సీపీఐ జెండాను ఆవిష్కరిస్తున్న రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
కమ్యూనిస్టు పార్టీలు లేకపోతే చట్టాలు, హక్కులు ఉండేవికాదు
సీపీఐ వందేళ్ల ఆవిర్భావ దినోత్సవ సభ’లో ఎమ్మెల్యే కూనంనేని
సాక్షి, హైదరాబాద్: ఎర్ర జెండాలన్నీ ఏక మై..ఢిల్లీ ఎర్రకోటపై పార్టీ జెండా ఎగరే యాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు ఆకాంక్షించారు. భారత కమ్యూనిస్టు పార్టీ లేకపోతే ప్రజల కు రక్షణ కవచం లేన ట్టేనని, అనేక వీరోచిత పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను, చట్టాలను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తిరోగమన దిశగా వెళ్తోందని ఆయన ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో శుక్రవారం భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) వందేళ్ల ఆవిర్భావ దినోత్సవ సభ’జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ పతాకాన్ని కూనంనేని ఎగురవేశారు.
ఈ సభకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహ అధ్యక్షత వహించగా, సీపీఐ జాతీయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, కె.రామకృష్ణ, జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్‌పాషా హాజర య్యారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, దోపిడీ వర్గాల నుంచి మానవ జాతి విముక్తి కోసం అనేక త్యాగాలు, వీరోచిత పోరాటాలు చేసిన ఘనమైన చరిత్ర సీపీఐకే ఉందన్నారు.
పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజలను చైతన్యం చేసే శక్తి ఎర్రజెండాకు ఉందని, ఎర్ర జెండా కనిపించొద్దనే ఎజెండాతో బీజేపీ పనిచేస్తున్నదని విమర్శించారు. కె. రామకృష్ణ మాట్లాడుతూ ఇటీవలే వందేళ్ల ఉత్సవాలను పూర్తి చేసుకున్న ఆర్ ఎస్‌ఎస్ సంస్థ తమ వందేళ్ల చరిత్రలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశా రు. సీపీఐ సీనియర్ నాయకులు అజీజ్ పాషా మాట్లాడుతూ రాబోయే కా లంలో సీపీఐకు మంచి స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


