West Bengal
-
పశ్చిమబెంగాల్ లో ఇవాళ తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు
-
Bengal Elections: కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పోలింగ్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది.. -
బెంగాల్, తమిళనాడు ఎన్నికలకు సర్వం సిద్ధం
పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పశ్చిమ బెంగాల్ మొదటి దశ ఎన్నికల (152 స్థానాలకు)తో పాటు తమిళనాడులోని మొత్తం 234 సీట్లకు గురువారం (ఏప్రిల్ 23) ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు మే4న వెల్లడవుతాయి. పశ్చిమ బెంగాల్లో.. పశ్చిమ బెంగాల్లో మొదటి దశ పోలింగ్‌లో 16 జిల్లాల్లోని 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతుంది. మొదటి దశలో 8,000కి పైగా పోలింగ్ కేంద్రాలను అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఓటింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. భారీ ఓటింగ్ శాతం నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.జనసాంద్రత ఎక్కువ ఉండే ప్రాంతాల్లో క్యూలు భారీగా ఉండకుండా ఓటర్లు ముందుగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.అధికారిక సమాచారం ప్రకారం మొత్తం 3,60,77,171 ఓటర్లు ఈ దశలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. వీరిలో మంది 1,84,99,496 పురుషులు, 1,75,77,210 మంది మహిళలు, 465 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు.మొదటి దశలో పోలింగ్ జరిగే ప్రాంతాలు: మొదటి దశలో ఉత్తర బెంగాల్ జిల్లాలు డార్జిలింగ్, జల్పాయిగురి, కూచ్ బేహార్ ప్రాంతాలు, అలాగే జంగల్ మహల్, పురులియా, బాంకురా, పశ్చిమ మేదినిపూర్, బీర్బూమ్, ముర్షిదాబాద్ భాగాలు ఉన్నాయి.వోటర్ ఐడీ లేకపోయినా ఓటు వేయవచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లి వేయాలి. పోలింగ్ కేంద్రానికి వెళ్లే ముందు ఓటర్ జాబితాలో పేరు ఉందో లేదో నిర్ధారించుకోవాలి. తమిళనాడులోతమిళనాడులో 5.73 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు.ఇందులో 2.93 కోట్ల మహిళా ఓటర్లు, 7,728 ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తం 33,133 ప్రాంతాల్లో 75,064 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో 249 మోడల్ బూత్‌లు, 325 మహిళలు నిర్వహించే బూత్‌లు, 71 దివ్యాంగులు నిర్వహించే బూత్‌లు ఉన్నాయి.ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు) రాష్ట్రవ్యాప్తంగా వినియోగానికి సిద్ధం చేశారు. మొత్తం 1,06,418 బ్యాలట్ యూనిట్లు, 75,064 కంట్రోల్ యూనిట్లు, 75,064 వివిప్యాట్ యూనిట్లు ఏర్పాటు చేశారు. మొత్తం 3,60,068 పోలింగ్ సిబ్బంది ఈ కేంద్రాల్లో విధుల్లో ఉంటారు.అదనంగా 300 పారామిలిటరీ దళాలు, 83,800కు పైగా పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. మొత్తం 62 కౌంటింగ్ కేంద్రాలకు అనుమతి ఇచ్చారు.తమిళనాడు ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటలకు ముందు వచ్చి క్యూలో నిలబడిన ప్రతి ఓటరుకు ఓటు వేయడానికి అనుమతి ఉంటుంది. ఏప్రిల్ 23న తమిళనాడులో పబ్లిక్ హాలిడే.బస్సులు, మెట్రో, స్థానిక రవాణా సేవలు సాధారణంగా నడుస్తాయి. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరేందుకు సౌకర్యంగా ఉంటుంది.పెట్రోల్ బంకులు, కిరాణా దుకాణాలు తెరిచే ఉంటాయి. -
ముగిసిన మొదటి విడత ప్రచారం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. అసెంబ్లీలోని మొత్తం 294 సీట్లకు గాను ఈ నెల 23వ తేదీన 152 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్‌లో 3.60 కోట్ల అర్హులైన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న ఈ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ భారీగా భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. మొదటి విడతలో 8 వేల పోలింగ్ బూత్‌లను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించింది. పోలింగ్ సజావుగా సాగేందుకు సుమారు 2,450 కంపెనీలు, రెండున్నర లక్షల కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. అదనంగా 2,193 క్విక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసింది.రాష్ట్రంలోని మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర్ దినాజ్‌పూర్, కూచ్ బెహార్, బిర్బూమ్, బురŠాద్వన్ జిల్లాలపై ఈసీ ఎక్కువ దృష్టి కేంద్రీకరించింది. మొదటి విడతలో ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి బరిలో నిలిచిన నందిగ్రామ్, కేంద్ర మాజీ మంత్రి నిశిత్ ప్రామాణిక్ పోటీలో ఉన్న మాతాభంగ, కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌదరి పోటీ చేస్తున్న బెహరంపూర్ తదితర నియోజకవర్గాలున్నాయి. పశ్చిమ్ మేదినీపూర్ జిల్లా ఖరగ్‌పూర్ సదర్‌లో రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, టీఎంసీకి చెందిన ప్రదీప్ సర్కార్ ముఖాముఖి తలపడుతున్నారు. ఈ నెల 29వ తేదీన రెండో విడత పోలింగ్, మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్నాయి.టీఎంసీ, బీజేపీ మధ్యే అసలు పోటీటీఎంసీ వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టేందుకు చెమటోడ్చుతుండగా, మమతా బెనర్జీని గద్దె దించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో చేపట్టిన సర్ ప్రక్రియతో 91 లక్షల ఓట్లు తొలగింపునకు గురి కావడం తమకు కలిసి వస్తోందని కాషాయ దళం ఆశతో ఉంది. మొదటి విడత ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల హింస, దిగజారిన శాంతి భద్రతల అంశం, పెచ్చుమీరిన అవినీతిపై సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాట్లను టీఎంసీ ప్రోత్సహిస్తోందని వీరు ఆరోపణలు గుప్పించారు. కాగా, టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ విస్తృతంగా ప్రచారం చేపట్టారు. సర్ ద్వారా బీజేపీ ఓటరు జాబితాను తారుమారు చేసి, అనుకూలంగా మార్చుకుందని వీరు విమర్శించారు. కేంద్ర విభాగాలను వాడుకుంటూ బీజేపీ నాయకులు తమ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకి అధికారమిస్తే చేపలు, గుడ్లు, మాంసంపై నిషేధం తీసుకువస్తుందని, ప్రజల ఆహార అలవాట్లను కూడా శాసిస్తుందని ప్రజలను టీఎంసీ హెచ్చరించారు. కాగా, కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీ తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌తోపాటు గతంలో దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న సీపీఎం ప్రభావం కూడా అంతంత మాత్రమేనని పరిశీలకులు అంటున్నారు. -
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. కీలక అభ్యర్థులు వీరే..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఓటింగ్ ఏప్రిల్ 23న జరుగుతుంది. తొలి దశలో 152 స్థానాలకు పోలింగ్ ఉంటుంది. తొలి దశ ప్రచారం మంగళవారం (ఏప్రిల్ 21)న ముగిసింది. మిగిలిన ప్రాంతాల్లో ఏప్రిల్ 29న ఓటింగ్ జరుగుతుంది. ఫలితాలు మే 4న ప్రకటిస్తారు.రాజకీయంగా కీలకమైన పశ్చిమ బెంగాల్లో ప్రధాన పోటీ తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్యే ఉంది. ఏప్రిల్ 23న ఓటింగ్ 16 జిల్లాల్లోని 152 నియోజకవర్గాల్లో ఉన్నాయి.తొలి దశలో పోటీ చేసే కీలక అభ్యర్థులునందిగ్రామ్లో సువేందు అధికారి vs పబిత్ర కర్బీజేపీ నేత సువేందు అధికారి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారు. 2021లో మమతా బెనర్జీని ఓడించి ఈ స్థానాన్ని గెలిచారు. అలాగే భవానీపూర్ నుంచి కూడా ఆన పోటీ చేస్తున్నాడు. నందిగ్రామ్ లో ఏప్రిల్ 23న, భవానీపూర్‌లో ఏప్రిల్ 29న పోలింగ్ జరుగుతుంది. సువేందు అధికారి 2020లో టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2021 ఎన్నికల్లో టీఎంసీ 294 స్థానాలకుగానూ 213 స్థానాలు గెలిచింది. కానీ, నందిగ్రామ్‌లో సువేందు అధికారి.. బెనర్జీపై విజయం సాధించారు.ప్రస్తుతం అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అధికారి. టీఎంసీ అభ్యర్థి పబిత్ర కర్ పై ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. కర్ ఒకప్పుడు బీజేపీలో కొనసాగారు. తర్వాత టీఎంసీ చేరారు. ఇప్పుడు తన మాజీ గురువుతో పోటీ పడుతున్నారు.బహరంపూర్‌లో అధీర్ రంజన్ చౌధురి vs సుబ్రత మైత్రాఅధీర్ రంజన్ చౌధురి దీర్ఘకాలం కాంగ్రెస్ ఎంపీగా బహరంపూర్ నుంచి 5 సార్లు గెలిచారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీ నేత యూసుఫ్ పఠాన్ చేతిలో ఓడిపోయారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలో బహరంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థి సుబ్రత మైత్రాను ఎదుర్కొంటున్నారు.ఆసన్సోల్ దక్షిణలో అగ్నిమిత్ర పాల్ vs తపాస్ బెనర్జీఅగ్నిమిత్ర పాల్ బీజేపీ మహిళా నాయకుల్లో ప్రముఖురాలు. 2019లో బీజేపీలో చేరి, 2021 ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి సాయోని ఘోష్ పై విజయం సాధించారు. ఇప్పుడు టీఎంసీ అభ్యర్థి తపాస్ బెనర్జీతో పోటీ పడుతున్నారు. తపాస్ బెనర్జీ టీఎంసీకి చెందిన సీనియర్ నాయకుడు. 2011 నుంచి 2021 వరకు ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.ఖరగ్‌పూర్ సదర్‌లో దిలీప్ ఘోష్ vs ప్రదీప్ సర్కార్దిలీప్ ఘోష్ బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు. పశ్చిమ బెంగాల్ లో పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషించారు. 2016లో ఖరగ్‌పూర్ సదర్ నుంచి గెలిచారు. 2021లో బీజేపీ అభ్యర్థి హిరణ్ చటర్జీ స్వల్ప తేడాతో విజయం సాధించారు. 2026 ఎన్నికల్లో ఘోష్ మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. టీఎంసీ ప్రదీప్ సర్కార్ ను రంగంలోకి దింపింది. సర్కార్ 2019 ఉపఎన్నికలో గెలిచారు.మథాభంగాలో నిసిత్ ప్రమాణిక్ vs సబ్‌లు బర్మన్కేంద్ర మాజీ మంత్రి నిసిత్ ప్రమాణిక్ బీజేపీ అభ్యర్థిగా కూచ్ బెహార్ జిల్లా మథాభంగా (ఎస్సీ) స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. టీఎంసీ నుంచి సబ్‌లు బర్మన్ పోటీకి దిగారు. సీపీఎం అభ్యర్థి ఖగేన్ చంద్ర బర్మన్, కాంగ్రెస్ అభ్యర్థి క్షితేంద్ర నాథ్ బర్మన్ కూడా రంగంలో ఉన్నారు. ప్రమాణిక్ 2021 లో దిన్హాటా నుంచి గెలిచారు. తర్వాత లోక్ సభ సభ్యత్వం కొనసాగించేందుకు ఆ స్థానాన్ని ఖాళీ చేశారు. ఉపఎన్నికలో ఉదయన్ గుహ గెలిచారు.డోంకల్లో హుమాయున్ కబీర్ vs మొస్తాఫిజుర్ రహమాన్మాజీ టీఎంసీ నేత, మమతా బెనర్జీ కేబినెట్లో మంత్రిగా పనిచేసి హుమాయున్ కబీర్.. ఇప్పుడు ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీని స్థాపించి స్వతంత్రంగా పోటీ నిర్ణయం తీసుకున్నారు. 2025 లో బాబ్రీ మసీదు నిర్మాణ ప్రతిపాదన కారణంగా ఆయన పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన కబీర్, సీపీఎం అభ్యర్థి మొస్తాఫిజుర్ రహమాన్ పై పోటీ చేస్తున్నారు. 2021లో ఈ స్థానం నుంచి టీఎంసీకి చెందిన జాఫికుల్ ఇస్లాం గెలిచారు.పానిహాటిలో రత్నా దేవనాథ్ vs నిర్మల్ ఘోష్ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనలో అత్యాచారం, హత్యకు గురైన మహిళా వైద్యురాలి తల్లి రత్నా దేవనాథ్. బీజేపీ అభ్యర్థిగా పానిహాటి నుంచి రత్నా దేవనాథ్ పోటీ చేస్తున్నారు. ఆమె ప్రత్యర్థి టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్. -
PM Modi : పది రూపాయల స్నాక్.. పది కోట్ల వ్యూస్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏప్రిల్ 21న జహాగ్రామ్‌లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సభ అనంతరం హెలిప్యాడ్ వైపు వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న దుకాణం వద్ద ఆగి, స్థానిక స్ట్రీట్ ఫుడ్ అయిన ఝల్మురి రుచి చూశారు. అక్కడి ప్రజలతో సరదాగా మాట్లాడారు. ఆ క్షణాల ఫొటోలు, వీడియోలను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు.ఈ సంఘటనతో ఆ దుకాణం యజమాని విక్రమ్ కుమార్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. మోదీ రాకతో నేను ఓవర్‌నైట్‌లో ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారాను అని విక్రమ్ మీడియాతో చెప్పుకొచ్చాడు. ఊహించని విధంగా ప్రజలు తన దుకాణానికి పోటెత్తుతున్నారని, ఫోన్‌కాల్స్ ఎక్కువై సమాధానం చెప్పలేక ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో పెట్టాల్సి వచ్చిందని వివరించాడు. కస్టమర్లతో పాటు రీల్స్ తీసుకునేవారు, సెల్ఫీలు దిగేవారు కూడా పెరిగారని చెప్పాడు.ప్రధాని మోదీ కొనుగోలు చేసిన ఝల్మురి ధర కేవలం రూ.10 మాత్రమేనని విక్రమ్ వెల్లడించాడు. మోదీ షేర్ చేసిన వీడియో 24 గంటల్లోపే ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల వ్యూస్, ఫేస్బుక్లో 11 కోట్ల వ్యూస్ దాటింది. అంతేకాదు, ఝల్మురి కోసం గూగుల్‌లో గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సెర్చ్‌లు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి.ప్రధాని సభ ముగించుకుని హెలిప్యాడ్ వైపు వెళ్తున్నప్పుడు నా స్టాల్ వద్ద ఆగారు. ఝల్మురి ధర ఎంత అని అడిగారు. నా నేపథ్యం, చదువు గురించి తెలుసుకున్నారు. నేను తొమ్మిదో తరగతి వరకు చదివానని చెప్పాను’అని విక్రమ్ గుర్తు చేసుకున్నాడు. తరువాత మోదీ సోషల్ మీడియాలో ‘జహాగ్రామ్‌లో మసాలా ఝల్మురి రుచి చూశాను’ అని రాశారు. ఆ రోజు ఆయన నాలుగు సభలు నిర్వహించినప్పటికీ, ఈ చిన్న విరామం ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా, మోదీ స్వయంగా డబ్బు చెల్లించి కొనుగోలు చేయడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ ఒక్క క్షణం వెనుక విక్రమ్ కుటుంబం దీర్ఘ ప్రయాణం ఉంది. 12 ఏళ్ల క్రితం వారు బీహార్ నుంచి జహాగ్రామ్‌కి వచ్చారు. చిన్న చిన్న స్టాళ్లలో మారుతూ, చివరికి రాజ్ కాలేజ్ మోర్ వద్ద ప్రభుత్వ అనుమతితో 77 అడుగుల స్థలం పొందారు. అక్కడే శాశ్వతంగా ఝల్మురి అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. కుటుంబం జహాగ్రామ్లోని బఛ్ఛుర్దోహా ప్రాంతంలో ఇల్లు కూడా నిర్మించుకుంది. షాపు నుంచే వచ్చే ఆదాయంతో ఆ ఇల్లు నిర్మాణం సాగిందని విక్రమ్ తెలిపారు. ఇప్పుడు తన దుకాణం రద్దీ పెరిగింది. కస్టమర్లతో పాటు నెటిజన్లను ఆకర్షిస్తోంది. Jhalmuri break in Jhargram! pic.twitter.com/LJNjEojAW4— Narendra Modi (@narendramodi) April 19, 2026 -
ఎల్లుండే బెంగాల్ పోలింగ్.. ఈసీ కొత్త ఆంక్షలు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఆంక్షలను తెర మీదకు తెచ్చింది. టూవీలర్స్ ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఎన్నికలు జరగబోయే 152 నియోజకవర్గాలకు ఈ ఆంక్షలు వర్తించనున్నాయి. గురువారం తొలి దఫా పోలింగ్ నేపథ్యంలో.. ఈ రెండ్రోజుల పాటు బైక్ ప్రయాణాలపై నిషేధం విధించింది ఈసీ. సాయంత్రం 6 నుంచి వేకువ జామున 6 దాకా రోడ్లపై బైక్ ఎక్కడానికి వీల్లేదు. అయితే.. అత్యవసరం సేవల కోసం మాత్రమే మినహాయింపు ఉంటుందని ఈసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక ఉదయం 6 నుంచి సాయంత్రం 6 మధ్య బైక్‌లు రోడ్ల మీద తిరగవచ్చు. కానీ, ఒంటరిగానే వెళ్లాల్సి ఉంటుంది. అంటే పిలియన్ రైడింగ్(pillion riding) కు అనుమతి లేదన్నమాట. అలాగే.. బైక్ ర్యాలీలకు అస్సలు అనుమతి లేదు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. అయితే.. పగటి పూట పిలియన్ రైడింగ్ విషయంలో టూవీలర్స్ వాహనదారులకు మాత్రం ఈసీ కాస్త ఊరట ఇచ్చింది. పిల్లలను విద్యా సంస్థల్లో దింపడం, వేడుకలకు హాజరు కావడం, మెడికల్ ఎమర్జెన్సీలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఓట్లు వేయడానికి వెళ్లేవారికి కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. పోలింగ్‌కు విఘాతం కలగవచ్చనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ చెబుతోంది. బెంగాల్లో ఏ ఎన్నికలు జరిగినా.. హింసాత్మక ఘటనలు జరగడం చూస్తున్నదే. అందుకే అక్కడి ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బెంగాల్లో ఈసారి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించి తీరతామని సీఈసీ జ్ఞానేష్ కుమార్ సోమవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కఠిన ఆంక్షలు అమలు చేయాలని ఈసీ భావిస్తోంది. అయితే.. బెంగాల్ ఎన్నికల కోసం ఈసీ ఈ కొత్త ఆంక్షలు తేవడం ఇదే తొలిసారి కాదు. 2021 బెంగాల్ ఎన్నికల టైంలోనూ ద్విచక్ర వాహనాలపై ఇలాంటి ఆంక్షలే విధించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ ఈసీ ఈ తరహా నిర్ణయమే అమలు చేసింది. -
మోదీ మెచ్చిన చిరుతిండి..! ఇన్ని పేర్లతో పిలుస్తారా..
బెంగాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రఖ్యాత చిరుతిండి ఝాల్మురీని మోదీ రుచి చూశారు. దీన్ని మరమరాలు, పచ్చి మిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు, ఇతర మసాలాలతో తయారు చేస్తారు. ఝార్గ్రామ్ జిల్లాలో మోదీ కాన్వాయ్ ఓ దుకాణం ముందు హఠాత్తుగా ఆగింది. మోదీ వాహనం దిగి దుకాణదారును పలకరించారు. ‘‘సోదరా! ఝాల్మురీ ఎంత? నాకు రుచి చూపించు. రుచికరంగా త యారు చెయ్’’ అని కోరా రు. తను వెంటనే ఝాల్ మురీ చేసి ప్రధానికి అందించాడు. డబ్బులు తీసుకోవడానికి నిరాకరించగా మోదీ బలవంతంగా అతడి చేతిలో పెట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఈ చిరుతిండి హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వంటకానికి యావత్తు భారతదేశంలో ప్రజలంతా చేసుకుంటారు. కాకపోతే ఆయా ప్రాంతాల వారీగా పలుల పేర్లు ఉన్నాయంతే. కానీ దీని రుచికి అందరు ఫిదా అనే చెప్పాలి. విదేశీయలు సైతం అబ్బా అని లొట్టలేసుకుంటూ తినేలా చేసే స్నాక్ ఐటెం ఇది. మరి నోరూరించే ఈ ఝల్మురి వంటకాల కహానీ గురించి సవివరంగా చూద్దామా..!.ఝల్మురి అంటే..కోల్‌కతా స్ట్రీట్ చిరుతిండి ఇది. మరమరాలు, ఆవనూనె, మసాలాలు, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, వేరుశెనగుళ్లు, సెనగపప్పులు వేసి కమ్మగా, కారంగా చేసే వంటకం. ఇది ఏమి స్టవ్ వెలిగించే చేసే వంటకం కాదు. ఇది మొత్తం పదార్థాలు కలపడం పైనే రుచి ఆధాపడి ఉంటుంది. ఆ పేరు ఎలా వచ్చిందంటే..బెంగాలీలో “ఝల్” అంటే కారం, “మురి” అంటే మరమరాలు. ఈ రెండింటినీ కలిపితే,కారం కారం మరమరాలు అని అర్థం. అమ్మకందారులు స్టీల్ పాత్రలలో దీన్ని కలుపుతూ..పదార్థాలను గాల్లోకి ఎగరువేస్తూ..కోన్ల వార్తాపత్రికలను చుట్టి సర్వ్ చేస్తుంటారు. చవకైనది..మనసుకు ఆహ్లాదాన్ని, కాలక్షేపాన్ని ఇచ్చే చిరుతిండి ఇది. వలసవాద కాలంలో బెంగాల్లో ఉద్భవించిందని చెబుతుంటారు. మాములు చిరుతిండిగా మొదలైన రైళ్లలో, బీచ్‌లలో, కళాశాల ప్రాంగణాలలో విరివిగా అమ్ముతుంటారు. ఇంకా పెద్ద పెద్ద కేఫ్‌లు సైతం లభిస్తోంది. ఈ స్ట్రీట్ భారతదేశమంతటా ఫేమస్. పైగా ఆయా ప్రాంతాల వారీగా పలు రకాలుగా పిలుస్తారు. చేసే విధానం ఒక్కటే. మరి ఆ పేర్లేంటో చూసేద్దామా..! ఇన్ని పేర్లా..?!ముంబైలో దీన్ని భేల్పురిగా తీపి కారంల కలయికతో తయారు చేస్తారు. ఇక బెంగళూరు చురుమురిలో తురిమిన కొబ్బరితో దక్షిణ భారత రుచితో మిళితం చస్తారు. ఒడిశాలో మసాల మురిగా..అందులో అన్ని ఎక్కువ పదార్థాలు జోడించనప్పటికీ ఘాటుగా ఉంటుంది. ఇక దక్షిణ భారతదేశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ వంటి ప్రాంతాలో ముంతమసాల, పిడతకింద పప్పు, ఉగ్గాణి వంటి పేర్లోతో పిలుస్తారు.ముంతమసాల: రమరాలు, మసాలా దినుసులు, వేరుశెనగ గుళ్లు, ఉల్లిపాయలు, టొమాటోలు, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు తదితరాలను కలిపి గిన్నెలో ఇస్తారు కాబట్టి ముంత మసాల. అంటే ఇక్కడ ఒక చిన్న అల్యూమినియం ముంతలో (గిన్నె)లో సర్వ్ చేస్తారు. ఇది కోస్తాంధ్ర, రాయలసీమలో సాయంత్రం వేళల్లో దొరికే ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్.పిడతకింద పప్పు: ఇది కూడా ముంతమసాల లాంటిదే, కానీ ఇందులో మిరపకాయ బజ్జీలను చిన్న ముక్కలుగా చేసి కలుపుతారు. అలాగే మరమరాలు మెత్త బడకుండా చిన్న మట్టి కుండలో నిప్పులు వేసి మరమరాలపై ఉంచుతారు అందువల్ల ఆ పేరుతో పిలుస్తారు. ఇది ముఖ్యంగా కోస్తాంధ్ర (గుంటూరు, కృష్ణా జిల్లాలు) లో ఎక్కువగా కనిపిస్తుంది.ఉగ్గాణిమరమరాలను నీటిలో నానబెట్టి, తాలింపు పెట్టి చేసే ఒక రకమైన తడి మిశ్రమం. దీనికి పసుపు, వేరుశెనగ గుళ్లు, పుట్నాల పొడి (పుట్నాల పప్పు పొడి) ప్రధానంగా ఉపయోగిస్తారు. దీన్ని సాధారణంగా మిరపకాయ బజ్జీలతో కలిపి తింటారు, అందుకే దీనిని 'ఉగ్గాణి బజ్జీ' అని పిలుస్తారు. రాయలసీమ ప్రాంతంలో (కర్నూలు, అనంతపురం) ఇది చాలా ఫేమస్. అక్కడ దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా తింటారట. ఆరోగ్యదాయకం కూడా..ఈ మరమరాలతో తయారు చేసే ఈ వంటకం ఆరోగ్యప్రదం కూడా. ఎందుకంటే ఇందులో ఆయిల్ కంటెంట్ తక్కువ. పైగా అన్ని నేచురల్‌గా కలిపేస్తారు. ఇక్కడ డీప్‌ఫ్రైకి ఛాన్స్‌లేదు. టమటా, ఉల్లిపాయలు నుంచి అన్ని కూడా పచ్చిగానే కలుపుతారు. ఒకరకంగా సలాడ్ మాదిరి ఐటెం. కాకపోతే కాస్త మరమరాలతో రుచికరంగా మారుతుంది. పైగా వెయిట్‌లాస్ స్నాక్ ఐటెం అని అంటున్నారు. ఇది కడుపు నిండిన అనుభూతితోపాటు మనసుకు హాయినిచ్చే స్నాక్ ఐటెం అట. ఇక మరమరాల్లో కార్బోహైడ్రేట్లు కూడా తక్కువగానే ఉంటాయని అంటున్నారు. పైగా తేలిగ్గా అరిగిపోతుంది కూడా అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మంచి ఫైబర్ తోపాటు, సులువుగా జీర్ణమయ్యే బలవర్ధకమైన చిరుతిండి అట. -
మమత వర్సెస్ మోదీ: ఐ-ప్యాక్ అడ్డాగా యుద్ధం!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను తుఫాను చెలరేగుతోంది. ఎన్నికల వ్యూహకర్త సంస్థ ‘ఐ-ప్యాక్’ చుట్టూ అల్లుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు ఇప్పుడు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), కేంద్రంలోని బీజేపీ మధ్య యుద్ధానికి దారితీశాయి. మనీ లాండరింగ్ విచారణతో మొదలైన ఈ వ్యవహారం.. దాడులు, అరెస్టులు, సమన్లు దాటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమేయమున్న ‘గ్రీన్ ఫైల్’ ఎపిసోడ్‌తో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఇంతకీ ఈ ఐ-ప్యాక్ చుట్టూ ఏం జరుగుతోంది?తనిఖీల నుంచి రాజకీయ రగడకు.. ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా, ఊహించని రీతిలో సీఎం మమతా బెనర్జీ అక్కడికి చేరుకోవడంతో హైడ్రామా చోటుచేసుకుంది. ఏజెన్సీ వర్గాల సమాచారం ప్రకారం.. ఆమె తన అనుచరులు, పోలీసులతో కలిసి దాడులు జరుగుతున్న ప్రదేశం నుంచి కీలకమైన పత్రాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను బలవంతంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత సాల్ట్ లేక్‌లోని ఐ-ప్యాక్ కార్యాలయంలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. మమత చేతిలో ఉన్న ఆ ‘గ్రీన్ ఫైల్’ దృశ్యాలు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.పరస్పర తీవ్ర ఆరోపణలుమనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద జరుగుతున్న విచారణను సీఎం అడ్డుకున్నారని ఈడీ ఆరోపిస్తుండగా.. దర్యాప్తు సంస్థలు ఉద్దేశపూర్వకంగా తమ పార్టీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని, అభ్యర్థుల జాబితాను, హార్డ్ డిస్క్‌లను లాగేసుకుంటున్నాయని టీఎంసీ ఎదురుదాడికి దిగింది. ‘ఓ పార్టీ వ్యూహాలను, పత్రాలను ఎత్తుకెళ్లడం అమిత్ షా బాధ్యతా?’ అని ప్రశ్నించిన మమత, దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి గెలవాలని సవాల్ విసిరారు.బొగ్గు కుంభకోణం, హవాలా లింక్స్..ఈ మొత్తం వివాదానికి మూలం 2020లో అనూప్ మాఝీ అలియాస్ లాలాకు చెందిన అక్రమ బొగ్గు మైనింగ్ కుంభకోణం. ఈ స్కామ్ ద్వారా వచ్చిన నల్లధనాన్ని హవాలా మార్గాల ద్వారా ఐ-ప్యాక్ మాతృసంస్థ అయిన ‘ఇండియన్ ప్యాక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్’కు మళ్లించారని ఈడీ ప్రధాన ఆరోపణ. హవాలా ఆపరేటర్ల ద్వారా కోట్ల రూపాయలు ఈ సంస్థకు బదిలీ అయ్యాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.సాక్ష్యాలను మాయం చేయడం ఏంటి?ఈ ఆరోపణలపై దాడులు జరుగుతుండగా, ముఖ్యమంత్రి నేరుగా వెళ్లి సాక్ష్యాలను మాయం చేయడంపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి మాఫియాకు మద్దతు ఇస్తున్నారని.. ప్రభుత్వాలను కూల్చడానికి, ఏర్పాటు చేయడానికి ఐ-ప్యాక్ నేరుగా మాఫియా నుంచి డబ్బులు తీసుకుంటోందని బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ ఆరోపించారు. విచారణను అడ్డుకున్న మమతపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దర్యాప్తు సమయంలో ముఖ్యమంత్రి ప్రవేశించి సాక్ష్యాలను తీసుకెళ్లడం బహుశా భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విమర్శించారు.అరెస్టులు,ముమ్మర విచారణ..మనీ లాండరింగ్ విచారణలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐ-ప్యాక్ మరో సహ వ్యవస్థాపకుడు వినేష్ చందేల్‌ను ఈడీ అరెస్టు చేయడంతో ఈ కేసు ఉచ్చు మరింత బిగుసుకుంది. ఈ వ్యవహారంలో పీఎంఎల్ఏ నిబంధనలకు అనుగుణంగానే ఈడీ వ్యవహరించిందని, సరైన ఆధారాలు సమర్పించిందని ఢిల్లీ కోర్టు సైతం స్పష్టం చేసింది. దర్యాప్తు విస్తృతం కావడంతో డైరెక్టర్ రిషి రాజ్ సింగ్‌కు విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేయడమే కాకుండా, ప్రతీక్ జైన్, ఆయన భార్య, సోదరుడి వ్యాపార లావాదేవీలపై కూడా ఈడీ నిఘా పెట్టింది.ప్రశాంత్ కిషోర్ తప్పుకున్నాక..2021 ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ ఐ-ప్యాక్ నుంచి వైదొలిగినప్పటికీ, ఈ సంస్థ బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఇంకా కీలకంగానే వ్యవహరిస్తోంది. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు జరుగుతున్న ఈ దాడులు టీఎంసీ ప్రచార యంత్రాంగాన్ని దెబ్బతీసే కుట్ర అని ఆ పార్టీ ఆరోపిస్తుండగా.. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ ఈ అంశాన్ని వాడుకుంటోంది. ఈ వ్యవహారం రాబోయే ఎన్నికల్లో ఓటర్ల నాడిని ప్రభావితం చేసే ప్రధాన అస్త్రంగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు. -
‘ఝాల్మురీ’ ఓ డ్రామా: మమత
కోల్‌కతా: ఝార్గ్రామ్లో సోమవారం ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ దుకాణం వద్ద ఆగి ‘ఝాల్మురీ’ని కొనుగోలు చేయడం ఒక డ్రామా అని సీఎం మమతా బెనర్జీ కొట్టిపారేశారు. ‘అదంతా ప్రణాళికతో చేసిందే. అనుకోకుండా జరిగితే∙అక్కడికి అన్ని కెమెరాలు ఎలా వచ్చాయి?’ అని ప్రశ్నించారు. ప్రధాని వెంట ఉండే భద్రతాధికారులే వీటిని ముందుగానే ఏర్పాటు చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తన జేబు నుంచి రూ.10 నోటు బయటకు తీయడాన్ని ప్రస్తావిస్తూ ‘ఇదంతా నమ్ముతారా? మొత్తం డ్రామయే’ అని ఆమె అన్నారు. ‘మీకు అకస్మాత్తుగా ఝాల్మురీపై ప్రేమ పుట్టుకొచ్చింది. అయితే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలను చేపలు, మాంసం తినకుండా అడ్డుకోవడాన్ని ఏమంటారు?’ అంటూ మోదీని సీఎం ప్రశ్నించారు. -
‘ఝాల్మురీ’కి విశేష స్పందన
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆదివారం పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచారం సమయంలో ఝాల్మురీ దుకాణాన్ని సందర్శించినప్పటి ఫొటోలకు సామాజిక మాధ్యమ వేదికల్లో విపరీత స్పందన లభించింది. ఈ ఫొటోలకు 24 గంటల వ్యవధిలో ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల వ్యూస్, ఫేస్బుక్లో 9 కోట్ల వ్యూస్ లభించాయి. గత 22 ఏళ్ల కాలంలో గూగుల్ సెర్చ్‌లో ‘ఝాల్మురీ’కి ఇంతటి స్పందన రావడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. ప్రఖ్యాత చిరుతిండి ఝాల్మురీని మరమరాలు, పచ్చి మిర్చి, టమాటాలు, ఉల్లి, ఇతర మసాలా దినుసులు కలిపి తయారు చేస్తారు. -
టీఎంసీ గుండాలు పది రోజుల్లో లొంగిపోవాలి.. లేదా: మోదీ వార్నింగ్
కోల్‌కతా: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ప్రధాని మోదీ విరుచుకపడ్డారు. బెంగాల్లో అశాంతి సృష్టిస్తున్న టీఎంసీ గుండాలను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బెంగాల్‌లోని బిష్ణుపూర్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మే నాలుగు తర్వాత అవినీతిపరులు, గుండాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. కనుక టీఎంసీ గుండాలు పదిరోజుల్లోపు తమంతట తామే పోలీసుల ఎదుట లొంగిపోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. బిష్ణుపూర్ మాఫియా, టీఎంసీ సిండికేట్ ఆటలు ఇకసాగవన్నారు. గత 15 ఏళ్లుగా పశ్చిమబెంగాల్లో టీఎంసీ ఏవిధమైన అభివృద్ధి చేసిందో ప్రజలకు తెలియజేయాలన్నారు. టీఎంసీ విధానాలతో బెంగాల్ గుర్తింపు ప్రమాదకరంగా మారిందన్నారు. బెంగాల్ బ్రాండ్‌ను బీజేపీ కాపాడుతుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.అయితే అంతకుముందు లోక్‌సభలో లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు చాలా పెద్ద తప్పు చేశాయని పేర్కొన్నారు. దీనికి తగిన పర్యవసానాలను విపక్షాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని దేశ మహిళలకు ప్రతిపక్షాలు సమాధానం చెప్పుకోవాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు దేశ మహిళలను మోసం చేశాయని ఈ సందేశాన్ని దేశంలోని ప్రతి ఒక్కరికీ, ప్రతి గ్రామానికి చేరవేయాలని బీజేపీ కార్యకర్తలకు ప్రధాని మోదీ సూచించినట్లు తెలుస్తోంది -
‘మోదీ జీ.. మీ ప్రసంగం చట్ట విరుద్ధం’
కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం( ఏప్రిల్ 18వ తేదీ) రాత్రి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రచారం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని మోదీ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. దేశాన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు నిజాయితీగా మాట్లాడాలని, కానీ మీరు(మోదీ) ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ఆదివారం(ఏప్రిల్ 19వ తేదీ) హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో జరిగిన ఒక ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ బిల్లుపై జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ద్వారా ప్రధాని మోదీ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కోసం చట్టవిరుద్ధమైన ప్రచారం చేశారని ఆరోపించారు. వారు (బీజేపీ) రాజకీయ ప్రచారాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము మరియు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) ఉల్లంఘన జరిగింది’ అని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. తాము మహిళా రిజర్వేషన్ బిల్లు వ్యతిరేకం కాదని ,డీలిమిటేషన్ బిల్లుకు మాత్రమే వ్యతిరేకమన్నారు. డీలిమిటేషన్ అంశం మోదీ పొలిటికల్ అజెండాగా మమతా అభివర్ణించారు.శనివారం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలను ఉద్దేశించి ప్రధాని మోదీ హెచ్చరిస్తూ పాపం చేసినందుకు భారతదేశ మహిళలు వారిని తీవ్రంగా శిక్షించడం ఖాయమన్నారు. మరోవైపు నేటి పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్‌పై తన దాడిని కొనసాగించారు. శాసనసభలలోకి ఎక్కువ మంది మహిళలు ప్రవేశించకుండా నిరోధించడానికి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), కాంగ్రెస్‌లు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు మోదీ. ప్రస్తుతం పశ్చిమబెంగాల్లో రాజకీయ సమర శంఖారావం మరింత వేడెక్కింది. మోదీ వర్సెస్ మమతా అన్నట్లుగా పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారం వేడిక్కింది. -
మమతా సర్కార్‌కు రోజులు దగ్గరపడ్డాయి: ప్రధాని మోదీ
బిష్ణుపూర్: బెంగాల్ మహిళలు రిజర్వేషన్లు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఆయన బెంగాల్‌లోని బిష్ణుపూర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. మహిళా బిల్లుపై మమతకు చురకలు అంటించారు. మహిళలు ఎమ్మెల్యేలు కావడం టీఎంసీకి ఇష్టం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్‌తో కలిసి టీఎంసీ కుట్ర చేసిందన్న మోదీ.. మమతా సర్కార్‌పై బెంగాల్ ప్రజలు కోపంతో ఉన్నాయన్నారు. మమతా సర్కార్‌కు రోజులు దగ్గరపడ్డాయంటూ ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారుప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడంపై మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "బెంగాల్ మహిళలు 33 శాతం రిజర్వేషన్ కోరుకున్నారు. 2029 నుండి ఇది అమలు కావాలని బెంగాల్ మహిళలు ఆకాంక్షించారు. మహిళ రిజర్వేషన్లకు మేం కృషి చేశారు. కానీ టీఎంసీ.. కాంగ్రెస్‌తో కలిసి కుట్ర పన్నింది. మహిళలకు రిజర్వేషన్ కల్పించే చట్టం ఆమోదం పొందకుండా అడ్డుకుంది’’ అని మోదీ మండిపడ్డారు.మమతా సర్కార్‌ను కనికరం లేని ప్రభుత్వంంగా మోదీ అభివర్ణించారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వాతావరణం, ఉత్సాహం, ప్రేమ, ఆనందం మమతా ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహానికి చిహ్నాలు. ఇది మా శారదా దేవి నడయాడిన పవిత్ర భూమి, ఇక్కడ ఎంతో మంది మహిళలు హాజరయ్యారు. బీజేపీ అంటేనే మహిళా సాధికారత, రక్షణకు మారుపేరు, అందుకే మహిళలు బీజేపీని ఎక్కువగా దీవిస్తారు. వికసిత భారత్ నిర్మాణంలో మహిళల పాత్ర మరింత విస్తరించాలని మేము కోరుకుంటున్నాము. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని మేము ఆకాంక్షిస్తున్నాం’’ అంటూ మోదీ చెప్పుకొచ్చారు. -
దీదీ లోకల్ మంత్రం.. కమలం బూత్ తంత్రం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంటున్న కొద్దీ ప్రధాన రాజకీయ పక్షాలైన అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ తమ ప్రభుత్వంపై వ్యతిరేకతను అధిగమించేందుకు స్థానిక సమస్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈసారి తృణమూల్‌ను ఎలాగైనా గద్దె దింపి రాష్ట్రంలో తొలిసారి అధికారం చేపట్టాలని పట్టుదలగా ఉన్న బీజేపీ బూత్ స్థాయి నుంచే పక్కా ప్రణాళికలు రచిస్తోంది. తృణమూల్ ‘ప్రతిజ్ఞా స్తంభాలు’ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ‘స్థానిక మేనిఫెస్టో’లతో తృణమూల్ వినూత్నంగా ప్రచారం చేస్తోంది. స్థానికంగా ప్రధాన సమస్యలను గుర్తిస్తూ, వాటి పరిష్కారానికి మేనిఫెస్టోల్లో హామీలిస్తోంది. డార్జిలింగ్ పర్వత ప్రాంతంలో మూడు అసెంబ్లీ స్థానాలు మినహా రాష్ట్రంలోని మిగతా 291 చోట్లా తృణమూల్ బరిలో ఉంది. అభ్యర్థుల్లో జవాబుదారీతనం పెంచేందుకు, ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పేందుకు ప్రతి నియోజకవర్గంలో ‘ప్రతిజ్ఞా స్తంభం’ పేరిట వినూత్న కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. స్థానిక అభ్యర్థి తాలూకు ఎన్నికల కార్యాలయం ముందు ఈ స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానిపై అభ్యర్థి పేరుతో పాటు సమస్యల పరిష్కారానికి చేస్తున్న వాగ్దానాలను పొందుపరుస్తున్నారు. వారంక్రితం ప్రారంభమైన ఈ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా శరవేగంగా కొనసాగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్రతిజ్ఞా స్తంభాలు, ప్రచార కార్యక్రమాల వీడియోను పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీలో కూడా పంచుకుంది. అభ్యర్థి ప్రజలకు నేరుగా జవాబుదారీగా ఉంటారనే స్పష్టమైన సందేశాన్ని రాష్ట్రవ్యాప్తంగా పంపడం దీని వెనక వ్యూహమని భావిస్తున్నారు. గతం నుంచి బీజేపీ పాఠాలు ఇక బీజేపీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన సంస్థాగత లోపాలను దిద్దుకునే పనిలో పడింది. ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగ సభల ద్వారా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తూనే, అసలు యుద్ధభూమి అయిన పోలింగ్ బూత్‌ల నిర్వహణపై ఈసారి ప్రధానంగా దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని మొత్తం 85,379 పోలింగ్ బూత్‌ల్లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు మినహాయించి అంతటా ఇప్పటికే బూత్ కమిటీల ఏర్పాటును పూర్తి చేసింది. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు చెలరేగిన హింస కారణంగా బీజేపీ కార్యకర్తలు భారీగా బూత్‌లను వదిలి వెళ్లడం ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఈసారి ఆ పరిస్థితి తలెత్తరాదని కార్యకర్తలకు పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. చివరి నిమిషం దాకా ఎట్టి పరిస్థితుల్లోనూ బూత్‌ను వదలకూడదని ఆదేశించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా నేరుగా బూత్ స్థాయి కార్యకర్తలతో సంభాషిస్తూ ఉత్సాహం నింపుతున్నారు. బూత్ మేనేజ్మెంట్ను పకడ్బందీగా అమలు చేసేందుకు బెంగాల్‌ను బీజేపీ ఐదు భాగాలుగా విభజించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు అనంత్ నారాయణ్ మిశ్రా, పవన్ రాణా, సిద్ధార్థన్, ఎన్.మధుకర్, పవన్ సాయ్‌కి వాటి బాధ్యతలు అప్పగించింది. వీరంతా గత అక్టోబర్ నుంచే క్షేత్రస్థాయిలో మకాం వేశారు. సంస్థాగత లోపాలను సరిదిద్దుతూ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. మూడు నుంచి ఐదు బూత్‌లను కలిపి ఒక ‘శక్తి కేంద్రం’గా ఏర్పాటు చేసి, వాటి పర్యవేక్షణ బాధ్యతలను రా్రõÙ్టతర నేతలకు అప్పగించారు. నిరంతర సమీక్షలతో బూత్ స్థాయిలో రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. బూత్ మేనేజ్మెంట్లో ఈసారి తృణమూల్‌కు దీటుగా నిలుస్తామని బీజేపీ ధీమాగా ఉంది.రంగంలోకి ఆరెస్సెస్ క్షేత్రస్థాయిలో హిందువులను ఏకం చేసేందుకు ఆరెస్సెస్ ఆధ్వర్యంలో బెంగాల్ అంతటా ముమ్మర ప్రచారం సాగుతోంది. బెంగాలీ హిందువుల ఉనికిని ఈ ఎన్నికలు కీలకమంటూ ప్రచారం చేస్తోంది. ఎన్నికల హింసకు వెరచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉండే ధోరణికి స్వస్తి పలకాలి. ప్రతి బూత్నూ సురక్షితం చేసి, ఓటర్లు నిర్భయంగా ఓటేసేలా చూడాలి’’ అని కార్యకర్తలకు సూచిస్తోంది. ఈసారి ఒక్క బూత్ నుంచి కూడా తమ కార్యకర్తలను తృణమూల్ పారదోలే పరిస్థితి ఉండబోదని ఆరెస్సెస్ ముఖ్య నేత ఒకరు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా వచ్చిన ఆరెస్సెస్ స్వయంసేవకులు జనజాగరణ కార్యక్రమంలో నిమగ్నమైనట్టు వెల్లడించారు. శరత్ చంద్ర ముక్తవరం -
టీఎంసీ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐటీ అధికారులు శుక్రవారం టీఎంసీ నేతల ఇళ్లలో సోదాలు చేపట్టారు. వీరిలో ఒకరు రస్బెహారీ అసెంబ్లీ సీటుకు పోటీ చేస్తున్న టీఎంసీ ఎమ్మెల్యే దేబాశీస్ కుమార్ కాగా, మరొకరు భవానీపూర్ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీని బలపర్చిన మిరాజ్ షా కావడం గమనార్హం. కోల్‌కతాలోని దేబాశీస్ కుమార్ నివాసం, ఎన్నికల కార్యాలయం, ఆయనకు సంబంధించిన ఇతర కార్యాలయాల్లో ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించిన తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగాయి. ఐటీ అధికారుల మరో బృందం దక్షిణ కోల్‌కతాలోని ఎల్గిన్ రోడ్డులో ఉన్న మిరాజ్ షా నివాసంపై దాడి చేసింది. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీని బలపర్చిన నాలుగు వేర్వేరు మతాలకు చెందిన నేతల్లో మిరాజ్ ఒకరు. దేబాశీస్ కుమార్ సన్నిహితుడు, టీఎంసీ నేత కుమార్ సాహాకు చెందిన కాళీఘాట్ నివాసంపైనా ఐటీ దాడులు జరిగాయి. భూకుంభకోణం ఆరోపణలున్న దేబాశీస్ కుమార్ ఇప్పటికే పలుమార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. తమ నేతల ఇళ్లలో ఐటీ సోదాలను టీఎంసీ ఖండించింది. తమ పార్టీ నేతలను రెచ్చగొట్టేందుకు, వేధించేందుకే బీజేపీ ప్రభుత్వం ఇలా దాడులు చేయిస్తోందని ఆరోపించింది. ఐటీ సోదాల సమయంలో దేబాశీస్ నివాసం వద్ద గుమికూడిన టీఎంసీ కార్యకర్తలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందు జాగ్రత్తగా అక్కడ కేంద్ర బలగాలను మోహరించారు. -
అఖిలభారత సర్వీసుల విధానం నిష్ఫలమవుతోంది
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక ఉన్నపళంగా సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సహా 1,000 మందికిపైగా ఉన్నతాధికారులను రాత్రికి రాత్రే ఈసీ బదిలీచేసిన ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తంచేసింది. అయితే ఈ ఘటనలో తాము జోక్యంచేసుకోబోమంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ మేరకు ఈసీ నిర్ణయాన్ని సమరి్థస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌చేస్తూ దాఖలైన పిల్‌ను కొట్టేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ‘‘ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో ఉన్నతాధికారుల బదిలీలపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ సంప్రదిస్తే సముచితంగా ఉంటుంది. ఈసీ, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాల బేధాలతో అఖిలభారత సర్వీసుల అధికారులు నలిగిపోతున్నారు. ఆలిండియా సర్వీసెస్ ఏర్పాటు ఉద్దేశం నిష్ఫలమవుతోంది. ఇష్టారీతిన వాళ్లను బదిలీచేస్తున్నారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, ఈసీ మధ్య నమ్మకం లోపించిన నేపథ్యంలో సమన్వయం కోసం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)సర్వే కోసం న్యాయాధికారులను మేం నియమించాల్సి వచ్చింది’’అని వ్యాఖ్యానించింది. -
ఈవీఎం బటన్‌పై పెర్ఫ్యూమ్.. ఎన్నికల సంఘం సీరియస్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌లలో అనూహ్య పరిణామాలకు సంబంధించిన బెదిరిపులు వెలుగుచూస్తున్నాయి. ఓటర్లను భయపెట్టేందుకు, నిఘాను తప్పించుకునేందుకు దుండగులు వేస్తున్న కొత్త ఎత్తుగడలు తెలుసుకున్న ఎన్నికల సంఘం (ఈసీ) అవాక్కవుతోంది. ఈవీఎం బటన్లకు పెర్ఫ్యూమ్ పూయడం, వెబ్‌కాస్టింగ్ కెమెరాలకు చూయింగ్ గమ్ అంటించడం వంటి చర్యలపై ఈసీ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని, వెంటనే ఆయా బూత్‌లలో రీపోలింగ్ నిర్వహిస్తామని గట్టి హెచ్చరికలు జారీ చేసింది.ఓటర్లకు పెర్ఫ్యూమ్ బెదిరింపులుఓటర్లను ప్రభావితం చేసేందుకు కొందరు అగంతకులు దారుణమైన బెదిరింపులకు పాల్పడుతున్నారు. ‘మీరు ఏ పార్టీకి ఓటు వేశారో మాకు ఇట్టే తెలిసిపోతుంది, ఎందుకంటే ఈవీఎం బటన్లపై మేము పెర్ఫ్యూమ్ పూస్తాం’ అంటూ ఓటర్లను భయాందోళనలకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల్లో రికార్డింగ్ జరగకుండా ఉండేందుకు సీసీ కెమెరాలకు చూయింగ్ గమ్ అంటిస్తూ, నిఘా వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అక్రమాలపై దృష్టి సారించిన ఎన్నికల సంఘంఓటర్లను బెదిరించినా, నిఘా వ్యవస్థను ట్యాంపరింగ్ చేసినా రీపోలింగ్ తప్పదని స్పష్టం చేసింది.విద్యుత్ కోతలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లుపోలింగ్ సజావుగా సాగేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) మనోజ్ అగర్వాల్ ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. పోలింగ్ సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేకంగా జనరేటర్లను సైతం సిద్ధం చేస్తున్నారు. నెట్వర్క్ సమస్యలు ఉన్న డార్జిలింగ్, కాలింపాంగ్ సహా 642 'షాడో జోన్ల'లో వెబ్‌కాస్టింగ్ ఆగకుండా టెలికాం ఆపరేటర్ల ద్వారా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. పోలింగ్‌కు 7 రోజుల ముందే బూత్‌లలో కెమెరాల ఏర్పాటు, 2 రోజుల ముందే లైవ్ వెబ్‌కాస్టింగ్ ప్రారంభం కానుంది.అడుగడుగునా భారీ భద్రతఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర బలగాలతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 152 నియోజకవర్గాల్లో జరిగే తొలి దశ పోలింగ్ కోసం ఏకంగా 2,404 కేంద్ర బలగాల కంపెనీలను మోహరిస్తున్నారు. అత్యధికంగా ముర్షిదాబాద్‌లో 316 కంపెనీలు రంగంలోకి దిగుతుండగా.. ఆ తర్వాత తూర్పు మేదినీపూర్ (273), పశ్చిమ మేదినీపూర్ (272) జిల్లాల్లో భారీగా బలగాలను నియమించారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద సాయుధులైన కేంద్ర బలగాలతో పాటు లాఠీలు ధరించిన రాష్ట్ర పోలీసు సిబ్బంది అప్రమత్తంగా కాపలా ఉండనున్నారు.ఇది కూడా చదవండి: లష్కరే టాప్ కమాండర్‌పై దాడి.. పరిస్థితి విషమం -
దమ్ముంటే రోజూ నా కారు తనిఖీ చేయండి
ఇస్లాంపూర్: పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచారం వేళ తృణమూల్ కాంగ్రెస్ నేతలను మాత్రమే ఎన్నికల సంఘం అధికారులు లక్ష్యంగా చేసుకున్నారని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఆరోపించారు. బుధవారం ఉత్తర్ దినాజ్‌పూర్ జిల్లాలోని ఇస్లాంపూర్‌లో ప్రచారసభలో ఆమె ప్రసంగించారు. ‘‘కోల్‌కతాలోని డమ్‌డమ్ ఎయిర్పోర్ట్ సమీపంలో నా కారును తనిఖీచేసేందుకు కేంద్రబలగాలు దుస్సాహసం చేశాయి. మా టీఎంసీ నేతలందరి వాహనాల్లో సోదాలు చేస్తున్నప్పుడు ప్రధాని మోదీ, హోం మంత్రి, ఇతర బీజేపీ అగ్రనేతల వాహనాలను ఎందుకు వదిలేస్తున్నట్లు?. కేంద్రబలగాలకు అంత దమ్ముంటే నా వాహనాన్ని రోజూ తనిఖీచేయండి. ఇదే విషయం ఇవాళ వాళ్లకు చెప్పా. భయంతో వాళ్లు పారిపోయారు’’ అని మమత అన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కారును సైతం తనిఖీచేశారని టీఎంసీ బుధవారం తెలిపింది. ఈసారి ఎలాగైనా బెంగాల్లో టీఎంసీని అన్యాయంగా ఓడించి తాము గద్దెనెక్కాలని బీజేపీ శతథా ప్రయత్నిస్తోందని టీఎంసీ ఆరోపించింది. -
ఎన్నికల వేళ బెంగాల్లో కొత్త ట్విస్ట్?
సాక్షి, న్యూఢిల్లీ: బెంగాల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ సిలిగురి కారిడార్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానాంశంగా మారింది. దేశ భద్రత దృష్ట్యా దాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తారంటూ మొదలైన ప్రచారం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. దేశ సమాఖ్య స్వరూపాన్ని దెబ్బతీసేందుకు, రాష్ట్రాల హక్కులను కాలరాసేందుకే మోదీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరుగుతున్నారు. ఈ అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా మలచుకుంటున్నారు.వ్యూహాత్మకంగా కీలకం భారత ప్రధాన భూభాగాన్ని తూర్పు, ఈశాన్య రాష్ట్రాలతో కలిపే అతి సన్నని మార్గం సిలిగురి కారిడార్. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పుండే ఈ కారిడార్ భౌగోళికంగా చిన్నదైనా వ్యూహాత్మకంగా అత్యంత కీలకం. దేశానికే ‘లైఫ్ లైన్’వంటిది. దీనికి ఓ వైపున నేపాల్, మరోవైపు బంగ్లాదేశ్, ఇంకోవైపు భూటాన్, చైనా సరిహద్దు ప్రాంతాలున్నాయి. కోడి తల మాదిరిగా ఉండటంతో ఈ కారిడార్‌ను ‘చికెన్ నెక్’గా పిలుస్తారు. ఈశాన్య రాష్ట్రాలకు రోడ్డు, రైల్వే, సైనిక సరఫరా, వాణిజ్య రవాణా తదితరాలన్నీ ఈ మార్గంపైనే ఆధారపడి ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల వేళ ఈ మార్గం గనుక మూసుకుపోతే తూర్పు–ఈశాన్య ప్రాంతానికి మిగతా దేశంతో సంబంధాలే తెగిపోయే ప్రమాదముంది.తృణమూల్ మండిపాటు సరిహద్దు ప్రాంతాల పరిరక్షణ, భద్రతపై ఇటీవల పార్లమెంట్లో చర్చ సందర్భంగా సమయంలో సిలిగురిని కేంద్రపాలిత ప్రాంతం చేయవచ్చన్న వార్తలు తెరపైకొచ్చాయి. అలాగైతే ఉద్రిక్తతల వేళ ఆ ప్రాంత భద్రతపై కేంద్రానికి మెరుగైన నియంత్రణ ఉంటుందని, చైనాతో యుధ్ద పరిస్థితుల వంటివి తలెత్తితే త్వరిత నిర్ణయాలు, వ్యూహాత్మక కదలికలకు వీలుంటుందనే వాదన తెరపైకొచ్చింది. అలాంటి ప్రతిపాదనలేవీ లేవని కేంద్రం స్పష్టం చేసినా విపక్షాలు, ముఖ్యంగా తృణమూల్ మాత్రం దీన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకుంది. స్థానికుల్లో తాము బెంగాల్ నుంచి వేరుపడుతున్నామన్న భావన వస్తుందని ఆ పార్టీ వాదిస్తోంది.‘‘ఇలా ఒక రాష్ట్రం నుంచి కొంత ప్రాంతాన్ని విడదీసి కేంద్రపాలిత ప్రాంతం చేయడం సమాఖ్య నిర్మాణానికి విరుద్ధం. ఇది కేవలం పాలనాపరమైన మార్పు కాదు, రాష్ట్ర హక్కులపై దెబ్బ’’అంటూ జోరుగా ప్రచారం చేస్తోంది. మమత సర్కారుపై ఒత్తిడి పెంచడం, బెంగాలీల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడం, భద్రతాపరమైన అంశాలను తెరపైకి తేవడం వంటి ఉద్దేశాలతో బీజేపీ తొలుత ఉద్దేశపూర్వకంగానే ‘కేంద్రపాలిత ప్రాంతం’అంశాన్ని ప్రచారంలో పెట్టిందనే విశ్లేషణలు విని్పస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయమేదీ ఉండకపోయినా భద్రతాపరంగా పరిస్థితులు మారి ఉద్రిక్తతలు పెరిగితే ఈ దిశగా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.ఎన్నికలపై ప్రభావం..సిలిగురి కారిడార్‌పై రాజకీయ రచ్చ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఇదే అంశాన్ని తృణమూల్ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. గౌతమ్ దేవ్ వంటి ఆ పార్టీ నేతలు ‘కేంద్రపాలిత ప్రాంతం’అంశాన్ని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పట్టణ, గ్రామీణ, తేయాకు కార్మికుల మిశ్రమంగా ఉండే సిలిగురి ప్రాంతంలో కనీసం 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాల్లో ఈ ప్రచారం బాగా ప్రభావం చూపనుంది. దీనికి విరుగుడుగా స్థానిక సమస్యలు, ఉద్యోగాలు, వేతనాలు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలను బీజేపీ నమ్ముకుంది. వాటిపైనే ముమ్మరంగా ప్రచారం చేస్తూ స్థానికులను ఆకట్టుకునే పనిలో పడింది. సిలిగురి ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాల్లోని తేయాకు తోట కార్మికులు, గిరిజన వర్గాలు, రాజబన్షీలలో బీజేపీ ఇప్పటికే ప్రాబల్యాన్ని పెంచుకుంది. దాంతో ఇక్కడ తిరిగి పట్టు సాధించేందుకు తృణమూల్ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. -
శిఖరాగ్రం నుంచి శిథిలావస్థకు
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు ప్రధానంగా అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్యే కేంద్రీకృతమైంది. రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు అప్రతిహతంగా పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సిన దురవస్థకు చేరింది. 50 ఏళ్లుగా అధికారానికి దూరమైన కుర వృద్ద పార్టీ ఈసారి ఖాతా తెరిచేందుకే కిందా మీదా పడే పరిస్థితికి చేరుకుంది...! 1977 నుంచి మొదలైన పతనం స్వాతంత్య్రానంతరం నుంచి బెంగాల్‌ను కాంగ్రెస్ 1977 దాకా పాలించింది. బిదాన్ చంద్రరాయ్, ప్రఫుల్ల చంద్రసేన్, అజయ్ ముఖర్జీ, సిద్ధార్థ శంకర్ రే వంటి దిగ్గజ నేతలు ముఖ్యమంత్రులుగా చేశారు. 1977లో రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం మొదలైంది. ఆ ఏడాది జ్యోతిబసు నాయకత్వంలోని కమ్యూనిస్టులు రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. కాంగ్రెస్‌తో విభేదించి 1998లో మమతా బెనర్జీ సొంత కుంపటి పెట్టుకోవడంతో బెంగాల్లో పార్టీ పరిస్థితి మరింత కునారిల్లుతూ వచ్చింది. అప్పటినుంచీ క్రమంగా ప్రాధాన్యతను కోల్పోయింది. 2011లో బెంగాల్లో తృణమూల్ తొలిసారిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కాంగ్రెస్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు సాధించిన కాంగ్రెస్ 2011లో 42, 2016లో 44 సీట్లు నెగ్గింది. కానీ గత ఐదేళ్లలో బెంగాల్లో బీజేపీ పుంజుకోవడంతో కాంగ్రెస్ భారీగా నష్టపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా నెగ్గలేకపోయింది! ఓట్ల శాతంలోనూ సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. 2016లో కేవలం 3 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ 2021లో ఏకంగా 77 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదా చేజిక్కించుకుంది. కార్యాలయాల్లోనూ కన్పించని సందడి ప్రస్తుతం బెంగాల్‌వ్యాప్తంగా ప్రతి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో తృణమూల్, బీజేపీ జెండాలతో ఎన్నికల కోలాహలం కనబడుతుంటే కాంగ్రెస్‌లో మాత్రం చడీచప్పుడే లేదు. చాలా జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను సైతం తెరిచే పరిస్థితి లేదు! పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హస్తంజెండా పట్టుకునే కార్యకర్తే కరువైన పరిస్థితి! 2021 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకొంటే అన్ని పార్టీలూ ‘సున్నా’చుట్టాయి. దాంతో కాంగ్రెస్ ఈసారి మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తోంది. బెహ్రాంపూర్ నుండి అధిర్ రంజన్ చౌదరి, మాలతీపూర్ నుంచి మౌసమ్ నూర్, సుజాపూర్ నుంచి అబ్దుల్ హన్నన్ తదితరులు బరిలో ఉన్నారు.పతనానికి కారణాలెన్నో బెంగాల్లో కాంగ్రెస్ పతనానికి అనేక కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార పార్టీలకు వ్యతిరేకంగా భారీ ఉద్యమాలు నడపడంలో మూడు దశాబ్దాలుగా పార్టీ విఫలమైంది. తొలుత లెఫ్ట్ ఫ్రంట్‌కు దన్నుగా ఉన్న మధ్య, ఉన్నత తరగతి ఓటర్లు ఆ తర్వాత టీఎంసీ వైపు మళ్లారు. బీజేపీ ఎదుగుదలతో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు దాదాపుగా గండి పడింది. రాష్ట్రంలో 30 శాతమున్న ముస్లింలు పూర్తిగా తృణమూల్ వైపు వెళ్లారు. -
బెంగాల్‌ను మూడు ముక్కలు చేసేందుకు కుట్ర: మమత
కోల్‌కతా: డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా పశ్చిమ బెంగాల్‌ను మూడు ముక్కలుగా విభజించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను ఒడిశా, బిహార్లలో కలుపుతారే మోనంటూ అనుమానం వ్యక్తం చేశారు. బంకురా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో మమత మాట్లాడారు. టీఎంసీ నుంచి గద్దె దించేందుకు బీజేపీ రూ.వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. ఈ విషయమై బీజేపీ తనతో రూ.1,000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుందని, ఇప్పటికే రూ.200 కోట్లు ఇచ్చిందని హుమాయూన్ కబీర్ చేసిన ఆరోపణలతో కూడిన వీడియోను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్య చేశారు. -
భవానీపూర్‌లో నా అభ్యర్థిత్వం చెల్లకుండా కుట్ర
కోల్‌కతా: భవానీపూర్‌లో తన అభ్యర్థిత్వం చెల్లకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఇందులో భాగంగా రెండు తప్పుడు కేసుల్లో తనను ఇరికించేందుకు చేసిన ప్రయత్నాలను ప్రజలు, టీఎంసీ కార్యకర్తలు వమ్ము చేశారన్నారు. ఆమె శనివారం పశ్చిమ్ మేదినీపూర్ జిల్లాలో జరిగిన టీఎంసీ ప్రచార ర్యాలీల్లో ప్రసంగించారు. ‘ఈసీ సాయంతో భవానీపూర్‌లో నా అభ్యర్థిత్వాన్ని చెల్లకుండా చేసేందుకు శుక్రవారం బీజేపీ నాకు వ్యతిరేకంగా రెండు తప్పుడు అఫిడవిట్లు సమర్పించేందుకు కుట్ర పన్నింది. వారి ప్రయత్నాలను మేం భగ్నం చేశాం’అని ఆమె ప్రకటించారు. భవానీపూర్‌లో మమతకు ప్రధాన ప్రత్యర్థిగా ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి బరిలో ఉండటం తెల్సిందే. సర్ ప్రక్రియ సందర్భంగా బీజేపీ బలవంతంగా ఓటరు జాబితాల్లోని 90 లక్షల ఓటర్ల పేర్లను తొలగించిందని మమత విమర్శించారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసి నెగ్గే సత్తా లేకనే బీజేపీ దొడ్డిదారిన ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలను అనుకూలంగా మార్చుకునేందుకు ఈవీఎంలను ట్యాంపర్ చేసేందుకూ బీజేపీ పథకం వేస్తోందన్నారు. -
సానుభూతి కోసం బాధిత కార్డు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కేంద్ర హోం మంత్రి అమి త్ షా నిప్పులు చెరిగారు. ప్రజల సానుభూతి కోసం సీఎం మమత బాధితురా లినంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆరో పించారు. టీఎంసీ 15 ఏళ్ల పాలనతో రాష్ట్రం ఆర్థికంగా, శాంతిభద్రతల విషయంలో పూర్తిగా దిగజారిపోయిందని విమర్శించారు. అమిత్ షా శనివారం బంకురా, పురూలియా జిల్లాల్లో శనివారం బీజేపీ ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. బీజేపీకి అధికారమిస్తే టీఎంసీ సిండికేట్ పాలనకు ముగింపు తప్పదన్నారు. మహిళలకు అన్ని వేళలా రక్షణ కల్పిస్తామని తెలిపారు. అన్యాయానికి గురవుతున్న మహిళలకు న్యాయం చేకూరుస్తామని హామీ ఇచ్చారు. ‘సీఎం మమత బాధితురాలినంటూ చెప్పుకుంటున్నారు. కాలికో తలకో బ్యాండేజీ కట్టుకుని కనిపిస్తుంటారు. ఈసారి అలా జరగదు. కాలికి, చేతికి, తలకు బ్యాండేజీతో కనిపించినా బెంగాల్ ప్రజలు ఆమెకు ఓటేయరు’అని ఆయన స్పష్టం చేశారు. -
బెంగాలీలను మైనార్టీలు కానివ్వం
జాంగీపూర్/కత్వా/కుష్మాండీ: పశ్చిమ బెంగాల్లో బుజ్జగింపు రాజకీయాలను అంతం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని, బెంగాల్ ప్రజలను సొంత రాష్ట్రంలో మైనార్టీలు కానివ్వబోమని తేల్చిచెప్పారు. శనివారం బెంగాల్‌లోని జాంగీపూర్, కత్వా, కుష్మాండీలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ అసెంబ్లీ ఎన్నికలను బెంగాల్ గుర్తింపు, భవిష్యత్తు పరిరక్షణ కోసం జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని, చొరబాటుదార్లకు మద్దతు ఇస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే చొరబాటుదార్లను బయటకు పంపిస్తామని పునరుద్ఘాటించారు. జాతీయ భద్రతే తమకు ముఖ్యమని తేల్చిచెప్పారు. అక్రమ వలసల కారణంగా బెంగాల్లో చాలా ప్రాంతాల్లో జనాభా నిష్పత్తి మారిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. ‘మా, మాటీ, మనుష్’నినాదాన్ని తృణమూల్ కాంగ్రెస్ వదిలేసిందని, అధికారం నిలబెట్టుకోవడానికి చొరబాటుదార్లపై ఆధారపడుతోందని ధ్వజమెత్తారు. వారి ఓట్లతో వారి కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే తృణమూల్ కాంగ్రెస్ ఉద్దేశమని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాలను ఇకపై సహించే ప్రసక్తే లేదన్నారు. ప్రజలంతా ఏకమై ప్రభుత్వాన్ని మార్చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు వేసే ప్రతి ఓటు బీజేపీకి ఆశీర్వాదంగా మారాలని చెప్పారు. ప్రధానమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే.. కమ్యూనిస్టులకు కార్బన్ కాపీగా తృణమూల్ ‘‘బెంగాల్లో మార్పు తీసుకొస్తాం. రాష్ట్రాన్ని కాపాడుతాం. మార్పును ఎవరూ అడ్డుకోలేరు. బెంగాల్లో అహంకారం ప్రదర్శించిన ఎంతోమంది అడ్రస్ లేకుండాపోయారు. బ్రిటిష్ పాలకులతోపాటు కాంగ్రెస్, వామపక్షాలు గతంలో ఏమైందో చూశాం. ఇప్పుడు అదే పరిస్థితి తృణమూల్ కాంగ్రెస్‌కు ఎదురవుతుంది. బెంగాల్లో శ్రీరామనవమి వేడుకల్లో హింస జరిగితే మమతా బెనర్జీ ప్రభుత్వం నిందితులను కాపాడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని తేలడంతో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు అది సహించలేక తప్పుడు వీడియోలు, అబద్ధాలను పోస్టు చేస్తున్నారు. అస్సాం, పుదుచ్చేరిలోనూ ఇలాంటి కుతంత్రాలు సాగించారు. అబద్ధాలను నమ్మొద్దని ప్రజలను కోరుతున్నా. ఎన్నికల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలి. బీజేపీని గెలిపించుకోవాలి. మా, మాటీ, మనుష్ నినాదంతో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టు పార్టీలకు కార్బన్ కాపీగా మారిపోయింది. కమ్యూనిస్టు శక్తులు, సిండికేట్లు తృణమూల్ కాంగ్రెస్‌తో చేతులు కలిపాయి. కమ్యూనిస్టుల పాలనలో జరిగినట్లుగానే వేధింపులు, అరాచకాలు, అవినీతి అక్రమాలు కొనసాగుతున్నాయి. వామపక్ష కార్యకర్తలు ఓట్ల కోసం ప్రజలను బెదిరించేవారు. నేడు టీఎంసీ రౌడీలు సైతం అదే పని చేస్తున్నారు. అక్రమ ఆయుధా లు, డ్రగ్స్, పశువుల అక్రమ రవాణా, కట్ మనీ, కమీషన్లు.. ఇలా అన్నింటినీ తృణమూల్ కాంగ్రెస్ కాంట్రాక్టు తీసుకుంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతిపరులను కచ్చితంగా శిక్షిస్తాం. ప్రజలను వేధించినవారి కోసం జైలు తలుపులు తెరుచుకుంటాయి’’ అని అన్నారు. శరణార్థులకు భారత పౌరసత్వం ‘‘బీజేపీ అధికారంలోకి రాగానే మతువా, నామశూద్ర వర్గాలతోపాటు ఇతర శరణార్థులకు సీఏఏ కింద భారత పౌరసత్వం కల్పించే ప్రక్రియను వేగవంతం చేస్తాం. చొరబాటుదార్లు తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోవాల్సిందే. వారు వెనక్కి వెళ్లిపోవాల్సిన సమయం వచ్చింది. చొరబాటుదార్లను కాపాడేవారికి కూడా శిక్ష తప్పదు. బెంగాల్లో మా నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్ ఒక్కటే కాదు. మరొకటి కూడా ఉంది. అదే సబ్కా హిసాబ్. ప్రతి అరాచకవాదిని, అవినీతిపరుడిని శిక్షిస్తాం. శరణార్థులకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుంది. అలాగే బీజేపీ పాలనలో బెంగాల్‌ను ఉన్నత శిఖరాలకు చేరుస్తాం. ఓటింగ్‌లో మహిళల భాగస్వామ్యం అధికంగా ఉన్నచోట బీజేపీ విజయం సాధిస్తోంది. బెంగాల్లోనూ మహిళల ఓట్లతో అధికారంలోకి రాబోతున్నాం. ప్రజలంతా కలిసి తృణమూల్ కాంగ్రెస్ పాలనను అంతం చేయాలి. బీజేపీ పాలన వచ్చాక.. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, సిండికేట్ల అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. బెంగాల్లో అమలవుతున్న పథకాలను కొనసాగిస్తాం. వాటిని ఆపబోం’’అని మోదీ స్పష్టం చేశారు.మహిళల భద్రతే మా ధ్యేయం ‘‘మహిళల భద్రతకు బీజేపీ సర్కార్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో మహిళలపై లెక్కలేనన్ని నేరాలు జరిగాయి. వారిని దారుణంగా వేధించారు. మా ప్రభుత్వం వచ్చాక నేరగాళ్లను కఠినంగా శిక్షిస్తాం. పాత కేసులను మళ్లీ తెరుస్తాం. ఇది మోదీ గ్యారంటీ. మహిళల భద్రతే మా ధ్యేయం. తృణమూల్ ప్రభుత్వం ఫుట్‌బాల్ ఆటను కూడా సిండికేట్లకు అప్పగించింది. గత డిసెంబర్లో అర్జెంటీనా ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటన సందర్భంగా గందరగోళం జరిగింది. ఆ సిగ్గుచేటైన చిత్రాలను ప్రపంచమంతా చూసింది. బెంగాల్లో ప్రభుత్వం అంటే సిండికేట్, సిండికేట్ అంటే ప్రభుత్వం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. చట్టవిరుద్ధమైన పాలనకు పర్యాయపదం తృణమూల్ సర్కార్. మమతా బెనర్జీ పార్టీకి సిద్ధాంతాలు, విలువులు లేవు. అందుకే అది ఇతర రాష్ట్రాల్లో అడుగుపెట్టలేకపోయింది’’అని మోదీ అన్నారు. -
మెగా శనివారం.. ఒకేరోజు బరిలో మోదీ, మమత, షా..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంగ్రామం అత్యంత ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. ఏప్రిల్ 11.. శనివారం.. ‘మెగా శనివారం’గా మారింది. నేడు బెంగాల్ రాజకీయ ముఖచిత్రంపై ఒక మహా ఘట్టంగా నిలిచిపోనుంది. ఒకే రోజు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ తమ సత్తా చాటేందుకు సుడిగాలి పర్యటనలు చేస్తుండటంతో రాష్ట్రంలో పొలిటికల్ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోయింది.ఈ నలుగురు అగ్ర నేతల రాకతో బెంగాల్ ఎన్నికల వాతావరణం దద్దరిల్లుతోంది. తూర్పు బర్ధమాన్ జిల్లాలోని కల్నా సమీపంలోని సిమ్లాన్ వద్ద ఏర్పాటు చేసిన ‘విజయ్ సంకల్ప్’ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇందుకోసం కల్నా-బర్ధమాన్ స్టేట్ హైవే పక్కన ఉన్న వ్యవసాయ భూమిలో భారీ వేదికను సిద్ధం చేశారు. భద్రత కోసం వేదిక పరిసరాలను సీసీటీవీ నిఘాలోకి తీసుకురావడంతో పాటు, హెలికాప్టర్ ట్రయల్స్ కూడా పూర్తి చేశారు. ఈ సభకు 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు హాజరవుతున్నారని, ప్రతిపక్ష శిబిరాల నుంచి భారీగా వలసలు ఉంటాయని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాజీబ్ భౌమిక్ తెలిపారు.మరోవైపు బంకురా జిల్లా ఈరోజు ఒకేసారి రెండు ప్రధాన పార్టీల బలప్రదర్శనకు వేదిక కానుంది. బర్జోరా కాలేజ్ గ్రౌండ్స్‌లో సీఎం మమతా బెనర్జీ భారీ ఎన్నికల ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివస్తారని టీఎంసీ నాయకులు తెలిపారు. ఇదే జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఒండాలోని రామ్‌సాగర్, ఛత్నాలోని ఝాటిపహాడీ వద్ద రెండు వేర్వేరు సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. దీంతో పాటు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కూడా గంగాజల్ఘటిలో బీజేపీ అభ్యర్థి బిల్లేశ్వర్ సిన్హా తరఫున ప్రచారం చేయనున్నారు.బీర్భూమ్ జిల్లాలోనూ రాజకీయ వాతావరణం తారాస్థాయికి చేరింది. టీఎంసీ యువ నేత అభిషేక్ బెనర్జీ సైంథియాలోని జాలీబగాన్ సమీపంలో జరిగే సభలో పాల్గొననున్నారు. ఈ సభ కోసం భారీ వేదికతో పాటు ప్రత్యేక హెలిప్యాడ్‌ను కూడా సిద్ధం చేశారు. కేవలం సైంథియా నియోజకవర్గం నుంచే 50 నుంచి 60 వేల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్థానిక టీఎంసీ అధ్యక్షుడు దేబాశిష్ సాహా తెలిపారు. లాబ్పూర్, మయూరేశ్వర్, నానూర్ అభ్యర్థులతో పాటు సీనియర్ నేత అనుబ్రత మండల్ కూడా ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఈ అగ్ర నేతల ప్రచార పర్వం ఓటర్లను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. -
‘దీదీ’కి మైండ్ బ్లాంక్.. బెంగాల్ బరిలో బీజేపీ బ్రహ్మాస్త్రం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచార హోరును మరింతగా పెంచింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేసిన ‘సంకల్ప్ పత్ర’ (మేనిఫెస్టో)ను తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండికొట్టేలా రూపొందించారు. ముఖ్యంగా మహిళలు, యువతను ఆకర్షించడంతో పాటు, బెంగాలీ సంస్కృతిని కాపాడేలా బీజేపీ చేసిన హామీలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. బీజేపీ మేనిఫెస్టోలోని ఐదు ప్రధాన అంశాలు ఇవే..చొరబాట్లపై ఉక్కుపాదంఅక్రమ చొరబాట్లను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేసిన బీజేపీ.. చొరబాటుదారులను గుర్తించి, దేశం నుంచి పంపించే (డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్) విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని తీసుకువస్తామని, అలాగే లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్‌లను అరికట్టేందుకు కఠిన చట్టాలు రూపొందిస్తామని హామీ ఇచ్చింది.మహిళలకు పెద్ద పీటమహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భారీ నజరానాలు ప్రకటించింది. టీఎంసీ ప్రభుత్వం ఇస్తున్న ‘లక్ష్మీర్ భండార్’ సాయం కంటే దాదాపు రెట్టింపుగా ప్రతి మహిళకు నెలకు రూ.3,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాలు, పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు, 75 లక్షల మందిని ‘లఖ్పతి దీదీ’లుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేసింది.యువతకు ఉపాధినిరుద్యోగ సమస్యపై ప్రధానంగా ఫోకస్ పెట్టిన కమలనాథులు.. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 భృతి ఇస్తామని ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో కోటి కొత్త ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని హామీ ఇచ్చారు. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు 5 లక్షల మంది యువతకు చెరో రూ.10 లక్షల ఆర్థిక సాయం (సగం గ్రాంట్, సగం వడ్డీ లేని రుణం) అందించనున్నామని తెలిపారు.బెంగాలీ సంస్కృతి పరిరక్షణతమను బయటి వ్యక్తులుగా ముద్రవేస్తున్న టీఎంసీ వాదనను తిప్పికొడుతూ.. బెంగాలీ ఆత్మగౌరవాన్ని కాపాడతామని బీజేపీ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా వందేమాతరం మ్యూజియం, ఠాగూర్ కల్చరల్ సెంటర్ల ఏర్పాటుతో పాటు అన్ని శక్తిపీఠాలను కలుపుతూ ప్రత్యేక సర్క్యూట్ అభివృద్ధి చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.మౌలిక సదుపాయాల అభివృద్ధిరాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ.. తాజ్పూర్, కుల్పిలో ఆధునిక డీప్-సీ పోర్టులను నిర్మిస్తామని బీజేపీ తెలిపింది. సుందర్బన్స్ నుండి డార్జిలింగ్ వరకు నేరుగా జాతీయ రహదారితో పాటు, ఉత్తర బెంగాల్లో నాలుగు కొత్త నగరాల నిర్మాణాన్ని తమ ‘సంకల్ప్ పత్ర’లో ప్రముఖంగా పొందుపరిచింది.ఇది కూడా చదవండి: ‘కుంభమేళా మోనాలిసా’ పెళ్లి.. చిక్కుల్లో సీపీఎం నేతలు -
West Bengal: ‘పీకే’ లేని పందెం.. మమత హ్యాట్రిక్ కొడతారా?
అసెంబ్లీ ఎన్నికలు పశ్చిమ బెంగాల్ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. ఈ ఎన్నికల సంగ్రామం పైకి పాత కథలాగే కనిపిస్తున్నా, లోపల మాత్రం అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు సంక్షేమం, ప్రాంతీయ అస్తిత్వం నినాదంతో మమతా బెనర్జీ.. మరోవైపు జాతీయ నాయకత్వం, బెంగాల్ మార్పు నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీ తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈసారి కూడా ప్రధాన పోరు తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మధ్యే నెలకొంది. అయితే గత ఎన్నికల్లో భారీ విజయానికి కారణంగా నిలిచిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు దీదీ పక్కన లేరు. ఆయన మార్క్ వ్యూహాలు లేకుండా తృణమూల్ తిరిగి కాషాయ దళాన్ని నిలువరించగలదా? ఇదే ఇప్పుడు బెంగాల్ నుంచి ఢిల్లీ పీఠం వరకూ ఉత్కంఠ రేపుతున్న ప్రధాన ప్రశ్న.భవానీపూర్‌లో హై ఓల్టేజ్2026, ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు విడతలుగా జరగనున్న ఈ అత్యంత కీలకమైన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. మొత్తం 294 స్థానాలకు గానూ 291 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ నేరుగా పోటీ చేస్తుండగా, మిగిలిన మూడు డార్జిలింగ్ హిల్ సీట్లను తన మిత్రపక్షమైన బీజీపీఎంకు కేటాయించింది. భవానీపూర్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై మరోసారి హై-వోల్టేజ్ పోరుకు సిద్ధమయ్యారు. సువేందు అదనంగా తన పాత స్థానమైన నందిగ్రామ్ నుంచి కూడా పోటీకి దిగడం విశేషం.వ్యూహాన్ని మార్చిన బీజేపీమార్చి 17న వెలువడిన టీఎంసీ అభ్యర్థుల జాబితాలో మధుజ, మదన్ మిత్ర, ఫిర్హాద్ హకీమ్ లాంటి సీనియర్ నేతలకు చోటు దక్కింది. సామాజిక సమీకరణల్లో భాగంగా ఏకంగా 52 మంది మహిళలకు, 95 మంది ఎస్సీ, ఎస్టీలకు దీదీ అవకాశం కల్పించారు. ‘ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మేము కచ్చితంగా 226 కు పైగా సీట్లు సాధిస్తాం’ అని మమతా బెనర్జీ అత్యంత ధీమాగా చెబుతున్నారు. మరోవైపు, 2021లో ‘200 పార్’ నినాదంతో బరిలోకి దిగి వెనుకబడిన బీజేపీ, ఈసారి వ్యూహాన్ని మార్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్‌కతా సభలో మాట్లాడుతూ ‘మేము ఒకదాని తర్వాత ఒకటిగా 170 సీట్లు గెలుచుకుంటాం, ఆ తర్వాతే బెంగాల్లో అసలైన మార్పు వస్తుంది’ అని సవాల్ విసిరారు.సంక్షేమ పథకాల సాయంతో..ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘భయం లేని బెంగాల్’ నినాదంతో పట్టణ, హిందూ మెజారిటీ ప్రాంతాల్లో బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీల ప్రభావం ఉన్నప్పటికీ ప్రధానంగా శాంతిభద్రతల సమస్యలు, నిరుద్యోగంపై అధికార పార్టీని బీజేపీ నిలదీస్తోంది. దానికి ధీటుగా టీఎంసీ ‘లక్ష్మీర్ భండార్’ వంటి ప్రజాదరణ పొందిన సంక్షేమ పథకాలను నమ్ముకుంది. ఓటర్ల జాబితా సవరణలను దీటుగా ఎదుర్కొనేందుకు తమ బూత్ స్థాయి ఏజెంట్లను తిరిగి చురుగ్గా రంగంలోకి దించింది. రెండు దశల్లోనే ఎన్నికలు ఉండటంతో, ఇరు పార్టీలు ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి.కుదిపేసిన బొగ్గు కుంభకోణంఎన్నికల ప్రచారం ఊపందుకోకముందే, జనవరి నెలలో జరిగిన ఒక నాటకీయ పరిణామం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది. 2020 నాటి బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించి కోల్‌కతాలోని ఐ-ప్యాక్ ప్రధాన కార్యాలయాలతో పాటు, దాని చీఫ్ ప్రతీక్ జైన్ ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. అయితే, తమ ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల రహస్య డేటాను దొంగిలించేందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కక్షపూరితంగా ఈ దాడులు చేయిస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. ఏకంగా రాష్ట్ర పోలీసులతో కలిసి దాడులు జరుగుతున్న ప్రాంతానికి ఆమె స్వయంగా చేరుకుని, కీలక పత్రాలను సీజ్ చేయకుండా ఈడీ అధికారులను అడ్డుకున్నారు. దీనిని రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణించి, కోల్‌కతాలో భారీ నిరసన చేపట్టారు.నాడు ఐ-ప్యాక్ అండతో..అయితే విచారణకు ఆటంకం కలిగించారని ఈడీ ఆరోపించగా, ఈ వివాదంపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, ఈడీ అధికారుల విధులకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దని బెంగాల్ ప్రభుత్వాన్ని కఠినంగా హెచ్చరించాల్సి వచ్చింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 38 శాతం ఓట్లతో 77 సీట్లు గెలుచుకున్న బీజేపీ గట్టి పోటీనిచ్చినా, 213 సీట్లతో దీదీ తన ఆధిపత్యాన్ని ,చెక్కుచెదరనీయలేదు. ఆ చారిత్రక విజయంలో ప్రశాంత్ కిషోర్‌తో పాటు, ఆయన సంస్థ ఐ-ప్యాక్ పోషించిన పాత్ర అసాధారణం. ‘దీదీ కే బోలో’ లాంటి వినూత్న కార్యక్రమాలను కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయి సమస్యలను ప్రణాళికాబద్ధంగా గుర్తించి వాటిని ప్రభుత్వ విధానాలుగా, హామీలుగా మార్చడంలో ఐ-ప్యాక్ ఒక పటిష్టమైన డేటా వ్యవస్థలా పనిచేసింది.ఏం జరగనుంది?.. సర్వత్రా ఉత్కంఠఅయితే ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో సొంతంగా ‘జన్ సురాజ్ పార్టీ’ పెట్టుకుని రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. (ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు). ఈ 2026 ఎన్నికల్లో ఐ-ప్యాక్ ఇప్పటికీ టీఎంసీకి వ్యూహాత్మక భాగస్వామిగానే కొనసాగుతున్నప్పటికీ, గత ఎన్నికల్లో పీకే స్వయంగా నడిపించిన ఆ పదునైన వ్యూహాత్మక యంత్రాంగం ఇప్పుడు పూర్తిగా కనిపించడం లేదు. ఈ లోటు ఎన్నికల ఫలితాలపై ఎంతగా ప్రభావం చూపుతుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ కిషోర్ లాంటి దిగ్గజ వ్యూహకర్త నేరుగా లేకపోయినా, ఐ-ప్యాక్ మద్దతుతో పాటు, తనకున్న సొంత ఇమేజ్, పటిష్టమైన సంక్షేమ పథకాలతో మమతా బెనర్జీ ఈ మహా పోరును మరోసారి తనవైపు తిప్పుకుంటారో లేదో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: టెక్ ప్రపంచం షేక్.. ‘ఓపెన్ ఏఐ’ సంచలన ప్రతిపాదన! -
ఆరు నెలల్లోనే ఉమ్మడి పౌరస్మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోనే ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు చేస్తామని బీజేపీ ప్రకటించింది. పొరుగుదేశాల నుంచి చొరబాట్లకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తామని స్పష్టంచేసింది. రాష్ట్రంలో ప్రధానంగా మహిళలు, యువత, రైతులు, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించింది. వారి కోసం సంక్షేమ పథకాలను విస్తరింపజేస్తామని హామీ ఇచ్చింది. బెంగాల్లో బీజేపీ మేనిఫెస్టో ‘సంకల్ప పత్ర’ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం విడుదల చేశారు. సోనార్ బంగ్లా(బంగారు బెంగాల్)కు ఇదొక రోడ్ మ్యాప్ అని ఆయన అభివరి్ణంచారు. అవినీతి, రాజకీయ హింస, చొరబాట్లు, నిరుద్యోగ సమస్యకు ఈ అసెంబ్లీ ఎన్నికలు ఒక రెఫరెండమ్ అని తేల్చిచెప్పారు. మహిళలకు ఉచిత ప్రయాణం రాష్ట్ర సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లో తిష్టవేసిన ఆక్రమణదారులను, చొరబాటుదార్లను అక్కడి నుంచి వెళ్లగొడతామని పేర్కొన్నారు. ఆయా భూములకు విముక్తి కల్పిస్తామని తెలిపారు. ప్రజా రవాణా సంస్థ వాహనాల్లో మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు రూ.15,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అధికార పార్టీ అవినీతి వ్యవహారాలు, ఉపాధ్యాయ నియామకాల్లో కుంభకోణం వల్ల ఉద్యోగాలు కోల్పోయినవారికి ఐదేళ్లపాటు వయసు సడలింపు ఇస్తామని చెప్పారు. ఉద్యోగాలను పారదర్శకంగా, నైపుణ్యాల ఆధారంగా భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే ఉద్యోగుల కోసం ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సులు అమలు చేస్తామని వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఏటా రూ.9,000 చొప్పున అందజేస్తామని పేర్కొన్నారు. చేపలు, గుడ్లపై నిషేధం ఉండదు: అమిత్ షా బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాలీ బిడ్డనే పశ్చిమ బెంగాల్‌కు ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీకి అధికారం అప్పగిస్తే చేపలు, గుడ్లపై నిషేధం విధిస్తారంటూ కొందరు దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి నిషేధం ఉండదని స్పష్టంచేశారు.బీజేపీ సంకల్ప పత్రలో కీలకాంశాలు.. → బెంగాల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం చట్టం. → అక్రమ వలసలపై కఠిన చర్యలు. పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట. → ప్రజలు తమకు నచ్చిన మతాన్ని స్వేచ్ఛగా ఆచరించేలా చట్టం. → మహిళలకు ప్రతినెలా రూ.3,000 చొప్పున ఆర్థిక సాయం. వారి సాధికారతకు చేయూత. → పోలీసు శాఖలో ప్రత్యేకంగా మహిళా బెటాలియన్ ‘దుర్గా సురక్ష స్క్వాడ్’ఏర్పాటు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు. → కోటి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించేదాకా నెలకు రూ.3,000 చొప్పున ఆర్థిక సాయం. → ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం కేంద్ర రేట్లకు అనుగుణంగా మార్పు. ఏడో వేతన కమిషన్ సిఫార్సుల అమలు. → 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలు, దిగజారిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల. → కట్ మనీ(చట్టవిరుద్ధమైన కమిషన్లు/లంచాలు) సంస్కృతికి చరమగీతం. సిండికేట్ వ్యవస్థ అంతం. → ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు బెంగాల్లోనూ అమలు. ఉత్తర బెంగాల్ జిల్లాల్లో ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ఏర్పాటు. → వరి, బంగాళదుంప, మామిడి పండించే రైతులకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రోత్సాహకాలు. పంటలకు గిట్టుబాటు ధరలు. → రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లోకి కుర్మాలీ, రాజ్‌బన్షీ భాషలు. → అత్యున్నత పారిశ్రామిక హబ్‌గా బెంగాల్ అభివృద్ధి. అతిపెద్ద చేపల ఎగుమతి కేంద్రం ఏర్పాటు. → పాత తేయాకు తోటల పునరుద్ధరణ. డార్జీలింగ్ తేయాకుకు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు లభించేలా చర్యలు. జనపనార పరిశ్రమ ఆధునీకరణ. → రాష్ట్రంలో వందేమాతరం మ్యూజియం నిర్మాణం. -
యూపీనుంచి 50వేలమంది, పామునైనా నమ్మొచ్చేమో గానీ : మమత మండిపాటు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతున్న నేపథ్యంలో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని తెంతులియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈశాన్య రాష్ట్రమైన అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ఓటర్ల మద్దతుపై నమ్మకం లేక, బీజేపీ బయటి వ్యక్తులను రప్పించిందని ఆమె ఆరోపించారు.బీజేపీపై ఘాటు విమర్శలుఅయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అస్సాంలో 126 మంది సభ్యులున్న అసెంబ్లీకి ఏప్రిల్ 9, గురువారం నాడు ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ఈ సందర్బంగా అస్సాం ఎన్నికల సరళిపై మమతా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలోని ఏ దర్యాప్తు సంస్థా తటస్థంగా లేదని, కాషాయ పార్టీ వాటన్నింటినీ కొనేసిందని ఆరోపించారు. పామునైనా నమ్మవచ్చు కానీ, బీజేపీని మాత్రం నమ్మలేము అంటూ దీదీ ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్ నుండి సుమారు 50వేల మందిని రైళ్లలో అస్సాంకు తీసుకువచ్చారని మమతా బెనర్జీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో కూడా ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేయాలని బీజేపీ చూస్తోందని, అందుకే ఎన్నికల కమిషన్ ద్వారా అధికారులను బదిలీ చేయిస్తోందని విమర్శించారు. ఎన్నికల కోసం డబ్బు, మాదకద్రవ్యాలు, బయటి వ్యక్తులతో ఓటింగ్, లాంటి అక్రమాలకు తెగబడుతోందన్నారు. అయితే తమ కార్యకర్తలు వాటిని ఎదుర్కొని విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ వివాదంపశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుంచి 90 లక్షల పేర్లను తొలగించారని, ఒక వార్తాపత్రిక నివేదిక ప్రకారం, తొలగించిన 90 లక్షల పేర్లలో 60 లక్షలు హిందువులవి, 30 లక్షలు ముస్లింలవి అని కూడా బెనర్జీ అన్నారు. బీజేపీని ఎన్నడూ నమ్మకూడదని బెనర్జీ అన్నారు. అస్సాంలో జరిగిన ఎన్ఆర్సి ప్రక్రియలో తొలగించిన 19 లక్షల పేర్లలో 13 లక్షలు హిందువులు, 6 లక్షలు ముస్లింలు ఉన్నారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాల్లో తనను టీఎంసీ అభ్యర్థిగా పరిగణించాలని ఓటర్లను కోరుతూ, "నా నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలంటే, అన్ని స్థానాల్లో నేనే అభ్యర్థిని" అని బెనర్జీ అన్నారు. ఓటర్ల జాబితా నుంచి అనేక షెడ్యూల్డ్ కులాల వారి పేర్లను తొలగించారని, అలాగే తన నియోజకవర్గంలో కూడా ఓటర్ల పేర్లను తొలగించారని టీఎంసీ అధినేత్రి ఆరోపించారు. అయినా తనకు బెంగాల్ ప్రజలపై నమ్మకం ఉందన్నారు.ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?బీజేపీ ప్రభుత్వం బెంగాల్ ప్రజలు ఏం తినాలో, ఏం తినకూడదో నిర్దేశిస్తుందని ఆమె మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజల మాంసాహార అలవాట్లపై ఆంక్షలు విధిస్తుందని ఆరోపించారు.అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయని, అక్కడ వారిని రక్షించలేని ప్రధాని మోదీ, ఇక్కడ 'సోనార్ బంగ్లా' (బంగారు బెంగాల్) నిర్మిస్తామనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ప్రజలకు భద్రత కల్పించిన తర్వాతే మాత్రమే 'సోనార్ బంగ్లా' గురించి మాట్లాడాలన్నారు. (నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే!) -
పశ్చిమబెంగాల్లో బీజేపీ మేనిఫెస్టో విడుదల
కోల్‌కాతా: పశ్చిమబెంగాల్లో మహిళలు, యువత లక్ష్యంగా బీజేపీ తన మేనిఫెస్టో విడుదల చేసింది. పలు వర్గాలను ఆకట్టుకునేలా బీజేపీ హామీలు ఇచ్చింది. ఇంటికి పెద్దగా ఉన్న మహిళకు నెలకు రూ.3 వేలు ఆర్థిక ప్రోత్సాహకం ప్రకటించింది. ప్రభుత్వ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తామని బీజేపీ హమీ ఇచ్చింది. మేనిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనపై ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారన్నా అమిత్ షా.. బెంగాల్లో చీకటి పాలన ముగుస్తుందన్నారు.వికసిత్ బెంగాల్ రోడ్‌మ్యాప్‌ను మేనిఫెస్టోలో పెట్టాం. పేదలకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అమలు చేస్తామన్న అమిత్ షా.. రైతుల సంక్షేమం, యువత ఉపాధి అవకాశాలపై కీలక హామీలు ఇచ్చారు. మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక బెంగాల్లో యూసీసీ అమలు చేస్తామని తెలిపారు.భయం లేని బెంగాల్.. పునర్నిర్మాణమే తమ లక్ష్యం అన్న అమిత్ షా.. బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చొరబాటుదారుల ఏరివేత.. 7వ పే కమిషన్ అమలు చేస్తామని తెలిపారు. ‘‘ఆరు నెలల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏ చెల్లిపులు. మహిళలకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్. రాజకీయ హింస కేసులపై ముమ్మర దర్యాప్తు. బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్ కోసం భూముల కేటాయింపు. ఆవుల స్మగ్లింగ్ నిలిపివేస్తాం. దుర్గా సురక్ష స్క్వాడ్ ఏర్పాటు’’ చేస్తామని అమిత్ షా తెలిపారు. -
బెంగాల్ ఎన్నికలు: వీడియో ఎపిసోడ్‌తో బిగ్ షాక్
పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ.. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నెట్లో వదిలిన ఓ వీడియో రాజకీయ ప్రకంపనలు రేపింది. ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ అధినేత హుమాయున్ కబీర్.. బీజేపీతో చేతులు కలిపి మైనారిటీల ఓట్లను మళ్లించే కుట్ర చేశాడన్నది ఆ వీడియో సారాంశం. అయితే ఆ వీడియోను కబీర్ ఖండించినప్పటికీ నష్టం జరిగిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేసిన స్టింగ్ ఆపరేషన్ వీడియోతో బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేగింది. ఆ వీడియోలో హుమాయున్ కబీర్.. బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నాడని, మైనారిటీ ఓట్లను మళ్లించేందుకు భారీ నిధులు పొందాడని ఉంది. ఏకంగా ప్రధాని కార్యాలయం ఈ కుట్రలో భాగమైందని.. సువేందు అధికారి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మలతో సమన్వయం చేసుకోవాలని పీఎంవో సూచనలు చేసినట్లు ఉంది. అంతేకాదు.. पश्चिम बंगाल चुनाव के बीच हुमायूँ कबीर का सनसनीखेज वीडियोहुमायूँ कबीर ने BJP से 200 करोड़ रुपये की अग्रिम राशि की मांग की।"मुसलमानों को बेवकूफ़ बनाना आसान है, -हुमायूँबाबरी मस्जिद बने न बने लेकिन हमारा काम हो जाएगा- हुमायूँ#humayunkabir #WestBengalAssemblyElection2026 #TMC pic.twitter.com/xlOyKkfDgk— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) April 9, 2026ముస్లింలను మోసం చేయడం సులభమని.. ఇందుకు బాబ్రీ మసీదు అంశమే ఉదాహరణ అని హుమాయున్ కబీర్ వ్యాఖ్యలు చేసినట్లుగా ఉంది. బెంగాల్ ఓట్లలో ముస్లిం ఓట్లను మళ్లించేందుకు బీజేపీ నుంచి రూ.200 కోట్లు ముందస్తు నిధులు కబీర్ పొందినట్లు టీఎంసీ సంచలన ఆరోపణలకు దిగింది. దాదాపు రూ.1000 కోట్లతో ఈ కుట్రకు తెర లేపారని ఆరోపించిన టీఎంసీ.. ఈ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ ఆరోపణలపై బీజేపీ ఇంకా స్పందించలేదు. అయితే హుమాయున్ కబీర్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. అది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తీసిన వీడియో అని.. 2019 నవంబర్ తర్వాత ఏ బీజేపీ నేతతోనూ తాను టచ్‌లో లేనని.. ఇది తృణమూల్ నేతల దుష్ప్రచారమని.. పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. అయినప్పటికీ ఈ వివాదం వెంటనే రాజకీయ ప్రభావం చూపింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం ఎంఐఎం పార్టీ ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. తాజా వీడియో కలకలం నేపథ్యంలో.. ఆ కూటమిని రద్దు చేస్తున్నట్లు ఎంఐఎం అధినేత, హైదరాబాద్(తెలంగాణ) ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. బెంగాల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. హుమాయున్ కబీర్ మాజీ ఐపీఎస్ అధికారి. టీఎంసీలో చేరి రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా నెగ్గి.. మంత్రిగా పని చేశారు. బీజేపీలో చేరి అక్కడా కొంత కాలం ఉన్నారు. తిరిగి టీఎంసీలో చేరారు. అయితే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచేవారు. గత ఏడాది ముర్షీదాబాద్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బాబ్రీ మసీదు నమునాతో అక్కడ ఓ మసీదు నిర్మిస్తానని చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. విమర్శల నేపథ్యంలో.. టీఎంసీ ఆయన్ని బహిష్కరించగా ఏజేయూపీ పేరిట కొత్త పార్టీ స్థాపించాడాయన. తాజా వివాదం ఎన్నికల ముందు మైనారిటీ ఓట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం.. 294 స్థానాలకు ఎన్నికలు ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది. -
మోదీ చెప్పేవన్నీ తప్పుడు లెక్కలు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ టీఎంసీ పాలనలో మత్స్య ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించలేక పోయిందంటూ ప్రధాని మోదీ చేసిన విమర్శలపై సీఎం మమతా బెనర్జీ దీటుగా స్పందించారు. ఆయన చెబుతున్నవన్నీ తప్పుడు గణాంకాలంటూ ఎదురుదాడికి దిగారు. ‘బిహార్ అత్యధికంగా మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేస్తుండగా బెంగాల్లో వెనుకబడిపోయిందంటూ ప్రధాని మోదీ విమర్శించినట్లు తెలిసింది. బీజేపీ పాలనలోని రాష్ట్రాల్లో ప్రజలను మాంసాహారం, చేపలు, గుడ్లు తిననివ్వడం లేదు. అక్కడ బీఫ్, మాసం దుకాణాలను మూసివేస్తున్నారు. అందుకే, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాజస్తాన్, బిహార్, యూపీలు మాంసం, బీఫ్, చేపలను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాయి. బెంగాల్లో మాత్రం ఎక్కడ చూసినా చేపల మార్కెట్లు కనిపిస్తాయి. ఇక్కడ దొరికే మత్స్య ఉత్పత్తులను ప్రతి వారూ ఇక్కడ ఆహారంగా వాడుతారు. అందుకే, దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది’అంటూ ఆమె వివరించారు. గతంలో ఏపీ నుంచి మత్స్య ఉత్పత్తులను దిగుమతి చేసుకునేవారమని, ఇప్పుడా పరిస్థితి లేదని ఆమె అన్నారు. సొంత పార్టీ నేతలు చెప్పేవన్నీ యథాతథంగా వల్లెవేయడానికి బదులుగా, ఇలాంటి వాటిని కూడా మోదీ తెలుసుకోవాలని హితవు పలికారు. గురువారం సీఎం మమత ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగిన పలు ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో టీఎంసీని ఓడించాలనే కుట్రతోనే సర్ ప్రక్రియలో 90 లక్షలకు పైగా ఓటర్ల పేర్లను తొలగించారని, అయినప్పటికీ విజయం ఖాయమని మమత స్పష్టం చేశారు. -
బెంగాల్‌కు ఆరు గ్యారంటీలు
హల్దియా: క్రూరత్వానికి మారుపేరైన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పశ్చిమ బెంగాల్ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి వైఫల్యానికి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తోందని, రాష్ట్రాన్ని వెనక్కి లాగుతోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రగతి కావాలంటే బీజేపీని గెలిపించాలని సూచించారు. బెంగాల్లో తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. భయానక పాలన నుంచి బెంగాల్‌ను రక్షిస్తామని, సర్వత్రా విశ్వాసం నెలకొనే వాతావరణాన్ని సృష్టిస్తామని ప్రకటించారు. రేవు నగరం హల్దియా, అసన్సోల్తోపాటు సూరి పట్టణంలో గురువారం ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. భయానక వాతావరణం నెలకొని ఉంటే పెట్టుబడులను ఆకర్షించలేమని, విశ్వాసం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని తేల్చిచెప్పారు. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని నిర్మమ్(క్రూరమైన) సర్కార్‌గా అభివర్ణించారు. దేశమంతా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంటే బెంగాల్ మాత్రం వెనుకంజలోనే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. వికసిత్ బెంగాల్ స్వప్నం సాకారం కావాలంటే ఈ క్రూర ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని పేర్కొన్నారు. బెంగాల్లో బీజేపీ గెలిస్తే చేపలు, మాంసం తిననివ్వరంటూ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను మోదీ తిప్పికొట్టారు. డిమాండ్‌కు సరిపడా చేపలను ఉత్పత్తి చేయడంలో గత 15 ఏళ్లుగా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి రాగానే చేపల ఉత్పత్తిలో బెంగాల్ స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రధాన మంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే.. వందేళ్లకైనా విముక్తి లభించదు ‘‘ప్రతికూల వాతావరణంలోనూ ఈ సభకు జనం భారీగా తరలిరావడం సంతోషంగా ఉంది. ప్రభుత్వ మార్పునకు వారంతా సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఈసారి తృణమూల్ కాంగ్రెస్‌కు ఉద్వాసన తప్పదు. బీజేపీ ప్రభంజనం సృష్టించబోతోంది. పూర్బమేదినీపూర్లో గత ఎన్నికల్లో బీజేపీ 16 స్థానాలకు గాను 15 స్థానాలు గెల్చుకుంది. ఈసారి బెంగాల్ మొత్తం అదే పరిస్థితి కనిపించబోతోంది. భవానీపూర్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో సీఎం మమతా బెనర్జీ ఓడిపోతారు. తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ బెంగాల్ యువతకు తీవ్ర అన్యాయం చేసింది. ప్రైవేట్ రంగాన్ని నాశనం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకున్నారు. ఇప్పటిదాకా చేసిన పాపాలకు గాను ఆ పార్టీకి వందేళ్లకైనా విముక్తి లభించదు. ఇకపై తృణమూల్ ముక్త్ బెంగాల్ బెంగాల్లో కట్ మనీ సంస్కృతిని, సిండికేట్రాజ్ను అంతం చేస్తాం. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో మాఫియారాజ్ చెలరేగిపోతోంది. బొగ్గు, ఇసుక, మట్టిని దోచుకుంటోంది. ప్రజలకు తీరని అన్యాయం చేస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ పాపాలు గరిష్టస్థాయికి చేరాయి. ఈ పార్టీని ఇంటికి పంపాల్సిన సమయం వచ్చింది.‘మా, మాటీ, మనుష్ ’నినాదం ఉత్తదే.. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చట్టాలకు విలువ లేకుండాపోయింది. మహా జంగిల్రాజ్దే ఇక్కడ పెత్తనం. మాల్డా జిల్లాలో ఇటీవల జ్యుడీషియల్ అధికారులను నిర్బంధించారు. చట్టవిరుద్ధంగా మనదేశంలోకి ప్రవేశించినవారి వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. రాష్ట్రంలో పాలన మారగానే చొరబాటుదార్ల పోషకులపై ప్రత్యేక దర్యాప్తు జరిపిస్తాం. ఊచలు లెక్కబెట్టిస్తాం. తృణమూల్ కాంగ్రెస్ ‘మా, మాటీ, మనుష్ ’నినాదం ఉత్తదేనని తేలిపోయింది. మా(తల్లి) రోదిస్తోంది. మనుషులు భయంతో బతుకున్నారు. ఇక్కడి భూములను చొరబాటుదార్లు ఆక్రమించారు. చొరబాటుదార్ల కారణంగా స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కడం లేదు. బీజేపీ సర్కార్ వచ్చాక జీ రామ్ జీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తాం. పేదలకు ఉపాధి కల్పిస్తాం’’అని ప్రధాని మోదీ ప్రకటించారు. -
పశ్చిమ బెంగాల్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం
-
బీజేపీ గెలిస్తే.. నో చేపలు, నో మాంసం,నో బెంగాలీ : మమత ధ్వజం
కోల్‌కతా: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో భాగంగా లక్షలాది ఓట్లు తొలగించడం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంలో న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. తాను మళ్లీ న్యాయవాద వృత్తిలోకి అడుగుపెడుతున్నట్లుగా ఉందని తెలిపారు. మమతా బెనర్జీ ఎల్ఎల్బీ అభ్యసించారు. ఫిబ్రవరి 4న సుప్రీంకోర్టులో వాదించారు. ఎస్ఐఆర్ విషయంలో జోక్యం చేసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. బుధవారం హుగ్లీ జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. బెంగాల్‌ను బీజేపీ, ఎన్నికల సంఘం టార్గెట్ చేశాయని, అందుకే ఓట్లు తొలగించారని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో వాదించిన తొలి ముఖ్యమంత్రిని తానేనని వెల్లడించారు. ఓట్లు తొలగించినంత మాత్రాన తృణమూల్ కాంగ్రెస్‌ను ఎవరూ ఓడించలేరని తేల్చిచెప్పారు. ఓట్ల తొలగింపును వ్యతిరేకిస్తూ కచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తామన్నారు. తొలగించిన పేర్లను మళ్లీ ఓటర్ల జాబితాలో చేర్చేలా చట్టపరంగా పోరాడుతామని ప్రకటించారు. ఎస్ఐఆర్ అంశం ట్రిబ్యునల్ ఎదుట పెండింగ్‌లో ఉండగానే మొదటి దశ ఓటర్ల జాబితాను ఎలా ఖరారు చేశారంటూ ప్రశ్నించారు. ప్రజలు ఓట్లు వేయలేని పరిస్థితి ఉంటే ఇక ట్రిబ్యునల్స్‌తో ప్రయోజనం ఏమిటని పేర్కొన్నారు. మళ్లీ న్యాయవాద వృత్తి చేపట్టాలని ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాను కాబట్టి ఆ పని చేయలేనని వ్యాఖ్యానించారు. బీజేపీ గెలుపు కోసం ఈసీ ఆరాటం ఎన్నికల్లో నెగ్గడానికి బీజేపీ అడ్డదార్లు తొక్కుతోందని మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ఓటర్ల జాబితాను తారుమారు చేస్తున్నారని, ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం కూడా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు. బీజేపీ గెలుపు కోసమే ఎన్నికల సంఘం ఆరాటపడుతోందని ధ్వజమెత్తారు. బీజేపీకి పొరపాటున ఓటు వేస్తే చేపలు, మాంసం తినడం, బెంగాలీ భాష మాట్లాడడం మానుకోవాల్సి వస్తుందని ప్రజలను హెచ్చరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలను గుడ్లు, చేపలు, మాంసం తిననివ్వడం లేదని చెప్పారు. బీజేపీని గెలిపిస్తే అదే పరిస్థితి బెంగాల్లోనూ వస్తుందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన ముసుగులో బెంగాల్‌ను ముక్కలు చేయడానికి బీజేపీ కుట్ర పన్నిందని మమతా బెనర్జీ దుయ్యబట్టారు. బెంగాల్‌ను విడదీసి మరో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని ఆక్షేపించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల గురించి గోదీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ విత్ డ్రా : ఆమె ఎన్నిక ఇక లాంఛనమే!భవానీపూర్‌లో మమత నామినేషన్ సీఎం మమతా బెనర్జీ బుధవారం భవానీపూర్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. మమతకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తాను భవానీపూర్‌లోనే పుట్టి పెరిగానని మమతా బెనర్జీ అన్నారు. తన జీవితం ఈ ప్రాంతంతోనే ముడిపడి ఉందన్నారు. భవానీపూర్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: వ్యాపారవేత్త హత్య: దుబాయ్‌లో భారతీయ గ్యాంగ్‌స్టర్ అరెస్ట్ -
బయటకు వెళ్లిపొండి
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియపై దృష్టిసారించాల్సిన ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర అధికారులు బీజేపీ నేతలతో అంటకాగుతున్నారంటూ తృణమూల్కాంగ్రెస్ చేసిన ఆరోపణలతో ఆ పార్టీ నేతలు, ప్రధాన ఎన్నికల కమిషన్ సభ్యుల మధ్య జరిగిన సమావేశం కొన్ని నిమిషాల్లోనే రసాభాసగా మారి అర్ధంతరంగా ముగిసింది. తర్వాత అటు ఈసీ, ఇటు టీఎంసీ నేతలు పరస్పర ఆరోపణలు గుప్పించుకున్నారు. సమావేశంలో వాగ్వాదం జరగడానికి మీరే కారణమని రెండు వర్గాలూ వాదించుకున్నాయి. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ఈ వాగ్వాదానికి వేదికగా మారింది. బీజేపీ ముఖ్యులతో ఎన్నికల అధికారులకు సత్సంబంధాలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో లోపాలను ఎత్తిచూపుతూ తృణమూల్ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాసిన పలు లేఖలను టీఎంసీ ప్రతినిధి బృందం ఈసీకి అందజేసింది. భేటీ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఒబ్రియాన్, సాగరికా ఘోష్, ఎంపీలు సాకేత్ గోఖలే, మేనకా గురుస్వామిల ప్రతినిధి బృందం ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ సారథ్యంలోని ఎన్నికల సంఘానికి ఈ లేఖలను ఇచ్చారు. ఈ సందర్భంగా బెంగాల్‌లోని నందిగ్రామ్‌లో స్థానిక బీజేపీ నేతతో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు ఉన్న అనుబంధం సహా ఆరు ఘటనల సాక్ష్యాధారాలతో టీఎంసీ నేతలు అందించారు. ఎస్ఐఆర్ పేరిట లక్షలాది నిజమైన ఓటర్ల పేర్లను జాబితాను నుంచి తొలగించారని టీఎంసీ నేతలు వాదించారు. మమత రాసిన 9 లేఖలను సీఈసీకి ఇచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నికల అధికారులను రాష్ట్రం నుంచి బదిలీచేయాలని డిమాండ్‌చేశారు. భేటీ అర్ధంతరంగా ముగిశాక మీడియాతో ఓబ్రియాన్ మాట్లాడారు. ‘‘ఆరోపణలున్న అధికారుల సమక్షంలో పారదర్శకంగా ఎన్నికలు ఎలా జరుపుతారు? అని ప్రశ్నించాం. అందుకు సీఈసీ సమాధానం చెప్పాల్సిందిపోయి మీరంతా బయటకు వెళ్లండి అని గెంటేశారు. గతంలో 8–9 సార్లు ఎలక్షన్ కమిషన్‌తో భేటీ అయ్యాం. ప్రతిసారీ సీఈసీనే మాట్లాడారు. ఎవరినీ మాట్లాడనివ్వట్లేరు. అందుకే ఈసారి తిరిగొచ్చేటప్పుడు ఆయనను అభినందించా. పదవి నుంచి తొలగించాలని ఏకంగా పార్లమెంట్లో మీకు వ్యతిరేకంగా నోటీసులు జారీఅయ్యాయి అని చెప్పి బయటికొచ్చేశా’’అని ఓబ్రియాన్ వెల్లడించారు. ఇష్టారీతిన మాట్లాడారు: ఈసీ వాగ్వాదంపై ఈసీ తన వాదనను తర్వాత ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్చేసింది. ‘‘టీఎంసీ ప్రతినిధి బృందంతో ఈసీ ఉన్నతాధికారులు నిక్కచ్చిగా మాట్లాడారు. టీఎంసీ ఎంపీ ఓబ్రియాన్ గట్టిగా అరుస్తూ ఎలక్షన్ కమిషనర్లలో ఎవరినీ మాట్లాడనివ్వలేదు. హోదా మరచి అనుచితంగా ప్రవర్తించారు. ఆరోపణల అంశంపై సీఈసీ మాట్లాడబోతే ఆయననూ ఓబ్రియాన్ అడ్డుకున్నారు. దాంతో సీఈసీ ఆగ్రహంతో బయటకు వెళ్లండి అని చెప్పాల్సి వచ్చింది. పోలింగ్‌కేంద్రాల్లో రిగ్గింగ్, బూత్ జామింగ్, సోర్స్ జామింగ్ వంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని ఈసీ హెచ్చరించింది. ప్రతినిధి బృందంలో ముందుగా అనుమతి పొందిన వ్యక్తులు ఎందుకు రాలేదని నిలదీశాం. వాళ్లలో అసహనం పెరిగింది’’అని ఈసీ పేర్కొంది. ఈసీ వివరణపై టీఎంసీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ముక్కుసూటిగా మాట్లాడటంతోనే మాకు కోపం వచ్చిందని ఈసీ చెబుతోంది. మరి ఇంతే ముక్కుసూటిగా బీజేపీ నేతలకు ఆదేశాలిచ్చే దమ్ము ఈసీకి ఉందా?’’అని టీఎంసీ నాయకురాలు సాగరికా ఘోష్ ప్రశ్నించారు. -
‘తొలగింపుల’ జాతర!
