భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న జశోదబెన్
చార్మినార్ (హైదరాబాద్): ప్రధాని నరేంద్ర మోదీ సతీమణి జశోదబెన్ గురువారం పాత బస్తీని సందర్శించి పలు దేవాలయాల్లో పూజ లు నిర్వహించారు. ముందుగా చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించిన ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ ట్రస్టీ ఆమెకు ఘనంగా స్వాగతం పలికి అమ్మ వారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం చాంద్రా యణగుట్టలోని చెన్నకేశవ దేవాలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. తర్వాత లాల్‌దర్వాజ సింహవాహిని దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ తదితరులు ఆమెను ఘనంగా సత్కరించారు.


