రన్‌వేపై నిలిచిపోయిన విమానం: కలకలం | Riyadh bound Saudia flight stuck on Lucknow runway following technical glitch | Sakshi
Sakshi News home page

రన్‌వేపై నిలిచిపోయిన విమానం: కలకలం

Dec 27 2017 8:34 PM | Updated on Dec 27 2017 8:35 PM

Riyadh bound Saudia flight stuck on Lucknow runway following technical glitch - Sakshi


సాక్షి, లక్నో:  సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వే పై నిలిచిపోవడం కలకలం రేపింది.  లక్నో నుంచి రియాద్ వెళ్లాల్సిన సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వే పై నిలిచిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం అర్థాంతరంగా రన్‌వే పైనే నిలిచిపోయింది. ఈ సంఘటనతో కొన్ని విమానాలను  దారి మళ్లించడం తోపాటు, మరికొన్ని సర్వీసులను నిలిపివేశారు. దీంతో   సిబ్బంది, ప్రయాణీకులు  ఆందోళనకు గురయ్యారు.

వివరాల్లోకి వెళితే.. లక్నో-రియాద్‌ విమానం  గాల్లోకి  ఎగిరే  క్రమంలో రన్‌వేపైనే నిలిచిపోయింది.  ఈ సంఘటనతో విమానాశ్రాయానికి వచ్చి వెళ్లే పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికారులు ఆరు విమానాలను ఢిల్లీకి మళ్లించారు. టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న మరో మూడు విమాన సర్వీసులు నిలిచిపోయాయి.  అయితే విమాన సిబ్బంది, ప్రయాణికులంతా సురక్షితంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement