శంషాబాద్: రియాద్ విమానాన్ని ఆర్‌డీఎక్స్ బాంబుతో పేల్చేస్తామంటూ గురువారం తెల్లవారుజామున ఆర్‌జీఐఏ కస్టమర్ సపోర్ట్‌కు మరో బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఫ్లైనాస్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఎక్స్‌వై–325 విమానం రియాద్ నుంచి బయలుదేరి ఉదయం 7.50 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. ఇదే సమయంలో బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు వెంటనే భద్రతా చర్యలు చేపట్టారు.
విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత దానిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మరోమారు పూర్తిగా తనిఖీలు చేశారు. ప్రయాణికులను మరోమారు తనిఖీలు నిర్వహించి ఎలాంటి బాంబులు లేవని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.


