సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కార్యాచరణ చేపట్టింది. వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు బంజారాహిల్స్ నుంచి ఫిల్మ్‌నగర్ మీదుగా శిల్పా లేఅవుట్ వరకు అక్కడి నుంచి నేరుగా ఔటర్‌కు చేరుకొనే విధంగా కొత్త ఎక్స్‌ప్రెస్ కారిడార్ నిర్మాణానికి నిర్ణయించింది. అలాగే బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 నుంచి గచి్చ»ౌలిలోని శిల్పా లేఅవుట్ వరకు ఆరు లైన్ల ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించనున్నారు. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు–డీపీఆర్)ను రూపొందించేందుకు కన్సల్టెన్సీ నియమాకానికి హెచ్‌ఎండీఏ తాజాగా టెండర్లను ఆహా్వనించింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఔటర్‌రింగ్‌రోడ్డు వరకు సులభంగా రాకపోకలు సాగించేందుకు హెచ్‌ఎండీఏ ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, విస్తరణకు శ్రీకారం చుట్టింది.
ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ రూట్‌లో డైరీఫామ్ వరకు ఎలివేటెడ్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. మరోవైపు సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట్ వరకు మరో 23 కి.మీ.ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి టెండర్లు కూడా ఖరారయ్యాయి. ఓ బడా నిర్మాణ సంస్థ ఈ టెండర్‌లను దక్కించుకుంది. త్వరలోనే పనులను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రతిపాదన మేరకు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 నుంచి ఫిలింనగర్, జడ్జీస్ కాలనీ, దుర్గంచెరువు, టీ హబ్, శిల్పా లేఅవుట్ మీదుగా ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ వేను ప్రతిపాదించారు. ఔటర్ రింగ్ రోడ్డు గచ్చిబౌలి చౌరస్తా మీదుగా శిల్పా లేఅవుట్ సమీపం వరకు వచ్చే ప్లైఓవర్ వరకు ఈ సరికొత్త రహదారికి ప్రణాళికలు రూపొందించారు.
ఔటర్ నుంచి వచ్చేవారు నేరుగా నగరంలోకి చేరుకొనేందుకు, బంజారాహిల్స్ నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకొనేందుకు ఈ రహదారి దోహదం చేయనుంది.ఈ రహదారిలో దాదాపు 6 నుంచి 7 కి.మీ.వరకు ఆరు లైన్ల స్టీల్ బ్రిడ్జిని నిర్మాణం చేస్తారు. వివిధ ప్రాంతాల్లో అండర్‌పాస్‌లను నిరి్మంచనున్నారు. ఇప్పటికే ఈ రోడ్డు కోసం హెచ్‌ఎండీఏ అధికారులు సర్వే పూర్తి చేశారు. పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నివేదికను తయారు చేసేందుకు తాజాగా కన్సల్టెన్సీ నియమాకానికి హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది. వారం రోజుల్లోనే టెండర్లను ఖరారు చేసి కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు.
మరోవైపు షేక్‌పేట్ నాలా నుంచి సీబీఐటీ వరకు మరో రహదారి నిర్మాణానికి కూడా హెచ్‌ఎండీఏ ప్రణాళికలను రూపొందించింది. ష్‌క్‌పేట్ వైపు నుంచి వచ్చే వాహనదారులు ఈ మార్గంలో నేరుగా ఔటర్‌కు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది. నగరంలోని అన్ని వైపుల నుంచి ఔటర్‌రింగ్‌రోడ్డుకు, అలాగే ఔటర్‌రింగ్‌రోడ్డు నుంచి అన్ని వైపు లా రీజనల్ రింగ్‌రోడ్డు వరకు రాకపోకలను సులభతరం చేసేందుకు రహదారుల అభివృద్ధి, విస్తరణకు విస్తృతమైన ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు.