పశ్చిమ బెంగాల్లో ఈ నెల 23న జరగబోయే తొలి దశ పోలింగ్‌కు సంబంధించి తాజాగా 27 లక్షల 17 వేలమంది ఓటర్లు జాబితాల నుంచి కనుమరుగైనట్టు సోమవారం అర్ధరాత్రి దాటాక ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసిన తుది జాబితా వెల్లడిస్తోంది. దీంతో ఇప్పటివరకూ జాబితాల్లో పేర్లు లేనివారి సంఖ్య దాదాపు 91 లక్షలకు చేరింది. రెండో దశకు సంబంధించి తొలగింపులు కూడా కలుపుకొంటే ఇది కోటికన్నా ఎక్కువే ఉండొచ్చు. న్యాయ నిర్ణయ పరిధి (అజ్యుడికేషన్) ప్రక్రియ గత నెలలో మొదలయ్యాక ఈసీ విడుదల చేసిన అనుబంధ జాబితా ఇది. సహజంగానే ముస్లిం మెజారిటీ ఉన్న ముర్షీదాబాద్‌లో అత్యధికుల పేర్లు తొలగించారు. అక్కడ అజ్యుడికేషన్ పరిధిలోకెళ్లిన 11,01,145 మందిలో 4,55,137 మంది అనర్హులుగా తేలారు. ‘స్వచ్ఛమైన’ జాబితాతోనే ఎన్నికలు నిర్వహించాలన్న దృఢ నిశ్చయంతోనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)కు శ్రీకారం చుట్టామని బిహార్‌లో ఏరివేతలు మొదలెట్టినప్పుడే ఈసీ చెప్పింది. ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ బిహార్ అనుభవం తర్వాతైనా ఆ ప్రక్రియకు పట్టే సమయంపై అంచనా ఉండాలి. అది లేకపోబట్టే లక్షలాదిమంది ఓటర్లు ఈసారి ఓటింగ్‌కు దూరం కాబోతున్నారు. వారి అప్పీళ్లపై ట్రిబ్యునళ్ల విచారణ జరుగు తోంది. వారిలో విశ్వసనీయమైన ఓటర్లుగా నిర్ధారణయ్యేవారు కూడా ఉండొచ్చు. కానీ 2031 అసెంబ్లీ ఎన్నికలకు తప్ప వారు ఓట్లేయటం సాధ్యపడదు. న్యాయ నిర్ణయ ప్రక్రియకు సమయం పడుతుంది గనుక అంతవరకూ ఓటర్ల జాబితాలను ఆపటం సాధ్యపడదని సోమవారం సుప్రీంకోర్టు చెప్పటంతో అలాంటి ఓటర్లకు ప్రస్తుతానికి తలుపులు మూసుకుపోయాయి. ఈ నెల 23న పోలింగ్ జరగబోయే 152 నియోజక వర్గాలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితా సోమవారం విడుదలైంది. 29న రెండో దశలో 142 నియోజకవర్గాల్లో జరగబోయే పోలింగ్‌కు సంబంధించిన జాబితా బుధవారం అర్ధరాత్రి విడుదలవుతుంది. వ్యవధి తక్కువున్న తరుణంలో సుదీర్ఘ సమయం పట్టే ఇంత పెద్ద ప్రక్రియను ఒక అంచనా లేకుండా ఈసీ చేపట్టడాన్ని ధర్మాసనం తప్పుబట్టకపోవచ్చు గానీ, సాధారణ పౌరుల దృష్టిలో ఈసీది దోషమే అవుతుంది. ఎందుకంటే వారు బాధితులు. నిజానికి బిహార్ ‘సర్’ బెంగాల్‌తో పోలిస్తే ఎంతో మెరుగు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే తొలగింపులు పూర్తికావటం వల్ల ఫామ్–6 ద్వారా తిరిగి జాబితాలోకెక్కడానికి చాలామందికి అవకాశం వచ్చింది. బెంగాల్లో ఆ అదృష్టం దక్కలేదు. తమ పేరుందనుకునే లోగానే ఎవరో ఫామ్–7 కింద ఫిర్యాదు చేశారన్న కారణంతో ఓటర్లకు తాఖీదులు పోయాయి. పనులన్నీ మానుకుని కార్యాలయాల చుట్టూ తిరిగి అవసరమైన పత్రాలు తీసుకెళ్లినా సమస్య పరిష్కారం అనుమానమే. నిబంధనల ప్రకారం 2002 రికార్డులతో లింక్ లేని (అన్మ్యాప్డ్) సంగతి బయటపడినా, పేర్లలో అక్షర క్రమంలో స్వల్ప తేడాలొచ్చినా అనర్హులుగా జమవేయటం పెను సమస్యగా మారింది. తాజా జాబితాలో పేర్లు లేని వారిలో అనేకులు అడిగిన పత్రాలన్నీ ఇచ్చినా ఫలితం లేకపోయిందని బావురు మంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పెద్దయెత్తున అందజేసే ఫామ్–7 పత్రాలను తీసుకుని, వాటి ఆధారంగా తొలగింపులు చేపడుతున్నారన్న ఆరోపణలు వాస్తవం అనటానికి ఒక బీజేపీ నాయకురాలి పేరిట దాఖలైన ఫిర్యాదులే తార్కాణం. ఆ సంగతే తనకు తెలియదని ఆమె చెప్పటం గమనించదగ్గ అంశం.ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైనవారి సమస్య ఎన్నికల్లో ఓటేయలేకపోవటం మాత్రమే అయితే ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన దొంగ ఓటర్ల జాతర మాదిరి ఉదంతాల్లో తప్ప చాలా సందర్భాల్లో పోలింగ్ 65 శాతానికి మించదు. కానీ ఈ ‘సర్’ వల్ల గల్లంతైన వారికి భవిష్యత్తులో కష్టాలు చుట్టుముడతాయి. వారి పౌరసత్వమే సంశయాస్పదంగా మారి దేశం నుంచి గెంటేసే ప్రమాదం ఏర్పడుతుంది. బెంగాల్లో పార్టీల మధ్య ఉన్న కలహాలు సాధారణ ఓటర్ల భవితవ్యాన్ని అగమ్యగోచరం చేస్తున్నాయి. ఈసీ సక్రమంగా వ్యవహ రించివుంటే, ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసుకుంటే సమస్యలు తలెత్తేవి కాదు. ఆ సంస్థ చేతగానితనం సామాన్యుల బతుకుల్ని అయోమయంలోకి నెట్టింది. -
పాకిస్థాన్ మరిన్ని ముక్కలవ్వడం ఖాయం : రాజ్‌నాథ్ సింగ్
ఢిల్లీ: పాకిస్థాన్‌కు భారత రక్షణశాఖ రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ ‘కోల్‌కతాపై దాడి’ వ్యాఖ్యల్ని ఖండించారు. పశ్చిమ బెంగాల్‌పై కన్నేసే ప్రయత్నం చేస్తే పాకిస్థాన్ మరిన్ని ముక్కలవుతుందని హెచ్చరించారు.మంగళవారం ఖ్వాజా అసిఫ్ చేసిన వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. అసిఫ్ ఇటీవల ఓ కార్యక్రమంలో భారత్‌పై నోరు పారేసుకున్నారు. భవిష్యత్తులో భారత్ తమ దేశాన్ని దోషిగా నిలబెట్టి దాడులు చేస్తే ప్రతిస్పందనగా.. కోల్‌కతాపై దాడులు చేస్తామని అని అన్నారు. దీనిపై రాజ్‌నాథ్ సింగ్ పాక్ చరిత్రను గుర్తుచేశారు. ఈ తరహా వ్యాఖ్యలు చేసే 55 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌పై రెండు ముక్కలైంది. ఇప్పుడు బెంగాల్‌పై కన్నేస్తే పాకిస్థాన్ ఎన్నిముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలి’ అని హెచ్చరించారు.1971లో పాక్ రెండు ముక్కలుగా విడిపోయింది. అందులో బంగ్లాదేశ్ విడిపోయి ప్రత్యేక దేశంగా అవతరించింది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్ సైన్యం అండగా నిలిచింది. నాటి చరిత్రను తాజాగా రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేశారు. మరోసారి అదే తరహా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పాకిస్థాన్ ముక్కలవుతుందని వ్యాఖ్యానించారు. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. నాటి నుంచి పాకిస్థాన్.. భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఖవాజా మరోసారి ప్రగల్భాలు పలికారు. ఈ పరిణామాలపై తృణమూల్ కాంగ్రెస్ కూడా స్పందించింది. కోల్‌కతాపై దాడి చేస్తే పాక్‌లోని వారి ఇళ్లలోకి దూరి మరి చంపుతామని అధికార టీఎంసీ నేతలు వ్యాఖ్యానించారు. మొత్తం మీద, ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. రాజ్‌నాథ్ సింగ్ చేసిన హెచ్చరికలు మాత్రం భారతదేశం తన భూభాగాన్ని రక్షించేందుకు ఎలాంటి రాజీపడదని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. బెంగాల్‌పై కన్నేసే ప్రయత్నం చేస్తే పాకిస్తాన్‌కు మరింత విభజన తప్పదని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. -
బెంగాల్ రణరంగం: ‘దీదీ’ ముంగిట అతిపెద్ద గండం
గడచిన 15 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్ రాజకీయాలను ఏకఛత్రాధిపత్యంగా శాసిస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తన ప్రయాణంలో ఎన్నో రాజకీయ సవాళ్లు ఎదురయ్యాయి. అయితే ప్రతిసారీ ఆమెదే పైచేయి అవుతూ వచ్చింది. దశాబ్దం క్రితం శారద, నారద వంటి కుంభకోణాలు చుట్టుముట్టినా, 2011లో మునుపటి కన్నా 27 సీట్లు అదనంగా సాధించి, ఆమె సత్తా చాటి తొలిసారి సీఎం అయ్యారు. ఇక 2016లో 211 సీట్లతో టీఎంసీ విజయ ఢంకా మోగించింది. ఇక 2021లో అధికార వ్యతిరేకత, బీజేపీ సృష్టించిన భారీ ఫిరాయింపుల సునామీని సైతం ‘లక్ష్మీర్ భండార్’ అనే మహిళా సంక్షేమ పథకం సాయంతో మమత తిప్పికొట్టారు. అలాగే రికార్డు స్థాయిలో 215 సీట్లు కైవసం చేసుకున్నారు. అయితే ఈ ఏప్రిల్(2026) నెలాఖరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ‘దీదీ’కి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈసారి ఆమెకు ప్రధాన శత్రువులు ప్రతిపక్షాలు కాదు.. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణే అని విశ్లేషకులు అంటున్నారు.లోలోపల టెన్షన్..పైకి అంతా సవ్యంగానే ఉన్నట్లు, ధీమాగా కనిపిస్తున్నా.. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)అభ్యర్థుల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ‘చాలా ఒత్తిడి ఉంది.. 226 స్థానాల టార్గెట్‌ను చేరుకోవడం కష్టమే అనిపిస్తోంది’ అని స్వయంగా ఓ టీఎంసీ అభ్యర్థి పెదవి విరవడం క్షేత్రస్థాయి పరిస్థితికి అద్దం పడుతోంది. ఏప్రిల్ 23న తొలిదశ పోలింగ్ జరగనుంది. కాగా 152 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 35,97,704 మంది ఓటర్ల భవితవ్యం ఎన్నికల సంఘం చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) కారణంగా గాలిలో దీపంలా మారింది. ఎంతమంది ఓటు హక్కు కోల్పోతారోనన్న స్పష్టత లేకపోవడం తృణమూల్ శ్రేణులను వెంటాడుతోంది.కంచుకోటకు భారీ దెబ్బఓటర్లే పునాదిగా నిర్మించుకున్న మమత కంచుకోటను ఈసీ ఓటర్ల సవరణ ప్రక్రియ బలంగా కొడుతోందని టీఎంసీ భావిస్తోంది. విచారణ (అడ్జుడికేషన్)లో ఉన్న 60.06 లక్షల మంది ఓటర్లలో ఏప్రిల్ 5 నాటికి 57 లక్షల కేసులను ఈసీ పరిష్కరించింది. అయితే, ఈ ప్రక్రియ ఎంత అస్తవ్యస్తంగా ఉందో చెప్పేందుకు ఓ గణాంకం సాక్ష్యంగా నిలుస్తోంది. ముస్లిం జనాభా అధికంగా ఉండే నార్త్ దినాజ్‌పూర్‌లోని ఒక్క 'గోల్పోఖర్' నియోజకవర్గంలోనే 78,475 మంది ఓటర్లు విచారణలో ఉండగా.. గిరిజన జనాభా అధికంగా ఉండే బంకురా, పురూలియా జిల్లాలను పూర్తిగా కలిపినా ఆ సంఖ్య 72,694 మాత్రమే ఉండటం గమనార్హం.‘కేంద్రం కుట్రపూరితంగా..’బరాక్‌పూర్ టీఎంసీ ఎంపీ పార్థా భౌమిక్ మాట్లాడుతూ ‘మైదానంలో మాకు ప్రతిపక్షమే లేదు. మేం నేరుగా ఎన్నికల సంఘంతోనే పోరాడుతున్నాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం కుట్రపూరితంగా ఈసీ ద్వారా ప్రజల ఓటు హక్కును హరించాలని చూస్తోందని, అయినా బెంగాల్ ప్రజలు నాలుగోసారి మమతా దీదీకే పట్టం కడతారని మంత్రి చంద్రమా భట్టాచార్య ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల గణాంకాలు టీఎంసీకి ఏమాత్రం సానుకూలంగా లేవు. 2021లో 55 స్థానాల్లో టీఎంసీ 15,000 లోపు మెజారిటీతో బయటపడింది. అందులో 39 చోట్ల మెజారిటీ 10 వేల లోపే. ఒకవేళ ఏమాత్రం వ్యతిరేక పవనాలు వీచినా, ఈ 55 సీట్లు చేజారి, టీఎంసీ బలం 170కి పడిపోతుంది.సొంత నియోజకవర్గంలో సెగలు2024 లోక్‌సభ లెక్కల ప్రకారం చూస్తే, అసెంబ్లీ సెగ్మెంట్లలో 15 వేల లోపు స్వల్ప మెజారిటీ ఉన్న స్థానాలు 69కి పెరిగాయి. దీదీ సొంత నియోజకవర్గం భవానీపూర్, మానిక్తల, రాస్ బిహారీలలో మార్జిన్ తగ్గగా.. రాజార్హట్-గోపాల్‌పూర్‌లో మెజారిటీ కేవలం 74 ఓట్లే! ఈ లెక్కన స్వల్ప స్వింగ్ వచ్చినా టీఎంసీ మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువగా 146కి పడిపోయే ప్రమాదం ఉంది. ముస్లిం బెల్ట్ అయిన నార్త్ దినాజ్‌పూర్, మాల్డా, ముర్షిదాబాద్, బీర్భూమ్ (తొలి దశ పోలింగ్)లలోని 52 స్థానాలతో పాటు, సౌత్, నార్త్ 24 పరగణాలు, హౌరా జిల్లాల్లో టీఎంసీకి ఎదురులేదని విశ్లేషకులు చెబుతున్నారు.వణికిస్తున్న నార్త్ బెంగాల్నార్త్ బెంగాల్ మాత్రం టీఎంసీ పార్టీకి అతిపెద్ద బలహీనతగా మారింది. ఓటర్ల జాబితా అప్పీళ్ల ప్రక్రియను సరిదిద్దేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ప్రతిరోజూ ప్రచారం ముగిశాక అర్ధరాత్రి వరకూ కుస్తీ పడుతున్నారు. తమ సగం శ్రమను ఈసీతో పోరాడటానికే వెచ్చించాల్సి వస్తోందని టీఎంసీ వర్గాలు వాపోతున్నాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో బీజేపీ వంద సీట్లు దాటినా అది తమకు పెద్ద ప్రమాద హెచ్చరికేనని టీఎంసీ చెబుతోంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీని చిత్తు చేస్తే, ఆ ప్రభావం 2029 లోక్‌సభ ఎన్నికల వరకు ఉంటుందని కూడా విశ్వసిస్తోంది. ‘మే 4తో మా పోరాటం ముగియదు.. 2029 వరకు కొనసాగుతుంది’ అంటూ ఓ టీఎంసీ నేత చేసిన వ్యాఖ్యలు.. ఈ ఎన్నికలు ఆ పార్టీని ఎంతలా భయపెడుతున్నాయో చెప్పకనే చెబుతున్నాయి.ఇది కూడా చదవండి: విజయ్ కొత్త అఫిడవిట్.. వెలుగులోకి రెండు కేసులు -
కోల్‌కతాపై దాడి చేస్తామంటే ప్రధాని ఏం చేస్తున్నారు?: మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రధాని మోదీపై విరుచుకపడ్డారు. కోల్‌కతా దాకా దాడి చేస్తాం అని పాకిస్థాన్ ప్రగల్భాలు పలుకుతుంటే మోదీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ( సోమవారం) నైదా జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. "భారత్ గనుక ఈసారి ఏదైనా 'ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్' (కృత్రిమంగా దాడులు సృష్టించడం) చేయడానికి ప్రయత్నిస్తే, దేవుడి దయ వల్ల మేము ఆ యుద్ధాన్ని కోల్‌కతా వరకు తీసుకెళ్తాము" అని హెచ్చరించారు. అంటే, సరిహద్దులకే పరిమితం కాకుండా భారత్ లోపలికి చొచ్చుకెళ్లి కోల్‌కతా (తూర్పు తీరం వరకు) దాడులు చేస్తామని ఆయన పరోక్షంగా బెదిరించారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించనందుకు మమతా బెనర్జీ, ప్రధాని మోదీపై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ మాట్లాడారు.మమతా బెనర్జీ ప్రధాని మోదీ గురించి మాట్లాడుతూ " ప్రతి ఎన్నికల సభలో బెంగాల్‌ను టార్గెట్ చేసి మాట్లాడే మోదీ కోల్‌కతాపై దాడి చేస్తామని పాక్ మంత్రి హెచ్చరిస్తుంటే ఎందుకు స్పందించలేదు. ఒకవేళ ఈ ప్రాంతంపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎందుకు హెచ్చరించలేదు. దీనికి బాధ్యతగా ప్రధాని మోదీ రాజీనామా చేయాలి " అని ప్రధానిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అదే ఏవరైనా భారత్ అదే విధంగా కోల్‌కతాను టార్గెట్ చేస్తూ హెచ్చరిస్తే ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు. కాగా ఈ నెల 23,29 తేదీలలో ఈ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. -
దీదీపై ప్రధాని మోదీ ఆగ్రహం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. కూచ్ బెహార్‌లోని చారిత్రాత్మక రాస్ మేళా మైదానంలో జరిగిన ‘విజయ్ సంకల్ప సభ’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ, టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.మోదీ మాట్లాడుతూ.. టీఎంసీ ప్రభుత్వం అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిందని, ప్రజల సొమ్మును నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ‘చేసిన అక్రమాలకు టీఎంసీ నేతలు తప్పక మూల్యం చెల్లించుకోవాలి. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతిపరుల నుంచి దొంగిలించిన డబ్బును తిరిగి తీసుకుంటాం. నేరస్తులను తగిన విధంగా శిక్షిస్తాం’ అని ఆయన హామీ ఇచ్చారు.రాష్ట్రంలో అక్రమ చొరబాట్లను బీజేపీ అడ్డుకుందని, కానీ అది సరిపోదని, ప్రతి అక్రమ వలసదారుని వెనక్కి పంపుతామని మోదీ స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలతో టీఎంసీ అవినీతి, హింస, పాలన పతనంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.ఈ ప్రచారం ద్వారా బీజేపీ, ఈ నెల చివర్లో జరగనున్న ఓటింగ్‌కు ముందు ప్రజలను మరింతగా ఆకర్షించాలనే వ్యూహాన్ని అమలు చేస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి 294 స్థానాల కోసం ఎన్నికలు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు దశల్లో జరుగుతాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. సారాంశంగా, మోదీ ప్రసంగం బీజేపీ ఎన్నికల ప్రచారానికి నాంది పలికింది.Today’s rally in Cooch Behar clearly indicates the mood on the ground. Across West Bengal, there is growing anger against TMC’s corruption, violence and collapse of governance.@BJP4Bengalhttps://t.co/gMHIFeaMXr— Narendra Modi (@narendramodi) April 5, 2026 -
బెంగాల్ కురుక్షేత్రం: ‘దీదీ’ కోటలో ‘కమలం’ చిచ్చు
పశ్చిమ బెంగాల్ రాజకీయ క్షేత్రం ఇప్పుడు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల కారణంగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. గత కొంతకాలంగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని వెంటాడుతున్న వరుస కుంభకోణాలు, కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. అధికార పక్షం సంక్షేమ పథకాలను నమ్ముకుంటే, ప్రతిపక్ష బీజేపీ మాత్రం అవినీతి ఆరోపణలనే ప్రధాన అస్త్రంగా మార్చుకుని ఎన్నికల యుద్ధానికి దిగింది.ఉద్యోగాల వేట.. జైలు గోడలురాష్ట్రంలో సంచలనం సృష్టించిన ‘స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్’ టీఎంసీకి పెద్ద తలనొప్పిగా మారింది. వేల సంఖ్యలో ఉద్యోగాల రద్దు, అర్హులైన అభ్యర్థుల రోడ్డున పడటం లాంటి అంశాలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మాజీ మంత్రి పార్థ ఛటర్జీతో పాటు కీలక నేతలు జైలుకు వెళ్లడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది. దీనికి తోడు రేషన్ కుంభకోణం, పశువుల అక్రమ రవాణా కేసులు కూడా తోడవడంతో రాష్ట్రంలో ‘అవినీతి’ అనేది ఎన్నికల ప్రధాన ఎజెండాగా మారుతోంది.బెయిల్ పాలిటిక్స్: నైతిక విజయమా?ఇటీవల జ్యోతిప్రియ మల్లిక్, అనుబ్రత మండల్ వంటి కీలక నేతలు బెయిల్‌పై విడుదలవ్వడం టీఎంసీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీన్ని తాము ఎదుర్కొంటున్న రాజకీయ కక్షసాధింపుపై లభించిన నైతిక విజయంగా టీఎంసీ అభివర్ణిస్తోంది. ‘బెయిల్ రావడం అంటే పాపం కడిగేసుకోవడం కాదు’ అని బీజేపీ హెచ్చరిస్తున్నా, జైలు నుంచి వచ్చిన నేతలు మాత్రం 2026లో తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ బెయిల్ వ్యవహారాలు ఎన్నికల ప్రచారంలో హాట్ టాపిక్ కానున్నాయి.ఛార్జ్షీట్ల యుద్ధం.. బీజేపీ వ్యూహంప్రతిపక్ష నేత సువేందు అధికారి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ టీఎంసీని ఇరకాటంలో పెట్టేందుకు దూకుడు పెంచారు. ముఖ్యంగా మాల్డా, ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లో టీఎంసీ ఎమ్మెల్యేలపై బహిరంగంగా ‘ఛార్జ్షీట్లు’ విడుదల చేయడం బెంగాల్ రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌కు తెరలేపింది. కేంద్ర నిధులను మళ్లించారని, ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆరోపిస్తూ, బీజేపీ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్తోంది. అవినీతిని అంతం చేయడమే తమ లక్ష్యమని కమలనాథులు నినదిస్తున్నారు.పరస్పర ఆరోపణల రచ్చటీఎంసీ కూడా బీజేపీపై ఎదురుదాడికి పదును పెట్టింది. ఇతర పార్టీల నేతలు బీజేపీలోకి వెళ్లగానే వారిపై ఉన్న కేసులు ఎలా మాయమవుతాయంటూ పలు ఆరోపణలను ఎక్కుపెట్టింది. గతంలో నారద స్టింగ్ వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారు బీజేపీ కండువా కప్పుకోగానే పవిత్రులు అయిపోయారా? అని మమతా బెనర్జీ ప్రశ్నిస్తున్నారు. ఉపాధి హామీ నిధులను కేంద్రం అడ్డుకోవడం వెనుక రాజకీయ కక్ష ఉందన్న అభిషేక్ బెనర్జీ వాదనను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది.సంక్షేమం వర్సెస్ కుంభకోణం2026 అసెంబ్లీ పోరులో మమతా బెనర్జీ ప్రధానంగా తన సంక్షేమ పథకాలను ‘రక్షణ కవచం’గా భావిస్తున్నారు. ‘లక్ష్మీ భండార్’, ‘కన్యాశ్రీ’ వంటి పథకాల ద్వారా మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని దీదీ వ్యూహాలు రచిస్తున్నారు. ఒకవైపు అవినీతి ఆరోపణలు, మరోవైపు సంక్షేమ ఫలాలు.. ఈ రెండింటిలో బెంగాల్ ఓటర్లు దేనికి పట్టం కడతారన్నది ఉత్కంఠ రేపుతోంది.ఇది కూడా చదవండి: ‘మమ్మల్ని చంపేయండి’.. పాక్‌లో అల్లకల్లోలం -
365 రోజులున్నా ఫలితం శూన్యం
గజోల్: అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో 15 రోజులుపాటు ఉంటానంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై సీఎం మమతా బెనర్జీ తనదైన శైలిలో స్పందించారు. ‘అమిత్ షా అన్నా, బీజేపీ అన్నా బెంగాల్ ప్రజలకు గిట్టదు. అందుకే అమిత్ షా ఇక్కడ 15 రోజులు కాదు..ఏకంగా 365 రోజులపాటు మకాం వేసినా ఎలాంటి ఫలితమూ ఉండదు’అంటూ వ్యాఖ్యానించారు. శుక్రవారం మాల్దా జిల్లా గజోల్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. మాల్దాలో సర్ దరఖాస్తుల పరిశీలనకు వెళ్లిన న్యాయాధికారులను 8 గంటలపాటు నిర్బంధంలో ఉంచిన ఘటనపై మమత స్పందిస్తూ.. బీజేపీ హైదరాబాద్ కోకిల ఈ కుట్రకు పథకం వేసిందంటూ పరోక్షంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఇటీవల టీఎంసీ నుంచి వేరుపడి ఆమ్ జనతా ఉన్నయన్ పేరుతో పార్టీ పెట్టిన హుమాయూన్ కబీర్‌కు మద్దతు ప్రకటించిన ఎంఐఎం చీఫ్ ముస్లింల ఓట్లు చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన ఎంఐఎం, ఐఎస్ఎఫ్ కార్యకర్తలకు మాల్దా ఘటనలో ప్రమేయం ఉందన్నారు. ఇందులో కాంగ్రెస్ హస్తం కూడా ఉందని చెప్పారు. ‘మాల్దా ఘటన బెంగాల్ పరువును మంటగలిపింది. ఈ ఘటనకు కారణం స్థానికులు కారు. వాళ్లకు ఇబ్బందులు ఉండే ఉండొచ్చు. బయటి వ్యక్తులే వారిని ఈ ఉచ్చులోకి లాగారు. హైదరాబాద్ నుంచి తమ మతానికి చెందిన కొందరిని వెంటేసుకు వచ్చిన ఒక బీజేపీ కోయిల దీని వెనుక ఉంది. పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఎయిర్‌పోర్టులో మా సీఐడీ బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది’అని మమత తెలిపారు. ‘బెంగాల్ అంటే ఢిల్లీ మాదిరిగా కాదు. వివిధ ప్రభుత్వ సంస్థలను వాడుకుంటూ, ఓటర్లకు డబ్బు ఎరవేసి ఏదైనా చేయొచ్చని అనుకుంటే కుదరదు’అని స్పష్టం చేశారు. బీజేపీ ఓటమి ఖాయమని తనకు తెలుసునన్నారు. రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగం ఇప్పటికీ తన నియంత్రణలోనే ఉందని, ఎన్నికల కమిషన్ అధీనంలోకి వెళ్లలేదని చెప్పారు. -
మాల్డా ఘటనలో సూత్రధారి అరెస్టు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్డా జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) విధుల్లో నిమగ్నమైన ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను నిర్బంధించిన ఘటనలో అసలు సూత్రధారి అడ్వొకేట్ ముఫకరూల్ ఇస్లాంతోపాటు మరో వ్యక్తిని శుక్రవారం సిలిగురి బాగ్దోగ్రా ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో వలపన్ని పట్టుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటిదాకా 35 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్) అభ్యర్థి మౌలానా మొహమ్మద్ షాజహాన్ అలీ ఖాద్రీ కూడా ఉన్నాడు. మొతాబారీ అసెంబ్లీ స్థానం పరిధిలోని కాలియాచాక్ గ్రామంలో బుధవారం రాత్రి జ్యుడీషియల్ అధికారులను స్థానికులు ఘెరావ్ చేసి తొమ్మిది గంటలపాటు నిర్బంధించారు. అర్ధరాత్రి తర్వాత సైన్యం వారిని రక్షించింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. జ్యుడీషియల్ అధికారులను వేధించిన ఘటనపై సీబీఐ లేదా ఎన్ఐఏతో దర్యాప్తు జరిపించాలని ఆదేశించింది. ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని ఇతాహర్ గ్రామానికి చెందిన ముఫకరూల్ ఇస్లాం ప్రస్తుతం కోల్‌కతాలో న్యాయవాదిగా పని చేస్తున్నాడు. ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ కాలియాచాక్లో స్థానికులను రెచ్చగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ముఫకరూల్ ఇస్లాం ప్రోద్బలంతోనే జనం జ్యుడీషియల్ అధికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు తేలింది. కాలియాచాక్ పోలీసు స్టేషన్‌పై అతడిపై మూడు కేసులు నమోదు చేశారు. -
మార్పునకు దగ్గరి దారి భవానీపూర్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో మార్పునకు సొంత నియోజకవర్గం భవానీపూర్‌లో సీఎం మమతా బెనర్జీని ఓడించడమే దగ్గరిదారి అని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మమతకు పోటీగా బీజేపీ నేత సువేందు అధికారి భవానీపూర్‌లో గురువారం నామినేషన్ వేశారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావాలంటే 170 సీట్లను గెలుచుకోవడం ఒక ఎత్తయితే, భవానీపూర్‌లో సువేందు గెలవడం మరో ఎత్తుగా పేర్కొన్నారు. ఇక్కడ సువేందు విజయంతో రాష్ట్రంలో మార్పు దానంతటదే వస్తుందని పేర్కొన్నారు. కోల్‌కతాలోని హజ్రా నుంచి గురువారం మొదలైన సువేందు నామినేషన్ ర్యాలీలో మంత్రి ప్రసంగించారు. ‘బెంగాల్లో మార్పు సంభవిస్తుంది. అయితే, ముందుగా భవానీపూర్‌లో మార్పు రావాలా? వద్దా? అంటూ ప్రజలనుద్దేశించి ఆయన ప్రశ్నించారు. ‘రాష్ట్రాన్ని విముక్తం చేసేందుకు మన అభ్యర్థిని సువేందు అధికారిని భారీ మెజారిటీతో గెలిపించాలని భవానీపూర్ ప్రజలను చేతులెత్తి వేడుకుంటున్నా’అని పేర్కొన్నారు. నందిగ్రామ్ నుంచే కాదు భవానీపూర్‌లో కూడా పోటీ చేసి మమతను ఓడించాలని సువేందును ఒప్పించానన్నారు. 2021లో మరోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ సువేందు చేతిలో మమత ఓడారన్నారు. ఈసారి మాత్రం, రాష్ట్రంలో అధికారంతోపాటు భవానీపూర్‌లోనూ మమతా బెనర్జీ ఓటమి ఖాయమని అమిత్ షా ప్రకటించారు. ‘మోదీ జీ నాయకత్వంలో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలి. చొరబాటుదార్లను రాష్ట్రం నుంచే కాదు దేశం నుంచి వెళ్లగొట్టాలి’అని మంత్రి పేర్కొన్నారు. బెంగాల్ అస్తిత్వానికే ముప్పు ఏర్పడిందన్నారు. కాళీఘాట్ వద్ద హైటెన్షన్. బీజేపీ ర్యాలీలో జై శ్రీరాం, బీజేపీ జిందాబాద్, మమతా హటావో, బంగ్లా బచావో నినాదాలు భవానీపూర్‌లో మారుమోగుతున్న వేళ ర్యాలీ సీఎం మమతా బెనర్జీ నివాసమున్న కాళీఘాట్ సమీపానికి చేరుకుంది. అక్కడ టీఎంసీ మద్దతుదారులు పార్టీ జెండాలు చేబూని జోయ్ బంగ్లా, మమతా బెనర్జీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. రెండు పార్టీల మద్దతుదారుల నడుమ కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. -
జ్యుడీషియల్ అధికారుల నిర్బంధంపై సీరియస్
న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియలో నిమగ్నమైన ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను నిరసనకారులు నిర్బంధించడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఘటనపై సీబీఐ లేదా ఎన్ఐఏతో విచారణ జరిపించాలని గురువారం ఆదేశించింది. విధి నిర్వహణలో ఉన్న అధికారులకు తగిన రక్షణ కల్పించలేకపోయారని బెంగాల్ ప్రభుత్వ యంత్రాంగంపై మండిపడింది. జ్యుడీషియల్ అధికారులను జనం ఘెరావ్ చేసి, దాడి చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. ఎస్ఐఆర్ పట్ల అభ్యంతరాలను పరిష్కరిస్తున్న ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘానికి సూచించింది. జ్యుడీషియల్ అధికారులను భయభ్రాంతులకు గురిచేయడం సుప్రీంకోర్టు అధికారానికే సవాలు విసరడంతో సమానమని ఆక్షేపించింది. ఎస్ఆఐర్ను వ్యతిరేకిస్తూ బుధవారం మాల్డా జిల్లాలోని కాలియచౌక్లో జ్యుడీషియల్ అధికారులను నిరసనకారులు తొమ్మిది గంటలపాటు నిర్బంధించారు. ఆహారం, నీరు కూడా ఇవ్వలేదు. అర్ధరాత్రి తర్వాత భద్రతా సిబ్బంది వారిని రక్షించారు. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సుమోటోగా స్వీకరించి, విచారణ చేపట్టింది. అది ఘెరావ్ కాదని, రాజకీయ నిరసన అంటూ బెంగాల్ ప్రభుత్వం వివరణ ఇవ్వగా, ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. అది సాధారణ ఘటన కాదని, అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు ఒక పథకం ప్రకారం, ఉద్దేశపూర్వకంగా జరిగిన చర్య అని పేర్కొంది. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా మేజి్రస్టేట్, ఎస్పీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. మాల్డా జిల్లా ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 6న తమ ఎదుట ఆన్లైన్ ద్వారా హాజరు కావాలని స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దాదాపు 700 మంది జ్యుడీషియల్ అధికారులు బెంగాల్లో ఎస్ఐఆర్పై అభ్యంతరాలను పరిష్కరిస్తున్నారు. వీరంతా బెంగాల్‌తోపాటు ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందినవారు. -
బీజేపీ గేమ్ ప్లాన్‌లో భాగమే: మమత ఫైర్
బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఎస్ఐఆర్ విధుల్లో భాగంగా బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఏడుగురు న్యాయాధికారులను నిర్బంధించిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో, ఈ అంశం కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ వ్యవహారంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీ ప్లాన్ అంటూ విమర్శలు చేశారు.తాజాగా మమత మాట్లాడుతూ..‘ఈ ఘటనతో మా ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)పై ప్రజాగ్రహమే దీనికి కారణం. న్యాయాధికారులను ముట్టడించిన ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలియదు. కానీ SIRపై ప్రజలు కోపంగా ఉన్నారని మాత్రం నేను చెప్పగలను. దీనిపై నాకు ఎలాంటి అధికారం లేదు. శాంతిభద్రతలు వంటి అన్ని అధికారాలను వారే నా నుండి లాగేసుకున్నారు అంటూ వ్యాఖ్యానించారు.అలాగే, మాల్దాలో జరిగిన ఘటన బీజేపీ ఎన్నికల వ్యూహంలో భాగమే. ఎన్నికల్లో ఓటమి తప్పదని భావిస్తున్న కాషాయ పార్టీ, ఈ నెల చివరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయించి, బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోంది. వారు శాంతిభద్రతలను నియంత్రించాలని కోరుకుంటున్నారు కానీ విఫలమయ్యారు’ అని ఘాటు విమర్శలు చేశారు. ఇదే సమయంలో పేర్ల తొలగింపుపై విస్తృతమైన అశాంతి నెలకొన్న నేపథ్యంలో శాంతిని కాపాడుకోవాలని ప్రలోభాలకు లొంగవద్దని బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న అంటూ కామెంట్స్ చేశారు.Sagardighi, West Bengal: On Malda issue, Chief Minister Mamata Banerjee says, "The BJP is playing a game...They have removed 1 crore 20 lakhs voter names, which is why we approached the Supreme Court. The Supreme Court ruled that this cannot happen..." pic.twitter.com/HVyEGIdzjs— IANS (@ians_india) April 2, 2026 ఏం జరిగింది?బెంగాల్లో ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడాన్ని నిరసిస్తూ మాల్డా జిల్లాలో ఆందోళనకారులు బుధవారం ఆందోళనకు దిగారు. మొదట న్యాయాధికారులతో సమావేశం కావాలని నిరసనకారులు కోరారు. అందుకు అనుమతి నిరాకరించడంతో నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో కార్యాలయం చుట్టూ చేరి అధికారులను నిర్బంధించారు. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ వీధుల్లో భాగంగా బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఏడుగురు న్యాయాధికారులను నిర్బంధించిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి అని ధర్మాసనం అభివర్ణించింది. బెంగాల్లో శాంతిభద్రతల వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, ఈ ఘటనపై తగిన వివరణ ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేశారు.Seven judicial officers including THREE female officials were kept at siege for over 17 hours by Trinamool goons inside Kaliachak BDO office in Malda ! These judges have been appointed by the Hon'ble Court for completing the SIR process. But Mamata Banerjee and Trinamool does not… pic.twitter.com/a38LCVcPev— Keya Ghosh (@keyakahe) April 2, 2026ముగ్గురు మహిళలు సహా ఏడుగురు న్యాయాధికారులను కొన్ని అసాంఘిక శక్తులు నిర్బందించాయని, ఈ అర్థరాత్రి వరకు తాను స్వయంగా పరిస్థితిని పర్యవేక్షించాల్సి వచ్చిందని సీజేఐ తెలిపారు. ఇది న్యాయాధికారులను భయపెట్టడమే కాకుండా కోర్టు అధికారాన్ని నేరుగా సవాలు చేయడమేనని ధర్మాసనం పేర్కొంది. న్యాయాధికారులపై మానసిక దాడులకు పాల్పడేందుకు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. ఈ ఘటనపై సీబీఐ లేదా ఎన్ఐఏ విచారణ కోరేందుకు ఎన్నికల సంఘానికి సుప్రీం ధర్మాసనం అనుమతి ఇచ్చింది. -
డియర్ లీడర్స్.. ‘ఆమె’ కరుణిస్తేనే కుర్చీ!
ఒకప్పుడు ఓటు వేయడానికి ఇంటి నుంచి బయటకు రావడానికే సంకోచించిన మహిళలు, ఇప్పుడు భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికలు జరగబోతున్న అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు అత్యంత కీలకమైన ‘నిర్ణయాత్మక శక్తి’గా అవతరించారు. ఇప్పుడు ఏ పార్టీ గెలవాలన్నా, ఏ నాయకుడు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలన్నా మహిళల మద్దతు తప్పనిసరి అనే పరిస్థితి నెలకొంది.సైలెంట్ ఓటర్లు కాదు.. డిసైడింగ్ ఫ్యాక్టర్గత మూడు దశాబ్దాలుగా మహిళల రాజకీయ చైతన్యం ఊహించని రీతిలో పెరిగింది. మునుపటితో పోలిస్తే ఇప్పుడు మహిళలు పురుషులతో సమానంగా, కొన్ని రాష్ట్రాల్లో పురుషుల కంటే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కేవలం ఓటు వేయడమే కాదు, తమ ఓటుతో గెలుపోటములను తలకిందులు చేస్తున్నారు. అందుకే, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మహిళల కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీలు, నేరుగా నగదు బదిలీ వంటి పథకాలన్నీ ఈ ‘మహిళా ఓటు బ్యాంకు’ను ఆకట్టుకోవడానికేనని స్పష్టమవుతోంది.రాష్ట్రాల వారీగా మహిళల సత్తా ఇదే..అస్సాం: ఇక్కడ పెను మార్పు కనిపిస్తోంది. 2011లో కాంగ్రెస్ వైపు ఉన్న మహిళలు, 2021 నాటికి బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపారు. సంక్షేమ పథకాలు, స్థానిక అంశాలు మహిళల ఓటింగ్ సరళిని పూర్తిగా మార్చేశాయి.పశ్చిమ బెంగాల్: ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పట్టు బలంగా ఉంది. క్షేత్రస్థాయిలో ఉన్న అనుబంధం, మహిళా కేంద్రీకృత పథకాల వల్ల మహిళా ఓటర్లలో దాదాపు సగం మంది ఇప్పటికీ ‘దీదీ’ వెంటే నడుస్తున్నారు.కేరళ: మలయాళ గడ్డపై రాజకీయ విధేయతలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ మహిళా ఓట్లు ప్రధాన కూటముల మధ్య దాదాపు సమానంగా చీలిపోయినా, ఓటర్లు తమ అభిప్రాయాలను అంత సులభంగా మార్చుకోవడం లేదు.తమిళనాడు: ఇక్కడ మహిళల తీరు విభిన్నం. వీరు ఏ ఒక్క పార్టీకి కట్టుబడి ఉండరు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరును బట్టి తమ మద్దతును ఎప్పటికప్పుడు మార్చుకుంటూ అధికార మార్పిడికి కారకులవుతున్నారు. మొత్తానికి ఈ నాలుగు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల ఫలితాలను శాసించేది మహిళలే అనడంలో ఎటువంటి సందేహం లేదు. మెజారిటీ ఓట్లతో గెలుపు మార్జిన్‌ను నిర్ణయించేది కూడా వారే కావడం విశేషం. -
‘దీదీ’ ఇలాకాలో సినీ తారల ధమాకా!
పశ్చిమ బెంగాల్ రాజకీయాలంటేనే ఒక హై వోల్టేజ్ డ్రామా. రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలన్నా, ప్రతిపక్షంలో నిలబడాలన్నా కేవలం సిద్ధాంతాలు ఉంటే సరిపోదు.. ప్రజల హృదయాల్లో బలమైన ముద్ర వేసిన ‘గ్లామర్’ కూడా తోడవ్వాలి. దశాబ్దాలుగా బెంగాల్ రాజకీయాలను శాసిస్తున్న మమతా బెనర్జీ (టీఎంసీ) నుంచి, సవాల్ విసురుతున్న బీజేపీ (బీజేపీ) వరకు అందరికీ సినీ తారలే బ్రహ్మాస్త్రాలుగా మారారు. ఒకప్పుడు కేవలం ప్రచారానికే పరిమితమైన సినీ సెలబ్రిటీలు, నేడు నేరుగా ఎన్నికల బరిలో నిలిచి, పార్లమెంటు మెట్లు ఎక్కుతున్నారు. అటు గ్లామర్ అటు పవర్.. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్న ఆ బెంగాలీ అగ్ర తారల ప్రస్థానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.మిథున్ చక్రవర్తి: ‘డిస్కో డాన్సర్’ నుంచి బీజేపీ స్టార్ వరకు..బెంగాలీ సినిమాతో పాటు బాలీవుడ్ లోనూ ‘గ్రాండ్ మాస్టర్'గా పేరు తెచ్చుకున్న మిథున్ చక్రవర్తి రాజకీయ ప్రస్థానం ఆసక్తికరం. గతంలో తృణమూల్ తరపున రాజ్యసభ సభ్యునిగా ఉన్న ఆయన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో కీలక నేతగా ఉన్నారు. తన డైలాగులతో ప్రచార సభల్లో ఉత్సాహం నింపడం ఆయన ప్రత్యేకత.నుస్రత్ జహాన్: వివాదాలు.. విజయాలుబెంగాలీ సినిమా టాప్ హీరోయిన్లలో ఒకరైన నుస్రత్ జహాన్, 2019లో తృణమూల్ కాంగ్రెస్ తరపున బసిర్హాట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. తన పెళ్లి, పార్లమెంటులో తన ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎప్పుడూ వార్తల్లో నిలిచే నుస్రత్, 2024 వరకు ఎంపీగా సేవలు అందించారు.మిమీ చక్రవర్తి: యువత ఆరాధ్య దైవంనుస్రత్ జహాన్ ఆప్తమిత్రురాలు మిమీ చక్రవర్తి కూడా 2019లోనే రాజకీయ అరంగేట్రం చేశారు. జాదవ్‌పూర్ నియోజకవర్గం నుంచి టీఎంసీ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఇటీవల తన పదవికి రాజీనామా చేసి తిరిగి సినిమాలపై దృష్టి సారించినప్పటికీ, రాజకీయాల్లో ఆమె ప్రభావం మాత్రం తగ్గలేదు.చిరంజిత్ చక్రవర్తి: నిలకడైన రాజకీయ నాయకుడువెండితెరపై హీరోగా మెప్పించిన చిరంజిత్, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. బారాసత్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. సినిమా రంగం నుంచి వచ్చి రాజకీయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న అతికొద్ది మందిలో ఈయన ఒకరు.సాయోనీ ఘోష్: కొత్త తరం గళంనటి, గాయని అయిన సాయోనీ ఘోష్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. గతంలో టీఎంసీ యువజన విభాగం అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె 2024 ఎన్నికల్లో జాదవ్‌పూర్ నుంచి ఎంపీగా గెలిచి, పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆమె ప్రసంగాలు యువతను విశేషంగా ఆకట్టుకుంటాయి.హిరన్ ఛటర్జీ: బీజేపీ పోరాట యోధుడుఖరగ్పూర్ సదర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న హిరన్ ఛటర్జీ, మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్నారు. సినిమాల్లో చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్నప్పటికీ, రాజకీయాల్లో మాత్రం మాస్ లీడర్‌గా ఎదిగారు.సోహమ్ చక్రవర్తి - రాజ్ చక్రవర్తిసోహమ్ చక్రవర్తి: చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా ఎదిగిన సోహమ్, ప్రస్తుతం టీఎంసీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీ సినీ విభాగంలో చురుగ్గా ఉంటూ చండిపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.రాజ్ చక్రవర్తి: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ చక్రవర్తి, సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితులు. బరాక్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, అటు సినిమాలు ఇటు రాజకీయాలను సమన్వయం చేసుకుంటున్నారు.పర్ణో మిత్ర - సయంతిక బెనర్జీనటి పర్ణో మిత్ర గతంలో బీజేపీలో చేరి వార్తల్లో నిలిచారు. మరోవైపు సయంతిక బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.శ్రావంతి ఛటర్జీ: గ్లామర్ పాలిటిక్స్ప్రముఖ నటి శ్రావంతి ఛటర్జీ 2021 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. అయితే, ఆ ఎన్నికల తర్వాత ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వార్తల్లో నిలిచారు.పశ్చిమ బెంగాల్లో కేవలం గ్లామర్ ఉంటేనే రాజకీయాల్లో గెలవడం సాధ్యం కాదు. ప్రజల సమస్యల మీద పోరాడాలి. అదే సమయంలో పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పైన పేర్కొన్న నటీనటులు ఈ రెండు రంగాల్లోనూ సమతూకం పాటిస్తూ, బెంగాల్ రాజకీయాలను రక్తికట్టిస్తున్నారు. సినిమాల్లో వారి పాత్రలు ఎలా ఉన్నా, రాజకీయ తెరపై వారు పవర్ ఫుల్ లీడర్లుగానే కనిపిస్తున్నారు.ఇది కూడా చదవండి: అస్సాం ‘వార్’: ఈ ఏడు సీట్లలో.. నరాలు తెగే ఉత్కంఠ! -
బెంగాల్ దీదీకి ‘సరిహద్దు’ సెగ
దేశ రాజకీయాల్లో ఎప్పుడూ ఆసక్తి రేపే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణరంగాన్ని ఈసారి పొరుగు దేశమైన బంగ్లాదేశ్ పరిణామాలు ప్రభావితం చేస్తున్నాయి. వరుసగా నాలుగోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని తహతహలాడుతున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సరిహద్దు అంశాలు తలపోటుగా మారాయి. చొరబాటు అ్రస్తాన్ని సంధించి ఎలాగైనా దీదీ కోటలో పాగా వేయాలని బీజేపీ కంకణం కట్టుకుంది. బెంగాల్‌కు బంగ్లాదేశ్‌తో 2,216 కిలోమీటర్ల మేర సుదీర్ఘ సరిహద్దు ఉంది. ఇప్పుడు బెంగాల్ రాజకీయాలకు ఇదే కేంద్ర బిందువుగా మారింది. చొరబాట్లు కేంద్రం వైఫల్యమే.. సరిహద్దు గుండా శరణార్థులు, చొరబాటుదారుల రాక భారీగా పెరిగిందని, ఇది రాష్ట్ర జనాభా ముఖచిత్రాన్ని మార్చేస్తోందంటూ బీజేపీ తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తోంది. జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందని చెబుతూ హిందువుల ఓట్ల ఏకీకరణకు ప్రయతి్నస్తోంది. మరోవైపు, అధికార తృణమూల్ కాంగ్రెస్ ఈ ఆరోపణలను తిప్పికొడుతోంది. సరిహద్దుల భద్రత చూసుకునే బీఎస్ఎఫ్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని, చొరబాట్లు జరిగితే అది కేంద్రం వైఫల్యమేనని సీఎం మమతా బెనర్జీ వాదిస్తున్నారు. బంగ్లాదేశ్‌తో ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గుర్తుచేస్తూ, చొరబాట్ల పేరుతో బెంగాలీలను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సరిహద్దు జిల్లాల్లో రైతులను ప్రభావితం చేసే ‘తీస్తా నదీ జలాల పంపిణీ’వివాదం కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. ‘మతువా’ల చుట్టూ రాజకీయ చదరంగం బెంగాల్లో దాదాపు 17 శాతం ఉన్న దళిత (నామశూద్ర) ‘మతువా’సామాజిక వర్గం ఉత్తర 24 పరగణాలు, నదియా లాంటి సరిహద్దు జిల్లాల్లో సుమారు 30 నుంచి 40 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను శాసించగలదు. దశాబ్దాల క్రితం బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వీరు భారత పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కింద అధికారికంగా పౌరసత్వం కల్పిస్తామంటూ బీజేపీ ఇచి్చన హామీ వారిని ఆకర్షిస్తోంది. అయితే, సీఏఏ, ఎన్ఆర్సీలను బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని టీఎంసీ చెబుతోంది. మతువాలు ఇప్పటికే భారత పౌరులని దీదీ వాదిస్తున్నారు. సీఏఏ బీజేపీకి అస్త్రంగా మారింది. దీదీ మాత్రం సంక్షేమ పథకాలు, మైనారిటీ ఓట్ల ఏకీకరణపై ఆశలు పెట్టుకున్నారు. సరిహద్దు జిల్లాల్లో పెరిగిన ముస్లిం జనాభా బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి ఉన్న 7 జిల్లాల్లో ప్రతి ఏటా దాదాపు 5 వేల చొరబాటు కేసులు నమోదవుతున్నాయి. గుర్తించని చొరబాట్లు ఇంకా ఎన్నోరెట్లు ఉంటాయి. సరిహద్దు జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా 40 శాతం నుంచి 70 శాతం వరకు పెరిగింది. ముర్షిదాబాద్, మాల్డా జిల్లాల్లో ముస్లిం జనాభా 50 శాతానికిపైగా ఉండగా, దక్షిణ 24 పరగణాలు వంటి జిల్లాల్లో 40 శాతం వరకు ఉంది. అక్రమ చొరబాట్ల వల్లే ముస్లింల జనాభా పెరిగినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. ముస్లింలను భయపెట్టే రాజకీయాలు చేస్తున్నారని, బెంగాల్ సంస్కృతి, ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం సాగుతోందని తృణమూల్ కాంగ్రెస్ ఆక్షేపిస్తోంది. పెండింగ్‌లో 40 లక్షల ఎస్ఐఆర్ కేసులు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో భాగంగా సుమారు 25 లక్షల ఓటర్ల కేసులు పరిష్కారం కాగా, ఇంకా 40 లక్షల కేసులు పరిశీలనలోనే ఉండటం రాజకీయ చర్చకు దారితీసింది. సరిహద్దు జిల్లాలైన ముర్షిదాబాద్‌లో 12 లక్షల కేసులు, మాల్డాలో 8 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. మిగిలిన వివాదాస్పద ఓటర్లలో 20 లక్షల మంది ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో ఉన్నారు.సరిహద్దు జిల్లాల్లో పరిస్థితి ఇలా.. → జనాభాలో సగానికి పైగా ముస్లింలు ఉండే ముర్షీదాబాద్, మాల్డా జిల్లాలు ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటలు. కానీ, ఇప్పుడు టీఎంసీ పాగా వేసింది. ఇక్కడ హిందువుల ఓట్లను సంఘటితం చేయాలని బీజేపీ, పాత ఓటు బ్యాంకును కాపాడుకోవాలని వామపక్ష కూటమి యతి్నస్తున్నాయి. → రాజ్‌బన్షీలు, గూర్ఖాలు, తేయాకు తోటల కారి్మకులు ఉన్న ఉత్తర బెంగాల్ (కూచ్ బెహార్, జల్పాయ్గురి, డార్జిలింగ్) భౌగోళికంగా, సాంస్కృతికంగా భిన్నమైనది. ఇక్కడ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు సజీవంగా ఉన్నాయి. ఈ ప్రాంతం కొన్నేళ్లుగా బీజేపీకి ఆయువుపట్టుగా మారింది. → సుందర్బన్స్ అటవీ ప్రాంతంతో కూడిన దక్షిణ 24 పరగణాల జిల్లా టీఎంసీకి అభేద్యమైన కోట అనడం సబబు. మైనారీ్టలు, గ్రామీణ పేదలు ఎక్కువగా ఉండటం, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావంతో ఇక్కడ ఏ ఎన్నికలైనా సరే టీఎంసీ విజయం సాధిస్తోంది. స్థానికంగా బీజేపీ ఇంకా బలపడాల్సి ఉంది. -సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి -
సర్వం ‘సర్’మయం!
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మతపరమైన విభజన ప్రధానాంశంగా మారుతోంది. ముఖ్యంగా ప్రధాన పక్షాలైన అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ప్రచారమంతా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ చుట్టే తిరుగుతోంది! దాంతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానాంశాలుగా నిలిచిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ వంటివి పూర్తిగా పక్కకు పోయాయి. సర్, చొరబాట్లు, మైనారిటీల సంతుష్టీకరణే ప్రచారాంశాలుగా మారాయి.సర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 64 లక్షల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ఇంకా లక్షలాది ఓటర్ల తనిఖీ కొనసాగుతోంది. దాంతో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలే పూర్తిగా మారిపోతున్నాయి! 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 90 స్థానాల్లో మెజారిటీ 10 వేల లోపే నమోదైంది. భారీ ఓట్ల తొలగింపు కారణంగా ఆ స్థానాల్లో ఈసారి పార్టీల బలాబలాలే తారుమారయ్యే పరిస్థితి నెలకొంది! ఒక్క ముర్షీదాబాద్ జిల్లాలోనే ఏకంగా 11 లక్షల ఓట్లు తొలగింపునకు గురవడం విశేషం. 8.3 లక్షలతో మాల్డా రెండో స్థానంలో నిలిచింది. నార్త్, సౌత్ 24 పరగణా జిల్లాల్లో కలిపి 12 లక్షల పైచిలుకు ఓట్లు గల్లంతయ్యాయి. ఆ రెండు జిల్లాల్లో మరో 11 లక్షల ఓట్ల తనిఖీ కొనసాగుతోంది! ఇదంతా తమ ఓటుబ్యాంకుకు గండి కొట్టే కుట్రేనని టీఎంసీ ఆరోపిస్తుండగా, కేవలం చొరబాటుదారులను, దొంగ ఓటర్లను ఏరివేయడమే లక్ష్యమని బీజేపీ చెబుతోంది.అస్తిత్వవాదం దిశగా... బెంగాల్లో గతంలో ప్రధానంగా ఎన్నికల వేళ మాత్రమే పార్టీలు, మతపరమైన విభజన వంటివి తెరపైకి వచ్చేవి. ‘‘సర్ ప్రక్రియతో పరిస్థితే మారిపోయింది. కొంతకాలంగా ఏ జిల్లాను తీసుకున్నా మతపరమైన విభజన కొట్టొచ్చినట్టుగా కన్పిస్తోంది. అంతేగాక అది క్రమంగా శాశ్వత రూపు సంతరించుకుంటూ ఉండటం ఆందోళనకరం. స్థానికంగా చిన్న స్థాయిలో జరిగే శ్రీ రామనవమి ఉత్సవాలు ఈసారి భారీ జన సమీకరణ వేదికలుగా మారడం ఇందుకు నిదర్శనం’’ అని రాజకీయ విశ్లేషకులు సుమన్ భట్టాచార్య, మొయిదుల్ ఇస్లాం అభిప్రాయపడ్డారు. బెంగాల్ రాజకీయాలు వర్గ సమీకరణల నుంచి పూర్తిగా మతం, సంస్కృతి, పౌరసత్వం పేరిట క్రమంగా అస్తిత్వవాదం వైపు మళ్లుతున్నాయని వారన్నారు. -
West Bengal: 57 సీట్లు.. నరాలు తెగే ఉత్కంఠ!
పశ్చిమ బెంగాల్ రాజకీయం ఎప్పుడూ సెగలు పుట్టిస్తూనే ఉంటుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతున్న తరుణంలో.. ఇప్పుడు నేతలందరి దృష్టి ఆ 57 నియోజకవర్గాలపైనే నిలిచింది. 2021 ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఘనవిజయం సాధించినప్పటికీ, ఈ సీట్ల ఫలితాలను పరిశీలిస్తే పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడుతూ, నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.చిన్నపాటి ఓట్ల మార్పు జరిగినా..రాష్ట్ర అధికార పీఠాన్ని నిర్ణయించడంలో కేవలం 8,000 లోపు ఓట్ల తేడాతో గెలిచిన ఈ 57 సీట్లు ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి. ఈ స్వల్ప ఓట్ల తేడా అటు ఇటు అయితే బెంగాల్ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. గత 2021 ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే, ఈ 57 స్థానాల్లో గెలుపోటములు వెంట్రుక వాసిలో జరిగాయి. వీటిలో సగటున 8,000 కంటే తక్కువ ఓట్ల మెజారిటీతోనే అభ్యర్థులు గట్టెక్కారు. మరీ ముఖ్యంగా, 19 నియోజకవర్గాల్లో అయితే మెజారిటీ 3,000 ఓట్ల లోపే ఉండటం గమనార్హం. ఈ 57 కీలక స్థానాల్లో గతంలో టీఎంసీ 29 సీట్లు గెలవగా, బీజేపీ 28 స్థానాలను కైవసం చేసుకుంది. అంటే రెండు పార్టీల మధ్య పోరు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 3,000 కంటే తక్కువ ఓట్ల మెజారిటీ ఉన్న 19 సీట్లలో బీజేపీ 12 చోట్ల విజయం సాధించగా, టీఎంసీ 7 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో, 2026లో ఈ 57 స్థానాల్లో చిన్నపాటి ఓట్ల మార్పు జరిగినా అది ప్రభుత్వ మనుగడనే ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదే అసలైన కురుక్షేత్రంఈ ఉత్కంఠభరిత నియోజకవర్గాల్లో అత్యధికంగా 47 సీట్లు దక్షిణ బెంగాల్లోనే ఉన్నాయి. ఉత్తర బెంగాల్లో కేవలం 10 స్థానాలు మాత్రమే ఇటువంటి స్వల్ప మెజారిటీ పరిధిలో ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ జిల్లాలైన పుర్బా మేదినీపూర్, పశ్చిమ మేదినీపూర్, బంకురా, పురూలియా, పశ్చిమ బర్థమాన్ జిల్లాలు ఈసారి ప్రధాన యుద్ధభూమిగా మారనున్నాయి. బంకురా, పశ్చిమ బర్థమాన్ జిల్లాల్లో ఇటువంటి సీట్లు ఆరేసి చొప్పున ఉండగా.. మిగిలిన మూడు జిల్లాల్లో ఐదు చొప్పున ఉన్నాయి.గత ఎన్నికల్లో షాకింగ్ మెజారిటీలునందిగ్రామ్: ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రతిపక్ష నేత సువేందు అధికారి కేవలం 1,956 ఓట్ల తేడాతో విజయం సాధించారు.కుల్తీ: ఇక్కడ బీజేపీ అభ్యర్థి కేవలం 679 ఓట్లతో గట్టెక్కారు.దంతాన్: టీఎంసీ కేవలం 623 ఓట్లతో ఇక్కడ విజయాన్ని అందుకుంది.ఘటల్: బీజేపీ కేవలం 966 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలిచింది.దిన్హాటా: కూచ్ బెహార్ జిల్లాలోని ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నిశిత్ ప్రామాణిక్ కేవలం 57 ఓట్ల తేడాతో గెలవడం ఒక సంచలనం. అయితే ఆయన రాజీనామా తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ ఏకంగా 1.64 లక్షల ఓట్ల ఆధిక్యంతో ఇక్కడ గెలవడం గమనార్హం.మారిన రాజకీయ సమీకరణలు2026 సమరంలో పాత లెక్కలు చెల్లుతాయని చెప్పడం కష్టమే. ఎందుకంటే ఈసారి పోటీ మరింత క్లిష్టంగా మారనుంది. కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశం ఉండగా, సీపీఐ(ఎం) - ఐఎస్ఎఫ్ కలిసి పోటీ చేస్తున్నాయి. వీరికి తోడుగా అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం, మాజీ టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్‌కు చెందిన ఏజేయూపీ కూటమి ముస్లిం ఓట్ల సమీకరణలను మార్చే అవకాశం ఉంది. ఓట్లు ఇలా చీలిపోవడం వల్ల స్వల్ప మెజారిటీ ఉన్న స్థానాల్లో ఫలితాలు ఎటువైపు తిరుగుతాయోనన్న టెన్షన్ పార్టీల్లో నెలకొంది.పార్టీల ధీమా.. పరస్పర విమర్శలుబీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్నాథ్ ఛటోపాధ్యాయ మాట్లాడుతూ, ప్రభుత్వ వ్యతిరేకత, ఓటర్ల జాబితా సవరణ తమకు కలిసి వస్తుందని, తాము 80 శాతానికి పైగా సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు టీఎంసీ ప్రతినిధి అరూర్ చక్రవర్తి ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పించారు. బీజేపీకి అనుకూలంగా కొన్ని వర్గాల ఓటర్ల తొలగింపు జరుగుతోందని ఆరోపించారు. అయినప్పటికీ ప్రజలు తమవైపే ఉన్నారని, స్వల్ప మెజారిటీ సీట్లలో కూడా తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2021లో 213 సీట్లతో భారీ విజయం సాధించిన టీఎంసీకి, 77 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా ఎదిగిన బీజేపీకి మధ్య 2026 ఎన్నికలు చావో రేవో అన్నట్లు ఉండబోతున్నాయనడంలో సందేహం లేదు. ఇది కూడా చదవండి: మంచు దిబ్బల్లో ఘోరం.. ఐదుగురు మృతి -
ల్యాండింగ్‌కు వీలులేక గంటపాటు గాల్లో చక్కర్లు
కోల్‌కతా: ప్రత్యర్థి పార్టీలపై విమర్శలతో మెరుపులా విరుచుకుపడే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని గురువారం మధ్యాహ్నం ఉరు ములు, భారీవర్షం, భీకరగాలుల గంటలపాటు ఆందోళనకు గురిచేశాయి. ఎన్నికల ప్రచారర్యాలీల్లో పాల్గొని కోల్‌కతాకు ఛార్టెర్డ్ విమానంలో తిరుగుపయనమైన మమతకు కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో అననుకూల వాతావరణం స్వాగతం పలికింది. దీంతో తప్పనిపరిస్థితుల్లో విమానం గంటకుపైగా గాల్లోని చక్కర్లు కొట్టింది. తర్వాత ఎట్టకేలకు 5.19 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని అణ్డాల్ నగరంలో ప్రచారం ముగించుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు విమానంలో మమత బయల్దేరారు. అరగంటలో కోల్‌కతాలోని నేతాజీ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ అప్పటికే ఎయిర్పోర్ట్ ప్రాంతమంతా పెద్ద గాలివానలో చిక్కుకుంది. దీంతో విమానాల రాకపోకలను నిలిపేశారు. చేసేదిలేక విమానం చాలాసేపు గాల్లో చక్కర్లు కొట్టి గంట తర్వాత దిగిందని ముఖ్యమంత్రి కార్యాలయం, ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. -
West Bengal: శ్రీరామ నవమి టెన్షన్.. అంతటా హై అలర్ట్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో శ్రీరామ నవమి వేడుకల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా రాష్ట్రవ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధిస్తూ మమతా బెనర్జీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఊరేగింపుల్లో ఆయుధాలు చేతపట్టడంపై నిషేధం విధిస్తూ, భద్రతా వలయాన్ని కట్టుదిట్టం చేసింది.శోభాయాత్రకు పరిమితిగురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న రామ నవమి శోభాయాత్రల కోసం ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో భద్రతను ఏర్పాటు చేసింది. సుమారు 3,000 మంది పోలీసు సిబ్బందిని వివిధ ప్రాంతాల్లో మోహరించినట్లు ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. ప్రతి ఊరేగింపులో పాల్గొనే భక్తుల సంఖ్య 500 కు మించకూడదనే నిబంధన విధించారు. ఒకవేళ ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించినా లేదా నిర్దేశిత సంఖ్య కంటే ఎక్కువ మంది గుమిగూడినా, ఆ యాత్రను తక్షణమే నిలిపివేసి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘాహౌరా, చందన్నగర్, ఇస్లాంపూర్ వంటి సున్నితమైన ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టం చేయడమే కాకుండా, అదనపు బలగాలను రంగంలోకి దింపారు. పరిస్థితిని అదుపు చేయడానికి కేంద్ర బలగాలను (సీఆర్పీఎఫ్)కూడా సిద్ధంగా ఉంచారు. ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా తక్షణమే స్పందించేలా వ్యూహాలు రచించారు.నబన్నాలో ఉన్నత స్థాయి సమీక్షభద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం ‘నబన్నా’లో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం సెక్రటరీ, డీజీపీ, ఏడీజీ (శాంతిభద్రతలు) తో పాటు అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లు, ఎస్పీలు ఈ భేటీలో పాల్గొన్నారు. మార్చి 26 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా రామ నవమి ర్యాలీలు జరిగే అవకాశం ఉందని, గురువారం నాడు అత్యధిక సంఖ్యలో ర్యాలీలు వచ్చే సూచనలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. బెంగాల్ అంతటా శ్రీరామ నవమి వేళ పోలీసుల పహారా కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: అమెరికా-ఇరాన్ యుద్ధం.. థరూర్ సంచలన వ్యాఖ్యలు -
Bengal: బీజేపీ సంచలనం.. ‘ఆర్జీ కర్’ బాధితురాలి తల్లికి న్యాయం?
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. యావత్ దేశాన్ని కుదిపేసిన కోల్‌కతా ఆర్జీ కర్ (RG Kar) ఆస్పత్రి హత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ట్రైనీ డాక్టర్ తల్లి రత్న దేబ్‌నాథ్‌ను ఎన్నికల బరిలోకి దింపింది. బుధవారం విడుదల చేసిన 19 మంది అభ్యర్థుల మూడో జాబితాలో ఆమె పేరును ఉత్తర 24 పరగణాల జిల్లాలోని పాణిహతి నియోజకవర్గం నుండి ఖరారు చేసింది.న్యాయం కోసమే ఈ పోరాటం: రత్న దేబ్నాథ్తన అభ్యర్థిత్వంపై రత్న దేబ్నాథ్ ఉద్వేగంతో వ్యాఖ్యానిస్తూ.. ‘నా కూతురి విషయంలో న్యాయం కోసం ఎన్నో చోట్ల తిరిగాను. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో మహిళల భద్రత కోసం, నా బిడ్డకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతాను. నేను గెలిస్తే అది నా ఒక్కదాని విజయం కాదు, పాణిహతి ప్రజల విజయం’ అని ఆమె పేర్కొన్నారు. 2024 ఆగస్టులో జరిగిన ఈ దారుణ ఘటనపై సీబీఐ విచారణ జరగగా, ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు 2025 జనవరిలో కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే.మూడవ జాబితాలోని ఇతర విశేషాలుబీజేపీ విడుదల చేసిన ఈ మూడో జాబితాలో పలువురు ప్రముఖులకు చోటు దక్కింది.దీపాంజన్ చక్రవర్తి: నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ)మాజీ కమాండో అయిన ఈయనను హుగ్లీ జిల్లాలోని ఉత్తరపారా స్థానం నుండి బరిలోకి దింపారు.మొత్తం అభ్యర్థులు: బెంగాల్‌లోని మొత్తం 294 స్థానాలకు గాను, తాజా జాబితాతో కలిపి బీజేపీ ఇప్పటివరకు 274 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.రాజకీయ విమర్శలు - ఎన్నికల షెడ్యూల్రత్న దేబ్నాథ్ బీజేపీ తరపున పోటీ చేయడాన్ని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తప్పుబట్టింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ప్రస్తావిస్తూ టీఎంసీ నేత కునాల్ ఘోష్ విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. తుది ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి.ఇది కూడా చదవండి: Bengal Election: ‘సునామీ’కి సెంటర్ పాయింట్! -
Bengal Election: ‘సునామీ’కి సెంటర్ పాయింట్!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ‘దక్షిణ బెంగాల్’ ప్రాంతం ఎప్పుడూ ఒక పవర్ హౌస్ లాంటిది. హుగ్లీ నదీ తీరం మొదలుకొని నబన్న (రాష్ట్ర సచివాలయం) వరకు సాగే ఈ రాజకీయ చదరంగం ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు కాంగ్రెస్, ఆపై లెఫ్ట్ ఆధిపత్యం చూసిన ఈ ప్రాంతం, ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి తిరుగులేని కంచుకోటగా ఉంది. అయితే ఈ కోటకు బీటలు వారేలా చేసి అక్కడ పాగా వేయాలని బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అసలు దక్షిణ బెంగాల్ రాజకీయ సమీకరణలు ఏమిటి? ఏయే అంశాలు స్థానిక ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి? ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇదే చర్చనీయాంశంగా మారింది.తామ్రలిప్త సామ్రాజ్యం నుంచి..దక్షిణ బెంగాల్ చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే, ఇది కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదు, బెంగాలీ పునరుజ్జీవనోద్యమానికి కేంద్రం. ప్రాచీన తామ్రలిప్త సామ్రాజ్యం నుంచి బ్రిటీష్ పాలన వరకు ఈ ప్రాంతానిది ప్రత్యేక చరిత్ర. కోల్‌కతా, హౌరా లాంటి నగరాలు రాజకీయ చైతన్యానికి నిలయాలు. ఉత్తర బెంగాల్‌తో పోలిస్తే ఇక్కడ జనాభా చాలా ఎక్కువ. 2011 గణాంకాల ప్రకారం దక్షిణ బెంగాల్ జనాభా 7.4 కోట్లకు పైమాటే. ఈ అధిక జనాభా, పట్టణీకరణ ఇక్కడి ఎన్నికల ఫలితాలను శాసిస్తాయి.మౌలిక సదుపాయాల లేమికోల్కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టణ మధ్యతరగతి ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అయితే గత దశాబ్దాలుగా సాగుతున్న పట్టణీకరణకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు, శాటిలైట్ నగరాల అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి.దక్షిణ బెంగాల్ రాజకీయాల్లో ముస్లిం ఓటర్ల శాతం అత్యంత కీలకమైన అంశం. ముర్షిదాబాద్‌లో అత్యధికంగా 66.27 శాతం ముస్లిం జనాభా ఉండగా, బీర్భూమ్, దక్షిణ 24 పరగణాలు, నాడియా, హౌరా జిల్లాల్లో కూడా వీరి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంక్ మమతా బెనర్జీ వెంటే నిలిచింది. ముర్షిదాబాద్‌లోని 22 సీట్లకు గానూ గతంలో టీఎంసీ 20 గెలుచుకోవడం ముస్లింల మద్దతుకు నిదర్శనం.బీజేపీ ప్రచారాస్త్రాలుఈసారి ఐఎస్ఎఫ్ (ఐఎస్ఎఫ్), లెఫ్ట్, కాంగ్రెస్ కూటమి వల్ల ఓట్లు చీలితే తమకు లాభిస్తుందని బీజేపీ భావిస్తోంది. ముర్షిదాబాద్ లాంటి సరిహద్దు జిల్లాల్లో పశువుల అక్రమ రవాణా, స్మగ్లింగ్ వంటి అంశాలను బీజేపీ ప్రచారాస్త్రాలుగా వాడుకుంటోంది. దీని వల్ల తమకు సీట్లు పెరుగుతాయని కమలనాథులు ఆశిస్తున్నారు. మరోవైపు, పశ్చిమ 'రార్' ప్రాంతంలోని పురూలియా, బాంకురా, ఝార్గ్రామ్ వంటి జిల్లాల్లో గిరిజన జనాభా అధికం. ఇక్కడ బీజేపీ తన పట్టును పెంచుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. అర్జున్ ముండా వంటి జాతీయ స్థాయి గిరిజన నేతలను ఇక్కడ రంగంలోకి దించింది.మారుతున్న సమీకరణలుసంతాల్లు, ముండాలు సంప్రదాయబద్ధంగా టీఎంసీకి మద్దతు ఇస్తుండగా, మహతో సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకోవాలని బీజేపీ ఎత్తుగడలు వేస్తోంది. దీనికి తోడు రాజేష్ మహతో వంటి నేతలు పార్టీ మారడం స్థానిక సమీకరణలను మారుస్తోంది. అలాగే, వేసవిలో తలెత్తుతున్న తీవ్రమైన నీటి ఎద్దడి ఈసారి ప్రధాన ఎన్నికల అంశంగా మారింది. కేంద్ర నిధుల విషయంలో రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య జరుగుతున్న పోరులో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుండటం ఓటర్ల తీర్పుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.బీజేపీ- టీఎంసీ ఎత్తుకు పైఎత్తు!2021 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే, దక్షిణ బెంగాల్‌పై తృణమూల్ పట్టు ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. ఆనాడు దక్షిణ బెంగాల్‌లోని జిల్లాల్లో టీఎంసీ ఏకంగా 153 సీట్లు గెలుచుకోగా, బీజేపీ కేవలం 24 సీట్లకే పరిమితమైంది. కోల్‌కతా, హౌరా తదితర జిల్లాల్లో బీజేపీ ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని మమత ప్రయత్నిస్తుండగా, క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని, మారుతున్న సామాజిక సమీకరణలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ చూస్తోంది. మొత్తం మీద బెంగాల్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఈ దక్షిణ బెంగాల్ ఓటర్ల తీర్పుపైనే ఆధారపడి ఉందనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: West Bengal: కబీర్‌కి ఒవైసీ ‘పెద్దన్న’.. పొత్తు ఖరారు! -
West Bengal: కబీర్‌కి ఒవైసీ ‘పెద్దన్న’.. పొత్తు ఖరారు!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు- 2026 సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో కలిసి నడవాలని ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (ఏజేయూపీ) నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఒవైసీని తన ‘పెద్దన్న’ (బడా భాయ్)గా అభివర్ణించిన హుమాయున్ కబీర్.. రాబోయే ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేస్తామని అధికారికంగా ప్రకటించి రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు.ఒవైసీ అడుగుజాడల్లోనే..తమ కూటమి వివరాలను వెల్లడిస్తూ 182 నుండి 192 స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు కబీర్ తెలిపారు. ‘నా పెద్దన్న అసదుద్దీన్ ఒవైసీ బెంగాల్ గడ్డపైకి వచ్చారు. ఏజేయూపీ, ఏఐఎంఐఎం కలిసి ఈ ఎన్నికల యుద్ధంలో తలపడతాయి. ఆయనను నా సొంత అన్నలా భావిస్తున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కనీసం 20 భారీ ర్యాలీల్లో నాతో కలిసి పాల్గొంటారు’ అని అన్నారు. ఏప్రిల్ 1న బెహ్రంపూర్‌లో లక్షలాది మందితో నిర్వహించే తొలి సభకు ఒవైసీ స్వయంగా హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు. Kolkata | Founder of Janata Unnayan Party, Humayun Kabir and AIMIM President Asaduddin Owaisi hold a joint press conference after they announced an alliance between their parties for the West Bengal electionsHumayun Kabir says," We will hold 20 rallies all over the state. The… pic.twitter.com/GOrROLs1cZ— ANI (@ANI) March 25, 2026ఎప్పటికీ విడిపోని బంధంఈ పొత్తు కేవలం 2026 ఎన్నికల కోసమే కాదని, రాజకీయాల్లో తాను ఉన్నంత కాలం ఒవైసీతోనే తన ప్రయాణం కొనసాగుతుందని కబీర్ ఉద్ఘాటించారు. ‘నా అన్న ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ దిశగా నడిపించినా తూచా తప్పకుండా పాటిస్తాను. ఈ కూటమి ఎప్పటికీ విడిపోదు’ అంటూ తన నిబద్ధతను చాటుకున్నారు. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర బెంగాల్, కోల్‌కతా తదితర ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఈ కూటమి ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.ప్రతిపక్షాల ఫైర్మరోవైపు ఈ పొత్తుపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)తీవ్ర స్థాయిలో మండిపడింది. ఒవైసీ, హుమాయున్ కబీర్ కలవడం వల్ల సెక్యులర్ ఓట్లు చీలిపోయి, పరోక్షంగా బీజేపీకి లాభం చేకూరుతుందని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ విమర్శించారు. ఈ కూటమి వల్ల ముస్లిం ఓటర్లు ఏకాకి అవుతారని, అయితే జనం వీరిని నమ్మరని ఆయన వ్యాఖ్యానించారు. కాగా రాష్ట్రంలో ముస్లిం ఉప ముఖ్యమంత్రి వస్తారని కబీర్ చేసిన వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. -
బెంగాల్‌పై బీజేపీ ‘యూపీ’ వ్యూహం.. పోటీలో ఎవరంటే?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఫలించిన ఎన్నికల వ్యూహాన్ని పశ్చిమబెంగాల్లో అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. సన్యాసులు, పూజారులు, ఆధ్యాత్మికవాదులను ఎన్నికల బరిలో దించుతోంది. యూపీలో గోరఖ్‌నాథ్ మఠాధిపతి యోగి ఆదిత్యనాథ్ పలుమార్లు ఎంపీగా గెలిచి ముఖ్యమంత్రి కావడం తెలిసిందే.సన్యాసి వర్గం నుంచి వచ్చిన సాక్షి మహరాజ్, స్వామి అవైధ్యనాధ్, స్వామి చిన్మయానంద్ తదితరులు ఎన్నికల్లో గెలిచారు. బెంగాల్లో ఆధ్యాతి్మక రంగానికి చెందిన పలువురికి బీజేపీ టికెట్లిచి్చంది. భారత్ సేవాశ్రమంలో పని చేసిన ఉత్పల్ మహారాజ్‌ను కాలియాగంజ్ నుంచి బరిలో దించింది. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నుంచి 94 వేల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన సౌమన్ రాయ్‌తో ఉత్పల్ పోటీ పడే అవకాశముంది.ఉల్బేరియా సౌత్ నుంచి స్వామి మంగళానంద పూరికి బీజేపీ టికెట్ దక్కింది. తృణమూల్‌కు చెందిన పులోక్ రాయ్‌తో ఆయన తలపడనున్నారు. మఠాలు, ఆశ్రమాలకు ఆదరణ బాగా ఉండే నవద్వీప్ నుంచి శ్రీ శృతి శేఖర్ గోస్వామిని బీజేపీ బరిలోకి దించింది. బెహలా పూర్బ నుంచి సునీల్ మహారాజ్ పోటీలో ఉన్నారు. హన్సన్ నుంచి చారిత్రక తారాపీఠ ఆలయ పూజారి నిఖిల్ బెనర్జీ పోలీకి టికెటిచి్చంది. వీటిలో చాలావరకు తృణమూల్ సిట్టింగ్ స్థానాలే ఉండటం విశేషం! -
ఒవైసీ మూడో ఫ్రంట్.. పశ్చిమ బెంగాల్లో ముక్కోణపు పోరు!
ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్.. క్లుప్తంగా మజ్లిస్ పార్టీ..! హైదరాబాద్‌లో పత్తర్‌గట్టీ మునిసిపల్ డివిజన్ నుంచి ప్రస్తానం ప్రారంభించిన మజ్లిస్ పార్టీ.. ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా భారత్ వ్యాప్తంగా విస్తరిస్తోంది. జాతీయ పార్టీగా ఎదిగిన మజ్లిస్ ఇప్పుడు పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కొంగొత్త ఎత్తులతో ముందుకు సాగుతోంది. తాజాగా మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మూడో ఫ్రంట్‌ను ప్రకటించడంతో.. ఇప్పుడు బెంగాల్లో ముక్కోణపు పోరు మొదలైంది.ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ ఎన్నికల పోరు అంటే.. అయితే టీఎంసీ—లేదంటే బీజేపీ అన్నట్లుగా సాగింది. అయితే.. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన హుమయూన్ వేరు కుంపటి పెట్టారు. ఆమ్ జనతా ఉన్నయాన్ పార్టీ పేరుతో ఎన్నికలకు వెళ్తున్నారు. ఇప్పుడు మజ్లిస్ చీఫ్ అసదుద్దీ ఒవైసీ అతనితో కలిసి ఎన్నికల్లో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల బీజేపీకి.. కాషాయపార్టీ సాంప్రదాయ ఓటుబ్యాంకుకు ఎలాంటి నష్టం లేకపోయినా.. టీఎంసీ ఓట్లలో మాత్రం చీలికకు కారణమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ చీఫ్ మమతాబెనర్జీ ఈసారి కూడా తన విజయంపై ధీమాగా ఉన్నప్పటికీ, మజ్లిస్ కారణంగా తెరపైకి వచ్చిన మూడో కూటమి కారణంగా చమటోడ్చక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు జరగడం కూడా తృణమూల్‌కు ప్రతికూలాంశంగా మారుతోంది.ఈ నేపథ్యంలో ముస్లిం ఓటు బ్యాంకును మజ్లిస్ కచ్చితంగా చీలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మమతకు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే హుమయూన్ ప్రకటించగా.. తమ కూటమి 294 స్థానాల్లో కలిసి పోటీ చేస్తుందని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పశ్చిమ బెంగాల్లో తొలిసారి ఒక ముస్లిం ముఖ్యమంత్రి అయ్యేందుకు ఈ కూటమి అహరహం పనిచేస్తోంది. మూడో కూటమి అధికారంలోకి వస్తుందా? బెంగాల్లో పాగా వేయాలనే కాషాయం కల నెరవేరుతుందా? మమత ఎత్తుల ముందు విపక్షాల వ్యూహాలన్నీ చిత్తవుతాయా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. మే 4న వచ్చే ఫలితాల వరకు వేచిచూడాల్సిందే..! -
రూ.181 కోట్లు నగదు, మద్యం, డ్రగ్స్ స్వాధీనం
కోల్‌కతా: 294 మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు రెండు దశల్లో ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీలలో జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నేపథ్యంలో బెంగాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి డబ్బు, మద్యం, డ్రగ్స్, ఉచిత సామగ్రి సహా రూ.181 కోట్లకు పైగా విలువైన సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 15వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మొత్తం 294 నియోజకవర్గాల పరిధిలో ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి రావడం తెల్సిందే. అప్పట్నుంచి, విస్తృతంగా సోదాలు చేపట్టినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) కార్యాలయం తెలిపింది. జిల్లాలవారీగా 3,58,986 కేసులు నమోదు చేయగా, మొత్తం 3,11,829 ప్రభుత్వ ఆస్తుల విధ్వంసాలను, 19,901 ప్రైవేట్ ఆస్తుల విధ్వంసాలను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. ఫిర్యాదులకు స్పందించడానికి, నగదు, ఇతర వస్తువుల అక్రమ రవాణాను తనిఖీ చేయడానికి 1,800కు పైగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ (FSTలు), 2,200కు పైగా స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ (SSTలు)ను మోహరించినట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: ఫోన్ లాక్ కోడ్ భార్యకు పంపి, జ్యోతిష్కుడి సూసైడ్ మిస్టరీఇక శాంతిభద్రతల విషయానికి వస్తే, ఉద్రిక్తతలు పెరగకుండా నిరోధించడానికి కోల్‌కతా పోలీసులు, కేంద్ర బలగాలతో కలిసి బరనగర్, కాళీఘాట్లలో జరిగిన సంఘటనలలో జోక్యం చేసుకున్నారని వారు తెలిపారు. -
అభ్యర్థుల ప్రచార పాట్లు!
ఎన్నికల్లో ఇంటింటికి వెళ్లి ఓట్లడగటం పాత పద్ధతి. పశ్చిమ బెంగాల్లో అభ్యర్థులు ప్రచారం రూటు మార్చారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు వింత పాట్లు పడుతున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని కుండను పగుల గొట్టడం వంటి ఆటలు ఒకరు ఆడుతుంటే.. మరొక అభ్యర్థి బార్బర్ అవతారమెత్తారు. ఇంకొకరు ఏకంగా వంటింట్లోకి వెళ్లి చపాతీలు చేస్తే.. మరొకరు గుడిలో భజన కీర్తనలు పాడే పరమ భక్తుడిగా మారిపోయారు.చపాతీలు చేస్తూ... అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ ఇక్కట్లు అందరికీ తెలిసిందే. హుగ్లీలోని పుర్సురాలో గ్యాస్ లేక కట్టెల పొయ్యితో కుస్తీలు పడుతున్న ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు టీఎంసీ అభ్యర్థి పార్థ హజారీ. ఓ ఇంట్లో నేరుగా కిచెన్‌లోకి వెళ్లి మట్టి పొయ్యిపై రొట్టెలు చేశారు. సునాయాసంగా రొట్టె చేసి తన పాక కళను ప్రదర్శించారు. ‘‘గతంలో నేను రొట్టెలు చేశాను. వంట గురించి కొంత తెలుసు. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక చాలా కుటుంబాలు ఇబ్బందిపడుతున్నాయి. వారికి సాయం చేయాలని ప్రయతి్నంచాను’’ అని చెప్పుకొచ్చారు.కళ్లకు గంతలు కట్టుకుని.. రాష్ట్రంలోని బీర్భూమ్ జిల్లాలో అసాధారణమైన ఎన్నికల ప్రచారం జరుగుతోంది. రంజాన్ పండుగ సందర్భంగా స్థానికంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ చంద్ర బౌరీ సంప్రదాయ ‘హండీ ఫోడ్’ ఆట ఆడారు. కళ్లకు గంతలు కట్టుకుని, కుండను కర్రతో పగలగొట్టడానికి ప్రయతి్నంచారు. అయితే కుండ పగులగొట్టడంలో ఆయన విఫలమైనప్పటికీ.. జరగబోయే ఎన్నికల్లో బీజేపీ కూడా ఇలాగే ఓడిపోతుందని సింబాలిక్ చెప్పాలనుకున్నారు. దీనిని బీజేపీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎమ్మెల్యే అనూప్ కుమార్ సాహా విమర్శించారు. కళ్లు మూసుకుని బీజేపీని ఓడించడం సాధ్యం కాదంటూ అధికార పారీ్టపై తవ్రంగా స్పందించిన ఆయన.. సామాన్య ప్రజలను ఆకట్టుకోవడానికి క్షురకుడి అవతారమెత్తారు. సాహా దుబ్రాజ్‌పూర్‌లో ఒక గ్రామస్తుడికి ఏకంగా గడ్డమే గీశారు! ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.సీపీఎం అభ్యర్థి పూజలు పానిహటిలో సీపీఎం పార్టీ అభ్యర్థి కల్తాన్ దాస్‌గుప్తా పార్టీ సిద్ధాంతాలను పూర్తిగా పక్కకు పెట్టి మరీ ఏకంగా మహోత్సవ్ తళా ఘాట్ ఆలయంలో ప్రార్థనలతో ప్రచారాన్ని ప్రారంభించారు. ఇలాంటి వైరుధ్యాలు గతంలో కూడా చోటుచేసుకున్నాయని దాస్‌గుప్తా చెప్పారు. మాజీ రాష్ట్ర మంత్రి, దివంగత సుభాష్ చక్రవర్తి సైతం ఒకప్పుడు తారాపీఠ్ ఆలయంలో ఇలాగే ప్రార్థనలు చేసి పార్టీ శ్రేణుల్లో పెద్ద చర్చకు తెరలేపారు. గోపీబల్లవ్పూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బీజేపీ రాజేశ్ మహతో ఏకంగా భక్తుడి అవతారమెత్తారు. ఝార్గ్రామ్ అటవీ ప్రాంతంలోని పటాశిముల్లో ఇంటింటి ప్రచారానికి ముందు హరి నామ సంకీర్తన పాడారు. గ్రామస్తులతో కలిసి భక్తి గీతాలు ఆలపించారు. సభలో ప్రజలపై గులాల్ చల్లుతూ ఆడుకున్నారు.‘మత్స్య’ రాజకీయాలు బీజేపీ అధికారంలోకి వస్తే మాంసాహారాన్ని నిషేధిస్తుందన్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి బిధాన్నగర్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ శరద్వాత్ ముఖర్జీ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సాల్ట్ లేక్‌లోని ఐఏ మార్కెట్లో ఆయన ‘కట్ల’ చేపను చేతిలో పట్టుకుని మరీ ప్రచారం చేశారు. ‘‘బెంగాలీ సంస్కృతిలో చేపలు, అన్నం ప్రధానాహారం. అలాంటిది, బీజేపీ గెలిస్తే చేపలను తినకుండా నిషేధం విధిస్తుందని టీఎంసీ తప్పుడు ప్రచారం చేస్తోంది’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘బెంగాలీలకు చేప ఆహారం మాత్రమే కాదు. మన సంప్రదాయం. మన గుర్తింపులో ఒక భాగం. చేప లేకుండా ఏ శుభకార్యమూ ప్రారంభం కాదు. చివరకు పెళ్లి పత్రికలతో కూడా చేపను పంపిస్తారు. అందుకే చేప ద్వారానే నా ప్రత్యర్థులకు సందేశం పంపాలనుకుంటున్నా. చేపలు, అన్నంపై నిషేధం సంగతి అలా ఉంచితే... ప్రజలు కనీసం ఒక చేప ముక్కను కూడా కొనలేని దుస్థితిని టీఎంసీ పాలన తీసుకొచ్చింది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రజలు రెండింతలు ఎక్కువగా చేపలు తినగలుగుతారు’ అని పేర్కొన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మోదీయే అతిపెద్ద చొరబాటుదారు
కోల్‌కతా: బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వేలాదిమంది చొరబాటు దారులు పశ్చిమబెంగాల్లో తిష్టవేశారంటూ విమర్శలు గుప్పిస్తున్న ప్రధాని మోదీపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. శనివారం కోల్‌కతాలోని రెడ్‌రోడ్‌లో జరిగిన రంజాన్ వేడుకల్లో మమత పాల్గొని ప్రసంగించారు. ‘‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, బహుళ సామాజిక వైవిధ్యం పరిరక్షణకు జరుగుతున్న పోరాటమే ఈ శాసనసభ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీ ఓటు హక్కును మోదీ జీ, బీజేపీ లాక్కునేందుకు చేసే యత్నాలను అడ్డుకుంటా. చివరిదాకా పోరాడతా. కోల్‌కతా నుంచి ఢిల్లీలో సుప్రీంకోర్టు దాకా ప్రతిచోట కేంద్రం అసంబద్ధ నిర్ణయాలను సవాల్చేస్తా. మీరు(మోదీ) ముస్లిం దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి పాలకులతో కరచాలనం చేస్తారు. స్నేహబంధంపై ప్రసంగాలిస్తారు. తీరా భారత్‌కు వచ్చాక హిందూ–ముస్లిం అంటూ విడగొడతారు. ఓటర్ల పేర్లను ‘సర్’ జాబితా నుంచి అన్యాయంగా తొలగించారు. పైగా వాళ్లపై చొరబాటుదారులు అనే ముద్రవేస్తున్నారు. ఓట్ల జాబితాలోకి చొరబడిన మీరే అసలైన చొరబాటుదారులు’’ అంటూ మోదీ, బీజేపీ ప్రభుత్వాలపై మమత ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘బెంగాల్లో అప్రకటిత రాష్ట్రపతిపాలన కొనసాగుతోంది. మా నుంచి పాలనాధికారం లాగేసుకోవాలని చూస్తున్నారు. అయినాసరే మేం భయపడబోం’ అని మమత అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ముస్లింలనుద్దేశించి మమత మాట్లాడారు. ‘‘మీకు తోడుగా ఎవరు నిలబడకపోయినాసరే మీకు అండగా నేనుంటా. బెంగాల్లో మతాలు, కులాలు, వర్గాల తేడా లేకుండా అందర్నీ కుటుంబసభ్యుల్లా చూసుకుంటా. ఎవరైనా రాజకీయంగా రాష్ట్రాన్ని ఇబ్బందిపెట్టాలనుకుంటే చూస్తూ ఊరుకోను. ప్రజలను మతాల మాటున విడదీయాలనుకునే వాళ్లకు ఇక్కడ స్థానం లేదు. నేరుగా నరకానికి పొండి. హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు ఇక్కడ అంతా కలిసిమెలసి ఉంటారు. ఈ ఐకమత్యాన్ని చెడగొట్టేవాళ్లను మనం రాష్ట్రంలో అధికారంలోకి రానివ్వొద్దు’’ అని బీజేపీనుద్దేశించి వ్యాఖ్యానించారు. మమత ప్రసంగంపై బీజేపీ మండిపడింది. ‘‘ దేశ ప్రధానిని చొరబాటుదారుడు అంటూ సంబోధించే వాళ్లకు సీఎం కుర్చీ వంటి రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చునే హక్కు లేదు. ఆమెకు మతిపోయిందేమో. వెంటనే రాంచీకి వెళ్లి ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటే మంచిది’’ అని రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత సువేంధు అధికారి వ్యాఖ్యానించారు. -
మమతా మ్యానిఫెస్టో విడుదల.. గ్యారంటీలు ఇవే..!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో టీఎంసీ తన మ్యానిఫెస్టో విడుదల చేసింది. దీదీకే వచన్ పేరుతో ప్రజలకు పది హామీలను ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించింది. దీదీకే వచన్ దువారో చికిత్స ( ప్రజలకు ఇంటి వద్దకే వైద్యసేవలు) నిరుద్యోగులకు ప్రతినెల రూ.1,500, మహిళలకు ప్రతినెల రూ. 1,500,ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ. 1,700 అందజేయనున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు మరిన్ని సంక్షేమ ఫలితాలను ప్రకటించింది. బెంగాల్లో 294 స్థానాలకు ఏప్రిల్ 23, 29 తేదీలలో ఎన్నికలు జరగనున్నాయి.కాగా ఇటీవలే ఐదు రాష్ట్రాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్‌తో పాటు తమిళనాడు,కేరళ, అస్సాం, పుదుచ్చేరి ప్రాంతాలకు ఎన్నికలు జరగనున్నాయి.మెుత్తంగా ఐదు రాష్ట్రాల్లో కలిపి 824 అసెంబ్లీ స్థానాలకు పోటీ జరుగుతుండగా 17.4 కోట్ల మంది ఓటర్లు పాల్గొననున్నారు. ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ కమిషన్ కీలక చర్యలు చేపట్టింది. సీఎం మమతా బెనర్జీ పేచీలో ఉన్న చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీని తొలగించి వారి స్థానంలో ఇతర అధికారులను నియమించింది. అయితే పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ సారి 226 కు పైగా స్థానాల్లో విజయం సాధించి వరుసగా నాలుగవ సారి అధికారం ఏర్పాటు చేస్తామని మమతా బెనర్జీ ప్రకటించింది. ఈ ఏడాది భవానీపూర్ స్థానం నుంచి పోటీ చేస్తానని తెలిపింది. దీంతో బీజేపీ సైతం మమత పోటీ చేస్తున్న స్థానంలో తమ అభ్యర్థిగా సువేందు అధికారిని నిలపనుంది. 2021లో జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమత సువేందు అధికారి చేతిలో ఓడిపోయింది. దీంతో భవానీపూర్ నుంచి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. 2021లో టీఎంసీ 213 స్థానాలు గెలుచుకొని హ్యాట్రిక్ విజయం సాధించింది. 2016లో మూడు సీట్లకు పరిమితమైన బీజేపీ 2021లో 77 స్థానాలు చేజిక్కించుకొని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. దీంతో ఈ ఏడాది పశ్చిమబెంగాల్లో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. -
అసలు పోరు దీదీతో!
అసెంబ్లీ ఎన్నికలు త్వరలో అయిదు రాష్ట్రాలకు జరగనున్నాయి గానీ, దేశందృష్టి ప్రధానంగా ఉండేది ‘దీదీ’ పైనే. బీజేపీ అసలు యుద్ధం కూడా మమతా బెనర్జీతోనే. ఇప్పటికే వరుసగా మూడు సార్లు పశ్చిమ బెంగాల్ సీఎం అయిన ఆమె నాల్గవసారి కూడా విజయం సాధి స్తారా, లేక బీజేపీ ఈసారి అధికార లక్ష్యాన్ని చేరగలదా అన్నది ముఖ్యమే అయినా, అది మాత్రమే కాదు ప్రశ్న. సీట్లు అధికారానికి సంబంధించిన విషయం కాగా, ఇందులో దీర్ఘకాలిక సైద్ధాంతిక అంశాలు కూడా ఉన్నాయి.ఐదు ప్రచారాంశాలుతన 55 సంవత్సరాల రాజకీయ జీవితం పొడవునా ‘ఫైర్‌బ్రాండ్’గానే నిలిచిన మమత, ఒక విలక్షణమైన నాయకురాలు. 70 సంవత్సరాల వయసు దాటిన స్థితిలోనూ తనలోని అగ్ని మందగించక పోవటం అసాధారణ విషయం. 1998లో తృణమూల్కాంగ్రెస్ (టీఎంసీ) స్థాపించినప్పటి నుంచి కాంగ్రెస్‌తో పాటు వామ పక్ష కూటమిని, బీజేపీని కూడా ఒంటి చేత ఢీకొని వరుసగా గెలుస్తూ వస్తు న్నారు. ఆమె వరుసగా మూడవసారి రాష్ట్రంలో విజయ పతాకను ఎగరవేసినట్లే, వరుసగా మూడవసారి కేంద్రంలో గెలిచిన బీజేపీ, ఈసారి ఏ విధంగానైనా పశ్చిమ బెంగాల్‌ను వశపరచుకుని తీరా లన్న పట్టుదలతో ఉంది. అక్కడి మొత్తం స్థానాలు 294లో పోయిన మారు తృణమూల్ గెలిచిన 213కు, బీజేపీ తెచ్చుకోగలిగిన 77కు మధ్యగల తేడా 136 చాలా పెద్దదే అయినా, దానిని అధిగమించేదుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం, అధికారపక్షమైన బీజేపీ, వారి మాతృ సంస్థ అయిన సంఘ్ పరివార్ భూమ్యాకాశాలను ఏకం చేస్తున్నాయి.ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడినపుడు ఏమి జరగవచ్చు నన్నది అట్లుంచితే, రాగల ఆరు వారాల ప్రచారం స్థూలంగా అయిదు అంశాల చుట్టూ తిరగగలదని భావించవచ్చు. ఒకటి– మమత, మోదీ నాయకత్వాల స్పర్థ. రెండు– హిందూ జాతీయ వాదం, బెంగాలీ జాతీయవాదం. మూడు–ఫెడరలిజం, యూనిట రిజం. నాలుగు–తృణమూల్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం. అయిదు– సెక్యులరిజం, మతతత్వం. బెంగాలీ జాతీయవాదంస్వాతంత్య్రోద్యమ కాలం నుంచి బెంగాలీ జాతీయవాదంఎంత బలంగా రూపు దిద్దుకున్నదో తెలిసిందే. విశేషమేమంటే, 34 సంవత్సరాలపాటు పాలించిన వామపక్ష కూటమి సైతం మార్క్సిజ మని ఎంత మాట్లాడిందో బెంగాల్ జాతీయవాదాన్ని అంత పాటించింది. ఆ సుదీర్ఘ సంప్రదాయానికి మమత వారసురాలిగా మారారు. అందుకే గత ఎన్నికలలో బీజేపీ శ్రీరాముడిని, హిందూత్వాన్నిముందుకు తేగా, మమతా బెనర్జీ తమ దేవతలు కాళిక, కృష్ణుడుబెంగాలీ సంస్కృతి అంటూ వారి చిత్రాలతో ర్యాలీలు జరిపారు. శ్రీరాముడు 19వ శతాబ్దంలో మాత్రమే బయటి వ్యాపారులతోబెంగాల్కు ‘దిగుమతి’ అయ్యాడని ప్రకటించారు. అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ సర్కార్ అక్కర లేదంటూ, తన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, రాష్ట్రంపట్ల మోదీ ప్రభుత్వ వివక్షను ప్రజల దృష్టికి తీసు కువెళ్లారు. ఫెడరలిజం, సెక్యులరిజం తమ నినాదాలని స్పష్టం చేశారు. ఫలితాలు కనిపించినవే. వామపక్ష కూటమి, కాంగ్రెస్ తీవ్రంగా దెబ్బతినటంతో పాటు వారి నాయకులు, ఓటర్లు బీజేపీ వైపు మళ్ల టంతో 2019, 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ తగినన్ని సీట్లు (మొత్తం 42లో 18; 12) గెలవగలిగింది గానీ, అసెంబ్లీ సీట్లు 294లో తృణమూల్ బలం 210 కన్న తగ్గలేదు. వామపక్షాలు, కాంగ్రెస్ ఉమ్మడి బలం 2016 నాటి 120 నుంచి 2021లో దారుణంగా పత నమై వారి ఓటర్లు మళ్లటం వల్ల బీజేపీ సీట్లు 3 నుంచి 77కు పెరి గాయి. గత ఎన్నికలలో మమత పట్ల ఆగ్రహంతో బీజేపీ వైపు మొగ్గిన లెఫ్ట్, కాంగ్రెస్ శ్రేణులు ఈసారి తీసుకోగల వైఖరి ఏమి టన్నది గమనించదగినదవుతున్నది. బీజేపీని బాహాటంగా ఢీకొంటున్న నాయకురాలిగా ప్రశంసలు పొందుతున్న మమతా బెనర్జీ, ‘సర్’ పేరిట సాగిన ఓటర్ జాబితాల సవరణను ఏ మేరకు ఎదు ర్కొనగలరన్నది ఈసారి కొత్త పరీక్ష అవుతున్నది.తమిళనాడు రాజకీయాలుబెంగాల్లో వలె తమిళనాడులోనూ అధికార స్పర్థకు సైద్ధాంతిక అంశాలు తోడవుతున్నాయి. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఎంత ప్రభావం చూపవచ్చుననే అంచనాలను తప్పిస్తే, యథాతథంగా తమిళనాట పాలిస్తున్న డీఎంకే కూటమి బలమైనది. అక్కడి 234 స్థానాలలో ఆ కూటమి పోయినమారు 159 గెలిచింది. 75 తెచ్చుకున్న అన్నాడీఎంకే కూటమి చీలింది. ఒక వర్గం మాజీ ముఖ్య మంత్రి పన్నీర్ సెల్వం నాయకత్వాన డీఎంకేలో విలీనమైంది. అన్నాడీఎంకే కూటమిలోకి కొత్తగా ఎవరూ రాలేదు. ముఖ్యంగా జయలలిత మరణం తర్వాత బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వ మేదీ ఆవిర్భవించలేదు. స్టాలిన్ ప్రభుత్వ పాలన పట్ల చెప్పుకోదగిన అసంతృప్తి కనిపించటం లేదు. బెంగాల్లో వలెనే తమిళనాడులో కూడా తమిళ జాతీయవాదం, లేదా ద్రవిడ వాదం, ఫెడరల్ హక్కుల నినాదం దశాబ్దాలుగా కలగలిసిపోయి ఉన్నాయి. అందుకు ఉత్తరాది వ్యతిరేకత నుంచి ఒక పాయగా పుట్టుకు వచ్చిన సెక్యులరిజం తోడైంది. తమిళ సమాజాన్ని హిందూత్వ స్రవంతిలోకి తెచ్చేందుకు సంఘ్ పరివార్ అనేక ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు. అన్నాడీఎంకేను వెంట చేర్చుకునేందుకు లోగడ విఫల ప్రయత్నాలు చేసిన మీదట, రజనీకాంత్‌పై ఆశలు పెట్టుకోగా ఆయన రాజకీయా లలోకి రాకపోగా, ఇపుడు విజయ్ వైపు చూస్తున్నారు. ఇంతవరకైతే ఆయన ససేమిరా అంటున్నారు. అనూహ్యంగా విజయ్ గెలిచినట్ల యితే తప్ప మరోసారి డీఎంకేదే అధికారం కావచ్చు. కేరళ పరిస్థితి కూడా ఇటువంటిదే. 140 సీట్లు గల ఆ రాష్ట్రంలో మళ్లీ లెఫ్ట్ ఫ్రంట్, లేదా కాంగ్రెస్ నాయకత్వాన గల యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మినహా, కనీసం ఒక్క స్థానమైనా లేని బీజేపీకి అధికారమన్నది వారు సైతం ఆలోచించటం లేదు. పోయినమారు అనూహ్యంగా త్రిస్సూర్‌లో లోక్‌సభ గెలిచినందున ఆ పరిధిలోని అసెంబ్లీలు ఏవైనా గెలవగలరేమో చూడాలి. పుదుచ్చేరి విషయం అట్లుంచితే, అస్సాంలో గత పదేండ్ల నుంచి ప్రభుత్వంలో గల బీజేపీకి అధికారాన్ని నిలబెట్టుకోవటం పరీక్ష అవుతుంది. పోయిన మారు 126 స్థానాలలో 60 మాత్రమే తెచ్చుకుని, తర్వాత పరిపా లనా వైఫల్యాలతో కొంత అప్రతిష్ఠ పాలైనా, హిందూత్వ వాదం బలంగా ఉండటంపై వారు ఆశలు పెట్టుకుని ఉన్నారు. హిందూత్వ వాదం, కేంద్రీకృత అధికారం ఒకవైపు; ప్రాంతీయ జాతీయ వాదాలు, ఫెడరలిస్టు భావనలు మరొకవైపు అన్నట్లుగాఉంది. ఈ రెండు శక్తుల సైద్ధాంతిక పోరాటాలకు బెంగాల్, తమిళనాడు కేంద్రం కానున్నాయి. ఆ ఫలితాల ప్రభావం అనేక విధాలుగా ఉండగలదు.-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు-టంకశాల అశోక్ -
మమతా బెనర్జీకి బిగ్ షాక్.. సుప్రీంకోర్టు ఝలక్
న్యూఢిల్లీ: ఐప్యాక్ కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ కేసులో సోదాలు చేపట్టడానికి వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుకోవడం, దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం ఎంతమాత్రం సమంజసం కాదని తేల్చిచెప్పింది. ఇలాంటి సందర్భాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలను నిస్సహాయంగా వదిలివేయలేమని, ఏదో ఒక పరిష్కారం కావాల్సిందేనని పేర్కొంది.జనవరి 8న కోల్‌కతాలో రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ కార్యాలయంతోపాటు ఆ సంస్థ అధినేత ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ సోదాలు చేస్తుండగా, మమతా బెనర్జీ అక్కడకి దూసుకొచ్చారు. సోదాలకు అడ్డు తగలడంతోపాటు అక్కడున్న ల్యాప్‌టాప్, ఫోన్, కొన్ని ఫైళ్లు బలవంంతంగా లాక్కొని వెళ్లిపోయా రు. తర్వాత ఐప్యాక్ కార్యాలయంలోనూ హల్చల్ చేశారు. ఈడీ బృందం పట్ల దురుసు గా ప్రవర్తిస్తూ కొన్ని పత్రాలు తీసుకెళ్లారు. తమ దర్యాప్తు విషయంలో ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ జోక్యాన్ని సవాలు చేస్తూ ఈడీ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.‘‘ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించి, కేంద్ర దర్యాప్తు సంస్థ విధుల్లో జోక్యం చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇలాగైతే ఏం చేయాలి? రేపు మరో ముఖ్యమంత్రి కూడా ఇలాగే చేస్తే పరిస్థితి ఏమిటి? ఇలాంటి వాటికి ఏదో ఒక పరిష్కారం ఉండాల్సిందే’’ అని ధర్మాసనం పేర్కొంది. అనుచిత, అభ్యంతరకర పరిణామాలు పునరావృతం కాకుండా ప్రామాణిక కార్యాచరణ నియమావళి(ఎస్ఓపీ)ని రూపొందించాలని తేలి్చచెప్పింది. ఈడీ పిటిషన్‌పై విచారణ వాయిదా వేయాలన్న బెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరించింది. విచారణ యథావిధిగా కొనసాగుతుందని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదావేసింది. -
బెంగాల్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ సహా ఉన్నతాధికారులపై వేటు
కోల్‌కతా/న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్(ఈసీ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఉన్నత స్థాయి అధికార, పోలీసు యంత్రాంగాన్ని బాధ్యతల నుంచి తొలగించింది. ఆదివారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ, కొద్ది గంటల్లోనే ఈ మేరకు సమూల ప్రక్షాళన చర్యలను చేపట్టడం గమనార్హం. ఆదివారం సాయంత్రం వెలువరించిన మొదటి ఉత్తర్వులతో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నందినీ చక్రవర్తి, హోం శాఖ కార్యదర్శి జగదీశ్ ప్రసాద్ మీనాలపై వేటు వేసింది.అనంతరం, 16వ తేదీతో వెలువరించిన మరో ఆదేశంలో రాష్ట్ర డీజీపీ పియూశ్ పాండే, కోల్‌కతా సీపీ సుప్రతీమ్ సర్కార్ తదితర నలుగురు ఉన్నతస్థాయి ఐపీఎస్‌లను తొలగిస్తున్నట్లు తెలిపింది. నందినీ చక్రవర్తి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1993 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ దుష్యంత్ నరియాలాను నియమిస్తున్నట్లు ప్రకటించింది. దుష్యంత్ ప్రస్తుతం ఉత్తర బెంగాల్ అభివృద్ధి శాఖ అదనపు చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.అదేవిధంగా, జగదీశ్ ప్రసాద్ మీనా స్థానంలో హోంశాఖ కార్యదర్శిగా సంఘమిత్రా ఘోష్‌కు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలిపింది. డీజీపీగా 1992 బ్యాచ్ అధికారి సిద్్ధనాథ్ గుప్తాను నియమించింది. అజయ్ కుమార్ నంద్ను కోల్‌కతా పోలీస్ కమిషనర్‌గా నియమిస్తున్నట్లు ఈసీ తెలిపింది. శాంతి భద్రతల ఏడీజీ వినీత్ గోయల్ స్థానంలో అజయ్ ముకుంద్ పాండేను, సిద్్ధనాథ్ గుప్తా స్థానంలో డీజీగా నటరాజన్ రమేశ్ బాబును నియమించింది.ఈసీ బెంగాల్ వ్యతిరేకి: సీఎం మమత ఎన్నికల వేళ ఉన్నతాధికారులను బాధ్యతల నుంచి తొలగించడంపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈసీ, బీజేపీలు మహిళలకు, బెంగాల్‌కు వ్యతిరేకులన్న విషయం మరోసారి రుజువైందన్నారు. ఎల్పీజీ సంక్షోభంపై కోల్‌కతాలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బీజేపీ ఎందరు అధికారులను మార్చినా తమ ప్రభుత్వాన్ని మాత్రం మార్చలేదని ధీమా వ్యక్తం చేశారు. -
ఎన్నికల బాజా!
