2,322 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల ‘ఫస్ట్‌ లిస్ట్‌’ విడుదల | The first provisional merit list for the posts of staff nurses was released on Wednesday | Sakshi
Sakshi News home page

2,322 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల ‘ఫస్ట్‌ లిస్ట్‌’ విడుదల

Dec 25 2025 4:31 AM | Updated on Dec 25 2025 4:31 AM

The first provisional merit list for the posts of staff nurses was released on Wednesday

పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థి వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు

నేటి నుంచి 27 వరకు మెరిట్‌ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ

అభ్యంతరాల పరిశీలన తర్వాత రెండో ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్ట్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో 2,322 నర్సింగ్‌ ఆఫీసర్‌ (స్టాఫ్‌నర్స్‌) పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ‘ఫస్ట్‌ ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్ట్‌’ను బుధవారం విడు­దల చేసింది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) రాసిన మొత్తం 40,423 మంది అభ్యర్థుల వివరాల­ను, వారు సాధించిన మా­ర్కులతో సహా బోర్డు వెబ్‌­సైట్‌లో అందుబాటులో ఉంచింది. 

నియామక ప్రక్రియ పారదర్శకంగా నిర్వ­హించే క్ర­మంలో భాగంగా ఆయా దశల్లో అభ్యంతరాలు స్వీకరిస్తున్న బో­ర్డు, తాజాగా విడుదల చేసిన ప్రొ­వి­జినల్‌ మెరిట్‌ జాబితాపైనా అభ్య­ర్థు­లకు ఏవైనా సందేహాలు ఉంటే తెలిపేందుకు మరోసారి అవకా­శం కల్పించింది. ఈ మేరకు అభ్యర్థులు బుధవారం నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు బోర్డు వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి.. తమ అభ్యంతరాలను నమోదు చేసుకోవచ్చు. 

అభ్య­ర్థుల నుంచి వచ్చే అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీ­లించిన అనంతరం ‘సెకండ్‌ ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్ట్‌’ను విడుదల చేయనున్నట్లు బోర్డు తెలిపింది. ఆ తర్వాత మెరిట్‌ ఆధా­రంగా 1:1.5 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు పిలిచి, అనంతరం, ఉద్యోగాలకు ఎంపికైన వారి తుది జాబితాను విడుదల చేస్తారు.

జనవరిలో ఉద్యోగాల్లోకి..
వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన 1,260 ల్యాబ్‌ టెక్నీషి యన్‌ పోస్టుల నియామక ప్రక్రియను ఇటీవలే బోర్డు పూర్తి చేసింది. ఈ ల్యాబ్‌ టెక్నీషియన్లతో పాటు, ఉద్యోగాలకు ఎంపికయ్యే 2,322 మంది నర్సింగ్‌ ఆఫీసర్లు కూడా జనవరిలోనే ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉందని వైద్యశాఖ చెపుతోంది. గత సంవత్సరం 7 వేలకు పైగా నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మరో 2,322 పోస్టులను భర్తీ చేస్తుండటంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్టాఫ్‌నర్సుల కొరత పూర్తిగా తీరగలదని అధికారులు భావిస్తున్నారు.

రెండేళ్లలో 11 వేలకుపైగా పోస్టుల భర్తీ
ఆరోగ్యశాఖలో రెండేళ్లలో సుమారు 11 వేల ఉద్యోగాలు భర్తీ కాగా, అందులో 9 వేలకుపైగా నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు, 600 పైగా డాక్టర్లు, అలాగే ల్యాబ్‌ టెక్నీషి యన్, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ తదితర పోస్టులు ఉన్నాయి. మరో 5 వేలకుపైగా పోస్టులు భర్తీ ప్రక్రియలో ఉన్నాయి. ఇందులో 1,600 పైగా స్పెషలిస్ట్‌ డాక్టర్‌ (సీఏఎస్‌ స్పెషలిస్ట్‌) పోస్టులు, 600 పైగా అసి స్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు, 700 పైగా ఫార్మసిస్ట్‌ పోస్టు లు, సుమారు 2 వేల వరకూ మల్టీ పర్పస్‌ ఫీమేల్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement