breaking news
Riyadh flight
-
రియాద్ విమానానికి బాంబు బెదిరింపు
శంషాబాద్: రియాద్ విమానాన్ని ఆర్డీఎక్స్ బాంబుతో పేల్చేస్తామంటూ గురువారం తెల్లవారుజామున ఆర్జీఐఏ కస్టమర్ సపోర్ట్‌కు మరో బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఫ్లైనాస్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఎక్స్‌వై–325 విమానం రియాద్ నుంచి బయలుదేరి ఉదయం 7.50 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. ఇదే సమయంలో బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు వెంటనే భద్రతా చర్యలు చేపట్టారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత దానిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మరోమారు పూర్తిగా తనిఖీలు చేశారు. ప్రయాణికులను మరోమారు తనిఖీలు నిర్వహించి ఎలాంటి బాంబులు లేవని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రన్‌వేపై నిలిచిపోయిన విమానం: కలకలం
సాక్షి, లక్నో: సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వే పై నిలిచిపోవడం కలకలం రేపింది. లక్నో నుంచి రియాద్ వెళ్లాల్సిన సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వే పై నిలిచిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం అర్థాంతరంగా రన్‌వే పైనే నిలిచిపోయింది. ఈ సంఘటనతో కొన్ని విమానాలను దారి మళ్లించడం తోపాటు, మరికొన్ని సర్వీసులను నిలిపివేశారు. దీంతో సిబ్బంది, ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. లక్నో-రియాద్ విమానం గాల్లోకి ఎగిరే క్రమంలో రన్‌వేపైనే నిలిచిపోయింది. ఈ సంఘటనతో విమానాశ్రాయానికి వచ్చి వెళ్లే పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికారులు ఆరు విమానాలను ఢిల్లీకి మళ్లించారు. టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న మరో మూడు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే విమాన సిబ్బంది, ప్రయాణికులంతా సురక్షితంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
శంషాబాద్‌లో రియాద్ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రియాద్ బయలుదేరిన ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక కారణాల వల్ల ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. శంషాబాద్ నుంచి గురువారం రియాద్ బయలుదేరిన ఏవీ 753 విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే తిరిగి ఎమెర్జెన్సీ ల్యాండ్ అయింది. సాంకేతిక లోపాలు తలెత్తడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు తెలిసింది.