ఈసారి ఏప్రిల్ అధిక ఉష్ణోగ్రతలతోపాటు ఎన్నికల వేడిని కూడా చవిచూడబోతోంది. నాలుగు రాష్ట్రాలు– తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆదివారం ప్రకటించింది. బెంగాల్లో రెండు దఫాలుగా ఏప్రిల్ 23, 29ల్లో పోలింగ్ జరగనుండగా, మిగిలినచోట్ల 9న ఒకే దఫాతో ముగుస్తుంది. అన్నింటి ఫలితాలూ మే 4న వెలువడతాయి. 2006 నుంచి చూస్తే వేలంపాట మాదిరి అయిదు నుంచి ఎనిమిది దఫాలుగా పోలింగ్ సాగిన చరిత్రగల బెంగాల్లో ఈసారి కేవలం రెండు దఫాలతో సరిపెట్టారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరిపి 60.06 లక్షల మంది ఓటర్లను త్రిశంకు స్వర్గంలో ఉంచిన ఈసీ... ఆ విషయం తేలకుండానే బెంగాల్ ఎన్నికలు నిర్వహించబోతోంది. ఆ విషయంలో వచ్చిన ఫిర్యాదులను హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో ఏర్పడే అప్పిలేట్ ట్రిబ్యునళ్లు పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే 705 మంది ఆ పనిలో ఉన్నారు. రోజుకు లక్ష ఫిర్యాదుల్ని పరిష్కరిస్తున్నారు. అలా చూసుకుంటే నామినేషన్ల ఘట్టం ముగిసే ఏప్రిల్ 9 నాటికి 39 లక్షలమంది వినతులు పరిష్కారమవుతాయి. వారిలో ఎందరికి ఓటేసే భాగ్యం దక్కుతుందోగానీ... ఎటూ తేలకుండా 20 లక్షల మందికిపైగా మిగిలిపోతారు. ఎందుకంటే, ప్రజాప్రాతినిధ్య చట్టం 23(3) ప్రకారం నామినేషన్ల గడువు ముగిశాక ఎన్నికల జాబితా మారకూడదు. అధికారంలో ఉండగా ఏం చేసినా, ఎన్నికల సీజన్ వచ్చేసరికి వాగ్దానాలు వరదలై పారటం మనకు రివాజైంది. అధికారంలో ఉన్న వెసులుబాటు ఉపయోగించుకుని ఏదో పథకం పేరిట మహిళా ఓటర్ల ఖాతాలకు డబ్బు పంపిణీ సంప్రదాయం నిరుడు నవంబర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్ ఎన్డీయే కూటమి మొదలెట్టింది. దానికింద 75 లక్షల మంది మహిళలకు రూ.10,000 చొప్పున పంపిణీ అయ్యాయి. దీనికి మలి దశ కూడా ఉంటుందని చెప్పడం మరింత లాభించింది. మహిళలంతా ఎన్డీయేకు నీరాజనాలు పట్టారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కూడా ఆ బాటలోనే 1.31 కోట్లమంది మహిళల ఖాతాలకు రూ. 5,000 చొప్పున గత నెలలో బదిలీ చేశారు. ఇవిగాక రాబోయే రోజుల్లో పార్టీలు విడుదల చేయబోయే మేనిఫెస్టోల నిండా ఎటూ ఉచితాల మోత మోగుతుంది. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఒక్క అస్సాంలో తప్ప మరెక్కడా బీజేపీ అధికారంలో లేదు. పుదుచ్చేరిలో మాత్రం ప్రాంతీయ పక్షం ఎన్నార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని అధికార కూటమిలో భాగస్వామిగా ఉంది. ఓట్ల శాతం క్రమేపీ పెరుగుతూ వస్తున్న బెంగాల్లో ఈసారి నిర్ణయాత్మక పాత్ర పోషించగలమని ఆ పార్టీ విశ్వసిస్తోంది. కానీ వచ్చిన ఏ అవకాశాన్నయినా అంత తేలిగ్గా వదలని తృణమూల్ అధినేత, సీఎం మమతా బెనర్జీ ముందు ఎవరి ఎత్తుగడలైనా ఫలించటం అంత తేలిక కాదు. సినీ నటుడు విజయ్ కొత్తగా ప్రారంభించిన టీవీకే పార్టీతో పొత్తు ఖరారైతే తమిళనాడు తమ జోలెలో పడుతుందని బీజేపీ ఆశిస్తోంది. మిత్రపక్షం అన్నా డీఎంకేపై పెద్దగా ఆశలేమీ లేవు. స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకేను ఢీకొనడం కష్టమే. కేరళలో వరసగా పదేళ్లు సీపీఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్ ఏలుబడి సాగింది గనుక అక్కడ కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్‌లో బాగా ఆశలున్నాయి. 2014 నుంచి వరసగా అధికారంలోకొస్తున్న అస్సాంలో బీజేపీ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. 2023 నాటి నియోజకవర్గాల పునర్విభజనతో ముస్లిం ప్రాతినిధ్యం ఉండే స్థానాలు 23కి పడిపోవడం, మొన్నటి బడ్జెట్లో మహిళలకూ, యువతకూ ప్రకటించిన రూ. 5,000 కోట్ల ఆర్థిక లబ్ధి చేకూర్చే పథకాలు ఆ ఆత్మవిశ్వాసానికి మూలం. కాంగ్రెస్ సంస్థాగత బలహీనతలు సరేసరి. ఈ ఎన్నికలు ఈసీ విశ్వసనీయతకు కూడా పరీక్ష. లోక్‌సభలో అభిశంసన తీర్మానం ఎదుర్కొనబోతున్న తరుణంలో ఈసారైనా తటస్థత పాటిస్తుందని అందరూ ఆశిస్తున్న తరుణంలో బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినీ, హోం కార్యదర్శినీ మార్చింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో వచ్చిన ఫిర్యాదులపై రెండేళ్లు దాటుతున్నా నిమ్మకు నీరెత్తినట్టున్న ఆ సంస్థ వైఖరి ఈ ఎన్నికల విషయంలో మారకపోతే మరిన్ని ఛీత్కారాలు తప్పవు. మొత్తానికి ఏ పార్టీ జాతకం ఏమిటో తెలియడానికి మే నాలుగో తేదీ వరకూ ఆగక తప్పదు. -
దీదీకి ఝలక్ : 144 రేసు గుర్రాలు రెడీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన వేళ బీజేపీ (BJP) తన రేసు గుర్రాలను ప్రకటించింది. 2026 ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో 144 మందితో తొలి జాబితాను ప్రకటించింది.ఈ జాబితాలో మొత్తం 10 మంది మహిళా అభ్యర్థులకు చోటు దక్కింది.ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో 10మంది మహిళలు బరిలోకి దిగనున్నారు. అసన్సోల్ దక్షిణ నియోజకవర్గం నుండి అగ్నిమిత్ర పాల్, బెంగాల్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు (LoP) సువేందు అధికారి (భవానీపూర్ నియోజకవర్గం), దిలీప్ ఘోష్ (ఖరగ్‌పూర్ సదర్) వంటి ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. మరోవైపు ఈసారి ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య జాబితా తగ్గిపోవడం ప్రధాన వివాదంగా మారింది. గత ఏడాది నవంబర్‌లో ఓటర్ల సంఖ్య 7.66 కోట్లుగా ఉండగా, ఫిబ్రవరి 28న విడుదల చేసిన తుది జాబితాలో అది 6.44 కోట్లకు తగ్గింది.BJP announces first list of 144 candidates for the upcoming West Bengal Assembly Elections pic.twitter.com/QHLfHAUNFF— ANI (@ANI) March 16, 2026 "లాజికల్ డిస్క్రెపెన్సీ" విభాగం కింద వర్గీకరించి, న్యాయపరమైన పరిశీలన కోసం పంపిన దాదాపు 42 లక్షల మందికి పైగా ఓటర్ల భవిష్యత్తు మాత్రం ఇంకా సందిగ్ధంలోనే ఉంది.ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల నుండి వచ్చిన వారితో కలిపి మొత్తం 732 మంది జుడీషియల్ ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు.(అట్టుడుకుతున్న దుబాయ్ : విమానాశ్రయం వద్ద డ్రోన్ దాడి)ప్రధాని పర్యటన సందర్భంగా తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలపై కేంద్ర ఎన్నికల సంఘం (ECI) సీరియస్ అయింది. షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని, హింసాత్మక ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధాన కమిషనర్ హెచ్చరించారు.కాగా పశ్చిమ బెంగాల్‌తో సహా నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) ఆదివారం నాడు ప్రకటించిన వెంటనే బీజేపీ తొలి జాబితా సిద్ధం కావడం విశేషం. ఈ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడతాయి.కేరళలో కూడాకేరళ అసెంబ్లీ ఎన్నికలు 2026 కోసం బిజెపి సోమవారం (మార్చి 16) 47 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. క్రైస్తవ ఓటు బ్యాంకును ఆకర్షించే ప్రయత్నాల్లో భాగంగా. క్రైస్తవుల కోట అయిన కొట్టాయంలోని కంజిరపల్లిలో కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి,రాజ్యసభ సభ్యుడు జార్జ్ కురియన్ను పోటీకి దింపగా, ప్రాంతీయ పార్టీ కేరళ కాంగ్రెస్ మాజీ నాయకులు మరియు మాజీ ఎమ్మెల్యే పిసి జార్జ్ మరియు అతని కుమారుడు షోన్ జార్జ్‌లను వరుసగా కొట్టాయం జిల్లాలోని పూంజర్ , పాలాలో పోటీకి దింపడం గమనార్హం. ఇదీ చదవండి: అమ్మానాన్నకు సర్ప్రైజ్ గిఫ్ట్ : ఎమోషనల్ వీడియో -
బెంగాల్ ఎన్నికల వేళ కీలక పరిణామం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. నిన్న కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు సహా ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం అండ్ హిల్ అఫైర్స్ ప్రధాన కార్యదర్శి, మరికొందరు అధికారులను బదిలీ చేసినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి సమీక్ష నిర్వహించిన తర్వాత ఈ మార్పులు చేశామని తెలిపింది.ఎవరెవరిని బదిలీ చేశారు? మమతా బెనర్జీ అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్న ఇద్దరు ఉన్నత అధికారులను ఎన్నికల కమిషన్ తొలగించింది.చీఫ్ సెక్రటరీ: నందిని చక్రవర్తిని తొలగించి దుష్యంత్ నరియాలా (ఐఏఎస్-1993 బ్యాచ్)ను నియమించింది.ప్రిన్సిపల్ సెక్రటరీ, హోమ్ అండ్ హిల్ అఫైర్స్: జగదీశ్ ప్రసాద్ మీనాను తొలగించి సంగమిత్ర ఘోష్ (ఐఏఎస్-1997 బ్యాచ్)ను నియమించింది.ఇతర కీలక నియామకాలుడీజీ అండ్ ఐజీపీ: సిద్ధ్ నాథ్ గుప్తా (ఐపీఎస్-1992)డీజీ, కరెక్షనల్ సర్వీసెస్: నటరాజ్ రమేశ్ బాబు (ఐపీఎస్-1991)ఏడీజీ అండ్ ఐజీపీ, లా అండ్ ఆర్డర్: అజయ్ ముకంద్ రనడే (ఐపీఎస్-1995)కొలకతా పోలీస్ కమిషనర్: అజయ్ కుమార్ నంద్ (ఐపీఎస్-1996)ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని ఈసీ పేర్కొంది. బదిలీ అయిన అధికారులను ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల పనుల్లో నియమించరు. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ మార్పులు జరిగాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఎన్నికల కమిషన్‌పై విమర్శలు చేశారు. అర్ధరాత్రి దాటాక బెంగాల్ హోం సెక్రటరీ, చీఫ్ సెక్రటరీని బదిలీ చేయడం సరికాదని అన్నారు. పశ్చిమ బెంగాల్లో ఉన్నత అధికారుల బదిలీలపై ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత అధికార తృణమూల్ కాంగ్రెస్ సోమవారం రాజ్యసభ నుంచి వాకౌట్ చేసింది. ఈ ఘటన 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలపై ఓటింగ్ జరుగుతున్న సమయంలో జరిగింది.. మరోవైపు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సమర్థించారు. ఇలాంటి బదిలీలు చేయడానికి కమిషన్‌కు రాజ్యాంగ అధికారము ఉందని చెప్పారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తిన తృణమూల్ కాంగ్రెస్‌ను విమర్శించారు. -
బెంగాల్ ఎన్నికలు.. సీఎస్, హోం సెక్రటరీపై వేటు
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పశ్చిమబెంగాల్ చీఫ్ సెక్రటరీ, హోం సెక్రటరీపై ఈసీ బదిలీ వేటు వేసింది. అలాగే, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి పోస్టింగ్ వద్దని ఆదేశాల్లో పేర్కొంది. అనంతరం, కొత్త చీఫ్ సెక్రటరీగా దుష్యంత్ నరియాల, హోం సెక్రటరీగా సంఘమిత్ర ఘోష్‌లను నియామకం చేసింది. ఈ మేరకు ఆదివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ లేఖలో స్పష్టం చేసింది. తన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని, అధికారులు విధుల్లో చేరిన వివరాలతో కూడిన నివేదికను సోమవారం మధ్యాహ్నం 3 గంటల లోపు పంపాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇక, ఇప్పటివరకు నందిని చక్రవర్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు రెండు దశల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. Following the announcement of the West Bengal Assembly Elections 2026 schedule on 15 March 2026, the Election Commission of India announced the transfer of senior officers. Dushyant Nariala (IAS-1993) appointed Chief Secretary, Govt. of West Bengal, and Sanghamitra Ghosh… pic.twitter.com/pqXt0fWD8b— ANI (@ANI) March 15, 2026 -
పాంచ్ పటాకా.. ఐదు రాష్ట్రాల్లో మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కీలకమైన పశ్చిమ బెంగాల్‌తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీతో కలిసి ఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడించారు. బెంగాల్లో 294 స్థానాలకు ఏప్రిల్ 23, 29ల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది.తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. కేరళ (140), అస్సాం (126), పుదుచ్చేరి (30) అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నట్లు జ్ఞానేశ్ తెలిపారు. అన్నిచోట్లా మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తామని వివరించారు. ఇప్పటికే పార్టీల నేతలు, రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశమై సలహాలు స్వీకరించామని ఆయన చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఆయా రాష్ట్రాల్లో ప్రవర్తన నియామవళి అమల్లోకి వచ్చింది. హింస, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలు, 17.4 కోట్ల మంది ఓటర్లున్నట్టు సీఈసీ తెలిపారు. ‘‘మొత్తం 2.19 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున 750 నుంచి 900 మంది ఓటర్లున్నారు. సుమారు 25 లక్షల సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని తెలియజేశారు. యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. హింస, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు జరిగేలా చూడాలని, గత ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఈసీ పదవి నుంచి తనను తొలగించడానికి పార్లమెంటులో ప్రతిపక్షాలు నోటీసివ్వడంపై స్పందించేందుకు నిరాకరించారు.8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలుదేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్నాటకల్లో రెండేసి, గోవా, గుజరాత్, నాగాలాండ్, త్రిపురల్లో ఒక్కో స్థానాల్లో పోలింగ్ జరగనుంది. గోవా, కర్నాటక, నాగాలాండ్, త్రిపురల్లో ఏప్రిల్ 9న, గుజరాత్, మహారాష్ట్రలో ఏప్రిల్ 23న ఎన్నికలు నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది. -
తృణమూల్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో చొరబాటుదార్లను కాపాడేందుకే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను వ్యతిరేకిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. చొరబాటుదార్ల కారణంగా రాష్ట్రంలో చాలాప్రాంతాల్లో జనాభా సమతూకంలో విపరీతమైన మార్పులు వచ్చాయని ఆందోళన వ్యక్తంచేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే బెంగాలీ హిందువులను మైనార్టీ లుగా మార్చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో లబ్ధి కోసం చొరబాట్లను ప్రోత్సహించిందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ శనివారం పశ్చిమ బెంగాల్లో పర్యటించారు.రూ.18,680 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. రెండు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఓడరేవుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కోల్‌కతాలో బహిరంగ సభకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిర్వహించిన పరివర్తన్ యాత్ర ముగింపు సందర్భంగా ఈ సభ నిర్వహించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన సంస్థలపై దాడి చేసిందని ఆరోపించారు. ఈ అరాచక ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని అన్నారు.రాజకీయ మార్పు తీసుకురావాలని ప్రజలకు సూచించారు బెంగాల్ ఆత్మను కాపాడేందుకు, కట్ మనీ సంస్కృతిని అంతం చేసేందుకు, భయం నుంచి విముక్తి కోసం ఈ ఎన్నికలు జరగబోతున్నాయని స్పష్టంచేశారు. రాష్ట్ర భవిష్యత్తు విషయంలో ఈ ఎన్నికలు నిర్ణయాత్మక పోరాటమని అభివర్ణించారు. బెంగాల్లో జంగిల్ రాజ్ అంతం కాక తప్పదన్నారు. ఎస్ఐఆర్తో ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదార్ల పేర్లుతొలగిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. మృతి చెందినవారి పేర్లు కూడా తొలగించకూడదా? అని నిలదీశారు. నేరగాళ్లు ఉండాల్సింది జైల్లోనే.. తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఇన్నాళ్లూ ప్రజలను భయపెట్టారని, ఇక ఆ గూండాలే భయపడే రోజులు వచ్చాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నేరగాళ్లు, చొరబాటుదార్లు, బుజ్జగింపు రాజకీయాలు చేసేవాళ్లు చట్టానికి భయపడాల్సిందేనని ఉద్ఘాటించారు. నేరగాళ్లు ఉండాల్సిన చోటు జైలు మాత్రమేనని వ్యాఖ్యానించారు. బెంగాల్లో తాము అధికారంలోకి రాగానే వారిని జైలుకు పంపిస్తామన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవారిపై, హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన వచ్చే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించినవారిని, అరాచకాలకు పాల్పడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తీవ్రంగా హెచ్చరించారు. పొరుగుదేశాల్లో మతపరమైన వివక్షను ఎదుర్కొంటున్న మనదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం కల్పించడం తృణమూల్ కాంగ్రెస్‌కు ఇష్టం లేదని ఆక్షేపించారు. ఎందుకంటే హిందువులను ఆ పార్టీ ఓటు బ్యాంకుగా భావించడం లేదన్నారు. కేవలం నేరస్థుల అండతోనే మమతా బెనర్జీ సర్కారు మనుగడ సాగిస్తోందని విమర్శించారు.ఎస్ఐఆర్ నిర్వహించినందుకు రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అంటూ ప్రధానమంత్రి మండిపడ్డారు. దళిత మహిళా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును తృణమూల్ కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. కేవలం రాష్ట్రపతినే కాకుండా.. దేశంలోని గిరిజనులు, రాజ్యాంగాన్ని అవమానించినట్లు ధ్వజమెత్తారు. ఆ పార్టీ అన్ని హద్దులూ దాటేసిందన్నారు. తృణమూల్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ కోల్‌కతాలో ప్రధాని మోదీ హాజరైన సభ కంటే అరగంట ముందు అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. తమ పార్టీలకు అనుకూలంగా బిగ్గరగా నినాదాలు చేశారు. ఈ ఘటనలో బీజేపీ నాయకుడితోపాటు ఓ పోలీసు అధికారి గాయపడ్డారు. బహిరంగ సభకు వస్తుండగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తమను రెచ్చగొట్టి దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు.ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలం సిల్చార్: మన దేశంపై ప్రపంచ సంక్షోభాలు, యుద్ధాల ప్రభావాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడానికి కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి మోదీ స్పష్టంచేశారు. పశ్చిమాసియా పరిణామాల పట్ల మన దేశంలో ప్రజలను భయాందోళనకు గురి చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరైంది కాదని సూచించారు. మోదీ వరుసగా రెండోరోజు శనివారం కూడా అస్సాంలో పర్యటించారు.రూ.23,550 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. సిల్చార్‌లో బహిరంగ సభలో ప్రసంగించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. పశ్చిమాసియా యుద్ధాన్ని అడ్డంపెట్టుకొని ప్రజల్లో అలజడి సృష్టించడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు అభివృద్ధి గురించి ఏమీ తెలియదన్నారు. మోదీని దూషించడం, పుకార్లు వ్యాప్తి చేయడం, అబద్ధాలు చెప్పడం, తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. -
తృణమూల్‌ను ప్రజలు క్షమించరు
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రపతి ముర్మును ఘోరంగా అవమానించిందని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఒక దళితురాలిని అవమానించిన ఆ పార్టీని బెంగాల్ ప్రజలు క్షమించబోరని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ ఆదివారం ఢిల్లీలో పర్యటించారు. ‘వికసిత్ ఢిల్లీ’ నిర్మాణంలో భాగంగా రెండు మెట్రో కారిడార్లు సహా దాదాపు రూ.33,500 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు. బెంగాల్లో రాష్ట్రపతి ముర్ము పాల్గొన్న సంతాల్ గిరిజన సదస్సును తృణమూల్ బహిష్కరించిందని ఆరోపించారు.ఇది రాజ్యాంగానికి, దేశ ఆడబిడ్డలకు జరిగిన ఘోర అవమానమన్నారు. తృణమూల్ ను దేశ ప్రజలు, గిరిజన సమాజం, మహిళలు ఏనాటికీ క్షమించరన్నారు. అహంకారపూరిత రాజకీయాలను ప్రజలు కచ్చితంగా తిప్పికొడతారని చెప్పారు. ఢిల్లీ అభివృద్ధి ఒక నగరానికి పరిమితం కాదని, దేశ ప్రతిష్టతో ముడిపడి ఉందని మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ మెట్రో రైలు నెట్‌వర్క్‌ను రికార్డు స్థాయిలో 375 కిలోమీటర్లకు విస్తరిస్తున్నామని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత నారీ శక్తిని ప్రధాని మోదీ ప్రశంసించారు. రాజకీయాలు, సైన్స్, క్రీడలు తదితర రంగాల్లో మహిళలు నూతన శక్తితో ముందుకు సాగుతున్నారని మోదీ కొనియాడారు. -
ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఆగ్రహం
న్యూఢిల్లీ/కోల్‌కతా: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రొటోకాల్ నిబంధనలు ఉల్లంఘించడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. రాష్ట్రపతి పాల్గొనాల్సిన సంతాల్ గిరిజన సదస్సు వేదికను, ఆమె ప్రయాణ మార్గాన్ని హఠాత్తుగా మార్చడాన్ని తప్పుపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రపతి ప్రొటోకాల్‌కు సంబంధించిన ‘బ్లూ బుక్’ నిబంధనలు ఎందుకు పాటించలేదో చెప్పాలంటూ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి లేఖ రాశారు. ‘‘సీఎం, మంత్రులు, సీఎస్, డీజీపీల్లో ఎవరూ రాష్ట్రపతికి స్వాగతం పలక్కపోవడం బ్లూ బుక్ రూల్స్‌కు విరుద్ధం.రాష్ట్రపతికి కేటాయించిన వాష్ రూమ్‌లో నీటి సౌకర్యం కూడా లేదు. ఆమె ప్రయాణానికి చెత్తాచెదారంతో నిండిన మార్గాన్ని ఎంపిక చేశారు. వీటిపై వివరణ ఇవ్వండి. ప్రొటోకాల్ ఉల్లంఘనకు బాధ్యులైన డార్జిలింగ్ జిల్లా మేజి్రస్టేట్, సిలిగురి పోలీసు కమిషనర్, అదనపు జిల్లా మేజి్రస్టేట్పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండి’’ అని ఆదేశించారు.బెంగాల్ పర్యటనకు వెళ్లిన ముర్ముకు శనివారం సీఎం మమతా బెనర్జీ గానీ, మంత్రులు గానీ స్వాగతం పలకలేదు. షెడ్యూల్ ప్రకారం బదాన్నగర్లో జరగాల్సిన దళిత సదస్సును చివరి నిమిషంలో బాగ్డోగ్రా ఎయిర్‌పోర్టు సమీపంలోకి మార్చేశారు. సరైన సమాచారం లేక జనం ఆశించినంతగా హాజరు కాలేదు. ఈ పరిణామాలపై ముర్ము తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.ప్రొటోకాల్‌ను ఉల్లంఘించలేదు: మమతరాష్ట్రపతి పర్యటనలో ప్రొటోకాల్ ఉల్లంఘన జరగలేదని మమత తేల్చిచెప్పారు. రాష్ట్రపతి సదస్సులో లోపాలుంటే ప్రైవేట్ నిర్వాహకులు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియానే బాధ్యత వహించాలన్నారు. ‘‘రాజ్యాంగం పట్ల, రాష్ట్రపతి పట్ల మాకు ఎనలేని గౌరవముంది. రాష్ట్రపతిని మా తల్లిగా భావిస్తాం. ముర్మును మేం అవమానించలేదు. ఆమెకు సిలిగురి మేయర్ స్వాగతం పలికారు’’ అని చెప్పారు. ‘‘రాష్ట్రపతిని అవమానించే అలవాటు బీజేపీదే. గతంలో ఒక సభలో రాష్ట్రపతి నుంచుని ఉంటే ప్రధాని మోదీ మాత్రం కురీ్చలో కూర్చున్నారు’’ అని మమత విమర్శించారు. బీజేపీ అగ్ర నేత ఎల్కే అడ్వానీతో పాటు మోదీ కూర్చుని ఉండగా వారి పక్కన ముర్ము నుంచున్న ఫొటోను ప్రదర్శించారు. -
మీరు ఎందుకు రాలేదు.. ఏం చర్యలు తీసుకున్నారు?: కేంద్రం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ పర్యటనకు సంబంధించి సరైన ఏర్పాట్లు చేయకపోవడం కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రానికి రాష్టపతి వస్తే.. ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ కనీసం పట్టించుకోరా అంటూ మండిపడింది. దీనికి సమాధానం చెప్పాలంటూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నందిని చక్రవర్తిని కేంద హోం సెక్రటరీ గోవింద్ మోహన్ వివరణ కోరారు. సాధారణంగా రాష్ట్రపతి ఒక రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు స్వాగతం పలకడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ముర్ముకు రాష్ట్రం నుంచి ఎటువంటి స్వాగతం కానీ ఆహ్వానం కానీ లభించలేదు. దీన్నే కేంద్రం ప్రధానంగా ప్రస్తావించింది. ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, పోలీసు డైరెక్టర్ జనరల్‌లు.. రాష్ట్రపతిని ఆహ్వానించడానికి కానీ వీడ్కోలు చెప్పడానికి కానీ ఎందుకు హాజరు కాలేదు? రాష్ట్రపతి కోసం ఏర్పాటు చేసిన వాష్‌రూమ్‌లో నీరు లేదు 3) రాష్ట్రపతి వచ్చే మార్గం చెత్తతో నిండి ఉంది 4) డార్జిలింగ్ జిల్లా మేజిస్ట్రేట్, సిలిగురి పోలీసు కమిషనర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ బాధ్యులు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. దీనికి ఐదు గంటల్లోగా సమాధానం చెప్పండి’ అంటూ కేంద హోం సెక్రటరీ గోవింద్ మోహన్ ఆదేశించారు.అదొక ప్రైవేట్ ఆర్గనైజేషన్: సీఎం మమతాసిలిగురిలో జరిగిన 9వ అంతర్జాతీయ ఆదివాసీ సంతల్ సమావేశానికి గౌరవనీయులైన రాష్ట్రపతిని ఆహ్వానించారు. అంతర్జాతీయ సంతల్ కౌన్సిల్ అనేది ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఈ కార్యక్రమం ఏర్పాట్లకు సిబ్బంది తగినంత లేరని జిల్లా యంత్రాంగం రాష్ట్రపతి కార్యాలయానికి లిఖిత పూర్వకంగా తెలియజేసింది. ఫోన్ ద్వారా కూడా తెలియజేశాం. గౌరవనీయులైన రాష్ట్రపతిని మేయర్ సిలిగురి మున్సిపల్ కార్పొరేషన్, డిఎం డార్జిలింగ్ సిలిగురి పోలీస్ కమిషనరేట్ స్వాగతించి, వీడ్కోలు పలికారు. రాష్ట్రపతి సచివాలయం ఆమోదించిన లైనప్ ప్రకారం ఇది జరిగింది. ఈ లైనప్‌లో కానీ వేదిక ప్రణాళికలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి భాగం కాలేదు. జిల్లా యంత్రాంగం వైపు నుండి ఎటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదు’ అని మమతా ట్వీట్ చేశారు. కాగా, 9వ అంతర్జాతీయ సంతల్ సదస్సులో పాల్గొనడానికి సిలిగురికి వచ్చిన తనకు.. ముఖ్యమంత్రి నుంచి, రాష్ట్ర మంత్రుల నుంచి కూడా తనకు ఆహ్వానం అందలేదన్నారు ముర్ము. ‘మమత నా చెల్లెలు లాంటిది. బహుశా ఆమె కోపంగా ఉండవచ్చు. నేను బెంగాల్ పర్యటనకు వస్తే ఆమె నన్ను పట్టించుకోలేదు. సంతాల్ దివస్‌కు సరైన ఏర్పాట్లు చేయలేదు. ఆ కార్యక్రమానికి మమత హాజరు కాకపోవడం నన్ను బాధించింది.ఆమె అంతర్జాతీయ కార్యక్రమాన్ని ఇంత ఇరుకైన ప్రదేశంలో నిర్వహించాలని ఎంచుకుందో నాకు తెలియదు. వేదిక పెద్దదిగా ఉంటే, సమావేశానికి ఎక్కువ మంది హాజరయ్యేవారు అని ఆమె బిధాన్నగర్లో జరిగిన మరో కార్యక్రమంలో స్పష్టం చేశారు.. బిధాన్నగర్లో సమావేశం జరిగి ఉంటే ఐదు లక్షల మంది సులభంగా హాజరయ్యేవారని కూడా ముర్ము ప్రధానంగా ప్రస్తావించారు.రాష్ట్రపతితో రాజకీయాలు సరికాదురాష్ట్రపతితో కూడా రాజకీయాలు చేయాలనుకోవడం సరైనది కాదని ప్రధాని మోదీ నిన్ననే(శనివారం, మార్చి 7వ తేదీ) ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ పర్యటనలో రాష్ట్రపతిని టీఎంసీ అవమానించింది. టీఎంసీ హద్దు మీరి ప్రవర్తిస్తోంది’ అని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. -
బెంగాల్ సీఎంపై రాష్ట్రపతి ముర్ము ఆగ్రహం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగ్రహg వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో తన పర్యటనకు సంబంధించి సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై ముర్ము అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్జాతీయ కార్యక్రమానికి వేదిక ఎంపిక అంశానికి సంబంధించి ఏర్పాట్లను సరిగా చేయకపోవడాన్ని ముర్ము ఆక్షేపించారు. 9వ అంతర్జాతీయ సంతల్ సదస్సులో పాల్గొనడానికి సిలిగురికి వచ్చిన ముర్ము.. ముఖ్యమంత్రి నుంచి, రాష్ట్ర మంత్రుల నుంచి కూడా తనకు ఆహ్వానం అందలేదన్నారు. ‘మమత నా చెల్లెలు లాంటిది. బహుశా ఆమె కోపంగా ఉండవచ్చు. నేను బెంగాల్ పర్యటనకు వస్తే ఆమె నన్ను పట్టించుకోలేదు. సంతాల్ దివస్‌కు సరైన ఏర్పాట్లు చేయలేదు. ఆ కార్యక్రమానికి మమత హాజరు కాకపోవడం నన్ను బాధించింది.ఆమె అంతర్జాతీయ కార్యక్రమాన్ని ఇంత ఇరుకైన ప్రదేశంలో నిర్వహించాలని ఎంచుకుందో నాకు తెలియదు. వేదిక పెద్దదిగా ఉంటే, సమావేశానికి ఎక్కువ మంది హాజరయ్యేవారు అని ఆమె బిధాన్నగర్లో జరిగిన మరో కార్యక్రమంలో స్పష్టం చేశారు.. బిధాన్నగర్లో సమావేశం జరిగి ఉంటే ఐదు లక్షల మంది సులభంగా హాజరయ్యేవారని కూడా ముర్ము ప్రధానంగా ప్రస్తావించారు.రాష్ట్రపతితో రాజకీయాలు సరికాదురాష్ట్రపతితో కూడా రాజకీయాలు చేయాలనుకోవడం సరైనది కాదని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ పర్యటనలో రాష్ట్రపతిని టీఎంసీ అవమానించింది. టీఎంసీ హద్దు మీరి ప్రవర్తిస్తోంది’ అని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. -
టెన్త్ పాసైన వారికి మమతా బెనర్జీ గుడ్ న్యూస్
కోల్‌కాతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరుద్యోగ యువతకు తీపి కబురు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పదో తరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు నెలకు రూ.1500 ఇస్తామని ప్రకటించారు. నేటి నుంచే( మార్చి 7, శనివారం) ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు. ‘యువ సాథీ’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ కొత్త పథకం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని.. 21-40ఏళ్ల వారు ఈ పథకానికి అర్హులుగా మమతా బెనర్జీ తెలిపారు. కేవలం స్కాలర్షిప్లు తప్ప ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందని వారు మాత్రమే దీనికి అర్హులన్నారు.వాస్తవానికి ఏప్రిల్ 1 నుండి ప్రారంభం ఈ పథకం ప్రారంభం కావాల్సిఉందని.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) కానుకగా ఒక రోజు ముందుగానే ఇవాళ నుంచి (మార్చి7) నుంచే అమలు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఓటరు జాబితా సర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)తో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగించడాన్ని నిరసిస్తూ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో మమతా బెనర్జీ ఈ ప్రకటన చేశారు.కాగా, సీఎం తన ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక గణాంకాలను వెల్లడించారు. బెంగాల్లో నిరుద్యోగిత రేటు 40 శాతం తగ్గిందని ఆమె పేర్కొన్నారు. 'ఉత్కర్ష బంగ్లా' ద్వారా 40 లక్షల మందికి శిక్షణ ఇవ్వగా.. అందులో 10 లక్షల మందికి ఉపాధి లభించిందని మమతా తెలిపారు.బెంగాల్ చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో (MSME) దేశంలోనే నంబర్ వన్‌గా ఉందని.. దాదాపు 1.5 కోట్ల మంది ఈ రంగంలో పని చేస్తున్నారని వివరించారు. బెంగళూరు కంటే బెంగాల్లోనే ఐటీ రంగంలో ఎక్కువ మందికి ఉపాధి లభిస్తోందంటూ ఆమె వ్యాఖ్యానించారు. రైతులకు నెలకు రూ.10,000 ఇస్తున్నామని, భూమి లేని రైతులకు కూడా రూ. నాలుగు వేలు సహాయం అందిస్తున్నామని తెలిపారు. బీర్భూమ్ జిల్లాలోని దేవుచా పచామి బొగ్గు గనుల ద్వారా లక్ష మందికి ఉపాధి లభిస్తుందని.. రాబోయే 100 ఏళ్ల వరకు రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని మమతా ధీమా వ్యక్తం చేశారు. -
పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. బెంగాల్ గవర్నర్‌గా ఆయన మూడున్నరేళ్లు పనిచేశారు. అయితే, రాజీనామాకు గల కారణాలు మాత్రం ఆయన తెలపలేదు. బెంగాల్ కొత్త గవర్నర్‌గా తమిళనాడు గవర్నర్ రవిని కేంద్రం నియమించింది.వ్యక్తిగత నిర్ణయంతోనే తాను రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చారు. గవర్నర్ కార్యాలయంలో తాను తగినంత సమయం గడిపానన్న ఆనంద బోస్.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ పీటీఐకి ఆయన తెలిపారు. 2022లో గవర్నర్‌గా ఆనంద బోస్.. బాధ్యతలు చేపట్టారు.సుమారు మూడున్నరేళ్ల పాటు తన సేవలను అందించారు. ఆనంద బోస్ రాజీనామా షాక్‌కు గురిచేసిందని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. ఆయన రాజీనామా వెనుక గల కారణాలు ప్రస్తుతానికి తనకు తెలియవన్నారు. ఆర్ఎన్ రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి తనకు ఇప్పుడే తెలియజేశారంటూ ఎక్స్‌లో ఆమె పేర్కొన్నారు.I am shocked and deeply concerned by the sudden news of the resignation of Shri C. V. Ananda Bose, the Governor of West Bengal.The reasons behind his resignation are not known to me at this moment. However, given the prevailing circumstances, I would not be surprised if the…— Mamata Banerjee (@MamataOfficial) March 5, 2026 -
పశ్చిమ బెంగాల్లో బీజేపీని గెలిపిస్తే.. 45 రోజుల్లో..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బంపరాఫర్ ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే 45 రోజుల్లో ఏడో వేతన సంఘం సిఫారసులను అమలు చేస్తామని తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల నేపథ్యంలో దక్షిణ 24 పరగణాల జిల్లాలోరి మథురాపుర్లో బీజేపీ పరివర్తన్ యాత్రను అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సీఎం మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. ‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును వ్యతిరేకించకపోతే.. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ప్రతి హిందూ శరణార్థి ఇప్పటికే పౌరసత్వాన్ని పొందేవాడు. అయినప్పటికీ హిందూ శరణార్థులెవరూ బాధపడాల్సిన అవసరం లేదు. బీజేపీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఒక్క హిందూ శరణార్థి కూడా పౌరసత్వాన్ని కోల్పోకుండా చేస్తాం’ అని హామీ ఇచ్చారు. ‘పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక అక్రమ చొరబాటుదారులను లేకుండా చేస్తాం. చొరబాటుదారుల పేర్లను ప్రస్తుతం ఓటర్ల జాబితా నుంచి మాత్రమే తొలగిస్తున్నాం. దీనిపై మమతా దీదీ ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిందంటే చొరబాటుదారులను పూర్తిగా ఇక్కడి నుంచి పంపించేస్తాంప్రజల కోసం దీదీ చేసిందేమీ లేదు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులను మాత్రం ఆమె బుజ్జగిస్తున్నారు. మేమే రామ మందిరాన్ని, కాశి విశ్వనాథ్, మహాకాల్ కారిడార్‌ను కట్టించాం. మమతా బెనర్జీ ప్రజల్ని విస్మరించి వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని సీఎం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇదే వారి పద్ధతి. దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు జీతాలు అందుకుంటున్నారు. బెంగాల్ ఉద్యోగులు మాత్రమే ఇప్పటికీ ఆరో వేతన సంఘం సిఫారసుల మేరకు జీతాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే 45 రోజుల్లో ఏడో వేతన సంఘం సిఫారసులను అమలు చేస్తాం’ అని అమిత్ షా పునరుద్ఘాటించారు. -
భారత పార్లమెంట్‌కు తొలి LGBTQ+ మహిళ.. ఎవరీ మేనకా గురుస్వామి?
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నాలుగు స్థానాలకు అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీ.. తమ అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్ర మంత్రి బాబుల్ సుప్రియో, బెంగాల్ మాజీ డీజీపీ రాజీవ్‌కుమార్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, నటి కోయల్ మల్లిక్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు టీఎంసీ ‘ఎక్స్’ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది.అయితే, వీరిలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. ఎగువ సభకు ఆమె ఎన్నికైతే పార్లమెంట్ చరిత్రలోనే తొలి LGBTQ+ పార్లమెంట్ సభ్యురాలు అవుతారు. కాగా.. దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లో అయిదు స్థానాలు ఖాళీ అవుతుండగా.. నాలుగు టీఎంసీ, మరొకటి బీజేపీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక, మేనకా గురుస్వామి జీవితం న్యాయపరమైన ప్రతిభ, సామాజిక న్యాయం కోసం పోరాటం, అంతర్జాతీయ గుర్తింపులతో నిండి ఉంది. ఆమె రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడం భారతదేశంలో సమానత్వానికి ఒక చారిత్రాత్మక మైలురాయి పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.మేనకా గురుస్వామి ఎవరు?సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయిన మేనకా గురుస్వామి 2018లో చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఆ బంధాలను నేరంగా చెప్పే ఐపీసీ సెక్షన్ 377ను కొట్టివేయడంలో కీలక పాత్ర పోషించిన న్యాయవాదుల్లో మేనక కూడా ఒకరు. ఈ కేసు వాదించిన గురుస్వామి కూడా ఎల్జీబీటీక్యూ. ఇప్పుడు రాజ్యసభకు ఎన్నికైతే.. పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించే తొలి ఎల్జీబీటీక్యూ ఎంపీగా రికార్డు సృష్టించనున్నారు.ఆమె 1997లో భారత మాజీ అటార్నీ జనరల్ అశోక్ దేశాయ్ ఆధ్వర్యంలో తన కెరీర్‌ను ప్రారంభించింది. అలాగే, ఆయనను ఆమె తన గురువుగా భావిస్తుంది. 2001లో ఆక్స్‌ఫర్డ్‌లో తన BCL మరియు హార్వర్డ్‌లో తన LLM పూర్తి చేసిన తర్వాత, ఆమె కొంతకాలం న్యూయార్క్‌లోని డేవిస్ పోల్క్, వార్డ్‌వెల్‌లో అసోసియేట్‌గా పనిచేసింది. తరువాత ఆమె భారతదేశానికి తిరిగి వచ్చి న్యూఢిల్లీలో స్థిరపడ్డారు. ఆమె 2019లో ఫారిన్ పాలసీ మ్యాగజైన్ 100 మంది అత్యంత ప్రభావవంతమైన గ్లోబల్ థింకర్స్ జాబితాలో చోటు సంపాదించారు. టైమ్ మ్యాగజైన్-2019లో 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా.. బెంగాల్లో ఇటీవల I-PAC కార్యాలయాలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలను సవాలు చేస్తూ కోర్టు విచారణలో ఆమె.. టీఎంసీ తరఫున వాదనలు వినిపించారు. ఈ కారణంగానే ఆమెకు రాజ్యసభ స్థానం ఇచ్చినట్టు బెంగాల్ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. -
కేరళ ‘కేరళం’.. బెంగాల్ ‘బంగో’ అయ్యేదెన్నడు?
న్యూఢిల్లీ: కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా ‘కేరళం’గా మారుస్తూ పంపిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం ద్వారా దశాబ్దాల కాలంగా మలయాళీలు కోరుకుంటున్న తమ రాష్ట్ర అసలు పేరు పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. త్వరలో జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేరళ పేరు మార్పునకు సానుకూలంగా స్పందించిన కేంద్రం, పశ్చిమ బెంగాల్ విషయంలో కొన్ని దశాబ్దాలుగా విముఖత వ్యక్తం చేయడం ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీసింది.పశ్చిమ బెంగాల్ పేరును ‘బంగో’ లేదా 'బంగ్లా'గా మార్చాలని నాటి జ్యోతి బసు నుండి నేటి మమతా బెనర్జీ వరకు కనీసం నాలుగు సార్లు అసెంబ్లీ తీర్మానాలు చేసినా కేంద్రం వాటిని తిరస్కరించింది. ముఖ్యంగా అక్షర క్రమం ప్రకారం అధికారిక సమావేశాల్లో తమ రాష్ట్రం(వెస్ట్ బెంగాల్) పేరు చివరన రావడం వల్ల, తమకు మాట్లాడే అవకాశం అందరికంటే చివర్లో వస్తోందని, తద్వారా రాష్ట్ర సమస్యలను వివరించే సమయానికి ఏకాగ్రత తగ్గుతోందని మమతా బెనర్జీ గతంలో వాదించారు.2016లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు పేర్లు (ఆంగ్లంలో బెంగాల్, బెంగాలీలో బంగ్లా, హిందీలో బంగాల్) విధానాన్ని కేంద్రం తిరస్కరించింది. రాష్ట్రం మొత్తానికి ఒకే పేరు ఉండాలని కేంద్రం స్పష్టం చేయడంతో, 2018లో ‘బంగ్లా’ అనే పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించినా, ఆ పేరు పొరుగు దేశమైన 'బంగ్లాదేశ్'ను పోలి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.కేరళ ప్రతిపాదన ఆమోదం పొందడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. కేరళలో బీజేపీ, సీపీఎం మధ్య ఉన్న రహస్య ఒప్పందం వల్లే ఈ నిర్ణయం వేగంగా జరిగిందని ఆమె ఆరోపించారు. బెంగాల్‌పై కేంద్రం వివక్ష చూపుతోందని, అయినా తాము ‘బంగ్లా’ పేరు కోసం పోరాడుతూనే ఉంటామని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రాల పేర్ల మార్పులో పార్లమెంటుదే తుది నిర్ణయం అయినందున ఈ విషయంలో బెంగాల్ పేరు మార్పునకు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. ఇది కూడా చదవండి: చావబోయే పాక్ ప్రధానిని కాపాడా: ట్రంప్ -
మాజీ కేంద్ర మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత
కోల్‌కతా: భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ రాజకీయ నేత, మాజీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి ముకుల్ రాయ్ (71) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, సోమవారం తెల్లవారుజామున సుమారు 1:30 గంటల సమయంలో కోల్‌కతాలోని సాల్ట్ లేక్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు శుభ్రాంషు రాయ్ మీడియాకు తెలిపారు.గడచిన రెండు, మూడేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న ముకుల్ రాయ్ మృతిపై పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ముకుల్ రాయ్, యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో కేంద్ర షిప్పింగ్, రైల్వే శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, మమతా బెనర్జీ వెన్నంటి ఉండి టీఎంసీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు.అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 నుండి 2021 వరకు భారతీయ జనతా పార్టీలో కొనసాగిన ఆయన, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్నికల అనంతరం తిరిగి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ సమక్షంలో టీఎంసీ గూటికి చేరారు. ఈ ఫిరాయింపు అంశంపై ఆయనపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్షాలు న్యాయపోరాటం చేశాయి. ముకుల్ రాయ్ మృతిపై బీజేపీ నేత దిలీప్ ఘోష్ స్పందిస్తూ, ఆయన ఒక అనుభవజ్ఞుడైన నాయకుడని, బీజేపీలో ఉన్న సమయంలో ఆయనకు తగిన గౌరవం లభించిందని గుర్తు చేసుకున్నారు. -
ఎస్ఐఆర్ కోసం జ్యుడీషియల్ అధికారులను నియమించండి
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో వివాదాస్పదంగా మారిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై సుప్రీంకోర్టు అసాధారణ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియలో ఎన్నికల సంఘానికి సహకరించడానికి జ్యుడీషియల్ అధికారులను(జిల్లా కోర్టు న్యాయమూర్తులు లేదా జిల్లా కోర్టు మాజీ న్యాయమూర్తులు) నియమించాలని కలకత్తా హైకోర్టుకు స్పష్టంచేసింది. ఎస్ఐఆర్ దరఖాస్తులపై వచ్చే అభ్యంతరాలను ఆయా జ్యుడీషియల్ అధికారులు పరిశీలిస్తారని పేర్కొంది. ఎస్ఐఆర్ విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య కొనసాగుతున్న రగడ పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం, రాజ్యాంగబద్ధమైన సంస్థ మధ్య ఇలాంటి వివాదం ఏర్పడడం నిజంగా దురదృష్టకరమని పేర్కొంది. ఇరుపక్షాల మధ్య అపనమ్మకం నెలకొనడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ఈ దురదృష్టకరమైన బ్లేమ్ గేమ్ ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది. బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ సాఫీగా జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ జస్టిస్ విపుల్ ఎం.పంచోలీ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం స్పష్టంచేసింది. ఎస్ఐఆర్ సక్రమంగా పూర్తికావడానికి వీలుగా ఆదేశాలు జారీ చేసింది. వేర్వేరు కారణాలు, నిబంధనల వల్ల ఓటు హక్కు కోల్పోయే జాబితాలో ఉన్న వ్యక్తులకు సంబంధించిన క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిశీలనకు, ఎన్నికల సంఘానికి సహకరించడానికి జ్యుడీషియల్ అధికారులను నియమించాలని పేర్కొంది. అంతకు మించి మరో మార్గం లేదు ఎస్ఐఆర్ కోసం ఎన్నికల సంఘానికి సహాయం అందించడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తగినంత మంది గ్రేడ్ ‘ఎ’అధికారులను నియమించకపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ప్రక్రియ సజావుగా ముందుకు సాగాలంటే కొందరు జ్యుడీషియల్ అధికారులను, మాజీ న్యాయమూర్తులను నియమించాలని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్‌ను ఆదేశించింది. అదనపు జిల్లా జడ్జి, జిల్లా జడ్జి ర్యాంకు ఉన్న జ్యుడీషియల్ ఆఫీసర్లను నియమించాలని సూచించింది. అంతకంటే మరో మార్గం కనిపించడం లేదని పేర్కొంది. పేరు, వయసు వంటి వ్యత్యాసాల వల్ల ఓట్లు కోల్పోయే జాబితా ఉన్న వ్యక్తుల పెండింగ్ క్లెయిమ్‌లను వీరంతా క్షుణ్నంగా పరిశీలిస్తారని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం లేని పక్షంలో జ్యుడీషియల్ అధికారులను నియమించడం.. లేదా ఎన్నికల సంఘమే ఇతర రాష్ట్రాల నుంచి అధికారులను నియమించుకోవడం మినహా మరో మార్గం లేదని తేలి్చచెప్పింది. జ్యుడీషియల్ అధికారులకు తగిన భద్రత కలి్పంచాలని పోలీసులను ఆదేశించింది. తుది ఓటర్ల జాబితా ప్రచురణకు అనుమతి ఎస్ఐఆర్పై పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ అభ్యంతరాలను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ముందుగా నిర్ణయించిన డెడ్‌లైన్ ప్రకారమే ఈ నెల 28వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించడానికి ఎన్నికల సంఘానికి అనుమతి మంజూరు చేసింది. అవసరమైతే తర్వాత అనుబంధ జాబితాలు విడుదల చేయవచ్చని సూచించింది. ఫిబ్రవరి 28 తర్వాత కూడా అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చవచ్చని వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసే తేదీ వరకూ కొత్త పేర్లను చేర్చి, అనుబంధ జాబితాలు విడుదల చేసినా ఎలాంటి అభ్యంతరం ఉండదని ధర్మాసనం స్పష్టంచేసింది. ఇదిలా ఉండగా, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ శనివారం ఒక సమావేశం ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఎన్నికల సంఘం అధికారి, అడ్వొకేట్ జనరల్, కేంద్ర ప్రభుత్వం అదనపు సొలిసిటర్ జనరల్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ భేటీకి హాజరు కాబోతున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో సహకరించడానికి జ్యుడీషియల్ అధికారులను నియమించడంపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. -
బెంగాల్లో బీజేపీకి బిగ్ షాక్..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ప్రత్యేక గూర్ఖాల్యాండ్ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రంలోని తమ పార్టీ అనుకూలంగా లేదన్న ఆగ్రహంతో పశ్చిమబెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యే బిష్ణు ప్రసాద్ శర్మ కాషాయ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, గురువారం మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.కుర్సియాంగ్ శాసనసభ్యుడైన శర్మ కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో టీఎంసీలో చేరారు. మరో రెండు నెలల్లో బెంగాల్లో ఎన్నికల వేడి మొదలవుతున్న వేళ బీజేపీ రెబల్ ఎమ్మెల్యే పార్టీని వీడటం గమనార్హం. ‘కుర్సియాంగ్ ఓటర్ల మనోభీష్టానికి వ్యతిరేకంగా పనిచేయదల్చుకోలేదు. ఇప్పుడు నేను స్వేచ్ఛాజీవిని. ఎవరేం అనుకున్నా భయపడేదే లేదు’ అని పార్టీ మారాక బిష్ణుప్రసాద్ అన్నారు.బెంగాల్ కొండ ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలనా విభాగం ఉండాలని గత రెండేళ్లుగా బీజేపీ అధిష్టానంతో బిష్ణు పోరాడుతున్నారు. పశ్చిమబెంగాల్ మాత్రమేకాదు నార్త్ బెంగాల్ కూడా ముఖ్యమే’ అని గతంలో వ్యాఖ్యానించారు. పార్టీ వద్దని వారించినాసరే బిష్ణు ప్రసాద్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో డార్జిలింగ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. -
టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యే
కోల్‌కతా: ప్రత్యేక గూర్ఖాల్యాండ్ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రంలోని తమ పార్టీ అనుకూలంగా లేదన్న ఆగ్రహంతో పశ్చిమబెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యే బిష్ణు ప్రసాద్ శర్మ గురువారం మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కుర్సియాంగ్ శాసనసభ్యుడైన శర్మ కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో టీఎంసీలో చేరారు. మరో రెండు నెలల్లో బెంగాల్లో ఎన్నికల వేడి మొదలవుతున్న వేళ బీజేపీ రెబల్ ఎమ్మెల్యే పార్టీని వీడటం గమనార్హం. ‘కుర్సియాంగ్ ఓటర్ల మనోభీష్టానికి వ్యతిరేకంగా పనిచేయదల్చుకోలేదు. ఇప్పుడు నేను స్వేచ్ఛాజీవిని. ఎవరేం అనుకున్నా భయపడేదే లేదు’’అని పార్టీ మారాక బిష్ణుప్రసాద్ అన్నారు. బెంగాల్ కొండ ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలనా విభాగం ఉండాలని గత రెండేళ్లుగా బీజేపీ అధిష్టానంతో బిష్ణు పోరాడుతున్నారు. పశ్చిమబెంగాల్ మాత్రమేకాదు నార్త్ బెంగాల్ కూడా ముఖ్యమే’’ అని గతంలో వ్యాఖ్యానించారు. పార్టీ వద్దని వారించినాసరే బిష్ణు ప్రసాద్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో డార్జిలింగ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేశారు. -
‘SIR’ విధుల్లో అక్రమాలు.. ఏడుగురిపై ఈసీ వేటు!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కొరడా ఝుళిపించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ విధులలో నిర్లక్ష్యం, అధికారాల దుర్వినియోగానికి పాల్పడిన ఏడుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఏఈఆర్ఓ)హోదాలో ఉన్న ఈ అధికారులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కమిషన్ ఆదేశించింది.సస్పెన్షన్‌కు గురైన అధికారులలో సంషేర్‌గంజ్, ఫరక్కా, మైనాగురి, సూతి, కానింగ్ పూర్బో, డెబ్రా అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఏఈఆర్ఓలు ఉన్నారు. ముర్షిదాబాద్ జిల్లా సంషేర్‌గంజ్ ఏఈఆర్ఓ సెఫౌర్ రెహమాన్, ఫరక్కా ఏఈఆర్ఓ నితీష్ దాస్, మైనాగురి ఏఈఆర్ఓ డాలియా రాయ్ చౌదరి, సూతి ఏఈఆర్ఓ ముర్షీద్ ఆలంలపై వేటు పడింది. అలాగే కానింగ్ పూర్బో నియోజకవర్గానికి చెందిన సత్యజిత్ దాస్, జయదీప్ కుందు, డెబ్రా ఏఈఆర్ఓ దేబాశిష్ బిస్వాస్‌లను ఈసీ విధుల నుంచి తొలగించింది.ఓటర్ల జాబితా తుది ప్రచురణకు ముందు చేపట్టిన పరిశీలనలో ఈ అధికారులు తీవ్రమైన అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. అవసరమైన పత్రాలు సమర్పించకపోయినా, మ్యాపింగ్‌లో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, ఓటర్ల అర్హతపై అనుమానాలు ఉన్నా కూడా వీరు అనేక కేసులను క్లియర్ చేశారని తేలింది. అనర్హులకు ఓటు హక్కు కల్పించేలా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వీరు అధికారాలను దుర్వినియోగం చేశారని విచారణలో వెల్లడైంది.తప్పులను సరిదిద్దడంలో విఫలమైనందుకు వీరిని బాధ్యులుగా చేస్తూ ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ (ఆరపీ) యాక్ట్ 1950లోని సెక్షన్ 13సీసీ కింద తమకు ఉన్న అధికారాలను ఉపయోగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయా విభాగాల ఉన్నతాధికారులు ఎటువంటి జాప్యం లేకుండా ఈ అధికారులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని, ఆ వివరాలను తమకు నివేదించాలని ఈసీ స్పష్టం చేసింది.ఇది కూడా చదవండి: ‘ఐదేళ్లలో ఐటీ, బీపీఓలు..’ బాంబు పేల్చిన వినోద్ ఖోస్లా -
బెంగాల్ బొగ్గు కుంభకోణం కేసు
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో అక్రమ మైనింగ్, బొగ్గు దొంగతనం ఆరోపణలపై మనీ లాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం రూ.100 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. శాకాంబరీ ఇస్పాత్ అండ్ పవర్ లిమిటెడ్, గగన్ ఫెర్రోటెక్ లిమిటెడ్ కంపెనీలకు చెందిన స్థిరాస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు సీజ్ చేసిన వాటిలో ఉన్నాయంది. దీంతో, రూ.2,742 కోట్ల మేర అవకతకలు జరిగాయని భావిస్తున్న ఈ కేసులో ఇప్పటి వరకు అటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ.322.71 కోట్లకు చేరిందని ఈడీ పేర్కొంది. బొగ్గు కుంభకోణం కేసు విచారణలో భాగంగా జనవరి 8వ తేదీన కోల్‌కతాలోని ఐ–ప్యాక్ అనే ఎన్నికల కన్సల్టెన్సీతోపాటు ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్‌కు చెందిన కార్యాలయాల్లో ఈడీ చేపట్టిన సోదాలు వివాదాస్పదంగా మారాయి. జైన్ ఇంట్లో సోదాలు జరుపుతుండగా సీఎం మమతా బెనర్జీ అక్కడికి వచ్చి కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాలను తీసు కెళ్లారని ఈడీ ఆరోపించడం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దాకా రావడం తెల్సిందే. -
రెట్రో క్వీన్ కల్పనా ఈజ్ బ్యాక్
ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉండే నేటి డిజిటల్ కాలంలో కూడా కానీ కొన్ని క్లాసిక్స్‌కు ఎప్పటికీ కాలం చెల్లదన డానికి 1981లో ఒక వెలుగు వెలిగిన రంభ హో పాట, ఇప్పుడు మళ్ళీ దేశవ్యాప్తం గా మార్మోగి పోతోంది. కారణం ఒరిజినల్ రంభా హో గర్ల్ కల్పనా అయ్యర్ తన 69 ఏళ్ల వయసులో చేసిన ఒక అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్. పశ్చిమ బెంగాల్ సిలిగురిలోని ఒక పెళ్లి వేడుకలో ఈ మ్యాజిక్ జరిగింది. తన స్నేహితురాలి కుమారుడి పెళ్లికి వెళ్లిన కల్పనా, అక్కడివారి కోరిక మేరకు ఏమాత్రం ΄్లాన్ చేయకుండానే స్టేజ్ ఎక్కారు. లెజెండరీ సింగర్ ఉషా ఉతుప్ పాడిన అత్యంత ప్రసిద్ధ పాటల్లో ఒకటైన రంభహో పాటకు ఆమె తనదైన శైలిలో స్టెప్పులేసి సందడి చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ అవ్వడంపై కల్పనా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అభిమానులంతా తనపట్ల చూపిస్తున్న ప్రేమకి ఎంతో సంతోషంగా ఉందని ఆమె కృతజ్ఞతలు తెలి పారు. కల్పనా అయ్యర్ 1980లలో బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన డాన్సర్, నటి. ఆమె 1978లో మిస్ ఇండియా రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత హిందీ సినిమాల్లో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా డిస్కో డాన్సర్ సినిమాలోని ఔవా ఔవా, అర్మాన్ చిత్రంలోని రంభ హో వంటి పాటలతో ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమెను అప్పట్లో క్యాబరే క్వీన్ అని పిలిచేవారు. ఈ పాట మళ్ళీ ఇంతలా వైరల్ అవ్వడానికి మరో కారణం బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ధురంధర్ సినిమా కోసం ఈ ఐకానిక్ సాంగ్‌ను రీమిక్స్ వెర్షన్ లో ఉపయోగించారు. 80ల నాటి ఈ ఎనర్జిటిక్ పాటను నేటి జెన్‌జెడ్ యువత కూడా ఇష్టపడటం విశేషం. -
సర్‌కు ఆటంకం కలిగిస్తే ఊరుకోం
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో ఓటరు జాబితా సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ విషయంలో ఎన్నికల కమిషన్(ఈసీ), రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. సర్ ప్రక్రియకు అవరోధాలు కలిగించవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అదే సమయంలో, ప్రక్రియను పూర్తి చేసేందుకు ఈసీ గడువును మరో వారంపాటు పొడిగించింది. ఈ నెల 4వ తేదీన జరిగిన విచారణకు సీఎం మమతా బెనర్జీ స్వయంగా హాజరై వాదనలు వినిపించడం తెల్సిందే. ‘వాట్సాప్ ద్వారా కాకుండా ఈసీ అధికారికంగా ఆదేశాలు జారీ చేయాలి. వాటిని ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. మైక్రో అబ్జర్వర్లను తొలగించాలి’అని కోరారు. వీటిపై సుప్రీంకోర్టు కేంద్రం, ఈసీలకు నోటీసులు జారీ చేసింది. సోమవారం వీటిపై ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘సర్ విషయంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తాం. ఈ విషయంలో ఎటువంటి అడ్డంకులను కలిగించం. ఇందులో మావైఖరి సుస్పష్టం’అని సీజేఐ తెలిపారు. సర్ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం కొనసాగాల్సిందేనని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అవగాహన లేని అధికారులను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారు(ఈఆర్వో)లను నియమించిందంటూ ఈసీ తరఫున సీనియర్ లాయర్ డీఎస్ నాయుడు అభ్యంతరం తెలపగా మైక్రో అబ్జర్వర్లు ఏకపక్షంగా ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారంటూ బెంగాల్ ప్రభుత్వం తరఫున న్యాయవాది శ్యామ్ దివాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 14వ తేదీకల్లా పూర్తి చేసి, తుది జాబితా ప్రకటించాల్సి ఉందంటూ ఆయన..స్వల్ప కారణాలు చూపి 1.68 లక్షల పేర్లను తొలగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో, సంబంధిత దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేయడానికి, తుది జాబితాకు గడువును మరో ఒక వారం పాటు గడువు పొడిగిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. వెరిఫికేషన్ అనంతరం విడుదల చేసే ఫలితాలను తాము తప్పనిసరిగా పరిశీలిస్తామని, అవసరమైన పక్షంలో జోక్యం చేసుకుంటామని సీజేఐ ప్రకటించారు. ఓటర్ల తుది జాబితాపై అంతిమ నిర్ణయం ఎన్నికల అధికారులకే ఉండాలని స్పష్టం చేసింది. బెంగాల్ ప్రభుత్వం అందజేస్తామంటున్న 8,505 మంది అధికారులకు ఎలాంటి బాధ్యతలను అప్పగించాలో ఈసీయే నిర్ణయిస్తుందని కూడా తెలిపింది. ఓటర్లకు ఈసీ విడుదల చేసిన నోటీసులను కొందరు తగులబెట్టారని లాయర్ డీఎస్ నాయుడు తెలపగా, ధర్మాసనం సీరియస్‌గా తీసుకుంది. ఇటువంటి ఘటనలపై అఫిడవిట్ సమరి్పంచాల్సిందిగా బెంగాల్ డీజీపీని ఆదేశించింది. -
సీఈసీని అభిశంసించాలి
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను అభిశంసించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ అన్నారు. ఆయనపై అభిశంసనకు తీర్మానం ప్రవేశపెడితే తాము కచి్చతంగా మద్దతిస్తామని ప్రకటించారు. ఈ విషయంలో ఇతర విపక్ష పారీ్టలు సైతం ముందుకు రావాలని కోరారు. ఆమె మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బెంగాల్లో తమ పార్టీ మద్దతుదారుల ఓట్లను ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ముసుగులో తొలగిస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలకు సీఈసీని జబాబుదారీ చేస్తూ చట్టం తీసుకురావాలంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన సూచనను మమతా బెనర్జీ గట్టిగా సమర్థించారు. ఇప్పుడు ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను అభిశంసించాలని తేల్చిచెప్పారు. ఈ దిశగా కాంగ్రెస్ ముందడుగు వేస్తే మద్దతిస్తామని అన్నారు. ఓట్లు తొలగిస్తే బాధితులు ఎక్కడికెళ్లాలి? బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన మమతా బెనర్జీ తేల్చిచెప్పారు. ఎన్నికల సంఘాన్ని వాడుకోకుండా తమతో ముఖాముఖి తలపడాలని బీజేపీకి సవాలు విసిరారు. బెంగాల్లో ఎస్ఐఆర్ వల్ల దళితులు, గిరిజనులు, మైనారీ్టలు, అణగారినవర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతోందని, వారి ఓట్లు రద్దవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఎస్ఐఆర్తో తొలగింపునకు గురైన ఓట్లు వందశాతం తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులవేనని చెప్పారు. బీజేపీపై అనుమానం రాకుండా ఒకటి రెండు ఓట్లు ఇతర పారీ్టల మద్దతుదారులవి కూడా తొలగించి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఓట్లు తొలగిస్తే వారంతా ఎక్కడికి వెళ్లాలి? అని ప్రశ్నించారు. నేడు సుప్రీంకోర్టులో విచారణకు మమత హాజరు! బెంగాల్లో ఎస్ఐఆర్ చేపట్టడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది. ఈ విచారణకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. -
ఢిల్లీలో మమత.. ఈసీపై తీవ్ర ఆరోపణలు
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. సర్(SIR) విషయంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆయన తమ మాటల్ని వినలేదని, తమను అవమానించారని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈసీ తీరుపై మండిపడ్డారు.పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంఘం ‘సర్’ పేరిట ఓటర్ల రివ్యూ చేపట్టి.. లక్షల సంఖ్యలో ఓటర్లను తొలగించింది. ఈ నేపథ్యంలో సర్ ద్వారా కలిగిన నష్టంపై వివరించేందుకు, ఫిర్యాదు చేసేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. అనంతరం, మమతా బెనర్జీ.. సీఈసీ వ్యవహార శైలిపై విరుచుకుపడ్డారు. ఈసీతో సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో మమత ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నేను ఎల్కే అద్వానీ గారిని గౌరవిస్తాను. ఆయన తన తల్లిదండ్రుల జనన ధృవీకరణ పత్రాలను అందించగలరా అని అడుగుతున్నాను. ‘సర్’ పొంతన లేనిది. తప్పుల తడకగా ఉంది, అసంబద్ధమైనది. ఈ ఎన్ఆర్సీ కారణంగా బీఎల్ఓలతో సహా 150 మందికి పైగా మరణించారు. నేను నా వెంట 100 మందిని తీసుకువచ్చాను. వారిలో కొందరిని ఓటర్ల జాబితాలో చనిపోయినట్లు ప్రకటించారు. కానీ వారు సజీవంగా ఇక్కడే ఉన్నారు’ అని చెప్పుకొచ్చారు. Outside the @ECISVEEP office in Delhi, Mamata Banerjee questioned the cruel SIR rules asking how ordinary citizens can produce parents’ birth certificates.150+ BLO deaths. Living voters marked “dead.”This isn’t verification. This is voter suppression. Bengal won’t stay… pic.twitter.com/idewLmDaR4— Abhishek Banerjee Fans (@ABFansClub) February 2, 2026సర్ విషయంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించం. ఆయన మా మాటల్ని వినలేదు.. మమ్మల్ని అవమానించారు. ‘సర్’ వల్ల పశ్చిమ బెంగాల్లో చాలా కుటుంబాలు ఇబ్బందిపడ్డాయి. కొందరు సరైన డాక్యుమెంట్లు ఇవ్వలేకపోవడంతో ఓటరు జాబితాలో పేర్లు కోల్పోయారు. ఇంకొందరి ఓట్లు రకరకాల కారణాల వల్ల తొలగించారు అని అన్నారు.#WATCH | Delhi: Outside the Election Commission Office in Delhi, West Bengal CM Mamata Banerjee says, "... I respect Advani Ji and ask him whether he can provide the birth certificates of his father and mother. This is mismatch, a mismap, and unparliamentary... More than 150… pic.twitter.com/e6dhXl4AfN— ANI (@ANI) February 2, 2026అయితే, మమత చేసిన ఆరోపణలను ఈసీ వర్గాలు ఖండించాయి. టీఎంసీ ఎమ్మెల్యేలు తమతో అనుచితంగా ప్రవర్తించారని, సీఈసీ చెప్పేది వినిపించుకోలేదని అధికారులు తెలిపారు. మమత ప్రశ్నలకు సీఈసీ సరిగ్గానే స్పందించారని కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై బీజేపీ కూడా స్పందించింది. మమతా బెనర్జీది అంతా డ్రామా అంటూ కొట్టిపారేసింది. బీజేపీ నేత సువేందు అధికారి మాట్లాడుతూ మమతపై విమర్శలు గుప్పించారు. గంటసేపు ఈసీ ఆఫీసులో ఉండి, మాట్లాడి, సమావేశాన్ని బహిష్కరించానని చెప్పడం ఏంటని ఆయన విమర్శించారు. లోపల జరిగిందొకటి.. బయట మమత చెప్పిందొకటి అన్నారు. డ్రామా నడిపారని, పోలీసుల్ని ఇందులోకి లాగడం సరికాదని సూచించారు. -
45రోజుల్లో కంచె నిర్మిస్తాం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. చొరబాటుదార్లను కాపాడుతోందని, అవినీతిని వ్యవస్థీకృతంగా మార్చిందని, ఎన్నికల్లో లబ్ధి కోసం సరిహద్దుల్లో భద్రతను ఉద్దేశపూర్వకంగా గాలికొదిలేసిందని మండిపడ్డారు. దేశ భద్రత కోసం బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం అత్యవసరం అని తేల్చిచెప్పారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బారక్పూర్లో శనివారం బీజేపీ కార్యకర్తల సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది రాజకీయపరమైన అంశం కాదని.. దేశ భద్రత కోణంలో పార్టీని గెలిపించుకోవాలని స్పష్టంచేశారు. చొరబాటుదార్లను ముద్దు చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి భూమి కేటాయించాలని కోర్టు ఆదేశించినా మమతా బెనర్జీ ప్రభుత్వం లెక్కచేయడం లేదని ఆరోపించారు. చొరబాటుదార్లను ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారని, అంతిమంగా దేశ భద్రతకు ప్రమాదం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. పొరుగుదేశం నుంచి పశ్చిమ బెంగాల్లోకి విచ్చలవిడిగా అక్రమ వలసలు కొనసాగుతున్నాయని చెప్పారు. చొరబాటుదార్లను అడ్డుకోవడానికి బెంగాల్ ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. చొరబాటుదార్లు బెంగాల్లో సులువుగా లభిస్తున్న ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొని దేశమంతటా విస్తరిస్తున్నారని చెప్పారు. నేను హామీ ఇస్తున్నా.. ‘‘సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహకరించడం లేదని సాక్షాత్తూ కలకత్తా హైకోర్టు తప్పుపట్టింది. బీఎస్ఎఫ్కు భూమి ఇవ్వడం లేదని ఆక్షేపించింది. కోర్టు ఆదేశాల ప్రకా రం మార్చి 31వ లోగా ప్రభుత్వం భూమి కేటాయించాలి. ప్రభుత్వం స్పందించినా స్పందించకపోయి నా.. నేను హామీ ఇస్తున్నా. ఏప్రిల్‌లో బీజేపీ ముఖ్యమంత్రి కొలువుదీరడం తథ్యం. బీజేపీ ప్రభుత్వం రాగానే 45 రోజుల్లోగా కంచె నిర్మాణం పూర్తిచేస్తాం. హామీలు అమలు చేయడంలో రికార్డులు సృష్టించిన ఘనత బీజేపీదే. అస్సాంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక చొరబాటుదార్లను కట్టడి చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్రమ వలసలు యథేచ్ఛగా జరిగాయి. బీజేపీ రాగానే పరిస్థితి మారిపోయింది. అస్సాం తరహాలో బెంగాల్లోనూ చొరబాట్లను అడ్డుకోవడం ఖాయం. ఓటర్ల జాబితా ప్రక్షాళన జరగాల్సిందే బెంగాల్లో కేవలం చొరబాటుదార్ల ఓట్ల కోసమే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను మమతా బెనర్జీ గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారు. ఎవరికి నచ్చినా నచ్చకున్నా సరే ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదార్ల పేర్లు తొలగించక తప్పదు. ఓటర్ల జాబితా ప్రక్షాళన జరగాల్సిందే. బెంగాల్లో మతువా, నామశూద్ర సామాజిక వర్గాలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వేధింపులకు గురిచేస్తోంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో త్వరలో రాబోతున్న బీజేపీ ప్రభుత్వం మీకు రక్షణ కల్పిస్తుంది. మమతా బెనర్జీ పాలనలో అవినీతి వ్యవస్థీకృతంగా మారింది. అవినీతి మంత్రులకు ఎన్నికల్లో టికెట్లు నిరాకరించే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? బీజేపీ వచ్చాక అవినీతిపరులను కఠినంగా శిక్షిస్తాం. వందేమాతర గీతంపై పార్లమెంట్లో చర్చ చేపట్టడాన్ని తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకించింది. చొరబాటుదార్లను బుజ్జగించడానికే ఆరాటపడింది. అందుకే ఆ పార్టీని కూకటివేళ్లతో సహా పెకిలించివేయాలి. దేశభక్తులు, జాతీయవాదుల ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలి. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 50 శాతానికి పైగా ఓట్లు సాధించి అధికారంలోకి వస్తుంది. 2026 సంవత్సరం తృణమూల్ కాంగ్రెస్‌కు టాటా, బైబై చెప్పే సంవత్సరం’’అని అమిత్ షా స్పష్టంచేశారు. -
ది రాజాసాబ్ నిర్మాతకు అరుదైన గౌరవం
టాలీవుడ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు బెంగాల్ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డ్ వరించింది. ఈ విషయాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తాజాగా ఈ అవార్డ్‌ను నిర్మాత అందుకున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్ చేతుల మీదుగా తీసుకున్నారు.కాగా.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో టీజీ విశ్వప్రసాద్ ఒకరు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతగా ఉన్నారు. ఇటీవలే ఈ బ్యానర్లో ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సంక్రాంతి కానుకగా రిలీజైంది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అభిమానుల అంచనాలు ది రాజాసాబ్ అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, రిద్ధికుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు.Deeply honoured and humbled to share that our Producer @vishwaprasadtg garu has been awarded the West Bengal Governor’s Award of Excellence 🤗Our heartfelt gratitude to the Hon’ble Governor of West Bengal, Dr. C. V. Ananda Bose ji, for this prestigious recognition bestowed upon… pic.twitter.com/c9mgUz28Jc— People Media Factory (@peoplemediafcy) January 29, 2026 -
స్టేజ్‌పై నటికి చేదు అనుభవం.. ఫోలీసులకు ఫిర్యాదు
ప్రముఖ నటి, మాజీ ఎంపీ మిమీ చక్రవర్తికి పశ్చిమ బెంగాల్లో చేదు అనుభవం ఎదురైంది. వేదికపై ప్రదర్శన ఇస్తుండగానే నిర్వాహకులు తనను అవమానించారని ఆరోపిస్తూ ఆమె పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.అసలేం జరిగింది?పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లా, బొంగావ్‌లో 'నయా గోపాల్ గంజ్ యువక్ సంఘ్ క్లబ్' ఆధ్వర్యంలో ఈ నెల 25న అర్ధరాత్రి ఒక సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. మిమీ చక్రవర్తి ప్రదర్శన ఇస్తున్న సమయంలో నిర్వాహకులలో ఒకరైన తన్మయ్ శాస్త్రి అకస్మాత్తుగా స్టేజ్‌పైకి వచ్చి కార్యక్రమాన్ని ఆపివేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తనను స్టేజ్ దిగి వెళ్ళిపోవాలని ఆదేశించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్ధరాత్రి జరిగిన ఈ అనుచిత ప్రవర్తనపై మిమీ చక్రవర్తి సోమవారం బొంగావ్ పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. కళాకారుల పట్ల ఇలాంటి ప్రవర్తనను సహించకూడదని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.ఈ ఘటనపై మిమీ చక్రవర్తి ఎక్స్ (ట్విటర్) వేదికగా తన అసంతృప్తిని వెల్లడించింది. మైకులో అందరి ముందూ తనను అవమానించేలా మాట్లాడారని, ఇది తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రిపబ్లిక్ డే వేళ స్వేచ్ఛ, సమానత్వం గురించి మాట్లాడుకుంటాం కానీ, మహిళా కళాకారులకు కనీస గౌరవం, భద్రత కరువయ్యాయని’ అంటూ తనకు ఎదురైన చేదు ఘటన గురించి వివరించింది.As we celebrate Republic Day, we speak of freedom and equality.But the independence and dignity of women and artists are still too easily violated.I have built my image and career on my own over the years. Staying silent today would only normalise the humiliation of artists.…— Mimi chakraborty (@mimichakraborty) January 26, 2026 -
అజిత్ పవార్ మరణంపై అనుమానాలు.. బెంగాల్ సీఎం సంచలన వ్యాఖ్యలు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆకస్మిక మరణం యావత్ ప్రపంచం ఉలిక్కి పడేలా చేసింది. సహచరులతో కలిసి ప్రచారానికి బయలుదేరిన ఆయన బుదవారం ఉదయం బారామతి వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించారు. లియర్‌జెట్ 45 విమానం (రిజిస్ట్రేషన్ VT-SSK) బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ప్రయత్నించినప్పుడు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు.ఈ ఘోర విషాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ మహాయుతి నుండి దూరం జరిగేందుకు యోచిస్తున్నారని, శరద్‌పవార్‌తో కలవడానికి ప్రయత్నిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని ఈ నేపథ్యంలో ఆయన మరణం వెనుక కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. ఇక్కడ ప్రజలకు ఎలాంటి భద్రత లేదు. ఆయన బీజేపీతో ఉండగానే ఇలా జరిగిందని, ఇక ప్రతిపక్ష పార్టీల గతి ఏమిటో అర్థం కాదని ఆమె విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ కావాలని డిమాండ్ చేశారు. ఇతర ఏ ఏజెన్సీపైనా తమకు నమ్మకం లేదని మమత వ్యాఖ్యానించారు. Deeply shocked and stunned by the suddden demise of Ajit Pawar! The Deputy Chief Minister of Maharashtra and his co-passengers have died in a disastrous plane crash at Baramati today morning, and I am feeling a deep sense of loss.My condolences to his family including his uncle…— Mamata Banerjee (@MamataOfficial) January 28, 2026అజిత్ పవార్, మరో నలుగురు మృతి చెందిన విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలని మమతా డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని సీఎం మమతా బెనర్జీ బుధవారం డిమాండ్ చేశారు ఆయన మరణంపై సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్బంగా అజిత్ పవార్ మామ, శరద్ పవార్ సహా ఆయన కుటుంబానికి, పార్టీ శ్రేణులకు సంతాపాన్ని ప్రకటించారు. అజిత్ పవార్ మృతిపై కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి బాధాకరమన్న కాంగ్రెస్ గౌరవ్ గోగోయ్.. ఘటనపై అనుమానాలు నెలకొన్నాయని.. పారదర్శకమైన దర్యాప్తుతో వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మరోవైపు తెలంగాణ ఎమ్మెల్యే(గోషామహల్) రాజాసింగ్ సైతం అజిత్ పవార్ మరణంపై స్పందించారు. అజిత్ పవార్ చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి సడెన్ గా ప్రమాదంలో చనిపోవడం బాధాకరం. మహారాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తి ఆయన. కాబట్టి విమాన ప్రమాదం వెనక ఎమైనా కుట్ర ఉందా? అనే అనుమానాలు సహజం. గత కొంతకాలంగా ఆయన అధికార నుంచి బయటకు పోతారనే ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే కుట్రలు కూడా జరుగు తున్నాయని ప్రచారం జరుగుతోంది. విమాన బ్లాక్ బాక్స్‌ను విశ్లేషిస్తే..కుట్ర ఉందా లేదా తేలొచ్చు అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. కాగా జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికలకు ముందు వరుస ప్రజా ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించ డానికి పవార్ ముంబై నుండి తన స్వస్థలమైన బారామతికి బయలుదేరారు. ఈ విమానం దిగుతున్న సమయంలో నియంత్రణ కోల్పోయి రన్‌వే థ్రెషోల్డ్ దగ్గర క్రాష్-ల్యాండ్ అయిందని డీజీసీఏ ప్రకటించింది. క్రాష్ ల్యాండింగ్ తర్వాత ఈ విమానం ముక్కలుగా విడిపోయింది. ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగడంతో అనేక పేలుళ్ల శబ్దాలు విన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి DGCA అధికారులు ప్రస్తుతం సంఘటనా స్థలానికి వెళుతున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, రాష్ట్రంలో మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించారు. పవార్ అస్తమయంపై పలువురు రాజకీయ ప్రముఖులు, ఇతరులు పలువురు తీవ్ర విచారం ప్రకటించారు. -
మోహన్‌బాబుకి అరుదైన గౌరవం
ప్రముఖ నటుడు, నిర్మాత డా. మంచు మోహన్ బాబు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక గవర్నర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోల్‌కత్తాలోని లోక్ భవన్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ డా. సీవీ ఆనంద బోస్ చేతులమీదుగా ఈ అవార్డును తీసుకున్నారాయన. ‘‘మోహన్ బాబుగారు 50 సంవత్సరాల సినీ జీవితంలో కళామతల్లికి చేసిన సేవ, అట్టడుగు స్థాయి నుండి భారతదేశం గర్వించదగ్గ నటుడిగా ఎదగడం, విద్య, దాతృత్వంలో సమాజంపై చెరగని ముద్ర వేశారు.ఆయన సినీ, వ్యక్తిగత జీవితం, క్రమశిక్షణ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుంది. ప్రస్తుతం భారతదేశం అంతటా తెలుగు సినిమా ప్రభావం కనిపిస్తోంది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక తెలుగు నటుడికి ఇటువంటి గౌరవాన్ని ప్రదానం చేయడం ప్రత్యేకమైన చరిత్రను సృష్టించినట్టుగా నిలిచింది. కళకు, కళాకారులకు హద్దులు, భాషా సరిహద్దులు ఉండవని మరోసారి నిరూపించారు’’ అని మోహన్ బాబు తనయుడు, ‘మా’ అధ్యక్షుడు, హీరో విష్ణు మంచు తెలిపారు. -
నిపా వైరస్ కలకలం : ఎయిర్‌పోర్ట్స్‌లో హై అలర్ట్
భారతదేశంలో నిపా వైరస్ ఉనికి కలకలం రేపుతోంది. పశ్చిమ బెంగాల్లో ఐదు నిపా కేసులు నిర్ధారించారు. దాదాపు 100 మందిని హోం క్వారంటైన్లో ఉంచారు. తాజా వ్యాప్తితో ఆసియాలోని కొన్ని ప్రాంతాల విమానాశ్రయాల్లో నిబంధనలను కట్టుదిట్టం చేశారు. కోవిడ్ తరహా ఆరోగ్య తనిఖీలను ముమ్మరం చేశాయి. పశ్చిమ బెంగాల్లో ఒక ఆసుపత్రిలో వైరస్ గుర్తించారు. అదే జిల్లాకు చెందిన ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో రెండు కేసులు నమోదైనాయి. నర్సు, మరొ ఆసుపత్రి ఉద్యోగికి కూడా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. మొత్తం 5 కేసులను నిర్ధారించారు. దాదాపు 100 మంది హోమ్ క్వారంటైన్లో ఉంచారు. ఈ రోగులు కోల్‌కతా,చుట్టుపక్కల ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఒక రోగి పరిస్థితి విషమంగా ఉంది. పశ్చిమ బెంగాల్లో ఒక వ్యక్తి తెలియని వ్యాధితో మరణించడం, మరో ఐదుగురు ఈ వైరస్ బారిన పడటంతో ఇది వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ,ఈ వైరస్ బారిన పడ్డ మరో 100- 200 మందిని పరిశీలిస్తున్నామని ఎయిమ్స్ బిలాస్పూర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్ర కుమార్ అరోరా మీడియాకు తెలిపారు.ఈ నేపథ్యంలో అనేక ఆసియా దేశాల విమానాశ్రయాలు ఆరోగ్య పరీక్షలను కఠినతరం చేశాయి. థాయిలాండ్, నేపాల్, తైవాన్‌తో సహా అనేక ఆసియా దేశాలు పశ్చిమ బెంగాల్ నుండి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లలో ఆరోగ్య స్క్రీనింగ్‌లను ముమ్మరం చేశాయి. మరోవైపు చైనీస్ న్యూఇయర్ సీజన్‌కు ముందు నిపా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన పుట్టిస్తోంది.నిపా వైరస్ఈ వైరస్ గబ్బిలాలు (ప్టెరోపస్ జాతి),పందులు వంటి జంతువుల నుండి మానవులకు వ్యాపిస్తుంది. కొన్ని సందర్భాల్లో, ప్రజల నుంచి ప్రజలకు సామాజికసంబంధాల ద్వారా వ్యాపిస్తుంది. నిపా వైరస్ (NiV) అత్యంత అంటువ్యాధి. ప్రాణాంతకం కూడా. ఈ వైరస్ కేసు మరణాల రేటు 40–75శాతం ఉంటుంది. జ్వరం, తలనొప్పి, శ్వాసకోశ సమస్యలు, తీవ్రమైన సందర్భాల్లో మెదడు వాపు, మూర్ఛలు , కోమా వంటి లక్షణాలు ఉంటాయి. ప్రారంభ సంకేతాలు నిర్దిష్టంగా ఉండవు, గుర్తించడం కష్టమే.జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు నొప్పి శ్వాసకోశ ఇబ్బంది లేదా విలక్షణమైన న్యుమోనియా లాంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఇదీ చదవండి: ఏడాదికి రూ. 39 కోట్లు : ఈ బిజినెస్ గురించి తెలుసా?ఇంక్యుబేషన్ వ్యవధి 4 నుండి 14 రోజుల వరకు ఉంటుంది.కొన్ని సందర్భాల్లో, 45 రోజుల వరకు ఉంటుంది. ప్రాణాలతో బయటపడినవారు మూర్ఛ లేదా వ్యక్తిత్వ మార్పులు వంటి దీర్ఘకాలిక నాడీ సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు.నివారణ ఎలాక్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, పరిశుభ్రత పాటించడం. సెల్స్ ఐసోలేషన్, మాస్క్ ధరించడం ద్వారా మానవుని నుండి మానవునికి వ్యాప్తిని తగ్గించగలగాలి.పండ్ల గబ్బిలాలు, అనారోగ్య పందులు లేదా కలుషితమైన ఆహారానికి దూరంగా ఉండాలి.ఖర్జూర రసాన్ని మరిగించి పండ్లను పూర్తిగా కడగాలి; దెబ్బతిన్న పండ్లను పారవేయాలి.జంతువులు, వ్యాధిసోకిన వ్యక్తులకు దూరంగా ఉండాలిఅనుమానిత లక్షణాల కనిపిస్తే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ, తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి. భారతదేశంలో పశ్చిమ బెంగాల్, కేరళలో రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా నమోదైంది. ప్రతి సంవత్సరం మే నుండి సెప్టెంబర్ వరకు ఉండే పండ్ల గబ్బిలాల సంతానోత్పత్తి కాలంలోనే ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందని భావిస్తున్నారు. గబ్బిలాల మేటింగ్ పీరియడ్ కారణంగా జూనోటిక్ ఇన్ఫెక్షన్ వ్యాప్తికి కేరళ ఆరోగ్య శాఖ కోజికోడ్, మలప్పురం, కన్నూర్, వయనాడ్, ఎర్నాకులం అనే ఐదు జిల్లాల్లో అవగాహన కల్పిస్తోంది.ఇదీ చదవండి: యాక్సిడెంట్ కాదు.. డాష్‌బోర్డ్ కెమెరా షాకింగ్ విజువల్స్ -
బెంగాల్లో హడావుడిగా సర్ ప్రక్రియ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) జరుగుతున్న తీరుపై నోబెల్ గహ్రీత అమర్త్య సేన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అనవసరపు హడావుడితో సర్‌ను అమలు చేస్తున్నారన్నారు. దీని కారణంగా ప్రజల భాగస్వామ్యం ప్రమాదంలో పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో ఉంటున్న ఆయన ఇటీవల పీటీఐ ప్రతినిధితో మాట్లాడారు. ‘ఓటు హక్కును బలోపేతం చేసే ఓటరు జాబితా ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైంది. ఓటరు జాబితా రివిజన్ ప్రక్రియ కూడా అంతే ముఖ్యమైంది. దీన్ని ఎంతో జాగ్రత్తగా నిర్వహించాలి. అవసరమైన సమయం కేటాయించాలి. అయితే, ఇవన్నీ బెంగాల్లో ప్రస్తుతం లోపించాయి’అని సేన్ పేర్కొన్నారు. ‘ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అత్యంత వేగంగా, హడావుడిగా జరుగుతోంది. ఓటర్లు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తమ ఓటు హక్కును నిరూపించుకోవడానికి అవసరమైన పత్రాలను సమరి్పంచేందుకు తగినంత సమయం ఇవ్వడం లేదు. ఇది ఓటర్లకు అన్యాయం, దేశ ప్రజాస్వామ్యానికి ద్రోహం’అని అమర్త్య సేన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారులపైనా తీవ్ర ఒత్తిడి ఓటర్లే కాదు, ఎన్నికల అధికారులు కూడా సర్ విషయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తనకు అర్థమైందన్నారు. తన నివాసమున్న శాంతినికేతన్ నియోజకవర్గం నుంచి ఎన్నికల అధికారులు ఫోన్ చేసి, వాకబు చేసిన అంశాలను ఆయన ఉదహరించారు. ‘ఎన్నికల అధికారులు చనిపోయిన మా అమ్మ గురించి అడిగారు. నేను పుట్టినప్పుడు మా అమ్మ వయస్సెంత ఉంటుందంటూ ఆరా తీశారు. గత ఎన్నికల సమయంలో అక్కడే ఓటేశా. అప్పట్లో రికార్డులన్నీ అధికారుల వద్ద ఉన్నాయి. అందులో నా చిరునామా, మా కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలు సహా అన్ని వివరాలు రికార్డుల్లో భద్రంగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ విషయాలను అడగడం బట్టి చూస్తే వారెంత ఒత్తిడికి గురవుతున్నారో అర్థమవుతుంది’అని ఆయన అన్నారు. తన మాదిరిగానే అనేక మంది గ్రామీణ భారతీయులు ఇలాంటి విచారణలను ఇప్పుడు ఎదుర్కొంటున్నారని చెప్పారు. శాంతినికేతన్ ఉన్న ఊళ్లో పుట్టిన తనకు బర్త్ సరి్టఫికెట్ లేకపోవడంతో ఓటరుగా అర్హత సాధించేందుకు స్నేహితులు తన తరఫున అవసరమైన పత్రాలను అందజేశారన్నారు. తన విషయం పరిష్కారమైనప్పుటికీ, ఎటువంటి సాయం అందని సామాన్యులు పడే అవస్థలపై అమర్త్య సేన్ ఆందోళన వ్యక్తం చేశారు. సేన్, ఆయన తల్లి వయస్సుల్లో తేడాలపై సర్ అధికారులు ఆయనకు నోటీసు పంపడం తెల్సిందే. బీజేపీకే లాభమని అంటున్నారుబెంగాల్లో చేపట్టిన సర్‌తో ఎవరికి లాభం చేకూరుతుందనే విషయంలో తనకు సొంతంగా ఎటువంటి అంచనాలు లేవని అమర్త్య సేన్ తెలిపారు. ‘నేనేమీ ఎన్నికల విశ్లేషకుడిని కాను. ఈ విషయం కచి్చతంగా చెప్పలేను. నా కంటే ఎక్కువ విషయాలు తెలిసిన వ్యక్తులు చెప్పినదేమంటే.. సర్‌తో తక్కువ మంది ఓటర్లు నమోదవడం వల్ల బీజేపీకే ప్రయోజనమని. ఇది నిజమే కాదో నాకు తెలియదు’అని ఆయన అన్నారు. ‘అయితే, ఈసీకి ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఎవరు లబ్ధి పొందుతారు అనే విషయంతో సంబంధం లేకుండా, ఎన్నికల సంఘం ఈ లోపభూయిష్టమైన ఏర్పాటును కొనసాగనీయరాదు. గరి్వంచదగ్గ మన ప్రజాస్వామ్యంలో అనవసరమైన తప్పిదాలు జరిగేలా బలవంతం చేయరాదు’అని ఆయన హితవు పలికారు. నిరుపేదలపైనే ఎక్కువ ప్రభావం సర్ ప్రక్రియలో ఓటరు జాబితా నుంచి నిరుపేదలే ఎక్కువగా తొలగింపునకు గురయ్యే అవకాశం ఉందని అమర్త్య సేన్ చెప్పారు. అధికారులు అడిగే ధ్రువీకరణ పత్రాలను సామాన్యులు తీసుకురావడం కష్టసాధ్యమైన విషయంగా మారడమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. కొత్త ఓటర్ల జాబితాలో చేరడానికి అవసరమైన కొన్ని నిర్దిష్ట పత్రాలను సేకరించి, చూపించాలనే నిబంధన నిరుపేదలకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు హక్కును వినియోగించుకునే ప్రస్తుత సామాజిక వాతావరణంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీ వర్గాలు కూడా తమ ఓటు హక్కుతో సహా ఇతర హక్కులను పరిరక్షించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. బలపడిన హిందుత్వ అతివాదుల వల్ల ముస్లింలతోపాటు, కొన్ని వర్గాల హిందువులు కూడా కొన్నిసార్లు వెనుకబాటుకు గురవుతున్నారని సేన్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి భారతీయుడికి ఓటు హక్కు అందేలా ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. -
భారత్‌కు బంగ్లా టెన్షన్.. పద్మా నదిపై చైనా ప్లానేంటి?
