నటి, యాంకర్ అనసూయ పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. హీరోయిన్ల డ్రెస్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై అనసూయ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో శివాజీతో చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. అనంతరం శివాజీ కూడా అనసూయకు కౌంటర్ ఇచ్చాడు. ‘త్వరలోనే మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు రావాలని కోరుకుంటున్నాను’ అని శివాజీ వ్యంగ్యంగా మాట్లాడారు.
దీంతో అనసూయ మరోసారి శివాజీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘చాలా సందర్భాల్లో చాలా దాటుకుని వచ్చాను. మీ సపోర్ట్ నాకు అక్కర్లేదు. నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు’ అంటూ శివాజీకి చివాట్లు పెట్టింది. దీంతో అటు శివాజీ, ఇటు అనసూయ..ఇద్దరు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నారు.
ఇలాంటి నేపథ్యంలో అనసూయ తాజాగా ఓ వీడియోని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. గతంలో స్నేహితులతో కలిసి యూరప్ ట్రిప్ వేసిన అనసూయ. ఐస్‌ల్యాండ్‌లో స్వీమ్ సూట్‌లో ఫోటోషూట్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలను కూడా అప్పట్లో సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా దానికి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ.. నీళ్ల దగ్గర ఉన్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను. ట్రావెల్ డేస్ మిస్ అవుతున్నాను. త్వరలోనే మరో ట్రిప్‌కి ప్లాన్ చేయాలి’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. శివాజీపై కోపంతోనే ఆ వీడియో షేర్ చేశారంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.


