస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తే ఆహార కల్తీ బాధలు, అంటువ్యాధులు తగ్గి సమాజం మరింత ఆరోగ్యంగా ఉంటుంది.