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ యూనస్ సర్కార్ కవ్వింపు చర్యలకు దిగింది. బంగ్లాదేశ్ గంగా నది నీటితో పద్మా బ్యారేజీ నిర్మాణానికి సిద్ధం కావడం భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య 1996లో జరిగిన ఫరక్కా జలాల ఒప్పందం 2026లోనే ముగిసిపోనుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఫరక్కా నీటి ఒప్పందం పునరుద్ధరణపై చర్చలు సాగుతాయా? అనే సందిగ్థత నెలకొంది. మరోవైపు.. పద్మా బ్యారెజీ నిర్మాణానికి చైనా ఫండింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఒప్పందం ఇలా..భారత్ నుంచి బంగ్లాదేశ్‌లోకి ప్రవహించే గంగా నది భాగాన్నే అక్కడ పద్మా నది అంటారు. అయితే, గంగా నది నీటి వాటాల విషయంలో రెండు దేశాల మధ్య 1977లోనే మొదటి తాత్కాలిక ఒప్పందం ఢాకాలో జరిగింది. 1977లో అప్పటి బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ ఫరక్కా బ్యారేజీ సమస్యను ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA)లో ప్రస్తావించారు. ఇరు దేశాలూ కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలని ఐరాస సూచించింది. 1977 నవంబర్‌లో అప్పటి భారత ఉపప్రధాని బాబు జగజీవన్ రామ్ బంగ్లాదేశ్‌లో సందర్శించి, ఫరక్కా సమస్యను పరిష్కరించడానికి ఒక ఒప్పందంపై చర్చించారు. 1980–1990 మధ్య కాలంలో పలు చర్చలు విఫలమయ్యాయి. దీంతో, బంగ్లాదేశ్ తరచుగా నీటి కొరతపై ఆందోళన వ్యక్తం చేసింది. 1996లో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలోని ఫరక్కా బ్యారేజీ వద్ద ఉపరితల జలాల పంపిణీ నిర్దారణకు గంగా నీటి ఒప్పందం కుదిరింది.అనంతరం, ఫరక్కా జలాల ఒప్పందంపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం.. జనవరి 1 నుంచి మే 31 వరకు ఇరు దేశాలు ఫరక్కా వద్ద నది ప్రవాహాన్ని పంచుకుంటాయి. 30 ఏళ్ల కాలానికి సంతకం చేసిన ఈ ఒప్పందంపై ఇప్పుడు 2026లో మళ్లీ చర్చలు జరగాల్సి ఉంది. కాగా, ఫరక్కా బ్యారేజీ వద్ద నీటి విడుదల, నిల్వపై ఇరు దేశాలు తరచుగా విభేదిస్తున్నాయి. 2024లో బంగ్లాదేశ్‌లో భారీ వరదలు సంభవించాయి. ఈ వరదలకు పశ్చిమ బెంగాల్‌లోని ఫరక్కా బ్యారేజీ గేట్లు తెరవడమే కారణమని బంగ్లాదేశ్ ఆరోపించింది.బంగ్లా వాదన ఇదే..బంగ్లాదేశ్ ఆరోపణలపై భారత ప్రభుత్వం స్పందించి వాస్తవాలను గ్రహించాలని కోరింది. ఫరక్కా కేవలం ఒక బ్యారేజీ మాత్రమేనని, డ్యామ్ కాదని, నీటి మట్టం పెరిగినప్పుడు వచ్చే నీరంతా ప్రవహిస్తుందని భారత్ వివరించింది. గంగా/ పద్మా నదిపై గేట్లను ఉపయోగించి 40,000 క్యూసెక్కుల నీటిని ఫరక్కా కాలువలోకి మళ్లిస్తామని మిగిలింది బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుందని భారత్ తెలిపింది. అయితే, భారత్ నిర్మించిన ఫరక్కా బ్యారేజీ వల్ల గంగా నదిలో నీటి ప్రవాహం తగ్గిందని, అందుకే పద్మా బ్యారేజీ అవసరం పెరిగిందని బంగ్లాదేశ్ వాదిస్తోంది. ఈ ప్రాజెక్టు ఫరక్కా బ్యారేజీకి సుమారు 180 కిలోమీటర్ల దిగువన, కుష్టియా జిల్లాలోని పాంగ్షాలో నిర్మించే అవకాశం ఉంది.బంగ్లాదేశ్ వాటర్ డెవలప్మెంట్ బోర్డు (BWDB) పత్రాల ప్రకారం, ఫరక్కా బ్యారేజీ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి బంగ్లాదేశ్ నైరుతి ప్రాంతంలో నీటి ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్ మరో బ్యారేజీ నిర్మాణానికి సిద్దమైంది. సుమారు రూ.50,443.64 కోట్ల ఠాకాలతో( భారత కరెన్సీలో ₹37,895 కోట్లు) పద్మా బ్యారేజీ ప్రాజెక్టును చేపట్టనుంది. పద్మా బ్యారేజీ ద్వారా వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చేసి, దేశంలోని నైరుతి, ఈశాన్య ప్రాంతాలకు ఏడాది పొడవునా జలాలను అందించవచ్చని బంగ్లాదేశ్ విశ్వసిస్తోంది. బంగ్లాదేశ్‌లోని దాదాపు 37% ప్రాంతాలకు ఈ బ్యారేజీ ప్రయోజనం చేకూరుస్తుందని, 1996 ఒప్పందం ప్రకారం నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని బంగ్లాదేశ్ ప్లాన్ చేసుకుంటోంది.చైనా ఫండింగ్..ఇదిలా ఉండగా.. పద్మా బ్యారేజీ కోసం ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం చైనా సాయం తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విదేశీ రుణాల కోసం తర్వాత దశలో బంగ్లాదేశ్ ప్రయత్నించే అవకాశం ఉంది. మరోవైపు.. బంగ్లాదేశ్‌తో కలిసి తీస్తా మాస్టర్ ప్లాన్ అమలులో కూడా చైనా భాగస్వామిగా ఉంది. ఇటీవల చైనా రాయబారి యావో వెన్.. పశ్చిమ బెంగాల్‌లోని వ్యూహాత్మక సిలిగురి కారిడార్‌కు సమీపంలో ఉన్న ఉత్తర బంగ్లాదేశ్‌ను సందర్శించడం భారత్ నిశితంగా గమనిస్తోంది. సిక్కిం నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్‌లోకి ప్రవహించే తీస్తా నది నీటి పంపిణీకి సంబంధించిన సుదీర్ఘ ఒప్పందాన్ని భారత్, బంగ్లాదేశ్‌లు ఇంకా ఖరారు చేయలేకపోయాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నారు. తీస్తా నీటిని పంచుకుంటే, ఉత్తర బెంగాల్‌కు తాగునీరు కూడా అందదని, సాగునీటికి అవకాశం ఉండదని ఆమె అంటున్నారు.పద్మా బ్యారేజ్ ప్రాజెక్ట్ ప్రభావాలు..ప్రాజెక్ట్ వివరాలు:స్థానం: కుష్టియా జిల్లా, బంగ్లాదేశ్.ఖర్చు: సుమారు Tk 50,443.64 కోట్లు (₹37,895 కోట్లు).పొడవు: 2,100 మీటర్లు.నిల్వ సామర్థ్యం: 2,900 మిలియన్ క్యూబిక్ మీటర్లు.విద్యుత్ ఉత్పత్తి: 113 MW.బంగ్లాదేశ్‌కు లాభాలు:ఎండాకాలంలో నీటి నిల్వ, వ్యవసాయానికి సరఫరా.దక్షిణ–పశ్చిమ ప్రాంతాల్లో నీటి కొరత తగ్గింపు.విద్యుత్ ఉత్పత్తి, నీటి నిర్వహణలో స్వయం ఆధారంభారత్ ఆందోళనలు:గంగానది ప్రవాహం మరింత తగ్గే అవకాశం.పశ్చిమ బెంగాల్, బీహార్‌లో నీటి అవసరాలు ప్రభావితం కావచ్చు.ఫరక్కా ఒప్పందం పునరుద్ధరణ చర్చలు మరింత క్లిష్టం కావడం -
మహా జంగిల్‌రాజ్‌ను అంతం చేయండి
సింగూర్: ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదార్లను కాపాడుతూ దేశ భద్రతతో ఆటలాడుతున్న తృణమూల్ కాంగ్రెస్ పారీ్టకి బుద్ధి చెప్పాలని పశ్చిమబెంగాల్ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ‘‘రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పాలంటే ‘మహా జంగిల్‌రాజ్’ను అంతం చేయాల్సిందే. అభివృద్ధి కావాలన్నా, పెట్టుబడిదారులను ఆకర్షించాలన్నా తృణమూల్‌ను చిత్తుగా ఓడించాల్సిందే’’ అన్నారు. మోదీ ఆదివారం హుగ్లీ జిల్లాలోని సింగూర్‌లో పర్యటించారు. రూ.830 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మూడు వందేభారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. రాబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మహా జంగిల్‌రాజ్‌కు, బీజేపీ సుపరిపాలనకు పోరు జరగనుందన్నారు. తప్పుడు డాక్యుమెంట్లతో స్థిరపడిన చొరబాటుదార్లను తాము అధికారంలోకి రాగానే వెనక్కి పంపిస్తామని పునరుద్ఘాటించారు. బీజేపీ డబుల్ ఇంజన్ మోడల్‌ను ఆదరించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కలి్పస్తామన్నారు.అరాచక ప్రభుత్వాన్ని శిక్షించాలి ‘‘బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చొరబాట్లు విపరీతంగా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో సరిహద్దుల్లో కంచె నిర్మాణం ఆగిపోయింది. చొరబాటుదార్లు ప్రభుత్వ సహకారంతో తప్పుడు పత్రాలు సృష్టించి, ఇక్కడే తిష్టవేస్తున్నారు. వారిని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం నిస్సిగ్గుగా కాపాడుతోంది. మేమొచ్చాక వారందరినీ ఏరేస్తాం. బెంగాలీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తున్న అరాచక ప్రభుత్వాన్ని ప్రజలే శిక్షించాలి. అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకుంటున్న ప్రభుత్వాలను ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తున్నారు. దేశమంతటా ఈ ధోరణి కనిపిస్తోంది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా నిలిపివేసిన ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం బెంగాల్లో అమలు కావడం లేదు. పేద ప్రజలు నష్టపోతున్నారు. వారంతా తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించడం ఖాయం. మేము వచ్చాక ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అమలు చేస్తాం. ఇదీ నా గ్యారంటీ తృణమూల్ కాంగ్రెస్ పాలనలో మాఫియా నాయకులు, సిండికేట్లు, నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ప్రజలను పీడిస్తున్నారు. ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. బీజేపీ పాలనలో వారి ఆట కట్టిస్తాం. ప్రజలకు సుపరిపాలన అందిస్తాం. ఇదీ నా గ్యారంటీ. సిండికేట్ రాజ్ ఆగడాలు తట్టుకోలేక పరిశ్రమలు వెళ్లిపోయాయి. తృణమూల్ కాంగ్రెస్ నాయకులు సొంత సామ్రాజ్యాలు సృష్టించుకున్నారు. సిండికేట్ రాజ్, మాఫియా సంస్కృతిని అంతం చేయడమే మా లక్ష్యం. రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. సందేశ్‌కాళీలో భూములు ఆక్రమించారు. టీచర్ల నియామకంలో భారీగా అవినీతి జరిగింది. విద్యా వ్యవస్థను మాఫియాలు నియంత్రిస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తేనే ఇలాంటివి ఆగిపోతాయి. మహిళలు, యువత, రైతులకు తృణమూల్ కాంగ్రెస్ శత్రువులా మారింది. వారి జీవితాలతో చెలగాటం ఆడుతోంది’’ అన్నారు.చొరబాటుదార్లకు కాంగ్రెస్ అండ కలియాబోర్: కాంగ్రెస్ పారీ్టపై ప్రధాని మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. అస్సాంలో ఆ పార్టీ హయాంలో ఓట్ల కోసం భూములను చొరబాటుదార్లకు కట్టబెట్టిందని మండిపడ్డారు. దాంతో చొరబాటుదార్ల జనాభా విపరీతంగా పెరిగిపోయిందన్నారు. వారు భూములు, అడవులను విచ్చలవిడిగా ఆక్రమించుకున్నారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక చొరబాటుదార్లను ఖాళీ చేయిస్తున్నట్లు తెలిపారు. అస్సాంలోని నాగావ్ జిల్లాలో రూ.6,957 కోట్ల విలువైన కజిరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు మోదీ ఆదివారం పర్యటించారు. శంకుస్థాపన చేశారు. రెండు అమృత్‌భారత్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ‘‘చొరబాటుదారులు అస్సాం సంస్కృతిపై దాడి చేస్తున్నారు. స్థానిక యువత ఉపాధిని కొల్లగొడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో భూములు కబ్జా చేస్తున్నారు. చొరబాటుదార్ల కారణంగా అస్సాంకే కాకుండా మొత్తం దేశ భద్రతకు ముప్పు పొంచి ఉంది. చొరబాటుదార్లను కాపాడి అధికారం దక్కించుకోవడమే కాంగ్రెస్ విధానంగా మారిపోయింది. చొరబాటుదార్లకు మద్దతుగా బిహార్‌లో ర్యాలీలు నిర్వహించిన కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారు. అస్సాంలోనూ కాంగ్రెస్ కూటమికి అదే గతి పడుతుంది. కాంగ్రెస్‌కు అభివృద్ధి అజెండా అనేదే లేదు. ప్రతికూల రాజకీయాలతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది’’ అన్నారు. -
మోదీపై అభిషేక్ బెనర్జీ విమర్శలు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్లో ప్రతీకార రాజకీయాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.అసెంబ్లీ ఎన్నికల తరుణంలో టీఎంసీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. రాష్ట్రాలకు రావాల్సిన నిధులను కేంద్రం అడ్డుకుంటోందని, బీజేపీ రాష్ట్ర ప్రజలపై కష్టాలు మోపుతోందని అన్నారు. నిధుల నిలిపివేత వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు.కేంద్రం గ్రామీణ అభివృద్ధి, పథకాలు, మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన నిధులను విడుదల చేయడం లేదు. దీని వల్ల పేదలు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ప్రజలపై నేరుగా దాడి చేసినట్టే. బెంగాల్ ప్రజలు బీజేపీని తిరస్కరించారు. అందుకే కేంద్రం ప్రతీకారంగా నిధులను నిలిపివేస్తోంది’ అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్లో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. తృణమూల్ కాంగ్రెస్ కేంద్రంపై ఒత్తిడి పెంచుతుండగా, బీజేపీ మాత్రం నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయి. అందుకే విడుదల నిలిపివేశాం అని వాదిస్తోంది. ఈ వివాదం రాబోయే ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంది. మొత్తానికి, పశ్చిమ బెంగాల్‌కు నిధుల నిలిపివేతపై అభిషేక్ బెనర్జీ చేసిన ఆరోపణలు రాష్ట్ర కేంద్ర సంబంధాలను మరింత ఉద్రిక్తం చేస్తున్నాయి. -
కేంద్రం ఇచ్చిన నిధులపై దమ్ముంటే శ్వేతపత్రం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయని, అవినీతిపరులు స్వాహా చేస్తున్నారని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. రాష్ట్రానికి ఇప్పటిదాకా కేంద్రం ఇచ్చిన మొత్తం నిధుల వివరాలతో శ్వేతపత్రం ప్రచురించగలరా? అని మోదీకి సవాలు విసిరింది. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో పోస్టుచేసింది. 2021 నుంచి ఇప్పటివరకు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని పేర్కొంది. ‘‘రాజకీయ పర్యాటకుడు నరేంద్ర మోదీ బెంగాల్లో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలని నిజంగా కోరుకుంటున్నారా? అయితే, పీఎం ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి దక్కాల్సిన రూ.24,275 కోట్ల నిధులు ఇవ్వకుండా ఎందుకు నిలిపివేశారో సమాధానం చెప్పాలి’’ అని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా పీఎం ఆవాస్ యోజన పథకాన్ని కొనసాగించడానికి మమతా బెనర్జీ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలియజేసింది. బీజేపీ వాషింగ్ మిషన్‌గా మారినట్లు తృణమూల్ విమర్శించింది. అవినీ తిపరులు ఆ పార్టీలో చేరగానే పరిశుద్ధులు అయిపోతున్నారని ఎద్దేవా చేసింది. -
చొరబాటుదార్లను వెళ్లగొట్టుడే
మాల్డా: అక్రమ చొరబాట్లే పశ్చిమ బెంగాల్‌కు అతిపెద్ద సవాలుగా మారాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పొరుగుదేశం నుంచి వెల్లువెత్తుతున్న చొరబాట్ల కారణంగా ఇక్కడ జనాభా స్థితిగతుల్లో మార్పులు వస్తున్నాయని, తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ చొరబాట్ల వెనుక తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమేయం ఉందని మండిపడ్డారు. శరణార్థులుగా వచ్చినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలో శనివారం జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగించారు. తృణమూల్ కాంగ్రెస్ సిండికేట్ రాజ్ రాజకీయ లబ్ధి కోసం చొరబాట్లను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఇక్కడి పాలకులు చొరబాటుదార్లతో చేతులు కలిపారని ధ్వజమెత్తారు. అక్రమంగా వచ్చినవారిని బయటకు పంపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తేలి్చచెప్పారు. అభివృద్ధి చెందిన, సంపన్న దేశాలు సైతం చొరబాటుదార్లను భరించడం లేదని, బయటకు వెళ్లగొడుతున్నాయని గుర్తుచేశారు. బెంగాల్లో తాము అధికారంలోకి వచ్చాక చొరబాటు దార్ల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చారు. చట్టవిరుద్ధమైన వలసలను అడ్డుకోవడానికి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆ బంధాన్ని విచ్ఛిన్నం చేయాలి ‘‘చొరబాటుదారుల ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది. చాలా రాష్ట్రాల్లో జనాభా స్థితిగతులు మారిపోతున్నాయి. చాలాచోట్ల ఇన్నాళ్లూ అధికంగా వినిపించిన భాష కూడా మారుతోంది. మరో భాష ఆధిపత్యం కనిపిస్తోందని ప్రజలు చెబుతున్నారు. అక్రమంగా మనదేశంలోకి వచ్చినవారు ఘర్షణలకు కారణమవుతున్నారు. బెంగాల్‌లోని మాల్డా, ముర్షిదాబాద్‌లో ఇలాంటి ఘటనలు జరిగాయి. రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్, చొరబాటుదార్ల మధ్య బంధాన్ని విచి్ఛన్నం చేయాలి. ఇతర దేశాల్లో మతపరమైన వివక్ష ఎదుర్కొంటూ మనదేశంలోకి వచ్చినవారికి రక్షణ కల్పిస్తాం. మతువా వర్గం ప్రజలు అస్సలు ఆందోళన చెందొద్దు. అరాచక పాలనకు ముగింపు పలకాల్సిందే బెంగాల్లో పరివర్తన్కు సమయం ఆసన్నమైంది. తృణమూల్ కాంగ్రెస్ అరాచక పాలనకు ముగింపు పలకాల్సిందే. పేదల జీవితాలకు ముప్పుగా మారిన ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి. బెంగాల్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. సుపరిపాలన అందిస్తోంది. ఇక బెంగాల్లోనూ అధికారంలోకి రావడం, సుపరిపాలన అందించడం తథ్యం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడం ఖాయం. పేదలకు దక్కాల్సిన సంక్షేమ పథకాలను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను వారికి దక్కనివ్వడం లేదు. తృణమూల్ కాంగ్రెస్ నేతలు అవినీతిలో మునిగి తేలుతున్నారు. ప్రజల బాగు కోసం కేంద్రం ఇస్తున్న సొమ్మును విచ్చలవిడిగా లూటీ చేస్తున్నారు. అందుకే ప్రజాకంటక తృణమూల్ కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలి. బీజేపీ అభివృద్ధి మోడల్ పట్ల యువతలో విశ్వాసం పెరుగుతోంది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అపూర్వమైన విజయం సాధించింది. గతంలో మేము బలహీనంగా ఉన్నచోట ఇప్పుడు బలోపేతమయ్యాం. బెంగాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు, రైతులను నూతన అవకాశాలు కల్పిస్తాం. రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతాం’’అని ప్రధాని మోదీ ప్రకటించారు. -
బెంగాల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: మోదీ
పశ్చిమ బెంగాల్: బెంగాల్ పర్యటనలో మమతా బెనర్జీపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. పశ్చిమబెంగాల్లో శనివారం ఆయన వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను ప్రారంభించారు. అనంతరం సభలో ప్రధాని మాట్లాడుతూ. పేద, మధ్య తరగతి ప్రజలంటే మమత సర్కార్‌కు లెక్కలేదంటూ విమర్శలు గుప్పించారు. బెంగాల్లో అభివృద్ధికి మమతా బెనర్జీనే పెద్ద అడ్డంకి అంటూ మండిపడ్డారు.కేంద్ర నిధులను సైతం టీఎంసీ సర్కార్ పక్కదారి పట్టించిందని.. బెంగాల్ ప్రజల్ని మమత సర్కార్ లూటీ చేస్తోందంటూ ఆరోపించారు. మమత ప్రభుత్వం బెంగాల్లో అభివృద్ధిని కోరుకోవడం లేదు. మమత సర్కార్ అన్నిరంగాల్లో అవినీతిలో కూరుకుపోయింది. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం. పశ్చిమబెంగాల్‌కు పూర్వ వైభవం తీసుకువస్తాం. బెంగాల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే’’ అని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. -
‘బీజేపీ రూపొందించిన ఏఐ టూల్స్‌ను వాడటం వల్లే..’
కోల్‌కతా: బీజేపీ-ఈసీ టార్గెట్‌గా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి ఆరోపణలు చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరుగుతునన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) లో ఇప్పటివరకూ 54 లక్షల ఓటర్లను తొలగించారని మండిపడ్డారు. ప్రస్తుతం ‘సర్’ ఇంకా ఓటర్ల జాబితా సవరణ చేస్తున్న క్రమంలో కోటి వరకూ ఓటర్లను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విషయం అర్దమవుతుందన్నారు. బీజేపీ తయారు చేసిన ఏఐ టూల్స్‌ను ఈసీ వాడటం వల్లే ఇంత పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు జరుగుతుందని మండిపడ్డారు. తొలగించబడిన ఓటర్లలో మహిళలు, మైనార్టీలు, పేదలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారన్నారు. 2002 నాటి పాత ఓటరు జాబితాలను డిజిటైజ్ చేయడానికి బీజేపీ రూపొందించిన కృత్రిమ మేధస్సు (AI) టూల్స్ వాడటం వల్ల తప్పులు జరగుతున్నాయని మమతా స్పష్టం చేశారు. గత 20 ఏళ్లలో చేసిన సవరణలను పట్టించుకోకుండా, ప్రజలు తమ గుర్తింపును మళ్లీ నిరూపించుకోవాల్సి వస్తోందని అన్నారు. ఈ తొలగింపులు బీజేపీ వ్యూహంలో భాగమని, టీఎంసీ ఓటర్లను బలహీనపరచడమే లక్ష్యంగా ఉందన్నారు. -
బెంగాల్లో ట్విస్ట్.. ఈసీకి సీఎం మమత లేఖ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియపై సీఎం మమతా బెనర్జీ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు మరోమారు లేఖ రాశారు. 2002 నాటి ఓటరు జాబితా ఏఐ ఆధారిత డిజిటైజేషన్ కారణంగా దొర్లిన తప్పులు నిజమైన ఓటర్లను తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఓటరు జాబితాలోని పేర్లతో ఎస్ఐఆర్ సందర్భంగా పేర్లు సరిపోలడం లేదని, అనేక తప్పులు కనిపిస్తున్నాయని ఆ లేఖలో తెలిపారు.ఓటర్లు తమ గుర్తింపును ధ్రువీకరించుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఏకపక్షంగా కొనసాగుతున్న సర్ కారణంగా ఇప్పటి వరకు 77 మరణాలు, 4 ఆత్మహత్యాయత్నాలు, 17 మంది ఆస్పత్రి పాలైనట్లు రికార్డయిందని చెప్పారు. రెండు దశాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్న నిబంధనలను ఈసీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మమత ఆ లేఖలో తెలిపారు. ఈ అంశాలను ఈసీ పరిగణనలోకి తీసుకుని, సరైన రీతిలో చర్యలు తీసుకోవాలని కోరారు. సర్ జరుగుతున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఈసీకి సీఎం మమత పలుమార్లు లేఖలు రాయడం తెల్సిందే. -
ఎన్నికలప్పుడే విపక్షాలపై ఈడీ దాడులా?
న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపించిన సమయంలోనే కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విపక్ష నేతలపై దాడులు చేయడం వెనక మతలబు ఏమి టని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ప్రశ్నించారు. అసలు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ పరిధిని సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లన్నింటినీ తక్షణం విచారణకు స్వీకరించాల్సిందిగా సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. పశ్చిమబెంగాల్లో ఈడీ తాజా దాడుల ఉద్దేశం కేవలం విపక్ష నేతలను వేధించమేనని స్పష్టంగా కన్పిస్తోందన్నారు. ఒక సంస్థ కార్యాలయంలోకి చొరబడి కనిపించిన డాక్యుమెంట్లనల్లా జప్తు చేసేస్తామనడం సమంజసమా అని ప్రశ్నించారు. కేవలం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించలేమనే కడుపు మంటతో, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎలాగైనా ఇబ్బందులపాలు చేసేందుకే మోదీ ప్రభుత్వం ఇలా ఈడీని ఉసిగొల్పిందని సిబల్ ఆరోపించారు. గతంలో బిహార్‌లో లాలుప్రసాద్, తేజస్వీ యాదవ్, జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్‌పైనా సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందే ఈడీ దాడులకు దిగిందని గుర్తు చేశారు. బెంగాల్లో ఐప్యాక్ సంస్థపై దాడుల తర్వాత ఈడీ ఇప్పుడు ఇంకే విచారిస్తోందని ప్రశ్నించారు...అస్సలు అనుకోలేదు!యూపీఏ హయాంలో 2004–14 మధ్య ఇలా విపక్షాలు, విపక్ష నేతలపై ఇష్టారాజ్యంగా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం ఎప్పుడూ జరగలేదని సిబల్ అన్నారు. ‘‘ఇప్పుడు మాత్రం ఈడీ సర్వాంతర్యామిగా మారిపోయింది. దేశంలో ఎప్పుడైనా, ఎక్కడికైనా ఇట్టే వెళ్లి వాలిపోతోంది. విచారణ పేరుతో అడ్డ గోలు దాడులకు దిగుతోంది. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చే పనులతో సమాఖ్య వ్యవస్థనే కదలబారుస్తోంది’’అంటూ దుయ్యబట్టారు. యూపీఏ హయాంలో ఈడీని ఏర్పాటు చేసినప్పుడు ఇలాంటి పరిణామాన్ని మేం ఊహించలేదు’’అంటూ ఆవేదన వెలిబుచ్చారు. -
బెంగాల్లో మరో ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు ఈడీ
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెంగాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), టీఎంసీ ప్రభుత్వం మధ్య వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. బెంగాల్లో ఇటీవల ఐ-ప్యాక్ బొగ్గు కుంభకోణం కేసు దర్యాప్తును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆర్టికల్ 32 పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఈ సందర్బంగా.. ఈడీ తన పిటిషన్లో ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తును కోరింది. నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా దర్యాప్తు చేసే హక్కును రాష్ట్ర యంత్రాంగం తగ్గించింది అని పేర్కొంది. అధికారులు చట్టబద్ధంగా సోదాలు నిర్వహించకుండా, బొగ్గు అక్రమ రవాణా దర్యాప్తునకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకోకుండా అడ్డుకున్నారని ఆరోపించింది. రాష్ట్ర సీనియర్ అధికారుల సమక్షంలో డాక్యుమెంట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను బలవంతంగా తీసుకున్నారని చెప్పుకొచ్చింది. పోలీసు సిబ్బందితో సహా రాష్ట్ర అధికారుల జోక్యం న్యాయాన్ని అడ్డుకోవడమేనని ఈడీ వివరించింది.ఇదిలా ఉండగా.. ఈడీ దాడుల వ్యవహారంపై బెంగాల్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై అంతకుముందే.. తమ వాదనలు వినకుండా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కావియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక, కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా గురువారం కోల్‌కతాలోని ఐప్యాక్ కార్యాలయం, ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా అక్కడికి చేరుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పోలీసుల సాయంతో ఆమె దర్యాప్తుకు ఆటంకం కలిగించారని, సాక్ష్యాలను మాయం చేశారని పేర్కొంటూ ఈడీ శుక్రవారం కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన హైకోర్టు.. జనవరి 14వ తేదీకి విచారణను వాయిదా వేసింది. -
అమిత్ షా గుట్టువిప్పుతా: మమత
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో ఈడీ దాడుల కారణంగా రాజకీయం వేడెక్కింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రాజకీయంగా తృణముల్ కాంగ్రెస్‌ను ఎదుర్కోలేక ఇలా ఈడీ, దర్యాప్తు సంస్థలతో బెదిరింపులకు దిగుతున్నారని ఆరోరించారు. ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మమత వార్నింగ్ ఇచ్చారు. బొగ్గు కుంభకోణంలో అమిత్ షా ప్రమేయం ఉందని బాంబు పేల్చారు. దీంతో, మమత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.బెంగాల్లో ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలకు నిరసనగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం నిరసన మార్చ్‌లో పాల్గొన్నారు. హజ్రాలో మార్చ్ ముగిసిన తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మమత తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బెంగాల్ మేల్కొంది, ప్రజల మద్దతు లభిస్తోంది. కార్యకర్తలే దగ్గరుండి ఆందోళనలను నడిపించారు. గతంలో ఇలాంటి ఘటనలు చూశాం. రక్తం వచ్చేలా లాఠీ దెబ్బలు తిన్నాం. ఈ హజ్రాలోనే నేను కూడా దెబ్బలు తిన్నాను. నేను చాలాసార్లు దెబ్బలు తిన్నాను, శరీరమంతా గాయాలతోనే పని చేశాను. నన్ను ఎవరైనా కొట్టిన రోజున నేను పునర్జన్మ పొందుతాను. BREAKING : This is the most shocking development you will come across 🚨Do not play with fire. I have proof in pen drives showing how coal smuggling money reached Amit Shah through Suvendu Adhikari.— Mamata Banerjee 🤯 pic.twitter.com/2hRj8Vo8x5— Amock (@Politicx2029) January 9, 2026నాపై, నా ప్రభుత్వంపై ఒత్తిడి చేయకండి. నేను ఏం చేస్తానో మీకు తెలుసు. మేము చేస్తే చాలా చేయగలం. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన డబ్బు అమిత్ షా తింటారు. బొగ్గు కుంభకోణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రమేయం ఉంది. దేశద్రోహుల ద్వారా ఆ డబ్బు వెళుతుంది. బీజేపీకి చెందిన జగన్నాథ్ బొగ్గు స్కాంలో ఉన్నారు. జగన్నాథ్ ద్వారా బీజేపీ సువేందు అధికారి నుంచి డబ్బు అమిత్ షా దగ్గరకు వెళుతుంది. నా దగ్గర అన్ని పెన్ డ్రైవ్‌లు ఉన్నాయి, అన్నీ బయటపెడతాను. నేను చేపట్టిన పదవికి గౌరవం ఇచ్చి ఇప్పటివరకు మౌనంగా ఉన్నాను. నాపై మరీ ఎక్కువ ఒత్తిడి తేకండి' అని వార్నింగ్ ఇచ్చారు. దీంతో, మమత వ్యాఖ్యలపై చర్చ మొదలైంది.“Don’t irritate me — I will release all the evidence stored in pen drives.”CM @MamataOfficial issues a clear warning to HM Amit Shah.She alleges coal smuggling money changed hands and reached Amit Shah via Suvendu Adhikari and says she has proof.Final message is loud and… pic.twitter.com/KgGiHbfNjo— Spandan Gain (@GainSpandanLIVE) January 9, 2026అంతటితో ఆగకుండా..‘ఆరోగ్యంగా ఉన్న పులి కంటే గాయపడిన పులి ప్రమాదకరం. దేశ డబ్బును బయటకు తీసుకెళ్లారు, కానీ గ్రామస్తులకు డబ్బు ఇవ్వలేదు. నా డబ్బు నాకు ఇవ్వండి, ఇది పశ్చిమ బెంగాల్ డబ్బు. నాలుగు సంవత్సరాలుగా ఆవాస్, నీరు, సర్వశిక్షా అభియాన్, మధ్యాహ్న భోజనం నిలిపివేశారు. ఒకరిని ఎన్నికల సంఘంలో కూర్చోబెట్టారు. ఆ వ్యక్తి కేంద్ర హోంమంత్రి కింద పనిచేశారు. ఢిల్లీలో మా ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు, పోలీసులు వారిని తీసుకెళ్లారు. అన్ని ఏజెన్సీలను ఆక్రమించారు. మహారాష్ట్ర, హర్యానా, బీహార్లను బలవంతంగా ఆక్రమించారు, ఇప్పుడు బెంగాల్‌ను కూడా బలవంతంగా ఆక్రమించాలని చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్ పేరును భరించలేకపోతున్నారు, బెంగాల్ అంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్లో కొడుతున్నారు. పశ్చిమ బెంగాల్లో హిందీ మాట్లాడే వారిపై దాడి జరగలేదు, మేము ఎప్పుడూ చేయలేదు. మేము ఈ బీజేపీకి మర్యాద ఇస్తున్నాము, లేకపోతే చేతల్లో చూపిస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీపై ఆగ్రహం.. ఈడీని ఉద్దేశించి.. ‘మా పార్టీ పత్రాలను, హార్డ్‌డిస్క్‌లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల సమాచారం కూడా ఉంది. అందుకే వాటిని నేను వెనక్కి తెచ్చేశాను’ అని మమత తెలిపారు. అయితే, చట్టపరమైన దర్యాప్తును మమత అడ్డుకున్నారని, ఆమెతో కలిసి రాష్ట్ర పోలీసులు కీలక ఆధారాలను బలవంతంగా తీసుకుపోయారని ఢిల్లీలోని ఈడీ కార్యాలయం ఆరోపించింది. ఈ పరిణామాలపై ఇరు వర్గాలూ కోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యవహారంలో తక్షణ విచారణ చేపట్టాలని కలకత్తా హైకోర్టును ఈడీ కోరింది. అయితే దీనిపై న్యాయస్థానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
బెంగాల్లో ఈడీ దాడుల టెన్షన్.. సీఎం మమత ర్యాలీ
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ సహా ఆ సంస్థ కార్యాలయాలపై ఈడీ దాడులు ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. బెంగాల్లో ఈడీ దాడులను వ్యతిరేకిస్తూ ఏకంగా ముఖ్యమంత్రి మమతా బెనార్జీ ఆందోళనలు, ర్యాలీలు చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు టీఎంసీ నేతలు. సీఎం మమత చేపట్టిన ర్యాలీలో పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.మరోవైపు.. అంతకుముందు ఈడీ దాడులను నిరసిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం వెలుపల తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. రాజకీయ వైరంతోనే ఈడీని ఆయుధంగా ఉయోగిస్తోందని అమిత్‌షాపై టీఎంసీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అయితే, అమిత్ షా ఇంటి వద్ద టీఎంసీ నేతలు నిరసనలు తెలపడంతో పోలీసులు వారిని నిరసన ప్రాంతం నుంచి లాక్కెళ్లారు. తాము శాంతియుతంగా ఆందోళన చేపట్టామంటూ పోలీసుల చర్యను నేతలు ఖండించారు.#WATCH | Kolkata | TMC Chairperson and West Bengal CM Mamata Banerjee leads a rally today against the Enforcement Directorate, following the raid on I-PAC yesterday. Visuals from the 8B bus stand, Jadavpur pic.twitter.com/On4uMtFUBG— ANI (@ANI) January 9, 2026ఈ నిరసనల్లో టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, శతాబ్ది రాయ్, కీర్తి ఆజాద్, డెరెక్ ఓబ్రియన్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం, ఎంపీలు మాట్లాడుతూ.. ‘‘ఎంపీలతో పోలీసులు వ్యవహరించిన తీరు అందరికీ కనిపిస్తోంది’’ అని డెరెక్, మహువా వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజాస్వామ్య నిరసనలకు తావులేకుండా పోతోంది. నేరగాళ్లకు రివార్డులు దక్కుతున్నాయి. దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా వాడుతున్నారు. ఎన్నికలను తారుమారు చేస్తున్నారు. నిరసనకారులను జైలుకు పంపి.. రేపిస్టులకు బెయిల్ ఇస్తున్నారు. ఇది బీజేపీ విధానం. దీనిని బెంగాల్ అంగీకరించదు. మిమ్మల్ని ఓడించేందుకు మా శాయశక్తులా కృషిచేస్తాం’ అని అభిషేక్ బెనర్జీ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. ఇక, సోదాలు అడ్డుకున్నారని ఈడీ.. వాటిని ప్రశ్నిస్తూ ఐప్యాక్ కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించాయి.#WATCH | Kolkata | TMC Chairperson and West Bengal CM Mamata Banerjee leads a rally following the ED raid on I-PAC yesterday pic.twitter.com/CkYfedjywC— ANI (@ANI) January 9, 2026ఇదిలా ఉండగా.. కోల్‌కతాలో రాజకీయ సంప్రదింపుల సంస్థ ఐ-ప్యాక్ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వాటికి వ్యతిరేకంగా ఎంపీలు, నేతలు నినాదాలు చేశారు. ఈడీ సోదాల సందర్బంగా అధికారుల వద్ద నుంచి సీఎం మమతా బెనర్జీ పలు ఫైల్స్‌ను తీసుకెళ్లారు. దీంతో, ఈడీ దాడుల ఘటన బెంగాల్లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. -
అమిత్ షా కార్యాలయం ఎదుట ఉద్రిక్తత
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం దుమారం కొనసాగుతుంది. న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కార్యాలయం ఎదుట తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మోయిత్రా, డెరెక్ ఓ’బ్రయన్ సహా పలువురు నేతలు నిరసనకు దిగారు. ఈ నిరసనలో పోలీసులు వారిని బలవంతంగా లాగి అరెస్టు చేశారు.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పశ్చిమ బెంగాల్ అధికార టీఎంసీకి ఐపాక్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తోంది. ఈనేపథ్యంలో ఈడీ అధికారులు ఐపాక్ కార్యాలయంపై దాడులు జరిపారు. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.అయితే,ఈడీ దాడుల్ని టీఎంసీ ఎంపీలు ఖండిస్తున్నారు. ఎన్నికల ముందు ఈడీ దాడులు ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలనే ప్రయత్నం. తమ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలని కేంద్రం చూస్తోంది’అని ఆరోపణలు గుప్పిస్తున్నారు.అందుకు బీజేపీ సైతం టీఎంసీ దాడుల్ని తిప్పికొడుతోంది. ఈడీ దాడులు చట్టుపరమైనవని, ఇందులో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న దాడులు చట్టపరమైనవని, అవినీతి కేసులపై విచారణలో భాగమని స్పష్టం చేసింది. VIDEO | Delhi: TMC MPs protest outside Union Home Minister Amit Shah’s office with placards reading “Bengal rejects Modi-Shah’s dirty politics,” following the ED raids at I-PAC’s office in Kolkata yesterday.#TMC #AmitShah #Kolkata(Source - Third party)(Full VIDEO available… pic.twitter.com/7VyF2e7dfL— Press Trust of India (@PTI_News) January 9, 2026 -
మమత ఎన్నికల వ్యూహకర్తపై ఈడీ దాడులు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు అత్యంత కీలకమైన ఎన్నికల వ్యూహాలు అందించే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐప్యాక్) సంస్థపై, ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆకస్మిక దాడులు చేసింది. కోల్‌కతాలోని ఆయన నివాసంతోపాటు ఐప్యాక్ కార్యాలయాలు, సంబంధిత ప్రాంతాల్లో ఈడీ అధికారులు బుధవారం ఉదయం ఏకకాలంలో దాడులు చేశారు. రాబోయే పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీఎంసీ పార్టీ సిద్ధంచేసుకున్న ఎన్నికల వ్యూహప్రతివ్యూహాలు, పార్టీ అభ్యర్థుల జాబితా, ఎన్నికల వాగ్దానాలు, ఎజెండా, పార్టీ కార్యాచరణ, ఇతర రహస్య అంశాలకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనంచేసుకున్నట్లు వార్తలొచ్చాయి. సాల్ట్ లేక్ ప్రాంతంలోని ఐప్యాక్ ఆఫీస్, లౌదన్ స్ట్రీట్‌లోని జైన్ ఇల్లుసహా 10 ప్రాంతాల్లో గురువారం ఉదయం 6 గంటల నుంచే సోదాలు మొదలైనట్లు తెలుస్తోంది. టీఎంసీ కార్యకర్తలు కార్యాలయాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు ఈడీకి తోడుగా పారా మిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. విషయం తెల్సుకున్న వందలాది మంది టీఎంసీ పార్టీ కార్యకర్తలు, నేతలు వెనువెంటనే జైన్ ఇల్లు, ఐప్యాక్ కార్యాలయాల వద్దకు చేరుకుని ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. ఒక రాజకీయ వ్యూహరచనల సంస్థ కార్యాలయంలో చట్టవ్యతిరేకంగా సోదాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈడీ తనిఖీలకు ఎలాంటి చట్టబద్ధత లేదని స్పష్టంచేశారు.రంగంలోకి దూకిన సీఎం మమతప్రధాని మోదీపై విమర్శల వాగ్బాణాలు సంధించే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు రాజకీయ ఎన్నికల వ్యూహాలు, సలహాలు అందించే ఐప్యాక్ సంస్థను ఈడీ సోదాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ ఆగమేఘాలమీద రంగంలోకి దూకారు. సెక్టార్5లోని ఐప్యాక్ కార్యాలయానికి వచ్చి కొన్ని కీలక పత్రాలు, ఫైళ్లను ఆమె కాపాడారు. వాటిని ఆమె చేతపట్టుకుని అక్కడి నుంచి వెనుతిరిగారు. అంతకుముందే రాష్ట్ర డీజీపీ రాజీవ్ కుమార్, విధాన్‌పూర్ పోలీస్ కమిష నరేట్ పోలీస్ ఉన్నతాధికారులు, కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్‌వర్మ, పలువురు మంత్రులు, విధాన్‌పూర్ నగర మేయర్ కృష్ణచక్రవర్తి, టీఎంసీ నేతలు అక్కడికి చేరుకున్నారు. మమత నేరుగా 11వ అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి కొన్ని ఫైళ్లను తీసుకొచ్చారు. ఓవైపు ఈడీ అధికారులు, పారామిలటరీ బలగాలు మరోవైపు సీఎం మమత, రాష్ట్ర మంత్రులు, డీజీపీ, పోలీస్ కమిషనర్లతో జైన్ నివాసం ఒకదశలో రణరంగాన్ని తలపించింది.ఈడీకి వ్యతిరేకంగా నేడు ర్యాలీఈడీ అక్రమ సోదాలను నిరసిస్తూ శుక్రవారం కోల్‌కతాలో నిరసన ర్యాలీ చేపట్టబోతున్నట్లు మమత ప్రకటించారు.‘‘ఎస్ఐఆర్ పేరిట ఓట్లు తీసేస్తున్నా, నాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నా, ఆఫీసుల్లో పార్టీ వ్యూహ పత్రాలను పట్టుకుపోతున్నా చూస్తూ ఊరు కోవాలా? నిరసన ప్రదర్శనలు చేయ కూడదా?. అందుకే శుక్రవారం కోల్‌కతాలోని జాదవ్‌పూర్ 8బీ బస్టాప్ నుంచి హజ్రా క్రాసింగ్ దాకా ఐదు కిలోమీటర్ల మేర ర్యాలీ చేపడతా. వేలాదిగా జనం తరలివచ్చి ఈడీ వైఖరిని రోడ్లపై ఎండగట్టండి’’ అని మమత పిలుపునిచ్చారు.రాజకీయ వ్యూహాలను కొట్టేయడమే ఈడీ పనా?సీఎం మమతసోదాల అంశంపై సీఎం మమత మీడియాతో మాట్లాడుతూ ఈడీ దాడులను తూర్పారబట్టారు. ‘‘మా పార్టీ ఐటీ విభాగ సారథి జైన్ ఇంట్లో ఈడీ చట్టవిరుద్ధంగా సోదాలు చేసింది. అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ, ఐప్యాక్ సిద్ధంచేసిన వ్యూహాలు, ఎజెండా, పార్టీ అభ్యర్థుల జాబితా, ఇతర రహస్య వివరాలతో కూడిన డాక్యుమెంట్లు, హార్డ్‌డిస్క్‌లను జప్తుచేసేందుకు దుస్సాహసం చేశారు. వాటిలో కొన్నింటిని ఎలాగోలా నేను స్వయంగా వెళ్లి వెంటపట్టుకొచ్చా. రాజకీయ పార్టీకి సంబంధించిన విస్తృత సమాచారాన్ని తస్కరించడమే ఈడీ పనా?. రాజకీయ కక్షసాధింపు కోసమే ఈడీతో బీజేపీ సర్కార్ ఈ సోదాలు, దాడులు చేయిస్తోంది. వైరి పార్టీల రహస్యాలు కొట్టేస్తున్న ఈడీకి దర్యాప్తు సంస్థగా కొనసాగే అర్హతే లేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇలా రాజ్యాంగబద్ధ సంస్థలను విపక్ష పార్టీల మీద దుర్విని యోగపరుస్తున్నారు. ఎన్నికలకు ముందే దర్యాప్తు సంస్థలను పంపించి వేధిస్తుంటే దేశాన్ని కాపాడేదెవరు?. ఇకనైనా ప్రధాని మోదీ జోక్యంచేసుకుని హోం మంత్రి అమిత్ షా ఆగడాలకు అడ్డుకట్టవేయాలి. సాల్ట్ లేక్‌లోని సెక్టార్–5లోని ఐప్యాక్ ఆఫీస్‌లో ఉదయం ఆరు గంటలకే సిబ్బంది ఎవరూ లేనప్పుడు ఈడీ దాడులుచేసింది. మా డేటా, ఎన్నికల వ్యూహపత్రాలు, కంప్యూటర్లలోని సమాచారాన్ని తస్కరించారు. ఇది నిజంగా నేరమే. మా ఆఫీస్‌లోని మొత్తం డాక్యుమెంట్లను పట్టుకెళ్లబోయారు. బల్లాలన్నీ ఖాళీగా ఉన్నాయి. పోయిన పత్రాలను మళ్లీ సిద్ధంచేయాలంటే ఆలోపే ఎన్నికల ముహూర్తం, పోలింగ్ అయిపోతాయి. ఈడీ అధికారులు మా పత్రాలను కొట్టేశారు. మా ఎన్నికల వ్యూహాలను తెల్సుకున్నారు. అభ్యర్థుల జాబితా, హార్డ్‌డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు నొక్కేయడమే ఈడీ, అమిత్ షా పనా? టీఎంసీ అనేది నమోదిత రాజకీయ పార్టీ. ఆదాయ పన్ను చెల్లింపులు సమయానికి కట్టేస్తుంది. ఆ ఆదాయపన్ను వివరాలు కావాలంటే ఐటీ శాఖ నుంచి తీసుకోవచ్చు కదా?. ఇదే ఈడీగనక కోల్‌కతాలోని బీజేపీ ఆఫీస్‌లో సోదాలు చేస్తే బీజేపీ అగ్రనేతలు ఊరుకుంటారా?’’ అని మమత అన్నారు.ఆధారాలు ఉన్నందుకే దాడి చేశామన్న ఈడీఐప్యాక్ కార్యాలయాలపై సోదాల విషయంలో తర్వాత ఈడీ వివరణ ఇచ్చింది. ‘‘2020 నవంబర్‌లో పశ్చిమబెంగాల్లో కునుస్తోరియా, కజోరా, అసన్సోల్ ప్రాంతాల్లో బొగ్గు అక్రమ రవాణా కుంభకోణంలో స్థానిక బొగ్గు ఆపరేటర్ అనూప్ మాఝీ అలియాస్ లాలా ప్రధాన నిందితునిగా ఉన్నాడు. అతనికి సంబంధించిన వ్యక్తులు హవాలా మార్గంలో సొమ్మును తరలించారు. ఈ లావా దేవీలతో ఐప్యాక్ చీఫ్ ప్రతీక్‌జైన్‌కు సంబంధం ఉంది. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను సంపాదించాం. జైన్ కార్యాలయాల్లో సోదాలు చేశాం’’ అని ఈడీ పేర్కొంది. -
బెంగాల్లో ఈడీ సోదాలు.. మమతకు కొత్త టెన్షన్?
