breaking news
Swimsuits
-
స్విమ్ సూట్లో అనసూయ వీడియో.. శివాజీపై కోపమా?
నటి, యాంకర్ అనసూయ పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. హీరోయిన్ల డ్రెస్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై అనసూయ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో శివాజీతో చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. అనంతరం శివాజీ కూడా అనసూయకు కౌంటర్ ఇచ్చాడు. ‘త్వరలోనే మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు రావాలని కోరుకుంటున్నాను’ అని శివాజీ వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో అనసూయ మరోసారి శివాజీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘చాలా సందర్భాల్లో చాలా దాటుకుని వచ్చాను. మీ సపోర్ట్ నాకు అక్కర్లేదు. నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు’ అంటూ శివాజీకి చివాట్లు పెట్టింది. దీంతో అటు శివాజీ, ఇటు అనసూయ..ఇద్దరు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నారు.ఇలాంటి నేపథ్యంలో అనసూయ తాజాగా ఓ వీడియోని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. గతంలో స్నేహితులతో కలిసి యూరప్ ట్రిప్ వేసిన అనసూయ. ఐస్‌ల్యాండ్‌లో స్వీమ్ సూట్లో ఫోటోషూట్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలను కూడా అప్పట్లో సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా దానికి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ.. నీళ్ల దగ్గర ఉన్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను. ట్రావెల్ డేస్ మిస్ అవుతున్నాను. త్వరలోనే మరో ట్రిప్‌కి ప్లాన్ చేయాలి’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. శివాజీపై కోపంతోనే ఆ వీడియో షేర్ చేశారంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
బికినీయే కారణం కాదు!
‘మిస్ వరల్డ్’ కిరీటం సొంతం చేసుకోవడం అంత సులువు కాదు. చక్కటి శరీర కొలతలతో పాటు సమయ స్ఫూర్తి, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ... ఇలా ఎన్నో విషయాల్లో మార్కులు సంపాదిస్తేనే ఆ బిరుదు సొంతం అవుతుంది. అలాగే, ఈ పోటీల్లో భాగంగా ‘బికినీ రౌండ్’ ఒకటుంటుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ పోటీలో నిలిచే భామలు ఈత దుస్తులు ధరించాల్సిందే. అయితే, ఇక ఈత దుస్తులు ధరించాల్సిన అవసరంలేదు. ‘మిస్ వరల్డ్’ పోటీలకు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న జూలియా మోర్లీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈత దుస్తుల వల్ల అమ్మాయికి ఒరిగేదేమీ లేదనీ, ఆ మాటకొస్తే దానివల్ల ఎవరికీ ఏమీ ఒరగదని ఈ సందర్భంగా జూలియా పేర్కొన్నారు. దీని గురించి ఐశ్వర్యా రాయ్ స్పందిస్తూ -‘‘1994లో నేను ప్రపంచ సుందరి కిరీటం గెల్చుకున్నాను. వాస్తవానికి ఆ సమయంలో నాతో పాటు పోటీలో నిలిచిన 87 మంది అమ్మాయిలతో పోలిస్తే నా శరీరాకృతి ఈత దుస్తులకు అనువుగా ఉండేది కాదు. కానీ, స్విమ్ సూట్ ధరించాలనే నిబంధన ఉండటంతో ఏమీ చేయలేకపోయాను. అయినప్పటికీ నేను ప్రపంచ సుందరి కిరీటం సాధించగలిగాను. ఈ కిరీటాన్ని ఎవరికి ఇవ్వాలో నిర్ణయించేది బికినీ రౌండే అని చాలామంది భావిస్తారు. కానీ, అదొక్కటే కాదు. ఆత్మవిశ్వాసం, ప్రవర్తన.. ఇలా చాలా విషయాలు పరిగణనలోకి తీసుకుంటారు. ఏదేమైనా బికినీ రౌండ్ తీసేసినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు.


