దమ్ముంటే రోజూ నా కారు తనిఖీ చేయండి | Mamata Banerjee claims forces stopped car for check | Sakshi
Sakshi News home page

దమ్ముంటే రోజూ నా కారు తనిఖీ చేయండి

Apr 16 2026 6:15 AM | Updated on Apr 16 2026 6:15 AM

Mamata Banerjee claims forces stopped car for check

ఎన్నికల అధికారులకు మమతా బెనర్జీ సవాల్‌

ఇస్లాంపూర్‌: పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ప్రచారం వేళ తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలను మాత్రమే ఎన్నికల సంఘం అధికారులు లక్ష్యంగా చేసుకున్నారని టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ ఆరోపించారు. బుధవారం ఉత్తర్‌ దినాజ్‌పూర్‌ జిల్లాలోని ఇస్లాంపూర్‌లో ప్రచారసభలో ఆమె ప్రసంగించారు. ‘‘కోల్‌కతాలోని డమ్‌డమ్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో నా కారును తనిఖీచేసేందుకు కేంద్రబలగాలు దుస్సాహసం చేశాయి. 

మా టీఎంసీ నేతలందరి వాహనాల్లో సోదాలు చేస్తున్నప్పుడు ప్రధాని మోదీ, హోం మంత్రి, ఇతర బీజేపీ అగ్రనేతల వాహనాలను ఎందుకు వదిలేస్తున్నట్లు?. కేంద్రబలగాలకు అంత దమ్ముంటే నా వాహనాన్ని రోజూ తనిఖీచేయండి. ఇదే విషయం ఇవాళ వాళ్లకు చెప్పా. భయంతో వాళ్లు పారిపోయారు’’ అని మమత అన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ కారును సైతం తనిఖీచేశారని టీఎంసీ బుధవారం తెలిపింది. ఈసారి ఎలాగైనా బెంగాల్‌లో టీఎంసీని అన్యాయంగా ఓడించి తాము గద్దెనెక్కాలని బీజేపీ శతథా ప్రయత్నిస్తోందని టీఎంసీ ఆరోపించింది.

Advertisement
 
Advertisement
Advertisement