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎంట్రీతో రాజకీయగా ఒక్కసారిగా వేడెక్కింది. బెంగాల్లో రాజకీయ కన్సల్టెన్సీ ఐప్యాక్‌పై ఈడీ దాడులు చేపట్టింది. ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసం సహా ఐప్యాక్‌కు సంబంధించిన పలు ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా తనిఖీలు చేపట్టినట్టు ఈడీ తెలిపింది. మరోవైపు.. ఈడీ దాడులపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.బెంగాల్లో ఈడీ దాడులపై తాజాగా మమతా బెనర్జీ స్పందిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ దయచేసి క్షమించండి. మీ హోంమంత్రి అమిత్ షాను నియంత్రించండి. రాజకీయంగా మీరు మాతో(టీఎంసీ) పోరాడండి. అలా పోరాడలేకపోతే బెంగాల్‌కు ఎందుకు వస్తున్నారు?. ప్రజాస్వామ్య పద్ధతిలో మమ్మల్ని ఓడించండి. మీరు మా పత్రాలను, మా వ్యూహాన్ని, మా ఓటర్లను, మా డేటాను, మా బెంగాల్‌ను దోచుకోవడానికి ఏజెన్సీలను వాడుకుంటున్నారు. ఇవన్నీ చేయడం వల్ల, మీకు వచ్చే సీట్ల సంఖ్య సున్నాకు తగ్గిపోతుంది. దాడులతో మీరు చేసేది ఏమీ లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.#WATCH | Kolkata | On the ED raids at the IPAC office in Kolkata, West Bengal CM Mamata Banerjee says, "I am sorry Mr. Prime Minister, please control your Home Minister... If you (BJP) cannot fight with us, then why are you coming to Bengal? Defeat us in a democratic way. You are… pic.twitter.com/SKL7DNxeAc— ANI (@ANI) January 8, 2026మరోవైపు.. ఈడీ అధికారులు ఐప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో తనిఖీలు చేస్తుండగా మమతా బెనర్జీ, కోల్‌కతా పోలీసు కమిషనర్ మనోజ్ వర్మ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. ఈ సోదాలు రాజ్యాంగవిరుద్ధమని మండిపడ్డారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ తనిఖీలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘మా పార్టీ రాజకీయ వ్యూహం, అభ్యర్థుల జాబితా, రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకే ఈడీతో ఈ దాడులు చేయిస్తున్నారు. టీఎంసీ పార్టీ హార్డ్‌డిస్క్‌ను తీసుకునేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు’’ అని బెంగాల్ సీఎం ఆరోపించారు.అలాగే, ఈడీ ఫోరెన్సిక్ బృందం మాకు సంబంధించిన కొంత డేటాను బదిలీ చేశారని నేను విన్నాను. వారు మా హార్డ్ డిస్క్, మా ఫైనాన్షియల్ పత్రాలు, రాజకీయ పత్రాలు తీసుకున్నారు. బీజేపీకి లక్షల కోట్ల ఆస్తి ఉంది. కానీ, సీబీఐ, ఈడీ వారిని ఎవరినీ పట్టుకోలేదు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. #WATCH | Kolkata | On the ED raids at the IPAC office in Kolkata, West Bengal CM Mamata Banerjee says, "... I heard that ED's Forensic Team had come and they transferred some data. They took our hard disk, our financial papers, political papers... BJP has lakhs and crores of… pic.twitter.com/g66y7sedh1— ANI (@ANI) January 8, 2026కాగా, ఈడీ సోదాలు మనీలాండరింగ్ కేసు సంబంధించనట్టు అధికారులు చెబుతున్నారు. నేరానికి సంబంధించిన డబ్బు.. ఐ-ప్యాక్‌కు చేరినట్లు గుర్తించారని ఈడీ వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. ఇదిలా ఉండగా.. మమత వద్ద కనిపించిన ఫైల్స్‌లో ఏమున్నాయో పెద్దగా తెలియకపోయినప్పటికీ ఫొటోలలో ఒక ఫైల్‌పై ‘ఫిబ్రవరి 2022’ అని గుర్తించి ఉంది. మరొక ఫైల్లో తృణమూల్ నాయకుల ప్రయాణ రికార్డులను వివరించే పత్రాల కట్ట ఉంది. అటువంటి ఒక పత్రంలో "మహువా మోయిత్రా x 1", ఫిబ్రవరి 2, 2022 ప్రయాణ తేదీ ప్రస్తావించబడింది. మోయిత్రా కృష్ణానగర్ ఎంపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇక, ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడైన ప్రతీక్ జైన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగానికి హెడ్‌గానూ వ్యవహరిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచి టీఎంసీతో కలిసి ఐప్యాక్ పనిచేస్తోంది. అయితే, మరికొన్ని నెలల్లో బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. -
టేబుల్‌పై నోట్ల కట్టలు.. టీఎంసీ నేత..!
కోల్‌కతా: ఓ టేబుల్‌పై నోట్ల కట్టల గుట్ట..ఆ వెనుక టీఎంసీ నేత ఒకరు కూర్చున్న వీడియో ఒకటి పశ్చిమబెంగాల్లో వైరల్‌గా మారింది. ఉత్తర 24 పరగణాల జిల్లా బరాసత్–1 పంచాయతీ సమితి ఉపాధ్యక్షుడు మహ్మద్ గియాసుద్దీన్ మండల్, స్థానిక వ్యాపారి రకీబుల్ ఇస్లాంతోపాటు కూర్చుని ఉండగా వారికి ఎదురుగా ఉన్న టేబుల్‌పై పెద్ద మొత్తంలో డబ్బు కట్టలు కనిపిస్తున్నాయి. ఫోన్లో అవతలి వ్యక్తి.. ‘కొనేది క్యాష్లోనా, ఫైనాన్స్లోనా అని అడుగుతుండగా, అప్పుడే మరోవ్యక్తి నోట్ల కట్టలు నింపి ఉన్న నైలాన్ బ్యాగ్‌తో ఆ గదిలోకి ప్రవేశించడం కనిపిస్తోంది. మరికొద్ది నెలల్లోనే రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా వెలుగు చూసిన ఈ వీడియో రాజకీయ దుమారం రేపుతోంది. టీఎంసీ అక్రమ లావాదేవీలకు ఇదే నిదర్శనమంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అయితే, ఇది 2022 నాటి పాత వీడియో అని మండల్ కొట్టిపారేస్తున్నారు. అది ఓ భూమి లావాదేవీకి సంబంధించిన అంశమని, తనకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు. వీడియో కనిపిస్తున్న నగదు రెండేళ్ల క్రితం జరిగిన భూ లావాదేవీకి సంబంధించిందని రకీబుల్ ఇస్లాం కూడా తెలిపారు. ఇందులో ఎలాంటి తప్పిదం లేదని చెప్పారు. ఆ భూమి వ్యవహారంలో మండల్ భాగస్వామిగా ఉన్నారని, వీడియోలో కనిపించేది తన ఆఫీసు కూడా కాదని రకీబుల్ అన్నారు. ఈ అంశంపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని బరాసత్–1 పంచాయతీ టీఎంసీ కన్వీనర్ మహ్మద్ ఇషా సర్కార్ చెప్పారు. వీడియోలో పెద్ద ఎత్తున కనిపిస్తున్న నగదుపై అనుమానాలు తలెత్తుతున్నాయని చెప్పారు. అది అసలైన వీడియోనా కాదా అనేది తేలుస్తామన్నారు. వీడియోపై బీజేపీ నేత తపస్ మిత్రా మాట్లాడుతూ.. స్థానిక భూ మాఫియా వెనుక మహ్మద్ గియాసుద్దీన్ మండల్ హస్తముందని ఆరోపించారు. ఈ వీడియోను చూస్తే అధికార టీఎంసీ అసలు స్వరూపం తేటతెల్లమవుతుందని విమర్శించారు. -
ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా కోర్టుకెళతా
సాగర్ ఐల్యాండ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియను సవాల్ చేస్తూ కోర్టుకు వెళతామని టీఎంసీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. ఎస్ఐఆర్ అధికారుల వేధింపులు, ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలు భయాందోళనలకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నారని ఆమె ఆరోపించారు. దక్షిణ 24 పరగణాల జిల్లా సాగర్ ఐల్యాండ్‌లో జరిగిన బహిరంగ సభలో మమత మాట్లాడారు. ఎస్ఐఆర్ సిబ్బంది ఎలాంటి సహేతుక కారణాలను చూపకుండానే అర్హులైన ఓటర్ల పేర్లను ఏకపక్షంగా తొలగిస్తున్నారని విమర్శించారు. మామాలుగా చేపట్టే ఈ ప్రక్రియను ఎన్నికల వేళ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ఆయుధంగా వాడుతున్నారని ఆరోపించారు. ఓటర్ల పట్ల అమానవీయంగా వ్యవహరించడం, ఎస్ఐఆర్ నేపథ్యంలో సంభవిస్తున్న మరణాలపై 6న(మంగళవారం) కోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. ఓ సాధారణ పౌరురాలిగా అవసరమైతే దీనిపై సుప్రీంకోర్టు తలుపు కూడా తడతానన్నారు. ‘నేను కూడా అనుభవమున్న లాయర్నే’అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఈ పిటిషన్‌ను వ్యక్తిగతంగా వేస్తారా, రాష్ట్ర ప్రభుత్వం లేక టీఎంసీ పక్షానా అనే విషయం ఆమె స్పష్టంగా తెలపలేదు. వ్యాధి గ్రస్తులు, వృద్ధులు కూడా తాము అర్హులైన ఓటర్లమే అని నిరూపించుకోవాల్సి వస్తోందన్నారు. ఏమాత్రం కనికరం చూపకుండా ఎస్ఐఆర్ సిబ్బంది వారినీ క్యూలలో నిల్చోబెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే వలస కార్మికులపై వివక్ష చూపుతున్నారని మమత చెప్పారు. బెంగాలీలో మాట్లాడటం ఈ దేశంలో నేరమైపోయిందంటూ ఆమె..‘నన్ను చంపినా సరే, బెంగాలీలోనే మాట్లాడుతా’అని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ప్రజలు తాయిలాలు చూపే బీజేపీ.. గెలిచిన తర్వాత అణచివేతలకు పాల్పడుతుందని హెచ్చరించారు. ‘ఎన్నికలకు ముందు తలా రూ.10 వేలు పంచిపెడుతుంది.. ఆ తర్వాత వారిపైకి బుల్డోజర్లను నడుపుతుంది’అంటూ బీజేపీపై ధ్వజమెత్తారు. -
ఓట్లను ఏకపక్షంగా తొలగిస్తున్నారు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియపై సీఎం మమతా బెనర్జీ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే భారీగా ఓట్లు తొలగింపునకు గురయ్యే ప్రమాదముందన్నారు. అదే జరిగితే, ప్రజాస్వామ్య పునాదులపైనే దెబ్బకొట్టినట్లవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏకపక్షంగా, తప్పులతడకగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ను వెంటనే నిలిపివేయాలన్నారు. ఈ మేరకు ఆమె తాజాగా ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు మరో లేఖ రాశారు. ఎటువంటి ప్రణాళిక, సన్నద్ధత లేకుండా ఎన్నికల కమిషన్ హడావుడిగా చేపట్టిన ఎస్ఐఆర్తో తీవ్రమైన అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు, పరిపాలనాపరమైన తప్పిదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నవంబర్ 20, డిసెంబర్ 2వ తేదీల్లో రాసిన లేఖలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో క్షేత్రస్థాయిలో మరిన్ని ఘోరమైన తప్పిదాలకు తావిచ్చినట్లయిందని మమత ఆరోపించారు. సరైన శిక్షణ ఇవ్వలేదు ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొంటున్న అధికారులకు సరైన శిక్షణ లేదని, ఓటర్ల జాబితా సవరణకు వాడుతున్న సాఫ్ట్వేర్, ఐటీ వ్యవస్థలు సరైనవి కావని సీఎం మమత పేర్కొన్నారు. విధుల్లో ఉన్న సిబ్బందికి సరైన, ఒకే విధమైన శిక్షణ ఇవ్వలేదని ఆరోపించారు. అంతేకాదు, ఎన్నికల సంఘం జారీ చేస్తున్న ఆదేశాలలో స్పష్టత కూడా లేదన్నారు. పరస్పర విరుద్ధ ఆదేశాల కారణంగా క్షేత్రస్థాయి సిబ్బందిలో గందరగోళం నెలకొందని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ప్రణాళికా లోపం వల్ల ఈ కీలకమైన ప్రజాస్వామ్య ప్రక్రియ ఒక ప్రహసనంగా మారిందని, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన అభ్యంతరాలను ఇకపై అయినా పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తూ మరోసారి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ఈ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఐటీ వ్యవస్థల దుర్వినియోగం ఓటర్ల నమోదు అధికారు(ఈఆర్వో)లకు తెలియకుండా, వారి ఆమోదం లేకుండానే ఐటి వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని ముఖ్యమంత్రి మమత ఆరోపించారు. దీనివల్ల అర్హులైన ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును కోల్పోయే ప్రమాదముందని చెప్పారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, ఓటు తొలగించాలంటే చట్టపరమైన నిబంధనలు పాటించాలి, కానీ ఇక్కడ ఆ సరైన ప్రక్రియ అమలుకు నోచుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తొలగింపులకు ఎవరు అనుమతి ఇచ్చారు? ఏ చట్టపరమైన అధికారం కింద ఇవి జరుగుతున్నాయి? అని ప్రశ్నించారు. ఈ మొత్తం ప్రక్రియ ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలోనే జరుగుతోంది కాబట్టి, ఎటువంటి అక్రమ, ఏకపక్ష, పక్షపాత చర్యలకైనా ఎన్నికల కమిషనే పూర్తి బాధ్యత వహించాలని మమత స్పష్టం చేశారు. -
పశ్చిమ బెంగాల్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా నందిని చక్రవర్తి..!
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణిగా నందినీ చక్రవర్తి(Nandini Chakravorty) ఘనత సాధించారు. ఆమె బుధవారమే బాధ్యతలు స్వీకరించారు. ఆమె నిన్నటివరకు హోం, హిల్ అఫైర్స్ విభాగంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1994 బ్యాచ్‌కి చెందిన నందినీ చక్రవర్తి తన మూడు దశాబ్దాల కెరీర్లో అనేక కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ఆమె కథక్ డ్యానర్స్ కూడా. ఎంతో మంది సీనియర్లను వెనక్కినెట్టి రాష్ట్ర బ్యూరోక్రసీలో కీలక పదవిని ఆమె ఎలా అధిరోహించారు, ఆమె విద్యా నేపథ్యం ఏంటి వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.ప్రస్తుత ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ బుధవారంతో పదవీ విరమణ పొందారు. వాస్తవానికి ఆయన గత జూన్‌లోనే రిటైర్ కావాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు కేంద్రం ఆరు నెలల పొడిగింపు ఇచ్చింది. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నియామకాల్లో కేంద్ర నిబంధనలను పక్కన పెడుతోందన్న ఆరోపణ నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎవరీమె..కోల్‌కతాలోని లేడీ బ్రాబోర్న్ కళాశాల పూర్వ విద్యార్థిని అయిన చక్రవర్తి, రాంచీలోని సేక్రేడ్ హార్ట్ పాఠశాలలో తన పాఠశాల విద్యను అభ్యసించారు. ఆమె 1993లో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేసి, అదే సంవత్సరం యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఎన్నికలు సమీపించనున్న తరుణంలో పంత్ వారసుడిగా ఎవరిని నియమించాలన్నా ఊహగానాలకు అడ్డకట్టవేస్తూ..బెంగాల్ ప్రభుత్వం ఓ మహిళా ఐఏఎస్ అధికారికి బాధ్యతలను కట్టబెడుతూ..అందర్నీ విస్మయపరిచింది. ఈమె తనకుంటే సీనియర్లు ఉన్న ఐదు బ్యాచ్లలోని ఏడుగురు ఐఏఎస్ అధికారులను వెనక్కినెట్టి మరి ఈ అత్యునన్నత పదవిలో కొనసాగుతుండటం విశేషం. వివాదాలకు కేరాఫ్ కూడా..నందినీ చక్రవర్తి కెరీర్లో కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గవర్నర్ సివి ఆనంద బోస్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో రాజ్‌భవన్, రాష్ట్ర సచివాలయం (నబన్న) మధ్య జరిగిన ఘర్షణలో ఆమె పేరు వార్తల్లో నిలిచింది. అప్పట్లో ఆమెను ఆ పదవి నుంచి తొలగించాలని గవర్నర్ కోరినప్పటికీ, ప్రభుత్వం తొలుత నిరాకరించి, ఆ తర్వాత పర్యాటక శాఖకు బదిలీ చేసింది. అయితే 2026 పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనుభవజ్ఞురాలైన నందినీ చక్రవర్తిని ఈ పదవిలో నియమించి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని మమతా బెనర్జీ ప్రభుత్వం యోచిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదీఏమైన విధుల్లో చేదు అనుభవాలు, వివాదాలు..నెగిటివిటిని తెచ్చిపెడతాయన్నది అపోహేనని, అవి ఒక్కోసారి మన సామర్థ్యానికి, నిజాయితీకి దర్పణాలవుతాయని అందుకు ఈ ఐఏఎస్ అధికారిణి నందని చక్రవర్తి కేరీర్‌నే ఉదాహరణ. (చదవండి: ఆ గ్రామం న్యూ ఇయర్‌కి ఎలా స్వాగతం పలుకుతోందంటే..?) -
చచ్చిపోయాడనుకుంటే..30 ఏళ్లకు తిరిగొచ్చాడు!
ఉత్తరప్రదేశ్‌లోని,ముజఫర్‌నగర్‌లో అద్భుత సంఘటన జరిగింది. 30 ఏళ్ల క్రితం చని పోయాడని భావిస్తున్న వ్యక్తి ఊహించని విధంగా కళ్ల ముందు కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. తొలుత అస్సలు నమ్మలేదు.ఈ తరువాత కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఖతౌలి పట్టణంలోని మొహల్లా బల్కారాం నివాసి షరీఫ్ 28 ఏళ్ల నుంచి ఎలాంటి సమాచారం లేదు. బంధువులకు అందుబాటులో లేకుండా పొయ్యాడు. అయితే పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో షరీఫ్ అధికారిక పత్రాలకోసం 1997 తరువాత తొలిసారి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అకస్మాత్తుగా వృద్ధుడైన షరీఫ్ ప్రత్యక్షం కావడంతో బంధువులు, పొరుగు వారు, స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం షరీఫ్ మొదటి భార్య 1997లో మరణించింది. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకుని భార్యతో పశ్చిమ బెంగాల్‌కు వెళ్లాడు. ప్రారంభంలో ల్యాండ్‌లైన్ ఫోన్ కాల్స్ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండేవాడు. అయితే, కాలక్రమేణా అవీ ఆగిపోయాయి. అతను ఇచ్చిన అడ్రస్‌లో షరీఫ్‌ను సంప్రదించాలని ప్రయత్నించిన బంధువులకు నిరాశే ఎదునైంది. దీంతో అతను చనిపోయాడని భావించారు. అయితే ఎస్ఐఆర్ పుణ్యమా అని రెండు రోజుల క్రితం షరీఫ్ ఖతౌలికి తిరిగి వచ్చాడు. తొలుత ఎవరూ నమ్మలేదు. షరీఫ్ తిరిగి వచ్చాడన్న సమాచారంతో స్థానికంగా సందడి నెలకొంది. ఇరుగు పొరుగువారు, బంధువులు, పరిచయస్తుంతా గుమిగూడారు, దూరపు చుట్టాలు వీడియో కాల్స్ చేసి మురిసి పోయారు.ఇదీ చదవండి: లిఫ్ట్ ఇస్తామని, వ్యాన్‌లో మహిళపై సామూహిక అత్యాచారంగత 15, 20 ఏళ్లుగా అతని కోసం ఎంత వెదికినా ఫలితంలేదని మేనల్లుడు మొహమ్మద్ అక్లిమ్ తెలిపారు. అయితే రెండో పెళ్లి తరువాత ఆర్థిక పరిస్థితి, కమ్యూనికేషన్ సదుపాయం లేక పోవడం వల్ల తన కుటుంబంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని షరీఫ్ చెప్పుకొచ్చాడు. ఇపుడు ప్రభుత్వ పత్రాలు అవసరం కాబట్టి తిరిగి వచ్చానని, ఆ తర్వాత తిరిగి వెళ్లిపోతానని కూడా చెప్పాడు. అన్నట్టుగానే సంబంధిత పత్రాలను తీసుకొని బెంగాల్‌కు వెళ్లిపోయాడు. -
అమిత్ షా ఆరోపణలకు దీదీ ఘాటు కౌంటర్
ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు పశ్చిమ బెంగాల్ అడ్డాగా మారిందన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరోపణలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటు కౌంటర్ ఇచ్చారు. అలాంటప్పుడు పహల్గాం దాడిని కేంద్రమే జరిపించిందా? అని నిలదీశారామె. మంగళవారం బంకురా బిర్సింగ్‌పూర్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. బెంగాల్లో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని, ఉగ్రవాదులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారని అమిత్ షా ఆరోపించారు. ఆ లెక్కన జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు లేరంటే.. పహల్గాం దాడి ఎలా జరిగింది? దాన్ని మీరే చేయించారా?.. దేశ రాజధానిలో జరిగిన దాడికి కారణం ఎవరు?(ఎర్రకోట దాడిని ఉద్దేశించి..) అని ప్రశ్నించారామె. ప్రధాని మోదీని మహాభారతంలో దుర్యోధనుడిగా.. అమిత్ షాను దుశ్శాసనుడితో ఆమె పోల్చారు. శకుని శిష్యుడైన దుశ్శాసనుడు.. ఇక్కడి నుంచి సమాచారం సేకరించేందుకు వచ్చారు. ఎన్నికల సమయంలోనే ఆ దుర్యోధన దుశ్వాసనలకు బెంగాల్ గుర్తుకు వస్తుంది. ఓట్ల కోసం ఎగబడి వచ్చేస్తుంటారు అని మండిపడ్డారామె. ఇక తీవ్ర చర్చనీయాంశమైన ఎన్నికల జాబితా వివాదం (SIR) ప్రస్తావిస్తూ కేంద్రంపై టీఎంసీ అధినేత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బెంగాల్ ప్రజలను కేంద్రం ఎస్ఐఆర్ పేరుతో వేధిస్తోంది. కోటిన్నర ఓట్లను తొలగించే యత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో.. రాజ్‌బన్షీలు, మటువాలు, ఆదివాసీలు లక్ష్యంగా మారతున్నారని ఆవేదన వ్యక్తం చేశారామె. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎస్ఐఆర్ నిర్వహించడం పెద్ద మోసం. ఇది ఇలాగే కొనసాగితే చివరికి మీరు (అమిత్ షా) మరియు మీ కుమారుడు మాత్రమే మిగిలిపోతారు అని మమతా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది మే 7వ తేదీన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గడువు ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఆ రాష్ట్రంపై దృష్టిసారించింది. ఈ నెల 20న బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పర్యటించారు. తాజాగా మూడు రోజుల పర్యటన నిమిత్తం మరో అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో.. మంగళవారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంపై మండిపడ్డారు. హింసాత్మక రాజకీయాలను సృష్టించడంలో వామపక్షాలను టీఎంసీ అధిగమించిందని ఆరోపించారు. ఎన్నికల ప్రయోజనం కోసం టీఎంసీ పార్టీ బంగ్లాదేశీయుల చొరబాట్లను ప్రోత్సహిస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని ఇవ్వకపోవడం వల్లే భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కేంద్రం కంచె వేయలేకపోతోందని ఆరోపించారు. అలాగే.. మమత పాలనలో రాష్ట్రంలో హింస, అవినీతి రాజ్యమేలాయని.. ఆమె అవినీతి వల్లే 15 ఏళ్లుగా బెంగాల్ అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు కూడా ఇక్కడి ప్రజలకు అందకుండా టీఎంసీ సర్కార్ అడ్డుపడుతోందని ఆరోపించారు. ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలంటే బీజేపీని గెలిపించాలని బెంగాల్ ప్రజలను కోరారు. 2026 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే సరిహద్దుల వద్ద చొరబాట్లను ఆపుతామని.. అక్రమ వలసదారులను బెంగాల్ నుంచి తరిమికొడతామని హామీ ఇచ్చారు. -
ఎన్నికల రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్..!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇటీవల నియమితులైన నితిన్ నబిన్ అప్పుడే కార్యరంగంలోకి దూకారు. వచ్చే ఏడాదిలో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సంసిద్ధం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రా పార్టీ ఇన్ఛార్జీలు, కీలక నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీని తిరిగి నిలబెట్టడం, బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ఓటు శాతాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘జాతీయ పార్టీ అయినా, స్థానికంగానే ఆలోచించాలి’అన్న విధానంతో రాష్ట్రానికో ప్రణాళిక రూపొందించే పనిలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మూడు రాష్ట్రాల్లో పట్టుకోసం.. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన నబిన్ ఐదు రాష్ట్రాల ఎన్నికలతో తొలి పరీక్ష ఎదుర్కోనున్నారు. ఇందులో ముఖ్యంగా గడిచిన దశాబ్ధాల కాలంగా అధికారం అందుకోలేకపోతున్న బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పాగా వేయడం అంత సులభమయ్యేది కాదు. దీనికి తోడు ఇప్పటికే రెండుమార్లు అధికారంలో ఉన్న అస్సాంలో పార్టీని తిరిగి నిలబెట్టడం కత్తిమీద సాములాంటిదే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను నబిన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రణాళికలు, భవిష్యత్ వ్యూహాలపై ఆయన ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శులు బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్, తరుణ్ ఛుగ్, వినోద్ తావ్డే, అరుణ్ సింగ్, దుష్యంత్ గౌతమ్ తదితరులతో చర్చించారు. ఈ సందర్భంగానే ప్రతి బూత్‌కు ఒక ఇన్‌ఛార్జి, ఒక డేటా వలంటీర్, ఒక సోషల్ మీడియా వలంటీర్లను సిధ్దం చేయాలనే సూచనలు వచ్చాయి. ‘ఎన్నికలను స్టేజ్ మీద కాదు..బూత్ వద్ద గెలుస్తాం’అన్న విధానాన్ని అవలంబిస్తూనే..యువత, మహిళలను క్రియాశీలకం చేయాలని నిర్ణయించారు. స్థానిక సామాజిక సమీకరణలపై సర్వేలు, ప్రాంతాల వారీగా అధికంగా ఉండే వర్గాల మ్యాపింగ్, చిన్నచిన్న సమావేశాలు, స్థానిక భాషల్లో పార్టీ కంటెంట్ ప్రచారం వంటి దృష్టి సారించాల్సిన అంశాలపై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటు అంశాన్ని నబిన్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్న బన్సల్ నుంచి నివేదిక కోరినట్లు సమాచారం. కాయస్థ కులస్థుడైన నబిన్ సామాజిక వర్గానికి చెందిన జనాభా పశి్చమ బెంగాల్లో గణనీయమైన రాజకీయ, సామాజిక ప్రభావాన్ని కలిగి ఉంది. కోల్‌కతా, అసన్సోల్, సిలిగురి వంటి నగరాల్లోని బిహారీ వలసదారుల జనాభా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం నుంచే తన తొలి రాష్ట్ర పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. జాతీయ భద్రత, జీవనోపాధి, శాంతిభద్రతలు, వలసలు వంటి అంశాలతో రాష్ట్రంలోకి చొచ్చుకెళ్లేలా, టీఎంసీకి బలమున్న చోట బీజేపీ ఓటు శాతం పెంచేలా, గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లతో పార్టీకి అనుబంధం పెంచేలా చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఇప్పటికే రోడ్‌మ్యాప్ ఖరారైనట్లు చెబుతున్నారు. సంక్రాంతి తర్వాత నబిన్ బెంగాల్ పర్యటన ఉంటుందని అంటున్నారు. ఇక తమిళనాడులో బలమైన ప్రాంతీయ పార్టీలతో కూటమి..స్థానిక భాష, సంస్కృతి మీద గౌరం చూపేలా ప్రచారం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలతో బూత్ స్థాయి వరకు పార్టీని చేర్చాలన్నది లక్ష్యంగా నిర్ణయించారు. జనవరి తొలి వారంలో నబిన్ ఇక్కడ పర్యటించేలా షెడ్యూల్ ఖరారైంది. ఇక కేరళలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పాగా వేయడాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని నబిన్ భావిస్తున్నారు. తిరువనంతపురం మున్సిపల్ మేయర్ పీఠాన్ని కైవసం అంశాన్ని భవిష్యత్ ఎన్నికలకు పునాదిగా మలుచుకోవాలని నిర్ణయించారు. తొలిసారి ఓటువేసే యువతకు తమ వైపు తిప్పుకోవడంతో పాటు..ఉద్యోగాలు, విద్య అంశాలపై ప్రచారం చేస్తూ ఓటు శాతాన్ని గణనీయంగా పెంచితే గెలుపు సాధ్యమన్నది నబిన్ ఆలోచనగా ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక అస్సాంలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పనితీరును హైలెట్ చేయడం, స్థానిక నాయకులను అప్రమత్తం చేయడం, కాంగ్రెస్‌పై మరింత పదునుగా విమర్శలకు దిగేలా ఇప్పటికే రాష్ట్ర పర్యటన సందర్భంగా నేతలకు నబిన్ మార్గదర్శనం చేశారు. ఇప్పటికే పుదుచ్చేరిలోనూ పర్యటించిన నబిన్, పారీ్టకి ఉన్న బలాన్ని నిలుపుకునే అంశాలపై నేతలకు కీలక సూచనలు చేశారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీని నిలబెడుతూనే, కొరగరానికొయ్యగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే బలమైన పట్టుదలతో నబిన్ ముందుకెళ్తున్నారు. -
ఆ ఓటర్లను విచారణకు పిలవొద్దు
కోల్‌కతా: త్వరలో అసెంబ్లీ ఎన్నికలున్న పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణలకు సంబంధించి విపక్షాల విమర్శల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే సందర్భంగా ‘అన్ మ్యాప్డ్’గా పేర్కొన్న ఓటర్లను ప్రస్తుతానికి విచారణకు పిలవొద్దని జిల్లా స్థాయి ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది. విచారణకు రావాలంటూ వారికి అందినవన్నీ ఆటో జనరేటెడ్ నోటీసులని స్పష్టంచేసింది. 2002 నాటి ఎలక్టోరల్ రోల్స్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడమే ఈ గందరగోళానికి దారితీసినట్టు బెంగాల్ ముఖ్య ఎన్నికల అధికారి వెల్లడించారు. ‘‘వాటి పీడీఎఫ్ వెర్షన్‌ను సీఎస్వీ ఫార్మాట్‌కు మార్చే క్రమంలో బూత్ అధికారుల యాప్‌లో లింకేజీ వైఫల్యాలు చోటుచేసుకున్నాయి. నిజానికి అన్మ్యాప్డ్గా పేర్కొన్న ఓటర్లలో చాలామంది నిజమైన ఓటర్లే. ఈ కేసులను జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు నిశితంగా పరిశీలించాలి. నిజంగా అవసరమని భావించిన కేసుల్లో మాత్రమే ఓటర్లకు నోటీసులిచ్చి విచారణకు పిలవాలి’’ అని పేర్కొన్నారు. -
తొలగించిన ఓటర్ల జాబితాను ఈసీని కోరుతాం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)ఎస్ఐఆర్) సర్వే సమయంలో తొలగించిన 1.31 కోట్ల ఓటర్లకు సంబంధించిన జాబితా ఇవ్వాలని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్‌ను కోరుతామని టీఎంసీ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ చెప్పారు. ఈ నెల 31వ తేదీన జ్ఞానేశ్‌ను కలుస్తామని తెలిపారు. నిర్ణీత సమయంలోగా ఆ జాబితా ఇవ్వాలని అడుగుతామని, తమ డిమాండ్ నెరవేరని పక్షంలో ఢిల్లీలోని ఈసీ కార్యాలయం ఎదుట ఘెరావ్ చేపడతామని హెచ్చరించారు. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించినట్లు తేలితే ఢిల్లీలోనే నిరసనలను కొనసాగిస్తామన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగించిన ఓటర్ల జాబితాను ఈసీ వెల్లడించక పోవడానికి కారణాలేమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ సమయంలో కోటిన్నర మంది ఓటర్ల పేర్ల తొలగింపు బీజేపీ టార్గెట్ అని దీనర్థమా అని బెనర్జీ వ్యాఖ్యానించారు. ముసాయిదా జాబితా నుంచి తొలగింపునకు గురైన 58.20 లక్షల ఓటర్లలో రోహింగ్యాలు, బంగ్లాదేశీ వలసదారులు ఎందరున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ అనంతరం రాష్ట్రంలోని మొత్తం 10.05 కోట్ల జనాభాలో 5.79 శాతం జనాభా పేర్లను మాత్రమే తొలగించడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎస్ఐఆర్ చేపట్టిన రాష్ట్రాల్లో ఇదే అత్యంత తక్కువని ఎత్తి చూపారు. పశ్చిమబెంగాల్లో 50 శాతం వరకు ఓటర్లను గుర్తించలేకపోయినట్లు ప్రకటించిన ఈసీ..89 శాతం మేర ఓటర్ల వివరాలను ఎలా ప్రచురించిందని నిలదీశారు. దీనిపై ఈసీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ముఖ్యమైన వ్యక్తులను సైతం చనిపోయిన జాబితాలో ఈసీ చేర్చిందన్నారు. ఇటువంటి ఉదాహరణలెన్నో ఉన్నాయని, వీటిపై ఈసీపై కేసు ఎందుకు నమోదు చేయకూడదు? అంటూ బెనర్జీ నిలదీశారు. మీరు ఎస్ఐఆర్తో గెలవాలనుకుంటే, ప్రజలు ఎఫ్ఐఆర్తో బదులిస్తారని ఆయన ఈసీనుద్దేశించి వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌తో సరిహద్దులు కలిగిన త్రిపుర, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఎస్ఐఆర్ ఎందుకు చేపట్టడం లేదని ఈసీని అడిగారు. -
మహా జంగిల్‌రాజ్‌ను అంతం చేస్తాం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మమతా బెనర్జీ పార్టీ అవినీతి, బంధుప్రీతి కారణంగా రాష్ట్రం అధోగతి పాలైందని మండిపడ్డారు. ఇక్కడ మహా జంగిల్‌రాజ్ ప్రభుత్వం రాజ్యమేలుతోందని, అరాచక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. గతంలో బిహార్‌లో ఆటవిక రాజ్యం ఉండేదని, సరిగ్గా అలాంటి పరిస్థితులే ఇప్పుడు బెంగాల్లో కనిపిస్తున్నాయని ఆరోపించారు. ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించామని, అదే ఫలితం బెంగాల్లోనూ పునరావృతం కాబోతోందని తేల్చిచెప్పారు. బెంగాల్ రాష్ట్రం నాడియా జిల్లాలోని తాహెర్‌పూర్‌లో శనివారం నిర్వహించిన ‘పరివర్తన్ సంకల్ప సభ’లో ప్రధాని మోదీ కోల్‌కతా నుంచి వర్చువల్‌గా ప్రసంగించారు. బెంగాల్ కోటపై జెండా ఎగురవేయబోతున్నామని స్పష్టంచేశారు. మహా జంగిల్‌రాజ్‌ను కచ్చితంగా అంతం చేస్తామని తేల్చిచెప్పారు. బిహార్ ఎన్నికల ఫలితాలతో బెంగాల్లో బీజేపీ విజయానికి ద్వారాలు తెరుచుకున్నాయని పేర్కొన్నారు. గంగా నది బిహార్ నుంచి బెంగాల్లోకి ప్రవహిస్తోందని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తీసుకురావాలన్నారు. ‘బతికి ఉండాలంటే బీజేపీ రావాలి’ ‘‘తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు నన్ను, బీజేపీని ఎంతగా వ్యతిరేకించినా మాకు అభ్యంతరం లేదు. కానీ, ప్రజలను ఎందుకు వేధిస్తున్నారో, రాష్ట్ర అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలి. అవినీతి, బంధుపీత్రి, బుజ్జగింపు రాజకీయాల వల్ల ఇక్కడ ప్రగతి ఆగిపోయింది. ప్రజలు కష్టాలు పడుతున్నారు. కట్ మనీ, కమీషన్ల సంస్కృతికి చరమగీతం పాడాల్సిన సమయం వచ్చింది. బెంగాల్ నిజంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటే బీజేపీని గెలిపించాలి. మాకు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తాం. తృణమూల్ కాంగ్రెస్ అకృత్యాల నుంచి బెంగాల్‌కు విముక్తి కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ‘బతికి ఉండాలంటే బీజేపీ రావాలి’ అనే నినాదం రాష్ట్రంలో మార్మోగిపోతోంది. అందుకే ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తున్నారు చొరబాటుదారులకు తృణమూల్ కాంగ్రెస్ అండగా నిలుస్తుండడం సిగ్గుచేటు. వారిని కాపాడేందుకే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను ఆ పార్టీ వ్యతిరేకిస్తోంది. మనదేశంలోకి అక్రమంగా ప్రవేశించినవారిని గుర్తిస్తే వచ్చే నష్టమేంటో చెప్పాలి. బంగ్లాదేశ్‌లో మతపరంగా వేధింపులకు గురై మన దేశంలోకి వచ్చినవారికి సీఏఏ ద్వారా పౌరసత్వం ఇవ్వాలని సంకల్పించాం. దానిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది. బాధితులను బెదిరించాలని చూస్తోంది’’ అని మోదీ విమర్శించారు. తాహెర్‌పూర్‌లో ప్రధాని మోదీకి బదులుగా బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోసు రూ.3,200 కోట్ల విలువైన రహదారుల ప్రాజెక్టులను ప్రారంభించారు. పొగమంచు వల్ల హెలికాప్టర్ యూటర్న్ భారీ పొగమంచు కారణంగా ప్రధాని మోదీ హెలికాప్టర్ వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. మోదీ హెలికాప్టర్లో కోల్‌కతా నుంచి తాహెర్‌పూర్ చేరుకున్నారు. తాత్కాలికంగా ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌పై దిగాల్సి ఉండగా, పొగమంచు వల్ల అది సాధ్యం కాలేదు. దాంతో చేసేది లేక హెలికాప్టర్‌ను మళ్లీ కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. మోదీ కోల్‌కతా నుంచే వర్చువల్‌గా ప్రసంగించారు. మోదీ సభకు వెళ్తుండగా ప్రమాదం.. ముగ్గురి మృతి తాహెర్‌పూర్‌లో సభ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. మోదీ ప్రసంగించే సభకు వెళ్తుండగా రైలు ఢీకొట్టడంతో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సీల్డా–కృష్ణానగర్ సెక్షన్‌లోని తాహెర్‌పూర్, బడ్కుల్లా రైల్వేస్టేషన్ల మధ్య పొగమంచు వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపా రు. కార్యకర్తల మృతిపట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ తప్పులను సరిచేస్తున్నాం.. గౌహతి ఎయిర్‌పోర్టులో నూతన టెరి్మనల్ ప్రారంభించిన మోదీ గౌహతి: అస్సాంతోపాటు ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు దశాబ్దాలపాటు నిర్లక్ష్యం చేశాయని ప్రధాని మోదీ విమర్శించారు. ఆ పార్టీ ఎజెండాలో ఈశాన్య రాష్ట్రాలు ఏనాడూ లేవని ఆక్షేపించారు. కాంగ్రెస్ తప్పులను బీజేపీ ప్రభుత్వం సరిదిద్దుతోందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఆయన శనివారం అస్సాంలో పర్యటించారు. రాజధాని గౌహతిలో అస్సాం తొలి ముఖ్యమంత్రి గోపీనాథ్ బార్డోలోయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత లోకప్రియ గోపీనాథ్ బార్దోలోయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రూ.4,000 కోట్లతో నిర్మించిన నూతన టెరి్మనల్‌ను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. అస్సాం అటవీ భూములను ఆక్రమించుకొని రాష్ట్ర గుర్తింపునకు ముప్పుగా మారిన చొరబాటుదారులను కాంగ్రెస్ కాపాడిందని ఆరోపించారు. చొరబాటుదారులను గుర్తించడానికి ఎన్నికల సంఘం ‘ఎస్ఐఆర్’ ప్రక్రియ చేపట్టిందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను తొలగించడమే దీని అక్ష్యమన్నారు. కొందరు దేశ ద్రోహులు ఇప్పటికీ చొరబాటుదారులను కాపాడేందుకు ఆరాటపడుతున్నారని ప్రధానమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. చొరబాట్లను సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అస్సాంను గతంలో తూర్పు పాకిస్తాన్(నేటి బంగ్లాదేశ్)లో విలీనం చేయడానికి కుట్రలు జరిగాయని, కాంగ్రెస్ కూడా ఇందులో భాగస్వామి అని ధ్వజమెత్తారు. ఆ కుట్రను గోపీనాథ్ బార్డోలోయి విజయవంతంగా అడ్డుకున్నారని గుర్తుచేశారు. అస్సాం రాష్ట్రం భారతదేశం నుంచి విడిపోకుండా కాపాడారని కొనియాడారు. ఇండియాకు, ఆసియాన్ దేశాలకు మధ్య అస్సాం అనుసంధానంగా మారిందన్నారు. కీలక రంగాల్లో దేశ అభివృద్ధికి అస్సాం ఒక ఇంజిన్‌గా పనిచేస్తోందని ప్రశంసించారు. గౌహతిలో మెగా రోడ్ షో గౌహతిలో మోదీ శనివారం సాయంత్రం 3.8 కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించారు. జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. రహదారికి ఇరువైపులా నిల్చున్న ప్రజలకు మోదీ అభివాదం చేశారు. మోదీజీ జిందాబాద్, భారత్ మాతాకీ జై అంటూ జనం నినదించారు. బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద రోడ్ షో ముగిసింది. వచ్చే ఏడాది అస్సాం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ బలాన్ని చాటేలా ఈ రోడ్ షో జరిగింది. బీజేపీ నాయకులతో భేటీ ప్రధాని మోదీ అస్సాం బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారు. పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. -
ఈసీఐ ‘ఆపరేషన్ క్లీన్’: ఆ రాష్ట్రాల్లో గగ్గోలు!
వచ్చే ఏడాది(2026) జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (సర్)ప్రక్రియ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఓటర్ల తొలగింపు జరగడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ మూడు రాష్ట్రాల్లో కోట్ల మంది ఓటర్లను జాబితా నుండి తొలగించడం.. అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది.తమిళనాడులో 97 లక్షల పేర్లు తొలగింపు తమిళనాడులో మొదటి దశ సవరణ తర్వాత ఏకంగా 97 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. ఈ ప్రక్రియకు ముందు 6.41 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య, ఇప్పుడు 5.43 కోట్లకు పడిపోయింది. తొలగించిన వారిలో 27 లక్షల మంది మరణించిన వారు కాగా, 66 లక్షల మంది రాష్ట్రం విడిచి వెళ్లిన వలసదారులు, మరో 3.4 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లుగా ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. రాజధాని చెన్నైలోనే అత్యధికంగా 14.25 లక్షల ఓట్లు తొలగించడం గమనార్హం.కోయంబత్తూరులో భారీ మార్పులు ప్రతిపక్ష పార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కోయంబత్తూరు జిల్లాలో 6.5 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ఇక్కడ ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఐదు ఏఐడీఎంకే, ఒకటి బీజేపీ చేతిలో ఉన్నాయి. అలాగే దిండిగల్‌లో 2.34 లక్షలు, కాంచీపురంలో 2.74 లక్షల పేర్లను తొలగించారు. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తొలిసారి పోటీ చేస్తున్న కరూర్ జిల్లాలో కూడా 80 వేల ఓట్లు తొలగింపునకు గురయ్యాయి.బెంగాల్లో 58 లక్షల ఓట్లపై వేటు పశ్చిమ బెంగాల్లో కూడా పరిస్థితి ఇదేవిధంగా ఉంది. అక్కడ విడుదలైన ముసాయిదా జాబితా ప్రకారం 58.20 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు. ఇందులో 24.16 లక్షల మంది మరణించిన వారు, 19.88 లక్షల మంది వలస వెళ్లిన వారు కాగా, 12.20 లక్షల మంది గల్లంతైనట్లు గుర్తించారు. దాదాపు 1.38 లక్షల పేర్లను బోగస్ ఎంట్రీలుగా ఈసీఐ నిర్ధారించింది. ఫిబ్రవరి 2026 వరకు ఇక్కడ ప్రక్రియ కొనసాగనుంది.మమతా బెనర్జీ ఆగ్రహంపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ప్రక్రియను ‘బీజేపీ-ఈసీ కుట్ర’గా అభివర్ణించారు. ఓటర్ల జాబితాను తారుమారు చేస్తున్నారని, తమ రాష్ట్రం నుండి ఎవరినీ బయటకు పంపనివ్వబోమని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో 40 మంది అధికారులు మరణించారని ఆమె ఆరోపించారు. అయితే, మమతా బెనర్జీ తమ రాష్ట్రంలోని అక్రమ వలసదారుల ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే ఇలా మాట్లాడుతున్నారని బీజేపీ ఎదురుదాడికి దిగింది.తమిళనాడులో భిన్న స్వరాలుతమిళనాడులో అధికార డీఎంకే, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఈ సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ప్రధాన ప్రతిపక్షం ఏఐడీఎంకే మాత్రం ఈ ప్రక్రియకు మద్దతు తెలపడం విశేషం. నకిలీ ఓటర్ల తొలగింపు అవసరమని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) పేర్కొన్నారు. డీఎంకే ఈ విషయంలో అనవసర నాటకం ఆడుతోందని ఆయన విమర్శించారు.గుజరాత్లో 73.73 లక్షల పేర్లు తొలగింపుగుజరాత్ రాష్ట్రంలో 2025 అక్టోబర్ 27న ప్రారంభమైన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ముగిసింది. ప్రధాన ఎన్నికల అధికారి హరిత్ శుక్లా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం 73.73 లక్షల పేర్లను తొలగించారు. ఈ ప్రక్రియ ప్రారంభానికి ముందు 508 లక్షలుగా ఉన్న ఓటర్ల సంఖ్య, సవరణల అనంతరం ప్రస్తుతం 434 లక్షలకు చేరింది. తొలగించిన పేర్లలో అత్యధికంగా 40.25 లక్షల మంది శాశ్వతంగా వలస వెళ్లిన వారు కాగా, 18.07 లక్షల మంది మరణించిన వారు, 9.69 లక్షల మంది గైర్హాజరైన వారు, 3.81 లక్షల నకిలీ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 85.50 శాతం మంది ఓటర్ల నుండి (4.34 కోట్ల మంది) గణన ఫారాలను సేకరించి ఈ ప్రక్షాళన చేపట్టారు. ఓటర్లు తమ పేర్ల నమోదు లేదా సవరణల కోసం 2026 జనవరి 18 వరకు అభ్యంతరాలు దాఖలు చేయవచ్చు.తుది ఓటర్ల జాబితా 2026 ఫిబ్రవరి 17న ప్రచురితమవుతుంది.బీహార్‌లో ‘సర్’ సాగిందిలా..బీహార్‌లో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక విస్తృత సవరణ (సర్) ప్రక్రియ 2025 జూన్ 24న ప్రారంభమై, 2025 సెప్టెంబర్ 30 నాడు తుది జాబితా ప్రచురణతో ముగిసింది. ఈ ప్రక్రియలో మొత్తం 69 లక్షల మంది పేర్లను జాబితా నుండి తొలగించగా, 21.5 లక్షల మందిని కొత్తగా ఓటర్లుగా చేర్చారు. దీనివల్ల నికరంగా ఓటర్ల సంఖ్య సుమారు 47.5 లక్షలు తగ్గి, తుది జాబితా 742 లక్షలుగా ఉంది. ముఖ్యంగా ఆగస్టు 1న విడుదల చేసిన ముసాయిదాలోనే 65.6 లక్షల పేర్లను తొలగించగా, ఆ తర్వాత జరిగిన రెండు నెలల క్షేత్రస్థాయి పరిశీలనలో మరో 3.66 లక్షల పేర్లను తొలగించి, కొత్త దరఖాస్తులను ఆమోదించారు. ఈ ప్రక్రియలో మహిళా ఓటర్ల పేర్లు అత్యధికంగా తొలగించబడటం, సరిహద్దు జిల్లా అయిన గోపాల్‌గంజ్‌లో గరిష్టంగా కోత పడటం చర్చనీయాంశంగా మారింది.ఈసీఐ క్లారిటీ.. కోర్టు సమర్థనఓటర్ల జాబితాను కాలానుగుణంగా సవరించే రాజ్యాంగబద్ధమైన అధికారం తమకు ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. బీహార్‌లో కూడా ఇదే తరహా వివాదం తలెత్తగా, సుప్రీంకోర్టు ఈసీఐ నిర్ణయాన్ని సమర్థించింది. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరును కూడా అన్యాయంగా తొలగించబోమని, ఫిర్యాదులు చేసేందుకు జనవరి 18 వరకు గడువు ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం తమిళనాడు, బెంగాల్‌తో పాటు యూపీ, కేరళ, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. తమిళనాడు ఓటర్లకు అభ్యంతరాల కోసం జనవరి 18 వరకు సమయం ఇవ్వగా, బెంగాల్లో తుది జాబితా ఫిబ్రవరి 14, 2026న విడుదల కానుంది. ఎన్నికల వేళ ఈ ‘ఓట్ల వేట’ ఏ పార్టీకి లాభం చేకూరుస్తుందో, ఎవరి అవకాశాలను దెబ్బతీస్తుందో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: ‘బీజింగ్‌కు సాధ్యం.. ఢిల్లీకి అసాధ్యమా?’.. చైనా ‘మాస్టర్ క్లాస్’ -
కర్మశ్రీ పథకానికి గాంధీజీ పేరు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అమలవుతున్న గ్రామీణ ఉపాధి పథకం ‘కర్మశ్రీ’కి మహాత్మాగాంధీ పేరు పెడతామని సీఎం మమత ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఏ) పేరు ను వికసిత్–భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్(గ్రామీణ)(వీబీ–జీ రామ్ జీ)అంటూ మారుస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆమె ఈ ప్రకటన చేశారు. కొన్ని రాజ కీయ పార్టీలు జాతిపిత మహాత్మాగాంధీకి కూడా గౌరవం ఇవ్వడం లేదంటూ పరోక్షంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గురు వారం కోల్‌కతాలో వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో జరిగిన కార్యక్రమంలో సీఎం మమత మాట్లాడారు. ఎన్ఆర్ఈజీఏ కార్యక్రమం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించాలని నిర్ణయించడం చూస్తే తనకు బాధ కలుగుతోందన్నారు. జాతి నేతలను వాళ్లు (బీజేపీ)గౌరవించలేకుంటే, మేం ఆ పని చేస్తాం. కర్మశ్రీ పథకాన్ని ఇకపై గాంధీజీ పేరుతో పిల్చుకుంటామన్నారు. కర్మశ్రీ పథకం కింద బెంగాల్‌లోని గ్రామీణ ప్రాంతాల వారికి 75 రోజుల పనిదినాలను కల్పిస్తారు. -
దీపం వివాదం ఓట్లు తెచ్చేనా?
2026 ఏప్రిల్–మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ వ్యూహరచనలో ఇప్పటికీ హిందూత్వమే అగ్ర భాగాన ఉంది. తిరుప్పరన్ కుండ్రంలో దీపం వివాదం అంతర్లీనంగా ఈ అంశాన్నే ప్రతిబింబిస్తోంది.బిహార్‌లో ఇటీవల ఘన విజయం సాధించిన బీజేపీ, 2026 ఏప్రిల్–మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో పెను సవాళ్ళనే ఎదుర్కొంటోంది. ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యం వహిస్తున్న ఈ రెండు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల ప్రాభవం కనిపించదు. తమిళనాడులో ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే), పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఈసారి కూడా తమ సత్తా చాటవచ్చని భావిస్తున్నారు. తమిళనాట డీఎంకేతో సర్దుబాటు చేసుకుని, సంతృప్తి చెందేందుకే కాంగ్రెస్ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. కానీ, బెంగాల్లో దానికి ఆ మాత్రం ఊతం కూడా లభించడం లేదు. అందులోనూ బిహార్‌లో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్‌ను తోడు తీసుకెళ్ళేందుకు ఎవరూ సుముఖత చూపడం లేదు. మరోపక్క బీజేపీ ఈ రెండు రాష్ట్రాల్లోనూ సమరానికి సై అంటోంది. ఒంటరిగానే సై!అయితే, బెంగాల్లో 2019 పార్లమెంటరీ ఎన్నికల్లో సాధించిన అద్భుత ఫలితాలతో, ఇక ఆ తూర్పు రాష్ట్రాన్ని ‘జయించడం’ తనకు చిటికెలో పనిగా బీజేపీ భావించింది. తీరా, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. మొత్తం 294 స్థానాల్లో 200 కైవసం చేసు కోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, 77 సీట్లతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. కానీ, పోలైన ఓట్లలో 38 శాతం గడించి, ముఖ్య ప్రతిపక్షంగా అవతరించినందుకు కొంత సంతృప్తి చెందింది. ఈ గణాంకాలు అంత ప్రోత్సాహకరంగా లేకపోయినా, బిహార్‌లో విజయఢంకా మోగించాక ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాల యంలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ‘‘గంగా నది బిహార్ నుంచి బెంగాల్లోకి ప్రవహిస్తుంది’’ అని ప్రకటించారు. అది ఏదో ప్రాసంగికంగా దొర్లిన విషయంలా లేదు. బెంగాల్ విపుల ప్రణాళికపై కార్యాచరణకు హోమ్ మంత్రి అమిత్ షా అప్పటికే ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ వ్యూహరచనలో హిందూత్వమే ఇప్పటికీ అగ్ర భాగాన ఉంది. కానీ, పశ్చిమ బెంగాల్, తమిళ నాడుల్లో అది ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. దీప ప్రజ్వలన వివాదంతిరుప్పరన్ కుండ్రంలో దీపం వెలిగించడానికి సంబంధించి ఇటీవల రేగిన వివాదం అంతర్లీనంగా ఆ అంశాన్నే ప్రతిబింబించింది. తమిళులు ‘మురుగా!’ అంటూ విపరీతంగా ఆరాధించే సుబ్ర హ్మణ్య స్వామికి చెందిన ఆరు పవిత్ర క్షేత్రాలలో తిరుప్పరన్ కుండ్రం ఒకటి. అక్కడి ఆలయానికి కొద్ది మీటర్ల దూరంలోనే సుల్తాన్ సికందర్ ఔలియా దర్గా ఉంది. చెదురుమదురు ఘర్షణలను మినహా యిస్తే అక్కడ కార్తీక దీపోత్సవం శాంతియుతంగానే సాగిపోయింది. కాకపోతే, దర్గాకు కేవలం 15 మీటర్ల దూరంలో ఉన్న దీపత్తూన్గా పిలిచే ప్రాచీన స్తంభంపై దీపం వెలిగించేందుకు కోర్టు ఉత్తర్వు తెచ్చుకోవలసి వచ్చింది. దీపాన్ని వెలిగించే కార్యక్రమానికి అను మతి కోరుతూ మద్రాసు హైకోర్టులోని మదురై ధర్మాసనం ముందు ఈసారి పిటిషన్ దాఖలైంది. కోర్టు దీపారాధనకు అనుమతించడంతో బీజేపీ, దాని మిత్రపక్షాలు సంబరం చేసుకున్నాయి. కానీ, జిల్లా పాలనా యంత్రాంగం వెంటనే నిషేధాజ్ఞలు జారీ చేయడంతో, పోలీసులు వాటిని అమలుపరచవలసి వచ్చింది. ‘‘ఆశించిన ఫలితం సాధించడానికి హిందువులలో చైతన్యాన్ని రేకెత్తిస్తే చాలు’’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్య అవసరమైతే ఘర్షణకు దిగవలసిందని పరోక్షంగా సూచించి నట్లయింది. తమిళనాడు సాంస్కృతిక, మత సమ్మేళనాన్ని అర్థం చేసుకోవడంలో బీజేపీకి ‘ప్రాథమికమైన లోపం’ ఉందని కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు కార్తీ చిదంబరం వ్యాఖ్యానించారు. ‘‘తమిళ నాడు ప్రజానీకానికి దైవభక్తి ఎక్కువ. కానీ, మతాన్ని రాజకీయా లతో మిళితం చేసి చూడరు’’ అని ఆయన అన్నారు. చిన్నాచితక ప్రాంతాల్లో తప్పించి బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు తమిళ నాడులో పటిష్ఠమైన స్థానిక వ్యవస్థలు లేవు. అయినా, అవి దీపారా ధనపై వివాదాన్ని నిలకడగా కొనసాగించగలిగితే, ఓటర్ల మనసును కొంత వరకు పట్టుకోవచ్చు. కానీ, తమిళనాడు రాజకీ యాలు చాలావరకు ద్రావిడ కళగం నాయకుడు పెరియార్ ఇ.వి. రామస్వామి సిద్ధాంతాలతో ప్రభావితమైనవి. ఆయన చేపట్టిన ఆత్మగౌరవ ఉద్యమంలో ముస్లింలను కూడా దళితులుగా చిత్రించడం ఒక కీలకమైన అంశం. హిందూయిజంలో అంతర్లీనంగా ఉన్న కుల అణచివేత నుంచి తప్పించుకునేందుకు దళితులు ఇస్లాంలోకి మారారన్నది ఆయన సిద్ధాంతాలలో ఒకటి.ఓటుబ్యాంకుకు దెబ్బపశ్చిమ బెంగాల్లో టీఎంసీ వరుసగా మూడు విడతలుగా అధికారంలో ఉంది. ఆరోపణల తీవ్రతతో ఈసారి టీఎంసీ దుర్బల మైనదిగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విధేయులు పాల్పడినట్లుగా చెబుతున్న అవినీతి వాటిలో ప్రధానమైనది. అలాగే, కోల్‌కతాలో ఒక యువ డాక్టర్‌పై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన దారుణ ఘటనపై ఆగ్రహావేశాలు వీధులకెక్కాయి. పాలక పార్టీకి చెందిన గూండాలు, దళారీలకు తృణమో పణమో చెల్లిస్తేనే పనులు అవుతాయనీ, రక్షణ లభిస్తుందనీ ప్రజలు చెబుతున్న దృష్టాంతాలున్నాయి. దాంతో, తాము వామపక్ష కూటమి పాలన నాటి రోజుల్లోకే తిరిగి వెళ్ళినట్లుందని వారు అంటున్నారు. అయితే, అక్రమ వలసదారుల అంశాన్ని లేవనెత్తిన బీజేపీ ఒక రకంగా తానే చిక్కుల్లో పడింది. పశ్చిమ బెంగాల్లో ముస్లిం వలస దారుల కన్నా హిందూ వలసదారుల సంఖ్యే ఎక్కువగా ఉందని డేటా సూచిస్తోంది. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితాల సునిశిత సవరణ (సర్) బీజేపీ ఓటు బ్యాంకు లోపల కూడా ఆందో ళనను రేకెత్తించింది. బెంగాలీ భాషను ఢిల్లీ పోలీసులు ‘బంగ్లాదేశీ భాష’గా పేర్కొంటూ మరింత అపకీర్తిని తెచ్చిపెట్టారు. హిందూ పూజారులకు నెలసరి జీతాలు చెల్లించడం, దుర్గా ఉత్సవాలను నిర్వహించడం వంటి చర్యల ద్వారా తనను ‘హిందు వుల ఆప్తురాలు’గా చిత్రించుకునేందుకు మమత గట్టిగానే కృషి చేస్తున్నారు. కానీ, హిందూత్వపై బీజేపీతో పోటీ పడటం ప్రతి పక్షా లకు ఇప్పటికీ కష్టమవుతోందని ఇతర రాష్ట్రాల్లోని అనుభవాలు వెల్లడిస్తున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాజకీయాలు బలమైన ప్రాంతీయ గుర్తింపుల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. వాటిని ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చడానికి లేదు. అక్కడి ఓటర్లు హిందూత్వతో సునాయాసంగా మమేకమవుతారు. హిందూత్వ థీమ్‌లోకి భాష, సంస్కృతులను కూడా బీజేపీ ఈసారి అంతర్లీనం చేయ గలుగుతుందా? అన్నదే ప్రశ్న. వ్యాసకర్త: రాధికా రామశేషన్సీనియర్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
బెంగాల్లో 58 లక్షల ఓటర్లు గల్లంతు
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ మూడు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో కొలిక్కి వచ్చింది. వాటికి సంబంధించిన ఓటర్ జాబితా ముసాయిదాలు సిద్ధమయ్యాయి. అయితే ఆ ఐదు చోట్లా కలిపి ఏకంగా కోటి మందికి పైగా పేర్లు ఓటర్ల జాబితా నుంచి గల్లంతవడం విశేషం. ముఖ్యంగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ లోనే 58 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగింపునకు గురయ్యాయి! వారంతా ఓటర్ నమోదు ఫారాలు నింపి తిరిగివ్వని వారేనని ఈసీ అధికారులు చెప్పారు.వారి పేర్లు ఆబ్సెంట్, షిఫ్టెడ్, మృతులు/డూప్లికేట్ ఓటర్లు (ఏఎస్డీ) జాబితాలో చోటుచేసుకున్నట్టు తెలిపారు. ‘ఆ పేర్లను మేం ఓటర్ల జాబితా నుంచి తొలగించలేదు. దానిపై ఆయా నియోజకవర్గాల ఎన్నికల నమోదు అధికారులే నిర్ణయం తీసుకుంటారు‘ అని వివరించారు. ‘నిజమైన ఓటర్ల పేర్లు తొలగింపుకు గురైతే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తమ పేరు పునరుద్ధరించాలంటూ జనవరి 15 దాకా ఫారం 16 సమర్పించవచ్చు‘ అని తెలిపారు. పశ్చిమ బెంగాల్ మాదిరిగానే రాజస్తాన్ లో 44 లక్షలు, గోవాలో 1.01 లక్షలు, పుదుచ్చేరిలో 1.03 లక్షలు, లక్షదీ్వప్ లో 1,616 మంది పే ఓటర్ల జాబితా నుంచి ఏఎస్డీ జాబితాలోకి చేరాయి. బిహార్ లో కూడా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిపిన ఎస్ఐఆర్ లో ఏకంగా 68 లక్షల ఓట్లు తొలగింపుకు గురవడం తెలిసిందే.3 రాష్ట్రాలు, 2 యూటీల్లో కోటికి పైగా ∙అక్కడ ఎస్ఐఆర్ కొలిక్కి -
West Bengal: క్రీడాశాఖ మంత్రి రాజీనామా
ఢిల్లీ: ఇటీవల అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ రాక సందర్భంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో చోటు చేసుకున్న విధ్వంసానికి బాధ్యత వహిస్తూ క్రీడాశాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బిశ్వాస్ తన పదవికి రాజీనామా చేయగా దాన్ని సీఎం మమతా బెనర్జీ ఆమోదించారు. ఈనెల 13వ తేదీన తేదీన బెంగాల్లో మెస్సి రాక సందర్భంగా చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో సీఎం మమత బెనర్జీ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం. ఘటన జరిగిన రోజు క్రీడాకారులకు క్షమాపణ చెప్పిన మమత బెనర్జీ.. ఆ విధ్వంసానికి కారణమైన వారిపై చర్యలు చేపట్టారు. ఈవెంట్ ఏర్పాటు చేసిన ఆర్గనైజర్లను ఇప్పటికే అరెస్ట్ చేయగా, తాజాగా క్రీడామంత్రి రాజీనామాను సైతం ఆమోదించారు మమతా.లియోనెల్ మెస్సీ కార్యక్రమంలో గందరగోళం, విధ్వంసం పై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం డిజిపి రాజీవ్ కుమార్, బిధన్ నగర్ సిపి ముఖేష్ కుమార్, యువజన వ్యవహారాలు & క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేష్ కుమార్ సిన్హా లకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.కార్యక్రమం జరిగిన రోజున తన విధులు, బాధ్యతలలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డిసిపి అనీష్ సర్కార్ (ఐపిఎస్) పై శాఖాపరమైన చర్యలు చేపట్టిందిప్రభుత్వం. -
మహిళలూ వంటింటి ఆయుధాలతో సిద్ధంకండి : మమత సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా, సాక్షి: ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్) పై తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా సమీక్ష సమయంలో తమ పేర్లు తొలగిస్తే వంటగది పనిముట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర మహిళలను కోరారు. ఓటర్ల జాబితా లక్ష్యంగా ఎస్ఐఆర్ సమీక్ష, రానున్న ఎన్నికల నేపథ్యంలో మమతా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.మొదటినుంచీ ఎస్ఐఆర్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమత తాజా వ్యాఖ్యలు ఇక బీజేపీపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమైపోయినట్టు కనిపిస్తోంది. కృష్ణానగర్‌లో జరిగిన ఒక ర్యాలీలో బీజేపీ తీసుకొచ్చిన ఎస్ఐఆర్ ప్రక్రియపై నిప్పులు చెరిగారు. ఎస్ఐఆర్ పేరుతో తల్లులు, సోదరీమణుల హక్కులను లాక్కుంటున్నారని ఆమె మండి పడ్డారు. ఎన్నికల వేళ ఢిల్లీ నుంచి పోలీసులను తీసుకువచ్చి మహిళల్ని బెదిరిస్తున్నారని విమర్శించారు. ‘‘తల్లులారా, సోదరీ మణులారా, మీ పేర్లు తొలగిస్తే, మీ దగ్గర పనిముట్లు ఉన్నాయి కదా? మీరు వంట చేయడానికి ఉపయోగించే పనిముట్లు. మీకు బలం ఉంది కదా? మీ పేర్లు తొలగిస్తే మీరు ఊరుకోరు కదా? మహిళలు ముందుండి పోరాడతారు’’ అన్నారు.ఇదీ చదవండి: ఇండిగో బాధితులకు స్వల్ప ఊరట,ఆఫర్ ఏంటంటే..మహిళలా? బీజేపీ? తేల్చుకుందాంఅంతేకాదు మహిళలు బలవంతులా లేక బీజేపీ బలమైనదా? తేల్చి చెప్పాలనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. తాను లౌకికవాదిననీ, ఏ మతతత్వాన్ని నమ్మనని చెప్పుకొచ్చారు. కానీ బీజేపీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా, డబ్బుతో ప్రజలను విభజించేందుకు ఇతర రాష్ట్రాల నుండి ప్రజలను తీసుకువస్తుందని ఆరోపించారు.ఆదివారం కోల్‌కతాలో నిర్వహించిన సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని బెనర్జీ ప్రస్తావించారు. అవసరమైనప్పుడల్లా మనమందరం ఇంట్లోనే గీత పఠిస్తాం. దానికి బహిరంగ ప్రదర్శన ఎందుకు అని ప్రశ్నించారు. దేవుడనేవాడు మన హృదయాల్లో ఉంటాడు. అల్లాను ప్రార్థించేవారు హృదయాల్లోనే ప్రార్థిస్తారు. రంజాన్ సమయంలో, దుర్గా పూజ సమయంలో, ఇక్కడంతా కలిసి ప్రార్థనలు నిర్వహించుకుంటాం అని గుర్తు చేశారు. అలాగే ధర్మం అంటే పవిత్రత, మానవత్వం, శాంతి, హింస, వివక్ష, విభజన కాదు ఇదే కదా గీతారం, శ్రీకృష్ణుడు చెప్పింది ఇదే గదా అని ఆమె బీజీపీనుద్దేశించి ప్రవ్నించారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి గొప్ప వ్యక్తులెవరూ ప్రజలను విభజించే రాజకీయాలు చేయలేదని చెప్పారు. స్వాతంత్ర్యం కోసం పోరాడి, దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన బెంగాల్ ప్రజలు తాము భారతదేశ పౌరులమని నిరూపించుకోవాలా అని ముఖ్యమంత్రి అన్నారు. బీజేపీ మిమ్మల్ని ఏదీ తిననివ్వదు. చేపలు, మాంసం తినాలా వద్దా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. ఎవరు శాకాహారం, ఎవరు మాంసాహారం తినాలనేది వ్యక్తిగత ఎంపిక, అంతేకానీ బీజేపీది కాదని స్పష్టం చేశారు. తన ప్రభుత్వం బెంగాల్ నుండి ఎవరినీ వెళ్లగొట్టడానికి అనుమతించదన్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని బీఎస్ఎఫ్ పోస్టుల దగ్గరకు ఎవరూ వెళ్లవద్దు ఇదొక్కటే తన విన్నపం అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గాయపడిన పులి చాలా డేంజర్గాయపడిన పులి ఆరోగ్యంగా ఉన్న పులి కంటే ఎక్కువ భయంకరంగా ఉంటుందని బెనర్జీ హెచ్చరించారు "మీరు మాపై దాడి చేస్తే, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో మాకు తెలుసు. అన్యాయాన్ని ఎలా ఆపాలో మాకు తెలుసు," అని ఆమె అన్నారు. బీజేపీ తన ఐటీ సెల్ తయారుచేసిన జాబితాల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోందని ఆరోపించారు. బిహార్ చేయలేక పోవచ్చు, కానీ బెంగాల్ చేసి చూపిస్తుంది, మీరు ఏమి చేసినా సరే గుర్తుంచుకోండి అంటూ బీజేపీకి సవాల్ విసిరారు.చదవండి: ఫస్ట్ నైటే చెప్పేశాడు...కొత్త పెళ్ళి కూతురి విడాకులు -
సందేశ్‌ఖాలీ కేసు: కీలక సాక్షిపైదాడి,కుమారుడు, డ్రైవర్ మృతి
కోల్‌కతా, సాక్షి : పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన సందేశ్‌ఖలి వివాదానికి సంబంధించిన కేసుల్లో కీలక సాక్షిపై దాడి జరిగింది. ఈ ప్రమాదంలో భోలానాథ్ ఘోష్ తీవ్ర గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకోగా, అతని చిన్న కుమారుడు , కారు డ్రైవర్ మరణించారు. ఈ ప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తోంది.ఈకేసుకు సంబంధించి బుధవారం కోర్టుకు వెళుతుండగా ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బోయ్‌ఖలి పెట్రోల్ పంప్ సమీపంలో ఒక ట్రక్కు అమిత వేగంతో వచ్చి అతని వాహనాన్ని ఢీకొట్టింది. ట్రక్కు కారును ఢీకొట్టి, ఈడ్చుకెళ్లి, సమీపంలోని నీళ్లలోకి నెట్టివేసింది. వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఘోష్ చిన్న కుమారుడు సత్యజిత్ ఘోష్ (32), కారు డ్రైవర్ సహనూర్ మొల్లా (27) స్పాట్లోనే మరణించారు. తీవ్రంగా గాయపడిన భోలానాథ్‌ను మెరుగైన చికిత్స కోసం కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్ష కోసం కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రికి తరలించారు.సందేశ్‌ఖాలి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్ తనపై దాఖలు చేసిన అనేక కేసుల్లో ఒకదానికి సంబంధించి బసిర్హాట్ సబ్-డివిజనల్ కోర్టుకు హాజరు కావడానికి ఘోష్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చదవండి: మొటిమల చికిత్స కోసం వెళితే, దారుణం: రూ. 31 లక్షల దావాహత్యకు కుట్రఇది ఉద్దేశ పూర్వకంగా చేసిన దాడి అని, తన తండ్రిని హత్య చేసేందుకు పన్నిన పన్నాగమని ఘోష్ పెద్ద కుమారుడు బిశ్వజిత్ ఆరోపించారు. షాజహాన్ జైలు నుండే ఈ పథకం వేశాడన్నారు. 2024 జనవరిలో సందేశ్‌ఖాలిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై జరిగిన దాడిలో, అలాగే షాజహాన్‌కు వ్యతిరేకంగా సమాచారం ఇచ్చిన సంబంధిత సిబిఐ దర్యాప్తులో ఘోష్ ప్రధాన సాక్షులలో ఒకరిగా ఉన్నారు.ఏంటీ సందేశ్‌ఖాలీ కేసుపశ్చిమ బెంగాల్‌లోని ఉత్తే 24 పరగణాల జిల్లాలో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీలో అధికార తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్, లైంగిక వేధింపులు, భూకబ్జాలకు వ్యతిరేకంగా స్థానిక మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. మహిళలను బంధించి లైంగికంగా హింసించారని ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసు యంత్రాంగం స్పందించలేదని బాధితులు తీవ్ర ఆరోపణలు చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఈ అంశాన్ని కోల్‌కతా హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై ఉత్తర 24 పరగణాల జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. రేషన్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న షాజహాన్ షేక్ నివాసంపై ఈడీ అధికారులు తనిఖీల నిమిత్తం వెళ్లినపుడు షాజహాన్ అనుచరులు దాడి చేశారు. ఈ ఘటన అనంతరం షాజహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.షాజహాన్ అనేక కేసులకు సంబంధించి గతంలో అరెస్టు , కస్టడీలో ఉన్నాడు. మనీలాండరింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దాఖలు చేసిన ED ప్రాసిక్యూషన్ ఫిర్యాదు, భూకబ్జాలు, అక్రమ చేపల పెంపకం మరియు వ్యాపారం, ఇటుక బట్టీలను స్వాధీనం చేసుకోవడం, కాంట్రాక్టుల కార్టలైజేషన్, అక్రమ పన్నులు ,లెవీల వసూలు మరియు భూమి ఒప్పందాలపై కమీషన్లపై కేంద్రీకృతమై ఉన్న నేర సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడో వివరించింది. ఇదీ చదవండి: Indigo Crisis హర్ష్ గోయెంకా నో డిలే, నో డైవర్షన్ వైరల్ వీడియో -
S.I.R. Row: ఎస్ఐఆర్పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో.. కీలక వ్యాఖ్యలు చేసింది కూడా. వరుసగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోనే ఎస్ఐఆర్ జరుగుతోంది. ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండోదశ ఎస్ఐఆర్ కొనసాగుతోంది. దీనిపై పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు వేర్వురుగా పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే ఈ పిటిషన్లను వేర్వేరుగా విచారిస్తున్న సుప్రీం కోర్టు.. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుందని మంగళవారం స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో భాగమైన బీఎల్ఓలు (బూత్ లెవెల్ అధికారులు), ఇతర అధికారులకు బెదిరింపులు రావడాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలను తమ దృష్టికి తీసుకురావాలని లేకపోతే గందరగోళ పరిస్థితులు ఎదురుకావొచ్చని హెచ్చరించింది. బీఎల్ఓలకు బెదిరింపులు, ఎస్ఐఆర్ ప్రక్రియలో అంతరాయాల గురించి తమ దృష్టికి తీసుకువస్తే.. వారి భద్రతకు సంబంధించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించింది. బీఎల్ఓలు ఒత్తిడికి గురైతే వారి స్థానంలో వేరే వారిని తీసుకోవడం వంటి పరిష్కార మార్గాలను అనుసరిస్తూ.. ఎస్ఐఆర్ జరిగేలా చూడాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఈ ప్రక్రియ నిర్వహణలో ఏవైనా అవాంతరాలు ఏర్పడితే.. అధికారులను రక్షించడానికి పోలీసుల సహకారం తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం (Election Commission) కోర్టుకు వెల్లడించింది. -
టీఎంసీ ముస్లిం ఓటు బ్యాంక్ ఖతం!
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో అధికార టీఎంసీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ముర్షిదాబాద్ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగోసారి మమతా బెనర్జీని ముఖ్యమంత్రి పీఠం ఎక్కనివ్వబోనని ప్రతినబూనారు. రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్‌కున్న ముస్లిం ఓటు బ్యాంకు ఇక గల్లంతేనని స్పష్టం చేశారు. అసలు కథ ముందుందంటూ హెచ్చరికలు చేశారు. ముందుగా ప్రకటించిన విధంగానే శనివారం బెల్డంగలో బాబ్రీ తరహా మసీదుకు పునాది రాయి వేయడం తెల్సిందే. పోలీసులు ఈ కార్యక్రమానికి సహకారం అందించకున్నా 8 లక్షల మంది తరలివచ్చారన్నారు. విరాళాలు ఇటుకలు, డబ్బు రూపంలో వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. ఈ నెల 22న సొంతపార్టీ ఏర్పాటును ప్రకటిస్తానని, ముస్లింల సంక్షేమం కోసం పనిచేసే తమ పార్టీ అభ్యర్థులు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలోని 294 స్థానాలకు గాను 135 చోట్ల బరిలో ఉంటారన్నారు. ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో మాట్లాడి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాలను తాము మలుపు తిప్పబోతున్నట్లు చెప్పారు. టీఎంసీయే కాదు, బీజేపీకి కూడా రాష్ట్రంలో అధికారం దక్కనివ్వబోమని తేలి్చచెప్పారు. అదేవిధంగా, మసీదు నిర్మాణానికి పునాది రాయి వేసిన బెల్డంగలోని రెజినగర్‌లో ఫిబ్రవరిలో లక్ష మందితో ఖురాన్ పఠనం చేపడతామన్నారు. పఠనం అనంతరం మసీదు నిర్మాణ పనులు మొదలవుతాయని చెప్పారు. హాజరైన వారికి బిర్యానీతో విందు ఉంటుందని వివరించారు. -
బాబ్రీ మాదిరి మసీదుకు పునాది
బహరాంపూర్: పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా రెజినగర్‌లో శనివారం టీఎంసీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ పునాది రాయి వేశారు. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా చోటుచేసుకున్న ఈ పరిణామం రాజకీయ వేడిని రగిలి్చంది. రెజినగర్‌లో ఏర్పాటు చేసిన భారీ స్టేజీపై ఏర్పాటు చేసిన రిబ్బన్‌ను సౌదీ నుంచి వచి్చన ఇస్లామిక్ పెద్దలతోపాటు కబీర్ కట్ చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే, మసీదు నిర్మాణం తలపెట్టిన స్థలం అక్కడికి కిలోమీటరు దూరంలో ఉంది. ఈ సందర్భంగా తరలివచి్చన వేలాది మంది ‘నారా–ఇ– తక్బీర్, అల్లాహూ అక్బర్’అంటూ చేసిన నినాదాలు ఆ ప్రాంతంలో మారుమోగాయి. మసీదు నిర్మాణానికంటూ తలా ఒక ఇటుకను నెత్తిపై ఉంచుకుని ఉదయం నుంచి అక్కడికి వారంతా చేరుకున్నారు. ఆ ఇటుకలతో వలంటీర్లు ఇమారతి ఖైరత్ మాదిరి నిర్మాణం చేశారు. 1992లో అయోధ్యలోని బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన రోజును పురస్కరించుకుని కబీర్ ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. పెద్ద ఎత్తున జనం తరలిరావచ్చని, అవాంఛనీయ ఘటనలు జరగవచ్చని భావించిన అధికారులు ముందు జాగ్రత్తగా రెజినగర్తోపాటు బెల్దంగ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మత రాజకీయాలు చేస్తున్నారంటూ కబీర్‌ను అధికార టీఎంసీ సస్పెండ్ చేయడం తెల్సిందే. అయినప్పటికీ మసీదు నిర్మాణం విషయంలో వెనుకడుగు వేసేది లేదని ఆయన ప్రకటించారు. ఆ్రస్టేలియాకు చెందిన ఒక వ్యక్తి మసీదు కోసం రూ.80 కోట్లు ఇస్తామంటూ ముందుకు వచ్చారన్నారు. నిధుల కొరత లేనే లేదని చెప్పారు. మసీదు సముదాయం సుమారు 15 ఎకరాల్లో విస్తరించి ఉంటుందని, మొత్తం అంచనా వ్యయం రూ.300 కోట్లని చెప్పారు. ఇందులో ఒక ఆస్పత్రి, వైద్య కళాశాల, యూనివర్సిటీ, హోటల్, హెలిప్యాడ్ ఉంటాయన్నారు. స్థానిక వైద్యుడొకరు ఇప్పటికే రూ.కోటి విరాళం అందజేశారని చెప్పారు. ఈ ప్రాజెక్టు కేవలం మత పరమైందే కాదు, ఉద్వేగాలకు సంబంధించినదని కబీర్ ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. దేశంలో 40 కోట్ల మంది ఉండగా, బెంగాల్లో 4కోట్ల మంది ముస్లింలున్నారంటూ ఆయన, ఇక్కడో మసీదును కూడా నిర్మించుకోలేమా అని ప్రశ్నించారు. -
‘బాబ్రీ’ శంకుస్థాపనలో జోక్యం చేసుకోలేం.. హైకోర్టు వ్యాఖ్య
కోల్‌కతా: టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ తలపెట్టిన బాబ్రీ తరహా మసీదు విషయంలో తాము కలుగజేసుకోబోమని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్డంగాలో బాబ్రీ మసీదు కూల్చివేత రోజైన డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ వంటి మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు హుమాయూన్ కబీర్ ఇటీవల ప్రకటించడం తెల్సిందే.అక్కడ మత ఘర్షణలు చోటుచేసుకునే ప్రమాదమున్నందున శంకుస్థాపన కార్యక్రమాన్ని నిలువరించాలంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా తగినన్ని పోలీసు బలగాలను అక్కడుంచామని రాష్ట్ర ప్రభుత్వం, 19 కంపెనీల సాయుధ పోలీసు బలగాలను అక్కడ మోహరించినట్లు కేంద్రం తెలిపాయి. అవసరమైతే అదనంగా బలగాలను తరలిస్తామని కూడా పేర్కొన్నాయి. దీంతో, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ పౌల్ సారథ్యంలోని డివిజన్ బెంచ్ పై విషయం స్పష్టం చేసింది. -
ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ సస్పెన్షన్
బహరాంపూర్: పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్‌లో బాబ్రీ మసీదు వంటి మసీదు నిర్మాణాన్ని ఈ నెల 6వ తేదీన ప్రారంభిస్తానంటూ టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ చేసిన ప్రకటన సంచలనం రేపింది. బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన డిసెంబర్ 6వ తేదీని పురస్కరించుకుని దీని నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొనడాన్ని అధికార టీఎంసీ సీరియస్‌గా తీసుకుంది. ఆయన్ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. అయితే, కబీర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, త్వరలోనే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. తనను అరెస్ట్ చేయాలని చూసినా తలపెట్టిన కార్యక్రమాన్ని కొనసాగించి తీరుతానన్నారు. టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ కబీర్ పేరును నేరుగా ప్రస్తావించకుండా తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని మత విద్వేషాలను రెచ్చగొడుతున్న ద్రోహిగా అభివరి్ణంచారు. ప్రతి మతంలోనూ ద్రోహులున్నారు. ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు సృష్టించడమే వీరి పని అని పేర్కొన్నారు. ఈ పరిణామాలపై సీనియర్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ మీడియాతో మాట్లాడారు. మత రాజకీయాలకు పాల్పడుతున్న కబీర్‌పై టీఎంసీ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఇక నుంచి ఆయనతో టీఎంసీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. మసీదును ఎవరైనా నిర్మించొచ్చు. అదే సమయంలో మత పరంగా రెచ్చగొట్టడం తగదు. బాధ్యతాయుతంగా వ్యవహరించే మా పార్టీ ఇటువంటి వాటిని ప్రోత్సహించదు’అని ఆయన తెలిపారు. -
32 వేల మంది టీచర్ల కొలువులు భద్రం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో 32 వేల మంది ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు భారీ ఊరట లభించింది. వారి నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ బుధవారం తోసిపుచ్చింది. టీచర్ల నియామక పరీక్షలో విజయం సాధించలేని కొందరు అభ్యర్థుల కారణంగా మొత్తం వ్యవస్థ ప్రభావితం కావడానికి వీల్లేదని స్పష్టంచేసింది. పరీక్షలో అక్రమాలు జరిగినట్లు ఇప్పటిదాకా నిరూపణ కాలేదని పేర్కొంది. తొమ్మిదేళ్లపాటు టీచర్లుగా కొనసాగిన వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తే వారిపై, వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుందని వెల్లడించింది. పరీక్షల్లో అక్రమాల కేసులో కొనసాగుతున్న విచారణను ఆధారంగా చేసుకొని వారి నియామ కాలను రద్దు చేయలేమని వివరించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వును సమర్థించేందుకు నిరాకరించింది. ఆ 32,000 మంది ప్రైమరీ టీచర్ల నియామకాలు చెల్లుబాటు అవుతాయని తేల్చిచెప్పింది. సింగిల్ బెంచ్ తీర్పు పట్ల బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తంచేశారు. వేలాది మంది టీచర్ల కుటుంబాలకు న్యాయస్థానం గొప్ప ఓదార్పును ఇచ్చిందని పేర్కొన్నారు. యువత కోసం కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాం తప్ప వారి ఉద్యోగాలను తొలగించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు. న్యాయమూర్తులు మానవతా దృక్పథంతో ఆలోచించి, తీర్పు ఇచ్చారని తెలిపారు. -
బెంగాల్లో విజయమే లక్ష్యంగా పనిచేయండి
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై పోరాటం కొనసాగించాలని, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తేల్చిచెప్పారు. బెంగాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ పారదర్శకంగా, సరళంగా జరిగేలా జాగ్రత్త వహించాలని సూచించారు. బెంగాల్ బీజేపీ ఎంపీలు బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఎన్నికల వ్యూహాలపై వారు చర్చించినట్లు సమాచారం. బెంగాల్లో కచ్చితంగా అధికారం దక్కించుకోవాలని, అందుకోసం కష్టపడి పని చేయాలంటూ ప్రధానమంత్రి తమకు దిశానిర్దేశం చేశారని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ చెప్పారు. బీజేపీ కార్యకర్తల అంకితభావాన్ని మోదీ ప్రశంసించారని డార్జీలింగ్ ఎంపీ రాజు బిస్తా తెలిపారు. ప్రజలకు మరింత చేరువ కావడానికి కృషి చేయాలంటూ ఆదేశించారని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మాల్డాకు చెందిన లోక్‌సభ సభ్యుడు ఖగేన్ ముర్ము కూడా మోదీని కలిశారు. అక్టోబర్‌లో ముర్ముపై అల్లరిమూక దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముర్ము ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి ఆరా తీశారు. -
నాలుగు కాళ్ల దేవతలు!
అది పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా, నవద్వీప్ పట్టణం. ఎముకలు కొరికే చలి. నిశ్శబ్దపు తెల్లవారుజాము.. ఆ చీకట్లో రైల్వే కార్మికుల కాలనీలోని ఒక బాత్రూమ్ వెలుపల నేలపై నవజాత శిశువు. శరీరంపై ఎలాంటి వస్త్రం లేదు.. పురిటి నెత్తురు మరకలు తొలగలేదు.. ఇంకా ప్రపంచాన్ని పూర్తిగా చూడని ఆ పసికందును ఎవరో కనికరం లేకుండా వదిలివేశారు. ఆ చిన్ని ప్రాణం గడ్డకట్టే చలిలో వణికిపోయింది.. విలవిల్లాడిపోయింది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. వలయం కట్టి.. తెల్లార్లూ కాపలా కాసివీధి కుక్కల గుంపు ఒకటి ఆ శిశువును చుట్టుముట్టింది. అవి అరవలేదు. కదలకుండా, ప్రశాంతంగా.. శిశువు చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పరిచాయి. రాత్రంతా, అవి నిశ్శబ్ద సైనికుల్లా నిలబడ్డాయి. వేకువ వెలుగు వచ్చే వరకు.. ఆ బిడ్డ దగ్గరకు ఎవరినీ రాని వ్వలేదు. పసికందును తాకనివ్వలేదు. ‘ఉదయం లేచాక కనిపించిన ఆ దృశ్యం గుర్తొస్తే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది’.. అని స్థానికుడు సుక్లా మొండల్ ఉద్వేగంగా చెప్పారు. ‘ఆ కుక్కలు మామూలుగా లేవు. అవి అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. ఆ బిడ్డ బతకడానికి పోరాడుతోందని అవి అర్థం చేసుకున్నట్లు అనిపించింది’.. అని వ్యాఖ్యానించారు.పసికందు చుట్టూ సెంట్రీల్లా..తెల్లవారుజామున శిశువు చిన్నగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అప్పటివరకు ఎవరో జబ్బు పడిన బిడ్డ అనుకున్న స్థానికులకు, ఆ దృశ్యం చూసి నోట మాట రాలేదు. ఆ కుక్కలు కంచె వేసినట్లు, సెంట్రీల్లా పసికందు చుట్టూ నిల్చున్నాయి. సుక్లా మొండల్ ధైర్యం చేసి, మెల్లగా ముందుకు వెళ్లగానే.. ఆ కుక్కలు పక్కకు తప్పుకున్నాయి. వెంటనే ఆమె బిడ్డను తన దుపట్టాలో చుట్టి ఆసుపత్రికి పరుగులు తీశారు. పరీక్షించిన వైద్యులు, ఆ బిడ్డకు ఎటువంటి గాయాలు లేవని, కేవలం పుట్టిన కొన్ని నిమిషాలకే ఎవరో వదిలేశారని నిర్ధారించారు. పోలీసులు, శిశు సంక్షేమ అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.మనుషుల్ని మించిన మానవీయత..‘మేము ఎప్పుడూ ఈసడించుకుని.. తిట్టుకునే శునకాలే ఇవి.. కానీ, ఈ బిడ్డను వదిలి వెళ్లిన వారికంటే ఇవే ఎక్కువ మానవత్వాన్ని చూపించాయి’.. అని ఒక రైల్వే కార్మికుడు వ్యాఖ్యానించారు. సాయంత్రం అయ్యేసరికి కాలనీలో దృశ్యం మారిపోయింది. ఆ రాత్రంతా బిడ్డను కాపాడిన కుక్కల దగ్గరికి కాలనీలోని చిన్నారులంతా వెళ్లారు. వాటిని ఆప్యాయంగా నిమిరారు. ప్రేమతో బిస్కెట్లు తినిపించారు. ఆ కుక్కలు కేవలం ఒక శిశువును కాపాడటమే కాదు, ఆ రోజు ఆ కాలనీ ప్రజలందరికీ ఒక సందేశమిచ్చాయి. మానవత్వం అనేది నాలుగు కాళ్లపై కూడా రావచ్చని నిరూపించాయి.ఇలాంటి ఘటనే.. 1996లో కోల్‌కతా సమీపంలో ఇలాంటి ఓ ఘటనే చోటు చేసుకుంది. ఓ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెత్త గుట్టలో వదిలేశారు. అయితే ఆ బిడ్డకు మూడు వీధి కుక్కలు కాపలాగా ఉన్నాయి. చివరికి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ బిడ్డ సంరక్షణా కేంద్రానికి చేరింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎస్ఐఆర్ ఉద్యోగుల మృతి వెనుక ఈసీ హస్తం ఉంది
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో జరుగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)కు సంబంధించిన 40 మంది మరణించారని టీఎంసీ శుక్రవారం భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీని వెనుక రాష్ట్రంలోని పోల్ ప్యానెల్ చీఫ్ హస్తం ఉందని ఆరోపించింది. టీఎంసీ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రియన్ నేతృత్వంలో పదిమంది ఎంపీల ప్రతినిధి బృందం శుక్రవారం సీఈసీ అధికారులను కలిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఓబ్రియన్.. తమ పార్టీ ఐదు ప్రశ్నలను సీఈసీ ముందుంచుందని, కానీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలిపారు. తాము ఎస్ఐఆర్ను వ్యతిరేకించడం లేదని, ఈసీ పనిచే స్తున్న తీరుపై తమకు అభ్యంతరం ఉందని నొక్కి చెప్పారు. కమిషన్ దానిని కేవలం ఆరోపణలుగా తోసిపుచ్చిందని లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా తెలిపారు. సీఈసీని కలిసిన ప్రతినిధి బృందంలో లోక్‌సభ ఎంపీలు శతాబ్దిరాయ్, కళ్యాణ్ బెనర్జీ, ప్రతిమా మండల్, సజ్దా అహ్మద్, రాజ్యసభ ఎంపీలు డోలా సేన్, మమతా ఠాకూర్, సాకేత్ గోఖలే, ప్రకాష్ చిక్ బారిక్ ఉన్నారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ విధుల్లో నిమగ్నమైన బూత్ స్థాయి అధికారులు మరణాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్, తమిళనాడు ఈ సంఖ్య అధికంగా ఉంది. ఒక్క పశ్చిమబెంగాల్లోనే 40 మంది మరణించినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీఎల్ఓల మరణాలపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా ఇతర ప్రతిపక్ష నేతలు ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎస్ఐఆర్ సంస్కరణకాదని, విజయం కోసం బీజేపీ చేస్తున్న నియంతృత్వ పాలనని విమర్శిస్తున్నారు. -
26 లక్షల పేర్లు సరిపోలడం లేదు: ఈసీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ప్రస్తుత ఓటరు జాబితాలోని 26 లక్షల మంది ఓటర్ల పేర్లు 2002 నాటి ఓటరు జాబితాతో సరిపోలడం లేదని ఎన్నికల కమిషన్(ఈసీ)తెలిపింది. ఓటరు జాబితా ఎస్ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)ను బెంగాల్‌లోని సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ ఈసీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఎస్ఐఆర్లో భాగంగా బుధవారం నాటికి రాష్ట్రంలో 6 కోట్లకుపైగా ఎన్యుమరేషన్ దరఖాస్తులను డిజిటైజ్ చేసినట్లు ఈసీ తెలిపింది. అనంతరం వీటిని గత 2002 ఎస్ఐఆర్నాటి ఓటరు జాబితాతో పోల్చగా ఈ తేడా బయటపడిందని ఓ అధికారి వెల్లడించారు. డిజిటైజేషన్ కొనసాగుతున్నందున ఈ తేడా మరింతగా పెరిగే అవకాశాలున్నాయన్నారు. అయితే, తుది ఓటరు జాబితా నుంచి వీటిని ఈ పేర్లను ఆటోమేటిక్‌గా తొలగించినట్లు కాదన్నారు. -
ఎస్ఐఆర్ అప్లికేషన్ వివరాలు అందుబాటులో లేవెందుకు?
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం ఉపయోగించనున్న ఏఐ అప్లికేషన్ అనుమానం కలుగుతోందని టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే అన్నారు. యాప్, దాని కార్యాచరణగురించి ఎటువంటి వివరాలు అందుబాటులో లేవన్నారు. ‘బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ సమయంలో ఏఐ యాప్‌ను ఉపయోగిస్తున్నామని ఎన్నికల సంఘం చెబుతోంది. ఈ యాప్‌ను ఎవరు తయారు చేశారు? దాని కార్యాచరణకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఎందుకు లేవు’అని గోఖలే ప్రశ్నించారు. యాప్ డెవలపర్, అమ్మిన సంస్థ వివరాల గురించి తాను ప్రయత్నించానని, ఇప్పటికే ఉన్న సాఫ్ట్వేర్లు బాగా పనిచేయగలిగినప్పుడు, నకిలీలను గుర్తించడానికి ఏఐ అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. 2019లో మహారాష్ట్రలోనూ బీజేపీ ఐటీ సెల్‌తో అనుబంధం ఉన్న ఓ ఏజెన్సీని ఈసీఐ నియమించుకున్న విషయాన్ని తాను బయటపెట్టానని చెప్పారు. బయటినుంచి వెయ్యిమంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 50 మంది సాఫ్ట్వేర్ డెవలపర్లను నియమించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈసీఐకి రాసిన లేఖను ఆయన ప్రస్తావించారు. -
S.I.Rను ఆపలేం, కానీ..: సుప్రీం కోర్టు
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను నిలిపివేయాలన్న పిటిషనర్లకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. పలు రాష్ట్రాల్లో ప్రక్రియ కొనసాగుతున్నందున నిలుపుదల చేయలేమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశాశారు. అయితే పిటిషన్లపై విచారణ కొనసాగుతుందని పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆయన ఆదేశించారు.పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లను బుధవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా.. ఎస్ఐఆర్ విషయంలో రాజకీయ పార్టీలు లేనిపోని భయాందోళనలు కలిగిస్తున్నాయి ఈసీ పేర్కొంది. ఈ క్రమంలో.. కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం డిసెంబర్ 1వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను వివరణ కోరింది. తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఎస్ఐఆర్ విషయంలో కేరళ ప్రభుత్వం రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. ఎస్ఐఆర్ను సవాల్ చేస్తూ వేరుగా పిటిషన్లో ఇప్పటికే(నవంబర్ 21వ తేదీన) సుప్రీం కోర్టు ఈసీకి నోటీసులు జారీ చేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేదాకా ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని వేసిన మరో పిటిషన్‌పైనే ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్ 9-11 తేదీల మధ్యలో కేరళలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది.తమిళనాడు నుంచి ఎస్ఐఆర్కు అన్నాడీఎంకే మద్దతుగా అప్లికేషన్‌ను సమర్పించింది. అధికార డీఎంకే సహా అన్ని పార్టీలు వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. పుదుచ్చేరి నుంచి ప్రతిపక్ష నేత ఆర్ శివ వేరుగా పిటిషన్ వేశారు. అలాగే.. పశ్చిమ బెంగాల్ నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ కమిటీ పిటిషన్లు వేసింది. ఈ పిటిషన్‌పై విచారణ డిసెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. అయితే.. అదే తేదీన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా విడుదల కావాల్సి ఉందని విషయం ధర్మాసనం దృష్టికి వెళ్లగా.. అవసరమైతే ఆ గడువును(డ్రాఫ్ట్ రోల్స్ ప్రచురణ) పొడిగించవచ్చని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.‘‘అవసరమని తేలితే ఎన్నికల సంఘాన్ని తేదీ పొడిగించమని ఆదేశించవచ్చు. ఆ తేదీ(డిసెంబర్ 9) కారణంగా కోర్టుకు అధికారమే లేదని చెప్పలేం. కోర్టు ఎప్పుడైనా తేదీ పొడిగించమని చెప్పగలదు’’ అని అన్నారాయన. ఎస్ఐఆర్ ఉద్దేశ్యంఎస్ఐఆర్ అనేది ఓటర్ల జాబితా ఖచ్చితత్వం కోసం ఎన్నికల సంఘం చేపట్టే ప్రత్యేక సవరణ ప్రక్రియ. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఇది వివాదాస్పదమై, సుప్రీం కోర్టుకు చేరింది. దీని ఉద్దేశం.. ఓటర్ల జాబితాలో తప్పులు సరిచేయడంకొత్తగా అర్హులైన ఓటర్లను చేర్చడంమరణించిన లేదా అర్హత కోల్పోయిన వారిని తొలగించడంస్థానిక ఎన్నికలు లేదా ముఖ్యమైన ఎన్నికల ముందు జాబితా ఖచ్చితత్వం పెంచడం ఎస్ఐఆర్ ప్రక్రియలో.. డ్రాఫ్ట్ రోల్స్ ప్రచురణ.. ప్రస్తుత ఓటర్ల జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచడం.అభ్యంతరాలు/సవరణలు స్వీకరణ.. ప్రజలు తమ పేర్లు లేకపోవడం, తప్పులు ఉండడం వంటి అంశాలను తెలియజేయవచ్చు.ఫీల్డ్ వెరిఫికేషన్.. అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు ధృవీకరిస్తారు.ఫైనల్ రోల్స్ ప్రచురణ – సవరణల తర్వాత తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు -
ఎస్ఐఆర్ దెబ్బకు బంగ్లాదేశీయుల ఇంటిబాట
హకీంపూర్: భారత్–బంగ్లాదేశ్ మధ్య పశ్చిమబెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లా హకీంపూర్ వద్ద ఉన్న బీఎస్ఎఫ్ బోర్డర్ పోస్టు ఇప్పుడు రద్దీగా మారిపోయింది. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన బంగ్లాదేశీయులు నకిలీ పత్రాలతో ఏళ్లుగా హాయిగా గడిపారు. స్థానిక అధికారులు ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) చేపట్టడంతో అనధికారికంగా హకీంపూర్ పోస్టు మీదుగా తిరిగి బంగ్లాదేశ్ వెళ్లిపోయే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సంచుల్లో లగేజీలతో, చిన్నారుల చేతుల్లో వాటర్ బాటిళ్లతో కుటుంబాలకు కుటుంబాలు బంగ్లా బాట పడుతున్నాయి. మమ్మల్ని మాయింటికి వెళ్లనివ్వండి అంటూ వారు జవాన్లను వేడుకుంటున్నారు. నవంబర్ మొదటి వారం నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోందని భద్రతా సిబ్బందితోపాటు స్థానికులు కూడా అంటున్నారు. ఎస్ఐఆర్ వల్లే అసాధారణస్థాయిలో వ్యతిరేక వలసలు మొదలయ్యాయంటున్నారు. వీళ్లలో చాలా మంది దళారుల సాయంతో ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ ఐడీలు సంపాదించుకుని ఇక్కడే తిష్ట వేశారు. అయితే, ఎస్ఐఆర్ సిబ్బంది పాత ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తున్నారు. వారు వేసే ప్రశ్నలకు సమాధానాలిచ్చి రిస్కు తీసుకోవడం, జైలుకు వెళ్లడం కంటే సొంతదేశం తిరిగివెళ్లి కొంతకాలం అక్కడే ఉండటమే ఉత్తమమని వీరంతా భావిస్తున్నారు. హౌరా పారిశ్రామిక ప్రాంతంలోని ధులగోరి, బిరాటి, న్యూ టౌన్, ఘుసురి వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే బంగ్లా దేశీయులు బోర్డర్ పాయింట్ వద్ద క్యూలు కడుతున్నారు. రోజుకు కనీసం 200 మందిని సరైన పత్రాలు లేవనే కారణంతో వెనక్కి పంపించి, నిర్బంధంలోకి తీసుకుంటున్నామని బీఎస్ఎఫ్ జవాన్లు తెలిపారు. ఇలాంటిది తామసలు ఊహించలేదంటున్నారు. ‘వెనక్కి వెళ్లేవారు చూపే పత్రాలను పరిశీలించడం తప్పనిసరి. వాటిని జిల్లా అధికారులతోపాటు రాష్ట్ర పోలీసులకు పంపించాల్సి ఉంటుంది. అందుకు రెండు మూడు రోజుల సమయం తీసుకుంటోంది. దీంతో వారంతా అక్కడే మకాం వేస్తున్నారు’అని ఓ అధికారి చెప్పారు. వారికి ఆహారం అందజేస్తున్నామన్నారు. అయితే, బంగ్లాదేశీయుల రివర్స్ మైగ్రేషన్‌తో బెంగాల్ పోలీసులు సతమతమవుతున్నారు. సరైన పత్రాలు లేవనే కారణంతో నిర్బంధించిన వారిని జైళ్లలో పెట్టేందుకు సరైన వసతులు లేవు. అందుకే వారిని వదిలేస్తున్నామంటున్నారు. -
బెంగాల్లో బీఎల్వో ఆత్మహత్య
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని నడియా జిల్లాలో బూత్ లెవెల్ అధికారి(బీఎల్వో)గా వ్యవహరిస్తున్న రింకూ తరఫ్దార్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. శనివారం ఆమె తన నివాసంలో ఉరి వేసుకున్నారు. ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)కు సంబంధించిన ఒత్తిడుల వల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారని పోలీసులు తెలిపారు. బీఎల్వో రింకు సూసైడ్ నోట్‌ను సీఎం మమతా బెనర్జీ ఎక్స్‌లో షేర్ చేశారు. కృష్ణనగర్ జిల్లా చప్రాలోని వివేకానంద్ విద్యామందిర్‌లో పారా టీచర్‌గా పనిచేస్తున్న రింకు (52) తన నివాసంలో ఉరి వేసుకున్నారని ఆమె తెలిపారు. ఎస్ఐఆర్ కోసం ఇంకెందరు చనిపోవాలని ఈసీని ఆమె ప్రశ్నించారు. ఈ నెల 4వ తేదీన మొదలైన ఎస్ఐఆర్ ప్రక్రియ సందర్భంగా ఎన్నికల కమిషన్(ఈసీ) ఒత్తిళ్ల కారణంగా ఇప్పటి వరకు 30మందికిపైగా బీఎల్వోలు తనువు చాలించినట్లు అధికార టీఎంసీ పేర్కొంది. ఈ మరణాలకు ఈసీయే బాధ్యత వహించాలంది. ఎస్ఐఆర్ను తక్షణమే ఆపేయాలంటూ సీఎం మమత గురువారం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు లేఖ రాశారు. సీఎం మమత ఆరోపణలను బీజేపీ ఖండించింది. అది ఫేక్ సూసైడ్ నోట్ అని తెలిపింది. చేతనైతే ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించి, నిగ్గు తేల్చాలంది. రింకు తరఫ్దార్ టీఎంసీ ఒత్తిడుల వల్లే చనిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. కాగా, ఘటనపై తక్షణమే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎలక్టోరల్ అధికారిని ఈసీ ఆదేశించింది. -
బెంగాల్లోనూ ‘జంగిల్‌రాజ్’ను అంతం చేస్తాం
న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. కార్యకర్తల కష్టంతోనే గెలుపు దక్కిందని అన్నారు. బిహార్‌లో సుపరిపాలన కొనసాగిస్తామని, ఇకపై ప శ్చిమ బెంగాల్లో ‘జంగిల్‌రాజ్’ను అంతం చేస్తామని ప్రతినబూనారు. పరోక్షంగా ఎన్నికల శంఖారావం పూరించారు. మమతా బెనర్జీ ప్రభుత్వంపై సమర భేరీ మోగించారు. బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవంలో పాల్గొన్నారు. నేతలకు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గంగా నది బిహార్ గుండా బెంగాల్లోకి ప్రవహిస్తోందని చెప్పారు. బిహార్ విజయం ఇక బెంగాల్లో విజయానికి దారిని ఏర్పర్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అది ముస్లింలీగీ మావోవాదీ కాంగ్రెస్(ఎంఎంసీ)గా మారిందని ధ్వజమెత్తారు. ఆ పార్టీ త్వరలో ముక్కలుచెక్కలు కావడం తథ్యమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పెద్దలు వారు మునిగిపోవడంతోపాటు నమ్ముకున్నవారిని కూడా ముంచేస్తారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ మెడలో మిథిలా పెయింటింగ్‌లతో కూడిన గమ్చా(కండువా) ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తద్వారా బిహార్ ప్రజలతో తనకున్న అనుబంధాన్ని చాటిచెప్పారు. కొత్తగా ఎం.వై. ఫార్ములా బిహార్ విజయం కొత్తగా ఎం.వై.(మహిళలు, యువత) అనే ఫార్ములాను ఇచ్చిందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. జంగిల్‌రాజ్ మనుషుల మతపరమైన ఎం.వై.(ముస్లిం–యాదవ్) ఫార్ములాను ఈ విజయం మట్టిలో కలిపేసిందని అన్నారు. ‘ప్రజాస్వామ్యానికి తల్లి’ అనే గొప్ప గౌరవాన్ని భారత్‌కు ఇచి్చన గడ్డ బిహార్ అని కొనియాడారు. ప్రజాస్వామ్యంపై దాడి చేస్తే మట్టికరిపిస్తామన్న సందేశాన్ని ఇదే గడ్డ ఇచి్చందన్నారు. బిహార్‌లో ఎన్డీయే విజయం ప్రజాస్వామ్యానికి దక్కిన మహోన్నత విజయమని అభివరి్ణంచారు. అసత్యాలు ఓడిపోతాయని, ప్రజల విశ్వాసమే గెలుస్తుందని బిహార్ నిరూపించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పారీ్టకి మన దేశం పట్ల సానుకూల దృక్పథం గానీ, దార్శనికత గానీ లేవని మండిపడ్డారు. అదొక పరాన్నజీవి, మోయలేని భారం, నష్టదాయకం అంటూ కాంగ్రెస్ మిత్రపక్షాలను హెచ్చరించారు. ఈసీ పట్ల ప్రజల విశ్వాసం బలోపేతం ఎన్డీయే ప్రభంజనంతో బిహార్‌లో నూతన శకం ఆరంభమైందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. రాబోయే ఐదేళ్లలో మరింత వేగంగా అభివృద్ధి కొనసాగుతుందని తేల్చిచెప్పారు. కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. బిహార్ శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలుస్తాయని వ్యాఖ్యానించారు. బిహార్ ఎన్నికల ఫలితాలతో ఎన్నికల సంఘం పట్ల ప్రజల విశ్వాసం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం కృషితో ఈ ఎన్నికల్లో అత్యధిక శాతం ఓటింగ్ నమోదైనట్లు గుర్తుచేశారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వ ప్రతిభను నరేంద్ర మోదీ శ్లాఘించారు. ఎన్డీయే పక్షాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్ఐఆర్ను యువత స్వాగతించారు నేడు దేశంలో అత్యధికంగా యువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో బిహార్ కూడా ఉందని మోదీ వెల్లడించారు. ఇక్కడి యువతలో అన్ని కులాలు, మతాలకు చెందినవారు ఉన్నారని చెప్పారు. వారి ఆశలు, ఆకాంక్షలు, కలలు జంగిల్‌రాజ్ మనుషుల కమ్యూనల్ ఎం.వై.ఫార్ములాను సర్వనాశనం చేశాయని వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనను యువత స్వాగతించారని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)కు వారు మద్దతిచి్చనట్లు ఈ ఫలితాల ద్వారా స్పష్టమవుతోందని పేర్కొన్నారు. జంగిల్‌రాజ్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో విచ్చలవిడిగా హింసాకాండ జరిగేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ప్రధానమంత్రి సంతోషం వ్యక్తంచేశారు. ఎన్నికల సంఘం కృషి వల్ల అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని కొనియాడారు. బిహార్ విజయం పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో బీజేపీ కార్యకర్తలకు కొత్త శక్తిని ఇచి్చందని స్పష్టంచేశారు. -
బిహార్ మాదే.. ఇక బెంగాల్ వంతు : కేంద్రమంత్రి చాలెంజ్
పట్నా: పలు రాష్ట్రాల్లో వరుస విజయాలతో బీజేపీ తన హవాను కొనసాగుతోంది. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకు ప్రస్తుత ఓట్ల లెక్కింపులో బీజేపీ జోష్ మీద ఉంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన నెక్ట్స్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అని పేర్కొన్నారు.బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) మెజారిటీ స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. బిహార్‌లో అవినీతి, దోపిడీ,అరాకచక ప్రభుత్వానికి చోటు లేదని ప్రస్తుత ఆధిక్యం నిరూపి స్తోందని పేర్కొన్న గిరిరాజ్ సింగ్ రాష్ట్ర యువత తెలివైంది అంటూ ప్రశంసించారు. ఇది అభివృద్ధి సాధించిన విజయం. ప్రజలు శాంతి, న్యాయం,అభివృద్ధిని ఎంచుకున్నారు. నేటి యువత మునుపటి రోజులను చూడకపోయినా, వారి పెద్దలు చూశారు. వారినుంచి తెలుసుకున్నారు. అలాగే అరాచకంగా కొనసాగిన తేజస్వి యాదవ్ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు చూశారని ఎద్దేశా చేశారు. బిహార్‌ను గెల్చుకున్నాం. ఇపుడిక బెంగాల్ వంతు అంటూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పెద్ద చాలెంజ్ విసిరారు. అక్కడున్నది అరాచక ప్రభుత్వం అంటూ బెంగాల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తాజా అంచనాల ప్రకారం 243 మంది సభ్యులు గల బిహార్ అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 122 సీట్ల మెజారిటీ మార్కునుఅధిగమించింది ప్రస్తుతం 160 సీట్లలో ఆధిక్యంలో ఉంది. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ నేతృత్వంలోని ప్రతిపక్ష మహాఘట్బంధన్ 78 స్థానాల్లో ముందంజలో ఉంది. పోల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జాన్ సూరాజ్ పార్టీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.రాష్ట్రంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ వరుసగా ఐదోసారి తన పదవిని దక్కించుకుంటారా లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నిలిచింది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హర్యానా, మహారాష్ట్ర, దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. ఇదే జోరు బిహార్‌లోనూ కనిపిస్తోంది. -
ముకుల్‌రాయ్ సభ్యత్వం రద్దు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్ రాయ్‌ను పశ్చిమబెంగాల్ శాసనసభ సభ్యునిగా అనర్హు డిగా ప్రకటిస్తూ కలకత్తా హైకోర్టు గురువారం కీలక తీర్పువెలువరిచింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని సెక్షన్ల ప్రకారం ఆయనను జస్టిస్ దేబాంగ్సు బసాక్, జస్టిస్ మొహమ్మద్ షబ్బార్‡ రష్దిల డివిజన్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. భారత న్యాయశాస్త్ర చరిత్రలో హైకోర్టు ఇలా ఒక శాసనసభ్యుడిని అనర్హుడిగా ప్రకటించి అతని సభ్యత్వాన్ని రద్దుచేయడం ఇదే తొలిసారి అని కలకత్తా హైకోర్టు న్యాయవాదులు పేర్కొన్నారు. తృణమూల్ సీనియర్ నేత అయన ముకుల్ రాయ్ గతంలో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీతో విభేదాలొచ్చి పార్టీని వీడారు. తర్వాత బీజేపీలో చేరారు. దాంతో 2021 మేలో కృష్ణనగర్ ఉత్తర నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీచేసి గెలిచారు. అయితే కేవలం నెలరోజులకే ఆయన మళ్లీ టీఎంసీ గూటికి చేరుకున్నారు. దీంతో ఆయన సభ్యత్వాన్ని రద్దుచేయాలంటూ బీజేపీ నేత సువేంధు అధికారి హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. తీర్పుపై సువేంధు సంతోషం వ్యక్తంచేశారు. ఇది రాజ్యాంగబద్ధ విజయమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌గా ఆయన తరఫున దాఖలైన నామినేషన్‌ను సైతం కోర్టు రద్దుచేసింది. -
మూడేళ్ల తర్వాత బెంగాల్ మాజీ మంత్రికి బెయిల్
కోల్‌కతా: స్కూల్ సిబ్బంది నియామకాల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ ఎట్టకేలకు బెయిల్ లభించింది. మంగళవారం ఆయన అలీపూర్ జైలు నుంచి విడుదలయ్యారు. 2016లో చేపట్టిన స్కూళ్లలో బోధనేతర సిబ్బంది నియామకాల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఛటర్జీపై అభియోగాలు వచ్చాయి. దీంతో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు 2022 జూలై 23న అరెస్ట్ చేశారు. అనారోగ్యానికి గురైన ఆయన్ను అధికారులు ఏప్రిల్‌లో ముకుందాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. సోమవారం ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు మొత్తం 8 మంది సాక్షుల వాంగ్మూలాల నమోదు పూర్తయినందున ఆయనకు బెయల్ ఇచ్చేందుకు అంగీకరించింది.చదవండి: లగ్జరీ అపార్ట్మెంట్ : గోడకు పెన్సిల్‌తో రంధ్రం?! వైరల్ వీడియోఈ మేరకు కోర్టు ఆదేశాలు వెలువడటంతో ప్రెసిడెన్సీ జైలు అధికారులు ఛటర్జీని విడుదల చేశారు. సాక్షుల వాంగ్మూలాల నమోదు పూర్తయితే పార్థ ఛటర్జీకి బెయిలివ్వ వచ్చునంటూ ఆగస్ట్ 18వ తేదీన సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతకుముందే, ఛటర్జీకి ఈడీ కేసుల్లో బెయిల్ మంజూరైంది. ఆయన్ను మరే లాభదాయక పదవుల్లో నియమించరాదనే షరతుతో కలకత్తా హైకోర్టు సెప్టెంబర్ 26న బెయిల్‌కు పచ్చజెండా ఊపింది. బెయిల్‌పై పార్థ ఛటర్జీ విడుదలవడంతో కోల్‌కతాలోని ఆయన నివాసం వద్ద టీఎంసీ కార్యకర్తలు హడావుడి చేశారు. ఇదీ చదవండి: 100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద -
కూతురి కలను నిజం చేసిన నాన్న!
పిల్లలకు ప్రేమ పంచడంలో తల్లిదండ్రుల తర్వాతే ఎవరైనా. బిడ్డలను కంటిరెప్పలా సాకడంతో పాటు, వారి ఆనందం కోసం ఎంతో శ్రమిస్తుంటారు. పిల్లల కళ్లలో సంతోషం చూడటానికి ఎన్ని ఇబ్బందులనైనా పంటి బిగువున భరిస్తారు. తన గారాలపట్టి ఆనందం కోసం ఓ తండ్రి చేసిన పని ఇప్పుడు పతాక శీర్షికల్లో నిలిచింది.అందరి లాగే బచ్చు చౌదరికి తన కుటుంబమే ప్రపంచం. ముఖ్యంగా కూతురంటే అతడికి ఎనలేని ప్రేమ ఆమె ఏది అడిగినా కాదనడు. అలాగనీ అతడేమి పెద్ద జమీందారు కాదు. అతడో చాయ్ వాలా. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లా (Midnapore District) మౌలా గ్రామంలో ఒక చిన్న టీ స్టాల్ నడుపుతున్నాడు. కొన్నేళ్ల క్రితం స్కూటీ కొనిపెట్టమని తన కూతురు సుష్మ అడిగింది. అంతమాత్రం ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న బచ్చుకు బండి కొనడం అంటే కష్టమే అనిపించింది. కానీ కూతురు సంతోషమే తనకు ముఖ్యమని భావించాడు.బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. ప్రతి రోజు తాను సంపాదించిన మొత్తంలో కొంత మొత్తం పొదుపు చేయడం ప్రారంభించాడు. టీ అమ్మి సంపాదించిన డబ్బు నుంచి రోజూ కొన్ని 10 రూపాయల నాణేలను పక్కన పెట్టేవాడు. వీటిని ఒక పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో వేసేవాడు. అతడు ఇలా వరుసగా నాలుగు సంవత్సరాలు పాటు చేశాడు. నాణేలతో డబ్బా నిండిపోవడంతో ఇటీవల దగ్గరలోని టూవీలర్ షోరూమ్‌కు వెళ్లాడు.రూ. 69 వేల నాణేలు!వెంటనే వెళ్లి నాణేలతో కూడిన పెద్ద డబ్బాను షోరూమ్‌కు తెచ్చాడు. డబ్బాలోని నాణేలను నేల మీద పోయగానే... అక్కడున్నవారంతా ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టారు. నాణేలతో పాటు కొన్ని నోట్లను కూడా బచ్చు పొదుపు చేశాడు. వీటన్నింటిని 8 మంది రెండున్నర గంటల పాటు లెక్కించారు. డబ్బాలోని నాణేలన్ని కలిపి రూ. 69 వేలుగా లెక్క తేలింది. నోట్ల రూపంలో కూడబెట్టింది కూడా కలుపుకుంటే లక్ష రూపాయలు అయ్యాయి. మరో విశేషం ఏంటంటే బచ్చు చౌదరి కూతురు సుష్మ కూడా రూ. 10 వేలు పొదుపు చేసింది.ఆశ్చర్యపోయాంషోరూమ్ ఉద్యోగి అరిందమ్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. ''బచ్చు చౌదరి మా దగ్గరికి వచ్చి మొదట స్కూటర్ల ధరల గురించి అడిగారు. నాణేలు తీసుకుంటారా అని అడిగితే, తీసుకుంటామని చెప్పాం. డబ్బా నిండా నాణేలు తెచ్చి మా ముందు పోయడంతో ఆశ్చర్యపోయాం. మా కెరీర్లో ఇలాంటి అనుభవం మాకు ఎప్పుడూ ఎదురు కాలేదు. కూతురి సంతోషం కోసం అతడు చూపించిన అంకిత భావం మమ్మల్ని భావోద్వేగానికి గురి చేసింద''ని అన్నారు.చదవండి: చిన్న కారణాలు.. పెద్ద భయాలుమా కల నెరవేరిందితన కూతురి కోసం స్కూటర్ కొనడం చాలా సంతోషంగా ఉందని బచ్చు చౌదరి తెలిపారు. "నా కూతురు చాలా సంవత్సరాల క్రితం స్కూటర్ (Scooter) అడిగింది. అప్పుడు నేను దానిని కొనలేకపోయాను. కాబట్టి, నేను నాకు వీలైనంత పొదుపు చేయడం ప్రారంభించాను. దీనికి సమయం పట్టింది, కానీ నేను ఆమె కోసం దాన్ని చేశాను. స్కూటర్ కొనుక్కోవాలనేది నా కూతురు కల మాత్రమే కాదు, నాది కూడా. ఇప్పుడు మా కల సాకారమయిందని" బచ్చు తెలిపారు.


